Home కవితలు మార్పు కోసం నా అక్షరాలు

మార్పు కోసం నా అక్షరాలు

by Manjula Pathipati

నగరాల వెలుగుల్లో నీడలు పెరుగుతుంటే
గ్రామాల నిశ్శబ్దంలో బాధలు మోగుతుంటే
ఎందుకోసం సంబరాలు…
ఎవరికోసం ఈ సంబరాలు..!

మనుషుల మధ్య గోడలు ఎత్తుగా పెరిగిన వేళ
మానవత్వం పుటల్లో మౌనం చేరిన వేళ…
ఎందుకోసం సంబరాలు…
ఎవరికోసం ఈ సంబరాలు..!

మద్యము మత్తుకి బానిసై కుటుంబ-
సభ్యులను రోడ్డుపైన పడేస్తున్న వేళ…
ఎండిన డొక్కలతో అన్నం కోసం ఎదురుచూసే నిరీక్షణ కళ్లలో కారం పొడి చల్లిన వేళ…
ఎందుకోసం సంబరాలు…
ఎవరికోసం ఈ సంబరాలు..!

ఉద్యోగ అవకాశం కోసం తలుపులు తట్టే ఆశల్లో
మన్ను కొట్టిన వేళ…
పేదల బాధలు రుధిర గీతాలై పాడిన వేళ…
ఎందుకోసం సంబరాలు…
ఎవరికోసం ఈ సంబరాలు..!

ప్రకృతి కన్నీటి చుక్కలు నా సాహిత్య చేతి ద్వారా
సమాజ భవిష్యత్తును ప్రశ్నిస్తున్న వేళ…
నింకను పసిమొగ్గల నుండి ముసలి ముతక వరకు
అత్యాచారాలు చేస్తూ, దాడులు చేస్తున్న వేళ…
ఎందుకోసం సంబరాలు…
ఎవరికోసం ఈ సంబరాలు..!

ఒక్కసారి ఆలోచించండి…
ఒక్కసారి రేపటి ప్రపంచం కోసం ఆలోచించండి…

You may also like

8 comments

Paisley2632 June 4, 2026 - 9:47 pm Reply
Shelby581 June 7, 2026 - 3:57 pm Reply
Margaret3393 June 8, 2026 - 1:54 am Reply
Miriam293 June 9, 2026 - 2:17 pm Reply
Angel36 June 10, 2026 - 6:51 am Reply
Clarissa1355 June 19, 2026 - 12:28 am Reply
Edwin3910 June 19, 2026 - 10:59 am Reply
Gabriela1620 June 20, 2026 - 1:45 pm Reply

Leave a Comment