మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ఇంద్రధనుస్సు

క్విజ్ పోటీ-

by nellutla Indrani May 30, 2026
written by nellutla Indrani

నిర్వహణ-
⁠నెల్లుట్ల ఇందాణి
మయూఖ ద్వైమాసిక పత్రికలో జనరల్ నాలెడ్జ్ క్విజ్ ను ప్రారంభించాము. మీరేమి చేయాలో నెల్లుట్ల ఇంద్రాణి చెప్తున్నారు చదవండి- ఎడిటర్

Hi everyone ! Good morning from “Mayukha and Tharuni.My name is Indrani Nellutla.
Here I am shooting 20 General Knowledge questions for brain storming.If you know correct answers for 15 questions ” You are good”. More than 15 ” Clap your hands “.

I am also Providing Correct answers below, “But ……. but…”. don’t look at the answers 🙈. ( Now) 😄

చూసారా… మీ జవాబు లు 15 సరైనవైతే మిమ్మల్ని మీరే అభినందించుకోండి. మీ తెలివికి , మీ జ్ఞాపక శక్తి కి మీరే నిర్ణాయకులు. ఇదే మనకు ఉత్సాహాన్నిస్తుంది. ఇవిగో ప్రశ్నలు…

  1. Which country is known as “Rising sun” ?
    A. United States of America. B. China. China.D. Japan.
  2. Who is the first black president of South Africa?
    A. Nelson Mandela . B .Musaveni . C. Paul Kagame . D. Barak Obama.
  3. Which is the longest river in Europe?
    A. Godavari. B. Volaga. C. Amezan. D . Nile.
  4. 4.In Which Year United Nations was established?
    A. 1940 . B. 1950 . C. 1945 . D . 1960 .
  5. .Which line separates India and Pakistan?
    A. Red Cliff line. B. Ma Mohan line . C . Equater .D . Tropc of cancer.
  6. Where is Great Barrier Reef located . ?
    A. United States. B. Europe. C. Australai. D. Africa. ?
  7. Who wrote ” The Tale of Two Cities” .?
    A. Charles Dickens .B.G.Shaw .C. Clerk Hemes . D. William Shakespeare.
  8. .What is the National bird of New Zealand .?
    A. Bald eagle .B . Peacock. C. Elephant. 4. Kiwi.
  9. Which mountain separates Europe and Asia ?
    A . Urals . B. Pamir .C. Cascade. D . Andes.
  10. Who is one of the ” Kavithryam” from the below poets ?
    A . Kalidasa. B. Nannaya . C. Bhanu . D. Kanva.
  11. Name the first Indian Sattilite ?
    A. Aryabhatta B. Shankara C. Banabatta D. Bhaskara ?
  12. Who is the first recipient of Gyanpit award ?
    A. Vishwanatha Satyanarana B . Dr. C. Narayan Raddy . C. Dasarathi . D. Arudra.
  13. Which strait separates Iran and Soudi Arabia ?
    A. Hormuz. B . Panama . C. Suez. D. Bay of Bengal.
  14. Which painting of Ravi varma sold approx. 17.9. Million dollars ?
    A. Lord Rama .B. Lord Shiva. C . Lord Indra. D. Lord Krishna.
  15. The study of the kidney is called ?
    A. Cardailogy . B . Nephrology. C. Apthamology. D. Anthropology.
  16. Who is the Lyricist of ” Geet Gata Chal O Sathi Gun Gunatha Chal” ?
    A. Ravindra Jain B. Mahmmad Rafi . C. Gulzar. D . Kishore Kumar.
  17. Who is the founder of ” Amezan” ?
    A.Satya Nadella.B. Bill Gates. C. Jeff Bezos . D. Rishi.
  18. Who invented telphone ? A. Madam Currie .
    Thomas Edison. C. Enlisteen . D. Alexander Graham Bell.
  19. Which fruit is good source of vitamin. C .?
    A. Spinach . B. Orange . C. Potatoes .D. eggs .
  20. Good Year is trade name of ?
    A .Cars .B. Tires . C. Bikes. D. Racing Cars . ———-

    Correct Answers ———.
    1. D. ( Japan. The land of rising sun. The rising sun represents hope, renewal and energy for the Japanese people).

    2. A. Nelson Mandela ( from 1994 to 1999.).

    3.B. Volga ( stretching approximately 3,530 to 3,690 k.m ).

    4. C .1945 ( Biggest funder is United States America ).

    5. A. Red Cliff line ( Established on August 17, 1947 ).

    6. C. Australia ( it spans over 2,3000 k.m ).

    7. A. Charles Dickens ( He wrote about London and Paris).

    8. D. Kiwi ( Flightless bird).

    9. A.Ural mountains ( Running 2,500 k.m. North to South through Western Russia).

    10. B. Nannaya ( He translated Adi Parva ,Sabha Parva and a portion of Aranya Parva ).

    11. A. Aryabhatta ( launched on April 19 , 1975 ).

    12. A. Viswanatha Satyanarana.( For Ramayana Kalpavruksham in 1970 ).

    13. A. Hormuz ( Approximate length 90 to 104 miles ).

    14. D. Lord Krishna ( The Art work was purchased by Dr. Cyrus Poonwala ).

    15. B . Nephrology ( A specialist in this field known as Nephrologist .).

    16. A. Ravindra Jain ( He redefined Bollywood music despite being born blind .).

    17. C. Jeff Bezos ( He is a American Business man ).

    18. D. Alexander Graham Bell ( He invented the devise on March 7 , 1876.).

    19. B. Oranges ( a single orange can meet daily requirement ).

    20 .B. Tires ( Founded in 1898 , is a company that produces tires for passenger cars , trucks and racing Cars ). _**_.

    ఈ 20 ప్రశ్న లకు సరైన జవాబులు ఎన్ని వచ్చాయో మీరే చెక్ చేసుకోండి.. మిమ్మల్ని మీరే అభినందించుకోండి.. ఇది నిజమైన బలం ! – ఎడిటర్
May 30, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

పేరంటాలు

by Vijaya Kandala May 30, 2026
written by Vijaya Kandala

పెళ్లి ,వ్రతం,పూజ మొదలైన శుభకార్యాల్లో  మత్తైదువులు వచ్చి చేసే మంగళకార్యానికి  పేరంటమని పేరు.ఇదే అర్థంలో పేరంటాలు అని కూడా వాడుతారు.

అది క్రమంగా ఇరుగుపొరుగు స్త్రీ అనీ,శుభకార్యాలకు ఆహ్వానించదగిన స్త్రీ అని అర్థం  వచ్చింది.    దీనికి విపరీతంగా కాలక్రమంలో పసుపు,కుంకుమతో  భర్త శవంతో బాటే చితినెక్కిన స్త్రీని పేరంటాలని పిలవడం మొదలైంది.ఈ పధ్దతి ముగిసి చాలాకాలమైంది .కానీ మన చరిత్రలోని మెరుపులతో బాటు మరకలను  కూడా తెలుసుకోవాలి గదా.

క్లుప్తంగా  సంప్రదాయ పరిచయమే ఈ చిరువ్యాసం.ఈ  ప్రక్రియను సహగమనం లేదా సతి లేదా సాగుమానం అంటారు. అలా చేసిన స్త్రీని సతి లేదా పేరంటాలు అని  అంటారు.

 సహగమనమంటే తోడుగా వెళ్ళడమని అసలర్థం.కానీ అలవాటులో తోడుగా మరణించుట అనే అర్థం వచ్చి చేరింది. పరమ శివుని నింద వినజాలక పార్వతీ  దేవి అగ్నికి ఆహుతైన కథ మనందరికీ తెలిసిందే.ఆ సతీదేవి కథనే దీనికి స్ఫూర్తి అని కొందరి భావన.పతి చితిలో సతి అగ్నికి ఆహుతవడమని జనంలో సాదారణ అర్థం. వివిధ కులాలో,ప్రాంతాలలో విభిన్న రీతులుండేవి.

భర్త శవంతోబాటు స్త్రీని సజీవంగా గోతిలో పూడ్చిపెట్టడం చూసానని ప్రసిధ్ధ విదేశీ యాత్రికుడు న్యూనిజ్ రాసాడు.అబాగినులైన స్త్రీలపై మత్తుమందు ప్రయోగించేవారని చరిత్రకారుల పరిశోధనల్లో తేలింది.విజయనగర సామ్రాజ్య కాలంలో ఇలాంటివి అనేకం చూసామని నాటి విదేశీ యాత్రికులు  బార్బొసా, సీజర్ ఫ్రెడరిక్  వర్ణించారు.

              కారణాలను మనం ఊహించుకోవడమే.భర్త పట్ల తీవ్రమైన ప్రేమ,కీర్తికాంక్ష ,దేవతగా పూజింపబడతాననే భావన, సంఘంలో లభించే గౌరవాభిమానాలు – ఇందులో ఏదో ఒకటి గానీ,అన్నీ కలిసిగానీ కారణాలు కావచ్చు.కొన్ని స్మృతులలో  సహగమనం చేసిన స్త్రీకి స్వర్గం లభిస్తుందని చెప్పటం వల్లకూడా కొన్ని జరిగి ఉండవచ్చు.

                సంతానంలేని స్త్రీ జీవించిఉంటే ఆ వ్యక్తి ఆస్తిని ఆనుభవించే అవకాశముండదని వారసులు దీన్ని ప్రోత్సహించే వారని  కొందరి అభిప్రాయం.ఇలా సహగమనం ( సాగుమానం ) చేసిన స్త్రీవల్ల పుట్టింటి వారికి,అత్తింటివారికి 3 తరాల వరకు పుణ్యలోకాలు కలుగుతాయనే నమ్మకంతో  ఇరువైపుల బంధువులు (  ముఖ్యంగా స్త్రీలు ) ప్రోత్సహించేవారని మరి కొందరంటారు.

దుర్భర వైధవ్య బాథలు అనుభవించడంకంటె సహగమనం చేస్తే,ఒక్కసారే కష్టాలు గట్టెక్కుతాయని ఆలోచించేవారని  కొంతమంది విశ్వాసం.కారణమేదైనా బలిపశువు స్త్రీయే.

               ఈ సంప్రదాయం  మరో రూపంలో రసపుత్రులలో  ప్రబలంగా ఉండేది.భర్త ఉన్నా శత్రువుల వల్ల మానహానికి అవకాశముందని తెలిసిన రాజవంశపు స్త్రీలందరూ మూకుమ్మడిగా అగ్ని ప్రవేశం చేసేవారు.ప్రాణాని కంటే మానానికెక్కువ ప్రాధాన్యమిచ్చే ఈ సంప్రదాయాన్ని జోహార్ అనేవారు.

             19 వ శ.వచ్చేసరికి ఈ పధ్ధతి విపరీత దశకు వచ్చేసింది.ముఖ్యంగా బెంగాల్ ప్రాంతంలో 1818లో బ్రిటిష్ వారి ఆధిపత్యం ఉన్న ఇండియాలో మొత్తం 839 సహగమనాలు జరిగితే ,అందులో కేవలం బెంగాల్ లోనే 544 జరిగాయి. తరవాతి స్థాయిలో వారణాసి,బరైలీ,బీహార్ ప్రాంతాల్లోజరిగాయి.

ఉమ్మడి మద్రాస్ రాష్టం లో గంజాం,విశాఖ,రాజమండ్రి ,గుంటూరు, నెల్లూరు ,చిత్తూరు,కడపల్లో జరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి.

 నాడు స్త్రీ పునర్వివాహ ప్రసక్తి లేదు.జీవితమంతా అశుభానికి ప్రతీకగా ,అవమానాలు ,కష్టాలు భరిస్తూ గడపడం కంటె భర్తతోపాటు మరణించి పూజలందుకోవడం మేలని తలచేవారేమో.అయితే ఆనందంతో ఆ మోదించే వారూ ఉన్నారని చరిత్ర చెప్తోంది.స్వఛ్చందంగానే చేస్తున్నామని చూడవచ్చిన వారితో  చెప్పడం తనకు తెలుసని బార్బోసా రాశాడు.

 ఇలా బొమ్మగౌడ అనే అతని భార్య సంతోషంగా సహగమనం చేస్నట్లు షిమోగా జిల్లాలో దొరికిన ఒకశాసనం వల్ల తెలుస్తోంది. 1743 లో కాసింబజార్ లోని రామ్ చెంద్ పండిట్ మరణిస్తే అతని భార్య17 సంవత్సరాల వయస్సులో సహగమనానికి సిద్దపడితే నగరంలోని వర్తకులందరూ ఆ ప్రయత్నం నుండి మరలించడానికి  అనేక రకాలుగా ప్రయత్నించారట.ఆమె ఫౌజ్ దార్ అనుమతితో సహగమనం చేసిందట.

ఇందోర్ పరిపాలకురాలైన రాణి అహల్యాబాయి కూతురు ముక్తాబాయి సహగమనం చేసింది.తల్లి ఎంత బ్రతిమిలాడినా వినలేదు. ఆ తల్లి  ఆ  ప్రదేశంలోకూతురికొకగుడి కట్టించింది.

             ఇంత ఘోరాన్ని ఆపడానికి ఎవ్వరూ ప్రయత్నించలేదా అని ఆశ్చర్యపోకండి. చాలా చాలా ప్రయత్నాలు జరిగాయి.అంతకు రెండురెట్లు వ్యతిరేకతలూ ఎదురయ్యాయి. మధ్యయుగాల్లో  అక్బర్,సిక్కు గురువులు ,పీష్వాలు దీన్ని ఆపడానికి చాలా ప్రయత్నించారు.

1780 ప్రాంతంలో ఈస్టిండియా కంపెనీ చేసిన ప్రయత్నాలు హిందూ వ్యతిరేకత వల్ల ముందుకు సాగలేదు.కొంతకాలానికి రాజారామ్మోహన్ రాయ్ వంటివారు దీనికి వ్యతిరేకంగా ఒకఉద్యమమే లేవదీసారు,ఈ సందర్భంలో అప్పటి గవర్నర్ జనరల్ విలియం బెంటింక్ చొరవ తీసుకుని అన్ని వర్గాల వారి అభిప్రాయాలను  సేకరించాడు. హిందువుల వ్యతిరేకతను లెక్కజేయకుండా 1829లో సహగమనాన్ని శిక్షార్హమైన నేరంగా  లెక్కిస్తూ నిషేధాజ్ఞలు జారీ చేసాడు.

మన ఆంధ్ర ప్రాంతంలో దీనికి సాగుమానం,చిచ్చురుకుట ,గుండాన బడుట  అని రకరకాలుగా పిలుస్తారు.చరిత్ర ఆధారాలను చూస్తే 12 వ శ . నుండీ జరిగినట్లు తెలుస్తుంది.గత 800 సంవత్సరాలుగా చాలానే జరిగాయి.ప్రసిధ్ది పొందిన పేర్లు చాలానే వినిపిస్తాయి.వత్సవాయి సీతమ్మ (  1761 ) , వాసిరెడ్డి అచ్చమ్మ  ( 1763 )బాలసన్యాసమ్మ లిస్టు  పెద్దదే ఉంది .వీరంతా పేరంటాలు అనే పేరిట నేటికీ పూజలందుకుంటున్నారు.వీరి మహిమలను గూర్చి అనేక కథలు వ్యాప్తిలో ఉన్నాయి. అయితే వాస్తవాలు,విశ్వాసాలు పాలునీళ్లలా కలిసిపోయాయి.

             ఈ ఆధునిక కాలంలో ఇలాంటివాటిని ఎవ్వరూ ప్రోత్సహించరు.అనుమతించరు.కానీ ప్రాచీన సంస్కృతీ అధ్యయనంలో భాగంగా వీటిని గురించి రేఖామాత్రంగా నైనా తెలుసుకోవాలి.వారి చారిత్రక,సాంఘిక,ఆర్థిక దృక్పథాలనుఅవగాహన చేసుకోడానికి ప్రయత్నించాలి.

ఇంతకుముందు చెప్పుకున్నట్లు మెరుపులతోబాటు మరకలూ ఉంటాయి.వీటినీ ఒకనాడు ఎంతో పవిత్ర బాధ్యతగా గౌరవించే వారని తెలిస్తే చాలు.

May 30, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
Uncategorized

మాఅలస్కాప్రయాణం

by Rangaraju Shyamsundar May 30, 2026
written by Rangaraju Shyamsundar

కలలుకంటూనే, వాటినిగురించిఆలోచిస్తూఉంటేఅవిసంకల్పాలుగామారిఎప్పుడోఒకప్పుడునెరవేరుతాయిఅంటాడుఅబ్దుల్కలాం. అలాఆలోచించడంవల్లెనాకలకూడానెరవేరింది. ఎక్కువగానేషనల్జియోగ్రాఫిక్ఛానల్చూసేనాకుఅలస్కాలోనిగ్లేసియర్వరకుక్రూస్లోవెళ్లినపరిశోధకులువారికళ్ళముందేగ్లేసియర్లోనికొండప్రాంతంవిరిగిసముద్రంలోపడటందానిదాటికిసముద్రంలోనిఉవ్వెత్తునలేచినఅలలుక్రూయిజ్షిప్దూరంగానెట్టివేయడంచూశాను. జీవితంముగింపుదశలోనైనానిజంగాఇలాంటిదృశ్యాలనుదూరంగానైనాచూడగలనాఅనేనాకోరికఅతిత్వరలోతీరేఅదృష్టంనన్నువరిస్తుందనినాకుమారుడు- కూతురునా 70 వసంవత్సరపుజన్మదినవేడుకలుఅలస్కాలోజరుపుకుందాంఅనిఫోన్చేసిఆహ్వానించేవరకుఅనుకోలేదు.

ఎప్పుడోజియోగ్రఫీచానల్లోచూసినదృశ్యాలునిజంగాచూడబోతున్నందుకునాలోఒకవైపుఆనందంఇంకోవైపుఆందోళనకలగజేసాయి. ఆందోళనమామూలుచలికేతట్టుకోలేనినేనుఅలస్కాలోనిఅతిశీతలంగాఉండివాతావరణంఒక్కోమారు-20°నుండి-40°వరకుమంచుగడ్డకట్టేచలిప్రాంతాల్లోసంచరించడం-మళ్ళీపూర్తిఆరోగ్యంగాఇండియాతిరిగిరావడం. ఒకవైపుకలనిజంచేసుకోవడం – రెండోవైపుఆరోగ్యంఈరెండునామనసునుకుదిపేస్తున్నవిపరీతఆలోచనలునన్నుఆవరించాయి.

అమెరికావెళ్ళగానేమాపిల్లలుఅలస్కాట్రిప్కోసంటిక్కెట్లుకొనుగోలుచేయడం, అలస్కాలోవిహరించడానికిసరిపోయేదుస్తులుకొనుగోలుకోసంషాపింగ్చేసి, థర్మల్స్, జర్కిన్స్, జాకెట్స్, బూట్స్,   గ్లౌజెస్వగైరా, వగైరాలన్నికొనిప్యాక్చేసుకోవడంచకచకాజరిగిపోయాయి. సరిగ్గాప్రయాణానికికొద్దిరోజులముందుఅలస్కాప్రయాణంగురించిఎక్కువగాఆలోచించడంమూలానఅలస్కారూపురేఖలు, గడ్డకట్టినమంచు, మంచులోకదులుతున్నపెంగ్విన్లు, తిమింగళాలుకలలోకిరావడం, ఆచలికినేనువణికిపోతున్నదృశ్యాలుకలలోమెదలసాగాయి.  ఆకలలవత్తిడికిఒకానొకసమయంలోఈవయసులోఇంతరిస్క్ప్రయాణంఅవసరమాఅనికూడాఅనిపించింది.  కానీఈవిషయాలుపిల్లలతోచర్చిస్తేప్రయాణంఎక్కడక్యాన్సల్చేస్తారేమోఅనేభయంకూడావెన్నాడింది. 

అన్నిభయాలనుదూరంపెడుతూసాహసకృత్యాలకుసంబంధించినయూట్యూబ్వీడియోలనుచూస్తూఒక్కసారినాలడక్యాత్ర, మానససరోవరయాత్ర, మాయూరప్యాత్రఅనుభవాలుగుర్తుచేసుకుంటూ,అలస్కావిహారయాత్రనుఆస్వాదించడానికికోసంటిప్స్రాసుకుంటూప్రయాణతేదికోసంఎదురుచూస్తున్నాం. మేంవెళ్లాల్సినప్రయాణపుతేదీఆగస్టు 15 రానేవచ్చింది. యాదృచ్ఛికంగాట్రంప్-

పుతిన్శిఖరాగ్రసమావేశాలుఅదేరోజునమేముఅలస్కాప్రయాణాల్లోమొట్టమొదలుచేరుకోవలసినప్రదేశంఆంకరేజ్లోజరగనుండడంతోఆంకరేజ్పదంఎక్కువగాప్రాచుర్యంమైంది.  అన్నిసర్దుకునిచికాగోనుండిఅలస్కాలోనిఆంకరేజ్అనేప్రాంతానికిప్రయాణమయ్యాం.  చికాగోనుండిఆంకరేజ్కి 7 గంటలవిమానప్రయాణం,లోకల్ఫ్లైట్కాబట్టిరెండుగంటలముందేవిమానాశ్రయానికిచేరుకున్నాంమధ్యాహ్నంరెండుగంటలకల్లా. చికాగోకుఅలస్కాకుమూడుగంటలసమయంతేడావల్లఆంకరేజీచేరుకునేసరికిసాయంత్రం 7 గంటలయింది.  అనుకున్నవిధంగానేఆంకరేజ్లోదిగగానేముందుగాపలకరించిందిఅలస్కాలోనిచల్లనివాతావరణం.జాగ్రత్తలుతీసుకుంటూనేవిమానాశ్రయంలోనేరెంటల్కారుబుక్చేసుకునినేరుగాహోటల్గదికివెళ్లిడిన్నర్ముగించుకొనిరూమ్కివెళ్ళేసరికిరాత్రి 12 అయ్యింది.

అలస్కాకిఉన్నఇంకోపేరుల్యాండ్ఆఫ్మిడ్నైట్సన్అనిగడియారంలో 12 గంటలసమయంచూపిస్తున్నా, అప్పుడేచీకటిపడుతున్నట్టుగాఉంది.  ప్రొద్దున్నేలేచిఇంకాప్రయాణంచేయాల్సిఉన్నకారణంగాను, అలసిపోవడంవల్లనూతొందర్లోనేనిద్రలోకిజారుకున్నాం. ఆమరుసటిరోజుఉదయమేఆంకరేజ్నుండి 202 కిలోమీటర్లదూరంలోఉన్నసెవార్డ్గ్రామానికిప్రయాణంమొదలుపెట్టాం. దారిపొడవునావిశాలమైనరోడ్లు.రోడ్డుకుకుడివైపు, ఆప్రాంతంలోదక్షిణపుసముద్రంగాపిలువబడేపసిఫిక్మహాసముద్రంఎడమవైపు-ఎత్తైనకొండలు,కొండలుత్రవ్వివేసినరోడ్లు, కొండలపైఅక్కడక్కడకొండఅంచుల్లోనిలబడిమావైపేచూస్తునట్లుఅనిపించేకొండల్లోతిరగాడేగొఱ్ఱెలు -ప్రకృతిఎంతోఆహ్లాదకరంగాఉంది. ప్రపంచదేశాల్లోనివిస్తీర్ణంలోనాలుగోదేశంఅయినఅమెరికాలోప్రయాణంచేసేదిఎక్కువగంటలుకానీచూడాల్సినప్రదేశాల్లోగడిపేసమయంచాలాతక్కువ.  ప్రయాణంలోనేఎక్కువసమయంగడిచిపోతుంది.మధ్యలోఅందమైనప్రాంతాల్లోఆగుతూ, నల్లనిపర్వతాలపైమంచుదుప్పటికప్పుకునట్లుగామంచుతోనిండిఉన్నపర్వతాలనుచూస్తూ, సముద్రంలోసర్ఫింగ్చేస్తున్నఔత్సాహికక్రీడాకారులనుచూస్తూసాగిందిమాప్రయాణం. అలామధ్యాహ్నంమూడుగంటలప్రాంతంలోవిట్టియర్అనేప్రాంతానికిచేరుకున్నాం. ఈవిట్టియర్అనేప్రాంతంసముద్రానికి – కొండలకుమధ్యఉన్నఒకచిన్నగ్రామం. ఈప్రాంతంచేరుకోవాలంటేఒకేఒక్కసొరంగమార్గం 2.5 కిలోమీటర్లదూరంఉంటుంది.1943 సంవత్సరంలోఅమెరికాజపాన్యుద్ధసమయంలోఒకరహస్యమైనరక్షితనౌకాశ్రయంకోసందీన్నినిర్మించడంజరిగింది. ఈ 2.5 కిలోమీటర్లటన్నెల్ద్వారాప్రయాణానికినిర్ణీతసమయాలుఉంటాయి..ఈటన్నెల్గుండారోడ్డురైలుసౌకర్యంరెండూఉన్నాయి.ఈగ్రామంలోనివసించేజనాభాకేవలం 200 మంది

మాత్రమే. ఇక్కడికియాత్రికులేఎక్కువగావస్తుంటారు. ఈపట్టణంలోరెండేరెండుబహుళఅంతస్తులుకలిగినభవనాలుఉన్నాయి. బెగిచ్టవర్స్ఒకటైతేఇంకొకటిభక్నర్బిల్డింగ్. బెగిచ్టవర్స్లోమొత్తంనివాసగృహాలుకార్యాలయాలుఉంటేఇంకోటిభక్నర్బిల్డింగ్.ఇదియుద్ధకాలంలోఅమెరికాసైన్యానికిప్రధానకార్యాలయంగాఉండిఅప్పటిచరిత్రకునిలువెత్తుసాక్ష్యంగాఉంది.  ఈరెండుభవనాలసముదాయాలనుచూస్తూకొండలపైనుండిజాలువారేజలపాతాలనుచూస్తూ, ఆజలపాతాలు- నీరుచేరుతున్నపసిఫిక్సముద్రప్రాంతానికిచేరుకున్నాం. అంతులేనిసముద్రం, సముద్రంమధ్యలోగుట్టలు, ఆగుట్టలపైమంచు, సముద్రంలోఔత్సాహికులుచేసేనీటిపైతేలియాడేక్రీడలుకయాకింగ్, సర్ఫింగ్చూస్తూసముద్రంలోఎగిరిపడేసాల్మన్చేపలవిన్యాసాలనుచూస్తూఆప్రాంతంలోమూడుగంటలువిహరించాం. ఆరుగంటలసమయంలోమాప్రయాణంమళ్లీప్రారంభమైంది. అక్కడినుండి 4 గంటలుప్రయాణించిసేవార్డ్అనేప్రాంతానికిచేరుకొనిరాత్రి 10 గంటలసమయంలోఆసేవార్డ్ప్రాంతంలోనిఅతిధిగృహంలోకివెళ్లిసేదతీరాం.

ఆమరుసటిరోజుమాఅతిధిగృహంనుండిసముద్రతీరప్రాంతంలోనిసేవార్డ్పోర్ట్కిబయలుదేరాం.  సముద్రతీరంనుండే8 గంటలుసముద్రంలోప్రయాణించడానికిక్రూయిజ్ఇక్కడనుండేప్రారంభమవుతుంది. ఈఅలస్కారాష్ట్రంచాలాకాలంరష్యాఆధీనంలోఉండేది. 1867లోఅమెరికాఈప్రాంతాన్నికొనుగోలుచేశాక 49వఅమెరికాసంయుక్తరాష్ట్రంగాఅవతరించింది. అలస్కానుఅమెరికాకొనుగోలుచేశాకకొన్నివేలమందిప్రజలురష్యాకువెళ్ళిపోగామిగిలిపోయినవాళ్ళుఇదేప్రాంతంలోస్థిరపడ్డారు. 1895 ప్రాంతంలోఅలస్కాలోనికొన్నిప్రాంతాల్లోవిపరీతంగాబంగారుగనులుఉన్నాయనేప్రచారంప్రారంభంఅవడంతోచాలామందిఈప్రాంతాల్లోనిబంగారంవెతుకులాటకోసంవచ్చిఆప్రాంతాల్లోస్థిరపడ్డారు.  జూన్, జూలై, ఆగస్టునెలల్లోమాత్రంఎక్కువగాయాత్రికులువస్తుంటారు.  ఆగస్టుచివరివారంనుండిఈప్రాంతంలోచలిపెరుగుతూఉంటుంది. కొన్నిప్రాంతాల్లో -20నుండి-40 డిగ్రీలవరకువాతావరణపరిస్థితులుమారిపోతూయాత్రికులకువాతావరణంఅననుకూలంగామారుతూఉంటుంది.

చలికాలంలోనూఈప్రాంతానికివిశేషంగావచ్చేయాత్రికులూఉంటారు. ఈప్రాంతాన్నికొనుగోలుచేసినసమయంలోనిఅధికారివిలియంహెచ్సేవార్డ్గౌరవార్ధంఈపట్టణానికిసేవార్డ్గానామకరణంచేశారు. గల్ఫ్ఆఫ్అలస్కాగాపేరుగాంచినఈపసిఫిక్మహాసముద్రంలోఅలలనుచీల్చుకుంటూమాక్రూయిజ్గ్లేసియర్యాత్రప్రారంభమైంది. క్రూయిజ్సముద్రంలోనికొండప్రాంతంవైపుగాదూసుకెళ్లింది. సముద్రంలోనిచిన్నచిన్నద్వీపాలపైసూర్యకిరణాలకోసంవిశ్రాంతితీసుకుంటున్నసముద్రసింహాలను

చూపుతూఆపరిసరప్రాంతాల్లోమాపడవఆగింది. అందరూఒక్కసారిగాకెమెరాల్లోనూ, సెల్ఫోన్లలోనూసముద్రసింహాలఫొటోలుచిత్రీకరించడంకోసంపోటీపడ్డారు. ఫోటోలువీడియోలచిత్రీకరణకోసంఆగినపడవకొంతసమయంతర్వాతఇంకాముందుకుసాగింది. కొంతదూరంవెళ్ళాకఒక్కసారిగాగాల్లోఎగురుతున్నపఫిన్పక్షులుగుంపులు, గుంపులుగామాపడవపైనఎగరడంతోఅందరూఫోటోలుతీసుకోవడంతోపడవఆవరణభాగమంతాయాత్రికులతోపూర్తిగానిండిపోయింది. సముద్రఅలలకుఅరిగిపోయినసముద్రపుఒడ్డురాళ్ళప్రాంతమంతాచిత్రవిచిత్రమైనఆకృతులతోవినూత్నంగాఅగిపించింది.

ఇంకాముందుకుసాగుతున్నమాపడవఒక్కసారిగాఆగిపోయింది. సమీపప్రాంతంలోనేతిమింగళాలుకనుచూపుదూరంలోతేలియాడ్తున్నదృశ్యం, పడవలోనిటూరిస్ట్గైడ్ప్రకటనతోయాత్రికుల్లోఒక్కసారిగాఆత్రుతపెరిగిపోయిపడవలోపలడెక్లోకూర్చున్నయాత్రికులుఅందరూఒక్కసారిగాపడవబయటఆవరణలోకివచ్చితిమింగళాలనుఫోటోలుతీసుకోవడంలోను, వీడియోలనుచిత్రీకరించడంలోనుపోటీపడ్డారు.సముద్రంమట్టంగాలిపీల్చుకునేందుకుపైకిఎగరడం, సముద్రంలోమళ్ళీమునగడంలాంటితిమింగళాలవిన్యాసాలుచూస్తూ, ఇంకాకొంతసమయానికిచాలాదూరంలోతిమింగళాలుతేలుతూసముద్రంలోకనిపించడంతోఈవిన్యాసాల్లోపడవముందువైపుఇరువైపులాయాత్రికులకేరింతలతోప్రయాణంఆధ్యంతంసంతోషంతోగడిచిపోయింది.  సుమారుగా45000 కిలోలనుండి1,81,000కిలోలబరువుఉండేతిమింగళాలుగంటకు25 నుండి50 కిలోమీటర్లవేగంతోనీటిలోప్రయాణిస్తాయట. ఇవన్నీచూస్తున్ననాకునేషనల్జియోగ్రఫీఛానల్లోచూసినజ్ఞాపకాలుగుర్తుకువచ్చాయి. నేనుచాలామార్లునేషనల్జియోగ్రఫీఛానల్లోవీక్షించినమంచుగడ్డలుగ్లె్సియర్నుండివిడిపోయిసముద్రంలోపడిపోతున్నప్రాంతందరిదాపుల్లోకిమేంఅతిసమీపంలోఉన్నట్లుగాఅనిపించింది.సముద్రంలోతెలియాడ్తున్నమంచుముక్కలనుదాటుతూపడవఇంకాముందుకుప్రయాణించింది.మాకుకొంతదూరంలోపెద్దగ్లేసియర్నుండివిడివడినపెద్దపెద్దమంచుగుట్టలుసముద్రంలోపడిపోతున్నదృశ్యంసాక్షాత్కరించింది. ఇంకో 30 నిమిషాలుప్రయాణించిగ్లెషియర్ప్రాంతంలోచాలాసేపుఅలానేమంచుగుట్టలుగుట్టలుగావిరిగిపడేదృశ్యాలనుచూస్తూఅక్కడేగడిపాం.

వాతావరణంలోపెరిగిపోతున్నకాలుష్యం, గ్లోబల్వార్మింగ్కారణంగామంచుపర్వతాలుకరిగిపోవడం, సముద్రమట్టాలుపెరిగికొన్నికొన్నిద్వీపకల్పాలు, చిన్నచిన్నప్రాంతాలుసముద్రంలోమునిగిపోయే

విషయాలనుమనంవార్తల్లోవింటుంటాం, చదువుతాం,కానీపర్యావరణపరిరక్షణవిషయంలోఆచరణయోగ్యమైనకార్యక్రమాలకుపౌరులుగామనందూరంగాఉంటాం. దేశాధినేతలుసరేసరే.  మేంఆగ్లేషియర్ప్రాంతంలోతిరిగాడిందికేవలంఒకగంటమాత్రమేఅయినాతీవ్రమైనవేడికిగుట్టలుగుట్టలుగాసముద్రంలోపడిపోతున్నమంచుపెళ్ళలుచూసిమానసికంగాఆందోళన, బాధరెండుకలిగాయిపర్యావరణప్రేమికుడిగా, ఉద్యమకారుడుగాఉన్ననాకు. కొంతసమయంఅదేప్రాంతంలోతిరుగాడినమాపడవమమ్మల్నితిరిగిసేవార్డ్తీరప్రాంతంలోకికొన్నిగంటల్లోతీసుకువచ్చింది. ఎంతోకాలంగాప్రత్యక్షంగాచూడాలనుకున్నకోరికనెరవేరిందికానీ, గ్లోబల్వార్మింగ్కారణంగామనకుప్రకృతిఇచ్చినవనరులనుమనంమనముందుతరాలకుపూర్తిగాఇవ్వలేకపోతామేమోఅన్నబాధమనసులోమెదులుతుంటే. సేవార్డ్ప్రాంతంలోనిడౌన్టౌన్ప్రాంతంచేరుకొనికొంతసేపువిహరించిరాత్రి11 గంటలప్రాంతంలోమారూమ్కివెళ్ళాం.

ఆమరుసటిరోజుఉదయంసేవార్డ్నుండి50 కిలోమీటర్లదూరంలోనిఆరులక్షలఎకరాల్లోవిస్తరించిఉన్నకెనయ్జోర్డ్స్నేషనల్పార్కులోవిస్తరించిఉన్నపార్క్పరిసరాలుమరియుగ్లేసియర్చూడ్డానికివెళ్ళాం. పదివేలసంవత్సరాలక్రితంనుండిఉన్నఈగ్లేసియర్వాతావరణపరిస్థితులకారణంగా, ప్రపంచవ్యాప్తంగావస్తున్నభౌగోళికమార్పులు, గ్లోబల్వార్మింగ్కారణంగాఆగ్లె్సియర్అంతరించిపోతుండడంచూశాకఎంతోబాధగాఅనిపించింది. దాదాపు4000 అడుగులఎత్తైనఈఎగ్జిట్గ్లేసియర్గత250 సంవత్సరాలుగాపర్యావరణంలోవస్తున్నమార్పులకారణంగాదాదాపు50 శాతంఅంతరించిపోయింది. మేంమాకార్పార్కింగ్వద్దనుండిగ్లేసియర్ప్రాంతంవైపుచేరేసమయంలోఆప్రాంతంలోపర్యావరణపరిస్థితులనుఅధ్యయనంచేస్తున్నశాస్త్రజ్ఞులుప్రాంతాలవారీగాఏ, ఏసంవత్సరంలోఎంతభాగంగ్లేసియర్అంతరించిపోయిందోతెలిపేవిధంగానిర్థిష్టంగాబోర్డ్స్పెట్టడంచూసిఎంతోకలవరానికిగురయ్యా. ప్రపంచవ్యాప్తంగాఎంతోమందిపర్యావరణఉద్యమకారులుఎంతగాఉద్యమాలుచేస్తున్నా, పర్యావరణవిధ్వంసంఇంకాకొనసాగుతూనేఉంది. నాలుగువేలఅడుగులఎత్తైనప్రాంతంలోఉన్నగ్లేసియర్చూడటానికిమేముడొంకదారుల్లోఅతిప్రయాసతోప్రయాణించాం. ఎత్తైనప్రదేశాలుఎక్కుతూదిగుతూ. ముందుగాగ్లేసియర్కరగడంవల్లవిస్తరించిఉన్నమైదానప్రాంతంమీదుగావెళ్లాలనుకున్నాం.  కానీగ్లేసియర్కరగడంవల్లవస్తున్ననీటిప్రవాహవేగానికివీలుకాకపోవడంతోఆమార్గంద్వారాకాకుండాపైకిఎక్కడానికిగుట్టలమధ్యనుండిఏర్పడిఉన్నమరోకష్టమైనమార్గాన్నిఎంచుకొనిముందుకుసాగాం.

దాదాపు500 అడుగులవెడల్పు2000 అడుగులఎత్తులోఉన్నగ్లేసియర్లోదాదాపుసగభాగంపూర్తిగావట్టిపోయికేవలంసగభాగంమాత్రమేమంచుతోకప్పబడిఉంది. సూర్యరశ్మివేడికికరిగిపోయినగ్లేసియర్తాలూకునీరుక్రిందకుపారుతూకనిపించింది. చుట్టూచెట్లు-గుట్టలతోకనిపిస్తున్నఈప్రాంతంలోనేఎలుగుబంట్లుకూడాసంచరిస్తున్నాయనితెలుసుకొనిచూడాలనేకుతూహలంఉన్నాఅవిచూస్తే, మేంఅందమైనలోకాన్నిఇంకాచూడలేమేమోఅన్నభయం, అవికనిపిస్తేవచ్చేఅనర్ధాలను, ప్రమాదాలనుఊహించుకొనిఅక్కడినుండితిరిగివెనకకుబయలుదేరాం. దారిలోమధ్యాహ్నభోజనంముగించుకొనిసేవార్డ్నుండిమౌంట్మెకన్లీవైపుగాసాగిందిమాప్రయాణం.

సేవార్డ్నుండిమౌంట్మెకన్లీపర్వతందాదాపు576 కిలోమీటర్లు. డేనాలిగాఉన్నపేరును2015 లోమౌంట్మెకన్లీగామార్చారు. దీన్నిట్రంప్వచ్చాకమళ్లీ2025 లోడెనాలిగామార్చారు. సముద్రమట్టానికి20310 అడుగులఎత్తైనపర్వతశిఖరాగ్రంఈప్రాంతంలోఉంది. ప్రపంచంలోనేదీన్నిఅతిఎత్తైనమంచుశిఖరంగాకూడాపేర్కొంటారు.

మధ్యాహ్నంభోజనంతర్వాతసేవార్డ్నుండిమౌంట్మెకన్లీరావడానికిదాదాపు8 గంటలప్రయాణంచేయవలసివచ్చింది. సేవార్డ్ప్రాంతంనుండితిరిగివస్తుదారిలోనిఅలస్కావైల్డ్లైఫ్కన్సర్వేషన్సెంటర్లోకివెళ్ళాం.  200 ఎకరాలవిస్తీర్ణంలోఏర్పాటుచేయబడ్డఈకన్సర్వేషన్సెంటర్లోగాయపడి, అనాధలై-రక్షించబడినవివిధజంతువులకుదాతలుఇచ్చేవిరాళాలతోఆశ్రయంకల్పిస్తున్నారు.

అలస్కాప్రపంచంలోనేఅత్యధికంగాజంతువులుఉన్నప్రాంతానికిప్రసిద్ధి. ఈప్రాంతంవిస్తీర్ణంలోఅటవీప్రాంతాలు, సముద్రప్రాంతాలు, కొండప్రాంతాలు, గ్లేసియర్స్ప్రాంతాలుఒకదాన్నిమించిఇంకొకటిపోటీపర్యాటకులనుఅలరిస్తూఉంటాయి. అటవీప్రాంతంగుండాసాగేప్రయాణాలుఎక్కువగాఉండటంతోఈప్రాంతంలోయాదృచ్ఛికంగాజరిగేప్రమాదాలుకూడాఎక్కువే.  ఈప్రమాదాల్లోగాయపడినజంతువులనురక్షించబడినజంతువులనుఈకన్సర్వేషన్సెంటర్లోచేరుస్తుంటారు. ఎంట్రీఫీజ్35 డాలర్లుగాఉన్నఈకన్సర్వేషన్సెంటర్లోమనండబ్బురూపేణాఇచ్చేఎంట్రీఫీజ్కూడాజంతువులసౌకర్యాలకోసంవినియోగిస్తుంటారు. ఈకన్సర్వేషన్సెంటర్లోనిజంతువులన్నీఎంతోఆరోగ్యంగాఅటవీవాతావరణంలోనివసిస్తునట్లుగానేదృఢంగాఉన్నాయి. వివిధఎంక్లోజర్లలోఉన్నబోల్డ్ఈగల్, బ్లాక్బేర్,  బ్రౌన్బేర్,  కోయేటిస్, డీర్, ఎల్క్,  ఫాక్సస్,  గ్రేట్హార్నర్, ఔల్, లైన్స్, మూస్, ముస్కాస్, ముళ్ళపంది, రెయిన్డీర్, వోల్వ్స్‌, వుడ్బేసిన్జంతువులను, పక్షులనుచూసితదుపరిప్రయాణంకొనసాగించాం. దారి

పొడవునాఈప్రాంతంచూడ్డానికివస్తున్నయాత్రికులుతప్పపెద్దగాసంచారంలేదు.  చాలాప్రాంతాల్లోఇంటర్నెట్సౌకర్యంకూడాలేదు. కేవలండౌన్లోడ్చేసుకున్నరూట్మ్యాప్లద్వారామాత్రమేఈప్రదేశంచూడ్డానికిప్రయాణంచేయాల్సిఉంటుంది. దారిపొడుగునాప్రయాణంచేస్తున్నామధ్యలోశాఖాహారభోజనానికిచాలావెతుక్కోవాల్సివచ్చింది. దారిలోచాలాప్రాంతాల్లోప్రకృతివైపరీత్యాలవల్లకాలిపోయినచెట్లుకొన్నివందలఎకరాల్లోకనిపించాయి. రెండుమూడుచోట్లవర్షాలకుకృంగిపోయినరోడ్లువాటిరిపేర్లకోసందారిమళ్లించినరహదారిద్వారాప్రయాణిస్తూరాత్రి11 గంటలసమయంలోమౌంట్మెకన్లీప్రాంతంలోమేంబుక్చేసుకున్నఅతిథిగృహానికిచేరుకున్నాం. అత్యంతవిశాలంగాఉన్నఈఅతిథిగృహాల్లోమాకుకేటాయించినరూమ్కివెళ్లడానికికొంతసమయంపట్టింది. చలిఎక్కువగాఉన్నందునవార్మ్అప్కోసంఆపరిసరప్రాంతంలోనిచలిమంటవేడిలోగడిపిరాత్రిభోజనంముగించుకొనిరూమ్కివెళ్ళాం. రోజంతావిపరీతంగాతిరగడంవల్లఅలసిపోయినిద్రలోకిజారుకున్నాం.

ఆమరుసటిరోజుఉదయంమౌంట్మెకన్లీఅతిథిగృహంనుండి40 కిలోమీటర్లదూరంలోఉన్నతలకీత్నాఅనేప్రాంతానికిబయలుదేరాం. ఆరోజువాతావరణపరిస్థితుల్లోఅనూహ్యంగామార్పులువచ్చిఆకాశమంతామేఘావృతమైఉండివిపరీతమైనవర్షంవచ్చేపరిస్థితులు, వాతావరణంకూడాపూర్తిగాచల్లగామారిపోయింది. అలస్కాలాంటిప్రాంతాల్లోవాతావరణపరిస్థితులుఏర్పడిఎప్పుడూఒకేలాఉండవు. కొంచెంసేపట్లోనేవర్షం, ఆపిదపమరికొంచెంసేపట్లోఎండరావడంమాములే.కానీవర్షపువాతావరణంకొనసాగుతూనేఉందితలకీత్నావెళ్లేసమయానికివర్షంకొంచెంపెరుగుతూకొంచెంతగ్గుతూఉంది.

ఆరోజుటిమాప్రణాళికప్రకారండేనాలిలోనిఅతిఎతైనపర్వతశిఖరం, గ్లేసియర్స్చిన్నవిమానంలోచూసుకునిఆపరిసరప్రాంతంలోనిడేనాలినేషనల్పార్క్అంతాకారులోనేతిరగాలి. కానీవాతావరణపరిస్థితులుఅనుకూలించకపోవడంతోఎతైనశిఖరంతోకూడినగ్లేసియర్స్చూసేవిమానప్రయాణంతప్పనిపరిస్థితుల్లోరద్దుచేసుకున్నాం. వాతావరణంలోఎలాంటిమార్పులులేకపోవడం, ఉదృతంగావర్షంవచ్చేఛాయలుకనిపించడంతోడేనాలినేషనల్పార్క్వెళ్లాలనేఆలోచనకూడామానుకున్నాం. తలకీత్నపరిసరప్రాంతంలోఉన్నఅతిపురాతనకట్టడాలనుచూస్తూ,వస్తువులప్రదర్శనశాలలోసమయంగడుపుతూ, ఆగ్రామంసమీపంలోనినదితీరంలోమంచుకరుగుతూఉదృతంగాప్రవహిస్తున్ననదినిగమనిస్తూచాలాసమయంగడిపాం. ప్రయాణంలోఒకరోజుఇలాపూర్తిగావృధాఅయింది. సాయంత్రంవరకువాతావరణంలో

ఎలాంటిమార్పుకనిపించకపోవడంతోమళ్ళీతిరిగిమౌంట్మేకన్లీలాడ్జికివెళ్లిపోయిఆపరిసరప్రాంతంలోనిఅటవీప్రాంతంలోపర్యటించిరూమ్కివెళ్లిసేదతీరాం.

ఆమరుసటిరోజుఉదయంమళ్ళీమౌంట్మేకన్లీలాడ్జినుండితలకీత్నవెళ్లిఅక్కడినుండిచిన్నవిమానంలోడేనాలినేషనల్పార్క్లోనేకాకుండాప్రపంచంలోనేగ్లేసియర్స్తోకూడుకోనివున్నఅతిఎతైనశిఖరంఅయినడేనాలిపర్వతప్రాంతం, ఆపరిసరప్రాంతాల్లోనిగ్లేసియర్స్చూడ్డానికివెళ్ళాం. ఆకాశంలోనిమేఘాల్లోవిహారిస్తూ, ఆపరిసరప్రాంతాల్లోనిమంచుపర్వతాలనుపోలివున్నగ్లేసియర్స్, గ్లేసియర్స్నుండిఎండవేడికికరిగిప్రవహిస్తున్నమంచునీరులోయల్లోకిపారుతూసర్పాకృతిలోఉన్ననదులను, నదుల్లోకలుస్తున్నపిల్లకాలువలను, ఆప్రాంతంఅంతాదట్టంగాఉన్నదేవదారుచెట్లతోఉన్నఅడవులనువీక్షిస్తూఒకగంటసేపుప్రయాణించిసముద్రమట్టానికి 20390 అడుగులఎతైనశిఖరంసమీపంలోనిగ్లె్సియర్లోవిమానంనుండిదిగాం. ఆగ్లె్సియర్అంతాపూర్తిగామంచుతోకప్పబడినట్టుగాఉంది. మంచులోదిగాకమాలోఆనందంఅంబరమంతఅయ్యింది. జీవితంలోగ్లేసియర్స్తోకూడుకున్నఅలస్కాచూడాలనుకున్నకలనెరవేరింది. ఆమంచులోనేచాలాసేపువిహరించిఫ్లైట్అటెండెంట్సూచనతోమళ్ళీఫ్లైట్ఎక్కితిరిగితల్కీత్నప్రాంతంచేరుకొనిమౌంట్మేకన్లీలోనిమాఅతిధిగృహనికివెళ్లిపోయాం.

లాండ్ఆఫ్మిడ్నైట్సన్గాపేరుగాంచినముఖ్యప్రదేశాల్లోఒకటైనఅలస్కాయాత్రపూర్తిఅయింది. ఇంకాలాండ్ఆఫ్మిడ్నైట్సన్గాపిలువబడేనార్వేమరియుఫిన్లాండ్ప్రాంతాలుకూడాచూడాలనికోరికబకెట్లిస్ట్లోరాసుకునిఈప్రాంతాలుకూడాఅవకాశాన్నిబట్టివెళ్లాలానేనిర్ణయంతోవాటికోసంప్రణాళికలుకూడాఆలోచించడంప్రారంభించా.   

అలస్కాలోవిహరించిన 7రోజులుపూర్తిగాప్రకృతిలోమమేకమైజీవించడం, ఉదృతంగాప్రవహిస్తున్నజలాలగలగలలు, గాలులగుసగుసలు, పక్షులకిలకీలారావాలు, ఆకాశంలోరంగులుమార్చుకుంటున్నమేఘాలు, సముద్రంలోనివసించికనువిందుచేసేసముద్రసింహాలు, చేపలుతిమింగళాలవిన్యాసాలు, ఎతైనగుట్టలపైతిరుగాడేమౌంటైన్గొఱ్ఱెలు, నేషనల్పార్కులోదూరంగాతిరుగుతున్నబ్లాక్బేర్లు, పూర్తిగామంచురూపంలోఉండేతెల్లనినక్కలు, సాల్మన్చేపలుతినిరంగుమారిముదురుగోధుమరంగులోకనిపిస్తున్నఎలుగుబంటులుఈప్రాంతంలోమేంచూసినఅరుదైన, అందమైనఅపురూపమైన

జ్ఞాపకాలనుపదిలంగాభద్రపరచుకొనిఆమరుసటిరోజుమళ్ళీఇంకో 8 గంటలుప్రయాణించివిమానంలోచికాగోచేరుకున్నాం.

7780698038

Rssr1955@gmail.com

May 30, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

మనోరంజకం ( కథ)

by Shyama Dasi May 30, 2026
written by Shyama Dasi

“ఏమోయ్! ఎక్కడా ? ఫోన్లో అమ్మాయి మాట్లాడుతున్నది. త్వరగారా! “
నారాయణరావు అరుపుకు, ‘వారం అయింది అమ్మాయి ఫోన్ చేసి ఎందుకు చేయలేదో మరి‘
అనుకుంటూ అదే ఆలోచనలో కాఫీ కలుపుతూ ఉన్న సునీత,భర్త పిలుపుతో
“ఆ! వచ్చే, వచ్చే” తడిచేతులు చీర కొంగుకు తుడుచుకుంటూ హాల్లోకి వచ్చింది.
“ఇదిగో, మాట్లాడు ” అంటూ, నారాయణ రావు ఫోన్ భార్యకు అందించాడు.
“ఆ! శ్రీలు ఎలా ఉన్నారు? “
“అంతా బాగానే ఉన్నామమ్మా, కొత్త ఉద్యోగం కొంచెం పని ఎక్కువగానే ఉంటున్నది, నేను ఫ్రీ అయిన టైంలో మీకు అర్ధరాత్రి అప్పుడు ఫోన్ చేస్తే కంగారు పడతారని చేయలేదు అలా వారం గడిచిపోయిందమ్మా “
‘’ అలా కాదు శ్రీలు ఏ టైం అయినా పర్వాలేదు ఒక్కసారి పలకరించావంటే స్థిమితంగా ఉంటాము సరేనా తల్లీ!”
“అలాగే అమ్మా, ఈ సమ్మర్ లో ఇండియాకు రావాలని ప్లాన్ చేస్తున్నామమ్మా …. డేట్ కన్ఫర్మ్ అయిన తర్వాత వివరంగా చెప్తాను. “
“అవునా, చాలా సంతోషం శ్రీలు.ఎండలు ముదరకముందే వచ్చేందుకు చూడండి. అలాగే నీకేం కావాలో కూడా ముందుగానే చెప్పు వచ్చినప్పటినుండి పరుగులే మీకు. పాప ఎలా ఉంది. అల్లుడు గారు బాగున్నారు కదా, అత్తమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు? మనవాళ్లంతా క్షేమమే కదా! “
“అందరం బాగున్నామమ్మా. ఈయన వర్క్ లో చాలా బిజీగా ఉంటున్నారు. పాప బాగుంది. త్వరలో చూస్తారు కదా.
మనవాళ్ళందరిని కలవబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నాయనమ్మ తాతయ్య ఎలా ఉన్నారు?”
“తాతయ్య పరవాలేదు శ్రీలు. నాయనమ్మ ఆరోగ్యం తరచూ ఇబ్బంది పెడుతున్నది. ఆ గది దగ్గరకే వెళుతున్నాను పలకరించుకో చాలా సంతోషపడతారు”
మామగారికి ఫోన్ ఇచ్చి సగంలో వదిలేసిన కాఫీపని చూసేందుకు సునీత వంటగది వైపు కదిలింది.
“మధ్యాహ్నం భోజనాల తర్వాత అందరo హాల్లో కూర్చున్నపుడు. ఎప్పుడు ఏ అవసరం ముంచుకొస్తుందోనని నన్ను కనిపెట్టుకొనుoటూ, ఎక్కడికి కదలలేకున్నారు మీరు. పిల్లదాన్ని చూసి రెండేళ్లు దాటింది, ఫోనులో మాట్లాడుతున్నా, వీడియోలో చూస్తున్న, దగ్గరకు చేర్చుకోవాలన్న తపన తీరడం లేదు. దాని బిడ్డకు కూడా ఏ అచ్చట ముచ్చట తీర్చలేక పోతున్నాము.”
అంటూ అత్తయ్య బాధపడుతుంటే,
“అమ్మా!ఊరుకో, ఆ వెలితి తీర్చేందుకే నీ మనవరాలు వస్తున్నానని చెప్పింది కదా, నీ ఆయాసం అంతా ‘వూష్ కాకి ‘ అయిపోయి, చక చకా లేచి తిరుగుతావు చూడు.”
అంటూ మావారు ఉడికించారు. మావయ్య నవ్వుతూ చూస్తున్నారు.
శ్రీ లాస్య మా ఏకైక సంతానం. అల్లారుముద్దుగా పెరిగింది. అపురూప లావణ్యం అందమైన మనసున్న తనంటే మా బంధు వర్గానికి అంతా కూడా ఒక ప్రత్యేకమైన అభిమానం. చదువులో కూడా చాలా చురుగ్గా ఉండేది. అనుకోకుండా వచ్చిన సంబంధం, అందరికీ నచ్చినప్పటికీ, అమెరికా అనేసరికి, అంత దూరమా అని ఆగిపోయాము. కానీ అబ్బాయి తల్లిదండ్రులు ఒక అడుగు ముందుకు వేసి,
“అబ్బాయి, అమ్మాయి ఒకరికొకరు ఇష్టపడ్డారు. ఈడు జోడు కూడా చక్కగా కుదిరింది. అమ్మాయిని గురించి మీరు దిగులు పడకండి. మా ఇద్దరు పిల్లలు వసుధ, కృష్ణ చైతన్య ఇద్దరూ అట్లాంటాలో ఉంటారు. మీకు తెలుసు మా అమ్మాయికి పెళ్లయి ఇద్దరు పిల్లలు. మేము వారికిఐదారు గంటల ప్రయాణ దూరంలో సిన్సినాటిలో స్థిరపడ్డాము. తరచూ కలుస్తుంటాము. మా బంధు బలగమంతా కూడా అమెరికాలోనే ఉన్నారు.”
అంటూ మాకు నచ్చచెప్పి శుభస్య శీఘ్రం అనిపించారు. పెళ్లి ఘనంగా జరిగిపోయింది. మొదట్లో చాలా కష్టంగా అనిపించినా, తప్పదు కదా అలవాటు పడ్డాము. ఏడాదికి ఒకసారి తను రావడమో మేం వెళ్లడమో జరుగుతుండటం, శ్రీలు డెలివరీ సమయంలో అక్కడే ఆరు నెలలు ఉన్నాము . పాపకిప్పుడు ఐదేళ్లు. మా అత్తయ్య ఆరోగ్యం బాగోలేకపోవడంతో గత రెండేళ్లుగా మేము వెళ్లలేకపోయాము, ఉద్యోగాల మార్పులు,’ వీసా’ ప్రాబ్లమ్స్ తో శ్రీలు వాళ్ళు కూడా రాలేకపోయారు. ప్రొద్దున మాట్లాడినప్పటినుండి ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆత్రుత పడుతున్నాము.

తీరా శ్రీలు వాళ్ళు వస్తున్న రోజు దగ్గర పడుతున్న కొద్ది మనోబలం కంటే మించింది లేదు అన్నట్లు మంచంపై నుండి కాలుకింద పెట్టేందుకు ఆయాస పడుతూ ఇబ్బంది పడుతున్న మా అత్తయ్య, మావారు అన్నట్లుగానే ఉత్సాహంగా ఆ పని ఈ పని అందుకుంటూ హడావిడి పడసాగారు.
“సునీతా, ఎలాగూ శ్రీలు వాళ్ళు శ్రీరామనవమికి ఇక్కడే ఉంటారు కనుక, మనవాళ్లందరినీ ఇక్కడికే రమ్మని చెబుదాము. అందరం ఒకచోట కలిసినట్లు ఉంటుంది. పైగా శ్రీలు వాళ్లు కూడా ఎండలకు తిరిగే పని తప్పుతుంది ఏమంటావు? “
అన్నాడు నారాయణరావు. ఈ ఆలోచన బాగుందనిపించింది అందరికీ. అలాగే చేద్దాం అనుకున్నాము. మా పుట్టిల్లు, మా ఆడపడుచులు అందరివి,మాఊరుకి యాభై కిలోమీటర్ల దూరాల్లో ఊర్లే. అదీ కాక,మాఊర్లో ప్రసిద్ధి పొందిన రామాలయం, శివాలయాలు ఉన్నాయి. శ్రీరామనవమి, శివరాత్రి ఉత్సవాలు విశేషంగా జరుపుతారు కనుక చుట్టుపక్కల గ్రామాల నుండి అందరు కూడా ఇక్కడకు చేరుతారు.

పండక్కు వారం ముందుగా శ్రీలు, మా అల్లుడుగారు కృష్ణచైతన్య, పాప వచ్చారు. శ్రీలును దగ్గరకు తీసుకుని అత్తయ్య ఆపుకోలేక ఏడ్చేశారు . నా కళ్ళల్లో తడి గుండెల్లో భారాన్ని తగ్గించింది. మావారి పరిస్థితి,మామయ్య స్థితి కూడాఅంతే. అల్లుడు గారిని సాదరంగా పలకరించుకుని దగ్గరకు తీసుకున్నారు. పాప పేరు శ్రీనిధి అమ్మానాన్నల అందమంతా పుణికి పుచ్చుకొని కుందనపు బొమ్మలా ఉంది. తెలుగు స్పష్టంగా మాట్లాడుతున్నది దాంతో జేజవ్వ తాతయ్యల మురిపాలకు పొద్దు చాలడం లేదు, కథలు చెప్పమంటూ పాపవారిని వదలడం లేదు కూడా .

మరో రెండు రోజులకు బంధువులందరూ కూడా వచ్చేశారు. వాళ్ళ ఇళ్ళకు పిలిచి భోజనం పెట్టి పంపలేదు అన్న కొరత అందరిలో ఉన్నా, వచ్చిన మూడు వారాలకు అందులో ఎండలకు ఇబ్బంది పడతారని అందరూ ఇక్కడే సరదాగా గడుపుతున్నారు. తన వయసు పిల్లలతో నిధి కూడా బాగా కలిసిపోయి ఆడుకుంటున్నది.
అల్లుడుగారు కూడా కొత్త పాత లేకుండా మొదటి నుండి అందరితో కలిసి పోయారు. శ్రీలు అత్తగారు మాకు, బంధువులందరికీ కూడా పేరుపేరునా బహుమతులు పంపించారు.

శ్రీరామనవమి పండుగ సంబరాలకు దేవాలయాల ముందు,ఇళ్ల ముందు తాటాకు చలువ పందిళ్లు వేసి, మామిడి తోరణాలు కట్టి ఊరును ముస్తాబు చేస్తారు. రంగులు రాట్నాలు, రకరకాల అంగళ్ళు, సందడి చేస్తాయి. ముఖ్యంగా పిల్లలు పీచు మిఠాయితో చేతికి వాచీలు, ఉంగరాలు పెట్టించుకుని అవి(నాక్కుంటూ) రుచిచూస్తూ తిరగడం, రకరకాల ఆట బొమ్మలు, గాలి బుడగలుకొనడం సరదాలు. అక్కడక్కడ చలివేంద్రాలు పెట్టి పెద్దపెద్ద కుండలలో తాగే నీరు,మజ్జిగ, పానకం సిద్ధం చేస్తారు. వేడిని తగ్గించే పానకం, వడపప్పు ఈ పండుగ ముఖ్య ప్రసాదాలు. పొద్దున్నే అందరo స్నానపానాదులు, పూజా కార్యక్రమాలు, ముగించుకుని దేవాలయానికి బయలుదేరాము. కన్నుల పండువగా జరిగిన సీతారామ కళ్యాణం చూసి తరించి కల్యాణ అక్షింతలు తలపై చల్లుకొని,కొన్ని అక్షింతలు శ్రీలు వాళ్ళతోఅమెరికా పంపేoదుకు తీసుకొని ఇంటికి చేరాము.

ఆరోజు రాత్రి ఆరు బయట చల్లగాలికి మధ్య మధ్యలో విసన కర్రలతో విసురుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నప్పుడు, రోజంతా పండుగ సందడిని గమనిస్తూ ఉన్న నిధి,జేజి తాతయ్య ఒడిలో కూర్చుని ,

“తాతయ్యా! శ్రీరామనవమి అంటే ఏంటి ” అని అడిగింది.
“రాముడు పుట్టినరోజు తల్లీ” అంటూ పెద్ద వాళ్లకు కూడా అర్థమయ్యేలా చెప్పే పండుగ విశేషాలు వినాలని అందరం మాటలు ఆపి కుతూహలంగా కూర్చున్నాము.
నిధి తలనిమురుతూ నీలాగ’ రామ ‘అనే పేరును కూడా పలుకలేని అడవిలో పక్షులను జంతువులను చంపుకుని తింటూ బ్రతికే ఒక బోయవానికి, నారాయణ నామాన్ని పలుకుతూ నారదముని కనిపించి, ఇలా ప్రాణులను చంపడం పాపమని చెప్పి’ మరా ‘ మరా’ అని పలికించి నేను మళ్ళీ ఇక్కడికి తిరిగి వచ్చేవరకు ఇలాగే పలుకుతూ ఉండాలని చెప్పి వెళ్ళాడట. ఆ బోయవాడు ముని చెప్పినట్లు మరా, మరా అని చెబుతూ అక్కడే కూర్చుండిపోయాడు అంట. అదే రామ రామ అనే శబ్దంగా వినిపిస్తూ, ఆ బోయవాడు వాల్మీకి మహర్షిగా మారిపోయి మనందరికీ శ్రీరామ కథను చెప్పాడు తల్లి. రాముడు నీలాగా చాలామంచివాడు, ఎంతో బుద్ధిమంతుడు, అందరి పట్ల దయతో ఉండేవాడని చెబుతూ, రామచంద్రుని జననం, సీతా కళ్యాణం, వనవాసం, రామ భక్తుడైన హనుమంతుని గురించి,రావణ సంహారం, రామ పట్టాభిషేకం, లవకుశల జననం, అవతార సమాప్తి. ఒక్కొక్క ఘట్టాన్ని, వింటూ అందరం రామ కథలో, లీ నమైపోయాము. అందరి కళ్ల వెంట కన్నీళ్లు కారుతున్నాయి.
రాముడు లేడా!వెక్కి వెక్కి ఏడుస్తున్న నిధిని, సముదాయిస్తూ, రాముడు ఎక్కడికి వెళ్లిపోలేదు తల్లి మనతోనే ఉన్నా డు. రామ అని పలికితే హనుమంతుడు కూడా మన పక్కనే ఉంటాడు. అలా అయితే తాతయ్యా!రాముడిని పిలుస్తూ హనుమంతుని నా పక్కనే ఉంచుకుంటాను. అని చెబుతుంటే దాని బుద్ధి సూక్ష్మతకు, విశ్వాసానికి అందరం క్షణం సేపు నివ్వెర పోయాము.

తాతయ్య అందరి వైపు చూస్తూ, పదిపాకలున్న పల్లైనా రామాలయం తప్పక ఉంటుందన్నది మనమెరిగిన విషయమే కదా! సాయంత్రాలు తప్పనిసరిగా పిల్లలతో కలసి ,ఊరి వారందరూ అక్కడ చేరి రామ భజన చేస్తారు.
ఏ మహిమలు చూపని మనుజావతారం రామావతారం. రాజు గా ప్రజల పట్ల బాధ్యత, తల్లిదండ్రుల పట్ల విధేయత, భార్యాభర్తల అనుబంధం, సోదరులపట్ల అనురాగం, ఆశ్రమ వాసుల పట్ల రక్షణ, స్నేహ ధర్మం, శరణన్న శత్రువునైన క్షమించగలిగే ఔదార్యం. మర్యాదా పురుషోత్తముడైన శ్రీరామచంద్రుడు. తాను నడిచి చూపి,మన జీవితాలకు ఆదర్శంగా నిలిచాడు. అందరి నాలుకలపై పలుకు తేనెలు కురిపించే రామనామం మన బతుకునావను ఆత్మస్థైర్యంతో నడిపే శక్తినిస్తూ ఒడ్డుకు చేరుస్తుంది.
శ్రీరాముడు వసంత రుతువులో చైత్ర శుద్ధ నవమి గురువారం పునర్వసు నక్షత్రంకర్కాటక లగ్నం లో జన్మించినట్లు పురాణాలు చెబుతున్నాయి. మహావిష్ణువు యొక్క ఏడవ అవతారం శ్రీరాముడు. శ్రీరాముని జన్మదినంగా శ్రీరామనవమి జరుపుకుంటారు. సీతారాముల కళ్యాణం కూడా నవమినాడే జరిగిందని ఆ రోజే కళ్యాణం కూడా జరుపుతారు, వనవాసానంతరం పట్టాభిషిక్తుడు అయ్యిందికూడా నవమినాడే అని చెప్తారు. రామ పట్టాభిషేకం పటoలేని, ఇల్లుఉండదు. పూజామందిరమూ ఉండదు. ముఖ్యంగా పెళ్లిళ్లలో,సీతా సమేతుడై, సింహాసనం పై కూర్చుని, సోదరులను, హనుమంతుని, సకల దేవతలను కూడిన శ్రీరామచంద్రుని తప్పక పూజిస్తాము.
శ్రీరామనవమి పండుగ మన తెలుగు లోగిళ్ళలో వసంతోత్సవం పేరిట తొమ్మిది రోజులు చాలా వైభవంగా జరుపుకుంటాము. మార్చి అంటే ఎండలు మొదలవుతాయి కాబట్టి వడపప్పు, మిరియాలు వేసిన బెల్లo పానకం, ప్రసాదంగా పంచి పెడతారు. వడపప్పు పానకం చలువనిచ్చి సేద తీరుస్తాయి. విసెన కర్రలు కూడా పంచుతారు. దేవాలయాల్లో ముఖ్యంగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరుగుతుంది. గత ఏడాది మనమంతా భద్రాచలం వెళ్లి కళ్యాణం చూసి వచ్చాము కదా అంటూ తాతయ్యగుర్తు చేస్తూ, శ్రీరామ రామరామేతి
రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం
రామనామ వరాననే అని మూడుసార్లు పలికించి కళ్యాణ అక్షతలు అందరిపై చల్లాడు.

    ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్లిపోయారు.శ్రీలు వాళ్ళు ఊరికి వెళ్లే రోజు వచ్చింది. అందరి మనసులు భారంగా ఉన్నాయి అయినా, అక్కడ వాళ్లు దేనికి కొరత పడకూడదని, పచ్చళ్ళు, ఊరగాయలు, పొడులు,చిరు తిండ్లు. అన్నీ హాలంతా పరుచుకున్నాయి., ఇంకా బంధువులు ఇచ్చిన గిఫ్టులు, శ్రీలు అత్త,ఆడపడుచుల కొరకు మేం పంపుతున్న ప్రత్యేక బహుమతులు. ఇవన్నీచూస్తూ చైతన్య మేము తీసుకెళ్లేందుకేనా, విమానం సరిపోతుందా! అంటూ నవ్వుతుంటే! చూసేందుకు అలా అనిపిస్తుంది కానీ, తలా కాసింత పంచుకుంటే పూర్తిగా సరిపోవు కూడా అంటూ మా అత్తయ్య తనే స్వయంగా సర్దుతూ చెబుతుంటే, ఆమెను నొప్పించకూడదని మీరన్నది నిజమే అమ్మమ్మ, తనూ సూట్ కేసులు సర్దేందుకు కూర్చున్నాడు కృష్ణ చైతన్య. శ్రీలు వస్తానని ఫోన్లో చెప్పిన రోజు నుండి ఇప్పటివరకు మా అత్తయ్యేనా అని అబ్బురపరుస్తూ మందులకు మించిన శక్తి మనసుకు ఉందేమో అనిపిస్తున్నది.
    ఈసారి పాప కూడా బాగా చేరిక అయ్యి విడవలేకున్నాము. అయినా పసిది బెంగ పడుతుందని నిబ్బరంగామళ్లీ వాళ్లు రాబోయే రోజు కొరకు ఎదురు చూస్తూ అందరం మామూలుగా మసలాము. మనోరంజకమైన మన పండుగ పరమార్థం తెలుసుకున్న మనుమరాలు మరో దేశం వెళ్ళింది

    May 30, 2026 0 comment
    0 FacebookTwitterPinterestEmail
    కథలు

    ప్రేమ ఖరీదు.

    by Thatikola Padmavathi May 30, 2026
    written by Thatikola Padmavathi

    మాధవరావుకి ఇద్దరు ఆడపిల్లలే. ఉన్నంతలోనే పెద్ద కూతురు ఆరాధ్యకు డిగ్రీ వరకు చదువు చెప్పించాడు. పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు.
    “ఆరాధ్యకు ఇప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు. నేను ఇంకా పై చదువులు చదువుకోవాలి. ఉద్యోగం చేయాలి. అప్పటివరకు పెళ్లి చేసుకోను అన్నది.
    “నీకు ఇంకా పై చదువులు చెప్పిస్తే నీకన్నా ఆపై ఎక్కువగా చదువుకున్న వాడిని తీసుకురావాలి. నీ చెల్లెలు శాంతి ఇంటర్లో ఉన్నది. దానికి కూడా డిగ్రీ పూర్తి చేయించాలి.
    “నీకు పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తే అక్కడికి మా బాధ్యత సగం తీరిపోయినట్లు ఉంటుంది అన్నారు మాధవరావు.
    “నాకు ఇష్టం లేకుండా మీరు సంబంధాలేవి చూడకండి. నేను చేసుకోనని గట్టిగా చెప్పేసింది ఆరాధ్య.
    “పెళ్లి చేసుకున్నాక కూడా చదువుకోవచ్చు. ఉద్యోగం కూడా చేయొచ్చు. పెళ్లికి దీనికి ముడి పెట్టవద్దన్న ఆరాధ్య వినలేదు.
    “దాని కర్మ మనమేం చేస్తామని ఊరుకున్నారు. ఆరాధ్య ఎంబీఏ లో చేరింది. డిగ్రీలో పరిచయమైన విశ్వం ఆరాధ్యను ప్రేమిస్తున్నాడు. ఉద్యోగాలు వచ్చాక ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. అందుకే ఆరాధ్య పెళ్లికి అడ్డు చెప్పింది.
    “నాలుగేళ్లు వాళ్ళ ప్రేమను గోప్యంగా దాచి పెట్టారు. ఆరాధ్య చదువు పూర్తి అయిన వెంటనే ఉద్యోగంలో చేరింది.
    “ఆరు నెలలు గడిచిన విశ్వానికి ఉద్యోగం దొరకలేదు.
    “విశ్వం పెళ్లి ప్రస్తావన తెచ్చాడు. ఇప్పుడు కాదంటూ వాయిదాలు వేస్తూ వస్తున్నది ఆరాధ్య.
    “ఒకరోజు నిలదీసి అడిగేసరికి ఉద్యోగం లేని వాడికి ఇంటి అల్లుడుగా మా వాళ్ళు ఒప్పుకోరు అంది.
    “మీ వాళ్ళు ఒప్పుకోరా! నీకే ఇష్టం లేదా! నువ్వు ఇదివరకులా నాతో ఫ్రీగా మాట్లాడటం లేదు. ఒకప్పుడు కాస్త సమయం దొరికితే చాలు సినిమాలకి షికారులకి తిరిగేవాళ్ళం. నీకు ఉద్యోగం వచ్చాక మనిద్దరి మధ్య ఎడబాటు పెరిగింది. నీ మనసులో ఏముందో స్పష్టంగా చెప్పమన్నాడు విశ్వం.
    “నిజంగానే ఈమధ్య విశ్వం మీద ఆరాధ్యకు ప్రేమ తగ్గిపోయింది. తనకోసం మంచి మంచి సంబంధాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆస్తి అంతస్తులో విశ్వం కంటే గొప్ప వాళ్లే వస్తున్నారు.
    “ఇంట్లో వాళ్ళు మన పెళ్లికి ఒప్పుకోవడం లేదు. మనిద్దరి కులాలు ఒకటి కావు. వాళ్లని ఎదిరించి ఈ పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదన్నది.
    “ఆరాధ్య మనసులో ఉన్న మాటలు బయటపెట్టేసరికి విశ్వంకు కోపం వచ్చింది.
    “నువ్వేనా ఇలా మాట్లాడేది? ఆరేళ్ల నుంచి నా చుట్టూ తిరిగి నాతో స్నేహం చేశావు. సినిమాలు షికార్లకు తిప్పి డబ్బు ఖర్చు పెట్టించావు. పుట్టినరోజు, పార్టీ లంటూ రెస్టారెంట్లకి తిప్పావు. ఇప్పుడు వదిలించుకోవాలని చూస్తున్నావా! నీకు నా మీద ఉన్న ప్రేమంతా ఏమైపోయింది. నువ్వు కాదన్నా నేను వదిలేది లేదు. అనుకున్నట్లు మన పెళ్లి జరిగిపోవాల్సిందే అన్నాడు.
    “విశ్వం గట్టిగా అడిగేసరికి ఆరాధ్య అహం దెబ్బతిన్నది.
    “ఏంటి? ప్రేమిస్తే పెళ్లి చేసుకోవాలని రూలేమన్నా ఉన్నదా! అప్పటి పరిస్థితులు వేరు. నీ మీద నాకు ఇంట్రెస్ట్ కలగడం లేదు. నాకు ఆల్రెడీ పెళ్లి ఫిక్స్ అయిపోయింది. జరిగిందంతా మర్చిపోయి నువ్వు కూడా ఇంకొకరిని పెళ్లి చేసుకుని సుఖంగా ఉండు. అంతేకానీ నా పెళ్ళికి, నా సుఖానికి అడ్డు రావద్దు. కాదు కూడదని ఏమైనా ప్రయత్నం చేశావనుకో! నేనేం చేస్తానో అంటూ విశ్వాన్ని లెక్కచేయకుండా వెళ్లిపోయింది ఆరాధ్య.
    “ఎంత పొగరు! చూస్తా! ఎలా సుఖపడుతుందో నన్ను కాదని పెళ్లి చేసుకున్నా కూడా కంటిమీద కునుకు లేకుండా చేస్తానంటూ శపధం చేశాడు.
    “విశ్వం మాటలు పట్టించుకోలేదు ఆరాధ్య. అనుకున్నట్లుగానే ఆరాధ్య ఉద్యోగంలో చేరగానే గొప్ప గొప్ప పెళ్లి సంబంధాలు వస్తున్నాయి. తనకంటే ఆస్తిపరుడు, ఎక్కువ జీతం సంపాదించే శేఖరంని చూసి ఇష్టపడింది. నిజంగా చెప్పాలంటే ఇది కూడా ప్రేమ వివాహమనే చెప్పాలి. ఇద్దరిదీ ఒకే కులం కావడంతో ఇంట్లో వాళ్ళు పెళ్ళికి ఒప్పుకున్నారు. ఒక ముహూర్తాన ఇద్దరూ ఒకటయ్యారు.
    “మొదటి రాత్రి గదిలోకి వెళ్లి ఎదురుచూస్తున్నాడు శేఖరం. తెల్ల చీరలో అందంగా ముస్తాబై పాల గ్లాసు చేత పట్టుకొని సిగ్గుపడుతూ గదిలోకి అడుగు పెట్టింది ఆరాధ్య.
    “ఆమె చేతిలోని గ్లాసుని పక్కనపెట్టి రెండు భుజాలు పట్టుకొని మెల్లగా మంచం వైపు అడుగులు వేస్తూ తీసుకొచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు.
    సిగ్గుతో రెండు చేతులతో ముఖం కప్పుకుంది.
    “ఇదంతా సిగ్గేనా? ఇంతకుముందు లేనిది ఇప్పుడు ఎందుకు? ఆమె ముఖాన్ని చేతుల నుంచి తొలగించాడు.
    “ఈరోజు మన మొదటి రాత్రి”, మనసులు తనువులు పంచుకునే వేళ. మన మనసులు ఎటువంటి అరమరికలు ఉండకూడదు. మనసు విప్పి ఉన్న దున్నట్లు నిజం చెబితే మనిద్దరి మధ్య అపార్థాలకు తావుండదు. ఏమంటావు అన్నాడు శేఖరం.
    “మీరు చెప్పింది నిజమే! మీరు కూడా నా నుంచి ఎటువంటి నిజాలు దాయకూడ దన్నది ఆరాధ్య.
    “ఓకే! లేడీస్ ఫస్ట్ అన్నారు. ముందు నువ్వే చెప్పాలి అన్నాడు.
    “ఎందుకైనా మంచిది. ముందు చెబితే సరిపోతుంది. తర్వాత తెలిసినా ప్రమాదం ఉండదనుకొని ఆరాధ్య విశ్వంతో నడిపిన ప్రేమాయణం మొత్తం చెప్పేసింది.
    “నాకు లాగానే నీకు కూడా లవ్ ఎఫైర్ ఉందన్నమాట”
    “అంటే మీ వెంట కూడా అమ్మాయిలు వెంటపడేవారా?
    “ఏం! ఎందుకు పడరు. అందుట్లో నేను అందగాడిని! నావైపు ఆశగా చూసేవాళ్ళు వున్నారు.
    “మిమ్మల్ని ఎవరూ ప్రేమించలేదా! మీరే ప్రేమించారా?
    “నేనైతే ఎవరిని ప్రేమించలేదు. ఒక అమ్మాయి మాత్రం నా వెంటపడి ప్రేమించింది. ఇప్పటికీ నా మనసులోనే ఉందనుకో!
    “మీ మనసులో ఆ అమ్మాయి నుంచు కొని నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారు? ఆ పిల్లనే చేసుకోకపోయారా! అంటూ చిరు కోపం నటించింది.
    “ఈ బుంగమూతిలో నువ్వెంత అందంగా ఉన్నావో! చెప్పనా?
    “నా అందం సంగతి సరే! ముందు అమ్మాయి సంగతి చెప్పండి. మీ మనసు నుంచి ఆ అమ్మాయిని తీసేస్తేనే ఈరోజు మనం మొదటి రాత్రి జరుగుతుంది. లేకపోతే మీరక్కడ నేనిక్కడ అంటూ దూరం జరిగింది.
    “పిచ్చి పిల్లా! భర్త పరాయి స్త్రీని మనసులో దాచుకుంటే సహించలేని దానివి. నా మనసులో నువ్వు తప్ప రెండో వారికి స్థానం లేదు. నిన్ను ఆట పట్టించాలని అలా అన్నాను. అర్ధేచ కామేచ, మోక్షేచ, నాతిచరామి అంటూ నిన్ను పెళ్లి చేసుకున్నాను. జీవితాంతం నువ్వే నా భార్యవి. నువ్వే నా ప్రేయసివి కూడా. మాటలతోనే నిద్రపుచ్చుతావా! ముద్దు ముచ్చట్లు ఏమైనా ఉన్నాయా అంటూ భార్యని దగ్గరకు తీసుకున్నాడు శేఖరం.
    “వాళ్ళ వైవాహిక జీవితం ఆనంద సాగరంలో మునిగితేలుతున్నది.
    “జీవితం ఎప్పుడూ సుఖసంతోషాలతో ఉంటే దేవుడు చూస్తూ ఊరుకోడు. ఆరాధ్య ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.
    “ఉన్నట్లుండి ఆరాధ్య జీవితంలోకి అనుకోని తుఫాను వచ్చి పడింది.
    “అర్ధరాత్రి 12 గంటలకి గాఢ నిద్రలో ఉన్నారు ఆరాధ్య ఆమె భర్త శేఖరం. ఫోన్ రింగ్ అయినా శబ్దం ఇద్దరికీ వినబడలేదు. రెండోసారి రింగ్ అయ్యేసరికి ఆరాధ్య కళ్ళు తెరిచి చూసింది. భర్త ఆదమరచి నిద్రపోతున్నాడు. మెల్లగా లేచి వెళ్లి కాల్ చూసింది. అంతే ఒక్కసారి ఆమె గుండె ఝల్లుమంది.
    “ఇతనా! ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడెందుకు కాల్ చేసినట్లు. తిరిగి కాల్ చేయాలంటే భయం వేసింది. భర్తకి మెలకువ రాలేదు. అదే ఫోన్ మళ్ళీ రింగ్ అయింది.
    “లిఫ్ట్ చేయక తప్పలేదు. తన గొంతు తనకే వినబడనంతగా మెల్లగా ఎవరూ అన్నది.
    “నేనెవరో గుర్తుపట్టలేదా! గుర్తుపట్టిన ఎవరో తెలియనట్టు నటిస్తున్నావా! నేను నీ ప్రేమ పిపాసిని. నువ్వు నన్ను మర్చిపోయినా నేను మాత్రం మర్చిపోలేను. నిన్ను నీడల్లే వెంటాడుతూనే ఉంటాను. ఎందుకంటే నీ మీద ప్రేమ అంత గొప్పది!
    “ఇంతకీ నీకేం కావాలి? నాకు పెళ్లయిన విషయం నీకు తెలుసు అనుకుంటాను. ఎప్పుడో మర్చిపోయిన నిన్ను మళ్ళీ ఎందుకు గుర్తు చేస్తున్నావు. నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇంకెప్పుడూ ఫోన్ చేయకు అంటూ కట్ చేసింది.
    “ఏ.సి రూము అయినా ముఖమంత చెమటలు పడుతున్నాయి. శేఖరం లేవలేదు. బతికిపోయాననుకుని గుండెల మీద చెయ్యి వేసుకుంది. మంచం మీద పడుకున్నదన్న మాటే గాని నిద్ర పట్టడం లేదు. శేఖరం చూడలేదు చూసి ఉంటే ఏం జరిగేది?
    తన ఫోన్ నెంబర్ అతనికి ఎలా తెలుసు. అప్పటి పాత నెంబరు మార్చేసింది. అయినా ఫోన్ నెంబర్ తెలుసుకోవడం అంత పెద్ద కష్టమేమీ కాదు. ఎందుకు చేసినట్టు. “బ్లాక్మెయిల్ చేయాలని చూస్తున్నాడా! మళ్లీ చేసినప్పుడు చూసుకోవచ్చులే అని తనకు తానే ధైర్యం చెప్పుకోంది”.
    “తెల్లవారి లేచాక యధావిధిగా తన పనులు తాను చేసుకుంటూ పోతున్నది. పిల్లల్ని రెడీ చేసి స్కూల్ కి పంపించింది. భర్తకి బాక్స్ సర్దితను సర్దుకుంది. భార్యాభర్తలిద్దరు ఎవరి ఆఫీసులకు వాళ్ళు చేరుకున్నారు.
    ఆఫీసుకు వెళ్లిందన్న మాటే గాని వర్క్ చేయ బుద్ధి కాలేదు. మనసంతా చికాకుగా ఉంది. దానికి తోడు తలనొప్పి ఎక్కువైంది. సెలవు చెప్పి ఇంటికి వచ్చేసింది. ఎంత మర్చిపోదాం అనుకున్నా మనసులో భయం చోటుచేసుకుంది.
    “అది మొదలు ప్రతిరోజూ అర్ధరాత్రి పూట ఫోన్ రావడం ఆరాధ్య భయం భయంగా లిఫ్ట్ చేయడం జరుగుతున్నది. ఆరోజు రాత్రి పది మిస్సిడ్ కాల్స్ వచ్చాయి. ఆరాధ్య గాఢ నిద్రలో మునిగి ఉంది.
    “కాల్ రాగానే శేఖరం లేచి లిఫ్ట్ చేశాడు. హలో నేను అడిగింది ఏం చేసావు? 10 లక్షలు ఇస్తానంటే ఓకే.! నా దగ్గర ఉన్న నీ వీడియోలు డిలీట్ చేస్తాను. అంత డబ్బు ఇవ్వలేకపోతే చెప్పు మీ ఆయన ఊర్లో లేనప్పుడు అప్పుడప్పుడు గుట్టుచప్పుడు కాకుండా వచ్చి వెళ్తుంటాను. నాకు ఏదైనా పర్వాలేదు. నీకు ఏది ఇష్టమో చెప్పు. ఇంకా వెయిట్ చేయడం నావల్ల కాదంటున్నాడు.
    “హలో! మిస్టర్! నువ్వు చెప్పిన దాంట్లో నీకు ఏది ఇష్టమో చెప్పు ఆలోచిస్తాను అన్నారు శేఖరం.
    “ఓ! మీరే నా ఆరాధ్య భర్త. నా రెండు డిమాండ్స్ మీరు విన్నారు కదా. మీ ఆవిడ వీడియోలు నా దగ్గర ఉన్నాయి. చూపించమంటారా అన్నాడు.
    “చూడు విశ్వం. నీ పేరు నీ కథంతా నాకు తెలుసు. ఉద్యోగం సద్యోగం లేకుండా గాలికి తిరుగుతూ ప్రేమని అడ్డం పెట్టుకొని డబ్బు సంపాదించాలనుకునే వాడివి. ఆరాధ్య నాకు అంతా చెప్పింది. నీ దగ్గర వీడియోలు ఉన్నాయని నాకు తెలుసు. నీకు భార్య పిల్లలు ఉండే ఉంటారు. వాళ్లకోసం నువ్వేమైనా చేయగలవు. నేను కూడా అందుకు సిద్ధమే!
    “అయితే ఒక విషయం మనం డీల్ కుదుర్చుకునే ముందు నీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు శేఖరం.
    “విశ్వం ఏమిటో చెప్పమన్నాడు.
    “ఆరాధ్య నువ్వు ప్రేమించుకున్నారని విషయం మా పెళ్ళికి ముందే అన్ని విషయాలు దాచకుండా నాకు చెప్పింది. ప్రేమించడం, ప్రేమించబడటం అనేవి వ్యక్తిత్వాన్ని బట్టి నచ్చుతాయి. బాధ్యతారహితంగా ప్రవర్తించే వాడిని ఏ అమ్మాయి మాత్రం పెళ్లి చేసుకుంటుంది. ప్రేమ త్యాగాన్ని కోరుకోవాలి కానీ ద్వేషంతో వాళ్ళ జీవితాలను నాశనం చేయాలని చూడకూడదు.
    “ప్రేమించబడిన వాళ్లు సుఖంగా సంతోషంగా ఉండాలని కోరుకోవాలి. ప్రేమంటే ఏమిటో తెలుసా? ప్రేమ విలువలతో కూడుకున్నది. దేవదాసు పార్వతి, సలీం అనార్కలి, లైలా మజ్నుల ప్రేమ కథలు వినలేదా? పెద్దవాళ్లు అంగీకరించలేదని వాళ్ళ ప్రేమను త్యాగం చేసుకున్నారు. చివరికి చావుకు కూడా సిద్ధపడ్డారు. ప్రేమ కోసం కట్టుబాట్లలను పెంచుకొని పగ, ప్రతీకారాలు రగిలించుకోకుండా వాళ్ల ప్రేమకు సమాధులు కట్టుకున్నారు. పవిత్రమైన ప్రేమని ఆరాధించారు. ప్రేమించిన స్త్రీ కోసం వీడియోలు అడ్డం పెట్టుకుని ఏం సాధిస్తావు? పెళ్లయినాస్త్రీ జీవితాన్ని నాశనం చేసి అపవిత్రం చేస్తావా? లేకపోతే ప్రేమని డబ్బుతో కొనుక్కుంటావా?
    “ఆరాధ్య భర్తగా చెప్తున్నాను. కాదు కూడదని నీ డిమాండ్లకు లొంగి రాలేదని ప్రమాదం తలపెట్టాలని చూస్తే మాత్రం నేను చూస్తూ సహించను. చట్టపరంగా చర్యలు తీసుకోవలసి వస్తుంది. ఒకసారి నీ భార్య పిల్లల్ని దృష్టిలో పెట్టుకో! మనసు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందంటూ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చాడు శేఖరం.
    నీ ఆర్థిక అవసరాలకు ఏమైనా సాయం కావాలంటే అడుగు చేస్తానన్నాడు.
    “నాలుగు రోజుల తర్వాత పగటిపూట కాల్ చేశాడు విశ్వం. రాత్రివేళ కుదరదని పగలు చేయడం మొదలుపెట్టాడు. ఈసారి వీడికి తగిన గుణపాఠం చెప్పి తీరాల్సిందేనను కొన్నది ఆరాధ్య.
    “ఫోన్ లిఫ్ట్ చేయగానే సారీ ఆరాధ్య! నువ్వు చెప్పాలనుకున్న గుణపాఠం మీ వారు చెప్పారు. నా కళ్ళు తెరిపించారు. నువ్వెక్కడున్నా నీ సుఖమే కోరుకుంటాను. నా నుంచి నీకు ఎటువంటి ఇబ్బంది రాదు. నీ భర్త పిల్లలతో సుఖంగా ఉండమంటూ ఫోన్ పెట్టేశాడు విశ్వం.
    “పక్కనే ఉండి అంతా విన్న శేఖరం అదంతా నేను చూసుకున్నాను. నీకేం భయం లేదంటూ ప్రేమగా భార్యని హృదయానికి హత్తుకున్నాడు.
    “ప్రేమ ఒకరితో పెళ్లి ఒకరితో కోరుకుంటే ఇలాంటి అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్రతి ఆడపిల్ల పెళ్ళికి ముందు ఆచితూచి అడుగులు వేయాలి అంటూ భార్యకి ధైర్యం చెప్పాడు.

    May 30, 2026 0 comment
    0 FacebookTwitterPinterestEmail
    Uncategorized

    కాలభైరవాష్టమి ప్రాధాన్యత – విశ్వ నియమాల దృష్టి

    by dr. Lakkraju Nirmala May 30, 2026
    written by dr. Lakkraju Nirmala

    కాలాన్ని నియంత్రించే శక్తి కాలభైరవుడు. అశ్టమి తిథి ఆయనకు అత్యంత అనుకూలమైన శక్తి తరంగాలు ప్రసరించే సమయం. ఈ రెండూ కలిసినప్పుడు మనిషి జీవితంలో సమయం, కర్మ, శక్తి, భయం, అడ్డంకులు అన్నీ ప్రబలంగా మారుతాయి. ఈ రోజు విశ్వ నియమాలు అసాధారణంగా పనిచేస్తాయి.

    లా ఆఫ్ డివైన్ ఆనెస్స్ (ఐక్యత నియమం)
    కాలభైరవుడు కాలమనే విశ్వ శక్తి.
    అతనిని ఆరాధించడం అంటే మనలో ఉన్న కాల–ప్రజ్ఞను మేల్కొలపడం,
    మన శరీర రితువులతో (బయోలాజికల్ క్లాక్),
    మనసుతో, ఆత్మతో విశ్వప్రవాహం ఒకటిగా పనిచేసేలా చేయడం.
    అర్థం:
    ఈ రోజున చేసిన ధ్యానం మన అంతర్గత శక్తిని కాల ప్రవాహంతో కలుపుతుంది.
    తప్పిపోయిన సమయాన్ని తిరిగి సరి చేసుకునే అవగాహన వస్తుంది.

    1. లా ఆఫ్ వైబ్రేషన్ (కంపన నియమం)
      భైరవుడు అధిక తీవ్రత గల రక్షణాత్మక వైబ్రేషన్.
      అష్టమి తిథి చంద్రశక్తులు కూడా తక్కువ ఫ్రీక్వెన్సీ నుంచి పైకి లేవడం జరుగుతుంది.
      ఎందుకు ప్రభావం ఎక్కువ?
      ఈ రోజున భైరవ మంత్రం, భైరవ యంత్రం, ధ్యానం చేసినప్పుడు
      వైబ్రేషన్ శరీరంలోని
      మూలాధార
      స్వాధిష్ఠాన
      మనీపూర
      చక్రాలలోని భయాలు, అనిశ్చితి, గత కర్మ బంధాలు విడిచి పోతాయి.
    2. లా ఆఫ్ కార్మా (కర్మ నియమం)
      కాలభైరవుడు కాలాన్ని మాత్రమే కాదు, కర్మ ప్రవాహాన్ని కూడా నియంత్రించేవాడు.
      ఈ రోజున
      చేయబడిన శుద్ధి (repentance)
      చేసిన పూజ
      ఇచ్చిన దానం
      చేసిన సేవ
      కర్మఫలాన్ని సాధారణ దినాల కంటే వేగంగా ఇస్తుంది.
      అందుకే ఈ రోజున
      పాపాలు క్షమించబడతాయి,
      మనసు తేలిక అవుతుంది,
      కొత్త మార్గాలు తెరుచుకుంటాయి.
    3. లా ఆఫ్ అట్రాక్షన్ (ఆకర్షణ నియమం)
      ఈ రోజున మనస్సు భయంలేని స్థితికి చేరుతుంది.
      భయం తొలగితే ఆకర్షణ శక్తి పది రెట్లు పెరుగుతుంది.
      కాబట్టి ఈ రోజున:
      కోరికలు
      ధృడ సంకల్పాలు
      లక్ష్యాలు
      రక్షణ ప్రార్థనలు
      విశ్వానికి స్పష్టంగా చేరతాయి.
    4. లా ఆఫ్ యాక్షన్ (కార్య నియమం)
      భైరవుడు చర్య యొక్క దేవత.
      అంటే ఈ రోజున మనం మొదలు పెట్టిన పని
      ధైర్యం, స్పీడ్, నిర్ణయం అనే శక్తులతో నిండిపోతుంది.
      కాబట్టి ఈ రోజున:
      కొత్త వ్యాపారం
      కొత్త నిర్ణయం
      కొత్త సాధన
      కొత్త జీవన విధానం
      ప్రారంభించటం శుభం.
    5. లా ఆఫ్ కరెస్పాండెన్స్ (లోపలి – బయట సంబంధం)
      కాలభైరవాష్టమి రోజున లోపల ఉన్న భయాలు ప్రశాంతం అవుతాయి.
      లోపలి భయాలు తగ్గితే బయట జీవితం కూడా సరిగా నిలబడుతుంది.
      లోపల శాంతి = బయట రక్షణ
    6. షడ్చక్రాల దృష్టిలో ప్రాధాన్యత
      కాలభైరవుడు ప్రధానంగా మూలాధార చక్రం యొక్క అధిపతి.
      ఈ రోజున అయన శక్తి ప్రభావం పడేది:
    • మూలాధారము – భయం తొలగిస్తుంది
    • స్వాధిష్ఠానము – స్థిరత్వం ఇస్తుంది
    • మనీపూరము – ధైర్యం & నిర్ణయ శక్తి ఇస్తుంది
      ఈ రోజు ధ్యానం చేసినవారికి
      మానసిక దౌర్బల్యం తొలగి
      ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
    1. పంచభూతాల దృష్టిలో
      కాలభైరవుడు
      అగ్ని తత్త్వాన్ని శుద్ధి చేస్తాడు
      గాలి తత్త్వాన్ని సమసమానంగా చేస్తాడు
      భూమి తత్త్వాన్ని స్థిరపరుస్తాడు
      అంటే శరీరంలో
      వేడి
      ఒత్తిడి
      అలసట
      భయం
      తగ్గుతాయి.
    2. ఈ రోజున లభించే ఫలితాలు
      విశ్వ నియమాల ప్రకారం:
      గత కర్మాల శుద్ధి
      భయం, అడ్డంకుల తొలగింపు
      కోరికలు వేగంగా నెరవేరటం
      ఆర్థిక రక్షణ
      కుటుంబ రక్షణ
      చెడు శక్తుల నుండి విముక్తి
      మనసు–శరీరం సమతుల్యం
      ధైర్యం, స్పష్టత, నిర్ణయం
    3. ఆచరణ పద్ధతి (సరళమైనది)
    4. 8 దీపాలు వెలిగించండి (అష్టమి శక్తి)
    5. “ఓం కాళ భైరవాయ నమః” 108సార్లు చెప్పండి
    6. నువ్వుల నూనె దీపం వేయండి
    7. ఒక మంచి పని చేయండి (దానం, సేవ)
    8. రాత్రి ధ్యానం – 8 నిమిషాలు
      సారాంశం
      కాలభైరవాష్టమి అనేది ఒక ఇంటి పండుగ కాదు,
      ఒక దేవాలయ పూజ కాదు,
      ఇది కాలం – కర్మ – భయం – రక్షణ అన్న నాలుగు విశ్వ నియమాలు ఒకే స్థలం, ఒకే రోజున పనిచేసే సమయంలో నిర్మించిన విశ్వ శక్తి.
      ఈ శక్తిని గ్రహించినవారి జీవితం
      వేగంగా మారుతుంది,
      శుభ పథం లోకి వెళుతుంది,
      అడ్డంకులు చదరంగం లాంటి వేగంతో తొలగిపోతాయి.
    May 30, 2026 0 comment
    0 FacebookTwitterPinterestEmail
    వ్యాసాలు

    శాంతి ఓటమి కాదు!మానవజాతి విజయం!!

    by రంగరాజు పద్మజ May 30, 2026
    written by రంగరాజు పద్మజ

    మన పూర్వీకులు ఏదైనా మంచి ఆలోచన లేదా కొత్త పనిని మొదలు పెట్టాలనుకుంటే ఉగాది మరుసటి రోజు ఈ రోజునుండి దీన్ని ఆచరిస్తాను అని గట్టి నిర్ణయం తీసుకునే వారు.(Resolution) వలె… ఆ పని మీదే ధ్యాస పెట్టి మరీ చేసేవారు.
    అలా మనం కూడా ప్రపంచ శాంతి కోరుకుంటూ ఆ దిశగా ఒకరికొకరం చెప్పుకుంటూనో? ఆచరిస్తూనో సాగుదాము.
    ప్రపంచ శాంతి అనే గొప్ప సంస్కారం మనకు మహాభారతం నుండి హిరోషిమా వరకు ఒక హెచ్చరిక చేసింది.
    ఈ విశాల భూమండలంలో మనిషి ఎన్నో అద్భుతాలను సృష్టించాడు.కానీ అదే మనిషి, తన అహంకారంతో, తన కోపంతో, తన స్వార్థంతో…
    ప్రపంచాన్ని ఎన్నోసార్లు నాశనం అంచుల వరకు తీసుకెళ్లాడు. ఇది చరిత్ర సాక్షిగా జరిగిన సత్యం.
    శాంతి అనేది ఒక పదం కాదు!అది మానవ జాతి నిలబెట్టే మూల స్తంభం.
    మన దేశ చరిత్ర లోని సంఘటనలు మనకెన్నో పాఠాలు చెప్పాయి….
    మహాభారతం ఇతిహాసమే తీసుకుంటే…..ఆ యుద్ధం ముందు వచ్చిన శాంతి కోసం ప్రయత్నాలెన్నో… అవకాశాలు అన్నన్ని…( కృష్ణ- సంజయ- రాయబారాలు; ధౌమ్య- వ్యాస-విదుర హితోక్తులు, మునుల సందేషాలు) అందుకే మహాభారతం ఒక గొప్ప అద్దంవంటిది.
    శ్రీకృష్ణుడు స్వయంగా శాంతి దూతగా కౌరవుల దగ్గరకు వెళ్లి, పాండవులకు వారి కుటుంబాలను పోషించుకోవడానికి “ఐదు గ్రామాలు ఇవ్వండి” అని హితవు పలికాడు…రాయబారం నడిపాడు.కానీ దుర్యోధనుడు అహంకారంతో….
    సూది మొన ఆనేంతైనా భూమి ఇవ్వను” అన్నాడు.
    ఆ ఒక్క మాట —
    లక్షల ప్రాణాలను బలి తీసుకున్న యుద్ధానికి నాంది పలికింది.యుద్ధం ముగిసిన తర్వాత: ఏమైంది?
    గెలిచిన పాండవులు కూడా ఆనందించలేదు! కృష్ణుడికి గాంధారి శాపంతో బాధ మిగిలింది!
    కుటుంబాలు, రాజ్యాలు చిద్రమయ్యాయి
    మహాభారతం చెబుతున్నది స్పష్టంగా ఇదే:
    యుద్ధం గెలిచినా, జీవితం ఓడిపోతుంది.

    మరో ఉదాహరణ కూడా మనందరికీ తెలిసిందే!

    హిరోషిమా..సంఘటన ఎప్పుడో యుగాల కింద జరగలేదు! నిన్నా-మొన్నా ఆధునిక యుద్ధపు భయానక చిత్రం ఇంకా కళ్ళ ముందు కదలాడుతూనే ఉంది…పీడకలవలె ఎన్నో నిద్ర లేని రాత్రులు గడిపిన తరం నాకు చెప్పిన విషయాలు ఎన్నటికీ మరువలేను.ఇది కేవలం పురాణ కథ కాదు!మన ఆధునిక చరిత్ర కూడా ఇదే నిజాన్ని చెబుతోంది.
    1945లో, జపాన్‌లోని హిరోషిమా నగరంపై అణుబాంబు పడింది.ఒక క్షణంలోలక్షల మంది ప్రాణాలు కోల్పోయారు;నగరం బూడిద కుప్ప అయింది. మరణించగా మిగిలినజీవించిన వారు జీవితాంతం బాధలు అనుభవించారు.చిన్న పిల్లల నుండి వృద్ధుల వరకు —అందరూ యుద్ధానికి బలయ్యారు.ఆ రోజు ప్రపంచం తెలుసుకున్నది…
    యుద్ధం అనేది శత్రువును కాదు, మానవత్వాన్ని నాశనం చేస్తుంది. అని…ఎంత నిజం.. కానీ ఏం లాభం? సమాజ హితైషులు అన్ని రంగాలలోని వారు గగ్గోలు పెట్టారు.శాంతి కావాలని, ఎవరికైనా మనదేశంలో జరగడం లేదు కదా? అనిపించవచ్చు! మనది వేద భూమి- కర్మభూమి.మన వేదం చెప్పిన విషయం వసుధైకకుటుంబకం అనే భావనలో జీవించాం! జీవిస్తున్నాం…ఇకముందు తరాలు కూడా జీవించేలా నేర్పాలి.
    ఐనా పక్కిల్లు కాలిపోతుంటే మన ఇంట్లో సుఖంగా ఉండగలమా? ఆ మంటల తాలూకు సెగలు మనకు సోకవా? పసిపిల్లల రోదనలు – అమాయక ప్రజల ఆక్రందనలు మనకు కూడుతిననిస్తాయా? కునుకు పట్ట నిస్తుందా ? ఆ వ్యర్ధాలతో వాయు- జల – వాతావరణ కాలుష్య మేర్పడదా? మన ఆరోగాయాలమీద ఆ మిసైళ్ళ తాలూకు- బాంబుల రసాయనాలు శారీరక- మానసిక రుగ్మతలు తెచ్చిపెట్టవా?
    ముందు మానవత్వం తో పక్కవాడి మేలు కోరుకుందాము! తర్వాత మనను మనం ప్రేమించుకుందాము! అందుకే దేశిధి నేతలు
    యుద్ధం – లాభనష్టాల బేరీజు వేసికొని,
    ప్రపంచ దేశాలు ఒకసారి ఆలోచించాలి!
    యుద్ధం వల్ల లాభం ఏమిటి? వస్తే కొంత భూభాగం వస్తుందేమో? లేదా ఆధిపత్యం వస్తే వస్తుంది కావచ్చు.అది కూడా తాత్కాలిక ఆధిపత్యమే!
    కానీ నష్టం ఏమిటి?
    అనేక ప్రాణాలు పోతాయి, అదికూడా అన్నెంపున్నెం ఎరుగని పౌరులు, పసివారు, ఆడవాళ్ళు…వీరికీ ఆ యుద్ధానికి సంబంధమే ఉండదు.ఐనా బలౌతారు…అనాధలౌతారు…ఒక తరం వెనుక బడుతుంది.ఆర్థిక వ్యవస్థలు కూలిపోతాయి…సంవత్సరాల కొద్దీ నిర్మించుకొన్న భవనాలు కూలిపోతాయి, చారిత్రక సంబంధ ఆనవాళ్ళు పోయే అవకాశం ఉంటుంది. అలా జరిగితే ఆ దేశ – ప్రాంత అస్థిత్వమే కోల్పోతుంది
    ఆ జాతి. అదెంత నష్టమో ఆలోచించరా?
    భవిష్యత్ తరాలపై చెడు ప్రభావం ఆరోగ్య పరంగానూ, ఆ చేదు విషాదంతో మానసికంగానూ ఎంతగానో పడుతుంది.మనుషులు మృదుత్వం కోల్పోయి హృదయాలు కరుడుకట్టుతాయి . దాంతోమానవ విలువల పతనం ఔతుంది…కనుక
    యుద్ధం వల్ల లాభం తక్కువ నష్టం అంతులే నంత! అదే ప్రపంచంలో శాంతి ఉంటే:దేశాలు అభివృద్ధి చెందుతాయి;విద్య, వైద్యం, విజ్ఞానం పెరుగుతాయి!మనుషుల మధ్య ప్రేమ పెరుగుతుంది. మన ప్రాచీన మహర్షులు చెప్పినట్లు:

    అహింసా పరమో ధర్మః”

    హింసను విడిచి శాంతిని ఆచరించడమే పరమ ధర్మం.
    చుట్టుపక్కల జరుగుతున్న భీకర యుద్ధ బీభత్సం చూసే పాలకులకు- ప్రభువులకు చీమ కుట్టినట్టైనా లేదా?

    మహాభారతం మనను హెచ్చరిస్తోంది…
    హిరోషిమా మనకు గుర్తుచేస్తోంది…

    యుద్ధం అనేది పరిష్కారం కాదు!
    శాంతి మాత్రమే శాశ్వత మార్గం! అని….

    కాబట్టి మనం, ఆ యా దేశాలు, వాటి నాయకులు
    అందరూ ఒక నిర్ణయం తీసుకోవాలి:
    అస్త్రాల కంటే ఆలోచనలు గొప్పవి”
    యుద్ధాల కంటే సంభాషణలు శ్రేష్ఠమైనవి.”
    ప్రపంచ ప్రజలంతా కలసి అనుకోవాలి! సమాజ హితైషులంతా కలిసి అహింసా- శాంతి నినాదాన్ని యుద్ధకాముకులదాకా చేరవేయాలి…
    దుష్టులను శిక్షించండి! కాదనము! కానీ శిష్టులను రక్షించే మరో కృష్ణులు కమ్మని మాత్రమే కోరుకుంటూ… ఎలుక చొచ్చిందని ఇల్లు తగుల బెట్టుకోనవసరం లేదుకదా? ఎలుకలను ఏరిపారేయండి! ఏమీ తెలియని అమాయకులను బలిచేయకండి!

    “ప్రపంచం యుద్ధ రహితంగా ఉండాలి*… శాంతి పతాకం ఎల్లప్పుడూ ఎగరాలి!”

    May 30, 2026 3 comments
    0 FacebookTwitterPinterestEmail
    కథలు

    గతమెంతో ఘనము

    by Dr. G. Bavani Krishnamurty May 30, 2026
    written by Dr. G. Bavani Krishnamurty

    పరంధామయ్య, సుభద్రమ్మ రెండు రోజులు అయింది, కొడుకు దగ్గరకి వచ్చి. స్టేషన్నుంచి ఇంటికి తీసుకొచ్చి, ఆఫీసులో మీటింగ్ ఉందని వెంటనే వెళ్ళిపోయాడు కొడుకు సుధాకరం. ఇద్దరికీ టిఫిన్ పెట్టి, “భోజనం టేబుల్ మీద పెట్టాను. మీ టైముకి మీరు పెట్టుకుని తినండి అత్తయ్య… బాబుని స్కూల్ దగ్గర దింపి, నేనూ ఆఫిస్ కి వెళ్ళొస్తాను ” చెప్పి, హడావిడిగా వెళ్ళిపోయింది కోడలు కమల.
    సాయంత్రం వరకూ ఇద్దరూ మాటలు రాని బొమ్మల్లా కూర్చున్నారు.
    ఆరుగంటలకి కోడలు మనవడిని తీసుకుని వచ్చింది.
    వాడికి పాలు తాగించి,అదే అపార్ట్మెంట్ లో పై ఫ్లోర్ లో ఉన్న ట్యూషన్ కి తీసికెళ్లి దిగబెట్టి వచ్చింది.
    బట్టలు మార్చుకుని నైటీ వేసుకుని, సెల్ లో మాట్లాడుతూ సోఫాలో కాలిమీద కాలు వేసుకుని కూర్చుని, ఎదురుగా అత్త మామలున్నారన్న ధ్యాసకూడా లేకుండా కాలు ఊపుతూ మాట్లాడుతూనే ఉంది.
    ఎనిమిది అవుతుంటే, “డిన్నర్ టేబుల్ మీదుంది, మీకు ఆకలి అయినప్పుడు తినండి. నేనలా వెళ్ళి బాబుని ట్యూషన్ నుంచి తీసుకొస్తాను ” చెప్పి, తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయింది.
    తొమ్మిది అవుతుంటే వచ్చింది కోడలు కమల.
    కొడుక్కి తినిపిస్తూ “మీరు తినలేదేం?” అడిగింది.
    ‘”అబ్బాయి వచ్చాక తింటాo లేమ్మా ” అంది సుభద్రమ్మ.
    “సుధా వచ్చేసరికి లేట్ అవుతుందట. మిమ్మల్ని తినేసి పడుకోమన్నాడు”. హోటల్ నుంచి తెచ్చిన డిన్నర్ పేకెట్స్ విప్పి, ప్లేట్ లో పెట్టి ఇద్దరికీ ఇచ్చింది.
    బిర్యానీలో మసాలా, వెల్లుల్లి వాసన అలవాటు లేక పోవడంతో సుభద్రమ్మ “నాకంతగా ఆకలిగా లేదు ఇంతవద్దు తీసేయమ్మా “అని తనే కొద్దిగా ఉంచుకుని మిగిలినది బౌల్లో వేసేసింది. ఆ కాస్త తిన్నాననిపించి చేయి కడుక్కుంది. పరంధామయ్యకి సహించక పోయినా ఆకలికి ఆగలేక ముద్దకి ముంతడు నీళ్లు అన్నట్లు, ముద్ద నోట్లో పెట్టుకుని, నీళ్లు తాగి లోపలికి పంపాడు.
    ఇద్దరూపడుకున్నాక కొడుకు ఎప్పుడొచ్చాడో వారికి తెలియదు.
    ఉదయం ఇద్దరూ తొందరగానే లేచి, తయారై హాల్లోకి వచ్చి కూర్చున్నారు. కొడుకు లేచి వస్తే మాట్లాడవచ్చు అనుకున్నారు.
    సుధాకరం ఎనిమిదిన్నర దాటాక బెడ్ రూమ్ లోనుంచి బయటికి వచ్చాడు. ఆఫీస్ కి వెళ్ళడానికి తయారై ఉన్నాడు.
    తల్లిదండ్రుల్ని చూసి, “బ్రేక్ఫాస్ట్ చేశారానాన్నా,? ” అడుగుతూనే, తనే డిష్ లో ఉన్న ఇడ్లి ప్లేట్ లో పెట్టుకుని తినడం మొదలు పెట్టాడు.
    కొడుకుతో కలిసి తిందామని ఎదురు చూసిన ఆ తల్లిదండ్రులు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయారు.
    కొడుకు, కోడలు మనవడిని తీసుకుని వెడుతూ “అత్తయ్యా!సుధా కి ఈ రోజు ఆఫీస్ లో లంచ్ ఉందట.నేనూ కేంటేన్ లో తినేస్తాను. మీరు ఏం కావాలో వoడుకుని తినేయండి.”సమాధానం కోసం చూడకుండా వెళ్లిపోయారిద్దరూ.
    పరoధామయ్య, సుభద్రమ్మ ఒకరి మొఖాలు ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు.
    –
    తను ఖమ్మం లో ఉద్యోగం చేసే రోజుల్లో మొదటిసారి అమ్మ నాన్న ఖమ్మం వచ్చినప్పుడు తను స్టేషన్ కి వెళ్ళి,వారిని ఆప్యాయంగా పలకరించి ఇంటికి తీసుకొచ్చాడు.సుభద్ర ఎదురొచ్చి వారిని ప్రేమగా పలకరించి, అత్తగారి చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకొచ్చింది. కుశల ప్రశ్నలు వేసి కాఫీ ఫలహారాలు అందించింది.
    ఆ రోజు ఆఫీస్ కి సెలవు పెట్టేశాడు తను.
    లోపలికి వెళ్ళి “చూడు. అమ్మకి నాన్నకి ఏం కావాలో కనుక్కుని సమయానికి ఇవ్వు.భోజనంలోకి కూడా ఏం తింటారో కనుక్కుని చెయ్యి. నాన్న కారంకారంగా తింటారు. చూసి చెయ్యి తెలియకపోతే అమ్మని కనుక్కునిచెయ్యి ” చెప్పాడు.
    “ఆ విషయo మీరు ప్రత్యేకంగా చెప్పాలా? అదంతా నేనూ చూసుకుంటాను మీరు ఆఫీస్ కి వెళ్ళండి “అంది సుభద్ర.
    వాళ్ళు ఉన్న వారం రోజులు ఆఫీస్ కి వెళ్లేటప్పుడు వెళ్ళొస్తానని తల్లిదండ్రులకి చెప్పి, వారిని జాగ్రత్త గా చూసుకోమని, వేళకి భోజనం పెట్టేయమని భార్యకి చెప్పి వెళ్ళేవాడు. సాయంకాలం వచ్చేటప్పుడు వారికి నచ్చిన ఉపాహారాలు, పళ్ళు తీసుకొచ్చి, ప్లేట్స్ లో పెట్టి ఇద్దరికీ ఇచ్చేవాడు
    రాత్రి భోజనాలు అయ్యాక నలుగురు కూర్చుని కష్టసుఖాలు మాట్లాడుకునే వారు.
    “మీరిద్దరూ ఒంటరిగా అక్కడెoదుకు,?. ఇక్కడే మాతోపాటు ఉండిపోవచ్చుగా ” అంది సుభద్ర.
    “లేదులేమ్మా….. ఇంకా మాకు కాస్త ఓపిక ఉందిగా.. ఓపిక తగ్గితే మీ దగ్గరకే వస్తాం. మాకు మాత్రం మీరు తప్ప ఎవరున్నారు? ” అన్నాడు తండ్రి.
    “అవునమ్మాయ్! మీకూ మొన్నీ మధ్యనేగా పెళ్లయింది. కొన్నాళ్ళు సరదాగా ఉండండి. పిల్లా పాప బయలుదేరితే మనవడితో ఆడుకోడానికి అప్పుడు వచ్చి ఉంటాములే.”అంది అత్తగారూ కోడలికి బుగ్గలు నిమిరి ముద్దు పెట్టుకుంటూ.
    ఇద్దరికీ బట్టలు పెట్టి, కాళ్ళకి దణ్ణం పెట్టి ఆశీసులు తీసుకున్నారు.
    పరoధామయ్య కొంత డబ్బు తండ్రి చొక్కా జేబులో పెట్టి, “ఏవైనా ఖర్చులకి ఉంటాయి ” చెప్పాడు.
    “ఎందుకురా నాదగ్గర ఉన్నాయిలే “తండ్రి తియ్యబోతుంటే,”మీ దగ్గర లేవని కాదు, ఏదో నాతృప్తి కోసం ” తండ్రి చేతి మీద చెయ్యి వేసి ఆపాడు.
    వాళ్లిద్దరూ ప్రయాణమై వెడుతుంటే పరంధామయ్య, సుభద్ర కళ్ళనీళ్ల పర్యంతం అయ్యారు. స్టేషన్ కి వెళ్ళి ట్రైన్ ఎక్కించి, ట్రైన్ కదిలే వరకు ఉండి వచ్చారు…..”తలుపు చప్పుడు అవుతుంటే
    ఆలోచనలనుంచి తేరుకొని తలుపు తెరిచింది సుభద్రమ్మ.
    కోడలు మనవడుని తీసుకుని వచ్చింది.
    ఆమె కాళ్లు కడుక్కుని డ్రెస్ మార్చుకుని వచ్చే వరకూ ఆగి,”అమ్మాయ్! మేము బయలుదేరుతున్నాం అబ్బాయి వచ్చాక చెప్పు.”బేగ్ తీసుకుని చెప్పారు.
    ” అదేంటీ, పది రోజులు ఉంటారని చెప్పాడు సుధా,…” మనసులో సంతోషంగా ఉన్నా, అయోమయం నటించిందికమల.
    “మరోసారి వస్తాం లేమ్మా,అయినా పిల్లాడికి సెలవులిచ్చినప్పుడు మీరే రండి. మేమిక్కడుంటే మీకూ ఇబ్బంది, మేమూ తిని కూర్చోవడం. అక్కడైతే గుడి, గోపురం, తెలిసినా వాళ్ళు రావడం, పోవడం . ఏదో కాలక్షేపం అయిపోతూo టుంది .”అన్నాడు పరoధామయ్య.
    కమల సెల్ తీసుకుని “సుధా!మీ అమ్మ, నాన్న వెళ్ళిపోతామంటున్నారు…” చెప్పింది.
    ” అప్పుడేనా? అదేంటి.. నిన్ననే కదా వచ్చారు, ఉదయం నాతో ఏమి చెప్పలేదు.
    ఉండమని చెప్పకపోయావా? ” “
    “… చెప్పాను వెళ్లాలట…..”
    “సరే! నాకు ఇప్పుడే రావడానికి కుదరదు.. దారిఖర్చులకి డబ్బులున్నాయో లేదో ? వెయ్యో, రెండూవేలో ఇచ్చి పంపించు ” చెప్పాడు.
    వెయ్యి రూపాయలు తెచ్చి వారి చేతిలో పెట్టి, వాళ్ళు బయటికి రాగానే తలుపులు మూసుకుంది.
    ఇద్దరూ ఆటోలో బస్ స్టాండ్ కి వెళ్ళి తమ ఊరు వెళ్లే బసు ఎక్కి కూర్చున్నాక,మనసు స్థిమిత పడినట్లు అయింది. హాయిగా ఊపిరి పీల్చుకుని వెనక్కి జార్లబడి కూర్చున్నారు.
    “గత కాలము మేలు వచ్చుకాలము కంటెన్ ” భారతoలో నన్నయ రాసిన పద్య పాదం గుర్తుకొచ్చింది పరoధామయ్యకి.

    May 30, 2026 3 comments
    0 FacebookTwitterPinterestEmail
    కథలు

    స్నేహం

    by Varalakshmi Yanamandra May 30, 2026
    written by Varalakshmi Yanamandra

    గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఆ అభినందన సభకు జిల్లా కలెక్టరే కాక జిల్లాలో, మండలంలోని ప్రముఖులందరూ హాజరవడం విశేషం.

    ఆ ఊరికి చెందిన ఇద్దరమ్మాయిలు “ఐఏఎస్” పూర్తి చేసి కలెక్టర్లుగా పక్కపక్క జిల్లాలకు అపాయింట్మెంట్ ఆర్డర్లు తీసుకున్న సందర్భం. ఎందరో కలెక్టర్లు అవవచ్చు.. కానీ ఇదొక ప్రత్యేక సందర్భం.

    ఈ సభకు ఊరు ఊరంతా హాజరయ్యారు. పెద్ద బహిరంగ సభ అది.
    అందరూ మాట్లాడడం ఐపోయింది. జిల్లా కలెక్టరు గారు జానకి, శైలజలకు సన్మానం చేయబోతున్నారు.

    వారి గురించి ఆఊరి సర్పంచ్ చెబుతున్నారు ఇలా …
    “జానకి, శైలజ మంచి స్నేహితులు. జానకి అతి పేద కుటుంబానికి చెందిన అమ్మాయి, అంతే కాక తనకు చిన్నప్పుడు( కాలికి) పోలీయో వచ్చి సరిగా నడవలేదు.‌ ఐతే చాలా తేలివి గలది జానకి.
    ఇంటరు పూర్తిచేశారు జానకి, శైలజ ఇద్దరూ. ఐతే జానకి చదువు ఆపేసింది….”
    ఇంతలో కలెక్టరు గారు వాళ్ళనే చెప్పమన్నారు..
    జానకి “అలాటి పరిస్థితిలో శైలజ చేసిన గొప్ప సహాయం, మరువరానిది
    నా కోసం డబ్బు ఖర్చు పెట్టింది. నాకాలికి వాళ్ళ నాన్నగారిచేత వైద్యానికి సంబంధించి సహాయం చేయించింది.. తాను ఎక్కి చదువుకుందో…నన్నుకూడా తనతో పాటుగా చదివించిన ఆ కుటుంబానికి ఋణం తీర్చుకోలేను. శైలజ నాకు దేవుడిచ్చిన వరం.”
    అంటూ కన్నీరు పెట్టుకుంది.

    ఇక శైలజ మాట్లాడుతూ” జానకి చదువుకు సహాయం చెయ్యడం గొప్ప కాదు.తను ఏకసంథాగ్రాహి. నేను ఈ పరీక్ష ఉత్తీర్ణత పొందడానికి నాకు తాను నాకు చక్కగా తెలియని అంశాలన్నీ వివరంచడమే ముఖ్య కారణము. కాబట్టి తను ఉన్నత వ్యక్తిత్వం గలది “…. అంటూ ముగించిది.

    ఇక కలెక్టరు గారు ఇద్దరికీ వారు పొందిన విజయాన్ని పురస్కారించుకుని చాలా గొప్పగా సన్మానం చేశారు. చివరగా ఆయన చెప్పిన సందేశానికి పెద్ద ఎత్తున చప్పట్లు మారు మ్రోగిపోయాయి… “ఇద్దరికి ఇద్దరూ గొప్పవారే…వారి ఆశరం ఉన్నతం, ఉత్తమం… సమాజం పట్ల వారికున్న అవగాహనను నేను వారి మాటలలో తెలుసుకున్నాను.అంటూ…….
    ” ఏమతమైనా వివరించేదో మానవత్వమే,” అని వీరిరువురూ నిరూపించారు. “విధాత సృష్టిలో లోపం లేదు, మానవ దృష్టిలోనే శాపం ఉంది.” ఆ శాపాన్ని వీరువురూ బాపారు ఒకరికొకరు. “బాధ్యతల సుడిగుండాల్లో మనిషి జీవితం ముడిపడి ఉంది.” అనేది కూడా చక్కగా ఋజువు చేసి సమాజం పట్ల వారి బాధ్యతను తెలియజేశారు. చివరిగా అతి గొప్ప మాట చెప్పారు…..” స్వచ్ఛమైన స్నేహానికి ఎల్లలు లేవు” అని వీరువురూ నిరూపించారు.
    వీరిరువురి వలన ఇంకా మరన్ని మేళ్ళు జరగాలని ఆశిస్తూ చిరంజీవులను ఆశీర్వదిస్థున్నాను.” అంటూ సభను ముగించారు..‌సభలోని వారంతా కరతాళధ్వనులతో అభినందించారు.

    May 30, 2026 3 comments
    0 FacebookTwitterPinterestEmail
    ఇంద్రధనుస్సు

    మట్టిలో మాణిక్యం శ్రీ ఉడతా రామకృష్ణ

    by Achyutuni Rajasri May 30, 2026
    written by Achyutuni Rajasri

    ఆయన ఓప్రసిద్ధ జర్నలిస్టు, ఆకాశ వాణిలో గళం విప్పిన శ్రీ ఉడతా రామకృష్ణ గారి జీవితం నల్లేరుపై బండి కాదు. ఆయన బాల్యం యవ్వనం సంకుల సమరం అనే చెప్పాలి.

    కృష్ణాజిల్లాలోని గొల్లనపల్లి గ్రామంలో ఉడతా వెంకటేశ్వరరావు, సీతామహాలక్ష్మి దంపతులకు 2.2.1961లో జన్మించారు. ఈయన 5వ ఏటనే తండ్రి చెప్పాపెట్టకుండా ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోతే, బాల్యం అంతా కష్టాలలో గడిచింది. ఆ తండ్రి 1966 లో వెళ్లిపోయిన ఆయన తిరిగి 1982 లో రావటం మరవలేని జ్ఞాపకం. ఐనా తండ్రిని ఆదరించి అక్కున చేర్చుకున్న రామకృష్ణ, ఆయన తల్లిని మనం అభినందించి తీరాల్సిందే! నిజంగా ఇది నమ్మలేని నిజం! కన్నతల్లి అండదండలతో రామకృష్ణ ఎస్.ఎస్.సి. చదివి పేదరికం, కుటుంబ పోషణ కై చదువుకి ఫుల్ స్టాప్ పెట్టి కులవృత్తి ఐన మగ్గంపై చేనేత వస్త్ర తయారీలో నిమగ్నమైనారు 1975_1988…
    అలా రేడియోతో బంధం అనుబంధం ఏర్పడ్డాయి.నేత రాత పడుగుపేకలా సాగాయి.మంచి విశ్లేషణాత్మక లేఖలతో వివిధ భారతి సిన్మాపాటలతో కూర్చిన ప్రోగ్రాంలు (అరగంట ) తయారుచేసి పంపటం వరకు ఎదిగింది ఆయన కలం!అవిప్రసారం కావటంతో రెట్టించిన ఉత్సాహంతో ఆయన లో రచయిత విజృంభించాడు.రేడియో సంగీత పాఠాలు మొదలు కార్మికుల కార్యక్రమాలు కూడా శ్రద్ధగా ఆసక్తిగా వినేవారు.తన గ్రామంలో సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటూ చేనేత కార్మికుల చేత ప్రోగ్రాములు చేయించడం తో మంచి గుర్తింపు వచ్చింది.చాణుక్యుడు,చంద్రగుప్తుడు ఏకపాత్రాభినయం తో ఆయన లో నటుడు బైటికొచ్చాడు.తన 20వ ఏటకృతజ్ఞత కృతఘ్నత అనే స్వంత కథను రికార్డింగ్ లేకుండ సరాసరి చదవటం ఆలైవ్ ప్రసారంతో రామకృష్ణ లో ఆత్మవిశ్వాసం పెరగటం,దీనికితోడునిర్వాహకులు శ్రీమాడుగుల రామకృష్ణ గారి మెప్పుపొందటం ఓమధురానుభూతి.
    శ్రీసుధామ గారి ప్రోత్సాహంతో రేడియో లో “రాబోయే ఎన్నికలు, నడుస్తున్న చరిత్ర( వారంవారం) ఏనుగులవానిలంక బ్లోఅవుట్ ” రేడియోలో ప్రసారమై అశేషజనాదరణ పొందాయి.చమురుబావిలో మంటలు ఎగిసిపడటాన్ని ప్రత్యేకంగా చెప్పి రాయించిన సుధామ గారికి తను ఋణపడి ఉన్నానని అంటారాయన!
    కానీ రామకృష్ణ కు ఏలూరు బదిలీ కావటంతో రేడియోకి దూరమైనారు.


    ఇక జర్నలిస్టుగా ఆయన యాత్ర కు మార్గదర్శకులు గన్నవరం ఈనాడు విలేఖరి శ్రీ అవ్వారి గోవిందరాజులుగారని, ఆయనే తన తొలిగురువని చెప్పారు.1988లో ఆయన పరిచయంతో రామకృష్ణ పాత్రికేయునిగా స్థిరపడటానికి దోహదం చేసింది.1990లో ప్రజాశక్తిలో పాత్రికేయుడిగా జీవితం గొప్ప మలుపు తిరిగింది.36ఏళ్లు ఆపత్రికలో విలేఖరిగా, ఎడిటోరియల్ బోర్డ్ సభ్యునిగా ,జర్నలిజం కాలేజీ ఇన్ఛార్జిగా,ప్రిన్స్ పాల్ గా, క్వాలిటీ సెల్ ఇన్ చార్జిగా ఎదిగినా ఒదిగి ఉన్న నిగర్వి కావటంతో అందరిచేత సెభాష్ అనిపించుకొన్నారు. 2019లో రిటైరైనాక ప్రస్తుతం రైతువాణి మాసపత్రిక బ్యూరో చీఫ్ గా ఉన్నారు2020నుంచి.ఆయన కలంపేర్లుఉష్ణ, శ్రీవర్ష, వరుణ్. ఆయన ప్రజాశక్తి ఆదివారం లో వారం వారం రియల్ స్టోరీస్,సాహిత్య నృత్య శిల్ప చిత్ర, నాటక, సినీ నిపుణుల ఇంటర్వ్యూలు,రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ రాజకీయ యోధులచరిత్రలు వెలువడ్డాయి. తెలకపల్లి రవిగారి సలహాపై 36వ ఏట టైప్ ఇన్ స్టిట్యూట్ కెళ్లి 15ఏళ్ల పిల్లల తో కల్సి టైప్ నేర్చుకోటం చిన్నతనంగా భావించలేదు రామకృష్ణ. కారణం కుటుంబ బాధ్యతలు,ఉదరపోషణ!ఆయన ఇంటర్య్వూ చేసిన ప్రముఖ వ్యక్తులుపద్మశ్రీ వేదాంతం సత్యనారాయణ శర్మ, కోరాడ నర్సింహ్మారావు,కర్నాటి లక్ష్మీ నరసయ్య, వల్లం నరసింహారావు,చిత్ర కారుడు పద్మశ్రీ రామారావు,అంతర్జాతీయ శిల్పికాటూరి వెంకటేశ్వర రావు,వి.కోటేశ్వరమ్మ, వీరనారి నాగళ్ల రాజేశ్వరమ్మ..ఇలా ఎందరెందరో!
    ఇక ఈయన అమ్మకు అక్షరనైవేద్యం,బోనాలపై 535 కవితాసంకలనం,550కవితలతో సమ్మక్కసారలమ్మలపై సంకలనాలు వెలువరించినవిషయనిపుణుడిగా చరిత్రసృష్టించారు

    May 30, 2026 3 comments
    0 FacebookTwitterPinterestEmail
    Newer Posts
    Older Posts

    Recent Posts

    • క్విజ్ పోటీ-
    • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
    • తరిగొండ వెంగమాంబ
    • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
    • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

    @2021 - All Right Reserved to Mayuukha The Magazine


    Back To Top
    మయూఖ
    • హోమ్
    • కవితలు
    • కథలు
    • ధారావాహిక నవల
    • వ్యాసాలు
    • బాల‌సాహిత్యం
    • ఇంద్రధనుస్సు
    • ఇంట‌ర్వ్యూలు
    • పుస్త‌క స‌మీక్ష‌
    • అనువాద సాహిత్యం
    • About Us