కలకాలం ఆనందంగా బ్రతుకుదామనుకున్నావు నీవు,
కానీ నువ్వు గ్రహించలేదు, కడుపులోవున్నపుడే కత్తుల హత్యకి బలౌతవని…
నీ జన్మని ఈ భూదేవితో బంధం ఏర్పడుచుకోవాలకున్నావు నువ్వు
కానీ నీవు అనుకోలేదు, నీ పాదం ఈ భూమి పై ఏ ఒక్క అణువుతో సంబంధం కుదుర్చుకోలేదని …
కడుపులోవున్నపుడే ఈ లోకాన్ని కొత్తకోణం లో చూద్దామనుకున్నావు నీవు,
కానీ నీకు తెలియదు గర్భం దాటి లోకాన్ని చూడలేవని…
నీవు ఊహించలేదు నీ జీవితాన్ని మంచి జ్యోతి లా నిలిపేవాళ్ళే,
ఒక్క నిమిషం లో నీ జీవితాన్ని ఆర్పేయడానికి సిద్ధం అవుతారని…
కానీ ఇప్పుడు అర్థం అర్థమౌతుంది, నీ పాదం తో ఈ స్పృష్టి పులకరించాల్సిన స్థితి నుండి ఇప్పుడు నీ పిండ రూపాన్ని కడుపులోనే కనుమరుగు చేసే స్థితికి ఈ లోకం దిగజారిపోయిందని…
చివరికి నీకూ తెలిసిపోయింది,
ఇక ఈ జన్మకి నీకు సెలవని…
కవితలు
కాల గమనం
రేయింబవళ్ళ సూర్యచంద్రుల
యానం
కాల గమనంలో మలుపులు
కాలక్రమంలో అవి
అదృష్టాల పిలుపులు!
నేడుకు
నిన్నటి మాపు ఒక ఊపు
నేటి ఊపులు
రేపటి ఊహల చూపులు!
క్షణం క్షణం కరిగిపోయే కాలాన్ని
అనుక్షణం ఆస్వాదించు
కాలం ఒక ప్రవాహం అయితే
నీ జీవన స్రవంతిలో నీవు సాగు
కాలం ఓ ప్రయాణం అయితే
నీ గమ్యం చేర్చే దారిలో
నలుగురితో కలిసి ఏగు!
కాలం ఓ తెల్ల కాగితం అయితే
హృదయాన్ని ఆవిష్కరించుకో!
కాల స్రవంతి లో జీవితం తంతు
కలకాలం జీవించు నీ వంతు
కాలం కర్మం కలిసి వస్తే
అదృష్టం నట్టింటికి నడిచి వస్తుంది !
విరాట్ స్వరూపమైన కాలం
విశ్వ సమస్తానికి మూలం !
కాలం ఊరికే ఉండదు ఉండనీయదు
ఏదో ఒకటి జరిపిస్తనే ఉంటది
వృధా గా గడిపేయకు
మానవత్వానికి వన్నెలద్దు!
కాలం తీర్పు విలక్షణ మార్పు
అది చేర్పుల, తీసివేతల కూర్పు!
కాలం దిక్కు చూడకుంటే చిక్కు
కాలంలో బ్రతికే కాయాలు సృక్కు!
కాల…
తుపాకుల రాష్ట్రంలో
తూటావై మొలిచిన వాడా ప్రజానాయకుడా జోహార్
దార్శనికుడా జోహార్
సామాజిక తుట్టె పురుగులకు
రాజకీయ విషనాగులకు
శత్రువుగా అవతారమెత్తిన సవ్యసాచి ప్రజానాయకుడా జోహార్
నిలువెత్తు నిజాయితీపరుడా జోహార్
హక్కులు కావాలంటే పోరాడటం నేర్చుకోండని
ప్రతి అడుగులోనూ నిలబడటం నేర్చుకోండని
ప్రబోధించినవాడా జోహార్
ప్రజానాయకుడా జోహార్
భారత జనాభా ఉమ్మిలో
బ్రిటిష్ పాలకులు కొట్టుకుపోతారని స్వాతంత్ర్య స్ఫూర్తిని పూరించిన వాడా ప్రజానాయకుడా జోహార్
స్వాతంత్ర్య సమరయోధుడా జోహార్

బీసీలకు రిజర్వేషన్లు యాబైఏళ్ళకు ముందే
అందించిన ఘనుడా
బహుజన రాజకీయ ఉపాధ్యాయుడా
లోకనాయకుని అనుచరుడా జోహార్
ప్రజానాయకుడా జోహార్
విద్యలో మెట్రిక్య ఫలితాలు
అమ్మాయిల వివాహాలకు అడ్డుగోడకాగా ఆంగ్ల ఉత్తీర్ణత నిబంధనను రద్దుచేసినవాడా
ప్రజానాయకుడా జోహార్
మా పాలిటి బోధిసత్వుడా జోహార్
నిజం, నిగ్రహం, కరుణ
మూడు కళ్ళుగా నిలుపుకన్న త్రినేత్రుడా
క్రమశిక్షణ నిరాడంబరతా
నిలువెత్తు విగ్రహమైనవాడా
మచ్చలేని చంద్రుడా జోహార్
ప్రజానాయకుడా జోహార్
ఆస్తుల ఆశలేని నిస్వార్ధ పరుడా
అధికారుల సిఫార్సులను అడుగక
క్షురక వృత్తే ఘనమని చాటినవాడా
ప్రజానాయకుడా జోహార్
మానధనుడా జోహార్
బడుగుల కోసం కర్పూరమై కరిగిన
కర్పూరీ ఠాగూర్ జోహార్
మర్యాద లక్ష్మణరేఖను
కలనైనా దాటని
మహనీయుడా జోహార్
ప్రజానాయకుడా జోహార్
దూరం అంటే ఎంతదూరం
కొలిచి చెప్పే సాధనాలు ఎన్నైనా ఉండవచ్చు
అంతరాలు అవగతమౌతాయా?
మనిషికి,మనసుకు దూరం ఎంత?
శూన్యమా ! అనంతమా !!
కాలం మాటున దాగిన ప్రశ్నలలో
ఊపిరి విలువ ఎంత?
బేరీజు వేయవచ్చా?
సొంతమనుకొని, సొంతం కానీ
అన్ని బంధాలను పెనవేసుకొని
చెట్టాపట్టాలేసుకోకుండా ఉన్నట్టుండి మటుమాయం
హార్ట్ ఎటాక్ తో ఆయువు అంతం
జేబుకున్న చిల్లులు లెక్క పెడితే
గుండెకు ఐన గాయాలు కనిపిస్తాయా?
ఎపుడు ఏ ఉచ్చులో పడుతారో
తనకే తెలియని అమాయకత్వం మనిషిది
కానీ అన్ని ఊహాలు వేయగల అసాధ్యులు !
చిన్న జీవితంలో
దూరమెంతో తెలియని భారప్రయాణం
లెక్కలు చెప్పమంటే ఏమని చెప్పను?
జవాబులు లేని ప్రశ్నలకు
కొలవలేని సమాధానాలకు
నాకు నేనే ఎంతదూరమో??
ఓటమి ఒక శాశ్వత జ్ఞాపకం
అనుభవిస్తేనే గాని తెలియనిది
మొన్నటి ప్రణాళిక
నిన్నటి కార్యాచరణ
నేటి ఫలితం
భవిష్యత్తు ఆలోచనకు
‘ధన’ తో ఎవరో
‘తన’ తో ఎవరో తేలిపోయింది
ఓటమికి ఉన్న కసి
గెలుపుకు ఉండదు
నైతికత ఎప్పుడూ గొప్ప లక్షణమే
వెన్నుపోటు చారిత్రిక అవలక్షణం
వెనుక పొడవాలనుకున్నవాడికి
ఆ అవలక్షణమే సాధనం
బుద్ధి మందమైతే
బంధం తెగిపోతుంది
వ్యూహం మారుతుంది
మనిషి అసలు స్వరూపం బయటికి కనబడదు
బాహ్య రూపం ముసుగు మాత్రమే
ప్రవర్తన అంతా ఒక నటన మాత్రమే
ఈ నాటికీయ ప్రయాణం
పంతంతో ఒకలా
పగతో ఒకలా ఉంటుంది
అవసరంతో ఒకలా
ఆదరంతో ఒకలా ఉంటుంది
మనం లేని చోట వినబడే మాటలో
మనమెవరం అనేదే ముఖ్యం
నలుగురు కొట్టిన చప్పట్లు
మనకోసమా కాదా సరిచూసుకోవాలి
కదులుతున్న గడియారం ముల్లు
రేపటికి ఒక కొత్త ప్రశ్నాపత్రాన్ని తయారు చేస్తుంది
కాలం గుండ్రంగా ఉంటుంది
రాత్రి పగలు అందరికీ ఒకటే
ఈ చాపరేఖ ఇప్పుడు నాది కాకపోవచ్చు
కానీ రేపు …. ?
నేను తప్పిపోయాను
వెతుక్కోలేదు కాబట్టి
ఎప్పుడనేదీ చెప్పలేను
నేను మరణించాను
శ్వాసిస్తున్నాను కాబట్టి
ఆ విషయము అర్థంకాలేదు
చిన్న చిన్న ఆశల రెక్కలు
అప్పుడప్పుడు మొలచి రాలిపోయేవి
ఊడ్చి పారేస్తున్నదీ నేనే కాబట్టి
ఎదగలేదన్నది తెలియనేలేదు
ఇదంతా ఎందుకు అంటారా?
చెప్పడం అవసరమే..!
గుండె నిండా నింపుకున్న ప్రేమలో
ఓ తొణికిపాటు
తీగలు తీగలుగా అల్లుకున్న బంధాలు
కొంత విడివడిన వెసులుబాటు
అవకాశవాదులు అవసరార్థులు
తప్పిపోయారిప్పుడు
వెరిసి నాకిదొక అవకాశం
వేకువ మెలకువలో
నేనుగానే మేల్కొంటున్నా
పక్షుల కువకువలు
వినిపిస్తున్నప్పుడు
ఊహల రెక్కలు
విప్పుకుని ఎగురుతున్నా
నేనున్నానని ప్రకటించుకుంటూ,
నాలుగక్షరాలు చదివో రాసో
సంబరపడుతున్నా
నిజంగా నేనున్నాను.
జీవిత ప్రయాణం ఇద్దరి కలయిక,
ఆ కలయికలో ప్రేమే ఆధారశిల.
అనురాగం తో అల్లిన మమతా దారం,
భార్య–భర్తల బంధం ఆత్మల సారం.
ఆనందం పంచుకునే హృదయాల రాగం,
బాధల్లో నిలిచే విశ్వాసం దాగం,
ఒకరి కన్నీరు మరొకరికి తుడిపే హక్కు,
అదే ఈ బంధానికి శాశ్వత సాక్ష్యం.
కోపం వస్తే మాటలు మౌనమవుతాయి,
ప్రేమ తాకితే మేఘాలు చినుకవుతాయి,
చిన్న చిన్న తగవులు తీయని జ్ఞాపకాలు,
కలసి నవ్విన క్షణాలే నిజమైన కవితలు.
కాలం మారినా, మనసు మారదు,
వయసు పెరిగినా ప్రేమ తరుగదు,
ఒకరి ఊపిరి మరొకరికి ఆధారం,
అదే భార్య–భర్తల బంధం – జీవన ధారం.
అసూయ ఆమడదూరంలో కూర్చుంటుంది
ద్వేషం అతడి దేహంలో బతకలేక
ఖాళీ చేసి వెళ్ళిపోతుంది
శేషాల లెక్కల్లో
శత్రువుల సంఖ్య సున్నా
కవికో కవితావాక్యాన్నిచ్చే మంచితనం
అతడిలో ప్రసరిస్తున్నందుకేమో
చంద్రుడు తలపాగా మీద వెలుగుతుంటాడు
ప్రియమైన పాటలన్నీ చెవులను ముద్దాడుతుంటాయి
మసకచీకట్లే టార్చ్ లైట్లయి ఎదురొస్తాయి
చిరు చిరు జల్లులు
పూలలా మీద కురుస్తాయి
చురకలు పెట్టిన చేతులే
లేపనాన్ని పూస్తాయి
అహం కొలతలు తగ్గించబడి
దూరాలు దగ్గరగా నిలుచున్నప్పుడే
నిజమైన ప్రేమ..గుండెలను చీల్చుతూ
బయటికొస్తుంది
సన్నని గీతలను చెరిపేసినందుకో
అంతరాలను ఖననం చేసినందుకో
పగ, ప్రతీకారాలను కనబడకుండా ఊడ్చేసినందుకో
జీవన లయాన్విత చందమామకు
గోరుముద్దలు తినిపిస్తూ
ఆ కాంతుల్లో మెరిసిపోతున్న
ఆనందకర దృశ్యాల్లోనే
అతనిప్పుడు తడిసిపోతున్నాడు
సినీ వినీలాకాశ వీధిలో
అందాల కోకిలమ్మ
మా సుశీలమ్మ కు
పుట్టిన రోజు శుభాకాంక్షలు.
గాత్ర శుద్ధతకు, వాక్ స్పష్టతకు
మా సుశీలమ్మ నిలువెత్తు రూపం!
అమ్మ స్వరం తేనె
అమ్మ అక్షరం వెన్నె
అమ్మ ఉచ్చారణ చెక్కిన శిల్పం
బ్లర్ ఉండని high filter కంఠం
అమ్మ పాట వింటే
అలసట పోతుంది
అమ్మ పాట పాడుకుంటే
ఉత్సాహం నిండుతుంది
అందాల మోము
పసిపాప నవ్వు
పండువెన్నెల పలుకు
కనులకు చెవులకు ఇంపు
రచన; డాక్టర్ బండారు సుజాత శేఖర్
భువిదివిగా ప్రకృతి పల్లవించే తరుణం ..
త్రివేణి సంగమం.. గంగా యమునా సరస్వతులు పులకిస్తున్న క్షణం
ఇది అమృతం.. గరుడుడు తల్లి చెరవిడిపించిన సాక్ష్యం ..
సురాసురుల క్షీర సాగర మధనం
ఉద్భవించిన అమృతం… సూర్యచంద్రుల బృహస్పత్రుల సంరక్షణలో
దివి చేరుతున్న వేళ నాసిక్ ప్రయాగ్ హరిద్వార్,సరస్వతి, గోదావరి
పుణ్యక్షేత్రాల చినుకుగా తరింప చేసేహేల ..
మానవాతీత భక్తి ముక్తి మార్గాల అన్వేషణ
అకార నాగ వేవేల సాధు సజ్జనుల కదిలించే కుంభం ;
నేల ఈనినట్లు, పక్షులు రెక్కలు విచ్చినట్లు
పూలు విచ్చారినట్లు, సీతాకోకచిలుకలు బార్లు తీరినట్లు
మహా కుంభమేళ, కుంభమేళా సనాతన సధర్మ సంస్థాపన
చరితలకే చరిత సృష్టించే వైనం;
జగమే జీవనాధారం; జలమే జీవ సాకారం..
పుణ్య స్నానాల పుణ్యకార్యాల పాపపుణ్యాల బేరీజు
మనిషి మరొక్క మారు, ఇంకొక్క మారు అంత: మధనం; పిత్రుణాన్ని తీర్చే సతరుణం..
భారతాంబ కర్మభూమిగా పులకింత
ప్రపంచ పటాన మహాకుంభమేళ ఉత్సవం
నిరంతరం పుణ్యభూమిని జే గంటలతో శ్లాగిస్తున్న మహోత్సవం;
ఏది ఏమైనా
మనిషి మనీషిగా మారాలంటే ధర్మాచరణ కర్మ క్రియలే కాదు
నిన్ను నిన్నుగా సంస్కరించుకోవాలని మరువకు..
మానవత్వ శిఖరాన్ని గంగా పవిత్రతను పొందాలంటే
ప్రకృతి పరిరక్షకుడువై పల్లవించు…
కాలుష్య రహిత గంగా యమున సరస్వతుల, గోదావరి కృష్ణా ప్రవాహాన్ని. . భువిదివిగా ప్రకాశింపచేయి.
