మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

రోడ్డు ప్రమాదాలు

by Dr. Nannapuraju Vijayasri May 29, 2025
written by Dr. Nannapuraju Vijayasri

ప్రతినిత్యం రహదారులు రక్తంతో ఓలలాడుతున్నాయిఅనేక దుర్ఘటనలలో 4.80మంది ప్రాణాలు కోల్పోయారు 4.62లక్షల మంది గాయాల పాలైనారు.రహదారి భద్రతపై ప్రభుత్వాలు అంతబాధ్యతారాహిత్యంగానే ఉన్నాయి. 4.62లక్షల మందిని గాయాల పాలుఅయ్యారు. 2022 తో పోలిస్తే మృతులు 2.6 క్షతగాత్రులు 4.4 %పెరుగుదల జరిగింది.మధ్యతరగతి వర్గాలకు చెందిన యువత నడివయస్కులే రోడ్లపై రక్త దాహానికి ఎక్కువగా గురవుతున్నారు.దానివలన ఎన్నో కుటుంబాలు ఆర్థికంగా చితికి పోతున్నాయి.అతివేగానికి తోడు రోడ్ల నిర్మాణంలో లోపాలు లైసెన్సులజారీలో అక్రమాలు వాహన చోదకులబాధ్యతారాహిత్యం భద్రతాప్రమాణాల అమలులో నిర్లక్ష్యం తదితరాలతో రహదారులపై నిత్యం నెత్తుటేల్లుపారుతున్నాయి.
ఈ మధ్యకాలంలో అధునాతన బ్రేకింగ్ వ్యవస్థలుఏయిర్ బెలూన్ వంటిసౌకర్యాలుఅందుబాటులోకి వచ్చాయి.అయినా ప్రమాదాల్లో మృత్యువు పాలు అవుతున్నారు.మనదేశంలో జాతీయ రహదారులు2% అయినామరణాల్లో అధిక వాటా వాటిదే.ఇతర దేశాల్లో సైకిళ్ళుమోటార్ వాహనాలు పాదాచారులకువేరు వేరు మార్గాలున్నాయి.రోడ్ల నిర్మాణంలో మేలిమిప్రమాణాలుపాటించడం ట్రాఫిక్ నిబంధనలుఅక్కడ అమలు చేయడం ఒక కారణం. మన రవాణ చూసినట్టు అయితే పుట్ పాత్ లపైనాద్విచక్ర వాహనాలు నడపడం ట్రాఫిక్ పోలీసులు చలానాల విషయంపైశ్రద్ధ వహించడం బ్లాక్ స్పాట్ల సరి చేతలు. డ్రైవర్లు పని వత్తిడితోమద్యం మత్తులో బండితోలడంతో రక్తం చిందినరహదారులు అవుతున్నాయి.

ప్రమాదంలో కొట్టుమిట్టాడుతున్న వారిని వెంటనే ఆస్పత్రికి తరలిస్తే బాధితుల ఊపిరి నిలపవచ్చు. 108 పోను చేసి అంబులెన్సులు వచ్చేసరికిఆలస్యమై ఎందరో నిస్సహాయంగా ప్రాణాలు వదులుతున్నారు.రోడ్డు ప్రమాద బాధితుల అపన్న హస్తంఅందించడంపైప్రభుత్వ యంత్రాంగం తగు చర్యలు తీసుకోవాలి.ట్రాఫిక్ ఉల్లంఘనపైతగు చర్యలు తీసుకోని బ్లాక్ స్పాట్లను తక్షణం సరిదిద్దాలి.డ్రైవింగ్ పాఠశాలలువిరివిగా ఏర్పాటు చేయాలి.
మద్యం మత్తులో ద్విచక్ర వాహనాన్నిఢీ కొట్టి కారుపై పడిన మృతదేహంతో 18 కీ.మీ.ప్రయాణించిన వైనంచక్కగా చదువుకొని వృద్ధిలోకి రావలసినచిన్నపిల్లలు సైతం తల్లిదండ్రుల బాధ్యతారాహిత్యం వల్ల వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలు బలిగొంటున్నారు.
డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో పట్టుబడుతున్నారు.జాతీయ నేరగణాంకసంస్థలెక్కల ప్రకారం 2022 లో మద్యం డ్రగ్స్ మత్తులో వాహనాలు నడిపిన వారి కారణంగా దాదాపు మూడువేల ప్రాణ దీపాలు ఆరిపోయాయి ఆరు వేల మంది క్షతగాత్రులయ్యారు.హైదరాబాద్ లోని డ్రంకెన్ డ్రైవ్ పరీక్షలో లక్షల మందికి పైగా కేసులునమోదయ్యాయి. వారిని 5 వేల మందికి జైలుకు పంపారు. ఆ దండనకు ఏ మాత్రం వెరవనిచాలా మందిమళ్లీ మళ్లీ తప్పులుచేస్తున్నారు.ఢిల్లీలో ఒక స్వచ్ఛంద సంస్థ ముప్ఫై వేల మందివాహనదారులతో ఒక సర్వే చేస్తే తాగి బండ్లు నడిపినట్లు 81%ఒప్పుకున్నారు. బయటకు వెల్లిన వ్యక్తి క్షేమంగా ఇంటికి తిరిగి వస్తాడన్న నమ్మకం లేదు.జాతీయ రాష్ట్ర రహదారులకు 500 మీటర్ల పరిధిలో లిక్కర్ విక్రయాలను నిషేదించాలన్నసుప్రీం కోర్ట్ రోడ్లపైనరమేధం ఆగాలంటే తాగి బండి నడిపే ప్రతి ఒక్కరికి సరి అయిన శిక్షలు విధించాలి. మధ్యం మత్తులో అనేక మంది అమానుష నేరాలకు పాల్పడుతున్నారు. ఆరోగ్యాలను గుల్ల చేయడం సామాజిక అశాంతికి కారణమవుతున్న మద్యం తాగి వాహనం నడపడమే కారణమవుతుంది.
రహదారిపై మరణమృదంగంజాతి గుండెల విసేలా అనునిత్యం మార్మోగుతుంది.దేశవ్యాప్తంగా ప్రతి గంటకు 53 రోడ్డు ప్రమాదాలు 19 మంది మృత్యువాత పడుతున్నారు. క్షతగాత్రుల లెక్కలో 15.3 శాతం పెరుగుదలతో తీవ్రతకళ్ళకు కట్టినట్టుకనబడుతుంది. మృతుల్లో 18-45 ఏళ్ళ మధ్య వారే 69%. వరకు వున్నారు.
ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో భాగమైన రహదారిభద్రతపై దృష్టి పెట్టి 2030 నాటికల్లారోడ్డు ప్రమాదాల్నిమృతుల సంఖ్యను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా సంకల్పించింది. 2030నాటికి రోడ్ల నిర్మాణం వేగ నియంత్రణ కచ్చితంగా నిబంధనలు అమలుకుప్రాధాన్యం వేగ నియంత్రణణుతగ్గించే ప్రయత్నంలో చైనాఅద్భుత ఫలితాలు సాధించింది.
ప్రపంచ వ్యాప్తంగా రహదారి ప్రమాద మృతుల సంఖ్య అయిదు శాతం దాకతగ్గితే అంతకుమించి భారతదేశంలో పెరిగి నిశ్చేష్ట పరుస్తోంది.వాహన వేగాన్ని 51%తగ్గించగలిగిన ప్రమాద మరణాలు 30% దాక నియంత్రించగల వీలుందని తెలిసినా ఎడెనమిదిసెకండ్లలోనేవందల కిలోమీటర్ల వేగంఅందుకనే శకటాలు రోడ్డు ఎక్కుతున్నాయి. ఎయిర్ బ్యాగ్ ల్ని తప్పక వాడాలి. అమెరికాలో 98% జర్మనీ 89% చైనా 65%భారతదేశంలో 12 నుండి 13 మాత్రం వాడుతున్నారు. రహా దారి భద్రంగాఉండాలంటే వచ్చే పది సంవత్సరాలలో 10,900కోట్ల డాలర్లు ఖర్చు చేయాలని దాని వలన స్థూల దేశీయుత్పత్తి 3.7 %ఆర్థికంగా గిట్టుబాటు అవుతుందని ప్రపంచ బ్యాంక్ సూచిస్తుంది. రహాదారిపై మేట వేసిన నెత్తుటి సంక్షోభాన్నిరూపుమాపినపుడేసంక్షేమ రాజ్యా ప్రాణ ప్రతిష్టల భావన కలుగుతుంది.
2016లో దేశవ్యాప్తంగా రహదారులు రక్తదాహానికి 16 వేలమంది పాదాచారులు 2022లో 32 వేలకు పైగా బలి అయ్యారు. 90% పాదాచారులు గాయాలపాలు అయ్యారు అత్యధికులు పేద మధ్యతరగతి ప్రజలే ఆర్థిక ఇక్కట్లలోకి నెట్టేస్తున్నాయి 9వేల కి.మీ పైగా రహాదారులు విస్తరించి వుంటే 10% బాటలపైనే పుట్ పాత్ లు వున్నాయి. పుట్ ఓవర్ బ్రిడ్జిల ఏర్పాటు స్కై వాక్ లు ఏర్పాటు చేయాలి భద్రత అవగాహన చేయాలి రోడ్ల నాణ్యతనుమెరుగుపరచాలి

May 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

తస్మాత్ జాగ్రత్త

by Kura Bhanuja May 29, 2025
written by Kura Bhanuja

యేండ్ల పోట్లాటలు
ఎరకలేని ఉన్మాదం
రేకెత్తుతున్నాయి మతజాడలు
ఏది మతం ఏది అభిమతం
ఎంచుకోవాలి మనమే
అన్నిమతాల సారమొక్కటే
మానవత్వమే మనిషితత్త్వం
మతచిచ్చులు మరవనిమచ్చలు

ఆవేశం ఆగ్రహం
అంతానికి సూచికలు
మా ఆలోచన ఆయుధమే కానీ
కాదు వెనుకబాటు
జనం మాకు సామాన్యం కాదు
అదే మా పౌరుషం

మా దేశతలం తలమానికం
కోల్పో నీచూపు
నుదుటిని వెలుగు చెరిపే నీ పైశాచికం
ఉగ్రవాదాన్ని ఉప్పుపాతరేసి
నింగిని తలచేలా నీ ఆయుధాల నిర్వీర్యం
నీకు తెలుసు మా యుక్తి
నీ తెలివి ప్రపంచాన లోకువయ్యింది
ఏదో చెల్లుబాటుకై నీ ప్రయత్నం
మా ధైర్యం
ఆపరేషన్ సింధూర్ గా
నీ నట్టింట్లో అడుగుపెట్టి
నీ ఉగ్రమూక
ఆనవాళ్ళను తొలగించిన తీరును
చూసావు కదా
నారీశక్తి నారీగళం ప్రపంచంముందు
ప్రచండమైంది

ఆసరాకై అగ్రరాజ్యాల పొత్తుచేరి
ఒప్పందం కూర్చుకుంటావు
మళ్లీ నీదైన
కుతంత్రపు బుద్ధితో
దొంగచాటుదాడులకు సైతం దిగుతావు
నీ కుతంత్రాలకివి
చెంపపెట్టు
ఉఫ్ ఉఫ్ అని ఊదితే నీ ఊసే ఉండదు

భారత నారి వీరనారి
ఒక్కో అడుగు వేల ఉదాహరణలు
తస్మాత్త్ జాగ్రత్త!

May 29, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ధీరలారా!ధీరులారా!శిరసాభివందనం.

by Padma Tripurari May 29, 2025
written by Padma Tripurari

మానవతకు పట్టిన
చీడ పురుగులను
ఏరవేసి
శాంతి వృక్షానికి నీరు పోసి
జ్వలన శిఖలై ఎగిసిన ధీరలారా!
ధీరులారా!
వందనం.
శిరసాభివందనం.

ప్రాణభీతిని
తరిమికొట్టి
ప్రాణప్రీతిని
వదిలిపెట్టి
మాతృభూమికి
ప్రాణమిచ్చెడి
శూర లారా!
శూరులారా!
వందనం
.శిరసాభివందనం.

రక్తబంధము కన్న ఎన్న
భరతమాత సేవ మిన్న
అన్న మాటనె
హృదిని నిలిపి
సమరమందున
ఎగసి దూకిన
విజయలారా!
విజయులారా!
వందనం.అభివందనం.

బంధు వర్గము
స్నేహ బంధము
మదిని మెదిలిన
మనసు దృఢము చేసి
దేశ సేవకు
కదం తొక్కిన
భారతావని ప్రియ బంధులారా!
భయమన్నదెరుగని
అభయులారా!
వందనం.శిరసాభివందనం.

ధైర్యమన్నది
మదిని నిండగ
పిడుగులాగా
హుంకరించిన
రణ యోధలారా!
సమర యోధులారా!
వందనం
.శిరసాభివందనం

May 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

పుంభావ సరస్వతి :శంకరంబాడి సుందరాచారి

by Radhika Suri May 29, 2025
written by Radhika Suri

ప్రముఖ తెలుగు కవి ,రచయిత, సంగీతజ్ఞుడు, ఆంధ్ర ప్రదేశ్ ‘రాష్ట్ర గీత’ కర్త ఐన శ్రీ శంకరం బాడి సుందరాచారి గారు తిరుపతిలో ఆగస్టు 10న,1914లో జన్మించారు. వీరి తల్లిదండ్రులు కమలమ్మ, రాజగోపాలా చారి గార్లు.
వీరి సహధర్మచారిణి శ్రీమతి వేదమ్మాళ్ గారు.

తమిళులైనా తెలుగు భాషపై మక్కువతో ఎన్నో రచనలు చేశారు. థియోసాఫికల్ సొసైటీ కళాశాలలో ఇంటర్మీడియట్ చదివి ,చిన్నచితకా ఉద్యోగాలు చేసిన వీరు ఉద్యోగార్థమై మద్రాస్ ‘ఆంధ్ర పత్రిక’ ఆఫీసుకు వెళ్ళినప్పుడు దేశోద్ధారక కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు ‘మీకు తెలుగు వచ్చా’? అని అడిగినప్పుడు ‘మీకు తెలుగు రాదా’ అని ఎదురు ప్రశ్న వేయడంతో పంతులుగారు అవాక్కయ్యారట .ఈ పత్రికలో ఉన్నప్పుడు ఒక ప్రముఖునిపై పద్యం రాయమన్నపుడు తాను వ్యక్తులపై రాయలేనని ఉద్యోగం వదులుకున్న ఆత్మాభిమాని.

ప్రేమ వివాహం చేసుకున్న వీరి శ్రీమతి వేదమ్మాళ్ గారు
మనోవ్యాధితో గతించడం, ఐదేండ్ల కూతురు కూడా మరణించడం వారి జీవితంలో బాధించే అంశాలు. పద్య కవిత్వం అంటే ఎంతో ఇష్టం వీరికి ,అందులోను ఛందోబద్ధమైన తేటగీతి పద్యాలు మరీఇష్టమంటారు.
ఒక సందర్భంలో, నా పేరు కూడా తేటగీతిలో ఇమిడిపోయిందంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గీతం మా తెలుగు తల్లికి మల్లెపూదండ కూడా తేటగీతిలోనే రాసారాయన.

మహాత్మా గాంధీ హత్యోదంతం పై కలతచెంది’ బలిదానం’ కావ్యం రాశారు. ‘సుందర రామాయణం’ ‘సుందర భారతం’ పేరుతో రెండు కావ్యాల్ని, తిరుపతి వేంటేశ్వర స్వామి మకుటంతో ‘ శ్రీనివాస శతకాన్ని’ , ‘బుద్దగీతి’ పేరుతో బుద్ధుని చరిత్రను, ఠాగూర్ ‘గీతాంజలి’ లోని మూలభావాన్ని తీసుకొని చేసిన స్వతంత్రానువాదం ఎన్నో ప్రశంసలు పొందింది. భావగీతాలు, జానపద గీతాలు, సినిమా పాటలు రాశారు. 1942లో ‘దీనబంధు’ సినిమా కోసం రాసిన పాట ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ కారణాంతరాల వల్ల సినిమాలో చేర్చలేదట.
ఈ పాట శ్రీమతి టంగుటూరి సూర్యకుమారి గారు పాడిన తర్వాత అత్యంత ప్రజాదరణ పొందింది అంటారు. ‘బుద్ధ చరిత్ర’ లోని కొన్ని పద్యాలను ఆంగ్లంలోకి అనువదించి నెహ్రూ గారి మన్ననలు పొందారట .

ఈ కవి శ్రేష్ఠునిపై కొందరు ప్రముఖ కవి దిగ్గజాల అభిప్రాయాలు :

శ్రీపాద కృష్ణమూర్తి గారు: మృదువైన పదాల శైలి, కల్పనాచాతుర్యంతో కవిత్వాన్ని అత్యంత ఆదరణీయంగా మలిచారంటారు.

కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు :
సంస్కృత పదాలను వీడి , సరళమైన తెలుగులో పలుకుబడులు, కవితాత్మలకు సౌకుమార్యం కలగలిసి వీరి కవిత్వం
ఆదరణ పొందింది అంటారు.

గడియారం వేంకట శాస్త్రి గారు : ఎత్తుగడలు ,అలంకార, చమత్కారాల మేళవింపులతో సరళ భాషలో ,సహజ
భావ శృతులలో సాగే కవితాధార అంటారు .

రాయప్రోలు సుబ్బారావు గారు : వీరిశైలి తేటతెలుగులో సాగుతూ సుదూరంగా ధ్వనిస్తుంటుంది అంటారు .

రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు : తెలుగుదనపు తీపి రుచుల ఊట వీరి తేటగీతి కవిత్వం అంటూ శ్లాఘిస్తూనే, ఒకానొక సందర్భంలో భయంకర రూపంలో ఉండే ‘తాటకి’ మీ తేటగీతిలో ఇముడుతుందా అని ప్రశ్నిస్తే ,
నల్లకొండల నుగ్గుగా నలగ కొట్టి నడుగులు పిడుగులగుచు… అరుదెంచె అంటూ తాటకిని తేటతెలుగలో వర్ణించినపుడు శర్మగారు అచ్చెరువొందారట.
ఇలా చెప్తూపోతే వారి సాహితీ స్రవంతి గలగలలై పారుతూ సాహితీ ప్రియుల అభిమానాన్ని చూరగొన్న సందర్భాలు కోకొల్లలు.

1975లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనను సత్కరించింది .చారిగారిని వేంకటేశ్వర విశ్వవిద్యాలయం వారు’ ప్రసన్న కవి’ బిరుదుతో గౌరవించారు.
ఆయనకు జనబాహుళ్యంలో ‘భావకవి ‘ ‘సుకవి’ ‘ అహంభావకవి’ అని కూడా పేర్లు.

అచ్చ తెలుగులో , తెలుగువారి జీవన విధానాల్లోని సమస్త ఘట్టాలను,సాంప్రదాయాలను
భావసౌందర్య స్ఫోరకంగా, అతి రసవత్తరంగా, మాటలు ,పాటల రూపంలో వివరించి అందరినీ ఆకట్టుకోవడంలో అత్యంత ఘనులు .

నిరాడంబరత ,అసమానతలు ఎరుగని నిక్కచ్చితనం, ఆధ్యాత్మిక చింతన కలిగి ,అనన్య ప్రతిభాపాటవాలుగల ఈ బహుముఖ ప్రజ్ఞాశాలి పేరు కోసం ఎప్పుడూ పాకులాడలేదట .

ఎంత మేధావులైనా మనసు ముందు మోకరిల్లే వారేనని, కష్టాలు కడగండ్లకు అతీతులు కారనడానికి వీరే సాక్ష్యం . చరమాంకంలో ఐనవారు లేక ఒంటరితనంతో నిస్తేజంగా మారిన ఈ సాహితీదిగ్గజానికి ‘ప్రపంచ సాహితీపొత్తం’లో సరైన పుటలేదనే భావన ఎంతోమందిలోఉంది.

సాహితీ సేవలో అలసిసోలిన ఈ కవికోకిల ఏప్రిల్ 8,1977న, తిరుపతిలో ఇష్టదైమైన వెంకన్న పాదాల చెంత శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.

తెలుగుజాతి ఉన్నంతవరకు తెలుగు తల్లి మెడలో మల్లెపూదండను అతిఅందంగా కూర్చి అలంకరించిన ఘనుడిగా తెలుగుచరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన ఈ అసామాన్య కవిశ్రేష్ఠుడికి అక్షర నిరాజనాలతో…

(శంకరంబాడి సుందరాచారి గారి వర్ధంతి సందర్భంగా వారిని స్మరిస్తూ…)

May 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

అసలైన సంపద

by Nellutla Madhava Srinivas May 29, 2025
written by Nellutla Madhava Srinivas

ఒకరోజు ఒక ఆసుపత్రికి గర్భం దాల్చిన ముగ్గురు స్త్రీలు వస్తారు పరీక్ష చేయించుకోవడానికి. స్త్రీలకు ఉన్న సాధారణమైన అలవాటుగా ఒకరిని ఒకరు పలకరించుకుంటూ వారి యొక్క స్థితిగతులను చెప్పుకుంటారు. అందులో మొదటి స్త్రీ ఈ విధంగా చెప్తుంది. నా భర్త చాలా ఆస్తిపరుడు నేను ఏది కావాలన్నా కాదనకుండా కొనిస్తాడు నా కోసం ఒక కారు డ్రైవర్ను కూడా సిద్ధంగా ఉంచుతాడు ఎప్పుడు. ఇంటి నిండా పనివాళ్ళు ఎప్పుడూ ఉంటారు. అని చెప్పింది. అది విన్న రెండవ స్త్రీ నా భర్త ఒక మల్టీ నేషనల్ కంపెనీకి మేనేజర్. నాకు కూడా దేనికి కొదవలేదు ఏ లోటు రాకుండా ఏది అడిగినా కాదనకుండా కొనిస్తాడు. అంతేకాకుండా తన క్రెడిట్ కార్డు కూడా ఎప్పుడూ నా చేతిలోనే ఉంటుంది .అని గర్వంగా చెప్పింది. అది విన్న మూడవ స్త్రీ మీరు చెప్పినట్లుగా మేము అంత ధనవంతులం కాదు మాకు కార్లు బంగాళాలు నౌకర్లు లేరు కానీ….. నా భర్త నన్నుఎంతో ప్రేమగా చూసుకుంటాడు. నాకు ఏదైనా చిన్న బాధ కలిగితే అతని కంట్లో కన్నీళ్లు వస్తాయి. ఇప్పుడు కూడా నన్ను నా బర్తనే ఆసుపత్రికి తీసుకువచ్చాడు. అని చెప్పింది .అది విన్న ముందు ఇద్దరు అంతేలే అంతకన్నా ఏం చెప్పుకుంటారుఈ డబ్బు లేని వాళ్ళు. అని ఎగతాళి చేస్తారు మూడవ స్త్రీని.ఆసుపత్రిలో వైద్య పరీక్ష తర్వాత ముగ్గురు బయటికి వస్తారు. అప్పుడు మొదటి స్త్రీ ఇందాక నేను చెప్పాన నాకోసం కారు డ్రైవరు అప్పుడే వచ్చేసింది అని చెప్పి కార్ డోర్ తెరిచి కూర్చుంటుంది. తర్వాత రెండవ స్త్రీ అదిగో మా కారు డ్రైవర్ కూడా వచ్చారు అని నవ్వుతూ కార్ డోర్ తెరుస్తుంది. ఇక మిగిలిన మూడవ స్త్రీ తన భర్త రాకను గమనించి చాలా సంతోషంగా అటువైపు అడుగులు వేస్తుంది. ధనవంతులైన ఇద్దరు స్త్రీలు కూడా ఆమె చూస్తున్న వైపు చూస్తారు. ఒక పాత స్కూటర్ తో అత్యంత సాధారణంగా ఉన్న వ్యక్తి వారు ఉన్న వైపుగా వస్తున్నారు. అతనిని చూసి ఎగతాళిగా నవ్వుకుంటారు. కానీ అతని భార్య మాత్రం ఎదురెళ్లి ఇంత ఎండలో మీరు ఎందుకు వచ్చారండి నేను వచ్చేదాన్ని కదా అని అంటుంది ఆప్యాయంగా. అదేంటి లక్ష్మి నిన్ను కంటికి రెప్పలా కాపాడుకునే బాధ్యత నాది కాదా!!! ఇంత ఎండలో నువ్వు మాత్రం ఎలా వస్తావు అందుకే జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్దామని వచ్చాను. అంటూ బాటిల్లో నీళ్లు తీసి భార్య చేతికి అందించి ముందు నీళ్లు తాగు అంటూ అతని జేబు రుమాలు తీసి భార్య నుదిటిన వస్తున్న చెమటను తుడుస్తాడు ఎంతో ప్రేమగా. సరే ఇక పదండి బాగా ఎండగా ఉంది. ఆకలిగా కూడా ఉంది ఇంటికి వెళ్లి భోజనం చేద్దాం.అంటూ అతని స్కూటర్ ఎక్కి వెళ్ళిపోతుంది. అది చూసిన మిగతా ఇద్దరూ ఆమె వెళ్లిన వైపే చూస్తూ నిశ్చేష్టులై నిలబడతారు. అప్పుడు అర్థమవుతుంది వారికి వారు ఏం కోల్పోతున్నారు అనేది. డబ్బు, హోదా, పలుకుబడి ఎంత ఉన్నా ఆప్యాయంగా పలకరించే మనిషి ,అభిమానించే మనిషి కంటికి రెప్పలా కాపాడుకునే వ్యక్తి భర్తగా దొరకడం స్త్రీల అదృష్టం అది కదా అసలైన సంపద. అవునంటారా? కాదంటారా??

సామాజిక మాధ్యమంలో ఒక చిన్న రీల్ చూసి నా కలాన్ని కదిలించి రాయించిన చిట్టి కథ

May 29, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

ప్రజాపతి

by Konduri KashiVishveshwara Rao May 29, 2025
written by Konduri KashiVishveshwara Rao

అవసరాలకు పిలిచి మరీ అప్పులిచ్చే జగదీశ్‌ దురాశతో వడ్డి వ్యాపారం కూడా మొదలుపెట్టాడు. తీసుకున్న అప్పులు సమయానికి తీర్చకుండా ఉంటేనే జగదీష్‌ ఆత్మశాంతిస్తుంది. ఎందుకంటే నెలవారీ అప్పనంగా వచ్చే వడ్డిలు, చక్రవడ్డిలంటే అతనికి చక్రపొంగలిలా మహారుచిగా ఉంటాయి కాబట్టి.
ఎందుకో అతనికి ధనదాహం రోజురోజుకీ పెరిగిపోతోంది. క్రమక్రమంగా రియల్‌ ఎస్టేట్‌ రంగంలోకి ప్రవేశించి, అడ్డంగా కోట్లు ఆర్జించాడు. ఈ అక్రమ సంపాదనంతా బ్యాంకుల్లో వేస్తే ఇన్‌కంటాక్స్‌ కట్టాలి కదాని, అతి తెలివితో కరెంసీ నోట్లను గోనె సంచుల్లో వేసి కట్టి గోడౌన్‌ నింపేశాడు.
ఒకప్పుడు ఎకరాల్లో భూమిని కొని, ప్లాట్లు చేసి యాభై రెట్లకి అమ్మి లాభాలు చవిచూశాడు. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే పూర్తిగా తారుమరైపోయింది.
హైటెక్‌ గిరాకీని తట్టుకోవాలంటే కనీసం గజాల్లో కూడా ప్లాట్లు దొరకటం కష్టమైపోయింది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో చదరపు అడుగుల్లోనే వ్యాపారం చేయవలసి వస్తోందని తెగ మదనపడిపోయాడు. అందుకే అయితే ఎస్టేట్‌ మానేసి, వెంటనే కొత్త బిజినెస్‌ చేయాలని డిసైడయ్యాడు.
అదే సమయంలో జగదీష్‌కి ఒక సూపర్‌ ఐడియా ఒకటి ప్లాష్‌ అయ్యింది. ఇక ఏ మాత్రమూ ఆలస్యం చేయకూడదని, తన ప్లాన్‌ని అమలు చేయటానికి వెంటనే సైంటిస్ట్‌ ప్రజాపతి ఇంటికి కారులో బయలుదేరాడు.
* * *
లేక లేక పుట్టిన కొడుకుకి చక్రవర్తి అని పేరు పెట్టుకున్నారు. సాంబయ్య, రంగాబాయి దంపతులు. సాంబయ్య కూలీనాలీ చేస్తూ భార్యను ప్రేమగా చూసుకునేవాడు. చక్రవర్తిని మాత్రం గవర్నమెంటు స్కూలుకి పంపుతున్నారు. ఎందుకంటే ఆ స్కూల్లో ఒకపూట భోజనం పెడుతున్నారు. అలాగే ఉచితంగా క్లాసు పుస్తకాలు కూడా ఇస్తున్నారు. భార్య రంగాబాయికి జ్వరం వచ్చింది. ఎంతకాలమైనా జ్వరం తగ్గకపోగా అది జబ్బుగా మారిపోయి మంచానపడిరది. ఆమె వైద్యం కోసం అప్పులు చేయవలసి వచ్చింది. రాను రాను సరిjైున వైద్యం అందకపోవటంతో హఠాత్తుగా రంగాబాయి స్వర్గస్తురాలయ్యింది.
భార్య తోడు లేకపోవటంతో సాంబయ్యకు ఏదో వెలితిగా ఉండేది. ఎప్పుడూ ఆమె గురించే ఆలోచిస్తూ పరధ్యాన్నంగా ఉండేవాడు. ఆడ దిక్కులేని ఏ మగాడికైనా జీవితం మీద విరక్తి పుడుతుంది అనే దానికి బహుశా ఇదే ఉదాహరణేమో! అదే వైరాగ్యం, బెంగగా మారి తట్టుకోలేని స్థితిలో చివరికి సాంబయ్యకు గుండెపోటు వచ్చి భార్య దగ్గకు వెళ్ళిపోయాడు.
చక్రవర్తి టెన్త్‌క్లాసు చదువుతూనే చిన్న చితకా పనులు చేస్తూ తన కాళ్ళమీద తను నిలబడ్డాడు. కానీ చిక్కంతా ఇక్కడే ఎదురైయ్యింది. అమ్మ వైద్యం కోసం నాన్న తీసుకున్న అప్పులు తీర్చుమంటూ జగదీష్‌ అనుచరులు చక్రవర్తిని నిత్యం వేదించసాగారు. ఈ సమస్య చక్రవర్తి చదువుకు బ్రేక్‌ వేసింది. తండ్రి బాటలోనే కాయకష్టం చేస్తూ జగదీష్‌కి పదివేలు అప్పు కాస్తా తీర్చేశాడు.
ఉండటానికి ఇల్లు లేదు. కొంతకాలం పాడుబడిన ఇళ్ళల్లోనూ చెట్లకిందా జీవితాన్ని గడుపుతూ వచ్చాడు. ఆ తరువాత సిమెంట్‌ పైపుల్లో నివసించసాగారు. అక్కడ కూడా అతనికి చుక్కెదురైయ్యింది. మున్సిపాలిటి వాళ్లు వచ్చి ‘‘ఇక్కడ మేము మంచినీళ్ళ పైపులైన్సు వేయాలి. వెంటనే నువ్వు ఇక్కడ నుండీ ఖాళీ చేయాలి’’ అని చెప్పి చక్రవర్తిని వెళ్లగొట్టారు. అప్పుడే అతని దగ్గరున్న రేడియోలో నుండీ ‘‘పయనించే ఓ చిలుకా ఎగిరిపో! పాడై పోయెను గూడూ’’ పయనించే ఓ చిలుకా! అనే ఘంటసాల మాస్టారు పాడిన పాట వింటూ కన్నీళ్ళు పెట్టుకున్నాడు. తన దగ్గరున్న పెట్టెనూ, ఇంజనీర్‌ సర్‌ విశ్వేశ్వరయ్య ఫోటోని చేత పట్టుకొని బ్యాగును సర్దుకుని సిమెంట్‌ పైపుల నుండీ బయటకు వచ్చేశాడు చక్రవర్తి.
చాలీచాలని కూలి డబ్బులతో తన జీవితకాలంలోనే ఇల్లు కట్టటం అసాధ్యమనే ఆలోచనల ఆవర్తనాలలో మునిగిపోయాడు పాపం గరీబు చక్రవర్తి.
* * *
సైంటిస్ట్‌ ప్రజాపతికి తన ప్లాన్‌ వివరంగా చెప్పాడు. దానికి తగ్గట్టే ప్రయోగం చేసి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన అద్భుతమైన మందును తయారుచేయమని చెప్పాడు జగదిష్‌. ఇక తప్పనిసరి పరిస్థితులలో ప్రయోగం చేయటానికి ఒప్పుకున్నాడు సైంటిస్ట్‌ ప్రజాపతి. లేకుంటే చిత్రహింసలకు గురిచేస్తానని బెదిరిస్తున్నాడు.
సైంటిస్ట్‌ ప్రజాపతి చేస్తున్న ప్రయోగానికి కావలసిన రసాయనాలనూ, ఇతర లేబరేటరీ పరికరాలనూ సిద్దం చేశాడు. జగదీష్‌ తన గెస్ట్‌హౌస్‌లోనే ప్రయోగశాలను ఏర్పాటుచేశాడు. తాను కనిపెట్టబోయే మందుకోసం పగలూ రాత్రీ నిర్విరామంగా ఎన్నో గ్రంథాలు చదువుతున్నాడు. ఇంకా మరెన్నో మెడికల్‌ మ్యాగజైన్లు కూడా రిఫర్‌ చేస్తున్నాడు. ఇప్పుడు గెడ్డాలు, మీసాలు బాగా పెరిగిపోయి అసలు ఎవరు గుర్తుపట్టలేనటువంటి వ్యక్తిగా మారిపోయాడు సైంటిస్ట్‌ ప్రజాపతి.
‘‘ఇంకా ఎంతకాలం ఇలా కాలయాపన చేస్తావ్‌? అని కోపంతో సైంటిస్ట్‌ చెంప చెళ్లుమనిపించాడు జగదీష్‌. ఈ అనూహ్య చర్యకు ప్రజాపతి స్పృహ తప్పి కిందపడిపోయాడు. అతను తిరిగి కోలుకునే సరికి రెండు రోజుల సమయం పట్టింది. మీరు కొట్టిన దెబ్బలు సైంటిస్ట్‌ మెదడుమీద తీవ్ర ప్రభావం చూపించాయని డాక్టర్‌ సుధాకర్‌ నిర్ధారించాడు.
మొత్తానికి రెండు రోజుల తరువాత సైంటిస్ట్‌ మళ్ళీ చురుకుగా ప్రయోగాలు చేయటంతో, హమ్మయ్యా నన్ను బతికించావు దేవుడా! అని ఊపిరి తీసుకున్నాడు జగదీష్‌.
ప్రజాపతీ! నేను చెపుతున్నది జాగ్రత్తగా విను. ఇప్పుడు నీవు తయారుచేయబోయే మందు తీసుకున్నవాళ్లకు పూర్తిగా మతిమరుపు వ్యాధి వచ్చేయాలి. దానితోపాటు మందు స్లో పాయిజన్‌ లాగా కూడా పనిచేయాలి. అది కళ్లెర్ర జేసి బెదిరించటంతో భయపడిపోయాడు పాపం సైంటిస్ట్‌ ప్రజాపతి. కానీ ప్రభుత్వం నుండీ అనుమతి లేకుండా మరియూ ‘‘ప్రాణ హానికరమైన మందులు తయారుచేయటం చట్టరీత్యా నేరం’’ అని చెప్పినందుకే ప్రజాపతిని చిత్రహింసలకు గురిచేస్తున్నానడు జగదీష్‌.
సైంటిస్ట్‌ ప్రయోగాలు చేయటం మొదలుపెట్టి సుమారు సంవత్సరకాలం కావస్తోంది. అందుకే జగదీష్‌ జుట్టు పీక్కుంటున్నాడు. అసహనంతో రగిలిపోతున్నాడు. చివరికి సైంటిస్ట్‌ని చిత్రహింసలకు గురిచేయటం ప్రారంభించాడు.
‘‘ప్రజాపతీ! నేను చెప్పినట్లు త్వరగా ఆ మందును, ఫార్ములానూ వెంటనే కనిపెట్టకపోతే నీ తాట తీస్తాను, చంపేస్తాను’’ అర్థమయ్యిందా! అని కోపంతో జగదీష్‌ ఊగిపోతున్న సమయంలో ప్రజాపతి భార్య ప్రసన్నాదేవి లేబరేటరీలోనికి ఆదుర్ధాగా ప్రవేశించింది.
నీచుడా! నా భర్తను నిర్భంధించి ఇలా చిత్రహింసలకు గురిచేస్తూ ఆయనచేత ప్రాణాంతక ప్రయోగాలు చేయిస్తున్నావా! అంతేకాకుండా ప్రాణాంతకమైన మాదకద్రవ్యాలను, నకిలిమందులను తయారుచేయిస్తున్నావు. నువ్వు సర్వనాశనమైపోతావు. నువ్వొక దేశద్రోహివి. ప్రతీ నెలా నీ మనుషులు మా ఇంటికి వచ్చి ఇచ్చింది ఇలాంటి పాపిష్ఠి సొమ్మా! అంటూ ఉగ్రరూపం దాల్చిన ప్రసన్నాదేవి జగదీష్‌పై ఆగ్రహంతో విరుచుకుపడిరది.
శభాష్‌ ప్రసన్నాదేవిగారు! అసలు నేనే మిమ్మల్ని తీసుకురమ్మని చెపుతామనుకున్నాను. కానీ ‘‘వెతకిపోయిన తీగ కాలికి తగిలినట్లు మీరే వచ్చేశారు’’. ఇక్కడున్న దృశ్యాన్ని కళ్ళారా మీరే స్వయంగా చూశారుగా!
వెంటనే అతని అనుచరులు అక్కడున్న సైంటిస్టుని అతని భార్యనూ సీరియస్‌గా చూస్తూ రివాల్వర్లతో కవర్‌ చేశారు.
మేడమ్‌ ప్రసన్నాదేవిగారూ! నాకు కావలసిన మందును, ఫార్ములానూ త్వరగా తయారుచేసి నాకిచ్చేస్తే, అక్షరాల కోటి రూపాయల బహుమానంతో ఇదిగో ఇప్పుడే మీవారినీ మీతోపాటు ఇంటికి క్షేమంగా పంపించేస్తాను ఆవేశంగా అరిచాడు జగదీష్‌. వెంటనే ఆమెను కూడా బంధించారు జగదీష్‌ అనుచరులు.
* * *
చక్రవర్తికి కూడా వయసుతో వచ్చే సహజమైన కోరికలు చాలా ఉండేవి. ఒకరోజు అదే పనిమీద రెడ్‌లైట్‌ ఏరియాకి వెళ్ళాడు. అక్కడ కూడా చక్రవర్తికి ఎదురు దెబ్బ తగిలింది. పోలీసుల రైడిరగ్‌లో దొరికిపోయాడు.
ఇదేం న్యాయం? అమ్మాయిల్ని వదిలేసి కేవలం విటులనే అరెస్టులు చేయటం, వారికే శిక్షలు వేయటం ఏమిటి? ఇది ముమ్మాటికి అధర్మం! అని ధర్నా చేశాడు. దాంతో చక్రవర్తికి నెలరోజులు జైలుశిక్ష పడిరది.
అసలు ఈ రోజుల్లో బ్రతుకే ఒక సమస్యగా మారిపోయింది. ‘‘తాను దూర సందు లేదు, మెడకో డోలా!’’ అన్నట్లు ఇక పెళ్లి చేసుకోవటం ఎందుకు? అని డిసైడ్‌ అయిపోయాడు. తనకు సంసారంతో పనిలేదు కాబట్టి చిన్న ఇల్లు కట్టేద్దాం అని దీర్ఘంగా ఆలోచిస్తూ మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారి ఫోటోని చూస్తూ నిద్రలోకి జారుకున్నాడు చక్రవర్తి. ఎందుకో అతనికి మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారు వంటి గొప్ప ఇంజనీర్‌ కావాలనే కోరిక చాలా బలంగా ఉంది. మరి ఇంజనీర్‌ కావాలంటే బాగా చదువుకోవాలి కదా! దానికి ఎంతో డబ్బు కావాలి! ఏం చేస్తాం? నా తల్లిదండ్రులకు కూడా నన్ను విడిచివెళ్లిపోయారు అంటూ నిట్టూర్పుతో ఇంజనీర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారి ఫోటోని చూస్తూ కన్నీళ్ళు పెట్టుకునేవాడు. అందుకే అమ్మానాన్న ఫోటోలతోపాటు ఆ మహానీయుడి ఫోటోకు కూడా రోజూ నమస్కరించి తన దినచర్యలు ప్రారంభించసాగాడు చక్రవర్తి.
నాకు ఆరు గజాల భూమి కావాలి అని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిని అడిగాడు చక్రవర్తి. ‘‘ఆరు గజాలు భూమి కావాలంటే స్మశానంలో మాత్రమే దొరుకుతుంది’’ అని కోపంతో ఊగిపోయాడు రియల్టర్‌ రాజబాబు
మీకు కావలిస్తే మార్కెట్‌ రేటు కంటే డబుల్‌ ఇస్తాను. నాకు ఆరు గజాల ప్లాటు కావాలని అతనితో గొడవ పెట్టుకున్నాడు. నేనే కాదయ్యా ఈ దేశంలో ఎక్కడికిపోయినా ఆరు గజాల ఇంటి స్థలాన్ని ఏ ఒక్కరూ నీకు అమ్మరు గాక అమ్మరు! అని సూటిగా చెప్పేశాడు రియల్టర్‌ రాజబాబు.
దాంతో చక్రవర్తి కోర్టును ఆశ్రయించాడు. వ్యాపారం చేసేవాళ్ళు కొనుగోలుదార్లకి కావలసినంత స్థలం అమ్మాలని కోర్టు తీర్పు ఇచ్చింది. అయినా ఆరుగజాల స్థలంలో నువ్వు ఇల్లు ఎలా కడతావని జడ్జిగారు చక్రవర్తిని ప్రశ్నించాడు.
సార్‌! మిలార్డ్‌! నేను కొనుకున్న ఆరు గజాల స్థలంలో మూడు అంతస్తులు కడతాను. మూడవ అంతస్తులో నా బెడ్‌రూమ్‌తోపాటు వంటగది ఉంటుంది. రెండవ అంతస్తులో వాష్‌రూమ్‌ ఉంటుంది. ఇక మొదటి అంతస్తులో నేను చచ్చిపోతే నా సమాధి ఉంటుంది. నాకు అప్పుడు స్మశానాల సమస్య కూడా ఉండదని చెప్పాడు. ఇక లాయర్‌కు ఫీజు ఇవ్వలేకే తన కేసును తానే వాదించుకుంటున్నాననీ, అలాగే కట్టబోయే ఇంటి ప్లాన్‌ కూడా తానే వేసుకున్నాననీ, ఆయనా తాపీ మేస్త్రి చేతనే ఇల్లు కట్టిస్తానని కోర్టుకు సవినయంగా తెలియజేశాడు గరీబ్‌ చక్రవర్తి.
చక్రవర్తి లాజికల్‌ రీజనింగ్‌ని మెచ్చుకొని అతన్ని అభినందించాడు జడ్జ్‌. అయితే నీ ఇంట్లోనే సమాధి కట్టటం చట్టరీత్యా నేరం అని చెప్పి మొదటి అంతస్తులోనే కిచెన్‌ కమ్‌ డైనింగ్‌ రూముగా కట్టుకో! అని మొట్టికాయలు వేసింది న్యాయస్థానం.
సార్‌! ఇప్పుడు నేను అమీర్‌ చక్రవర్తిెనైపోయాను సార్‌! అని ఆనందంతో కేరింతలు కొడుతూ జడ్జ్‌గారితో సహా కోర్టులోని వారందరికీ దండాలు పెట్టాడు చక్రవర్తి.
* * *
యాహూ! యురేఖా! యాహూ! నేను సాధించాను. నేను కనుగొన్నాను. ప్రపంచంలో అందరికన్నా నేనే గొప్ప సైంటిస్టుని అంటూ ప్రయోగశాలలో బ్రహ్మానందంతో పరుగులు తీస్తుండగా అప్పుడే లోపలికి వస్తున్న జగదీష్‌ని ఢీ కొట్టాడు. దాంతో ఆయన కాస్తా బోర్లా పడిపోయాడు.
ఓరి నీ తస్సాదియ్యా! ఇదంతా నీ ఆనందమా! ఇంతకీ ఏం సాధించావో త్వరగా చెప్పి ఆ ఫార్ములా పేపర్లు నాకిచ్చేయ్‌ అంటూ ఉబ్బి తబ్బిబ్బైపోయాడు జగదీష్‌.
ఇదిగో ఇటు చూడండి ఇనది యస్‌.యమ్‌.టి. అనే మందు. అంటే ‘‘స్మార్ట్‌ మెడిసన్‌ టానిక్‌’’ దీని ఖరీదు లక్ష రూపాయలు. ఈ టానిక్‌ ఒక బాటిల్‌ మందును వాడిన వారికి పూర్తిగా మతిమరుపు వ్యాధి వచ్చేస్తుంది. అంతేకాదు ఈ మందు మీరు చెప్పినట్లు స్లో పాయిజన్‌ లాగా పనిచేస్తుంది. మీ దగ్గర అప్పులు తీసుకున్నవారి మీద ఇది ప్రయోగించవచ్చును. వారి ఆస్తులు,డబ్బులు మీ పేరు మీద వ్రాయించుకోవచ్చును అని చెప్పి ఆనందంతో గంతులు వేశాడు సైంటిస్ట్‌ ప్రజాపతి.
వెంటనే సైంటిస్ట్‌ చేతుల్లోంచి ఫార్ములా పేపర్లు లాగేసుకుని సైంటిస్ట్‌ ప్రజాపతిని క్రూరంగా కాల్చి చంపేశాడు కలియుగ రాక్షసుడు జగదీష్‌!
రక్తపు ధారలతో తడిసిపోయిన ప్రజాప్రతిని సైంటిస్ట్‌ జగదీశ్‌ అనుచరులు అతి క్రూరంగా అక్కడి నుండీ ఈడ్చుకుంటూపోయి ట్రక్కులో పడేశారు. పోతూ పోతూ గోడౌన్‌ నుంచి మూడు గోనె సంచుల డబ్బుల మూటలు కూడా గుట్టుచప్పుడు కాకుండా మోసుకొచ్చి ప్రజాపతి డెడ్‌బాడీ కనిపించకుండా గోనెసంచులతో కప్పేశారు. ఎందుకంటే తక్కువ జీతం ఇచ్చి అతి కిరాతకమైన వెట్టిచాకిరీ పనులు చేయించుకున్న యజమాని జగదీశ్‌పై కక్షతో. ‘‘ఒరేయ్‌! మన బాస్‌గాడికీ కరెక్ట్‌గా పవర్‌ఫుల్‌ డోస్‌ ఇచ్చాము కదూ! అని చీర్స్‌ కొట్టి విస్కీలో మునిగిపోయారు. అయినా మన బాస్‌కి కావలసిన ఫార్ములా పేపర్లు, రానే వచ్చాయిగా! వీడిని ఇంకా కాల్చటం, పూడ్చటం ఎందుకు? డబ్బులు దండగ! అని అర్ధరాత్రి ఊరి బయటకు తీసుకెళ్లి నిర్మానుష్య ప్రదేశంలో పడేసిపోయారు.
అప్పటివరకూ ఊపిరి బిగపట్టి మరణించినట్లు నటిస్తున్న ప్రజాపతికి వెంటనే ప్రాణం వచ్చినట్లయింది. వెర్రిమాలోకాలు నేను చచ్చిపోయాను అనుకున్నారు. అసలు నేను బుల్లెట్‌ ప్రూఫ్‌ జాకెట్‌ వేసుకున్నట్లు ఈ కుర్ర నాగన్నలకు తెలియదుగా! అని తనలో తానే నవ్వుకుంటూ పైకి లేస్తుండగా, సరిగ్గా అప్పుడే కూతురు సుప్రజ వచ్చి తండ్రిని కారులో ఎక్కించుకుని సురక్షితంగా ఇంటికి తీసుకువెళ్ళింది.
నాన్నా! మరి మీ గుండెల్లోంచి అలా రక్తం ధారగా ఎలా వచ్చింది? అని ఎంతో ఆసక్తితో అడిగింది కూతురు సుప్రజ. చూడు సుప్రజ నేను సైంటిస్ట్‌ని, పైగా మీ నాన్నని, తెలివైనవాడిని కూడా. రక్తం ధారగా వచ్చేందుకు ఒక కెమికల్‌ ట్యూబ్‌ని కన్పించకుండా ఏర్పాటు చేసుకున్నాను. నాకు తెలుసు ఏ క్షణంలోనైనా జగదీష్‌ నన్ను చంపేస్తాడని! అందుకే తెలివిగా ఈ ప్లాన్‌ చేశాను! అని అంటుండగా! అందుకే మీరు ఇంకొక జిలేబి తినాలి అంటూ వడ్డించింది భార్య ప్రసన్నాదేవి. ఒకటికాదోయ్‌ రెండు జిలేబీలు వడ్డించవోయ్‌ ప్రసన్నా అంటూ ప్రేమతో ఆ రోజు లంచ్‌ని హాయిగా ఆనందంగా ముగించారందరు.
ఐటి కంపెనీలో ఉద్యోగం చేస్తున్న సుప్రజ సమాజసేవ చేస్తు ఒకరోజు గరీబ్‌ బస్తీలో చక్రవర్తికి బట్టలు, దుప్పట్లోతోపాటు ఆహార పదార్థాలు అందజేసింది. ఆ రోజు అతనిని గమనించింది, అతనిలో ఏదో ప్రత్యేకత ఉందని గ్రహించింది. దానికి ముఖ్యమైన కారణం చక్రవర్తి సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య చిత్రపటాన్ని చూస్తూ కూర్చోవటమే.
అప్పటి నుండీ చక్రవర్తిని తరచు కలుస్తూ ఉండేది సుప్రజ. అతని ఆలోచనలను, ఆశయాలను అక్షర రూపంలోనికి తీసుకు వచ్చింది. ఎందుకో మరి సుప్రజతో పరిచయం వలన చక్రవర్తి జీవనంలో కొంగ్రొత్త చిగురుటాశలు అంకురించాయి. వారిద్దరి ప్రేమాలతగా వెనకేసుకుపోతోంది.
చక్కూ! కంగ్రాట్స్‌ లేషన్స్‌! వచ్చేవారం అమ్మా నాన్న నువ్వు నేనూ అందరం కలిసి ఢల్లీి వెళుతున్నం అంటూ అమితానందంతో చక్రవర్తిని హత్తుకుపోయింది సుప్రజ.
అసలు ఇదంతా ఏమిటీ అంటూ ఉక్కిరి బిక్కిరైపోయాడు చక్రవర్తి. పొల్యూషన్‌ నివారణకు నీవిచ్చిన పరిష్కార సూచనకు నీకు ప్రధానమంత్రిగారు అవార్డు ఇవ్వబోతున్నారు. అంతేకాదు, నీతోపాటు నాక్కూడా అవార్డు వస్తోంది తెలుసా! అని సుప్రజ చెప్పేసరికి చక్రవర్తి అమితానందభాష్పాలతో ఉక్కిరిబిక్కిరయ్యాడు.
ఒక్కసారిగా అమ్మా నాన్ననూ, సర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారిని స్మరించుకున్నాడు చక్రవర్తి.
అపరిశుభ్రతో విజృంభించే అంటువ్యాధులు రాకుండా ‘‘స్మార్ట్‌మెడిసిన్‌ టానిక్‌’’ కనిపెట్టిన సైంటిస్ట్‌ ప్రజాపతిని అవార్డుతోపాటు పదిలక్షల నగదు పురస్కారంలో సన్మానించారు ప్రధానమంత్రి.
పెట్రోల్‌, డిజిల్‌ మోటార్‌ వాహనాలు వాడకంతో వచ్చే కార్బన్‌మోనాక్సైడను బయటకు రాకుండా ప్రతీ వాహనానికి ఒక సిలెండర్‌ ఏర్పాటు చేసుకోవచ్చుననే అద్భుతమైన పరిశోధనకు చక్రవర్తిని అవార్డుతోపాటు, పదిలక్షల రూపాయలు నగదు పురస్కారంతో సన్మానించారు ప్రధానమంత్రి.
దోమలను, అంటువ్యాధులను తక్షణమే నివారించటానికి చెత్త, చెదారములను ‘‘ప్రతిరోజు శుభ్రపరచండి, చెత్తను తక్షణమే తరలించండి’’ అనే స్పాట్‌ పేమెంట్‌ ప్లాన్‌ అచరణయోగ్యంగా ఉందని సుప్రజను పురస్కారంతో సన్మానించారు ఆరోగ్యశాఖామంత్రి.
మానవ కళ్యాణానికి కోసం మరియు అభివృద్ధికి మాత్రమే పరిశోధనలు, ఆవిష్కరణలు చేయాలని, అంతేకాని వినాశకర ప్రయోగాలను చేసేవారిని ప్రభుత్వం తప్పకుండా శిక్షిస్తుంది అని ప్రధాని హితవు పలికారు.
జగదీశ్‌ చేపట్టిన మానవ వినాశకర, దురాలోచన ప్రయోగాలకు రెండు సంవత్సరాలు జైలుశిక్ష పడిరది.
అసలు పెళ్ళే చేసుకోనన్న చక్రవర్తి సుప్రజ ప్రేమలో పడ్డాడు, అలాగే ఆమె వద్ద కడుపునిండా చదువుకున్నాడు.
తన జీవితంలో ఇల్లే కట్టలేమన్న చక్రవర్తి ఇల్లు కూడా కట్టుకున్నాడు, ఒక ఇంటివాడయ్యాడు. చక్రవర్తి సుప్రజల కళ్యాణం ఎంతో వైభవంగా జరిగింది. ఇది చాలా అరుదైన, ఆదర్శమైన కళ్యామని ప్రశంసించారు ప్రముఖులు మరియు పెళ్ళివారు.
ఇది ‘‘స్మార్ట్‌మెడిసన్‌ టానిక్‌’’ దీని ఖరీదు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే! ఇది జనరల్‌ టానిక్‌. ఆరోగ్యం కోసం అందరూ త్రాగవచ్చు అని చెప్పి టానికి బాటిల్‌ని అల్లుడు చక్రవర్తికి కానుకగా అందించారు ప్రసన్నదేవి, ప్రజాపతి దంపతులు.
పెళ్ళివారే సాక్షాత్‌ కళ్యాణదేవతలై సుమాక్షతలతో ఆశీర్వదించారు.
‘‘ప్రజాహితమును కోరినవాడే ప్రజాపతి.’’

May 29, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

“స్వయంసిద్ధ – ఒక అభినేత్రి జీవనరేఖ”

by Dr. Maramraju Venkata Manasa May 29, 2025
written by Dr. Maramraju Venkata Manasa

రచన (అనుసృజన): శ్రీమతి శ్రీదేవీ మురళీధర్

ఒక మహిళ జీవితచరిత్రను మరొక మహిళ రచిస్తేనే అది రుచిస్తుంది అని నిశ్చితంగా రుజువు చేసిన రచన “స్వయంసిద్ధ – ఒక అభినేత్రి జీవనరేఖ”. ముఖ్యంగా శ్రీదేవీ మురళీధర్ గారి భాషా ప్రయోగం, సరళమైన రచనా శైలి, సూటిగా విషయాన్ని తెలియచెప్పే ధోరణి నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒక అసామాన్య ఆదర్శ జీవితాన్ని లిఖిత పూర్వకంగా సమాజానికి అందజేసిన శ్రీదేవీమురళీధర్ గారికి మన: ప్రీతి శుభాభినందనలు.

“రేఖ…” చలనచిత్ర పరిశ్రమలో ఐదు దశాబ్దాల కాలం నుంచి సంచలనాత్మక నటిగా మార్మోగుతున్న పేరు. తనదైన ప్రత్యేక శైలిలో అభినయ నైపుణ్యం గల అపూర్వమైన అభినేత్రిగా చలామణీ అవుతున్న పేరు. మొదట అయిష్టంగా అనివార్య కారణాల వల్ల చలనచిత్ర రంగంలోకి అడుగుపెట్టినా, సునాయాసంగా దుష్ట ప్రవృష్ట లోకపు చర్యల ద్వారా విషయాలను గ్రహిస్తూ, వాటికి తగ్గట్టు మెసులుకుంటూ రాటుదేలి రాణించిన మహిళగా గుర్తింపును కైవసం చేసుకున్న కథానాయిక. ‘ మహిళా సాధికారత ‘ కు ఈమె చరిత్ర ఒక ఉదాహరణ. ‘ సాధికారత ‘ మాట చిన్నదేగాని దాని వెనుక దశాబ్దాల లేదా జీవితకాలపు శ్రమ దాగివుంటుంది అని చెప్పటంలో “స్వయంసిద్ధ” నిర్ధిష్టమైన తార్కాణం. రేఖకు చిన్న ప్రాయంలోనే పెద్ద కూతురిగా కుటుంబ బాధ్యతలు మీదవేసుకోవలసి వచ్చింది. Elder daughter syndrome!! ఆమె ఉన్న చలనచిత్ర రంగంలోనే అప్పటికే  ఘనకీర్తి సంపాదించుకున్న తండ్రి జెమినీ గణేశన్ ఉండి కూడా యే రకమైన సెలబ్రిటీ ఇన్ఫ్లుయెన్స్ తన పై పడలేదు సరికదా ఆమె నిస్సహాయ స్థితిని, ఒంటరితనాన్ని ఆసరా తీసుకుని వారివారి స్వార్థానికి వాణిజ్య కోణంలో ఉపయోగించుకున్నారు. ఇంతటితో ఆగకుండా ఆమెపై నిందారోపణలు మోపుతూ మీడియా చేసిన దుష్ప్రచారం అంతా ఇంతా కాదు. అయినప్పటికీ అన్నీ భరించి అనుభవజ్ఞురాలిగా పరిణితి చెందింది. ఎవరి అంచనాలకూ అందని ఒక ఋషిక గా స్వశక్తితో ఆవిర్భవించింది.

అయితే, రేఖ ప్రముఖ నటి కాబట్టి ఆమె జీవితపు వెలుగు నీడలు బయటికి చర్చించుకునే అంశాలైనాయి. ఇట్లా బయటకు రాకుండా ఆటుపోట్లను అనుభవిస్తూ జీవితాలను సాగిస్తున్న మహిళలు ఎంతో మంది. తరాలు మారుతున్నా సమాజంలో పురుషాధిక్యత మాత్రం కనుమరుగు అవ్వటం లేదు. ఇక మీద కూడా అవ్వదు అనే నా అభిప్రాయం. కనుక మహిళలు ధీటైన వారిగా నిలదొక్కుకోవడానికి అధికంగా కృషి చేయాల్సి వస్తుంది. ఏ విషయంలోనూ మహిళలు పురుషులకంటే తక్కువ కాకున్నా ఏదో రకంగా మాటలు పడవలసి వస్తుంది. మరి ఇటువంటి పరిస్థితులలో మహిళలు విచక్షణా జ్ఞానం తో ఆలోచించి తమకు సానుకూలంగా ప్రతీదీ మలుచుకునేటట్టు చాకచక్యంగా వ్యవహరిస్తూ జీవితాలను చక్కబెట్టుకోవాలి. కుదరకపోతే అన్నిటినీ నిష్క్రమించి,  మనశ్శాంతి కలిగించే జీవితాన్ని ఎంచుకోవాలి. దీనికి రేఖ వంటి మహిళల చరిత్రలు ఆదర్శప్రాయాలు.

మూడక్షరాల ‘ జీవితం ‘ చాలా విలువైనది, వెలకట్టలేనిది. దానికి రెండక్షరాల ‘ ప్రేమ ‘ ను జోడిస్తే ఆ జీవితము స్వర్గసీమ! స్వచ్ఛమైన ప్రేమ కోసమే తపించింది రేఖ. ఎంత ప్రయత్నించినా తల్లి తప్ప మరెవ్వరి నుంచీ పొందలేకపోయింది. తల్లితండ్రుల నుంచి తప్ప ఇంకెవరి నుంచి మాత్రం ఆశించగలం? కనుక ఆమె నిశబ్దంగా గాంభీర్యంగా హుందాగా తనకు ఇష్టంగా ఆరోగ్యంగా జీవిస్తున్నది. రేఖ జీవితం పురుషులకూ ఆదర్శం. సానపట్టు పడితేనే కదా వజ్రం మెరుస్తుంది. ఇప్పుడు కష్టనష్టాలను అనుభవిస్తున్నామంటే , తరువాత సుఖసంతోషాలను అనుభవించడానికే అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు కూడా చెబుతాడు. ఇదే అంశం రేఖ చరిత్రలో కూడా ప్రస్ఫుటంగా కనబడుతుంది. పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నట్టు ఆమె ఎన్ని సమస్యలు ఎదుర్కున్నా , కీకారణ్యం లాంటి పరిశ్రమలో తనదైన రీతిలో నిలదొక్కుకున్నది వాస్తవం. ఎన్నెన్నో ప్రముఖ అవార్డులు రివార్డులు తన సొంతం చేసుకుంది. ఇప్పుడు ఎవరికీ అందని, ఎవరూ సూటిగా చూడలేని సూర్యుడిగా వెలుగుతుంది. ఆమె జీవితం ఒక గుణపాఠం. కనుక ఆమె ” స్వయంసిద్ద” .

పుస్తకం:  “స్వయంసిద్ధ – ఒక అభినేత్రి జీవనరేఖ”

రచన (అనుసృజన): శ్రీమతి శ్రీదేవీ మురళీధర్

ప్రచురణ: వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా

ప్రతులకు రచయిత్రిని మెసెంజర్ ద్వారా సంప్రదించగలరు (https://www.facebook.com/sridevi.muralidhar.9)

May 29, 2025 0 comment
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni May 29, 2025
written by Narendra Sandineni

సునీత గంగవరపు బ్రతుకు పుస్తకం కవిత
ప్రముఖ కవయిత్రి,సునీత గంగవరపు ప్రభుత్వ పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నారు.కవితలు,కథలు,రాస్తున్నారు.వివిధ పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.ప్రభుత్వపాఠశాలలో విద్యార్థులతో కూడా అప్పుడప్పుడు కథలు, కవితలు రాయిస్తూ సాహిత్య సృజన పట్ల మెళుకువలు నేర్పిస్తున్నారు.సునీత గంగవరపు కలం నుండి జాలువారిన “బ్రతుకు పుస్తకం’ కవితపై విశ్లేషణా వ్యాసం.ఈ కవితను ఆసక్తితో చదివాను. నాకు చాలా నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.బ్రతుకు పుస్తకం ఏదైనా పుస్తకాన్ని చదవాలి అనే ఆసక్తిని కలిగించే అంశం.పుస్తకాలకి రెక్కలు ఉండవు.కాని వాటిని చదివితే మనకు ఎన్నెన్నో రెక్కలు మొలిచినట్లుగా ఉంటుంది.ఆ రెక్కలు జ్ఞానాన్ని,ఆలోచనా శక్తిని,సృజనాత్మకతా నైపుణ్యాన్ని,లోక పరిశీలనా దృష్టిని కలిగిస్తాయి. ఏది మంచి పుస్తకం.ఏ పుస్తకాన్ని చదవాలి అనే ఆసక్తిని కలిగించే అంశం.
“బ్రతుకు పుస్తక పుటల నుండి/ఎన్ని అనుభూతుల రంగులో…/ఎన్నెన్ని అనుభవాల పరంపరలో…!/ అంటున్నారు.బ్రతుకు అంటే జీవితపు కొనసాగింపు. బ్రతుకు అంటే జీవితమంతా ఒక పనిలో ముందుకు సాగిపోవుట.పుట అనగా పుస్తకంలోని కాగితమునకు ఒకవైపు భాగం.పుట అంటే కాగితం, పేజీ,అర్థాలు.అనుభూతి అంటే స్పర్శ చేత తెలుసుకొను,తాకి తెలుసుకొను,అనుభవం ద్వారా తెలుసుకొనడం..
“ఎన్ని అనుభూతుల రంగులో…/అంటున్నారు.
బ్రతుకు పుస్తకం పుటల్లో అనుభూతులు,బాధ, దుఃఖం,ఆలోచన,ఆవేదన,ప్రేమ,అభిమానం, అనుమానం,స్నేహం లాంటి ఎన్నో రంగులు పులుముకుంటాయని కవయిత్రి సునీత తెలియజేస్తున్నారు.
“ఎన్నెన్ని అనుభవాల పరంపరలో…/అంటున్నారు.
బ్రతుకు పుస్తకపు పుటల్లో అనుభవాల పరంపర అంటే అనుభవాల అంతరాయం లేని,కొనసాగింపు అని అర్థమవుతుంది.
“కలలతోనే… కన్నీళ్ళతోనే/నిండిన పేజీలు/ అంటున్నారు.బ్రతుకు పుస్తకపు పుటల్లో కలలతో నిండిన పేజీలు ఉంటాయి.కలలను సాకారం చేసుకునేది ఎందరు అంటే ఇదమిద్దంగా చెప్పలేము. కలలు కల్లలు అయిన వాళ్లు కూడా ఉంటారు. బ్రతుకు పుస్తకం పుటల్లో కన్నీళ్ళతో నిండిన పేజీలు ఉంటాయి.కన్నీళ్లు కావాలని ఎవరు కోరుకోరు. తనకు తాను తెలియక ఆగాధంలో కూరుకు పోవడంతో కన్నీళ్లు వస్తాయి.తెలిసి అగాధంలో పడిపోయిన వాళ్ళు కొందరు ఉంటారు. స్వయంకృతాపరాధాలతో చేసిన కొన్ని పనులు, మనిషిని కన్నీళ్ళకు గురిచేస్తాయి. .


“అక్షరాల కందని దుఃఖ సంకేతాలు/అంటున్నారు.
కొన్ని ఉద్విగ్న క్షణాల్లో తెలిసి తెలియక మోసపోయిన అభాగ్యులు కూడా కొందరు ఉంటారు.జీవితంలో అక్షరాల కందని దుఃఖ సంకేతాలు ఉంటాయని కవయిత్రి సునీత తెలియజేస్తున్నారు. “పేజీలన్నీ ఒకేలా ఉండవు/అంటున్నారు. నిజమే…బ్రతుకు పుస్తకం చాలా పెద్దది.బ్రతుకు పుస్తకం పుటల్లో ఎన్నో పేజీలు ఉంటాయి.పుస్తకం లోని పేజీలన్నీ ఒకేలా ఉండవు,వేరు వేరుగా ఉంటాయని కవయిత్రి సునీత తెలియజేస్తున్నారు.
“వేటికవి సొంత రంగుల్ని పులుముకుంటాయి/ అంటున్నారు.జీవితం భిన్న స్వభావాల పార్శ్వం. బతుకు పుస్తకపు పుటలు సొంతరంగులని అద్దుకుంటాయి అనడంలో వాస్తవం దాగి ఉంది.
“నిగూఢతను ఆర్ద్రంగా పొదువుకుంటాయి/ అంటున్నారు.నిగూఢత అంటే రహస్యం.ఆర్ద్రం అంటే మెత్తదనం.బ్రతుకు పుస్తకం పుటల్లో రహస్యాలు కూడా మెత్తదనంతో దాచుకుంటాయి అని తెలియజేస్తున్నారు.
“కొన్ని పేజీల్లో మెరుపులు ఉంటాయి/అంటున్నారు.
నిజంగానే బ్రతుకు పుస్తకం పేజీల్లో మెరుపులు ఉండి ప్రకాశిస్తుంటాయి.వర్షించే ముందు ఉరుములు, మెరుపులు,గాలి దుమ్ము, దుమారం,వీస్తుంటాయి. మెరుపు ఒక వాతావరణంలోని విద్యుత్ ప్రవాహం మూలంగా ఏర్పడే దృగ్విషయం.విద్యుత్తు ఉన్నదని నిరూపించేది.ఇవి ఎక్కువ ఉరుములతో కూడిన వర్షంలో పడే సమయంలో కనిపిస్తాయి.మెరుపులు అత్యంత వేగంగా పయనిస్తాయి.మెరుపు రెండు మేఘాలు ఢీకొన్నప్పుడు వచ్చే ప్రకాశవంతమైన మెరుపు.
“అవి దిగులు మేఘాలను కరిగించి/పారవశ్యాన్ని వశీకరించుకుంటాయి/అంటున్నారు.జీవితంలో మెరుపులు ఉండాలి.మెరుపులు ఉంటేనే అవి దిగులు మేఘాలను కరిగించి పారవశ్యాన్ని వశీకరించుకుంటాయి.పారవశ్యము అంటే ఆత్మ ద్వారా ఒకరి శరీరాన్ని స్వాధీనం చేసుకోవడం, దైవత్వం ద్వారా మానవుని స్వాధీనం చేసుకోవడం. మట్టిని గురించి మనం మాట్లాడుతాం.మట్టిని చూడగానే ఏదో పులకరింత,మరేదో పారవశ్యం అంటాం.జీవితంలో సుఖదుఃఖాలు,శీతోష్ణాలు ఉంటాయి.బ్రతుకు పుస్తకం పుటల్లో వాటిని సమం చేసుకుంటేనే దిగులు మేఘాలను కరిగించి పారవశ్యాన్ని చేరుకుంటాయి.
“అక్కడక్కడ సునామీలు ఉంటాయి/రాయక తప్పని చేదు సారాంశాలుంటాయి/అంటున్నారు.
బ్రతుకు పుస్తకం పుటల్లో అక్కడక్కడ సునామీలు తుఫానులు కూడా ఉంటాయి.సునామీ తుఫాను 2004 డిసెంబర్ 26 న హిందూ మహాసముద్రం, సుమత్ర, ఇండోనేషియా దేశాలకి దక్షిణ తీరం కేంద్రంగా ఏర్పడిన సునామి 14 దేశాల్లో సుమారు
2,30,000 మందిని పొట్టన పెట్టుకుంది.అక్కడక్కడ
ఎదిరింప శక్యం కాని కష్టాలు,కడగండ్లు,సునామీలు
ఉంటాయి.రాయకుండా ఉండలేని,ఆత్మీయులకైన చెప్పుకోలేని,చేదైన సంఘటనల వివరాలుంటాయి. జీవితమన్నప్పుడు ఎలాంటి వారికైనా ఇవి అనుభవానికి రాక తప్పదు.
“ఒక్కో చోట/సూర్యకిరణాల ప్రసరణలుంటాయి/
అంటున్నారు.బ్రతుకు పుస్తకం పుటల్లో ఒక్కోచోట సూర్యకిరణాల ప్రసరణలు ఉండి జీవితంలో కాంతిని,క్రాంతిని తెస్తాయి అని కవయిత్రి చక్కగా వివరించారు.
“ఆకాశమంత ఆక్రమించిన/నక్షత్రాల సన్నని గుసగుసలు కొన్ని/పుస్తకాన్ని నిండారా పరిమళభరితం చేస్తుంటాయి/అంటున్నారు.
అనంతమైన ఆకాశం నక్షత్రాలతో కూడి ఉంటుంది. బ్రతుకు పుస్తకం పుటల్లో కూడా ఆకాశమంత ఆక్రమించిన నక్షత్రాల గుసగుసలు కొన్ని పుస్తకాన్ని పరిమళభరితం చేస్తుంటాయని తెలియజేస్తున్నారు.
“ఇంకొన్ని పేజీలు ఏమిటో/ఎప్పుడు ఖాళీగానే ఉంటాయి/అంటున్నారు.బ్రతుకు పుస్తకం పుటల్లో కొన్ని పేజీలు రాయకుండా ఎప్పుడు ఖాళీగానే ఉంటాయి.నిజంగానే…. బ్రతుకులో శూన్యత, స్తబ్దత ఆవరించినప్పుడు ఎవరికి చెప్పుకోలేని ఖాళీతనం మనసును ఆక్రమించుకుంటుంది.
“ఏమి రాసినా…ఎంత రాసినా/కాగితపు గుండెలపై యిమడలేని/నిర్లిప్తతలోంచి దిగాలుగా జారి పోతుంటాయి/అంటున్నారు.
ఏమి రాశాము…, ఎంత రాశాము అన్నది ముఖ్యం కాదు.మన భావోద్వేగాలను పంచుకోవడానికి ఆప్యాయతలు పెన వేసుకోవడానికి తగిన వాతావరణం లేనపుడు జీవితం నిర్లిప్తతలోకి జారిపోతుందని కవయిత్రి సునీత చక్కగా వ్యక్తీకరించారు.
“ప్రేమ స్పర్శ లేని ప్రేమ లేఖలా/అస్పష్టతను అలుముకుని/దిక్కుతోచక దిక్కులు చూస్తుంటాయి/
అంటున్నారు.బ్రతుకు పుస్తకం పుటల్లో ప్రేమ తాలూకు స్పర్శ లాంటి అనుభూతి లేని ప్రేమ లేఖల్లో ఏం ఉంటుంది?ప్రేమలేఖల్లో అస్పష్టతతో నిండి ఉంటుంది.అస్పష్టతతో నిండి ఉన్న జీవితాలు గడిపే వారు ఎల్లప్పుడూ నిరాశ నిస్పృహలతో దిక్కుతోచక దిక్కులు చూస్తుంటారు.జీవన యానంలో అనేకమైన అనుభవాలు ఎదురవుతాయి.దుఃఖం కలిగినప్పుడు దాని ఛాయా నలుపు రంగు.సుఖసంతోషాలతో కూడిన పచ్చదనం.అన్యాయం,అత్యాచారం ఎదుర్కొన్నప్పుడు కలిగిన కోపపు ఎరుపు రంగు. అద్భుతమైన విచిత్ర దృశ్యం కనిపిస్తే విరగబడి నవ్విన తెలుపు రంగు.ఈ విధంగా బ్రతుకు పుస్తకం పేజీల నిండా అనుభవాల రంగులు దర్శనమిస్తాయని కవయిత్రి సునీత వివరించడం చక్కగా ఉంది.సునీత కలం నుండి మరిన్ని మంచి కవితా సుమాలు అందించాలని మనసారా కోరుకుంటున్నాను..

May 29, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

తీరం చేరని కెరటం

by Kondapally Neeharini May 29, 2025
written by Kondapally Neeharini

నాకు తెలుసు, నాకు తెలుసు అంటూ కాంతం నోరు నొక్కేసినప్పుడల్లా ఏదో తెలియని విజయగర్వం తలెత్తుత్తుండేది. కానీ ఇప్పుడు తెలుస్తున్నది. నాకు ఏమీ తెలియదని. ఒంటిచేత్తో సంసారాన్ని లాగుకొస్తున్నాననే అనుకున్నానుగానీ సగం భారం నాకు తెలియకుండా తానూ మోస్తుందనుకోలేదు. ఇదంత అబద్ధమైపోతే బావుండు. ఈ వారం రోజుల నరకయాతన చాలు. ‘నేను’ అంటే ఏమనుకున్నావు?’ అని కళ్ళెగరేస్తూ కాలరెగిరేస్తూంటే, తిరిగి తిరిగి చూసే కాంతం నాకు కావాలి. ఈత నేర్చిన చేపపిల్ల అన్నప్పుడల్లా ముసిముసిగా నవ్వుకుంటూ పనిలో నిమగ్నమయ్యే నా కాంతం కావాలి. నా కాంతం నాకు కావాలి’’ ఈతి బాధలంటే ఏందోయ్‌ ఇవ్వే కదా…!’ అని నేన్నప్పుడల్లా సమయస్ఫూర్తిగా సర్దిచెప్పేనా కాంతం కావాలి కాంతం కావాలి. ఇంతకన్నా ఈతిబాధే ముంటుంది. కాంతంలేని బతుకొద్దు, కాంతం కావాలి కాంతమే కావాలి.
* * *
దుర్గయ్యకు, ఒక్కగానొక్క బిడ్డ కమలమణి. రాధమ్మ తల్లి పేరునూ, దుర్గయ్య తల్లి పేరునూ ఇద్దరిదీ పేర్లూ వచ్చేలా పెట్టుకున్న పేరు.
సింగారగ్రామం పట్టణానికి దగ్గరలో ఉన్నది కాబట్టి కమలమణి చదువుకు ఆటంకం లేకుండా డిగ్రీవరకు పూర్తి చేసుకున్నది. తన బిడ్డకు మంచి సంబంధం చూసి పెళ్ళి చెయ్యాలని ఎన్నడు పోని ఊళ్ళకు పోయి, ఎప్పుడు కలవని మనుషులనూ కలిసి, వెతికి వెతికి సుధాకర్‌ను దొరకబట్టాడు. అందగాడు, యోగ్యుడు, ఆస్తిపరుడు, అయినవాడు. ఇంకేం?
‘‘తల్లీ! నీకు ఆ అబ్బాయి నచ్చాడమ్మా.’’
‘‘ఏం నాన్నా ఎందుకు ఆ అనుమానం వచ్చింది?’’ ముసిముసి నవ్వులతో కమల సమాధానం. ‘‘ఆ ఏం లేదు, ఎప్పుడూ గలగలా మాట్లాడేదానివి, నిన్నటి నుండి ఎట్లాగో అదోలా ఉన్నావు అని…’’ తండ్రి మాటలకు కళ్ళ నీళ్ళు తిరిగిన కమల ‘‘ఆయన నచ్చిండన్న సంతోషం కన్నా మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాల్సి వస్తుంది గదా అనే భయం పట్టుకున్నది నాన్నా’’ అన్నది.
ఆ మాటలకు దుర్గయ్య ఒక్కసారి తనను తాను నమ్మలేకపోయాడు. ఒక విధమైన ఆశ్చర్యము, ఒక విధమైన ఒణుకు కలిగింది. ఆడపిల్లలు అమ్మా నాన్నల దగ్గర ఎంతో ఇష్టంగా, ఎంతో ఆనందంగా గడుపుతారు. పెళ్ళి చేసుకొని మరొకరితో జీవితం పంచుకోవాలని ఉన్నా తెలియని సంకెళ్ళవో పడబోతున్నాయని భయపడ్తారు. కాని తల్లిదండ్రులకు చెప్పరు, తెలియనివ్వరు. ఇవన్నీ తెలిసిన తండ్రే దుర్గయ్య. కమలను కన్నీళ్ళను పలకరిస్తూ ‘‘తప్పదు కదా బిడ్డా….’’ గాద్గిక స్వరం. ఒక ఇక్కడ ఉండలేక వెళ్లిపోయాడు.
* * *
పెంకుటింటి ముందు పెండ చాన్పి పచ్చగా మెరిసిపోతున్నది. వాకిలంతా తెల్లని ముగ్గులు నవ్వుతున్నయి. ఆ చిన్న ఇంటికే ప్రహరీగోడ పొందికగా ఉన్నది. దానికి ద్వారతోరణంగా మామిడాకులు సాదరంగా ఆహ్వానిస్తున్నవి. పందిరి గుంజలకు బంతిపూల దండలు వేళాడుతూ అందరిని పలకరిస్తున్నట్లున్నవి. పైనుండి కొబ్బరి మట్టలూ, పెండ్లి మంటపానికి కట్టిన అరిటాకులు ఆకుపచ్చదనంతో పోటీపడ్తున్నవి. పండ్లూ ఫలహారాలు తింటూ పిల్లలు అటు ఇటూ పరుగులు దీస్తున్నారు. ఇంటిముందు చావిడిలో అందరు కూర్చోడానికి చాపలు వేసి ఉ్ననవి. అటు ఇటు ఎండదగులకుండా తడకలు కట్టున్నవి. ఇంటి గోడలపైన ప్రహరీ గోడలమీదా వేసిన బొమ్మలు, జరగబోయే పెండ్లి తాలూకు సంబరాల్ని తెలుపుత్నువి. తెల్ల సున్నం గోడకు, ఎర్రని జాజుపట్టీల రేఖా చిత్రాలు, గీతలబొమ్మలు భలే అమాయకత్వపు అందాలతో ఆకర్షిస్తున్నవి. అయ్యగారు మంత్రాలు చదువుతుంటే కొందరు పెద్దోళ్ళు చూస్తున్నారు. గణపతి పూజకాగానే ‘‘పెండ్లి పిల్లను తీసుకురావాలే’’ అని అయ్యగారు అనగానే సన్నాయి మేళం గట్టిగా వాయిస్తున్నరు. ‘‘బంగారు బొమ్మ రావేమే పందిట్ల పెండ్లి జరిగేనే….’’ కదా! ఎంత ఆశ్చర్యం. పెండ్లి కూతురు అనగానే సిగ్గుల మొగ్గయిపోయి, ఏదో కొత్త కళతో చెప్పనలవి కాని అందంతో ఉంటారు వధూవరులు. ‘‘మాంగల్యం తంతునా….’’ మనోవాక్కాయ కర్మేణా ఒకరికొకరు ఒదిగి ఉండే అద్భుత జీవన ఘట్టానికి నాంది పెళ్ళి. దుర్గయ్య, రాధమ్మలు కన్యాదానం చేయడం తమకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నారు. పెళ్ళికి వచ్చిన పెద్దలు జిలకరబెల్లం పెట్టుకున్న ఆ జంటపై అక్షతలు వేస్తున్నారు. అందరూ ఎంతో ఆసక్తితో చూస్తున్నారు. తరువాత జరుపబోయే తలంబ్రాల తంతు కోసం ఆత్రంగా చూస్తున్నారు, ఎక్కడో ఆడుతున్న పిల్లలూ బిలబిలమంటూ వచ్చి చేరిపోయారు మంటపం దగ్గర. అయ్యవారు చెప్పినట్టు ఒద్దికగా తలంబ్రాలు పోసుకున్న జంటనే ఇక పోటీపడి తలంబ్రాలు పోసుకోవడం అందరికీ ఓ సరదా. అప్పటివరకూ ఉన్న ఉద్వేగపూరిత, భయపూరిత వాతావరణం మొత్తం ఈ తంతుతో చల్లబడి, ప్రశాంతత తెస్తుంది.
పెళ్ళి భోజనాల కోసం మగపెళ్ళి వారిని పిలవడానికి చేతిలో కుంకుమ కాయ పట్టుకోని పోయినారు, పెండ్లి పిల్ల తల్లి రాధమ్మ, ఆమె వెనుక దుర్గయ్య. అక్కడ ఏడుపు వినిపిస్తున్నది, ఆడపడుచు సత్య చుట్టు బంధువులు చేరి బుజ్జగిస్తున్నారు. విషయం తెలుసుకోగా, ఆడబిడ్డ కట్నం ఇప్పుడు ఇయ్యకుంటే పెళ్ళి ఇంట్లోంచి తినకుండా పోతనంటున్నడు మా ఆయన అని! మాట ముచ్చట్లల్లో మాట్లాడుకున్న కట్నం నేను ఇచ్చేశానే అన్నాడు దుర్గయ్య. వియ్యంకుడు దగ్గరికొచ్చి, అనుకోని అవసరం బడి ఆ డబ్బులు వాడుకున్న, పంట ఇంటికొచ్చిన తర్వాత బిడ్డకు అల్లునికి పిలిచి కట్నం బెడ్దామనుకున్నాం అన్నాడు. ఇంత కష్టపడి ఇంత జేసినాక ఆడపిల్ల ఏడ్చుకుంటు పోవడమేందని ఆలోచించుకొని, దుర్గయ్యనే ఇస్తానన్నాడు. కొద్దిసేపటికి సర్దుబాటు చేస్తేగానీ అందరూ ఆనందంగా భోజనాలు చేయలేదు. అప్పుడే తెలిసింది కమలమణికి, మోయాల్సిన బాధ్యత ఉంటుంది చాలానే అని!
* * *
రామాపురంలో ఊరు పెద్దదే, లింగయ్య కుటుంబమూ పెద్దదే. ఉన్న కొద్ది పంట చేన్లతోపాటు, చేసుకునే బడిపంతులు ఉద్యోగంతో ఎట్లాగో అట్లా నెట్టుకొస్తున్నాడు. ఇద్దరు బిడ్డలు ఇద్దరు కొడుకులు. భార్య చనిపోయేవరకే ఇద్దరాడపిల్లల పెండ్లిళ్ళు చేసిండు. పెద్ద కొడుకు సుధాకర్‌ పెండ్లి హడావిడి తగ్గింది. పదిమందిల పరువు కాపాడిన దుర్గయ్యను తలుచుకుంటుంటేనే కోడలు కమలమలమణి ఛాయగిలాసతో లోపలికొచ్చింది.
చేతికున్న గోరింటాకు ఇంకా పోలేదు. కొత్త పెండ్లి పిల్ల అప్పుడే ఇంటి పని చేస్తున్నది అనుకుంటూ ‘‘ఏం సంగతులు కమలమ్మా! చిన్నబోయి ఉన్నవు, అమ్మ నాయన యాదికొస్తున్నారా ఏంది?’’ అన్నాడు కోడలితో లింగయ్య.
‘‘అయ్యో అదేం లేదు మామయ్యా!….’’ అని అక్కడే ఆగిన కోడలుతో ‘ఏందమ్మా ఏదో చెప్పబోయినవ్‌, మళ్ళీ ఆగిపోయినవ్‌, ఏందో చెప్పు’’ అన్నడు.
‘‘నేను బడిలో ఉద్యోగం కోసం పోదామనుకుంటున్న మామ… మీకు చెప్పినాంక దరఖాస్తు బెట్టుకొమ్మన్నడు ఆయన’’ అని ఆగింది. ‘‘ఉద్యోగం జేస్తవా?’’ ఆశ్చర్యంగా అంటున్న మామగారి నుండి మరిన్ని మాటలు ఆశించకుండా.
‘‘మీ కొడుకు సంపాదన సరిపోదనిగాదు, మనకున్నవి తక్కువనిగాదు గాని ఇంత చదువుకున్న ఉట్టిగానే ఇంట్ల కూచోబుద్దయిత లేదు, టీచర్‌ జాబ్‌ అయితే మంచిగుంటదని….’’ ధైర్యంగా అన్నది కమల.
‘‘సరే! మావోడు సరేనన్నాడా? ఇంటెడు చాకిరి చేసుకోనిపోయి మళ్ల బళ్ళె చెయ్యాల్నంటె కష్టంగాదా?’’ తన అనుమానాన్ని వ్యక్తపరుస్తూ
‘‘ఏంగాదు మామయ్య, ఈ కాలంల అందరు చేస్తున్నరు గదా… ఏదో ఓటిచేసుకొని, కష్టపడదాం’’ అన్నది ధైర్యంగా.
ఆమెలోని పట్టుదల చూసి సరే అన్నడు లింగయ్య. సంబరపడిపోతూ భర్త సుధాకర్‌ దగ్గరికి ఉరికింది కమలమణి.
* * *
కుండపోత వాన కురుస్తున్నది. రోడ్లన్నీ జలమయమైపోయినవి. సందు సందులకు చేరుతున్న ఇళ్ళ చూర్లనీళ్ళన్నీ పల్లం కోసం పరుగులు తీస్తున్నవి. ఆకాశానికి భూమికి నీటి వంతెన ఏర్పడ్డట్టు ఎడతెగని వాన. ఇంట్లో నిండు చూలాలి ప్రసవ వేదన. ‘‘అమ్మా! అమ్మా నొప్పి! నొప్పి!’’ అరుపులు మేఘగర్జనల్లో కలిసిపోతున్నవి.
కమలమణి ఆ గడపలో కాలుబెట్టినప్పటి నుండి ఆమె చేతులమీదుగా ఇది రెండో కాన్పు! పెద్దాడ బిడ్డ మల్చూరు కాన్పు, ఇప్పుడు చిన్నాడి బిడ్డ తొల్చూరు కాన్పు. వానను సైతం లెక్కచేయక భర్త సాయంతో ఎడ్ల బండిలో చిన్నాడ బిడ్డ నెక్కించుకొని సర్కారు దవాఖానకు తీసుకొనిపోవడం, పెద్దాపరేషన్‌ చేయించడం, ఇంటికి తీసుకొచ్చి బాలింతకు సేవలు చేయడం, చంటిపిల్లవాణ్ణి సాకడం, ఆమెను అత్తగారింటికి పంపేదనుక కన్నతల్లిలాగా కమలనే చేసింది. తనకోవైపు వేవిళ్ళు, అన్నం సయించకున్నా, చేతగాకపోయినా పంటి బిగువున భరిస్తూ అన్ని పనులు చేసింది. కాలం దెచ్చే సంబురాలు ఆ ఇంటిలో విరిసినవి.
దుర్గయ్య, రాధమ్మలు వచ్చి తొలి కాన్పుకు తల్లిగారింట్లో జరగాలని కమలను తీసుకుపోవడంతోగాని ఆమెకు విశ్రాంతి దొరకలేదు. చదువులకని పట్నంల ఉన్న మరిది మధ్య మధ్య వీళ్ళింటికి వచ్చిపోతూ అన్న సుధాకర్‌కు ఎప్పటికప్పుడు ఇక్కడి ముచ్చట్లు చేరవేస్తుండేది. సుఖప్రసవం అయ్యి, బిడ్డను చూసుకునే దాక ఆమె మనసంతా, అత్తగారింటి మీదికే పొయ్యేది. ఇట్లా ఇరువై ఒక్కటి అయ్యిందో లేదో నెలలోపే అత్తగారింటికి వెళ్ళిపోయింది. బ్రతిమిలాడితేగాని అన్నం తినని తమ గార్వాల బిడ్డేనా అని కమలలో వచ్చిన మార్పును చూసి తల్లిదండ్రులు ఆశ్చర్యపోయేవారు.
* * *
టీచర్‌ ఉద్యోగం అంటే ఒకప్పుడు ‘‘బతకలేనోళ్లు బడిపంతుళ్ళు’’ కాని ఇప్పుడు బతకనేర్చినోళ్ళు బడి పంతుళ్ళు’’. సమాజ పోకడలతో తానూ జతకడుతూ చదువు చెప్పడం, అందరినీ మెప్పించడం అంత సులువు కాదు. అయినా ఏ మాత్రం బెదరక ఏ మాత్రం ‘పని’ మానక పనులు చేస్తూ చేస్తూ ‘తనకు ముగ్గురు సంతానమయిన తర్వాత కమల ఉద్యోగం వదిలేసింది. ఆమె ఆ నిర్ణయాన్ని ముందు భర్తకే చెప్పింది.
ముసలివాడైన మామ మంచాన బడడం, ఆడబిడ్డలిద్దరి బాధ్యతలు చూడడం, ఒకరి తరువాత మరొకరు ముగ్గురు పిల్లలవ్వడం, ఒచ్చిపోయే ఇల్లు, ఇక తన వల్లగాదని మానేసిన ఉద్యోగాన్ని తృణప్రాయంగా భావించింది కమల. ఈ మధ్యలో మరిది చదువు పూర్తయ్యి, ఉద్యోగం చేస్తుండడంతో ఆయనకూ పెండ్లి చేసే బాధ్యత అన్నా వదినలదే అయ్యింది. ఉన్న పొలంలో ఏదో కొంత పంట పండినా, చెల్కలన్నీ అమ్మేసి పంచుకున్నారు అన్నదమ్ములిద్దరు. గవర్నమెంటు ఉద్యోగం, మధ్య మధ్య ట్రాన్స్‌ఫర్‌లు సుధాకర్‌కూ కష్టమైపోతుండేది. ఎక్కడ ఉద్యోగముంటే అక్కడ చిన్న ఇల్లు కిరాయికి తీసుకొని ఒక్కడే ఒండుకుంటూ ఉండేవాడు. శని, ఆదివారాలు ఒచ్చిపోతూ ఉండేవాడు. పెళ్ళయ్యి రాగానే కమల తమ పెరట్లో నాటిన మందార చెట్టు ఇప్పుడు పెరిగిపెద్దయ్యింది. ఏం మారతాయి? శరీరంలో సత్తువ తగ్గడం, ఎముకలు కుంగడం తప్ప. ఎప్పుడూ ఖాళీగా ఉండడం, నింపాదిగా తినడం, హాయిగా పడుకోవడమే తెలియని కమలమణి తలలో వెండి తీగలు మెరిసేవరకు యంత్రంలా చేస్తూనే ఉండేది.
మామగారు లింగయ్య కాలం చేయడంతో ఇంట్లో ఏదో శూన్యం నిండుకున్నట్లు అనిపించినా తన పిల్లలతో వెలితిని పూడ్చుకునేది.
‘‘అమ్మా! ఇదేందే నాకు ఇంత తక్కువ మార్కులొచ్చినవి. ఛీ! ఇజ్జత్‌ మొత్తం బోయిందే’’ అని దుఃఖించే పెద్ద కొడుకును ఎట్లా ఓదార్చిందో, పెరిగిన రూపురేఖల ప్రభావం మీద పడి ఇబ్బంది పెట్టకుండా కన్న బిడ్డనూ చూసుకున్నది. కాలప్రవాహానికి తట్టుకునేలా చిన్న కొడుకు చదువువరకు ట్యూషన్లూ పెట్టించి మరీ చదివించేది.
ఊళ్ళో అమ్మా నాయనలు పెద్ద వయస్సోళ్ళై పోయినారన్న బాధ. వాళ్ళకెవ్వరూ చూసుకునే వోళ్ళే లేరన్న బాధ. ఒక్కగానొక్క బిడ్డను నేను గాకుంటే మరెవ్వరౌతారని వాళ్ళ విషయాలూ పట్టించుకునే కమలకు ఎక్కడ అడ్డురాలేదు భర్త సుధాకర్‌. అదొక్కటే ఆమెకు చేయూత. మధ్య మధ్య కన్నవారింటికి వెళ్ళిరావడం, ఇక్కడ అక్కడ ఓ మూడుతరాల వారధిగా కమల నిలబడిరది.
* * *
‘‘మణెమ్మా ఓ మణెమ్మా… ఏం జేస్తున్నవూ? రాజత్త పిలుస్తునే ఉన్నది.
‘‘ఒస్తున్నా’’
‘‘రా ఇట్లా కూర్చో…’’
‘‘ఏందత్తమ్మా ఏమాయె అంత అదురు? దా ఇట్లా కూర్చో అని గద్దెపీట చూపిస్తుంటే, రాజత్త ఒచ్చి కూర్చున్నది.
‘‘గా నడిమింటి పుల్లయ్య లేడూ….’’
‘‘ఆఁ…. ఏమైంది!’’ ‘‘వాళ్ళింట్ల దొంగలు పడ్డరంట.’’ అన్నది గట్టిగా. ‘‘అయ్యో పాపం! ఏం బోయినయి ఏంది?’’ ఆత్రుత.
‘‘దుకుణంలా నగదు ఎత్తుకుపోయిన్రట’’ అన్నది రాజత్త.
‘‘అయ్యో పాపం! కమల, ఆమె ముచ్చట్లు పెట్టుకున్నరు.
కమల, కన్నతల్లి తల్లిగారివైపు వాళ్ళంతా మణి, మణెమ్మ అని పిలిచేది. ఆమె అమ్మ చెల్లెలు, చిన్నాయన బిడ్డ. రాజవ్వది అదే ఊరు. ఊరు కూరికే కమల దగ్గరి కొచ్చిపోవుడు ‘ఊరి ముచ్చట్లు చెప్పిపోవుడు ఆమె కలవాటు. తండ్రివైపు బంధువులు కమల అంటే తల్లి వైపువాళ్ళు. మణెమ్మ అనేది. రాజవ్వ వరసకు చిన్నమ్మగావాలె. కాని ఆమెను వాళ్ళ చిన్న మామకు ఇచ్చినందుకు, ఆ వరస కన్నా ఈ వరసే ముఖ్యమని అత్త అనమనేవోళ్ళు, అందుకే రాజత్త అనడమే అలవాటయ్యింది కమలమణికి.
ఒడ్లెండ బోయించుడు, చింతపండు గింజలు గొట్టుడు, కారం దంపించుడు, పసుపు పట్టించుడు, పిండి గిర్నీకి బియ్యం పంపుడు, కందులు ఇసిరించుడు. ఒక్కటా రెండా, నలుగు రొచ్చిపోయే ఇల్లు అన్నీ ఉండొద్దా అని భర్తతోని వాదించే కమల ఏడాదికి సరిపడే గ్రాసాన్ని సిద్ధం చేసుకునేది.
‘‘పెద్దోనికి ఉద్యోగం రావాలె, చిన్నోనికి కాలేజీల సీటు రావాలె, పిల్ల చదువులో మంచిగున్నది. పై చదువులు చదివిస్తుంటేనే మంచి సంబంధం వస్తది… ఏమంటవ్‌’’ కమల ఎప్పుడు భర్తతో చెప్పే మాటలు. దీపావళి పండుగకు పటాకులు కాల్చినంత సంబరంగ చెప్పే మాటలు. బాధ్యత అనేది బరువుగాకుంటే బావుంటుంది. కష్టంలోనూ ఇష్టం చూసుకుంటే బావుంటుంది.
* * *
‘ఆయాసం ఒస్తుంది, ఒక్కటే గుండెల్ల నొప్పొస్తున్నది’’ అని అంటూనే పడిపోయిన కమలమణి హాస్పటల్‌ ఐసీయూలో నిస్తేజంగా ఉన్నది. వెయ్యి తుఫాన్లు ఒక్కసారే కూల్చినట్లు, అగాధంలోకి విసిరేసినట్టు అంతా చీకటిమయం అంతా దుఃఖమయం. ముసలి తల్లిదండ్రులు కంటి మంటికి ధారగా రోధిస్తూనే ఉన్నరు. ముగ్గురు పిల్లలు అచేతనులయిపోయినారు. వారి దుఃఖం ఎవ్వరు తీర్చలేనివి అయ్యింది.
సుధాకర్‌కు బ్రతుకంతా అంధకారబంధురమైపోయింది. కాంతి ఎగిరిపోయింది.
‘‘ఇంకో ఏడాదిలో రిటైర్‌ అయిపోతాను. కమల చెప్పిన లిస్ట్‌లేమో చాలా ఉన్నాయి రా తమ్మీ’’ అని మొన్ననే నాతో అన్నవ్‌ గదా అన్నా ఇంతలోనే ఒదినమ్మ ఇట్లా అయిపోయిందేందే’’ అని సుధాకర్‌ తమ్ముడు కన్నీళ్ళు కారుస్తున్నడు. బంధువులంత ఒక్కొక్కరు సుధాకర్‌ను పలకరిస్తూం ఉన్నరు. ఆడబిడ్డలిద్దరూ ఆగకుండా ఏడుస్తూనే ఉన్నారు.
* * *
‘‘ఏయ్‌ ఇగో! నిన్నే!’’
‘‘ఏంది, ఎహే! ఎవరన్న జూస్తరు.’’
‘‘ఏం కాదు! మనం మొగుడుపెళ్లాలం. ఎవ్వరేమనుకోరుగాని, నీకు ఓ మాట చెప్పాలి ఇక్కడ కూర్చో’’.
‘‘ఊఁ…’’
‘‘మా ఇంట్లో ఇంతమంది ఉన్నరు. అందరు నిన్ను పిలిచే పేరులోని నేను నిన్ను పిలువను. నీకో పేరు పెట్టుకుంటా.’’
‘‘అబ్బో! ఎందుకో?’’
‘‘నా జీవితంలో నువ్వు ఓ కొత్త వెలుగువువు కావాలె. దారి దీపంగావాలె.’’
‘‘అంటే?’’… ముసి ముసి నవ్వులతో కమల ఓరగ చూసింది.
‘‘కాంతం’’ అని పిలుస్తాను. కాంతి అంటే వెలుగు, దీపం ఇచ్చే వెలుగు’’ అంటున్న సుధాకర్‌ను ఆశ్చర్యంగా చూస్తూ ‘‘అబ్బో! నాకు నవ్వొస్తుంది. ఎవ్వరు లేనప్పుడు అట్ల పిలువుగాని, అందరి ముందట అట్ల ‘కాంతం’ అని పిలువకు సరేనా’’ అన్న కమల మాటలకు సరే నన్న ఈ ముప్ఫై ఏళ్ళ జీవితంలో ఎవ్వరికీ తెలియని పేరు ‘కాంతం’ ఇప్పుడు దూరమైపోయింది. ఒంటరిగా ఈ సంసారాన్ని ఎట్లా నడపాలి? నేనెట్ల బ్రతకాలి?
సంసారాన్ని ఎట్లా నడపాలి? నేనెట్ల బ్రతకాలి!
కాంతం కావాలి. నాకు కాంతమే కావాలి. కష్టాల్లో కష్టంగా, ఇష్టాల్లో ఇష్టంగా ఇన్నాళ్ళు ‘తను’ మొత్తం ‘నాది’గా అయ్యి ఇంటిని దిద్దుకొచ్చిన నా కాంతం కావాలి. ఉన్నప్పుడు తెలువదు విలువ, లేనప్పుడే తెలుస్తది. వారం రోజులు హాస్పటల్‌లో ఉంటే తను బాగయి ఒస్తుందనే నమ్మకంతో కష్టంగా గడిపినం. అమాయకంగా చూస్తున్న పిల్లలు. వాళ్ళ పెళ్ళిళ్ళు, వాళ్ళ బాధ్యతలు అయ్యో! ఎంత పనయ్యింది. ఆ గుండెనొప్పి ఏదో నా కన్న రాకపాయె… సుధాకర్‌ హృదయ విదారకంగా ఏడుస్తున్నాడు. ఏడుస్తూనే ఉన్నాడు. దుఃఖ సంద్రం ప్రక్కన నిగ్రహం లేకుండా ఏడుస్తూనే ఉన్నాడు.

May 29, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

ఉనిక –

by Anuradha Bodda May 29, 2025
written by Anuradha Bodda

చెన్నమనేని స్వీయ చరిత్ర 

చెన్నమనేని విద్యాసాగర్ గారి ‘ఉనిక’ ఒక విజ్ఞాన ఖని అని చెప్పొచ్చు. చాలా రోజుల తరువాత ఒక మంచి పుస్తకం చదివాను అన్న భావన కలిగించింది. ఇది వారి రాజకీయ, సామాజిక అనుభవాలని, పరిజ్ఞానాన్ని మనకు పంచుతూ ఇచ్చిన ఒక కానుక. ఈ పుస్తకం నవ్విస్తుంది, ఆలోచింపచేస్తుంది, ఆహ్లాద పరుస్తుంది, కదిలిస్తుంది కూడా. There is really a feel good vibe running through the whole book. అయితే మనసుని కలిచివేసే సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి ఇందులో. ఈ  పుస్తకంలో వారు తన జీవన ప్రయాణంలోని ముఖ్య ఘట్టాలను ఎంతో క్రమబద్ధంగా తన బాల్యం నుంచి, విద్యాభ్యాసం వరకు, R.S.S. సభ్యత్వం నుంచి రాజకీయ వేత్తగా ఎదిగి, గవర్నర్ పదవికి న్యాయం చెయ్యటం వరకు పొందు పరిచారు. అలా పొందు పరచిన విధానం, ఉపయోగించిన భాష చూస్తే వారు ఒక మంచి రచయిత కూడా అని అనిపించక మానదు. 

శ్రీ విద్యాసాగర్ గారి నిశితమైన పరిశీలనా శక్తి, రాజకీయాల పట్ల అవగాహణ, విశ్లేషణ, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం, మారుతున్న విలువల పట్ల ఆవేదన, దేశం పట్ల, పార్టీ పట్ల అపారమైన అభిమానం, వారి అత్యున్నత వ్యక్తిత్వం అన్నీ విశదంగా కనిపిస్తాయి వారి స్వీయ చరిత్రలో. ముఖ్యంగా ఇది ఒక పిక్టోరియల్ బుక్. పేజీల మధ్యలో ఉన్న ఫోటోలు, పేపర్ కట్టింగ్స్, జరిగిన సంఘటనలకు సాక్ష్యంగా నిలవటమే కాకుండా,  దీర్ఘమైన వచనం మధ్య ఒక విరామం ఇస్తూ  సంఘటనలను  దృశ్యీకరించుకోవటానికి ఉపయుక్తంగా ఉన్నాయి.

సుపరిచితమైన తెలంగాణా ప్రాంతాలను గుర్తు చేస్తూ, ఎక్కడో జ్ఞాపకాలలో మిగిలిన తెలంగాణ పదజాలమైన కయిసిప్ప, దాలి, గిలాసులు, డేగిసాలు, శిబ్బి, పాలగోకు, ఉట్టి లాటి ఎన్నో పదాలను ఉపయోగిస్తూ తాను అబ్బురంగా చూసిన క్రిమి కీటకాలు, పక్షి గూళ్ళు లాటివి వివరిస్తూ రాసిన వారి బాల్యాన్ని చదవటం మొదలు పెట్టగానే ఆ కథా విధానం మనల్ని కట్టిపడేస్తుంది.  

   ‘ఎవరినీ లెక్కచేయకుండా క్రిమికీటకాలు మరొకవైపు రాజ్యమేలుతుండేవి. నల్ల చీమలు, ఎర్ర చీమలూ, క్రమబద్ధంగా వాటి నడక, చెట్ల కొమ్మలకు వేలాడే పిట్ట గూళ్ళు, తేనెతుట్టెలు, ఆధునిక ఇంజనీరు యుగానికే సవాలుగా అనిపిస్తుంది. వీటిని చూసి ఆశ్చర్యపడటం ఒక్కటే అప్పుడు తెలిసేది.’ (page 57)

తెలంగాణాలో దొరలంటే చాలా గొప్పవారని ప్రతీతి. అలాటిది, విద్యాసాగర్జీ చిన్నతనంలో గడిపిన మధ్యతరగతి జీవనం, వర్షం వస్తే చూరులోంచి నీళ్లు కారేటువంటి ఒక పాకలో వారి జీవనం సాగిందని తెలియటం ఒకింత ఆశ్చర్యం కలిగించిన విషయం. చెప్పుకోగలగాలి కానీ ప్రతి ఒక్కరి జీవనం ఒక కావ్యం అవుతుంది అనిపించింది వారి చిన్నతనంలోని జీవన విధానం చదివితే. 

పదేళ్ల వయసులో తన తండ్రి కాలం చేసినప్పుడు, వారి అంత్యక్రియలు జరిగినప్పుడు అర్ధం కాలేదు కానీ, అమ్మ మట్టెల చప్పుడు వినపడనప్పుడు తన తల్లికి ఆ లోటు ఏంటో అర్థమయి ఎంతగానో దుఃఖించానని ఆ పసి వయసు దుఃఖాన్ని తన ‘కాళ్ళ మట్టెలు’’ కథనం ద్వారా సాగర్ జీ చెప్పుకున్న విధానం మనసుని కదిలించివేస్తుంది. అది కూడా తాను జైలు జీవితం గడుపుతున్న సమయంలో గస్తీ తిరుగుతున్న గార్డుల బూట్ల చప్పుడు వింటూ గుర్తు చేసుకుంటూ బాధపడటం మరీ కదిలిస్తుంది. 

‘అమ్మ కాళ్ళ మట్టెల చప్పుడుని బట్టి నేను పడుకుని ఉన్నా… అమ్మ ఎక్కడ ఉన్నది  తెలుసుకోగలిగేవాణ్ణి. మెల్లగా నావైపు వస్తున్న కాళ్ళ మట్టెల చప్పుడును వింటూ ఎప్పుడు నా కడుపు మీద అమ్మ చేయి ఉంచుతుందో తెలుసుకునే వాణ్ణి’ (page 69)

‘ఎప్పుడో అమ్మ వస్తుందనీ, కడుపు నిమిరి మళ్ళీ అన్నం తినిపిస్తుందనీ, వద్దన్నా అది తప్పించుకోలేననీ చూస్తున్నాను. అమ్మ వస్తున్నట్టు అనిపించింది కానీ తనేనా కాదా అని అనుమానం వచ్చింది. కడుపు మీద చేయి ఉంచి నిమిరేవరకు అమ్మ వచ్చిందని తెలియలేదు. అమ్మ కాళ్ళ మట్టెల చప్పుడుని గుర్తుపట్టి ఎక్కడికి పోతుందో ఎప్పుడు వస్తుందో తెలిసిపోతుంది. కానీ ఆ రోజు తెలియడం లేదు. అమ్మ కడుపు మీద నిమురుతూ ఒక్క ముద్ద తిను అన్నప్పుడు అమ్మ వచ్చిందని తెలిసింది. మరి కాళ్ల మట్టెలు? అప్పుడు నాన్న చనిపోయింది జ్ఞాపకానికొచ్చింది. మొట్టమొదటి సారి దుఃఖం పెల్లుబికింది.’ (page 70)  

ఎమర్జెన్సీలో రాజకీయ నాయకుల జైలు జీవితం గూర్చి నేను విని ఉన్నాను. కానీ వీరి ద్వారా మరొక కొత్త కోణం చూసాను. జైలు జీవితంలో ఉన్న ఇతర నేరస్తులను ఈ రాజకీయ ఖైదీల సహాయానికి నియమించేవారని, వారితో మాట్లాడటం, వారి కధలు అన్నీ వింటూ, వారి విభిన్న మనస్తత్వాలను తెలుసుకునేవారని, ఒక అడ్వొకేటుగా వారి సమస్యలు, వారి కధలు విన్న తరువాత, వారి విడుదలకి అర్జీ లేఖలు రాసి ఇచ్చేవారని, కొన్నిసార్లు వారు నేరస్థులు అని తెలిసీ వారికి అర్జీ లేఖలు రాసి ఇవ్వటం సరైన పనేనా అనే ఆత్మ విమర్శ చేసుకునేవారనీ చెప్పుకొచ్చారు. ఇదంతా  కూడా వారి మానవీయతను చాటుతుంది. ఆ సందర్బంగా జైలు నుంచే వారు ‘అలర్జీ’ అనే పేర ఒక కథ రాసారు. ఎవరు మనకు ఎన్ని సహాయాలు చేసినా స్వధర్మంని మించిన దేముంటుంది అని చెప్తుంది ఈ కథ. 

“పొడిసేస్త దొర!’ అతను కిందికి చూస్తూ అన్నాడు. 

రామారావు గుండె ధడేలు మన్నది. మొఖం రంగు మారింది. గుడ్లలో నీరు తిరిగింది. కొంచెం ముందుకు వంగి… “నా భార్య ముందు, నా చిన్నారి పసిపాపల ముందు… నీకు సహాయం చేసిన నన్ను… చంపేస్తావా?” రామారావు ఆవేశంతోనే అడిగాడు. 

మీరు నన్ను చూసినంక కోర్టుల… గవాయి పలికితే… ఇగ.. నాకేముంటద్దొర! ఉరే అయితది. నా పెండ్లాం, పోరగాండ్ల గతేమయిద్ధి!” మెల్లిగా మట్టి గిల్లుతూ అన్నాడతను.  (page 115)

సూర్యోదయం రోజూ ఒకలాగే ఉంటుంది, కానీ అది మనకు అప్పుడుడప్పుడు మాత్రమే ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అది మన మనసు స్థితిని బట్టి ఉంటుంది అని ఎక్కడో విన్నాను. అలాగే జైలులో ఎన్నో మల్లెలు పూసేవనీ, కానీ ఆ మల్లెలు ఎంత అందమైన వైనా జైలు జీవితంలో అవి ఎవరినీ ఆకర్షించేవి కావు, అంటూ చేప్పే వారి కవిత వారిలోని కవితాత్మకతను చాటుతుంది.  

జైలు మల్లెల పొదలు

పెరుగును వరుసగ

జీవన బందీలుగ

చూచును దిగులుగ  (page 109)

రాజకీయ నాయకులు అనగానే వారికేంటి, రాజల్లాంటి బ్రతుకులు, అనుకుంటాం మనం. కానీ ఆ రాజకీయ జీవితం పూల పాన్పు కాదు, అది ఊరికే కూడా రాదు. ఆ నాయకత్వం పొందటం వెనుక, వారి అకుంఠిత దీక్ష, పార్టీ పట్ల, ప్రజల పట్ల వారి నిబద్దత, వారి నిరంతర శ్రమ ఎన్నో దాగుంటాయి. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి ఆటుపోట్లను తట్టుకుని అడుగేస్తే ఆ నాయకత్వం చేజిక్కుతుంది. అది చేజిక్కిన తరువాత కూడా వారి జీవితం కత్తిమీద సాములాగే ఉంటుంది. అలాటి శ్రమ, దీక్ష అన్నీ కనిపిస్తాయి, విద్యాసాగర్ గారి రాజకీయ ప్రయాణంలో. మెట్టుపల్లి ఎన్నికలకు ముందు పలు రకాల వ్యతిరేకతలను ఎదుర్కొంటూ కూడా వారు గ్రామ గ్రామాలకు తిరుగుతూ, అందరితో కరచాలనం చేస్తూ ప్రజల మనసులను గెలవటం నిజంగా అభినందనీయం. అంతేకాకూండా, తమ ప్రచార సమయంలో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవటానికి వారు చేసిన కృషి కూడా అభినందనీయం. 

విద్యాసాగర్ గారు, రాజకీయ నాయకులే కాకుండా మంచి విజ్ఞానవేత్త. ఎన్నో చోట్ల వారు చదివిన పుస్తకాలను, అవి నేర్పిన మంచిని ఉటంకించారు.  శ్రీపాద డాంగే, కార్ల్ మాక్స్, అంబెడ్కర్, సినారే, వివేకానంద, ఎల్.కె. అద్వానీ, అటల్ బిహారీ వాజపేయి వంటి మరెందరో రచనల్ని క్షుణ్ణంగా చదివారని వాటినుంచి, తమ వ్యక్తిత్వాన్ని తీర్చి దిద్దుకున్నారనీ అర్ధమవుతుంది. ఈ పుస్తకం అడుగడుగునా వారి వ్యక్తిత్వానికి అద్ధం పడుతుంది. 

ఒక సందర్భంలో సినారే గురించి ఇలా చెబుతారు. 

‘అయన సాహితీధార కూడా సమయానుకూలంగా ప్రజల ఉద్యమాల కనుగుణంగా మలుపులు తిరుగుతూ వచ్చింది. ఒక దశలో ‘గోమాత గిట్టలలో కొడవలి అంచులు నడుస్తున్నాయి.’ తెగిపోతున్న కండరాలు / ఎగురుతున్న జండాలు అన్నారు. అయన తెలంగాణా పదబంధ సుగంధంలో ఎన్నో సామాజిక విషయాల విశ్లేషణలు కనపడతాయి..’ (page 254) 

ఇక శాసనసభ సమావేశ విశేషాలు చదువుతుంటే వారి చతురత, సమయస్ఫూర్తి, స్పాంటేనియస్ సమాధానాలు, నవ్విస్తాయి, అబ్బురపరుస్తాయి. చిన్న వయసు నుంచి, రాజకీయముగా ఎంతో ఎత్తుకు ఎదిగిన జీవితం వరకు కూడా, తాను చేసిన తప్పులను తప్పుగా ఒప్పుకుని పశ్చాత్తాపాన్ని వెలిబుచ్చటంలో వారి ఆత్మావలోకనం కనిపిస్తుంది.  

తాను అధిరోహించిన పదవులకు న్యాయం చేస్తూ, సామాజిక సమస్యలకు తగు సమయంలో తగు విధంగా స్పందించి నీటి సరఫరా, గ్రామ గ్రామానికి దోబీ ఘాట్ నిర్మాణాలు, యూదులకు మైనార్టీ స్టేటస్ కల్పించటం, బహు భార్యత్వంకి సంబంధించిన చట్టంలో మార్పులు తీసుకొచ్చే ప్రయత్నం, లాటి అనేక ఉపయుక్తమైన కార్యక్రమాలు చేపట్టారు. మూడు గ్రామాలను దత్తత తీసుకుని ఆ గ్రామాల అభివ్రుద్దికి  కృషి చేశారు. సర్దార్ వల్లాభాయి పటేల్, వందేమాతరం రామచంద్రరావు, నారాయణరావు పవార్ వంటి వీరుల జీవిత చరిత్రలను వివరిస్తూ, వాటిని స్కూళ్లలో పాఠ్యంశాలు గా చేర్చాలనే తపన వ్యక్తం చేసారు. వారి తల్లి చంద్రమ్మ గారి పేరిట ఎంతో  మంది పేదలకు, రోగులకు సహకారం అందేలా చేశారు. ఎయిడ్స్ అనేది అంటు వ్యాధి కాదు అని చెప్పే ప్రయత్నం చేసారు. 

ఏదో ఉడతా భక్తిగా పనులు చెయ్యటం కాకుండా తాను చేపట్టిన ప్రతి పనీ ఎక్కడా జంకకుండా, మధ్యలో వదిలేయకుండా ఆ పనులు పట్టుదలతో సాధించారు. ఉదాహరణకి గిరిజనులకు చట్ట ప్రకారం అటవీ ఉత్పత్తులపై వారు పొందవలసిన హక్కులను సమకూరుస్తూ, అది సద్వినియోగం అవ్వాలంటే హక్కులు మాత్రమే ఇస్తే సరిపోదని,  ఎంతో ప్రణాళికా బద్దంగా వాళ్ళకి నిధులు, నీటి వనరులు కల్పిస్తూ, కావాల్సిన శిక్షణ ఇప్పించే ప్రయత్నం చేసారు. ఇవన్నీ కూడా వారి సిన్సియారిటీకి, సేవానిరతికి, పట్టుదలకీ సాక్షాలు. 

ప్రస్తుత జనాభా లెక్కల ప్రకారం మన భారతదేశం ఎక్కువ యువత ఉన్న దేశం. ఈ యువతకు సరయిన శిక్షణని ఇవ్వకపోతే ‘Demographic Dividend’ turns to ‘Demographic Disaster’ అని కూడా వారొక చోట వాపోయారు. 

చరిత్ర ఎప్పుడు నిలిచిపోవాలని, రాబోయే తరాలకు అది మార్గ దర్శకంగా నిలవాలనే తాపత్రయంతో ఎన్నోచోట్ల మహానాయకుల విగ్రహ ప్రతిష్ట చేయించటం, వారికి సంబందించిన చరిత్రను వెలుగులోకి తేవటం లాటి కార్యక్రమాలు కూడా చేపట్టారు. మహారాష్ట్ర లోని రాజభవన్ ప్రజల దర్శనానికి తెరిచేలా చేసారు. అదే రాజభవన్లోని బ్రిటీష్ కాలం నాటి అండర్ గ్రౌండ్ బంకర్ వెలుగులోకి వచ్చేలా చేసి అందరినీ ఆశ్చర్య పరిచారు.  

ముందే పేర్కొన్నట్టు ఈ పుస్తకం ఒక విజ్ఞాన ఖని. దీని ద్వారా ఎన్నో రాజకీయ పరిస్థితులు, విశ్లేషణలు తెలుస్తాయి, ఎన్నో పుస్తకాల గురించిన సమాచారం తెలుస్తుంది, భారతీయ తత్వం, దాని గొప్పతనం తెలుస్తుంది. ఇలా ఎన్నో విషయాలను తెలుపుతూ ఆయా కాలాల సామాజిక రాజకీయ పరిస్థితులను రికార్డు చేసిన ఈ పుస్తకం stands as a good resource for research students. భవిష్యత్తులో నాయకులు కావాలనుకునే వ్యక్తులకి ఇది ఒక దిక్సూచి కూడా.  ఈ విషయాలన్నీ దాదాపుగా ప్రముఖంగా పత్రికలలో ప్రచురించ పడినవే. రెగ్యులర్గా వార్తలు ఫాలొ అయ్యేవారికి కొత్త కాకపోవచు. అయితే తెలిసిన వారికి విషయాలను కొత్త కోణంలో పరిచయం చేస్తుంది, తెలియనివారికి  విషయ పరిజ్ఞానాన్ని అందిస్తుంది ఈ ‘ఉనిక’. 

సాగర్జీ పార్టీ కార్యకర్తగా, వకీలుగా, జైలులో ఖైదీగా, శాసన సభ సభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా, గవర్నరుగా… ఏ పాత్రలో ఉన్నా ప్రజల మనిషిగా ప్రజలకు ఉపయోగపడాలని అనునిత్యం పాటు పడిన నాయకుడిగా ప్రజల మనసులలో ఎప్పటికీ నిలిచి ఉంటారు. ఈ ‘ఉనిక’ వారిని మంచి రచయితగా కూడా గుర్తుంచుకునేలా చెస్తుంది. 

May 29, 2025 0 comment
1 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • వేకువ పాట
  • చాణుక్యుడు ఆదిశంకరాచార్యుల ప్రభావం ఒక సింహావలోకనం
  • సనాతనమంటే?
  • సమాజానికి హానికరమైనవిగా కాక ఉపయుక్తమైన రచనలు చేయాలి- డా. జి. చెన్నకేశవరెడ్డి
  • సాహిత్యాకాశంలో నక్షత్రాక్షర తోరణం- అక్షరగీతం

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us