తెలుగు భాషకు మాత్రమే ప్రత్యేకమైనవి పద్యం,అవధానాలు.అలాగే అన్ని భాషల కంటే అత్యధిక సంఖ్యలోనున్న సామెతలు.పొడుపు కథలు కూడా తెలుగు భాషకే స్వంతం.
ఏ భాషలోనైనా అసంఖ్యాకంగా ఉండే మాటలు నామవాచకాలు.వ్యక్తుల,స్థలాల,పశుపక్ష్యాదుల పేర్లన్నీ నామవాచకాలేననునది తెలిసిన సంగతే.విద్యావంతుల సంభాషణల్లో,రచనల్లో ఈ రకం నామవాచకాల వాడుకలో కొన్ని ప్రత్యేకార్థాలూ, ఒడుపులూ కనిపిస్తాయి.కొన్ని సందర్భాల్లో ఇటువంటి మాటలకు నిశ్చితమైన అర్థం వుంటే, కొన్ని సమయాల్లో విరుద్దార్థమో, విపరీతార్థమో ఉండవచ్చు.కొన్ని సరదాకు సృష్టించుకున్నవైతే, కొన్ని ప్రయోజనదృష్టితో పుట్టినవి.
పై విధమైన నామవాచకాలను కొందరు జాతీయాలని వ్యవహరిస్తారు.కొన్ని తెలుగు సాహిత్యంలో తెలుగువాళ్ళ వాడకంలో పుట్టి,వ్యాప్తిలోకి వచ్చినవైతే,మరికొన్ని సంస్కృత వాఙ్మయంలో పుట్టినా,తెలుగువాళ్ళు స్వంతం చేసుకున్నవి.ఈ మాటల్లో వ్యక్తి నామాల మీద పుట్టినవి,ఇతర సాధారణ విశేష్యాల్లాగా సహజమైనవి కావు-విద్యావంతుల విశ్వామిత్ర సృష్టిలో ఉద్భవించినవి.
మనం తరచుగా వినే, వాడే కొన్ని జాతీయాల గురించి ముచ్చటించుకుందాం..
అక్షింతలు
ఈ తెలుగు మాటకు సరైన సంస్కృత రూపం అక్షతలు
క్షతం అంటే దెబ్బ,ప్రమాదం.అవేవీ లేకుండా మంత్రపూతంగా వేసే బియ్యపు గింజలు అక్షతలు.శుభకార్యాలలో తెల్లగా ఉన్న బియ్యాన్ని అక్షతలుగా వాడుతారు.ఆశీర్వదించటానికి,దీవించటానికి తలమీద అక్షతలు చల్లటం పరిపాటి.అలాగే దైవపూజలో కూడా అక్షింతలు చల్లుతాం.అయితే- చల్లు కు బదులు వేయు అనే పదాన్ని వాడినప్పుడు తిట్టు,దూషించు,విమర్శించు అనే అర్థాలు వస్తాయి.భూత,ప్రేత పిశాచాదులను పారద్రోలటానికి ఉచ్ఛాటన మంత్రాలు చదువుతూ,అక్షింతలను నాలుగు మూలలా విసురుతారు.భిన్న విధాల వాడుక ఉన్నందున విడిగా అక్షింతలు అనే మాట వాడినప్పుడు సందర్భాన్ని పురస్కరించుకుని అర్థం చేసుకోవలసివుంటుంది.
ఆటవిడుపు
ఇది పాతకాలపు వీధిబడుల సాంప్రదాయంలో ఒక భాగం.ఆనాటి బోధన పూర్తయ్యి,పిల్లలు ఇళ్లకు వెళ్లేముందు ఒక పద్యం చెప్పేవారు.మరునాడుదయం దానిని గుర్తుపెట్టుకొని ఉపాధ్యాయుడికి ఒప్పచెప్పాలి.తప్పు చెపితే,ఒకటికి పదిసార్లు పలకపై దాన్ని సరిగా వ్రాసి,చూపాలి.పిల్లలు ఆడుకోవడానికి పోబోతుండగా బడి విడుపు సమయంలో నేర్పిన పద్యాన్ని ఆటవిడుపు పద్యమనేవారు.ఈ విధమైన చదువు ఇప్పుడు లేకపోయినా,ఆటవిడుపు అనే మాట మాత్రం అర్థవిశేషం సంపాదించుకుని, పనిలేకపోవటం అనే భావంలో వ్యవహృతమవుతున్నది.
గాడిదగుడ్డు
గాడిద నాలుగుకాళ్ళ జంతువు.అది పిల్లల్ని కంటుందే కానీ,గుడ్లు పెట్టదు. కాబట్టి,గాడిదగుడ్డనేది కుందేటికొమ్ములాగా లేనిదానితో సమానం.గాడిదగుడ్డంటే శూన్యం.ఈ మాటను విసుగుతో,నిందార్థకంగా మాత్రమే వాడుతారు.

1 comment
Predict the babies sexRedskins raido xxxPeter
norths cumshotsBdsm training listFree gay nude siteCock robin only the very best
lyricsBig tit bbw videoYoung teen voyeur videos xnxx Stream better sexMiranda keyes nudeFellation deepthroatAdult
superstore myrtle beachBig cocks trying to
fuckGay bearmen picturesAriel nude galleriesKenya hijuelos
sexReplacement of thumb joint https://xnxxindo.cc/ Adult desktop backgroundsFree jpegs of nude
womenVideo vulvaOlder matures fuckingErotic gay bear dad
storiesWillll exercising lose boy boobsNude mature women doing housework
picturesSeasoning for chicken breastVagina pictures of cum xnxx
Amateur audio book v aAdult speech and languageForbiddin lesbianMike mckeown sex offendersCinzia lotti nudeFuck me lingerieAdult fan fiction hearts kingdom