దూరం అంటే ఎంతదూరం
కొలిచి చెప్పే సాధనాలు ఎన్నైనా ఉండవచ్చు
అంతరాలు అవగతమౌతాయా?
మనిషికి,మనసుకు దూరం ఎంత?
శూన్యమా ! అనంతమా !!
కాలం మాటున దాగిన ప్రశ్నలలో
ఊపిరి విలువ ఎంత?
బేరీజు వేయవచ్చా?
సొంతమనుకొని, సొంతం కానీ
అన్ని బంధాలను పెనవేసుకొని
చెట్టాపట్టాలేసుకోకుండా ఉన్నట్టుండి మటుమాయం
హార్ట్ ఎటాక్ తో ఆయువు అంతం
జేబుకున్న చిల్లులు లెక్క పెడితే
గుండెకు ఐన గాయాలు కనిపిస్తాయా?
ఎపుడు ఏ ఉచ్చులో పడుతారో
తనకే తెలియని అమాయకత్వం మనిషిది
కానీ అన్ని ఊహాలు వేయగల అసాధ్యులు !
చిన్న జీవితంలో
దూరమెంతో తెలియని భారప్రయాణం
లెక్కలు చెప్పమంటే ఏమని చెప్పను?
జవాబులు లేని ప్రశ్నలకు
కొలవలేని సమాధానాలకు
నాకు నేనే ఎంతదూరమో??
ఓటమి ఒక శాశ్వత జ్ఞాపకం
అనుభవిస్తేనే గాని తెలియనిది
మొన్నటి ప్రణాళిక
నిన్నటి కార్యాచరణ
నేటి ఫలితం
భవిష్యత్తు ఆలోచనకు
‘ధన’ తో ఎవరో
‘తన’ తో ఎవరో తేలిపోయింది
ఓటమికి ఉన్న కసి
గెలుపుకు ఉండదు
నైతికత ఎప్పుడూ గొప్ప లక్షణమే
వెన్నుపోటు చారిత్రిక అవలక్షణం
వెనుక పొడవాలనుకున్నవాడికి
ఆ అవలక్షణమే సాధనం
బుద్ధి మందమైతే
బంధం తెగిపోతుంది
వ్యూహం మారుతుంది
మనిషి అసలు స్వరూపం బయటికి కనబడదు
బాహ్య రూపం ముసుగు మాత్రమే
ప్రవర్తన అంతా ఒక నటన మాత్రమే
ఈ నాటికీయ ప్రయాణం
పంతంతో ఒకలా
పగతో ఒకలా ఉంటుంది
అవసరంతో ఒకలా
ఆదరంతో ఒకలా ఉంటుంది
మనం లేని చోట వినబడే మాటలో
మనమెవరం అనేదే ముఖ్యం
నలుగురు కొట్టిన చప్పట్లు
మనకోసమా కాదా సరిచూసుకోవాలి
కదులుతున్న గడియారం ముల్లు
రేపటికి ఒక కొత్త ప్రశ్నాపత్రాన్ని తయారు చేస్తుంది
కాలం గుండ్రంగా ఉంటుంది
రాత్రి పగలు అందరికీ ఒకటే
ఈ చాపరేఖ ఇప్పుడు నాది కాకపోవచ్చు
కానీ రేపు …. ?
చిట్టి కథ గొప్ప సందేశం
బాగా సంపన్నులు అయిన ఒక కుటుంబంలో వారితో చాలా సంవత్సరాలుగా ఒక కుక్క ఉండేది. ఆ కుక్క చాతనైనన్ని రోజులు ఆ ఇంటికి తను చేయగలిగినంత చేసి కంటికి రెప్పలా కాపాడింది ఇంట్లో వాళ్ళని. ఇక ఇప్పుడు దాని ఓపిక తగ్గి అది ఏమి చేయలేదు అనుకున్న సమయంలో ఆ ఇంటి యజమాని ఇక దీంతో మనకు పని లేదు దీనిని వదిలేసి ఇంకొక దాన్ని తెచ్చుకుందామని దానిని దూరంగా ఉన్న అడవిలోకి వదిలిపెడతాడు. ఆ కుక్కని వదిలేసి ఆ యజమాని వెళ్లిపోయిన తర్వాత నిదానంగా ఓపిక కూడతీసుకొని నడుస్తున్న కుక్కను అటుగా వస్తున్న ఒక పులి చూస్తుంది. హమ్మయ్య !!!!ఎక్కువగా కష్టపడకుండా నాకు ఈ రోజుటి ఆహారం లభించింది అని అనుకుంటూ నెమ్మదిగా కుక్క వస్తున్నవైపు అడుగులు వేస్తూ వస్తుంది. అది గమనించిన కుక్క ముందు భయపడిన ….నిదానంగా ఆలోచించి తనలో తాను అనుకుంటున్నట్లుగా పులికి వినబడేటట్టుగా ఈ విధంగా మాట్లాడింది. కొంచెం సేపు అటు ఇటు నడిచి ఏదో ఆలోచిస్తున్నట్లుగా చూస్తూ పులి దగ్గరికి వచ్చే సమయానికి దానికి వినిపించేటట్లుగా ఇవి నిన్న మొన్న నేను తిన్న పులి ఎముకలు కదా !!! ఇక ఈరోజు ఆహారం వెతకకుండానే నా దగ్గరికి వస్తుంది అని అంటుంది. అది విన్న పులి భయపడి నిదానంగా వెనుకకు జరుగుతుంది అక్కడినుండి. ఇదంతా చెట్టు పైన కూర్చుని చూస్తున్న కోతిగమనించింది. పులి కొంచెం దూరం వెళ్లిన తర్వాత కోతి రెండు చెట్ల అవతలికి దూకి పులితో ఈ విధంగా అంటుంది. అయ్యో!!!! పిచ్చిదానా నువ్వు దాని మాటలు నమ్మావా??? అది ఇప్పుడు తిన్నవి కావు .చాలా రోజుల నుండి ఉన్నాయి ఆ ఎముకలు అక్కడ. నువ్వు ఏమీ భయపడాల్సిన పనిలేదు .ఆ జంతువు నీ నుండి తప్పించుకోవడానికి నిన్ను భయపెట్టే ప్రయత్నం చేసింది అంతే. నువ్వు వెళ్లి హాయిగా దానిని ఆరగించు. నీకు తోడుగా నేను వస్తాను పద అని పులికి చెప్పి రెండూ కలిసి బయలుదేరాయి. అది గమనించిన కుక్క విషయం గ్రహించి ఇప్పుడు ఏం చేయటం అని ఒక నిమిషం ఆలోచించి తెలివిగా అవి రెండు వినేటట్లుగా నేను ఇందాకే చెప్పి పంపించాను కదా ఒక కోతికి మొన్న తెచ్చిన పులిని మూడు రోజులకు సరిపడా తిన్నాను. పులి మాంసం చాలా బాగుంది. మళ్లీ ఒక పులిని ఆహారంగా తీసుకురమ్మని పంపాను. ఇంకా రాలేదేంటి అని ఆ రెండింటికి వినిపించేటట్టుగా స్వగతంగా అనుకుంటుంది. అది విన్న పులికి చాలా కోపం వస్తుంది. పులి కోపంగా కోతిని చూసి నిజంగానే తనను ఆ జంతువుకు ఆహారంగా ఇవ్వడానికే కోతి పన్నాగం పన్నింది అని భ్రమపడి అమాంతం కోతిని తన పంజాతో కొట్టి చంపి అరవిస్తుంది. ఇది వినడానికి చిన్న కథ అయినా ఎంత నీతి చూడండి. అనవసరంగా ఎదుటి వారి వ్యవహారంలో తల దూర్చకూడదు దూరిస్తే కోతికి పట్టిన గతే పడుతుంది. అంతేకాకుండా అపాయం వచ్చినప్పుడు ప్రమాదం ముంచుకొచ్చినప్పుడు దాని నుండి ఎలా తప్పించుకోవాలా అని మనం ఆలోచించటం మొదలుపెడితే ఎదుటి వ్యక్తి, ఎదుట ఉన్న ప్రమాదం ఎంత పెద్ద వైనా సరే తప్పించుకోవటానికి ఏదో ఒక మార్గం కనపడుతుంది. అప్పటికి బయటపడే అవకాశం కలుగుతుంది. ఏ ప్రయత్నం చేయకుండా భయపడితే మాత్రం మనంతట మనమే గోతిలో పడ్డట్లుగా ఉంటుంది. పులిని భయపెట్టడం అనేది కుక్క వల్ల అయ్యే పని కాదు కానీ …..తన ప్రాణం మీద ఉన్న తీపి తో ఒక ప్రయత్నమైతే చేసింది కుక్క. ఆ క్షణానికి కుక్క మాటలను పులి నమ్మటం వలన కుక్క సేఫ్ గా బయటపడగలిగింది.
అందుకే ఆపద రాగానే కంగారుపడి భయపడి హడావిడి చేయకుండా ఏ ప్రయత్నము చేయకుండా కూర్చోవడం కన్నా మెదడుకు పదును పెడితే ఆపద నుండి దాదాపుగా గట్టెక్కగలం . ఒక జంతువే అంత తెలివిగా ప్రవర్తించి తన ప్రాణాలను కాపాడుకోగలిగినప్పుడు ….మనం మానవులం దానికన్నా తెలివైన వాళ్ళం అంతకన్నా తెలివిగా మనం ఆలోచించలేమా చెప్పండి.
నేను విన్నది నాకు నచ్చింది మీతో పంచుకోవాలనిపించి పెడుతున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి. మీ వాళ్లకు షేర్ చేయండి.
సర్వేజనా సుఖినోభవంతు
నేను తప్పిపోయాను
వెతుక్కోలేదు కాబట్టి
ఎప్పుడనేదీ చెప్పలేను
నేను మరణించాను
శ్వాసిస్తున్నాను కాబట్టి
ఆ విషయము అర్థంకాలేదు
చిన్న చిన్న ఆశల రెక్కలు
అప్పుడప్పుడు మొలచి రాలిపోయేవి
ఊడ్చి పారేస్తున్నదీ నేనే కాబట్టి
ఎదగలేదన్నది తెలియనేలేదు
ఇదంతా ఎందుకు అంటారా?
చెప్పడం అవసరమే..!
గుండె నిండా నింపుకున్న ప్రేమలో
ఓ తొణికిపాటు
తీగలు తీగలుగా అల్లుకున్న బంధాలు
కొంత విడివడిన వెసులుబాటు
అవకాశవాదులు అవసరార్థులు
తప్పిపోయారిప్పుడు
వెరిసి నాకిదొక అవకాశం
వేకువ మెలకువలో
నేనుగానే మేల్కొంటున్నా
పక్షుల కువకువలు
వినిపిస్తున్నప్పుడు
ఊహల రెక్కలు
విప్పుకుని ఎగురుతున్నా
నేనున్నానని ప్రకటించుకుంటూ,
నాలుగక్షరాలు చదివో రాసో
సంబరపడుతున్నా
నిజంగా నేనున్నాను.
తమిళనాడు రాష్ట్రంలోని తిరుమేయచూర్ జిల్లాలో ఉన్న లలితాంబికై దేవి పురాతన ఆలయం. ఈ ఆలయం వేల సంవత్సరాల పురాతనమైనది కేవలం సూత్రాలతో ప్రవహించే కావేరీ నది దక్షిణ ఒడ్డున ఉన్న ఈ ఆలయం శివుని యాబై ఆరవ ఆలయం. ఆలయంలోని ప్రధాన దేవతలు లలితాంబికై మరియు మహానాడు. ఈ ఆలయంలో పవిత్రమైన పండుగ రాధా సప్తమి జరుపుకుంటారు. వ్యాధి లేని జీవితం మరియు సంపద జీవితంలో శాంతి మరియు ఆనందం నుండి ఉపశమనం పొందాలని భక్తులు వేడుకుంటారు. ఈ ఆలయం పేరు మేఘనాధ స్వామి పలితాంబిక ఆలయం కాగా ఈ ఆలయంలో లలితాపారాయన సూత్రాన్ని పఠించడం భక్తుల కోరికలు తీరుతాయి ఈ ఆలయానికి అమ్మవారికి శాంతి పరిచిన మహాదేవుని ఆలయంగా కూడా పేరు ఉండటం గమనార్హం. ఈ ఆలయంలో శివుడు మేఘనాథ్ స్వామిగా పార్వతి లలితాంబిక ఆవిర్భవించారు. జగన్మాత పాండాసురుడు అనే రాక్షసుడిని సంహరించడం కొరకు శ్రీ చక్ర రథంపై ఆసీనురాలై పాండాసురునిక సంహరించింది. ఆ తర్వాత ఆగ్రహంతో ఉన్న లలితాంబిక శివుని ఆదేశాల మేరకు ఈ క్షేత్రానికి వచ్చి తపస్సు చేసిందట.
ఋషులు పరాశక్తి దేవి వద్దకు వెళ్లి, దేవత వారికి భద్రత కల్పించాలని కోరారు. దేవి యాగం నుండి ఉద్భవించి, శ్రీ చక్రంపై లలితాంబికగా ఎక్కి, దెయ్యంతో పాటు యుద్ధాన్ని ప్రారంభించింది మరియు చివరికి దేవి దేవి అతన్ని నాశనం చేసింది. దేవి కోపంగా ఉంది మరియు శివుడు పరాశక్తి దేవిని మనోన్మణి అనే పేరుతో భూమికి రావాలని కోరాడు, తద్వారా దేవి తన కోపాన్ని చల్లబరుస్తుంది. ఈ ఆలయానికి వచ్చిన తర్వాత దేవత దయగలది మరియు సరళంగా మారింది. దేవత పదాలను పాలించడానికి వాక్ దేవతలను ఏర్పాటు చేసి, సుమారు వెయ్యి పేర్లతో తన స్తుతిని జపించమని కోరింది.
ఆలయ చరిత్ర
తమిళనాడులోని తిరువారూర్ జిల్లా cccccom తిరుమీయచ్చూర్లోని లలితాంబికాదేవి దేవాల ఎన్నో ప్రత్యేకతలను కలిగి భక్తులకు కొంగుబంగారంగా విలసిల్లుతోంది. మేఘనాథస్వామి పేరుతో పరమేశ్వరుడు, లలితాంబిక పేరుతో పార్వతీదేవి ఇక్కడ కొలువైవున్నారు. లలితాంబిక కొలువైన ఆలయ ప్రాంగణం ప్రతినిత్యం లలితా సహస్రనామ పారాయణాలతో ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. ఈ దేవాలయ దర్శనం సర్వపాప ప్రాక్షాలన గావిస్తుంది అని అంటారు ఇక్కడ స్వామిని ప్రార్థిస్తే పెళ్లి కాని యువతులకు శీఘ్ర కళ్యాణ ప్రాప్తి కలుగుతుందని భక్తుల విశ్వాసం. శనీశ్వరుడు, గరుడుడు, సూర్య రథసారధి యైన అరణుడు, యముడు, వాలి, సుగ్రీవులు ఇక్కడ జన్మించారని భక్తుల విశ్వాసం.
ఈ దేవాలయములో ఎన్నో ఉపాలయాలు కూడా ఉన్నాయి కాళీదేవి మందిరం దర్శించదగినది 8 చేతులతో మహిషాసురమర్ధినిగా ఉన్న ఆమెను దుర్గాదేవికా సుఖ మహర్షి సోత్రం గావించాడు. వేద వ్యాసుని కుమారుడైన సుఖ మహర్షి చిలుక ముక్కు కలిగిన వాడు. భక్తుల కోరికలను కాళీదేవి చిలుక ద్వారా లలితాంబకు తెలియజేస్తుందని అందుకే ప్రతినిత్యం ఒక చిలుక సాయం సమయాలలో లలితాంబిక గుడిపై ఎగురుతుందని అక్కడ ప్రచారంలో ఉన్న కథ.
ఈ ఆలయంలో రెండు శివమూర్తులు రెండు పార్వతి మూర్తులు పూజలందుకోవడం ప్రత్యేకత. తమిళనాట తిరుమీయచ్చూరు. తిరువారూరు, తిరుప్పగతూరు దేవాలయాల్లో మాత్రమే ఉన్నట్లు తెలుస్తుంది. ఈ ప్రదేశంలోనే సూర్యుడికి శాప విమోచనం కలిగిందని పెద్దలు చెబుతారు. సూర్య రథసారధి అయిన అరుణుని అవతారాన్ని సూర్యుడు హేళన చేయడంతో బాటు అతని శివపూజను అడ్డుకోవడంతో శివుడు కోపించి సూర్యుని శపించాడు. శాపవిమోచన కోసం సూర్యుడు అర్థించగా, 7 నెలలు శివపార్వతులను ఏనుగుపై అధిష్ఠింపజేసి మేఘాలపై నుంచి, అర్చనగావించాలని అప్పుడే శాపం నుంచి విముక్తి లభిస్తుందని శివుడు పలుకగా, అదేవిధంగా చేసిన సూర్యుడు శాపం నుంచివిముక్తి పొందాడని అంటారు దాని గుర్తుగా గజవరుష్ట వాహనంపై అధిష్టించినట్టు చెక్కబడిన శివపార్వతుల విగ్రహాలు దర్శనమిస్తాయి.
దేవాలయ విశేషాలు
తిరుమీయచ్చూర్ శ్రీ మేఘనాథస్వామి ఆలయంలోని ఈశ్వరుడు స్వయంభూనాధుడు. లలితాంబిక పేరుతో అమ్మవారు శ్రీ చక్రరాజ సింహాసనంపై అధిష్ఠించి భక్తులకు అభయమిస్తూ అభయముద్రలో ఠీవిగా మహారాణిలా ఆశీనురాలై, చిరునవ్వులు చిందిస్తూ కళకళలాడే మోముతో మనకు దర్శనమిస్తుంది. ఆమె ప్రాం గణంలో లలితా సహస్రనామాలు, లలితా నవరత్నమాలా పారాయణ చేసే వారికి సకల సౌభాగ్యాలు కలుగుతాయన్నది భక్తుల విశ్వాసం. అందుకే జీవితంలో ఒక్కసారైనా ఈ ఆలయంలో లలితా సహస్రనామ పారాయణ చేయాలని భక్తులు కోరుకుంటారు.
ఆలయ ప్రాశస్త్యం
తిరుమీయచూర్ ఆలయం వెయ్యి సంవత్సరాల పురాతనమైనదని చరిత్రకారుల భావన. రాక్షసుడు రుషులను, దేవతలను బాధిస్తుండగా వారంతా జగన్మాతకు విన్నవించుకున్నారు. వారి కోరికను మన్నించి ఆమె పండాసురునితో యుద్ధం చేసి అతన్ని సంహరించింది. రాక్షస వధానంతరం కూడా ఆమె కోపం తగ్గకపోవడంతో ఆమెను భూలోకానికి వెళ్లి మనోన్మణి పేరుతో తపస్సు చేయమని పరమేశ్వరుడు ఆదేశించగా ఆమె ఈ క్షేత్రానికి వచ్చి తపస్సు చేసి ప్రశాంతంగా కరుణామయిగా మారింది. ఆమే ఈ లలితాబింక అని పురాణకథనం. హయగ్రీవుడు లలితాదేవి భక్తుడు. లలితా సహస్రనామ మహత్యాన్ని అగస్త్య మహర్షికి తెలియజేశాడు హయగ్రీవుడు. అప్పుడు లలితా సహస్రనామ పారాయణకు అనువైన స్థలం తెలియజేయమని ఆగస్త్యుడు హయగ్రీవుని కోరాడు.
హయగ్రీవుడు భూలోకంలో మనోన్మణి రూపంలో సౌందర్యనాయకి విరాజిల్లుతున్నదని అగస్త్యునికి తెలియజేస్తాడు. అనంతరం అగస్త్యుడు తన పత్ని లోపాముద్రతో కలసి తిరుమీయచ్చూర్ ఏతెంచి అక్కడ లలితాంబిక సన్నిధిలో లలితా సహస్రనామం, తను విరచించిన లలితా నవరత్నమాల పారాయణ గావించాడని తెలుస్తోంది.
12 నాగమూర్తులు…
ఈ దేవాలయంలో నవగ్రహాలు లేకపోయినా, 12 రాశులకు చిహ్నంగా, 12 నాగమూర్తులు ఇక్కడ పూజలందుకుంటారు. ఇక్కడ దీపాలు వెలిగించి పూజలు సల్పితే అన్ని గ్రహదోషాల నుంచి విముక్తులవుతారని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో పుష్కరిణి ‘సూర్య తీర్థం’ పేరుతో విలసిల్లుతున్నది. తిరుమీయచ్చూర్ దేవాలయంలో శిల్పకళ ఉట్టిపడుతుంది. ప్రాంగణంలోని ‘శివశక్తి’ శిల్పం సందర్శకులనెంతో ఆకట్టుకొంటుంది. శివుడు కోపంతో ఉన్న పార్వతిని అనునయిస్తున్నట్టు చెక్కబడిన ఈ శిల్పం, ఆమె మోములో ఒక వైపు క్రోధం, మరోవైపు చిరునవ్వు కనువిందు కలిగిస్తూ ” శిల్పాచార్యుల నైపుణ్యానికి దర్పణంగా నిలిచింది. తిరుమీయచ్చూరు లలితాంబిక విగ్రహమూర్తి అద్భుతంగా జీవకళ ఉట్టిపడుతుంటుంది. భక్తుల పాలిట పెన్నిధిగా, శివపార్వతుల సన్నిధికి ఆలవాలమై తిరుమీయచ్చుర్ లలితా సహస్రనామాలకు పుట్టినిల్లుగా ప్రఖ్యాతిగాంచింది.
తిరువాయువు జిల్లాలో మైలాడుదురైకి 12 కిలోమీటర్ల దూరంలో తిరు మీయచ్చుర్ ఉంది. మహిళాడు దొరై నుంచి బస్సు సౌకర్యం కూడా ఉంది.
*ఎవరైతే భగవంతుడికి తనను తాను అర్పించుకుంటారో వారికి భగవంతుడు పశుడౌతాడు.
శాంతి కాముకుడు బుద్ధుడు
బుద్ధుడు శాంతి కాముకుడు. అహింసావాది. ప్రపంచ తాత్త్వికులలో అగ్రస్థానాన్ని పొందినవాడు. ఆరాధనీయుడు. అటువంటి బుద్ధుని ధర్మప్రభోదాలు జీవన మార్గదర్శకాలుగా దేశ విదేశాల్లో విస్త్రుతంగా వ్యాపించాయి. జనులకు నైతిక జీవనాన్ని ధర్మాచరణను ప్రభోధించటంలో ప్రముఖ పాత్రవహించింది బౌద్ధం. నియమబద్ధమైన వ్యాప్తికోసం గుహా-స్తూప చైత్య శిల్పాన్ని, పాళీ-సంస్కృత సాహిత్యాన్ని పరిఢవిల్లజేసింది. ఓ వెయ్యేండ్లు క్రీ.పూ 5వ శతాబ్దినుంచి క్రీశ 5వ శతాబ్ది వరకు మహావైభవంగా విరాజిల్లి ప్రజాదరణ పొందిన బౌద్ధం, ఆ తర్వాత ఈ దేశ పాలకుల హిందూమత దురభిమానం వల్ల తను పుట్టిన నేలనుంచి అదృశ్యమైంది. డా.బి.ఆర్.అంబేద్కర్ బౌద్ధ ధర్మ దీక్షా స్వీకారం కారణంగా తిరిగి 1956 నుంచి మరోకసారి పునర్వికాస దశ పొందింది.
బుద్ధుని కాలంలోనే బౌద్ధం తెలంగాణకు చేరింది. ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లో వ్యాపించింది. ఆయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపు 300 బౌద్ధ స్థలాలు కనిపించితే, వాటిలో 10-15 వరకు మాత్రమే తెలంగాణావి. కోస్తాంధ్ర కంటే ఎంతో ముందుగానే ఇక్కడికి బౌద్ధం వచ్చింది అనేది చారిత్రక సత్యమైనప్పటికీ, ఆ ఆధారాలను మిగుల్చుకోవడంలో తగినంత శ్రద్ధ ఇప్పటివరకూ ఒప్పుకోవలసిన నిజం. వెతుక్కోవడంలో చూపలేదనేది
ఆదిలాబాద్, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల్లో ఇప్పటివరకు బౌద్ధ నిర్మాణాల ఆనవాళ్లు లభించలేదు. నిజామాబాద్-బోధన్, మెదక్-కొండాపురం, కరీంనగర్-కోటి లింగాల, ధూళికట్ట, పాశిగాం, మీర్జంపేట, నల్గొండ-నాగార్జునకొండ, తిరుమలగిరి, ఫణిగిరి, గాజుల బండ, వడ్లమాకుల, ఏలేశ్వరం, ఖమ్మం- నేలకొండపల్లి, అశ్వారావుపేట(?), కాపవరం. బౌద్ధ స్థూపాలు ఇటుకలు, బంకమన్ను, సున్నం, రాతి పలకల నిర్మాణాలు. ఇటువంటి కొండలున్నా గుహా విహారాలు ఆధారాలను దొరకలేదు. కానీ కొత్తగూడెంలో వున్న ఈ భౌద్ధ ఆనవాలు గుహాలయమనేందుకు సరిపోయేలా వుంది.
ఎక్కడుంది ఈ బౌద్ధ గుహాలయం?
కొత్తగూడెం నుంచి ఇల్లెందు వెళ్ళే బైపాస్ రహదారిలో 5 కిలోమీటర్లు ప్రయాణించి అక్కడినుంచి కేవలం ఒక్కకిలోమీటరు ఎడమపక్కగా వున్న కచ్చా రోడ్ లో వెళితే క్వారీగా తొలుచుకుంటూ వచ్చిన కారుకొండ పర్వతం కనిపిస్తుంది. దానికి పడమటి దిక్కున కారుకొండ చెరువు కనిపిస్తుంది. కొండను రాళ్ళుదొరుకుతున్నాయని చుట్టూతా బలమైన పండుని కొరుక్కుంటూ వచ్చినట్లు తొలుచుకుంటూ వచ్చారు. ఈ ప్రాంతానికి కూడా ముప్పు పొంచి వున్నప్పుడు, స్థానికుల నిరసన వెల్లువెత్తింది. తమ ఆరాధ్య దైవం సడాలమ్మ గుడిని, ఆనాదిగా వస్తున్న బుద్దుని రాతిగుండు, దెబోగా గుహలను కూల్చేయవద్దని ప్రభుత్వానికి విన్నవించారు. చాలా ప్రయత్నాల తర్వాత ఎట్టకేలకు ప్రభుత్వం జోక్యం చేసుకోవడంతో ఆ కొంచెం ప్రాంతం వరకూ క్వారీ పనులు నిలిపివేసారు. తెలంగాణా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గుహల అభివృద్ధికి స్వల్పంగా నిధులు కేటాయించడంతో వాటికి రక్షణగా చుట్టూతా ఇనుప వల వేశారు. రక్షిత కట్టడం గా ఏర్పాటు చేశారు.
చతుర్ధశ బుద్ధప్రతిమలతో ఏకశిలా నిర్మిత గోళాకార గుహదేవళం
కారుకొండ గుట్టకు పడమట దిక్కున ఈశాన్య దిశగా వది అడుగుల పైబడిన ఎత్తులో పాతిక అడుగుల పైగా చుట్టుకొలత వున్న ఇసుకరాతిగుండు ఒకటుంది. దానికి నాలుగు దిశల్లోనూ ధ్యానముద్రలో వున్న రూపం వుంది. రాతి గుండులో నాలుగు ముఖాలుగా ఎంచిన దిశల్లో అడుగులోతు గుంటలుగా తొలిచి దానిలోపట ఈ రూపాన్ని మలచారు. బహుదళ పద్మాన్ని ఆననంగా తీసుకుని ధ్యానస్థితిలో నిర్మలంగా కూర్చుని వున్న ఒకేరకమైన రూపాలు నాలుగువైపులా వున్నాయి. మూర్తి కుడిభుజం వైపున్న దిశలో దీపం వెలిగించే గూడును ఏర్పాటు చేసారు. మరో ప్రత్యేకమైన విషయం ఏమిటంటే ఈ విగ్రహాలకు అత్యంత పురాతనమైన సహజరంగులను వేసారన్న ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. మహాయాన బౌద్ధానికి చెందిన శిల్పాలయివుండొచ్చని పిస్తున్నాయి.
బౌద్ధ ప్రతిమా శాస్త్రాన్ని పరిశీలిస్తే, ప్రతి భంగిమకూ ప్రత్యేకమైన అర్థం ఉంది. నిలబడే కూర్చుంటే భంగిమలకే కాక చేతి వేళ్లను ఉంచే విధానానికి కూడా దీనిలో ప్రత్యేకమైన వివరణలు ఉన్నాయి. ధ్యాన స్థితిలో ఉన్న బుద్ధుడి విగ్రహాల్లో ఎక్కువగా భూస్పర్శముద్ర కనిపిస్తూ ఉంటుంది కానీ ఇక్కడి విగ్రహాలలో మాత్రం ధ్యాన సమహిత ముద్ర కనిపిస్తుంది.
ఒడిలోకి చేర్చుకున్న ఎడమ చేతిని వెల్లకిలాతిప్పిఉంచి దానిపై కుడిచేతిని వెల్లకిలా తిప్పిసున్నితంగా ఆనించివుంచిన ముద్రలో గమనించ వచ్చు. ధ్యానసమాధిస్థితికి ప్రతీకగా దీనిని భావిస్తారు. ముడుచుకున్న కాళ్ళుకూడా పద్మాసన స్థితిలో కాక ఎడమముంగాలిపై కుడముంగాలు చేర్చిన స్థితిలో వున్నది. తిన్నగా వుంచిన వెన్నెముక, పైకెత్తిన తల, ప్రశాంతమైన ముఖం నిటారైన మెడతో తలెత్తికనిపిస్తోంది. ఇటువంటి ఆసన స్థితి ప్రశాంత ధ్యానానికి అత్యంత అనుకూలమైనదిగా చెపుతారు. రావిచెట్టుక్రింద జ్ఞానోదయం అయినప్పుడు సైతం బుద్ధుడు అవలంభించిన ధ్యానపద్దతి ఇదే స్థితిలోనే అని యోగసాధకులు చెపుతారు. ఇటువంటి స్థితి జ్ఞానేంద్రయాలపై వత్తిడిపడకుండా శరీరాన్ని సమస్థితిలో వుంచేందుకు దోహదం చేస్తుంది. చైనాలో చియాంగ్ సేన్ పిరియడ్ లో తయారుచేయించిన బుద్ధప్రతిమలు బ్యాంకాక్ దగ్గర వాట్ బెంచంభోఫిట్ ప్రాంతలో ఇదే ఆసనస్థితిలో వుండటాన్ని గమనించవచ్చు. భారతదేశంలో సైతం అనేక చోట్ల ఇదే రకమైన ధ్యానస్థితిలో వున్న బుద్దప్రతిమలున్నాయి. ఒడిలో భిక్షాపాత్రుంచుకున్న విగ్రహాలుసైతం భిక్షాపాత్రమినహా మిగిలిన రూపమంతా ఇలానే వుంటుంది. కొంత పొడవుగా సాగిన చెవులు, ఉంగరాలు తిరిగిన జుట్టు, బుద్దుని భారతీయ రూపానికి అచ్చమైన ప్రతీకలుగా వున్నాయి. మెడలో ఏదో కంఠాభరణం ఆనవాలు అస్పష్టంగా కనిపిస్తోంది. ఎడమభుజం వైపుకు వేసిన వస్త్రపుజాడలు కనిపిస్తున్నాయి. అయితే ఇసుకరాయికావడం వల్ల అనేక శతాబ్దాల కోరివేతతో నష్టపోయిన భాగం కొంత అయితే ప్రధానమైన రూపాన్ని మాత్రం ప్రత్యేకకారణాలతో మనుషసంభంధమైన ధ్వంసీకరణ జరిగివుండొచ్చన్నట్లే కనిపిస్తున్నాయివి. బుద్ధ విగ్రహం వున్న తొలచిన గూడుకు తోరణం మాదిరిగా ప్రత్యేకంగా గాడులను కొట్టి అలంకరించారు. అంతేకాకుండా గూడుకు అడుగు క్రిందనుంచి చుట్టూతా తిరిగొచ్చేలా రెండంగుళాల లోతుతో ఒకగాడిని కొట్టారు. రాతిగుండుకు పై భాగంలో ఖచ్చితంగా మధ్య భాగంలో అడుగు లేదా పద్నాలుగు అంగుళాల భుజం కొలతతో ఒక చతురస్రాకారపు గాడి, దానికి మధ్యభాగంలో మరికొంత లోతుగా వృత్తాకారపు గాడి కనిపిస్తున్నాయి. ఎత్తుగావున్న ఈ భాగంలో రాత్రిపూట దీపం వెలిగించే వారో లేదా. ధ్యానసాధనలో భాగంగా గుడ్రని ఆకారంలో వున్న ఈ రాతిని మొత్తంగా భుద్ధుని శిరస్సుగా భావిస్తే ఆ మధ్యలో వున్న భాగాన్ని సహస్రారంగా పరిగణించేవారో, లేక ధాతుగర్భంగా మలచేందుకు ఇదేమైనా సూచనవుతుందో ఇతిమిధ్ధంగా ఇప్పటికి దొరికిన ఆధారాలతో తేల్చలేము. ఈశాన్య దిశవైపు చూస్తున్న బుద్ధప్రతిమకు ముందువైపున వున్న రాతిబండకుమధ్యలో ఒక చెట్టుమొలవడం వల్ల నిలవుగా చీలి ఆ వైపు ఒక ప్రత్యేక ద్వారతోరణంటా కనిపిస్తోంది. ఆ మొక్క మొదలు ఇంకా పచ్చిగానే వుంది మళ్లీ మొలకెత్తితే అది ఈ బండలను మరింత చీల్చివేసే ప్రమాదంలేకపోలేదు. గొడ్డలితో నరకటం, పలుగుతో పొడిచిమొదలు తీయటం కంటే యాసిడ్ లాంటి రసాయనాలను వాడి చెట్టుని తొలగిస్తే రాతిగుండుకు నష్టం కలకుండా వాటిని తీసేయడం సాధ్యం అవుతుంది.
బుద్ధుడేనా లేక జైన పార్శనాధుడా?
బహుదళ పద్మాన్ని ఆసనంగా, నాగపడగలను ఛత్రంగా వేసుకుని అచ్చంగా ఇటువంటి ధ్యానముద్రలో కంఠాభరణంతో సహాకనిపించే వారిలో జైనానికి సంభందించి పార్శనాధుడు పోలికలున్నాయి. జైనబసదుల్లోనూ ఇటువంటి పూజలు జరిగేవిధానం వుంది. అయితే జైనంలో దిగంబరత్వం వుంటుంది. బౌద్ధంలో వస్త్రధారణ కనిపిస్తుంది కానీ ఈ బొమ్మలలో వస్త్రదారణ వున్నది లేనిదీ స్పష్టంగా తెలియటం లేదు.
దెబోగా గృహాలు
రాతిగుండు నుంచి మరికొంత పడమటి దిశగా వెళ్ళి చూస్తే గుట్టపై కొంచెం ఎత్తులో ఈ రెండు గుహలూ కనిపిస్తాయి. దెబోగా గుహలు అంటే అదృశ్యశక్తులున్న మాంత్రికగుహలని ప్రాచుర్యంలోకి వచ్చిందీపేరు. ఇసుకరాతికొండలో తొలచిన ఈ గుహల్లో ఒకదానిపై 1986 లో గుట్టమీదనుంచి ఒక పెద్దరాయి దొర్లుకుంటూ వచ్చిపడటంతో ఒక గుహ పాక్షికంగా ధ్వంసం అయ్యింది.
ఎనిమిదడుగుల ఎత్తుతో పన్నెండడుగుల వెడల్పు
ఆరడుగుల వెడల్పుతో గుహలు చక్కటి గదిలా వున్నాయి. ఆరడుగుల ఎత్తులో మూడున్నర అడుగుల వెడల్పున్న రాతి ద్వారాలున్నాయి. ద్వారాలు మూసేందుకు కూడా ఏదో ఇరుసులు లాంటివి తిప్పారనేందుకు గుర్తుగా రెండు పెద్ద గుంటలవంటివి కూడా వున్నాయి. ద్వారాలకు ఎదురుగా ప్రధాన విగ్రహరూపాలు ధ్వంసం తర్వాత కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే రూపం పోల్చుకునేలా తెలుస్తున్నాయి. వైష్ణవ సంప్రదాయంలా కనిపిస్తున్న విగ్రహాలలో మధ్యలో పురుషదేవుడు ఆయనకు రెండువైపులా దేవేరుల విగ్రహాల్లాగా వున్నాయి. ఆభరాలు దండిగా వేయబడివున్నాయి. పైగా కుడిఎడమల వున్న గోడల్లో ద్వారపాలక విగ్రహాల్లాగా రెండు నిలువెత్తు విగ్రహాలున్నాయి. కానీ అవి తర్జని చూపిస్తూ ద్వారపాలన చేస్తున్నట్లుగా కాక ముకుళిత హస్తాలతో భక్తభంగిమలో కనిపిస్తున్నాయి. ఎక్కువగా జనసంచారమేమీ లేకపోవడం వల్ల పురుగులూ, పాములూ దీన్ని ఆవాసంగా చేసుకున్నట్లున్నాయి. ఆ తర్వత చూస్తే అంతే మందం వున్న పాము కుబుసాన్ని కూడా ఆ గుహలో… రెండవ గుహలో అక్కడక్కడ పురాతన సహజరంగుల ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి.
కొత్తగూడెం మండలంలోని కారుకొండ రామవరంలో దెగోబా గుహాల ప్రాంతంలో బంగారు నాణేలు దొరికాయని, 40 బంగారు నాణేల నిధి పగిలిపోయిన కాంశ్యపేటికలో దొరకాయట. ప్రాధమిక పరిశీలనలో ఇవి విజయనగర కాలానికి చెందినవిగా భావిస్తున్నారు. ఈ మొత్తం నాణేలను రెండు రకాలుగా విభజించవచ్చు. 15 రకం శ్రీకృష్ణదేవరాయల కాలం(1530-1542) కాలం నాటివి రెండవ రకం విజయవాడ బౌద్ధశ్రీ ప్రదర్శనశాలకు తరలించారు నేలకొండపల్లిలో దొరికిన కోట్లాది రూపాయిల విలువచేసే బుద్దవిగ్రహంతో పాటు ఇవికూడా. ఇప్పటికి అక్కడే ఉన్నాయి. ఆ నాణేలు విజయనగర కాలం నాటివని వాటిపైనున్న లిపి మరియు సంకేతాల ఆధారంగా రెండవ రకమైన బంగారు నాణేలు రెండుతలల గండభేరుండ పక్షి రకానికి చెందినవి. బొమ్మ వైపు దీనిలో రెండుతలల గంఢభేరుండ పక్షి పైపైకి ఎగురుతున్నట్లుగా చిత్రించి వుంది. ఇవి కూడా గుండ్రని నాణేలే గండభేరుండ పక్షికి రెండు వైపులా ఒక్కో ఏనుగును చిత్రించారు.
పక్షి తన తోక్కరు కాళ్ళను క్రిందవైపున అనించి వుంచింది. రెండు మెడలనూ కలుపుతున్న దగ్గర ఒక కంఠాభరణం వంటి నిర్మాణం వుంది.బొరుసు వైపు గమనిస్తే శ్రీవ్రతాపాచ్యుతరాయ అనే అక్షరాలున్నాయి. అయితే ఇక్కడ విజయనగర రాజ్యపు కాలంలో విరివిగా పూజారికాలు జరిగేయని భావించవచ్చు బహుశా ముడుపులుగా వేసినవో లేదా ఏదైనా నిర్మాణం కోసం వాడిన నాణేలో భూగర్భంలో కలిసి ఇప్పటికీ దొరికి ఉంటాయి. విగ్రహాలు శిథిలమైన విధానం చూస్తే కేవలం వాతావరణ కోరివేత వల్లమాత్రమే అవి ధ్వంసం అయినట్లు అనిపిస్తుంది. ప్రత్యేకంగా శత్రువు మూకల దాడిలో ధ్వంసం అయినట్లు అర్థమవుతుంది.
సీతమ్మ పాదాలు:
కొత్తగూడెం నుంచి ఇల్లెందు వెళుతున్న బైపాస్ రోడ్ లోనే కారుకొండ గుట్టకు ఉత్తరదిక్కున రోడ్డుమీద సీతమ్మ పాదాల పేరుతో రాతిమీదున్న ముద్రలను పూజిస్తున్నారు. పెద్ద రాతిమీద వస్తువులను అరగదీయటం వల్ల ఏర్పడిన నున్నటి గుంటలు మూడు వున్నాయి. వాటి పక్కనే నునుపు దేలిన పొత్రంవంటి రాళ్ళు కూడా కనిపిస్తున్నాయి. రాతిపనిముట్లకాలంలో ఆదిమానవుడు ఉపయోగించిన పనిముట్లమాదిరిగా కనిపిస్తున్నాయి. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో ఎప్పటినుంచో జీవరాశి ఉండేదని ఆదిమానవులు ఈ ప్రాంతమంతా తిరిగాడారని ఇప్పటికే అనేక నిర్దిష్ట ఆధారాలతో నిరూపించబడింది. ఆదిమానవుల ఆవాసాలకు జంతువుల నుంచి ఎండా వానల నుంచి రక్షించుకునేందుకు ఇలా చక్కటి కొండ పక్కనే వాగు ఉండటం ఎంతైనా ఉపయోగకరమైన అనువైన ఆవాసం అవుతుంది. సహజంగా జాయిన్ కానీ ఆ తర్వాతే బౌద్ధం కానీ ప్రాథమిక ఆవాసాలను ఆధారంగా ఆలంబనగా చేసుకునే వారి వారి బసదులను పునర్మించారు. వాటిని ధ్వంసం చేస్తూ తదనంర కట్టడాలు ఏర్పడ్డాయని చరిత్ర చెబుతున్నది. సీతమ్మ పాదాలుగా పిలువబడుతున్న ప్రాంతం కారుకొండ గుట్ట ఉన్న ప్రాంతం హేమాచంద్రాపురం అని పిలుస్తున్నారు.
గ్రామ దేవతగా సనాలమ్మ పూజలందుకునేది ఇక్కడే.ఏదో రాయి తెచ్చి పసుపు కుంకుమ బొట్లు పెట్టి దర్శనం పెట్టేస్తున్నారు. కొంచెం లోతుగా పరిశీలిస్తే గ్రామదేవతలు చాలా పురాతన సంస్కృతికి నిలువెత్తు సాక్షాలు మాతృ స్వామ్య వ్యవస్థ కాలములో ప్రారంభమైన అమ్మదేవతల ఆరాధన పురుషాధిక్య సమాజపు కట్టడులనుతట్టుకుంటూ నిలబడి అనేక ఆనవాళ్ళను మనకోసం అందించేలా చేసింది ఈ గ్రామదేవతలు, సప్తమాత్రుకలు, గిరిజన దేవతలు వంటి వారే. అలాగే సమ్మక్క, సారలమ్మలు కాకతీయ సామ్రాజ్యంలో ప్రతాపరుద్రుడిని ఎదిరించి నిలబడిన శౌర్యాన్ని రెండెళ్ళకొకమారు వచ్చే జాతర ఆధారంగా గుర్తుపెట్టుకుంటున్నాం. కానీ ముసలమ్మ, నాగులమ్మ, నడాలమ్మ, బాపనమ్మ వంటి కోయ నారీమణుల గురించిన కథలు వరంగల్, ఖమ్మం జిల్లాలలో ఆ సరిహద్దుల్లో వున్నాయి. కానీ ఆ కథలను చెప్పేవారు దొరకటం లేదు. పటం కధలు కులపురాణాల్లాగా కోయలలో డోలీలు కోయభాషలో ఆయాకథలను చెప్పేవారు. కానీ ఇప్పుడు అటువంటి వారే కనిపించడం లేదు. పైగా పోలవరం పేరుతో అత్యంత ఆదివాసులను ఉన్నచోటునుంచి తరలిస్తున్నాం. తిండి నీరు ఆవాసం దొరికేలా చేయగలమేమో కానీ వారి నరనరాల్లో ఇంకిపోయివున్న సంస్కృతి వారి తరంతోనే చచ్చిపోకుండా కాపాడుకోవడం ఈ తరం పైన ఉన్నది.
ఈ సడాలమ్మ కథకూడా ఎక్కడో ఏ గిరిజన డోలీ మెదడులో బ్రతికుందో వెతికి చెప్పించుకోలేకపోతే అది అతనితో పాటే చితిలో నిశ్శబ్దంగా కాలిపోవడం ఖాయం. పినపాక ప్రాంతంలోనూ సడాలమ్మ జాతర వసంతకాలం తో జరుగుతుంది. వనదేవత రాక సందర్భంగా లక్ష్మీదేవిని తోడ్కొని వెళ్లి కొండ ప్రాంతంలో వన దేవతకు ఎదుర్కోలు పలికి డప్పువాయిద్యాలతో గద్దెకు తరలించడం.. వనదేవత రాక సందర్భంగా పెద్దవాగు వద్ద సంతాన ప్రాప్తి కోసం అధిక సంఖ్యలో మహాళలు వేచి ఉండగా గిరిజన పూజారి వడ్డే వన దేవతను గిరిజన మహిళలు పైనుంచి తోడ్కొని వెళ్తారు. తమకు ఆ వనదేవత దీవనెలు అందినట్లు భావిస్తారు. ఆ తర్వాత భక్తులు కానుకలు, బెల్లం, మొక్కుబడులను దేవతలకు సమర్పించుకుంటారు. రాత్రి వనదేవతను, నడాలమ్మ తల్లిని గోదావరికి తరలించి అక్కడ పుణ్య స్నానాలు చేయించి మళ్లి గద్దె పైకి తోడ్కొని రావడం అనేది గిరిజన ఆచారంగా పినపాక ప్రాంతంలో జరుగుతుంది.
తెలివికల్ల చిన్న కోడిపుంజు
రేనార్డు అనే నక్క ఆకలితో ఉంది. వాతావరణం వసంతం వలె వుంది నిజమే, కానీ అది డిసెంబరు. ఆ నక్క తన ఆహారం కోసం అడవిలోకి వెళ్ళాలని అనుకోలేదు. సూర్యోదయానికి ముందే అది లాక్ వుడ్ వాకిలిలోకి దూరి దగ్గరలోనే ఉన్న కోడిపెట్టను మొరటుగా నోట కరుచుకుని వెళ్ళిపోయింది. ఆ కోడిపుంజు నిద్రావస్థలో ఉండి కనులు మిటకరిస్తూ ఆ నక్కను చూసింది. మరుసటి రోజు ఆ నక్క మరో కోడిపెట్టను పట్టుకుపోయింది. మూడవరోజు ఇంకొకదాన్ని. అక్కడ మిగిలిన కోడిపెట్టలు కోడిపుంజును కోపంగా నువ్వు దీని గురించి ఏదైనా ఎందుకు చేయవు అన్నాయి. ఆ రైతు ఆ స్థలంలో కొన్ని వలలు ఏర్పాటు చేసాడు. కానీ అవి నక్క చిక్కడానికి అంత పెద్దగా ఉపయోగపడలేదు. కానీ నాల్గవ రాత్రి కోడికి ఇష్టంలేని నక్క రాక కోసం తగిన ఏర్పాటు చేసింది. అది ఒక గుడ్ల గంప కొమ్మ మీద పెట్టి ఎదురు చూస్తుంది. నక్క వచ్చి నోరు తెరవగానే కోడి గంపను దాని మీద పెట్టింది. ఆ గుడ్లు నక్క ముఖం మీద పడి చితికిపోయాయి మరియు ఆ గంప దాని తలమీద పడింది. ఆ నక్క గంప నుండి తల బయటికి తీసుకోకముందే కోడిపుంజు పిచ్చిదానిలా అరవటం మొదలెట్టింది. నన్ను ఇంతముందే లేపటం ఎందుకోసం అని రైతు గులుగుతూ మంచం మీదినుండి లేచిండు. వెంటనే అతను నక్క తన తల గంపనుండి తీసే ప్రయత్నంలో గుడ్ల సొనతో కండ్లు మూసుకుపోయాయి. వెంటనే నక్క చర్మపు ముక్కలు కింద పడ్డాయి. కోడిని యజమాని ఎప్పుడు కూడా కోడికూర వండనని వాగ్దానం చేసాడు. అందువలన అది జీవితాంతం కోళ్ల గూటికి యజమానిగా ఉండిపోయింది.
నక్కను పట్టించిన లాక్ వుడ్ కోడిపుంజు తను చేసిన పనికి గర్వపడుతూ, ఇకనుండి తను ఎందులోనైనా తన అభిప్రాయం తెలుపవచ్చు అనుకుంది. పెట్టెలకు ఏ ఆహారం ఇవ్వాలో, టీవీలో రైతు ఏ ప్రోగ్రామ్ చూడాలో ఏ ప్రోగ్రామ్ చూడవద్దో తన అభిప్రాయం తెలిపింది. మొదట్లో లాక్ వుడ్ కోడిపుంజు సలహా వినాలనుకున్నాడు. ఎందుకంటే కోడిపుంజు ధైర్యం కలది, మంచిది. నక్కను కూడా పట్టించింది కాబట్టి. అది తన పక్కింటి యజమాని కూతురు వూలీతో ప్రేమలో పడింది. ఎంత తొందరగా వీలైతే అంత తొందర ఆమెను వివాహమాడాలి అనుకున్నాడు, కానీ ఈ వివాహానికి పుంజు ఇష్టపడలేదు. చూడు ఇక్కడ ముసలి కొడుకు, అతను రైతుతో బదులుగా విల్ కిన్స్ కూతురును ఎందుకు వివాహం చేసుకోవు? ఆమె చాలా అందగత్తె మరియు మంచి గుణవతి మరియు ఆమె కోళ్ళ పెంపకంలో దిట్ట. నా అభిప్రాయం ఏమిటంటే ఆ పక్కింటి అమ్మాయి చాలా చెడు లక్షణాలు కలది అని నీవు తెలుసుకోవాలి. ఆ రైతు అటువంటి వారితో ఉండాలనుకోలేదు. అతను అతను నోరు మూయకుంటే తన మాట మార్చి పుంజును పులుసు పెడతానని భయపెట్టినాడు. పుంజు అందుకు భయపడలేదు. ఇంకా చెప్తూనే ఉంది. ఆమె ఇంటిని శుభ్రంగా వుంచుకోదు మరియు గ్రామంలో తెలివైన అమ్మాయి కూడా కాదు. ఒకవేళ అతడు శాశ్వతంగా వెళ్ళిపోతే, కానీ లాక్ వుడ్ అందువల్ల పాట్టీ విల్ కిన్స్ కు బదులుగా వివాహమాడుతానని వాగ్దానం చేశాడు. కావున వివాహం జరిగింది. రైతు మరియు అతని కొత్త భార్య ఎంతో సంతోషంగా తృప్తిగా ఉన్నారు. వారు తెలివిగల పుంజుపై గౌరవంతో ఉన్నారు. అందువల్ల పుంజు గర్వమునకు అంతు లేకుండా పోయింది.
ఒక కృతజ్ఞత లేని రాకుమారుడు
గోల్డన్ లాక్ అనే రాకుమారుడికి ఒక బిడ్డీ అనబడే నర్సు ఉన్నది. ఆమె అతడిని ఊయలలో ఊపేది, నిద్ర పుచ్చేందుకు శ్రావ్యమైన పాటలు పాడేది. తన చంకలో ఎత్తుకొనేది. బంగారు తల వెంట్రుకలను దువ్వేది. ఆమె అతనికి మొదటి మాటలు మరియు పాటలు నేర్పింది. తోటలోకి తీసుకొని పోయి ఆహ్లాదకరమైన ఆటలు చూపేది. వారు ఒకరికొకరు అలవాటైనారు. కానీ ఆ యువరాజు ఎప్పుడైతే యువకుడైనాడో, అతనికి చదువు ప్రొఫెసర్లతోనే నేర్పించాలని అతని తండ్రి నిశ్చయించాడు. బిడ్డీ ఇక అవసరం లేదు, ఆమె ఎక్కడికైనా, ఇష్టమొచ్చిన చోటికి పోవచ్చు. కానీ రాజభవనంలో ఇక ఆమె అవసరం లేదు. ఆమె మునుపటి వలె యవ్వనంలో లేదు, ఉల్లాసంగా లేదు. ఇది వాస్తవం. కానీ కానీ ఆ యువకునికి ఏ ఇబ్బంది కలిగినా ఆమె హృదయం ద్రవించి పోయేది. అతనికి ఇబ్బంది కలిగినపుడు అతడిని ఓదార్చేది, మంచి విషయాలు చెప్పి సుఖ పెట్టేది.
కానీ ఆ రాకుమారుడు ఆమె దయను త్వరగానే మరచిపోయాడు. అతను వెంటనే పెరగాలని అనుకున్నాడు. ఆమె ఆ ఇంట్లోనే వుండేందుకు తండ్రితో ఒక్కమాట కూడా చెప్పలేదు. వారు ఆమెను బయట చలి, అననుకూలమైన వాతావరణంలోకి పంపేశారు. ఆమె రాచ తోటలు దాటి ముందుకు పోలేక పోయింది. ఆమె అక్కడ బాధతో మెత్తని కొమ్మలు కలిగిన వృక్షముగా (Crooked Willow)మారిపోయింది. వెంటవెంటనే రాకుమారుడు ఏదో తనకు బాగా ఇష్టమైనది కోల్పోయినట్లు అనుకున్నాడు. అతను తన ముదుసలి నర్సును చూసేందుకు బయటకి పరుగెత్తాడు. కానీ ఆమె కనబడలేదు. కానీ అప్పటినుండి తన అన్ని బాధలను ఆ విల్లో చెట్టుకు రహస్యంగా చెప్పేవాడు. అతనికి ఎప్పటికి ప్రపంచంలో తనను అర్థం చేసుకున్నది ఆ వంగిపోయిన ముసలి చెట్టు మాత్రమే నని అనుకునేవాడు.
ఆమె అవసరం తీరాక ఆమెను దయాదాక్షిణ్యం లేకుండా బయటికి పంపడం క్షమించరాని నేరం కదా!
ఒక చెరువు దగ్గరలో ఒక కొంగ మరియు దానికి దగ్గరలోని అడవిలో ఒక నక్క ఉండేవి. అవి మనమిద్దరం దగ్గర దగ్గర ఉండేవాళ్ళం కదా, కాబట్టి మనం ఒకరికొకరం పిలిచి విందు చేసుకుందాం అని అనుకున్నాయి. మొదటగా నక్క విందుకు పిలిచింది. ఎంతో మర్యాదగా నక్క కొంగను తన ఇంటికి పిలిచి ఒక ప్లేటులో రుచిగల పదార్థాలు పెట్టి ఇక తినుమని ప్రేమతో కోరింది. కొంగ తన పొడుగు మూతితో ఎక్కువగా తినలేకపోయింది. కానీ నక్క మాత్రం గబగబా తినేసింది.
తర్వాత రోజు కొంగ తగిన విధంగా మర్యాద చేయాలనుకుంది. ఎంతో మర్యాదగా నక్కను కొంగ తనింటికి విందుకు పిలిచింది. ఒక టేబుల్ మీద ఒక సన్నమూతి కూజాలో పాయసం పోసి నక్కను తినమని కోరింది. కొంగ తన సన్నని పొడవైన మెడతో కూజాలో మూతిపెట్టి పాయసం మొత్తం తినేసింది. కానీ నక్క ఆ కూజాలో మూతి పెట్టలేక టేబుల్ చుట్టూ తిరిగి తిరిగి కొంచెం కూడా పాయసం తినలేకపోయింది. ఈ విధంగా కొంగ, నక్కకు సరైన గుణపాఠం నేర్పింది.
ఇదే అవి ఒకరికొకరు విందుకు ఆహ్వానించడం చివరిసారి అయ్యింది.
నీవు ఇతరులకు ఎలా మర్యాద చేస్తావో, అదే తీరు మర్యాదను నీవు పొందుతావు.
(ఈ కథ 365 గుడ్ నైట్ స్టోరీస్ లోని 23 జనవరి ది)
