Home వ్యాసాలు రైక్వుని కథ

రైక్వుని కథ

ఈ కథ ఛాందోగ్యోపనిషత్తులో ప్రసిద్ధమైంది. నిరుపేద ఐన రైక్వుడు ధనవంతుడైన జాన్రపతికి బ్రహ్మాపదేశం చేయడం  ఈ కథలోని ప్రత్యేకత.

పూర్వకాలంలో జాన్రశుతి గొప్ప దాతగా పేరొందినాడు. అతడు నెలకొల్పిన సత్రాలకు లెక్కే లేదు. అడిగినవారికెల్ల దాన ధర్మాలు చేస్తూ, తల్లిదండ్రులను సేవిస్తూ, అతిథి అభ్యాగతులను సత్కరిస్తూ హాయిగా ఉన్నాడు. తానే కీర్తిమంతుడనని భావించాడు.

ఆయన నెలకొల్పిన అన్న స్కూల్లో జనులు అన్నపానీయాలు స్వీకరిస్తూ, అతని గురించి, వేనోళ్ళ చెప్పుకుంటున్నారు. అందువల్ల అతని కీర్తి దశదిశలా వ్యాపించింది.

జాన్రశుతివల్ల ఆయన కాలంలో ఒక్కడు కూడా ఆకలితో అలమటించినవాడు లేడు. అన్న సంతర్పం మహాభాగ్యంగా భావిస్తూ, జానశ్రుతి తనకంటే పుణ్యాత్ముడెవడూ లేడని ఇంచుక గర్వపడుతూ ఉండేవాడు.

ఇట్లుండగా ఒక సత్రానికి ఇద్దరు పరమహంసలు వచ్చారు. వారిని జానశ్రుతి గమనించ లేదు. కాని వారి మాటలు వినే అవకాశం అతనికి లభించింది. తానంత గొప్ప అన్నదాత కనుక అతణ్ణి ఎవరే విధంగా కీర్తిస్తున్నారో తెలుసుకోవాలన్న ఆసక్తి ఆయనలో ఉంది. ఆ కారణం వారి మాటల్ని కూడా విన్నాడు.

ఒక పరమహంస మరొక పరమహంసతో దాతృత్వంవల్ల జానశ్రుతి తేజస్సు సూర్యునిలో సమానమై లోకమంతటా వ్యాపించింది. దాన్ని ఎవరైనా తాకితే వారి నది దహించి వేస్తుంది” అని పలికాడు. అప్పుడు రెండవ పరమహంస “జానశ్రుతి రైక్వుని ముందెంతటివాడు? బ్రహ్మజ్ఞానియైన అతనికి ఎవ్వరూ సాటి రారు. జానశ్రుతికి గల ధనబలం కన్న రైక్వుని జ్ఞానబలమే గొప్పది. జానశ్రూతికంటె రైక్వుడే పుణ్యవంతుడు” అని బదులు చెప్పాడు, బ్రహ్మవేత్త అని కీర్తించాడు కూడా.

ఈ మాటలు విన్న జానశ్రుతికి కోపం రాలేదుగాని, ఆ రైక్వుడెట్లుంటాడో, ఎక్కడుంటాడో తెలుసుకోవాలన్న కోరిక కల్గింది. అనుకున్నదే తడవుగా తన సారథిని పిలిచి రైక్వుడెక్కడున్నాడో తెలుసుకొని రమ్మని ఆజ్ఞాపించినాడు. సారథి వెదకని చోటు లేదు. రైక్వుడనేవాడు గొప్పవాడై ఉంటాడనుకొని గొప్ప వాళ్లను మాత్రమే చూడసాగినాడు. యోగులు సామాన్యలుగా ఉంటారని, భగవంతునితో అన్ని ప్రాణులను చూసినట్లే, అన్ని ప్రాణుల్లో భగవంతుడు చూస్తారని పాపం సారథికి తెలియదు. అందుకే అతడు రైక్వుణ్ణి చూడలేకపోయాడు. నిష్ఫలుడై అరిగి వచ్చిన సారథిని సామాన్యులలో వెదకమని జానశ్రుతి ఆజ్ఞాపించాడు.

సారథి ఈ సారి మూలమూలన వెదికాడు. ఒక కుగ్రామంలో చిరిగిన బట్టలతో పెరిగిన గడ్డంతో, గోక్కుంటున్న దురద దేహంతో రైక్వుడు కనిపించాడు. అదే విషయం జానశ్రుతికి చెప్పాడు సారథి.

బ్రహ్మవేత్త ఐన రైక్వుని జాడ తెలిసిన జానశ్రుతి రైక్వుణ్ణి పేదతనం నుంచి విముక్తుణ్ణిచేసి, అతనివల్ల బ్రహ్మవిద్య సంపాదించాలనుకున్నాడు. ఒక బంగారు రథాన్ని సిద్ధపరిచి దానిమీద ఒక బంగారు పళ్ళెలో బంగారు నాణాలు నింపి బయల్దేరాడు. రథంతోపాటు మంచి పాలిచ్చే గోవుల్ని కూడా తీసుకొని వెళ్ళాడు.

అయితే ఆ సమయఁలో అతని కూతురు తండ్రి వెంట బయల్దేరింది. జానశ్రుతి చిన్న పిల్ల కదా అని వద్దన లేదు.

జానశ్రుతి రైక్వుని దగ్గరికి వచ్చి తాను తెచ్చిన కాన్కలను అతని ముందుంచాడు. తన మనస్సు తొందరపెట్టగా ‘ఓ స్వామీ నా కు మీరు ఉపాసించే దేవుణ్ణి గూర్చి ఉపదేశించండి” అని అర్థించాడు.

రైక్వుడు జానశ్రుతి అభిప్రాయం తెలుసుకున్నాడు. ధనం ఇచ్చి బ్రహ్మోపదేశాన్ని పొందాలనుకున్న జానశ్రుతిని ‘ఓ మూర్ఖుడా బ్రహ్మవిద్యను దేనితో కొనజాలరు. అది సమస్త సంపదలలో శ్రేష్ఠమైంది. నీ కాన్కలను తీసుకొని తిరిగి వెళ్ళిపో! అని ఆజ్ఞాపించాడు.  జానశ్రుతికి తాను ఆనాటి కాలంలో గొప్ప ధనవంతుడిననే అహంకారం ఉంది. ఎప్పుడైతే రైక్వుడు ఆ మాటలాడినాడో ధన గర్వాన్ని విడిచిపెట్టిన వాడయ్యాడు. క్షమించమని వేడుకున్నాడు. రైక్వుడు దయగలవాడై జానశ్రుతిలో ఇట్లన్నాడు. “ఇదిగో నీ అవస్థను నీ కూతురు చూస్తున్నది. ఆమె ముఖము చిన్నబోయింది. నేను అమ్మాయి ముఖం చూసి నీకు ఉపదేశం చేస్తానని చెప్పగా జానశ్రుతి ఎంతో ఆనందించాడు.

రైక్వుడు జానశ్రుతికి బ్రహ్మొ         పదేశం చేశాడు. ‘దానికే సంసర్గ విద్య’ అని పేరు.

“ప్రాణం దేన్నైనా తనలో కలుపుకుంటుంది. అగ్ని, సూర్యచంద్రులు బ్రహ్మాండంతో ప్రకాశక లోకాలన్నీ ప్రాణమే తనలో కలుపుకొని ఉంటుంది. అట్లే మన శరీరంలో వాక్కు, నేత్రం, శ్రోత్రం, మనస్సు దానిలోని చెక్కు చెదరక ఉంటాయి.

లోకంలోని ప్రాణశక్తి గొప్పిది. దానికి రెండు స్థానాలున్నాయి. ఒకటి, శరీరగత ప్రాణం, రెండు బ్రహ్మాండాంతర్గత ప్రాణం. నిజానికి ఈ ప్రాణశక్తి పరమాత్మ మహిమ చేతనే శరీరంలోనూ, బ్రహ్మాండంలోను పనిచేస్తుంది. పరమాత్మ ఆజ్ఞను శిరసావహించి ప్రపంచంలోని పదార్థాలను తనలో లీనం చేసుకుంటుంది. ఈ విషయం మానవాళికి తెలియదు. అందుకే వారు ప్రాణానికి ప్రాణమైన పరమాత్మను గుర్తించలేకపోతున్నారు” అంటూ రైక్వుడు ఒక కథ చెప్పాడు.

“ఒక బ్రహ్మచారి అతిథిగా ఒక ఇద్దరు మిత్రులు ఉన్న ఇంటికి వచ్చాడు. వారప్పుడు అన్నం తినడానికి సిద్ధంగా ఉన్నారు. బ్రహ్మచారి తనను కూడా అన్నం పెట్టమని కోరాడు. కాని వారు తిరస్కరించాడు. అప్పుడు ఆ బ్రహ్మచారి వారితో “మీరు నాకు కాదు అన్నం పెట్టేది. ప్రాణదేవత తృప్తి పడడానికే నేను మిమ్మల్ని అన్నం అడుగుతున్నాను. నిజానికి ఈ ప్రాణమే బ్రహ్మాండంతో అన్నాన్ని సృష్టించడానికి కారణమవుతుంది. అట్లే మన శరీరంలో ఉండి శరీరం నడవడానికి, ముఖ్యంగా ఇంద్రియాలు బలంగా ఉండడానికి అదే అన్నాన్ని స్వీకరిస్తుంది. ఈ విధంగా అన్నాన్ని సృష్టించిన ప్రాణమే ఆకలిగొని తింటుంది. అంతేకాని మనం కాదు, దీన్నిబట్టి తెలుస్తున్నదేమనగా ప్రాణశక్తి ఏ విధంగా అన్నాన్ని గ్రహిస్తుందో, అట్లే సమస్త లోకాలను పరమాత్మనే తనలోకి గ్రహిస్తాడు. అనగా లయం చేస్తాడు. అన్నం ఒకరిది కాదు. అది పరమాత్మచే ఈయబడింది. తినేది ప్రాణమేగాని, మనం (అనగా జీవులం) అజ్ఞానం చేత తింటున్నామనుకుంటున్నాం. ఇది సత్యం కాదు. కనుక నాకు అన్నం పెట్టడం పుణ్యమేగాని పాపం కాదు” అని వివరించాడు.

బ్రహ్మచారి మాటల్లో సత్యాన్ని గ్రహించి ఆ మిత్రులు అతని కన్నం వడ్చించారు. బ్రహ్మచారి తృప్తిగా ఆరగించి వెళ్ళిపోయాడు. పరమాత్మ సృష్టికర్తయే కాదు, సృష్టి కర్త కూడా.” అన్నసత్రాల్లో నీవిచ్చే అన్నం పరమాత్మ సృష్టించిందేగాని ఓ జానశ్రుతీ! నీవు సృష్టించింది కాదు. అట్లే ఆ పరమాత్మ సృష్టించిన ప్రాణమే అన్న వృద్ధికి తడ్పడుతూ, పిండగతమై ఆకలి తీర్చుకుంటుంది. అన్నం ఒకరిది కాదని, దానిమీద మానవునికధికారం లేదని, అన్నం అందరిదని, ప్రాణాన్ని తృప్తిపరచడానికి అన్నాన్ని స్వీకరిస్తున్నట్లు గ్రహించాలి తప్ప తనదనే భావన సరైంది కాదు. ఇదే నీకిచ్చే బ్రహ్మోపదేశం” అని రైక్వుడు పలకగా జానశ్రుతి ఎంతో ఆనందించాడు. తాను తెచ్చిన కాన్కలను అతనికి సమర్పించాడు.

ధనాశలేనివాడై, ఇంద్రియాలను జయించినవాడై, బండినడుపుతూ నిరుపేదగా జీవితాన్ని గడుపుతున్న రైక్వుడు నివసించే గ్రామం ‘రైక్వవర్ణం’ అనే పేరుతో ప్రసిద్ధి చెందింది. అప్పటి నుంచి అతని కీర్తి దశదశిలా వ్యాపించింది.

 

You may also like

1 comment

P.Srinivasa rao September 15, 2021 - 4:13 pm

మంచి విజ్ఞానాన్ని తెలిపారు..

Reply

Leave a Comment