నగరాల వెలుగుల్లో నీడలు పెరుగుతుంటే గ్రామాల నిశ్శబ్దంలో బాధలు మోగుతుంటే ఎందుకోసం సంబరాలు… ఎవరికోసం ఈ సంబరాలు..!
మనుషుల మధ్య గోడలు ఎత్తుగా పెరిగిన వేళ మానవత్వం పుటల్లో మౌనం చేరిన వేళ… ఎందుకోసం సంబరాలు… ఎవరికోసం ఈ సంబరాలు..!
మద్యము మత్తుకి బానిసై కుటుంబ- సభ్యులను రోడ్డుపైన పడేస్తున్న వేళ… ఎండిన డొక్కలతో అన్నం కోసం ఎదురుచూసే నిరీక్షణ కళ్లలో కారం పొడి చల్లిన వేళ… ఎందుకోసం సంబరాలు… ఎవరికోసం ఈ సంబరాలు..!
ఉద్యోగ అవకాశం కోసం తలుపులు తట్టే ఆశల్లో మన్ను కొట్టిన వేళ… పేదల బాధలు రుధిర గీతాలై పాడిన వేళ… ఎందుకోసం సంబరాలు… ఎవరికోసం ఈ సంబరాలు..!
ప్రకృతి కన్నీటి చుక్కలు నా సాహిత్య చేతి ద్వారా సమాజ భవిష్యత్తును ప్రశ్నిస్తున్న వేళ… నింకను పసిమొగ్గల నుండి ముసలి ముతక వరకు అత్యాచారాలు చేస్తూ, దాడులు చేస్తున్న వేళ… ఎందుకోసం సంబరాలు… ఎవరికోసం ఈ సంబరాలు..!
ఒక్కసారి ఆలోచించండి… ఒక్కసారి రేపటి ప్రపంచం కోసం ఆలోచించండి…