మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
Uncategorized

డాక్టర్ చిటికెన కిరణ్ కుమార్ గారి కథలకు సమీక్ష

by Dr. Vasundhara July 20, 2025
written by Dr. Vasundhara

శీర్షిక. అంబోధిలో ఆణిముత్యాలు

విషయ సూచిక
1ముందుమాట 2రచయిత,చిరుపరిచయం
3 కథల సమీక్షలో,
పాత్రలు
సంభాషణ
అంతరార్థం
సందేశం. మొ!!నవి

1ముందుమాట

సంగీత సాహిత్యాలు రెండు, సరస్వతిదేవి మానవులకు ప్రసాదించిన క్షీరామృతాలు.

సంగీతం,శృతి మధురం.వింటేనే ఆనందం కలుగుతుంది. క్షీరంవలె
సులభతరం.
సాహిత్యం, అమృత మదనంవలె
కష్టతరం. అందుకే నన్నయ్య కవిత్వాన్ని (భారతాన్ని) “లోనారసి”
చూడాలన్నాడు. మన కవిత్వాది రచనలకు
సమీక్షలు,వివరణలు, ముందు మాటలు పీఠికలు ఉండడం వల్లే ఆ యాకావ్యాల విలువ, మనం తెలుసుకుంటున్నాం.
అందుకే జ్ఞానపీఠ పురస్కార గ్రహీత సి నారాయణరెడ్డి గారు ఇలా అన్నారు “కప్పి చెప్పేవాడు కవి, విప్పి చెప్పేవాడు విమర్శకుడు”అని.

కథలు కాలక్షేపం కోసం రాయకూడదు.
సమాజ క్షేమం కోసం
సందేశాత్మకంగా రాయాలి. కవి, లేదా కథా రచయిత సమాజ స్పృహ కలిగి ఉంటేనే
అది సాథ్యమవుతుంది
***
2) రచయితపరిచయం
సాహిత్య సస్యాభివృద్ధికి
మాగాణి, కవి పండితులకు పుట్టినిల్లు, జ్ఞానపీఠ పురస్కార గ్రహీత డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి జన్మస్థలమైన సిరిసిల్ల, కిరణ్ కుమార్ గారికి కూడా జన్మస్థానం కావడం విశేషం.
ఉమా, కనకయ్య గార్ల మొదటి సంతానం కిరణ్ కుమార్ గారు.
కనకయ్య గారు మున్సిపల్ కౌన్సిలర్ గా రాజకీయాలలో ఉంటూ, వంశపారపర్యంగా ఉన్న వృత్తి, వస్త్ర వ్యాపారాన్నీ సాగించారు. కిరణ్ కుమార్ తండ్రికి సహాయంగా ఉంటూనే M.com పూర్తి చేశారు. కాలేజీ రోజులలో నుంచి సాహిత్య సేద్యం ప్రారంభించి అచిర కాలంలోనే
సాహిత్య బృందావనాన్నీపెంచి వివిధ సాహిత్య ప్రక్రియా పుష్పాలను
వందల సంఖ్యలో
పూయించిన ఘనత కిరణ్ కుమార్ గారిదే.
. ఆసంఖ్యాక అవార్డులు బహుమతులు వారి సొంతం.అతి చిన్న వయస్సు లోనే అలుపెరుగని సాహితీ ప్రయాణం ప్రారంభించి
ఉన్నత స్థాయికి ఎదిగిన కిరణ్ కుమార్ గారు శ్రమించే స్వభావం కలవారు, సౌమ్యులు, సాహిత్యా భిలాష వారిఊపిరి.
***
3) కథల సమీక్ష
కథ, నవలా ప్రక్రియలకు పాత్రలు సంభాషణలు ప్రాణం
వంటివి.
ప్రస్తుత సమీక్షలో కిరణ్ గారి రెండు కథలను సమీక్షకు ఎన్నుకున్నాను.
1 అనుబంధం.
2 ఉషోదయమా…
ఈ రెంటినీ ఎన్నుకోవడంలో ఉద్దేశం, ఈ రెండు కథలకు పాత్రలు, సంఘటనలు ఒకటే కావడం ముఖ్య కారణం.
రెండు కథలలో సమాజానికి కావలసిన సందేశాలు, ఉపదేశాలు మొదలైన వాటిని పాఠక హృదయాలకు దగ్గరగా తీసుకువచ్చే ప్రయత్నమేఈ సమీక్ష.

కబీర్ చెప్పినట్లు ఏదైనావిషయాన్ని ఉపమానంతో చెప్పాలి.
రసాల మామిడిపండును బాగా రసం తీసి గ్లాసులో పోసి ఇవ్వుచ్చినప్పుడు తాగేవాళ్లు బాగా ఆనందిస్తారు అలాగే కథలలో, రచనలలో ఉండే అంతరార్థాలను, సంభాషణ చాతుర్యాలను, ప్రజలకు ఆచరణీయమైన సందేశాలను సమీక్షలో విపులంగా చూపించగలిగినప్పుడు ఆకథ, సమీక్ష రెండు ధన్యమవుతాయ్.

.ముందు అనుబంధం+ ఉషోదయమా అనే వాటిని గురించి మీకు వివరించాలి.
అనుబంధం అనేది కిరణ్ కుమార్ గారు రాసినమొట్టమొదటి కథ.
అటు తరువాత ఉషోదయమా? అనే కథ తన మొదటి కథ, “అనుబంధా”నికి పొడిగింపుగా రాసిన రెండో కథ. ఇవి విడివిడిగా చదివినా, లేక కలిపి చదివినా వాటి వాటి సందేశం సమగ్రంగానే ఉన్నది. కానీ కలిపి చదివినప్పుడు పాఠకుని లోతుగా ఆలోచింపజేస్తుందనడంలో సందేహం లేదు.

మొదటి దానిలో మోసం కనపడితే రెండవ దానిలో మోసానికి తగిన ప్రతిఫలం, దర్పణంలో చూపించినట్లు చూపించారు రచయిత కిరణ్ కుమార్. అందుకే రెండు చదివినప్పుడు సంపూర్ణమైనటువంటి అవగాహన చదువరులకు ఏర్పడుతుంది.

అందువల్ల నేను అనుబంధం+ ఉషోదయమా? రెంటిని కలిపి సమీక్షిస్తున్నాను.
ఈ కథలను గురించిన ఒక గొప్ప విషయాన్నీ మీ ముందు సంతోషంగా సగర్వంగా నేను సమర్పిస్తున్నాను.
ఏ కొద్ది మంది రచయితలకోదక్కే ఇటువంటి అదృష్టం మన కిరణ్ కుమార్ గారికి దక్కింది అని చెప్పడం సమచితం
పై రెండు కథలలో
ఓ కొడుకు మోసం
ఓ తండ్రి నిర్ణయం కలిసి “ఓ తండ్రి తీర్పు” అనే లఘు చిత్రంగా తయారయింది. ఆ చిత్ర విశిష్టతను గురించి క్లుప్తంగా వివరించడం జరుగుతుంది.

ఓ తండ్రి తీర్పు లఘు చిత్రానికి ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డులు రెండు వరించాయి.
ఐ ఎఫ్ యం ఏ (ఇంటర్నేషనల్ ఫిల్మ్ మేకర్స్ అసోసియేషన్) వారి అవార్డు మరియు పిన్ టీవీ సంస్థ వారి అవార్డులు గెలుచుకున్నాయి.
శ్రీరామదూత ఫిల్మ్ మేకర్ పతాకంపై చిట్టా రాజేశ్వరరావు చిట్టా అపూర్వ అనేవారు నిర్మించగా ఈ చిత్రానికి ఐదు ప్రభుత్వ నంది అవార్డులు అందుకున్న శ్రీ గాదంశెట్టి ఉమామహేశ్వరరావు గారు దర్శకత్వం వహించారు. అంతర్జాల విఫణి నుండి 10 ఓ టి టి ఏజెన్సీ ఫ్లాట్ ఫార్ముల ద్వారా
ప్రేక్షకులు వీక్షిస్తున్నారు.
అనేక కుటుంబాలలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలను ఇతివృత్తంగా తీసుకున్న కథా నేపథ్యంలో కొనసాగింది ఈ చిత్రం.

తల్లిదండ్రులకు ఆసరాగా నిలవాల్సిన తనయులే తమ బాధ్యతను విస్మరిస్తున్నారని, నిరాదరణకు గురి అవుతున్న తల్లిదండ్రులను దృష్టిలో పెట్టుకొని యువతలో మార్పు కోరే దిశగా ఈ లఘు చిత్రం నిర్మించబడింది.
ఓ తండ్రి తీర్పు లఘుచిత్రం లింక్, కథా సమీక్ష అనంతరం
చూడగలరు.
ఇక కథలోకి తొంగి చూద్దామా!
1వ కథ అనుబంధం.
****”
పాత్రలు 1 రంగనాథం 2 రాజా 3 ఆదిత్య
గుడ్డి ప్రేమ ప్రమాదం.
పిల్లలనుప్రేమించు
కానీ నమ్మవద్దు. నీ ఆస్తి, ఏదైనా నీ తర్వాతే ఎవరికైనా.

పిల్లవాడు నీ వాడే వాడి భార్య పరాయిది.
ఇత్యాది నిత్య సత్యాలను తెలిపే కథ అనుబంధం.
రంగనాథం గారి పిచ్చి ప్రేమను వాడుకొనీ ఆయన కొడుకు
రాజా, నాన్నగారి ఆస్తులుఅన్ని అమ్మించి తనపేర డబ్బు వేసుకొని నాన్నను ఎయిర్ పోర్ట్ లో వదిలే గుట్టుగా అమెరికా వెళ్ళిడం, రంగనాథం గారు
పక్కింటి ఆదిత్య సహాయంతో ఎయిర్పోర్ట్ నుంచి ఇంటికి రావడం తో కథ ముగుస్తుంది.
కానీ ఈ కథలో రెండు విషయాలు అసంపూర్ణంగానే ఉన్నాయని రచయిత కిరణ్ గారికి అనిపించిది. ఆ రెంటిని పాఠకులకు తెలపడానికి రెండో కథ రాయడం జరిగింది.
అదే ఉషోదయమా…
అన్న పేరు గల రెండో కథ.
2)ఉషోదయమా..
“ముఖ్య”పాత్రలు 1 రాజా2 రాజా భార్య, నిషా 3 నిషా అన్న.4. రంగనాథం (రాజా తండ్రి )
“””””””””””””””””””
మనం తప్పు చేస్తుంటే ఎవరు చూడలేదనుకుంటా ము.
కానీ చూచేవాడు చూడనే చూస్తాడు. తగిన శిక్ష వేస్తాడు.
ఒకప్పుడు నిజంగా జరిగింది సాఫ్ట్వేర్ రంగం ఎందరో లక్షాది కారులు భిక్షాధికారులు అయినారు. అందులో రాజా నిషా ప్రధములు. ఉన్నదంతా ఊడ్చుకొని పోతే పొట్ట చేత పట్టుకుని ఇండియాకి వస్తారు
బావ మరిది తన నాన్నను కూడా రాజాకు అప్ప చెప్పి నాగపూర్. జారు కుంటాడు

రంగనాథం గారిని మోసం చేసి ఆస్తి కాజేసిన రాజాను, నిష ను నిష పుట్టింటి వాళ్ళు పురుగులను చూసినట్టు చూస్తారు ఇక్కడ సందర్బానికి తగ్గ సంభాషణతో కథ
రక్తి కట్టింది.

మూలిగే నక్క మీద తాటికాయ పట్టేట్టు
రాజా నిషాల జీవితం
దుర్భరమైంది.

రాజా, ఓమిత్రుని సహాయంతో, తనకు నిషాకు ఉద్యోగాలుసంపాదించినా ఆ ఉద్యోగాల్లో అనుకొని ఆపద వస్తుంది. తన మీద మోపిన నేరాన్నీ
తన యజమానికి చెప్పుకోవడానికి వెళ్లిన రాజా, నిషా, అక్కడ యజమాని స్థానంలో
ఉన్న రంగనాథం గారిని చూచి
వణికిపోతారు. ఇంతవరకు వారిని కమ్ముకొని ఉన్న అహంకారమనే చీకటి (నిషా ఆమెకు తగ్గ పేరు) తొలగి వారిలో ఉషోదయ రేఖలు కనపడినట్లు పశ్చాత్తాపంతో రంగనాథం గారి పాదాలపై పడతారు.

రంగనాథం గారు నిష్పక్షపాతంగా, కోర్టులో న్యాయమైన తీర్పు చెప్పే జడ్జి లాగా వారిద్దరిని అడగవలసిన అడిగేసి గెట్ లాస్ట్ అంటాడు.
దానికి కారణం రంగనాథం గారి
సిద్ధాంతాలు రెండు. 1) నమ్మిన వారినిమోసం చేయకూడదు.
2)
ఆత్మ విశ్వాసమే నీ ఆయుధం.

వాటిని నమ్ముకున్న రంగనాథం గారు కొడుకును కోడలిని
నిర్ధాక్షిణ్యంగా శాశ్వతంగా వదులుకున్నారు. ఇదే “ఓ తండ్రి తీర్పు” కొడుకు వల్ల రిక్తహస్తాలతో నిలిచిన రంగనాథం గారు ఆత్మవిశ్వాసంతో ఈనాడు కోట్లకు అధిపతి అయినారు.

చారిత్రాత్మకమైన ఈ తీర్పు ఈనాటి యువతీ యువకులకు గుణపాఠం కావాలి.
చివరి దశలో ఎవరు చూస్తారో (పనిమనిషో
పరాయి వాళ్ళోఎవరైనా)
,వారికి తమ ఆస్తినీ తల్లిదండ్రులు ఇచ్చేసే నిర్ణయానికి రావాలి.
ఈ కథలో ఇది చక్కని సందేశం.
విలువైనవిషయాలు..

1) కొడుకు మోసానికి గురైన రంగనాథం గారిని,తల్లి తండ్రి లేని ఆదిత్య, “నిన్ను నాన్నా అని పిలవచ్చా” అన్న వాక్యం, సందర్భానికి విలువనిచ్చే వాక్యం.

2)ఎంతవిద్యావంతులైనా,
నిషాలాంటి వారి నోట
వచ్చే మాటలు.”ఆ ముసలాడిడబ్బులు
కూడా అయిపోయాయి” అన్నది

2) తన కొడుకు, కోడలికి కనపడకుండా అటు తిరిగి కూర్చున్న రంగనాథం గారు “నేను తప్పు చేయలేదు నాపై కేసు పెట్టారు”అన్నకొడుకు మాటలకు “నీకు మోసం చేయడం, తప్పు చేయడం తెలియదా?” అంటూ కొడుకు వైపు తిరిగిన రంగనాథం గారి మాటలు,కదలిక చక్కగా సందర్భోచితంగ ఉన్నాయి..

ఇలాంటివి కవి యొక్క పదప్రయోగ దక్షతకు, వాక్య నిర్మాణ చాతుర్యానికి, పాత్ర పోషణ నైపుణ్యానికి
నిదర్శనం.
సాహిత్యాభిమానులు,సకల సాహిత్య ప్రక్రియా నిపుణులు,
అన్నిటికంటే ఓర్పు నేర్పు, గల రచయిత డా. చిటికన కిరణ్ కుమార్ గారు చక్కటి కథా రచయితగా ఈ కథల ద్వారా గుర్తింపు పొందారు. దానికి నిదర్శనమే “ఓ తండ్రి తీర్పు” ఇది పేరుకు లఘుచిత్రం. పెద్దరికం లో అలఘు చిత్రం.

ఈ సమీక్షతో కూడా ఆ లఘుచిత్రాన్ని జోడించడం జరుగుతుంది. పాఠకోత్తములు కదా సమీక్షలు చదివి లఘు చిత్రాన్ని వీక్షించి ఆనందిస్తారని ఆశిస్తూ…
ఐ. ఎఫ్. ఎమ్. ఎ మరియు పిన్ టి. వి ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డులు అందుకున్న ” ఓ తండ్రి తీర్పు”లఘు చిత్రం


July 20, 2025 27 comments
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

ఒట్టి చాపలులో జీవనచైతన్యం

by Dr. Kachapuram Durgadevi July 20, 2025
written by Dr. Kachapuram Durgadevi

కొన్ని దశాబ్దాల క్రితం ప్రజల అభిరుచులను బట్టి నీతి, ప్రేమ, కార్మికులు, సంస్కరణ ఈ విధంగా కథా వస్తువు కాలక్రమం లో మారుతూ ఉండేది. ఇప్పుడు సామాజిక అవసరమే అత్యంత .ఆవశ్యకమైన కథావస్తువుగా మారింది. నేడు దళితుల ఆత్మగౌరవం, చైతన్యం, సంఘటిత పోరాటాలు, తిరుగుబాటు, తిరస్కారాలు కథా వస్తువులై తెలుగు కథా వస్తువు పరిధిని పెంచాయి. 1920 ప్రాంతం నుండి దళితుల జీవితాలను సానుభూతితో చిత్రించిన రచనలు నేడు సహానుభూతిని కలిగి ఉంటున్నాయి.

“ఒక కథకుడికి రచనా సామర్థ్యం లేకపోయినా సరి చేయవచ్చుగాని జీవితం తెలియకపోతే సరిచేయడం ఎవరి వల్లా కాదు… శిల్పమూ భాషా రచనకు ముఖ్యం కాదని కాదు. అవి చాలా ముఖ్యం. అయితే అవి కథారచనకు మూల పరికరాలు. ముడి పదార్థం జీవితం” అంటారు కొడవటిగంటి. సాహిత్యకారుల జీవన గవనంలోని ప్రతి సంఘటన సృజన వైపు మళ్లకపోవచ్చు. కానీ కొన్ని సందర్భాలలోని తీవ్రత అది కలిగించే ఒత్తిడి కవిగానో రచయితగానో నిలబెడతాయి. “ఒట్టి చాపలు” కథలు పరిశీలించి రాసినవి కావు. డా మండల స్వామి జీవితంలోంచి అనుభవాల నుండి ఆవిష్కృతమైనవే అని అనిపిస్తుంది. రచయిత వృత్తిపరంగా ఉపాధ్యాయులు వారి జీవన నేపథ్యానికి అనుగుణంగా ఈ సంపుటిలో కొన్ని విద్యాపరమైన పాఠశాలలకు సంబంధించిన కథలు ఉన్నాయి ఈ వైవిధ్యంలోనూ కథల ఇతివృత్తాలు పాత్రలు ఎక్కువగా దళిత జీవితాన్ని, చైతన్యాన్ని చిత్రించినవే కావడం వల్ల “ఒట్టి చాపలు” ను దళితవాద కథా సంపుటి గానే గుర్తించాలి.

ప్రభుత్వ ఉపాధ్యాయుడయినా కులం కారణంగా కిరాయికి ఇల్లు దొరకని పరిస్థితిని చిత్రించిన కథ “ఇల్లు దొరికింది”. “చేతిలో చేయి కలిపిన వెంకటయ్య జై భీములు అనడంతో శీనులో కొత్త ఆలోచన మొదలైంది” అనడంలో రచయిత దళిత సంఘటిత చైతన్య ఆవశ్యకతను స్పష్టం చేసినారు. వెంకటయ్య పాత్ర చేత “ఈ వ్యవస్థ పట్ల, ఈ వ్యవస్థ అందిస్తున్న అవమానాల బహుమతుల పట్ల మనం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది” అని అనిపిస్తారు. ప్రధాన పాత్ర కోపాన్ని ఆవేశాన్ని నియంత్రించుకుంటున్న కొద్ది పాఠకుడు దళితులు పొందుతున్న సామాజిక గౌరవం ఇదేనా అన్న ఘాటు ప్రశ్నను ఎదుర్కొంటాడు.

“సదువుకున్న తెలివి” కథలో ఆత్మగౌరవంతో జీవించడానికి ఆర్థిక స్థోమత అవసరమని తెలిపే పాత్ర ముత్తమ్మది. అసహాయతలో చైతన్యం చెదిరిన తల్లికి ధైర్యాన్ని వ్యక్తిత్వాన్ని ఇచ్చే విద్యావంతుడైన కొడుకు పాండు. క్లిష్టమైన పరిస్థితులలో మానవ ప్రవృత్తులు సమయానుసారంగా ఎన్ని రకాలుగా మారుతాయో కూడా ఈ కథ తెలుపుతుంది. ఏళ్లుగా వివక్షచూపుతూ శ్రమదోపిడీ చేస్తున్న పటేలమ్మ “పాండూ! నువ్వు సదువుకున్నవురా! నీకన్నీ తెల్సురా!…. నేను పటేలమ్మను కాదు. ఓ మనిషి లెక్క అడుగుతున్న ఈ ఒక్క సాయం చెయ్యి బిడ్డా! నీకు దండం బెడ్తా” అంటుంది కథ ముగింపులో. ఆమెలో పరివర్తన తీసుకురావడంలో చదువుకున్న పాండు సఫలుడవుతాడు. కరోనా నేపథ్యంలో పాండు చదువుకున్న తెలివితో కరోనా నెగిటివ్ ని పాజిటివ్ అని చెప్పి తల్లిని శ్రమదోపిడి నుండి తప్పించడం కొసమెరుపు.

దళితులలో రూపొందిన చైతన్యాన్ని చిత్రించిన కథ “కాలం మారింది”.
దళితుడైన యాదగిరి జనరల్ సీటులో స్వతంత్ర అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో సర్పంచ్ అయి నాయకుడిగా ఎదుగుతాడు. ఈ క్రమంలో పూలు పండ్లు పెట్టుకొని తిరిగి వస్తుండగా యాదగిరి బంధువర్గం ప్రయాణిస్తున్న డీసీఎం ప్రమాదానికి గురవుతుంది. ఆ సందర్భంలో “మన మాల మాదిగోల్లంతా మాటిమాటికి దేవునిగుల్యకు పోతుండ్రంట. అందుకనే ఇట్లయిందని అంటున్నదే! ఈల్ల ఇకమతుల మీద మన్నుబొయ్య!”
వంటి సంభాషణలు గ్రామాలలో ఇంకా మిగిలి ఉన్న వర్గ వైషమ్యాలను, ఆధిపత్య ధోరణులను, రచయితకు గల సామాజిక స్పృహను పట్టి చూపిస్తాయి. కొత్త గుడి గర్భాలయంలో యాదగిరి దంపతులు మొదటి కొబ్బరికాయ కొట్టడంతో కథ పూర్తి అవుతుంది. ఉన్నత విద్య మంచి వ్యక్తిత్వం రాజకీయ ప్రాతినిధ్యంతో సామాజిక గౌరవాన్ని సాధించగలమని నిరూపించిన కథ “కాలం మారింది”.

బాల్య వివాహాలు, లింగ వివక్షత, మూఢ నమ్మకాలు, విద్య ప్రాధాన్యత, శాస్త్రీయ దృష్టి కోణపు ఆవిశ్యకత లను చర్చించిన కథ “ఒట్టి చాపలు”. అండాలు కొడుకు శివ ఎం ఫార్మసీ చదివి ఫార్మసిస్ట్ గా పనిచేస్తుంటాడు. ఎక్కువ చదివిస్తే కట్నం ఎక్కువ ఇవ్వాల్సి వస్తుందని తొమ్మిదవ తరగతి లోనే చదువు ఆపేయించబడిన కూతురు స్వాతి. చదువుకోవాలని నిగూఢవాంఛ, తనకు జరగబోయే బాల్య వివాహం పట్ల వ్యతిరేకతల వల్ల స్వాతి మానసిక అనారోగ్యానికి గురి అవుతుంది. ఆమెను బాగు చేయించడం కొరకు అండాలు ఆశ్రయించిన పద్ధతులు, మూఢనమ్మకాలు వాటిని వ్యతిరేకించిన కొడుకు, చివరగా తల్లి స్వీయ అనుభవంతో మోసాలను గ్రహించడం “ఒట్టి చాపలు” లోని కథాంశం. శాస్త్రీయ దృక్పథం కొరవడిన కారణంగా ఆర్థికంగా కూడా కొందరు చితికి పోవడాన్ని, తరాల మధ్య అంతరాలను నిలువుటద్దంలో చూపిస్తుందీ కథ.

రచయితగా కథనంలో జోక్యం చేసుకోకుండా పాత్రల మాటలతోనే కథలను నడిపింపచేయడం మండల స్వామి గారి సంభాషణాత్మక శైలి. అనవసరమైన పాత్రలు సంఘటనలు సంపుటిలో ఎక్కడా కనబడవు. గారడీ చేసే శిల్పానికి దూరంగా హంగు ఆర్భాటాలు లేని సహజత్వానికి దగ్గరగా ఉన్న కథలు ఇవి. పాత్రల రూపురేఖల వర్ణనలు ఒక్కచోట కూడా లేకపోవడం, మానవ ప్రవృత్తులకు ప్రాధాన్యత నివ్వడం ఆధునికతగా గమనింపులోకి వస్తాయి. విద్య ఆర్థిక స్థితిగతులలో వెనుకబడిన దిగువ మధ్యతరగతి దళిత బహుజన ప్రజలకు ప్రతీక ఈ ఒట్టి చాపలు. నీతిని తెలిపే ఇతివృత్తాలకు ప్రేమగాథలకు ప్రాధాన్యతనివ్వకుండా మనిషి ముఖ్యం, మనిషి బతుకు గౌరవంగా ఉత్సాహంగా సాగటం ముఖ్యం అనే భావాలను స్పష్టంచేసిన కథా సంపుటి ఒట్టి చాపలు.

July 20, 2025 19 comments
4 FacebookTwitterPinterestEmail
కవితలు

బుద్దుడు — బోధి వృక్షం . .

by రాఘవాచార్య‌ July 20, 2025
written by రాఘవాచార్య‌

బుద్దుని చిత్రం వేస్తే
బోధి వృక్షం చిత్రం వేయాల్సిందే
బుద్దుని గురించి ప్రసంగిస్తే
బోధి వృక్షం గురించి పది మాటలైనా మాట్లాడకుంటే
ఆ ఉపన్యాసం సంపూర్ణం కాదు

ఉపాధ్యాయుడు చెప్పిన
బుద్దుని బోధనల పాఠం విద్యార్థులు
అస్సలు మరువరు!
ఎందుకంటే పిల్లలు రోజూ ఆడుకునేది
బోధి వృక్షంగా ప్రసిద్ది గాంచిన
పెద్ద రావిచెట్టు కిందే!

ఆ ఊర్లో పంచాయతి అయేది
బోధి వృక్షం కిందే !
చెప్పే న్యాయం పొల్లు పోకుండా
సత్య ప్రమాణంగా హరిశ్చంద్ర ముద్ర !

చిత్రం ! బుద్దుని విగ్రహం ముందు
నిల్చుని దండం పెడుతూ స్వార్థంగా
ధన కనక వస్తు వాహనాలు అడుగరు !
నిస్వార్థ ప్రశాంతతను అడుగుతారు

July 20, 2025 18 comments
0 FacebookTwitterPinterestEmail
కథలు

అమ్ములు పెళ్లి

by Laxmi Madan May 31, 2025
written by Laxmi Madan

“అమ్ములు! లే నాన్నా! ఈరోజు నిన్ను చూసుకోవడానికి పెళ్లి వాళ్ళు వస్తున్నారు. తొందరగా లేచి తయారు కావాలి తల్లి” అంటూ ఒక గంట నుండి లేపుతుంది అమ్ములు తల్లి శాంత.

ఈ అమ్ములు అనబడే సుకుమారి 25 ఏళ్ల పాపాయి. అతి కష్టం మీద బీటెక్ పూర్తి చేసి, తనకి వచ్చిన ర్యాంక్ కి ఉద్యోగాలు రాకపోయినా పర్వాలేదు, అని నిశ్చింతతో ఇంట్లో ఓటిటిలో వచ్చిన సినిమాలన్నీ చూసేస్తూ, వెబ్ సిరీస్ ను నమిలేస్తూ, తల్లి చేసిన వంటకాలన్నీ మింగేస్తూ, శరీరాన్ని పెంచేస్తూ అలా ఇంట్లోనే సెటిల్ అయ్యింది.

ఇక పెళ్లి చేయాలి అని తలచిన తల్లిదండ్రులు మ్యాట్రిమోనీ లో సంబంధాలు చూస్తున్నారు. ఫోటోల్లో ఈ సుకుమారి రూపం చూసి 90% మంది వెనక్కి వెళ్ళిపోతున్నారు.

చివరికి ఒక సంబంధం వచ్చింది. వాళ్లే అమ్ములును ఈరోజు చూసుకోవడానికి వస్తున్నారు. పెళ్ళికొడుకు డాక్టర్. చదువు ధ్యాసలో పడి పెళ్లి విషయాన్ని మర్చిపోయాడు. అందులో డాక్టర్ వృత్తి బిజీగా ఉంటుంది కదా! చివరికి ఇంట్లో బామ్మ 4 మొట్టి కాయలు వేస్తే పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అతనికి కూడా ఎన్ని సంబంధాలు చూసినా కుదరడం లేదు. ముదురు టెంక అయ్యాక ,లేత టెంకలు ఎలా దొరుకుతారు? ముందు అందమైన అమ్మాయిలను చూస్తే, వాళ్లంతా రిజెక్ట్ చేశారు. చివరికి ఎవరైనా సరే అనేసి ఈ అమ్మాయి చూడటానికి ఒప్పుకున్నాడు.

“అమ్ములు! లేచావా”?

“ఆ లేచాను కాపీ ఏది”అన్నది బెడ్ మీద అలాగే కూర్చుని.

“ఇదిగో చూడు తీసుకొచ్చాను” అని ట్రై లో కాఫీ దానితో పాటు 6 బిస్కెట్స్, కొంచెం బూందీ తెచ్చి పెట్టింది.

అదంతా చూస్తున్నా తండ్రి బక్కారావు కి( సార్ధక నామధేయుడు) ఒళ్ళు చిలచిర లాడసాగింది.

“అసలు దీని వాలకం ఏంటో అర్థం కావడం లేదు. మంచం మీద నుండి సోఫాలోకి సోఫాలో నుండి బాత్రూంలోకి వెళుతుంది. అంతకుమించి నాలుగు అడుగులు ఎక్కడికి వేయదు. దీని పెళ్లి అయితే ఎన్ని సమస్యలు తెచ్చి పెడుతుందో! అందుకు తోడు ఈ శాంత ఒకటి ఎప్పుడూ దాన్ని మేపుతూనే ఉంటుంది. ఒక్క పని చెప్పదు”అనుకున్నాడు స్వగతంగా .పైకి అంటే ఇంకేమైనా ఉందా? తల్లి కూతుర్లు ఆయుధాలు లేకుండా యుద్ధానికి వచ్చే లాగా ఉంటారు. గతాన్ని మరవని బక్కా రావు మాట నోట్లోనే కుక్కుకున్నాడు.

“అమ్మ ఈరోజు స్వీట్ పెట్టలేదు”అని అరిచింది.

“ఈరోజు పెళ్లిచూపులు కదా! స్వీట్ తింటే ఇంకా లావుగా కనిపిస్తావు. కొంచెం స్లిమ్ గా ఉందాలి. ఈ మాత్రం తిను తల్లీ! వాళ్ళు వెళ్ళాక బోలెడు స్వీట్స్ మిగిలిపోతాయి. అవన్నీ నువ్వే తిను”అన్నది శాంత బుజ్జగిస్తూ.

“నువ్వెప్పుడూ ఇంతే! అడిగింది ఏది పెట్టవు”అన్నది మూతిని పిడకలా చేసుకుని. లక్క పిడత కాదండి బాబు పిడకనే.

పెద్ద మగ్గునిండా కాఫీ జురా జురా జుర్రుకుంటూ తాగేసింది. మధ్య మధ్యలో పెద్ద చప్పుడు వచ్చేలా బిస్కెట్లు, బూందీ తింటూ టీవీ ముందర సెటిల్ అయింది.

శాంత బ్రేక్ ఫాస్ట్ తేవడానికి హడావుడిగా ఉంది.

“అమ్ములు స్నానం చేసి రా! నీకు టిఫిన్ పెడతాను ఇప్పటికే 11 అయ్యింది మళ్లీ లంచ్ తినాలి. ఆ తర్వాత పెళ్లి వాళ్ళు వస్తారు. నువ్వు రెడీ కావాలి కదా”? అన్నది గారాబంగా.

“టీవీ కూడా ఎక్కువసేపు చూడని వ్వరు”అనుకుంటూ బాత్రూంలోకి వెళ్ళింది అమ్ములు.

అక్కడే ఉన్న తండ్రికి మనసులో రకరకాలుగా ఉంది. ఏ రకంగా ఉన్నా ఏమీ చేయలేడు అర్భకప్రాణి.

స్నానం చేసి ఒక నైటీ దిగేసుకుని వెంటనే వచ్చి సోఫాలో కూర్చుంది. కుయ్యో మని సోఫా సౌండ్ వచ్చింది. ఆ సోఫాకి మాటలొస్తే బండ బూతులు తిట్టేదేమో?

ఇంతలో శాంత ఒక ప్లేట్ లో నాలుగు వడలు, 4 ఇడ్లీలు, పచ్చడి సాంబారు పెట్టుకొని తీసుకొని వచ్చి, అమ్ములు ముందర ఉన్న టీపాయ్ మీద పెట్టింది.

“నాకు ఇడ్లీ వద్దు. ఆ ఇడ్లీలు తీసేసి దాని బదులుగా మరొక ఆరు వడలు పెట్టేసేయ్”అన్నది సుకుమారి అమ్ములు.

“అలాగే కన్నా” అంటూ ఆరు వడలు తెచ్చి ప్లేట్లో వేసి ఇడ్లీలు తీసేస్తుంటే,

“వద్దులే అమ్మ !ఇడ్లీలు ఆరోగ్యానికి మంచిది కదా! మధ్య మధ్యలో నంచుకుని తింటాను”అన్నది అమ్ములు ప్లేటు మీదకి దాడి చేస్తూ.

వేడివేడి వడలు తింటుంటే చెమట పట్టసాగింది. అమ్ములుకు లేచి ఫ్యాన్ వేసుకునే ఓపిక ఎక్కడిది? వెంటనే అటు పక్కకు వెళ్తున్న నాన్నను చూసి,

“నాన్న నాకోసం నువ్వు ఒక్క పని కూడా చేయవు? ఫ్యాన్ వేసి వెళ్ళు”అన్నది తండ్రిని కొర కొరా చూస్తూ.

“లేచి ఫ్యాన్ వేసుకుంటే, ఇంకో రెండు వడలు ఎక్కువ పడతాయి కడుపులో. అందుకే నేను వేయలేదు. లేచినప్పుడు ఫుడ్ కిందకి వెళ్తుంది. “అన్నాడు మనసులో కోపాన్ని దాచుకొని.

“లంచ్ లో అలాగే చేస్తాను. ఇప్పుడైతే ఫ్యాన్ వేసి వెళ్ళు”అన్నది పెద్ద పెద్ద వడలను నోట్లో పెట్టుకుంటూ.

“కర్మ కర్మ “అని తిట్టుకుంటూ ఫ్యానేసి వెళ్ళాడు బక్క రావ్.

ఇలా అమ్ములు బ్రేక్ ఫాస్ట్, లంచ్ అయ్యేసరికి మూడున్నర అయ్యింది.

“ఇక చీర కట్టుకో తల్లి. అదిగో ఆ గదిలో చీర, నగలు అన్ని పెట్టాను”అన్నది శాంత.

“వెబ్ సిరీస్ చూస్తున్నాను. నాకు డిస్ట్రబ్ అవుతుంది. నేను టీవీ చూస్తుంటాను .నువ్వు నాకు చీర కట్టేసేయ్”అన్నది అమ్ములు.

అమ్ములు కి చీర కట్టే ప్రయత్నంలో ఉన్నది శాంత. ఆరు గజాల చీరకు రెండు కుచ్చిళ్ళు కూడా రాలేదు. జాకెట్ మోచేతుల వరకు కూడా ఎక్కలేదు. యుద్ధ ప్రాతిపదికన బ్లౌజ్ కుట్లని వి, చీరకు రెండు మీటర్ల బట్టను జాయిన్ చేసి చీర కట్టింది శాంత. లాంగ్ చైన్ కాస్త మెడకు బిగుతుగా సరిపోయింది. గాజుల అవస్థ చెప్పలే ము.

మొత్తానికి పెళ్లి చూపులకు తయారైంది అమ్ములు.

“అబ్బాయి ఫోటో చూసావా? అమ్ములు”అని తండ్రి అడిగాడు.

“చూసానులే నాన్న.ఎలా ఉంటే ఏంటి? వాళ్ళింట్లో టీవీ ఉంటే చాలు.వంటకి వంటమనిషి ఉందో లేదో అడగాలి” అన్నది నాలుగు చిప్స్ నోట్లో వేసుకుని.

తల కొట్టుకుని బయటకు వెళ్ళాడు బక్క రావ్

సాయంత్రం నాలుగు గంటల సమయంలో పెళ్లి వారు వచ్చారు. పెళ్ళికొడుకు, అతని తల్లిదండ్రులు.

పెళ్ళికొడుకుని పరిశీలించాడు బక్క రావ్.

తల మొత్తం రాజస్థాన్ ఎడారిలా ఉంది. ఎండకు ఇసుక మెరిసినట్లు గుండు మెరుస్తుంది. వెనుకకు ఉన్న నాలుగు వెంట్రుకలను జాగ్రత్తగా దువ్వి ముందరికి వేసుకున్నాడు.

ఇంట్లో ఫ్యాన్ ఫుల్ స్పీడ్ గా తిరుగుతుంది. పెళ్ళికొడుకుకు భయమేసింది. ఆ ఉన్న నాలుగు వెంట్రుకలు మళ్లీ వెనక్కి వెళ్ళిపోతే గుండోదయం అవుతుందని.

లోపలికి రావడంతోటే..

“కాస్త ఫ్యాన్ స్పీడ్ తగ్గిస్తారా? నాకు ఫ్యాన్ గాలి పడదు”అన్నాడు గడప దగ్గరే నిలబడి.

బక్కరావు వెళ్లి ఫ్యాన్ స్పీడ్ తగ్గించి, వాళ్లను కూర్చోమని చేతులు కట్టుకొని నిలబడ్డాడు.

శాంత లోపలి నుండి నోటిని సెవెంటీ ఎంఎం సైజ్ చేసి, పారల్లాంటి పళ్ళతో నవ్వుకుంటూ వచ్చి, మంచినీళ్లు అందించింది.

వాళ్లు నీళ్లు తాగే ప్రయత్నంలో ఉండగా, పెళ్లికూతురుని బయటకు తీసుకొని వచ్చారు.

“అమ్ములు ముందు చిప్స్ ప్యాకెట్ లోపల పెట్టు. తర్వాత తిందువు గాని”అని బలవంతంగా చిప్స్ ప్యాకెట్ మంచం మీద పడేయించి, బయటకు తీసుకొని వచ్చింది.

బయటకు వచ్చిన అమ్ములు వాళ్ళందర్నీ తేరిపార చూసింది. పెళ్ళికొడుకు ఎవరో అర్థం కాలేదు.

బక్కరావు పెళ్లి కొడుకు తల్లిదండ్రులు మరియు పెళ్ళికొడుకును పరిచయం చేశాడు.

“అదేంటి మామగారు అనుకున్నాను. పెళ్లికొడుకా? ఎలా ఉంటే ఏముందిలే! సంపాదన బాగానే ఉంది కదా” అనుకుని తనకోసం వేసిన స్పెషల్ సోఫాలో కూర్చుంది. సోఫా స్క్రీగ్స్ కుయ్యో మొర్రో అంటూ మరొకసారి అరిచాయి.

“మా అమ్మాయిని ఎండ కన్నెరుగకుండా పెంచాం బాబు” అన్నది శాంత.

” నీ మొహం! ఎండ తగలకుంటే డి విటమిన్ తగ్గి సమస్యలు వస్తాయే పిచ్చి ముఖమా!” అనుకున్నాడు పెళ్లి కొడుకు బట్ట తలని నిమురుతూ.

” ఇంతకీ మీరు ఏం చేస్తున్నారు” అన్నాడు బట్టా రావు( పెళ్లి కొడుకు).

“వాళ్ళమ్మ వండి పెడితే వేస్టే కాకుండా తిని పెడుతుంది అంతే” అన్నాడు అక్కసుగా బక్కా రావు.

శాంత ఉరిమి చూసింది. ఆ చూపుకే చలి జ్వరం వచ్చినట్లు వణికి ఎవ్వరూ చూడకుండా చెంపలు వేసుకున్నాడు.

“తినడం కాదు, ఉద్యోగం చేస్తుందా” అని అడిగాను.

“లేదండీ, అమ్మాయి ఉద్యోగం చేస్తే సినిమాలు, సిరీస్ లు ఎవరు చూస్తారు? మరీ ఇలా అడగటం బాగో లేదండీ” అన్నాడు బక్కారావు శాంత ఉరుము మరచి పోయి.

తల బాదుకున్నాడు బట్టా రావు. నెత్తి మీద గుప్పెడు జుట్టు లేదని మరచిపోయి. తల మంట పుట్టి కెవ్వు మనే అరుపు నోట్లో కుక్కేసుకున్నాడు.

“మా అమ్మాయిని కాలు కందకుండా పెంచాం” అన్నది శాంత.

“కాళ్లకు ఒత్తిడి కలగాలని మేము ఆక్యుపంచర్ చెప్పులను వాడమని అంటున్నా ము, చెప్పులు లేకుండా నడవాలని చెప్తున్నాము. ఈమె కాళ్లు కందకుండా పెంచారట. అసలు బిడ్డను పెంచుతుందా పిల్లి పిల్లని పెంచుతుందా? ఎందుకంటే అవి వాటి పనులు అవి చేసుకోలేవు. కానీ ఈ పిల్ల మనిషి కదా! అయినా నా పిచ్చి గానీ ,రూపం చూస్తే అర్థం కావట్లేదా ఓన్లీ తినడానికి పుట్టిందని?”అని మనసులో గులుగుకొని ఓ పిచ్చి నవ్వు నవ్వాడు బట్టా రావు.

ఇంతలో శాంత రకరకాల టిఫిన్లు తెచ్చి టేబుల్ మీద పెట్టింది. అమ్ములు చూపంత ఆ టిఫిన్ మీదనే ఉంది. మొహమాటానికి పెళ్లి కొడుకు వాళ్ళు ఏమి తీసుకోలేదు.

ఆగలేకపోయిన అమ్ములు చటుక్కున నాలుగు జిలేబీలు అందుకున్నది.

బక్కరావుకు ఒళ్ళు మండుతున్నది. శాంత కళ్ళతో సైగ చేసింది. కానీ ఆ సైగలు ఏమి పని చేయలేదు. జిలేబి రసం కారుతుంటే కుక్కుకొని తింటూనే ఉంది అమ్ములు.

పాపం బట్ట రావు తల్లిదండ్రులు బిక్కుబిక్కుమంటూ కూర్చున్నారు. “అసలే కొడుకుకు వయసు పెళ్లీడు దాటింది. ఇప్పుడు ఈ అమ్ములు అనే శాల్తి ని చేసుకుంటే, జీవితాంతం నేను వంటగదికే అంకితం అవుతాను. తండ్రి సామాన్లు తేవడానికి సరిపోతాడు. కొడుకు మందులు ఇవ్వడానికి సరిపోతాడు. ఈ సంబంధం కొడుకు ఒప్పుకోకుండా ఉంటేనే బాగుంటుంది. పెళ్లి కాకున్నా సరే” అని పాత దేవుళ్ళు కొత్త దేవుళ్ళు అందరినీ తలుచుకుంది బట్ట రావు తల్లి బిక్కమ్మ.

బట్ట రావు ను చేయితో గోకింది. అతని ముఖంలోకి అమాయకంగా చూసింది బిక్కమ్మ.

భుజాలు వాల్చి కూర్చున్న తండ్రిని చూశాడు బట్టా రావు. ముఖమంతా పీక్కొని పోయి కొడుకు సమాధానం కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు అయోమయరావ్.

ఇంతలో జూస్ తెచ్చింది శాంత. అందరూ గ్లాసులు అందుకున్నారు. అమ్ములు సీసా ఎత్తి తాగసాగింది. ఒక పక్క టీవీ చూడాలని మనసులో ఉంది.

ఇక బట్టా రావు ఆగలేక చేతిలో ఉన్న గ్లాస్ టప్పుమని శబ్దం వచ్చేలా టీపాయ్ మీద పెట్టి.

అమ్మ, నాన్న వెళ్లి కార్లు కూర్చోండి అన్నాడు.

జీవితమంతా రోగులకు సేవ చేస్తాను. కానీ నాకు ఈ అమ్ములు వద్దు. భవిష్యత్తు లో సొమ్ములు వద్దు. అంటూ ఉన్న నాలుగు వెంట్రుక పోచలను వెనక్కి తోసి పరిగెత్తాడు.

అమ్ములు హాయిగా సిరీస్ చూస్తూ చిప్స్ లాగించ సాగింది.

బక్క రావు బిక్కు బిక్కు మంటూ నిలబడ్డాడు.

శాంత అశాంతంగా లోపలికి వెళ్ళింది.

May 31, 2025 76 comments
0 FacebookTwitterPinterestEmail
కథలు

ఆహా! నీ లీల!     

by Aruna Dhulipala May 31, 2025
written by Aruna Dhulipala

ఉదయం 7 గంటలు అవుతోంది. ఫోను అదేపనిగా మోగుతున్నది. ఇండియా నుండి ఆంజనేయ శాస్త్రి కాల్.

         “హలో మామయ్యా! బాగున్నారా? ఏంటి విషయాలు?”  అడిగాడు అమెరికాలో ఉన్న ‘భారవ్’ అలియాస్ భార్గవరామ శర్మ. 

      “నాయనా! నిన్న గుడికి గర్భాలయం కట్టడం పూర్తి అయిందో లేదో! ఇవాళ పొద్దటి నుండి ఆగకుండా వాన పడుతోంది. ఇప్పుడు మాకు రాత్రయింది కదా! ఇంకా కురుస్తూనే ఉంది. వరస చూస్తుంటే తగ్గేటట్టు అనిపించడం లేదు. అంతా ఆ అమ్మవారి దయ. ఆనందంతో చెప్పుకుపోతున్నాడు ఆంజనేయ శాస్త్రి.

     “వాట్! ఎంత శుభవార్త చెప్పారు. ఇక మన ఊరి కష్టాలు తీరినట్టే మామయ్యా! గుడి పనులు మొత్తం పూర్తి చేయించండి.  ఇంకా ఎంత కావాలో చెప్పండి.

డబ్బులు వెంటనే పంపిస్తాను” అన్నాడు పొంగిపోతూ భార్గవరామశర్మ.

      “ఇదంతా నీ వల్లే నాయనా! పుట్టిన ఊరి ఋణం తీర్చుకుంటున్నావు” అన్నాడు శాస్త్రి.

     “ఇట్లాంటి మాటలతో నన్ను సిగ్గుపడేలా చేయకండి మామయ్యా! ఇప్పటికే నేను చేసిన దానికి కృంగిపోతున్నాను”

       “ఆ అమ్మవారు నీ హృదయంలో ప్రవేశించి నిన్ను ఇంతటి పని చేయిస్తున్నది. ఇంతకంటే మనకేం కావాలి? పనులు వేగంగా జరుగుతున్నాయి. దాదాపు పూర్తయినట్టే. వార్షికోత్సవం సమయానికి ప్రతిష్ఠ జరగాల్సిందే. ఇప్పటికైనా మీ తండ్రి ఆత్మ శాంతిస్తుంది. సరే నాయనా! ఉంటాను” అని ఫోను పెట్టేశాడు ఆంజనేయశాస్త్రి.

              ********* ********* *******

        నేలపల్లి ఊరు. ఎప్పుడూ సస్యశ్యామలంగా ధాన్యాలు కుప్పబోసిన రాశిలా నిండుగా నవ్వుతూ ఉండేది. ఊరిప్రజలు అరమరికలు లేకుండా ఎదుటివారి 

కష్టసుఖాల్లో పాలుపంచుకుంటూ అన్యోన్యంగా ఉండేవాళ్ళు. 

      ఆ ఊళ్ళో పురోహితుడు నరసింహశర్మ. ఆయన ఆ

ఊళ్ళో శ్రీరాజరాజేశ్వరీ దేవి ఆలయాన్ని కట్టించాడు. పురోహితుడు అనే పదానికున్న అర్థాన్ని సార్థకం చేస్తూ ఊళ్లోని బాగోగులను పట్టించుకునేవాడు. ఊరి పెద్దలు కూడా ఏ చిన్న సమస్య అయినా ఆయనతో చర్చించేవారు.

      గుడి చిన్నదే. కానీ చుట్టూ విశాలమైన ఆవరణ. రావి, వేప కలిసి ఉన్న నీడనిచ్చే పెద్ద చెట్టు ఉండేవి. శరన్నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలు, పూజలు జరిగేవి. వచ్చే భక్తులకు అన్నదానం కూడా చేసేవారు. రైతులు తాము పండించిన పంటల్లో కొంతభాగాన్ని ఆలయానికి సమర్పించేవారు. పాడిసంపద ఉన్నవాళ్లు ఉత్సవాల సమయంలో పాలు, పెరుగు, నెయ్యి కావలసినంత ఇచ్చేవాళ్ళు. 

       ఇక గుడి వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగేవి. చుట్టుపక్కల ఊళ్ల నుండి ఎంతోమంది

వచ్చేవారు. పూజా కార్యక్రమాలతో పాటు హరికథా శ్రవణం, ఒగ్గుకథలు, ఎడ్లబండ్ల పూజలు, అగ్నిగుండాలు, రథోత్సవం ఇవన్నీ ప్రత్యేక ఆకర్షణలు. సంగీత, నాట్య కళా ప్రదర్శనలు కూడా రసజ్ఞులను అలరించేవి. ఆ సమయంలో వాటిని చూడడానికి జనం విరగబడేవారు. బొమ్మల షాపులు, తినుబండారాల బండ్లు, గారడీ ప్రదర్శనలు, కనికట్టు మాయాజాలాలు ఒకటేమిటి? విద్యుద్దీపాలతో రాత్రుళ్ళు కూడా పట్టపగళ్లయ్యేవి. 

         నరసింహ శర్మకు ఒక్కడే కొడుకు భార్గవరామశర్మ.

అందరిలాగే కొడుకును పెద్ద చదువులు చదివించి, విదేశాలకు పంపాలన్న కోరిక వేల కిలోమీటర్ల దూరంతో పాటు దగ్గరకు రాలేనంతగా మనసునూ దూరం చేసింది.

చదువుకొని ఉద్యోగరీత్యా వెళ్లినవాడు తండ్రి శ్రీరాముని మీద భక్తితో పెట్టిన పేరును కూడా ‘భారవ్’ అని స్టైల్ గా మార్చుకున్నాడు. అది తండ్రికి మరింత భారంగా తోచింది. తనతో చదువుకుంటున్న అమ్మాయి సౌమ్యను పెళ్లి చేసుకొని అక్కడే స్థిరపడ్డాడు ‘భారవ్’. అప్పుడో ఇప్పుడో ఒక ఫోన్ కాల్ అంతే. తండ్రి ఫోన్ చేసినప్పుడు ముక్తసరి మాటలతో సరిపెట్టడం.

         దిగులుతో మంచం పట్టిన ఆయన అకాల మరణానికి చేరువయ్యాడు. కర్మ కాండ జరిపించడానికి భార్యతో సహా వచ్చిన భార్గవరామశర్మ తప్పదన్నట్టు తల్లిని తమతో రమ్మన్నాడు. ఆత్మాభిమానం గల ఆ ఇల్లాలు ఇల్లు, ఊరును వదిలి రానన్నది. తన మాట వినలేదని కోపంతో వెళ్ళిపోయాడు భార్గవరామశర్మ.

ఇల్లు బోసిపోయింది. అదే ఇంట్లో ఆమె కొడుకు పంపించే డబ్బుతో, భర్త జ్ఞాపకాలతో, ఇరుగుపొరుగువారి ఆదరణతో బతుకును ఈడుస్తున్నది. పూజలు కరువయి, ఉత్సవాలు లేక గుడి మెల్లమెల్లగా శోభను కోల్పోసాగింది.

        కారణం తెలియదు కానీ ఊరిపెద్దలు ఎంతగా ప్రయత్నించినా గుడిలో పూజారిగా ఉండడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఆ ఏడాది వర్షాలు కురవలేదు. ఏమో కాల మహిమ! అనుకున్నారు జనం. కష్టనష్టాలు భరిస్తూ కాలంతో రాజీ పడ్డారు. తరువాత మూడేళ్లు అదే పరిస్థితి. చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో వర్షం విపరీతంగా పడేది. ఇక్కడ పడకపోయేది. మబ్బులు ఎంతగా కమ్ముకున్నా తేలిపోయేవి. చినుకు పడేది కాదు. బతుకును వెతుక్కుంటూ ఊరిజనం మెల్లగా వలసదారి పట్టారు.

              ******  ******** ********

     ఆంజనేయ శాస్త్రి, నరసింహ శర్మ మంచి స్నేహితులు.

రెండూళ్ల అవతల నాగులపల్లి ఆయన ఊరు. ఆయన కూడా పౌరోహిత్యం చేసేవాడు. రెండు కుటుంబాలు ఎంతో ఆత్మీయంగా ఉండేవి. చిన్నప్పటి నుండీ భార్గవరామశర్మకు అతడిని ‘మామయ్యా’ అని పిలవడం అలవాటు. ఆ చనువుతో నరసింహ శర్మ చనిపోయినప్పుడే ఆంజనేయశాస్త్రి, భార్గవరామశర్మకు హితబోధ చేసే ప్రయత్నం చేశాడు కానీ భార్గవరామశర్మ పట్టించుకోకపోవడంతో వదిలేశాడు. 

      నేలపల్లి ఊళ్ళో జరుగుతున్న పరిస్థితులు ఆంజనేయ శాస్త్రికి తెలుస్తూనే ఉన్నాయి. చూస్తూ ఊరుకోలేక పోయాడు. ఏదో ఒక పరిష్కారం చూడకపోతే తన వృత్తికి అర్థం లేదనుకున్నాడు. భార్గవరామశర్మకు ఫోను చేసి విషయమంతా వివరించాడు. అయినా అతని మనసు కరగలేదు. నాకు ఇంకెప్పుడూ ఈ విషయంలో ఫోను చేయొద్దని, అది నా సమస్య కాదని కోపగించుకున్నాడు. అట్లా రెండు మూడు సార్లు ప్రయత్నించి ఆంజనేయ శాస్త్రి 

భంగపడ్డాడు. 

             ******* ******** ******

      ఒకరోజు హఠాత్తుగా భార్గవరామశర్మ నుండి ఆంజనేయ శాస్త్రికి ఫోను వచ్చింది. 

“మామయ్యా! గుడి పునర్నిర్మాణం జరగాలంటే ఎంత ఖర్చవుతుంది?” అని అడిగాడు. ఆ గొంతులో ఆర్తి, ఆవేదన స్పష్టంగా తెలుస్తున్నాయి.

“భార్గవరామా! ఏమైంది నాయనా?” అడిగాడు నెమ్మదిగా ఆంజనేయశాస్త్రి.

“నన్ను క్షమించమని అడిగే అర్హత కూడా నాకు లేదు మామయ్యా! నాన్నను దూరం చేసుకున్నాను. బతికి ఉన్న అమ్మను ఆదరించడం లేదు. నా పాపానికి తగిన ప్రాయశ్చిత్తం అనుభవిస్తున్నా. నిన్న రాత్రి నాకు వచ్చిన కలను మర్చిపోలేక పోతున్నాను. కరువుతో అల్లాడుతున్న ఊరి జనం నా చుట్టూ దీనంగా నిలబడి ఉన్నారు. పిల్లలు ఆకలితో అలమటిస్తున్నారు. బీడుగా మారిన పంటపొలాలు. కళ్ళముందు ప్రత్యక్షమైనట్లు కనిపించాయి. ఆ దృశ్యం చూడలేకపోయాను. నాన్న

తరువాత ఆయన కొడుకుగా గుడి పాడువడకుండా చూసుకోవాల్సింది. మీరు ఎంత చెప్పినా నేను వినలేదు. ఆ పాపమే కావచ్చేమో! పెళ్లయి పదేళ్లు అయినా నాకు సంతానం లేదు. మామయ్యా! నన్ను మన్నించి నా కోరిక ఒక్కటి తీర్చండి. అన్నీ తెలిసినవారు. ఇప్పుడు నా ధ్యేయం ఒక్కటే. మన ఊరి ప్రజలను కాపాడాలి. ఎంత డబ్బు అయినా పంపిస్తాను. మీరు దగ్గరుండి గుడి నిర్మాణం మొదలుపెట్టండి. ఇంతకుముందు దానికంటే విశాలంగా కట్టించండి. ఊరి పెద్దలతో నేను మాట్లాడతాను”అని పూడుకు పోతున్న కంఠంతో చెప్పాడు. 

         “కొద్ది రోజులు అమ్మకు మీ ఇంట్లో ఆశ్రయమిచ్చి ఇల్లును కూడా బాగు చేయించండి. దయచేసి కాదనొద్దు మామయ్యా!” అంటూ బతిమిలాడాడు. ఆంజనేయశాస్త్రి ఆనందానికి అవధులు లేవు. 

               ********* ****** ********

      భార్గవ రామశర్మ నిర్ణయానికి పెద్దలు హర్షించారు. ఊరు నిలబడితే చాలనుకున్నారు. ఆంజనేయశాస్త్రి ఆధ్వర్యంలో అన్నీ జరగడానికి ఒప్పుకున్నారు. డబ్బు

చేతిలో ఉంటే పనులు జరగడం ఎంతసేపు?ఎనిమిది నెలల్లో గుడి నిర్మాణం పూర్తయింది. గుడి పూజారిగా ఆంజనేయ శాస్త్రికి ఇల్లు ఏర్పాటయింది. నరసింహ శర్మ ఇల్లు కూడా బాగయింది

        వార్షికోత్సవ సమయంలోనే శ్రీరాజరాజేశ్వరీ దేవి అమ్మవారి విగ్రహాన్ని పునః ప్రతిష్ఠాపన చేశారు. నాలుగు సంవత్సరాల తర్వాత మళ్లీ జనాలతో కళకళ లాడింది ఆ ఊరు. రెండు నెలల సెలవు తీసుకొని నాలుగు రోజుల ముందే భార్యతో పాటు ఊరికి వచ్చాడు భార్గవరామశర్మ.

తాను వచ్చినప్పటినుండీ ఊరి పెద్దలు, ప్రజలు ఆదరిస్తున్న విధానానికి ఆశ్చర్యపోయాడు. గుడి నిర్మాణం  జరగుతుండడం వల్ల వాళ్ళకు కలుగుతున్న ఆనందాన్ని కళ్లారా చూశాడు. వాళ్లకు తండ్రి పట్ల ఉన్న అపార గౌరవాన్ని అర్థం చేసుకున్నాడు. ఇన్నిరోజులు తాను ఏం కోల్పోయాడో తెలిసి కన్నీరు ఉబికివచ్చింది.

        ఆరోజు వార్షికోత్సవంలో నాలుగవ రోజు. రాత్రి ఒంటిగంట. డప్పుల మోత అంతకంతకూ తీవ్రమవుతున్నది. సాయంత్రం నుండి తగులబెట్టిన కర్రలు నిప్పు కణికలై రుద్రుని ఫాలనేత్రం వలె ఎర్రగా

మండుతున్నాయి. సమానంగా పేర్చిన ఆ నిప్పుల మీద నడవడానికి ఆ అగ్నిగుండం చుట్టూ దాదాపు పదిహేను మంది నిలబడి ఉన్నారు. 

         వీరశైవజంగాల, బలిజల భక్తిపారవశ్యం మిన్నంటుతున్నది. ఆ రోజంతా వారి పూజా కార్యక్రమాలు నిర్వహించబడుతాయి. ‘దండకాలు’ చదువుతున్నారు. ఒక్కసారి “అశ్శరభ శరభ శరభ, అశ్శరభ శరభ శరభ”

అని గట్టిగా అరుస్తూ ఒకరి తరువాత ఒకరు నిప్పులమీద నడుస్తున్నారు. వారిలో కొంతమంది ఆడవాళ్లు కూడా ఉన్నారు. కోరికలు తీరాలనో, తీరిన కోర్కెల మొక్కులో? ఏది ఏమో కానీ వాళ్ళ పాదాలకు ఎటువంటి బాధ కలగడం లేదు. ఊపిరిబిగబట్టి చూస్తున్న వందలాది జనం ఆనందంతో, ఆశ్చర్యంతో, భయంతో తమను తాము మర్చిపోయారు. వారి ఆనందకేరింతలు గత వైభవాన్ని పునరావృతం చేస్తున్నాయి.

       గుడి మెట్ల మీద కూర్చొని ఇదంతా గమనిస్తున్న భార్గవ రామశర్మకు తన బాల్యంలో జరిగే జాతర గుర్తొచ్చింది. తిరిగి అటువంటి అనుభూతిని పొందుతూ

తన పక్కన ఉన్న  ఆంజనేయశాస్త్రి వైపు చూశాడు. ఒకేసారి ఇద్దరి కళ్ళు కలుసుకున్నాయి. ఆ చూపుల్లో అవ్యక్తమైన భావం. ఒకరి పట్ల ఒకరికి ఆరాధనా భావం కదలాడింది. కన్నీటి పొర కదలాడుతుండగా అమాంతం వంగి ఆంజనేయ శాస్త్రి పాదాలకు నమస్కరించాడు భార్గవరామశర్మ. అతడిని దగ్గరకు తీసుకొని లాలనగా తల నిమిరాడు ఆంజనేయ శాస్త్రి. 

        అంతా సద్దుమణిగే సరికి 3 గంటలు అయింది. తెల్లవారి వార్షికోత్సవం ముగుస్తుంది. ఇంటికి వెళ్లి తల్లి మంచం దగ్గరకు వెళ్ళాడు. అలికిడికి నిద్రలేచిన తల్లి ఒడిలో పడుకున్నాడు. తల్లి కళ్ళు చెమర్చాయి. తండ్రి రూపం కళ్ళల్లో కదలాడి తనను ఆశీర్వదిస్తున్నట్టు తోచింది. ప్రశాంతంగా కళ్ళు మూసుకున్నాడు. తలుపు చప్పుడుకు రూములో నుండి బయటకు వచ్చిన సౌమ్య వాళ్ళిద్దరిని అట్లా చూసి చిన్నగా నవ్వుకుంది. వచ్చిన ఈ వారం రోజుల్లోనే ఆమె అత్తగారికి చాలా దగ్గరైంది.

        చివరి రోజు పూర్ణాహుతి. ఉదయమే గుడికి వెళ్ళడానికి సిద్ధమైన సమయంలో “అమ్మా! బాగున్నారా?” అంటూ ఒక వ్యక్తి వచ్చాడు. నరసింహశర్మ భార్య ఆయనను గుర్తు పట్టలేదు.

“అమ్మా! నేను చంద్రాన్ని. నేను బతికి ఉన్నానంటే మీరే కారణం. ఏడేళ్ల కింద ఉత్సవానికి వచ్చినప్పుడు నాకు గుండెపోటు వచ్చింది. మీరు ఎవరితోనో మాట్లాడి కారు ఏర్పాటు చేసి నాభార్యకు తోడుగా మీరూ బయలుదేరి నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు. సమయానికి తీసురావడం వల్ల బతికాడని డాక్టర్లు చెప్పారు. మీ మేలు జీవితంలో మరువలేను” అని కాళ్లకు దండం పెట్టాడు. “ఓ నువ్వా చంద్రం! ఇప్పుడు గుర్తుకు వచ్చింది” అంటూ కబుర్లు మొదలు పెట్టిన తల్లిని, చంద్రాన్ని చూస్తూ మైమరచిపోయాడు భార్గవరామశర్మ. తన తల్లిదండ్రులకు ఆ ఊరితో పెనవేసుకున్న జ్ఞాపకాలకు చలించిపోయాడు.  అమ్మను తనతో రమ్మన్నప్పుడు ఆమె ఎందుకురాలేదో అర్థమై మనసు బాధతో మూల్గింది.  

         సెలవు పూర్తయిన భార్గవరామశర్మ తనతో పాటు కొంతకాలం తల్లిని తీసుకువెళ్లేందుకు ఒప్పించాడు. ప్రయాణానికి మూడు రోజుల ముందు షాపింగు కోసమని తల్లిని, భార్యను హైదరాబాద్ కు తీసుకువెళ్ళాడు. తిరిగి వస్తున్న సమయంలో షాపు మెట్లమీద కళ్ళు తిరిగి హఠాత్తుగా తనమీదకు ఒరిగిపోయిన సౌమ్యను హడావిడిగా ఆసుపత్రిలో

చేర్చాడు. ‘ఆమె గర్భవతి’ అని డాక్టర్లు చెప్పిన మాటకు అతని సంతోషం మిన్నంటింది. తల్లిని భుజాలు పట్టి కుదిపేశాడు. అమ్మవారికి మనసులో నమస్కరించుకున్నాడు. భార్య ఆరోగ్యదృష్ట్యా ప్రయాణం వాయిదా వేసుకున్నాడు. ఊళ్ళోకి రావడంతోనే

ఆంజనేయశాస్త్రి చెవిలో తాను తండ్రి కాబోతున్న శుభవార్తను చెప్పాడు నవ్వుతూ. ఆయన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతూ “ఆహా! ఎంత కరుణామయివి తల్లీ! ఏమి నీ లీల?” అని రెండు చేతులు జోడించాడు

భక్తి పరవశతతో.

May 31, 2025 73 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

బ్రహ్మశ్రీ మోతుకూరి నరహరి గారితో ముఖాముఖీ

by రంగరాజు పద్మజ May 31, 2025
written by రంగరాజు పద్మజ

శ్రీమతి కొండపల్లి నీహారిణి గారి సంపాదకత్వంలో వెలువడుతున్న మయూఖ అంతర్జాల ద్వైమాసిక పత్రిక ముఖాముఖిలో భాగంగా ప్రముఖ పండితులు, సాహిత్యానికి సామాజిక ప్రయోజనమే లక్ష్యమని నమ్మే సాహితీ మేరునగం బ్రహ్మశ్రీ మోతుకూరు నరహరి గారితో రంగరాజు పద్మజ ఈనాటి ముఖాముఖి….

ఏదేని సాహిత్యరచనలోని తప్పొప్పులు గమనించి చెప్పేది విమర్శ. అయితే అలా విమర్శ చేయాలంటే సాహిత్యంలో గొప్ప నిష్ణాతులై ఉండి, విద్వాంసులై ఉండి,ప్రాచీన వాఙ్మయంపై నిత్యం అధ్యయనం చేసేవారు మాత్రమే చక్కని విమర్శ చేయగలరు. దీనికి జ్ఞాపక శక్తితో పాటు, పునశ్చరణ ఉండాలి! ఇవన్నీ కలిసి చేసే విమర్శతో సారస్వత పరమార్ధం తెలుస్తుంది.
కవి ప్రవృత్తి జోలికి పోకుండా, కావ్యాన్ని మాత్రమే స్వచ్ఛమైన విమర్శ చేస్తూ, రచనలు ప్రోత్సహిస్తేనే నిజమైన విమర్శ అనిపించుకుంటుంది.
ఇటువంటి సద్విమర్శలు చేసే మాన్య మహోదయులు బ్రహ్మశ్రీ మోత్కూరు నరహరి గారు ఒక విమర్శకులే కాదు, ఏ విషయమైనా అనర్గళంగా ఉపన్యసించే మంచి వక్తలు… సాహితీవేత్తలు… వ్యాకర్తలు… సామాజిక స్పృహ కలిగిన మానవతామూర్తులు!ఉద్యమ సంఘాలను ముందుండి నడిపించగల నాయకులు…
ఏదేని విషయం అడగగానే ఆ నిర్దిష్ట విషయం ఏదైనా సరే వ్యుత్పత్తి అర్ధాలతో, వ్యాకరణ వివరణలతో వివరించగల విచక్షణులు.
అటువంటి కవి, పండిత, విమర్శకులైన మాన్యులు నరహరి గారితో సంభాషించి మరెన్నో విషయాలు తెలుసుకుందాం!
మీ రంగరాజు పద్మజ.

రంగరాజు పద్మజ :– నమస్కారమండి!

మోతుకూరి నరహరి గారు:- శుభం అమ్మా!

పద్మజ:– కొండపల్లి నీహారిణి సంపాదకత్వంలో మయూఖ పత్రిక మీతో ముఖాముఖి చేసి ఎన్నో విషయాలు పాఠకులకందించాలని అభిలాష!
మీరు అంగీకరించడం మీతో మాట్లాడే అరుదైన అవకాశం నాకు రావడం చాలా సంతోషంగా ఉంది.

నరహరి గారు :– చాలా సంతోషమమ్మా! నీహారిణి నాకు పది సంవత్సరాలుగా పరిచయమే! ఆమె Phd చేస్తున్నప్పుడు, తన గైడ్ నిత్యానంద రావుగారిని వ్యాకరణ, సంస్కృత శ్లోకాల గురించి అడిగితే… నన్ను కలవమని చెప్పగా తను వచ్చింది.
కొండపల్లి శేషగిరి రావు గారి కోడలుగా సరే! కానీ వాళ్ళ నాన్నగారు సుప్రసిద్ధ కమ్యూనిస్టు, 52లో ఎంపీగా గెలిచాడు. అది కూడా కాళోజి గారి మీద. ఆయనంటే నాకు చాలా గౌరవం. నీహారిణిని నేను చెల్లెలిలాగ భావిస్తాను. ఆమె భర్త వేణుగోపాల్ తో కూడా సన్నిహితంగా ఉంటాను.

పద్మజ:– మీ కుటుంబ నేపథ్యం చెప్పండి?

నరహరి గారు :– మా స్వంత ఊరు మోతుకూరు పక్కనే బుజిలాపురం. ఇంటిపేరు కూడా మోత్కూరే! మన ఇండ్ల పేర్లు ఊళ్ళ పేర్లు అయినప్పుడు వలస అని అనుకోవాలి! నేను పుట్టింది 11-4-1944 అని రాసారు. తెలుగు పంచాంగం ప్రకారం బహుశా తారణ నామ సంవత్సర ఆషాడ శుద్ధ ఏకాదశి అయి ఉంటుంది. దానికి ఎలిబీ లేదు.
పక్కనే ఇక్కుర్తి అని ఒక ఊరు ఉన్నది. ఆ ఊర్లో మా అమ్మమ్మ గారు ఉండేవారు.
నేను మొట్టమొదటి సంతానాన్ని కాబట్టి అక్కడే పుట్టాను. 11 సంవత్సరాలు వచ్చేవరకు అమ్మమ్మగారింట్లోనే పెరిగి, అక్కడే చదువుకున్నాను. తర్వాత మోత్కూర్ కు వచ్చినాను. హై స్కూల్ వరకు చదువుకున్నాను. 62లో హైస్కూల్ చదువు అయిపోయింది. మా నాన్నగారు పౌరోహిత్యం చేసేవారు. ఆయన కమ్యూనిస్టు పార్టీ సభ్యులు కూడా! ఆ రోజుల్లో కమ్యూనిస్టు కానివారు లేరు. ఎందుకంటే తెలంగాణ పోరాటం 1956 లో ప్రారంభమైంది. పోరాటాన్ని నేను చూడలేదు కానీ పోరాటం తర్వాత పోలీస్ యాక్షన్ పోలీసుల దాడులు, కమ్యూనిస్టులను చిత్రహింసలు పెట్టడం చూశాను.
1964 లో పార్టీ చీలిపోయేంత వరకు అంతా కలిసే ఉన్నారు కాబట్టి, నాన్న కూడా అందులో చురుగ్గా పనిచేసేవారు. మా మేనమామలు కూడా పౌరోహిత్యం చేసుకుంటున్నా సరే! కమ్యూనిస్టు సానుభూతిపరులుగా ఉండేవారు. కమ్యూనిస్టులు రాత్రిపూట వచ్చి “అమ్మా! మీకేమైనా ఇబ్బంది వస్తే మేము వస్తాము” అని చెప్పేవాళ్ళు.
మా అమ్మమ్మ వాళ్ళు అవ్వారు వాళ్ళు. నేను పుట్టేటప్పటికీ మా తాతయ్య రామకృష్ణయ్య గారు మరణించారు. మా పెద్దమ్మ మడికొండ పల్లా దుర్గయ్య గారి వదిన నరసమ్మ గారు వెంకటయ్య గారి భార్య. రెండవ వారు మా అమ్మ. త్రిపురారి వెంకట్రామయ్య గారి భార్య అహల్యగారు మూడు వీరంతా పేరుకు అగ్రవర్ణమే! కానీ ఏమీ చదువుకోలేదు. కానీ కార్తీకమాసంలోనూ, రోజూ విధివిధానంగా ఆచారాలు పాటించే వాళ్ళు. వాళ్లు పాడే పాటలు విని విని పాటల మీద, పద్యాల మీద, శ్లోకాల మీద ఒక రకమైన ఆసక్తి కలిగింది.
పద్మజ :– మీ అభిరుచులలో అటు కమ్యూనిస్టు భావాలు- ఇటు సంప్రదాయ రచనలు, ప్రాచీన వాఙ్మయం, సాహిత్యానికి ఆకర్షింపబడటం, అందులో రాణించగలగడం ఇలా పరస్పర వైరుధ్యాలు ఎలా సాధ్యమైంది?

నరహరి గారు :– ఇది ఒక అపోహ మాత్రమే! సంప్రదాయంలో పుట్టిన వారికి వామపక్ష భావాలు ఉండడం అసహజమనుకుంటారు కానీ, కమ్యూనిజం ఏం చెబుతుంది?

ఒక మనిషిని వేరొక మనిషి; ఒక జాతిని వేరొక జాతి పీడించే సాంఘిక ధర్మం ఇంకానా? ఇకపై చెల్లదు అని కదా!

శ్రీశ్రీ చెప్పిందే మార్క్స్ చెప్పాడు. మార్క్స్ చెప్పింది ఏమిటి కమ్యూనిస్టు మేనిఫెస్టోలో మొట్టమొదటి వాక్యం ఏమిటి అంటే
ఇదివరకు జరిగిన చరిత్ర అంతా కూడా వర్గాల మధ్య జరిగిన పోరాటమే! అనే వాక్యం మొదటిది.
మన భారతీయ సంప్రదాయంలో నేను హిందూ అనడం లేదు! వైదిక అంటున్నాను… భారతీయ సంప్రదాయం కానివ్వండి, అద్వైతం కానివ్వండి, విశిష్టాద్వైతం ఏదైనా సరే కోరుకునేది ఏమిటి?

సర్వే భవంతు సుఖినః
సర్వేసంతు నిరామయాః
సర్వే భద్రాణి పశ్యన్తు మా కశ్చిద్దుఃఖ భాగ్భవేత్
(మా కశ్చిద్ – దుఃఖ- భాగ – భవేత్)

ఎవరికీ దుఃఖం కలుగకుండు గాక! అందరూ సమానంగా ఉందురు గాక !
అనే కదా! కోరుకునేది మరి కమ్యూనిజం కోరుకునేది కూడా అదే కదా? ఎందుకో కమ్యూనిష్టులను దుర్మార్గులు, దుష్టులు అని ఒక ముద్ర వేసారు. అలా ఏమీ లేదు. ఒక పీడనం ఉందా? లేదా? ఇవాళ దోపిడీ ఉందా? లేదా? ఈ దోపిడీని అంతం చేయాలంటే ఏం చేయాలి ?ఒక్క ముక్కలో చెప్పాలంటే వైదిక సంప్రదాయం అనేది సిద్ధాంతం చెబుతుంది… సూత్రీకరిస్తుంది… విషదీకరిస్తుంది.
మార్క్సిజం దాన్ని ఆచరణలో చూపెడుతుంది. అందువల్ల ఈ రెండింటి మధ్య ఏమాత్రం వైరుధ్యం లేదు.
ఎందుకంటే? నేను ప్రసంగించినప్పుడు రామానుజాచార్యుల వారిని కోట్ చేసి చెప్తాను.
“రామానుజాచార్యుల వారి గురువుగారు
మంత్రోపదేశం చేసి ఎవరికీ చెప్పకండి” అని అంటే…
“చెప్తే ఏమవుతుంద”ని? రామానుజులు అడిగారట. “చెప్తే నీకు నరకం వస్తుంది” అన్నారట గురువుగారు.
“విన్న వారికి ఏమొస్తుంది”? అని రామానుజులు అడిగారట.
“స్వర్గం వస్తుంది”! అన్నారట గురువుగారు. “అయితే నాకు నరకం వచ్చినా పర్వాలేదు” అని రామానుజులు గిరిశిఖరం ఎక్కి అందరికీ మంత్రం చెప్తాను” అని అందరికీ స్వర్గం వస్తుంది… నాకు నరకం వచ్చినా పర్వాలేదు! అని అన్నారట. రామానుజులవారు.
అలాగే శంకరాచార్యులవారు వస్తుంటే ఎదురుగా కల్లుముంత పట్టుకొని చండాలుడు వస్తూ ఉంటే… ఆయన శిష్యులు అందరూ అతనితో అపసర అపసర అంటే పక్కకు తప్పుకో! పక్కకు తప్పుకో! అని అన్నారట!
ఆ చండాలుడు అన్నాడట ఎవరు తప్పుకోవాలి?
ఆత్మనా? పరమాత్మ నా? అని అడిగాడట. అది విని,
చండాలోస్తూ స తు ద్విజోస్తు గురురిత్యేషా
మనీషా! మమ!! ( మనీషా= బుద్ధి)(జ్ఞానం)
ఆ చండాలుడి ముందు సాష్టాంగ పడ్డారట ఆది శంకరులు.
మనసు ఆలోచిస్తుంది- బుద్ధి వివేచన చేస్తుంది. కాబట్టి గురువు- గురువే!
చండాల అస్తు ద్విజః అస్తు
బ్రాహ్మణుడు కావచ్చు! చండాలుడు కావచ్చు! కాబట్టి ఇక్కడ ద్వైతాద్వైతా విశిష్టాద్వైత ఏమి చూసినా సరే కులం పేరుతో మతం పేరుతో వివక్ష చూపించడం అనేది ఎక్కడా లేదు!
తర్వాత కాలాల్లో వచ్చినవి ఇవన్నీ. అందువల్ల భారతీయ సంప్రదాయానికి ఏ విధమైన వైరుధ్యము లేదు! ఇందాక నేను చెప్పినట్టుగా మన విశ్వాసాలు మన సిద్ధాంతాలు! మన సూత్రాలన్నీ ఆకాంక్షలు. ఇవే మార్క్సిజం అనేది ఆచరణ.
మొన్న దాశరధి గారి గురించి జూమ్ మీటింగులో ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ దాశరధి గారు ఆ రోజుల్లో అన్నాడు
రానున్నది ఏది నిజం?
అదే సోషలిజం కలపండోయ్ భుజం భుజం
కదలండోయ్ గజంగజం!!
అన్నాడు. కానీ సోషలిజం వచ్చిన రష్యాలోనే కమ్యూనిజం పోయింది.. అన్నారు.
నేను వెంటనే స్పందించి సోదరా! మీరు చెప్పింది వాస్తవమే! రష్యాలో పోయినంతమాత్రం చేత ప్రపంచంలో అంతా పోయిందని కాదు! ఇవాళ ఉత్తర కొరియా గాని, వియత్నం గాని, క్యూబా కాని, మన పక్కన శ్రీలంకలో ఈ మధ్యనే లూరా, డేనీ లాంటి వాళ్ళు, వెనిజులా లాంటి వాళ్ళు వచ్చారు. ఎక్కడ పీడన ఉంటుందో? అక్కడ మార్క్సిజం ఉంటుంది!
రష్యన్ కవి ఇలా అంటాడు
“ఎక్కడ బాధ ఉందో అక్కడల్లా నేను ఉన్నాను”!
కారిన ప్రతి కన్నీటి కణంలో నన్ను నేను శిలువ వేసుకున్నాను” అని అన్నాడు.
దాన్ని శ్రీశ్రీ అనువాదం చేశాడు.
అలాగే రామాయణంలో కూడా
యత్రయత్ర రఘునాథ కీర్తనమ్
తత్త్ర తత్ర నతమస్తకాంజలిమ్
భాష్ప వారి పరిపూర్ణ లోచనమ్
మారుతిమ్ నమత రాక్షసాంతకమ్!
అని వాల్మీకి అంటాడు.
ఎక్కడెక్కడ పీడన ఉంటుందో? అక్కడక్కడ తిరుగుబాటు ఉంటుంది. ఈ రెండింటికి వైరుధ్యం లేదు! మనం కోరుకునేది అందరూ బాగుండాలని, ప్రవచన కారులు ఇదే విషయం పదేపదే చెబుతున్నారు. కొద్దిమంది వింటున్నారు. కానీ ఆచరణలో పెట్టడం లేదు. అందుకే సమాజంలో ఇన్ని అరాచకాలు జరుగుతున్నాయని నా బాధ!
అందువల్ల రెండింటికి సమన్వయం చేసుకోవాలి! తప్ప వైదిక సంప్రదాయం, భారతీయ సంప్రదాయం, మార్క్సిజం అనేవి పరస్పర పూరకాలు… పోషకాలే… తప్ప పరస్పర వైరుధ్యమైనవి కావు!
పద్మజ:— మీరు ఆంధ్ర ప్రాచ్య కళాశాలలో ఎందుకు చేరాలనుకున్నారు?

నరహరి గారు :—- నేను 1962లో హైస్కూలు పాస్ అయ్యి రెండు సంవత్సరాలు ఉద్యోగం కోసం ప్రయత్నించాను. నల్లగొండ జిల్లా చింతపల్లి మండలంలో ఉపాధ్యాయునిగా ఉద్యోగం వచ్చింది. అప్పుడప్పుడే పంచాయతీరాజ్ వ్యవస్థ వచ్చింది కనుక హైస్కూల్ చదువుతోనే ఉద్యోగం వచ్చేది. అప్పుడు నాకు అనారోగ్యంగా ఉండడంతో ఉద్యోగంలో జాయిన్ కాలేకపోయాను.
1964 ఆగస్టులో హైదరాబాద్ వచ్చాను. అక్టోబర్లో వికారాబాద్ జిల్లాలో విద్యాశాఖాధి కార్యాలయంలో ఎల్డీసీగా ఉద్యోగం వచ్చింది. ఆ రోజుల్లో ఒక రెవెన్యూ , మరొకటి విద్యకు రెండు విభాగాలు ఉండేవి. తర్వాత వాటిని ఒకదానిలో మరొకటి కలిపారు. ప్రమోషన్ లు త్వరగా రావని 1965 లో హైదరాబాద్ వచ్చాను. ఉపాధ్యాయుడుగా చేయాలనుకున్నాను. అక్కడ ఒక మిత్రుడు కలిస్తే సాయంకాల కాలేజీలో చేరాలనుకుంటున్నాను. ఎక్కడ చేరాలి? అని అడిగితే, నల్లకుంటలో ప్రాచ్య కళాశాల ఉంది. ఖండవల్లి లక్ష్మీ నిరంజనం గారు దాన్ని ప్రారంభించారు. సాయంత్రం ఐదు నుంచి తొమ్మిది వరకు ఉంటుందంటే 1965లో దానిలో చేరాను. డిప్లమా ఓరియంటల్ 1970లో వరంగల్లో ట్రైనింగ్ చేసాను, 1973లో ఎం ఏ, 1974లో లెక్చరర్ గా చేరాను. మా శ్రీమతి కూడా ఓరియంటల్ కాలేజీలో చేరింది. బి ఓ ఎల్; డీవొయల్ చేసింది. 1972లో ట్రైనింగ్ చేసి ఉద్యోగంలో చేరింది. నేను రావడంతో నా కుటుంబం మొత్తం ఇక్కడికి వచ్చి చదువుకుని అందరూ స్థిరపడ్డారు. ఒక వైదిక సంప్రదాయంలో పెరిగాను కాబట్టి అమ్మమ్మ నేర్పించిన మంత్రాలతో పౌరోహిత్యం చేయించేది. చిన్నప్పటి నుండి అవన్నీ వింటున్నాను.కాబట్టి ఓరియంటల్ కాలేజీ అనగానే సంస్కృతం ఉంటుందని ఆసక్తి కలిగింది. నమక చమకాలు; శ్రీ, భూ సూక్తాలు ఇవన్నీ విని నేర్చుకున్నాను. కానీ అది సంస్కృతం అని, దానిలో కవులు ఉన్నారు, సాహిత్యం ఉందని తెలియదు! DOL లో చేరాక కాళిదాసు అనే కవి , కాదంబరి రాసిన బాణబట్టు కవులున్నారని తెలిసింది.
మా గురువుగారు చేగుంట శివునూరి విశ్వనాథ శర్మ గారు సంస్కృతం, వ్యాకరణం, కాదంబరి వంటి కావ్యాలు చెప్పారు. ఇన్నేళ్లయిన వారు చెప్పిన పాఠాలు మర్చిపోలేదు. ఆ ఒరవడిలోనే నేను నా విద్యార్థులకు బాల వ్యాకరణం, ఇతర కావ్యాలు చెప్పాను. నరహరి సార్ అంటే బాల వ్యాకరణం అనే గుర్తింపు వచ్చింది.
పద్మజ:—- మీరు మూడు తరాల గురువులను చూసారు కదా! మీరు, మీగురువుగారు ఎలా ఉండేవారు? నేటి గురువుల పరిస్థితి ఏమిటి?

నరహరిగారు :– గురువులంటే హైస్కూల్లో అమృత పాఠశాలలో ఉన్నప్పుడు మాకు ఆత్మకూరు ప్రాంతంలో చాడ అనే ఒక ఊరు ఉంది. అక్కడ తిరునగరి శ్రీనివాసులు గారు మా గురువు. ఆయన మాకు తెలుగు నేర్పేవారు ప్రతి సంవత్సరం 26 జనవరి నాడు గాని, 15 ఆగస్టు నాడు గాని తప్పకుండా ఒక దేశ భక్తి కవిత చదివించేవారు. ఆయన ప్రోత్సాహం వల్ల షేక్స్పియర్ నాటకాన్ని అనువాదం చేసాను. ఆ రోజుల్లో ఆంధ్రప్రభ దినపత్రిక వచ్చేది. పల్లా దుర్గయ్య గారి గంగిరెద్దు, దాశరధి కవితలు మొదలైనవి చదవడం వల్ల భాష మీద పట్టు ఏర్పడింది. కాలేజీకి వచ్చిన తర్వాత విశ్వనాధ శర్మ గారు సంస్కృతం నేర్పడం, రామారావు గారు, ఆంజనేయ శాస్త్రి గారు మొదలైన వారంతా మాకు తెలుగు- సంస్కృతం నేర్పించారు.
పాతకాలం గురువులకు ఏ వ్యాపకాలు లేవు!
యజుర్వేద – తైత్తరీయ సంహితలో శీక్షావల్లి అని అనువాకం ఉంది. దాన్లో ఇలా చెప్తారు.

స్వాధ్యాయ ప్రవచనాత్ ప్రమధితవ్యమ్

స్వాధ్యాయం అంటే యజ్ఞం అని ఒక అర్థం. స్వయం శిక్షణ అని మరో అర్థం. మనం విద్యార్థులకు బోధించే ముందుచదువుకొని తయారై విద్యార్థులకు బోధించాలి అని దాని భావం.
పూర్వకాలపు ఆశ్రమాలలో గురువులు అనుష్టానం చేసుకోవడం ; చదువు చెప్పడం తప్ప మరో వ్యాపకం లేదు.
మా గురువుల తరంలోనూ ఫోన్లు వగైరాలు లేవు. నిత్య నైమిత్తిక కర్మలు చేసుకోవడం, చదువుకోవడం, పాఠాలు చెప్పడం వాళ్ళ కర్తవ్యంగా ఉండేది.
మా దగ్గరికి వచ్చేసరికి 1967 లోనూ, 1972లో ఆలియాలో పనిచేసే నాటికీ, 1974లో లెక్చరర్ గా చేరినప్పటికీ ఈ మొబైల్స్ రాలేదు! ఒక్క టీవీ ఉండేది. అందుకే మా చదువంతా పుస్తకాలు, పత్రికలతోనే నడిచింది. మాకు కోయిల్ కందాడై రంగనాథాచార్యులు మాకు ప్రిన్సిపాల్ గా ఉండే వారు.
తరగతిలో చాలామంది ఉపాధ్యాయులు గద్యమో, నాటకమో? ఇంకా ఏదో చెప్తామనేవారు. అలంకార శాస్త్రం ఛందస్సు చెప్పే వాళ్ళు విమర్శ చెప్పే వాళ్ళు కావాలి. అలంకార సంగ్రహం, ప్రతాప రుద్రీయము చెప్పాలి బాల- వ్యాకరణం ప్రౌఢ్యాకరణాలు చెప్పాలి. ఆంధ్ర శబ్ద చింతామణి కూడా చెప్పే వాళ్ళు కావాలి. వాళ్ళు దొరకడం లేదు అని అన్నారాయన. నేను తెలుగు ఉపాధ్యాయుడిని కనుక
నాకు వాటిమీద ఆసక్తి ఉంది. సిద్ధమే చెప్తాను సార్ అని నేను అన్నాను. సాయంకాల కళాశాల కాబట్టి పగలంతా సమయం దొరికేది అప్పటికే విద్యార్థి ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, కమ్యూనిస్టు పార్టీ ఐకమత్యం కోసం ఉద్యమాల్లో పాల్గొంటున్నా కూడా ఎక్కువ చదివే వాడిని. దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారి రమణీయం మొదలైనవి చదువుకొని తరగతికి వెళ్లేవాడిని. అలంకార శాస్త్రంలో మొదట సంస్కృతంలో శ్లోకం చెప్పి దానికి పద్యం చెప్పాలి.
శ్లోకాన్ని కూడా చెప్పగలగాలి! పుల్లెల శ్రీరామచంద్రుడు గారు ఏమంటారంటే?
” యజ్ఞతి బహు నాధీశే తధాపీ పఠ పుత్ర వ్యాకరణమ్!
స్వజనః స్వజనో ఆభూత్ సకలం‐- శకలం; సకృత్- శకృత్ అని చెప్తుండేవారు.
కొడుకుతో ఒరేయ్ అబ్బాయీ! నువ్వు ఎంత చదువుకున్నా సరే! వ్యాకరణం చదువుకో లేకపోతే ఏ పదాలకు ఏం అర్థమో తెలియదు. కాబట్టి వ్యాకరణం చదువుకో!
ఎందుకంటే స్వజనః= మన వాళ్ళు; శ్వజనః= కుక్కల గుంపు; *సకలం= మొత్తం ; శకలం=ముక్క అని సకృత్ = అరుదుగా ; శకృత్= పేడ అని అర్ధం.

దీన్ని నేను ప్రయోగంలో ఇలా చెప్పేవాణ్ణి. ఉపనయనం చేసేటప్పుడు వెంట్రుకలు కత్తిరించే సమయంలో…
పూర్వతోపతి; దక్షిణతోపతి,కృత్తాన్, కేశాన్ పిండే దధాయ
అని మంత్రం చెప్పి అర్ధం చెప్పితే చక్కగా అర్ధమౌతుంది. నా పద్ధతి ఏమిటంటే? ఒక పదం చెప్పితే అర్ధంతో పాటు అలా ప్రయోగం కూడా చెప్తాను.
ఉదాహరణకు ఇటీవల కాలంలో కాంతారా సినిమా వచ్చింది. కాంతారా అంటే అర్థం ఏమిటని చాలామంది నన్ను అడిగారు. కాంతారా అంటే అడవి దానికి సంబంధించిన చరిత్ర అని అర్థం. అలా పదం దానికి అర్థం చెప్తే సరిపోదు ప్రయోగం చెప్పాలని…
వారికి శ్యామలా దండకంలో
కాంతార వాసప్రియే! కృత్తి వాసఃప్రియే సర్వలోక ప్రియే! సర్వమంత్రాత్మకే….

ఈ ఉదాహరణ చెప్పాను.
సింగం అనే పదానికి తెలుగు ఉదాహరణ ఉత్తర గోగ్రహణం సందర్భంలో అర్జునుడు వస్తూ ఉంటే ద్రోణాచార్యుడు వచ్చేవాడు ఎవరనుకుంటున్నారు?

వచ్చెడు వాడు ఫల్గుణుడు,
సింగం బాకటితో గుహంతరమునన్ చేడ్పాటుమై…
“కాంతారనివాసఖిన్నమతి అంటే అడవిలో ఇంత కాలం ఉండి, చాలా చిరాకు తో వస్తున్నాడని”
ఇలా వివరించేవాడిని.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మా గురువులకేమో వారి అనుష్టానం, మాకు చదువు చెప్పడం తప్ప ఇంకోటి లేదు. మా దగ్గరికి వచ్చేసరికి ఉద్యమాలు వచ్చాయి. నాకైతే సాయంకాలం కాలేజీ కాబట్టి మధ్యాహ్నం తీరిక దొరకడంతో ఉద్యమాలు చేస్తూనే చదువుకునే వాళ్ళం. ఎందుకంటే నాకు జీతం ఇస్తున్నది విద్యార్థులకు పాఠం చెప్పమని ఆ బాధ్యత నేను నెరవేర్చాలి. బాధ్యతలు నెరవేరిస్తే హక్కులొస్తాయ్… పాఠం చెప్పడం ముఖ్యం.
ఇప్పటికీ నిరంతరం రాస్తాను- చదువుతాను.
అందరికీ ఇంకొక సందేహం ఉంటుంది. శ్రుతి ఎలా రాయాలి? అని
స్మృతి ఎలా రాయాలని…
శ్రుతి ని శ కు కొమ్ము ఇచ్చి ర వత్తు ఇవ్వాలి.
స్మృతి ఎలా రాయాలంటే ? స కు మ వత్తు ఇచ్చి, వట్రుసుడి పెట్టాలి (రుత్వం)
ఇలానే ఎందుకు రాయాలంటే ?
శ్రుతి అంటే కొమ్ము ఇస్తాం కనుక
కుంతి కొడుకులు కౌంతేయులౌతారు.
బుద్ధుడిని బౌద్ధము ఔతుంది.
కుతూహలం = కౌతుకం ఔతుంది.
ఋషి లోని ఋ వేరు!
ఉ రాస్తే ఆది వృద్ధి వచ్చి ఔ అవుతుంది.
పుత్రుడు = పౌత్రుడు; పౌత్రి అవుతుంది.
పురము = పౌరులు కాబట్టి ఉ రాయాలి.శ రాసి వట్రుసుడి పెడితే రు కు ఆర్ ఆదేశమౌతే శార్త అవుతుంది. అయితే అందంగా ఉండదు

‘శ్రుతి’- సరి అయిన పదం. చాలామంది అనవధానత/ఔదాసీన్యం (Non-Serious ness)వల్ల ‘శ్రుతి-స్మృతి’ పదాలను-వాటి నుంచి ఏర్పడే రూపాలను గురించిన ఆలోచన లేకుండా-ఇష్టం వచ్చినట్టుగా రాస్తూ ఉంటారు.
శ్రుతి. =శ్ ర్ ఉ తి.
=శ్ ర్ ఔ తి-సంబంధార్ధంలో ఆది అౘ్చునకు వృద్ధి (ఉ->ఔ).
=శ్రౌతి-శ్రౌత…
‘శ్రౌత,స్మార్త నిత్యానుష్ఠాన..’
శృతి-అని రాస్తే ఏమవుతుంది?
=శ్ ఋ తి.
=శ్ ఆర్ తి/శ్ అర్ తి.
=శార్తి/శర్తి-వంటి అసాధు రూపాలు ఏర్పడుతాయి.
కనుక ‘శ్రుతి’ అనే రాయాలి.
స్మృతి=స్ మ్ ఋ తి.
=స్ మ్ ఆర్ తి/స్ మ్ అర్ తి
=స్మార్తి->స్మార్త…√. …
‘శ్రుతి స్మృతి పురాణానాం, ఆలయం కరుణాలయం..’.
స్మ్రుతి-అని రాస్తే ఏమవుతుంది?
స్ మ్ ర్ ఉ తి.
=స్ మ్ ర్ ఔ తి- సంబంధార్థంలో ఆది అౘ్చునకు వృద్ధి.
=స్మ్రౌతి-అనే అసాధు రూపం సిద్ధిస్తుంది. అందువల్ల ‘స్మృతి’ అని మాత్రమే రాయాలని అవసరమైన చోట్ల విద్యార్థులకు విడమర్చి చెప్పాలి!
మహాభారతంలో యయాతి చరిత్రలో యయాతి క్షత్రియుడు కదా! దేవయాని బ్రాహ్మణ అమ్మాయి కదా! పెళ్లి ఎలా చేసుకున్నాడు? అని ఒక ప్రశ్న వేసారు.
రాజు అనేవాడు వర్ణాశ్రమ ధర్మాలను కాపాడాలి కదా!
వర్ణధర్మముల్ కాదు సురల నేలిన యయాతి భూసురోత్తమ భార్గవ పుత్రి తానెట్లు దేవిచేసే?

అనే ప్రశ్న వేస్తే ఆ కచదేవయాని కథంతా వస్తుంది. వ్యాకరణలో కూడా అదే కిమ్? అంటాడు.
అంటే ఈ పదాన్ని ఇలానే ఎందుకనాలి? ఇంకొక విధంగా ఎందుకు అనకూడదు? అనే ప్రశ్న వేసి దానికి జవాబు చెప్తాడు.
ప్రశ్న వేయడం అనేది భారతీయ సంప్రదాయంలో వైదిక సంప్రదాయంలో ఉంది.
అసలు నేనెవరిని?
కః అహం?
ఈ కః విసర్గకు ఓత్వం వస్తుంది. అహం అనేదానికి అకారపు శ్లేష పెట్టాలి.
కోహమ్? అనాలి నేనెవరిని?
పరమాత్మ- ఆత్మ – తత్ – త్వం – అసి
తత్ అంటే అది ( పరబ్రహ్మస్వరూపము)
త్వం అంటే నీవు
అసి అంటే క్రియా పదమైతే ఉన్నావు అని అర్థం. అసి నామవాచకమైతే కత్తి అని అర్థం.
ప్రతిదానికి అర్థాలు మారుతూ ఉంటాయి.
ఉదాహరణకు మత్తః అని ఉందనుకోండి!
మత్తః = మత్తుడు
మత్ + తః = నుండి ఇలా అర్ధాలు మారుతాయి. విభిన్నమైన భాషల్లో కూడా ఇలా నానార్ధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే విద్యార్థులకు ఇలా గురువు విడమర్చి చెప్పాలి అని…. ఆ విద్యార్ధికి విద్య ఎలా వస్తుందంటే???

ఉదా॥

ఆచార్యః పారమాదత్తే
ఆచార్యుడు చెప్పడం వల్ల ఒక వంతు, విద్యార్థి తన స్వంతంగా ఆలోచించి నేర్చుకోవడం వల్ల సగం వస్తుంది, సహాధ్యాయుల వల్ల ఒక పావు భాగం నేర్చుకుంటాడు. లోకజ్ఞానం వల్ల మరికొంత జ్ఞానం వస్తుంది. అందుకే గురువులను గౌరవిస్తూనే వారి మార్గంలో నడవాలి!
కొడకండ్ల సిద్ధాంతి గారు పరమపదించినప్పుడు నేనొక వ్యాసం రాసాను.
మహాజనో ఏనక సంబంధా అని
ఏన కథా = ఏ మార్గంలో పెద్దవారు నడిచారో అది మన మార్గం. మహాజనహా + ఏ న కథః సబంధాః
మామూలు శీర్షికలు పెట్టవచ్చు! కానీ సంస్కృతం గురించి కుతూహలం కలిగించాలని ఆ శీర్షిక పెట్టాను.
ఉద్యోగ విరమణదేముంది? అయిపోయింది. కానీ నిరంతరం ఇప్పటికీ చింతన చేస్తూ ఉండడం ఆలోచిస్తూ ఉండడం, ఆలోచనఅంటే ఒక విషయం గుర్తుకొచ్చింది. నేను విద్యార్థులను లక్ష్మీదేవికి ఎంతమంది పిల్లలు? అని ప్రశ్నించాను. లక్ష్మీదేవికి పిల్లలు ఎవరు సార్? అన్నారు విద్యార్థులు…
“మన్మథుడున్నాడు కానీ అతని పుట్టుక మనకు తెలియదు. శరీరం లేకపోయినా ప్రాణం ఉంది.
కానీ ముగ్గురు పిల్లలు ఉన్నారు లక్ష్మీదేవికి” అని నేను అన్నాను.
“ఎక్కడ ఉన్నదని పండితులే” అడిగారు.
శ్రీ సూక్తం చదవండి అన్నాను.

ఆనందః కర్ధమశ్చైవ చిక్లీత ఇతి విశ్రుతాః ౹
ఋషయః తే త్రయః పుత్రాః స్వయం శ్రీదేవి దేవతా॥
కర్తమేన ప్రజాభూతా మయి సంభవ కర్ధమ ౹ శ్రియం వాసయమే కులే మాతరం పద్మ మాలినీమ్॥

కర్థముడా! నీవల్ల అమ్మ తల్లి అయింది. లేకపోతే గొడ్రాలు అంటారు కదా! ఒక బిడ్డకే తల్లి అయితే కదలీ వధ్య అంటారు. అందుకే ముగ్గురున్నారని శ్రీ సూక్తం చదివితే తెలుస్తుంది.
పురుష సూక్తం చదవారా! అన్నాను.
“చదివాము అన్నారు” అందులో మూడు ప్రశ్నలు ఉన్నాయి చెప్పండి అన్నాను.
1- విరాట్ పురుషుడిని వర్ణిస్తున్నారు.
సహస్ర శీర్షా పురుషః ౹
సహస్రాక్షః సహస్ర పాత్ ౹
అని వర్ణించారు. ఈ మహా విగ్రహానికి ముఖం ఎవరు? చేతులు ఎవరు? పాదాలెవరు? తొడలెవరు? అని ప్రశ్నించాడు!!
ముఖం కిమస్య ? ( ముఖం ఏకవచనం)
కౌ బాహు? ( బహువులు ద్వివచనం)
కౌవూరూ ఉచ్చారణలో కావూరు అవుతుంది.
పాదావుచ్యేతే ఈ నాలుగు ప్రశ్నలు వేశాడు.
నాలుగు ప్రశ్నలకు జవాబు చెప్పాడు.
బ్రాహ్మణః అస్య ముఖం ఆసిత్
ఆసీత్ = ఉన్నాడు ఆ స్థానం వాళ్ళది.
బ్రాహ్మణ ముఖమాసిత్
సర్వేంద్రియానం నయనం ప్రధానం! సర్వస్య గాత్రస్య శిర ప్రధానం( Think Tank)
రాజన్యః కృతః = క్షత్రియులు దేశాన్ని కాపాడాలి! కదా! దానికి బహువుల అండ ఉండాలి.
ఊరూ తదస్య యద్వైశ్యః౹
కోమట్లు వ్యాపారం చేసేవారనే అనుకుంటారు కానీ భగవద్గీతలో 18 వ అధ్యాయంలో గీతాకారుడు ఏం చెప్పారంటే?
ఒక్కొక్క వర్ణం ఏం చేయాలో చాతుర్వణ్యం అని చెబుతూ కృషి, గోరక్ష, వాణిజ్యం వైశ్య కర్మ స్వభావం అన్నాడు.
అంటే వ్యవసాయం, గోరక్ష ,వ్యాపారం చేయాలి! వ్యవసాయం చేయాలంటే పశువులు కావాలి కదా! అందుకు గోరక్ష చేయాలి. వ్యవసాయం చేస్తే పంట వస్తే తినగా మిగిలిన దాన్ని ఎగుమతి చేయాలి!
నీ దగ్గర లేని దాన్ని దిగుమతి చేసుకోవాలి! ఇది వ్యాపారం.
వ్యవసాయం నుండి వ్యాపారం వచ్చింది
పాదార ఈ భూమి మీద నిలబడాలంటే పాదాలే కదా అవే ముఖ్యము.
ఉపాధ్యాయుడుగా గతంలో ఉన్నవారు మహానుభావులు. మా తరానికి చెందిన ఉపాధ్యాయులు కొంతమంది ఉద్యోగంలో ఉంటూ రకరకాల వ్యాపారాలు చేసేవారు. ఎప్పుడూ అలాంటి వారు ఉంటారు. మేము నిష్టగా ఉపాధ్యాయ వృత్తిని నిర్వహించాము.
ఇప్పుడు మంచివారు లేరని కాదు! కానీ, సంఖ్య తగ్గుతున్నది. రకరకాల వ్యాపకాలు సంపాదన కోసం పాకులాట ఎక్కువై దానికే సమయం కేటాయిస్తున్నారు. నేనేమంటానంటే ఉదయం తొమ్మిది నుండి నాలుగు గంటల వరకు పని చేసి, అది కూడా యాంత్రికంగా కాకుండా పాఠాలు చెప్పేలా తాను ముందు చదువుకోవాలి! పిల్లలకు చెప్పాలి!
మా గురువులు ఎలా ఉండేవారు అంటే? కద్రువనాగమాత ఎక్కడుందిరా? అని అడిగేవారు.
జవాబుగా బాలవ్యాకరణం తత్సమ పరిచ్ఛేదం ఫలానా సూత్రం అని చెప్పాలి!
కద్రువ నాగమాత అని ఎందుకన్నాడు? ఏం సూత్రం? అంటే నిపాత సూత్రం.
నిపాతం అనే ఎందుకనాలి? అంటే కద్రువు అనేది సంస్కృతంలో దీర్ఘాంతంగా ఉంటుంది. తెలుగులో కద్రువ అంటున్నాము. సంస్కృతంలో కద్రూ దీర్ఘాంతం తెలుగులోకి వచ్చేసరికి “నామంబులకు దీర్ఘం హ్రస్వంబగు” అని సూత్రం! దాని ప్రకారం
కద్రువ అయింది.
కద్రూ ఏమిటి ? ఉకారాంతం కదా?
ఉకారాంత గో శబ్దములకు అంతట వు వర్ణకంబగు .( సూత్రం) అని రావాలి!
ఉదాహరణకు గురువు, తరువు,మనువు, మొదలైనవి మరి అలా అయితే కద్రువు కావాలి కదా? మరి ప్రయోగంలో కద్రువ అని ఉంది కదా! అందువల్ల కద్రువా అనే శబ్దాన్ని వ్యాకరణ సూత్రాలతో సాధించలేరు!! ఇది ఇలానే ఉంటుందని చెప్పడమే నిపాత సూత్రం .
కద్రువ అని ఇప్పుడు అడిగితే కద్రువ అనే చెప్తారు.
ధాత అనే ఒక పదం ఉంటుంది.
ధాత అంటే బ్రహ్మ
దాత అంటే ఇచ్చువాడు.
రెండింటి మధ్య ఒక ఒత్తు మాత్రమే భేదం …ఒత్తుతో అర్ధం అంతగా మారుతుంది. కాబట్టి ఇలాంటివి నిక్కచ్చిగా చెప్పాలి.
ఈ నాటి గురువులు కూడా ఇలా చక్కగానే చెప్తున్నారు.
కాకపోతే తప్పులు చెప్తే మటుకు వారికి తెలియచేయాలి! అధికారుల పర్యవేక్షణ ఉంటే పాఠాలు చెప్పమని అంటే తప్పక మెరుగుపడుతుంది విద్యా వ్యవస్థ.
M A phd చేసిన నేను శిశు తరగతి పిల్లలకు పాఠాలు చెప్పాలా? అని అనుకోవద్దు!
ఉద్యోగంలో చేరాక అవన్నీ ఆలోచించవద్దు! సెకండ్ గ్రేడ్ టీచర్ గా చేరితే సెకండ్ గ్రేడ్ కు పాఠాలు చెప్పాల్సిందే! మిగతా విషయాలు ఏమున్నా సరే డ్యూటీ మాత్రం సక్రమంగా చేయాలి. 10- 15 సంవత్సరాల క్రితమే నేను నాయకుడిగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ లో ఒక నిర్ణయం తీసుకున్నాను. తరగతి గదిలో ఎవరూ మొబైల్ ఉపయోగించకూడదని… మా ఉపాధ్యాయ సభ్యులందరికీ ఇదే విషయం చెప్పాను. ఈమధ్యనే ప్రభుత్వం ఈ ఆర్డర్ ఇచ్చింది. కొంతమంది అత్యవసరంగా ఇంటి నుండి ఫోను వస్తే ఎట్లా? అని అంటారు. కొంప మునుగుతుందా? స్టాప్ రూమ్ లో పెట్టి తరగతికి వెళ్ళాలి! లేదా స్విచ్ ఆఫ్ చేయాలి! విరామ సమయంలో చూసుకోవచ్చు! లేదా ఒక తరగతి నుండి మరో తరగతికి వెళుతున్నప్పుడు మధ్య సమయంలో చూడవచ్చని చెప్పాను.
ఒక వైవిధ్యం ఎక్కడ ఉందంటే? ప్రైవేట్ పాఠశాలల్లో 10, 15 వేలు రూపాయలు జీతం ఇచ్చి విపరీతమైన చాకిరీ చేయిస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో వేలల్లో జీతం వస్తుంది కదా! ఇక పర్వాలేదు పాఠం చెప్పినా, చెప్పకపోయినా ఏం కాదులే అనుకునేవారున్నారు. కానీ మంచిగా బోధించే ఉపాధ్యాయులు ఎప్పుడూ ఉన్నారు. వాళ్ళని ప్రోత్సహించాలి.
రాజకీయ నాయకులకు అనుయాయులుగా ఉన్నవారు ఎక్కువగా పాఠశాలకు రారు. అధికారులు వాళ్ళ మీద చర్య తీసుకోవాలి. మా యూనియన్ జోక్యం తీసుకోదు అని అంటాను.
గత కాలముకంటె వచ్చు కాలము మేలు అని నన్నయ్యగారు చెప్పింది నిజమే! కానీ మళ్ళీ పూర్వం గురువుల వలె ఒక వశిష్ఠుడో, వాల్మీకో, సాందీపని వంటి వాళ్లు రారు! కానీ వాళ్ళను ఆదర్శంగా తీసుకొని, వాళ్ళ మార్గదర్శకంలో నడవాలి కదా! వాళ్లు బోధించిన దాంట్లో 10శాతమో- వంద శాతమో మనమూ బోధించాలి కదా! భగత్ సింగ్ లాంటి వాళ్ళు మహానుభావులు లేరు. వాళ్ళు వస్తారని మనం కూర్చున్నామా? వాళ్లు ఆ రూపంలో వస్తారా? వాళ్ళు చేసిన దాంట్లో మనమేం చేయగలమని ఎవరికి వారే అనుకోవాలి! తప్పనిసరిగా ఒకటే పద్ధతి ఏ దేశమైనా బాగుపడాలంటే ముందు విద్యా వ్యవస్థ బాగుపడాలి… ఉపాధ్యాయులు తమకు తాము ఆత్మ పరిశీలన చేసుకోవాలి!
యజుర్వేద *-తైత్తరీయ ఉపనిషత్తుల్లో శిక్షావల్లిలో
స్వాధ్యాయ ప్రవచ సే చ ప్రమధితవ్యం అధ్యయనం చేయడంలోనూ- అధ్యాపనం చేయడంలోనూ పొరపాటు పడొద్దు!
ధర్మాన్న ప్రమధితవ్యం అంటే ధర్మం నుండి ప్రమిదితవ్యం జారకూడదు అని చెప్తుంది.

ఈ కాలంలో రెండు రకాల అతివాదాలు ఉన్నాయి. ఏమి చదవకుండానే కళ్ళు మూసికొని, చెంపలేసుకుని నమస్కారం చేసుకునేవారు ఒక రకం, ఏమి చదువుకోకుండానే అందులో ఏముందిలే చెత్త అనేవారు మరో రకం కాబట్టి ఈ రెండు అతివాదాలను సాధ్యమైనంత వరకు ఎంతవరకైతే అంతవరకు దులిపేసి మనం చదువుకోవాలి.
సంస్కృతం రాదు అనుకోవద్దు! వాటికి అనువాదాలు ఉన్నాయి. వాటిని చదివి మన వేదాంతాన్ని ,కానీ మన భారతీయ సంస్కృతిని గాని తెలుసుకోవాలి.

లోకాః సమస్తా సుఖినోభవంతు! అన్నాడే కానీ హిందూ భవంతు… అనలేదు కదా! లేదా ముస్లిం భవంతు సుఖినః అనలేదు కదా! కాబట్టి ఈ వాక్యాలు ప్రపంచానికి అంతటికి వర్తిస్తాయి.
అందువల్ల మనం ప్రధానంగా ఈ దేశం బాగుపడాలంటే సాంకేతికంగా కానీ, మరో రకంగా కానీ బాగుపడాలంటే విద్య ముఖ్యం కనుక చక్కగా బోధించాలి.
ఇటీవలి కాలంలో కార్పోరేట్ కాలేజీలన్నీ సంస్కృతం చెప్తున్నాయి. సంస్కృతానికి నేను వ్యతిరేకిని కాను. కానీ మాతృ భాష రాకుంటే ఎలా? విద్యార్ధి పదవ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం, ఇంటర్ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువుతాడు. ఇంటర్ లో సంస్కృతం ఉంటుంది. ఆ తర్వాత భాషా బోధనలు ఉండవు.
అగ్రవర్ణమని చెప్పుకునే వాళ్లకు కూడా మా పిల్లలకు తెలుగు రాదండని చెప్తున్నారు ఎంత బాధాకరమైన విషయమో!
మా మనవడు ఆర్మీలో పనిచేస్తున్నాడు. వాడు తెలుగు అద్భుతంగా మాట్లాడుతాడు కానీ చదవడం రాయడం రాదు. తెలుగు లో నమస్కారం తాతయ్యా! అని రాశాడు. “అమ్మ రాసిందా! ” అని అడిగాను. “నేను గూగుల్లో రాశాను” అని అన్నాడు.
ఏ ఇంజనీరు అయినా వైద్య విద్య అయినా చదవుకోండి. కానీ తెలుగు నేర్చుకోండి ఎందుకంటే విదేశాలకు పోయేది ఒక శాతం రెండు శాతం కానీ మిగతా వారంతా ఇక్కడే ఉండి ఉద్యోగాలు చేయాలి కదా! ప్రజలతో తెలుగు భాష రాకుండా ఉద్యోగం ఎలా చేయగలడు?
నాతో చదివిన ఒక తను కలెక్టర్గా పని చేస్తున్నప్పుడు ఒక ఆమె ఒక కాగితం తీసుకొని వచ్చిందట. “ఇదేదో వచ్చింది చూడు సార్” అని ఆయనకిచ్చిందట. అందులో
you are granted a house site అని ఉంది.
అంటే నీకు ఇంటి భూమి వచ్చిందని చెప్పాడట.
“నాకు ఇంటి జాగా వచ్చిందంటే నాకు తెలవడం లేదు కదా సార్” అని అన్నదట ఆమె.
కలెక్టర్ ఆ రోజు నుండి వెంటనే ప్రజలకు పంపేవాటిటి ఇంగ్లీష్ లో కాకుండా తెలుగులోనే రాయమని ఆర్డర్ ఇచ్చాడట.
నేను కవిత్వం విషయంలో కూడా ఏమంటానంటే కవికి శ్రోతకు మధ్య ఒక వ్యాఖ్యాత ఉండనవసరం లేదు అంటాను.
ఉదా॥ కవి
పొలాలనన్నీ హలాల దున్ని
ఇలా తలంలో
అనే కవితకు ఒక వ్యాఖ్యాత అవసరమా? కేవలం మార్కుల కోసం కార్పోరేట్ కాలేజీలు పనిచేస్తున్నాయి. సంస్కృతం నేర్చుకోవాలంటే నేర్చుకోండి! కానీ పరీక్షలో కానీ ఎక్కడైనా సరే దేవనాగరలిపిలో రాయండి. మీరు ఇంగ్లీషులో సమాధానాలు రాసి, సంస్కృతం నేర్చుకున్నామంటే ఎలా? అదికాక ఎలా ఐతే తెలుగు ద్వితీయ భాషగా ఉందో ఆ స్థాయిలో సంస్కృతం కూడా ఉండాలి ! నాలుగు శబ్దాలు చెప్పి కంఠస్థం చేసి సంస్కృతం నేర్చుకున్నామంటే ఎలా? అలా ఐతే సంస్కృత భాషకు సేవ చేసినట్టు కాదు! భ్రష్టు పట్టించినట్టే అవుతుంది. సంస్కృతం నేర్చుకోవాల్సిందే! తెలుగు వారికి తెలుగు రాకుండా చేసి సంస్కృతం నేర్పడం హాస్యాస్పదం !
మేము ఒక ఉద్యమం తీసాము
సంస్కృత భాషకు నమస్కరిస్తాం!
అమ్మ భాష ముందు తర్వాతే ఏ భాషైనా అని
ఉద్యమించాం.

May 31, 2025 69 comments
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

లోకం పోకడ

by Radhika Suri May 31, 2025
written by Radhika Suri

సంఘజీవియైన కవికి సామాజికాంశాలపై సునిశిత దృష్టి ఉండాలి , ఎరుకతో ఉంటూ విజ్ఞత ప్రదర్శించాలి. ముఖ్యంగా సూక్ష్మగ్రాహిగా ఉంటూ జనం గొంతుకై నినదీస్తూ కలాన్ని ఆయుధంగా
ఎక్కుపెట్టాలి. సమకాలీన అంశాల్ని కథా వస్తువులుగా చేసుకుని అలతి పదాలతో విషయాన్ని సూటిగా సహజంగా చెప్పాలి.

‘లోకం పోకడ’ పుస్తకంలో సోదరులు యరకల యాదయ్య గారు సామాజిక స్థితిగతులను గమనిస్తూ, జనజీవన వైవిధ్యాలను, వారి మనస్తత్వాలను దగ్గరగా చూస్తూ కవిగా తమ భావాలను వర్ణరంజితంగా మలిచి చక్కగా రాసుకున్న అక్షరసత్యాలు.

పేరు పెట్టని కవితలే అన్నీ ,
బతుకు పోరాటంలోని ఆరాటాల్ని , సంఘర్షణలను అద్దంలో
చూపెట్టారు.

ముందుగా కాలే కడుపుల కడగండ్లను కళ్ళ ముందుంచుతూ …
‘మలమల లాడి
ఎండిన డొక్కలు
కష్టాన్ని ఎత్తుకుంటాయి…
అంటూ ఆకలి పోరాటంలోని ఆర్తిని, అవసరాన్ని చిన్న వాక్యాల్లో తేటతెల్లం చేసిన తీరు బాగుంది.

మనుషుల మనస్తత్వాలు ఎలా ఉంటాయో చెప్తూ’ గల్లీలో లొళ్ళైతే పిలిచిన పోరు
పక్కనుండి చెవులకు పని చెపుతరు… అంటూ
మనిషికి పక్కింట్లోకి తొంగి చూడడంలోని ఆసక్తిని ,ఆతృతను ఎత్తి చూపెడతారు.

ముసుగు వేసుకున్న మనుషుల ప్రవర్తన ,అవసరం తీరిన తర్వాత ఎలా ఉంటుందో చెప్తూ…”అవసరమనుకుంటే అంగలారుస్తరు
ఆపద తీరగానే
ముఖం చాటేస్తరు”అంటూ స్వార్థం నిండిన మనుషులు ఎలా ఉంటారో చెప్తారొకచోట.

ఓటు విలువ, ఎన్నికల తంతు ఎంతలా దిగజారిపోయాయో చెప్తూ…
“ఓటు ప్రతి పౌరుడి హక్కు బిచ్చగాడిలా అడుక్కుతింటావేందుకు “అంటూ
ఓటరును అమ్ముడుపోవద్దంటూ మందలిస్తూ చిరుకోపం ప్రదర్శిస్తారు.

నగరీకరణతో పల్లెలు కళతప్పి రసాయన కర్మగారాలుగా రూపాంతరం చెందుతూ ఉంటే ఆవేదన వెళ్ళగక్కుతూ… “రసవాయువులు కొన్ని ఊపిరితిత్తులను
దిగ్బంధించి శాసిస్తే
ఎన్నోఅస్వస్త జీవితాలకు ఊపిరులు పోస్తవి”
అని బాధను వ్యక్తపరుస్తారు.

ఉత్పత్తిదారులను నిర్వీర్యం చేస్తున్న పెత్తందారీ వ్యవస్థను
ఎత్తి చూపిస్తూ…
“ఉత్పత్తి గొప్పేమి కాదంట
రాజ్యాలను ముంచి తేల్చిన
వర్తక పటిమనేనట”
అంటూ చురకలంటిస్తారు.

నాది నేననే భావనతో తప్పుడు దారిలో కూడబెట్టడం తగదంటూ, అశాశ్వతమైన జీవితంలో చివరికి ఏదీ మనతో రాదని తత్వబోధ చేసి శ్రమ దోపిడి మానుకోండని హితోపదేశం చేస్తారు.

రాజకీయ ఊసరవెల్లి రంగులు మార్చుతూ, కొండచిలువలా భూమిని భక్షిస్తుందంటూ ఆవేదన వ్యక్త పరుస్తారు . మౌనానికి మించిన ఆభరణం లేదని
వివేకవంతుడు సముచిత భాషణంతో భాసిస్తాడంటారు.

చివరగా ‘నా నగరం తెలంగాణ మణిహారం’ అంటూ యాభై యేండ్లలలో హైదరాబాద్ షహర్ ఎన్ని మార్పులు చేర్పులతో విశ్వనగరంగా ఎదిగిన పరిణామక్రమాన్ని చక్కగా వివరించారు.

యరకల యాదయ్య గారు ఒక సభలో కనిపించి రాధికమ్మా అంటూ ఆత్మీయంగా పలకరిస్తూ తమ ‘ లోకం పోకడ’ పుస్తకం నాకందించారు. చదివిన తదనంతరం నా మనోభావాలను పేపర్ పై పెట్టాలని అనిపించింది. పుస్తకం సమతామానవతా విలువల కలబోతలతో సమాజం ఎలా ఉందో, మనం ఎలా ఉండాలో చెప్తూ, చిందే చెమట చుక్కలలోని అందాన్ని ,ఆత్మానందాన్ని చక్కగా వివరించిన యాదయ్యగారిని అభినందిస్తూ…

May 31, 2025 56 comments
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

కూడలి చెట్టు

by Padmasri Chennojwala May 31, 2025
written by Padmasri Chennojwala

నల్లగొండ రమేష్ గారు నాటిన విత్తనం మొలకెత్తి,47 శాఖలుగా విస్తరించి (స్త్రీ శక్తి, ప్రకృతి, పెదవాగు, ప్రేమ, మానవ సంబంధాలు మొదలైన)ఒక్కో శాఖపై ఒక్కో రంగు పుష్పాలతో, తీయని పరిమళాలను వెదజల్లుతూ ‘కూడలిచెట్టు’గా సాహితీ అభిమానులను అలరించింది.

‘మన చెలిమి చెట్టుకు లేదు శిశిరం
మన మమతలకు లేదు ఏ దూరం
మనది ఆత్మీయమైన సమరం
మనది ఆనందాల తీరం ‘ (వసంతమే నిరంతరం) అంటూ చిగురేసిన చెలిమి చెట్టుపై వసంతగీతాన్నాలపించే స్నేహశీలి.

‘రొదల రొంపి కాంక్రీట్ పొదల హంపి
బందులకు ఇబ్బందులకు కేరాఫ్
సిటీ లైఫ్ నిజమైన పిటీ లైఫ్’ అంటూ సాగిన వీరి (మహానగరం)
ట్రాఫిక్ పద్మవ్యూహాలు, వాహనాల రణగొణ ధ్వనులు వీరికి సుతరామూ గిట్టవనే విషయాన్ని
ఎంత స్పష్టంగా తెలియజేస్తుందో ప్రకృతి రమణీయతను,
పల్లె జీవనాన్ని వీరు అంతగా ప్రేమిస్తారన్న విషయాన్ని కూడా (ఒక తోవ)అనే కవిత తెలియజేస్తుంది.

‘రామప్ప గుడి నాట్యమదనిక శిల్ప లావణ్యం బలాదూరయ్యే తోవ ‘

ఎంత గొప్ప భావసంపద!
ఎంత చక్కని పోహళింపు!

తాను ప్రయాణిస్తున్న తోవలో నాట్యమదనిక శిల్పలావణ్యాన్ని చూడటం ( ప్రస్తావన దారి మళ్లుతోందని భావింపక,పాఠకులు కాస్త క్షమించగలిగితే… ఇంత అద్భుతమైన ఉపమానం చూడగానే ఒక్కసారిగా
‘పరమేశుని జడలోన చామంతివి నీలిమేఘాల తేలేటి పూబంతివి ‘ అనే పాట నా మదిలో స్ఫురించింది. ఆ ఉపమానం ఎంత అద్భుతంగా ఉందో ఇది కూడా అంతే అద్భుతంగా ఉందని చెప్పడానికి మాత్రమే ఈ ప్రస్తావన తీసుకొచ్చాను.) రాళ్లలో జవరాళ్లను చూడటం(కదిలిన రాళ్లు) వీరిలోని భావుకతను తెలియజేస్తాయి.

‘అరకు అందాలు దిగదుడుపైన దోవలోకి నా బైకుతో నా ప్రయాణం ఆరంభం అవ్వగానే ఒక పులకరింత అలలా లోలో తనువంతా అల్లుకుంది ‘

‘ పెదవాగు ‘ లేని వీరి కవిత్వాన్ని చూడలేం. పెదవాగును ఎంతగా ఇష్టపడతారో ఆకుపచ్చని అందాల నడుమ సాగే తమ బైకు ప్రయాణాన్ని కూడా అంతే ఇష్టపడతారనే విషయం పాఠకులకు చాలాసార్లు అవగతమ వుతుంది.

‘వాగు వంపుల వయ్యారపు నడకలు గవ్వలు గువ్వలు అలలు గాలి వలలు
ఇటు తీరం అందం…. అటు పెదవాగు హోరందం(చానకాలం తర్వాత) అంటూ పెదవాగు అందాలపై తమ భావాల వంతెనను నిర్మిస్తారు.

‘తన బతుకొక వెలుగు చూడని కృష్ణ బిలం
తనకు కలిసి రాలేదు పాడుకాలం
ఐనా
కష్టానికి ఎదురీదిన తీరుకు ఒక సలాం (ఒంటరిగా)’
నాలుగు వైపులా చీకటి ఆవరించిన ఒక స్త్రీ జీవితాన్ని ,
విధి ఆడిన వికృతకేళిలో సర్వం కోల్పోయిన ఓ నిస్సహాయురాలి దీనస్థితిని
‘బాధల రేపల్లె రాధమ్మ
అశోకవనంలో శోకిస్తున్న సీతమ్మ ‘అంటూ
హృద్యంగా వర్ణిస్తూనే,
‘కష్టాల కన్నీళ్లను ఎదిరిస్తున్న మనోరథం ఆమెది
జీవన సమరంలో జవసత్వాలున్న సుప్తచేతనం ఆమెది ‘అంటూ ‘అశోక వనంలో సీతమ్మ ‘అనే కవితలో శూన్యం నుండి కొత్త అడుగులేసే సంకల్పశక్తిని బలంగా నినదించారు.

‘ప్రగతి రఫెల్ లాగా దూసుకెళ్తుంటే
పేదరికం వానపాము లాగా సాగుతుంది'(ఆమె నడిచి వెళుతుంటే) అనడం
సంక్షేమ పథకాలు సామాన్యుడికి చేరడం లేదనే విషయాన్ని గురి చూసి వదిలారు.

‘రాబడికి మించింది అప్పు
తెలియక చేసిందీ తప్పు
జీవితాన్ని ముంచు అప్పోక ఊబి
నిరాశ దాని నాభి (ఆమె కంటిలో సముద్రమే బొట్టు) ‘ అంటూ మబ్బుల్లో నీళ్లు చూసి ముంత ఒ లకబోసుకునే మనస్తత్వాలకు చురకలంటించారు.

‘బహుసుందర బహుళ అంతస్తుల భవనాలు
అయితే నేమి నిమిషంలో నిలువునా శిథిలాలు (మరు భూమి) ‘ అంటూ యుద్ధం సృష్టించే వినాశనాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించడం

‘రాయబారాలకు గ్రహణం పట్టిన వేళ
రాక్షస రాజకీయాలకు ఆగ్రహం పుట్టిన వేళ
పొగల్జిమ్ముతున్నవి సెగల నల్లని బూడిద కుప్పలు
పగల్జిమ్ముతున్నవి నాయకుల కద న ప్రకటనల గొప్పలు ‘
అంటూ (మరుభూమి )
యుద్ధం జనజీవనాన్ని ఛిద్రం చేసిన తీరును హృద్యంగా వర్ణించడమే గాకుండా, యుద్ధాలకు స్వస్తి పలకాలనీ,విశ్వమానవ సౌభ్రాతృత్వానికి చేతులు కలపాలనే శాంతికాముకుడు.

‘పొలమంతా నిండింది వాననీరు
కర్షకుడి కంట కట్ట తెగింది కన్నీరు’

‘ఆశలన్నీ ఆవిరి
ఊసులన్నీ హుష్ కాకి’
(సముద్రమంత దుఃఖం)
అంటూ అన్నదాత జీవితం ప్రకృతితో ముడివడిన విధానాన్ని ఆర్తిగా అల్లారు.

‘నా స్వేదం చిందించి మీకు కడుపు నింపే అమ్మను నేను
మరి నేను ఆకలికి అలమటిస్తున్నానెందుకో ‘(రైతు ధ్వజం) అంటూ దీపం కింది చీకటి వంటి అన్నదాత జీవితాన్ని బరువుగా పలికించారు.

‘పనే దైవం తనకి
కులంలో ఒక రజిత వెలుగు తన ఉనికి’

‘రక్తం కరిగించితే చెంగిలించిన తప్తలోహం
శ్రమించిన స్వర్ణకాల క్షణాలింకా ఎరుకే నాకు ‘అంటూ ఒక స్వర్ణకారుడి జీవితంలోని సాదక బాధకాలనీ, కుటుంబ పోషణకై ఒక తండ్రి చేసే పోరాటానికి(మా నాన్న) అద్దం పట్టారు.

‘ఆశల ఆవలి తీరాలగుండా ఊరేగే బాటసారులం మనం
లోకమంతా మాదే శోకమంతా మాదే(సూర్యులం)’
కవి ఎంత సామాజిక స్పృహ కలిగి ఉంటాడో, “రవిగాంచని చోటు కవి గాంచున్” అని ఏ హృదయంలో ఏ వేదన ఉన్నా, అందులోకి పరకాయ ప్రవేశం చేయగలిగే శక్తి కవికే సాధ్యమనీ, అప్పుడే పదునైన కవిత్వం కాగితం పైకె క్కగలుగుతుందని చెప్పారు.

ప్రకృతి అందాలకు పరవశిస్తూ, దహేగాం తోవలో సాగే వీరి బైక్ ప్రయాణంలో ఏ కారణం వల్లనైనా మనసు స్విచ్ ఆఫ్ అయితే, ‘యూటర్న్ ‘ తీసుకుని వెండి వెన్నెల జల్లుల్లో హారతి పట్టిన ఆడబిడ్డ (కూడలి చెట్టు) చెంత మనసుని రీఛార్జ్ చేసుకుని, ఎదనిండా కొత్త ఊపిరి నింపుకొని, వారి అందమైన భావాలకు అరుణిమ కాంతులను, ధవళిమ వెలుగులను జతకూర్చి, వసంతవిపినపు సోయగాలతో మరో కవితాసంపుటిని సాహితీ అభిమానులకు అందించడానికి సమాయత్తం కావాలని ఆకాంక్షిస్తూ, అభినందిస్తూ…….

May 31, 2025 57 comments
0 FacebookTwitterPinterestEmail
కథలు

వీరుడా వందనం

by Padmasri Chennojwala May 31, 2025
written by Padmasri Chennojwala

శత్రువుపై ముప్పేట దాడి చేస్తూ ముట్టడి చేసే సామర్థ్యమున్నటు వంటి సైన్యాన్ని త్రివిధ దళాలు అంటారు. సరిహద్దు వివాదాలుగానీ, మరే ఇతర కారణాల వల్లగానీ తప్పనిసరి పరిస్థితుల్లో యుద్ధం చేయాల్సివస్తే వీరు ప్రదర్శించే ధైర్య సాహసాలుగానీ, శౌర్యప్రతాపాలు గానీ వర్ణించడానికి ఏ భాషా సరిపోదేమో, బంధాలు, అనుబంధాలను కోల్పోతామేమో నన్న బాధలో కొందరు, కోల్పోయి కొందరు అనుభవిస్తున్న బాధ ఒకవైపయితే, మనకోసం ప్రాణాలొడ్డి పోరాడుతున్న వారి కోసం, వారి కుటుంబాల కోసం ఏమీ చేయలేకపోతున్నామనే సాధారణ పౌరుల బాధ మరోవైపు. వారి త్యాగాలకు వెలకట్టడం అసాధ్యమే అయినా, కృతజ్ఞతాపూర్వకంగా వారి వేదనలపై సింహావలోకనం……

పొరుగు రాష్ట్రానికి చెంది, భాగ్యనగరంలో నివసిస్తున్న ఒక కుటుంబంతో నాకు చక్కని స్నేహ సంబంధాలున్నాయి. ఆ ఇంటి ఇల్లాలి గురించి చెప్పాల్సి వస్తే, సద్గుణ సంపన్నుడైన భర్త, చక్కని వ్యక్తిత్వం,విలువలతో పెరిగి, ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులైన పిల్లలతో, పండ్ల బరువుకు వంగిన చెట్టువలె ఫలప్రదమైన వైవాహిక జీవితాన్ని అనుభవిస్తున్నప్పటికీ, ఏదో ఒక సమయంలో ఆమె కంటి చెమరింత నా దృష్టిని దాటిపోలేదు, ఎంత దాచాలని ప్రయత్నించినా ఎప్పుడో ఒకప్పుడు ఆమె గొంతులో ధ్వనించే జీర నా చెవిని దాటిపోలేదు. ఎంత చక్కని స్నేహం అయినప్పటికీ, అది కొన్ని పరిమితులకులోనై ఉండాలన్న వివేకంతో నేను కూడా ఎప్పుడూ ఆమెను ఆ విషయంపై ప్రశ్నించలేదు. మా స్నేహం ఇలా సంవత్సరాలుగా కొనసాగుతూ ఉండగా, తమాయించుకోలేని ఆమె ఒకరోజు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తనకు తానుగా నాతో పంచుకున్న విషయమేమిటంటే, తమ ఆరుగురు తోబుట్టువుల్లో అందరికంటే చిన్నదైన తమ చెల్లికి (వయసులో కూడా చాలా తేడా ఉండటంతో, ఆమె అడుగుల కింద తామంతా అరచేతులు పరిచి పెంచామని) పెళ్ళీడు రాగానే సమీప బంధువుతో పెళ్లి జరిపించామనీ, సరిగ్గా ఒక్క నెల రోజుల వైవాహిక జీవితానంతరం ఉద్యోగ నిర్వహణకని వెళ్లిన అతను కార్గిల్ యుద్ధభూమిలో వీరమరణం పొందాడనీ చెప్పింది.

ఎంతటి గాయాన్నైనా మాన్పే శక్తి కాలానికి ఉందన్న సత్యాన్ని అనుసరించి, పునర్వివాహానికై ఒప్పించాలని తామంతా ఎంతగా ప్రయత్నించినా (అత్తింటివారు నిండు మనసుతో సంపూర్ణ సమ్మతిని తెలియజేసినప్పటికీ కూడా) ఆమె ఏ చిన్న అవకాశాన్ని కూడా ఇవ్వలేదనీ, తన సామర్థ్యానికి తగిన ఉద్యోగాన్ని చేసుకుంటూ, వృద్ధులైన తల్లిదండ్రులకు సేవచేస్తూ, కవల పిల్లలకు జన్మనిచ్చి, పురిట్లోనే కన్ను మూసిన ఓ మాతృమూర్తి అంతరంగాన పరకాయ ప్రవేశం చేసి, ఆ శిశువులిద్దరినీ తన ఒడికి చేర్చుకొని, గుండెలకు హత్తుకుని, వాళ్లను ప్రయోజకులను చేసి తన జన్మను సార్థకం చేసుకున్నప్పటికీ కూడా, ఆమె జీవితంలోని నీలి నీడల్ని ఒక తోబుట్టువుగా తాను హరాయించు కోలేకపోతున్నాననీ, షడ్రసోపేతమైన భోజనపళ్ళాన్ని భగవంతుడు తన చేతికి అందించినా, పూర్తిస్థాయిలో దాన్ని ఆస్వాదించలేకపోతున్నాననీ చెప్పింది.


ఈ విషయం నాకు తెలిసి చాలా సంవత్సరాలైనప్పటికీ,ఈ మధ్యనే వాళ్ళింట్లో అంగరంగ వైభవంగా జరిగిన ఒక శుభకార్యానికి నేను వెళ్లడం, ఆమె తన చెల్లిని నాకు పరిచయం చేయడం(నేను ఆమెను చూడటం అదే మొదటిసారి) జరిగింది. కలయిక మొదటిదే అయినప్పటికీ, ఒకరి గురించి ఒకరు తెలిసిన వాళ్ళం కావడం వల్ల, ఇద్దరం ఎంతో స్నేహంగా మాట్లాడుకుంటూ, వాళ్ల బంధువులు కూడా చాలా మట్టుకు తెలిసినవారే కావడంతో వారికి సంబంధించిన కబుర్లు చెప్పుకుంటూ, పైకి కులాసాగా గడిపినట్టు కనిపించినప్పటికీ, లో లోపల నా గుండెనెవరో మెలిపెడుతున్నంత బాధన నుభవిస్తూ ఉన్నాను. కార్యక్రమాన్ని తిలకిస్తూ, వారి బంధువులు, ఇరుగుపొరుగు వారితో మాట్లాడుతూ తిరుగుతున్నానన్న మాటేగానీ నా మనసు మనసులో లేదు. ముఖానికి చిరునవ్వు పులుముకుని, తెచ్చి పెట్టుకున్న ఉత్సాహంతో రెండు గంటల నటనా నంతరం, ఆ ఇంటి వారి వద్ద సెలవు తీసుకుని, కంటి చెలిమెలో ఊరే నీటిని కనిపించనీయకుండా శతవిధాల ప్రయత్నిస్తూ, ఇంచుమించుగా నా వయసులోనే ఉన్న ఆ వీరపత్నికి పైకి కరచాలనం చేస్తూ, మనసులో పాదాభివందనం చేసి ఇల్లు చేరాను.


కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన మేజర్ పద్మపాణి గారిని గురించి ఆ రోజుల్లో పత్రికల్లో వచ్చిన విషయాలకు( వీరమరణం పొందిన ప్రతి సైనికుడి త్యాగం మరువలేనిదే, దానికి హెచ్చుతగ్గులు గానీ, స్థాయీ భేదాలుగానీ ఉండవనేది అందరూ అంగీకరించి తీరాల్సిన విషయమే)ప్రజల గుండెల్లో ఎప్పటికీ మరపుకు తావుండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే అప్పుడు అతని అర్ధాంగి గర్భం ధరించి ఉండటం, పుట్టబోయే శిశువుకు సంబంధించి అతను తన తల్లిదండ్రులకు ఉత్తరాలు రాయడం, అతని పార్థివ దేహం కుటుంబ సభ్యులకు చేరుకునే లోపు వార్తాపత్రికల్లో ఆ సమాచారం విస్తారంగా రావడం కారణమనిపి స్తుంది. ఆ వీరుడి రక్తంతో ఊపిరి పోసుకున్న చిట్టితల్లి, తన చిట్టి గుండెతో వ్రాసుకున్న పుస్తకానికి పెట్టిన శీర్షిక ‘నేను చూడని నాన్న’. శీర్షికతోనే గుండెల్ని మెలిబెట్టే ఆ పుస్తకాన్ని చదివే సాహసం బహుశా కొందరికే సాధ్యమవుతుందేమో.


దేశ శ్రేయస్సు కోసం అహర్నిశలు తపిస్తూ, వీరోచితంగా పోరాడుతూ నేలకొరిగిన ప్రతి వీరుడికీ, వారిని కోల్పోయి గర్వంతో కూడిన వేదన ననుభవించే వారి కుటుంబాలకి బదులుగా ఏమిచ్చినా, మన రుణం తీరేది కాదు.

వీరులారా వందనం
వీరమాతలారా వందనం
వీరపత్నులారా వందనం

May 31, 2025 53 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

జీవితచరిత్రలు చదవడం ఇష్టం

by రంగరాజు పద్మజ May 30, 2025
written by రంగరాజు పద్మజ
  • డా. ముక్తేవిభారతి

    మయూఖ పాఠకులకు పరిచయమే అక్కర లేని తరుణీ మణి ముక్తేవి భారతి గారు. వారితో పరిచయ కార్యక్రమం…

ముక్తేవి భారతి గారు యువతీ మండలి వైస్ ప్రెసిడెంట్ గానూ, ఆంధ్ర మహిళా సభ ఫైన్ ఆర్ట్స్ కాలేజీ చైర్ పర్సన్ గానూ పనిచేసారు.

రంగరాజుపద్మజ:- అమ్మా! నమస్కారం!

ముక్తేవి భారతి:- నమస్కారమండీ!

పద్మజ:- తరుణీ పత్రిక పాఠకులకు మీ నేపధ్యం వివరిస్తారా?

భారతి :– ముందుగా తరుణీ పత్రిక నిర్వహిస్తున్న సంపాదకురాలికి- సిబ్బందికి ధన్యవాదములు.

నేను 10-6-1941 లో కృష్ణా జిల్లా పెడన గ్రామంలో పుట్టాను. మా తల్లిదండ్రుల పేర్లు అరవింద-వెలువలి శంకరం గారు. మా వారి పేరు ముక్తేవి లక్ష్మణ్ రావుగారు.

పద్మజ:– మీ విద్య ఎక్కడ కొనసాగింది?

భారతి:- బందరులో ప్రాథమిక విద్య, డిగ్రీ వరకు, 1961 లో M A History బెనారస్ హిందూ యూనివర్శిటీలో,
1968 M A తెలుగు ఉస్మానియా యూనివర్శిటీలోనూ,
1974 సం౹ M.Litt- ఉస్మానియాలో,
1978 సం. PG diploma in industries- ఉస్మానియాలో,
1980 Ph.D – ఉస్మానియాలో చేసాను.

పద్మజ:– మీ వృత్తికి సంబంధించిన విశేషాలు తెలుపండి.

భారతి:– నేను నారాయణ గూడలోని రావు బహద్దూర్ వెంకట్రామిరెడ్డి కాలేజీలో అసోసియేట్ ప్రొఫెసర్ ( Associate professor) తెలుగు విభాగంలో,
అలాగే చిక్కడపల్లిలోని సరోజనీనాయుడు మహిళా కళాశాల లో ప్రధాన అధ్యాపకురాలిగా ( Principle) ఈ హైదరాబాద్ లోనే పనిచేసాను.
రాజా బహద్దూర్ వెంకట్ రామరెడ్డి గారు తెలంగాణలో ఉన్న బాలికలకు చదువు సంధ్యలు నేర్చుకోవాలంటే తగిన విద్యాసంస్థలు లేవని, ఆర్థికంగా కూడా చదివే స్తోమత లేని వారి కోసం ఈ పాఠశాలను స్థాపించాలని నారాయణగూడ హైస్కూల్ మరియు రెడ్డి ఉమెన్స్ కాలేజీ ని స్థాపించారు. అందులో చదివిన పిల్లలు డిస్టింక్షన్ లో పాస్ అయి జీవితంలో నిలదొక్కుకున్నారు. కేవలం బాలికలను దృష్టిలో పెట్టుకొనే నడిపారు. దాంట్లోనే నేను చాలా సంవత్సరాలు పనిచేసాను. నేను ఉద్యోగ విరమణ చేసి 25 సంవత్సరాలు అయింది. మొన్న ఈ మధ్య ఉమెన్స్ డే రోజున ఆ కాలేజీలో అచ్యుత అని ప్రిన్సిపల్ గా వచ్చిన ఆమె నన్ను మహిళా దినోత్సవ సందర్భంగా మహిళలను ఉద్దేశించి మాట్లాడాలి! రమ్మని ఆహ్వానిస్తే …”అమ్మా! ఇంకా నన్ను గుర్తు పెట్టుకున్నారా?” అని అంటే ఎలా, మరుస్తాము? అని అన్నారు. ఆ మాట నాకు చాలా సంతోషం కలిగించింది. అందుకే నేమో అబ్దుల్ కలాం గారు నన్ను దేశాధ్యక్షుడు అని పిలిచే కన్నా ఒక ఉపాధ్యాయుడు అని అంటేనే నాకు ఎంతో ఇష్టమని అన్నారంటే ఎంతో గౌరవప్రదమైనది.
ముఖ్యంగా చిలకమర్తి లక్ష్మీనరసింహ పంతులుగారు జీవిత చరిత్ర చదువుతుంటే మనకెంతో ఆశ్చర్యం వేస్తుంది. ఆయన చాలా కష్టపడ్డాడు కంటిచూపు సరిగా ఉండదు. అయినా ఎన్నో రచనలు గణపతి వంటి నవలలు, గయోపాఖ్యానం వంటి నాటకాలు, ఎన్నో ప్రహసనాలు, జీవిత చరిత్రలు రాశారు. సంతోషం అని అన్నారు.

పద్మజ:- మీరు డాక్టరేట్ పుచ్చుకున్నారు కదా! ఏ అంశం పైన పరిశోధన చేశారు? ఆ సబ్జెక్ట్ తీసుకున్న కారణాలు ఏమిటి?

భారతి:– నేను చిలకమర్తి సాహిత్య సేవ పరిశోధనాంశంగా 1988 లో డాక్టరేట్ పట్టా పుచ్చుకున్నాను.
ఎందుకంటే సంఘసంస్కర్తలు అంటే నాకు చాలా గౌరవం. అందులో ముఖ్యంగా చిలకమర్తి లక్ష్మీనరసింహం పంతులుగారు చాలా ఇష్టం. ఆయన జీవిత చరిత్ర చదువుతూ ఉంటే మనకెంత ఆశ్చర్యమేస్తుందంటే… చెప్పలేము.
ఆయన సమాజం కోసం చాలా కష్టపడ్డాడు. వ్యక్తిగతంగానూ కష్టమైన జీవితమే! సమాజంలో ఉన్న అన్యాయాలనే ఎదుర్కోవడం కోసం సాహిత్యాన్ని ఆయుధంగా చేసుకున్న వ్యక్తి చిలకమర్తి లక్ష్మీనరసింహగారు.
ఆయన జీవితంలో మూడు కోణాలు గ్రహించాను. సంఘసేవ, దేశభక్తి, సాహిత్య సృష్టి. వారి ప్రతిభ గురించి ఒక మాట చెప్తాను.
బెంగాల్ విభజన అప్పట్లో పెద్ద ఉద్యమం. బిపిన్ చంద్ర పాల్ దేశమంతా పర్యటిస్తూ, రాజమహేంద్రవరం వచ్చారు. ఐదు రోజులు ఆంగ్ల భాషలో ఆయన ఉపన్యసించారు. సామాన్యులకు ఆంగ్ల భాష అర్ధంకాదు కదా! అందుకని ఆ ఐదు రోజులూ ఆయన వెంట ఉండి, వారి ఉపన్యాసాలు తెలుగులో అనువదించి, ప్రజలకు అర్థమయ్యేలా చెప్పారు. అంటే ఆంగ్ల భాష మీద అంత పట్టు ఉండేదని తెలుస్తుంది. ఆయన ఎక్కువగా చదువుకోలేదు! మెట్రిక్యులేషన్ కూడా పాస్ కాలేదు. ఎందుకు చదవలేకపోయారంటే కంటి చూపు సరిగా లేకపోవడంవల్ల బ్లాక్ బోర్డు మీద అక్షరాలు సరిగ్గా కనిపించకపోయేవి. అందుకే పరీక్ష పాస్ కాలేకపోయారు. అయినా ఆ భాష మీద అంత పాండిత్యం సంపాదించుకున్నారు. ఈ ఐదు రోజుల ఉపన్యాసాల అనువాద భాషణం అయిపోయాక ,ఆయన దేశభక్తి ఉప్పొంగి పోగా ఆశువుగా ఒక పద్యం ఇలా చెప్పారు.
పద్యం:-

డాక్టర్ ముక్తేవి భారతిగారితో ముఖాముఖి గ్రహీత రంగరాజు పద్మజ

భరతఖండంబు చక్కని పాడియావు
హిందువులు లేగ దూడలై ఏడ్చుచుండ
తెల్లవారను గడసరి గొల్ల వారు
పితుకుచున్నారు మూతులు బిగియగట్టి!

ఇది మొట్టమొదటి జాతీయ కవిత అని సి.నారాయణరెడ్డి గారి తన పిహెచ్డి (Phd) సిద్ధాంత గ్రంథంలో రాశారు. వీరి తర్వాతే రాయప్రోలు, గురజాడ గారు దేశభక్తి కవితలు రాసారు. వాటికి స్ఫూర్తి ఈ పద్యమే అని కూడా చెప్పారు. ఇది రాసిన తర్వాత ఒకచమత్కారం జరిగింది.

బ్రిటిష్ వారు తమను గడుసరి గొల్లవారు అన్నారని నేరం మోపారట. దానికి జవాబిస్తూ
“మీకు తెలుగు భాషలో ఉన్న సొగసు తెలవదని తెల్లవారెను గడసరి గొల్లవారని చెప్పారట కానీ నిజానికి గడుసరి తెల్లవారే ” అలాంటివి ఎన్నో రాసారు.
ఈరోజు దళితుల గురించి ఎందరో మాట్లాడుతున్నారు. కానీ సంఘసంస్కర్తగా ఆనాడే ఆయన దళితులకు న్యాయం జరగాలని అనుకుని ఊరికే అనుకుంటే లాభం లేదని,
దళిత పాఠశాల, రాత్రి పాఠశాలలు నిర్వహించారు. దళితులకు పుస్తకాలు, పెన్నులు కొనేందుకు వారికి డబ్బులు ఉండవని, తానే కొని వారికి ఇచ్చి చదువు చెప్పారు. మరి ఈయనేమన్నా ధనవంతుడా అంటే కానేకాదు!ఆయనకు ఏమీ లేదు… రెండు మూడు పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేసేవారు. అటువంటి త్యాగమూర్తులు వారు. ఆయన గురించి చెప్తే పాఠకులు మరి కొంతమంది ప్రేరణ పొంది సంఘ సేవకులవుతారని నా భావన.
గణపతి నవల కూడా హాస్య నవల కాదు! అధిక్షేపాత్మక నవల. సమాజంలో అలాంటి యువకులు ఉండకూడదని ఆ పాత్రల ద్వారా తెలిపారు. కన్యాశుల్కంలో రాసిన గిరీశం, బారిష్టర్ పార్వతీశంలో పార్వతీశం, ఈ ముగ్గురు యువకులు సమాజానికి ఏ విధంగాను ఉపయోగపడని వారని చెప్పడానికి ఆ పాత్రలను సృష్టించారు ఆయన రచనలు కానీ జీవితం కానీ చూస్తే గొప్ప ప్రేరణ కలిగి ఇలాంటి వ్యక్తి ప్రపంచంలో అందరికీ తెలియాలని ముఖ్యంగా యువకులకు తెలియాలని పరిశోధనకు ఎన్నుకున్నాను. గైడ్ గా జి.వి. సుబ్రహ్మణ్యం గారు మార్గదర్శకత్వం చేసారు.

పద్మజ:– మీరు ఎన్నో రచనలు చేసారు కదా! వాటి నేపథ్యం వివరిస్తారా?

భారతి:– 1960 లో చెల్లాయి పెళ్లి అనే కథ రాసాను. అది అప్పట్లో బందర్ లో ఉన్న తెలుగు విద్యార్థి పత్రికలో ప్రింట్ చేశారు.
65 ఏళ్లుగా సాహిత్య రంగంలో కృషి చేస్తూనే ఉన్నాను. 300 పైగా కథలను రాసాను.
చెల్లాయి పెళ్ళి రాసినప్పుడు వాసిరెడ్డి సీతాదేవి గారు నాకు మంచి స్నేహితురాలు. ఆవిడ ఏమన్నారంటే? నీ వయసు వారు ఎక్కువగా ప్రేమ కథలను రాస్తారు. నువ్వెందుకు ఈ కథరాసావు? అని అడిగారు. ఆ కథను సమాజాన్ని దృష్టిలో పెట్టుకునే రాసాను. ఒక అమ్మాయికి మామూలుగా పెళ్లయిన తర్వాత భర్త మరణించాడు. ఆమెకు చదవు చెప్పించక, బయటకు ఎక్కడికీ వెళ్ళనీయక ఇంట్లోనే ఉంచేశారు. ఆ అమ్మాయి అన్నగారు చెల్లెలికి పెళ్ళి చేద్దామని తండ్రితో ఎంత పోట్లాడినా తండ్రి ఒప్పుకోలేదు. సమాజం తనను వెలివేస్తుందని తండ్రి భయపడ్డాడు. వితంతు వివాహం మన ఇంటా వంటా లేదు! అని అన్నాడు. అన్న ఎన్నో సంబంధాలు చూస్తాడు. అయితే తండ్రి కొడుకు పెళ్లి చేయాలని పట్టుబడతాడు.
చెల్లెలు పెళ్లి చేసుకున్న తర్వాతనే తాను పెళ్ళి చేసుకుంటానని పట్టు పట్టి కూర్చున్నాడు. ఆ అమ్మాయి విసిగిపోయి “అన్నయ్యా! నువ్వు పెళ్లి చేసుకో! నా కోసం నువ్వుఆగ వద్దు! అని అంటుంది.
ఒక పెళ్లే కాదు సమాజంలో ఉపయోగపడే ఎన్నో విషయాలు ఉన్నాయని, ఇలా సమాజానికి ఉపయోగపడే కథలు రాసాను. ముఖ్యంగా భారతి కథలు అని రెండు సంపుటిలు 1993-94లో వచ్చాయి. ధర్మ గంట మోగదు అనే సాంఘిక కథలు అచ్చయ్యాయి. అద్దంలో అమ్మ మీద ఒక కథ మేడమ్ కథలసంపుటి వచ్చింది.
అంతకు ముందే చిలకమర్తి – యువ భారతి ప్రచురించారు.
భారతంలో ప్రేమ కథలు,1991లో తెలుగులోనూ- హిందీలోను ప్రింట్ అయ్యాయి.
1993 లో కంచె చేను మేస్తే ఆంధ్రప్రదేశ్ బాలల సాహిత్య అకాడమీ వారు ప్రచురించారు. ప్రబంధంలో భక్తికథలు మద్రాస్ పత్రిక భక్తి కుముదం (2001-2002) పత్రికలో వేసారు.
ఋషి పీఠం వారు భక్తితరంగాలు ( 2003-2012);
భారతీతీర్థ సమాఖ్య భారతంలో నీతికథలను ప్రచురించింది.

పద్మజ :- చాలా సంతోషం ! మరి నవలా ప్రక్రియలో కూడా మీదైన ప్రత్యేక శైలి ఉంది. నవలల గురించి చెప్పండి…

భారతి:— బతుకు నేర్పిన న్యాయం -1996 లో రాసాను.
మళ్ళీ వచ్చిన వసంతం అనే సాంఘిక నవల 2002 లో అచ్చైంది.
బతుకు నేర్పిన న్యాయం నవలలో మమత ( కథానాయిక) కుటుంబంలో ఒక అమ్మాయి పెళ్లి చేసుకొని ఆత్మహత్య చేసుకుంటుంది. దాంతో ఆమె మనసు వికలమై, ముందు పెళ్లి వద్దంటుంది. అందరికీ అలా ఔతుందా ? అని పెద్దవారు సర్దిచెప్పితే సరేనని పెళ్ళి చేసుకుంటుంది. తర్వాత ఆడపిల్ల తన గర్భంలో ఉందని తెలిసి అబార్షన్ చేయించుకుంటానని పట్టు పట్టింది. తర్వాత కొన్ని రోజులకు ఇలా ఎందుకు చేశానని పశ్చాత్తాపపడుతుంది. అంటే సంఘములో ఏదైనా చెడు జరిగితే దాని ప్రభావం ఎలా ఉంటుందో తెలిపే ఇతివృత్తం.
తర్వాత కొంతకాలానికి ఒక మగపిల్లాడిని పెంచుకోవాలని అనాధ శరణాలయం వెళ్ళి, అక్కడ మొదట పిల్లవాడిని తీసుకోవాలని అంతా సిద్ధపడ్డ తర్వాత మగ పిల్లవాడు ఎందుకు? ఆడపిల్లను పెంచుకుంటానని నిర్ణయించుకుంటుంది.
పాలగ్లాస్ అనే కథ సినిమాల్లో మొదటిరాత్రి కథానాయక పాలగ్లాస్ తీసుకొని పడకగదిలోనికి వెళ్లడం చూస్తాం. ఇక్కడ నేను రాసిన పాలగ్లాస్ కథ అది కాదు! మనం పనిమనిషికి సామాన్యంగా చాయ్ ఇస్తాం. ఆమె ఈ ఆ గ్లాసు కడిగి అక్కడ బోర్లించి పెడుతుంది. ఆ ఇంట్లో పని చేసే ఆమె పని మానేసింది. ఆమె స్థానంలో ఒక 14 సంవత్సరాల అమ్మాయి పని చేస్తానని వచ్చింది. ఆ అమ్మాయికి చాయ్ ఇవ్వబోతే నాకు చాయ్ పడదు! డాక్టర్ వద్దన్నాడు పాలు తాగమన్నాడు. పాలు తాగుతాను అని అంటుంది. యజమాను రాలు విస్తుపోతుంది పనివాళ్ళకు పాలు పోయడమేమిటని? పోయను అంటుంది.
భర్త, కొడుకు ఇద్దరు నీ ఇష్టం పాలు పోయకపోతే సరే! కానీ ఈ అమ్మాయి కూడా వెళ్ళిపోతే నీకు పనిలో సహాయపడే వాళ్ళు ఎవరూ ఉండరు. నీకు కష్టం అవుతుంది అని అంటారు.
అమ్మో/! ఆమె పని మానేస్తే తాను చేసుకోలేనని ఆ పిల్లకు రోజు పాలు పోస్తుంది.
ఒక మార్పు రావాలంటే యువతనుండే వస్తుంది. ఆ ఇంట్లో ఇంటర్ చదివే పిల్లవాడు ఒకడున్నాడు. అతనికి తల్లి రోజు బోర్నవీటా కలిపిన పాలను ఇస్తుంది. తల్లికి తెలియకుండా ఆ పాలు తెచ్చి ఈ పని అమ్మాయికి ఇస్తున్నాడు. నువ్వు తాగు మా అమ్మ నాకు మళ్ళీ పోస్తుంది. అదిగాక మేం ఐస్ క్రీములు అవీ తింటామని అంటాడు.
సరే అని అమ్మాయి రోజు రెండు గ్లాసుల పాలు తాగుతున్నది. కొద్ది రోజులకు ఆ పిల్ల నేను రేపటి నుండి పనిలోకి రాను! అంటుంది అదేమిటి? ఎందుకు రావు? అని అడిగితే నేను చదువుకుంటున్నాను. సెలవులు అయిపోయాయి. రేపటినుండి స్కూల్ మొదలవుతుంది. సెలవుల్లో ఊరికే ఉండడం ఎందుకు అని నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చని పనిలో చేరాను. అని రెండు గ్లాసులు కడిగి అక్కడ బోర్లించింది. రెండేమిటీ? అడిగిన యజమానురాలతో అమ్మా! నన్ను క్షమించండి! నేను ఒక అబద్ధం చెప్పాను అంటుంది.
ఏం అబద్ధం చెప్పావు? అంటే డాక్టర్ నాకేమీ చెప్పలేదు. మీరు కుక్కకు పళ్ళంనిండా పాలు పోస్తుంటే నాకు కూడా పాలు తాగాలనిపించింది. ఊరికే మీరు పాలు పోయమంటే పోయారు కదా! అందుకని అబద్ధం చెప్పాను అన్నది.
చిన్నపిల్లల్లో కూడా మార్పు వస్తుంది. ఆ ఇంటర్ చదివే పిల్లవాడికి ఏమనిపిస్తుంది అంటే ఆమెకు మనవలె పాలు తాగాలని ఉండదా? అని
ఆస్ట్రేలియా నుండి శ్రీనివాసు గారు కథా సంకలనంలో వాన కథను వేస్తాను… మీ అనుమతి కోరుతూ ఫోన్ కాల్ చేశాను అన్నాడు. తప్పక వేయండి అన్నాను.
ఈ కథేమిటీ అంటే ఒకరోజు విపరీతంగా వాన పడుతుంది. అందరూ సంతోషంగా ఉంటారు. పక్కన ఉన్న జమీందారు గారి భార్య నీరు ఇంట్లోకి వస్తుందని ఎవరిని లోపలికి రానివ్వదు. ఓ బిచ్చగాడు వచ్చి వాన వెలిసే దాకా ఈ వసారా లో కూర్చుంటాను అంటాడు. ససేమిరా వద్దు! నీ తడి బట్టలూ… నువ్వూ కంపు కొడుతున్నావు! రావద్దు అంటుంది. ఇంట్లో ఖరీదైన ఫర్నిచర్ ఉంటుంది. అవి పాడై పోతాయని ఆమెకు బెంగ. ఆమెకు ఆ సామాన్లు ఆనందాన్నిస్తాయి.
ఆ బిచ్చగాడు తడుస్తూనే పక్క ఇంటికి వెళతాడు. ఆ ఇంట్లో చిన్నపిల్లలు తాతా! రా! తాతా! రా ! అని ప్రేమగా పిలుస్తారు. చలి పెడుతున్నవేమో అని ఒక తువ్వాలు ఇచ్చి, తల తుడుచుకోమని చెప్పి, అన్నం పెట్టి తినమని ఆప్యాయంగా మాట్లాడతారు. అతనికి చాలా ఆశ్చర్యం అవుతుంది.
వెళ్ళిపోతూ విస్తరిని పారేసి, ఇలాంటి పిల్లలు ఉండబట్టే ఇంకా సమాజం ఇంత గౌరవంగా ఉంది. అందరూ ఈ పక్కింటి అమ్మలాంటి వారైతే ఎలా ఉంటుందో? అన్న ఆ మాట ఆమె విని, నిజంగానే ఆ బిచ్చగాడికి కాసింత అన్నం పెడితే తనకు ఏం తక్కువ అయ్యేది? నాకు పిల్లలు లేరు!
ఈ వాన నా మనసులో కొత్త ఆలోచన కలిగించింది. మానవత్వం తెలిసింది. ఈ వాన నాలో మెరుపు తీసుకొచ్చింది అనుకున్నది.
ఈ కథ రెండు పేజేలే ఐనా ఒక సందేశం ఉన్న కథ తనకు నచ్చిందని అన్నాడు.

పద్మజ:– మహాభారతం ఈనాటికీ మీరు అన్వయించిన విధానం, దానికి మీరు చేసిన కృషి తెలుపుతారా?

భారతి:— ఉలూచి కథ కానీ, చిత్రాంగద కథ కాని అర్జునుడు తీర్థయాత్రకు వెళతారని తెలిసి కూడా నీమీదనే మనసుంది అని చెప్పారు.
శకుంతల పాత్ర నాకు ఆదర్శవంతం అనిపిస్తుంది. అందుకే నేమో ఇంటర్, డిగ్రీ ,పిజి, వరకు తర్వాత ఐఏఎస్ లో కూడా పాఠ్యాంశంగా శకుంతల కథ ఉండడం ఎందుకు? అని ఆలోచిస్తే మన నేటి సమాజంలో కూడా శకుంతల వంటి బాలికలు ఉన్నారు. జీవితంతో ఎంతగా పోరాడిందంటే? ఎక్కడో కణ్వాశ్రమంలో ఉన్న శకుంతల రాజదర్బార్ కు వచ్చి మరీ దుష్యంతునితో మాట్లాడి- పోట్లాడి ఒప్పించి, మెప్పించి చివరకు విజయం పొందింది. ఇదే పరిస్థితిలో ఆధునిక చదువుకున్న అమ్మాయి ఉన్నదనుకోండి! అంత పోరాటం చేయకపోవునేమో? ఐతే విడాకులు తీసుకుంటుంది. లేకపోతే పుట్టింటికి వెళ్ళిపోతుంది కానీ తమ జీవితాన్ని నిలబెట్టుకోవాలన్న ధైర్యం ఉండక వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడి ఉండాలని చూసుకోవాలనే ఒక ఆలోచన శకుంతలను చూసి నేర్చుకోవచ్చు అనిపిస్తుంది.
శకుంతల కథ ఒక సందేశం ఇచ్చే కావ్యం. ఈ కథలు విన్న చదివినా జీవితానికి అన్వయించుకుంటేనే వాటి ఫలితం ఉంటుంది.
భారతంలో ప్రేమకథలు రావడానికి నేపథ్యం ఏమిటంటే? ఒకప్పుడు వారపత్రికలలో ప్రతివారం ఒక కథ వచ్చేది. అవన్నీ ఒక పుస్తకం వేశాను.
శాంతి సుందరి గారు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాదకురాలు హిందీలోనికి అనువదించారు. నా కథలు కొన్ని స్వాతి శ్రీపాద ఆంగ్లంలో అనువదించారు. రఘునాథన్ గారు మేడమ్ కథలను తమిళభాష లోకి అనువదించారు.
భారతంలో నీతికథలు రాసాను. నన్నయ రాసిన ఎన్నో ఉపాఖ్యానాలు ఉన్నాయి. మొట్టమొదటి కథే సురమ ఒక కుక్క కథ! సారమేయుడు జనమేజయుడు యజ్ఞం చేస్తుంటే అక్కడికి వస్తే ఆయన తమ్ముడు నిష్కారణంగా కొడతాడు. తల్లితో ఈ విషయం చెప్తాడు సారమేయుడు. అనవసరంగా ఎవరినైనా బాధిస్తే అనిమిత్త ఆపదలు వస్తాయి, అంటే అనుకోని కష్టాలు వస్తాయని, యజ్ఞం ఆపేసి తిరిగి మొదలు పెడతాడు. చిన్న కుక్క పిల్ల చెప్పిన మాట ఏమిటంటే మనకేం హాని చెయ్యకపోయినా కుక్క కనపడితే చాలు కొడతాం! అలా కూడదని చెప్పిన నీతికథ.
ఇలాంటివే రాశాను మహాభారతంలో ప్రారంభంలో సరమ కుక్కతో మొదలై స్వర్గారోహణపర్వంలో ధర్మరాజు వెంట కుక్క ప్రయాణంతో భారతం ముగుస్తుంది. అంటే ఆ కుక్క పాత్ర ఎంత ప్రాధాన్యత ఉందో చెప్పాను.

పద్మజ:- ప్రబంధాలను నవల రూపంలో రచన చేశారని విన్నాము. నవలా రూపంగా ఐనా సరే! ఈ కాలంలో ప్రబంధాలు చదివే వారు ఉన్నారా? మా తరుణి ప్రేక్షకులకు వాటి ప్రాశస్త్యం చెప్పండి.

భారతి :– ప్రబంధ సాహిత్యం అంటే నాకు చాలా ఇష్టం. ఆధునిక సాహిత్యం – ప్రబంధ సాహిత్యం రెండూ రెండు కళ్ళు లాంటివి. ఆయా ప్రబంధాలను చదివే వారు తక్కువ అయ్యారని ఆవేదనగా కూడా ఉంటుంది. ఈ తరం వారికి సాహిత్యం చేరకుంటే ఎలా ?అని చాలా కాలంగా ఆలోచించి ఏమిటి మార్గం అంటే నేనేమైనా చేయాలంటే అధికారంలో లేను… ఏం చేయాలని అనునుకున్నప్పుడు ప్రబంధాలను నవలలుగా రాస్తే కొంతమంది నవలలు చదువుతారు కనుక ప్రబంధాలు నవలల వలె రాస్తే చదువుతారని మొదలు పెట్టాను.
అలా నేను రాసిన నవలలన్నీ అన్ని పత్రికల వారు సీరియల్స్ గా వేశారు.అల్లసాని నెద్దన రచించిన మను చరిత్రను గాంధర్వం పేరుతో నవలను రాశాను.
ఇందులోని పద్యాలను చూసి మను చరిత్ర శృంగార ప్రబంధము అని అంటారు. కానీ శృంగార ప్రబంధం కాదు! శృంగార రసాభాసం. దాని తర్వాత ఆశ్వాసాలను చెప్పాలి కదా! మనుచరిత్రలో ఈ అంశాన్ని చాలామంది చెప్పరు. మొదటి మూడు ఆశ్వాసాలు చదవడానికి ఉత్సాహంగా ఉండి శృంగారపరంగా ఉంటాయి కనుక చదువుతారేమో? తర్వాత కథను చదవరు కనుకనే నేను గాంధర్వం ( అల్లసాని మనుచరిత్ర) అనే పేరుతో నవల రాశాను. 2011అది పుస్తక రూపంలో వచ్చి ప్రచారంలోకి వచ్చింది.

పద్మజ :– గాంధర్వమని పేరు ఎందుకు పెట్టాలనిపించింది?

భారతి:– వరూధిని- ప్రవరాఖ్యుడు;
మాయాప్రవరుడు- స్వరూచి చేసుకున్న వివాహాలన్నీ గాంధర్వ వివాహాలే! కనుక నేను ఆ ప్రబంధాలకు గాంధర్వము అని పేరు పెట్టాను. మన సాహిత్యంలో ఒక అపప్రద ఉంది. మనుచరిత్ర శృంగార ప్రభంధం అని కానీ నిజానికి అది శృంగారం కాదు! శృంగార రసాభాసం…అని ఎందుకు అంటున్నానంటే? వరూధినికే ప్రేమ తప్ప ప్రవరాఖ్యుడికి ఆమె మీద ప్రేమ లేదు.
ఆయనకు ఎంతసేపూ తన భార్య, తన శిష్యులు, తన అనుష్ఠానం ఇవే తప్ప ఆమె మీద ఆకర్షణ లేదు. అందుకే ఆమె అంటుంది…

ఎక్కడి యూరు కాల్నిలువ కింటికిబోయెదనంచు పల్కెదీవక్కట మీ కుటీరనిలయంబులకున్‌ సరిరాకపోయెనేయిక్కడి రత్నకందరము లిక్కడి నందనచందనోత్కరంబిక్కడి గాంగసైకతము లిక్కడి యీ లవలీనికుంజముల్‌ !!

ఇన్ని అద్భుతాలు వదులుకొని పోతానంటున్నావు ఏమిటి మీ కుటుంబంలో ఉన్నది? అని అంటుంది.
అమ్మో! ఈమె నన్ను పంపించదేమో? అనుకుంటాడు ఆయన అగ్నిహోత్రుడిని ప్రతిరోజూ పూజిస్తాడు కాబట్టి ఆయనని ప్రార్థిస్తాడు.

నేనే గనుక భగవత్పదాంబుజ ధ్యాన రతుండడనేని
పరదార ధనాదుల కోరనేని, సన్మానము తోడ నన్ను సదనంబు చేర్చుము ఇనుండు పశ్చిమాంబుధిలోనికుంగకమున్ను
దీని భావమేమంటే??
నేనే గనుక నీ పాదాలను నమ్ముకుని పూజించిన వాడనైతే, నేనే గనుక ఇతర స్త్రీలపై వ్యామోహం లేని వాడినైతే, నేనే గనుక ధనం మీద వ్యామోహం లేని వాడనైతే, సూర్యుడు అస్తమించక ముందు నన్ను నా ఇంటికి చేర్చమని వేడుకుంటాడు.
మను చరిత్రను పాఠకులు మూడు ఆశ్వాసాలే చదువుతున్నారు. పాఠ్యాంశంగానూ అంతే చెప్తున్నారు.
మొదటి ఆశ్వాసంలో ప్రవరుడు అరుణాస్పదపురంలో ఉన్నట్టు చెబుతారు. సిద్ధుడు పసరు రాయడం, హిమాలయాలకు పోవడం, వరూధిని కనపడడం, రెండో ఆశ్వాసంలో ..
ఎవతె వీవు? భీత హరిణేక్షణ! ఒంటి చరించె…… దోవతప్పితిన్ !…పురంబుగాన … తెరువెద్ది?శుభం నీకు!
నాకు ఈ ఊరు తెలియదు. తోవ తప్పాను, నేను అహంకారంతో వచ్చాను, దయచేసి నాకు మార్గం చెప్పు అంటాడు.
ఆమె చెప్పొచ్చు కదా! చెప్పదు..
” ఇంతటి కన్నులున్న భూసురేంద్ర! ……
యెల్లిదమైతిమి మాటలేటికిన్

ఏదో నెపం పెట్టుకొని ఆడవాళ్ళతో మాట్లాడాలనీ కానీ, నీకు వచ్చిన తోవ తెలియదా? నేను చెప్పను పో! అంటుంది.
మూడో ఆశ్వాసంలో మాయాగంధర్వుడు ఎప్పటినుండో వేధిస్తున్నాడు. ప్రవరుడు వెళ్ళిపోయాడు కనుక నేనే ప్రవరుడి వేషంతో వెళ్తాను అనుకోని, అతనికి కామరూపం ఉంటుంది కనుక అక్కడ పూలు కోస్తూ కనిపించాడు. ఆమె చెలికత్తె చూసి వరూధినితో, నువ్వు పొరపాటు పడుతున్నావు ఆ ప్రవరుడు ఎంత బ్రాహ్మణోత్తముడైనా ఇంత గొప్ప అప్సరస సాంగత్యాన్ని వదులుకొని వెళ్ళడు. ఊరికే నిన్ను బెదిరించాడు.. ఇక్కడే ఎక్కడో ఉంటాడు… అదిగో అక్కడ ఉన్నాడని చెప్తుంది.
అటుచూస్తే మాయ ప్రవరుడు అచ్చంగా ప్రవరాఖ్యుడిలాగే ఉంటాడు. గంధర్వుడితో సంగమిస్తుంది. అతనితో స్వరోచి అనే పిల్లవాడు పుడతాడు. వీళ్ళు ఎలా విడిపోతారంటే మాయా ప్రవరాఖ్యుడు ఇలా చెప్తాడు.
“నాకు కాలికి పసరు పూసిన సిద్దుడు కనిపించాడు. నా తల్లిదండ్రులు నన్ను చూడకపోయేసరికి చాలా దుఃఖంలో ఉన్నారట! నేను వెళ్లి వాళ్లను చూసి నాలుగు రోజులుండి మళ్ళీ వస్తాను!” అంటాడు కానీ అతను రాలేదు.
ఈ కథను సెలబస్ లో ఎవరు చెప్పరు. పిల్లలు చదవరు.
స్వరోచి మహారాజు వేటకు వెడుతుంటే ఒక అమ్మాయి నన్ను రక్షించండి! నన్ను రక్షించండి! అని పరిగెడుతూ వస్తుంది. ఆ అమ్మాయి పేరు మనోరమ. ఆమె ఇందీవరాక్షుడు అనే గంధర్వుడి కూతురు. ఇందీవరాక్షుడు వరూధినికి సోదరుడు. అతను ఎందుకు రాక్షసుడు అయ్యాడు అంటే? ఒక గురువు దగ్గరకు వెళ్ళి ఆయుర్వేద విద్యను నేర్పమని అడిగితే “మీరు గంధర్వులు! విలాస పురుషులు! మీకు ఆయుర్వేదం నేను నేర్పను! అంటాడు.
నువ్వు చెప్పకుంటే నేను నేర్చుకోలేనా? అని అహంకారంతో మాయతో విద్యార్థుల మధ్య కూర్చొని ఆయుర్వేద విద్య నేర్చుకుంటాడు. అంతటితో ఆగక గురువుగారి దగ్గరికి వెళ్లి నేను ఆయుర్వేదం నేర్చుకున్నాను అంటాడు. నువ్వు ఇంత అహంకారవంతుడివి కనుక రాక్షసుడువై నీ కూతురు వెంట పడతావు! అని శాపం పెడతాడు. అలా పరిగెత్తుకుంటూ వచ్చి స్వరోచి రక్షణ కోరుతాడు. ఆ శాపం ఇవ్వగానే మరి ఈ శాపం ఎలా విముక్తి అవుతుంది? అని అడుగుతాడు. స్వరోచితో నువ్వు యుద్ధం చేసినప్పుడు, యుద్ధంలో ఓడినప్పుడు నీకు పూర్వరూపం వస్తుందని చెప్తాడు. అట్లాగే యుద్ధం చేస్తాడు. యుద్ధంలో మరణించే స్థితి వస్తే మళ్ళీ ఇందీవరాక్షుడి రూపం వచ్చి మనోరమను స్వరోచికిచ్చి పెళ్లి చేస్తాడు అది మొదటి కథ.
ఐతే ఈ మనోరమ ఒకసారి ఏడుస్తూ కూర్చుంది. ఎందుకు ఏడుస్తున్నావ్? అని అడుగుతాడు. నాతో పాటు నా ఇద్దరు స్నేహితురాండ్రు వచ్చారు. వాళ్ళు అడవిలో ఎక్కడో తప్పిపోయారని అంటుంది. ఎందుకు వచ్చారు అని అడిగితే,ఒక ఆమె కళావతి, ఇంకొక ఆమె విభావతి, ఇద్దరూ నాతో పాటే వచ్చారు మేము అందరం వన విహారం చేస్తూ వస్తుంటే బూచి వలె తెల్లటి గడ్డాలు మీసాలున్నాయని కనపడితే ఏమిటో చూద్దామని పిల్ల చేష్టతో ఆయన కళ్ళు , ముక్కువేళ్ళతో పొడిచాను. ఆయన తపస్సు భంగమై లేచి నీకింత అహంకారమా? అని నిన్నొక రాక్షసుడు వెంటపడతాడు అన్నాడు.
ఆ స్నేహితురాండ్రు ఇద్దరూ ఆయనతో పోట్లాడితే వాళ్ళని మీకు ఇంత అహంకారమా? దేనికని కుష్టి వ్యాధి వచ్చుగాక! కాని శపించాడు. పాపం వాళ్ళు ఆ వ్యాధితో ఎక్కడో ఏడుస్తూ ఉంటారు అని అన్నది.
స్వరోచి తనకొచ్చిన ఆయుర్వేద విద్యతో వాళ్లను బాగు చేస్తానంటాడు. వారికోసం వెతికితే ఒకచోట చెట్టు మొదట్లో కూర్చొని ఏడుస్తూ కనపడ్డారు. వారికి స్వరోచి ఆయుర్వేద చికిత్స చేసి వ్యాధి నయం చేస్తాడు. అందులో ఒక అమ్మాయికి ఇదివరలో అమ్మవారు ఒక విద్య నేర్పుతుంది. ఆ విద్య ఏమిటంటే ఎప్పుడు సమస్త సంపదలు కలిగే ఆ విద్యను రాజుగారికి దానం చేస్తుంది. ఇంకో అమ్మాయికి పక్షుల, జంతువుల భాష వస్తుంది. ఆ అమ్మాయి కూడా ఈ స్వరూచికి ఆ విద్యను ఇస్తుంది. అప్పుడు ఆ ఇద్దరినీ పెళ్లి చేసుకుంటాడు. అంటే స్వరూచికి మూడు పెళ్లిళ్లు అయ్యాయి. తరువాతి కథాంశం ఏమిటి అంటే స్వరోచి ఒకసారి ఈ భార్యలను వెంటబెట్టుకొని ఉద్యాన విహారానికి వెళతాడు వెళ్తుంటే అక్కడ ఒక సరస్సు తీరంలో చక్రవాక పక్షి ఒక హంస రెండు ఆడవే అక్కడ ఉంటాయి. చక్రవాక పక్షి అంటుంది కదా! ఆ రాజును చూడవే ఎంత అదృష్టవంతుడో ఆ స్త్రీలు ఎంత అదృష్టవంతులు ముగ్గురు భార్యలున్నా ముగ్గురునీ ప్రేమగా చూస్తున్నాడు. వాళ్లు కూడా అసూయాద్వేషాలు లేకుండా ఎంత బాగున్నారు అంటుంది.
అయితే ఆ రెండో పక్షి “నీ మొహంలే ఏ ఆడది కూడా తన భర్త వేరే ఆడదానితో ఉన్నాడంటే ఏమీ ఆనందించదు! పొరపాటు పడుతున్నావు నేను అదృష్టవంతురాలిని నా భర్తకు నేను ఒక్కదాన్నే భార్యను” అని అంటుంది.
అంటే బహు భార్యత్వాన్ని అన్యాపదేశంగా వ్యతిరేకిస్తున్నదీ రచన. సమాజానికి ఒక సందేశం వంటిది.
ఈ మాటలన్నీ విన్న స్వరోచి తనకు పక్షి భాష తెలుసు కనుక అర్థమై ఛీ…ఛీ .. నన్ను ఈ పక్షులు ఇంత అవమానిస్తున్నాయని ఇంటికి వెడతాడు. కానీ వేట ఉత్సాహంలో మళ్ళీ కొన్ని రోజులకు అడవికి వస్తాడు.
ఒక మగ జింక చుట్టూ ఆడ జింకలు తిరుగుతూ ఉంటాయి. స్వరోచి వినేటట్టుగా ఛీ.. ఛీ… నేనేమైనా స్వరోచిననుకున్నారా? ఆడవాళ్ళతో గడపడానికి పో! పో! పోండి అని అంటాడు.
ఆ మాట విన్న స్వరూచి నాకింత అప్రతిష్ట ఏమిటి? అని బాధపడతాడు మళ్ళీ కొన్ని రోజులకు అరణ్యంలో విహారానికి వస్తాడు. ఒక వరాహాన్ని బాణంతో కొట్టబోతుంటే అక్కడున్న అమ్మాయి ఆ వరాహాన్ని ఎందుకు కొడతావు? నన్ను బాణంతో కొట్టు అంటుంది. అదేమిటి? నిన్ను నేనెందుకు కొడతాను? అని అంటాడు.
అప్పుడు ఆమె నేను ప్రేమించిన వ్యక్తి నన్ను ప్రేమించలేదు కనుక చచ్చిపోతాను అంటుంది. అయితే నువ్వు ప్రేమించిన వ్యక్తి ఎవరు? చెప్పు! తీసుకొని వస్తాను అంటాడు.
నిన్నే ప్రేమించాను అంటుంది.
అదేమిటి? నువ్వేమో జంతువు- నేనేమో మనిషిని! నీకు నాకు ప్రేమ ఏమిటి? సాంగత్యం ఏమిటి? అని అంటాడు.
కాదు, కాదు ఒకసారి నన్ను కౌగలించుకో తర్వాత చెప్తాను అంటుంది.
అతను ఆమెను కౌగిలించుకోగానే వనదేవతగా, అందమైన యవ్వనవతిగా మారుతుంది. ఎందుకొచ్చావు? ఇక్కడికి అని అడిగితే దేవతలంతా నన్ను కోరారు స్వరూచితో కలిసి నీకు కొడుకు పుడితే వాడే మనుధర్మ శాస్త్రాన్ని రచించే మనువు ఔతాడని, అతనే పరిపాలిస్తాడని చెప్పింది. దీన్నే స్వారోచిషమనుసంభవం అని అంటారు.
కొద్ది రోజులకు కొడుకు పుట్టి నేను విష్ణువును ధ్యానించుకోవడానికి వెళ్తాను అంటాడు. విష్ణువు ఇప్పుడు కాదు చాలా ఏండ్లు భూమిని పరిపాలించి మనుధర్మ శాస్త్రాన్ని రచించాలి! అని నువ్వు భూమ్మీద ఉండాలని అంటాడు. ఐదు ఆరు ఆశ్వాసాలలో ఉన్న కథ స్వారోచిష మనుసంభవానికి మూలం.
యయాతి, కచ,దేవయాని, మరియు శర్మిష్ట భారతాధారంగా రాస్తే ఎమెస్కో వారు ప్రచురించారు, బసవేశ్వరుడు, దక్షిణకాశి, జైత్రయాత్ర, పాండురంగలీలలు, ఆనంద కాననం,గిరిక పరిణయం, కోనేటిరాయడు, భక్తి తరంగాలు మొదలైన ప్రబంధాధారిత రచనలు చేసాను.

పద్మజ :— వెంగమాంబ సినిమా లో మీ సేవలు ఎలా ఉపయోగపడ్డాయి?

భారతి :– తరిగొండ వెంగమాంబ అన్నప్పుడు కొండ అంటున్నాము. కొండ కాదు కుండ అనాలి. దానికో చరిత్ర ఉంది. ఆమె ఓ కుండలో పెరుగు పోసి కవ్వంతో చిలుకుతున్నప్పుడు ఆ కవ్వం కింద ఏదో తగిలిందట.. ఏమిటని చూస్తే అక్కడ ఏమి కనిపించలేదు. ఆమె భయపడి భర్తకు చెప్తే అతను కూడా జాగ్రత్తగా కవ్వం కింద చెయ్యి పెట్టి చూస్తే అక్కడ సాలగ్రామం ఉందట. ఆ సాలగ్రామంలో లక్ష్మీనరసింహస్వామి రూపం కనిపించిందట. అలా ఆ సంగతి ఆ ఊరంతా తెలిసింది. ఒకరోజున ఆకాశవాణి “ఈ ఊళ్లో ధనవంతుడి చేత నరసింహ స్వామి దేవాలయం కట్టించండి! ఈ ఊరికి క్షేమం కలుగుతుంది.” అని అంటే ఆ ఊళ్ళో లక్ష్మీనరసింహ స్వామి కోవెల కట్టారు. ప్రజల నోళ్ళల్లో తరికుండ కాస్తా పలుకుబడుల మార్పుతో తరికొండ… తరిగొండ అయింది. ఈమె మొట్టమొదట నరసింహ శతకం రాశారు.
వెంగమాంబ బాల్యంలో చదువుకోకుండా తిరుగుతూ ఉంటే అందరూ ఆమెను ఆక్షేపించారట.పిచ్చి పట్టిందని అన్నారట.
ఆమె తండ్రి బాధపడుతూ ఒక గురువు దగ్గర చదువుకోమని పంపించాడు. ఆ గురువు దగ్గర సమస్త శాస్త్రాలు నేర్చుకుంది. తర్వాత తరిగొండకు వచ్చింది. రచనా వ్యాసంగం కొనసాగించింది. తర్వాత ఆమె తిరుపతికి వెళ్లి వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో గొప్ప రచనలు చేయడం జరిగింది.
ఊటుకూరు లక్ష్మీనరసమ్మ గారి ఆంధ్ర కవయిత్రుల పుస్తకం చదువుతుంటే తరిగొండ వెంగమాంబ ఇంత గొప్ప కవయిత్రా ?అనిపించింది. మొల్ల రామాయణం, తిమ్మక్క సుభద్ర కళ్యాణం, రంగాజమ్మ మన్నార దాస విలాసం ఇలా వారంతా ఒక్కటే కావ్యం రాసినా, ఏడు ఎనిమిది యక్షగానాలు, పద్య కావ్యాలు, కీర్తనలు, ఇన్ని రాసిన వెంగమాంబను మరిచిపోతే ఎలా? అని నా మెదడు మేత మేస్తూనే ఉన్నది. నేనొక నవల రాశాను. అప్పటికి ఆమె గురించి రాసిన పుస్తకాలు లేవు. సుందరయ్య విజ్ఞాన భవన్లో ఒకటి రెండు ఉన్నట్టున్నాయి. వాటిని తెచ్చుకొని రాశాను. తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఆమె రచనలు అన్నింటిని ముద్రించారు. ఇప్పుడు తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం కూడా భక్తులు వెళ్లి చూస్తారు. నేను కొంచెం సేకరించి నవలగా రాస్తే ఒక పత్రిక వారు ధారావాహికగా ప్రచురించారు. తర్వాత ఎమెస్కో ( EMSCO)
పబ్లికేషన్స్ అవన్నీ కలిపి ఒక పుస్తకం వలె నవలగా అచ్చు వేయించారు. దొరస్వామి రాజుగారు ప్రొడ్యూసర్ ఆయన నా తో ఫోన్ కాల్ చేసి అమ్మా! తరిగొండ వెంగమాంబ నవలలు మాకు ఇస్తారా? అన్నారు. నేను వెంటనే ఇచ్చాను. ఆయన దాన్ని సినిమాగా తీశారు. దాని ముందు 20 -30 ఎపిసోడ్ లు ఎస్వీబీసీ ( SVBC) ఛానల్ లో ప్రసారం చేశారు. తరిగొండ వెంగమాంబ నాకు ఎంత అభిమాన రచయిత్రయిందంటే? కేంద్ర సాహిత్య అకాడమీ వారు నాకు మోనోగ్రాఫ్ రాసే అవకాశం ఇచ్చారు. తర్వాత ఐనంపూడి శ్రీలక్ష్మి గారి అక్షరయాన్ సహస్ర కవయిత్రుల సంస్థ లోకూడా తరిగొండ వెంగమాంబ మీద నేను పెద్ద వ్యాసం రాసి ఇచ్చాను. వెంగమాంబ బాలవితంతువుగా చాలా కష్టాలు పడింది. వెంకటేశ్వర స్వామే నా భర్త! అని ఎవరిని పెళ్లి చేసుకోను అంటుంది. కానీ తల్లితండ్రులు బలవంతంగా ఒకరికి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆమె అతనికి మొదటి రోజే చెప్తుంది “నువ్వు నా భర్త కాదు! వేంకటేశ్వర స్వామే నా భర్త” అని..
ఈ మాటతో ఆయన ఎంతో వేదన చెంది మరణించాడు. ఆ కాలంలో భర్త మరణిస్తే సుమంగళి చిహ్నాలన్నీ తీసేయాలి. కానీ ఆమె ఏమీ తీయలేదు. అలాగే తిరిగేది. ఆ ఊరు వారికి అది నచ్చలేదు. ఊరి వారందరూ ఆమె అలా ఉంటే ఊరికి అరిష్టమని శిరోముండనం చేయాలని పట్టుబడతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమె చేయించుకోనంటుంది.
పుష్పగిరి పీఠాధిపతులను పిలిపించి ఆమెకు విధవగా మారమని చెప్పిస్తారు. అప్పుడు ఆమె అంటుంది ఒక పతివ్రత అయిన నన్ను ఒక మంగలి ముట్టుకోవడం ధర్మమేనా? అని ఇప్పుడు జుట్టు తీసేస్తాను అనుకోండి! మళ్ళీ పెరగదని మీరు హామీ ఇస్తారా? అని అడిగితే ఈమె సామాన్యురాలు కాదు! ఏదో మహత్తు ఉంది… అని వెళ్ళిపోతాడు. అక్కడున్న వారందరూ వెంగమాంబను స్వామికి దండం పెట్టమని ఒత్తిడి చేస్తారు. అప్పుడు ఆమె ఆ స్వామి సింహాసనం దిగితే దండం పెడతాను. అంటుంది సరే! ఎందుకంటున్నదో? అని వెంటనే ఆ సింహాసనం దిగుతాడు.ఆ సింహాసనం భగ్గున మండిపోయింది. అప్పుడు అనుకుంటాడు ఈమె భగవద అంశంలో పుట్టిన్నట్టున్నది కాబట్టి మనం ఎవరూ బాధించవద్దని చెప్పి ,అలా వదిలేయండి అని పీఠాధిపతి అన్నారు.
వెంగమాంబ హారతి ఇవ్వడానికి వెళితే దేవాలయంలో పూజారులు, పెద్దలు హారతి ఇవ్వవద్దని తలుపులు వేసి, తాళాలు వేసి,చేతికి సంకెళ్లు వేసేవారు.
ఒక వితంతువు దేవుడికి హారతి ఇవ్వడం ఏమిటి? అని వారి వాదన ! ఆ రోజుల్లోనే స్వామి వారి రథం ఇంటింటి ముందు హారతులందుకుని సాగుతుంది .
ఒక రోజు రథం ఆగిపోయింది. వెంగమాంబ తాను ఇంట్లోంచి హారతి ఇచ్చింది. ఆ రథం కదిలింది అప్పటి నుండి దాన్ని ముత్యాల హారతి అన్నారు. ఈ రోజుకు కూడా ముత్యాల హారతి ఇచ్చిన తర్వాతనే వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనికి వెళ్లి పవళింపు సేవ జరిపిస్తారు. ఈ హారతి ఇచ్చిన తర్వాతనే తలుపులు వేస్తారు. ఇంకొక విషయం ఏమిటంటే మనం హారతి ఇచ్చేటప్పుడు అమ్మవారికి, అయ్యవారికి హారతి ఇచ్చి వారి ఆశీస్సులు కోరుకుంటాం! కానీ తరిగొండ వెంగమాంబ కేవలం స్వామికి , అలివేలు మంగమ్మకే కాకుండా ఆ ఊర్లో ఉన్న రథాలకి, అక్కడున్న ప్రాకారాలకు, అక్కడి సామాన్య ప్రజలకు, వంటశాలలకు, వంట వారికి, అన్నింటికీ మంగళహారతి ఇచ్చేదట. అది ముత్యాల హారతి యొక్క గొప్పతనం.
ఇంత గొప్ప మహిళ నేను ఇక్కడ ఉండలేను అంటే వెంకటేశ్వర స్వామి ఒక బిలంలోనుండి తీసుకుని వెళ్లి అభయారణ్యంలోని గుహలో ఉండమని చెప్తాడు. అక్కడ ఉంటుంది ఆమె.
వేంకటాచల మహాత్మ్యం రాసింది. ఆ పద్య కావ్యం చదువుతూ ఉంటే మనకు తిరుపతిలో ఉన్నామా? అనే భావన కలుగుతుంది. అంత విశేషంగా ఉంది. నేను చాలా ప్రబంధాలు నవలలుగా రాసాను. దీనిని కూడా ఒక నవలగా రాసి సామవేదం షణ్ముఖ శర్మ గారి ఋషిపీఠం పత్రికకు పంపాను. ఆ పత్రిక వారు మూడు సంవత్సరాలు సీరియల్ గా వేశారు. ఆ నవల పేరు కోనేటి రాయడు ఆ పేరుతోనే పుస్తకం ప్రచురించారు. ఆ నవల కూడా పాఠకులకు చేరింది.
ఎన్నోరచనలు చేసింది .ఆమె సాహిత్యం అంటే ఇప్పటికీ నాకెంతో ఇష్టం.

పద్మజ:- అన్నీ మంగళప్రదంగా ఉండాలనే శుభకామన ఎంత గొప్పదో కదా!
అలాగే ధూర్జటి కవి రచనల గురించి వివరిస్తారా?

భారతి:– ముందే చెప్పాను ప్రబంధాలు అంటే చాలా ఇష్టం అని ధూర్జటి నాకిష్టమైన కవి అంత స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న కవులు ఇద్దరే ఇద్దరు. ఒకరు ధూర్జటి మరొకరు పోతన ఆయన మాటలలోనే ఆయన వ్యక్తిత్వం తెలుస్తుంది.
పద్యం :–
రాజుల్మత్తులు వారిసేవ నరకప్రాయంబు,
వారిచ్చు నంభోజాక్షీ చతురంతయాన తురగభూషాదు
లాత్మ వ్యధా బీజంబుల్,తదాపేక్ష చాలు పరితృప్తిం
బొందితిన్, జ్ఞానలక్ష్మీ జాగ్రత్పరిణామ మిమ్ము దయతో శ్రీకాళహస్తీశ్వరా ॥

కాళహస్తీశ్వర శతకం, కాళహస్తి మహాత్మ్యం రెండు రాశాడు. ముందు శతకం తర్వాత పెద్ద వయసు వచ్చిన తర్వాత కాళహస్తి దేవాలయం వెళ్లి ప్రబంధం రాశాడు.
విశేషం ఏమిటీ అంటే కాళహస్తి మహాత్మ్యంలో ఒక శైవాచార్యుడు వస్తాడు ఒక దాసి అతన్ని చూసింది. అతనెంత అందంగా ఉన్నాడు అనుకుంటుంది. శివ భక్తుడు కదా! నన్ను నేను అర్పించుకుంటాను. అనుకొని మా ఇంటికి రండి అని పిలుస్తుంది. ఆ దాసితో ఆ శైవాచార్యుడు వెళ్తాడు, భోజనం పెడుతుంది,అతనితో సంతోషంగా ఉండిపోతుంది.
అసలు ఈమె ఎవరంటే? రాజుగారి పళ్ళెరుపు దాసి! అంటే రాజుగారికి సరిగ్గా సమయానికి భోజనం తీసుకొని వెళ్ళాలి. అది ఆ అమ్మాయి ఉద్యోగం. శైవాచార్యుడి ఆకర్షణలో పడి ఆలస్యమైంది. రాజుగారు కోప్పడతారేమోనని భయపడిపోయింది. త్వరగా చీరా, రవికా, జుట్టు సవరించుకొని వెళ్తుంది. రాజుకు భోజనం ఆలస్యమవడంతో కోపంతో ఆమె ఏమి చూసుకొని అంతలా మిడిసిపడుతున్నది..? అనుకొని నీ జుట్టు చాలా అందంగా పొడుగ్గా ఉంటుందికదా! అది చూసుకొని నీకు గర్వం. అందుకే నాకు భోజనం ఆలస్యంగా తెచ్చావని కోపంతో రాజుగారు మంగలిని పిలిపించి ఆమెకు బోడగుండు చేయిస్తాడు. పాపం దాసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది . ఇంటికి వెళ్లి ఆ శైవ భక్తుడితో చెప్పి గోలు గోలున ఏడుస్తుంది.
ఏడవకు అంటూ ఆయన ఆమె తల మీద చేతితో నిమిరి ఓదార్చుతాడు. జుట్టు అంతా ఇదివరకటి వలె వచ్చేస్తుంది.
దాసి తెల్లవారి భోజనం పట్టుకుని రాజు గారి బంగ్లాకి వెళుతుంది. ఆమె జుట్టు చూసి ఒక్కరోజులో నీకు జుట్టు ఎలా వచ్చింది? అని మంగలికి నువ్వు లంచం ఇచ్చి జుట్టు తీయకుండా చేసి ఉంటావు! నన్ను మోసం చేశారు… అంటాడు. కాదు మంగలి నా జుట్టు నిజంగానే తీశాడు. కానీ మా ఇంట్లో శివభక్తుడున్నాడు అతని వల్లనే నా జుట్టు పెరిగింది. అంటే అతన్ని నేను చూడాలి అని దాసి ఇంటికి వస్తాడు రాజు. శైవభక్తుడి తేజస్సు చూసి రాజు విస్తుపోతాడు.
అయ్యా! రాజా మీ దర్శనం చేసుకుందామనే ఈ ఊరు వచ్చాను. ఎందుకంటే మీ ఊర్లో కాళహస్తి దేవాలయం లేదు. నువ్వు కట్టించు అని అంటాడు.
అప్పుడు ఆ రాజు కాళహస్తి దేవాలయాన్ని కట్టిస్తాడు. ధూర్జటి కాళహస్తి మహత్యంలో ఎన్నో కథలు ఉన్నాయి. చాలా చిన్న చిన్న కథలు ఉన్నాయి.
నేను మొట్టమొదట కథారచయిత్రిని కనుక నాకు కథలు ఆసక్తి కలిగిస్తాయి. అందుకే ప్రబంధంగా రాసినప్పుడు ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని రాసి దక్షిణ కాశీ అని పేరు పెట్టాను. అది కూడా ముద్రణ అయింది.

పద్మజ:– కవులకు తమ రచనల మీద సామర్థ్యం మీద అంతులేని ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం ఉండేదిట. ధనాపేక్ష లేకుండా సాహితీ సేవ చేసారు. ధూర్జటి గురించి మీ విశ్లేషణ చాలా బాగుంది!
అలాగే మీ కవితా రచన గురించి చెప్తూ…రేపటి తరం కవితలు ఎలా రాస్తే బాగుంటుందో చెప్పండి!!

భారతి:– పద్యాలు రాసే వాళ్ళ సంఖ్య తగ్గింది. వచన కవిత్వం పెరిగింది. అది నాలుగు ఐదు లైన్లు మాత్రమే అయితే అందులో కవిత్వం వెతుక్కోవాల్సి వస్తుంది. కవిత్వం రాయాలంటే పాండిత్యం, భావనా శక్తి ఉండాలి అందుకుగాను విపరీతంగా పుస్తకాలు చదవాలి. కవితలో కవిత్వం ఉంటేనే పది కాలాలపాటు నిలిచి ఉంటుంది. ప్రాచీన కావ్యాలు ఇవ్వాళ కూడా మనం చదువుతున్నామంటే క్యాచీగా ఉండి, జ్ఞాపకం ఉంటాయి. ప్రాథమిక పద్యాలు ఎక్కువ ధారణ ఉండదు ఎంత చదివితే అంత కొత్త ఆలోచనలు వస్తాయి. నేను ఒక కవితాసంకలనం వేసుకున్నాను.
ఆ సంకలనానికి భారతీయం అని పేరుపెట్టాను. అప్పట్లో ఉదయం పత్రిక ఉండేది అందులో ప్రతి వారం ఒక కవిత అచ్చు అయ్యేది. తర్వాత పసిపిల్లల గురించి ఫిమేల్ చైల్డ్ ఇయర్ శీర్షికన కవితలు ఒక సంవత్సరం పాటు వచ్చాయి. అప్పుడు ఊయలనే కవిత రాశాను. ఉయ్యాల దేనికి ప్రతినిధి అంటే ఒక ఆడపిల్లకి…
ఉయ్యాలలో ఉండే నెల రోజుల పసికందైనా సరే తల్లితో మాట్లాడుతుంది. అంటే అది కవి భావనే! తల్లి ఊయలలోకి తొంగి తొంగి చూస్తుంటే ఆ అమ్మాయి ఏమంటుందంటే…
అమ్మా నేను ఆడపిల్లను పుట్టాను అని బాధపడుతున్నావా?
రౌడీ మగ పిల్లవాడి కన్నా ఆడపిల్ల నీకు ఆనందం కాదా?
నువ్వు హాస్పిటల్ లో డాక్టరమ్మను ,
బడిలో టీచరమ్మను చూసినప్పుడు
నీ కూతురు అలా కావాలని అనుకోలేదా? అని అంటుంది తల్లి కూతురు వేసిన ఈ ప్రశ్నలకు జవాబు చెప్పడానికి ఉక్కిరి బిక్కిరి అయిపోతుంది. చివరగా ఊయలలో ఉన్న పిల్ల ఏమంటుందంటే ..?
“అమ్మా నాకు పట్టుపరికిణీలు కొనవద్దు!
పట్టా గొలుసులూ వద్దు!
ప్రాణంతో ఉండనీయండి నన్ను!
నా కళ్ళతో నన్ను లోకాన్ని చూడనివ్వండి!
నా మనసుతో ఆలోచించనివ్వండి !
నేను అమ్మను అవుతాను!
ముగ్గురమ్మల మూలపుటమ్మనవుతాను!
శక్తిని అవుతాను! యుక్తినౌతాను!
నన్ను నన్నుగా బతకనీయండి!
అని ఉయ్యాలలో పాప అన్నట్టుగా రాసి
ఊయల అని దానికి పేరు పెట్టాను.

పద్మజ:– మీరు జీవిత చరిత్రలు రాశారని విన్నాను వాటిని ఎందుకు రాయాలనిపించింది?

భారతి:– జీవిత చరిత్రలు ఎందుకు రాయాల్సి వచ్చిందంటే? నాకు వాటిని చదవడం చాలా ఇష్టం. వాటిని చదివితే మనకు అనుకోకుండా ఒక దేశభక్తో.. ఒక సమాజ సేవ చేయాలనో ఆకాంక్ష ఏర్పడుతుంది.
ఒక జీవితకాలంలో వారు అన్ని పనులు చేయగలిగితే మనం ప్రపంచానికి పనికొచ్చే ఒకటో రెండు పనులు చేయలేమా? అనే భావం కలుగుతుంది. అందుకే జీవిత చరిత్రలు చదవడం, రాయడం నాకు ఇష్టం. అందుకే ఇల్లిందల సరస్వతీ దేవి జీవిత చరిత్రను రాయించారు. అలాగే తరిగొండ వెంగమాంబ జీవిత చరిత్రను కేంద్ర సాహిత్య అకాడమీ వారు నాచే రాయించారు.
ఎల్లాప్రగడ సీతాకుమారి గారు ఎంతో కాలం కిందటే ఆడపిల్లలు బయట ప్రపంచంలోకి వచ్చి చదువుకోడానికి కష్టం… అనుకుని ఆ రోజుల్లో ఒక చిన్న యువతి మండలిని స్థాపించి, చిన్న చిన్నగా పెంచి ఆ యువతీ మండలిలో ఇప్పుడు పీజీలు కూడా చదువుతున్నారు.
ఆ సంస్థకు నేను వైస్ ప్రెసిడెంట్ గా పనిచేసాను.
అలా ఎల్లాప్రగడ సీతాకుమారి జీవిత చరిత్రను రాశాను.
ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ గారి గురించి ఒక వ్యాసం రాశాను. అది చూసి వారి అబ్బాయి రాజరాజ నరేంద్ర అమెరికాలో నివసించే వారు ఆ వ్యాసం చదివి మా అమ్మగారి గురించి చక్కని వ్యాసం రాశారు. ఆమె చేతనే అమ్మ జీవిత చరిత్ర రాయించాలని వంశీ రామరాజు గారిని కోరారు. రామరాజు గారు వంశీ సంస్థ ద్వారా ఆ పుస్తకం అచ్చు వేయించారు. ఈ మహిళలంతా స్ఫూర్తినిచ్చే వారే. వారి జీవితమంతా త్యాగం చేసి దేశానికి, సమాజానికి ఎంతో ఉపయోగపడ్డారు. వారితో పోల్చుకుంటే మనం ఎంత స్వార్ధపరులమో కదా! మన గురించి మనం ఆలోచించుకోవడం తప్ప మరొక ఆలోచన రాదు.వాళ్ళు జీవితమంతా దేశానికి , సమాజాని కోసమే ఆలోచించారు.
అందుకే జీవిత చరిత్రలు రాయాలి! తప్పక ఈ తరం వారు వాటిని చదవాలి! చదివితే ప్రేరణ పొంది ఏవైనా మంచి పనులు చేయగలరు . అలా వారి జీవితాలు సార్ధకత పొందుతాయి.

పద్మజ:– ఇంతటి సాహిత్యాన్ని సృష్టించిన మీరు పొందిన పురస్కారాలు, అందుకున్న అవార్డులు సన్మానాలు తెలుపుతారా?

భారతి:– ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వారు ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును 1991లో బహుకరించారు.
మద్రాసు కేసరి కుటీరం వారు గృహలక్ష్మి స్వర్ణ కంకణ పురస్కారాన్ని 1996లో ఇచ్చారు.
1998 లో మద్రాసు తెలుగు అకాడమీ వారు ఉగాది పురస్కారాన్ని అందజేశారు.
1998లో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వారు ధర్మనిధి పురస్కారాన్ని ఇచ్చారు.
1995లో అభినందన సంస్థ వారు
దుర్గాబాయి దేశ్ ముఖ్ అవార్డు ప్రధానం చేసారు.
1989 లో ఆంధ్ర మహిళా సభ హైదరాబాద్ వారు చల్లపల్లి వెంకట శాస్త్రి
అవార్డును బహుకరించారు.
2000 సం.పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ వాళ్ళు బెస్ట్ ఉమెన్ రైటర్ అవార్డును అందజేశారు.
2002 లో వంశీ సాంస్కృతిక సంస్థ
ఇల్లిందల సరస్వతీదేవి *స్వర్ణ పథకం అందించారు.
2002 లో విశ్వసాహితీ సంస్థ వారు తెలుగు సాహిత్య విమర్శ , 2006 లో సుశీలా నారాయణ రెడ్డి సాహిత్య అవార్డ్, 2007 లో నాయని సుబ్బారావు సాహిత్య పురస్కారం, కొత్తూరు దేశికులు వెంకటలక్ష్మి పురస్కారం బహుకరించాయి. 2008 లో రావూరి కాంతమ్మ లిటరేచర్ అవార్డ్, 2011 లో విజయవాడ కళాపీఠం వారు ఊటుకూరు లక్ష్మీకాంతమ్మ సాహిత్య పురస్కారం,
ఉపాసనా సంస్థ 2013లో మండపాక ఉమాదేవి సాహిత్య పురస్కారం,
సామవేదం షణ్ముఖ శర్మగారి తల్లి లలితాదేవి స్మారక పురస్కారం ఋషి పీఠంనుండి,
నవ్యసాహితీ సమితి నుండి వసంతోత్సవం – ఉగాది పురస్కారం, ఇలా పలు సంస్థల నుండే కాకుండా
2014 లో అమెరికాలోని హ్యూస్టన్ – వంగూరి ఫౌండేషన్ సంస్థ జీవన సాఫల్య పురస్కారం,
గిడుగు రామమూర్తి జీవనసాఫల్య పురస్కారం,
విశిష్ట మహిళా పురస్కారం తెలంగాణ ప్రభుత్వం 2024 మహిళాదినోత్సవ సందర్భంగా అందించారు.
అపురూప అమృత లత జీవన సాఫల్య పురస్కారం అందుకున్నాను.

పద్మజ:–ఇన్ని పురస్కారాలందుకున్నందుకు అనేక అభినందనలమ్మా!

అలాగే మయూఖ పత్రిక పాఠకులకు మీరు ఏం సూచనలు ఇస్తారు?

భారతి :– సూచనలు కాదు కానీ ఇవాళ నన్ను మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఎవరైనా విన్నవారు కొన్ని విషయాలైనా మనసుకు పట్టుకుంటే, ఒక్క మన కుటుంబానికే కాదు సమాజానికి ఏమైనా చెయ్యాలని అనుకోవాలి. రాయాలంటే పుస్తకాలు బాగా చదవాలి. నా వయసు 80 పైన ఇప్పటికీ సాహిత్య కృషి చేస్తూనే ఉన్నాను. సాహిత్యం ఎలా పని చేస్తుంది అనే దానికి ఉదాహరణగా నేను ఒక కథ చెప్తాను.
ఆరుగురు అక్క చెల్లెళ్లు అన్న తమ్ముళ్లు ఒక ఫంక్షన్ లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఇప్పటి జనరేషన్లో ఎవరైనా ఒక్కొక్క పిల్లనే కంటున్నారు. ఒక పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే మీ అందరూ ఇలా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటున్నారు మీరందరూ ఒరేయ్! అన్నాయి అని, ఒసేయ్! చెల్లి అని ఒక్కొక్కరు ప్రేమగా పిలుచుకుంటున్నారు నాకు ఎవరూ తోడు లేరు. తోడు ఎవరున్నారని ఏడుస్తున్నాడు.
వాళ్ళ అమ్మ నిజమే కదా! అనుకుంటుంది.
కాలేజీకి వెళుతుంటే ఒకరు ఎదురొచ్చి మీ కథ తోడు చదివాను. ఒక నిర్ణయం తీసుకున్నాము మా అమ్మాయికి ఇప్పుడు 9 సంవత్సరాలు ఒక పిల్ల చాలు అనుకున్నాము కానీ మా తర్వాత మా అమ్మాయి ఒంటరిగా అయిపోతుందని ఇంకొకరిని కనాలని అనుకుంటున్నామని అన్నాడు.
అంటే నా కథ ఒకరి మనసు మార్చిందంటే సాహిత్య లక్ష్యం నెరవేరినట్టే!
అలాంటి ఎన్నో కథలు ఉన్నాయి.ఈ తరం వారు చదువుతూ, రాస్తూ, ఉంటే మన విలువలు రక్షింపబడతాయి.
పద్మజ:– ప్రేక్షకులకు ఇంత గొప్ప సాహితీవేత్తను, మానవతా మూర్తిని పరిచయం చేయడం, నా భాగ్యంగా తలుస్తున్నాను. ఇంకా ఎన్నో విషయాలున్నాయి వారినుండి నేర్చుకోవడానికి ఇంత తక్కువ సమయం సరిపోదు! ఎంత చెప్పిన తక్కువే వారు వృత్తి రీత్యా విద్యార్థులకు చేసిన సేవలు అమోఘం. ఇవాళ ఒక స్ఫూర్తివంతమైన మహిళా రత్నం శ్రీమతి ముక్తేవి భారతి గారితో పరిచయం చేసుకున్నాము.
మరొక మహిళా రత్నంతో కలుస్తాను! అందాకా మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటూ..

మీ రంగరాజు పద్మజ.

May 30, 2025 55 comments
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • వేకువ పాట
  • చాణుక్యుడు ఆదిశంకరాచార్యుల ప్రభావం ఒక సింహావలోకనం
  • సనాతనమంటే?
  • సమాజానికి హానికరమైనవిగా కాక ఉపయుక్తమైన రచనలు చేయాలి- డా. జి. చెన్నకేశవరెడ్డి
  • సాహిత్యాకాశంలో నక్షత్రాక్షర తోరణం- అక్షరగీతం

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us