మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

గార్గి

by ఆచార్య మస‌న‌ October 24, 2021
written by ఆచార్య మస‌న‌

దైవదత్తమైన ప్రతిభ విషయంలో స్త్రీ పురుషులిద్దరూ సమానమే. అన్నిరంగాల్లో లాగా ఆధ్యాత్మిక రంగంలోను ప్రసిద్ధి గల మహిళా మణులెందరో భారతీయ సమాజంలో కనిపిస్తారు.

వేదమంత్రార్థం తెలిసిన వారిని ద్రష్టలని పిలుస్తారు. అట్టివారిలో ఆత్రేయి, లోపాముద్ర, ఇంద్రాణి, పౌలోమి మొదలైనవారి సరసన నిలబడ గల్గిన విదుషీమణి గార్గి, గార్గి అద్భుతమైన చరిత్ర బృహదారణ్యకోపనిషత్తులో చోటు చేసుకున్నది.

గార్గి వాచక్ను మహర్షి కూతురు. తండ్రి పెంపకంలో ఆమె గొప్ప వక్తగా పేరుగాంచింది. విశిష్టమైన వ్యక్తిగా రాణించింది. ఆశ్రమ వాతావరణంలో పెరడగం వల్ల ఆమెలో ఆధ్యాత్మికానురక్తి ద్విగుణీకృతమైంది. తోటి బ్రహ్మచారిణులతో సంభాషించడం వల్ల వాదపటిమను సంతరించుకున్నది. గార్గి వాదబలానికి తలలూపని వారు లేరు. ఆమె సంవాదశైలికి మునిపల్లెలే కాదు, ఆనాటి రాజస్థానాలు కూడా మురిసిపోయాయి.

జనక చక్రవర్తి ఒకసారి ‘దక్షిణ’మనే పేరుగల మహాయాగాన్ని తలపెట్టినాడు. ఆ యాగానికి దేశంలోని నలుమూలల నుంచి వేదపండితులు వచ్చారు. యాగం ఫలవంతమైంది. కాని ఆ మహా చక్రవర్తికి ఇంకా తృప్తి కలగలేదు. వచ్చిన పండితులలో బ్రహ్మవేత్తలెవరో తెలుసుకోవాలనుకున్నాడు. తానే నిర్ణయిస్తే అది రాజుగారి పక్షపాత దృష్టికి నిదర్శనమవుతుంది. అందుకే ఆయన ఒక ఆలోచన చేశాడు.

తన కొలువు కూటానికి సమీపంలో ఒక వెయ్యి ఆవుల్ని తెప్పించి ఉంచాడు. ఆ గోవుల కొమ్ములకు పదేసి బంగారు నాణాల చొప్పున అలంకరింపబడడం చూపరులకు అద్భుతంగా తోచింది.

జనకుడు సభనొక్కసారి తేరిపార జూశాడు. ఆ సభలో ఆసీనులైనవారు సామాన్యులు కారు. వారిలో అశ్వలుడు, ఆర్తభాగుడు, భుజ్యుడు, ఉశస్త చాక్రాయణుడు, కహోలుడు, విదగ్గుడు, శాకుల్యుడు అందరిని మించి యాజ్ఞవల్క్యుడున్నాడు, విదుషీమణుల్లో గార్గి ఉంది.

రాజు సభాంగణంలో తమ విద్వత్తులో ప్రకాశిస్తున్న పండితులనుద్దేశించి “ఓ పండితులారా! మీరంతా బ్రహ్మజ్ఞులుగా కనిపిస్తున్నారు. ఐతే మీ అందరిలో ఎవరు గొప్పవారో తేల్చే శక్తి నాకు లేదు. కాని మీలో ఎవరు బ్రహ్మవేత్తలో వారికి వెయ్యి గోవులను బహుమానంగా ఇస్తాను. వారీ గోవులను ఏ ఇబ్బంది లేకుండా తమ ఆశ్రమానికి తోలుకొని పోవచ్చు”నని ప్రకటన చేశాడు.

ప్రకటన విననైతే విన్నారుగాని ఆ పండితులెవ్వరూ తాము బ్రహ్మవేత్తలమని చెప్పడానికి ముందుకు రాలేకపోయారు. ఒకరి ముఖం మరొకరు చూసుకుంటున్నారు. అప్పుడు ఆ సభలో వున్న యాజ్ఞవల్క్యుడు తన శిష్యుడైన సామశ్రవుణ్ణి పిలిచి, ఆ వెయ్యి గోవులను తన ఆశ్రమానికి తోలుకొని వెళ్ళవలసిందిగా ఆజ్ఞాపించాడు. అప్పటిదాకా చప్పుడు చేయని పండితులు క్రోధావేశానికి లోనై యాజ్ఞవల్కుణ్ణి తిట్టసాగారు. ఆయన తమకంటె గొప్పవాడా? అని ప్రశ్నించసాగారు.

సభలోని కలకలాన్ని గ్రహించిన జనకుని పురోహితుడు అశ్వలుడనేవాడు సభాసదులనుద్దేశించి శాంతంగా ఉండవలసిందిగా కోరుతూ, యాజ్ఞవల్క్యునితో “మీరు అందరికంటె మించిన పండితులైతే మీకివే వందనాలు! మాకూ గోవుల్ని తోలుకొని పోవాలని ఉంది. కాని మీరాపని మమ్మల్ని కాదని చేశారు. ఐతే మేమడిగే ప్రశ్నలకు సమాధానలు చెప్పినట్లైతే అందుకు మేమేమీ నిరోధించం” అంటూ తాను కొన్ని ప్రశ్నలను సంధించినాడు. యాజ్ఞవల్క్యుడు వాటికి తగిన సమాధానాలిచ్చాడు. ఆ తర్వాత వరుసగా అశ్వలుడు, ఆర్తభాగుడు, భుజ్యుడు, ఉశస్త చాక్రాయణుడు, కహోలుడు మొదలైన వారు ప్రశ్నలు సంధించారు. కాని యాజ్ఞవల్క్యుడు ధీరోదాత్తంగా వారి ప్రశ్నలనే బాణాలను ఎదుర్కొని ఏమాత్రం గాయపడక సమాధానాలిచ్చాడు. అంతేకాదు, “నేను బ్రహ్మవేత్తను. వెయ్యి గోవులను నా ఆశ్రమానికి తోలుకొని పోవడానికి అనుమతి ఇవ్వండి” అని రాజునుద్దేశించి పలికినాడు. రాజు మౌనంగా ఉన్నాడు కాని, అతని పురోహితుడు అశ్వలుడు అడ్డుపడ్డాడు. అంతకుముందే వాదంలో అశ్వలుడు కూడా ఓడిపోయి ఖంగుతిన్నాడు.

పురుష పుంగవులెవ్వరూ యాజ్ఞవల్యుణ్ణి వాదంలో ఓడించలేకపోయారు. ఇక నారీజనంలో విదుషీమణులెవరైనా ఉంటే తప్పక యాజ్ఞవల్యుణ్ణి గెలిచేవారనే మాటలు వినిపించాయి. క్రమంగా అలా మాట్లాడుతున్న వారి చూపులు ఒక విద్వన్మణి మీద వాలాయి. ఆమె ఎవరో కాదు, గార్గి! తపస్సే స్త్రీరూపం దాల్చినట్లుంది. విద్వత్తే ఆకారం పొందినట్లుంది. సాక్షాత్తు వేదమాత ప్రత్యక్షమైనట్లు గోచరిస్తుంది.

మిన్నకుండడం విద్వాంసుల పని కాదని తెలిసిన గార్గి జనక మహారాజుతో, యాజ్ఞవల్క్యుణ్ణి ప్రశ్నించడానికి అనుమతి కోరింది. అలా కోరడంలోనే ఆమె విద్వత్తుతో పాటు ఎంతటి వినయశీలం కలిగిందో తేటతెల్లమవుతుంది.

‘ఇంత గొప్ప పండితులం మేమే యాజ్ఞవల్యున్ని గెలవలేకపోయాం. ఒక స్త్రీ ప్రశ్నలు అడగడమా?’ అని కొందరు పండితులు గుసగుసలుపోయారు. కాని ధర్మప్రభువైన జనకుడు “ఇది విద్వత్సభ. ప్రతిభ, పాండిత్యం ఒకరి సొత్తు కాదు. అవి ఎవరిలోనైనా ఉండవచ్చు. కనుక యాజ్ఞవల్యున్ని ప్రశ్నించడానికి గార్గిని అనుమతిస్తున్నాను” అని పలుకగానే సమస్త నారీలోకంతో పాటుగా గార్గి తన అంతరంగంలో ఎంతో సంతోషపడింది.

మహర్షిని చూసి “ఓ యాజ్ఞవల్క్యా! కాశీవాసియో, విదేహనగరవాసియో, ఎవరైనా ఒక వీరుడు వాడిగల బాణాలతో శత్రువులను ఎదిరించినట్లే నేను మిమ్మల్ని రెండు ప్రశ్నలతో గెలవాలనుకుంటున్నాను” అనగా ఆ మహర్షి అందుకు సరే అన్నాడు.

గార్గి అడిగిన మొదటి ప్రశ్న : “దివికి పైనా, భూమికి క్రిందా, మధ్యనున్న అంతరిక్షంలో ఉన్న దానిపేరేమిటి?”

యాజ్ఞవల్క్యుని సమాధానం : “దివికి పైన, భూమికి క్రింద అంతరిక్ష్యంలోను అంతటా ఉన్నది ఆకాశమే”.

గార్గి రెండవ ప్రశ్న : “ఈ ఆకాశం దేనిలో ఓతప్రోతమై (వ్యాపించి) ఉన్నది?”

యాజ్ఞవల్క్యుని సమాధానం : “ఈ ఆకాశం అక్షర పరబ్రహ్మలో వ్యాపించి ఉన్నది. నాశం లేనిది అక్షరబ్రహ్మం. దానివల్లనే సృష్టి స్థితిలయలు వరుసగా జరుగుతున్నాయి. మూడు కాలాలు, మూడు లోకాలు ఆ అక్షరబ్రహ్మ ఆజ్ఞకు లోబడి నడుచుకుంటాయి. ఐదే అక్షరబ్రహ్మం కనిపించదు. కాని అన్నింటినీ చూస్తుంది. అన్నింటిని వింటుంది” అని సృష్టిరహస్యాన్ని విప్పి చెప్పిన యాజ్ఞవల్క్యుని మాటలకు హర్షించిన గార్గి, అతనిని బ్రహ్మవిదులలో శ్రేష్ఠుడని స్వయంగా ప్రకటించింది, సభ అంతా పులకించి పోయింది.

భారతదేశ చరిత్రలో ఒక మహిళ తన అపారమైన వాదపటిమతో ఒక పురుషుణ్ణి బ్రహ్మవేత్తగా నిరూపించిన ఘట్టం సువర్ణాక్షరాలతో లిఖింపదగింది, నారీలోకానికి గర్వకారణమైంది.

గార్గి, యాజ్ఞవల్క్యుడు పరస్పరం అభినందించుకున్నారు. జనక మహారాజు ఎంతగానో సంతోషించాడు. గార్గిని అందరి హర్షధ్వానాల మధ్య సన్మానించినాడు. ఆ తర్వాతనే జనకుడు యాజ్ఞవల్యుణ్ణి గురువుగా చేసికొని అతనివల్ల బ్రహ్మోపదేశం పొంది మోక్షార్హత సంపాదించినాడు.

– ఆచార్య మసన చెన్నప్ప.

23.10.2021

October 24, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

తెలుగులో ఉదాహరణ వాఙ్మయం

by Dasharathula Narsaiah October 24, 2021
written by Dasharathula Narsaiah

తెలుగు సాహిత్యంలో ప్రాచీన యుగం నుండి ఆధునిక యుగం వరకూ ఎన్నెన్నో ప్రక్రియలు పుట్టుకొచ్చాయి. ద్విపదలు, శతకాలు, రగడలు, ఉదాహరణలు, యక్షగానాలు, పదకవితలు, నవల, కథానిక, నాటకం, నాటిక, ఏకాంకిక – వంటి ప్రక్రియలు సాహిత్యంలో నిలదొక్కుకుని వాటి సత్తాను నిరూపించుకున్నాయి.

ఉదాహరణ ప్రక్రియ కూడా 12వ శతాబ్దంలో ఆవిర్భవించి, ఆధునిక యుగం వరకూ కూడా గౌరవింపబడుతున్నది.

పుట్టుక, స్వరూపం : ‘హృ’ ధాతువుకు ‘ఉత్’ అను ఉపసర్గ చేరగా ఉదాహరణం ఏర్పడింది. దీనికి దృష్టాంతం, నిదర్శనం – నైఘంటికార్థాలు. మార్గ కవిత్వానికి సంకేతంగా నిలిచే వృత్త పద్యాలతోనూ, దేశి కవిత్వానికి సంకేతంగా నిలిచే కళికోత్కళితలతోనూ ఉదాహరణ ప్రక్రియ రూపుదిద్దుకుంది. అంటే, ఉదాహరణ ప్రక్రియ – మార్గ, దేశి కవిత్వాలను కలిపిన అద్భుత సాహిత్య ప్రక్రియగా గుర్తింపు పొందింది.

ఉదాహరణ ప్రక్రియలో – తెలుగులోని విభక్తి ప్రత్యయాలకు ఆశ్రయం లభించింది. సర్వ విభక్తులనూ క్రమంగా ఉదాహరించడం ఈ ఒక్క ప్రక్రియలోనే జరుగుతుంది. సృష్టిలోని జీవాత్మ, పరమాత్మల సంగమం లాగా, భాషలోని ప్రకృతి ప్రత్యయాల సంగమం అనివార్యంగా జరిగే సాహితీ ప్రక్రియగా ఉదాహరణ ప్రక్రియ సార్థక్యం చెందింది.

వృత్త పద్యాలతో పాటు, కళికోత్కళితలు కూడా చోటు చేసుకోవడం వల్ల – ఈ ఉదాహరణ ప్రక్రియ సంగీత, సాహిత్యాలను మేళవింపు చేసుకున్న ప్రక్రియలకు ఉదాహరణ ప్రాయంగా నిలిచింది.

సంస్కృత ప్రమేయం లేకుండా తెలుగులో ఆవిర్భవించిన స్వతంత్ర ప్రక్రియగా ఉదాహరణం ప్రత్యేకతను సంతరించుకుంది. తెలుగులో తెలియవచ్చినంతగా, మరే భాషల్లో దీనికి సంబంధించిన సమాచారం తెలియకపోవడం వల్ల తెలుగు సాహిత్యానికే పరిమితమైన వినూత్న రచనా ప్రక్రియగా కూడా ‘ఉదాహరణం’ రూపుదిద్దుకుంది.

నేపథ్యం : ప్రాక్తన మానవుడు ప్రకృతిని ప్రేమించాడు. నిరంతర అన్వేషణాసక్తి – ప్రాక్తన మానవుణ్ణి మిగతా జంతు సముదాయం నుండి వేరు చేసింది. ప్రకృతిని క్రమంగా తాను సాధించిన విజయాలకు మూలంగా భావించాడు. ప్రకృతిలో దైవత్వాన్ని చూసాడు. ఆరాధించడం, పూజించడం అలవాటు చేసుకున్నాడు. రకరకాల స్తోత్ర పాఠాలతో స్తుతించాడు. ఈ స్తోత్ర పాఠాలు మనకు ఋగ్వేదంలో ‘కుంతాప సూక్తములు’ అనే పేరుతో కనిపిస్తాయి. ఈ కుంతాప సూక్తములకే ‘నారాశంసులు’ అని కూడా పేరు.

వేద వాఙ్మయం లోని ‘కుంతాప సూక్తములు’, కాలక్రమంలో లౌకిక వాఙ్మయం లోకి ప్రవేశించాయి.

హరివంశ, విష్ణు పురాణాలలో పృథు చక్రవర్తిని స్తుతించిన సందర్భాలున్నాయి. పృథు చక్రవర్తి యజ్ఞయాగాదులు నిర్వహించే క్రమంలో సూతమాగధులు జన్మించినట్లు పురాణాలు చెపుతున్నాయి. సూత మాగధులు పుట్టిన సందర్భాన్ని పురస్కరించుకొని ఋషులు స్తోత్ర పాఠాలు నిర్వహించారు. ఈ స్తోత్ర పాఠాల పరంపర క్రమంగా లౌకిక సాహిత్యంలోనూ నిలదొక్కుకుంది. ప్రభువుల లోకోత్తర చరిత్రను ప్రచారం చేయడానికి ఈ స్తోత్ర పాఠాలు చదువడం క్రమంగా ఒక అలవాటుగా రూపుదిద్దుకుంది. ఈ స్తోత్ర పాఠాలు భారతాది మహా గ్రంథాలలో కూడా స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఆయా దేవతలను, మానవులను స్తుతించే సందర్భాలలో ఈ స్తోత్ర పాఠాలు కావ్యాలలో ప్రవేశించాయి. అంతేకాదు, ఈ స్తోత్ర పాఠాలు ప్రత్యేక కావ్యాలుగా అవతరించాయి. అట్లా, అవతరించిన స్తుతి ప్రధానమైన కావ్యమే ఈ ఉదాహరణం అని చెప్పవచ్చు.

కాళిదాసు తన రఘువంశంలో మొదటిసారిగా ఉదాహరణ శబ్దాన్ని ప్రయోగించాడు. రఘు వంశంలోని నాల్గవ సర్గలో ఈ కింది శ్లోకం ఉంది.

“శరైరుత్సవ సంకేతాన్యకృత్వా విరతోత్సవాన్

జయోదాహరణం బాహ్వోర్గాపయా మాస కిన్నరాన్”

రఘువంశ మహారాజు శరత్కాల ఉత్సవ సంకేతాఖ్య గణాలను ఉత్సవ రహితులుగా నిర్వీర్యం చేశాడు అనగా వారిపైన విజయాన్ని సాధించాడు. ఈ విజయానికి సూచకంగా కిన్నెరులు ఉదాహరణాన్ని గానం చేశారట! కిన్నెరులు గానం చేసిన ఈ ఉదాహరణమే లౌకిక సాహిత్యంలోనూ, సంస్కృత సాహిత్యంలోనూ ప్రవేశించి ఉంటుందని పల్వురు భావిస్తున్నారు. రఘువంశంలోని జయోదహరణాన్ని మల్లినాథసూరి ఇట్లా వ్యాఖ్యానించాడు.

“కిన్నెరాన్బాహ్వోః స్వభుజయోర్జయోదాహరణం

జయాఖ్యాపకం క్షుద్ర ప్రబంధ విశేషంగా పయామాస”

మల్లినాథసూరి వ్యాఖ్యను పురస్కరించుకొని ఉదాహరణం అనగా ఒక కావ్య విశేషమనీ, గానానుకూలమైనదనీ తెలుస్తుంది. మల్లినాథసూరి తెలుగులో ఉదాహరణ స్వరూపం తెలిసినవాడు కాబట్టి ‘జయోదాహరణమ్’ అనే పదాన్ని చూడగానే ‘జయోదాహరణమ్ జయాఖ్యాపకమ్ -క్షుద్ర ప్రబంధ విశేషమ్ గాపయామాస’ అని అనగలిగాడు.

కాళిదాసు విక్రమోర్వశీయం నాటకంలో కూడా ‘ఉదాహరణమ్’ అనే పదాన్ని ప్రయోగించాడు.

తుల్యానురాగ పిశునం లలితార్థ బంధం

పత్రే నివేశిత ముదాహరణం ప్రియాయాః

ఈ శ్లోకానికి వ్యాఖ్యానం రాసిన రంగనాథుడు ఉదాహరణ శబ్దానికి ‘ఉక్తి’ అను అర్థాన్ని చెప్పాడు. రంగనాథుని దృష్టిలో ‘ఉదాహరణం’ అనేది కావ్యం కాదు. ‘ జయోక్తి’ గానే ఉదాహరణ శబ్దాన్ని వ్యాఖ్యానించాడు. అంటే, సంస్కృత వాజ్మయంలో అప్పటికీ ఉదాహరణ ప్రక్రియ లేదు కాబట్టి అట్లా వ్యాఖ్యానించాడని చెప్పుకోవలసి ఉంటుంది. దీనిని బట్టి తెలుగులో ఉదాహరణ ప్రక్రియ స్వతంత్ర ప్రక్రియ అని తెలుస్తుంది. తెలుగు కంటె ముందు సంస్కృతంలో ఉదాహరణ ప్రక్రియ లేదని కూడా తెలుస్తుంది. అనగా తెలుగులో వెలువడిన స్వతంత్ర ప్రక్రియగా ఉదాహరణ ప్రక్రియ పేరు దక్కించుకుంది.

ఉదాహరణం లక్షణాలు :

  1. ప్రథమా విభక్తి నుండి మొదలెట్టి, సప్తమీ విభక్తి వరకు అన్ని విభక్తులల్లో వృత్త పద్యాలు చెప్పాలి. ఆ తర్వాత సంబోధనలతో పద్యం చెప్పాలి.
  2. చివరలో సార్వవిభక్తకంగా ఒక పద్యాన్ని, అంకితాంక పద్యాన్ని చెప్పాలి.
  3. ప్రథమాది సప్తవిభక్తుల్లోనూ, సంబోధనలోనూ ప్రతి విభక్తిలోని వృత్త పద్యం కింద రగడ భేదాలైన కళికోత్కళికలు చెప్పాలి.
  4. కళిక ఎన్మిది పాదాలు కలిగి వుంటుంది. అందులో సగం అర్థకళిక. ఇది కూడా ఎన్మిది పాదాలలో ఉంటుంది. దీనికి ఉత్కళిక అని పేరు.
  5. ప్రతి విభక్తిలో వరుసగా ఒక వృత్తపద్యం, దాని కింద ఒక కళిక, ఉత్కళిక మాత్రమే ఉంటాయి. అంతకు మించి పద్యాలు ఉండకూడదు.
  6. కళికలోని ప్రతి పాదం చివర ఆయా విభక్తులకు చెందిన ప్రత్యయాలు ఉండాలి. ఉత్కళికలో మాత్రం చివర రెండు పాదాలలో మాత్రమే విభక్తి ప్రత్యయాలు ఉండాలి.
  7. సంబోధనా విభక్తిలోని కళికోత్కళికలు – అన్ని పాదాలలో సంబోధనాంతాలుగానే ఉండాలి.
  8. సార్వవిభక్తి పద్యంలో అన్ని విభక్తులు చెప్పాలి. ఇది సాధారణంగా మత్తేభంలోగానీ, శార్దూలంలో గానీ వుంటుంది.
  9. ఈ ప్రక్రియ స్తుతి ప్రధానమైనది కాబట్టి గానయోగ్యంగా ఉంటుంది. వృత్త పద్యాలు రాగాంగ ప్రధానాలుగా వుంటే, కళికోత్కళికలు తాళాంగ ప్రధానంగా వుంటాయి. త్రిపుట, జంపె, రూపక తాళాలతో కళికోత్కళికలు పాడుకోవడానికి వీలుగా ఉంటాయి. ఆ తాళాలకు అనుకూలమైన త్రశ్య, చతురస్ర, మిశ్ర జాతులు ఈ కళికోత్కళికలలో ప్రకటింపబడుతాయి.
  10. మహాకావ్యాలలో నాయక గుణవర్ణన ప్రధానమైనట్లుగా, ఉదాహరణల్లో నాయక గుణకీర్తనమే ప్రధానం.
  11. సాధారణంగా ఒక ఉదాహరణ కావ్యంలో కళికోత్కళికలూ, వృత్తాలు – అన్నీ కలిసి 26 పద్యాలుంటాయి.
  12. ఉదాహరణ కావ్యంలోని కళికోత్కళికలు ఒక రకంగా రగడ భేదాలే. ఇవి 9 రకాలుగా చెప్పబడినాయి. అవి –
  13. హయప్రచార రగడ
  14. తురగవల్గన రగడ
  15. విజయమంగళ రగడ
  16. మధురగతి రగడ
  17. హరిగతి రగడ
  18. ద్విరదగతి రగడ
  19. జయభద్ర రగడ
  20. హరిణగతి రగడ
  21. వృషభగతి రగడ

ఈ రగడలు 9 రకాలుగా చెప్పినా అందులో ముఖ్యమైనవి నాలుగు మాత్రమే. అవి. 1. హయప్రచార రగడ, 2. మధురగతి రగడ, 3. ద్విరదగతి రగడ, 4. హరిణగతి రగడ.

హయప్రచార రగడలో మూడు మాత్రల గణాలు, మధురగతి రగడలో నాలుగు మాత్రల గణాలు. ద్విరదగతి రగడలో ఐదు మాత్రల గణాలు, హరిణగతి రగడలో ఏడు మాత్రల గణాలుంటాయి. ఈ నాల్గింటిలోనూ ప్రతి పాదంలో నాలుగు గణాలే ఉంటాయి. ఈ నాలుగు గణాలను రెట్టింపు చేస్తే వరుసగా 1.తురగ వల్గనం, 2.హరిగతి, 3.జయభద్రం, 4. వృషభగతి – రగడలు ఏర్పడుతాయి. తురగవల్గన రగడను రెట్టింపు చేస్తే విజయమంగళ రగడ ఏర్పడుతుంది.

ఉదాహరణ వాఙ్మయ  వికాసం

తెలుగులో ఉదాహరణ ప్రక్రియ పాల్కురికి సోమనాథుడు రచించిన బసవోదాహరణంతో ప్రారంభమైంది. అయితే, నన్నయ మహాభారతంలోని ఆదిపర్వంలో ఉదంకోపాఖ్యాన సందర్భంగా ప్రథమా విభక్త్యంత పద్యాలు కనిపిస్తాయి. ఈ విభక్త్యంత పద్యాలే, తెలుగులో విభక్తులతో కూడిన పద్యాలు రాయడానికి అనగా ఉదాహరణ కావ్యాలు ఆవిర్భవించడానికి మూలకారణమయ్యాయని కొందరు అభిప్రాయపడుతున్నారు.

“దేవ మనుష్య లోకములఁద్రిమ్మరుచున్ విపుల ప్రతాప సం

భావిత శక్తి శౌర్యులు నపార విషోత్కట కోప విస్ఫుర

త్పావక తాపి తాఖిల విపక్షులునైన మహానుభావులై

రావత కోటి ఘోర ఫణిరాజులు మాకుఁ బ్రసన్నులయ్యెడున్”

– ఇట్లాగే ‘మాకు ప్రసన్నుడయ్యెడున్’ – అను పాదాంతంతో మరి మూడు పద్యాలున్నాయి.

12వ శతాబ్దంలో, వీర శైవమతాన్ని తెలుగు దేశంలో విస్తృతంగా ప్రచారం చేసిన శివకవులలో పాల్కురికి సోమనాథుడు ప్రథముడు. ఆయన లేఖిని నుండి బసవోదాహరణం రావడం, ఒక రకంగా శైవ మత ప్రచారానికి ఇది ఉపయోగపడి వుంటుందని భావించడంలో తప్పులేదు. వీరశైవ మత స్థాపకుడైన బసవేశ్వరుణ్ణి కలియుగ రుద్రుణిగా సాక్షాత్కరింపజేస్తూ ఈ కింది పద్యం చెప్పాడు.

“వసిగొని యెవ్వడేని బసవాయను నీ సుకృతాక్షర త్రయం

బెసగ పఠించెనేని గిరిజేశుని కాతని వక్ష గహ్వరం

బసదృశ్య గేహమన్న యవి యార్యుల వాక్యములట్ల కావునన్

బసవన (బుణ్యమూర్తిఁ దలపంగదె చిత్తమ పాయ కెప్పుడున్”

బసవా! అను సుకృతాక్షర త్రయాన్ని పఠించినంత మాత్రంచేత పరమేశ్వరుడు ఆ భక్తుని ముఖ గహ్వరంలో నివసిస్తాడని చెప్పడంతో బసవేశ్వరునికి పరమేశ్వరత్వాన్ని – ఆపాదించింది ఈ పద్యం.

భాషాపరంగా బసవోదాహరణాన్ని పరిశీలిస్తే చతుర్థి విభక్తి ప్రత్యయంలో ఇపుడున్న కొఱకు, కై- ప్రత్యయాలు కాకుండా, ‘కునై’ రూపం కనబడుతుంది. ఉదాహరణకు ఈ కింది కళికను గమనిద్దాం!

వెండియును నిర్మల ప-విత్ర గోత్రునకు నై

పండిత స్తవనీయ – పాత్ర గాత్రునకు నై

దురిత భంజన కళా – ధుర్య చరితునకు నై

సరవి నిష్ట వ్రతా – శ్చర్య భరితునకు నై

సవిశేష విమలగుణ – జాలలోలునకు నై

శివయోగ సంధాన – శీల పాలునకు నై

……………………………………….

…………………………………………

ఇట్లా సాగిపోతుంది కళిక.

భాషా చరిత్ర పరిణామ క్రమంలో విభక్తి ప్రత్యయాలు ఎట్లా రూపాంతరం చెందాయో తెలుసు కోడానికి, ఉదాహరణ వాజ్మయ ప్రక్రియ చక్కగా పనికి వస్తుందని ఈ ఉదాహరణ ఋజువు చేస్తుంది.

క్రీ.శ. 1320 ప్రాంతంలో రావిపాటి త్రిపురాంతకుడు త్రిపురాంతకోదాహరణాన్ని రచించాడు. శ్రీశైలానికి తూర్పు వాకిలిలో కొలువుదీరిన దేవుడు త్రిపురాంతక దేవుడు. ఆయన మీద రాసిన కావ్యమే త్రిపురాంతకోదాహరణం. త్రిపురాంతకోదాహరణంలో కన్నప్ప, సేనమరాజు, నంబి, భల్లహుడు, చిఱుతొండడు వంటి శివభక్తులు ప్రస్తుతింపబడినారు. ఈ కావ్యంలో శివుని ఉతృష్టతను చాటి చెప్పే అర్ధనారీశ్వరత్వం, గంగాధారణం, దక్షాధ్వర ధ్వంసం, కపాల భిక్షాటనం, త్రిపురాసుర సంహరణం మొ|| పౌరాణిక విషయాలు ప్రస్తావించబడినాయి. వీరశైవం కాకుండా శివాద్వైత మార్గమే ఈ ఉదాహరణ కావ్యంలో ప్రతిపాదించబడింది.

మానవల్లి రామకృష్ణ కవి త్రిపురాంతకోదాహరణాన్ని వెలుగులోకి తీసుకువచ్చాడు. ఈ సందర్భంగా – “దీని శబ్దార్థ మాధుర్యానికి మెచ్చి, ఈ కృతి రత్నం చిన్నదైనప్పటికీ – దీనిని పండితులు కంఠాలంకారంగా స్వీకరిస్తారని” భావించి పరిష్కరించినట్లు వ్యాఖ్యానించాడు.

15వ శతాబ్దంలో సంపూర్ణమైన ఉదాహరణ కావ్యాలు లభించలేదు గాని, ఉదాహరణ కావ్య భేదమైన ‘విద్దళి’ లభించినట్లు నిడుదవోలు వేంకటరావు తెలియబరిచాడు. ఈ కావ్యంలో వృత్త పద్యాలతో పాటు కంద, గీత దేశీయ ఛందస్సులు మిళితమై ఉన్నాయని తెలిపాడు.

16వ శతాబ్దంలో తాళ్ళపాక పెద్ద తిరుమలాచార్యుడు వేంకటేశ్వరోదాహరణాన్ని రచించాడు. ఆయనకు సమకాలీన కాలంలో చిత్రకవి పెద్దన హనుమదోదాహరణం రచించాడు. పెద్ద తిరుమలాచార్యుడు వేంకటేశ్వరోదాహరణంలో సార్వవిభక్తిక పద్యం తర్వాత షష్యంతాలతో కూడిన అంకితాంక పద్యాన్ని రచించాడు. ఇది ఒక విలక్షణత్వంగా నిలిచిందని చెప్పాలి.

ఉత్తర ప్రబంధ యుగంలో ప్రసిద్ధ లాక్షణికుడైన అప్పకవి ఉదాహరణానికి లక్షణాలు చెప్పాడు. దానికి లక్ష్యభూతంగా శ్రీ కృష్ణోదాహరణాన్ని రచించాడు. శ్రీకృష్ణుని లీలావిలాసాలు, శిష్ట రక్షణ, దుష్ట శిక్షణ ప్రధానేతి వృత్తంగా ఈ కావ్య రచన సాగింది.

దక్షిణాంధ్ర  యుగంలో బాలకవి అనంతయ్య రాసిన శేషార్యోదాహరణం ఒక్కటే పరిపూర్ణంగా లభించిన ఉదాహరణ కావ్యం. అంకితాంక పద్యం కందంలో ఉండడం దీని ప్రత్యేకత. కందంలో అంకితాంక పద్యం రాసిన తొలి ఉదాహరణంగా ఈ కావ్యానికి గుర్తింపు లభించింది. అయితే ఈ యుగంలో మరికొన్ని ఉదాహరణ కావ్యాలు లభించాయి. కాని అవి అసంపూర్ణ గ్రంథాలే. ఏనుగు లక్షణ కవి రాసిన విశ్వేశ్వరోదాహరణం, నుదురుపాటి సాంబశివమూర్తి రాసిన రఘునాథీయోదాహరణం – అసంపూర్ణంగా లభించిన ఉదాహరణ కావ్యాలే. మచ్చ వేంకటకవి ముఖలింగేశ్వరోదాహరణం కూడా పరిపూర్ణంగా దొరుకలేదు.

పాల్కురికి సోమనాథుని కాలంలో మొదలైన ఉదాహరణ కావ్య ప్రక్రియ ఆయా కాలాలలో తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగింది.

ఆధునిక యుగంలో కూడా ఉదాహరణ కావ్యాలు పుంఖానుపుంఖంగా వెలువడుతున్నాయి. ప్రాచీనకాలంలో వెలువడిన ఉదాహరణల కంటె, ఆధునిక యుగంలో వెలువడుతున్న ఉదాహరణలే అధికం.

ఆధునిక యుగం – వైవిధ్యభరితం

ఆధునిక యుగంలో వెలువడుతున్న ఉదాహరణ కావ్యాలను పరిశీలిస్తే – మనకు వైవిధ్యం అధికంగా గోచరిస్తుంది. సామాజిక శ్రేయస్సు కోసం పాటుపడిన వ్యక్తుల జీవితాలను ఇతివృత్తంగా తీసుకుని అనేక ఉదాహరణలు వచ్చాయి. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసిన వీరుల త్యాగాలను ప్రశంసిస్తూ ఉదాహరణ కావ్యాలు వచ్చాయి. ప్రాంతీయ వైవిధ్యాలను తొలగించి విశాల భావాలను ప్రచారం చేయడమే పనిగా ఉదాహరణలు వెలువడ్డాయి. ఇట్లా, వ్యక్తుల పరంగా, సమాజపరంగా, దేశపరంగా వివిధ ఉదాహరణ కావ్యాలు పుట్టుకొచ్చాయి.

ఆధునిక యుగంలో మానవుడు యాంత్రిక జీవితానికి అలవాటు పడినాడు. సాహిత్యానికి అధిక సమయాన్ని వెచ్చించే పరిస్థితి లేదు. చాలా తక్కువ సమయంలో పూర్తయ్యే కావ్యాలవైపు పాఠకులు మొగ్గు చూపుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకొని, చాలా తక్కువ పద్యాలలో పూర్తయ్యే కావ్యాల మీద ఆసక్తి పెరుగుతుంది. ఇట్లాంటి పరిస్థితుల్లో ఉదాహరణ కావ్యాల మీద ఆసక్తి కనబరచే పరిస్థితులు అధికంగా ఏర్పడుతున్నాయి.

ఆధునిక యుగంలో వెలువడిన ఉదాహరణ కావ్యాలు

  1. నాగేశ్వరోదాహరణం – కీ.శే. మండపాక పార్వతీశ్వర శాస్త్రి                       –        1938
  2. గోపాలోదాహరణం – కళాప్రపూర్ణ విశ్వనాథ సత్యనారాయణ                   –        1940
  3. వీరేశలింగోదాహరణం – మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి                  –        1948
  4. అన్నమార్యోదాహరణం – డా|| తిమ్మావరుల కోదండ రామయ్య                  –        1951
  5. శంకరోదాహరణం – కవి కిశోర శంకరప్రసాద్                                  –        1952
  6. శ్రీమద్రామానుజోదాహరణం – చెలమచర్ల రంగాచార్యులు –        1952
  7. ఆంధ్రలక్ష్మీ వైభవోదాహరణం- చెలమచర్ల రంగాచార్యులు –        1952
  8. విశాలాంద్రోదాహరణం – డా|| దివాకర్ల వేంకటావధాని                            –        1956
  9. వీరభద్రోదాహరణం – మల్లంపల్లి వీరేశ్వరశర్మ                                  –        1961
  10. విరూపాక్షోదాహరణం – మల్లంపల్లి వీరేశ్వరశర్మ                                  –        1961
  11. లక్ష్మీనృసింహోదాహరణం- డా. సుప్రసన్న –        1962
  12. సామగాన ప్రియోదాహరణం – శ్రీమతి బుర్రా కమలాదేవి –        1963
  13. వివేకానందోదాహరణం – పాటిలు తిమ్మారెడ్డి                                                               –              1963
  14. వేంకటేశ్వరోదాహరణం – గాజుల వీరయ్య                                          –        1963
  15. రాధాకృష్ణోదాహరణం – వడ్డాది సీతారామాంజనేయ కవి                         –        1965
  16. శ్రీరామోదాహరణం – అత్తిలి వేంకటరమణ                                     –        1966
  17. శ్రీసత్యసాశాయీశ్వరోదాహరణం- ఉప్పాడ రాజారావు – 1966
  18. శ్రీనివాసోదాహరణం – జంధ్యాల పాపయ్యశాస్త్రి                                 –        1969
  19. శ్రీ వేంకటేశ్వరోదాహరణం – బండి నాగరాజు –        1971
  20. శ్రీ వేంకటేశ్వరోదాహరణం – వేముగంటి నరసింహాచార్యులు –        1973
  21. జనకోదాహరణం – బల్లి పురుషోత్తం                                         –        1973
  22. కుమారోదాహరణం – బల్లి పురుషోత్తం                                         –        1973
  23. పరిశుద్దాత్మోదాహరణం – బల్లి పురుషోత్తం –        1973
  24. రామలింగేశ్వరోదాహరణం – శ్రీపాద కృష్ణమూర్తి –        1973
  25. సత్యోదాహరణం – జంధ్యాల వేంకటేశ్వర శాస్త్రి                              –        1980
  26. శారదోదాహరణం – జంధ్యాల వేంకటేశ్వర శాస్త్రి                               –        1980
  27. విశ్వనాథోదాహరణం – జంధ్యాల వేంకటేశ్వర శాస్త్రి                               –        1980
  28. సురూపోదాహరణం – సాల్వ కృష్ణమూర్తి                                       –        1980
  29. ఉత్ఫుల్లకం (ఉదాహరణ భేదం)- సంపత్కుమార్ –
  30. కొత్త సద్దలి (ఉదాహరణ భేదం)- ఆరుద్ర –
  31. శ్రీరామోదాహరణం – నిడుదవోలు వేంకటరావు                                –
  32. శ్రీ రాఘవోదాహరణం – కొమ్ము సుబ్రహ్మణ్యవర ప్రసాద్                          –        1983
  33. శ్రీ గణేశోదాహరణం – శ్రీ వేముగంటి నరసింహాచార్యులు                       –        1983
  34. శ్రీ రామచంద్రోదాహరణం – డా॥ దాశరథుల బాలయ్య –        1983
  35. యాదగిరి లక్ష్మీనృసింహోదాహరణం – డా|| దాశరథుల బాలయ్య – 1983

– ఇంకా నా దృష్టికి రాని మరిన్ని ఉదాహరణ కావ్యాలు కూడా వెలువడినాయి. వాటిని కూడా సేకరించి రికార్డు చేయాల్సిన అవసరం ఉంది.

ఉదాహరణ కావ్య భేదాలు :

ఉదాహరణ కావ్యాలకు లక్షణాలు చెప్పిన లాక్షణికులు ఉదాహరణ కావ్యభేదాలను కూడా సూచించారు.

విన్నకోట పెద్దన కావ్యాలంకార చూడామణిలో సద్దలి, పద్దలి, విద్దలి, కల్యాణి, ఉత్ఫుల్లకం – అను ఐదు రకాల భేదాలను సూచించాడు.

సద్దలి : సంబోధనా విభక్తి పద్యాల్ని వదలిపెట్టి సప్త విభక్తుల్లో పద్యాలు చెపితే అది సద్దలి.

పద్దలి : సప్త విభక్తుల్లో పద్యాలూ, సంబోధనా విభక్తి పద్యాలు చెపితే అది పద్దలి.

విద్దలి : సంబోధనా విభక్తిని విడిచి విషమ విభక్తుల్లో పద్యాలు చెపితే అది విద్దలి.

కల్యాణి : కేవలం కళికలతో రచించిన కృతికి ‘కల్యాణి’ అని పేరు.

ఉత్ఫుల్లకం : కేవలం ఉత్కళికలతో రచించిన కృతికి ఉత్ఫుల్లకం అని పేరు.

– ఇన్ని భేదాలు చెపుతూనే విన్నకోట పెద్దన ‘ధరనుదాహరణాది భేదములు పెక్కు’ అని కూడా అభిప్రాయపడినాడు. దీంట్లో ఆరుద్ర కొత్త సద్దలి, సంపత్కుమార ఉత్ఫుల్లకం – వంటి ఉదాహరణ కావ్య భేదాలను రచించారు.

మొత్తం మీద ఉదాహరణ కావ్యప్రక్రియ – భిన్న ఇతివృత్తాలతో – అనగా ఆధ్యాత్మిక, వ్యక్తిగత, సామాజిక, భౌగోళిక, ప్రాంతీయ, దేశీయ గత వైవిధ్యభరిత ఇతివృత్తాలతో – తన అస్తిత్వాన్ని చాటుకుంటూ సాహిత్యంలో తన స్థానాన్ని భద్రపరుచుకుంది.

 

 

డా|| దాశరథుల నర్సయ్య

విశ్రాంత తెలుగు అధ్యాపకులు

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల

గజ్వేల్, సిద్దిపేట జిల్లా

9390919100

October 24, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

యోగ ఆవశ్యకత

by Bandi Usha October 24, 2021
written by Bandi Usha

“ఆరోగ్యానికి అసలైన ఔషధం ఆసనము.”

శరీరానికి ఆసనము, మనసుకు ధ్యానం ఈ రెండింటి మేళవింపు ప్రాణాయామం. ఇది చేయటమే అసలైన యోగం.

అందుకే పెద్దలన్నారు “సర్వరోగాల నివారణకు సంజీవని యోగా.’’

నేటి మానవుడు అభివృద్ధి పేరుతో అవని నుండి ఆకసం దాకా సునాయాసంగా ప్రయాణం చేయగలుగుతున్నాడు గానీ ఆరోగ్యం విషయంలో మాత్రం అవని నుండి పాతాళం వైపుకు ప్రయాణిస్తున్నాడు.

దీనికి కారణం మానసిక వత్తిడి, ఆహారపు అలవాట్లు, ఆర్థికంగా అపరిమితంగా ఎదగాలనుకోవటం, వ్యామోహం, అసంతృప్తి ఇవన్నీ అనారోగ్యానికి కారణం అవుతున్నాయి.

మరి ఒకసారి కోల్పోయిన ఆరోగ్యాన్ని తిరిగి పొందలేమా?

మానవుడు సాధించలేనిది ఏముంది – కొంచెం శ్రద్ధ వహిస్తే తిరిగి మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది.

దాదాపు 80 శాతం రుగ్మతలు మానసికపరమైనవే. ఆహారపు అలవాట్లు, ఆసన మరియు ధ్యానం ద్వారా తిరిగి ఆరోగ్యాన్ని పొందవచ్చు. శరీరాన్ని, మనసును ఏకతాటిపై నడిపించే యోగాను ప్రతిరోజూ క్రమం తప్పకుండా చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.

మనం, మన పెద్దవారిని గమనించినట్లయితే వారు అందరూ ఎటువంటి రుగ్మతలు లేకుండా హాయిగా జీవిస్తున్నారు. వారి కన్నా ముందుతరంవారు నిండు నూరేళ్ళు ఆనందంగా జీవించారు. కానీ ఈనాడు మనకు అన్ని రుగ్మతలే. డాక్టరుని సంప్రదించకుండా, మందు బిళ్ళ వేసుకోకుండా జీవితం గడవటం లేదంటే అతిశయోక్తి కాదు. దీనికి కారణం ఏమిటి?

కారణం ఎక్కడో వెతకాల్సిన అవసరఁ లేదు. మనమే దీనికి కారణం. మన పెద్దవారు రోజంతా శ్రమించినా, సాధారణ భోజనం చేసేవారు. మనం శారీరక శ్రమను మరచిపోయాము. రుచల పేరుతో అవసరానికి మించి అనవసర పదార్తాలను భుజిస్తున్నాము. దీనితో కొత్త కొత్త రుగ్మతలు వస్తున్నాయి.

ముప్ఫై సంవత్సరాలు దాటక ముందే బి.పి, షుగర్, థైరాయిడ్, నడుము నొప్పి, కడుపు ఉబ్బరం, అధిక బరువు ఇలా అనేక రకాల రుగ్మతలు మనల్ని వేధిస్తున్నాయి. ఇంకా కొంతమందికి పుట్టినప్పటి నుండే రుగ్మతలు.

ఇలా ఎంతకాలం? ఇకనైనా మేల్కొందాం. యోగావలన కలిగే ఫలితాలను తెలుసుకొని ఆచరించి, ముందు తరాలవారికి ఆర్థిక నిధిని కాకుండా ఆరోగ్య నిధులను అందిద్దాము.

యోగా ప్రతిరోజూ చేయటం వలన శరీరంలోని మలినాలు తొలిగిపోయి శుద్ధి జరుగుతుంది.

రోజూ ఆసనాలు వేయటం ద్వారా ఎముకలు దృఢంగా, శక్తివంతంగా తయారవుతాయి.

రోగ నిరోధక శక్తి పెరగటంవలన శరీరం వ్యాధులతో సమర్థవంతంగా పోరాడి ఆరోగ్యవంతులుగా చేస్తుంది.

ఇప్పుడు మనం చేసే పనులు ఎక్కువగా శరీరానికి, మనసుకు సంబంధం లేనివే. జిహ్వ చాపల్యం చంపుకోలేక, అనారోగ్యానికి గురిచేసే అనేక ఆహారపదార్థాలు తింటున్నాము. అంతేకాకుండా వత్తిడిగా ఉన్నా, ఖాళీగా ఉన్నా ఎక్కువగా ఆహారం తింటాము. యోగా చేయటం ద్వారా వత్తిడి దూరమవటమే కాకుండా ఎంత అవసరమో అంతే తింటాము.

క్రమం తప్పకుండా యోగా చేసేవారికి రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడటంతో బిపి తగ్గుతుంది. కండరాలను బలోపేతం చేయటం వలన గుండె పని తీరు బావుంటుంది. ఇన్సులిన్ ఉత్పత్తి మెరుగు అవటంతో చక్కెర వ్యాధి అదుపులో ఉంటుంది.

ప్రాణాయామాల ద్వారా శ్వాస్రకియ మెరుగుపడి, ఊపిరితిత్తుల పని తీరు బాగుంటుంది.

శారీరకంగా, మానసికంగా దృఢంగా అవటంతో వృద్ధాప్య ఛాయలు కనిపించవు. బరువు తగ్గుతారు. కంటి సమస్యలు దూరమవుతాయి. కొవ్వు నిల్వలు తగ్గుతాయి. అజీర్తి, తలనొప్పి, మైగ్రేన్, సైనస్, ఎలర్జీలు, సయాటికా, వెరికోసిలం వెయిన్స్, కీళ్ళనొప్పులు, నడుము నొప్పి, మహిళలలో ఋతు సంబంధ సమస్యలు…. ఇలా ఎన్నో సమస్యలు యోగా ద్వారా పరిష్కరించబడతాయి.

ఏకా్రగత, జ్ఞాపకశక్తి, గ్రహణశక్తితోపాటు ఆత్మవిశ్వాసం, స్వీయ క్రమశిక్షణ అలవడతాయి. భావోద్వేగాలు అదుపులో ఉండటం వలన సమస్యలను సానుకూలంగా, ధైర్యంగా ఎదుర్కోగలరు.

మరి ఇంతటి దివ్య ఔషధాన్ని మనందరం బ్రహ్మ ముహూర్త సమయంలో ప్రతిరోజూ స్వీకరిద్దాము. నిండు నూరేళ్ళు ఆనందంగా, హాయిగా జీవిద్దాం.

బండి ఉష, అరవిందయోగ ట్రస్ట్, ఖమ్మం

October 24, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

గుర్రం జాషువా కాలం నాటి వర్ణ వివక్షత ` సాహిత్యం

by vanaparti padma October 24, 2021
written by vanaparti padma

భారత దేశసామాజిక వ్యవస్థలో వివిధ మతాలు, విభిన్న కులాల వారు జీవిస్తున్నారు.  బ్రహ్మణ, క్షత్రియ, వైశ్యం, శూద్ర అనే నాలుగు వర్ణాలతో పాటు, పంచమ వర్ణం అనే మరొక వర్ణం అదనంగా స్పష్టించబడిరది.  వీటిల్లో ఉపకులాలున్నాయి.  కులాల్లోని అంతరాల వల్ల అస్పృశ్యత విచ్చలవిడిగా కొనసాగుతుంది.   పంచములకు సమాజంలో అనేక పేర్లు ఉన్నాయి.  అంత్య, అంత్యజ, ఛండాల,  శ్వపచ, మాల, మాదిగ, ఛమార్‌, మోచీ, మాంగ్‌, మహర్‌ ఇలా ఎన్నో పేర్లతో పిలుస్తూ సభ్య సమాజం సాంఫీుక జీవితం నుండి వెలి వేసారు.

అస్పృశ్యులుగాను, పంచములుగాను పిలువబడుతున్న వీరందరు ఊరికి వెలుపల వెలివాడలు నిర్మించుకొన్నారు.  వీరి ఉనికి, నీడలు సవర్ణ సమాజంపై పడకుండా కట్టుదిట్టం చేశారు.  మరణించిన జంతువులు వాటి తోళ్ళు, కలేబరాలూ, కుక్కలు, గాడిదలు వీరి స్థిర, చరాస్తులు,  అంత్యజులు శుచి శుభ్రంగా ఉండకూడదు.  మంచి దుస్తులు ధరించకూడదు శవాల మీది ప్రేత వస్త్రాలే వీరికి దుస్తులు.  పగిలినమట్టి పాత్రలు ఉపయోగించాలి.  భోజనంలో కాని ఇతర పరిస్థితులలో

నెయ్యి వాడకూడదు.  అస్పృశ్యులు ఆభరణాలుగా ఇనుప నగలే ధరించాలి. దేశ దిమ్మరులై సంచార జీవితం గడపాలి.  శవాలకు కాపలాకాస్తూ కాటి కాపరులై ఉండాలి.  ఊరి పోలిమేరల్లో ఉండి గ్రామాన్ని రక్షిస్తుండాలి.  సొంత ఆస్తి వుండకూడదు.

బహిష్కరణకు గురైన పంచమ జాతిలో పుట్టినవారే గుర్రం జాషువా కుల దొంతరల సమాజంలో పుట్టకతోనే అస్పృశ్యుడుగా ముద్రపడిరది.  మహాకవి గుర్రం జాషువా 1895 సం॥ సెప్టెంబర్‌ 28వ తేదిన గుంటూరు జిల్లా వినుగొండలో జన్మించారు.  తల్లిదండ్రులు లింగమ్మ వీరయ్యలు.  ఈ దపంతులు కులాంతర వివాహం చేసుకున్న క్రైస్తవ, యాదవ కులస్థులు కాబట్టి యాదవులు వీరిని కులం నుండి వెలివేసారు.  మనది పితృసామ్యం వ్యవస్థ కావున తండ్రి కులమే వారి సంతానానికి కూడ వర్తిస్తుంది.  కాబట్టి జాషువా కులం అస్పృశ్యుడిగా  చెప్పబడిరది.  జాషువా బాల్యం నుండి కటిక దారిద్య్రాన్ని అనుభవించాడు.  కులం, పేదరికం రెండు తన గురువులని చెప్పుకున్నారు.  పేదరికం ఆయనకు వినయాన్ని నేర్పితే, కులం ఆయనని బానిసని చేయక ప్రతిఘటించే శక్తినిచ్చింది.  కుల సమాజం పోవాలని కలం మోధుడై  సమాజం మీద దండెత్తాడు జాషువా.  ఇవన్నీ జాషువా సాహితి వ్యక్తిత్వాన్ని ఒకరకంగా పటిష్టపరిస్తే ఇంత కంటే విశాలమైన భూమిక మరొకటి జాషువా కవిత్వానికి బలం చేకూర్చింది.

19వ శతాబ్ధం నాటికి భారతీయ సామాజిక వ్యవస్థ కుల, మత సంఘర్షణలతో, అస్పృశ్యతా దురాచారంతో, హేతురహితమైన ఆచారాలు భ్రష్టుపట్టిపోయిన సంప్రదాయాలు బలంగా మర్రి ఊడల్లా వ్యాపించాయి.  అ నారోగ్యకరమైన వ్యవస్థను రూపుమాపాలని, సమాజాన్ని ఆవరించిన చీకట్లను పారదోలాలని కొందరు మేథావులు సంస్కరణ ఉద్యమాలు నడిపారు.  ఈ ఉద్యమాలు సమాజంలో నెలకొన్న అనేక దుష్ట సంప్రదాయాలను రూపు మాపేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేసాయి.  వలస పాలనను అంతమొందించాలని జాతీయోద్యమం పుంజుకుంది.  జాతీయోద్యమం, సంఘ సంస్కరణ ఉద్యమ ఆశయాలను లక్ష్యాలను చేపట్టింది.  ఆదే సమయంలో రాజకీయోద్యమం, సంస్కరణ ఉద్యమాలు కొనసాగుతున్నాయి.  కాని జాతీయోద్యమ ఉదృతికి తట్టుకోలేక పోయాయి.  జాతీయోద్యమ లక్ష్యం ప్రధానంగా స్వాతంత్య్ర సంపాదన అందుకోసం సమాజంలో గుణాత్మకమైన మార్పులు రావాలని కొందరు మేథావులు భావించారు.  ఆస్తిక, నాస్తిక ఉద్యమాలు చరిత్రలో నిలిచి పోయెలా తగిన పాత్ర పోషించాయి.  మన దేశంలో మహాత్మాగాంధీ నాయకత్వాన, జాతీయోద్యమం బలంగా సాగుతుంది.  మహరాష్ట్రంలో డా॥ బాబాసాహెబ్‌ అంబేద్కర్‌ నాయకత్వంలో పంచముల కులనిర్ములనోద్యమం చేపట్టారు. అంబేద్కర్‌ ఉద్యమాలకు స్పందించిన కవులు వారి వారి మార్గాన్ని ఎంచుకుని కృసి చేయసాగారు.  జాషువా పై ఈ ఉద్యమాల ప్రభావం బలంగా పడిరది.  జాషువా వ్యక్తిగత జీవితం సాహిత్య జీవితం రెండు ఘర్షణ నుండి పుట్టినవే.  ఈ రెండు ఒకదానికొకటి పేన వేసుకపోయి మహకవి జాషువా రూపంలో కన్పిస్తాయి.

జాషువా బాల్యంలో  ఆటస్థలంలో పంచముడిగా సవర్ణుల చేత అవమానింపబడ్డాడు, పాఠశాలలో చదువుకునే రోజులలో గురువులకు కూడా అస్పృశ్యత భేదభావం ఉండేది అంటు ఓ పద్యంలో ఇలా ‘‘మా గురువు గారికి కోపము వచ్చు వేళ / పెంపల రెడునంట రాని తన మడమువచ్చే’’ అని జాషువా చెప్పుకున్నారు.  గ్రామంలో నాటక ప్రదర్శనకు వెళ్ళిన బాల జాషువాకు అక్కడ అస్పృశ్యత ఎదురైంది.  జాషువా కవిగా కళ్ళు తెరిచే నాటికి ప్రతి పల్లె, పట్టణాలలో ఊరు వాడలలో ఆశుకవితా ధారల్లో పండితులు పామరులు మునిగితేలుతున్నారు.  కొప్పరపు కవులు, తిరుపతి వేంకటకవులు ఆశుకవితతో అవధానాలు చేస్తూ గ్రామగ్రామాల్లో విస్తృతంగా పర్యంటించారు.  ఇలాంటి సాహిత్య వాతావరణం జాషువాలో ‘కవి’ అంశ మొగ్గ తొడిగి సాహిత్య ప్రస్థానం మొదలైంది.

జాషువా హిందూ ధర్మశాస్త్రాలు, ఇతిహసాలు చదువుతుంటే హిందువుల్లో సంచలనం బయలు దేరింది.  ఆశ్యర్యాన్ని ఆగ్రహాన్ని ప్రదర్శించారు.  కవిత్వం చెప్పడం మొదలు పెట్టగానే ` ‘‘ప్రధివీ సురులు దక్కనితర జాతులు కైతలల్లరాదు నేరం’’ అ ని సవర్ణులు జాషువాని నిలదీసారు.

జాషువా వ్యక్తిగా, కవిగా, కుల రక్కసి చేతిలో అనేకమైన అవమానాలు, అవహేళన పలుమారులు చవిచూసారు.  అవమానించిన కవులను వ్యక్తులను ‘గవ్వకు సాటిరాని పలుగాకులుగా’ గణించాడు. వీరు అడ్డగిస్తే తనను వరించిన శారద లేచిపోవునా! అని ఘంటమూనెదన్‌ రవ్వలు రాల్చెదన్‌ గరగరల్‌ పచరించెద నాంధ్ర వాణికిన్‌’’ అని ఆత్మ విశ్వాస ప్రకటన చేసాడు.  ఈ సామాజిక సాహిత్య నేపథ్యం నుండి చీకటి వెలుగుల నుండి జాషువా కవిత్వాన్ని  దర్శించవచ్చు.  జాతీయోద్యమాల వల్ల, కులనిర్మూలనా పోరాటాల వల్ల, సంస్కరణల వల్ల, క్రైస్తవ మతం వల్లనైతేనేమి విద్య నేర్చుకునే హక్కును, ఆలయ ప్రవేశాన్ని పొందగలిగారు పంచములు.

ప్రాథమికోపాధ్యాయునిగా జీవితం ప్రారంభించి, నాటి మూకీ చిత్రాలకు వ్యాఖ్యాతగా పనిచేశారు.   ఊరూరా తిరిగి, వీరేశలింగం, చిలకమర్తల వారి ఆశీర్వాదాలు పొంది, కావ్యజగత్తులో స్థిరపడ్డారు.  తిరుపతి వేంకటకవుల ప్రోత్సాహంతో ముందుకుసాగి, ఉభయ భాషాప్రవీణులై తెలుగు పండితునిగా, ద్వితీయ ప్రపంచ సంగ్రామ సమయంలో యుద్ధప్రచారకునిగా, స్వాతంత్య్రానంతరం 1956 నుండి 1960 వరకు ఆకాశవాణి మద్రాస్‌ కేంద్రంలో తెలుగు ప్రోడ్యూసర్‌గా ఉద్యోగాలు నిర్వహించారు.

ఆరుబయటి ప్రక్కపరుచుకొని, ఒక ప్రక్క వేడిగాడ్పులు, మరోపక్క పిండిఆరబోసినట్లున్న వెన్నెలను అనుభవిస్తూ ‘‘నా జీవితం కూడా ఇలాగే వెన్నెల వడగాడ్పు మిళితమై సాగిపోతుంది, వడగాడ్పు నా జీవితమైతే, వెన్నెల నా కవిత్వం’’ అని తన ఆత్మకథలో వ్రాసుకున్నారు.  కవిగా నిలదొక్కుకోవడానికి పడిన శ్రమ నిలుపుకున్న వ్యక్తిత్వమే జాషువాను గొప్ప కవిగా ప్రకాశింపచేసింది.

జాషువా తెలుగు సాహిత్యంలోని వివిధ సాహితీ ప్రక్రియలని చేపట్టి రచనలు చేశారు.  సోదరునితో కలిసి నేత్రావధానం చేసారు.  పారాణిక నాటకాలు రాసారు.  నవలా ప్రక్రియలో కూడా జాషువాకు ప్రవేశం ఉంది.  జీవిక కోసం పారాణిక, సాంఘిక నాటకాలనేకం రాశారు.  ‘బొబ్బిలి యుద్దం’ వంటి సినిమాలకు ఆశువుపద్యాలల్లి ఇచ్చారు. గేయాలు రాశారు, జానపద కళారూపాలకు గేయాలు సమకూర్చారు జాషువా ఎన్ని ప్రక్రియలు చేపట్టినా తెలుగు సాహితీలోకం ఆయనను ఆధునిక పద్యకవిగా గుర్తించి గౌరవించింది.

జాషువా ప్రధానంగా వస్తు కవి.  అయిన శిల్ప వ్యతిరేకి మాత్రం కాదు.  సంప్రదాయ చంధస్సు స్వీకరించి, సమకాలీన సంఘటనతో నవ్యమైన వస్తువును జోడిరచి కవిత్వం చెప్పారు.  వీరు వర్తమానాన్ని నిశితంగా పరిశీలిస్తూ భూత, భవిష్యత్తు కాలానికి తొంగి చూడగలిగిన ఋషితుల్యుడు.  జాషువా ప్రాచీన కవుల సంస్కృత కవుల కవిత్వాన్ని పుక్కిట పట్టారు అతని కవిత్వంలో కవిత్రయం వారి కవితారీతులు, శ్రీనాథకవి సీస పద్యధార, ప్రబంధ కవుల వర్ణనతో పాటు కాళిదాసు వచోవైభవం చూడవచ్చును,  కథావస్తువు, పాత్రల చిత్రణ, చంధోలంకారాది నియమాలు, రసపోషణ, ఉక్తిచిత్రి, భాషాపదప్రయోగం లాంటివన్ని కావ్య శిల్పానికి అంగాంగాలుగా చెప్పుకోవచ్చు.  అనతంతమైన ఆర్థ్రత, అపారమైన భావుకతతో మానవీయ కవిగా దర్వనమిస్తారు.  ప్రకృతి అందాలను, సూక్ష్మ రహస్యాలను సున్నితంగా కవిత్వ రూపంలో సమాజానికి అందించడం జాషువా కవితా ప్రతిభకు నిదర్శనం.

సీయపద్య రచనకు జాషువా పెట్టింది పేరు.  శ్రీనాథుని త రువాత సీసపద్యాన్ని జాషువానే మధురంగా రాయగలిగాడని విమర్శకులు సైతం పొగిడినారు.  కవితా శిల్పం, నైపుణ్యం, వైభవం సీసపద్య రచనలో ఆటవెలది జోడిరచి చెప్పడంలో జాషువా ప్రతిభా సంపత్తి వెల్లడవుతుంది.

‘‘ముడిచె నిచ్చట కుంతికొడుకు ద్రౌపదికొప్పు / పగవాని రుధిరంబు పరిమళింప / మెఱసె నిచ్చోట నాదరుషా కురారంబు / నిఖిల భారతము కన్నీరు నింప / వెలిసె నిచ్చోట పచ్చల బర్హిపీరంబు / షాజాను రాజు నాస్థాన వాటి / పెండ్లాడె నిచ్చోట పృధ్విరాజోక రోజు / జయ చంద్రు సుతను దోస్సారగరియ’’ ఇలా  సీస పద్యంలో ఆటవెలదినిగాని, తేటగీతిని గాని వాడుకున్న వాటిలో అందంగా, సొగసుగా  నృత్యం చేయించగల  శక్తి సంపన్నుడు.  జాషువా వృత్తాలలో మత్తేభం, శార్థూలం, ఉత్పలమాల,  చంపకమాల, జాతుల్లో ఆటవెలది,  తేటగీతి, కందం, సీసం లాంటివి ఆయన మధురమైన కవితలకు వాహికలుగా నిలిచాయి.

జాషువా గబ్బిలాన్ని చీకటితో పోల్చి చెప్పడం కోసం ఉపమాలంకారం తీసుకున్నాడు.  ‘మక్కు మొగమున్న చీకటి ముద్దవోలె / విహరణముసేయ సాగె గజ్జల మొకండు’ అంటు చెప్పారు.  అర్థాంతరన్యాసాలంకారానికి గాను ‘‘గిరుల మగవాని చెలిమి వ్యక్తీకరింప, మస్తమునదాల్పు మొకచిన్ని మంచుతున్క, విసపు మేతరికది సిఫారసుగనుండు, వ్యర్తములుగావు పెద్దలపరిచయములు’’ అంటు పూరించారు.  ఔషధంబు లేని యస్పృశ్యత జాఢ్య / మంద భాగ్యు నన్ను మఱచిపోవు’’ అనే పద్యపాదములు రూపకాలంకారానికి చక్కని ఉదాహరణంగా నిలిచింది.  ప్రకృతిని చూసి పులకించే కవిహృదయం జాషువాది.  అందుకే గరికపోచలో కూడా కవిత్వాన్ని చూడగల్గిన సున్నిత  హృదయంగలవారు.

‘‘తేటయైన తీపినీట దిక్కులదాక / విస్తరించి రుచుల గుస్తరించి / చిల్కసంద్రముంపు సీయుచుగన్నట్టు’’ అనే ఈ పద్యంలో తీయదనాన్ని దాచుకున్న నీటిసరస్సు స్వచ్ఛమైన  తెలుగు భాషలా ఉంటుందని చెప్పడంతో  జాషువాకు తెలుగు భాషపైనున్న అభిమానం తెలుస్తుంది.  జాషువా సాహిత్యంలో సంస్కృతం, ఆంగ్లభాషా పదాలతో పాటు హిందుస్తానీ, ఉర్దూ, పారశీక, హిందీ మిశ్రమపదాలు అనేకం వీరి కవిత్వంలో కల్సిపోయాయి.  తెలుగు పలుకుబడులు, నుడికారాలు, జాతీయాలు జాషువా కవిత్వంలో పలుమార్లు కన్పిస్తాయి.  కవిత్వానికి తెలుగుపలుకుబడులతో గుడికట్టారు జాషువా అంటారు డా॥ సి.నారాయణ రెడ్డి గారు.  30కి పైగా రచనలు చేసి, సాహితీ జగత్తులో తనదైన ముద్రవేసుకున్న మహోన్నతమైన కవి జాషువా.

జాషువా పాండితీవైదుష్యానికి వేయికి పైగా సన్మానాలు జరిగాయి.  ఆంధ్రప్రదేశ్‌ ఆస్థాన కవి శతావధాని చైళ్ళపిళ్ళ వేంకటశాస్త్రి గారు జాషువాకు గండె పెండారం తొడిగి సత్కరించారు.  కనకాభిషేకం చేసి పగటి దివిటీలు పట్టి పల్లకిలో ఊరేగించారు.  జాషువాను వర్ణ వివక్షతతో క్షోభపెట్టిన సమాజమే ఆయన పాండిత్యానికి ప్రతిభావ్యుతృత్తులకు తలలు వంచి కవికోకిల, కవిశారద, కవిదిగ్గజ, మధుర శ్రీనాథ, నవయుగకవి  చక్రవర్తి, విశ్వకవి, కవిసామ్రాట్‌ బిరుదుతో పాటు, కేంద్ర సాహిత్య అకాడమీ   ‘‘క్రీస్తు చరిత్ర’’ కావ్యానికి అవార్డు బహుకరించింది, ఆంద్రప్రదేశ్‌ ప్రభుత్వం శాసన మండలి సభ్యునిగా నియమించింది, ఆంధ్ర విశ్వవిద్యాలయం  ‘‘కళాప్రపూర్ణ’’ బిరుదాంకితున్ని చేసింది.  రాష్ట్రపతి ‘‘పద్మభూషణ్‌’’ ఇచ్చి సంత్కరించారు.  జాషువా 1971 జులై 24వ తేదిన కీర్తి శేషులైనారు.

 

రచన:

వనపర్తి పద్మావతి,

హన్మకొండ,

సెల్‌ : 9949290567.

October 24, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

రెండు పండుగలు(బతుకమ్మ, దసరా)

by కావ్యసుధ (ఆర్. హరిశంకర్) October 24, 2021
written by కావ్యసుధ (ఆర్. హరిశంకర్)

బోణి అంటే స్త్రీ. పూబోణి రూపం మనం సాహిత్యంలో చూస్తాము. బోణి + అమ్మ = బోణెమ్మ. జన వ్యవహారంలో బొడ్డెమ్మ అయింది.

బొడ్డెమ్మ- కన్నెపిల్లల పండుగ

బతుకమ్మపండుగకన్నా ముందు బొడ్డెమ్మ పండుగ వస్తుంది. తొమ్మిది రోజులపాటు కన్నెపిల్లలు మాత్రమే చేసే  పండుగ ఇది. తొమ్మిది రోజులు బొడ్డెమ్మ పండుగ. తొమ్మిదవ రోజు ‘సద్దుల బతుకమ్మ’. బొడ్డెమ్మ అంటే చిన్న అమ్మాయి అని అర్థం.

పుట్టమన్నుతో ఒక పీట మీద అయిదు అంతస్థులుగా చతుర ప్రాకారంగా చేసి ఒక దానిపై ఒకటి త్రిభుజాకారంగా పేరుస్తారు. తంగెడు, బంతి వంటి పూలతో అలంకరించి శిఖరాన బియ్యంతో నిండిన కలశాన్ని ఉంచి, దానిపైన కొత్త రవికె బట్ట నుంచి దానిపై తమలపాకు, పసుపు ముద్ద ఉంచి ఆ ముద్దను గౌరమ్మగా భావించి పసుపు, కుంకుమలతో పూజిస్తారు. బొడ్డెమ్మ పండుగ అంటే కన్నెపిల్లల ఆట, పాట మాత్రమే కాదు, ఆడపిల్లల్ని పూజించే పండుగ గౌరవించే పండుగ. తెలంగాణ ప్రాంతమంతా ఆడపిల్లని ఆడపిల్ల అంటారు. ఆడపిల్ల పుట్టందింటే లక్ష్మీదేవి పుట్టింది అంటారు.

సిబ్బి పిండి పూలను అందంగా సాయంత్రానికి అందంగా వేసి పూలముగ్గులలో బొడ్డెమ్మను పెట్టి చుట్టూ తిరుగుతూ లయాత్మకంగా చప్పట్లు కొడుతూ బొడ్డెమ్మ బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్…. నీ బిడ్డ పేరేమికోల్… నీ బిడ్డ నీలగేరుకోల్…. నిచ్చెమల్లె చెట్టేసి కోల్…. నిచ్చమల్ల చెట్టుకు కోల్…. రోజు నీళ్ళు పోసి కోల్…. అనే పాటతోపాటు, బొడ్డెమ్మకు సంబంధించిన ఎన్నో పాటలను పాడుకొని మంచి భర్త రావాలని కోరుకుంటారు.

ఆ విధంగా ఎనిమిది రోజులు బొడ్డెమ్మను కొలిచి ఆఖరి రోజున అందుబాటులో ఉన్న బావిలోగానీ, చెరువులో గానీ జారవిడుస్తారు. తొమ్మదవ రోజున బొడ్డెమ్మపై కలశంలో నిండిన బియ్యాన్ని పరమాన్నంగా వండి ఆరగిస్తారు.

బతుకమ్మ పండుగ తెలంగాణ స్త్రీలకు పూల పండుగ. ఆటపాటల పండుగ. ఊరి పరిసరాల్లోనూ ఇంటి పెరడులోనూ పూలను సేకరించి బతుకమ్మను పేర్చడం సంప్రదాయం. బతుకమ్మ పండుగ నాటికి విరబూసిన తంగేడు పూలతో ముఖ్యంగా బతుకమ్మను రూపొందించడం ఆచారం.

ప్రకృతి వివిధ వర్ణశోభితమై అలరిస్తూ ఉంటుంది. శరత్కాలం వర్షాలు తగ్గి ప్రకృతి వినూత్న శోభ సంతరించుకునే కాలం శరత్ ఋతువు. శరదృతువులో చామంతి, బంతి, తంగేడు, గునుగుపూలు విరగబూస్తాయి. మగువలు ఈ పూలను సేకరించి అందమైన రూపమిచ్చి ‘బతుకమ్మ’ అని అమ్మవారిని కీర్తిస్తూ పాడే పాటలు తెలంగాణా అంత ప్రతిధ్వనిస్తాయి.

తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబింపజేసే బతుకమ్మ పండుగను భాద్రపద బహుళ అమావాస్య నుండి ఆశ్వయుజ శుద్ధ అష్టమి వరకు అత్యంత వైభవంగా స్త్రీలు, జానపద సంగీత, నృత్య సమ్మేళనం జరుపుకుంటారు.

ఇలా ఎనిమిది రోజులు ఆడాకా తొమ్మిదవ రోజు అంటే అష్టమి నాడు జరుపుకునే పండుగను “సద్దుల బతుకమ్మ” అంటారు. కంది, పెసర, వేరుసెనగలు పప్పులన్నీ పొడులుచేసి అన్నంతో సద్దులు చేస్తారు.

బ్రతుకు + అమ్మ = బతుకమ్మ అంటే బతికించే అమ్మ లేదా బ్రతికిన అమ్మ బ్రతుకమ్మ అయ్యిందని భావిస్తారు. ఈ బ్రతుకమ్మ క్రమక్రమంగా రూపాంతరం చెందుతూ ‘బతుకు అమ్మ’గా మారింది. రంగు రంగుల, రకరకాల పూలతో తయారుచేసే ఈ బతుకమ్మలు లక్ష్మీదేవి, పార్వతీదేవి అంశంగానూ, ప్రకృతికి ప్రతిరూపంగాను భావిస్తారు.

బతుకమ్మను గురించి పలు కథలు ప్రచారంలో ఉన్నాయి. వరంగల్ రాజధానిగా రాజ్యమేలిన కాకతీయుల కాలంలో ఎంతో వైభవంగా బతుకమ్మ పండుగ జరిగేదని తెలుస్తోంది.

చారిత్రక ఆధారంగా 19వ శతాబ్దం పూర్వార్థం లోను, 20వ శతాబ్ధం ఉత్తరార్థంలోనూ తెలంగాణ ప్రాంతంలో ప్రకృతి బీభత్సం జరిగి అంటువ్యాధులు సోకి లక్షలాది మంది చనిపోతుండగా ఉన్న తమ సంతానం మరణించకుండా ఉండాలని కోరుతూ బతుకు అమ్మ, బతుకమ్మ దేవిని ప్రార్థించగా ఆమె కరుణచే బతికినారని అందుకే బతుకమ్మగా పూజించడం సంప్రదాయంగా వచ్చిందని పెద్దలు చెబుతారు.

చోళ దేశపు రాజైన ధర్మాంగతుడికి అనేకమంది కుమారులున్నారు. వారు శ్రతువుల చేతిలో హతులవడంతో తన భార్యతో అడవులకు వెళ్ళిపోయిన శ్రీ లక్ష్మీదేవిని గురించి తపస్సు చేయగా లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఏం వరం కావాలని అడుగగా అమ్మా అని పిలిచే సంతాన భాగ్యం కలిగించమనగా తథాస్తు అంది. తనకు కూతురు పుట్టగా బతుకమ్మ అని పేరు పెట్టినట్లుగా భట్టు నరసింహ కవి శ్రీ లక్ష్మీదేవి చందమామ సృష్టి బతుకమ్మాయె చందమామ అంటూ బతుకమ్మ పుట్టుక గురించి వ్రాసిన తొలిపాటగా తెలుస్తోంది.

దసరా దరహాసం

దసరా పండుగను జరుపుకున్నాం. విజయదశమి పండుగను మనం అనాదిగా జరుపుకుంటున్నాం. ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి నుండి దశమి వరకు తొమ్మిది రోజులు శ్రీ దేవి నవరాత్రులు శరన్నవరాత్రులుగా భావించి ఆరాధనలు జరుపుతారు. ఆశ్వయుజ మాసంలో శరదృతువు ప్రారంభమవుతుంది. శరతంకాలపు వెన్నెల స్వచ్ఛమైన శ్వేతవర్ణంలా శరదృతువులో వచ్చే పండుగ కాబట్టి ‘శరన్నవరాత్రులు’గా పరిగణిస్తారు.

భారతీయ సంస్కృతిలో జరుపుకునే పండుగలన్నింటికీ ఒక పరమార్థం ఉంటుంది. హిందువులందరూ సమైక్యంగా అత్యంత వైభవంగా జరుపుకునే పర్వదినాలలో ‘విజయదశమి’, ‘దసరా’ ప్రాముఖ్యత సంతరించుకుంది.

అమ్మవారి ఆలయాల్లో తొమ్మది రోజులపాటు దేవి నవరాత్రులను నిర్వహిస్తూ ప్రతిరోజూ దుర్గాదేవిని వివిధ రూపాలలో శోభాయమానంగా అలంకరించి పూజలు జరుపుకోవడం ‘విజయదశమి’ పర్వదినం విశేషం. ప్రతి సంవత్సరం ఆశ్వయుజ శుద్ధ పాఢ్యమి నుండి శుద్ధ దశమి వరకు దేవీ నవరాత్రుల పేరిట ‘దసరా’ పండుగ జరుపుకోవడం మనకు అనాదిగా వస్తున్న సాంప్రదాయం.

శరన్నవరాత్రుల గురించి వ్యాసభగవానుడు

“శృణురాజస్పవక్ష్మామి నవరాత్రి నవతం శుభమ్ శరత్కాలే విశేషరో కర్తవ్యమే విది పూర్వకమ్” అని వివరించాడు. సర్వప్రాణులకు వసంత ఋతువు, శరదృతువు క్లిష్టమైన కాలాలు, ఇవి జనులందరికీ యన కోరలంటారు. జనులకు దోషాలు కలిగించేవి. జనులకు నాశనం కలిగించేవి. వాటి వలన మనుషులు తమ పరుదులు దాటి చిత్ర ప్రకోపించి ఘోరమైన మనస్సుతో ప్రశాంతతను పొందడానికి, శరత్ కాలంలో శరన్నవరాత్రులు నిర్వహించాలని పురాణాలు చెబుతున్నాయి.

సంస్కృతంలో రోజుని ‘అహోరాత్రం’ అంటారు. ‘అహోరాత్రం’ పదంలో తొలి అక్షరం ‘అ’నీ, చివరి అక్షరం ‘త్ర’నీ తొలగిస్తే ‘హోరా’ అయింది. హోరా అంటే అహోరాత్రం అనే అర్థం. అలాంటి హోరాలు దశ కలిపితే అది ‘దశహోరా’ అయింది.

ఈ ‘దశహోరా’ కాలక్రమంలో ‘దసరా’ అయింది. ‘దసరా’ అంటే దశరాత్రుల పండుగ. ‘విజయ’ అంటే జగన్మాత. ఈ శరన్నవ రాత్రులలో ఆమె ఆరాధన వలన సకల ఐశ్వర్యాలు కల్గుతాయి. ఆమె కరుణ పొందడానికి శరన్నవ రాత్రులు అనువైన కాలం.

‘నవం నూతనం రాత్రం జ్ఞానం యస్మాత్తం నవ రాత్రః అని పండితుల వాక్కు. రాత్రి అనే పదానికి జ్ఞానమనే అర్థాన్ని సూచిస్తున్నాయి. నవరాత్రులంటే తొమ్మిది రాత్రులు. రాత్రిని తిథిగా స్వీకరించాలి. ‘నవాహోవై సంవత్సర ప్రతిమా’ అనే వాక్యం వలన నవరాత్ర కర్మ సంవత్సర కాలానికి ప్రతిరూపమని తెలుస్తోంది. ఆశ్వయుజ శుక్ల పాడ్యమినాడు నవరాత్ర ఆరాధనలు మొదలవుతాయి. ఈ నవరాత్రులలో నవదుర్గల ఆరాధన వల్ల సమస్త పాపాలు, బాధలు తొలగిపోయి సకల సౌభాగ్యాలు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని మన పురాణాల ద్వారా విదితమవుతుంది.

ఈ నవరాత్రుల పూజ వలన ధర్మార్థ కామ మోక్షాలనే చతుర్విధ పురుషార్థ ఫలాలు ప్రాప్తిస్తాయి. భక్తుల రోగ, శోక, సంతాన, భయాలను ఈ దుర్గాదేవి నశింప చేస్తుంది. ఈ నవరాత్రులలో నవదుర్గా రూపాల్లోని మహాలక్ష్మి, మహా సరస్వతీ, మహాకాళికలను ఆరాధించడం వల్ల మహాలక్ష్మి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తే, మహాసరస్వతిగా విద్యాబుద్ధులను అనుగ్రహిస్తుంది. మహాకాళిగా దుర్గగా పూజించడంవల్ల శతృభయం తొలగి విజయం సిద్ధిస్తుంది.

‘ప్రథమా శైలపుత్రీ, ద్వీతీయా బ్రహ్మచారిణీ, తృతీయ చంద్రమంటేతి కుష్మాండేతి చతుర్థకే, పంచమా స్కందమాతేతి, షష్టాకాత్యాయనీ తచ సప్తమా కాలరాత్రీతి మహాగౌరీతి చాష్టమీ నవమాసిద్ధి దాత్రీతి నవదుర్గాః ప్రకీర్తతాః”

అని మార్కండేయ పురాణం పేర్కొన్నది. సకల దేవతా శక్తులకు మూలధారిణి, సకల మంత్ర అధిదేవత, ఓంకార స్వరూపిణి, సృష్టిలోని పలు ప్రాణులకు మాతృమూర్తియైన శక్తికి ప్రతిరూపంగా దుర్గాదేవిని ఆరాధించడం అనాదిగా మన ఆచారం.

ఈ ప్రపంచమంతటా ఒక శక్తి నిక్షిప్తమై వుండి, చైతన్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఈ శక్తే పరమాత్మ. పరమాత్మే అశక్తి. శివశక్తి నిరాకార అయిన ఆదిపరాశక్తి అవసరార్థం అనేక రూపాలు ధరించి, సత్త్వ రజోస్తమోగుణాలను ఆశ్రయిస్తుంది. ఇచ్ఛాశక్తి, జ్ఞానాశక్తి, క్రియాశక్తి అనే త్రిగుణ శక్తులుంటాయి. సృష్టి చేయాలనే సంకల్పం ఇచ్ఛాశక్తి వలన ఏర్పడుతుంది. దానికి సంబంధించిన కార్యకలాపమంతా జ్ఞానశక్తి వలన ఏర్పడుతుంది. సంకల్పం కార్యరూపం ధరిస్తే అది క్రియాశక్తి రూపం అవుతుంది. ఈ త్రిశక్తుల ద్వారా ఆదిపరాశక్తి విశ్వసృష్టి చేస్తుంది. ఆదిశక్తి తన మాయా ప్రభావంతో అనేక అద్భుత కార్యాలు చేస్తుంది.

అనంతమైన ఈ విశ్వాన్ని పోషించి, లయం చేస్తుంది. శక్తియే దేవి అని పాశాయేశ ధనుర్బాణాల ధరించిన మహా విద్యయని, దుర్గాదేవియై నిఖిల జగత్తును రక్షించే మహాశక్తిగా వెలసినది. కనుక ఈ నవరాత్రులలో దివ్యతేజస్సుతో ప్రభవించే దుర్గాదేవిని అర్చిస్తే సమస్త రోగాలు తొలగి ఆయురారోగ్యాలు కలిగి, బ్రహ్మత్వసిద్ధి, భుక్తి, ముక్తిపదమవుతుంది. దుర్గాదేవి పూజ వలన అన్నింటా విజయాల్ని ప్రసాదిస్తుంది. అందుకే అమ్మకు ప్రణామాలర్పించి, ఆశ్సీస్సులు పొంది విజయదశమి రోజున నూతన కార్యక్రమాలను పారంభిస్తే విజయం కలుగుతుందని, శుభాలు చేకూరుతాయని విశ్వాసం. విజయదశమి పండుగా చారి్రతాత్మకమైన ప్రాశస్త్యాన్ని, విశిష్టతను సంతరించుకున్నది.

“యా దేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితా! నమస్తస్యై నమస్తస్యై, నమస్తస్యై నమో నమః’ అని సమస్త ప్రాణికోటిలోనూ శక్తి రూపంలో ఉండే దేవికి నమస్కరించింది మార్కండేయ పురాణం. శివుడు సైతం శక్తి సంపన్నుడైనప్పుడే ఆయనకు పరమేశ్వరత్వం సిద్ధిస్తుంది. శక్తి లేకుంటే ఏ ప్రాణి కదలలేదు. దుష్టరాక్షసులను సంహరించడానికి ఆ రాశక్తి పది రూపాల్లో అవతరిస్తూ ఉంటుంది. జగన్మాతను దుర్గభవాని, రుద్రాణి వంటి అనేక నామాలతో భక్తులు కీర్తిస్తుంటారు.

ప్రాచీన కాలంలో ఆర్యులకు అపరాజితాదేవి ప్రధానమైన దేవతగా ఉండేది. ‘అపరాజిత’ అంటే ‘పరాజయం’ పొందినది. వైదిక కాలంలోని ఈ అపరాజితాదేవి క్రమేణా క్ష్రతియుల జయాధిష్టాన దేవత అయింది. క్షత్రియులు దశమినాడు అపరాజితను పూజించటం ఆచారమైంది. నవమినాడుగానీ, దశమినాడుగానీ ఈ అపరాజితను పూజిస్తే విజయం తథ్యమని పురాణ ప్రవచనం.

ఈ రూపాలకే ’నవదుర్గలు’ అని పేరు. దుర్గాదేవి తొలి స్వరూపంలో శైలపుత్రిగా, మలి రోజు బ్రహ్మచారిణి స్వరూపంగా, తృతీయ స్వరూపంగా చంద్ర ఘంటాదేవి, చతుర్థ స్వరూపంగా కుష్మాండాదేవిగా, పంచమ రూపం స్కందమాత, షష్టి స్వరూపం కాత్యాయనిదేవి, సప్తమ రూపం కాళరాత్రీ, అష్టమ రూపంగా మహాగౌరి, దుర్గాదేవి నవమ స్వరూపంలో ప్రసిద్ధి చెందింది.

‘’ఏతస్యా దసరం కించిత్ వ్రతం నాన్తి ధరాతలే

నవరాత్రాభిరం వైశ్య పావనం సుఖదం తథా

ఆనందం మోక్షదం చైవ సుఖ సంతాన వర్థనమ్

శ్రతునాశకరం కామం నవరాత్ర వ్రతం సదా”

అంటూ నవరాత్ర మహిమను పురాణాలు కొనియాడాయి.

అంతా శక్తి మయం, స్త్రీ శక్తిమయం, ఆదిపరాశక్తి పార్వతి అంశతో కరువుకాటకాలను తొలగించి, లక్ష్మీదేవి సిరిసంపదలను చేకూర్చి, దుర్గాదేవి కోరిన కోర్కెలను నెరవేరుస్తుంది. పరాశక్తి త్రిమూర్తులను పోలియున్న సత్వ రజస్తమో గుణములను ప్రతిరూపంగా నిలుస్తుంది. కాబట్టి భక్తి శ్రద్ధలతో, గౌరవంతో కొలవాలి.

ఆశ్వయుజం అంటే న + శ= ఆశ్వ అవుతుంది. శ్వ = అంటే రేపటికి, న = ఉండదని, రేపటికి ఉండదని, అంటే నిత్యం మార్పు చెందే ప్రకృతి అని అశ్వపదానికి అర్థం. ఆశ్వ +యుజం అంటే అశ్వేన యుజ్యతే. ఇది ఆశ్వయుజం అవుతుంది. ప్రకృతిలో కూడినది అని దానికి అర్థం. ప్రకృతిలో కూడి ఉండేది పరమాత్మ.

“ప్రాతర్యా నాణా ప్రథమాయజధమ్

నోరన సామయంతి దేవాయా అజుష్టమ్”

అని ఋగ్వేదంలో ఉన్నది. అంటే సూర్యోదయానికి ముందు తూర్పున ఏ నక్షత్రం ఉదయిస్తే ఆ నక్షత్రానికి సంబంధించిన దేవతను పూజించాలి లేదా సూర్యాస్తమయ సమయంలో తూర్పున ఉదయించే నక్షత్ర దేవతనైనా పూజించాలి. ఖగోళ శాస్త్రరీత్యా పరిశీలించినప్పుడు ఈ శరన్నవరాత్రులలో కన్యారాశి నక్షత్రాలు కనిపిస్తాయి. కన్యరాశి స్త్రీ ఆకృతి. ఆ స్త్రీ రూపమే మనం ఆరాధించే దుర్గామాత. కన్యరాశి తర్వాత కనిపించేది సింహ నక్షత్రం. ఆ ఆకృతే దుర్గాదేవి వాహనం. కనుక సింహాసనం అధిష్టించి భక్తులకు సర్వసిద్ధులనూ ప్రసాదిస్తుంది.

“అశ్వినస్య సితే పక్షే దశమ్యాం తారకోదయే

సకాలో విజయోనామ సర్వకామర్థ సాధకః”

ఆశ్వయుజ దశమి సాయంకాలం నక్షత్రోదయ వేళను విజయకాలం అంటారు. ఆ సమయం సర్వకామ్యార్థ సాధకం అనీ, సాయంకాలం నాటి, నక్షత్రాలు అప్పుడే పొడగట్టే కాలం విజయకాలమని, సకల కార్యసిద్ధి కలిగిస్తుందనీ చింతామి కారుడు ప్రవచించాడు.

చిదగ్ని కుండ సంభూతమైన దేవి తత్త్వములేనిది ప్రపంచంలో ఏదీ లేదు. సమస్త ప్రపంచం శ్రీ దేవి మయం. శ్రీ దేవి మూల ప్రకృతి స్వరూపిణియై సర్వ చరాచర జగత్తులో వ్యాపించి అగోచరంగా ఉంటు, సకల భూతకోటికి సర్వవిధాల ఉపయోగపడుతుంది. దేవి నవరాత్రులలో శక్తి ప్రదాతయైన దుర్గాపూజ ప్రదానం.

ఈ నవరాత్రులలో ఒక్కొక్కనాడు శక్తిని పూజించడం వలన, నవ శక్తులతో, నవదుర్గులతో కూడియుండటం వలన నవరాత్రులయ్యాయని శివుడు పార్వతిదేవితో చెప్పినట్లు శక్తి సంగమ తంత్రం ద్వారా తెలుస్తోంది.

‘శ్రీ’ అంటే ‘ప్రకృతి’, దేవి అంటే ‘ప్రకాశించునది’ అర్థం. కనుక శ్రీదేవి అనగా ప్రకృతిలోని ప్రతి పదార్థంలోనూ గల ‘చిత్’ శక్తి అని అర్థం. చిత్ శక్తి పూజయే శ్రీ దేవి పూజ. సర్వం శక్తిమయం, భక్తే శక్తి మయం. ఆ ఆదిపరాశక్తిని భక్తిభావనలతో నిర్మల హృదయులై ఈ నవరాత్రులలో ఆమె నారాధిస్తే, సర్వ శక్తులనిచ్చి సదా కాపాడుతుంది.

శమీ వృక్షం మహిమాన్వితమైనది కాబట్టి, దసరా నాడు “శమీ శమయతే పాపం / శమీ శ్రతు వినాశినీ/ అర్జునస్య ధనుర్ధారీ! రామస్వ ప్రియదర్శినీ” అనే శ్లోకాన్ని తెల్లని కాగితాలపై వ్రాసి పఠిస్తూ శమీ వృక్షానికి ప్రదక్షిణలు చేసి, కొమ్మలపై వేసి నమస్కరించి, శమీ పత్రాల్ని తీసికొని ‘బంగారం’గా భావించి, శమీ పత్రాల్ని పెద్దలకు ఇచ్చి పాదాభివందనం చేసి దీవెనలు పొందుతారు.

అశ్వయుజ శుద్ధ దశమి నాడు శమీపూజ జరిగిందని నాటి నుండి నేటివరకు విజయాలకు ప్రతీకగా విజయదశమినాడు శమీ వృక్షాన్ని పూజించడం సంప్రదాయంగా వస్తోంది.

నవ దుర్గల ఆరాధనవల్ల సమస్త పాపాలు, బాధలు తొలగి, దీర్ఘ రోగాల నుంచి విముక్తి కలిగి, సకల సౌఖ్యాలు, సౌభాగ్యాలు సిద్ధిస్తాయని, ఈతిబాధలకు గురికాకుండా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయని, ఆ దుర్గాదేవి ఇహపర సుఖాలను అనుగ్రహించి మానవులకు రక్షగా నిలచి కాపాడుతుందనే పరమార్థతత్త్వం నవరాత్రుల వల్ల అవగతమవుతుంది. సర్వ సిద్ధిశ్చాత్ నవదుర్గా ప్రకీర్తితా! అనే పెద్దల మాటలను గుర్తు చేసుకుంటూ నవరాత్రి విశేషాలను తెలుసుకుందాం.

శమీ శమయతే….

శమీ వృక్షం గొప్ప ఔషధీ వృక్షం. శమీ పాప నాశనీ, అంటే పాపాలతో కూడిన వ్యాధుల్ని నాశనం చేసే గుణం కలది అని అర్థం. అందుకే శమీ వృక్షాన్ని పూజించడంవల్ల పాపాలు శమిస్తాయని, వ్యాధుల నాశనంతోపాటు విజయం కలుగుతుందనే విశ్వాసంతో మన భారతీయ సంప్రదాయంలో (జమ్మి) శమీ పూజ విశిష్టతను సంతరించుకొన్నది. శమీ వృక్షం నూరు సంవత్సరాల జీవితాన్నిస్తుందని, మానవుని మనస్సుపై శమీ ప్రభావం ఉంటుందని ఆధర్వణ వేదంలో, శమీ, సమ్మోహన వశ్య ప్రభావం కలదని దత్తాత్రేయ తంత్రంలో తెల్పబడింది. శమీ వృక్షం రసంతో సర్వలోహాలు భస్మమౌతాయని రస తంత్రాల్లో వివరించబడిన శమీ వ్రతాలు తుమ్మ ఆకులను పోలి దళసరిగా ఉంటాయి. కఫ పైత్యాన్ని, శ్వాస, అతిసారం, కుష్టు, తదితర వ్యాధులను నయం చేసే ప్రభావం కలది.

అందుకే ఆశ్వయుజ శుక్లపక్ష దశమి శ్రవణ నక్షత్రంలో మహిమాన్వితమైన శమీ వృక్షాన్ని పూజించి, ప్రదక్షిణలు చేసి “శమీ శమయతే పాపం! శమీ శతృవినాశనం అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనం అనే శ్లోకాన్ని చెప్పుకొని శమీ పత్రాల్ని ‘బంగారం’గా భావించి పెద్దలకు ఇచ్చి ఆశీస్సులు పొందడం ఆచారంగా వస్తోంది.

“శివ శ్శక్త్యాయుక్తః యది భవతి శక్తిః ప్రభావితం….” ఆ శివుడు శక్తితోనే లోకములను శాసిఁచగల్గుతున్నాడని, అందుకే విజదశమి నాడు ఆయుధ పూజ కూడా విశిష్టంగా చేస్తారు.

సృష్టిలో సర్వమూ శక్తి రూపమే. శరణార్థులందరినీ రక్షించగల శక్తి కలిగిన తల్లి ఆ దుర్గామాతే. “ఐం హ్రీం, క్లీం, చాముండాయైనమః” అనే సవర్ణ మంత్రం లిఖించబడిన తామ్రరేకు యంత్రంపై నారికేళంతో కలశాన్ని స్థాపించి దుర్గాదేవిని మంత్ర పూర్వకంగా ఆవాహన చేసి తొమ్మది రోజులు ఉదయం సాయంత్రం దుర్గా సహస్రనామ, త్రిశతి, సప్తశతి, పఠిస్తూ పూజా విధి నిర్వహించాలి.

తొలి రోజు రక్షశక్తిగా దుర్గ, మలినాడు మంత్రశక్తి మంగళ గౌరిగా, తృతీయమున అన్నపూర్ణాదేవి ప్రాణశక్తిగా, చతుర్థమున కళాశక్తి లలితా త్రిపురసుందరీదేవిగా, మహాలక్ష్మి పంచమిన ఐశ్వర్యశక్తిగా, షష్ఠిన విద్యాశక్తిగా గాయత్రి, సప్తమిన జ్ఞానశక్తిగా సరస్వతీదేవిగా, అష్టమిన ధార్మకి శక్తిగా దుర్గా, సంహారశక్తిగా నవమిన మహిషాసురమర్ధనీ, దశమిరోజున విజయశక్తిగా శ్రీ రాజరాజేశ్వరిదేవిగా మహాదర్శనమిస్తుంది.

సాత్విక, రాజస,తామస అని మూడు విధాలుగా పూజాదికాలు ప్రాచీన సంప్రదాయం, సరస్వతి ఆరాధన సాత్విక అనుష్ఠానానికి మూలం. మహాకాళి ఆరాధన తామసికం, రాజసానికి మహాలక్ష్మీ, ఈ నవరాత్రులలో శ్రీ రాజరాజేశ్వరిదేవిని ఆరాధిస్తే సకల దేవతలను పూజించిన పుణ్యఫలం లభిస్తుందని శాస్త్రవచనం.

నవావరణ యంత్రంపై శ్రీ దేవిని ప్రతిష్ఠించి, సప్తమి, అష్టమి, నవమి తిథులలో పూజ ఆచరిస్తారు. దశమినాటితో పూజ సమాప్తి అవుతుంది. ఆ తిథికే “విజయదశమి” అని పేరు.

ఈ నవరాత్రులలో రాత్రిపూజకే అధిక ప్రాధాన్యత. రాత్రివేళ అమ్మను ఆరాధిస్తే సర్వ పాపాలు ప్రక్షాళనమవుతాయని శాస్త్రోక్తి. ఈ నవరా్రతి వ్రతాన్ని తొమ్మది రోజులపాటు చేసుకోలేని వారు ఏడు రాత్రులు లేదా, ఐదు, మూడు, లేదా ఒక్కరాత్రి ఆచరించవచ్చను.

“త్రిరాత్రం వాపి కర్తవ్యం సప్తమ్యాది యధాక్రమః”

మూడు రాత్రులంటే సప్తమి నుండి, పంచ రాత్రులంటే పంచమి నుండి ఏడు రాత్రులంటే తృతీయ నుండి, ఏకరాత్రి అంటే అష్టమి లేక నవమి నాడు జరుపుకొనవచ్చును.

ఈ నవరాత్రి పూజలు ఆచరించిన తొమ్మది రోజులూ ఒక పూట భోజనంతోగానీ, తొమ్మది రోజులూ ఒక పూట భోజనంతోగానీ, తొమ్మది రోజులు పూర్తి ఉపవాసంతోగాని పూజలు నిర్వహించవచ్చును.

సర్వారిష్ట నివారణకారిణి కావడం చేత తొలి మూడు రోజులు దర్గాపూజ ఆచరించి, అష్టైశ్యర్యప్రదాయిని అయిన లక్ష్మీదేవిని ఆవిష్కరించుకొని సద్గుణ భావసంపదను పొందాలి. దుర్గాపూజ ద్వార అరిషడ్వర్గాలను అంతరింపజేసుకొని, తర్వాత మూడురోజులు లక్ష్మీపూజ ద్వారా సుగుణ సంపదను పొంది, చివరి మూడు రోజుల్లో సరస్వతీ పూజ ద్వారా జ్ఞానం లభిస్తుంది. ఈ జ్ఞానమే ఆధ్యాత్మిక జ్ఞానం. ఆత్మజ్ఞానం, దుర్గా, లక్ష్మి, సరస్వతి ముగ్గురు కూడ ఒక్క జగజ్జనని స్వరూపాలే అని గ్రహించాలి.

October 24, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

“కాలం నది ఒడ్డున”

by Jyothi Muvvala October 24, 2021
written by Jyothi Muvvala
పుస్తకం పేరు : “కాలం నది ఒడ్డున”
కవి :  కళారత్న బిక్కికృష్ణ గారు
సమీక్షకురాలు : జ్యోతి మువ్వల
కాలం అనేది ఒక మహానది. ఎందరో జీవితాలను చూసిన జీవనది. అది ఎవరి కోసం ఆగదు. ఎంతటి ఘనులైన కాలం కాటుకు బలికాక తప్పదు. కాలగర్భంలో కలవక మానదు. మరి కాలం నది ఒడ్డున ఏముంటుంది? జీవితమనే చదరంగంలో ఎత్తుపల్లాలు, కష్టసుఖాలు కావలి కుండలై నడిపిస్తూ ఉంటాయి. కాలం అనే నది ప్రవాహంలో ఈదుకుంటూ పోవాల్సిందే మరి… అది ఏ తీరాన పడేస్తుందో వేచి చూడాల్సిందే. మృత్యుగాలి వీచిందా కాలం నదిలో దేహాం కొట్టుకు పోవాల్సిందే…
కాలం నది ఒడ్డున అనే పేరులో ఎంత నిగూఢ అర్ధం దాగివుందో… ఈ కవితా సంకలనంలోని కవితలలో కూడా అంతే నిగూఢ అర్థాలను ఇమిడ్చి కవిగారు మనకు అందించారు. కాలం నది ఒడ్డున ఓ పచ్చని చెట్టు వలె పల్లవిస్తూ నిటారుగా తలెత్తుకొని నిలబడాలని పరుల కోసం పుష్పించి ఫలించిన పండై రాలిపోవాలి అంటూ సందేశం ఇచ్చారు బిక్కికృష్ణ గారు.
ఇక కవి గారి గురించి చెప్పుకోవాలి అంటే…ఉక్కు లాంటి మనిషి, నవనీత హృదయుడు, సుప్రసిద్ధ కవి, సాహితీ విమర్శకులు, యువకవులను ప్రోత్సహిస్తూ  ప్రతిభావంతులైన కవులను వెలుగులోకి తెస్తున్న నిస్వార్థ సాహిత్య సేవకులు. కవిత్వం డిక్షన్ సృష్టికర్త,  ఈ దశాబ్దపు మహాకవిగా పేరుగాంచిన గొప్ప విమర్శకులు, సాహితీ సమీక్షకులు. కవిత్వం- డిక్షన్ అనే పుస్తకం ద్వారా కవితా నిర్మాణ పద్ధతులను కవిత్వపు భాషను తెలియజేసినా గొప్ప సహృదయం గలిగిన కవి.

బిక్కి కృష్ణ గారి కవిత్వం కూడా జీవనది లాంటిదే. ఎందరో యువకవులకు కవితా దాహం తీరుస్తుంది.
ఈ కవితా సంకలనంలో ప్రతి కవితా అంతర్వాహినిగా ప్రతి పదం గమనంలో ప్రవహిస్తుంది అని చెప్పటంలో అతిశయోక్తి లేదు. కవితలే కాకుండా గజల్, పాటలు కథలు, ఇలా వివిధ ప్రక్రియలలో తనదైన ముద్ర వేసిన సవ్యసాచి, బహుముఖప్రజ్ఞాశాలి మన బిక్కికృష్ణ గారు.
ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వంతో అందరివారయ్యారు. ప్రతి కవితలో ఆయన వ్యక్తిత్వం ఆలోచనా తీరు ప్రసుపుట్టిస్తాయి. ఈ కాలం నది ఒడ్డున అనే కావ్యం నుంచి కొన్ని కవితలను పరిశీలిద్దాం.
*వాడితో చెప్పండి*…
వాన చినుకుల్ని మనపై చల్లిన ఆకాశంపై
ప్రేమతో మల్లెమొగ్గలను విసరాలని
పంట పొలాలకు నీరందించిన చెరువులపై
గంగమ్మ తల్లి గుడి కట్టి పూజించాలని”
ఎంత చక్కటి భావం. ఆకాశం మనకు వర్షం అందిస్తే తిరిగి ప్రేమగా మల్లెమొగ్గలను విసిరి నీరందించిన చెరువులపై గంగమ్మ తల్లి గుడి కట్టి పూజించే రైతు యొక్క సున్నిత మనస్తత్వాన్ని వారి ఔదార్యాన్ని తెలుపుతూ రాసిన కవిత.
 అదే కవితలో…
“పల్లె తల్లి శిగపై పొడుచుకొచ్చిన పొద్దుపొడుపు నేనని
విద్యార్థుల మెదళ్ళలో గూడుకట్టుకున్న అజ్ఞానపు క్యాన్సర్ను
పదునైన అక్షరాలతో శస్త్ర చికిత్స చేసిన డాక్టర్ని నేనని
మొక్కగా చెట్టుగా మహావృక్షంగా జ్ఞానవృక్షంగా బాధల గాధల్లో బోధివృక్షంగా ఎదిగిన రైతుబిడ్డ నేనని
కొడవలితో ఆకాశంలో ఉన్న సూర్యుడి గొంతు కోయాలని ప్రయత్నిస్తే
ఒక్క కిరణం దారం చాలు పది మందిలో వాణ్ణి ఉరేసి చంపడానికి” అని ఘాటుగా ముగించారు.
ఆకలితో అలమటించే కరువు ప్రాంతాల్లోని ప్రజల ఆర్తనాదాలను దగ్గరినుంచి చూసిన కవి! వారి జీవన శైలి ఆత్మాభిమానలను కడుపుమంటలను, రైతుల కష్టాలను ఆకలికేకలకు  ఈ కవితని నిలువెత్తు సాక్ష్యంగా మలిచారు. రైతులు ఎంత సున్నిత మనస్కులో అవసరమైతే తిరగబడి పోరాడే వీరులు ఈ రైతు బిడ్డలు… జ్ఞాన వృక్షంగా బాధలా  గాథల్లో బోధివృక్షంగా ఎదిగిన రైతుబిడ్డనని తెలుపుతూ ప్రతి పాదం నేపథ్యంలో తీవ్రమైన భావావేశంతో పదునైన ప్రశ్నలను సంధించారు.
ఈ కవితకు 2014 రజనీ కుందుర్తి అత్యుత్తమ అవార్డు కూడా లభించింది.
*ప్రజలే కళ్ళు… కవితల ఆనవాళ్లు*
చెట్టంత మనిషి ఏమైనట్టు?
ప్రకృతితల్లి ఒడిలో ఎదిగిన చెట్టుకు
చెట్టుతో పాటు దాన్ని తోబుట్టువుల ఎదిగిన మనిషికి
ఎవడి దిష్టి దోషం తగిలిందో కానీ
దారం తెగిన గాలిపటాల్లా
తమ ఆధారాలు, అస్తిత్వాలు కోల్పోయారు.
చెట్టులోని పువ్వులు పెనుగాలికి రాలినట్టు
మనిషిలోని సున్నితత్వాన్ని ఎవరో నలిపేసారు.
మనిషిని చెట్టుతో పోలుస్తూ చెట్టంత మనిషి ఏమైనట్టు? అంటూ అడిగిన ప్రశ్న… మనందరినీ ఆత్మపరిశీలనలోనికి నెట్టేస్తుంది. పువ్వు లాంటి సున్నిత మనస్తత్వాలు గాలికి రాలి పోయినట్టు మనిషిలోని మానవత్వం సున్నితత్వాన్ని కూడా ఎవరో నలిపేసారా? ఎందుకు మీ ఆధారాలను అస్తిత్వాలను కోల్పోయారు అని ప్రశ్నిస్తున్నారు కవిగారు.
*కర్షక కవి రాసిన పొలం కావ్యం*…
చినుకుల పసికూనలని కనలేక నొప్పితో మబ్బుల ఆకాశం తెరచాటున మూలుగుతున్న గర్భవతి
గుడ్డి మేఘాన్ని ప్రసవించేలా చెయ్యమని గాలి మంత్రసాని
చెట్టు పైనుండి గాలిపటంలా ఎగరేసిన బాలుడు నీవు!”
అంటూ రైతు గొప్పతనాన్ని అభివర్ణిస్తూ అవినీతికి అమ్ముడుపోయిన నాయకులు ఉన్నచోట పొలానికే కాదు
దేశానికి కూడా కంచ వేసినా ప్రయోజనం లేదు అంటూ తెలిపిన గొప్ప కవిత ఇది.ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే కవి పోలిక వినూత్నంగా అరుదైన పదవిన్యాసం బావాభివ్యక్తి అనుభూతి తనదైన శైలిలో అద్భుతంగా ప్రచలితమౌతున్నాయి.
అదే విధంగా మరో కవితను చూస్తే…
*అక్షరాల చనుబాలు*
“ఆత్మహత్యలు చేసుకుని చనిపోవడం ఏంటి?
అసలు మనిషి ఎందుకు చచ్చిపోవాలి?
జీవితంలో ఎన్ని సార్లుయినా చచ్చిబతకాలిగాని
నాలుగు కూనలను బతికించడం కోసం
ఇళ్లల్లో దూరి పాల ప్యాకెట్లు ఎత్తుకొచ్చి
కూనల ఆకలి తీరుస్తున్న మా ఇంటి ముందున్న
రౌడీ ఆడ పిల్లిని చూసి ఉంటే….ఆ తల్లి
భర్త చనిపోయాడని భయపడి పాలిచ్చి పెంచిన పిల్లలను
విషమిచ్చి చంపేది కాదు.”
ఈ కవిత చదివినప్పుడు మనసు ఎంతో ఆర్ద్రమైపోయింది. జీవితంలో అనుకోని సంఘటనలు ఎదురైనప్పుడు ధైర్యం కోల్పోకుండా దృఢ సంకల్పంతో నిలబడితే సాధించలేనిది ఏదీ లేదు అని తెలియజేయడానికి కవి తీసుకున్న కవితా వస్తువు “పిల్లి”
 తన పిల్లలను పెంచుకోవడం కోసం పిల్లి ఎంత తపన పడుతుందో… అది చూసి ఉంటే నువ్వు నీ బిడ్డలను చంపుకోవమ్మ అని కవి చెప్పిన విధానం అద్భుతంగా ఉంది.
*ఆకాశమే హద్దుగా*…
స్వేచ్ఛగా తిరిగే మరుపేగు దారాలను పుటుక్కున తెంపేసి ఎక్కడ ఏ కలల ప్రపంచంలో వాలిపోతారోనని మా భయం
ఎగసిపడే యవ్వన కెరటాలు మీరు
మీ ప్రేమ సాగరాల పూల పడవలలో విహరిస్తుంటారు.
ఏ సమస్యల సుడిగుండాలలో మునిగిపోతారోనని మా భయం!
మా మా ఎదలపై నిదురించిన ప్రేమపావురాలు మీరు
ఏ కలల కీకారణ్యంలో తప్పిపోయి ఎక్కడ కలవరపడి పోతారోనని మా భయం!”
ప్రేమగా కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్న బిడ్డలు… ప్రేమ అనే వలలో చిక్కుకొని ఆ మాయలో తల్లిదండ్రులను కూడా వదులుకొని పేగు బంధాన్ని తెంపుకొని వెళ్ళిపోతారేమోనని  ప్రస్తుతం సమాజంలోని జరుగుతున్న తీరుతెన్నులను చూసి తల్లిదండ్రుల భయాన్ని కవిత రూపంలో చక్కగా చిత్రించారు కవిగారు.
*మనసులను శుభ్రపరుద్దాం*…”
“ఇప్పుడు కొత్తగా చెప్పేదేముంది?
కొత్తగా రాసేదేముంది?
వాడు నీ దేశపు కంప్యూటర్లో అవినీతి వైరస్గా చేరిపోయాక
ప్రభుత్వ ఫైళ్ళలో అధికార సంతకం ఫంగస్గా మిగిలిపోయాక
ప్రపంచ బ్యాంకు కలేబరలలో ప్రజల గొర్రెల తలలు అప్పుడే తెగబడ్డాయి
ఇప్పుడు చందమామ స్విస్ బ్యాంకులో బ్లాక్ మనీ కుందేలును దాచిన అవకాశవాదులంతా…
ఎటొచ్చి ఈ భూమిపై ఉన్న వాళ్లకు భుక్తి గడవని వాళ్లకు
భూమి పుత్రులకే బాధల భూకంపాలనీ…”
ఈ కవితలో కవిగారు  సాంకేతిక యుగంలోని నవ్యతను సంకేతిక పరంగా కవితా వస్తువుగా మలచి వ్యంగ్యంగా చెప్పినా వాస్తవాలకు అద్దంపట్టేలా చెప్పారు. ఏ రోజైతే ప్రభుత్వాలు అమ్ముడుపోయాయో  అభివృద్ధి పేరిట దేశాన్ని విదేశాలలో అమ్మేశారో అప్పుడే దేశ సంపద అంతా తరలిపోయింది. అందని చందమామలోని కుందేలుగా పరాయి దేశంలో చేరిపోయింది. చందమామలో కుందేలు ఉందనుకుంటే ఉందని లేదనుకుంటే లేదని కనిపించని నిజాలను స్కామ్ ముసుగులో దోచేసిన ప్రభుత్వాల తీరును ఎండగడుతూ బలైపోయిన రైతులు, సాధారణ ఉద్యోగుల కష్టాలన్నీ వివరించారు.
*గుమ్మడికాయల దొంగ*…
ఈ కవితలో వాడు పైకి మేధావి ముసుగు ధరించి పెద్ద మనిషిగా కనిపిస్తుంటాడు.
కానీ… వాడి మనసుపుటల్లో అసూయ సర్పం ఆకారణ
ద్వేషంతో బుసలు కొడుతూనే ఉంటుంది.
ఏనుగంత వ్యక్తిత్వం ఉన్న వాడు ఎదురుపడితే
కవిత్వపు భాషలో మొరుగుతూంటాడు
పాపం వాడి తప్పేం లేదు శునకానికి జీతమిచ్చి
కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టిన ప్రభుత్వాలదే!
నిజాలను మాట్లాడిన వాడు భుజాలు తడుముకుంటాడు
బహుశా గుమ్మడికాయల దొంగలంటే వీడినేమో!”
అంటూ మనిషి నైజాన్ని  బట్టబయలు చేశారు.అభ్యుదయ భావాలతో ప్రజ్వరిల్లుతూ నివురుగప్పిన నిజాలను నిర్భయంగా తన కవితలలో తెలియజేస్తున్నారు.
 కవి గారు రాసిన ప్రతి కవితలో  ఒక సందేశంతో పాటు మనిషి యొక్క చీకటి కోణాలకు తెర తీస్తూ వాస్తవాలకు ప్రతీకలుగా నిలుస్తాయి.
*బుల్లితెర భూతం*
“మీ హృదయాల్ని మీ ఇంట్లో మీ టివి భూతం
తన రిమోట్ కంట్రోల్తో ఛానల్ లైజ్ చేసేసింది
రంగుల మార్కెట్లో యాడ్స్ పొయ్యిపై
మీ మెదళ్ళను ఉడకబెట్టుకొని కొంచెం కొంచెం ఆరగిస్తోంది”
అంటూ బాధ్యత కలిగిన పౌరుడిగా సమాజిక స్పృహతో ప్రజలను మేల్కొల్పే కవిత ఇది. అదేవిధంగా కాలగర్భంలో మళ్లీ విత్తనమే మొలకెత్తు… ఆకాశమంత ప్రేమ ఆమె చిరునామా… మగువ మల్లెతీగ etc…ఇలా  అభ్యుదయ కవితలే కాక చక్కటి బావ వ్యక్తిత్వానికి నిదర్శనంగా కవితా వనంలో భావుకత్వపు కుసుమాల పరిమళాలు వెదజల్లుతూ ఆ ఆనంద అనుభూతులలోనికి
పాఠకులను తీసుకువెళ్లి రసజ్ఞుల హృదయాలను కొల్లగొడుతున్నారు. కవితా వస్తువు ఏదైనా ప్రతి వస్తువు కవితగా మలిచి రచనా నైపుణ్యంతో కోటి కాంతులతో నలుదిశలా విస్తరించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ సంకలనంలో ప్రతి కవిత ఒక అద్భుతం. మొత్తం 77 కవితలు కలిగిన ఈ సంకలనం ఒక్కో కవిత ఒక్కో వాస్తవికతకు నిదర్శనంగా నిలిచి కాలం నది ఒడ్డున అనే కావ్యంగా మలచిబడింది అని చెప్పవచ్చును.
ఈ సంకలనానికి పలు ప్రముఖులు తమ అభిప్రాయాలను అందించారు. కలం యోధుడు బిక్కీ కృష్ణ గారు అని నానీల సృష్టికర్త ప్రముఖ కవి ఎన్. గోపి గారు అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. కవిత్వం రాసేటప్పుడు బిక్కి కృష్ణ గారు మూడో మనిషి అవుతారు  తనను తాను చీల్చుకొని లోకాన్ని చీల్చి చూస్తాడు. తన అందాలు, ఆవేదనలు, ఆక్రోశాలు, అనుభవాలు వర్ణనాత్మకంగా బయల్పడతాయి అని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కే. శివారెడ్డి గారు తెలియజేశారు. ఎగరేసిన మానవతా కవిత పతాక బిక్కీ కృష్ణ గారు ఆయన కవితలకు ముందు మాట అవసరం లేదు అని తేల్చి చెప్పేశారు నగ్నముని గారు.పల్లె సెగపై పొద్దుపొడుపు అని శిఖామణి గారు అభివర్ణించారు. మల్లెల నరసింహమూర్తి గారు, డాక్టర్ ప్రసాద్ మూర్తి గారు, బి.డి శ్యామల గారు, ఇలా చాలా మంది ప్రముఖులు  బిక్కి కృష్ణ గారి కవిత శైలిని, వ్యక్తిత్వాన్ని  కవితా నిర్మాణంలోని గొప్పతనాన్ని తమ అభిప్రాయాలలో పేర్కొన్నారు. ఈ మహాకవి మరెన్నో సంకలనాలను భవిష్యత్తులో మనకు అందించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
–జ్యోతి మువ్వల
బెంగళూరు.
9008083344
October 24, 2021 0 comment
2 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

చినువా అచెబి రచన “Things Fall Apart’; నైజీరియా లో నల్లగుండె చప్పుడు

by మూర్తి కెవివిఎస్ October 24, 2021
written by మూర్తి కెవివిఎస్

Thing fall apart అనే ఈ ఆఫ్రికన్ నవల ని ఇటీవల చదివాను. రచయిత Chinua achebe. స్వయం గా ఆంగ్ల ఆచార్యుడు కనుక ఇంగ్లీష్ లో రాశాడు.నైజీరియా అనగానే మనకి మనసు లో ఏర్పడే చిత్ర పటం వేరు కాని ఈ నవల చదివిన తరువాత అది పూర్తిగా కనుమరుగై మరో రూపం ఏర్పడుతుంది. ఆ రకంగా తన ఈబో జాతికి ఇంకా ఆఫ్రికా ఖండానికి చినుబా అచెబా ఒక గొప్ప సేవ యే చేశాడు. ఈ నవల రమారమి 50 భాషల్లోకి అనువదింపడి,కోటి ప్రతులకి పైగా అమ్ముడై ఇంకా తన జైత్రయాత్ర ని కొనసాగిస్తూనే ఉంది. నల్ల జాతి ప్రజల గుండె చప్పుళ్ళని జోసెఫ్ కాన్రాడ్ లాంటి వాళ్ళు వినిపించి ఉండవచ్చుగాకా..! కాని దానిలో లేని ఒక తమదైన స్వరం నూతనం గా దీనిలో వినిపిస్తుంది,కారణం చినుబా అచెబా తాను స్వయం గా ఆ భూమిపుత్రుడు కావడం..!

స్థూలం గా నవల లోకి వెళదాము. చెప్పాలనంటే దీనిలోని ప్రతి పేజీలోనూ ఏదో ఓ ఆసక్తి కరమైన అంశం తారసపడుతుంది. బహుశా నైజీరియా కి సంబందించిన జీవితం మనకి చాలా తక్కువ తెలిసిఉండటం వల్ల అలా అనిపినిస్తుందేమో..! అమెరికన్,రష్యన్,ఇతర యూరపు కి చెందినవి ఎక్కువగా చదివాము తప్పా ఆఫ్రికన్ నవల సీరియస్ గా చదివింది ఎక్కడని..?సరే దానికి కారణాలు అనేకం..అదో పెద్ద గ్రంథం.ఇంచుమించు ప్రతి ఆఫ్రికా దేశం లోనూ ఈ నవల పాఠ్యగ్రంథం గా ఉన్నది. మన వలెనే వాళ్ళూ బ్రిటీష్ వారి చేతనే పాలించబడ్డారు.ఆ పాలన లో జరిగిన కథయే ఈ పుస్తకరూపం లో వచ్చింది.మరి ఆ బ్రిటీష్ వాళ్ళ సైకాలజీ ఏమిటో అర్థం కాదుగాని ఈ నవలని మొదటిసారిగా ప్రచురించింది కూడా లండన్ లోనే..!

Okonkwo తన గ్రామం లోనే కాదు ఆ చుట్టుపక్కల ఉన్న తొమ్మిది గ్రామాల్లో యోధుని గానూ,పెద్ద మనిషి గానూ పేరున్న వ్యక్తి.పండుగ సమయాల్లో జరిగే కుస్తీ పోటీల్లో ఫాల్గోవటం దాంట్లో గెలిచి వీరతాళ్ళు వేయించుకోవడం అక్కడి ఆనవాయితీ.అలాంటి వారికి ప్రత్యేక గౌరవం ఉంటుంది. ఈ Umuofia గ్రామం లో మన కథానాయకుడు Okonkwo పెద్ద రైతు కూడా. అతని తండ్రి Unoka దుబారా మనిషి గా,తాగుబోతు గా ,అప్పులు చేసి చెడు పేరు తెచ్చుకున్న వాడిగా ప్రసిద్ధి. ఆ విధంగా తాను కాకూడదని ఎంతో పట్టుదల గా జీవితం లో ఓ స్థాయి కి వస్తాడు. Yams పంట ని విరివి గా పండిస్తాడు.కోళ్ళు,పశువులు బాగా ఉన్నాయి.తన కాంపౌండ్ లో ముగ్గురు భార్యలకి,తనకి ఎవరి ఇళ్ళు వాళ్ళకి నిర్మించాడు.మొత్తం 11 మంది సంతానం.

వారి ఈబో తెగ లో బహుభార్యత్వం సాధారణం. కన్యాశుల్కం అనేది ఉంది. Okonkwo రెండవ భార్య మొదటి భర్త ని విడిచి ఇక్కడకి వచ్చిన మనిషి.సరే..ప్రాణానికి ప్రాణం అనేది ఆ తెగ లోని ఆచారాల్లో ఒకటి. ఉదాహరణకి వీరి గ్రామానికి చెందిన ఒక ఆడ మనిషిని పక్క గ్రామం కి చెందిన వ్యక్తి చంపితే వాళ్ళ కుటుంబం లోని ఓ వ్యక్తిని చంపడానికి ఇవ్వమని అడుగుతారు.అప్పుడు వాళ్ళు మూడేళ్ళ పిల్లాడిని ఇస్తారు.అతని పేరు Ikemefuna.మరో మూడేళ్ళు పెంచిన తరువాత ఈ కుర్రాడిని గొడ్డలితో నరికి చంపుతారు.అది అక్కడి వ్యవహారం.ఇవ్వలేదంటే గ్రామం అంతా ఏకమై దోషి యొక్క ఇంటి పై పడి నరుకుతారు.అదీ విషయం…అలాగని ఎవర్నీ పడితే వాళ్ళని నరుకుతారు అనుకుంటే తప్పు.ఉదాహరణకి Okonkwo తుపాకి పొరబాటున పేలి ఒకరి ప్రాణం పోయినప్పుడు ఊరి పెద్దల్లో ఒకడని కూడా చూడకుండా అతని ఇళ్ళని నాశనం చేసి,ఏడేళ్ళు కుటుంబాన్ని గ్రామం నుంచి బహిష్కరిస్తారు.ఇదంతా తమ కట్టుబాటు లో భాగమే కనక మన హీరో కూడా మౌనం గానే భరిస్తాడు.

భూమి వారికి అత్యంత పూజనీయమైనది. ఒక దేవత. అలాగే సర్పం…కొండచిలువ సైతం ఒక దేవత.ఎట్టి పరిస్థితుల్లోనూ చంపరు.అది ఇంటి లోనికి వచ్చినా,దానికి కావాలిసింది తిని వెళ్ళేవరకు వేచిచూస్తారు తప్పా చంపరు. అలాగే ఊరి పెద్దలు కూర్చోవడానికి మేక చర్మాన్ని చాప లా వాడతారు. మన పూర్వీకులు జింక,పులి చర్మాలు ఉపయోగించిన వైనం గుర్తుకు రావడం లేదూ..? సరే…ఎంతో ఆనందంగా…చిన్న చిన్న వైరుధ్యాలతో సాగిపోయే మన కథానాయకుని జీవితం ఏడేళ్ళ ప్రవాస సమయం లో మలుపు తిరుగుతుంది. ఆ ప్రవాసం ఎక్కడో కాదు,తన మేన మామ ఇంటి ప్రాంగణం లో..Mbanta గ్రామం లో..!

ఈ గ్రామానికి వచ్చి ఏడేళ్ళు ఉండాలి,పొరబాటున తన తుపాకి గుండు తగిలి స్వగ్రామం లో ఒకరి చావుకి కారణమైనందువల్ల.అలా ఒకటి రెండు ఏళ్ళు గడుస్తున్న సమయం లో తన మిత్రుడు Obierika చూడటానికి వచ్చి,తమ గ్రామం లో వచ్చిన మార్పులు గురించి చెబుతాడు.క్రైస్తవ ప్రచారకులు ఊరి లోకి వచ్చి తమ తెగ లో కొందరిని మతం మార్చారని,మిస్టర్ బ్రౌన్ అనే తెల్లవాడు దానికి కారకుడని వివరిస్తాడు.మన తాతముత్తాతల,దేవతల ఆత్మలు ఘోషిస్తున్నాయని అంటాడు. Okonkwo కూడా బాధపడతాడు.ఊరికి సంబందించిన పెద్ద ఒకాయన కూడా చర్చ్ కి వెళుతుంటాడు.ఊరిని ఏ విధంగా మిషనరీస్ ఓ క్రమ పద్ధతి లో విడదీసిందీ చర్చించుకుంటారు.

బైబిల్ విషయం లో ఈబో పెద్దలు లేవనెత్తిన కొన్ని ప్రశ్నలు మిష్టర్ బ్రౌన్ ని ఇరకాటం లో పడేస్తాయి.దానితో అతను వేరే దారి అవలంబిస్తాడు.స్కూల్,ఆసుపత్రి,టీచర్ ట్రైనింగ్ సంస్థలు వంటివాటిని ప్రభుత్వం తో మాట్లాడి ఈ ఊరికి రప్పిస్తాడు.అక్కడ చదువుకున్న వాళ్ళు పైకి వచ్చి ఉద్యోగాలు చేయడం చూసి ఈబో తెగ లోని పై వర్గం వారు కూడా మిషనరీ సంస్థ లకి తమ పిల్లల్ని పంపడం మొదలెడతారు.అంతదాకా కింది వర్గం వారు మాత్రమే తమ పిల్లల్ని పంపేవారు.

ప్రవాసం ముగిసి Okonkwo తన గ్రామం వచ్చేస్తాడు.పరిస్థితులు అన్నీ మారిపోయి కనిపిస్తాయి.తమ దేవతలకి,పూర్వీకుల ఆత్మలకి విలువ లేకుండాపోయింది.చర్చ్ నుంచి పాటలు,మాటలు వినబడుతున్నాయి.దీనికి గాను మనం ఏమీ చేయలేమా అని మిత్రులతో అంటాడు.మన లోని వాళ్ళే కొంతమంది అటు మొగ్గినపుడు ఏమి చేగలం అంటారు వాళ్ళు.తెల్ల మిషనరీస్ వ్యాపారాన్ని గ్రామానికి తీసుకు వచ్చారు.పాం ఆయిల్,దుంపలు వంటివి కొనుగోలు అయ్యేందుకు కేంద్రాలు తెరిచారు.డబ్బులు బాగా స్థానికుల చేతిలో ఆడుతున్నాయి.

ఇదిలా ఉండగా స్థానిక పండుగ జరిగే సందర్భం లో కియాగా అనే మతాన్ని తీసుకున్న వ్యక్తి అలజడి సృష్టిస్తాడు.బాగా అల్లర్లు జరుగుతాయి.కథానాయకుని నాయకత్వం లో అతని అనుయాయులు అంతా కియాగా ఇంటికి వెళ్ళి ధ్వంసం చేసి ఆ వ్యక్తిని చంపేస్తారు.అంతేగాక చర్చ్ ని కూడా తగలబెడతారు.అయితే ఈ సందర్భం లో మిష్టర్ బ్రౌన్ కాకుండా వేరే తెల్లజాతీయుడు ఉంటాడు.అతను ఈ సంగతి అంతా పైనున్న డిప్యూటీ కమీషనర్ కి వెళ్ళి చెబుతాడు.అతనూ ఒక బ్రిటీష్ వాడే.ఆ అధికారి వెంటనే జవాన్లని పంపించి చర్చలకి అని చెప్పి ఊరి పెద్దల్ని కొందర్ని రప్పించి వాళ్ళని బంధించి చిత్ర హింసలు పెడతారు. వీళ్ళని ఒదలాలీ అంటే ఊరంతా కలిసి పెనాల్టీ కట్టాలని ఇంకా కొంతమంది Okonkwo లాంటి అందరూ వచ్చి లొంగిపోవాలని కబురుపెడతారు. దీనితో ఒళ్ళుమండి వచ్చిన ప్రభుత్వ మెసెంజెర్ ని నరికి చంపుతాడు కథానాయకుడు.

ఇక లాభం లేదని కమీషనర్ ఈ ఊరికి వస్తాడు తన బలగం తో. ఊరి చివరన చెట్టు కి ఓ శవం వేలాడుతుందని దాన్ని దింపి సాయపడండి అంటారు ఊరివాళ్ళు.ఆత్మహత్య చేసుకున్న వారి అంత్యక్రియలు తాము జరపమని చెబుతారు.సరే అని చెప్పి ఆ శవాన్ని జవాన్లతో దింపిస్తాడు కమీషనర్.ఇంతకీ అది ఎవరిదో కాదు Okonkwo యొక్క శవం. కమీషనర్ నిర్ఘాంతపోతాడు.ఇక మీద ఎప్పుడూ ఇలా ఫీల్డ్ మీదకి తాను రాకుడదని అనుకుంటాడు. మరో రకంగా తనకి ఆనందం అనిపించింది,ఎందుకంటే తాను రాయబొయే పుస్తకానికి మంచి వస్తువు ,సరంజామా దొరికిందని.తాను రాబొయే పుస్తకం పేరు ఏమిటంటే The pacification of the primitive tribes of the lower Niger. ఆ పుస్తకం లో ఈ ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి గూర్చి కూడా ఓ పేరాగ్రాఫ్ రాయాలి అనుకుంటాడు.

(సమాప్తం)

 

October 24, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

వరంగల్ జిల్లా పత్రికల సమగ్ర పరిశోధక సర్వస్వం-డా. నమిలకొండ సునీత పరిశోధన

by సంకేపల్లి నాగేంద్ర శర్మ October 24, 2021
written by సంకేపల్లి నాగేంద్ర శర్మ
పుట్టిన ఊరు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వేములవాడ అయినా, రచయిత్రి డా.నమిలకొండ సునీత గారు వృత్తి రీత్యా ప్రభుత్వ తెలుగు పండితురాలుగా కామారెడ్దిలో పనిచేస్తూ,  స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.  భార్యా భర్తలు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. డా.సునీత ఎంఎ,(తెలుగు) పండిత శిక్షణ పూర్తి చేసి, తెలుగు పండితురాలుగా పనిచేస్తున్నారు. ఎంఫిల్ చేసిన తదుపరి, 2018లో వరంగల్ జిల్లా పత్రికలు-నాడు నేడు, సాహిత్య సేవ అనే అంశంపై పిహెచ్ డి చేసి, ఒక గ్రంథంగా విడుదల చేశారు. 350 పేజీలున్న ఈ గ్రంథంలో తెలుగు పత్రికల తీరు తెన్నుల గూర్చి, సమాచార సేకరణ చేసి,  దీర్ఘంగా, వరంగల్ జిల్లా పత్రికల చరిత్రను, జర్నలిస్టులు, సంపాదకుల వివరాలను, పత్రికల సాహిత్య సేవలను ఆసక్తి కరంగా చర్చించి, పత్రికల పై పరిశోధన చేసే వారికి ఒక ఉపయుక్తమైన గ్రంథంగా తీర్చి దిద్దారు. తెలుగు సామాజిక లోకానికి, ముఖ్యంగా తెలంగాణా ప్రాత్రికేయరంగానికి ఇది ఒక అపూర్వ కానుకగా పరిశోధించి ఇచ్చారనే చెప్పాలి. 2017 లో తెలుగు రీడర్ గా రిటైర్డయిన  డా.అన్నదానం వేంకట సుబ్రహ్మణ్య పర్యవేక్షణలో ఉస్మానియా తెలుగు శాఖ నుండి పిహెచ్ డి పట్టాన్ని పొందారు. రచయిత్రి తెలుగు సాహిత్యంలో పరిశోధక రచయిత్రి కావడం వల్ల, ఇందులోని పరిశోధక వివరాలు, విశ్లేషణలు మేలిమి బంగారంలా కనబడతాయి.  నేటి సమాజంలో ప్రజాస్వామ్య మనుగడకు ఉపకరించే పత్రికలకు ప్రతిష్టాపన శక్తి ఉంది. విలువలను ప్రతిష్టించగలుగుతాయి. ప్రజాస్వామ్య సౌధానికి నాలుగు స్తంభాలలో ఒకటైన పత్రికల పాత్ర సమాజంలో ఎంతో గొప్పది. కేవలం సెన్సేషన్ కోసం, సంఘర్షణ కోసం కాకుండా. సంస్కరణ కోసం పత్రికలు ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా నిలిచి, ఒక నిర్మాణాత్మకమైన పాత్రను పోషించాయని గైడ్ చెబుతూ, ఇందులకు రచయిత్రి చేసిన కృషిని ముందు మాటలు రాసిన సాహితీ ప్రముఖులు అభినందించారు. గోరాశాస్త్రి, మాడపాటి హన్మంతరావు, సురవరం, నార్ల, పొత్తూరి, ఎంవి.ఆర్. శాస్త్రి, ఎబికె.ప్రసాద్, దేవులపల్లి అమర్  వంటి  ప్రముఖులు పత్రికా రంగంపై వివిధ కోణాల్లో రచనలు చేశారు. ఒక జిల్లా పత్రికారంగంపై పరిధిని ఎంచుకొని సిద్దాంత పరిశోధన చేయడం అరుదైన పనేయని రచయిత్రిని అభినందించక తప్పదు.
పేరుకు వరంగల్ జిల్లా పత్రికల అంశమైనా, ఇందులో తెలుగు పత్రికల చరిత్ర తీరును, సాహిత్య సేవలను చక్కగా విశ్లేషించారు. పాత్రికేయ, సాహితీ పెద్దలైన ముఖ్యుల సహాయ సహకారాలను తీసుకొని పరిశోధించి, ఈ గ్రంథాన్ని ఆసక్తి కరంగా మలిచారు. వీరు గత ఆరేడేళ్ళ నుండి వివిధ పత్రికలకు పరిశోధక సాహిత్య వ్యాసాలు రాస్తున్నారు. వివిధ మ్యాగజైన్ లలో కూడా వీరి పరిశోధక వ్యాసాలు కనిపిస్తుంటాయి. మొదట ప్రభాత కిరణాలు సాహిత్య వ్యాసాల సంచిక తర్వాత, వీరి పిహెచ్ డి గ్రంథం వెలువడింది.  దీన్ని అయిదు అధ్యాయాలుగా విభజించి, రచయత్రి తన పరిశోధనను ప్రారంభించారు. రచయిత్రి వివరించిన ప్రస్తావన, ఉపసంహారాలు రెండింటిని కలిపి కూడా ఒక అధ్యాయంగా పరిగణించవచ్చును. విభజించిన అంశాలు.  అవి 1.పత్రికలు-స్వరూప స్వభావాలు 2. సంపాదకీయాలు-పరిశీలన 3.పత్రికలు, భాషా సాహిత్యం 4.సంస్కృతి, పత్రికల స్థితి గతులు నాడు. నేడు 5.పాత్రికేయుల జీవన రేఖలు. ఇవి  అయిదు భాగాలుగా విభజించి విశ్లేషణ గావించారు.
ప్రాత్రికేయ దిగ్గజం కీ.శే. పొత్తూరి వెంకటేశ్వర్ రావు, ప్రముఖ విప్లవ రచయిత వరవరరావు, సీనియర్ సాహితీవేత్త డా.టి.రంగస్వామి, గైడ్ సుబ్రమణ్యం తదితరులు ముందుమాటలు రాసి, భావి తరాలకు మేలు చేసే ఆకర సిద్దాంత గ్రంథమని, రచయిత్రిని అభినందించారు. ఈ పుస్తకంలోని భాష సరళంగా ఉంది. తీసుకొన్న వివిధా అంశాల విశ్లేషణలు, వివిధ కోణాల్లో ప్రామాణికంగా నిలిచాయి. పేరుకు వరంగల్ జిల్లా చరిత్రయినా, తెలుగు పత్రికల పరిశోధనలో సముచిత సిద్దాంత గ్రంథంగా నిలబడుతుందని అభివర్ణించారు. అన్ని జిల్లాల సాహిత్యంతో పాటుగా, రాజకీయ, సాంఘీక విషయాలపై పరిశోధనలు జరగాల్సి ఉందని, ఇలాంటివి తెలుగు పత్రికా సాహితీ రంగానికి వన్నె తెస్తుందని శ్లాఘించారు. దాదాపు వంద ఏళ్ళ కిందటి నుండి స్మృతి పథం నుండి పోతున్న పత్రికలను రచయిత్రి ప్రామాణీకంగా పరిశోధన చేయడం అభినందించ తగిన విషయమని అన్నారు. ఇలాంటి పరిశోధనలు ఇంతవరకు కోస్తా, రాయలసీమల్లో జరుగలేదని సంపాదక దిగ్గజం స్వర్గీయ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు  అన్నారు. వరంగల్ జిల్లా సీనియర్ పాత్రికేయులు కీ.శే. వి.ఎల్. నర్సింహారావుతో సహా మండువ రవీందర్, నమిలకొండ బాలకిషన్ రావు, గుముడవెళ్ళి మనోహర్ రావు, డా.టి.రంగస్వామి ప్రభృతులు రచయిత్రి డా. సునీతకు క్షేత్ర  పరిశోధనలో తమ వంతు సహకారాన్ని అందించారు.
 ఈ పుస్తకం పై రచయిత్రి నమిలకొండ సునీత తన అభిప్రాయం రాస్తూ, తన గ్రంథ రచనలో వరంగల్ జిల్లా పత్రికలే కాక, వివిధ పత్రికల యాజమాన్యం, సంఫాదకులు, విలేకరులు, రచయితలు, మొదలగు వారు అనేక అంశాలలో చేసిన పత్రికా సేవను పరిశోధనా దృష్టితో పరిశీలించి రికార్డు చేసినట్లు తెలిపారు. జూట్ అంటే జనపనార మిల్లుల యాజమాన్యాల వారి పత్రికలకన్నా, కార్పోరేట్ సెక్టర్, కాషాయ దళారీల స్వార్థ ప్రయోజనాల కోసం పత్రిక తీరులు మారుతున్నావి. ఇవ్వన్నిటికి మినహాయింపుగా ఉమ్మడి జిల్లా వరంగల్ నాటి పత్రికలు ఎంతగానో సామాజిక, సాహిత్య సేవ చేసాయని, డా. వరవరరావు ముందుమాటలో అన్నారు. సునీత గారి పరిశోధనలో తన రెండు దశాబ్దాల సృజన పత్రిక గూర్చి చక్కగా రాశారని, పత్రికల్లోని వివిధ అంశాలపై వింగడించి విశ్లేషణలు చేసి, వ్యాఖ్యానించడం అభినందనీయమని డా. వరవర అన్నారు. గుత్తాదారుల పరిశ్రమగా నడుస్తున్న ఈ కాలపు పత్రికలను కాదని, స్థానీయత వైపు మొగ్గి పరిశోధన చేయడంతో రచయిత్రి సంకల్ప కృషిని అభినందించి తీరాలని అన్నారు. డా.సునీత శత వసంతాల జిల్లా పత్రికారంగాన్ని సమీక్షించారని, పత్రికల అగచాట్లు,సాదక బాధకాలు, తీరు తెన్నులు, రాజకీయ, సినిమా పత్రికల గూర్చి ఇందులో చర్చించడం అభినందించదగిన విషయమని ప్రముఖ సాహితీవేత్త డా.టి.రంగస్వామి గారు తన ముందు మాటలో అన్నారు. వరంగల్ సాహిత్య చరిత్ర పరిశోధనకు ఇది ఒక విలువైన ఆకర గ్రంథమని అన్నారు.  ఒక గృహిణీగా, రచయిత్రిగా, ఉద్యోగినిగా మూడు పాత్రల్లో ఉంటూనే, విభిన్నంగా పత్రికలపై సిద్దాంత పరిశోధన చేయడానికి సాహసించడం అభినందనీయమని అన్నారు.
ఇహ పరిశోధన పుస్తకంలోకి వెడితే, కత్తికంటే కలం గొప్పది, వార్తయందు జగము వర్ధిల్లు చున్నది. వరంగల్ జిల్లా పత్రికల్లో జనధర్మ, వరంగల్ వాణి, పాములపర్తి సదాశివరావు నిర్వహించిన కాకతీయ, ఒద్దిరాజు సోదరుల తెలుగు పత్రిక, డా.పెండ్యాల వరవరరావు గారి సృజన పత్రిక, దేవులపల్లి రామానుజారావు వారి శోభ తదితరుల అమూల్యమైన సాహితీ పత్రికా రంగ సేవలు ఇందులో కనిపిస్తాయి.   పివి, కాళోజీల పాత్ర కనిపిస్తుంది. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాట వ్యధలు, స్వాతంత్రోద్యమ కాలం నాటి సమాచారం, విప్లవ భావాల తీరు తెన్నులు చర్చకు వస్తాయి. ఈ పరిశోధక  గ్రంథ రచనలో తనకు సహకరించిన డా.టి.రంగస్వామి దంపతులు, విఎల్. నరసింహారావుల సేవలు అమూల్యమని రచయిత్రి ధన్యవాదాలు చెప్పుకున్నారు.
ఈ సిద్దాంత పుస్తకంలో 16 పీజీల రచయిత్రి ప్రస్తావన అర్దవంతమైనది. ఇందులో  రచయిత్రి పత్రికల సాహిత్య, సమాచార విశ్లేషణ పనస తొనకలు ఒలిచి పెట్టినట్లుగా ఉంది.  స్వాతంత్ర్యం తర్వాత సర్వతోముఖాభివృద్ధికి కృషి చేసిన కాకతీయ వార పత్రిక నిర్వహణపై పాములపర్తి సదాశివరావు, పివి సారథ్యం వహించారు. ఇందులో పివి రాసిన వ్యాసాలు, కథలు, వివిధ రచనలు మారు పేర్లతో చోటు చేసుకున్నాయి. సదాశివరావు రచనలు తాత్విక, సాహిత్య కళారంగాలకు వన్నె తెచ్చాయి. భండారు చంద్రమౌళీశ్వరరావు ప్రగతి, రాజరాజ నరేంద్ర, చిత్ర విచిత్ర, ఎం.ఎస్.ఆచార్య జనధర్మ, వరంగల్ వాణీ, దేవులపల్లి రామానుజారావు వారి శోభ, పెండ్యాల వరవరరావు సృజన, జాతీయ సాహిత్య పరిషత్ వారి ఆధ్వర్యంలో వెలువడిన సాధన, నమిలకొండ బాకి వారి ప్రసారిక పత్రికలు జిల్లాలో నూతన దశ-దిశలను ఆవిష్కరించాయి. ఇలా రచయిత్రి మనోగతంలో అనేక విషయాలు పత్రికా రంగం, సాహితీ సేవలను గూర్చి సంతృప్తిగా చర్చించారు.
తెలుగు సాహిత్య చరిత్రలో సాహిత్య సాంప్రదాయం వేయ్యేళ్ళు కొనసాగిన సీమ అంటూ వరంగల్ ప్రాచీన చరిత్రను ప్రస్తావించారు. వరంగల్. ప్రాచీన ఆదిమానవుడి కాలం నుండి శాతవాహన, ఇక్ష్వాకు, రాష్ట్రకూట, చాళుక్య, కాకతీయ, పద్మనాయక, బహుమని, విజయనగర, గజపతి, కుతుబ్ షాహి, ఆసఫ్ జాహి సామ్రాజ్యం కొనసాగింది.  ఇక్కడ ఎంతో అమూల్యమైన చరిత్ర దాగి ఉంది.  కాకతీయ సామ్రాజ్యం ఒక వైపు పాల్కురికి వీరశైవం, భగవద్రామానుజుని శ్రీ వైష్ణవం, మరో వైపు మహాకవి పోతనామాత్యుని భాగవత సాంప్రదాయం మధ్య సమతౌల్యతను చేస్తూ, తన పత్రికా పరిశోధనా సాహితీ వ్యాసంగం కొన సాగినట్లు రచయిత్రి చెప్పుకున్నారు. ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లాలో  ఆ కాలంలో నుండి ఇటీవలి కాలం వరకు 175 పత్రికలు వెలువడ్దాయంటే ఈ జిల్లా పత్రికా రంగ చరిత్ర ఘనమైనది, విస్తృతమైందని చెప్పక తప్పదు . దాశరథి, కాళోజీ, పివి, పాములపర్తి, ఎంఎస్ ఆచార్య వంటి ప్రముఖులు సాహిత్య పత్రికా రంగ సేవలో చిరస్థాయిగా నిలిచిపోయారు.
మొదటి అధ్యాయంలో  పత్రికా రంగ స్వరూప స్వభావాల్లో, 1920 నుండి తెలంగాణాలో పత్రికా రంగానికి మైలురాయిగా నిలిచింది. ఇక్కడ నిజాం, బ్రిటిష్ పాలకుల అనుమతులు తీసుకోవాలి. మత ఘర్షణల గూర్చి, ప్రభుత్వ ఉద్యోగులపై ఎలాంటి వ్యతిరేక రాతలు, విమర్శలు రాయరాదు. ఇలా అనేక ఆంక్షలు ఎదుర్కొని పత్రికల  ప్రారంభానికి పాలకులు సూక్ష్మ పరిశీలన చేసి, అనుమతులు ఇచ్చేవారు. అధికార భాష ఉర్దూ కావడం వల్ల, ఉర్దూ పత్రికలతో పాటు, తెలుగు, ఆంగ్లం తదితర భాషల్లో పత్రికలు ఆ కాలంలో వస్తూండేవి. దిన,వార,పక్ష, మాస పత్రికలు వస్తుండేవి. 1922లో తెలుగులో నల్లగొండ జిల్లా నీలగిరి, వరంగల్ జిల్లా వద్దిరాజు సోదరుల వారి తెనుగు పత్రికలు సాంకేతిక పరిజ్నానం అంతగా లేకున్న, వాటిని అధిగమించి ఎంతో సాహిత్య సేవ చేశాయి. హైదరాబాద్ సురవరం వారి సంపాదకత్వంలో (1926-47) గోలకొండ పత్రిక, 1947 నాటి షోయబుల్లాఖాన్ వారి ఉర్దూ రయ్యత్, ఇమ్రోజ్ లాంటి పత్రికలు ఎంతో సాహిత్య సేవ చేశాయి. హైద్రాబాద్ గోలకొండ కవుల సంచిక ద్వారా ఎంతోమంది కవులు వెలుగులోకి వచ్చారు.
వరంగల్ జిల్లాలో 175 పత్రికలు నడిచాయి. ఇందులో గోడ. లిఖిత, సైక్లోస్టైల్ పత్రికలు చేరాయి.  ఎప్పుడైతే, 1980-90 దశకాలలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలు పెద్ద పెట్టుబడులతో సొంత ప్రింటింగ్ ప్రెస్ లతో వచ్చి, జిల్లా స్థాయి ఎడిషన్లు ప్రారంభించాక ఆయా జిల్లాలలో ఉన్న చిన్న పాటి పత్రికలకి పోటీలో నిలువలేక పోయాయి.  వరంగల్ జిల్లాలో గ్రంథాలయోద్యమంలో పత్రికల పాత్ర, గొప్పది. సాంకేతికలు అంతగా లేని కాలంలొ, ఆ కాలం నాటి  పత్రికల ప్రతులు దొరకలేదు. కొన్ని మాత్రమే లభ్యం. ఈ ప్రతులను భద్ర పరిచే అంశంలో కొంత శ్రద్ద వహించకపోవడాన్ని రచయిత్రి చివరన ఎత్తి చూపారు. వైశ్యకల్ప వంటి ఒకటి రెండు పత్రికలను మహిళా సంఫాదకులు నడిపారు. స్వాతంత్ర్యానికి పూర్వం పత్రికలు జాతిహితమనే పరమధర్మాన్ని ఎంచుకొని నడిపారు. స్వాతంత్ర్యం తదుపరి పత్రికా నిర్వహణలో భారీ పెట్టుబడుల రాకతో ఒక వాణీజ్య కలాపంగా మారింది. పత్రికల దశ దిశ మారింది. వరంగల్ జిల్లా పత్రికారంగ చరిత్ర ఇంధ్ర ధనస్సు లాగా అన్ని తత్వాలను, ఇజాలను, నూతన చైతన్యాలను, జాతీయ సంస్కృతులను, ఇముడ్చుకొని ముందుకు సాగింది. జాతీయ పత్రికా రంగానికి ఆద్యుడిగా రాజరాంమోహన్ రాయ్ అయితే, వరంగల్ పత్రికా రంగానికి ఒద్దిరాజు సోదరులు ఆద్యులుగా నిలిచారు. స్వాతంత్రోద్యమం, ఆంధ్రోద్యమం, గ్రంథాలయోద్యమం, నిజాం విముక్తి ఉద్యమం, విప్లవోద్యమం, సామాజిక ఉద్యమం, తెలంగాణా ఉద్యమం వంటి పలు ప్రజాస్వామిక ఉద్యమాలకు జిల్లా పత్రికలు బాసటగా నిలిచాయి. పత్రికా నిర్వహణ సమస్యలను ఎదుర్కొవడంలో అపసోపలు పడ్దా, దుష్ట శక్తులు, పాలకుల నియంత్రణలతో పలు సమస్యలు ఉన్నా, పత్రికల నిర్వహణ కొనసాగింది.  నిష్పక్షక  రిఫోర్టింగ్, ప్రజాస్వామ్య బాధ్యతలను ఎరిగి పత్రికలు, చిన్నపత్రికలు నడిచాయి. న్యూస్ ప్రింట్ కొరత,  ప్రింటింగ్ కాస్ట్ పెరగడం, కార్మికులతో ఇబ్బందులు, వేతనాల సమస్యలు, అర్ధబలం, పాలకుల సహకారం లేక పత్రికల నిర్వహణ భారంగా ఉండేది. ఉదాహరణకు ఒద్దిరాజు సోదరుల తెనుగు పత్రికల విశేషాలను ప్రముఖంగా చర్చించారు. శైవపత్రికలు రెండు నడిచాయి. పిల్లల మాస పత్రిక పూలతోటతో పాటు, మానుకోట , సుకృతి, జ్నానోదయ వంటి లిఖిత పత్రికలు, సినిమా నేపథ్యంలో చిత్రవిచిత్ర అనే పత్రిక తదితర పత్రికలకు జిల్లా కేంద్రంగా నిలిచింది. ఒరుగల్లు, జర్మల్ ఆఫ్ ఇంగ్లీష్ స్టడీస్, ఫాతిమావాణీ, తెలంగాణా లీడర్, తాకీద్ వంటి ఆంగ్ల పత్రికలు కూడా వచ్చాయి. దయాళ్, నయ్యత్, కాకతీయ స్టార్, పరివార్, షరారే, ఉర్దూ హమారజహాన్ వంటి ఉర్దూ పత్రికలు వచ్చాయి. తెలుగు పత్రికలు 156 వరకు నడిచాయని రచయిత్రి ఒక జాబితాను పుస్తకంలో ఇచ్చారు. దళిత దర్బార్, దీపిక, పెన్ కౌంటర్,పల్లె జీవితం, ధర్మభూమి, సమస్య, విరాట్, మేడారం, ప్రజాయుగం, ప్రజలు, కాకతీయ టైమ్స్, తెలంగాణా రౌండప్, సిటీ టైమ్స్, పద్మమిత్ర, సచివాలయం, చురకలు వంటి విభిన్నాంశాల పత్రికలను ఈ పత్రికల జాబితాలో చేర్చారు.
సంపాదకీయాలు-పరిశీలన అనే రెండవ భాగంలో రచయిత్రి తెనుగు, ఆంధ్రాభ్యుదయం, దేవులపల్లి రామానుజారావు గారి శోభ, పాములపర్తి సదాశివరావుగారి కాకతీయ వార పత్రిక,  ఎం.ఎస్. ఆచార్య గారి జనధర్మ, తదుపరి అనుబంధంగా వెలువడిన వరంగల్ వాణీ దినపత్రిక,  దివ్వెల హనుమంతరావు గారి ప్రజామిత్ర,, సాధన,  కాళోజీ, పెండ్యాల వరవరరావుగారి నలుగురు సాహితీ మిత్రుల ఆధ్వర్యంలో వచ్చిన  సృజనతో పాటు, ఆరోగ్య సాధనం, ఏకశిల దినపత్రిక, నమిలకొండ బాలకిషన్ రావు గారి ప్రసారిక, అగ్రగామి, మానుకోట, ప్రజాతరంగం, ఆరోగ్యనిధి, సిరాశాసనం మొదలగు 19 పత్రికల సంపాదకీయాలను, నాటి కాలపు పరిణామాలను, వాతావరణాలను, సంపాదకీయాల విలువలను, నిష్పాక్షికతలను రచయిత్రి తన కున్న ముడి సమాచారంతో అధ్భుతంగా విశ్లేషించారు. శాస్త్రీయత నూటికి నూరు పాళ్ళుగా కనబడుతుంది.  తెలంగాణా భాష, యాస, చమత్కారంగా, సరళంగా ప్రజాభిప్రాయాల్ని ప్రతిబింబించే విధంగా సంపాదకీయాలు ఉండేవని రాశారు.
తెలుగు పత్రికల్లో సురవరం వారి గోల్కొండ పత్రికల సంపాదకీయాల తర్వాత, ఇక్కడి పత్రికలు అలరించాయి. వద్దిరాజు సోదరుల తెనుగు పత్రిక సంపాదకీయాల్లో ఇతర పత్రికల విషయాలు చర్చకు వస్తుండేవి. ఆ కాలపు రోజుల్లో ఇతర ప్రాంతాల నుండి వెలువడే  పత్రికలు ఎలా చేరి యుంటాయన్న విషయమై రచయిత్రి సందేహం వెలిబుచ్చుతారు. అంటే ఆ కాలంలోనే పత్రికల పరిశీలన కూడ విస్తృత ప్రాతిపదికన ఉండేదన్న విషయం మనకు స్పస్టమవుతుంది. సమకాలీన రాజకీయ అంశాలపై కాకుండా, దేశవిదేశాల అంశాలు, ఇతర అనేక విషయాలపై వ్యాసాలు, సంపాదకీయాలు రాశారు.  శాసన సభ అలక, స్త్రీ విద్య, అంతర్ రాష్ట్ర సంబంధాలు, పాలకులు-పాలితులు, రాజ్యాంగ శ్రద్ద, సంఘం, వార్షికోత్సవములు, గ్రామ కరణముల సంఘం, పండిత సభ-ఆంగ్లేయుల హెచ్చరిక, మహాత్ముడు నాయకుడు కాడు, ఆలిఘర్ విశ్వవిద్యాలయము, టప్సా,ఉపాయములు, ఉత్తర ఆర్కాట్ లో గల అగ్ని సమస్తానం వంటి అంశాలపై రాసిన వ్యాసాలు, సంపాదకీయాలు అలరించే విధంగా ఉండేవి. నిజాం నాటి ఆంధ్ర జనసంఘం మన అక్కర అనే అంశంపై రాయబడిన సంపాదకీయం ఇది ప్రజల ఆశాజ్యోతిగా నిలిచింది.
కోకల సీతారామశర్మ సంపాదకత్వంలో వెలువడిన ఆంధ్రాభ్యుదయం సారస్వత చైతన్య సేవ చేసింది.  తాళపత్రాల సేకరణ గూర్చి రాసింది. సాహితీ విలువలతో రాణీంచిందని రచయిత్రి రాశారు. రజాకార్ల పైశాచిక కృత్యాలపై శోభ పత్రికలో దేవులపల్లి వారు రాసిన సంపాదకీయం ప్రాముఖ్యత నొందింది. ఆధునిక ఆంధ్ర వాజ్మయ సౌధము అని పేరున చక్కటి సంపాదకీయం రాశారు. దేవులపల్లి వారి శోభ పత్రిక రెండు సంవత్సరాలు నడిచింది. కాకతీయ పత్రిక రాజకీయోద్యమం దిశగా సాగినప్పటికినీ, మార్టిస్ట్ ధోరణీలో ఉండి, సాహితీ కృషికై పరితపించింది.  జనధర్మలో సంపాదకీయాలు సాహసోపేతంగా ఉండేవి.  ఔషధాలతో కాక ఆపరేషన్లు అవసరమా అని సంపాదకులు ప్రశ్నించారు. తెలంగాణా పోరాటం, అభివృద్ధి సమస్యలను 1960-88 వరకు తన సంపాదకీయాల రూపంలో వెలుగులోనికి తెచ్చారు. విప్లవ పత్రికగా పేరు పడిన సృజన పత్రికలో సంపాదకీయాలు ప్రజాభిప్రాయానికి వేదికగా, బడుగు, అణగారిన వర్గాల వారి వాణిగా, పౌరహక్కులు, విప్లవ పోరాటాల ప్రస్తావనలతో నిండి ఉండేవి. సిరాశాసనం సంపాదకీయాలు కూడా అలాగే ఉండేవి.  ప్రజల అభిప్రాయాల కు అనుగుణంగా నాటి పత్రికలు సంపాదకీయాలు అలరించాయని పరిశోధక రచయిత్రి పేర్కొన్నారు. చౌడవరపు విశ్వనాథం, భండారు చంద్రమౌళీశ్వరరావుల ఆద్వర్యంలో వెలువడిన ప్రగతి పత్రిక నిజాం ప్రభుత్వం పత్రికా స్వేచ్చపై ఆంక్షలు విధించినా తీవ్రమైన భావజాలంతో లెక్కచేయక వారపత్రికగా నడించింది.
మూడవ అధ్యాయంలో పత్రికలు-భాషా, సాహిత్యం, సంస్కృతి అనే అంశంపై చర్చించారు. ఇందులకు తెనుగు పత్రిక, శోభ, సృజన, ఓరుగల్లు, ఆర్షధర్మం, ప్రజాతరంగం,కాకతీయ మొదలగు పత్రికల తీరును సమీక్షించారు. ఇందులోనే పత్రికలు-సాహిత్య సేవ అనే అంశం తీసుకొని చర్చించారు. తెనుగు, ఆంధ్రాభ్యుదయం, శోభ, జనధర్మ, కాకతీయ, ప్రజామిత్ర, అదృష్టం, కాకతీయ పక్షపత్రిక, ఆరోగ్య సాధనం, వరంగల్ వాణీ, అగ్రగామి, ప్రసారిక, శక్తి బిందు, నవోదయం, వైశ్యకల్ప, ప్రజాతరంగం, ఆయుధం, సిరాతరంగం, తెనుగుతల్లి తదితర పత్రికల తీరును సమీక్షించారు.  భాషా సాహిత్యాల పరిరక్షణలో వరంగల్ పత్రికలు ఒక వేదికగా నిలిచాయని, తొలుత గ్రాంధికంలో ఉన్నా, తదుపరి వ్యావహారిక భాషకు పట్టం కట్టారని, నూతన పదబంధాల రూపకల్పనకు కృషి చేశాయి.
ఉర్దూ రాజ భాషగా ఉన్నా, ఆ నాటి పత్రికలు తెలుగు భాషా చైతన్యానికి తమ వంతుగా కృషి చేశయి.  వద్దిరాజు సోదరుల పత్రిక పేరే తెనుగు.  ఇది 1922లో ప్రారంభమైంది. తెలుగు భాషా చైతన్యానికి ఈ పత్రిక పూనుకొంది.  ప్రముఖ పరిశోధక రచయిత గుమ్మనగారి బాల శ్రీనివాసమూర్తి వద్దిరాజు సోదరుల భాషాభిమానం గూర్చి చేసిన అంశాలతో చక్కటి పరిశోధక రచయిత్రి చర్చ చేశారు.  కొత్తరచయితల వ్యాసాలు, సాహితీ విశేషాలు, గ్రంథ పరిచయాలు, సమీక్షలు, నాటక సమీక్షలు కూడా వస్తుండేవి.  సమగ్ర భాషా దృక్పథం,  భాషా పటుత్వం తొణీకిసలాడింది.  మరుగుపడి అనాదరణకు గురైన వివిధ పుస్తకాల వివరాలు సేకరించి రాయటంలో కోకల సీతారామశర్మ సంపాదకత్వలో వెలువడిన ఆంధ్రాభ్యుదయం మాస పత్రిక కృషి అపారం. ఉర్దూ తెలుగు వంటి సంకర భాషా వ్యాప్తి నిరోధానికి ఈ పత్రిక కృషి చేసింది. ముదిగొండ బుచ్చిలింగయ్య శాస్త్రి స్వీయ మార్గం, ప్రహసనాలపై రాసిన కామరుషి మృత్యుంజయశర్మ ప్రహసనాలు వ్యాసాన్ని ఈ పత్రిక ప్రచురించింది.  పరిశోధకులకు శోభ పత్రిక తగిన ప్రోత్సాహం ఇచ్చింది.  1950 ఫిబ్రవరి, 4,5,6 తేదీలలో తూప్రాన్ లో జరిగిన ఆంధ్రసారస్వత పరిషత్ వారి సభల ప్రత్యేక సంచికను వెలువరించి, సాహిత్యాభిమానాన్ని చాటుకొంది.
కాకతీయ పత్రిక సంపాదకులు పాములపర్తి సదాశివరావు గారు,  సందేశం కమ్యూనిస్ట్ పత్రికకు ఎడిటర్ గా ఉంటూ బౌద్దం, శంకరాద్వైతం వంటి ప్రత్యేక సంచికలను వెలువరించారు. వరంగల్ వాణీ ఎడిటర్ ఎం.ఎస్. ఆచార్య గారు  ముఖ్యమంత్రి జలగం వెంగళరావు  సిఎం హోదాలో వరంగల్ కు వచ్చినపుడు ప్రత్యేక సంచికను తీశారు. పివి, కాళోజీ, పల్లా, రామకోటాచార్య, డా.టిఎస్.మూర్తి తదితరుల ప్రత్యేక సాహితీ సంచికలను, కవితా సంకలనాల వంటి గ్రంథాలను ప్రచురించింది. సాధన మాస పత్రికా సంపాదకులు దివ్వెల హన్మంతరావుగారు జాగృతి ఎడిటర్ గా, వరంగల్ పోతన విజ్నాన పీఠం వ్యవస్థాపనలో పాలు పంచుకున్నారు. కృష్ణావతారం అనే మున్షీ రాసిన ఆంగ్ల గ్రంథాన్ని ఏడు సంపుటాలుగా తెలుగులోకి అనువదించి, అచ్చులోకి తెచ్చారు. ప్రగతి పత్రికలో మహాకవి దాశరథి గారి రచనలు విరివిగా వస్తుండేవి. భండారు చంద్రమౌళీశ్వరరావు గారు విశ్వేశ్వర, దుర్గా మహిళా సంస్కృతాంధ్ర కళాశాల, ఆయుర్వేద కళాశాల స్థాపనలో ముఖ్య పాత్రను పోషించారు.  ఇలా సంఫాదకులు ఎన్నెన్నో సామాజిక ప్రయోజనాల పనులకు ఆ కాలంలో శ్రీకారం చుట్టారని రచయిత్రి తమ పరిశోధన ద్వారా ఆసక్తికరమైన విషయాలను తేట తెల్లం చేశారు. ఆంధ్రప్రభ ఉప సంఫాదకులుగా పనిచేసిన పిఎన్.స్వామి నవసమాజం పత్రికను కొద్దికాలం నడిపారు. వీరు జర్నలిస్టుల యూనియన్ కు నాయకునిగా రాణించారు. మాజీ మంత్రియైన స్వర్గీయ పివి.రంగారావు కాకతీయ పక్ష పత్రికను నెలకొల్పి, విఎల్. నరసింహారావు సారధ్యంలో కొంతకాలం నడిపి, పత్రికారంగానికి సేవలందించారు. పిఎన్.స్వామి గారు ఆనాటి రజాకార్లు, నైజాం పాలకుల దౌర్జన్యలపై కాకతీయ వార పత్రికకో  సాహసోపేతంగా  రిపోర్టింగ్ చేస్తుండేవారని, ఆ నాటి కలెక్టర్ సంపాదకులైన పాములపర్తి సదాశివరావును పిలిపించారని రచయిత్రి చెప్పుకొచ్చారు.
శాస్త్రీయ దృక్పథంతో భాష ఉండాలన్న ధ్యేయంతో సృజన పత్రిక పనిచేసింది.  1966లో ప్రారంభమైన ఈ త్రైమాసిక పత్రిక కాళోజీ మొదటి ఎడిటర్. తదుపరి వరవరరావుగారు. సాహితీ మిత్రులు నవీన్, తిరుపతయ్య, వేనరెడ్డిలతో కలిసి స్థాపించారు. గద్దర్, అల్లం రాజయ్య, నారాయణ, అల్లం వీరయ్య వంటి ప్రముఖుల రచనలను ఇందులో వచ్చేవి. శ్రీశ్రీ, బుచ్చిబాబు మొదలగు సాహితీ దిగ్ధంతుల ప్రత్యేక సంచికలను సృజన ప్రచురించింది. అంపశయ్య నవల కొంత భాగం దారావాహికంగా ఇందులోనే వచ్చింది.  సాహిత్య సేవలో ఆనాటి పత్రికలు మహిళా రచయితల రచనలు వేసేవి. ఇక్కడి పత్రికలు సాహిత్యరంగాన్ని విస్మరించకుండా  చక్కగా ప్రాధాన్యతలతో సృజిస్తూనే వ్యాసాలు రాస్తుండేవి.  తెనుగు పత్రిక సాహిత్య సేవ అపూర్వం. ఇ.రాజయ్య, రత్నమ్మ లాంటి వారి కవిత్వాలు వచ్చాయి. ఆంగ్ల పద్యాల అనువాద రచనలు కూడా వచ్చేవి. ఆచార్య బిరుదురాజు రామరాజు, పిఎన్.శాస్త్రి, డా.పివి.రమణయ్య, కోదాటి రామక్రిష్ణారావు, ములుగు వీరభద్రశాస్త్రి, పింగళి లింబారెడ్డి, మసిపట్ల పట్టాభి రామకవి, తిరునగరి జీయర్ స్వామి వంటి వారల సాహిత్య, సామాజిక రచనలకు వేదికగా నాటి వరంగల్ పత్రికలు నిలిచాయి.
 శోభ పత్రికలో దాశరధి అగ్నిధార, కాళోజీ నా గొడవ ప్రచురితమయ్యాయి. పొట్లపల్లి రామారావు, ఆదిరాజు వీరభద్రరావు, పల్లా దుర్గయ్య వంట్ఇ దిగ్దంతుల రచనలు వచ్చేవి. నాటి జనధర్మ పత్రిక వట్టికోట ఆళ్వార్ స్వామి వారి గంగు అసంపూర్ణ  నవలను ధారావాహికంగా వేసింది.  ప్రజామిత్ర పత్రికలో రామా చంద్రమౌళి, గట్టు రామిరెడ్డి నవలలు సీరియల్ గా వచ్చాయి. కాకతీయ పక్ష పత్రికలో విద్వాన్ విశ్వం, దిగంబర కవి కేశవరావు, సుప్రసన్న, పల్లా దుర్గయ్య, కాళోజీ, దాశరథి, అముముల కృష్ణమూర్తి తదితరుల పండితుల కవిత్వాలను ప్రచురిస్తుండేది.  సృజనలో గ్రంథ సమీక్షలు, వ్యాసాలు, అనువాద రచనలు వస్తుండేవి.  ఓరుగల్లు ఆంగ్ల పత్రికలో కథలు, కథానికలకు వేదికగా నిలిచాయి.  దాశరథి, దివాకర్ల వెంకటావధాని గార్ల కవిత్వాలని వేశాయి.  1980లో ప్రారంభమైన ప్రసారిక పత్రికలో వచ్చే రచనలు, గ్రంధ సమీక్షలు, సాహిత్య విమర్శల గూర్చి విస్తృతంగా రచయిత్రి చర్చించారు. డా.టి.రంగస్వామి వంటి సాహితీ ప్రముఖులు ఈ పత్రికకు చేదోడు వాదోడుగా ఈ పత్రికకు అండగా నిలిచారు.  ప్రతి సంవత్సరంలో ప్రసారైక  రెండు ప్రత్యేక సంచికలను వెలువరించేవి.  2014లో కాళోజీ జన్మదిన, 2015లో వరంగల్ ఆకాశవాణి రజితోత్సవాల గూర్చి ప్రత్యేక సంచికలను వేశాయి.  ఈ పత్రిక నాలుగు దశాబ్దాలైనా నేటికినీ కొనసాగుతుండడం ఒక ప్రత్యేకత.
నాల్గవ అధ్యాయంలో పత్రికల స్థితిగతులు-నాడు నేడు అనే అంశాన్ని తీసుకొని, పరిశోధక రచయిత్రి చర్చించారు. ఇది ఎనిమిది పేజీలలోనే రాసినా, అనేక విషయాలను ప్రస్తావించారు.  ఈ అధ్యాయంలో రచయిత్రి చర్చ శాస్త్రీయంగా ఉంది. పత్రికలు బ్రిటిష్, నైజాం నిరంకుశ పాలనలో వారి వారి నిబంధనలకు అనుగుణంగా ప్రారంభించడం కష్టతరంగా ఉండేది. ఆనాటి సర్కార్ వారు,  పత్రికలకు అంతగా స్వేచ్చ నివ్వడానికి అనుమతులు ఇచ్చేవి కావు.  పత్రికా నిర్వహణ, ఖర్చులు, సర్క్యులేషన్ అన్నీ భారంగానే ఉండేవి. చాలా పత్రికలు పురుటిలోనే మూతపడ్డ వైనాన్ని రచయిత్రి మనముందు ఆవేదనతో ఉంచారు. నాటి పత్రికల దశను 1920-1970 వరకు, 1971-2020 వరకు రచయిత్రి విభజించారు. ఈ కాలాదులలో పత్రికా రంగంలో అనేకంగా వచ్చిన మార్పులను సంక్షిప్తంగా చర్చించారు. 1922 ఆగస్ట్ 22 న ఒద్దిరాజు సోదరులతో ఇనగుర్తి నుండి తెనుగు పత్రిక సొంత ప్రెస్ తో మొదలైంది. ఈ పత్రిక మిగతా జిల్లాలోని అన్ని పత్రికలకు మార్గదర్శిగా నిలిచింది. భాషా,సాహిత్య, సంపాదకీయ, సాంస్కృతిక విలువలకు ప్రాధాన్యత ఇస్తూ, మనుగడను సాగించింది. తదుపరి ఆంధ్రాభ్యుదయం, శోభ, శైవ ధార్మిక, మానుకోట, కాకతీయ వంటి పత్రికలు జిల్లా సమాచార రంగాన్ని సుసంపన్నం చేశాయి. జిల్లాలోని తొమ్మిది దశాబ్దాల పత్రికా రంగ నిర్వహణ తీరును, చరిత్రగా పరిశోధించి రికార్డు చేయడం చూస్తే, రచయిత్రి ఎంతో శ్రమకోర్చిన వైనం ప్రస్ఫుటమవుతుంది.  ఒక సన్నివేశంలాగా,  ఒక మహత్తర అధ్బుతంగా ఈ సిద్దాంత రచనలో కనిపిస్తాయి.  నాటి కాలపు చిన్న పత్రికలపై పరిశోధన ఆశామాషీ కాదు. నాటి పత్రికల ప్రతులు, సంబందీకులు, ఆ కాలపు వివరాలు, సమస్యలు దొరకడం దుర్లభం.  చాలా మంది వాళ్ళ వారసులు వాటిని నిల్వ చేయక పోవడం పట్ల రచయిత్రి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ఆ నాటి కాలపు విషయాలు, ప్రత్యేక సంచికలు, గ్రంధస్త వివరాలను ముడిగా, అతి కష్టంగా  సేకరించి, విశ్లేషించి రాయడం ఒక నైపుణ్యమే. ఈ కాలపు సాంకేతిక నైపుణ్యాలు నాటి కాలంలో లేవు. అయినా రచయిత్రి క్లిష్టతరమైన అంశాన్ని ఎన్నుకొని చేసిన పరిశోధన వందకు వందశాతం ఫల వంతమైందని చెప్పవచ్చును. తన సిద్దాంత రచన కోసం రచయిత్రి తాను పర్యటించిన అనుభవాలను అక్కడక్కడా రికార్డు చేశారు.
అయిదవ అధ్యాయంలో పాత్రికేయుల జీవన రేఖలు అనే అంశం తీసుకొని, 41 మంది పాత్రికేయుల విశేషాలను సంక్షిప్తంగా ఫోటోలతో పరిచయం చేశారు. ఈ అధ్యాయం ఈ పరిశోధక పుస్తకానికి గుండె కాయ లాంటిదని చెప్పవచ్చును. ఇందులో చాలా మంది సాహితీ మూర్తులు కావడం విశేషం. ఎందుకంటే ఈమె గారి టైటిల్ వరంగల్ జిల్లా పత్రికలు, నాడు, నేడు, సాహిత్య సేవ  అనే అంశమే. ఏ అధ్యాయంలో చూసినా, పాత్రికేయ రంగ సమాచారంతో పాటు, ఆ నాటి సంపాదకులు, రచయితల సాహిత్య సేవ అనే అంశం అంతరార్ధంగా కనిపిస్తుంటుంది. సంపాదకుడు ఎలా ఉండాలో, పత్రిక ప్రారంభ చట్టాలు ఎలా ఉంటాయి అనే అంశాలపై రచయిత్రి చర్చించారు. పత్రికారంగంలో నేడు అనారోగ్య ధోరణులు వచ్చాయి. ఇప్పుడు యజమాని, సంపాదకుడు వేర్వేరుగా ఉన్నారని, ముందు అన్ని బాధ్యతలు సంపాదకుడే చూసుకొనే వారు.  సంపాదకుడే వార్తలు, పత్రికా నిర్వహణకు, వివరాలకు బాధ్యత వహించేవారు. సమాజ శ్రేయస్సు, ధర్మాగ్రహంతో పనిచేసేవారు. వరంగల్ జిల్లా సంపాదకులు అనేక కష్ట నష్టాలకోర్చి పత్రికలను నడిపారు.  తెనుగు పత్రిక నిర్వాహకులలో ఒకరైన ఒద్దిరాజు సీతారామచంద్రరావు గారిని సంపాదక పితామహుడిగా అభివర్ణించారు. ఎంఎస్. ఆచార్య, సృజన, ప్రసారిక సంపాదకీయాలు అచ్చులోకి వెలువడినాయి. ఒద్దిరాజు సోదరులు(తెనుగు పత్రిక), కోకల సీతారామ శర్మ, ముదిగొండ వీరేశలింగశాస్త్రి, కంభంపాటి అప్పన్నశాస్త్రి, చాగంటి భాస్కర లింగ శాస్త్రి, దేవులపల్లి రామానుజారావు(శోభ పత్రిక), బి.ఎన్.గుప్త (మానుకోట), పాములపర్తి సదాశివరావు, టి.రాజేశ్వరరావు,(ఓరుగల్లు పత్రిక), టి.లోకాచార్యులు(మానవధర్మ), ఎంఎస్.ఆచార్య(జనధర్మ), దివ్వెల హన్మంతరావు(ప్రజామిత్ర), భండారు సదాశివరావు(సాధన), టివైఎన్.చారి(దేవస్థానవాణీ), భండారు చంద్రమౌళీశ్వరరావు(ప్రగతి), పిఎన్.స్వామి(నవసమాజం), ఆచార్య కోవెల సంపత్కుమారాచార్యులు (సుకృతి లిఖిత పత్రిక), బొబ్బల ఇంద్రసేనారెడ్డి (గ్రామజ్యోతి గోడ పత్రిక), పివి.రంగారావు(కాకతీయ పక్షపత్రిక), చిలువేరు కృష్ణమూర్తి (ఆరోగ్య సాధనం), పెండ్యాల వరవరరావు (సృజన), నమిలకొండ బాలకిషన్ రావు(ప్రసారిక), గుండా ప్రకాశరావు(యువతరంగం), గుముడవెళ్ళి మనోఃహరరావు(ప్రజాతరంగం), సిబి.లక్ష్మి(మానుకోట), నవాబ్ (సిరా శాసనం),  రవీంద్రశర్మ(ఆయుధం), పరకాల సతీష్ (తెలుగు తల్లి), అనిల్ కుమార్ గౌడ్ (కాకతీయ టైమ్స్) వంటి సంపాదకుల పరిచయాలు ఫోటోలతో నిండుగా కనిపిస్తాయి.
రచయిత్రి ఉపసంహార (ముగింపు) వ్యాసంలో జిల్లా పత్రికల చరిత్ర రంగ చరిత్రకు రాయడానికి చేసిన వస్తు సేకరణ, పడిన అష్ట కష్టాలను వివరించారు.  సాంకేతికలు అంతగా లేని కాలం అది.  సిడీలు, పెన్ డ్రైవ్ లు లేని కాలంలో పత్రికల ప్రతులు అంతగా లభించకున్నా, పరిశోధనను ఆపకుండా కొనసాగించారు. పత్రికలను పదిలపరిచే సాంకేతిక సౌకర్యం లేని కాలంలోని పత్రికలపై పరిశోధన చేశారు. దొరికిన కొన్ని ప్రతులతోనే, ముఖ్యుల సాయంతోనే విశ్వసనీయంగా పరిశోధనను సాగించారు. నిజాం విముక్తి పోరాటం, స్వాతంత్రోద్యమ ఫోరాటాల్లోను జిల్లాలో పత్రికలు నిర్వహించిన పాత్ర చిరస్మరణీయమైనది. మూలసూత్రమైన ప్రజాస్వామ్యాన్ని అనుసంధానం చేసుకొంటూ, శాంతి సాధనలో దైర్య సాహసాలతో నూతన సమాజ నిర్మాణానికి నాటి వరంగల్ జిల్లా పత్రికలు, వారి సాహిత్య సేవల కృషిని రచయిత్రి వేనోళ్ళ శ్లాఘించడం కనిపిస్తుంది.
తెలుగు సాహిత్య అకాడమి, తెలుగు విశ్వవిధ్యాలయం, తెలంగాణా సాహిత్య అకాడమి వంటి ప్రభుత్వ రంగ సంస్థలు చేయలేని పనిని తన భుజాన వేసుకొని, రచయిత్రి  చేసిన కఠోర పరిశోధక పరిశ్రమను అభినందించక తప్పదు. తాను జర్నలిస్టు కాకున్నా, జర్నలిజం విలువలను వివరిస్తూ, పరిరక్షించేలా సాహిత్యాంశాలను అల్లుతూ విశ్లేషిస్తూ రాశారు. చివరన కొసమెరుపులు, పత్రికల జాబితాను, ఉపయుక్త గ్రంద్థ సూచిని ఇచ్చి, పాటకులకు తన పరిశోధనా పటిమను ఎరుక పరిచారు. ఉన్నత విద్యావంతురాలైన ఒక యువ స్త్రీ మూర్తి ఈ రకమైన తెలంగాణాలోని సాంస్కృతిక, సాహితీ కేంద్రమైన వరంగల్  ఉమ్మడి జిల్లా పత్రికారంగ చరిత్రపై పరిశోధన చేసి, సాఫల్య విజయం సాధించడం చూస్తే, ఆమె పరిశోధక తపస్సుకు సాహితీ వేత్తలు, పాటకులు జేజేలు పలకాల్సిందే. కాకతీయ తోరణంతో పుస్తక ముఖచిత్రం అలరించింది. తన బెటర్ హాప్ ప్రభుత్వ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న అవుసీపురం ప్రభాకర శర్మ గారికి అక్షరాభివందనంగా ఈ పరిశోధక పుస్తకాన్నిఅంకితంగా సమర్పించుకున్నారు.  పుస్తక ప్రచురణ: జనవరి, 2018. పేజీలు: 340. వెల:300 రూపాయలు.
October 24, 2021 1 comment
1 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

తెలంగాణ తేజోరూపం

by vanaparti padma October 24, 2021
written by vanaparti padma

నిర్థిష్ఠ లక్ష్యంగా సాహిత్యపు విలువలతో నిరంతర కవిగా మృత్యుపర్యంతం తెలుగు కవితా ప్రపంచంలో వెలుగొందిన అగ్రగణ్యులు సి.నా.రె గారు.  గేయం పద్యం, సంగీత రూపకం, కథాకావ్యం, కావ్యేతీహాసం, వచనకవిత్వం, గజల్‌, పాట నాటిక, వ్యాసం, పరిశోధన, సంభాషణా రచన, విద్యబోధన, వ్యాఖ్యానం, ఉపన్యాసం వంటి అనేక ప్రక్రియలలో ఆరితేరిన సాహిత్య ధీరుడు. తెలుగు సాహిత్యంపై తనదైన ముద్రను మిగిల్చి వెళ్లిన మానవీయకవి సి.నారాయణ రెడ్డి గారు.  మేరు శిఖరం లాంటి సినారె జన్మదినం సందర్భంగా తిరునగరి శ్రీనివాస్‌ గారి సంపాదకత్వంలో ‘‘కవితా విశ్వంభరుడు’’ అనే కవితా సంకలనం వెలువడించారు.  ఇందులో 71 మంది కవుల కవితా నీరాజనాల సమహారంగా తరతరాలకు ఆదర్శంగా అక్షర పుష్పాల పరిమళంగా నిలుస్తుంది. తిరునగరి శ్రీనివాస్‌ గారు కవి, రచయిత, మరియు జర్నలిస్టు కావడంతో పాటు నారాయణ రెడ్డి గారికి ఆప్తుడు కూడా అతి సమీపంగా ఉండి వారి రచనశైలిని కొంత ఆకళింపు చేసుకున్నారు.  కాబట్టి సి.నా.రె. కవిత్వం, గజళ్ళు, పాటలపై వచ్చిన రచన పై కూడ తనదైన శైలిలో విశ్లేషణ చేస్తూ ‘‘జ్ఞానవీచికలు’’ సాహిత్య విమర్శా వ్యాసాలు అనే పుస్తకం కూడా సి.నా.రె జన్మదినం సందర్భంగా ఆవిష్కరించి, గురుభక్తిని చాటుకున్నారు.  ‘‘కవితా విశ్వంభరుడు’’ కవితా సంకలనం, మరియు ‘‘జ్ఞానవిచీకలు’’ వ్యాససంపుటి రెండు పుస్తకములు కూడా నేటి తరానికి, మరో తరానికి అధ్యయనం, పరిశోధనకు ఉపయుక్తంగా వుంటాయనేది అక్షర సత్యం.  ‘‘విశ్వంభరుడు’’ అక్షరాలతో నిరాజనం పట్టిన కవుల అక్షర లక్షల అణిముత్యాల వంటి కవితలను విశ్లేషించుకుందాం…

అక్షరనాదాల్ని పలికించిన విజ్ఞాని / గుండెనిండా విశ్వంభరా తత్వంతో / ఎన్నో అనుభూతుల క్షేత్ర బంధం / అలలెత్తిన మానవత్వం / ‘యశస్వి’ సి.నా.రె. అంటూ వారి జీవితపు సాహితి ప్రస్తావాన్ని వివరించారు.  ‘‘చిత్రం… హాయి భళారే విచిత్రం’’గా మదిలో మీ జ్ఞాపకాలు నింపి / కానరాని లోకానికి ఎలా వెళ్లారు / ‘‘విశ్వంభర’’ తో జ్ఞానపీఠాన్ని అదిరోహించి మీరు ఇంద్రుడి పీఠాన్ని అధిరోహించటానికి వెళ్లారా / అంటు మదినిండ అక్షరాలు నింపిన జ్ఞాపకాలతో జీవిస్తాము అంటూ మనోవేధనను వ్యక్తం చేశారు.

శబ్దసౌందర్యాలు సైనిక కవాతులై సాగేవి / పొద్దును పాట చేసి / భూగోళమంతా భూపాలరాగమైన వెన్నెలపాట / సర్వసామాన్యుడు / బహుముఖీన ప్రతిభా ప్రభాతుడు అంటు ‘‘వనపట్ల సుబ్బయ్య’’ వెన్నెల పాటగా కవిత్వీకరించారు.  ‘‘ఆయన ఈ అనంతమైన / సాహిత్య వెలిగే జ్యోతి / ఆసాంఘిక శక్తులపై ఉరిమిన ‘‘మహద్యుతి’’ అంటారు మౌనశ్రీ మల్లిక్‌.  మలి జ్ఞానపీఠ విశ్వంభరుడా ‘‘మాకు దూరమై మీ… పెన్నుమూ ‘‘సి.నా.రె’’! అంటూ తను లేడనే నిజాన్ని జీర్ణించుకోలేని డా॥ అమ్మిన శ్రీనివాసరాజు గారి వ్యధ నే మూడక్షరాలు.  ‘‘పద్మభూషణంతో, జ్ఞానపీఠంలో నింగికెగసినారె నిత్యమయినారె / ధృవతారగా నిలిచిపోయినారె అంటు డా॥ రామకృష్ణమూర్తి గారు సి.నా.రె. ను చిరంజీవిగా చేశారు.  ‘వగలరాణివినీవే’ నంటూ అక్షరాన్ని వంపులు త్రిప్పిన సముద్రుడు / ‘మబ్బులో ఏముందని’ అంటునే ఆ చోటికే తరలిపోయిన తపస్వి / ‘‘అభినందన మందరామాలలు’’ ఎన్ని వేసిన సరిపోవు అంటు ‘‘పాటల రారాజు’’గా మల్చినారు.  యలమర్తి అనూరాధ ‘‘కృష్ణవేణి నడకలా… సాగించిన సృజనకారుడు!’’ / తెలుగు పదాలను కర్పూరం / వసంత రాయలకు కావ్యమల్లిన / కవి శిఖమణి సి.నా.రె. అంటారు.  ‘‘కిలపర్తి దాలినాయుడు’’

‘‘గలగలపారే జలపాతమై / ధీర, గంభీర వీరతలతో / సాహితీ సీమను అలరింప చేసిన మహకవి, మహోన్నత కవికి వందనం చేశారు.  ‘‘కవిసార్వబౌముడు’’ అనే శీర్షిక ద్వారా శనిగరపు రాజమోహన్‌ ‘‘పేదలకన్నీటిలో తడిసిన కష్టం / పెద్దల పెదాలతో పలికిన జీవిత సత్యం ఆయన కవిత్వం’’ అంటూ సి.నా.రె. పదాల అల్లికను చెప్పారు.  డా. గంజి భాగ్యలక్ష్మి, ‘‘అతడొక సాహితి యుద్దనౌక / ఎడారిలో సైతం పయనించే శక్తి / సాహితి లోకానికే ఆయనొక స్ఫూర్తి’’ అంటారు టి.వి. అశోక్‌ కుమార్‌.  ‘‘తెలంగాణ అక్షరకీర్తి, కిరీటం, కవితా తపస్వినిత్య ప్రగతిశీలి, అభ్యుదయవాది, మానవతామూర్తి, కవితా జాతిరత్నం’’ అంటూ సి.నా.రె. గారి కీర్తిని అక్షర శిఖరాల్లో నిల్పినారు ఎల్గటి తిరుపతిరెడ్డి. ‘‘అభినందన మందార విశ్వంభర సాహితి సారంగధర సినారె… దివికేగిన గేయతార తెలుగు కావ్యధార అజరామర సినారె… అంటూ కవి ఎపుడు అమరుడె అన్నట్లు గుమ్మడి రామలక్ష్మి తన కలం ద్వారా వెల్లడిరచారు.  ‘‘సాహిత్య సమరంలో గెలిచి నిలిచిన అక్షర తపస్వి / విశ్వజనీనతకు నిదర్శనం / మన తెలుగు వెలుగుల తేజం సి.నా.రె అంటూ సాహిత్య జగత్తులో అక్షరాలను నక్షత్రాలుగా మల్చిన తేజో రూపం సి.నా.రె వారు ప్రతిభకు పట్టంకట్టారు వనపర్తి పద్మావతి.  మాతృభాష సినారె / మధుర కవిత సినారె / మహిలోపల వెలిసినట్టి / మహాకవి సినారె అని ‘‘మణిపూసలు’’ గా మల్చారు వడిచర్ల సత్యం.  సినీ జగత్తు నీ పాటకు దాసోహం అంది, కర్పూర వసంత రాయల్ని పలకరించినా, నాగార్జున సాగరాన్ని తాకిని నీ మాటల ప్రతిధ్వని మనసును తాకుతుంది.  మహాకవి ప్రణామం అంటాడు కందుల శివకృష్ణ సాహిత్యపు బాటసారి… శీర్షికతో.

‘‘తెలుగు భాషా దురంధురుడు / సాహితి విశ్వంభరుడు / మీగజల్స్‌ అద్భుతాలు భళారే / మిమ్మల్ని ఎప్పటికి మరువలేరే సినారె అందుకోండి మా జోహారే అని అద్దేపల్లి జ్యోతి సినారె గారికి ‘పరిపూర్ణుడు’ అంటు జోహార్లు అర్పించారు.  ‘‘సినిరంగాన్ని ఉర్రూతలూగించి మెరిసిన వెండి తెరధృవతార / వివిధ రంగాల్లో ప్రతిభను చూపి చెరగని ముద్ర వేసిన గురువుకు నా కవితా సుమాంజలి అని డా. చీదెళ్ల సీతాలక్ష్మి అక్షరసుమాలు అర్పించారు.  ‘‘ఓ పద్మశ్రీ… నీకలం పగలే వెన్నెలను, వెన్నెలలోని చల్లదనాన్నే కాక సాగర ఘషను వినిపించింది’’ అని విశ్వకవికి వందనం… అంటారు లింగాల రజని. ‘‘ఆ కలం నడక అమృత వర్షం / ఆ గళం సాహితీ పరవశం / ఆ  స్నేహం పుస్తకాల పరిమళం’’ ‘‘మీ బాటలోనే’’ మేము అంటారు ఉండ్రాళ్ళ రాజేశం. ‘‘చిరంజీవిగా చరితార్థులు సినారె / తెలుగు సాహిత్యాంబరంలో / శోభాయ మానంగా వెలిగె స్మరణీయ నారాయణ ధృవతారమీరె’’ ధృవతారగా వెలుగొంది సాహితి లోకానికి వెలుగులు పంచాలనే ఆశ మనోహర్‌ రెడ్డి గంటా.  మరెందరో కవులు, కవయిత్రులు, వ్యధతోను, గౌరవంతోను, ఆవేధనతోను ఓ మహామేరు పర్వతమే సాహితిలోకాన్ని విడిచింది అని తెల్సినప్పటికి కవుల కలంగళం ఎప్పటికి సినారెగార్ని తమవెంట ఉన్నట్లుగానే భావిస్తున్నారు.  సినారె గారు మన మధ్య లేకపోవచ్చు కాని వారు రాసిన కవిత్వం సిని గేయాలు, గజళ్ళు, అన్ని కూడా సాహితి వినిలాకాశంలో ఉన్నంత వరకు సినారె అజరామరుడు.  చిరంజీవి అంటు నీరాజానాలు అర్పిస్తు విశ్వంభరుడుని విశ్వవ్యాప్తం చేశారు.

తిరునగరి శ్రీనివాస్‌ కలం నుండి జాలువారిన మరో పుస్తకము ‘‘జ్ఞాన వీచిక’’ సాహిత్య విమర్శా వ్యాసాలు ఇందులో 25 వ్యాసాలు ఉన్నాయి.  సాహిత్యాన్ని మలుపులు తిప్పిన ప్రయెగశీలి సినారె గారు.  ‘‘వాక్కుకు వయస్సు లేదని’’ ప్రవచించిన సాహిత్యాన్వేషి, ‘నవ్వనిపువ్వు’ మొదలుకొని, ‘‘నా రణం మరణంపైనే’’ వరకు 86 గ్రంథాలను రాసిన నిలువెత్తు తెలుగు సాహిత్య సాక్ష్యం.  అనుభూతి కేంద్రం ఆయన కవిత్వం.  విభిన్నసాహిత్య తాత్విక కోణాలను శోధించిన సమగ్ర పరిశోధన సినారె రచనలు అలాంటి రచనల పై సాహిత్య విమర్శా వ్యాసాలను అక్షరాలక్షలను ప్రోది చేసి భావితరాలు సులభ శైలిలో తన కలం ద్వారా ‘జ్ఞానవీచిక’ అందించారు రచయిత శ్రీనివాస్‌.

1931 జులై 29 నుండి 12 జూన్‌ 2017 వరకు నిర్ఠిష్ట లక్ష్యంతో సాహిత్యపున విలువలతో ‘‘నిరంతరకవి’’గా తెలుగు కవితా ప్రపంచంలో వెలుగొందిన అగ్రగణ్యులు కవిత్వమే చిరునామా, శ్వాసగా మార్చుకున్న నిరంతర బాటసారి సాహితీ ఉన్నత శిఖరం సినారె.  ‘వాక్కుకు వయస్సు’ లేదన్న సాహిత్యాన్వేషి, ‘నవ్వని పువ్వు’ మొదలుకొని ‘‘నా రణం మరణం పైనే’’ అంటూ 86 గ్రంథాలను రచన చేసి మధుర కవితాక్షర జలపాతాలను పొంగించారు.  ‘‘నడక నా తల్లి పరుగు నా తండ్రి సమత నా భాష’’ అన్న కవితా వారి ప్రతిభా సమ్మేళనానికి నిదర్శనం.  ‘‘చిన్న నాటి మురిపెం ఇప్పటికి నా గుండె గూటిలో పదిలంగా ఉంది’’ అంటూ హృదయ నేత్రాలలో దివ్యత్వంగా బాల్యాన్ని దాచుకున్నారు.  చైతన్యం రంగరించుకున్న రవి లాంటి కవి సినారె తెలుగు భాష ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన సాహితీ చైతన్య దీపం.

సాహిత్య ప్రపంచంలో ఓ అపూర్వ ప్రయోగంగా నిలిచింది.  ‘ప్ర’ పంచపదులు, భావపరిణతికి, చందోవైవిద్యానికి పరాకాష్టగా నిలిచి వెలిగింది ఈ కావ్యం.  ‘ప్ర’పంచపదులు అన్న కూర్పులో అనేక అర్థాలున్నాయి.  ‘ప్రపంచించి’ చెప్పడం అంటే ‘విస్తరించి చెప్పడం’ అని అర్థం.  ‘ప్రపంచ’ అని కలుపుకుంటే లోకతత్వాన్ని బట్టి చెప్పిన పదాలని తెలుస్తుంది.  మానవ సమాజ పరిణామతత్వానికి సినారె అందించిన నిరంతర మూల్యాంకన ఫలితమే ‘‘ప్ర’’పంచపదులన్నది అక్షరాక్షర సత్యం, మానవ సమాజాన్ని విశ్లేషించిన సినారె మహత్తర హృదయావిష్కరణే ‘ప్ర’పంచ పదులు అంటూ విశ్లేషించారు  రచయిత.

‘‘ఒళ్ళంతా కన్నీళ్ళయిన జీవితం’’ పట్ల కనబరిచిన ఆర్తినారాయణ రెడ్డి కవితా వ్యక్తిత్వాన్ని కళ్ళకు కట్టినట్లు చూపారు.  40సం॥ సినారె కవితా కృషికి సంకేతంగా ‘ది బెస్ట్‌’ అనే ఉద్దేశ్యంతో కాకుండ ‘ఆల్‌ ఆర్‌ ది బెస్ట్‌’ అనుకున్న కవితలను ఎంపిక చేసి ‘నిరంతరం’ను ప్రచురించారు.  ‘‘తరం మారుతుంది ` ఆ స్వరం మారుతున్నది / వందేమాతరం గీతం వరుస మారుతున్నది’’ అనే కవితలో అభివృద్ధి వైపుగా కనబరుస్తున్న నిర్లిప్తత, నిర్లాక్ష్యాన్ని ఎండగడుతూ చిదిమి వేసినా వదలని చీడ అంటుకుని ముసి, ముసినవ్వుల మాటున విషం మరుగుతున్నదని వేదన చెందారు.  ‘‘కాలం ఇసుకలో దిగబడ్డ కాళ్ళను పెరుక్కుంటూ వేళ్ళమీద నడుస్తున్న మాతృభారతిని ‘జాగ్రత్త  సుమా అంటూ ముందు జాగ్రత్త చెప్పారు.  ‘‘ఆకలేస్తే వీధి దోసిలి / ఆగ్రహిసై వీధి పిడికిలి’ అంటూ నిన్ను నిన్నుగా నిలిపి భుజం తట్టే మహాభోధి వీధి’ అంటారు.  శబ్దశక్తితో కూడిన హృదయ స్పందనలకు చైతన్యాన్ని రంగరించి నిరంతరం కవిత్వాన్ని అజేయంగా, ఆప్రతిహతంగా సినారె గారు ఆవిష్కరించారు.

ప్రౌడ నిర్భరవయః పరిపాకంలో ప్రచురించిన కవితాసంపుటి ‘వ్యక్తిత్వం’ 69వ జన్మదినంన వెలుబడిన ఈకృతిలోని కవితల్లో సినారె క్రాంత దర్శిత్వం ప్రస్ఫుటించడం ప్రత్యేక విశేషం, అత్యాధునికుడుగా సృజన చేసిన ప్రతిభాశాలి ‘వ్యక్తిత్వం’ సంపుటిలోని ప్రతికవితా నవనవో న్మేషమైందె అనడంలో సందేహం లేదు.  ‘‘గుండెకు నిప్పంటుకుంది అర్పడానికి నా దగ్గం కన్నీళ్ళు లేవు’’ అనే పంక్తుల్లో సమాజంలో ఒక గుండె బాధతో రగులుతున్నపుడు సానుభూతీదయాచూపలేని కఠినాత్ములను మెత్తగా మందలించిన తీరు బాగుంది అంటారు వ్యాసకర్త శ్రీనివాస్‌.

సినారె వెలువరించిన అత్యాధునిక, ఆలోచనాత్మక కవితా సంపుటి ‘‘కవితావ్యక్తిత్వం’’ వర్తమాన పరిస్థితుల మధ్య సినారె ఎగురవేసిన మానవీయపతాకం ‘వ్యక్తిత్వం’

‘‘ప్రకృతిలోని చలనశీలానికి పరిణామం మనిషి / జగతిలోని భ్రమణ గుణానికి ప్రతిరూపం మనిషి అనే మానవతా వాదాన్ని మకుటాయమానం చేసుకున్నారు.  ఐదు ప్రకరణాల సమగ్రకావ్యం 1980లో ‘‘విశ్వంభర’’గా మానవ  పురోగమనశీలితకు నడకలు నేర్పిన కావ్యంగా ప్రచురితమై జ్ఞానపీఠపై నిలిచింది సినారె గారి రచనాశిల్పం.  మానవత్తత్వం, అలంకార ఔచిత్యం కల్పనం, శబ్ధ, ఉదాత్తభావమై సమనిష్పత్తిలో కలిసి హృదjైుక, వేద్యమైన ప్రతికాత్మక కావ్యం ‘విశ్వంభర’ జ్ఞాన బీజమే విశ్వంభరాభ్రమణానికి శాశ్వతచైతన్య తేజమై నిలిచింది.  నాయకుడైన మానవునికి విశాల విశ్వంభరనే జీవన రంగస్థలంగా మలిచి చూపిన మహాకావ్యమైంది ‘‘విశ్వంభర’’

చిరకాలం స్మృతిపదంలో నిలిచే  మనోజ్ఞ కళాఖండాలుగా కథాకావ్యాలను మలిచాడు.  సి.నా.రె.  ‘‘జాతిరత్నం’’ ‘‘విశ్వనాథనాయుడు’’ కర్పూర వసంత రాయలు, ‘‘సప్నభంగం’’ ‘‘నాగార్జున సాగరం’’ లాంటి రచనా వైచిత్రిని అనుభూతుల దృశ్య పరంపరలను కళ్ళముందు నిలుపుతాయి.  ఉదయం నా హృదయం మధునం, విశ్వగీతి, భూమిక, సమదర్శనం, మావూరు మాట్లాడిరది, ముఖాముఖి సమీక్షణం, రామప్ప, గాంధీయం, మీరాబాయి, శిఖరాలు, లోయలు, ముత్యాలకోకిల, మందార మకరందాలు, మట్టిమనిషి, ఆకాశం, నిరంతరం, విశ్వంభర వంటి కావ్యాలలో అనవరతంగా పరిజ్ఞాణంతో సాగిన సినారె రచనా ప్రయాణపు మలుపులు, మార్పులు, వారు ఇచ్చిన తీర్పులు పరిశోధనాత్మక విమర్శకు, విశ్లేషణలకు ద్వారాలు తెరిచాయి.  కవిత్వాన్ని గుబాళింపచేసే లక్షణాన్ని పుష్కలంగా కలిగిన కవి కావున కవిత్వమే సినారెకు శ్వాసగా మాతృభాషగా మారింది.

అంత్యప్రాస, పూర్వాంత్యప్రాస నియతితో ఫారసీ, ఊర్ధూకవితలోని రదీప్‌, ఖాసియా చందస్సులో ‘తెలుగు గజళ్లను’ సృజించి విస్తృతంగా ప్రాచుర్యంలోకి తీసుకవచ్చారు సినారె గజల్‌పల్లవి ‘మత్లా’చరణం ‘ముక్తా’ కవినామముద్ర ‘తఖల్లుస్‌’, నారాయణరెడ్డి గజళ్లలో తఖల్లుస్‌ ‘సినారె’’ తన సతీమణి సుశీలా నారాయణ రెడ్డి స్మృతిలో ప్రఖ్యాతమై విఖ్యాతిపొందిన తెలుగు గజళ్లనెన్నింటినో రచించి స్వరకల్పన చేసి స్వయంగా గానం చేశారు. ‘అమ్మ’ లాంటి వాళ్లమ్మాయి ‘గంగ’కు తన గజళ్లను అంకితమిచ్చారు.  35 గజల్‌ను ‘‘సినారె గజల్స్‌’’ పేరిట పుస్తకంగా వెలువరించారు.  అంతకు ముందే ‘తెలుగు గజల్‌లు’ కూడా ఆయన లేఖిని నుండి వచ్చాయి.  ‘మత్లా’ మొదులుకొని ‘మక్తా’ వరకు అన్ని పాదాల్లో మాత్రా సంఖ్యాసమత్వాన్ని పాటిస్తూ ‘కాఫియా’ స్వరూపంలో స్వేచ్ఛ తీసుకుంటు గజళ్లలో కూడా యతి నియతిని పాటిస్తూ సినారె గజల్స్‌కి పరిపూర్ణత తీసుకవచ్చారు.

ఆచార్య సినారె ప్రతినిత్యం నడకలో సహచరుల పలకరింతలకు బదులు పలుకుతూనే మనసులో పంక్తుల అట్లుకుంటూ చెప్పగా వెలుబడిన ‘ద్విపదులు’ ‘కలం సాక్షిగా’ పేరుతో 1995 సం॥లో ప్రచురించబడ్డాయి.  చతురస్ర, మిశ్రతిస్ర గతులలో సాగిన ఈ ద్విపదులు నడకలో జనించిన ముత్యాలుగా, మనసుకు అద్దం పట్టిన మౌలిక సత్యాలుగా అభివర్ణించారు. కత్తిరిస్తేనే మొక్కలు కొత్తగా చిగురు పెడతాయని చెప్పిన సినారె బీజం చిన్నదైనా దిక్కులను కాపాడె దిక్కయ్యే పచ్చని చెట్టుని ప్రసవిస్తుందని సూచించారు.  ‘కరగని జీవన నిధులు’’గా నారాయణ రెడ్డి ద్విపదులుగా భాసించాయి.  ‘‘ఊపిరిగాడ్పులు చెలరేగుతున్నాయి / ఉరికే రోజులతో చేయి కలిపి నా మనసు పరుగులు తీస్తున్నది / పరిసరాల ప్రశంసలతో… ముంచేస్తున్నవి.  అనే ఉరికే రోజులు ` సినారె చివరి ప్రచురిత కవిత ‘‘మన తెలంగాణ’’ దిన పత్రిక ` కలం పేజీలు 12/6/2017 లో అచ్చు రూపంలో ఉంది.  ‘‘చెక్కనిదేశిల కడుపున శిల్పమెలా పుడుతుంది / మరగనిదే నీరు ఎలామబ్బు రూపుకడుతుంది / నలగనిదే అడుగు ఎలానటన రక్తి కడుతుంది’’ అన్న సినారె మరణం సాహిత్య ప్రపంచానికి, సాంస్కృతిక వైభవానికి ఎంతో లోటును మిగిల్చింది.

‘‘సంకల్పం అచంచలంగా వుంటే / ఈదగలిగే చేతులకు సముద్రాలు లొంగిపోతాయి’’ అనే ధీమాను వ్యక్త పరుస్తూ 116 కవితలతో తన 86వ జన్మదినోత్సవ సందర్భాంగా సినారె గారు ‘‘నా రణం మరణం పైనే’’ అన్న కవితల సంపుటిని వినూత్న వస్తు వైవిద్యం, భావవైశిష్ట్యం, శిఖరస్థాయిలో అభివ్యక్తిని సంతరించుకున్న కవితలను ఈ సంపుటిలో చేర్చారు.  ‘‘తొలి ఊపిరి జననం, తుది ఊపిరి మరణం’’ అని తెలిసిన ప్రాణికి కరిగిపోయిన జీవనకాలంలో తాను మిగిల్చిన పునాదులే మరణానంతర సజీవత్వాన్ని ఆపాదిస్తాయని అ ంటారు.  మరణాన్ని జయించే దైర్యపు ధీరతనే జీవిత వృక్షాన్ని అక్షయంగా నిలుపుతుందన్న ఆశావాహ దృక్పథాన్ని నారాయణ రెడ్డి గారు వ్యక్తం చేశారు.  పరిపక్వఫలభరితమై తరుదశకు చేరుకుని అన్నీ తట్టుకుని నిలబడే మనుగడల జీవిత వృక్షాన్ని కాంక్షించారు.  వారి వారసులుగా మనం సాగుదాము అంటూ తిరునగరి శ్రీనివాస్‌ వారి వ్యాసాల ద్వారా తెలిపారు.  ఈ సాహిత్య విమర్శా వ్యాసాలు భావితరాలకు పరిశోధనకు నాందిపలుకుతాయని భావిస్తున్నాము.

‘‘చినుకును రమ్మని చిటికేశాను అది జల్లై వచ్చి కురిసిపోయింది చిగురును చేత్తో నిమిరి చూశాను అది నూరు రేకుల పువ్వై విచ్చుకుంది.  తారను ధగధగ వెలిగిపో అన్నాను, అది మధ్యాహ్న సూర్యబింబంలా ఉజ్వలించింది’’ అనే పంక్తుల్లో ప్రకృతిలో మనిషి మమెకమైతే సంపదలను ఇస్తుంది.  ఆదే ప్రకృతిని విధ్వంసం చేస్తే కల్లోలం సృష్టింస్తుంది.  వ్యక్తి నీతిగా, న్యాయంగా, నిస్వార్థంగా మానవతా దృష్టిలో తోటి వారిని ఆదుకోవాలనే సమన్యాయం వీరి రచనల్లో ఉన్నాయి.  ఓ మేరుపర్వతం లాంటి భావకుడు స్పర్శించిన అక్షర జ్ఞానం మనకిచ్చిన అక్షర వరాలుగా భావిస్తూ ఆదర్శవంతమైన, సాహితి విలువలతో కూడిన రచనలు చేయటానికి ఆదర్శనీయులు మన ఆచార్య సి.నారాయణ రెడ్డి అంటారు శ్రీనివాస్‌ తిరునగరి.

 

October 24, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

*సామాజిక స్పృహతో చేసిన రచన–చైతన్య జ్యోతి*

by vedartham Madhusudana sharma October 24, 2021
written by vedartham Madhusudana sharma
      నేటి సమాజములో మానవతా విలువలను పెంపొందించుటకు,సామాజిక ప్రగతి సాధించుటకు,సమాజము లోని లోటుపాట్లను ఎత్తి చూపి,వాటికి పరిష్కార మార్గాలను సూచించుటకు,గొప్పనైన సంస్కృతి,సంప్రదాయాలను గురించి తెలియజేయుటకు,సన్మార్గానికి దారిదీపాలైన మహనీయుల చరిత్రను భవిష్యత్తు తరాల వారికి అందించుటకు సాహిత్యము ఏకైక మార్గమని తన కవిత్వము ద్వారా పాఠకులకు తెలియజేసేందుకు మన ముందుకు వచ్చారు డా.పోలా సాయి జ్యోతి గారు.
      వీరు తెలుగు భాషా అధ్యాపకురాలిగా విద్యార్థులకు తెలుగు భాషా,సంస్కృతులను గురించి తెలియజేస్తూనే,సమాజము లోని ప్రతి ఒక్కరికీ తన కవిత్వం ద్వారా హితబోధ చేస్తున్నారు.”హితేన సహితం సాహిత్యం ” అన్నారు కదా పెద్దలు.
       ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాహిత్యములో రాణిస్తున్న అతి కొద్దిమంది మహిళల్లో శ్రీమతి సాయి జ్యోతి ఒకరు.వీరి ప్రస్తుత రచన “చైతన్య జ్యోతి”.ఇందులో ఉన్న కవితలన్నీ వివిధ సందర్భాలలో రాసినవి.అనేక కవితా సంకలనాలలో ప్రచురించబడినవి,వివిధ కవి సమ్మేళనాలలో చదివినవి.ఆయా కార్యక్రమాల నిర్వాహకులు విధించిన నిబంధనల మేరకు ఇవి రాయబడినవి కాబట్టి రాసిలో చిన్నవైన వాసిలో గొప్పవి.కవితలను చదువుతూ వెళ్తుంటే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది.వారు చెప్పిన విధముగా కొన్ని వాక్యాలలోనే విషయాన్ని చెప్పడం కత్తి మీద సాము వంటిది.పాఠకులను ఆకట్టుకునేలా,పరిధి లోపల రాయడం అనేది ఎంతో చాకచక్యంతో కూడిన పని.అయితే ఆ పరిధిని దాటకుండా ఆయా అంశాల గురించి తనదైన శైలిలో అద్భుతమైన కవిత్వాన్ని రాసి సాహిత్యజ్యోతిగా పలువురి చేత ప్రసంశలు అందుకున్నారు ఈ కవయిత్రి.
      ఈ పుస్తకములో శ్రీమతి సాయి జ్యోతి మొదటగా తన ఇష్ట దేవతలైన శ్రీ గణేశుడు,శ్రీ వేంకటేశ్వరుడు మొదలైన వారికి ప్రాణామములు అర్పించి,పూర్వకవులైన పోతన,సురవరం,యశోదా రెడ్డి,పి. వి,సినారె,కపిలవాయి తదితర సాహితీ మూర్తుల భాషా సేవలను స్మరించుకోవడం అనేది మంచి సంప్రదాయం.
         తర్వాత వీరు అనేక సామాజికాంశాలు అయిన తెలంగాణ,శిల్పి,ఓటువిలువ, జలం,శ్రమైక జీవనం,వృద్ధాప్యం,వరకట్నం,కాలుష్యం,పాలమూరు,కందనూలు ఘనత మొదలైన వాటిని స్పృశించారు.

           వీరు ఇంకా మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే  పండగ లైన ఉగాది,బతుకమ్మ,బోనాలు,రాఖీ ల గురించి తన కవిత్వములో చక్కగా తెలియజేసారు.
          మాతృభాషా గొప్పతనాన్ని వీరు సాహిత్యం,అక్షరామాలిక,జ్ఞానదీపం,తెలుగు భాష,జ్ఞానకోవెల,మాతృ భాషా వంటి కవితల్లో తనదైన శైలిలో చిత్రించారు.
           అంతేకాకుండా భారతదేశ రక్షణ కొరకు తమ కుటుంబం,భార్యా పిల్లలను వదలి,ప్రాణాలను సైతం లెక్క చేయక,విపత్కర పరిస్థితులలో సరిహద్దుల్లో పహారా కాస్తున్న వీర సైనికుల ప్రాణ త్యాగాలను స్మరించుకుని తన కవిత్వము ద్వారా శ్రద్ధాంజలి ఘటించారు.
        నేడు ప్రపంచం మొత్తాన్ని కంటిమీద కు నుకు లేకుండా చేసి,తన ప్రతాపంతో ఎన్నో లక్షల మంది ప్రాణాలను బలి గొంటున్న కరోనా మహమ్మారి గురించి,దాని ప్రతాపం గురించి దాదాపు 10 కవితల్లో తెలియజేసింది.దీన్ని నిలువరించుటకు ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సందర్బంగా చేయడానికి పనిలేక,తినడానికి తిండిలేక సొంత వూరికి వెళ్లి, కలో గంజో తాగుదమని బయలుదేరిన వలస కార్మికుల కు సరైన రవాణా సౌకర్యాలు లేక కాలినడకన మైళ్ళ కొద్దీ ప్రయాణిస్తున్న వారి కష్టాలను గురించి చక్కగా వివరించింది సాయి జ్యోతి.
          అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ బంగారు తెలంగాణ,మిషన్ భగీరథ,కెసియార్ వంటి కవితల ద్వారా తన కృతజ్ఞతను చాటుకున్నారు.
        ఇంకా తనకు జన్మ నిచ్చిన అమ్మ నాన్నల గురించి,భార్య గొప్పతనం గురించి,మానవీయ విలువల గురించి,మాన సంవేదనలు అయిన సంతోషము,ఆనందం, మొదలైన వాటి గురించి గొప్పగా తన కవితల్లో చిత్రించారు.
         ఈ విధంగా వైవిధ్యభరితమైన అంశాలను కవిత్వీకరించి ఒక్క చోట రాసిపోసినట్లుగా ఉన్న డా.పోలా సాయి జ్యోతి గారి ఈ పుస్తకం ఒక పూల సింగిడిగా పేర్కొనవచ్చు.వీరు భవిష్యత్తులో మరిన్ని రచనలు చేసి గొప్ప సాహితీ వేత్తగా ఎదగాలని కోరుకుందాం.
October 24, 2021 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us