పాటల బృందావనం
మళ్ళీ ఎప్పుడు పుడుతుందో ఈ గాత్రం….సంగీతం పరవశించింది ఈమె గళం లో….సప్తస్వరాలు తమ జన్మ ధన్యమైందని మురిసి పోయాయి ఈ మహా గాయని కంఠం లో….పదిహేడు భాషల పాటలు ఈమె గాత్రాన్ని అని నిత్యం స్తుతించాయి….అమ్మా జానకమ్మ ఏమి వ్రాయగలను నీ గురించి …ఒక సంగీత అభిమాని ఆయుష్షు లో ఒక్కో సంవత్సరం ఆయుష్షు ను తీసి భగవంతుడు నీకు ఇచ్చి ఇంకా కొన్నేళ్ళు మి మ్ముల్ని ఈ భూమి మీద ఉండేలా చేయలేకపోయాడా ఆ దేవుడు…..విధి ఎంత కర్కశ మయినది..
గాన గంధర్వుడి ని చిన్న పిల్లాడి లా చూస్తూ వీడు చిలిపి చిలిపి పిల్లోడు అల్లరి బాలుడు అంటూనే ఎన్ని మధుర మైన పాటల్ని ఆ అల్లరి బాలుని తో మాకు అందించావు జానకమ్మ…..ఎంత చెప్పనమ్మా నీ ఘనతను..ఆకాశం దాటింది నీకీర్తి….అష్ట దిక్కులకు ఆవల కు వెళ్ళి పోయిందమ్మ నీ ఖ్యాతి..
previous post
