మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కథలు

జొన్న రొట్టెలు “కథ

by Butam Mutyalu August 15, 2022
written by Butam Mutyalu

వానాకాలపు సాయంత్రం మలిసంజపొద్దు పడమట కొండల మాటున జారుకుంటుంది. మస్క మసకగా చీకటి ముసురుకుంటుంది. చెట్టు, పుట్ట, గట్టు, కొండలు గుట్టలు అనక ఊరు, వాడ నల్లని కాటుకమల్లే చీకటి దుప్పటి కప్పుకుంటున్నాయి అప్చిపటికే చినుకులు రాలి రోడ్డంతా తడిసిముద్పోదగయిపోయి చిత్తడి చిత్తడిగా మారింది. అటు పడమటి దాపున సరిహద్దుగా ఎత్తైన కొండల శిఖరాలుగా కాపురాలు గుట్ట అంచు వెంబడి దూరంగా విసిరేసినట్టున్న నల్లగొండలోని జీవివారిగూడెం రోడ్డు బాటంతా వచ్చిపోయేవారితో రద్దీగా ఉంది ఆ బస్టాపు మూలమలుపు తిరిగితే నల్లతాసులా పరుచుకునే వారిగూడానికి బాట చాపుతుంది 

    అసుంట ఆంజనేయస్వామి గుడి బాటకు ఇటు అటుగా ఇద్దరు ముగ్గురు లంబాడ లచ్చువమ్మలు బాటకు పక్కెంట కట్టెలు పొయ్యిలు రాజేసుకుంటు పొయ్యి ముందు సేదతీరిండ్రు పొయ్యిలో మంట రాజుకుంటుంది పొయ్యి మీద పెంక వేడెక్కుతుంది పొయ్యి చుట్టూత రక్షణ కవచంలా నాపరాళ్ళు మూడువైపులా అమర్చి ఉన్నాయి పొయ్యి ముందు ఆమెకు ఒకవైపు ఎండు కట్టెలు కొన్ని, చేతులో ఊదురుగొట్టంతో ఊపిరి బిగబట్టి ఊదుతూ నిప్పు రాజేస్తుంది ఇటుముందు తాంబాలంలా ( బేషన్ గిన్నే ) ఇంకో పక్క కాల్చిన రొట్టెలు వేడి చల్లారకుండా ఉండేందుకు హాట్ బాక్స్. బేషన్లో పిసికి ముద్ద చేసిన పిండి  

పక్కెంట జగ్గులో నీళ్ళు , కలపని పొడిపిండి, పొడిపిండిని పీటపై చల్లుతూ పిసికిన పిండి ముద్ద తీసుకొని ఒకచేత పట్టి మరోచేత ఒత్తుతూ అద్దుతూ పీట నిండారగా చేతితో రొట్టెను సాగదీస్తూ నిండు సందమామలా రొట్టెకు రూపమిస్తుంది

   యథాలాపంగా వేడివేడి రొట్టెలకోసంనేను ఆమె దగ్గరికి సమీపించాను ఆమె నా వైపు ఇంతలేసి కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ ” ఎన్ని రొట్టెలు కావాలి సారు” అని తిన్నగా అన్దినది. నేను ఆమె వైపు చూస్తూ ” రెండు జొన్న రొట్టెలు ఇవ్వమ్మా” అని అన్నాను. నేను అన్న మాటను అందుకుని పీటపై అప్పటికే పచ్చి రొట్టెగా చేసిన రొట్టెను చేత తీసుకొని పొయ్యి పై మంటకు వేడెక్కుతున్న పెంక పై వేసింది. కుడి చేతిని నీటిలో ముంచి పెంకపై కాలుతున్న రొట్టెను తడి చేస్తూ ఉంది , నాలాగే రొట్టెలకు వచ్చినవారు నాకు పక్కగా నిలబడి చూస్తూ ఉన్నారు. ఆమె దగ్వగరకు వచ్చిన గిరాకి మళ్ళి పోకుండా మంటని పెద్దది చేస్తూ త్వరగా రొట్టెను కాల్చేలా తిప్పి తిప్పి పెంకమీద వేస్తూ ఉంది , వేడికి రొట్టె అక్కడక్కడ ఉబ్బుతుంది అక్కడక్కడ కాలి నల్లగా మారిపోతూ ఉంది . ఆమె తిప్పి తిప్పి కాలుస్తూనే ఉంది. అటు ఇటు చూస్తే బజారు వీధి లైట్లు వెలుగుతూ ఉన్నాయి అక్కడక్కడ గతుకులు పడిన రోడ్డు కురిసిన వర్షానికి రంగు మారిన నీళ్ళు బురదరూపు సంతరించుకున్నాయి. పొయ్యి మంట బగబగమని మండుతూ ఉంటే ఆమె మొఖము ఆ వెలుగులో దగదగ మెరిసిపోతోంది . ఇంత పిండి ముద్ద మరొకటి తీసుకొని అప్పడంలా సాగదీస్తూ రొట్టెను చేస్తావుంది కానీ ఏదో పోగొట్టుకున్న దానిలా మొఖమంతా పాలిపోయి విచారంతో నిండిపోయింది ఆమె పక్కన ఆమెను చూస్తూ కూర్చున్న కూతురు ఆమె పనికి ఆటంకం కలిగిస్తూ ఉంది. 

 ” ఏమే పిల్ల జరట్లుండు విసిగించకూ ” అని కసురుకుంటూ అన్నదామె

” నీయమ్మ నేన్జేస్తనే ” అని బిడ్డ విసిగిస్తూ అనసాగింది.

” జర్రాగే మమ్మగాని సతాయించకు” అని బతిమాలుతున్నట్టు అన్నది.

” నీయమ్మ నేన్జేస్తేందమ్మ నన్నొదంటవు నాకు చెయ్యరాదా ఎట్ల “

“జర్రాగు రొట్టె పిండి ముద్ద సరిగ చెయ్యరాదు నీకు పీటమీద కొడితే అప్పలాగ పల్సగ రావాలి ముందు చూడు తర్వాత చేద్దువు చిత్తడిల ఎందుకొచ్చినవే మళ్ళీ వానొస్తే నేన్తడుస్త నువ్ తడుస్తవ్ , వానకు తడిస్తే సర్ది అయితది రూమ్ దగ్గర ఉండి చదువుకోపో “

“ఊకే సదువు సదువు అంటవ్ నేన్ సదవన్ పో ఈయాల సెలవు సెలవు నాడు సదవాలా “

“ఒశే పిల్ల జోలి బాగుందిగా బలె గమ్మతి చేస్తుందేంరో మాకే సదువు లేక రోడ్ల మీద కుసోని రొట్టెలమ్ముకుంటున్నం నువ్వన్న గింత సద్వుకుంటవంటే” అని గుల్గ సాగింది.

మాటలవడి పెంకమీద రొట్టె నల్లగా మాడింది ” అయ్యో అయ్యో జర్రాగు సారు రొట్టే నల్లగ అయ్యింది ఇంకోటి చేస్తా “అని

లబోదిబోమంటు కూతురి వైపు గుడ్లురిమి చూసింది చూస్తూనే పీటపై తొందరతొందరగా రొట్టెను సాగదీయసాగింది సాగదీస్తుంటే రొట్టె పర్రెలు పర్రెలు గా ఇచ్చుకుంటుంది సరిచేస్తూ సాగదీస్తుంది

” ఏమ్మా నీ కూతురా” అని నేను అనగానే

” అవును సారు , చదువుతుంది సారు , నాకొడుకు వాటర్ ఫిల్టర్ మీద ఉండు వాడు సదువు సద్వురా అంటే… సదువుకు పంగనామాలు బెట్టిండు. ” అని అంటుండగా

” ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్ ట్రింగ్” మంటూ ఆమె రొమ్ములో దాగివున్న సెల్ పోన్ మోగింది. గుండెల్లో పిడుగు పడ్డట్టు ఉలికిపడి తిన్నగా తడిచేత తీసుకుంది. ఒకవైపు అసహనంతో కూడిన ఆందోళన చెందుతూనే జీరబోయిన గొంతుకతో “అలో అలో” అంటూ తడబడుతూనే పలికింది. ఆమె మాటలో వనుకు స్పష్టంగా కనిపిస్తూవుంది. మొఖంపై చెమట కమ్మింది. తను మండుతున్న పొయ్యి ని తదేకంగా చూస్తానే పెంకపై జొన్నరొట్టె ను తిరిగేయబోయింది అంతలోనే చేయికి సురుక్కున వేడితగిలి అలాగే రొట్టెను విడిచింది రొట్టె పోయ్యిలో పడి బగబగ మండుతూ నల్లగా మాడింది “ అయ్యో వోరి దేవుడా … ఇయ్యాల లేసి ఎవరి మొఖం చూస్తినిరా శని చుట్టుకున్నట్టు వున్నది అని తనను తానే నిందించుకుంటూ జర్రాగు సారు ఇంకోటి చేసి ఇస్తాను అని ఒకచేత పిండి తీసుకొని పిసుకుతూనే మరోచేత “ అలో అలో ఎవరూ? “ అని అన్నది.

“ హలో నేను “ అంటూ అవతలి గొంతు పలికింది.

“ ఆ చెప్పుండ్రి “ అని బదులు పలికింది.

“ అదేనమ్మా నీ కూతురు గురించి నేను చెప్పిన విషయం గురించి ఏమి అనుకుంటున్నారు” అంటూ అతను సావదానంగా పలికిండు. 

“ యాడియే …మీరే చెప్పుండ్రి . నేనా ఆడిమన్సిని నాకంటే మీకే బాగా తెలుసు , పిల్లల గురించి అంతా మీకు ఎర్కేనాయే మీరే ఏదో ఒకటి చెప్పుండ్రి ఏమి చేద్దామో?” అంటూ గబగబా పలికింది . పీటపై రొట్టె చేస్తూనే

“ అంతా నాకు తెలుసు అంటే ఎలాగమ్మా? మనం సావదానంగా ఒక నిర్ణయానికి వద్దాం ఏమంటవూ?” అని అతను అనగానే 

“ అదేనయా నేనా ఆడపిల్ల తల్లిని. ఏదెర్కలేనిదాన్ని. నాకా సదువు గిదువు తెల్వని దాన్ని . జర్రంత మీరే నజర్ పెట్టి నా బిడ్డ బతుకు ఆగం గాకుండా సూడాలి జల్దిన లగ్గం జేస్తే సరి” అని కట్టెవిరిచినట్టు అన్నది. 

“ అట్లా అంటే ఎట్లమ్మా? పెండ్లి పెండ్లి అని ఒకటే తొందర పెడుతున్నవ్. అట్లా గబగబ ఉర్కులాడితే ఎట్లా? ఉర్కి ఉర్కి పసుల కాస్తే కుదురుతుందా చెప్పు. ఇదిగో నేను ముందే చెప్పిన మా ఇంటికాడ పప్పన్నం తిందాం. మీ ఇంటికాడ ఎంగేజ్మెంట్ 

 చేద్దాం. అలాగే మీ ఇంటి దగ్గరనే పిల్ల, పిలగానికి లగ్గం పెట్టుకొని లగ్నపత్రిక రాయిద్దాం . మన్చిరోజు చూసుకొని మీ ఇంటిదగ్గరనే పెండ్లి చేద్దాం సరేనా, లగ్గం మీ యింటి దగ్గర చేస్తే అది మీకే మంచిది” అంటూ నింపాదిగ పలికిండు అతను 

“ సరే అట్లనే కానిద్దాం “ అని ఆమె అన్నది….

“ కానీ ఏందమ్మా, ఇంకా నేనే ఒకమెట్టు దిగివస్తే “ అంటూ కాస్తా కటువుగా పలికిండు అతడు.

“ అదికాదు బయ్యా.. పిల్లా, పిలగానికి పెండ్లి మీ యింటి దగ్గర జరుపుండ్రి. నేనా ఏదెర్కలేని ఆడిమన్సిని, అటసూత్తే పెండ్లి అన్ని ఇగురంగ చెయ్యగలనా? నాకేమన్న సదువా సాత్రమా, అసలే మగదిక్కు లేనిదాన్ని , నువు కూడ నన్నే చేసియమంటున్నవు. నీదేంబోయింది రేపు నలుగురు నన్నంటరు అడదాని పెత్తనం తమ్మల్ల దొరతనం అని వూకెనే అనలే , ఏది గింత సరిగ కుదురకున్నా వచ్చిన జనం నన్నాడిపోస్కుంటరు బయ్యా.. జర గది నువ్వే ముంగట నడ్సి పుణ్యం గట్టుకోండ్రి.” అని దీనంగా వేడుకుంటి. అయిన వుండి “ అలాగంటే ఏట్లనమ్మా , యిద్దరం కల్సి ఒకపని చేద్దాం . ఇప్పుడు ఎంగేజ్మెంట్ పెట్టుకుందాం , దసరా, దీపావళి లగ్గాలప్పుడన్న , కుదరకుంటే మళ్లి మాఘమాసం లగ్గాలప్పుడు పెండ్లికి వాయిదా వేద్దాం. అప్పుడు అందరం ప్రీగా వుంటాం కదా, ఇగపోతే నువు పిలగానికి ఇస్తానన్న కట్నం డబ్బులు యిప్పుడే ముందుగా యిస్తే అబ్బాయి ఏదేవొక యాపారం చేసుకుంటడు. వచ్చే ఎండాకాలం లగ్గాల నాటికి 

“ ఆ.. ఏందమ్మా వినిపించనట్టు మాట్లాడుతవు. “ అని అతను అన్నడు

 “ అట పతిదానికి తప్పులు తీస్తవేందయా యినవడ్డది కాని ముంగల ముంగల ఎట్ట ఇయ్యను పైసలతో పని” అని అన్ననోలేదో “ సూడమ్మా నువు ఇప్పుడు పైసలు ఇచ్చి సరేనంటే మనకు మంచిది. లేకుంటే పిలగాడు ఏదో ఒకటి చేసి కుదుర్కున్నంకనే పెండ్లి ఏమంటవు సరేనా? “ అని అనే.

 “ ఆ… ఓరిదేవుడా ఎట్టా సచ్చేది గాళ్ళ మన్సుల మర్మం ఏందోగని అంతు చిక్కుతలేదు “ అని లోలోన గొనుగుతూ బాదతో కండ్లు పిండసాగింది. చేతులున్న పోను నేల జారింది. నేలచూపులు చూస్తూ నే కొంగు మొఖానికి పెట్టుకొని బోరుమంటూ ఏడుపందుకుంది. “ ఏమయిందమ్మా” అంటూ కూతురు కాసింత ఆందోళన చెందుతూ ఆత్రుతగా అడిగింది 

….

” ఏందమ్మా ఏమైంది ఏడుస్తున్నవ్” అని ఆమె వైపు తీక్షణంగా చూస్తూ నేను అడిగిన.

ఇగో సారు నా పేరు తీత్రిబాయి

నాకు ఒక్కగానొక్క ఆడబిడ్డె , పేరు సామియా. మాది మీరంగాని తండా గా ముచ్చట ఇనుర్రి కొడుకును ఆపి పిల్లను డిగ్రీ దాక సదివిచ్చిన కాలేజు పోరల సోపతిల అది ఒక పిలగాన్ని ఇష్టపడింది మేము లంబాడ. గాళ్ళు సూదర్లట సరే పిల్ల మన్సు పడింది గదా గా ముచ్చట నా కండ్ల పడింది గాళ్ళను ఇడదీస్తందుకు నాకు మనసొప్పలే , గాళ్లను కలపాలని చూస్తున్న గా పిలగాన్ని అడిగితే ఇద్దరం ప్రేమించుకుంటున్నం పెళ్ళి చేస్కుంటం అని అన్నడు నా బిడ్డె కుద్దుగ అదే మాట పలికింది కని గా పిల్లగ్గాన్ని అయ్య గింత తేడు పెడుతుండు కిందికంటే మీదికేస్తడు మీదికంటే కిందికేస్తడు ఒక్కతీరు మనిషికాదు ఒకపాలి ఏమో “నాకు ఇష్టం లేదు గుడిల దండలు మార్చి చేపిచ్చుకో అంటడు. లేకుంటే రీస్టరు పెండ్లి చెపియ్యి అంటడు, ఇంకోపాలి పప్పన్నం తిందాము అంటడు సరే దారిలకు వచ్చిండని , పిల్లను గార్వంగ సాదుకుంటి ఉత్తగ ఎట్ల పట్టియ్యను దాన్ని ఎవరినో ఒకయ్యను జూసి పెండ్లిచేసి నాల్గిత్తులు నెత్తిన సల్లితే నా బర్వు దిగుద్ది అనుకుంటి గట్లనే మన్సుల అనుకుని పిల్లకు ఇంత ఒంటిమీదికి నల్లపూసలదంండను చేపిచ్చిన నా మెడల గుండ్లను సెడగొట్టి నా చెవుల గెంటీలు చెడగొట్టి పిల్లకు దిద్దులు బుట్టాలు చేపించిన రెక్కలు ముక్కలు చేసుకుని పైసపైస కూడబెట్టి సందేళ్ళ మాపు గీడ కూకొని జొన్న రొట్టెలు చేసి అమ్ముకుని పూట ఎల్లదీస్కుంట ఊస్నూరు పాస్నూరు చేసుకుని జర్రంత నలుగురిల నజరు గొడితట్టు తలెత్తి బతికేటట్టుగ ఉండాలని నేను చూస్తున్న , కాని నన్ను పగ్గుతూ ఇబ్బంది పెడుతుండ్రు గాళ్ళు పిల్ల ఒంటిమీదికి బంగారం పెడితే నీ పిల్లకు పెట్టుకుంటున్నవ్ అనే, సరే పిలగానికి లగ్గం కర్సులకు గిన్ని పైసలు జూస్త తియ్య అంటే నా పిలగానికి కట్నం ఇయ్యమనే, మళ్ళీ అయన ఆడిబిడ్డ కట్నం ఇయ్యమనే ఆ పిల్లగానికి ఏదో యాపారానికి నన్నే ఎగనూకమనే సరే అదులో బదులో చేసి దులుపుకుందాం అంటే ఆ ఇచ్చే డబ్బులు ముంగల ముంగల ఇయ్యమంటుండు లగ్గం తర్వాత అంటుండు. ఎట్టజెయ్య సారు …ఆయిన అత్తగారి సొమ్ము అయినట్టు ఇయ్యమంటే ఎట్లియ్యాలే సారు అదికూడ ముంగల ముంగలంటే లోకంల ఎవలన్న ఇస్తరా. నేనయుతే సూడలే సారు గిదేంపజ్జతి గతిలేని సంసారానికి గంజినీళ్ళే పాన్కం అని మేం బతుకుతుంటే ఆయిన సంపాయించి పెట్టిన ముల్లెలు వున్నట్టు ముంగల ముంగల ఇయ్యాలంట నాకు అరికాలిమంట నెత్తికెక్కింది వొచ్చిన కోపానికి కొర్కాసు వాత పెట్టాలన్నంత కోపం వుంది గని పిల్ల మొఖం సూడాల్సి వచ్చే. పిల్లను గార్వంగ సాదుకుంటి ఎట్ట జెయ్యాలే సారు… యిగ్గో

మొంచోడు మంచోడనుకుంటే మంచం కరాబు సేసిండట అట్టుంది గాయిన వాలకం , ఇసుంట రమ్మంటే ఇల్లంతా నాదంటరా . నమ్మితిరా సిద్దా అంటే ముంచితి బిడ్డా అన్నట్టుగుంది గాళ్ళ యిలవరస, 

మిరాశి హక్కు వున్నట్లు పీస దీస్కుంట అడిగిండు

పిల్ల బతుకు ఆగం గావొద్దని సుట్టాల దాపుకు జేరుదామంటే 

సెడి చెల్లెలు యింటికి అలిగి అత్తగారింటికి పోగుడదాయే ఎట్ట జెయను సారు

” అంటూ ఎగదన్నుకొచ్చే దుఃఖాన్ని పైటకొంగుతో తూడ్సుకోసాగింది.

“అమ్మా మరేం గాబరా పడకు నీ కూతురిపై నీకు మమకారం ఉంటది సహజం , విషయం సాగతీత మంచిది కాదు దీని పరిష్కారానికి వెంటనే వెళ్ళి పోలీసులను కలువు ” అని నేను అనగానే అలా అన్నానో లేదో సరసర అక్కడ పని పక్కన పెట్టి పిల్లను వెంటబెట్టుకొని ” దేవుడా ఈ గండం నుంచి గట్టెక్కించే దారి చూపు” అని ఆమె మతిలో ప్రార్ధించింది శుభ సూచకంగా దూరాన వున్న గుడి లో గంట మోగిన సప్పుడు వినిపించింది . ఆమె తన కూతురు ను తోడు గా వెంటబెట్టుకొని ముందుకు సాగిపోయింది తెగిన గాలి పటంలా…! దిక్క దాపు ఆసరా కోసం.నేను వారినే చూస్తూ కొయ్య బారిన వాడిలా నిశ్చేష్టుడయ్యాను. అలా క్షణకాలం రెప్ప వేయకుండా చూస్తోవుండిపోయా. కానున్నది కాకమానదు ఎమైనా కానియ్యి బంధం ముడి పడి వుంటుందా? తెగుతుందా, సమస్య జటిలమే కానీ బుర్ర లో అలోచనలు పరిపరి విధాలుగా గింగిరాలు కొడుతున్నాయి. అటుగా చిరుగాలి వీచింది, మనసు కాసింత తేలికగా అనిపించింది.గుండెలో బరువు తగ్గి చినుకుల చిరుజల్లు ఆశ మిణుగురు లా మినుకు మినుకు మంటూ చిరుదివ్వే వెలిగింది.

…….. 

August 15, 2022 0 comment
4 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

తపస్వి మనోహరం

by చంద్రకళ దీకొండ August 15, 2022
written by చంద్రకళ దీకొండ

మాస రచనల పోటీకి

తేదీ:24/12/2021
పేరు:చంద్రకళ. దీకొండ
ఊరు : మల్కాజిగిరి
చరవాణి : 938131384
అంశము : పుస్తక సమీక్ష
రచన సంఖ్య : 11

పుస్తకం పేరు : గెలుపు పిలుపు
రచయిత : శ్రీ బుర్రా వెంకటేశం,ఐ. ఎ. ఎస్. గారు

పేద కుటుంబంలో పుట్టి,స్వయంశక్తితో ఎదిగి
పర్యాటక, సాంస్కృతిక, క్రీడలు, బలహీన వర్గాల సంక్షేమ కార్యదర్శి, వివిధ ప్రభుత్వ శాఖలలో పాతిక సంవత్సరములు వృత్తి నిర్వహణ గావించి,రెండువేల మంది మానసిక వికలాంగుల పునరావాసానికై కృషి చేసి జాతీయ,
అంతర్జాతీయ అవార్డులు,రివార్డులు అందుకున్న,
స్వయంగా గెలుపు శిఖరాగ్రం చేరుకుని,గెలుపు సంతకం చేసిన శ్రీ బుర్రా వెంకటేశం,ఐ. ఎ. ఎస్.గారి రచన…ఎంతో ప్రజాదరణ పొందిన సెల్ఫీ విత్ సక్సెస్ పుస్తకం గెలుపు పిలుపు గా తెలుగు భాషలో… బెంగాలీ,స్పానిష్ మరియు పోర్చుగీస్ భాషలలోనికి అనువదించబడినది.

మనం సాధించే ప్రతి విజయం ఆనందాన్ని ఇచ్చినప్పుడే అది నిజమైన సక్సెస్ పని చేయడం ఆపితే అదే ఫెయిల్యూర్
గెలుపును పలువురికి పంచినప్పుడే దానికి సార్థకత వంటి సూక్తులు…
ఏకలవ్యుడు,రెండు కప్పలు,నక్క-నాగలోకం వంటి కథలతో ఆసక్తిని రేకెత్తిస్తూ… గెలుపు దశలను, కోణాలను, గెలుపు శిఖరాగ్రం చేరుకొనుటకు కావలసిన ఓర్పు,జిగి, పట్టుదల అనే ఆయుధాలు సమకూర్చుకోవాల్సిన ఆవశ్యకతను సులభశైలిలో పిల్లలు,యువత, పెద్దలు అవగాహన చేసుకునేలా రచించబడినది.

ఇందులో “కోచింగ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా”కోట (గెలుపు దుకాణం)
బాపూజీ,టాటా వంటి గెలుపు శ్రేణులు
ఎన్నోసార్లు విఫలమై గ్రాంఫోన్, విద్యుద్దీపంతో పాటు మరెన్నో వస్తువులు కనిపెట్టి 1093 పేటెంట్లు పొందిన ఎడిసన్,ఐజాక్ న్యూటన్ వంటి శాస్తవేత్తలు…
హేళనకు గురై పట్టుబట్టి సంస్కృతం నేర్చుకున్న తిల్ శాస్త్రి …
గెలుపును పదిమందికీ పంచిన
ప్రేమ్ జీ, వారెన్ బఫెట్ వంటి వ్యాపార దిగ్గజాలు, వితరణశీలురు…
గురు స్థానాన్నుంచి రాష్ట్రపతిగా ఎదిగిన డాక్టర్ రాధాకృష్ణన్ వంటి వారు…
రామోజీరావు,
ఐ. ఐ. టి.రామయ్య వంటి కృషీవలురు…
మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సోదాహరణంగా నిలిచి మనకెన్నో గెలుపు పాఠాలు చెపుతారు.

ఈర్ష్య, కోపం,ప్రతీకారం,పగ, అహంకారం వంటి గెలుపు లోపాలతో పతనమైన హిట్లర్ వంటి చరిత్రకారులు…విధ్వంసాలు,
విద్వేషాలతో పతనమైన
మాదకద్రవ్యాల మాఫియా చక్రవర్తి “పాబ్లో ఎస్కోలర్” గెలుపులో పాపాలను వివరిస్తారు.

కష్టపడి నిచ్చెనలెక్కి పెద్దపాము నోట్లోకి జారిన పావుల్లా దుర్వ్యసనాలకు లోనైన మైఖేల్ జాక్సన్ ; అతిగా అందరినీ నమ్మి మోసపోయిన మహానటి సావిత్రి వంటి వారు గెలుపు లోపాలను మనకు తెలియబరుస్తారు.

గెలుపును సమన్వయంతో ఎలా సాధించవచ్చో బాపు-రమణలు చెపుతారు.
కలిసికట్టుగా సమస్యలను పారద్రోలిన డిస్నీ&పిక్సార్
గెలుపు పథానికి దారి చూపిస్తారు.

పన్నెండు మంది పబ్లిషర్ల వద్దకు తిరిగి ఓటమినే ఇంధనంగా తీసుకున్న ప్రఖ్యాత రచయిత్రి జె.కె.రోలింగ్ పరిచయం ఎంతో స్ఫూర్తిని కలుగజేస్తుంది.

బాధనే పెట్టుబడిగా పెట్టి రాప్ సంగీత రారాజుగా ఎదిగిన ఎమినమ్ వృత్తాంతం మనలో ఆత్మవిశ్వాసాన్ని మేల్కొల్పుతుంది.

అంతేకాదు…ఫార్స్ వర్త్ ప్రతిభను వాడుకుని అరువు గెలుపు అందుకున్న డేవిడ్ పార్నాఫ్ గురించీ,దాని పర్యవసానాల గురించీ మనం తెలుసుకోవచ్చు.

నిరుపేద కుటుంబంలో పుట్టి రాజ్యాంగ రచన చేసిన అంబేద్కర్ జీవన కథనమూ ఇందులో ఉంది.

తనకే తెలియని ప్రతిభ దాగున్న సైలెంట్ పాప బియాన్,
బాల్యంలో అత్యాచారానికి గురై, ప్రపంచ ప్రఖ్యాత వ్యాఖ్యాతగా పేరు పొందిన నల్లజాతిరత్నం ఓప్రా విన్ ప్రే,
బంగారు పతకాన్ని అందుకున్న బాక్సింగ్ ఛాంపియన్,ఇద్దరు బిడ్డల తల్లి మేరికొం మహిళలలో స్ఫూర్తిని రగిలిస్తారు.

ఇంకా ఎందరో విభిన్న రంగాలలో దీక్షతో గెలుపు సాధించిన వారి గెలుపు చిత్రాల ను మన కళ్ళ ముందు నిలిపి
స్ఫూర్తిని,ఉత్తేజాన్ని రగిలించే
పుస్తకమిది.

ఓటమితో క్రుంగినప్పుడు,
అవకాశాలు అందక నిరాశలో కూరుకుపోయినప్పుడు ఈ పుస్తకం ఒక్కసారి తిరగేస్తే చాలు…మనలో ఆత్మవిశ్వాసం ఉప్పొంగి,చైతన్యం పెల్లుబికి,అంతర్మథనమే మన ప్రగతికి సోపానమౌతుంది

పుస్తక ప్రదర్శనశాలకు వెళితే…
తప్పక ఈ పుస్తకంతో పాటు ఆత్మవిశ్వాసాన్నీ మీ వెంట తెచ్చుకుంటారు కదూ…?!

August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Uncategorized

1947 ఆగస్ట్ 15 నాటి ఆంధ్రపత్రిక

by mayuukha August 15, 2022
written by mayuukha
August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

బాల చిత్రం

by Hasini August 15, 2022
written by Hasini
చిత్రకారిణి : ఏ. నాగసాయి హాసిని, 6th class
Sri Chaithanya Techno School
Hyderabad
D/O.A.Gopal Krisha Rao
A.Viraja Vonhika
August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

చురకలు

by కొరుప్రోలు హరనాథ్ August 15, 2022
written by కొరుప్రోలు హరనాథ్

తప్పు తప్పే…

పక్కనే

కట్టుకున్న భర్త

అటు పక్కన సమయం చూసి

ప్రియురాల్ని కాటువేయాలని చూసే

పొంచి ఉన్న ప్రియుడు

క్షణంలో ‘భార్య’ గల్లంతు

భర్త ‘పరేషాన్’

ఇదీ ఇప్పటి సంస్కృతి

ఇది ప్రియుడి తప్పా

ప్రియురాలి తొందరపాటా….

ఏమై పోతుందీ ‘నవల’

ఎటు పోతుందీ ‘యువత’

(ఇటీవల విశాఖపట్నం బీచ్ లో జరిగిన సంఘటన ఆధారంగా)

నగరం తోడు

ఈ నగరం గమ్మత్తైన కిమ్మిక్కు

ఎడ తెరపి లేని వాన దెబ్బకు

త్రవ్విన రోడ్లపై

ట్రాఫిక్కంతరాయ కలిగి

ఏ హాస్పిటల్లోని పుట్టవలసిన పసిగుడ్డు

ఏ అంబులెన్స్ లోనో, ఏ ఆటోలోనో

పుట్టలేక పుట్టి ఏ తల్లికి గర్భశోకం

ఎప్పుడు ఎలా

ఈ మహానగరం ‘రోడ్లు’

కలిగిస్తాయో తెలియదు కదా….

August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

పదకిరణకలనం -9

by కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి August 15, 2022
written by కాటేపల్లి లక్ష్మీనరసింహ మూర్తి

ఆధారములు

*****

అడ్డం

**

01. దినుసుల గంధం కోసం నూరే రాయి (2)

03. భారతీయ దృశ్యశ్రవణ మాధ్యమం తెలుగు రూపంలో  (5)

07. అపుణ్యుడు చిరాయువు అంటారు (2)

09. తన్మయత్వం (3)

11. సముద్రం మెడ (2)

12. దయగల చురకత్తి (4)

14. పొల్లు మాంసం (2)

16. భార్యాభర్తలు (4)

18. పదములు కలిగిన సంఖ్య (2)

20. కొరడా (2)

22. డొల్లుగింజ (2)

23. దండు (2)

24. నెమ్మది కవి (3)

26. పరిఖ ఎటుచూచినా (3)

28. వివరంగా భూమి (3)

29. పొందాలనే కోరిక (3)

31. … ప్రభూ! మనసు (2)

33. బయట కాదు (3)

34. సంతకం రాత (2)

36. విశ్వామిత్ర పిత (2)

38. పూర్తిగా యావ తీరగ (4)

41. భవుడు (5)

44. కొయ్యముక్క తుంగ కాదు (2)

46. వివరం (2)

47. భిన్నంలో భాగములను తెలిపే కొంచెం (2)

49. పాలకూర భూమి(2)

50. భద్రంగా (4)

51. అశ్వినీ నక్షత్రం (4)

నిలువు

**

01. సత్యవంతుడు (5)

02. కొత్త దురద (2)

04. నరకంలో తీరు (2)

05. వెన్న (3)

06. మోసాలు (4)

07. చేయి (2)

08. కోకిలకోకిలలు చెల్లాచెదరగు (6)

10. మెఱుపు (2)

13. క్షీరం వంతు (2)

15. దీవి (2)

17. ధ్వజం (3)

18. తిరుగువాడు (3)

21. శతకంలో కాలప్రమాణం (2)

23. పశువు వీపు (2)

25. రక్తం పారేది దీనిలో (3)

27. అమావాస్య చూపు (2)

28. ద్రవ్యం (2)

30. ఆహ్వానపత్రికలో కుటుంబసభ్యులు, సేనతో ..(6)

31. పైనుండి చల్లు (3)

32. వేపుడుకు ప్రసిద్ధమైన గడ్డ (5)

35. మమతల బంగ సోదరి (2)

37. విడత  (2)

39. ఉష్ణం (2)

40. ప్రసిద్ధచారిత్రక చిత్రకారుడు (4)

42. వెలుగు తోడు (2)

43. నేను కాదు నువ్వు లు (3)

45. అర రోగి (2)

48. వంగజేయు (2)

August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

బంగారు కల

by Chillara Bhavanidevi August 15, 2022
written by Chillara Bhavanidevi

3

తూర్పుదిక్కు సూర్యభగవానునికి స్వాగతం పలుకుతూ వేయిరేకుల వెండి పద్మాలను సమర్పిస్తున్నది. విద్యారణ్యస్వామి ఆశీస్సుల్లా విజయనగరం శిరస్సుపై వేలవేల వెలుగు అక్షింతలు వర్షిస్తున్నాయి. విజయనగరంలోని దేవాలయాల నుండి సుప్రభాత సమయాన జరిపే పూజాదికాల మంత్రోచ్ఛాటనా తరంగాలు పంపానదీ జలాలను తాకి పవిత్రమొనర్చి మరల విరూపాక్షుని చరణాలను అభిషేకిస్తున్నాయి.
విరూపాక్షస్వామి దేవాలయం బయట తుంగభద్ర కృష్ణరాయని కీర్తి వాహినిలా ప్రవహిస్తోంది. విరూపాక్ష ఆలయ గాలిగోపురం శిల్పకళాశోభితమై అనేక స్తంభాలు కిటికీలతో విరాజిల్లుతోంది. ప్రాకారద్వారం నుండి వశిష్టతీర్థమనే తుంగభద్రానదీ భాగం పవిత్రఘట్టంగా విరాజిల్లుతోంది. హంపీ విరూపాక్ష దేవాలయం హేమకూట పర్వతపాదం దగ్గర హంపీ పట్టణం నడిబొడ్డున వుంది. దీనినే ‘పంపావతి దేవాలయం’ అని కూడా అంటారు. హంపీలోని అన్ని దేవాలయాలకన్నా పరమ పవిత్రంగా భావించబడే ఈ దేవాలయం ఏడవ శతాబ్దకాలంనాటిదని చెప్తుంటారు. శివ, పంప, భువనేశ్వరీ ఆరాధన జరిగే ఈ గుడి గర్భగుడి, మూడు అంతర్భాగాలు, స్తంభాల మండపం, శ్రీకృష్ణరాయ నిర్మిత రంగమండపంతో అలరారుతున్నది. ఈ దేవాలయం చుట్టూ అనేక స్తంభాల మండపాలు, ద్వారాలు సమావేశ మందిరాలున్నాయి.
రంగమండపం అనేక శిల్పాకృతులతో ముప్ఫై రాతిస్తంభాలతో నిర్మితమైంది. ప్రతిస్తంభం రెండు నిలువు భాగాలుగా కన్పిస్తుంది. మొదటిది మకర శరీరంతో సింహాకృతిలో కన్పిస్తే రెండవది శైవ సంబంధిóత అంశాలతో అలరారుతున్నది. రంగరాయ మండపం లోపల పైభాగం దూలాలన్నింటిమీద మహాభారతం, రామాయణం, శివపురాణాలు చిత్రీకరించబడినాయి. విరూపాక్ష గుడివద్ద తొమ్మిది అంతస్థులతో అత్యంత ఎత్తులో ఉండే బృహద్గోపురాన్ని అనుసరించి విపణివీధి ఉంది. విరూపాక్షగుడి ప్రధాన గోపురాన్ని ‘బిష్టప్ప గోపురం’ అంటారు. దీనికి మరో చివర మహానంది వుంది.
భువనేశ్వరీ దేవాలయ మహాద్వార కళాత్మకత, రాతిస్తంభాలు, పైకప్పు లోపలిభాగ చిత్రాలు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి.
హంపీ విరూపాక్షస్వామిని దర్శించుకొన్న మంజరి చంద్రప్పలు స్వామి తీర్థ ప్రసాదాలు స్వీకరించి కాసేపు దేవాలయం మెట్లమీద కూర్చున్నారు.
‘‘మంజూ! ఈ విజయనగర ప్రజలు ఎంత అదృష్టవంతులో కదా! ఇంతటి మహనీయుడైన ప్రభువు పాలనలో జీవించటానికి అర్హులయ్యారు. విరూపాక్షస్వామి దయవల్ల ఆ తిరుమలేశుని కృపవల్ల కృష్ణరాయ ప్రభువు కీర్తిచంద్రికలు దశదిశలా వ్యాపిస్తున్నాయి.’’
‘‘అవును చంద్రా! రాయలవారు ప్రతి విజయయాత్ర తర్వాత దేవేరులతో తిరుమల సందర్శించి తులలేని కానుకలను సమర్పించడం ప్రభువు భక్తికి నిదర్శనం.’’
‘‘మంజూ! చెప్పటం మరిచాను. తిమ్మరుసులవారు నాకోపని అప్పగించారు.’’
‘‘వారికి నీవు నమ్మినబంటువి కదా! ఏం చెప్పారేంటి?’’
‘‘నిర్మాణం కొనసాగిస్తున్న విఠల మండపం, ఏకశిలారథం నిర్మాణ పర్యవేక్షణ నాకప్పగించారు.’’
‘‘ఇంకేం! ఇక రాత్రింబవళ్ళు ఆ శిల్పకన్యల ధ్యాసే!’’ ఉడుక్కుంది మంజరి.
‘‘ఆ శిల్పాలకి మించిన సజీవ శిల్పమే నాకోసం ఉంది మంజూ! ప్రధాన శిల్పాచార్యుడు ఎంపికచేసిన శిల్ప విన్నాణాలన్నింటిలో నీవే కన్పిస్తున్నావు. ఆయన నిన్ను, నీ నృత్యాన్ని ఎప్పుడైనా చూశారా అని నా అనుమానం.’’
‘‘చాలులే చంద్రా! అతిశయోక్తి వద్దుగానీ వారు నా నాట్యాన్ని రాయలవారి పట్టాభిషేకోత్సవ సందర్భంలో చూశారు అంతే’’ నవ్విందామె చిన్నగా.
‘‘కళాహృదయుల కళాతపస్సుకు కాలమే బందీ అవుతుంది. విఠల మందిరంలో నిర్మితమవుతున్న సప్తస్వర స్తంభాలని మీటుతుంటే వివిధ వాయిద్యాల సందడి. నువ్వయితే పరవశంతో నర్తిస్తావు.
‘‘ఎల్లుండి పున్నమిరాత్రి నన్నక్కడికి తీసుకుపో చంద్రా’’ తమకంగా అడిగింది.
‘‘పరులకు ప్రవేశం నిషిద్ధం. అయినా ఆచార్యుల అనుమతి అడిగి తీసుకెళ్తాను.’’
‘‘పద! చిన్నాదేవిగారి పూజకు వేళకాకముందే నేను మందిరానికి చేరాలి.’’
‘‘ఉండుండు! ఇవ్వాళ విద్యారణ్యస్వామి జయంతి. వారి ఆశీస్సులు ప్రత్యేకంగా తీసుకోవాలి. ఈ గుడి వెనుక వారి ఆలయానికి వెళదాం.’’
మంజరి చంద్రప్ప వెంట విద్యారణ్యుల గుడిలోకి ప్రవేశించింది.
విజయనగర సామ్రాజ్య నిర్మాణానికి ప్రేరణగా నిలిచిన ఆ మహనీయుని మూర్తి చూడగానే చంద్రప్ప పరమ భావుకుడయ్యాడు. అతని కళ్ళు ఆనందంతో చెమర్చాయి.
‘‘మంజూ! స్వామి ఎంతటి శక్తి సంపన్నుడో చూడు! పాడయిన ఓరుగల్లు సౌభాగ్యాన్ని విద్యానగర రాజవీధిలో నిలిపిన ఘనుడీయన. క్షీణిస్తున్న హిందూమత ప్రాభవాన్ని తిరిగి నిలబెట్టిన తపస్వి. రాజకీయ తంత్రజ్ఞుడు. ఇహానికి పరానికి నిలిచిన నిస్సంగి. ఎప్పుడో వశిష్టుని గురించి విన్నాము. ఈ విద్యారణ్యుల దివ్య ఋషిత్వము వారి విగ్రహంలో ఎంతగా ప్రస్ఫుటిస్తున్నదో చూడు.’’
‘‘ఆ కన్ను మూతలో నంతర్విలీల పం
చాలనిలస్తంభ నాత్మార్చి వెలుగు
ఆ బొమ్మ మోడ్పులో నసమాక్షుసెగకన్న
మంట రేగిన సుళ్ళు మాటుమణుగు
ఆ కన్నువిప్పులో నఖిల రాజన్య శి
క్షాదక్షమైన వర్చస్సు మెరయు
ఆ చిరునవ్వులో నాంధ్ర సామ్రాజ్యసు
శ్రీ నవ్య జీవన శీలమిముడు
ఈ శిలావిగ్రహము నందె యింతగొప్ప
కుదురుకొని యుండ ఊహలు గుములుకొనిన
ఎంతవాడవొ నిను స్తుతింప గలమె?
విజయనగరాంధ్ర దేవుడవే నిజంబు’’
అంటున్న చంద్రప్పతో కలిసి ఆ స్వామికి నమస్కరించింది మంజరి.
‘‘దేశబాధ చూసి తపస్సు మాని రాజకీయాలలో ప్రవేశించి హంపీలో తెలుగు రాజ్యాన్ని పునఃప్రతిష్టించి సంస్కర్తjైు మతోద్ధారకుడై ముక్తిపొందిన ఈ విద్యారణ్యస్వామి గుడి తెలుగు ప్రజలందరూ చూసి తరించాల్సినది’’ మంజరి ప్రస్తుతించింది.
మనసులోని భావోద్వేగాలను సమన్వయపరుచుకుంటూ గుడి మెట్లు దిగి వస్తున్న మంజరి చంద్రప్పలను చాటునుంచి చండ్రనిప్పుల్లాంటి రెండు
కళ్ళు ఆగ్రహజ్వాలలతో గమనించడం వారికి తెలియదు. ఆ క్షణం నుంచి ఆ కళ్ళు వారి జీవితాలపై నిప్పుల వర్షం కురిపించబోతున్నాయని తెలిస్తే ఆ జంట అంత ఆనందంగా ఉండగలదా?
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
శ్రీకృష్ణదేవరాయలు ఆలోచనామగ్నుడై మందిరంలో పచార్లు చేస్తున్నారు. వార్తాహరుడొచ్చాడు. తిమ్మరుసు మహామంత్రి రాక గురించిన సమాచారాన్ని నివేదించి నిష్క్రమించాడు. విజయనగర సామ్రాజ్యమే తిమ్మరుసు తయారుచేసిన చిత్రపటం. ఆయనకి ఎక్కడికెళ్ళాలన్నా ఆంక్షలుండవు. ముఖ్యంగా రాయలను కలవాలంటే కూడా కబురు పంపటం అనుమతి పొందటం అవసరం లేదు. అయినా రాచమర్యాదలు తప్పని సంస్కారి ఆయన. తిమ్మరుసు ప్రవేశించగానే కృష్ణదేవరాయలు ఎదురేగి ఆహ్వానించారు.
‘‘రండి అప్పాజీ! మీ కోసమే ఎదురుచూస్తున్నాను.’’
ఇరువురూ ఆసీనులైనారు. అప్పాజీవారు ఎప్పటిలాగే గంభీర ముద్రతో
ఉన్నారు.
‘‘అప్పాజీ! మన సామ్రాజ్యవిస్తరణకు దక్షిణ జైత్రయాత్ర దిగ్విజయంగా సాగింది. ఇక ఉత్తర విజయయాత్ర గురించి ఏమాలోచించారు’’
‘‘రాయా! కృష్ణకు ఉత్తరాన మనకున్న బలమైన శత్రువు గజపతి. గతంలో విజయనగర సామ్రాజ్య ఆధీనంలో ఉదయగిరి కొండవీడులను జయించి తన ఆధీనం చేసుకొన్నాడు. అవి తిరిగి విజయనగర సామ్రాజ్యంలో చేరాలి’’ యుద్ధానికి తిమ్మరుసు అనుమతి లభించినట్లే!
వెంటనే సేనానాయకులకు సమాచారం అందింది. శత్రు దుర్భేద్యమైన
ఉదయగిరికోట ముట్టడి ప్రారంభమైంది. నెలల తరబడి జరిగిన ముట్టడివల్ల
ఉదయగిరి రాయలవశమైంది. ఉదయగిరికి రాయసం కొండమరుసును పాలకుడిగా నియమించి రాయలు తిరుమల శ్రీనివాసుని దర్శనానికి పయనమయ్యారు. తిరుమల వేంకటేశునికి అనేక కానుకలు సమర్పించి మళ్ళీ కొంతకాలానికి కొండవీడుపై దండెత్తారు. దారిలో అద్దంకి, వినుకొండ, బెల్లంకొండ, నాగార్జునకొండ వంటి ఉపదుర్గాలను జయించి కొండవీడును ముట్టడిరచి గజపతి కుమారుడు వీరభద్రగజపతిని ఇతర సామంతులతో బందీలుగా పట్టుకున్నారు. ధరణికోటలోని అమరేశ్వరుడ్ని, శ్రీశైల మల్లన్ననూ దర్శించి భక్తిమీర అర్చించారు రాయలు.
అనంతరం కొండపల్లి, అనంతగిరి, నల్గొండ, కంభంమెట్టు, కనిగిరి కోటలు ఆక్రమించి సింహాచలం చేరారు. విజయస్తంభం నాటారు. కృష్ణరాయని విజయయాత్ర శ్రీకూర్మం, పూరి, కటకందాకా సాగింది. కృష్ణరాయ గజపతుల మధ్య ఎడతెగని యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. తిమ్మరుసు భేదోపాయం, రాయల అసాధారణ ప్రజ్ఞాపాటవాలు విజయనగర విజయానికి దోహదపడ్డాయి. రాయల కీర్తిపతాక నీలిగగనంలో రెపరెపలాడిరది.
నిర్వీర్వుడయిన గజపతి రాయలతో సంధిచేసుకుని అయిష్టంగా అయినా తప్పని పరిస్థితులలో తన కుమార్తె అయిన ఆన్నపూర్ణాదేవిని రాయలకిచ్చి వివాహం చేశాడు.
తనను దాసీపుత్రుడని అవమానించిన గజపతిచే కాళ్ళు కడిగించుకుని కన్యాదానం పొంది సంతృఫ్తుడైన కృష్ణరాయలు కృష్ణకు ఉత్తరాన ఉన్న భూములన్నీ గజపతి ఆధీనం చేసి తన సహృదయతను ప్రకటించారు. అన్నపూర్ణాదేవిని బెదిరించి వారి తొలిరేయి రాయలను హత్య చేయించాలను కున్న గజపతుల కుట్ర ఫలించలేదు. రాయలు అన్నపూర్ణాదేవిని క్షమించి జంటగా విజయనగరానికి చేరారు.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
చల్లని వెన్నెల రాత్రి చంద్రికల వెలుగులో మెరిసిపోతున్న మంజరిని తదేకంగా కొన్ని నిమిషాలు చూశాడు చంద్రప్ప. ప్రేమగా ఆమెను కౌగలించాడు. నిర్మాణం దాదాపు పూర్తవుతున్న విఠల మండపంలోకి తీసుకెళ్ళాడు.
మానవుడికి విశ్వకర్మకు జరిగిన పోటీయా అన్నట్లుండే విజయ విఠల దేవాలయం విఠలస్వామి విష్ణువుకు అంకితంగా నిర్మితమవుతోంది. కృష్ణరాయ ప్రభువు ప్రారంభించిన ఈ కట్టడం పూర్తికావటానికి ఎన్నాళ్ళు పడుతుందో మరి! గర్భగుడిలో మూలవిరాట్‌, ఉత్సవ విగ్రహాలుండాలి. విఠలస్వామిమందిరం మూడువైపులా ద్వారాలతో పెద్దరాతి గోడలమీద నిర్మాణమవుతోంది. బలమైన శిలావేదికను సైనికులు నర్తకీమణులు మోస్తున్నట్లు తీరుస్తున్నారు. మూలలు నిర్మితమౌతున్న నృత్యమందిరాలు, కల్యాణ మండపాలు పూర్తిగా తయారయ్యాక ఎంత సుందరంగా ఉంటాయో!
ఒక్కొక్క శిల్పాన్ని చూస్తూ నడుస్తున్నారు. ఏమి అందమా కళాకృతులది! నాట్యభంగిమలు నాట్యశాస్త్రాన్ని లిఖిస్తున్నాయి. ప్రతిభంగిమ మన్మోహనంగా నృత్యానికి ప్రేరణ ఇస్తోంది. మంజరి పాదాలు లయగా మండపమంతా తిరుగాడుతున్నాయి. చంద్రప్ప మురళీ మాధురులు పున్నమి పరిమళంతో కలసి అల్లనల్లన గాలి తరంగాలుగా వ్యాపిస్తున్నాయి. విఠలస్వామి దేవాలయంలోని శిల్పవిన్యాసం చూస్తుంటే మంజరి మనస్సు ఆనందార్ణవంలో ఉరకలు వేస్తున్నది. అక్కడక్కడ స్తంభాలకు పాక్షికంగా అమర్చిన సంగీతశిలలను స్పృశించాడు చంద్రప్ప.
సరి… గమ… ప… ద… ని…
సప్తస్వరాలు పలుకుతున్న కొన్ని సంగీత స్తంభాలు స్వర సంచారం చేస్తున్నాయి. మీటగల కళాకారునికి, సంగీతజ్ఞునికి ఎదురుగా నిలిచి హృదయాన్ని ఆవిష్కరిస్తున్నాయి. కొన్ని శిలా స్తంభాలు మృదంగ ధ్వానాన్ని, కొన్ని వీణాస్వనాన్ని, కొన్ని సారంగిని… ఓప్‌ా… సకల సంగీత ప్రపంచమంతా విఠలస్వామి మందిరంలో కొలువుదీరింది. చేతిలోని వెదురు వేణువును పక్కనబెట్టి శిలావాయిద్యాలతోనే రకరకాల మేళకర్తలు రంగరించి వాద్యాలాపన చేశాడు చంద్రప్ప. శిల్పరాగాలకు పులకించిన మంజరి మరింత తన్మయ సమ్మోహనంగా విఠలమండపంలో నృత్యం చేస్తున్నది.
ఆమె అందెల రవళికి ప్రతిస్పందించిన శిలావాయిద్యాలు చంద్రప్ప అంగుళీస్పర్శతో ప్రాణం పోసుకుని మరింత చైతన్యాన్ని ప్రసారంచేశాయి. ఆ రాత్రి నాదమాధురీ మహిమ ఎంతసేపు పరిసరాలను రసప్లావితం చేశాయో వాళ్ళకే తెలీదు. ఒకరి కౌగిట ఒకరు పరవశించి ఆదమరిచిపోయిన ఆ జంట హృదయాలు తొలికిరణ స్పర్శకు జాగ్రదావస్థకు వచ్చాయి.
విఠలమండపం మెట్లుదిగి తూర్పువైపున తేజరిల్లుతున్న ఏకశిలారథం ఎదుట నిలిచారు.
ఒకే శిలలోంచి శిల్పీకరించినట్లుండే ఈ ఏకశిలారథం పెద్ద రాతివేదికపై చెక్కబడిరది. నాలుగు రాతిచక్రాలు వృత్తాకారంలో రాతిఇరుసులతో పూడ్చబడ్డాయి. ఇవి కదులుతాయని కూడా ప్రతీతి. గుండ్రని రాతిచక్రాలపై ఇరుసు కేంద్రంగా వలయాకారంలో చెక్కడపు రేఖలు తీర్చబడ్డాయి. ఆ రేఖల వలయాల్లో లతలు, కళాకృతులు చూసినవాళ్ళకి కనుల పండుగే! దాదాపు ఎనిమిది అడుగుల ఎత్తైన పీఠంపైన రథం రకరకాల శిల్ప స్తంభాలతో కన్పిస్తున్నది. రథానికి నాల్గువైపులా పీఠాన్ని మోస్తున్నట్లు సింహవాహికలు బలాఢ్యులున్నారు. రథశిఖరంపై రాతితో రథం. ఆపైన గోపురం…. ఇదంతా ఒకే శిలలోంచి మలిచారంటే నమ్మలేనట్లు అన్పిస్తుంది.
రాతిరథాన్ని చూస్తుంటే మంజరికి నోటమాటే రాలేదు.
‘‘మనిషి ఎంత గొప్పవాడు! శక్తిమంతుడు! అలవిగాని గండశిలలను సైతం చిన్నఉలితో లోబరుచుకుని ఇంతటి శాశ్వతత్వాన్ని ప్రసాదించిన ఆ శిల్పుల పేర్లు కూడా తర్వాతి తరాలకు తెలియకపోవచ్చు. అటువంటి ప్రజ్ఞావంతులైన శిల్పకారులను పోషించి తన కీర్తితోబాటు వారి ప్రావీణ్యతకు శాశ్వతత్వాన్ని కల్పించిన కృష్ణరాయప్రభువెంతటి ధన్యుడు! రాజులు, రాజ్యాలు శాశ్వతం కాకపోవచ్చు. కానీ చెదరని ఈ శిల్పనగరం ఎప్పటికీ ప్రభువును చిరంజీవిని చేస్తుంది’’ తనలో తాను అనుకున్నట్లుగా మంజరి మాట్లాడుతుంటే చంద్రప్ప సంతోషభరితుడయ్యాడు.
‘‘మంజూ! నీవింతటి భావుకురాలవని తెల్సు. ఈ స్థలం, ఈ శిల్ప సౌందర్యం నీ రసపిపాసను మరింతగా ఇనుమడిరపచేస్తుందని తెలిసే శిల్పాచార్యుల అనుమతితో నిన్నీనాడు ఇక్కడికి తీసుకువచ్చాను. నా ఆలోచన ఫలించింది. ఈ సంగీత మండపంలో నిత్య నృత్య గాన వినోదాలు జరగాలనే సత్సంకల్పంతోనే ప్రభువీ సరస్వతీ నిలయాన్ని రూపొందింపజేశారు’’ చంద్రప్ప మాటలు శ్రద్ధగా విన్నదామె.
సంగీత మండపంలో బోర్లాపడుకుని అరచేతుల్లో పద్మంలాంటి వదనాన్ని
ఉంచి ప్రేమంతా కుప్పబోసి చంద్రప్పవైపే చుస్తూ పారవశ్యంతో వింటున్న మంజరిని రహస్యంగా వెంటాడుతున్నాయి అవే జత కళ్ళు. ఆ కళ్ళల్లో చంద్రప్ప పట్ల అసూయ, కసి కన్పిస్తున్నాయి.
‘‘మంజూ! నడిరాత్రి దాటింది. ఇక పోదాం. రేపు మరికొన్ని చూద్దాం.’’
చంద్రప్ప మంజరి చేయిపట్టుకొని మెట్లు దిగుతున్నాడు.
‘‘చంద్రా! నీకో మాట చెప్పాలి. మా అమ్మ ఎవరితోనో రహస్యంగా చర్చలు చేస్తున్నది.నేను వెళ్ళగానే ఆపేస్తున్నది. నాకేదో అనుమానంగా ఉంది. మొదట్నుంచీ మన స్నేహం అమ్మకి ఇష్టంలేదు. ఈ మధ్య సేనానాయకుడు గండమనాయకుని కుమారుడు మా యింటికి వచ్చి అమ్మను కలిసి ఏవో మంతనాలు చేస్తున్నట్లు తెలిసింది. ఆ కంటకుని చూపులు, చేష్టలు నాకంతగా రుచించటం లేదు’’ దిగులుగా అంది. చంద్రప్ప మౌనంగా విన్నాడు.
వాళ్ళిద్దరూ విఠలస్వామి దేవాలయ ప్రాంగణం దాటి మెట్లు దిగుతున్నారు. వెన్నెల విరగకాస్తున్నది. ప్రేమైక జీవుల హృదయాల పట్ల వెన్నెలకీ ఆసక్తి ఎక్కువేమో అన్నంత ప్రకాశవంతమైన రాత్రి అది.
‘‘మంజూ! ఇంటిదాకా వస్తాను పద’’ ఆమె చేతిని వదల్లేదు చంద్రప్ప.
‘‘అహ… వద్దు. అమ్మకి తెలిస్తే! ఇంత పొద్దుపోయి రావటానికి కారణాలు చెప్పాలి. ఇంక నీతో చూస్తే?’’
‘‘మరేం చెప్తావు’’
‘‘మా నేస్తం మలయద్వతి ఇంట నృత్యారాధన చేసి వస్తున్నానని’’
‘‘ఎంతటి జాణవు! నీ ఆరాధన నృత్యానికా! నాకా!’’ కొంటెగా నవ్వాడు చంద్రప్ప.
‘‘చంద్రా! నిజం చెప్పనా! నీవు గాయకుడివి. నీ స్వరాలు నా అందెలు చేస్తున్న స్నేహం మనది.’’ అతని చేతిని మృదువుగా నొక్కి ముందుకు కదిలింది. ఆమె కనుమరుగయేంతవరకు చూసి చంద్రప్ప వడివడిగా కదిలాడు.
చంద్రప్ప అటు నాలుగడుగులు వేశాడో లేదో ఇటు తన గృహాన్ని సమీపిస్తున్న మంజరిని వెనుకనించి ఎవరో నోరు మూసేసి రెండు చేతులు వెనక్కి బిగించి పట్టుకున్నారు. ఈ హఠాత్పరిణామానికి ఆమె దిగ్భ్రాంతి చెందింది. కీచుగా అరవబోయింది. కానీ గొంతు భయంతో పెగలలేదు.
ఆమెను పట్టుకున్న వ్యక్తి కొంత నీడలో ఉండటం వల్ల ముసుగేసుకోవటం వల్ల అతనెవరో తెలీటం లేదు.
‘‘ఆ చంద్రప్పను మర్చిపో! లేదంటే’’ బొంగురు గొంతుతో హుంకరించాడు ముసుగుమనిషి.
ఇంతలో మరోవ్యక్తి చెంగున దూకి ముసుగుమనిషిని గట్టిగా మెడమీద కొట్టాడు. ఊహించని దెబ్బకు ముసుగుమనిషి మంజరి నొదిలేశాడు. ఆమె అతనికేసి తీక్షణంగా చూస్తున్నది. ఎవరో తెలీటం లేదు. కొత్తవ్యక్తి వదలకుండా కొడ్తున్న దెబ్బలకు ముసుగుమనిషి తట్టుకోలేకపోయాడు. దూరంగా పరుగులు పెట్టాడు. కొంతసేపట్లో కొత్తవ్యక్తిని తిమ్మరుసు మహామాత్యుని కుమారుడు గోవిందరాయలుగా గుర్తించిన మంజరి అతనికి వినమ్రంగా నమస్కరించింది.
‘‘మంజరీ! ఇంత రాత్రివేళ ఇలా రావటం మంచిదేనా! త్వరగా వెళ్ళిపో!’’ అంటూ గోవిందరాయలు చకచకా కదిలి నీడల్లో కలిసిపోయాడు.
అతని సంస్కారానికి మనసులోనే అంజలి ఘటించిందామె.
శ్రీకృష్ణదేవరాయల రాజ్యం తిమ్మరుసు శక్తిమీదే ఆధారపడిరదనుకున్నా, తిమ్మరుసు కుటుంబీకులంతా రాజు గౌరవాన్ని కాపాడేవారేననిపించింది.
ఆమె నివాసం మొన్నటిదాకా చిన్నాజీ భవనంలోనే! అప్పుడప్పుడు వచ్చే మంజరి కోసం కృష్ణసాని ఎదురుచూడటం జరిగేది కాదు. అందులోనూ మంజరిని రాజభవనానికి చేర్చాక కృష్ణసాని మరింత హాయిగా నిద్రపోతున్నది.
తల్లిగాఢనిద్ర చూసి నిట్టూర్చి తన కక్ష్యలోకి ప్రవేశించిన మంజరి అక్కడి వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉండటం చూసి నిర్ఘాంతపోయింది. ఎవరో తన గదిలో దేనికోసమో వెదికారన్న వాస్తవం అర్థం అయింది. తన గదిలోని భద్రపేటికలో తనపైన అతినమ్మకంగా చంద్రప్ప దాచిన రహస్యపత్రాలు మాయమయ్యాయని గుర్తించిన మంజరి వణికిపోయింది. రాజాగ్రహానికి గురికావలసివస్తుందనే భయంతో ఆ రాత్రంతా జాగారమే చేసింది.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
శ్రీకృష్ణదేవరాయలు అప్పాజీతో సమావేశ మందిరంలో దీర్ఘచర్చల్లో మునిగి
ఉన్నారు.
‘‘అప్పాజీ! మీరు చెప్పిన విషయాలకు మా మనసు కల్లోలపడుతున్నది. మనమేం చేయలేమా?’’
‘‘రాయా! రాజ్యక్షేమం రాజు వ్యక్తిగత అంశాలకన్నా ముఖ్యమైంది. అన్నపూర్ణాదేవిగారు సకల సద్గుణశీల. గజపతుల ఇంటి ఆడబడుచుగా తగిన మర్యాదలు కోరటం సహజం.’’
‘‘మనమూ ఏ విషయంలోనూ తీసిపోనివారమే!’’ రాయలు పౌరుషంగా అన్నాడు.
‘‘నిజమే రాయా! కానీ చెప్పుడు మాటలు ఎంతటివారలకైనా చేటు చేస్తాయి. మీరు అన్యథా భావించకపోతే ఆ వీరేంద్రుని… అదే… అన్నపూర్ణాదేవి వెంట ఈ రాజ్యానికి వచ్చిన ఆమె బంధువు. అతనిని ఓ కంట కనిపెట్టడం మంచిది’’ సాలోచనగా అన్నాడు తిమ్మరుసు మంత్రి.
‘‘నిజమే! గజపతులకు మనమీద ప్రేమాభిమానాలుంటాయని ఎప్పటికీ అనుకోలేము. మన సైన్యాధికారులందరినీ అప్రమత్తుల్ని చేయండి అప్పాజీ. చిన్నపామైనా పెద్ద కర్రను ఉపయోగించాల్సిందే.’’
‘‘మంచిది రాయా! నేనిక వెళ్ళివస్తాను.’’
తిమ్మరుసు వెళ్ళిపోయాక కృష్ణరాయలు చాలాసేపు ఆలోచిస్తూ ఉండిపోయాడు.
ష్ట్ర ష్ట్ర ష్ట్ర
మంజరి కంగారుగా హజరారామ దేవాలయ ప్రాంగణంలో కదంబం చెట్టు నీడలో ఎదురుచూస్తున్నది చంద్రప్ప కోసం! అతను ఎంతకీ రాలేదు. మనసును సమాధానపరుచుకొని ఆలయానికి ప్రదక్షణం చేస్తున్నది.
హజరారామ దేవాలయం పేరుకు తగ్గట్టు రామాయణ కాలంనాటి కిష్కింధాపురిలో నిర్మించబడినందున ప్రాకారాల గోడమీద లోపలివైపు రామాయణ గాధంతా శిల్పచరిత్రగా లిఖించబడి ఉంది. వెలుపలి వైపు ఐదారు వరుసలుగా వీరసైనికులు, అశ్వాలు, ఏనుగులు, విజయనగర సైన్యశక్తిని చెబుతున్నట్లున్నాయి. ప్రధాన దైవమైన విష్ణువు, బుద్ధునిగా కన్పించడం ప్రత్యేక ఆకర్షణ. ఇది రాజవంశీకులు దర్శించే ఆలయం కావటాన ఎక్కువగా జనం లేరు.
ఎన్నోసార్లు చూసిన దేవాలయమైనా ఆనాడు మంజరి ప్రత్యేకంగా ప్రతిశిల్పాన్ని శ్రద్ధగా చూస్తూ పరిశీలిస్తూ ముందుకు నడిచింది. ఎంతటి నిష్ణాతులైన శిల్పులైతేనే ఇది చెక్కగలుగుతారు! చంద్రప్ప ఎంతకీ రాడేం? జరిగింది చెప్పాలని తనెంత ఆతురతతో ఉంది.
దేవాలయ శిల్పాలమీద మనసు నిలవడం లేదు. ఇంతలో దూరంగా చంద్రప్ప కనిపించాడు. ఆ నడకలో మునుపటి చురుకుదనం లేదు.
‘‘చంద్రా!’’ ఎదురెళ్ళి కౌగిలించుకుంది. అతనామెకు దగ్గరకు తీసుకొని దేవాలయం ప్రాంగణంలో అరుగుమీద కూర్చుండబెట్టాడు.
‘‘ఎలా జరిగింది? ఎవరి పని?’’ అడిగాడు.
‘‘తెలియటం లేదు. కంటకుని పనేమో! మొన్నరాత్రి జరిగిన సంఘటనలు రెండూ జోడిరచి చూస్తే మనమీద కాదు, విజయనగరం మీదే ఏదో కుట్ర జరుగుతున్నట్లనిపిస్తుంది.’’
‘‘రహస్యపత్రాలు దొంగిలించబడినట్లు తిమ్మరుసులవారికి తెలియాలి.’’
‘‘వారు చారచక్షువు. వారికీపాటికి తెలిసే వుంటుంది. నన్ననుమానిస్తే ఎలాగా అనే ఆలోచిస్తున్నాను.’’
‘‘నువ్వే వెళ్ళి తిమ్మరుసు మహామాత్యుల వారికి జరిగింది విన్నవించు. అమాత్యులు ప్రజ్ఞావంతులు. విచక్షణతో వ్యవహరిస్తారని నా నమ్మకం.’’
ఆమె విశ్వాసాన్ని అతను ఖండిరచలేదు.
‘‘సరే! నేను తిమ్మరుసులవారిని కలుస్తాను. అంతా విరూపాక్షుని దయ’’
విచారంగా వెళ్ళిపోతున్న చంద్రప్పనుఅలాగే చూస్తూండిపోయింది.మంజరి.
అతను తిమ్మరుసును కలవలేదనీ, వీరేంద్రుని కుట్రవల్ల దారిలోనే రాజభటులు రాజద్రోహం నేరంకింద అతన్ని బందీనిచేసి చెరసాలలో పెట్టారనీ మరో నాలుగు దినాలదాకా మంజరికి తెలిసే అవకాశమే లేదు.

వేలవేల వెలుగు అక్షింతలు వర్షిస్తున్నాయి. విజయనగరంలోని దేవాలయాల నుండి సుప్రభాత సమయాన జరిపే పూజాదికాల మంత్రోచ్ఛాటనా తరంగాలు పంపానదీ జలాలను తాకి పవిత్రమొనర్చి మరల విరూపాక్షుని చరణాలను అభిషేకిస్తున్నాయి.

బాల‌సాహిత్యం

బాల సాహిత్యం లో బుర్ర కథ -విప్లవ జ్యోతి అల్లూరి సీతా రామ రాజు ….

by Divakarla Rajeshwari August 15, 2022
written by Divakarla Rajeshwari

జానపద వినోద గాన కళా ప్రక్రియగా బుర్రకధ ఉత్తమ ప్రచారసాధనం. సంగీతం, నృత్యం, అభినయాలతో కూడిన జన ప్రియమైన ప్రదర్శన కళ బుర్ర కథ. ప్రజలకు వినోదంతో పాటు
విజ్ఞానాన్ని ప్రసాదించి, ఉత్తేజ పరచిచైతన్య వంతులను చేయగలిగిన మహత్తర మాధ్యమం బుర్రకథ.

బుర్రకథ లో ప్రధాన కథకుడు, భుజం మీది తంబురా మీటుతూ, ఎడమ చేతివ్రేళ్ళలోని అందెల్ని మ్రోగిస్తూ తంబురా శృతిలో కథా గానం చేస్తాడు. షరాయి, నిలువుటంగీ, తలపాగ ధరించి, కాళ్ళకు గజ్జెలు ధరించి, రసానుగుణంగా చిందులు తొక్కుతూ, గంతులు వేస్తూ, అభినయిస్తాడు. అతని గానాలాపనలకు సహకరిస్తూ ఇద్దరు లేక ఒక్కరు గుమ్మెటలు ధరించి, తందాన తాన వంత పాడుతూ, కథాకథనంలో తాళరీతిని అందిస్తారు.
బుర్ర కధలుగా స్వాతంత్ర్య వీరుల గాథలు ఆబాల గోపాలాన్ని ఉర్రూతలూగిస్తాయి.భారత స్వాతంత్ర్య చరిత్రలో అల్లూరి సీతారామరాజు చరిత్ర ప్రత్యేక మైన అధ్యాయం.

ఓడిపోతానని తెలిసి కూడా/ కడదాకా పోరినెత్తురోడి పడిపోవడం/ సాధారణ యోధ కథప్రజల మీది ప్రేమతో/ ప్రజల్ని గట్టెక్కించాలనిఆత్మార్పణ చెయ్యడం/ అసాధారణ వీరగాధ!…
అటువంటి అసాధారణ యోధుడు అల్లూరి సీతారామరాజు గాధను వచన కవితా కథా కావ్యంగా మలిచారు ప్రజాకవి డాక్టర్‌ అద్దేపల్లి రామ్మోహనరావుగారు. అల్లూరి సీతారామరాజు గారి వీర గాథ తెలుగులో అనేక ప్రక్రియలుగా వెలువడింది. వీరగాథా వాజ్ఞ్మయంపై లోతైన పరిశోధన చేసిన డా.తంగిరాల సుబ్బారావు గారి కోరిక మేరకు డా.మల్లెల గురవయ్య 1995లో ‘సీతారామ రాజీయము’ పేరుతో సుమారు 2000 పద్యాల్లో ఒక మహా కావ్యాన్ని రచించారు. దాన్ని అల్లూరి శతజయంతి సందర్భంగా 1997 జూలై లో ముద్రించారు.

జానపదులు అల్లుకున్న వీర గాథల్లో మిక్కిలి జనప్రియమైన కథ అల్లూరి సీతా రామ రాజు. శ్రీ సుంకర సత్యనారాయణ గారు ఈ వీరుని స్వాతంత్య్ర సమరాన్ని ఒక ఉత్తేజపూరిత మైన బుర్రకథగా రూపొందించారు. బుర్రకథా పితామహులుగా పేరు పొందిన శ్రీ నాజరు గారు ఈ వీరుని కథను ఊరూరా ప్రదర్శించి ప్రచారం చేసారు. బుర్రకథకు ప్రత్యేకమయిన దుస్తులు ధరించడం శ్రీ నాజరు గారితో ప్రారంభమయింది.

శ్రీ అల్లూరి సీతారామ రాజు ను విప్లవ జ్యోతిగా కీర్తిస్తూ శ్రీ పి. దుర్గా రావు ఎం ఒ ఎల్ గారు బుర్రకథను రాసారు. (1955 ). దుర్గా రావు గారు భారత కోకిల సరోజినీ దేవి. నవయుగ నిర్మాత శ్రీ కందుకూరి, వీర నారీమణి ఝాన్సీ లక్ష్మీ బాయి జీవితాలను గూర్చి చిన్న చిన్న బుర్ర కథలను రాసినట్టు తెలిపారు. పూర్వం వారు రావుల పెంట పాఠశాల విద్యార్థులు ప్రదర్శించడానికి రాసిన కథను విస్తృత పరచి ప్రస్తుత బుర్ర కథను బాలలందరికి ఉపయోగార్థం గా ప్రచురించారు. (1984 మే ). పుస్తక ప్రతిని బట్టి వారు చెరుకు పల్లి పోస్ట్,నక్రేకల్, నల్లగొండ జిల్లా వాస్తవ్యులని తెలుస్తుంది.
దుర్గా రావు గారు తాము ఈకథను బాలల కోసం రాసినట్లుగా ప్రకటించినా,అల్లూరి
సీతారామరాజుకథ ఆబాల గోపాలానికి అచంచలమైన దేశ రక్షణా ధ్యేయాన్ని కలిగిస్తుంది.

తమ రచనకు అల్లూరి సీతారామ రాజు చరిత్ర పరిశోధకులు, రచయిత, స్వాతంత్య్ర సమరయోధులు. శ్రీ పడాల రామారావు గారు రాసిన “ఆంధ్రశ్రీ “మొదలైన గ్రంధాలు ఆధారమని తెలిపారు. దుర్గారావుగారు బుర్రకథ ఆరంభం లో అమర వీరులందరకూ, దేశభక్తులకూ జోహారులను అర్పించారు. ప్రార్థన గా “అంబవైన నీవేనమ్మా! జగదాంబవైనా నీవేనమ్మా! అని భారతాంబను స్తుతించారు.

బుర్రకథకు జీవం వంతలు. వంతల బలం లేక పోతే బుర్రకథకు అందం లేదు. కథకుడు చరణం పాడిన తరువాత, “భళా భళానోయ్ తమ్ముడా! సై భాయి భళానోయ్ తమ్ముడా!” అంటూ ఈ బుర్ర కథలో వంత కథకునికి తోడుగా తమ్మునిగా సహకరించాడు.

వంత అడిగిన ప్రశ్నలకు సందేహాలకు జవాబు చెబుతున్నట్లుగా కథకుడు విశాఖ జిల్లా పాండ్రింగిలో 1897 జులై 4వ తేదీన అల్లూరి సీతారామరాజు పుట్టుక నుంచి 1924లో జరిగిన బలిదానం వరకూ జరిగిన ఏ సంఘటననూ విడవకుండా అన్నింటినీ పూసగుచ్చినట్లుగా వివరించాడు.
వినరా భారత వీర కుమారా !-విజయము మనదేరా! అంటూ పల్లవి తో ఆరంభం అయిన కథ, రగడలతో, కీర్తనలతో, పల్లె పదాలతో, సందర్భానికి తగిన బాణీలతో, రసావేశం చిందే పదాలతో రక్తి కట్టింది.
రచయిత తాము బాలలకోసం ఉద్దేశించి రాసారు కాబట్టి, ప్రతి గీతాన్ని పాడిన తరువాత తమ్ముడు అని సంబోధించిన వంతకు సంభాషణలో మరల కథను వివరించారు.

“పదునేడవ శతాబ్దిరా
పడవల పైనే వచ్చిరి” …ఈస్టిండియా పేరుతో వాణిజ్యానికని వచ్చిన ఆంగ్లేయులు “నెత్తిన టోపీ
పెట్టుక, మెత్తని మాటలు నత్తుచు, ఒకచే త్రాసునుబట్టుక, ఒకచే కత్తినిబట్టుక ” “భారత దేశము నాక్రమింపగా
పన్నాగమునే పన్నిరి దొరలు”. …అని కథకుడు ద్రుత తాళ గతులతో పాడుతూ,
“భారత ప్రజలే ముందుకొచ్చిరి పగతురనెదిరింపా. ..
అంటూ ఆవేశం కనబరుస్తూ” “బుసలు కొట్టెడి నాగుబాములా
కెరటాల్ చిందేసముద్రంబులా
గిర గిర తిరిగేసుడిగుండములా ..దేశ ప్రజలలో రగులుకున్న జ్వాలను ఉపమానం కావించాడు.

ఆ ప్రజా విప్లవం తిరుగుబాటును ఆంగ్లేయులు అణచి వేసారని ఆ ఆరంభ సంగ్రామ మే స్వాతంత్ర్య దీక్షకు ప్రేరణమని కథకుడు…తందాన తాన, క్రమం లో కథను సమ తులగతుల తో నడి పించాడు.
తరువాత గాంధీజీ నాయకత్వం లో స్వాతంత్రోద్యమం జరుగుతున్నా సాయుధం గా పోరాడి రక్తం చిందినప్పుడే స్వాతంత్ర్యం పొందగలమని మన్యంలో పోరాటం జరిపాడు అల్లూరి సీతారామరాజని కథా సూత్రాన్ని బిగించాడు.
విశాఖ లో సుభాష్ చంద్రబోసు ఉపన్యాసం ద్వారా దీక్షా కంకణ బద్ధుడై చదువుకు స్వస్తి చెప్పి సీతారామరాజు సంగ్రామానికి దూకాడని ఆ యువకుని లో జాగృత చైన్యానికి నాందిని తెలిపాడు.

మహాత్మా గాంధీ గారు ఆంధ్ర పర్యటనలో ఉండగా ఆయనకు అల్లూరి చిత్రపటాన్ని బహూకరించిన సందర్భం లో “నేను సాయుధ విప్లవాన్ని ఆమోదించ లేను, కాని శ్రీ రామ రాజు వంటి ధైర్య వంతుడు, త్యాగి, నిరాడంబరుడు, ఉత్తమ శీలుడునగు యువకునికి జోహారులు అర్పింపకుండ ఉండలేను “(యంగ్ ఇండియ పత్రిక 1926.) అని గాంధీ గారు సీతా రామ రాజును గురించి రాసారు.

సీతా రామరాజు ,స్వాతంత్ర్య దీక్షను వహించడానికి ముందుగా దేశమంతా పర్యటన కావించాడని, తాను నిర్వహించ వలసిన కర్తవ్యాన్ని గురించి పరి పరి విధాల ఆలోచించాడని తెలుపుతూ కథకుడు సంభాషణా లౌల్యం లో మునిగిపోయినప్పుడు, వంత అతడు ఉపన్యాస ధోరణి లోకి మళ్ళాడని చనువుగా చెప్పడం రచయిత తనకు తానే హెచ్చరించు కున్నట్లు కనిపిస్తుంది.

రౌలటు ఆక్టు, తీవ్ర నిర్బంధాలు, జలియన్ వాలాబాగు హత్యలు, డయ్యరు సేనాని దురంతాలు సీతా రామ రాజు మనస్సును కలచి వేశాయి.
మన్య ప్రాంతం లో ఆంగ్లేయుల ఘోర పైశాచిక కృత్యాలు కనబడ్డాయి. కోయ ప్రజల దీనావస్థలను కళ్ళారా తిలకించాడు.
నిర్దాక్షిణ్యం గా హింసిస్తున్న తీవ్ర శక్తులతో పోరాడాలని బహిరంగంగానూ, రహస్యం గానూ, పోరాడి చావు దెబ్బ కొట్టాలని నిశ్చయించాడు.
ఇక్కడ రచయిత రామరాజు వ్యక్తిత్వాన్ని చక్కాగా నిరూపించారు. వ్యక్తిగతంగా ఆ వీరుడు హింసావాది కాదని, తీవ్ర శక్తులను అంత చేయడమే ఆతని ధ్యేయం అనీ స్పష్టం చేసారు. ఆ ఆశయం కోసం నిప్పు రవ్వగా రాజుకొని జ్వాలగా ప్రజ్వరిల్లిన ఆతన భావ తీవ్రతను బాలలకు తగిన పదాలతో వివరించారు.
పరదేశీయులతో జరిగే పోరాటం లో సమిధగా కావాలనీ, దేశమాత చరణాలకు పూజా పుష్పం గా ఆత్మార్పణ కావించు కోవాలని ఎంచినట్లు సీతారామరాజు త్యాగ గుణాన్ని తెలిపారు.

మన్య ప్రాతం మధ్య ప్రదేశ్ ఒరిస్సాలకుమధ్య -ఇటు ఉభయ గోదావరులను ఆనుకుని కొండలతో, కోనలతో, అడవులతో నిండి ఉందని మన్య ప్రాంతాన్ని బాలలకు భౌగోళిక పటం గీసినట్లు తెలిపారు.
మన్య ప్రాంత ప్రజలు “చేతులు రెండు -చక్కన ఉంటే -చల్ల కదలనీ -చల్లని బ్రతుకు -ఎల్లారే ఎల్లల్ల పిల్లా!” అంటూ జానపద రీతులలో ప్రకృతి ఒడిలో స్వేచ్ఛగా ఉన్న జన జీవన రీతికి తంబురను మీటారు.
అల హాయిగా సాగే మన్యం లో జొరబడి క్రూరమైన దమన నీతితో ఆంగ్లేయులు
అమాయకులను హింసించారు. వాళ్ళ భూములను ముఠా దార్లకు అప్పగించారు.
ఇక్కడ రచయిత కథకు కొంత విరామాన్ని కల్పిస్తూ కథకుని ద్వారా
మన్య ప్రజలను కాపాడ దలచిన సీతారామరాజు తలిదండ్రలు, జననము. బాల్యము లను గురించి వినరా భారత వీర కుమారా! అని వినిపించారు. ‘ప్రాణాలకు తెగించి పోరాడుట, ప్రాణాలిచ్చి యితరుల్ని రక్షించుట, అతనికి పుట్టుక నుంచి కలిగినగుణాలు.. అందుకు ఉదాహరణగా బాల్యంలో గోదావరిలో కొట్టుకుపోతున్న మిత్రుణ్ణి తనకు ఈత రాక పోయినా సంకల్ప బలంతో గోదావరిలో దూకి అతన్ని ఒడ్డుకు లాగి రక్షించడాన్ని విన్నవించారు.
సీతా రామ రాజు మన్యానికి సింహ ద్వారం అయిన కృష్ణ దేవు పేట నీలకంఠేశ్వరాలయం లో సన్యాసిగా రాజకీయ జీవితాన్ని ఆరంభించడం జరిగింది. అక్కడ రాజుకు చిటెకెల భాస్కర రావు గారు ఆశ్రయం ఇచ్చారు.
ఇక మన్యం కోయలను బాష్టియన్ అనే తహసిల్దారు క్రూరంగా హింసించిన రీతి ఆనాటి దీనావస్థను ధ్వనించింది.
కోయలను కూలెద్దులుగా చేసి, వాళ్ళ శ్రమను దోచుకున్న విధానాన్ని తెలుపుతూ, “భద్రాద్రి రాముడా!బాధలికెన్నాళ్ళు! ఐలేసా!ఓ ఐలేసా అంటూ శ్రామిక గీతాలను చేర్చారు. అతని బాధలు తట్టుకోలేక కోయలు ఎదురు తిరిగారు. సీతారామరాజు వారికి అండగానిలిచాడు. సమీపాన ఉన్న గట్టు పొణకల గ్రామం మునసబు గంటు దొర,అతని తమ్ముడు మల్లుదొరలు కూడా తోడయ్యారు. వారితో బాటుగోవిందు రత్తి దంపతుల పరిచయం కలిగింది. మరికొంతమందితో కలసి సీతా రామరాజు సామ్రాజ్య వాద శక్తులను, వారి తాబేదార్లను ఎదుర్కొనడానికి ప్రణాళికను సిద్దం చేసాడు.

ముందుగా సీతా రామరాజు కోయ చెంచులలో ఐకమత్యం కలిగించడానికి కృషి చేసాడు.
తాగుడు మానమని ప్రబోధించి, మల్లు దొర వంటి వారిచే కూడా మాని పించాడు.
అంతా ఒక్కటే కులం కర్మజీవులం శ్రమజీవులం అని బోధించాడు. వారిని మట్టి నుండి మహావీరులను కావించాడు. ఇత్తడిని పుత్తడి గా మలచాడు. 24 సంవత్సరాల వయసులో (1921) లోమన్యం తిరుగు బాటు సాయుధ పోరాట లక్ష్యం స్వాతంత్ర్య సాధనగా ఏర్పరచాడు.

సీతా రామ రాజు గాము కొండ ధార కొండల నడుమ విప్లవ పొరాట యొధులకు గెరిల్లా పద్ధతులను ప్రబోధించాడు. గెరిల్లా పద్ధతులను గురించి
“ప్రక్క పోటు పొడవండి
పక్షి వోలె యెగరండి
చుక్కలు తెగి పడి నట్టులుగా
సూటిగ శత్రువు పై బడుడీ
వెనక నుండి పై బడదాము వేగమె
కను మరుగవుదాము భారతీయ వీరులు అనగా
భయము తోడ పరుగిడవలెరా” అంటూ కథకుడు పోరాట పటిమకు తగిన అభ్యాస నైపుణ్యాన్ని విశదం చేసాడు.
ఇక తుపాకులు ఫిరంగులు మారణాయుధాలు కలిగిన ఆంగ్లేయులతో రామరాజు “విల్లమ్ములతో వచ్చి చేరుకొను వేయి కనులతోడా ..
అమ్ముకు కట్టీ మిరపకాయలను
అంపును లేఖల శత్రు శిబిరముల,
ఇన్ని గంటలాకు-ఇన్ని దినములకు
వచ్చెద కాచుకొమ్మనుచు …అంటూ మిరప కాయ టపా ను గూర్చిన విశేషాన్ని తెలిపినప్పుడు
ఒక అమ్ముకు మిరపకాయను చీటీని గుచ్చి తాము దాడి చేయ బోయే ప్రదేశానికి దగ్గర చెట్టుకో తలుపుకో ప్రయోగించేవారని బాలలకు విశదం అవుతుంది
అల్లూరి సీతా రామ రాజు మెరుపు దాడి చేసిన స్టేషను లను వరుస గా తెలుపుతూ, ఆ దాడులలో పట్టుబడిన ఆయుధాల వివరాలను ఎప్పటికి అప్పుడు రికార్డు పుస్తకాలలో దాఖలా చేసినట్లు, అల్లూరి సీతా రామ రాజు పోరాట నిబద్ధతను కథకుడు వెల్లడించాడు.
అలాగే లాగరాయి పితూరియోధుడు వీరయ్య ను గురించి చెప్తూ. పితూరీలు అంటే ఉద్యమాలు, తిరుగుబాట్లు అనీ. వాటిని వైరులు అణచి వేసానీ తెలిపాడు.

ఇలా కొనసాగి పోతుంటే
ఆ వెల్లువ నాపే శక్తి లేదని బాష్టియను బ్రేకను దొరకు వినతి చేసాడు.

ఇక్కడ హాస్యాన్ని జోడించారు రచయిత. బ్రేకను హల్లో హల్లో అని ఆర్తనాదం చేస్తూ మన్యం వీరుని చిత్ర గాథలను మద్రాసు గవర్నరు వెల్లింగ్టన్ కు ఫోనులో గోడు చెప్పుకున్నాడని అల్లూరి సీతారామ రాజు పరాక్రమాన్ని అన్యాప దేశం గా నిరూపించారు.
మన్యం విప్లవాన్ని అణగ ద్రొక్క డానికి
జర్ జర్ మనుచు లారీల నిండా కాకినాడ రిజర్వు దళాలు కదిలి వచ్చాయి,
జయపురం నుండి ఏనుగులు వచ్చాయి.
తిరుగుబాటును అణచి వేయడానికి గవర్నరు ప్రపంచ యుద్ధం లో పేరు పొందిన మేజర్ జనరల్ గుడాల్ ను పంపించాడు. కాని
అతని వల్లకూడా సాధ్యం కాలేదు.
“కుయ్యో మొర్రో అని కూత పెట్టాడు….
గుడాలు వినతికి పై అధి కారులు
పంపిరి వేలాది సైనిక భటులను,
గూర్ఖాదళమును గూర్చి పంపిరీ
మలబార్ పోలీసు మందిని దెచ్చిరి మన్యం భూములకూ” …రామరాజు తో తామిక చాల లేమని స్పెషల్ ట్రయిను లో దిగిన అస్సాము, మలబారు, గూర్ఖా దళాల తో మన్యం నిండి పోయింది.

తూర్పు గోదావరి జిల్లా కలెక్టరు బ్రేకను దొరకు బదులు రూథరు ఫర్డ్ వచ్చాడు. ఈ రూథర్ ఫర్డ్ పన్నుల నిరాకరణోద్యమం సాగించిన పల్నాటి వీర హనుమంతుని చంపిన వాడు. ప్రపంచ
యుద్ధం లో ఎడారి యుద్ధ యోధుని గా పేరు పొందిన కవర్టు హైటరులు కూడా గుడాలుకు సహాయకులుగా వచ్చారు.
వారు ఇక విప్లవ జ్యోతిని మోసం తో ఆర్పివేయడమే శరణ్యం అని తలచారు,
వారి క్రూర నీతి నెరుగక భాస్కర రావు గుడాలు తో సంధి చేసుకోడానికి వెళ్ళ మని అల్లూరి సీతా రామ రాజుకు సలహాను ఇచ్చారు.

అల్లూరి సీతా రామ రాజు ఆంగ్లేయులకు దొరికి పోవడం, ఆ వీరుని మరణాలను గురించి, వేర్వేరు వివరణలున్నాయని, బుర్రకథా రచయిత తెలిపారు.
కొన్ని గ్రంథాలలో ఆశ్రయాన్నిచ్చిన చిటికెల భాస్కర రావు గారి సలహాను అనుసరించి అల్లూరి సీతా రామ రాజు ఆంగ్ల సేనాని గుడాలు దగ్గరకు వెళ్ళడం, అతడు మోసంతో అల్లూరిని బంధించి కాల్చివేసినట్లు ఉందని , శ్రీ పడాల వారు రాసిన ఆంధ్ర శ్రీ లో శ్రీ రాజు రక్త సిక్తమైన తన దేహాన్ని యేటిలో కడుగు కొని అర్ఘ్యం ఇస్తున్న సమయం లో అస్సాం సైన్యానికి తెలిసి, శ్రీ రాజును బంధించి చెట్టుకు కట్టి కాల్చారని ఉందని దుర్గా రావు గారు తెలిపారు.
దుర్గా రావు గారు తమ బుర్ర కథలో సీతా రామరాజు భాస్కర రావు గారి సలహాను విని ఒక్క క్షణం చ లించినట్లు, తరువాత చిన్న తనం లో తడ్రి పలికిన మాటలు జ్ఞప్తికి వచ్చి ఆంగ్లేయులతో పోరాడడానికే నిశ్చయించినాట్లు రాసారు. రక్త సిక్తమైన దేహాన్ని నదిలో కడుగు కొని సంధ్యార్కునికి అర్ఘ్యాన్ని ఇస్తున్న సమయం లో అస్సాం సైన్యం చుట్టు ముట్టి, సేనాని గుడాలు దగ్గరకు తీసుకుని పోగా అతడు సీతారామరాజును చెట్టుకు కట్టి కాల్చాడని రాసారు.

అల్లూరి సీతారామ రాజు అనుచరుల పేర్లు, శత్రువులైన దొరలపేర్లు, అధికారుల పేర్లు, ఇలా అందరి పేర్లూ రచయిత పొందుపరిచారు. ఒక ప్రజాయోధుడు, ఒక మహా విప్లవకారుడు
మన స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు వెలుగుబాట వేసిన త్యాగధనుని అమరగాధ ను అతి సరళం గా బుర్ర కథగా రచించిన పి. దుర్గా రావు గారు అభినంద నీయులు రాజేశ్వరి* దివాకర్ల .

విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు పుట్టిన గ్రామమైన పాలకోడేరు మండలం మోగల్లులో
జరిగే జయంతి (జూలై 4)కార్యక్రమానికి ప్రధాని మోదీ భీమవరాన్ని సందర్శించారు.

August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

రైట్ ైట్

by Konduri KashiVishveshwara Rao August 15, 2022
written by Konduri KashiVishveshwara Rao

భానుడి ప్రతాపం రోజురోజుకీ పెరుగుతూ, ఎండలు చుర్రుమంటున్నాయి. ఎక్కండి! ఎక్కండి! ఎల్లిపోదాం అని కేకలేస్తూ ప్రయాణీకులను బస్సు లోపలికి కూరుతున్నాడు క్లీనర్‌ కన్నబాబు. ఈ మాటలు నువ్వు గంటసేపటి నుండీ చెపుతున్నావు తెలుసా! అసలు ఎక్కడికెళ్ళారయ్యా మీ డ్రైవరూ కండక్టరూ? అని తమ అసహనం ప్రదర్శించారు ప్రయాణీకులు.
బస్సుపైనా, లోపలా కూడా లగేజీతో నిండిపోయింది. వాటిల్లో మూటలు, కోళ్ళ గంపలున్నాయి. ఒక కుర్రాడైతే రెండు మేకల కాళ్ళకు బంధంవేసి, తాడును గట్టిగా పట్టుకొని కూర్చున్నాడు. బస్సులో సీట్ల కోసం ఆడంగుల తగాదా మొదలైయ్యింది. మగరాయుళ్ళు మటుకూ వేరుశనక్కాయలు తింటూ పిచ్చాపాటీ మాట్లాడుతున్నారు. తిన్న వేరుశెనగ తొక్కలను బస్సు లోపలే వేస్తున్నారు.
ఎవరయ్యా! దారికడ్డంగా ఇలా చేపల బుట్టలను బస్సులో ఏసింది? మరి మీరు మేకలను, కోళ్ళను ఎక్కించలేదా? బస్సు నీ ఒక్కడిదే కాదు బాబూ మరి మన అందరిదీ! అంటూ చమత్కరించాడు చేపల చిన్నయ్య.
మీ మేకలు చూడవయ్యా, ఒంటేలు, రెండు చేసి ఎలా పాడుచేశాయో అని ఒకడంటే, నీ చేపల బుట్టల్లోంచి నీచువాసన నీళ్ళు ఎలా కారతన్నాయో చూడు! అంటూ వాగ్వాదానికి దిగారు. అయినా బస్సు మాత్రం ఇంకా స్టార్ట్‌ కాలేదు.
మొత్తానికి డ్రైవర్‌ వచ్చి డ్రైవింగ్‌ సీటులో కూర్చున్నాడు. ప్రయాణీకులందరీని ఒకసారి విమానం పైలట్‌లా చూసి, వెంటనే సిగరెట్‌ వెలిగించి, సినిమా పాటలు పెట్టాడు. ఇదుగో అందరూ టికెట్‌ సరిపడా డబ్బులు ఇచ్చి బేగా టికెట్‌ తీసుకోండి. టికెట్‌! టికెట్‌! అంటూ చిటికెలేస్తూ టికెట్లు కొడుతున్నాడు కండక్టర్‌.
ఇంతలో ఒక ప్యాసింజర్‌ బీడీ వెలిగించాడు. అసలే బస్సులో ఒకటే ఉక్కపోతగా ఉంది. దానికి తోడు ఈ సిగరెట్ల బీడీల పొగతోడైంద అని తిట్టేసరికి గబగబా మూడు దమ్ములులాగి బీడీని పడేశాడు అతను.
అప్పటికే కికిరిసిన బస్సులోకి స్కూలు పిల్లలూ, కూరగాయలవాళ్లు, చిన్నా చితకా వ్యాపారులు ఇంకా ఎక్కుతున్నారు.
అందుకే సత్తిరాజు ముందుగానే బస్సెక్కి హాయిగా పేపర్‌ చదువుకుంటున్నాడు. సత్తిరాజు ఆ చుట్టుప్రక్కల నాలుగు గ్రామాలకి ఒకే ఒక మెడికల్‌ స్పెషలిస్ట్‌, అదే ఆర్‌.యం.పి. డాక్టర్‌, వారాని ఒకసారి టౌనుకెళ్ళి ఒక సినిమా చూసి, పేషంట్లకి ఇవ్వవలసిన మందులు, ఇంజక్షన్లు కొని తెచ్చుకుంటాడు.
ఇదుగో డబ్బులు తీసుకో! టౌనుకి ఆరు టిక్కెట్లు ఇవ్వమన్నాడు ఓ ప్యాసింజర్‌. మరి ఆరుగురినీ చూపించమన్నాడు కండక్టర్‌. మేము ముగ్గురం మగ మనసులం. ఇంకా ముగ్గురు ఆడ టికెట్లు.ఇప్పుడే బాత్‌రూమ్‌కెళ్ళారని చెపుతుండగానే వాళ్ళు ముగ్గురూ పరిగెత్తుకుంటూ వచ్చి బస్సు ఎక్కేశారు.
ఈ గందరగోళంలో, డాక్టర్‌గారూ ఒకసారి పేపరు ఇస్తారా! అని డాక్టర్‌ సత్తిరాజు చేతుల్లో నుండీ విసురుగా దినపత్రికను లాగేసుకున్నాడు వెనకసీటు స్కూలు మాస్టారు.
కండక్టర్‌ రైట్‌! రైట్‌! అని చెప్పటంతో బస్సుస్టార్ట్‌ అయ్యింది. బస్సు కదిలిందిగా! ఇక ఉక్కపోత ఉండదు, హాయిగా గాలేస్తోంది లే! అంటున్నారు ప్రయాణికులు. బస్సు ఒక ఫర్లాంగు దూరం వెళ్ళేలోపే బస్సులోకి నల్లని దట్టమైన పొగ కమ్ము కొచ్చింది. పొగతోపాటు కిరసనాయిల్‌ వాసనతో ప్రయాణీకులు ఉక్కిరిబిక్కిరైపోతున్నారు. ఇంజన్‌ని రైజ్‌ చేశాడు డ్రైవర్‌. అంతే! బస్సు ఆగిపోయింది.
తుమ్ముతున్నవాళ్ళు కొందరైతే, మరికొందరు వాంతులు కూడా బస్సులోనే చేసుకున్నారు. ఇదేం బస్సురా నాయనా! టాపునిండా చిల్లులే! ఇక కింద నుండి రోడ్డు కన్పిస్తోంది. ఇంజను సౌండూలో ఒకరి మాటలు ఇంకొకరికి వినిపించటంలేదు. కళ్లు మండటంతో ప్రయాణీకులు బస్సు దిగిపోతున్నారు.
డ్రైవరూ, క్లీనరూ కలసి ఏదో రిపేరింగు చేస్తున్నారు. స్టార్ట్‌ అవుతోంది, మళ్ళీ ఆగిపోతోంది. కానీ డాక్టర్‌ సత్తిరాజు, స్కూలు మాష్టర్‌ మటుకూ బస్సులోనే కూర్చుండిపోయారు. ఒకవేళ తాము కిందకు దిగితే మళ్ళీ సీటు దొరకదేమోనని.
డాక్టర్‌గారూ! ఈ పేపర్లో రాసిన దినఫలాలు నిజంగా జరుగుతాయంటారా? అని అదోలా అడిగాడు స్కూలు మాష్టారు. చూడండి మాష్టారు అది మీ నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. ఇంతకీ దినఫలంలో మీకు ఏం రాసుందేమిటి? అని ఉత్కంఠగా అడిగాడు డాక్టర్‌ సత్తిరాజు. మీరు వస్తువులు కోల్పోతారు జాగ్రత్త! ప్రయాణాలలో అటంకాలు ఎదురౌతాయి అని రాసుంది. అయినా నా దగ్గరేముండిపోవటానికి? ఈ బ్యాగు ఒక్కటేగా? ఇది నా చేతిలోనే ఉంటుందిగా! అని చెప్పి కిందకి దిగాడు. కళ్లు మండటంతో సత్తిరాజు కూడా బస్సుదిగక తప్పలేదు.
దాదాపు రెండు గంటలు రిపేరింగు చేసినా బస్సు స్టార్ట్‌ అవలేదు. ప్రయాణీకులు కాస్తా, ఆందోళనకారులుగా మారిపోయారు. అసలు ఇలాంటి డొక్కు ప్రయివేటు బస్సుకి లైసెన్సు ఇచ్చిందెవరు? దీన్ని కాల్చిపారేయాలి అని రెచ్చిపోతున్నారు. దాన్ని మనం కాల్చక్కర్లేదు నాయనా! అదిగో పొగ ఇంకా ఎక్కువగా వస్తోందిగా! అదే కాలిపోతుందిలే! అని అంటూ డాక్టర్‌ సత్తిరాజు ఇంటికి తిరుగు ముఖం పెట్టాడు. అలాగే తిట్టుకుంటూ కండక్టర్‌ దగ్గర టికెట్‌ డబ్బులు తిరిగి తీసుకొని వెళ్ళిపోతున్నారు ప్యాసింజర్లు.
స్కూలు పిల్లలకి మాత్రం బస్సు ఇలా పాడైపోవటం ఆనందంగానే ఉంది. ఆడుతూ పాడుతూ ఇంటికెళ్ళిపోయారు. మాష్టారు స్కూలుకు ఆలస్యంగా చేరుకున్నాడు. మొఖానికి పట్టిన చెమట తుడుచుకుందామని తన చిన్న టర్కీటవల్‌ని బ్యాగ్‌లోంచి తీయబోయాడు. ‘‘అరే! ఆ టవల్‌ను బస్‌సీటుమీద వేసుకొని కూర్చున్నాను.’’ అది కాస్తా బస్సులోనే మర్చిపోయాను. అయితే పేపర్లో రాసిన దినఫలం రైట్‌! రైట్‌ అనుకున్నాడు.
‘‘కండక్టర్‌ రైట్‌! రైట్‌! అన్నా బస్సు మాత్రం అక్కడే ఉంది.’’

August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారు రచించిన
పిలుపు కవితకు నా విశ్లేషణ

by చంద్రకళ దీకొండ August 15, 2022
written by చంద్రకళ దీకొండ

యుద్ధం ఎంత భయాంకరమో,ప్రత్యక్షంగా చూసినవారి మనఃస్థితి ఎలా ఉంటుందో,దాని వలన జనజీవనం ఎంత అతలాకుతలమౌతుందో…
ప్రభావవంతంగా తన కవితలో పొందుపరిచారు మహాకవి!

యుద్ధంలో అసువులు బాసినవారు,అయినవారిని పోగొట్టుకున్నవాళ్ళు,
కాళ్ళుచేతులు కోల్పోయి జీవచ్ఛవాలైన వాళ్ళు,క్షతగాత్రులు,చివరి క్షణం వరకూ శత్రువుతో పోరాడిన వీరసైనికులు…దయనీయమైన యుద్ధానంతర దృశ్యాలను దృశ్యమానం చేసారు తన కవితలో.

ఆ దృశ్యాలే అర్జునుణ్ణి యుద్ధరంగం నుండి పారిపోయేలా చేసినవి!
ఆ దృశ్యాలే అశోకుడిని శోకతప్తుడిగా మార్చి,తథాగతుని బాటను పట్టించినవి!

ధాత్రీ జనని గుండె మీద యుద్ధపు కొరకంచుల ఎర్రని రవ్వలు అంటూ యుద్ధజ్వాలలకు ప్రతీకగా మండే కొరకంచులను ఎత్తుగడగా వాడారు. ఆ కొరకంచుల ఎర్రని రవ్వలు గాలికి ఎగిరి దూరంగా పడుతాయి.అంటే యుద్ధం ఒకచోట ప్రారంభమైనా, దాని ప్రభావం ప్రక్కదేశాల మీద,ప్రపంచమంతటా దాని ప్రభావముంటుందని ఈ పంక్తుల్లో తెలిపారు.

కోటి కోటి సైనికుల ఊడిపడిన కనుగ్రుడ్ల అద్దాలలో ప్రతిఫలించే నిజాలను
అనే పంక్తుల్లో యుద్ధం కొరకు కోట్లాది సైనికులు పడే బాధలను,కష్టాలను, స్వసుఖాన్ని విడచి,శత్రువుల చేతికి చిక్కితే చిత్రహింసల పాలై,చివరి క్షణం వరకూ పోరాడుతూ ప్రజలకై చేసే ప్రాణత్యాగాలను గుర్తించమంటున్నారు.కనీసం కన్నీరు కార్చమంటున్నారు.

దరిద్రుని నోరులేని కడుపు
తెరుచుకున్న నాలుక బూడిదలో వ్రాసుకున్న మాటలు అనే పంక్తులలో యుద్ధానికి ఎక్కువగా బలయ్యేది సామాన్య ప్రజానీకం అనే విషయాన్ని తెలుపుతూ…
ఆహారం,నీరు దొరకక తల్లడిల్లే పరిస్థితులను వర్ణిస్తూ పోల్చిన నోరులేని కడుపు అనే ప్రతీక పేదవాని కోపం పెదవికి చేటు సామెతను గుర్తుకు తెస్తుంది.ఒకవేళ తెరుచుకున్న నాలుక మాట్లాడినా…బూడిదలో వ్రాసుకున్న మాటలు అంటే ఎదురుతిరిగిన సామాన్యుడికి చావే గతి అనే సత్యాన్ని చాటిచెప్పారు.

కాలం విరిగిన బండిచక్రం అనే ప్రతీకలో యుద్ధం ఆరంభం అయ్యాక అంతమెప్పుడో తెలియని అనిశ్చితిని వివరించారు.

మొండిచేతుల మానవత్వం తెల్లబోయిన దీనదృశ్యం
అనే పంక్తులలో …ఎదురుగా వేలకొలది ప్రాణాలు గాలిలో కలుస్తున్నా, మనసున్న మానవుడు తెల్లబోయి చూడడం తప్ప,
ఏమీ చేయలేని దీనస్థితిని,
నిస్సహాయ పరిస్థితిని వెల్లడించారు.

ముగింపు పంక్తుల్లో…
ముడుచుకున్న కాగితపు గుండెలు చిరిగి పోకముందే
అనే పంక్తిలో కవులు తమ భావావేశాన్ని ప్రకటించకముందే
(ప్రజాచైతన్యంలో వారి పాత్రను తెలుపుతూ)
అణచుకున్న నల్లని మంటలు ఆకాశానికి రేగకముందే
అనే పంక్తిలో ప్రజలలో అసంతృప్తి విప్లవంగా ఎగసిపడకముందే
మీరిపుడైనా మేల్కొంటారా
చీకటి తెరలను చీలుస్తారా
అంటూ ప్రభుత్వాల కర్తవ్యాన్ని, యుద్ధవిరమణ ప్రతిపాదనను తెచ్చి, సంధి కుదిర్చి,యుద్ధ చీకటి తెరలను చీల్చాలంటూ సూచించారు.

యాభై ఏళ్ళ క్రితం జూన్ 8 వ తేదీన వియత్నాం గ్రామంలో జరిగిన యుద్ధబీభత్సాన్ని నిక్ ఉడ్ అనే ఫోటోగ్రాఫర్ తన కెమెరాలో బంధించిన దృశ్యం ప్రపంచాన్ని కుదిపేసింది.ఆ ఛాయాచిత్రంలో సైనికులు,ఓ వృద్ధురాలు,
తొమ్మిదేళ్ల బాలిక,బాలుడు బాంబు దాడిలో గాయపడి ఒంటిపై స్పృహ లేకుండా పరిగెడుతుంటారు.ఆ బాలిక మంటలకు తల్లడిల్లిపోతూ దాహం తీర్చమని కోరుతుంది. ఆ బాలికతో పాటు ఇంకొందరిని
కూడా అంబులెన్స్ లో తరలిస్తాడు నిక్ ఉడ్.
ఇటువంటి మానవతా దృష్టి
ఈ రోజుల్లో ఎంతమందికి ఉంటుంది…?!
సందేహించాల్సిన విషయమే.

యుద్ధం కన్నా శాంతి,
విద్వేషాల కన్నా,మానవత్వమే
హితమని సందేశమిస్తూ,
పిలుపు అనే శీర్షిక సార్థకమయ్యేలా ప్రభావవంతమైన మేలుకొలుపు కవితను అందించిన కవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్ గారికి
వందనములు🙏🙏🙏🙏

( కవితాలయం సాహితీ సామాజిక సేవా సంస్ధ వారు ఐదవ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలో ద్వితీయ బహుమతి(250 రూపాయలు నగదు బహుమతి) పొందిన నా సమీక్ష!

August 15, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine

Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us