మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

వందేమాతరం

by రూపాదేవి November 24, 2025
written by రూపాదేవి

వందేమాతర గీతం… అవమాన గాయంలోంచి పుట్టుకొచ్చిన గేయం. దేశాన్ని మాతగా వర్ణిస్తూ ప్రేమ, భక్తి రంగరించి రాసిన సంక్షిప్త కావ్యం, ఉద్యమకారులు ‘పోరాట స్ఫూర్తి కేంద్రం’, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ సమస్త జాతినీ ఒక్కటి చేసిన ఆ సమర నినాదానికి సరిగ్గా 150 ఏళ్లు!

భారత దేశానికి నవలా ప్రక్రియను పరిచయం చేసిన బంకిం చంద్ర చాటోపాధ్యాయ 1875, నవంబరు 7న క్రింది పాదాలు రాశాడు.

వందేమాతరం
సుజలాం సుఫలాం
మలయజ శీతలాం..
సస్యశ్యామలాం మాతరం.

శుభ్రజ్యోత్స్న పులకిత యామినీం
పుల్లకుసుమిత ధ్రుమదళ శోభినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం.
వందేమాతరం

1905 అక్టోబర్ 16 న బ్రిటీషు వారి బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా ఐక్య భారతాన్ని స్మరించుకునేలా తొలి సారిగా ‘వందేమాతరం’ గీతాన్ని ఆలపించారు ఠాగూర్

బిపిన్ చంద్రపాల్ వందేమాతర గీతాన్ని దేశానికంతా పరిచయం చేశాడు.
వందేమాతరం నినాదాన్నీ వివిధ భాషల్లో కరపత్రాలుగా ముద్రించి పంచారు. అదే పేరుతో పత్రికలూ నడిపారు. సాయుధ దళాల ముఖ్యనేత అరవింద్ ఘోష్ మొదటగా వందేమాతర గీతాన్ని ఇంగ్లిషులోకి అనువదించాడు. ఆ ప్రతి దక్షిణాది భాషలలోకీ కూడా తర్జుమా అయ్యింది. 1906లో పాథేఫోన్స్ కంపెనీ దాన్ని గ్రామఫోన్ రికార్డుగా తీసుకొచ్చింది.

భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో 1905-11 మధ్య కాలాన్ని ‘వందేమాతర యుగం’ అనవచ్చు. వందేమాతర గీతం ఉద్యమకారులకు మనోబలాన్ని ఇచ్చింది. సామాన్యులనూ సమరయోధులుగా మార్చింది. గ్రామాల్లోనూ ‘వందేమాతరం సంఘాలు’ వెలిశాయి కొద్దిమందికే పరిమితమైన ఉద్యమంలోకి విద్యార్థిలోకమంతా ఉత్సాహంగా దూకింది.

తెలంగాణలోనూ 1938 నవంబర్ 28న బి హాస్టల్ కమ్యూనిటీ హాలులో సమావేశమైన ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు వందేమాతరం గేయాన్ని గళమెత్తి పాడారు. వందేమాతరం విద్యార్థి ఉద్యమంగా రాజుకునీ హైదరాబాద్లో మొదలై నిజాం రాజ్యం మొత్తం పాకింది.

1947 ఆగస్టు 15 భారత దేశానికి స్వాతంత్య్ర్యం సిద్ధించిన రోజున ప్రఖ్యాత సంగీతకారుడు ఓమ్ ప్రకాశ్ వందేమాతర గీతాన్ని పార్లమెంటులో ఆలపించారు. ఏ వాద్య సంగీతమూ లేకుండా అచ్చమైన గాత్రాన్ని వినిపించారు.
అదే పర్వదినాన వందేమాతరాన్నే తొలి విజయ గీతంగా ఆల్ ఇండియా రేడియో లో ప్రసారం చేశారు!

1950 రాజ్యాంగ పరిషత్తు చివరి సమావేశం ‘వందేమాతరం గేయాన్ని… రవీంద్రుడి జనగణమన జాతీయగీత సమానంగా గౌరవించాలి… అదే స్థాయి హోదాని కల్పించాలి’ అంటూ తీర్మానించింది.

రెండింటికీ సమాన హోదాయే ఉన్నా ‘జనగణమన’ పాడటానికి చాలా కట్టుబాట్లు ఉన్నాయి. ఆ బాణీని ఎవరూ మార్చకూడదు, పాడే సమయమూ (52 సెకన్లు) మారకూడదు.

వందేమాతరానికి ఆ పరిమితులు లేవు. కాబట్టే వేలాది వెర్షన్లు వచ్చాయి.

దూరదర్శన్లో ప్రతిరోజూ సుప్రభాత గీతంగా వినిపించే వందేమాతరానికి నేపథ్య సంగీతం ఉండదు.

బీబీసీ వరల్డ్ సర్వీస్ నిర్వహించిన అంతర్జాతీయ పోల్లో … ప్రపంచ ప్రసిద్ధ జాతీయ గేయాల్లో రెండో స్థానం అందుకుంది వందేమాతరం. సంక్షిప్తం

November 24, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సిద్ధార్థుని పూర్వచరిత్ర

by Dr. Aruna Parandhamulu November 24, 2025
written by Dr. Aruna Parandhamulu

ఉత్తర భారతదేమంతా ఒకే పాలనలో లేదుక్రీస్తు పూర్వం  ఆరవ శతాబ్దoలో. అనేక రాజ్యాలుగా విడిపోయి ఉంది. వాటిలో కొన్ని పెద్దరాజ్యాలైతే మరికొన్ని చిన్న రాజ్యాలుగా వుండేవి. ఈ రాజ్యాలలో కొన్ని రాజుల పాలనలో వుండేవి.

శాక్యులరాజ్యమైన కపిలవస్తు పూర్తిగా ప్రజాస్వామికమైనదా! కొన్ని కుటుంబాలచే పాలించాబడినదా!అనిఖచ్చింతంగానిర్ధారించి చెప్పేందుకు ఆధారాలు లేవు.అయితే కొన్ని పాలక కుటుంబాలుండేవనీ అవి ఒకటి తరువాత ఒకటి పరిపాలన చేసినట్లుగా చెప్పేందుకు మాత్రం కచ్చితమైనఆధారాలున్నాయి. వరుసక్రమం ప్రకారం పరిపాలన చేసేన పెద్దను “రాజు” అనేవారు. రాజులచే పాలింపబడిన రాజ్యాలను జనపదములనీ, రాజరికంలేని రాజ్యాలను సంఘాలనీ,గణాలనీ పిలిచేవారు.కపిలవస్తుశాక్యుల రాజధాని.

సిద్దార్థ గౌతముడు జన్మించేనాటికి తండ్రి శుద్ధోధనుడుకపిలవస్తుకు రాజు.ఇది ఒకప్పుడు స్వతంత్రంగా ఉండినప్పటికిని ఆ తర్వాత ఈ కోసుల రాజుల అధికారం కిందికి వచ్చింది. కోసలరాజుల ఆమోదం లేనిదే శాక్యులు రాజ్యాంగపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు వీలులేదు. ఆ కాలంలో రాజ్యాలఅన్నింటిలోకోసల రాజ్యం చాలా శక్తివంతమైనదిగా ఉండేది. ఆ తర్వాత చెప్పుకోదగ్గరాజ్యంమగధరాజ్యం. కోసల రాజు అయిన ప్రసేనుడు. మగధ రాజైన బింబిసారుడు సిద్ధార్థ గౌతమునికి సమకాలికులే

సిద్ధార్థుని పూర్వీకులు

గొప్ప హేతువాది అయిన కపిలుని పేరుపైనే ఈ నగరం వెలసియుండవచ్చుఅనిచారిత్రకారులుబావిస్తున్నారు.కపిలవస్తు పరిపాలించిన శాక్యులరాజుసినహుడు.జయసేనుని కుమారుడు.కాంచనసినహుడిభార్య. వీరి సంతానం ఏడుగురు సంతానం ఐదుగురు మగ పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు1.శుద్ధోధనుడు, 2.దాతోధనుడు,3.శాక్యోధనుడు, 4.సుఖోధనుడు, 5.అమితోదనుడు. అయిదుగురు కుమారులుఇద్దరూకుమార్తెలు1.అమిత.2.పమితసిద్ధార్థ గౌతమునికి తాతసినహుడునాన్నమ్మకాంచన. సిద్ధార్థ గౌతముని తండ్రి శుద్ధోధనుడు, నలుగురు చిన్నాన్నలు ఇద్దరూ అత్తలు.

శుద్ధోధనుడు యుద్ధ విద్యలో ఆరితేరిన వీరుడు. యుద్ద పరీక్షలో అగ్రగణ్యుడుఅందుకుకారణంగా రెండవ భార్యని చేసుకోవడానికి అర్హుతకలవాడు కాబట్టిశుద్ధోధనుడుమహా ప్రజాపతిని కూడా పెళ్లి చేసుకున్నాడు.శుద్ధోధనుడికీ ఇద్దరు భార్యలు మొదటిభార్యమహామాయ రెండోభార్య మహాప్రజాపతి.మహామాయ తోబుట్టువు.మహాప్రజాపతి అక్క

శుద్ధోధనుడు గొప్ప ఆస్తిపరుడు విస్తారమైన వ్యవసాయభూములున్న కారణంగా పనివాళ్లు కూడ ఎక్కవ మంది వుండేవారు.వారి వ్యవసాయభూమిలోవేయిననాగళ్ళుపనిచేసేవట.సిద్ధార్థ గౌతముని అమ్మమ్మా సులక్షణ, తాత అంజనుడుమహామయతల్లిదండ్రులు.కొలియవంశీయుడైన యీఅంజనుడుదేవదాహ అనే గ్రామంలో నివసించేవారు.

సిద్ధార్థునిజన్మకథ

క్రీస్తుపూర్వం 563 వ సంవత్సరము వైశాఖ పౌర్ణమి రోజున మహామాయ సిద్ధార్థునికిజన్మనిచ్చింది.శుద్ధోధనుడు మహామాయలకు వివాహమైన చాలా ఏళ వరకు వారికి సంతానంకలుగలేదు.లేకలేక గలిగిన సంతానం కావడంతో వారి ఆనందానికీవధులేవుఅత్యంత వైభవంగా జన్మదిన మహోత్సవాన్ని జరుపుకొన్నారు. వారితో పాటు శాక్య కుటుంబాలన్నీ ఆ దినాన్ని పర్వదినంగ జరుపుకున్నారు.సిద్ధార్థగౌతమునికిజన్మించేనాటికి శాక్యరాజ్యానికి శుద్దోధనుడే పాలకుడు, ఆ కారణంగా రాజలాంఛనాలతో ఆ శిశువు జన్మదిన వేడుకలు జరిగాయి. తనతండ్రిఅపుడురాజుగనుక పుట్టిన కుమారుడు కూడరాకుమారుడైనాడు.పదవ రోజున బాలునికి నామకరణం జరిపారు ఆ బాలునికిసిద్ధార్థుడని పేరు పెట్టారు. గౌతమ వంశము కారణంగా సిద్ధార్థ గౌతమినిగా పిలువబడ్డాడు.

ఒకవైపునామకరణోత్సవం జరుగుతుండగా మహామాయ ఉన్నట్టుండి అస్వస్థతకులోనైంది.తనకు అంతమ ఘడియలు ఆసమైనట్టుబావించి మహామాయ తనసోదరిమహాప్రజాపతికీసిద్ధార్థున్నిపెంచిపెద్దజేసేబాధ్యతనుఅప్పజెప్పితుదిశ్వాసవిడిచింది.శుద్ధోధనుడుమహాప్రజాపతికన్నీరుమున్నీరై విలపించారు.

సిద్దార్థునికిఅప్పుడు ఏడు రోజులు వయస్సుమాత్రమే. మహాప్రజాపతి కుమారుడు నందుడు సిద్ధార్థ కంటే చిన్నవాడు. ఇద్దరిని పెంచి పెద్దచేసిందిమహాప్రజాపతి.

సిద్ధార్థునకు ఎనిమిదవ ఏటావిద్యబ్యాసం మొదలైంది.శుద్ధోధనుడుసర్వమిత్రుడను సకల శాస్త్ర పారంగతున్ని గురువుగా నియమించాడు. “సర్వమిత్రుడు” భాషాశాస్త్రం,వ్యాకరణశాస్త్రం, వేద వేదంగాది,ఉపనిషత్ శాస్త్రం లో పరిజ్ఞానం కలవాడు.సిద్ధార్థుడు గురు వద్ద ఆనాటి తత్వశాస్త్రాన్నింటినిక్షుణంగా నేర్చుకున్నాడు.ఉద్దిక్షుడుసిద్ధార్థునికి రెండవ గురువు. ఆ తర్వాత కపిలవస్తు ఆశ్రమ వాసి అయిన అలారకాలాముని శిష్యుడు భరద్వజుని వద్ద ఏకాగ్రత ధ్యాననిష్టలను కూడా నేర్చుకున్నాడు.

సిద్ధార్థుడొకనాడు తన సహచరులతో పాటు వ్యవసాయ క్షేత్రమునకు పోయి అక్కడ మండుటెండలో కొందరు వ్యవసాయ కూలీలు ఒంటికిబట్టలేకుండా కొందరు పొలాలను దున్నుతున్నారు. మరికొందరు గట్లు వేస్తున్నారు మరి కొందరు చెట్టు నరుకుతున్నారు వారందరినీ చూశాడు ఆ దృశ్యం సిద్ధార్థుని మనస్సును ఎంతో కలతపరిచింది.. ఒక వ్యక్తిని మరో వ్యక్తి ఆ విధంగా దోచుకోవటం న్యాయం కాదని సిద్ధార్థుడు తన మిత్రులతో చెప్పాడు. శ్రామికుని శ్రమ ఫలితాలను అనుభవించడం న్యాయమెలా అవుతుందని వారిని ప్రశ్నించాడు.అయితే ఆ ప్రశ్నకు ఏలా సమాధానమివ్వాలో తన మిత్రులకు తెలియలేదు. ఎందుకంటే శ్రామికుడు తన యజమాని కొరకై శ్రమించడమే తమ ధర్మమని సనాతన సిద్ధాంతమే వారికి తెలుసు.

మృగాలను వేటాడే కార్యక్రమంలో సిద్ధార్థుడు పాల్గొనే వారు కాదు. అప్పుడు మిత్రులు అడిగేవారు? నీకు పులులుఅంటే భయమా! అని. అప్పుడు తన మిత్రులతో మీరు పులులను ఎందుకు చంపుతున్నారు? అవి మీకు ఇలాంటి హాని చేయడం లేదు కదా! అలాంటప్పుడు చంపడం ఎందుకని ప్రశ్నించాడుసిద్ధార్థుడు. తన మిత్రులనుండి ఎలాంటి సమాధానం రాలేదు.

నువ్వు వేటాడకపోయినప్పటికిని గురి పెట్టి బాణం ప్రయోగించడంలో మా నేర్పును చూసేందుకైనా మన వెంట రావచ్చు కదా!అని మిత్రులు అడిగేవారు. అందుకు సమాధానంగా సిద్ధార్థుడు మీరు అమాయక జీవులని చంపడం చూసి నేను భరించలేను అందుకు మీ వెంట రావటం నాకు ఇష్టం లేదు అని సమాధానం ఇచ్చేవారు.

సిద్ధార్థుని ప్రవర్తన పట్ల పెద్దమ్మ ఎంతో బాధపడేది.నువ్వు క్షత్రియుడవు యుద్ధం చేయటం నీ విద్యుక్త ధర్మం అని నీకు తెలుసు కదా? యుద్ధ విద్యలలోప్రావీణ్యం కోసం నువ్వు వేటకు వెళ్లాలి అనిచెప్పేది. సిద్ధార్థుని ప్రవర్తన తీరు పట్ల పెద్దమ్మ ఎంతో బాధపడుతుండేది.

అది సరేనమ్మా! అసలు క్షత్రియుడు ఎందుకు యుద్ధం చేయాలి?అనిసిద్ధార్థుడుప్రశ్నించాడు. అందుకు యుద్ధం నీ ధర్మం నాయనాఅని తన పెద్దమ్మ జవాబుచ్చేది.ఆ సమాధానానికి సిద్ధార్థునిమనసు అంగీకరించలేదు. ఒక మనిషిని మరో మనిషి చంపడం ధర్మము ఎలా అవుతుందని ఆమెను ప్రశ్నించాడుసిద్ధార్థుడు.

యుద్ధం చేయకపోవడం సన్యాసులకై చెల్లుతుంది కానీ నీవు క్షత్రియుడవు కదా! నీవు యుద్ధం చేయకపోతే

నీ రాజ్యాన్ని ఎవరు కాపాడతారు? అని ఆమె ప్రశ్నించింది.

అది సరేనమ్మా! ఈ క్షత్రియులు ఒకరినొకరు ప్రేమించుకోగలిగితే ఒకరినొకరు చంపకోనక్కరలేకుండా వారి రాజ్యాలను వారు కాపాడుకోవచ్చు కదా అని ఎదురు ప్రశ్న వేసేవాడు సిద్ధార్థుడు.

ఆ ప్రశ్నలకు సమాధానం లేక వదిలేసింది పెద్దమ్మ.

సిద్ధార్థుడికి పదహారేళ్లు నిండియుడడంతో వివాహం కోసం ఆరాట పడుతున్నారు అమ్మానాన్నలు.శాక్యవంశీయుడైన“దండపాణి” పుత్రిక యశోధర. ఆమె సౌందర్యవతి శీలవతి కూడదండపాణి తన పరిసర ప్రాంతాల రాకుమారులందరిని తన కుమార్తెస్వయంవరంలోపాల్గొనవలసిందిగ ఆహ్వానాలు పంపాడు.యశోధరకు ఏర్పాటైన స్వయంవరంలో తప్పక పాల్గొనవలసిందిగసిద్ధార్థుణ్ణి తన తల్లిదండ్రులు కోరగఅతనందుకుఅంగీకరించాడు.యువరాజులందరిలోను సిద్ధార్థగౌతమునే యశోధర ఎన్నిక చేసికొన్నది.

అయితే దండపాణిసంతోషించలేకపోయాడు, అసలు వీరి వైవాహిక జీవనం కలకాలం కొనసాగుతుందాఅంటూఅనుమానించాడు.సిద్ధార్థుడుసాధువుల సాన్నిహిత్యాన్ని కోరుతుంటాడుగదా! ఎప్పుడూ ఒంటరిగావుండెందుకు ఇష్టపడుతాడుగదా! అలాంటివాడు సరియైన సంసారిలా కాగలడని దండపాణి ఆలోచించసాగాడు.అయితే యశోధరమాత్రంసిద్ధార్థునితప్ప వేరొకరినిపెళ్లిచేసుకోటానికి ఒప్పుకోలేదు. సాధువుల సాంగత్యం. సన్యాసులతో సమాగమం నేరమెలా అవుతుందో తెల్పమంటు తన తండ్రిని ప్రశ్నించేది. ఆమెతల్లి అమితశుద్ధోధనుడిచెల్లెలుపెళ్లిఖాయపరచవలసిందిగ దండపాణిని కోరింది. దండపాణి అందుకంగీకరించాడు.

అయితే స్వయంవరంలో పాల్గొన యువ రాజులు నిరాశ చెందడమేగాకతామని అవమానించినట్లు భావించి.ఏదో ఒక పోటీ నిర్వహించ వలసిందిగదా! అలా ఎందుకుజేయలేదని వారు ప్రశ్నించారు.ఆరాకుమారులంతా ఏకమై విలువిద్యలో ఎవరునెగ్గితే వారినే ఆమె పరిణయమాడవలసిందిగ దండపాణిపై ఒత్తిడితెచ్చారు. దండపాణి అందుకంగీకరించకతప్పలేదుమొదట సిద్ధార్థుడలాంటి పరీక్షలో పాల్గొన దలచలేదు. కాని తన రథసారధియైన చెన్నుడుసిద్ధార్థుడు బాణ ప్రయోగపరీక్షలోపాల్గొనవలసిందిగాను,అలాచేయనట్లయితే తన తండ్రియైనశుద్దోదనుని కుటుంబానికే కాక తనను వరించిన యశోధరకు సైతం అవమానంకాగలదని చెప్పాడు.తన రథసారధి యొక్క మాటలకు ముగ్ధుడైన సిద్ధార్థుడుబాణప్రయోగ పరీక్షకు సమాయత్తమయ్యాడు.పోటీ మొదలైంది. ప్రతి ఒక్కరు తమ విలువిద్యా నైపుణ్యాన్ని చూపెట్టారు.చిట్టచివరిగ గౌతముడు విల్లుబూనిబాణప్రయోగంజేశాడు. గురిజూసి సరిగ్గా గుర్తుపైనే బాణం గృచ్చుకొనేలా కొట్టడంలో సిద్ధార్థుడేసిద్ధహస్తుడనినిరూపించుకొన్నాడు.పరీక్ష ముగిసింది.శుద్ధోదనుడుదండపాణి ఎంతో సంతోషించారు. ఇక యశోధర, మహాప్రజాపతియిత్యాదులఆనందానికవధులులేవు.

యశోదతో వివాహం జరిపించారు. సంసార జీవనము ఆనందంగా గడుపుతున్నాడు. కొడుకు కోసం శుద్ధోధనుడు మూడు గొప్ప విలాస మందిరాలు ఏర్పాటు చేయించాడు. వేసవి కాలంలో ఒక భవనము. చలికాలంలో ఒక భవనము. వర్షాకాలలోఒక భవనము. సమస్త సదుపాయాలు ఆ భవనాల్లో ఏర్పాటు చేశాడు.

శుద్దోధనుడు సిద్ధార్థుని చుట్టూ శృంగార విద్యలలో చేరిన ఆరితేరిన ఆలలను ఎల్లప్పుడూ చుట్టూ ముట్టి ఉండేటట్లు చేశాడు. సిద్ధార్థుని దృష్టి ఎల్లప్పుడూ విలాసాల పైనేఉండేటట్లు చూశాడు.అయినప్పటికీ అజ్ఞానపురితమైనమత్తుగొలిపే ప్రోత్సాహంతో తమ కామ కలాపాలలు యువరాజును ఏమి చేయలేమని వారు భావించారు.రాజకుమారుడు ఆవనిత పట్ల ఏమాత్రం ఆసక్తి చూపించలేదు.

ఇరవై ఏళ్ల వయసు పైబడ్డ వారందరూ శాక్యసంఘంలో సభ్యత్వం స్వీకరించాలని నియమం ఉండేది.సిద్ధార్థునికీ ఇరవై ఏళ్ల వయసు వచ్చింది. సిద్ధార్థునికిశాక్య సంఘంలో సభ్యత్వమివ్వబడింది.శాక్యసంఘపురోహితుడు నీ బాధ్యత లేమిటోచెప్తాను విను అన్నాడు.

1 నీ శరీరాన్ని మనసును నీ ధనాన్ని అర్పించిన సరే నీవు శాక్యుల ప్రయోజనాలను కాపాడాలి.

2.శాక్యు సంఘ సమావేశపు తప్పకుండా హాజరు కావాలి.

3.ఏ శాక్యుని లో ఏలాంటి లోపాలు కనిపించిన. నిష్పక్షపతంగా నిర్భయంగా సంఘం దృష్టికి తీసుకురావాలి.

4నీపైనేరారోపణలు చేసినప్పుడు నీవు కోపించరాదు నీవు తప్పు చేసినట్టు ఉంటే ఒప్పుకోవాలి నీలో ఏ దోషము లేదని నిరూపించాలి.

ఇక ఏ ఏ పరిస్థితుల్లో నువ్వు సంఘ సభ్యత్వాన్ని కోల్పోతావో వివరిస్తాను అంటూ పురోహితుడు వివరించసాగాడు.

1 మానభంగానికి పాల్పడినట్లు రుజువైతే

2 నీ ఎవరినైనా హత్య గావించినట్లు రుజువైతే

3 నువ్వు దొంగిలించినట్లు రుజువైతే ఈ సంఘంలో ఉండడానికి నువ్వు అనర్హుడవుఅని పురోహితుడు వివరించాడు.

శాక్య సంఘ నియమాలను బాధ్యతలను క్షుణంగావిరించినందుకు మీకు నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అనిసిద్ధార్థుడు తెలిపాడు. ఎనిమిదేళ్లు గడిచాయి.శాక్య సంఘముతో సిద్ధార్థుడు ఎంతో అంకితభావంతో పని చేసేవాడు. సంఘ సభ్యునిగా ఉంటున్న ఎనిమిదవ వేట ఏర్పడిన ఓ సంఘటన శుద్ధోదనునికి భరించలేని బాధ అయింది.సిద్ధార్థుతుని జీవితంలో గొప్ప మార్పుకు దారితీసింది. శాక్యుల రాజ్యానికి పక్కనే కొలియుల రాజ్యం ఉండేది. ఈ రెండు రాజ్యాలను రోహిణి నది విడదీస్తుంది. ఆ రెండు రాజ్యాల వారు వ్యవసాయానికి ఈ రోహిణి నది జనాలనే  వాడుకునేవారు.వ్యవసాయ కాలములు ఈ నది జలాలు ఎవరు ముందుగా వాడుకోవాలి ఎవరు ఎంత నీరు వాడుకోవాలి అనే విషయంపై ఈ రెండు రాజ్యాలు ప్రతి ఏటా వివాదం ఏర్పడేది. ఈ వివాదం అప్పుడప్పుడు ఘర్షణ సైతం దారితీసిన కొన్ని సందర్భాలు ఉన్నాయి. అది తీవ్ర స్థాయికి చేరుకుంది. సిద్ధార్థుతుని28వ ఏట ఏర్పడిన నది జలాల వివాదం చివరకు ఈ రెండు రాజ్యాల మధ్య పోరాటంగా మారి ఇరుపక్షాలకు చెందిన వ్యవసాయ కూలీలకు కొట్టుకోవడం వరకి వెళ్ళాయి.

ఈ వివాదం యుద్ధం ద్వారానే శాశ్వతంగా పరిష్కారం కావాలంటూ అటు శాక్యులు ఇటు కొలియులు అనుకున్నారు.కొలియుల పై యుద్ధాన్ని ప్రకటించేందుకు నిర్ణయం తీసుకునేందుకు సేనాపతి శాక్య సంఘ సమావేశాన్ని ఏర్పాటు చేశాడు.

సేనాపతి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. మన వారిపై కొలియులు. దాడి  చేసిన కారణంగా మనవారు వెనుకకు మళ్ళీ రావడం జరిగింది. మన వారిపై కొలియులు ఈ విధంగా దాడి చేయడం ఇది మొదటిసారి కాదు అయినప్పటికీ ఇన్నాళ్లుగా వాళ్ళ ఆగడాలు సహించాము. ఇక పై సహించవద్దు. ఈ సమస్య శాశ్వతంగా పరిష్కరించబడాలంటే యుద్ధ ప్రకటన చేయాల్సిందిఅని కోరుతున్నాను అన్నాడు. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించే వాళ్ళు ఉన్నట్లయితే మాట్లాడవచ్చు అన్నాడు.

సిద్ధార్థ గౌతముడు తన స్థానం నుండి లేచి ఈ ప్రతిపాదనను నేను వ్యతిరేకిస్తున్నాను. యుద్ధం చేసినంత మాత్రాన వివాదం పరిష్కారం కాదు కదా! ఈ యుద్ధం మరో యుద్ధానికి కారణంఅవుతుంది. చంపిన వాడిని చంపేందుకు మరొకరు తయారవుతారు.జయించినవాడు జయించేందుకు ప్రయత్నం చేస్తాడు. దోచినవాడు తిరిగి దోచుకోబడతాడు.తొందరపాటుగా మన సంఘం కొలియుల పై యుద్ధం ప్రకటించడం సమంజసం కాదని నేను భావిస్తున్నాను.

అసలు వివాదములు తప్పు ఎవ్వరిదో చాలా స్పృశితంగా పరిశీలన చేయాలి మన వారు సేతంకొలియుల పై దాడి చేసి గాయపరచరనివిన్నాను. అది వాస్తవం అయితే ఇద్దరూదోషులే కదా!.ఇద్దరు మధ్యవర్తులను ఎన్నుకోమని అడుగుదాం ఈ నలుగురు కలిపి మరో మధ్యవర్తి ఎన్నుకుంటారు. వారు సమావేశమై వివాదాన్ని  చర్చించి సమస్యను శాశ్వత పరిష్కారం మార్గాన్ని కోరుదాంఅనిసిద్ధార్థుడు తను ఉపన్యాసంలో అన్నాడు. ఈ ప్రతిపాదను మరో సభ్యుడు బరపరిచాడు.

సేనాపతి లేచి కొలియులుమనపై సాధించే దాడులు వారిని కఠినంగా శిక్షించినప్పుడు మాత్రమే అరికట్టబడగలవుఅని తెలిపారు.సేనాపతి ప్రతిపాదనకు సిద్ధార్థుడు సవరణను ప్రవేశపట్టగా అది అధిక సంఖ్యలో వ్యతిరేకించడంతో వీగిపోయింది. సిద్ధార్థుడు ఈ ప్రతిపాదనను బలపరుచ వద్దని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అన్నాడు. శాక్యులు కోలియులు ఇద్దరూ బంధువులే అలాంటప్పుడు ఒకరిని ఒకరు నాశనం చేసుకోవడం ఎందుకు అన్నాడు.వెంటనే సేనాపతి సిద్ధార్థున్ని వ్యతిరేకిస్తూ యుద్ధం అంటూ ఏర్పడితే  క్షత్రియులు బంధువులాపరాయివారా అన్న తేడా లేదని రాజ్య రక్షణకై కడకుతోబుట్టును సైతం పోగొట్టుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పాడు.

యజ్ఞయగాదులు చేయటం బ్రాహ్మణుల కర్తవ్యం అలాగే యుద్ధం చేయటం క్షత్రియుల  కర్తవ్యం. వ్యాపారం చేయటం వైశ్యుల కర్తవ్యం. పై కులాల వారందరికీ సేవ చేయటం శూద్రుల  కర్తవ్యం మన శాస్త్రాలను ఘోషిస్తున్నాయిసేనాపతి చెప్పాడు.

వెంటనే సిద్ధార్థుడు సమాధానం ఇచ్చాడు. ధర్మ శాస్త్రాన్ని నేను అర్థం చేసుకోగలను శత్రుత్వాన్ని శత్రుత్వంతో శాంతింప చేయలేమని నేను భావిస్తున్నాను అనిఅన్నాడు. సహనం కోల్పోయిన సేనాపతి ఈ సమస్యను సంఘ సభ్యులతో మాట్లాడి తేల్చుకోమన్నాడు. అందరూ సేనాపతి  బలపరిచారు.సిద్ధార్థుడు నిరాశ చెందాడు. యుద్ధం వద్దు అంటే అందరూ యుద్ధం చేయాలి అని కంకణం కట్టుకున్నారు అని అన్నాడు.

తరువాయి భాగం వచ్చేనెల

November 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Uncategorized

కాటుక కంటి నీరు

by Vijaya Kandala November 24, 2025
written by Vijaya Kandala

 ఈరోజు  ముచ్చటలన్నీ  మన తెలుగు భాషాభిమానం గురించే  .  చెప్పుకోడానికి అనేక సంగతులు ఉన్నాయి  .ఎందరో మాతృభాష గొప్పదనం గురించి ఎప్పుడో  ,ఎందరో మరెన్నో సార్లు చెప్పారు   .మన మూ వింటున్నాం  కానీ పాటించడంలో  ఇష్టం , ఓపిక ,ఆసక్తి  అనే విలేక అనే సంగతి  తెలిసినా  , చెప్పడం అలవాటైన వారు ఊరుకోరుగా . నేను ఆ బాపతే అనుకోండి .

ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి  ?అనేది చిక్కు ప్రశ్న . అయినా చీకట్లో బాణం వేస్తున్న .ఏ కొందరికైనా తగలకపోతుందా అనే అత్యాశతో మొదలెట్టా  . ఇందులో స్పృశించిన అంశాలలో ఒక క్రమం గురించి వెతకకండి  . కోతి కొమ్మచ్చి అనుకోండి తప్పులేదు  .బహుశా అదే సరైన మాటేమో కూడా .

భాష  అనేది అతి చిన్న మాట . రెండు అక్షరాల మాట కానీ  ,ఆ రెండక్షరాలలో మర్రి విత్తనంలా  విశ్వమం తా  దాగింది  .నేల నాలుగు చెరుగు ల పా కిం ది  .ఆకాశపుటంచులను  తాకింది ఎందుకంటే భావవ్యక్తీకరణకు పునాది భాష కదా .

ప్రతి మనిషికి తల్లి ఎలా అత్యంత సన్నిహితమో  ఆమె ఒడి అనే బడిలో నేర్చిన పలుకూ అంత సన్నిహితం . అయితే ఆధునిక కాలంలో అమ్మను , అమ్మ భాషను ఒద్దు  అనుకుంటున్నాం  .అసలు గలగల మాట్లాడమంటే ఒక సు హృద్భావ వాతావరణ అని సృష్టించడమే .  ఆ వాతావరణంలో అవసరానికి మించి , ఆడంబరాన్ని జోడించి  ,ఇతర భాషా పదాలను వాడడం నల్లేరుపై బండి నడకంత సులభం  .ఆ వ్యామోహం నుంచి బయటికి రావడానికి మనకు సుతరామూ  ఇష్టం లేదు .

 ఎప్పటిది తెలుగు అంటే  ,మన ఊహకందనంత పాతది  .క్రీస్తు శకం 575లో కడప జిల్లా ఎర్రగుడిపాడు లో ఉన్న చెన్నకేశవ స్వామి ఆలయంలో ధనం జయుడు తొలి తెలుగు శాసనం వేయించాడు  .

ఎంత చక్కని భాష అండి మన తెలుగు  .గుండ్రంగా ముత్యాల లాంటి అక్షరాలతో ముచ్చటైనది మన లిపి  . కొన్ని సరదా  సంగతులు గుర్తు చేస్తాను  .విసుక్కోక చదవండి  .చదివించండి . ఆపై ఆలోచించండి .

ఆ అనే ఏకాక్షర పదం లేదా వాక్యం ఉంది . దీన్ని ఆశ్చర్యంగా  ,ప్రశ్నగా  ,జవాబుగా  ,నీరసంగా , అనుమానంగా  ఇంకా ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు .

మొన్ననే ఓ మంచి వాక్యం చదివాను  .మీరూ  చదవండి మరి .  సులువైనది . బరువైనది . గుర్తుపెట్టుకో తగ్గది కూడా. సముద్రమంత లోతైన అర్థమున్న వాక్యం ఇది. భూమ్మీదికి అరువు పై వచ్చాము  , కొంత కాలానికి భూమికి బరువై వెళ్ళిపోతాం. ఈ మధ్యలో పరువుగా బ్రతకాలి  .

చూడండి . అరువు -బరువు- పరువు ఒక అక్షరం తేడాతో ఎంత సొగసైన వాక్యం సిద్ధమైంది .

 మరో చిన్న మాట   .

రెండెడ్ల  బండ్లు అంటే  ,రెండు అర్థాలు

రెండు ఎడ్లు గల బండ్లు

 ఎడ్ల బండ్లు రెండు  .

ఎంత అందం ఉంది ఈ భాషలో  .ఇంకోటి ఇది రెండు పదాల ప్రశ్నా ర్ధక  వాక్యం  .

వాడొచ్చాడా ? నేను వివరించక్కర్లేదు .

మీరు పలికే విధాన్ని బట్టి అర్థం మారుతుంది ప్రయత్నించి , చూడండి.

ఇంకో సరదా వాక్యం .

నీ నూనె నా నూనె ని  నేనన్నానా, నీ నూనె నీ నూనె  .నా నూనె నా నూనె  .

నిదానంగా చదవండి ఒకే అక్షరంతో మూడు వాక్యాలు వచ్చాయి  .

ఒకే పదాన్ని సందర్భం బట్టి రకరకాలుగా అర్థం చేసుకోవచ్చు . బొక్కలో వేస్తాను  .నాకు లక్ష బొక్క వచ్చింది వ్యాపారంలో. బొక్కలు కొట్టే మిషన్ ఉందా ?మొదటి బొక్కకు జైలు , రెండవ బొక్క నష్టం  ,మూడో మొక్కకు పంచింగ్ మిషన్ అని అర్ధాలు వచ్చాయి  .

పులిహోర మనకు ఇష్టమైన వంటకం  .ఇందులో పులి ఎక్కడుంది అని గాబరా పడకండి . ఇక్కడ  పులి అంటే పుల్లని పులిసినఓ గిరం అంటే ఆహారం  .పులిబొంగరాలు అనే మాట గుర్తుకు తెచ్చుకోండి .

వల్ల కాడు పూర్వరూపం ఒ ల్ల కాటు పనికిరాని అడవి . అదే పొల్లకాడై వల్లకాడుగా స్థిరపడింది  .భీమా అనే పదం తీసుకోండి ఇందులోని బీమా అనేది పారసీ పదం .ఆ భాషలోభీమా  అంటే భయం  .జీవితంలో భయాన్ని పోగొట్టే సంస్థ భీమా సంస్థ .

తద్దినంకు చావుకు  సంబంధం లేదు  .దాన్ని విడదీస్తే త త్ + దినం ఆ రోజు అని అసలు అర్థం .

మనం పాకీ  పనిని అసహ్యించుకుంటాం . పవిత్రత  ,శుభ్రత  అని అర్ధం దా నికి  .పాకిస్తాన్ అంటే పవిత్రమైన దేశం అని అర్థం  .

 ఒకే పదం రకరకాలుగా వాడుతూ విభిన్నమైన అర్థాలను సాధిస్తాం  .నమ్మట్లేదా ? కింది ఉదాహరణ చూడండి

 ఆకు _లోలాకు -విస్తరాకు_ విడాకులు . ఇతర భాషా  పదాలతోను  వేరు వేరు అర్థాలను సాధిస్తున్నాం .

 ఇది సెకండ్ హ్యాండ్ పుస్తకం  .తీరా సమయానికి వాడు హ్యాండ్ ఇచ్చాడు . రెండు హ్యాండ్లూ వేర్వేరు సుమా

తెలుగు జీవద్భాష వాడుకలో ఉంది  .సరిగా వాడకుంటే  నాచుపట్టే స్థితికి దగ్గరగా జరుగుతుంది. వాడక మనం చెడుతున్నాం . ప్రతి భాషలోనూ మార్పులు చేర్పులు సహజం  .పాత అర్థాలు పక్కకు జరిగి  ,కొత్త అర్ధాలను సంతరించుకుంటాయి మనకు తెలుగు వచ్చుఅంటే  సరిపోదు  .మన తర్వాతి  తరాల సంగతి ?

మళ్ళీ తెలుగు మనదే అన్న నిజం అప్పుడప్పుడు గుర్తుకొచ్చి    ,చమత్కారాలతో కూడా జవాబిస్తాం  .

ఏమండీ సుబ్బారావు గారిల్లెక్కడా ?

ఆయనకేం పని ఇల్లెక్కడానికి   .

అర్థం ఉన్నా  లేకున్నా , కొన్ని పదాలు జంటగా వాడితేనే మనకు అర్థమవుతాయి   .ఉదాహరణ

పిల్లా జెల్ల _ఇల్లుగి ల్లు_ నగానట్రా

ధ్వని అనుకరణ శబ్దాలున్నాయి  .అది మరో ముచ్చట .

డ్డా  మ్మని పడ్డాడు .పూలు జలజలా రాలే  .  పకపక నవ్వాడు  .

పద బంధాలు _నానుడులు_ సామెతలు _పొడుపు కథలు -జాతీయాలు -కథలు -కవితలు- నవలలు _కావ్యాలు ఇంత కాలం నుండి అని చెప్పడానికి వీలుకాని రోజు నుంచి కాచిన పాలపై తేరి న మీగడ ఇదంతా . ఆస్వాదించండి . ఆనందించండి మరోమాట

అడుగు 

 దేని గురించి అని  అడగండి  .అదే అడుగు గురించి . అంటే ప్రశ్నించు అని అర్థం  .ఈ పదాన్ని ఎన్నో రకాలుగా వాడతాం. ప్రతి అడుగుకి అర్థం మారుతుంది .

అడుగు అంటే పాదం మూడు అడుగుల నే ల కావాలని వామనుడు బలిని అడిగాడుగా .

 అడుగు తీసి అడుగు పెట్టలేనంత జనం వచ్చారు

 ప్రయాణం అడుగు ఆమడగా సాగుతుందంటే చాలా కష్టంగా ఉంది అని అర్థం .

 బాల్చీలో నీళ్లు అడుగంటాయి  .

రేపు పొద్దున ఆయన అడిగితే ఏం చెప్పను ?

 ఇవాళ వాడిని అడిగేయాలి  .

నలుగురిని అడిగి చేయి .

 ఒక్కొక్క పదం ఎన్నెన్ని వన్నెలతో మీ జీవితంలో చేరిపోయిందో మీ మనసునే అడగండి .

ఇవన్నీ మాకు తెలిసినవే  . కొత్తదనం ఏమీ లేదు పాత చింతకాయ పచ్చడే గా అంటున్నారా  .నిజమే  .నాకూ  తొలు త అలానే అనిపించింది  .అయినా పాత చింతకాయ పచ్చడి  పధ్యా నికి  పనికొస్తుంది . కొత్త చింతకాయ జలుబు చేస్తుంది .సమస్యలకు  పరిష్కారాలు తెలియక కాదు  .పాటించడం ఇష్టం లేక  , ఓపిక లేక. ఆలా వదిలేస్తే  పీట ముడి  పడిపోతాయి  .

ఈమధ్య సురవరం ప్రతాపరెడ్డి గారి తెలంగాణ వ్యాసాలు అనే పుస్తకం చదివాను . అందులో తెలుగు భాషా సేవ అని ఆలోచనాత్మక వ్యాసం  ఉంది  .అది చదివాక ఇది రాయాలనిపించింది .

“దేశాభివృద్ధికి భాషాభివృద్ది ఒక గొప్ప సాధనమని అందరికీ తెలిసిన విషయమే . బెంగాలీ భాషతో సమానముగా మనదేశములో అభివృద్ధి చెందుచున్న రెండవ భాష మహారాష్ట్రము  .మీకే దేశ చరిత్ర కావలసిన ను ఈ భాష యందు దొరకగలదు .ప్రకృతి శాస్త్రవుల అనేకములు వ్రాయించబడినవి ఇట్లు మన ఇరుగుపొరుగు వారు తమ తమ దేశ భాషలను అభివృద్ధి చేసుకొని  ,అవిశ్రాంతముగా స్వార్ధమునందును దృష్టి ఉంచక , పాటుపడుచున్న మన తెలుగు సీమ వారు మాత్రము ఇతర అన్ని విషయములందువలె భాషాభివృద్ది విషయమునను గాఢ నిద్రపోవుచున్నారు .ఇది మిక్కిలి శోచనీయము .”

“విద్య రాని  వాడు తోక కొమ్ములు లేని పసరమని మన పెద్దలన్నారు . మాతృభాషనేరుగ ని వాడు  తెలివి లేని పసరమని చెప్పవలెను  .మనకు ఇంగ్లీషు , హిందీ భాషలపై కలవ్యామూహము మన మాతృభాష పై లేదు . పరభాషలన్ని నేర్చిన కులవిద్యకు సాటి లేదు గువ్వలచెన్న అని ఆ మహానుభావుడు ఆనాడే ఉర్దూ హిందీ ఇంగ్లీష్ వెలువలు మనలను ముంచుకొని పోకముందే బోధించి ఉండెను.”

“మన ప్రాచీనాంధ్ర వీరుల గాధలను తెలుపు గ్రంథాలు మనము వ్రాయకున్నా , తందాన (జంగం) కథలు చెప్పు పిచ్చిగుంట వారిలో ఆ చరిత్ర లింక నిలిచి ఉన్నవి  .అవి అంతరించక ముందే వాటిని సమకూర్చి  ,ముద్రించ వలెను . సోమనాద్రి  ,రామేశ్వరరావు  ,సదాశివరెడ్డి , తిమ్మరాజు , కుంభం పుల్లారెడ్డి , మెదక్ శంకరమ్మ , కుంభం చెన్నయ్య , సర్వాయి పాపడు మొదలగు  వారి కథలు కొల్లలుగా అనాధృతమై , ఆముద్రిత మై  ,విస్తృత పధ మందు లీనమై పోవుచున్నవి  .మనము మన జంగం కథలను సవరించి  ,సంస్కరించి  ,చారిత్రక పీఠికలతో ముద్రించి  ,ప్రచారం చేయుట అవసరము .”

“మనకు ఏ విషయమైనా తెలుసుకొనే  అవసరము కలిగితే  , ఇంగ్లీషు వాంగ్మయాన్ని ఆశ్రయిస్తున్నాము . మన భాషలో వివిధ పరిశోధనలకును , విజ్ఞానానికి పనికి వచ్చు ఉద్ గ్రంథాలను వ్రాయించి ప్రచురింపవలెను .

“ఇంగ్లీషు వారికి తమ భాషపై కల అభిమానములో సహస్రాంశము కూడా మనకు లేదు . ప్రతి జాతికిని తన మాతృభాషపై అభిమానం ఉన్నట్లు సర్వత్ర వ్యక్తమైనది  .అరబ్ తన భాష అమృతం అనియు తక్కిన భాషలంతా తన ఒంటె కాలి క్రింది దుమ్ముతో సమానమనియు అంటాడు . ఆర్యులు తమ భాష దేవ భాష అనేది తక్కినవి  భాషలనా గ రికము లు  ,తమదే నాగరిక భాష అన్నారు . ప్రాకృతము విజృంభించిన వాడు సంస్కృతాన్ని  గురించి కూడా  ఈ మాటలే అంటాడు .

మీ మనసులో ముళ్ళు గుచ్చుకున్నట్లు ఉన్నాయ ని నాకు తెలుసు . నేను అలాగే అనుకున్నాను  .ఇంకా ఇంకా చాలా అనుకున్నాను . ఎందుకంటే ఈ మాటలు 80 సంవత్సరాల క్రితం చెప్పినవి  .

ఈ మాటలు శ్రీ కొమర్రాజు లక్ష్మణ రావు గారు ఓరుగల్లు లో చేసిన అధ్యక్షపన్యాసం లోనివి .

                                                                                    ( 28 -12-1944)

ఎలా ఈ సమస్యను పరిష్కరించడం   ?

నాకు తోచిన కొన్ని సూచనలు   .మీ స్వబుద్ధితో మరికొన్నింటిని జోడించి , ప్రయత్నించండి  .మొదటగా మంచి పుస్తకాలు చదవండి  .ప్రముఖుల ప్రవచనాలను వినండి . చాలామంది ప్రవచన కారులు ఆంగ్ల పదాలు వాడకుండా , గంటల తరబడి  ,సులువైన సరళమైన భాషలో విషయాన్ని అందిస్తున్నారు . ఈనాడు పేపర్ చదవండి . అందులో నేను మొదట చదివేది సంపాదకీయాలు  ,హెడ్డింగులు .

 రోజు ఓ పది నిమిషాలు ఇంగ్లీషు పదాలు వాడకుండా మాట్లాడే ప్రయత్నం చేయించండి పిల్లలతో  .పాత సినిమాలు చూడకున్నా పర్వాలేదు డైలాగులు వినండి  .కొత్త పదాలు -పదబంధాలు- సామెతలు-నానుడులు -జాతీయాలు తెలుస్తాయి  .మీ పనులను చేసుకుంటూనే ఈ పని చేయవచ్చు .

వివిధ పత్రికల్లో వచ్చే గళ్ళ నుడి కట్టు  సరదాగా    ప్రయత్నించండీ .  చివరగా ప్రస్తుతం వస్తున్న యాంకర్ల (వ్యాఖ్యాతల) మాటలు వినండి  .అయితే ఓ మాట . పై పనులన్నీ కొంతకాలం చేశాక , చివరిది ఆచరించండి  .చూడకండి  .మళ్లీ చెప్తున్నాను . వీళ్ళు గురువులే  .ఎలా పలకవచ్చో , ఎక్కడ ఒత్తులు అవసరమో ,ఎక్కడ అనవసరమో  ,తెలుసుకునే ప్రయత్నాలు చేయండి . .

కాటుక కంటినీరు చనుకట్టు పయిం బడనేల ….   త్రి శుద్ధి గ నమ్ము భారతీ  .తెలుగు సాహిత్యంలో

ఇది పోత నా మాత్యు ని ప్రసిద్ధ చాటువు .తెలుగు సాహిత్యంలో పేరెన్నిక గన్న  ఆణిముత్యం . ఇందులో శారదా దే వి   కవి కళ్ళముందర దీన వదనంతో ప్రత్యక్షమైంది . చలించి పోయాడు  పోతన . తన జీవితా వసరాలకోసం  అమ్మనమ్మనని త్రికరణ శుద్ధిగా ప్రమాణం చేశాడు .

మన కీనాడున్న   సమస్యలు అలాంటివి కావు . ఆకలి వే ళలు  లేవు . రాజ్యస్థానాల  అదలింపులు , బెదరింపులు కనుచూపు మెరలో లేవు . రావు . ఐనా తెలుగు భాషకు ఈ దుస్థితి ఏల ?

ప్రభుత్వాన్ని నిందించి మన భాధ్యతను వదిలించుకుందామా ?

మనవైపు నుంచి నిశ్శబ్దం సబబేన ?

మన నరనరాల్లో ,అణువు అణువున జీర్ణించిన జాతి సంపదను చేతు లా రా జా రవిడుచుకుందామ  ?

కొంతకాలానికి తరు వాతి తరా లు  తెలుగు గొప్పదనాన్ని ఇ తర దేశీయుల ద్వారణో  ,పర భాశీయుల ద్వారానో  తెలుసుకుని  మనల్ని క్ష మి స్తారా

మనమేం చేద్దాం

ఆలోచించండి .

తెలుగు భాష గొప్పదని మనం కొత్తగా చెప్పనక్కరలేదు  .వెనకటి వారెందరో ఎప్పుడో చెప్పేశారు .ఆ భాష గొప్పదనాన్ని తెలుసుకోండి  .తర్వాత తరాలకు దాని మీద ఆసక్తి కలిగేలా ప్రోత్సహించండి . ఇప్పటి తల్లిదండ్రులు మీకు ఆసక్తి కలిగితే  ,తప్పనిసరిగా అది మీ పిల్లలలో ప్రతిఫలిస్తుంది . చదవడం ఎప్పుడైతే మొదలవుతుందో అప్పుడే మన భాషా జ్ఞానం పెరుగుతుంది . వేగంగా చదవడం అలవాటు అవుతుంది  .మన ఆలోచన పరిధి విస్తరిస్తుంది .

మన మనసులోని భావాలను ఇతరులకు అందించడానికి ఇతరులు చెప్పిందాన్ని గ్రహించడమే భాషకు పరమావధి . అది చేతగానప్పుడు తెలుగువారు అని చెప్పుకోవడం సమంజసమేనా ?నాకు జవాబు అవసరం లేదు మీ మనసును మీరే ప్రశ్నించండి  .సమాధానం మీకే తెలుస్తుంది .

November 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

రామబ్రహ్మం గారు రెబ్బాప్రగడ…

by Achyutuni Rajasri November 24, 2025
written by Achyutuni Rajasri

ఆయన వృత్తి ప్రవృత్తి పూర్తిగా భిన్నం! ఒక యువ శాస్త్రవేత్త గా ఎదిగి దేశాలు పర్యటించిన ఆయన శ్రీ రామబ్రహ్మంగారు.చదివిన చదువుకి ఆయన సంగీత సాహిత్య అభిరుచికి ఏమాత్రం సంబంధం లేదు.కానీ ఆరెంటిలోనూ రాణించారు.
28.8.1960లోతూర్పుగోదావరిజిల్లాలోని శ్రీకృష్ణ పట్టణంలో ప్రభవించిన ఆయన ఆధ్యాత్మిక రంగంలో తన అంతిమ శ్వాస దాకా గడిపిన ధన్య జీవి.ఆంధ్రాయూనివర్శిటీలో B.E. ఖర్గపూర్ IIT లో M.Tech చదివిన ప్రతిభాశాలి. ఇస్రో లో సైంటిస్ట్ గా తొలిసారి జాబ్ లో చేరారు.IISC బెంగుళూర్ లో ఎలక్ట్రానిక్స్ లో PHD చేశారు.16 ఏళ్లు ఇస్రోలో ఆపై పలు ప్రైవేట్ సంస్థల్లో ఉన్నత పదవులు అలంకరించారు.2019 లో ఇద్దరు పిల్లల బాధ్యత తీరాక ఆధ్యాత్మిక రంగంలోప్రవేశించటం పూర్వజన్మ అలరించాయి సుకృతం.2016 నుంచి తనదైన శైలిలో భక్తి పాటలు తెలుగు సంస్కృతంలో రాసి గాయనీ మణుల చేత పాడించారు అవి యూట్యూబ్ లో చాలా మందిని అలరించాయి

54వ ఏటనే అమ్మవారిని స్తుతిస్తూ ఆయన రాసిన భక్తిపాటలు జనాల్ని ఉర్రూతలూగించాయి.తూ.గో.జిల్లా వెదురుపాకలో విజయదుర్గాపీఠం గురువు గారి ఆశీస్సులు స్ఫూర్తితో ఆయన లో కవిత భక్తిధారలుగా ఎగిసి పాటలరూపంలో ప్రజాహృదయాల్లో చొచ్చుకుపోయింది. ఎలాంటి భేషజం గర్వం లేకుండ తరతమభేదం చూపకుండా తోచిన అడిగిన సాయంజేసిన దొడ్డ బుద్ధి ఆయనది.
భగవద్గీత సారాన్ని వంట బట్టించుకున్నారు.ఇలా ఇంటాబైట మంచిపేరు సంపాదించిన ఆయన కాలంచేసి 9నెలలైంది.కానీ ఆయన రాసిన భక్తిపాటలు అజరామరాలు.ఆయన బెంగుళూర్ లోనే స్థిరపడినా మాతృభాష ను సంగీతాన్ని ప్రేమించిన వ్యక్తిగా నిల్చిపోయారు

November 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

జ్ఞాన గుళిక -1

by Naresh Chary November 24, 2025
written by Naresh Chary

“పలకలనుంచి పలుకులవైపు”
కందుకూరి శ్రీరాములు గారి కవితా సంపుటి

మిత్రులకు నమస్కారం
ఈరోజు జ్ఞాన గుళిక శీర్షికన నేను పరిచయం చేస్తున్న మొదటి పుస్తకం ప్రముఖ కవి కందుకూరి శ్రీరాములు గారి కవితా సంపుటి పలకల నుంచి పలుకుల వైపు. చదివి ఆనందిస్తారని ఆశిస్తూ….

ఉత్తమమైన పలుకులు

“మొక్కై వంగనిది మానై వంగునా”అనేది పెద్దల మాట. అది మనిషికి కూడా వర్తిస్తుంది‌. ఒక మంచి సమాజం రూపొందాలంటే ముందుగా వ్యక్తికి మంచి వ్యక్తిత్వ నిర్మాణం జరగాలి. ఆ వ్యక్తిత్వ నిర్మాణం బాల్యదశనుండే ప్రారంభం కావాలి. బాల్యదశ నుంచి తల్లిదండ్రులు, గురువులు వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతారు.ఆ తీర్చిదిద్దడంలో ఉపయోగపడేవి నీతి కథలు, కవితలు,పాటలు,పద్యాలు గేయాలు.వీటిని చిన్నప్పటినుండే పిల్లలకు అలవాటు చేస్తే వారు మంచి పౌరులుగా ఎదుగుతారు.
ఎవరికి వారే యమునా తీరే అనేట్టుగా బ్రతుకుతున్న ఈ కాలంలో సాహిత్యకారులు మాత్రం ఉత్తమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు. అందులో కందుకూరి శ్రీరాములు గారి కృషి శ్లాఘనీయం. వారు 1974 (దివిటి)నుండి కవిత్వం ప్రారంభించి అంచలంచలుగా ఎదిగి తెలంగాణలో ప్రముఖ కవిగా గుర్తింపు పొందారు. వారు ఉపాధ్యాయులుగా పనిచేస్తూనే కవిగా,సామాజిక శాస్త్రవేత్తగా మారడం ఎంతో మంది బాగుపడడానికి కారణమైంది.
లోగడ కందుకూరి శ్రీరాములు గారు ఎన్నో కవితా సంపుటాలను వెలువరించినా 2024 లో వెలువరించిన “పలకల నుంచి పలుకులవైపు”అనే కవితా సంపుటికి ప్రత్యేకత ఉంది. ఇందులోని కవితలన్నీ బాలలకు,కళాశాల విద్యార్థులకు సంబంధించినవే. ఇందులో 49 కవితలు ఉన్నాయి. ఇవి బాల్యాన్ని అద్భుతంగా చిత్రించిన కవితలు . ఎవరి జీవితం లోనైనా బాల్యం చాలా ముఖ్యమైంది.దానికి పేద,ధనిక బేధం ఏమీ ఉండదు. అందరికీ మంచివో, చెడ్డవో జ్ఞాపకాలు అనేకం ఉంటాయి. బాల్యం ఎలాంటిదో కవి ఈ విధంగా చెబుతాడు “కన్ను మీద కనురెప్ప పడ్డంత సున్నితం/మట్టిపెళ్ల మీద తొలకరి పడ్డంత /సునిశితం-సువాసనత్వం (చిగురు కల) నిజమే కదా!. బాల్యంలో ఎవరికైనా బడితో అవినాభావ సంబంధం ఉంటుంది. జ్ఞానాన్ని ఒంటబట్టించుకున్నవాడు గొప్పవాడిగా ఎదుగుతాడు, తల బరువు అనుకునేవాడు సమాజానికి భారంగా మారుతాడు. బడిలో ఎలాంటి వారు వస్తారు? ఎందుకొస్తారు? అసలు బడి అంటే ఏమిటో ఇలా చెబుతాడు కవి “ఒకడు అమాయకుడిలా వస్తాడు/ కొన్నిఊహలు పెంచి కొన్ని వ్యూహాలు చెప్పి /శస్త్రాస్త్ర విద్యలు నేర్పితే /వీరుడిలా తయారవుతాడు. ఒకడు బక్క చిక్కిన వాడు వస్తాడు/ వ్యాయామం మార్చి ఫాస్ట్ తో/ ఆరోగ్య సూత్రాలు చెప్పి బలవంతుడిని చేస్తే/ వస్తాదై కుస్తీకి దిగుతాడు. గుడ్డివానికి చూపు/ చెవిటివానికి వినికిడి/కుంటివానికి నడక/ తొంటి వానికి చేయి/ మూగవానికి మాట/గుండె లేని వాడికి శ్వాస అందించే కర్మాగారం/ఈ నారుమడి బడి(తుకం). పాఠశాలలో దెబ్బలు తింటే భవిష్యత్తులో లాఠీ దెబ్బలు తినే అవసరం రాదు అనేది ఇప్పుడు అంటున్న మాట.దాన్ని గుర్తుకు చేస్తూ “అక్షరాలు నేర్పటం ఎంత ప్రయత్నం/ జ్ఞానం పొందటం ఎంత పరీక్ష /ప్రతి పీరియడ్ నెలవంకల గోడ కుర్చీలే /నిండు పూర్ణిమ జ్ఞానం పొందడానికి/ ప్రతిరోజూ గుండు సున్నాల కోదండాలే/ నిలువెత్తు సంతకం ఆకాశమంత రాయటానికి-/ఎందుకు చదవలేదని అటు గోడ దెబ్బ ఇటు చెంప దెబ్బ /అమ్మ – గురువు(బరిగె) అప్పట్లో చదువుకున్న ప్రతి ఒక్కరికి దాదాపు ఒకసారైనా ఇలాంటి అనుభవం ఎదురవుతుంది.
శిక్ష అనుభవిస్తున్నప్పుడు మనకు టీచర్ పై కోపం వచ్చినా ఇప్పుడు గుర్తొస్తే నవ్వొస్తుంది. ఏ గురువుకు కూడా విద్యార్థి శత్రువు కాదు.వారి భవిష్యత్తు బాగుండాలని, తనకంటే పై స్థాయికి ఎదగాలని కలగంటాడు. అప్పట్లో పెద్దబాలశిక్ష చదివితే మొత్తం చదువు వచ్చినట్టుగానే భావించేవారు. ఎందుకంటే అది ఒక ఎన్సైక్లోపిడియా. కాలక్రమేనా విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు వచ్చాయి. పెద్దబాలశిక్ష కనుమరుగైపోయింది కానీ అప్పట్లో పెద్దబాలశిక్ష పూర్తి చేశామంటే డిగ్రీ పూర్తి చేసినట్టు లెక్క.ఇప్పుడున్న ప్రతి మేధావి పెద్దబాలశిక్షతో అనుబంధం ఉన్నవాళ్లే‌. దాని పేరు మీదనే అద్భుతమైన కవితను అందించారు కవిగారు. అందులో “మనం మనిషిని మనిషిగా చేయడం మరిచాం/ శిల్పానికి గుండెనిచ్చి బొమ్మకు కన్నీళ్ళని ఇవ్వాలి/మాతృస్తన్యం తాగి పెరిగిన యువకుల్లారా/ పారతంత్ర్యం అనే మాట వద్దు/శాస్త్ర విజ్ఞానం లేని భాషా బట్టీయం/అమ్మా అని అర్థం తెలియని అవిద్య పాఠాలు/ బాధలు కన్నీళ్లు తెలియని గుడ్డులో దాగి ఉన్నాం/ ఇవాళ రేపు తెలియని ఇంగ్లీష్ వ్యామోహంలో పడ్డాం/అంటూ నేటి విద్యా విధానాన్ని ఎండగట్టాడు.ఇదే కవితలో “సామాజిక రుగ్మతలు అర్థమైతే తప్ప /వాడు డాక్టర్ అయినా లాభం లేదు/ శ్లోకం కంటే ముందు శోకం తెలుసుకోనీయండి” (పెద్దబాలశిక్ష) అంటూ చదువుకునే యువతకు దిశానిర్దేశం చేస్తాడు. నిజమే కదా ! బట్టీ విధానం ద్వారా ఏమొస్తుంది? ఏమీ రాదు. విషయం అర్థమైతే తప్ప తనెంచుకున్న రంగంలో నిపుణుడు కాలేడు. విద్య యొక్క విలువలు ఒంటబట్టించుకుంటే తప్ప దేశం పురోగతిని సాధించదు. విద్యార్థులు స్వేచ్ఛగా ఉన్నప్పుడే ఎక్కువగా నేర్చుకుంటారని సృజన శక్తి కూడా బయటకు వస్తుంది అని చెప్పే ఈ కవితా వాక్యాలు అందర్నీ ఆలోచింపజేసేలా ఉంటాయి”అందమైన చేపను/ తలకిందులుగా వేలాడదీసి /ప్రశ్నల జవాబుల పరీక్ష పెట్టకు/ నీళ్లలో వదులు/ వేయి వయ్యారాలు పోతుంది”(బోర్డు మీద బొండు మల్లెలు)
కందుకూరి శ్రీరాములు గారికి బోధన అంటే మక్కువ ఎక్కువ. త్రికరణశుద్ధిగా కర్తవ్య నిర్వహణ చేశాడు కాబట్టే మండల స్థాయి, జిల్లాస్థాయి,రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు అవార్డులను అందుకోగలిగాడు. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్మాణమవుతుంది అనే మాటను బలంగా నమ్మాడు కాబట్టే అహర్నిశలు శ్రమించి తనవంతుగా దేశానికి ఉత్తమ పౌరులను అందించగలిగాడు. తను పని చేస్తున్న కాలంలో పాఠశాలలో ఏ చిన్న సమస్య వచ్చినా అది ఉపాధ్యాయునికి కావచ్చు లేదా విద్యార్థికి కావచ్చు దానిపైన కవితతో స్పందించాడు. విద్యార్థుల భవితకై ఎన్నో కవితలు రాశాడు. వాళ్లలో కవితా స్పృహను కలిగించాడు. ఆలోచన దృక్పథాన్ని మార్చగలిగాడు. ప్రతి విద్యార్థి ఏదో సామర్ధ్యాన్ని కలిగి ఉంటాడని నమ్మాడు. దాన్ని గురించి ఒక కవితలో ఇలా చెప్తాడు “అది మొగ్గే కావచ్చు/ స్పృశించు/ వేయి రెక్కలై విచ్చుకుంటుంది/ ఆ పాప మూగే కావచ్చు/కదిపి చూడు /కళ్లతో మాట్లాడుతుంది/ ఆ చేయికి అ ఆ లు చుట్టరావనకు సున్నాలు చుట్టిన చేయే సన్నాయి రాగం పలుకుతుంది/ బలపాలు కారిన ముక్కే/ ప్రభంజనాల్ని శ్వాసిస్తుంది/పూల గొట్టాలనూదినన నోరే/శబ్ద శంఖారావమవుతుంది గోడను ఆసరా పట్టుకొని లేస్తున్న కాళ్లే/ కదనరంగంలో తురంగాలు అవుతాయి/ అంటూ చెబుతూనే గురువుగారి కర్తవ్యం కూడా “వాళ్ళమ్మ ఒడిలో పడుకోబెట్టుకోవచ్చు/ నువ్వు జనం కత్తుల ఒరలో నిద్ర లేపు” (శిలను చెక్కితే) అంటూ గుర్తు చేశాడు. తను ఏం చేశాడో మరో కవితలో ఇలా అద్భుతంగా చెప్పాడు” అక్షరాన్ని ఆయుధం చేశాను/ చూపుకు పదును పెట్టి /గురి తప్పని కిరణమై/ చీకటి మండలాన్ని /కూకటివేళ్లతో పెగిలించింది (ఆకాశం అంచు).
కవిత్వం సానుభూతి లేదా సహానుభూతి నుండి వస్తుంది.పాఠశాల స్థాయిలో రకరకాల విద్యార్థులను చూసిన కందుకూరి శ్రీరాములు గారు ఎన్నో కవితలు రాశారు.అందులో చేతుల్లేని విద్యార్థిని చూసి రాసిన కవిత ఆనాటి దృశ్యాన్ని మనకు కళ్ళ ముందు చూపుతుంది “నిండిన హాస్య సభలో నవ్వుల జల్లులు కురిసినప్పుడు/అందరి కరతాళ ధ్వనుల మధ్య/ వాడి భుజాలకు వేలాడుతున్న/ కుక్క చెవుల చేతులు టపటపలాడినప్పుడు/అప్పటి వాడి సంతోషం మనకు దుఃఖంగా /అప్పటి వాడి ఆనందం మనకు అంతర్మధనంగా మారకపోతే/ అసలు మనం మనసున్న మనుషులమే కాదు”( శబ్ద శరీరం) ఎంతో ఆర్ద్ర హృదయం ఉంటే తప్ప ఇలాంటి కవిత రాదు. అలాగే ట్రాక్టర్ యాక్సిడెంట్ అయి నడుము విరిగిన విద్యార్థిని చూసి రాసిన కవిత కూడా అప్పటి దృశ్యాన్ని మన కళ్ళ ముందుంచి గుండెని మెలిపెడుతుంది.” వాడు /ఇంజనీర్ కావలసిన వాడు/ విరిగిన ఎముకలని కొలుచుకుంటున్నాడు/ డాక్టర్ కావలసిన వాడు/ నాడీ సరి చూసుకుంటున్నాడు/ శాస్త్రజ్ఞుడు కావలసిన వాడు/ భూమి మీద అంబాడుతున్నాడు/ మేఘాలలోకి ఎగిరే రెక్కలు తెగిపోయి/ బురదలో కుమ్మరి పురుగైనాడు”(ప్రభాకరుడు )అంటూ విద్యార్థి స్థితిని ఎంతో ఆవేదనాభరితంగా కవితలో చిత్రించాడు.ఉపాధ్యాయ వృత్తి అంటేనే నిత్యం పుస్తకాలతో కుస్తీ. పుస్తకంపై కూడా రాసిన కవిత గొప్పగా అనిపిస్తుంది.”అక్షరాల్లో /పత్రహరితం నింపుకొని/ ఆరిపోయే దీపానికి /ఆక్సిజన్ వదులుతుంది(పూసే పుస్తకం) అంటూ పుస్తక స్వభావాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. అలాగే విద్యార్థుల మధ్య స్పర్ధ ఉన్నట్లయితే చదువులో ఎక్కువగా రాణిస్తారు.వారిని ఎప్పటికప్పుడు ప్రోత్సహిస్తూ ఉత్సాహవంతమైన మాటలు చెప్తేనే వాళ్లు గమ్యం వైపు వడివడిగా అడుగులు వేస్తారు. ఆ ప్రయత్నమూ చేశారు కందుకూరి వారు. “నువ్వో మెట్టెక్కావనుకో /నీ పక్కనుండి వెళ్లి /వాడు రెండు మెట్లు ఎక్కుతున్నాడు/ నువ్వు అలాగే నుంచున్నావనుకో /వాడు ఆకాశాన్ని ఆక్రమిస్తాడు/ నువ్వు అడుగంటుతావు”( కాలజ్ఞానం )అంటూ విద్యార్థులను తట్టి లేపుతాడు కార్యోన్ముఖులను చేస్తాడు.
పిల్లలను మంచి వ్యక్తిత్వం గల వ్యక్తులుగా రూపుదిద్దడంలో తల్లిదండ్రుల తర్వాత బాధ్యత ప్రధానంగా ఉపాధ్యాయుల పైనే ఉంటుంది.విద్యార్థులు మట్టిముద్దలాంటివారు. వాళ్లను ఎలా అంటే అలా మలవవచ్చు. ఉపాధ్యాయులు పాఠశాలలో నేర్పిన క్రమశిక్షణ, నిబద్ధతే విద్యార్థికి జీవితాంతం తోడుండి విజయం వైపు అడుగులేయిస్తాయి. కాబట్టి వారి అందమైన భవిష్యత్తు రూపకల్పనలో ఉపాధ్యాయుడి పాత్ర అత్యంత కీలకమని చెప్పే ఈ కవిత సార్వకాలీనమైంది.” బువ్వ తినిపించటమూ/బుజ్జగించటమూ అది మీ ధర్మమైతే/ విల్లు వంచమనటం/ అల్లే తాడు బిగించి బాణాలు సంధించమనటం/ ఇది మా కర్తవ్యం/మీరు లాలి పాటలు జోల పాటలు పాడి నిద్రపుచ్చుతారు/ మేము శ్లోకాలు చెప్పి వాటికి అర్థాలు చెప్పి బుద్ధిని మేల్కొల్పుపుతాం/ మీరు బట్టలు కొని కుట్టించి తొడిగించి /మల్లెపూలను చేసి పంపుతారు/మేం ఆ మల్లెల్ని దారాల సూదుల్తో గుచ్చి/ దండలల్లి ఒక హోదాను కల్పిస్తాం/ కని పోషించడం మీకు తెలుసు/ కనిపించేట్లు అందలమెక్కించడం మాకు తెలుసు”అని చెప్తూనే “తీర్పు చెప్పే మా ఎర్రపెన్నుంది చూశారూ!/ సుప్రీంకోర్టు కన్నా గొప్పది/ తిరుగులేని తీర్పు చెపుతుంది”. (స్పాట్) అంటూ తలుచుకుంటే గురువు విద్యార్థిని సక్రమ మార్గంలో పెట్టడానికి ఏమైనా చేయగలడు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పాడు.
కందుకూరి శ్రీరాములు గారు రాసిన ఈ “పలకల నుంచి పలుకుల వైపు” కవితా సంపుటిలో మొత్తం విద్యార్థుల్లో చైతన్యపరిచే కవితలు,ఆలోచింపజేసే కవితలు, అనుసరించే కవితలు పుష్కలంగా ఉన్నాయి. కొన్ని కవితలు కంటతడి పెట్టిస్తాయి. కందుకూరి వారి శైలి, శిల్పం అలంకారికత ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తాయి. ఇవన్నీ ఉత్తమ మైన పలుకులు,పిల్లలకి, కాలేజీకి వెళ్లే యువకులకు ప్రోత్సహించే కవితలు ఇందులో ఉన్నాయి. ఇది అందరూ చదవదగ్గ పుస్తకం.

November 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

జ్ఞాన గుళిక: 2

by Naresh Chary November 24, 2025
written by Naresh Chary

ఏకధార (కందాళై రాఘవాచార్య గారి కవితా సంపుటి)
8790593638

ఎవరి కవితనైనా చదివిన తరువాత తన విలక్షణమైన స్పందనతో ఆకట్టుకునే కందాళై రాఘవాచార్య గారు బహుముఖ ప్రజ్ఞాశాలురు.వీరు బండలింగాపురం( ఉమ్మడి కరీంనగర్ జిల్లా) వాస్తవ్యులు ,1969 నుంచి కవిత్వం రాస్తున్న సీనియర్ కవుల్లో ఒకరు. అప్పటినుంచి ఇప్పటివరకు దాదాపుగా 4000లకు పైగా కవితలు రాశారు. నాకు సోమవారం కవి సమ్మేళనం ద్వారా పరిచయమైన కందాళై రాఘవాచార్య గారు తన విశిష్టమైన కవితా వస్తువులతో, కవిత్వంతో నన్ను ఆకర్షించారు. నేను అడగ్గానే తన తొలి కవిత సంపుటి “ఏకధార”ను నాకు 12-07-2021న పంపించారు. పంపిన రోజే దాన్ని పూర్తిగా చదివి అభిప్రాయం కూడా చెప్పాను.వారు చాలా సంతోషించారు కూడా. అనంతరం తనను మయూఖ‌ ఆన్లైన్ పత్రిక కోసం ఇంటర్వ్యూ కూడా చేశాను. అందులో వారు ఎన్నో కొత్త విషయాలను వెల్లడించారు.
ఇక ఈ కవితా సంపుటి ” ఏకధారలో “మొత్తం 100 కవితలున్నాయి. ఈ నూరు కవితలు / రేపటి నారు కవితలని కవి ఎంతో ఆశాభావంతో చెప్పడంవల్ల కవిత్వం ఎలా ఉంటుందో ఓ అంచనాకు రావచ్చు. ఈ సంపుటిలో నందిని సిధారెడ్డి రెడ్డి సార్ గారి ముందు మాటలు,తన చిరకాల మిత్రుడైన వి.పి చందన్ రావు గారి స్పందన విశేషంగా ఆకట్టుకుంటాయి.
ఏ కవికైనా తొలినాళ్ళలో తన చుట్టూ ఉన్న వాతావరణం,పరిస్థితులు కవితావస్తులవుతాయి అందులో చెరువు కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే బతుకమ్మ పండుగప్పుడు,ఈతలు నేర్చుకుంటున్నప్పుడు, చేపలు పడుతున్నప్పుడు చెరువు బాల్యానికి విశేషమైన జ్ఞాపకాలను ఇస్తుంది. అందుకే గ్రామీణ వాతావరణంలో పుట్టిపెరిగిన ప్రతి ఒక్కరికీ చెరువుతో విడదీయరాని అనుబంధం ఉంటుంది. అందుకే ప్రతికవీ చెరువు మీద కవిత రాయకుండా ఉండలేడు. కందాళైగారు కరువు కాలం నాటి చెరువుల గురించి ఏమంటారంటే “భూమి పూజ కాదు/చెరువు పూజ చేయాలి/ ఇప్పుడు ఉన్నవన్నీ పేరున్న చెరువులే/ నీరున్న చెరువులు కావు/అని చెరువులు ఎండిపోతున్న వైనాన్ని కళ్ళకు కడతాడు. సానుభూతి,సహానుభూతి ఉంటే తప్ప కవిత్వం రాదు. కవికి ఒక్కొక్కరు ఒక్కో విధంగా నిర్వచనాలు ఇచ్చారు.కందాళైగారు ” కవి/ దుఃఖానికి చిరునామాగా /అందరి నోటా నానుతున్నాడని” కవికి కొత్త భాష్యం చెప్పారు. (దుఃఖం ద్వీపకల్పం). ఈ ప్రపంచం మొత్తం దుఃఖమే ఉందని రాస్తూ దుఃఖం హృదయ మథనంగా/ నిలువెత్తు మనిషిని నీరు చేస్తుంది/ దుఃఖానికి జవాబులు ఏ గ్రంథంలో దొరుకుతాయి” (దుఃఖద్వీపకల్పం) అని ప్రశ్నిస్తూనే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడమే దుఃఖనివారణకు సరైన పరిష్కారమని పరోక్షంగా చెబుతాడు. సమాజంలోని సమస్యలను ఎత్తిచూపడం, అన్యాయాన్ని ప్రశ్నించడం కవి లక్షణం. మన సమాజంలో అస్పృశ్యత ఇప్పటికీ అక్కడక్కడా కనిపిస్తూనే ఉంది.అస్పృశ్యత గురించి కవులు ఎన్నో రకాలుగా కవితాస్త్రాలను సంధించారు. కందాళైగారు కూడా అస్పృశ్యతను ప్రత్యక్షంగా చూసి కవితాస్త్రాన్ని సంధించారు.”ఊర్ల ఓట్లకాడ అందరం ఒకటంటారు/ రమ్మంటరు – రాకుంటే లేప్కపోయి ఓట్లేపిస్తరు/ దొరలను అరుసుకున్నట్లు అరుసుకుంటరు/రాస్కుని పూస్కొని తిరుగుతరు/ అప్పుడు గిట్ల ముట్టుడు లేదు-అంటుడు లేదు/ ఈడ చాగిలాస దగ్గర ముట్టుడచ్చింది”(చాగిలాస) అని వాస్తవ స్థితిని మన కళ్ళకు కడతాడు,ఆలోచనలో పడేస్తాడు.
మనకు స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా ఇంకా అన్యాయాలు,అక్రమాలతో భరతమాత దుఃఖిస్తూ ఉన్నదని చెబుతాడు. అందుకే “దేశం నాలుగు దిక్కులూ కన్నీటికి వేదికే/ కొన్ని కోట్ల జనాల కన్నీళ్ళతోనే సముద్రం పురుడు పోసుకుంది”(కన్ను జాగ్రత్త- కన్నీరు జాగ్రత్త). నేడు దేశానికి అన్నం పెట్టే రైతన్నకు భూమి కరువవుతోందని ఇప్పుడు “దున్నేవాడిది కాదు భూమి /కొన్న వాడిదే భూమి/ కబ్జాతంత్రం చేసినవాడిదే భూమి /ఇక పంట భూమిలోని నాగలికి పక్షవాతం వచ్చినట్టే అని వాస్తవాన్ని మనకు తెలియజేస్తూనే “భూమిపై ఎవడూ జెండా పాతలేడు/భూమే అందర్నీ పాతేస్తుంది” అనే నగ్న సత్యాన్ని చెబుతాడు(కొన్న వాడిదే భూమి). అంతేకాకుండా ఈ కవిత సంపుటిలో భూమిపైనే రాసిన మరిన్ని కవితలు మనల్ని ఎంతో ఆలోచనలో పడేస్తాయి, ఆర్ద్రతను కలిగిస్తాయి. “భూమి జపం” శీర్షికన రాసిన కవితలోని కొన్ని కవితా వాక్యాలు ఒకసారి పరికించండి “భూమి ఈరోజు ఒకడిది /రేపు మరొకటిది/ చేతులు మారిన భూమికి ఇద్దరూ రక్తం అంటిస్తారు/ కొందరు జెండాలు నాటితే/ కొందరు తూటాలు చల్లుతారు/ అమాయకులు భూమిపై ఒరిగిపోతారు/ అని చెబుతూనే వర్షం పడని కాలం భూమికి ఆకాల జ్వరం – కరువు క్యాన్సర్ అంటాడు. “పంట భూమి పట్నం వాడి చేతిలోకి కట్నంగా పోతుంది/ ఏమీ లేని వాడికి భూమి లేమి బుక్కలేమి”/ అంటూ సామాన్యుని పక్షాన నిలబడతాడు.
తెలంగాణ తొలి దశ పోరాటాన్ని మలిదశ పోరాటాన్ని ప్రత్యక్షంగా చూసిన కవి కాబట్టి చాలా విషయాలను కవితల్లో చెప్పారు. నీళ్లు, నిధులు, ఉద్యోగాల కోసమే కాకుండా తెలంగాణ భాష యాస సంస్కృతి నిలబెట్టుకోవడం కోసం కూడా తెలంగాణ రాష్ట్ర పోరాటం జరిగింది. దీనిపైన ఎందరో కవులు కవితలల్లారు. 2009 నుంచి 2014 వరకు మలిదశ పోరాటం అనంతరం మన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైందో అంటే అవి ఇలా చెప్తాడు “తెలంగాణ రాష్ట్రం మనకు వచ్చినాక /తంగేడు పూలకు రాచరికం వచ్చింది” (పెరట్లో తంగేడు). తెలంగాణ సాంస్కృతిక కళారూపం బతుకమ్మ. దాంట్లో తంగేడు పువ్వుకు విశిష్టమైన స్థానం ఉంది. ఆంధ్ర పాలనలో బతుకమ్మకు అంతగా గుర్తింపు రాలేదు.తెలంగాణ వచ్చాకే బతుకమ్మ విశ్వసుందరైంది.
నిరాశ ఎంతటి మనిషిలోనైనా చైతన్య జ్యోతిని ఆర్పేస్తుంది. ముందుకెళ్లాలన్నా ఏదైనా సాధించాలన్నా ఆశాభావం అనేది చాలా ముఖ్యం.అందుకే కవి “అన్ని పంటల కన్నా/ఆశ పంట గొప్ప/ఆశ కోయవద్దు/ నిరాశ అసలు వద్దు/ నువ్వు బతితేనే /లోకమంతా బతుకు” (పొద్దుతిరగని పువ్వు) అంటూ ఉత్సాహం నింపే కవితా వాక్యాలు రాస్తాడు. వ్యక్తి బాగుపడాలన్నాదేశం బాగుపడాలన్నా,పాలకులు సరైన దిశలో పాలన కొనసాగించాలని చెబుతూ పాలకులు పదేపదే మాట తప్పడం వలన ప్రజలకు నమ్మకం పోతుందని మాట తప్పడం వాళ్ళకు సహజమైపోయిందని కవి వాపోతూ “వేదికలపై నినాదాలు, హామీలు అసంపూర్ణ వాక్యాలే” (అసంపూర్ణ వాక్యం) అంటూ పాలకులకు చురకలంటిస్తాడు”.ఉదయానికి అస్తమయానికి మధ్య ఎప్పుడూ ఒక సంపూర్ణ ప్రణాళిక దర్శనం కాదు /మళ్ళీ ఉదయం కాకుండానే అర్ధరాత్రి చంపబడుతుంది”అంటూ వారు ఏ విధంగా ప్రణాళికలను మధ్యలోనే వదిలేస్తారో ఎండగడతాడు. అగ్గిపుల్ల,సబ్బుబిళ్ళ కాదేది కవితకు అనర్హం అన్నాడు శ్రీశ్రీ .చూడాలే గానీ ప్రతి వస్తువులో కూడా కవికి కవిత్వం కనిపిస్తుంది.”మేడలు శుభ్రంగా ఉన్నాయి /మేడలోని చెత్తతో /నగరమంతా /చెత్త నగరం అయిపోయింది(చెత్త నగరం)అని చెత్త పై కవిత రాస్తూనే మనం చెత్తను నిర్లక్ష్యం చేసే తీరును కళ్ళ ముందుంచుతాడు. అలాగే” దిండు “పై కవిత రాస్తూ “ఈ దిండు/ఆమె సహస్ర శోకాలను దాచేస్తూ/ ఎన్ని కన్నీటి నదులను పీల్చిందో!/నాని నాని పిడుచగట్టుకపోయింది” నిజానికి ఆడవాళ్ళకి దిండే సాంత్వన చేకూర్చే మిత్రురాలిగా మారినట్టు అద్భుతమైన ఊహ చేశాడు.అదే కవిత చివరిలో ఇలా అంటాడు “ప్రతి ఇంట్లో ప్రతి స్త్రీ దుఃఖం ఎవరికీ తెలియదు/ఒక్క దిండుకు తప్ప”.
మన దేశంలో నక్సలిజం ఇంకా పూర్తిగా అంతం కాలేదు ఇప్పటికీ అక్కడక్కడ అడవుల్లో, కొండా కోనల్లో ఎన్కౌంటర్లు జరుగుతూనే ఉన్నాయి. ఎవరివైతేనేమి ప్రాణాలు ప్రాణాలే కదా! ఎవరు చనిపోయినా వాళ్ళ కుటుంబానికి వారు దూరమైనట్టే కదా!ఎవరికైనా కడుపుకోత ఉంటుంది కదా!”అడవిలో కోయిలలు కూయడం లేదు/ తుపాకులు కూస్తున్నాయి రక్తరుతువంటూ( కోయరాని కోయిల) ఆ కవితలోనే “అడవి నిండా పూల తీగలు కాదు /యమపాశాలు వేలాడుతున్నాయి”.అని అక్కడి పరిస్థితిని హృద్యంగా చూపెడతాడు. టెక్నాలజీ ఇంత పెరిగినా వరకట్న సమస్య ఇంకా అక్కడక్కడ కనిపిస్తూనే ఉంది. ఈ వరకట్న భూతానికి మహిళలు ఇంకా చిత్రహింసలకు గురౌతూనే ఉన్నారు. రకరకాల పద్ధతుల్లో స్త్రీ బలి అవుతునే ఉంది. “స్త్రీని వధించడానికి ఈ కట్న వ్యవస్థకు నూగారు చీర సైతం దుష్ట ఆయుధమే /నిరపరాధి చీర అపరాధిగా వేలాడుతోంది/ చీర తాడై ఆమె కట్టె అయిపోయింది/ ఇప్పుడు షోకేస్ లోని చీరలన్నీ నాకు తాళ్ళుగా కనిపిస్తున్నాయి” (చీరతాడు)అంటూ వాస్తవ స్థితిని మన ముందుంచి కంటతడి పెట్టిస్తాడు.
నేటి బాలలే రేపటి పౌరులు.పౌరులందరూ చదువుకొని ప్రయోజకులైతేనే కదా దేశం బాగుపడేది. నేటి కాలంలో చదువు నిర్బంధం చేసారు కానీ దానికి పూర్వకాలంలో ఎక్కువ మంది పిల్లలు హోటల్లలోనూ, దుకాణాలలోనూ ఎక్కడపడితే అక్కడ పనిచేస్తూ కనపడేవారు. వారిని చూసి కవి” బాల భాస్కరులు బతుకు కాలి బాల కార్మికులవుతున్నారు/చిచ్చరపిడుగులు చిచ్చుబుడ్డులై/ గుప్పున ఆరిపోతున్నారు”.( భాస్వరంలో బాల్యం) అంటూ వారి దీనస్థితికి చలించి పోతాడు.వర్ణనా నైపుణ్యం కలవాడు కవి అనేది పెద్దలు చెప్పిన మాట. అలాంటి వర్ణనా నైపుణ్యం పుష్కలంగా కలవారు కందాళైగారు “ఈ చలి ఏ మేడలోకి పోదు/అనాథలపైకి వృద్ధుల పైకి మాత్రం పోతుంది/ ఈ చలి రాత్రి/రేపటి ఉదయానికి చావు కబుర్లు అందిస్తుంది/ పాపం! సూర్యుడు వచ్చి అంత్యక్రియలను చూసి/పడమర అరేబియాలో సముద్ర స్నానం చేసి/ కిరణాలను పిండుకొని పోతాడు!!(చలిరాత్రి). ఎంత గొప్ప ఊహో కదా ఇది. ఇలాంటిదే మరో కవిత “ఒక్క సుఖ స్వప్నం కోసం ఎన్ని రాత్రులను మోసానో/ రెప్పలు ఉబ్బి ఉబ్బి సూర్యోదయాలైనాయి/ ఒక ఆనందభాష్పం కోసం/ ఎన్ని దుఃఖ జలపాతాల్లో తడిచానో/ వసంతం రాకముందే/ శిశిరం ఒంటినంతా మడత పెట్టింది/ఎడారిని పాదాలకు కట్టుకొని/ వీపుపై లోకాన్ని మోస్తున్నాను “(లోక బాధ).
అమ్మ మీద, నాన్న మీద,ఊరు మీద ,చెరువు మీద కవిత్వం వ్రాయకుండాఏ కవి జీవితం కూడా పూర్తికాదు. అందుకు కందాళై వారు కూడా మినహాయింపు ఏమీ కాదు. అమ్మ గురించి కవిత్వం రాస్తూ వారు అన్న” అమ్మ నాలో జీవనదిగా ప్రవహిస్తుంది” (అమ్మ నాలో జీవనది)అనే వాక్యం అమ్మ పట్ల తనకున్న ప్రేమను పట్టి చూపుతుంది. అలాగే నాన్న గురించి రాస్తూ”ఎవరెస్టు శిఖరంలా కనిపించే ప్రతి నాన్నలో /ధ్రువంగా దుఃఖ సముద్రాలు గడ్డకట్టి ఉంటాయి”(నాన్న ఏడ్చాడు)అనే వాక్యాల్లో నాన్న పైకి ఎంత గంభీరంగా ఉన్నా కూడా లోపల సముద్రమంత దుఃఖముంటుందనే విషయాన్ని స్పష్టపరిచాడు. కుటుంబం పట్ల ఎంతో ప్రేమ ఉంటే గాని నాన్నకు దుఃఖం రాదు.
ఏ కవినైనా సంఘటనలు ఇట్టే కుదిపేస్తాయి , కవితా వస్తువులౌతాయి. లాతూర్ భూకంపం ఎంతోమందిని నిరాశ్రయులను చేసింది. ఊరూవాడా అన్నింటినీ ఊడ్చిపెట్టుకుపోయింది. దానిపై కందాళైగారు ” పంట పండించినవాడి కడుపులోకి పోలేదు/పండించిన వాడు భూమి కడుపులోకి పోయాడు/ ఇవి ఆకలి చావులా! కావు- నేలతల్లి ఉన్మాద హత్యలు/కలలుకనే రెప్పలు తెరుచుకోలేదు/భూమి తెరుచుకుని కలలను మూసివేసింది/ రెప్ప కింద ఇప్పుడు కలలు సమాధి/ రేప్పపై ఇల్లు సమాధి/ శ్మశానం ప్రత్యేకంగా లేదు/ ఊరి చివర స్మశానం ఏడుస్తుంది” అంటూ భూకంపం నాటి హృదయవిదారక దృశ్యాలను మన కళ్ళముందు నిలుపుతాడు.
ఈ సంపుటిలో ఉన్న కవితలన్నీ వేటికవే ప్రత్యేకమైనవి.ఎంతో ఆవేదనతో రాసినవి. అధ్యయనం అభ్యాసం, తన కవితా సూత్రాలుగా జీవనం కొనసాగిస్తున్న కందాళై గారు73 సంవత్సరాల వయస్సులోనూ ఇప్పటికీ యువకులతో పోటీపడుతున్నారంటే కవిత్వం పట్ల ఆయనకున్న ప్రేమ మరియు నిబద్ధతే కారణం. ఇవి అందరూ అలవర్చుకోదగిన సుగుణాలు. ఇది అందరూ చదవదగ్గ పుస్తకం.

November 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

నవ్వే రాణి

by ఒద్దిరాజు మురళీధరంరావు November 24, 2025
written by ఒద్దిరాజు మురళీధరంరావు

అనగనగా ఒక రాణి ఉండేది. ఆమె ఎప్పుడూ నవ్వుతూనే ఉండేది . ఆమె ఎంత సేపు నవ్వేదంటే … గోడ పైనుండి పటాలు కింద పడేంత వరకు… ప్లేట్లు గూళ్ల నుండి కింద పడేంత వరకు నవ్వేది. చాలా చిన్న విషయం కూడా ఆమె నవ్వుకు ప్రేరణ అయ్యేది. ఆమె నవ్వు ఎంత గట్టిగా ఉండేదంటే…. ఆస్థానంలో ఉన్న వారందరూ, నౌకర్లూ, కింద అంతస్తులో ఉన్నవాళ్లు కూడా వాళ్ళ చెవులు మూసుకోవాల్సి వచ్చేది.
చెవులు మూసుకోవడానికి వాళ్లు ముందు వాళ్ళ వేళ్ళను వాడేవాళ్లు. కానీ, చివరకు చెవిలో దూదులు పెట్టుకొని పనులు పూర్తి చేసుకోవాల్సి వచ్చేది.
ఎవరికీ కూడా ఆ రాణి పేరు ఏంటో తెలియదు . ఎందుకంటే ఆమెను అందరూ “హర్ మెర్రీ మెజిస్టీ” అని పిలిచేవాళ్లు. అంటే, దొరసాని గా పిలిచేవాళ్లు. ఎప్పుడైతే ఛాన్స్లర్ రాజ్యం అప్పుల పాలు కాబోతున్నదని చెప్పాడో, ఆమెకు చెక్కిలిగిలి పెట్టినట్టై అతిగా నవ్వుతూ మెట్ల మీద నుండి జారిపడి కాలు విరగగొట్టుకుంది. భూకంపం వచ్చింది. బంగ్లా ధ్వంసం అయింది . అప్పుడు ఆమె పక్కటెముకలు నొప్పి పుట్టేంతవరకు నవ్వింది . పెద్ద పెద్ద డాక్టర్లు ఆమెకు వైద్యం చేసేందుకు వచ్చారు. కానీ ఆమె చేయి సైగతో వాళ్లను రానివ్వలేదు.
నవ్వు ఆరోగ్యదాయకం అంటూ ఆమె కండ్ల నీళ్లు ఆమె ముఖం పైకి కారేంతవరకు నవ్వేది . కానీ , నవ్వు జీవితంలో ఒక మంచి ఘటన . దాన్ని చాలా జాగ్రత్తగా వాడాలి.
ఆమె అభిప్రాయాలకు ప్రజలు ఆమెతో ఏకీభవించకపోవడం ఆమెకు ఇష్టం అయ్యేది కాదు. అందుకోసం ఆమె చాన్సులర్ నే చంపేసింది.ఇది ఎంత హాస్యము? ఈ హాస్యం ఆమెను నవ్వు ఆపు లేక ఆపుకోలేక పోయి నవ్వి నవ్వి మొస తీసుకోలేక చివరికి చనిపోయింది. చిట్ట చివరకు దర్బారులో ఉన్నవాళ్ళూ, దేశీయులు కొంత శాంతి నిశ్శబ్దాన్ని సంతోషంగా అనుభవించ గలిగారు. అతి సర్వత్ర వర్జయేత్ అని మనం పెద్దలు ఊరికే అన్నారా!!
Too much of everything is bad.
” అతి సర్వత్ర వర్జయేత్ “
*

November 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

ఒక బంగారు చేప

by ఒద్దిరాజు మురళీధరంరావు November 24, 2025
written by ఒద్దిరాజు మురళీధరంరావు

(గుడ్ నైట్ స్టోరీస్ నుండి – 2025 ఆగస్ట్ 18)

సముద్రంలో చేపలు పట్టే ఒక ముసలతని పేరు వాసిల్. ఎప్పటిలాగే అతడు సముద్రంలో ఒక మూలకు వలవేసాడు. వలలో ఏమైనా చేపలు పడినాయా చూద్దామని వెళ్లి చూశాడు. ఆ వలను బయటికి తీసి చూసేసరికి దాంట్లో ఒక బంగారు చేప కనిపించింది. దాన్ని బయటికి తీయబోయే వరకు
“నన్ను నీళ్ళల్లోనే వదిలిపెట్టు నీకు ఏది కావాలంటే అది ఇస్తాను” అన్నది చేప.
అతను ఆశ్చర్యపోయి,
” నాకు ఏమీ కావాలో తెలియదు .‌నా భార్యను అడిగి చెప్తాను .” అని ఇంటికి వెళ్లి భార్యతో జరిగిన సంఘటనంతా చెప్పాడు. భార్య నాలుగు చివాట్లు పెట్టి, వెంటనే వెళ్లి తనకు మంచి దుస్తులు కావాలని అడుగు. నాకు కేవలం ఈ చిరిగిపోయిన పాత బ్లౌజ్ ఒకటే ఉంది ” అని అంటుంది . వాసిల్ వెళ్లి కొత్త బట్టలు తేగానే ఆమె తనకు బంగారు బండి కావాలని చెప్పి వెంటనే చేప వద్దకు పంపించింది భర్తను. ఎందుకంటే ఆమె ఎప్పుడూ అటువంటి వాటిల్లో కూర్చోలేదు. ఆ ముసలి వాసిల్ వెంటనే వెళ్లి బంగారు బండి తెచ్చాడు. కానీ ఆ ముసలమ్మకు అది కూడా తృప్తి కాలేదు. ఇప్పుడు ఆమె కోరిక సముద్రపు ఒడ్డున ఒక మంచి బంగ్లా కావాలనీ, దాని చుట్టూ మంచి మంచి చెట్లు, తోటలు, గంపెడు నౌకర్లు కావాలని కోరుతుంది . అవన్నీ వస్తాయి . కానీ, అవి కూడా ఆమెను తృప్తి పరచలేదు. చివరికి ఆమెకు ఒక విచిత్రమైన కోరిక కలుగుతుంది . ఆమె ఆ బంగారు చేప వచ్చి తనకు సేవ చేయాలని తలుస్తుంది.
ఈ విషయం తెలియగానే ఆ చేపకు కోపం ముంచుకు వచ్చింది. వెంటనే ఇచ్చినవన్నీ తీసేసుకున్నది . అప్పుడు ఆ ముసలమ్మ తన గుడిసె ముందు చిరిగిన బట్టలతోనే వల అల్లుకుంటూ కూర్చున్నది.
తెలిసిందా ఇప్పుడు? ఒకవేళ నువ్వు అతి ఆశకు పోతే.. నీకు ఏమీ లేకుండా అవుతాయి.
” అతి ఆశ కొంపకు చేటు”*_

November 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

తెలివికల్ల తాబేలు

by ఒద్దిరాజు మురళీధరంరావు November 24, 2025
written by ఒద్దిరాజు మురళీధరంరావు

ఒకరోజు ఒక కుందేలును తాబేలు దాటి ముందుకు పోయింది. తాబేలును దూషించడం మొదలుపెట్టింది. రోడ్డుపై చాలా జాగా ఉన్నప్పటికీ నువ్వు రోడ్డు మధ్యనే ఎందుకు నిలుచున్నావు?” అన్నది.
తాబేలు తల బయటికి తీసి క్షమాపణ కోరుదామని అనుకొని అన్నది. తను తన మిత్రునితో పందెంలో ఉన్నానని కానీ అతడు చాలా నెమ్మది కాబట్టి అతను నన్ను చేరే లోపల ఒక కూర్పు తీద్దామని అని అనుకున్నాను” అని .
అనగానే,
“ఎట్… అంతా అబద్ధం ! “అని కుందేలు తన వెనుక కాళ్ళ మీద నిలబడి అన్నది .
“ఒక్క మాట కూడా నేను నమ్మను నన్ను కూడా దాటేసి వెళ్తానని అంటావు తర్వాత” అని కూడా అన్నది.
దాని ముందు దారికి అడ్డంగా ఒక గీత గీసింది.” రెడీ…. స్టడీ ….గో ….” అన్నది. అని, అది కూడా పరుగెత్తింది.
తాబేలుకు తెలుసు తను గెలిచే అవకాశం లేదని. కానీ, దాని భుజాలపైన చురుకైన తల కలిగి ఉన్నది.
అది దారి ఏటవాలుగా ఉన్నదని గమనించంది. కాబట్టి ఒక గుండు రాయి కొరకు వెతికింది. దగ్గరలో ఉన్న ఆ రాయిని కుందేలు వెనక దొర్లేటట్టు నెట్టింది . ఆ రాయి కుందేలును దాటి ఎప్పుడైతే పోయిందో తాబేలు గట్టిగా అరిచింది, ” చూడు…. నేను నిన్ను దాటేశాను.” అని .ఆ రాయి జారిపోతున్నప్పుడు చాలా మట్టి అంటింది. దాన్ని చూసి తాబేలు తనను దాటిపోయిందని కుందేలు తన ఓటమిని అంగీకరించింది. అప్పుడు తాబేలు గుట్ట మీద నిలబడి నవ్వింది. తను ఎక్కడికి పోకుండానే పందెం గెలిచినట్టు భావించింది తాబేలు.

November 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Uncategorized

ఒక తిండి బోతు

by ఒద్దిరాజు మురళీధరంరావు November 24, 2025
written by ఒద్దిరాజు మురళీధరంరావు

ఒక ఊళ్లో ఒక బాబు జన్మించాడు. అతనికి ఆకలిగా ఉన్నప్పుడు నోరు ఎట్లా తెచ్చుకోవాలో తెలియకుండేది.
తన తల్లి చేతికి ఏది అందితే అది ప్రేమతో అందించేది. ఒక కప్పు పాలు, ఒక స్పాంజ్ ముక్క, ఆలుగడ్డ సూప్, ఓట్ల జావ, కోడి చారు ఇంకా ఎన్నో ఇటువంటి వస్తువులు పదార్థాలు ఇచ్చేది. నీకు ఏది కావాలో అది తీసుకో అన్నది తల్లి .
తనకు పేరు పెట్టకముందే అతని ముందర ఏది పెడితే అది తినేస్తున్నందుకు అతన్ని ‘తిండిబోతు’ అని పిలవడానికి అందరూ నిశ్చయించారు. కానీ , త్వరలోనే అతనికి తిండి పెట్టకముందే ఏది కనిపిస్తే అది తినడం మొదలుపెట్టాడు. అట్లా తింటున్నాడు కాబట్టి అతణ్ణి ‘అత్యాశపరుడ’ని పిలవడం మొదలుపెట్టారు. ఆ పిల్లవాడి జీర్ణశక్తి ఎంత ఎక్కువ అంటే మొత్తం రొట్టె ముక్కను ఓ రాస్ బెర్రీ ఫలాన్ని మింగినట్టు మింగేవాడు . ఇంకా ఎప్పుడైతే ఒక ముక్క కూడా ఇంట్లో లేనప్పుడు, అతను టేబుల్, చైర్లు వాటినే కాకుండా బెడ్ రూంలో బెడ్ వంటివీ మింగేసేవాడు. తర్వాత తోటలోకి పోయేవాడు. అక్కడ చెర్రీస్ ఇష్టపడి మొత్తం చెట్టుని ఇదో లెక్క అన్నట్టు తినేవాడు. గేటును వెదకకుండా ఫ్రెండ్స్ నే మింగేసి , గ్రామం లోకి చేరి దారిలో కనబడినవన్నీ తింటాడు .
గ్రామస్తులను భయకంపితులను చేశాడు . అతడు ఇంకా చంటి బాబు కాదు . అతను చాలా పెద్ద కడుపుతో ఒక పెద్ద ఆజానుబాహుడు. పక్క ఇంటి ద్వారం నుండి లారా అనే ఒక అమ్మాయి ఏమంటుందంటే….అతను అట్లా పోలేడు అన్నది. తను పాఠశాలకు పోవటానికి ఆలస్యం కాకుండా టైం కు లేచేందుకు గడియారాన్ని కి అలారం కు కీ ఇచ్చింది. అతను ఇక ముందు మనను కూడా తినేస్తాడు. అని ఆమె చెప్పింది వాస్తవమే కూడా! ఆలస్యం కాకుండానే ఆ తిండిబోతు లారా ఇంటిని మొత్తం మింగేసాడు
అదృష్టవశాత్తు మర్నాడు ఉదయాన్నే అలారం మోగింది. ఆ ధ్వనికి ఆ తిండిబోతుకు ఎంత షాక్ అయిందంటే…. తను నోరు తెరిచాడో లేదో ఇంటిని తిరిగి వాంతి చేసాడు. దాని తర్వాత అతడు తన ఎక్కువ ఆకలిని కోల్పోయాడు.‌ కొద్ది కాలానికి అతణ్ణి వాళ్లు ఇంకా తిండిబోతు అనేవాళ్ళు . కానీ చివరకు అతనికి ఆల్బర్ట్ అనే పేరు పెట్టారు. అతను కూడా అందరి వలెనే చిన్న బాలుడైనాడు.

November 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • వేకువ పాట
  • చాణుక్యుడు ఆదిశంకరాచార్యుల ప్రభావం ఒక సింహావలోకనం
  • సనాతనమంటే?
  • సమాజానికి హానికరమైనవిగా కాక ఉపయుక్తమైన రచనలు చేయాలి- డా. జి. చెన్నకేశవరెడ్డి
  • సాహిత్యాకాశంలో నక్షత్రాక్షర తోరణం- అక్షరగీతం

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us