ఇందిరా ప్రియదర్శిని ఆమె అసలు పేరు.
1917-నవంబర్ 19 వ తేదీ న ఉత్తర్ ప్రదేశ్ లోని అలహాబాద్ లో జన్మించారు.
తల్లి దండ్రులు -కమలా దేవి
జహార్ లాల్ నెహ్రూ.
భారతదేశపు తొలి (ఏకైక) మహిళా ప్రధాని.
1942 లో ఫిరోజ్ గాంధీతో వివాహం జరిగింది.
మొదట -1962-64 వరకు
సమా చార ప్రచారశాఖ మంత్రి గా బాధ్యతలు నిర్వహించారు .
బ్యాంకుల జాతీయికరణ చేసారు .గరీబీ హటావో నినాదంతో పేదరిక నిర్మూలనకు కృషి చేశారు.
20 సూత్రాల పథకం అమలు చేసారు.
పాకిస్తాన్ బంగ్లాదేశ్ యుద్ధంలో బంగ్లాదేశ్ కు మద్దతుగా నిలిచి ప్రపంచ దేశాల మన్ననలు పొందారు అప్పుడు 1972లో ఆమెకు “భారతరత్న”ను ప్రకటించింది భారతదేశం.
ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న అటల్ బిహారీ వాజ్ పాయ్ “మేరీ దేశ్ కా కాళికామాత హై ఇందిరాగాంధీ” అన్నారట పార్లమెంటులో.
1975 విధించిన ఎమర్జెన్సీ
ఆమె జీవితంలో ఒక మచ్చగా మిగిలింది.
స్వర్ణ దేవాలయం పై సైనిక చర్య తీసుకున్నందుకు ఆమె ప్రాణాలే బలి పెట్టవలసి వచ్చినది.
1984 అక్టోబర్ 31న సొంత అంగ రక్షకుల చేతిలో ప్రాణాలు కోల్పోయింది.
ఒక మహిళగా ఒక జీవితకాలం ఆత్మవిశ్వాసంతో నిలబడిన ధీరవనిత ను ఆమెలో మనం చూడవచ్చును.
