మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

తెలంగాణ బతుకమ్మ పండుగలో తంగేడు పూలు (Cassia auriculata) శాస్త్రీయ, ఆధ్యాత్మిక మరియు విశ్వ నియమాల పరంగా ప్రాముఖ్యత:

by dr. Lakkraju Nirmala September 23, 2025
written by dr. Lakkraju Nirmala

1. తంగేడు పువ్వు – శాస్త్రీయ వివరాలు:

శాస్త్రీయ నామం: Cassia auriculata

ఇతర పేర్లు: Tanner’s Cassia, Avaram (తమిళంలో), తంగేడు (తెలుగులో)

భాగాలు ఉపయోగం: పుష్పాలు, ఆకులు, గింజలు, వేర్లు—all parts are medicinal.

ఔషధ గుణాలు: శరీర వేడి తగ్గించడానికి. ముత్ర విసర్జన నియంత్రణకు. చర్మ రోగాలు తగ్గించడానికి. రక్తశుద్ధి (Blood purification).

లివర్ ఫంక్షన్ మెరుగుపరచడం. డయాబెటిస్ నియంత్రణకు సహాయపడే గుణం కలదు.

2. బతుకమ్మలో తంగేడు పూలు – ఆధ్యాత్మిక భావన: బతుకమ్మ పండుగ అనేది: జీవరేఖను (life energy) పూజించే పండుగ. స్త్రీ శక్తిని (Shakti) ఆహ్వానించే కాలం. శరదృతువులో శరీర శుద్ధి, మానసిక విశ్రాంతి, ప్రకృతి మానవ మేళవింపును సూచిస్తుంది.

తంగేడు పువ్వు: ఆకర్షణీయమైన పసుపు రంగులో ఉంటుంది. ఇది సూర్య శక్తి, ఆరోగ్యాన్ని సూచిస్తుంది.

పసుపు రంగు అనేది విశ్వ శుద్ధి శక్తిని సూచించే తత్త్వంగా భావించబడుతుంది.

ఈ పువ్వు విషాలను శోషించగల సామర్థ్యంతో, ప్రకృతితో మానవుని అనుసంధానించే పాత్ర పోషిస్తుంది.

3. తంగేడు పూలు & విశ్వ నియమాలు – అనుసంధానం:

1. లా ఆఫ్ డివైన్ ఆనెస్స్ (Law of Divine Oneness): తంగేడు పువ్వు ప్రకృతిలోని శుద్ధికర శక్తిని మానవుని శరీరానికి కలిపే ఒక బంధం.
=> పుష్పం, భూమి, నీరు, శరీరం — ఇవన్నీ ఒకే శుద్ధతత్త్వానికి అనుబంధాలు.

2. లా ఆఫ్ వైబ్రేషన్ (Law of Vibration): తంగేడు పువ్వు పసుపు రంగుతో, ఆరోగ్యకర వైబ్రేషన్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది మానవ చక్రాలపై శుభ ప్రతిఘటన కలుగజేస్తుంది, ముఖ్యంగా మణిపూరక చక్రం (solar plexus chakra)పై ప్రభావం.

3. లా ఆఫ్ ఆక్షన్ (Law of Action): ఈ పువ్వు వాడటం అంటే ఒక చైతన్యక చర్య. శరీర శుద్ధి, ఇంటి పరిసరాల పరిశుభ్రతలో భాగమవుతుంది. అంటే, ప్రకృతి ద్వారా మన ఆరోగ్యాన్ని దిద్దుకోవడమే.

4. లా ఆఫ్ కరెస్పాండెన్స్ (Law of Correspondence): బయట పువ్వు శుద్ధి చేస్తే, మనలోనూ శుద్ధి జరుగుతుంది. అంతర్లోకం ↔ బాహ్య లోకం అనుసంధానం.

5. లా ఆఫ్ హార్మనీ & నేచర్ (Law of Rhythm/Nature): బతుకమ్మ కాలంలో ప్రకృతి శుద్ధితత్వం ఉద్భవిస్తుంది. తంగేడు పువ్వులు ఆ కాలంలో విరియడం అనేది ప్రకృతిలోని తరంగాలకు అనుగుణంగా శరీరాన్ని సరిపోల్చే ప్రక్రియ.

4. పంచభూత సంబంధం: పంచభూతం తంగేడు పూలు పాత్ర పృథివీ (భూమి) భూమిలో పెరిగే ఈ చెట్టు మూలికల శుద్ధితత్వం అందిస్తుంది
ఆపః (నీరు) దీని గుణాలు రక్తాన్ని, మూత్రాన్ని శుద్ధి చేస్తాయి
అగ్ని పసుపు రంగు అగ్ని తత్త్వానికి సమానం, మణిపూర చక్రాన్ని ఉత్తేజితం చేస్తుంది
వాయువు శరీరంలో గాలి ప్రసరణ, జీర్ణ వ్యవస్థకు శ్రేయస్సు
ఆకాశం ఈ పువ్వుతో శుభత, ఆధ్యాత్మికత అలవరుస్తారు, అంతర్గత స్థిరత్వానికి తోడ్పడుతుంది

సారాంశం: తంగేడు పువ్వు వాడకమంటే పుష్పార్చన మాత్రమే కాదు. అది: శరీర శుద్ధికి సహకరించే శాస్త్రీయ మార్గం,

ఆత్మశుద్ధికి దారి చూపించే ఆధ్యాత్మిక మార్గం, విశ్వ నియమాల ప్రకారం ప్రకృతి-ప్రాణి మిళిత జీవన తత్వాన్ని వ్యక్తపరచే మార్గం.

September 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ప్రకృతి పండుగ – ప్రాకృత పండుగ

by Dr. Bheri Sunitha Rammohan Reddy September 23, 2025
written by Dr. Bheri Sunitha Rammohan Reddy

బతుకమ్మ పండుగ ,పూల పండగ, జానపదుల పండుగ, కేవలం తెలంగాణకు మాత్రమే సొంతం అయిన పండుగ. ఏ పండగ చేసినా దేవుడిని పూలతో పూజిస్తాం, ఇక్కడ పూలనే పూజించే పండగ బతుకమ్మ పండుగ. అంటే ప్రకృతి పండగ, ప్రకృతి నే పరమాత్మ అని భావించి మన పూర్వీకులు చేసిన పండగ . చేను చెలకల్లో దొరికే తంగేడు, గునుగు, ముత్యాలపువ్వు, అడవి చేమంతి ,కట్ల పూలు, గుమ్మడిపూలు ఇవే బతుకమ్మకు అందాన్ని ఇచ్చి ఆకృతిని కల్పించే పూలు ఈ పండగ భాద్రపద అమావాస్య నుండి ఆశ్విజ అష్టమి వరకు అంటే చిన్న బతుకమ్మ మొదలు సద్దుల బతుకమ్మ వరకు 9 రోజులు బతుకమ్మ పండుగ రోజులు ,అందులో ఆరో రోజు గౌరమ్మ అలిగి వెళ్లింది అందుకే అది అర్రెమ్ ఆనాడు ఆనాడు బతుకమ్మ ఎవరు ఆడరు ఆడకూడదు, దీనికి కూడా కారణాలు ఉంటాయి. బహుశా ఆడవాళ్ళ కు అలసట తీరాలనో, పంట పొలాల పనులు పూర్తి చేసుకోవాలనో ఉద్దేశ్యం కావచ్చు.

బతుకమ్మ పేర్చడం ఒక కళ ఆడడం అంతకంటే గొప్పది . నాట్య కళ, గానకళ . అంటే సంగీత , సాహిత్య, నృత్య కళా రూపం సమ్మేళనం. చప్పట్లు చరుస్తూ బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ,పాటలు పాడుతూ ఉంటారు. ఇందులో చుట్టూ తిరగడం ప్రదక్షిణ చప్పట్లు చరచడం, భజన చేయడం ఆ చప్పట్లు మూడు సత్వస్తమ రజోగుణాలకు ప్రతీకలుగా, ఈ మూడు చప్పట్లు ,ఇక పాటలు గళార్చన .
బతుకమ్మ రూపం శ్రీ చక్రానికి మరో రూపం, జ్ఞానపదులు శ్రీ చక్రం అంటే జానపదులు బతుకమ్మ అన్నారు. మొత్తంగా అక్కడ ఇక్కడ తల్లి పరాత్పరేశ్వరి గౌరీ దేవి ,తరతరాల నుండి బతుకమ్మ ఆట ఆడుతూనే ఉన్నాం. అనేక పాటలు ఆ పాటలో అలవోకగా కట్టుకున్నవే అయినా అందులో ఆధ్యాత్మికత ఉంటుంది, సామాజికత ఉంటుంది ,చరిత్ర ఉంటుంది. ఇంకా ముఖ్యంగా పెళ్లికి ఎదిగిన పిల్లలకి ,పెళ్లయిన కొత్త పెళ్ళికూతురులకి, అత్తవారింట ఎలా ఉండాలి అని గౌరీ దేవి పేరుతో సుద్దులు చెప్పే పాటలెన్నో ఉంటాయి.
ఈ పండగలో నలుగురు కలిసి అందరం ఒక్కటే అని చెప్పే తత్వం ఉంది ,ఆధ్యాత్మికంగా గౌరీదేవిని కొలుస్తూ ఉన్న తత్వం ఉంది ,ఇక ఆరోగ్యం ఏ పూలైతే ఆరోగ్యాన్ని ఇస్తాయో వాటన్నింటినీ కుప్పగా పోసి బతుకమ్మగా పేర్చి వాటి ముందు ఓ రెండు గంటల ఆట ఆడితే మనం తీసే ఉఛ్వాస , నిశ్వాసవల్ల ఆరోగ్యం చేకూరుతుంది. ఇంకా నడుము వంచి లేస్తూ ఆడుతున్న ఆట వల్ల సంవత్సరకాలం నడుము నొప్పి రాదు. గొంతెత్తి పాడే పాటలు కాబట్టి రాగం పెరుగుతుంది, గొంతు రుగ్మతలు తగ్గుతాయి . నలుగురిలో మాట్లాడలేనితనం అనే భయాన్ని పోగొడుతుంది.
ఇట్లా ఎన్నో లాభాలు ఉన్న ఈ బతుకమ్మ పండగ తెలంగాణకు మాత్రమే సొంతమైన పండుగ . ఈ పండగ కాలంతో పాటు తీరు మారుతుంది కొత్తదనాన్ని కోరుకుంటున్న ప్రజలు, పండగ కావాలంటూనే పండగ రూపాన్ని మార్చారు. స్వచ్ఛమైన పూల బదులు రకరకాల కాగితాలు ప్లాస్టిక్ వచ్చి చేరుతున్నాయి. నోరార పాడే పాటల బదులు డీజేల హోరు మిగిలింది . ఇక ఆట శూన్యమే లేదా వింత వింత నృత్యాలు అసలు ఆడే పద్ధతి మర్చిపోయారు. ఎక్కడో ఉత్తర భారతంలో ఉన్న విన్యాసాలన్నీ ఇక్కడ చూపిస్తున్నారు. ముందున్న బతకమ్మకి నమస్కారముద్రలో చరిచే చప్పట్లు వెనక భాగం లో ఎలా చరుస్తారు ? అర్థం ఉందా ? ఏమో అయోమయం !!

ఆట ఆడక పాట పాడక ప్రదక్షణ లేక ఆడుతున్న ఆట గా చేస్తున్నారు.
ఇప్పుడు బతుకమ్మలు అమ్ముతున్నారట !! కొన్ని అయితే బుట్టలు తిరిగేసి ప్లాస్టిక్ పూలతో చుడుతున్నారట, ఎటు పోతుంది ? ఎన్నో తత్వాలతో కూడుకున్న ఉన్న ఈ పల్లె పండుగ ఎందుకు తీరు మారుతున్నది? ఆలోచించాలి … మన పండగనే అసలు పద్ధతిలో చేసుకోవాలి. అందులో ఉన్న అర్ధాన్ని, పరమార్ధాన్ని గ్రహించాలి. పండగను పండగ లాగానే చేసుకోవాలి. చేను చెలకల్లో తిరుగుతూ పువ్వు పువ్వు ఏరి రంగులద్దుతూ, సిబ్బి లో, స్థాంభాళలో, పెద్ద పెద్ద పలాల్లో , పేరుస్తూ అనుభవించిన ఆనాటి ఆనందాలు ఎక్కడ? అంతమంది వలయాకారంలో తిరుగుతూ ఉంటే, ఎంత అందమైన దృశ్యం!! ఒక్కరు పాటు పాడతూ చెప్తూ ఉంటే అందరు సామూహికంగా బృందం గానాలాలపించే మన సంస్కృతిని తిరిగి సాధించుకోవాలి. పాటను బ్రతికించుకోవాలి. బతుకు బతకనివ్వు అనే సదుద్దేశ్యంతో ఆరంభమై న బతుకమ్మ పండుగ గొప్పదనం పునరుద్ధరణ చేయాలి.
వీధి వీధి నుండి ఒక్కొక్కరుగా ఓ ప్రవాహమై గుడి ముందు లేదా చెరువు దగ్గర అందరం ఏకమై ఆడిన ఆనాటి ఆటల వైభవం ఏది ? పండగ తీరు మారింది . అయినా పండగ ఉంది. పండుగలు ఉండాలి.

September 23, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

“ఛోటా (హిమాలయన్) చార్ థామ్ యాత్ర”

by Maji Bharathi September 21, 2025
written by Maji Bharathi

       హిందువులు జీవితంలో ఒక్కసారైనా చేసుకోవాలనుకున్న యాత్రలలో, అతి ముఖ్యమైనది  ఛోటా చార్ థామ్ (హిమాలయన్ చార్ థామ్) యాత్ర ఒకటి. ఇందులో హిమాలయ పర్వతశ్రేణులలో వుండే బదరీనాథ్, కేదారనాథ్, గంగోత్రి, యమునోత్రి ఆలయ దర్శనాలుంటాయి. అక్షయ తృతీయ నుండి, దీపావళి వరకు (ఆరు నెలలు) మాత్రమే ఈ చార్ థామ్ యాత్ర తెరిచి ఉంటుంది. మిగిలిన ఆరునెలలు, మంచుతో కప్పబడి, ఆ ప్రాంతం ఆవాసయోగ్యంగా ఉండదు.
       [ఆదిశంకరాచార్యుల వారి చార్ థామ్ అంటే నాలుగు దిక్కులా ఉండే నాలుగు థామాల దర్శనం: అవి తూర్పున పూరీ (జగన్నాథ్), దక్షిణాన రామేశ్వరం (రామనాథేశ్వర్), పశ్చిమాన ద్వారక (శ్రీకృష్ణ), ఉత్తరాన బదరి (బదరీనాథ్)].

      ఈ యాత్రలో ఎక్కువ భాగం తలెత్తి చూడలేనంత ఎత్తులో మహోన్నతమైన మంచు శిఖరాలు. గలగల పారుతున్న హిమనదులు. త్రోవ పొడవునా ప్రకృతి రమణీయ దృశ్యాలే. ఎంత చూసినా తనివి తీరని అందం ఈ యాత్ర ప్రత్యేకం. త్రోవ పొడవునా, ఒకవైపు మహోన్నత పర్వతాలు. ఇంకొక వైపు, ఒళ్ళు జలదరింపజేసే లోయలు. కళ్ళను కట్టిపడేసే పచ్చదనం. పాము మెలికల్లా తిరుగుతున్న రహదారుల సొబగులు. ఒళ్లంతా కళ్ళు చేసుకుని చూస్తున్నా తరగని అనుభూతినిస్తాయి. ఆ అనుభూతులను మనసు పొరల్లో నిక్షిప్తం చేసుకోవాలే తప్పించి, కెమెరా కళ్ళకు కూడా పూర్తిగా అందవవి.
         ఈ యాత్ర, యెన్నో సవాళ్లతో కూడుకొని వుంటుంది. ప్రతికూల పరిస్థితులు వుంటాయని తెలిసీ, ఒక్కోసారి ప్రాణాలకు ముప్పు వాటిల్లే ప్రమాదముంటుందని తెలిసీ, యాత్రలో అనుక్షణమెదురయ్యే సవాళ్లను తట్టుకుంటూ, యీ యాత్ర చెయ్యడానికి సంకల్పిస్తారు భక్తులు.  ఏ నిమిషంలో వాతావరణం మారిపోతుందో… కొండచరియలే విరిగి పడతాయో, కుండపోత వర్షమే కురుస్తుందో, మంచు తుఫానే ముంచుతుందో… ప్రకృతి ఏ రకమైన బీభత్సాన్ని సృష్టిస్తుందో చెప్పలేని పరిస్థితుంటుంది. అందుకని మన చేతిసంచిలో అవసరమైన అన్ని రకాల మందులు, మంచినీళ్లు, శక్తినిచ్చే ఆహార పదార్థాలు, చలికి ఆగే దుస్తులు వుంచుకోవాలి. మార్గమధ్యంలో అవరోధమేర్పడితే, ముందుకు వెనుకకు వెళ్ళలేని పరిస్థితి, చాలా గంటలు రోడ్డుమీదే వుండాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అందుకని ముందు జాగ్రత్తలన్నీ తీసుకొని మానసికంగా సంసిద్ధమై వుండాలి.
       ఎప్పుడెప్పుడా అని యెదురుచూస్తున్న మా చార్ థామ్ ప్రయాణం (ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి) మే 29న (2024), ఫ్లైట్లో ఢిల్లీ చేరుకోవడంతో మొదలైంది. ఢిల్లీనుండి బస్సులో, రాత్రికి హరిద్వార్ చేరుకున్నాం. 30వ తేదీన, ఉదయాన్నే లేచి హరిద్వార్ లో గంగానది దర్శనం చేసుకుని, బార్కోట్ కు ప్రయాణమయ్యాం. బార్కోట్ చేరుకునే మార్గమధ్యంలో వెహికల్ పర్మిట్ తీసుకోవాలి.
31st May: బార్కోట్ -యమునోత్రి- బార్కోట్ 
       బార్కోట్ నుండి 46 కిమీ దూరంలో వున్న యమునోత్రి జన్మప్రదేశం కాళింది పర్వతం. గంగానదికి అతి పెద్ద ఉపనది. మీదకు వెళ్లడానికి, నడకకు ఆరు గంటలు, గుర్రంమీద రెండు గంటలు పడుతుంది. వాలు తక్కువగా వుండి, యెత్తుగా వుంటుంది. అందుకని నడవడం కష్టం. ఇరుకైన దారి. దానికి తోడు పోనీల వాళ్ళు, డోలీల వాళ్ళు మనల్ని తోసేస్తూ వుంటారు. ఆలయంలో ప్రధాన మూర్తి యమునా దేవి. ఆమె వాహనం తాబేలు. యమునకు ఇరుప్రక్కల గంగ, సరస్వతి వుంటారు.
          అతి ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, ఒక ప్రక్క మంచు పర్వతాలు.,.. ఆ మంచు కరిగి, జలమై, నదాలుగా మారి, మనకి అడుగుల దూరంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీటిలో చెయ్యి పెడితే జిల్లుమని, వేళ్లు కొంకర్లు పోతూ ఉంటాయి. ఆ శీతల నదాలకు చేరువలోనే, వేడి పొగలను వెలువరిస్తూ,  వేడి నీటిబుగ్గలుంటాయి. ఈ ఆలయ ప్రాంతంలో కూడా రెండు వేడినీటి బుగ్గలున్నాయి. ఒకటి ఆలయం కుడివైపున ఉంటే, ఇంకొకటి ఆలయం బయట ఉన్న సూర్యదేవాలయం దగ్గర ఉష్ణకుండం పేరుతో ఉంటుంది. ఇందులో బియ్యం మూట కట్టి ఐదు నిమిషాలుంచితే ఉడికిపోతుంది. దీని ప్రక్కన యమశిల వుంటుంది. అక్కడ సంకల్పం చెప్పించుకుంటారు. (యమున సోదరుడు యముడు). సూర్యదేవుని పిల్లలే యమున, యముడు.

      యమునోత్రి దర్శనమయ్యాక, ఉత్తర కాశి చేరుకోవాలి. కాని ఆలస్యమైనందున బార్కోట్ లోనే రెండవ రాత్రి కూడా వుండవలసి వచ్చింది.
        మేమున్న హోటల్ నుండి చూస్తే, ఎంతసేపు చూసినా అలానే ఉండిపోవాలనిపిస్తుంది. అందమైన లతలతో, పువ్వులతో అల్లుకున్న పచ్చని వృక్షాలు. ఎటు చూసినా పచ్చని కొండలే! వాటిమధ్య అక్కడక్కడ హోటల్స్, కంటికింపైన వర్ణాలతో.
        హిమాలయాలలో ఆలస్యంగా సూర్యాస్తమయం అవుతుంది. స్వచ్ఛమైన నీలి రంగులో ఆకాశం. ఆ నీలి రంగును ఆక్రమిస్తూ, అస్తమిస్తున్న భానుని కిరణాలు, ఆకాశాన్ని సింధుర వర్ణంలో మెరిపిస్తూ… ఏ చిత్రకారుడో చిత్రాన్ని గీసి ఇక్కడ మర్చిపోయాడేమోనని, చూస్తూ అలా మైమరచిపోతాం.
1st June: బార్కోట్-గంగోత్రి- పిపాల్ కోటి
      వేకువనే గంగోత్రికి బస్సులో బయలుదేరాం. త్రోవలో మెడికల్ కేంపుంది. ప్రకృతి అందాలను తిలకిస్తూ, కొండల మధ్య పయనిస్తూ, అడవులను దాటుకుంటూ, మధ్యాహ్నం రెండు గంటలకు గంగోత్రి చేరుకున్నాం.
      గంగోత్రికి వెళ్లే త్రోవలో అక్కడక్కడా చిన్న చిన్న గ్రామాలు, ఆర్మీ బేస్ లు, పవర్ ప్రాజెక్టులు కనిపిస్తాయి. త్రోవ కిరువైపులా పూలతో కూడిన పొదలు, చిన్న చిన్న చెట్లు. ప్రయాణం భారమనిపించదు. పగలు ఎండ చాలా తీక్షణంగా ఉంటుంది. ప్రయాణమంతా ఘాట్ రోడ్డే కాబట్టి, బస్సులో ఏసీ వెయ్యరు. లోపల మనకి కాస్త వేడిగా ఉన్నా, క్రిందకి దిగేటప్పటికి చల్లగా ఉంటుంది. వెళ్తున్న కొద్దీ, ఉష్ణోగ్రతలో మార్పు స్పష్టంగా తెలుస్తుంది మనకు.
     గంగోత్రిలో మన యాత్రా రిజిస్ట్రేషన్ ను చెక్ చేసి, ముందుకు పంపిస్తారు. వెహికల్ పార్క్ చేసి, కొంత దూరం నడవాల్సింటుంది. వీల్ చైర్స్ వుంటాయి. త్రోవలో షాపులున్నాయి.
         గంగోత్రి ఆలయం పాలరాతి నిర్మితం. గంగామాతను ఎంతసేపు చూసినా చూడాలనే అనిపిస్తుంది. కరుణతో నిండిన ఆ కళ్ళు, మనపై ఆశీస్సుల వర్షాన్ని కురిపిస్తాయి. ఇక్కడ గంగను భగీరథి అంటారు. దేవప్రయాగలో, అలకానందతో కలిసాక గంగ అవుతుంది. అక్షయతృతీయ నుండి దీపావళి వరకు మాత్రమే ఆలయం తెరిచివుంటుంది. ఆ తర్వాత, హర్షిల్ పట్టణానికి దగ్గర ముఖ్బా గ్రామంలో, గంగామాత పూజలందుకుంటుంది. ఆలయంలో అన్నపూర్ణ, సరస్వతి, లక్ష్మీదేవి, ఆదిశంకర, భగీరథ విగ్రహాలున్నాయి.

        ఆలయం బయట శివాలయం, హనుమాన్ ఆలయం వున్నాయి. మెట్లు దిగి క్రిందకు వెళ్తే, భగీరథ శిల వుంది. ఈ శిల నుండి నీళ్ళు వస్తూనేవున్నాయి. ఇక్కడ భగీరథుని విగ్రహం కూడా వుంది. కొంచెం ముందుకెళితే, పరవళ్ళు తొక్కుతూ, ధవళ వర్ణంలో, ఉదృతంగా గంగ. ఉరవడి శబ్దం వింటూనే మనసు పులకించిపోతుంది. గంగా స్నానం చేయాలని వున్నా, స్నానం మాట దేవుడెరుగు, గంగను ముట్టుకుంటేనే వేళ్ళు కొంకర్లు పోతున్నాయి. ఇక్కడికి 19 కిలోమీటర్ల దూరంలో, గంగానది పుట్టిన స్థలం గోముఖం వుంటుంది. అక్కడికి వెళ్లడానికి రోజుకి 150 టికెట్లు మాత్రమే యిస్తారు. ట్రెక్కింగ్ చాలా కష్టం.
     గంగా ప్రవాహపు హోరుమంటున్న శబ్దం వింటుంటే మనసు పరవశించిపోతుంది. ఆ తల్లి పరవళ్ళను తిలకిస్తుంటే తనువు పులకాంకితమౌతుంది. వేళ్ళు కొంకర్లు పోతున్నా, గంగమ్మ తల్లిని ముట్టుకోకుండా ఉండలేకపోతున్నాం. అంతటి శీతల వాతావరణంలో కూడా అక్కడ నుండి కదలాలనిపించడం లేదు. గంగోత్రి నుండి కదలాలని లేకపోయినా, మారే శీతోష్ణ పరిస్థితులను జ్ఞప్తి పెట్టుకొని బలవంతంగా బయలుదేరాం. ఎంత తొందరగా, అక్కడినుండి బయటపడితే అంత మంచిది.
            కొండ చరియలు విరిగిపడినా, మంచు తుఫాను కురిసినా, కొండల మధ్య చిక్కుకుపోతాం. ఎటూ వెళ్లేందుకు వీలుండదు. బార్కోట్ నుండి బయలుదేరినప్పుడు వేడిగా వుంటే… ప్రయాణం సాగేకొద్దీ చల్లగా వుంటుంది. మధ్యాహ్నం తర్వాత ఆ చల్లదనం ఎక్కువవుతుంది. మార్గమధ్యంలో వుండిపోవాల్సి వస్తే, చలికి గడ్డకట్టుకుపోతాం. అందుకని మనతోపాటు అత్యవసర మందులు, బలాన్ని, శక్తినిచ్చే ఆహార పదార్థాలు, స్వెటర్, షాల్ వంటి వాటిని తప్పనిసరిగా తీసుకెళ్లాలి. ఎప్పుడు యెక్కడ, యే అవసరం పడుతుందో చెప్పలేం. ఈ రాత్రికి మేం ఉత్తరకాశి చేరుకోవాలి. కాని సమయాభావం వలన మార్గమధ్యంలో, పిపాల్ కోటిలో బస చెయ్యాల్సి వచ్చింది.
2-6-24: పిపాల్ కోటి – ఉత్తరకాశి – సీతాపూర్
ఉదయాన్నే పిపాల్ కోటి నుండి బయలుదేరి, ఉత్తర కాశీ చేరుకొని, అక్కడ కాశీ విశ్వనాధేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకుని, రాత్రికి సీతాపూర్ చేరుకున్నాం.
3-6-24: సీతాపూర్ – గౌరీకుండ్ – కేదారనాథ్
ఉదయం 3 గంటలకే సీతాపూర్ నుండి బయలుదేరి గౌరీకుండ్ మీదుగా కేదారనాథ్ చేరుకొని, కేదారనాథుని దర్శించుకుని, రాత్రికి కేదార్నాథ్లో ఉండి, మరుచటి రోజు గౌరీకుండ్ సీతాపూర్, ఋషికేశ్ ల మీదుగా జోషిమఠ్ చేరుకున్నాం.
          ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఐదవదైన కేదారనాథ్, ఉత్తరాఖండ్ లోని, రుద్రప్రయాగ జిల్లాలో, సముద్రమట్టానికి 3,584 మీటర్ల ఎత్తులో, గర్వాల్ కొండల పైభాగంలో వుంటుంది. ఈ గుడిని యెప్పుడు, యెవరు కట్టించారో చారిత్రక ఆధారాలైతే లేవు గాని, ఆదిశంకరాచార్యులు వారు నిర్మించినట్లు విశ్వసిస్తారు. ఇక్కడ కేదారేశ్వరుడు స్వయంభువు.
            పురాణాల ప్రకారం కురుక్షేత్ర యుద్ధానంతరం సగోత్రీకుల హత్యాపాతకం నుండి విముక్తి కోసం, మహాశివుని వెతుకుతూ హిమాలయాలకు వెళ్లిన పాండవులకు దర్శనమివ్వడం యిష్టం లేక, వృషభరూపంలో శివుడు మంచు లోపలికి చొచ్చుకుపోయాడని, అది తెలిసి పాండవులు వృషభం (శివుని) పృష్టభాగాన్ని స్పర్శించి పాపవిముక్తులైనట్లు కథనం. పృష్టభాగం కేదారనాథ్లో వుంటే,  మంచులో కూరుకుపోయిన తలభాగం నేపాల్ లోని, ఖాట్మండులో పశుపతినాధునిగా పూజలందుకుంటున్నట్టు భక్తుల విశ్వాసం.      

           గౌరీకుండ్ నుండి రోడ్డు మార్గం లేదు. కొండల మధ్య ప్రయాణించవలసి వుంటుంది. గౌరీకుండ్ చేరుకోవడానికి వున్న మార్గాల్లో, మేం సీతాపూర్ నుండి చేరుకున్నాం.
               కేదార్ నాథ్ కు  హెలికాప్టర్ సదుపాయమున్నా టికెట్లు దొరకకపోవచ్చు. దొరికినా, మనం వెళ్లే సమయానికి వాతావరణం సరిగ్గా లేకపోతే, హెలికాప్టర్ క్యాన్సిల్ చేస్తారు. ఒక్కోసారి, మరో ఐదు నిమిషాల్లో ల్యాండ్ అవుతామనగా కూడా, హఠాత్తుగా వాతావరణం మారిపోయి, హెలికాప్టర్లు వెనక్కి వచ్చేస్తాయి. టికెట్ బుక్ చేసుకునేటప్పుడే, ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
       ప్రీపెయిడ్ పోనీ స్టేషన్ నుండి పోనీలుంటాయి. అక్కడ ఫిక్స్డ్ రేటు ఉంటుంది. నలుగురు మనుషులు మోసే డోలి, ఒక్క మనిషి వీపున మోసే పిట్టూ… వీటికి ప్రీ పెయిడ్ స్టేషన్ ఉండదు. డిమాండ్ బట్టి రేటు మారుతుంది.
       గౌరీకుండ్ నుండి కేదార్ నాథ్ కు నడిచి వెళ్లవచ్చు. (21 కి.మీ.) ప్రయాణంలో చలిని తట్టుకునే దుస్తులు వేసుకొని, సన్ స్క్రీన్ లోషన్, క్యాప్, రెయిన్ కోట్, ఎమర్జెన్సీ మందులు తప్పనిసరిగా వెంట వుంచుకోవాలి. త్రోవంతా రాతి పలకలతో వేసిన మెట్లుంటే, కొన్ని దగ్గర్ల మెట్లు లేకుండానే వుంటుంది. కొండల మధ్య నుండి, కొండలమీద నుండి ప్రయాణముంటుంది. చుట్టూ పచ్చని ప్రకృతి. త్రోవలో అక్కడక్కడా జలపాతాలు.
        వీక్షించాలేగాని, త్రోవంతా కళ్ళను తిప్పుకోనివ్వని ప్రకృతి సోయగాలు. గలగల కదిలే జలపాతాలు, మన పాదాలనంటి ప్రవహిస్తాయి. లోయల్లో నదులు ప్రవహిస్తూ, ముచ్చట గొలుపుతూ ఉంటాయి. అధిరోహించే కొండలు అనంతంగా సాగుతూనే ఉంటాయి. చల్లనిగాలి ముఖానికి స్వాంతన చేకూర్చుతుంటే, ప్రకృతి సోయగాలు మనసును మైమరిపిస్తుంటే, కాళ్లు వాటంత అవే ముందుకు సాగుతాయి.
       హఠాత్తుగా క్లౌడ్ బరస్టై, జలపాతాలు మార్గాన్ని ముంచెత్తే సందర్భాలు, కొండ చరియలు విరిగిపడి, మార్గం మూసుకుపోయే పరిస్థితులు, మంచు తుఫానులు, విపరీతమైన వర్షాలు… యిటువంటి ప్రతికూల పరిస్థితులు యెన్నో ఎదురుకావచ్చు. అటువంటి సందర్భాలలో యాత్రను తాత్కాలికంగా నిలిపివేస్తారు. మన ప్రయాణం యెక్కడైనా ఆగిపోవచ్చు. మానసికంగా సిద్ధపడాలి.
           కేదారేశ్వరుని నిజరూప దర్శనం మధ్యాహ్నం 12 వరకు ఉంటుంది. అప్పుడు స్పర్శ దర్శనం కూడా చేసుకోవచ్చు. 12-2pm మధ్యలో ఆలయాన్ని మూసివేస్తారు. ఆ తర్వాత బంగారు తొడుగుతోనే మనకు స్వామి దర్శనమిస్తారు. ఆలయం ముందు విశాలమైన ప్రాంగణం. ఎదురుగా నందీశ్వరుడు. అక్కడ నుండి చూస్తే, చుట్టూ పచ్చని కొండలతో, మంచు శిఖరాలతో, మంచు కరుగుతుంటే జాలువారే జలపాతాలతో, ప్రకృతి ఆహ్లాదకరంగా వుంటుంది. నీలి రంగులో స్వచ్ఛంగా ఆకాశం. ఆకాశాన్ని చీల్చుకుంటూ తన ప్రతాపాన్ని చూపించే సూర్యుడు. మేఘాలు లేకపోతే, సూర్యకిరణాల తీక్షణత చాలా ఎక్కువగా ఉంటుంది.
           దర్శనమెప్పుడవుతుందా అన్న ఆతృత ఒకవైపు. ఆ పరిసరాలలోనే ఉండిపోవాలనే కాంక్ష ఇంకొక వైపు. భలే చిత్రంగా ఉంటుంది ఆ అనుభూతి. దర్శనమయ్యాక, అక్కడి ప్రకృతిలో లీనమైపోతాం. కదలాలనిపించదు. గాని, మరుక్షణం ఏమౌతుందో ఊహించలేం.
       హఠాత్తుగా మేఘాల విష్పోటనం సంభవించవచ్చు. నదులు పొంగి పొరలవచ్చు కొండ చరియలు విరిగిపడి దారులు మూసుకుపోవచ్చు. మరల మార్గం సుగమమావటానికి ఎంత కాలం పడుతుందో తెలియదు. అందుకని, దర్శనం చేసుకున్నాక, ఆ అనుభూతులను మూట కట్టుకుంటూ, క్రిందకు చేరుకోవడం ఉత్తమం.
         గర్భగుడి ముందున్న మంటపంలో భీముడు, అర్జునుడు, సహదేవుడు, నకులుడు, ద్రౌపది, లక్ష్మీనారాయణుల విగ్రహాలు చిన్న చిన్న గూటిలో వున్నట్టుంటాయి. ఇక్కడ శివుడు లింగాకారంలో కాకుండా, అసమానంగా ఉన్న పెద్ద రాయి ఆకారంలో వుంటారు. పురాణ కథనం ప్రకారం, వృషభపు వెనుక భాగమది. కేదారేశ్వరుని దర్శనం చేసుకుని బయటికొస్తే, అక్కడొక చిన్న ఆలయముంటుంది. అదే అసలైన కేదారేశ్వర ఆలయమంటారు.
        కేదారేశ్వర ఆలయం వెనక భీమశిల వుంటుంది.  2013లో వచ్చిన వరదల్లో కొట్టుకొని వచ్చి, ఆలయానికి వెనక ఉండి వరద ప్రవాహాన్ని రెండు పాయలుగా చీల్చి, ఆలయాన్ని కాపాడిందని… అలాగని అది ఆలయాన్ని కాపాడేంత పెద్ద శిలైతే కాదు. ఆ కొండల మీద అంత పెద్ద శిలలున్న ఆనవాళ్లేమీ కానరాలేదు. అంతవరకు ప్రవాహంతో పాటు కొట్టుకొని వచ్చి, సరిగ్గా ఆలయం వెనకే కాపు కాసినట్టు యెలా వుండిపోయిందన్నది ఆశ్చర్యకరమే?
       ఆలయం వెనక కొండమీద క్షేత్రపాలకుని ఆలయం. దగ్గరలో ఆదిశంకరాచార్యుల వారి ఆలయం కూడా వుంటుంది. ఇక్కడే వారు శివసాన్నిధ్యం చెందారు.
       ఈ చార్ ధామ్ యాత్రలో ప్రయాణమెక్కువగా, దర్శన సమయం తక్కువగా వుంటుంది. అంతా ఘాట్ రోడ్ ప్రయాణమే.  పైకి వెళుతున్న కొద్ది మౌంటైన్ సిక్ నెస్ వచ్చే అవకాశమెక్కువ.
      ప్రయాణమెంత కష్టమనిపించినా, కేదారనాథుని దర్శనం కాగానే, ప్రయాణ బడలిక మాయమై, తనువు పులకితమౌతుంది. దేవదేవుని సన్నిధిలోనే వుండిపోవాలనిపిస్తుంది. ఎన్ని జన్మల భాగ్యమో, సశరీరంగా యీ పవిత్రభూమిపై కాలూనామని తలుచుకోగానే, మనసు అలౌకిక ఆనందాన్ని పొందుతుంది. ఉద్విగ్నతకూ లోనవుతుంది. ఆ మధురక్షణాలను వర్ణించలేం. అనుభవించగలమే తప్ప. అనంతమైన ఆ హిమవత్పర్వతాల మధ్య, ఆలయ సన్నిధిలో నిల్చున్నామన్న భావనే మధురం. ఆ అనుభూతులనన్నిటినీ మదిలో పదిల పరుచుకొని, ఇంకొకసారి దర్శించుకునే అవకాశమొస్తే బాగుండునని, శివుని ప్రార్ధించుకుంటూ వెనుదిరిగాం.
4-6-24: కేదారనాథ్- గౌరీకుండ్ – సీతాపూర్ – ఋషికేశ్ – జోషిమఠ్
రుషికేశ్ (హృషికేశ్) యోగాకు పుట్టినిల్లుగా కొలవబడుతుంది. ఎన్నో ఆశ్రమాలు ఇక్కడున్నాయి. 2015లో, రుషికేశ్, హరిద్వార్ నగరాలు దేశ వారసత్వసంపదగా పేర్కొనబడ్డాయి. ఇక్కడే గంగానదిపై రామ్ జూలా, లక్ష్మణ జూలా వంతెనలున్నాయి. ఇది దాటాక టెహ్రి డ్యాం వస్తుంది. చాలా పెద్ద ప్రాజెక్ట్. ఆ డ్యామ్ చుట్టూ రెండు మూడు గంటలు పైనే తిరిగినట్టున్నాం. డ్యాముని దాటేసామని అనుకునేలోగా మరలా కనిపించేది.
5-6-24: జోషిమఠ్ – బదరీనాథ్
     ఉత్తరాఖండ్, ఛమోలి జిల్లాలో జోషిమఠ్ (జ్యోతిర్ మఠ్) ఆదిశంకరాచార్యులు ప్రతిష్టించిన పీఠాలలో (మిగిలినవి- శృంగేరి, పూరి, ద్వారక, కంచి) ఒకటి. ఈ మఠము అధర్వణ వేదానికి ప్రతీక. 108 దివ్యదేశాలలో ఒకటి. ఆదిశంకరాచార్యులు వారు ప్రతిష్టించిన నరసింహస్వామి యిక్కడ ఆలయంలో కొలువు తీరారు. అమ్మవారు పరిమళవల్లి. ఇక్కడ నరసింహ స్వామి వారి ఎడమ చేయి సన్నంగా ఉంటుంది. ఆ చెయ్యి పడిపోయిన నాడు బదరీనాథ్ ఆలయం మాయమైతుందని, సాలగ్రామ ఆకారంలో, యిక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న భవిష్య బద్రిలో ప్రత్యక్షమవుతుందని యిక్కడి వారి నమ్మకం. బదరి ఆలయాన్ని ఆరునెలలు మూసి వేసినప్పుడు, బదరీనాథుడు యిక్కడికి వచ్చి పూజలందుకుంటారు. ఈ ఆలయం వెనక దశావతారాలు, శివ, అమ్మవార్ల ఆలయాలున్నాయి.

      మఠంలో బదరి నారాయణ, రాజరాజేశ్వరి దేవి ఆలయాలు, ఆదిశంకరాచార్యులు వారి ప్రతిమ యిక్కడ నిత్యం పూజలందుకుంటాయి. శంకరాచార్యుల వారు వాడిన సామాన్లు, తపస్సు చేసిన గుహ కూడా యిక్కడ చూడవచ్చు.
       ఇక్కడ ఆర్మీ మిలటరీ కంటోన్మెంట్ (ఘర్వాల్ రైఫిల్స్ వారి స్థావరం) కూడా యిక్కడే వుంది.
     ఇక్కడికి 10 కి.మీ. దూరంలో తపోవన్ వుంది. ఇక్కడ వేడి నీటి బుగ్గలుంటాయి. ఇక్కడి నుండి మనం ధవళగంగను చూడవచ్చు. ఇక్కడికి దగ్గరలోనే ఔలి రోప్ వే, గారి భవాని ఆలయాలున్నాయి.
        ఉత్తరాఖండ్లో 2021 లో వచ్చిన వరదల తరువాత, ఇక్కడి నేల కొద్దిగా కృంగిపోయి, యిల్లులు బీటలు వారి ప్రజల్లో ఆందోళనకు కారణమైంది. ఇక్కడి నుండే బదరీనాథ్ యాత్ర మొదలవుతుంది. జోషిమట్ దాటాక విష్ణు ప్రయాగ్ హైడల్ ప్రాజెక్ట్, తపోవన్ విష్ణుజాడ్ హైడెల్ ప్రోజెక్ట్ లు మార్గమధ్యంలో కనిపించాయి.
బదరీనాథ్:   సాయంకాలనికి బద్రీనాథ్ చేరుకుని, దర్శనం చేసుకున్నాం.   
        ఉత్తరాఖండ్, ఛమోలి జిల్లాలో, అలకానంద నదీతీరంలో, ఘర్వాల్ పర్వతశ్రేణుల్లో, 108 దివ్యక్షేత్రాలలో ఒకటైన, ప్రముఖ వైష్ణవ ఆలయం, బదరీనాథ్. ఈ ఆలయ ప్రాముఖ్యత గురించి వేదాలలో, భాగవతంలో, స్కంద పురాణంలో, పద్మ పురాణంలో  వివరించబడింది. బదరికా (రేగు) వనం వలన యిక్కడ స్వామికి బద్రీనాథ్ అనే పేరు వచ్చిందని ఒక కథనం. అశోకుని కాలంలో బౌద్ధ క్షేత్రంగా, తర్వాత ఆదిశంకరాచార్యులచే హిందూ క్షేత్రంగా పునరుద్ధరించబడిందన్న చారిత్రక ఆధారాలున్నాయి. ఈ ఆలయం వెనుక ఉన్న రెండు కొండలను నరనారాయణులంటారు. ఈ స్థలానికి వున్న ప్రాముఖ్యతను బట్టి ఇక్కడ చాలా మఠాలున్నాయి.
      దక్షిణాదిలో ఉన్నట్లు ఉత్తరాదిలో ఆలయాలు పెద్దగా వుండవు. శిల్పకళా నైపుణ్యం కూడా యెక్కువగా కనిపించదు. ఎత్తైన మెట్లెక్కి, ప్రవేశద్వారం, మంటపం దాటి, ఆలయం లోపలికి ప్రవేశిస్తే, ఒక అడుగు ప్రమాణంలో, నల్లరాతిలో ఒదిగి, రెండు చేతుల్లో శంఖు చక్రాలతో, మరో రెండు చేతులు యోగముద్రలో, పద్మాసనం వేసుకొని, బదరీనాథుడు, బదరీ వృక్షం క్రింద దర్శనమిస్తాడు.  సంవత్సరానికి ఆరునెలలు మాత్రమే యిక్కడ కొలువై, తర్వాత జోషిమఠ్ కు చేరుకుంటాడు. ఆలయంలో పైకప్పు బంగారు తాపడంతో, స్తంభాలు, గోడలు వివిధ రకాల డిజైన్లతో అలరారుతున్నాయి. ఆలయంలోపల కుబేర, నారద, ఉద్ధవ, నరనారాయణుల మూర్తులుంటే, ఆలయం చుట్టూ  లక్ష్మి, గరుడ, నవదుర్గ, లక్ష్మీనరసింహ, ఆదిశంకరాచార్య, ఘంటకర్ణల ఉపాలయాలు వున్నాయి. మేము వెళ్లిన సమయానికి చాలా పెద్ద లైన్లు వున్నాయి. సెక్యూరిటీ బాగుంది. మొబైల్ ఫోన్స్ ఎలౌ చేశారు. చక్కగా ఫోటోలు తీసుకున్నాం. ఇక్కడ పచ్చి శనగపప్పు ప్రసాదంగా యిస్తున్నారు.

      ఆలయానికి సమీపంలో, కొద్దిగా క్రిందకు దిగితే, అలకానంద నదిని ఆనుకొని, తప్తకుండ్ వేడినీటి బుగ్గలున్నాయి (నారద కుండ్, సూర్య కుండ్). ప్రక్కనే వున్న అలకానంద నదిలో నీళ్లు మంచులా చల్లగా వుంటే, యిక్కడి నీళ్లు పొగలు చిమ్ముతున్నాయి. స్త్రీలు స్నానాలు చేసేందుకు వీలుగా, ఒక దాని చుట్టూ గదిలా కట్టారు. అది చిన్నగా వుండడంతో, అక్కడ రద్దీగా వుంది. మగవారు వేరే బుగ్గల్లో స్నానాలు చేసి, పిండ ప్రదానం చేస్తున్నారు. ఈ వైపు తీరమంతా సిమెంటుతో గచ్చు చేసి వుండడంతో, పితృ కార్యాలు చేసేవాళ్లకి సులభంగా వుంది.
       ఆలయం చుట్టూ చిన్న చిన్న వీధులు, అందులోనే దుకాణాలు, భోజనాలయాలు, చిన్న చిన్న యిల్లులున్నాయి. ఈ ప్రదేశం సంవత్సరానికి ఆరునెలలు మూసి వుంటుంది కాబట్టి, ఇళ్ల నిర్మాణాల మీద పెద్దగా ఖర్చు పెట్టరు. ఆలయానికి 300- 400 మీటర్ల దూరంలో మెయిన్ రోడ్డు, హోటళ్లు, లాడ్జిలు, దుకాణాలు, మఠాలు చాలా వున్నాయి.
6-6-24: బదరీనాథ్ – హరిద్వార్ వయా ఋషికేశ్
      ఉదయాన్నే మరల దర్శనం చేసుకుని తప్తకుండ్ నీటిబుగ్గలను చూసాం. మాతో వచ్చిన కొంతమంది పితృకార్యాలు చేసుకున్నారు. బద్రీనాథ్లో మేము జీయర్ స్వామి మఠంలో వున్నాం. వసతిసౌకర్యం బాగుంది. అక్కడున్న సత్రంలో ఉచిత భోజనసదుపాయం కూడా వుంది. మధ్యాహ్న భోజనాలయ్యాక బయలుదేరి, రాత్రికి హరిద్వార్ చేరుకున్నాం. హరిద్వార్ వెళ్లే త్రోవలో, అలకానంద నది మధ్యలో వుండే ధారీదేవి ఆలయాన్ని దర్శించుకున్నాం. అమ్మవారి ముఖం మాత్రమే పూజలందుకుంటుందిక్కడ. ఈ ఆలయానికి పైకప్పు ఉండదు. చార్ థామ్ ల రక్షకురాలిగా పరిగణించబడుతుంది ఈ అమ్మవారు.
7-6-24: హరిద్వార్  
        అమృతభాండాన్ని గరుత్మంతుడు తీసుకొని వచ్చే సమయంలో, అమృతం చిందిన నాలుగు ప్రదేశాలలో, హరిద్వార్ ఒకటని పురాణ కథనం. (ప్రయాగ్, ఉజ్జయని, నాసిక్- మిగిలిన మూడు క్షేత్రాలు). ఈరోజు హరిద్వార్ లోనే బస. ఇక్కడ కూడా చాలా ఆశ్రమాలున్నాయి. వసతి సదుపాయం బాగుంది. ముందుగా దక్షమహాదేవ్ ఆలయాన్ని దర్శించుకున్నాం. దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశం, సతి దేవి యజ్ఞగుండంలో దూకిన ప్రదేశమిది. ఆ తర్వాత బిల్వ పర్వతం మీదున్న వున్న మానసా దేవి ఆలయాన్ని దర్శించుకున్నాం. పైకి వెళ్లడానికి, మెట్ల మార్గంతో పాటు, రోప్ వే కూడా ఉంది. కొద్ది దూరంలో నీలపర్వత శిఖరంపై చండీదేవి ఆలయముంటుంది. ఇదొక శక్తిపీఠం. సమయం లేక దర్శించుకోలేకపోయాం.

ఆ రాత్రి గంగాహారతి చూసాం.  వారణాసిలో, గంగాహారతి చూశాక, యిక్కడ గొప్పగా అనిపించలేదు. కాని విపరీతమైన జన సందోహం.  
8-6-24: హరిద్వార్- ఢిల్లీ – విశాఖపట్నం
ఉదయాన్నే బస్సులో ఢిల్లీ చేరుకొని అక్కడి నుండి ఫ్లైట్లో విశాఖపట్నం చేరుకున్నాం.
    ప్రకృతి అందాల నడుమ కొలువైన ఈ చార్ థామ్ లను సందర్శించుకుని, ఆ లౌకిక ఆనందాన్ననుభవించి, జీవితకాలానికి సరిపడా మధురానుభూతులను మూట కట్టుకొని, సంతృప్తితో, స్వగృహాలకు చేరుకున్నాం.

September 21, 2025 10 comments
0 FacebookTwitterPinterestEmail
సంపాదకీయం

 అంతర్జాలం, Internet – సౌకర్యం కాదు, అవసరం!

by Kondapally Neeharini September 21, 2025
written by Kondapally Neeharini

సెప్టెంబర్ మయూఖ పత్రిక ఎడిటోరియల్

   గుడ్డి దీపం కింద కూర్చొని చదువుకున్నాను అని చదివిన జీవిత చరిత్రలు నిజంగానే గొప్ప ప్రభావం చూపాయి ఆనాడు. తర్వాత స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదువుకున్నాను అని వచ్చిన మోనోగ్రాఫ్స్ కూడా అంతే ప్రభావం చూపాయి. ఆ గుడ్డి దీపానికి ఈ స్ట్రీట్ లైట్ కు మధ్యన అంతరం ఏంటో  తెలియనివాళ్ళం కాదు. వీధి దీపాలు ఇంటి వెలుగు దీపాలైన తర్వాత శాస్త్ర విజ్ఞానాలు అభివృద్ధి చెందాయి. సాంకేతిక విజ్ఞాన విశేషాలు విస్తరించాయి. ప్రపంచవ్యాప్తంగా ఫోన్లు, సర్వర్లు, డొమైన్లు ఇవే వింటున్నాం. రకరకాల కంప్యూటర్లు, టాబ్లెట్లు వంటివే కంటున్నాం. నవీన పరికరాల ఎన్నో ఉపయోగిస్తూ నెట్వర్క్ అనుసంధానంతో కమ్యూనికేషన్ చేయడమనేది చాలా సహజమైపోయింది.

       ఏ కాలానికి అనుగుణంగా ఆ కాలంలో ఆలోచనలో మార్పులు వచ్చాయి. విజ్ఞానం వికాస దశలో ఉన్నది. చంద్ర మండలాన్ని శాసించే స్థాయికి వెళ్లారు. ఊహించని సాంకేతిక పరిణామాలు ప్రపంచం మొత్తం శాసిస్తూ ఉన్న సమయంలో ఇంటర్నెట్ ప్రాముఖ్యత చాలా పెరిగిపోయింది. తెలుగులో దీన్ని అంతర్జాలం అని అంటున్నాం. అంతర్జాలం అంటే చాలా విస్తృత అర్థమే ఉన్నది. విమానాలు ఆకాశంలో ప్రయాణం చేసి, వివిధ ప్రాంతాలకు చేరుకుంటున్నాయి.  వీటికి మన కంటికి కనిపించని రహదారులు వేసి ఉంటాయంటున్నారు . నేల మీద వాహనాలు వెళ్లడానికి ఉన్న దారుల ఎట్లా ఉన్నాయో అట్లాగే విమానాలు వెళ్లడానికి కూడా దారులు ఉన్నాయన్నట్టు! ఇవి చేపలు పట్టడానికి ఉపయోగించే వల ఎలా ఉంటుందో అలా విస్తరించి ఉంటాయి. అలాగే ఈ సాంకేతిక పరికరాలు ఉపయోగించడానికి వాడుతున్న అంతర్జాల వలలూ ఉంటాయి.  ఒక ప్రధాన నగరం నుంచి జిల్లాలకు జిల్లాల నుంచి గ్రామాలకు గ్రామాలలో కూడా వీధుల్లోకి దారులు ఉంటాయి, బాటలు ఉంటాయి. మళ్లీ వీధుల్లో కూడా ఒక ఇంటికి ఒక ఇంటికి వెళ్లడానికి కాస్తంత చిన్న దారి ఉంటుంది. అలాగే సాంకేతిక దారులు కూడా ఉంటాయి.

అవిగనుక కంటికే కనిపిస్తే, మన కళ్ళతో చూస్తే, బహుశా అల్లిబిల్లిగా అల్లుకున్న ఇనుప తెరలాగా ఉంటుందేమో! ఈ శాటిలైట్ మాయాజాలం తెచ్చింది ఎవరు మనిషి విజ్ఞాన జిజ్ఞాసనే కదా!

    ముసలి వాళ్ళ నుండి చిన్న పాపాయిల వరకు ఫోన్ వాడకానికి అలవాటైన ఈ కాలాన్ని సమీక్షించుకోవాలంటే సమగ్ర విశ్లేషణ చేసుకోవాలంటే టెక్నాలజీ సంబంధిత విషయాలు ఎలా తెలియాలో మనుషుల లోభాలూ, ప్రలోభాల విపరీతాలు తెలియాలి. మనిషి వ్యాపార వస్తువైన వైనమూ తెలియాలి.

కమ్యూనికేషన్ టెక్నాలజీ ఇప్పుడు ఎంతో ముఖ్యమై ప్రపంచాన్నే పరిపాలిస్తున్నది. కోట్ల మందిని అనుసంధానం చేయడానికి కోట్ల కంప్యూటర్లను వాడుతున్నారు. శాటిలైట్ లకి రకరకాల మిషన్లను అమర్చి సర్వర్లు కంప్యూటర్లు వంటి సాఫ్ట్వేర్ పరికరాలతో ప్రోగ్రామ్స్ ను అందజేస్తూ టెక్నాలజీ గుప్పట్లోకి మనిషి వెళ్ళిపోయి చాలా ఏళ్లవుతోంది.ట్రాన్స్మిషన్స్ తో కంట్రోల్ చేస్తూ ఏ సాంకేతికతకు ఎటువంటి నియమాలు ఉన్నవో ఆ నియమాలను అనుసరిస్తూ అనుసంధానం చేసే విధానాన్ని ఇంటర్నెట్ విధానం అంటాం. ఫోన్ లుచేయడం ఈమెయిల్ చేయడం చాటింగ్ చేయడం రకరకాల వీడియో కాన్ఫరెన్స్ చేయడంతో సంభాషించడము, ముఖ్య సందేశాలను పంపించడం జరుగుతున్నది. అన్ని రకాల వ్యాపార లావాదేవీలకు నెట్వర్క్ ఈ ఇంటర్నెట్. ప్రతి ఇంటర్నెట్ కు సంబంధించిన విజ్ఞానానికి ప్రోటోకాల్ అనేది ఉంటుంది. ఇవన్నీ నియంత్రణలోనే ఉంటాయి. ఎక్కడైతే ఎప్పుడైతే వేరే మార్గాల్లోకి వెళ్తున్నాయో అది పసిగట్టగలిగే నేర్పు కూడా ఈ ఇంటర్నెట్ వాడుకంలో  ఉంది. కాబట్టి ఇంటర్నెట్ లేకుండా మనిషికి జీవనం  లేదు అనే సత్యాన్ని గ్రహించి ఎప్పటికప్పుడు నిఘా కళ్ళతో చూస్తూ కంట్రోల్ చేయవలసిన అవసరం కాస్త ఇప్పుడు అగత్యమై కూర్చున్నది. భద్రతా విభాగాలు ఎక్కువ చేసి, ఎక్కడెక్కడ అయితే చెడు ప్రవేశిస్తున్నదో అక్కడ ప్రత్యక్షమై అడ్వాన్స్డ్ రీసెర్చ్ ప్రాజెక్టు ఏజెన్సీ ద్వారా రక్షించుకోవాల్సిన బాధ్యత ఉన్నది. దీన్నే, ఈ సంస్థనే  ARPA అంటున్నారు. ఈ ‘ ఆర్పా ‘ నడపడానికి సరిపోయిన నిధులను ఏర్పరచి ప్రపంచాన్ని కాపాడుకోవాలి. మనవైన ఆనందాలకూ మనవైన దుఃఖాలకూ తోడూనీడైనప్పుడు హృదయ రహస్య కుహరం లోకీ ప్రవేశించి నప్పడూ సంరక్షణ పథకాలు తప్పనిసరవవూ? అవుతాయి. ఈ అడిక్షన్ కంట్రోల్ చేయడం ఎవరితరం కావడం లేదు.

     ప్రభుత్వ సేవలకైనా అంటే బిల్లు లు కట్టడం బట్వాడా చేయడం, ప్రైవేట్ విధానాలలో గాని షాపింగ్ చేసే దాంట్లోనూ బ్యాంకింగ్ విధానాలలోను ఆన్లైన్ సేవలు ఊరూరా అందుకున్నాయి. మీడియా అనే పదం సర్వసాధారణంగా ప్రతి ఒక్కరి నోటు వినిపిస్తున్న మాట. మానవ సంఘానికి దశ దిశ ఇంటర్నెట్టే జీవం అయిపోయి కూర్చుంది. ఎప్పుడో దాదాపు 70 దశాబ్దాల క్రిందనే నేషనల్ సైన్స్ ఫౌండేషన్ నెట్వర్క్ ఇంటర్నెట్ మాతృక మొదలైంది. అప్పటినుంచి కొన్ని దేశాలలో కొన్ని పట్టణాలకే పరిమితమైన ఈ సౌలభ్యం భూమి ధృవ ప్రాంతాలకు కూడా చేరుకున్నది పల్లె పల్లెను ఏకం చేసింది.

అసలు ఈ ఇంటర్నెట్ కి వరల్డ్ వైడ్ వెబ్ కు మధ్యన సూక్ష్మ అంతరం ఉన్నది. కానీ సాధారణంగా ఒకటే పదాన్ని వాడుతూ ఉంటారు.

ఒకప్పుడు ఫోన్ వాడకం కేవలం సమాచారం తెలుసుకోవడానికి ఒకరినొకరు పలకరించుకోవడంతో సరిపోయేది. అటువంటి ఫోన్ అనే పరికరంలోకి మొత్తం సాంకేతికత చేరిపోయి ఇంటర్నెట్ పైననే జీవితాలు ఆధారపడిపోయేలా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ పైననే బ్రతుకులు గడిచేలా శాసించిన పరిస్థితులు ఇవి. నువ్వెక్కడుంటే అక్కడ నేను … నువ్వెక్కడికెళ్తే అక్కడికి నేను … అంటూ మన వెనుకే వస్తూ మనవెంటే వస్తూ వాకిట్లోనుండి వెళ్ళిన వైర్లు ఇంట్లోకి వచ్చాయి. వరండా లోగిలి దాటి, హాల్ ను అలంకరించి ఆనందాలు పంచే, నయనానందాలూ పెంచే టీ వి గా మారింది. ఈ రూం ఆ రూం అని లేకుండా గుండె గదిలోకి , సమస్త జన జ్ఞానం లోకి, మనుషుల మనసుల్లోకి చేరింది ఇంటర్నెట్!!

 ఇక ఇంటర్నెట్ ఆధారం తో ప్రపంచం గుప్పిట్లో కి వచ్చే అల్ట్రా మాడర్న్ టెక్నాలజీ కి చిరునామా ‘ ఫోన్ యంత్రం’ అయ్యాక పరిణామాలు చాలా విస్తృత మయ్యాయి. నయనాలూ హస్తాలూ మెదడు వారధులై, సారధులై నయా జమానానే నడిపిస్తున్నాయి. ఈ అంతర్వలయానికి చిక్కని ఈ వరల్డ్ వైడ్ వెబ్ మాయాజాలం లో పడని మనిషులే లేరనేంతగా అయిపోయాం. ఆలోచనా ధారలన్నీ వెబ్ సైట్ లో చేరిపోవడం, ముఖం పత్రాలు ముఖ్యమైపోవడం ఇది ప్రస్తుత జీవన చిత్రం. ఇట్లా సాంకేతిక చుక్కలను పేర్చుకుంటూ పోతున్న మనిషి బ్రతుకులో కన్నీటి చుక్క లనూ కొనుక్కుని మనవైన డొమైన్స్ లలో నిక్షిప్తం చేసుకోవాల్సిన పరిస్థితులు ఇవి. ఇక ఇంటి చిరునామా లెందుకు? అంతర్జాల విలాసం ఇస్తున్నాం!

ఇంటర్నెట్ ఎప్పుడు సౌకర్యం కాదు అవసరం అయింది. ఈ అవసరాలలో లాభాలు ఉన్నాయి నష్టాలున్నాయి.

క్షణాలలో లెక్కలు కట్టి జవాబులు చెప్పగలిగిన గణితశాస్త్రం మన గుప్పిట్లో ఉండేది. అద్వితీయమైన ధారణా శక్తితో మెదడునే కంప్యూటర్లలా ఉపయోగించేవాళ్ళు. దత్తాంశాలను ,డేటాలకూ ఇప్పుడంతా గణన యంత్రాలే వాడుతున్నారు!  అంతటి జ్ఞాపక శక్తిని హరించి వేస్తున్నది అంతర్జాలం. అనవసరమైన విషయాలను  చూస్తూ, అమూల్యమైన సమయం వృధా చేయడం, లేత హృదయాలపై ముదురు నీడలు పడవేస్తూ ఎంత నష్టం చేస్తుందో తెలియని సమాజం కాదు ఇది. అన్ని సమాచారాలనూ నిక్షేపించగలిగే విద్యుత్ ఉపకరణమైన కంప్యూటర్ల ఉపయోగాలు ఎక్కువై కరెంట్ ఉత్పత్తి భారాలు విపరీతంగా పడుతున్నాయి. ఇవన్నీ ఎవరు మానిటరింగ్ చేస్తున్నారు? ఇదీ ఆలోచించాల్సిన విషయమే. ఇక అన్నింటినీ మించినవి ఇంటర్నెట్ మోసాలు! బాంక్ లో దాచుకున్న డబ్బు ఎప్పుడు ఎవరు ఎలా హాక్ చేసి కాజేస్తారో తెలియని కష్టాలు వచ్చిపడ్డాయి.సైబర్ నేరగాళ్లు  ఎక్కువయ్యారు. అన్నీ ఫోన్ కు లింక్ చేయడం వల్ల పెద్ద కష్టమైపోతున్నది. పదిమంది ఉద్యోగులు చేసే పనిని ఒకరిద్దరి తో కానిచ్చేస్తూ నిరుద్యోగులనూ బాధపెడుతున్న వైనమూ తెలుసు.ఏవైనా ‘పెరుగుట విరుగుట కొరకే !’అనే మాటను ఎప్పుడైనా నమ్మాల్సిందే.

   Internet  తో లాభాలు లేవా?ఉన్నాయి. ప్రపంచ జ్ఞానం పెరిగింది. హాస్పిటల్లో చేర్చాలనుకునేవాళ్ళకు , ఆరోగ్యం ఎలాఉన్నదో తెలుసుకోవాలన్నా, చేర్పించాలన్నా ఇంట్లోనుండే పేరు నమోదుసుకోవచ్చు. ఒకటా రెండా? ఇలాంటివి చాలానే ఉన్నాయి. ముఖ్యంగా వివిధ భాషల్లో వెబ్సైట్ నిర్మించారు అందులో మన తెలుగు భాష కూడా ఉన్నది. Positive thoughts మంచిది కాబట్టి, మన మాతృభాష లో అంతర్జాల మనుగడ సాగిస్తూ, పురోగతిని సాధిద్దాం! హృదయాలను రచించుకుందాం! అంతరంగాలను పంచుకుందాం!!

 _____****___ 

September 21, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

పెళ్లి ఓ సుదీర్ఘ ప్రయాణం

by అనూశ్రీ. September 21, 2025
written by అనూశ్రీ.

భారతీయ సమాజంలో వివాహ వ్యవస్థ చాలా ప్రాధాన్యత కలిగి ఉన్నది.
వివాహమంటేనే ఒక పవిత్ర బంధం, రెండు కుటుంబాల కలయిక, అనుబంధాల పెనవేత. అప్పటిదాకా అపరిచితులుగా ఉన్న రెండు ప్రత్యేక వ్యక్తిత్వాలు తమ జీవన మనుగడ కోసం.. కష్టసుఖాలలో పాలుపంచుకునే తోడు కోసం నమ్మకమనే సూత్రంతో మనసులను పెనవేసుకుని ఆదర్శ జీవనం కోసం వేసే తొలి అడుగులు ఆ ఏడు అడుగులు

ఈ చిత్రంలో మన సమాజంలో పెళ్లి అనే పవిత్ర బంధం ప్రారంభం అవడం, చివరికి అది విడాకుల వరకు ఎలా చేరడాన్ని చూపుతోంది.

ఎన్నో కలలతో ఆశలతో పెళ్లి అనే బంధంలోకి అడుగుపెడుతున్న వధువు/ వరుడి మనసులో వరుడు/ వధువు. తన జీవిత సామ్రాజ్యానికి రారాజు/రారాణి. మంగళసూత్రం తమ ఇద్దరినీ ప్రేమతో బంధించే పవిత్ర మంత్రం.

అయితే అందరూ ఈ బంధంలో విజయవంతంగా కొనసాగుతున్నారా..!? అంటే అవునని చెప్పలేని పరిస్థితి. భిన్నాభిప్రాయాలు, ఆర్థిక సమస్యలు, అహంకారాలు, కుటుంబాన్ని దెబ్బతీసే వ్యాసనాలు.. ఇవన్నీ కలసి లేదా ఏదో ఒక్కటి భార్యాభర్తల బంధాన్ని ముళ్ల దారిలో నిలబెడుతున్నాయి.

చిరునవ్వులతో, చిరుకోపాలతో మొదలైన విభేదాలు క్రమంగా మనసులను వేరు చేసుకునేదాకా వస్తోంది. ఈ రోజుల్లో అయితే మరీ వేగంగా వివాహాలు విచ్చిన్నం అవుతున్నాయి. ఇందులో ఏ ఒక్కరినీ బాధ్యులుగా చేయలేము. వారి వారి కుటుంబ నేపథ్యాలు, ప్రవర్తన కూడా ఒక కారణమే..

ఇప్పుడు జరుగుతున్నవి ఒకప్పటిలా బాల్యవివాహాలు కాదు. పూర్తి మెచ్యూరిటీతో మసులుకోగల వయసు వచ్చినాకే పెళ్లిళ్లు జరుగుతున్నాయి. అయినా ఒకప్పటిలా నిలవడం లేదు.

ఎన్నో ఆశలు, కలలతో ఎంతో ఆర్భాటంగా, వైభవంగా లక్షలు ఖర్చు పెట్టి చేస్తున్న పెళ్లిళ్లు ప్రణాళికలు వేసుకున్నంతకాలమైనా నిలవడం లేదు. ప్రేమ, అనురాగం, నమ్మకం, కొరవడిన జంటలు తీవ్ర తర్జనభర్జనల అనంతరం న్యాయస్థానాల ముందు నిలబడటం విచారించవలసిన విషయం. కానీ ఇది ఇప్పుడు పెరుగుతున్న వాస్తవం. నేటి కాలంలో పెళ్లిళ్లు ఎంత వేగంగా జరుగుతున్నాయో, అంతే వేగంగా విరిగిపోతున్నాయి

పెళ్లి కేవలం వేడుక కాదు, ఒక సుదీర్ఘ ప్రయాణం.. ఒకరికొకరు ఇచ్చుకునే భరోసా.. అదే నేడు కరువై.. బంధం బరువై అర్ధాంతరంగా వదిలి వేసే పరిస్థితి.

కుటుంబ విలువలు, సర్దుకుపోయే స్వభావం..ప్రేమలో నిజాయితీ, బాధ్యతలో నిబద్ధత, ఒకరి పట్ల ఒకరికి ప్రేమా గౌరవం ఇవి ఇరువురికి సమానంగా ఉన్నప్పుడే వివాహం నూరేళ్ల ఉత్సవమై వెలుగుతుంది. తుది శ్వాస దాకా నిజమైన తోడై వెంట నడుస్తుంది.

అనూశ్రీ గౌరోజు

September 21, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
ధారావాహిక నవల

అయితే మీరే.. (భుజాలు తడుముకుంటున్నారుగా!) – 6వ భాగం

by Sompaka Seetha September 21, 2025
written by Sompaka Seetha

ఇంతవరకు జరిగిన కథ:

ఆమని మనవడి పుట్టినరోజు వేడుకకు హాజరైన మైథిలి, మాలినిలు ఆ వేడుక పూర్తి కాగానే అదే ఊళ్లో ఉంటున్న పద్మిని ,హాసిని ,చంద్రికలను కలుస్తారు. వీరంతా ఒకప్పుడు విజయవాడలో ఒక ప్రైవేట్ కార్పొరేట్ జూనియర్ కళాశాలలో కలిసి పని చేసినందున వీరి మధ్య గాఢమైన స్నేహం అల్లుకుంటుంది. పద్మిని, హాసిని ,చంద్రికలకు ప్రభుత్వ కొలువులు దొరకటంతో వారు ఆయా ఊళ్లకు వెళ్లిపోతారు. ఉద్యోగాలపోటీని తట్టుకోలేని మైధిలి ,ఆమని, మాలినిలు అవే ప్రైవేటు ఉద్యోగాలతో కుస్తీ పడుతుంటారు . గట్టి ప్రభుత్వ ఉద్యోగానికి అర్హత ఉన్న మైధిలి కూడా అలాంటి అవకాశాన్ని దొరకపుచ్చుకోలేక ఇటు ఇంట్లోనూ అటు సమాజంలోనూ వివక్షకు గురవుతుంది .ఏ కాలమైతే ఆమని భర్త రామారావు గారిని ఉన్నతమైన మనిషిగా మలిచిందో అదే కాలం మాలిని పట్ల నిర్దాక్షిణ్యంగా పసుపు కుంకుమలకు దూరం చేసి పరోక్షంగా ఒంటరిని చేయటం , హాసిని పట్ల ఆమె భర్త ప్రవర్తించే వైఖరిలాంటి దుఃఖపూరిత విషయాలు తెలుసుకున్న మైధిలి బాధతో కదిలిపోతుంది. మేమంతా నీకు అండగా ఉంటామని ధైర్యం చెప్తారు హాసినికి మిత్రురాండ్రంతా

ఇక చదవండి

మేము వడ్డించుకుందామనే లోపులోనే అన్నయ్యగారు కొన్ని పదార్థాలు, అమని కొన్ని పదార్థాలు మా ప్లేట్లలో వడ్డించి, వాళ్ళు వడ్డించే పదార్థాలకి నో చెప్పే అవకాశం లేకుండా చేశారు మొత్తానికి ఇద్దరూ కలిసి. సరదాగా కబుర్లాడుకుంటూ భోజనం ముగించాము. రామారావు అన్నయ్యగారు జోక్స్‌ కట్‌ చేస్తూ, తనకు ఉద్యోగం వచ్చిన కొత్తలో జరిగిన కొన్ని సంఘటనలు చెబుతుంటే కడుపుబ్బా నవ్వుకున్నాం. మా టీచింగ్‌ పీరియడ్లో చూడటమే ఆయనని. సరదాగా మాట్లాడ్తారు రామారావు అన్నయ్య అని మాలిని చెబ్తుండగా, చాలాసార్లు వినివున్నాను గానీ, ఇంత క్లోజ్‌గా, సరదాగా స్వంత అన్నయ్యలాగా మాట్లాడటం చూస్తుంటే ఆ అభిమానానికి నా కండ్లలో గిర్రున నీళ్లు తిరిగాయి. అది వారికంట కనపడకుండా ఉండేందుకు శతవిధాలా ప్రయత్నించాను నేను.

మాలిని వాళ్ళ కొడుకు, కోడలు ఉండేది, ఆమని వాళ్ళు ఉండేదీ అదే ఊరు. కానీ నేనే చాలా సంవత్సరాల తర్వాత కలిసి, చూస్తున్నందువల్లనో ఏమో… నిన్నటికి నిన్న పద్మిని దంపతులు, చంద్రిక వాళ్లింటో, వారు చూపించిన అభిమానం, మాలిని వాళ్ళ కొడుకు, కోడలు నన్ను రిసీవ్‌ చేసకుని అక్కున చేర్చుకున్న తీరు… ముఖ్యంగా మా అందరి పిల్లలు (ఒక్క హాసినికి మినహాయించి) మా కాలేజీలోనే, అంటే మేము పని చేసిన కాలేజీ విద్యార్థులవ్వటం వల్ల అప్పట్లో మేడమ్‌ అని సంభోదించినా, అప్పుడప్పుడు ఫోన్లలో పలకరింపు ద్వారా ఆంటీగా మారిపోయా. ఈరోజు అది నన్నెంతో సంతోషానికి అంతకు మించిన సంతృప్తిని మూటకట్టించింది. ఇలాంటి స్నేహితులుంటే చాలుగదా! వీరి ముందు సొంత చుట్టాలైనా బలాదూరే నన్పించింది. ఇదేమాట మాలినితో అంటే ‘‘అంతేనబ్బా’’ అంది తను కూడా.

ఓ గంట కూర్చున్నాక, బస్టాండుకు బయల్దేరాను నేను, అందరి దగ్గరా సెలవు తీసుకుంటూ. మాలిని, ఆమని ఇద్దరూ బస్టాండుకు వచ్చి, బస్‌ వచ్చేవరకు నిరీక్షించి, రాగానే నన్ను బస్సెక్కించి జాగ్రత్త అని చెప్పి, బైబై చెబుతూ, ఆటోలో వాళ్ళిద్దరూ వారి వారి ఇండ్లకు వెనుతిరిగారు.

***

ఒక్కొక్కరిదీ ఒక్కో గాథ. మా జీవితాలు పరచిన ఎర్ర తివాచీలు అసలే కావు. ఇంటా, బయటా ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, ముఖ్యంగా కుటుంబ విషయాల్లో ఎన్నో ఢక్కా మొక్కీలు తిని పడిలేస్తూ, లేస్తూ పడుతూ… ఇదిగో ఈనాటికి అన్ని బాధ్యతలూ తీరిపోయాయి కాబట్టి నిన్నటి పుట్టినరోజు వేడుకని అంత ఆనందమయం చేసుకోగలిగాము.

టిక్కెట్‌ అన్న కండక్టర్‌ పిలుపుతో మనీ పర్సు తెరచి సరిపడా డబ్బులిచ్చి టికెట్‌ తీసుకొని, పర్సులో పెట్టి విండోకి దగ్గిరగా జరిగి కూర్చున్నాను.

వాతావరణం ఎంతో ఆహ్లాదంగా అనిపించసాగింది. కిటికీలోంచి చల్లని గాలి మొహానికి తాకి, నా ఆహ్లాదానుభూతిని అది రెట్టింపు చేసింది.

ఆమని అందమైన పేరు. కానీ పేరుకీ, జీవితానికీ ఎటువంటి లంకె కుదరదు ఒక్కోసారి. కాలం కుదిపే కుదుపులకు అతీతులం కాదెవరమూ. వాటిని తట్టుకుని నిలబడేదే గదా జీవితమంటే.

ఒకరకంగా చెప్పాలంటే మా ఫ్రెండ్సందరి పేర్లూ చాలా సౌందర్యవంత మైనవే. అలా సాగిపోవాలనే ఆశతోటి మా తల్లిదండ్రులు చిన్నతనంలో పెట్టినవే. కానీ మానవుడు తలచేదొకటి, జీవితంలో జరిగేది వేరొకటి. అందరమూ ఈ కాలచక్ర భ్రమణంలో ఎదురయ్యే కష్టాలతో ఈడ్వబడుతూ అప్పుడప్పుడూ అతిథుల్లా పలకరించే సంతోషాలను బూస్టింగ్‌లా భావిస్తూ గెలుస్తూ ఓడిపోతూ, కొన్నాళ్ళు ఓడిపోతూ, గెలుస్తామనే ఆశతో కొన్నేళ్ళు… గెలుపు, ఓటముల కలయికే జీవితమనే యదార్థాన్ని జీర్ణం చేసుకుంటూ కాలంతో నడిచిన వసంతాలు కొన్ని.

ఏంటో ఈమధ్య బాగా వేదాంతం పుట్టుకొస్తోంది నాలో. ఇది వయసుతో పాటు ఆపాదింపబడినదా లేక జీవిత వాస్తవాల నుండి ఎగజిమ్మిన లావాలా చిలకరింపా? ఏదో మొత్తానికి వాటన్నింటినీ తట్టుకుంటూ, ఒకరకంగా చెప్పాలంటే మొండిగా అధిగమిస్తూ… ఇవాళ ఇలా నిలబడిగలిగాం మేమంతా. ఇంటింటికో చరిత్ర అన్నట్లుగా ఒక్కో కుటుంబానిది ఒక్కోగాథ. ఒక్కొక్కసారి జీవితంలో తెలుపు, నలుపుల మలుపులు. ఈనాటికీ చదరంగంలాంటి జీవిత పాఠాల, గుణపాఠాల గడులను నేర్పు అనే ఓర్మితో, ఒంటపట్టిన పాఠాలను నెమరువేస్తూ బంధాలను నిలుపుకుంటూ, గుణపాఠాల బడిలో ఇంకా నిత్య విద్యార్థులుగానే వెలుగుతూ అవసరమైన అంశాలను సేవ్‌ చేసుకుంటూ మనోవ్యాధికి గురిచేసి కుంగుబాటుని రానివ్వగల సంఘటనలను మొదడు నుండి డిలీట్‌ చేసుకుంటూ… అప్పుడప్పుడూ ఇదిగో ఇలా ఈ స్నేహ పరిమళాలను రీఛార్జ్‌ చేసుకుంటూ బ్రతుకు బ్యాటరీని వెలిగించుకుంటున్నాం.

మధ్యలో ఏదో ఊరొచ్చింది. పల్లీలు అమ్మేవాడి కేకలు చెవిలో ఘొల్లు మంటుంటే, ఆలోచనలతో ఓ కునుకు తీసిన నాకు గబుక్కున మెలకువ వచ్చింది.

మనసు మాయలమారి పుట్ట అంటారు చాలామంది. మనకు కోరికలను చుట్టేసి మనచుట్టూ మాయలనే పుట్టలాగా చుట్టగల నేర్పరి. కానీ నేను అనుభవాల పుట్ట, అల్లరి పుట్ట, జ్ఞాపకాల మాళిగ అని కూడా అంటాను, ఎవరు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా.

మనం ఖాళీగా ఉన్నామని పసిగడితే చాలు ఒక్కో జ్ఞాపకాన్ని గాని, ఒక్కో సంఘటననుగాని మనమీదకు అస్త్రంగా సంధించి చోద్యం చూస్తూ మన మానసిక బలాబలాలను లెక్కగట్టే ఓ గొప్ప యంత్రమే మన మనసు.

వ్యసనాలు కొక్కేనికి తగిలించే చొక్కాలు కావు. అవి మనుష్యుల్ని రాపాడిరచి, చీడపురుగులై వ్యక్తిత్వాలను నిలువెల్లా కూల్చేస్తాయి. ముందు సరదాగానే మొదలవుతాయి. తర్వాత అలవాట్లుగా మారి కూర్చుంటాయి. వాటికి బానిసలుగా మారిన వారితో అనుక్షణం దాసోహం చేయించుకుంటాయి. చిత్తు చిత్తు చేస్తాయి జీవితాలను. ఒక్కరితోపోదు ఈ పీడ. చెట్టు వేళ్లను పెకిలిస్తే, ఇక చెట్టుకున్న కొమ్మలేం పచ్చగా ఉంటాయి? పూలేం పూస్తాయి? కాయలేం కాస్తాయి? చివరికి అంతా నాశనమే. వ్యసనాల బారినపడిన కుటుంబాలదీ అదే పరిస్థితి. మేల్కొంటే జీవితం మధ్య పేజీలో ఉన్నా ఆనందమే అంతటా. జీవితం వంద పేజీల పుస్తకమైతే మా జంటలన్నీ సెంటర్‌ పేజీని క్రాస్‌ చేసిన చదువరులమే!

ఆమధ్య పురా స్నేహితురాలు కలిసింది. తనపేరు సువర్ణ. ఇంచుమించు నా వయసే. మనసు మాణిక్యం. పేరుకు తగ్గట్టే పసిడి వర్ణం, గులాబీ వర్ణం రెండూ కలిపితే ఏర్పడే మేనిఛాయ తనది. పెద్ద పెద్ద కండ్లు. తీర్చినట్లుండే కనుబొమ్మలు. ఇంద్రధనువులా వంపు తిరిగి నల్లగా ఉంటాయి. వంకీల జుత్తు. పోనీ వేసుకుంటుంది. చేతినిండా మట్టిగాజులు. మాటలో సౌమ్యం. నడతలో నమ్రత. చీరకట్టులోనైనా, డ్రెస్‌లోనైనా తిరిగి చూడాలనిపించే అందమైన, ఆకర్షణీయమైన రూపం. నవ్వినపుడు తళుక్కుమనే పలువరుసని చూస్తే దానిమ్మ గింజలు కూడా అలుగుతాయేమో నన్పిస్తుంది. మా ఇద్దరిదీ ఒకేవూరు. వారి శ్రీవారిది, మా శ్రీవారిదీ ఒకటే డిపార్టుమెంటు అవ్వటం మూలంగా తరచుగా అనేకంటే దాదాపు అన్ని పెండ్లిళ్లల్లో, వేడుకల శుభసమయాల్లో కలుస్తుంటాం. అలా పరిచయం కాబడ్డ మేము క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అయిపోవటానికి ఎన్నో రోజులు పట్టలేదు.

తరచుగా కలిసినపుడు, అదే చాలా ఏండ్ల నాటి సుపరిచయమై కష్టసుఖాలను మనసు విప్పి చెప్పుకునే స్థాయికి ఎదిగేట్టు చేసింది. అలాగే సంత రోజుల్లో కూడా కూరగాయలు కొనుక్కోవటానికి వెళ్లినపుడు లేదా ఏదైనా షాపింగ్‌ సమయాల్లో కలిసేవాళ్ళం, సరదాగా ఉండేవాళ్లం.

అప్పుడప్పుడు ఫోన్లలో పలకరింపులు, ఛాటింగ్‌లు ఉండనే ఉంటాయి. ఒకసారి కలిసినపుడు… ఎప్పుడూ కలివిడిగా, సందడిగా తిరిగే తను ముక్తసరిగా మొహంలో ఏదో చెప్పనలవికాని బాధ గూడు కట్టుకున్నట్లు కనిపిస్తే, నేనే అడిగాను ‘ఏంటి సువర్ణా ఇలా ఉన్నావు? మొహంలో హుషారు కనబడట్లేదేంటి? పిల్లలకేమన్నా ఒంట్లో బాగోలేదని కబురొచ్చిందా?’ అన్నా. ‘ఊహూ…’ అంటూ తల అడ్డంగా ఊపింది కాదన్నట్లుగా.

‘మరి మీ వారికి ఏమైనా అనారోగ్యమా’? అని అడిగా.

దానికీ కాదని మళ్లీ తల అడ్డంగా ఊపింది. ఈసారి తన కండ్లలో సన్నని నీటిపొరను చూశాను. ఎందుకో నా మనసు కలుక్కుమంది. ఆనోటా, ఈనోటా వాళ్లింటాయన గురించి విన్నాను. తర్వాత ఒకరిద్దరి ద్వారా తెలిసినది ‘నిజమే… సువర్ణ వాళ్ళాయన చాలా అనుమానం మనిషి’ అని. నాకెందుకో బాగా డౌట్‌ వచ్చింది. ఆ హాల్లో సత్యనారాయణ వ్రతం జరుగుతోంది. బాగా పరిచయస్తులవ్వటంతో మేము అంటే నేను, సువర్ణ ముందుగానే వెళ్ళాము. ఆలస్యంగా వెళితే బాగోదని. ఈ వ్రతం, పెట్టుబడులు అవ్వీ ఇవ్వీ అయ్యేటప్పటికి కనీసం గంటన్నర పైచిలుకే పట్టేట్లుంది. ఇక లాభం లేదు. తన మనసెందుకో బాగా బాధపడుతోందని అర్థమైంది. కనుక్కోవాలనుకున్నాను. అది గృహప్రవేశ ఫంక్షను. అంతకుముదే అవతలి రూంలో గణపతి హోమం చేశారు. ఇవతలి రూంలో వ్రతం పెట్టుకున్నారు. దీపారాధన వెలిగించబడి ఉన్నది గదా స్వామి వారి మంటపం ముందు ఫ్యాన్లు బంద్‌ చేసేశారు. నిజంగా ఆ హోమపు పొగ ఇవతలికి కూడా బాగా వస్తోంది. ఈ వంకతో తనని ‘కాసేపు అటు బైట కూర్చుందాం రా… పొగ తగ్గాక లోపలికి వద్దాంలే’ అంటే, సరేనని తల ఊపింది.

గట్టిగా అడిగితే చాలు ఆ కన్నీటి కుండలైన ఆ కండ్ల నుండి ధారగా మారటానికి సిద్ధంగా ఉన్నాయి కన్నీళ్ళు. నెమ్మదిగా తన భుజం చుట్టూ లాలనగా నా రెండు చేతులను చుడుతూ ‘ఏమైంది?’ అని అడిగా. ఇక నీవు చెప్పకపోతే ఊరుకోనన్నట్లుగా చూశాను. చెప్పకపోతే వదిలేలా లేదనుకుంది కాబోలు, అటూ ఇటూ తటపటాయిస్తూ చూసింది నాల్గువైపులా భీత హరిణిలా.

గృహ యజమాని, భార్య, వారి పిల్లలు వ్రతం చేసుకుంటున్నారు బుద్ధిగా దగ్గిర బంధువులని పిలవబడే వాళ్ళు వారి చుట్టూ జంపఖానాల మీద కొందరు మోకాళ్లనొప్పి, నడుము నొప్పి బాధితులు కుర్చీలలో కూర్చుని శ్రద్ధగా స్వామివారి కథను వింటన్నారు. మగవాళ్ళు బైట వరండాలో కూర్చుని లోకాభిరామాయణం మాట్లాడుకుంటున్నారు.

‘మనవేపు ఎవరూ చూడట్లేదుగాని, ఏంటమ్మాయి ఈరోజు చాలా మూడీగా ఉన్నావు’ అని నిలేశా. ఏ ఇంటిలోనైనా ఉత్తరం సందు వదులుతారు గదా. అలానే ఉంది ఆ ఇంటికి కూడా. అక్కడే సేఫ్‌ అని నే అటుదారి తీశా, కుర్చీ తీసుకుని, నాతోపాటే తానూ తన కుర్చీ తెచ్చుకుంది అక్కడికి.

గతంలో చిన్ని చిన్ని విషయాలు చెప్పి బాధ పడేదికానీ, దానిని మించిన బాధ పడ్తోందీరోజు అన్పించింది తన వాలకం చూస్తుంటే. కండ్లనిండా ధారగా కురుస్తున్న కన్నీటిని కర్చీఫ్‌తో అద్దుకుంటూ, సన్న గొంతుకతో, కేవలం నాకు మాత్రమే వినపడేటట్లుగా లో గొంతుకతో చెప్పటం ప్రారంభించింది. మా కష్టసుఖాలేవి కలబోసుకున్నా అవి మా కడుపులోనే ఉంటాయి. ఒకరిమీద మరొకరికి అలాంటి నమ్మకం ఉంది మాకు ఇప్పటికీ, ఎప్పటికీ. అది మాకు బాగా తెలుసు.

‘‘నేను రోజూ యోగా క్లాస్‌కి తెల్లవారురaామునే వెళ్తాను కదా!’’ అంది దుఃఖాన్ని తమాయించుకుని.

‘‘అవునూ’’ అన్నాను. తను, నేనూ యోగా క్లాసులో కూడా తను ముందు వెళితే, నా మ్యాట్‌ను ప్రక్కనే వేసి ఉంచేది. అలాగే ఒకవేళ నేను ముందుగా వెళ్ళినపుడు నా ప్రక్కనే తనకు మ్యాట్‌ వేసి ఉంచేదాన్ని. దాదాపు రెండేళ్లు యోగా క్లాస్‌ మేట్స్‌మి కూడా. తర్వాత నాకు కొంచెం అనారోగ్యంగా ఉండటంతో ఒక సంవత్సరం అయిపోతుంది వెళ్ళక. ఇంట్లోనే ప్రాణాయామం చేస్తాను. రోజూ సాయంత్రాలు యాభై నిముషాలు తగ్గకుండా నడుస్తాను. నా జ్ఞాపకాలకు బ్రేక్‌ వేస్తూ తనను ‘తర్వాతేం జరిగింది?’ అన్నా కండ్లతోటే.

యోగా సెషన్‌లో చివరిరోజు వార్షికోత్సవం లాగా చేస్తారు. బాగా అనుభవజ్ఞులైన యోగా టీచర్‌ జిల్లా కన్వీనర్‌గా పిలువబడే యోగా గురువు ఒకరిద్దరు హాజరవుతారు. యోగాపట్ల మీమీ స్పందన తెల్పండి అని అందరితో మాట్లాడిస్తారు. అందరితో అదే హాలులో ఆటలాడిస్తారు. మెమొరీ పవర్‌ పెంచేవీ, ఐక్యతను వృద్ధి చేసేలాంటి వాటితోటి. మధ్యలో ఆధ్యాత్మిక విషయాలను మన మనసులలో పదిలం చేసుకునే దిశగా భగవంతుని మీద ఉండే కీర్తనలు, పాటల కేసట్లను పెట్టి మనల్ని కండ్లు మూసుకోమని సూచనలిస్తూ భజనలు చేయిస్తారు. నిజంగా ఎంతో పారవశ్యంతో కూడిన ఆధ్యాత్మికానందాన్ని పోగు చేసుకుంటాం ఈ కార్యక్రమం ద్వారా. ఆరోజు ఫలహారం అందరికీ అక్కడే సమకూర్చబడుతుంది. మనల్నే పండ్లు తెమ్మంటారు. కొంతమంది ఆరోజు డ్రైఫ్రూట్స్‌ లాంటివి కూడా తెస్తారు. ఆ హాలే క్యాంటీన్‌. మనమే కుక్స్‌. మనం తెచ్చినవే వెరైటీ టిఫిన్స్‌. మధ్యలో ఒక గంట స్వల్ప విరామం కేటాయిస్తారు. అక్కడ నీనా అనే తేడాగానీ ఉచ్ఛ, నీచ, ఆడ, మగ బేధాలేవీ ఉండవు. ఉండేదల్లా అంతా ఒకే కుటుంబమనే సద్భావన మాత్రమే. అందరూ తెచ్చిన పండ్లన్నీ ముక్కలుగా కోసి, ఎంతమంది ఉంటే అంతమందికి ప్లేట్లలో పంచుతారు. వండిన ఆహార పదార్థాలు టిఫిన్‌కు నిషిద్ధం ఆరోజు. ఒకరోజు ముందే ఈ విషయాన్ని సూచిస్తూ మీతోపాటుగా ఇంకో ఇద్దరికి సరిపడా పండ్లు తెమ్మని చెబుతారు. కోసిన ఆ పండ్ల ముక్కలన్నీ కలిపితే బోల్డవుతాయి. అందరి కడుపునిండగా ఇంకా కొన్ని పదార్థాలు మిగిలిపోతే ఇంటికొచ్చేటప్పుడు ఎవరికి కావాలంటే వారిని తినమంటారు. ఎవరైనా కొబ్బరినీళ్ళు తెచ్చినా, ఫ్రూట్స్‌ సలాడ్స్‌ లాంటివి తెచ్చినా, వాటినీ గ్లాసుల్లో పోసిస్తారు అందరికీ. ఇలా బ్రేక్‌గా ఇచ్చిన గంట సమయం సరదా సరదా కబుర్లతో ఇట్లే గడిచిపోతుంది. టాయిలెట్స్‌కి వెళ్లొచ్చేవారు వెళ్లొస్తారు. అందరం అక్కయ్య, అన్నా, తమ్ముడు, చెల్లి లాంటి ఆప్యాయతా పూర్వక పిలుపులే. ట్రైనర్స్‌ని గురువుగారని సంబోధిస్తాం. వాలంటీర్లను చిన్న గురువుగారంటాం నవ్వుతూ. ఎక్కడా ఎలాంటి అమర్యాద పూర్వక వాతావరణాన్కిగానీ తావుండదు. యోగా హాల్‌ అంటే పవిత్ర దేవాలయం. మధ్య మధ్యలో గురూజీల ప్రసంగాలు ఉంటాయి. వాటి తర్వాత మరికొన్ని యోగాసనాలు, తర్వాత మళ్లీ ఏవైనా రెండు ఆటలు, మళ్లీ స్పీచ్‌, స్పందనలు ` ఇలా ఒకదాని తర్వాత మరో అంశం నిర్వహింపబడుతూ ఎక్కడా బోర్‌ అనేదానికి తావులేకుండా ఆరోజు మరపురాని రోజుగా మలుస్తారు యోగా గురువులు.

ఉదయం ఐదు గంటలకు ప్రారంభమైన యోగా ఈ చివరిరోజు మాత్రం దాదాపు ఇదంతా పూర్తయ్యేసరికి పదకొండున్నర, పన్నెండు అలా అయిపోతుంది. చెప్పలేదు కదూ! సాధకులందరూ గురూజీని దుశ్శాలువాతో సన్మానించి మెడలో పూలదండను సమర్పిస్తారు. కొంతమంది వారి వారి శ్రద్ధాసక్తుల మేరకు నూతన వస్త్రాలు కూడా సమర్పించటం కద్దు. కానీ ఈ వస్త్ర సమర్పణ అనేది అనివార్యం కాదు. మరి నాకేం గురుదక్షిణ ఇస్తారు? మీరంతా అని గురువుగారు అడిగిన ప్రశ్నకు సాధకులంతా తమకు తోచిన రీతిలో సమాధానమిస్తుంటే ఆయన నవ్వుతూ ఇవన్నీ ఏమీ వద్దు! మీరు నేర్చుకున్న ఈ యోగావిద్యను మీ వంతుగా మరో ఇద్దరికి పరిచయం చేయండి. ఒకవేళ కుదరక రోజూ క్లాసుకు హాజరవ్వకలేకపోయినా మీరు ఈ నేర్చుకున్న క్రియలను అభ్యాసం చెయ్యండి. సంపూర్ణ ఆరోగ్యంతో

ఉండండని దీవిస్తారు. ఎంతోమంది బాబాల పేరుతో, స్వామీజీల పేరుతో ఫలాపేక్షతోటే నడుస్తున్న నేటి సమాజంలో ఎటువంటి స్వలాభాన్ని ఆశించకుండా మరో ఇద్దరికి మీ వంతుగా నేర్పండని కోరటమే గురుదక్షిణ అని చెప్పిన సంస్కారవంతమైన ఈ యోగా గురుపరంపర యొక్క విలువలను ఆచరించి, తరించటమే తప్ప ఏమిచ్చి కొనుక్కోగలం. ఈ యోగ కుటుంబం నేర్పిన నిస్వార్థ పూరితమైన కుటుంబిక సంస్కారాలను ఎన్ని లక్షలు పెట్టినా కొనగలమా?

‘గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన’ అన్న రీతిగా కొంతమంది యోగా చేసేవారిని చులకనగా చూస్తూ, పొద్దున్నే వెళ్తున్నారంటే ఏదో కూడని పనికే

వెళ్తున్నారనే కాలం. ఇలాంటి పచ్చకామెర్ల రోగులను ఏ వైద్యుడు బాగుచేయగలడు? ఏ గురువులు సంస్కారాలనందివ్వగలరు? ఏ ఉపాధ్యాయుడు సత్ప్రవర్తన గురించి బుర్రకెక్కేట్టు పాఠాలు బోధించగలడు? పుట్టుకతో వచ్చిన బుద్ధి పిడకలతో పోవాల్సిందే. సరిగా ఇలాంటి కోవలోకే వచ్చే ఓ ఆణిముత్యం సువర్ణ వాళ్ల పతిదేవుడని తెలిసింది తను వెళ్లబోసుకున్న విషయాలు ద్వారా.

‘‘అతగాడి మనస్తత్వమిదేనని తెలుసుగదా మొదట్నుంచి? నువ్వెందుకు అతిగా బాధపడుతున్నావ్‌?’’ అన్నా.

‘‘అదికాదు మైథిలీ… యోగాసనాలు అన్నీ అయిపోయిన తర్వాత శవాసనం వేయమంటారు గదా, నాదసలే వంకీల జుట్టు, లేచినపుడు కొద్దిగా జుట్టు చెదురుతుంది గదా! పోనీకి పెట్టిన క్లిప్పు తీసేస్తా, శవాసనం వేసినపుడు. అందుకు అనుమానపు చూపులు వెళ్ళగానే. ఒక్కోరోజు మరీ గుర్రుగా ఉంటాడని చెప్పింది’’ వాపోతూ.

‘‘ఏం చెబితే అర్థమవుతుంది అతనికి? ఎలా చెబితే అర్థమవుతుందో? నాకేం అర్థం కావట్లేదు. ఒక్కోసారి బాగా ఏడుపొచ్చేస్తుంటుంది’’ అని చెబుతుంటే నాకు చాలా బాధ అన్పించింది సువర్ణను చూడగానే.

‘‘మొన్న వారం రోజుల క్రితం యోగా సెషన్‌ పూర్తయింది మైథిలీ. ఎప్పటిలాగే వార్షికోత్సవంలాగా చేస్తారు గదా ముగింపు పండుగంటూ. నీకు తెల్సు గదా..’’ అంది. ‘‘అవును’’ అన్నాను.

నేనైతే నాకున్న ఆరోగ్యపరమైన ఇబ్బందుల వల్ల మానివేశానుగానీ, సువర్ణ మానకుండా వెళుతూనే ఉంది యోగా క్లాసులకు.

ఇలాగా మాకీరోజు సెషన్‌ చివరి రోజు. లేటవుతుంది. మధ్యాహ్నం పన్నెండయి పోతుందని చెప్పిందట భర్తతో. సరేనని అన్నాడట. వాళ్ళకు జావ తాగే అలవాటు, టిఫిన్‌ తినగానే. తనొక్కడే గదాని వదిలెయ్యలేదు మైథిలీ. ఇడ్లీ వేసి హాట్‌ ప్యాక్‌లో సర్దా. పల్లీ చట్నీ కూడా చేశా తినలేరని. పక్కనే కొరప్పొడి డబ్బా

ఉండనే ఉంటుంది ఎప్పుడూ. జావచేసి ఫ్లాస్కులో పోశా. అన్నీ ఎదురుగా డైనింగ్‌ టేబుల్‌ మీద సర్ది పెట్టానని చెబితే సరేనన్నారు.

వాళ్ళకు పెరడు పెద్దది. పూలమొక్కలవీ బాగా ఉంటాయి. రోజూ ఊడుపు ఎక్కువే. అయినా ఏనాడు విసుగు కనిపించదు తన మొహంలో ఎప్పుడైనా అటుగా వెళ్లినపుడు వాళ్లింటికి వెళ్లటం అలవాటే నాకు. ఏ సమయంలో చూసినా చాలా

శుభ్రంగా ఉంటుంది వాకిలి గాని, పెరడుగానీ. ఇలా ఎలా సాధ్యమని అడిగితే, రెండుపూటలా శుభ్రంగా ఊడుస్తానని చెప్తే, నాకెంతో ముచ్చటేసేది. అట్లా అన్ని పనులూ చేసి, తనను ఉదయం తినటాన్కి, తాగటాన్కి కావలసినవి సిద్ధం ఏసి చెప్పి వచ్చినా ఆరోజు ‘‘ఏంటే ఇంత ఆలస్యమయింది? ఆ జుట్టంతా రేగిపోయి

ఉందేంటి? ఎక్కడ పడుకుని వచ్చావు ముండా’’ అని బూతులు తిడుతూ గొంతును పిసకబోయాడట. తన మెడచుట్టూ బిగుసుకుంటూన్న వాడి రెండు చేతులనూ ఎట్లాగో బలవంతంగా విడదీసుకుని నేను గదిలోకి పోయి చాలాసేపటిదాకా తలుపులేసుకున్నా భయంతోటి’’ అని సువర్ణ చెప్తుంటే తనగుండె వేగంగా ఎగిరిపడటాన్ని గమనించా. మొహమంతా బాధతోటి వివర్ణమైపోయింది.

‘‘ఇంతకుముందు అనుమానంగా చూసేవాడు, కోపంతో టీకప్పు విసిరేసేవాడు, టీ బోగోలేదంటూ. కూరలు ఎంత రుచిగా వండినా కుదరలేదు, నీ ధ్యాస ఎక్కడ ఏడుస్తోందని చాలా చులకన చేసి మాట్లాడేవాడట. అప్పుడు పిల్లలుండేవారట. ఎందుకు డాడీ అనవసరంగా మమ్మీని తిడుతున్నారని పిల్లలు గట్టిగా నిలదీస్తే, తన గదిలోకి పోయి ఆరోజంతా అలకపాన్పు ఎక్కేవాడట. ఎన్నిసార్లు పిలిచినా భోజనానికి రాకపోతే, చివరికి తనే ఉసూరనిపించి భోజనం ప్లేట్లో పెట్టి, గదిలో టీపాయ్‌ మీద పెట్టి వచ్చేదట. సువర్ణ మంచినీళ్లు, పెరుగు, రసంతో సహా. మళ్ళీ మధ్యలో తనెళ్లి కనబడితే ఎక్కడ మధ్యలో అహంతో చెయ్యి కడిగేసుకుంటాడోననే జాలితో. ఇదిగో ఇదే వీక్‌పాయింట్‌ ఆడాళ్లందరిదీ. మన తప్పులేకుండా తిట్లుపడటం, ప్రతి చిన్నదానికి సాకులు పెట్టి హేళనగా మాట్లాడే మాటల్ని భరించటం. మన కుటుంబాలే ఇలా ఏడ్చాయా? లోకంలో ఉన్న కొంపలన్నీ ఇట్లాగే తగలడ్డాయా? లేదా మన కొంపల్లోనే ఇలా ఉంటాయా అన్పిస్తుంటుంది ఒక్కోసారి ఇలాంటివన్నీ వింటుంటే.

మళ్ళీ సువర్ణ ఏమనేదో తెలుసా ‘‘మైథిలీ… ప్లేటు మొత్తం ఖాళీ చేసేశాడు, ఒక్క చుక్క కూడా విడవకుండా పెరుగు మొత్తం తాగేసేవాడట. దొంగపిల్లి నాకినట్లుగా వుండేదట ఆ ఖాళీ అయిన పెరుగు కప్పును చూస్తుంటే అని చెప్పి నవ్వేది తర్వాత. అది దొంగపిల్లి కాదు, బలిసిన పెద్ద గండుపిల్లి. జంగు పిల్లి’’ అని నేను తిట్టుకునేదాన్ని మనసులో.

‘‘ఆకలైతే వాడే తింటాడులే అని ఈసారి నేనేం పట్టించుకోలేదు. ఈరోజు నా ధర్మంగా నేను అన్నం, కూరా వండి పెట్టాను టేబుల్‌ మీద. నన్ను నేను సమాదాయించుకుంటూ చెయ్యని తప్పుకు నేనెందుకు కడుపు మాడ్చుకోవాలని ఓ రెండు ముద్దలు పెట్టుకుని తిని చెయ్యి కడుక్కున్నాను. ఈసారి నాకు తినమని కూడా అడగాలనిపించలేదు. నా దారిననే వెళ్ళి పిల్లల రూమ్‌లో పడుకున్నాను. తర్వాత రెండు రోజులదాకా నాకు చాలా డిప్రెషన్‌లాగా అనిపించింది’’ అంటూ ఎంతో బాధతో చెబుతుంటే నా ప్రాణం విలవిలలాడిపోయింది తన బాధాపూరితమైన మాటలు వింటుంటే.

‘‘మరి ఆ రెండు రోజులూ ఏం చేశాడు మీ ఆయన? తిండి తిన్నాడా? లేదా’’ అని అడిగా… ఒకింత బాధతో మిళితమయిన కోపంతో’’

‘‘ఆ… ఎందుకు తినలా! శుభ్రంగా మెక్కాడు. నంగనాచిలా ఆ మరుసటిరోజే చికిన్‌ తెచ్చి, నాకు కనబడేటట్లు టేబుల్‌ మీద పెట్టాడు. వండు అన్నట్టు. నా బాధను, కోపాన్ని తమాయించుకుని వండి పెట్టాను. శుభ్రంగా తిన్నాడు సిగ్గులేకుండా’’ అన్నది. తన మనసు ఎంత వేదనకు గురయితే ఈ మాట వచ్చిందోనని అనుకున్నా.

‘‘మరి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నావా? మానేశావా యోగాకి వెళ్ళటం? మీ ఇంటి దగ్గర ఉన్న విమలా, రత్నమ్మ గార్లతో కలిసేగా వెళ్ళేది, వచ్చేదీ’’ అన్నా.

‘‘అవును, అయినా వాడికి అనుమానం పొరలు కమ్మి, కండ్లు కనబడని గుడ్డోడవుతాడు. అదే మావాడి స్పెషాలిటీ’’ అంది విరక్తిగా.

‘‘ఆ… ఎందుకులే పెంటగోల అని మానేశాను. యోగాకు వెళ్లట్లేదంది. ఇట్లా బాధపెట్టి బెదిరించి, మాన్పించాలనేగా వాడి ప్లానంతా. వాడనుకున్నది సాధించుకున్నాడు. చివరికి నన్ను నాల్గు గోడలకి బందీ చేసి’’ అన్నది మళ్ళీ కోపంగా.

ఇదివరకు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కొంతలో కొంతవరకు నయం. ఆలోచించేవాడు మాట వదలాలంటే. ఇప్పుడు వాళ్ళిద్దరూ బెంగుళూరులో

ఉంటన్నారుగా ఉద్యోగాల్లో. ఇక వీడు మరీ పేట్రేగిపోతున్నాడు. ఒక్కోసారి ఏం వాగుతున్నాడో కూడా తెలవట్లేదు. ఆనోటికి హద్దూపద్దూ ఉండట్లేదని వాపోయింది సువర్ణ.

అందంగా పుట్టడం సువర్ణ చేసుకున్న పాపమా? అందంగా ఉన్న తమ కూతుర్ని, ఉద్యోగస్తుడూ… లక్షణంగా పెండ్లాన్ని చూసుకుంటాడని నమ్మి ఇతగాడికిచ్చి కట్టబెట్టిన తల్లిదండ్రులదా?

మగడు ఏదన్నా పడుండాలి. వాడికి కోపమొస్తే భరించాల్సిందేనమ్మా అంటూ సాగదీసే సదరు అత్తగారి టెంపరితనమా?

నిజంగానే ‘కాకి ముక్కుకు దొండపండు’ అనే సామెతకు నూటికి రెండొందల శాతం కరెక్టు సువర్ణ భర్తగారి విషయంలో. నాకు ఆ పేరెత్తి ఇదీ అని చెప్పాలన్నా కంపరమెత్తుతుంది ఇప్పటికి కూడా.

ఇలా చాలా విషయాలు తెలుస్తుంటాయి అప్పుడప్పుడు తన ద్వారా. అందుకే నాకు సువర్ణ భర్త అంటే ఏవగింపు. తను కూడా ఇంతకు మునుపు ఎంత బాధలో ఉన్నా మా ఆయన, మావారు అని సంబోధించేది నాతో మాట్లాడేటప్పుడు. ఎంత బాధ సలుపుతుంటే, మనసులో ఎంత విరక్తి పుడితే వాడు, వీడు అని తిడ్తుంది భర్తను. నాకు తప్పులేదనిపించింది. మరి తక్కువ పనులు చేశాడావాడు అని పిలవబడుతున్న సదరు సువర్ణ గారి మొగుడుగారు.

నువ్వు తెల్లగానే ఉంటావు గదా, నీకెందుకు క్రీములు, పౌడర్లు అని సాధించేవాడట. కొత్త బట్టలు కట్టుకుంటే ఓర్చుకోలేడట. మంచిగా తల దువ్వి జడ వేసుకున్నా అనుమానమేనట… ఎవరన్నా ఇంటికి అతిథులు వస్తే, అందులో

వాళ్ళు పురుష పుంగవులైతే తనను మంచినీళ్ళు కూడా తేనీయడట. ఒకసారి అలాగే టీ పెట్టి పట్టుకెళితే, నానా బూతులూ తిట్టాడట వాళ్ళు వెళ్ళిన తర్వాత. ఇక అప్పట్నుంచి అతగాడికే టీ కప్పులు ట్రేలో పెట్టి అందిస్తే తీసుకెళ్లి వాళ్లకిస్తాడట. దొడ్లో అంట్లు తోముతుంటుంటే రోజూ కుర్చీ వేసుకుని కూర్చొని, ఆ సమయానికి పేపరో, పుస్తకమో చదువుకుంటున్నట్లు నటిస్తాడట. మొదట్లో అర్థమయ్యేది కాదట సువర్ణకు. దొడ్డివైపు తలుపులు వేసేవుంటాయట. తియ్యరట ఎప్పుడూ. అయినా వాడికి అనుమానమేనట. ఒకసారి పౌడర్లో సున్నం కలిపాడట. మామూలుగా రోజూ రాసుకున్నట్లు రాసుకుంటే, మొహమంతా పొక్కిపోయి ఎలర్జీ వచ్చి, ఆసుపత్రికి వెళితే ఆ పౌడరును చూసి అందులో సున్నం కలిసిందని చెప్పారట డాక్లర్లు. మళ్ళీ ఇంకోసారి స్ప్రే బాటిల్లో హ్యాండ్‌ వాష్‌ లాంటిది కలిపాడట. ఇదీ వాడి నిర్వాకమేనని తెలిసి వాళ్ళ పెద్దబ్బాయికి చూపిస్తే ‘నిజమే మమ్మీ ఇందులో హ్యాండ్‌ వాష్‌ కలిపాడు అని తండ్రిని ఛీత్కరించుకున్నాడట.’ వాళ్ళ డాడీ వెలగబెట్టే నిర్వాకాలన్నీ తెలుసు పిల్లలకు. వాళ్ళేం చిన్నవాళ్ళు కాదుగా! అందుకే ఏదన్నా శుభకార్యానికి వెళ్ళాలంటే ఆ… డాడీ ఎందుకు మమ్మీ? మనమే వెళ్లొద్దాం అంటారట. తండ్రి అంటే అతను చేసే పనుల వల్ల ఎంత విలువ తగ్గిపోతోంది తండ్రిగా తనకు అని ఒక్కోసారి చెప్పి నిట్టూరుస్తూంటుంది సువర్ణ.

‘ఇన్ని చేస్తున్నా, మావారంటే నాకు చాలా ఇష్టం మైథిలీ’ అంటుంది నాతో ఒక్కోసారి.

‘‘కానీ నా ప్రేమను గుర్తించడు. ఎప్పుడు సందు దొరుకుతుందా అని ఎదురుచూస్తుంటాడు సూటీ పోటీ మాటలు వదలటానికి’’ అన్నది మళ్ళీ.

నమ్మకం లేనిచోట ప్రేమ ఉండదంటారు నిజమే. భార్యమీద, ఆమె నడత మీద అస్సలు ఏమాత్రం నమ్మకం లేదు. అందుకే అంత ఆవేదన సువర్ణకు.

శుభ్రంగా ఉంటుంది వాకిలి గాని, పెరడుగానీ. ఇలా ఎలా సాధ్యమని అడిగితే, రెండుపూటలా శుభ్రంగా ఊడుస్తానని చెప్తే, నాకెంతో ముచ్చటేసేది. అట్లా అన్ని పనులూ చేసి, తనను ఉదయం తినటాన్కి, తాగటాన్కి కావలసినవి సిద్ధం ఏసి చెప్పి వచ్చినా ఆరోజు ‘‘ఏంటే ఇంత ఆలస్యమయింది? ఆ జుట్టంతా రేగిపోయి

ఉందేంటి? ఎక్కడ పడుకుని వచ్చావు ముండా’’ అని బూతులు తిడుతూ గొంతును పిసకబోయాడట. తన మెడచుట్టూ బిగుసుకుంటూన్న వాడి రెండు చేతులనూ ఎట్లాగో బలవంతంగా విడదీసుకుని నేను గదిలోకి పోయి చాలాసేపటిదాకా తలుపులేసుకున్నా భయంతోటి’’ అని సువర్ణ చెప్తుంటే తనగుండె వేగంగా ఎగిరిపడటాన్ని గమనించా. మొహమంతా బాధతోటి వివర్ణమైపోయింది.

‘‘ఇంతకుముందు అనుమానంగా చూసేవాడు, కోపంతో టీకప్పు విసిరేసేవాడు, టీ బోగోలేదంటూ. కూరలు ఎంత రుచిగా వండినా కుదరలేదు, నీ ధ్యాస ఎక్కడ ఏడుస్తోందని చాలా చులకన చేసి మాట్లాడేవాడట. అప్పుడు పిల్లలుండేవారట. ఎందుకు డాడీ అనవసరంగా మమ్మీని తిడుతున్నారని పిల్లలు గట్టిగా నిలదీస్తే, తన గదిలోకి పోయి ఆరోజంతా అలకపాన్పు ఎక్కేవాడట. ఎన్నిసార్లు పిలిచినా భోజనానికి రాకపోతే, చివరికి తనే ఉసూరనిపించి భోజనం ప్లేట్లో పెట్టి, గదిలో టీపాయ్‌ మీద పెట్టి వచ్చేదట. సువర్ణ మంచినీళ్లు, పెరుగు, రసంతో సహా. మళ్ళీ మధ్యలో తనెళ్లి కనబడితే ఎక్కడ మధ్యలో అహంతో చెయ్యి కడిగేసుకుంటాడోననే జాలితో. ఇదిగో ఇదే వీక్‌పాయింట్‌ ఆడాళ్లందరిదీ. మన తప్పులేకుండా తిట్లుపడటం, ప్రతి చిన్నదానికి సాకులు పెట్టి హేళనగా మాట్లాడే మాటల్ని భరించటం. మన కుటుంబాలే ఇలా ఏడ్చాయా? లోకంలో ఉన్న కొంపలన్నీ ఇట్లాగే తగలడ్డాయా? లేదా మన కొంపల్లోనే ఇలా ఉంటాయా అన్పిస్తుంటుంది ఒక్కోసారి ఇలాంటివన్నీ వింటుంటే.

మళ్ళీ సువర్ణ ఏమనేదో తెలుసా ‘‘మైథిలీ… ప్లేటు మొత్తం ఖాళీ చేసేశాడు, ఒక్క చుక్క కూడా విడవకుండా పెరుగు మొత్తం తాగేసేవాడట. దొంగపిల్లి నాకినట్లుగా వుండేదట ఆ ఖాళీ అయిన పెరుగు కప్పును చూస్తుంటే అని చెప్పి నవ్వేది తర్వాత. అది దొంగపిల్లి కాదు, బలిసిన పెద్ద గండుపిల్లి. జంగు పిల్లి’’ అని నేను తిట్టుకునేదాన్ని మనసులో.

‘‘ఆకలైతే వాడే తింటాడులే అని ఈసారి నేనేం పట్టించుకోలేదు. ఈరోజు నా ధర్మంగా నేను అన్నం, కూరా వండి పెట్టాను టేబుల్‌ మీద. నన్ను నేను సమాదాయించుకుంటూ చెయ్యని తప్పుకు నేనెందుకు కడుపు మాడ్చుకోవాలని ఓ రెండు ముద్దలు పెట్టుకుని తిని చెయ్యి కడుక్కున్నాను. ఈసారి నాకు తినమని కూడా అడగాలనిపించలేదు. నా దారిననే వెళ్ళి పిల్లల రూమ్‌లో పడుకున్నాను. తర్వాత రెండు రోజులదాకా నాకు చాలా డిప్రెషన్‌లాగా అనిపించింది’’ అంటూ ఎంతో బాధతో చెబుతుంటే నా ప్రాణం విలవిలలాడిపోయింది తన బాధాపూరితమైన మాటలు వింటుంటే.

‘‘మరి ఆ రెండు రోజులూ ఏం చేశాడు మీ ఆయన? తిండి తిన్నాడా? లేదా’’ అని అడిగా… ఒకింత బాధతో మిళితమయిన కోపంతో’’

‘‘ఆ… ఎందుకు తినలా! శుభ్రంగా మెక్కాడు. నంగనాచిలా ఆ మరుసటిరోజే చికిన్‌ తెచ్చి, నాకు కనబడేటట్లు టేబుల్‌ మీద పెట్టాడు. వండు అన్నట్టు. నా బాధను, కోపాన్ని తమాయించుకుని వండి పెట్టాను. శుభ్రంగా తిన్నాడు సిగ్గులేకుండా’’ అన్నది. తన మనసు ఎంత వేదనకు గురయితే ఈ మాట వచ్చిందోనని అనుకున్నా.

‘‘మరి ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నావా? మానేశావా యోగాకి వెళ్ళటం? మీ ఇంటి దగ్గర ఉన్న విమలా, రత్నమ్మ గార్లతో కలిసేగా వెళ్ళేది, వచ్చేదీ’’ అన్నా.

‘‘అవును, అయినా వాడికి అనుమానం పొరలు కమ్మి, కండ్లు కనబడని గుడ్డోడవుతాడు. అదే మావాడి స్పెషాలిటీ’’ అంది విరక్తిగా.

‘‘ఆ… ఎందుకులే పెంటగోల అని మానేశాను. యోగాకు వెళ్లట్లేదంది. ఇట్లా బాధపెట్టి బెదిరించి, మాన్పించాలనేగా వాడి ప్లానంతా. వాడనుకున్నది సాధించుకున్నాడు. చివరికి నన్ను నాల్గు గోడలకి బందీ చేసి’’ అన్నది మళ్ళీ కోపంగా.

ఇదివరకు పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు కొంతలో కొంతవరకు నయం. ఆలోచించేవాడు మాట వదలాలంటే. ఇప్పుడు వాళ్ళిద్దరూ బెంగుళూరులో

ఉంటన్నారుగా ఉద్యోగాల్లో. ఇక వీడు మరీ పేట్రేగిపోతున్నాడు. ఒక్కోసారి ఏం వాగుతున్నాడో కూడా తెలవట్లేదు. ఆనోటికి హద్దూపద్దూ ఉండట్లేదని వాపోయింది సువర్ణ.

అందంగా పుట్టడం సువర్ణ చేసుకున్న పాపమా? అందంగా ఉన్న తమ కూతుర్ని, ఉద్యోగస్తుడూ… లక్షణంగా పెండ్లాన్ని చూసుకుంటాడని నమ్మి ఇతగాడికిచ్చి కట్టబెట్టిన తల్లిదండ్రులదా?

మగడు ఏదన్నా పడుండాలి. వాడికి కోపమొస్తే భరించాల్సిందేనమ్మా అంటూ సాగదీసే సదరు అత్తగారి టెంపరితనమా?

నిజంగానే ‘కాకి ముక్కుకు దొండపండు’ అనే సామెతకు నూటికి రెండొందల శాతం కరెక్టు సువర్ణ భర్తగారి విషయంలో. నాకు ఆ పేరెత్తి ఇదీ అని చెప్పాలన్నా కంపరమెత్తుతుంది ఇప్పటికి కూడా.

ఇలా చాలా విషయాలు తెలుస్తుంటాయి అప్పుడప్పుడు తన ద్వారా. అందుకే నాకు సువర్ణ భర్త అంటే ఏవగింపు. తను కూడా ఇంతకు మునుపు ఎంత బాధలో ఉన్నా మా ఆయన, మావారు అని సంబోధించేది నాతో మాట్లాడేటప్పుడు. ఎంత బాధ సలుపుతుంటే, మనసులో ఎంత విరక్తి పుడితే వాడు, వీడు అని తిడ్తుంది భర్తను. నాకు తప్పులేదనిపించింది. మరి తక్కువ పనులు చేశాడావాడు అని పిలవబడుతున్న సదరు సువర్ణ గారి మొగుడుగారు.

నువ్వు తెల్లగానే ఉంటావు గదా, నీకెందుకు క్రీములు, పౌడర్లు అని సాధించేవాడట. కొత్త బట్టలు కట్టుకుంటే ఓర్చుకోలేడట. మంచిగా తల దువ్వి జడ వేసుకున్నా అనుమానమేనట… ఎవరన్నా ఇంటికి అతిథులు వస్తే, అందులో

వాళ్ళు పురుష పుంగవులైతే తనను మంచినీళ్ళు కూడా తేనీయడట. ఒకసారి అలాగే టీ పెట్టి పట్టుకెళితే, నానా బూతులూ తిట్టాడట వాళ్ళు వెళ్ళిన తర్వాత. ఇక అప్పట్నుంచి అతగాడికే టీ కప్పులు ట్రేలో పెట్టి అందిస్తే తీసుకెళ్లి వాళ్లకిస్తాడట. దొడ్లో అంట్లు తోముతుంటుంటే రోజూ కుర్చీ వేసుకుని కూర్చొని, ఆ సమయానికి పేపరో, పుస్తకమో చదువుకుంటున్నట్లు నటిస్తాడట. మొదట్లో అర్థమయ్యేది కాదట సువర్ణకు. దొడ్డివైపు తలుపులు వేసేవుంటాయట. తియ్యరట ఎప్పుడూ. అయినా వాడికి అనుమానమేనట. ఒకసారి పౌడర్లో సున్నం కలిపాడట. మామూలుగా రోజూ రాసుకున్నట్లు రాసుకుంటే, మొహమంతా పొక్కిపోయి ఎలర్జీ వచ్చి, ఆసుపత్రికి వెళితే ఆ పౌడరును చూసి అందులో సున్నం కలిసిందని చెప్పారట డాక్లర్లు. మళ్ళీ ఇంకోసారి స్ప్రే బాటిల్లో హ్యాండ్‌ వాష్‌ లాంటిది కలిపాడట. ఇదీ వాడి నిర్వాకమేనని తెలిసి వాళ్ళ పెద్దబ్బాయికి చూపిస్తే ‘నిజమే మమ్మీ ఇందులో హ్యాండ్‌ వాష్‌ కలిపాడు అని తండ్రిని ఛీత్కరించుకున్నాడట.’ వాళ్ళ డాడీ వెలగబెట్టే నిర్వాకాలన్నీ తెలుసు పిల్లలకు. వాళ్ళేం చిన్నవాళ్ళు కాదుగా! అందుకే ఏదన్నా శుభకార్యానికి వెళ్ళాలంటే ఆ… డాడీ ఎందుకు మమ్మీ? మనమే వెళ్లొద్దాం అంటారట. తండ్రి అంటే అతను చేసే పనుల వల్ల ఎంత విలువ తగ్గిపోతోంది తండ్రిగా తనకు అని ఒక్కోసారి చెప్పి నిట్టూరుస్తూంటుంది సువర్ణ.

‘ఇన్ని చేస్తున్నా, మావారంటే నాకు చాలా ఇష్టం మైథిలీ’ అంటుంది నాతో ఒక్కోసారి.

‘‘కానీ నా ప్రేమను గుర్తించడు. ఎప్పుడు సందు దొరుకుతుందా అని ఎదురుచూస్తుంటాడు సూటీ పోటీ మాటలు వదలటానికి’’ అన్నది మళ్ళీ.

నమ్మకం లేనిచోట ప్రేమ ఉండదంటారు నిజమే. భార్యమీద, ఆమె నడత మీద అస్సలు ఏమాత్రం నమ్మకం లేదు. అందుకే అంత ఆవేదన సువర్ణకు.

అభద్రతా భావంలో కూరుకుపోయిన వాడి చెవులకు ‘రామా’ అన్నా బూతుమాటే. వాళ్ల చూపులకు, వాళ్ల బుద్ధులకు కూడా పచ్చ కామెర్ల రోగమే నన్నడిగితే.

‘‘అమ్మా కథ పూర్తయింది. అందరూ వచ్చి స్వామివారికి దండం పెట్టుకోండి’’ అన్న పంతులుగారి పిలుపుకు మేము కూర్చున్న చోటు విడిచి వ్రతం జరిగే దగ్గరకొచ్చి దండం పెట్టుకుని, హారతి అద్దుకుని ప్రసాదం తీసుకున్నాము. గిఫ్ట్‌లు ఆ దంపతుల చేతుల్లో పెట్టి భోజనాలు ముగించుకుని, ఆటో ఎక్కి ఎవరి వీధి మలుపు వరకు వాళ్ళని దింపేటట్లుగా ఆటోవాలాతో మాట్లాడుకున్నాము.

‘‘ఏ విషయంలోగానీ, ఏ సందర్భంలోగానీ నువ్వసలు డిప్రెస్‌ అవ్వకూడదని, నీ పిల్లలు కూడా ఎదిగి, ప్రయోజకులై, స్వతంత్రంగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నువ్వేమీ బెంగపడకు’’ అని సువర్ణకు ధైర్యం చెప్పాను నేను.

‘‘అవును నా ధైర్యం నా పిల్లలే. కొద్దిరోజులే ఇక, ఓపిక పడతా. లిమిట్స్‌ దాటి పూర్వంలాగా బాధలు పెడితే మాత్రం నా కొడుకుల దగ్గరకు బెంగుళూరుకు వెళ్ళిపోతాను’’ అని చెప్పింది నిశ్చయంగా, స్పష్టంగా సువర్ణ.

‘‘మరి ఇవే మాటలు మీ ఆయనతో కూడా చెప్పకపోయావా?’’ అన్నా.

‘‘అతగాడు పాముతో సమానం. చెబితే కాచుక్కూచుంటాడు పోనీయకుండా! మళ్ళీ ఏదో ఓ సందర్భం సృష్టించుకుని చెలరేగిపోడూ… అప్పుడు నేనే ఆ అనుమానపు పడగను నా కాళ్ళతో అణిచి పారేస్తానంది’’ ధృఢ నిశ్చయంతో.

‘‘మరి అక్కడికి కూడా వస్తేనో?’’ అన్నా సందేహంగా.

‘‘రాడు. ఏ మొహం పెట్టుకుని వస్తాడు. వాడికి ఎన్ని గుండెలు?’’ అంది ధృడ చిత్తంతో నవ్వుతూ.

ఆ నవ్వు చూసి ‘స్థిమిత పడిరదిలే…  హమ్మయ్యా’ అనుకున్నా…

‘‘మరి ఇప్పుడంటే వాళ్ళు సింగిల్స్‌. రేపు వాళ్ల పెండ్లిండ్లయితే ఎలా? మళ్ళీ ప్రశ్నార్థకం కాకుండా చూసుకోవాలిగదా నీ భవిష్యత్తును’’ అన్నా సువర్ణతో.

దానికి తన భవిష్యత్‌ ప్రణాళికని కూడా చెప్పింది.

ఓటమి నుంచే పట్టుదల, పట్టుదల నుండి సాధించాలనే తపన, ఆ తపన నుండే గెలుపుదారులు తెరుచుకుంటాయనుకుంటా.

‘‘పెండ్లప్పుడు వాళ్ళ పుట్టింటివాళ్లు పెట్టిన బంగారం పదితులాలదాకా  ఉంటుందట. దానిమీద తనకే గానీ వేరే ఎవ్వరికీ హక్కు లేదన్నది’’

‘‘ఆ పది తులాల బంగారం అమ్మేసి, నేను బొటిక్‌ పెట్టుకుంటా’’నంది.

సువర్ణ మంచి టైలరమ్మ. కచ్‌వర్క్‌, ఎంబ్రాయిడరీ, వెరైటీ వెరైటీ మోడల్స్‌లో బ్లౌజులు బాగా కుడుతుంది. ఫ్రాకులు, శారీఫాల్సు, పంజాబీస్‌ కూడా బాగా కుడుతుందని పేరుంది వాళ్ల వీధిలో. తనను కాదని స్టిచ్చింగ్‌కి బైటకి వెళ్ళరెవరూ.

ఈ అనుమానం రోగం బాగా ముదిరిన తర్వాత ఏదో కొద్దిగా సుస్తీ చేస్తే ఆ వంకతోటి ఆ టైలరింగ్‌నీ అటకెక్కించాడని మొత్తుకుంది ఓసారి.

‘‘మరి నీ ఆరోగ్యం కుదుటపడిన తర్వాత మళ్ళీ అడగకపోయావా?’’ అన్నాను.

‘‘కుట్టుకుంటానని అంటే లేనిపోని ప్రేమంతా నామీద ఒలకబోసి నీకెందుకు నేనున్నానుగా! ఏది కావాలంటే అది కొనిపెడతా. డబ్బులు అవసరమైతే నేనిస్తాగా? అంటే సరేననుకున్నా. ఆ టైలరింగ్‌కు సంబంధించిన మిషను వగైరాలన్నీ అమ్మేశాడు. నేనూ నమ్మాను. ఒక సంవత్సరం అన్నట్లుగా అన్నీ చేశాడు. తరువాతి నుంచి మొండిచెయ్యే చూపేవాడట. కావలసినవి సమకూరుస్తాడు. కానీ పైసా కూడా చేతికి చిక్కనివ్వడు’’ అని చెప్పింది గతకాలపు చేదును గుర్తు చేసుకుంటూ’’ సువర్ణ.

ఆర్థిక స్వాలంబనను అటకెక్కేట్లు చేసి తమపైనే ఆధారపడేట్లు చేసుకుంటూ అభివృద్ధి పథంలో నడిచే అవకాశం లేకుండా చేయటం. ఇది ఒక రకపు టాలెంట్‌. ఇలా రెక్కలు విరిచి వేయబడిన సువర్ణలెందరో ఈ సమాజంలో.

***

కొందరు వైట్‌ కాలర్స్‌ టాలెంటెడ్‌ పర్సన్సు, వీరి దర్జా, ఠీవి… ఆ తీరేవేరు. భార్యల ఎ.టి.ఎమ్‌. కార్డులు వారి జేబులోనే నివాసముంటాయి. ‘సొమ్మొకడిది సోకొకడిది’ అంటే ఇదేనేమో ననిపిస్తుంటుంది నాకు అప్పుడప్పుడు.

పండక్కో, పబ్బానికో ఏ చీరో కొనటం, పెద్ద మొత్తంలో ఏరియర్స్‌ లాంటివి ఏవో రావటంతో ఓ చిన్న నగలాంటి ఉంగరమో, బొంగరమో లాంటిది కొని, ఇదుగోనోయ్‌ నీకు గిఫ్టు అంటూ మురిపించటం. ఇంకో విడ్డూరమేంటంటే వాళ్ళ అప్‌ అండ్‌ డౌన్‌ బస్‌ ఛార్జీల డబ్బు వాళ్ళ మొహాన కొట్టటం. ఇంతే ఇక కష్టపడి సంపాదించుకున్న జీతపురాళ్లను పూర్తిగా ఏనాడు చూసిన పాపాన పోని వాళ్ళు ఎంతమందో ఈ మాయదారి ఏ.టి.ఎమ్‌. లొచ్చాక. పే బిల్స్‌లో చూసి మురిసిపోవటమే మన ఉద్యోగినుల పని.

ఇంత చేస్తున్నా గుర్తింపుకు నోచుకోని మహిళలెందరో. ఇటు ఇంట్లో, అటు బయటా చచ్చే చాకిరీ చేసి, అనారోగ్యంలోకి నెట్టివేయబడుట, కృంగిపోయేవారు మరెందరో. ఇలా ఆలోచిస్తే నా బుర్రలో ఠక్కున హాసిని సంసారం గుర్తుకొస్తుంది. తనదే జీతమెక్కువ. ఇంట్లో పని కూడా తనకే ఎక్కువ. పెండ్లైన క్రొత్తలో ఏదో ప్రైవేటు డిగ్రీ కాలేజీలో ఆఫీస్‌ వర్క్‌ చేసేవాడట భర్త. చాలాచోట్ల మారాడట. ఎక్కడా స్థిరత్వం ఉండదట. ‘ఏదన్నా చిన్న తేడాలు వస్తాయి. వదులుకుని ఇంట్లో కూర్చుంటే ఎలా అనే ఆలోచన కూడా ఉండదు మైథిలీ’ అని వాపోతుంటుంది ఒక్కోసారి నాతో.

‘‘మరి వేరే ఎక్కడైనా ట్రై చెయ్యవచ్చుగదా? సిస్టమ్‌ వర్క్‌తో పాటుగా పి.జి.లో మ్యాథ్స్‌ క్వాలిఫికేషన్‌ వుందిగదా! ఖాళీగా ఉంటే ఏం తోస్తుందని’’ అడిగా.

‘‘ఎందుకు మైథిలీ… నా జీతం ఉందిగా! అతడిరక కష్టపడటమెందుకు, ఇలా ఉంటాయి అతగాడి భావాలు’’ అని చెప్పి బాధపడుతుంది.

‘‘నన్ను బస్టాండులో దింపటం, సాయంత్రం వచ్చి పికప్‌ చేసుకోవటం ఆయన పని. ఓ… దీనికే తెగ ఇబ్బంది పడిపోతుంటాడని’’ చెప్పింది వేదన స్వరంతో.

‘‘మరీ అలా రికామీగా ఉంటే ఎలా పొద్దుపోతుంది మీ ఆయనకి?’’ అని అడిగితే టైముకి అన్నీ తింటూ, టీలు తాగుతూ హ్యాపీగా కాలం వెళ్లదీస్తుంటాని’’ నవ్వురాక, ఏడ్వలేక చిన్నబుచ్చుకున్న ముఖంతో చెప్పింది.

హాసిని గూడా తెల్లగా అందంగా, బక్కపలచగా బాగుంటుంది. పి.జి. చేసింది. గవర్నమెంటు మహిళా కళాశాలలో వర్క్‌ చేస్తోంది లెక్చరర్‌గా.

అన్నీ అనుకున్నట్లుగా జరిగితే అది జీవితం ఎందుకవుతుంది? మన అగిడినవన్నీ ఇస్తే వాడు దేవుడు ఎందుకవుతాడు? ప్రతిమనిషి గుండెలో ఏదో ఒక బాధ మేకులా గ్రుచ్చుకుంటూనే ఉంటుందనుకుంటాను. గాయాలు చేసేది కాలమే. వాటిని మాన్పగల శక్తీ కాలానిదే. మరపునిచ్చేదీ కాలమేనంటాం. ఇది నిజమేనా? ఏమీ కాదనే నన్పిస్తుంది నాకు మనసుకు మాత్రం. అన్నీ మనకు మనమే చేసుకుని మన అనుభవాలను, అనుభూతులను కావాలని ఆపాదిస్తూ ఆత్మవంచన చేసుకుని బ్రతికేస్తున్నామేమో అనిపిస్తుంటుంది. కాలంలో కలిపి నడకసాగించలేని పరిస్థితులే ఇలాంటి ఆలోచనల పుట్టుకకు నాంది అనుకుంటాను.

లేకపోతే ఏమిటి? కాలం కుంటినడక నడస్తోందంటాం (మనం) కాలం నవ్వుతోందంటాం, పరుగులు పెడుతోందంటాం. ఒకింత గర్వంతో మనం విజయం చేపట్టిన వేళల్లో కాలాన్ని కట్టేస్తాననే ప్రగల్భాలు కూడా పలుకుతాం.

అంటే ఒక సందర్భాన్ని మన మనసు సంతోషంగా స్వీకరిస్తే నాకు కాలం కలిసివచ్చిందంటాం. దుఃఖపూరితమైన క్షణాల్ని యుగాలతో పోలుస్తాం. కానీ కాలం కాలమే. వీచేగాలి, పారేనీరు, కాసే ఎండ… వీటిల్లో హెచ్చుతగ్గులుండచ్చు. కానీ కాలం ఎప్పుడూ తన పంథాలోనే తన చట్రంలోనే చరిస్తుంటుంది. కాలానికి ఏ అనుభూతులూ, ఏ సంవేదనలూ, సంఘర్షణలూ, స్థాయీ బేధాలూ, ఉచ్ఛనీచాలూ, ప్రాంతీయ బేధాలూ ఉండవు. మనమెలాగూ ఆ చట్రంలో పడి నలుగుతున్నాం. కనీసం కాలాన్నైనా ఫ్రీగా వదిలేద్దాం.

కానీ కాలంలాగా మనం కూడా ఏ భావాలనూ తగిలించుకోకుండా ఏ వేదనలలో మునిగిపోకుండా కాలాన్నే ఊతకర్రగా చేసుకుని నడవ గలిగే స్థాయికి ఎదగగలిగితే జీవితమంతా ఆనందమయమేగదా! కానీ అలా ఉండలేమే! అదేగదా వచ్చిన చిక్కంతా!

కొన్నినాళ్లామె ఆమనిని మరచిన శిశిరం. కాకపోతే మిగతా ఋతువులన్నీ కూడా గ్రహణంలా ముసురుకున్న వేదనాభరితం. బాధలో ఉన్నా, దుఃఖాల్లో

ఉన్నా, కష్టాల్లో ఉన్నా నేనింతే, నా బ్రతుకింతేననే డిప్రెషన్‌లో పడి కృంగిపోవటం సహజం. కానీ అదే మారని పరిస్థితులలోనా ఓర్మితో, పిల్లల కోసమో, సమాజంలో పరువు పోతుందనే విజ్ఞతతోనే నడుచుకోగలిగిన ఇండ్లు భవిష్యత్తులో శిశిరాలను సైతం తొంగిచూడటానికి తావీయని పచ్చదనాలతో నిండిన వసంతాలే. ఇందుకు నిలువెత్తు సాక్ష్యమే. ఆమని, రామారావు అన్నయ్య గార్ల జీవితం. ‘భోగి కానివాడు యోగి కాలేడనే’ సామెత ఎంత నిజమో! అసలు ఈ సామెతలు, నానుడులు, హితోక్తులూ, ఛలోక్తులూ ఎంత విజ్ఞానాన్ని తాగి చిరయశస్సును పొందుతూ నేటికీ సజీవంగా మిలమిలలాడుతున్నాయోగదా!

తన చుట్టుపట్ల ఉండే వాతావరణం వాటిని అంటిపెట్టుకుని ఉండే పరిస్థితులు, మనుష్యులను చాలా ప్రభావితం చేస్తాయి.

రామారావుగారిది ఆఫీసర్‌ స్థాయి ఉద్యోగం. తిన్నగా ఉన్నా, ఉండనీయని స్నేహితుల బృందాలు. వాళ్లల్లో వాళ్ళ సహ ఉద్యోగులు కూడా ఉండచ్చు. అవసరం కోసం మచ్చిక చేసుకుని మనమేలు కోరుతున్నట్లు నటిస్తూ ఎంతోమంది పబ్బం గడుపుకుంటున్న వాళ్ళే ఈ రోజుల్లో. అలాంటి పబ్బపు మేఘాలకు చిక్కిన వారి కుటుంబం చాలా రోజుల వరకు తారల మిలమిలలు లేని నింగిలా, మబ్బులు కమ్మిన జాబిలిలా వెలవెలా బోవటం నేను కళ్లారా చూసినదాన్ని. కానీ ఏనాడూ ఇలా అని తనకు తానుగా ఎవరికీ చెప్పుకోని స్వాభిమాని నా ఫ్రెండ్‌ ఆమని ఆనోటా ఈ నోటా తెలిసిందేంటంటే ఫ్రెండ్సుని నమ్మి వారికి ష్యూరిటీ సంతకాలు పెట్టటం, ఈయన మెతకదనాన్ని చూసి వాళ్లు సకాలంలో బ్యాంకులో కట్టాల్సిన వాయిదాలు కట్టకపోవటం… అందుకుగాను అన్నయ్యగారి జీతం చాలావరకు కట్టయి పోవటంతో కష్టాలు మొదలయ్యాయని ఆమని ఒకసారి నాతో చెబుతూ నువ్వు విన్నది నిజమే మైథిలీ అన్నది.

‘‘మా వారికి పేకాట రాదు. అయినా బలవంతంగా కూర్చోపెట్టే వాళ్లట ఆయనను స్నేహితులు. ఆటరాదు, డబ్బులన్నీ పోయేవి. పోనీ ఆపేసి వచ్చేయొచ్చు కదా ఈయన. రాకుండా తెల్లవార్లూ కూర్చొని ఆరోగ్యాన్ని, నిద్రను, డబ్బును అన్నీ పోగొట్టుకొని వచ్చేవారు.

దానితో నాకు బాగా కోపం వచ్చేది. మనస్పర్థలు మొదలయ్యేవి. అవి మర్చిపోవాలనే సాకుతోనో, లేదా ఫ్రెండ్స్‌కు కంపెనీ ఇచ్చే నెపంతోనో, లేదా ఎలా ఉంటుందో రుచి చూద్దామనే వంకతోటో మొదలౌతాయి వ్యసనాలన్నీ. నేను చాలా పరిధిలో ఉంటాను. అస్సలు లిమిట్స్‌ దాటవనే సమర్థింపులు చేస్తూ, చేసిన తప్పులు కప్పిపుచ్చుకోనే ఇలాంటి పురుష పుంగవుల నైజాలు. వాళ్ళకేనా బాధలు, కష్టాలు… ఇంటా బయటా చచ్చే చాకిరీ చేసుకుంటూ నెలకు పట్టుమని రెండురోజులు కూడా సెలవు దొరకని ప్రైవేటు ఉద్యోగాలతో నలిగిపోతూ… ఆ దొరికే రెండు సాధారణ సెలవుల సౌకర్యాన్ని కూడా తాను వ్యక్తిగత ఇబ్బందులకు వాడుకోలేని అశక్తురాలు స్త్రీలు ఎప్పటికీ. ఆ రెండు సెలవుల్ని కూడా పిల్లలకి ఒంట్లో బాగోలేకపోతేనో లేదా అవసరాలు తీర్చుకోవటాన్కి ఇంటికొచ్చే చుట్టాల్ని చూసుకోవటానికో ఎగిరిపోతాయి. మరి ఇలాంటప్పుడు ఆడవాళ్లు కూడా తాగి తందనాలాడాలా? ఇబ్బందులు మర్చి పోవటాన్కి చీట్లపేక ఆడాలా? లేక బీడీలు, సిగరెట్లు తాగాలా?

నిజంగా కుటుంబపరంగా స్త్రీల సేవలు గుర్తింపుకు నోచుకోనివి. కనీసం ప్రేమకాదుగదా, కృతజ్ఞతాపూర్వక చూపులు కూడా తాకలేని దూరతీరమే వీరిది. పైగా ఇల్లాలంటే, ఆడదంటే ఇంట్లో పనులన్నీ వాళ్ళే చూసుకోవాలని ఉవాచలు. ఏం ఇద్దరూ ఠంచనుగా కొలువులకు పోవాల్సిన వాళ్ళేగదా! చెరోపని చేసుకుంటే తప్పేంటి? ఇలాంటి మాట లెప్పుడైనా స్త్రీ నోటివెంట వచ్చాయో! ఇక అగ్గి మీద గుగ్గిలాలే వేగుతాయి ఆ ఇండ్లలో. నూటికో, కోటికో ఉంటారేమో మరి పుణ్యమూర్తులు. భార్యలకు అన్ని పనుల్లో సాయపడుతూ. ఇలా జరిగితే స్త్రీ, పురుష వివక్ష అనే పదం ఈ రోజుల్లో వినపడేదికాదేమో. అంటే కచ్చితంగా ఇంటా, బయటా స్త్రీలు శ్రమించే శ్రమకు విలువ కనీస గౌరవం కూడా తక్కువే. మళ్ళీ పెద్ద సంస్కారపు రాయుళ్లలాగా మైకాసురులవుతూ స్త్రీ పురుష సమానత్వం గురించి తెగ లెక్చర్లు దంచుతారు. సమానమే గానీ, మాకంటే కొంచెం తక్కువగానే సమానమంటూ వింతైన కోర్కెను మనసులో నాటుకుని, దాన్ని పెంచి పోషిస్తున్న మేధావి వర్గముంది నేటి సమాజంలో ఎక్కువగా.

గట్టి ఎదురుదెబ్బలు రెండు, మూడు తగిలితేగానీ మనిషి స్వతహాగా మారడంటారు. ఇది చాలా వాస్తవం. ఇటు వాయిదాలు చెల్లించక తన జీతం కటింగ్‌లతో పోవటం, అటు వ్యసనాలకు అప్పగించిన దోస్తులు. ఇటు పిల్లలకు ఇంటర్‌ పూర్తయి సిటీకి పై చదువులకు పంపాల్సిరావటం, పై చదువుల కోసం పంపగలగాలంటే, డబ్బుల విషయంలో జాగ్రత్తపడకపోతే ఎన్ని ఇబ్బందులతో ఊపిరాడక నలిగిపోతామోననే విషయాలతో జ్ఞానోదయమైందనుకుంటా… ఆయనలో చిన్నచిన్నగా మార్పు రావటం మొదలైంది మైథిలీ అని అంటూ… ఎవరైతే తనను ఆర్థిక నష్టాలకు గురి చేశారో, వారికి దూరంగా ఉంటూ, అప్పోసొప్పో తెచ్చుకున్న డబ్బుల్తో పిల్లల్ని పై చదువులు చదివిస్తున్నామని అంటూ, రిటైర్మెంటుకు దగ్గరకు వస్తుంటే ఎవరైనా స్వంత ఇల్లు కట్టుకోవాలని లేదా భార్యకు నగలు చేయించాలనో అనుకుంటారు. నేనేమీ చేయించలేకపోయాను నీకంటూ అన్నారట ఆమనితో రామారావుగారు బాధపడుతూ.

‘‘మరి నువ్వేమన్నావ్‌?’’ అన్నాను నేను ఆమనితో

‘‘ఏమంటాను మైథిలీ! పూర్వపు మనిషిలా ఉంటే చెడామడా కడిగేద్దును. ఇప్పుడిప్పుడే ఎవరేంటో తెలుసుకుంటున్నారు. ఇలా మనిషిగా మారుతున్నారు గదా!

‘‘పోనీ ఒక వడ్డాణం చేయించమని అడగకపోయావా’’ అన్నా నవ్వుతూ.

ఇది హేళనగా అడిగిన ప్రశ్నకాడు సుమా… ఆమని గొంతు బాధతో కూరుకుపోయి ఉంది. కొంచెమైనా స్వస్థ పరచాలనే ఉద్దేశ్యంతో నవ్వుతూ అడిగాను.

సన్నగా నవ్వు విన్పించింది ఆమని మాటల్లో. హమ్మయ్యా అనుకున్నా నాలోనేను.

మళ్ళీ తనే ‘‘నాకు నగల సంగతేమోగాని, ఉన్న ఈ ఇల్లు కూడా అమ్మాల్సి వచ్చేట్లుంది’’ అన్నది.

వాళ్ళు ఐదేళ్ళ క్రితం ఎలాగో ఐదు సెంట్ల భూమిలో ఒక మూడు గదుల ఇల్లు, విశాలమైన స్థలమూ ఉన్నది కొనుక్కుని అద్దె ఇళ్ల బాధను దాటుకున్నారు. అప్పుడు మా ఫ్రెండ్సంతా సంతోషించాము. కానీ ఆమని మాటలతో ఆ సంతోషం కాస్తా ఎగిరిపోయింది నాలో. ఇంకో రెండు మూడు నెలలో దిగిపోతారు. మరి అప్పుడెట్లాగా అని నా మనసు పీకులాడిరది.

అదే అన్నా తనతో ‘‘మరి ఎలాగా?’’ అని

‘‘ఏం చేయాలి మైథిలీ? ఇది తప్ప వేరే దారేలేదు. ఆ మాయదారి వాళ్ళకు షూరిటీలు పెట్టిన పాపానికి బాగా అప్పుల్లో పడిపోయాం. అదీగాక ముగ్గురి పిల్లల చదువులూ. నాది గొప్ప జీతమా అంటే అదీకాదు. అనామత్తే. బెనిఫిట్స్‌ ఎప్పటికొస్తాయో ఏమో! రిటైర్మెంట్‌ ఠంచనుగా వస్తుందిగానీ, రావాల్సిన డబ్బులు తొందరగా రావుగా అన్నది.

అదీ నిజమేననుకున్నాను మనసులో.

‘‘పోనీ ఆ వచ్చే డబ్బులతో ఉన్న అప్పుల్ని తీర్చేసి మీకు సరిపడా ఓ చిన్న ఇల్లు కొనుక్కోవటమో లేదా ఏదో అపార్టుమెంట కొనుక్కోవటమో చెయ్యొచ్చుగా?’’ అన్నా తనతో.

‘‘నిజమే గానీ పిల్లల చదువులకు చేసిన అప్పుల మీద వడ్డీలకు వడ్డీలు బాగా పెరిగిపోయాయి’’ అంటూ

‘‘అవన్నీ తీరిపోతే, పిల్లలు ఉద్యోగాల్లో స్థిరపడిపోతే చాలనుకుంటున్నాం ఇద్దరం’’ అంది.

‘‘మీరిద్దరూ ఓసారి కూర్చుని బాకీలు ఎంత ఉన్నాయి? ఎంత మిగుల్తున్నాయి? వచ్చేవాటిల్లో అని చూసుకుపోయారా?’’ అంటే

‘‘ఆ ముచ్చట కూడా అయింది. అంత పెద్ద మొత్తంగా ఏమీ మిగలవు. ఇల్లు కొనుకోవటాన్కి కూడా సరిపోవు’’ అన్నది.

ఇంకా మరీ లోతుగా తరచి అడిగితే తన మనసునింకా బాధపెట్టినట్లు అవుతుందని విరమించుకున్నాను నేను ఆ ప్రయత్నాన్ని.

పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తమేదీ లేదంటారు పెద్దవాళ్ళు. ఇది నూటికి నూరుపాళ్ళూ నిజమేనని నమ్ముతాను నేను. అగ్నిలో పుటంబెట్టి పైకి తీసిన బంగారంలా తేలారు ఆమని వాళ్ళ ఆయన. ఆయన మాటతీరు, సరదాగా కలివిడిగా ఇంటికొచ్చిన మనుష్యుల్ని కలుపుకుని ఆప్యాయంగా మాట్లాడేతత్వం చూస్తుంటే, ఔరా! ఆయన ఈయనేనా? అని ఆశ్చర్యం కలగకమానదు చూసేవాళ్లకి. ఆమని అంటే అమితమైన ప్రేమ ఇప్పుడు కొట్టొచ్చినట్లు కన్పడుతోంది రామారావు గారిలో.

ఇప్పుడు మేమంతా అరవైని దిగ్విజయంగా దాటిన వాళ్ళమే. వయస్సు రీత్యా కొద్దో గొప్పో ఆరోగ్యంలో తేడాపాడాలు రావటం, వాటిని గీత దాటనియ్యకుండా చేయటం కోసంగా మందులు వాడుకోవటం తప్పనిసరిగా మారిపోయింది మా దినచర్యలో.

ఆమని ఎక్కడ మందులు వేసుకోవటం మర్చిపోతుందోనని ఎక్కువ శాతం రామారావు అన్నయ్యగారే టైమ్‌కు ఏ ఏ మందులు ఇవ్వాలో, వాటిని ఇవ్వటం, గ్లాసుతో మంచినీళ్ళు అందించటం… ఇంకా ఇవ్వేనా! ఇంటి పనులలో కూడా సాయం చేస్తున్నారట. ఇవన్నీ వింటుంటే ముచ్చటేసింది నాకు. ఎప్పుడు మనం వాళ్ళింటికి వెళ్ళినా ప్రక్కప్రక్కనే కూర్చొని ఆదిదంపతులలాగా అన్పిస్తారు నా కంటికి.

‘‘ఏమోయ్‌! మేమెళ్ళాక దిష్టి తీసేసుకోండి ఇద్దరూ’’ అంటే నవ్వటం తనవంతవుతుంది ఆమనికి.

పెళ్ళైన కొత్తలో ఎలాగైతే ఒకరికొకరుగా అన్యోన్యంగా మసలుకుంటామో మళ్ళీ పిల్లలకు చదువులయిపోయి, పెండ్లిండ్లయిపోయి ఎవరికి వాళ్ళు సెటిలయిపోయి వాళ్లవాళ్ల ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ల సంసారంలో వాళ్ళు కిందా మీదా పడ్తూ, వాళ్ళ కుటుంబాల్ని నడుపుకుంటున్నప్పుడు మళ్ళీ మనకు పూర్వస్థితే. గిద్దెడు బియ్యమే. వృద్ధాప్యంలోకి ప్రవేశిస్తున్నామంటే మరో బాల్యంలోకి అడుగు పెట్టడమే. కాకపోతే ఆ బాల్యంలో మనకు జ్ఞానం లేదు, చీకూ చింత అసలే లేదు. మరి ఈ బాల్యంలో భర్తకి భార్య పసిపాప, భార్యకి భర్త పసిపిల్లాడు. మళ్ళీ ఆ గిద్దెడు గింజల్ని ఉడకేసుకుని తినటమే. కావలసినంత ఖాళీ సమయం. అప్పుడు ఏమైతే మనం కోల్పోయిన అభిరుచులున్నాయో వాటిని అప్పుడు తీర్చుకుంటే ఒక్కళ్లే ఉంటున్నామనే బెంగా ఉండదు. ఖాళీగా ఉన్నామనే చింతా ఉండదు. ఏమంటారు? అంతేగదా? నేను చెప్పింది రైటేనా? నాతో మీరు ఏకీభవిస్తారని భావిస్తా.

ఇవే మాటలు మా ఫ్రెండ్సంతా బైఠాయించినపుడు తన్నుకుంటూ తన్నుకుంటూ బైటికొచ్చేస్తుంటాయి ఆశువుగా.

‘‘అబ్బా నేను మాత్రం హాయిగా పుస్తకాలు చదివేస్తూ కాలం గడిపేస్తానన్నా’’ వాళ్ళతో ‘‘నేను పుస్తకాల పురుగుని. పుస్తకాల ముచ్చును’’ అన్నా సరదాగా నవ్వుతూ.

‘‘యూ ఆర్‌ ఏ వెరీ గుడ్డు బేబీ’’ అంది చంద్రిక.

‘‘చిత్తం… చిత్తం…’’ అన్నట్లుగా తలూపా నేను.

‘‘ఆ… నేను ఆధ్యాత్మిక కార్యక్రమాలకు, యోగాకి వెళ్తానంది’’ మాలిని కూడా నవ్వుతూ.

‘‘నేను హాయిగా విశ్రాంతి తీసుకుంటానబ్బా… నాకిలాగే హాయిగా

ఉంది’’ అన్నది చంద్రిక.

తను ఇటీవలే రిటైర్డయింది. నాల్గు నెలలు కూడా అవ్వలేదింకా. ఆ మధ్యలో తను అనారోగ్యానికి గురై మెడికల్‌ లీవు కూడా తీసుకుంది. అందుకనే వేరే ఏమీ మాట్లాడలేకపోయాము మేము.

‘‘మరి నువ్వు’’ అన్నాము ఆమని వైపు చూస్తూ…

ఇప్పుడు నేను బొమ్మలు గీస్తాను. నా అభిరుచికి ప్రాణం పోస్తూ, మళ్ళీ దాన్ని తిరిగి ప్రారంభిస్తా’’ అంది.

‘‘బొమ్మలకు రంగులు కూడా వెయ్యమన్నాను’’ నేను తనతో సూచనగా.

అంగీకారంగా తల ఊపింది తృప్తిగా ఆమని.

‘‘పద్మిని మిగిలిందన్నట్లుగా తనవైపు చూశాము’’ మేము.

మేమేమడుగుతామో తనకు తెలుసు. మేము ప్రశ్నించే అవసరం లేకుండానే ‘‘మావారు రియల్‌ ఎస్టేట్‌ బిజినెస్‌ చూస్తున్నారు గదా! కొద్దిగా పని ఎక్కువవుతోంది బిజినెస్‌ పెరగటం వల్ల. ఎవరైనా ఓ కుర్రాడిని చూసి సహాయంగా పెట్టుకోవాలన్నారు మావారు’’ అంటూ

‘‘ఓ ఐదారేండ్లు నేను హెల్ప్‌ చెయ్యగలను ఆఫీసు పనుల్లో. అలా చేస్తే నాకూ టైం పాసవుతుందిగదా! అన్నా మావారితో’’ అని నవ్వింది పద్మిని.

‘‘ఓ.కే.’’ అన్నాము మేమంతా. గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేస్తున్న ఫోజుతో.

‘‘మా ఇంట్లోనే ఓ గది ఆఫీసుకు కేటాయిద్దామనుకుంటున్నాను.’’ అంది పద్మిని.

తధాస్తు అన్నాము మేము. ఇక మిగిలినది హాసిని. ప్రస్తుతం మాకంటే కనీసం ఓ పన్నెండు, పదమూడేళ్ళ చిన్నది.

‘‘నిన్ను ఇప్పుడు అడగలేని పేదవాళ్ళం మేము’’ అన్నాను. పెద్దవాళ్లం అంటే అది రోటీన్‌. పేదవాళ్లం అన్నందుకు అందరూ మనఃస్ఫూర్తిగా నవ్వారు. వాళ్లతో నేనూ శృతి కలిపాను.
***
మాకు తెలిసిన వాళ్లింటికి వెళ్లాల్సొచ్చింది ఒకరోజు వారిని పలకరించటానికి. సరే. అదే దారివెంట వెళితే రెండో వీధిలోనే శాలినిగారూ

వాళ్లుండేది. చాలారోజులైంది ఆ మేడమ్‌ని చూసి అని… నన్ను వాళ్ళింటి దగ్గర డ్రాప్‌ చేయండి’’ అని అన్నా మా వారితో. సరేనని నన్ను వాళ్ళింటి దగ్గర దింపి, మావారు బైట పనులున్నాయని వెళ్ళిపోయారు వెంటనే. నేను నెమ్మదిగా గేటు తీసుకుని లోపలికి వెళ్ళాను. ఆ ఇంటి వాతావరణం నాకెంతగానో నచ్చుతుంది. పచ్చగా ఉండే చెట్లు, పూలతో నిండుగా ఉండే పూలమొక్కలు, గేటు తీసుకుని లోపలికి వెళ్ళగానే ఎంతో ఆహ్లాదంగా అనిపిస్తాయి మనసుకు. దాన్ని ఆస్వాదిస్తూ నేను ద్వారబంధానికి ముందు అమర్చబడిన మెస్‌డోర్‌ లోంచి ఇంట్లోకి చూశా. ఏంటి అలికిడి లేదు? అని తేరిపార చూస్తే, లోపల హాల్లో ఒంటరిగా కుర్చీలో కూర్చొని ఉన్నారు శాలిని మేడమ్‌గారు. తను కూర్చున్న కుర్చీకి ఎదురుగా ఉన్న టేబుల్‌ మ్యాట్‌పై రెండు మోచేతులూ ఆన్చుకుని, ఆ చేతుల మధ్యలో తలపెట్టుకుని, కండ్లు మూసుకుని ఉన్నారు. ఏదో తదేక దీక్షలో ఉన్నట్లుగా.

‘‘మేడమ్‌గారూ బాగున్నారా?’’ అన్న నా పిలుపుకు ఉలిక్కిపడి లేచి, నెమ్మది నెమ్మదిగా అడుగులేస్తూ వచ్చి, మెస్‌డోర్‌ బోల్ట్‌ తీశారు. ఎప్పుడూ హుషారుకు ప్రతిరూపంగా ఉండే ఆవిడ, బాగా నీరసపడిపోయినట్లుగా ఉన్నారు. ఆ టేబుల్‌ మ్యాట్‌ మీద కొన్ని పాత మ్యాగజైన్లు. ఆరోజు దినపత్రిక చెల్లాచెదురుగా పడి ఉన్నాయి.

‘‘ఏంటి నీరసంగా కనబడుతున్నారు? ఒంట్లో బాగోలేదా?’’ అని కుశల ప్రశ్న వేశాను. నాకు కూర్చోవటానికి సోఫా చూపించి, నా ప్రక్కనే వచ్చి కూర్చుంటూ ‘‘ఆ… అసలు బాగోటం లేదండీ వారం రోజుల్నుంచి. అమ్మా, నేనూ కలసి ఈ మధ్య ఊరెళ్తున్నాం అని చెప్పాగదా మీతో.’’ తను అక్కడే ఆగిపోయింది. ‘‘ఇంకొంత మంది బంధువులను కలవాలని. ఇంటికి తాళం పెట్టి వెళ్లాం. అసలే రోజులు బాగోలేదు. అందుకని ఇక నేను వెళ్లిన పని కాగానే వచ్చేశాను’’ అన్నారు నాతో డీలాపడ్డ స్వరంతో.

‘‘మీ అమ్మగారుండి ఉంటే బాగుండేది ఈ సమయంలో మీకు తోడుగా’’ అన్నా.

‘‘అవునండీ… కానీ తను నా దగ్గరకొచ్చి సంవత్సరం దాటిపోయిందిగదా! ఇక్కడుంటే తనూ, నేనూ ఇద్దరమే. బిక్కు బిక్కుమంటూ ఉండాలి. అక్కడైతే మా వాళ్లంతా దగ్గర్లోనే చుట్టుప్రక్కల ఊళ్లల్లో ఉంటారు. ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడొచ్చి కలిసి వెళ్తుంటారు అమ్మా వాళ్ళని. పాపం నా దగ్గర చాలా రోజులుండిపోయిందిగదా. తనూ కొద్దిరోజులు, మా పిన్నిలు, బాబాయిలు, మా మామయ్యల దగ్గర ఉండొస్తుంది అని నేను వచ్చేశానండీ’’ అన్నారు మళ్లీ శాలినిగారు.

భర్తకీ, శాలినిగారికీ ఏవో మనస్పర్ధలున్నాయని తెలుసు నాకు లోపాయికారిగా. మాతో పరిచయమున్నప్పటి నుండి భార్యాభర్తలిద్దరూ ఫ్రెండ్స్‌లా కలిసిపోతారు. ఎక్కడకి వచ్చినా చక్కగా మాట్లాడతారు. అందరితో కలివిడిగా ఉంటారు. మా ఇంటికొచ్చినప్పుడల్లా పిల్లలకు ఏవో ఒకటి తెచ్చేవాళ్లు తినటాన్కి. వట్టి చేతుల్తో అస్సలు వచ్చేవాళ్లుకారు. కానీ భార్యభర్తల మధ్య ఏముందో గానీ ఎక్కువశాతం ఎడమొగం, పెడమొగం గానే ఉంటారు. వాళ్ళకి బాగా తెలుసున్న వాళ్లుమటుకు ‘‘వాళ్ళమధ్య ఎప్పుడూ ఇగోల మాటలు చెలరేగుతుంటాయి’’ అంటారు.

కానీ చాలా రోజుల క్రితమే తెలిసింది. ఏ చెడు అలవాట్లు ఉంటే సంసారంలో కలతలు రేగుతాయో ఏమైతే ఉండకూడదో అలాంటి గుణాలే శాలినిగారి ఇంటాయనలో వాళ్ళ వేరు కుంపట్లవటానికి మూలమని. అవును ద్వేషించినా, సహించవచ్చునేమోగానీ పరాయి స్త్రీలకు అలవాటు పడ్డ భర్తలను ఏ భార్యలు భరించగలరు చెప్పండి? అసలే స్వాభిమానం పాళ్లు ఎక్కువ. స్వావలంబన కలిగిన మహిళ తను. అసలు వాళ్లు విడిపోవటాన్కి ఇదే సరైన కారణమని శాలినిగారి మాటల ద్వారానే తెలిసి చాలా బాధపడ్డాను.

ప్రస్తుతంలోకి వస్తూ ‘‘ఏంటి? ఏమైందని అడిగితే ఎలర్జీ వచ్చేసింది బాగా. గొంతుకు ఇన్ఫెక్షను వచ్చింది. దానితోబాటుగా జ్వరం తగిలింది. ఈరోజే కాస్త చారన్నం తిన్నానని’’ చెప్పారు. తన వాలకం చూస్తూంటే ఇంకో నాల్గురోజులైతే తప్ప తేరుకోలేరని తెలిసిపోతోంది.

కూర బాగోలేదని, అన్నం మాడిరదని, ఫ్రిడ్జ్‌లో వాటర్‌ బాటిల్సు పెట్టలేదనేవి కుంటి సాకులు మాత్రమే. మనమంటే అయిష్టత ఏర్పడినపుడు మనమెంత గొప్పగా రుచిగా చేసినా ఏవీ నచ్చవు, రుచించవు మగవాళ్ళకి. ఇలాంటి వంకలు చూపించి మనకు మనస్తాపం కలిగించి, మనమీదనే అలుగుతోందని, అఖాండాలు వేసి ప్లేటు ఫిరాయిస్తూ వాళ్ళను ప్రశ్నించలేని విధంగా తయారు చేస్తున్నారు ఆడవాళ్ళని మగజాతిలో చాలామంది. ఈ మందిలో శాలిని సదరు భర్తగారు కూడా ఒకరని వేరే చెప్పక్కర్లేదనుకుంటాను.

వాళ్ళ వారి గురించి చెబుతూ మా ఆయనగా పిలవబడే ఇప్పటి జల్సారాయుడు రిటైర్మెంట్‌కు దగ్గరలో ఉన్నాడు. ఇప్పుడు ఈయనగారి వయసు చూసి వస్తుందా ఏ ఆడదైనా. నిజమైన ప్రేమతో వస్తుందా? చెప్పండి డబ్బు ఆశకు కాకపోతే తప్ప?’’ అంటూ

‘‘ఇతగాడికింకా ఒళ్లూపై తెలవట్లేదు. ఆ పెన్షనూ, బెనిఫిట్లూ రాగానే ఆ ఉంచుకున్నది అన్నంలోనో, టిఫిన్‌లోనో ఇంత మందు కలిపిపెట్టడం, వాడు చావటం ఖాయం’’ అని విరక్తి నిండిన బాధతో అన్నారు.

నిజమే, డబ్బుకు ఆశపడి వచ్చేవాళ్ళు ఎంతోమందిని చూస్తున్నాం సమాజంలో నేడు. ఉంచుకున్న వాడిని హత్య చేసి డబ్బు, నగలతో పరారయ్యేవాళ్లు ఎంతమందిలేరు? శాలినిగారు బాధతో చెప్పినా వందశాతం వాస్తవ విషయమే అది.

‘‘నాకు నా పిల్లలిద్దరూ రెండు భుజాలండి. వాళ్ళు చాలు నాకు. నాకున్నదేదో వాళ్లిద్దరికీ ఇచ్చేస్తాను. నాకెందుకండీ ఈ నగలు, బంగారం అదీను’’ అంటే ‘‘కొద్దిరోజులుంచుకోండి. ఇప్పుడే ఎందుకు ఇవ్వటమ’’న్నాను నేను శాలినిగారితో. ‘‘ఏమోనండి. నాకు ఉండటానికి ఇల్లు ఉంది. పెన్షన్‌ డబ్బులు వస్తాయి. నా ఒక్కదానికి ఎక్కీ తక్కీ’’ అన్నారు వైరాగ్యంతో. అవును మేడంగారి పిల్లలిద్దరూ బంగారాలు. ఒక్కదానివి ఎందుకు అక్కడ? మాతో వచ్చి ఉండు’’ అని ఫోన్‌ చేసినప్పుడల్లా అంటుంటారట శాలినిగారు.

‘‘ఆ… ఇప్పట్నుంచే ఎందుకు? లేవలేనినాడు ఎటూ తప్పదు’’ అన్నారు.

అదీ నిజమే ననిపించింది నాకు. ఎందుకో ఈ రోజు శాలిని గార్ని చూస్తే పాత గాయాలన్నీ రేగినట్లన్పించసాగింది ఆవిడ వాలకం, మాటలు చూస్తుంటే. అందులోంచి ఆవిడను బదలాయించాలని, ‘‘ఈ పదవినోదం నింపుదాం రండి!’’ అన్నా సరదాగా. టేబుల్‌ పైనున్న ఈనాడు ఆదివారం అనుబంధ పుస్తకం చూపిస్తూ.

శాలిని గారికీ ఇష్టమే, ఇలాంటి పజిల్స్‌ నింపటమంటే. తను అంతకుముందే సగం పైగా పూర్తిచేశారు. మిగతావి ఇద్దరం కల్సి ఆలోచించి కంప్లీట్‌ చేశాము. ఇద్దరమూ కాసేపు బడిపిల్లలుగా మారిపోయాం. కొన్ని అతి చిన్న పదాలే. బుర్రలు బద్దలు కొట్టుకున్నంత పని చేస్తేనే గాని జవాబులు దొరకలేదు. ఇది తలచుకుంటూ తెగ నవ్వుకున్నాం ఇద్దరం.

‘‘టీగానీ, కాఫీ గానీ తాగుతారా?’’ అన్నారు శాలినిగారు నాతో.

‘‘ఏమ్మా బాగా హుషారొచ్చినట్లుంది మీకు’’ అన్నా నవ్వుతూ.

‘‘అవునండీ మైథిలీ… కొంచెం హాయిగా ఉంది ప్రాణానికి. మీరొచ్చి మాట్లాడుతూ, ఇద్దరం కలిసి పదవినోదం నింపుతుంటే సమయమే తెలియలేదని తనూ నాతో నవ్వారు. గంటన్నర దాటిపోయింది వచ్చి. ‘‘మళ్ళీ వస్తా’’నని చెప్పి నేను మావారికి ఫోన్‌ చేసి చెప్పా ‘‘రండి తీసుకువెళ్లండి’’ అని. కాసేపటికి బైట బైకు హారన్‌ వినపడగానే నేను బైటికి వచ్చి, శాలినిగారికి బై చెప్పి బండెక్కాను. తను కూడా మాకు బై చెప్పి ‘‘వస్తూండండి మైథిలిగారూ.. అప్పుడప్పుడు’’ అని మరీ మరీ చెప్పి లోనికి వెళ్ళిపోయారు గేటు వేసుకుని.

వయసు పెరుగుతుంటే జ్ఞానంతోపాటుగా నలుగురికీ ఆదర్శంగా ఉండగలగానిగానీ, నా బాధ్యతలన్నీ తీరిపోయాయిగదా, నేను మళ్ళీ మొదటికే వస్తా, నా ఇష్టం వచ్చినట్లుంటానంటే, అలాంటి మగవాళ్లకి మనం ఏం చెప్పగలం? ఒకటే కుటుంబంగా ఉన్నవాళ్ళం పిల్లల్ని వేరొక ఇంటికి ఇచ్చిపుచ్చుకుని సంబంధాలు కలుపుకున్నాక ఎవరైనా గానీ తమలో ఉన్న లోపాలను తగ్గించుకోవాలనే ఆలోచన రాకపోతే అది ముందుముందు తమ బిడ్డల భవిష్యత్తుకు ఎంతటి అరిష్టం కలుగజేస్తుందో తెలుసుకోని మనిషి కూడా మనిషేనా అనిపిస్తుంది నాకు. అంతేగదా! ‘‘మీ నాన్న ఇట్లాగదా! లేకపోతే మీవాళ్లు ఇట్లాగదా అని రేపటిరోజున మన పిల్లలతో వారి అత్తింటివాళ్లు గొడవపెడితే అది క్షేమదాయకమా? చెప్పండి. అంతా, అన్ని రోజులు మంచిగా ఉంటాయనే గ్యారంటీ ఏముంది? కోపతాపాలు, అలకలు, అభిప్రాయ బేధాలు రావటం సహజం భార్యాభర్తల మధ్య. కోపంతో ఉన్నప్పుడు మీవాళ్లిట్లా, మీ వాళ్లిట్లా అని దెప్పుతారుగా అల్లుళ్లు, కోడళ్లు. మంచి చేస్తారో, చేయరో తరువాతి సంగతి. ముందు ఆ వచ్చిన కోపం మొత్తాన్ని దెప్పుళ్లతో వెళ్లగక్కేస్తారు! ఈ ఆలోచన మగవాళ్లకి ఎందుకు రాదో ఏంటో? మళ్లీ అందరికీ తీర్పులు చెప్పే పెద్దలే, మనం ఏమన్నా చెబుతే ఇల్లు వినిపించుకోదు. ఇంటికి ఆవేశమే తప్ప ఆలోచన చెయ్యలేదు ఒక్కోసారి. బైట నుంచి వినపడే ఎన్ని ఇగోల సూక్తిముక్తావళులను పానం చేసిందో ఏమో అన్ని పరిస్థితులను అవగాహనతో ఆకళింపు చేసుకోవాల్సిందిపోయి, గట్టిగా, ధృడంగా నిలబడాల్సిన ఇల్లు కర్కశంగా, కఠినంగా మారిపోతుంది. నేను లేకపోతే నీకు నీడేది? అన్ని ప్రశ్నించే అహంకారమా? లేక నేనేగా నీకు గత్యంతరమనే ధీమానా? ఎప్పుడు సందు దొరుకుతుందా? సాకులు ఎత్తిచూపుతానంటూ విశ్వరూపాన్ని ప్రదర్శించటానికి సిద్ధమైపోతుంది. చూపిస్తే ఎవరికి నష్టం? చూసేవారికి, వారితో పాటుగా ప్రభావితులకు అన్ని విధాలుగా నష్టమేగదా.

మరి ఇంత చిన్న ఇంగిత జ్ఞానాన్ని కూడా మరచిన ఇండ్లు కేవలం ఇంత ఇసుక, సిమెంటు, ఇటుకలు గానే మిగిలిపోతాయి. మరి అలాంటప్పుడు బంధాలు బీటుపడవా? అందరం ఉప్పు, కారమే తింటున్నాం గదా! ఎంత తమాయించుకున్నా ఒక్కసారైనా కోపం రాకుండా ఉంటుందా? సర్దుబాటు అవసరం ఇద్దరిలో ఉండాలి కూడానూ. కానీ దానికీ లిమిట్స్‌ ఉంటాయి గదా! వయసుతో బాటు బి.పి. కూడా పెరుగుతుంది కదా! మాటా మాటా పెరిగితే ఇళ్లు విరిగిపోతాయి. బంధాలు ముక్కలైపోతాయి. ఇళ్ళు విరిగిపోతే మరమ్మత్తు చేసుకోవటానికి సామాగ్రి ఉంటుంది. కానీ ఒక్కసారి విరిగిన మనసును మరమ్మత్తు చేయటమంటే ముడిపడ్డ దారాన్ని ముడివేయటమే. ఎన్నిసార్లు ముడివేస్తే అది హృదయానికి అంత గట్టిగా పెళుసుగా తాకుతూ భరించ శక్యంగాని బాధను అనుభవింపజేస్తుంది. అందుకే మాట తూలద్దు అంటారు పెద్దవాళ్ళు. కోపంలో కూడా ఆచితూచి అవసరమైనంత వరకు మాట్లాడే వారిని జ్ఞాని అంటాను నేను. ఎంత గొప్ప గొప్ప చదువులు చదివితే ఏం లాభం? ఇలాంటి ఆలోచనా సరళి వంటబట్టించుకోనప్పుడు? ఇంకొంతమంది అనుకుంటారు ఒకేఒక్క గట్టిగా తిట్టో, కోప్పడో ఎదుటివాళ్ల మాటను మూయించి, తన మాటనే పెత్తందారీతనాన్ని ప్రతిధ్వనింప చేస్తారు. ఒకేరకం పూలతో నిండిన తోటకంటే వివిధ వర్ణాల పూలతో వికసించి పరిమళించేదే గదా నిజమైన వనం. తోటలో పక్షుల కిలకిలారావాల మాదిరిగా ఇంటామెకు కూడా మాట్లాడే అవకాశం

ఉండాలి, ఇవ్వాలి ఇంటాయన. పిల్లల మాటలు కూడా వినబడుతుండాలి అదేగదా కళకళలాడే ఇల్లంటే? ఎవరూ లేరు? ఏదీలేదు… వాళ్ళంతే అంటారు. నా దారిన నేనుంటానంటే అది కేవలం నిర్జీవంగా మారిన భవనం మాత్రమే. అది చూపరులకు ఎంతో గొప్పదిగా, ఆకర్షణీయంగా కనిపించవచ్చు. కానీ ఆ ఇంటివారికి అది కేవలం తాటిచెట్టు నీడనే.

నీడతో పాటు చిరునవ్వులు చిందించగల ఆహార్యం, దానికి తోడుగా జీవితాంతం పంచివ్వగల అనురాగం, ప్రశాంతతా, సంపద ఇంటాయన దగ్గర అక్షయంగా ఉండాలి.

***

శరత్కాలపు వెన్నెల అనుకుని ఆనందించటానికి, చూచి అనుభూతించటానికి. చంద్రునికి రెండు పక్షాలుంటాయి. ఒక పక్షంలో అంటే

శుక్లపక్షంలో వెలుగుతాడు. కృష్ణపక్షంలో వీగుతాడు క్రమేపీ. కానీ చంద్రిక నా దోస్తు. ఇప్పటివరకు తన జీవితం ఒంటరి పోరాటమే. ఆ ఇంటి చంద్రుడు ఎప్పుడూ కృష్ణపక్షంలోనే జీవిస్తాడు. ఆ మసకలో ఇక చిన్న చిన్న తారల వెలుగేం కనబడుతుంది? చంద్రిక ఏం తళుకులీనుతుంది? కానీ జీవితాన్ని నిలుపుకోవాలనే పట్టుదలతో చదువుతో ప్రభుత్వ కొలువు సంపాదించుకోవటానికి వివిధ పరీక్షల్లో నెగ్గటానికి తిప్పలు పడిరది. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకుని తన చిన్ని తారల్ని వెలిగించుకోగలిగింది. వెలుగునివ్వగలిగింది. ముగ్గురు పిల్లల్ని చదివించుకుని, మంచి సంబంధాలు చూచి పెండ్లిండ్లు చేసింది. పురుళ్లు పోసింది. బాధ్యతలు తీర్చుకుంది. సమాజంలో సెభాష్‌ అనిపించుకుంది. పుట్టింటివారి నుంచి లభించిన అండ అంగబలంగా చెప్పుకుంటే, చంద్రిక అర్థబలం ఉద్యోగమే. సంపాదించిన తన సంపాదనే. తన విలాసాల మత్తులో కృష్ణపక్షం తేలుతూ చంద్రలోకాన్ని బాధ్యతా రాహిత్యంలోకి నెట్టిన కృష్ణపక్షం నెమ్మదిగా జీతం చూసి ఇటు దిక్కుకు పయనం మార్చాడట.

‘‘మరి నువ్వేమనలేదా చంద్రికా?’’ అన్నా నేను.

‘‘పిల్లల పెండ్లిండ్ల బాధ్యతలను బాధ్యతగా స్వీకరిస్తావా? అని అడిగా నిర్మొహమాటంగా’’ అంది చంద్రిక.

‘‘ఇంట్లో ఉండి తినటానికి, జనాభా లెక్కలోని తన పేరు చూపించటానికే ఇష్టపడ్డాడుకానీ, బాధ్యతలంటే నావల్లకాదు అని చేతులెత్తేశాడని’’ చెప్పి బాధపడిరది.

‘‘ఈ విషయంలో మరి నువ్వేం నిర్ణయం తీసుకున్నావని’’ అడిగితే…

బదులుగా ‘‘మా ఆయన తన ఉద్యోగంలో లంచాలు మరిగి, ఎప్పుడూ సస్పెన్షన్‌లోనే ఉద్యోగమంతా. ఒకసారి మేనేజ్‌ చేసి, మా నాన్నగారున్నప్పుడు వాళ్ళకాళ్లు వీళ్లకాళ్లు పట్టుకుని, డబ్బు పెట్టాల్సిన చోట పెట్టి ఇప్పించగలిగారు పోస్టింగ్‌ను మళ్ళీ యథాతథంగా. కానీ ప్రతీసారీ అలా కుదరదు గదా మైథిలీ’’ అని వాపోయింది చంద్రిక.

నిజమేనన్నట్లుగా తల ఊపాను నేను.

‘‘నాకు జీతం బాగా వస్తుందని తెలుసుకుని, ఒకసారి మళ్ళీ స్కెచ్‌ వేశాడు. కానీ నా మనసప్పటికే విరిగిపోయింది. పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. నష్టమేంటో, లాభమేంటో తెలుసుకునే వయసుకి వచ్చారు వాళ్లు. పిల్లల కోసమైనా ఇంట్లోకి రానిద్దామనుకున్నా. కానీ వాళ్లు ససేమిరా నో చెప్పారు.

అన్ని రకాల ఢక్కామొక్కీలు తిని, రాయిలాగా మారిపోయింది నా మనసు. బాధ్యత తీసుకోనన్నాడు. పోనీ వ్యసనాలనేమన్నా వదులుకున్నాడా? అదీలేదు. రోజూ ఇల్లు గడుపుకుంటూ పిల్లలని, వాళ్ళకి రెక్కలొచ్చేదాకా మోస్తూ, వాళ్ళకు పెండ్లిండ్లు చేసేదాకా ఆర్థిక భారం నామీదేననే విషయం స్పష్టమైపోయింది. వీటన్నిటితోపాటుగా తన రోజువారీ ఖర్చులకి కూడా నామీదే ఆధారపడతాడని కూడా అర్థమైపోయింది.’’

నేను వింటూ మధ్య మధ్యలో ‘ఊ..’ కొడుతున్నాను. స్త్రీ మనసు ఎంతో సున్నితమైనది. అలాంటి సున్నిత మనస్కురాలైన చంద్రిక మనసు ఎంతగా వేదనకు గురి అయితే ఇలా మారింది పాపం. అందరూ ఉన్నా నాఅనే వాళ్ళున్నారని చెప్పుకోవటానికి ఆధారం లేని జీవితం తనది. ఐనా స్వాభిమానంతో నెగ్గుకొచ్చింది. ఏ సందర్భం వస్తుందా? రాళ్లు వేద్దామని చూసే సమాజంలో బ్రతుకుతున్నాం ప్రస్తుతం అందరం. తనూ అందులో భాగమేనని వేరే చెప్పనక్కర్లేదనుకుంటాను.

‘‘రాళ్లు పడీ పడీ, ఆ దెబ్బలు తినితినీ ఏడవటం కూడా మరిచిపోయా మైథిలీ!’’ అనటంతో నా మనసంతా బాధతో కెలికినట్లయింది.

‘తన మొహం మీద మాత్రం చిరునవ్వే ఎప్పుడూ. ఏమీ ఇవ్వకపోయినా తనకు ఓ మంచి ఉద్యోగాన్ని, చిరునవ్వుని ప్రసాదించాడు ఆ దేవుడు’ అనుకుంటుంటాను నేను అప్పుడప్పుడు భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటాను.

‘‘ఒక్కోసారి రాత్రిళ్ళు పిల్లలకు బిస్కెట్లు ప్యాకెట్లు తినడానికి కొనిచ్చి, నేను పస్తులు పడుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి.’’ అని నవ్వుతూ చెప్పింది నాతో.

‘‘ఇంకా అదేనవ్వు. ఇదెలా సాధ్యం?’’ అని అడిగా ఆశ్చర్యంగా.

‘‘రాటుదేలిపోయానన్నిటికీ. ఇప్పుడు నవ్వుతున్నాగానీ, ఈ బాధలు తట్టుకోలేక ఏడ్చిన రాత్రులెన్నో. అప్పట్లో తిండికీ ఉపవాసమే, నిద్రకూ ఉపవాసమే. కానీ దేవుడు మాత్రం నాకు చిరునవ్వుతో సహవాసం ఇచ్చినందుకు నేను చాలా ఋణపడి ఉంటాను’’ అంది నాతో.

‘‘దేవుడెక్కడున్నాడు? ఉన్నాడా?’’ అని అడిగా నవ్వుతూ.

‘‘ఆ… నిజంగానే ఉన్నాడబ్బా!’’ అంది.

నాకర్థంకాక నివ్వెరపోయా…

‘‘మనలో ఉన్న ఆత్మవిశ్వాసం, దానితోపాటు అబ్బే ధైర్యమే దేవుడంటే’’ అని క్రొత్త నిర్వచనాన్నిచ్చిన చంద్రికకు హృదయంలోనే ధన్యవాదాలర్పించాను.

పనుండి ఈమధ్య మా స్నేహితురాళ్లుండే ఊరెళ్లాను. చాలా రోజులైందని అక్కడే ఉండే చంద్రికను కలవటానికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన నన్ను చూసి చాలా సంబరపడిపోతూ `

‘‘ఏమండీ ఇటురండి. ఎవరొచ్చారో చూడండి’’ అంటూ ‘‘మా మైథిలీ మేడంగారు’’ అంటూ నన్ను పరిచయం చేసింది.

ఆశ్చర్యపోవటం నావంతయింది.

‘‘మేడమ్‌గారూ బాగున్నారా?’’ అంటూ కూర్చున్న మా ఇద్దరికీ మంచినీళ్ల గ్లాసులు తెచ్చిచ్చి, ఓ నిమిషం మాట్లాడి లోపలికి వెళ్ళిపోయాడు చంద్రిక వాళ్ళాయన.

‘‘ఇదేంటీ? మళ్లీ ఇదెప్పట్నుంచి?’’ అని అడిగాను చంద్రికను.

‘‘ఏంలేదు. నాకామధ్య గుండెకు సంబంధించిన జబ్బు చేసిందని చెప్పాగా? అప్పుడు నన్ను పలకరించాలనే నెపంతో వచ్చిచేరాడు. మళ్ళీ నన్ను చేరి, నా పెన్షన్‌ డబ్బుని తినటానికేనని తెలుసు. కాని కొద్దిరోజులు చూద్దాం అనుకుని ఏమీ అనలేదు.’’ అంది చంద్రిక. ఇదే అదనుగా ఇంట్లో చేరాడని చెప్పింది.

‘‘మరిప్పుడు బాగానే ఉంటున్నాడా?’’ అని అడిగా.

‘‘ఆ… బాగానే ఉంటున్నాడని’’ చెప్పింది.

‘‘అలవాట్లలో మార్పొచ్చిందా?’’ అన్నా.

‘‘ఆ… ఫరవాలేదు. సిగరెట్లు పూర్తిగా మానేశాడు. డాక్టర్లు వార్నింగిచ్చారట. పొగ పీల్చటం మానకపోతే ఊపిరితిత్తుల కేన్సర్‌కు దారితీసే ప్రమాదముందని’’

‘‘ఓహో… అదన్నమాట’’ అన్నాను.

‘‘మరి సురాపానమో?’’ అంటూ నా సందేహం వెలిబుచ్చాను.

‘‘ఇప్పుడు డైలీ లోంచి వీక్లీలోకి మారాడంది’’

‘‘మొత్తం మీద మనిషిలో చాలా మార్పు వచ్చిందన్నమాట’’ అన్నా సందేహం వీడీ వీడనట్లుగా.

‘‘మాంసం కూరలయితే తనే వండేస్తాడు. రోజూ వంటగది పనుల్లో సాయం చేస్తున్నాడు. కూరలు తరిగివ్వటం, రాత్రిపూట చపాతీలకు పిండి కలిపివ్వటం, సాయంత్రాలు స్నాక్స్‌ తేవటంలాంటివి చేస్తున్నాడు’’ అంది చంద్రిక.

నాకు కొంచెం సంతోషమన్పించింది. మంచిగా ఉన్నప్పుడు పట్టించుకోకుండా బలాదూర్లు తిరిగినా, చంద్రిక కొంచెం సిక్‌ అయి, చేసుకోలేని రోజుల్లో సహాయంగా ఉంటున్నాడులే’ అని తృప్తిపడ్డాను.

తన కండ్లలో కూడా అదేభావం దోబూచులాడిరది.

‘‘పిల్లలు వచ్చి వెళ్తున్నారా’’ అని అడిగా తనను.

‘‘ఆ… మొన్న రిటైర్మెంట్‌ ఫంక్షన్‌కి, నాకు బాగోలేనప్పుడు మళ్లీ అడపాదడపా వాళ్లని చూడాలన్పించినపుడు వచ్చి వెళ్తున్నారు’’ అంది చంద్రిక.

‘‘వాళ్ళ కోపం పోయిందా తండ్రిమీద’’ అని అడిగా.

‘‘మొదటిసారి వచ్చినపుడు వాళ్ళ నాన్నతో మాట్లాడలేదెవరము. ఇక నేనే నెమ్మది నెమ్మదిగా నచ్చచెప్పటం ప్రారంభించా పిల్లలకు. వాళ్ళు కూడా తమ తండ్రిలో వచ్చిన మార్పు గమనించి, మామూలుగా మాట్లాడుతున్నారు’’ అన్నది.

చంద్రిక మొహంలో ఇదీ అని కనిపెట్టటానికి వీలులేని ఒకలాంటి స్థితప్రజ్ఞత కనపడిరది. తిరిగివచ్చాడని సంతోషంగానీ, గొడవలైతే వెళ్ళిపోతాడనే బెంగగానీ ఏమీలేవు.

‘‘హమ్మయ్య… ఇక మొత్తం సంతోషమే నీ జీవితంలో’’ అన్నా.

ఇంతలోకి ఎప్పుడు ఛాయ్‌ తయారుచేశాడో? మా ఇద్దరికీ చెరో కప్పు ఛాయ్‌ ఇచ్చి తనో కప్పుతో లోపలి గదిలోకి వెళ్ళిపోయాడు చంద్రిక భర్త.

టీ తాగటమయిపోయాక చంద్రికతో వెళ్ళొస్తానని చెబుతుంటే, వాళ్ళాయనను కూడా పిలిచింది హాల్లోకి రమ్మని.

బైటికొచ్చినతను ‘‘మీ సార్‌ బాగున్నారా మేడంగారూ?’’ అని అడుగుతూ పిల్లల గురించి కుశల ప్రశ్నలు వేశాడు.

‘‘ఆ బాగానే ఉన్నారని’’ చెప్పి, చంద్రికతో ‘‘ఆరోగ్యం జాగ్రత్త చంద్రికా’’ అని చెప్పి బైటికి దారి తీశాను. తను కూడా నాతోపాటు రాబోతుంటే, ‘‘వద్దు వద్దు… నువ్వు విశ్రాంతి తీసుకో’’ అని చెప్పి నేను బైటికొచ్చేశాను.

తనింకా బాగా కోలుకోలేదు. ఆ జబ్బున పడ్డ ఇబ్బంది ఆమె శారీరక పరిస్థితి చూస్తే అర్థమవుతోంది నాకు.

నేనెప్పుడూ ఊహించని సంఘటన ఎదురైంది. నేనే కాదు మా ఫ్రెండ్స్‌ ఎవ్వరమూ ఊహించని విషయమిది. కాలం మనుష్యుల్లో మార్పు తీసుకొస్తుందంటారు. గాయాలు చేసే శక్తి, తిరిగి వాటిని మాన్పే శక్తి కాలానిదే అంటారు.

పుట్టినప్పుడు బ్రహ్మదేవుడు మన తలరాతలు రాస్తాడంటారు. కానీ ఈ విధాత రాసే తలరాతల కంటే కాలం గీసిన గీతలదే పైచెయ్యేమో.

ఆ రాతలకు పరిహారాలుంటాయి. మరి కాలం గీసే గీతలను చెరిపేయగల ఎరైజర్‌ ఎక్కడుంటుంది? ఎవరి దగ్గరుంటుంది? ఒకవేళ మనం గట్టిగా చెరిపివేసుకోవాలని తపన పడ్డా పేజీలు చిరిగిపోతాయేగానీ, కాలం గీసిన గీతలు చెరిగిపోతాయా? అన్నీ ప్రశ్నలే… జవాబు తోచని, రాని ప్రశ్నలే! అయినా కొన్ని కొన్ని సందర్భాలెదురైనపుడు, కొందరి జీవితాలను పరిశీలించినపుడు ఇవే ప్రశ్నలు దూసుకెళ్లినట్లనిపిస్తుంది నా మనసు కవాటంలోకి. కొండ చిలువలా చుట్టుకున్న, అంటిపెట్టుకున్న కృష్ణ పక్షాల్లో నిజమైన మార్పు రావాలంటే ఒక జీవితకాలం చాలదేమో.

***

‘‘కొడుకుకి, కోడలికి నా అవసరం తీరిపోయింది. ఇప్పుడిక్కడ వ్యర్థ పదార్థంగా పడివుండటం కంటే చేతనైనంత వరకూ నేనే ఇలా కష్టపడి పదో, పరకో సంపాదిస్తాను. స్వంతిల్లు ఎలాగూ ఉండనే ఉంది. వృద్ధుల ఫించను, మావారికొచ్చే ఫించను… ఇవి చాలునాకు’’ అంది మాలిని నాతో ధైర్యంగా.

ఇదిగో ఈ ఒక్కగది చాలు నాకు. ఇందులోనే నాక్కావల్సిన కొంచెం సామాను ఎప్పుడైనా బుద్ధి పుట్టి కొడుకు, కోడలు, పిల్లకాయలు ఇంటికొస్తే సరిపడే విధంగా ఫ్రిడ్జ్‌, రెండు మంచాలు, గ్యాస్‌పొయ్యి, ఓ టేబుల్‌ ఉంచుకుని, మిగతా సామానంతా సన్‌షేడ్స్‌ మీద సర్దించేశా పనివాళ్ళతో…’’ అంటూ ఆ హాలు లాంటి గదిలో ఉంచుకున్న సామాన్లను చూపించింది మాలిని నాకు.

వెరీగుడ్‌… అనుకున్నా మనసులో

అధైర్యం, పిరికితనం పోయాయి మాలినిలో. పూర్తిగా కొడుకుమీద ఆధారడిపోవటంతో కోడలికి చులకనగా మారిపోయింది మాలిని. తరాల్లో మార్పులు వచ్చినప్పుడల్లా వారి అభిప్రాయాల్లో కూడా పలు మార్పులు వస్తాయని వాటికి ఇరువైపులా వారు సర్దుబాటు కాలేనపుడు కుటుంబంలో ఎలాంటి దుష్పరిణామాలు చోటు చేసుకుంటాయో, అవి ఎంత తీవ్ర ఫలితాలనిస్తాయోననే విషయం మేం ఎంతగా చెప్పినా పట్టించుకోని అనేకంటే ఒకరకంగా తనలో ఏర్పడిన ‘ఒంటరిగా ఉంటే బ్రతకలేనేమో’ అనే ఊహ భయపెట్టిందిన్నాళ్లూ మాలినిని. ఇప్పుడా భయాన్ని, బ్రతకగలననే ధైర్యం తరిమికొట్టింది. దగ్గిరగా ఉంటే నిజంగానే ప్రేమలుండవు. దూరంగా ఉంటేనే కాస్తో, కూస్తో ప్రేమలూ, అభిమానాలూ మిగిలి ఉంటాయి అనే విషయాన్ని ఆలస్యంగానైనా గ్రహించిన మాలిని ఆత్మవిశ్వాసపు ప్రతీకగా నిలబడిరది నాముందు.

తనకు షేక్‌ హ్యాండిచ్చి… ‘‘సెభాష్‌ మాలినీ…’’ అన్నా మనఃస్ఫూర్తిగా.

‘‘మరి ఏమిటి నీ భవిష్యత్‌ ప్రణాళిక?’’ అని అడిగా.

దానికి ప్రతిగా నన్ను చెయ్యిపట్టి ఎంతో సంతోషంగా చిన్నపిల్లను తీసుకువెళ్తున్నట్లు, తానూ ఓ చిన్న పిల్లైపోతూ వాళ్ల ఇంటి వెనుకకు తీసుకెళ్లి చూపించింది.

ఆ స్థలం చూసి, నేను చాలా ఆశ్చర్యపోయాను. మాలిని భర్త కాలం చేసిన తర్వాత మాలిని ఎక్కువగా కొడుకు దగ్గరే ఉండిపోవటంతో, ఈ స్థలమంతా చెత్తచెదారం, కలుపుతో నిండిపోయి ఉన్న జాగాలో ఇదెలా సాధ్యం? అనుకున్నా. సంకల్ప బలం గట్టిగా ఉంటే, సాధించలేనిది ఏదీలేదనే దానికి నిలువెత్తు సాక్ష్యం. మాలినిjైు నా ముందుందనిపించింది.

ఒక ప్రక్కన వంగ, గోరు చిక్కుళ్లు, టమాటా, పచ్చిమిర్చి, బీర, సొర పాదులు… ఇంకోవైపు జాగాలో సగం, వివిధ రకాల ఆకుకూరల మడులు, మిగతా సగంలో గులాబీలు, రెండురకాల కనకాంబరాలు, పందిరికి పాకించిన సన్నజాజి, విరజాజి మొక్కలు పచ్చపచ్చగా అప్పుడే పట్టిన పూత పిందెలతో, కూరగాయ మొక్కలు నవనవలాడుతూ తలలాడిస్తున్న ఆకు కూరల మడులు, విచ్చుకోవటాన్కి పోటీ పడుతున్న ఎరుపు, తెలుపు, గులాబీ మొగ్గలు, వీటితో పోటీకి సిద్ధంగా ఉన్న కనకాంబరాలు… అన్నీ ఓ క్రమపద్ధతిలో పేర్చినట్లుగా ఉన్న ఆ చిన్న సైజు పెరటి తోటను చూస్తుంటే ఒకవైపు ముచ్చటగానూ, మరోవైపు ఇలా తయారు చేయటానికి ఎంత శ్రమపడ్డదో మాలిని అని అనుకుంటే తన మీద ఉన్న వల్లమాలిన స్నేహం కాస్తా గౌరవంగా మారిపోయింది నా మనసులో. నిజంగా ఎంతో సంతోషంతో తనకు మనఃస్ఫూర్తిగా ‘‘అభినందనలు’’ చెప్పా.

‘‘థాంక్యూ మైథిలీ…’’ అంది ప్రతిగా.

‘‘ఇక నేను ఈ పెరటి తోట వదిలి ఎక్కడికీ వెళ్లను, వెళ్లలేను. ఎవరైనా నన్ను చూడాలనుకుంటే వాళ్లే వస్తారు. వచ్చి రెండ్రోజులుండిపోతారు’’ అన్నది నిక్కచ్చిగా.

నిజంగా పెరటి తోటన్నా… అందులోని మొక్కలన్నా పిల్లలతో సమానం. కాసింత మట్టి, కూసింత నీరు పోస్తే మనకు ఎంతో ప్రేమతో, కృతజ్ఞతగా పండ్లను, పూలను, ఆకుకూరలను, కాయగూరలను ఇస్తాయి. అన్నానికి ఆదరువుగా మారతాయి. పిల్లలైనా కోపంతో మనల్ని ఎప్పుడైనా కసురుకుంటారేమోగానీ… ఇవి ఎప్పుడూ తలలూపుతూ మనకు స్వాగతం పలుకుతాయి తప్ప చీదరించుకోవు మనల్ని చూడగానే. కొందరు మనుష్యుల్లాగా మూతి ముడుచుకోవు. మరొకొందరిలాగా చీటికీ, మాటికీ విసుక్కోవు. కయ్యం పెట్టుకోవు. ఈర్ష్యా ద్వేషాలకు అతీతం. తెలిసిందల్లా ఇవ్వడమే.

ఇలా ఆలోచిస్తున్న నన్ను తన చేత్తో కుదుపుతూ ‘‘రా మైథిలీ… ఇంట్లో కూర్చుందాం’’ అంది.

‘‘అబ్బే వద్దు. వద్దు… ఇక్కడే హాయిగా, చల్లగా, అంతకుమించి స్వచ్ఛంగా ఉంది’’ అనటంతో

తనకూ, నాకూ ఓ రెండు కుర్చీలు ఇంట్లోంచి తీసుకొచ్చి వేసింది. కూర్చున్నాం తృప్తిగా ఇద్దరం. కడుపునిండా మాట్లాడుకున్నాం.

‘‘ఇక్కడ వారం వారం సంత జరుగుతుందిగదా! ఆ సంతకు పంపించేస్తాను వాటిని’’ అంది నాతో, కూరగాయలవైపు చూపిస్తూ.

‘‘ఇంటి చుట్టుప్రక్కల వారికి అపుడపుడు ఇచ్చినా చాలా కూరగాయలుంటాయి ఇంకా. అందుకనే ఈ నిర్ణయం తీసుకున్నా’’ అంది మాలిని.

ప్రతి మాట తన గొంతులో ఆత్మ విశ్వాసపు తళుకులను అద్దుకుంటూ మరొకసారి తను ‘‘స్వాభిమానమూర్తిగా’’ సాక్షాత్కరించింది. సాధికారత కొట్టొచ్చినట్లు కనపడిరది తన ప్రతి అడుగులో.

***

‘‘ఊ… తర్వాతేమైంది?’’ అంది మైథిలి సువర్ణతో.

‘‘బంగారం అమ్మద్దు మమ్మీ. మేమిద్దరం చెరో రెండు లక్షలు ఇస్తాము’’ అన్నారు భార్గవ్‌, నవీన్‌లు.

‘‘మరి తీసుకోకపోయావా?’’ అంది మైథిలి.

‘‘నాకీ ఆస్తిపాస్తులు, నగానట్రా మీద ఏమాత్రం మోజులేదు మైథిలీ. అవి పెట్టుకుని సంతోషంగా గడపాల్సిన రోజులన్నీ భారంగానే గడిచిపోయాయి. ఇప్పుడు దేనికోసం ఇవన్నీ. నాతోపాటు అవమానాన్ని హేళనలను సమపాళ్లలో స్వీకరించాయి నా ఒంటిమీద నగలు. ఒక్కోసారి అవి కూడా దెబ్బలు తిన్నాయి. ఆ కరడుకట్టిన అనుమానాహంకారపు చేతుల్లో నన్ను బాధించిన గతకాలపు చేదును సమూలంగా తుడిచివేద్దామనుకుంటున్నాను. నాతోపాటుగా నా నగలకు స్వాభిమానపు పునర్జన్మ నిస్తాను మైథిలీ’’ అంది సువర్ణ.

ఆమె గొంతులో ధృఢ నిశ్చయం అంతకు మించి పట్టుదల, పట్టుదలకు మించి స్వశక్తితో తన కాళ్లమీద తాను నిలబడుతూ అనుమానపు పడగను అణగద్రొక్కాలనే స్వీయ ఆలోచనలకు పడ్డ బీజం మొలకెత్తి వృక్షంలా వ్రేళ్లూనటానికి ఇంతకాలం పట్టిందన్నమాట అనుకుంది మైథిలి తన మనసులో.

‘ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు’ అనే పాత సామెతను తిరగరాసిన తన నేస్తం సువర్ణ మీదున్న ఆప్యాయత, వాత్సల్యం రెట్టింపయ్యాయి.

‘‘స్త్రీల స్వాభిమానం, పట్టుదలలు ` మహిళా జగతికే వెన్నెలలన్నమాట’’ అన్నా సువర్ణతో.

‘‘మరి ఎప్పుడు నీ కార్యాచరణకు శ్రీకారం చుడుతున్నావు?’’ అన్నా సువర్ణతో.

‘‘వచ్చేవారమే’’ అంది సంతోషంగా.

‘‘మరి బొటిక్‌కి కావాల్సిన సామాగ్రి అంతా సమకూర్చుకున్నావా?’’ అన్నా సువర్ణతో.

‘‘ఆ… ఆ పనులన్నీ చకచకా సాగిపోతున్నాయి. గతంలో ఓ కిరాణా షాప్‌ నడిచిందట దాంట్లో. అది ప్రస్తుతం ఖాళీ అయిందట. దాన్నే మేము ఐదు సంవత్సరాలు లీజుకు తీసుకున్నాము. పిల్లలిద్దరూ దగ్గరుండి ఆ ఫార్మాలిటీస్‌కు సంబంధించిన పనులు చూసుకున్నారు. ఎవరికి ఖాళీ దొరికిన సమయంలో వాళ్లు దగ్గరుండి కార్పెంటరీ వర్కు చేయిస్తున్నారు. ఒక ఏకాండి హాలు పెద్దదిగా ఉంది. దీనికంటే కొంచెం చిన్న గదిలాంటిది ఆ హాలుకు వెనుకగా ఉంది. ప్రస్తుతం సరిపోతుంది. కప్‌ బోర్డ్సు మేమే పెట్టించుకుంటామని అడిగితే ఓనర్‌ ఒప్పుకున్నారు. స్టిచ్చింగ్‌కు వచ్చే బట్టలు పెట్టటానికి, మగ్గంవర్క్‌ చేసినవి, ఎంబ్రాయిడరీ చేసినవి తగిలించటాన్కి వీలుగా వార్డ్‌ రోబ్‌ లాంటిది, క్లాత్‌ కటింగ్‌కి ఓ పెద్ద టేబుల్‌. ఇలా, ఓ చిన్న క్యాష్‌ కౌంటర్‌ లాగా ఇలా… ఏవైతే ముఖ్యమో అలాంటివి చేయిస్తున్నాము’’ అంటూ

‘‘ప్రస్తుతం నాకు టైలరింగ్‌లో సహాయానికి ఒక ఆడమనిషిని, మగ్గం వర్క్‌ చేయటానికి ఒక మగ మనిషిని మాట్లాడదామనుకుంటున్నా’’ మైథిలీ అంది నాతో.

‘‘చాలా ఫాస్ట్‌గా ఉన్నావ్‌!’’ అన్నా నవ్వుతూ.

‘‘నా గతాన్ని ఓవర్‌టేక్‌ చేయాలంటే ఫాస్ట్‌గా ఉండాలిగా అంది’’ ప్రతిగా నవ్వు గొంతుకతో.

నా మనసులో కొద్దిగా సందేహం మిగిలింది. అందుకే అన్నా సువర్ణతో `

‘‘భార్గవ్‌, నవీన్‌ వాళ్ళు డబ్బు ఇస్తామన్నప్పుడు తీసుకోవచ్చు గదా! ఎందుకు వద్దన్నావు?’’

‘‘అది కాదు మైథిలీ… వాళ్ళిద్దరూ అపార్టుమెంటు కొనుక్కుంటున్న క్రమంలో పేమెంటుగా పెద్ద మొత్తాన్నే చెల్లిస్తున్నారు నెలనెలా. దానికితోడు ఇద్దరూ చెరో చిట్టీ కూడా వేస్తున్నారు. అందుకే ఇక నేను అడగదలుచుకోలేదు. ఒకవేళ వాళ్లు ఇలాంటి పేమెంట్లు, చిట్టీలు కట్టాల్సి లేకపోయినా అడగకూడదనుకున్నా. ఇప్పటికీ వాళ్ళిస్తామన్న డబ్బులు తీసుకోలేదని కొద్దిగా అలిగారు రెండ్రోజులు. నేనే సర్ది చెప్పా వాళ్లను. నెమ్మదిగా అలకమాని దార్లో పడ్డారు’’

‘‘అదే ఎందుకు తీసుకోలేదని నా డౌటనుమానం’’ అన్నా సువర్ణతో

‘‘అసలు విషయం చెప్పనా’’ అంది నాతో.

(సశేషం)

September 21, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

వచసా స్మరామి! శిరసా నమామి!! (కవిత)

by Kondapally Neeharini September 21, 2025
written by Kondapally Neeharini

ఎక్కాల్సిన శిఖరాల

దాటాల్సిన లోయల

జీవిత గుణాలకు గణాంకాల

గుట్టు నేర్పే గురువులే మాకాదర్శం

భాష భాగ్యాన్ని

 శాస్త్ర జ్ఞానాన్ని

సమయ పాలననీ గుప్పిట బట్టే

తెలివి నేర్పిన గురువులే మాకాదర్శం

గురువులంటే మా ఉపాధ్యాయులు

గురువులంటే మా ఊహల వారధులు

దేశభక్తి ని రంగరించి

క్షేమ సమాజ సూత్రాలని నేర్పించి

అభ్యుదయ దృక్పథాన్ని అలవర్చే

నిస్వార్థ సేవలను అందిచే గురువులే మాకాదర్శం

ఆటపాటల పోటీలు క్రీడా వినోదాలు

 ప్రపంచ విజ్ఞాన ప్రయోగాల పాఠాలు

ప్రశ్నల పరీక్షలు ఫలితాల నిరీక్షణ లూ

చీకటి వెలుగుల సమవర్తన నేర్పే గురువులే మాకాదర్శం

అవనీ అమ్మ ఒక రీతైతే

నింగీ నాన్న ఒక తీరైతే

 విశ్వ మానవతా రూపమయ్యే

అమ్మానాన్నగ మిన్నగ చూసే గురువులే మాకాదర్శం

పరాన్న జీవులవ్వద్దంటూ

పరులమేలును కోరాలంటూ

చదువుల విలువలు వినిపించే

పోటీ ప్రపంచపు విస్ఫోటనమయ్యే  గురువులే మాకాదర్శం

కులాలు మతాలు ఎన్నున్నా

మానవత్వం మాకు సమ్మతమైతే

సామరస్య  సంస్కారం మా మతమైతే

ఎత్తిన జెండా లో ఎదిగిన వర్ణ వికాసం

విద్యార్థులే అంటారు

వేకువ ఉదయం మాదంటారు

ఎలుగెత్తి చాటిన విద్వత్తు మాకేనంటారు

జగతి జవసత్వాలు మేమంటారు

ప్రగతి దారులు మేమే వేయాలంటారు

నాటిన విత్తులు మొలకెత్తి

పెరిగిన వృక్షాలు బడిపిల్లలేనంటారు

అందాల్సిన ఫలాలు భవితవ్యానిదేనంటారు

శిక్షణ ఇచ్చినా శిక్ష వేసినా

ఎంతోఎదిగేలాచేసే ఇంతటి గురువులే మాకాదర్శం

చిగురించే ఆశలకు నవ పల్లవులం

చదువుల వన వసంతం విరిసేలా

నలుగురు మెచ్చే నడవడి మాదైతే

నీతి నిజాయితీ ఉండాలనే మా గురువులే మాకాదర్శం!

గురువు అంటే గగనమంత గౌరవం

గురువు అంటే సముద్రమంత ఆదర్శం

చంద్రునిగా వెలుగొందించే  సూర్యులే గురువులు

సూర్య తేజంగా చూపించే చంద్రులే గురువులు

గురువంటే మా ఉపాధ్యాయులు !

గురువంటే మా ఊహల వారధులు!!

మము  నడిపించిన గురువుకు వచసా స్మరామి !

మము  గెలిపించిన గురువుకు శిరసా నమామి!!

___*****____

September 21, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

మూడో సీత కథ – సమ్యక్పరిశీలన

by Lingamneni Sujatha September 21, 2025
written by Lingamneni Sujatha

 మూడోసీత కథ కొంత వాస్తవము. మరి కొంత రచయిత స్వకపోలకల్పితం.

ఆ ఊరు పుల్లేటికుర్రు. ఆ ఊరిలో ముగ్గురు సీతలున్నారు.

పెద్ద సీత వాళ్ళ అమ్మ నాన్న చూపించిన ఓ “శఠ గోపం” గాడిని

నోరెత్తకుండా పెళ్ళి చేసుకుని పిచ్చి గొర్రెలా వాడి వెనకాల వెళ్ళింది.

ఇక రెండవ సీత విషయానికి వస్తే.. ఎస్.ఎస్.ఎల్.సి వరకు చదివింది గాని ఉత్త పిచ్చి మొద్దు.ఎంత సేపు ఈ వోణీ మా బావ బొంబాయి నుండి తెచ్చాడనో, ఈ గాజులు మా బాబాయి అమెరికా నుండి తెచ్చాడనో గొప్పలు చెప్పుకోవడం తప్ప బుర్రలో గుజ్జు లేదు.

ఇక మిగిలింది చిన్న సీత. అందుకే మూడో సీత కథ అన్నారు. ఈ సీత అమాయకురాలు కాదు. గడుగ్గాయి. కొంచెం అహం, మరి కొంచెం పెంకితనం కలగలిసిన అమ్మాయి. మేధావి. ఎవ్వరూ తనని ఒక్క మాటంటే పడదు. ఆఖరికి కన్న తల్లి అయినా సరే. తల్లి దండ్రులకు ఒక్కతే కూతురు.అల్లరి పిల్ల.

సీత మాటల్లోనే …మా ఊరు ఎవరైనా వచ్చి ప్లీడరు సుబ్బారావు గారి ఇల్లెక్కడ? అని ఎవరినైనా అడిగితే, రెండు నిముషాలు ఆలోచిస్తారు. “అల్లరి సీత” ఇల్లెక్కడ అని అడిగితే, క్షణంలో చూపిస్తారు. అది మా ఊళ్ళో నాకు ఉన్న పరపతి అంటుంది. సీత తల్లి పేరు భాగ్యలక్ష్మి.

పెద్ద సీత పెళ్ళి చూపులనాడే..అదేంటే పెద్ద సీతా! ఆ చీపురి పుల్ల గాడిని నువ్వు ఎలా పెళ్ళి చేసుకుంటావే? అని మూడవ సీత అంటుంది.పెద్ద సీత నాయనమ్మ, ముందు ఇక్కడినుంచి పోతావా? పోవా? పిదప కాలం, పిదప బుద్ధులు అంటూ మూడవ సీత నెత్తిమీద ఒక మొట్టికాయ తగిలించింది.

నేనేమీ నీ మనుమరాలిలాగా మూగ మొద్దును కాదు.జాగ్రత్త అంది సీత.

ఏం చేస్తావే భడవా? అంటూ కోపంగా సీత వైపుకు పరుగెత్తుకు వచ్చింది.

ఈ సారి మంగలి అనంతయ్యతో చెప్పి నీ గుండుకు గాటు పెట్టిస్తా! అని ఇంకా దూరంగా పరిగెడుతూ అరిచింది సీత.

నిన్నూ …నిన్నూ…అంటూ ఆవిడ వెంటపడటం, సీత చెంగున గోడ దూకి గెంతెయ్యడం,పెద్దావిడ బ్యాలెన్స్ తప్పి గోడకు గుద్దుకోవడంలో, హాస్య రసం తొణికిసలాడుతోంది. తళ తళ లాడే మర చెంబు లాంటి ఆవిడ గుండు మీద నుండి రక్తం ధార కట్టడం ఒక్కసారే జరిగినాయి. ఇక్కడ కరుణ రసం జాలువారింది. పెద్ద సీత పెళ్ళి చూపులనాడు జరిగిన గోలకు పెద్ద సీత, చిన్న సీతతో మాట్లాడడం మానేసింది.

సీత ఆ ఊరిలో సుందరాచారి కొలిమి దగ్గరకు వెళ్ళి పలుగులూ,కొడవళ్ళు, నాగలి కర్రులు, తయారు చేస్తుంటే, సీత నేనూ తిత్తి ఆడిస్తానంటే అమ్మాయిగారమ్మాయిగారూ…మీరు బ్రేమ్మల పిల్ల. ఇట్టా తిత్తి ఆడించారని తెలిస్తే, నా నోటి కాడ కూడు పోతుంది.

మీకు దండమెడతా గానీ, దూరం నుంచి చూడండి అన్నాడు.

కుమ్మరి నరసింహులు ఇంటికి వెళ్ళి సారె తిప్పుతానన్నా,అలాగే చేతులెత్తి నమస్కరించాడు. వడ్రంగి నాగాచారి ఇంట్లో బాడితె పట్టుకుని చెక్కుతానన్నా ఇదే గోల. సీత ఈ విషయం తల్లిదండ్రులకు చెపితే , సీత వాళ్ళ నాన్న ఊరుకున్నాడు. కానీ వాళ్ళ అమ్మ అంటూ సొంటూ లేకుండా, అందరి ఇళ్ళు తిరుగుతావా? భడవా! ఇంకొకసారి వాళ్ళిళ్లకు వెళ్ళావో నీ కాళ్ళు విరగ కొట్టి గదిలో కూర్చో బెడతానంటూ తిట్టింది.

సీత ఐదో తరగతి చేరే సరికి చట్టి ముక్కు జోగారావు, కిర్రు చెప్పుల మధు, మెల్లకళ్ళ పార్వతీశం, డొంకాడ వెంకటరావు,మద్దిమత్తిన సుభాష్ బోసు, సీతకు ప్రాణ స్నేహితులయ్యారు. సీత వీళ్లతో కలిసి మామిడితోటల్లోనూ, అరటి తోటల్లోనూ దొంగతనాలు చేసేది. సీత వాళ్ళతో కలిసి బచ్చాలాట, కబడ్డీ ఆడేది. ఆ విషయం సీత తల్లికి తెలిసి, మగపిల్లలతో ఆటలేమిటే? నీకు అంటూ చెవులు సాగదీసేది.

ఆడ పిల్లలతో ఆడుకుందామంటే, వాళ్ళు తొక్కుడుబిళ్ళలూ, గచ్చకాయలు, పులీ మేకా, బొమ్మలాటలు ఆడతారు కదా!

చిన్న చెరువు దగ్గర కరణం గారి పాలేరు గేదలను కడుగుతున్నాడు. వాడు చూడకుండా సీత ఒక దాని మీదకు ఎక్కి కూచుంది. దాన్ని ఒడ్డుకు ఎక్కించడానికి కాంతారావు తన్నాడు. గేద చరచరా బయటకు వచ్చి పరుగు లంకించుకుంది. సీతకు దూకాలంటే భయం. గేద ఎగురుతూ పరిగెడుతుంటే వణుకు. ఊళ్ళో వాళ్ళు ఆ గేదని, గేద మీద వణుకుతున్న సీతని చూసి ఒకటే నవ్వు. ఆ తర్వాత గేదల మీద ఎక్కి స్వారీ చేయడం సీతకు అలవాటు అయ్యింది.

వినాయక చవితి వచ్చిందంటే భుజాన గోనె సంచులు తగిలించుకుని, సీత తన మగ స్నేహితులు,పత్రి కోసుకు రావడానికి బయల్దేరేవారు. మగ పిల్లలు చెట్లు ఎక్కి వెలగ పత్రి, కాయలు, సీతాఫలాలు కోసేవారు.పూజకు రకరకాల పూలు,పళ్ళు కోసుకుని తెచ్చేవారు. అందులో ఉన్న పెద్ద కాయల్ని సీత తన సంచిలో వేసుకోవడంలో కిలాడీతనం తెలుస్తోంది.

పాలవెల్లి కడిగి పసుపు రాసి, కుంకుమ బొట్టు పెట్టి, పాలవెల్లికి పూలు పళ్ళు వేలాడ దీస్తారు. వినాయకుడిని పసుపు రాసిన పీఠం మీద పెట్టి, పైన పాలవెల్లి తగిలిస్తారు. వినాయకుడిని పూలు, పళ్ళు, ఇంటిలో వండిన నైవేద్యం పెట్టి, పూజిస్తారు. ఆ సాయంకాలం తొమ్మిది మంది ఇళ్లకు వెళ్ళి వినాయకుడిని చూస్తే,పిల్లలకు చదువు బాగా వస్తుందని ప్రగాఢ నమ్మకం.

ఆ ప్రకారం సీత వాళ్ళ అమ్మతో పాటు తొమ్మిది మంది ఇళ్లకు వెళ్ళి వినాయకుడిని చూసి వచ్చింది. తర్వాత స్నేహితుల ఇళ్లకు వెళ్ళి చూసి వచ్చింది. పిదప మధుగాడు సీత ఇంటిలో వినాయకుడిని చూసి, పాలవెల్లికి కట్టి ఉన్న పెద్ద వెలక్కాయలు, సీతా ఫలాలు, మొక్కజొన్న పొత్తుల్ని చూసి, సీతా! నా సంచిలో ఉన్న పెద్ద కాయల్ని దొంగతనం చేస్తావటే? అంటూ ఏడుస్తూ వెళ్ళి ఆ విషయం అందరికీ చెప్పాడు. అందరూ సీతను దొంగతనం చేశావట గదా! అని అడిగితే, మా అందరి సంచులు ఒకే రకంగా ఉన్నాయి. పొరపాటున సంచి మారింది అని చెప్పడంలో సీత ఎంతటి మేధావో తెలుస్తోంది.

 పుల్లేటికుర్రులో మూడు స్కూళ్లు ఉన్నాయి. మేడబడి, సుబ్బరాజు గారి బడి, పాకబడి. సీత వాళ్ళ ఇంటికి దగ్గరగా ఉందని,లాయరు సుబ్బారావు గారు సీతను పాక బడిలో చేర్చారు. ఏలియా మాస్టారి పాక బడిలో చదివి, పది మంది పిల్లలు హైస్కూల్లో చేరడానికి ఎంట్రన్స్ పరీక్ష వ్రాశారు. అందరూ పరీక్ష పాసై హైస్కూల్లో చేరారు.

సీత హైస్కూల్లో చేరగానే, వాళ్ళ నాన్నగారు నైలాన్ గౌను కొని ఇచ్చారు. ఆ ఊరిలో మొట్ట మొదటి సారి నైలాన్ గౌను సీతే తొడిగింది. ఆ విద్యార్థులందరిలో సీతే ధనవంతురాలు.

 హైస్కూల్లో హిస్టరీ మాస్టారి పెన్ను పోయింది. వెలక్కాయల విషయంలో సీత ఫేమస్ కనుక, సీతే తీసి ఉంటుందని మేడబడి విద్యార్థిని కమలకుమారి అందరికీ చెప్పింది. సీతే మాస్టారి పెన్ను కొట్టేసిన వీరదొంగ అని, పోస్టాఫీసు గోడ మీద, స్కూలు గోడల మీద రాశారు.

సీత అంటే గిట్టని పెద్ద సీత నాయనమ్మ, సీత ఇంటికి వచ్చి, గురువులంటే ఎవరనుకున్నావు? గురువు గారి పెన్ను కొట్టేస్తావా? నువ్వు చేసిన వెధవ పని వల్ల మీ అమ్మ నాన్నలకు ఎంత అప్రదిష్టే అంది. ఆ మాటతో సీత తల్లి రెచ్చిపోయి, మర్యాదగా మాస్టారి పెన్ను ఇవ్వు అని సీత చెవుల్ని బారెడు సాగ దీసింది. నేను మాస్టారి పెన్ను తీయలేదని సీత చెప్పినా ఎవరూ నమ్మలేదు.

మర్నాడు మూడో పీరియడ్ హిస్టరీ మాస్టారు వచ్చి, పిల్లలూ నా పెన్ను ఇంట్లోనే దొరికింది అన్నారు. సాయంత్రం ఇంటికి వెళ్లగానే సీత పూనకం వచ్చిన దానిలా ఊగిపోతూ, వాళ్ళ అమ్మను, ఏమే పెదపాడు మా లక్ష్మికూతురా! కన్న బిడ్డను దొంగ అనడానికి నీ నోరెట్లా వచ్చిందే? మాస్టారుగారు పెన్ను ఇంట్లో మరిచిపోతే, దొంగతనం నాకు అంట గడతావా? ఇవాల్టినుంచి నువ్వు నా కన్నతల్లివీ కాదు. నేను నీ కూతుర్ని కాదు అంటుంది. కన్నతల్లి అయినా సరే,అనవసరంగా ఒక మాట అంటే… సీత పడదు.

సీత వాళ్ళ నాన్న సీతను బుజ్జగించి, సైకిలు ఎక్కించుకుని తీసుకు వెళ్ళి సీతకు వాటర్ మెన్ పెన్ను కొని ఇచ్చాడు. ఆ విధంగా ఫస్ట్ ఫారం లోనే సీత పెన్నుకు సొంతదారు అయింది. మహా గణపతి దయ వల్ల సీత మీద పడిన అపవాదు తొలగిపోయిందని సీతకు గట్టి నమ్మకం.

దసరా పండుగకు స్కూలు పిల్లలు, మాస్టార్లు కలిసి పిల్లల ఇళ్లకు వెళ్లేవారు. అయ్య వారికి చాలు అయిదు వరహాలు. పిల్లవాళ్లకు చాలు పప్పుబెల్లాలు అని పిల్లలు పాడగానే, ఆ ఇంటి వాళ్ళు వచ్చి,పిల్లలకు తినుబండారాలు, మాస్టారికి డబ్బు ఇచ్చేవారు.

దీపావళికి సీత పాకబడి బ్యాచ్ ఫ్రెండ్స్ అందరూ కలిసి సిసింద్రీలు,

మతాబులు, చిచ్చుబుడ్లు, అవ్వాయి చువ్వాయిలు తయారు చేసేవాళ్ళు. అందరిలోకి సీత చలాకీగా ఎక్కువ కొట్టేసి, తానే కాల్చిన కిలాడి.

దీపావళికి ఆ ఊరిలో అందరి ఇళ్లల్లో వివిధ రకాల స్వీట్లు తయారు చేసేవారు. పిల్లలు ఎవరి ఇళ్ళకు వెళ్ళినా, స్వీట్లు పెట్టేవారు.

ఒక రోజు ముత్యాలోడు మా ఇంట్లో నూకలు కూడా లేవే? నేను నిన్న రాత్రి అన్నం తినలేదే సీతా! అన్నాడు…

సీత ఏడుస్తూ, నేను రేపటి నుండీ క్యారేజీ తెస్తా! నీవు నాతో కలిసి తిందువు గాని అంది. సీతది అంతటి జాలి గుండె.

కోమటి గురవయ్య తోటలో మామిడి కాయలు కొయ్యడానికి సీత తన క్లాసు మేట్సుతో వెళ్ళింది. మామిడి చెట్టు ఎక్కిన మధు గాడిని కరెంటు చీమలు కుడితే, బాబోయ్ అని అరిచాడు. తోటమాలి సుబ్బన్న,అల్లుడు,కూతురు, భార్య రావడంతో సీత బ్యాచ్ అంతా పట్టుబడ్డారు. ఇంతకీ గోనెలో ఉన్నవి ఏడు కాయలు. పిల్లల్ని గట్టిగా పట్టుకుని, ప్రెసిడెంటు గారి ఇంటికి తీసుకొని వెళ్లారు. ఆయన పిల్లల తల్లిదండ్రులను పిలిపించారు.

ఇక్కడ పట్టుబడ్డ వాళ్లందరూ తలా పాతిక రూపాయలు”తప్పు” కట్టాలి. ఇకముందు ఇటువంటి తప్పు చేయమని, అందరి కాళ్ళు పట్టుకుని ప్రమాణం చేయాలి. ఇదే నా తీర్పు అన్నాడు ప్రెసిడెంటు.

సీతకు పిచ్చి కోపం వచ్చింది.ప్రెసిడెంటు వైపు కోపంగా చూస్తూ, ఛస్తే నేను ఎవడికాళ్ళు పట్టుకోను. మేము కోసింది ఏడు కాయలు. అసలీ తోటమాలి సుబ్బన్న,రోజూ ఎన్ని కాయలు దొంగతనంగా అమ్మడం లేదూ! …

గురవయ్యా! దొంగ లెక్కలు వ్రాసి, దొంగ కొలతలు కొలిచి ఎంత డబ్బు అన్యాయంగా కొట్టేస్తున్నావో నాకు తెలి యదనుకున్నావా? …

ఏమండీ ప్రెసిడెంటు గారూ! మీరు “బోడెమ్మ” ఇంటిలో దూరితే నేను చూశానని, నాకు బిస్కట్లు కొని పెట్టీ, ఎవరికీ చెప్పవద్దని, మీరు నాతో ఒట్టు వేయించుకోలేదా? అని సీత గట్టిగా అరిచింది.

అంతే! క్షణంలో ప్రెసిడెంటు గారి భార్య గడప ఇవతలకు వచ్చి, ఆయన రెక్క పట్టుకుని లోపలికి తీసుకుని వెళ్ళింది. పంచాయతి మధ్యలోనే ఆగిపోయింది. ఎవరి ఇళ్ళకు వాళ్ళు నవ్వుకుంటూ వెళ్లిపోయారు.

ఏడు మామిడి కాయలు దొంగిలించిన తమను అందరి కాళ్ళు పట్టుకోమని తీర్పు ఇచ్చిన ప్రెసిడెంటును, ధైర్యంతో ఎదుర్కొని ఆయన పరువు తీసిన సీత ఎంతటి మేధావో వేరే చెప్పాలా?…

సీత శకుంతల నాటకం వ్రాసింది. సీత బ్యాచ్ ఆ నాటకం స్కూలు యానివర్సరీ రోజున వేశారు. శకుంతలగా నటించిన సీతకు ఫస్ట్ ప్రైజు వచ్చింది. సీత తల్లి సంబర పడింది.ఊరందరూ సీతను మెచ్చుకున్నారు.

సీత తన స్నేహితుడు బాజీ వల్ల సైకిల్ తొక్కడం నేర్చుకుంది. ఆ ఊరిలో మొదటి సారి సైకిల్ కొనుక్కుని సైకిల్ మీద తిరిగిన ఆడపిల్లసీతే.

ఆ ఊరి లైబ్రరీకి వెళ్లి పుస్తకాలు చదివిన మొదటి ఆడపిల్ల కూడా సీతే.

స్కూలు పక్కన బడ్డీ కొట్టు పెట్టుకున్న వెల్లంగి రామారావు భార్యను తన్ని,ఇంట్లో నుంచి వెళ్లగొట్టాడని విన్న సీత, తన క్లాసులోని ఆడపిల్లలందరినీ,కొంత మంది మగ పిల్లల్నీ,వెంటబెట్టుకుని రామారావు కొట్టుకు వెళ్ళింది.

రామారావు గారూ…మీ ఆవిడ సూర్యావతిని మీరు తన్ని, బయటకు నెట్టారని మాకు తెలుసు. ఇలా ఇంకొక సారి జరిగితే,మీ దగ్గర ఎవరం ఏమీ కొనము.

అవసరమైతే స్కూలు పిల్లలు మొత్తం వెళ్ళి,పోలీసు స్టేషన్ లోను మెజిస్ట్రేట్ ఇంటి దగ్గరా మీమీద కంప్లైంట్ ఇస్తాం. మర్యాదగా కామినేని వాళ్ళ ఇంట్లో నుంచి,నీ పెళ్ళాన్ని బతిమాలి నీ ఇంటికి తీసుకు పో అని బెదిరించింది.

అట్టాగే! అమ్మాయి గారు చిత్తం అంటూ తన భార్యను తన ఇంటికి తీసుకుని వెళ్ళాడు. థర్డ్ ఫారం లో సీత చేసిన ఘన కార్యంలో నాయకురాలి లక్షణాలు తెలుస్తాయి.

ఆ కాలంలో పూనకాలు పూనేవాళ్లు కొందరుంటే, దెయ్యాలు పట్టినవి అనే వాళ్ళు కొందరుండేవారు. భార్యలను బానిసలుగా చూస్తూ, అయినదానికీ, కానిదానికీ భార్యను కొట్టే వాళ్ళు కొందరుండేవారు. కొంతమంది తెలివైన భార్యలు, దెయ్యం పట్టినట్టు, లేక పోతే దేవుడు పూనినట్టు, నటించి భర్తలను భయ పెట్టేవారు.

కార్తిక మాసంలో కార్తిక స్నానాలు, వన భోజనాలు ఉంటాయి. ఆ ఊరి శివాలయంలో, ఆశ్రమంలో,రద్దీగా ఉంటుంది. భక్తులు వాటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. మన సీత అటువంటి వాటిల్లో ముందే ఉంటుంది.

ఒక రోజు స్కూలు నుండి సీత ఇంటికి వెళ్లేసరికి, వాళ్ళ నాన్న కోపంగా ఉన్నాడు. సీతా… నీ ఎస్.ఎస్.ఎల్.సి. చదువు అయిపోవచ్చింది గదా! అని మీ అమ్మ నీ పెళ్ళి చేయమంటోంది. ఏం చేయమంటావో చెప్పు అన్నాడు.

వెంటనే సీత… నేను ఇప్పుడు చస్తే పెళ్ళి చేసుకోను. మొదట డిగ్రీ కావాలి. తర్వాత లాయర్ని కావాలి. జీవితంలో సెటిలయ్యాక, నాకు నచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటానంది.తన అభిప్రా యాలను కుండ పగులకొట్టినట్లు చెప్పడంలో, సీతకి సీతే సాటి.

సీత అమ్మమ్మకు బాగా లేదని టెలిగ్రామ్ వస్తే, తల్లిదండ్రులతో పాటు సీత కూడా ఏలూరు వెళుతుంది. సీత అమ్మమ్మ చనిపోతుంది. ఆమె పెద్ద కర్మ ముగిసిన మర్నాడు,సీత తాత కూడా చనిపోతాడు. సీత తల్లి మానసికంగా కుంగిపోతుంది. సీత తల్లికే ధైర్యం చెప్పిన ధీర బాలిక.

సీత ఎస్.ఎస్.ఎల్.సి. రిజల్ట్స్ వచ్చాయి. సీత వాళ్ళ స్కూలు ఫస్టు మాత్రమే కాదు. స్టేట్ సెకండ్ హైయెస్ట్ స్కోరు కూడా సీతకి వచ్చింది. సీత ఆనందానికి హద్దుల్లేవు.

సీత తల్లి సీతతో… నువ్వు చదివిగొప్పదానివి అయితే, అందరూ నన్ను చూపించి, ఆమే సీత తల్లి అంటుంటే…చూడాలని ఉందే అంటూ, సీతను కావిలించుకుంటుంది.

సీత తల నిమురుతూ తండ్రి ఆనందంతో, దగ్గరకు తీసుకున్నాడు. ఆయన కన్నీళ్లు సీత తల మీద అక్షింతలుగా పడుతున్నాయి.

ఇంతటితో మూడవ సీత కథ సమాప్తం.

ఈ నవల చదివి ముగించిన తర్వాత ఒక మంచి పుస్తకం చదివామన్న ఆనందం కలుగుతుందనడంలో ఏ మాత్రం అతిశయోక్తిలేదు.ఇంత మంచి నవలను వ్రాసి, మనందరికీ ఆనందం కలిగించిన భువన చంద్ర గారు నిజంగా ధన్య జీవులు.

ఈ నవలలోని భాష ప్రాంతీయ వ్యవహారిక భాషతో అలరారుతోంది.భాషా విశేషాలు, జాతీయాలు, సామెతలు సందర్భానుసారంగా ఉన్నాయి.

కాళ్ళు విరగ్గొట్టి గాడి పొయ్యిలో పెట్టేవాడిని.

ఉన్నదీ పోయింది. ఉంచుకున్నదీ పోయింది.

ఒంటి కాయ సొంటికొమ్ము.

నలుగురిలో జరిగేది చావైనా బ్రతుకైనా పండుగ లాంటిదే.

మరణ చక్రం ఒక ఇంట్లో, పదమూడు రోజుల్లో రెండు సార్లు తిరిగింది. ఆయనను ఏడుకట్ల సవారీ మీద ఎక్కించారు.

నోరా! వీపుకు దెబ్బలు తెచ్చుకోకే.

కాలు జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే వెనక్కి తీసుకోలేం.

కుక్కతోక వంకర- మనిషి మాట వంకర…ఏంచేస్తాం శంకరా!

కోపంతో తెగ ముట ముటలాడేది. బతక లేక బడిపంతులు.

 పైసా మే పరమాత్మా, ధన మూలం ఇదం జగత్.

తలంటి అంటే తిట్టు, తాషామర్బా అంటే వీపు విమానం మోత మోగించడం, గడేకార్, బేఫికర్, భాడకావ్, మొదలైన విశేష పదాలను ఉపయోగించారు.

September 21, 2025 3 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

శ్వేతప్రపంచం

by Vijaya Kandala September 21, 2025
written by Vijaya Kandala

మానవ జీవితంలో రంగులకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఒక్క నిమిషం రంగులు లేని ప్రపంచాన్ని ఊహించుకోండి  .మన వల్ల కాదు . ప్రకృతిలో ఎన్నో వర్ణాలు ఉన్నాయి  .అవన్నీ  మన వ్యక్తిత్వంపైమనకు  తెలియకుండానే చెరగని ముద్ర వేస్తాయి . వేసాయి  .వేస్తున్నాయి . మానవ ప్రవర్తన  పై రంగుల ప్రభావాలను గురించి ఎన్నో పరిశోధనలు జరిగాయి .ఆ వివరాలను గురించి మరోసారి చెప్పుకుందాం. ప్రతి రంగుకు ఓ ప్రత్యేకత ఉంది . ప్రతి మనిషికి ఉన్నట్టుగానే  .అయితే రంగుల గురించి ఎక్కడ చెప్పినా , ఎప్పుడు చెప్పిన ఎవరు చెప్పినా ,  మనసులో మెదిలే తొలి రంగు తెల్లని తెలుపు .

అందరూ ఇష్టపడేది  తెలు పే . పిండార బోసినట్లు వెన్నెల  ,పౌర్ణ మి  చంద్రుడు   , మల్లెలు  , ఐరావతం  ,పాలు ,నందివర్ధనం  , పారిజాతం ఎవరికి ఇష్టం కాదు చెప్పండి .  తెలుపు రంగులో ప్రత్యేకంగా ఉండే  కొన్నింటిని గురించి చెప్పుకుందాం . వాటి గురించి  మీకుచాలా  తెలుసని నాకు తెలుసు . అయితే అరుదుగాకనిపించి  , మురిపించి  మనల్ని  ఆలోచింపచేసే  కొన్ని విశేషాలను రేఖామాత్రంగా గుర్తు చేసుకుందాం.

మనిషి ఎప్పుడు మొదట  తన గురించి ఆలోచిస్తాడు  . తెలుపు రంగును బాగా అభిమానించే వారితో  మొదలు పెడదాం. తెలుపు రంగును ఇష్టపడేవారు పరిశుభ్రతను , పరిపూర్ణతను , నిరాడంబరతను  ఇష్టపడతారు .వీ రు నిజాయితీగా , అమాయకంగా ఉంటారు . అన్ని రంగులు తెలుపులో దాగినట్లుగా వీరి భావాలు అంత త్వరగా బయటపడవు . శాంతి ప్రియులు . ఎవరిపైన ఆధారపడి ఉండడం వీరికి నచ్చదు. ఎవరిని నొప్పించడం కూడా నచ్చదు . జీవితంలో వచ్చే కష్టసుఖాలను బ్యాలెన్స్ చేసుకోవడంలో నేర్పరులు  .ఏ విషయంలోనైనా పాజిటివ్గా ఆలోచిస్తూ  ,ఆత్మవిశ్వాసంతో మెలుగుతారు . ఇవన్నీ అధిక శాతం వారిలో కనిపించే  అంశాలు  .

ఇక్కడ నుంచి మెల్లగా జంతు లోకంలోకి అడుగుపెడదాం.

జంతు ప్రపంచం
తెలుపు రంగులో అనగానే గుర్తొచ్చేవి తెల్ల పులి  ,తెల్ల ఏనుగు  ,తెల్ల నెమలి ,కుందేలు .ఒక్కొక్క దాని గురించి కాస్త చెప్పుకుందాం.  మీకో విషయం తెలుసా?  జులై 29 నాడు ఇంటర్నేషనల్ టైగర్ డే గా జరుపుకుంటారుప్రపంచవ్యాప్తంగా  .  తెల్ల  పులులు  .తెల్లటి బొచ్చు  ,నల్లని చారలు ,తెల్లటి చర్మం  ,నీలి కళ్ళతో ఆకర్షిస్తాయి . ఇవి  బెంగాల్ పులి యొక్క ఉపజాతి. జన్యుపరమైన అమరికల వలన పులికి ఇలాంటి తెల్ల రంగు వస్తుంది . అరుదైన రకం  .ఎందుకంటే జన్మించిన ప్రతి పదివేల పులులలో ఒక్కటి మాత్రమే తెల్లనిది  . ఎదిగిన తెల్ల  పులి 570 పౌండ్ల వరకు తూ గుతుంది  .సాధారణ పులుల కన్నా పొడవు ఉంటుంది  .పది అడుగుల కంటే ఎక్కువ పొడవు  .గంటకు 60 మైళ్ళ వరకు పరిగెత్తగలవు . అంటే హైవే మీద పరిగెత్తే కారుతో సమానంగా ప్రయాణిస్తాయి .ఒక తడవకు దాదాపు 18 కిలోల మాంసాన్ని తింటాయి . ఒంటరిగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతాయి  .కానీ మంచి పెంపకం దారులు .
పిల్లల్ని చాలా బాగా చూసుకుంటాయి . వీటికి ఎక్కువ  స్థలం కావాలి  .దాదాపు 20 చదరపు కిలోమీటర్ల విశా ల  ప్రాంతం అవసరం . . ఉండడానికి ,తిరగడానికి  ,వేటాడ్డానికి  కనీసం ఉండాలి .నీటిలో  బాగా ఈదుతాయి  . పంజాలు ఈదడం లో సహాయపడతాయి  .7 మైళ్ళ వరకు ఒక తడవ వెళుతుంది ఈదుకుంటూ .దేశంలో 1561లో తొలిసారిగా తెల్ల పులి గుర్తించబడింది. ఈ విషయం అక్బర్ నామాలో  రాసి  ఉంది .  అడవుల్లో కనిపించడం అరుదు . ఎందుకంటే వీటి రంగే  వీటిని శత్రువులకు సులువుగా పట్టిస్తుంది  .ఎక్కువగా జూలలో ,థీమ్  పార్కులలో ఉంటాయి .

పులి తర్వాత గుర్తొచ్చేది తెల్ల ఏనుగు .దీన్నే వైట్ ఎలిఫెంట్ అంటారు  .వైట్  ఎలిఫెంట్ అంటాం కానీ  ,నిజానికి  వీటి చర్మం లేత రంగులో ఉంటుంది . కళ్ళు తెలుపు లేదా గులాబీ రంగులో ఉంటాయి. థాయిలాండ్ లో ఎక్కువగా కనిపిస్తాయి . రాజరి  కానికి హోదాకు చిహ్నం   .భారతీయులకు తెల్ల ఏనుగు  అనగానే ఐరావతం గుర్తుకొస్తుంది  .అష్ట  దిగ్గజాలలో ఇది ఒకటి . తూర్పు దిక్కుకు ప్రాతినిధ్యం వహిస్తుంది  .ఇంద్రుని వాహనం కూడాను  .

దీని రంగు గురించి ఒక ప్రాచీనమైన కథ ఉంది  .ఒకసారి  దుర్వాస మహర్షి వెళ్తూ ఉండగా ఏనుగు ఎదుర్పడింది . అయితే  మహర్షిని చూసి నమస్కరించకుండా అహంకారంతో  ,వెళ్ళిపోయింది . ఆయనను గుర్తించనట్టుగా అన్నమాట . .చూసిన మహర్షికి కోపం వచ్చి . దాని నలుపు రంగులో మారిపొమ్మని  శపించారు  .దాంతో దానికి చాలా బాధేసింది . దుఃఖ మ్ వచ్చేసింది .  తెల్లటి ఏనుగు  కాస్త  నల్లగా మారి పోయింది  .ఏం చేయాలో తెలియలేదు  .  బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లి మొరపెట్టుకుంది . బ్రహ్మదేవుడు నావల్ల కాదు  .ఈ పని కేవలం శివుడు మాత్రమే చేయగలడు  .వెళ్లి శివుడి గురించి తపస్సు చేయి అని చెప్పాడు  .అలాగే చేసింది . శివుడు ప్రత్యక్ష మై  , ఇక్కడ ఒక పుష్కరిణి  ఉంది  .అందులో వెళ్లి  ,స్నానం చేసి , దాని పక్కన ఉన్నదేవాలయంలో పూజ చేయి . నీ రంగు నీకొస్తుంది అని వ రమి చ్చాడట  .అంతే  అది పుష్కరిణిలో మునిగి లేవగానే  ,ఆ నలుపు రంగు పోయి   తెల్లటి తెలుపు మళ్ళీ  వచ్చేసింది  .  అందుకని ఆ  పక్కన  ఉన్న దేవాలయాన్ని ఐరావతేశ్వర ఆలయం అంటారు  .ఇది దారాసురం అనే గ్రామంలో ఉంది . ఈ గ్రామం శ్రీరంగానికి చాలా దగ్గరలో ఉంది .

చతురంగబలాలలో ఏనుగుది ముఖ్యమైన పాత్ర  .వీటిని పెంచడం చాలా ఖరీదైన వ్యవహారం .  ప్రత్యేకమైన ఆహారం , శిక్షణ వైద్యం అవసరం .ఒక కార్యక్రమం లేదా ప్రాజెక్ట్ ఖరీదు అయింది లేదా ఆ ఖర్చుకు తగినంత ఉపయోగం ఉండదు అని చెప్పడానికి వైట్ ఎలిఫెంట్ అనే పదం వాడతారు  . గంటకు 40 మైళ్ళ వేగంతో పరిగెత్తగలదు  . అందాన్ని  ఇచ్చే దంతాలే దీనికి శత్రువులు  . వీటి కోసం వేటాడే వారు ఎందరో .

అనేక సంస్కృతులలో ఏనుగులు  బలానికి  ,అదృష్టానికి ప్రతీక . వేల సంవత్సరాలుగా ఇవి మానవ సంస్కృతిలో ఒక భాగం  .మనకైతే ఏనుగు తల ఉన్న దేవుడు గణాలకు అధిపతిగా  , తెలివితేటలకు ,జ్ఞానానికి మూల కారణంగా కొలవబడుతున్నాడు . అదే గణపతి లేదా వినాయకుడు .

మయూరం
అందరికీ ఇష్టమైన పక్షి నెమలి.  పించం  నెమలికి అందం .  అందంగా హుందాగా మహారాణిలా పురివిప్పిన  తెల్ల నెమలి మనకు ఆహ్లాదాన్ని ఇస్తుంది , ధవళ  కాంతులతో మనసు దోచుకుంటుంది  . తెల్ల నెమలి  నెమలి జాతిలో అరుదైన రకం . జన్య పరమైన లోపం వల్ల తెల్లగా ఎదుగుతుంది . ఈ కారణంగా ఈకలు  ,చర్మం తెల్లగా ఉంటాయి . ఇంకో వింత సంగతి చెప్పనా ! తెల్లనెమలి  పుట్టుకతో పసుపు రంగులో  ఉంటుంది .పెరిగే కొద్దీ పసుపే తెలుపు  రంగుగా రూపాంతరం చెందుతుంది . ఒకటి నుండి మూడు సంవత్సరాల వరకు ఈ ప్రక్రియ కొనసాగుతుం ది .  అడవుల్లోఇవి  కనిపించడం అరు దు  .ఎందుకంటే అక్కడ మరింత సులువుగా పట్టుబడిపోతాయి. బ్రతికి బట్ట కట్టడం చాలా కష్టం  .ఇంకో సమస్యతెల్ల నెమలి తో  కలవడానికి ఆడ నెమళ్ళూ  త్వరగా ఇష్టపడవు. అందుకని వీటిని ప్రత్యేకంగా పెంపక కేంద్రాలలో సిద్ధం  చేస్తారు .

సుబ్రమణ్య స్వామి వాహనము నెమలి  .క్రిస్టియానిటీలో తెల్ల నెమలిని ఏసుక్రీస్తు ప్రతీకగా  నమ్ముతారు . బౌద్ధమతంలో ఇది నిర్వా ణానికి గుర్తు. ప్రపంచవ్యాప్తంగా నెమళ్లు అదృష్టానికి , అభివృద్ధికి చిహ్నాలని  నమ్ముతారు . మన జానపద కథల్లో  అందానికి గర్వానికి గుర్తు . ఇవి సర్వభక్షకులు . కీటకాలు  ,పువ్వులు,విత్తనాలు  ,చిన్న పురుగులు , ఎలుకలు  ,బల్లు లు అన్నీ తింటాయి . హానికరమైన కీటకాలను తినడం వల్ల రైతుకు మంచి నేస్తం . మనదేశంలో నె మళ్లను వేటాడు నిషేధం  .ఈసారి హైదరాబాద్ లోని zoo  కి వెళ్ళినప్పుడు చూడండి . అక్కడ తెల్ల నెమ ళ్ళు మిమ్మల్ని పలకరిస్తాయి .

ఇప్పటిదాకా చెప్పుకున్నవన్నీ జన్యుపరమైన మార్పులతో పుట్టిన ప్రాణులు . అలా కాక సహజ సిద్ధంగా ఎక్కువ శాతం తెలుపురంగుతో  అప్పుడప్పుడు గోధుమరంగు  మచ్చలతో  ,మనల్ని మరిపించి  ,మురిపించే బుల్లి ప్రాణి మరొకటుంది  .అది  అందరికీ ఇష్టమైనది కూడా  .

కుందేలు
అదే కుందేలు  .తెల్లని పాలలాంటి రంగు  ,పట్టుకుచ్చు లాంటి వెంట్రుకలు దీనికి పె ట్టని సొమ్ములు  .కుదురుగా ఒకచోట ఉండక  ,హడావుడిగా  ,సందడిగా తిరిగే చిరు ప్రాణి  . శేషము , బన్నీ  ,శశకం  ,కో ని అని కూడా పిలుస్తారు  ,వన్యప్రాణి  .శాకా హారి . చిన్న సైజువి ఐదు సంవత్సరాల వరకు జీవిస్తే  ,కొంచెం పెద్ద రకంగాఉండేవి 12 సంవత్సరాల వరకు బతుకుతాయి  ,సంఘజీవులు .గుంపుగా ఉండడానికి ఇష్టపడతాయి  .ఇంట్లో పెంచాలనుకుంటే కనీసం రెండింటినైనా ఎంచుకోవాలి .

ప్రత్యేకతలు
వీటి దంతాలు జీవితమంతా పెరుగుతాయి  .తినకపోతే  ,అవి మరింత పెరిగి దంత సమస్యలు వస్తాయి . నీళ్లు బాగా తాగుతాయి. ఇంట్లో పెంచేవారు తప్పనిసరిగా వెడల్పాటి పాత్రలో నీళ్లు పోసి ఉంచాలి. తరచూ వాటిని మార్చాలి  .చాలామందికి కుందేలు ఆహారం అంటే క్యారెట్లు అని నమ్మకం  .కానీ ఇది పొరపాటు  .క్యారెట్ లలో చక్కెర శాతం అధికం కాబట్టి  ,అప్పుడప్పుడు ఇవ్వాలి  .కానీ రోజు కాదు . వీటికి బాగా వ్యాయామం అవసరం . అందుకు విశాలమైన స్థలం కావాలి. అక్కడ అవి ఎగురుతాయి  . దూకుతాయి  ,పరిగెత్తుతాయి , కాళ్ళను విశాలంగా సాగదీస్తాయి  .ఇవన్నీటికి స్థలం  అవసరం కదా  !చెవులు బాగా పెద్దవిగా ఉంటాయి  .అందుకని చెవుల పిల్లి అని కూడా అంటారు వీటి వినికిడి శక్తి సా టి లేనిది  .ఈ చెవుల ఆధారంగా తలను 180 డిగ్రీల వరకు తిప్పి చూడగలవు .

ఒక U K  లోనే  రెండు మిలియన్లకు పైగా పెంపుడు కుందేలు ఉన్నాయని అంచనా. రెండు అడుగుల కంటే ఎక్కువ ఎత్తు వరకు ఎగర గలవు . పిల్లులవలే  వీటికి లిట్టర్ ట్రైనింగ్ ఇవ్వచ్చు. వీటి జీర్ణశక్తి ప్రత్యేకమైనది . పీచున్న పదార్థాలను ఎక్కువగా తింటాయి       . చాలా జంతువులకు ఆహారం మనుషులతో సహా .

కళ్ళు ఎక్కువగా ముదురు గులాబీ రంగులో స్వచ్ఛంగా పారదర్శకంగా ఉంటాయి. ఆహారాన్ని నము లుతూ  అటు ఇటు సంచరిస్తూ మనల్ని ఆనందింప చేసే చిట్టి ప్రాణి  కుందేలు .

శ్వేత ప్రపంచం శీర్షికలో  ఇప్పటిదాకా వనవిహారం  చేశాం . జం తువులు మనలా నడవవు. గెంతుతాయి .పరిగెత్తుతాయి. దూకుతాయి . మనమూ అలాగే  దూకి వంటింట్లోకి జొరబడదాం. వంటింట్లో బోలెడు దినుసులు అవి దాచుకోవడానికి బోల్డ్ బోల్డ్ డబ్బాలు  ఉంటాయి .  వెతుకుదాం పదండి .

వంటింట్లో కాలు  పెట్టగానే తెల్లనిది . నిత్యావసరమైంది ఏది అనగానే తొluత గుర్తుకొచ్చేది లవణం  .అదేనండి  రోజు వాడే ఉప్పు .దాన్నే సోడియం క్లోరైడ్ అంటారు .మాకు ఉప్పు గురించి  తెలుసు . అది తక్కువైనా కష్టమే ఎక్కువైనా కష్టమే అంటారా ! మీరు అనుకునేది నిజమే  .అయితే ఇవాళ మరి కాస్త లోతుగా చెప్పుకుందాం  .ఉప్పు ఆహారానికి రుచి మాత్రమే కాదు  .ఇంకా ఎన్నింటికో అవసరం  .ఉప్పు తక్కువైతే ఆవకాయ చెడిపోతుంది  .ఆహార పదార్థాలను నిలవ చేయడానికి ఉప్పునే వాడతాం. ఆహారానికి రుచిని ఇవ్వడంలో ముఖ్యపాత్ర ఉప్పుదె . పచ్చళ్ళు , చేపలను నిలువ చేయడానికి కూడా ఇది అవసరం.

కొన్ని వందల ఏళ్ళ క్రితం ఉప్పును ద్రవ్యంగా వాడేవారు  .బ్రిటిష్ వారు ఉప్పుపై విధించిన పన్నుకు వ్యతిరేకంగా గాంధీజీ దండి ఉప్పు సత్యాగ్రహం కూడా చేశారు  .ఉప్పు ఎక్కువగా వాడితే ఆహారం రుచి మారుతుంది  .తరచు  అలా జరిగితే రక్తపోటు  ,గుండెజబ్బులు  ,మూత్రపిండాల సమస్యలు వచ్చే అవకాశాలు  పెరుగుతాయి .  గాయాలై నప్పుడు ఉప్పు నీళ్లతో కడిగితే ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు బాగా తగ్గుతాయట  .షడ్రుచుల్లో దేని ప్రభావమైనా  తగ్గించే శక్తి ఒప్పుకుంది  .అందుకే దాన్ని రుచుల్లో రారాజు అన్నారు .

చాలా పిరికివాడని చెప్పడానికి ఫ లా నా వ్యక్తి ఉప్పు పిరి కి అంటారు . పల్లెటూర్లలో ఆడే ఆట పుప్పన బట్టి  .ఈ ఆట మధ్య యుగాల్లోనూ  ఆడేవారని మనకు ఆధారాలు ఉన్నాయి  .ఉప్పు అని కూత పెడుతూ మధ్యలో గీసిన గీతలను దాటుకుంటూ చివరికి వెళ్లి పిడికెడు మట్టిని తెచ్చి స్వ స్థానానికి వస్తే గెలిచినట్లు . అలా తేవడం గెలుపుకు చిహ్నం  .తేలేని నివాడు  ,భయపడి ముందుకు సాగనివాడు ఉప్పుపిరి కి . అంటే పరమ భయస్తుడు  .

దీని గొప్పదనాన్ని చెబుతూ సుమతి శతకకర్త ఉప్పే పసరుచుల కెల్లా అన్నాడు  .నిజజీవితంలో ఉప్పు మనకు అత్యవసరం  .  ప్రపంచంలో చాలామందికి చాలా కాలం వరకు ఉప్పు తయారీ తెలీదు. మధ్యయుగాల్లో టి బేట్ వంటి దేశాల్లో ఉప్పు బిళ్ళలు రూపాయి బిళ్ళలుగా చలామణి అయ్యేవి. ఇంత విలువ గలది కనుకనే వాని ఉప్పు తిని పెరిగాను  అనే సామెతపుట్టినది .  వేద కాలం లో  నుండి  మనకు  ఉప్పు  తయారీ  తెలుసు  .దాన్ని వాడకమూ తెలుసు  .గుర్రం మొదలైన పశువులకు దానాలో ఉప్పు  , సైంధవ లవణం కలిపి పెడతారు . మర్చిపోయాను రాత్రి పూట ఉప్పు అనకూడదు . బుట్టలోది  .రుచి అని పెద్దవాళ్ళు ఒకప్పుడు చెప్పేవాళ్ళు . ఇప్పుడు  అవన్నీ మానేశామనుకోండి

సంస్కృతంలో లవణ శబ్దం నుంచి లావణ్యమ్  ఏర్పడింది . ఉప్పులో కనిపించే మెరుపును స్త్రీలలో కనిపించే నిగారింపుతో పోల్చారు .  ఇంత కథ ఉంది మన రోజు వాడే ఉప్పులో.

బియ్యం కాని  బియ్యం

బియ్యం కాని బియ్యం అదేనండి  . సగ్గుబియ్యం.ఇవి టాపీయోకా  అనే మొక్క వేర్ల నుండి తయారవుతాయి . దీని  ఉపయోగాలు ఎన్నో  .శరీరానికి త్వరగా శక్తినిస్తుంది . తేలికగా అరుగు తుంది కాబట్టి ఉపవాస సమయంలో ఎక్కువగా వాడతారు  .పోషకాలు  తక్కువగా ఉంటాయి కాబట్టి  ఇతర పదార్థాలతో కలిపి తినడం మంచిది. మహారాష్ట్ర ప్రాంతాల్లో వీటిని వేరుశెనగ గుళ్ళు, బంగాళాదుంపలతో కలిపి వాడుకుంటారు .వండడా నికి  ముందు  బాగా నానాలి    . లేకపోతే త్వరగా అరగదు . రక్తంలో చక్కెర స్థాయిని వేగంగా పెంచుతుంది కనుక మధుమేహంతో బాధపడే వాళ్ళు తగు మాత్రమే వాడాలి  .కడుపుపై మృదువుగా పనిచేస్తుంది.

ఇంకొక విషయం  .చరిత్ర ప్రకారం క్రీస్తుశకం 18 00ప్రాంతంలో ట్రావెల్కూర్ రాజ్యంలో గొప్ప కరువు వచ్చిందట  .అప్పటి రాజు తిరునాళ్ రామ వర్మ అతని తమ్ముడు తిరుణాల్ మహారాజు ప్రజలు కరువుని ఎదుర్కోవడానికి అనేక చర్యలను అనుసరించారు  .అందులో ఒకటి ఆహార వనరుగా   ఈ పిండి దుంపను ప్రవేశపెట్టడం  .రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రజలకు కర్ర పెండలం నమ్మకమైన పోషకమైన జీవనాధారంగా మారింది  .బియ్యం ఖరీదైన ఆహారంగా మారిన సమయంలో ప్రజలు వీటిపై ఆధారపడేవాళ్లు ఇది 3000 సంవత్సరాలుగా చైనీస్ వంటకాలలో కీలక పదార్థం .

తర్వాత దేని గురించా అని ఆలోచిస్తున్నారా  ?

తర్వాతది బార్లీ  .  ప్రపంచంలో నాలుగవ ముఖ్యమైన పంట బార్లీ  . ఇండియాలో ఆరవ స్థానంలో దీని దిగుబడి  . శరీర దారుఢ్యాన్ని పెంచుతుంది .  మంచి పోషకాలు కలిగిన ధాన్యం  .మిడిల్ ఈస్ట్ ప్రాంతాలలో వాడిన మొట్టమొదటి సి రియల్  .కనీసం 9000 సంవత్సరాలకు పూర్వమే దీని పండించేవారు అనడానికి చారిత్రక ఆధారాలున్నాయి . ప్రాచీన కాలంలో ఈజిప్టులో పండించేవారు  .ఇందులో అధిక శాతం ప్రోటీన్ బి కాంప్లెక్స్ విటమిన్లు ఉన్నాయి. పండిన పంటలో అధిక భాగం మాల్టుగా మారుస్తారు . పశువుల దానాలో వాడే ముఖ్య పదార్థం కూడా . మాల్ట్ సారాన్ని పసిపిల్లల , వృద్ధుల ఆహారంలో వాడుతారు.

జీర్ణ క్రియలో వచ్చే సమస్యలను సవరించడానికి బార్లీ నీటిని కొంచెం కొంచెంగా దినం అంత తాగా లి . మిగిలిన ఆహారం పరిమాణాన్ని తగ్గిస్తూ ఇలా తాగడం అనేది నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో  అలవాటు .బార్లీ ని ఆహారంగా పానీయాలలో పశువుల దానా గా ఉపయోగిస్తారు . ఇందులో ఫైబర్ ఉంది . కొలెస్ట్రాల్  ,రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో  చాలా ఉపయోగం  .ఈ ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది   .మలబద్ధకాన్ని నివారిస్తుంది  .క్యాలరీలు బాగా తక్కువ. కడుపు నిండిన భావన కలిగిస్తుంది  .ఈ కారణంగా బరువు తగ్గడంలో కూడా ఇది   ఉపకారి . గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది  .పురాతన రోమ్ లో గ్లాడియేటర్లు బార్లీని ప్రధాన ఆహారంగా తీసుకునేవారుట . దీన్ని సాగు కూడా చాలా సులభం  .అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ తట్టుకొని పెరుగుతుంది  .

సంపూర్ణ ఫలం

సంపూర్ణ ఫలం అంటే మనకు తెలిసిన కొబ్బరికాయ . కొబ్బరి చెట్టును కల్పవృక్షం అంటారు . అంటే చెట్టులోని ప్రతి భాగం మనకు ఉపయోగిస్తుంది . నిజం చెప్పాలంటే భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో పెళ్లి  ,నిశ్చితార్థం నుంచి మొదలైన కొబ్బరితో ప్రయాణం చివరి వరకు కొనసాగుతుంది . హోమాలు, పూజలు, యజ్ఞాలు , పండుగలు ,శుభకార్యాలు అనేక ధార్మిక కార్యక్రమాల్లో కొబ్బరికాయ లేనిదే పని నడవదు.

దక్షిణ భారతదేశంలో చాలా ఇళ్లల్లో కొబ్బరి లేనిదే  రోజువారి వంట పూర్తి అవ్వదు . కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అంచనాల ప్రకారం కొబ్బరి ఉత్పత్తిలో కేరళదే 2018 వరకు అగ్రస్థానం ప్రాచీన కాలం గురించి చెప్పాలంటే పురావ స్తు తవ్వకాలలో , ఆయుర్వేదంలో , బుద్ధుని జాతక కథల్లో  ,చైనా అరేబియా యాత్రిkuల అనుభవాల్లో దీని ప్రసక్తి ఉంది . ఒకటి రెండవ శతాబ్దల ప్రారంభంలో కొబ్బరికాయ ధార్మిక కార్యక్రమాలకు వాడడం మొదలై ఉండొచ్చని ఒక అంచనా .1958లో ప్రచురించబడిన ఒక పరిశోధన పత్రంలో మనిషి ఆవిర్భావానికి ముందే పురావస్తు శాఖకు లభించిన శిధిలాల ప్రకారం కొబ్బరి చెట్లు ఉన్నాయని వ్యాసరచయితలు  కే పి వి మీన న్ , పండలై పేర్కొన్నారు .

శిలా శాసనాల మీద కూడా దేవాలయ ఆస్తులుగా ఉన్న కొబ్బరి తోటల ప్రస్తావన ఉంది   . అంతేకాదు మత్స్య పురాణం , బ్రహ్మవైవర్త పురాణం , బ్రహ్మ పురాణాలలో కొబ్బరి ప్రసక్తి ఉంది . చరక సంహితలో కూడా దీని గురించి చెప్పబడింది . ఆహారంగా మాత్రమే కాకుండా , దానికి ఉన్న ఇతర ఆరోగ్య – ఔషధ – సౌందర్య ప్రయోజనాల దృష్ట్యా దీని కల్పవృక్షం అని ఆధునిక శాస్త్రజ్ఞులు కూడా అంగీకరిస్తున్నారు  .ఆధ్యాత్మికంగా కొబ్బరికాయను మానవ శరీరానికి ప్రతీకగా పోలుస్తారు .  కొబ్బరికాయలు దిష్టి తీయడానికి కూడా వాడుతారు  .నువ్వు నక్షత్రాలను లెక్కపెట్టగలిగితే కొబ్బరితో వచ్చే ప్రయోజనాలను లెక్కించగలవు అనేది ఫిలిప్పీన్స్ సామెత  .సంప్రదాయ పద్ధతుల్లో తీసిన కొబ్బరిపాలను డైరీ ఉత్పత్తులకు బదులుగా వాడవచ్చు . కొబ్బరిలో ఉండే కొవ్వు పదార్థాలు ఎముకల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి  .కొబ్బరిలో ఉండే రాగి ,ఇనుము శరీరంలో రక్తం స్థాయిలని నిలిపి ఉంచుతాయి కొబ్బరి కు న్న బహుముఖ ప్రయోజనాల వల్ల సాంఘికంగా ,ఆధ్యాత్మికంగా , ఆర్థికంగా ఈ పంటకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.

బియ్యం

ఇక మన ముఖ్య  ఆహారమైనటువంటి బియ్యం దగ్గరికి నడుద్దాం . కోట్లాది ప్రజలకు ప్రధాన ఆహారం బియ్యం  .ఇవి పండినప్పుడు వడ్లు . పొట్టు తీసితే బియ్యం .ఉడికితే అన్నం  .ఆసక్తికరమైన విషయాలు ఎన్నో కలిగి ఉన్న ధాన్యం బియ్యం  .అన్నం అంటే పోషించేది ఆయుష్షుని ఇచ్చేది సంరక్షించేది మాత్రమే కాదని సంసార జీవితాన్ని సుఖమయం చేసేదని ప్రఖ్యాత వైద్యుడు సుస్రుతుడు 2000  సంవత్సరాల కిందటే  చెప్పాడు  .వేలాది సంవత్సరాల నుంచి ఈ ధాన్యం మనకు తెలుసని , చైనా , దక్షిణ తూర్పు ప్రాంతాల్లో పండించే వారని చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ప్రపంచ జనాభాలో సగం కంటే ఎక్కువ మందికి ఇది ప్రధాన ఆహారం  .శక్తిని పిండి పదార్థాలని ఇస్తుంది .

చాలా ఆసియా దేశాల్లో ఈ పంటను పవిత్రంగా భావిస్తారు  .వేడుకల్లో సంప్రదాయాల్లో తప్పక ఉపయోగిస్తారు . ప్రపంచవ్యాప్తంగా 1,20,000 మించిన బియ్యం రకాలు ఉన్నాయి   .దేనికదే పోషకాలు , రంగు , రుచి లలో విభిన్నం . ఒక అంచనా ప్రకారం ఒక కిలో బియ్యం పండడానికి సగటున 5000 లీటర్ల నీరు కావాలి  .

కొన్ని సంస్కృతుల్లో బియ్యం అభివృద్ధికి ప్రజన న శక్తికి ప్రతీక . 9000 సంవత్సరాల ముందు నుంచి దీని పండిస్తున్నాం .సంప్రదాయ సాగు విధానాలు ఒక తరం నుంచి మరో తరానికి అందించబడుతూ వచ్చాయి  .ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు ఉడికించడం , ఆవిరిపై ఉడికించడం  ,వేయించడం  ,అంతేకాదు వీటిని వాడి  అసంఖ్యాకమైన వంటకాలు కూడా చేయొచ్చు.

ఇంకా ఉంది

ఎన్నో సౌందర్య ఉత్పత్తుల్లో బియ్యాన్ని వాడుతారు  .బియ్యం కడిగిన నీళ్లు కూడా సౌందర్య పోషణలో ఉపయోగిస్తారు  .దక్షిణ భారత దేశంలో  పిల్లలకు తినిపించే  మొదటి ఆహారం బియ్యమే . అంటే అన్నమే . బియ్యాన్ని  వేయించి  , రవ్వలాగా విసిరి , ఉడికించి  పిల్లలకి తినిపిస్తారు  .

ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ప్రభావితం చేసే అంశాలలో వరి ఉత్పత్తి ఒకటి ఎందుకంటే ప్రతి ఏటా 500 మిలియన్ టన్నుల బియ్యం ఉత్పత్తి అవుతున్నాయి కోట్లాది ప్రజలకు ఆహార భద్రతను కల్పించేది వరి పంట మాత్రమే . జవాన్ లో దీని పవిత్రమైన పంటగా భావిస్తారు  .సంప్రదాయక వేడుకల్లో , పెళ్లిళ్లలో ముఖ్యపాత్ర పోషిస్తుంది. బౌద్ధ సంప్రదాయంలోను దీనికి ప్రముఖ స్థానం ఉంది  . ఆరోగ్యపరంగా చూస్తే సులువుగా వేగంగా జీర్ణం  అవుతుంది  .

చివరగా మరొక్క మాట అన్నం తినడానికి వేళాపాళ  తప్పనిసరిగా ఉండాలి .వేళకు  తింటేనే ఆయువు   , వీర్యపుష్టి ,బలం శరీర కాంతి పెరుగుతాయి .

మన వంటింట్లో ఉండే జంట కవుల గురించి చెప్పుకోకుంటే ఈ వ్యాసం అసమగ్రం. అసంపూర్ణం . అవే పాలు పె రుగులు .

క్షీర సాగరం

విశ్వమంతా వ్యాపించిన ముఖ్య ఖాద్య  పదార్థం పాలు . ఆరోగ్యాన్ని పెంచేది  .ఆరోగ్యం బా లేకుంటే కోలుకోవడానికి సహకరించేది పాలే . ఇది సంపూర్ణ ఆహారం అని చెప్పొచ్చు . కొబ్బరి సంపూర్ణఫలమైతే పాలు నిస్సందేహంగా సంపూర్ణ ఆహారం  .అనాది నుంచి పశు సంబంధిత పాలను మానవులు వాడుతూ ఉన్నారు . సాధారణంగా ఆవు, బర్రె ,మేక పాలను వాడుతారు  .కొన్ని ప్రాంతాల్లో గుర్రపు పాలు కూడా వాడుతారు .కొన్ని ప్రత్యేక సందర్భాలలో గాడిద పాలను మందులా  వాడతారు  .

తక్కువ చక్కెరతో తల్లిపాలకు రెండు రెట్ల ప్రోటీన్ తో ఆవు పాలు ఉంటాయి  .ఆవు పాలలో కంటే గేదె  పాలలో కొవ్వు ఎక్కువ ఆరోగ్యాన్ని సంరక్షించుకోవడానికి అత్యవసరమైన విటమిన్లు, అనేక ఖనిజాలు ,కొవ్వు పదార్థాలు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి ఆవు పాలలో.

ఒక లీటర్ పాలలో ఒక మనిషికి ఒక రోజుకు అవసరమైన కాల్షియం, ఫాస్ఫరస్ మొత్తం లభిస్తాయి. పాలు అరగడానికి గంటన్నర సమయం పడుతుంది. ప్రాచీన వైద్యుడు చరకు ని అభిప్రాయంలో పాలు మనలో బలాన్ని, జ్ఞాపకశక్తిని పెంచుతాయి. అలసటను దూరం చేసి ,శక్తినిస్తాయి .ఆధునిక పరిశోధనలు చరకుని  అభిప్రాయాన్ని బ లపరుస్తున్నాయి .పసిపాపల నుండి పండు వృద్ధుల వరకు అందరికీ సరిపోయే ఆహారం  . గర్భిణులకు బాలింతలకు సమానంగా ఉపయోగం ఈ పాలే . సన్నగా బరువు తక్కువగా ఉన్న వారికి పాలు గొప్ప ఆహారం . రక్తప్రసరణ సరిగా లేని వారికి ఇవి  చాలా ఉపయోగం. ఎసిడిటీకి మంచి మందు చల్లని పాలు .నిద్ర పట్టని వారికి  పడుకునే ముందు కొంచెం తేనె కలిపిన గోరువెచ్చని పాలు గొప్పగా పనిచేస్తాయి  .జలుబు, గొంతులో గరగర ,టాన్సిలైటిస్ అస్తమా వంటి శ్వాస సమస్యలకు లాభకారి  .ఓ గ్లాస్ పాలలో చిటికెడు పసుపు నాలుగు లేక ఐదు నలగొట్టిన మిరియాలు కలిపి మూడు రోజులు వరసగా రాత్రులు తాగితే మంచి ఫలితం ఉంటుంది  .

సౌందర్య పోషణలోనూ ప్రముఖ పాత్ర పాలది . పాల ప్రసక్తి లేకుండా మనకు విందులు, పండుగలు, వేడుకలు, వినోదాలు పూర్తి కావు. పూజలోనూ పాలది ప్రముఖ  స్థానం .

పాలు అనే మాటను  భాగం అనే అర్థం లోను వాడతాం. ఈరోజుల్లో సోయా గింజల నుంచి బాదాం కొబ్బరి లతో సహా అనేక పదార్థాల నుండి పాలను తయారు చేస్తున్నారు .బజార్లో అందుబాటులో ఉన్నాయి కూడా.

 పాముకు పాలు పోసి పెంచిన విషమే కక్కుతుంది

 పాలలో పంచదార ఒలికినట్లు అని సామెతలు ఉన్నాయి. మేకపాలు అనగానే గాంధీజీ గుర్తొస్తారు. తెల్లని వన్నీ  పాలని నల్లనివన్నీ నీళ్లు అనుకుంటాడు అని అమాయకులను గురించి చెప్తూ ఉంటాం. ప్రపంచంలోని  పాల ఉత్పత్తిలో 85% ఆవుపాలు 11% గేదె పాలు 2 శాతం మేకపాలు ఉంటాయి. ఉత్తర భారతంలో పాలను అలాగే తీసుకుంటారు . అదే దక్షిణ దేశంలో కాఫీ లేదా టీ ద్వారా తీసుకుంటాం. పెరుగు లేదా మజ్జిగ రూపంలోనూ వాడతాం .

మరి కాస్త

పాలలోంచి తయారయ్యే  ఉత్పత్తులు లెక్కలేన  న్ని .  పెరుగు ,మజ్జిగ, మీగడ ,నెయ్యి   అందరికీ నచ్చిన పనీ ర్  గురించి చెప్పే పనేలేదు  .మన మిఠాయిల్లో పాల ఉత్పత్తులు ముఖ్యపాత్ర వహిస్తాయి. పూర్వం రోజుల్లో ముఖ్యంగా గ్రామాల్లో అందరి ఇళ్లల్లోనూ పాడి ఉండేది. పాలు పెరుగు అమ్మడం నా మోషిగా భావించేవారు .మజ్జిగ అనగానే నాకు మధురానగరి  లో చల్ల నమ్మ బోదు  అని చక్కటి అందమైన గీతం గుర్తొస్తుంది దాని గురించి మరోసారి చెప్పుకుందాం.

నాగుల చవితికి నాగుల పంచమికి పుట్టలో పాలు పోయడం తెలుగువారి సనాతన సంప్రదాయం .మనం కొలిచే లక్ష్మీదేవి క్షీరసాగర కన్యక కదా! పాలు పొంగిస్తేనే గృహప్రవేశ వేడుక మొదలవుతుంది .పాలు అనగానే క్షీరసాగర మధనం చవితి  చంద్రుని కథ గుర్తు వస్తాయి. పాల ఉత్పత్తుల కథ చెప్పాలంటే మరో భారతం అవుతుంది

పెరుగు

పెరుగు గురించి చెప్పకుండా పాల కథ అసంపూర్ణం .పాలను  కాసింత పెరుగు వేసి ,తోడు పెడితే వచ్చేదే పెరుగు .ఆహ్లాదాన్ని ఉత్సాహాన్ని ఇచ్చేది. ఆ  రుచి మళ్లీ మళ్లీ  తినాలనిపిస్తుంది .యూరప్ అమెరికాలో సాధారణంగా ఆవుపాల పెరుగును వాడితే ,భారతదేశంలో గేదె పెరుగును ఎక్కువగా వాడతారు.రష్యాలో మేక, గొర్రె ,గుర్రం పాలను ఎక్కువగా పెరుగు తయారీలో వాడతారు .పెరుగు నాణ్యత మంచి పాలపై చక్క టి తోడు పై ఆధారపడి ఉంటుంది .వేసవికాలంలో పెరుగు త్వరగా తోడుకుంటుంది .చలికాలంలో ఎక్కువ సమయం తీసుకుంటుంది .కనుక పైనుంచి పెద్ద గిన్నెనో  కంబళినో కప్తారు .వేడి దినాల్లో పెరుగు తయారు కావడానికి 6 నుంచి 8:00  గంటలు పడితే చలికాలంలో 12 నుంచి 16 గంటల కావాలి .ఆహార శాస్త్రాన్ని గమనిస్తే టర్కీలో   తొలుత పెరుగు తయారైందని తెలుస్తుంది. మన దేశంలో పాలతోపాటు పెరుగునూ  సంపూర్ణ ఆహారంగా పరిగణిస్తారు.

పెరుగు శక్తి నిచ్చే  ఆహారం .అవసరమైన ప్రోటీన్ విటమిన్లు మినరల్లు  ఉంటాయి .క్యాల్షియం కూడా దండిగా ఉంటుంది .దీనిలోని ప్రోటీన్లు పాల ప్రోటీన్లకన్నా తేలిగ్గా జీర్ణం అవుతాయి .ఒక అంచనా ప్రకారం తా గిన పాలలో 32 శాతం గంటలో జీర్ణ మైతే అదే గంటలో 91% పెరుగుజీర్ణ మౌతుంది .  పేగులపై ,పొట్టపై మృదువుగా పనిచేస్తుంది .మృదువైన చర్మానికి ఓట్స్ పొడిని పెరుగుతో కలిపి ప్యాక్లా వాడతారు. సౌందర్య సాధనంగానే కాదు, భారతీయులు చాలా వంటల్లో పెరుగును చేరుస్తారు. కేవలం పెరుగు ముఖ్య పదార్థంగా లస్సీ , దహి వడ ,దధి  ఓ ధనం వంటి వంటలు ఎన్నో చేస్తారు. రోజు పెరుగు తినడం వల్ల రక్తప్రసరణ బాగా జరిగి ,గుండె జబ్బులు రావని పలు అధ్యయనాల్లో తేలింది . దీని లోని  లాక్టోబర్ బ్యాక్టీరియా శరీరంలో తెల్ల రక్త కణాలను పెరిగేలా చేస్తుంది.

చాలామందికి పెరుగన్న తినకపోతే భోజనం పూర్తయినట్లు కాదు రోజు పెరుగు సేవిస్తే ,వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది . ఆయుర్వేదం గేదె పాల పెరుగు కంటే ఆవుపాల పెరుగు మంచిదంటుంది .అయితే ఈ ప్రయోజనాలన్నీ తాజా పెరుగులోనే  లభ్యం .మనదేశంలో ఉత్పత్తి అయ్యే పాలలో దాదాపు 46% పాల రూపంలో వాడితే తక్కిన 54% పాల పదార్థాల వినియోగిస్తున్నాం.

ఇవన్నీ మనకు తెలిసినవే అంటారా . నిజమే. మరోసారి ప్రేమగా , అభిమానంతో గుర్తు చేసుకోవడమే .

రెండవ  , చివరి భాగం త్వరలో  .

మళ్ళీ కలుద్దాం .

September 21, 2025 3 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni September 21, 2025
written by Narendra Sandineni

గాజోజు నాగభూషణం ప్రాణదీపం కవిత
కవిత్వం ఓ విశ్లేషణా
‌ప్రముఖ కవి,ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు, గాజోజు నాగభూషణం కలం నుండి జాలువారిన ప్రాణ దీపం కవితా సంపుటిలోని ప్రాణ దీపం కవితపై విశ్లేషణా వ్యాసం.ప్రాణ దీపం కవిత నాకు చాలా నచ్చింది.వేదనలోంచి కవిత్వం పుడుతుందంటారు. అది అక్షరాలా నిజమనిపిస్తోంది.కవి నాగభూషణం ఆషామాషీగా కవిత్వం రాసే వ్యక్తి కాదు.నిబద్ధత కల వ్యక్తి.ప్రాణ దీపం కవితలో అమ్మతో గడిపిన బాల్యాన్ని ఆమెతో పెనవేసుకున్న బంధానికి అక్షర రూపం ఇచ్చాడు.ప్రాణ దీపం కవిత చదువుతుంటే దుఃఖం వస్తుంది.నాకైతే రెండు మూడు రోజులు సరిగా నిద్ర పట్ట లేదు.కవి నాగభూషణం అమ్మ గురించి కవిత రాశాడు.కవితకు ప్రాణ దీపం పేరు పెట్టాడు.నిజంగా మనం ఒక్కసారి మనసు పెట్టి కవిత చదివితే మనకు అమ్మ ప్రాణ దీపం అన్న సంగతి ఎరుకలోకి వస్తుంది.అమ్మ గురించి ఎందరో కవులు కవితలు,గేయాలు, పద్యాలు రాశారు.ప్రాణ దీపం కవిత హృదయానికి హత్తుకునేలా ఉంది.నేటి సంక్షుభిత సమాజంలో అమ్మలు ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ తమ కన్న పిల్లలను సాకుతున్నారు. అయినప్పటికీ ఎన్నో కష్టాలను ఎదుర్కొన్న అమ్మలను మనం మరియు మన సమాజం వృద్ధాప్యంలో సరిగా చూడడం లేదు.అమ్మలను వృద్ధుల ఆశ్రమాల్లో చేర్పిస్తున్నట్లు మనం రోజు వార్తా పత్రికల్లో చదువుతున్నాం.మానవ సంబంధాలన్నీ మసక బారిపోతున్నాయి.మానవ సంబంధాలు మనీ సంబంధాలుగా కొనసాగుతున్నాయి.జీవితంలో అమ్మ ఎదుర్కొన్న కష్టాలను,కన్నీళ్లను,వేదనలను అక్షరీకరించడం సామాన్యమైన విషయం కాదు.కందుకూరి రమేష్ బాబు అమ్మ గురించి సామాన్య శాస్త్రంలో వేలాది మంది అమ్మల ఫోటోలను గ్యాలరీలో ప్రదర్శించారు. కందుకూరి రమేష్ బాబు సామాన్య శాస్త్రం గ్యాలరీకి గాజోజు నాగభూషణం అమ్మ చిత్రం కూడా ప్రదర్శనలోకి చేరాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.ప్రాణదీపం కవిత అమ్మ యొక్క చరిత్ర.అమ్మ చరిత్రను ప్రాణ దీపం కవితలో ఆవిష్కరించడం అద్భుతంగా ఉంది.ప్రముఖ కవి, రచయిత,శ్రీ ఎస్.కె.పిళ్లె అమ్మ స్మృతిలో అమ్మ గేయ కవిత రాశారు.ప్రముఖ కవి జ్వాలాముఖి అమ్మ గేయ కవితకు పీఠిక రాస్తూ “పిళ్లెగారి కావ్య జగత్తులో ఊపిరి పోసుకుని నిలిచి వెలిగిన అమ్మ ఎవరో కాదు: పీడితుల తాడితుల విముక్తి పోరాటంలో అందరికీ వాత్సల్యాన్నందించి విప్లవకారుల సరసన నిలిచిన వీరమాత,గోర్కీ చెప్పిన ‘అమ్మ’ ఆ విశ్వమాతకు విప్లవ తేజానికి జోహార్’ అని చెప్పారు.ప్రముఖ కవి జ్వాలాముఖి పీఠికలో అమ్మ గురించి రాసిన వాక్యాల్లో ఎంతో బలం ఉంది.ప్రాణ దీపం కవితా సంపుటిని అమ్మకు అంకితమిచ్చారు.నాగభూషణంకు అమ్మంటే ప్రాణం అని మనకు తెలుస్తోంది.అమ్మను చివరి వరకు ప్రేమగా చూసుకున్నారు.ప్రాణ దీపం కవితా సంపుటికి ముఖచిత్రం ప్రముఖ చిత్రకారుడు అన్నవరం శ్రీనివాస్ వేశారు.చాలా చక్కగా ఉంది. ముఖచిత్రం వెనకాల నాగభూషణం కుమారుడు అక్షయ్ కపిల్ నానమ్మ యాదిలో చిత్రం గీశారు. చక్కటి చిత్రాన్ని గీసిన అక్షయ్ కపిల్ ను అభినందిస్తున్నాను.
“చుట్టూ చీకటి కొండలు/పల్లేర్లు పరుచుకున్న దారులు/అడుగు తీసి అడుగు వేస్తే/పాదాలకు చుట్టుకొనే పగల పాములు/దూరమెంతో…. చేరే తీరమెక్కడో/అంతు చిక్కని అనంత పయనం/ అంటున్నారు.ఇవి ప్రాణ దీపం కవితలో మొదటి చరణాలు.కవి నాగభూషణం చుట్టూ చీకటి కొండలు ఉన్నాయంటున్నారు.


“పల్లేర్లు పరుచుకున్న దారులు/అంటున్నారు.పల్లెల్లో చేనులు,చెల్కల్లోని దారుల్లో పల్లేర్లు ఉంటాయి. చేనులు చెల్కల్లో నడుస్తున్నప్పుడు పల్లేర్లు గుచ్చుకుంటాయి.పాదాలకు గాయాలు అవుతాయి. పల్లేర్లు గుచ్చుకోవడం వల్ల రక్త మోడుతుంది.పల్లేర్లు
గుచ్చుకున్న పాదాల అవస్థ చెప్పతరం కాదు.
‘అడుగు తీసి అడుగు వేస్తే/పాదాలకు చుట్టుకొనే పగల పాములు/అంటున్నారు.చేనులు చెల్కల్లో ప్రయాణిస్తున్న అమ్మ అడుగు తీసి అడుగు వేస్తే పగల పాములు పాదాలకు చుట్టుకునేవి.కవి నాగభూషణం పగల పాములు అనడం ప్రతీకలా ఉంది.నేటి వ్యవస్థలో మన కుటుంబంలోని కొందరు మన చుట్టూ నివసించే ఇరుగు పొరుగు వారు పగతో పాములా బుసలు కొడుతుంటారు వారు. ఈర్ష్యా,అసూయా ద్వేషాలతో ఏం చేయడానికైనా వెనుకాడరు.ఈర్ష్యా,అసూయా,ద్వేషాల,జాడ్యం ఇప్పుడు అడుగడుగునా కనిపిస్తుంది.ఈర్ష్య, అసూయతో ద్వేషాలతో రగిలేవాళ్లు మంచితనాన్ని ఓర్వ లేరు.మంచిగా పని చేసుకునే వాళ్లను పని చేసుకోనివ్వరు.ఎప్పుడు ఏదో ఆటంకం కలిగిస్తూ ఉంటారు.ఇతరులు బాధ పడుతుంటే చూసి ఆనందంతో పండుగ చేసుకుంటారు.
‘దూరమెంతో… చేరే తీరమెక్కడో/అంతు చిక్కని అనంతపయనం/అంటున్నారు.అమ్మ పయనంలో దూరమెంతో చేరే తీరం ఎక్కడో అంతుచిక్కని అనంతపయనం అన్న పదాలు అక్షరాల నిజమనిపిస్తాయి.అమ్మ జీవన ప్రయాణం అంతు చిక్కని అనంత పయనం.
‘ఏ గాలికి దీపం ఎప్పుడు ఆరుతుందో/ అంటున్నారు.ఒకప్పుడు దీపాల కింద బతికిన రోజులు.గ్యాస్ నూనె పోసి కందీళ దీపం వెలిగించే వారు.రాత్రంతా కందీళ దీపం వెలుగుతుండేది. జడివాన గాలి హోరుకి కందీళ దీపాలు ఆరిపోతుండేవి.తర్వాత,తర్వాత కరెంటు వచ్చింది. కరెంటు లేనప్పుడు మసక చీకటిలోనే జీవనం కొనసాగింది.
‘చిల్లుపడి,నావ ఎక్కడ మునుగుతుందో/ అంటున్నారు.చిల్లుపడితే నావ మునుగుతుందని, గాలికి దీపం ఆరిపోతుందనే విషయం మనకందరికీ తెలుసు.రంధ్రం పడిన నావ ఎక్కడ మునుగుతుందో తెలియని విధంగా జీవితం ఎక్కడ ఆగిపోతుందో తెలియదు.
‘అంతా తాయి మాయి తండ్లాట/అంటున్నారు. తాయి మాయి తండ్లాట తెలంగాణ పదం.ఏదీ మనసున పట్టుకుంట ఆగమాగం కావడం దీని అర్థం.
‘అయినా నడక సాగాలి/నడకలింకా నేర్వని నాలుగు పసి కెరటాలను/తీరానికి చేర్చే తిమిర సమరంలో’/ ఏకాంత కడలివీ నువ్వే/అలల నెదిరించి నడిచిన నావవూ నువ్వే/అలసటెరుగక నడిపిన సరంగువు నువ్వే/అంటున్నారు.అమ్మ నడక సాగుతూనే ఉంది.అమ్మకు నలుగురు పిల్లలని తెలుస్తుంది. నడకలింకా నేర్వని నాలుగు పసి కెరటాలు వాళ్ళు. నలుగురు పిల్లలకు విద్య వినయం నేర్పాలి. నలుగురు పిల్లలను తీరానికి చేర్చే తిమిర సమరంలో ఏకాంత కడలివి నువ్వే.పెను విషాదంలో ముంచి నాన్న అందనంత దూరానికి వెళ్లిపోవడం వల్ల అమ్మ ఒంటరిదైంది.జీర్ణించుకోలేని నిజం ఇది. అందుకే కవి నాగభూషణం అమ్మను ఏకాంత కడలివి నువ్వే అన్నారు.
‘అలలనెదిరించి నడిచిన నావవూ నువ్వే/
‘అల‌సటెరుగక నడిపిన సరంగువు నువ్వే/
అమ్మ అలల నెదిరించి నావను నడిపింది. అలసటెరుగక నడిపిన సరంగు అమ్మ.అమ్మ జీవిత పోరాటంలో అలుపెరగకుండా సాహసంతో జీవనం కొనసాగించింది.
‘తిమింగలాలను తప్పించి/అమంగళాలను దాటించి/ కాలాన్ని కత్తి మొనపై నిలిపి/కడకు తీరానికి మమ్ము చేర్చి/అంటున్నారు.అందనంత దూరానికి అమ్మ నువ్వెళ్ళి పోయావు.సముద్రంలో నావ నడుస్తూ ఉంటే తిమింగలాలు (ఒక రకమైన పెద్ద చేపలు) నావకు అడ్డుగా వచ్చినప్పుడు వాటిని తప్పించి నావను నడపాలి.అమంగళాలు అంటే అరిష్టము, అశుభము.జీవన పయనంలో ఎదురయ్యే కష్టాలను ఎదుర్కొని అమ్మ ముందుకు నడిచింది.కాలాన్ని కత్తి మొనపై నిలిపి కడకు తీరానికి మమ్ము చేర్చి అందనంత దూరానికి అమ్మ వెళ్ళిపోయింది. ఎవరైనా మిత్రులు కాని బంధువులు కాని కనిపిస్తే అమ్మ బాగా ఉందా అని అడుగుతాం.అమ్మ చనిపోయింది అని ఎవ్వరు చెప్పరు.అమ్మ కాలం చేసింది అని చెప్తారు.ఏదో ఒక రోజు భూమ్మీద పుట్టిన ప్రతి మనిషి కాలగర్భంలో కలిసి పోవాల్సిందే.నావలో కూర్చున్న మమ్ము తీరానికి చేర్చి అమ్మ అందనంత దూరానికి వెళ్లిపోయిందని చెప్పడం బాగుంది.
‘నువ్వు లేని లోకమిప్పుడు/చుక్కలు రాలిన ఆకాశంలా/మొక్కలు మొలువని ఎడారిలా/
దిక్కులు కానరాని దిగులు ప్రయాణంలా/ దీనమై,హీనమై,శూన్యమై/బ్రతుకు రంపపు కోతై/లోలోన రక్తమోడుతోంది/అంటున్నారు.
అమ్మ లేని లోకం ఇప్పుడు చుక్కలు రాలిన ఆకాశంలా ఉంది.చుక్కలు అంటే నక్షత్రాలు. నక్షత్రాలు ఉంటేనే ఆకాశానికి కాంతి,అందం అని మనందరికీ తెలుసు.మొక్కలు మొలువని ప్రాంతాలు ఎడారులు.ఎడారి ప్రాంతం పచ్చదనం కొరవడి వికారంగా ఉంటుంది.ప్రకృతి అంటే చెట్టు చేమలతో వాటి కదలికలతో ఎంతో సుందరంగా ఉంటుంది.ప్రకృతి సౌందర్యం చెప్పనలవి కాదు. దిక్కులు తోచని దిగులు ప్రయాణం ఎంత ఘోరంగా ఉంటుందో మనమందరం ఎరిగినదే. ‘దీనమై,హీనమై,శూన్యమై/బ్రతుకు రంపపు కోతై/రక్తమోడుతుంది/అంటున్నారు.అమ్మ లేని కుటుంబం పొందే దిగులును మాటల్లో వర్ణించలేం. కవి నాగభూషణం అమ్మ లేని బ్రతుకు రంపపు కోతకు గురి అయి రక్త మోడుతున్నట్లుగా ఉందని కవిత ద్వారా చక్కగా వివరించారు.
‘ఇయ్యాల అమ్మల దినమంట/తాతలైన వాళ్లైనా, తండ్రులైన వాళ్లైనా/పావురంగా,గావురంగా/అమ్మ ఒడిలో పసిపిల్లలై/ముసి ముసి నవ్వులతో మురిసిపోతున్నారు/నన్నెందుకమ్మా అమ్మ లేనివాన్ని చేసావు/ అంటున్నారు.పాశ్చాత్య దేశాల్లో మొదలైన మదర్స్ డే వేడుకలు.ఇప్పుడు ప్రపంచమంతా జరుపుకుంటున్నారు.మదర్స్ డేను ఒక పండుగగా జరుపుకుంటున్నారు.నవ మాసాలు మోసి కంటుంది అమ్మ.తన పిల్లలను పెంచి పెద్ద చేస్తుంది.ఎన్ని కష్టాలైనా భరిస్తుంది.పిల్లలను చూసి ముసి ముసి నవ్వులతో మురిసి పోతుంది.పిల్లల్ని ఎత్తుకొని ఆడిస్తుంది.పిల్లలను పాడిస్తుంది.నన్నెందుకమ్మా అమ్మలేని వాన్ని చేసావు అనే వాక్యాలు చదువుతుంటే కళ్ళల్లో దుఃఖం పెల్లుబికి వస్తుంది. అమ్మకు సాటి ఎవ్వరు రారు.అందుకే అమ్మను మాతృదేవోభవ అన్నారు.కనిపించే దేవత అమ్మ. అమ్మ కనిపించకుండా పోతే ఎంతో దిగులుగా ఉంటుంది.ఆ కుటుంబానికి కలిగిన బాధను ఎవరు తీర్చలేరు.అమ్మ స్థానంలో మరెవరు ఆ ప్రేమను, అనురాగాన్ని పూరించలేరు.ఇవాళ వృద్ధాప్యంలో అమ్మను సరిగా చూడడంలేదు.ఈనాడు అమ్మ తన ఇంట్లో బోసిపోయి పిల్లలు ఉండి కూడా వాళ్ళ ఆదరణ కరువై దుఃఖంతో దిగులుతో దీనంగా ఉంటుంది.కానీ,కవి నాగభూషణం అమ్మను చక్కగా చూసుకున్నారు.అమ్మల దినం రోజు అమ్మ నువ్వు ఎందుకు వెళ్ళిపోయావని బాధా తప్త హృదయంతో ఆవేదన చెందుతున్నారు. ‘పొద్దు పొడుపు కంటే ముందు/పొద్దుగాల్ల లేసి నీ మొకమే జూసెటోన్ని/ఇప్పుడు ఏ దిక్కు చూసినా/ శూన్యమే దిక్కైంది/అంటున్నారు.మనమందరం రాత్రి పడుకుంటాం.మళ్లీ ఉదయాన్నే లేస్తాం. పొద్దున లేవగానే అమ్మ మొకమే చూసే సంస్కారం ఎందరికీ ఉంటుంది.అమ్మ అందనంత దూరం వెళ్లిపోయినంక అమ్మను పొద్దు పొడుపు కంటే ముందు పొద్దుగాల్ల లేసి అమ్మ ముఖం చూడడం ఎవ్వరికి సాధ్యం కాదు.ఇప్పుడు ఏ దిక్కు చూసినా అమ్మ లేకుంటే శూన్యమే దిక్కైంది అన్నది అక్షరాలా నిజమనిపిస్తుంది.
“ఇంద్ర లోకమో…చంద్ర లోకమో/నాకైతే తెల్వదు గానీ/చంద్రబింబం లాంటి నీ మొకం మీద/ముద్దు పెట్టుకొనుటానికి/అన్ని లోకాలు దాటి నీ/కన్న పేగు కోసం ఒక్కసారి కదిలి రామ్మా/అంటున్నారు.అమ్మ చని పోయిన తర్వాత ఎక్కడకు వెళుతుందో ఎవ్వరికి తెలియదు.మన పురాణాలు చెప్పినట్లు ఇంద్రలోకం,చంద్ర లోకం ఇంకా మరెన్నో లోకాలు ఉన్నాయి.స్వర్గం,నరకం అని ఏవేవో మనం అనుకుంటాం.కానీ,అవి అన్ని మన ఊహకు అందనివి.ఇంద్ర లోకమో చంద్ర లోకమో నాకైతే తెల్వదు గాని చంద్రబింబం లాంటి నీ మొకం మీద ముద్దు పెట్టుకొనుటానికి అన్ని లోకాలు దాటి ఒక్కసారి కదిలి రామ్మా అనడం ఎంతో బాగుంది.
“బతుకు నాకిచ్చి నువ్వెళ్ళి పోయినంక/ఇప్పుడు బతుకమ్మ పండుగచ్చింది/ఏ వరుసలో ఏ పువ్వు పేర్చిన/నీ నవ్వు మొకమే కనిపిస్తుంది/అంటున్నారు. బతుకమ్మ పండుగ తెలంగాణలో పెద్ద వేడుకగా జరుపుకుంటారు.ఇంటిముందు బతుకమ్మ పేర్చి స్త్రీలందరు బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని పాడుతూ ఆడతారు.స్త్రీలందరికీ బతుకమ్మ పండుగ అదొక వేడుక.ఆడపిల్లలు తమ తల్లుల ఇంటికి వెళతారు.బతుకమ్మ పండుగకు ఇంట్లో తీరొక్క పూలతో బతుకమ్మను పేరుస్తారు.ఏ వరుసలో ఏ పువ్వు పేర్చిన నీ నవ్వు మొకమే కనిపిస్తుంది అంటున్నాడు.అమ్మ ఉన్నప్పుడు ఆనందంగా బతుకమ్మను పేర్చేది.
“నువ్వు లేవన్న నిజం/నిలువెల్లా నిప్పులా కాలుస్తుంది/అంటున్నారు.బతుకమ్మ పండుగ రోజు నువ్వు లేవన్న నిజం నిలువెల్లా నిప్పులా కాలుస్తుంది అని కవి నాగభూషణం తల్లి లేక పోవడం వల్ల కలిగిన బాధను వ్యక్తం చేస్తున్నాడు.

“కనులు మూసినా తెరిచినా/కాలాన్నెదిరించిన నీ కన్నీటి యాత్రే గుర్తొస్తుందమ్మా/అంటున్నారు.కనులు మూసినా తెరిచినా అమ్మ గుర్తుకు వస్తుంది. అమ్మతో ఆనందంగా గడిపిన రోజులు ఎప్పటికీ గుర్తుంటాయి.అమ్మ ప్రత్యక్ష దైవం.కనిపించని దేవుడు ఉన్నాడో లేడో మనం ఎరుగం.కనిపించే అమ్మ దైవం కాదన లేని సత్యం.అమ్మ కుటుంబం కొరకు తన పిల్లల కొరకు తన సంసారాన్ని నిలుపుకోవడానికి ఎంతో పోరాటం చేస్తుంది.ఆ పోరాటంలో అమ్మ విజయం సాధిస్తుంది.ఓటమి ఎదురైనా అమ్మ కుంగిపోదు.అమ్మ విజయం కొరకు మళ్ళీ మళ్ళీ ప్రయత్నించి విజయాన్ని సాధించి కుటుంబాన్ని గట్టెక్కిస్తుంది.
కాలాన్నెదిరించిన నీ కన్నీటి యాత్రే గుర్తొస్తుందమ్మా. ప్రాణం విడిచిన అమ్మను చావు డప్పులతో సాగనంపుతాం.పాడె పై శవాన్ని స్మశానానికి తరలించడానికి అందరు సహకరిస్తారు.ఇరుగు పొరుగు బంధువులు,మిత్రులు,స్నేహితులు ఆ శవయాత్రలో అందరు పాల్గొంటారు. ఇప్పుడైతే వైకుంఠధామానికి శవాన్ని తరలిస్తున్నారు. చనిపోయిన తర్వాత శవానికి స్నానం చేయిస్తారు. కొత్త బట్టలు కడతారు.పాడె మీద ఎక్కించికొని డప్పులతో తరలిస్తారు.దింపుడు కళ్లెం చేస్తారు. చివరికి కట్టెలు పేర్చి అమ్మ శవాన్ని దహానం చేస్తారు.మంటల్లో అమ్మ శరీరం బూడిదగా మారి పోయింది.కాలాన్నెదిరించిన నీ కన్నీటి యాత్ర గుర్తొస్తుందమ్మా అని ఆవేదనతో కవి నాగభూషణం బాధపడుతున్నారు.
“నెత్తిమీద నిండు వడ్ల బస్తా/ఒక చేతిలో నేను/ఇంకో చేతిలో సాయానికో కట్టె/గంగలో దిగి/ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు/ఒక్కో బస్తా నువ్వు జార గొడుతుంటే/నీ దుక్కంలో కారిన కన్నీళ్ళతో/కలిసి పారినట్లే అనిపించింది గంగ/అంటున్నారు.
అమ్మ నెత్తి మీద నిండు వడ్ల బస్తా ఎత్తుకొని నడుస్తోంది.ఒక చేతిలో కవి నాగభూషణం తల్లి చేతులు పట్టుకొని గంగలో నడుస్తున్నాడు.ఇంకో చేతిలో సాయానికో కట్టె.అమ్మ గంగలో వట్టిగ నడవడం లేదు.నెత్తి మీద నిండు వడ్ల బస్తా ఎత్తుకొని నడుస్తోంది.ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు అందుబాటులో లేవు.ఇప్పటిలాగా బస్సులు,ఆటోలు ఏవి ఉండేవి కావు.ఎక్కడికి ఏ ఊరుకు వెళ్ళాలన్న కాలి నడకన వెళ్ళే వాళ్ళు.కొన్ని ఊర్లకు వెళ్లాలంటే గంగ దాటి వెళ్ళాలి.అమ్మ గంగలో దాటి ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకు ఒక్కో బస్తా జార గొడుతుంటే ఆమె దుక్కంతో కారిన కన్నీళ్ళతో కలిసి పారినట్లు అనిపించింది గంగ.అమ్మ అలసట అన్నది ఎరుగకుండ గంగలో నడిచింది. గంగలో నీళ్ళు ఎప్పడు పారుతుంటాయి.అమ్మ దుక్కంలో కారిన కన్నీళ్ళతో కలిసి గంగ పారినట్లు అనిపించింది అన్న వాక్యాలు చదివితే మనకు కళ్ళపొంటి కన్నీళ్ళు ఉబికి వస్తాయి.గంగ దాటడం అంటే ఎంతో ప్రయాసతో కూడిన పని.నెత్తి మీద నిండు వడ్ల బస్తా చేతిలో కొడుకు నాగభూషణం మరో చేతిలో సాయానికో కట్టె అన్న వాక్యాలతో అమ్మ గంగ దాటుతున్న తీరును కళ్ళకు కట్టినట్లుగా కవి నాగభూషణం వెల్లడించాడు.
“తాత ఇచ్చిన నాలుగు వడ్ల బస్తాల సాయం కోసం/ సాహసోపేతంగా నడిచిన నీ అడుగులు/నా బతుకు పయనంలో/భరోసా నింపిన పాద ముద్రలు/ అంటున్నారు.తాత ఇచ్చిన నాలుగు వడ్ల బస్తాల సాయం కోసం అమ్మ సాహసోపేతంగా గంగలో నడిచి వడ్లను తీసుకు వచ్చి కుటుంబాన్ని కాపాడింది.అమ్మతో పాటు ప్రయాణం చేసిన కవి నాగభూషణం భరోసాతో బతుకు పయనం కొనసాగించాడు.
“ఇంటిని కాజేయాలని/కాచుకున్న గుంట నక్కలను/ గడ్డపారతో అడ్డంగా నిల్చొని ఎదిరించిన/నీ గుండె నిబ్బరమే కాదె/నా గుండెల్లో గుట్టంత దైర్యాన్ని నింపింది/అంటున్నారు.ఇంటిని కాజేయాలని కాచుకున్న గుంటనక్కలను అమ్మ ఎంతో ధైర్యంతో గడ్డపారతో ఎదిరించింది.తన కుటుంబానికి తన నలుగురు పిల్లలకు ఆ ఇల్లు బాసటగా ఉంటుందని ఈ సాహసం చేసింది.అమ్మ అలా ఉగ్ర నరసింహ అవతారం ఎత్తడం వల్లనే ఆ ఇల్లు మాకు దక్కిందని కవి నాగభూషణం అంటున్నాడు.అమ్మ నా గుండెల్లో గుట్టంత ధైర్యాన్ని నింపింది.అమ్మ తీసుకున్న చర్య కుటుంబానికి రక్షగా ఉంది.అమ్మ ఇల్లును కాపాడుకుంది.ఎందరు మహిళలు ఈనాడు సాహసంగా పోరాడుతున్నారు?అమ్మ ఆనాడు సరియైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్న చర్య అభినందనీయం.అమ్మ ఆనాడు తీసుకున్న చర్య ఈనాటి మహిళలకి ఎంతో స్ఫూర్తిగా ఉంటుంది.
“లేమితనంలో నువ్వు/ఒక్కో గడపాఎక్కి దిగుతుంటే/నీ వేలు పట్టుకొని నడిచిన నన్ను/తెలిసీ తెలియని వయసులోనే/తొలిచిన ప్రశ్న/ఇంతగా పేరుకున్న అంతరాలు/అంతమయ్యే దెట్లా/ అంటున్నారు.అమ్మ లేమితనంలో ఒక్కో గడపా ఎక్కి దిగుతుంటే నాగభూషణం అమ్మ వేలు పట్టుకుని నడిచినాడు.ఏమీ తెలియని వయసులోనే ఇంతగా అంతరాలు ఎందుకు ఉన్నాయి?అంతరాలు అంతమయ్యే దెట్లా?అనే ఆలోచన కవికి కలిగింది.
“ఆనాటి అలజడులే కదమ్మా/నాకు కొత్త దారుల్ని పరిచయం చేసింది/అంటున్నారు.అమ్మ ఎదుర్కొన్న ఆనాటి అలజడులు తనకు కొత్తదారుల్ని పరిచయం చేసింది అని కవి నాగభూషణం అంటున్నారు.
“రోజంతా ఉపాసమున్న మాకు/పెరట్లో అట్టిగనే కాసిన అనిగెపు కాయలను/ఉడికించి ఆ పూట ఆకలి దీర్చి/అంటున్నారు.పేదరికం శాపం లాంటిది. తిండికి కూడ ఉండదు.ఉపాసముండి బతకాల్సి వస్తుంది.రోజంతా ఉపాసమున్న మాకు పెరట్లో కాసిన అనిగపు(సొర) కాయలను ఉడికించి అమ్మ ఆ పూట ఆకలి తీర్చింది.అమ్మ తన పిల్లలను ఉపాసముంచదు.అనిగెపు కాయలను ఉడికించి పిల్లల ఆకలి తీర్చిన అమ్మ ప్రేమను దేనితో కొలవగలం?
“పిడికెడు బియ్యమైనా దొరకని పరీక్షా కాలాన/ఎట్టికి తెచ్చిన తౌడును రొట్టెలుగా కాల్చి/తినిపిచ్చి తీరొక్క శోకం దీసిన/అంటున్నారు.ఆ కాలంలో పిడికెడు బియ్యం కూడా దొరకని రోజులు ఉన్నాయనే వాస్తవాన్ని మనకు తెలియ జేశాడు.అమ్మ తౌడును రొట్టెలుగా కాల్చి పిల్లలకు తినిపించింది.తీరొక్క శోకం దీసింది.అమ్మ గడ్డు రోజులను తల్చుకుని ఏడ్చింది.వ్యవసాయదారులు పశువులకు తౌడు కలిపి పెడుతారు.పశువులు తినే తౌడును రొట్టెలుగా తయారు చేసి పిల్లలకు తినిపించింది.ఒరిస్సాలోని కలహండి ప్రాంతంలో గడ్డి గడ్డలను తిన్నట్లు మనం చదువుకున్నాం.ప్రాణదీపం కవిత చదువుతుంటే కన్నీళ్లు ఉబికి వస్తాయి భగవంతుడు అమ్మకు ఎన్ని బాధలు కల్పించాడు.ఆ బాధలను అమ్మతో పాటు పిల్లలు కూడా అనుభవించారు.ఇవ్వాళ కరువు దినాలు పోయి సరైన ఆహారం తింటున్నాం.ఆ రోజుల్లో తినడానికి ఏమీ దొరికేది కాదు.కరువులు, కాటకాలు పేదరికం పెను శాపంగా ఉండేది.
“దుక్కంలోంచే కదమ్మా నేను/దూసిన కత్తినై మెరిసింది/అంటున్నారు.అమ్మతో పాటు కవి నాగభూషణం దుక్కాన్ని అనుభవించాడు.అందుకే అంటున్నాడు దుక్కం లోంచే కదమ్మా దూసిన కత్తినై మెరిసింది నేను అని.
“దీపంతో పాటు నువ్వు కాలిపోతూ/ఎన్ని రాత్రులనో కరగదీసి/బీడీలు చుట్టి, ఊపిరితిత్తుల్ని/పొగ జూరిన ఉత్తి తిత్తులుగా మార్చుకున్న/నీ వేదనలోంచే కదా నాలో వేల శోధనలు వెల్లు వెత్తింది/అంటున్నారు. దీపం తాను కాలిపోతూ వెలుగును పంచుతుంది. దీపంతో పాటు అమ్మ ఎన్ని రాత్రులనో కరగదీసి వట్టిగ ఉండలేదు.అమ్మ బతకడం కొరకు కుటుంబం పోషణ చేయడం కొరకు బీడీలు చుట్టే వృత్తిని ఎన్నుకొంది.పొద్దున లేచిన దగ్గర్నుండి రాత్రి పడుకునే దాకా బీడీలు చుట్టేది.బీడీలు చుట్టే వాళ్ళ శ్రమకు వచ్చేది అరకొర కూలీ డబ్బులు మాత్రమే. అయినప్పటికీ అమ్మ ఎంతో శ్రమకోర్చి బీడీలు చుట్టి ఊపిరితిత్తుల్ని పొగ జూరిన ఉత్తి తిత్తులుగా మార్చుకున్న తీరును చూస్తే మనకు ఎంతో బాధ కలుగుతుంది.అమ్మ అనుభవించిన వేదనలోంచే కవి నాగభూషణంలో వేల శోధనలు వెలువెత్తి గొప్ప కవిగా మరియు గాయకుడిగా రూపుదిద్దుకున్నాడు.
“ఇప్పటిదాకా ముళ్ళ గాయాలను నువ్వు మోసి/ పూల వాసనలు మాకు పంచావు/అంటున్నారు. అమ్మను పూల చెట్లతో పోలుస్తున్నాడు.గులాబీ చెట్టుకు ముళ్ళు ఉంటాయి.అయినప్పటికీ మనం ముళ్ళు ఉన్న గులాబీ చెట్టును మన ఇంట్లో పెంచుతాం.గులాబీ పువ్వులు దేవుని పటాలకు అలంకరిస్తాం.గులాబీ పువ్వు కమ్మని వాసన కలిగి ఉంటుంది.స్త్రీలు తమ సిగలో గులాబీ పూలు అలంకరించుకుంటారు.ప్రేమికులు తమ ప్రేమకు గుర్తుగా ప్రియురాలుకు గులాబీ పువ్వు బహుకరిస్తారు.అమ్మ గురించి గులాబీ చెట్టులాగా ముళ్ళ గాయాలను మోసి పూల వాసనలు మాకు పంచావు అని కవి నాగభూషణం తల్లిని గూర్చి గొప్పగా చెప్పినాడు. “నన్ను పూలు లేని కొమ్మను చేసి/గాలికి మలిగిన వత్తివై నువ్వారి పోయావు/అంటున్నారు.కవి నాగభూషణం ఎంతో వేదనతో నన్ను పూలు లేని కొమ్మను చేసి గాలికి మలిగిన వత్తివై నువ్వారి పోయావు అని అమ్మను గూర్చి అంటున్నారు.మనం పూలు లేని కొమ్మను ఆదరించం.గాలికి వెలిగిన దీపం ఆరిపోవడం సహజమని భావగర్బితంగా చెప్పిన వాక్యాలు ఇవి.
“ఇప్పుడు నాకంటూ మిగిలిందల్లా/ తడియారకుండా ఉన్న/నీ తలపుల తవ్విపోతలే/ అంటున్నారు.అమ్మ వెళ్ళిపోయిన తర్వాత మనకు ఉండేవి అమ్మ మిగిల్చిన జ్ఞాపకాలు మాత్రమే. అప్పుడప్పుడు అమ్మ జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చుకుంటాం.మనకు ఇష్టమైన అమ్మ జ్ఞాపకాలను ఇతరులతో పంచుకుంటాం.కవి నాగభూషణం ఇప్పుడు నాకంటూ మిగిలిందల్లా తడి ఆరకుండా ఉన్న నీ తలపుల తవ్విపోతలే అనడం ఎంతో బాగుంది.
“నడిచే దారుల్లో/నీ విలువల విత్తనాల్ని నాటుకోవడమే/పొడిచే పొద్దు/నీ ముద్దు మోమేనని మురిసిపోవడమే/అంటున్నారు.అమ్మ అందరాని లోకాలకు వెళ్ళిపోయింది.అయినప్పటికీ అమ్మ వెళ్లిపోయిన తర్వాత మన జీవితానికి కొనసాగింపు ఉంటుంది.అమ్మ వెళ్లిపోయిన తర్వాత మనం నడిచే దారుల్లో అమ్మ అందించిన విలువల విత్తనాల్ని నాటుకోవడం,పొడిచే పొద్దులో అమ్మ ముద్దు మోమును చూసి మురిసి పోవడం తన దినచర్యగా మారిందని కవి వ్యక్తం చేయడం గొప్పగా ఉంది.
“మాలో వెలుగుతున్న/మమ్మల్ని వెలిగిస్తున్న/ప్రాణ దీపం నువ్వే కదమ్మా/ అంటున్నారు.అమ్మ మనల్ని నవ మాసాలు మోసి కన్నది.అమ్మ ప్రేమతో పెంచి పెద్ద చేసింది.అమ్మ చేయినందుకుని పెరిగాం. అమ్మనే మనకు వెలుగును ఇచ్చింది.అమ్మా! మమ్ము వెలిగిస్తున్న ప్రాణ దీపం నువ్వే కదమ్మా అనడం అక్షరాలా నిజం.అమ్మ ప్రాణ దీపం వెలుగులు కవి నాగభూషణంకు అందాలని మనసారా కోరుకుంటున్నాను.విశ్వంలో ఉన్న ప్రతి తల్లి ప్రాణదీపమై తన సంతానానికి వెలుగులు పంచాలని ఆశిస్తున్నాను.కవి గాజోజు నాగభూషణం మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కాంక్షిస్తున్నాను.

September 21, 2025 3 comments
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • వేకువ పాట
  • చాణుక్యుడు ఆదిశంకరాచార్యుల ప్రభావం ఒక సింహావలోకనం
  • సనాతనమంటే?
  • సమాజానికి హానికరమైనవిగా కాక ఉపయుక్తమైన రచనలు చేయాలి- డా. జి. చెన్నకేశవరెడ్డి
  • సాహిత్యాకాశంలో నక్షత్రాక్షర తోరణం- అక్షరగీతం

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us