మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
పుస్త‌క స‌మీక్ష‌

బాలల అనువాద కథలు

by ఒద్దిరాజు మురళీధరంరావు July 30, 2023
written by ఒద్దిరాజు మురళీధరంరావు

మూలం:- డా॥ బి.జి రమేష్ గారు.
అనువాదకులు:- ఒద్దిరాజు మురళీధర్ రావు గారు.

పాశ్చాత్య దేశాలతో పోల్చుకున్నప్పుడు మన తెలుగు భాషలో బాలలసాహిత్యం తక్కువనే చెప్పాలి. ముఖ్యంగా ఉన్న ఆ కొద్ది రచనలు పిల్లలకు చేరువ కావడం లేదు.. దానికి కారణం
” తిలాపాపం తలా పిడికెడు” అన్నట్టు సృజనాత్మక త అంతగా లేని మూస విద్యావిధానంలో విద్యార్థులు “హోం వర్కు” తోనే అధిక సమయం మరియు అధిక భారంతో గడపడంతో సమయం లేక పోవడం, తల్లిదండ్రులు ఉద్యోగస్తులైతే ఇల్లు చేరే సరికే పిల్లలు నిద్రలోనూ…. నిద్రావస్థలో ను ఉండడం, ముఖ్యంగా కొందరు తల్లులకు పిల్లల చేత ఎలాంటి పుస్తకాలు చదివించాలనే ఎంపికలో అవకాశాలు లేకపోవడమనే నాకనిపిస్తుంది… ఆ లోటు పూడ్చడానికా? అన్నట్టుగా డా.బి.జి రమేష్ గారి ఆంగ్లంలో రాసిన పిల్లల కథలు విలువలు నేర్పే దిశగా సాగాయి.

మూల రచయిత రమేష్ గారు కన్నడ ప్రాంతానికి చెందిన రచయిత, మైసూరు జిల్లా లోని హోనాసోగే గ్రామానికి చెందిన వారు. వీరు ఎన్నో గ్రంథాలను రచించారు. అందులో ఈ ” Bed time stories ” అనే కథల పుస్తకాన్ని గౌరవనీయులు ఒద్దిరాజు మురళీధర్ రావు గారు తేలిక తెలుగు భాషలో పిల్లలకు ఎవరి సహాయం లేకుండానే అర్థమయ్యేటట్టు గా అనువదించారు.
అనువాదం చేయడం అంత సులువేమీ కాదు. ఒక భాష వస్తే సరిపోదు! అక్కడి కథను ఇక్కడ అన్వయిస్తూ చెప్పాలి. ఎందుకంటే మూలంలోని పరిసరాలు, అక్కడి సంస్కృతి, సంప్రదాయాలువేరు. అయినా వాటికి లోటు లేకుండా… మూల రచయిత భావం, సహజత్వం చెడకుండా తనదైన భాషా శైలి లో బాల బాలికలకు అందించడం కష్టమే అయినా మురళీధర్ రావు గారికి ఇదివరలో రవీంద్రనాథ్ ఠాగూర్, లియో టాల్స్టాయ్ వంటి రచనలను అనువదించిన అనుభవం ఉంది. అంతేకాదు మూల భాష మరియు లక్ష్య భాష రెండూ చక్కగా తెలుసుకాబట్టి మూలంలోని విషయం చెడకుండా కథలంటే ఇష్టపడే చిన్నారులకుచక్కగా అనువదించ�

July 30, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

మనిషి కోసం తపన

by A, Gajender Reddy July 20, 2023
written by A, Gajender Reddy

వారాల ఆనంద్ రచనల్లో ‘మానేరు తీరం’ విలక్షణమైంది. ‘ప్రవాహం పయనమై సముద్రాన్ని చేరుతుంది. అవును. పరుగులెత్తడం తెలిసిన ప్రవాహం నేలతల్లిని ఆర్తిగా తడుముతూ గమ్యం వైపు సాగిపోతుంది” అంటూ ప్రారంభమౌతుంది. మరి మనుషుల్లో – ప్రవాహం తెలీని బతుకుల్లో మాటలు కోటలు దాటుతాయి, చేతలు సాగిలబడతాయి, గమ్యం గాభరా పడుతుంది.
నేడు మనుషుల్లో సహజత్వం క్షీణిస్తున్నది. నటన పెరుగుతున్నది. మనసుల్ని భూస్థాపితం చేసి లోకం వేదికపై దర్జాగా నటించేస్తూ బతికేస్తున్నామని, మానవీయ విలువల కంటే ఎక్కువగా కుహనా అవసరాలపై మక్కువను పెంచుకున్నామని అంటాడు. మనం ఎంత ఉదాసీనులమై పోయాం! “యథాలాపంగా ఊపిరి తీసుకుంటున్నట్లుగానే మనం లోకం కేసి చూడ్డం అలవాటు చేసుకుంటున్నాం. తూర్పు పడమరై పోయినా, ఆకాశం విరిగి మీద పడ్డా, ప్రవాహం ఎదురు తిరిగి దిశ మార్చుకున్నా, మనుషులు మమతానురాగాల్ని పోగొట్టుకున్నా, మానవతా విలువలన్నీ కట్టగట్టుకు కొట్టుకుపోయినా, స్నేహం నిర్దయగా స్వార్థమయి పోయినా, అవసరం మనిషిని ఆటవికున్ని చేస్తున్నా, మనిషి విలువ వినియోగ వస్తువై పోయినా మనం ప్రేక్షకునిలా అలా గంభీరంగా చూస్తూ మన బతుకు మనం బతికేస్తున్నాం”.
ఇప్పుడంతా లౌక్యం యాంత్రికత్వం కృత్రిమత్వం. మనిషన్న మాటకి అర్థం మారి యంత్రాలకు పర్యాయపదాలుగా మారుతున్నాం. మనల్ని మనం వదిలేసుకొని పరుగులు తీస్తున్నాం. ఎవరి కోసమో దేనికోసమో తెలీకుండానే చేస్తున్న పనిలో ఎవరికి ఆనందముంది? మనది కాని మనకోసం కాని బతుకు వేరేవారి నియంత్రణలో వేరెవరి లాభం కోసమో ఉక్కుచట్రంలో బిగించ బడి పరుగు తీస్తున్న బతుకు దేనికి? చరిత్రగతిలో ధూళిలా రాలిపోవడం తప్ప, అనంతయాత్రలో ఆనవాలు మిగల్చకుండా సాగిపోవడం తప్ప ప్రయోజనమేముంది? అని ప్రశ్నిస్తాడు ఆనంద్.

సమాజం దాకా ఎందుకు? ఇద్దరు కలిస్తే ప్రేమగా అభిమానంగా పలకరించుకుంటున్నారా? ఎన్ని దూరాలు, ఎన్ని అనుమానాలు? ఇద్దరు మనుషుల మధ్య రెండు మనసుల మధ్య రెండు ఆలోచనల మధ్య ఎడం నిజంగా ఎంత ఘోరం? అంటూ ఒకే మనిషిలోని అంతర్ బహిర్ తత్వాల మధ్య ఎడాన్ని కూడా ఉటంకిస్తాడు. ఆనాటి ఆ స్నేహాలు ఏవి? సెలవులకి ఊరికి పోయి వచ్చిన అనుభవాల ముచ్చట్లు అందరం కలిసి పంచుకోకుండా కాలు నిలిచేదా! కాలం నడిచేదా? అని గుర్తు చేస్తాడు. నేడు ప్రతిక్షణం అవిశ్వాసాన్ని మోస్తూ చివరి అంచుకు ఎలా చేరగలం? అందుకని ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉందో కూడ చెప్తాడు. ఆనంద్. “మనం ఒకరికి ఒకరంగా సాటి మనిషిగా స్నేహం పంచుకోవాల్సి ఉంది. అభిమానాన్ని పెంచుకోవాల్సి ఉంది. ప్రేమను నింపుకోవాల్సి ఉంది. మనల్ని మనం అర్థం చేసుకోవాల్సి ఉంది. శ్వాసలో విశ్వాసాన్ని నింపుకోవాల్సి ఉంది.” ఇద్దరి మనుషుల కరచాలనంలోంచి స్నేహం ఉరకలెత్తాలని, రెండు చూపుల ఆరాధనల్లోంచి ఆప్యాయతలు వెల్లివిరియాలని కోరుకుంటాడు. మమేకత్వం మనల్ని మనుషుల్ని చేస్తుందని భావిస్తాడు. ఎక్కడ మనిషిని తూచకుండా మనిషిలా చూస్తారో అక్కడిదాకా ఏకబిగిన నడిచిపోవాలనీ, పరుగులు

తీయాలనీ ఆనంద్ మనసు మానేరులా ఉరకలు వేస్తుంది. సాగిపోతున్న కాలంలో ప్రతిక్షణం ఓ నూతన శకానికి నాంది పలకాలి. ఓ సరికొత్త ఆలోచనకి అనుభూతికి తొలిమెట్టు కావాలి. మనిషిని చిగురింపజేసే, మనసుని పురివిప్పదీసే నూతనోదయం కావాల్సిందే, మనిషి మనిషిగా మిగలాల్సిందేనని ఆకాంక్షిస్తాడు.

మౌనం, మాట, మరుపు, మనసుల గురించి ఆనంద్ చెప్పిన వాక్యాలు ఆణిముత్యాలు. వినగలిగితే మౌనంలో కోటి గొంతుకల రవాన్ని పెదాలు వినిపిస్తాయి… నిశ్శబ్దాన్ని నిక్షిప్తం చేసుకొని భావ తరంగాల్ని మోస్తూ సాగే మౌనం ఖచ్చితంగా అర్థవంతమయిన సంభాషణమే. మాట ఎగసిపడే భావనా తరంగం. జాలువారే ఆత్మీయతా ప్రవాహం. మాట మనసులో ముంచితీసిన అనుభూతి ప్రతిబింబం. మాట పలికితే గుండెల్నినట్టుంటుంది. మనిషికి మరపు వరం. మనిషి కదలికకే మూలం. గతంలోని బాధామయ అనుభవాల్ని మరువకుంటే వర్తమానం భయంకరమవుతుంది. అట్లాగే గతకాలపు సంతోషంలో కొట్టుకుపోతూ ఉంటే భవిష్యత్తు బాధామయమవుతుంది. మనిషి మనస్సు అనురాగపు ఆర్ద్రతను ఆశిస్తుంది. తనను తానుగా గుర్తించే తోడును కోరుకుంటుంది. ఎవరి ఊహయితే ఉరకలు పెట్టిస్తుందో ఎవరి స్నేహమయితే ఆనంద తీరాన్ని చేరుస్తుందో ఎవరి తోడయితే సంతోషపు సముద్రాల్లో ఈదులాడిస్తుందో ఆ తోడు కోసం స్నేహం కోసం ఆ ఆలంబన కోసం మనసు తహతహ లాడుతుంది.

ఇంకా “శిశువు కెవ్వుమన్న పిలుపులో జీవన పోరాటపు ప్రతిధ్వని వినిపిస్తుంది” “ఆకాశం వేయి వెలుగుల సూర్యునికి మాతృమూర్తి… ఆకాశం మనకు నేస్తం… మొత్తంగా శూన్యం తాత్కాలికం.. చేతనే శాశ్వతం” వంటి చైతన్యం వైపు మనిషిని నడిపించే మహా పంక్తులు మనల్ని వెన్నాడుతాయి.

ఈ పుస్తకానికి విశ్వేందర్ రెడ్డి అందించిన ముఖచిత్రం, లోపలి పేజీలలో కల్యాణం శ్రీనివాస్ గీసిన భావగర్భితమైన బొమ్మలూ మనల్ని ఆకర్షిస్తాయి. ‘మానేరు తీరం’ వారాల ఆనంద్ హృదయం ద్రవించి, మేధస్సును మధించి, మనిషి కోసం తపించి రాసిన గ్రంథం.

ప్రతులకు : వారాల ఆనంద్

9440501281

July 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

ఆటా కార్యక్రమం – యు.ఎస్.ఏ

by A. Venugopal July 20, 2023
written by A. Venugopal
July 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

తరుణి యూట్యూబ్

by mayuukha July 20, 2023
written by mayuukha

తరుణి యూట్యూబ్ చానెల్ ను చూడండి, మీరు తప్పకుండా నచ్చుతారు. తొలి ప్రయత్నం ఇది . మీ సహకారం అందించండి. ఈ చానెల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి . లైక్ చేయండి, షేర్ చేయండి !థాంక్యూ – డాక్టర్ కొండపల్లి నీహారిణి, కవయిత్రి, రచయిత్రి, సాహిత్య విమర్శకులు, మయూఖ అంతర్జాల పత్రిక,
తరుణి పత్రిక ల వ్యవస్థాపకులు, సంపాదకులు .

https://youtube.com/@Tharuni-women

July 20, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

తెలివిగల చాప

by కూకట్ల తిరుపతి July 20, 2023
written by కూకట్ల తిరుపతి
July 20, 2023 0 comment
1 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

ఉదయించే కవుల వారం ‘కవివారం’

by Aruna Dhulipala July 19, 2023
written by Aruna Dhulipala

కవివారం” – ముప్ఫయి ముగ్గురు కవులు, కవయిత్రులు రచించిన కవితా సంకలనంపై సమీక్ష – అరుణ ధూళిపాళ

కవిత్వం అంటే ఉబుసుపోక రాసుకునే ఏవో నాలుగు ముక్కల పదాల కూర్పు కాదు. ఏదో ఒక సమయంలో చలించిన మనసు అంతర్గతపొరల్లో నుంచి బయటకు పెల్లుబికే భావ స్పందన. అలా పుట్టినదే “కవివారం” కవితా పుస్తక మాలిక. ఇందులో ముప్పది ముగ్గురు కవులు రాసిన కవితలన్నీ చేర్చబడ్డాయి.. కరోనా మహమ్మారి కోరలు చాపక ముందు ఈ కవులంతా ప్రతీ సోమవారం ఏదో ఒక చోట చేరి, వారి వారి కవితలను చదువుతూ విశ్లేషించుకుంటూ ఆత్మీయ ముచ్చట్లను పంచుకునేవారు. కరోనాలో ఏమీ చేయలేని స్థితిలో ప్రతీవారం కలుసుకునే తపనను విడువలేక ప్రత్యామ్నాయంగా జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని యధావిధిగా వారి కవితా ప్రవాహాన్ని కొనసాగించారు. చదివే కవితలకు పుస్తకరూపం ఇస్తే అది ఉపయుక్తంగా ఉంటుందని భావించి దానికోసం అనేకానేక శ్రమలకోర్చి మన ముందుంచారు. ఈ విషయంలో సంపాదకులు కందుకూరి శ్రీరాములు గారు, బెల్లంకొండ సంపత్ కుమార్ గార్ల కృషి శ్లాఘనీయం.
‘కవివారం’ అనే పేరు వింటే ప్రతీ ఒక్కరికీ ఆశ్చర్యం కలుగక మానదు. సోమవారం నాడు ప్రత్యేకంగా ఉదయించే కవుల వారం అది. ఎక్కడ ఉన్నవారైనా, ఎటువంటి పనుల్లో వున్నా ఆ చోటునుంచే
అందరూ ఒక సుహృద్భావ వాతావరణంలో జూమ్ లో సమావేశమై వారి వారి కవిత్వ ధారలను ఒలికిస్తారు. అలా రూపొందించబడిన ‘కవివారం’ పుస్తకాన్ని తెలంగాణా కోసం అక్షరాల్ని, జీవితాల్ని త్యాగం చేసిన అమర సాహితీ వేత్తలకు అంకితం ఇవ్వడం వారి ఉదాత్త భావనను, కవిత్వం పట్ల వారికున్న అంతులేని అనురాగాన్ని తెలియచేస్తోంది. అందులోని అక్షర ఆణిముత్యాలను కొన్నింటిని చూద్దాం.
“పూలయినా కాయలైనా పండ్లయినా / రాల్చగలిగే నిబ్బరం చెట్టు” “కలలు కూల్చడానికి / కాలం సిద్ధంగా ఉంటుంది” డా. నందిని సిధారెడ్డి రచించిన ‘దూరభారాలు’ అనే కవితలో పంక్తులివి. కాదు జీవిత వాస్తవాలు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఋతుధర్మాన్ని పాటిస్తుంది చెట్టు నిబ్బరంగా. మనిషి కనే కలలు ఎప్పుడూ కాలానికి లోబడి కూలుతాయి. స్వీకరించక తప్పదు. మనమంతా కాలచక్రంలో తిరుగాడే బొమ్మలమే..అంటూ జీవన సత్యాలను చెప్పారు. అలాగే ‘వేడుక’ కవితలో “ఒప్పుకోరు గానీ/

పువ్వెనక పువ్వు తాంబాలంలో శిఖరం పేర్చే/ జానపద స్త్రీల చేతుల్లో ఏమికళ” అంటూ బతుకమ్మను పేర్చే కళానైపుణ్యాన్ని మెచ్చుకుంటారు.
‘గ్లోబల్ ఖడ్గం’ కవితలో “బొట్టు కాటుకలతో పాటు / ఏ రాష్ట్రపు ఐదో తనాన్నయినా డాలరే అమ్మగలదు. “గ్లోబల్ మూడవ హస్తం/ మానవ గోళం మీదే మార్కెట్ వలను విసిరింది “నాళేశ్వరం శంకరం రచించిన ఈ వాక్యాలు గ్లోబల్ వ్యవస్థ వల్ల వచ్చిన మార్పులు, ప్రపంచాన్ని డాలర్ శాసిస్తున్న తీరును కళ్ళకు కడతాయి. ఆ ఆవేదనతో “అనుక్షణం నేల కంట్లోంచి/ జారుతున్న జల పాత సవ్వడి/ నా బాహ్యాంతర మనో లోయంతా ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది” అంటూ వాపోతారు.
“పదం ఒక ముడి పదార్థం/ అదే ఒరిగిపోతుందో/ అదెట్లా ఒనగూరుతుందో” …”నీవు కవివి/ నీవు సృష్టికర్తవు ” ప్రతీ దాన్ని పసిగట్టిన మనసు/ జ్ఞాన గ్రంథమై రూపుదిద్దుకుంటుంది” ..అని ‘కవనభూమి’ కవితలో కవులు మనసుతో ఆలోచించాలంటూ భావంతో ఓడించాలని, కలంతో జయించాలని చెబుతూ కవి బాధ్యతను గుర్తు చేస్తూ పదమనే ముడి పదార్థాన్ని తన అంతరంగంలోంచి ఒక గొప్ప శిల్పంగా చెక్కాలని కందుకూరి శ్రీరాములు సూచిస్తారు. మామూలు పదాలు కవిత్వమవటమంటే/ ఒక అవయవం పనిని ఇంకో అవయవం చేయటమే/ అని కవిత్వం ఉండాల్సిన రీతిని చెప్తారు. ‘కళ్ళతో విను’ అనే కవితలో.
“గాయానికి సిద్ధపడ్డన్నాళ్ళు/ గాయం గాయ పరుస్తూనే ఉంటది/ బుద్ధికి జీవమిచ్చినాంక/ గాయం నీరు కారిపోతది”/ అంటూ ‘నేను’ కవితలో మనిషికి ఉద్బోధ చేస్తున్నారు డా. బెల్లంకొండ సంపత్ కుమార్. అడుగులు ముందుకు వేస్తూ నడవాలే కానీ గాయాలు అవుతున్నాయని వెనక్కు తగ్గకూడదు. బుద్ధి బలంతో ఆలోచిస్తే గాయం ఏమీ చేయలేదని మనలను ప్రోత్సహిస్తారు. ప్రపంచంలో మానవ సమాజం శాంతికి దర్పణంగా ఉండాలని ” ఏ పక్షం కానీ/ బతుకు పక్షం అయేదాక/ శాంతిని ప్రతిక్షేపిద్దాం”/ అని ” యుద్ధం రెండు దేశాల మధ్యనే జరగదు” అనే కవితలో కొత్త విలువల ఆవిష్కరణలను ఆకాంక్షిస్తారు.
కందాళై రాఘవాచార్యులు ‘చిప్పల బువ్వ’ కవితలో “బతుకంటే అర్థం పరమార్థం/ చిప్పకూడు తినేటోల్లకే సమజైతది” పూట గడవడం కోసం ఎన్నో తిప్పలు పడే పేదవాళ్లకు జీవితం అంటే ఏమిటో అర్థమవుతుంది కానీ పండితులకేం తెలుస్తుంది అంటారు. ‘తొమ్మిది గజాల చీర’ కవితలో ” అమ్మ ఇప్పుడు లేదుగని/ చెక్క పెట్టెల తొమ్మిది గజాల చీర/ మడతలు మడతలుగా/ అమ్మనే యాది సేస్తది”/ అంటూ ఆర్ద్రంగా అమ్మను గుర్తుచేసుకుంటారు.
కర్షకుడు తన శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసి, చివరకు ఓడిపోయి కన్నీరుగా కరిగిపోతున్నప్పుడు రూప్ కుమార్ హృదయం ద్రవిస్తుంది. దాంట్లో నుండి వెలువడిన కవిత్వం మన హృదయాలను తడిగా మారుస్తుంది. ‘ఒంటరీదైన పొలం’ అన్న కవితలో “తండ్లాడుతున్న ఆత్మను పంజరంలో పట్టుకొని/ ఏ చెట్టు కొమ్మకో వేలాడదీయడానికి”/…”కట్టె పొగలా తేలిపోతూ/ అతను వెళ్ళిపోతున్నాడు”/ అలాగే ‘ తెర తొలగిన దృశ్యాలు’ కవితలో దేహాన్ని వదిలిన ఆత్మ చీకటికి భయపడుతూ, కొడుకు చితికి నిప్పంటించగానే వెలుగులోకి పయనించినట్టు ఊహిస్తూ “బిడ్డా! తల కొరివిగా చితికి నిప్పంటించి/ నా మరో ప్రపంచాన్ని వెలుతురుమయం చేసావు/ ఇక భయం మరచి కాంతి మార్గం గుండా/ మళ్ళీ ప్రయాణం కొనసాగిస్తాను”/ అన్న మాటలు మనిషి జీవన సహజ స్వభావాలకు దర్పణాలు.
ఇక డా. కొండపల్లి నీహారిణి ‘నీళ్ళాట’ కవితను చూస్తే ప్రసవవేదనను అనుభవించి పిల్లలకోసం సమస్తం త్యాగం చేసే స్త్రీని వృద్ధాప్యంలో తన పిల్లలే తనను దూరం చేస్తున్న నేటి సమాజ స్థితికి ఆవేదన వ్యక్తం చేస్తూ “అప్పటి నీళ్లాట ఇప్పటి కన్నీళ్ళాట ఒక్కటైనట్టు/ ఇంత కనా కష్టంగయ్యిందా జీవన చక్రం”/ అంటారు. అంతేకాక ‘రినోవేట్ చేసుకుందాం’ అనే కవితలో “కాలం ఓ సమ్మోహనాస్త్రం/ ఋతుచక్రం మహా నియంత/ జీవితాన్ని/ మార్చగలదు – పూడ్చగలదు”/ జీవితం- కాల నియమాలకు, ఋతువులకు లోబడి ఉండక తప్పదంటారు. “రేపటి దేవులాటలో పల్లె/ ఒక పట్టలేని చరిత్ర/ చిత్రమవుతుంది”/ అకాలమైన వాతావరణ మార్పులకు పల్లెలు కన్నీటి ప్రవాహాలవుతాయని, రేపటి కోసం వెతుక్కునే పల్లె వేదన పట్టలేని చరిత్ర చిత్రంగా మారుతుందని అక్షరమై రోదిస్తారు.

జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు ఎదురైనా కొన్ని చిన్న చిన్న సంతోషాలు జీవితాన్ని చిగురింప చేస్తాయని చెప్తూ దాసరి మోహన్ ‘ఆనందాల పొట్లం’ అన్న కవిత” ద్వారా “జీవితం చిలిపిది/ చిన్ని చిన్ని ఆనందాలను/ పొట్లం కట్టుకొని పదిలపరచు కుంటది” అని ఆశావహ దృక్పథాన్ని అందిస్తారు. ‘నువ్వు మరణించలేదు’ అనే కవితలో “నువ్వు మరణించలేదు/ ఎక్కడో నోట వాక్యమై/ నిప్పును రాజేస్తూనే ఉంటావు”/ మరణం దేహానికే కానీ ఆత్మకు కాదన్నట్టు, కవి మరణించినా “నిండు సభలో చప్పట్ల సాక్షిగా/ చెంపలపై దొర్లిపోయే కన్నీటి కవనంగా”/ …మిగిలిపోతాడంటూ…”సుకవి జీవించు ప్రజల నాలుకలయందు”….అనే వాక్యాన్ని గుర్తుకుతెస్తారు.
“చెప్పలేదంటనక పోయేరు ఓ మిత్రులారా” అనే కవితా పంక్తుల్లో ” నీ బతుకు మారదు బరువు మారదు/ తలరాత మారదు జీవితపు నీ నడక మారదు/ అంటున్న వేణు నక్షత్రం. తేదీలు, కాలాలు మారినంత మాత్రాన జీవితం మారనప్పుడు కొత్త సంవత్సర శుభాకాంక్షలు ఏమని చెప్పాలంటూ మిత్రులతో వాపోతారు. ‘పరుగు పరుగు’ అనే కవితలో “జీవిత ముఖాన్ని చూసుకోవడానికి తీరికే లేదు” అని అవిశ్రాంత మనిషి మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని హెచ్చరిస్తారు.
‘అమ్మ అంటే’ అనే కవితలో ” అనివార్య పరిస్థితుల్లో/ కన్న పేగును సైతం పేలిక కింద/ చెత్త కుప్పల పైన పారుతున్న మురికి కాలువలలో/ వదిలివేస్తున్నారన్న విషయాన్ని దృశ్యమానం చేస్తూ అలాంటి స్థితిలో ఆడవారి నిస్సహాయత పేగు బంధాన్ని కూడా తెంచుతుందని ఆవేదన చెందుతారు వేణుశ్రీ. ‘నేనిపుడెవరిని’ అన్న కవితలో “నరనరాలలోని నారక్తం /
నాది కాకుండా పోతుంది”/ అని ప్రయివేటీకరణను మరణ సముద్రంగా పేర్కొంటారు.
‘తరుగుతో మెరుగు’ అనే కవితలో “రుతువుల సత్యం నిండిన పాఠం/ నాలో గుణపాఠం ఎప్పుడు మొదలైంది/ కాటేసినప్పుడేనా ఈ పాట్లన్నీ/ చలించుట ప్రకృతి ఎప్పుడు నేర్చుకుంది”/ ఇలాంటి వాక్యాలతో సహజసిద్ధంగా జరుగుతున్న వాటన్నింటికీ కారణం ఏది? మంచి చెడులు అన్నింటినీ ఆస్వాదిస్తూ ఉండాలని చెబుతూ, రాలిన ‘మామిడి పండు మధురం/ రాలి పడే మరణంలో ఎందుకు ఉండొద్దని ప్రశ్నిస్తారు అహోబిలం ప్రభాకర్. ‘బరువు ముల్లె’ అన్న కవితలో “ఈడికి పంపినోడవు/ ఇన్ని కొట్టివేతల/ వెతలెందుకు/ ఈ డొక్క నింపనీకి/ ఎంత దద్దరిల్లుదు”/ అంటూ పొట్టకూటికి పేదలు పడే పాట్లను గురించి ఆవేదన వ్యక్తం చేస్తారు.
‘విలువ’ కవితలో “ప్రతి పనికి/మానవీయతను జోడిస్తే/ మహాత్ముడి వవుతావు”…మనం చేసే పనిలో మానవీయ విలువలు ఉండాలని, ‘స్మార్ట్ ఫోన్’ కవితలో “నేను వీడుతానన్నా/ నన్ను వీడనంటున్నది”/ అంటూ స్మార్ట్ ఫోన్ మోజు ఈరోజు మనిషి జీవితాన్ని ఎంతగా ప్రభావితం చేసిందో చెప్పిన గజేందర్ రెడ్డి అనేకమందికి జ్ఞాపకాల ముల్లె అయిన ప్రఖ్యాత ఉస్మానియా యూనివర్సిటీ గురించి చెబుతూ “ఆకలితో ఉన్నప్పుడు కడుపు నింపింది/ ఉద్యమాలకు అది ఊపిరి అయ్యింది”/ అని తన అనుభవాలను జ్ఞప్తికి తెచ్చుకుంటారు ‘జ్ఞాపకాలు’ కవితలో
‘ఆలంబన’ కవిత ద్వారా “సముద్రాలు దాటి వచ్చిన ఆలోచన/ నమ్మించి మోసం చేసింది”… “గాలి, నీరు, వెన్నెలను విభజించి పాలించి” బ్రిటీష్ వారి దుర్మార్గపు పాలనను వివరించి, అటువంటి దాన్నుండి విముక్తి పొందిన మనకు ఆ స్వాతంత్ర్య పోరు ఊపిరి కావాలంటారు ఒద్దిరాజు ప్రవీణ్. అంతేకాక ‘ తల్లి సిగలో తంగేడు’ కవితలో “చెరువులు అలుగులు దుంకిన జీవకళ/ పల్లెలు దరువేసిన జానపదం/ ఉపాధి దొరికి మనాది మరచిన జీవితం”…ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణా ప్రజలు హాయిగా జీవితాలను గడుపుతారని చెప్తారు. ‘నది ఎండిపోయాక’
కవితలో “దుఃఖం నుండి దుఃఖం లోకి సుడులు తిరుగుతుంటే/ నాలోకి నేను ఇంకిపోయి/ నీలోకి ఒంపుకోలేకపోయాను”. అంటారు మరోచోట. బాధయొక్క పరాకాష్ఠ ఇది..అద్భుతమైన భావుకత.
‘బతుకమ్మ పండుగ’ కవితలో “మనసు నిండిన పండుగ/ బతుకమ్మ నిండుగ/ నువ్వే లేకుంటే/ ఎన్ని బంధాలు/ నిరర్థకమో”/ తెలంగాణా సంబురం. ఆబాలగోపాలాన్ని అలరించే పండుగ. దాన్ని వర్ణిస్తూ కె. నరసింగం బతుకమ్మ పండుగ మనుషుల కల్మషాలు తొలగిపోయి కలిసిపోతారని, అది లేకుంటే బంధాలన్నీ అర్థం లేనివిగా మారతాయని అంటారు. ‘కళ’ అనే ఇంకో కవితలో “దుర్గమమైన ప్రాసాదంలో/ సైనికులు లేని రక్షణ/ ఆ పక్షి/ కళాత్మక నిర్మాణం” అసామాన్యమైన అల్లికతో గూడు నిర్మించి, తన పిల్లలకు రక్షణ కల్పించే పక్షి కళా నైపుణ్యాన్ని విశ్లేషిస్తారు. ఇది చదివినప్పుడు గుఱ్ఱం జాషువా గారి ‘గిజిగాడు’ గుర్తుకు రాక మానదు.
‘ఊరు’ అనే కవితలో తన ఊరి గొప్పతనాన్ని వర్ణించే గజవెల్లి “ఋషిలా జీవిస్తుంది నా ఊరు/ కృషితో పయనిస్తుంది నా ఊరు/ అనంత చరిత్ర పుటలపై నా ఊరు/ అడుగులు తిరిగి చూసుకుంటుంది”/ అంటూ ఊరు యొక్క అభివృద్ధిని కాంక్షిస్తారు. భారత పౌరులను ఉత్సాహపరుస్తూ ‘మలినం లేని’ అనే కవితలో “మతం గోడలను కూల్చే/ చైతన్య కణాలను నిద్రలేపండి/ కుల మతాలకు అతీతంగా గౌరవించే/ మలినం లేని మరో భారతాన్ని నిర్మించండి” అని కుల మతాల విద్వేషాలను నిరసిస్తారు.
స్త్రీ – సమాజం’ అనే కవితలో “నీవే ఒక శక్తివై/ యుక్తివై/ సుదర్శన చక్రానివై/ నిన్ను నీవు /రక్షించుకో తల్లి”/.. గుండెల్లి ఇస్తారి రాసిన కవితా వాక్యాలివి. ప్రస్తుత సమాజంలో ఎక్కడా రక్షణ లేని స్త్రీ తనను తాను రక్షించుకునే ఆయుధం కావాలని ఆత్మవిశ్వాసాన్ని నూరిపోస్తారు. ‘ఎన్నికల పండుగ’ అన్న కవితలో “మిమ్ము ఎదిరించే / ధైర్యాన్ని అమ్ముకున్నాం/ మిమ్ము ప్రశ్నించే / తత్వాన్ని తాకట్టు పెట్టాం”/ ఎన్నికల పండుగ వస్తుంది. పోతుంది. ప్రజలకు ఒరిగేది ఏమీ ఉండదు. చివరకు ధైర్యాన్ని, వ్యక్తిత్వాన్ని మీకోసం కోల్పోయామని నాయకులను నిలదీస్తారు.
స్ఫూర్తిదాత అమ్మ’ అనే కవితను చూస్తే “పురిటి నొప్పులు ఒంటినిండా/ అయినా సంతోషమే కంటినిండా/ ….”ఎన్ని మత్తు మందులు సరిపోవు/ నొప్పులు ఓర్చాలంటే/ మాతృత్వపు మనసు చాలు/ మవునంగా భరించాలంటే”/ అని చెప్తున్న జగ్గయ్య అమ్మతనపు అనురాగాన్ని అందంగా మలిచారు. ఆ మాధుర్యానికి కొలమానం లేదు కదా! “కదులుతేనే కాలమని/ కొనసాగేదే జీవనమని” కాల ప్రవాహంతో కలిసిపోక తప్పదంటారు.
‘ఆమె…చిరునవ్వుల చిరునామా’ అన్న తన కవిత ద్వారా దుగ్గి గాయత్రి “తానిప్పుడు వంటింటి కుందేలు కాదు/ ఆకసమే హద్దుగా ఎదిగిన చిరునవ్వుల చిరునామా ఆమె”/ అంటూ స్త్రీ ఎదుగుతున్న క్రమాన్ని, అవసరమైతే భద్రకాళి అవతరమెత్తి అన్యాయాన్ని ఎదిరించే స్త్రీ సబలత్వాన్ని వివరిస్తారు.
యాదికచ్చిన బాల్యం’ అనే కవితలో ఒకప్పటి బాల్యస్మృతులను నెమరేసుకుంటూ దుర్గ రాములు “చీకు చింత లేని చిరుతల్లా ఊరంతా తిరిగి తిరిగి/ అలసి అరుగులమీద సేద/ అణా పైసా ఖర్చు కాలే సోపతి తేనె తెట్టలా/ సుట్టూ తిరిగె/ అని ఆ కాలాన్ని యాది చేసుకుంటారు. అదే క్రమంలో ‘యువ’తర’మా’ అనే కవితలో ఇంకెన్నాళ్ళు నువ్వొదిలిన పొగలో నీ పొగరును కప్పేస్తావు/ సరిపోదా సరదాల బండి, ఇకనైనా దిగి/ గమ్యంవైపు అడుగువేయి”/ అని నేటి యువతరాన్ని హెచ్చరిస్తారు.
‘గుడ్డముక్క’ కవిత ద్వారా అనుభవాలతో పండిపోయిన జీవితం గుడ్డముక్క లాంటిది. అది శాశ్వతం కాదు. నచ్చినా నచ్చకున్నా పైకి ప్రదర్శించకుండా, గుడ్డముక్క చిరిగితే అతుకులు వేసినట్టు అతుకులు వేసుకోవాలనే భావాన్ని ఎంతో వేదనా భరితంగా చిత్రిస్తారు దేవనపల్లి వీణావాణి. ‘టెర్మినేటర్ సీడ్’ అనే మరో కవితలో పంటలు పండక ఆకలికి అలమటించే రైతుల వెతను “శత్రువు శపథం చేసి టెర్మినేటర్ బీజాల్ని/ దేశం మీదకు వదిలినట్టున్నాడు/ కత్తుల్లేని యుద్ధంలో మారకపు సొమ్ము మింగి/ ఖాళీ డొక్కల్ని వెక్కిరిస్తున్నాడు. అంటూ ఆవేదనను వ్యక్తం చేస్తారు.

“తవ్విన గతం కుప్పనంతా/ తొవ్వ కోసం/ చూపు దిక్కు మెట్లుగా పేర్చాను/ …’దీప పుంజం’ కవితలో నక్క హరికృష్ణ కలం నుండి వెలువడిన వాక్యాలివి.గతమంతా ఎంత తవ్వినా మళ్లీ మళ్ళీ అవే కనిపిస్తున్నాయని, అందుకే దాన్నంతా ఒక కుప్పగా పోసి భవిష్యత్తు కోసం చూపు ప్రసరించానంటారు. “చావు పుట్టుకలు/ పుట్టి చచ్చేందుకే కాదని /జీవిత చక్రానికి మర్మ గర్భ ప్రతిబింబమైంది”/ అని “ఎండుటాకు తను రాలిపోతూ కొత్త ఆత్మను నింపుకొని నేలను మెత్తగా స్పర్శిస్తుందని” ‘ఎండుటాకు’ కవితలో తాత్వికతను దర్శిస్తారు.
‘ఆరోజొకటి రావాలి’ కవితలో చెట్టు,మనిషికి అనేకరకాలుగా ఉపయోగపడుతూ మరణించిన తర్వాత దేహాన్ని కాల్చడానికి కూడా తన దేహాన్ని త్యాగం చేస్తుందని చెప్తూ నరేశ్ చారి “నీకోసం నువ్వు బ్రతికేరోజు రావాలి/ నిన్ను నేలపై కాకుండా/ మనిషి తన గుండెల్లో నాటుకునే రోజు రావాలి”/ అంటూ మనిషిలోని మార్పును ఆకాంక్షిస్తారు. ‘రమ్మంటుందనే’ కవితలో మనిషి తనకు తెలియకుండానే సమయాన్ని వృధా చేస్తున్నాడంటూ ” వేళ్ళ సందుల్లోంచి ఇసుక జారిపోయినట్టు/ కాలం నీ చేతి నుండి జారిపోతుంది/ అప్పుడు నీ కన్నీళ్ళు కాలువలై/ ఉప్పు నీటి సముద్రాలను తయారుచేస్తాయి”/ అందుకే ఇకనైనా జాగ్రత్త పడమని హెచ్చరిక చేస్తారు.
నల్లగొండ రమేష్ రాసిన ‘సముద్రమంత దుఃఖం’ కవితలో అతివృష్టికి పొలమంతా నిండిన నీళ్లే కాదు, రైతు కన్నీటి ప్రవాహం కూడా కలిసిపోతుంది. అప్పటిదాకా తొలకరి కోసం కాపు గాచిన రైతు గుండెల్లో దిగులు మబ్బులు కమ్ముకుంటాయి. ఆ బాధను మనసులకు హత్తుకునేటట్టు “పొలమంతా నిండింది వాననీరు/ కర్షకుడి కంట కట్టతెగింది కంటినీరు”/ అంటారు. అలాగే అందరికీ అన్నం పెట్టే అన్నదాత/ దుక్కి దున్నిన పొలంలో/ దుఃఖం పాడుకుంటున్న ఏకాకి ఇపుడు”/ ఆ ఒంటరి బాటసారికి తోడు ఎవ్వరూ లేరంటూ వాపోతారు.
ఇక బక్కారెడ్డి తన ‘కవి’ అనే కవితలో “కాలాన్ని సిరగా నింపుకొని/ ఒడువని కాలాన్ని ఒడుపుగా/ మనోఫలకాలపై ఒంపుతాడు/ ఒక కవి రాసే కవిత్వాన్ని వ్యక్తీకరిస్తూ కవి తాను కాలాన్నే సిరాగా మార్చుకొని, చక్రంలా తిరిగే కాలాన్ని కూడా ఒడుపుగా పట్టుకొని మనసుల్లోకి ఒంపే ప్రయత్నం చేస్తాడని కవితావిష్కరణ చేస్తారు. ఎన్నికల్లో ఓటరులను ఆకట్టుకోవడానికి పాదయాత్రలు చేయడం, వాగ్దానాలు చేయటాన్ని విమర్శిస్తూ ‘పాదయాత్రలు’ అనే కవితతో ” అధికార అందలమెక్కిస్తారే గాని/ శాపాలు పెట్టలేని అమాయక దేవుళ్ళు” అని ప్రజలు ఓట్లు వేసి నమ్మకంతో వారిని గెలిపిస్తారు కానీ నచ్చకుంటే ఏమీ చేయలేని అమాయకులు అని ఆవేదన చెందుతారు.
బండారు పుష్పలత ‘బాల్యాన్ని వెతకాలి’ కవితలో ఆనాటికీ, ఈనాటికి వ్యవస్థలో వచ్చిన మార్పుల వల్ల పిల్లలకు బాల్యం కరువైతున్నదని, పిల్లలు రోజంతా ఆటా పాటా లేక ఇరుకైన మనసులుగా మారుతున్నారని చెప్తూ “పోయిన బాల్యాన్ని వెతకాలంటూ “ఆహ్లాదం ఎరుగక మానసికంగా కుంగిన జీవితాలు”/ ఎంతో బాధగా బాల్యాన్ని తిరిగి రమ్మంటూ కోరుతారు.
తన బిడ్డ అంచెలంచెలుగా ఎదుగుతూ ఉంటే ఆనందానుభూతుల్ని పొందిన కన్నతల్లి కొడుకుతో పాటుగా ఎగరాలనుకుంటే “కన్నకొడుకే ఎగరలేవని/ వదిలేస్తూ ఉంటే/ ఆశాపాశం వదిలి/ ఆ తల్లికి ఎగరాలనివుంది”/ అన్న భానుజ కవిత్వంలో ఇంటింటి తల్లి కథ, కన్నీటి వెత మనసును కరిగిస్తుంది. కరోనా తీరని కష్టనష్టాలను మిగిల్చినా ” మమతల ప్రపంచంతో నిండిన కుటుంబంతో/ మమతను పంచుకునే సమయం”/ అని మానవ సంబంధాల విలువను మనుషులు తెలుసుకోవాలన్న ఆశను వ్యక్తం చేస్తారు.
“నీ కోసం ఒక్క కవితను ప్రసవించలేకపోయానే అని/ మసక మసకగా ఉన్న గుండె అద్దాన్ని తుడిచి/ నన్ను నాకు కొత్తగా చూపించావు”/ అంటారు ముదిగొండ సంతోష్ తన ‘ కవితావాక్యం’ కవితలో. అక్షరాలను అందంగా అల్లాలన్న కోరికను వ్యక్తం చేస్తున్న కవితా హృదయం అతనిది. రాత్రి అనేది ఒక చీకటి ప్రపంచం. అందులో ఏదైనా జరగొచ్చు. అందుకే రాత్రిని వర్ణిస్తూ “ఈ నల్లని రాత్రి/ గుండెల్ని పిండేస్తూ/ రోదనగా వేదన గుమ్మరిస్తున్న ఈ రాత్రి”/..”నక్షత్రాలను నేల రాలుస్తూ/ ఇంకా విరగబడి నవ్వుతుంది”/ చీకటి మాటున జరిగే ఎన్నో కఠోర సత్యాలకు ఆవేదన చెందుతూ” ఈ రాత్రిని తగలబెట్టాలి. కొత్త కాగడాను వెలిగించాలి”/ ఉద్యమించమని ‘దీర్ఘరాత్రి’ కవితలో ప్రేరేపిస్తారు.
‘మనసుతోనే గెలవాలి’ కవితలో ఎం.రామదాసు “నా తల్లి గర్భంలో నేను పెరుగుతున్నప్పుడు/ నా చుట్టూ ఉమ్మనీరు సముద్రం/ అవనిపై నేను అడుగేసినప్పుడు/ నా చుట్టూ ఉప్పునీటి సంద్రం”/ తల్లి గర్భంలో ఈదులాడిన మనిషి కుల మత వ్యవస్థ, అవస్థల్లో జీవన సముద్రంలో ఈదుతుంటాడు. దాని నుండి బయటపడి ఐకమత్యంగా మెలగమని సూచిస్తారు. ‘నిండుదనం’ కవితలో “నిన్నటి అబద్ధం/ నేడు సత్యం/ మరి రేపటిది ఊహ”/ ఇవన్నీ సహజం. కానీ అందరూ కలిసి మెలిసి ఉండడమే జీవితం అని సందేశాన్ని అందిస్తారు.
రుక్సానా రాసిన “మా మతం వారి అభిమతం ఒకటి కాదు” అన్న కవితలో “మతం కన్నా మాతృభూమికి విలువ ఇచ్చి, బ్రతుకుతున్న వాళ్ళం/ మానవత్వం లేని వాడికి మతం ఆపాదించి, మాతో కలపొద్దు”/ అంటూ మతాల మధ్య చిచ్చు పెరిగి ఏదో ఒక మతాన్ని తప్పు పట్టేవాళ్ళను నిరసించే గొంతుక వినిపిస్తుంది.
“కాలుతున్న కాలం సాక్షిగా’ కవితలో డా.వి.శంకర్ “నువ్వు నువ్వుగా నిలబడడం ఎంత కష్టమో/ ఒక్కొక్కటే అనుభవంలోకి వస్తుంది/ చీకటిని అలంకరించుకున్న మూఢత్వం/ అడుగడుగునా నిన్ను శీల పరీక్షకు గురి చేస్తుంది/ అంటూ సమాజంలో మనిషి ఎలా బతకాలనుకున్నా చుట్టూ వున్నవాళ్లు ఏవిధంగా ఉంటారన్న సత్యాన్ని విప్పి చెబుతారు.
డా. సరోజ వింజామర కవిత ‘ ప్రశ్నించే గొంతుక’ లో ” ఎందుకు అన్నీ భరించే భూదేవినే అవాలి/ ఎత్తి పడేసే ప్రళయం ఎందుకు కాకూడదు/ అంటూ అలనాటి నుండి స్త్రీ మాత్రమే అన్నింటినీ భరించి సహనశీలిలా ఎందుకుండాలని? సమాజాన్ని ప్రశ్నిస్తారు. ఒకవైపు ఇలా రాస్తూనే మరోవైపు పురుషుల పక్షం వహించి ‘ప్రతిస్పందన’ కవితలో వారికీ సమన్యాయం కావాలంటారు.
డా. సాలగ్రామగిరి ‘అలసిపోని పాదాలు’ కవితలో ఆడవారి పాదాలు జీవితమనే బాటలో ఎంత నడక సాగిస్తాయో తెలుపుతూ ఎవరి వెనకో ఆ పాదాలు ఉండకూడదని, ” నాతో సమానంగానో నాకు ముందు గానో/ నడవమని అంటాడేమోనని ఎదురుచూస్తున్నా/ అని స్త్రీ ఆవేదనకు అద్దం పడతారు. “మెరుగైన సమాజం కోసం” కవితలో “చట్టసభల్లో నిద్దరోతున్న సార్ల

గురకనడుగు/ సంక్షేమపథకాల అమలు ఏపాటో చెబుతోంది” అని నేటి చట్టసభల తీరును ఎండగడతారు.
‘ఆగమైపాయె’ కవితలో రైతు వ్యధల్ని వినిపిస్తున్న సోమశిల తిరుపాల్ “వరి పంట ఇంకెవ్వరేస్తారు చెప్పూ/ అన్నదాతలు కాడి కిందకు దింపితే/ అంటూ రైతు పండించడం మానేస్తే మనగతి ఏమవుతుందని ప్రభుత్వం రైతులను పట్టించుకోని విధానాన్ని నిరసిస్తారు. ‘మారలే’ కవితలో ” కదిలే సాధనం మారింది కానీ నలిగే బతుకులు మారలే” అని
ప్రగతి ఎంత సాధించినా ఆకలి బతుకులు మారలేదని
ఆవేదన వ్యక్తం చేస్తారు.
ఈవిధంగా తమ కవితా పాటవాలతో అందరి మనసులను రంజింపజేస్తున్న ఈ కవులు, కవయిత్రుల కలాల నుండి ఇంకా ఎన్నో కవితా మకరందాలు వెలు వడాలని ఆకాంక్షిస్తున్నాను.

July 19, 2023 229 comments
0 FacebookTwitterPinterestEmail
కథలు

కొకతట్టి చాంద్ బీ

by Veera valli July 19, 2023
written by Veera valli

ఇది నిజంగా జరిగిన 1960 ప్రాంతంలోని కథ. నా చిన్నప్పుడు, సీతారాం బాగ్ లో ఉన్న మా ఇంటికి ఈ ముస్లిం ఆవిడ, మంగళ్ ఘాట్ లో ఉన్న గోడే ఖబర్ నుండి వచ్చేది. మా అమ్మ లక్ష్మి నరసమ్మగారు ఆవిడకు నరసింహ స్వామి పూజ చేసి తీర్థ ప్రసాదాలు ఇస్తే, ఆవిడ ఎంతో భక్తితో పూజ చేయించి వాటిని స్వీకరించే ది. మొహర్రం పీర్ల పండగ రోజు మా అమ్మ ఆమెకి దట్టి, బట్టలు పంపేది. ఆమె మాకు ఊదు ప్రసాదంగా తెచ్చి ఇచ్చేది. మాకు ఏ జబ్బు చేసిన దర్గాలకు తీసుకెళ్ళి ప్రార్థనలు చేసేది మా అమ్మ.

చుట్టు పక్కల వారు, కులం వారు ఆక్షేపిస్తున్నా ఎదురించి ముస్లిం మహిళకు నరసింహ జయంతి రోజు ఆమె తరపున మా అమ్మ పూజ చేయటం అయితే,

వాళ్ళ బంధువులు అభ్యంతర పెట్టినా, మోహల్లా (వీధి) వాళ్ళు గర్హించినా, ముస్లిం వనిత ధైర్యంగా పూజ చేయించటమే కాక మా అమ్మ ఇచ్చిన దట్టిని పీర్ల కు సమర్పించి మొక్కులు మొక్కి మా కుటుంబం కోసం ప్రార్థనలు చేయటం గొప్ప కదా. ఆరోజుల్లో నిజంగా అభినందనీయమే.

ఆ రోజుల్లో మడి ఆచారాలు సంప్రదాయాలు ఎక్కువగా ఆచరించే మా కుటుంబాలు ఈ విధమైన సఖ్యత చూపడం నిజంగా నాకు అద్భుతమే అనిపిస్తిస్తుంది ఇప్పటికీ. ఏమీ చదువుకొని మా అమ్మ, పేదరికానికి మతంఉంటుందా? అని అడిగిన ప్రశ్న గొప్పది.

అందుకే మనసు లో ముద్ర వేసుకుని పోయిన ఈ సంఘటనని కథగా రాయాలని పించింది. ఈ ఇద్దరి స్త్రీ లను అభినందించకుండా ఉండలేకపోతున్నాను.

మా అమ్మ లక్ష్మి నరసమ్మ

‘అమ్మా‘ అంటూ పరుగున అమ్మ దగ్గరికి వెళ్ళాను.

మడి చీరలో ఉన్న లక్ష్మమ్మ, అదేమా అమ్మ.. ‘ఏమిటే ఆ ఉరుకులు. దగ్గరికి రాకు, ముట్టుకోకు, దూరం దూరం.. మడిలో ఉన్నా..‘ అని దూరంగా జరిగింది.

‘సరేలే ముట్టుకోను గానీ, ఆవిడ వొచ్చింది. అదే బురఖా ఆవిడ‘ అప్పటిదాకా తాడాట ఆడుతూ, చాంద్ బీ రావటం వల్ల అమ్మకి చెబుతామని అలాగే వచ్చేసాను.

‘మళ్లీ తాడట ఆడుతున్నావా, ఎలా దమ్ము తీస్తున్నావో చూడు. ఎన్ని సార్లు చెప్పినా వినవు. ఆ తాడు అవతల పడేయి. ఆవిడని కూచోమని చెప్పి, మంచినీళ్ళివ్వు వచేస్తున్నా‘ అంటూ అమ్మ హడావిడిగా వంట పూర్తి చేయటానికి వెళ్ళింది.

‘సరే కానీ, ఆవిడ ఎండలో వచ్చింది. నువ్వే అంటావు కదా ఎండలో నుంచి వచ్చి నీళ్ళు తాగొద్దని. మరి ఇవ్వమంటావా నీళ్ళు.‘ అంటూ నా సందేహాన్ని అడిగాను. ‘సరేలే, ప్రశ్నలు మొదలుపెట్టావా… చెప్పింది చేయి. ఎవరొచ్చినా ముందు వారిని కూచో పెట్టీ మంచి నీళ్ళు ఇవ్వటం పద్దతని ఎన్ని సార్లు చెప్పాను. ఆమె ఇష్టం, తాగాలను కుంటే తాగుతుంది.‘ విసుక్కుంటూ తనపనిలో పడింది.

ఏమిటో అమ్మ ఒక్కోసారి ఒక్కొలాగా మాట్లాడుతుంది. ఆడే స్కిప్పింగ్ రోప్ పక్కన పెట్టి, వంటింటి లోకి వెళ్ళాను. చల్లటి మంచినీళ్ళు రాగి చెంబుతో తీసుకెళ్ళి, గ్లాసులో పోసి ఆవిడ ముందు పెట్టాను. మోసుకొచ్చిన సంచిని అరుగు మీద పెట్టి బరువును మోసిన చేతిని మరో చేత్తో నొక్కుకుంటూ అరుగు మీద నీరసంగా కూచుని ఉంది చాంద్ బీ. ఎండలో నడిచి వచ్చిందేమో ఎక్కడలేని అలసట కనిపిస్తోంది ఆమె ముఖంలో. నేను చెంబుతో నీళ్ళు తేవటం చూసి తల మించి బురఖా తీసి, ఇంటి ముందున్న చింత చెట్టు మొదట్లో కెళ్ళి అక్కడున్న బకెట్ లోని నీళ్ళతో మొహం కడుగుకుంది. ఎవరొచ్చినా కాళ్ళు కడుక్కుని లోపలికిరావాలి. అందుకే నీళ్ళబకెట్ ని ఇంటి ఎదురుగా పెట్టడం మా ఇండ్లలో పద్దతి.

కాస్త ప్రాణం కుదుట పడి, ఇంటి వాకిట్లోని అరుగు మీద కూచుని బురఖాతో ముఖం తుడుచుకుంది. మంచినీళ్ళ గ్లాస్ తీసుకుని గట గట మని తాగి, ఇంకా నీళ్ళు పొయ్యమని గ్లాస్ చూపింది. ఆమెకి చాలా దాహంగా ఉంది కాబోలు మాట్లాడలేక పోతోంది. రెండో గ్లాసు కూడా తాగేసింది. ప్రతి సారి పూజ కోసం తల స్నానం చేసి వస్తుంది. ఇంకా జుట్టు ఆరలేదులా ఉంది, ఆమె వోత్తైన తడి జుట్టుతో వెనకాల బురఖా అంతా తడిసి పోయింది. ఆమెనే చూస్తూ నిలుచుండి పోయాను.

నీళ్ళ చెంబు లోపల పెట్టటానికి వెళ్లి అమ్మ హడావిడి పడటం చూశాను. ఆవిడ ఇవాళ వస్తుందని వంట తొందరగా చెయ్యాలని పొద్దుట్నుంచి అంటూనే ఉంది అమ్మ. దాదాపుగా వంట పూర్తి అయింది.

వంట అవటమే ఆలస్యం కట్టెలు ఆర్పీ, కాలినంత భాగం తీసేసి మిగిలిన కట్టెలని, ఆర్పిన కట్టె ముక్కలను ఎండలో పెట్టీ బొగ్గులుగా తెల్లారి మళ్లీ వంటకు ఉపయోగిస్తుంది. ఎందుకమ్మా అలాగ అంటే. మొత్తం కట్టెలు కాలిపోతే బూడిద అవుతుంది. అందుకే అర్పేయాలి. అప్పుడు కాలిన కట్టే బొగ్గు అవుతుంది. అవి మళ్లీ వంటకు పనికొస్తాయి కదా‘ అనేది అమ్మ. ఏంటో తను చేసేవి అప్పుడు అర్థమయ్యేది కాదు. కానీ అది ఆమెకి పేదరికం నేర్పిన కొన్ని పాఠాలలో ఇదొకటని తరువాత రోజుల్లో అర్థమయింది. పాపం ఆవిడ ఎంతో పొదుపుగా సంసారాన్ని లాక్కొ చ్చింది కదా అనిపిస్తుంది.

పొయ్యిపైన చట్టిలోని పప్పుచారుని స్టీలు గిన్నెలోకి వోమ్పేసి మూత పెట్టింది. మట్టిచట్టిలో పప్పుచారు చేయటం ఆమె అలవాటు. పక్క పొయ్యి పై ఉడుకుతున్న అన్నం ఒకసారి గరిటతో తిప్పి, అన్నం గంజి వార్చటానికి తప్పాలామూతికి తట్టు (అదే బియ్యం సంచి) ముక్కని కట్టి పక్కనే ఉన్న అరుగు మీద వొంపింది. ఆ గోనె పట్టాకి రంద్రాలు ఉంటాయి కదా అన్నం పడిపోకుండా గంజి మాత్రమే బయటకు పోతుందన్నమాట. పొయ్యిలోని మంటతీసేసింది కానీ పూర్తిగా అర్పలేదు. మళ్లీ పులిహోర తాలింపు పెట్టాలికదా. ఈలోపు గిన్నెలో నీళ్ళుపోసి శక్కర, టీ పొడివేసి పోయి మీద పెట్టింది. పక్క పొయ్యి లోని నిప్పుని ఆర్పేసి, పొయ్యిదగ్గర అంతా సర్దేసింది. గంజి వార్చిన అన్నం గిన్నెకి మూత పెట్టీ మళ్లీ ఆర్పిన పొయ్యి మీద పెట్టేసింది. ఆ వేడికి అన్నం పొడి పొడిగా అవుతుందన్న మాట.

అప్పటికి గ్యాస్ పొయ్యి రాలేదు మా వరకు. వచ్చినా భరించలేని మధ్యతరగతి శ్రీవైష్ణవ కుటుంభం మాది. మట్టి పొయ్యి మీదే వంట చేయాలి. ఆ పొయ్యిని ఆమే తయారు చేస్తుంది. ఒక మంచి రోజు చూసుకుని, తానే వెళ్లి పుట్టమన్ను తవ్వుకొచ్చి నీళ్ళతో తడిపి, బాగా పిసికి, ఆ మట్టితో గుండ్రటి పొయ్యి తయారు చేస్తుంది. మధ్యలో ఇనుప చువ్వ లు పెడుతుంది. దాని వల్ల బొగ్గులు వేయటానికి వీలవుతుంది. ఇంపచువ్వల కిందిభాగంలోకి చేయిదూరెంతగా కన్నంచేస్తుంది. అక్కడ పిడకపై కిరోసినేసి వెలిగించటానికి ఉపయోగపడుతుంది. అవసరమైతే రెండు కట్టెలని కుడా పెట్టి కట్టెల పొయ్యిలగా కుడా వాడుకోవచ్చు. కొన్ని సార్లు అక్కడే ఆలుగడ్డలని, మొగరం గడ్డల్నిఅదేనండి చిలగడదుంపలు, ఇంకా లేత బెండకాయలను, లేత బీరకాయలను కాల్చి మాకుఅన్నం లోకి ఇచ్చేది. కూరల బదులుగా వాటితో భోజనం కానిచ్చేవాళ్ళం. అప్పుడప్పుడు అమ్మ పక్కన కూచుని చిన్న పోయ్యిని చేసేదాన్ని. ఏంటో మరి ఎండగానేవిరిగిపోయేది.

అలాగే మరో చిన్న పొయ్యి చేస్తుంది. దాన్ని కట్టెలు మాత్రమే పెట్టీ వాడుకోవచ్చు. వాటిని నీడలో ఆరాక వంటింట్లో ఓపక్కన గట్టులాగ చేసి పెర్మినేంట్ గా దానిపై పెట్టేస్తుంది. రోజు వంట అయ్యాక ఎర్రమట్టి, పేడ కలిపి పోయ్యిలని అలికి వాటిపై ముగ్గు వేయటంతో అవి శుద్ధి అయి తిరిగి మరునాడు మడి వంటకి పనికి వస్తుందన్నమాట. ఆమెకి ప్రతిరోజూ సంధ్యవేళ పొయ్యిలు అలకడం తప్పనిసరి పని. వంటంత ఒకపూటే చేసేస్తుంది. రాత్రికి రొట్తెల్ని, తక్కువపడే అన్నాన్ని కిరోసిన్ పంపు స్టవ్ పై వండేస్తుంది. మళ్లీ ఈ స్టౌ పొద్దుట వంటకి పనికి రాదుట. ఆ వంటలతో దేవుడికి ఆరగింపు చేసేది కాదు అమ్మ.

మా నాన్న దేశికాచార్యులు గుళ్ళో పూజలు చేసి తెచ్చే చాలీచాలని సంపాదనతో ఇల్లు వెళ్ళదీస్తోంది. నలుగురు సంతానoలో మా పెద్దన్నయ్య ఉద్యోగంలో చేరి కాస్త సంపాదిస్తున్నాడు.. అక్క చూడామణికి చిన్నప్పుడే పెళ్లి చేసి అత్తారింటికి పంపారు. పెద్దకుటుంబంలోకి వెళ్ళటంతో పుట్టింటిని ఆమె పూర్తిగా మరిచి పోయేలా చేసింది. అమ్మ, అన్నయ్య అప్పుడప్పుడు వెళ్లి పండ్లో పూలో, వీలైతే ఎవైన పిండివంటలు చేస్తే అవి ఇచ్చి బాగోగులు అడిగి వస్తుంటారు. ఒకందుకు అమ్మాయి ఒకతి ఉందని కుడా గమనించే స్థితిలో లేని పేద కుటుంభం మాది. రెండు గదుల చిన్న పెంకుటిల్లు. ఆ గుడిప్రక్కవీధి అంతా అలాంటి వారే నివసిస్తున్నారు. అన్నయ్య స్కూలు ఫైనల్ పాసవంగానే చిన్న ఉద్యోగం చూసుకున్నాడు. చిన్నన్నయ్య పదవ తరగతిలో ఉన్నాడు. నాన్న, గుడికి జీయంగార్ వచ్చినప్పుడు సామూహిక ఉపనయన కార్యక్రమాల్లో అన్నయ్యలిద్దరికి చిన్నప్పుడే ఉపనయనం చేయించాడు. అప్పుడప్పుడు ఇద్దరూ ఆయనతో పాటు పూజలకు వెళుతుంటారు. తరువాత నేను.. విజయ లక్ష్మి ..సెవెంత్క్లాస్ అండి. అమ్మ మాత్రం ఆడపిల్లకి చదువు వద్దని మొత్తుకున్నా అన్నయ్యలు వినకుండా నన్ను చదివిస్తున్నారు. గవర్నమెంటు స్కూల్లో ఫీజు లేదు కాబట్టి చదువు సాగుతుంది. పదమూడు నిండకుండానే నాపెళ్లి చేయాలని మానాన్న వెంట పడుతుంది మా అమ్మ.

అమ్మ పని అయినట్టుంది. రెండు గ్లాసుల్లో చాయి తీసుకుని వాకిట్లో కొచ్చింది. “బాగున్నావా చాంద్ బీ. అమ్మాయి నీళ్ళిచ్చిందా? ఎండ మండి పోతుంది. మొహం చూడు ఎలా అయిందో. పొద్దున్నుంచి నీవేమి తినవు కదా, కాస్త చాయి తాగు నీరసం తగ్గుతుంది.” అంటూ ఒక గ్లాస్ ను ఆమె ముందు పెట్టీ, తాను ఓ గ్లాస్ తీసుకుని కడప లోపల కూచుంది. అయ్యో వద్దులేమ్మ, మీకే పని ఎక్కువ అయింది.” అని మొహమాట పడింది. “కష్టమేముంది నీ పేరుచెప్పుకుని నేనూ తాగుతాలే. నా మడి వంట ఇప్పుడే అయింది. నీకోసమే ఎదురుచూస్తున్న, ఇద్దరం కలిసి తాగుదామని నేనూ చాయ్ తాగలేదు‘. అంది.

చాయి తాగటం అంటే పెద్ద ఇత్తడి గిలసులో సగానికి పైగా పోసుకుని చీరచెంగుతో పట్టుకుని తాపీగా ‘ఉఫ్ ఉఫ్’ అని ఊదుకుంటూ తాగటం ఎంతో ఇష్టం. అంతా పనయ్యాక టీ తాగి అలసట తీర్చుకుని మడి వదలడం ఆమె రోజువారీ అలవాటు.

“తాగు, కాస్త నీరసం తగ్గుతుంది. పులిహోరకి అన్నంచేశాను. తాలింపు పెట్టేస్తే అయిపోతుందిలే”

“షుక్రియ అమ్మా ఇంత పనిలో కూడా ఎప్పుడూ నాకోసం చాయి ఇస్తావు” అంటూ వేడి గ్లాస్ని బురఖాతో పట్టుకుని ఊదుకుంటూ తాగుతూ “మీ అందరు ఎలా ఉన్నారు అమ్మా” అంది. “ఏదో కాలం వెళ్ళ దీస్తున్నాము” అంటూ తమ తమ కుటుంబాల విషయాలు మాట్లాడు కున్నారు. చాంద్ బీ ప్రొద్దున్నే తలరా స్నానం చేసి ఏమి తినకుండా నరసింహ స్వామి పూజ కోసం ఇక్కడికి సాయిత్యం (ప్రసాదానికి కావలసిన సరుకులు) తీసుకుని వస్తుంది. ఈ ప్రసాదమే తింటుంది. ఇది ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నదే.

‘పూజ సామాన్లు తెచ్చిన‘ అంటూ చేతిలోని సంచిని ముందుకు జరిపింది. “మీ ఆయన, పిల్లలు ఎట్లా ఉన్నారు?”. టీ తాగుతూ అడిగింది అమ్మ. “ఏం బాగమ్మ, పిలగాడు జిద్ చేస్తే పాన్షాప్ పెట్టించినం. పిల్లేమో ఈడు కొచ్చింది. దానికి

షాది చెయాల కదమ్మ. ఆయన కమాయించిన దాన్లో ఇల్లు గడవడమే ముష్కిల్ అవుతుంది” అంటూ తనగోడు వెళ్ళ బోసుకుంది.

అమ్మ వెనకాలే వచ్చిన నేను, లోని కెళ్లి చేట తీసుకుని వచ్చి ఆవిడ ముందుపెట్టాను. ప్రతి సంవత్సరం ఆవిడ రావడం, సంచిలో వంట సాయిత్యం తేవటం నాకు తెలుసు. మళ్లీ అమ్మ చెప్పాల్సిన పని లేకుండానే లోనుంచి చేట తెచ్చేసాను. “అమ్మో బాగానే తెలిసిపోయిందే బేటీకీ “చాంద్ బీ నవ్వుతూ సంచీలోని బియ్యం, పప్పు, బెల్లం, చింతపండు, ఎండుమిరపకాయలు, కరివేపాకు మొదలైన సాయిత్య సామాన్లు చేటలో ఉంచింది. కొబ్బరికాయ, పూలు, అగర్బత్తులున్న కవరును వేరుగా చేట పక్కన పెట్టింది.

“చాంద్ బీ, అందరికీ ఏదో ఒకరకంగా ఈ కష్టాలన్ని ఉంటూనే ఉంటాయి. ఏంచేస్తాం మన కర్మ, నుదుట రాసింది అనుభవించక తప్పుతుందా. ధైర్యంగా సంసారాన్ని ఈదటమే మన పని. అన్ని బాగవుతాయి. బాధపడకు.‘ అంది అమ్మలేస్తూ. ” ఉండు నిముషంలో వస్తా. భోగం వంట చేయాలిగా త్వరగానే అయిపోతుందిలే” అంటూ చాయి తాగటం ముగించి సామాన్లున్న చేట, పూజ కవరుని తీసుకుని లోపలికెళ్ళి పనిలో పడింది. గూట్లోని గచ్చకాయల్ని తీసుకుని ఆడుకోవటానికి బయటకొచ్చాను. అప్పుడు నాతో ఆడటానికి ఎవరూలేరు. ఒక్కదాన్నే ఆడుకుంటూ తలెత్తి చాంద్ బీ వైపు చూసాను. బకేట్లోని నీళ్ళ తో టీ గ్లాస్ కడిగి తాను కూచున్న అరుగు మీద బోర్లిచ్చింది. కళ్ళు మూసుకొని ధ్యానం చేయటం మొదలెట్టింది.

ప్రతి నరసింహజయంతి నాడు తప్పకుండా గోడేఖబర్, కోకతట్టి నుండి వచ్చి, అమ్మతో పూజ చేయించుకుని వెళ్ళటం ఆమె ఎన్నో ఏళ్లుగా నిష్టగా చేస్తున్న పని. వీళ్ళిద్దరి స్నేహితం ఆవీధిలోని వారికి వింతగా ఉంటుంది. పక్క వాళ్ళు, చాల సార్లు అమ్మతో నిష్టూరంగా మాట్లాడేవారుకుడా. ‘భక్తి, శ్రద్ధతో చేసే పూజని ఎవరినైనా ఆ దేవుడు అనుగ్రహిస్తాడు. మతమేదైన ఆయన కే పక్ష్టపాతం లేదు. ఆదేవుడికేలేని అభ్యంతరం పూజ చేసే నాకేమిటి’’ అని ఘాటుగానే జవాబు చెప్పేది.

అమ్మ మడి, ఆచారాలతో మధ్యాహ్నం రెండైన మడిచీర విప్పదు. వంట, పూజ దేవుడి ఆరగింపు అయి ఆవిడ భోజనం చేసేసరికి ముడైనావుతుంది.

చాంద్ బీ ముస్లిం, బురఖా వేసుకునిగాని బయటకి వెళ్ళదు. ఇక్కడికి వచ్చినప్పుడు ముఖం మించి బురఖా తొలగిస్తుంది. వచ్చిరాని తెలుగులో మాట్లాడుతుంది. అమ్మ ఆవిడని అందరిలా లోపలి పిలవదు బయట అరుగు మీదే కూచోమంటుంది. మంచినీళ్ళు గ్లాసులో ఇస్తే ఆవిడ తాగాక కడిగి బోర్లిస్తుంది. దానిపై నీళ్ళుచల్లి లోపలి తీసుకెళ్ల మంటుంది. కాని ఆమెని మాత్రం చాల ఆప్యాయంగా ఆదరించేది. కుటుంబ విషయాలు అడిగి మరి తెలుసుకొని సలహాలిచ్చేది. అదే ఆవిడని అడిగాను చాలాసార్లు. ‘నీకు అర్థంకాదులే మన మడిఆచారాలు మనవి. ఆమె మత ఆచారాలు ఆమెవి. తరతరాలుగా వచ్చే వాళ్ళ ఆచారలని పాటిస్తుంది. మనమూ అంతే. కాని నాకు తెలిసిందంతా ఒకటే ఇద్దరం మా కష్ట సుఖాలను చెప్పుకుంటాం. ఆమెదోరకం నాదోరకం. కానీ మా మతాలేవైనా ఇద్దరమూ బీదవాళ్ళమే.

పేద తనానికి మతం లేదు కదా ఏమిటో…ఎంచేయగలం, ఒకరికొకరం నాలుగు ఓదార్పుమాటలు చెప్పుకోవటం తప్పా.’ అని చెప్పేది. కొంత ఆకళింపు చేసుకునే దాన్ని కొంత అర్థం కాకపోయేది.

ఎప్పట్నుంచో పొల్లుపోకుండా ఇలాగే జరుగుతున్నా నాకు మాత్రం కొత్తగానే ఉంటుంది. ఆవిడ బురఖా వేసుకునే వస్తుంది. అలా ఎందుకు వేసుకుంటారని ఓ సారి అడిగాను. “బిడ్డా ఇది మా ఆచారం మా ఇండ్లల్లో గిట్లనే వేసుకోవాలి.” ఆమె రెండు చెవులకి కనీసం ఆరేసి దుద్దులైన ఉన్నాయి. చెవి చుట్టుతా కుట్టించుకుంది. నాకు విచిత్రంగా అనిపించి. ‘ఎందుకలా అన్నీ కుట్టిన్చుకున్నావు నొప్పి వేయలేదా‘ అని అడిగింది. ‘‘మాకిలా చిన్నప్పుడే కుట్టిస్తరు. మా అమ్మిజాన్ నాకు మూడు ఎండ్లకే కుట్టించింది. నొప్పి గిప్పి ఎంతెలుస్తది అప్పుడు ‘‘ అంది.

అమ్మ బయటికి వచ్చి కూచుంటూ “అయిపోవచ్చింది. ఆరగింపు చేసి ప్రసాదం కట్టిస్తాను. అన్నట్టు మీ పాన్ షాప్ ఎలా ఉంది. మా అబ్బాయి చూసాడట మీ వాడ్ని. కొత్తగా పెట్టామని చప్పాడట బాగా నడుస్తుందా”అడిగింది.

“ఏం దుక్నమో అమ్మా. మా ఆయన సైకిల్ షాప్ లో పంచేజేయమంటే ఆడ చేయ నన్నాడు.వాళ్ళ దోస్తుల మాటలు విని పాన్ దుక్నం పెట్పిచ్చిన్డు. ఆడ బాగా పైసలు వస్తయని చెబుతుండు. అది పెట్టటానికి మల్ల అప్పు అయింది. ఇప్పటికైతే బాగానే షాప్లో కూచుంటున్నాడు. రెండునెలలు అయింది. అప్పుకూడా కొంచం కొంచం వాపసు చేసిండు. సామి దయవల్ల గిట్లనే కమాయిస్తే చాలు. ఈయన, సైకిల్ దుక్నంల దినమంతా కష్టం చేసినా ఆమ్దని గంతనే. ఇయ్యాల రేపు అందరూ కార్లు, స్కూటర్ కొంటున్రు కదా సైకిల్ ఎవ్వరు తొక్తలేరు. వచ్చిన పైసల్ దాదాగాల్లకి, దుక్నం కిరాయి ఇయ్యంగ తిండికి సరిపోదు.” తన బాధ చెప్పుకుంది చాంద్ బీ.

“అవును చాంద్ బీ, అన్నీపిర్యమై పోయినై. మనం ఎంత సంపాదించినా తిండికే సరిపోవటం లేదు. మీ పిల్ల కూడా పెండ్లికి వచ్చిందిగా సంబంధాలు చూస్తున్నారా?” “అవునమ్మా గదే పరిశాన్ గుంది మొన్న దుబాయ్ నుంచి ఒక సంబంధం వచ్చింది కాని పిల్లగాడి ఈడు పెద్దగుంది. పిల్లేమో 17 ఏడ్లు, వచ్చే రిస్తలేమో 30, 40 ఎడ్లవాళ్ళు వస్తున్నై. నాకేమో ఇష్టం లే. మా ఇంటాయనేమో వాళ్ళు పైసల్ అడగరని గసొంటి రిస్తలే చూస్తుండు. ఏమో అమ్మా రాత్రికి కంటికి నిద్ర రాదు పరిషాన్ అవుతున్న.” అంటూ కళ్ళు తుడుచు కుంది. “ఊరుకో చాంద్ ఆ భగవంతుడున్నాడు నీ కష్టాలన్నీ గట్టేక్కిస్తాడులే. చూడు పిల్లగాడు బాగుపడుతున్నాడు కదా. అలాగే పిల్లకి కూడా మంచి రిస్త వొస్తది లే దిగులు పడకు. మీ ఆయనకి చెప్పు పిల్ల గొంతు కొయొద్దని. అంత ఈడు ఉన్నోడికి కట్టబెట్టకండి. అసలే రోజులు బాగాలేవు ఆ దుబాయ్ తీసుకపోయి ఎలా చూస్తాడో మనకి తెలియదుకదా. మళ్ళీ మనం చూడగలమా. ఇక్కడి పిలగాడైతే, పిల్ల మన కండ్ల ముందుంటది. మంచీ చెడు చూడవచ్చు. మా వాడు మొన్న పేపర్ల చదివి చెప్పిండు పెళ్లి చేసుకొని దుబాయ్ తీసుకుపోయి అమ్మేస్తరట. మీ పాత బస్తీలో ఇవన్నీ బాగా జరుగు తున్నాయని అన్నాడు. జాగర్త ఒకటికి రెండుసార్లు వాళ్ళగురించి అందరిని అడిగి తెలుసుకొని పెళ్లి చేయండి.” తనకు తెలిసిన విషయం చెప్పింది.

“అవునమ్మా నేనూ అదే అని బయట రిస్తలని హర్కిస్ వద్దంటున్న. మా బస్తీల చాల పిల్లలకి గట్లనే అయ్యింది. ఒకసారి పిల్ల పెండ్లి అయి ఆడకి పోయిందంటే ఇక అన్తనే, మళ్ళి మనకి కనబడదు. ఏ ఖబర్ ఉండదు. ఆడ అమ్మేస్తరో, ఇంట్లనే

ఉంచు తరో తెల్వదాయే. అందుకనే నేను ఈడనే చూస్తున్న. మొన్న మా తోడికోడలు చిన్నమ్మ ఒక రిస్త తెచ్చింది. పిల్లగాడు ఎక్కువ సదువ లేదు. కూరగాయల దుక్నం పెట్టుకున్నడు. కాని చాల పైసల్ అడుగుతున్నరు. మనకాడ అంత లేదు. ఇప్పుడున్న ఇల్లు అమ్మితే గిరివి పైసల్ పోను పెళ్లి చేసి పంపొచ్చు కాని గిరివి పెట్టిన సేటు అమ్మనిస్త లేడు. వాడికే అమ్మాలంట. అట్లైతే ఇల్లు అగ్వకు పోయి పైసల్ సరిపోవు. అన్ని తెల్సినంక కూడా సోనా ఏం పెడతవ్ అంటుంది మా తోడికోడలు. మా అమ్మిజాన్ పెట్టిన గీ చెవి కమ్మలు ఇస్తనన్న. గవి సాలవంట. ఏమ్చేయాలో సంజవుతలేదు.”

“చాంద్ బీ, బాధ పడకు, ఆ అల్లా మీద, నరసింహస్వామి మీద భరోస పెట్టు అంతా బాగైతది. ఉండు ఆరగింపు చేసి ప్రసాదం తెస్తా” అంటూ లేచి లోని కెళ్ళింది. దేవుడికి ఆరగింపు చేసి ఇస్తరాకులో పులిహోర ప్యాక్ చేసి. వడపప్పు శీతలం, కొబ్బరికాయ చిప్పలు, అరటిపళ్ళు వేరు వేరుగా కట్టి సంచిలో పెట్టి. పళ్ళెంలో హారతి, తీర్థ ప్రసాదలతో బయటికి వచ్చింది. “చాంద్ ఇదో తీర్థం తీసుకో” అంది. ఆమె లేచి బయటనించే దేవుడికి దండం పెట్టి, హారతి కళ్ళకద్దుకుని తీర్థం తీసుకుంది. అరటి పళ్ళు ఆమె ముందుంచి “ఇదిగో సంచిలో అన్నీ పెట్టాను. నీవు ఈ పళ్ళు తిను ఇదిగో మంచినీళ్ళు తాగు. ఇంటిదాకా వెళ్ళటానికి కాస్త ఊపిరి వొస్తుంది. ఇంటికెళ్ళి అందరు కలిసి ఈ ప్రసాదం తినండి.” అలాగే నమ్మా నరసిమ్హసామికి మామీద ఎప్పుడు దయ వస్తదో ఏమో. సామి నా బిడ్డా పెండ్లి మంచిగా అయ్యేట్టు చూడు సామీ.” అంటూ. పళ్ళు తిని నీళ్ళు తాగి సంచి తీసుకుని లేచింది. “వస్తానమ్మా పనికి పోవాలె… వస్తాను విజయమ్మ చల్లన్గుండు ” అంటూ మరో సారి దేముడికి దండం పెట్టి బయలు దేరింది. “మంచిది చాంద్ బీ అంతా బాగైతది దిగులు పడకు. ఆ.. అలాగే మరచి పోకు పీర్ల పండక్కి రా దట్టి తీస్క పోదుగాని” అంటూ సాగనంపింది. ఆడుతున్న ఆట ఆపి “మంచిది అంటీ”అన్నాను ఆమె వెళుతున్న వైపు చూస్తూ.

కోకతట్టి నుంచి వచ్చే ముస్లిం చాంద్ బీ, నరసింహ స్వామి కి భోగం చేయిస్తే … గుడి పూజారి భార్య అయిన మా అమ్మేమో ప్రతీ మొహర్రం పీర్ల పండక్కి దట్టి, చాదర్, వస్త్రాలు పంపుతుంది. ఆవిడ ఊదు ప్రసాదంగా తెచ్చి ఇస్తుంది. నాకు బుద్ది తెలిసినప్పటినుంచీ ఇలాగే సాగుతోంది. మొదట్లో అర్థం అవక అమ్మని అడిగి అడిగి విసిగించేదాన్ని. తరువాత అలవాటయి పోయింది.

సాంప్రదాయ కుటుంభం లోని అమ్మ పీర్ల పండగ మానలేదు

ముస్లిం అయిన చాంద్ బీ నరసింహ జయంతికి భోగం చేయించటంమూ మానలేదు.

తమ వాడకట్టు అగ్రహారం మాత్రమే తెలిసిన అమ్మ,

ఆమె మోహల్లానే తెలిసిన చాంద్ బీ వాళ్ళ ప్రపంచమే వాళ్ళది.

ఇద్దరికి ఎలాంటి చదువు సంధ్యలు లేవు, ప్రపంచ జ్ఞానమూ లేదు.

వాళ్ళ వాళ్ళ ఆచార వ్యవహారాలను పాటిస్తూ, ఇతర దేవుళ్ళనీ, వాళ్ళ సాంప్రదాయాలను గౌరవించి, నమ్మి పూజలు చేసేవీళ్ళకి హిందూ ముస్లిం మత కలహాలు అసలు తెలీదు. కొన్ని శతాబ్దాల క్రితం ముస్లింలు ఎక్కడనుంచి వచ్చారో తెలియదు. తెలిసిం దంతా ఒక్కటే అంతా పేదరిక బాధితులమని. వీళ్ళ సంస్కారం ముందు, ఎంతో చదువుకుని, సో

కాల్డ్ సంస్కారాన్ని పులుముకొని సంఘంలో తిరిగే మహానుభావులు తమ మతమే గొప్పదని రొమ్ము విరుచుకుని ప్రచారాలు చేస్తున్నారు. మరి వాళ్ళు చదివిన చదువు విజ్ఞత నేర్పలేదా! వాళ్ళు గుడ్డిగా పాటిస్తున్నదంతా రాజకీయ మత్రాంగమని తెలుసుకోలేక పోతున్నారా. దేశంలో తలెత్తుతున్న సమస్యల్ని పక్కదారి పట్టించేందుకు స్వార్థ రాజకీయాల కోసం మత వైషమ్యాలను పెంచుతూ, మనుషుల మధ్య అడ్డుగొడల్ని నిలిపి, మనల్ని పావుల్లా వాడుకుంటున్నారని ఈ స్కాలర్స్ కి తెలియదా?

ఆ రోజుల్లోనే, అంటే 1960 ప్రాంతం లోనే మతసామరస్యానికి ప్రతీకలుగా ఉండే వాళ్ళు వీళ్ళిద్దరూ.

ఇప్పుడే ఇలాగుంది. రానున్న కాలంలో మన దేశం ఇంకెంత మారుతుందో కులాలు మతాలు లేకుండా అందరూ బాగుంట రెమో నని అనుకునే దాన్ని. కానీ మారుతున్న కాలంతో మనుషులు వింత పోకడలు తప్ప విచక్షణ కనబడటం లేదు. తమ తమ మతాలే గొప్ప వని అనడం కంటే ఇతర మతాల వాళ్ళని దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ ప్రచారాలు చేస్తున్న వారిని చూస్తే మన సంస్కృతి ఏమై పోతుందో అనిపిస్తుంది.

July 19, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

ఇద్దరమ్మాయిలు- ఒక పడవ

by Shanti July 19, 2023
written by Shanti

ఆ ఇద్దరమ్మాయిలు పడవలో అలా వెళ్ళిపోతున్నారు. పూడుకుపోయిన గొంతులో పగిలిన పాట లాగ, చేజారిన గుండెలో చిక్కుకున్న మాటలాగ.. ఉలుకు లేదు..పలుకు లేదు.

చుట్టూతా నీళ్లు, సగం పైగా పడవలో పూలు, పూల చివరన పొడుచుకొచ్చిన ముళ్ళలాగా వీళ్ళు.. నీటి మీద నిటారుగా పరుచుకున్న వారి మిసిమి మిలమిల ల మధ్య చొరబడ్డ నిశ్శబ్దాలు ప్రతిఫలిస్తుంటే.. తేలి ములిగిపోతున్న చేపల్ని తేటగా తేరిపార చూస్తూ తెడ్లు వేస్తున్నారు.

అప్పుడప్పుడూ తోటలో తొంగిచూసిన కలుపు మొక్క లాగ,శూన్యాకాశపు చిరిగిన పొట్లం నుంచీ ఒక మేఘం నీడ ముసిరినప్పుడు మాత్రం తొలి రజస్వల తొందరపాటు లాంటి మానవమానాలు తోడిన తొక్కిసలాంటి, రగడి రాపాడిన రక్తపు చార లాంటి, బహుశా ఒక భయద భూకంపం లాంటి భూస్థాపితమైన జ్ఞాపకం బాధించినట్టుంది. క్షణం సేపే… కొంచెం మ్లానమైన ముఖాలతో కసురుకున్నట్టు, కలవరబడ్డట్టు కాస్త కటువుగా కనుబొమ్మలను కదిపారు.

వాళ్లు యుద్ధంలో శాంతి సందేశాలు పంపుతూ పట్టుబడిపోయిన పావురాల లాగా ఉన్నారు. అలాగని బంధనాలు వేసిలేవు.. వాళ్ళ సాచిన రెక్కలను ఎవరో సావకాశంగా కత్తిరించిన సార్ధకతతో సంతోష సరాగాలు ముద్దాడిన మౌనరాగాలలో ముద్దలు ముద్దలుగా మొలకలెత్తే ఒక మట్టి వాసన, ముకుళించుకుని మురిసిపోతోంది.

అయినా వాళ్ళు తేలు కుట్టిన దొంగల్లా లేరు. తేరు మీద తీక్షణంగా వెలుగుతూ తేలిపోయే దీపాల్లాగ, లేత గులాబీ జెండాల్లాగా రెపరెపలాడుతున్నారు. జోడి గా కోరికోరి ఎవరో జగజ్జేతే వస్తాడని గవ్వలని గట్టుమీద గబగబావేసి ఎవరో జోస్యం గబుక్కున చెప్పినట్లున్నారు. అది వాళ్ళు ఎంత మాత్రమూ నమ్మ లేదు.అయినా ఎవరితో జెట్టీలు పెట్టుకోకుండా, జతకూడడానికే జాగ్రత్తగా జాజిపూలు గుట్టగా పోసుకుని గుడి పండుగలో మాలలుగా గుది గుచ్చడానికి, నిస్త్రాణగా తెల్లబోయిన నింగిని నీటిలో తొలగతోస్తూ, గాటంపు గాయాల గాఢత దాస్తూ, అంత గాడ్పు లోనూ గడుసుతనంతో గమిస్తున్నారు.

వాళ్ల గురించిన స్పష్టత వాళ్లకు సాంతం ఉందన్పిస్తోంది. అంతలోనే… వాళ్ళ ఉదంతం ఒక అంతం లేని కథన్పిస్తోంది. వాళ్లు శాంతంగా ఉన్నారు… స్త్రీత్వపు గరిమ గురించి చాలాసార్లు సుదీర్ఘంగా విన్నారు. పడవ చుట్టూ తిరుగుతున్న చేప పిల్లల్ని నీటి పలక మీద తెల్లటి అక్షరాల్లా చూశారు. కన్యలైనా, కుంతి అనే ఇంతి గురించి అంతో ఇంతో తెలుసుకున్న వాళ్ళు కదా… పసిబిడ్డల ఆలోచనతో వాళ్ళ పరువం కొంచెం పలకరించింది. ఫలదీకరణ ప్రక్రియ పరాకుగా గుర్తుకొచ్చి కాబోలు.. సిగ్గు చెందిన ఆలోచనలతో శిరస్సు వంచుకున్నారు. వాళ్ళ హృదయాలు వద్దన్నా ఉప్పొంగాయి. ఇంకా వాళ్ళు చెట్టు, పుట్ట, చేపబుట్ట లలో పుట్టిన విచిత్ర శిశువుల భాగోతాలు, అనంతరాయుడు, అగంతక వాయువు స్త్రీలను ఆనందంగా ఆశీర్వదించి ఉచితంగా పునిస్త్రీలు గా చేసిన పురాణ కథలు బోలెడు పూర్తిగా పుక్కిట పట్టి ఉన్నారు. అందుకే ఎడతెరిపి లేకుండా తెడ్లు వేస్తూ, అలసటతో వచ్చిన చెమట చుక్కల్ని చూపుడు వేలుతో గబుక్కున తాకి కాస్త కలవరపడ్డారు. చేపలు, కప్పలు చెమట చుక్కల్ని మింగి గర్భవతులవడం గుర్తుకొచ్చి కాస్త గాబరా పడ్డారు.

వాళ్లకు స్త్రీత్వపు ఔన్నత్యం గురించి కూడా బాగా తెలుసు. ఓ నారీ! సుకుమారి! కుసుమ కుమారి..!! అనే అనవసరపు పొగడ్తలు, ‘సురారులమ్మ..కడుపారగబుచ్చిన యుద్ధభేరీ’ లాంటి అమోఘమైన స్తోత్రాలు సైతం శృతం చేసి ఉన్నారు. వాళ్ళ జీవిత పథాన్ని నిర్దేశించే మదాలస, యశోద ల లాంటి ఆదర్శమాతల అద్భుతమైన గాథల్ని ఔపాసన పట్టేశారు. అడవి వాసన తగలని అతివ ఊర్మిళ నిదుర వద్దని ఆ రొద ని ఉదయాన్నే ఎర్రబడ్డ కళ్ళతో ఏటివాలుగా ఎటో ఎగరగొట్టేశారు. సావిత్రి సుధను మధువు లా ఆ మధ్యాహ్నమే పుచ్చుకున్నారు. సత్యవతి కథనం సంపూర్ణంగా సాయంత్రం సుగంధం పూసుకు విన్నారు. ఐదుగురి అలవి కాని అనురాగం పొందిన ఆ పాంచాలి వ్యథను అసహ్యం కలగని అనురక్తితో ఆ రాత్రి పూట అప్పటికప్పుడు పడవకు అటూ ఇటూ, లోపటా- బైటా తమ చుట్టూతా పట్టు పావడాల్లా కట్టారు.

వాళ్ళిద్దరి పడవ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. తడవ తడవకూ తప్పటడుగులు వేయని పడవ అది. తన పనిలో తాను నిమగ్నమైన భగ్న నౌక. అది చైత్రమాసంలో రెండు కొండల నడుమ లోయలో చిక్కుకున్న చిన్న మబ్బు ముక్కలాగుంది. కానీ అది యజ్ఞవాటిక లోంచో, నాగలి చాలు లోంచో ఒక్క పెట్టున ఆవిర్భవించిన ఆశ్చర్యం కాదు. ఏళ్ళు పూళ్ళు అడవిలో అజ్ఞాతంగా మొలచి ఋతుమతి ఐన దగ్గర నుంచీ అలవి కాని ఆరు ఋతువులకు ఆలవాలమై, చేవదీరిన చెట్టు కొమ్మలతో చేసిందది. అడ్డుగా అక్కడక్కడా అమావాస్య గీతలు, పైపూతగా పున్నమి చారలు గీసుకుంది. పలు ప్రమాదాలు దాటి వచ్చిందది. అందుకే చేవదీరినా ఇంకా పచ్చి ఆకులు కాలిన వాసన చెక్కల్లో ఇంకిపోయే ఉంది. అదొక సాదాసీదా పడవ. ఏ వాదప్రతివాదాలు చేయకుండా ఆ ఇద్దరమ్మాయిలను మోసుకుంటూ, తోసుకుంటూ వెళ్తోంది. జలస్పర్శతోనే తన జావళీలను జప్తు చేసుకుంది. నీళ్లు తాకినా నిర్మోహంగానే ఉంది. ‘జాగ్రత్త’ మాత్రమే దాని ఇప్పటి ఆచారం. ఏ తీరపు తొందర లేనిది దాని సంచారం. తేనె పిట్ట ల్లాంటి తరుణులను తీసుకువెళ్తున్నా వాళ్ల మనసులోని మసక చేదు చూడగలగడం దాని గ్రహచారం. నాచు పట్టిన క్రింది భాగంలో నానాజాతి సమితుల ఛాయలు ప్రతిఫలిస్తున్నా దానికంటూ ప్రత్యేకంగా ఏ చిహ్నమూ లేకపోవడం దాని అసంశయాత్మక సమాచారం.

వాళ్ళిద్దరి గురించి ఎంతో వివరించాలి… అసలు వాళ్లు ఎక్కడివాళ్లు.. ఈ పడవలో కెలా వచ్చారు… కానీ ఎందుకో మనస్కరించట్లేదు. విచారము, వినోదమూ కాకుండా ఏ వ్యగ్రతా లేకుండా, నిర్వికారంగా ఉన్నారనిపిస్తున్నారు. అయితే వాళ్లు నిజాయితీగా ఉన్నారని మాత్రం నిస్సంకోచంగా, నిష్కర్షగా చెప్పొచ్చు. అది నిజానికి తేలికగా చెప్పడం చాలా సులువైన పని…అలా ఉండటం అనితరసాధ్యం.

విభా-ప్రభాతాలలో ఏ విభ్రమము, విస్మయము లేకుండా ఉన్న వాళ్ళిద్దరూ ఒకరు తెలుపు ఒకరు నలుపు కాదు. రౌద్రమైన రక్త వర్ణంలో కాస్త తెల్లటి శాంతి పూల రంగు చిలకరించి చుట్లు చుట్టిన గులాబీ రంగు తీగలా ఉంది వాళ్ళ దేహం. తెల్లమద్ది వృక్షాల పూచిన తోపులా ఉంది వాళ్ళ మొహం. నది నడుమన పెదాల మధ్య నాలుక నొక్కి పట్టి వాళ్ళ హృదయాలు అమలినాలని గుర్రపు డెక్క ఆకులు గోల పెడ్తున్నా, పడవ అడుగుకు తోసేసిన పసితనపు నిసి రాత్రి నిజాలు నిటారుగా ఉండుండి నీటిపాముల్లా లేచి నిలదీస్తున్నట్లు ఈల వేస్తున్నా, కాలం కొయ్యకు ఉరితీసిన ఉదయపు ఉత్పాతాల హేల ఉద్రేక పరుస్తున్నా, రాత్రి రంగేళీల రంగవల్లి రక్తి కట్టిస్తానంటున్నా… అవేవీ పట్టించుకోకుండా అమ్మాయిలిద్దరూ ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. అసహనంతో దేన్నో అందుకోవాలనుకుంటున్నట్టున్నారు. సర్దుకుపోవడం, సహన గీతం సదా పాడడం వాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. అలాగనే సూర్యుణ్ణి, చంద్రుడ్ని రెండు సున్నాల లాగా, సరి సమానంగా శిశు స్థాయిలోనే దిద్దుకున్నారు.. గుండెలకు గట్టిగా అదుముకున్నారు.

వాళ్ళు ఏ తీరం గురించీ ఇంకా ఆనుపానులు, ఆరాలు తీయట్లేదు. తేరగా దొరికే తీరం కూడా వాళ్ళ గమ్యం కాదనుకుంటా. కనుకునే తొలి జామైనా మలి జామైనా ఏదీ తూచకుండా ,తూగకుండా అనుభూతిస్తూ తాపీగా తెడ్లు వేస్తున్నారు. గుడి దగ్గర జరిగే ఉత్సవంలో గరగల్ని కచ్చితంగా మోయాలని మాత్రం వాళ్లకు తెలుసు. నీటి నురగ లని అందుకే గభాలున తోసేస్తున్నారు. స్థిమితంగా కూర్చోలేకపోవడం, శీఘ్రగతిన చెదరడం , చీమ చిట్టుక్కు మన్నా బెదిరిపోవడం… అంతలోనే మళ్లీ సర్దుకు కూర్చోవడం.అంతే. ఇంకే చిలిపి ఆలోచన వాళ్లకు లేదు.

ఆ ఇద్దరమ్మాయిలు ఆ పడవలో అలా అలా వెళ్ళిపోతూనే ఉన్నారు. ఎందుకో మాత్రం ఒకే ఒక్కసారి ఇద్దరూ కలిసి నవ్వారు. కాటుక కొండల కారడవిలో కబళించాలని చూసే కార్చిచ్చును అదాట్టున కురిసిన ఒక స్వప్న జలపాతం అనాయాసంగా చల్లార్చిందని…ఆ నీరు ఆ ఇద్దరి కన్నీరే నని… గట్టుమీద చెట్టులా పాతుకుపోయిన ఎవరో పురుష పుంగవడు కొంచెం గొంతు తగ్గించి అసహనంగానో, అర్థవంతంగానో అన్నట్టున్నాడు. సుదూరంగా ఉన్నందువల్ల కాబోలు లేదా ఆత్రంగా నేత్రాలలో శుభ్రజ్యోత్స్నలు నింపుకొని వెలిగిపోతున్నందు వల్లనో ఎందుకో ఆ ఇద్దరి కీ ఆ సూత్రం వినబడలేదు, కనబడలేదు.

సర్వస్వతంత్రురాలు కాని, హద్దులు, పొద్దులూ ఎరుగని పడవ మాత్రం ఒక్కసారి హృదయం సర్దుకుని..అటూ ఇటూ ఒరిగి నిట్టూర్చింది. పాము పడగల్లా తలెత్తిన రెండు బుడగలు తెడ్లు వేసిన తాకిడికి తలక్రిందులయ్యాయి.

July 19, 2023 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

చిలుక కథలు (కథాగుచ్ఛము)

by Arutla Sridevi July 18, 2023
written by Arutla Sridevi

3. చిలుకమ్మ అందం

ఒక అడవిలో మేడిచెట్టు కొమ్మపై క చిలుక గోరింక కాపురమున్నాయి. అనుకోకుండా చిలుక అనారోగ్యానికి గురైంది. చిలుక మేతకు వెళ్ళలేకపోయింది. గోరింకనే బయటకు వెళ్లి చిలుకకు తగినంత మేత తెచ్చేది. ఇంకా గోరింక చిలుకకు ఎన్నో సపర్యలు చేసింది. కొన్ని రోజులకు చిలుక కోలుకుంది.

ఒకరోజు చిలుక గోరింక తీరిగ్గా కూర్చొని మాట్లాడుకుంటున్నాయి.  మాటల మధ్యలో గోరింక చిలుకమ్మ నేను నీకు ఎంతో సేవ చేశాను కదా నాకొక బహుమతి ఇవ్వరాదూ అంది. అదేమిటో అడుగు అంది చిలుక. ఏం లేదు నువ్వు పచ్చని రంగులో చాలా అందంగా ఉంటావు కదా. ఒక ఈక ఇవ్వవా అంది గోరింక. అమ్మో ఒక ఈక ఇస్తే నా అందం చెడిపోతుంది.  నేనివ్వను అని చిలుకమ్మ కోపంతో గోరింక మీదకు గయ్యుమని లేచింది. అంతేకాకుండా ఈక అడిగినందుకు నేను నీ దగ్గరుండనని గూటిని విడిచి చిలుక ఎటో ఎగిరిపోయింది. గోరింక ఎంత బ్రతిమాలినా చిలుక వినిపించుకోలేదు.

అట్లా వెళ్తూ వెళ్తూ ఉన్న చిలుకకు ఒక జోష్యం చెప్పుకనేవాడు కనిపించాడు. చిలుక అతని దగ్గరకు వెళ్లి నేను నీకేమైనా ఉపయోగపడాతానేమో నన్ను నీ దగ్గర ఉంచుకోరాదు అనడగింది. అందుకు ఆ జ్యోతిష్కుడు కొంచెం ఆలోచించి సరే నిన్ను నా దగ్గర ఉండనిస్తాను కాని అందుకు పర్యవసానంగా నీ అందమైన ఈక ఒకటి ఇవ్వాలి అన్నాడు. ఆ మాటతో చిర్రెత్తుకొచ్చిన చిలుక కోపంతో అక్కడ నుండి వెళ్లిపోయింది.

అట్లా వెళ్తూ వెళ్తూ ఉన్న చిలుక బాగా అలసిపోయి ఒక చెట్టు కొమ్మపై వాలింది. అదే చెట్టు కొమ్మపై ఒక కోతి కాపురముంటున్నది. ఏం చిలుక గారు ఎటు నుండి ఎటు ప్రయాణిస్తున్నారు? అనడిగింది. చిలుక జరిగిన సంగతంతా చెప్పి ఈక ఇమ్మన్నందుకు తాను అలిగి వచ్చేశానని చెప్పింది. విషయమంతా విన్న కోతి చిలుకను ఓదార్చింది. సరే నువ్వు ఇక నుండి నా దగ్గరే ఉందువుగాని నేను నిన్నేమీ అడగనులే అంది కోతి. ఆ రోజు నుండి చిలుక కోతి హాయిగా కలిసి ఉంటున్నాయి.

ఒకసారి చిలుక ఒక స్వచ్ఛమైన , నిర్మలమైన చెఱువుగట్టుపై ఉన్న వేప చెట్టుకొమ్మపై వాలింది.  అదే చెటు కొమ్మపై ఒక కోతి కాపురముంటున్నది. ఏం చిలుకగారు ఎటు నుండి ఎటు ప్రయాణిస్తున్నారు? అనడగింది. చిలుక జరిగిన సంగతంతా చెప్పి ఈక ఇమ్మన్నందుకు తాను అలిగి వచ్చేశానని చెప్పింది. విషయమంతా విన్న కోతి చిలుకను ఓదార్చింది, సరే నువ్వు ఇక నుండి నా దగ్గరే ఉందువుగాని నేను నిన్నేమీ అడగనులే అంది కోతి. ఆ రోజు నుండి చిలుక కోతి హాయిగా కలిసి ఉంటున్నాయి.

ఒకసారి చిలుక ఒక స్వచ్ఛమైన, నిర్మలమైన చెఱువు గట్టుపై ఉన్న వేప చెట్టుకొమ్మపై వాలింది. చిలుక నీళ్లవైపు చూసి ఆహా నీళ్లు ఎంత నిర్మలంగా ఉన్నాయి అనుకుంటున్నత లోపే ఆ నీళ్లలో వికృతంగా, అసహ్యంగా ఉన్న పక్షి ఒకటి చిలుకకు కనిపించింది. చిలుక ఆశ్చర్యంగానూ, భయంగానూ ఆ పక్షిని తదేకంగా చూడసాగింది. చిలుక రెక్కలు టపటప లాడించింది. ఆ నీళ్లలోని వికృత పక్షి కూడా రెక్కలు టపటప లాడించింది. చిలుక ముక్కును ఇటూ అటూ అంది. ఆ వికృత పక్షి కూడా అట్లాగే ముక్కును ఇటూ అటూ అంది. ఆ వికృత పక్షి చిలుక ఎట్లా చేస్తే అట్లాగే చేస్తుంది.  ఏమీఅర్థంకాని చిలుక కొంచెంసేపు ఆలోచించింది. ఓ! ఇది వేరే పక్షి కాదు తన ప్రతిరూపమే అని అనుకున్న చిలుక నా అందమైన రూపం ఇంకా వికృతఁగా ఎట్లయింది అని బాధపడుతూనే కోతి దగ్గరకు వెళ్లింది. ఆ సమయానికి ఆ చెట్టుపై కోతి లేదు. అక్కడే కోకిలమ్మ, ఒకటి ఉంది. చిలుక ఎంతో మర్యాదతో కోకిలగారు కోతిగారు ఎక్కిడికి వెళ్ళారు? అనడిగింది. ఏమో అలా బయటకు వెళ్లినట్టున్నారు అంది కోకిల.  చిలుక ఏడుస్తూ కొమ్మపై కూచుంది. ఏమైంది, చిలుకగారు విచారంగా ఉన్నారు అంది కోకిల, చిలుకు ఆప్యాయంగా పలుకరిస్తూ. ఏం లేదు, కోకిలగారూ నా అందమైన ఈకలన్నీ ఎలా ఊడిపోయినాయి, నను ఇంత వికృతంగా ఎట్లయినాను అంది చిలుక ఏడుస్తూ. ఓ అదా! చిలుకగారు, మీకు ఒక విషయం చెప్పాలి. మీరు రోజూ నిద్రబోయే సమయానికి మీకేమాత్రం నొప్పి కలుగకుండా రోజుకో ఈక పీక్కుంది కోతి. ఆ ఈకలన్నీ జమజేసి అదిగో పిల్లలు అడుకుంటున్నారో వాళ్ళకమ్మడానికి వెళ్లింది, అని చెప్పింది కోకిల. కోతి చేసిన మోసానికి చిలుకకు కోపం ముంచుకొచ్చింది. కానీ ఏం చేయగలదు. కోతి తనకన్నా బలవంతుడాయే, ఏమీ చేయలేని చిలుక ఎగురుతూ ఎటో వెళ్లిపోయింది.

ఎగురుతూ ఎగురుతూ అలా వెళ్లిన ఒక జంతు ప్రదర్శన శాలకు వెళ్లి అక్కడే ఉన్న యజమాని దగ్గరకు వెళ్లింది. అయ్యా మీ జంతు ప్రదర్శన శాలలో నాకు స్థానమిస్తారా? అనడిగింది. ఏం మొహం పెట్టుకుని అడుగుతున్నావే చిలుకా! నీకు ఈకలే లేవు అందమే లేదు. నిన్ను చూస్తే ఇతర చిలుకలు పొడచి చంపినా చంపుతాయి, వెళ్లు, ఇక్కడి నుంచి అని తరిమికొట్టాడు ఆ జూ యజమాని.  చిలుకకు కళ్లలో నీళ్లు తిరిగాయి. చిలుకకు తన మొదటి నేస్తమయిన గోరువంక గుర్తొచ్చింది. నన్ను గోరువంక ఎంతగా ఆదరించింది, ఎంత సేవలు చేసింది అయినా నేను మూర్ఖంగా ఒక్క ఈక ఇవ్వలేకపోయాను. ఇప్పడు చూడు ఈకల్నీ పోగొట్టుకుని నా గతేమయ్యిందో అని వెక్కి వెక్కి ఏడ్చింది. చిలుక పశ్చత్తాపముతో తిరిగి గోరింక వద్దకు వెళ్లింది. అక్కడ గోరింక మరో అందమైన చిలుకతో స్నేహం చేసింది. ఆ రెండు చిలకా గోరింకలు ఎంతో హాయిగా ఉన్నాయి. చిలుకమ్మ గోరింకతో నేను ఇక నుండి నీ దగ్గర ఉండవచ్చా అనడిగింది. క్షమించు చిలుకమ్మా గూటిలో మా ఇద్దరికే చోటుంది, నువ్వేటైనా వెళ్లు అంది గోరింక. చేసేదేమి లేని చిలుక శివుని ధ్యానించుటకై హిమాలయాలకు ఎగిరిపోయింది.

July 18, 2023 0 comment
2 FacebookTwitterPinterestEmail
కథలు

‘తిమిరపు వెలుగు’

by Sunka Dharani July 18, 2023
written by Sunka Dharani

‘నేను త్వరగా వచ్చేస్తా అమ్మ! ఒట్టు..’
‘ఇలాగే చెప్పి మొన్న ఆ ప్రీతి వాళ్లింటి కాడికి పోయావ్. నేను మళ్లీ నీ కోసం బెత్తం పట్టుకుని వచ్చేలా చేశావ్. గుర్తులేదా’
‘మొన్నంటే అరిసెలకు ఆశ పడి అక్కడే ఇచ్చేవరకు ఉండాల్సి వచ్చింది. అందుకే లేటైంది లేవే, అయినా ఎందుకు నేనేదో చిన్నపిల్ల అన్నట్లు కర్ర పట్టుకొని….’ అని చెప్తుండగానే
‘చూడు జహీ! బయట పరిస్థితులు అస్సలు బాలేవు. మీ నాన్న వచ్చే వేళకి నువ్వు ఇంట్లో లేవనుకో ఈ సారి బెత్తం కాదు, కొరడా పట్టుకొస్తా’ కొంచెం గట్టిగానే అనింది అమ్మ.
‘నీకా ఛాన్స్ ఇవ్వను లే!’ అంటూ నాలో నేనే నవ్వుకుని మన్విత వాళ్లింటికి బయల్దేరా. ఈ రోజు తనకి పెళ్లిచూపులు.

నా కోసం ఎదురుచూస్తుంటుందేమో అనుకుంటు ఉండేసరికి ఆటో మన్విత వాళ్ల ఇల్లు దాటేసింది. ఆటో అతన్ని ‘హ్హ.. ఇక్కడే ఆపండి.’ అని డబ్బులిచ్చేసి మన్వి వాళ్లింటికి అడుగులేసా. ఎందుకో ఈ రోజు మన్వి వాళ్ల వీధంతా హడావుడిగా ఉంది. ఆటో చప్పుడు వినిపించి మన్వి బయటకొచ్చింది.
‘ఎప్పుడు రమ్మంటే ఎప్పుడొస్తున్నావమ్మా!?’
‘అబ్బా అమ్మ గురించి తెలిసిందేగా. త్వరగా వస్తానని నాతో చెప్పించుకోవాలని ఇంత లేట్ చేసింది.’
‘సర్లే పదా!’ అంటూ మన్వి తన రూంకి తీసుకెళ్లింది.
ఇంతలో మన్వి వాళ్ల అమ్మ వచ్చి ‘పెళ్లికొడుకు వాళ్లు ఇంకో అరగంటలో వచ్చేస్తారట ఏవైనా ఉంటే తొందరగా తయారై రండి’ అని చెప్పి వెళ్లింది. నెమ్మదిగా మన్వి మొహం వాడిపోతూ, కళ్లలో నీటి ఛాయలు అలుముకున్నాయి.

నిజానికి మన్వి నేను ఒకే స్కూల్. మాది చాలా బలమైన ఫ్రెండ్ షిప్. తనకి ఈ పెళ్లంటే ఇష్టం లేదు. ఎందుకంటే తనకింకా పదహారెళ్లే. వీళ్ల కుటుంబం బలవంతం మీదుగా ఈ పెళ్లి జరగబోతుంది.
‘నీకు ఈ పెళ్లి ఇష్టం లేదని మళ్లీ చెప్పొచ్చుగా మన్వి’
‘చెప్పి చూసా! చిన్నపిల్లవి నీకేం తెలీదు. మేం చెప్పినట్లు విను అన్నారు’
‘నీకు పెళ్ళైపోతే నాకు దూరంగా వెళ్లిపోతావు కదా!’
‘ఔను జహీరా! నాకు మీ అందర్నీ వదిలి వెళ్లాలని లేదు’ అంటూ ఇద్దరం ఒకరికొకరం ధైర్యం చెప్పుకుంటున్నాం.

పెళ్లికొడుకు వాళ్లు వచ్చారని మన్వి వాళ్ల చుట్టాలు,ఇంట్లో వాళ్లు ఇంటి గేట్ వరకు వెళ్ళారు. నేనేమో మన్వి రూం నుండి బయటకు వచ్చి కిటికీలోంచి అబ్బాయి వాళ్లని చూస్తున్నా. ఇంతలో టెలిఫోన్ మోగుతుంది. పట్టించుకోకుండా కిటికీ మీదే ధ్యాస పెట్టా. మళ్లీ ఇంకో సారి మోగింది. ఈసారి మన్వి రూం నుండి బయటకొచ్చి టెలిఫోన్ ఎత్తి మాట్లాడింది.
‘హాలో! ఎవరు?’
‘హా.. మన్వి నేను జహీరా వాళ్ల అమ్మని’
‘ఆంటీ చెప్పండి’
‘జహీరా లేదా?’
‘ఉంది ఇస్తున్నా ఆంటీ’ జహీ మీ అమ్మ ఫోన్ చేసింది.
అని చెప్పగానే అమ్మెందుకు ఫోన్ చేసింది అనుకుంటూ, ఫోన్ తీసుకున్నా

‘హలో జహీ..’
‘నేనే అమ్మ ఏవైంది ఫోన్ చేశావ్’
‘జహీ నువ్వక్కడి నుండి వెంటనే దగ్గర్లో ఉన్న మావయ్య వాళ్లింటికి వెళ్లు. చాలా ప్రమాదంలో ఉన్నాం మనం’ అనగానే నా వెన్ను అదిరింది
‘ఏవైంది అమ్మ ఎందుకిలా మాట్లాడుతున్నావు’
‘అవన్నీ ఇప్పుడు చెప్పలేను. నేను నాన్న దర్బార్ మందిరంలో ఉన్నాం’
‘నువ్వు అక్కడ్నుండి ఖాదీర్ మావయ్య వాళ్లింటికి వెళ్లు. మావయ్య నిన్ను మా దగ్గరకి తీసుకొస్తాడు.
జహీ.. నిన్నెవరైనా నువ్ సిక్కు పిల్లవా అని అడిగితే కాదు అని చెప్పు’ అంటూ అమ్మ ఏడుస్తూ చెప్తుండగానే ఫోన్ సిగ్నల్ పోయింది.

ఇంతలో బయటున్న పెళ్లి కొడుకు వాళ్లు లోపలికి వచ్చారు. అమ్మ నాకు దేని గురించి చెప్పలేదు అసలేమైంది అనుకుని మన్వి నేను రూంలోకి వెళ్లి గడియ పెట్టాం. మన్వికి అమ్మ చెప్పిందంతా చెప్పా.
‘కానీ అసలేం జరుగుతుందో అర్థం కాట్లేదు మన్వి’ ఎండిపోయిన గొంతుతో నిస్సహాయంగా చెప్పా.
మన్వి ఆలోచిస్తూ ‘మీ అమ్మ చివర్లో నిన్ను సిక్కు అమ్మాయివని ఎందుకు చెప్పకంది?’
‘నన్ను ఇంకా భయపెట్టకు మన్వి’
ఇంతలో గడియ తీయమని మన్వి వాళ్ల నాన్న పిలుపు, నా గుండెలో రైళ్లు పరిగెడుతున్నాయి.
సంశయిస్తూనే మన్వి తలుపు తీసింది.

వాళ్ల నాన్న నేరుగా నా దగ్గరకొచ్చి
‘జహీరా బయట దారుణంగా అల్లర్లు జరుగుతున్నాయి. నువ్వెందుకమ్మా ఇక్కడికొచ్చావు’
ఇంతలో మన్వి ‘నేనే రమ్మని బలవంత పెట్టా నాన్న’ అంది చిన్న గొంతుతో
అందరూ ఆలోచనలో పడ్డారు
ప్రతి ఒక్కరి మొహంలో కంగారు, భయం.
అప్పుడు అర్థమైంది నేను వీళ్లకేదో అపాయం తలపెట్టా అని.
‘నాన్న ఇందాక జహీ వాళ్ల అమ్మ కూడా ఫోన్ చేసింది’ అంటూ మా అమ్మ చెప్పిన మాటలు మన్వి వాళ్ల నాన్నకి చెప్పింది.

ఆయన ఆలోచించి అమ్మ చెప్పినట్లుగానే నన్ను ఖాదీర్ మామయ్య వాళ్లింట్లో దింపేస్తా అన్నాడు. అప్పుడు మన్వి వాళ్ల నానమ్మ కలుగజేసుకుని
‘నీకెందుకు వచ్చిన సంతరా! ఈ పిల్ల వెళ్లగలదులే’ అంది విసుగ్గానే
‘నీకేం తేలీదమ్మా నువ్వూరుకో, జహీరా మన్వి హే కాదు వాళ్ల నాన్న నేను కూడా చిన్నప్పటి స్నేహితులం. ఇలాంటి ఆపద సమయంలో వీళ్లని చేరదీసుకోవాల్సిన బాధ్యత మనకుండదా’
‘బాధ్యత సరే లేరా! ఈ పిల్ల మన్వి కోసం మనింటికి వస్తుందని అందరికీ తెలుసు, ఇప్పుడు ఈమె ఇక్కడుందని తెలిస్తే మన ఇంటి మీదకి వచ్చేయరు’
‘నువ్వు కాసేపు ఆగమ్మా!’ అని మన్వి వాళ్ల అమ్మకి, వాళ్ల నాన్న సైగ చేస్తాడు.
దానికి వాళ్లమ్మ తలూపి..

నన్ను మన్విని వేరే గదిలోకి తీసుకెళ్లి మన్వి బట్టలు ఇచ్చి మార్చుకోమంది. నన్ను మన్వి లానే తయారుచేస్తోంది. ఇదంతా చూస్తున్న మన్వి వాళ్లమ్మని అడిగింది
‘ఎందుకమ్మా జహీకి ఇప్పుడేం ప్రమాదముంది’
‘జహీకి కాదు! మన ఊర్లోని సిక్కు వాళ్లందరికీ ప్రమాదం.’
‘సిక్కువాళ్లేంటీ ఎందుకలా’ అంటూ జహీ మన్వి వాళ్ల అమ్మ మొహం చూసింది దీనంగా..
వాళ్ల అమ్మ కళ్లలో నీళ్లు తుడుచుకుని
‘మొన్న రేడియోలో చెప్పారుగా తల్లీ నువ్వు విన్లేదా ఇవన్నీ పెద్ద కుళ్లు కుతంత్రాల యవ్వరాలు నీకెలా చెప్పేది’
‘హ్హ.. మొన్న మన ప్రధానమంత్రి చనిపోయారని దీని గురించి గొడవలు జరుగుతున్నాయని అమ్మ చెప్పింది’
ఇంతలో మన్వి వాళ్ల నాన్న పిలుపు.

‘పెరడు వెనకాల నుండి వెళ్లండి ఎవరికంటా పడరు’ అంది మన్వి వాళ్ల అమ్మ.
నాలో చెప్పలేని భయం ఉబికోస్తుంది. వెంటనే మన్వి నన్ను గట్టిగా కౌగలించుకొని జాగ్రత్త జహీ అంటూ ఏడుస్తుండగానే మన్వి వాళ్ల నాన్న నా చేయి పట్టుకుని నా తలపై వోని కప్పి బయటకు తీసుకెళ్లారు కంగారు పడుతూనే. మామయ్య వాళ్ల ఇళ్లు కాస్త దూరంలోనే ఉంది.
మేము నడుచుకుంటూ వెళ్తుంటే ఢిల్లీ అంత ఎరుపు పులుముకున్నట్టు ఎక్కడ చూడు రక్తం, మంటలు..
‘అసలేవైంది అంకుల్.. సిక్కుల్ని మాత్రమే ఎందుకు చంపుతున్నారు, ఎవరు చంపుతున్నారు నాకు చాలా భయంగా ఉంది’
‘ఎవరో చేసిన పనికి మత విద్వేషాలు రెచ్చగొట్టి ఇలాంటి కల్లోలాలు సృష్టించి ఏ పాపం తెలీని అమాయక జనాల్ని కూడా పొట్టన పెట్టుకుంటున్నారు తల్లీ’ అంటూ కన్నీళ్లు తెచ్చుకున్నారు.

మేం నడిచే వీధుల్లో ఉన్న సిక్కు ఇళ్లన్నీ అగ్నితో దగ్ధమవుతున్నాయి. కొన్ని శరీరాలు రోడ్ల గుండా పడున్నాయి. ఆ దృశ్యాలు చూస్తున్నంతసేపు నరకంలో నడుస్తున్న ఆలోచన. ఆ వాసన ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉంది. తీరా రోడ్ నం. 23 కి రాగానే  అటువైపుగా ఆయుధాలు పట్టుకుని వెళ్తున్న ఓ ముఠా
మన్వి వాళ్ల నాన్నను చూసి..
‘మధుశాస్త్రి అటువైపు ఎక్కడికి ఈ టైంలో.. అక్కడ మంటలు అంటించాం’
మన్వి వాళ్ల నాన్నకి, నాకు గుండె ఆగినంత పనైంది.
వాళ్ల మాటలకు తడబడుతూనే
‘మ..మన్వితకి ఆరోగ్యం పాడైంది. ఇటువైపుగా హస్పిటల్ కి వెళ్దామని’ అంటూ వాళ్ల దృష్టి పడకముందే అక్కడి నుండి త్వరగా వెళ్లిపోయాం.
ఖదీర్ మామయ్య వాళ్ల ఇళ్లంతా తగలబడిపోయింది. మేం మామయ్య కోసం చుట్టుతా వెతికాం. అలా రోడ్ నం. 24 వరకు వెళ్లగానే మమ్మల్ని గమనించి ఖదీర్ మామయ్య మమ్మల్ని ఓ పరదాలోకి లాగారు. నన్ను దగ్గరకు తీసుకొని ఏడుస్తూ ‘జహీరాను జాగ్రత్తగా తీసుకొచ్చినందుకు మీకేలా కృతజ్ఞతలు చెప్పాలో తెలీట్లేదు’ అంటూ మన్వి వాళ్ల నాన్నకి రెండు చేతులతో దండం పెట్టాడు.
‘మీరు ఇంకా ఇక్కడుండడం మంచిది కాదు. త్వరగా మందిరానికి వెళ్ళండి’ అని మధుశాస్త్రి గారు చెప్పి మమ్మల్ని జాగ్రత్తగా పంపారు.
మామయ్యతో కలిసి ఎలాగోలా దర్బార్ మందిరానికి చేరుకున్నాం. కానీ అక్కడి పరిస్థితి చూసి నా మనసు, మెదడు మొద్దుబారిపోయింది.
మందిరమంతా కూడా నిప్పుల వరదలు. అందులో అమ్మనాన్న కూడా ఉన్నారు. గట్టిగా ఏడ్చే స్వతంత్రం కూడా లేదు. మామయ్య కూడా అక్కడే కుప్పకూలాడు మమ్మల్ని ఓదార్చే వారే లేని పరిస్థితి. ఏడ్చి ఏడ్చి శరీరం అదుపు తప్పింది. అలా ఆ రోజు అక్కడే ప్రాణాలతో ఉండగలిగాం. ఆ రోజు ఖదీర్ మామయ్య తన పగ్రి తీసేసి పొడవైన జుత్తును కత్తిరించాడు, తన కుడి చేయి కడియాన్ని కూడా తీసేసాడు. మరుసటిరోజు ఢిల్లీ నుండి ఎక్కడికైనా పారిపోవాలని ఓ రైలెక్కాం. అలా మా ఇంటిని కుటుంబాన్ని కోల్పోయి బిక్కుబిక్కుమంటూ బయలుదేరి చివరికి హైదరాబాద్ వచ్చేసాం. ఆరోజు రైల్లో మా పక్కన కూర్చున్న ఓ హిందూ కుటుంబం అచ్చు మన్వి వాళ్లలాగానే! వాళ్లు సరదాగా మమ్మల్ని చూస్తూ ఎక్కడి వరకండి ప్రయాణం అని మామయ్యని అడిగారు. దానికి మామయ్య అనుమానంగానే ‘హైదరాబాద్ వరకు’ అని చెప్పాడు.
అందులో ఒకావిడ ‘నీ పేరెంటమ్మా’ అని అడిగేసరికి
‘జహీరా సింగ్…’ అని చెప్పబోతుంటే
మామయ్య నా నోటిని అదిమిన
‘జాహ్నవి…’ అని చెప్పాడు
‘హో.. మంచి పేరు’
అప్పుడర్థం కాలేదు నా చుట్టూ జరిగిన మారణహోమం గురించి. జహీరా సింగ్ నుండి జాహ్నవి గుప్తాగా మారిన నా కథ గురించి. ఇప్పుడు నాకు ఇరవై మూడేళ్లు.

July 18, 2023 0 comment
2 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us