Home కవితలు జలధార

జలధార

by వకుళవాసు

నా ఆనందాన్ని నీకు ధారబోస్తున్నా నాకన్నుల నిండుగా మళ్ళీ నింపుతావుగ…

నా ప్రపంచాన్ని నీకిచ్చేస్తున్నా నీకొత్తప్రపంచంలో హాయిగా విహరింపజేస్తావుగ…

నాఇంటి మహరాణిని నీచేతుల్లో పెడుతున్న నీహృదయసామ్రాజ్యానికి రాణిని చేస్తావుగ…

నాకన్నీళ్ళను ఈ జలధారలో కలిపిపోస్తున్నా తన కన్నీళ్ళు రెప్పలగడప దాటనీయవుగ…

నానవ్వులన్నీ మూటగట్టి అప్పజెబుతున్నా నీఅనురాగలను తన నవ్వులపూలగా రాలుస్తావుగ…

You may also like

Leave a Comment