మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
పుస్త‌క స‌మీక్ష‌

అనుబంధాలకు సెలవెందుకు మరి!

by Pragati June 14, 2022
written by Pragati

“ఈ దమయంతి ఏ మహారాజు కూతురో కాదు… నలుడు నడిరాత్రి నట్టడివిలో వదిలేసి పోయినా పుట్టింటికి పోవడానికి. తల్లిదండ్రులు లేని… తన కుటుంబాన్నే పోషించుకోలేని ఓ నిరుపేద అన్నకు చెల్లెలు. నీకు చెప్పుకునే కారణాలు ఎన్ని ఉన్నా… నాకు ఉన్న ఒకే ఒక్క కారణం… నా బిడ్డల్ని బతికించుకోవడం… బిడ్డల కోసం నేను బతకడమే! పరిస్థితులు, అవసరాలే అన్నీ నేర్పుతాయి. దాచుకోవడానికి నాదగ్గర ఏమీలేదు.” ఓ దమయంతి నిస్సహాయ స్థితిలో తీసుకున్న నిర్ణయాన్ని ఈ మాటలు చెబుతాయి. (మన్నించండి… మరో సారీ)
“నీ దెగ్గిర ఐదేండ్లు సదవతారు పిలకాయలు. వాల్లకు మంచీ సెడ్డా ఇవరంగా సెప్పొద్దా?” తన కొడుక్కు చదువు చెప్పిన ఓ టీచర్ను నిలదీసిన తల్లి. (అందుకో నా లేఖ)
“మరుగు, మరుపు చేస్కోపోతే బతుకు ఎట్టా సాగుతాది చిన్నోడా? సుకానికి ఉన్నా లేకపోయినా… కష్టానికి కాపుకాసే వాళ్ళే కదా అయినోళ్ళు. బాధలో ఉన్నప్పుడు పాత కతలు ఎత్తిపోదిస్తే పెద్దంతరం అయితాదా?” పిల్లలు చేసిన తప్పుల్ని పెద్ద మనసుతో క్షమించేసిన ఓ తల్లి. (ముత్యాల దారం)
“…ఇన్నేండ్లూ మొగుడు, బిడ్డలు, కుటుంబరమే ప్రపంచమని బతికినావు. ఇప్పుడు ప్రపంచాన్ని చూడు వా. నీకోసం నువ్వు బతుకు. నీకు అప్పుడు ఎంత ధైర్యం వస్తాదో చూద్దువు గాని. ఇదో కొత్తబతుకు.” ఎంతో ఆత్మీయంగా, లాలనగా, మృదువుగా, ఓదార్పుగా చెప్తున్న సుగుణ. (కొత్తబతుకు) ఇంతకూ ఆమెకు సుగుణ ఏమవుతుంది? మనిషవుతుంది!
అమ్మా నాన్న విడిపోయినప్పుడు కోర్టులో జడ్జిగారు అడిగినప్పుడు నాన్నతోనే ఉంటామని ఎందుకు చెప్పారా పిల్లలు? అలా అన్నవాళ్లు పన్నెండేళ్ళ తర్వాత తిరిగి తల్లి ఒడిలోకి ఎందుకు చేరారు? (వసంత రాగాలు)
ఆ రోజు కోర్టుకు వచ్చిన వింత కేసు విన్నప్పటి నుండీ జడ్జి గారి మనస్సు నలతపడుతోంది. ఆ కేసు వేసిన వ్యక్తి కాళ్ళు మొక్కాలి అనిపించింది. ఏమిటా వింత కేసు? తను ఎంత భంగపడి పిలిచినా వృద్ధులైన తన తల్లి, సోదరుడు తన వద్దకు రావడం లేదని, వారిని వారికంటే చిన్నవాడు, ఆర్థిక స్తోమతా ఉన్న తాను చూసుకుంటానని… వారిని తనవద్దకు వచ్చేలా చేయమని కేసుపెట్టాడు. (అమ్మను చూడాలి)
“అమ్మా! నువ్విక ఆ మూలగదిలోకి వెళ్ళక్కర్లేదు. ఒళ్ళు నొప్పులు, జ్వరంతో బాధపడక్కర్లేదు. ఇవాళ సాయంత్రమే మన ప్రయాణం. హైదరాబాద్ కే కాదు… స్వేచ్ఛ, ఆనందం నిండిన మనదైన మన ప్రపంచంలోకి.” తల్లికి ధైర్యాన్నిచ్చిన బిడ్డ మాటలు. (మూలగది)
ఈసందర్భాలను చదువుతుంటే జీవితాలను చదువుతున్నట్టుంది కదా. అవును, యం.ఆర్. అరుణకుమారి గారు ముందుమాటలో చెప్పుకున్నట్టు పాపులర్ రచయిత్రి కావాలని రాసిన కథలు కాదివి. జీవితాల్లో ఆప్యాయతా, అనురాగాలను స్పర్శిస్తూ జీవితం పట్ల ప్రేమతో రాసిన కథలు. ‘ఇంగ సెలవా మరి!’ అంటూ ఇరవై ఒక్క కథల గుచ్ఛాన్ని తెలుగు పాఠకులకు అందించారు. ‘ఇంగ సెలవా మరి’ అనే శీర్షికతో ఓ కథ ఉన్నప్పటికీ చాలా కథలకు ఈ శీర్షిక సరిపోతుంది, బహుశా అందుకే పుస్తకానికి అదే పేరు పెట్టుంటారు. ఈ కథలన్నీ మానవ సంబంధాల ఔన్నత్యాన్ని చిత్రిస్తూ రాసినవి.
పెంచిపెద్ద చేసిన తల్లిదండ్రులను పట్టించుకోని సంతానం గురించి మనం చాలా చూస్తుంటాం. కానీ తల్లిని తను చూసుకోవడానికి తన దగ్గరకు రమ్మని కోర్టులో కేసు వేసిన కొడుకు గురించి తెలుసుకోవాలంటే ‘అమ్మను చూడాలి’ కథ చదవాలి. తన తల్లిదండ్రుల ప్రేమను తన స్వార్థానికి ఉపయోగించుకుంటున్న భర్తకు బుద్ధి రావడానికి ‘మీ ఇంటికి పొండి’ అంటూ తల్లిదండ్రులను పంపించిన కూతురి కథ ‘మీ ఇంటికి పొండి’.
జీవితమంతా తనవెంట నీడలా నడిచి, అర్ధాంతరంగా సెలవు తీసుకున్న అర్ధాంగి నీలతో సంభాషణం ‘ఇంగ సెలవా మరి!’ ఆమె ఆదరించిన జనమంతా ఎవరికి వారుగా బతికేస్తుంటే మనుషుల మధ్య ఆప్యాయతలు, అనుబంధాలు ఏమైపోతున్నాయంటూ ఆవేదనతో ఒరిగిపోతాడు. భార్యాభర్తల అపురూపమైన బంధాన్ని ప్రేమకావ్యంగా చూపెడుతుందీ కథ.
ఈ పుస్తకంలో చాలా గొప్పగా చెప్పుకోవాల్సిన కథలు ‘గూట్లో రామచిలుక’, ‘రెక్కలు చాచిన పంజరం’. స్త్రీ సాధికారతకు గొప్ప ఉదాహరణలీ కథలు. ‘గూట్లో రామచిలుక’ కథలో కుటుంబాన్ని ఆదుకోవడానికి భర్త, అత్తమామల ఒత్తిడితో పసిబిడ్డను వదిలి సౌదీ వెళ్లిన జమున పదేళ్ళ తరువాత తిరిగివస్తే కనిపించిన పరిణామాలతో ఆగ్రహోదగ్రురాలవుతుంది. తన స్థానంలో మరో స్త్రీని, తన రక్తం పంచుకున్న బిడ్డ ఆ ఇంట పనిమనిషిగా ఉండటం చూసి భర్త, అత్తమామల్ని ఇంటి నుంచి వెళ్ళగొట్టడం పాఠకులకు సంతోషాన్నిస్తుంది.
‘రెక్కలు చాచిన పంజరం’ కథలో భర్త పోయిన జీవమ్మ కొడుకు ఇంటి నుంచి పల్లెకు వెళ్లిపోతానంటుంది. కారణం అడిగిన కోడలికి, కూతురుకు ఆమె చెప్పిన మాటలు కళ్ళు తెరిపించేలా ఉంటాయి. “నాలుగు గోడల మధ్య ఉండాల్సినప్పుడు ఎక్కడైతే ఏమిటి?” అంటూ ప్రశ్నిస్తుంది. వంటింటి నాలుగు గోడల పంజరం… పడకటింటి నాలుగు గోడల పంజరం… మొత్తం ఇంటి నాలుగు గోడల పంజరం…! పంజరమే ప్రపంచం అయిపొయింది స్త్రీకి. కోడలు చదువుకున్నది. ఈ విశాల ప్రపంచంలో స్వేచ్ఛా విహంగం అనుకుంది. కానీ కాదని అర్థమైంది. ఆమె కూడా పంజరంలోనే ఉంది. కాకపోతే ఆమె ఉన్న పంజరం తలుపు థెరిచిఉన్తున్ది. కుటుంబ అవసరాల రీత్యా బయటకు వెళ్ళినా, అదృశ్య కట్టుబాట్లు, ఆధిపత్య ఆంక్షలు, ఊచల్లా ఆమె చుట్టూ దడి కట్టుకునే ఉంటాయి. భర్త బతికినంత కాలం ఆయన అదుపాజ్ఞల్లో భయంతో బతికిన తాను ఇప్పుడు ఆ భయాన్ని వదిలించుకోవడానికి ఆ యింటికి వెళ్ళాలనుకోవడం చాలా గొప్పగా ఆలోచన. ఆ ఇంట్లో స్వేచ్ఛగా తిరగాలని, తనకు నచ్చినట్టు బతకాలని నిర్ణయించుకోవడం చాలా గొప్ప ముగింపు.
అమ్మాయిల ఆత్మవిశ్వాసానికి సంబంధించిన మరో కథ ‘ఏడడుగులు’. తన శరీర ఆకృతిని హేళన చేసిన పెళ్ళికొడుకును తోసిరాజిన ఆధునిక యువతి సుప్రజ కథ ఇది. భిన్నమైన శిల్పంలో రాసిన ‘మూలగది’ కథలో ‘ మగాడు సెక్స్ కోసం ఆడదాన్ని ప్రేమిస్తే, ఆడది ప్రేమ కోసం సెక్స్ ఇస్తుంది’ మాటలు నిజం ,చాలా బంధాలలో.
‘అపురూపమా అందుకో నా లేఖ’, ‘ఉయ్యాల… మొయ్యాల!’ కథలు కొడుకులు కావాలని, చివరికి వారివల్ల భంగపడిన తల్లిదండ్రుల కథలు.
తన జీవితంలో ఎదురైనా విషాదాన్ని దిగమింగుకొని, ‘ప్లీజ్ నాన్నా, నా కొడుకు భద్రం!’ కథగా రూపొందించినట్లు పుస్తకం అట్ట లోపలి భాగంలో రాసిన మాటల ద్వారా అర్థమవుతుంది. ఆమె రాసిన మాటలు, ఆ కథ పాఠకుల హృదయాలను కదిలించివేస్తుంది.
మన జీవితాల్లోని అనేక కోణాలను ఆవిష్కరించే ఈ కథలు కేవలం సందేశాన్ని మాత్రమే కాదు, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి. ఆలోచింపజేస్తాయి. మనిషితనాన్ని ప్రతి కథలోనూ పలికించిన అరుణకుమారి గారు అభినందనీయులు. సుద్దాల అశోక్ తేజ గారి మాటల్లో చెప్పాలంటే ప్రతి కథలో మానవ సంబంధాలను మానవీయ పరిమళ పూమాలగా చేయాలనే సంకల్పం కనిపిస్తుంది. కథలన్నీ చదివాక మనల్ని మనం బేరీజు వేసుకునే ప్రయత్నం చేస్తామనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఆ రకంగా అరుణకుమారి గారు రచయిత్రిగా సంపూర్ణ విజయం సాధించినట్లు.

  • ప్రగతి
June 14, 2022 1 comment
2 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

జానపదసాహిత్యవేత్త డాక్టర్ రావి ప్రేమలత

by Vanga yashoda June 13, 2022
written by Vanga yashoda

మానవ సంబంధాలు, వైతిక విలువలు శిథిలమవుతున్న ప్రస్తుత తరుణంలో మన మూలాలను తెలియజేసే ఎన్నో పరిశోధనలు రావల్సిన అవసరం ఉంది.  ఇలాంటి తరుణంలో  మన సాహిత్యంలోని అమూల్యమైన అంశాలను గుర్తించి పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది.  అందుకే జానపదసాహిత్యంపై పరిశోధనలు పెరగాలి.  భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించడమే జానపద విజ్ఞాన ప్రత్యేకత.   అలాంటి ప్రత్యేకత కలిగిన జానపద సాహిత్యంలో స్త్రీల స్వరాన్ని సాధికారికంగా వినిపించే బాధ్యతను కొందరు మాత్రమే తీసుకోగలరు. వారిలో ప్రముఖులు డాక్టర్ రావి ప్రేమలత గారు. ఆమె  గత నాలుగు దశాబ్దాలుగా జానపద, ప్రాచీన సంప్రదాయ, ఆధునిక సాహిత్య రంగాల్లో పరిశోధనలు చేస్తున్నారు. మూడు దశాబ్దాలు తెలుగు అధ్యాపకురాలిగా పనిచేసి, ఉత్తమ విమర్శకురాలిగా, సాహిత్య పరిశోధకురాలిగా  అనేక కొత్త విషయాలను వెలుగులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా మనం వాకిట్లో వేసే ముగ్గుల గురించి ఆమె ఒక పుస్తకమే తీసుకువచ్చారు.  ఆమెతో జరిగిన మాట ముచ్చట మయుఖ పాఠకుల కోసం.

జానపద సాహిత్య పరిశోధనలో మీరు చేస్తున్న కృషి అభినందనీయం. మీకు జానపద సాహిత్యం పై ఆసక్తి ఎలా కలిగింది.?

చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడం చాలా ఇష్టమైన వ్యాపకం.  అలా  పుస్తకాలు చదువుతున్నప్పుడు అందులో ఉండే అంశాలు మరింత క్షుణ్ణంగా తెలుసుకోవాలనే తపన కలిగేది. అందుకోసం మరిన్ని రిఫరెన్స్ పుస్తకాలు చదివేదాన్ని. అలా చదివిన అంశాలన్నింటినీ వ్యాసంగా రాయడంతో అది పరిశోధనాత్మక వ్యాసం అయ్యేది. జానపద సాహిత్యంలో విశేష కృషి చేసిన ఆచార్య నాయిని కృష్ణకుమారి గారి మార్గదర్శకత్వంలో పిహెచ్ డి చేశాను.  అప్పుడు తెలిసింది చరిత్ర చెప్పని, పుస్తకాల్లో లేని చాలా విషయాలు ప్రజలల్లో ఉన్నాయి అన్న విషయం. అలా తెలుసుకున్న వాటికి అక్షర రూపం ఇవ్వడం వల్ల  రాబోయే తరాలకు సంస్కృతి, సంప్రదాయాలు అందించడం సాధ్యమవుతుంది.  మన సంప్రదాయంలో ఒక శాస్త్రీయ విజ్ఞానం ఉంటుంది. ప్రతి ఆచారం వెనుక చరిత్ర ఉంటుంది. అది ఏంటో తెలుసుకుని చేయగలిగితే ఏ సంస్కృతియైనా, సంప్రదాయమైన, ఆచారమైన భవిష్యత్ తరాలకు అందుతుంది. అలా చెప్పలేకపోతే క్రమక్రమంగా వాటి ఉనికి అంతర్ధాన మవుతుంది. అందుకే నేను తెలుసుకున్న విషయాలను వ్యాసాలు రాశాను. అయితే జానపద సాహిత్యంలో ఎక్కువగా పరిశోధనాత్మక వ్యాసాలు రాశాను.

మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కదా మరి రచనలు ఎప్పుడు  ప్రారంభించారు?
చిన్నప్పటి నుంచి పుస్తకాలు చదవడంపై ఉన్న అభిరుచితో మాలతీచందూర్, వాసిరెడ్డి సీతాదేవి, మాదిరెడ్డి సులోచన, శ్రీశ్రీ, సినారె తదితరుల సాహిత్యం ఎక్కువగా చదివేదాన్ని., తెలుగు సాహిత్యంపై ఉన్న ఆసక్తి, పెద్దవాళ్లు చెప్పే జానపదకథలు నన్ను రచనావ్యాసంగం వైపు మళ్లించాయి.  ఎం.ఏ చదువుతున్నప్పుడు వ్యాసాలు రాయడం మొదలు పెట్టాను. అయితే ఇది ఒక రోజుతో జరిగిన ప్రక్రియ కాదు.
మొదటి సారిగా ‘స్రవంతి’లో నేను రాసిన వ్యాసం వచ్చింది. ఆ తర్వాత ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చాయి. ఆ తర్వాత చాలా పత్రికల్లో పరిశోధనాత్మక వ్యాసాలు వచ్చాయి. పాఠకుల నుంచి మంచి స్పంధన రావడంతో జానపద సాహిత్యంపై , పరిశోధనాత్మక వ్యాసాల వైపు ఆసక్తి మరింత పెరిగింది. 

మీ పరిశోధనలో భాగంగా క్షేత్రస్థాయి అంశాల కోసం గ్రామల్లో ఎక్కువగా తిరిగారు కదా? మీ దృష్టికి వచ్చిన అంశాలు?

కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఆసక్తితో మారుమూల గ్రామాలకు సైతం వెళ్లేదాన్ని. అక్కడ ఎన్నో ఆసక్తికరమైన అంశాలను తెలుసుకున్నాను.  పూర్వం మతాలు మనుగడలో లేని కాలంలో మాతృస్వామ్య  వ్యవస్థ ఉండేది. అందుకు నిదర్శనం గ్రామదేవతలు. ప్రతి ఊరికి రక్షణ గా గ్రామ దేవతలు ఉంటారు. కులాలను బట్టి, ప్రాంతాలను బట్టి గ్రామ దేవతల పేర్లు మారినా వారందరినీ గ్రామ రక్షకులు గానే ప్రజలు భావిస్తారు. అందుకే వందల ఏండ్ల చరిత్ర ఉన్న గ్రామ దేవతల కథలు మనకు జానపద సాహిత్యంలో కనిపిస్తాయి.  మహిళలు ఇంటికే కాదు  గ్రామాలు, రాజ్యాలకు కూడా రక్షకులుగా, పూజ్యులుగా వచ్చ చరిత్ర మనకు కనిపిస్తుంది.  ప్రజల మధ్య నుంచి వచ్చిన జానపదకథల్లో మన ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు మెండుగా ఉంటాయి. వాటికి తెలుసుకోవడం వల్ల మన మూలాలు గ్రహించే వీలు కలుగుతుంది.  అందుకే  జానపదకథలను పుస్తక రూపంలో తీసుకువస్తున్నాను. అనేక పల్లెల్లో తిరిగి దాదాపు రెండువందల కథలను సేకరించాను. వాటిలో కొన్నింటిని పుస్తక రూపంలో తీసుకువస్తున్నాను.

జానపద కథల్లో మూడు రకాల కథలుంటాయి. సందర్భోచిత కథలు, కాలక్షేపకథలు, నీతికథలు. ఒక్కొక్క విభాగంలో నాలుగైదు కథలను ఎంపిక చేశాను.   పిల్లలకు మంచిఅలవాట్లు, ప్రవర్తన నేర్పేలా ఎన్నో కథలు వాడుకలో ఉన్నాయి. అయితే అవి అన్నీ మౌఖిక రూపంలోనే తప్ప లిఖిత రూపంలో లేవు.. వాటిని సేకరించి పుస్తకంలో పొందుపరుస్తున్నాను. 

తెలంగాణ జానపద సాహిత్యం పై మీ అభిప్రాయం?

 తొలి తెలుగుకథ, శతకం, వాజ్మయం వంటి అనేక సాహిత్య ప్రక్రియ లకు పుట్టినిల్లు తెలంగాణ. అయితే సమాచార రాహిత్యంతో ఇన్ని రోజులు జానపద సాహిత్యం మరుగున పడింది. ఇప్పుడిప్పుడే జానపద కళా రూపాలు వెలుగులోకి వస్తున్నాయి.

జానపదసాహిత్యంలో పరిశోధనలు చేశారు. మరి ఇంటి ముందు వేసే ముగ్గులపై పరిశోధన చేయడానికి కారణం? మీరు రచించిన ‘తెలుగు స్త్రీల చిత్రలిపి’ గురించి చెప్పండి.

మన సంప్రదాయాల్లో ఒక సైన్సు ఉంటుంది. ప్రతి ఆచారం వెనుక ఆరోగ్యకరమైన అంశం ఉంటుంది. అది ఏంటో చెప్పకపోతే క్రమక్రమంగా వాటి ఉనికి అంతర్ధాన మవుతుంది. నేను ముగ్గుల గురించి పరిశోధన చేస్తున్నప్పుడు ఇదే విషయం స్పష్టమైంది. అతి ప్రాచీన కాలం నుంచి సంప్రదాయకం గా మహిళలు వేస్తున్న అనేక ముగ్గులను పరిశీలించినపుడు అనేక ఆసక్తి కరమైన విషయాలు తెలిశాయి. ముగ్గులు అనేవి భావవ్యక్తీ కరణ సాధనాలుగా, ఒక విధమైన లిపిగా గుర్తించాను. మహిళల కళానైపుణ్యానికి, కల్పనాశక్తికి చిహ్నాలు. వాకిట్లో వేసే ముగ్గులు చిత్రకళాధిదేవతకు సహజ సౌందర్య శోభిత ఆభరణాలు అన్న విషయాన్ని చెబుతూ ‘తెలుగు స్త్రీల చిత్రలిపి’గా వాటన్నింటినీ పుస్తకం రూపంలో తీసుకువచ్చాను. ఈ పుస్తకానికి రామరాజు జానపద విజ్ఞాన బహుమతి వచ్చింది.  మన రాష్ట్రంలోని మహిళల చిత్రకళా నైపుణ్యం ప్రపంచంలోని వివిధ దేశాల్లోని మహిళల చిత్రకళతో పోలి ఉంటుంది. ఈ విషయం పరిశీలిస్తే  జానపద విజ్ఞానానికి ఎల్లలు లేవు అన్నది మరింత స్పష్టంగా తెలుస్తుంది. 

ఇప్పటివరకు మీ సాహిత్యం, పరిశోధనల గురించి చెప్పారు. ఇప్పుడు మీ గురించి చెప్పండి.

 భువనగిరి దగ్గర నాగిరెడ్డి పల్లె మా సొంతూరు. నాన్న రావి రామిరెడ్డి, ఆర్ అండ్ బి లో ఇంజనీర్ గా పనిచేశారు. అమ్మ మనోరమ. ముగ్గురు అమ్మాయిలం, ఒక అబ్బాయి. ఇంటికి నేనే పెద్దదాన్ని. హైస్కూల్ వరకు భుననగిరిలో చదివాను. ఆ తర్వాత హైదరాబాద్ లోని రెడ్డి కాలేజీ లో పియుసీ, వనితా మహావిద్యాలయలో డిగ్రీ, ఉస్మానియా యూనివర్సిటీలో బిఎడ్, పిజీ(తెలుగు), తెలుగు పద సాహిత్యం పురాగాథలు’ అంశంపై పి హెచ్ డి పూర్తి చేశాను. రామచంద్ర డిగ్రీ, పీజీ కాలేజీ లో ముప్పై ఏండ్లు తెలుగు అధ్యాపకురాలిగా పనిచేశాను. డిగ్రీ చదువుతున్నప్పుడే అగ్రికల్చర్ యూనివర్సిటీలో లెక్చరర్ గా పనిచేసే జె.వి.సత్యనారాయణ రెడ్డితో పెండ్లి అయ్యింది. మాకు ఒక అమ్మాయి. డాక్టర్‌ ప్రణీత, ప్రస్తుతం అమెరికాలో ఉంటుంది. 

  అవార్డులు.. – ఉత్తమ విమర్శ గ్రంథం ‘వ్యాసలతిక కు తెలుగు విశ్వవిద్యాలయం

పురస్కారం – ఉత్తమ గ్రంథం ‘ తెలుగు స్త్రీల చిత్రలిపి’ తెలుగు విశ్వవిద్యాలయం

పురస్కారం – ఉత్తమ పరిశోధకురాలు తంగిరాల బహుమతి – ప్రముఖ రచయిత పాకాల యశోదరెడ్డి స్మారక పురస్కారం – వై. రంగనాయకమ్మ స్మారక పురస్కారం – ఉత్తమ విమర్శ గ్రంథం’అవలోకనం’ తెలుగు విశ్వవిద్యాలయం

పురస్కారం – ఉత్తమ అధ్యాపకురాలు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం – తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారం

రచనలు..

[1. తెలుగు జానపద సాహిత్యం పురాగాథలు – 1980

2. జానపద విజ్ఞాన పరిశీలనం – 1990

3. తెలుగు స్త్రీల చిత్రలిపి – 1991

4.జానపద విజ్ఞానంలో స్త్రీ – 1996

5. వ్యాస లతిక – 2002

6. Folk tales of south india – Andhra pradesh – Editor – 2005

7. ఆలోకనం – 2015

8. పాకాల యశోదరెడ్డి – 2015

June 13, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

చిలుక కథలు (కథాగుచ్ఛము)

by Arutla Sridevi June 13, 2022
written by Arutla Sridevi

గర్వమణిగిన చిలుక

అందాల అడవిలో ఓ మేడి చెట్టుపై చిలుకమ్మ గూడుకట్టుకొని అందులో హాయిగా ఉ ంటుంది. ఉన్నట్లుండి తుఫాను రావడంతో అడవి అంతా గాలి దుమ్ముతో కూడిన వర్షం కురిసింది. వర్షానికి పక్షులన్నీ వాటి వాటి గూళ్ల లోపల వెచ్చగా తల దాచుకొన్నాయి. అటువైపుగా వస్తున్న ఒక కాకి వర్షానికి బాగా తడిచిపోయి ఓ కొమ్మచాటున సేద దీరుదామని చిలుకమ్మ ఉన్న గూటివైపు వచ్చి ఒక కొమ్మచాటున కూచుంది. కాకి అంటే చిలుకకు అసహ్యం. చిలుక గూటిలో నుండి బయటకు వచ్చి “ఏయ్ కాకి వెళ్లిపో నా గూటిని ముట్టుకోకు. మేము అందమైన చిలుకలం పండ్లు మాత్రమే తినే వాళ్లం. నువ్వు ఎంగిలి కూడు, మాంసం తినేదానివి. పైగా శరీరమంతా నల్లరంగు, ఆ గొంతన్నా బాగుంటుందా అంటే అదీ లేదు. పొద్దస్తమానం కావు కావు అని పిచ్చి కేకలు నువ్విక్కడుంటే మా గూటి అందం చెడిపోతుంది. మా పరువు కూడా పోతుంది. వెంటనే వెళ్లిపో” అన్నది. అందుకు కాకి “చిలుక గారు మీరన్నదంతా వాస్తవాలే. నేను కాదని అనను. కాని భగవంతుని సృష్టిలో నేను ఒకదాన్ని నా కర్మ ఇట్ల రాసి ఉంది. కొంత వాన తగ్గగానే వెళ్లిపోతాను. బాగా చలివేస్తుంది” అని కాకి చిలుకను కాళ్లవేళ్ల పడి బ్రతిమాలుకుంది. అయినప్పటికీ చిలుకకు కాస్తయినా కనికరం లేకుండా లేదు వెళ్లిపో ఇప్పుడే వెళ్లిపో అని కసురుకుంది. చేసేదేమి లేక కాకి చిన్నబుచ్చుకుని అదే వర్షంలో తడుస్తూ తన గూటికె వెళ్లిపోయింది.

తెల్లవారింతర్వాత సూర్యుడి లేలేత కిరణాలు అడివిలో ప్రసరిస్తున్నాయి. ఆ కిరణాలకు ఆకులపై నిలబడ్డ మంచు బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. అడవంతా పండగకి కడుక్కున్న ఇల్లులా శుభ్రంగా కనబడుతుంది. చెట్ల కింద గడ్డిపువ్వులు నవ్వుతూ పలకరిస్తున్నాయి. గూటిలోని చిలుకమ్మకు ప్రకృతి అందాలు చూసిరావాలని కోరిక కలిగింది. అనుకున్నదే తడువు అది వెంటనే ఎగురుతూ ఎగురుతూ అట్లా అడవిలో వింతలు చూస్తూ పోతోంది. అది ఒక చెట్టుకొమ్మపై వాలింది. ఆ చెట్టుకు సమీపంలో ఒక స్వచ్ఛమైన నీరున్న గుంట కనబడింది.

ఎగిరి, ఎగిరీ అలిసి ఉన్న చిలుకకు ఆ నీరు తాగాలనిపించింది. అది వెంటనే ఆ నీటి గుంట దగ్గరకు వెళ్లి నీళ్లు తాగుదామని మెల్లగా ఒక కాలు ముందుకు వేసింది. అంతే అది

జర్రున జారి గుంటలో పడ్డది. నిజానికి అది స్వచ్ఛమైన నీటి గుంటకాదు. అందులో అంతా బురద నిండుకొని ఉన్నది. ఆ బురదంతా చిలుకకు అంటింది. దాని ఆకుపచ్చటి రెక్కలు కాని నల్లగా అయిపోయినాయి. ఒళ్లంతా కంపుకొడుతుంది.

జరిగిందానికి చిలుక చాలా బాధపడ్డది. ఏడ్చింది.

కానీ ఆ బురదను ఆ కంపును ఎట్లా వదిలించుకోవాలో చిలుకకు తెలియలేదు. అది అట్లా ఎగురుతూ ఎగురుతూ ఒక పాడుబడ్డ గుడిలోని గూటిలో తల దాచుకున్న పావురం గూటిలో వాలింది. ఆ సమయంలో పావురం ఆ గూటిలో లేదు. అది గింజలేరుకొనడానికి అట్లా బయటికి వెళ్లింది. పావురము గూటికి తిరిగి వచ్చేసరికి బురదతో కంపుకొడుతున్న చిలుక కనిపించింది. పావురము చిలుకతో “ఛీ ఛీ నువ్వెవరు ఈ బురదేమిటి నడు.. ముందు నా గూటినుండి బయటికి పో” అన్నది. అందుకా చిలుక దీనంగా పావురం గారూ నేను చిలుకమ్మను నన్ను గుర్తు పట్టలేదా. ఒకసారి సరిగ్గా గమనించి చూడండి” అన్నది.

“హు, చిలుకవైతే ఏమిటి? అప్పటి అందమేది నీలో అంతా బురదంటింది. ఇటువంటి దానికి ఆశ్రయమిస్తే నా పావురాల జాతి నన్ను వెలివేస్తుంది. మర్యాదగా బయటకు పో” అని పావురము చిలుక ఎంత బ్రతిమాలుకున్నా వినకుండా గూటి నుండి వెళ్లగొట్టింది.

అయ్యో! తానొకప్పుడు ఎంత అందంగా ఉండేది అందరిలో ఎంత గౌరవంగా ఎంత హుందాగా

ఉండేదాన్ని ఇప్పుడు నాకీ గతి పట్టింది. అని ఏడుస్తూ ఏడుస్తూ ఒక చెట్టుకొమ్మపై వాలింది చిలుక. ఆ కొమ్మ మీద పాలపిట్టలు కాపురముంటున్నాయి. అందులో

మొగ పాలపిట్ట తన భార్య పిట్టను ఇలా తిట్టసాగింది. “ఏమేవ్ ఏదో దరిద్రపు గొట్టు పక్షి మన పక్క కొమ్మపై వాలింది నువ్వు లోపలికిరా” అంటూ అరిచింది. అలాగే అని ఆడ పాల పిట్ట అటువైపు కొమ్మపై వాలింది. చిలుక వెంటనే పాలపిట్టల ముందు వాలి అయ్యా నేను చిలుకమ్మను అనుకోకుండా బురదలో పడి ఇట్లా తయారయ్యానే కాని ఇది నా నిజరూపం కాదు. దయచేసి నాకు ఆశ్రయమివ్వండి అని కోరింది. అమ్మో ఇంతకుముందు నీవు చిలుకవు “ఇప్పుడు నువ్వు దుర్వాసన అంటించు కున్నదానవు. నువ్విట్లాగే ఎక్కువ కాలం మా దగ్గరుంటే మా పిల్లలకూ ఏదైనా వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. దయచేసి వెళ్లిపో చిలుకమ్మా. మర్యాదగా వెళ్లకపోతే

మెడపట్టి గెంటి వేయవలసి వస్తుంది”. అని ఆడ పాలపిట్ట చిలుకతో అన్నది. చిలుక తనకెంత దుర్గతి పట్టిందిరా దేవుడా… అని ఏడుస్తూ ఏడుస్తూ ఊరపిచ్చుకలుండే చెట్టుపై వాలింది. అక్కడ కూడా చిలుకకు శృంగ భంగమే అయ్యింది. నిరాశ చెందిన చిలుక ఇక తనకేదారీ లేదని, అటు తన జాతి రామ చిలుకలు రానివ్వడం లేదు. ఇటు పర జాతి పక్షులూ రానివ్వడం లేదని బాగా బాధపడ్డది. నిరాశ చెందిన చిలుక చివరకు ఒక స్మశానంలోని వేప చెట్టుపైకి చేరింది. అక్కడ ఎవరో పిండం పెట్టిన పదార్థాలు తింటున్న కాకులు చిలుకకు కనిపించాయి. బాగా ఆకలితో ఉ న్న చిలుక ఆకలికి తట్టుకోలేకపోయింది. అది కూడా కాకులతో చేరి అవే ఎంగిలి మెతుకులు ఏరుకోసాగింది. ఇంతలో ఒక కాకి చిలుకకు అడ్డం పడి, నువ్వు ఈ ఎంగిలి మెతుకులు ఏరుకోవడానికి వీల్లేదు అన్నది. చిలుక అయ్యా ! “కాకి గారు ఇది కూడా తినక పోతే ఇక నేను చచ్చిపోవలసిందే దయచేసి ఇదన్నా తిననివ్వండి” అని దీనంగా అడిగింది. “నువ్విలా రా చిలుకా !” అని కాకి చిలుకను ఒక నీటి పంపు దగ్గరకు తీసుకెళ్లింది. స్మశానంలో శవ దహనం తర్వాత స్నానాలు చెయ్యడానికి గాను మనుషులు ఏర్పాటు చేసుకున్న నల్లాలు అక్కడున్నవి ఒక నల్లకింద చిలుకను కూర్చొమ్మన్నది. చిలుక అట్లాగే చేసింది. కాకి దాని మూతితో నల్లపై భాగాన్ని గట్టిగా వత్తి పట్టుకొన్నది. అంతే నీళ్లు చిలుకపై జలజలా రాలిపడ్డాయి. చిలుకకున్న బురదంతా కొట్టుకుపోయింది. చిలుక ఎప్పటి మాదిరి పచ్చగా శుభ్రంగా తయారయ్యింది. ఈలోపుగా కాకి ఎక్కడనుండో రకరకాల పండ్లు తెచ్చి చిలుకకు ఆహారంగా ఇచ్చింది. చిలుక కడుపు నిండా పండ్లు తిన్నది.

‘గతంలో తాను కాకి పట్ల ఎంత నీచంగా, ఎంత నిర్ధయంగా ప్రవర్తించింది. అయినా అవన్నీ మనసులో పెట్టుకోకుండా కాకి తననెంతగా ఆదరించింది. నాకు పై భాగమే అందము. బుద్ది లేనిదానను నేనే ఈ కాకి ముందు గుణశీలత ముందు నా అందమెంత? అవి మనసులో తలచుకొంది పాశ్చాత్తాపంతో చిలుక కళ్లలో నీళ్లు తిరిగాయి. చిలుక కాకితో ఇలా అంది నేను జీవితమంతా నీ దగ్గరే ఉండి నీకు సేవ చేస్తాను. ఇక నుండి నువ్వే నాకు గురువు అంది. కాకి చిలుకలో వచ్చిన మార్పుకి సంతోషించింది.

అప్పటి నుండి చిలుకమ్మ పక్షులన్నింటినీ పోగుచేసి వేదాంతం, నైతిక విలువలు, గురించి చెప్తూ దాని జీవనం కొనసాగించింది.

June 13, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఆత్రేయకు ఆత్మీయ నివాళి

by M.Umalaxmi June 13, 2022
written by M.Umalaxmi

ఇంత గొప్ప రచయిత గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది. మన మనసులను చదివి మధురకవిగా నిలిచిన మనసుకవి ఆత్రేయకు ఆత్మీయ నివాళి.

ఆచార్య ఆత్రేయగా సినీరంగ ప్రవేశం చేసిన కిళాంబి వెంకట నరసింహాచార్యులు (మే 7, 1921 – సెప్టెంబర్ 13, 1989) తెలుగులో నాటక, సినిమా పాటల, మాటల రచయిత, నిర్మాత, దర్శకులు. దాదాపు 400 సినిమాలకు మాటలు, పాటలు రాసిన కవి. అత్రేయకి నటుడు కొంగర జగ్గయ్య ఆప్తమిత్రుడు. ఆత్రేయ వ్రాసిన పాటలు, నాటకాలు, నాటికలు, కథలు మొదలగు రచనలన్నీ ఏడు సంపుటాలలో సమగ్రంగా ప్రచురించి జగ్గయ్య తన మిత్రుడికి గొప్ప నివాళి అర్పించాడు అని చెప్పవచ్చు. ఆచార్య ఆత్రేయ తెలుగు సినిమా గేయరచయితగా, సంభాషణకర్తగా పేరుపొందినా నిజానికి అతను మాతృరంగం నాటకాలే. నాటక రచయితగా అతను స్థానం సుస్థిరం. మనసుకవిగా సినిమా వారు పిలుచుకునే ఆత్రేయ నాటకాల్లో చక్కని ప్రయోగాలు చేసి నాటక రంగాన్ని మలుపుతిప్పారు.

1921 మే 7 న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని సూళ్ళూరుపేట మండలంలో గల మంగళంపాడు గ్రామంలో జన్మించాడు. తండ్రి కృష్ణమాచార్యులు. తల్లి సీతమ్మ. చిన్నప్పటినుండి నాటకంలోని పద్యాలను రాగయుక్తంగా చదివేవారు. సమాజంలో మధ్య తరగతి కుటుంబ సమస్యలను తీసుకుని మనోహరమైన నాటకాలుగా మలిచారు. వీరి ‘ప్రవర్తన’, ‘ఎన్.జి.వో’ నాటకాలు ఆంధ్ర నాటక కళా పరిషత్ అవార్డులను గెలుచుకున్నారు. విశేషంగా రాష్ట్రవ్యాప్తంగా వందల సంఖ్యలో ప్రదర్శనలు జరిగాయి. అలాగే ‘కప్పలు’ బాగా ప్రాచుర్యం పొందిన నాటకం. రాయలసీమ క్షామ పరిస్థితులను వివరించే ‘మాయ’ నాటకం, స్వాతంత్ర్యానంతరం దేశంలో చెలరేగిన హిందూ ముస్లిం హింసాకండను ‘ఈనాడు’ అనే మూడంకాల నాటకం, విశ్వశాంతిని కాంక్షించే ‘విశ్వశాంతి’ నాటకాన్ని రచించారు. విశ్వశాంతి నాటకానికి కూడా రాష్ట్ర స్థాయి బహుమతి లభించింది. ‘సామ్రాట్ అశోక, గౌతమ బుద్ధ’, ‘భయం’ నాటకాలు కూడా వ్రాసారు.

ఆత్రేయ గొప్ప వేదాంతి. ప్రతివిషయాన్ని వాస్తవిక దృష్టితో ఆలోచించి సంభాషణలను సమకూరుస్తారు. “వేదాంతం, వైరాగ్యం ఒంటపడితే చాలా ప్రమాదం. వాటి జోలికిపోకుండా ఉంటే చాలా మంచిది. అవి మనిషిలోని కార్య దీక్షను, గట్టి విశ్వాసాలను దెబ్బతీస్తాయి” అని ఆత్రేయ అంటారు. శృంగార రసం శృతి మించితే అశ్లీలం అవుతుంది. ఇటువంటి కొన్ని సన్నివేశాలకు రచయిత పచ్చిగా రాయక తప్పదు. నేను రాయను అని మడికట్టుకు కూర్చుంటే సినీ రచయితగా చిత్ర పరిశ్రమలో ఏ రచయితా నిలబడ లేడు. ఈ కారణమే ఆత్రేయను బూత్రేయ అని కూడా పేరు మూట గట్టుకునేలా చేసింది.

ఆత్రేయ తాత్విక ధోరణితో రాసిన సంభాషణలు జీవిత తత్వాన్ని గుట్టువిప్పుతాయి. జీవితాన్ని కాచి వడబోసిన నగ్నసత్యాలు. ప్రతి వ్యక్తి జీవితానికి మార్గ దర్శకాలు. “వెలుగు నీడలు” చిత్రంలో ఇటువంటి ఓ అద్భుత సంభాషణ తనదైన శైలిలో రాసి ఓ సన్నివేశానికి ఆత్రేయ జీవం పోసారు. సెంటిమెంటల్ అనే పదానికి భావగర్భితమైన, కరుణ రసముగల, శృంగార భావములుగల అర్థాలున్నాయి. సినిమా పరిభాషలో సెంటిమెంటల్ డైలాగ్స్ అంటే పరస్పర ప్రేమానురాగాలను, ఆత్మీయానుబంధాలతో, కరుణరస భరితంగా ఒకరికొకరు సంభాషించు కోవడం. సెంటిమెంటల్ డైలాగ్స్ రాయడంలో ఆత్రేయది అందెవేసిన చెయ్యి. ఆత్రేయకు లేడీస్ సెంటిమెంట్లు లేకపోయినా లేడీస్ సెంటిమెంట్ డైలాగ్స్ బాగా రాస్తారని చెప్పుకుంటారు.

రచనలు చేయడానికి చాలా సమయం తీసుకునేవాడు ఆత్రేయ. నిర్మాతలను తిప్పుకునేవాడు. రాయక నిర్మాతలనూ రాసి ప్రేక్షకులనూ ఏడిపిస్తాడని అతనుపై ఓ ఛలోక్తి. కానీ అతను ఏమనే వారంటే రాస్తూ నేనెంత ఏడుస్థానో ఎందరికి తెలుసు అనేవారు.

• తన పాటల్లో అత్యున్నత భావాలను పలికించినట్లే, ద్వంద్వార్థాలనూ, చవకబారు అర్థాలనూ ప్రతిఫలించాడు. అంచేత అతనును బూత్రేయ అనీ అన్నారు.

• ఒకసారి ఏదో చిత్రానికి పాట రాయవలసివచ్చినప్పుడు చాలా సమయం తీసుకోవడంతో నిర్మాత గొల్లుమన్నాడు. తను ఆ పాట కోసం బస చేసిన హోటల్ పేరు “చోళ” అందుకే “పల్లవి” తట్టడంలేదని చెప్పి వేరే హోటల్ కి మార్పించుకుని వెంటనే ఆ పాటను పూర్తి చేసారు. ఇంతకీ విషయమేమిటంటే చోళులకీ, పల్లవులకీ పడదు. ఇదే విషయాన్ని శ్లేషగా చెప్పారు.

• తెలుగు సినిమా పాటలను మామూలు వాడుక మాటలతోనే రాయగలిగిన ఘనాపాటీ ఆత్రేయ. ఉదాహరణకి, తేనె మనసులు సినిమాలో ఈ రెండు పాటలు “ఏవమ్మా నిన్నేనమ్మా ఏలా ఉన్నావు,” “నీ ఎదుట నేను వారెదుట నీవు, మా ఎదుట ఓ మామా ఎప్పుడుంటావు.” అలాగే ప్రేమనగర్ సినిమాలో “నేను పుట్టాను ఈలోకం మెచ్చింది,, నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది, నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది.” పాట,, “తేట తేట తెలుగులా తెల్లవారి వెలుగులా” పాట. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ చిట్టా అనంతమే అవుతుంది.

మరోచరిత్ర సినిమాకి రాసిన పాటలు ఏ తీగ పువ్వునో…ఏ కొమ్మ తేటినో… పదహారేల్లకు…నీలో నాలో బలే బలే మగాడివోయ్ …నీ అన నీ దానినోయ్…అనే పాటలు ఇప్పటికి శ్రోతలని అలరిస్తూనే ఉన్నాయి.

‘అంతులేని కథ’లో ‘కళ్ళల్లో ఉన్నదేదో కన్నులకు తెలుసు…’, ‘మరోచరిత్ర’లో ‘విధి చేయు వింతలన్నీ…’, ‘ఇది కథ కాదు’లో ‘సరిగమలు గలగలలు…’, ‘స్వాతిముత్యం’లో ‘చిన్నారి పొన్నారి కిట్టయ్య…’ తోపాటు ‘తేనే మనసులు’, ‘ప్రైవేట్ మాస్టర్’, ‘బ్రహ్మాచారి’, ‘మట్టిలో మాణిక్యం’, ‘బడి పంతులు’, ‘పాపం పసివాడు’, ‘భక్త తుకారం’, ‘బాబు’, ‘జ్యోతి’, ‘అందమైన అనుబంధం’, ‘గుప్పెడు మనసు’, ‘ఆకలి రాజ్యం’, ‘అభిలాష’, ‘కోకిలమ్మ’, ‘అభినందన’, ‘ప్రేమ’ వంటి చిత్రాల్లో 1400లకుపైగా పాటలు రాసి తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. పాటలన్ని భావోద్వేగాల సమాహారంగా ఉండటంతో ఆత్రేయను ‘మనసు కవి’గా ప్రేక్షకులు, అభిమానులు అభివర్ణించారు. ఎంతటి బరువైన భావాలనైనా అర్థవంతమైన తేలికైన పదాలతో పలికించడంతో ఆత్రేయ దిట్ట. మూడున్నర దశాబ్దాల సినీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను చవిచూశారు. పాటల్లో తన అనుభవాలను పొదిగి, గుండె బరువును దించుకునేవారని అతను సన్నిహితులు పలు సందర్భాల్లో చెప్పారు. కృష్ణ శారదలు నటించిన “ఇంద్రధనుస్సు” సినిమాలోని పాట “నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి” అనే పాట ఆత్రేయకు అత్యంత ఇష్టమైన పాటగా చెబుతారు. అతను ఒకసారి ఏదో సందర్భంలో ఈ పాట నా జీవితానికి సంబంధించిన పాట అని చెప్పారు.

ఆత్రేయ వాస్తవిక జీవితంలో భగ్నప్రేమికుడయ్యుంటాడు. అందుకనే అతను రాసిన పాటల్లో విషాద గీతాలు, ముఖ్యంగా మనసును గూర్చి రాసిన పాటల్లో అంతటి విషాదం గోచరిస్తూ ఉండేవేమో. ఇంతకీ మనసును గూర్చి ఆత్రేయ రాసినన్ని పాటలు వేరొకరు రాసి ఉండలేదు. అందుకనే ఆతడిని మనసు కవి అనేవారు. బహుశా అందుచేతనే అయ్యుంటుంది, డాక్టర్ చక్రవర్తి సినిమాలోని “మనసున మనసై బ్రతుకున బ్రతుకై” పాటని ఆత్రేయనే రాసారని అనుకునేవారు. కానీ ఈ పాటని రాసినది వాస్తవానికి శ్రీశ్రీగా వీరిద్దరికీ సంబంధించినదే ఇంకొక సంగతుంది. అదేమంటే …… సినిమాలో “కారులో షికారికెళ్ళే పాలబుగ్గల పసిడిచాన” పాటని శ్రీ.శ్రీ. రాసారేమో అనుకునేవారు. కాని ఈపాటని రాసింది మాత్రం ఆత్రేయ.

ఆత్రేయ పాటల రచయిత మాత్రమే కాకుండా, అనేక సినిమాలకు మాటల రచయితగా కూడా ఉన్నారు. ముఖ్యంగా ప్రేమనగర్ సినిమా విజయంలో ఆత్రేయ రాసిన పాటలు, మాటలు ముఖ్యభూమిక వహించిందంటే అతిశయోక్తి కాదు. అందులో, మచ్చుకు ప్రేమ్ నగర్

‘దీక్ష’ (1950) చిత్రానికి తొలిసారి అతను పాటలు రాశారు. “పోరా బాబు పో..” అంటూ సాగే పాట ప్రేక్షకులను, సినీ మేకర్స్ ని బాగా ఆకట్టుకోవడం ఆత్రేయ పాటల్లోని మాధుర్యం ఏంటో సినిమా పరిశ్రమకు తెలిసింది. అదే ఏడాదిలో విడుదలైన ‘సంసారం’ చిత్రానికి తొలిసారి కథా రచన కూడా చేశారు. దీంతో దర్శక, నిర్మాతలంతా ఆత్రేయతో పాటలు రాయించేందుకు క్యూ కట్టారు. ‘అర్థాంగి’ చిత్రంలో ‘రాక రాక వచ్చావు చందమామా..’, ‘తోడి కోడళ్ళు’ చిత్రంలో ‘కారులో షికారుకెళ్లి…’, ‘శ్రీ వెంకటేశ్వర మహాత్మ్యం’లో ‘శీశైలవాసా శ్రీ వెంకటేషా…’, ‘మంచి మనసులు’ల్లో ‘శిలలపై శిల్పాలు చెక్కినారు…’, ‘మూగ మనసులు’ చిత్రంలో ‘ముద్దబంతి పువ్వులో… ‘డాక్టర్ చక్రవర్తి’లో ‘నీవులేక వీణ …’, ‘అంతస్తులు’లో ‘తెల్ల చీర కట్టుకున్నది ఎవరి కోసము…’, ‘ప్రేమనగర్’లో ‘నేను పుట్టాను ఈ లోకం మెచ్చింది. నేను ఏడ్చాను ఈ లోకం నవ్వింది. నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది…’, ‘మరోచరిత్ర’లో ‘ఏ తీగ పువ్వునో ఏ కొమ్మ తేటినో…’, ‘ఇంద్రధనస్సు’లో

‘నేనొక ప్రేమ పిపాసిని నీవొక ఆశ్రమ వాసివి…,

June 13, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఓ మనిషీ.. కాలాతీతం కానీకు!

by కె. వీణారెడ్డి, June 13, 2022
written by కె. వీణారెడ్డి,

నింగి అంచులదాకా అంచెలంచెలుగా…

 ఆకాశపు చేలాంచలాన్నే అందుకోవాలని,

ముద్దు ముద్దుగా తన పాదముద్రలనే..

సముద్రపులోతుల్లోన ముద్రించాలని,

 తనకన్నా ముందేవున్న అవనీతలాన్నంతా..

తన కబంద హస్తాల్లో బంధించాలని,

గగనచర, భూచర, వనచర,జలచరాలన్నీ..

తన అదుపాజ్ఞల్లో చరించాలని,

సృష్టిలోని పంచభూతాలన్నీ..

తన దృష్టిని దాటి పోకూడదని,

విశ్వమందలి అణురేణువునంతా..

మేథో మంత్రంతో, ధనతంత్రంతో…

తన వశవర్తిగా చేసుకోవాలని,

తన దురాశాదురాక్రమణలనెరవేసి…

స్వార్ధపు గాలంతో సాంకేతిక వల విసిరి,

తన వలలోనే పడాలి విశ్వవలయమంతా..

అనుకొంటూ, గొప్ప కలగంటున్నాడు..

కనిపించేది మాత్రమే సత్యమని,

కనిపించనిదంతా అసత్యమని

భావించిన నరుడు.. అతి తెలివిపరుడు..

అన్నీ తెలుసనుకొంటున్న నేటి మానవుడు!

కాలక్రమేణా.. తన ఊహకందని విధివిధానా..

తను పరచిన వలయే తన చుట్టూ వలయమై,

తను వేసిన గాలమే కాలమై తనను లాగినపుడు..

లాగి లెంపకాయ వేసి బోర్లా పడేసినపుడు, 

అపుడుగానీ అర్థంకాదీ మేథావికి.. 

అనంత ప్రకృతిముందు తానెంత? 

మృత్యువు కబళించగల తన బ్రతుకెంత? 

మహా సముద్రంలో ఓ నీటి బొట్టంతైనా, 

ఇసుక రాశిలో ఓ చిన్న రేణువంతైనా, 

ప్రళయ ప్రభంజనంలో గడ్డిపోచంతైనా, 

కానివాడనని.. అస్వతంత్రుడనని… 

ఏ అజ్ఞాతశక్తి చేతిలోనో ఇమిడివున్న వాడనని.. 

అర్థమయ్యేనాటికే.. అంతా మించిపోయేనని.. 

మనిషిలోని అజ్ఞానం.. అహంకారం, 

మేథోమదం.. ఐశ్వర్యగర్వం, 

అధికార దర్పం.. అవినీతి బలం, 

కీర్తి కాంక్షలు.. పొగడ్తల వాంఛలు 

తనలోని తప్పులన్నీ తననే కాలమై కాటేశాయని, 

కాలాతీతమైపోయిందన్న కలవరంతో… 

ఆ మనిషి ఆఖరి శ్వాస ఇలా అంటున్నది… 

మంచీ మానవత, నీతి నిజాయితి, శాంతీ సహనం,

ప్రేమా త్యాగం వంటి మానవీయ గుణాలే.. 

అశాశ్వతమైన మానవ జీవితానికవే 

శాశ్వతమైన వెలుగునిచ్చే కాంతిమణులని! 

నిజమేనంటూ నిష్క్రమించింది మనిషి నిశ్వాస.

June 13, 2022 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

భూతల్లి పుట్టింది..

by Chandu Pendyala June 9, 2022
written by Chandu Pendyala

అడుగులకు ఆదరువైన అమ్మ
అందరిని పిలిచింది
మనిషి పుట్టిండు జంతు జాతి పుట్టింది
చెట్టు చేమ లు వెలసినయి
నదీ జలాలు పారినయి ఆకలి ఆరంభమైంది
వీసమంత మనిషి మనసు
గాసంకోసం తిరిగిండు
బతుకు బాట వెదికింది
పోడు ఎవుసం మొదలైంది భూములు బావురుమనని
భూసారం బుగ్గి కాని
పంటలు పండించె తెలివినబడ్డరు
గొర్రె పిల్లల మందలు
మడిమడికి తిరిగినవి
అర్ధ రాతిరి యాల్ల
కుక్కలు వాటిని కాపాడే
సైనికులయినవి
గొంగడి కొప్పెరలు
మోతుకాకు సుట్టలు
జకుముకి నిప్పులు
కంది పొరక మంటలు
నిదుర కాచినవి
జొన్న కొయ్యకాల్లు
కొర్రాల్లు అయినవి
చిమ్మని చీకట్లో
మిణుగురు పురుగులు
కందీల్లు అయినవి
ముల్లు కర్రలు
విల్లంబులైనవి
పంది కూనల కసువు
భూపసిడి అయ్యింది
కోడిపిల్లల పెంట
కొంగుబంగారమయ్యింది
దొడ్డెడు గొడ్ల పెంట
బండి పొనుక నింపుకొని పొలాలకు జాతర కట్టినవి
పెంట కుప్పలు
చెలకల అలికినవి
ఎద్దు తిరిగిన నేల
ఎగిరి దునికింది
రాగాలు తీస్తూ వంగి
పొలం నాట్లు వేసిన
రైతు కూలీలందరు రోగాలు
లేని పంట పండించినరు
భూమాత కాక తగ్గించినరు
ప్రపంచానికి చల్లదనం
అనే ధనం ఇచ్చిండ్రు
గత చరిత్రను మరచిన
ఆధునిక మానవులు
ధరణి దహించకముందే
విచిత్ర రోగాల
విలయతాండవం
విజృంభించకముందే
మత్తు నుండి మేల్కొనకపోతే
జగత్తులో ఉత్తమ జాతి
అని చెప్పుకునే మానవజాతి
తమకు తాము జప్తు కాక తప్పదు…

June 9, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

యోగ చేయటానికి నియమాలు

by Bandi Usha May 3, 2022
written by Bandi Usha

బ్రహ్మమూహూర్త సమయము అనగా ఉదయం గం. 4.00 లేదా గం. 4.30లకు లేచి, నోటిని శుభ్రం చేసుకని అర లీటర్ గోరు వెచ్చని నీరు త్రాగి ఆ తరువాత కార్యక్రమాలు పూర్తి చేసి, స్నానం చేసి ఆసనాలు చేయవలెను.

స్నానం చేసిన యెడల శరీరము తేలికగా ఉండి ఆసనములకు సహకరించును. స్నానం వీలుకానిచో యోగా పూర్తయిన తరువాత అరగంటకు చేయవలెను.

  • అనారోగ్యంగా ఉన్నప్పుడు యోగా చేయరాదు.
  •  గాలి, వెలుతురు వచ్చే ప్రదేశములో మాత్రమే యోగ చేయవలెను.
  • యోగా నేలపై కాకుండా మందపు తివాచీపై చేయవలెను.
  • బిగుతుగా ఉండే దుస్తులు ధరించరాదు. కాటన్ దుస్తులు ధరించుట మంచిది.
  • ఉదయం వీలుకాని యెడల సాయంత్రం చేసినను తిన్న తర్వాత కనీసం మూడు గంటలు గడిచాకే చేయాలి కానీ యోగాకు అనువైన సమయము ఉదయమే.
  • సాధన గురుసమక్షంలో చేయవలెను. అప్పుడే ఒక క్రమ పద్ధతిలో అభ్యాసం జరుగుతుంది. ఏ సమస్యకు ఎటువంటి ఆసనం వేయాలో, ఏది వేయకూడదో తెలుసుకోవచ్చు.
  • వత్తిడికి దూరంగా ఉండాలంటే కాఫీ, టీ, ధూమపానం మానివేయలి. శీతల పానీాలు కూడా అనారోగ్యానికి హేతువు.
  • రోజూ తేలికపాటి ఆహారం తీసుకుంటే సాధన బాగా జరుగుతుంది.

స్త్రీలు

వదులుగా ఉండే బట్టలు వేసుకోవాలి. బహిష్ఠు సమయంలో చేయరాదు.

గర్భిణీ స్త్రీలు డాక్టర్ సలహా మేరకు కొన్ని ఆసనాలు 5వ నెలవరకు చేయవచ్చు.

మయూరాసనం వేయకూడదు.

బాలింతలు నాలుగు నెలల తర్వాత డాక్టరం సలహా మేరకు చేయాలి.

పిల్లలు

పది సంవత్సరాలు వచ్చేంతవరకు అన్ని ఆసనాలు వేయరాదు. పిల్లలతో చేయించేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైనప్పుడు మధ్యలో విశ్రాంతి ఆసనం వేయించాలి.

సాధన పూర్తికాగానే పాలు, జ్యూస్ లు ఆహారపదార్థాలు పెట్టరాదు.

అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయించాలి.

పిల్లలు సాధనపై మనసు కేంద్రీకరించునట్లు చూడాలి.

ఆసనములు

తాడాసన్ – తాడ అంటే పర్వతం. ఈ ఆసనాన్ని సమస్థితిలో నిలబడి చేయాలి.

ఈ ఆసనాన్ని మొదటగా నేలపై నిల్చొని రెండు పాదాలు కలిపి ఉంచాలి.

చేతివేళ్ళను కలిపి తలపై బోర్లించాలి.

నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ చేతుల్ని లాగుతున్నట్లుగా పైకి తీసుకొని వచ్చి కాలివేళ్ళపై నిలబడాలి.

శ్వాస విడుస్తూ పూర్వపు స్థితికి రావాలి.

ఇది ప్రతిరోజూ రెండూ లేదా మూడుసార్లు చేయాలి.

2. సమస్థితిలో నిల్చొని రెండు చేతుల్ని శరీరానికి ఇరువైపులా ఉంచాలి.

శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా చేతుల్ని పైకెత్తుతూ కాలిమడమల్ని కూడా ఎత్తాలి. 

శ్వాస విడుస్తూ మరలా సమస్థితికి రావాలి

ఆసన స్థితిలో మూడు, నాలుగు శ్వాసలు తీసుకొని విడవొచ్చు.

ఇది రెండు లేదా మూడుసార్లు చేయవచ్చు.

3. పాదాలను జతచేసి సమస్థితిలో నిల్చోవాలి.

చేతులను ముందుకు సాగదీసి చేతివేళ్లను కలిపి ఉంచి అరచేతులు ముందుకు చాచునట్లు తిప్పాలి.

శ్వాస విడుస్తూ చేతివేళ్లను అలాగే కలిపి ఉంచి ఛాతీపై అరచేతులు ఉంచాలి. ఇలా నాలుగు నుండి ఐదుసార్లు చేయాలి.

4. పాదాలను జతచేసి సమస్థితిలో నిల్చోవాలి. పైన చెప్పినట్లుగానే చేతివేళ్లను కలిపి ఉంచి పూర్తిగా ముందుకు, పైకి కాకుండా మధ్యలోకి చేతులను, ఛాతీకన్నా కాస్త ఎత్తులో ఉండేలా సాగదీయాలి.

ఇది కూడా నాలుగు నుండి ఐదుసార్లు చేయాలి.

రోజూ చేసేవారు ఈ నాలుగింటిలో ఏవైనా రెండింటిని చేస్తే సరిపోతుంది.

5. చేతులను ముందుకు, వెనకకు సాగదీస్తూ చేయుట.

పాదాలను జతచేసి సమస్థితిలో నిల్చోవలెను. తరువాత చేతులను ముందుకు చాచి అరచేతులను కలిపి ఉంచవలెను.

శ్వాస తీసుకుంటూ చేతులను వెనక్కి చాచుతూ, ఛాతీని కూడా వెనుకకు వంచి తలపైకెత్తాలి.

శ్వాస విడుస్తూ చేతులను ముందుకు తీసుకొచ్చి ఛాతీ, తల కూడా నిటారుగా ఉంచాలి.

ఇది రోజులో నాలుగైదు సార్లు చేయాలి.

ఉపయోగాలు

  • నాడీ మండలం బలోపేతం అవుతుంది.
  • మడమలు, పిక్కలు ధృడంగా అవుతాయి.
  • వెన్నెముక సమస్యలకు ఉపశమనం కలుగుతుంది.
  • ఛాతీ భాగము, భుజాలు, మెడలో కలిగే ఇబ్బందులు తొలగుతాయి.
  • చేతులు సన్నగా అవుతాయి.
  • వీటితోపాటు మడమ, మోకాలు, నడుము జాయింట్స్ పట్టకుండా ఉండటానికి వ్యాయామం చేసినట్లయితే శరీరము ఆసనాలు వేయటానికి సిద్ధమవుతుంది.
  • ముందుగా మడమ కోసం.

రెండు చేతులను నడముపై ఉంచుకొని కుడి మోకాలిని కొంచెం పైకెత్తి బొటనవేలుతో సున్నా చుడుతూ మడమను తిప్పాలి.

  • క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ పదిసార్లు తిప్పాలి. అదే విధంగా ఎడమ మోకాలని ఎత్తి ఎడమ మడమను తిప్పాలి.

ప్రయోజనాలు : మడమ నొప్పులు తగ్గుతాయి.

మోకాళ్ల కొరకు

మొదట సమస్థితిలో నిల్చువాలి.

కాస్తవంగి రెండు చేతులకు మోకాళ్ళపై బరువు పడకుండా మోకాళ్ళపై ఉంచి క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ పదిసార్లు తిప్పాలి.

మోకాళ్ళ ముందుకు వస్తున్నప్పుడు కాలిమడమలు ఎత్తాలి.

వెనకి్క వస్తున్నప్పుడు మడమలు నేలకు ఆన్చాలి.

ప్రయోజనాలు : మోకాళ్ళ నొప్పులు తగ్గుతాయి.

నడుము కొరకు :

  • కాళ్ళమధ్య అడుగు దూరం ఉంచాలి.
  • రెండు చేతులను నడుముపై ఉంచి నడుమును గుండ్రంగా తిప్పాలి.
  • క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఎనిమిదిసార్లు తిప్పాలి.
  • శ్వాసతీసుకుంటూ నడుమును ముందుకు, శ్వాసవిడుసూ్త వెనుకకు తిప్పాలి.

ప్రయోజనాలు : నడుము నొప్పులు తగ్గుతాయి.

May 3, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

స్వర్ణ పతాకలు

by ఆచార్య మస‌న‌ April 23, 2022
written by ఆచార్య మస‌న‌

ఉప్పుకప్పురంబు నొక్క పోలికనుండు

చూడ చూడ రుచుల జాడవేరు

పురుషులందు పుణ్యపురుషులు వేరయా

విశ్వదాభిరామ వినురవేమ!

నేనొక డిగ్రీ కళాశాలకు, వార్షికోత్సవానికి ముఖ్య వక్తగా వెళ్ళిన సందర్భంలో ఒక డిగ్రీ విద్యార్ధిని పై పద్యాన్ని చదివి “పురుషులందే పుణ్యపురుషులుంటారా ? స్త్రీలలో ఉండరా ? సారు!” అని ప్రశ్నించింది.

పురుషులంటే మగవారని సామాన్యార్థం. కాని పురుష శబ్దానికి అర్థం తెలిస్తే విషయం ఎంత ఉదాత్తమైందో బోధపడుతుంది. ‘పురీశేతి ఇతి పురుషు’ అని నిర్వచనం. పురమునందు ప్రకాశించువాడని అర్థం. ఇక్కడ పురశబ్దానికి రెండర్థాలున్నాయి. ఒక అర్ధం బ్రహ్మాండమని, రెండవ అర్థం శరీరమని. బ్రహ్మాండంలో ప్రకాశించేవాడు దేవుడని, శరీరంలో ప్రకాశించేవాడు జీవుడని తెలుసుకోవాలి.

అప్పుడు జీవులందు పుణ్యజీవులు వేరుగా ఉంటారనే అర్థం వస్తుంది. మగవారుగాని, స్త్రీలుగాని ఎవరైనా పుణ్యాత్ములేననే విశేషార్ధం స్ఫురిస్తుంది. నేను ఇదే విషయాన్ని స్త్రీ పురుషుల మధ్య తేడాలేకుండా తెలియజేసినప్పుడు ప్రశ్నించిన అమ్మాయి, ఆమె తోటి విద్యార్థినులు విన్నారు. ఎంతో సంతోషించారు.

మహాకవి కాళిదాసు రఘువంశ కావ్యాన్ని ఆరంభిస్తూ చెప్పిన “వాగర్ధా వివసంపృత్తా” అనే శ్లోకం పార్వతీ పరమేశ్వరులను జగత్తుకు తల్లిదండ్రులుగా పేర్కొన్నది. శబ్దార్థాల వలె భార్యా భర్తలు అవినాభావ సంబంధం కలిగిన వారుగా తెలియజేసింది.

మన ప్రాచీన సంస్కృతిలో పురుషునికెంత ప్రాధాన్యమో స్త్రీకంతే ప్రాధాన్యం. యాజ్ఞ వల్కుడు ‘బృహదారణ్యకోపనిషత్తు’లో భార్యాభర్తల సంబంధాన్ని ‘అర్ధభృగలం’తో పోలుస్తాడు. గింజలోని రెండు పలుకుల లాంటివారు భార్యాభర్తలు, వంశాభివృద్ధికి దాంపత్యమే శరణ్యము కదా!

నాకు ఎక్కడా ప్రాచీన సంప్రదాయంలో స్త్రీ పురుషుని కంటే తక్కువ అన్న విషయం కనిపించలేదు.

“త్వమేవ మాతాచ పితాత్వమేవ” అని భగవంతుణ్ణి మాతృమూర్తిగా స్తుతిస్తాం. భారతీయులకు వేదం, భూమి, గోవు, గాయత్రి, తులసి, గంగానది మాతృ సమానులు. ఇంత గొప్ప సంప్రదాయం మనకుండగా మనం విదేశాల నుంచి వచ్చిన చదువుల ఆధారంగా స్త్రీ చైతన్యాన్ని పొందవలసిన అవసరం ఉందా ? అనిపిస్తుంది.

“యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతాః” స్త్రీలు గౌరవింపబడిన చోట దేవతలుంటారని మనుస్మృతి చెప్తుంది. అంతేకాదు, ఉపాధ్యాయునికంటే ఆచార్యుడు పదిరెట్లెక్కువగా, ఆచార్యుని కంటె తండ్రి వందరెట్లెక్కువగా, తండ్రికంటె తల్లి వెయ్యిరెట్లెక్కువగా గౌరవానికి అర్హురాలని కూడా మనుస్మృతి చెప్తుంది.

ప్రాచీన కాలంలో ఇన్ని విధాలుగా స్త్రీ ఔన్నత్యం తెలుపబడుతుండగా, స్త్రీని విద్యకు దూరంగా ఉంచిన కొన్ని సందర్భాలు నన్నెంతగానో బాధించాయి. విద్యావేత్త లెవ్వరూ జ్ఞానార్జన విషయంలో స్త్రీ పురుషులను వేర్వేరుగా చూడరు.

యజ్ఞయాగాదులందు భర్తకు భార్య కుడివైపున కూర్చోవడమంటే, అన్ని వ్యవహారాలలో పురుషుని స్త్రీ కుడి భుజం అనే అర్థం స్పష్టమౌతుంది.

ఉపనిషత్తుల కాలానికి వస్తే ఒక జబాల, ఒక మైత్రేయి, ఒక గార్గి స్త్రీ ఔన్నత్యానికి ఎత్తిన స్వర్ణ పతాకలు. జనకుని సభలో గార్గి యాజ్ఞ వల్యుణ్ణి బ్రహ్మవేత్తగా నిరూపించిన ఘట్టం మన సంప్రదాయంలో స్త్రీ విద్యకు గల ప్రాధాన్యాన్ని తెలుపుతుంది.

జబాల సత్యకాముణ్ణి పెంచిన విధం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. మైత్రేయి యాజ్ఞ వల్యుణ్ణి ఆత్మ గురించి అడిగిన ప్రశ్నలు స్త్రీ సాహసాన్ని, ఆధ్యాత్మిక పరిణతిని తెలుపుతున్నాయి. జీవితంలో సీత అనసూయకంటే రెండాకులు ఎక్కువ చదివినట్లు రామాయణ అరణ్యకాండ తెలియజేస్తుంది. వసిష్ఠుని ధర్మపత్ని అరుంధతి విజ్ఞాన జ్యోతి. అన్న విషయం అందరూ ఎదిగిందే.

పూర్వం ఏ కాలంలోను స్త్రీ విద్యకు దూరంగా లేదు. బహుశా ముస్లింల ఏలుబడిలో స్త్రీలు గడపదాటి బయటికి రాకపోవడం వల్ల వారికి విద్య దూరమైంది. ఇది భారతేదశ చరిత్రలోనే ఒక చీకటి అధ్యాయం. ఒక విధంగా ఆంగ్లేయులు స్త్రీ విద్యకు ప్రాధాన్యం ఇచ్చారనే దాంట్లో కొత్త దనమేమీ లేదు. భారతీయ సంస్కృతిలో తల్లి మొదటి గురువు అన్న మాట విస్మరించరానిది . ఈ సందర్భంగా

స్వాతంత్ర్యానంతర క్రమంగా స్త్రీ విద్యకు ప్రాముఖ్యం లభించింది. కాని మనం ఏనాడు స్త్రీని విద్యకు దూరం చేయలేదు. ఒక్కసారి వేదమంత్రాలను గమనిస్తే, మంత్రార్ధం తెలిసిన ద్రష్టలుగా ఎంతోమంది స్త్రీలు కనిపిస్తారు

సంప్రదాయాన్ని అవగాహన చేసుకొని, మన సంస్కృతిని గౌరవిస్తూ మళ్ళీ స్త్రీ విద్యను ప్రోత్సహించిన మహానుభావులెందరో ఉన్నారు. అటువంటి పుణ్యపురుషుల మూలంగా బాలికలు బాలురతో పాటు పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశించి తమ ప్రతిభాపాటవాలను చూపుతున్నారు. తల్లి దండ్రులకు గౌరవాన్ని తెస్తున్నారు.

జాతీయ, అంతర్జాతీయ రంగాలలో తమ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నారు.

ఒక్క రాజకీయ రంగమనేకాదు, ఆధ్యాత్మిక రంగంలోనూ స్త్రీల యోగదానం ప్రశంసనీయం. అగ్రరాజ్యాధిపత్యాన్ని కైవసం చేసుకోవడానికి కూడా స్త్రీ శక్తి ఉరకలేస్తుందంటే, స్త్రీలకు సమాజంలో గల స్థానం ఎంత గొప్పదో ఊహించవచ్చు. అయితే కొన్ని దేశాలలో స్త్రీ విద్యగల ప్రాధాన్యం

అంతంతమాత్రమే. కాని భారతీయులు మాత్రం సాంప్రదాయకంగా మహిళాభ్యుదయ సాధనలో విద్యార్జనకు అగ్రతాంబూలమివ్వడం సత్యం.

April 23, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

బంగారు కల

by Chillara Bhavanidevi April 22, 2022
written by Chillara Bhavanidevi

(ధారావాహిక నవల) by డా. చిల్లర భవానీదేవి

‘అహో! ఆంధ్రభోజా! శ్రీకృష్ణదేవరాయా!

విజయనగర సామ్రాజ్య నిర్మాణ తేజో విరాజా!!…’’

ఘంటసాల గళంలోంచి ఉత్తేజకరంగా అద్భుతగీతం ఆడియో మంద్రస్థాయిలో విన్పిస్తోంది.

తెల్లారితే బస్‌ హంపీనగరాన్ని చేరుతుందంటే అమృతకి చాలా ఎక్సయిటింగ్‌గా ఉంది. బస్‌ అంతా నిద్రమూడ్‌లోకి జారుకుంటున్నారు. అభిషేక్‌ కూడా హంపీ గురించే ఆలోచిస్తున్నాడని అమృతకి తెలుసు. రాత్రి పదవుతోంది. దాదాపు నలభైమంది ప్రయాణిస్తున్న ఆ టూరిస్ట్‌ బస్‌ తెల్లవారితే ఒక అద్భుత ప్రపంచంలోకి అడుగు పెట్టబోతున్నదని వాళ్ళిద్దరికీ అన్పిస్తున్నదంటే ఆ స్థలం వాళ్ళకి ఎంత ప్రీతిపాత్రమైందో మరి!

‘‘అభీ!’’ మెల్లగా పిల్చింది అమృత.

‘‘ఊ…’’ అభిషేక్‌ బదులిచ్చింది ఒక్క అక్షరమే అయినా అమృత మీద ప్రేమంతా రంగరించి అన్నట్లుంది.

‘‘ఇప్పుడు నీకేమన్పిస్తుంది’’ అతని భుజమ్మీద వాలి కళ్ళు మూసుకుంది.

‘‘మనం మనదైన లోకంలోని కాలానికి వెళ్ళిపోతున్నాం అమ్మూ’’ ట్రాన్స్‌లో

ఉన్నట్లు అన్నాడు.

‘‘నిజంగా  అప్పుడు  ఉండేఉంటాం  అభీ!’’  అమృత  రెప్పల  కింద  సినిమా రీళ్ళలాగా… అనేక దృశ్యాలు కన్పిస్తున్నాయి.

‘‘అమ్మూ!’’ మంద్రంగా హస్కీ వాయిస్‌తో పిలిచాడు అభిషేక్‌.

అలా పిలిస్తే అమృతకెంత ఇష్టమో అతనికి తెలుసు. నాగస్వరానికి ఆడే నాగినిలా అయిపోయింది అమృత.

‘‘చెప్పు అభీ!’’

‘‘రేపట్నుంచి   మన   జీవితంలో   కొత్త   అధ్యాయం   మొదలవుతుందని నాకన్పిస్తుంది.’’

‘‘అవును అభీ… నాక్కూడా’’

‘‘మనం ఇన్నాళ్ళుగా కన్న కలలు నిజం కాబోతున్నాయంటే… ఓప్‌ా నమ్మలేకుండా ఉన్నాను’’ ఉద్వేగంగా అన్నాడు అభిషేక్‌.

‘‘అవును అభీ! మనం యూనివర్శిటీ స్టూడెంట్స్‌గా ఏ క్షణంలో కలిశామో… ఆ ఘడియ అద్భుతమైంది అభీ. ఎందరో అక్కడ చదువుకుంటారు. కాని మనలాగా చరిత్రలోకి ప్రయాణించేవాళ్ళుంటారా! అనిపిస్తుంది.’’

‘‘అవును అమ్మూ! నీకు చెప్పాను గుర్తుందా! మొదటిసారి ఫీల్డ్‌వర్క్‌ కోసం నేను హంపీ వచ్చినప్పుడు ఎంత ఆశ్చర్యపోయానో!క్లాసులో ప్రొఫెసర్‌ విజయనగర సామ్రాజ్యం గురించి చెప్తున్నప్పుడు అవన్నీ నేను చూసినవే అన్పించింది.’’

‘‘అవును అభీ! మనం ఈ సామ్రాజ్యంలో పుట్టామనే నా నమ్మకం.’’

‘‘ఏదో పరీక్షల కోసం చదివాను, రాశాను గానీ ఇద్దరం కల్సి హంపీ ఎప్పుడు వస్తామా అని నా మనస్సు వేగిరపడుతోంది.’’

‘‘అవును అభీ! పెళ్ళయితేగానీ ఇలా కల్సి రాలేం కదా!’’

‘‘కళాకారులుగా కల్సి మనం ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాం. కానీ ఈ అనుభవం వేరు. చదువుకన్నా నీ నాట్యమే నన్ను నీ దగ్గరికి చేర్చింది అమ్మూ.’’

‘‘నీ పాటకోసమే నా పాదాలు ఎప్పుడూ ఎదురుచూస్తాయి అభీ!’’

‘‘రేపటి నుంచి మనం మనదైన అద్భుత ప్రపంచంలో విహరిద్దాం’’

అభిషేక్‌ ఆమె నడుం చుట్టూ చేయి వేశాడు.

‘‘అందుకే గదా! హనీమూన్‌కి ఎక్కడికెళ్తారు? అని నాన్న అడిగితే ‘హంపీ’ పేరు చెప్పాను’’ కొంచెం సిగ్గుపడిరది అమృత.

‘‘అంతా నవ్వారు తెలుసా! శిథిలాల్లో హనీమూనా అని’’ అభిషేక్‌ అల్లరిగా చూశాడు.

‘‘నువ్వెక్కడుంటే అదే నా స్వర్గం అభీ! మనం కలలు కన్న కళాప్రపంచం కన్నా మనకింకేం కావాలి చెప్పు’’ తన్మయంగా అంటున్న అమృత భుజంచుట్టూ చేయివేసి దగ్గరగా తీసుకున్నాడు అభిషేక్‌.

నవదంపతుల   మనసులు   పరస్పరం   ఊసులాడుకుంటుంటే   నిద్రలోకి జారుకున్నారు.

బస్‌ రాత్రి చీకటిని లైట్ల కత్తులతో చీలుస్తూ పరిగెడుతోంది. రాబోయే రోజు వాళ్ళ జీవితాలనే మార్చేస్తుందని తెలీని ఆ యువజంట ఆదమరిచి నిద్రపోతున్నది.

తెలతెలవారుతోంది. సూరీడు కూడా బద్ధకిస్తున్నట్లు ఇంకా పూర్తిగా పక్కమీంచి లేవలేదు. బస్‌లో లైట్లేసి హారన్‌ కొట్టాడు డ్రైవర్‌. అంతా నిద్రలేచి గమ్యం చేరినట్లు గుర్తించారు.

‘‘అభీ!..  హంపీ  అదే  హాస్పేట్‌  వచ్చేశాం’’  అమృత  అతన్ని  నిద్రలేపింది ఆనందంగా.

అభిషేక్‌ కళ్ళు నులుముకుని చుట్టూ చూశాడు. అంతా దిగుతున్నారు. పెద్ద లగేజీలన్నీ బస్‌ డిక్కీలోంచి తీస్తున్నారు.

అమృత, అభిషేక్‌లు బస్‌ దిగారు.

ఎదురుగా హోటల్‌ ప్రియదర్శిని. టూరిజం ప్యాకేజీ సభ్యులుగా అందరికీ డబుల్‌ బెడ్‌ ఎ.సి రూంలు కేటాయించారు. అంతా వెళ్ళాక రిసెప్షన్‌లో కొంచెంసేపు ఆగి అభిషేక్‌ తనకి కావాల్సిన సమాచారాన్ని తీసుకున్నాడు. రూంకి వచ్చి ఇద్దరూ రిఫ్రెష్‌ అయ్యారు. రూంకే బ్రేక్‌ఫాస్ట్‌ తెప్పించుకుని తిన్నారు.

‘‘అభీ! మనం అడిగినట్లు విడిగా ఒక కారు ఏర్పాటయిందా?’’

‘‘ఆ! ఒక గైడ్‌ కూడా’’

‘‘మనకి గైడ్‌ ఎందుకు అభీ! నువ్వున్నావుగా’’

‘‘అలా అనకు అమ్మూ! మనతో వచ్చేది డ్రైవర్‌ కం గైడ్‌. నేను ఆర్కియాలజీ విద్యార్థినే!  అయినా  మనం  చదువుకోని  ఎన్నో  విషయాలు  స్థానికులకు తెలుస్తాయి…’’ నవ్వాడు.

‘‘వాటికి ఆధారాలుంటాయా?’’ అనుమానంగా అడిగింది.

‘‘ఉండకపోవచ్చు… కానీ జనశ్రుతిలో పుట్టిన కథలుండొచ్చు…’’

‘‘అసలు  భారతదేశ  చరిత్రే  సరిగ్గా  రికార్డుకాలేదంటారు.  పోర్చుగీసు యాత్రికులు, బ్రిటీష్‌ చరిత్రకారులు, శిలాశాసనాలు, సాహితీ గ్రంథాలు ఇవేకదా మన చరిత్రకు ఆధారాలు.’’

‘‘నిజమే!’’ ఒప్పుకున్నాడు అభిషేక్‌.

‘‘మనవాళ్ళు సరిగ్గా అన్నీ రికార్డు చేసివుంటే మనకి ఇంకెంత విలువైన సమాచారం తెలిసేదో! నాకు మాత్రం విజయనగర సామ్రాజ్యం గురించి ఇంత అభిమానం పెరగటానికి కారణం నువ్వే అభీ! నేను తెలుగు లిటరేచర్‌ విద్యార్థిగా శ్రీకృష్ణదేవరాయల సాహితీ ప్రియత్వం, కవిపోషణ, ఆ కవుల గురించి వాళ్ళ కావ్యాల గురించి చదువుకున్నాను. కానీ నీలా విజయనగర సామ్రాజ్య శిథిలాల వెనుగ దాగిన చరిత్ర పునాదుల నుంచి తెలియదు.నీ మాటల్లో నేను ఆ స్వర్ణయుగం మళ్ళీ చూశాను. ఆ హంపీ గురించి మనిద్దరికీ ఎందుకింత ప్రేమ అభీ!’’

అతని చేయి తన చేతిలోకి తీసుకొని అడిగింది అమృత.

‘‘తెలీదు అమ్మూ! కారణం ఇదని చెప్పలేను. మేం ఈ ప్రాంతం వాళ్ళమేననీ, మా పూర్వీకులు తెలుగునాడుకు వలస వెళ్ళారనీ అమ్మ చెప్పేది. అయినా రాయల పాలనలో తెలుగు, తమిళ, కన్నడ ప్రాంతాలున్నాయని అందరికీ తెలుసు.’’

‘‘మరి అలా ఎందరో ఉంటారు. నీకు మాత్రం ఎందుకింత ఇది.’’

‘‘ఏమో! చిన్నప్పట్నుంచీ శ్రీకృష్ణదేవరాయల పేరు వింటే నా మనసు పులకరించేది. హంపీ విజయనగర సామ్రాజ్యం నేపథ్యం గల సినిమాలు గానీ పాటలు గానీ చాలా ఇష్టం అన్పించేవి. శ్రీకృష్ణదేవరాయల అసలు చిత్రపటం లభ్యంకాలేదుగానీ లేకపోతే రాయల చిత్రం చూస్తే అది ఏ జన్మలోనైనా గుర్తించగలను.’’ అభిషేక్‌ మనసులో ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాడు.

‘‘నాక్కూడా అంతే అభీ! విచిత్రంగా లేదూ! మనిద్దరి అభిరుచి ఒకటే కావటం’’ నమ్మలేనట్టు చూసిందామె.

‘‘అవును. కొన్నిసార్లు జన్మాంతర సంస్కారాలు వెంటవస్తాయి. అందుకే నర్తకిగా నువ్వు, గాయకుడిగా నేను కళ పట్ల సహజాభిమానంతో ఉన్నాం. ఇది మన జన్మాంతర హృదయధర్మంగా ఉంది.’’

‘‘కారు వచ్చేలోపు మనం ఈ హంపీ విజయనగర సామ్రాజ్య ఆత్మని పూర్తిగా స్పర్శించేలోపు ఇన్నాళ్ళూ నాకు చూపించాలని నువ్వు కలలుగన్న ఈ పుణ్యస్థలం గురించి కొంచెం చెప్పు అభీ!’’

‘‘అలా అయితే ప్రస్తుతానికి నేనే నీ గైడ్‌ని. విను’’ అంటూ అభిషేక్‌ ఏదో ప్రపంచంలో ఉన్నట్లు మాట్లాడుతున్నాడు. ఆర్కియాలజీ స్టూడెంట్‌గానే కాదు, ఈ మట్టి గురించిన జ్ఞాపకాలతో అతని మాటల్లో ఆ మట్టిబంధం పరిమళిస్తూంది.

‘‘నీకు తెలుసా అమ్మూ! ఇందాక మనం అనుకున్నట్లు మనవాళ్ళు రాసిన ఆధారాలే కాదు… ‘రాబర్ట్‌ సీవెల్‌’ అనే ఆంగ్ల ప్రభుత్వాధికారి ‘ద ఫర్‌గాటన్‌ ఎంపైర్‌’ పేరుతో ఈ మట్టిలో కలిసిన విజయనగర సామ్రాజ్యం అనే మాణిక్యాన్ని వెలికితీసేదాకా మనకెవ్వరికీ దీన్ని గురించి తెలియలేదు.’’

‘‘అయ్యో! ఇప్పటికీ పూర్తిగా తెలీదని నువ్వే అన్నావోసారి.’’

‘‘అవును. శ్రీకృష్ణదేవరాయల పూర్వీకులు బళ్ళారివారంటారు. ఈ రాజ్యాన్ని సంగమ, సాళువ, తుళువ, ఆరవీటి వంశాలు పాలించారు. రాయలు తుళువ వంశీకుడు.  రాయల  తాత  ఈశ్వర  నాయకుడు,  తల్లిదండ్రులు  నాగాంబ నరసరాయలు. నరసనాయకుని పెద్దకొడుకు వీరనరసింహరాయలు ‘సాళువ’ వంశాన్ని కూలదోసి రాజై తుళువ వంశాన్ని ప్రతిష్టించాడు. అతని మరణం తర్వాత తిమ్మరుసు సహాయంతో శ్రీకృష్ణదేవరాయలు కర్ణాటక సింహాసనానికి క్రీ.శ 1509లో అధిపతి అయ్యాడు.

‘‘ఈ తిమ్మరుసుకేగా తర్వాతి కాలంలో రాయలు కళ్ళు పీకించింది’’ అమృత

ఉద్విగ్నంగా అడిగింది.

‘‘అవును!’’ విచారంగా చెప్పాడు అభిషేక్‌.

‘‘మరి కుందేళ్ళు వేటకుక్కల్ని తరమటం, హరిహరరాయలు బుక్కరాయలు విద్యారణ్యస్వామి కథ!’’ అర్థంగానట్లు చూసింది.

‘‘నువ్వు విన్నది సరైన ఐతిహ్యమే! దక్షిణాపథంలో తెలుగుల కాకతీయ సామ్రాజ్యం పతనమయ్యాక అక్కడ్నుంచి పారిపోయి హరిహర, బుక్కరాయలనే అన్నదమ్ములు విద్యారణ్యస్వామి ఆశీస్సులతో ఈ స్థలప్రభావం గుర్తించి ఇక్కడ సామ్రాజ్య స్థాపన చేశారని ప్రతీతి. కొందరైతే ఆ కాలానికి విద్యారణ్యస్వామి లేరనీ, విజయనగర రాజగురువు క్రియాశక్తియోగి అనీ అంటారు. ఏదైతేనేం ఇంతటి కళావైభవాన్ని సంతరించిన ఆ పాలన మరపురానిది… మహనీయమైనది కదా!’’ అభిషేక్‌ మాట పూర్తి అవుతూనే రూం అటెండర్‌ కాలింగ్‌ బెల్‌ కొట్టాడు.

అమృత తలుపు తీసింది.

‘‘వెహికల్‌ రెడీ మేడమ్‌!’’ చెప్పేసి వెళ్ళిపోయాడతడు.

అమృత, అభిషేక్‌లు కార్లో కూర్చున్నారు. అమృత బ్యాగ్‌లో కెమెరా, బైనాక్యులర్స్‌, సెల్‌, వాటర్‌ బాటిల్‌ అన్నీ సరిగ్గా ఉన్నాయో, లేవో సరిచూసుకుంది.

కొత్త  మోడల్‌  ఎ.సి కారు.  కొత్తగా  పెళ్ళయిన  జంట.  పాత  వైభవాన్ని చూడటానికి బయలుదేరారు. దోవలో పడిపోయిన ప్రాకారాలు శిధిలమైన కట్టడాలు కన్పిస్తున్నాయి. అభిషేక్‌ వాటి దగ్గర రెండు నిమిషాలు కారాపి ఫోటోలు తీసుకుంటున్నాడు. ఆ మొండిగోడలను ఆత్మీయంగా తడుముతున్న అభిషేక్‌ని చూస్తుంటే అమృతకి విచిత్రంగా అన్పించింది. మనిషి హృదయం ఎంత గొప్పది! ఎంతగా స్పందిస్తుంది! ఒక్కొక్క మనిషి జీవమున్నా రాయిలాగే ప్రవర్తిస్తుంటాడు. కొందరు సున్నిత మనస్కులు రాళ్ళలో కూడా ప్రాణాన్ని చూస్తారు.

అమృతకి ఒక తెలుగుకవి పాట గుర్తొచ్చింది.

‘‘రాలలోపల పూలు పూచిన రామమందిరలీల

                ఆరామ సుందర హేల

రాలలో హృదయాలు మ్రోగిన రాచకేళీశాల

                ఆరామమందిర లీల

నిన్నటిదా మరి మొన్నటిదా ఇది

                ఎన్ని జన్మల గాథ!…’’        

పాటని హమ్‌ చేస్తూ అభిషేక్‌ చేయి పట్టుకొని ఆ ప్రాచీన శిథిలాల్లో తిరుగుతుంటే అమృతకి  గమ్మత్తుగా  అనిపించింది.  హంపీ  శిథిలాల  విూంచి  గెంతుకుంటూ వెళ్తున్నాయి కోతుల గుంపులు. కొన్ని పిల్లకోతులు ఆగి వీళ్ళ చేతుల్లో ఏమైనా తినే వస్తువులున్నాయేమో లాక్కునిపోదామని చూస్తున్నాయి. అభిషేక్‌ గాగుల్స్‌ చూసి వెక్కిరించిందో పిల్లకోతి. మళ్ళీ ఇంతలోనే తల్లిపొట్ట కరుచుకొని వెళ్ళిపోయింది. సృష్టిలో ఏ ప్రాణికైనా మాతృత్వం అనే వరాన్ని  భగవంతుడు ఇవ్వకపోతే ఈ కాస్త ప్రేమ, కరుణ కూడా మాయమైపోయేవేమో!

‘‘అమ్మూ! ఇటు చూడు. గతవైభవదీప్తికి చిహ్నాలుగా ఈ ప్రాకారం మీద అద్భుత శిల్పాలు. ఇది రాయల రాజముద్ర. ఈ అందమైన స్త్రీమూర్తి మొహాన్ని ఇలా చెక్కేయటానికి దాడిచేసి ఆక్రమించిన ఆ దురాత్ములకి మనసెలా ఒప్పిందో! ఏ శిల్పి కలగని ఈ శిల్పాన్ని చెక్కాడో! ఇప్పుడీ శిల్పాన్ని చూస్తే ఆ శిల్పికి గుండె ముక్కలవదూ…’’

అమ్మూ! ఇటుచూడు. కొండకు కొండ కొక్కేలు వేసినట్లు బారులు తీరి ఇంత పటిష్టంగా ఉన్న ప్రాంతం కాబట్టే విజయనగర రాజులు దీనిని రాజధానిగా కోట కట్టారు.  ఇప్పుడు  బీటలువారిన  వీటిని  చూస్తుంటే  కొడాలి  సుబ్బారావుగారి ‘హంపీక్షేత్రం’లో ఆ పద్యమే గుర్తొస్తున్నది.

‘‘శిలలు ద్రవించి యేడ్చినవి జీర్ణములైనవి తుంగభద్ర లో

పల, గుడిగోపురంబులు సభాస్థలులైనవి కొండముచ్చు గుం

పులకు చరిత్రలో మునిగిపోయిన దాంద్ర వసుంధరాధి పో

జ్జ్వల విజయప్రతాప రభసంబొక స్వప్నకథా విశేషమై’’`

అంటూ మధురంగా అభిషేక్‌ పాడిన ఆ పద్యానికి అమృత పరవశించి పోయింది. అతని కంఠం అచ్చంగా ఘంటసాల గళమే! అదే భావోద్దీపన. అందుకే ఆ పాట వినేవాళ్ళ హృదయాలలో తిష్టవేసుకుంటుంది. అమృత కళాహృదయం దోచుకున్న గాయకుడు అభిషేక్‌. ఆమెకి ఎన్నిసార్లు విన్నా తనివితీరదు అతని పాట.

‘‘అమృతా! కొడాలివారు ఈ హంపీ చూసే అంత గొప్పకావ్యం రాశారు! మరి నువ్వేం రాస్తావు!’’ అభిషేక్‌ కవ్వించాడు.

‘‘నేను హంపీలో మన ప్రేమకావ్యానికి మారాకు తొడిగిస్తాను’’ అమృత గుసగుసలాడిరది.

విజయనగర సామ్రాజ్య వైభవ ద్వారంలో అడుగుపెట్టిన ఆ దంపతులకి కళ్ళముందున్న శిథిల కట్టడాల నుండి నాటి విజయ నగరశోభ మనోహర కథన దృశ్యంగా సాక్షాత్కరించింది.

ష్ట్ర  ష్ట్ర  ష్ట్ర

సప్తప్రాకార పరివేష్టితమై ఆదర్శప్రావీణ్యంతో కట్టబడిన అరవైమైళ్ళ చుట్టుకొలత ఉన్న ఆ పట్టణం మొదటి కోటగోడ వరస హాస్పేటకి ఆగ్నేయంగా రెండు కొండలు కలిసేచోట ఉంది. మొదటి ప్రాకారం నుంచి మూడో ప్రాకారం వరకు పొలాలు, తోటలు. రెండవది హాస్పేటలో ఉంది. దానికి ఉత్తరంగా మూడోది, మలపనహోగుడి గ్రామానికి దక్షిణాన నాల్గోది. దానికి ఉత్తరంగా కన్పించేది ఐదోది. కమలాపురం చెరువుకు దక్షిణాన ఆరోది. నిలిచి ఉన్నది ఏడోది. ఇదే అంతర్భాగ ప్రాకారం. నిరంతరం కట్టుదిట్టమైన పహారాలతో ‘మూరురాయలగండ’ శ్రీకృష్ణదేవరాయలు అమిత ధీశక్తిశాలి తిమ్మరుసు మహామంత్రి చల్లని నీడలో విలసిల్లుతోంది. ఆ ప్రాకారాల లోపలే నగరానికి కావలసిన సర్వసంపదలు నెలకొని ఉన్నాయి. అందుచేత కోటతలుపులు మూసివేసినా ఎవరికీ ఎటువంటి కష్టం కలుగదు.

రాజభవనానికి దగ్గరలో ఎదురుగా నాల్గు విపణి వీధులున్నాయి. ఆ వీధులలో పురుషులంతా సమస్త వస్త్రాలంకార భూషితులయి కన్పిస్తున్నారు. వీధుల్లో రత్నాలు, వజ్రాలు రాసులుగా పోసి అమ్ముతున్నారు.

రక్షక భటులు గుర్రాలపై హడావుడిచేస్తూ వచ్చారు. ‘‘తొలగండి.. తొలగండి..’’

ప్రజల మధ్యనించి మార్గం ఏర్పడిరది.

గుర్రాలు ఆగాయి. రాజోద్యోగి దిగటంతో అంతా భయభక్తులతో లేచి నిలిచారు. ఆయన ఒక వర్తకుని వద్దకు వెళ్ళి ‘‘మీ వర్తకం బాగా జరుగుతోందా!’’ గంభీరంగా అడిగాడు.

‘‘చిత్తం’’ వర్తకుడు గౌరవంగా బదులిచ్చాడు.

‘‘బీజాపూర్‌ యుద్ధం ముగిసింది. తెలుసుకదా! మన సైన్యం కుటుంబాలకు ఆర్థిక సాయానికి’’ అర్థోక్తిలో ఆగాడు.

‘‘చిత్తం!’’

‘‘మహామంత్రులవారు రేపు సాయంత్రం ఒక సమావేశం ఏర్పాటు చేశారు. మీరంతా.’’

‘‘చిత్తం!… ఏలిన వారి కృప.’’

వర్తకుల  రాజభక్తి  ఆ  సమావేశంలో  మణి  మాణిక్యాల  రూపంలో ప్రతిఫలించింది.

విజయనగర సామ్రాజ్యంలో రాయలపాలన వచ్చాక ముందు అంతశ్శత్రువుల్ని  సరిచేయటం  జరిగింది.  మహామంత్రి  ఏర్పాటుచేసిన సమావేశంలో తిమ్మరుసు ఇలా చెప్పాడు.

‘‘అధికారులు సత్యాహింసలు, నీతిసూత్రాలకు కట్టుబడి ఉండాలి. మనం పోర్చుగీసువారితో స్నేహం చేసి వారివద్ద గుర్రాలు, తుపాకులు, ఆయుధాలు కొంటున్నాం.  సైన్యానికి  వివిధ  భాగాల్లో  శిక్షణ  ఇచ్చాం.  అశ్వారోహకులు, గజారోహకులు, విలుకాండ్రు, సైనికులు అంతా ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలి. మన ప్రభువు కూడా యుద్ధవిద్యలో అసమానులే!

ఆయన జగజ్జెట్టి, వీరుడు. తాను స్వయంగా సైన్యం ముందుండి నడిపిస్తారు. మన ప్రభువు ప్రతి విజయానికి మనవంతు కర్తవ్యం నెరవేర్చాలి.’’

కాదంటే బతకలేరు అనే కఠోర హెచ్చరిక అందరికీ తెలుసు. తిమ్మరుసు మహామంత్రి మేథోకుశలత ఆ ప్రముఖులకి తెలియందికాదు.

ష్ట్ర  ష్ట్ర  ష్ట్ర

దృశ్యాన్ని కళ్ళకి కట్టించిన ఆ శిథిల వైభవాన్ని చూస్తూ కారులో ముందుకు కదిలారు అభిషేక్‌, అమృతలు. అభిషేక్‌ కళ్ళతో చూసినట్లుగా అమృతకు చెప్తున్నాడు.

‘‘అమృతా! అటుచూడు! అక్కడ రాయలవారి అంతఃపురం ఉండేది. దానిచుట్టూ ఇది విశిష్టమైన మహానగరంగా నిర్మితమైంది. సుమారు ఏడుమైళ్ళ చుట్టుకొలత కలిగి బలిష్టంగా యాభై అడుగుల ఎత్తు, పది అడుగుల వెడల్పు గల ప్రాకారం ఉండేది. దీని ప్రధాన ద్వారాన్ని ఇరవై వేలమంది అశ్వికులు రాత్రింబవళ్ళు కాపలా కాసేవారు.

‘‘అభీ! కృష్ణదేవరాయల కాలం స్వర్ణయుగం అని ప్రసిద్ధికెక్కిందిగదా!’’

‘‘అవును అమ్మూ! రాయల కాలంలో విజయనగర సామ్రాజ్యం అద్భుతమైన సంపదలతో వెలలేని అమూల్య అరుదైన వస్తువులతో దేవలోకంలా ఉండేది. దేనికీ లోటులేక శాంతి సౌభాగ్యాలతో తులతూగేది. ఇదంతా కేవలం రాయల ప్రతిభ మాత్రమే కాదు. అప్పాజీ మేధస్సు కూడా! వివిధ కార్యక్రమాలతో కృష్ణదేవరాయలు నిమగ్నమై ఉంటే తిమ్మరుసు మహామంత్రి తన అసాధారణ ప్రజ్ఞాపాటవాలతో రాజ్యపాలనను నిర్వర్తిస్తూ రాయలను, రాజ్యాన్ని రెండు

కళ్ళుగా చూసుకున్నాడు. విజయనగర సామ్రాజ్య చరిత్ర గురించి చెప్పేటప్పుడు తిమ్మరుసు గురించి చెప్పకపోతే అది అసంపూర్ణమే!’’

కారు మళ్ళీ ఆగింది.

అభిషేక్‌ ఆ ప్రాంతమంతా చిరపరిచితమైనట్లు సొంతింట్లో నడుస్తున్నట్లు అనుభూతి చెందటం అతనికే విచిత్రంగా అన్పిస్తుంది. అతను వరుసగా ఒక్కొక్క స్థలాన్ని  చూపిస్తూ  రాయల  స్వర్ణయుగాన్ని  మళ్ళీ  అమృత  కనుల  ముందు ఆవిష్కరించాడు.

‘‘శ్రీమద్రామాయణంలో వాల్మీకి వర్ణించిన కిష్కింధ ఈ హంపీయే. తుంగభద్రా నదీతీరంలో కిష్కింధ ముఖ్యపట్టణంగా ఆనెగొంది కలిపి ‘వానరధ్వజ’మనే పేరుతో విలసిల్లాయి.  నగరాన్ని  భద్రంగా  కాపాడే  ఐదు  పర్వతాలు  మాతంగం, మాల్యవంతం,  హేమకూటం,  బసవశృంగం,  కిష్కింధ.  వీటిలో  మాతంగం సుగ్రీవుడెక్కటానికి సాధ్యమైంది. వాలి దీనిని ఎక్కలేక పోయాడని రామాయణ శృతి. వాలి, దుందుభుల గుహ ఇప్పటికీ  ఇక్కడ కనిపిస్తుంది.

రావణాసురుడు సీతని చెరపట్టి ఆకాశ మార్గాన తీసికెళ్ళినప్పుడు ఆమె నగలు మూటగట్టి ఇక్కడి పంపా సరోవరం ఒడ్డున పడేసింది. శ్రీ విరూపాక్ష దేవాలయం ఉన్న ఈ ప్రాంతాన్ని దక్షిణకాశిగా వర్ణిస్తారు. కన్నడంలో ‘పాలు’ అనే పదాన్ని ‘హాలు’ అంటారు. ‘పంపా’ అనే పదం ‘హంపా’, ‘హంపీ’గా రూపాంతరం చెందింది.  హనుమంతుడు  పుట్టిన  హనుమత్పర్వతం  కన్పిస్తుంది.  వాలిని శ్రీరాముడు దహనం చేసిన ‘వాలికాష్టం’ ఇక్కడ ఉంది.

ప్రతి సంవత్సరం ఏప్రిల్‌లో హంపీ రథోత్సవం జరుగుతుంది. ప్రపంచం నలుమూలల నుంచి లక్షమంది ప్రజలు ఈ ఉత్సవానికి వస్తారు.

శిథిల కట్టడాలు, రాతిగుళ్ళు, శిలాకనుమలు, కరకులోయలు, నిర్జన వీధులు, శిథిల దేవాలయాలు, నదిలోంచి వచ్చే కాలువలు, చెరుకు, అరటి తోటలతో కన్పించే ఈ హంపీ పట్టణంలో నాటి రాయల ప్రాభవం ఈ శిథిలాల నేపథ్యం లోంచి చూస్తేనే ఇంత అద్భుతంగా అన్పిస్తుంది. ఇక నిజంగా ఈ కాలంలో ఈ పట్టణం ఎంత ఉజ్వలంగా వెలిగిందో కదా’’ తన్మయంగా చెప్పాడు అభిషేక్‌.

‘‘అవును అభీ! ఈ దేవాలయం పేరేంటి? ఇంతటి శిల్పకళతో చాలా సంపన్నంగా ఉంది’’ అమృత ఒక పెద్ద దేవాలయం గోడలమీది శిల్పకళను తనివితీరా చూస్తూ అడిగింది.

‘‘ఇది పట్టాభిరామ దేవాలయం. ఇక్కడ నుంచి కమలాపురం దాదాపు ఒక కిలోమీటరుంటుంది. ఇది అచ్యుతరాయల నిర్మితం. దీనికి దగ్గరే తుంగభద్రా ప్రాజెక్టు పెద్దకాలువ ఉంది. ఇక్కడ ఇలాంటి దేవాలయాలన్నీ దీర్ఘచతురస్రంగా గానీ సమచతురస్రంగా గానీ ఉన్నాయి. ఐదు కక్ష్యాంతరాలుగా బహిర్‌ద్వారం, రంగమండపం, అర్థమండపం, అంతరాళ మండపం, గర్భగృహం అనే పేర్లతో కన్పిస్తాయి. బహిర్‌ద్వారం ఉపరితలంలో గోపురం ఉంటుంది. దీనినే ‘రాయల గోపురం’ అంటారు. ద్వారానికి రెండువైపులా శిల్పాకృతులు, ధ్వజస్తంభం, బలిపీఠం, ముఖమండపం సమ చతురస్ర స్తంభాల మండపాలు కన్పిస్తాయి. దేవతా శిల్పాలంకరణలు సర్వసామాన్యం. గర్భగుహలో ఏ అలంకరణా ఉండదు. పై భాగంలో పరిణతి పొందిన తల విమానం ఉంటుంది. అధిష్టానం, పట్టిక, తలం, శిల్పం, పట్టిన పైన కలశం… ప్రతిభావంతమైన

శిల్పాచార్యుల పర్యవేక్షణలో రాయల కాలంలో కట్టబడిన అనేక దేవాలయాలున్నాయి. పెనుగొండ, లేపాక్షి, కంబ, కదిరి, మధుర, తంజావూరుమొదలైనచోట్ల విజయనగర శైలికి సంబంధించిన వాస్తుకన్పిస్తుంది.

ఈ దేవాలయమే కాదు హంపీలో పంపాపతిస్వామి, చక్రతీర్థంలో కోదండ రామస్వామి, విఠలస్వామి దేవాలయాలు ఇలాంటివే!

‘‘అభీ! ఇవన్నీ ఎప్పుడో చూసినట్లన్పిస్తుంది. నేను మొదటిసారి ఇప్పుడేగా వచ్చానిక్కడికి’’ ఆశ్చర్యంగా అడిగింది అమృత.

ఆమె చేతిని సున్నితంగా ప్రేమగా పట్టుకున్నాడు అభిషేక్‌.

‘‘అమృతా! పద! ఆ మండపంలో విశ్రాంతిగా కూర్చో… ఆ… ఈ నీళ్ళు తాగు. కళ్ళకి కన్పించినంత మేరా సువిశాలంగా కన్పించే ఈ హంపీ విజయనగర పట్టణంలో మనం ఉండేవాళ్ళమని నాకు చాలాసార్లు అన్పించింది. గతజన్మలు నమ్ముతావో లేదోనని నీతో అనలేదు. ఇప్పుడు నీక్కూడా అలాగే అన్పిస్తుందంటే మనకి ఈ హంపీకి ఏదో ఆత్మబంధం ఉంది. అమ్మూ! ఇది మనకి చిరపరచితమైన నగరమే! ఈ వీధులు మనం తిరిగినవే! నీకు ఒక్కొక్కటి గుర్తుచేస్తూ రాయలవారి కాలంలోకి తీసుకెళ్తాను. ఇలా నా హృదయానికి నీ అరచేతిని ఉంచు’’ వివశంగా కళ్ళు మూసుకున్నాడు.

ఆమె అలాగే చేసింది.

ఇద్దరూ  విజయనగర  సామ్రాజ్య  వైభవోన్నతికి  కారకుడైన  ప్రభువు శ్రీకృష్ణదేవరాయల  పాలనలో  పౌరులుగా  రాయల  ఆదరణ  చూరగొన్న కళాకారులుగా, శ్రీకృష్ణదేవరాయల స్వర్ణయుగ అనుభవాలనూ, గతజన్మ జ్ఞాపకాలనూ నిశ్శబ్దంగా మననం చేసుకుంటున్నారు.

అదొక విచిత్ర కాలసంయోగం.

(సశేషం)

April 22, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

కొత్త జీవితం

by shaik saleem April 18, 2022
written by shaik saleem

సాయంత్రం కావొస్తుంది. గది కిటికీ పక్కనే కూర్చున్న రిజ్వానా దీర్ఘ ఆలోచనల్లో మునిగిపోయి ఉంది. అస్తమిస్తున్న సూర్యుడు తన లేత నారింజ రంగును భూమంతా పరిచాడు. ఆ వెలుగు పడిన పరిసరాలు మరింత ప్రకాశవంతంగా మెరుస్తున్నాయి. సన్నగా వీస్తున్న చల్లటి గాలి ఆమె ముఖాన్ని మెత్తగా తాకుతోంది.

అదే పాత రిజ్వానా అయితే ఆ దృశ్యాలను మనసారా ఆస్వాదించేది. కానీ ఇప్పుడు ఆమె మనసు మనసులో లేదు. ఆమె, ఆమెనే కాదసలు. కొద్ది రోజుల్లోనే అంతా మారిపోయింది. నిత్యం ఆత్మవిశ్వాసం తొణకిసలాడే ఆమె కళ్ళల్లో ఇప్పుడు శూన్యం నిండుకుంది.

ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఎటూ దిక్కు తోచడం లేదు. తననే నమ్ముకున్న తల్లి, ఇద్దరు చెల్లెళ్లు. ఇల్లు పట్టకుండా తిరిగే తండ్రి. అన్నింటినీ మించి తన కడుపులో పడిన నలుసు గురించిన బాధ స్థిమితంగా ఉండనీయడంలేదు. సరిగ్గా ఊపిరైనా పోసుకోని ఆ నలుసును తలచుకుంటే రిజ్వానాకు ఊపిరాడ్డం లేదు. తామిద్దరి ప్రతిరూపం తన కడుపులో అంకురించింది.

కానీ స్నేహితులు ‘రానివాడి రూపెందుకు? అబార్షన్ చేయించుకో’ అని సలహాలిస్తున్నారు. బంధువులైతే ‘నీచమైన పని చేసావ్’ అంటూ చీదరించుకున్నారు. ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తెలియని తికమకలో తనతో తానే పోరాటం చేస్తుంది. తనలాగే ఈ లోకాన్ని చూడబోయే ఆ అంకురాన్ని నలిపేయాలంటే మనసు రావడం లేదామెకు. ఇది ఆడవాళ్ళ బలమో బలహీనతో ఇదమిత్థంగా తేల్చుకోలేని గందరగోళ పరిస్థితి.

“లేదు నా రియాజ్ నా కోసం కచ్చితంగా వస్తాడు. ఎక్కడున్నా వస్తాడు. తండ్రి కాబోతున్నాడని తెలిస్తే కచ్చితంగా వస్తాడు. మళ్లీ పాత రోజులు వస్తాయి. ఎట్టి పరిస్థితుల్లో బిడ్డను చంపుకోకూడదు” అని దృఢ నిశ్చయంతో అనుకుంది రిజ్వానా. అయినా ఎక్కడో చిన్న అనుమానం పొడసూపుతనే ఉంది.

“రియాజ్ రాకపోతే… ఎప్పటికీ రాకపోతే. ఈ బిడ్డ పరిస్థితి ఏంటీ? తండ్రి లేని బిడ్డగా పెరగాల్సిందేనా” భవిష్యత్తును తలచుకుంటే తల తిరిగిపోతుంది.

“ఏది నీ బడీ బేటీ… నీ ప్యారీ బిడ్డా. ఎటు పోయింది. వాడెవడితోనే ప్రేమా ప్రేమా అంటూ తిరిగింది. వద్దంటున్నా వినకుండా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి పెళ్ళి చేసుకుంది. చివరకు వాడు కడుపు చేసి ఎటో పారిపోయాడు. ఊళ్ళో నా పరువు తీసింది” బయట వరండాలో తండ్రి రంకెలు వేస్తూ ఇష్టమొచ్చినట్లుగా భార్య చెంపలు పగలగొడుతున్నాడు.

అదే గతంలోని రిజ్వానా అయితే కొట్టబోతున్న తండ్రి చేతిని పట్టుకుని ఆపేసేది. తల్లిపై ఒక్క దెబ్బ పడనిచ్చేది కాదు. ఎముకలు తప్ప చెంచా కండైనా లేని తల్లి భరించలేక ఆర్తనాదాలు పెడుతున్నా రిజ్వానా బలవంతంగా తనను తాను ఆపుకుంటూ మౌనంగా ఉండిపోయింది.

“పైసా సంపాదించవు. ఆడపిల్ల జీతంపై బతుకుతున్నావు. నీకెక్కడిదిరా పరువు. నువ్వు నా కూతుర్ని అనేంత మగాడివా” అని భర్తను నిలదీయాలని వుంది ఆమెకూ. కానీ ఆ పని చేయలేదు.

పెండ్లయిన కొత్తలోనే భర్త తాగొచ్చి కొడుతుంటే పుట్టింట్లో ఎన్నో సార్లు చెప్పుకుంది. అతన్ని మార్చడానికి వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు. తాగుబోతోడు ఎవరి మాట వింటాడు. పైగా మూర్ఖుడు. అందుకే వాళ్ళూ చేతులు దులుపుకున్నారు.

“మొగుడు కొట్టినా తిట్టినా పడుండాలి. మేమేం చేయగలం. నిన్ను కన్నాము గానీ నీ తలరాతను కనలేముగా. చావైనా బతుకైనా అతనితోనే” పుట్టింటికి వచ్చిన ప్రతిసారీ తండ్రి బలవంతంగా భర్త దగ్గరకు పంపేవాడు.

ఆ మాటలు ఆమె చెవిలో అలా ఉండిపోయాయి. దెబ్బలకు అలవాటు పడిన ఆమె శరీరం పుట్టింటి సంగతే మరచింది. ముగ్గురు ఆడపిల్లలకు తల్లయింది. ఆమె కష్టాలు మరింత పెరిగాయి. అబ్బాయిని కనలేదని హింసించేవాడు. అయితే పెద్ద కూతురు రిజ్వానా కాస్త ఎదిగిన తర్వాత తండ్రిని ఎదిరించడం మొదలుపెట్టింది. “అమ్మీ… అబ్బా అలా కొడుతుంటే నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడవేంటి?” అడిగేది రిజ్వానా.

“చావైనా బతుకైనా మొగుడితోనే” అన్న తండ్రి మాటలు గుర్తు చేసుకుని మౌనంగా ఉండిపోయేది. అమాయకమైన తల్లిని చూసి రిజ్వానాకు జాలిపడాలో, కోప్పడాలో అర్థమయ్యేది కాదు.

తండ్రి ఇల్లు పట్టించుకోకపోయినా రిజ్వానా కష్టపడి డిగ్రీ పూర్తి చేసింది. పై చదువులు చదవాలని ఉన్నా కుటుంబం కోసం ఉద్యోగంలో చేరింది. ఇద్దరు చెల్లెళ్ళను చదివిస్తుంది. ఆడపిల్ల అయినా కుటుంబాన్ని పోషించేది. ఎవరి మాటనూ లెక్క చేయని తండ్రి ఉద్యోగం చేసి, డబ్బు సంపాదించే రిజ్వానాని చూస్తే మాత్రం భయపడతాడు. కానీ ఆడపిల్ల గడపదాటి బయటకు వెళ్ళడం ఆయనకు అస్సలు ఇష్టం లేదు. పైసా సంపాదించడు. పైగా రిజ్వానా తన మాట వినదని తెలుసు. కూతురు ఎదురైతే కొరకొరమని చూస్తాడు. ఏమీ చేయలేక నోరు మూసుకుని ఉంటాడు.

అలాంటి అతనికి ఇప్పుడు కూతురంటే భయం లేదు. ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాడు. దీనంతటికీ కారణం రియాజ్. తన జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తుందని రిజ్వాన కలలో కూడా అనుకోలేదు. అన్ని విషయాల్లో తెలివిగా వ్యవహరిస్తూ ధైర్యంగా ఉండే రిజ్వానా అలా ఎలా చేసిందో తల్లికి కూడా అర్థం కావడం లేదు.

సరిగ్గా ఏడాది కిందట తను పని చేసే చోటనే రియాజ్ ను చూసింది. తొలి చూపులోనే బాగా నచ్చేశాడు. చూపు తిప్పుకోలేని అందం రిజ్వానాది. అందుకే రియాజ్ ఆమెను కలవడానికి రోజూ అక్కడకు వచ్చేవాడు. రియాజ్ కూడా అందంలో తక్కువేం కాదు. ఓ రోజు ధైర్యం చేసి రిజ్వానాని పలకరించాడు. అతని పలకరింపు కోసమే ఎదురుచూస్తున్నట్టు వెంటనే స్పందించింది. ఆ పలకరింపే వారి మధ్య పరిచయానికి నాంది పలికింది.

మెల్లిమెల్లిగా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రియాజ్ ఎంతో ఆప్యాయంగా మాట్లాడేవాడు. అప్పటి వరకు ఇల్లూ, చెల్లెలు, తల్లీ బంధాలను మోసిన రిజ్వానాకు అతని పలకరింపులో ఓదార్పు కనిపించింది. కష్టాల్లో పాలుపంచుకుంటానని ధైర్యం చెప్పాడు. ఇద్దరం పెండ్లి చేసుకుందామన్నాడు. అతని మాటలు పూర్తిగా నమ్మింది. ఇద్దరూ దగ్గరయ్యారు. ఆరు నెలలు హాయిగా గడిపేశారు.

వీరి ప్రేమ గురించి చుట్టు పక్కల అందరికీ తెలిసిపోయింది. దాంతో రిజ్వానా పెండ్లి చేసుకుందామని తొందరపెట్టింది. రియాజ్ విషయం ఇంట్లో చెప్పాడు. కానీ ఒప్పుకోలేదు. పైగా ఆ పెండ్లి చేసుకుంటే చచ్చిపోతామని బెదిరించారు. భయపడ్డ రియాజ్ అప్పటి నుంచి రిజ్వానాకు ముఖం చాటేశాడు. అతన్ని కలవడానికి, ఏం జరిగిందో తెలుసుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసింది. ఎంత ప్రయత్నించినా రియాజ్ దొరకలేదు. చివరకు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది.

పోలీసులు రియాజ్ ను, అతని తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పోలీసులకు భయపడి పెండ్లి చేసుకున్నాడు. అతని తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడంతో పోలీసులే మాట్లాడి వేరు కాపురం పెట్టించారు.

పెండ్లి తర్వాత రిజ్వానా ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండేది. అక్కడ తల్లి, చెల్లెళ్ళ పరిస్థితి దారుణంగా తయారయింది. ‘నా సుఖం నేను చూసుకొని వచ్చేశాను. అమ్మా, చెల్లెళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో’ అని ఆవేదన చెందింది. వాళ్ళ కోసం రిజ్వానా మళ్ళీ ఉద్యోగంలో చేరతానంటే భర్త ఒప్పుకోలేదు. తల్లినీ, చెల్లెళ్ళను ఆదుకోవడం కోసం ఆమె రియాజ్ కు చెప్పకుండా ఉద్యోగంలో చేరిపోయింది. దాంతో ఇద్దరికీ గొడవ జరిగింది. అసలే అవకాశం కోసం ఎదురుచూస్తున్న రియాజ్ తల్లిదండ్రులకు ఇదొక సాకుగా దొరికింది. వద్దన్నా ఉద్యోగంలో చేరిందని కొడుక్కు లేనిపోనివి చెప్పారు.

‘ఇలాంటి పిల్ల మనకు వద్దు. దాన్ని ఎలాగైనా వదిలించుకో, నీకు మంచి సంబంధం చూసి మళ్ళీ పెళ్ళి చేస్తాం’ అనేవారు. అటు కన్న వాళ్లకు ఎదురు చెప్పలేక, పెండ్లి చేసుకున్న రిజ్వానాను వదిలేస్తే పోలీసులు ఏం చేస్తారో అనే భయంతో ఎవరికీ చెప్పకుండా ఎటో పారిపోయాడు.

రియాజ్ వెళ్ళిన కొద్ది రోజులకే తను తల్లికాబోతుందని తెలిసింది. ఈ విషయం అతనికి చెప్పడానికి ఎన్నోసార్లు ఫోన్ చేసింది.

కానీ ఫోన్ పని చేయలేదు. చివరకు మళ్ళీ పోలీస్ స్టేషన్ కు వెళ్ళింది. ‘ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తాము. మావాడిని వదిలి వెళ్ళమనండీ’ పోలీసులు పిలిపించి మాట్లాడితే రియాజ్ తండ్రి జవాబు ఇది.

‘నాకు డబ్బు వద్దు, నా కడుపులో బిడ్డకు తండ్రి కావాలి, నేను నా భర్తతోనే కలిసి బతుకుతాను’ అంది. ఆమె కన్నీళ్ళకు కాస్త కూడా కరగని అతను అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి మళ్ళీ అత్తమామల కాళ్ళు పట్టుకుంది. అయినా ఆ కఠిన హృదయాలు చలించలేదు. చేసేది లేక ఏడ్చుకుంటూ పుట్టింటికి చేరింది.

‘మీ అమ్మాయిని మొగుడు వదిలేసి ఎటో వెళ్ళిపోయాడంట కదా. అందర్నీ ఎదిరించి ప్రేమించి పెళ్ళి చేసుకుంది. నేను సంపాదిస్తున్నాను కదా అంటూ తండ్రినే లెక్కచేసేది కాదు. ఇప్పుడేమయింది? ఆకొచ్చి ముల్లు మీద పడ్డా, ముల్లొచ్చి ఆకు మీద పడ్డా నష్టం ఆకుకే. అందుకే ఆడపిల్ల హద్దుల్లో ఉండాలి’ అంటూ తల్లి దగ్గరకు వచ్చి నీతులు చెప్పే వారు చుట్టుపక్కల వాళ్ళు. వాళ్ళంతా ఒకప్పుడు రిజ్వానాను చూసి మురిసిపోయిన వాళ్ళే.

“మీ అమ్మాయికి ఎంత ధైర్యం. కొడుకులు లేకపోయినా నీకు ఆ లోటు తీర్చింది నీ బిడ్డ. ఇలా కుటుంబం కోసం ఆరాటపడే ఆడపిల్లలు ఎంత మంది ఉంటారు. నిజంగా నూ అదృష్ట వంతురాలివి” అని రిజ్వానా తల్లితో తెగ చెప్పే వారు. ఇప్పుడేమో ఇలా నోటి కొచ్చినట్టు మాట్లాడుతుంటే ఆ తల్లి మనసు తట్టుకోలేకపోయింది.

ఇప్పుడు కూతురికి మూడో నెల. తమకు అండగా ఉంటుందనుకున్న బిడ్డ ఇలా ఢీలా పడేసరికి ఆ తల్లికి ఏం చేయాలో తోచడం లేదు. నలుగురూ అంటున్న మాటలు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలని ఓ సారి ఆ ప్రయత్నం కూడా చేసింది. తల్లి కాళ్ళా వేళ్ళా పడి బతిమలాడితే మనసు మార్చుకుంది. ఇక ఎప్పుడూ దిగాలుగా తన గది కిటికీ దగ్గర కూరొచ్చి ఆలోచిస్తూనే ఉంటుంది.

“దీదీ… అబ్బా అమ్మీని ఇష్టం వచ్చినట్టు కొడుతున్నాడు. మేం ఎంత చెప్పినా వినడం లేదు. నూ ఒకసారి బయటకు వచ్చి నాన్నను ఆపు” రిజ్వానా పెద్ద చెల్లెలు ధైర్యం చేసి అక్క దగ్గరకు వచ్చి బతిమలాడింది. .

“ఇప్పుడు నాన్న నా మాట వింటాడా. నేను చేసిన తప్పు అలాంటిది. నోరు తెరిచి మాట్లాడే హక్కు నాకు లేదు” అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ అలాగే మంచంపై ఒరిగింది.

ఓపికున్నంత సేపూ రంకెలేసిన తండ్రి అలసిపోయి పడుకున్నాడు. ఇల్లంతా నిశ్శబ్దం. ఆ ఇంట్లో ఎవరి ముఖాల్లో జీవం లేదు. ఒకప్పుడు ఆ ఇల్లు ఎలా ఉండేది. రిజ్వానా చేసే అల్లరితో సందడి సందడిగా ఉండేది. ఇంట్లో అందరి కన్నా పెద్ద పిల్ల అయినా చిన్న పిల్లలా సరదాగా ఉండేది.

“ఇక ఈ బతుకు బతకడం అనవసరమా? చావు మాత్రమే నా సమస్యకు పరిష్కారం” అనే నిర్ణయానికి వచ్చింది రిజ్వానా. మెల్లగా లేచి తన గది తలుపు తీసుకుని బయటకు వచ్చింది. తల్లిని చివరి చూపు చూసుకుందామని వెదికింది. వంటగది బయట తలుపుకు ఆనుకుని నిద్రపోతుంది. భర్త కొట్టిన దెబ్బలకు అక్కడే సొమ్మసిల్లి పడిపోయింది. అలాగే నిద్రపోతోంది. పక్కనే తన ఇద్దరు చెల్లెళ్ళు అమాయకంగా నిద్రపోతున్నారు. వాళ్ళను ఆ స్థితిలో చూసి రిజ్వానా దుఖం ఆగలేదు.

‘వీళ్ళను ఇలా వదిలేసి నా చావు నేను చస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి?’ అని ఒక్క క్షణం ఆలోచించింది. మళ్ళీ వెళ్ళి దిండులో తల దూర్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఎప్పుడు నిద్రపోయిందో తనకే తెలియదు.

కిటికీ నుండి వెచ్చగా పడుతున్న సూర్య కిరణాల వేడిమి భరించలేక కండ్లు తెరిచింది. మళ్ళీ అవే ఆలోచనలు చుట్టుముట్టాయి. స్నేహితురాలు మున్ని పరుగులాంటి నడకతో వచ్చింది.

“మామీ… మామీ… రిజ్వానా ఏదీ? ఎక్కడుంది..?” అంటూ కంగారుగా అడిగింది.

ఆ కంగారు చూసి భయపడ్డ ఆమె “ఏమైంది మున్నీ.. ఎందుకంత కంగారుగా ఉన్నావు. అసలేం జరిగింది. నాకు చెప్పు” అంది.

“లేదు మామీ…. రిజ్వానాకే చెప్తా… గదిలోనే ఉందా…” అంటూ అటువైపుగా పరిగెత్తింది. లోపల నుండి మున్నీ మాటలు వినిపించిన రిజ్వానానే ఆత్రంగా బయటకు వచ్చింది.

“ఏంటి మున్నీ… రియాజ్ గురించి ఏమైనా తెలిసిందా. తను నిన్ను కలిశాడా. నా గురించి తనకు చెప్పావా. నా కోసం వస్తానన్నాడా..?” అంటూ ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపించింది.

“రియాజ్ పై ఎంత ప్రేమ ఈమెకు. అతనిపై ఎంత నమ్మకం పెట్టుకుంది. ఇప్పుడు ఈ విషయం చెప్తే ఏమైపోతుందో ఏమో? కానీ చెప్పకపోతే ఎలా… చెప్పాల్సిందే. లేకపోతే ఇలా భ్రమల్లోనే బతికేస్తుంది” అని ధైర్యం తెచ్చుకుంది.

“లేదు రిజ్వానా తను నన్ను కలవలేదు. కానీ రియాజ్ మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడంట. వాళ్ళ అమ్మానాన్ననే ఎవరికీ తెలియకుండా గుట్టుచప్పుడు కాకుండా ఊళ్ళో పెళ్ళి చేసి సైలెంట్ గా ఇక్కడకు తీసుకొచ్చారు. పెళ్ళి జరిగి కూడా పది రోజులయ్యిందంట” అని చెప్పింది.

ఆ మాటలు విన్న ఆమెకు నెత్తిన పిడుగుపడ్డట్టు అనిపించింది. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గుండెలు పగిలేలా ఏడుస్తూనే ఉంది. మళ్ళీ గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది.

కూతురు ఎలాంటి అఘాయిత్యం చేసుకుంటుందో అని బయట తల్లి తల్లడిల్లిపోయింది. దబదబా తలుపులు బద్దలు కొట్టి లోపలికి పోయింది. రిజ్వానా కుక్కిమంచంలో పడి ఏడుస్తూనే ఉంది. “ఏమీ చేసుకోనని నాకు మాట ఇవ్వు రిజ్వానా” అంటూ తల్లి కన్నీళ్ళు పెట్టుకుంది.

“ఈ విషయం చెప్పడానికే మా అబ్బాకు తెలియకుండా మీ ఇంటికి వచ్చాను. ఇక్కడికి వచ్చానని తెలిస్తే ఇంట్లో నన్ను చంపేస్తారు. నేను మళ్ళీ వస్తా” అని మున్నీ వెళ్ళిపోయింది.

రియాజ్ గురించి తెలిసి కూతురు ఏం చేసుకుంటుందో అని ఆ తల్లి భయపడింది. ఆ రోజంతా బిడ్డను క్షణం కూడా వదిలిపెట్టలేదు. రిజ్వానా రోజంతా ఏడుస్తూనే ఉంది. పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. రాత్రి పది దాటింది. తల్లి ఎంత బతిమలాడినా మెతుకు ముట్టుకోలేదు.

“అమ్మీ… కొద్ది సేపు నన్ను ఒంటరిగా వదిలెయ్, ఊరికూరికే తినమని విసిగించకు. నేనేమీ చేసుకోనులే, నువ్వెళ్ళి తినుపో” అంది చిరాగ్గా.

కొద్దిసేపు వదిలేస్తే మనసు కుదుటపడుతుందిలే అని తల్లి వచ్చేసింది. ఏమీ తినకుండా గ్లాసుడు నీళ్ళు తాగి అలా నడుం వాల్చింది. బాగా అలసిపోయింది వుంది. అయినా నిద్ర పట్టడం లేదు. రాత్రి పన్నెండు అయ్యింది.

రిజ్వానా గదిలో ఏదో అలికిడైనట్టు వినిపించి అటువైపు వెళ్ళింది. ఉరి వేసుకోవడానికి చున్నీని ఫ్యానుకు కడుతుంది రిజ్వానా. అది చూసి తల్లి గుండెలు బాదుకుంది.

“అంత పని చేయకే తల్లీ, మమ్మల్ని వదిలి వెళ్ళిపోతావా, నిన్నే నమ్ముకున్న మేము ఎలా బతకాలి” అంటూ వెళ్ళి కూతురి కాళ్ళు పట్టుకుంది. ఉదయం తలుపు పగలకొట్టడంతో రిజ్వానాకు లోపలి నుండి గడియ పెట్టుకునే అవకాశం లేకుండా పోయింది.

“అమ్మీ… అసలు నేనెందుకు బతకాలి? ఎవరి కోసం బతకాలి? నా వల్ల కావడం లేదు. అందర్నీ ఎదిరించి పెండ్లి చేసుకున్నాను. ఎవరికీ సుఖం లేకుండా పోయింది. ఇన్ని రోజులు రియాజ్ వస్తాడని ఆశగా ఎదురు చూశా. ఇక

రాడని అర్థమయింది. ఇక నేనెందుకు బతకాలి. ఈ బిడ్డను ఎలా బతికించాలి. నన్ను చావనీ అమ్మీ” అంటూ తల్లి గుండెలపై పడి పొగిలి పొగిలి ఏడ్చింది.

“నీ కడుపులో బిడ్డ కోసం బతకాలి. నీతో పాటు ఆ బిడ్డను కూడా చంపేస్తావా? నిన్ను నమ్ముకుని చెల్లెళ్ళు ఉన్నారు. మీ అబ్బా ఇల్లు పట్టించుకోడు. నువ్వు కూడా ఇలా చేస్తే మేమేం చేయాలి. చచ్చిపోవడమే నీ నిర్ణయమైతే అందరం కలిసే చద్దాం” అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది.

ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు. వాళ్ళ ఏడుపు విని నిద్ర పోతున్న ఇద్దరు చెల్లెళ్ళు కూడా వచ్చారు. పరిస్థితి అర్థమై అమ్మనూ, అక్కనూ చుట్టుకొని వాళ్ళూ ఏడుపు మొదలుపెట్టారు.

అలా ఏడుస్తూ ఎప్పుడు నిద్రపోయిందో తెలీదు, రిజ్వానా కండ్లు తెరిచే సరికి ఎదురుగా స్వాతి. “స్వాతీ నువ్వేనా… ఎప్పుడు వచ్చావు. నువ్విక

రావేమో అనుకున్నాను. కోపంతో నా మొఖమే చూడవనుకున్నాను” అంటూ తలదించుకుంది.

“ఏంటే నువ్వు చేసిన పని. ఇదేనా రిజ్వానా అంటే. నా స్నేహితురాలు ఎలా ఉండేది. ఏంటిది? పిరికి దానిలా చావాలనుకుంటావా?” అంటూ కోప్పడింది.

“అమ్మీ నీకు అన్ని విషయాలు చెప్పినట్టుంది” అంది.

“అవును చెప్పింది. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాను. అయినా నేను వున్నాననుకున్నావా లేదా? ఇంత జరిగినా నాకెందుకు ఒక్క మాట కూడా చెప్పలేదు” అంది మళ్ళీ కాస్త కోపంగా.

“ఎలా చెప్పమంటావే? అప్పుడు అంటే, నువ్వు ఎంత చెప్పారు. ఇంకా చదువుకో, ఇప్పుడే పెళ్ళి ఎందుకని. అంటీ అయితే మరీ మరీ బతిమలాడారు.

కానీ నేను మీ మాట వినలేదు. చివరకు అంకుల్ కూడా చెప్పారు. ఎవ్వరినీ లెక్క చేయలేదు. ఆంటీకి నా ముఖం ఎలా చూపించేది? అందుకే రాలేదు” సంజాయిషీగా చెబుతూ తలదించుకుంది.

“నీ మొహం. అమ్మ నీ గురించి ఎంత బాధపడుతుందో తెలుసా. అసలిప్పుడు నాతో పాటు అమ్మ కూడా నీ దగ్గరకు రావాలనుకుంది.

కానీ యూనివర్సిటీలో సెమినార్ ఉంది. అమ్మ డిపార్ట్ మెంట్ హెడ్ కదా.. కంపల్సరీగా ఉ ండాలి. అందుకే వెళ్ళాల్సి వచ్చింది. నిన్ను నాతో మాటు మా ఇంటికి తీసుకురమ్మంది. నాన్న కూడా ఇదే చెప్పారు.” అంది. “అవునా… అంటీ నా గురించి అడిగారా? నిజమేనా..?” అంటూ అత్రంగా అడిగింది రిజ్వానా. “నేను నీకు అబద్దం చెప్తానా” “లేదు, నువ్వెప్పుడూ అబద్దం చెప్పవు. అప్పుడు మీ మాట విని ఉంటే ఎంత బాగుండేదో” అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది.

“ఇప్పుడేం జరిగిందని ఇలా ఏడుస్తున్నావు? వాడు పోతే ఇక నీ జీవితమే పోయిందా? మేమంతా ఏంటి మరి?” కోప్పడింది స్వాతి.

“ఏడ్వక ఏం చేయమంటావే. తల్లినైతే రేపు నా బిడ్డ భవిష్యత్ ఏమిటి? ఎలా పెంచాలి? తండ్రి గురించి నిందించే లోకాన్ని నేనసలు ఎదుర్కొనగలనా?”.

“ఎవర్నే ఎదుర్కోవలసింది. ముందు నీకు నువ్వు సమాధానం చెప్పుకో చాలు. సూటి పోటి మాటలు అనే సమాజం గురించి ఆలోచించకు. అయినా మోసపోవడం కాదే తప్పు. మోసగించిన ఆ వెధవది. అటువంటి దరిద్రులదే తప్పంతా. ఇప్పుడు రోజులు మారిపోయాయే. ఇంకా బ్లాక్ అండ్ వైట్ సినిమా రోజుల్లోలా మాట్లాడటం ఆశ్చర్యంగా ఉంది. ఒంటరి తల్లులు ఎందరో ధైర్యంగా, ఇష్టంగా తమ బిడ్డలను పెంచుకుంటున్నారు. చివరకు పాస్పోర్టులో కూడా తండ్రి పేరు లేకుండా తల్లి పేరుతోనే విదేశాలకు వెళుతున్నారు. సర్టిఫికేట్లో తల్లి పేరు కోసం పోరాటం చేసి గెలిచిన

వారు ఎందరో ఉన్నారు. నీ బిడ్డకు తండ్రి లేడు. అయితే ఏం. తల్లి వుంది. తానే అవసరం ఉన్న చోట తండ్రిగా మారుతుంది. అది నువ్వే. ధైర్యంగా ఉండు. మేమంతా నీ ప్రతి కష్టంలో ఉన్నామని మరిచిపోకు”.

విశ్వాసంగా స్వాతి చెబుతున్న మాటలు ఎంతో ఊరటనిచ్చాయి. విషాద ఛాయల చీకటి అలుముకున్న ముఖంలో పున్నమి వెన్నెల వికసిస్తున్నది. అయినా చిన్న చిన్న భయాలేవో ఇంకా వదల్లేదు. తిరిగి ఇలా అడిగింది.

“నన్ను ఈ సమాజం బతకనిస్తుందా? అంతెందుకు మా నాన్నే నన్ను నీచంగా చూస్తున్నాడు”

“నాన్న గురించి ఎందుకు అంతగా ఆలోచిస్తున్నావు. ముందు నువ్వేమీ తప్పు చేయలేదన్న నిజాన్ని నీ మనసుకు చెప్పు. ప్రేమించడం తప్పెలా అవుతుందే. అవతలి వాడికి నీ ప్రేమను పొందే అర్హత లేదన్న నిజాన్ని ముందు నువ్వు

అంగీకరించు. మళ్లీ నువు కోరుకున్న రోజులు నీ ముందుకు వస్తాయి. మళ్ళీ ఉద్యోగం మొదలుపెడితే మీ నాన్నను దారిలోకి తేవడం ఎంతసేపు చెప్పు”.

“నువ్వు చెప్పేది నిజమే కానీ..” అంటూ ఏదో అనబోయింది రిజ్వానా. “చూడవే.. అనవసరంగా ఏదేదో అలోచించి మైండ్ పాడుచేసుకోకు. ఇప్పుడు నీ జీవితానికి ఏం కాలేదు. ధైర్యంగా ఉండు. హాయిగా బతుకు” అంది స్వాతి.

“నువ్వు చెప్తుంటే ఎక్కడ లేని ధైర్యం వస్తుంది. అసలు నేను ఇన్ని రోజులు ఇలా ధైర్యంగా ఉన్నానన్నా, అమ్మను హింసించే నాన్నను ఎదిరించి బతికానన్నా దానికి కారణం నీ స్నేహమే. నువ్విచ్చిన ధైర్యమే. ప్రేమ పిచ్చిలో పడి నిన్నూ, నా ధైర్యాన్ని ఇన్ని రోజులూ పోగొట్టుకున్నాను.

యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ ఆంటీ, ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. గిరిజన మహిళల కోసం ఎంత చేస్తున్నారు. అంత పెద్ద కుటుంబంలో పుట్టిన నువ్వు కూడా ఆంటీలాగే సమాజం అంటూ, సమస్యలంటూ పోరాడుతున్నావు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ ఉంటావు. నీలాంటి స్నేహితురాలు ఉండడం నిజంగా నా అదృష్టం. కానీ నేను ఏం చేశాను? మీ మాటలు పట్టించుకోలేదు. నేను చేసిన చిన్న పొరపాటు నా జీవితం మొత్తాన్నే తలకిందులు చేసేసింది.” మళ్ళీ కన్నీళ్ళు పెట్టుకుంది.

“నీకెన్ని సార్లు చెప్పాలి. పాత విషయాలు గుర్తు చేసుకోకు. మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టు. ముందు ఆ ఏడుపు మానుకో. నీకు తెలుసుగా ఏడిస్తే నాకు నచ్చదని. అంతేకాదు. లోపల రూపుదిద్దుకుంటున్న బిడ్డకు అస్సలు మంచిది కాదు” అంది స్వాతి.

“అవును. నీకు ఏడిస్తే నచ్చదు. ఇక ఏడ్వనులే. నువ్వు చెప్పినట్టు కొత్త జీవితం మొదలుపెడతా. నువ్వు నా తోడుంటే చాలు. ఈ ప్రపంచాన్నైనా జయిస్తా. నా బిడ్డకు ధైర్యంగా జన్మనిస్తా. మంచి మనిషిగా తీర్చిదిద్దుతా. ఉ ద్యోగం చేసుకుంటూనే పై చదువులు చదువుకుంటాను. అమ్మను, చెల్లెళ్ళను కూడా చూసుకుంటాను. అంతే కాదు నీలా, అంటీలా సమాజం కోసం కూడా నాకు చేతనైనది చేస్తా. నాలా ప్రేమ పేరుతో మోసపోతున్న ఆడపిల్లలకు అండగా ఉంటా” గుండెల నిండా ఆత్మవిశ్వాసం నింపుకుని అంది రిజ్వానా.

“అద్దీ లెక్క! స్వాతీ ఫ్రెండంటే ఆశామాషీగా ఉంటుందా ఏమి? నాకు తెలుసు. నువ్వు తలచుకుంటే సాధించగలవు. నీకెలాంటి సాయం కావాలన్నా చేసేందుకు నేనూ. అమ్మా సిద్ధంగా ఉన్నాము” అంటూ స్నేహితురాలిని ఓ నిమిషం గాఢంగా కౌగిలించుకుని మంచంపై కూర్చోబెట్టి అన్నం ముద్దలు కలిపి పెట్టింది.

“అంటీ, దీన్ని కొన్ని రోజులు మా ఇంటికి తీసుకెళతాను. వాతావరణం కాస్త మారితే మనసు కాస్త కుదటపడుతుంది” “సరే స్వాతమ్మా… ఆ పని చెయ్యి. కొన్ని రోజులు నీతోనే ఉంచుకో” అంటూ బట్టలు సర్దే పనిలో పడింది రిజ్వానా

“అంతా ఓకేనే… మరి ఆ రియాజ్ ను అలా వదిలేయాల్సిందేనా” అంది రిజ్వానా. “అలా ఎలా వదిలేస్తాం. వాడి సంగతి నాన్న చూసుకుంటారు”.

“అవును స్వాతి. నిజమే… అంకుల్ లాయర్ కదా, ఆ సంగతే మర్చిపోయా. ఇలాంటి వాళ్ళకు కచ్చితంగా శిక్ష పడాలి. ఆడపిల్లల్ని ప్రేమించి మోసం చేస్తారు. మళ్ళీ పెండ్లి చేసుకుని హాయిగా బతికేస్తారు. చట్టాలంటే అసలు భయం లేకుండా పోయింది. ఎలాగైనా తప్పించుకోవచ్చని వీళ్ళ ధీమా. వీడికి అంకులే సరైన మందు. ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉందే. నువ్వొచ్చి నాకు కొత్త ఊపిరి పోశావు” అంటూ నవ్వుతూ స్వాతి మెడచుట్టూ తన రెండు చేతులు వేసి అల్లేసుకుంది రిజ్వానా.

April 18, 2022 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us