గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (19)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)తెలుగులోకి అను సృజన చేసింది. గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలకు ఉల్లాసాన్ని కలిగిస్తాయి.
“జాగ్రత్త దోస్త్ ! ఇక్కడ మనిషి
తీసుకునే శ్వాస కూడా నకిలీదే !
చలాకీగా తిరిగే ప్రతి మనిషి ప్రాణంతో
ఉన్నట్లు మాత్రం అనుకోకు !
నిత్య జీవితంలో మనకు ఎందరో మనుషులు తారసపడతారు.నిత్యం కనిపించే వాళ్లు అయినప్పటికీ వాళ్లు అందరు మనకు కావాల్సిన వాళ్ళు కారు,మనకు కావలసిన వాళ్లు కొందరు మాత్రమే ఉంటారు అనే వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి.ఈ షాయరీ కవితలోని భావాలు సమాజంలో మనుషుల నిజ స్వరూపాన్ని ప్రతిబింబిస్తున్నాయి.బాహ్యంగా మనుషులు ఎలా కనిపిస్తున్నారో అలా ఉండరు.పైపై మెరుగులు అంటే అందం,తీయ తీయని చిలుక పలుకుల ముద్దు ముద్దు మాటలతో జనాన్ని ఆకట్టుకొని బుట్టలో వేసుకునే వారిని చూసి తక్షణమే వారిపై ఒక అభిప్రాయానికి రాకూడదు.అపరిచితుల జోలికి వెళ్లకూడదు.అపరిచితులను వెంటనే నమ్మకూడదు. అపరిచితుల మాటలకు చిక్కి బోల్తాపడకూడదు. మనకు తెలియని మనుషులు కనుక వారు ఎలాంటి వారో?అని తక్షణమే వారిపై ఒక నిర్ణయానికి రాకూడదు.వారు చెప్పేది మంచి మాటలా? బూటకపు మాటలా?వారి గురించి నిదానంగా ఆలోచించాలి.అసలు వారెవరు?వారితో గల మన సంబంధం ఏమిటి?అని దృష్టి సారించాలి అనే సూచన దాగి ఉంది.షాయరీ కవితలో మనిషి జీవితంలోని నాటకాలను,మోసాలను,వాస్తవికతను దార్శనికతతో చూపించడమైంది.షాయరీ కవితలో దాగి ఉన్న లోతైన భావం ఒక గొప్ప అర్థంతో కూడుకొని మనసుకు తాకి హాయిని గొల్పుతుంది. ‘జాగ్రత్త దోస్త్ ఇక్కడ మనిషి తీసుకునే శ్వాస కూడా నకిలీదే/’అంటే స్నేహపూర్వకమైన హెచ్చరికగా ఉపయోగిస్తారు.ఎవరైనా స్నేహితునికి ఏదైనా ముఖ్యమైన విషయం తెలియజేయడానికి జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది. జాగ్రత్త అంటే అప్రమత్తంగా ఉండడం మరియు జాగ్రత్తతో వ్యవహరించమని తెలియజేస్తుంది.దోస్త్ ఇది హిందీ పదం సంభాషణలో స్నేహపూర్వకంగా విస్తృతంగా ఉపయోగిస్తారు.జాగ్రత్త దోస్త్ అని చెప్పడం మీకు తనపై గల అపారమైన ప్రేమను, శ్రద్ధను తెలియజేస్తుంది.నేటి సమాజంలో ఉన్న మనుషుల మనసుల్లో నెలకొని ఉన్న కృత్రిమతను, మాయ మాటలను తప్పుడు ప్రవర్తనను సూచిస్తుంది.ఇక్కడ నకిలీ శ్వాస అనే భావన మనిషిలో వాస్తవికత లేక పోవడాన్ని, మోసపూరితంగా వ్యవహరించడాన్ని తెలుపుతుంది. ఇవ్వాళ సమాజంలో వ్యక్తుల నడత దోషభూయిష్టమై,కలుషితమై కంపు కొడుతోంది. సమాజంలో ఉండే చాలా మంది తమ నిజమైన స్వభావాన్ని దాచుకొని కృత్రిమమైన రూపంలో కనిపిస్తారు. ‘చలాకీగా తిరిగే ప్రతి మనిషి/ప్రాణంతో ఉన్నట్లు మాత్రం అనుకోకు’/అని చెప్పడం ద్వారా జీవితంలో మనకు కనిపించే వాళ్లు నిజంగా,ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు అని, భావించకూడదని హెచ్చరిస్తోంది.కవి జీవితంలోని అంతర్ముఖ పరిస్థితులపై దృష్టి చూపించారు.అనేక మంది బాహ్యంగా,శక్తివంతంగా,ఆనందంగా ఉన్నట్లు మనకు కనిపించవచ్చు.కానీ,వారి లోపల నిండి ఉన్న విషాదపు ఛాయలు,నిరాశ,నిర్లిప్తతతో పాటు, ఎదుటి వారిని బురిడీ కొట్టించే నయ వంచన, మోసం కూడా దాగి ఉండ వచ్చు.అందు వల్ల సమాజంలోని మనుషులతో వ్యవహరించే సందర్భంలో ఎటు వంటి దగా,మోసానికి గురి కాకుండా జాగ్రత్తగా ఉండమని సూచిస్తుంది.ఈ పంక్తి లోని లోతైన భావం మన హృదయాలను కదిలిస్తుంది.మనం ఎటువంటి సంకోచం లేకుండా మరొక సారి మన జీవితంపై దృష్టి పెట్టేలా ఆలోచింప జేస్తుంది.జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి వ్యక్తిని గుర్తించడంలో ఏమరుపాటు,అశ్రద్ధ తగదు.మనిషి తాను సందర్భానుసారంగా,స్వతంత్రమైన ఆలోచనతో ఇతరులతో వ్యవహరించాలి.తాను జీవితంలో సరియైన యుక్తి మరియు నేర్పుతో అప్రమత్తంగా ఉండాలన్న సందేశం ఉంది.ఈ షాయరీ కవిత ద్వారా మనం చూసే ప్రతి మనిషి ఎలా ఉన్నాడో,ఎట్లాంటి స్వభావం ఉందో అని తక్షణం అర్థం చేసుకోవడం కష్టం అని తెలుస్తోంది. మనిషి స్వభావంలోని కృత్రిమతను,అవగాహన లేక పోవడాన్ని విమర్శిస్తూ జీవితంలో అప్రమత్తంగా ఉండాలి అనే సందేశాన్ని ఇస్తుంది.ఈ కవితలోని భావం మన మనసులను తట్టి లేపుతుంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (20)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి డాక్టర్ భారతి తెలుగులోకి అను సృజన చేసింది.
“ఏదైనా మంత్రం వేసి … నన్ను చలాకైన
“వాడిగా మార్చి పడేయ రాదు ?
“ నా ఈ అమాయకత్వం నాకు చాలా
“కష్టాల్ని తెచ్చి పెడుతోంది మరి !
మంత్రం అంటే మన మనసును నియంత్రించే సాధనం.అంటే మన ఆలోచనలను కంట్రోల్ చేసే మార్గం.ఇందులో మంత్రం అంటే ఒక అద్భుతమైన మార్పు లేదా ప్రత్యేకమైన శక్తి సాధనతో తన స్వభావాన్ని మార్చుకోవడం.మంత్రాలతో లేదా మాయాజాలంతో మన జీవితాలను వెంటనే మార్చడం సాధ్యం కాదు,కానీ,తన ఆలోచనా విధానం ద్వారా తన స్వభావాన్ని మెరుగుపరుచు కోవచ్చు.చలాకైన వాడిగా ఉండాలి అంటే తాను బాగా అనుభవాల నుండి నేర్చుకున్న కార్యాచరణతో సమర్థత చూపించే వ్యక్తిగా మారాలి అని సూచిస్తుంది.కానీ,వ్యక్తి మానసికంగా ఉన్న అమాయకత్వం నుండి ఒత్తిడిని అనుభవిస్తూ బ్రతుకు ఒక సవాలుగా నిలుస్తుంది. ‘నా ఈ అమాయకత్వం నాకు చాలా/కష్టాల్ని తెచ్చి పెడుతోంది’/ మరి ఇక్కడ తాను తన అమాయకత్వంతో బాధలను అనుభవిస్తున్నాడు. అమాయకత్వం వల్ల అపరిచిత వ్యక్తుల చేతిలో సులభంగా మోసపోతున్నాడు.మరియు తాను ఏమి చేయాలో తెలియక పోవడం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.తనలోని అమాయకత్వం తనకు కష్టాలను,సమస్యలను తెచ్చి పెడుతుంది.అతను తన సహజమైన అమాయకత్వం విడిచిపెట్టాలని,తన స్వభావాన్ని సమర్థమైన చలాకీతనంగా మార్చుకోవాలని అనుకుంటున్నాడు.కానీ,అతనికి ఆ మార్పును ఎలా పొందాలో తెలియకపోవడం వల్ల తీవ్రమైన ఆందోళనకు గురి అవుతున్నాడు.చలాకిగా ఉండాలంటే ముందుగా తన మీద తనకు పూర్ణ విశ్వాసం ఉండడం అవసరం.తాను సాధించిన చిన్న చిన్న విజయాలను గుర్తుంచుకోవడం ద్వారా తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు.తన మనసులోని భావాలను,స్పష్టంగా,ధైర్యంగా చెప్పాలి.తాను ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలను తెలుసు కోవడం ద్వారా తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ముందుగా చిన్న చిన్న పనులు చేయడం ద్వారా తమను తాము పరీక్షించుకోవాలి.దాని ద్వారా అమాయకత్వం తగ్గి చలాకితనం ఉప్పొంగుతుంది. ఉత్సాహం,ఉత్తేజం పెరుగుతుంది.ఎవరైనా తమ జీవితంలో తప్పులు చేయడం సహజం.తాను ఆ తప్పుల నుండి గుణపాఠం నేర్చుకొని అమాయకత్వాన్ని విడిచి పెట్టి జీవితంలో ముందుకు సాగాలి.అప్పుడే విజయాలు సాధించడం సాధ్యం అవుతుంది అని గుల్జార్ షాయరీ కవితలోని భావాలు తెలియ జేస్తున్నాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (21)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది. గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలను రంజింప చేస్తాయి.
“నిర్దయుడా … నేను మరణించాక కనీసం
“నీకు ఆ కబురు కూడా చేరకూడదు !
“నువ్వు పిచ్చివాడిలా నా కోసం
“వెతుకుతునే ఉండు …
“నీకు నా సమాధి ఆచూకీ కూడా దొరక
“కూడదు !
ఈ కవితా పంక్తులు తన హృదయంలోని గాఢమైన బాధను మరియు ఆవేదనను,లోతైన భావోద్వేగాన్ని,అంతులేని కోపాన్ని, వ్యక్తపరుస్తోంది. నిర్ధయుడా అంటే నీలో ఏ మాత్రం దయా దాక్షిణ్యం, ప్రేమ,అభిమానం కనిపించడం లేదు.అందుకే తాను దయ లేని వాడా అని అతనిని సంబోధిస్తున్నాడు.ఈ పదం వ్యక్తి గుండెల్లో నెలకొన్న తీవ్రమైన గుబులును, మనస్సులో దాగి ఉన్న బాధను స్పష్టంగా తెలియజేస్తుంది.తాను అత్యంత ప్రియమైన వ్యక్తి అయినప్పటికీ తన పట్ల నిర్దయగా ప్రవర్తించాడని, తన లోపలి బాధను,ప్రేమను అర్థం చేసుకోలేదు అనే ఆవేదన వ్యక్తం అవుతోంది. నిర్దయుడా నేను మరణించిన తర్వాత కూడా నీకు ఆ వార్త కూడా తెలియకూడదు అనే నిర్ణయం కనబడుతుంది. ఇది ఒకింత ప్రతీకార భావాన్ని తనలో గల ఆవేశాన్ని వ్యక్తం చేస్తుంది.నేను జీవితంలో నీకు ఎంతో ముఖ్యం అని తెలుసు. అయినప్పటికీ తనను అసలు పట్టించుకోని విధంగా వ్యవహరించడం చేత తన మరణం గురించి అతనికి తెలుసుకునే అవకాశం కూడా ఇవ్వదలుచుకోలేదు అనే విషయం ఇందులో కనబడుతుంది.
‘నువ్వు పిచ్చివాడిలా తిరుగుతూ నా కోసం వీధుల్లో వెతుకుతూనే ఉండు’/అంటే ఇక్కడ తాను అనుభవించిన బాధతో పాటు తనకు ప్రియమైన వారు తన ప్రాముఖ్యతను మరణించిన తర్వాత అయినా గుర్తించాలి అని కోరుకుంటున్నాడు.తాను చేసిన తప్పును గ్రహించాలి.అతడు పిచ్చివాడిలా తన కోసం వెతుకుతునే ఉండాలి అనే భావం వ్యక్తం అవుతుంది.నీకు నా సమాధి ఎక్కడ ఉందో అనే ఆచూకీ కూడా దొరకకూడదు.ఇది ఒక అంతిమ ఆవేదన.తాను మరణించిన తర్వాత కూడా తన కోసం గుండె నిండా గుబులతో తహతహలాడుతుండాలి అనే ఆకాంక్ష వ్యక్తం అవుతుంది.ఇది ఆ వ్యక్తి గుండెల్లో పొంగి పొర్లుతున్న బాధను తెలియజేస్తుంది.ప్రియమైన వ్యక్తి మీద బాధతో,తీరని ఆవేశంతో,ఆగ్రహంతో చెప్పిన భావోద్వేగపూరితమైన భావాలు ఇందులో కనిపిస్తున్నాయి.ఇది ఒక విధంగా మనసులోని గూడు కట్టుకున్న బాధను మరియు తన జీవితంలో మిగిలిపోయిన శూన్యతను వ్యక్తం చేస్తుంది.ఈ కవితా పంక్తులు ప్రేమతో కూడిన ఆవేదన,ఎడతెగని కోపం మరియు విరహాన్ని ప్రతిబింబిస్తున్నాయి.ఇది ప్రియమైన ఆప్తుడు తన పట్ల చేసిన ఘోరమైన నిర్లక్ష్యానికి,ద్రోహానికి ప్రతిగా ఆవేదనతో కూడిన బాధను వ్యక్తం చేస్తున్నది.కవి గుల్జార్ తనలోని ప్రేమను,బాధను,ఈ షాయరీ కవితలో అద్భుతంగా పండించారు.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (22)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి ( డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“అతను నా కోసం
“వెతుకుతున్నాడు … బహుశా అతనికి
“అవసరం ఉందేమో !
“ఆ నేల కిందే నా సమాధి ఉందని అతనికి
“తెలియదు !
ఈ కవితా పంక్తులు గాఢమైన భావోద్వేగాలతో నిండి ఉన్నాయి.
అతను నా కోసం/వెతుకుతున్నాడు/అంటే అతను నన్ను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాడు.ఈ కవితా చరణం వ్యక్తిలోని గాఢమైన ప్రేమతో చేసే అన్వేషణను సూచిస్తుంది.ఇది ఒక వ్యక్తి మరొకరి కోసం ఎంతో ఆతృతగా వెతకడం మరియు అందు కోసం చేస్తున్న ప్రయత్నాన్ని తెలియజేస్తుంది.ఇది కేవలం తాను శారీరకంగా వెతకడం మాత్రమే కాక, ఆత్మీయంగా,భావోద్వేగాలపరంగా కూడా అతనిని కనుగొనాలని చేసే ప్రయత్నం కనిపిస్తున్నది.
‘బహుశా అతనికి/అవసరం ఉందేమో/ అంటున్నారు.అంటే అతనికి నాతో ఏదో సంబంధం ఉండాలి,అయినా ఏదైనా అవసరం ఉండవచ్చు అనే సందేహాం వ్యక్తం అవుతున్నది.ఇది అతని పట్ల గల ప్రేమ లేదా జాలితో కూడిన భావన. ‘ఆ నేల కిందే నా సమాధి ఉందని/అతనికి తెలియదు/అంటే అతనెక్కడైతే నిలబడి ఉన్నాడో ఆ స్థలంలోనే నా సమాధి ఉంది అనే సంగతి అతనికి ఎలా తెలుస్తుంది?అతను నా సమాధిని కూడా చూడ లేదు.కాబట్టి అతనికి సమాధి ఎక్కడ ఉందో తెలియదు.ఈ పంక్తి అత్యంత భావోద్వేగభరితమైనది.ఇది జీవితానికి సంబంధించిన ఒక విషాదకరమైన వాస్తవాన్ని తెలియజేస్తుంది.అతను నన్ను వెతుకుతున్నప్పటికీ నా ఆత్మకి ఎలా తెలుస్తుంది?నా ఆత్మకి తెలియదు లేదా నా పరిస్థితి అతనికి తెలియదు.అతను నిలబడి ఉన్న నేల కిందే నా జీవన గమనం ముగిసింది అని తెలియని స్థితి.ఇది ఒక వ్యక్తి తన ఆత్మను లేదా తన జ్ఞాపకాలను గురించి చెప్పినట్లుగా అనిపిస్తుంది.దీన్ని ఒక భావోద్వేగపు స్వరూపంగా చూడవచ్చు.దీనిలో ఒక మౌనమైన వేదన,అర్థం కాని దురవస్థ వ్యక్తం అవుతున్నాయి. ఇది తనకు ఎదురైన జీవితం,చేదు అనుభవాలను కవితాత్మకంగా వ్యక్తీకరించినాడని చెప్పవచ్చు.ఒకరి కోసం వెతికినా ఆ వ్యక్తి ఆత్మ యొక్క నిశ్శబ్ద పిలుపును లేదా గమనం ముగిసిన దశను గుర్తించ లేని పరిస్థితిని ఇది సూచిస్తుంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (23)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)తెలుగులోకి అను సృజన చేసింది.
“ఇంత అలక దేని కోయి ….
“నీ అలక తీర్చే సులువేదైనా కాస్త చెప్పు !
“నా జీవితాన్ని తాకట్టు పెట్టేస్తా
“నీ అలక తీర్చడానికి !
ఇష్టం లేక మొహం చాటు చేయడం అలక.తాను ప్రేమించే వ్యక్తి తన పట్ల అపరాధం చేసినప్పుడు, కొంత సమయం ఉదాసీనంగా వ్యవహరించడం అలక.మనిషి అలకను అధీనంలో పెట్టుకోవడం కష్టం.అలక అంటే ఒక నిశ్చితమైన ఫలితాన్ని కోరి ఓ పథకం ప్రకారం ఆ పని సాధించేందుకు కోపం వహించడం,ఆ కోపం తెచ్చుకున్నదే అయి ఉంటుంది.ఆవేశంతో కూడిన కోపం కాదు.
ఈ కవితా పంక్తులు తాను తన ప్రియమైన వారి అలకను తీర్చే ప్రయత్నంలో వ్యక్తీకరించిన భావనలను సూచిస్తుంది.ఇది అంతా సున్నితమైన ప్రేమతో కూడిన భావనగా తోస్తోంది.తాను తన ప్రియమైన వారి అలకను తీర్చే ప్రయత్నంలో తన ప్రేమను అంకితభావాన్ని గాఢంగా వ్యక్తికరించాడు.
“ఇంత అలక దేని కోయి…/అతను తన ప్రియమైన వారిని ప్రశ్నిస్తూ అలక వెనక గల కారణాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది. అతను ఆశ్చర్యాన్ని, ఆరాటాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇంత పెద్ద అలక ఎందుకు?దీనికి ఏమి కారణం?అనే ప్రశ్నలతో అలక గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత వ్యక్తం అవుతుంది.అలక ప్రేమికుల మధ్య సంభాషణలో అనేక సార్లు వినిపించే మాధుర్యమైన ప్రశ్న.
‘నీ అలక తీర్చే సులువేదైనా కాస్త చెప్పు/’అతను ఎంతో వినయంతో ఆమె అలకను తీర్చటానికి మార్గం చెప్పమని అడుగుతున్నాడు.అతను తమను దూరంగా ఉంచిన కారణాలను తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.తనను తాను నిరూపించేందుకు అలక తీర్చడం ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నాడు.ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది.దీనికి ఏదైనా సాధ్యం అయ్యే సులభమైన మార్గం చెప్పమని కోరడం ద్వారా అతను తన సరళతను,నిజాయితీని చూపిస్తున్నాడు.
‘నా జీవితాన్ని తాకట్టు పెట్టేస్తా/నీ అలక తీర్చడానికి/ అంటున్నాడు.అతనికి ఆమె మీద ఎంతో ప్రేమ ఉంది.ఇది ప్రేమ యొక్క గాఢతను,అంకితభావాన్ని, ప్రాధాన్యతను తెలియజేస్తుంది.అతను తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధం అని చెప్పి ఆమె అలకను తీర్చాలనుకుంటున్నాడు.తన ప్రియమైన వారి సంతోషం కోసం అతను ఎంత దూరమైనా వెళ్లేందుకు తాను సిద్ధమని తన ప్రాణం త్యాగం చేయగల శక్తిని కలిగి ఉన్నాడని సూచిస్తుంది.ఇవన్నీ అతను తన ప్రేమను వ్యక్తపరిచే తీరును గాఢమైన ప్రేమ,భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయి.తనకు అత్యంత ప్రియమైన వారిని కోల్పోయే భయంతో వారి మనసును తిరిగి పొందడానికి ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమని సూచిస్తున్నాయి.ఇది ప్రేమ,దానిలోని భావోద్వేగాలను బలంగా చూపించే ఉదాహరణగా నిలుస్తుంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (24)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“కొద్ది వెలుతురు అడిగా ఈ జీవితాన్ని !
“చూడండి … నేను ప్రేమించిన వాళ్ళు
“మొత్తానికే …. నిప్పు రాజేశారు !
ఈ కవితా పంక్తులు జీవితంలోని నమ్మకద్రోహం, ఆవేదన మరియు ఆకస్మికంగా ఎదురయ్యే మార్పులను అత్యంత గాఢంగా ప్రతిబింబిస్తాయి.
‘కొద్దిగా వెలుతురు అడిగా జీవితాన్ని’!/ఈ పంక్తి ద్వారా కవి చెప్పదలచిన భావం ఇది.జీవితంలో తాను తక్కువగానే ఆశించాను అని,కేవలం కొద్దిగా సంతోషం లేదా ఆశ కోసం మాత్రమే తపించాను అని,తన ఆశలు పెద్దవేమి కాదు అని,తను కోరుకున్నది ఒక సాధారణ వెలుగు మాత్రమే అని అంటున్నాడు.
‘చూడండి … నేను ప్రేమించిన వాళ్లు/అనే పంక్తి ద్వారా కవి తనకు అత్యంత సన్నిహితమైన వారితో,నమ్మిన వారితో గల ప్రేమతో కూడిన అనుబంధాలను సూచిస్తున్నాడు.ఇది ఒక గాఢమైన భావోద్వేగంతో కూడుకొని ఉంది.
‘ మొత్తానికే … నిప్పు రాజేశారు !/అంటే అతనికి ఎదురైన పరిస్థితులు మారాయి.ఆశ్చర్యంతో,బాధతో తాను ప్రేమించిన వారు,తనకు మద్దతుగా ఉండాలి అని భావించిన వారు, అనుకోకుండా తన జీవితాన్ని నిప్పుల బారిన పడేసినట్లుగా నడుచుకున్నారు. తాను ఎంతో ప్రేమించిన వారు,నమ్ముకున్న వాళ్ళే తీరా తన జీవితం నాశనం అవ్వడానికి కారణమయ్యారు అని,నిప్పు రాజేశారు అనే వాస్తవాన్ని తెలియజేస్తున్నది.అంటే జీవితం అంతా దహించుకుపోయినట్లు,అన్ని తారుమారు అయినట్లు తెలుస్తున్నది.ఇది నమ్మక ద్రోహం, అవిశ్వాసం మరియు ఆత్మీయ సంబంధాల్లో ఎదురయ్యే కఠిన అనుభవాలకు ప్రతిరూపం.ఇది జీవితంలో కలిగిన నమ్మక ద్రోహాన్ని,ఆకస్మిక ఆవేదనను ప్రతిఫలిస్తుంది.ఈ కవితలోని భావం ప్రతి మనిషి జీవితంలో బాధలు ఎదుర్కోవాల్సిన స్థితికి ప్రతినిధిగా నిలుస్తుంది.మనం జీవితంలో కొద్దిగా ఆనందం కోరుకుంటే అప్పుడప్పుడు నిరాశ, నమ్మకద్రోహం,భరించలేని తీవ్రమైన అనుభవాలు, కలలో కూడా ఊహించని చిక్కులు ఎదురవుతాయి. ఇది నమ్మకంతో ముడిపడిన సంబంధాల పట్ల కలిగే బాధను నిశితంగా చూపిస్తుంది.కవితలోని ఈ భావనలు తన అనుభవాలకే కాక సమాజంలో నెలకొన్న వాస్తవిక స్థితిగతులకు వర్తిస్తాయి. ఎందుకంటే మనం ఆశించే వెలుగుకు ప్రతిగా చీకటిని ఎదుర్కోవాల్సి వచ్చే సందర్భాలు అనేకం ఉంటాయి.కవి కోరుకున్న వెలుగుకు ప్రతిగా చీకటిని ఎదుర్కోవాల్సి వచ్చిన కఠోర సత్యాన్ని ఈ పంక్తులు సూచిస్తున్నాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (25)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“ఇదెలాంటి విషమో … ఏమో హృదయాల్లో
“నిండి పోయింది ?
“మనిషి మరణించాడు కానీ నీడలు బతికే
“ఉన్నాయి !
ఈ కవితలోని భావాలు చాలా లోతుగా భావోద్వేగంగా ఉన్నాయి.
“ఇదెలాంటి విషమో …ఏమో హృదయాల్లో/“నిండి పోయింది ?/ ఈ కవితా పంక్తి చాలా తీవ్రమైన భావోద్వేగాన్ని ప్రతిబింబిస్తుంది.ఇది మనసుకు చెప్పలేని బాధను,తీవ్రమైన కలతను కలిగించే ఏదో ఒక సంఘటన లేదా పరిస్థితి హృదయాలను ప్రభావితం చేస్తోంది.ఇది అనుభవంతో తాను ఎదుర్కొన్న చిన్నపాటి సమస్యను,అంతు లేని విషాదాన్ని సూచిస్తోంది.ఒక వైవిధ్యమైన అసహనాన్ని మనసులో నిలుపుతుంది.
“మనిషి మరణించాడు కానీ నీడలు బతికే/ ఉన్నాయి/’ అంటే ఈ కవితా పంక్తి ధార్మికతను మరియు ప్రగాఢమైన తాత్విక భావనను వ్యక్తపరుస్తుంది.మనిషి మరణం అనగా శరీర రూపంగా అతను లేకపోవడం,కానీ,అతను చేసిన పనులు,ఆలోచనలు,జ్ఞాపకాలు ఇంకా సజీవంగా ఉంటాయి.ఇక్కడ నీడలు అనగా మనిషి శరీరాన్ని విడిచి పోయిన తర్వాత కూడా అతని జ్ఞాపకాలు, అతని ప్రభావం లేదా అతని చేష్టలు,ఇంకా మన జీవితాల్లో కొనసాగుతాయి అని చెప్పవచ్చు.నీడలు అనేది ఆ వ్యక్తి ప్రాముఖ్యతను,ప్రభావాన్ని తెలుపుతాయి.ఇది మన మరణానంతరం కూడా మిగిలి ఉండి,జ్ఞాపకాల ప్రాధాన్యతను చూపిస్తుంది. ఇది మనిషి జీవితం మరియు మరణం మధ్య ఉండే సంబంధాన్ని మరియు మన దైనందిన జీవితాలపై అది చూపించే ప్రభావాన్ని ఆవిష్కరిస్తుంది.ఈ షాయరీ కవిత మన జీవితం,మరణం వాటి మధ్య సంబంధం మరియు తన జీవితం ముగిసినా అతని జ్ఞాపకాలు,ప్రభావాలు ఎలా కొనసాగుతాయో ఆవిష్కరించేందుకు చేసిన ఒక అద్భుతమైన ప్రయోగం.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత. (26)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)తెలుగులోకి అను సృజన చేసింది.
“అందరికీ తెలుసు … నేను కట్టుకున్న
“ఇల్లు ఇంకా పచ్చిగానే ఉందని
“అయినా … జనం వాళ్ల ప్రార్థనల్లో వర్షం
“కురవాలని కోరుకున్నారు చూడండి !
ఈ కవితా పంక్తిలో ఆంతర్యం చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంది.కవి గుల్జార్ హృదయంలో చెలరేగే భావాలను ప్రతీకాత్మకంగా చెప్పిన విధానం కనిపిస్తుంది.
“అందరికీ తెలుసు … నేను కట్టుకున్న/ఇల్లు ఇంకా పచ్చిగానే ఉందని/”దీని అర్థం ఏమిటంటే నేను కొత్తగా కట్టుకున్న ఇల్లు ఇంకా పచ్చిగా,తడిగా ఉంది. ఇక్కడ ‘ఇల్లు పచ్చిగా ఉండటం’ అనేది కొత్తగా నిర్మించిన ఇల్లు పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేదు అని సూచిస్తుంది.ఇది ఒక వ్యక్తి సొంత జీవితంలో కొత్తగా ప్రారంభించిన పని లేదా పరిసరాల గురించి చెప్పే ప్రతీకగా కూడా భావించవచ్చు. “అయినా … జనం వాళ్ల ప్రార్థనల్లో వర్షం/కురవాలని కోరుకున్నారు చూడండి/అంటున్నారు.ఇది ప్రతీకాత్మకంగా చెప్పబడింది.కానీ,వర్షం కోసం ప్రార్థనలు చేయడం అంటే జనాలు తమ అవసరాలు కోసం ప్రయత్నించడం మరియు ప్రకృతి సహకారం కోరుకోవడం సూచిస్తుంది.జనాలు వర్షం కురవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నారు.వర్షం అనేది బాహ్య పరిస్థితే అయినా,వర్షం వల్ల ఇల్లు తడిసి నష్టం కలిగించవచ్చు.ఏదైనా జరిగితే ఇల్లు తడిసిపోయే అవకాశం ఉందని కూడా అర్థం అవుతుంది.ఈ కవితా పంక్తులు వ్యక్తిగత మరియు సామాజిక స్థితి మధ్య విరుద్ధతను చూపిస్తున్నాయి.అతను పచ్చగా ఉన్న తన కొత్త ఇల్లును సంరక్షించుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ,జనాలు తమ అవసరాల కోసం కోరుకునే కోరికల వల్ల తనకు సమస్యలు,వచ్చే అవకాశాన్ని తెలియజేశారు.కవి వ్యంగ్య రీతిలో వ్యక్తిగత జీవితం మరియు సామాజిక ప్రవర్తన మధ్య గల సున్నితమైన సంబంధాన్ని కవిత ద్వారా ఆవిష్కరింపజేస్తున్నారు. ఇది భిన్నమైన సందర్భాల్లో మనుషుల తీరును ప్రతిబింబించే ఒక ఉదాహరణగా నిలుస్తుంది అని చెప్పిన కవి గుల్జార్ భావాలు పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (27)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“చూడు ! నా మీద అలిగితే … మా “అమ్మలాగే అలుగు !
“మా అమ్మ పొద్దున్నే మాట్లాడింది
“సాయంత్రానికల్లా మరిచిపోయి నన్ను
“దగ్గర తీసేది !
ఈ పంక్తిలో కవి తన భావాన్ని చెప్పే విధానం అర్థపరంగా,ఆసక్తికరంగా ఉంటుంది.ఇందులోని భావం చాలా సున్నితంగా హృదయానికి హత్తుకునేలా ఉంది.కవితలోని ప్రధాన భావం అమ్మ ప్రేమ పై ఆధారపడి ఉంటుంది.
“నా మీద అలిగితే … మా అమ్మలాగే అలుగు”/కవి తన సహచరునితో లేదా తనకు ఎదురుగా ఉన్న వారితో చెబుతున్నారు.అంటే నువ్వు నా మీద అలిగినా,మా అమ్మలా ఆ అలక తక్కువ సేపే కలిగి ఉండాలి అనే భావాన్ని అందిస్తున్నారు.మా అమ్మకు అలక రావడం సహజం.కానీ,ఆ అలక ఎక్కువ సేపు నిలవదు.ఇక్కడ అమ్మ అనేది ప్రేమకు ప్రతిరూపం. అమ్మను అనురాగం,నిస్వార్థత,క్షమకు ప్రతీకగా ఉపయోగించారు.
“మా అమ్మ పొద్దున్నే మాట్లాడింది/సాయంత్రానికల్లా మరిచిపోయి/నన్ను దగ్గర తీసేది/అని అంటున్నారు.
ఇది ఒక ఉదాహరణగా కవి తన అమ్మను గురించి ఇలా ప్రస్తావిస్తున్నారు.తాను ఉదయం అలిగినా, సాయంత్రానికి ఆ అలక పూర్తిగా మరిచిపోయి, తనను తిరిగి ప్రేమగా దగ్గర తీసుకునేది.అంటే అమ్మ ప్రేమతో,క్షమతో తనను స్వీకరించేది.ఇక్కడ ‘మరిచిపోయి’ అనే పదం క్షమకు సూచన.ఇది అమ్మ ప్రేమలో సహజమైన లక్షణం అని చెప్పవచ్చు.ఇక్కడ అమ్మ ప్రేమను,దయను,క్షమను గుర్తు చేస్తూ తన అభిప్రాయాన్ని తెలుపుతున్నాడు.కవి ఈ పంక్తి ద్వారా ఎవరితోనైనా సంబంధాన్ని మధురంగా కొనసాగించాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమ్మలా ప్రేమతో మెలగాలి.అమ్మలా అలక తక్కువ సేపు ఉండాలి,తర్వాత ప్రేమకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే సందేశాన్ని తెలియ చేస్తున్నాడు.అమ్మ ప్రేమ ఎంతో గొప్పది.అమ్మలో స్వార్థం అనేది ఇసుమంత కూడా కనిపించదు.మనం కూడా అమ్మలాగే నిస్వార్థంగా ఉండాలి అని సూచిస్తున్నాడు.ఈ కవితలో వ్యక్తిత్వం,సంబంధాల కొనసాగింపుల గొప్పతనం వ్యక్తం అవుతుంది.ప్రత్యేకంగా ఏవైనా కొట్లాటలు,ఆగడాలు,అలకలు కలిగినప్పుడు కూడా ప్రేమతో మెలగాలి అని చెప్పడమే ప్రధానమైన ఉద్దేశ్యం.ఈ కవితలోని అద్భుతమైన భావాలు
పాఠకులను హృదయాలను రంజింప చేస్తాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (28)
తెలుగులోకి అను సృజన ; కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“ నిప్పు రాజేసే వాళ్లకు ఏం తెలుసు !
“గాలి దిశ మార్చుకుంటే వాళ్లు కూడా కాలి
“బూడిదవుతారని ??
ఈ కవితా పంక్తులలో లోతైన భావనతో కూడిన ఒక గొప్ప ఆలోచన దాగి ఉంది.ఇది జీవిత సత్యాన్ని తెలిపే సున్నితమైన సామెతలా కనిపించడమే కాదు,పాఠకుల హృదయాలను ఆలోచింపజేస్తుంది.
“నిప్పు రాజేసే వాళ్లకు’/అంటే ఇతరులకు సమస్యలు సృష్టించే వాళ్ళు,అకారణంగా కలహాలు రేపే వాళ్ళు, తప్పుడు పనులు చేసే వాళ్ళు,ఎదుటి వాళ్లకు హాని చేయాలనే ఉద్దేశంతో వ్యవహరించే వ్యక్తులను సూచిస్తుంది.స్వార్థపరుల తలంపులు,ఆలోచనలు, చేసే పనులు ఎల్లప్పుడు తమ స్వప్రయోజనాలు నెరవేర్చుకోవడాని కోసమే ఉంటాయి.సమాజంలో స్వార్థపరులు తమ ప్రయోజనాల కోసం ఇతరుల జీవన విధానంలో కలిగించుకుని తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తారు.
“గాలి దిశ మార్చుకుంటే/”అంటే గాలి అనే పదం ఇక్కడ పరిస్థితులను లేదా సమయాన్ని సూచిస్తుంది.జీవితంలో ఏదీ ఒక్క చోటే స్థిరంగా ఉండదు.సమయాన్ని బట్టి పరిస్థితులు అప్పటికప్పుడు మారుతాయి.కన్ను మూసి తెరిచేలోగా క్షణం మారినట్టు,కాలచక్రం గిర్రున తిరుగుతుంది.గాలి దిశ అంటే పరిస్థితుల గతి.గాలి దిశ మారిపోతే ఎవరి స్థితి ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు?జీవితం ఏ వైపున పయనిస్తుందో ఎవరికి తెలియదు.తాము రాజేసిన మంటలు దిశ మార్చుకుని తమను కూడా కాల్చి బూడిద చేయ వచ్చు.మారిపోయే పరిస్థితిని ఊహించడం ఎవరి తరం కాదనేది స్పష్టం అవుతున్నది.
“వాళ్లు కూడా కాలి బూడిద అవుతారని “/ఎవరైనా వారు చేసే చర్యల ప్రభావం ఒక్క సారిగా తిరగబడితే అది వారి మీద కూడా దుష్ప్రభావం చూపిస్తుంది.ఇది కర్మ సిద్ధాంతాన్ని సూచిస్తుంది. దుర్మార్గంగా చేసే పనుల ప్రభావం ఎప్పుడో ఒకప్పుడు తమ పైన కూడా పడుతుందని చెప్పడం, ఎవరైనా దానవుల వలె రాక్షస ప్రవృత్తితో నడుచుకుంటే తాను తీసిన గోతిలో తానే పడడం జరుగుతుంది.దాని వల్ల కలిగే ఫలితం తనకే హాని కలిగిస్తుంది.సామాజికంగా లేదా వ్యక్తిగతంగా ఎవరికైనా హాని చేసే పని చేయడం వల్ల చివరికి అది వాళ్ళకే బెడిసికొట్టి తీరని నష్టంగా మారుతుంది అనే సందేశం తెలియజేస్తుంది.దుష్ట కార్యాలు చేయడం తాత్కాలికంగా లాభం కలిగించినప్పటికి,దీర్ఘ కాలంలో వాటి ప్రభావం తిరగబడి,ఆ దుష్కా.ర్యాలు చేసిన వారికే కష్టాలు కలుగుతాయి.అందు వల్ల ఇతరులకు మంచి చేయడం,న్యాయంగా నడుచుకోవడం,మనకు సమాజానికి మంచిది అని తెలియజేస్తుంది.ఎవరికైన హాని చేయడానికి ప్రయత్నించే ముందు ఆ కర్మల ప్రభావం తిరిగి తమ పైనే దాడి చేస్తుంది అనే నిజాన్ని గుర్తుంచుకోవాలి అనే సందేశం కవి గుల్జార్ భావాల్లో వ్యక్తం అవుతోంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (29)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“నీ జ్ఞాపకాల ఉదయాలను నాతోనే ఉండనివ్వు …
“ఎవరికి తెలుసు …ఎప్పుడు ఏ వీధి మలుపులో
“జీవితం అస్తమిస్తుందో ….?
ఈ కవితా పంక్తులు జీవితం యొక్క అస్థిరతను, దాని ఆవశ్యకతను తెలియజేస్తుంది.
“నీ జ్ఞాపకాల ఉదయాలను నాతోనే ఉండనివ్వు”
అనే చరణంలో ఒక వ్యక్తి తన మనసుకు సంబంధించిన ముఖ్యమైన జ్ఞాపకాలను ఎప్పటికీ తనతో ఉండాలని కోరుకుంటున్నాడు.ఎందుకంటే జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలియదు.’ఉదయం’ అన్నది దినచర్యలో ఒక భాగం,ఇది రోజు వారి జీవితంలో కొత్త ప్రారంభాలకు సూచనగా నిలుస్తుంది.ఆ జ్ఞాపకాలతో కొత్త జీవన అనుభవాలను స్ఫూర్తిగా తీసుకొని జీవనం గడపాలనే భావనను వ్యక్తం చేస్తుంది.
“ఎవరికి తెలుసు … ఎప్పుడు ఏ వీధి మలుపులో/జీవితం అస్తమిస్తుందో … /అనేది జీవితం యొక్క అనిశ్ఛితి,అస్థిరతను, తాత్కాలికతను సూచిస్తుంది.మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలియని పరిస్థితిని తెలుపుతుంది. మనకు ముందు ఏం జరుగుతుందో ?ఎక్కడ ఎలా మార్పులు చోటు చేసుకుంటాయో? అనే దానిని ఎవరు ఊహించ లేరు.జీవితం క్షణికం కాబట్టి అది ఎక్కడ ముగుస్తుందో? తెలియదు.జీవితాన్ని సమర్థంగా, గౌరవంగా కొనసాగించాలని,ప్రియమైన జ్ఞాపకాలను,హృదయంలో పదిలంగా నిలుపుకోవాలి అని తెలియజేస్తున్నది.జీవితం మనకు అందించే ప్రతి క్షణాన్ని,విలువైన కానుకగా భావించి, మధురమైన గత జ్ఞాపకాలను మనసులో నిలుపుకొని,వర్తమానాన్ని ప్రేమతో,ఆసక్తితో ఆస్వాదించాలనే గాఢమైన సందేశం కవి గుల్జార్ షాయరీ కవితలో వ్యక్తం అవుతుంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (30)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన ; నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“ప్రేమించు కానీ తిరిగి ఏమీ ఆశించకు
“దుఃఖం ప్రేమించడం మూలాన కలగదు …
“తిరిగి ప్రేమను ఆశిస్తావు చూడు,అప్పుడు “కలుగుతుంది.
ఈ పంక్తి ద్వారా ప్రేమకు సంబంధించిన ఒక విలువైన సందేశాన్ని అందిస్తున్నారు.
“ప్రేమించు కానీ తిరిగి ఏమీ ఆశించకు”అనేది ప్రేమ యొక్క అసలైన స్వరూపాన్ని తెలియజేస్తుంది. ప్రేమను స్వచ్ఛమైనదిగా ఎంచి,స్వార్థం లేకుండా ప్రేమించాలి అని ఇక్కడ సూచిస్తున్నారు.ప్రేమ అనేది నిర్మలమైనది,స్వచ్ఛమైనది.ప్రేమలో స్వార్థం లేకుండా ఉండాలి.ప్రేమించడం అంటే మన హృదయాన్ని ఇతరుల కోసం తెరవడం,వారి మీద మమతను చూపించడం.అయితే దీనికి ప్రతిఫలంగా వారి నుంచి ప్రేమ లేదా గుర్తింపును ఆశించడం,మన దుఃఖానికి కారణం అవుతుంది.
“దుఃఖం ప్రేమించడం మూలాన కలగదు”అని చెప్పడం,ఎవరైనా నిస్వార్ధంగా ప్రేమిస్తే దుఃఖం కలగదు.ప్రేమ సహజంగా స్వచ్ఛతతో కూడి ఉండాలి.ప్రేమించేటప్పుడు ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించ కూడదు.నిస్వార్థంగా ప్రేమిస్తే దుఃఖం కలుగదు.కానీ మీరు ప్రేమించిన వ్యక్తి నుంచి తిరిగి ప్రేమను ఆశించి అది లభించకపోతే దుఃఖం కలుగుతుంది.
“తిరిగి ప్రేమను ఆశిస్తావు చూడు,అప్పుడు కలుగుతుంది”/అని సూచించడం వల్ల మన దుఃఖానికి కారణం ఏమిటో తెలుస్తుంది. ప్రేమకు ప్రతిఫలం ఆశించడం ద్వారా ఆశలు పెరుగుతాయి. కానీ ఆ ఆశలు తీరకపోతే బాధ కలుగుతుంది. అందుకే ప్రేమ ఏ ప్రతిఫలాన్ని ఆశించనిదై ఉండాలి. ఈ భావం మనకు ఇతరులతో సంబంధాలను మరింత మంచిగా దృఢంగా నిలిపే మార్గాన్ని చూపుతుంది.మొత్తానికి ప్రేమను స్వార్థరహితంగా ప్రకటిస్తే మనం నిజమైన ఆనందాన్ని పొందగలం. అందు వల్ల ప్రేమను పంచడమే కానీ తిరిగి ప్రతిఫలాన్ని ఆశించకూడదనే భావన అని కవి గుల్జార్ కవితలో వ్యక్తం అవుతున్నది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత. (31)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“నీతో విసిగి వేసారిపోయామన్న వారిని
“వదిలివేయి
“భారంగా మిగలడం కన్నా జ్ఞాపకంగా మిగిలి
“పోవడమే మంచిది.
ఈ పంక్తులు అందంగా ఒక గొప్ప జీవిత సత్యాన్ని చెబుతోంది మరియు లోతైన భావనను కలిగి ఉంది.దీనిలో వ్యక్తిగత సంబంధాల మధ్య ఉండే సున్నితమైన సమతౌల్యతను గురించి చర్చించబడింది.
“నీతో విసిగి వేసారి పోయామన్న వారిని వదిలివేయి’/ఎవరు మనతో విసిగి వేసారి పోతారో, మనను అంగీకరించలేకపోతారో,అలాంటి వారిని వదిలి వేయడం మంచిదని సూచిస్తోంది.ఈ పంక్తిలోని భావన ఏమిటంటే,మన సమీపంలో ఉన్న వారు మనపై విసుగు చెంది,మనతో ఉండటానికి ఇష్టపడకపోతే,వారిని బలవంతంగా మనతో ఉంచడం అవసరం లేదని,ఎవరు మనకు అనుకూలంగా వ్యవహరించరో వారిని విడిచి పెట్టడమే సరైనదని అర్థం.
“భారంగా మిగలడం కన్నా జ్ఞాపకంగా మిగిలి/ పోవడమే మంచిది.”/ఎందు కంటే మనం వారికి భారంగా అనిపించడం కన్నా,మనతో గడిపిన మంచి జ్ఞాపకాలను మిగుల్చుకోవడం మంచిది.మన కుటుంబంలో,స్నేహితులలో లేదా ఇతర సంబంధాలలో మనం బలవంతంగా ఉండి వారికి మనం భారంగా మారడం మంచిది కాదు.ఒక వ్యక్తికి చెందిన గొప్ప జ్ఞాపకాలు జీవితాంతం మనతో ఉంటాయి.అందు వల్ల సంబంధాన్ని బలవంతంగా కొనసాగించకుండా గౌరవంగా ముగించడం మంచిదని చెప్పే ప్రయత్నం ఇది.ఇతరులతో మన సంబంధాలు బాగా ఉండాలి.ఇతరులతో మన సంబంధాలు భారంగా మారితే శాంతియుతంగా దూరమవడం కూడా ఒక మంచి నిర్ణయం.ఇది సంబంధాలను హాని లేకుండా,గౌరవంగా ముగించుకునే సమర్థమైన మార్గం అని కవి గుల్జార్ భావాల్లో వ్యక్తం అవుతుంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (32)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)తెలుగులోకి అను సృజన చేసింది.
“దోస్త్ …గుర్తుంచుకో ! కాలం గడిచే కొద్దీ నేనేమో
“అందరిలా మారిపోతాననుకోకు !
“నిన్నెప్పుడు కలిసినా … గతంలోలాగే ఉంటుంది
“నీతో నా వ్యవహారం.
ఈ కవితా పంక్తులు స్నేహానికి,బంధానికి గల అవినాభావ సంబంధాన్ని సూచిస్తాయి.
“కాలం గడిచిన కొద్దీ నేనేమో/అందరిలా మారిపోతాననుకోకు/ అని స్పష్టంగా చెప్పడం,కాలం ఎంత మారినా,తాను తన వ్యక్తిత్వాన్ని,తన స్వభావాన్ని మార్చుకోనని స్పష్టం చేస్తున్నాడు.ఇది అతని నిజాయితీకి,స్థిరత్వానికి నిదర్శనం.కాలం ఎంత గడిచినప్పటికీ నేను మారిపోనని నిన్ను చూసిన ప్రతి సారి,మన అనుబంధం,మన స్నేహం గతంలో ఎలా ఉందో,ఇప్పుడు అలాగే ఉంటుందని తెలియజేస్తున్నాడు.
నిన్నెప్పుడు కలిసినా .. గతంలోలాగే ఉంటుంది”/ అని అంటున్నాడు.స్నేహం ఎంత కాలం గడిచినా మారదు.స్నేహితుల మధ్య ఉండే అనుబంధం ఎప్పుడు పూర్వం ఎలా ఉందో అలాగే కొనసాగుతుంది అనేది వాస్తవంగా తోస్తుంది.
“నీతో నా వ్యవహారం”/ఈ కవితా పంక్తి సంబంధం మీద ఉన్న విశ్వాసాన్ని తెలియ జేస్తుంది.నా నడవడి నీతో ఎప్పుడు నిస్వార్థంగా,నిజాయితీతోనే ఉంటుంది.నా స్వభావం ఎప్పటికీ మారదు.నీతో నా స్నేహం ఎప్పటికీ అదే తరహాలో ఉంటుంది అని చెప్పే ఓ హామీగా చూడవచ్చు.ఈ షాయరీ కవితలోని భావన ఒక వ్యక్తి తన మిత్రుడితో గల అనుబంధాన్ని,మారని వ్యక్తిత్వాన్ని,కాలం ఎంత మారినా స్నేహం వారి మధ్య గల అనుబంధం ఎప్పటికీ మారదనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది. అసలుసిసలైన స్నేహం కాలంతో మారదు.అది కేవలం హృదయానికి సంబంధించినది.కవి గుల్జార్ స్నేహానికి, అనుబంధానికి గల గాఢతను షాయరీ కవితలో వ్యక్తం చేసిన తీరు అద్భుతంగా ఉంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (33)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“ నేను అమాయకుడినే కావొచ్చు కానీ,
“నేనెలాంటి
“వాడినో తెలియదు నీకు !
“నా సంతోషం కోసం వంద సార్లైనా విరిగి
“ముక్కలవగలను !
ఈ కవితా పంక్తిలోని భావం ఒక వ్యక్తి తన అంతర్ముఖ భావనలను వ్యక్తిత్వాన్ని వ్యక్తపరుస్తూ చెప్పినది.
ఇది ప్రస్తుతానికి అతని ప్రాధాన్యతల గురించిన లోతైన ఆలోచనను తెలియజేస్తుంది.
“నేను అమాయకుడినే కావొచ్చు/కానీ,వ్యక్తి తన అమాయకత్వాన్ని ఒప్పుకుంటున్నాడు.ఇది అతనిలోని నిజాయితీని సూచిస్తుంది.ఈ పంక్తిలో అతను తనను నిందించే వారికి సమాధానమిస్తున్నట్లు ఉంది.
“నేనెలాంటి వాడినో తెలియదు నీకు”/కానీ,అతను నిజానికి ఎలా ఉంటాడో,అతని గొప్పతనాన్ని, త్యాగపరత్వాన్ని ఇతరులు గుర్తించడం లేదని తపన పడుతున్నాడు.తన మనసులోని భావాలను ఇతరులు సరిగా అర్థం చేసుకోలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.తన వ్యక్తిత్వం గురించి,తన గొప్పతనం గురించి ప్రపంచానికి తెలియని తీరును తెలియజేస్తున్నాడు.
“నా సంతోషం కోసం వంద సార్లైనా విరిగి/ ముక్కలవగలను/అని అంటున్నాడు.ఇది తన ఆనందం కోసం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న శక్తివంతమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోంది. అతడు తన ఆనందం కోసం ఎంత గొప్ప త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాడు.అవసరమైతే వంద సార్లు విరిగి ముక్కలైనప్పటికీ తన ఆనందాన్ని దక్కించుకోవడంలో వెనుకాడడు.ఇది అతని త్యాగానికి,తన భావోద్వేగాలకు అద్దం పడుతుంది. ఈ కవితా పంక్తి తన బాధ్యతాయుతమైన ప్రేమ పూర్వక స్వభావానికి ప్రతీక.అది తన లక్ష్యాలకు ఆటంకంగా వచ్చిన ఎన్నింటినైనా ఎదిరించి,తన ఆనందాన్ని సాధించడంలో వెనుకడుగు వేయని తత్వాన్ని చూపిస్తుంది.ఈ కవితా పంక్తులలో ఒక వ్యక్తి తన అసలైన స్వరూపాన్ని తెలియజేసే ప్రయత్నం కనిపిస్తోంది.అతను అమాయకుడిగా కనిపించినప్పటికీ,అతని భావోద్వేగాలు లోతైనవి. తాను స్వార్థ రహితమైన త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.తన ఉన్నతమైన లక్ష్యాలను, ఇతరులు అర్థం చేసుకోలేకపోతున్నారని స్పష్టం చేస్తున్నాడు.కవి గుల్జార్ షాయరీ కవితలో వ్యక్తం చేసిన భావాలు బాగున్నాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(34)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“ఈ జీవితం నా మీద ఎందుకో
“అలిగినట్లుంది
“పోనీయ్ …ఇంకా వదిలేయ్ …
“ఇదేమి మొదటి సారి కాదుగా
“అలగనీ
ఈ కవితా పంక్తుల్లో జీవితాన్ని ఒక కష్ట సాధ్యమైన ప్రయాణంగా చూడటం కనిపిస్తుంది.
“ఈ జీవితం నా మీద ఎందుకో అలిగినట్లుంది”/అంటే జీవితంలో కొన్ని కష్టాలు, నిరాశలు ఎదురవుతు కలవరం కలిగిస్తున్నాయి. కానీ,ఆ కష్టాలు,సమస్యల గురించి అదే పనిగా ఎక్కువగా ఆలోచించడం,బాధ పడటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.నష్టమే ఎక్కువగా ఉంటుంది.ఈ కవితా పంక్తి తన మనసును పిండేస్తున్న నిరాశను,ఒత్తిడిని,జీవితం ఎందుకో ఇంత అన్యాయంగా ఉంది అనే భావనను వ్యక్తం చేస్తోంది.
“పోనీయ్ … ఇక వదిలేయ్ …”/ అని తాను మనసులో అనుకోవడం ఒక రకమైన బాధ నుంచి విముక్తి పొందటానికి చేసే ప్రయత్నం.ఇది అన్ని వదిలివేయడం కాదు,అన్ని పట్టించు కోకుండా ఉండడం కాదు.తాను జీవితాన్ని ఒక కొత్త కోణం నుండి చూసే ప్రయత్నం.తాను తన మనసులో నిండిపోయిన బాధను తేలికగా మరిచిపోయే ప్రయత్నం చేస్తున్నట్లుగా భావించవచ్చు.ఇందులో ఓ రకంగా జీవితంలోని కష్టాలను పెద్దగా పట్టించుకోకుండా వాటిని మరిచిపోయి ముందుకు సాగమనే సూచన దాగి ఉంది.
“ఇదేమి మొదటిసారి కాదుగా”/అని వ్యక్తం చేయడం వెనుక తాను ఇప్పటికే జీవితంలో ఇలాంటివి ఎన్నో సవాలక్ష సవాళ్లను సులభంగా ఎదుర్కొని ముందుకు సాగిపోయిన తీరు కనిపిస్తుంది.కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా ధైర్యంగా ఉంటూ ఈ క్షణాలను సమర్థవంతంగా ఎదుర్కోవడం మంచిది. ఇదేమి మొదటి సారి కాదుగా అనే చరణం చాలా కీలకంగా తోస్తుంది.తనకు జీవితంలో ఇప్పటికే అనేకానేక కష్టాలు,సమస్యలు ఎన్నో ఎదురైనాయని వాటిని ఎదుర్కొని బలంగా నిలబడిన అనుభవం ఉందని తెలియజేస్తున్నాడు.తన జీవితం తాత్కాలికంగా విసిగి ఉన్నదని అంటున్నాడు.తన జీవితం అన్యాయానికి లోనైందని దానిని సరిదిద్దడానికి తాను తన ఎదలోపల ఒక పరిష్కారం కోసం చేసే తపన,ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది. ఇదేమి మొదటిసారి కాదుగా అనే మాటలు,గతంలో కష్టాలను అధిగమించిన అనుభవాలను గుర్తు చేస్తాయి.ఈ షాయరీ కవితలోని ప్రధాన ఉద్దేశం తాను కష్టాలను స్వీకరించి వాటిని అధిగమించ గల శక్తి తనకు ఉందని తెలియజేయడం.జీవితానికి అర్థం ఏమిటి?అనేది కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది.ఇంత వరకు తాను కష్టాలను ఎదుర్కొని బలంగా నిలబడిన అనుభవం ఉంది.మళ్లీ కూడా తాను అదే శక్తితో ముందు కెళ్లగల సాహసం ఉంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును కూడా స్వీకరించాలి.అప్పుడే తనను తాను నిరూపించుకోవడం జరుగుతుంది.జీవితం ఎప్పుడో ఒక్కోసారి పరీక్షకు గురి చేస్తుంది.నిరాశ, నిట్టూర్పులు,అదో రకం బాధ ఏదోలా అనిపించినప్పుడు,మనసుకు శాంతి నిచ్చే పని చేయడం,ధైర్యంగా ముందుకు సాగడం అనివార్యం అని కవి గుల్జార్ షాయరీ కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(35)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“జీవించడానికి కొన్నే కొన్ని నా కాలపు
“క్షణాలు భద్రంగా దాచిపెట్టుకున్నాను !
“కానీ అవి ఎక్కడ … ఎప్పుడు
“ఖర్చైపోయాయో కూడా తెలీనే లేదు …
ఈ కవితా పంక్తులు జీవితం మీద లోతైన అవగాహనను ప్రతిబింబిస్తుంది.
“జీవించడానికి కొన్నే కొన్ని నా కాలపు క్షణాలు భద్రంగా దాచి పెట్టుకున్నాను/అంటున్నాడు. జీవించడానికి కొన్ని తన కాలపు క్షణాలను భద్రంగా దాచి పెట్టుకున్నా.జీవితంలోని అతి ముఖ్యమైన, విలువైన క్షణాలను జాగ్రత్తగా దాచి ఉంచుకున్నాడు అని అర్థం. “అవి ఎక్కడ … ఎప్పుడు/ఖర్చయి పోయాయో కూడా తెలీనే లేదు”/అని అంటున్నాడు.జీవితం అనేది ఎన్నో ఆకాంక్షలతో,ప్రయాణాలతో నిండిన ప్రక్రియ.మనం అప్రమత్తంగా లేకపోతే సమయాన్ని ఎలా గడిపామో కూడా తెలియదు.ఇది కాలం ఎంత వేగంగా వెళ్ళిపోతుందో,మళ్లీ తిరిగి రానిదో అనే విషయాన్ని గుర్తు చేస్తుంది.జీవితంలో కొన్ని మంచి అపురూపమైన సమయాలను భద్రంగా దాచి ఉంచాలని అనుకుంటాం.కానీ, కాలం ఎవరికి చిక్కక విలువైన క్షణాలు తెలియకుండానే ఇట్టే గడిచి పోతాయి.ఇది జీవితం ఎంత క్షణభంగురమైనదో, సమయం ఎంత విలువైనదో తెలియజేస్తుంది.మన జీవితంలో సమయానికి ఎంతో విలువ ఉంది,దానిని సద్వినియోగం చేసుకోవడం ఎంతో ముఖ్యమని ఈ కవితా పంక్తి తెలియ జేస్తుంది.కాలం అనేది నిరంతరం కదులుతూనే ఉంటుంది.మనం దాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి.మనం తెలియకుండానే అనవసర విషయాల్లో తలదూర్చితే అత్యంత విలువైన సమయాన్ని కోల్పోతాం.జీవితంలో ప్రతి క్షణాన్ని చురుకుగా ప్రయోజనకరంగా వినియోగించాలని కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ జీవితాన్ని జాగ్రత్తగా గడపాలి అనే ప్రేరణను కలిగిస్తాయి.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావాలు అద్భుతంగా ఉన్నాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత. (36)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“రోజూ ఎలా ఉన్నావని అడుగుతూ నన్ను
“సిగ్గుపడేట్లు ఎందుకు చేసావు ?
“ఇంకా ఎలా ఉంటాను నువ్వే చెప్పు?
“నువ్వు నన్ను ఏ స్థితిలో వదిలేసావో .. అదిగో
“అలానే నా పరిస్థితి !
ఈ కవితా పంక్తులు లోతైన భావోద్వేగాలతో నిండినవి.తాను జీవితంలో ఎదుర్కొంటున్న బాధను,బాధ్యత లేకుండా వదిలేసిన వారి చర్యల వల్ల కలిగిన హృదయ వేదనను తెలుపుతున్నాయి
“రోజూ ఎలా ఉన్నావని అడుగుతూ నన్ను/సిగ్గు పడేట్లు ఎందుకు చేసావు?/అంటే మాట్లాడుతున్న వ్యక్తి తన జీవితంలో కలిగిన బాధను ప్రతి రోజు గుర్తు చేయడాన్ని మళ్లీ మళ్లీ వినలేకపోవడం వల్లనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు.తాను తన పరిస్థితిని ఎల్లప్పుడు గుర్తు చేయడం వల్ల తనలో ఉన్న బాధ మరింత రెట్టింపు అవుతుంది.ఇది తనకు కలిగిన మానసిక ఆవేదనను స్పష్టం చేస్తోంది.
“ఇంకా ఎలా ఉంటాను నువ్వే చెప్పు ?/అని అంటే ఇంకా నేను ఎలా ఉంటానో నీకు తెలుసు కదా. ఇప్పుడు నీవు ఇంతకు పూర్వం నన్ను చూసిన విధంగానే బాధలను అనుభవిస్తూ ఉన్నాను.నువ్వు నన్ను ఏ స్థితిలో వదిలేసావో తిరిగి అదే స్థితిలో ఉన్నాను అనే భావనను తెలియజేస్తున్నాడు..
“నువ్వు నన్ను ఏ స్థితిలో వదిలేసావో… అదిగో అలానే నా పరిస్థితి/అంటే ఇక్కడ తన జీవితం ఎలాంటి మార్పు లేకుండా ఎటువంటి పురోగతి లేకుండా అదే స్థితిలో కొనసాగుతుందని అతను తెలుపుతున్నాడు.తనను పట్టించుకోనట్టి బాధ్యతాహీనతను స్పష్టంగా ఎత్తి చూపుతున్నాడు. ఇది తాను ఎవరో ఒకరిని నమ్మినారు,ఆ నమ్మిన వ్యక్తి వారిని మధ్యలో వదిలి వేయడం వల్ల ఎదుర్కొంటున్న ఒంటరితనాన్ని,బాధను వ్యక్తం చేస్తున్నట్లు తెలుపుతుంది.ఈ పంక్తులు ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితంలోని లోతైన బాధలను ప్రతిబింబిస్తాయి.అతను వదిలిపెట్టడం వల్ల తాను అనుబంధాన్ని కోల్పోవడం,ఒంటరితనం ఎదుర్కోవడం జరిగింది.ఈ కవితలో భావోద్వేగాల తీవ్రత మరియు సంబంధం పట్ల బాధ్యత అనేది లేకపోవడం స్పష్టంగా వ్యక్తం అవుతుంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (37)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“నా కళ్ళల్లోకి రావద్దని ఆమెకి చెప్పండి
“ఎవరైనా …
“ఆమె కలలో కొచ్చిన రాత్రి మెలకువ
“వచ్చేస్తుంది ….
“హృదయం ముక్కలవుతుంది?!
ఈ కవితా పంక్తులు భావోద్వేగాలతో నిండి ఉన్నాయి.
“నా కళ్ళల్లోకి రావద్దని ఆమెకి చెప్పండి/ఎవరైనా…/ఇది ఒక ఆకాంక్షను,ఒక విజ్ఞాపనను వ్యక్తం చేస్తోంది.ఆమె అంటే ఎవరో ప్రత్యేకమైన వ్యక్తి అని,ఆమె గురించి తనకు బలమైన భావనలు ఉన్నాయని తెలియ జేస్తున్నాయి.నా కళ్ళల్లోకి రావద్దని అంటే ఎందుకో తెలియదు?ఆమె చూపులు తన మనసుని కలవరం కలిగిస్తాయి.ఆమె గుర్తుకు వచ్చి ఆమెకు చెందిన ఆలోచనలు వేధించి,వెంటాడుతాయి.తాను ఆమెను ఎంతగానో గాఢంగా ప్రేమించాడు.కాబట్టి తన ఆవేదనను ఈ కవిత పంక్తులలో వ్యక్తం చేస్తున్నాడు.
“ఆమె కలలోకొచ్చిన రాత్రి మెలకువ వచ్చేస్తుంది …/ ఎందు కంటే ఆమె కలలో వచ్చినట్లయితే తన నిద్రకు భంగం కలుగుతుంది.ఆ ఆలోచన వల్లనే తన హృదయం ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. ఇది ఒక చిధ్రమైన అనుభవాన్ని చెప్పే పంక్తి.ఆమె కలలోకి వచ్చి తన నిద్రను దూరం చేస్తోంది.ఇది మనసు ప్రశాంతతను కోల్పోయిన పరిస్థితిని సూచిస్తుంది.
“హృదయం ముక్కలవుతుంది?!/అంటే ఇది ప్రేమ,వ్యథ,అసహనాన్ని వ్యక్తపరిచే పదాలుగా కనిపిస్తున్నాయి.ఇది తన మనసులోని బాధ లేదా విరహాన్ని సూచిస్తుంది.ఆమెపై తన ప్రేమ ఎంత ప్రగాఢంగా ఉందో ఆమెని గుర్తు చేసుకునే ప్రతి సారి హృదయం బాధపడుతుందని ఇది తెలియజేస్తుంది.
ఈ షాయరీ కవితా పంక్తులు ప్రేమ,విరహం,బాధల నడుమ ఉండే అంతరంగిక స్థితిని ప్రతిబింబిస్తాయి. ఇది ఒక వ్యక్తి తన మనసులోని అలజడిని, హృదయంలోని బాధను వ్యక్తపరుస్తున్నట్లు తెలుస్తోంది.కవి గుల్జార్ ఎవరో తనకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిని గుర్తు చేసుకుంటూ తనలో కలిగే భావోద్వేగాలను షాయరీ కవితా రూపంలో వ్యక్తం చేస్తున్నారు.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత. (38)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“నా ఊహా ప్రపంచం ఎంత అందంగా
“ఉంటుందనుకున్నావు ?
“నీతోనే మొదలవుతుంది …
“నీవుగానే ముగుస్తుంది !
ఈ కవితా పంక్తులు మనసులో ఊహ ప్రపంచం గురించి,వ్యక్తిగత భావోద్వేగాలను,ఆత్మీయ ప్రేమను వ్యక్తపరుస్తున్నాయి.ఇందులోని ఒక్కో పదం ఒక లోతైన భావనను వ్యక్తపరిచేలా ఉండటం గమనించవచ్చు.
“నా ఊహా ప్రపంచం ఎంత అందంగా/ ఉంటుందనుకున్నావు?/ఊహ ఎంత అందంగా ఉంటుందో నీకు తెలియదు.మన ఊహా ప్రపంచం మనకి ఎంతో ప్రత్యేకమైనది.దీన్ని వేరొకరితో పంచుకోవాలనుకోవడం ఒక భావోద్వేగం.ఆ వ్యక్తి తన ఊహలకు సంబంధించిన కేంద్ర బిందువుగా ఉందని చెప్పే ప్రయత్నం ఇది.
“నీతోనే మొదలవుతుంది …/అంటే ఇది జీవితంలోని ఆరంభం,స్ఫూర్తి ఎక్కడ నుంచి వస్తుందో చూపుతుంది.తన ఊహలు,తన కలలు ఏవైతే ఉన్నాయో అవి ఆ వ్యక్తితోనే ప్రారంభం అవుతాయన్న భావన గోచరిస్తుంది.ఇక్కడ ఆ వ్యక్తి ప్రాముఖ్యత,ప్రేమను వ్యక్తం చేస్తుంది.
“నీవు గానే ముగుస్తుంది !ఇది తన జీవిత ప్రయాణం.ఆ వ్యక్తితోనే ముగుస్తుందన్న భావనను సూచిస్తుంది.నీతోనే మొదలవుతుంది..నీవుగానే ముగుస్తుంది.ఇది ప్రేమ భావనను ఆ వ్యక్తి ప్రాముఖ్యతను వ్యక్తపరుస్తుంది.ఆ వ్యక్తి లేకపోతే తన ఊహా ప్రపంచానికి,తన కలలకు,తన జీవితానికి ఎలాంటి అర్థం ఉండదని స్పష్టంగా చెప్పడం.తన ఊహల ప్రపంచం ఆ వ్యక్తితోనే ప్రారంభమై అదే వ్యక్తితో ముగిసేంతగా బలపడిందని అర్థమవుతుంది.ఈ షాయరీ కవితా పంక్తులు ఒక సునిశితమైన ప్రేమను,ఆత్మీయతను,అలాగే ఆ వ్యక్తి జీవితంలో ఉన్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తాయి. ఇవి ఒక్క స్నేహం,ప్రేమ లేదా బంధానికి సంబంధించిన భావంగా భావించవచ్చు.ఈ భావాలు తన జీవితంలో సహజమైన సంబంధం ఎలా ఉంటుందో తెలుపుతాయి.ఈ కవితలో తాను ఎవరినైతే అంత గాఢంగా ప్రేమిస్తాడో వారికే తన జీవితం అంకితం అవుతుంది అనే భావన వ్యక్తం అవుతుంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత. (39)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“నీ ప్రేమ కూడా చాలా ఖరీదైనదిలా
“ఉంది …
“రోజు రోజుకి పెరిగిపోయే ధరలా !
ఈ కవితా పంక్తి ఒక రూపకం (metaphor) ద్వారా వ్యక్తీకరించబడింది.
“నీ ప్రేమ కూడా చాలా ఖరీదైనదిలా/ఉంది/అని చెప్పడం ద్వారా ఆ ప్రేమ అత్యంత విలువైనదిగా లేదా అందరికీ సులభంగా అందని దానిగా అభివర్ణించబడుతోంది.
“రోజు రోజుకి పెరిగిపోయే ధరలా/అంటే మీ ప్రేమ చాలా విలువైనదిగా అనిపిస్తుంది.అది రోజు రోజుకి పెరిగే ఖరీదైన వస్తువుల ధరల మాదిరిగా ఉంది. అంటే,అది సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండేలా లేదు.కానీ ఎంతో విలువైనదిగా ఉంది.ఇది ప్రేమ విలువ రోజు రోజుకు పెరుగుతోందని చెప్పడమే కాకుండా దాన్ని పొందడం కష్టతరంగా మారుతోందనే భావనను కూడా సూచిస్తుంది.ప్రేమ ఎంత ఎక్కువ ఆత్మీయతను కలిగిస్తుందో,అది అంత విలువైనదిగా భావించబడుతుంది.రోజు రోజుకు ప్రేమలో కలిగే కొత్త అనుభూతులు,మధురమైన క్షణాలు,ఆ ప్రేమ విలువను మరింత పెంచుతాయి. ప్రేమను సాధించడం లేదా దానిని పొందడం చాలా కష్టం అవుతుందనే భావన కూడా ఇందులో దాగి ఉంది.ప్రేమ రోజు రోజుకు పెరిగి అది సాధించలేనిదిగా అనిపించవచ్చు.ఈ కవితా పంక్తులు ఆ ప్రేమ విలువను, ప్రేమలో దాగి ఉన్న విశిష్టతను,ప్రేమ యొక్క ప్రత్యేకతను తెలియజేస్తుంది.అలాగే ప్రేమను పొందడం ఎంతో కష్టం అనే వాస్తవాన్ని వ్యక్తం చేస్తుంది.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావనలు అద్భుతంగా ఉన్నాయి.పాఠకుల హృదయాలను రంజింపజేస్తాయి.
వ్యాసాలు
(మొదటి భాగం, మహాబోధి బుద్ధవిహార)
బౌద్ధధర్మాన్ని సామాన్య ప్రజలలోనికి కొనిపోవడానికి జాతకకథలు ఎంతో ఉపయోగపడ్తాయి. ఈ జాతక కథలు పాలీ(భాష)లోని గాథలకు సందర్భసహిత వివరణలు. ఇవి పాలీత్రిపిటకాలలో ఖుద్ధనికాయంలో భాగంగా ఉన్నాయి. బౌద్ధులకు ఆదర్శ గ్రంథాలు త్రిపిటకాలు. అవి: 1. వినయపిటకం, 2. సుత్తపిటకం, 3.అభిధమ్మపిటకం.ఈ త్రిపిటకాలలో రెండవదైన సుత్తపిటకానికి సంబంధించిన గ్రంథమే ఖుద్ధనికాయగ్రంథం.
ఈ ఖుద్ధనికాయగ్రంథం మొదటిభాగంలో 150(నూటాయాబై) కథలున్నాయి. ఆ కథలను పదివర్గాలుగా విభజించారు. అవి: 1) అపణ్ణక, 2) శీల, 3) కురుఙ్గ (కురుంగ), 4) కులావక,5) అత్థకామ, 6) ఆసీస, 7) ఇత్థి, 8) వరుణ, 9) అపాయిమ్హ .10) లిత్థ, 11) పరోసత, హంచి, కుసనాళి, 14) అసమ్పదాన, 15) కకణ్టక వర్గాలు. ఇందులోని ఒక్కొక్క వర్గంలో ‘పది కథలు’(15I10R మొత్తం 150) ఉన్నాయి.
ఒకటి రెండు కథల్లో తప్ప, ప్రతికథలోనూ ఒక వర్తమాన కథ, ఒక అతీతకథ(గతాపూర్వ)జన్మకు సంబం ధించినకథ) ఉంటుంది. అంతేగాకుండా ఈ కథల్లో మనుష్యులు, యక్షులే గాకుండా రకరకాలప్రాణులు ాజంతువులు (ఏనుగు, కోతి మొసలి మొదలైనవి), పక్షులు(పావురాలు, చిలుకలు మొదలైనవి) కూడా కనబడుతాయి. ముందుగా ఆ కథల్లోనుండి వ్యాపారుల కష్టనష్టాల గురించి తెలుసుకుందాం,
వ్యాపారుల కష్టనష్టాలు ా సమాజం (అపణ్ణకకథ)
సరుకుల రవాణాకు పూర్వకాలమైన, ఇప్పుడైనా కష్టమైన పనే. సరుకుల రవాణా, ధరల నిర్ణయం, అనిశ్చిత స్థితి, అస్థిరస్థితి, భయాందోళనతోనే ఉంటుంది. ఆనాటికి, ఈనాటికి సరుకులరవాణాలో వేగం పెరిగితే పెరగవచ్చు. కాని, అవే సమస్యలు, కొన్ని వందల ఏండ్లనుండి వ్యాపారస్థులకు ఎదురు అవుతునే ఉన్నాయి. జాతకకథల ద్వారా ఆ వ్యాపారుల సాధకబాధకాల గురించి తెలుసుకుందాం.
ప్రాచీనకాలంలో అయినా, నేటి ఆధునికకాలంలో అయినా కొన్ని ప్రాంతాల్లో సరుకు రవాణావాహనాలు అడవులగుండా వెళ్ళాల్సి ఉంటుంది.ఆ అడవలు అనేకరకాలుగా ఉంటాయి. అవి: 1) దొంగల అడవి, 2) క్రూరమృగాల అడవి, 3) నీరులేని అడవి, 4) అమనుష్యుల అడవి, 5) తిండి దొరుకని అడవి.
ఈ అడవులగుండా భూమార్గంలో తూర్పు నుండి పడమరకు, పడమటి నుండి తూర్పుకు వ్యాపారనిమిత్తం బండ్లమీదసరుకు తీసుకొని రండు, మూడుజట్ల వ్యాపారులు కలిసి వెళ్లేవారు. ఆ జట్లకు ఎదురయ్యే, కలిగే లాభనష్టాలు: ` సాధారణంగా దారి, నీరు, ఆహారం, సరుకులు, వాటి విలువనిర్ణయించడాలు, దొంగలు, యక్షులు, మోసగాళ్లు మొదలైన సమస్యలు ఎదురవుతాయి. వాటి గురించి తెలుసుకుందాం.
రెండు, మూడుజట్ల వ్యాపారులబండ్లు ఒకేసారి ప్రయాణం చేస్తే ఒనగూరే కష్టనష్టాల గురించి, ఒక్కొక్కజట్టు వెళ్తే ఒనగూరే కష్టనష్టాల గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం.
ఆపణణ్జజాతక కథలో బోధిసత్వుడు ఒక వ్యాపారికుటుంబంలో, సౌమ్యుడు మరో వ్యాపారికుటుంబంలో జన్మించారు. వీరిద్దరు తూర్పు నుండి పడమరకు, పడమటి నుండి తూర్పుకు సరుకు అమ్ముకోవడానికి వెళ్లేవారు.
బోధిసత్వుడు (మొదటి వ్యాపారి) 500 బండ్లతో సరుకు అమ్ముకోవడానికి, మరో వ్యాపారి కొడుకు ` సౌమ్యుడు కూడా 500 బండ్లతో సరుకు అమ్ముకోవడానికి బయలుదేరారు.
ఇద్దరూ ఒకే సారి వెళ్తే పశువులకు మేత, నీళ్లు కష్టమౌతాయని బోధిసత్వుడు భావించాడు. అంతేగాకుండా దారి బాగా నలిగి, గతుకులు, గాళ్లు పడుతుందని, నీటికి ఇబ్బంది అవుతుందని, ఇద్దరిలో ఎవరో ఒకరు ఒక నెల ఆలస్యంగా బయలుదేరితే మంచిదని బోధిసత్వుడంటాడు. అప్పుడు సౌమ్యవ్యాపారి తానే ముందుగా వెళ్తానంటాడు.అందుకు బోధిసత్వుడు అంగీకరిస్తాడు.
ముందుజట్టువారి ఆలోచనలు: ముందుజట్టుకు ఎదురయ్యే లాభనష్టాలు
- దారి నలిగి పోదు. గతుకులుండవు. పశువులకు కావలసినంత మేత, నీరు పుష్కలంగా లభిస్తుంది, దారిలో ఆకుకూరలు, కూరగాయలు కొదువలేకుండా దొరుకుతాయి. పైగా ముందుగా వ్యాపారం చేయడం వల్ల ఇష్టం వచ్చిన ధరలకు సరుకులు అమ్ముకోవచ్చు.
వెనకజట్టుకు ఎదురయ్యే లాభనష్టాలు: వెనక జట్టువారి ఆలోచనలు
మొదటి జట్టు నష్టాలు రెండవ జట్టుకు లాభాలుగా మారుతాయి. 1) మొదటిజట్టులో వెళ్లినవారు ా శ్రమించి ఎగుడుదిగుడు బాటలను (ఎత్తుపల్లాలు)సరిచేస్తారు. 2) మొదటిజట్టువారి ఎడ్లు దారిలో ముదురుగడ్డి తింటాయి. 3) నీరు లేని చోట చెలిమెలు తవ్వుతారు.
వెనక జట్టుకు లాభాలు:
1) బండ్ల ప్రయాణం చేసే దారి సుగమంగా ఉంటుంది.
2) లేత పసిరిక(గడ్డి), లేత కూరగాయలు దొరుకుతాయి
3) నీటి కోసం శ్రమించాల్సి అవసరం లేదు. చెలిమలు, ఇతర నీటివనరులు సిద్ధంగా ఉంటాయి.
4) ముందుజట్టుగా పోయినవారు సరుకులధరలు నిర్ణయించాలంటే ప్రాణం పోయినంత పని అవుతుం ది. సరుకులధరలు ముందుజట్టునిర్ణయిస్తుంది. ఆ శ్రమ వెనకజట్టుకు ఉండదు. కాబట్టి సరుకులు తేలిగ్గా అమ్ముకోవచ్చు.
ముందు జట్టు నష్టాలు, వెనక జట్టుకు లాభాలు:
వెనక జట్టు నష్టాలు, ముందు జట్టుకు లాభాలు
యక్షులు: యక్షులతోబాధలు
జాతకకథలను చదువుతుంటె ఎక్కడ యక్షుల ప్రస్తావన వచ్చినా, వారిని నరమాంసభక్షకులుగానే చిత్రించారు, అది ఎంతవరకు నిజమో తెలియదు. వీరు అనేకరకాలుగా మోసాలు చేస్తుంటారు.
అ) నీరు ా మోసాలు
యక్షులు చేసే మోసాలు, క్రూరకర్మలు ఇన్నిఅన్ని కావు. 1) దారెంట బండ్లు వెళ్తుంటే వ్యాపారస్తులు తీసుకెళ్లే నీటిని మోసపు మాటలతో, మోసపువేషాలతో నమ్మించి, నీటిని పారబోయిస్తారు. 2) వారు (వ్యాపారస్తులు) నీరు లేకుండా బలహీనులైనప్పుడు వారిని పీక్కు తింటారు(అపణ్ణక కథ, పుట,85) చనిపోయినా కూడా వారిని పీక్కు తింటారు.
ఆ) యక్షులమోసపు వేషం:
యక్షుల నాయకుడు వయస్సులో ఉన్న ఎడ్లను అందమైన బండికి కట్టుకుంటాడు. విల్లంబులు, డాలు, కత్తి ధరిస్తాడు. పదిపన్నెండు మంది అనుచరులును వెంటబెట్టుకొని, తామరపూలను, కలువపూలను పట్టుకుంటాండు. తడిసిన వెంట్రుకలతో, తడిసిన బట్టలతో సంపన్నుల్లా బండి మీద కూర్చుంటాడు.
బురద అంటిన చక్రాలతో కూడిన బండితో వ్యాపారస్తులకు ఎదురు వస్తాడు. అనుచరులు కూడా అలాగే దాదాపు తమ నాయకుని వేషంలోనే ఉంటారు. ఆ బండిని, బండికున్న బురదను, తడిసిన బట్టలను, వెంట్రుకలను చూసి, వ్యాపారస్తొలవారు వర్షంలో తడిసి వస్తున్నారనే అనుకుంటారు.
నిజమన వ్యాపారి తన పైకి దుమ్ము రాకుండా ‘ముందుబండి’లో పయనిస్తుంటాడు. యక్షుడు అతని పక్కన బండిని పోనిస్తూ మెల్లెగా మాటల్లోకి దింపి, తేలిగ్గా బరువులేని బండ్లతో వెళ్లమని సలహా ఇచ్చి,వారిని నమ్మేటట్లు చేస్తారు. వారి వద్ద బానల్లో ఉన్న నీటిని పార బోయిస్తాడు.
పాపం! నిజమైనవ్యాపారస్తులు ఎంతదూరం వెళ్ళినా వాన వచ్చిన జాడగానీ, నీటిజాడ గానీ ఉండదు. నీరులేక నీరసించి, బలహీనం కాగానే యక్షులు వచ్చి, ఆ మనుష్యులను, వారి ఎద్దులను పీక్కుతింటారు.
వ్యాపారస్తుల ఎడారి ప్రయాణం:
వ్యాపారస్తుల ఎడారి ప్రయాణం కూడా చాలా కష్టాలతో కూడుకున్నదే (పుట. 92). ఎడారి ప్రయాణం సముద్రప్రయాణం (నీటిమీది ప్రయాణం) లాంటిదే.
అ) ఎడారిలో దారి తప్పడం:
సముద్రపుప్రయాణంలో దారి గుర్తులుండవు. అలాగే ఎడారిప్రయాణంలో కూడా నేలమీద దారి గుర్తులుండవు. అందువల్ల ఆ కాలంలో వ్యాపారాస్తులు(సార్థవాహులు) నక్షత్రాలను బట్టి దారి తెలుసుకోవడానికి ప్రయత్నించేవారు. లేదా దిశానిర్దేశం చేయడానికి ఎవరైనా నక్షత్రజ్ఞానంకలిగిన ఒక వ్యక్తిని తీసుకెళ్లేవారు. అతను రాత్రిపూట ఏమాత్రం కునుకుతీసినా ఆ బండ్లు దారి తప్పేవి. బండ్లు ఒక్కోసారి తిరిగి, బయటుదేరిన చోటికే వెళ్లే అవకాశాలు ఉండేవి.
ఆ) ఎడారిలో ఇసుక కాలడం:
ఎడారిఇసుకను చేతిలోకి తీసుకుంటే వేళ్లసందుల నుండి జారిపోయే సన్ననిదువ్వలా ఉంటది. పొద్దు ఎక్కువ అవుతున్న కొద్దీ ఇసుక వేడెక్కి, ఇసుక నిప్పులరాశిలా మారుతుంది. కాళ్లుకాల్తుంటే పశువులు నడవలేవు. ఈ కారణంగా ప్రయాణం జటిలమౌతుంది. ప్రయాణం చేయడానికి వీలు లేకపోవడంవల్ల ప్రయాణం ఆపేస్తారు.గుడారాల్లోనే ఉండిపోతారు.
ఒకవైపు మలమల మాడ్చే ఎండ, మరోవైపు నీళ్లకరవు:
నీటిజాడ(జలనిధి) గురించి తెలిసినవారు ఎవరైనా ఉంటే వారివారి ద్వారా జాడ తెలసుకొని, చెలిమెలు, బావులు తవ్వే ప్రయత్నం చేసేవారు. ఎడారిఇసుకలో ఎక్కడైనా ఆకుపచ్చగా దర్భగడ్డి ఉంటే అక్కడ నీరు ఉన్నట్టు గ్రహించేవారు. ఆ చోట చెవిపెట్టి నీళ్లు పారుతున్నట్లుగా, జలజల శబ్ద వస్తుందా, లేదా అని వినేవారు.
క్రూరమృగాలు: వీటికి తోడు క్రూరమృగాలు. ప్రాణభయం.
రాత్రిపూట ప్రయాణం చేయడానికి చీకటి దిశ సరిగా తెలియదు, క్రూరమృగాలు ఎక్కడినుండి వచ్చి మీద పడ్తాయో తెలియదు.
సంచారవ్యాపారుల మోసాలు:
సంచారవ్యాపారులు అంటే తాము తీసుకెళ్లిన వస్తువులపేర్లతో కేకలు వేసుకుంటూ, వీధులవెంట తిరుగు తూ, ఇంటింటికి సరుకుల అమ్ముకునే వారు. ఈ సంచారవ్యాపారుల్లో కొందరు అమాయకులైన ప్రజలను మోసం చేస్తుంటారు. విలువైన వస్తువులను, విలువలేని వాటిగా చెప్పి, వెల తక్కువ చేసి చెప్తారు.
వర్తకుల నియమం:
వర్తకుల నియమం ప్రకారం ఒక వర్తకుడు వచ్చి వెళ్లాకనే, మరొక వర్తకుడు వెళ్ళాలి. కాని ఒకేసారి ఇద్దరు వెళ్లకూడదు (పుట. 96).
లివితేటలుగల యువకుని వ్యాపారం:
శ్రేష్ఠికులంలో పుట్టిన బోధిసత్త్వుడు మహామేధావి, పండితుడు. అతను ఒకనాడు రాజాస్థానానికి పోతూ పోతూ, ఒక చచ్చిన ఎలుకను చూస్తాడు. దాని నక్షత్రబలాన్ని చూసి, ‘ఎవరైనా తెలివిగలవాడు ఈ చచ్చిన ఎలుకతో వ్యాపారం చేసి, భార్యాపిల్లలను పోషిస్తాడు’ అని అంటాడు.
ఆ మాటలు విన్న ఒక యువకుడు ఆ చచ్చిన ఎలుకను తీసుకెళ్ళి, పిల్లికి మేతగా ఒక కాకణికం(అణా వంటి చిన్న నాణెం)కు అమ్ముతాడు. దానితో కొన్ని బెల్లంముక్కలు కొంటాడు. ఒక పెద్దకుండా నీరు తీసుకొని పోయి, దారిలో పెట్టుకుంటాడు. అడవిలో పూలు ఏరుకొని, ఆ దారెంట వచ్చే దాహార్తులకు కావలసినన్ని నీళ్లుపోసి, వారికి ఒక బెల్లం ముక్క ఇస్తాడు. వారు సంతోషంతో తలా గొప్పెడు పూలు పెడ్తారు.
ఆ యువకుడు ఆ పూలను అమ్మి, మళ్ళీ బెల్లాన్ని కొని, వారికి ఇస్తాడు. తర్వాత అతను తోటకు వెళ్తే పూలమొక్కలు ఇస్తారు. వాటిని అమ్మి ఎనిమిది ‘కార్షాపణాలు’ సంపాదిస్తాడు. ఇంతలో ఒక రోజు గాలివాన వస్తుంది. రాజుగారి ఉద్యావనంలో చెట్లకొమ్మలు విరగి, ఆకులు రాలి, వాటితో నిండిపోతుంది. తోటమాలి అనుమతితో పిల్లలతో విరిగిన చెట్లకొమ్మలను ఏరించి, ఆ చెట్లకకొమ్మలను కుమ్మరి వాళ్లకు అమ్ముతాడు.
కకుమ్మరిఅతను కుండలు, బానలు ఇస్తాడు. వాటిని అమ్మితే 16 కార్షాపణాలు వస్తాయి. మొత్తంమీద అతనికి 24 కార్షాపణాలు సంపాదించాడు. వాటితో కుండలు కొని, మంచి నీరు నింపి, గడ్డిని అమ్మేవారికి (500మందికి) దాహం తీరుస్తాడు. వారు తిరిగి అతనికి ఏదైనా సహాయం చేయాలని అనుకుంటారు. వారి సహాయం తర్వాతతీసుకుంటానని చెప్తాడు.
ఆ యువకునికి ‘స్థలపథవర్తకులు (ఊర్లు తిరిగి వ్యాపారం చేసే వర్తకులు), జలపథవర్తకులు (నౌకావ్యాపారులు)’ వద్ద పనిచేసే పరిచారకులతో పరిచయమైతది. ‘స్థలపథవర్తకుడు’ గుర్రాలతో వస్తున్నాడని తెలుసుకొని, గడ్డి వాళ్ల వద్దకు వెళ్లి, గడ్డిమోపులు మాట్లాడుకుంటాడు. ‘తన గడ్డి అయిపోయేవరకు వాళ్లు అమ్మకూడదని ఒప్పందం చేసుకుంటాడు. 500 గడ్డిమోపులను 1000 నాణాలకు గుర్రాల వ్యాపారికి అమ్ముతాడు.
తర్వాత పెద్దనౌకలో ‘జలపథవ్యాపారి’ సరుకు తెస్తున్నాడని తెలుసుకొంటాడు. ఎనిమిది కార్షాపణాలతో బండిని కొని, చక్కగా, ఆర్భాటంగా అలంకరించుకొని, నౌకాశ్రయానికి వెళ్తాడు. తన దగ్గరున్న ఉంగరాన్ని బయానాగా (అడ్వాన్స్)ఇచ్చి, సరుకుతో సహా నావను కొని, అక్కడికి దగ్గరలోనే ఒక చిన్న మంటపాన్ని ఏర్పాటుచేసుకుంటాడు.
‘బయటి నుండి ఎవరన్నా సరుకులు కొనే వ్యాపారులు వస్తే మూడవజాములో నాకు చెప్పండని అక్కడివారికి చెప్తాడు. సరుకులతో నౌక వారణాసి నుండి వచ్చిందని తెలియగానే వందమంది వ్యాపారులు సరుకులను కొన డానికి నౌక వద్దకు వెళ్తారు. అప్పుడే సరుకు అమ్ముడు పోయిందని, ఒక యువకుడు కొన్నాడని, అతను మూడవ జామున వస్తాడని చెప్తారు. మొత్తం మీద ఆ యువకునికి ఒక్కొక్కరు 2000కార్షాపణాలు ఇచ్చి మొత్త సరుకును కొనేస్తారు. మొత్తం మీద రెండులక్షల (200000) కార్షాపణాలు సంపాదించుకొని తిరిగి వారణాసి వెళ్తాడు.
చచ్చినఎలుకతో వ్యాపారంచేయడమనే ఈ కథవల్ల వ్యాపారస్తునకు ఉండవలసిన లక్షణాలు తెలుస్తున్నాయి. అత్యల్పసమయంలో పనికిరాని వస్తువు(చచ్చాన ఎలుక)ను కూడా తెలివితేటలతో అమ్మవచ్చు, ముందుచూపు, యుక్తి, లౌక్యం, సమయస్ఫూర్తి ఉంటే డబ్బును ఎంతైనా, ఎలాగైనా సంపాదించవచ్చ ని కూడా మనకు ఈ కథ వల్లతెలుస్తుంది. వ్యాపారస్తులకు ఉండవలసినివి తెలివితేటలు అని ఈ కథ నిరూపిస్తున్నది.
వ్యాపారులు ా సరుకు ధర నిర్ణయం ా అధికారులకు లంచాలు:
సర్వసాధారణంగా రాజులుకొనే సరుకులు ` గుర్రాలు, ఏనుగులు, మణులు, మాణిక్యాలు, బంగారం మొదలైనవి. ఆ సరుకులధరలు నిర్ణయించడానికి ఆనాడు ‘ప్రత్యేకఅధికారులు’ఉండేవారు. ఆ ప్రత్యేకఅధికారులు ‘న్యాయం’గా సరుకు వెల’ నిర్ణయంచి, వాటిని అమ్మేవారికి ‘రొక్కం’ ఇప్పించేవారు. అలా సరుకులవెలను న్యాయంగా ఇప్పించడంతో ఖజానా ఖాళీ అవుతుండేది. ఈ విషయాన్ని రాజు గ్రహించాడు. అందువల్ల ‘సరుకు విలువ తెలియని’ ఒక ‘మూర్ఖుడిని, లోభిని’। అధికారిగా నియమిస్తాడు. ఇతనికి సరుకు గురించి తెలియకపోవడంతో, సరుకుకు విలువ కట్టకుండా నోటికి వచ్చినంత చెప్తుండేవాడు.
ఒకసారి ఒక వ్యాపారి ఉత్తరాపథంనుండి 500 గుర్రాలను తీసుకొని ‘ధరలనిర్ణయాధికారి’ వద్దకు వచ్చాడు. అతను వాటికి ‘మానెడు బియ్యం’ వెల కట్టాడు. ఆ వ్యాపారి అంతకుముంఉన్న ‘ధరల అధికారి’ వద్దకు వెళ్లి, మొరపెట్టుకుంటాడు. అప్పుడు అతను ఆ అధికారికి ‘లంచం’ ఇవ్వమంటాడు. తర్వాత రాజుగారి సమక్షంలో ‘మానెడు బియ్యం విలువ’ చెప్పమంటాడు. అందుకు అతను సరేనని ఒప్పుకొని, రాజుగారి సమక్షంలో మానెడెబియ్యం విలువ ‘రాజుతో సహా వారణాసి రాజ్యమంత’ అని అంటాడు. దాంతో అతని తెలివితేటలు బయటపడ్తాయి.
వర్ణాంతర వివాహం ా శ్రేష్ఠి కుటుంబం:
శ్రేష్ఠి కుటుంబంలోని కూతురు సేవకునితో సంబంధం పెట్టుకొని, చేతికి అందినంత సొమ్ముతీసుకొని, అతనితో ఇంట్లోనుండి వెళ్లిపోతుంది. మానసిక, శారీరక వేదన చెందుతుంది. ప్రసవానికి పుట్టింటికి వెళ్ళాలని అనుకుంటది. కాని మధ్యలోనే ప్రసవం అవుతుంది. రెండుసార్లు అలాగే మధ్యలోనే ప్రసవించి, వెనుకకు తిరిగి వస్తుంది. పిల్లలు పెరిగి పెద్ద అయిన తర్వాత, తాతఅమ్మమ్మల గురించి అడిగితే వారికి ఏ విషయాలు చెప్పకుండా, ఇద్దరు పిల్లలతో పుట్టింటికి వస్తుంది. నగరద్వారం వద్ద ఉన్న ధర్మశాలలో దిగి, తల్లిదండ్రులకు కబురు పంపిస్తుంది.కాని, తల్లిదండ్రులు ఆమెను ఇంటిలోనికి ఆహ్వానించడానికి ఇష్టపడరు, ఆమెను ఇంటిలోకి రానివ్వరు.కాని పిల్లలనుతమతో ఉంచుకోవడానికి అంగీకరిస్తారు, ఆ పిల్లలను దగ్గరికి తీసుకుంటారు.
(శ్రేష్ఠి : ఇది ఒక పదవి, ఈ పదమే శెట్టిగా మారింది)
ఇలాంటి వ్యాపార సంబంధిత అంశాలు, ఆనాటి సమాజం మనకు జాతకకథలవల్ల తెలుస్తాయి.
ప్రతి మనిషికి జన్మతః కొన్ని హక్కులుంటాయి. వాటికి తోడు బాధ్యతలూ ఉంటాయి. హక్కులు, బాధ్యతలు ఒకే నాణానికి రెండు వైపులు. విడదీయలేనివి. తరాజుకు కుడి ఎడమల్లా ప్రాథమిక సహజాలు. మనసా, వాచా, కర్మణా ఆచరించేవి, అనుభవించేవి. ప్రేమ, గౌరవంలా ఇచ్చిపుచ్చుకునేవి.
మనిషి సంఘజీవి. సమాజమనే కొలనులో తోటివారితో కలిసిపోయి ఈదాలి. అలలను ఆస్వాదించాలి, లోతులను గౌరవిస్తూ ఆటుపోట్లను ఆకళింపు చేసుకోవాలి. కట్టుబాటులను అనుసరిస్తూ పరిధుల్లో జీవించాలి. మనిషి ఎంత స్వతంత్ర జీవి అయినా బతుకుదెరువుకు విచ్చలవిడి విధానం దరువు కాకూడదు. ఒక దేశ పౌరుడిగా చట్టబద్దంగా నడచుకోవాలి. మనిషికి హక్కులు జన్మతో సిద్ధించినా, బాధ్యత లేని స్వాతంత్ర్యం గమ్యం లేని ప్రయాణంతో సమానం. మాటల్లోనైనా, చేతల్లోనైనా ఇతరులకు హాని జరగనంత వరకే హక్కులకు చెల్లుబాటని గమనించాలి. ఎవరి జీవితాన్ని వారే చిత్రించుకునే చిత్రకారుడిలాగా, ఎవరి ప్రపంచాన్ని వారే చెక్కుకునే శిల్పిలాగా సహకరించేవే హక్కులు, బాధ్యతలు. మానవ హక్కులు అందరికీ సమానమే. హక్కుల అనుభవంలో కాని, బాధ్యతల నిర్వహణలో కాని లింగ భేదం ఉండదు, ఉండకూడదు. నో జెండర్ డిఫరెన్సియేషన్! సృష్టిలో అందరూ సమానమే.
ప్రతి చలనం వెనుక నిశ్శబ్దంగా నడిచే కాలంలా, ప్రతి హక్కు వెనుక ఓ బాధ్యత దాగి ఉంటుంది. చలికాలం తరువాత వసంతం వచ్చినట్లు, హక్కుతో స్వాధీనం చేసుకున్న దాన్ని రక్షించుకునే బాధ్యతను కూడా ప్రకృతి నిర్దేశిస్తుంది. నిజానికి బాధ్యతతో సంరక్షించుకునేవే హక్కులు. బాధ్యత మనిషి సమర్థతకు, గొప్పతనానికి ఆంతరంగిక విలువ. ఒక నమ్మకానికి గుర్తు. ఆదర్శ దాంపత్యంలా హక్కులు, బాధ్యతలు కలగలిపిన అందమైన ఉయ్యాల జంపాలలు. పాట ప్రాభవానికి రాగం, పల్లవిలా, ఎగిరే పక్షికి రెండు రెక్కల్లా, మనిషి మనుగడకు ఈ రెండింటి సమతుల్యత ఎంతో అవసరం. ఎంత నల్లబడినా బరువెక్కని మేఘం వర్షించదు. అలాగే ఎన్ని హక్కులకు అర్హతలున్నా, బాధ్యతలు గుర్తెరిగి నడుచుకున్నంత కాలమే వాటికి గౌరవం, సాఫల్యం (చెల్లుబాటు). చెట్టు పైకి ఎంత ఎదగాలంటే దాని వేళ్లు అంత లోతుగా చొచ్చుకొని వెళ్లాలి. హక్కులకు సాధికార క్షేత్రం బాధ్యతల వక్షస్థలమైనా, హక్కు అధికారమూ కాదు, బాధ్యత బానిస కాదు!
హక్కులు, బాధ్యతలు సమానమేనా?
సందర్భాన్ని అనుసరించి బేరీజు వేయాల్సిన విషయం ఇది. ఒకదాని వెనుక మరొకటి ఉంటుంది కనుక సంఖ్యాపరంగా సమానం కావచ్చు. రెండింటిని విడదీయడం అసాధ్యమైనా, వాటి ప్రాధాన్యతలో కుడి ఎడమలవడం సహజం. అలా అయితేనే మనిషి మనుగడకు అర్థం, పరమార్థం ఉంటుంది. బీజగణిత సూత్రాలు నిజ జీవితానికి ఎల్లప్పుడు నూటికి నూరుపాళ్లు వర్తించవు. అటు ఇటు అయితే అసమానత అనో, అన్యాయమనో వ్యవహరించడం అర్థరహితం.
బాధ్యతను బరువు అనుకోవడం ఎంత మూర్ఖత్వమో, హక్కును అధికారమనుకోవడం అంతే అవివేకం. చెట్టుకు ఎవరూ నేర్పించరు ఏ కొమ్మకు ఎన్ని పూలు పూయాలో, ఎన్ని కాయలు కాయాలో, ఎంత బరువును మోయాలో. అది ప్రకృతి ఆపాదించే బాధ్యత. అలాగే, బాధ్యతనెరిగి నడుచుకునే మనిషికి హక్కులు వాటికవే మోకరిల్లుతాయి. రెండింటికీ తూకం వేయడం అసంబద్దం. ఏ బాధ్యతా లేని ఏకాంత జీవికి ఏ హక్కులూ ఉండవు. సమాజంలో ఎదుగుదలకు మరో మనిషి తోడ్పాటు అనివార్యం. ఇచ్చి పుచ్చుకునే దృక్పథం ప్రకృతి అనుసరించే సూత్రం. అది ప్రకృతి బిడ్డలందరికీ శిరోధార్యం.
హక్కుల కొరకే ఏర్పరుచుకున్న సంఘాలకు గుర్తింపు అర్థరహితం. కుల, మత, జాతి, జాతీయ, ప్రాంతీయ, భాషా, సాంస్కృతిక, లింగ, వైకల్య, రూపురేఖల వివక్ష లేకుండా విశ్వ వ్యాప్తంగా జన్మించిన మనుషులందరికి హక్కులు సమానమే. వ్యక్తిగత స్వాతంత్ర్యమూ సమానమే. ఆయా దేశాల చట్టాలూ, పేదా గొప్ప తేడా లేకుండా సమానంగా వర్తించేవే. నాగరిక సమాజంలో ఎవరు ఎవరికీ తక్కువా కాదు ఎక్కువా కాదు.
హక్కులు.. బాధ్యతల సంచుల్లో ఒ(పొ)దిగిన బహుమానాలు!
బాధ్యత అంటే హక్కు అనుభవించే సమయంలో ఉత్పన్నమయ్యే సమస్యకు పరిష్కారం వెదకడం. అవసరమైన చోట ఆపన్న హస్తం అందించడం. సందర్భాన్ని బట్టి త్యాగం చేయడం. చేపట్టిన కార్యాన్ని నిర్వర్తించడంలో నిబ్బరం ప్రదర్శించడం. క్లిష్ట పరిస్థితులను తట్టుకునే సామర్థ్యం కలిగి ఉండడం. బాధ్యతకు కొలత పరిమాణంలో కాదు ఓర్పులో ఉంటుంది. అదొక స్థితిస్థాపకత. హక్కు నెరవేర్చుకోవడానికి ఉపయోగపడే ఒక ఆయుధం.. ఓ పొదుగు. హక్కుకు దున్నే గుణముంటే, మైదానానికుండే పొక్కిలి గుణం బాధ్యతకు ఉంటుంది. కత్తిలాంటి హక్కుకు బాధ్యత ఒక ఒర.. ఓ రక్షణ కవచం! హక్కు బాణమైతే, బాధ్యత ఒక విల్లు. హక్కులనే బహుమానాలకు అవసరమైన ‘గిఫ్ట్ రాప్’ బాధ్యత!
షరతులు వర్తిస్తాయి!
హక్కు అంటే సమాజంలో ప్రతి మనిషికి తనదైన జీవన విధానంతో మనుగడ సాగించడానికి లభించే స్వేచ్ఛ. కుల, మత, ప్రాంత, లింగ భేదాలు వర్తించని స్వతంత్రత. అది ఆరోగ్యం, విద్య, వాక్కు విషయాలలో స్వేచ్ఛా కావచ్చు. కాని షరతులు వర్తిస్తాయి. పైన పేర్కొన్నవన్నీ దేశ పౌరుడిగా రాజ్యాంగం ద్వారా పొందిన హక్కులైనా ఇతరుల స్వేచ్ఛకు భంగం వాటిల్లనంత వరకే వర్తిస్తాయి. చట్టపరమైన హక్కులు అందరికీ సమానం కనుక హద్దులు వర్తిస్తాయి. అది వేరొకరిని బాధించేదైతే నవ్వడమే కాదు, ఏడ్వడం కూడా నిషేధమే!
బాధ్యతలతో సరితూగేవే అనుభవించాల్సిన హక్కులు! హక్కు అధికారం కాదు. అది బాధ్యతకు సమాంతరం. బాధ్యతను విస్మరించిన హక్కు, చర్మం ఒలిచిన మృత కళేబరంలా విలువ కోల్పోతుంది. ‘రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆర్ కాంప్లిమెంటరీ!’ హక్కులు, బాధ్యతలు ఒకదానిపై ఒకటి పరస్పర ఆధారితాలు. పరిపూరక సమాంతరాలు. ‘వైన్ అండ్ డైన్’ లా పరస్పర అనుబంధం కలిగి ఉండేవి. కేశాలంకారానికి వేసే జడకు రెండు పాయల్లా, రెంటికీ విడదీయరాని అల్లిక. మనిషి వ్యక్తిత్వానికి అవసరమైన గుర్తింపు, గౌరవం దక్కాలంటే ఈ రెండింటి నడుమ సమతుల్యత అవసరం. పుట్టగానే అన్ని పువ్వులు పరిమళించనట్లు, పుట్టుకతోనే రావు అందరికీ అన్ని హక్కులు. రాని వాటిని బాధ్యతతో శ్రమించి సాధించుకోవాలి.
హక్కును అధికారంలా భావించే వారికి అదొక ‘మత్తు’ ఆవరించిన శక్తి. తమ చుట్టూ ఉన్న పర్యావరణంపై, జీవితాలపై కొంత నియంత్రణ ఉండాలనే సహజమైన కోరిక. సరైన అర్హతలు లేని వారికి అదొక బలమైన ఆకర్షణ! ‘హోదా’ అనే భ్రమలో పడేసే మానసిక ప్రేరణ. మనుషుల తత్వాలను బట్టి, కొందరు ఆకర్షితులౌతారు, మరికొందరు దానికి దూరంగా ఉంటారు. అధికారం, హోదా తరచుగా కలిసే ఉంటాయి. ఎందుకంటే అధికారంలో ఉన్నవారు ఇతరులకన్న ఎక్కువగా గౌరవించబడతారని అపోహ. గౌరవం సంగతేమో కానీ, వారిని జనాలనుండి మాత్రం వేరు చేస్తుంది. అధికారానికి రెండు పార్శ్వాలు. ఒక వైపు సానుకూల మార్పుకు దోహదం చేస్తూ పురోగతిని తీసుకురావడం. మరో వైపు అవినీతితో కూడిన అధికార దుర్వినియోగంతో అనైతిక చర్యలకు పూనుకోవడం లాంటి చీకటి కోణం.
బహు పాత్రాభినయం
ఒంటరి కాదు మనిషి. పుట్టిన నుంచి గిట్టే దాకా కుటుంబ పరంగా, ఉద్యోగ పరంగా, సమాజ పరంగా ఎన్నో పాత్రల్లో జీవించాలి. ఆయా పాత్రలకు ప్రత్యేకించిన విధులను (బాధ్యతలను) సంపూర్ణంగా నెరవేర్చే దిశలో తలమునకలవుతేనే అధికారికంగా కొన్ని హక్కులకు అర్హుడవుతాడు. గెలుస్తేనే కదా ‘పథకం’ వరించేది! నెరవేర్చిన బాధ్యతలకు గుర్తింపుగా సిద్ధించేవే హక్కులు. ఏవీ అప్రమేయంగా లభించవు. ప్రతి ఒక్కరి జీవితానికి ఇవి అనుభవేకవేద్యమే. హక్కు అంటే దండించే అధికారం కాదు, సంస్కరించే ఆయుధం, సాటి మనిషికి సహకరించే సంప్రదాయం. హక్కు అంటే మనిషి మనిషిని కలిపి నడిపే శక్తి.. విడదీసి విసిరివేసే కుయుక్తి కాదు. నీటిలో దిగని వాడెప్పుడూ ‘గజ ఈతగాడు’ కాలేడు! బాధ్యతలనుండి పారిపోయినవాడికి ఏ హక్కులుండవు. ఆ రెండింటి నడుమ నిత్యం జరిగే వరుస ఘర్షణలను సమన్వయించుకుంటూ వెళ్లడమనేదే మనిషి వ్యక్తిత్వానికి అసలైన నిర్వచనం, జీవితానికి లిట్మస్ పరీక్ష. అప్పుడప్పుడు ఈ రెంటికీ సమతుల్యత కుదరక పోయినా భుజంపై ఆనించిన ‘కావడి బద్దను’ అటు ఇటుగా జరుపుతూ తులనాత్మకంగా వ్యవహరించే మెలకువలను జీవితం నేర్పిస్తుంది ప్రతి మనిషికి. ఇది అందరికి తెలిసినా, తెలియనట్టుండే అతి పెద్ద రహస్యం!
కుటుంబం – బాధ్యతలు – హక్కులు
కుటుంబమంటూ ఏర్పరచుకున్నాకా బిడ్డల బాగోగులకు సతతం పాటు పడడమే భార్యాభర్తల బాధ్యత. అందులో అవసరాన్ని బట్టి త్యాగమూ ఉంటుంది, అందమైన స్వార్థమూ ఉంటుంది. హక్కులున్నా.. అవి నిద్రాణంగా ఉంటాయి. పరిస్థితులు చేయిదాటి పోకుండా వాడుకునేవే ఆ హక్కులు. ఏది సూచించినా మాటల్లోనే కాక చేతల్లోనూ నిర్దేశనం చేయాల్సి ఉంటుంది. ప్రేమ, గౌరవాలే ప్రమాణంగా కుటుంబానికి రక్షణ కల్పించే దిశలో, కుటుంబ విలువలు కాపాడే ప్రయత్నంలో కొన్ని ప్రత్యేక హక్కులను ఉపయోగించాల్సి వస్తుంది. కుటుంబ సభ్యుల్లో ఒకరి యెడల ఇంకొకరికి ఉండాల్సిన బాధ్యతలను సంపూర్ణంగా వివరించడం అసాధ్యం. కుటుంబాన్ని బట్టి కాలానుగుణంగా ఉత్పన్నమయ్యె పరిస్థితులను అనుసరించి వాటి ప్రామాణికతతో పాటు పరిమాణం నిర్ధారించబడుతుంది.
ఇష్టమున్న చోటే బాధ్యత, బాధ్యతతో ఉంటేనే ఇష్టం పుట్టుకొస్తుంది. రెండింటికి అవినాభావ సంబంధం. జీవితం ఒక ప్రయాణం. శిశువుగా ప్రారంభించి క్రమంగా ఎన్నో దశలు దాటుకుంటూ వెళ్తాడు మనిషి. తండ్రిగా, తల్లిగా, భర్తగా, భార్యగా, కొడుకుగా, కూతురుగా, ఇంకా ఇతరత్రా బంధాల పాత్రల్లో ప్రతి మనిషికి తప్పదు జీవితంలో బహు పాత్రాభినయం. ప్రవేశం చేసిన పాత్రను బట్టి బాధ్యతలు, హక్కులు సంక్రమిస్తాయి. వ్యక్తిగత ప్రవర్తనకు సమాజం కొన్ని ప్రమాణాలను ఏర్పరచుతుంది. వాటి ప్రాముఖ్యతను అంగీకరించి ఎలాంటి ఉల్లంఘనలకు పాల్పడకుండా ఆయా ప్రమాణాల ప్రకారం నడుచుకోవడం ప్రతి వ్యక్తి బాధ్యత.
హక్కులు, బాధ్యతలు రైలు పట్టాలలా ప్రక్క ప్రక్కనే ఉంటాయి ఎప్పుడూ సమాంతరంగా. సర్వసాధారణంగా అవి ఒక దానితో మరొకటి అవిభక్తంగా అనుసంధానించబడి ఉంటాయి. పదవులు, అధికారం హోదాల లాగా, హక్కులు సంపాదించుకునేవి.. ఇవ్వబడవు. ఆడే ఆటను బట్టి మైదానానికి హద్దులు. అలాగే హక్కులకు ఎల్లలు లేదా హద్దులుంటాయి. ఆ హద్దుల రూపాలే బాధ్యతలు. పుట్టిన ప్రతి మనిషికి బ్రతికే హక్కుంది.. కానీ ఇతరుల గొంతు నొక్కుతూ కాదు. జీవించే హక్కును ప్రాథమిక హక్కులన్నింటికీ ‘గుండె’గా భారత సర్వోత్తమ న్యాయస్థానం అభివర్ణించింది. ‘రైట్ టు లైఫ్ ఈజ్ ద హార్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్ రైట్స్!’ నవ్వే హక్కుంది.. ఇతరులను అపహాస్యం చేస్తూ కాదు. ఏడ్చే హక్కుంది.. ఇతరులకు నరకం చూపించడానికి కాదు. మాట్లాడే హక్కుంది.. సాటి వారిని చిన్నబుచ్చడానికి కాదు. చట్టం ద్వారా సంక్రమించిన ఏ హక్కులకైనా పరిమితులుంటాయి. చట్టం ముందు అందరు సమానమే. వ్యక్తిగత స్వాతంత్ర్యం అందరికి సమానమే. ఎలాంటి వివక్షకు తావు లేదు. ముందుకు వెళ్లే హక్కుందంటే.. దారిలో ఉన్నవారి అడ్డు తొలగించుకొని కాదు. నీకంటూ ఒక దారిని సృష్టించుకొని వెళ్లమని అర్థం. హక్కుల విలువ ఇతరుల హక్కులకు భంగం వాటిల్లనంత వరకే. బాధ్యత లేని హక్కు వినాశకరం కావచ్చు. అందుకే ఏ పౌరుడైనా తన చర్యలకు తానే బాధ్యత వహించాల్సి ఉంటుంది.
13 జనవరి 2025 నుండి మొదలైన మహాకుంభమేళా సందర్భంగా అందిస్తున్న ప్రత్యేక వ్యాసం. మయూఖ పాఠకులకు ప్రత్యేకం..
పరిచయం
మహాకుంభమేళా అనేది కోట్లాది హిందువులు సంస్కృతి సంప్రదాయాలపై అచంచల విశ్వాసంతో చేసే యాత్ర ఈ సంవత్సరం 13 జనవరి నుండి 26 ఫిబ్రవరి 2025 వరకు సాగే 45 రోజుల యాత్ర.
ఇందులో నాలుగు రకాలు ఉంటాయి. సాధారణ కుంభమేళా ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది . ప్రతి ఆరు సంవత్సరాలకు జరిగేది అర్థ కుంభమేళా పూర్ణకుంభమేళా ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ లలో జరుగుతుంది . ఇలా 12 పూర్ణకుంభమేళాలు జరిగాక జరిగేది మహాకుంభమేళా . అంటే 144 సంవత్సరాలకు జరిగేది .ఇది అలహాబాద్ లో మాత్రమే జరుగుతుంది. అయితే ఈ రోజులలో 12 సంవత్సరాలకు జరిగే దాన్నే మహాకుంభమేళా అని పిలుస్తున్నారు.
కుంభం అంటే సంస్కృతంలో కుండ అని కలశం అని అర్ధాలు ఉన్నాయి . ఖగోళ శాస్త్రం ప్రకారం కుంభం ఒక రాశి కూడా కుంభరాశిలోనే ఈ పండుగను నిర్వహిస్తారు. మేళ అంటే కలవడం, జాతర అని అర్థాలు, లక్షలాది హిందువులు గంగ ఒడ్డుకు చేరుకొని . చేసే వేడుక ఈ జాతర మరిచాను లక్షలాది ఒకప్పుడు . నేఊ కోట్లాది అనాలి. 2013లో జరిగిన కుంభమేళాకు దాదాపు 20 కోట్ల మంది వచ్చారని ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అంచనా సూర్యుడు, బృహస్పతి గ్రహాల స్థానాల ఆధారంగా ఈ మేళా జరుగుతుంది . సూర్యుడు బృహస్పతి సింహరాశిలో ఉంటే త్రయంబకేశ్వర్‌లో సూర్యుడు మేషరాశిలో ఉంటే హరిద్వార్‌లో కుంభమేళా జరుగుతుంది .
అలాగే బృహస్పతి వృషభ రాశిలో సూర్యుడు మకర రాశిలో ఉంటే ప్రయాగరజ్ లో బృహస్పతి- సూర్యుడు వృశ్చిక రాశిలో ఉంటే ఉజ్జయినిలో జరుగుతుంది . ఇందువల్లే ప్రతి స్థలంలోనూ బృహస్పతి సూర్యుడు చంద్రుడు స్థానాల ఆధారంగా మేళా తేదీలను నిర్ణయిస్తారు. వాటిని షా హిస్నాన్ లేదా రాజస్నాన్ అని అంటారు.
పౌరాణిక ఆధారాలు
పురాణాల ప్రకారం క్షీరసాగర మధనంలో, భాగవత విష్ణు పురాణాలలో రామాయణం, మహాభారతాల్లో దీని ప్రసక్తి కనిపిస్తుంది. – క్షీరసాగ చిలకడం మొదలు పెడతారు. తీరా అమృతం దొరికాక ఎక్కువ వాటా కోసం గొడవలు పడతారు రాక్షసులు చేతిలో ఆ అమృత కుంభం పడితే వారి అరాచకాలకు హద్దులు ఉండవని తెలిసిన మహావిష్ణువు కుంభాన్ని ఆ ప్రదేశం నుంచి దూరంగా తీసుకెళ్తాడు .అలా వెళ్ళినప్పుడు కొన్ని అమృత బిందువులు ప్రయాగ ఉజ్జయిని హరిద్వార్ నాసిక్‌లలోని నదుల్లో పడ్డాయని ప్రజల విశ్వాసం .
ఎన్నో ఏళ్లుగా ప్రయోగరాజ్ లో పురోహిత్యం చేస్తున్న తెలుగు పురోహితుడు శ్రీ ఎడవల్లి చంద్రశేఖర ప్రవీణ్ శర్మ గారి అభిప్రాయంలో ఈ నాలుగు ప్రదేశాలలోనే కుంభమేళా నిర్వహించడంపై భిన్న కథనాలున్నాయి . సామ. అధర్వణ వేదాల ప్రకారం సముద్ర మధనం లో వచ్చిన అమృత కలశాన్ని మొదటగా జయంతుడు అనే కాకి నోట కరచుకొని భూమి చుట్టూ తిరుగుతుంది. అలా తిరగడంలో నాలుగు చుక్కలు ఈ ప్రదేశాల్లో పడ్డాయని, అందువల్లనే ఈ నాలుగు క్షేత్రాలలో కుంభమేళ జరుగుతుంది. అయితే అమృత కలశాన్ని నోట కరుచుకొని వెళ్ళింది కాకి కాదు గరుడ పక్షి అని మరో కథనం..
చరిత్ర ఏం చెస్తోంది ?
క్రీస్తు శకం 629 -645 మధ్యకాలంలో మన దేశానికి వచ్చిన చైనా యాత్రికుడు హుయున సాంగ్ కుంభమేళాను గురించి ప్రస్తావించాడు. ఇతను హర్షవర్ధనుని కాలంలో మన దేశానికి వచ్చాడు.
ఆధునిక కాలంలో దీని గురించిన ఆధారాలు మనకు కనిపిస్తున్నాయి. ఈస్ట్ ఇండియా కంపెనీ పాలనలో ఇంపీరియల్ గజేటి ఆఫ్ ఇండియా లో 1796 లో రెండు మిలియన్ల మంది 1889లో 2.5 మిలియన్ల యాత్రికులు కుంభమేళాకు వచ్చినట్లు ప్రకటించారు.
జ్వర్ కుంభమేళాలో బ్రిటిష్ అధికారి రాబర్ట్ మాంటి గౌరీ మార్టిన్ సందర్శకులలో బుఖారా కాబుల్ తుర్కిస్తాన్ నుండి వచ్చిన గుర్రాల వర్తకులు ఉన్నారన్నాడు. వీధితో బాటు అరబ్బులు పర్షియన్లు గుర్రాల వ్యాపారం కోసం వచ్చారని చెప్పాడు. ఆ మేళాలో రోడ్డుకు ఇరువైపులా ధాన్యం, తినుబండారాలు, బట్టలు, బొమ్మలు అమ్మవారున్నారట. యాత్రికులు నీళ్లలో వదిలే దీపాలు కదలే నక్షత్రాలలో కనిపించేవని కూడా చెప్పాడు. ఎందరో హిందూ రాజులు సిక్కు ప్రభువులు నవాబులు మేళా చూడడానికి వచ్చే వారిని కూడా చెప్పాడు ప్రయాగ లో 1895 లో జరిగిన కుంభమేళాకు వచ్చిన ప్రఖ్యాత రచయిత మార్క్ ట్వేయిన్ దీన్ని చాలా మెచ్చుకున్నాడు . 1938లో లార్డ్ అక్లాండ్ యాత్రికులపై పన్నును రద్దు చేశాడు. అందువల్ల యాత్రికుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ఈస్ట్ ఇండియా కంపెనీ ఈ రకమైన మేళాలను ఆదాయ వనరు గానే పరిగణించి, ప్రోత్సహించింది. పన్నులు కూడా వసూలు చేసేది . ఈ సందర్భంలో జరిగే అమ్మకాలపై టాక్స్ కూడా విధించేవారు. 1954లో ఐదు మిలియన్ల మంది 1977లో 10 మిలియన్ల మంది 1989లో 15 మిలియన్ల మంది కుంభమేళాను దర్శించుకున్నారు.
ఎన్సైక్లోపీడియా బ్రిటానికా అంచనా ప్రకారం 2019 కుంభమేళాలో 200 మిలియన్లకు పైగా యాత్రికులు వచ్చారు. ఇది ప్రపంచంలో Largest People Gadharing కుంభమేళా అధికారులు ఒకేరోజులో అత్యధిkuలు దర్శించిన తేదీలు 10 ఫిబ్రవరి 2013లో 30 మిలియన్లు 4 ఫిబ్రవరి 2019లో 50 మిలియన్లు అని ప్రకటించారు.
అయితే ప్రాచీన వేదకాలం నుండే ఈ ఆచారం ఉన్నట్లు వేద విద్వాంసులు అంటారు .ఈ కుంభమేళా స్నానాలు 850 ఏళ్లకు పైగా జరుగుతున్నట్లు, ఆదిశంకరులు దీనికి ఆద్యుడు అని కూడా చెప్తారు .వీరి తర్వాత శంకరుల శిష్యులు, అనుయాయు లు, సన్యాసులు,అఘోరాలు, నాగ సాధువులు రాజస్నానానికి ఏర్పాట్లు చేసేవారు. ఇలా షాహి స్నానం చేయడం వల్ల గత జన్మల పాపకర్మల నుండి విముక్తి కలిగి, మోక్షం పొందుతారని ఆస్తికుల విశ్వాసం. అందుకే ఒకప్పుడు లక్షల్లో ఉన్న యాత్రికుల సంఖ్య కోట్లల్లోకి పెరిగింది పెరగబోతోంది రాబోయే కాలంలో,
మరి కాస్త ముందుకొస్తే 1982లో అమృత్ కుంటే ర్ సంధానే అనే బెంగాలీ సినిమా కుంభమేళా దృశ్యాలను చిత్రీకరించింది. .2001లో మారజయో యో బెంజో, నిక్ డేలు The Greatest Show on earth అనే డాక్యుమెంటరీ తీశారు. నదీముద్దీన్ KUMBH MELA Songs of the river అని 2004లో మరొక డాక్యుమెంటరీ ని చిత్రించాడు. 28 ఏప్రిల్ 2017 BBC. Greatest Show on Earth Kumbha Mela పేరుతో ఇంకో ఆడియో వీడియో రిపోర్టును కూడా విడుదల చేసింది.
అంతేనా
అంటే కాదు అనే చెప్పాలి కుంభమేళా అంటే కేవలం స్నానాలే అనుకుంటే పొరపాటే . అంతకు మించిన విశేషాలు లెక్కలేనన్ని . తర్పణాలు, పిండ ప్రదానాలు, పితృ పూజలు, దాన ధర్మాలు, సంతలు, విద్యావిషయక చర్చలు, వేద పండితుల వాద ప్రతి వాదాలు సాధువుల సంతుల ప్రవచనాలు, సాంస్కృతిక కార్యక్రమాలు You Name It we have it అన్న రీతిలో ఉంటాయి. సామూహిక భజనలు ప్రార్ధనలు, పారాయణాలు అడుగడుగునా కనిపిస్తాయి.
ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు నడిపే భోజనశాలలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస ఏర్పాట్లు , స్నానానికి కావలసినటువంటి ఏర్పాట్లతో పాటు బట్టలు మార్చుకోవడానికి కూడా ఏర్పాట్లను చేశారు .టెంట్ సిటీని నిర్మిస్తున్నారంటే ఏ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయో ఆలోచించుకోండి. ఇవన్నీ ఎప్పటికప్పుడే ఔరా అనిపిస్తాయి.
ఈ రోజుల్లో మనలాంటి సాధారణ భక్తులతో పాటుగా, వీఐపీలు, నాగా సాధువులు, ఇతర సాధువులు, కల్పవాసీలు ( నెల రోజులు దీక్షలో ఉండేవారు) పీఠాధిపతులు, మఠాధిపతులు, విదేశీ వార్తా విలేకరులు ప్రసిద్ధిగాంచిన వీడియో గ్రాఫర్లు, స్వదేశీ వార్తా సంస్థల ప్రతినిధులు మరెందరెందరో వీటిని ప్రజలకు అందించడానికి ప్రతీక్షణం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.
అయిపోయిందా
నాగా సాధువుల ప్రసక్తి లేకుండా కుంభమేళా వేడుకలు వ్యాసాలు అన్నీ అసంపూర్ణమే అసమగ్రమే వేలాది నాగ సాధువుల ప్రవేశం వారి అద్భుత విన్యాసాలు మనల్ని నిశ్చేష్టులను చేస్తాయి.
వీరి ప్రవర్తన, వేషధారణ అన్ని ప్రత్యేకమే. వ రు తప్పకుండా ఈ కుంభమేళా వస్తారు ఎలా వస్తారో తెలీదు. మేళా అయ్యాక ఎక్కడికి వెళ్తారో ఎలా వెళ్తారో కూడా తెలీదు. చాలామంది ఒంటినిండా బూడిద పూసుకొని నగ్నంగా ఉంటారు . తలంతా జడలు కట్టి ఉంటుంది . మేళా మొదలయ్యేసరికి సిద్ధం తర్వాత మాయం. కచ్చితంగా బ్రహ్మచర్యాన్ని పాటిస్తారు. ఎక్కువగా మాట్లాడడానికి ఇష్టపడరు . సడన్‌గా తిట్టడం కూడా మొదలెడ తారు .కసురుకుంటారు .ఏ కాలమైనా, ఎలాంటి వాతావరణమైనా దిగంబరులే బంధాలను ఇష్టపడరు. అత్యంత తీవ్రమైన పద్ధతులలో శారీరక క్రమశిక్షణను పాటిస్తారు . మనసుతో శరీరాన్ని శాసిస్తారు .ఈ యాత్ర సమయంలో మాత్రమే జనాలతో కలుస్తారు.
సభ్య సమాజం వీరిని దూరంగా పెట్టినా, అసహ్యించుకున్న, భయపడ్డా గ్రామీణ ప్రాంతాల వారు, విదేశీయులు బాగా నమ్ముతారు . ప్రత్యక్ష దైవాలుగా కొలుస్తారు. వారి ఆగ్రహాన్ని భరించి, ఆశీస్సులను పొందడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తారు . సాధువులు, బిక్షకులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, అధికారులు ప్రభుత్వం సాధారణ భక్తులు, దేశ విదేశీ సందర్శకులు ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, చరిత్రకారులు, స్వచ్ఛంద సంస్థలు ఇందరు మరెందరో ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్న కుంభమేళా కొన్ని గంటల్లో మన కళ్ళ ముందుకు రాబోతోంది .రెండు చేతులు చాచి తరతరాల సంస్కృతి సంప్రదాయాలకు విశ్వాసాలకు భారతీయతకు చిరునామాగా నిలిచిన ఈ కుంభమేళాను ఆనందిద్దాం. ఆహ్వానిద్దాం. మన మధ్యలో రాజకీయాలను చేరనీయకుండా మానవత్వాన్ని పరిమళింప చేద్దాం .ఎందుకంటే ఇది 12 ఏళ్లకు ఒకసారి వచ్చే పండుగ ఎందుకంటే ఇది ది గ్రేటెస్ట్ షో ఆన్ ఎర్త్ కనుక.
రెండవ మరియు చివరి భాగం కొరకు ఎదురు చూడండి. త్వరలో..
తెలుగు సాహిత్యంలో అమ్మ అంశంతో కథలు కవితలు నవలలు నాటకాలు చాలా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి అమ్మ త్యాగాన్ని అమ్మ గొప్పతనాన్ని అమ్మంటే దేవత అని రకరకాలుగా అమ్మను గురించిన రచనలను మనం గమనించాం ఆ తర్వాత స్నేహం దానికి సంబంధించినటువంటి కథలు , కవితలు , నవలలు వంటి రచనల్ని మనం చూసాం కానీ ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న అంశం వృద్ధాప్యం. వృద్ధాప్యానికి సంబంధించినటువంటి రచనలు చాలా తక్కువగా వచ్చాయి వచ్చినా వాటిని ఎవరు ఇష్టపడరు పైగా అంత ప్రాధాన్యత కూడా ఇవ్వరు. వృద్ధులైన తల్లిదండ్రులు పడుతున్న మానసిక స్థితిని వ్యక్తీకరిస్తూ కవితలు కథలు వచ్చిన నాటకాలు మాత్రం చాలా తక్కువగా మనకు కనిపిస్తాయి

శ్రీ విశ్వనాథ గణపతి రావు రచించిన జీవనవేదం వృద్ధుల పట్ల నిరాదరణ కథా వస్తువుగా రచించిన నాటిక. శ్రీ అరిసెట్టి శివన్నారాయణ గారి పుణ్యఫలం నాటకం కూడా తల్లిదండ్రుల పట్ల బిడ్డలు చూపించే నిర్లక్ష్యం , ఎంతో ప్రేమగా పెంచుకున్న కొడుకు పెళ్లి అయ్యాక భార్యని వారి తల్లిదండ్రులను పట్టించుకుని కన్నతల్లి తండ్రులను పక్కన పెట్టడం ..వారి కడుపుకోతని కళ్ళకు కట్టినట్లుగా వివరించిన నాటిక. స్నిగ్ధ (గోపి సత్య ప్రకాష్) గారి నాటిక సద్గతి కూడా తల్లిని పట్టించుకోని కొడుకు కథ. శ్రీ వల్లూరు శివప్రసాద్ గారు రచించిన వానప్రస్థం నాటకంలో వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు సుఖం లేకపోవడం గురించిన నాటిక.
ఆధునికంగా అనేకమైన నాటికలు ఇదే వస్తువుపై వచ్చినా వేటికవే తమ తమ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి నాటక ప్రదర్శనలలో కొత్త ఒరవడి సృష్టించిన విధానం కథానాటికల పోటీ. అజో- విభో -కందాళం ఫౌండేషన్ ( అప్పా జోస్యుల విష్ణుభొట్ల) వారు కథ ఆధారంగా రాసిన నాటికలను మాత్రమే ప్రదర్శింపజేసే ఏకైక పరిషత్ ! ఈ ఫౌండేషన్ నాటిక ప్రదర్శనలతో పాటు సాహితీ రంగాన్ని కూడా సమానంగా ఆదరిస్తుంది. వివిధ సాహిత్య విభాగాల్లో విశేషంగా కృషిచేసిన వారిని ఘనంగా సత్కరిస్తుంది. వారి సాహిత్యానికి సంబంధించిన వ్యాసాలతో అపురూపమైన జ్ఞాపికలను అందిస్తుంది . ఈ ఎంపికలో భాగంగా నిష్ణాతులతో ముందుగా ఎంపిక చేయిస్తుంది.
వర్తమాన సమాజంలో వివిధ అంశాలపై రైతుల దోపిడి, స్త్రీ స్వేచ్ఛ ,కుటుంబ సంబంధాలు ,మానసిక సమస్యలు మొదలైన అంశాలపై నాటికలు రచించిన కథా రచయితల నాటికలను ప్రదర్శించేందుకు అవకాశం కల్పిస్తుంది ఈ నేపథ్యంలో రూపుదిద్దుకున్న నాటిక దేవరాగం. మూలకథ రచయిత సయ్యద్ సలీం గారు.
సయ్యద్ సలీం గారు కథలు కవితలు నవలల రచయితగా సాహితీ రంగంలో తనదైన స్థానం ఏర్పరుచుకున్న ప్రముఖ రచయిత మనిషి కథతో సాహితీ ప్రపంచంలో అడుగుపెట్టి 300 కి పైగా కథలు 150 కవితలు 30 కి పైగా నవలలు రచించారు. వీరి కథలు కన్నడ హిందీ ఒరియా మరాఠీ భాషలలోకి అనువదించబడ్డాయి. సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత .మానవత్వం ప్రధాన అంశంగా వీరి రచనలు అందరి చేత చదివింప చేస్తాయి.
మూల కథ శీర్షిక అమ్మ . నాటకీకరణ చేసిన కె కె ఎస్ స్వామి గారు దీనికి దేవరాగం అని పేరు పెట్టారు. అజో విభో కందాళం , జాషువా సాంస్కృతిక వేదిక సంయుక్తంగా నిర్వహించిన కథ నాటికల పోటీలలో జనవరి 4 2025 ప్రదర్శింపబడిన ఈనాటిక ద్వితీయ ఉత్తమ ప్రదర్శన బహుమతిని గెలుచుకుంది బాధపడుతున్న తల్లిని కాపాడుకోవడం కోసం కూతురు ఎదుర్కొన్న ఇబ్బందులను సలీం గారు వివరిస్తూ ఈనాటికను రచించారు అనకాపల్లిలో కొణతాల వెంకట నారాయణమ్మ కళా ప్రాంగణంలో శ్రీ సౌజన్య కళాశాల వంటి ఉత్తరాంధ్ర వారి ప్రదర్శన దేవరాగం. పేక్షకుల విశేష ఆదరణ పొందిన నాటకం ఈ నాటకం.
జన్మనిచ్చిన తల్లిదండ్రులు పిల్లలకు ఉండే బంధం ఎంత బలమైనదో స్పష్టంగా చూపిన నాటిక . బంధాలు విడవకుండా తల్లిదండ్రులను చూసుకోవడం , వృద్ధాప్యంలో వారికి అండగా నిలబడడం వారికే ఎంతో మానసిక స్థైర్యాన్ని కలిగిస్తుందని చెప్పడం ఈ నాటిక కథాంశం.

ఈ నాటకంలో తండ్రి కొడుకు అల్లుడు స్నేహితుడు డాక్టర్ కూతురు పాత్రలు ఉంటాయి తండ్రి పాత్రను దమ్ములూరి సత్యనారాయణ గారు పోషించారు .విదేశాలలో ఉన్న కొడుకు తనకోసం వస్తాడని ఎంతో ఆశగా ఎదురు చూస్తాడు తండ్రి .కొడుకు పాత్రలో మెట్ట వెంకటరాజు గారు విదేశంలో ఉన్నా రంగస్థలం మీద పక్కన ఉండి మాట్లాడుతూ అక్కడ నుంచి వీడియో కాల్ లో మాట్లాడిన భావనను కలిగిస్తూ మాట్లాడుతాడు . ఇది నాటకం ప్రదర్శన లో గొప్పతనం!
మొదటి దృశ్యంలో తండ్రిని పుట్టినరోజు సందర్భంగా పలకరించిన కొడుకు వీరి మాటల ద్వారా తండ్రికి కొడుకును చూడాలన్న తపన.. కొడుకుకేమో ఉద్యోగ పరంగా రాలేని పరిస్థితి కనిపిస్తాయి. ఇంతలో కూతురుగా నటిస్తున్న సాలూరు జ్యోతి అల్లుడుగా నటించిన మెట్ట పోలి నాయుడు ప్రవేశిస్తారు ఇదే దృశ్యంలో తండ్రి స్నేహితుడైన బిడ్డ శివ పాత్రధారి కూడా తన స్నేహితుని పుట్టినరోజున శుభాకాంక్షలు తెలిపేందుకు వస్తారు మొదటి సన్నివేశంలోని కొడుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన తనను చూసేందుకు వచ్చే సంవత్సరం వరకు రాడన్న దిగులు కూతురు అల్లుడు పుట్టినరోజు శుభాకాంక్షలు స్వయంగా వచ్చి తెలిపిన వారు కూడా ఉద్యోగరీత్యా డిప్యూటేషన్ మీద విదేశానికి వెళ్ళబోతున్నారన్న వార్తను విని స్నేహితుడు ఎంత సంతోష పెట్టాలని చూసిన తండ్రి డీలా పడిపోతాడు. అది చూసి కూతురు తను చేస్తున్న ఈ తప్పును క్షమించమంటుంది .
అప్పుడు తండ్రి అంటాడు “ఇక్కడ తప్పంతా మనుషుల మధ్య పెనవేసుకుపోయిన మమతాను రాగాల రక్త సంబంధాలదే! మనిషిని కట్టిపడేసే అన్ని బంధాల్లోనూ కణ సంబంధం చాలా బలమైంది. ఆ బంధం బ్రతికి ఉండగానే మానసికంగా దూరమైతే కలిగే బాధ మరణం కన్నా విషాదమైనది ఎందుకంటే దాన్ని జ్ఞాపకంగా మిగుల్చుకోలేము అనుభూతిగా అనుభవించలేము ” అంటాడు వృద్ధాప్యంలో ఉన్న కన్నతండ్రి వేదన ఈ మాటలలో చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది.

రెండవ దృశ్యంలో తండ్రి దగ్గరికి కూతురు అల్లుడు అమెరికా వెళ్ళిపోయే ముందు కొంతకాలం తండ్రి దగ్గర ఉండేందుకు వస్తుంది కూతురు భర్తతో సహా అవి చూసి తండ్రి శివ స్నేహితుడు మురిసిపోతాడు . అది అదృష్టం అని స్నేహితునితో అంటూ “అదృష్టం అంటే ఆస్తిపాస్తులు అంతస్తులు అధికారం హోదా లెక్కపెట్టలేనంత డబ్బు వెలకట్టలేనంత సిరిసంపదలు కావు !మనల్ని అర్థం చేసుకొని అభిమానించి అనుక్షణం మన కోసం ఆలోచించే ఆత్మీయులు మనకి దక్కడం నిజమైన అదృష్టం !” అంటాడు.
మూడవ దృశ్యంలో తండ్రి కూతురు అల్లుడు వెళ్లిపోతారన్న షాక్ లో తనకి పీడకలలు వచ్చినట్లు భయపడుతూ వణికిపోతుంటాడు ఏదేదో ఆలోచనలలో మునిగిపోతుంటాడు . అతనిలోని మానసిక అనారోగ్యం మొదలైంది . అది ఇంకా కూతురు అల్లుడు గమనించలేదు.
నాలుగవ దృశ్యంలో పాస్‌పోర్ట్ ఉన్న బ్యాగు మాయమవడం పై కూతురు తండ్రిని అనుమానిస్తుంది అనుకోకుండా ఆ బ్యాగు స్నేహితుడు తన కొడుకుకు ఎల్ఐసి ఆఫీసులో దొరికిందని తీసుకొస్తాడు. మానసికంగా షాక్ కి గురైన తండ్రికి తను ఆ బ్యాగు తీసుకెళ్లిన జ్ఞాపకం కూడా లేదు.. కావాలని మేము వెళ్ళిపోతున్నామని పాస్‌పోర్ట్ లు ఉన్న బ్యాగును మాయం చేసావని నింద వేస్తారు కూతురు అల్లుడు!
ఐదవ దృశ్యంలో మరింత షాక్ లో ఉన్న తండ్రి అల్లుడుని చూసి ఇంట్లో దొంగ వచ్చాడని భ్రమపడి పిచ్చిగా ఇల్లంతా తిరిగి అల్లుడిని దొంగ దొంగ అని అరిచి గొంతు నొక్క పోతాడు ! అర్థం చేసుకోని కూతురు తండ్రిని దూషిస్తుంది . స్నేహితుడు కూతురు అల్లుడు ఇద్దరినీ కూర్చోబెట్టి అతని ఆరోగ్య స్థితిని వివరిస్తాడు. స్పృహ కోల్పోయిన తండ్రిని ఆసుపత్రికి తీసుకెళ్లగా అతనికి అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతున్నాడని చెబుతాడు డాక్టర్ . తండ్రి ఆరోగ్య పరిస్థితిని వివరిస్తూ అయిదు సంవత్సరాలకు మించి బ్రతకరని మతిమరుపుతోపాటు లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్లు ఊహించుకుంటారని చిన్నపిల్లాడిలా ప్రవర్తిస్తారని చెబుతారు డాక్టర్.

ఆరవ దృశ్యంలో కూతురు అన్నతో మాట్లాడి తండ్రి పరిస్థితిని వివరిస్తుంది. తానిప్పుడు రాలేనని అవసరమైతే మరి కాస్త డబ్బు పంపిస్తానని అంటాడు అన్న. ఏడవదృశ్యంలో అన్న రాకపోవడం తండ్రి అనారోగ్యంతో ఆలోచనలో పడుతుంది కూతురు .
తనతో వస్తున్నావా లేదా అని ప్రశ్నించిన భర్తతో నేను ఇప్పుడు కూతురు, భార్య ,కోడలు ,పిల్లల తల్లి గాను, కాదు స్వార్థానికి అతీతంగా స్పందించే సహృదయం ఉన్న మనిషిగా నాకు జన్మనిచ్చిన నాకు జీవితాన్ని ప్రసాదించిన నాన్న అనే సాటి మనిషి కోసం ఆలోచిస్తున్నాను అంటుంది.
తండ్రి స్నేహితుడు కూతురిని అల్లుడిని ఆపమని చెప్పినప్పుడు కూతురు “నీటిలోపల చేపలు, గాలిలో పక్షులు ఎదురీది బ్రతుకుతున్నప్పుడు మనిషిని నేను పరిస్థితులకు ఎదురీది బ్రతకలేనా ? ” అంటుంది కూతురులో మార్పు స్పష్టంగా తెలుస్తుంది. ఆమెలోని మార్పును చూసి తండ్రి స్నేహితుడు “చిన్నతనం ఏ గుడికి దైవదర్శనానికి వెళ్లిన మీ నాన్న నిన్ను భుజాల మీద కూర్చోబెట్టుకొని దైవ స్వరూపాలని చూపించేవాడు కానీ ఈరోజు నువ్వు నీ జీవితాన్ని గర్భగుడిగా మార్చి అందులో నీకు జన్మనిచ్చిన కన్న తండ్రిని మూలవిరాట్టుగా ప్రతిష్టించి సేవిస్తున్నావు. నువ్వు మీ నాన్న కూతురువి కాదు దేవరాగానివి తల్లి! ఆ దేవరాగం పాదాలు కళ్ళకు వత్తుకొని నా జన్మ తరించి నీ తల్లీ ” అంటాడు.
తండ్రిని కాపాడుకోవడం తన జీవన లక్ష్యాన్ని పక్కనపెట్టి తండ్రిని చూసుకునేందుకు సిద్ధపడ్డ ఉదాత్తమైన కూతురు కథ దేవరాగం . ఈ నాటకాన్ని నాటకీకరణ చేసిన కేకేఎల్ స్వామి గారు డాక్టర్ పాత్ర పోషించిన శ్రీ గంగాధరయ్య గారికి ఈ నాటకం అంకితం చేశారు వృద్ధాప్యంలో తండ్రి పట్ల కొడుకు కూతురు తీసుకోవలసిన శ్రద్ధను చూపించవలసిన బాధ్యతను వేలెత్తి చూపిన నాటిక దేవరాగం.

ఈనాటికకు సంగీతం పి లీలా మోహన్ అందించగా కళాకారులకు ఆహార్యంతో అందంగా తీర్చిదిద్దింది ఎస్ రమణ గారు . నాటక ప్రదేశానికి రంగాలంకరణ చేసిన వారు సింగూరు రమణ గారు . అద్భుతమైన లైటింగ్ ను అందించిన వారు నిరంజన్ . నాటకం ఆధ్యాంతం దర్శకత్వం వహించిన వారు శ్రీ కేకేఎల్ స్వామి గారు.
నాటకం సలీం గారి కథను రక్తి కట్టించేలా మరి కాస్త నటనను ప్రదర్శించి ఉండొచ్చు. మూల కథ మాత్రం తల్లిదండ్రులను వృద్ధాప్యంలో నిరాకరించినప్పుడు ఆ తల్లిదండ్రుల మనోవేదనకు నిజ దర్పణం. ఇక వారు అనారోగ్యానికి గురైతే కలిగే పరిణామాలను కూడా ఈ నాటకంలో మనం గమనిస్తాం .కూతురు తండ్రి కోసం భర్తతో పోట్లాడిన సన్నివేశంలో డాక్టర్ గోవాడ దర్శకత్వంలో వచ్చిన మూల్యం నాటికలో భార్య తన తండ్రి కోసం తపించి భర్తతో వాదించిన దృశ్యం మనకు జ్ఞప్తికి వస్తుంది.

నాటకీకరణలో కే కే ఎల్ స్వామి గారు కృతకృత్యులయ్యారు మంచి నాటకాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించారు ఇటువంటి అంశాలతో మరెన్నో నాటకాలు మూల కథకులు సలీం గారి నుంచి నాటకీకరణ చేసిన కేకేఎల్ స్వామి గారి నుంచి వస్తాయని ఆశిద్దాం!
* * * * * * * * * *
కావ్యాలలో నాటకం రమ్యమైనది.” నాటకాంతం హి సాహిత్యం ” అన్న మహాకవి కాళిదాసు భావనలో అన్ని సాహిత్య ప్రక్రియలోనూ చివరిగా స్పర్శించవలసిన అంకం నాటకం . కవిత్వం, వ్యాసం ,కథ, నవల వీటన్నిటి తర్వాత నాటకం వస్తు రూపంలో భావగంధం కలిగి మనోరంజనం కలిగిస్తూ సామాజిక ప్రయోజనం తో పాటు సందేశాన్ని అందించే అద్భుత దృశ్యరూపకం నాటకం.
సజీవ ప్రదర్శన తో నాటకం అందరినీ ఆకట్టుకుంటుంది. కానీ ఏయే నాటకాలు నాటికలు ప్రదర్శించబడ్డాయో వాటి కథ, నటీనటులు , సాంకేతిక నిపుణులు ,దర్శకుడు వీరందరి గురించిన సమాచారం తిరిగి చూసుకోవాలంటే మనకు కనిపించదు అందుకోసం నా పరిధిలో నేను గమనించిన చూసిన నాటకాలను పరిచయం చేయాలని ఉద్దేశంతో మన తెలుగు నాటకాలు అనే పేరుతో నేను కొన్ని నాటకాలను పరిచయం చేయాలనుకుంటున్నాను. తద్వారా మన తెలుగు నాటకాలు కొన్ని చదివి తెలుసుకునే అవకాశం కొంతమందికైనా కలుగుతుందని ఆశాభావం. అయితే నాటకం చదివి తెలుసుకోమన్నది నా ఉద్దేశం కాదు. నాటకం ఖచ్చితంగా రంగస్థలం మీద ప్రదర్శించినప్పుడు చూడవలసినదే . కాకపోతే ఆ నాటకం గురించిన సమగ్ర సమాచారం తెలుసుకోవడం ద్వారా నాటక రచయిత ,నటీనటుడు ,ప్రదర్శనలు తీసుకున్నటువంటి శ్రద్ధ కళాకారుల నైపుణ్యం వీటన్నిటి గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుందనే ఉద్దేశంతో నేను ప్రయత్నం చేస్తున్నాను మీ అందరి ఆదరణను కోరుకుంటున్నాను. ఇక పై నేను ధారావాహిక గా అందించే మన తెలుగు నాటకాలను మీరందరూ చదివి తెలుసుకుంటారు కదూ .. ఆయా నాటికలను మీ సమీపంలో ప్రదర్శించబడినప్పుడు తప్పనిసరిగా చూస్తారని ఆశిస్తున్నాను.
నిన్నే పెళ్ళాడుతా నాటకం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించారు. అనేక కథలు, నవలలు, నాటికలు వ్రాసారు. ఈమె పబ్లిక్ రిలేషన్స్‌లో డిగ్రీ చదవి, హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై సీవరేజ్ బోర్డులో తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంలో అధికార హోదాలో పదవీ విరమణ పొందారు. ఈమె సరసిజ అనే పేరుతో ఒక సాహిత్య సంస్థను నెలకొల్పారు.
రేడియో నాటక రచయిత్రిగా సుమారు రెండువందల పైన నాటకాలు ఆకాశవాణి, హైదరాబాద్ కేంద్రం ద్వారా ప్రసారం అయ్యాయి. యవనిక, రంగస్థలం , అంతర్మథనం, మ్యాచ్ ఫిక్సింగ్ ,మేమూ మనుషులమే తదితర రంగస్థల నాటక రచయిత్రిగా పేరుపొంది శ్రద్ధాంజలి, హాంగ్ మి ప్లీజ్, మహానటుడు, మానవా ఏది నీ చిరునామా , అష్టావక్ర మొదలైన నాటికలు అనేకం రచించి ప్రదర్శింపజేసారు. అనేక టెలీ ఫిల్మ్స్ రచించారు. ఉత్తరం (రసరంజని నాటక రచన పోటిలో బహుమతి పొందిన నాటకం) ,స్పర్శ (అమెరికా తెలుగు అసోసియేషన్ వారు నిర్వహించిన నాటక రచనల పోటిలో ప్రథమ బహుమతి పొందిన నాటకం), హైటెక్ కాపురం (మమకారాల కాపురం పేరుతొ అమెరికాలో ప్రదర్శన సరసిజ థియేటర్ ద్వారా) ,మిస్సమ్మ( విజయ వారి మిస్సమ్మ సినిమా రంగస్థల నాటకంగా సరసిజ థియేటర్ ద్వారా అమెరికాలో ప్రదర్శన). అనగనగా ఓ రాజకుమారి (భేతాళ కథ ఆధారంగా రాసిన జానపద నాటకం అమెరికాలో ప్రదర్శన)
ఇవి కాకుండా టివి సీరియల్స్ , నవలలు రచించి అనేక పురస్కారాలు అందుకున్నారు.

సరసిజ విమెన్ థియేటర్ వ్యవస్థాపన 2013 లో జరిగింది.
ఇటీవల తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో, సరసిజ విమెన్ థియేటర్, లేఖిని మహిళా రచయిత్రుల సంస్థ కలిసి నాటకం రాయడం ఎలా ? అనే వర్క్ షాపును నిర్వహించారు. వివిధ నాటకరంగ ప్రముఖుల ప్రసంగాలతో శిక్షణను నడిపించి చివరి రోజు తెలుగు విశ్వ విద్యాలయం నందమూరి తారకరామారావు సభా ప్రాంగణంలో నిన్నే పెళ్ళాడుతా నాటకం ప్రదర్శింపజేసారు. నాటకం ఆద్యంతం అందరినీ ఆకట్టుకుని మనసారా నవ్వేలా చేసింది. నాటకం లో పాల్గొన్న వారందరూ తమ తమ పాత్రలకు జీవం పోసారు.
నాటకంలో ప్రత్యేకత మొట్టమొదట నాటకాన్ని పరిచయం చేయడం అపర్ణ మరియు సతీష్ లు నాటకం తో పాటు నాటక రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి గారి గురించి అదే విధంగా ఆరోజు కార్యక్రమంలో పాల్గొనే అతిథులను గురించి పరిచయం చేస్తూ నాటకానికి ముందుగా ఉపోద్ఘాతాన్ని అందించి నాటకంలోకి ప్రవేశింప చేశారు.
గిరి ఈ నాటకంలో కథానాయకుడు. గిరి తల్లిదండ్రులు అబ్బాయికి 40 సంవత్సరాలకు దగ్గరలో ఉన్నాడని ఇంకా వివాహం కాలేదని సంబంధాలు అనేకం చూస్తుంటారు. తండ్రి శ్రీధర్ కూడా విసిగిపోతాడు . వచ్చిన సంబంధాలు గిరి తనకు నచ్చలేదని తిప్పికొట్టేవాడు. అనేక పెళ్లి సంబంధాల వారిని సంప్రదిస్తూ అబ్బాయికి మంచి అమ్మాయి కోసం ఆరాట పడుతూ ఉంటుంది తల్లి కామాక్షి. పెళ్లి సంబంధాలు చూపించే సీతారామశాస్త్రి గారు ఎన్ని సంబంధాలు చూపించిన అవి నచ్చలేదని తోసి పారేస్తుంటాడు గిరి. ఎవరైనా పులిహోర సరిగ్గా చేసే వారిని పెళ్లి చేసుకుంటానంటాడు గిరి.

ఆధునిక పెళ్లిచూపులు అబ్బాయి ఇంటికే అమ్మాయి కుటుంబం వచ్చే ఏర్పాటు చేసి ఎలాగో తల్లిదండ్రుల చేత ఒప్పించి రప్పిస్తాడు సీతారామశాస్త్రి . సర్వోత్తమరావు వరూధిని, జ్వాలలు ఇంటికి వచ్చి ఇల్లు బాగోలేదని అబ్బాయి జీతం ఎంత అని రకరకాలుగా ప్రశ్నిస్తారు .విసిగిపోయిన గిరి స్నేహితుడు కుమార్ ను పిలిచి నువ్వు తయారు చేసే రోబో ని తీసుకురా నేను ఆ రోబోను పెళ్లి చేసుకుంటానంటాడు .నిజంగానే ఆ రోబో బందాని ఇంట్లోకి తీసుకొస్తాడు కుమార్.
ఆ రోబో పేరు బందా బొమ్మ లాగా అందంగా ఉండడం చూసి ఆమెను చూడగానే ఇష్టపడతాడు గిరి. ఈలోగా అంతకు ముందు వచ్చిన జ్వాలా వచ్చి నిన్ను నేనే పెళ్ళాడుతా అంటుంది. అంతకు ముందు పెట్టిన కండిషన్స్ అన్ని పక్కన పెడతానంటుంది రోబో బందా నాకు నువ్వే నచ్చేసావు అంటుంది . ఈ హడావిడి కి పోలీసు వచ్చి విషయం అర్థం కాక అయోమయంలో పడతాడు . జ్వాలా, బంధ నేను నిన్నే పెళ్ళాడుతా అంటే నేను నిన్నే పెళ్ళాడుతానడంలో హాస్యం మరింత రక్తి కట్టింది అంతకుముందు బెట్టు చేసిన జ్వాల తల్లిదండ్రులు కూడా తిరిగి మామూలుగా మారుతారు చివరికి గిరి బందా రోబోను తిరస్కరించి జ్వాలను పెళ్ళాడుతాడు .


చక్కని సంభాషణ ప్రతి సన్నివేశంలో హాస్యం పండేలా చేసింది ఇందులో రచయిత్రి ప్రతి స్పష్టంగా కనిపించింది . రోబో పాత్ర పోషించిన బంధ అలాగే పోలీస్ పాత్ర పోషించిన గోవింద్ నాయుడు అందరినీ ఆకట్టుకున్నారు. ఇక ఈ నాటకంలో నటించినటువంటి నటీనటులు శ్రీధర్ పాత్రలు కాకర్ల హనుమంతరావు కామాక్షిగా శోభ గారు నటించగా గిరి పాత్రలో మంజునాథ్ చక్కని పాత్రపోషణ చేసి ఇతనే ఈ నాటకానికి దర్శకత్వం కూడా వహించాడు.
కుమార్ గా ప్రశాంత్ జ్వాలగా అనూష ,వరూధినిగా శ్రీదేవి ఏకే బందాగా పూజ ,సీతారామశాస్త్రిగా వేణుగోపాల్ , సర్వోత్తమరావుగా రామకృష్ణ గారు , రామ్మూర్తి గా స్వరాజ్ కుమార్ గారు , కానిస్టేబుల్ గా గోవింద నాయుడు గారు నటించగా ఈ నాటకానికి ఆహార్యం అందించిన వారు మల్లాది గోపాలకృష్ణ గారు, సంగీతం సమకూర్చిన వారు సురభి నాగరాజు గారు ,లైటింగ్ అమర్చినవారు సురభి ఉమాశంకర్ గారు .
నాటకం మొత్తం ఆద్యంతం చక్కని దర్శకత్వం వహించి అనేక నాటకాలలో నటిస్తూ అటు నటన ఇటు దర్శకత్వంలో రాణిస్తున్నటువంటి నటుడు మంజునాథని అందరూ మెచ్చుకున్నారు. వీటన్నిటికీ అతీతంగా అత్యద్భుతమైన రచనతో హాస్యంతో అందరినీ ఆకట్టుకొని మూడు రోజుల నాటకం రాయడం ఎలా వర్క్ షాప్ తో పాటు అద్భుతమైన నాటకం ప్రదర్శింపజేసిన శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారిపై సభలో ఉన్న వారందరూ ప్రశంసల వర్షం కురిపించారు.
నాటకానంతరం జరిగిన సభలో ముఖ్యఅతిథిగా డాక్టర్ కె వి రమణ గారు తెలంగాణ ప్రభుత్వ పూర్వ సలహాదారు, గౌరవ అతిథులు గా ఆచార్య డి.ఎస్.ఎన్ మూర్తి గారు, బుర్ర సాయి మాధవ్ గారు ప్రముఖ సినీ రచయిత, ఆత్మీయ అతిథులుగా డాక్టర్ విజయభాస్కర్ గారు, డాక్టర్ మధు చిత్తరువు గారు, బి ఎన్ రెడ్డి గారు , శ్రీమతి పుట్టి నాగలక్ష్మి గారు , శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు పాల్గొనగా సభాధ్యక్షత వహించిన వారు శ్రీ రామ కోటేశ్వరరావు గారు.
నాటకంలో పాల్గొన్న వారిని, నాటకం రాయడం ఎలా వర్క్ షాప్ లో పాల్గొన్న రచయితలు, విద్యార్థులను అలాగే లేఖిని పురస్కారాలను అందించడం జరిగింది. అతిధులందరూ ఏకగ్రీవంగా మహిళా రచయిత్రులను విరివిగా నాటకాలు రచించడంలో పాలుపంచుకోవాల్సిందిగా కోరారు. మంచి నాటకాలను రచించి సమాజంలో సమకాలీన సమస్యలపై స్పందించి మహిళలు నాటక రంగంలో మరింతగా అభివృద్ధి చెందాల్సిన ఆవశ్యకతని వివరించారు.
నిన్నే పెళ్ళాడుతా నాటకం చూడడానికి వచ్చిన వారందరూ ఒక మంచి వినోదాత్మకమైన హాస్య భరితమైనటువంటి నాటకాన్ని చూసామన్న సంతృప్తిని వ్యక్తపరిచారు.


ఇదొక గోప్ప అనుభవం…మధురమైన అనుభూతి…!!
గమ్యం ఏటో తెలియకుండా మొదలైంది నా పయనం. ఈ జీవితపు రైలు చక్రాలు ఎటు నడిస్తే అటే ఇక!!
మాదొక చిన్న పల్లెటూరు…ఏకైక కూతర్ని కాదు గానీ..కనిష్ఠ పుత్రికను నేను!
మా ఊరికి ఓ మూడు మైళ్ల దూరంలో పదవతరగతి వరకు చదివాను… జిహ్వకో రుచి పుర్రెకో బుద్ధి అన్నట్లు…ఓకే బెంచీ లో కూర్చున్న వాళ్ళం కూడా తరువాత ఒకే కోర్సులు చదవలేదు. ఎవరి అభిరుచిని బట్టి మార్గాన్ని ఎంపికచేసుకున్నాం….
మరో ఇరవై మైళ్ల దూరంలో గురుకుల కళాశాలలొ నా ప్రీ డిగ్రీ పూర్తిచేసాను. మరో యాభై మైళ్లలో డిగ్రీ కుడా పూర్తయింది.ఇప్పుడే మొదలైంది అసలైన ఘట్టం….ఇప్పుడే తీసుకోవాలి అతి కీలకమైన నిర్ణయం… జీవిత గమనాన్ని నిర్దేశించే మలుపు ఇది…
“కష్టే ఫలి’.. అనుకున్నట్లు గానే నేను అనుకున్న విశ్వవిద్యాలయం లోనే నాకు సీటు వచింది. అక్కడ చదుకోవాలనేది నా అభిలాష!!
ఇదొక గమ్మత్తైన ప్రపంచం..నిజమే ఇదొక వింత ప్రపంచమే… బయటి టైమూ….మనుషులు ఆచారాలు..అలవాట్లు అన్నీ వేరే….
మెదటి రోజు కాలేజీ కి వెళ్ళేటప్పుడు..’ జుట్టుకి నూనే రాసుకుని వెళతావా..?? అన్న నా సహచరిని మాటలు వెరైటీ గా అనిపించాయి నాకు…. ఈ కాస్త శ్రద్ధ లేకపోతే ఉన్న చీపురుకట్ట కాస్త కొత్తిమీర కాట్టైనా ఆశశ్చర్యం లేేదు..!!
స్వదేశీయులకన్నా విదేశీయులతోనే నిండిపొయింది క్యాంపస్. కొత్తదనం వాతావరణం మనుషుల్లోనే కాదు…భోజనం లో కూడా… చప్పటి మెతుకుల పప్పు, చిన్నరొట్టే,కూరగాయ తొక్కు,చారు ,పెరుగు…… కంచం ఎంత నిండుగా ఉన్నా నా కడుపుని మాత్రం నింపలేకపోయాయి…
నేనో చిన్నపాటి భక్తురాల్ని ప్రతీ శనివారం తలంటుకుని,కాళ్ళకి పసుపు రాసుకుని కుంకుమ పెట్టుకుని పోతే…తదేకమైన చూపులు…మా స్నేహితుల కాంప్లిమెంట్లు..కామెంట్లు…
మనం ఉండే చోటు మారినా…మనం మన సాంప్రదాయాలు…అలవాట్లు మారవు కదా మరి!!
ఒక్కోసారి గడవమన్నా గడవని కాలం ఇక్కడ చక్రాలేసుకుని మరీ పరిగెడుతుంది…రోజు కాలేజీకి వెళ్ళటం రావటం ఇరవైనాల్గు గంటలు సెకన్లలాగ గడిచేవి…ఇక్కడ కాలం మనుషులు రెండూ ఫాస్టే…!!
కొత్త విద్యార్థులకు టీ పార్టీ కహానిలు..కబుర్లు..ఆటపాటలతో స్వాగతం పలికారు మా సీనియర్లు…ఆ కార్యక్రమంలో వర్షం కూడా మాతో పాల్గొంది.
మళ్ళీ పక్షం రోజులకే ఫ్రెషర్స్ పార్టీ…ఆ చల్లటి సాయంత్రాన..లైట్ల వెలుగులు…తారాలు..
బాగానే తయారయి వెళ్ళాం…
వారి కళలతోఅందర్ని ఆశ్చర్యగొలిపారు…ఒక్కొక్కరు ఒక జాతిరత్నమే…!!
ఆరోజు సందడి గురించి చర్చించుకునే లోపే..సెమిస్టర్ వచ్చేసింది… వారం రోజులల్లోనే ప్రశ్నాపత్రాలు గాల్లో ఎగిరాయి.
ఏమాటకామేటె చెప్పాలి..స్నేహం ఎక్కడైనా తీయని ఫలమే… రకరకాల పండ్లరసం లాంటిది ఆరోగ్యమూ..ఆనందమూ..!
మా మిత్రులగురించి ఒక్క మాటలో చెప్పాలంటే…
‘కెంపులు…రత్నాలు…పగడాలు..ముత్యాలు అన్ని కలగలసిన హారం” అలా ఉంటాం మేమంతా…
నాకూ…నలుగురు ఆణిముత్యాలు దొరికారు…మా కాలక్షేపంలో సమయం రన్నింగ్ రేస్ పెట్టినట్లు పరిగెడుతుంది… ప్రతీ ఒక్కరి జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండిపోయే కొన్ని గోల్డెన్ డేస్ ఉంటాయి..అవి కాలేజీ రోజులనటం లో సందేహం లేదు…
ఏదేమైనా…కొన్ని రోజుల తరువాత ఈ అనుభూతుల గురించి…అవి కష్టాలైనా..ఇష్టాలైనా..కలహమైనా..స్నేహమైనా…ప్రేమైనా..ఈ జ్ఞాపకాలన్నింటిని
తమవైన అనుభవాలను నెమరవెస్కుంటూ అనాల్సిందే…” ఆరోజులూ…మళ్ళీ రావూ…ఈరోజుల్లా కానేకావు!..అంతే లేని ఆనందాలు…
వెంటే వస్తే అంతే చాలు..!!!
నమ్ముకున్న వృత్తిపై మమకారంతో బతుకు జీవన బాటలో నిత్యం శ్రమిస్తున్న నేతన్నల జీవిత చిత్రంలోకి తొంగి చూస్తే మరెన్నో కథనాలు కనిపిస్తాయి. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కథనాన్ని ఒకసారి మనం తెలుసుకుందాం…
సిరిసిల్ల అంటేనే తెలంగాణలో అతిపెద్ద వస్త్ర పరిశ్రమకు కేంద్రంగా ఎంతో ప్రత్యేకమైనది. వేల సంఖ్యలో కార్మికులు మరమగ్గాలపై వస్త్ర ఉత్పత్తి సాగిస్తారు. ఇక్కడ చేనేత మగ్గాలపై ఒకప్పుడు వస్త్ర పరిశ్రమ కుటీర పరిశ్రమతో అనేక ఉత్పత్తులు చేస్తూ కాలానుగుణంగా మరమగ్గాలుగా ఇంగ్లీష్ లూంలు సురూ, గపూర్, రమేష్, మేకర్లు, కండెలు చుట్టే మిషన్లు, సైజింగ్‌లు, వార్పింగ్ మిషన్లు, ట్విస్టింగ్ మిషన్ లు, రేపర్ లూంలు, ఇలా ఆటోమేటిక్ మర మగ్గాలు అనేక రకాలుగా వారి వారి ఉత్పత్తులకు అనుగుణంగా నిర్మించుకుని యజమానులు, ఆసాములు, కార్మికులుగా మూడు తరహాలుగా విభజింపబడి వస్రోత్పత్తి ఏళ్లుగా కొనసాగుతుంది. ఇలా ఉత్పత్తి అయిన వస్త్రాలను సిరిసిల్లలో డయింగ్ వ్యవస్థ అంటే ఉత్పత్తి అయిన కాటన్ గుడ్డ అద్దకంతో కేస్మేట్, పాప్లిన్ వస్త్రాలుగా తయారు చేయబడి ఆర్డర్ పై పెట్టికోట్స్, సారీస్, బ్లౌజ్ పీస్ లు పలు గార్మెంట్లుగా సరఫరా చేస్తూ వస్రోత్పత్తిదారులు నేరుగా అమ్మకం దారులుగా వివిధ అనేక రాష్ట్రాలతో వ్యాపార సంబంధాలు కుదుర్చుకొని అమ్మకాలు జరుపుతున్న నేపథ్యం ఒక కోణం అయితే, అందులో పాలిస్టర్ వస్త్రాన్ని తయారు చేయడం మరో విభాగం అని చెప్పవచ్చు. పాలిస్టర్ గుడ్డను తయారు విషయంలో బోస్ కి, లైనింగ్, షూటింగ్, షర్టింగ్ , సారీస్ గ్రే ఇలా పలు రకాలుగా తయారు చేసి హైదరాబాద్ ఏజెంట్ల ద్వారా, యజమానులకు అమ్మి దానిని ప్రాసెసింగ్ తో ఫినిషింగ్‌గా సిల్క్ మిల్లుల ద్వారా ఏర్పడి అనేక హోల్‌సేల్, రిటైల్ దుకాణాలకు సప్లై జరిగుతున్నాయి. కాటన్ వ్యవస్థ, పాలిస్టర్ వ్యవస్థ రెండు విభాగాలుగా సిరిసిల్ల మరమగ్గాల వస్త్ర పరిశ్రమలో వేల సంఖ్యలో కార్మికులు, వందల సంఖ్యలో ఆసాములు, యజమానులు ఉత్పత్తి రంగంలో మనుగడ కొనసాగుతున్న క్రమంలో ఒకవైపు ఉపాధి, మరోవైపు నైపుణ్యం, కళాత్మకత వివిధ రకాలుగా అంతర్లీనంగా ప్రాముఖ్యతను సంతరించుకొని అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నది. అందుకు ప్రధాన కారణం ఉత్పత్తిదారుడే అమ్మకందారుడుగా మారి తయారుచేసిన గుడ్డను యజమాని నేరుగా మార్కెట్ సెంటర్లలో కొందరు నేరుగా, మరికొందరు ఏజెంట్ల ద్వారా అమ్మకాలు జరిపిన తరుణంలో అక్కడి మార్కెట్ పరిస్థితుల యొక్క ప్రభావం పోటీగా దేశంలోనే అతిపెద్ద ఉత్పత్తి కేంద్రాలుగా పేరుగాంచిన తిరుపూర్, సూరత్, అహ్మదాబాద్, సోలాపూర్ లతో పోటీకి ధీటుగా నిలిచే ప్రయత్నాలు సిరిసిల్ల వస్త్ర యజమానుల వస్త్ర ఉత్పత్తులు అంతగా నిలువలేకపోయాయి. దానికి ప్రధాన కారణం ఏదేని ఒక వస్త్ర పరిశ్రమకు కావలసినటువంటి రవాణా మార్గాలైన ప్రధాన రైల్వే మార్గాలు , అతిపెద్ద అంగడి మార్కెట్లు చేరువలో లేక పెద్ద మొత్తంలో భారాన్ని. మోస్తున్నది. దిగుమతిగా తయారు చేసే విషయంలో, ఎగుమతి చేసే విషయంలో కానీ భరించి ప్రధాన పోటీ ఇవ్వలేకపోగా అయినా సిరిసిల్ల ప్రాంతంలో అతిపెద్ద సామాజిక వర్గం పద్మశాలి వర్గం ఉండడం వల్ల వారికి ప్రధాన వృత్తి చేనేత వృత్తి అవ్వడం ఆటుపోట్లు ఎదుర్కొన్న గానీ నమ్మిన వృత్తిని వదలక, మరో కొత్త వృత్తిలో అనుభవం లేక ఒక్కోసారి తీవ్ర విపత్కర పరిస్థితులు అయిన ( మందం)లను ఎదుర్కొన్నది. అప్పుడు నమ్ముకున్న వృత్తితో వారి జీవనం గడపలేక ఆత్మహత్యలు చేసుకోవడం అనేకమందిని దిగ్భ్రాంతికి గురిచేసింది.
ఆ సమయంలో ప్రభుత్వ నేపథ్యం సిరిసిల్లకు ఎంతైనా అవసరం అని భావించి పలు ఉపాధి పథకాలు కొన్ని ప్రత్యేకమైనవి కార్మికులకు, ఆసాములకు, యజమానులకు ప్రభుత్వాలు కల్పించినవి. తెలంగాణ రాష్ట్రం సిద్ధించక ముందు గతంలో చేనేత కార్మికులు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్న ఆ సమయంలో అప్పటి ప్రభుత్వ అధికారులు గోడలపై “జోట కూసున్నదని ఊరుకోకు, పూట గడుస్తలేదని ఉరి వేసుకోకు ” ఈ అక్షరాలు రాయించిన సందర్భంలో వివిధ ప్రాంతాల నుండి బస్సులలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు చూసి ఏమిటి ఈ పరిస్థితి అని చాలా మందిని ఆలోచింపజేసింది. చేనేత కార్మికుల యొక్క ఆత్మహత్యలు జరుగుతున్న సందర్భాన్ని అప్పట్లో గ్రహించిన సినీ నటుడు చిరంజీవి సిరిసిల్లకు విచ్చేసి ఇలాంటి పరిస్థితుల్లో మీరు ఉన్నారా? నేత కార్మికులను ఉద్దేశించి తన సానుభూతి మాటలు తన ప్రసంగంలో వినిపించాయి. తెలంగాణ ఉద్యమం ఉధృతమైన సమయంలో సిరిసిల్ల ప్రాంత పరిస్థితులలో ప్రధాన సమస్యలు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, మరియు పలు సమస్యలకు పరిష్కార దిశగా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం “బతుకమ్మ చీరల తయారీ” పథకాన్ని రూపొందించి సిరిసిల్ల వస్త్ర పరిశ్రమలో వెలుగులు నింపే ప్రయత్నం చేయటంలో ప్రధాన భాగం అయింది.
మార్పు దిశగా” బతుకమ్మ చీరల తయారీ పథకం “
దశాబ్దాల నుండి యజమానులు, ఆసాములు, కార్మికులు మూడు విభాగాలుగా సిరిసిల్ల సామాజిక వర్గం లో ప్రధానంగా పద్మశాలి వర్గం ఉత్పత్తిని కొనసాగిస్తున్నది. అయితే సొంత వ్యాపారాలను అనాదిగా కోనసాగిస్తున్న ప్పటికీ అనేక ఆటుపోట్లను ఎదుర్కొన్నది. కానీ బతుకమ్మ చీరల తయారీ పథకం సిరిసిల్ల సమాజంలో మార్పు దిశగా అడుగులు వేసింది. గతంలో ఇతర రాష్ట్రాలలో,ఇతర ప్రాంతాలలో వ్యాపారాలతో తలమునకలుగా ఆటుపోట్లు ఎదుర్కొన్న కష్టాలకు ఇక చరమగీతం పాడి ఒక కొత్త మార్గంలో ప్రభుత్వం అందించే బతుకమ్మ చీరల తయారీ సంవత్సరంలో ఎక్కువ రోజులు పని కల్పించడం ఒక భాగమైతే, ఆర్. వి.ఎం ఆర్డర్లైనా స్కూల్ యూనిఫామ్ లు గుడ్డ తయారు కూడా కొంత భాగమైంది. చేనేతన్నలకు ఉపాధి కోసం ఏర్పాటుచేసిన బతుకమ్మ చీరల తయారీ పథకం అనేక సంస్థలు ఇట్టి ప్రయోగాన్నిఅభినందించడం జరిగింది. పెద్ద మొత్తంలో నేత అనుబంధ సంఘాలలో అనేక మార్పులుగా మ్యాక్స్ సొసైటీలు గా ఏర్పడి ప్రభుత్వ ఆర్డర్లను తయారుచేసి గతంలో కంటే చీరల ఉత్పత్తిపై సిరిసిల్ల నేత కార్మిక వర్గం ఎక్కువగా సుముకత చూపింది. ఇది శాశ్వత పరిష్కార మార్గంగా మారాలని యోచించింది.
నేత కళాత్మకత ఒక ప్రత్యేకం
నేతతో అనేక కళాత్మకాలను సృష్టించిన ఘనత కూడా సిరిసిల్ల వాసులకే దక్కడం ఒక ప్రత్యేకత. అగ్గిపెట్టలో అమర్చేంత చీరను తయారుచేసిన కళాకారులు సిరిసిల్ల లో ఉండడం యావత్ ప్రపంచాన్ని ఆలోచింపజేసింది. సిరిసిల్ల ప్రాంత నేత కళాకారులకు ఒక ప్రత్యేక తర్ఫీదు ఇప్పిస్తే మరిన్ని నూతన ఆవిష్కరణలను చూసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
అనుబంధ సంఘాల ఆవేదన
కాటన్ ప్రభుత్వ చీరలు రావాలి!
కాటన్ పరిశ్రమను కాపాడాలి!!
వస్త్రోత్పత్తికి అనుబంధంగా నిలిచిన సైజింగ్ పరిశ్రమ, అద్దకం పరిశ్రమ ప్రధాన ఇబ్బందులను ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఇటీవల కాటన్ వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల ఐక్యవేదిక ఆవేదన వ్యక్తం చేసింది. కళాత్మకత సృజన కలిగిన కార్మికులు పెద్ద సంఖ్యలో సిరిసిల్ల కార్మిక వర్గం ఆధారపడి ఉందని వారికి చేయూత అవసరమని, అందుకు ప్రభుత్వ పథకాలైన ఆర్డర్ల ఆవశ్యకమని తెలుపుతూ ఇటీవల దసరా పండుగ సందర్భంగా కాటన్ ప్రభుత్వ చీరలు రావాలి! కాటన్ పరిశ్రమను కాపాడాలి!! అంటూ ఫ్లెక్సీలతో సిరిసిల్ల లో దసరా పండుగ వాతావరణంలో పట్టణం మొత్తం అనుబంధ సంఘాల ఆవేదనను వ్యక్తం చేయడం గమనించదగ్గ విషయం.
సిరిసిల్లకు ప్రభుత్వ పథకాలే ఆధారం
యార్న్ డిపో ఏర్పాటు మరో మలుపు
సిరిసిల్ల చేనేత వస్త్ర పరిశ్రమ రూపాంతరాలు చెంది మరమగ్గాలపై అనేక కళాకృతులు ఇతర ఉత్పత్తులు తయారుచేసిన దశాబ్దాల చరిత్ర కలిగిన సిరిసిల్ల నేత కార్మికులకు ఉపాధి విషయంలో శాశ్వత పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న విషయం అందరికీ తెలుసు మరో . కొత్త కోణంలో నేటి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించి వస్త్రోత్పత్తికి అవసరమైన యార్న్ డిపో ఏర్పాటు చేయుటకు నిర్ణయం తీసుకున్న సంగతి సిరిసిల్ల వస్త్ర వ్యాపారులలో మళ్లీ మరో కొత్త కోణంలో నేత ఉత్పత్తులపై ఆశలు చిగురించాయి.
రెక్కాడితే గానే డొక్కాడని జీవితాలను గడుపుతున్న నేత కార్మికులకు గతంలో ఉత్పత్తి, మార్కెట్ మాంద్యం లాంటి అనేక పరిస్థితుల ప్రభావం కార్మికులపై పడగా ఆ పరిస్థితుల మార్పుకై మొదటగా “బతుకమ్మ చీరల తయారీ పథకం ” గత ప్రభుత్వం ప్రవేశపెట్టి కొత్త మార్గంతో సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టగా నేడు “యార్న్ డిపో” ద్వారా వస్ట్ర ఉత్పత్తికి ప్రధాన భాగంగా నిలిచే నూలును ప్రభుత్వం అందించే ప్రయత్నం మరో నూతన ఆవిష్కరణకు, మార్పుకు మార్గం చూపుతోందని భావిస్తున్న సిరిసిల్ల చేనేతన్నల ఆశాభావం. పడుగులను నమ్ముకున్న నేతన్నల బతుకు జీవన చిత్రంలో నూతన ఆవిష్కరణలు వారి నుండి వెలువడాలని ఆశిద్దాం.
సేవ అనేది అన్ని ధర్మాలలో కెల్లా ఉత్తమ ధర్మం. మన ఈ భారతదేశంలో కుల,మత, జాతులకు అతీతంగా సేవాగుణం గురించి బోధించి, ఆచరణలో పెట్టి సేవాధర్మాన్ని ఎలా ఆచరించాలో చెప్పారు. సేవ అనేది ప్రతిఫలం ఆశించకుండా చేస్తేనే నిజమైన సేవ. పేరు కోసం పాకులాడి చేసే సేవలో స్వార్ధం ఉంటుంది.
మానవాళి ఎలా జీవించాలో నేర్పింది రామాయణం. చిన్న చిన్న కథల ద్వారా, వ్యక్తుల ద్వారా సేవా ధర్మాన్ని అంతగా చదువుకోని వారికి కూడా తెలిసేలా వివరించింది. సమాజంలో ఒకరికొకరి మధ్యన సేవాగుణం ఉంటేనే బంధాలు నిలుస్తాయి.
సేవలు ఎన్నో రకాలుగా చేయవచ్చు. రోగులు, అనాధ శిశువులకు, అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడం మొదలైనవెన్నో ఉన్నాయి.
సేవ చేయడంలో సేవలు పొందినవారే కాక- సేవలు అందించిన వారికి కూడా ఆత్మ సంతృప్తి కలుగుతుంది. ఒకసారి అనుభవంలోకి వస్తే పదే పదే సేవలు చేయాలని అనిపిస్తుంది. సేవ చేయడానికి స్వార్ధం వదిలితే చాలు!
అటువంటి సేవా గుణాన్ని శబరి పాత్ర ద్వారా రామాయణం చెప్తుంది.సేవాగుణం పెంపొందించేలా మాటిమాటికి చెప్పకపోతే మానవ మనస్తత్వాలు, విద్రోహ చర్యలు ఎక్కువగా పెరిగిపోతున్న ఈ రోజులలో సేవాధర్మం పెంచి, సత్ప్రవర్తన అలవర్చుకొనే దిశగా సాగాలి.
శబరి బోయ జాతిలో పుట్టిన పరమ భక్తురాలు. భక్తికీ, ప్రపత్తికీ… పరాకాష్టగా నిలిచి, నిష్ఠతో రాముని పూజించి తరించిన మహిళా భక్తురాలు ..
నవ విధ భక్తి మార్గాలలో తరించినవారుగా పేరు పొందిన వారిలో…. శ్రీరాముడి కథ వింటూ ప్రేమించిన వాడు హనుమంతుడు, కీర్తించి తరించిన వాడు వాల్మీకి. పాదుకా సేవ చేసి తన భక్తిని లోకానికి తెలిపిన వాడు భరతుడు… ఇలా రామాయణంలో ఎందరో భక్తులు మనకు దర్శనమిస్తారు… అందులో రాముని పూజించి తన్మయురాలయింది ‘శబరి’.
శబరికి జన పదాలలో జీవితం కృత్రిమంగా కనపడటంతో ఆ జీవితం నచ్చక అడవిలో కాలం గడుపుతూ… అక్కడి మునులను, ఋషులను దర్శిస్తూ… వారు భగవంతుడి గురించి చెప్పే బోధనలు వింటూ… చూస్తూ గడుపుతుంది… ఎందుకంటే ఆ కాలంలో మహిళలను ఆశ్రమాలలో ఋషులు చేర్చుకోక పోయేవారు… అయినా ఆమె మతంగ మహాముని తన గురువుగా భావించి, ఆ గురువుగారి ఆశ్రమాన్ని
మతంగముని సమిధల కొరకు, పూలు పండ్లు, దుంపల కొరకు వెళ్ళినప్పుడు చక్కగా శుభ్రపరిచి ప్రాంగణమంతా కళ్ళాపి చల్లి ముగ్గులు పెట్టేది.. ఇలా ఎన్నో రకాల సేవలు చేసేది.

పంపా సరస్సుకు వెళ్ళే తోవలో ముళ్ళు, రాళ్లు లేకుండా దారి అంతా బాగు చేసేది. ఇదంతా గురువుగారి కటాక్షం ముఖ్యమని, రాముడి దర్శనం కావాలంటే గురువు యొక్క మార్గదర్శనంలో భగవంతుడిని పొందాలని ఆమె ఎంపిక చేసుకున్న ప్రపత్తి మార్గము.
మతంగ మహాముని శబరితో రాముడు వస్తాడు, నిన్ను అనుగ్రహిస్తాడు… రాముడిని దర్శనం చేసుకొమ్మని చెప్పి, మతంగముని ఆయువు తీరడంతో ఆయన దేహాన్ని చాలిస్తాడు. ఆనాటి నుండి 14 సంవత్సరాలు నిరంతరంగా రామనామం చేస్తూ… రాముడి కొరకు ఎదురు చూస్తూ కాలం గడుపుతుంది శబరి.
రామలక్ష్మణులు సీతాన్వేషణ చేస్తూ పంపా తీరానికి వచ్చే తోవలో వృద్ధురాలై, వంగిపోయిన నడుముతో, తలంతా నెరసి, కళ్ళు కనిపించక, చేతులు నొసట ఆనించుకుని చూస్తూ… వణుకుతున్న చేతులతో ఒక పండ్ల బుట్టను పట్టుకొని వస్తూ కనిపించింది.
ఆమె ఎదురుగా ఆజానుబాహులైన సుందరమైన రామలక్ష్మణులను చూసింది…. వీరే మునులు చెప్పిన రామలక్ష్మణులనుకున్నది… చేతిలోని బుట్టను కింద పెట్టి నమస్కరిస్తూ….
రామా! రామా! నా తండ్రీ ! అని పిలుస్తూ కనపడిన శబరిని చూసి లక్ష్మణుడు రాక్షస స్త్రీ మనుష్య రూపంగా వచ్చిందని అంటాడు. రాముడికి మాత్రం ఆమె రాక్షస స్త్రీ కాదని… సరే గమనిద్దాం… అనుకొని ఆ పక్కనే ఉన్న ఒక పెద్ద చెట్టు కింద కాసేపు విశ్రాంతి తీసుకుందాం అని కూర్చున్నారు… ఆ పక్కనే శబరి కుటీరం ఉన్నది.
వచ్చింది రామలక్ష్మణులే అని శబరి అనుకొని రాముడి పాదాల మీద పడి ఏడుస్తూ…. నాయనా నీ భార్యను రాక్షసుడు అపహరించాడట కదా! అయినా సీతమ్మ నీ దగ్గరికి వస్తుందని రాముడిని ఓదారుస్తుంది…
ఇది కూడా సేవాభావమే! ఆపదలో ఉన్నవారికి ఓదార్పు నివ్వడం నిజమైనసేవే!!
నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను.. నా గురువుల అనుగ్రహమే మీ దర్శనం అయిందని కళ్ళల్లో నీరు ధారగా కారుతూండగా… నాయనా నా కుటీరంలోకి రాండి… కాసేపు విశ్రమిద్దురు అని, పళ్ళ బుట్టను చేతిలో పట్టుకొని కుటీరం వైపు తోవ చూపిస్తూ ఉండగా.. అమ్మా! నీ గురువు ఎవరు? అని అడుగుతాడు రాముడు.
నా గురువు మతంగ ముని… ఆయన నీ గురించి చెప్పి నువ్వు ఇక్కడే ఉండు… శ్రీరాముడు వస్తాడు సేవలు చేయమని చెప్పగా ఆనాటినుండి మీ కొరకు ఎదురు చూస్తున్నానని చెప్పింది శబరి.
రాముడి కొరకు రోజూ చెట్టుచెట్టు కూ తిరిగి తీయని మామిడి పండ్లు తాను రుచి చూసి, బాగుంటేనే రాముడి కొరకని అలా నైవేద్యం పెట్టేది..
రాముడు పండ్లు తింటూ రాముడు నీ మనసు వలనే ఈ పండ్లు కూడా తీయగా ఉన్నాయి… ఎందుకంటే భక్తిశ్రద్ధలతో ఇచ్చిన పండ్లు ఇవి అని రాముడుతింటూ ఉంటే… లక్ష్మణుడికి చాలా సంతోషం కలిగింది… ఎందుకంటే సీతా వియోగం జరిగినప్పటి నుండి రాముడు ఆహారం తీసుకోలేదు. శబరి ప్రేమతో కూడిన భక్తితో ఇవ్వడం వలన తింటున్నాడని సంతోషం…(ఇది లక్ష్మణుని సేవాగుణం)
శబరి కూడా 14 సంవత్సరాలుగా రోజూ రాముడికని పండ్లు ఏరుకొని తేవడం, నివేదించడం…( ఏదేని పని తలపెడితే కొద్ది రోజులు ఉత్సాహంగాఆ పని చేయడం, తరువాత ఆ పనినుండి పక్కకు వైదొలగడం కాకుండా ఆ పని అయ్యేటంత వరకూ దీక్ష వలె చేయడం అనేది కార్యసాధకుల గొప్ప లక్షణం…ఇదిఆచరణీయం…)
ఎదురు చూసి ఎదురు చూసి రాముడు రాకపోయేసరికి.. రాముని ప్రసాదంగా ఆ పళ్ళను తానుతిని, మళ్లీ తెల్లవారి మంచి పండ్లు ఏరుకొని తెచ్చి పెట్టేది.
శబరి రాముడితో నేను బోయ జాతిలో పుట్టాను. నేను చదువుకున్న దాన్ని కాదు, పెద్దగా విషయాలు తెలియవు, మంచిగా మాట్లాడటం కూడా రాదు… అయినా రామా!… నామీద దయ తలచి ఇంత చక్కగా మాట్లాడుతున్నావు… నా అదృష్టం సుమా!( వినయప్రకటనం- గ్రహించవలసిన విషయం)
ఏదీ? నీ పాదాలను చూడనీ! అయ్యో! రాళ్లు ముళ్ళు గుచ్చుకొని, నీ పాదాలు వాచి పోయాయి అంటూ… తన పమిట కొంగును నోటికి చేర్చి ఆవిరిపట్టి వేడి కాపు రాముడి పాదాలకు పెట్టింది…( ప్రేమ తత్త్వం) అయినా రామా! మీకూ.. మాకూ ఎప్పటినుండో సంబంధంఉంది . నీ పాదాలను తాకే అధికారం మా బోయల కే ఉంది… ఒక నాడు గుహుడికి నీ పాదాలను కడిగే భాగ్యం, గౌరవం దక్కింది.. ఆ గుహుడు మా జాతి వాడే.. కాబట్టి శ్రీరామ చరణాలు తాకె అదృష్టం భిల్ల వంశీయులకే ఉంది.. ( హక్కులు తెలుపడం- తెలుసుకోవడం)దానికి కారణం.. ఆచార్య కటాక్షమే కారణం అంటుంది. ( గురుభక్తి)
ఆమె ఆర్తి చూసిన రాముడు తనకు భక్తి మాత్రమే ముఖ్యమని, జాతి, వంశాలతో నాకు అవసరం లేదు అని అంటాడు.(జాతి వివక్షత లేకపోవడం )భక్తి లేని వాడు ఎంత గొప్ప వంశంలో పుట్టి నా… ఎంత గొప్పవాడైనా నాకు దగ్గర కాలేడు.
నువ్వు మనస్ఫూర్తిగా ఆరాధించావు కాబట్టి ధన్యురాలువి అన్నాడు రాముడు.
భగవంతుడు భక్తినే చూస్తాడు… కానీ జాతిని చూడడు కదా! భగవంతుని పొందుటకు… భగవంతుడే ఉపాయమని నమ్మినవారిని ప్రపన్నులని అంటారు.( ప్రపన్నతనే భక్తి తో భగవంతుని కరుణాకటాక్షం పొందగలుగుతాం)భగవంతుని పొందుటకు ఆచార్యుడే
ఉపాయమని విశ్వసించిన శబరి అంతకన్నా ఒక మెట్టు పైనే నిలుచున్న భక్తురాలు. ఆమె ఆచార్య కటాక్షం, భగవత్ కటాక్షం రెండూ ఆచరించి.. మోక్షం పొందడానికి కావలసిన ఆరెండు ముఖ్య సాధనాలను స్వంతం చేసుకున్న శబరి…యోగంతో అగ్నిని పుట్టించుకొని, రామలక్ష్మణుల ఎదుటనే యోగాగ్నిలో ప్రవేశించి, పరమపదము పొందిన శబరి ధన్యురాలు.
భక్తి, ప్రపత్తులకు సేవకూ పరాకాష్ట శబరి వృత్తాంతం…
శబరి నదిగా మారిందని అనడంలో కూడా సేవ అనేదిఏ ఒక్క రోజో చేసి ఊరుకునేది కాదనీ, నిరంతరం నది ఎలా ప్రవహిస్తుందో…సహజంగా అలాగే సేవా గుణం నిరంతరాయంగా కొనసాగుతూనే ఉండాలని సూచించే శబరి కథ ఆనాటికీ – ఈనాటికీ ఆచరణీయం!
చిన్న ఆఖ్యానంలో దార్శనికులైన ఋషులు లక్ష్యం ఏర్పరుచుకోవడం, దానికై శ్రద్ధగా శ్రమించడం, సేవాతత్పరత, ప్రేమ, భక్తి….రామునిలో ఐక్యమైనదంటే ఈ గుణాలన్నీ రాముడిని కూడా కదా! అలా మంచి మార్గం చూపేవారి భావాలతో, చేతలతో మమేకవడమే కదా!
శబరిలోని ఏ ఒక్క గుణం మనం స్వీకరించి పాటించినా మన జన్మ ధన్యమే కాకుండా… సమాజ అశాంతి, అల్లరుల నుండి బయటపడడమే కాకుండా మంచి లక్ష్యాలతో ముందుకు సాగవచ్చు.
పురాణ కథలను యథాతథంగా చదవడం మంచిదే ఐనా అంతరార్ధం గ్రహిస్తే ఋషుల ప్రయత్నం ఫలించినట్టే….
సాహిత్యం పరిభాషలో సానిహిత్యంగా పేర్కొనవచ్చు నిజానికి సాహిత్యం అంటే (లాటిన్ litterae నుండి బహువచనం రూపంలో
అక్షరాల కూర్పు అనేది రచనలు చేసే ఒక సృజన ఒక కళ, ఇది ప్రచురించబడిన కావ్యాలకు మాత్రమే పరిమితం కాదు నిజానికి చెప్పాలంటే, సాహిత్యం అనే పదానికి అర్థం “అక్షరాలతో సాన్నిహిత్యం” కలలతో మమేకమై కావ్య సృష్టికి అంకురార్పణ జరుగుతుంది అది పద్యం కావచ్చు వచనం కావచ్చు ఈ ఉరవడిలో కొన్ని పరిచయాలు యాదృచ్ఛికంగా జరిగిన ఒక వ్యక్తి ఉత్తాన పతనాలకు వారధిగా నిలబెడుతుంది కొన్ని గొప్ప పరిచయాలు గొప్ప అనుభూతులుగా మర్చిపోలేని మధురస్మృతులుగా కూడా మిగిలిపోతాయి మరికొన్ని పరిచయాలు అప్పటి అవసరానికి ఆ క్షణానికే పరిమితం అయినా కొన్ని మాత్రం జీవితాంతం వెన్నాడుతుంటాయి అసలు కలనైనా కలుసుకోలేని కొన్ని పరిచయాలు మనకున్న ఇష్టాల మనం పెంచుకున్న ఇష్టాల పరంపరలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి అలా నా జీవితాంతం వెన్నంటిన ఒక పరిచయం బిఎస్ రాములు ఒక గొప్ప సామాజిక తత్వవేత్త ప్రసిద్ధ కథకులు అనుభవశాలి తెలంగాణ ప్రాంత సాహిత్యానికి సాహితి దిగ్గజాలలో ఒక మూల స్తంభం అనడంలో అతిశయోక్తి కాదు.

నేను 90 లలో సాహిత్యం పై ఆసక్తితో అడపాదడపా కథలు నవలలు సాహిత్య గ్రంధాలు పత్రికలు చదువుతున్న తొలినాళ్లలో నాకు ప్రేరకమైన నవల తెలుగులో బతుకు పోరు నవల ఈ నవల రచన బిఎస్ రాములు గారు నన్ను నేను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి రూట్స్ అలెక్స్ హెలి ఏడు తరాలు గోర్కి అమ్మ నవల టాల్ స్టాయ్ నవలలు అలాగే కన్యాశుల్కం నాటకం వరవిక్రయం నాటకం మాలపల్లి ఉన్నవ లక్ష్మీనారాయణ గారి నవల రచనలు నన్ను ప్రభావితపరిచాయి ఆ దిశగా నేను సాహిత్యంలో అడుగులు వేయడానికి ఆదుకొల్పిన రచనలలో బతుకు పోరు ఒకటి అలాగే బి ఎస్ రాములు గారి పాలు కథల సంపుటి లోని కథలు కూడా నన్ను బాగా ఆకట్టుకున్నాయి పాలు కథలు పాలు పాలు మురిపాలు సగపాలు ఆపాలు ఈ పాలు కోపాలు తాపాలు ఇలా కథను సాగదీస్తూ పాలు పాలు పాలు పలుమార్లు పాలు వచ్చేలా కథను నడిపించడం బిఎస్ రాములు గారి పరిణతికి అనుభవానికి భాష పై తనకున్న పట్టును ఎరుక పరుస్తుంది తెలపండిన తత్వవేత్త కనుకనే తెలంగాణ పల్లెల్లో దళిత బహుజనులు వాడభాషలకు పట్టం కడుతూ వాడలో తొంగిచూసే భాష పలుకుబడులను తెలంగాణ యాసను వినసొంపుగా రంగరించి కథలుగా నవలలుగా గొప్ప గ్రంథాలుగా తీర్చిదిద్దిన శిల్పిగా పేర్కొనవచ్చు మాకంటే ముందున్నతరం వారు అతని నవల కాని కథ కాని చదివినప్పుడు నేను బిఎస్ రాములు గారిని భవిష్యత్తు దర్శనంలో కలుస్తానని అస్సలు ఊహించుకోలేదు నాడు సాహిత్యంలో నా తొలి అడుగులకు ప్రేరకాలైన సాహిత్య లో వారి రచనలు బతుకు పోరు పాలు కథల సంపుటులు ముందు వరుసలో ఉంటాయి.
అలా నేను సాహిత్యంలో సృజన చేస్తూ కథలు నవలలు తీసుకువస్తున్న సందర్భంలో దశాబ్దం తర్వాత నేను వేముల ఎల్లన్న కక్క నవల రచయిత ఇద్దరం జంట పక్షులమై హైదరాబాదులో వెళ్ళినప్పుడు దారిలో ఒక పని బిఎస్ రాములు సార్ గారు కలిశారు అలా వారితో మొదటిసారి 2003 4 ప్రాంతం మాట్లాడడం జరిగింది మృదు స్వభావి ఆవేశం ఎకోశానలేని ఆలోచన ధీరుడు నాకు కొన్ని సూచనలు సలహాలు ఇచ్చారు అప్పట్లో నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడు మరొకరు సీనియర్ జర్నలిస్టు కవి రచయిత పాలపిట్ట సంపాదకులు గుడిపాటి గారు కూడా ఒకరు నా అనుభవంలో గుర్తుంచుకునే అతి తక్కువ కొద్దిమందిలో శికామణి ఎండ్లూరి సుధాకర్ గోరటి వెంకన్న వేముల ఎల్లన్న బిఎస్ రాములు గుడిపాటి జాతశ్రీ గోగు శ్యామల అక్కగారు డాక్టర్ నను మాస సార్ స్వామి కొమ్ము సుధాకర్ దొడ్డి రామ్మూర్తి అంబటి వెంకన్న మునాస వెంకట్ పైలం సంతోష్ లాంటి కవులు కొందరు సాహితీ సృజనలో నాకు ప్రత్యక్షంగానో పరోక్షంగానో సూచనగానూ సలహా గాను బిఎస్ రాములు గారు ఫోన్లో సంభాషణ చేస్తూ అనేకమార్లు పలకరించేవారు వారిని ఎప్పుడూ పత్రికల్లో చూస్తూనే ఉన్నా ప్రత్యక్షంగా వారితో గడిపింది తక్కువ ఫోన్లో పలకరించినప్పుడు ఆత్మీయంగా అక్కున చేర్చుకునే పలకరింపు వారి సొంతం నాకు సరైన గుర్తింపు ప్రోత్సాహం దొరకడం లేదని నేను అన్నప్పుడు మన ప్రయత్నం మనం చేయాలి రాస్తూనే ఉండు ఏదో ఒక రోజు గుర్తింపు దక్కుతుంది ఆవేశం పనికిరాదు. ఆలోచన తో సైన్యం మనం పాటిస్తూ నడుచుకో అనే వారి స్ఫూర్తిదాయకమైనటువంటి పలుకులు ప్రతి వ్యక్తికి అవసరమైనవి వారిని ఇతర రచనలు చదివినప్పుడు వారి పోరాట తత్వం వారి నేపథ్యం ఎరుక చేసుకుని అంతటి విశాల హృదయం ఉన్న వారు భారతీయ సాహిత్యంలో ఎన్నదగిన వారు కొత్తగా రాసేవారు తప్పక చదవాల్సిన రచనల అమ్ముల పొదీ బి ఎస్ రాములు గారు.
BS. రాములు గారు సామాజిక తత్వవేత్త, సుప్రసిద్ద కథా, నవలా రచయితగా మరియు ప్రశంసలు పొంది, సాహిత్యంలో స్రష్ట గా వినుతికెక్కారు. బి.ఎస్. రాములు గారు 2016 నుండి 2022 వరకు తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌కు మొదటి చైర్మన్‌గా కూడ ఉన్నారు.
పాలు, బడి, సహజాతాలు, సదువు, చేయూత, ప్రేమ, వేప చెట్టు, రియల్ ఎస్టేట్. కథల సంపుటిలో పాలు కథ ఒక ప్రయోగం ఈ కథల సంపుటి ఐఏఎస్ గ్రూప్స్ ప్రిపరేషన్ కి తెలుగు పరీక్షకు పాఠ్యాంశం అంతటి ఉన్నతి సాధించిన కథలు వారి కలం నుండి జాలువారడం వారి కథల గొప్పతనం సాటిలేని మేటి రచనలుగా బాసిల్లడం శుభ పరిణామం.
ఎన్నో పోరాటాలు చేసిన నేపథ్యం సమాజంలోని వైరుధ్యాలను పసిగట్టిన నేపథ్యం వాటికి అసమానతలకు అక్షరం సందించి కథలు నవలలు రాస్తూనే రాజి లేని పోరు సాగిస్తున్నారు నిరంతర అధ్యయనశీలి ఒక పోస్ట్ మాన్ గా ఒక టీచర్ గా ఒక రచయితగా సామాజిక తత్వవేత్తగా అంచలంచలుగా ఎదిగిన వారు ఓ మేరు శిఖరం అంతటి మహోన్నత వ్యక్తి బి.ఎస్. రాములు గారు 175 కు పైచిలుకు కథలు అనేక నవలలు రాసిన స్రష్ట
ఎందరికో కథ సంపుటాలు కథ సంకలనాలు విశాల సాహితీ ద్వారా ప్రచురించారు అలాగే సాహిత్యంలో కొత్త తరానికి ప్రోత్సహిస్తూ విశాల సాహితి ప్రతిభ పురస్కారం కీర్తి పురస్కారాలు అందజేస్తూ వస్తున్నారు. నేను 2019లో విశాల సాహితి ద్వారా కీర్తి పురస్కారం గౌరవ తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ మరియు బిఎస్ రాములు గారి చేతుల మీదుగా స్వీకరించాను
వారిని చదువుతూ ఎదిగి వారిచే పురస్కారం పొందడం మహాదృష్టం గా భావిస్తున్నాను వారి 75 వసంతాల జీవితం నిండు నూరేళ్లు సాగాలని మనందరికో మార్గదర్శనం కావాలని వారిని చూస్తూ వారి చేత ప్రశంసలు పొందిన స్థాయికి ఎదిగినందుకు గర్వపడుతూ చంద్రునికో నూలు పోగు చందం వారికి 75వ జన్మదిన శుభ అక్షరఅభివందనం తెలుపుకుంటుంన్నాను