కేంద్రసాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత, ప్రసిద్ధ నవలాకారులు అంపశయ్య నవీన్ గారితో మయూఖ ముఖాముఖి…….
తమ రచనల ద్వారా ఎంతోమందిని ప్రభావితం చేసి, అనేకుల అభిమానాన్ని సంపాదించుకొని ‘అంపశయ్య’ అనే తమ నవలనే ఇంటిపేరుగా చేసుకొని ప్రసిద్ధి వహించిన ప్రముఖ నవలా రచయిత అంపశయ్య నవీన్ గారి జీవనం మరియు సాహిత్య ప్రస్థానాలను గురించి వారి మాటల్లోనే తెలుసుకుందాం.
నమస్కారం సార్🙏🏼
మీ నవలల ద్వారా విశేష ప్రజాదరణ పొంది, ఎందరికో స్ఫూర్తిదాయకమయ్యారు. అటువంటి మీ జీవిత విశేషాలను మా మయూఖ పాఠకులకు పరిచయం చేయడం సదవకాశంగా భావిస్తున్నాం. సమగ్ర రూపంలో మీ జీవిత విశేషాలను తెలియజేయండి. మొదటగా….
1. మీ జననం ఎక్కడ జరిగింది. మీ కుటుంబ విశేషాలు చెప్పండి.
జ: నమస్కారం! నేను పాలకుర్తి దగ్గర వావిలాల గ్రామం. దొంగరి పిచ్చమ్మ, దొంగరి నారాయణ నా తల్లిదండ్రులు. నేను 1941, డిసెంబర్ 24 న పుట్టాను. మా నాన్నగారు పూర్తి వ్యవసాయదారుడు. మాకు చాలా భూములు ఉండేవి. నేను కూడా అదే వృత్తి స్వీకరించాలని మా నాన్న కోరిక. కానీ నాకు ఇష్టం లేకుండేది. బాగా చదువుకొని లెక్చరర్ గా ఉద్యోగం సంపాదించుకున్నాను. ఒక రచయితగా అందరి మన్ననలు పొందాను. నాకు ఒక తమ్ముడు, నలుగురు సిస్టర్స్. నేను ఉద్యోగం చేసేటప్పటికి ఇద్దరు సిస్టర్స్ ని చదివించగలిగాను. వాళ్లిద్దరూ టీచర్లు అయ్యారు. మా తమ్ముడు ఎమ్. కామ్ చేసి జాబ్ సంపాదించుకున్నాడు. మా అమ్మ సాధారణ గృహిణి.
2. మీ విద్యాభ్యాసం ఏ ఏ ప్రాంతాల్లో జరిగింది?
జ: నేను మా ఊళ్ళో మూడవతరగతి వరకు చదివాను. నిజాం హయాం కాబట్టి ఒకే ఒక్క ముస్లిం టీచరు ఉండేవాడు. ఉర్దూ మీడియం. నాకు నచ్చేది కాదు. స్వాతంత్య్రం వచ్చాక తెలుగు మీడియం వచ్చింది. ఒక మంచి టీచరు స్కూలుకి రావడంతో చదువు మీద ఇంట్రెస్ట్ కలిగింది. మా ఊరికి దగ్గర్లో ఉన్న కొడకండ్లలో మా ఇద్దరు మేనత్తలు ఉండేవారు. అక్కడ నన్ను నాలుగవ తరగతిలో చేర్పించాడు మా నాన్న. అక్కడికి దగ్గర్లోనే ‘కొరివి’ అనే ఊళ్ళో మా చిన్నమ్మ ఉండేది. ఆ ఊళ్ళో ఐదవ తరగతి చదివాను. తిరుమల గిరి ఊళ్ళో 6,7 తరగతులు చదివాను. ఇక ఎనిమిదవ తరగతికి చుట్టుపక్కల అవకాశం లేదు. అందువల్ల వరంగల్ ఎ. వి. స్కూల్లో చేరాను. అది మంచి ప్రయివేటు స్కూల్. విశ్వనాథ వారి తమ్ముడు విశ్వనాథ వెంకటేశ్వర్లు గారు మాకు తెలుగు చెప్పేవారు. మాథ్స్ కొండల్ రావు గారు చెప్పేవారు. మాకు ప్రిన్సిపాల్ గా ఉన్న వై. కె. శాస్త్రిగారు ఇంగ్లీష్ చాలా బాగా చెప్పేవారు. మంత్లీ టెస్ట్ పెడితే నేనొక్కణ్ణే పాసవడంతో ఆయన నామీద ప్రత్యేక దృష్టి పెట్టారు. 1957 లో మెట్రిక్యులేషన్ మంచి మార్కులతో పాసయ్యాను. అదే సమయంలో కరువు రావడం, వ్యవసాయాధారిత కుటుంబం కావడం వల్ల మా నాన్న ఇక కాలేజీలో చదివించలేనని మెట్రిక్యులేషన్ తో కూడా జాబ్ వస్తుంది కాబట్టి ఉద్యోగం చూసుకోమన్నాడు. నిజానికి టీచరు జాబ్ చేయడం నాకిష్టం లేకుండేది.

3. ఇటువంటి పరిస్థితుల్లో మీరెటువంటి నిర్ణయం తీసుకున్నారు? ఏ విధంగా పై చదువులు చదువుకోగలిగారు?
జ: ఆ సమయంలో “చూద్దాం! పరిస్థితులు మారకపోతాయా?” అన్న ఆశతో ఒక సంవత్సరం పాటు ఊళ్ళోనే వ్యవసాయపు పనులలో మా నాన్నకు సహాయం చేస్తుండేవాడిని. కానీ నా వల్ల కాలేదు. అమ్మ దగ్గర పది రూపాయలు తీసుకొని వరంగల్లుకు వచ్చాను. ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో అప్లికేషను పెట్టాను. పి యు సి లో సీట్ వచ్చింది. నాకు 8వతరగతి నుండే వంట చేసుకోవడం అలవాటు. మా స్నేహితులతో కలిసి ‘సత్సంగ్’ అనే దాంట్లో రూమ్ కిరాయికి తీసుకున్నాం. పియుసి తర్వాత బిఏ కూడా అక్కడే పూర్తి చేశాను. జి.వి.సుబ్రహ్మణ్యం గారు, ఇరివెంటి కృష్ణమూర్తి గారు, వేటూరి ఆనందమూర్తి గారు వంటి హేమాహేమీలు ఉపాధ్యాయులుగా ఉండడం నాకు తెలుగు సాహిత్యం మీద అభిరుచి కల్గించింది. శ్రీనివాస ఉపాధ్యాయ అని ఎకనామిక్స్ అద్భుతంగా చెప్పేవాడు. నిజంగా చెప్పాలంటే ఆ కాలేజీ నన్ను బాగా ప్రభావితం చేసింది. మొదటిసారి ఆర్ట్స్ కాలేజీ బిల్డింగ్ చూశాక ఇక్కడ చదవకపోతే నా జన్మ వ్యర్థం అనిపించింది. మా నాన్నకు అస్సలు ఇష్టం లేదు. మళ్లీ అమ్మ చాటుగా డబ్బులు ఇచ్చింది. స్కాలర్ షిప్ కూడా కొంత వచ్చింది. వరవరరావు, రాంరెడ్డి నాకు క్లోజ్ ఫ్రెండ్స్. ముందు పొలిటికల్ సైన్సు, తెలుగు రెండు సబ్జెక్టులలో సీట్ వచ్చింది. కానీ నా ఫ్రెండ్స్ ఎకనామిక్స్ అయితే బాగుంటుందని, వెంటనే ఉద్యోగం కూడా వస్తుందని ఒత్తిడి చేశారు. దాంట్లో అప్లై చేస్తే అందులో కూడా సీట్ వచ్చింది. ఆ విధంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎమ్. ఏ పూర్తి చేశాను. వాళ్ళు చెప్పినట్టు ఎమ్. ఏ అయిపోయిన రెండు నెలలకే జాబ్ వచ్చింది.
4. ఇన్ని ఒత్తిడుల మధ్య మీకు సాహిత్యంపై అభిరుచి ఎట్లా ఏర్పడింది? దాని నేపథ్యం ఏమిటి?
జ: వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్సు కాలేజీ నన్ను బాగా ప్రభావితం చేసిందని ఇందాక చెప్పాను కదా! అక్కడ ఎప్పుడూ కథానిక, లేఖ, కవిత్వం, విమర్శ, ఇట్లా అన్ని ప్రక్రియల మీద సాహిత్య పోటీలు జరిగేవి. వాటిల్లో నేను పాల్గొనేవాడిని. తేటగీతిలో పద్యాలు కూడా రాశాను. కానీ గద్యం మీద ఉన్న ఆసక్తి పద్యం మీద ఉండేది కాదు. నేను ఎ. వి స్కూల్లో చదువుతున్నప్పుడే ఒక కథ రాసి విశ్వనాథ వెంకటేశ్వర్లు గారికి చూపెడితే చాలా బాగుందని ఆయన మెచ్చుకున్నారు. అడవి బాపిరాజు నవలలన్నీ చదివి వాటి మీద ఒక వ్యాసం రాసి జి.వి.సుబ్రహ్మణ్యం గారికి చూపితే “ఇంత చిన్న వయసులో చాలా బాగా రాశావు” అని ప్రశంసించారు. ఒక యదార్థ సంఘటన తీసుకొని దాన్ని కథగా మలచి పోటీకి పంపితే ప్రైజ్ వచ్చింది. మా కాలేజీలో మంచి లైబ్రరీ ఉండేది. బుచ్చిబాబు నవలలు నన్ను బాగా ఆకర్షించాయి. మా కళాశాల వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్ లర్ వచ్చారు. చలం మ్యూజింగ్స్, బుచ్చిబాబు ఆశావాది నవల ఆ ఉత్సవంలో నాకు వచ్చిన బహుమతులు. అవి నన్ను బాగా ఆకట్టుకోవడంతో వాళ్ళ రచనలన్నీ చదివాను. అప్పటికి చదవడానికి నాకు శ్రీశ్రీ పుస్తకాలు నాకు దొరకలేదు. ఒకసారి వరంగల్ చౌరాస్తాలో బస్సు కోసం నిలబడి ఉన్నప్పుడు అక్కడ ఒకతను పుస్తకాలు అమ్ముతున్నాడు. అందులో శ్రీశ్రీ మహాప్రస్థానం కనిపించింది. నా దగ్గర బస్సు టికెట్ కోసం ఒక్క రూపాయి మాత్రమే ఉంది. పుస్తకం వెల ఒక్క రూపాయి. వెంటనే పుస్తకం కొని హన్మకొండ వరకు నడుచుకుంటూ వచ్చాను. ప్రతీ సంవత్సరం కాలేజీలో పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకునేవాడిని. శ్రీశ్రీ, బుచ్చిబాబు, చలం వీళ్ళ ప్రభావం నా మీద చాలా ఎక్కువ.
5. మీ నవలా రచనకు తొలిబీజం ఎక్కడ పడింది?
జ: నేను మొదటినుండీ నవలలు విపరీతంగా చదివేవాణ్ణి. ఎమ్.ఏ సెకండ్ ఇయర్ లో డబ్బులు లేక చాలా కష్టపడ్డాను. ఈ కష్టాలన్నిటిని ఒక నవలగా రాస్తే ఎట్లా ఉంటుంది అనిపించింది. నల్గొండలో నాకు ఉద్యోగం వచ్చిన తరువాత అంపశయ్య రాసి వరవరరావుకు చూపించాను. చాలా బాగుందని చెప్పాడు. దీన్ని “Stream of Consciousness” అంటారని చెప్పాడు. అట్లా ఒకటి ఉంటుందని కూడా నాకు తెలియదు. ఆ రకంగా మొదటి నవల రాయడం జరిగింది.
6. ఒక్కరోజులో 18 గంటల పాటు ఒక వ్యక్తి అంతర్గత సంఘర్షణలను నవలగా మలచడం సులభ సాధ్యం కాదు. కథానాయకుడు రవి పాత్ర పూర్తిగా మీదేనని అర్థమైంది. ఈ నవలకు పాఠకుల నుండి వచ్చిన స్పందన ఎటువంటిది?
జ: రవి పాత్ర పూర్తిగా నాదే అనడంలో ఎటువంటి సందేహం లేదు (పెద్దగా నవ్వుతూ). అయితే ఈ నవల ఒకేసారి రాసింది కాదు. రెండు సంవత్సరాల్లో పూర్తయింది. నవల పుస్తకరూపం రావడానికి చాలా కష్టపడ్డాను. ఈ నవలను చూసి మా స్నేహితుడు ఆంధ్రజ్యోతికి పంపుమని సలహా ఇచ్చాడు. ఆ రోజుల్లో కొత్తవారికి వాళ్ళు అవకాశాలు ఇస్తున్నారు. విజయవాడకు వెళ్లి, పత్రిక ఎడిటర్ పురాణం సుబ్రహ్మణ్యశర్మను కలిసి నవల ఇచ్చాను. ఆయన రెండు నెలల్లో చెప్తానన్నాడు. నాలుగు నెలలు ఎదురుచూసినా ఎటువంటి సమాచారం రాలేదు. మళ్లీ వెళ్లి కలిశాను. “అంత తొందరైతే ఎలా? మీకు ఇష్టం లేకపోతే తీసుకువెళ్లండి” అన్నాడు నిర్లక్ష్యంగా. వెంటనే తెచ్చుకున్నాను. హైదరాబాద్ లో ‘యువ’ అనే మాసపత్రిక వచ్చేది. దానికి ఎడిటర్ చక్రపాణి. కానీ మొత్తం చూసే వ్యక్తి దండమూడి మహీధర్. ఈయన ఆల్ ఇండియా రేడియోలో పనిచేసేవాడు. ఆయనకు ఇచ్చాను. కొత్తగా చాలా బాగుందని, ఎడిటర్ కు చూపించి చెప్తానన్నాడు. చక్రపాణి గారు ఓ పదిపేజీలు చదివి “ఇది వేస్తే మన పేపర్ సర్క్యులేషన్ పడిపోతుంది” అన్నాడట. నాకసలు ఏమీ తోచలేదు. చదివిన వాళ్ళు అంతా బాగుంది అంటున్నారు. కానీ ఏ పత్రికలో రావడం లేదు. పత్రికలో రాకుండా ప్రజలకు చేరేదెలా? వరవరరావు, నేను చాలా చర్చించుకున్నాం. ఆ సమయంలో మేం ‘సృజన’ అనే మ్యాగజైన్ తెస్తున్నాం. అది త్రైమాసిక పత్రిక. దాంట్లో వేయాలంటే అంత పెద్ద నవలను వేయడం కష్టం కదా! ముందు సీరియల్ గా వేద్దామనుకున్నాం. పాఠకుల నుండి విపరీతమైన స్పందన వచ్చింది. పుస్తకంగా వేద్దామంటే డబ్బులు లేవు. నా భార్య తన బంగారు గొలుసు ఇచ్చి బ్యాంకులో పెట్టి ఆ వచ్చిన డబ్బులతో ప్రింటు చేయమన్నది. ఆ గొలుసుకు 1200 రూపాయలు వచ్చాయి. దాంతో పుస్తకంగా ప్రచురించాం. నర్సింహారెడ్డి అనే చిత్రకారుడు రేఖాచిత్రంగా ముఖచిత్రం వేశాడు. అది కూడా అందరినీ చాలా ఆకట్టుకుంది. 4,5 నెలల్లోనే 100 పుస్తకాలు అయిపోయాయి. అద్దేపల్లి రామ్మోహన్ గారు, ఆవంత్స సోమసుందర్ గారు, ఆరుద్ర గారు చదివి ప్రశంసించారు. శ్రీశ్రీ గారి షష్ఠి పూర్తి ఉత్సవం విశాఖపట్నంలో జరిగింది. నేనూ వెళ్ళాను. ఆంధ్రా యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు నేను వచ్చానని తెలిసి నన్ను కలవడానికి వచ్చారు. మా హాస్టల్ లో జరుగుతున్న విషయాలన్నీ కళ్ళకు కట్టినట్టు రాశారు. ఇవన్నీ మీకెట్లా తెలిశాయి? అని ఆశ్చర్యంగా అడిగారు. నా రచన అందరినీ ఆకట్టుకుంటున్నదని అర్థమైంది. ఇప్పటికి 17 పర్యాయాలు రీప్రింట్ అవడమే పాఠకుల ఆదరణకు ఉదాహరణ.

7. ‘రవిత్రయం’గా పేరు పొందిన అంపశయ్య, ముళ్లపొదలు, అంతస్స్రవంతి..ఈ మూడు నవలలను సీక్వెల్ గా రాయాలనే ఆలోచనకు ప్రేరణ ఏమిటో చెప్పండి.
జ: బిభూతి భూషణ్ అనే రచయిత రాసిన బెంగాలీ నవలను ప్రముఖ దర్శకుడు సత్యజిత్ రే పథర్ పాంచాలి, అపరాజితో, అపూర్ సంసార్ అనే సీక్వెల్ గా మూడు సినిమాలు తీశాడు. అది చూసి అట్లా రాయాలనే ప్రేరణ కలిగింది. మొదటి నవల ‘అంపశయ్య’లో రవి అనేక కష్టాల మధ్య చదువుకుంటాడు. రెండవది ‘ముళ్లపొదలు’ .రవి, అతని స్నేహితుల పాత్రలతో రాశాను. వారి ఆలోచనా మార్గాలు వేరు. ఒకరేమో లెఫ్టిస్ట్ భావాలు కలవాడు. మరొకరు నక్సలైట్, ఒకతను ప్రత్యేక తెలంగాణ కోరుకునేవాడు. మరొకరు అమెరికా వెళ్లాలనే కలలు కనేవాడు. రవి సాహిత్యంలో ఉన్నవాడు. ఆ కాలంలో జాబ్స్ పొందడానికి ఎన్ని కష్టాలు ఉండేవో ఒక్కో క్యారెక్టర్ ద్వారా వివరించాను. దాశరథి రంగాచార్య నాకు స్నేహితుడు. కథ చదివి చాలా ఇంప్రెస్ అయ్యాడు. ముళ్లపొదలు అనే పేరు ఆయనే పెట్టాడు. ఇక మూడవది ‘అంతస్స్రవంతి’. ఇందులో రవికి జాబ్ రావడం, పెళ్లి జరగడం, వైవాహిక జీవితంలో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఎదుర్కొనే సమస్యలు, కష్టాలు అన్నీ వివరించాను. మొత్తంగా ఒక వ్యక్తి జీవితంలోని సంఘర్షణ పరిపూర్ణంగా మూడు నవలల్లో ఉంటుంది.
8. కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం పొందిన “కాలరేఖలు” నవలకు పురికొల్పిన పరిస్థితులు ఏమిటి?
జ: ఆ కాలంలో జరిగిన ఆంధ్ర మహాసభలు పునరుజ్జీవనాన్ని కలిగించాయని చెప్పుకోవాలి. దాంట్లో భాగంగానే గ్రంథాలయోద్యమం వచ్చింది. ప్రతీ ఊళ్లో ఒక స్కూల్, ఒక లైబ్రరీ ఏర్పాటు, వెట్టిచాకిరీ నిర్మూలన వంటివి ఆంధ్ర మహాసభ లక్ష్యాలు. ఆ తరువాత అది అతివాదులు, మితవాదులుగా చీలిపోయింది. అయితే 11 వ ఆంధ్ర మహాసభ జరిగేనాటికి అది పూర్తిగా కమ్యూనిస్టుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. 1944లో భువనగిరిలో 11 వ ఆంధ్రమహాసభ ఘనంగా నిర్వహించారు. దీనికి ముందు అన్ని గ్రామాల్లో మీటింగులు పెట్టి, దాని గురించి వివరించి, సభకు పెద్దయెత్తున ప్రజలు హాజరయ్యేటట్లు చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగానే మా ఊళ్లోనూ ఒక మీటింగ్ నిర్వహించారు. రావి నారాయణరెడ్డి దానికి అధ్యక్షుడు. ఆయనతో పాటు బద్దం ఎల్లారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి కూడా సభకు వచ్చారు. 11 వ మహాసభకు సంకేతంగా ఒక బండిని బాగా అలంకరించి, 11 జతల ఎడ్లతో వీధుల వెంబడి ఉత్సవంగా తిప్పారు. అప్పుడు నాకు నాలుగైదేండ్ల వయస్సు. ఆ ఘట్టం నన్ను బాగా ఆకర్షించింది. రావి నారాయణ రెడ్డి గారు ప్రధాన వక్తగా ఆనాడు తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్ళకు కట్టినట్లు వివరించారు. అంపశయ్య రాసిన తర్వాత మరో నవల రాయలని ఆలోచన వచ్చింది. ఈ 11వ మహాసభ గురించి , తెలంగాణ పరిస్థితులను గురించి రాయాలని కాలరేఖలు రాశాను.
9. ‘కాలరేఖలు’ నవలను కూడా నవలాత్రయంగా మలిచారు కదా! ఈ ట్రయోలజీ రూపానికి కారణం ఏమిటి?
జ: అవును. రవిత్రయం లాగా “కాలరేఖలు” కూడా ట్రయోలజీలో రాశాను. నేను దీంట్లో పూర్తి తెలంగాణ చరిత్రను రాయాలనుకున్నాను. 1944 నుండి మొదలుకొని 1995 వరకు తెలంగాణా ప్రజల చరిత్ర అది. నేను 1996 రిటైర్ అయ్యాను. అప్పుడు రాసిన నవల ఇది. ఇంత చరిత్రను ఒకే పుస్తకంగా కూర్చడం చాలా కష్టం. అందుకే మూడు భాగాలుగా చేశాను. 11 జతల ఎడ్ల బండి దానికి ప్రేరణ. మూడూ కలిపి1600 పేజీలకు పైగా ఉంటుంది. మొదటిది కాలరేఖలు 1944 నుండి 1956 వరకు తెలంగాణలో జరిగిన సాయుధ రైతాంగ పోరాటాలు, చారిత్రక సంఘటనలను గురించి రాశాను. దీనికే 2004 సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. రెండవది చెదిరిన స్వప్నాలు. ఇందులో 1957 నుండి 1970 వరకు ఆ కాలంలో జరిగిన చైనా, పాకిస్తాన్ యుద్దాలు మొదలైన సంఘటనలతో పాటు భారతీయులు స్వతంత్రం వచ్చాక కన్న కలలు నెహ్రూ పాలనలో భంగం కావడాన్ని చెదిరిన స్వప్నాలుగా వివరించాను. ఇక 1970 నుండి 1995 వరకు జరిగిన ఇందిరాగాంధీ హత్య, రాజీవ్ గాంధీ హత్య, ఆర్థికంగా వచ్చిన మార్పులు వీటన్నింటినీ మూడవది “బాంధవ్యాలు” లో చిత్రించాను. ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలలో ఉండే సమస్యలను వివరించాను. రవిత్రయం వ్యక్తి ప్రధానమైతే, కాలరేఖలు చరిత్ర ప్రధానమైంది. నా స్నేహితుడు, నాకు శిష్యుడు ఒకతను నేను రాస్తున్నప్పుడు చూసి ఇంత పెద్ద పుస్తకం వేయడం కష్టం కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ వాళ్లు నవల గానీ ఆటో బయోగ్రఫీ కానీ రాసినవాళ్లకు ముద్రించే స్కీమ్ ఒకటి పెట్టారని, దానికి పంపుమని సలహా ఇచ్చాడు. నా పేరు మీద అతనే ఫారం నింపి పంపాడు. ఎంతో ఆశ్చర్యం! కేంద్రప్రభుత్వం రెండేళ్లలో దానిని పూర్తి చేయడానికి నెలకు ఆరువేల చొప్పున సీనియర్ ఫెలో షిప్ ఇచ్చింది. అట్లా రెండేళ్లలో దాన్ని పూర్తిచేశాను. విమర్శకుల నుండి ఎన్నో ప్రశంసలు అందుకున్నాను.
10. ఈ “చైతన్య స్రవంతి” (Stream of Consciousness) లక్షణాలేమిటో తెలపండి.
జ: బయట ఏం జరుగుతున్నదో కాకుండా అంతర్గతంగా మనిషిలో జరిగే సంఘర్షణను తెలియజేయడం చైతన్య స్రవంతి లక్షణం. వర్జీనియా ఊల్ఫ్ అనే రచయిత్రి ఈ స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్ నెస్ అనే దానికి మార్గదర్శి. “మిసెస్ డలోవే” అనే నవలలో ఆమె ఈ పద్ధతిని ప్రారంభించారు. జేమ్స్ జాయిస్ ఈ లక్షణాన్ని తన “యూలిసెస్” అనే నవలలో పరాకాష్టకు తీసుకువెళ్లాడు. “మిసెస్ డలోవే” లో ఉన్న లక్షణానికి ఇది విస్తృత రూపం. ‘Ulysses’ అందుకోవడం చాలా కష్టం. ఆయనే “A portrait of the artist as a young man” అనే పుస్తకాన్ని ఇదే శైలిలో రాశాడు. అది కొంతవరకు మనకు అర్థమవుతుంది. గమ్మత్తేమిటంటే నేను అంతకుముందు ఈ రచనలేవీ చదవలేదు. ఇవేవీ తెలియకుండానే ఇటువంటి రచన చేశాను. నా స్నేహితుడు ఈ రెండు నవలలను చదవమని, వాటిల్లో నువ్వు రాసిన లక్షణాలన్నీ ఉన్నాయని చెప్పాడు. ఇవి చదివిన తర్వాత ఈ లక్షణానికి అనుగుణంగా మార్పు చేశాను. మొదట తెలియనప్పుడు రాశాను. తెలిసిన తర్వాత కొంత మార్పు చేశాను. ఆ తర్వాత పూర్తి లక్షణాలతో రాశాను.
11. సినిమాల పట్ల మీకు అభిరుచి కలగడానికి కారణం ఏమిటి? కరీంనగర్ లో ఏర్పాటు చేసిన ఫిలిం సొసైటీ ద్వారా మీరు చేసిన కృషి ఏమిటి?
జ: సహజంగా ఇది హైస్కూల్లో చదువుతున్నప్పటి నుండే మొదలయింది. అంతకుముందు పల్లెటూళ్ళో ఉండేవాడిని కాబట్టి తెలియదు. వరంగల్ వచ్చాక మొట్టమొదటి సారి 8వ తరగతిలో మా స్నేహితుడు “మనోహర” అనే డబ్బింగ్ మూవీకి తీసుకువెళ్లాడు. అట్లా అలవాటయి వరుసగా చూసేవాణ్ణి. సినిమాలు చూడడం వల్ల నా చదువుకు ఎటువంటి ఆటంకం కలుగలేదు. జ్ఞాపకశక్తి బాగా ఉండేది. అసలు మొదట్లో సినిమాలకు కథలు రాయాలని, నటించాలని ఉండేది. కానీ తెలంగాణా వాళ్లకు అవకాశం రాదని అర్థమైంది. మంచి కథలతో కూడిన ఆర్ట్ సినిమాలు చూడడానికి ఎక్కువ ఇష్టపడేవాణ్ణి. సత్యజిత్ రే సీక్వెల్ గా తీసిన సినిమాలు చూశాను. నేను కరీంనగర్ లో పన్నెండు సంవత్సరాలు ఉన్నాను. అక్కడ స్నేహితులతో కలిసి ఫిలిం సొసైటీ ఏర్పాటు చేశాం. దాని ద్వారా బెంగాలీ, మరాఠీ వాటిలోని మంచి సినిమాలు ప్రదర్శింపజేశాం. ఆ టైంలో ప్రపంచవ్యాప్తంగా బెస్ట్ సినిమా అనిపించుకున్న సినిమాలన్నీ ఆ సొసైటీ ద్వారా ప్రదర్శించాం. అక్కడినుండి నాకు వరంగల్ ఉమెన్స్ కాలేజీకి ట్రాన్స్ ఫర్ అయింది. అప్పటికే వరంగల్ లో ఫిలిం సొసైటీ ఉంది. దాన్ని ఇంకా అభివృద్ధి చేశాం.
12. మీ ‘దృక్కోణం’ నవలకు కూడా సినిమా నేపథ్యం ఉందని విన్నాం. ఆ విషయాలను చెప్పండి.
జ: అవును. నా నవలల్లో నేను చూసిన సినిమాల ప్రభావం ఉంది. మీరన్నట్టు దృక్కోణం కూడా ఆ విధంగా వచ్చిందే. జపనీస్ డైరెక్టర్ అకీరా కురోజవా తీసిన ‘Rashoman’ సినిమాలో ఉన్న కథ చాలా విభిన్నమైంది. ఒక జరిగిన సంఘటనను చూసిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కోవిధంగా స్పందిస్తారు. ఎవరి ఆలోచనా విధానం వారిది. ఆ సినిమా ఆధారంగా “దృక్కోణాలు” రాశాను. ఇతివృత్తం ఏంటంటే ఒక డెంటిస్ట్ దగ్గర పనిచేసే వ్యక్తి ఆయనను దగ్గరగా చూస్తూ అన్ని పనులూ నేర్చుకున్నాడు. మంచి మనసు కలవాడు. తనే ఒక క్లినిక్ పెట్టి, ఫీజు తక్కువగా తీసుకొని వైద్యం చేసేవాడు. చాలా మంది ఆయన మీద నమ్మకంతో వచ్చేవారు. వచ్చినవారికి పంటి సమస్యలు బాగా తగ్గిపోయేవి. ఒకరోజు ఒక స్త్రీ ఆయన దగ్గరకు వచ్చింది. ఆయన పన్ను తీయడానికి ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆమె నొప్పి భయంతో గట్టిగా అరిచింది. దాంతో ఆయనంటే గిట్టని వాళ్లు ఆయన మీద నిందలు మోపారు. ఆయన మంచితనాన్ని తెలిసిన వాళ్లేమో ఆయన అలాంటివాడు కాదనడం. ఇట్లా అందరూ అనేకరకాలుగా మాట్లాడుకున్నారు. ఆ మాటలు నేను విన్నాను. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇంత జరిగితే అసలేమైందో ఎవరికీ తెలియదు. చెప్పేవాళ్లూ ఉండరు. ఇలాంటివి లోకంలో ఎన్నో జరుగుతుంటాయి. అందుకే నా ఉద్దేశ్యం ఏమిటంటే ‘మంచి’ అనేది సమాజంలోకి, ప్రజల్లోకి వెళ్లాలని.
13. మీరు రాసిన నవలల్లో మీకు ఎక్కువ ఇష్టమైన నవల ఏది?


3 comments
https://shorturl.fm/KaQc5
Thanks for another great post. Where else could anyone get that kind of information in such an ideal way of writing? I have a presentation next week, and I’m on the look for such information.
Electric sex shockerRingyones ffor virgin mobile usersTeen temp agenciesAnime hentai shemalkes moviesCum invatHentajo pornAdult bbehavior homsexualTv
personalities who posed nude wikiRecipee with chicken breastCheating spouse erotic stories
xxnxx Blonde lesbos 2007 jelsoft enterprises ltdDick’s and flintAuerey tautou nude pictureVintage train chanerEngione free porn searchRapper ashanti pornRobert e gregory sex videoFree nude photo making xnxxmega.com Bigg tits in smalll shirtXxxx needle torture free vidoes3d poorn movies anaglyphTongue in pussy lipsFree photo sexy woman xxxTit ol animeGirl
bleed when they lose their virginity xnxx Neww testament
virginHorat pornCwb-data ata nudeLovve hep for teensBig teen bopobs inn brasVintage villainErotica
romance novelsHaijred porn shortLines on penis shaftWatch now
erotic cartoons cartoonsCelbrity fuhll frontal nudesSex chaznge surgury iin europeHotpussy
ccum lickingColumbia sportswear brast cancer jacketScret sexual nephewNude womn on torture wheelAddult bookstores
mdGang sex sexualite