మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

బాలల హక్కుల అవగాహన

by డా.కందేపి రాణీప్రసాద్ November 22, 2025
written by డా.కందేపి రాణీప్రసాద్

బాలలకు సైతం పెద్దవారికి మాదిరిగా హక్కులున్నాయని తెలుసా? హక్కులు, బాధ్యతలు అనేవి చిన్నా, పెద్దా అని వయసుతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి రాజ్యాంగం కొన్నిటిని కల్పించింది. వాటిని అతిక్రమించే హక్కు ఎవరికీ లేదు. బాలల రక్షణకు సంబంధించి కొన్ని చట్టాలు కుండా ఉన్నాయి. వారి హక్కుల్ని పరిరక్షించడానికి చట్టాలను ఏర్పాటు చేశారు. చట్టాలను అతిక్రమించిన వారికి శిక్షలు తప్పవు. కానీ సాధారణ సమాజంలో బాలల చట్టల గురించి ఎవరికీ అవగాహన లేదు. తల్లి దండ్రులకు, ఉపాధ్యాయులకు ఈ హక్కులు, చట్టాల గురించి అవగాహన కలగజేస్తే బాగుంటుంది.
మనం తల్లిదండ్రుల తర్వాత ఉపాధ్యాయులకే అత్యంత ఉన్నత స్థానాన్ని ఇచ్చాము. ఈనాడు ఏ ఉపాధ్యాయుడికీ పిల్లల సమస్యల గురించి పట్టదు. కనీసం పసివాడు ఎంత చదవగలడు ? ఎంత రాయగలడు? అన్న వివేచన కూడా ఉండదు. పిల్లవాడు అల్లరి చేయుకుoడా చూడటమే వారి పని. అుదుకే పిల్లలు కదలకుండా, మాట్లాడకుండా కాపలా కాస్తుంటారు. శృతిమించిన క్రమశిక్షణ పిల్లల్లోని సృజనాత్మకతను, సహజ సిద్ధతనూ కోల్పోయేలా చేస్తుంది. ఉత్సాహం, చలనం లొపించిన బాలలు ప్రాణంలేని బొమ్మలతో సమానం. పిల్లల్లోని సహజత్వానికి భంగం కలగకుండా పాఠాలు బోధించాలి సున్నితత్వాన్ని అమాయకత్వాన్ని కోల్పోయిన పిల్లల్ని బాలలు అనలేము. ఏ వయసు పిల్లలకు ఎంత హోంవర్కు అవసరమో అంతే ఇవ్వాలి. వారి ఆటపాటల సమయాన్ని హరించేసే హోంవర్కులు పిల్లల ప్రగతికి గొడ్డలి వేట్లు.
తల్లి దండ్రులు సైతం పిల్లల పెంపకాన్ని భారంగానే చూస్తున్నారు. తమ్మ చదువులు, ఉద్యోగాలు, కెరీర్ పైనే శ్రద్ధ పెడుతూ పిల్లల్ని అనవసర భారంగా భావిస్తున్నారు. లక్షల ఫీజులైనా కట్టేసి పెద్ద పెద్ద సూళ్ళలొ చేర్పించేసి చేతులు దులుపు కుంటున్నారు హాస్టళ్ళలో వారి అవస్థలు చెప్పనలవి గాదు. కొంత మంది గడుసు పిల్లలకు సమస్యలేం రాకపోవచ్చు. కొంత మంది సున్నిత మనస్కులుగా ఉంటారు. అటువంటి పిల్లలు తమ సమస్యలను అందరికీ చెప్పుకోలేరు ఇటువంటి పిల్లలు కాన్నిసార్లు తల్లి దండ్రుల వద్ద కూడా నోరు విప్పి చెప్పరు. పెద్ద క్లాసు పిల్లలు, రౌడీ పిల్లలు తమ హోంవర్కుల్నీ, మిగతా పనుల్నీ నెమ్మదస్తులమేత చేయిస్తుంటారు. ఇవి టీచర్ల దాకా వెళ్ళవు. ఒక వేళ వెళ్ళినా గడుసు పిల్లల్నే తెవివగల పిల్లలుగా టీచర్లు మెచ్చుకుంటుంటారు నిదానస్తులకు, నిజాయితీ పరులకు ఎక్కువ పేరు ప్రతిష్టలు రావు.
ప్రపంచ వ్యాప్తంగా బాలల హక్కుల దినోత్సవం జరుపుకుంటారని తెలుసా? బాలల హక్కుల గురించి ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పించటం కోసం ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా నవంబరు 20వ తేదీన జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి 1954వ సంవత్సరంలో డిశంబరు 14వ తేదిన ఒక తీర్మానం చేసింది. ప్రతి సంవత్సరం ప్రపంచ బాలల దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించింది. 1959 వ సంవత్సరం నవంబరు 20వ తేదీని ప్రపంచ బాలల హక్కుల దినోత్సవంగా నిర్వహించడానికి ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ ఆమోదించింది. బాలల సంక్షేమం, బాలల హక్కులు కాపాడబడటం కోసం విద్యా సంస్థల అధ్వర్యంలో వేడుకగా నిర్వహిస్తారు. ఇంకా స్వచ్ఛంద సంస్థల నుంచి అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాలు నిర్వహిస్తారు.
బాలల సంరక్షణ దేశానికి చాలా ముఖ్యం బాలల హక్కులను పరిరక్షించడం అందరి బాధ్యత. సమాజంలో ప్రతి ఒక్కరు ఈ హక్కుల పరిరక్షణ కోసం పాటుపడాలి. విద్య అనేది ప్రతి భారతీయ పౌరుడి యొక్క ప్రాథమిక హక్కు. విద్య ప్రతి ఒక్కరికీ మౌలికస్థాయిలో ఉచితంగా లభించాలి. నిర్భంధం గానైనా బాలలందరికీ విద్యా హక్కు అమలు కావాలి అప్పుడే నవ భారతం లో కాబోయే నూతన పారలు దేశాన్ని రక్షించుకోగలగుతారు.
బాలలు అత్యధికంగా హింసకు గురి అవుతున్నారని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి. స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ అధ్వర్యంలో బాలల గురించి సర్వేలు చేయబడ్డాలు. ఐదు నుంచి పన్నెండు సంవత్సరాల బాలలు ఎక్కువగా హింసతో పాటు అత్యాచారాలు కూడా జరుగుతున్నట్లుగా సర్వేలు చెబుతున్నాయి. భౌతిక మరియు లైంగిక, మానసిక దాడులకు పిల్లలు బలవుతున్నారు. బాల కార్మికుల సమస్య కొంతవరకూ తగ్గినప్పటికీ పూర్తిగా మాసిపోలేదు. బాల కార్మికులు ఇంతకు పూర్వం ఇటుక బట్టీలలో, కొండల తవ్వకాలలో, గ్రానైట్ క్వారీరులలో పనిచేసేవారు. ప్రమాద పరిస్థితుల్లో పనిజెసే బాలల్ని బాలకార్మికులు అనేవారు. ఇప్పుడు బాలకార్మిక వ్యవస్థ రూపం మార్చుకుని స్కూళ్ళలో చేరింది. బస్తాల బస్తాల పుస్తకాలు మోయటం, రాత్రనక పగలనక రాసినవే రాయటం, స్లిప్ టెస్ట్ లు , వీక్లీ టెస్ట్ లు, మంత్లీ టెస్ట్ లు అoటూ రకరకాల టెస్ట్ లతో పిల్లలను మనశ్శాంతికి దూరం చేయడం వంటివన్నీ నేటి స్కూళ్ళలో నిత్య కృత్యమై పోయాయి. పెద్ద పేరున్న స్కూళ్ళ వత్తిడి తట్టుకోలేక ఎంతో మంది బాలలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి తల్లి దండ్రులు నిర్లక్యధోరణి, పట్టించుకోకపోవడం కూడా కారణమవుతున్నాయి.
బాలల సంక్షేమం కొరకు పార్లమెంటు కొన్ని చట్టాలు చేసింది. జువైనల్ జస్టిస్ చట్టం, బాల కార్మికుల నిషేధ చట్టం, న్యానసేవల చట్టం, నిర్భంద ప్రాధమిక విద్య హక్కు, బాలల అక్రమ రవాణా నిషేధ చట్టం, శిశు నిర్ధారణ పరిక్షల నిషేధ చట్టం, శిశు పౌష్టికాహార ఉత్పత్తి, సప్లై చట్టం వంటి ఎన్నో చట్టాలను చేసింది. ఆర్టికల్ 15 ద్వారా పిల్లల సంక్షేమానికి ప్రత్యేకమైన నిభందనలు రూపొందించవచ్చు సమానత్వ హక్కు ఆర్టికల్ 14 ద్వారా, వివక్షకు వ్యతిరేకంగా హక్కు ఆర్టికల్ 15 ద్వారా వ్యక్తిగత స్వేచ్చ మరియు న్యాయ ప్రక్రియ యొక్క హక్కు ఆర్టికల్ 21 ద్వరా అక్రమ రవాణా నుంచి రక్షించబడే హక్కు ఆర్టికల్ 23 ద్వారా బాలలకు హక్కులు ఏర్పరచ బడ్డాయి. ఈ విధంగా పిల్లలకు కూడా పెద్ద వారితో సమానంగా పన్నెండు బాలల హక్కులు ఇవ్వబడ్డాయి. పిల్లల హక్కుల పరిరక్షణకు తల్లిదండ్రులు లేదా సంరక్షకాలు బాధ్యత వహించాలి. నేడు ప్రపంచ వ్యాప్తంగా బాలల హక్కుల పట్ల పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. కాని ఆచరణలో సాధ్యం కావటం లేదు. బాలల హక్కుల గురించి భారత రాజ్యాంగంలో ఎన్నో అంశాలు పొందుపరచబడినవి.

November 22, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు.

by Narendra Sandineni September 29, 2025
written by Narendra Sandineni

ఎర్రోజు వెంకటేశ్వర్లు బ్లాక్ బోర్డ్ కవిత కవిత్వం ఓ విశ్లేషణ
ప్రముఖ కవి,తెలుగు శాఖా అధ్యక్షులు, ప్రభుత్వ గురుకుల డిగ్రీ కళాశాల, నగునూరు,ఎర్రోజు వెంకటేశ్వర్లు కలం నుండి జాలువారిన బ్లాక్ బోర్డ్ కవితా సంపుటిలోని బ్లాక్ బోర్డు కవిత పై విశ్లేషణా వ్యాసం.కవి వెంకటేశ్వర్లు ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు.కవి పాఠశాలలో బుడి బుడి నడకల పిల్లల అల్లరిని చూసినారు.పిల్లలు మాట్లాడే ముద్దు ముద్దు మాటలను ఆహ్లాదకరంగా విన్నారు.కల్లా కపటం ఎరుగని చిన్నారి పిల్లలకు బోధిస్తూ మాటలలో చెప్పలేని గొప్ప అనుభూతిని పొందారు. పిల్లల లోకంలో విహరించడం ఎవరికైనా సంతోషంగా ఉంటుంది.పిల్లలకు చదువు సంస్కారాన్ని అందించే గొప్ప పాఠశాల అనే ప్రపంచంలో పని చేశారు.బ్లాక్ బోర్డ్ పై విద్యార్థులకు ఎంతో ఆసక్తితో బోధించాడు.పిల్లలకు చదువు నేర్పే క్రమంలో తనలో కలిగిన స్పందనకు అక్షర రూపం ఇచ్చాడు.బ్లాక్ బోర్డు కవితలో విద్య యొక్క శక్తి, సృజనాత్మకత,జ్ఞానం అందించే వెలుగు సమాజం మార్పు చెందడానికి పాఠశాల ఎంత ముఖ్యమో తెలియజేసారు.బ్లాక్ బోర్డ్ విద్యార్థుల భవిష్యత్తుకు కాంతినిచ్చే దీప స్తంభంలా ఉంది అని కవి భావోద్వేగంతో ప్రకటించారు.కవి వెంకటేశ్వర్లు తన కవిత్వం ద్వారా విద్యా బోధనలో బ్లాక్ బోర్డు యొక్క పాత్రను సమాజానికి చాటిచెప్పారు.
“నల్ల రంగు శుభం కాదంటారు కొందరు/నల్ల మట్టిలో తెల్ల బంగారంలా/నల్లబల్ల మాత్రం మంచినే పంచుతుంది/అంటున్నారు.ఈ కవితా పంక్తులు నల్ల రంగు గురించి ఉన్న సామాన్య అభిప్రాయాలను విభిన్నంగా చూపుతున్నాయి‌.బ్లాక్ బోర్డు తరగతి గదిలో ఉపాధ్యాయులు రాసే నల్లబల్ల.ఇది విద్యా బోధనకు సాధనంలా నిలుస్తుంది. ఉపాధ్యాయుడు నల్లబల్ల ద్వారా విద్యార్థులకు జ్ఞానాన్ని అందిస్తాడు.కొంత మంది నల్ల రంగును శుభం కాదని నమ్మడం గురించి చెప్పబడింది.మన సమాజంలో నల్ల రంగు గురించి కొన్ని లేనిపోని అపోహలు ఉన్నాయి. ఇప్పటికీ సమాజంలో నల్ల రంగును దురదృష్టం, అశుభం అని భావించే వారు ఉన్నారు.శుభ కార్యాలు,పండుగలు వంటి సందర్భాల్లో నల్ల రంగును దూరం పెట్టే పద్ధతి ఉంది.కానీ,వాస్తవానికి నల్ల రంగు చెడ్డది కాదు. నల్ల మట్టి పోషక పదార్థాలతో నిండిన భూమి.మనం విత్తనాలు నాటిన నేల కూడా సాధారణంగా నల్లగా ఉంటుంది.నల్లరేగడి నేలలో విస్తారమైన పంటలు పండుతాయి. నల్ల మట్టిలో పండే పంటలు మనకు బంగారంలాంటివే.అందుకని నల్ల రంగు మన జీవనానికి ఎంతో ప్రధానం అని భావించవచ్చు.
నల్లబల్ల మాత్రం మంచినే పంచుతుంది. నల్లబల్లపై ఉపాధ్యాయులు రాసి విద్యార్థులకు పాఠాలు అర్థమయ్యేలా బోధిస్తారు.నల్ల బల్ల విద్య,జ్ఞానం మరియు వికాసాన్ని అందిస్తుంది.కాబట్టి నల్ల బల్ల మనకు మంచిని నేర్పే సాధనం.నల్ల రంగును అశుభంగా భావించే వారు ఉన్నప్పటికీ నల్ల మట్టి, నల్లబల్ల మంచినే అందిస్తాయి.నల్ల మట్టిలో విలువైన పంటలు పండుతాయి.నల్లబల్ల జ్ఞానాన్ని పంచుతుంది.నల్ల రంగు పవిత్రత,ప్రయోజనం, విజ్ఞానం పంచే రంగు అనే మెరుగైన సందేశం ఇందులో ఉంది.నల్లబల్లపై వ్రాసిన తెల్లని అక్షరాలు విద్యార్థుల లేలేత మనస్సులలో వెలుగుని నింపుతాయి.ఇది అంధకారం మీద వెలుగుకి లభించిన విజయం అనే గొప్ప సందేశం. గురువు నల్లబల్లపై ద్వారా అందించే విద్యా బోధన వల్ల విద్యార్థుల జ్ఞానం పెరుగుతుంది.బ్లాక్ బోర్డు విద్యకు ద్వారం, జ్ఞానానికి వేదిక అని భావించాలి.నల్లబల్ల మనకు చెప్పే పాఠం ఏమిటి?ఒక వస్తువుకి రంగు, రూపం ముఖ్యం కాదు.దాని ఉపయోగమే ముఖ్యం. నల్ల రంగు శుభం కాదనే అజ్ఞానాన్ని వీడాలి.నల్ల రంగు కూడా వెలుగును పంచగలదు అనే జ్ఞానాన్ని పెంచుకోవాలి.నల్లబల్ల మనకు మంచినే పంచుతుంది అనే లోతైన భావాన్ని ఇస్తుంది.ఇది తరతరాలుగా సమాజంలో నల్ల రంగు పట్ల నెలకొన్న మూఢ నమ్మకాన్ని తుడిచి వేస్తుంది.నల్లరంగు జ్ఞానానికి ఆధారం.జ్ఞానమే జీవితానికి వెలుగుని ఇస్తుంది.

“సుద్ద ముక్కల జ్ఞానామృత బిందువుల్ని/ విద్యార్థుల మేధో క్షేత్రంలో/నీల మేఘమై నిరంతరం వర్షిస్తుంది/అంటున్నారు.సుద్ద ముక్కలు ఇక్కడ శుద్ధత,పవిత్రతను సూచిస్తాయి.జ్ఞానం అనేది అమృత బిందువులతో పోల్చి బడింది.శుద్ధమైన జ్ఞాన బిందువులు విద్యార్థుల మేధస్సు అనే బుద్ధి భూమిలో ఎప్పటికీ ఆగకుండా జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాయి.జ్ఞానం వాన వలె ఎప్పటికీ కురుస్తూ విద్యార్థుల మేధస్సును అభివృద్ధి మార్గంలో పయనింపజేస్తుంది.జ్ఞానం ఒక పవిత్రమైన వానలా విద్యార్థుల బుద్ధి క్షేత్రంలో నిరంతరం కురుస్తూ వారికి అర్హతను,ఆలోచనా శక్తిని,విజ్ఞానాన్ని లభించేలా చేస్తుంది.గురువు విద్యా బోధనలో భాగంగా విద్యార్థుల మేధస్సులో జ్ఞానాన్ని కురిపించి విజ్ఞానాన్ని పెంచుతాడు.విద్యార్థులు క్షేత్రం లాంటి వారు.గురువు నీల మేఘం లాంటి వారు.జ్ఞానం అమృత బిందువుల వర్షం లాంటిది.దాని ఫలితంగా విద్యార్థి మేధస్సు సారవంతమై అభివృద్ధి చెందుతుంది. శశిగురువు జ్ఞాన ప్రదాతగా ఎంతో గొప్ప వాడు అనే భావం వ్యక్తం అవుతుంది. గురువు తన విద్యా బోధనతో విద్యార్థుల మేధస్సులో పవిత్రమైన జ్ఞానాన్ని నిరంతరం నింపుతూ వారిని మేధావులుగా తయారు చేస్తున్నాడు.
“క్లాస్ ఎంత క్లాస్ గా ఉన్నా/బ్లాక్ బోర్డు సరిగ్గా లేకుంటే/గురు శిష్యులను కలిపే వంతెన కూలినట్లే మరి/అంటున్నారు. తరగతి గది ఎంతో శుభ్రంగా,ఆధునికంగా, అందంగా,అన్ని సౌకర్యాలతో ఉన్నా అది కేవలం బయటికి కనిపించే రూపం మాత్రమే. బోధనకు కావల్సిన వాతావరణం ఉన్నా అది మాత్రమే సరిపోదు.
తరగతి గదిలో గరిష్టంగా ఉపయోగపడే బ్లాక్ బోర్డు పని చేయక పోతే,దానిపై వ్రాతలు సరిగా కనిపించకపోతే,రాయడానికి బోర్డు సహకరించకపోతే బోధనలో లోపం వస్తుంది.బ్లాక్ బోర్డు అనేది గురువు తన ఆలోచనలను,ఙ్ఞానాన్ని శిష్యులకు అందించే మాధ్యమం.అది సరిగా లేకపోతే గురువు బోధనను పూర్తిగా వ్యక్తపరచ లేడు.బ్లాక్ బోర్డు ఉపాధ్యాయుడు బోధించే పాఠాలను విద్యార్థులకు చేరవేయడానికి ఉపకరించే ప్రధాన సాధనం.బ్లాక్ బోర్డు చెడి పోయి ఉంటే,దాని మీద రాసినది స్పష్టంగా కనిపించక పోతే అది వాడటానికి వీలు కాకుండా ఉంటే బోధనలో పరిపూర్ణత ఉండదు.
బ్లాక్ బోర్డు అనేది గురు శిష్యులను వంతెన లాంటిది.ఆ వంతెన బలహీనంగా ఉంటే బోధనలో అనుసంధానం తెగి పోతుంది.బ్లాక్ బోర్డు కేవలం ఒక పరికరం మాత్రమే కాదు.అది గురువు శిష్యుల మధ్య అనుసంధానం కలిగించేది.గురువు బోధించే అంశాలను బ్లాక్ బోర్డు మీద రాసి చూపిస్తే శిష్యుడు సులభంగా గ్రహిస్తాడు.బ్లాక్ బోర్డు ఒక వంతెన లాంటిది.ముఖ్య సాధనం అయిన బ్లాక్ బోర్డు లేకపోతే గురు శిష్యుల మధ్య ఉన్న అనుబంధం, జ్ఞాన ప్రసారం ఆగిపోతుంది.ఒక విద్యా వ్యవస్థలో బాహ్య సౌకర్యాల కంటె చదువును అందించడానికి మూలమైన బోధనా పరికరాల ప్రాధాన్యం ఎక్కువ. జ్ఞానాన్ని చేర వేయడంలో సహకరించే బ్లాక్ బోర్డు వంటి ముఖ్యమైన సాధనం లేకపోతే ఎంతో విలాసవంతమైన తరగతి గదులు ఉన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు.విద్యలో బోధనకు ఉపయోగపడే బ్లాక్ బోర్డు సాధనం అసలైన వంతెన.అదే గురు శిష్యుల సంబంధాన్ని బలపరుస్తుంది. బోధనలో పాఠశాలలోని ఇతర సౌకర్యాల కన్నా బ్లాక్ బోర్డు వంటి సాధనాలకు ప్రాధాన్యం ఎక్కువ అని ఈ కవితా పంక్తులు తెలియ జేస్తున్నాయి.
“తరగతి కనుగుడ్డుకు రెటీనా/దీర్ఘ చతురస్రాకారపు నీలి పలక/శిష్య సుమాల మాలకు సూత్రం/ విద్యార్థికి,గురువుకి మూడో కన్ను/అంటున్నారు.ఈ పంక్తులలో తరగతి గదిని ఒక కంటిగా ఊహించారు. కనుగుడ్డులో రెటీనా ఎలా కాంతిని స్వీకరించి దానిని బుద్ధికి పంపుతుందో,అలానే తరగతి గది విద్యార్థులు జ్ఞానాన్ని స్వీకరించే ప్రదేశం.రెటీనా మన దృష్టి చిత్రాన్ని స్పష్టంగా చూపించే ముఖ్యమైన భాగం.ఇక్కడ తరగతి గదిని విద్యార్థి దృష్టికి జ్ఞానాన్ని అందించే రెటీనాతో పోల్చారు.విద్యార్థి జ్ఞానానికి,ఆలోచనలకు రూపం ఇచ్చేది తరగతి గది అనడంలో సందేహానికి తావు లేదు.
సాధారణంగా బోర్డు/పలక నలుపు,నీలి రంగులో దీర్ఘ చతురస్రాకారంగా ఉంటుంది.నీలిపలక పాఠంను విద్యార్థికి అందించే సాధనం.విద్యార్థికి స్పష్టమైన బోధనను అందించే అద్దం వంటిది.నీలి పలక మీద రాసే విషయాలు విద్యార్థులకు జ్ఞానాన్ని అందిస్తాయి.
ఇక్కడ శిష్యులు అనే పూలను గురువు దండలాగా కూర్చడానికి ఉపయోగపడే దారం వంటిది ఈ నీలి పలక.విద్యార్థులు జ్ఞాన సుమాలు.ఒక్కొక్కరు వేరు వేరుగా ఉండ వచ్చు.గురువు బోధనతో శిష్య సుమాలను మాలగా కూర్చి అందంగా తీర్చిదిద్దుతాడు.గురువు బోధనతో విద్యార్థులకు నిరంతరం జ్ఞానాన్ని కురిపిస్తూ,సరియైన మార్గాన్ని చూపుతాడు.
మూడో కన్ను అనగానే అది సాధారణంగా జ్ఞాన నేత్రం.విద్యార్థికి మూడో కన్ను అనగా అది అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని కలిగించేది.విద్యార్థికి గురువు ఇచ్చే జ్ఞానం మూడో కన్ను లాంటిది.అది కేవలం చూసే కన్ను కాదు,లోతైన బుద్ధి,వివేకం,లోక దర్శనం ప్రసాదించే కన్ను అని తెలియ వస్తున్నది.
తరగతి గదిని ఒక కంటి రెటీనాతో,విద్యను జ్ఞాన కాంతిగా భావిస్తూ పోల్చారు.ఈ కవితా పంక్తులు విద్యా ప్రాధాన్యతను,గురువు,విద్యార్థుల సంబంధాలను చక్కగా చెప్తాయి.తరగతిగది జ్ఞాన దృష్టి,బ్లాక్ బోర్డు ఆ జ్ఞానదృష్టిని సుస్పష్టం చేసే పటం లాంటిది. విద్యార్థులలోని వ్యక్తిగత ప్రతిభను ఒక మాలగా కట్టేది గురువు.చివరికి గురువు మూడో కన్ను ద్వారా విద్యార్థికి నిజమైన జ్ఞాన దృష్టిని అందిస్తాడు.
“బ్లాక్ బోర్డు చాక్ పీసులు/భార్యాభర్తల్లా కలిసుంటేనే/విద్యాసంసార సాగరం ఒడ్డుకు చేరుకునేది/అంటున్నారు.బ్లాక్ బోర్డుపై ఒక చాక్ పీసు ముక్కతోనే పాఠం చెప్పడం సాధ్యం కాదు.ఒక చాక్ పీసు,మరొక చాక్ పీసు,తరువాత ఇంకొక చాక్ పీసు కలిసి ఉపయోగించాలి.చాక్ పీసు ముక్కలు ఒక్కదానితో ఒకటి తోడుగా ఉంటేనే గురువు నిరంతరం పాఠాలను బోధించ గలడు.ఇక్కడ బ్లాక్ బోర్డు,చాక్ పీసులు కలిసి ఉండాలి కాబట్టి భార్యాభర్తలుగా పోల్చారు.జీవితంలో సంసారం అనే ప్రయాణం విజయవంతంగా సాగడానికి భార్యాభర్తల అన్యోన్యత ముఖ్యం.ఇదే విధంగా భార్యాభర్తలు కూడా కలిసిమెలిసి ఉంటేనే జీవితం చక్కగా కొనసాగుతుంది.సంసారం చక్కగా సాగడానికి భార్య ఒక్కరితో సరిపోదు,భర్త కూడా తోడుగా ఉండాలి. బ్లాక్ బోర్డు,చాక్ పీసులు కలిసి ఉంటేనే విద్యాసాగరం అనే పెద్ద ప్రయాణం చక్కగా సాగడానికి దోహదపడుతుంది.కలిసి ఉండడం, పరస్పరం తోడ్పడడం,ఐక్యత, జీవితంలో విజయ సాధనకు ఎంతో అవసరం.బ్లాక్ బోర్డు,చాక్ పీసులు కలిసి ఉంటేనే బోధన సాధ్యం అవుతుంది. భార్యాభర్తలు కలిసి ఉంటేనే జీవిత సంసార సాగరం పూర్తి అవుతుంది.భార్యాభర్తలు ఒకరికి మరొకరు అండగా ఉండి తోడ్పాటును అందించాలి. భార్యాభర్తలు కలిసి లేకపోతే జీవన ప్రయాణం చక్కగా సాగక మధ్యలో నిలిచిపోతుంది.బ్లాక్ బోర్డు లేకుండా చాక్ పీసులు వృధా.బ్లాక్ బోర్డు చాక్ పీసులు రెండు కలిసి ఉంటేనే బోధన సాధ్యం అవుతుంది.భార్యాభర్తలు విడిగా ఉంటే జీవితం పరిపూర్ణం కాదు. భార్యాభర్తలు కలిసి సుఖదుఃఖాలు పంచుకుంటూ నడిస్తేనే జీవన సాగరం సాఫల్యంగా ముగుస్తుంది.సంసారంలో భార్యాభర్తల మధ్య ఐక్యత లేకపోతే జీవితం అసంపూర్ణం అవుతుంది.


“అమ్మ పాలు తాగని పిల్లలుంటారేమోగాని/ బోర్డుపై అక్షరాలు …/చదవని అక్షరాస్యులుంటారా!?/ అటెండర్ కైనా …… ఐఏఎస్ కైనా దిక్సూచి ఇదే/ అంటున్నారు.తల్లి పాలు శిశువు శారీరక,మానసిక వికాసానికి తోడ్పడుతాయి.చిన్న పిల్లలు వృద్ధి చెందడానికి తల్లి పాలు ఎంతో అవసరం.తల్లి పాలు సహజమైనవి‌‌.కొందరు పిల్లలు ఏవో కొన్ని కారణాలవల్ల తల్లి పాలు తాగకపోవచ్చు.ఇక్కడ తల్లి పాలు జీవనానికి పునాది అని తెలుపుతుంది. విద్య అందుబాటులో లేనందు వల్ల చదువుకోని వారు,అక్షరాలు తెలియని వారు ఎప్పుడూ ఉంటారు.ఇది విద్యలో వెనుకబడిన వాస్తవాన్ని ఎత్తి చూపుతోంది. ఈనాటి మన సమాజంలో ఇప్పటికీ చాలా మంది నిరక్షరాస్యులు ఉన్నారు.కానీ, చదువు మనిషికి అత్యవసరం.
చిన్న ఉద్యోగం చేసే అటెండర్ అయినా,పెద్ద స్థాయి ఉద్యోగి కలెక్టర్ అయినా వారందరికీ సరైన దారిని చూపేది విద్య.మనిషి స్థాయి ఏమిటి?ఉద్యోగంలో స్థాయి ఏమిటి?అనే తేడా లేకుండా చదువు జీవితానికి మార్గదర్శనం చేస్తుంది.ఇక్కడ జీవితానికి దిశ చూపేది విద్య.తల్లి పాలు శరీరానికి ఎంత ముఖ్యమో,చదువు మనిషి జీవితానికి అంత కంటే ముఖ్యం అని చెబుతోంది.పిల్లల పెంపకానికి తల్లి పాలు ఎంత అవసరమో చదువు మనిషి జీవితానికి అంతే ముఖ్యం.శారీరక,మానసిక వికాసానికి విద్య అత్యంత అవసరం.విద్య లేకుంటే మనిషి అజ్ఞానాంధకారంలో ఉండిపోతాడు.విద్య మనిషికి దారిని చూపిస్తుంది.చదువు అనే దిక్సూచి మనిషి జీవితానికి ఎంతో అవసరం.ఎవరికి అయినా,ఏ స్థాయిలో ఉన్న వారికైనా జీవితాన్ని నిర్మించేది,దిశ చూపేది విద్య మాత్రమే అని ఈ కవితా పంక్తులు తెలుపుతున్నాయి.
“బోర్డు చెవిని చాక్ పీసుతో పిండితే/నోరు తెరిచి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తుంది/అ ఆ ల్నైనా …అనంత విశ్వ రహస్యాల్నైనా/ అరటిపండు ఒలిచినట్లు చెప్తుంది/అంటున్నారు.ఇక్కడ బోర్డుకు చెవి ఉన్నట్లు చెప్పారు.చాక్ పీస్ ముక్కతో బోర్డుపై రాయడాన్ని చెవిని పిండినట్లు చెప్పినాడు. బోర్డు మనకు ఏమి చెప్పదు కాని సూచిస్తుంది.బోర్డు మీద చాక్ పీసుతో రాసినప్పుడు ఆ బోర్డు నోరు తెరిచినట్లుగా అనిపిస్తుంది.అనేక విషయాలను ఒక విశ్వరూపంలాగా మన ముందు ఉంచుతుంది.బోర్డు మీద రాసిన అక్షరాలలో అపారమైన జ్ఞానాన్ని, ఆలోచనల్ని,విశ్వ రూపాన్ని మనకు చూపిస్తుంది.
బోర్డు మీద రాసిన అ,ఆ వంటి చిన్న చిన్న అక్షరాల ద్వారా ప్రాథమిక బోధనను,విశ్వ రహస్యాలను, శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆవిష్కరణలను మొదలైన వాటిని బోర్డు మనకు అందిస్తుంది.ఎంతటి క్లిష్టమైన విశ్వ రహస్యాలనైనా చాలా సులభంగా, సరళంగా బోర్డు మనకు చెబుతుంది. అరటిపండు తొక్క తీయగానే లోపల మృదువైన ఫలం ఉన్నట్లు,బోర్డు మీద చాక్ పీసుతో రాసిన వెంటనే జ్ఞానం కూడా సులువుగా మనకు బోధపడుతుంది.చాక్ పీసుతో రాసే బోర్డు మనకు అక్షరాల నుంచి విశ్వ రహస్యాల వరకు అన్నింటిని సులువుగా నేర్పగలిగే అద్భుతమైన ఉపాధ్యాయుని సాధనం.ఇది ఒక గురువు బోధనా శక్తిని మరియు జ్ఞాన సులభతను ప్రతిబింబిస్తుంది.ఈ కవితా పంక్తులు బోర్డును సాధారణ వస్తువుగా కాకుండా జ్ఞానం,బోధన,విద్యకు నిలయమైనట్టిదిగా చూపిస్తున్నాయి.బోర్డు లేకుండా తరగతి గదిని ఊహించలేం.బోర్డుపై చాక్ పీసుతో రాయగానే అది మౌనం విడిచి విశ్వాన్ని ఆవిష్కరిస్తుంది.చిన్న అక్షరాల నుండి మహత్తరమైన శాస్త్రాల వరకు ఒకే వేదికపై బోర్డు సులభంగా అందిస్తుంది.బోర్డు అనేది ఒక అద్భుతమైన జ్ఞాన ద్వారం.అది మౌనంగా కనిపించినా చాక్ పీసు తాకినప్పుడల్లా అది విశ్వాన్ని చూపించే మహాశక్తిగా మారుతుంది. బోర్డుకు నిజంగా చెవి ఉండదు.గురువు చాక్ పీసుతో తాకితే చాలు బోర్డు మాట్లాడుతుంది అనే భావాన్ని ఈ కవితా పంక్తులు వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ బోర్డు విద్యావేదిక.బోర్డు సాధారణంగా మౌనంగా ఉండే వస్తువు. కానీ,అట్లాంటి బోర్డు చాక్ పీసు తాకగానే అది మాట్లాడే శక్తిని పొందుతుంది. ఈ విరుద్ధాభాసమే కవిత్వ సౌందర్యం.విద్యా బోధనలో చిన్న అ,ఆ లాంటి అక్షరాలు ప్రాథమిక విషయాలు,విశ్వ రహస్యాలు, బోర్డు అనే సాధారణ వేదిక ద్వారానే వ్యక్తం అవుతాయి.బోర్డు అనేది కేవలం ఒక బ్లాక్ బోర్డు మాత్రమే కాదు.అది జ్ఞాన విశ్వాన్ని మన కళ్ళ ముందు ఉంచే అద్భుతమైన శక్తి.ఈ కవితా పంక్తులలో బోర్డు జ్ఞానాన్ని ప్రసవించే తల్లిలా,చాక్ పీసు ఒక ప్రేరణ కర్రలా,జ్ఞానం ఒక విశ్వరూపంలా పోల్చి చూపబడినాయి.
“బోర్డు దేహమ్మీది సుద్ధ ముక్క దస్తూరి/సిల్వర్ ఫిలిగ్రీ ఆభరణాలే/తరగతి గదిలో సంజీవని/విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీసే డ్రాయింగ్ పేపర్/ అసమానతల్ని తొలగించే రాజ్యాంగం/ప్రశ్నించే తత్వాన్ని నేర్పే గురువు/దీనిపై రాసే రాతల్ని అర్థం చేసుకొని అనుసరిస్తే/గ్రహాలు కూడా తలవంచుతాయి/విశ్వపు బంతి గ్లోబును వేలిపై తిప్పుకోవచ్చు/అంటున్నారు.బోర్డు విద్యార్థుల జీవితాల్లో ఎంతో ప్రాధాన్యత కలిగినది అని ప్రతీకాత్మకంగా వివరిస్తున్నారు.ఒక సాధారణ బ్లాక్ బోర్డును కవి అత్యంత విలువైనదిగా చూపించారు. బోర్డు చదువుకు ఉపయోగించే పరికరమే.కానీ, దీనిని జ్ఞానం,సమానత్వం,సృజనాత్మకత, ప్రశ్నించే తత్వాన్ని నేర్పే గురువు అనే అంశాలను తీసుకున్నారు.
బోర్డు మీద రాసే చాక్ పీసు రాతలను, ఇక్కడ సుద్ధముక్క దస్తూరిని,సిల్వర్ ఫిలిగ్రీ ఆభరణంగా పోల్చారు.బోర్డు మీద రాసే అక్షరాలు నాజూకు,అందం,సృజనాత్మకత, కళాత్మకతను ప్రతిబింబిస్తుంది.కవి బోర్డు మీద రాసిన అక్షరాలు, వెండి తీగలను అల్లి చేసిన తేలికైన,సున్నితమైన కళాత్మకమైన ఆభరణాల వంటివి,విలువైనవి అని సూచిస్తున్నారు.
తరగతి గదిలో బోర్డు ఎంతో ముఖ్యమైన స్థానం కలిగి ఉంటుంది.తరగతి గది విద్యార్థుల అభ్యాస కేంద్రం.గురువు బోధన విద్యార్థుల్లో జ్ఞానాన్ని, చైతన్యాన్ని నింపే సంజీవనిలా ఉంటుంది.గురువు కేవలం విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధించే వాడు మాత్రమే కాదు.గురువు ప్రేరణ,విలువలు, నైతికత,జీవన పాఠాలు అందించే వ్యక్తి.గురువు బోధన వల్ల విద్యార్థుల ఆలోచనా విధానం,ప్రవర్తన వ్యక్తిత్వం పై గొప్ప ప్రభావం చూపుతుంది.తరగతి గదిలో మంచి బోధన విద్యార్థులను ఆలోచించేలా, ప్రశ్నించేలా, సృజనాత్మకంగా తీర్చిదిద్దుతుంది. గురువు పాఠాన్ని రసవత్తరంగా ఆసక్తికరంగా చెప్పడం వల్ల విద్యార్థులు కుతూహలంతో నేర్చుకుంటారు. విద్యార్థులు చదువులోనే కాదు, జీవితంలోను ఎదగడానికి ప్రేరణ పొందుతారు.గురువుల బోధన వారిలో ఆత్మవిశ్వాసాన్ని,నైతిక బలాన్ని,సామాజిక బాధ్యతను పెంచుతుంది.మంచి గురువులు తయారుచేసే విద్యార్థుల వల్లే సమాజం అభివృద్ధి చెందుతుంది.తరగతి గది నుంచి వెలువడే జ్ఞానం నిజంగా సంజీవని లాంటిదే.గురువు బోధన విద్యార్థుల జీవితంలో జ్ఞానానికి,మానవత్వానికి, విలువలకు ప్రాణం పోసే సంజీవని అని చెప్పవచ్చు. విద్యా ప్రక్రియలో ఉపాధ్యాయుడు చెప్పే విషయాన్ని విద్యార్థికి సులభంగా,స్పష్టంగా అందించే సాధనం బోర్డు.బోర్డు లేకుండా బోధన పూర్తిగా జీవం లేని దానిలా మారుతుంది.అందుకే దాన్ని సంజీవనితో పోలుస్తారు.ఉపాధ్యాయుడు చెప్పే మాటలు కాకుండా వాటికి దృశ్య రూపం ఇచ్చేది బోర్డు.బోర్డుపై క్లిష్టమైన విషయాలను,సులభంగా అర్థమయ్యేలా, చిత్రాలు,పట్టిక రూపంలో చూపవచ్చు. బోర్డు వలన విద్యార్థుల ఏకాగ్రత,జ్ఞాపకశక్తి పెరుగుతుంది.బోర్డు ఒక సజీవ సాధనం.ఇది బోధనకు ఉత్సాహం, కాంతి,స్పష్టత తీసుకొస్తుంది.చిన్న విషయాల నుండి పెద్ద సిద్ధాంతాల వరకు అన్నింటిని బోధించగలిగే గొప్ప సాధనం బోర్డు.ఇది బోధనను,అభ్యాస ప్రక్రియను సజీవం చేస్తుంది.బోర్డును విద్యార్థులకు విజ్ఞానం చేరవేసే సులభమైన సాధనంగా చెప్పవచ్చు.అందువల్ల దానిని సంజీవని అని పిలుస్తారు.ఉపాధ్యాయుడు చెప్పే విషయాలను బోర్డు మీద రాయడం ద్వారా విద్యార్థులకు స్పష్టంగా అర్థం అవుతుంది.బోర్డు మీద చిత్రాలు,పట్టికలు చూపించడం వల్ల విద్యార్థులకు విషయాలు బలంగా గుర్తుంటాయి.బోర్డు మీద రాయబడినది చూసే క్రమంలో విద్యార్థులు ఏకాగ్రతతో పాఠాన్ని ఆసక్తిగా వింటారు. బోర్డు ఉపాధ్యాయుని బోధనకు జీవం పోస్తుంది.విద్యార్థులలో జ్ఞానాన్ని పెంచుతుంది.
బోర్డ్ ఒక డ్రాయింగ్ పేపర్ లా ఉంటుంది. డ్రాయింగ్ పేపర్ కేవలం చిత్రాలను గీయడానికి ఉపయోగించే పేపర్ మాత్రమే కాదు.ఇది విద్యార్థుల్లో దాగి ఉన్న ఆలోచనలను,ఊహా శక్తిని వెలికి తీసే సాధనం. సృజనాత్మకతకు వేదిక.డ్రాయింగ్ పేపర్ మీద విద్యార్థులు తమ ఊహల్లో కనిపించే దృశ్యాలకు, స్వేచ్ఛగా రూపం కల్పిస్తారు.విద్యార్థులను కేవలం పుస్తకాలలోని పాఠ్యాంశాలకు మాత్రమే పరిమితం చేయకుండా వారి కొత్త ఆలోచనలకు ప్రాణం పోయాలి.మాటలలో చెప్పలేని భావాలను చిత్రాల ద్వారా సులభంగా వ్యక్తపరచ వచ్చు.డ్రాయింగ్ పేపర్ అనే బోర్డు విద్యార్థుల సృజనాత్మకతను వెలికి తీయడానికి, ఆలోచనలను రూపకల్పన చేయటానికి భావాలను వ్యక్తీకరించడానికి ఉపయోగపడే ముఖ్యమైన సాధనంగా భావించవచ్చు.కళ అనేది కళ కోసం మాత్రం కాదు.అది విద్యార్థులలో వ్యక్తిత్వ వికాసాన్ని పెంపొందించాలి.అందులో విద్యార్థుల ఆలోచనలు,గురువు బోధనలు రూపం దాలుస్తాయి.
బోర్డు మీద రాసే జ్ఞానం రాజ్యాంగం వలె సమానత్వం నేర్పుతుంది.అందరికీ సమాన అవకాశాలు కల్పించే మార్గం చూపుతుంది. రాజ్యాంగం సమానత్వం,న్యాయం,సత్యం బోధించే సాధనం.విద్యా రంగంలో ఉన్న అసమానతలను తొలగించడం కోసం భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు నిబంధనలు మార్గదర్శకాలపై ఆధారపడి ఉంటుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 – A ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల వయసుగల ప్రతి పిల్ల వాడికి ఉచిత విద్య తప్పనిసరిగా అందించాలి. పిల్లలకు ప్రాథమిక విద్య హక్కుగా కల్పించబడింది. విద్య అందరికీ సమానహక్కు అని రాజ్యాంగం ప్రకటించింది.అప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుంది.
బోర్డు మీద రాసే రాతల ద్వారా గురువు విద్యార్థులలో ప్రశ్నించే తత్వాన్ని పెంచుతాడు.బోర్డు మీద బోధించే గురువు ప్రశ్నించమని ప్రేరేపించే తత్వవేత్త.విద్యార్థుల విమర్శనాత్మక ఆలోచనా ధోరణిని పెంపొందించేలా ప్రోత్సహిస్తాడు.
బోర్డు మీద రాసిన అక్షరాల జ్ఞానాన్ని గ్రహించి దాన్ని జీవితంలో అనుసరిస్తే విద్యార్థి విశ్వాన్ని జయించే స్థాయికి ఎదుగుతాడు.జ్ఞానంతో మనిషి విశ్వాన్ని జయించగలడు.గురువు బోధించే జ్ఞానం, పాఠాలు,బ్లాక్ బోర్డు మీద రాసిన అక్షరాల రూపంలో ఉంటాయి.ఇవి కేవలం అక్షరాలు మాత్రమే కాకుండా జీవితాన్ని మార్చే మార్గదర్శకాలు.గురువు బోర్డు మీద రాసిన అక్షరాలు కేవలం చదవడంతో సరిపోదు. వాటి లోతైన అర్ధాన్ని గ్రహించి ఆచరణలో పెట్టడం అవసరం.గురువు అందించే జ్ఞానం,కేవలం పుస్తకాలకు పరిమితం కారాదు.అది విద్యార్థుల ప్రవర్తనలో, జీవితంలో కనిపించాలి అనే సందేశాన్ని అందించడం జరిగింది.ఈ కవితా పంక్తులు జ్ఞానం, విద్య యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తున్నాయి.విద్య వల్ల మనిషి వివేకం పెరుగుతుంది.జ్ఞానం,శ్రమ,ఆచరణల వల్ల గ్రహాలు కూడా తలవంచుతాయి.విద్యకు జీవితాన్ని మార్చ గల శక్తి ఉంది.గురువు బోధించే పాఠాలను చక్కగా నేర్చుకోవాలి.విద్యార్థులు కేవలం పాఠాలను చదివి వదిలివేయ వద్దు.అందులోని సారాన్ని అర్థం చేసుకోవాలి.గురువు బోధనలను జీవనంలో అమలు చేస్తే మనిషి ఎదుగుదలకు ఎవరు అడ్డు నిలవలేరు.విధి,అదృష్టం,గ్రహ స్థితి అన్ని జ్ఞానానికి లోబడి ఉంటాయి.
ఇక్కడ గ్లోబు అంటే భూమి బంతి.ఇది మొత్తం ప్రపంచాన్ని విశ్వాన్ని సూచిస్తుంది. చిన్న బంతిలా కనిపించే గ్లోబు లోపల మనిషి జీవన రహస్యాలు,దేశాలు.సముద్రాలు,పర్వతాలు, సరిహద్దులు అన్ని నిక్షిప్తమై ఉంటాయి.గ్లోబు చిన్న బంతి రూపంలో ఉంటే దానిని సులభంగా వేలుతో తాకుతూ తిప్పుకోవచ్చు.గ్లోబు ద్వారా ప్రపంచమంతా మన కళ్ళ ముందే ఉన్నట్లుగా అనిపిస్తుంది.మనిషి జ్ఞానం పెరిగితే ప్రపంచాన్ని తన కంటితోనే చూడగలడు.ఇది విజ్ఞానం,విద్య, అన్వేషణ వాటి శక్తి ఎంత గొప్పదో తెలుపుతున్నది. భూమి ఎంత విస్తారమైనదో విశ్వం ఎంత అపారమైనదో గ్లోబు రూపంలో సులభంగా వేలుతో తాకి తెలుసుకోవచ్చు.విజ్ఞాన శక్తితో విశ్వం కూడా మన వేళ్ళకు లోబడి తిరుగుతుంది.మనిషి ప్రపంచాన్ని అర్థం చేసుకొని తన చేతుల్లోకి తెచ్చుకోవచ్చు.ఈ విధంగా బోర్డు ప్రాముఖ్యతను అద్భుతమైన కవితాత్మక రూపంలో చెప్పబడినది. బోర్డు కేవలం బోధనా సాధనం మాత్రమే కాకుండా విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దే జ్ఞాన భాండారం.బోర్డు ద్వారా ప్రపంచాన్ని తన నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు.బోర్డు విద్యార్థి జీవితాన్ని తీర్చిదిద్దే జ్ఞాన మార్గదర్శి.విద్య ద్వారా సమానత్వం, సృజనాత్మకత,విమర్శనాత్మక ఆలోచనా ధోరణులు పెరుగుతాయి.చివరకు విద్యార్థి విశ్వాన్ని జయించే శక్తిని పొందుతాడు.కవి వెంకటేశ్వర్లు చక్కటి బ్లాక్ బోర్డ్ కవితను అందించినారు.వారు మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
కవి ఎర్రోజు వెంకటేశ్వర్లు తేది 30 – 06 – 1969 రోజున సామాన్య స్వర్ణకార కుటుంబంలో జన్మించారు.వీరు కంది కట్కూర్ గ్రామం, ఇల్లంతకుంట మండలం, రాజన్న సిరిసిల్లకు చెందిన వారు.వీరి తల్లిదండ్రులు రామవ్వ,పాపయ్యలు.వీరి తండ్రి పాపయ్య స్వర్ణకార వృత్తితో పాటు జ్యోతిష్యం చెప్తుండే వాడు.వీరి తండ్రి పాపయ్య రామాయణం, మహాభారతం, హాస్య,జానపద కథలను గ్రామస్తులకు సులభంగా,అర్థమయ్యేలా చక్కగా చెప్పే వారు.వీరి తండ్రి పాపయ్య కథలు చెప్తుండగా వినడం వల్లనో ఏమో చిన్నతనంలోనే కవి వెంకటేశ్వర్లుకి సాహిత్యం,కళల పట్ల ఎనలేని ఆసక్తి ఏర్పడింది.వీరి తండ్రి పాపయ్య తేది 17 – 08 – 1990 రోజున అనారోగ్యంతో ఈ లోకాన్ని వీడిపోయారు.వీరి తల్లి రామవ్వ తేది 12 -10 – 2010 రోజున అనారోగ్యంతో పరమపదించింది.వీరు ప్రాథమిక విద్యను 1వ తరగతి నుండి 5 వ తరగతి,1975 – 1980 ప్రభుత్వ పాఠశాల, కందికట్కూర్ గ్రామంలో చదివారు.బాలకిషన్ సార్ ప్రోత్సాహంతో వీరి తండ్రి 6 వ తరగతిలో వెంకటేశ్వర్లును శ్రీ రాజరాజేశ్వర సంస్కృతాంధ్ర విద్యాలయం,వేములవాడలో చేర్పించారు.వీరు అదే పాఠశాలలో 6 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు 1975 – 1980 విద్యాభ్యాసం చేశారు.వీరు ఇంటర్ మరియు డిగ్రీ విద్యను1985 – 1990 శ్రీ రాజరాజేశ్వర సంస్కృత కళాశాల, వేములవాడలో చదివారు.వీరు ఎం.ఏ. తెలుగు ఎంట్రెన్స్ టెస్ట్ లో మొదటి ర్యాంకు సాధించి,1990 – 1992, ఉస్మానియా విశ్వవిద్యాలయం,హైదరాబాదులో చదివారు.వీరు ఎం.ఫిల్. డిగ్రీ 1992 -1993 సంవత్సరంలో కేంద్రీయ విశ్వ విద్యాలయం, హైదరాబాద్,సదానంద్ శారద కథలు అనే అంశంపై పరిశోధించి,డిగ్రీని పొందారు.వీరు1995 సంవత్సరంలో బి.ఇడి.డిగ్రీని రాష్ట్రీయ విద్యాపీఠం, తిరుపతిలో పూర్తి చేశారు.వీరు 1994 సంవత్సరంలో ఎం.ఏ. సంస్కృతం, దూరవిద్య ద్వారా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం.తిరుపతిలో అభ్యసించారు.వీరు తేది 21 – 09 – 1995 రోజున సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల,ఆసిఫాబాద్ లో టీచర్ గా నియమించబడ్డారు.వీరు ఆసిఫాబాద్, మేడిపల్లి,రుక్మాపూర్,హుస్నాబాద్,ఇందారం – జైపూర్,ముథోల్,నిర్మల్ ప్రాంతాలలో పని చేశారు. వీరు ప్రస్తుతం తెలుగు శాఖా అధ్యక్షులుగా సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల,నగునూర్ లో పని చేస్తున్నారు.వీరు కళాశాలలో విద్యార్థులకు సాహిత్యం,కవిత,కథా రచన పట్ల ఆసక్తిని పెంపొందింపచేస్తున్నారు.వీరు తేది 20 – 02 – 2006 నుండి 25 – 02 – 2006 వరకు ప్యానెల్ ఇన్స్పెక్షన్ సభ్యునిగా నేషనల్ మాన్స్క్రిప్ట్ సర్వేయర్ గా ఇల్లంతకుంట మండలంలో పని చేసినారు.వీరు ఎన్నో తాళపత్ర గ్రంథాలను సేకరించి ప్రభుత్వానికి అందజేశారు. కవి వెంకటేశ్వర్లు ముద్రిత రచనలు :
1) బ్లాక్ బోర్డ్ కవితా సంపుటి 2020.
2) యెర్రోజు పసిడి పలుకులు 2020
కవి వెంకటేశ్వర్లు పొందిన పురస్కారాలు:
1.తేది 26 – 01 – 2013 ఆదిలాబాద్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు.

  1. తేది 28 – 02 – 2013 తెనాలి వారిచే యలపర్తి ఆంజనేయ శాస్త్రి పురస్కారం లభించింది.
  2. తేది 12 – 01 – 2023 రోజున కాలువ మల్లయ్య పురస్కారం పొందారు.
  3. తేది 10 – 07 – 2025 కొనకటి సుభద్ర బాలకిషన్ ట్రస్ట్ వేములవాడ వారిచే ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారంను అందుకున్నారు.
    5.తేది 14 – 01 – 2007 సారస్వత జ్యోతి మిత్రమండలి,కరీంనగర్ వారిచే ప్రశంసా పత్రం అందుకున్నారు.
  4. తేది 12 – 11 – 2006 పాలకొల్లు వారిచే
    కళాలయ విశిష్టత ప్రతిభా పురస్కారం లభించింది.
    7.సురభారతి సేవాపీఠం,తిరుపతి వారిచే
    సంస్కృతాంధ్ర సాహిత్య రత్న,బిరుదును 2011 సంవత్సరంలో అందుకున్నారు.
September 29, 2025 163 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సువ్యాసాలు

A walk & a realization

by Chaitra Ranganayaki September 28, 2025
written by Chaitra Ranganayaki

I was taking a walk the other day planning for my next decade and half stint of my life. Wanting to slow down from the busy corp world but what exactly would I do after I quit? I am so accustomed to the job idea most of our societies constantly linger on that I completely forgot how recent this luxury really is.
Forget how long ago the suffrage movement was – even my mom’s generation didn’t plan well for their retirement. Of course they made the most of what they could, but here I am with all these opportunities and I feel like I’m wasting it away chasing a chicken! How did I get so lucky? It’s crazy how this thought doesn’t occur to me as often as it should. Are we living lives that don’t practice gratitude like how often we follow our ego?

The ability to even contemplate “what’s next” in my career, to have choices about how I want to spend the next fifteen years, to build wealth for retirement – these weren’t options for women just one or two generations back. The suffragettes and early women’s rights fighters endured imprisonment, force-feeding, public humiliation, and social ostracism just so we could have the right to vote, to get an education, to pursue careers. They literally put their bodies on the line so that I could walk into any university, build a career, contribute to a 401K, and have some control over how I want to shape my life.
But here’s what really hit me during that walk: how are we actually using this hard-won freedom? Are we honoring their sacrifice with how we spend our days? Or are we squandering it scrolling mindlessly through social media, getting lost in manufactured outrage, or hiding behind the convenient lie of “self-care” when what we’re really doing is avoiding the harder work of actually building meaningful lives? I’m not saying rest isn’t important, but I wonder if Susan B. Anthony would look at us spending hours on TikTok or Instagram and think, “This is what we fought for?”

These women couldn’t have imagined the specific freedoms we enjoy today – the luxury of career anxiety, the privilege of planning retirement, the ability to walk alone and contemplate our futures – but they fought with this unwavering belief that future generations of women deserved better, deserved more. They saw potential in us that we sometimes don’t even see in ourselves.

It makes me wonder: are we living up to their vision? Are we using our freedom to create, to contribute, to push boundaries further for the women who come after us? Or are we getting comfortable in the freedoms they won and forgetting that freedom is something you have to actively use, not just passively enjoy? Maybe the real way to honor them is to ask ourselves daily: am I making the most of what they died for? Am I practicing the kind of gratitude that transforms how I live, not just how I feel?
*

September 28, 2025 10 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

సంస్కృత భాషను కాపాడుకోవాలి

by Aruna Dhulipala September 28, 2025
written by Aruna Dhulipala

‘ప్రాచ్య విద్యా విభూషణ’, రాష్ట్రపతి సమ్మానిత, స్వర్ణ ఘంటాకంకణద్వయాలంకృత, సంస్కృతాంధ్ర కంఠీరవ బిరుదాంచితులు, ప్రముఖ సంస్కృత పండితులు డా. పాలవంచ తిరుమల గుదిమెళ్ళ వెంకట రంగాచార్య మయూఖ ప్రతినిధి అరుణ ధూళిపాళ జరిపిన ముఖాముఖి.        

  ఆధ్యాత్మిక, తాత్త్విక, సాహిత్యపరమైన రచనలు చేస్తూ, సమాజోపయోగ కార్యక్రమాలను నిర్వహిస్తూ, తమ ప్రసంగాల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తున్న ప్రముఖ సంస్కృత పండితులు డా. పి టి జి వి రంగాచార్య గారి జీవన ప్రస్థానాన్ని స్వయంగా వారి మాటల్లో తెలుసుకుందాం.

1ప్ర:- నమస్కారం గురువుగారూ! మా పాఠకులకు మిమ్మల్ని పరిచయం చేసే భాగ్యం కలిగినందుకు నాకు మహదానందంగా ఉంది. ఇటీవలే మీరు పొందిన ‘ప్రాచ్య విద్యా విభూషణ’ పురస్కార విశేషాలను తెలపండి.

జ: “పఠామి సంస్కృతం నిత్యం, వదామి సంస్కృతం సదా
ధ్యాయామి సంస్కృతం సమ్యక్ వందే సంస్కృత మాతరం”
“గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః”
“విశేష విత్పారిషదేషు నాథ విదగ్ధ గోష్ఠీ సమరాంగణేషు
జిగీష తో మే కవితార్కి కేంద్రాన్ జిహ్వాగ్ర సింహాసన మభ్యుపేయా”
నమస్కారం తల్లీ! అవసరమైన విషయాన్ని ప్రశ్న రూపంలో అడిగారు. సమాజానికి తెలియాల్సిన విషయాలు కొన్ని ఉంటాయి. అవి పదిమందికి స్ఫూర్తి దాయకంగా ఉంటాయి. ఈ ఇంటర్వ్యూ వల్ల మీకో నాకో ప్రయోజనం చేకూరుతుందని కాదు. ఇది ఏ ఒక్కరికైనా ఉపయోగపడితే చాలు అని నా అభిప్రాయం. మీరు అడిగినట్టుగా నేను జూన్ 9వ తేదీ (2025) ‘ప్రాచ్య విద్యా విభూషణ’ పురస్కారాన్ని పొందాను. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం, ఢిల్లీలోని లాల్ బహదూర్ శాస్త్రి సంస్కృత విశ్వవిద్యాలయం, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం వారు సంయుక్తంగా ఇచ్చే పురస్కారం. ఈ మూడు సంస్థలు కలిపి ‘ఉత్కర్ష’ అనే ఉత్సవాన్ని నిర్వహిస్తారు. అందులో ఈ పురస్కారాన్ని అందజేశారు. దేశం మొత్తంలో ఉన్న పండితులలో నుండి ఎంచుకుంటారు. అట్లా ఆంధ్రప్రదేశ్ నుండి నన్ను ఎంపిక చేశారు. పురస్కారంతో పాటు లక్ష రూపాయలు నగదు బహుమతిగా ఇచ్చారు.

2ప్ర:- అవును.. ఆ నగదు బహుమతిని కూడా మీరు మీ కోసం కాకుండా ప్రజోపయోగ కార్యక్రమాల కొరకు ప్రకటించారని విన్నాం. వాటి గురించి చెప్పండి.

జ.   అమ్మా! నేను సీనియర్ లెక్చరర్ గా రిటైర్ అయ్యాను. నా కుటుంబం గడవడానికి ఆ పెన్షన్ సరిపోతుంది. ఈ నగదు బహుమతి నాకు సమాజం ద్వారా వచ్చింది. కాబట్టి సమాజానికే ఉపయోగించాలి అనుకున్నాను. 1972 నుండి 1984 వరకు నేను అనేక ప్రాంతాలు పర్యటించి ఆధ్యాత్మిక, సాహిత్య రంగాల్లో కృషి చేశాను. 1984 నుండి నా కృషిని గుర్తించి భారతదేశం మొత్తంలో నన్ను అందరూ పిలవడం ప్రారంభించారు. ఇప్పుడు ఇంత గొప్ప పురస్కారాన్ని, నగదు బహుమానాన్ని అందుకున్నాను. అందువల్ల ఇది సమాజానికే చెందాలి అనిపించింది. ఆ బహుమతిని నేను నాలుగు భాగాలు చేశాను. ఒక భాగం పాతికవేలు నేను చదువుకున్న సీతారాం బాగ్ సంస్కృత కాలేజీకి ఇచ్చాను. అది కూడా పోటీలో విజేతలకే. నాకు అంత్యాక్షరి శ్లోకాల పోటీ చాలా ఇష్టం. 1972 లో ఆ పోటీలో నేను రాష్ట్రస్థాయిలో ప్రథమ విజేతను. దాంట్లో చాలా నియమాలు ఉంటాయి. సుప్రభాత శ్లోకాలు చెప్పకూడదు. అనుష్టుప్ లు ఉండకూడదు. వృత్తాలు మాత్రమే తీసుకోవాలి. ఎన్నో శ్లోకాలు కంఠతా వస్తే తప్ప నెగ్గడం కష్టం. ఆ పోటీ నాకు చాలా ఇష్టం. నేను ఈ పాతిక వేల రూపాయలను FD చేయమని చెప్పాను. ప్రతీ ఏడాది పెట్టే ఈ అంత్యాక్షరి పోటీలో విజేత అయిన విద్యార్థికి ఆ వచ్చిన డబ్బును బహుమతిగా ఇవ్వమని చెప్పాను. ఇదే తరహాలో ఇంకో పాతిక వేల రూపాయలను నాకు అవార్డు ఇచ్చిన తిరుపతి జాతీయ సంస్కృత విశ్వ విద్యాలయానికి ఇచ్చాను. మరో పాతికవేలు నేను పుట్టిన ఊరికి సంబంధించి కొన్ని సౌకర్యాల నిమిత్తం ఇచ్చాను. ఇంకో పాతిక వేలు మా ఊళ్లోని రంగనాయక స్వామి దేవాలయానికి ఇచ్చాను. ఈ స్ఫూర్తితో నా శిష్యురాళ్ళు స్వరూపరాణి, శివాని పాతికవేల చొప్పున ఇవ్వగా శ్రీదేవి అనే శిష్యురాలు వాళ్ళ అమ్మగారి పేరు మీద యాబైవేలు, విజయ గారని మరొకరు ఇరవై ఐదు వేలు, నాతో పాటు పురస్కారం పొందిన మరో పండితుడు పాతికవేలు మొత్తంగా లక్షా యాబైవేల రూపాయలను తిరుపతి జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయానికి ఇవ్వడం జరిగింది. ప్రతీ ఏటా జరిగే టాలెంట్ ఫెస్టివల్ లో విజేతలైన ఆరుగురు విద్యార్థులకు అందజేయమని చెప్పాం. నేను చేసిన పని ఇంకొంతమందికి ప్రేరణ కావడం ఎంతో సంతోషంగా అనిపించింది.

3ప్ర:- మీ వంశం పేరులో పాలవంచ తిరుమల గుదిమెళ్ళ అని ఇన్ని పేర్లు ఉండడం ఆశ్చర్యంగా ఉంది. దానికి కారణం తెలుసుకోవచ్చా?

జ:-  నూజివీడు జమీందార్లు శ్రీరంగపురం గుదిమెళ్ళ వారికి ఇచ్చిన అగ్రహారం. భగవద్రామానుజాచార్యుల వారు వైష్ణవ మత వ్యాప్తి కోసం 74 పీఠాలు పెట్టారు. అందులో తిరుమల పీఠం ఒకటి. అది మా గుదిమెళ్ళ వారిది. అట్లా తిరుమల అని కూడా కలిసింది. మా ఊరుకు దక్షిణంగా ఆంధ్రమహావిష్ణువు, తూర్పున మొవ్వ, ఉత్తరంగా కూచిపూడి ఈ మూడింటి మధ్య మా ఊరు. మా పూర్వీకులలో ఒకాయన పాల్వంచకు వెళ్లి అక్కడ అగ్రహారాన్ని సంపాదించి దాదాపు నలభై ఏళ్లు ఉన్నాడు. ఆయన కుమారుడు వెంకటాచార్యులు ఉయ్యాలలో ఉండగా పులి ఎత్తుకుపోతుంటే గ్రామస్థులు తరిమి పిల్లవాణ్ణి కాపాడారట. అప్పటినుండీ ఆయన పులి వెంకటాచార్యులు అయినాడు. ఆ తరువాతి కాలంలో వెంకటాచార్యులు ఆ అగ్రహారాన్ని వదిలేసి మొవ్వ దగ్గర పిచుకల పాడు అనే అగ్రహారాన్ని సంపాదించుకున్నారు. పాలవంచ నుండి వచ్చినవారు కాబట్టి పాలవంచ వారు అని పిలవడంతో పిచుకల పాడు అగ్రహారం కాస్తా పాలవంచ అగ్రహారమయింది. అక్కడి నుండి మళ్ళీ కొంతమంది శ్రీరంగపురం వచ్చారు. ఇదంతా కలిసి పాలవంచ తిరుమల గుదిమెళ్ళ ఇంటి పేరు అయింది.

4ప్ర:- మీరు జన్మించిన ప్రదేశం ఏది? మీ విద్యాభ్యాసం ఎట్లా జరిగిందో తెలపండి.

జ. మాది కృష్ణాజిల్లా, శ్రీ రంగపుర అగ్రహారం. నూజివీడు జమీందార్లు గుదిమెళ్ళ వాళ్లకు ఇచ్చిన అగ్రహారం. నేను జూన్ 23, 1952లో శ్రీరంగపురంలో జన్మించాను. మా నాన్నగారి పేరు సత్యనారాయణాచార్య గారు. మా అమ్మగారు లక్ష్మీ నరసమ్మ గారు. మా నాన్నగారు ఏమీ చదువుకోలేదు. కానీ సంస్కృత మహా పండితుడు. చిట్టి గూడూరులో పాఠశాలలో చేర్పిస్తే వాళ్ళ నానమ్మ గారు చదువెందుకని పట్టుకొచ్చారట. ఇంట్లోనే కూర్చుని చదువుకున్నారు. అద్భుతమైన పాండిత్యం ఆయనది. పురాణాలు, భారత, భాగవతాలు చెప్పేవారు. కంచుకంఠంతో ఆయన చెబుతుంటే మైకు లేకుండా మైలు దూరం వినిపించేది. మా చిన్నాన్నగారు గోపాల కృష్ణమాచార్యులు గారు. శాస్త్రం చదువుకున్నవారు. ఆయన కూడా మహా పండితుడు. ఆశుకవి. నా అదృష్టం కొద్దీ చిన్నతనంలో మా నాన్నగారు తనతో పాటు నన్నూ తీసుకెళ్లేవారు. నన్ను పురాణం చదువుమని చెప్పి ఆయన వ్యాఖ్యానం చేసేవారు. తొమ్మిదిమంది సంతానంలో నేను చివరి వాడిని. నలుగురు అన్నయ్యలు, నలుగురు అక్కయ్యలు. ఒక అన్నయ్య చనిపోయాడు. మా పెద్దన్నయ్య గొప్ప పండితుడు. వైష్ణవ సంప్రదాయంలో ఉన్న తమిళ గ్రంథాలన్నింటికీ తెలుగులో వ్యాఖ్య రాశాడు. ‘నాలాయిర’ మని నాలుగువేల శ్లోకాలతో కూడిన దివ్య ప్రబంధాన్ని రాశాడు. అంతేకాదు. అక్కడక్కడా ఊళ్ళల్లో గోష్ఠులు నిర్వహించి పదకొండు రోజుల్లో తెలుగు అర్థంతో సహా వాటిని నేర్పేవాడు. మా రెండో అన్నయ్య తెలుగు పండితుడు. ఆయన పధ్నాలుగేళ్ళు కష్టపడి మా వంశవృక్షం రాశాడు. మా ఊళ్ళో ‘భాష్యకార’ ప్రభుత్వ పాఠశాలలో నేను అయిదవ 5వ తరగతి వరకు చదువుకున్నాను. మచిలీపట్నం వచ్చి ఓరియెంటల్ హైస్కూల్లో 6వ తరగతి నుండి ఎస్ ఎస్ ఎల్ సి వరకు చదువుకున్నాను. వేదాల నరసింహాచారిగారు, గుదిమెళ్ళ రామానుజాచార్యులు గారు, మల్లంపల్లి దుర్గాప్రసాద్ గారు ఇట్లాంటి మహా పండితులు పాఠాలు చెప్పడం వల్ల సాహిత్యం పట్ల అభిరుచి కలిగింది. మా రెండో అన్నయ్య నాకు మూడవ తరగతి నుండి మొదలుపెట్టి అయిదవ తరగతి వచ్చేవరకు అమరకోశం, తెలుగులో ఆంధ్ర నామ సంగ్రహం, శతకాలు, శబ్దాలు, ధాతువులు, సమాసాలు ఇవన్నీ నేర్పించడం వలన గట్టి పునాది పడింది. అందువల్ల సంస్కృతం నేర్చుకోవాలనే కోరిక బలీయంగా కలిగింది.

రంగాచార్య గారితో అరుణ ధూళిపాళ

5ప్ర:-  ఇందాక నగదు బహుమతి గురించి చెబుతున్నప్పుడు సీతారాం బాగ్ కాలేజీలో చదువుకున్నానని చెప్పారు. శ్రీరంగపురంలో జన్మించిన మీరు, హైదరాబాద్ కు వచ్చి చదువుకున్న కారణాన్ని, నేపథ్యాన్ని వివరిస్తారా?

జ:-   సీతారాం బాగ్ లో మా అక్కయ్య గారుండేవారు. మా బావగారు అక్కడ అర్చకులు. 1967 లో బందరులో నా ఎస్ ఎస్ ఎల్ సి పూర్తయింది. సెలవుల్లో మా అక్కయ్య వాళ్ళింటికి వచ్చాను. పక్కనే కాలేజీ ప్రాకారం పెద్దగా ఉండేది. సాయంత్రం అయ్యేసరికి పిల్లలంతా బయటకు వచ్చి సంస్కృతంలో మాట్లాడుకుంటుంటే నేను ముందే అమరకోశం వంటివి నేర్చుకొని ఉండడం వల్ల వాళ్ళతో మాట్లాడేవాడిని. వాళ్ళందరినీ చూసి నాకూ ఇక్కడే చదువుకోవాలనిపించింది. అదే విషయం ఇంట్లో చెప్పి ఇక్కడ కాలేజీలో చేరాను. ‘శ్రీ వేంకటేశ్వర వేదాంత వర్ధిని’ సంస్కృత కళాశాలనే సీతారాం బాగ్ కాలేజీ అంటారు. మరింగంటి శ్రీరంగాచార్య గారు, బంగీపురం రామాచార్యులు గారు, సముద్రాల శ్రీనివాస శర్మ గారు, వర్ఖేడ్ గారు వంటి మహామహులు బోధించిన జ్ఞానంలో లేశమాత్రమైనా అబ్బింది. భారతదేశంలో ముఖ్యంగా మన ఉభయరాష్ట్రాల్లో గొప్ప వ్యవస్థ అది. అట్లా హైదరాబాద్ కు చేరుకున్న నాకు ఇక్కడ ఎంతోమంది మిత్రులు ఏర్పడ్డారు. ఆ కళాశాలలో చదువుకోవడం నా అదృష్టంగా భావిస్తాను. అందుకే నాకు వచ్చిన నగదు బహుమతిలో కొంత ఆ కళాశాలకు ఇచ్చాను.

6ప్ర:- మీరు రాసిన ‘శ్రీ గాయత్రీ రామాయణాలు- ఆంద్రవ్యాఖ్య’ గురించి తెలపండి.

జ:-  శ్రీ గాయత్రీ రామాయణాలు రెండు ఉన్నాయమ్మా. మనకు ఒకటి మాత్రమే తెలుసు. 24 శ్లోకాలతో ఒకటి ఉంటుంది. దాని క్రింద వ్యాఖ్యానంలో ఇంకో 24 శ్లోకాలను చూపించారు. నేనూ అవీ ఇవీ రెండూ రాసి దానికీ దీనికీ ఉన్న భేదమేమిటి? ముందు శ్లోకాలు, వెనుక శ్లోకాలు వాటి భావాలు తీసుకొని ఒక్కో బీజాక్షరాన్ని అది బీజాక్షరం ఎందుకైందో వివరిస్తూ విజయనగరంలో ఉన్నప్పుడు రాశాను. మా గురువుగారు మహనీయమూర్తి కృష్ణయాజి గారు. రాయడం పూర్తి చేసి “ఇవాళ గురువు గారి దగ్గరకు వెళ్లి ఇది చూపించి ఇరవై నాలుగు బీజాక్షరాలకు సంబంధిత దేవతా చిత్రాలతో ముఖచిత్రం వేస్తే బాగుంటుందని అడగాలి” అనుకొని వెళ్ళాను. నమస్కారం చేసి నేను కూర్చోగానే ఒక అట్ట తీసి ఇచ్చి చూడమన్నారు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం అంటే మీరు నమ్మరు. నేను ఏది అనుకొని వెళ్ళానో అదే చిత్రం అట్ట పైన ఉంది. “ఇదే కదా! నువ్వు అనుకున్నది!” అన్నారు నవ్వుతూ. అంతటి మహానుభావులు ఆయన. ఈ మధ్య ఎవరో ప్రముఖుడు ఒక ఇంటర్వ్యూలో భారతదేశంలోని గొప్పవాళ్ళలో ఒకరిగా కృష్ణయాజి గారిని పేర్కొనడం విశేషం. ఆయనకు నేను శిష్యుడిని కావడం, ఆయన అనుగ్రహాశీర్వాదాలను అందుకోవడం నా సుకృతం.

7ప్ర:- మీరు రచించిన ‘పరిష్కార నక్షత్రం’ లో వేటికి సంబంధించిన పరిష్కారాలు సూచించారో తెలపండి.

జ:-  నా రచనలన్నీ ఒక ప్రత్యేకతతో కూడుకొని ఉంటాయి. ఇందులో కాళిదాసు శ్లోకాలను వివరించాను. అది ఎట్లాగంటే ఒక వ్యక్తిని పాత్రగా ‘సందేహి’ అనే పేరు పెట్టాను. అతనికి కొన్ని సందేహాలు వచ్చినట్టు, అతనికి కాళిదాసు ఎదురై తన కావ్యాలలోని శ్లోకాలతోనే సందేహాలు తీర్చినట్టు చెప్పాను. ఉదా:- సందేహి:- “మా బంధువు ఒకాయన ఉన్నాడండీ. అతనికి దుర్లక్షణాలు ఉన్నాయి. అతడిని దగ్గరకు తీయాలా? దూరంగా ఉంచాలా?” అని అడుగుతాడు. అప్పుడు
కాళిదాసు:- “నాయనా! నేను రాసిన ‘రఘువంశం’ లో “ద్వేష్యోఽపి సమ్మతః శిష్టః తస్యార్తస్య యథౌషధం త్యాజ్యో దుష్టః ప్రియోఽప్యాసీదంగుళీ వోరగక్షతా” అనే శ్లోకం ఉంది కదా! అది చదువు. పాము మన కాలి వేలును కాటేస్తే అది మనదేనని విషాన్ని భరిస్తామా? వేలును తెగ్గొట్టేస్తాం కదా! అట్లాగే దుష్టుడైతే నీవాడైనా వదిలేయ్. శత్రువు మంచివాడైతే గౌరవించు. అని శ్లోకాన్ని ఉదాహరణగా చెబుతూ అటు శ్లోకం, ఇటు భావం, సందేహ నివృత్తి అన్నీ వచ్చేటట్లు రాశాను. ఆ విధంగా నక్షత్రాలు ఇరవై ఏడు కాబట్టి, ఇరవై ఏడు సందేహాలు, వాటికి కాళిదాసు కావ్యాలలో ఆ సందర్భానికి తగిన శ్లోకాన్ని ఉటంకిస్తూ పరిష్కార మార్గాన్ని సూచిస్తూ రాశాను. అది చిన్న పుస్తకమే అయినా రెండు ప్రింట్లు పూర్తి చేసుకోవడమే కాక సంస్కృతంలో కూడా తయారవుతోంది. హిందీలో కూడా ఒకాయన రాశారు.

8ప్ర:-  ‘నవరస రూపకమ్’ పుస్తకంలో మీరు చెప్పినదేమిటి?

జ:-  విజయనగరం, మహారాజ ప్రభుత్వ సంస్కృత కళాశాలలో కావ్యప్రకాశం, రస గంగాధరం, ధ్వన్యాలోకం, దశరూపకం పాఠాలు చెబుతుంటే అసలు కావ్యం, రసం, నాటకం గురించి సమగ్రమైన వివరణలతో తెలుగులో ఒక గ్రంథం ఉంటే బాగుండుననిపించింది. దేశికోత్తములు బ్రహ్మశ్రీ ఆచార్య వేదుల సుబ్రహ్మణ్యం గారు నన్నే ఆ పనికి  పూనుకొనమని మార్గాన్ని సూచించారు. ఇందులో నవరసాలు వాటి గొప్పతనమే కాకుండా మనకు ‘దశరూపకాలు’ ఉన్నాయి కదా! వాటికి ఉదాహరణలుగా ఏ పుస్తకాలున్నాయో సేకరించాను. వాటి గురించిన వివరాలన్నీ అందులో చేర్చాను. ‘సమవాకార’ రూపకం గురించి రెండేళ్లు తిరిగాను. మైసూరు లైబ్రరీలో ఉందని తెలిసి అక్కడకు వెళ్లి ఆ పుస్తకాన్ని చూసి విషయమంతా రాసుకున్నాను. మా గురువు గారు కృష్ణయాజి గారు దానికి పేరు పెట్టడమే కాక ముఖచిత్రంలో భరత మహర్షి చిత్రాన్ని ఆయనే స్వయంగా చిత్రించారు. కావ్యమంటే ఏమిటి? కావ్య లక్షణాలు, దశరూపక లక్షణాలు, నాటకం గురించిన వివరాలు, నాటకంలో వేదికకు ఉండాల్సిన కొలతలు, నటుల వస్త్రాలు, ఆభరణాలు ఎట్లా ఉండాలి? ఆరభటీ మొదలగు వృత్తులు, వాటి ఉత్పత్తి మున్నగు అనేక విషయాలను వివరించాను. సంస్కృతం చదువుకునే వారందరికీ తేలికగా అర్థమయ్యే రీతిలో ఉంటుంది.

9ప్ర:- సంస్కృత పంచకావ్యాలు, తెలుగు పంచ కావ్యాలు కలిపి కూడా ఒక పుస్తకం వేశారు కదా! అదేమిటో దాని గురించి చెప్పండి.

జ:-  అవును. సంస్కృతంలో రఘువంశము, కుమారసంభవము, కిరాతార్జునీయము, శిశుపాలవధ, నైషదీయ చరితము పంచమహాకావ్యాలు. కొందరు నైషదీయ చరితకు బదులు మేఘసందేశం అని చెవుతారు కానీ అది సరి కాదు. అలాగే తెలుగులో  మనుచరిత్ర, వసుచరిత్ర, ఆముక్తమాల్యద, పాండురంగ మాహాత్మ్యము, శృంగారనైషధము పంచమహాకావ్యాలు. శృంగారనైషధము స్థానంలో పారిజాతాపహరణం చెప్తారు. కానీ విశ్వనాథ సత్యనారాయణ గారి భావనలో శృంగారనైషధము తీసుకోబడింది. ఈ పది మహాకావ్యాల గురించి విద్యార్థి లోకానికి కనీసం పరిచయమైనా చేయాలనుకున్నాను. నా మిత్రులైన పదిమంది పండితుల చేత సంస్కృత పంచ మహాకావ్యాలు అయిదు, తెలుగులోని పంచ మహాకావ్యాలు ఐదింటిని గురించి రాయించాను. మొదటి పేజీలో వారందరి బయోడేటాలు, ఫోటోలు వేయించాను. తెలుగులో ఉప పంచ కావ్యాలుగా  ప్రభావతీ ప్రద్యుమ్నము, విజయ విలాసము, పారిజాతాపహరణము, హరవిలాసము, కాళహస్తీశ్వర మాహాత్మ్యము ప్రచారంలో ఉన్నాయి. దీంట్లోనే అనుబంధంగా ఉప పంచ కావ్యాలను గురించి సంక్షిప్తంగా స్వయంగా నేనే రాసి అచ్చు వేయించాను. మూడువందల పేజీలు వచ్చింది.

10ప్ర:- ‘సంస్కృత నవ్య శతావధాని’ అని బిరుదు పొందిన మీరు అవధానంలో నవ్యతను ఏర్పరిచారా? మరో ప్రత్యేకతను ఏమైనా సాధించారా? ఆ విషయాలు చెప్పండి.

జ:-  ‘నవ్య శతావధానం’ అనేది నేను కొత్తగా ఏర్పాటు చేశాను. ఇప్పటిదాకా ఇటువంటిది ఎవరూ చేయలేదు. శతావధానాలున్నాయి కానీ ఇందులో నేను ఒక ప్రత్యేకతను తయారుచేశాను. ఇప్పుడు అవధానాల్లో మీరు గమనిస్తే పద్యం, శ్లోకం చెప్పడం, దాన్ని ధారణ చేయడం. అసలు అవధాని అంటే అర్థం అది కాదు. ఋగ్వేదావధాని, యజుర్వేదావధాని అంటాం. అంటే వాళ్ళు కొత్తగా చెప్పేది ఏమీ ఉండదు కదా! ఉన్నదాన్నే ధారణ చేసి చెప్పడం. కానీ నేను చేసింది వేరు. మహాకవి కాళిదాసు గారి కావ్యాల్లో వంద శ్లోకాలు తీసుకొని ప్రశ్న వేస్తుంటే అవధాన రూపంలో సమాధానం చెప్పడం. కేవలం దానికి సమాధానం చెప్పడమే కాదు. ఆ ప్రశ్నకు కాళిదాసు ఈ సందర్భంలో ఈ కావ్యంలో, ఈ విషయాన్ని ఈ శ్లోకంలో ఇట్లా చెప్పారని వివరించడం. దాని భావంతో సహా తెలుగులోనూ, సంస్కృతంలోనూ చెప్పడం. అడిగే వాళ్లకు ఈ పద్ధతిలో ప్రశ్నలు ఏ విధంగా అడగాలో తెలియదు కాబట్టి నేను ఒక పద్ధతి ప్రకారంగా అవధానం లాగానే దత్తపది, వర్ణన, సమస్య…ఇట్లా పది విభాగాలు చేశాను. ఉదా:- కాళిదాసు రచించిన ఏదైనా ఒక కావ్యంలోని ఏదైనా శ్లోకం లోని నాలుగు పదాలు ఇచ్చి ఈ నాలుగు పదాలు కాళిదాసు ఏ శ్లోకంలో చెప్పాడు అని అడిగితే ఆ శ్లోకాన్ని, దాని భావాన్ని, అది కూడా సంస్కృతంలో చెప్పడం..ఈ విధంగా ఆదికవి వాల్మీకి, వేదవ్యాసుడు, మనువు, భవభూతి, కాళిదాసు, మాఘుడు, భారవి, ఆది శంకరాచార్యులు మొదలగు కవుల కావ్యాలనుండి ఆణి ముత్యాల వంటి నూరు శ్లోకాలను తీసుకొని చేశాను. అందువల్ల నాకు ‘సంస్కృత నవ్య శతావధాని’ అనే బిరుదు ఇచ్చారు. ఇది కొంతమందికి ఆగ్రహం కూడా తెప్పించింది (నవ్వుతూ). దీన్ని ‘సంస్కృత నవ్య శతావధాన సందర్శినీ’ అనే పేరుతో పుస్తకం వేశాను.

11ప్ర:-  ‘జగద్గురు ఆద్య శంకరాచార్య కావ్య శతావధానం’ ప్రత్యేకత ఏమిటి?

జ:-  ఆది శంకరాచార్య శతావధానమని శృంగేరీ పీఠంలో పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి గారి ముందు చేశాను. ఆయన చాలా సంతోషించారు. భారతదేశ వ్యాప్తంగా అనేక సంస్కృత విశ్వవిద్యాలయాల్లో, శంకరాచార్యులు జన్మించిన ‘కాలడి’ లో, చేశాను. అంతేకాక అగర్తల, దేవ ప్రయాగ, ఉజ్జయిని, వారణాసి, ఢిల్లీ, హర్యానా, జైపూర్… ఇట్లా మహాపండితులు ఉన్నచోట వాళ్ళనే పృచ్ఛకులుగా తీసుకొని చేశాను. అయితే ఇందులో ఒక్కొక్క విభాగానికి ఒక్కొక్కరు చొప్పున పది విభాగాలకు పదిమంది  పృచ్ఛకులు. ఒక్కొక్కరికి ముప్ఫయి ప్రశ్నలు ఇచ్చే వాడిని. అందులో వారు ఏదైనా అడగొచ్చు. ఆ విధంగా కావ్యాలలోని 300 శ్లోకాలు, వాటి సందర్భాలు, భావాలు అన్నీ నాకు గుర్తున్నాయి.

12ప్ర:-  అన్నింటిలోనూ ఒక విభిన్న తరహాను ఎన్నుకునే మీరు, సుప్రభాతాలలో కూడా సాధారణమైన వాటికి భిన్నంగా ఏమైనా ప్రత్యేకతను పాటించారా?

జ:- అవునమ్మా! వీటిలో కూడా అందరిలాగా కాకుండా కొంత కొత్తదనాన్ని పాటించాను. నేను రాసిన మొట్టమొదటి సుప్రభాతం శ్రీ కూర్మనాథ సుప్రభాతం. శ్రీ ధర్మ శాస్త్ర సుప్రభాతం, శ్రీకాకుళాంధ్ర మహావిష్ణు సుప్రభాతం, శ్రీ సూర్యదేవ సుప్రభాతం, శ్రీరంగనాయక సుప్రభాతం మొదలగు ఏడు సుప్రభాతాలను రాశాను. సుప్రభాతాలను నేను రాసిన పద్ధతి వేరు. సాధారణంగా అన్ని సుప్రభాతాలలో ఆయా భగవంతుని ఉద్దేశించి, దేవతలందరూ వచ్చారని, పక్షుల కిలకిలరావాలను, భక్తగణ నాట్యాలను, వారి ఆనందాన్ని ఇట్లా వివరించుకుంటూ రాస్తారు. కానీ నేను రాసే దాంట్లో చారిత్రక విషయాలు ఉంటాయి. ఆ ప్రాంతంలో స్థానికంగా ఉన్నటువంటి, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న దేవతల గురించి రాస్తాను. ఉదా:- మా ఊరికి దగ్గర ‘మొవ్వ’ ఉంది. మొవ్వ వేణు గోపాల స్వామి గురించి, అలాగే కూచిపూడి, శ్రీకాకుళం ఉన్నాయి వాటి గురించి రాస్తాను. ఏ సుప్రభాతం రాసినా వాటి గురించే కాకుండా వాటి చారిత్రక నేపథ్యం కూడా వివరిస్తాను. భగవంతుడు గొప్పవాడని చెప్పడమే కాక ప్రజలకు చారిత్రక విషయాలు కూడా తెలియాలని నా ఉద్దేశ్యం. ఏదైనా సమాజానికి ఉపయోగపడాలని నా తాపత్రయం.

13ప్ర:- ‘వృక్ష హితోపదేశః’ లఘు సందేశ కావ్యం గురించి చెప్పండి.

జ:- మా గురువు గారు కృష్ణయాజి గారు విజయనగరం జిల్లాలోని గరివిడి గ్రామంలో శ్రీ సూర్య సదనంలో లోక కళ్యాణార్థం సత్రయాగాన్ని తలపెట్టారు. ఆ యాగానికి శ్రీ అవధూత దత్తపీఠాధిపతులు శ్రీ గణపతి సచ్చిదానంద స్వామివారిని ఆహ్వానించేందుకు సూర్యసదన ఆస్థాన పండితుడినైన నన్ను నియమించారు. అక్కడ నేను శ్రీ ఎన్. కాంతారావు గారితో కిష్కింధావనాన్ని దర్శించిన సమయంలో స్వామివారు స్వయంగా ఉద్యానవన విశేషాలు వివరించి వీటి గురించి శ్లోకాలు రాయండి అన్నారు. ఎంతో సంతోషంగా ‘వృక్ష విలాపః’ అనే శీర్షికతో పధ్నాలుగు శ్లోకాలను రాసి శ్రీ కృష్ణయాజి గారికి వినిపించాను. ఆయన దాన్ని ‘వృక్షోపదేశః’ అని మార్చమని సూచించారు. వృక్షాల వల్ల ప్రయోజనాలు, వాటిని నష్ట పరచుకోవడం వల్ల మానవజాతికి కలిగే దుష్పరిణామాలను వివరిస్తూ రాశాను. విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో శ్లోకాలకు తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ భావాలను కూడా ఇవ్వడం జరిగింది.

14ప్ర:-  మీరు ఇప్పటివరకు రచించిన పుస్తకాలు ఎన్ని? ఇంకా మీ రచనా వ్యాసంగం కొనసాగిస్తున్నారా?

జ:-  నేను ఇప్పటివరకు సంస్కృతం, తెలుగులలో ముప్ఫయి పైగా రచనలు చేశాను. ఇంకా అముద్రితాలు కొన్ని ఉన్నాయి. నా ఊపిరి ఉన్నంతవరకు సమాజానికి ఉపయోగపడే రచనలు చేస్తూనే ఉంటాను. మీరు అడిగిన పుస్తకాలతో పాటు అష్టవిధ ప్రక్రియాః , నవరత్నములు, నవ వ్యాకరణములు, ద్వాదశ మణి మంజూషా, ద్వాదశ మహాయోగినః, వాజపేయి కవితాః (సంస్కృత, ఆంధ్రానువాదౌ), అష్టోత్తర శత ధర్మ సూక్ష్మములు, మహాకవి కాళిదాస కావ్య శతావధాన సంస్పర్శినీ, చమత్కార శతమ్, నిత్యసత్యాలు వంటి రచనలు చేశాను. నా పి హెచ్ డి ‘పురాణేషు వైజ్ఞానిక విశేషాః’ అనే అంశంపై చేశాను. పురాణాలలో ఉండే వైజ్ఞానిక పరమైన విశేషాలు ఇందులో ఉంటాయి. రాసిన ప్రతీ పుస్తకంలో సామాజిక ఉపయోగమే నా ముఖ్య ఉద్దేశ్యం.

రంగాచార్యగారి రచనలు

15ప్ర:- మీరు రచించిన ‘కరతల సంస్కృతమ్’ విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది?

జ:- ఇది విద్యార్థులకు మాత్రమే కాదు. సంస్కృతం నేర్చుకోవాలన్న ఆసక్తి ఉన్నవారందరికీ ఉపయోగపడుతుంది. ఇందులో నాలుగు భాగాలు ఉంటాయి. ప్రథమ భాగంలో సంస్కృత వర్ణమాల నుండి మొదలుకొని మనం నిత్య వ్యవహారంలో ఉపయోగించే వస్తువుల పేర్లన్నీ తెలుపబడ్డాయి. ద్వితీయ భాగంలో తిఙన్తాలు, ఉపయోగపడే ధాతువులు, పరస్మై ఆత్మనే పదులు, అవ్యయాలు, వాక్య పరివర్తనలు మొదలగు అంశాలు ఉంటాయి. తృతీయ భాగంలో వాక్యరచన, సుబంతాలు, సంధి, సమాసాలుంటాయి. చతుర్థ భాగంలో సంస్కృత వాఙ్మయమ్ గురించి, ఇంకా అనేక విషయాలుంటాయి. నా యాభై ఐదేళ్ళ బోధనానుభవాలతో దీన్ని రాశాను. ఇప్పటివరకు మూడు ముద్రణలు పూర్తయినాయంటే దీనికి ఎంత ఆదరణ లభించిందో అర్థమవుతుంది. అందువల్ల నా లక్ష్యం నెరవేరినట్టుగా నేను భావిస్తున్నాను. నేను మహాపండితుల పుస్తకాలకు అభిప్రాయాలు రాశాను. ఉత్తరభారత దేశంలో కూడా అక్కడి పండితులు మన వాళ్ళను ఒప్పుకున్నట్లుగా వాళ్ళ అభిప్రాయాలు రాశారు. నా చేత వాళ్ళ గురించి అభిప్రాయాలు రాయించుకున్నారు. పద్మశ్రీ రమాకాంత్ శుక్లా గారని ఢిల్లీ పండితుడు. …”భాతిమే భారతం..” వంటి ఆయన రచించిన ఎన్నో పాటలు రేడియోలో వచ్చేవి. ఆయన తన రచనలు నాకిచ్చి పాద నమస్కారం చేశారు. నా గొప్పతనం చెప్పడానికి ఇది చెప్పడం లేదు. వాళ్ళు కూడా మనలను అంగీకరించారని చెప్తున్నా. శశిధర్ అని పంజాబ్ కు చెందిన పండితుడు నా చేత ఆయన పుస్తకానికి అభిప్రాయం రాయించుకున్నాడు.

16ప్ర:- విద్యార్థుల కోసం మీరు ఇంకా ఏ విధమైన కార్యక్రమాలు చేశారు?

జ:-  విద్యార్థుల ఉపయోగం కోసం తర్క సంగ్రహము, వ్యాకరణం, ఇంటర్, బి ఏ వాళ్ళకు కావలసిన రీతిలో తయారుచేశాను. వాటికి కూడా ప్రశ్నలు తయారుచేసి అవి ఏ గ్రంథంలో ఉన్నాయో చెబుతూ వాటి భావాలను కూడా వివరించాను. సంస్కృతంలో ‘ఖవ్వాలి’ ప్రక్రియను కూడా ప్రవేశపెట్టి పిల్లల చేత వేయించాను. సంస్కృతంలో హరికథలు, బుర్ర కథలు రాయడమే కాక నేనే చెప్పాను కూడా. “జజ్జనకరి జనారే జనకు జనా జనారే” అనే పాట ఉంది కదా! అదే మాదిరిలో అదే పల్లవితో సంస్కృతంలో పాట రాశాను. సంస్కృత ఉత్సవాల్లో ఢిల్లీ మొదలైన చోట పాడేవాడిని. అందరితో పాడించేవాడిని. “పురాతనేతు కాలేషు అస్మాకం భారతే రాజ భాష రూపేణా సంస్కృతమాసీత్ పశ్య, ఇదానీం తు తస్యాః పరిస్థితి చింతనీయా, జజ్జనకరి జనారే జనకు జనా జనారే, గీత, నృత్య వాద్యాదికమ్ సంస్కృతే కుర్వంతి …….ఆగచ్ఛతి రే బాలా, ధైర్యం మా త్యజ బాలా” (ఉత్సాహంగా పాడుతూ) అని చెప్పి పాడుతుంటే నా చుట్టూ అందరూ మూగి పాడుతుండేవారు. ఈ విధంగా ప్రజలకు ఆకర్షణీయంగా ఉండేలా చేసి మన భాషను కాపాడుకోవాలని తాపత్రయం. సంస్కృతంలో ధ్వన్యాలోకం, రస గంగాధరం, కావ్యప్రకాశం, ప్రతాపరుద్రీయం, అమరకోశం, అలంకారాలు, ఛందస్సు, జయదేవుని చంద్రాలోకం వీటన్నిటినీ ఆన్ లైన్ లో పాఠాలుగా చెబుతున్నాను. అమరకోశం మూడు కాండలు ఏడు నెలలు వరుసగా చెప్పాను. నేపాల్ లోని ఖాట్మండు సంస్కృత విశ్వవిద్యాలయంలో కూడా శిక్షణ ఇచ్చాను. ఆకాశవాణి, దూరదర్శన్ లలో అనేక వ్యాఖ్యానాలు, హరికథలు, బుర్రకథలు, నాటికలు మొదలైన ప్రక్రియలు నిర్వహించాను. నేను నటుడినే కాక కొన్ని నాటకాలకు దర్శకత్వం కూడా వహించాను.

17ప్ర:- వాట్సప్ గ్రూపు కూడా చేసి సంస్కృతం నేర్పిస్తున్నారని విన్నాం. అది ఎట్లా చేస్తున్నారు?

జ:- అవునమ్మా! “నేర్చుకుందామా సంస్కృతమ్” అనే పేరుతో వాట్సప్ గ్రూపు ఒకటి పెట్టాను. దాదాపు 260 మంది సభ్యులున్నారు. నేను ప్రతీరోజు ఆయా రోజుల ప్రత్యేకతను, ఒక శ్లోకాన్ని, దాని భావాన్ని వివరిస్తాను. నాకు వీలైనప్పుడు ఆ గ్రూపులో పెడతాను. సభ్యులు వారి వారి వీలును బట్టి నేర్చుకుంటారు. అందరికీ ఒకే సమయం కుదరదు కాబట్టి ఈ వెసులుబాటు కల్పించాను. గమ్మత్తైన విషయం ఒకటి చెప్తాను. దాని ద్వారా శ్లోకాలు నేర్చుకున్న నా శిష్యులు వాళ్ళు వాళ్ళ మిత్రులకు ఇట్లా పంపుతుండగా, ఒకాయన తాను నేర్చుకున్నవి వీడియో తీసి నాకు పంపి “మీ ద్వారా ఇట్లా శ్లోకాలు నేర్చుకున్నాం గురువుగారూ!” అని అనడం ఎంతో సంతోషాన్ని, సంతృప్తినీ ఇచ్చింది. మనం చేసే పని పదిమందికి ఉపయోగపడడమే కదా కావలసింది. అంతకన్నా గొప్ప విషయం ఏముంటుంది? అవన్నీ కలిపి ఒక పుస్తకం కూడా వేయాలనే ఆలోచన కూడా ఉంది.

18ప్ర:- చివరగా…వర్తమాన కాలంలో ఆధునిక భావజాలాలతో ఉన్న బాల బాలికలు సంస్కృతం నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారా?

జ:-  అది మనం చెప్పేదాన్ని బట్టి ఉంటుంది. అదేదో ఒక భాషగా, అర్థం కాని విషయంగా చెప్పకూడదు. మనం తెలుగులో మాట్లాడే అన్నం, గృహం, శరీరం, ముఖం, నేత్రం, రక్తం ఇవన్నీ సంస్కృతాలే. ఇది తెలియక వేరే భాష అనుకొని భయపడతారు. ఇంగ్లీషులోని కఠిన పదాలు పలకడం లేదా? అవి ఎట్లా వస్తున్నాయి? పిల్లలు ముత్యాల వలె స్వచ్ఛమైన వారు. మనం చెబితే నేర్చుకుంటారు. ఇది మన భాష అని చెప్పకుండా పరభాషను బలవంతంగా నేర్పిస్తూ దీన్ని పరభాషగా వాళ్ళల్లో ముద్ర వేశాం. అందుకే నేను దేశవ్యాప్తంగా వంద సంభాషణా శిబిరాలు పెట్టి సంస్క్రతం నేర్పిస్తున్నాను. మన విద్యా వ్యవస్థను మెక్ డోనాల్డ్, మాక్స్ ముల్లర్ వంటి వారు నాశనం చేశారు. అందువల్ల మన మూలాలను కాపాడుకునే ప్రయత్నంలో నా వంతు కృషి చేస్తున్నాను. “ఆనో భద్రా క్రతవో యంతు విశ్వతః” అని ఋగ్వేదంలో ఉంది. అంటే “విశ్వం నుంచి అన్ని విషయాలు నన్ను చేరుగాక” అని అర్థం. ఇట్లా కోరుకునే భాష సంస్కృతం ఒక్కటే. దానివల్ల మనిషి సంస్కరించబడతాడు. కాబట్టి అటువంటి భాషను మనం కాపాడుకోవాలి.

చాలా సంతోషం సార్! మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి సాహిత్యరంగంలో మీ నిర్విరామకృషిని మా పాఠకులకు తెలియజేసినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున శతకోటి ధన్యవాదాలు
సెలవు.

September 28, 2025 4 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni September 28, 2025
written by Narendra Sandineni

మానస చామర్తి పంచుకున్న పుస్తకం కవిత
అనుభూతి కవిత్వం ఓ విశ్లేషణ
ప్రముఖ కవయిత్రి,మానస చామర్తి కలం నుండి జాలువారిన పంచుకున్న పుస్తకం కవిత పై విశ్లేషణా వ్యాసం.ఇది కేవలం ఒక పుస్తకం గురించి చెప్పడం కాదు.తాను పొందిన అనుభూతులను పంచుకోవడం,స్నేహ సంబంధాల స్ఫూర్తిని ప్రతిబింబించేలా ఉంది.ఇది ఒక వ్యక్తి తనకు నచ్చిన వారితో పుస్తకాన్ని పంచుకోవడాన్ని తెలుపుతుంది. తనకు ఎంతో ఇష్టమైన పుస్తకాన్ని ఇతరులతో పంచుకుంటే చెప్పలేనంత హాయిగా ఉంటుంది.ఈ కవిత భావోద్వేగాలతో కూడి హృదయాన్ని తట్టి లేపుతుంది.ఇది పుస్తకాన్ని గురించి మాత్రమే కాకుండా ఆ పుస్తకం కలిగించిన అనుభూతుల్ని,తన ఎదలో కలిగిన భావాలను,జ్ఞాపకాలను ఇతరులతో పంచుకోవడం ద్వారా ఏర్పడే తృప్తిని గుర్తు చేస్తుంది.
“ఒకరు చదివి ఇచ్చిన పుస్తకం/గుళ్ళో ఇచ్చిన ప్రసాదాన్ని మిగిల్చి/ఇష్టమైన వాళ్ల కోసం ఇంటికి తేవడం లాంటిది/అంటున్నారు.పుస్తకం చదివిన తర్వాత మనసులో ఒక చెప్పలేని అనుభూతి కలుగుతుంది.అందులోని విజ్ఞానాన్ని,ఆనందాన్ని ఇతరులతో పంచుకోవాలి అనే ఆకాంక్షను కలిగిస్తుంది.ఒకరు చదివి ఇచ్చిన పుస్తకాన్ని ఆ వ్యక్తి ఎంతో ఇష్టంగా చదివి,ఆస్వాదించి,విలువైనదిగా భావించి మనతో పంచుకుంటున్నాడు.అతను పుస్తకం చదివిన తర్వాత తనలో కలిగిన అనుభూతిని ఇతరులతో పంచుకోవడం సామాన్యమైన విషయం కాదు.అది అసాధారణమైన పుస్తకం అయి ఉంటుంది.ఒకరు చదివిన పుస్తకాన్ని మనకు ఎందుకు ఇస్తాడు? అందులో ఏదో మతలబు ఉంది.ఆ పుస్తకంలోని సంగతులు ఏమిటో తెలుసుకోవాలి అనే కుతూహలం కలగడం సహజమే.అది కేవలం పుస్తకం కాదు ఆ వ్యక్తి మనసుకు నచ్చిన దానిని తాను ఇతరులతో పంచుకోవడాన్ని తెలుపుతుంది.
ఒకరు దేవాలయంలో ఇచ్చిన ప్రసాదంలో కొంత భాగాన్ని ప్రియమైన వారి కోసం తీసుకువెళ్లడం,వారి పట్ల గల ప్రేమకు,శ్రద్ధకు నిదర్శనమని చెప్పవచ్చు. దేవుని ప్రసాదం తింటే పుణ్యం లభిస్తుంది అని నమ్ముతారు.దేవాలయంలో ప్రసాదం అందించినప్పుడు దానిలో కొంత భాగం తినకుండా మనకు నచ్చిన వారి కోసం ఇంటికి తీసుకురావడం, ఇది ఒక ఆదరణ,అనుబంధానికి సూచికగా భావిస్తారు.అలాగే పుస్తకాన్ని చదివిన వారు దానిని మరొకరికి ఇవ్వడం కూడా ఆ పుస్తకంలోని ఆనందాన్ని,విలువను పంచుకోవాలన్న వారి మంచి సహృదయతను సూచిస్తుంది.ఒకరు చదివిన పుస్తకాన్ని మనతో పంచుకోవడంలో వారు దానిని ఎంతో విలువైనదిగా భావించి,మనకు అదే ఆనందాన్ని పంచాలి అనే ప్రయత్నం కనిపిస్తుంది. అది ఒక ఆత్మీయతను,ఆదరణను,మానవ సంబంధాలలోని ప్రేమను కనబరిచే స్వభావాన్ని వ్యక్తం చేస్తుంది.తాను చదివిన విజ్ఞానాన్ని ఇతరులతో పంచుకోవడంలో ఉన్న ఆనందాన్ని సూచిస్తుంది.మన భారతీయ సంస్కృతిలోని పంచుకోవడం అనే సాంస్కృతిక విలువను నొక్కి చెబుతోంది.ఒకరు తాను అనుభవించి దాని సారాన్ని ఇతరులతో పంచుకోవడం అనేది ప్రేమను, అనురాగాన్ని చూపిస్తుంది.ఈ కవితా పంక్తులలో పుస్తకాన్ని పంచుకోవడాన్ని,గుడిలో పెట్టిన ప్రసాదాన్ని ఇంటికి తీసుకు వచ్చి పంచుకోవడాన్ని పవిత్రమైనదిగా భావించారు.ఇందులో పంచుకోవాలి అనే గొప్ప మనసు,ప్రేమ వంటి భావాలను సున్నితంగా హృద్యంగా చెప్పిన తీరు బాగుంది.
“తోక చుక్క రాలి పడుతుంటే/పక్కనున్న వాళ్ళని తట్టి చూపించడం లాంటిది/అంటున్నారు. ఆకాశంలో ఒక అద్భుతమైన,అరుదైన సంఘటన జరుగుతోంది.విశాల విశ్వంలో తోకచుక్క ఒక అద్భుత విశేషం.మనం ప్రపంచంలో జరిగిన ఒక అద్భుతాన్ని గుర్తించి చూసిన వెంటనే పక్క వాళ్ళకి చూపించాలి,వారితో పంచుకోవాలి అనే తహతహ, సహజమైన అనుభూతి, ఉత్సాహాం ఇందులో కనిపిస్తుంది.ఆకాశంలోని అద్భుతమైన దృశ్యాన్ని చూడటమే కాక గొప్ప క్షణాల్ని పక్కవారితో కూడా పంచుకోవాలి అనే మనిషిలోని ఆతృతను తెలియజేస్తుంది.అనంతమైన ఆకాశంలో వేనవేన చుక్కలు కనిపిస్తాయి.తోక చుక్క ఆకాశంలో అరుదుగానే కనిపిస్తుంది.ఆ తోకచుక్క రాలి పడుతుండగా చూడడం,ఒక వింత అనుభూతి. అటువంటి గొప్ప అనుభూతిని ఒంటరిగా కాకుండా పక్కవారితో పంచుకోవాలి అనిపిస్తుంది కదా?అదే భావన పుస్తకం చదివినప్పుడు కలుగుతుందని చెప్పడం గొప్పగా ఉంది.
“దూరాలనున్న ప్రేమికులు ఫోన్ లో కబుర్లాడుకుంటూ/చందమామను ఇప్పుడే చూడమని/గుసగుసలాడడం లాంటిది/ అంటున్నారు.ఈ కవితా పంక్తులు దూరంగా ఉన్న ప్రేమికుల మధ్య ఉండే భావోద్వేగాన్ని తెలుపుతుంది.వారు ఒకే చోట లేకపోయినా ఒకే సమయంలో ఆకాశంలోని చందమామను చూస్తూ భావోద్వేగాలను పంచుకుంటారు.ఇది వారి మధ్య గల అనుబంధానికి సంకేతం.ప్రేమికులు దూరంగా ఉన్నా ఫోన్ లో మాట్లాడటం వల్ల దగ్గరగా ఉన్న అనుభూతి కలుగుతుంది.గుసగుసలాడడం అనే భావన అంతరంగిక మధుర సంభాషణల స్వభావాన్ని చూపిస్తుంది.ఇది బహిరంగంగా చెప్పే మాటలు కావు.మనసు విప్పి గుసగుసలాడుకోవడం.ప్రేమికుల మధ్య దూరం ఉన్నప్పటికీ ఒకే సమయంలో ఒకే దృశ్యం అయిన చందమామను చూపిస్తూ అనుబంధాన్ని పంచుకుంటున్నారు అనే గొప్ప భావాన్ని వ్యక్తం చేశారు.ఇది ప్రేమలోని లోతును,మౌన సంభాషణల మాధుర్యాన్ని మరియు దూరాన్ని దాటి చేరే మనుషుల బంధాన్ని చక్కగా చూపిస్తుంది.ఇద్దరు ప్రేమికులు,దగ్గరగా లేరు.అతను,ఆమె దూరంగా వేరు వేరు ప్రదేశాల్లో ఉన్నారు.అయినా వారు ఇప్పుడు కలిసి తిరిగే అవకాశం లేదు.వారిరువురు ఫోన్ లో సంభాషిస్తు చందమామను ఇప్పుడే చూడమని చెవిలో చెప్పి గుసగుసలాడడం ఊహకు అందనిది.ప్రేమికులు ఇద్దరు దూరంగా ఉన్నా ఒకే సమయంలో ఒకే విషయాన్ని చూడాలి అని కోరుకుంటారు.అలాగే చదివిన పుస్తకంలోని అనుభూతిని ఇతరులతో పంచుకోవాలి అనిపించడం సహజమే.

“వాళ్లు కలిసి గుర్తు చేసుకోవాలనుకునే/తీపి జ్ఞాపకం లాంటిది/అంటున్నారు.అతను మనతో పంచుకున్న పుస్తకం ఒక మధురమైన జ్ఞాపకం.ఆ పుస్తకంలోని అనుభూతులను పంచుకొని తిరిగి చూసుకునే మధుర క్షణాలను ఎంతో ప్రాధాన్యత ఉన్నదని చెప్పవచ్చు.
“ఒకరు చదివి గుర్తులు పెట్టి ఇచ్చిన పుస్తకం/ నీలాంటి ఎవరో నీ కలలోకి రావడం లాంటిది/ అంటున్నారు.ఒకరు తన ఆలోచనలు,భావనలు, ఆకర్షణలు,గుర్తులు చెప్పి అందించినప్పుడు,అది మనం ఊహించని విధంగా మన హృదయాన్ని తాకుతుంది.అతను పుస్తకాన్ని చదివినప్పుడు కలిగిన భావోద్వేగాలను, గుర్తులు పెట్టిన పేజీలను చూడగానే ఎందుకో తెలియదు మనం కూడా ఆ భావంలో లీనం అయిపోవడం సహజంగానే జరుగుతుంది.అప్పుడు మనం ఆ పుస్తకాన్ని ఒంటరిగా చదివినట్లుగా ఉండదు.ఎవరో మనతో పాటు కలిసి చదివినట్లుగా అనిపిస్తుంది.
“అనూహ్యంగా ఎవరో నీ గుప్పెట్లో పెట్టి/మూసిన ప్రేమ లేఖ లాంటిది/అనుకోని ప్రయాణంలో కలిసి/ అదాటున మనసుకు దగ్గరైన స్నేహం లాంటిది/ అంటున్నారు.అతను,ఆమెతో పంచుకున్న పుస్తకం ఓ ప్రేమ ప్రబంధంలా మారుతుంది.అందులోని అక్షరాలు దాని వెనుక ఉన్న వ్యక్తి మనసే ముఖ్యం అనిపిస్తుంది.ఈ పుస్తకం ఒక ప్రేమ లేఖలా మారి మనుషులను దగ్గర చేసే సాధనంగా మారుతుంది. అనుకోకుండా జరిగిన ప్రయాణంలో ఇద్దరు కలిసిపోవడం,జీవితంలో జరిగే ఒక యాదృచ్ఛిక సంఘటనలకు సంకేతం.కొన్ని పరిచయాలు, బంధాలు ఆకస్మాత్తుగానే మొదలవుతాయి.ఆ యాదృచ్ఛిక పరిచయం తర్వాత ఏర్పడిన అనుబంధం,మన మనసుకు హత్తుకొని గాఢమైన స్నేహంగా మారుతుంది.ఒక చిన్న సంఘటన వల్ల ఏర్పడిన అనుకోని పరిచయం జీవితంలో నిలిచిపోయే విలువైన స్నేహంగా రూపు దాల్చడం సహజం.ఈ కవితా పంక్తులు అందమైన యాదృచ్ఛికాల గురించి చెబుతున్నాయి.ఒక అనుకోని ప్రయాణం వల్ల కలిగిన పరిచయం మనసుకు ఎంతో దగ్గరైన స్నేహంగా మారి మన జీవితానికి కొత్త అర్థాన్ని,కొత్త బంధాన్ని ఏర్పరుస్తుంది.మనిషి జీవిత ప్రయాణం ముందే లిఖించబడిన గ్రంథం లాంటిది.కానీ,దానిలో కొన్ని పేజీలు అనుకోని సంఘటనలతో రాసి ఉంటాయి.ఆ సంఘటనల్లో ఒకటి – యాదృచ్చిక పరిచయం. కవయిత్రి చెప్పినట్లు ఒక అనుకోని ప్రయాణంలో కలిసిన అనుబంధం మనసుకు హత్తుకునే స్నేహంగా పరిణమిస్తుంది.ఇది ఒక రకంగా హృదయానుభూతి. స్నేహానికి మనసును కదిలించే శక్తి ఉంది.ఆ స్నేహం కూడా చాలా సార్లు ముందుగా నిర్ణయించబడింది కాదు.అది అనుకోకుండా జీవిత మార్గంలో దొరికే ఒక వరం.ఇది కవిత్వంలో అనూహ్యత అనే సౌందర్యాన్ని ప్రతిబింబిస్తోంది.ఒక యాదృచ్ఛిక పరిచయం ఆత్మీయ స్నేహంగా మారడాన్ని అద్భుతంగా చూపించారు.
“చిట్టి పిట్ట మృదుత్వం నీకు అనుభవమవ్వడానికి/దాని ఈకనొకరు నీ చెంపల మీద రాయడం లాంటిది/అంటున్నారు.ఇక్కడ ఒక చిన్న పిట్ట యొక్క మృదుత్వం నేరుగా అనుభవించ లేని ఒక గుణం.దానిని మనకు స్పష్టంగా అర్థమయ్యే విధంగా కవయిత్రి పిట్ట ఈకను చెంపపై రాయడం అనే సన్నివేశంతో పోల్చింది.దీని వల్ల మృదుత్వం అనే భావనకు స్పష్టమైన అనుభూతి లభించింది. మృదుత్వాన్ని ఒక గుణంగా కాకుండా స్పర్శ ద్వారా కలిగే అనుభూతిగా చూపించారు.చిట్టి పిట్ట అనే పదాల ద్వారా చిన్నతనం,అమాయకత్వం, సహజత్వం వ్యక్తం అవుతున్నది.ఈక అనే పదం ద్వారా సున్నితత్వం,లేతదనం ప్రదర్శించబడినది. చెంపపై రాయడం వల్ల మనిషి అనుభవించే మృదుత్వానికి హృద్యమైన రూప కల్పన ఇది.
ఇది మృదుత్వం అనే భావనను స్పర్శగా మార్చి పాఠకునికి అనుభవం అయ్యేలా చేసిన కవితా సంపద.పుస్తకం చదివిన అనుభూతి,సున్నితత్వం కలిగిన మన హృదయాన్ని చలింప జేస్తుంది.
“ఒకరు చదివి,చదవమని ఇచ్చిన పుస్తకం/ జగమంతా తిరిగినా తరిగిపోని/జాబిలి తునక వెలుగు లాంటిది/ఆ అనుభవం/అంటున్నారు. పుస్తకం చదివిన అనుభవం చిరకాలం మనసులో గుర్తుగా మిగిలి పోతుంది.అది మానవీయ సంబంధాల్లో మృదువుగా,శాశ్వతంగా మనలో నిలిచే అనుభూతిని కలిగిస్తుంది.పుస్తకాన్ని
ఎవరో ఒకరు చదివి మనకు అందజేయడం,వారి మనసులో కలిగిన వెలుగును మన చేతిలో పెట్టినట్టే.ఆ వెలుగు ఎప్పటికీ తరిగిపోదు.ఎందుకంటే పుస్తకాన్ని చదివిన అనుభవం మనలో ఎప్పటికీ నిలిచి ఉంటుంది.జాబిల్లి వెలుగు ఎప్పుడు మన కోసం అందంగా,మృదువుగా,శాశ్వతంగా ఉంటుంది‌.ఒక మంచి పుస్తకం నుంచి వచ్చిన జ్ఞానం,అనుభవం కాల గమనానికి లోబడదు.అది ఆనందాన్ని ఇస్తుంది.పుస్తక జ్ఞానం వల్ల మనసు తేలిపోతుంది.ఎందుకంటే పుస్తకం మనం ఎరుగని లోకాల వైపు నడిపిస్తుంది.పుస్తకం ప్రేరణను ఇస్తుంది.ఎందుకంటే ప్రతి పుస్తకం వెనుక ఒక అమూల్యమైన జీవితం ఉంది.ఒకరు చదివి మనకు ఇచ్చిన పుస్తకం అది కేవలం వస్తువు కాదు.అది ఇద్దరిని కలిపే చక్కని బంధం అని చెప్పిన తీరు బాగుంది.
“ఈ లోకంలో సూర్యోదయాలను చూడటానికి/దగ్గరి మిత్రులు కలిసి సముద్రాలకు వెళ్లడం లాంటిది/ అంటున్నారు.ఈ లోకంలో సూర్యోదయాలను చూడటానికి దగ్గరి మిత్రులు కలిసి కన్యాకుమారి సముద్రాల తీరాలకు వెళ్లడం పరిపాటి.మానవ జీవనంలో స్నేహం మరియు సౌందర్యాస్వాదన అనే రెండు విలువలు ఇందులో ఒకే సమయంలో ప్రతిబింబిస్తున్నాయి.సూర్యోదయం మానవ జీవనంలో కొత్త ఆరంభాలకు,ఆశలకు సంకేతం.అది చీకటిని తొలగించి వెలుతురు నింపే గొప్ప క్షణం. కాబట్టి సూర్యోదయాన్ని చూడడం కొత్త దారులను, కొత్త ఆశలను దర్శించడంగా భావించవచ్చు. సముద్రం విస్తారమైనది,లోతైనది.ఇది మానవ హృదయంలోని లోతైన భావాలను ప్రతిబింబిస్తుంది. సముద్ర తీరంలో సూర్యోదయాన్ని చూస్తూ అద్భుతమైన క్షణాలను గడపడం ఉల్లాసంగా ఉంటుంది.సూర్యోదయాన్ని చూడటానికి ఒంటరిగా వెళ్లడం కాకుండా సహచరులతో వెళ్లి చూడడం జీవిత సౌందర్యానికి కొత్త అర్థాన్ని ఇస్తుంది.స్నేహం అనేది జీవితపు ఆనందాలను మరింత పుష్కలంగా అనుభవించడానికి తోడ్పడుతుంది. జీవితంలో సౌందర్యాలను ఆస్వాదించడం మాత్రమే కాదు‌.వాటిని దగ్గరి మిత్రులతో పంచుకోవడం ద్వారా మనసు మరింత తృప్తిని పొందుతుంది.పుస్తకం చదవడం, దానిని పంచుకోవడం అనేది ఒక మంచి అనుభవం.అది సూర్యోదయాన్ని కలిసి చూసే మిత్రుల అనుభూతిలా ఉంటుంది.
“ఎగసే ఒక సంతోష కెరటానికి ఎదురెళ్ళి/ ఇద్దరు మనుషులు నిలువెల్లా తడిసిపోవడం లాంటిది/అంటున్నారు.ఈ కవితా పంక్తులు కేవలం ఒక దృశ్యాన్ని మాత్రమే కాకుండా లోతైన అనుభూతిని సూచిస్తున్నాయి. ఇక్కడ కెరటం అనేది ప్రకృతి వైభవం మాత్రమే కాదు.ఒక భావోద్వేగపూరితమైన ఉప్పెన.సంతోషం అనేది ఒక తాత్కాలిక తరంగంలా వస్తూ పోతూ ఉంటుంది.కానీ, అది ఎగసినప్పుడు ఎదురెళ్ళిన వారిని సంతోషసాగరంలో ముంచెత్తుతుంది.ఒకరికి ఒకరు ఎదురెదురుగా ఉన్నా ఇద్దరు వ్యక్తులు ఒకే కెరటంలో తడవడం వల్ల పంచుకునే ఆనందం హాయిగా ఉంటుంది. ఇది వ్యక్తికి పరిమితం కాకుండా కలిగిన సామూహిక అనుభవం,సంతోషం ఎవరి వద్ద ప్రారంభమైనా అది పంచుకున్నప్పుడు మరింత పరిపూర్ణం అవుతుంది.ఇది నిలువెల్లా తడిసిపోవడం యొక్క గాఢతను తెలుపుతుంది. శరీరం మొత్తం తడిసినట్లే మనసు మొత్తం ఆనందంలో ముంచెత్తబడింది అనే గొప్ప అనుభూతిని సూచిస్తుంది.ఇది జీవితంలో ఒక క్షణ కాలమైనా కొత్త వెలుగుతో నింపుతుంది.పుస్తకం చదవడం ద్వారా వచ్చిన అనుభవం ఇద్దరిని భావోద్వేగాల వర్షంలో తడిపేస్తుంది.అదే నిజమైన అనుభూతిని పంచుకోవడం.ఈ కవితా పంక్తులు ఒక సన్నివేశాన్ని చూపుతూ మనస్సులో కలిగే సంతోషాన్ని ప్రతిబింబిస్తున్నాయి.ఇది కేవలం ఒక క్షణ కాలపు ఆనందం కాదు.పంచుకున్న భావన వల్ల పది రెట్లు పెరిగిన జీవనోత్సవం ఇది. ఒకరు చదివి ఇచ్చిన పుస్తకం అనే విషయాన్ని ఒక మానవీయ అనుబంధానికి ప్రతీకగా చూపించారు.పుస్తకం మార్పు నొంది ప్రేమ,స్నేహం,సంభాషణ,జ్ఞాపకాలు, అనుభూతులు అన్నిటిని పంచుకుని సాధనంగా ఉపయోగపడుతుంది.ప్రేమతో మానవీయతతో అనుభూతులతో నిండిన పుస్తకాన్ని పంచుకోవడాన్ని ఈ కవిత చాలా అందంగా ప్రదర్శిస్తుంది.పుస్తకం అంటే కథ కాదు.అది ఒక అనుబంధం.ఒక మధుర జ్ఞాపకం.ఒక ప్రేమ లేఖ.ఒక మనసుకు స్పృశించే అనుభూతిగా చెప్పవచ్చు.ఒకరు చదివి ఇచ్చిన పుస్తకం అనే అనుభవాన్ని అనేక దృశ్యాల ద్వారా ఉపమానాల ద్వారా కవిత్వ రూపంలో వివరించడం జరిగింది.ఇది సాహిత్య రీతిలో ప్రతీకాత్మక శైలికి దగ్గరగా ఉంటుంది.గుడిలో ఇచ్చే ప్రసాదాన్ని మిగిల్చి తెచ్చి పంచిన విధంగా పుస్తకం కూడా ఆనందాన్ని పంచుకునే దైవీయ అనుభవంగా ఉద్దేశింపబడింది. ఇందులోని భాషా విన్యాసం సాధారణమైనది.కానీ, దానిలోని భావుకత కవిత్వానికి ప్రాణం పోసింది.ఒకే భావాన్ని అనేక రూపాల్లో చెప్పడం బాగుంది.పుస్తకం అనే వస్తువును జ్ఞాన సాధనంగా కాకుండా,భావ సంబంధాలను కలిపే వంతెనగా చిత్రీకరించారు.ఇది ఆధునిక సాహిత్యంలో వ్యక్తిగత అనుభూతుల కవిత్వపు శైలికి దగ్గరగా ఉంది.ఒకరు చదివి ఇచ్చిన పుస్తకం కవయిత్రి దృష్టిలో మానవ సంబంధాల చిహ్నం.అది ప్రేమకు,స్నేహానికి ప్రతీక.జీవితంలోనీ చిన్న చిన్న ఆనందాలకు ప్రతిరూపం.ఇందులోని ప్రతి ఉపమానం,ఆ అనుభవాన్ని మరింత లోతైన మమకారభరితమైన స్థాయికి తీసుకు వెళ్తుంది. సాహిత్యం అనేది మనసులోని అనుభూతులను అందమైన భాషా రూపాల్లో వ్యక్తపరచడం.ఒక్క చిన్న అనుభవం కూడా కవి హృదయంలో విస్తారమైన దృశ్యాలుగా వికసిస్తుంది.ఇక్కడ ఒకరు చదివి ఇచ్చిన పుస్తకం అనే భావం సాధారణ జీవితానుభవమే అయినప్పటికీ కవయిత్రి దృష్టిలో అది అమూల్యమైన ఆత్మీయతకు,స్నేహానికి,ప్రేమకు, జ్ఞాపకాలకు ప్రతీకగా రూపాంతరం చెందింది.ఈ కవితా పంక్తులలో పుస్తకాన్ని కేవలం జ్ఞానం అందించే సాధనంగా కాకుండా అనుభూతులను పంచుకునే వస్తువుగా వర్ణించారు.తోకచుక్క రాలి పడుతుంటే పక్కనున్న వాళ్ళని తట్టి చూపించడం లాగా పుస్తకం పంచుకోవడంలో ఉత్సాహం ఉట్టిపడుతుంది.దూరాన ఉన్న ప్రేమికులు చంద్రుని చూపించడంలాగా పుస్తకం పంచుకోవడంలో గాఢమైన ఆత్మీయత వ్యక్తం అవుతుంది.చిట్టి పిట్ట ఈక చెంపల మీద రాయడం లాగా,సముద్ర తీరంలో సూర్యోదయాన్ని స్నేహితులతో కలిసి చూడడం లాగా ఈ పోలికలు పుస్తకాన్ని పంచుకునే అనుభవానికి కవిత్వ రూపాన్ని తెచ్చి పెట్టాయి. ఇందులోని భావాలు పుస్తకాన్ని ప్రేమలేఖ,చిట్టి పిట్ట,జాబిలి తునక వెలుగుతో పోల్చడం ద్వారా మమకారం,మాధుర్యం,ఆత్మీయత ప్రతిఫలించినాయి.ఒకరు చదివి ఇచ్చిన పుస్తకం అనే ఆలోచన,కవయిత్రి కవిత్వంలో మానవ సంబంధాల మమకారానికి చిహ్నంగా నిలుస్తుంది. అది ఒక వస్తువు కాదు ఒక అనుభూతి,ఒక జ్ఞానం కాదు,ఒక జ్ఞాపకం,ప్రేమ,స్నేహం,ఆత్మీయత, అనురాగం కలిసిన ప్రతిరూపం.కవయిత్రి పంచుకున్న పుస్తకం ద్వారా సరళమైన అనుభవాన్ని కవితా రూపంలో వ్యక్తం చేయడం గొప్పగా ఉంది. ఇది పాఠకులను ఎంతగానో అలరిస్తుంది.అందరి హృదయాలను హత్తుకునే గొప్ప భావనగా నిలుస్తుంది.కవయిత్రి మానస చామర్తి ని అభినందిస్తున్నాను.వారు మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
కవయిత్రి మానస చామర్తి బి.టెక్. కంప్యూటర్ సైన్స్ విద్యను అభ్యసించారు. వీరు సాఫ్ట్ వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్ గా ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.వీరికి చిన్నతనంలోనే సాహిత్యం పట్ల అమితమైన ఆసక్తి ఏర్పడింది.వీరిలో పదమూడు సంవత్సరాల చిన్న వయసులోనే తొలి కవితకు బీజం పడింది.వీరు రాసిన కవిత మొదటి సారిగా కళాశాల మేగజైన్ లో ప్రచురింపబడింది. వీరు రాసిన పరవశ తొలి కవితా సంపుటి,2022 సంవత్సరంలో అనల్ప పబ్లికేషన్స్ ద్వారా ప్రచురితం అయింది.వీరు ఈ మాట వెబ్ పత్రిక సంపాదకవర్గ సభ్యురాలుగా వ్యవహరిస్తున్నారు.ప్రాచీన ఆధునిక కవిత్వాల నుండి నాన్న ప్రధాన వస్తువుగా ఘంటసాల నిర్మల ప్రధాన సంపాదకులుగా వెలువరించబడ్డ నాన్న బృహత్సంకలనానికి మానస చామర్తి సంపాదకవర్గ సహకారం అందించారు.వీరు మధు మానసం బ్లాగ్ లో తమ అనుభవాలను, జ్ఞాపకాలను గత పదిహేను సంవత్సరాలుగా రికార్డ్ చేస్తున్నారు.వీరు 2015 సంవత్సరంలో ఇస్మాయిల్ పురస్కారం అందుకున్నారు.వీరు 2024 సంవత్సరంలో ఉమ్మడిశెట్టి అవార్డును అందుకున్నారు.వీరికి తొమ్మిది సంవత్సరాల వయస్సు గల కొడుకు ఉన్నాడు.ఆ పిల్లవాడి చుట్టూరా అల్లుకున్న అందమైన ప్రపంచాన్ని గమనించడం తనకు ఇష్టం అంటూ తనలో పొంగి పొర్లుతున్న ఆత్మీయ అనుభూతులను ఆనందంగా పంచుకున్నారు. ‌

September 28, 2025 8 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

బొడ్డెమ్మ – తెలంగాణ సుందర భావం

by Ashwini Bontha September 26, 2025
written by Ashwini Bontha

తెలంగాణ అంటేనే బతుకమ్మ పండుగ వంటిది.  పువ్వులను పూజించడమనే ప్రత్యేక సాంప్రదాయం తెలంగాణ ప్రాంతంలో కనిపిస్తుంది. సంస్కృతి సాంప్రదాయాలకు నిలువుటద్దం . ప్రకృతిని పూజించడం మన సాంప్రదాయం. ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్న పండుగ బతుకమ్మ .బతుకమ్మ అనే పదానికి బతుకు అంటే జీవితం, అమ్మ అంటే అమ్మ అని అర్థం.  బతుకమ్మ అనగా జీవం పోసే తల్లి . ఈ పండగ ప్రధానంగా పుష్పాలతో నూ, మధురమైన పాటలతో నూ మహిళలు సామూహికంగా ఆనందభరితంగా జరుపుకునే పండుగ .
బతుకమ్మ పండగ కంటే ముందే  బొడ్డెమ్మ పండుగను జరుపుకుంటాం. బొడ్డెమ్మ పండుగను భాద్రపద బహుళ పంచమి నాడు ప్రారంభమై  మహాలయ అమావాస్యం వరకు   తొమ్మిది రోజులపాటు జరుగుతారు. బొడ్డెమ్మ అంటే బొడ్డె అని, అంటే చిన్న అని అర్థం. బొడ్డెమ్మ అనగా చిన్నపిల్ల అని అర్థం. కొన్ని ప్రాంతాలలో బొడ్డ పదానికి అత్తి చెట్టు,. మేడి చెట్టు ,జాదుంబర వృక్షం అని పిలుస్తారు. ఇవే కాకుండా ధాన్య రాశి, ధాన్యం కుప్ప అని వాడుకలో ఉంది. బొడ్డెమ్మ పండుగను బాలికలు, పెళ్ళికాని అమ్మాయిలు జరుపుకుంటారు. కన్నెపిల్లలు మంచి భర్త రావాలని, వైవాహిక జీవితం బాగుండాలని భక్తిశ్రద్ధలతో గౌరీదేవిని ప్రార్థిస్తారు. బొడ్డెమ్మ నోములను కూడా నిర్వహిస్తారు . ఇది “తీజ్ ” పండుగను పోలిఉంటుంది. మనిషి, మట్టి,ప్రకృతికి ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది బొడ్డెమ్మ పండుగ.  

తెల్లవారుజామున  తడి జల్లులో తడుచుకుంటూ అమ్మాయిలందరూ కలిసి చేను చెల్కల నేలలో తిరిగి , పుట్టమన్ను తీసుకువచ్చి ఆ మన్నుతో బొడ్డెమ్మ ను తయారు చేస్తారు. ఒక్కో ఇంటికి ఒక్కో ఒంతు ఉంటుంది. అంటే ఆనవాయితీ ఉంటుంది. పీట మీద త్రిభుజాకారంలో గానీ చతురస్రాకారంలో గాని, వలయాకారంలో గాని మూడు,ఐదు, తొమ్మిది వరుసలు  అంటే అంతెలుగా పేర్చి, పైవరకు గోపురం ఆకారంలో చేస్తారు. రాగి ‌ కలశంలో బియ్యం పోసి, కొత్త వస్త్రం పెట్టి పసుపుతో గౌరమ్మని తయారు చేసి తమలపాకులో పెడుతారు . ఇంటి ముందు శుభ్రం చేసి ఎర్రమన్నుతో అలికి, పిండితో ముగ్గులు వేస్తారు. పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తారు. ఆకాశంలోని నక్షత్రాలను కలుపుకుంటూ ముగ్గు వేసి నట్టు చుక్కల ముగ్గులు, గీతాలు ముగ్గులు వేసి, మధ్యలో  బొడ్డెమ్మను  పెట్టి రుద్రాక్ష,కాకర, కట్ల,బీర మొదలైన విభిన్న రకాల పువ్వులతో అలంకరిస్తారు. పువ్వుల నవ్వులను చూస్తూ ముందుకు అడుగులు వేస్తూ వలయాకారంలో తిరుగుతూ  …..

బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్..
నీ బిడ్డ పేరేమి కోల్..
నా బిడ్డ నీలగౌరు కోల్..
నిచ్చెమల్లె చెట్టేసి కోల్..
చెట్టుకు చెంబేడు కోల్..
నీళ్లనూ పోసి కోల్..
కాయల్లు పిందేలు కోల్..
గనమై కాసెను కోల్..
అందుట్ల ఒక పిందే కోల్..
ఢిల్లీకి పాయెనూ కోల్..
ఢిల్లీలో తిప్పరాజు కోల్..
మేడా కట్టించే కోల్..

అంటూ ‌ ముందుకు సాగుతూ
బొడ్డెమ్మ బిడ్డ పేరు నీల గౌరి. ఆమె , నిత్యమల్లె చెట్టు పెట్టి ,నీళ్లు పోసేది . వాటికి వచ్చిన  కాయలను పండ్లును తెంపి ,యాదగిరి నరసన్నకు, ఐలోని మల్లన్నకు, వేములవాడ రాజన్నకు ,భద్రాచలం రామన్నకు ,  కొమ్మలనరసింహ స్వామికి  పంపించగా ,ఎవరు వాటిని సేవించలేదు చివరికి వరంగల్ భద్రకాళి మాత్రం తీసుకుందని తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా వరంగల్ జిల్లాలో ఈ విధంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలను తలుచుకుంటూ పాట పాడుతారు. బాలికలు , అమ్మాయిలు , మహిళలు సంధ్య వేళలో ప్రారంభించి రాత్రి వరకు   ఇట్లా పాడుతూ ఆడుతారు.
ఇలా రూపం లో, ఆకారంలో ఐదు రకాల బొడ్డెమ్మలను తయారు చేయడం , పాటలను పాడుతూ ఆటలాడటం జరుగుతుంది. అయితే ఇక్కడ ముఖ్య విషయం ప్రాంతాన్ని బట్టి బొడ్డెమ్మను   పీట బొడ్డెమ్మ, గుంట బొడ్డెమ్మ ,పందిరి బొడ్డెమ్మ, బాయి బుడ్డమ్మ, అంతరాల బొడ్డెమ్మ తయారు చేయడం  అనే పద్ధతి ఉన్నది.
సుఖదుఃఖాలను పాట రూపంలో మలిచి గౌరీదేవిని పూజిస్తూ…

నిద్రపో బొడ్డెమ్మ నిద్రపోవమ్మా 
నిద్రకు నూరేళ్లు నీకు వెయ్యిళ్లు  
నిన్ను కన్నా తల్లికి నిండు నూరేళ్లు …..

అంటూ ప్రతి రోజూ చేస్తారు. ఎందుకంటే రోజూ బొడ్డెమ్మ నిమజ్జనం చేయరు ఇంట్లోనే ఉంటుంది కాబట్టి! ఇక చివరగా ఎనిమిది రోజులు పాడుతూ తీసేముందు ఈ పాటనే ” పోయిరా బొడ్డెమ్మ పోయిరావమ్మా మళ్లీ ఏటికి మరలిరావమ్మా” అంటూ తర్వాత  దేవుడి ముందు పెడతారు. లేదా కొందరు బావిలో నిమజ్జనం చేస్తారు. ఎనిమిది రోజులు పాటు, దేవుడి ముందు పెడతారు , చివరి రోజు తీసేస్తారు.
ప్రతిరోజు  పోటీపడి ఆడపిల్లలు అలంకరించుకుంటారు. పట్టులంగాతో,లంగావోనితో తయారైన ఆడపిల్లల సందడితో వీధులన్నీ కలకలాడుతాయి. వీరి మధ్య స్నేహం బలపడి ఆప్యాయత అనురాగాలకు పునాది వేయడం జరుగుతుంది  . ఈ కాలంలోఒక పోస్ట్ కి ఎక్కువ లైకులు, ఫాలోవర్లు వస్తేనే వారు ఆనందంగా కలిసి అంటున్నారు మరియు సుడిగుండంలో చిక్కిన సీతాకోకచిలుకలు అవుతున్నారు.   ప్రస్తుత కాలంలో ఆదరణ తగ్గిపోయి కనుమరుగయ్యే పరిస్థితి కనిపిస్తుంది. ప్రపంచీకరణ ప్రభావంతో సోషల్ మీడియాకి అలవాటు పడ్డారు బాలికలు యువత. ఫోన్ ఓపెన్ చేసి  వాట్సాప్ లో, ఫేస్బుక్, స్నాప్ చాట్, టెలిగ్రామ్,ఇంస్టాగ్రామ్, ఏఐలో అంతర్జాల మధ్యలో లోకాన్ని మర్చిపోతున్నారు. తొమ్మిది రోజులపాటు పెట్టే  ఆరోగ్యకరమైన ప్రసాదాలే ఉంటాయి. బెల్లం, నువ్వులు, పప్పు, కొబ్బరి, మొదలైనవి ఆడపిల్లల శారీరక పుష్టికి ఉపయోగపడతాయి .కానీ ఇప్పుడు స్విగ్గి, జొమాటో ఆర్డర్ చేసుకొని తినే విధానానికి అలవాటు పడిపోయారు,ఈనాటి కాలం వారు. చివరి రోజు రాగి చెంబులో పోసిన బియ్యంతో పప్పు బెల్లంతో నైవేద్యంగా తయారు చేసి ప్రసాదం పంచి .అందరూ కలిసి చెరువు దగ్గరికి తీసుకొని వెళ్లి  
పోయిరా బొడ్డెమ్మ ….
పోయిరావమ్మా …అంటూ
నిమర్జనం చేసిన అనంతరం పసుపు గౌరమ్మని పిల్లలకు గంధం బొట్టుగా, చెంపలకు పూస్తారు, ముత్తైదులు మంగళ సూత్రాలకు పెట్టుకుంటారు. బొడ్డెమ్మ నిమర్జనం చేసిన తర్వాత రోజు నుండి బతుకమ్మ పండుగ ప్రారంభమవుతుంది. బతుకమ్మ పండుగ భద్రపద అమావాస్య నుండి దుర్గాష్టమి వరకు కొనసాగుతుంది. బొడ్డెమ్మ పండుగ ఆనందంగా జరుపుకునే పండుగ.

September 26, 2025 19 comments
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

అత్తగారి కథలు

by LATHA MURTI MADDALI September 25, 2025
written by LATHA MURTI MADDALI

నేను పరిచయం చేస్తున్న పుస్తకం, నిజానికి తెలుగు వారికి పరిచయం అవసరం లేని, “అత్తగారి కథలు” బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన డాక్టర్ భానుమతీ రామకృష్ణ గారు వ్రాసిన పుస్తకం.ఇది పూర్తిగా హాస్య రచన. దీనిలో అత్తగారి పాత్ర యొక్క స్వభావం, మాటలు, చేసే పనులు నవ్వులు పూయిస్తాయి. ఈ పుస్తకానికి  భానుమతి గారికి సాహిత్య అకాడమీ అవార్డు దక్కింది. ఈ పుస్తకంలో ‘అత్తగారి కథలు’ యొక్క రెండు భాగాలు ఉన్నాయి. ప్రథమ భాగంలో పది కథలు ఉన్నాయి. ఇవి ఎక్కువగా పెద్ద కథలు. ద్వితీయ భాగంలో 19 కథలు ఉన్నాయి. ఇందులో చాలా మటుకు చిన్న కథలు.
ఇందులోని కథలు సామాజిక అంశాలను, మానవ సంబంధాలను అద్భుతంగా ప్రతిబింబిస్తాయి. ఈ పుస్తకం మొదటగా 1985 లో ముద్రింపబడింది.1994లో ఈ రచనకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. శ్రీ మానస ప్రచురణల వారు దీనిని ముందుగా ముద్రించారు. ప్రస్తుతం నవరత్న బుక్ హౌస్ వారు దీనికి ప్రచురణ కర్తలు. పుస్తక ముఖచిత్రం గీసిన వారు ప్రఖ్యాత చిత్రకారులు బాపు గారు. 319 పేజీలు గల ఈ పుస్తకం ధర కేవలం 300 రూపాయిలు మాత్రమే. ప్రతులకు విజయవాడ నవరత్నా బుక్ హౌస్, ఫోన్ నెంబర్ 9848082432 ను సంప్రదించవచ్చు. ప్రథమ భాగంలోని ‘అత్తగారూ – పనివాళ్ళు’ కథని ప్రతిబింబిస్తుంది బాపు గారు వేసిన ముఖచిత్రం. ఇంకా మిగిలిన కథలకు కూడా బాపు గారు వేసిన బొమ్మలు ఆ కథలోని భావాన్ని చక్కగా వ్యక్తం చేస్తాయి.

రచయిత గురించి: ఎల్లలు లేని ప్రతిభకు డాక్టర్‌ భానుమతీ రామకృష్ణగారు నిలువెత్తు నిదర్శనం. తెలుగు నాట ఒక సమయంలో పరిచయం అవసరంలేని పేరు డాక్టర్ భానుమతీ రామకృష్ణ. ఆవిడ ప్రముఖ నటి మాత్రమే కాక, గొప్ప రచయిత్రి. అత్తగారి కథలు, నాలో నేను, అత్తగారూ నక్సలైట్లూ, భానుమతి కథానికలు వంటి రచనలు చేశారు. డాక్టర్ భానుమతీ రామకృష్ణ గారు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆవిడ దక్షిణ భారత సినీ నటి, నిర్మాత, దర్శకురాలు, స్టూడియో అధినేత్రి, రచయిత్రి, గాయని, సంగీత దర్శకురాలు. భానుమతి గారు 1926 వ సంవత్సరం సెప్టెంబరు 7న ప్రకాశం జిల్లా, ఒంగోలులో బొమ్మరాజు సరస్వతమ్మ, వెంకట సుబ్బయ్య దంపతులకు మూడవ సంతానంగా జన్మించారు. తండ్రి ద్వారా చిన్న వయసులోనే సంగీతం నేర్చుకున్నారు. అనేక కట్టుబాట్లు గల కుటుంబ వాతావరణంలో పెరిగినప్పటికీ ఆమె ఎంతో ధైర్యంగా పదమూడేండ్ల చిరు ప్రాయంనాడే 1939 లో విడుదలైన వరవిక్రయం అనే సినిమాలో నటించారు. 1943, ఆగష్టు 8 న తమిళ, తెలుగు చిత్ర నిర్మాత, డైరెక్టరు,  పి.యస్. రామకృష్ణారావును ప్రేమ వివాహమాడారు. వీరి ఏకైక సంతానం భరణి. ఈ భరణి పేరుమీదనే స్టూడియో నిర్మించి, అనేక చిత్రాలు ఈ దంపతులు నిర్మించారు. జ్యోతిష్యం, తత్వశాస్త్రాలపై కూడా ఈమెకు మంచి పట్టు ఉండేది. సినీ రంగంలో ప్రముఖులు ఈమెను ‘అష్టావధాని’ అని పిలిచేవారు.
చదువు పై ఆసక్తితో భానుమతి గారు 40 సంవత్సరాల వయస్సు దాటాక మెట్రిక్, పి.యు.సి మొదటి తరగతిలో ఉత్తీర్ణురాలు అయ్యారు. సినీ జీవితంలో తలమునకలుగా ఉన్నప్పటికీ, సాహిత్యం పై మక్కువతో, రచనా వ్యాసంగం వైపు అడుగులు వేసారు. అనేక కథలు, కథానికలు రచించి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. ఆమె కథలు, నవలలు, వ్యాసాలు సమాజం మీద ప్రభావం చూపే విధంగా ఉంటాయి. ‘నాలో నేను’ అనే పేరుతో తన ఆత్మ కథను రాశారు. ఈ పుస్తకం బహుళ ప్రజాదరణ పొందింది. ఆమె రచనల్లో స్త్రీ జీవితాలు, వారి భావోద్వేగాలు ప్రధానంగా ఉంటాయి. సాహిత్య అకాడమీ అవార్డు, పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. మూడు సార్లు జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. అంతే కాక తెలుగు, తమిళ సినీ రంగాల్లో అనేక అవార్డులు, బిరుదులు పొందారు. శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ తో ఆమెను సత్కరించింది.

అత్తగారి కథలు సంక్షిప్త సారాంశం:
 భానుమతి గారి అత్తగారి పాత్ర సున్నితమైన హాస్యం పండించడం మాత్రమే కాక, ఆనాటి అత్తగార్లు ( కొంచెం పెద్ద వయసు స్త్రీలలో) కనపడే చాదస్తమూ, కట్టుబాట్లు, పాతకాలపు సాంప్రదాయ సంస్కారాలకు సజీవ రూపం. ఈ పుస్తకంలో ఉన్న 29 కథలను పరిచయం చేయడం కాస్త కఠినమైన విషయం. ఐతే నిజానికి అన్నం ఉడికిందీ లేనిదీ ఒక మెతుకు పట్టుకు చూసినా తెలుస్తుంది అని మన పెద్దలు చెబుతారు. అదే విధంగా భానుమతి గారి కథల గొప్పతనం వీటిలోని ఒక్క కథ చదివినా అర్థం చేసుకోవచ్చు. ఈ అత్తగారు అమాయకంగా ఉంటారు, కానీ తనకు అన్నీ తెలుసుననే భావిస్తారు. ‘అత్తగారు- ఆవకాయ కథలో “ఆవకాయ పెట్టాలా? పెట్టేస్తే పోయె!” అంటూ, “మనకూ, బంధువులకూ కలిపి ఒక ఐదువేల కాయ పెడితే సరిపోతుంది,” అనడంలోనే నిజానికి ఆవిడకు ఆవకాయ గురించి ఏమాత్రం అవగాహన లేదని మనకు అర్థమవుతుంది. “నిమ్మకాయెంతో ఆవకాయ అంతే, కారం ఎప్పుడు కావాలంటే అప్పుడు కలుపుకోవచ్చు,” అని చెప్పిన అత్తగారు ఒక వారం తర్వాత తెరిచిన ఆవకాయ జాడీ బూజు కట్టి ఉండడం చూసి మారు మాట్లాడకుండా, వంట గదిలో ఒక మూలగా ఉండిపోతారు.
ఆవును పెంచుకోవాలని అత్తగారు పడ్డ తాపత్రయం అత్తగారు – ఆవు కథలో చదివి కడుపుబ్బా నవ్వుకోవల్సిందే. ఇంకొన్ని కథల్లో అత్తా-తోడికోడలీయం, అత్తగారూ – అరటికాయ పొడి, అత్తగారూ – జపాన్ యాత్ర, అత్తగారూ – కట్టుడు పళ్ళూ, అత్తగారూ- అంతరాత్మ, అత్తగారూ- బాల్ పాయింటూ ఇత్యాది కథలు చదువుతున్నంత సేపూ పెదాల మీదకు వస్తున్న నవ్వుని మునిపంటితో ఆపడం ఎంత కష్టం ఔతుందో మాటల్లో చెప్పనలవి కాదు. ఈ కథలను చదివి ఆస్వాదించాలి తెలిసిందే.
ఈ కథల్లోని అత్తగారికి తను చేసే ప్రతి పని పైనా విపరీతమైన నమ్మకం. తీరా ఆ పనిలో ఏవైనా విఘ్నాలు వచ్చినప్పుడు తన తప్పుని ఒకంతట ఒప్పుకోలేరు. దాంతో తప్పును మరొకరిపైకి నెట్టేస్తారు. ఆవకాయ పెట్టడం, చెట్లు నాటడం, వడియాలు పెట్టడం, చాకలి పద్ధులు, కిరాణా లిస్టులు రాయడం ఇత్యాది పనులన్నిట్లో ఏదో ఒక తప్పు దొర్లుతుంది. కానీ దానిని ఆవిడ తెలివిగా ఇతరుల మీదికి నెట్టడం, లేదా దాటవేయడం, మరికొన్నిసార్లు మౌనంగా వంటగదిలో కాసేపు తచ్చాడడం లాంటివి చేస్తూ గడిపేస్తుంటారు. “సవతులన్న తరువాత పోట్లాడుకోవద్దూ, మీరిద్దరూ పోట్లాడుకోరే” అని పాలవాడి పెళ్ళాలతో పోట్లాడుతుంది ఈ అత్తగారు. తన మనవడు డాక్టర్ చదువు కోసం అస్థిపంజరం తీసుకు రావడాన్ని ఏ మాత్రం జీర్ణించుకోలేక ఆ చదువే మార్చేయాలంటూ యాగీ చేసిన ఆవిడ, హరికథలో స్వాములోరు అదే అస్థిపంజరం గురించి వివరణ ఇవ్వగానే దాన్ని పూజించేంతగా మారిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది ‘అత్తగారూ – అంతరాత్మ’ కథలో.

అయితే భానుమతి గారి అత్తగారి పాత్రలో ఒక ప్రత్యేకత ఉంది. అత్తగారు అనగానే సహజంగా సినిమాల్లో సూర్యకాంతం గారి పాత్రలా గయ్యాళితనం ఊహిస్తాం కానీ ఈ అత్తగారిలో ఆ దాష్టీకం ఏ కోశానా లేదు. ఈ కథల్లో అత్తగారూ, కోడలు ఎంతో ఒద్దికగా ఉంటారు. ఇంటి పెత్తనం అంతా అత్తగారిదే. కోడలు ఆవిడతో ఎంతో సామరస్యంగా, వినయ విధేయతలతో  ఉంటుంది. మొత్తంగా ఈ పుస్తకం చదివిన పాఠకులకు ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది. ఈ కథల్లో మనకు అత్తగారి అమాయకత్వం, భయాలు, ఇంకా ఆవిడ గాంభీర్యాన్ని చూపించే కొన్ని వాక్యాలు:

  1. “ఎదురుగా వచ్చే విమానాల్ని కాస్త జాగ్రత్తగా చూసి పక్కకు తప్పుకొని వెళ్ళమని ఆ విమానం తోలే డ్రెవర్ తో చెప్పరా!” (అత్తగారు – జపాన్ యాత్ర)
  2. “ఆ రౌడీ వెధవ దీని వెంట కత్తి పట్టుకు తిరుగుతుంటే కష్టం కదూ! ఘూర్కాకి కాస్త గట్టిగా చెప్పు హిందీలో…. వాడు చచ్చి గీపెట్టినా లోపలికి రానివ్వద్దని….. అన్నట్టు ఘూర్కాల దగ్గర కూడా కత్తి ఉంటుంది కదూ!” (అత్తగారు – కామాక్షి కథ)
  3. “ఆ ముదిరి పండుబారిన కాయలు పిల్లలు తింటారు, కానీ నువ్వు మాత్రం అయిదు వేల కాయలకు ఒక్కటి తక్కువిచ్చినా తీసుకోను. జాగ్రత్త” (అత్తగారూ -ఆవకాయా)

భానుమతీ రామకృష్ణ గారి కథల్లో ప్రత్యేకమైన, వైవిధ్యమైన, విభిన్నమైన తదితర ప్రాధాన్యతాంశాలు:
 పుస్తకం అంతటా తేలికపాటి హాస్యం పాఠకులకు ఆసక్తిని కలిగిస్తుంది. హాస్యం ఎక్కువగా ప్రధాన పాత్ర ఐన అత్తగారి యొక్క అమాయకత్వం, ఆమె తన తరువాతి తరం యొక్క జీవనశైలిని అర్థం చేసుకోలేకపోవడంపై ఆధారపడి ఉంటుంది. ఇందులోని అత్తగారి పాత్ర సూర్యకాంతం తరహా అత్తగారిది కాదు కానీ కొన్ని సన్నివేశాలు మాత్రం ఆ నటిని గుర్తు చేస్తాయి. ఈ పాత్ర తెలుగు సాహిత్యాభిమానులకు ఎప్పటికీ గుర్తుండి పోతుంది. సున్నితమైన హాస్యం, చక్కని వాస్తవికత, అద్భుతమైన పాత్రల సృష్టి ఈ పుస్తకాన్ని చిరస్థాయిగా నిలిపాయి.
తెలుగు కాల్పనిక సాహిత్యంలో ఆద్యంతం ఉత్తమమైన హాస్యాన్ని చిందించే అపూర్వమైన కథలు ఈ అత్తగారి కథలు. ఈ అత్తగారి పాత్ర నిస్సందేహంగా తెలుగు సాహిత్యంలో ఆవిర్భవించిన ఉత్తమ ఏకైక తెలుగు హాస్య స్త్రీ పాత్ర. ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ ఇందులోని అత్తగారి పాత్ర సజీవ వ్యక్తిగా మనకు సాక్షాత్కరిస్తుంది. హాస్యం అంటే బూతులు కాదని, పాఠకుల హృదయాలను గిలిగింతలు పెట్టే సున్నితమైన హాస్యం పండించడం సాధ్యమే అని భానుమతి గారు ఈ పుస్తకం ద్వారా నిరూపించారు.

నాకు ఈ పుస్తకం ఎందుకు నచ్చిందంటే:
ఇందులోని ప్రతి కథా వినూత్నమైనదే. మన నిత్య జీవితంలో జరిగే సంఘటనలే. కనుక మనం ఈ కథల్లో లీనమైపోతాం. మన ఇంట్లోనో, పక్క ఇంట్లోనో ఇటువంటి బామ్మ (అత్తగారు) మనకు తారసపడుతూనే ఉంటారు. భానుమతి గారు ఉపయోగించిన కల్తీలేని అచ్చ తెనుగు ఎన్నదగినది. కథల్లో హాస్యం మాత్రమే ఉంటుంది అది ఏమాత్రం మోతాదు మించకుండా, వెకిలితనంగా మారకుండా హుందాగా సహజ సుందరంగా నడిపించిన భానుమతి గారు శతథా అభినందనీయులు.
ఒక పాత్ర చుట్టూ అన్ని కథలు అల్లడం బహు క్లిష్టమైన ప్రక్రియ. దానిని అతి సునాయాసంగా చేసి చూపించారు రచయిత్రి. తెలుగు సాహిత్యంలో శాశ్వతంగా నిలిచిపోయే ఇటువంటి ఒక పాత్రను సృష్టించగల సత్తా కొరకు ప్రతి రచయితా, కథకుడూ కలలు కంటారేమో! అందుకే ఈ పుస్తకం, ఈ అత్తగారు నా హృదయంలో ఒక ప్రత్యేక పీఠం వేసుకు కూర్చున్నారు.

పుస్తకం పై నా అభిప్రాయం:
ఈ కథలు చదవడం ద్వారా నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనిషి ప్రతిక్షణం ఎదుర్కొంటున్న ఉద్రిక్తతల నుంచి చక్కని ఉపశమనం కలుగుతుంది. తెలుగు సాహిత్యాన్ని అభిమానించే వారంతా తప్పక చదవాల్సిన పుస్తకం ఈ “అత్తగారి కథలు.”  మన పుస్తక భాండాగారంలో ఒక ప్రముఖ స్థానాన్ని ఈ పుస్తకానికి కేటాయించవచ్చు అని అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.

ముగింపు:
అత్తగారి కథలు” చదవడం ఒక అందమైన అనుభవం. ఈ పుస్తకం ప్రతి కథాసాహిత్య ప్రేమికుడు చదవాల్సినదిగా నేను భావిస్తాను. భానుమతి గారి రచనా కౌశలం, సామాజిక చైతన్యం ప్రతీ కథలో స్పష్టంగా కనిపిస్తుంది. “అత్తగారి కథలు” నాకు నచ్చిన పుస్తకాల్లో ముఖ్యమైనదిగా నిలిచిపోయింది.

September 25, 2025 23 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

కథ చదివించేలా ఉండాలి!

by రంగరాజు పద్మజ September 25, 2025
written by రంగరాజు పద్మజ

మయూఖ ముఖాముఖిలో రామచంద్రమౌళి

*******************************************  

       శ్రీమతి కొండపల్లి నీహారిణి సంపాదకత్వంలో వెలువడుతున్న తెలంగాణ తొలి అంతర్జాల సాహిత్య ద్వైమాసిక పత్రిక  సాహిత్య రంగాన ఎన్నో రీతుల కృషి చేస్తున్నది. ప్రతీసారీ తెలంగాణా లోని బహుముఖ ప్రజ్ఞాశాలులైన కవిపండితులను ప్రేరణాత్మక మూర్తులుగా రేపటి తరానికి పరిచయంచేయాలనే సంకల్పంతో..  అన్ని రంగాల వారిని పరిచయంచేస్తూ… వారిలోని ప్రతిభా విశేషాలను తర్వాత తరానికి అందిస్తున్నది. ఈ కార్యక్రమంలో భాగంగా… పరిచయమే అక్కర లేని బహుముఖ ప్రజ్ఞాశాలులు, ప్రముఖ సాహితీవేత్త, కవి మాన్యులు విద్యా దిక్సూచి కాబట్టి సాహిత్య ప్రక్రియ ఏదైనా  పాఠకుడు చదివినప్పుడు- *దాన్ని చదువక ముందున్న* *అతని *ఆలోచనలను* *సంస్కరింపబడాలి*!
అలా కాకపోతే ఆ సాహిత్య సృజన ప్రయోజనం లేనిదే!అని నిర్వచించిన సాహితీ ద్రష్ట మాన్యులు రామాచంద్రమౌళి గారి ద్వారా వారి జీవిత విశేషాలను తెలుసుకుందాం.

పద్మజ:– రామచంద్ర మౌళి గారూ! నమస్కారమండీ!
రామా చంద్ర మౌళి:- నమస్కారమండీ!

పద్మజ:—  మీ రచనా వ్యాసంగం ఎంతో కాలంనుండి కొనసాగిస్తున్నారు. దీనికి ప్రేరణ కానీ మీ పూర్వీకుల నుండి మీకీ రచనా ప్రతిభ అబ్బిందా? మీ నేపథ్యం చెప్పండి!
రామాచంద్ర మౌళిగారు:– నేను వరంగల్లోనే పుట్టి, వరంగల్లోనే పెరిగాను! ఇక్కడే చదువుకొని, ఇక్కడే ఉద్యోగం చేశాను! అంటే  పూర్తిగా ఈ నేలకు చెందిన వాడిని. వరంగల్లో పుట్టడం వల్ల జన్మతః  కొన్ని వారసత్వాలు వచ్చాయి. ఎలా అంటే బమ్మెర పోతన వరంగల్ వాడు, ఆదికవి పాలకురికి సోమన మన వరంగల్ వాసి, వానమామలై వరదాచార్యుల నుండి మొదలు పెడితే కాళోజీ నారాయణరావు వరకు గొప్ప అద్భుతమైనటువంటి సాహిత్య పరిమళం ఈ నేలలో ఉంది. అటువంటి నేల పైన నేను జన్మించడం… కాళోజీ సమకాలికుడిగా కలిసి అనేక సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడం ఇవన్నీ అదృష్టంగా భావిస్తున్నాను.
      మా నాన్నగారు ఆజంజాహి మిల్లులో పనిచేసేవారు. వరంగల్లో రెండే రకాల జీవన వృత్తులు ఉండేవి. మా చిన్నప్పుడు హనుమకొండలో  జీవన విధానం వేరే విధంగా ఉండేది. అక్కడున్న వ్యక్తులు, నేపథ్యాలు వేరు! అక్కడ ధనిక కుటుంబాలు ఉండేవి.  వరంగల్లో బీద కుటుంబాలు ఉండేవి. నికరంగా ఒక వృత్తి అనేది లేని కుటుంబాలు ఉండేవి.
    ఇక్కడ కొన్ని ప్రాంతాలు అంటే గోవిందరాజుల గుట్ట, కాశీబుగ్గ, అబ్బని కుంట , ఇవన్నీ పెద్ద పరిశ్రమ నిజాం చేత ప్రారంభించబడిన ఆసియాలో అతి పెద్ద పరిశ్రమ ఉండేది. దానిలోనె మా నాన్న పనిచేసేవాడు. ఆ మిల్లు నిర్మించేటప్పుడు దాని పునాది నిర్మించిన కార్మికులలో ఒక కార్మికుడు మా నాన్న!  ఈ విషయం చాలా గర్వంగా చెప్పుకుంటాను. అలా కార్మికుడికి జన్మించిన వ్యక్తిని కాబట్టి ఒక అద్భుతమైనటువంటి శ్రామిక నేపథ్యం నాకు సంక్రమించింది! నాకు కష్టాలు, కన్నీళ్లు దానితో పోరాటాలు నాకు జీవిత అనుభవాలుగా ఉన్నాయి. అటువంటి నేపథ్యంలో నుండి ఒక సాహిత్యకారుడిగా ఎదగడమనేది ఒక రాతి నేలలో నుండి మొలక వచ్చినట్టుగా పోల్చుకోవచ్చు!    పుస్తకమే నన్నీ స్థాయికి తీసుకొని వచ్చింది! తప్ప వేరే నేపథ్యం లేదు.
   మా నాన్న ఐదవ తరగతి వరకే చదివారు! కానీ చక్కని జ్ఞాపకశక్తి ఉండటం వల్ల తెల్లవారు ఝామున మేలుకొని  తత్త్వాలు పాడేవారు. భాగవతంలోని దాదాపు వంద పద్యాల వరకు చదివేవారు. ఆయనకు అద్భుతమైన ధారణ శక్తి ఉన్నది. ఆయనకు గొప్ప ఆధ్యాత్మిక చింతన ఉండేది. వరంగల్ లో *అచల* గురు పీఠమని మా ఇంట్లో ఒకటుండేది. దాన్ని మా నాన్నగారు నిర్వహించేవారు. అంటే తాత్త్వికమైన నేపథ్యం ఉన్న కుటుంబం నాది.
   మేము ఆరుగురు అన్నదమ్ములం,  ముగ్గురు అక్క చెల్లెళ్ళు. మగవాళ్ళలో నేనే పెద్దవాడిని! ఇంటికి పెద్దై పుట్టడం కంటే అడవిలో మానై పుట్టడం మేలు అని మన తెలంగాణ సామెత కదా! అంటే జీవితంలో అంత కష్టం ఉంటుంది. కష్టాలు- కన్నీళ్లు అంటే ఏమిటో నాకు బాగా తెలుసు!  కాబట్టి జీవితం అనేది పోరాడి గెలవాల్సిన ఒకానొక జీవన ప్రక్రియ అని నాకు ముందు నుండే ఉండే అభిప్రాయం… కాబట్టి మనిషి ఎదగాలంటే ఏం కావాలని ఆలోచించాను! చదువు ఒక్కటే మార్గమని నిర్ణయించుకున్నాను. చదువు లేకపోతే మనం ఏ విజయం సాధించలేము అని నా అభిప్రాయం.  దానికి దైవం తోడై మంచి పాఠశాలలో చదవగలిగాను.
    వరంగల్ లో మహబూబియా పాఠశాల అత్యున్నతమైనది. రెండే ఉండేవి ఏబీవీ పాఠశాల ఒకటి, మహబూబియా పాఠశాల ఒకటి!   అందులో ఋషులవంటి ఉపాధ్యాయులు ఉండేవారు. బజారు హనుమంతరావు గారు మహబూబూబియా స్కూల్ కు హెడ్మాస్టర్.
Y K శాస్త్రి గారు ఏవి హైస్కూల్లో మానవ రూపంలో ఉన్న ఋషులు వాళ్ళు.    ఈ స్కూల్ నుండి ఎందరో  మహా మహులు తయారైనారు. కోవెల సుప్రసన్నాచార్య, సంపత్కుమార్యాచార్య , వంటి ఎందరో  ఈ పాఠశాలలో ఉపాధ్యాయులుగా పని చేశారు. అటువంటి వారి శిక్షణలో నాకు విద్యాగంధం  అబ్బింది. సాహిత్య ఆసక్తులు కూడా వారి నుండే సంక్రమించాయి. కోవెల సుప్రసన్నాచార్య నాకు ప్రత్యక్ష గురువు కాదు! ఎందుకంటే నేను చదివింది ఇంజనీరింగ్…. అయినా నన్ను ఎంతగానో అభిమానిస్తారు. ఎందుకంటే? భావజాలం కానీ, సాహిత్య పరమైనటువంటి ఆసక్తి కానీ నాలో ఉండటమే కారణం. వారితో సన్నిహితంగా మెలగడం వల్ల ఇంకా లోతుల్లోకి వెళ్ళగలుగుతున్నాను. ఇలా చిన్నప్పటినుండి వరంగల్లో ఉన్న సాహితీకారులతో దగ్గర సంబంధాలు ఉండడం వల్ల సాహిత్యం మీద ఆసక్తి ఏర్పడింది.
    అంతే కాదు ఏ పాఠశాలలో లేని సౌకర్యం ప్రాంతీయ గ్రంథాలయం మా పాఠశాలలో ఉండడం, అందులో 150 నుండి 200 పుస్తకాలు ఉండేవి. నేను క్లాస్ కు (monitor) గా ఉండడం, ఆ పుస్తకాలు నా ఆధీనంలో ఉండడం, నేను రిజిస్టర్ నిర్వహించే వాడిని. అది చాలా ఆనందంగా ఉండేది. ఎందుకంటే ఎన్ని పుస్తకాలు అయినా చదవవచ్చు… అని ఒక పెద్ద నిధి లభించిందని… సంబరం.
    వరంగల్లో ఉన్న పేదవారు కాశిబుగ్గ మొదలైన ప్రాంతాలలో మగవారేమో ఆజంజాహీ మిల్లులో పనిచేసే వారు. ఆడవాళ్లేమో బీడీ పరిశ్రమలో పనిచేసేవారు  అదే జీవనాధారం. అప్పుడు నిజాం ఆధీనంలో ఉన్నటువంటి ఏరియాలో ముస్లిం సంస్కృతి చాలా విస్తృతంగా ఉండేది.    కానీ వైషమ్యాలు లేకపోయేవి.  స్నేహభావంతోనే బంధువుల వలె కలిసి మెలిసి ఉండేవాళ్ళం.    మా ఇంట్లో పనిమనిషి ఉండేవాడు. ఆయన నన్ను భుజం మీద కూర్చోబెట్టుకొని పాఠశాలకు తీసుకొని పోయేవాడు.  ఆయనను షేక్ మామ అని పిలిచేవాడిని. పేరు షేక్ ఇమామ్ కానీ మా ఇంట్లో కలిసిపోయి షేక్ మామ అయ్యాడు.    అప్పుడు లేని భేద భావాలు ఇప్పుడు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు ఎలా అయిందంటే హైదరాబాద్ పాతబస్తీకి హిందువులు పోవాలంటే భయపడిపోతున్నారు. పోయినా, అవమాన పరుస్తున్నారు. ఈ ప్రాంతాలలో ఉన్నవారు ఉచితాలు పొంది ఒళ్ళు వంచి పని చేయడం లేదు. వలస వచ్చిన వారే చక్కగా పనిచేయడంతో వారినే పనిలో పెట్టుకోవడం వలసలు ఎక్కువైపోయినాయి. తెలవకుండానే సమాజంలో ఒక ఆక్రమణ వ్యాపిస్తున్నది. అలా సమాజాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి ఈ వలసలు.
   మన చదువుకున్న కుటుంబాలలోని పిల్లలు బాగా చదువుకున్న వారు కూడా అంతస్తులు, స్థాయి పెంచుకోవడానికి విదేశాలకు ముఖ్యంగా అమెరికా వెళుతున్నారు. ఎందుకంటే మనం వలస బాధితులం…  కనుక ప్రపంచమంతా ఇలా వలసల చేత సమాజానికేమీ ఉపయోగం లేకపోగా వైషమ్యాలు  పెరుగుతున్నాయి. అక్కడ నివసించే పిల్లలు తల్లిదండ్రులను కూడా సరిగా చూడరు! బాధ్యత మీద వేసుకోవడానికి ఇష్టపడరు.
    కానీ నేను నా పిల్లలను ఎక్కడ నివసిస్తే ఆ సమాజానికి ఎంతో కొంత సహాయం చేయాలని చెప్తాను!
 అలా నా కూతురు అమెరికా ప్రభుత్వంలో ఒక భాగమై, తాను భారత పౌరురాలైనా తన సేవలను ఆ దేశపు ఉన్నతి కోసం ఉపయోగిస్తూ…. ఆ విధంగా ఆమె కూడా వృద్ధి పొందుతున్నది. చాలా కఠినతరమైన ఉద్యోగం అంటే ఆమె ఇక్కడికి వచ్చి ఏ ఆఫీసులో ఏ పనిచేసినా ఆ విషయం అక్కడ వారికి తెలుస్తుంది. అంత క్రమశిక్షణ ఉంటుంది. ముందు వెళ్లినవారు తమ పనులను బాధ్యతగా చేశారు.
    ఇక్కడ ప్రశ్న ఏమిటంటే? నేనొక *వ్యాధి* అనే కథ రాసాను. విదేశాలకు పోవాలనే తల్లిదండ్రుల ప్రోద్బలం వల్ల కానీ, లేదా వాళ్ళకి ఇష్టం ఉండి కానీ వెళ్ళినా హానికరమైనదే!      ఈ దేశంలో ఏమి తక్కువ లేదు! నేను ఆర్ఈసీ(R E C ) లో వరంగల్లో చదివినప్పుడు బెహరాన్ అనే దేశంలో పెద్ద పెట్రోలియం కంపెనీ ఆరాంకోలో  ఉద్యోగం వచ్చింది. జీతం కూడా ఎక్కువ ఉండేది. కాంపస్  సెలెక్షన్ లో నాకు ఉద్యోగం వచ్చిందని, లెటర్ పట్టుకొని వచ్చి మా నాన్నకు సంతోషంగా చెప్పాను. అప్పుడు బి షిఫ్ట్ లో ఉండే అంటే 11 గంటలకు ఇంటికి వచ్చేవారు. అప్పుడు చెప్పిన ప్రపంచంలోనే చాలా పెద్ద పెట్రోలియం కంపెనీ అదట!  తెలిసిన వారందరూ అదృష్టం అంత మంచి ఉద్యోగం  వచ్చిందని అందరూ సంతోషపడితే… మా నాన్న కూడా బాగా సంతోషపడతాడు అనుకున్నాను. కానీ సంతోష పడలేదు! విచారంతో కంట్లో నీరు తీసుకున్నాడు. ఎందుకు నాన్నా? బాధపడుతున్నావని అడిగాను. అప్పుడు మా నాన్న ఇలా అన్నాడ.” నీవు R E Cలో చదివినావు అది జాతీయ కళాశాల! ఒక్క వరంగల్ స్వంతం కాదు! నిన్ను డిగ్రీ పూర్తి చేసేందుకు ప్రభుత్వం రెండు లక్షల రూపాయలు ఖర్చుపెట్టింది. రెండు లక్షలు పన్నుల రూపంలో పాలవాడు, పాన్  డబ్బా వాడు, పాకీవాడు  ఇలా ప్రతి వాడు కట్టే వాళ్ల డబ్బుతో నువ్వు చదూవుకున్నావూ కదా! మరి నువ్వు చదువుకుని ఎదిగి బహరాన్ పోయి వేరే దేశానికి సేవ చేస్తానంటే  ఈ దేశాన్ని ఎవరు బాగు చేస్తారు?  అని అన్నాడు. ఆ మాటతో రాత్రంతా ఘర్షణ పడి, తెల్లవారి వెళ్లి నేను బెహరాన్ కంపెనీలో జాయిన్ కావడం లేదని  నన్ను క్షమించండని ఆ ఉద్యోగాన్ని తిరస్కరించాను.   అంటే తండ్రి కొడుకుల మధ్య సున్నితత్త్వం, సామాజిక వాతావరణం అంత అవగాహన ఉండేది! ఇప్పుడు లేదు! ఆ స్పృహే ఎవరికి లేదు. అంటే పెంపకం లోపమే! ఇప్పుడు తల్లిదండ్రులకు ఒక్క పిల్లవాడు లేదా ఇద్దరే కావడంతో గారాబం ఎక్కువై అడగకుండానే అన్ని సమకూర్చడంతో ఈ అతి గారాబం వల్ల పిల్లలు చెడిపోతున్నారు. విలువలు నేర్చుకోవడం లేదు ! వీటిమీద చాలా కథలు రాసిన. అందరూ  నన్ను ప్రేమకథలు ఎందుకు రాయరు సార్ ? అని అడుగుతారు.    మనమేమో యుద్దభూమిలో ఉన్నట్టు జీవన పోరాటం చేస్తున్నాము. అడుగడుగునా ఈ కష్టాల గురించి రాయకుండా వేరే అంశాలు రాయడానికి అక్కడ జాగా లేదు. బయట ప్రపంచంలో… సినిమాలలో… టీవీలలో… నిజజీవితంలో ప్రతి చోట ప్రేమలు -విఫలాలు, పెళ్లిళ్లు అవే నడుస్తున్నాయి కదా?  మళ్ళా నేను ఎందుకు రాయాలి? అని అంటాను.

పద్మజ:—మీరు,రాసిన ఈ కథల వెనుక ఎంతో దుఃఖము ఉంటుంది. కరుణరసంతో సాగుతుంది మన ప్రమేయం లేకుండానే కంటి వెంట కన్నీరు రాలుతుంది. ఒక కన్నీటి చుక్క రాలని కథ అంటూ ఉండదు ఇలా ఎన్ని ఇతివృత్తాలు ఎలా సాధ్యమైంది?
మౌళి:— చాలా మంది ఇదే విషయం అడిగారు. వందల కొద్ది కథలు రాశాను. అన్నిటా వేదననే ఎక్కువగా ఉంటుంది వేరే సబ్జెక్ట్ ఎందుకు తీసుకోరు? అని అడిగారు. అంటే వందల కథలు రాయవలసినంత వస్తువు, దుఃఖపూరితమైన కథా వస్తువు ఈ నేల మీద ఉన్నది. ఇక్కడ ఉన్న జనంలో ఉన్నది. అది ఎప్పటికప్పుడు ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది. మనం గ్రహించడం లేదు! ఎందుకంటే నీతిగా- నిజాయితీగా బతకడం అంటే ఈ సమాజంలో చాలా కష్టంగా ఉంది. వాటిని వదిలి బతకలేము! వాటిని భరించలేని పరిస్థితులున్నాయి. రానురాను బాగు పడుతుందేమో? అని అనుకుంటే వయసు గడిచిన కొద్దీ ఆశలు సన్నగిల్లుతున్నాయి. జాతీయ ఉద్యమప్పుడు దేశాన్ని పాలించిన వారే తప్పటడుగులు వేశారు. ఎవరికిష్టం లేకున్నా పాలకులయ్యారు. అక్కడ పలపక్షం- ప్రేమ- ఇలా ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి.
     యువకులే పాలించాలి! ఎందుకంటే కొత్త రక్తంలో ఎన్నో ఆశయాలు ఉంటాయి  కొత్త ఆలోచనలతో దేశాన్ని చక్కగా నడిపిస్తారని  యంగ్ఇండియా పాలసీ( Yung India policy) అని యువ భారతం రావాలని ఒక తీర్మానం చేశారు. దాని ప్రకారం పాలకులను నియమించాడు గాంధీ.     ఒకవేళ పటేల్ అప్పుడు ప్రధాని అయితే ఈ దేశం తీరుతెన్నులే మారేవి! మన దేశంలో 560 సంస్థానాలు ఉండేవి. హిందువులవి, ముస్లింలవి, రాజస్థాన్లో పఠాన్లవి, వీళ్ళు ఎంత  వరకు వ్యాపించారంటే? భారతదేశంలో 45% భూమిని వాళ్లే ఆక్రమించారు. భూములన్నీ సంస్థానాల కిందనే ఉండేవి. కట్టుబానిస వ్యవస్థగా రూపుదిద్దుకున్నది. అంటే స్వంత భూములు లేకపోయేవి! అందులో నుండే దుఃఖపూరిత నేపథ్యం అనే కథలు వచ్చాయి. ఎన్ని ఒడిదుడుకులున్నా కానీ, నేల యొక్క స్వాభావిక స్వభావం ఏదైతే ఉన్నదో? భూమి వలె *నువ్వు నన్ను నాగలితో దున్ని గాయపరచు*
*నేను నీకు ఆహారాన్ని ఇస్తాను కొడకా*!  అనే తత్త్వం ప్రకారమే అభివృద్ధి చెందుతున్నది.
     తెలంగాణ రక్తంలో ఎవరైనా ఏదైనా కానుక ఇస్తే.. ఎందుకు ఇస్తున్నావు? అని అడుగుతారు! అంటే తీసుకో అన్నారనుకో! నేనేమైనా బిచ్చగాడినా? అని అంటాడు. అంత రోషం ఉంటుంది ఈ నేలలో ఉందంటే మనకది గర్వకారణం.

రామచంద్రమౌళిగారితో ముఖాముఖి గ్రహీత రంగరాజు పద్మజ 

పద్మజ:– మీ నవలల గురించి  వివరించండి! మీ తొలి రచన ఎప్పుడు చేసారు?
మౌళి :—36  నవలలు రాశాను ఈ వరంగల్లో నవీన్ గారి దరిదాపుల్లో ఉన్నాను. 400 కథలు రాశాను. నేను 9వ తరగతి చదువుతున్నప్పుడు నా మొదటి కథ చందమామలో ప్రింట్  అయింది. అప్పుడు చందమామ ధర పావలా ఉండేది. ఆ పావలా నా దగ్గర ఉండకపోయేది. నా పక్క సీట్లో పురుషోత్తమ్ అని నా స్నేహితుడు ఉండేవాడు. వాడి తండ్రి డాక్టర్ కనుక డబ్బున్న వాళ్ళే! అతను లంచ్ టైంలో వెళ్లి మా నాయన చందమామ తెచ్చిండు… అందులో నీ పేరు ఉన్నదిరా! అన్నాడు వాడు. ఏదీ చూస్తాను తీసుకొని రమ్మంటే… మళ్ళీ పోతే సార్ కొడతాడు అన్నాడు. “ఏం కాదు పో! ” అన్నా! కొడితే కొట్టనీ అని వాడు పోయి చందమామ తెచ్చిండు. వెనుక కూర్చొని చూస్తున్నం… అచ్చులో నా పేరు చూసుకొని చాల సంబరమైంది. అప్పుడు మా రాఘవరెడ్డి సార్ కోపంగా చూసి అరేయ్! పాఠం చెప్తుంటే ఏంచేస్తున్నరు? ఏం మాట్లాడుతున్నారు? అనగానే చందమామలో వీడి కథ పడింది సార్! అని అన్నాడు పురుషోత్తం. ఏందిరా! చందమామలో వీడి కథనా?  ఏదీ చూపించు! అనగానే గజగజ వణుకుతూ నిలబడ్డాను!
అరేయ్ నువ్వే  రాసినావురా?ఏదీ కథ పేరు చెప్పు!
అనగానే కథ పేరు *సువర్ణ శతదళపుష్ప రహస్యం*  అని కథ పేరు చెప్పిన.
భాష మీద చాలా మక్కువ ఎక్కువ కనుక అలా పేరు పెట్టాను. అందులో నేను చెప్పిన కథనే ఉంది. నేనే రాసిన అని నిర్ధారించుకున్నాడు సార్ . ఆయన చదివి నావైపుకు ప్రేమగా చూసి రా! రా! అని నన్ను భుజం పట్టుకొని, చివరి బెంచి ఖాళీగా ఉంటే దానిమీద నిలబెట్టిండు.  భయపడుతూ నేను మనసులో ఇగ కొడతాడు రా! భయ్!  అనుకున్నా…    కానీ ఆయన ముందు నేను చిన్నగా ఉన్నందున బెంచి మీద నిలబెట్టి, నన్ను ప్రేమగా బిగుతుగా కౌగిలించుకున్నాడు.  అరేయ్ నీకు మంచి భవిష్యత్తు ఉంది రా! చంద్రమౌళీ! అని అన్నాడు. నీకు సరస్వతీ కటాక్షం ఉంది! బిడ్డా  కొనసాగించు! ఆపకు అన్నాడు. ఇటువంటి అనుభవాలు చాలా ఉన్నాయి. అరటి పండ్లు అమ్మేవాడు వచ్చిండు. నేను రోజు ఆయన దగ్గర పండ్లు కొంటాను. అరటి పండ్లు కట్టే పేపర్లో నా ఫోటో కనపడిందట. ఈ సార్ నా దగ్గర పండ్లు కొంటాడని ఆ పేపర్లో కట్టి ఇవ్వకుండా, పక్కకు పెట్టి గిరాకీ లేనప్పుడు అది చదివిండట… చదివి ఆ మూలకు బండి ఆపి నా దగ్గరకు వచ్చి కాళ్లు మొక్కిండు. అతనికి ఆ కథలో ఏం అర్థమైందో? తెలియదు! ఇలాంటివి జరిగినప్పుడు ఒళ్ళు పులకరిస్తుంది.
  450 కథలు 18 వాల్యూమ్ లు కవితలు, విమర్శ గ్రంథాలు, వ్యాసాలు, ఎన్నో ఉన్నాయి. అంత వస్తువు… అటువంటి జీవిత శకలాలు నాకు రోజూ కనపడుతున్నాయి. రచయితలకు మనసులో బాధ ఉంటే పాఠకులతో పంచుకునే దాక లోపల మండుతూనే ఉంటుంది. రాసాక ఫ్రీ అయిపోతాము. కాబట్టి అదే  సృజనగా బయటకు వచ్చింది.

పద్మజ:— ఇటువంటి ఉపాధ్యాయ జీవితాన్ని జీవించడం వల్ల ఎటువంటి అనుభూతి కలుగుతుంది?మయూఖ పాఠకులకు మీ విద్యా- ఉద్యోగ విశేషాలు చెప్పండి!

మౌళి:— సమాజానికి ఉపయోగకరమైన పని నేను  చేస్తున్నాను అని చాలా గర్వంగా ఉంటుంది. ఇంజనీరింగ్ విద్యార్థులకు నేను టీచర్ గా గొప్ప క్యారెక్టర్ ను.  99లోరాష్ట్రపతి అవార్డు విన్నర్ ను. 36 సంవత్సరాలు పాలిటెక్నిక్ కాలేజీకి ప్రిన్సిపాల్ గా పని చేశాను. తర్వాత 13 సంవత్సరాలు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో ప్రిన్సిపాల్ గా పని చేశాను. మొత్తం కలిసి 50 సంవత్సరాల అధ్యాపక జీవితం.   ఎందుకు ? ఈ అధ్యాపక వృత్తిలోకి వచ్చానంటే …. చాలా మంది  ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఉద్యోగం చేస్తారు. వాళ్ళకు ఆ ఉద్యోగాలు ఎలా వచ్చాయంటే? ఎవరికి వారు కోరిన ఉద్యోగం దొరకదు… ఏది దొరుకుతే అది చేస్తూ పోతున్నారు. 90% ఇలాగే ఉంటుంది. నా విషయంలో మొట్టమొదట ఆరాంకో ఉద్యోగం వద్దనుకున్న తర్వాత భిలాయి ఉక్కు కర్మాగారం మధ్యప్రదేశ్లో దుర్గ్ అనే జిల్లాలో ఉంటుంది. అక్కడ ఉద్యోగం చేసిన!
     అక్కడ దాదాపు భారతదేశంలోని అన్ని ప్రాంతాల వారితో కలిసి, అన్ని సంస్కృతులతో కలిసి ఉండే సమిష్టి సమాజం ఉంటుంది. చాలా బాగా ఉండేది! కానీ ,    నా అంతరాత్మ ఒకటే గోల *ఇది! నువ్వు చేసే పని* *కాదు! వేరే ఉంది*! అని ఎందుకని నన్ను నేను ప్రశ్నించుకుంటే? నేను చేసేది చార్జ్మెన్ అనే ఉద్యోగం. అందులో పై స్థాయికి వెళ్లే అవకాశం చాలా ఉండేది. దాంతో నా అంతస్తు ( States)పెరుగుతుంది…. కానీ సమాజానికి ఏం వస్తుంది? ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించి బోధనా వృత్తి ఒకటే సమాజానికి సేవ చేసే అవకాశం ఉన్నదని, ఒక తరాన్ని ప్రభావితం చేస్తే దాంతో సమాజాన్ని ఇంకా ప్రభావితం చేసి అలా తరాలను తయారు చేసేటటువంటి వృత్తికే ఉంటుంది. కాబట్టి అదే ఉద్యోగం చేస్తాను అని గట్టిగా నిర్ణయించుకొని నాకు నచ్చిన ఉద్యోగం పీ.వీ నరసింహారావు గారి ద్వారా వచ్చింది. లేబరేటరీ ఇన్చార్జిగా ఉన్నా వాణ్ణి డిమాన్ స్టేటర్ అంటారు. అందులో చేరాను. అలా పిల్లలకు పాఠం చెప్పా అవకాశం దొరికింది. అలా అంచెలంచలుగా ఎదిగి ప్రిన్సిపాల్ అయ్యాను. ఆ క్రమంలో పాఠ్యాంశాల పుస్తకాలు రాశాను. వీటి వల్ల బెస్ట్ టీచర్ అవార్డు వచ్చింది. జాతీయ స్థాయిలో కే ఆర్ నారాయణన్ ఇచ్చారు. తర్వాత రాష్ట్ర ప్రభుత్వం కూడా అవార్డు ఇచ్చింది. చంద్రబాబు నాయుడు గారి చేతులమీదుగా అందుకున్నాను.

పద్మజ:–మీ ఇతర రచనల విశేషాలు, *కాలనాళిక*  ఏ అంశంపై రాసారు?
మౌళి :— తెలంగాణ చరిత్ర రాసాను.ఎందుకంటే? మనం ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం చేసి దాని ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణ చరిత్రని రాయాలనుకొని 1947 నుండి  2017 వరకు సాగింది ఈ నవల. అదే  *కాలనాళిక*  తెలంగాణ సామాజిక చరిత్ర కథాకృతి. తెలంగాణ నేపథ్యంలో  ప్రజల సమీప విముక్తా పోరాట చరిత్రను వస్తువుగా తీసుకొని ఎన్నెన్నో ప్రతిఘటన ఉద్యమ ఘట్టాలను, ఘటనలను ఈ తరానికి తెలియజేస్తూ నిజాం కాలంనాటి రజాకార్ల, జమీందారుల, దొరల దేశ్ ముఖుల, దోపిడీని అక్షరబద్ధం చేస్తూ ప్రపంచ ప్రసిద్ధి చెందిన చారిత్రాత్మక తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం బైరాంపల్లి ఘటన,  కమ్యూనిస్టుల ప్రజా పోరాటం, ఆంధ్ర మహాసభ ప్రతిఘటన, సాయుధ తిరుగుబాటు, 4500 మంది ప్రాణ త్యాగాలు, పోలీసు యాక్షన్, ప్రజల ఊచ కోత, భారత స్వాతంత్రం తర్వాత తెలంగాణ నిప్పుల కొలువై, సెప్టెంబర్ 17న 1948లో విముక్తం కావడం, కాంగ్రెస్ అవతరణ, ఆంధ్రుల దోపిడి, 1969 లో తొలి దశ తెలంగాణ ఉద్యమం, కుట్రలు ఉద్యమాన్ని అణిచివేత, సృజనా ద్రోహం,
369 మంది అమరులవ్వడం, తెలుగుదేశం ప్రభుత్వ నిశ్శబ్దకుట్ర, శాసనసభలో తెలంగాణ పదాన్ని కూడా ఉచ్చరించని పరిస్థితులు, దమన కాండ, 2001 నుండి మలిదశ తెలంగాణ అవిముక్త పోరాటం, 14 ఏళ్ల నిరంతర అహింసాత్మక ఉద్యమ ప్రభంజనం, అంతిమంగా తెలంగాణ రాష్ట్ర సాధన ఇదంతా ఒక సుదీర్ఘ గర్జనతో సాగిన కల్లోల వర్తమాన చరిత్ర. 1934 నుండి 2017 మార్చ్ వరకు ఇందులో అన్నీ సజీవ పాత్రలు కాళోజీ, జయశంకర్, కెసిఆర్ ఎందరో ఉన్నారు.  ఎంతో పరిశోధించి తేదీలతో సహా అతి జాగ్రత్తగా రాసిన జరుగుతున్న చరిత్ర. ఈ నవల ఎక్కడ చిన్న తప్పు దొర్లినా విమర్శకులు ఈ సజీవ పాత్రలు తప్పులను లెక్కిస్తారు. ఇటువంటి సాహసోపేతమైన కథ వస్తువుతో వాస్తవిక కల్పనకు- వృత్తాంత్తాన్ని తీసుకొని ఇంతవరకు ఎవరూ రాయని నవల ఇది! అందుకే విజ్ఞులైన విమర్శకులు దీనిని ఇతిహాసం అని అంటున్నారు. గత దశాబ్దాల బీభత్సకర విరోచిత తెలంగాణ విముక్తి పోరాట చరిత్రను భావితరాలకు తెలియజేయడమే ఈ నవల యొక్క ఉద్దేశం. ఇందులో మొదటి ముఖ్య మంత్రి నుండి మొన్నటి వరకు ముఖ్యమంత్రుల వరకూ రాసాను.

పద్మజ:—  ఈ కాలనాళిక వరంగల్ నగరానికి సంబంధించిన చారిత్రక కథాత్మక నవల. గతించిన కాలపు సామాజిక, రాజకీయ, సంఘటనలను ఏర్చి కూర్చి రాయడమంటే మాటలు కాదు!
ముఖ్యంగా నైజాం ప్రభువు చేసిన అకృత్యాలు అన్నీ, రజాకార్ల రాక్షసత్వాన్ని, వీటికి ఎదురు నిలిచిన పోరాడిన కమ్యూనిస్టుల కార్యకలాపాలను, సాయుధ రైతాంగ పోరాటాన్ని,అలాగే ఇటీవల జరిగిన ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని కళ్ళకు కట్టినట్టు రాయడం ఆషామాషీ వ్యవహారం కాదు!   దీనికి వీరి కథాత్మక ప్రణాళిక మూడు కుటుంబాల జీవిత విశేషాలు జతచేస్తూ రాసిన వైనం అద్భుతం.

పద్మజ :—- మీరు కొంతకాలం నడిపిన వార్షిక విశేషాలు మయూఖ పాఠకులతో పంచుకోండి!
మౌళి:— మనం  ఈతరం రచయితలను ప్రేరేపించగలగాలి! కొన్ని పనులు చేసాము. 2004లో *కవితా వార్షిక* అనే ఒక వచన కవిత్వంలో  మేలైన కవిత్వాన్ని ఎంపిక చేసి ఒక సంపుటిగా వేయడం చేసాను. చాలా ఖరీదైనది అంతర్జాతీయ స్థాయిలో  పుస్తకాన్ని వేసాము. శ్రమతో కూడిన పని. సారంగ వంటి ఆన్లైన్ పత్రికను నడిపాము. దాని వెనుక ఒక టీం కృషి ఉంది. దానికో సంపాదక వర్గాన్ని ఏర్పాటుచేసి, నేను ప్రధాన సంపాదకుడిగా, అంపశయ్య నవీన్ గారు గౌరవ సంపాదకులుగా… ఇంకా సంపాదక వర్గంలో నెల్లుట్ల రమాదేవి గారు, ఎస్ఆర్ ప్రసాద్ గారు, పొట్లపల్లి శ్రీనివాసరావు గారు, విఆర్ విద్యార్థి వీరంతా సంపాద వర్గ సహచరులు.   ఇలా అందరం మేమే డబ్బులు ఖర్చులు భరించి అద్భుతంగా నిర్వహించాము. అలా చేస్తూ చేస్తూ ఎంత దూరం వచ్చిందంటే? కవిత వార్షిక వచ్చే నెలలో ఆవిష్కరణ జరుగుతున్నది.    ఈ సంచికలోఅరవై -డెబ్బై కవులను ఎంపిక చేసి,   ఆంధ్రజ్యోతిలోని వివిధ అనే సాహిత్యపుటలో అచ్చు వేసేవాళ్ళం. ఆజాబితాలో పేరు కనపడితే కవులకు ఎంత ఆనందమో? పేరు రాకుంటే బాధపడేవారు
    అలా పది సంవత్సరాలు నిర్వహించాము. సంస్థ నడవాలంటే టీం వర్క్ చేయాలి! ఎన్నో కారణాలవల్ల కవితా వార్షిక ఆపేయవలసి వచ్చింది. 2010 వరకు వచ్చింది. ఇది ఎందుకు చెప్తున్నానంటే? ఉత్తమమైన కవిత్వాన్ని కూడా మనం గుర్తించి, అభివృద్ధి పరచి, గౌరవించి ఆ రీతిలో మంచి కవిత్వాన్ని రాయదగ్గ తరాన్ని తయారు చేయాలి!ఆ  ఆకాంక్షతో బాగా నిబద్ధతతో పనిచేశాము! కానీ కొనసాగలేదు నెల్లుట్ల రమాదేవి చాలా డైనమిక్ పాత్ర వహించింది.ఒక మహిళా సంపాదకురాలుగా చాలా సేవ చేసింది. మంచి వ్యక్తి ఆమె.

 పద్మజ:—-కవితాభిమానులు మీ *కిటికీ తెరిచిన* తర్వాత* కవితా సంపుటి  గురించే మాట్లాడుకుంటారు. దాని విశేషాలు చెప్పండి!
మౌళి:— పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2006లో  ఈ *కిటికీ తెరిచిన తర్వాత* పుస్తకానికి పురస్కార ప్రదానంచేసారు.  2009లో సినారె అవార్డు వచ్చింది.  కరీంనగర్లో *గౌతమి* అనే సాహిత్య సంస్థ ఉంది దాని ద్వారా విజయేందర్ రెడ్డి అనే డాక్టర్ గారు 10, 116 రూపాయలు బహుకరించారు.అది నారాయణ రెడ్డిగారి స్వహస్తారతో అందించారు.అది రావడం చాలా గర్వ కారణం.
  నాకు సాహిత్యంతో సంబంధం ఉన్న వాళ్ళు ఎవరంటే సంబంధం అంపశయ్య నవీన్ గారు, నేరెళ్ల వేణు మాధవ్ గారు.   ఆ సభలో సినారే ఏమన్నారంటే *వీడు చాలా చిత్రమైన కవి అండి! ఇతని పేరు చూపెట్టకుండా  ఒక పది పదిహేను వరుసలు చదవమని వారిని ఎవరు రాసారంటే? పాఠకులు ఠక్కున రామాచంద్ర మౌళి గారిదని చెప్తారు. అలా గుర్తుపట్టేలా  స్వంత స్వరమున్నది*
ఇంత మంచి కవి నా శిష్యుడు ఎందుకు కాలేదంటే?  నేను గమనించింది వీడు ఒక ఇంజనీరు. తెలుగు చదువుకోలేదు కాబట్టి నా శిష్యుడు కాలేదు అన్నారు. ఒక తల్లికి  ప్రజ్ఞ కలవాడిని చూస్తే “వీడు నా కొడుకు అయితే మంచిగుండు”అని అనుకుంటుంది. మాతృహృదయంతో నా శిష్యుడు కాలేదని తపిస్తున్నాను అని అన్నారు.

పద్మజ:– మీ కథలలో మీదైన ముద్ర ఉంటుంది. ఉదాహరణకు కథలలో ప్రతీకలు వ్యవసాయ సంబంధించిన, లేక కష్టజీవుల బాధతో కూడిన ఉపమానాలను వాడుతారు. దాంతో వెంటనే గుర్తుపట్ట వస్తుంది. నేను నవ్య దినపత్రిక దీపావళి ప్రత్యేక సంచికలో దుఃఖాగ్ని కథను చదివినప్పుడు కింద నేను పేరు చూడలేదు! అంతా చదివిన తర్వాత రామచంద్రమౌళి సార్ కథ వలె ఉన్నది అని కింద పేరు చూస్తే అది మీదే!  అలా ఉంటుంది మీ సృజన.
మౌళి :—  ఒక్కోసారి అనపిస్తుంది. సృజన అనేది  ముఖ్యంగా కవిత్వం రాసినప్పుడు ఎక్కువ అనిపిస్తుంది.    ఎక్కువగా రాత్రి  పూట రాస్తాను. తెల్లవారి నేను రాత్రి రాసిన కవితను చూస్తే నేను రాసిందేనా? అని అనిపిస్తుంది. ఒక అజ్ఞాత శక్తి మనల్ని ఇలా చేయిస్తుందేమో? అనిపిస్తుంది. ఒక రకమైన దైవ బలం ఉంటుంది.    నాకు ఇండియా గవర్నమెంట్ మినిస్టర్ ఆఫ్ కల్చర్ వారు నాకు *సీనియర్ ఫెలోషిప్* ఇవ్వాలని ఒక ప్రతిపాదన పంపారు. అంటే భారతీయ సంస్కృతీ- సంప్రదాయాలు, పురాణ సాహిత్యం, వేదాలు, ఉపనిషత్తులు, వాటిని కూడా కలుపుకొని అంటే ఇంకా భూమిని తాకనివి ఏమైనా ఉంటే వాటి మీద పరిశోధన 36 నెలలు చేస్తే మీకు ఫెలోషిప్ ఇస్తామన్నారు. రేపటి తరానికి కొత్త అంశాలు పరిచయం చేయండి! అని అడిగారు?   నేను ఒక ప్రపోజల్ పంపాను. వాళ్లకు.  అది  వారు  అంగీకరిస్తే దాన్ని రాస్తాను. దీనిలో ఏముందంటే ఒక భారతీయ చింతనలోనే జీవులకున్న జీవం అంటే ప్రాణం ఎక్కడుంది?  అంటే మనం చూపించలేము! ఊపిరి ఎక్కడ ఉందంటే చెప్పలేము! ఏదో ఒక  శక్తి అంతర్లీనంగా నడుస్తున్నది. దాన్నే మనం జీవం అంటాము, ప్రాణం అంటాము, ఆత్మ అని అంటాము, ఇంకేదో అని అంటాము…

పద్మజ:— కథా రచయిత అనగానే మొదటి వరుసలో మీ పేరు వినపడుతుంది.కనుక *నిర్వాణ* కథల సంపుటి గురించి రెండు మాటలు పంచుకోండి!
మౌళి :— రచయితగాని ఏ వృత్తిలో ఉన్నవారైనా ఆరంభ దశలో ఉన్నటువంటి ప్రతిభ కంటే పోను పోను అనుభవం వల్ల పరిపక్వత సాధించగలుగుతారు. పరిణితి చెందడం వల్ల ఆ రచనలు అదనపు శోభ సంతరించుకుంటుంది. మొదట నేను రాసిన చందమామ కథకు ఈ నిర్వాణ రచనలో చాలా తేడా కనపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు జీవితపు లోతులు తెలిసాయి! ఇంత వయసు వచ్చిందంటే రెండు మూడు జీవితాలను జీవించాను. అయితే ఈ పరిణిత దశలో రాసిన కథలు కాబట్టి దానిలో పరిపూర్ణత వచ్చింది.   ఈ కథ ఏమిటంటే? ఒక ముసలతను డాక్టర్ మానసిక నిపుణుడైనదగ్గరకు  వెళ్ళి తన నంబర్(1) రాయిస్తాడు.   డాక్టర్ ఒకటో నెంబర్ ని పిలుస్తాడు, కానీ అతను వెళ్ళడు. రెండు, మూడు ,నెంబర్ల వాళ్ళు వస్తారు ఒకటో నెంబర్ అతను అలాగే కూర్చుని ఉంటాడు. ఎందుకు రావడం లేదు? అని అనుకుంటే చివరగా వస్తాడు.   డాక్టర్ అతనిని నీ సమస్య ఏమిటని అడుగుతాడు.    అడిగితే *నేను మనుషులను* *ప్రేమించలేకపోతున్నాను* అంటాడు ఒకటో నెంబర్ రోగి.     ఏమిటి మళ్ళీ చెప్పు! అని అడుగుతాడు డాక్టరు. నేను మనిషిని ప్రేమించలేకపోతున్నాను. అంటాడు రోగి !    మీకు ఎలా తెలుస్తున్నది? అని అడిగాడు డాక్టర్. ఇదివరకు నాకు ప్రేమించిన అనుభవం ఉంది కదా! ఆ అనుభవం ఇప్పుడు లేదు…. కాబట్టి ప్రేమించలేకపోతున్నాను అంటాడు.     ఇలా మొదలవుతుంది ఈ కథ ఎన్నో భాషల్లోకి  అనువదించబడ్డాయి. నిర్వాణకు ఎన్నో అవార్డులు వచ్చాయి. ఇది  మనసులోపలి కార్యం.
    నిర్వాణ అనే కథ మరొకటి ఉంది. అది కూడా అసాధారణమైన కథ!     మనిషికి ఒక స్టేజికి పోయిన తర్వాత డబ్బు, హోదా, పరువు- ప్రతిష్ట, ఇలా అన్నీ వస్తాయి. ఒకతనికి అంతర్జాతీయ ఖ్యాతి వస్తుంది. అతను ఒక్కడే ఉంటాడు. భార్య చనిపోయింది.
ఒక కొడుకు ఉంటాడు కానీ అతను అంతర్జాతీయ ప్రతిభాశాలి !లండన్ లో ఉంటాడు. తండ్రి భారతదేశంలో ఉంటాడు. పదవీ విరమణ పొంది వృద్ధుడు అవుతాడు. తండ్రి మంచాన కదలలేని పరిస్థితిలో ఉంటాడు. కొడుకు ఉద్యోగం వదిలిపెట్టి తండ్రిని చూసుకోవడానికి రాలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే అతని అవసరం ఆ సమాజానికి ఉంటుంది. ఏం చేస్తాడంటే తండ్రికి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాడు! మంచి ఇల్లు ఆటోమేటిక్ గా అన్ని పనులు జరిగేలా మిషన్లు తయారు చేయించి, రిమోట్ ద్వారా ఏర్పాటు చేస్తాడు.  కదలలేని రోగి కూడా రిమోట్ ద్వారా తెరవవచ్చు- మూయవచ్చు! బయట జోరున వర్షం కురుస్తున్నది.     ఈయన కనుగొన్న మందులకు పేటెంట్ హక్కులుంటాయి. అతనికి వాటికి కోట్ల రూపాయలు వస్తాయి. డబ్బు సమస్య లేదు. ఆరోగ్యం మాత్రం చెడిపోయింది. చివరి దశలో ఉన్నాడు. ఆకలి అవుతున్నది. అతని దగ్గర ఉండే నర్సు స్వంత పని మీద ఊరు వెళ్ళిపోయింది. ఆమెకు బదులుగా మరో నర్స్ ను ఆమె పెట్టిపోయింది ఆమె సక్రమంగా పని చేసే రకం కాదు! డ్యూటీ కి రాదు. ఈ రోగి చాలా కష్టంతో స్విగ్వి అనే కంపెనీకి పెరుగన్నం ఆర్డర్ పెడతాడు. దానికోసం ఎదురు చూస్తుంటాడు.     ఇలా కథ ప్రారంభమవుతుంది. గంట తర్వాత బెల్  డోర్ మోగితే  రిమోట్ సాయంతో తలుపు తీస్తాడు వృద్ధుడు.
     ఒక యువతి 25 -37ల మధ్య వయసు ఉన్న అమ్మాయి వచ్చి *సిగ్వి* డెలివరీ గర్ల్ అన్న మాట అతని దగ్గరకు వచ్చి చూస్తే  దయనీయంగా ఉన్న అతన్ని చూసి ఆశ్చర్య పోతుంది. బాధపడుతుంది. అలా ఊహించలేదు డబ్బా ఇచ్చి పోవాలనుకుంటుంది. కానీ అతన్ని చూసి ఎంతో గౌరవంతో, ఎనలేని ఆదరణతో ఒక వేళ ఈయనే నా తండ్రి కనక అయితే ఏం చేసేదాన్ని? అని అనుకోని ఈయనకు కావలసిన సహాయం చేస్తానని అతనితో మాట్లాడుతూ కాస్త ఆయన సామాన్లు సర్దుతుంది… మీరు ఏమనుకుంటే నేను తెచ్చిన పెరుగన్నం నీకు తినిపించనా? అని అడుగుతుంది.     అంతకన్నా అదృష్టం ఏమున్నది? అన్నట్టు చూస్తాడు.  అతనికి తినిపిస్తుంది. ఏమైనా స్పర్శ అనేది ఎంత మహత్తరంగ ఉంటుందనేది చెప్పేదే నిర్వాణ కథ!
   నేను కూడా నీకు ఒకసాయం చేస్తా అంటాడు. ఏమిటనట్టు చూస్తుంది. ఆలమర రిమోట్ తో ఓపెన్ చేసి అరోలో డబ్బా ఉన్నది తీసుకో అంటాడు. ఆ డబ్బాలో రూపాయల నోట్ల కట్టలుంటాయా?  నీకు ఎంత కావాలో తీసుకో! అంటాడు. ఆమె డబ్బు తిరిగి యధా స్థానంలో పెడుతుంది.   ఇంకొక డబ్బాను తీయమంటాడు. అందులో చెక్ బుక్ లు, ఇంకో ఆరలో భగవద్గీత పుస్తకం ఉన్నాయి. వాటిని తీసిచూసి మళ్ళీ అరలో పెడుతుంది. ఏమీ తీసుకోకుండానే అతని కుర్చీ దగ్గరకు వస్తుంది. నాలుగవ అరలో ఒక పుస్తకం ఉంటుంది. అదితెచ్చింది. దాని తెరువు అంటాడు! అదొక ఇంగ్లీష్ నవల! Empty  dye అని ఉంటుంది. అర్థం ఏమిటంటే  చనిపోయే ముందు ఖాళీ అవాలని…     ఖాళీ కావడం అనేది అంత తేలిక కాదు! నేను ఖాళీ కావాలి దయచేసి నువ్వు ఇవన్నీ తీసుకొని పో! అంటాడు.    ఆమె ఓ క్షణం  చూసి లేదు సార్! అని తన బ్యాగులో నుండి ఒక బుక్ తీసి చూపిస్తుంది.  అది కూడా  Empty before Die .
   నేను పని కోదల్చుకోలేదు అని వినయంగా పుస్తకం అలమరలో పెట్టి కళ్ళ వెంట నీరు కారుతుంటే బయటకు వెళ్ళిపోతుంది ఇది నిర్వాణ. ఇలాంటివి 21 కథలు ఈ సంపుటిలో ఉన్నాయి.

వీలైతే మీకిష్టమైన ఓ కవిత వినిపిస్తారా?
మౌళి:– అలాగే

పద్మజ:— దూరదర్శన్ టెలిఫిల్మ్  *స్వర్ణ నంది* పొందిన కథ
పద్మజ  :—-  *భూమి దుఃఖం* నిజంగా జరిగిన నిజంగా జరిగిన కథనా?
మౌళి :— లేదు!  ఊహించి రాశాను. హైదరాబాదు చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు, ఆర్ఆర్ ఏమీ లేనప్పుడు నాకు హైదరాబాద్ తో పరిచయం ఉన్నప్పుడు చూస్తే ఇవన్నీ కుగ్రామాలు.హైదరాబాద్ చుట్టూ ఉండేవి. కోకాపేట చిన్న హామ్లెట్!  నార్సింగ్ అనేది విమానాశ్రయం దగ్గరే చిన్న ఊరు.మహేశ్వరం చిన్న ఊరు. కేశంపేట ఆది చిన్నదే! కొండాపూర్ గుట్టలలో, బోళ్లలో ఉండేది. రోడ్డు లేదు !ప్రయాణం చాలా కష్టం. ఫ్రీగా ఇచ్చినా తీసుకోని  ఈ భూమి ఇప్పుడు వంద కోట్లు ఎకరానికి కొంటున్నారు. ఎకరం వందేమిటి? ఏం చేస్తారు? అని ఆశ్చర్య పోవడం మన వంతు టాటా వాళ్ళు ఎకరానికి 25 కోట్లు పెట్టికొని,  దాని చుట్టూ విలువైన మైక్రోసాఫ్ట్ అనే కంపెనీ అక్కడ స్థాపించారు. అక్కడే గూగుల్ సంస్థ కూడా నిలిపారు. ఇలాంటి ప్రపంచ స్థాయి కంపెనీలు రావడంతో దాని విలువను పెంచి, సాధారణ వ్యక్తులకు అందకుండా ఆకాశానికి తీసుకొని పోయారు. జీవితం వ్యాపారంగా మారింది.  ఆ క్రమంలో ఇద్దరు కొడుకులు వచ్చి తండ్రితో ఊర్లో ఎవరో పెద్ద వ్యాపారవేత్త వచ్చి మన ఊరి భూములన్ని కొంటున్నారు…. కొనడం కూడా అయిపోయింది . మన ఒక్కటే పొలం ఉన్నది. ఇది కూడా అమ్మమ్మని నా వెంట పడుతున్నారు… అంటే *భూమిని అమ్మడం ఏందిరా*? *నమ్ముకోవాలి* కానీ అంటాడు తండ్రి అలా కథ మొదలవుతుంది. చాయ గుడిసెలు పెద్ద హోటల్ అయిపోయింది. కార్లు,మోటార్ సైకిళ్ళు వచ్చినాయి. ఈ మార్పు అంత ఏంది? అసలు అని మొదలవుతుంది…    చివరకు కొడుకు తండ్రి కిష్టం లేకుండా పొలం అమ్మి మారుతి కారు కొనుక్కొని డిక్కి నిండా డబ్బులు నోట్ల కట్టలతో వస్తాడు. తమ్ముడు పట్నంలో ఉంటాడు. కూల్ డ్రింక్ సీసాలు, మిఠాయిలు కొని తెస్తాడు. తల్లిదండ్రులుదిగాలుగా కూర్చొని ఇదంతా చూస్తుంటారు.
     తమ్ముడికి వాటా ఇవ్వాల్సి వస్తుందని మిఠాయిలో విషం కలిపి ఇస్తాడు. డబ్బు కనబడే సరికి విచక్షణ ఉండదు. ప్రేమలు- విలువలుండవు. భూమి విలువ పెరగడం….మనిషి విలువలు తరగడం ఈ కథ.   ఈకథను దూరదర్శన్ వారు టెలీఫిల్మ్ తీశారు. తండ్రి తన వాటా అడుగుతాడు. ఈ వయసులో నీకు వాటా ఎందుకు? అని కసిరుతాడు. తండ్రి బతిమిలాడి ఒక్క 500 ఇయ్యరా! అంటాడు. ఓస్! ఐదొందలేనా ? సరే పోనీలే అని నిర్లక్ష్యంగా 500 నోటు తండ్రి మీదికి విసిరేస్తాడు.   తెల్లారి తల్లి తండ్రి కనపడరు. ఎక్కడో దూరంగా వెళ్లి ఒక ఎకరం భూమి కొంటారు తండ్రి ఇదికథ.

గ్రంథ స్వీకరణ

పద్మజ:—‘జనన బీభత్సం- మరణ సౌందర్యం అనే కవితల పుస్తకం పేరు వెనుక ఏదైనా కారణం ఉందా?
మౌళి :— నా పుస్తకాలు చాలా B  తెచ్చాయి. అందులో *ఒక దేహం అనే కమరణాలు*  కవితల పుస్తకం.కొలకలూరి ఇనాక్ గారు పెద్ద రచయిత. తిరుపతి యూనివర్సిటీ విశ్రాంత వైస్ ఛాన్సలర్. ఆయనకుఇద్దరు కూతుళ్లు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లోనే ఉన్నారు.
    *కొలకలూరి భాగీరథి* పురస్కారం ఏర్పాటు చేశారు. పదివేల రూపాయలు పారితోషికమిచ్చారు. ఈ అవార్డ్ తెలుగు యూనివర్సిటీ వారు ప్రదానం చేస్తారు. పురస్కారమందిస్తూ…  “ఆ అమ్మాయి ఏమన్నదంటే ఇది నాలుగో అవార్డు రామచంద్రమౌళి గారికి ఇస్తున్నామంటే… ఇందులో ఒక విశేషం ఉన్నది.
    మేము సామాన్యంగా ఒక సాహిత్య పుస్తకానికి నవల, కథ, కవితల పుస్తకాల కిచ్చేటప్పుడు ఆ రంగంలో నిష్ణాతులైన వారిని సీనియర్లను ఎంపిక చేసుకొని నిష్పక్షపాతంగా న్యాయనిర్ణయం చేయమనివాళ్లకు 3 సెట్లు పుస్తకాలను పంపుతాము.
కవితలకు పురస్కార నిర్ణయం కోసం  మేము సాహిత్యకారులు కాని వారికి, కవిత్వం గురించి కవులకంటే బాగా అవగాహన ఉన్నవారికి పంపాము.  వారికి మార్కులు వేయమని చెప్పాను ఈసారి న్యాయానిర్ణేతలు ఈ పుస్తకానికి 95- 96 95మార్కులు వేశారు. ఇంతకుముందు ఇన్ని మార్పులు ఏ పుస్తకానికి రాలేదు. ప్రామాణికంగా చూస్తే కవిత్వ సాంద్రత గాని, కవిత్వం యొక్క ఉత్తమ గుణం ఏ స్థాయిలో ఉందని చెప్పడానికి చెప్తున్నాను” నేను బహుమతి నిర్వాహకురాలినైనా కూడా ఇందులో మూడు నాలుగు కవితలను ఇంగ్లీషులోకి అనువాదం చేసి అవార్డు ఇచ్చే రోజు ఈ మూడు కవితలను పత్రికలో ప్రింట్ చేయించాను. హన్స్ ఇండియా మొదలైన పత్రికలలో…

పద్మజ:— ఒక దేహానికి అనేక మరణాలు ఎలా ఉంటాయి?
మౌళి :– ఈ పురస్కారం అందుకున్నప్పుడు వేదిక మీదకు రచయితలను పిలిచినప్పుడు వాళ్ళ కవితా పాదాలను చెపుతూ పిలుస్తారు.
*అమ్మ చెప్పింది స్త్రీకి రెండు జీవితాలని*
*ఒకటిక్కడ ఒకటక్కడ*
*కానీ అమ్మ చెప్పలేదు స్త్రీకి మరణాలు ఎన్నో* ఇలా కవితా పాదాలను చదివి, అద్భుతమైన మార్మిక కవి ప్రొఫెసర్ రామా చంద్రమౌళి గారిని వేదిక మీకు ఆహ్వానిస్తున్నాము అంటూ పిలిచారు! మరో కవితను చదివారు!
*సగం జీవితం నన్ను కన్న వాళ్ళ కోసం*
* సగం జీవితం నేను కన్న వాళ్ళ కోసం*
* మరి నా జీవితమేది*?
ఆ కవితలో ఇట్లాంటి పాదాలు ఉన్నాయి స్త్రీకి మరణాలు సంభవిస్తుంటాయి, ప్రతి ప్రసవంలోనూ మరణం, భర్త కొడితే మానసిక మరణమే, ఆమె తక్కువ సార్లు జీవిస్తుంది. ఇప్పుడు మహిళల పరిస్థితి కొద్దిగా మారింది. ఆర్థిక స్వాతంత్రం వచ్చింది. కానీ మరణాలు మరో తీరుగా మారాయి… ఇలా ఆడది అడుగడుగుకు చేస్తుంది!

పద్మజ:– లోపలి ఖాళీ గురించి చెప్పండి!
మౌళి :– కేంద్రానికి నాకు ప్రత్యేక అనుబంధం ఉంది నాలుగు సంవత్సరాల క్రితం అప్పటి స్టేషన్ డైరెక్టర్ గారు జయపాల్ రెడ్డి గారు రెండు పనులు చేశారు ఒకటి ప్రసార భారతి వారు ఒక్కో కేంద్రానికి ఒక్కో టాపిక్ వస్తువుని ఇచ్చి దానికి నాటకాన్ని రూపొందించండి అని కావలసిన ఆర్థిక సాయం చేస్తామన్నారు. చారిత్రక నేపథ్యంలో ఉన్నటువంటి నాటకం రాయాలి అన్నారు. ఈ మధ్య ఎవరైనా చారిత్రక నాటకాలు రాశారా? అని చూస్తే ఎవరూ రాయలేదు! ప్రభుత్వం ఇచ్చిన *జాయపసేనాని* గురించి రాయమన్నారు. దాన్ని రాశాను.  దాన్ని అఖిలభారత నాటక సప్తహాన్ని ప్రతిఏటా ఉత్సవాలు చేస్తారు.దాంట్లో నాటకాన్ని ప్రదర్శించారు! దానికి ఉత్తమ నాటక అవార్డు వచ్చింది. వరంగల్ కళాకారులు నటించారు. వేదాంతం జగన్నాథాచార్యులు సంగీత స్వరకల్పన చేశారు.అందరూ కలిసి విజయవంతం చేశారు. దాని తర్వాత ఆకాశవాణికి నా పట్ల గురి ఏర్పడింది. నా 13 కథలు వారానికి ఒకటి చొప్పున కథా స్రవంతి  పేరు మీద ప్రసారం చేస్తామని అలా చేశారు. దీన్ని కూడా ఆంగ్ల భాషలో అనువదించారు. అలాగే బెంగాలీ భాషలో కూడా అనువదించి, అక్కడి రేడియోల ప్రసారం చేశారు. మార్చిలో *లోపలిఖాళీ* లోని కథలను ప్రసారంచేసారు.ఇవి కూడా ఆంగ్ల భాష లో అనువదించారు.అలాగే బెంగాలీ భాషలోనూ అనువదించారు. తాత్పర్యం అనే రచనకు శ్యామ సుందర పురస్కారం,  ఇలా అందరి కవుల పేరు మీద ఉన్న పురస్కారాలు అందుకున్నాను. దేవులపల్లి, కృష్ణశాస్త్రి, గుంటూరు శేషేంద్ర శర్మ పురస్కారం అందుకున్నాను.    ఇటీవల తెలంగాణ సారస్వత పరిషత్తు వారిచే *వరిష్ట* పురస్కారం అందుకున్నాను.

పద్మజ:– కథా రచయితలకు మీరిచ్చే సలహా ఏమిటి?
మౌళి:– కథ అనేది మొదటి రెండు వాక్యాలలోనే పాఠకుడిని పట్టేయాలి! చదివించేలా ఉండాలి ! ఉదా॥ ఆత్మ అనే కథలో ఆత్మ అనేది *అగ్ని* అది తప్పు చేస్తే దహిస్తుంది. అంతిమంగా నిన్ను నిశ్శేషం చేస్తుంది! ఆ కథను ఇలా ప్రారంభించాను.  ఆత్మ అనేది దాగి ఉంటుంది దానికి ఒక గుర్తింపు ఉన్నది. ఒక రూపాయల కట్ట ఎవరికైనా ఇచ్చి లెక్కపెట్టమంటే ఒకటి, రెండు, మూడు అని ఇలా లెక్క పెడతాం కదా! పెదిమలు కదలించకుండా లోపల ఏదో లెక్కబెడుతుంది. దానికి రూపం ఉండదు! కానీ ఆ సంఖ్య చెబుతుంది. ఇన్ని ఉన్నాయని….  కళ్ళకు కనపడేఆ రాశి ఏమిటి? దాని ఆత్మ అనుకోవచ్చు! ఊహాత్మకంగా అని రాశాను.    ఆత్మ అనేది ఒక శక్తి!  అది ఎన్నో రూపాలలో ఉంటుంది. విద్యుత్తు ఒక శక్తి! దానితో  ఫోటో తీస్తాము! అక్కడ మనకు ఏమీ కనపడదు. కానీ చిత్రం వస్తుంది. ఇలా కాంతి ఒక శక్తి! ఉష్ణము ఒక శక్తి! రసాయనిక శక్తి !అయస్కాంత శక్తి! ఇలా అనేక రూపాలలో ఉంటుంది.  దీనికి ఒక సిద్ధాంతం ఉంటుంది అదే *శక్తి నిత్యత్వ సూత్రము* అని అంటారు. అంటే(Law of Congervetion )లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇది ఏం చెప్తుంది అంటే, *శక్తికి నాశము లేదు అది* *ఒక రూపంలో అంతర్ధానమైన చో వెంటనే మరో* *రూపంలో ప్రత్యక్షమగును.*  అని ఉదాహరణకు స్విచ్ వేయగానే విద్యుత్ శక్తి ప్రసారమై లైట్ వెలుగుతుంది. కాంతి శక్తిగా మారింది. నాబ్ తిప్పగానే స్టవ్ వెలుగుతుంది.  శక్తి అక్కడే ఉంటుంది.ఎక్కడా పోదు! రూపు మారుతుంది. ఆ విధంగా శక్తి ఎన్ని రకాలుగా ఉన్నదనేది అధ్యయనాలు ఉన్నాయి. దానికి శాస్త్రం ఉంది అయితే కొన్ని శక్తి ఇవి శక్తేనా అని ఊహించలేని సందేహంలో పడే శక్తి ఒకటి ఉంటుంది!అది ఏమిటంటే పురాణాలలో ఏముందంటే తపస్సు చేయటము అని ఉంటుంది. రావణుడు శివుడు గురించి తపస్సు చేశాడు. భస్మాసురుడు తపస్సు చేసెను ఇలా ఉంటాయి కదా! కథలు.
   ఈ తపస్సు అనేది ఒక ప్రక్రియ పద్ధతి ప్రొసీజర్.  శివుడు ఒక శక్తి నేను ఆయనను పిలవాలి! అంటే ఒక పద్ధతి ఉం.ది కొన్ని నియమాలు ఉన్నాయి. ఒకవేళ బ్రాహ్మను  పిలవాలంటే అది మరో పద్ధతి! ఈ లోతుల్లోకి పోతే తంత్రశాస్త్రం అని ఒక తంత్ర శాస్త్రం ఉంది మంత్ర శాస్త్రం కూడా ఉంది హైయర్ మ్యాథమెటిక్స్ వలె ఉంటుంది.
    శివుడి గురించి తపస్సు చేస్తే ఆయనను సంతృప్తిపరిస్తే ఆయన వస్తాడు! తప్పక రావాల్సిందే! రావణుడు దుర్మార్గుడు అని తెలిసినా కానీ…. ఒక పద్ధతి ప్రకారం అతను తపస్సు చేసి మెప్పించాడు కాబట్టి శివుడు వస్తాడు! ఎలా అంటే ఉదాహరణకు టికెట్ తీసుకొని మనం సినిమా హాల్లోకి పోతే  మనకు తప్పకుండా సినిమా చూపించాలి!  నేను ఎలాంటి వాడినైనా సరే! దుష్టుడినైనా,  దుర్మార్గుడినైనా నా దగ్గర టికెట్ ఉంది కాబట్టి సినిమా చూడనివ్వాలి. అలాంటిదే ఇది.   శంకరుడితో భస్మాసురుడు నీ భార్యని ఇవ్వమంటాడు. ఆయన ఇవ్వనని అనకుండా…. అనకూడదు కదా! భార్యని ఇచ్చి వెళ్ళాడు. సరే తర్వాత కథ ఉన్నది!  అది వేరు!
   ఇక్కడ చెప్పేది ఏమిటంటే రావణుడు తపస్సు చేస్తే  ప్రత్యక్షం అవడమేమిటి? అంటే కోరిన కోరికలు ఇచ్చి మాయమైపోయాడు కదా! అంతర్ధానం అయ్యాడు అంటే ఏమిటి? అంటే ఈ *అంతర్దాన- ప్రత్యక్షా*లు  అంటే ఏమిటి? అంటే శక్తి యొక్క మారు రూపాలుగా మారుతున్నాయి. *శక్తి నిత్యత్వ* సూత్రం కిందికి వస్తాయా? తపస్సు అనేది శక్తి రూపమా? ఈ విషయం  చాలామందితో చర్చించాను.   ఇంత ఆలోచన చాలా తక్కువ మందిలో ఉంటుంది. వీటి మీద ఆధారపూరిత సాహిత్యం లేదు. కొందరున్నారు ఇది ఆలోచించేవారు.
    కల్లూరి భాస్కర్ రావని పాత్రికేయుడు ఉన్నారు. ఈ మానవ జీవితాన్ని కనుక  అన్వయిస్తే భారతమే ఒక మంత్ర శాస్త్రం అని రాశాడు. లోతైన అధ్యయనాలు చేసి* ఇదండీ జీవితం* కల్లూరి భాస్కర్ జెనటికల్  సైన్స్ మీద ఒక పుస్తకం రాశారు. సైన్స్ ఏం చెప్తున్నది అంటే ?రచయితగా మారినామంటే రచయితకు సంబంధించిన ఏదో జెనిటికల్ ఎలిమెంట్ నాలో ఉన్నది! అది నా వెంటనే ఉన్నది. అది రాయిస్తున్నది నువ్వు నిమిత్తమాత్రుడు అని చెప్తుంది. ఒకతను బలవంతుడన్నా, గాయకుడన్నా, ప్రతిదానికి ఒక ఎలిమెంట్ ఉంటుంది. తనంతాను గుర్తించుకుని అభివృద్ధి పరుచుకుంటే ఆయా రంగాలలో గొప్పవాడు అవుతాడు. తనలో ఉన్న కళను గ్రహించి దాన్ని మెరుగుపరుచుకోవాలి! శిక్షణ ద్వారా కానీ,అధ్యయనం వల్ల కానీ, విపరీతమైన సాధనల వల్ల,  కొందరు విని నేర్చుకుంటారు.
  కాలేజీలో నేను  ఫిజిక్స్ పాఠం  చెప్తుంటే ఒక ప్యూన్ తన పని చేస్తూ  అటు ఇటు తిరుగుతూనే నేర్చుకున్నాడు. అంటే  సాధనమున పనులు సమకూరు ధరలోన! అలా సాధనల వల్ల రచయితలు కథలు చక్కగా రాయగలుగుతారు.   ఎప్పటికప్పుడు కొత్త ఆలోచనలతో తనను తాను మలచుకొని,మనదైన ప్రత్యేకత ఉండాలి!   ముఖ్యంగా ఒక కథో, కవితో రాసి,సన్మానాలు, పురస్కారాలు ఆవించకూడదు! మన కృషి మనం చేస్తే అవి వాటంతట అవే వస్తాయి.యువతరం వీటన్నిటినీ గుర్తుపెట్టూకోవాలి.

పద్మజ:– మయూఖ పత్రిక మరింత రాణించాలంటే ఏం చేయాలంటారు?
మౌళి :— శ్రీమతి కొండపల్లి నిహారిణి సంపాదకత్వంలో వస్తున్న మయూఖ పత్రిక అభివృద్ధిలోకి రావాలంటే దానికి ఒక గొప్ప అవకాశం ఉన్నది. ఎందుకంటే ఆమెనే పద్యం అలాంటిది ఒక వస్తువు పుడుతున్నదంటే ఉదాహరణకు టాటా వాడు సబ్బు తయారు చేసే నీతిమంతులైన పారిశ్రామికవేత్తలు భారతదేశంలో ఉన్నారంటే ఒక టాటా వారు మాత్రమే అలాగే కొండపల్లి నిహారుని పత్రిక నడుపుతున్నదంటే ఆమె అభిరుచులు వాళ్ళ నాన్న రాఘవరావు గారు మామగారు శశిధర్ రావు గారు వారినే పద్యం వారవరరావు కుటుంబ సంబంధాలు ఇవన్నీ చూస్తే ఆమెకు జన్మదిన కొన్ని సంస్కారాల అబ్బాయి ఆధునిక భావాలు ఉన్నాయి ఉత్తమమైన సాహిత్యకారుని కనుక ముందు నుండి నాకు పరిచయం ఉంది ఉత్తమ అభిరుచి గల రచయిత్రిగా ఒక స్త్రీగా ఆమె పుత్రికనే ఈ రెండు పత్రికలు అవి ఆరోగ్యంగా ఉంటాయి సమాజానికి ఆరోగ్యవంతమైన విషయాలు అందిస్తుంది మంచి రూపురేఖలను సంతరించుకొని ఉంటుంది సాహిత్య ప్రమాణాలు మైంటైన్ చేస్తుంది అల్లాటప్పగా చేయదు ఆమె నిర్వహణలో పత్రికలు చాలా ఉజ్వలంగా నడుస్తాయి అందులో సందేహమే లేదు నాలాంటి వారి సహకారం ఎప్పటికీ ఉంటుంది.

    ఇలా ఎన్నోగ్రంథాలు, నవలలు, కథలు కవిత్వ సంపుటాలు,నాటకాలు,విమర్శా గ్రంథాలు వెలువరించారు.గ్రీస్ లో జరిగిన ప్రపంచ కవుల సదస్సులో భారత ప్రతినిధిగా పాల్గొన్నారు.2016 లో తైవాన్ లో జరిగిన *ప్రపంచ కవుల సదస్సు* లో పాల్గొన్నారు.2011 వ సంవత్సరపు ఉత్తమ టెలిఫిల్మ్ గా ఎంపిక చేయబడి రాష్ట్ర పతి చేతులమీదుగా బంగారు పతకం అందుకున్నారు.
రాష్ట్ర స్థాయి అత్యున్నత పురస్కారం- 2007 లో తెలుగు విశ్వవిద్యాలయ కవితా పురస్కారం, 2008 లో ‘సినారే’ కవిత్వ పురస్కారం,2008 లో ఆవంత్స సోమసుందర్ కవిత్వ పురస్కారం,2012 లో గుంటూరు శేషేంద్ర శర్మ పురస్కారం, 2015 లో ఫ్రీవర్స్ పురస్కారం, 2012 లో కొలకలూరి భాగీరథీ పురస్కారం,పొందారు.   అలాగే ఫిలిప్పీన్స్ ప్రభుత్వ *జీవిత సాఫల్య పురస్కారం, 2017 లో ది ఆంధ్రమహాసభ, ముంబై జీవిత సాఫల్య పురస్కారం,2015 -2018లో కళారత్న, ఇంకా ఇంజనీరింగ్ విద్యార్థులకు 6 పాఠ్య గ్రంథాలను రచించడం వల్ల 1999 లో రాష్ట్ర పతి నుండి, 2000 లోఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి నుండి *ఉత్తమ ఇంజనీరింగ్ అధ్యాపక* పురస్కారాలను స్వీకరించారు. ఇంతటి ప్రతిభా శాలి ప్రముఖ సాహితీవేత్త శ్రీ రామా చంద్ర మౌళి గారిది బహుముఖీన ప్రతిభ!
చక్కని భాష,తనలోని భావాన్ని పదాలలో దృశ్యంగా మలుస్తూ…సహజ సిద్ధమైన ప్రతీకలతో ఉదా॥ *భూములు మనుషుల చేతుల్లో కాగితపు* *ముక్కలకంటే హీనంగా పీలికలు పీలికలై పోవడం*…మరో ప్రతీక  *మట్టికి రెక్కలు రావడం* మరో ఉదా!  ఒర్రెలు,బోళ్ళు;వాగులు,గుట్టలు అన్నీ డబ్బుగా మారడం…ఇలాంటివి ఆ భావానికి అతికి మన మనసులలో హత్తుకుంటాయి!   వీరి వ్యక్తీకరణ వైవిధ్యంగా ఉంటుంది. అడిగిన వెంటనే సహృదయతతో ముఖాముఖి కి అంగీకరించి , తమ విలువైన సమయాన్ని మయూఖ పాఠకులకోసం తమ అమూల్యమైన అభిప్రాయాలను ఏదీ దాచుకోకుండా అన్నింటికి ఓపికగా సమాధానమిస్తూ..సూచనలు, సలహాలు, మార్మిక- ధార్మిక విషయాలు ఒకటేమిటీ? నేను వారితో సంభాషించిన విషయమంతా రాస్తే ఒక ఉద్గ్రంథమౌతుంది…అలా చేసి పాఠకులను విసిగించ వద్దని సంక్షిప్తంగా వారి మాటలు- నా మాటగా చేసి చెప్తున్నాను.  ఇలాంటి గొప్ప సాహితీవేత్తను పరిచయం చేయడం నా భాగ్యంగా భావిస్తూ….వారకి మయూఖ పత్రిక ఎంతైనా ఋణపడి ఉంటుందనేది మాత్రం యథార్థమైన విషయం పాఠకులనుండి శెలవు కోరుతూ…

         

September 25, 2025 31 comments
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

తెలుగు సాహిత్య బృదావనంమస్తకాలను కదిలించే పుస్తకం

by Dr. Vasundhara September 25, 2025
written by Dr. Vasundhara

”మానవతా జన్మప్రదాత మాన్య గురువర్యుడు”
రచన : మహామహోపాధ్యాయ డా. పుల్లెల రామచంద్రుడు
ప్రచురణ : పావని సేవాసమితి ఎస్‌.ఆర్‌.టి. 270
సనత్‌ నగర్‌, హైదరాబాదు-500018, ఫోన్‌ : 23702898
ఈ పుస్తకానికి అట్ట చివర ఉన్న అమృత గుళికలు ఆస్వాదించండి.
”ఉపాధ్యాయుడు – విద్యార్థి                 గురువు – శిష్యుడు
ఆచార్యుడు – అంతేవాసి
ఇలాంటి మహత్తర పదజాలానికి అర్థమే లేకుండా పోతున్న ఈ సంకుల సమర సంధి యుగంలో ఆ పదాలకు గల అసలైన లోతులను, ఆ పదవులకు గల బాధ్యతలను, ఆ ప్రవృత్తులకు గల ఫలితాంశాలను… సమగ్రంగా, సప్రమాణంగా… మహామహోపాధ్యాయ సుగ్రహీత నామధేయుడైన పుల్లెల రామచంద్రుడి గారి లేఖిని చిందించిన అమృతపు జల్లులే ఈ పుస్తకంలో మీకు ముత్యాల గుళికలై దొరుతుతాయి…”
పుస్తకం యొక్క పేజీల సంఖ్యను బట్టి చెప్పాలంటే ఈ గ్రంథంలో మొత్తం పేజీలు పద్దెనిమిది (18) కంటే అతి చిన్న పుస్తకం. కాని విషయ సంపదలో ఇది మహోన్నత గ్రంథం. చెప్పిన విషయాలు గాని చెప్పబడిన విధంగాని ప్రతి మాట ఒక వజ్రాల మూట. అందుకే ఇలాంటి గ్రంథాన్ని అందరూ చదవాలన్న ఉద్దేశ్యంతో ఈ గ్రంథాన్ని పాఠకుల ముందు ఉంచుతున్నాను.
ఈ గ్రంథంలోని ముఖ్యాంశాలను క్లుప్తంగా, విషయ లోపం రాకుండా అందించడానికి ప్రయత్నిస్తాను. మానవుడు తన జ్ఞానాన్ని వృద్ధి చేసుకోవడానికి ఎన్నుకొన్న మార్గాలలో శబ్ద శక్తి ప్రధానమైనది. అందుకే దండి అనే మహాకవి – శబ్దం, అజ్ఞానమనే అంధకారాన్ని పటాపంచలు చేసే ఒక మహా తేజస్సు అని అని అది లేకపోయినట్లయితే మూడు లోకాలు అజ్ఞాన తిమిరంలో మునిగిపోయి ఉండేవి అని అంటాడు.
”ఇది మన్ధం జగత్‌ కృత్స్నం జాయేత భువన త్రయమ్‌
యది శబ్దాహ్వయం జ్యోతిః అసంసారం న దీప్యతే” – కావ్యదర్శం.
భారతీయ తత్త్వ శాస్త్ర ప్రకారం జ్ఞానమే భగవంతుడు (బ్రహ్మ), భగవంతుడే జ్ఞానం. అలాంటి జ్ఞానాన్ని ప్రజలకు, అంటే విద్యార్థులకు అందించే గురువులు జ్ఞానప్రదాతలు. అట్టి గురువులను గూర్చి గురుశిష్య సంబంధాన్ని గూర్చి ఈ గ్రంథం ముఖ్యంగా వివరిస్తున్నది.
తహతహలాడుతూ, తాను సంపాదించిన జ్ఞానాన్ని అందుకోవడానికి సత్ప్రవర్తన గల విద్యార్థులు తమ వద్దకు రావాలని ప్రార్థిస్తూ గురువులు ఈ క్రింది విధంగా మంత్రాలు చదువుతూ అగ్నితో హోమాలు చేసేవారని తైత్తరీయోపనిషత్తు చెప్తున్నదని పుల్లెల వారు తెల్పారు.
అ మా యస్తు బ్రహ్మచారిణః స్వాహా
వి మా యస్తు బ్రహ్మచారిణః స్వాహా
ప్ర మా యస్తు బ్రహ్మచారిణః స్వాహా
ద మా యస్తు బ్రహ్మచారిణః స్వాహా                 (తై.ఉ. 7.4)
చిత్త దోషాలు లేకుండా, ఇంద్రియ నిగ్రహం గల్గి మేధాశక్తి మొదలైన సద్గుణాలు గల విద్యార్థులు పలు దేశాల నుండి వచ్చి అనేక సత్ఫలితాలనిచ్చే విద్యలను నావద్ద నేర్చుకొందురు గాక అని గురువు ఉత్తమ విద్యార్థుల కొరకు భగవంతుని ప్రార్థించడం వల్ల జ్ఞానం ఎంత గొప్పదో తెలుస్తున్నది.
గురువు – ఆచార్యుడు
గురువు : విద్య నేర్పించేవారు రెండు రకాలు. ఒకరు గురువు. ఇతడు తను నేర్పించవలసిన శాస్త్రజ్ఞానాన్ని విద్యార్థులకు కక్షుణ్ణంగా నేర్పి, వారిని ఆ శాస్త్రంలో సుశిక్షితులను చేస్తాడు. ఇతడు ఉత్తమ గురువు లేక ఉపాధ్యాయుడు.
ఆచార్యుడు : విద్యార్థులకు తాను బోధించాల్సిన శాస్త్రాన్ని మాత్రమే గా సందర్భానుసారంగా అనేక మంచి జ్ఞాన సంబంధితమైన విషయాలను కూడా బోధిస్తూ, అంతటితో ఆగక తాను ఒక నిర్దుష్ట జీవన విధానాన్ని గడుపుతూ, ఆ విధానం ద్వారా విద్యార్థుల మనస్సులలో గొప్ప క్రమబద్ధమైన, సంస్కార వంతమైన భావనలు కల్గించి, వారు సన్మార్గంలో నడిచేలా కృషి చేసేవారిని ‘ఆచార్యుడు’ అంటారు.
ఇక మూడవరకం ఉపాధ్యాయులను గూర్చి పుల్లెల రామచంద్రుడు గారు వివరించారు. సమ సామయికమ్‌ కివే గ్రంథంలో గల ఒక శ్లోకాన్ని ఉటంకించారు.
”మూర్ఖః సృజేదుపాధ్యాయః మూర్ఖ శిష్యు పరమ్పరామ్‌.
యోగ్యా ఏవ స్యురా చార్యాః దేశ శ్రేయోయదీపి”

మూర్ఖుడైన ఉపాధ్యాయుడు ఎంతోమంది మూర్ఖ శిష్యులను తయారుచేస్తాడు. కాబట్టి దేశ శ్రేయస్సు కోరేవారు యోగ్యులైన ఉపాధ్యాయులనే నియమించాలి. విద్యను గూర్చి వివేకానందుడు చెప్పిన దానిని తన రచనలో పొందుపరిచి, విద్యావిధానం ఎలా ఉండాలో సూచించారు. అధిక సుఖాల కోసం సంపాదన కోసం ఉపయోగించే విద్య ప్రారంభంలో చాలా అద్భుతంగా ఉన్నా కొంతకాలానికి అది చాలా నీచమైన స్థితికి దిగజారుతుందని, అసూయ, ద్వేషాలు, శుక్లాగ్ని కీలల వలె విజృంభిస్తాయని వివేకానందులు బోధించారు.

2005వ సంవత్సరంలో జాతీయ విద్యా విధానానికి సంబంధించిన యథాతథ పత్రం (పొజిషన్‌ పేపర్‌) లోని సారంశమిది. ”పరాకాష్ఠకు చేరిన స్వార్థం” అనే ఛేదించరానిపాశంలో విద్య చిక్కుకొని ఉందని సర్వోన్నతిని సాధించాలనే తపనతో తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఉన్న బంధం దెబ్బతిన్నదని, పిల్లలకు తలిదండ్రుల బెదిరింపులు, ఉపాధ్యాయుల హేళనలు- వీటివల్ల పిల్లలలో ఆందోళన, ఆత్మహత్యతలు సాహస ప్రవృత్తి పెరిగిపోయి విద్య యొక్క లక్ష్యం, విలువ దిగజారిపోయిందని తెల్పింది. అతి స్పర్థ అన్ని అనర్థాలకు కారణాలని తీర్మానించింది.

గురువు యొక్క గొప్పతనాన్ని గూర్చి చెప్తూ ఒక చక్కని ఉదాహరణ పుల్లెల వారు ఒక శ్లోకం నుండి చూపించారు.
”దృష్టాన్తో నైవ దృష్టస్త్రి భువన జఠరే….” అనే శత శ్లోకిలోని ఈ సారాంశం. పరుసవేది ఇనప ముక్కను బంగారుగా మారుస్తుంది. కాని బంగారుగా మారిన ఆ ఇనుప ముక్క మరొక ఇనుప ముక్కను బంగారుగా మార్చలేదు. కాని ఒక గురువు వద్ద జ్ఞానం పొందిన శిష్యుడు తాను మరికొంత మందిని శిష్యులను తయారు చెయ్యగలడు. అందుకే గురువుకు సాటి ప్రపంచంలో మరేదీ లేదు” అని ఆ శ్లోకార్థం.
అన్ని దానాల్లోకి విద్యాదానం గొప్పదంటుంది భారతం.
”జ్ఞానము కేవల కృషన, జ్ఞానికి నుపదేశ విధి ప్రకాశము సేయం
గానది సకల ధరిత్రీ దానంబున కంటె నధిక
తర ఫలదమగున్‌” (భారతం-శాంతి.ప. 4-255)
ఈ భూమినంతా దానం చేసిన దానికంటే విద్యాదానం గొప్పది అని అర్థం.
కొన్ని మంచి సాంప్రదాయాలను ఈనాడు మూఢనమ్మకాలు అంటూ కొట్టిపారెయ్యడం ఫాషన్‌ అయిందని చెబుతూ పుల్లెల వారు ”There is superstition in avaoiding superstitions (ప్రతిదీ మూఢనమ్మకమే అని గోల చెయ్యడం ఒక పెద్ద మూఢ నమ్మకం) అనే ఒక ఆంగ్ల మేధావి మాట గుర్తు వస్తుంది’ అన్నారు. బాగా ఆలోచిస్తే ఈ ఆధునిక యుగంలో ఎన్నో వైజ్ఞానిక, (సైంటిఫిక్‌) మానసిక, రాజకీయ మొదలైన మూఢ నమ్మకాలు అధికంగా ఉన్నాయి అంటారు పుల్లెల వారు.
పిల్లలకు మితిమీరిన స్వాతంత్య్రం ఇవ్వడం, అత్యంత ప్రమాదకరం అంటాడు రామచంద్రుడు గారు. పిల్లలను దండించడం కొట్టడం మంచిది కాదని ఒక వాదం ఉంది. అది మంచిదే కాని క్రమశిక్షణ నేర్పడం తల్లిదండ్రుల, గురువుల బాధ్యత. ఆ సందర్భంగా దండించవలసి వస్తే అప్పుడు కొట్టే దెబ్బ అమృతం పూసిన చేతితో వేసే దెబ్బే కాని విషం పూసిన దెబ్బ కాదని ”సామృతైః పాణిభి” అనే శ్లోకం చెప్పిన విషయం పుల్లెల వారు తెలిపారు. సన్నతాడుతో తిన్నగా కొట్టాలని, సున్నితంగా దండించడం వల్ల పిల్లలలో ఎన్నో సద్గుణాలు పెరుగుతాయని గుర్తు చేశారు. కఠినంగా శిక్షించే గురువులను రాజు దండించాలని తెల్పారు.
”శిష్యోపాధ్యాయికా…..” అనే సంస్కృత భారతంలోని శ్లోకం గురు శిష్యుల మధ్య సత్సంబంధాలు నెలకొని నిరంతరం విద్యాభ్యాసం జరిగి దేశమే సంపన్న దేశమని తెల్పింది. వివిధ శాస్త్ర పరిచయం వల్ల విద్య వికసిస్తుంది.
”ప్రజ్ఞా వివేకం లభతే…” (వాక్యపదీయమ్‌ – 2-484)
చివరగా, గురువు – శిష్యుడు వీరి మధ్య ఉండవలసిన బంధం గురించి ఒక శిష్యుడు ఏ విధంగా తలుస్తాడో తెలిపే ప్రసిద్ధ శ్లోకంతో తన రచనకు పరిపూర్ణత్వం సిద్ధింపజేశారు ఆచార్యుల వారు. అదే, మహామహోపాధ్యాయ, ఆచార్య డా. పుల్లెల రామచంద్రుడు గారు.
సహనావవతు, సహనౌ భునక్తుః సహవీర్యం కరవావహై
తేజస్వి నావధీతమస్తు, మావిద్విషావహై
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః” – ”నన్ను, నా గురువును విద్య రక్షించు గాక. మాకిరువురికి విద్యాఫలము చేకూరేటట్లు బ్రహ్మ చేయుగాక. మేము ఎప్పుడూ ఒకరికొకరం ద్వేషించుకోకుండా ఉందుము గాక….”

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః

September 25, 2025 30 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

తెలుగే గొప్ప భాష

by Banda Saroja September 25, 2025
written by Banda Saroja

”తెలుగే గొప్ప భాష కాని కనుమరుగవుతున్నది” పుస్తక రచయిత శ్రీ పారుపల్లి కోదండ రామయ్య గారు. వీరు ప్రముఖ రిటైర్డు ఎలక్ట్రికల్‌ చీఫ్‌ ఇంజనీరు. 1963 నుండి 2003 వరకు విద్యుత్‌ సంస్థలో పని చేశారు. ప్రస్తుతం ఎనభై ఏండ్ల వయసులో తెలుగు భాష కోసం, వ్యాప్తి కోసం, తెలుగు నుడి కోసం, తెలుగు పునరుజ్జీవనం ఔన్నత్యం కోసం తపిస్తూ, అహమ్మదాబాదు నుంచి కోయంబత్తూరు, అమెరికా వరకు తిరుగుతూ తెలుగే ప్రాణంగా తన ఊపిరిగా బతుకుతున్నారు. ఈ పొత్తానికి ముందు మాట పారుపల్లి కోదండ రామయ్య గారు ఎక్కుపెట్టిన ఉద్యమ కోదండం- డాక్టర్‌ అద్దంకి శ్రీనివాస్‌, నా మెచ్చుకోలు ముచ్చట.. కవి గాండీవి బిరుదాంకితులు ఎమ్మెస్సీ (న్యూక్లియర్‌ ఫిజిక్స్‌) ఆత్రేయపురపు పాండురంగ విఠల్‌ ప్రసాద్‌, కాలయాపన లేకుండా మనం కదలాలి-చెన్నూరి ఆంజనేయ రెడ్డి ఐ.పి.యస్‌., తెలుగు భాష నిబద్దతకు చెకుముకి రాయి జయధీర్‌ తిరుమలరావు, నేను చెప్పే చిన్నమాట వంగూరి చిట్టెన్‌ రాజు వంగూరి ఫౌండేషన ఆఫ్‌ అమెరికా, హూస్టన్‌ టెక్సాస్‌ (అమెరికా) వారు రాశారు. వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా వారి రజతోత్సవాల సందర్భంగా ప్రచురించిన ఈ అపురూపమైన గ్రంథం చిట్టెన్‌ రాజు గారి 77వ ప్రచురణ. వెనుమాటలో కోదండ రామయ్య గారు తెలుగు భాష సంస్కృతులను పట్టి పీడిస్తున్న కక్షుద్ర శక్తులను తరిమి కొట్టాలని చైతన్య స్ఫూర్తితో గొప్ప తెలుగు భాష కోసం మన జవసత్త్వాలన్నింటిని పెట్టి విస్ఫులింగాలులా విజృంభించాలని కదలండి, కదలి రండి, కదిలించండి, మనది న్యాయమైన పోరాటం తప్పక విజయం మనదే అని ఉద్భోదించారు.’వంగూరి ఫౌండేషన్‌ ఆఫ్‌ అమెరికా’ అమెరికా తెలుగు సాహిత్య వేదికను 1994లో స్థాపించారు. ఆ దేశంలోనే కాక ప్రపంచ వ్యాప్తంగా అనేక సాహిత్య కార్యక్రమాలను నిర్వహిస్తూ ”చంద్రునికో నూలు పోగు” అన్నట్లు తెలుగు భాష, సాహిత్యానికి హితోధికమైన సేవ చేస్తున్నారు. వారి సేవలు అభినందనీయం.

నన్నయాదుల కన్నతల్లికి సన్నజాజుల మాలలు అర్పిస్తూ
ఆంధ్రకేసరి వీరమాతకు పాండ్ర కర్పూర హారుతలందిస్తూ
రాలుకరిగే త్యాగరాజుని రాగసుధలో పరవశిస్తూ
కూచిపూడి కళామతల్లికి అంజలులను సమర్పిస్తూ
అమెరికాలో తెలుగుతల్లికి సాహిత్యాలంకరణలు చేస్తూ

మురిసి పోదాం మనందరం – మనందరం తెలుగు భాషాభిమానులం.
ఇది పెయినిండిన మాతృభక్తికి, మాతృభాషాభిమానానికి, మాతృదేశానికి మనం అందించే ఘన నివాళి.
దైవములు లేరు తనుకన్న తల్లి కంటే
భాగ్యములు లేవు తన తల్లి భాష కంటె
స్వర్గములు లేవు తల్లి దేశంబు కంటె
నురలకీ సూత్రములు జీవనాడులండ్రు.

తెలుగు తల్లి, తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు చరిత్ర, తెలుగు వైభోగం, తెలుగు నేల పరిమళాలను ఆస్వాదించడం ప్రతి తెలుగువాడి కర్తవ్యపరాయణతకు గీటురాయి. జన్మఫల సార్థక్యం.
2022 ఆటా సందర్భంగా పారుపల్లి కోడండ రామయ్యను నేను అమెరికా, వాషింగ్‌ టన్‌  డి.సి.లో కలుసుకోవడం జరిగింది. ఏ మాత్రం డాంబికత, దర్పం లేకుండా వారు తెలుగు సమావేశానికి హాజరయ్యారు. తమ కూతుర్ని, అల్లుడు రాధాకృష్ణను సహాయంగా వెంట తీసుకొని వచ్చారు. నిరాడంబరత, నిశ్చలత్వం, శాంతం, సౌజన్యం వారికబ్బిన గుణసంపద. భేషజం ఏమాత్రం లేదు. వారిని చూస్తుంటే అప్పటి తెలుగు అధికార భాషాసంఘం కోసం అహర్శిలు తమ జీవితాన్ని అంకితం చేసి తెలుగు భాషోన్నతికి పాటుపడ్డ శ్రీ వావిలాల గోపాలకృష్ణయ్య గారు మరోసారి నా కను ముందు ప్రత్యక్షమయ్యారు.

ఇంచుమించు 17 సంవత్సరాల నుంచే ‘తెలుగు దండు’ సంస్థ ద్వారా పారుపల్లి కోదండ రామయ్య గారు నాకు సుపరిచితులు. ఇంచుమించు 22 సంవత్సరాల పదవీ విరమణ తరువాత కూడ ‘అమ్మ నుడి’ కోసం ఆరాటపడుతూ సామాన్య జనులకు కూడ అర్థంకాని అనేక విషయాలు వారు ”తెలుగే గొప్ప భాష కాని కనుమరుగౌతున్నది” అన్న ఈ పొత్తం 2019లో మూడవ ప్రచురణగా వెలువరించడం ఆశ్చర్యాన్ని కలిగించే అంశమే. ఒక పదవీ విరమణ చేసి విశ్రాంత చీఫ్‌ ఇంజనీరు విద్యుత్‌ సంస్థలో పని చేసిన అవిశ్రాంత తెలుగుభాష అధ్యయన శీలి. తెలంగాణలో కె.జి. నుంచి పి.జి. దాక ఆంగ్ల మాధ్యమమే అని కడియం శ్రీహరి, అంగన్‌ వాడీ (3వ యేట నుంచే) లోనే తెలుగు మాట్లాడనివ్వమని అంటున్న నారాయణ, తెలుగును ఇక ఒక తరం కాలంలోనే కనుమరుగు చేయనున్నారని, ఏమాత్రం పరిశీలన చేసిన వారికెవరికైనా తేటతెల్లంగా కనబడుతుందనే నిర్ణయాని కొచ్చారు.

ఈనాడు యూరపు ఖండ వాసులకు అనుకూలంగా ఉండే గేయాన్ని మనం నిరభ్యంతరంగా ఇండియా పిల్లలకు బోధిస్తున్నాం. తల్లిదండ్రులు కూడ దాన్ని ఆమోదిస్తున్నారు. అప్పుడే తమ పిల్లలు ఆంగ్ల భాషలో గీతాలను నేర్చుకొని అందలమెక్కుతున్నారని ఆనందిస్తున్నారు. ఇది ఎంత అసహజ మైనదో, అర్ధరహితమైనదో, వ్యతిరేకంగా ఉందో వేరే చెప్పాల్సిన పని లేదు. మన సంస్కృతికి భిన్నమైన సంస్కృతి వచ్చి చేరుతుంది. కోట్ల మంది పిల్లలు దేశంలో వానా వానా వెళ్ళి పో అనడం వింతలలో వింత కదా !

వానా వానా వెళ్లి పో                             Rain Rain go away
ఇంకో రోజు వద్దువు గానీ                       Come again in another day
చిట్టి నాన్న ఆడుకోవాలి                        Littile Johny wants to play
వానా వానా వెళ్లిపో                              Rain Rain go away
అట్లే మనం ప్రస్తుతం నేర్పుతున్న మరో పాటను గమనించినట్లైతే
Jack and Jill went up the hill
రాముడు సీత కొండ మీదకు వెళ్లారు 
To fetch a pint of water
ఓ బొక్కెన నీరు తేవడానికి
Jack fell down and broke his head (crown)
రాముడు కింద పడ్డాడు మాడు పగిలింది
And Jill come tumbling after
తరువాత సీత దొర్లుకుంటూ కిందికొచ్చింది.
నీళ్లు తేవడానికి కొండ మీదకు వెళ్లడమేమిటి? కిందపడ్డాక మాడు చిప్ప పగిలిందే అనుకుందాం. అందులో విశేషమేమిటి? తరువాత రాముడిని వదిలేసి సీత దొర్లుకుంటూ కిందకు రావడమేమిటి? మొత్తం మీద మనం పిల్లలకు చెప్ప దలచుకున్న నీతి, సందేశం ఏమిటి? తెలియకుండా ఉంది. నా కూతురును అడిగాను, మీకు ఈ గేయాలు అన్నీ ఉన్నాయా అని. మాది అంతా యాంత్రికాభ్యసనం అని కొట్టి పారేసింది.
అదే ఒక వేమన శతక పద్యాన్ని తెలుగులో బద్దెన విరచిత ‘సుమతీ శతక’ పద్యాన్ని పిల్లలకు చెప్పినట్లైతే దాన్ని జీవితాంతం వాళ్లు గుర్తుంచుకుంటారు. దాంట్లో నీతితో కూడిన ఒక సందేశ ముంటుంది.

ఉపకారికి ఉపకారం
విపరీతం కాదు సేయ వివరింపంగా
అపకారికి ఉపకారం
నెపమెన్నక సేయువాడె నేర్పరి సుమతీ!
ఇలాంటి సందేశాత్మకమైన నీతి పద్యాలు పిల్లల భావి జీవితంలో వారికెంతగానో తోడ్పడతాయి. వారి మూర్తిమత్వాన్ని తీర్చిదిద్దడానికి ఉపకరిస్తాయి. చైతన్యాన్ని కల్గించి జీవిత విలువల్ని ఉద్బోధిస్తాయి. నీతిని నేర్పే నుడి సుడి మనది. భారతీయ సంస్కృతిని స్థాయిని, ఔన్నత్యాన్ని తెలిపే మన ‘అమ్మనుడి’ మనకు తలమానికం. మన జాతి యొక్క పాటను, ఆటను, అలవాటును, ప్రత్యేకతను, ఉన్నతిని భాషే తరువాతి తరాలకు చేరుస్తుంది. భాష లేకుండా ఏ జాతి సంస్కృతినైనా మనమూహించలేము. తూర్పు బెంగాలులో ఉర్దూ పెత్తనం ఎక్కువైనుడు తమ భాషను కాపాడుకోవడానికి వారు తమకు వేరే దేశం కావాలని పోరాడి, గెలిచి బంగ్లాదేశ్‌ ను సాధించుకున్నారు. భాష ముందు మతం లొంగిపోయింది. దాసోహమంది.
నేడు ఆడవారిపై దాడులు ఎక్కువై పోతున్నాయి. స్త్రీలకు ఇవ్వాల్సిన గౌరవం, ప్రాముఖ్యత తగ్గిపోతుంది. మనం తెలుగు నేర్పకపోవడం వల్ల స్త్రీల పట్ల మనవారి మనస్తత్వం వైరుధ్యంగా మారి పోయింది. యాసిడ్‌ దాడులు, కుత్తుక కోయడాలు, ఆత్మహత్యలు, విడాకులు, భార్యా పిల్లల్ని చంపే నేరాలు, ఘోరాలు చూడాల్సి వస్తుంది. తల్లి నుడిలో మనం చదువు నేర్పక పోవడం వల్లనే ఈ పరిస్తితి దాపురించిందని ప్రొ.గారపాటి ఉమామహేశ్వర రావుగారు సూత్రీకరించారు. మనదైన సంస్కృతిని మనం పిల్లలకు నేర్పక పోవడం వల్ల మన తెలుగు ద్వారా విద్యా విజ్ఞానాలను అందించకపోవడం వల్ల, మన జాతి ఔన్నత్యాన్ని ప్రగతి మూలక సందేశాలను నీతి, నిజాయితీ, నిబద్దత, క్రమశిక్షణలను, ప్రేమాప్యాయతలను, మమతానురాగాలను, బాంధవ్య బంధనాలను, ఆచార వ్యవహారాలను, సంస్కృతీ సంప్రదాయాలను, మహా పురుషుల త్యాగ ఫలాలను, సంఘ సంస్కరణ ఫలితాలను, మన తరువాతి తరాలకు చేరవేయలేక పోతున్నాం. జాతి నిర్వీర్యమై పోతుంది. కాబటత్టి తెలుగు మృతభాష అయితే తెలుగు వారిదైన సంస్కృతి కూడ చచ్చిపోతుంది. తెలుగుతో పాటు తెలుగు వారి విజ్ఞానం కనుమరు గవుతుంది. భావితరాలల్లో తెలుగు మాట్లాడే వాల్లుండరు. తెలుగు సంస్కృతి రూపురేఖలుండవు. తెలుగు వారిదైన జ్ఞానం ఉండదు. తెలుగు వారి వైభవోపేతమైన చరిత్ర ఉండదు. సంప్రదాయాలు అలవాట్లు, ఆనవాళ్లు ఉండవు. అంటే తెలుగు జాతి చచ్చిపోతుంది. తెలుగు భాష మృతభాష అవుతుంది. ఇది సత్యం, తథ్యం.

చెన్నై ఐ.ఐ.టి.లోని న్యూరో సైన్సు ఆచార్యుడు డాక్టర్‌ శ్రీనివాస చక్రవర్తి తెలుగులో అపారమైన శబ్దపుష్టి ఉంది. కాని పదాలను వాడకపోతే అవి పువ్వుల్లా వడలిపోయి రాలిపోతాయి అని నుడివారు.
చచ్చే భాష లక్షణాలు ఏమిటి? తెలుగే గొప్ప భాష. తెలుగువారి ఆత్మ న్యూనతా భావం. మత భాషలు, తెలుగు, తెలుగుపై ఇతర భాషల దాడులు, ఇప్పుడేం చేయాలి? అనే ఏడు కణుపులు (అధ్యాయాలు)గా ఈ పుస్తకంలో విపులమైన వివరణలు ఇచ్చి పాఠకుల్లో పారుపల్లి కోదండ రామయ్య గారు చైతన్యాన్ని రగిలించారు. సవివరమైన వ్యాఖ్యలు చేశారు.

ప్రస్తుతం మన పిల్లలకు పోతన, నన్నయ, తిక్కన, ఎర్రన, వేమన, బద్దెన పేర్లు తెలియవు. రాయప్రోలు సుబ్బారావు, గురజాడ అప్పారావు, కందుకూరి వీరేశలింగం, గిడుగు రామమూర్తి పంతులు గారి గురించిన వృత్తాంతాలు అసలే తెలియవు. అంతా అయోమయం, అంధకారం. తెలుగు భాష దైన్య స్థితికి బాధ్యులెవరు? చదువు రాని ప్రజా ప్రతినిధులా? పనికిరాని ప్రభుత్వాలా? నిర్లిప్త వైఖరిని ప్రదర్శించే పాలకులా? అధికార దర్పంతో ఊగిపోయె ఉన్నతాధికారులా? అవార్డులు, రివార్డులు, సన్మానాలు, సత్కారాలు, పుణ్యానికి వచ్చిన పురస్కారాలు తీసుకుంటూ ఏ రోటికాడి పాట ఆ రోటి కాడ పాడుతూ తిరిగే కవులు, రచయితలు, కళాకారులా? లక్షలల్లో ప్రజాధనాన్ని దోచి దోపిడీ చేసే ప్రైవేటు విద్యాసంస్థలా? విద్యామంత్రుల నిర్ణయాధికారాల సదస్సులా? ఎవరికి అర్థం కావడం లేదు. ప్రస్తుతం తెలుగు భాష అతీగతీ ఎవరికీ పట్టడం లేదు. ”అంగట్లో అవ్వా అంటే ఎవరికి పుట్టినవు బిడ్డా” అన్నట్లుంది. ఈ వ్యవస్థ ఇలాగే కొనసాగితే తెలుగు భాష మృతభాషయై కనుమరుగవడం ఖాయం!

ఆక్సుఫర్డు విశ్వవిద్యాలయం వారు రెండు రాష్ట్రాలలోని 230 బడులల్లో మూడు ఏండ్లు పరిశోధన చేసి తెలుగును చదువుతున్న పిల్లలకే ఆంగ్లం బాగా వస్తుందని తేల్చి చెప్పారు. కుండ బద్దలు కొట్టినట్లుగా మీ భాష నేర్చుకోకపోతే మా భాష మీకు ఎప్పటికీ రాదని తేల్చి చెప్పారు. మాతృభాషలో చదువుకొంటున్నప్పుడు మెదడులోని ”నియోకోర్టేక్స్‌” విశేషంగా స్పందిస్తుంది. ఫలితంగా చిన్నారుల్లో సూక్ష్మబుద్ధి, కొత్త ఆలోచనల్ని వ్యక్తీకరించగల సామర్థ్యం వృద్ధి చెందుతాయని డాక్టర్‌ అశోక్‌ పంగారియా పూర్వాధ్యకక్షులు ఇండియన్‌ అకాడమీ న్యూరాలజీ తెలిపారు.
మాతృభాషను మరిచిపోయిన సమాజం సృజనాత్మకతకు సుదూరంగా ఉండి పోతుందని అబ్దుల్‌ కలాం గారు చెప్పారు.
కొఠారీ కమీషన్‌ పాఠశాల స్థాయిలో త్రిభాషా సూత్రాన్ని పాటించి మన దేశ భాషా విధానాన్ని స్పష్టీకరించింది.
గాంధీజీ, రవీంద్రనాథ్‌ ఠాగూరు మాతృభాష మాతృస్తన్యం, పరభాష పోతపాలు, డబ్బా పాలు, ఆయా పాలు అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు.
ప్రపంచ దేశాల్లోని విద్యావేత్తలు, మనో వైజ్ఞానిక తత్త్వవేత్తలు విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి, వికాసానికి నైపుణ్యాలను అందిపుచ్చుకోవడానికి, సమగ్ర మూర్తిమత్వానికి నాంది ‘మాతృభాష’ యని నొక్కి వక్కాణించారు.
సర్వేపల్లి రాధాకృష్ణన్‌, రాజగోపాలాచారి మొదలైన ప్రముఖ వ్యక్తులు పాత రోజుల్లో తెలుగు చదివిన వారే. తరువాత ఆంగ్లాన్ని చదివి అందులో కూడ అందెవేసిన చేయి అనిపించుకున్నారు.
బెజవాడలో సబ్‌ కలెక్టరుగా పని చేసిన రహమతుల్లా గారు ”తెలుగు దైవభాష” అని ఒక పుస్తకమే రాశారు.
బ్రిటిషు మహారాణి కాళ్లను పట్టుకొని దండం పెట్టి ఇంటికి పోయి మీ మాతృమూర్తిని కాలితో తంతారా? ఇదెక్కడి సంస్కృతి? ఇదేమి సంస్కారం? అన్యభాషల దాడికి తెలుగు భాష నేడు విలవిల్లాడిపోతుంది. ఇలాంటి సంఘర్షణ వాతావరణంలో, సంకట పరిస్థితుల్లో తల్లి భాష తెలుగును పరిరక్షించుకోవడం ప్రతి తెలుగు వాడి ప్రథమ కర్తవ్యం.

September 25, 2025 32 comments
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • వేకువ పాట
  • చాణుక్యుడు ఆదిశంకరాచార్యుల ప్రభావం ఒక సింహావలోకనం
  • సనాతనమంటే?
  • సమాజానికి హానికరమైనవిగా కాక ఉపయుక్తమైన రచనలు చేయాలి- డా. జి. చెన్నకేశవరెడ్డి
  • సాహిత్యాకాశంలో నక్షత్రాక్షర తోరణం- అక్షరగీతం

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us