మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
పుస్త‌క స‌మీక్ష‌

అభిసారిక

by K. Madhuri March 16, 2025
written by K. Madhuri

అమ్మ డైరీలో కొన్ని పేజీలు నవల రచయిత రవిమంత్రి గారు..
పేరు లో మంత్రి ఉన్నా, రచయితగా రారాజు స్థానాన్ని చేరుకున్నారు ఈ రచన తో..
అమ్మ డైరీలో కొన్ని పేజీలు మీ నవలకు మనస్ఫూర్తిగా
అభినందనలు..శుభాకాంక్షలు..

ఈ పుస్తకం చదవడం కోసం ఎన్నిరోజులుగా వేచి ఉన్నానో,.. చదివాక అనిపించింది వర్త్ వర్మ వర్త్ (వర్త్ ఫర్ వెయిటింగ్) .
నాకో సంగతి చెప్పు.. అసలు ఎవరైనా నీకు ఉత్తరం రాశారా? పోనీ నువ్వెప్పుడైనా రాశావా? (అంటే ఏం చెప్తాం అండి రాసుంటే బాగుండేది అనుకోవడం తప్ప.) అని మొదలు పెడుతూ ఉత్తరాలు రాద్దాం అన్న ఆలోచనలకి బీజం వేశారు.
నీకు ఉత్తరాలు చదివే అలవాటుందో లేదో తెలియకుండానే రాస్తున్నాను అంటూ తెలియకుండానే పుస్తకoమొత్తం చదివేలా చేశారు..
కథ పుట్టుక- సాధారణంగా కథలు చెప్పడం బాగా తెలిసిన రవి మంత్రి గారు అమ్మ కథని చెప్పాలి అనుకోవడం దగ్గర, అమ్మకి కూడా ప్రేమకథ ఉంటుందనుకోవడం దగ్గర ఈ ప్రయాణం మొదలై ఉండొచ్చు అని సందేహంగానే కథ సందర్భాన్ని తెలియజేశారు.
కథలోని పాత్రల పరిచయం- ఈ కథలో ప్రధాన పాత్రలు నాలుగు. వాటిని నడిపించే పాత్రలు మరో మూడు.
1) సారిక- మన కథానాయిక. కార్పోరేట్ స్కూల్ ప్రిన్సిపాల్. టీనేజర్ నుంచి అమ్మ వరకు ప్రయాణం లో వయసుతో పాటు వచ్చే మార్పులకి తగ్గట్టు ప్రవర్తిస్తూ,ఒక దశ తర్వాత భావాల్ని నియంత్రించుకోవడం నేర్చుకొని పరిస్థితులని తన అదుపులోకి తెచ్చుకోగలిగే పాత్ర.
పాఠకులు తను నవ్వితే నవ్వి, ఏడిస్తే ఆమెతో పాటే ఏడ్చారు అంటే అతిశయోక్తి కాదు.
2) అభిరామ్- కథానాయకుడు. తనకు బాధ కలిగినా ఇతరులను బాధ పెట్టని మంచి మనసున్న పాత్ర. రామ్ లా ప్రేమించడం చాలా కష్టం.
3) నందగోపాల్- సారిక భర్త. సౌమ్యుడు. ఇతనిలా మనుషులని స్వీకరించటం చాలా కష్టం.
రామ్, నందు ఈ రెండు పాత్రల్నీ పోలిన మనుషుల్ని చాలా అరుదుగా చూస్తాం.
4) వర్థనమ్మ- సారిక తల్లి. ఈవిడ ప్రతీ ఆడపిల్ల తల్లికీ ప్రతినిధి లా అనిపిస్తారు.
5) సుచిత్ర- రామ్ భార్య. గతాలు, భవిష్యత్తులు అనే ఉచ్చులో చిక్కుకోకుండా ఆ రోజుని మాత్రమే ఆస్వాదించే మనస్తత్వం.
6) గీత,జిత్తు- నేటి సమాజంలో విభిన్న మనస్తత్వాలు గల పిల్లలకు ప్రతిరూపాలు.

సారిక వాళ్ళ వెనక ఇంట్లో కి కొత్తగా వచ్చారు గీత మరియు గీత వాళ్ళ నాన్న. గీత పరిచయం తో కాలక్షేపం కోసం కొమ్మపై వాలిన పక్షి ఎగిరిపోతుందని తెలిసినా, బాగున్న ఆ క్షణాన్ని ఆస్వాదిస్తూ రేపటి గురించి తలుచుకోవటం మానేసింది సారిక. కొన్నిరోజుల్లోనే గీత సారిక కి, వాళ్ళ కొడుకు జిత్తు కి చాల దగ్గరైంది.
గీత సారిక అలవాట్లని, ప్రపంచాన్ని, ఆకారాన్ని కొంచెంకొంచెంగా మార్చేసింది. తనకి తననే కొత్తగా పరిచయం చేసింది.
ఒకరోజు గీత సారిక ని డిన్నర్ కి ఆహ్వానించింది. తన తండ్రి ని పరిచయం చేస్తానని చెప్పింది గీత.
మీ నాన్న పేరేంటి అని అడగగా, అభిరామ్ నాయుడు అని సమాధానమిచ్చింది గీత. రామ్ అంటే నువ్వు… అని సారికా అంటుండగానే,, అందుకొని అవును నేను గీతాంజలి అని చెప్పి వెళ్ళిపోయింది గీత.
రామ్ అంటే తనేనా ఇప్పుడెందుకు వచ్చాడు. కలవాలా వద్దా అని ఆలోచనలో పడింది సారిక..
ఇంతకీ రామ్ ఎవరంటే ?
సారిక ఇంజనీరింగ్ చదివే రోజుల్లో సీనియర్. ర్యాగింగ్ ద్వారా పరిచయం అయ్యి మెల్లమెల్లగా మాటలు కలిపే ప్రయత్నం చేశాడు. పరీక్ష సరిగ్గా రాయలేదన్న కోపం రామ్ మీద చూపిస్తూ అందరి ముందు తిట్టింది సారిక. సారి సారిక ఇంక నీ జోలికి రాను అంటూ మాయమయ్యాడు రామ్.
రామ్ ని తిట్టి తప్పు చేశావ్ చిన్నప్పుడు తెలిసిన అమ్మాయివి అని చనువుగా మాట్లాడాడు రామ్ అని రాజేష్ చెప్పగా, ఆరా తీసి తను అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చిన్నపుడు కలిసి ఆడుకున్న స్నేహితుడు అని, అప్పట్లో రామ్ కి సారిక అంటే చాలా ఇష్టం ఉండేదని వాళ్ళ మామ్మ ద్వారా తెలుసుకుంది.
వేసవి సెలవులు కావడం తో కలవడం కుదరక ఆకాశవాణి ద్వారా నీకై అభిసారికనై పాట తో సందేశం పంపింది.
సినిమాకి అని చెప్పి సారిక స్నేహితురాలు పద్మ. బీచ్ లో వేచి ఉన్న రామ్ కి సారిక ని కలిపించింది.
ఇంకేముంది ప్రేమ చిగురించి బీచ్ లు, సినిమాలు, షికార్లు తిరగడాలతో పెరిగిపోతూ ఉంది.
వర్ధనమ్మ వాళ్ళ అన్నయ్య తో ఆస్తి లో వాట కోసం పోరు పెట్టుకొని సాధించింది.
అన్న కూతురు పెళ్లి నిశ్చయం తో సింహాచలం లో కలిసిపోయారు ఇరు కుటుంబాలు. సారిక బావ నందు అందగాడు ,మంచి ఉద్యోగం అవ్వటం తో సారిక ఇష్టం తో పనిలేకుండా పెళ్ళిచూపులు కానిచ్చేశారు తల్లిదండ్రులు. మామయ్య వాళ్ళు వెళ్ళిపోగానే మదిలోని ప్రేమను బయట పెట్టింది సారిక. ఇంకేముంది సారికని నందుతో పెళ్లికి ఒప్పించటానికి ఇంట్లో రోజు యుద్ధవాతావరణమే సాగుతుంది.
ఇక లాభం లేదు అనుకొని వర్దనమ్మ రామ్ ని కలిసి మాట్లాడింది. సారిక తో పెళ్లికి ఒప్పుకోక పోవటానికి కారణం కులమేనా అని రామ్ ప్రశ్నించగా,
కులము ఒక్కటే కాదని. నందు తన అన్న కొడుకు రక్త సంబంధం, తెలిసినవాడు, మంచి ఉద్యోగం, నందు ని చేసుకుంటే సుఖపడుతుందని సారిక భవిష్యత్తు కి భరోసానిచ్చింది.
ఇక చేసేదేమీ లేక సారిక ఎంత వారిస్తున్నా వినకుండా, భరోసా లేని తన భవిష్యత్తుతో సారికని ముడిపెట్టలేక తను సుఖంగా ఉండాలని వాదించి గెలిచి, సారికను నందు తో పెళ్లికి ఒప్పించాడు రామ్.
సారిక నందుని పెళ్ళిచేసుకుని అమెరికా వెళ్ళింది. నందు చిన్నపుడు పూజిత అనే అమ్మాయిని ప్రేమించాడు. ఆమె వయస్సు ఎక్కువ అవ్వటం వల్ల వారి ప్రేమ ముందుకు సాగలేదు. సారిక – నందు ఇద్దరు గతాలను స్వాగతించి,
మెల్లగా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ అలవాటు గా సాగిపోతున్నారు. పుట్టిన కొడుకు కి అభిరామ్, పూజిత లా పేర్లు కలిసేలా అభిజిత్ అని పేరు పెట్టారు.
బాబు పెద్దవాళ్ళ దగ్గర పెరిగితే బాగుంటుందని బెంగుళూరు ట్రాన్స్ఫర్ చేయించుకున్నాడు నందు. భారత్ కి వచ్చే చివరి రోజు ఆఫీస్ లో సెండ్ ఆఫ్ పార్టీ కి వెళ్లి అగ్నిప్రమాదం లో చిక్కుకొని మరణించాడు.
తరువాత నందు కోరిక ప్రకారం సారిక జిత్తు ని తీసుకొని భారత్ కి వచ్చి డిగ్రీ పూర్తి చేసి ప్రస్తుతం ప్రిన్సిపాల్ గా ఉద్యోగం చేస్తూ జీవిస్తుంది.

మరునాడు గీత ఆహ్వానాన్ని మన్నించి డిన్నర్ లో రామ్ ని కలిసి మాట్లాడింది.
మళ్ళీ కలపాలనే ఉద్దేశమే ఉంటే తనకి దూరంగా ఉండమని గీత ని హెచ్చరించింది.
రామ్ చిత్రను యిష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాడు.
సారిక గురించి తెలుసుకొని, గతాన్ని స్వీకరించి, చిత్ర తన ప్రేమతో రామ్ ని మార్చేసింది. పుట్టిన పాప కి వారు ప్రేమించిన రోజులలో సారిక చెప్పినట్లు గీతాంజలి అని పేరు పెట్టారు. కొన్నాళ్ళకి చిత్ర కాన్సర్ తో మరణించింది. ఇదంతా చిత్ర డైరీ చదివి తెలుసుకుంది సారిక. తన అమ్మ డైరీ చదివిన గీత సారికని వాళ్ళ నాన్న తో కలిపే ప్రయత్నం చేసింది. రామ్ కి చేసిన అన్యాయానికి క్షమాపణ కోరుతూ నందు రాసిన లేఖ చదివి జిత్తు కూడా అదే ప్రయత్నం చేశాడు.
ఈ వయసు లో ఎవరు ఏం అనుకుంటారో అని అనిపించినా ఎప్పటికీ మనల్ని వేల కళ్ళు చూస్తాయి, వందల నోళ్ళు మాట్లాడతాయి. ప్రతి ఒక్కరికీ సమాధానం చెప్తూ పోలేము కదా! అందరిని మెప్పించాలి అంటే ఎప్పటికీ మనం మనలా ఉండలేం. మనం ఎవరి కోసమో జీవించకూడదు అని మళ్ళీ మొదటి నుంచి కొత్త గా ప్రయాణం మొదలు పెట్టారు అభి- సారిక…
అమ్మకు కూడా ప్రేమకథ ఉంటుందనుకోవడం అతిశయోక్తి కాకపోయినా, చివరికి ఆ ప్రేమని కలిపి గెలిపించడం మాత్రం ఇండియా లో ఈ రోజుల్లో అమాయకత్వమే అవుతుంది అనిపించింది, కానీ నిజంగా జరిగితే బాగుండు అనేంత అందగా ఉంది..
మనసు లేని పెద్దలు విడదీసిన పిల్లల ప్రేమకథ ని పెద్దమనసు తో వారి పిల్లలు మళ్ళీ కలపడం .. ఇదే అన్నింటిలో ప్రత్యేకం.
పుస్తకం చదువుతున్నంత సేపు బయటి ప్రపంచాన్ని బహిష్కరించి, అభి – సారిక ల ప్రేమ ప్రపంచం.. నందు, చిత్ర, జిత్తు, గీతా లతో సంసారిక బంధం, త్యాగం, సర్దుబాటు, అర్థం చేసుకోవటం అన్ని.. వారితో పాటు నవ్వడం, వారి బాధలో వారితో పాటు ఏడ్వడం.. అన్ని చుట్టూ అల్లుకునేలా చేసిన
రచయిత మాటలు, భావాలు పాఠకులని సుతిమెత్తగా ఎప్పటికప్పుడు స్పృశిస్తూనే ఉన్నాయి.

ఈ కథని పాఠకుడు తన మనసులోని భావాలను తానే రాసుకుని చదువుతున్నట్లుగా భావిస్తాడు..
నవల మధ్యమధ్యలో షేక్స్పియర్, బుద్ధుడు, రోజ్ వైల్డర్, పింగళి…లను అలాఅలా పలకరిస్తూ.. మనుస్మృతి లోకి వెళ్ళిరావడం చాలాచాలా బాగుంది..
ఈ ప్రేమలు విడిపోవడాలు ప్రేమ వెతుక్కుంటూ రావడాలు,చాలా అరుదుగా జరిగే విషయాలు అనే ముగింపుతో..
అరుదుగా జరిగే విషయాన్ని కూడా ఆలోచనలోకి తెచ్చి, అద్భుతంగా వర్ణించే రవిమంత్రి లాంటి రచయిత కూడా మాకు అరుదే మరి!…
ధన్యవాదాలు..

March 16, 2025 0 comment
2 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

తెలుగు సాహిత్యం`వడ్డేపల్లి ప్రస్థానం

by Bhoomagalla Lavanya March 16, 2025
written by Bhoomagalla Lavanya

సమాజం గాయపడినప్పుడల్లా కవిత్వాన్ని ఔషధంగా ప్రయోగించి, సామాజిక చైతన్యాన్ని కాంక్షించి సాధించిన మహాకవులు, మేధావులు ఎందరెందరో ఆధునిక తెలుగు సాహిత్యరంగంలో ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ నేలపై ఎంతోమంది మహాకవులు, చైతన్యవంతులు పుట్టి తమ సృజనాత్మకతాశక్తితో సాహిత్యరంగాన్ని సుసంపన్నం చేశారు. మహాకవులైన దాశరథి, సి. నారాయణరెడ్డి లాంటి వారి ప్రభావంతో యువకవులు కూడా కలంపట్టి జన్మతః వారిని అనుసరిస్తూ, వారి మార్గదర్శనంతో సాహిత్యరంగంలో కొత్త ఒరవడిని దిద్దిన కవులు ఉన్నారు. వారిలో వడ్డేపల్లి కృష్ణ ఒకరు. తెలంగాణ సాహితీరంగంలో నూతన శకాన్ని స్థాపించిన వారిగా ఆయన మనకు కనిపిస్తాడు.
1994లో పిహెచ్‌.డిలో చేరి ఆచార్య ఎస్వీ. రామారావు పర్యవేక్షణలో ‘తెలుగులో లలితగీతాలు’ అనే అంశం మీద పరిశోధన చేసి 1998లో డాక్టరేట్‌ పట్టా పొందారు. అది 2000 సం॥లో ‘‘తెలుగులో లలితగీతాలు’’ పుస్తకంగా వెలువడి, ప్రామాణిక గ్రంథంగా గుర్తింపు పొందింది.
వడ్డేపల్లి కృష్ణ లలితగీతాల మహాకవిగా, పరిశోధకుడిగా తెలుగునేలపైన ప్రసిద్ధులు. తన సాహిత్యకృషితో రాశిలో, వాసిలో తనకుతానై విస్తరించి, విశ్వవ్యాప్తమై ఎదిగారు. మాట వరుసకు మాత్రమే లలితగీతాల మహాకవి కానీ ఇవేగాక గేయనాటికలు, నాటకాలు, సినిమా పాటలు, నృత్యరూపకాలు, కథలు, భక్తిగీతాలు, లలితగీతాలు వంటి అనేక ప్రక్రియల్లో కృషిచేసిన రచయిత. సినిమాదర్శకులు కూడా. వడ్డేపల్లి కృష్ణ నాలుగు తరాల వారధి. మహాకవి సినారె సాహిత్య వారసత్వ సంపదలో పెన్నిధి, పుట్టిపెరిగిన ప్రాంతమే కాదు, ప్రక్రియల్లోను అడుగుజాడ సినారెది.
                   ‘‘మానేరు నీరు మహిమో
                   మాతల్లి పాల మహిమో’’ అంటూ వివిధ సందర్భాల్లో సాహిత్య ప్రస్థానాన్ని గుర్తు చేసుకునే వడ్డేపల్లి తన సాహితీ ప్రవేశం చిన్నతనంలోనే చేశాడు. విద్యార్థి దశలోనే అనగా 6వ తరగతి చదువుతున్న రోజుల్లోనే శ్రీ కనపర్తి లక్ష్మీనరసయ్యగారు సినారెగారి ఏకైక నాటిక ‘‘సినీకవి’’లో (కథకుడు) తారాపతి పాత్రధారణ చేయించాడు. ఆ పాత్ర పోషణలో చిన్ననాటనే అప్పటి జిల్లా కేంద్రమైన కరీంనగర్లో (1960) పలువురి ప్రశంసలు అందుకున్నాడు. ఆనాటి నుండి అనేక రంగస్థల నాటకాలలోనేగాక దూరదర్శన్లో ‘స్త్రీ’, ‘మిస్టర్‌’ (సీరియల్స్‌) మరియు ‘మంచు తెరలు’, ‘వెన్నెలకాపురం’ మొదలైన నాటికల్లో నటించాడు.
 గేయమనేది మాత్రాఛందోవిశేషం. వడ్డేపల్లి కృష్ణ సాహిత్యసంస్కారమంతా అతని గేయరచనలోనే కనబడుతుంది. అంతేకాదు ఆయన రచనల్లో అధిక భాగం గేయాలే. గురువులైన కనపర్తి లక్ష్మీనరసయ్య, నందగిరి అనంత రాజశర్మగార్ల ప్రోత్సాహంతో గేయఛందస్సును ఆకళింపు చేసుకొని కవితారచనను మొదలుపెట్టారు. నిరంతర సాధనతో, అధ్యయనంతో నిగ్గుతేలిన వీరి ప్రథమకవిత ‘‘ఎవడెరుగును?’’ అనే గేయం ‘స్రవంతి’ మాసపత్రికలో 1968 జూన్లో ప్రచురితమైంది.
             ‘‘అతని మనస్సునందలి
               ఆంతర్యమ్మెవడెరుగును?
                   వీడిన ప్రేమికులలోని
                   బడబాగ్ని నెవడెరుగును?’’
సామాజిక స్పృహతో వడ్డేపల్లి రాసిన గేయమిది. ఇది తొలి గేయమైనా ఎంతో పరిణతి చెందినవారు రాసినట్లుగా ఉంది. ఇందులోని అభివ్యక్తి, పదప్రయోగవైచిత్రి, పైపైకి కనిపించే అందాల గురించి కాక లోలోపల ఉన్న వెతలను గురించి, కథలను గురించి ఈ గేయములో కళ్లకు కట్టినట్లు వివరించాడు. ‘‘చితికిన బ్రతుకులలోపలి వెతల గూర్చి ఎవడెరుగును?’ అన్న వాక్యం పాఠకుల్ని ఆలోచింపజేస్తుంది. గుండెల్ని ద్రవింపజేస్తుంది. 1969లో వీరి ప్రథమ ప్రబోధ గేయాలు ‘‘కనరా నీదేశం వినరా సందేశం’’, ‘‘వర్షించవేమేఘమా!’’ మొదలైన గేయాలు ఆకాశవాణిలో ప్రసారితమయ్యాయి.
1976లో ‘వెలుగొచ్చింది’ అనే నాటికను తెలంగాణ మాండలికంలో రచించి, దర్శకత్వం వహించి, కరీంనగర్‌ జిల్లాలో పలుమార్లు ప్రదర్శించి జిల్లా స్థాయి నాటిక పోటీలలో కూడా బహుమతులు అందుకున్నాడు. ఆయన వెలుగుమేడ (1976), గాంధీ గణాధిపత్యం (బాలల గేయనాటికలు-2015), రంగ తరంగాలు (రంగస్థల నాటికలు 2018) మొదలైన గేయనాటికలు రచించాడు. ఆయన ఆయా సందర్భాల్లో రచించిన గేయనాటికలెన్నో ఆకాశవాణి, దూరదర్శన్‌ కేంద్రాల్లో ప్రసారితమయ్యాయి. భక్తకవి పోతన, భాగ్యనగరం, వెలుగువెన్నెల మొదలైన నాటకాలు అముద్రితంగా ఉన్నాయి.
వడ్డేపల్లి కృష్ణ అనేక సంగీత నృత్యరూపకాల్ని రచించాడు. మొదటగా ‘వడ్డేపల్లి రూపకాలు’ అనే పేరుతో అనేక సంగీత నృత్యరూపకాలను సంపుటిగా వెలువరించాడు. ఇందులో స్వదేశీయం’, ‘విశ్వకళ్యాణం’, ‘వివానంది విజయం’, ‘ఆమ్రపాలి’, ‘మాతృదేవోభవ’, ‘పితృదేవోభవ’, ‘మహిళాభ్యుదయం’, ‘శ్రీకృష్ణదేవరాయలు’, ‘స్వర్ణభారతి’, ‘నృత్యభారతి’, ‘సంక్రాంతి లక్ష్మీ’, ‘ఉగాది వేళ-వసంతహేల’, ‘తెలుగు తేజ’, ‘అభినయం’, ‘చండాలిక’, ‘మానవత్వం’ వంటి రూపకాలు చేర్చాడు. ఎయిడ్స్‌ మీద కూడా ‘వెన్నెల వెలవెల’ అనే పేరుతో రూపకాలు రూపొందించాడు.
అలాగే వడ్డేపల్లి కృష్ణ మరొక సంగీతనృత్యరూపక సంపుటి అయిన ‘తెలంగాణ రూపకములు-త్రివిక్రములు’లో ఎక్కువగా తెలంగాణ నేపథ్యానికి సంబంధించినవే కావడం విశేషం. ఇందులోని తెలంగాణ వైభవం, తెలంగాణ పుణ్యక్షేత్రాలు, తెలంగాణ తేజోమూర్తులు, గోలకొండ, రామప్ప, కాకతీయ వైభవం, తరతరాల తెలంగాణ, యాదాద్రి వైభవం మొదలైనవన్నీ తెలంగాణ వేదికవే. అందుకే ఈ సంపుటికి ‘ తెలంగాణరూపకములు’ అనే పేరును స్థిరపరిచాడు. ఇదే సంపుటిలో సమాజంలోని అక్రమాల్ని, సమస్యల్ని ఖండిస్తూ విక్రమంగా సంస్కరించి మహానీయులుగా నిలిచిన ముగ్గురు త్రిమూర్తులు అయిన మహాత్మాజ్యోతి బాపులే, భారతరత్న డా. బి.ఆర్‌. అంబేద్కర్‌, భాగ్యరెడ్డివర్మ అని సంస్కర్తల జీవితచరిత్రలని సంగీత నృత్య రూపకాలుగా మలిచి ‘త్రివిక్రములు’ పేరుతో ఈ సంపుటిలో చేర్చడమైనది. మరొక సంగీత నృత్య రూపకమైన ‘బతుకమ్మ-జయజయహే తెలంగాణ’ సంపుటిని కూడా వడ్డేపల్లి కృష్ణ తెలంగాణ నేపథ్యంలోనే నడిపించాడు. ఈ విధంగా సమకాలీన సమాజంలో గతచరిత్రను, సంస్కృతిని, మానవీయ సంబంధాలను ఉదాత్రీకరిస్తూ రూపొందించిన ఈ రూపకాల్ని వేదిక మీద నృత్య, గాన, సంగీత సమ్మేళనంతో చూస్తే, అవి కొన్ని వందలరెట్లు ప్రభావితం చేస్తాయి అలరిస్తాయి. చైతన్యపరుస్తాయి. కావ్యానందం కలిగిస్తాయి. ఇంత వస్తువైవిధ్య పూరితంగా రాయడం వడ్డేపల్లి కృష్ణకే చెల్లింది.
 వడ్డేపల్లి కృష్ణ చేసిన సాహిత్యసేవకు గాను ఎంతోమంది, ఎన్నో సంస్థలు ఆయనను బిరుదులతో గౌరవించారు. 1995లో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవస్థానం వారు ‘‘గౌతమీ కిరీటి’’ అనే బిరుదుతో సత్కరించారు. 1997లో కళాంజలి ఆర్ట్స్‌ వారు ‘‘బాలసాహిత్య రత్న’’ అనే బిరుదుతో, 2004లో అమెరికా ఆటా సంస్థవారు ‘లలితశ్రీ’ అనే బిరుదుతో, 2012లో తెలంగాణ భాషా పరిరక్షణ సమితి వారు ‘‘లలితగీత ప్రపూర్ణ’’ బిరుదు. 2014లో గ్రేటర్కన్యాస్‌ సిటీ తెలుగు అసోసియేషన్‌ వారు ‘కవనప్రజ్ఞ’ అనే బిరుదు. 2015లో భారత్‌ కల్చరల్‌ అకాడమీ వారు ‘కవి శిరోమణి’ అనే బిరుదుతో, 2016లో హ్యూస్టన్‌ తెలుగు అసోసియేషన్‌ వారు ూఱఙఱఅస్త్ర ూవస్త్రవఅస శీట ూఱస్త్రష్ట్ర్‌ ూశీఅస్త్రం అనే బిరుదులతో, 2018లో వంశీ ఆర్ట్స్‌ థియేటర్స్‌ వారు ‘కళారత్న’ అనే బిరుదులతో గౌరవంగా సత్కరించారు.

March 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni March 16, 2025
written by Narendra Sandineni

డాక్టర్ కె.జి. వేణు రచించిన 10) మినీ కవితల పై విశ్లేషణా వ్యాసాలు.
ప్రముఖ కవి,డాక్టర్ కె.జి.వేణు రచించిన విశ్వాసం గెలుపు మినీ కవిత‌. విశ్వాసం అంటే ఒక వ్యక్తిపై నమ్మకం కలిగి ఉండడం.ఆత్మవిశ్వాసం అంటే తనపై నమ్మకం.ఒక నిర్దిష్టమైన పని లేదా లక్ష్యాన్ని సాధించగలను అని తన సామర్థ్యంపై నమ్మకం కలిగి ఉండడం విశ్వాసం. గెలుపు అంటే విజయం.ఏదైనా పోటీలో విజయం సాధించడం గెలుపు.పోటీలో నెగ్గుట గెలుపు. ఓడిపోకుండా ఉండటం గెలుపు.విశ్వాసం,గెలుపు చాలా లోతైన అర్థాన్ని ఇస్తుంది.ఇది వ్యక్తిగత జీవితంలోను,వృత్తిపరమైన విజయాలలోను అన్ని రంగాల్లో కనిపిస్తుంది.విశ్వాసం అంటే ఏమిటి? విశ్వాసం అనేది మనం ఎంచుకున్న మార్గంపై అవిశ్రాంతంగా నమ్మకంతో ముందుకు సాగడం.ఇది నమ్మకం మరియు పట్టుదలతో సాగాలి.ఎందుకు విశ్వాసం గెలిపిస్తుంది?ఏ పని చేసినా మధ్యలో ఆటంకాలు వస్తాయి.విశ్వాసం ఉంటే ఆ ఆటంకాలను అధిగమించి విజయాలు సొంతం అవుతాయి.సందేహాలు,భయాలు మన ప్రయాణాన్ని నిలిపివేస్తాయి.విశ్వాసం ఉంటే లక్ష్యం ఎప్పుడు మన కళ్ళ ముందు కదలాడుతుంది.మనం ఏదైనా గొప్ప పని చేయాలంటే మన మీద మనకు అపారమైన నమ్మకం ఉండాలి.అదే గెలుపునకు మార్గం చూపుతుంది.జీవితంలో ఎన్నోసార్లు మనం విఫలమవుతాం.మనపై మనకు విశ్వాసం ఉంటే మళ్లీ లేచి ప్రయత్నిస్తాం.విజయం ప్రతి ఒక్కరికి సమానంగా అందుబాటులో ఉంటుంది.చిత్తశుద్ధితో ప్రయత్నించే వారు మాత్రమే విజేతలు అవుతారు. మనం నమ్మిన ఆశయాల పట్ల విశ్వాసం ఉంటే ఖచ్చితంగా గెలుపు మనదే అవుతుంది.కవి డాక్టర్ కె.జి.వేణు రచించిన విశ్వాసం గెలుపు కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారించండి.అలౌకిక అనుభూతుల లోకంలో విహరించండి. ”మైదానంలో పరుగు పందెం/మనిషికి కుక్కకు మధ్య పోటీ/ఇది ఒక ఉత్కంఠ భరితమైన పోటీని సూచిస్తుంది.మైదానం అంటే ఇక్కడ ప్రపంచాన్ని లేదా మనుషుల జీవిత రాటాలను సూచించవచ్చు.మనిషికి కుక్కకు మధ్య పోటీ.ఇది ఒక సరళమైన కవితా పంక్తి.ఇందులో మనిషి మరియు శునకం నైజం మధ్య గల తేడాను సులభంగా గుర్తించవచ్చు. ”శునకం సునాయాసంగా గెలిచింది/శునకం పోటీలో సులభంగా గెలవడం,దాని సహజమైన నైపుణ్యాన్ని, శక్తిని,ఏకాగ్రతను తెలుపుతుంది. ”కారణాన్ని వెతికితే దొరికింది/కుక్క విశ్వాసం మనిషిని జయిస్తూ../ఇది మనలో జిజ్ఞాసను కలిగిస్తుంది.ఎందుకు శునకం గెలిచింది?కుక్క విశ్వాసం మనిషిని జయించింది.ఇది అసలు సందేశాన్ని వెల్లడిస్తుంది.మనిషి ధీమాగా ఉన్నాడు. మనిషి తనలోని స్వార్థంతో,అహంకారంతో తాను ఎలాగైనా గెలుస్తాను అనే ఆలోచనలతో ముందుకు సాగుతున్నాడు.కుక్క మాత్రం తన లక్ష్యంపై గురి పెట్టింది.స్వార్ధం ఎరుగని కుక్క విశ్వాసంతో పరుగు తీసింది.కుక్క నిబద్ధత,అంకితభావం,దృఢమైన విశ్వాసంతో గెలిచింది.ఈ కవితా పంక్తులు మనిషి జీవితానికి విలువైన సందేశాన్ని అందిస్తాయి. విజయం కోసం శక్తి,బుద్ధి మాత్రమే కాకుండా విశ్వాసం,అంకితభావం మరియు నిజాయితీ అవసరం అని సూచిస్తుంది.మనిషికి తనలో సందేహాలు,భయాలు ఉంటాయి.కానీ,కుక్క తన లక్ష్యాన్ని మాత్రమే చూస్తుంది.అదే దాన్ని విజేతగా నిలబెడుతుంది.కవి వేణు విశ్వాసం గెలుపు కవిత ద్వారా లోతైన భావాన్ని అందించారు.

డాక్టర్ కె‌.జి.వేణు రచించిన ఆకాశానికి నైవేద్యం (మినీ కవిత) పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
“కోతికి బట్టలు తొడిగారు/చప్పట్లతో వీధిలో వినోదం/
అంటున్నారు.లోకంలోని మనుషుల తీరు గురించి చెబుతున్నారు.కోతికి బట్టలు వేయడం అవసరం లేదు.మనుషులమైన మనం బట్టలు వేసుకోవాలి. కోతికి బట్టలు వేసి వినోదంగా చూసే మనుషుల గురించి చెబుతున్నాడు.పాశ్చాత్య దేశాల సంస్కృతి ప్రభావం మన దేశంలోకి వ్యాపించింది.కోతికి బట్టలు తొడగడం,ఆడంబరాన్ని చాటుకోవడం,వ్యర్థ వినోదం అని సూచించవచ్చు.కోతికి బట్టలు వేసిన ఆనందంలో ప్రజలు చప్పట్లు కొడతారు.ఇది సమాజంలో ఉన్న విలాస వ్యామోహాన్ని తెలుపుతుంది.సమాజంలో నెలకొన్న అసలైన మౌలిక సమస్యలు పట్టించుకోకుండా కోతులకు బట్టలు వేసి ఆనందించే మానసిక స్థితిని తెలియజేస్తుంది.
“అక్కడ ఓ పిల్లాడు దీనంగా/ఒంటిమీద చొక్కా లేక ఏడాదిగా/వొంటిని ఆకాశానికి నైవేద్యంగా/ అంటున్నారు.కోతికి బట్టలు వేసి ఆనందిస్తున్న తీరును కవి ప్రశ్నిస్తున్నాడు.ఇదే సమాజంలో నివసిస్తున్న ఒక నిరుపేద బాలుడు నిరాశగా ఒంటిమీద చొక్కా లేక ఏడాది కాలం గడిచింది. పేదరికంతో ఆ నిరుపేద బాలుడు వేసుకోవడానికి బట్టలు లేని స్థితి కొనసాగుతుంది.ఆ బాలుడు కనీస అవసరాలైన చొక్కా లేకుండా గడపడం బాధను కలిగిస్తుంది. ‌. ”వొంటిని ఆకాశానికి నైవేద్యంగా/అంటున్నారు.ఈ దేశంలో వేసుకోవడానికి బట్టలు లేక ఆ బాలుడు తన శరీరాన్ని ఆకాశానికి నైవేద్యంగా అర్పించినట్లు తోస్తోంది.ఇది తీవ్రమైన పేదరికం,మనుషుల మధ్య వ్యత్యాసాన్ని హృదయ విదారకంగా చూపుతుంది. ఈ కవిత సమాజంలోని కొందరు పెద్ద మనుషుల విపరీత ప్రవర్తనను,ఆడంబరాన్ని ఘాటుగా విమర్శిస్తుంది.అలాగే నిరుపేదల దుస్థితి ఆవేదన కలిగిస్తుంది.ఒక వైపు కోతికి బట్టలు తొడిగేంత సంపద,వినోదం,మరోవైపు కనీస వస్త్రాలు లేని బాలుడు కనిపిస్తాడు.ఇది మన సామాజిక అసమానతలపై కవి పదునైన ప్రశ్నను సంధించారు. ఆకాశానికి నైవేద్యం అనే ఉపమానం లోతైన భావాన్ని వ్యక్తం చేస్తుంది.నైవేద్యం అంటే దేవుడికి సమర్పించే ప్రసాదం.ఒక వ్యక్తి బట్టలు లేక ఒంటి మీద ఏమీ లేకపోతే అతని శరీరం పూర్తిగా బయటికి కనిపిస్తుంది.ఆకాశానికి నైవేద్యం అనేది అతని బట్టలులేనితనాన్ని కవ్వించే విధంగా ఉపయోగించబడింది‌.ఒక వైపు ప్రజలు కోతికి బట్టలు వేస్తూ వినోదం చూస్తుంటే మరో వైపు ఆ బాలుడు తన దారిద్ర్యాన్ని అంగీకరించినట్లుగా, శరీరాన్ని ఆకాశానికి అర్పించినట్లుగా ఉంటాడు.ఇది సమాజంలో నెలకొన్న తీవ్రమైన అసమానతలను తెలియజేస్తుంది.మనిషికి భూమి,ఆకాశం,ప్రకృతి తప్ప మరో ఆశ్రయం లేకపోవడం,అతను వాటికి అర్పించబడి జీవించడం అనే భావన దాగి ఉంది. ఆకాశానికి నైవేద్యం అనేది పేదరికం,సమాజపు ద్వంద్వ ధోరణి,అసమానతలు,జీవన తాత్వికత ఇందులో అనేక కోణాలను కలిగి ఉంది.కవితలో ఇది ఒక వ్యంగ్య ప్రయోగంగా మనుషుల ఉదాసీనతపై ఒత్తిడి కలిగించే విధంగా ఉపయోగించబడింది.
డాక్టర్ కె.జి. వేణు రచించిన ఆ సంతకాలు ప్రమాదం మినీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
“భూమి,ఆకాశాల మీద/సామాన్యుడి హక్కుకు/ శ్వేత పత్రం రాసే సిరా చుక్క “ప్రశ్న”/అంటున్నారు. ఈ కవితా పంక్తులలో ప్రశ్న యొక్క శక్తిని మరియు సామాన్యుడి హక్కులకు అది కలిగించే ప్రాముఖ్యతను చక్కగా వివరించారు.శ్వేత పత్రం అనేది ఒక నివేదిక లేదా గైడ్.ఇది పాఠకులకు ఒక సమస్యను అర్థం చేసుకోవడానికి సమస్యను పరిష్కరించడానికి లేదా నిర్ణయం తీసుకోవడానికి సహాయపడటానికి ఉద్దేశించబడింది.ఇక్కడ భూమి,ఆకాశం,సమాజంలో ఉన్న సామాన్యుడికి చెందిన హక్కులను సూచిస్తాయి.సామాన్యుడికి స్వేచ్ఛ,సమానత్వం,న్యాయంలాంటి హక్కులు ఉన్నాయి అని బల్లగుద్ది చెబుతున్నారు.శ్వేత పత్రం రాసే సిరా చుక్క ప్రశ్న.ఇక్కడ ప్రశ్న ఒక సిరా చుక్కగా సూచించబడింది. ప్రశ్నించడం ద్వారానే నిజాలు వెలుగులోకి వస్తాయి.
“మేధావులు మాత్రం ప్రశ్నకు దూరంగా/చెదకు దగ్గరగా సంతకాలు చేస్తూ ../అంటున్నారు.సత్యాన్ని వెతకాల్సిన మేధావులు మాత్రం ప్రశ్నించకుండా మౌనం పాటిస్తున్నారు. చెదకు నాశనం చేసే గుణం ఉంటుంది.చెదను ఇక్కడ చెడిపోయే ప్రాతినిధ్యంగా ఉపయోగించారు.చెడుపై తిరుగుబాటు చేయాల్సిన మేధావులు అన్యాయాలు,అక్రమాలు,అవినీతికి అనుకూలంగా వ్యవహరిస్తూ నిశ్శబ్దంగా ఆమోద ముద్ర వేస్తున్నారు అని కవి సుతిమెత్తగా విమర్శించారు.సామాన్య ప్రజల హక్కులను రక్షించడంలో ప్రశ్నించాల్సిన అవసరాన్ని స్పష్టంగా తెలియజేస్తోంది.ప్రశ్నించే గుణం సామాన్యుడికి సత్యాన్ని తెలుసుకునే సాధనం.మేధావులు తమ బాధ్యతను వదిలేసి నిశ్శబ్దంగా అంగీకరిస్తున్నారని కవి వాపోతున్నారు. మేధావులు ప్రశ్నించకుంటే సమాజంలో అన్యాయం,అవినీతి, అక్రమాలు పెరిగిపోతాయి.ఆ సంతకాలు ప్రమాదం అనే కవితా శీర్షిక లోతైన అర్ధాన్ని కలిగి ఉంది.ఇది ముఖ్యంగా మేధావుల నిశ్శబ్ద అంగీకారాన్ని,వ్యతిరేకించాల్సిన దానికి మద్దతు ఇవ్వడాన్ని,తప్పు జరిగితే ప్రశ్నించకుండా ఉండటాన్ని సూచిస్తుంది.మేధావులు తమ ఆలోచనా శక్తిని ఉపయోగించి సమాజంలో జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించాల్సిన అవసరం ఉంది.అలాంటి మేధావులు ప్రశ్నించడం మానేసి తప్పును అంగీకరించే విధంగా సంతకాలు చేయడం ప్రమాదం.ఇది కేవలం సంతకానికే మాత్రం పరిమితం కాదు.కళ్ళ ముందు జరుగుతున్న అన్యాయాన్ని చూసి చూడనట్లుగా ఉండడం,అన్యాయం జరిగిందని తెలిసినా స్పందించక పోవడం,దానికి మౌనంగా ఉండటం,ఒక రకమైన ప్రమాదం కల్గించే సంతకమే.మేధావుల మౌనం అంగీకారం కిందికి వస్తుంది.అది న్యాయ పోరాటాన్ని నిలిపివేస్తుంది.చెద అనేది నాశనం చేస్తుంది.మేధావులు సత్యం పక్కన పెట్టి అన్యాయపు వ్యవస్థకు మద్దతుగా సంతకాలు చేయడం సమాజాన్ని ప్రమాదంలో పడేస్తుంది. తప్పును ప్రశ్నించకుండా ఉండటం,దానిని అంగీకరించడం అత్యంత ప్రమాదకరం.ఇది సమాజంలో ఉన్న అన్యాయాలను మరింత బలపరిచే అవకాశం ఉంది. అందుకే ఆ సంతకాలు ప్రమాదం అని చెప్పిన తీరు బాగుంది. మేధావులు ప్రశ్నించడం,ధైర్యంగా నిలబడటం అవసరం అనే బలమైన సందేశాన్ని కవి అందిస్తున్నారు.
డాక్టర్ కె.జి.వేణు రచించిన తెలిస్తే చెప్పండి మినీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
తెలిస్తే చెప్పండి (మినీ కవిత)
“ఆమె కోసం వెతుకుతున్నారు/చూస్తే,దేశం నిండా ఆమె బూడిదే/ఎవరు తగులబెట్టారో తెలియదు/ కన్నీళ్లతో వేడుకుంటున్నాను/తెలిస్తే చెప్పండి .. ఆమె పేరు ‘శాంతి’/ఈ కవిత భావోద్వేగభరితంగా హృదయాన్ని కదిలించేలా ఉంది.దీన్ని విభిన్న కోణాల్లో విశ్లేషించవచ్చు.వ్యక్తిగత వేదన,సామాజిక పరిస్థితులను ప్రతిబింబించే ఒక సామూహిక బాధ అని వ్యక్తం అవుతుంది.
“ఆమె కోసం వెతుకుతున్నాను/చూస్తే,దేశం నిండా ఆమె బూడిదే/అంటున్నారు.వ్యక్తిగతంగా తాను ఆమె కోసం వెతుకుతున్నట్లు చెబుతున్నారు.ఇది కోల్పోయిన ప్రియమైన వ్యక్తి కోసం వెతుకుతున్న వేదన కావచ్చు.సమాజంలో లేకుండా పోయిన ఒక విలువైన అంశాన్ని వెతుకుతున్నట్టుగా భావించ వచ్చు.ఇది ఒక వ్యక్తిగతమైన కోరికలా అనిపించి నప్పటికీ సమాజానికి సంబంధించిన సమస్య అని అర్థం అవుతుంది. చూస్తే దేశం నిండా ఆమె బూడిదే/ఇది చాలా శక్తివంతమైన భావ చిత్రం.ఇది గాఢమైన భావనను వ్యక్తం చేస్తుంది.ఇది నాశనాన్ని సూచిస్తుంది.దేశం నిండా అనే పద ప్రయోగం ఆమె మరణాల వ్యక్తిగత ఘటన మాత్రమే కాదు.ఇది సమాజాన్ని ప్రభావితం చేసే సంఘటన.దహనం చేయబడిన శరీరం బూడిదగా మారుతుంది. కవి బూడిదను రూపకంగా మరియు శాంతి నశించడాన్ని సూచించేందుకు వాడి ఉండవచ్చు.నాకు దేశమంతటా ఆమె బూడిద మాత్రమే కనిపిస్తుంది. ఈ కవితా పంక్తిలో ఆమెను ఎవరో తగులబెట్టారు. కానీ,అది వ్యక్తిగత హింస మాత్రమే కాదు.దేశం మొత్తానికి చెందిన విషాదం.బూడిద అంటే విధ్వంసానికి సంకేతం.ఇది యుద్ధం,అల్లర్లు, సామూహిక విధ్వంసాన్ని సూచించవచ్చు.
“”ఎవరు తగులబెట్టారో తెలియదు/అంటున్నారు.ఇది అత్యంత బాధాకరమైన విషయం.ఈ విధ్వంసాన్ని సృష్టించింది ఎవరో తెలియదు?ఇందుకు బాధ్యత ఎవరిది?ఇది సమాజంలో నెలకొన్న అనిశ్చితిని తెలియజేస్తుంది. బాధ్యులు ఎవరో తెలియకపోవడం వంటి పరిస్థితిని సూచిస్తుంది.ఎవరు ఆమెను నాశనం చేశారో తెలియదు?ఎవరు శాంతిని భగ్నం చేశారో తెలియదు?ఇది యుద్ధం,హింస,అశాంతికి సంకేతం కావచ్చు. నేరం చేసిన నేరస్తులు ఎవరో తెలియక పోవడం సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని బాధ్యతారాహిత్యాన్ని సూచిస్తుంది.
“కన్నీళ్లతో వేడుకుంటున్నాను/అంటున్నారు.కవి బాధలో మునిగిపోయి సహాయం చేయమని కోరుతున్నారు.దీనిలో ఒక బాధితుని ఆవేదన మాత్రమే కాక న్యాయం కోసం చేసే విజ్ఞాపన కూడా ఉంది.ఇది ఒక అభ్యర్థన,ఒక అశాంతి నడుమ మానవత కోసం చిత్తశుద్ధితో చేసిన ప్రార్థన.
తెలిస్తే చెప్పండి .. ఆమె పేరు ‘శాంతి’/అంటున్నారు. చివరకు కవి ఆమె పేరు శాంతి అని వెల్లడిస్తున్నారు. ఇది కవితలో అసలు మర్మం.కవి మానవ సమాజంలో శాంతి కోసం వెతుకుతున్నారు. కానీ, దాని స్థానంలో బూడిద మాత్రమే కనిపిస్తోంది.ఇది వ్యక్తిగత కోణాన్ని మించి సమాజంలోని నాశనమైన శాంతికి ప్రతీకగా మారుతోంది.ఇందులో శాంతి అంటే కేవలం ఒక వ్యక్తి మాత్రమే కాదు.దేశంలో కనుమరుగైన ప్రశాంతతను,హింసకు బలైన సామాజిక స్థితిని సున్నితంగా వ్యక్తీకరించారు.ఈ కవిత వ్యక్తిగతంగా ప్రారంభమైనా అంతకు మించిన సామాజిక సందేశాన్ని అందిస్తుంది.ఇందులో ఉన్న శాంతి అనే పేరు ద్వంద్వ అర్ధాన్ని కలిగి ఉంది. నిజంగా ఒక వ్యక్తి పేరు శాంతి అయి ఉండొచ్చు. ఇందులో శాంతిని ఒక రూపకంలా ఉపయోగించారు. ఇది యుద్ధం వల్ల జరిగిన విధ్వంసం,సమాజంలో శాంతి మాయం అవుతున్న దుస్థితిని సూచించే సామాజిక విమర్శగా కూడా భావించవచ్చు.కవి చివరి పంక్తిలో శాంతి పదాన్ని ఉపయోగించడం ద్వారా అందరికీ ఆలోచన కలిగించేలా చేశారు. ఇక్కడ శాంతి అనేది ఒక వ్యక్తి మాత్రమేనా?లేక ప్రపంచం కోల్పోయిన శాంతి అనే విలువా?ఈ కవిత పాఠకుల హృదయాన్ని కదిలించేలా ఆసక్తికరంగా సాగింది,ఇది వాస్తవిక సంఘటన,నష్టపోయిన శాంతి,హింస వలన కలిగిన బాధ, సమాజంలోని అనిశ్చితిని ప్రతిబింబిస్తుంది.ప్రజల సామాజిక చైతన్యానికి అద్దంపడుతుంది.సమాజంలో ప్రశాంతతను పునరుద్ధరించాలి అని కోరడం ఒక ఆవేదనగా భావించవచ్చు.
డాక్టర్ కె.జి.వేణు రచించిన వాయిదాలెందుకు?మినీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
“ఆడతనం గడప దాటితే చాలు/వేధిస్తూ మానభంగం ఉరి త్రాళ్ళు/అంటున్నారు.మహిళ ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టడాన్ని గడప దాటడం అంటారు.సమాజంలో ఇప్పటికీ మహిళలు ఇంటి నుంచి బయటకు రావాలంటే భయపడుతున్నారు.మహిళలు ఇంటి నుంచి బయటకు వస్తే పోకిరీలు వేధింపులకు, మానభంగానికి పాల్పడుతున్నారు.దుర్మార్గుల అఘాయిత్యాలకు గురి అయిన స్త్రీలు అవమానం భరించలేక అర్ధాంతరంగా తమ ప్రాణాలను తీసుకుంటున్నారు. ఈ కవితా పంక్తులు మహిళలపై జరుగుతున్న వేధింపులను,అత్యాచారాలను సూచిస్తున్నాయి.సమాజంలో మహిళలు ఎక్కడ ఏ స్థాయిలో ఉన్నా లైంగిక వేధింపులు ఒక పెద్ద సమస్యగా మారింది.
“కామం ఈ దేశంలో నదులై ప్రవహిస్తోంది/ సమాజంలో అనైతికత హద్దులు మీరిపోయింది. మానవ సంబంధాల్లో విలువలు తగ్గిపోతున్నాయి. దుర్మార్గులు కామదాహంతో మానవతా విలువలను మంటగల్పుతున్న పరిస్థితి ఈ దేశంలో నదిలా విస్తరించింది అని కవి ఆవేదనతో వాపోతున్నారు.
“అరాచకానికి అడుగడుగునా గొడుగులు/ అన్యాయానికి,అసాంఘిక చర్యలకు సహకరిస్తున్న పరిస్థితిని సూచిస్తుంది.దోషులను రక్షించే విధానాలు,న్యాయస్థానంలో శిక్షలు ఆలస్యం అవటంలాంటి సంఘటనలు అరాచకానికి బలాన్ని అందిస్తున్నాయి.
“దుష్ట సంహారానికి అన్ని వాయిదాలే/నేరస్తులకు తగిన శిక్ష పడకుండా న్యాయవ్యవస్థలో జాప్యం జరుగుతుండడం వల్ల దుష్టులను శిక్షించడం ఆలస్యం అవుతుంది.మన సమాజంలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు,లైంగిక వేధింపులకు చరమగీతం పాడాలి.అత్యాచారాలు చేస్తున్న నేరస్తులకు శిక్షలు ఆలస్యం కావడం బాధను కలిగిస్తుంది.దుర్మార్గుల విశృంఖల చేష్టలకు అడ్డుకట్ట వేయాలి.సమాజంలో మార్పు రావాలి.ఈ దేశంలో మహిళలకు రక్షణ కల్పించాలి.సత్వర న్యాయానికి పునాది వేయాలి.మహిళలను వేధించిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలి.అప్పుడే సమాజ ఉన్నతికి వీలు కలుగుతుంది.ఈ కవిత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రతిబింబిస్తుంది.
డాక్టర్ కె.జి.వేణు రచించిన కొత్త గీతాలు పాడండి కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
“అత్యాచారం అబలమీద కాదు/నేరుగా ఈ దేశానికే జరిగింది/అంటున్నారు.ఈ కవితా పంక్తి అత్యంత ప్రభావశీలమైనది.సాధారణంగా,లైంగిక దాడి బాధితురాలిని మాత్రమే ప్రభావితం చేస్తుంది అని భావిస్తారు.కానీ,కవిత ఇక్కడ విస్తృత భావనను ప్రతిపాదిస్తోంది.అత్యాచారానికి గురి అయిన బాధితురాలి వ్యక్తిగత నష్టం మాత్రమే కాదు.ఇది దేశానికి జరిగిన అవమానం.ఒక మహిళపై జరిగిన దాడి అంటే సమాజం తన విలువలను కోల్పోయింది అని తెలిపే సంకేతంగా కనిపిస్తోంది.
“ప్రతి వొంటి మీద ఆ రక్తపు మరకలే/ఇది తీవ్రమైన వాస్తవాన్ని వెల్లడించే కవితా పంక్తి.అబల మీద జరిగిన లైంగిక హింసను సమాజం ఏకపక్షంగా చూసి బాధితురాలిని ఒంటరిగా విడిచిపెట్టడం సాధారణం. కానీ,కవి ప్రతి ఒక్కరి మీద ఈ నేరం తాలూకు మచ్చ ఉందని అంటున్నారు.ఇలాంటి లైంగిక దాడి సంఘటనలు జరగడానికి సమాజమే బాధ్యత వహించాలి.
“సారే జహాసే అచ్చా … అబద్ధమది/అంటున్నారు.
ఇది భారతదేశానికి సంబంధించిన దేశభక్తి గీతం.
కవి సారే జహాసే అచ్చాని వ్యంగ్యంగా ఉపయోగించారు.ఇది ఎలాంటి ప్రజాస్వామ్యం?ఇది ఎలాంటి న్యాయం?అనే ప్రశ్న లేవనెత్తుతుంది.ఈ దేశం గొప్పది అని చెప్పుకోవడమే కాదు.ఈ దేశంలోని మహిళలకు రక్షణ కల్పించగలిగితేనే అది నిజమైన గొప్పతనంగా భావించ వచ్చు.
“వనిత కన్నీళ్ళతో కొత్త గీతాలు పాడండి/ అంటున్నారు.కవి ఇది ప్రజలకు చేసిన విజ్ఞప్తిగా అనిపిస్తోంది.మహిళల బాధను అర్థం చేసుకొని,ఒక కొత్త సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది అని సూచిస్తుంది.ఈ కవిత కన్నీళ్లను కేవలం దుఃఖానికి ప్రతీకగా చూపించకుండా,చైతన్యానికి కొత్త మార్గాన్ని సూచించే ప్రక్రియగా అభివర్ణిస్తోంది.మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను కేవలం వ్యక్తిగత సమస్యగా కాకుండా దేశాన్ని ప్రజాస్వామ్యాన్ని అవమానించే దుర్ఘటనలుగా అర్థం చేసుకోవాలి అని కవి స్పష్టం చేస్తున్నారు.మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు,దారుణ దురంతాలకు సమాజం బాధ్యత వహించాలి.అప్పుడే మనం నిజమైన అభివృద్ధిని సాధించగలం అనే ధ్వని ఇందులో వినిపిస్తుంది.ఈ కవిత సామాజిక చైతన్యాన్ని ప్రభావితం చేసే శక్తివంతమైన సందేశాన్ని కలిగి ఉంది.ఇది మహిళలపై జరిగే అత్యాచారాలను వ్యక్తిగత సమస్యగా కాకుండా సమాజానికి,దేశానికి జరిగిన అవమానంగా చూపిస్తుంది.
డాక్టర్ కె.జి.వేణు రచించిన అంగట్లో ఊపిరాడక మినీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
“బిగించిన సీసాల్లో ఊపిరాడక/నీరు రుచిని కోల్పోతుంది/అంటున్నారు.ఇక్కడ నీరు స్వభావసిద్ధమైన స్వేచ్ఛను సూచిస్తుంది.బిగించిన సీసాలో నీరు బంధనాన్ని సూచిస్తుంది.నీటిని ఒక బాటిల్ లో నిల్వ చేస్తే అది కాలక్రమేణా తన సహజ స్వభావాన్ని కోల్పోతుంది.ఒక వ్యక్తిని లేదా సమాజాన్ని నియంత్రించినప్పుడు వారి స్వేచ్ఛ క్రమంగా తగ్గిపోతుంది.
“తాను సరుకై అంగట్లో చేరాక/మనిషి దాహం తీర్చే గుణాన్ని/ ధరల వురికి వ్రేలాడదీస్తూ../ అంటున్నారు.మనిషి దాహం తీర్చే నీరు ఒక వస్తువుగా మారి అంగడికి చేరిన తర్వాత దాని విలువను ధరతో కొలుస్తారు.ఇది మనుషుల జీవితాన్ని ప్రతిబింబించే విధంగా ఉంది.స్వేచ్ఛగా జీవించే మనిషి సమాజపు ఆంక్షల వల్ల ఒక వస్తువుగా మారిపోతాడు.ఇక్కడ ఆ వ్యక్తిని విలువలు నిర్ణయిస్తాయి.కానీ,మనిషి తన అసలు స్వభావాన్ని పట్టించుకోడు.ఈ కవితలో స్వేచ్ఛా బంధనాలు,మార్కెట్ మరియు విలువల గురించి లోతైన సందేశాన్ని అందిస్తుంది.మనిషి స్వేచ్ఛను కోల్పోయి ఒక వస్తువుగా మారిపోయినప్పుడు అతని అసలు విలువ కేవలం ధనంతో మాత్రమే కొలువబడుతుంది.ఈ కవితా పంక్తులలో లోతైన
అంతరార్థం దాగి ఉంది.కవి సమాజంలోని వాస్తవికతను ఎత్తిచూపుతున్నారు.
డాక్టర్ కె.జి.వేణు రచించిన మట్టిగా మారిపోతూ .. మినీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
“వర్షంలో అతడు తడుస్తూ ../నేలకొరిగిన వృక్షాల గాయాలకు/ లేపనాలతో చికిత్స చేస్తున్నాడు/ అంటున్నారు.వర్షంలో తడవడం అనేది అతని జీవితంలోని కష్టాలను,అవాంతరాలను సూచిస్తుంది.వర్షంలో తడుస్తూ ఉండడం అనే పదం శారీరక,మానసిక బాధలను తెలియజేస్తుంది.ప్రకృతి విపత్తుల వల్ల నేల కూలిన వృక్షాల గాయాలకు చికిత్స చేస్తున్నాడు.అది ఒక metaphor రూపకంగా కనిపిస్తుంది.ఇది మానవతా విలువల పునరుద్ధరణ తత్వాన్ని ప్రతిబింబిస్తుంది.
“రేపటి నీడకు అండగా తాను/భవిష్యత్తు తరాలకు తాను చెట్ల వలె ఆధారంగా ఉండాలి అనే భావాన్ని తెలుపుతుంది.చెట్లు నీడను ఇస్తాయి.పండ్లను ఇస్తాయి.అలాగే తాను కూడా భవిష్యత్తులో ప్రయోజనకరమైన పనులు చేయాలి అనే భావన వ్యక్తం అవుతుంది.
“మనిషిగా కాదు మట్టిగా మారిపోతూ../ అంటున్నారు.ఇది చాలా శక్తివంతమైన ఉపమానం. అతడు వ్యక్తిగతమైన లాభాలను ఆశించకుండా మట్టిగా మారిపోతాను అనే సందేశం ఉంది.నేల, భూమిని మట్టి అంటారు.భూమి పరిపూర్ణమైన త్యాగానికి ప్రతీక.ఈ కవితలో మనిషి త్యాగాన్ని ప్రకృతిలో అతడి మమేకతను భవిష్యత్తు తరాలకు సహాయపడే విధంగా జీవించాలి అనే గొప్ప భావం వ్యక్తం చేశారు.తాను ఒక వ్యక్తిగా కాకుండా భూమిగా ప్రకృతిగా మారి సమాజానికి ఉపయోగపడాలని భావిస్తున్నాడు.
డాక్టర్ కె.జి.వేణు రచించిన త్యాగాల మేఘాలు మినీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
“వర్షం కురుస్తోంది సువాసనతో/వెంటనే బకెట్లో నింపుకున్నాను/అంటున్నారు.వర్షానికి ఒక ప్రత్యేకమైన వాసన ఉంటుంది. ముఖ్యంగా భూమిపై వర్షం పడినప్పుడు వచ్చే మట్టి వాసన మనసుకు హాయి గొల్పుతుంది.కవి ఈ వర్షాన్ని కేవలం ఒక సాధారణ ప్రకృతి సంఘటనగా కాకుండా ఆహ్లాదకరమైన అనుభూతిగా భావిస్తున్నారు. వెంటనే బకెట్లో నింపుకున్నాను అనే భావన కవి భౌతికంగా ఆ వర్ష జలాలను బకెట్లోకి సేకరించారు అని చెప్పవచ్చు.భావ ప్రపంచంతో చూస్తే కవి ఈ అనుభూతిని తమ హృదయంలో నింపుకున్నట్టుగా భావించవచ్చు.
“తొంగి చూస్తే ఆ నీటి నిండా/త్యాగాలతో మేఘాల శరీరాలు/ అంటున్నారు.వర్షపు నీటిని పరిశీలిస్తే,అది కేవలం నీరు మాత్రమే కాకుండా మరేదో లోతైన అర్థాన్ని సూచిస్తున్నట్లు కవి భావన దాగి ఉంది. త్యాగాల మేఘాల శరీరాలు అంటే మేఘాలు తమ శరీరాన్ని త్యాగం చేసి భూమికి జీవం పోస్తాయి.ఇది త్యాగ భావనకు ప్రతీకగా నిలుస్తుంది.ప్రకృతి త్యాగశీలి.అది తనలో ఉన్నదంతా పరోపకారం కోసం మాత్రమే వినియోగిస్తుంది.
“కృతజ్ఞతగా నేను హారతిస్తూ ../అంటున్నారు.
కవి తాను ప్రకృతి మాత సేవలకు కృతజ్ఞతాపూర్వకంగా హారతి అందిస్తున్నట్లు భావిస్తున్నాడు.వర్షం వల్ల కలిగిన ఆనందానికి పులకించిపోయినాడు.అందుకు ప్రతిఫలంగా ప్రకృతి మహత్యానికి భక్తితో నమస్కారిస్తున్నాడు.తాను తన్మయత్వంతో ప్రకృతిని వీక్షిస్తున్నట్లు తెలుస్తోంది.ఈ కవితా పంక్తులలో వర్షాన్ని కేవలం ఒక సహజ సిద్ధమైన ప్రకృతి సంఘటనగా కాకుండా తనలో కలిగిన అనుభూతిని,త్యాగానికి ప్రతీకగా మేఘాల గొప్పతనంగా భావిస్తున్నాడు.కవి ప్రకృతికి కృతజ్ఞతను వ్యక్తం చేయడం అద్భుతంగా ఉంది.ఇది ప్రకృతిని మరియు మానవ జీవన తత్వాన్ని లోతుగా అర్థం చేసుకునే మనస్తత్వాన్ని ప్రతిబింబించే ఒక అందమైన భావ వ్యక్తీకరణ.ఈ కవిత పాఠకులను ఆలోచింపజేస్తుంది.ఇందులోని ప్రతి పంక్తి లోతైన భావాన్ని కలిగి ఉంది.
డాక్టర్ కె.జి.వేణు రచించిన పచ్చదనం కోసం శ్వాస మినీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ఈ కవిత పచ్చదనం కోసం శ్వాస పర్యావరణ పరిరక్షణకు తోడ్పాటును అందిస్తుంది.ప్రకృతిలో భాగమైన చెట్లు అందించే ఆక్సిజన్ ద్వారానే మనం శ్వాస తీసుకోవడం,జీవించడం జరుగుతున్నది.చెట్లు మన మనుగడకు చాలా అవసరం అన్న భావనను తెలియజేస్తుంది.పచ్చదనం కోసం విరివిగా చెట్లు నాటాలి.అట్టి చెట్లను పరిరక్షించడం ద్వారా పచ్చదనాన్ని పెంచుకోవచ్చు.ప్రకృతి మన జీవనాధారం.మనం తీసుకునే ఆక్సిజన్ కు చెట్లే మూలాలు.వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి చెట్ల పెంపకం ఎంతో అవసరం.నీటి కాలుష్యాన్ని నివారించాలి.మట్టి నాశనాన్ని తగ్గించాలి.రోజుకు కనీసం ఒక మొక్క నాటాలి,నీటి వృథాను తగ్గించాలి.పర్యావరణానికి హాని కలిగించని ఉత్పత్తులను వినియోగించాలి.సామాజికంగా పచ్చదనం పెంపొందించే కార్యక్రమాల్లో పాల్గొనాలి.మన శ్వాస ప్రకృతి కోసం ప్రకృతి మన శ్వాస కోసం మాత్రమే అనేది ప్రగతిశీలతను చాటుతుంది.
“గతాన్ని తానెప్పుడు తవ్వుకోడు/ఆ సమాధుల నిండా కళేబరాలే/కొత్త మొక్కల కోసం శ్వాసిస్తాడు/ మట్టి కణాల గర్భసంచుల్లోకి/తానే ఒక పచ్చదనంగా ప్రవేశిస్తూ../ అంటున్నారు.ఈ కవితా పంక్తులలో గతాన్ని తిరిగి చూడలేని వ్యక్తిగా చిత్రీకరించారు.ప్రతి పంక్తిలో కవి తాత్వికతను,ప్రకృతి తత్వాన్ని జీవితంపై తన దృక్పథాన్ని వ్యక్తపరుస్తున్నాడు.
కవి ఇక్కడ మనిషి గతాన్ని ఎప్పుడు తిరిగి చూడకుండా ఆలోచించకుండా ముందుకు సాగాలి అనే భావనను వ్యక్తం చేస్తున్నాడు.ఎప్పుడో గతంలో జరిగిన విషయాల గురించి చింతిస్తూ కాలాన్ని వ్యర్థం చేసుకోకూడదు అనే సందేశం ఇక్కడ కనిపిస్తుంది.
ఇక్కడ సమాధులు అనే ప్రతీక ద్వారా మృతుల ప్రపంచాన్ని సూచిస్తున్నారు.సమాధుల్లో నిండి పోయిన కళేబరాలు అంటే మట్టిలో కలిసిన అస్తిపంజరాలు మాత్రమే కాదు.మనిషి జీవితంలోని గతకాలపు అనుభవాలు,దుఃఖాలు,బాధలు, మరణించిన వ్యక్తుల ఆశలు,ఆశయాలు అని అర్థం అవుతుంది.మనం గతంలో ఉండి,గతాన్ని గుర్తు చేసుకుంటే మన ఆశలు చనిపోయిన చోటే పాతి పెట్టబడి ఉన్నాయని అర్థం.
కొత్త మొక్కల కోసం శ్వాసిస్తాడు అని చెప్పడం.ఇది ఒక సానుకూలభావాన్ని సూచిస్తుంది.కొత్త జీవితాన్ని స్వాగతించడానికి కొత్త అవకాశాల కోసం ఎదురు చూడటానికి కవి మానవుడిని ప్రేరేపిస్తున్నాడు. భవిష్యత్తు పట్ల ఆశావహ దృక్పథాన్ని కనబరుస్తున్నాడు.కవి ఇక్కడ ప్రకృతితో జీవన సంబంధాన్ని చూపించారు.కొత్త జీవితానికి అవసరమైన విత్తనాలను చేర్చుకోవడం.ఇది పుడమి తత్వాన్ని ప్రతిబింబిస్తోంది.
ఇక్కడ కవి మనిషి తాను పచ్చదనంగా మారి పోవాలని చెబుతున్నాడు.పచ్చదనం అంటే కొత్త ఆశలు,కొత్త ఆలోచనల దిశగా అడుగులు వేయడం. తన జీవితంలో అభివృద్ధి కొరకు ఒక వ్యక్తి గతాన్ని వదిలేసి భవిష్యత్తులోని ఆశతో ముందుకు సాగాలి అని సూచిస్తున్నారు.మనిషి జీవితంలోని సానుకూలమైన మార్పులకై,భవిష్యత్తుపై దృష్టిని సారించాలని ఈ కవితా పంక్తులు తెలియ జేస్తున్నాయి.మనిషి గతాన్ని తవ్వుకోవడం మాని భవిష్యత్తు కోసం కొత్త విత్తనాలు నాటాలి.మనిషి కొత్త ఆశలతో జీవించాలి అనే సందేశాన్ని ఈ కవితా పంక్తులు అందిస్తున్నాయి.
డాక్టర్ కె.జి. వేణు తేది 01 – 05 – 1954 రోజున ప్రొద్దుటూరు గ్రామం,కడప జిల్లాలో జన్మించారు.వీరి తల్లిదండ్రులు కుళాయమ్మ,గంగన్న.వీరు 1 వ తరగతి నుండి డిగ్రీ వరకు ప్రొద్దుటూరు పట్టణంలో చదివారు.వీరు పి.జి. విద్యను ఎం.ఎస్సీ.(కెమిస్ట్రీ) శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ,అనంతపూర్ లో చదివారు.వీరు ఎం.ఫిల్. మరియు Ph.D. డిగ్రీలను, ఆంధ్రా యూనివర్సిటీ,వైజాగ్ నుండి పొందారు.వీరు 17 జనవరి,1979 రోజున శ్రీకాకుళం,ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్రం ఉపన్యాసకునిగా నియమించబడ్డారు.వీరు 2012 లో రిటైర్ అయ్యారు.వీరు 2012 నుండి 2016 వరకు ప్రొఫెసర్,హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ (బేసిక్ సైన్సెస్) సాంకేతిక విద్యా పరిషత్ ఇంజనీరింగ్ కళాశాలలో బాధ్యతలు నిర్వహించారు.వీరు కవి,వ్యాఖ్యాత, నటుడు,దర్శకుడు,న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.వీరు 2008 నుండి విశాఖ కళాభారతి నాటక పరిషత్ చీఫ్ కన్వీనర్ గా కొనసాగుతున్నారు.వీరు 35 కథలు,53 కవితలు,48 సాహిత్య వ్యాసాలు,12 విమర్శ వ్యాసాలు,320 మినీ కవితలు రాశారు.అవి వివిధ దిన,వార,మాస పత్రికలలో ప్రచురింపబడినవి.
కవి కె.జి. వేణు ప్రచురించిన పుస్తకాల వివరాలు :
1) ఈ తీర్పుకి బదులేది (నాటిక)
2) రక్తాభిషేకం (నాటిక)
3) మహా మంత్రుల పుష్పం ( నాటకం)
4) ఆనంద తాండవం (కథల సంపుటి).
వీరు రచించిన ఆనందతాండవం,గురుబ్రహ్మ నాటకాలకు కువైట్ వారి ఉత్తమ రచన బహుమతులను అందుకున్నారు.
వీరు రచించిన పుష్పవిలాపం నాటకానికి జాతీయస్థాయిలో ఉత్తమ రచన బహుమతి అందుకోవడం జరిగింది.వీరు రచించిన ఈ బిడ్డ నాకు కావాలి కథకు అమెరికా ఆటా వారి బహుమతి లభించింది.వీరు రచించిన 20 కవితలకు,18 కథలకు,10 వ్యాసాలకు బహుమతులు అందుకోవడం జరిగింది.వీరు ఉత్తమ నటుడిగా 24 సార్లు బహుమతి అందుకున్నారు. వీరు ఉత్తమ దర్శకుడిగా 5 సార్లు బహుమతి అందుకున్నారు. వీరు ఉత్తమ నాటక రచయితగా 12సార్లు బహుమతి అందుకున్నారు.వీరు వివిధ పత్రికలకు వ్యాసాలు,కథలు,కవితలు,సమీక్షలు, సాహిత్య విమర్శ వ్యాసాలు రాస్తున్నారు.
కవి కె.జి.వేణు స్వీకరించిన అవార్డుల వివరాలు :
1) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ అధ్యాపక అవార్డు.2) కళా తపస్వి అవార్డు,3) విశిష్ట మూర్తి అవార్డు,4) ఆంధ్ర రత్న అవార్డు,5) కువైట్ తెలుగు సంఘం అవార్డు,6) జీవిత సాఫల్య పురస్కారం, 7)రావూజీ అవార్డు,8) సురభి పనారస గోవిందరావు అవార్డు,9) విశాఖ రత్న అవార్డు,10)సి.పి. బ్రౌన్ బెంగుళూరు అవార్డు,11) నవ సాహితి ఇంటర్ నేషనల్ ఆర్గనైజేషన్,చెన్నై వారిచే ఉత్తమ సాహిత్య విమర్శకుడు అవార్డు (2023),12)రాయపూర్ ఆంధ్రా అసోసియేషన్ వారిచే ‘సాహిత్య ప్రపూర్ణ’ పురస్కారాన్ని 18 – 08 – 2024 రోజున స్వీకరించారు.13)నవ సాహితీ ఇంటర్ నేషనల్ ఆర్గనైజేషన్ చెన్నై వారిచే ఉత్తమ కవిత్వానికి గురజాడ అవార్డు (2024).14) ఆనందతాండవం కథా సంపుటికి 2025 గిడుగు రామమూర్తి జాతీయ పురస్కారం అందుకున్నారు.
కవి కె.జి.వేణు అందుకున్న సన్మానాలు :
వీరు ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు మరియు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సి.నారాయణరెడ్డి గారు మొదలైన మహామహుల చేత 178 సన్మానాలు అందుకోవడం జరిగింది.
కవి కె.జి.వేణు విదేశీ ప్రయాణాల వివరాలు :
1)వీరు PhD work కోసం 1997లో కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక విజ్ఞాన నౌక సాగర కన్యలో విదేశీ శాస్త్రవేత్తలతో కలిసి మన దేశ శాస్త్రవేత్తల బృందంలో ఒకడిగా మూడు నెలల పాటు సింగపూర్,మలేషియా,శ్రీలంక,మాల్దీవులలో సముద్ర జలాల్లో పర్యటన చేశారు.
2) వీరు 2019లో 3 నెలల పాటు యూరప్ దేశాలు, జర్మనీ, బెల్జియం,నెదర్లాండ్స్,లగ్జమ్ బర్గ్, స్విట్జర్లాండ్,ఫ్రాన్స్ సందర్శన చేయడం జరిగింది.

March 16, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మా కుంభమేళా యాత్ర  రెండో భాగం

by Vijaya Kandala January 31, 2025
written by Vijaya Kandala

 ప్రస్తుతం  ఏ న్యూస్ పేపర్ చూసిన  , వార్తా చానల్ చూసిన  ,యూట్యూబ్ ఛానల్ చూసిన కుంభమేళా _నాగ సాధువులు _అఖారాలు ర ప్రముఖుల సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు , పిండ ప్రదానాలు , ఆధ్యాత్మిక వాతావరణం మన నలువైపులా  ఆవరించింది .  ఈ సమయంలో ప్రయాగరాజ్ _ హరిద్వార్ _ఉజ్జయిని _ నాసిక్ ప్రాంతాల నదుల్లోకి  అపరిమితమైన పాజిటివ్ ఎనర్జీ వచ్చి చేరుతుంది అని మన పెద్దలు చెప్పారు .  ఆ హరిద్వార్లో పుణ్యస్నానాలు చేయడానికి మేము ఆరుగురం కలిసి  హైదరాబాదులో బయలుదేరి మరునాటి సాయంకాలం హరిద్వార్ చేరుకున్నాం .

ఢిల్లీ రైల్వే స్టేషన్ లోనే  కొంచెం ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చి  ,పక్కగా ఉన్న హల్దీ రామ్ వాళ్ళ హోటల్ గమనించి , టిఫిన్ చేయడానికి వెళ్ళాం . స్టేషన్లో లోపల తినలేము అనుకునే వాళ్లకు , నచ్చిన రుచులు కావాలి అనుకునే వాళ్లకు ఇది ఒక మంచి అవకాశం  . టిఫెన్స్ చాలా రుచిగా ఉండినాయి  . చాలా వేగంగా సర్వీస్ ఉంటుంది  .ఎన్నో   రకాలు  మనకు  దొరుకుతాయి  .బాగా రష్ గా కూడా ఉండింది  .టిఫిన్ చేసి కాసేపు సేద తీరి హరిద్వార్ బయలుదేరం.  ఢిల్లీలో చలి ఉంటుందని తెలుసు అయితే అంతకంటే ఎక్కువగా హరిద్వార్లో ఉండింది .  హోటల్లో దిగి ,లగేజ్  పెట్టేసి సాయంత్రం చుట్టుపక్కల తిరిగాము  .

తెల్లవారి  ప్రొద్దున్నే హ రి కి పౌరీ చేరి  అక్కడే స్నానాలు చేశాము . గంగమ్మకు భక్తితో నమస్కరించుకొని  ,నీళ్లలో దిగి పసుపు, కుంకుమ  రాగి నాణ్యాలు వేసి  నమస్కారం చేసుకొని స్నానాలు చేశాము . దగ్గర్లోనే బట్టలు మార్చుకోవడానికి తాత్కాలిక గదులు కూడా ఏర్పాటు చేశారు .

మరో ముఖ్య విషయం   నీటి వేగానికి తట్టుకుని   స్నానం చేయడానికి వీలుగా ఇనుప  గొలుసులు కూడా ఉన్నాయి . చాలామంది  ఒక చేత్తో గొలుసు పట్టుకుని ఇంకో చేత నీళ్లలో మునిగి లేచి స్నానా లు  చేశారు .

స్నానాఘట్టాల వద్ద  రద్దీగా ఉన్నా  చుట్టుపక్కల చాలా శుభ్రంగా ఉంది  .చెత్తాచెదారం  వెంబడి వెంబడే శుభ్రం చేస్తూ వచ్చారు  .పూజా ద్రవ్యాలు అమ్మే షాపులు , రంగురంగుల పూసలు  ,హారాలు  , అలంకరణ సామాగ్రి   ,శివలింగాలు , రుద్రాక్షలు కొనాలనుకుంటే ఎన్ని ఉన్నాయో చెప్పలేను .  కనులవిందు చేసేవి మరి ఇంకెన్నో . మా హోటల్ నదీ తీరానికి  చాలా దగ్గరలోనే ఉండింది . అందువల్ల మళ్లీ  హోటల్ కు  వచ్చి మానసా దేవి మందిరానికి బయలుదేరాం  . ఆ వెళ్లే దారిలో అన్ని ధర్మశాలలే .అవన్నీ  ఎంతో ప్రాచీనమైనవి . కనీసం 50 , 60 ఏళ్ల క్రితం  కట్టిన వాటిలాగా అనిపించేయి .  ధర్మశాలలు అన్నీ కూడా  చాలా పాతవి చక్కటి చెక్క పనితనం కనిపించిండి వాటిలో  . బాల్కనీలు అవి చూస్తే ఎంత ఆనందంగా ఉండిందో చెప్పలేను మన పూర్వుల భక్తి శ్రద్ధ  నైపుణ్యం చూస్తేఆశ్చర్యం తో బాటు ఆనందం  కూడా వేసింది .

మానసా దేవి మందిరం ఎంట్రన్స్ మా హోటల్ కి బాగా దగ్గర  అక్కడ  కొండ మీద  గుడి ఉంది . అలాగే మూడు కొండల మీద మూడు దేవాలయాలు ఉన్నాయి . ఒకటి మానసా దేవి మందిరం , రెండవది చండీ దేవి మందిరం . మూడవది అంజనమాత మందిరం . అలా మూడు ఉన్నాయి వీటిని రోప్ వి ల  పై చూడడం అపురూపమైన అనుభవం .  ఆంజనేయుల గుళ్ళు అనేకం కానీ ఆ తల్లి గుడి ఇక్కడే కనిపించింది . బహుశా నేనే ఇక్కడ మొదటిసారి గమనించి ఉంటాను . ధ్యానం చేసుకోవడానికి ఆ వాతావరణం అనుకూలంగా ఉండింది . ఐదు నిమిషాలు కళ్ళు మూసుకున్న చాలు గొప్ప ప్రశాంతత మన సొంతం   .మానసా దేవి మందిరం , చండీ మందిరం కొద్దిగా కో లాహలంగా ఉంటే ఇక్కడ ఒక అలోకి క వాతావరణం  ,నిశ్శబ్ద సంగీతం నాకు అనుభవంలోకి వఛాయి .

 మూడు చూసుకొని  మళ్లీ బయలుదేరి మా బసకు  దగ్గరలో ఉన్న హోటల్లో భోజనం చేసి కాస్త రెస్ట్ తీసుకుని , గంగాహారతిని చూడడానికి వెళ్ళాము  .ఎంత బాగుందో ఎదురుగా గంగమ్మ గంగకి ఎదురుగా వరుసగా మెట్ల మీద అశేష ప్రజానీకం చక్కటి భజనలు , సామూహిక జయ జయ డ్వానాలూ  కొత్త లోకంలోకి ప్రవేశించినట్లు అనిపించింది  .అందరూ కలిసి మనకు  జీవన ప్రదాతలైన జలసిరులకు మనసా వాచా కర్మణా నమస్కారం చేసే అద్భుత దృశ్యం అక్కడ చూసాం .  ఎందుకంటే మన జీవన విధానం వికసించిందినదీతీరాల్లోనే  . భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినట్లు గంగ భారతీయ ఆత్మ .

ఎంతో తృప్తితో బయటికి వచ్చి మా హొటెలకు బయలు దేరాము.

దారిలో వెచ్చదనాన్ని ఇచ్చే అనేక సాధనాలు  చూసాం. వేడి వేడి సమోసాలు  ,కచోరీలు , పూరీల అమ్మకాలు మరోపక్క  స్వెటర్లు బ్లాంకెట్లు స్కార్ఫ్లు బ్లౌజులు సాక్సులు ఇంకోపక్క డ్రై ఫ్రూట్ షాప్స్ అంతేనా . అంతేకాదు సుమ ఇంకా…

ఖరీదైన రాళ్లు  ,శంఖాలు , రుద్రాక్షలు , స్పటిక రస లింగాలు భగవంతుని పూజకు కావలసినటువంటి అనేకమైన సామాగ్రి  కోరినవన్నీ ఒకే చోట దొరికే కన్జ్యూమర్స్ పారడైజ్ అని చెప్పవచ్చు . ప్రతివారికి అవసరమైన వస్తువు అందుబాటు ధరలో దొరకడం ఇక్కడ ప్రత్యేకత  .షాపులుకూడా బాగా పొద్దెక్కాక తెరుస్తారు . రాత్రి పొద్దు పోయే వరకు పెద్ద పెద్ద బాణలిలో వేడివేడిగా వేగుతున్న సమోసా , రగడ , కచోరీ , గులాబ్ జాములురారమ్మని  అని పిలుస్తూ ఉంటాయి. రోడ్డు మీద నడుస్తూ ఉంటే  దాని నుంచి తప్పించుకోవడం కష్టమే  .ఆ చలికి ఈ వేడివేడి ఆహారం సరి అయిన జవాబు అనిపిస్తుంది చాలాసార్లు  .వాళ్ళు ఎంతో మర్యాదగా మనల్ని ఆహ్వానిస్తారు . షాపులోకి రమ్మని చెప్పే విధానం  బలే బలే నచ్చుతుంది .

రాత్రంతా అలా విహరించి లాడ్జికి చేరి అలసి సొలసి నిద్రపోయాం . తెల్లవారి పొద్దున్నే ఋషికేశ్ బయలుదేరామ్ . హరిద్వార్ పదహారేళ్ల పడుచు పిల్లలాగా చెంగుచెంగున గంతు లేస్తుంటే , అనుభవాల మంద గమనంతో భారంగా నడుస్తున్న మధ్య వయసు స్త్రీ లా కనిపిస్తుంది రిషికేష్  . అయితే హరిద్వార్  ఆధ్యాత్మిక ప్రదేశం మాత్రమే కాదు  .పెద్ద వాణిజ్య కూడలి . అక్కడ టెక్స్టైల్ పరిశ్రమ విశ్వరూపం కనిపిస్తుంది   .రిషికేష్ లో కూడా త్రివేణి సంగమం ఉందంట . అక్కడికి వెళ్ళాక తెలిసింది . పైన ఉన్న నీలకంఠ మహేశ్వర్ దేవాలయానికి వెళ్ళాం . కొండపైన ఉంది  .ఆ కొండలే మన అహంకారానికి అడ్డు కట్టలు  . పెద్ద ఘాట్రోడ్  .ప్రాచీనమైన మందిరం .  క్రిందికి చూస్తే నయనం  దకర దృశ్యం . కొండనుండి కిందికి వచ్చి ఋషి కేష్ లో  స్నానం చేశాం . అప్పటికే 12:00 అయినట్టుంది అందువల్ల శరీరానికి అంత ఇబ్బంది కలగలేదు  .రోడ్డుకు రెండు వైపులా చిన్నచిన్న దుకాణాలు వాళ్ల కళ్ళల్లో మన పట్ల పెద్ద పెద్ద ఆశలు .

మళ్లీ వ్యాన్ లో కూర్చుని ఒక గంట ప్రయాణం చేసి ఇస్కాన్ వారి రెస్టారెంట్లో భోజనం చేసాం  .మెల్లిగా నడుస్తూ అక్కడి నుంచి పరమాత్మానంద ఆశ్రమం , గీతా ఆశ్రమం చూసుకుంటూ నడుచుకుంటూ జానకి జుల చేరుకున్నాం   . అక్కడ ఫోటోగ్రఫీ నిషిద్ధం  . జానకి ఝులా   ఫోటో  క్రింద ఈఆస్తాను . చూడండి .ఒకప్పుడు లక్ష్మణఝులా  వేరే ఎక్కువగా వినిపించేది . చెక్క వంతెన పై ఇప్పుడు చిన్న కంకర సిమెంట్ లాంటిది కలిపి రోడ్డు లా వేశారు  . చిన్న కదలిక అయినా అనుభవం బాగుంటుంది

ఇక్కడ అంటే రిషికేశ్లో ఒక విషయం గమనించాను . బేరం అనేది ఇక్కడ బాగా తక్కువ . అన్ని షాపుల్లో ఇంచుమించు ఒకే రేట్ చెప్తారు . అయితే ఎన్నిసార్లు అయినా వివరిస్తారు  .ఎన్ని వస్తువులు అయినా చూపిస్తారు  .

 మాయాదేవి మందిరం , దక్షిణేశ్వర్ మహాదేవ మందిరం చూసాము . చాలా బాగుందినవి .ఆరోజు అక్కడ ఎలక్షన్స్ జరుగుతుండె  . మా హోటల్ స్టేషన్ కి దగ్గరే .కానీ  లగేజ్ ఉంటుంది కదా  .సాయంత్రం ఆటో ట్యాక్సీ దొరకడం కష్టమని చెప్పారు చుట్టుపక్కల వాళ్ళు . అందువల్ల చాలా త్వరగా రైల్వే స్టేషన్ కి వెళ్ళిపోయాము . సాయంత్రం నాలుగున్నర గంటలకు బి కానిర్ ఎక్స్ప్రెస్ లో బయలుదేరి కురుక్షేత్ర దిగాము .  ఆ రోజంతా కురుక్షేత్ర  తిరగాలనుకున్నారాత్రి అయిపోయిన అందువల్ల మా  హోటల్ కి దగ్గరలో చుట్టుపక్కల కాస్త చూసుకుంన్నా ము.   ఇక్కడ పొద్దుటి పూట చలి ఎక్కువగానే ఉండింది .మొదలు చిన్న బ్రహ్మసరోవరం చేరుకున్నాం. ఇక్కడే దుర్యోధనుడు జల స్తంభన విద్యతో నీటిలో దాగి  ఉన్నాచోటని చెప్పారు . స్వచ్ఛంగా శుభ్రంగా నీళ్ళు బావుంది  .దానికి ఎదురుగా లక్ష్మీనారాయణ గుడి ఉంది  .అది చూసుకొని మళ్లీ బయలుదేరి పెద్దబ్రహ్మ మానస సరోవరం  వెళ్ళాము .కనుచూపుమేర నీళ్లు చల్లని గాలి అక్కడ   స్థానికులు గోధుమ పిండిని చపాతీ పిండిలా తడిపి పొడి పిండిలో దొర్లించి చిన్న చిన్న  గుండ్రెడ్డి బాల్స్ లాగా చేస్తారు .

ఈ చిన్నది గుండ్రటి బాల్స్ ని  నీళ్లలో విసిరేస్తే  చాలా తక్కువ ఖర్చు తో అపురూపమైన అనుభవాన్ని మన సొంతం చేసుకుంటాం  . నీటిలో మునిగి ముక్కుతో పట్టి గుటుక్కున మింగుతాయిబాతులు . చూడడానికి బాగుంటుంది 

ఆ తరువాత గీతోపదేశం జరిగిన  ప్రదేశానికి  వెళ్ళాము . ఫోటోలు క్రింద ఇస్తాను చూడండి . ఆ ముఖాల్లో హావ భావాలు ఎంత ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయో . చివరికి గుర్రాలు కూడా ఓ నిమిషంలో మన మీదికి దుకాస్తయేమో అన్నంత సహజంగా ఉన్నాయి  . కదలికలను  ,వేగాన్ని కళ్ళ ముందర కళ్ళకు కట్టినట్టు నిలబెట్టిన అజ్ఞాత శిల్ప లకు పాదాభివందనాలు  . అంతకుమించి ఇంకేం చేయలేం కదా .

అక్కడే కూర్చుని గీతలో రెండు  అధ్యాయాలు మనసులో చదువుకున్నాను . ఆ తర్వాత జ్యోతి సర్ వెళ్ళాం అంటే పాండవులు ఆయుధాలు దాచిన స్థలం . అక్కడ భారీ ఎత్తున కృష్ణ భగవానుని విశ్వరూప దర్శనం మోడల్ ఉంది . అర్జునుడు  ఏమో కానీ మేము విభ్రాంతులమై అలా నిలబడిపోయాము .  లౌకికమైన అనుభూతికి అందని భావమది .

అక్కడ ఇంకో రెండు అధ్యాయాలు గీత చదువుకుని భీష్మ పితామహుడు అంప శయ్య మీద పడి ఉండిన ప్రదేశానికి వెళ్ళాం  .ఆ పక్కనే అర్జునుడు భీశ్ముని కోసం గంగను తెప్పించిన సంఘటనకు గుర్తుగా పాతది మెట్ల బావి కూడా అక్కడే ఉంది . డాన్ని బాణ గంగ అంటారు . అక్కడి నుంచి భద్రకాళి గుడికి వెళ్ళాము . సాధారణంగా మనం చూసేదానికి భిన్నంగా ఇక్కడ అమ్మవారు  శాంతంగా ప్రసన్న వదనంతో , చిరునవ్వుతో చక్కగా మనల్ని పలకరిస్తున్నట్టుగా , ఒక తల్లి అక్కడ ఎదురు చూస్తోంది మనకోసం అన్నట్టుగా అనిపించింది చూస్తుంటే  . ఆ పక్కనే చిన్న పద్మవ్యూహం టైపులో మెలికలు తిరిగిన దారి ఉంది. అలా తిరుగుతూ వచ్చి దర్శనం చేసుకోవాలన్నమాట  .అక్కడ ఒక చిన్న మంటపంలో పద్మవ్యూహం కూడా చిత్రించబడి ఉంది చివరిలో ఫోటో ఇస్తాను చూసుకోండి

ఒక విషయం నా దృష్టికి వచ్చింది యాత్రను ఇక్కడ ముఖ్యంగాఅంటే  కురుక్షేత్ర చు ట్టు పక్కల ప్రాంతాల్లో కాళీ దేవాలయాలు  ,కాలభైరవ ఆలయాలు చాలా కనిపించాయి  .అయితే ప్రధాన ఆలయం లేక ఉపాలయాల రూపంలో తప్పనిసరిగా ప్రతి గుడిలోనూ కా ళీ లేదా భైరవ ఆలయం కనిపించింది ఆ తృప్తిని గుండెల నిండా నింపుకొని కురుక్షేత్రం నుండి ఢిల్లీకి అక్కడి నుంచి హైదరాబాదు చేరుకున్నాము .

ఇక్కడితో కుంభమేళాలో పుణ్యా స్నానం చేయాలన్న నా పన్నెండేళ్ల కల తిరిగి  తీరింది .

అయితే యాత్ర విశేషాలు ఎప్పుడు సశేషాలే  . ఇదొక అనంత భావ స్రవంతి  .మరో ప్రయాణానికి బయలుదేరే వరకు ఈ విశేషాలు  మనసులో  మల్లెల పరిమళాలను వెదజల్లుతాయి .  తృప్తిగా  మరికొంత కాలం  ఉత్సాహంగా ఉండేలా చేస్తాయి  .

 ఇక్కడితో  మా కుంభమేళా యాత్ర రెండవ మరియు చివరి భాగం పూర్తయింది  .

మరోసారి మరో మంచి అంశంతో కలిసే వరకు సెలవా మరి

మీ   విజయకందాళ

9912842104

January 31, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

తిరునగరి దేవకీ దేవి గారితో మయూఖా పత్రిక ముఖాముఖి !!

by రంగరాజు పద్మజ January 31, 2025
written by రంగరాజు పద్మజ

స్త్రీలకూమెదడు ఉంది – దానికి జ్ఞానం ఇవ్వాలి!! ఆమెకూ హృదయం ఉంది-  దానికి అనుభవం ఇవ్వాలి అనే చలం మాటలు గుర్తుకు వస్తాయి తిరునగరి దేవకి దేవిగారితో మాట్లాడినప్పుడు, వారి రచనలు చదువుతూ ఉంటే… వీరు మహిళా చైతన్యం,  మహిళల మనోభావాల గురించి కథలు, కవితలు రాసారు. వాటిలో ఆమె భావాలు ప్రతిఫలిస్తాయి.   ముఖ్యంగా ఏ ఉద్యమానికైనా సాహిత్యం ఒక కరదీపిక వంటిది. అటువంటి చైతన్యపరిచే రచనలు చేసి, తెలంగాణ తొలి మలి దశలలో ఉద్యమానికి ఊపిరులూది , మనకు ప్రత్యేక తెలంగాణ కావాలని గొంతెత్తి ఘోషించిన తిరునగరి దేవకీదేవి గారికి ఇలా అందరినీ చైతన్య పరిచి ఉత్సాహాన్ని నింపే స్ఫూర్తి ,తన నేపథ్యం వారి సాహిత్యం, వారి ఉద్యోగపర్వం …ఇలా బహు కోణాలలో ఎంతో ప్రత్యేకతలను సాధించుకున్న వారితో జరిపే ఈ  ముఖాముఖిలో ఆ విషయాలన్నీ తెలుసుకుందాం.!  పాఠకులు స్ఫూర్తిని పొందే దిశగా వారితో నుడుగుల అడుగులు వేద్దాం!
   ఒక తెలుగు అధ్యాపకురాలి గా సంపూర్ణ కాలం ఉద్యోగాన్ని చేసి ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన తిరునగరి దేవకి దేవి గారిని పరిచయం చేసుకోబోతున్నాం. ఒక నన్నయ్యను, ఒక శ్రీనాథుని ఒక పోతనను చదివి కళాశాలలో ఒక లెక్చరర్ గా పిల్లలకు భాష నైపుణ్యాలను, సాహిత్య విశేషాలను అరటిపండు ఒలిచి పెట్టినట్లు నేర్పించిన దేవకీ దేవి గారిని తెలుసుకోవాలి. తన సహచరుడితో కలిసి మానవ హక్కుల కోసం పోరాడినటువంటి జీవితాన్ని తెలుసుకోవాలి. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పోరాటాలు సలిపిన ఉద్యమ కారిణిగా తెలుసుకోవాలి. ఇప్పటికీ తనదైన శైలిలో రచనలు చేస్తూ కవిత్వం, కథలు, సాహిత్య విమర్శనా వ్యాసాలు ప్రక్రియలలో రచయితలతో పోటీ పడుతున్న దేవకీ దేవి గారిని తెలుసుకోవాలి. “తెలంగాణ విమోచనోద్యమ నవలల్లో స్త్రీ చైతన్యం ” అనే అంశంపై పరిశోధన చేసిన డాక్టర్  దేవకి దేవి గారి గురించి, మొత్తంగా వారి జీవన ప్రస్థానాన్ని మయూఖ ముఖాముఖిలో  తెలుసుకుందాం!

రంగరాజు పద్మజ:– నమస్కారమండీ! దేవకీ దేవి గారు!

తిరునగరి దేవకీ దేవి:–నమస్కారం! మయూఖ పత్రిక  నన్ను పరిచయం చేస్తున్నందుకు ముందుగా నా కృతజ్ఞతలు!

పద్మజ:– మీకుటుంబ నేపథ్యం, విద్య- ఉద్యోగం ఆ ప్రస్థానం ఎలా సాగింది మయూఖ పాఠకులకు వివరిస్తారా?

దేవకి:–  నా నేపథ్యం అంటే… ఒక రకంగా ఆర్థికంగా చాలా వెనుకబడిన కుటుంబం మాది. మా తాత గారి పేరు తిరువెంగళం. ఆయన హుజూరాబాద్ వాస్తవ్యులు. అక్కడ వాళ్లు మిరాశి దారులు. చుట్టుపక్కల గ్రామాలు వారి ఆధీనంలో ఉండేవి. తాతగారు ఆయుర్వేద వైద్యులు, జ్యోతిష పండితులు, ఇంటికి ముగ్గులు కూడా పోసేవారు. నా అతి చిన్న వయసులోనే తాతగారు మరణించారు. వారు ఓ తీరు మంచి జీవితాన్నే గడిపారు. తాత గారికి ఆరుగురు మగసంతానం, ఇద్దరు ఆడసంతానం. ఆరుగురు మగపిల్లల్లో చిన్నవారు చనిపోయారు. ఈ ఆరుగురులో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, మా చిన్న బాబు వెంకటేశ్వర్లు, మా బాపు ఈ ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగాలు లేవు. కానిగి ( ప్రభుత్వంతో సంబంధంలేని ప్రైవేట్ పాఠశాల) బడి నడుపుకునేవారు. మా తాతగారు చనిపోయాక అక్కడ జీవించే పరిస్థితులు లేవు.   మా అమ్మ అందంగా ఉండడంతో అమ్మని ఇష్టపడి కోడలిగా చేసుకోవాలనుకున్నారు. అలా బాపు అమ్మను పెళ్లి చేసుకున్నారు.  కానీ మా అమ్మమ్మ తాత గార్లకు ఆరుగురు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. వైద్యం మీదనే కుటుంబం నడిచేది , ఆర్థికంగా చాలా వెనుకబడి ఉండేవారు. కాబట్టి కట్నం కూడా అడగని మా తాతయ్య సంబంధం నచ్చి మా అమ్మని బాపుకు ఇవ్వడానికి సిద్ధపడ్డారు.  వారి స్థితి బాగుంది కనుక మంచి సంబంధమే అనుకున్నారు. తొమ్మిదవయేట పెళ్ళై, అత్తవారింటికి పోయిన తర్వాత అంతా ఆమెకు అయోమయంగా అనిపించిందట. మా నాన్న అందంగా ఉండేవాడు కాదు- అమ్మ చాలా బాగుండేది. ఆ పెళ్లిని చూసిన వారంతా కాకి ముక్కుకు దొండ పండు అని పదేపదే అని సరికి చిన్న వయసులో ఆ మాటలు ఆమె మనసు మీద ఒక ముద్ర పడింది. ఎందుకో అత్తగారింట ఇమడలేకపోయింది. దాంతో  మా మేనమామలు మా అమ్మను, బాపును హనుమకొండకు తీసుకొని వచ్చారు. ఆయన పాఠశాలకు ఎక్కడా శాశ్వత స్థలంలేక, సగం కట్టి ఆగిపోయిన ఇండ్లలోనూ, చిన్నకోవెలలోను,  పెద్ద కోవెలలోనూ పాఠశాల నడిపేవారు. బ్రాహ్మణవాడ, మచిలీబజార్, నరసింహారావు అనే వకీల్ ఇంట్లో, గుడిబండల దగ్గర ఇలా ఒక చోట ఉంటూ లేకుండా నడిపారు. ఈ కానిగిరి  బడిలో అన్ని తరగతులు ఉండేవి. ఒక్కడే పంతులు. సంవత్సరం పొడుగునా ఎప్పుడూ అడ్మిషన్లు ఉంటాయి. ఒక విద్యార్థి రెండు రూపాయలు ఇచ్చేవాడు. కొందరు ఇవ్వక మా ఇల్లు గడవడం కష్టంగా ఉండేది. నాకు మా చెల్లెలికి వయసులో నాలుగున్నర ఏండ్లు తేడా ఉంది. ఈ పరిస్థితుల్లో అప్పుడు ఖాదీ ఉద్యమం జరుగుతున్నది. అంబర్ చరఖా  శిక్షణ అని ప్రవేశపెట్టారు కాంగ్రెస్. ఆ ట్రైనింగు అమ్మకు మామయ్యలు ఇప్పించారు. ట్రైనింగ్ చేసి టీచరుగా జాయిన్ అయింది.  కానీ ఉద్యోగరీత్యా అన్ని ఊర్లకు తిరగాల్సి వచ్చేది. తక్కువ జీతం అక్కడొక ఇల్లు, సంసారం. ఇక్కడొక ఒక సంసారం ఇలా ఆర్థికంగా ఇబ్బందిగానే ఉండేది. చిన్న మామయ్యలు జీవితంలో స్థిరపడలేదు. అందుకే  అమ్మమ్మ మా దగ్గర ఉండేది.     హనుమకొండలో బ్రాహ్మణవాడలో మాకు చిన్న గుడిసె ఉండేది. నాలుగు గోడలు, రెండు తడకలు అంతే ! ఏ రోజు చక్కెర చాపత్తా.. ఆ రోజే కొనుక్కోవాలి. చారనా ( పావలా)  చక్కర, దొవ్వాన ( రెండు అణాలు)  చాపత్తా కొనుక్కునే వాళ్ళం. ఒక్కోసారి అణా చాపత్తా కూడా తెచ్చేవాళ్ళం. మా అమ్మమ్మ పరిస్థితి ఏంటి అంటే? ఆరుగురు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. ఆమెకు విపరీతమైన తలనొప్పి వ్యాధితో బాధపడేది. హాస్పిటల్లో జాయిన్ చేస్తే నరాలను పొరపాటుగా కత్తిరించగా దాంతో కంటి చూపు పోయింది. చూపులేకున్నా మా ఇద్దరినీ పోషించింది, అన్ని పనులు చేసేది.
   ఆ పరిస్థితుల్లో పెరిగాము. నాకు చిన్నప్పటినుండి ధైర్యం, ఆత్మవిశ్వాసం ఎక్కువే!  ఆ పరిస్థితులు నన్ను అలా తయారు చేశాయేమో? పాఠశాలలో డ్రామాలు వేయడం, ఉపన్యాసాలు, ఇవ్వడం మోనో యాక్షన్ మొదలైనవి చేసేదాన్ని. చాలా చురుకుగా ఉండేదాన్ని. నాకు పాఠశాలలో మంచి గుర్తింపు ఉండేది. ఎనిమిదవ తరగతికి వచ్చిన తర్వాత మంచి మార్కులు వచ్చినవి. ఈ లోపు మా అమ్మ ప్రాజెక్టు అయిపోయింది. అమ్మ మళ్లీ ఉపాధి వేటలో పడింది. వార్తా పత్రికలో వయోజన విద్య  వ్యాపార ప్రకటన ఒకటి వచ్చింది. పెద్దవారికి చదువు చెప్పాలి, అక్కడ జాయిన్ అయింది. దాంతో మా మేనమామ నాకు చదువులో ఉన్న శ్రద్ధను చూసి, జనగామకు తీసుకొని పోయాడు.
9 ,10, 11 తరగతులు  మామయ్య దగ్గర ఉండి చదువుకున్నాను. అది నా జీవితంలో ఒక గొప్ప మలుపు! చాలా చురుకుగా అన్నిట్లో పాల్గొనేదాన్ని.
  ఆ సమయంలో  అమ్మకు నల్లగొండ జిల్లా సిరిపురంలో మళ్లీ అంబరచరక ప్రాజెక్టు పని వచ్చింది.  నేను జనగామలోనే చదివాను కానీ పై చదువులకు తప్పకుండా హన్మకొండకు పోవాల్సి వచ్చింది. అంతవరకు తెలుగు మీడియంలో చదివాను.
   ఉమెన్స్ కాలేజీలో మ్యాథమెటిక్స్ చదవాలనుకున్న నేను మామయ్య నన్ను సైన్స్ లో చేర్పించారు. దాంతో పియుసి ఫెయిల్ అయ్యాను. 1968లో అమ్మ వెండి వడ్డాణం అమ్మి, ట్యుటోరియల్ కు ఫీజు కట్టిస్తే, తిరిగి చదివి పాసయ్యాను. అప్పుడు అమ్మతో కలిసి ఉన్నాను. ట్రైనింగ్ లో ఫెయిల్ కూడా కావడం వల్ల అమ్మకు టీచరు ఉద్యోగం రాలేదు.

ఎంతో కష్టపడి  ఆఫీసుల చుట్టూ తిరిగి ఫీజు మాఫీ చేయించుకున్నాను. అదీ మా పరిస్థితి. కానీ మళ్లీ టర్మ్  ఫేజ్ కట్టటమెలా? అని ఆలోచించి హోమ్ ట్యూషన్ ఉదయం ఒకటి, సాయంత్రం రెండు ఇంటింటికి పోయి చెప్పేదాన్ని. ఆ డబ్బులు బట్టలు, పుస్తకాలు మొదలైనవాటికి సరిపుచ్చుకునేదాన్ని. మధ్యాహ్నం కాలేజీకి పోయేదాన్ని ఆ సమయంలోనే అంటే ఈ కాలేజీలో చేరకముందు 69లో తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. ట్యూషన్ చెప్పి వస్తుంటే దోస్తులు హైస్కూల్ చదివే వారు ఉద్యమం జరుగుతున్నదని చెప్పినప్పుడు విని నిజమే! మనకు అన్యాయం జరిగింది కదా! మనమే కొట్లాడాలని దానిలో పాల్గొన్నాను.

      P U C లో ఫెయిల్ కావడం వల్ల ఒక సంవత్సరం, తెలంగాణా ఉద్యమం వల్ల మరో సంవత్సరం వృథా అయ్యింది. అప్పుడు ఆలస్యంగా విద్యా సంవత్సరం మొదలైంది ఆర్ట్స్ కాలేజీలో మ్యాథ్స్-  అప్లైడ్ మాథ్స్ తో అప్లై చేశాను .ఆ గ్రూప్ కు తగినంత మంది లేరని ఆ కోర్సును రద్దు చేశారని, వేరే బ్రాంచ్ తీసుకోవాలంటే నాకు తెలుగు ఇష్టం కనుక తెలుగు, సంస్కృతం, చరిత్ర  సబ్జెక్ట్ లు ఎన్నుకొని బి.ఎ లో చేరాను. ఇలా కో ఎడ్యుకేషన్ లో చేరడానికి కారణం ఉమెన్స్ కాలేజీలో ధోరణి నాకు నచ్చలేదు. వారి హడావుడి, ఫ్యాషన్లు అవన్నీ నాకు నచ్చవు. అందుకే ఆర్ట్స్ కాలేజీలో కో ఎడ్యుకేషన్ లో చేరాను.

         ఇంకొక విషయం మీకు చెప్ప మర్చిపోయాను. నేను ఏడవ తరగతిలో ఉన్నప్పుడు మా మేనమామ ఒక చమత్కారంగా ఉన్న వివాహ ఆహ్వాన పత్రికను చూపించారు. హడే బడే నామ సంవత్సరం ఏలూరు అమావాస్య నాడు అని పైన హెడ్డింగ్ ఉంది. అది చదివి తమాషాగా అనిపించి దాని ఆధారంగా ఒక నాటకం రాసి మా తోటి విద్యార్థులను కూడా పిలిచి ఆ నాటకం గండయ్య అనే కౌన్సిలర్ కు చూపించాను. గణేష్ ఉత్సవాలలో ఈ నాటకం వేస్తామని అనుమతి ఇవ్వమని అంటే ఆయన సరే అన్నాడు. ఆరోజు వర్షం పడి ఆగిపోయింది. తెల్లవారి వేసాము. ముందురోజు వేషాలు వేసుకుని ఇంటికి పోతే అది చూసి  నా దోస్త్ నిర్మల వాళ్ళ నాన్నమ్మ చెంప మీద ఒక్కటేసి, నాటకాలు వేయ వద్దన్నారట! ఆమె తెల్లవారి రాకపోయేసరికి ఆమె పాత్ర ఇంకొకరికి ఇచ్చి ఆ నాటకం ప్రదర్శించాము. పియుసి లో కూడా కాలేజీ డే కి తుపాకి రాముడు వెంకట్రాముడు వేషం వేశాను. బాగుందని వన్స్ మోర్ అని మళ్ళీ వేయమన్నారు. ఆ కాలంలో కాలేజీలో ముస్లిం ఘోషాపద్ధతి ఉండేది. ముస్లిం ఆచారాలు స్పష్టంగా కనపడేవి. ఎలా అంటే కాలేజీ చుట్టూ క్లాసులు ఉండేవి, మధ్యలో ఆడవారికి తరగతులుండి, వాటిచుట్టూ ఓ కాంపౌండ్ ఉండి, ముందు వరండా ఉండి , అందరిని లోపలికి పంపకపోయేవారు.
 ఆపా అనే ఒక ఆమె కాపలాగా ఉండి, ఎవరైనా కలువడానికి వస్తే ఆమె పరిమిషన్ తో పోయి  మాట్లాడి వచ్చేవాళ్ళం. లోపల టెన్నికాయిట్ వంటి ఆటలు ఆడే వసతి ఉండేది.  ఏవైనా మీటింగ్ లు అయితే ఆపా ముందు నడుస్తుంటే మేము వెనుక నడుస్తూ వెళ్లే వాళ్ళం. అలా డిగ్రీ అయిపోయింది.   ఎమ్. ఏ చదవాలని తెలుగుకు దరఖాస్తు చేసుకున్నాను. ఎకనామికల్ గా బ్యాక్ వర్డ్ గా నాకు 50 రూపాయలు సంవత్సరానికి స్కాలర్షిప్ వచ్చేది. తర్వాత 70 రూపాయలు చేశారు. తర్వాత కాలేజీలో ఎమ్.ఏ చదివేటప్పుడు హాఫ్ ఫ్రీ షిప్ వచ్చింది. ఇలా ఇదే క్రమంలో నేను ట్యూషన్ చెప్పిన ఫీజులు కూడా ఆ చదువులకు వాడే దాన్ని.

 ఉస్మానియా అప్లియేటెడ్ పీ.జీ సెంటర్ అక్కడ పి.జీ పూర్తి చేశాను. ఫలితాలు రాగానే జనగామ లోను, వికారాబాద్ కాలేజీలోనూ అధ్యాపకురాలుగా దరఖాస్తు పెట్టాను. రామరాజు గారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ గా ( ప్రిన్సిపాల్)  గాను ఉండేవారు ఆయన నన్ను సెలెక్ట్ చేశారు. వికారాబాద్ లో జాయిన్ అయ్యాను. విద్యకు సంబంధించి మిగిలిన చదువు కొనసాగడానికి అవకాశం చిక్కలేదు. నా వెంట వికారాబాద్ కు  చెల్లెలు, పిన్ని  వచ్చి, రెండు సంవత్సరాలున్నారు నాకు తోడుగా.. నేను అక్కడ పనిచేస్తున్న సమయంలో శంకరయ్య గారితో పరిచయమైంది. ఆయన కూడా మ్యాథమెటిక్స్ లెక్చరర్ గా అదే కాలేజీలో పనిచేస్తున్నారు. ఆయన అభ్యుదయ భావాలు ఉన్నవారు. అంతేకాదు మేము ఆర్థికంగా నిలదొక్కుకొని, కట్నాలు ఇచ్చి, పెళ్లి చేయగలిగిన పరిస్థితి మా నాన్నగారికి లేదు!  చదివే ఇబ్బందిగా సాగింది.
నా జీతం 450 రూపాయలతో మొదలైంది. ఇంటి కిరాయి 50 రూపాయలు.
అమ్మకు కూడా పంపాలి . ఇలాంటి పరిస్థితుల్లో శంకరయ్య గారితో పెళ్లి బాగుంటుందని ఇద్దరం మాట్లాడుకున్నాం  ఆయన పూర్తిగా వామపక్ష భావజాలంతో ఉన్నారు .అలా అని పార్టీలతో సంబంధం లేదు. ఆయన కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి.మహబూబ్  నగర్ నుండి ఆయన జైలుకు కూడా పోయి వచ్చారు. మా ఇద్దరి ఆలోచనలు కలుస్తాయని నిర్ణయించుకున్నాం. మా మామయ్యలకు చెప్పాము. ఆయన ప్రభావం నామీద ఉంది కాకపోతే మామయ్య ఆధ్యాత్మికవాదులు. నేను ఉద్యమంలో తిరుగుతున్నప్పుడు నాకు ఏం జరుగుతున్నది అనిపించేది… మనం నమ్మేదొకటి… చేసేది ఒకటి.. జనాలు దైవభక్తిని గొప్పగా చెప్తున్నారు…. ఆ దైవభక్తి ఉన్న వాళ్ళు నమ్మకం ఉంటే సరిపోదు దాన్ని ఆచరణలో పెట్టాలి కదా! చాలా మంది ప్రదర్శన గా భక్తి పరులవలె కనిపిస్తున్నారు. దైవభక్తి ఉంటే వారిలో వచ్చిన మార్పు ఏమిటి? అని ఆలోచించుకున్నప్పుడు శంకరయ్య గారి పద్ధతి బాగుందనిపించి, ఇద్దరం నిర్ణయం తీసుకున్నాము. పెద్దలు అంగీకరించారు. ఇంటి ముందటే పెళ్లి జరిపించారు. పర్చారంగా రావు గారింట్లో కిరాయికి వెళ్లేంతవరకూ  కుర్చీలు గాని మంచాలు లాంటివి గాని లేవు. కరెంటు లేదు. 69 లో నీటి కరువు వస్తే మా మేనమామ వాళ్ళు స్వయంగా నీటి బావి తవ్వుకున్నారు. వాళ్లకి కూడా ఐకమత్యత, కష్టించి పని చేయాలని ఒక పద్ధతి ఉండేది. ఆ బావినీళ్లు సరిపోకపోతే ఇంకా అవసరమైతే ఉప్పర వాడకుపోయి నీళ్లు తెచ్చుకునే వాళ్ళం. మాది ప్రేమ వివాహం కాదు. నేను కుదుర్చుకున్న పెళ్లి. నలుగురు మామయ్యలు తల 500 రూపాయలు వేసుకొని వచ్చిన వారికి అన్నం పెట్టారు. మా పెళ్ళికి హర గోపాల్ గారు, వరవరరావు గారు, పి.వి సుబ్బారావు గారు వచ్చారు. వారి సమక్షంలో పూలదండలు మార్చుకున్నాము. కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీధర్ బాబు గారు అధ్యక్షత వహించారు. మమ్మల్ని అభినందించారు. శంకరయ్య తరఫున వారి ఒక్క అన్న తప్ప ఎవరూ రాలేదు. మహబూబ్ నగర్ ఘన్పూర్ దగ్గర చిన్న పల్లెటూరు పర్వతాపురంలో పెరిగారు కనుక  కులాంతర వివాహాలు వారికి తెలియదు.  అందుకే రాలేదు. నా పెళ్ళికి నేనే ఒక కార్డు వేయించాను. ఫలానా శంకరయ్యతో నా పెళ్లి అవుతున్నదని, బాపు పేరు పెట్టి ప్రింట్ చేయించాను. శంకరయ్య ఒక లెటర్ మీద ఫలానా దేవకి దేవితో నా పెళ్లి జరుగుతున్నది మీరందరూ రాగలరని రాసి వెనుక స్టాప్ లిస్టు దానికి పెట్టి అటెండర్ తో అందరి దగ్గరికి పంపారు.
పిల్లలకు ఆదర్శంగా ఉండేందుకు మేము మా పెళ్లి గురించి బయట ఎక్కడా బయటపడలేదు. ఒక్కసారిగా ఆ  పెళ్ళి సర్కులర్ చూసి అందరూ ఆశ్చర్యపోయారు. పెళ్ళిలోశంకరయ్య గారికి భోజనాల హడావుడి వద్దని చాయ్ బిస్కెట్లు ఇద్దామన్నారు. కానీ ఎంతో దూరం నుండి వచ్చి ఆకలితో పోవడం ఎందుకు అని నాకు నచ్చక భోజనాలు ఏర్పాటు చేశాం.
   శంకరయ్యను చూసినప్పుడు ఆయన అభ్యుదయ భావాలు విన్నప్పుడు నాకు ఒక హీరోలా అనిపించింది. కానీ అసలు జీవితం ప్రారంభమయ్యాక నాకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఎందుకంటే ఆయనకు సోషల్ యాక్టివిటీస్ ఎక్కువ.. అవసరమైన వారికి సహాయపడాలనే తత్త్వం ఆయనది. నాకు ఆ గుణం నచ్చే పెళ్లి చేసుకున్నాను.పెళ్లికి ముందు అది బాగానే ఉంది. కానీ శృతిమించడంతో తర్వాత కొంచెం ఇబ్బంది పడ్డాను కానీ నేను ఏదైతే ఇష్టపడ్డానో దాన్ని వ్యతిరేకించ వద్దు కదా! అని ఒక సిద్ధాంతానికి ఆకర్షితురాలినై పెళ్లి చేసుకున్నాను. అది సమస్య అనుకోవద్దు కదా! ఆ   సంఘర్షణతో చాలా రోజులు ఇబ్బంది పడ్డాను. ఇల్లు పట్టించుకోకుండా “సివిల్ లిబర్టీస్” రంగారెడ్డి జిల్లా ఇన్చార్జిగా, కన్వీనర్ గా ఉండి ఎక్కడ ఏ గ్రామంలో ఏ సమస్య వచ్చినా పోవడం… రావడం, అదేకాక చైతన్య కళా సాహితీ అని ఒక లిటరరీ కమిటీ ఉండేది. దానికి సంబంధించిన పనులు చేస్తున్న క్రమంలో ఆయనకు శ్రమతో పాటు చాలా డబ్బులు ఖర్చైయ్యేవి. అది సరే వచ్చేవారు పోయేవారు భోజనాలు పెట్టడం, తను మ్యాథమెటిక్స్ లెక్చరర్ కాబట్టి ఆ రోజుల్లో పిల్లలు  చుట్టుపక్కల గ్రామాల నుండి వచ్చి గదులు కిరాయికి తీసుకొని, వండుకొని తిని చదువుకునేవారు. ఇప్పుడు అప్ అండ్ డౌన్, లేదా హాస్టల్స్ తో ఆ బాధ తప్పింది. ఆ పిల్లలు ఏ సమయమైన “సార్! ఆ ఫలానా లెక్క రావడం లేదు” అని తిందామని కూర్చునే సమయంలో కూడా వచ్చేవారు. విసుగు అనుకోకుండా ఆ లెక్కలు చెప్పేవారు. అలా ఎంతోమందికి  చెప్పేవారు. కొంతమంది పిల్లలు వారికి కూర్చుని చదువుకునే జాగలేక  వచ్చి కూర్చొని చదువుకునేవారు. వాళ్లేమీ ఫీజు ఇవ్వకపోయేవారు.  కొందరు  వాళ్ళు కట్టాల్సిన ఫీజు “సార్! సార్! స్కూల్లో ఫీజు కట్టాలి, నాకు ఇంటి నుంచి వచ్చినాక ఇస్తా” అని అడిగితే  వారి ఫీజులు కూడా కట్టేవాడు శంకరయ్య.  వచ్చిన పేరు చచ్చినా పోదట  అని ఒక మంచి పని చేయడం వేరు, ఆ మంచిని నిలబెట్టుకోవడం వేరు! దానికోసం చాలా కష్టపడాలి !అలా ఆయన మంచితనం దుర్వినియోగం చేసిన వాళ్లే ఎక్కువ! అవన్నీ చూస్తున్నప్పుడు నాకు వాటిని వ్యతిరేకించాలని అనిపించేది. నాదీ కుటుంబమే కదా !నేను అలా చేయాల్సి వచ్చేది. ఎవరికేసమస్య వచ్చిన తానే భుజాలకి ఎత్తుకునేవారు.
  ఉదాహరణకు బ్యాంకులో లోన్లు తీసుకొని డబ్బులు సమయానికి కట్టకపోతే, బ్యాంక్ వారు పంచనామా  చేసి, ఇల్లు వేలం వేసి పోతారు. దానికి ఒక పద్ధతి ఉంటుంది దాని ప్రకారంగా చేయరు. అటువంటి వారొస్తారు.   గవర్నమెంట్ తరఫున కూడా జనాలను మోసం చేసేవారు గ్రామాలలో ఉండేవారు. వారు కూడా వచ్చి శంకరయ్యను సాయమడిగేవారు. ఒకసారి మహబూబ్ నగర్ నుండి కులకచర్ల అవతల ఒక అతను బీదవాడు. తన పనేదో తాను చేసుకునేవాడు. ఎవరి జోలికి పోయేవాడు కాదు! కానీ ఎవరిని లెక్క చేయని మనస్తత్త్వం. పనికాగానే హాయిగా రామకోటి రాసుకుంటూ కూర్చునేవాడట. తమకు లొంగి ఉండలేదని బాణామతి పేరుతో  చంపేశారు. ఆయన కుటుంబం శంకరయ్య గారి దగ్గరకు వచ్చారు. వస్తే దాని కొరకు అప్పీల్ చేసి ఆ రోజుల్లో పదివేల రూపాయలు గవర్నమెంట్ నుండి ఇప్పించారు కొడుకుకు. దానితో చిన్న ఇల్లు వేసుకుని దానికి శంకరయ్య అని పేరు పెట్టుకున్నారు. అలాంటి పనులు చేసేవారు.  ఆయన దగ్గర నాటకాలు ఆడి డబ్బులు లాక్కోవడం తనని  మాలిన ధర్మం వల్ల చాలా ఇబ్బంది పడ్డాను. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యం దెబ్బతిన్నది. ఎందుకంటే కాలేజీలో పని, ఇలా సమస్యల కోసం తిరగడం షుగర్ ఎక్కువై అది గమనించక ఆరోగ్యం పాడైంది. న్యాయంగా ఉండి నిలదీయడంతో కాలేజీలోనూ గొడవ అయి సస్పెండ్ చేశారు. రకరకాల బాధలతో నేను phd చేయలేకపోయాను. అలా జీవితం సాగింది. అబ్బాయి పదో తరగతిలో ఉన్నప్పుడు నేను పిహెచ్డి చేయగలిగాను. అమ్మాయిని 6 వతరగతిలో గవర్నమెంట్ వారి నవోదయ స్కూల్లో చేర్పించాము. అబ్బాయి మాతోనే ఉన్నాడు.
    ఐదు సంవత్సరాల తెలంగాణ విమోచన ఉద్యమ నవలలు స్త్రీ చైతన్యం అనే టాపిక్కుతో తెలంగాణకు జరిగిన అన్యాయాలను దృష్టిలో పెట్టుకొని ఆ అంశంపై సిద్ధాంత గ్రంథం రాశాను. ఉద్యమాలు చేసిన దాన్ని తెలంగాణ వారికి ఏమేమి అన్యాయాలు జరిగాయో నాకు అవగాహన ఉండటం వల్ల, వలస పాలకులు తర్వాత వచ్చిన వారు అంతకుముందు కూడా నైజాం కాలంలో కూడా ఇక్కడ ప్రజలంతా బడుగు వర్గాలవారు చాలా ఇబ్బంది పడ్డారు. మరి ఆ పరిస్థితులను వెలికి తీయాలి కదా! ముఖ్యంగా స్త్రీల కోణంలో ఆలోచించడం నాకు ఇష్టం.  మామూలుగా ఎక్కడ ఏ పని చేసినా… స్త్రీలను  పిలిచి ఊరికే అలా బొమ్మలవలె  వేదికల మీద  కూర్చోబెడతారు. నిజంగా సముచిత స్థానం ఇవ్వరు. వారి నైపుణ్యాలను తెలుసుకొనే ప్రయత్నం చేయరు. వారి ఉద్ద్యేశ్యాలను అడగరు! వారికి ప్రాధాన్యత ఇవ్వరు.   ఉద్యమంలో మహిళలు చాలా పకడ్బందీగా పనిచేశారు  తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వాళ్ళు లేకపోతే ఉద్యమం నడవకపోయేది. మల్లు స్వరాజ్యం, అచ్చమాంబ, కనకమ్మ, అనసూయ, ఐలమ్మ, పెసర సత్తెమ్మ, నర్సక్క ఇలా వీళ్ళందరూ ఎంతో పనిచేశారు. ఆయుధాలు కూడా పట్టుకున్నారు. ఇంకా కొంతమందికి అవకాశం ఇవ్వలేదు కానీ వారు కూడా ఆయుధాలు పట్టడానికి సిద్ధంగానే ఉండేవారు. వాళ్ళు వంటలు చేసేవారు. అండర్ గ్రౌండ్ లో ఉన్నప్పుడు, అక్కడ కూడా పెళ్లిళ్లు అయ్యేవి పిల్లల్ని కనేవారు. ఆ పిల్లల బాధ్యత కూడా ఆడవాళ్లు తీసుకున్నారు. ఎందుకంటే ఉద్యమాలలో పిల్లలు ఉండకూడదు. అడవిలో ఒకవేళ సైన్యం వస్తే వాళ్ల ఆచూకీ తెలవకూడదు కదా! పిల్లలు ఏడుస్తే బయటపడుతుందని…
కనకమ్మ  తన చంటిపిల్లవాడిని బొగ్గు బాయి దగ్గర  పెట్టేసి వచ్చింది. అంత గొప్ప త్యాగం చేసింది. అది చాలామందికి తెలియదు.    అచ్చమాంబ కాన్పులు చేసేది. సుగుణ వంటలు చేసేది. అనసూయ తన తోటి ఉద్యమకారులు అనారోగ్యంతో ఉంటే పోలీసులు వస్తుంటే భుజం మీద ఎత్తుకొని పరిగెత్తింది. అలాంటి పనులు చేశారని వారందరి గురించి రాయాలి కదా! నేను తీసుకున్నది నవలలు… నవలలకు నిజంగా జరిగిన దానికి ఎంతో తేడా ఉంది! అసలు రచయితలు స్త్రీల త్యాగాలు పాఠకులకు చెప్పారా? లేదా? అని రాయాలనుకొని, ఎక్కడెక్కడ అయితే వాళ్ళు సరిగ్గా రాయలేదో దాన్ని నిలదీశాను! సాధారణంగా ఎంత ఉద్యమకారులైనా, ఎంత రైతాంగ పోరాటాన్ని సమర్థించినా మగవారికి  ఎక్కడో లోలోపల ఆధిపత్య ధోరణి ఉంటుంది. అలా రాయడం అంత ఇష్టం ఉండకపోవచ్చు కానీ నేను మాత్రం చాలా నిక్కచ్చిగా రాశాను. కృష్ణాబాయి అనే విరసం సభ్యురాలు ఒకచోట పుచ్చలపల్లి సుందరయ్య ఉద్యమంలో ఉన్నప్పుడు కష్టపడ్డారు. జనాలని ఆకర్షించేందుకు నాటకాలు వేశారు. ఆ నాటకంలో పాత్రను భార్య పాత్రను పోషించమన్నారు. ఆమె కూడా ఉద్యమకారిణి అయినా ఇష్టపడలేదు. అయితే ఏం చేశాడంటే నువ్వు నాటకంలో నటిస్తా అనేదాక అన్నం తిననని రెండు రోజులు ఉపవాసం ఉన్నాడు. పాపం ఆమె తప్పనిసరై ఆయన కొరకు నటించింది. ఇది చదివిన తర్వాత నాకు ఏమనిపించిందంటే? పార్టీలో కూడా పాతివ్రత్యం తప్పలేదు అని రాశాను. ఆమె చదివింది.
    ఆమెను ఒప్పించాలి కానీ బెదిరించకూడదు! అని నా అభిప్రాయం. కొందరు మగవారు వామపక్ష భావజాలం లేకపోయినా భార్యలకు ఎంతో తోడ్పడుతారు. ఆ భావాలున్నవారు కూడా కొన్నిసార్లు ఇలా ప్రవర్తిస్తుంటారు. అక్కడ కూడా ఆధిపత్య ధోరణి ఉంటుంది. వాళ్ళకి ఇష్టమైతే పనులు చేస్తారు! చేయమంటే చేయరు. భావాలు ఉండడం వేరు, ఆచరణలో పెట్టడం వేరు! ఉద్యమంలో ఆడవాళ్లు చాలా గొప్పగా పని చేశారు అలా ఉద్యమాల్లో పని చేసిన నవలలు 21 లో ఆడవాళ్ళ ప్రమేయం ఉన్న నవలలను మాత్రమే నేను తీసుకున్నాను నా గైడ్ జయధీర్ తిరుమలరావు.

పద్మజ:– పిడికిట ఇసుక సంకలనం ముద్రించారు కదా!  అది ఎందుకు రాయాలనిపించింది? దాని గురించి వివరించి చెప్తారా?

దేవకీదేవి:— ఇది నా కథా సంపుటి. రకరకాల సందర్భాలలో  నా దృష్టికి వచ్చిన విషయాలను కథలుగా మలిచాను.    కరోనా టైం లో ఎటువంటి పరిస్థితులు ఎదురైనాయి?  ఈ సమస్యలను ఎలా ఎదుర్కొన్నారు? అవి కుటుంబానికి ఎంత ఇబ్బంది కలిగించాయి? జనాల ఆలోచన విధానం ఎలా ఉంది? స్త్రీల మీద కరోనా మరింత బాధ్యతను ఎలా పెంచింది ?తర్వాత ఒంటరిగా ఉన్నవారు వృద్ధులు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? ఇవన్నీ నన్ను ఆలోచింపచేసాయి. ఆ నేపథ్యంలోనే  ముస్లిమ్ ల మీద ఒక అపవాదు ఉండేది. వారి వల్లనే కరోనా ఎక్కువ అవుతున్నదని, వారిని సమాజానికి దూరంగా ఉంచడం జరిగింది.   దానిలో నిజమెంత వాళ్ళు ఎలా ఇబ్బంది పడ్డారు? టెక్నాలజీ కరోనాను ఎలా గెలవగలిగింది? వాళ్ళు ఎలా ఇబ్బంది పడ్డారంటే  ఉదాహరణకు పవర్ కట్ అయిందనుకోండి! లిఫ్ట్ పనిచేయదు. బజారు నుండి కొనుక్కొని వచ్చిన వస్తువులు మోసుకొని అన్ని మెట్లు ఎక్కలేరు. ఎవరూ సహాయం చేయరు. వాన పడితే కరెంటు పోయి రోడ్ నిండా నీళ్లు ఉండటంతో ఆర్డర్ చేసిన ఆహారం అందకపోవడం ఇలాంటివి ఎన్నో…

     ఇక భర్త చనిపోయిన ఆడవాళ్లు ఎందుకూ పనికిరారు అని చూసే సమాజాన్ని చూసినప్పుడు నన్ను ఆలోచింపజేసింది. భర్త చనిపోవడానికి ముందే వారి కార్యక్రమాలే వారు చావుకు కారణం అవుతాయి. బంధువులకు సహాయంచేయాలనే ఆరాటంలో వాళ్ళ శరీరాన్ని నిర్లక్ష్యం చేసుకుంటారు. ఆ చనిపోయిన వ్యక్తి తన నిర్లక్ష్యం వల్ల భార్య, కుటుంబం ఎంత క్షోభను అనుభవిస్తారో చెప్పలేం. అంతేకాదు చనిపోయిన అతని భార్య సమాజం నుండి విసిరి వేయబడుతుంది. సహాయం పొందిన వారికి  ఈమె సహాయం కనపడదు. ఆమెవల్ల ఏదో కీడు జరుగుతుందని అనుకుంటారు. వారిని అవమానపరచడం ఇటువంటి వాటిని రాశాను. తర్వాత ఇంత ఆధునిక యుగంలో కూడా వారిని విధవలుగా తయారు చేయడం నాకు నచ్చదు.

        భర్త లేని ఆడవారికి వేరే అస్తిత్వం ఉండాలి, వేరే రూపం ఇవ్వడం పితృస్వామ్య భావజాలంలో ఒకటి. అలా చేస్తే వారు పునర్వివాహాలు చేసుకోకుండా కుటుంబానికి అంకితమై పిల్లలను సాకుతూ… ఇంటెడు చాకిరి చేస్తూ పడి ఉండాలనే ఒక స్వార్థం. వాటి గురించి కథలు రాశాను.

   ఎదుటి వారికి సహాయం చేయాలని అనుకునే వారిని ఎలా దురుపయోగం చేస్తారని, మహిళలను చిన్నచూపు చూసే అంశాలు ఆచారాలను పిచ్చిగా నమ్మడం, వాటి వెనుక అర్థం గమనించకుండా నడుచుకోవడం ఇవన్నీ నాకు ఒక కథ వస్తువులైనాయి. తర్వాత స్త్రీలకు ఇంటి బాధ్యత అంతా వాళ్లే అప్ప చెప్పడం వల్ల ఇంట్లో సమస్యలు ఎలా వస్తాయని? నేటి ఆలోచన విధానంలో పిల్లల పెంపకంలో కెరీర్ ప్రధానం అనుకుంటున్నారు కానీ, ర్యాంక్ రావాలి, మంచి ఉద్యోగం రావాలని కేవలం చదువుకే ప్రాధాన్యతనే ఇస్తున్నారు. అలా పిల్లల్ని పెంచడం వల్ల వారికి పుస్తక జ్ఞానం తప్ప లౌకిక జ్ఞానం లేకుండా ఆ పిల్లలకు సమస్యలు వస్తున్నాయి. కేవలం పుస్తక జ్ఞానం కాకుండా రెండూ ఉండాలని కొన్ని కథలలో రాశాను.

  ఈ పిడికిట ఇసుక అని ఎందుకు పేరు పెట్టానంటే పిడికిట్లో ఇసుకను పట్టుకుంటే అది నిలవదు! క్రమంగా జారిపోతుంది. మెల్లమెల్లగా అంతా అయిపోతుంది. అలాగే కుటుంబ వ్యవస్థలో కుటుంబ సంబంధాలు కూడా మనకు తెలియకుండానే మెల్లగా జారిపోయాయి. ఇదివరకు మనం అమ్మమ్మ ఇంటికి, మేనమామల ఇంటికి, మేనత్తల ఇండ్లకు పోతే హాయిగా కుటుంబ సభ్యుల వలే కలిసి మెలిసి ఉండేవాళ్ళం. మన పెళ్లిళ్లయి మనం ఒక కుటుంబం ఏర్పరచుకున్నాక తర్వాత ఆ ఇంటికి వెళితే వారు మనను చుట్టాల వలె లేదా పరిచయస్తుల వలె కాఫీ తీసుకుంటావా? చాయ్ తాగుతావా? అని అడిగే వరకు వస్తుంది. అంతవరకు నా అనుకున్న బంధం కడకు తోసి వేసిన వైనం.. ఒకప్పుడు  అందరంకలిసే ఉన్నాం కదా? పనులుకూడా కలిసే చేసుకున్నాంకదా? గమ్మత్తుగా తెలియకుండా ఆ ఇంటికీ, బంధుత్వాలకూ దూరమవుతాం. మన ఇంట్లో కూడా అన్నదమ్ములు.. అక్క చెల్లెళ్ళు  ఒకప్పుడు ఎంతో బాండింగ్ తో  ఒకరి మధ్య ఒకరు ప్రేమతో ఉండి కలిసి మెలిసి పెరిగిన వాళ్ళమే!  పెళ్లయిన తర్వాత వారి సంసారాలు వారివి. వారి జీవన విధానం వేరు! తల్లితండ్రులు మెల్లగా బయట వారై పోతారు. ఏదైనా ఇంటి విషయాలు చర్చించుకుంటే అల్లుడు- బిడ్డ కలిసి చర్చించుకుంటారు. ఈ తల్లిదండ్రులను కలుపుకోరు! అటు కొడుకు- కోడలు వారి మధ్య చర్చించుకుంటారు… కానీ ఆ విషయాలు ఏవీ అత్తమామలకు చెప్పరు. అక్కడ ఇక్కడ తల్లికి సంబంధం ఉండదు.

   విదేశాలకు పోతే ఇంకా విచిత్రమైన పరిస్థితి మేనల్లుండ్లో- మేనకోడళ్ళను తన పిల్లల వలే అంతకంటే ఎక్కువగా చూసుకున్న వ్యక్తి.. తరువాత భార్యతో ఆమె బంధువులతో మమేకం అవుతారు. ఇటువైపు మొక్కుబడి సంబంధాలు మిగులుతాయి. చివరకు ఆ కుటుంబంలోని స్త్రీకి భర్త కూడాచనిపోతే.. చివరి రేణువు ఎప్పుడు రాలిపోతుందో తెలువదు… అని భావం. ఇలాంటి రకరకాల సమస్యలను తీసుకొని ఈ పిడికిట ఇసుకను సంకలనం చేశాను.

పద్మజ:– ఇందులో మీ స్వానభవాలు ఉన్నాయా?

దేవకేదేవి:- చాలా ఉన్నాయి నేరము- శిక్ష అనే కథ నా అనుభవం కాదు కానీ, నా పరిశీలన! నేరం ఒకరు చేస్తే శిక్ష మరొకరికి పడుతుంది. చిన్న ఆధారాలతో  రుజువు చేయబడుతుంది. రుజువైన వారి మానసిక వేదన వారిపై పడిన మచ్చ మాసిపోవు కదా! అందులో ఒక పాత్ర ఇలా అంటుంది అరేయ్ నువ్వు పనికి రాకపోతే చంపి పడేస్తా కొడకా ఏమనుకున్నావో అని అంటాడు నేరము శిక్ష కథలో…. చంపింది అన్నవాడు కాదు. వేరే అతను చంపేస్తాడు. ఫోన్ ఆధారంగా నువ్వే చంపావని నేరం మోపుతారు. అప్పుడు వాడి పరిస్థితి ఏమిటి? ఇలా రాశాను కథా సంపుటి ఆలస్యమైనా పరిశీలన చేయడంలో లేట్ అయినా బాగానే ఉపయోగపడింది.

పద్మజ:– మీరు ప్రతీ విషయాన్నీ ప్రత్యేక కోణంలో చూస్తూ… చుట్టూ పరిసరాలను పక్కా ప్రణాళికతో చూస్తారని అనిపిస్తున్నది.

అరుదైన ఛాయాచిత్రం అనే కవితా సంపుటిలో రైతులకు సంబంధించిన అంశాలున్నాయి. కథల్లో కూడా వ్యవసాయం మీద కథ రాసాను. సన్నకారు రైతులను భూస్వాములు ఎలా అదుపులోనికి తీసుకుంటారని, వారిని కొత్త టెక్నాలజీ అని పెట్టుబడిదారులు ఎలా మోసం చేస్తారని, రైతుకు సంబంధించిన సమస్యలను రాసాను. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన ఉద్యమం జరుగుతున్నప్పుడు వచ్చిన హావ భావాలన్నీ కవితలుగా రాసాను. ఒక్కొక్క సంఘటనకు ఒక్కో కవిత, నాకు వ్యక్తిగతంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సరైనవిగా అనిపించనివి, మహిళలకు సంబంధించినవి బతుకమ్మ మీద కవితలు ఒక సంపుటిగా వేసాను.   ఇదే కాకుండా బతుకమ్మ పాటల్లో స్త్రీ మనోభావాలు అని రాసాను. ఎందరో బతుకమ్మ మీద వేల వ్యాసాలు రాసారు. మళ్ళీ దీని మీద నువ్వు ప్రాజెక్టు ఎందుకు చేయాలి? అని కొంతమంది అన్నారు. కానీ ఎంతసేపు బతకమ్మ తయారీ నేపథ్యం, ఆధ్యాత్మికత నేపథ్యంవాటి గురించి రాసారే కానీ స్త్రీలు ఎట్లా పాటలు పాడుకున్నారు? ఆ పాటలలో ఏ సంఘర్షణ? ఉంది పాటల్లోఆడ పిల్లలు పుట్టగానే వాళ్లకు పనులు రావాలనుకునేవారు. అవి ఎలా నేర్పారు ? మొదలైనవి రాసాను. ఉదాహరణకు జనకు జనకునింట అనే పాటలో బొమ్మరిల్లు కట్టడం, ధాన్యాన్ని దంచడం,చెరగడం ఇలాంటివన్నీ పెద్దలు నేర్పిస్తున్ననట్టుగా ఉంటుంది. ఆ  పాటలు ఆ రోజుల్లో బాల్యవివాహాలు ఉండేవని తెలుపుతున్నది. ఆ పాటలలో అల్లుండ్లలకు అలుకలు; అర్జునుడు భార్య సుభద్రతో  మీ అమ్మ వాళ్లు నాకేమీ కట్నకానుకలు ఇచ్చారు? అనే సంవాదం చేయడం అంటే జానపద పాటలలో పౌరాణిక పాత్రలు కనపడతాయి. శివుడు పార్వతి మొదలైన పాటలలో తమను తాము చూసుకుంటూ… చెప్పే పాటలు గురించి రాసాను.   అక్కడితో సరిపోదు! కలవారి కోడలు కలికి కామాక్షి  పాటను గమనిస్తే  ఎందుకీ కన్నీళ్ళు ఏమి కష్టాలు అని అడుగుతాడు అన్న తర్వాత ఏంచెప్తాడంటే వాకిట్లో బాలుడు అంబాడేదాకా ఓర్చుకో ! అంటాడు. అంటే  నీకు సంతానం కలిగే దాకా పరిస్థితి ఇలానే ఉంటుంది!  అందుకని ఓపిక పట్టు! అన్న మాటలకు మనకర్ధమైయ్యేదిమిటంటే? ఆడపిల్లకు పెళ్ళి అయితే సరిపోదు! సంతానం కలుగక పోతే అత్తవారింటినుండి పంపిచేస్తారని… అలాంటి ఇబ్బందులు తెలిపే పాటలున్నాయి.

      సమిష్టి కుటుంబాలలో ఆమెకు బతుకమ్మ ప్రసాదం తినాలని బుద్ధి పుడితే, ఆమె అత్తని అడుగుతుంది! ఆమె మామను అడగమంటుంది… ఇలా ఇంటిల్లిపాదిని అడుగుతూనే పోయింది. చివరకు భర్తను అడిగితే కానీ ఆమెకు బతుకమ్మ ప్రసాదం దొరకదు. అంటే సమిష్టి కుటుంబంలో ఈ రీతి- రివాజులు అన్ని ఈ పాటలలో తెలుస్తాయి.  ఇంకా మగవాళ్ళ బహుభార్యాత్వం లో ఆడవాళ్ళు ఎంత ఆరాట పడ్డారనేది గంగా-గౌరి సంవాదంలో తెలుస్తుంది.  పెళ్లిళ్లు చేయకపోతే తల్లిదండ్రులు ఎంత బాధ పడతారని అప్పగింతల పాటలో వారి బాధ, అప్పగింతల తర్వాత అత్తగారింట్లో అందరితోటి మంచిగా ఉండాలని ఆట్లా ఉంటే నీకు కావాల్సినవన్నీ  కొని ఇస్తామని తల్లిదండ్రులు సుద్దులు చెబుతారు. అవి చెప్పడంతో పాటు ఆ రోజుల్లో అన్నీ బాల్యవివాహాలు ఉండేవని తెలుస్తుంది. ఆ పాటలలో అలుకలు ఎలా ఉండేవి అంటే అర్జునుడు సుభద్రతో మీ అమ్మ వాళ్ళు నాకేం కట్నకానుకలు ఇచ్చారు? అనే సంవాదం చేయడం జానపద పాటలలో పౌరాణిక పాత్రలు కూడా కనపడతాయి. శివుడు పార్వతి మొదలైన పాత్రలలో తమను తాము చూసుకుంటూ అనుభవించే పాటలున్నాయి. సమస్యలు, సంప్రదాయాలు ఆచారాలు అన్నింటిని కూర్చుకున్న పాటలున్నాయి. ఆడవాళ్లు వారికే అర్థమయ్యే భాషలో ఒకరితో ఒకరు చెప్పుకునే పాటలు పైకి ఒక అర్థంతో కనబడుతుంది, లోపల ఇంకొక అంతరార్థం ఉంటుంది. అవి చమత్కారమైన పాటలు.        పండుగ పూట పదిమంది ఒకచోట చేరి పండుగ చేసుకుంటున్నప్పుడు అందరూ వింటారని, విని వారి జీవితాలు మార్చుకుంటారనీ ఇలా బతుకమ్మ పాటల్లో ఎన్నో విషయాలు రాసారు.

తిరునగరి దేవకీదేవిగారితో ముఖాముఖి గ్రహీత రంగరాజు పద్మజ

          మలిదశ తెలంగాణ ఉద్యమం రాకముందు జడ్చర్ల రైలు ప్రమాదం, వసంత వాగు (యశ్వంతాపురం) రైలు ప్రమాదం, లాతూరు భూకంపం, నక్క ఆండాలమ్మ పాట చాలా ప్రసిద్ధి పొందినవి. (భువనగిరి) ఎన్ గోపి అక్కను రజాకార్ మూమెంట్లో వాళ్ళు చాలా ఘోరంగా అత్యాచారం చేసి చంపేశారు. అదే ఇతివృత్తం గా పాట వచ్చింది. అలా కాలానుగుణంగా సమాజంలోని ఏ సమస్య ఉంటే దాన్ని తీసుకొని బతకమ్మ పాటలుగా మలుచుకున్నారు. మలి దశ ఉద్యమంలో కూడా బోలెడు పాటలు వచ్చినవి. స్త్రీల మనోభావాలను తీసుకున్న ఆ పాటల పరిణామం ఎలా జరుగుతూ వచ్చింది అనేది తీసుకున్నాను. ఏడేడు తరాల కథ అని తెలంగాణ కథ ( సిడి) గురించి కూడా రాశాను. ఎవరెవరు రాశారో దొరికినంత వరకు తీసుకున్నాను. వృద్ధులకు సంబంధించిన పాటలు, కమ్మరి, చేనేత వారివి, వ్యవసాయానికి సంబంధించిన పాటలు కూడా వివరించడం జరిగింది.

పద్మజ :– చాలా సంతోషం ఈ మీ కృషికి పరిశీలనా దృక్పధం ఉండాలి! దాని వెనుక క్షుణ్ణంగా చదివితే గాని ఇవన్నీ తెలియవు. ఆడవారి మనస్తత్వం కూడా అర్థం చేసుకోగలిగి ఉండాలి. అప్పుడే వారి బాధేమిటో తెలుస్తుంది. బతుకమ్మ ఆధ్యాత్మికంగానే కాకుండా, శ్రమజీవుల హృదయం పరుచుకునే వేడుకగా చక్కగా వివరించారు. మీకు ఫైర్ బ్రాండ్ అని ఉద్యమంలో పేరు రావడానికి కారణం ఏమిటి?

దేవకీదేవి:– ఉద్యమ కాలంలో నేనొక విద్యాసంస్థకు సంబంధించిన వ్యక్తినే కాదు . PUC పరీక్షలు రాసి, సెలవులు గడుపుతున్న విద్యార్థిని. మెడికల్, ఇంజనీరింగ్, డిగ్రీ , హైస్కూలు మొదలైన విద్యార్థులను నాయకులంతా, యూనియన్ నాయకులుగా విద్యార్థులు ముందుకు వచ్చారు. నేను మొదట నిరాహార దీక్షలో పాల్గొన్నాను. అప్పటి నిరాహార దీక్ష చాలా పద్ధతి ప్రకారం 24 గంటలు కూర్చొనే వాళ్ళం. అలా రెండుసార్లు నిరాహార దీక్ష చేసాను.ఆ తర్వాత ఆఫీసులలోనికి వెళ్లి పికెటింగ్ కూడా చేశాము .ఆ చేస్తున్నప్పుడు వెంట వచ్చిన విద్యార్థులు ఎక్కడికో వెళ్లారు. విద్యాసంవత్సరం వృధా అవుతుందనుకున్నారో? లేక వారింట్లో పెద్దలు కోప్పడి వద్దన్నారో తెలియదు! కానీ వాళ్ళు ఇళ్ళకే పరిమితమైపోయారు. 1969 ఏప్రిల్ 16న బాలికల ర్యాలీ తీశారు. జీవన్ లాల్ కాంప్లెక్స్ నుండి వేయి స్తంభాల గుడి వరకు అందరం కూర్చున్నాము. ఇంకో గుంపు వచ్చి చెట్ల కింద కూర్చున్నారు. వాళ్లు కూడా తెలంగాణకు సంబంధించిన అంశాలు మాట్లాడుతున్నారు. నేనెందుకు మాట్లాడకూడదు? అనిపించింది. తెలిసీతెలియని ఆ సమయంలో ఆంధ్రా వారితో మనకు జరుగుతున్న నష్టం గురించి, ఝాన్సీ లక్ష్మీబాయి వలె ఎందుకు ప్రశ్నించకూడదని ఆవేశంగా మాట్లాడి, కొంగు నడుముకు కట్టుకొని మాట్లాడిన! మొట్టమొదటిసారి అది పేపర్లో వార్త లాగా ఫోటో వచ్చింది. అప్పుడు నన్ను నేను మొదటిసారి పత్రిక లోచూసుకున్నాను. ఆ తర్వాత వేరే వాళ్ళు రాకపోవడం నేనే వీళ్ళందరికీ నాయకత్వం వహించడం, ఆ తర్వాత  మిగతా ఆడపిల్లలను సమీకరించాను. అలా చాలామంది వచ్చారు. నాతో పాల్గొన్నవారు మిగతా ఆడపిల్లలు చాలా మందే ఉన్నారు. కానీ అందరూ అన్ని సందర్భాల్లో నాతో కలిసి రాలేదు. ఇంకొకటి ఏమిటంటే ఆ రోజుల్లో హాస్టల్స్ లేవు! విద్యాలయాలు మూసేసారు. మలిదశ ఉద్యమంలో హాస్టల్స్ ఉన్నాయి. దానివల్ల ఏంటంటే అందరూ గుంపుగా గుమి కూడడం గుంపుగా రావడం అనేది సులువు. ఆడపిల్లలు బయటకు రావడం కష్టం. ముఖ్యంగా ఉద్యమాలలో పాల్గొనడం అంటే  పెద్దలు వద్దనే వారు. అలా కూడగట్టుకోవడంలో నేను విజయవంతమైనాను. హనుమకొండ చౌరస్తాలో రాస్తారోకో చేసే వాళ్ళం. కాసేపు చేయగానే పోలీసులు వచ్చి మమ్మల్ని వ్యాన్లో ఎక్కించుకొని పోతుంటే, వ్యాన్ ఎక్కి జోరుగా ఉపన్యాసం ఇచ్చేదాన్ని. ఆవేశంతో మాట్లాడి హంగామా చేసేవాళ్ళం. మగ ఉద్యమకారులు పిల్లలు బాగా సహకరించే వారు. మేము కూడా ఉద్యమం చేయాలని వారికి ఉన్నది. పోలీస్ స్టేషన్ కు పోయిన తర్వాత రికార్డు చేసి నినాదాలు చేసేవాళ్లం. మా వెనుక ఉద్యమ నాయకులు ఉండేవారు మాకు టీలు, బిస్కెట్లు తెప్పించేవారు. ఆ తర్వాత కోర్టు మెట్లు ఎక్కే వాళ్ళం. ఏప్రిల్ లో కోర్టుకు పోయినప్పుడు మమ్మల్ని అందరినీ జడ్జి ముందు నిలబెడితే పిల్లలందరూ ఉద్యమం చేస్తున్నారు కదా !అని అనుకునేవారు ఇంకో విషయం తప్పక చెప్పాలి. ఇక్కడ జడ్జీలు స్థానికులు కారు. కానీ వ్యతిరేకులు కారు. వాళ్లంతా ఉద్యమం పట్ల సముఖంగానే ఉన్నారు. చట్టం ప్రకారం వాళ్ళు ఏదైనా చేయాల్సి వస్తే చేస్తారు. ఉద్యమంలో చనిపోయిన 367 మంది ఇక్కడ స్థానిక పోలీసుల వల్ల చనిపోలేదు. సిఆర్పి అంటే (సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ) వల్ల చనిపోయారు. అందుకే మేము చిప్ప పోలీస్! డౌన్ !డౌన్!!  అని స్లోగన్ ఇస్తూ సమ్మె చేసాం!

   మలిదశ ఉద్యమం అలా కాదు! ఇది చాలా గమనించాల్సిన అంశం. మలిదశలో వలస వచ్చిన పోలీస్ అధికారులు మా మీద మరింత పెత్తనం చేలాయించి, కొంతమందిని చాలా హింసించి ఉద్యమం నీరు కార్చే పని చేశారు. తర్వాత ఆత్మహత్యలు కూడా జరిగాయి. అప్పుడు చనిపోయిందంతా సిఆర్పి ఫైరింగ్ వల్ల.. అదొకటి గమనించాలి! ఇలాగే వరంగల్ పోస్ట్ ఆఫీసు, పెద్ద రాగన్న దర్వాజా దగ్గర, హనుమకొండ చౌరస్తాలో ఇలా వేరువేరు ప్రాంతాల్లో రాస్తారోకో చేసాము. ఆఫీసుల్లో పికటింగ్ చేశాము. ఇంత తీవ్రంగా జరుగుతున్నప్పుడు ఒకరోజు రాగన్న దర్వాజా పోలీస్ స్టేషన్ దగ్గర మేము రాస్తారోకో చేస్తున్నాము. మమ్మల్ని తీసుకొని పోయి జీవులో ఎక్కిస్తున్నారు… మేము వ్యతిరేకించాము. కొట్లాడే క్రమంలో పోలీస్ గల్లా పట్టాను. లాఠీ గుంజితే అది విరిగిపోయింది. ఇదంతా పెద్దవారి దృష్టికి వచ్చింది. అంతకుముందు హనుమకొండ చౌరస్తాలో జరిగినప్పుడు ఏమైందంటే వరదారావు అని ఇన్స్పెక్టర్ ఒక అమ్మాయి కాలర్ పట్టుకునేసరికి ఆయన మీదకు  ఆ అమ్మాయి చెప్పు లేపింది… అది జరిగిన సాయంత్రం పబ్లిక్ మీటింగ్  అయింది. నన్ను మాట్లాడమంటే స్టేజీ మీదికి వెళ్లిన, మేము రాస్తారోక చేయకూడదు తప్పే… మీరు అరెస్టు చేశారు చట్టాన్ని మేము గౌరవించాలి! నిజమే! ఆడపిల్లను అరెస్టు చేయడానికి ఆడ పోలీసులు కావాలి కదా! మీరు మమ్మల్ని ఎలా అరెస్టు చేశారు?  మీకు ఆడ పోలీసులు లేకపోతే మీరే చీరలు కట్టుకొని రావాల్సి ఉండే! ఆడవాళ్లు అసమర్థులని నేను ఒప్పుకున్నట్టైంది కదా!  ఆవేశంలో ఆ విషయం గుర్తుకు రాలేదు. కానీ స్టేజి మీద పోలీసులను ఇష్టమున్నట్టు తిట్టిన.. ఆ మీటింగ్ అయిపోయింది .ఇంటికి వచ్చిన.   తెల్లవారి చాలామంది మా ఇంటికి వచ్చి కలిసి పోయారు  మీరు అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అని మిమ్మల్ని తప్పకుండా పీడియాక్ట్ కింద అరెస్ట్ చేస్తారు. మీరు ఇంట్లో ఉండొద్దు! కొన్ని రోజులు ఎక్కడికైనా పోండి! అని ఎంతోమంది చెబితే జనగామ దగ్గర నవాబు పేటలో మా మామయ్య టీచరుగా పనిచేస్తారు. అక్కడికి వెళ్లి 15 రోజులు ఉండి వచ్చిన. తర్వాత ఒకరోజు అరెస్ట్ చేసినప్పుడు మీరు తప్పు కదా! ఇలా చేయకూడదు కదా! మీ అమ్మాయిలు ఎందుకు చేస్తున్నారు? అని జడ్జి అడిగితే మమ్మల్ని అరెస్టు చేసి జైలుకు పంపించండి అన్నాను. ఏ జైలుకు పోతారు వరంగల్ జైలా? రాజమండ్రి జైలా? అని అడిగారు.

   రాజమండ్రి ఆంధ్ర జైల్ సార్!  మాకెందుకు? వరంగల్ జైల్లో వేయండి! అన్నాను.  నీ ఇష్టం వచ్చినట్టు వేస్తామా? అని జడ్జి గారంటే మీరే కదా! సార్! ఏ జైలుకు పోతారు? అని అడిగారు! ఇప్పుడు  మీ ఇష్టం అంటున్నారు.. అని అన్నాను. అనేసరికి జడ్జి స్థాణువులా అయిపోయాడు. నేను అలా సమాధానం ఇస్తానని అనుకోలేదు. ఎక్కడైనా ఫ్రీగా గట్టిగా మాట్లాడడం, ఫ్రీగా మూవ్ అవ్వడం… ఆ క్రమంలో నేను పరకాల, జనగామ, వరంగల్, ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి పోయి మాట్లాడుతున్నాను. ఫైర్ బ్రాండ్ అని నాకు పేరు పెట్టడానికి అదొక కారణం అయి ఉంటుంది.

   అప్పుడు పదవ తరగతి పరీక్షలు అవుతున్నాయి ఆ పరీక్ష రాయవద్దు అని తెలంగాణ వాదులంతా నిర్ణయించుకున్నారు. కానీ కొందరికి ఒక సంవత్సరం వేస్ట్ అవుతుందని భయం. వాళ్లు పరీక్ష రాయడానికి సిద్ధమవుతుంటే ఎక్కడినుండో ఒక జీప్ తెచ్చారు. అందులో ఎక్కినాము. మేము కొద్దిగా కారంపొడి తీసుకొని  పోయాము! గేట్ దగ్గర పోలీస్ కాపలా ఉన్నారు. మేము పరీక్ష రాయడానికి పోతున్నారనుకున్నారు. లోపలికి వెళ్లి పరీక్ష రాసే వారి పేపర్లన్నీ గుంజుకొని, చించేసి, బయటపడ్డాం! అలా మూడు నాలుగు స్కూళ్లలో పరీక్ష రాయనివ్వకుండా చేశాం. అందులో నేనున్నాను. అక్కడితో ఆగలేదు, ఉద్యమం అయిపోయిన తర్వాత ఎంపీ ఎన్నికలు వచ్చినవి 14 సీట్లు ఆ ఎన్నికల సమయంలో ఊరూరా  తిరిగి తెలంగాణ ప్రజా సమితి వాళ్ళనే గెలిపించాలని చెప్పినాము. ఆ గుంపులో నేనున్నాను. తెలంగాణ వాదులు నన్ను బాగానే ఉపయోగించుకున్నారు. ఈమె తెలంగాణ అభిమాని కాబట్టి మనం తీసుకొని పోతే బాగుంటుంది అనుకున్నారు. నేను కూడా ఎంపీలు గెలిస్తే మనకు రాజకీయంగా మంచి జరుగుతుందని, అనుకున్నాను. నేను ఆ ఎన్నికలలో చిత్తశుద్ధితో పనిచేసే ఇల్లిల్లు తిరిగి తెలంగాణకే ఓటు వేయమని ప్రచారం చేశాను. సంక్రాంతి రోజులు…  ప్రతీ ఇంటి ముందుకు వెళ్లి అమ్మా!  ఉన్నారా?  అంటే మమ్మల్ని ఆడుక్కునే వాళ్ళు అనుకున్నారేమో? కొన్ని చక్కిలాలు  తెచ్చింది వేయడానికి… ఇంకో డాక్టర్ ఇంటికి వెళితే పడుకోమని  బెడ్ చూపించింది పేషెంట్ అనుకుని. అలా తిరిగి ప్రచారం చేయడమే కాకుండా ఒక రోజున నేను స్వయంగా ఒక్కదాన్నే ఎలక్షన్ రోల్ ను తీసుకుని, మాకు సంబంధించిన ఏరియాలో ప్రతి ఇంట్లో ఓటు వేశారా? లేదా అని కనుక్కొని వేయని వాళ్ళని వేయమని బతిమిలాడి, తిరిగి వచ్చినాను. ఇదంతా తెలిసే ఫైర్ బ్రాండ్ అన్నారేమో? ఆ విధంగా పనిచేస్తే ఎం.పీ వివి గిరి గెలిచిన తర్వాత కనీసం ఒక్క మీటింగ్ పెట్టి మాకు కృతజ్ఞతలు కూడా చెప్పలేదు! మా ఉద్యమంతో సంబంధమే లేదు ఉన్నాడు.. అంత ఉత్తిదే అయింది. ప్పోగ్రసివ్  ఆర్గనైజేషన్ హన్మకొండలో ప్రారంభించారు. అందులో నేను మెంబర్ని.

అనిశెట్టి రజిత కూడా మెంబరే! దానికి కూడా అధ్యక్షత వహించాను. మరిచిపోయిన విషయం ఏమిటంటే ఉద్యమం జరుగుతున్నప్పుడు మహిళా సదస్సు జరిగింది. ఆ మహిళా సదస్సుకు అధ్యక్షత వహించాను.ఆ సభకు ఈశ్వరిబాయి వచ్చింది. హైదరాబాదుకు వచ్చి నాయకులు నన్ను తీసుకొని వచ్చినారు. జీవన్ లాల్ గ్రౌండ్స్ లో వేలమంది ఉన్నారు. తర్వాత ( POW)  పిఓడబ్ల్యూ ఫౌండర్ మెంబర్ను. తరువాత మలిదశ ఉద్యమం.

పద్మజ :– మీరు సామాజిక కోణంలో ఆలోచిస్తూ, ఇన్ని ఉద్యమాలు చేస్తూ, పాటలలో నవలలో స్త్రీల మనోభావాలు ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా గమనించారు. అభినందనలు! ముఖ్యంగా స్త్రీల సమస్యలకు మూలాలు ఎక్కడ? వాటిని అధిగమించేందుకు రచయిత్రులుగా మన కర్తవ్యాలు ఏమిటి అంటారు?

దేవకీదేవి:– మామూలుగా స్త్రీల సమస్యలకు సామాజిక దృష్టికోణం మారాలి. పితృస్వామ్య భావజాలం అనేది ఇంకా నడుస్తూనే ఉంది. ఎన్ని ఉద్యమాలు చేసినా కొంత మార్పు వచ్చింది. ఇప్పటికీ అత్యాచారాలు జరుగుతున్నాయి. గృహహింస  జరుగుతున్నది. చదువుకొని విదేశాలకు పోయినా అక్కడ కూడా ఆడవాళ్ళు హింసను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఇవి మారాలి అంటే  ఆడవాళ్ళను చూసే ఈ కోణం మారాలి! ఆడవాళ్లు  అనుభవించడానికి మాత్రమే అంటే భోగ్య వస్తువుగా చూస్తున్నారు. వారికి సమాన స్థాయిని ఇవ్వనవసరం లేదు అని అనుకుంటున్నది సమాజం.  వాళ్లకూ మెదడుంది… ఆలోచించగలరని, వాళ్ళు స్వయం శక్తిగా ఎదగగలరని అనుకోలేకపోతున్నారు. ఇది లేనంత కాలం ఎన్ని చట్టాలు వచ్చినా మార్పు ఉండదు. అలా అని మనం ఆగకుండా ఎప్పటికప్పుడు పిల్లల్ని పెంచే క్రమంలో, ఆలోచించే క్రమంలో, టీచింగ్ చేసే క్రమంల, రచనలు చేసే విషయంలో వారి స్వేచ్ఛను గౌరకిస్తూ.. నిలదొక్కుకునేలా చేయాలి! రాజకీయ నాయకులకు కూడా మహిళలకు ప్రాధాన్యతను ఇస్తూ నడుచుకోవాలి. ఇప్పటివరకు మహిళా బిల్లు లేదు. అంటే వస్తే మనకు ఎంత నష్టం జరుగుతుందో అనె ఉద్దేశంతో మహిళా బిల్లుకు మోక్షం రావడం లేదు. గ్రామాలకు సంబంధించి మహిళలకు ఎన్నికలలో నిలబడేందుకు అవకాశాలున్నాయి. కొన్నిచోట్ల పేరుకు మహిళను నిలబెట్టి వెనుక నుండి పురుషులే పాలన చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే వారు మాట్లాడగలుగుతున్నారు. వాళ్లు ధైర్యంగా నిలబడగలుగుతున్నారు. ఇక్కడ కూడా మార్పురావాలి. ఏ మార్పు వచ్చినా ఈ సమాజంలోని కోణం మారేంతవరకు ఆడవారి సమస్యలకు పరిష్కారం ఉండదు. అలా అని నిరాశపడి వదలకూడదు. మన ప్రయత్నం మనం చేయాలి! ఎప్పటికప్పుడు సమస్యలను గమనిస్తూ, పరిష్కరించుకునే మార్గం వెతుకుతూ, మన పక్కన ఉన్న వారిని చైతన్య పరుస్తూ, రచనలు కావచ్చు, సంస్థలు కావచ్చు, మార్పులను తీసుకొని పోతూ ఉంటే తప్ప ప్రగతిని సాధించలేము అనుకుంటున్నాను.

పద్మజ:– మీ సూచన బాగుంది. స్త్రీ ఆధిక్యత పురుషాధిక్యతకు సమాధానమని అనుకుంటున్నారా?  ఎందుకు అడుగుతున్నానంటే ఇటీవల బెంగళూరులో సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకునే ముందు గంటకుపైన ఒక వీడియో చేసి మరణించాడు. అందులో భార్య, ఆమె తాలూకు బంధువులు తన మీద కోర్టులో పెట్టిన కేసులు, శిక్షలు, జరిమానాలు, జీవనభృతి కోసం అడిగిన భరణం ఆయన ఆదాయానికి మించి కోరడం, ఇవన్నీ రికార్డు చేశారు… అలాంటప్పుడు పురుష ద్వేషం ఆడతనానికి జెండాగా భావిస్తారా? లేదా మహిళలు మగవాడిపై విరుచుకు పడడం ఎంతవరకు సబబు?

దేవకీదేవి:– స్త్రీవాదమనేది స్త్రీ సమానతకు మాత్రమే ఉండాలి. వారితో సమానంగా హక్కులు ఉండాలి  ఆధిక్యత కాదు! మన మీద పెత్తనం చెలాయించడం, వారి అభిప్రాయం రుద్దడం, మన మీద దాడి చేయడం, దండెత్తడం కాకుండా మనల్ని గౌరవించాలనే తప్ప ఇక్కడ పురుషాధిక్యత ఉన్నదని…. స్త్రీ ఆధిక్యతను కాదు కోరేది! సమాజంలో మనుషులు ఎప్పుడూ మంచోళ్లు- చెడ్డోళ్ళు ఉంటారు. ఆడవాళ్ళల్లో చెడ్డ వాళ్ళు ఉంటే విమర్శించాల్సిందే ! దాన్ని ఎప్పుడూ సమర్ధించకూడదు! ఏ కోణంలో ఆమె ఆలోచించిందో? ఎలా అతన్ని ఇబ్బంది పట్టిందనేది ఎప్పుడు గర్హించాల్సిందే! అంతే కాదు స్త్రీవాదం పురుషులను అణగదొక్కడానికి కాదు! స్త్రీల సమస్యలను అర్థం చేసుకొని, స్త్రీకి కూడా గౌరవం ఇవ్వాలని, స్త్రీకి కూడా సమాన హక్కులు ఇవ్వాలనే ఉద్దేశం. మీరన్నట్టుగా కూడా స్త్రీల నుండి పురుషులకు అనేక సమస్యలు వస్తున్నాయి. మనం ఎప్పుడైతే సమానత్వాన్ని కోరుకుంటున్నామో? అప్పుడు ఇలాంటి భార్యా బాధితుల సమస్యల కిందకే వస్తుంది. భర్త బాధితులుంటే ఎంత తప్పో? భార్యా బాధితులు ఉండడం కూడా అంతే తప్పు. అని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చివరగా చెప్పేదేమిటంటే? ఏ బాధితులు ఉన్నా ఒకవేళ స్త్రీ పురుషులకు; పురుషుడు  స్త్రీలకు తప్పు చేస్తే స్త్రీకే ఎక్కువ అసరు పడుతుంది. పురుషుడికి ఎక్కువ అసరు పడదు. ఆమె గమనించకపోవచ్చు కానీ నష్టపోయేది ఆమెనే! ఈ ఆధిక్యత కోసం ఆమె భర్తని ఇబ్బంది పెట్టినా ఆ ఫలితం ఆమెపై ప్రభావాన్ని చూపుతుంది. తర్వాత పిల్లలకు కూడా ఇబ్బంది అవుతుంది.

పద్మజ:– ముఖ్యంగా సాధికారత ఎందుకు? అక్కడ ఈ ఆధిక్యత పోరులో పిల్లలు తల్లితండ్రులు ఉండి కూడా అనాధలుగా మారుతున్నారంటే.. అటువంటి వారి గురించి ఎవరు మాట్లాడాలి? ఆ పిల్లల గురించి ఎవరు పోట్లాడాలి?

దేవకీదేవి :– మీరు చెప్పిన దాంట్లో  కేవలం సెల్ఫ్ కేరీర్ , తన వ్యక్తిత్వ ఎదుగుదలను స్త్రీ ఒకవేళ చూసుకొని, పిల్లల్ని కానీ భర్తను కానీ పట్టించుకోకపోతే ఏం జరుగుతుంది అని అడిగారు కదా! అది తప్పకుండా తప్పే అవుతుంది. అక్కడ మనం గమనించాల్సింది ఆమె ఏదైతే కోరుకుంటున్నారో అందులో వాస్తవికత ఎంత? ఆమె కోరుకున్నది కరెక్టేనా? ఆమె ఆశిస్తున్నది సరైనదేనా? ఆమె కేవలం తన ఆధిక్యత చూసుకుంటున్నదా? లేదా తన పిల్లల్ని కూడా కలుపుకొని చూస్తున్నదా? అంటే పురుషాధిక్యతలో భర్త  పిల్లలను, పట్టించుకోలేదనుకోండి !అప్పుడు ఆమె ఏదైనా కోరితే అది సబబే!

  ఏం లేకుండా భర్తను అణగదొక్కడం అనే భావం… పురుషుడు స్త్రీని అణగదొక్కడం అనేది ఎంత తప్పో ఈమె భర్తను అణగదొక్కడం కూడా అంతే తప్పు! సమానత్వం అనేది ఉండాలి. అప్పుడు కుటుంబం కూడా శ్రేయోదాయకంగా ఉంటుంది. అభివృద్ది మంచిగా వస్తుంది. పిల్లలకు ఏ హాని ఉండదు.

పద్మజ :—చాలామంది ఇలాంటి సంఘటనలు విన్నప్పుడు భార్యాభర్తలిద్దరూ ఎవరి సుఖం వాళ్లే చూసుకుంటే? ఎందరో త్యాగం చేసి, మానవ విలువలతో కట్టుబాట్లతో తయారుచేసిన ఈ వివాహ వ్యవస్థ  మరియు కుటుంబ సంస్కృతి ఏం కావాలి? ఈ దిశగా రచయిత్రులు సామాన్య జనానికి కుటుంబ విలువలు తెలిపే రచనలు ఏమైనా చేస్తున్నారా? దానికి ఎలా స్పందిస్తారు? అనే ప్రశ్న సమాజంలో వినపడుతున్నది. దానికి మీరేమంటారు? కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయి.  విడాకుల శాతం పెరుగుతున్నది. మీరు సూచించే పరిష్కారమేమిటీ?

దేవకీదేవి:– మీరనే దానిలో రెండు కోణాలు ఉన్నాయి. మామూలుగా  ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. ఈ ప్రేమ పెళ్లి వరకే ఉంటున్నది. తర్వాత మామూలుగా అందరికీ  కోరికలున్నట్టే అన్నీ కావాలి. తనకు కట్నంగా ఎంతో డబ్బులు ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ప్రేమించుకున్నప్పుడు ప్రేయసిగా ఉన్నామే భార్య కాగానే అతని ప్రవర్తన మారుతున్నది. అంతకుముందు ప్రేయసికి ఇష్టమైనవన్నీ పెళ్లైయ్యాక  ఇష్టం కావడం లేదు. భార్య అంటే తన చెప్పు చేతుల్లో ఉండాలి! నేను ఏది చెప్తే అది వినాలి! అన్నప్పుడు ఇప్పటికాలానికి అనుగుణంగా ఆడ పిల్లలు కూడా చదువుకోవడం, పెంపకం బాగా లేక వాళ్ళు కూడా మగ వాళ్ళు చేస్తున్నట్టు మేము ఉద్యోగం చేస్తున్నాం కదా? అనే భావనలో ఉండి వాళ్లకు ఉన్న పని భారంతో  వీటిని భర్తలు గమనించకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురౌవుతున్నాయి. అయితే మనం ఎప్పుడూ

ఏమాశిస్తున్నామని అంటే? అమ్మాయే సర్దుకు పోవాలని , అది కరెక్ట్ అనుకుంటే ఆమె ప్రశ్నించడం మొదలవుతుందో?  అక్కడ బ్రేక్ వస్తుంది. స్థాయిని బట్టి తప్పొప్పులు నిర్ణయించాలి. ప్రతి చోట అబ్బాయిదే తప్పని అనడం లేదు. ఇద్దరూ సర్దుకోలేకపోతున్నారు అనేది గమనించాలి! కేవలం విడాకులు తీసుకోవడం కాదు. ఎంతవరకు సర్దుకు పోగలిగారు కాలానుగుణంగా, పరిస్థితిలకు అనుగుణంగా ఆలోచనలు మారాలి.

   నేనే ఆలోచిస్తుంటాను. నా కొడుకు 9 గంటలైనా నిద్ర లేవకున్నా నేనేమీ అనుకోలేదు. 9 గంటలకు వచ్చి, టిఫిన్ తిన్నాడు, పోతున్నా అన్నాడు.అదే కోడలు 9 గంటల వరకు నిద్రపోతే నేనెందుకు మామూలుగా ఫీల్ కాను ?అని నాకు నేనే ప్రశ్నించుకున్నాను. ఇంకా ఇలాంటి ఆలోచనల నుండి మనం బయటపడలేదు. ఆమె ఏవో పనులు చేయలేదని అనుకుంటున్నానంటే…? మన మనసు అమ్మాయి అయితే ఒక విధంగా  అబ్బాయైతే ఇంకో విధంగా ఆలోచిస్తున్నట్టే కదా! నేను ఆ పద్ధతిలో పెరిగాను. నావలెనే నా కోడలు ఉండాలి! అనేది నా అంతరాంతరాలలో ఉన్నట్టే కదా? ఆ ఆలోచనలు నా పై పని చేస్తున్నవి. అంటే అత్తల ఆలోచనలా ఉంటున్నవి. నేను నిష్కర్షగా చెప్తున్నాను. నేను  మా అబ్బాయి పని తప్పు కాదు! కోడలి పని తప్పుగా భావిస్తున్నాను కదా! ఇది మానసికంగా అమ్మాయిలు సర్దుకుపోవాలని అనుకుంటాము. అయితే మారుతున్న కాలంలో వాళ్ళ ఆలోచన అలా లేదు. అయితే మీరన్నట్టుగా ఎవరు సిద్ధంగా ఉన్నా, లేకపోయినా.. విడాకులనేది పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుంది. అది వాళ్ళు ఆలోచించుకోవాలి, అది గమనించాలి! ఇప్పుడు రకరకాల సమస్యలున్నాయి. సహజీవనం చేయడం కూడా నేను ఒప్పుకోను! అది పిల్లలపై చాలా ప్రభావం చూపెడుతుంది. వ్యవస్థను విచ్చిన్నం చేస్తుంది. తర్వాత వాళ్ళ భవిష్యత్తు ఏమిటి? ఈ విషయం ఆలోచించాలి కదా! అంటే నాకు అతను ఇష్టం లేదు! ఇదివరకు ఉన్నట్టే ఒంటరిగా ఉంటాను… వెళ్ళిపోతాను.. అనుకుంటే సమాజం అస్థిరతకే దారితీస్తుంది.

పద్మజ:– మీ దృష్టిలో మానవతా గుణాలతో ఉన్న ఆదర్శ మహిళ, మీ అభిమాన రచయిత్రి / రచయిత కానీ ఎవరు?

దేవకీదేవి :—ఇది పెద్ద ప్రశ్నే! ఆదర్శ మహిళ అంటే రైతంగ పోరాటంలో పాల్గొన్న వారే అంటాను. ఆదర్శ మహిళలను చెప్పాలంటే ముందుగా మా అమ్మమ్మ గురించి చెప్తాను! మా తాతగారు చాలా చిన్న వయసులోనే చనిపోతే, అంతమంది పిల్లల్ని సాది- సవరించి, ఒక్క తాటిమీద నడిపించగలిగిన వ్యక్తి ఆమెనే ! మమ్మల్ని కూడా అంతా బాగా చూసింది. అందరూ బాగుండాలనుకొనేది.

   గొప్పగా అంటే జ్యోతిరావు పూలే లాంటి ఎందరో ఉన్నారు. కానీ నాకంటి ముందు రోజు కనపడే మా అమ్మమ్మ కంటే ఎక్కువగా ఎవరూ అనిపించరు. నేను మా అమ్మమ్మని ఆదర్శంగా తీసుకుంటాను.

పద్మజ :– మలిదశ ఉద్యమంలో మీ పాత్ర ఏమిటి? అది ఎలా జరిగింది? ఆ జ్ఞాపకాలు మయూఖ పాఠకులతో పంచుకుంటారా?

దేవకిదేవి:– తొలిదశ ఉద్యమంలో పాల్గొన్న తర్వాత డిగ్రీ, పీజీ చేసి, ఉద్యోగ రీత్యా వికారాబాద్ కు వచ్చేసినాను. కానీ ఎప్పుడూ తెలంగాణ ఆస్తిత్వ ఆర్భాటం గురించి మరిచిపోలేదు. ఎప్పుడూ పిల్లలకు పాఠాలు చెప్తుండేటప్పుడు కూడా మన భాష గురించి, యాస గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడేదాన్ని. ముఖ్యంగా అధ్యాపకురాలిగా నేను స్పాట్ వాల్యూయేషన్ కు పోయినప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఎక్కువ ఆంధ్ర లెక్చరర్లు కూడా పేపర్లు దిద్దడానికి వచ్చేవారు. తెలంగాణ పిల్లల జవాబుల గురించి, తెలంగాణ భాషను గురించి చాలా చులకనగా మాట్లాడేవారు. ఆ సందర్భంలో నేను ఎప్పటికప్పుడు సమాధానం ఇస్తూనే వచ్చేదాన్ని. పాఠం చెప్పేటప్పుడు కూడా అదే పరిస్థితి. ఆ తర్వాత 1997లో జనసభ ఏర్పడింది. ఐతే నేనెప్పుడైతే తెలంగాణ అభిమానినని జనాలకు తెలుసో వారంతా మళ్లీ నన్ను సభలలో పాల్గొనమని పిలిచారు. జనసభలో ఒక కమిటీ సభ్యురాలుగా నన్ను చేశారు. న్యాయంగా చెప్పాలంటే దానికి పెద్దగా న్యాయం చేయలేదు! బెల్లీ లలిత హత్య తర్వాత క్రమంగా జనసభ నిస్తేజమైపోయింది.

   ఆ తర్వాత తెలంగాణ మహిళా వేదిక మళ్లీ ఇంకొక వేదిక తయారైంది. అప్పుడు కూడా నన్ను పిలిచారు. మహిళా వేదికలో నన్ను ఉండమన్నారు. దాంట్లో కూడా నేను నామమాత్రం గానే పనిచేశాను. కానీ మొత్తానికి ఈమె తెలంగాణ కొరకు మాట్లాడుతుందని ఒక ముద్ర మాత్రం పడింది. చివరగా కేసీఆర్ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసినప్పుడు ఉద్యమం ఊపందుకున్నది. అనేక చోట్ల ధర్నాలు జరగడం,

తెలంగాణ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేశారు. ఉత్సవ కమిటీలో కూడా నేను సభ్యురాలుగా ఉండి పని చేశాను. పిల్లల ఉపన్యాసాలు, వ్యాసాలు వాటికి సంబంధించిన  కార్యక్రమంలో ఒక సభ్యురాలుగా ఉండి పని చేశాను. ఎక్కడ కూడా తెలంగాణకు సంబంధించిన మీటింగ్ జరుగుతున్నప్పుడు వాటిలో పాల్గొనేదాన్ని. 

     2009లో నేను పదవి విరమణ పొందిన తర్వాత, కేసీఆర్ నిరాహార దీక్ష చేసినప్పుడు అనుకోకుండా నేను ఉద్యమకారణంగానే అమరవీరుల స్థూపం నాంపల్లికి పోయాను. అక్కడ కోదండరాం గారున్నారు. నన్ను చూసి పండుగ రోజు పాలపిట్ట వలె బాగా కనపడ్డారు అని అన్నారు. ఆ సభలో మాట్లాడటం జరిగింది. తర్వాత తెలంగాణ ఉద్యమానికి సుముఖంగా ఉన్నటువంటి కొంతమంది స్త్రీలను కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. అనుకోకుండా దాంట్లో చొచ్చుకు పోయాను.

  నేను ఉండేది వికారాబాద్ లో కానీ హైదరాబాదుకు వచ్చి అందరిని చూసి,వాళ్ళల్లో ఒక్కదాన్నై తెలంగాణ మహిళా వేదిక అనేది ఏర్పాటయింది 16 మంది సభ్యులతో. దాన్లో అందరూ కన్వీనర్లే !అట్లా మహిళా వేదిక ద్వారా కార్యక్రమాల్లో పాల్గొన్నాను. ఆర్ట్స్ కాలేజీ దగ్గరకు పోవడము, మా వేదిక మీద నిర్ణయాలు చేసుకొని, ఇంకా విచిత్రం ఏమిటంటే? ఆర్ట్స్ కాలేజీలో గేట్లు మూసివేస్తే పక్కన గోడలు ఉంటే వాటిని విద్యార్థులు పగలగొట్టారు. ఆ గోడలు కూడా దూకి వెళ్లాను. అప్పటికి నాకు 60 ఏండ్లు వచ్చినవి. వాళ్లలో ఒక దానిగా నేను పోవడం, ఉపన్యాసాలు ఇవ్వడం అది విని ప్రజలు చాలా సంతోషపడ్డారు. నేను 69 లో ఉద్యమంలో పాల్గొన్నప్పుడు ఎట్లా జనం చప్పట్లు కొట్టేవాళ్ళో?అలా  ఇక్కడ ఆర్ట్స్ కాలేజీలో పిల్లలు నా ఆవేశాన్ని చూసి ఆశ్చర్యపోయే వాళ్ళు. అట్లా ఆర్ట్స్ కాలేజీలో, నిజాం కాలేజీలో, తర్వాత మెడికల్ కాలేజీలో ఇలా ప్రతి చోట ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడకు పోవడం, వంటావార్పు కార్యక్రమంలో  వికారాబాద్ లో  అనేకచోట్ల పాల్గొనేదాన్ని.

  అంతే కాకుండా మానవహారం  మిలియన్ మార్చ్  ఉన్నపుడు కూడా వికారాబాద్ నుండి వచ్చి లోయర్ ట్యాంకు బండ్ దగ్గర ఆడవాళ్ళందరం కూడి, పోలీసుల కళ్ళు కప్పి ట్యాంక్ బండ పైకెక్కినాము. సాయంత్రం దాకా చాలా యాక్టివ్ గా పాల్గొన్నాము. నన్ను చూసి జనాలు ఏమిటీ ఈమెనే ఇట్ల పాల్గొన్నారు… మనం ఎందుకు పాల్గొనకూడదు, అనుకునే ఉత్సాహం  వచ్చేంతగా నేను ఎగిరిన… అదీ కాకుండా మేమందరం కలిసి 31 జనవరి 2010లో  ఆర్టీసీ ఫంక్షన్ హాల్లో ఒక మహిళా సదస్సు ఏర్పాటు చేసినాము. అట్లా వికారాబాద్ నుండి విద్యార్థులను నాలుగైదు కార్లలో తీసుకొని పోయినాము. కార్లో పెట్రోల్ నేను పోయించుకోలేదు కానీ, మిగిలిన ఖర్చులన్నీ నేనే పెట్టుకున్నా…

ఆ విధంగా పనిచేసిన తర్వాత సాగరహారం చేసినప్పుడు పోలీసులు చాలా గట్టి బందోబస్తు చేసి నెక్లెస్ రోడ్ లోకి రానివ్వలేదు. రవీంద్ర భారతి దగ్గర నుండి పోతుంటే.. అక్కడ అడ్డుకున్నారు. తర్వాత ఖైరతాబాద్ నుండి పోతే అక్కడా అడ్డుకున్నారు. రవీంద్ర భారతి దగ్గర పోనిచ్చారు. మనుషులని అడ్డు చెప్పలేదు! అక్కడినుండి లోపలికి పోయిన తర్వాత ఎక్కువసేపు స్లొగన్స్ ఇచ్చినాను. ఆఖరుకు బాష్పవాయువు ప్రయోగం చేశారు. అప్పుడు అందరం విడిపోయినాము. తిరిగి లోయర్ ట్యాంకుబండ నుండి సంజీవయ్య పార్క్ వరకు నడిచి సాగరహారం లోపలికి వెళ్ళాము. ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొన్నాను. ఆర్ట్స్ కాలేజీ దగ్గర విద్యార్థులను అరెస్టు చేశారు. ఎన్నోసార్లు అలా అరెస్టు అయి,  పోలీసు స్టేషన్ కు పోయి వచ్చినాము.

   రైలు రోకోలు ఎన్ని కార్యక్రమాలు చేశారో అన్నిట్లో చివరి వరకు పాల్గొన్నాను. యూనియన్ వాళ్ళు తప్ప చాలా సందర్భాలలో ఒక్కదాన్నే ఉన్నాను. చివరకు  ఉద్యమం సఫలీకృతమై, తెలంగాణ రాష్రం ప్రకటించేంత వరకూ నా వయసును లెక్కపెట్టకుండా ఊరూరా తిరిగాము.   హైదరాబాదులో , వికారా బాద్ లో తిరిగాము.

  తెలంగాణ వచ్చిన తర్వాత ఆ రాత్రి 12 గంటలకు అందరితోనూ తెలంగాణకు సంబంధించిన ప్రతిజ్ఞ కోదండరాం చేయించాడు. ఆయన వికారా బాద్ కు వచ్చిండు ఆ ప్రతిజ్ఞ నాతోనే చేయించాడు. అప్పుడు కూడా 12 గంటల రాత్రి వికారాబాద్ లో నేను ఒక్కదాన్నే ఆడదాన్ని.

      అట్లా తెలంగాణ కోసం కృషి చేసినాను. ఇందిరాపార్క్ దగ్గర ఎన్నో సమావేశాలు అయ్యాయి… వాటిలో కూడా మాట్లాడాను. అయితే నేను చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే 69 నుండి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నేను ఏ రాజకీయ లబ్దిని ఆశించి కాదు! తెలంగాణ అస్తిత్వం కాపాడాలి! తెలంగాణ గౌరవాన్ని కాపాడుకోవాలి! మన తెలంగాణలో ఉన్న   మన నిధులు మనకు కావాలి! మన ఉద్యోగాలు మనకు కావాలి! మన సంస్కృతి మనకు ఉండాలి! అని నిలబడ్డాను. ఏమాశించి పనిచేయలేదు. ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను.

పద్మజ:- మీరు తెలుగు భాషా అధ్యాపకులుగా పనిచేసారు. ఆ సందర్భంగా మీ విద్యార్థులకు పద్యపఠనం ఎలా చేయాలనీ, కావ్యగానం ఎలా చేయాలనీ చెప్పిన సందర్భంలో చెప్పిన పద్యాలను ఆలాపించండి! మయూఖ పాఠకులు వింటారు.

ఇక్కడ దేవకీదేవి గారి పద్యపఠనం

పద్మజ :– మయూఖ పత్రిక మీద మీ అభిప్రాయం లేదా పత్రికల మీద మీ అభిప్రాయం చెప్పండి!

దేవకీదేవి:– ఇప్పుడు  అంటే ఈ మధ్యకాలంలో పత్రికలు ఆన్ లైన్ ( అంతర్జాలం) లోనే ఎక్కువగా వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో దూసుకుపోతున్న పత్రిక  మయూఖ. మరియు ఈ పత్రిక రచయితలతో పాటు  రచయిత్రులందరినీ సమానంగా ప్రోత్సహిస్తున్న పత్రిక! రచయిత్రులకు ఒక ఊతం లాగా ఉపయోగపడుతున్నది. కాబట్టి తప్పకుండా మయూఖ పత్రికను అభినందించాల్సిందే! ఇందులో నవలలు కూడా సీరియల్స్ గా వేస్తున్నారు. తర్వాత  ముఖాముఖిలు రికార్డింగ్ చేయడం అనేది భావితరాలకు అవసరమైనటువంటిది. ఒక్కో రచయిత ఒక్కో దశలో ఒక్కో ప్రక్రియలో రాణించారు… అని తెలుపుతుంది.

   ఇందులో ప్రచురింపబడితే ఎన్నో అవకాశాలు వస్తున్నాయి. కొందరికి అన్నం ముద్ద నోట్లోకి పోవాలంటే… విస్తరి కావాలి! అంటే మోదుగాకులు అడవి నుండి తెచ్చుకోవాలి, పుల్లలు ఏరుకోవాలి, వాటిని  కుట్టుకోవాలి, బియ్యం సంపాదించుకోవాలి! వాటిని వండుకుంటే అప్పుడు గాని అన్నం బుక్క నోట్లోకి పోదు!  అట్లాంటి జీవితాలున్న వారిని కూడా పరిచయం చేస్తున్నారు కదా అదీ సంతోషం…..

పద్మజ:- మీ విలువైన అభిప్రాయం వెలిబుచ్చినందుకు, అడగగానే ఎక్కువ సమయం గడిచిపోకుండా రచయిత్రిగా మీ సవిస్తరమైన అనుభవాలు, జ్ఞాపకాలు మా పాఠకులతో పంచుకున్నందుకు చాలా సంతోషంతో అనేక  కృతజ్ఞతలండీ! 

January 31, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

అంతరంగం

by Narendra Sandineni January 31, 2025
written by Narendra Sandineni

అన్నవరం దేవేందర్ అంతరంగం వర్తమాన జీవన చిత్రణ పుస్తకం పై సమగ్ర విశ్లేషణా వ్యాసం.

ప్రముఖ కవి,అన్నవరం దేవేందర్ కలం నుండి జాలువారిన అంతరంగం వర్తమాన జీవన చిత్రణ  పుస్తకం పై సమగ్ర విశ్లేషణా వ్యాసం.కవి దేవేందర్ దిశ డిజిటల్ దినపత్రికలో మే 2021 నుండి సెప్టెంబర్ 2024 వరకు నిర్విఘ్నంగా కాలమ్ కొనసాగింది.అంతరంగం అనేది వ్యక్తి యొక్క అంతర్చేతన భావాలు,ఆలోచనలు మరియు అనుభవాల సమాహారం.ఇది మన లోపలి వ్యక్తిత్వాన్ని,మనోభావాలను మరియు జీవితానికి సంబంధించి మన దృష్టిని ప్రతిబింబిస్తుంది.వర్తమాన జీవన చిత్రణ అంటే ప్రస్తుత కాలంలో వ్యక్తులు మరియు సమాజంలో ఎలా జీవిస్తున్నారో వివరిస్తూ ఆ జీవన శైలిని అర్థం చేసుకోవడం.ఇది వ్యక్తి జీవన విధానం నుండి సామాజిక అంశాల వరకు విస్తరించవచ్చు.ఆధునిక జీవనశైలి అంటే టెక్నాలజీ ఆధారిత జీవనం,స్మార్ట్ ఫోన్లు,కంప్యూటర్లు, ఇంటర్నెట్ ప్రభావంతో కూడి ఉంటుంది.నిత్యం పనిలో బిజీగా ఉండే జీవితం,సమయం తక్కువ, పని ఎక్కువ.కుటుంబంపై శ్రద్ధ తక్కువ,వ్యక్తి స్వేచ్ఛ ఎక్కువగా కొనసాగుతున్నది. సాంప్రదాయాల పట్ల ఆసక్తి నశించి ఆధునికతకు మక్కువ పెరగడం చూస్తున్నాం.సామాజిక జీవనంలో  స్నేహ సంబంధాలు తగ్గుతున్నాయి.జనం డిజిటల్ మీడియాలో పరిమితం అవుతున్నారు.నగరాల్లో పెరుగుతున్న జనసాంద్రత,గ్రామాలతో తగ్గుతున్న  సంబంధాలు,మానవ అంతరంగం పై ప్రభావం చూపుతున్నాయి.ప్రస్తుత జీవన శైలి అంతరంగం ఒత్తిడి మరియు అశాంతి మధ్య చిక్కుకొని ఊగిసలాడుతున్నది.ఆధ్యాత్మిక,స్వీయ చింతనలు మరియు ధ్యానం వంటి పద్ధతులు వ్యక్తి అంతరంగాన్ని ప్రశాంతంగా ఉంచడంలో కీలకంగా పని చేస్తున్నాయి.ఆధునిక జీవనంలోని వ్యక్తుల అంతరంగాన్ని సమాజంలోని మార్పులను సమన్వయం చేస్తున్న జీవన శైలికి ప్రతిబింబమైన కవి దేవేందర్ అంతరంగం వర్తమాన జీవన చిత్రణ కాలమ్స్ ను మనస్ఫూర్తిగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేద్దాం.అంతరంగం మనస్సులోని జ్ఞాపకాలను తెలియజేసే శక్తి.అంతరంగం పుస్తకాన్ని కలం పట్టిన తొలినాళ్ళ నుంచి కలిసి వెంట నడుస్తున్న సోపతిగాడు,పాత్రికేయ వృత్తినే నమ్ముకొని జీవితాన్ని ఒక యుద్ధంగా ఎల్లదీస్తున్న సాహసికుడు ఆత్మీయ మిత్రుడు మహమ్మద్ ఫజుల్ రహమాన్ కు అంకితం ఇవ్వడం ముదావహం.డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ ముందు మాటలో కొన్ని విషయాల అంతరార్థం విడమర్చి చెప్పే వరకు దాని విస్మృత,విపక్ష,వివక్షిత కోణం పాఠకులకు స్ఫురించదు.దేవేందర్ పూర్వాశ్రమంలో జర్నలిస్ట్ కావడంతో నిరంతరం రాసే నైపుణ్యం అబ్బింది. తెలంగాణ మనుషుల జీవితపు ప్రతి మలుపును ఈ వ్యాసాలు సంక్షిప్తంగానే అయినా నిక్కచ్చిగా రికార్డు చేశాయి.ఈ అంతరంగంలో దాదాపు 30 పుస్తకాల పరిచయం ఉన్నది.అన్నవరం దేవేందర్ రచన అంటేనే అది తెలంగాణ తల్లి కమ్మనైన భాషకు అక్షర రూపం.నిరంతరాయంగా మూడేళ్లకు పైగా ఒక కాలమ్ తెలుగు పత్రికల్లో రాయడం అంటే కష్ట సాధ్యమైన పని.ఈ వ్యాసాల ద్వారా తన ఒక్కడి అంతరంగం మాత్రమే కాకుండా సమాజానికి బాకీ పడ్డాం అని భావించే బుద్ధిజీవులందరి భావనలను ఆవిష్కరించాడు.అందుకు ఈ పుస్తకాన్ని చదవడం, మిత్రులకు గిఫ్టుగా ఇవ్వడం కూడా ఒక మార్గమే సంగిశెట్టి శ్రీనివాస్ అంటున్నారు.డి.మార్కండేయ ముందు మాటలో సముద్ర గంభీర విషయమైనా, సాధారణ అంశమైనా ఎంతో అలవోకగా,నల్లేరు మీద బండి నడిచిన చందాన అచ్చ తెలంగాణ యాసలో రాయడం అన్నవరం దేవేందరన్న శైలి.ఒక ఆర్టికల్ కి మరొక ఆర్టికల్ కి పొంతన లేకుండా వైవిధ్యపూరితమైన అంశాలను ఎంచుకోవడమే కాకుండా వాటిని పండు ఒలిచి పెట్టినట్లుగా పాఠకులకు చెప్పడం అన్నకు కొట్టినపిండి.మూడేళ్ల పాటు అన్న తన కాలమ్ ని దిశ దినపత్రిక సాహిత్య పేజీలో కొనసాగించారు.అంతరంగం శీర్షిక పేరుతో కొనసాగిన ఆ కాలమ్..పాఠకుల్లో బాగా పాపులర్ అయింది.పేజీకి తెలంగాణ అస్తిత్వాన్ని తెచ్చిపెట్టింది అన్నారు.అట్ట వెనుక అర్థవంతమైన బ్లర్బ్ రాసిన నగునూరి శేఖర్ ఈ ‘అంతరంగం’ 2021 నుంచి దిశ దినపత్రికలో రాస్తున్న కాలమ్ వ్యాసాలు.ఇందులో సామాజిక,సాహిత్య అంశాలతో పాటు వ్యక్తిత్వ నిర్మాణ అంశాలను తనదైన వాస్తవిక దృక్పథంతో విశ్లేషించారు.అంతరంగం సమకాలీన సామాజిక అంశాలను చిత్రిక పట్టిన సంవేదనల సారం. నడుస్తున్న చరిత్రకు అక్షర రూపం అన్నారు.కవి దేవేందర్ తన అంతరంగ ఆలోచనల గురించి చెబుతూ సృజనాత్మక రచనా వ్యాసంగం కొనసాగుతున్నప్పుడు 2021 మే నెలలో మా హుస్నాబాద్ తొలితరం పాత్రికేయ సహచరుడు మహమ్మద్ ఫజుల్ రహమాన్ ఫోన్ చేసి ‘దిశ’ దినపత్రిక సాహిత్య పేజీలో ఒక కాలమ్ రాయాలని ఆదేశించే ధ్వనితోనే కోరిండు.తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఉధృతంగా కవిత్వం రాస్తున్న నాకు 2018 తర్వాత వచనం రాతలకు విరామం మిగిలింది.వెంటనే ‘సరేపో’అని మొదలుపెట్టాను. అప్పుడే ‘రేషమున్న యువతరం ఎక్కడ’ అనే వ్యాసం రాసి పంపిస్తే దానికి ‘అంతరంగం’ అని శీర్షిక తనే పెట్టి ‘దిశ’లో ప్రచురించారు.ఈ అంతరంగం వెనుక ఇంత నేపథ్యం దాగి ఉంది అంటున్నారు.ఈ పుస్తకాన్ని సాహితీ సోపతి,కరీంనగర్ వారు ముద్రించారు.కవి దేవేందర్ అంతరంగంలో నుండి పురుడు పోసుకుని పుట్టిన నూట యాభై కాలమ్స్ సర్వాంగ సుందరంగా అలరారుతున్నాయి.

రేషమున్న యువతరం ఎక్కడ? కాలమ్ లో 
తెలంగాణ సాయుధ పోరాటం,భూస్వామ్య వ్యతిరేక నక్సల్స్ పోరాటం,రెండు మార్లు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాలు,రాజకీయ ఉద్యమాలు,ఇన్ని రాజకీయ ఉద్యమాల స్వభావం ఇక్కడి ప్రజల మీద ఉన్నా గానీ,ఇప్పటి మిలీనియర్స్ తరంలో ప్రశ్నించే స్వభావం కనిపిస్త లేదు.ఎంత అవినీతి జరిగినా నవతరం ఆ వార్తలను సైతం చూడని స్థితి నెలకొని ఉన్నది.ఇదొక పట్టింపులేని తరం వస్తున్నదా? ఆలోచించాలి.కవి దేవేందర్ సమాజం గురించి యువతరం పట్టించుకోవడం లేదని, యువతరంలోని రేషం,ఆవేశం ఏమైంది?అని ఆలోచనలు రేకెత్తించడం బాగుంది.

సచ్చిన పిల్లిని గోడవతల ఇసిరేసినట్టు …కాలమ్ లో
కోవిడ్ మహమ్మారి సోకి మనదేశంలో లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు.రోజు రోజుకు మరణాల సంఖ్య పెరిగిపోయి దుఃఖం ప్రవహిస్తున్నది.మరణం మనిషికి వచ్చేదే కానీ,అకాల మరణం సాగనంప లేని దుస్థితి.మనిషి చస్తే నల్లని పాలిథిన్ కవర్లో చుట్టి మునిసిపాలిటీ వాళ్లకు అప్పగించడం,ఎండిన కనుగుడ్ల నుంచి నీళ్లను రాల్చడం.పిల్లి చచ్చిపోతే గోడ అవతలకు పెరట్ల ఇసిరేసినట్లు అయ్యింది.కరోనాతో చనిపోయిన వాళ్ళ స్థితి అలా తయారయింది.కవి దేవేందర్ చక్కటి జాతీయాన్ని ఉపయోగించి కరోనా వైరస్ వాస్తవాన్ని కళ్ళ ముందు ఉంచారు.

అధ్యయనంతోనే వికాసం కాలమ్ లో    
మనిషి ఆకలి తీర్చేది పుస్తకమే.మస్తిష్కపు దాహం తీర్చేది పుస్తకమే.ప్రపంచం గురించి పరిచయం చేసేది పుస్తకమే.అసలు పుస్తకాలు లేనిదే మనిషి వికాసం లేదు.కవి దేవేందర్ మనిషికి అధ్యయనంతోనే వికాసం ఉంటది అని,ఇలాంటి కోవిడ్ పాండమిక్ సమయాలలో పుస్తక పఠనం ఉపయోగపడుతుందనడంలో సందేహం లేదు అని అంటున్నారు.పుస్తక పఠనం మనిషి ఉన్నతికి సోపానం అవుతుంది.

దుక్కం కమ్ముకొస్తున్న కాలం కాలమ్ లో   
ఎవరిని కదిపిన ఆత్మీయుల కరోనా మరణ రోదనలే.ఎంత దుక్కం అంటే దగ్గర వాళ్లు చనిపోయినప్పుడు బిగ్గరగా పట్టుకొని ఏడ్వ లేని కాలం.మనిషి ఆఖరి యాత్రలో ఆయన జ్ఞాపకాలను తలచుకుంటూ నడవలేని,పోలేని దుస్థితి.ఒక వైపు లాక్ డౌన్ మరో వైపు కరోనా రెండో విడత.ఒక వైద్యులు తప్ప ఎవరు రక్షించలేని స్థితి.ఇంత దుక్క సందర్భంలోను గౌరవనీయమైన వృత్తి గల వైద్యం దారుణ దోపిడీ వ్యాపారంగా మారి పోయింది. లక్షలకు లక్షలు పోయినా మనిషి బతకని స్థితి. చచ్చినా పైసలు కట్టనిది శవాన్ని ఇయ్యని దుస్థితి. దేశంలో చాలా మంది ప్రాణాలు కోల్పోయారు.కవి దేవేందర్ ఇలా సమాజమంతా దుక్క మేఘాలు కమ్ముకున్నాయి అని అంటున్నారు.కరోనా వైరస్ కాలంలోని డాక్టర్ల దోపిడిని ఎండగట్టారు.

ఏలు వంకర పెట్టుడు ఎక్కువైంది కాలమ్ లో
అన్నింటి కన్న అల్కటి పని.దళారి వృత్తి.దళారికి పెద్ద పెట్టుబడి ఏం అక్కర్లేదు.మాటలే పెట్టుబడి. మత్పరిచ్చుడు,కొనిపిచ్చుడు.ఇద్దరి దగ్గర కమిషన్ తీసుకునుడు.జీవన వ్యయం ఇబ్బడి ముబ్బడిగా పెరగడం వల్ల సులువుగా సంపాదించే మార్గాలకు మనిషి పరుగులు తీస్తున్నాడు.ప్రభుత్వ ఉద్యోగులు, లంచాలు,అవినీతి,అన్యాయం,రాజకీయ నాయకుల కమిషన్లు,పనులు,పైరవీలు,ప్రజా ప్రతినిధులకు గూడ పైపైన సంపాదన లేనిది గడవని పరిస్థితి ఉన్నది.అన్ని రంగాల ఉద్యోగులు కూడా పైసలు సంపాదించే అవకాశం ఎక్కడ ఉంటే అక్కడ వేలు పెడతరు.ఒక సామెత ఉంది.‘ఏలు వంకర పెడితే వెన్న వస్తది’అని,ఆ వెన్న కోసమే వెన్న దొంగలు సమాజం అంతా నిండి పోయిండ్రు.కవి దేవేందర్ దేశం రాను రాను ఎటు పోతుందో ?అని ప్రశ్నించడం బాగుంది.

భూమి ఫక్కున నవ్వు కాలమ్ లో
భూమి మీద దయతలచి బతుకుడే గాకుండ, నేలంతా సత్తె నాశనం చేస్తుండ్రు.తెలంగాణ సాయుధ పోరాటంల లక్షల ఎకరాల భూమి పంచి ఇచ్చిండ్రు.ఈ భూమి మీదనే గుట్టలు,కొండలు ఉన్నయి.వాటిని కైమ కైమ చేసి పర్యావరణాన్ని సర్వనాశనం చేసుడు.భూమి మీద సముద్రాలను కలుషితం చేసుడు.వాతావరణాన్ని విష వలయం చేసుడు.ఈ మనిషి అనే జీవికే చెల్లింది.భూమి మీదనే అడవులల్ల మూగజీవాలను వేటాడుడు. నోట్లో నాలిక లేని ఆదివాసి సమాజాన్ని అడవి నుంచి వెళ్లగొట్టుడు.ఇదంతా భూమికి కన్నీరు తెప్పించుడే.కవి దేవేందర్ భూమి గూర్చి మనిషికి మనిషికి మధ్య కొట్లాటలు,కక్షలు,కార్పణ్యాలు కొనసాగుతున్నాయని,ఇవన్నీ చూసి భూమి పక్కున నవ్వుతది.మనిషి ఎక్కిళ్ళు పట్టి ఏడుస్తున్నాడు అని అంటున్నారు.మనిషి చేస్తున్న పనుల వల్ల సహనశీలి భూమాత రోదనలు మిన్నంటుతున్నాయి.వైరాగ్య భావనతో భూమి పక్కున నవ్వడం చూసి మనిషి కన్నీళ్లు కారుస్తున్నాడు అని చెప్పడం బాగుంది.

విద్య వేరు.. విజ్ఞానం వేరు కాలమ్ లో
విద్య వేరు విజ్ఞానం వేరు.అందులో పది మందికి ఉపయోగపడడం వేరు.చాలా మంది మస్తు చదువుకుంటరు.చదివిన శాస్త్రంలో తెలివి ఉంటది గని,బయటి తెలివి ఉండదు.అక్షరాలు నేర్వకున్న అందరి కంటే లోక రీతిగా పనులు చేసే వాళ్లు ఊర్లల్ల మస్తు కనిపిస్తరు.అక్షరాలు రావు.సమాజాన్ని చదువుతరు.బెక్కంటి బాలయ్య అనే పెద్ద మనిషికి చదువు రాదు.ఇతరుల కోసం పని చేసే తత్వం, చైతన్యం కనిపిస్తది.నిజంగా బాగా చదువుకున్న వాళ్ళు చదువు సంధ్యలు లేని వాళ్ల కోసం పని చేస్తారా?అనే ప్రశ్న వేసుకుంటే ఏమో చేయరనే జవాబు వస్తది.చదివిన చదువు,నేర్పిన శాస్త్రం చేస్తున్న ఉద్యోగం వెలగబెడుతున్న పదవి ప్రజలకు ఉపయోగపడాలి.పది మందికి అక్కరకు వస్తేనే జ్ఞానం.కవి దేవేందర్ విద్య వేరు విజ్ఞానం వేరు అని ఉదాహరణలతో చెప్పిన తీరు బాగుంది.

నవ్వే మనిషికి అందం … కాలమ్ లో

కొందరు వక్కడవక్కడ నవ్వుకుంటనే మాట్లాడుతరు.కొందరి మొగం మీద నవ్వు ఎల్ల కాలం ఉంటది.కొందరు ముసి ముసి నవ్వులు నవ్వుతరు.కొందరైతే అసలే నవ్వరు.అసలు మనిషికి మాత్రమే నవ్వు ఉంటది.పసిపిల్లలు పాలు తాగకుండా తల్లి దిక్కు నవ్వు కండ్లు పెడతరు. అంతరాల యంత్రాంగంలో నవ్వులు మాయమవుతయి.నవ్వు సహజంగనే రావాలంటే మనిషి స్వచ్ఛంగా ఉండాలె.తెల్ల కాగితం లెక్క మనసు ఉండాలె.స్వచ్ఛమైన శ్రమ జీవన మానవులకు నవ్వులే పూస్తయి.కవి దేవేందర్ మనిషి అహంకారాన్ని వదిలి వేస్తే నవ్వులు పూయించ వచ్చు అని అంటున్నారు.

అధికార మదంబున … కాలమ్ లో
పవర్ అనేది ప్రమాదకరమైనది.ఎన్నిక ద్వారా గెలిచిన ప్రజా ప్రతినిధులు ప్రజలకు సేవకులుగా ఉండాలి.యజమానులుగా ప్రవర్తిస్తుంటారు.ప్రజా ప్రతినిధుల ముందు అంగరంగ హంగూ ఆర్భాటం, ముందు వెనుక మందీ మార్బలం అట్లనే ఉంటది. అధికారం అంటేనే పెత్తనం.పెత్తనం అంటే నియంతృత్వం.నియంతృత్వంతో ప్రజాస్వామ్యం హతమవుతుంది.అధికారం తలకు ఎక్కిన తర్వాత అహంకారంతో అనుచితంగా ప్రవర్తిస్తుంటారు.ప్రజా సేవ అంటే ప్రజలకు సేవలు అందించడం.కవి దేవేందర్ ఇప్పుడు అట్ల కాదు అప్పటికీ ఇప్పటికీ నాయకుల వ్యవహార తీరు మారి పోయింది అని, ఆనాటి ప్రజాపాలకులు నిస్వార్ధంగా పని చేసే వారు అని అంటున్నారు.నిజంగా ఈనాటి ప్రజా ప్రతినిధులు అధికార మదంతో ప్రజా సంక్షేమం పట్ల శ్రద్ధ చూపడం లేదు.                                                        

మంది కోసమే మనమనుకోవాలె కాలమ్ లో
ప్రభుత్వ ఉద్యోగులు అంటే పబ్లిక్ సర్వెంట్లు.ప్రజల సేవకులు.ప్రభుత్వ ఉద్యోగులు,అధికారులు,ప్రజల పట్ల గౌరవంగానే మెలగాలి.అట్లా ఉండదు వ్యవహారం.అంతా చులకన,చిన్న చూపు.రేపు రాపో,మాపు రాపో,లేదు లేదు పో,ఇట్లా ఎట్ల పడితే అట్ల అనే పద్ధతి ఉంటది.కవి దేవేందర్ ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల నుంచి వచ్చిన వ్యక్తిగా ప్రజల వేతనం పొందుతూ ప్రజలకు జవాబుదారీగా బాధ్యతగా మెలగాల్సి ఉంటది అని అంటున్నారు.

పౌరస్పృహ కోల్పోతున్న కాలం కాలమ్ లో
సమాజంలో మనిషి మనిషిగా వ్యవహరించాల్సిన రీతి లేకుండా పోతున్నది.ఎన్ని చట్టాలు ఉన్నా,ఎన్ని నిఘాలు ఉన్నాయనే దాని కంటే ఎవరికి వారే స్పృహతో ఒక పద్ధతిగా జీవించాలి అనుకుంటే బాగుంటది కదా.కవి దేవేందర్ నిత్య జీవితంలో పౌరస్పృహ కనిపించని దృశ్యాలు ఎన్నో ఉంటున్నాయి అని అంటున్నారు.సమాజంలో పౌరులు బాధ్యతగా మెలగాలి అనే గొప్ప సూచన ఉంది.

పేరు ఆమెది …అధికారం ఆయనది కాలమ్ లో
స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలు,మండల ప్రజా పరిషత్,జిల్లా పరిషత్ లో మహిళలకు సగ భాగం రిజర్వేషన్ కల్పిస్తే కూడా,మళ్లీ మగ రాజ్యమే కొనసాగుతుంది.ఆయా సీట్లలో మహిళలు నిలుచుని గెలిచినా నిర్ణయాలు మగవారివే ఉంటున్నయి.ఊరి సర్పంచ్ మహిళ అయినా పంచాయతీ సమస్య ఆమె దగ్గరకు తీసుకెళ్లరు. అందరూ ఆమె భర్తకే తెలియజేస్తరు.ఇట్లా అయితే మహిళలకు హక్కులు,రిజర్వేషన్లు కల్పించడం ఎందుకు?అనే ప్రశ్న ఉత్పన్నమవుతుంది.పేరు ఆమెది అధికారం ఆమెది అయితేనే రాజకీయాల్లో మహిళలు రాణిస్తారు.కవి దేవేందర్ మహిళలు చైతన్యం పెంచుకొని తనదైన రీతిలో పాలించాలి అని భావిస్తున్నాడు.

పని పట్ల ప్రేమ ఉంటేనే మంచిది కాలమ్ లో
చేస్తున్న పని పట్ల ప్రేమ ఉంటే పని సులువు అవుతుంది.ఇది నా పని నేను ఈ రోజులో పూర్తి చేయాలి అనే టార్గెట్ తానే నిర్ణయించుకుని చేసుకుపోవడం సొగసైన పని.ఆధునిక కాలంలో మనిషి పని పట్ల శ్రద్ధ చూపించాలనే గొప్ప సందేశం వ్యక్తం అవుతుంది.

కరోనాతో కకావికలం కాలమ్ లో
కరోనా ప్రపంచాన్ని కకావికలం చేసింది.కరోనా వల్ల చనిపోయిన వాళ్ళ బిల్లులకు లక్షలకు లక్షలు అప్పుల చేసి దుఃఖపడుతున్న సందర్భాలు ఉన్నాయి.ఆసుపత్రుల యాజమాన్యాలు దారుణమైన దోపిడిని కొనసాగించాయి.ఆసుపత్రికి పోతే మరణించినట్లు అయ్యింది.కరోనా వల్ల బాగా లాభపడ్డది ఎవరంటే ఫార్మా కంపెనీలు,కార్పొరేట్ ఆసుపత్రులు.కరోనా వల్ల దాదాపు రెండు సంవత్సరాలుగా బడులు,కళాశాలలు నడువ లేదు. మైదానాల్లో చెట్లు మొలుస్తున్నయి.ఆటలు ఆడి చదువుకునే పిల్లల గుంపు లేదు.ఇండ్లల్లనే ఇన్ని రోజులుగా ఉండి పిచ్చెక్కిపోతున్న సందర్భం వచ్చింది.ఆన్ లైన్ క్లాసులు పేరుకు నడుస్తున్నాయి గని పిల్లలకు ఇది సరిపడడం లేదు.అందరి ఇండ్లలో అవకాశం లేకపోవడం చిన్న సెల్ ఫోన్ లో   టెలివిజన్లో విద్య,విజ్ఞానం పొందలేక పోతున్నారు. కరోనా వల్ల సామాన్యులు,చదువుకునే పిల్లలు అందరి జీవితాలు వెతల పాలయ్యాయి.కవి దేవేందర్ ఆనాటి దుస్థితిని కళ్ళ ముందు ఉంచారు.

యాజమాన్యం,ఉద్యోగ వర్గం కలగలిసి పోయిన కాలం కాలమ్ లో
ప్రభుత్వాలు,ఉద్యోగ సంఘాలు,స్నేహపూరిత వాతావరణంలో ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కార్మికులకైనా,కార్మిక నాయకులకైనా,ఉద్యోగ సంఘ నాయకులకైనా,పోరాట స్వభావం పూర్తిగా అంతరించి పోయినట్లు కనిపిస్తుంది.గ్లోబలైజేషన్ కాలం ఇరవై ఏళ్ల కింద ప్రపంచమంతా దాపురించింది.చాలా ఏళ్ల నుంచి ప్రభుత్వ,ప్రైవేటు రంగ కార్మిక సంఘాల పోరాట చైతన్యం కనిపించడం లేదు.సాఫ్ట్ వేర్ రంగంలో పని చేసే వాళ్లకు మంచి వేతనం ఉంటుంది.పని గంటలు ఎక్కువగానే ఉంటాయి.ఒత్తిడి కూడా ఉంటుంది.వాళ్లు ఎవరు ట్రేడ్ యూనియన్ లో కలవరు.సంఘం పెట్టుకునే అవకాశం కూడా లేదు.ఉద్యోగ సంఘాల్లో కూడా సమరశీలత కంటే సామరస్యశీలత ఎక్కువ కనిపిస్తది.యాజమాన్యం,ఉద్యోగ వర్గం కలిసి పోవడం తగదు.ఉద్యోగ వర్గంలో చైతన్యం కొరవడితే సమస్యలు ఎలా పరిష్కరించుకుంటారు అనే గొప్ప సందేశం కనబడుతుంది.

మనసు తెలుసుకోవాలి కాలమ్ లో
అవతల వారిని అర్థం చేసుకోకపోతే మనసుల మధ్య దూరం పెరిగిపోతుంది.సమస్యనైనా, విషయాన్నైనా అవతలి వ్యక్తుల సైకాలజీతో పరిశీలించాలి.లేకుంటే మానవ సంబంధాలు దెబ్బ తింటాయి.రాజకీయ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి.అది ఇసుమంత అయినా సరే ఏ రాజకీయ పార్టీ అయినా అట్లనే ఉంటది. అధినేతకు నంగి నంగి,వంగి వంగి ప్రవర్తిస్తేనే మనుగడ ఉంటది.మనిషి ఎట్లా ఉన్నాడో ఆయన చుట్టూ ఉన్న వాళ్లతో సంబంధాల కొనసాగింపు వల్ల తెలుస్తది.కవి దేవేందర్ ఏది ఏమైనా ఒకరికొకరు అర్థం చేసుకోవడం,అవతలి వాళ్ళ స్థితిని, ఆలోచనలను గౌరవించడం అందరి మానసిక ఆరోగ్యానికి మంచిది అని చెప్పిన తీరు బాగుంది.ఇవ్వాళ సమాజంలో అదే కొరవడింది. మనిషి అవతలి వాళ్ళ మనసు తెలుసుకొని ప్రవర్తించాలి అనే ఆదర్శ భావం దాగుంది. 

ఎవల పని వాళ్లే చేసుకునుడు కాలమ్ లో
ఇంటా,బయటా గమనిస్తుంటే కొంతమంది ఇంకొకరి మీద ఆధారపడి జీవించేవాళ్ళు కనిపిస్తరు.నిజానికి ఎవరి పని వాళ్ళు చేసుకోవడంలో ఉన్న తృప్తి, ఆనందం పొందడం ఆత్మగౌరవం.ఎవరి వ్యక్తిగత పనులు వాళ్ళు చేసుకోకపోవడం పూర్తిగా ఇంకొకరి మీద ఆధారపడి జీవించే స్థితి స్టేటస్ గా కొనసాగుతుంది.నిజానికి సమాజంలో పని సంస్కృతి పెంపొందాలి కానీ,చేయించుకునే కల్చర్ పెరుగుతుంది.ఇది పని పట్ల వ్యతిరేకత.పని చేసే మనుషుల పట్ల తక్కువ భావం.ఎవరి పనులు వాళ్లే చేసుకోవాల్సిన అవసరం ఉంది.కవి దేవేందర్ మనిషి ఇతరులపై ఆధారపడవద్దని,బద్ధకాన్ని వీడాలని,ఎవరి పనులు వాళ్లు చేసుకోవాలని. ఆరోగ్యానికి మంచిది అని చక్కగా వివరించారు.

మాట తీరుతోనే మనిషి విలువ కాలమ్ లో
మనిషికి మనిషి పట్ల గౌరవం ఉండాలి.ప్రేమ హృదయం కనపడాలి.ఈ తరం పిల్లలు మాత్రం ‘అంకుల్ ఆంటీ’అని ఇతరులను గౌరవ సూచకంగనే పిలుస్తున్నరు.కొందరు ఇంకొకరి గురించి మాట్లాడితే పేరు చివరకు అన్నా అంటరు.అందులో మనకు అభిమానం కనిపిస్తది.ఏది ఏమైనా మనిషి అన్న వాడు ప్రేమాస్పరుడు అయి ఉండాలి.హృదయం తెల్ల కాగితంలా తెల్లగా ఉండాలి.కవి దేవేందర్ మాట తీరుతోనే మనిషికి విలువ ఉంటుందని,మనిషి ఇచ్చిన మాటను కాపాడుకోవాలి ఆని చెప్పిన తీరు అద్భుతంగా ఉంది. 

పట్టింపు లేని తరం తయారవుతున్నది కాలమ్ లో
ఇప్పుడు పెరుగుతున్న తరంలో ప్రశ్నించుడు.ఇట్లా ఎట్ల ఉంటుంది.ఇది పద్ధతి కాదు కదా?అని ఆలోచించుడు పూర్తిగా లేకుండా అయితంది.పక్క వారికి అన్యాయం జరిగినా పట్టించుకోక పోవడం, ఏదైనా సమస్య వస్తే దాని మూలాల్లోకి వెళ్ళక పోవడం,ముఖ్యంగా హేతుబద్ధంగా ఆలోచించక పోవడం ఎక్కువగా కనిపిస్తుంది.పూర్వకాలంలో శ్రీ శ్రీ మహా ప్రస్థానం చదివి అదో రకమైన ఉత్తేజం పొందారు.సామాజిక విషయాల పట్ల అవగాహన, చట్టాల అమలు,పౌర హక్కులు,పౌర స్పృహ, బాధ్యతలు,ప్రభుత్వ తీరు తెన్నులు లాంటి అంశాల అవగాహన లేకుండా పోయింది.కవి దేవేందర్ ఈనాటి యువతరం పట్టింపు లేకుండా వ్యవహరిస్తున్నారు అని అంటున్నారు.

మొక్కలు నాటుడు గుట్టలు మింగుడు కాలమ్ లో
మొక్కలు నాటాలె,చెట్లు పెంచాలనే స్పృహ ఈ కాలంలో అందరికీ వచ్చింది.ప్రతి పల్లెకు ఆనుకుని ఉండే గుట్టలకే ముప్పు వచ్చింది.ఊరెక్కడ అంటే ఆ గుట్ట కిందనే అని చెప్పుతరు. అగోరామసక్కదనమసొంటి గుట్టలను గ్రానైట్ అమ్ముకునేందుకు మాయం చేస్తున్నరు.ఊరంతా మొక్కలు నాటి పెంచుడెందుకు?వేలాది చెట్లు, మహావృక్షాలు ఎదిగిన గుట్టలను పగలగొట్టుడు ఎందుకు?గుట్ట అంటే రాళ్లు,బండలు మాత్రమే కాదు.అదొక వనం.గుట్టలను పైసల కోసం గ్రానైట్ క్వారీలకు ఇస్తే పర్యావరణం నాశనం అయితది. ఊర్లల్ల హరితహారం ఎందుకు?ఊరు పక్క ఉన్న గుట్టలు అమ్ముకునుడెందుకు?ఇందులో వృక్షాలను, గుట్టలను కాపాడుకోవాలి అనే సందేశం కనబడుతుంది.

సుప్త చేతనకు మాతృభాష చికిత్స కాలమ్ లో
తెలుగు నేలకు వేల కిలోమీటర్ల ఆవల సౌదీ అరేబియా దేశం.తెలుగు వినిపించని కనిపించని ప్రాంతంలో చావు అంచులకు తాకి వచ్చింది. ముప్పయి నాలుగు రోజులు కోమాలో ఉన్న స్థితి.

ఇరవై ఏడు రోజుల నుంచి వెంటిలేటర్ నుంచి ప్రాణ వాయువు అందుతున్నది.నాలుగు తెలుగు పదాల వల్లనే తన మెదడు పని చేస్తున్న అలికిడి వల్ల పునర్జన్మ పొందాడు.ఇర్ఫాన్ మహమ్మద్ జెడ్డా నగరంలో అంతర్జాతీయ స్థాయి సీనియర్ జర్నలిస్టుగా పని చేస్తున్నాడు.చిత్తూరు జిల్లా నుంచి వెళ్లి అక్కడ క్రిటికల్  కేర్ హెడ్ గా పనిచేస్తున్న మమతకు ఈ విషయం తెలిసింది.వెంటనే తన పేషెంట్ వద్దకు వెళ్లి తెలుగులో మాట్లాడింది.ఇర్ఫాన్ మెదడులో కదలిక కనిపించింది.ఈ వివరాలన్నీ ఇర్ఫాన్ స్వయంగా వివరించారు.తల్లి భాష పలుకులలోనే మెదడు మ్యాపింగ్ స్పందనలు.ఏ భాష అయినా నేర్చుకోవచ్చు.ఎవరి మాతృ భాష వారి సంస్కృతి.కవి దేవేందర్ పంచుకున్న ముచ్చట్లు ఎప్పటికీ గుర్తుంటాయి.సుప్త చేతనకు మాతృ భాష చికిత్సతో ఇర్ఫాన్ కోలుకోవడం అద్భుతం.

ప్రామాణికతే …  అప్రజాస్వామికత కాలమ్ లో
ఎవరు మాట్లాడుకునేది వాళ్ల భాష.ఎవల అవ్వ నేర్పిన పలుకులే వాళ్ళ భాష.ఇది ప్రామాణికమైన భాష అంటూ మిగిలినదంతా మాండలికం అనడం మంచిగా లేదు.అందరు మనుషులే అందరిదీ భాషనే.ప్రామాణికత గిట్లనే రాయాలి అనేది  అప్రజాస్వామికత.భాషలో కొత్త పదాలు కలుపుకుంట రాస్తూ పోవాలె.అది విస్తృతం అయితది.కవి దేవేందర్ ప్రామాణిక భాష గిట్లనే ఉండాలి.గిట్లనే రాయాలి అనుడు సక్కనైన మాట కాదు అంటూ భా‌షా పండితులకు సరైన సమాధానం ఇచ్చారు.

తెలంగాణ మట్టి పరిమళం పాట కాలమ్ లో
బతుకమ్మ పండుగ అంటే పువ్వులతో బతుకమ్మను పేర్సుడే కాదు.పదాలతో పాటలు అల్లుడు.బతుకమ్మ పర్వదినం.స్త్రీలు ఆడి పాడతారు.కాబట్టి స్త్రీల పండుగ.తెలంగాణ ప్రాంతానికే పరిమితమైన పర్వం.ఇది ఒక సాంస్కృతిక ఉత్సవం.పదాలు పాడుతూ కథనం చెప్పడం,దాన్ని కోరస్ గా ఉయ్యాలో అంటూ అందుకొని పాడడంలో ఒక సజీవ లక్షణం ఉన్నది.బతుకమ్మ అంటే తెలంగాణ ఆడబిడ్డలకు ఇష్టమైన పండుగ.బతుకమ్మ సంస్కృతి శ్రమ జీవితానికి సంబంధించినది. మహిళల కళాత్మక విలువలకు సంబంధించినది. బతుకమ్మ ఒక సాహిత్య సాంస్కృతికోత్సవం.కవి దేవేందర్ బతుకమ్మ విశిష్టతను తెలంగాణ మట్టి పరిమళం పాటలో ఉంది అని చెప్పిన తీరు చక్కగా ఉంది.

మనిషికి తార్కిక ఆలోచన ఉండాలి కాలమ్ లో
ఎంత విద్యావంతులైనా తార్కిక ఆలోచన లేకపోతే ఉత్త మనిషి కిందనే లెక్క.జీవితంలో కొంచెమైనా లాజికల్ గా ఉండాలి కదా! ఏమిటి?ఎట్లా? ఎందుకు?అనే శాస్త్రీయ విశ్లేషణ దాకా ఎందుకు? అనారోగ్యంగా ఉన్న మనిషిని ఆసుపత్రిలో చేర్పించేందుకు కూడా ‘మంగళవారం ఐ రాదు’ అనే ముచ్చట తెలిసి పరేషాన్ అనిపించింది. మంగళవారం నాడు ఆసుపత్రిలో చేరితే తమకు ఐ రాదు అంటే ఆ వ్యాధి ముదిరితే ఎట్లా?ఇంకో ప్రమాదం ముంచుకు రావచ్చు కదా?ఈనాటి విద్యార్థులకు చదువుతో పాటు లోక జ్ఞానం, శాస్త్రీయంగా ఆలోచించడం,తార్కికంగా చర్చించడం కూడా సిలబస్ లో ఉండాలి.కవి దేవేందర్ మూఢ నమ్మకాలను నమ్మ వద్దు.శాస్త్రీయంగా ఆలోచించాలి అంటూ కనువిప్పు కలిగించారు. 

యువతరానికి సోయి ఉండాలి కాలమ్ లో
రాజకీయ పార్టీలు,రాజకీయ ప్రముఖులు వాళ్ల కార్యకలాపాలు,వాళ్ల చరిత్ర చూస్తే విద్యావంతులకు జర అసహనం అనిపిస్తుంది గాని,ఈ ప్రపంచంలో రాజకీయ నిర్ణయం లేకుండా ఏదీ నడవదు. విద్యావంతులైన ఉద్యోగులు,సంపన్న శ్రేణులు, నిరుద్యోగులు రాజకీయాలు మనం చేయలేమని, మనకు సరిపోవు అని దూరంగా ఉంటున్నరు. అసలు ఓటు కూడా వేయడానికి నిరాసక్తత వ్యక్తం చేస్తున్నరు.మరి ఎంత దూరం ఉండాలని అనుకున్నా రాజకీయాలను,ఆయా పార్టీల తాత్విక సిద్ధాంతాలను అర్థం చేసుకోకుంటే అవి మన ప్రతి అవసరాన్ని ప్రభావితం చేస్తయి.రాజకీయ పార్టీలే కదా పరిపాలనను నడిపేవి.అయితే,అందులో అందరు అవినీతిపరులు ఉంటారు.ఇందులో కూడా కులాలు,మతాలు,ఆధిపత్య గొడవలు ఉంటాయి. మనకెందుకులే అనుకుంటే ఇంతే సంగతులు. అందుకే రాజకీయ పార్టీలు విద్యావంతుల జోలికి వెళ్ళవు.కవి దేవేందర్ రాజకీయాల పట్ల అసహనం కన్న చైతన్యం పెంపొందించుకోవాలని,రాజకీయాలు నేటి తరానికి అవసరం అంటూ ఆలోచింప జేస్తున్నారు.

కొత్త సంస్కృతులు విస్తృతమవుతున్నయి కాలమ్ లో
సంస్కృతి,సంప్రదాయాలు,ఆచారాలు,వ్యవహారాలు పరంపరగా వస్తుంటయి.ఇప్పుడు మధ్యతరగతి జనాలు చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా మద్యం బాటిళ్లు తెచ్చి దావత్ చేసుకుంటున్నరు.మద్యం తాగించడం కొత్త సంస్కృతిలో భాగమైంది.ఒక ఇంటిలో ఎవరైనా చనిపోతే ఇది వరకు ఆ కుటుంబాన్ని సాధారణంగా పరామర్శించేవాళ్ళు.కొత్త కల్చర్ వల్ల మందుతో పరామర్శించే అలవాటయింది.పుట్టిన రోజులకు మొదలు ప్రతి సందర్భంలోనూ మందు సంస్కృతి కుటుంబంలోనికి ప్రవేశించింది.ఈ సంస్కృతి కొనసాగింపుగా కింది మధ్యతరగతి శ్రమజీవనపరులు సైతం తాగడం, తూలడం లొల్లులు చేసుకోవడం ఎక్కువ అవుతున్నది.తాగడం ఎక్కువైతే కుటుంబంలో గొడవలు,రాష్ డ్రైవింగ్ ప్రమాదాలు,తద్వారా మరణాలు సంభవిస్తున్నాయి.ఎందుకంటే ప్రజలు తాగితేనే ప్రభుత్వ బొక్కసం నిండుతుంది.ప్రజలు తాగడానికి అలవాటై ఉంటేనే సీసా ఇచ్చి ఓట్లు వేయించుకోవచ్చు.కవి దేవేందర్ తాగడం వద్దని ఎవరూ అనరు.ఎవలకు వాళ్లే అదుపులో ఉండాలి అని అంటున్నారు.తాగుడు సంస్కృతికి స్వస్తి చెప్పాలి.అప్పుడే కుటుంబాలు,దేశం ప్రగతి పథంలో సాగిపోతాయనడంలో సందేహం లేదు.

చిన్నపిల్లగాండ్లకు కూడా తెలుస్తుంది కాలమ్ లో
చిన్న పిల్లలు కూడా మనం ఏం మాట్లాడుతున్నం? ఎందుకు మాట్లాడుతున్నం?మాటల వెనుక ఉన్న మర్మం కనిపెడుతున్న రోజులు ఇవి.ఈ రోజులలో యతి ప్రాసల మాటలకు ఓట్లు గలగల రాలవు కదా. గతంలో రాలవచ్చు.అవసరం కాబట్టి,ఇప్పటి మాటలను ఎట్లు నమ్ముదురు?అసలు ఈ లొల్లి ఎందువల్ల వచ్చింది.ఇలా తప్పు ఎవలది?ఒప్పు ఎవరిది?అనే సున్నితపు గీతను పసి కట్టే వాళ్ళు మేధావులే కానవసరం లేదు.ప్రజలు కనిపెడతరు. ఒక్కలు చెప్పిందే నమ్మే స్థితి కాదు.అందరి మనసులకు సీసీ కెమెరాలు ఉంటయి.అయితే నమ్మినట్టు మౌనంగనే ఉంటరు.ఎవలు చెప్పిన అదే గంపగుత్తగా నమ్మరు.కని లంగ ఎవలో?దొంగ ఎవలో?కనిపెడతరు.అవకాశం వచ్చినప్పుడు తెల్లగోలు చేస్తరు,చూస్తున్నం కదా?కవి దేవేందర్ చిన్న పిల్లలను ఉదాహరణగా తీసుకొని లోక రీతిని తెలియజేసిన తీరు అద్భుతంగా ఉంది.

అసలు ప్రజా ప్రాతినిధ్యం అదే కాలమ్ లో
ప్రజా ప్రతినిధులు అంటే ప్రభుత్వంలో ప్రజల సంక్షేమం కోసం పని చేసే వారు.చాలా మంది ప్రజా ప్రతినిధులు మంత్రులు అయిన తర్వాత అసలు మాట్లాడాలనుకున్న వారికి దొరకని స్థితి ఉంటది. మంత్రిగారి కారు నగరంలోకి వస్తుంటే ఆ హంగామానే వేరుగా ఉంటది.ఆయన వచ్చే రహదారులన్నీ ఆయన కోసం తెరిచి అందరికీ మూసి వేస్తరు.ఏ ఊర్లకు వచ్చినా రోడ్లన్నీ అన్యాయంగా నిలిచిపోవాల్సిందే.హంగూ, ఆర్భాటం,ఒక ప్రజాప్రతినిధి అస్తిత్వంగా చలామణి అవుతున్నది.ప్రజా ప్రతినిధులు ప్రజలకు యజమానులు అనే భావనలో ఉంటూ సేవా దృక్పథం ఉండాల్సి ఉంది.ప్రజాప్రతినిధులు ప్రజలను ముప్పు తిప్పలు పెట్టకపోతే సరిపోతది.ఏది ఏమైనా హంగామా,ఆర్బాటం,హడావుడి పటాటోపం తగ్గి పనులు సులువు అయితేనే అందరికీ తృప్తి.కవి దేవేందర్ ప్రజా ప్రతినిధులు ప్రజల పట్ల  బాధ్యతగా మెలగాలి అని గుర్తు చేస్తున్నారు.

అంతరాత్మను శోధించుకోవాలి కాలమ్ లో
ఎవరి అంతరంగాన్ని వాళ్లే జల్లెడ పట్టుకుంటే మనుషులకు మనుషులకు మధ్య అగాధం ఏర్పడదు.కొంత మంది మనుషుల సంబంధాలు దూరం దూరంగనే ఉంటయి.అయితే ఆఖరుకు ఎవరు ఏం పట్టుకపోరు కని,ఉన్నన్ని రోజులు కలిసి మెలిసి ఆత్మీయంగానైనా జీవిస్తే అనంత కాలంలో నాలుగు మంచి జ్ఞాపకాలని మిగిల్చి పోవచ్చు.మంచి ప్రవర్తన,మంచి మనస్తత్వం సుగుణం నలుగురికి సహాయం చేసే గుణం,అవసరానికి తోడు నిలిచే వ్యక్తిత్వం సమాజంలో అవసరమైన విషయాలు. ఇవన్ని రోజు రోజుకు మానవుల మధ్య పెరిగిపోతుండాలి కానీ తగ్గి పోతున్నాయి. మనిషన్నప్పుడు పుట్టి పెరిగిన వాతావరణంతో మమేకమై ఆలోచిస్తాడు.మనిషి అధ్యయనంతోనే చైతన్యం పెంపొందించుకోవాలి.మానవ సంబంధాలు సుతారంగా నిలుపుకోవాలి.అప్పుడే మానవ పరిమళం ముందు తరాలకు వారసత్వంగా ఇస్తుంది.కవి దేవేందర్ అంతరాత్మ శోధనతోనే మనసు తేలిక అవుతుందనే ఆలోచనలు రేకెత్తిస్తున్నాడు. 

మారుతున్న స్వరాలు కాలమ్ లో
ఎవరైనా ఎక్కెక్కి పడి ఏడిస్తే ‘అయ్యో ఎంత బాధనో గదా’అనే అనిపిస్తది.అందునా చంద్రబాబు నాయుడు అంతటి మనిషి వలవల కన్నీళ్లు రాలుస్తూ దుక్కపడితే అయ్యో అనిపిస్తది. ఎవరు ఏడిచినా ‘అయ్యో’ అంటాం.ఏది ఏమైనా రాజకీయ నాయకులు అత్యంత నీచమైన స్థితికి దిగజారి పోయారు.ఒక్క పార్టీ ఒక్క రాజకీయ నాయకుడు అని కాదు దాదాపు వ్యవస్థనే ఇట్ల తయారయింది.అసలు రాజకీయ పార్టీలకు ప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు సమాజానికి ఆదర్శంగా కనిపించాలి. తిట్టుకొనుడు,జుగుప్సాకరమైన మాటలు అనుకునుడు.ఒకరిని మించి మరొకరు తయారవుతున్నారు.ఇతర నాయకులను చులకన చేసి మాట్లాడడం,ఎట్ల పడితే అట్లనే మాట్లాడడం కామన్ అయ్యింది.కవి దేవేందర్ రానున్న రోజులలో అలనాటి ఆదర్శ నాయకులు కనిపించకపోవచ్చు అని అంటున్నారు.

ఆస్వాదిస్తేనే ఆనంద జీవనం కాలమ్ లో
సూర్యోదయం,సూర్యాస్తమయ సందర్భాలను అప్పటి సూర్యుని రంగును పరవశంతో పరిశీలిస్తే కలిగే తృప్తి వేరుగా ఉంటది.ఇది ఎక్కువగా పల్లెటూర్లనే సాధ్యం.పట్టణాల్లో సూర్యుడే కనపడనన్ని ఎత్తైన భవనాలు,కాంతి కూడా రాకుండా గోడలు,పరదాలు,మల్లా లోపల కాంతి కోసం విద్యుత్ దీపాలు,చెరువు గట్టు మీది నుంచి లేదా పొలం గట్ల మీద మీంచి సూర్యోదయం కన్నా ముందే నడుస్తే ఆ వాతావరణ అనుభూతి ఎందులో రాదు.ప్రేమ,ఆనందం,స్నేహభావం,ఇవన్నీ మనిషి జీవితాన్ని సంపన్నున్ని చేస్తాయి.డబ్బు,ఆస్తి, అంతస్తు,హోదా,పార్టీలు ఇచ్చే సంపన్న సుఖలాలస కంటే,ప్రకృతిలో ప్రకృతిగా సాటి మనిషిని కరుణ రసాత్మకంగా చూడటం మంచిగుంటది.పట్నంలో ఉన్న వాళ్లు కూడా ఏం పని చేయాలన్నా కొంచెం బయటకు నడిచి వెళ్లాలి.చెట్లు చేమను చూస్తే మనిషికి ఒక రకమైన మానసిక ఉల్లాసమే కాదు పులకరింత కూడా.పసిపాపల నవ్వుల లోని వెలుగు చూడగలగాలి.మూగజీవాల పట్ల కరుణ ప్రకటించాలి.కవి దేవేందర్ మనం ఇతరులకు ఇవ్వడంలో ఉన్న మానసిక తృప్తి తీసుకోవడంలో ఉండదని అంటున్నారు.ఆస్వాదిస్తేనే ఆనంద జీవనం ఉంటుందనే విషయాన్ని అందరం స్వాగతిద్దాం.

అనివార్యతను ఆహ్వానించాల్సిందే కాలమ్ లో
తల్లిదండ్రులను ‘ఓల్డ్ ఏజ్ హోంలో వేయవద్దు లేదా వేస్తున్నారు’ అనే నిందార్థంలో పత్రికలు,టీవీలలో కార్టూన్లు,కథలు,వ్యాసాలు వస్తుంటాయి.వృద్ధులకు ఇల్లే మంచి సౌకర్యం,సౌలభ్యం.ఇంట్లో మనుషులందరు రెక్కలు వచ్చిన పిట్టల్లా ఎగిరిపోతే ఎలా?ఉన్న ఊర్లో ఉద్యోగాలు ఉండవు.చదివిన చదువులకు కొలువులు ఎక్కడో సుదూర నగరాల్లో లేదా దేశాల్లోనే.ఇది కాలం తెచ్చిన బలవంతపు పరిణామం.అక్కడికి వృద్ధులైన తల్లిదండ్రులను తీసుకుపోలేరు.తీసుకుపోయినా అక్కడ నెగుల లేరు.ఎవరో ఒకరు పెడితే తినాలి.వండితేనే ఉండాలి అనే స్థితికి వచ్చినంక ఈ ఓల్డ్ ఏజ్ హోంలు అవసరానికి అనుగుణంగానే వెలసినాయి.నిజానికి ఓల్డ్ ఏజ్ హోంలో అన్నీ ఉంటాయి.ఇక ఆఖరుకు వృద్ధులంతా కలిసి ఉండాల్సింది వృద్ధాశ్రమాలలోనే. ఆధునిక మార్పులకు అనుగుణంగా వృద్ధ తల్లిదండ్రులు పిల్లలు అందరు మైండ్ సెట్ మార్చు కోవాల్సి ఉంటుంది.ఆఖరు మజిలీలో అదొక ఆటవిడుపు అవుతుంది.సాంకేతిక విద్య విస్తృతమైన తర్వాత ప్రపంచీకరణ ప్రభావం వల్ల కుటుంబాలు కూడా గ్లోబల్ అయిపోయినవి. అనివార్యమైన అభివృద్ధి నమూనా ఇది.

కవి దేవేందర్ అనివార్యతను ఆహ్వానించాల్సిందే అని అంటున్నారు.

పుస్తకం ప్రియ భూషణం కాలమ్ లో
పుస్తకాలే ప్రపంచాన్ని పుట్టిస్తాయి.పుస్తకాలు అధ్యయనం చేయకుంటే బాయిలో కప్పలాగ జీవించడమే.ఆ కప్పకు కూడా చచ్చేంత వరకు ఆహారం దొరుకుతుంది.ఆనందంగానే ఉంటది కావచ్చు.కానీ,ఆ బాయి దాటి ప్రపంచాన్ని చూడ లేరు.ప్రపంచంలోని ఎన్నో విషయాలు పుస్తకాలలోనే నిక్షిప్తమై ఉన్నాయి.మానసిక వికాసం కొరకు,చరిత్ర పట్ల అవగాహన కోసం,పుస్తకాలు చదవడం అవసరం.పుస్తకాలు సమస్త ప్రజల ఆస్తులు కావాలి. ఇంటింటా పుస్తకాల అలమార ఉంచుకోవాలి. అందులో నచ్చిన మెచ్చిన అన్ని రంగాల పుస్తకాలు అమర్చుకోవాలి.కవి దేవేందర్ చెప్పినట్లుగా పుస్తకం ప్రియ భూషణం కావాలని కోరుకుందాం.

కాలానికి సజీవ సాక్ష్యం గాజోజు ప్రాణదీపం కాలమ్ లో
గాజోజు నాగభూషణం ఆయన తన యాభై ఏళ్ల తర్వాత ప్రాణ దీపం కవితా సంపుటిని ప్రామాణికంగా వెలువరించారు.అంతకు ముందు మట్టి సరిగమలు నానీల పుస్తకం వెలువరించారు. ప్రాణ దీపంలో ఉద్యమాల తాత్వికత,జీవన సంఘర్షణలు,పోరాట ఆరాటాలు,అసమానతలపై ఎక్కుపెట్టిన ఆలోచనలు,కరోనా కల్లోల నేపథ్యాలు ఉన్నాయి.ఈ ప్రాణదీపం కవితా సంపుటిని ఇటీవలనే పరమపదించిన తన మాతృమూర్తి స్మృతిలో రచయిత వెలువరించారు.కవి దేవేందర్ ఇందులో ఎన్నో సమకాలీన విషయాలు మనల్ని కలవరపెడతాయని అంటున్నారు.

సాన తేలిన వేట వాక్యం బూర్ల కవిత్వం కాలమ్ లో
బూర్ల వెంకటేశ్వర్లు ఇటీవల ప్రాణగంధం అనే కవితా సంపుటి వెలువరించారు.వృత్తిరీత్యా బూర్ల వెంకన్న డిగ్రీ విద్యార్థులకు తెలుగు సాహిత్యాన్ని బోధించే వాడు.ఇంకేముంది ఆయన కవిత్వ మెళుకువలు తెల్సిన నేర్పరి.ఇప్పటికే ఐదు పుస్తకాలు వెలువరించారు.ఇది ఆరవ సంపుటి.ఆయన కవిత్వం నిండా మనిషి జీవన తాత్వికత నిండి ఉన్నది.కవి దేవేందర్ సాధారణంగా అందరు చూస్తున్న అంశాలే కాని బూర్ల కంటి చూపులో కవిత్వం ఉందని అంటున్నారు.

కాలంతో కలిసి నడిచిన కాలువ మల్లయ్య కాలమ్ లో
నిరంతర శ్రమ సౌందర్యాన్ని సృష్టించిన రచయిత కాలువ మల్లయ్య.తెలుగు నేల మీద ఇంత విస్తృతంగా రాస్తున్న సృజన కారుడు మరెవ్వరు లేరేమో.ఇప్పటి వరకు 20వేల పేజీలకు పైగా రాసిన రచయిత.ఆయన సాహిత్యంపై 28 మంది విద్యార్థులు ఎం.ఫిల్. పిహెచ్,డి పరిశోధనలు చేశారు.శాతవాహన,కాకతీయ విశ్వవిద్యాలయాల్లో తన నవలలు పాఠ్యాంశాలుగా ఉన్నాయి.కాలువ మల్లయ్య భూస్వామ్య ప్యూడల్ వ్యవస్థ అవశేషాలను దానికి వ్యతిరేకంగా వచ్చిన పోరాటాలను చిత్రించారు.కాలువ మల్లయ్య బహుజన కుల జీవితాల్లోని కల్లోలాలను గొప్పగా విప్పి చెప్పారు.కవి దేవేందర్ ఆయన సాహిత్య జీవితం కూడా యాభై ఏళ్లు నిండుతున్న సందర్భంగా విస్తృతంగా ప్రజల భాషలో రాస్తున్న గొప్ప రచయిత కాలువ మల్లయ్యకు శుభాకాంక్షలు తెలియజేయడం బాగుంది.

ఒక  విస్మృత వీరుని చరిత్ర కాలమ్ లో
ప్రజలే చరిత్ర నిర్మాతలు అనడంలో ఎలాంటి సందేహం లేదు.చరిత్రను అక్షరబద్ధం చేయడం చారిత్రక అవసరం.మల్ దాదా 1920 తరువాత సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంతంలోని తురకవానికుంట పోతారం (జె) లో అడవిని నరికి సమిష్టి వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసుకున్న వీరుడు.వెట్టిచాకిరికి వ్యతిరేకంగా పోరాటం చేసి కలిసి వ్యవసాయం చేసి ఎదురు నిలిచిన ధీరుడు అని గులాబీల మల్లారెడ్డి ఇటీవల రాసిన మల్ దాదా చారిత్రక నవల ద్వారా తెలుస్తున్నది.ఈ నవలా రచయిత మల్ దాదాకు మనుమడు అయితడు.మల్ దాదా కొడుకు లింగారెడ్డి.లింగారెడ్డి కుమారుడు గులాబీల మల్లారెడ్డి.మల్ దాదా నవల 2016 లో మల్లారెడ్డి వెలువరించారు.వీరు సీనియర్ న్యాయవాదిగా కరీంనగర్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. వీరు ప్రవృత్తి రీత్యా రచనా వ్యాసంగం చేస్తున్నారు. ఒక విస్మృత వీరుని చరిత్ర మల్ దాదా నవల అందరు చదవాలి.

ఇక్కడి నేల – అక్కడి వాన కాలమ్ లో
డాక్టర్ నలిమెల భాస్కర్ అనువాదంలో ఆరితేరిన చేయి.ఒకటా రెండా దేశంలోని పద్నాలుగు భాషలలో రాయడం,మాట్లాడడం ఆయనకు సులువు.తాను ఇటీవలనే ఇక్కడి నేల – అక్కడి వాన అనువాద కవితా సంకలనం వెలువరించారు.ఇందులో కన్నడ, హిందీ,గుజరాతీ,పంజాబీ,మరాఠీ,తమిళ,మలయాళీ,బెంగాలీ,ఇంగ్లీష్ భాషలకు చెందిన 43 కవితలు ఉన్నాయి.మనం పుట్టి పెరిగిన నేల వెలుగే కాకుండా,ఇతర రాష్ట్రాలలో కవులు ఏం రాస్తున్నారు?అక్కడ కవితా వస్తువు ఏం తీసుకుంటున్నారు? ఆయా ప్రాంతాల సంస్కృతి, చరిత్ర,సాహిత్యం తెలుసుకోవాలంటే తప్పనిసరిగా ఇతర భాషల కవిత్వం అధ్యయనం చేయాలి. తెలుగు సాహిత్యాన్ని ఇతర భాషల సాహిత్యం అధ్యయనం చేయడంలో భాస్కర్ సాహిత్య కృషి గొప్పది.నలిమెల అనువాదమే గాకుండా తెలంగాణ భాష గురించి పరిశోధనాత్మక రచనలు చేశారు. తెలంగాణ పదకోశం రూపొందించారు.దీనిని సాహితీ సోపతి ప్రచురించింది.కవి దేవేందర్ జయహో, నలిమెల సార్ అంటున్నారు.

ప్రజాస్వామిక ప్రణాళిక రూపొందాలి కాలమ్ లో
జ్ఞాన సృజన కలబోత సాహిత్య అకాడమీకి జూలూరు గౌరీ శంకర్ అధ్యక్షుడు కావడం సాహిత్య లోకానికి ఒక సందర్భాన్ని కలిగించింది.తాను తెలుగు సాహిత్యంలో మొట్టమొదటి బహుజన వృత్తుల కవిత్వ సంకలనం వెంటాడే కలాలు – వెనుకబడిన కులాలు వెలువరించారు.తెలంగాణ మలిదశ ఆరంభంలోనే పొక్కిలి కవితా సంకలనాన్ని వెలువరించారు.జూలూరు గౌరీశంకర్ తెలుగు సాహిత్యంలో ఎవరు వెలువరించని 30 దీర్ఘ కవితలను సంపుటిగా వెలువరించారు అని కవి దేవేందర్  అంటున్నారు.

కవనంలో సరసిజ అంకుశం కాలమ్ లో
పెనుగొండ సరసిజ తన ‘ఇక మారాల్సింది నువ్వే’ కవితా సంపుటిలో పాత మోనాటనీని ఛేదించారు. సరసిజ కవిత్వం ఇంత స్పష్టమైన వాస్తవిక దృక్పథంలో రాయడం వెనుక ఆమె సహచరుడు పెనుగొండ బసవేశ్వర్ తోడ్పాటు ఎంతో ఉంది. సరసిజ గొప్ప కవయిత్రిగా ఎదుగుతున్నది. వృత్తిరీత్యా సరసిజ టీవీ న్యూస్ రీడర్ గా ఉంటూ నిరంతరం కవిత్వంలో నడుస్తున్నది.కొత్త వస్తువును కవిత్వంగా రూపొందించడంలో ఎత్తుగడలో, ముగింపులో,నడకలో ఆసక్తి ఉంటుంది.తనదైన ముద్రతో ఇది కవిత్వంలోకి ఒదుగుతుందా లేదా అని మీమాంస లేకుండా రాస్తున్న కవయిత్రి సరసిజ‌. అందుకే సూటిగా అంటుంది ‘ఇక మారాల్సింది నువ్వేనని’అది ఎవలను తాకాలో వాళ్లకే తాకుతుంది.సరసిజ తొలి కవితా సంపుటి ‘కాగితాన్ని ముద్దాడిన కల’ వెలువరించింది.’ఇక మారాల్సింది నువ్వే’రెండవ కవితా సంపుటి.

కవిత్వం వరద పారుతోంది కాలమ్ లో
తెలుగు నాట కవిత్వం,కథలు రాసే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరుగుతున్నది.ఇది ఒక శుభ పరిణామంగా చెప్పవచ్చు.ఈ రకంగా కవిత్వంలోకి అన్ని రంగాల నుంచి వస్తున్నారు.ఇరవై,ముప్పై ఏండ్ల కింద ఇట్లా లేదు.కొందరు మాత్రమే రాసి పుస్తకాలు అచ్చు వేసే వాళ్ళు.ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు,ఫేస్ బుక్ వాల్ మీద కవిత్వం ప్రవహిస్తున్నది.ఇందులో చాలా విషయాలు కూడా ఉంటున్నాయి.చదవదగ్గ సాహిత్యం వస్తున్నది.కవి దేవేందర్ ప్రతి మనిషి ఏదో రకంగా కళాకారుడేనని, పాట,ఆట,కవిత,నాట్యం,నాటకం,ఏదైనా సంబంధం లేకుండా ఎవరు ఉండరు అని,అయితే తమలో ఉన్న కళను తమకు తామే పాతాళ గరిగెతో వెతికి తీసుకొని సాన పెట్టుకోవాల్సిందే అని అంటున్నారు.

పుస్తకం గురించి ఒక పుస్తకం కాలమ్ లో
గత,వర్తమాన,భవిష్యత్ తరాలకు సకల రంగాల్లో కొనసాగింపునకు ఆధారం పుస్తకమే.పుస్తకం లేకుంటే ప్రపంచమే లేదు.సమస్త శాస్త్ర సాంకేతిక కళా జీవన రంగాల్లో పుస్తకం ఒక పరంపర.ఒక తరం నుండి మరో తరానికి పుస్తకాలు,అందులోని అక్షరాలు వారధుల్లాంటివి.దామెరకుంట శంకరయ్యకు పుస్తకం మీదనే కవిత్వం రాయాలనే తలంపు వచ్చింది.దామెరకుంట ప్రధానంగా కవి.వీరు వృత్తి రీత్యా జీవశాస్త్ర ఉపాధ్యాయుడు.పుస్తకం కదా మానవాళిని తీర్చిదిద్దింది.వయ్యి పేరుతో దీర్ఘ కవితను వెలువరించారు.వయ్యి అంటే పుస్తకమే.ఏ పుస్తకమైనా చైతన్యమే దాని మర్మం మనిషిని పట్టి మేల్కొల్పేది పుస్తకమే.పుస్తకాలు చదవాలంటే అక్షరాలు నేర్వాలి.వయ్యి కవితలో అక్షరాలు వల్లే వేస్తేనే కాళ్లు ఊర్లు దాటేవి/అంటారు.పుస్తకం కొత్త ఉదయంలా/కొత్త ప్రపంచానికై/కాలం తెచ్చిన మార్పుల్ని/ ఒంటినిండా నింపుకున్న/ పరిమళభరితం/అంటూ పుస్తకంపై,చదువుపై, అక్షరాలపై,జ్ఞానంపై అమితమైన ప్రేమను వ్యక్తం చేశాడు.50 పేజీల దీర్ఘ కవిత చదువుతుంటే మధ్యలో ఆగాలనిపించదని,వయ్యిఫై మరింత అభిమానులం అవుతాం అని కవి దేవేందర్ అంటున్నారు.

మీరు పుస్తకం కొంటున్నారా?! కాలమ్ లో
జీవితంలో స్థిరత్వం పొందేందుకు అవసరమైన అధ్యయనం పోటీలకు అవసరమైన పుస్తకాలు మినహా ఇతర పుస్తకాలు చదివే తీరిక తగ్గిపోతున్న కాలం.అయితే గతానికి ఇప్పటికీ రాసే వాళ్ళు పెరిగారు.పుస్తకాలు వస్తున్నాయి కానీ,అమ్మడం తక్కువగా ఉన్నది.జీవన వికాసం కొరకు మానసిక ప్రశాంతత కొరకు సాహిత్యం వైపు చూపు తగ్గి పోయింది.ఎవరైనా పుస్తకం ఇస్తే దానికి అయిన ఖర్చు కూడా పెద్దగా ఏమీ ఉండదు.వంద రూపాయలకు అటు ఇటు అంటే దాని వల్ల మిత్రుని పుస్తకం కొనుక్కొని చదివాననే అనుభూతి ఉంటది.రచయితకు కూడా గౌరవం కలుగుతుంది. పుస్తకాల షాపులలో పెడితే సాధారణ పాఠకులు కూడా కొనడం లేదు.రీసర్చ్ స్కాలర్లు కొందరు పాత తరం వాళ్లు కొందరివే కొని చదువుతున్నారు.కవి దేవేందర్ పుస్తకాలు కొని చదవాలని అంటున్నారు. 

వెంటాడే బతుకు యానమిది కాలమ్ లో
సామాన్యుల చరిత్ర జీవన రేఖలు ఎట్లా ఉంటాయనే విషయం తెలుసుకోవాలంటే లేంబాల వాటిక కథలు చదవాల్సిందే.వేములవాడ కథలు,పిన్నంశెట్టి కిషన్ ది ప్రఖ్యాతి గాంచిన వేములవాడ పట్టణం.ఈ లేంబాల వాటిక కథలు చదువుతుంటే అమరావతి కథలు చదువుతున్నట్టే అన్పిస్తుంది.తాను చదివిన, పెరిగిన,తిరిగిన,ఆడిన సోపతిగాళ్ళ ముచ్చట్లు, సినిమాల షికార్లు,ఒకటేమిటి సమస్త కథనాలు 44 వరకు ఉన్నాయి.ఇందులో ఏది మొదలు పెట్టినా కొస దాకా చదువకుంట నిలుప లేరు.ఇందులో ఆయన స్నేహితులు,సహ విద్యార్థులు,చుట్టాలు, బంధువులు అందరూ కన్పిస్తారు.కవి దేవేందర్ ఈ పుస్తకం చదివిన వారు ఎవరి బాల్యంలోకి వాళ్ళు తొంగి చూసుకోవచ్చు అని అంటున్నారు.

అభిమానం నటనకా!నటులకా? కాలమ్ లో
నటన పట్ల కన్న నటునిపై అభిమానం మితిమీరిపోతున్నది.ముఖ్యంగా సినీ నటులపై అభిమానం పెరిగి పెద్దదై అభిమాన సంఘాలు ఆవిర్భవించడం,ఈ సంఘాలు ఆయన కళ పట్లనే కాకుండా,ఆయన పట్ల కూడా విపరీతంగా స్పందించడం పెరిగి పోతున్నది.కళను నమ్మడం, అభిమానించడం,ప్రేమించడం,అనుసరించడం వేరు. హీరోలను అభిమానించడం,హీరో అంటే పడి చచ్చి పోవడం,చైతన్య రాహిత్యమే.కవి దేవేందర్ నిజంగా యువతరం సామాజిక చైతన్యం ఎక్కడికి పోయింది? చదువుకున్న చదువులు ఎందుకు ఉపయోగపడుతున్నాయి? అర్థం కాదు అని  అంటున్నారు.

స్నేహం అనంతానంత జీవన సౌందర్యం కాలమ్ లో
ఈ సహృదయ సౌందర్యంలో జీవించడం ఎలా ఉంటుందనేది,ఇటీవల జరిగిన ఒక వాట్సాప్ గ్రూప్ గెట్ టుగెదర్ సమావేశం లో వ్యక్తమయింది.ఆ వాట్సాప్ గ్రూప్ పేరు ఎస్పీ ఫ్రెండ్స్ దాని అడ్మిన్ జీవీ.శ్యాం ప్రసాద్ లాల్  కరీంనగర్ అడిషనల్ కలెక్టర్.దీనిని 2013లో ఏర్పాటు చేశారు.గ్రూప్ సభ్యునికి ఉండాల్సింది ముఖ్యంగా స్నేహపూరిత సహృదయత మాత్రమే.ఇంకా ఎందరో ఇట్లాంటి వారు ఉన్నారు.రోజు ఉదయం ఒక సుభాషితాన్ని గ్రూప్ లో పెడతారు.కొందరు పాత పాటలను షేర్ చేస్తారు.ఒక మిత్రుడు దినపత్రిక పెడతారు.చాలా మందికి తెలియదు కానీ అందరి పుట్టిన రోజులు, పెళ్లి రోజులు అడ్మిన్ దగ్గర ఉంటాయి.ఆయా రోజులలో వారికి శుభాకాంక్షల వెల్లువ కొనసాగుతుంది.ఇందులో ఉన్నత స్థాయి ఉద్యోగులతో పాటు కింది స్థాయి వాళ్ళు కూడా ఉంటారు.అంతా సమానం అనే దృక్పథంలో నడుస్తారు.కవి దేవేందర్ ముఖ్యంగా సాటి మనిషిని ప్రేమించడం,సహృదయ సంస్కారాన్ని ఇతరులకు పంచడం అవసరం అని అంటున్నారు.స్నేహం అనంతానంత జీవన సౌందర్యం వెల్లివిరియాలి.

ఉత్తరాలలో కళాత్మక సృజన కాలమ్ లో
పూర్వం ఉత్తర ప్రత్యుత్తరాలు పోస్టులో పంపే లేఖల ద్వారా ఉండేవని ఈ తరం వారికి చెప్పాల్సి వస్తున్నది.ఇప్పటి తరం ఈ – మెయిల్,వాట్సాప్, టెలిగ్రామ్,జూమ్ వీడియో కాలింగ్ లకు సంబంధించినది.ఉత్తరం రాయడంలోనే రచనా శక్తి అంకురిస్తుంది.అసలు లేఖ చదువుతుంటే తను చెప్పదలుచు కున్నది ఎట్లా వ్యక్తీకరించాడో తెలిసేది.అలా ఉత్తరాలు విరివిగా రాసే వారు తర్వాత కాలంలో రచయితలు అయ్యారు.నిజానికి సాహిత్యంలో లేఖ కూడా ఒక ప్రక్రియ.ఉత్తరం అంటే దూరాన్ని కలిపి దారం వంటిదని ఎన్నటి నుంచో చదువుకున్నం.ఎవరి వద్దనైనా పాత ఉత్తరాలు ఉంటే పరిశీలించవచ్చు.పాత లేఖలలో భావుకత కనిపిస్తుంది.ఒకరికొకరు రాసే పద్ధతిని బట్టి ఆయా మనః స్థితిని అర్థం చేసుకోవచ్చు.కవి దేవేందర్ ఉత్తరాలలోని కళాత్మక సృజన ప్రాధాన్యతను తెలియజేశారు.

డిజిటల్ పత్రికల యుగం మనది కాలమ్ లో
పత్రికలు,ప్రసార మాధ్యమాలు ఇప్పుడు ఎక్కువగా పెట్టుబడిదారుల చేతులకు చేరాయి.ఒక నాటి కాలంలో పత్రికలు అంటే ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా నిలిచేవి.రాను రానూ వాటి ప్రాధాన్యం తగ్గిపోతోంది.గత రెండేళ్లుగా కరోనా సంక్షోభం వచ్చి అన్ని వ్యవస్థలు కూలిపోయినట్లే పత్రికా రంగం కూడా కునారిల్లిపోయింది.ఒకరిని ఒకరు తాకని, చూడని సంక్షోభం సందర్భంలో పత్రికలను ఎవరు తెప్పించుకోలేదు.దీంతో ముద్రణ ముప్పావు తగ్గి పోయింది.అక్కడక్కడ కొన్ని ముద్రించినా చాలా మంది ఈ పేపర్ కు అలవాటు పడ్డారు.డిజిటల్ పత్రికలు చదవడం ఎక్కువైంది.సోషల్ మీడియాలో వార్తలు,సంఘటనలు,వీడియో క్లిప్పులు,లెక్కకు మిక్కిలి ప్రచారం అవుతున్నాయి.కవి దేవేందర్ అందరు డిజిటల్ ప్లాట్ ఫారానికి వచ్చేస్తున్న సందర్భం ఇది అనే వాస్తవాన్ని తెలియజేయడం బాగుంది.

స్నేహం అందమైన అనుబంధం కాలమ్ లో
విద్యార్థుల మూర్తిమత్వం వికసించేది తరగతి గదిలోనే.ఎంత ఎదిగినా బాల్యంలోని స్నేహితులు కలిస్తే చక్కిలిగింతే.తాము చదువుకున్న తరగతి గోడలను తాకి పరవశించవచ్చు.తాము ఆడుకున్న మైదానంలోను పెద్ద పెరిగిన గాంభీర్యతను వదిలేసి తిరిగితే అదొక ఆనందం.ప్రాథమిక స్థాయి,హై స్కూల్ స్థాయిలో ఆ అనురాగం కొనసాగుతుంది.ఇటీవల కాలంలో ఆయా పాఠశాలలలో చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళణాలు నిర్వహిస్తున్నారు.ఇది పాత మిత్రులతో పాత జ్ఞాపకాలను తిరిగి పంచుకోవడమే.కవి దేవేందర్ ఎప్పుడో ముప్పై, నలభై ఏండ్ల కింద చదువుకున్న వాళ్ళు ‘రారా పోరా’ అని మాట్లాడుకోవడమే ఒక పులకింత అని అంటున్నారు.కల్మషంలేనితనం వలన స్నేహం, అనుబంధం ఏర్పడతుందనేది వాస్తవం.

సృజనే జీవిత పరమానందం కాలమ్ లో
మనిషన్నాక ఏదో కళలో ప్రవేశమో,ఇష్టమో, ప్రావీణ్యమో ఉండి ఉంటది.కొందరికి డాన్స్,మరి కొందరికి క్రీడలు,మరి కొందరికి పాటలు పాడటం, ఎందరికో పెయింటింగ్,మిమిక్రీ,సంగీతము, సాహిత్యము,పద కవిత్వం రచన చిన్నప్పటి నుంచి ఉంటాయి.వాటికి మెరుగు పెట్టుకోవడంలో శ్రద్ధ చూపక పోవడంతో నైపుణ్యత సాధించకపోవచ్చు. లైఫ్ లో స్థిరపడుతున్న క్రమంలో మన సృజనకు పదును పెడితే ఇంటిలోని సభ్యులందరిపై ఆ ప్రభావం ఉంటుంది.తల్లిదండ్రులు చెప్పితేనే పిల్లలు ఆచరించరు.వాళ్ళ చర్యలను,ఇష్టాలను,కళలను తాము అవలంబించే ప్రయత్నం చేస్తుంటారు.ఇట్ల కుటుంబం,బంధువులు,స్నేహితులు సహ ఉద్యోగులు అందరూ తమ కళాత్మక సౌందర్య జీవనం కోసం వెతుక్కుంటారు.కవి దేవేందర్ సృజనను అలవర్చుకుంటే జీవితం పరమానందం అవుతుంది అని అంటున్నారు.

కొడుకులు కోడండ్లు – తల్లిదండ్రులు కాలమ్ లో
మొన్న వాకింగ్లో పరిచయమైన నడక మిత్రుడు ‘మనకు ఏం కాకుండా మన ఆరోగ్యం కాపాడుకోవాలె.మనకు ఏమన్న అయితే కొడుకులు రారు కోడండ్లు చేయరు అని ఖరాకండిగా చెప్పిండు.తండ్రులు,తల్లులు మార్పు దిశగా ఆలోచించాల్సిందే.చెంతన ఎవరు లేరు వాస్తవమే. ఎవరు పలకరించడం లేదు వాస్తవమే.ఇది ఒక అనివార్యత.కవి దేవేందర్ గతానికి ఇప్పటికీ కుటుంబ సంబంధాల్లో వచ్చిన మానసిక సంబంధమైన మార్పులన్నీ అవగాహన చేసుకుని ఆధునిక దృక్పథంతో ఆనందంగా జీవించాల్సిన విధానాన్ని గూర్చి ఆలోచించవలసిన అవసరం ఉన్నది అని అంటున్నారు.

మీకంటూ కొంత స్పేస్ కావాలి కాలమ్ లో
ఏ వృత్తిలో ఉన్న వారైనా జీవితంలో కొంచెం స్పేస్ ఉంచుకోవాలి.ఎన్ని ఒత్తిడులు ఉన్నా కొంత ఏకాంతం,కొంత ప్రశాంతత,కొంత సొంతదనపు ఆలోచనలకు సమయం అవసరం.ఈ రోజులలో అన్ని వృత్తుల వారు,విద్యార్థులు సమయం లేదు తొందరగా పూర్తి చేయాలి లేదంటే బాస్ అరుస్తాడు టార్గెట్ అచీవ్ కాలేము అనే మీమాంసలో పడి తమ కోసం తాము జీవించ లేక పోతున్నారు.కుటుంబ పోషణ కోసం పని చేయడంలోను,తమ వ్యక్తిగత స్వేచ్ఛ కోసం కొంత సమయం లేకుంటే మరీ మనిషి యంత్రం అయి జీవితం నిస్సారమైపోతుంది. సంపాదించే వారికే పైసలు కట్టలు కట్టలు కనపడతాయి.మనశ్శాంతి దొరకదు.కుటుంబంలో సభ్యులందరు ఎవరి స్పేస్ వారు కేటాయించు కోవాలి.చేతిలో ఉన్న సెల్ ఫోన్ కు కాస్త విరామం ఇవ్వాలి.రోజుకో గంట సేపైనా ఫోన్ స్విచ్చాఫ్ చేస్తే హాయిగా ఉంటుంది.కవి దేవేందర్ మనిషి సెల్ ను బానిసలాగా వాడుకోవాలె గానీ,సెల్ కు బానిస కాకూడదనే సత్యాన్ని విడమర్చి చెప్పడం బాగుంది.

పండు వెన్నెలలో కవిత్వ ప్రవాహం కాలమ్ లో
ప్రతి పౌర్ణమి రోజు నగరంలో ఒక కవి రచయిత లేదా సాహిత్య అభిమాని ఇంటి డాబా మీద కవులు సమావేశం అవుతారు.కవిత్వం చెప్పుకుంటారు. ఎన్నీల ముచ్చట్లు తెలుగు సాహిత్యంలో పండు వెన్నెల కవిత్వం ఒక మైలురాయి.21 ఆగస్ట్ 2013 రాఖీ పున్నమి రోజున మొదలైన ఎన్నీల ముచ్చట్ల ప్రస్థానం నగరంలోని దాదాపు అందరూ కవులు రచయితల ఇండ్ల మీద కవి సమ్మేళనాలు జరిగాయి.కవిత్వం అంటే కేరాఫ్ చిరునామా కరీంనగర్ అయింది.కవి దేవేందర్ కరీంనగర్ లో నిండు పున్నమి నాడు పండు వెన్నెలలో అక్షరాలు కవిత్వ వాక్యాలై పరవళ్ళు తొక్కుతున్నయి అంటున్నారు.

పిల్లలతో ఉన్న మజాయే వేరు కాలమ్ లో
పిల్లల నవ్వులు,పిల్లల చిన్నిచిన్ని మాటలు,పిల్లల చూపులు,పిల్లల ప్రతి చేష్టకు ఒక సంకేతం ఉంటది. పిల్లల కోరిక నెరవేర్చకపోతే అలగడం,నిరసన వ్యక్తం చేయడం ఉంటది.కోపం ఎక్కువైతే వస్తువులు విసిరి వేయడం ఉంటది.దీనిని కుటుంబ సభ్యులు వారి సైకాలజీ తో పట్టుకోవాలి.పిల్లలను పెంచడం అనేది గొప్ప ఓపిక.పిల్లలు ఉన్న ఇల్లు ఆనందాల హరివిల్లు. కవి దేవేందర్ ఏది ఏమైనా పిల్లలతో ఆడుకుంటే పిల్లలమై పోవచ్చు అంటున్నారు.

ఇది అనంత కాలగమనం కాలమ్ లో
హుజురాబాద్ చరిత్రను ప్రఖ్యాత జర్నలిస్ట్,రచయిత ఆవునూరి సమ్మయ్య తన గమనం పుస్తకంలో నమోదు చేశారు.కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కు చెందిన చరిత్రనే గాకుండా ఆ ప్రాంత రాజకీయ, ఉద్యమకారుల పరిచయం ఇందులో ఉంది.1969 తొలి దశ తెలంగాణ ఉద్యమంలోను,1998 మలిదశ ఉద్యమంలోను,ప్రత్యక్షంగా పాల్గొన్న ఉద్యమకారుడు.తాను గవాయి పేరుతో హుజురాబాద్ ఉద్యమాల చరిత్రను అక్షరీకరించాడు.అందులోను పోరాటాల నేపథ్యం, స్వభావం,ఆయా ఊర్ల నుంచి అజ్ఞాతంలో ఉన్న వారి వివరాలు ఉన్నాయి.గమనం పుస్తకానికి హుజూరాబాద్ కు చెందిన ముక్కెర రాజు,పలకల ఈశ్వర్ రెడ్డి,రవిశంకర్ శుక్లా సంపాదకత్వం వహించారు.కవి దేవేందర్ జన సాహితి ప్రచురించిన ఈ పుస్తకం అన్ని ప్రాంతాల వారు చదవాలని.ఆయా ప్రాంతాల చరిత్ర ఎలా నమోదు చేయాలో తెలుస్తుందని అంటున్నారు. 

నృత్య కళా వెలుగు ఆచార్య రజని శ్రీ కాలమ్ లో
ఆచార్య గాజుల రజని శ్రీ తెలంగాణలో ప్రసిద్ధి పొందిన నాట్యాచార్యులు.వీరు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు.వీరు తోటపల్లి గ్రామం హుస్నాబాద్ మండలం సిద్దిపేట జిల్లాకు చెందిన వారు.వీరు తోటపల్లిలో 1964 లో ఉపాధ్యాయుడిగా నియమించబడ్డారు.వీరు 31 జనవరి 2002లో భీమదేవరపల్లి ప్రభుత్వ పాఠశాల నుండి రిటైర్ అయ్యారు.వీరు తెలంగాణలో గొప్ప కళాకారుడుగా నాట్యాచార్యులుగా పేరుగాంచారు.రజని శ్రీ  మొత్తం‌ జీవితాన్ని కళా,సాహిత్య,సాంస్కృతిక విద్యా రంగానికి అంకితం చేసిన గొప్ప మనిషి.ఆయనకు ముగ్గురు కుమారులు.జీ.వీ.శ్యాం ప్రసాద్ లాల్ కరీంనగర్ జిల్లా అడిషనల్ కలెక్టర్,హరీష్ కుమార్ హైకోర్టు న్యాయవాది,క్రాంతి కుమార్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా స్థిరపడ్డారు.రజనిశ్రీ పేరిట వారి కుమారులు సాహిత్య పురస్కారాన్ని కూడా ప్రకటించారు.రజని శ్రీ గారు మే 28 2007న పరమపదించారు.కవి దేవేందర్ రజని శ్రీ కళా జీవితం యావత్ సృజన కళాకారులకు స్ఫూర్తిదాయకం అంటున్నారు.

కాలం మారుతోంది బాసూ ! కాలమ్ లో
మారుతున్న కాలానుగుణంగా జీవించడం నేర్చుకుంటేనే జీవనోత్సవం.కొందరు ఎప్పుడు మా కాలంలో గిట్లుండే మా చిన్నతనంల అందరూ ఉమ్మడి కుటుంబంలా కలిసిమెలిసి ఉండేది. ఇప్పుడు కుటుంబం ఎక్కడెక్కడో ఉంటున్నారని మథనపడుతుంటారు.వర్తమానంలో జీవించడం అంటే మారుతున్న జీవనశైలిని అందుకోవాలి.దాని వెంబడి నడవాలి.ఇటీవల కాలంలో పుట్టినరోజు వేడుకలకు కేక్ కటింగ్ లు చాలామంది జరుపుకుంటున్నారు.కవి దేవేందర్ ఉత్సవాలు, పండుగలు,సంప్రదాయాలు కొనసాగించడం వలన మనసు ఉల్లాసం అవుతుందని,కాలంతో పాటు సాగిపోవాలనే స్ఫూర్తిని కలిగిస్తున్నారు.

కోరలు చాచిన మగహంకారం కాలమ్ లో
మగ అహంకారుల దుర్మార్గాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది.అత్యాచారాలు సులువుగా చేస్తున్నారు.బాలికల మీద మైనారిటీ తీరని మగ పోరగాండ్లు క్రూరత్వం ప్రదర్శిస్తున్నారు.ఇది తప్పు అనే కనీస స్పృహ వారికి లేకుండా పోయింది.నేరం చేస్తే శిక్ష పడుతుందనే భయం లేదు.ఏం కాదు నాకు అన్న అభయం ఉన్న తర్వాత నేరాలు సాగుతూనే ఉంటాయి.కవి దేవేందర్ రాజకీయ ప్రజా ప్రతినిధుల ప్రమేయం పోలీసుల మీద ఏమాత్రం ఉండకుండా ఉంటే నేరాల విచారణ సజావుగా సాగుతుందని, శిక్షలు సరిగ్గా పడతాయని,సమాజం నుంచి అత్యాచార సంస్కృతిని తరిమివేసి సర్వ సమానత్వం స్నేహపూరిత వాతావరణం కల్పించాల్సి ఉందని అంటున్నారు. 

మాయమవుతున్న చదువరి కాలమ్ లో
అధ్యయనం రాను రానూ తక్కువ అయిపోతున్న కాలం.అవసరమైన పుస్తకాలు తప్పితే ఇతర పుస్తకాలు తెరువుకు ఈనాటి తరం పోవడం లేదు. ఒకప్పుడు విద్యాలయాల చదువులతో పాటు ఇతర కళ,సామాజిక శాస్త్రాలు విరివిగా చదివే వారు. అసలు ఇప్పుడు అట్లా చదివే వాళ్ళు ఎక్కడ ఎవరూ కనిపిస్తలేరు.అయితే కాలం మారుతున్నది.తమకు అవసరం లేనిది ఎందుకు చదవడం?సామాజిక విషయాలు మాకెందుకు?అనే తరం తయారయింది. ఇదంతా ప్రపంచీకరణ తర్వాత విద్యారంగంలో వచ్చిన మార్పులు.తరం మారింది.టెక్నాలజీ మారుతోంది అయినా కవి  దేవేందర్ ఇంకా చదవాల్సిన సాహిత్యం,శాస్త్ర విజ్ఞాన గ్రంధాలు యువతరం చదవడం లేదని అంటున్నారు.

తోటి కవుల కవిత్వం పై కవి శతారం కాలమ్ లో
గోపగాని రవీందర్ కొత్తగా పరిచయం అక్కని లేని కవి.ఆయన మాత్రం ఇతర కవుల కవిత్వాన్ని విమర్శనాత్మకంగా పరామర్శిస్తారు.ఎవరి కవిత్వం వాళ్లు రాసుకుని అచ్చు వేసుకొని మురిసిపోయే కాలం ఇది.గోపగాని రవీందర్ మాత్రం తన తోటి కవుల కవిత్వాన్ని ఇష్టంగా చదివి ఒక వ్యాసం రాయడం గొప్ప విషయమే.శతారం అనే  కవిత్వ విమర్శల వ్యాసాల సంకలనం వెలువరించారు.ఈ పుస్తకంలో 75 వ్యాసాలు ఉన్నాయి.అభ్యుదయ, విప్లవ అస్తిత్వ సాహిత్యం పట్ల విమర్శ ఉన్నది.ఇటు కవిత్వం,అటు విమర్శతో నిరంతరం అక్షరాలను ఆయుధం చేస్తున్న గోపగాని రవీందర్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు.కవి దేవేందర్ శతారం పుస్తకాన్ని వర్ధమాన కవులు,రచయితలు కొనుక్కొని చదవాల్సిన అవసరం ఉన్నది అని అంటున్నారు.

నడక ముచ్చట్లు కాలమ్ లో
దినచర్యలో నడక అనివార్యంగా భాగమైన తర్వాత రోజు మైదానంలో తిరగడం ఒక ఆనందం.ఆ రోజంతా ఉత్సాహంగా గడపటానికి అదొక టానిక్ అయ్యింది.ప్రాతః కాలమున ఇంటి నుంచి మౌనంగా నడక మొదలవ్వగానే రోజూ కనపడే మనుషులే కన్పిస్తారు.మౌనంగా కళ్ళతోనే పలకరింపులు. కొందరైతే చూడగానే చిరునవ్వుల ముఖాలు. మైదానంలో కల్సి నడుస్తున్న కొద్ది కొంతమంది వయ్యారపు నడకలు,కొన్ని మహా వేగంగా ఉరుకులు,కొందరు మోకాళ్ల నొప్పులతో మెల్లమెల్లగా బండి లాగినట్టు,మరి కొందరైతే సెల్ ఫోన్ చూసుకుంటూనే నడుస్తుంటారు.ఇంక కొందరు ముచ్చట్లతోనే నడుస్తుంటారు.కవి దేవేందర్ నేను ధ్యానం నుంచి బయటకు వచ్చి ఇంటికి చేరుకున్న అంటున్నారు.నడక ముచ్చట్లు ఉంటాయి అంటే ఆశ్చర్యం కలుగుతుంది.

చిటపటా చినుకులతో కురిసిందీ వాన కాలమ్ లో
వాన తనివి తీరా కురిసింది.ఎక్కడా చూసినా నీళ్లే. నీట మునిగిన పొలాలు,ఊర్లు,ఇండ్లు,నదుల పక్కన నివసిస్తే నది కన్నెర్ర చేస్తది.చెరువులను ఆక్రమించుకున్న కాలనీలకు కాల పరీక్షనే.కాలంబు రాగానే కాటేసి తీరాలె అన్నట్టు నీళ్ళకు కాలం వచ్చింది.వాటి తావుల్లో కట్టుకున్న ఇండ్లకు ముప్పు వచ్చింది.ఇండ్లు కట్టుకున్నోళ్లు అమాయకులు.దాని అడుగు జాగను ప్లాట్లు ప్లాట్లుగా చేసి అమ్ముకున్న రియల్ ఎస్టేట్ మారాజులను అనాలె.వాళ్ల రాజకీయాలను అనాలె.సూసి చూడనట్టు నటించే యంత్రాంగంను అనాలె.కవి దేవేందర్ ఏది ఏక్కువైన నష్టమే.వాన చినుకులు పడితే ఏం జరుగుతుంది? చెరువులను ప్లాట్లు చేసి అమ్ముకునే కుటిల రాజకీయం కొనసాగుతుంది అని అంటున్నారు.ఏది ఏమైనా వాన అంటే అందరికీ సంబరమే. 

నిషా బాబులు నయా వేషాలు కాలమ్ లో
ప్రతి ఊరిలో మద్యం షాపులు విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు.పట్టణాలు,నగరాలలోనూ వాడ వాడకు మద్యం షాపులు ఉన్నాయి.వాటి దగ్గర జనాల రద్దీ ఉంటున్నది.మద్యం మనుషులకు హాని చేస్తుంది.నిరంతరం మద్యం సేవించిన వారి కాలేయం దెబ్బతింటుంది.ఆర్థికంగా నష్టపోతారు. ఇంటిలో కూడా లొల్లులు అవుతాయి.ఫంక్షన్ లలో మందును ఏర్పాటు చేస్తున్నారు.కవి దేవేందర్ గాంధీ పుట్టిన దేశంలో ఇలా మద్యం ఏరులై పారడాన్ని ఎవరు ఆపగలరు?ఎవరికి వారు నిషేధం విధించుకుంటే తప్ప అని అంటున్నారు.

తిండిని పారేసి రోగం ఎందుకో?! కాలమ్ లో
పిడికెడు అన్నం మెతుకులు తయారు కావాలంటే రైతు ఎంత శ్రమ చెయ్యాలి?మట్టి నుండి వరి పండించడానికి ఎన్ని వేల లీటర్ల నీరు కావాలి?తిరిగి ఆ బియ్యం అన్నంగా మారడానికి,అందులోకి కూరలు తయారు కావాలంటే ఎంత పని?ఎంత ఓపిక కావాలి?ఇవేవి అర్థం చేసుకోరు కొందరు మనుషులు.ఏదైనా ఫంక్షన్ లకు పోతే ఎన్నడూ తిననోళ్లు అన్నం తింటున్నట్లు ఎగబడతరు. అవసరమైన దానికంటే ఎక్కువ పెట్టించుకుంటారు. పూర్తిగా తినరు.అటూ ఇటూ కలుపుతరు. మిగతాదంతా పారేస్తరు.ఆహార వృధా కొనసాగుతున్నది.ఆహారం లేక దేశంలో ఎందరో ఆకలితో అలమటిస్తున్నారు.కవి దేవేందర్ తిండిని పారేసే రోగం ఎందుకు?అని ప్రశ్నించడం బాగుంది. 

ఝండా ఊంచా రహే హమారా కాలమ్ లో
ఇది భారతదేశ అమృతోత్సవ సందర్భం.ఆనాడు పోరాటం చేసి అసువులు బాసిన త్యాగధనులను దేశ ప్రజలంతా మనస్ఫూర్తిగా స్మరించుకోవాల్సిన సందర్భం.భారతదేశం బహుళ సాంస్కృతిక జీవనం,భిన్న భావాల విభిన్న సంస్కృతులకు పుట్టినిల్లు.ఎప్పుడూ ఏక ధ్రువరూపం తీసుకోలేదు. ఒకే సంస్కృతి,ఒకే ఆలోచన ఎన్నడూ లేదు.అందరి అస్తిత్వాలు వేరు వేరు.అస్తిత్వాలు మళ్లీ కలిస్తే భారతదేశం. త్రివర్ణ పతాకం ఒక్కటే. భారతీయులందరూ ఈ తిరంగ జెండా కిందనే ఉన్నారు.కవి దేవేందర్ మాతృదేశ స్వాతంత్రం అందరి స్వాతంత్ర్యం.జయహో భారత్ అంటున్నారు.

కెమెరా కళ్ల  కోసమే పెళ్లి కాలమ్ లో
జీవితంలో పెళ్లి అనేది అత్యంత మధురమైన మైలురాయి.ఆలుమగలు పులకించిపోయే జ్ఞాపకం.పెళ్లిళ్లకు దగ్గర బంధువులు,దూరపు బంధువులు,స్నేహితులు అందరు వస్తారు.ఈ సంఘటనలను చిత్రాలలో బంధించడం ఫోటోగ్రాఫర్ల పని.వీడియోగా రూపొందించడం డిజిటలైజ్ చేయడం ఒక కళ.ఒక నైపుణ్యత గల విద్య.ఈ రోజులలో పెళ్లిళ్లను తమ కెమెరాలలో రికార్డ్ చేయడం గాకుండా ఫోటోగ్రాఫర్లే వివాహాలను నడిపిస్తున్నారు.ఏది ఏమైనా కెమెరా ఆర్ట్ బలమైన కళ.అది చూపరులను ఇట్టే ఆకట్టుకుంటుంది. ప్రకృతిని ఉన్న దాని కన్నా మరింత అందంగా చిత్రిస్తుంది.కవి దేవేందర్ కెమెరా కళాకారులను అభినందించాల్సిందే అంటున్నారు.

కనువిందు చేసే కేరళ యాత్ర కాలమ్ లో
అక్కడి గాలిలోని సుగంధ ద్రవ్యాల మొక్కల పరిమళం మనసుకు హాయి చేస్తది.తేయాకు తోటల నుంచి నడిచి వెళుతుంటే పచ్చిపచ్చి చాయ వాసన వ్యాపిస్తుంది.మిరియాలు,యాలకులు,సాజీర, దాల్చిన చెక్క,లవంగాల చెట్ల గాలి సోకి ఛాతి ఉబ్బిపోతుంది.కవి దేవేందర్ మన్నార్ లో ఎక్కడ తిరిగినా మనసు తేలికగా మారి గాలిలో నడుస్తున్న అనుభూతి కలుగుతుంది అని అంటున్నారు.

అచ్చుకు అచ్చంగా గ్రహణం కాలమ్ లో
దిన,వార,మాస పత్రికల ముద్రణ ఇంకో దశాబ్దం దాటితే రూపం మార్చుకునేట్టు కనిపిస్తున్నది.అట్లాగే సాహిత్యం కూడా ఇది వరకు కవిత్వం,కథలు, నవలలు వేల కొలది అచ్చు అయి మార్కెట్లోకి వచ్చేవి.రానున్న కాలంలో కష్టంగా తోస్తున్నది.అన్ని పత్రికలు డిజిటల్ రూపంలోకి వచ్చినయి.పత్రికను స్టాల్ కు వెళ్లి కొనుక్కుని ఇంటికి తెచ్చుకొని చదవడం మాని అరచేతిలో సెల్ ఫోన్ లోనే అనుకున్న సమయంలో చూస్తున్నరు.దీంతో కండ్లకు ఇబ్బందే కావచ్చు.రానున్న దశాబ్దం తర్వాత ఈ ప్రింటింగ్ యంత్రాలు పంపిణీ వ్యవస్థ ఉంటదా? ఉండదా? అనేది అనుమానమే.అట్లనే పుస్తకాలు, పత్రికలు ఇంకా చెవులలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఆ బుక్ ఓపెన్ చేసి,అదే చదివి పెట్టే టెక్నాలజీ కూడా వచ్చింది.ఇక చదవడం కూడా వద్దు.వట్టిగ  కూర్చుంటే పుస్తకం వినిపిస్తుంది.కవి దేవేందర్ రానున్న రోజులలో తెలుగు పుస్తకాలు ముద్రణ తగ్గిపోయి ఇ – బుక్స్ రూపం మార్చుకోవచ్చునని, అర చేతిలో వైకుంఠం అన్నట్లు మన కళ్ళ ముందు చరిత్ర మారుతోంది అంటున్నారు.

అర్థం పర్థం వదిలిన నామం కాలమ్ లో
పిల్లల పేర్ల ట్రెండ్ ఐదు,పది సంవత్సరాలకో సారి మారిపోతోంది.మార్పులు అనివార్యమే.కొన్ని అర్థవంతంగా ఉంటాయి.మరి కొన్ని ఏ అర్థం లేకుండా ఉంటాయి.ఇటీవల ఒక పాపను ‘నీ పేరు ఏంటని’ అడిగితే సిమ్రిద్ధి అని చెప్పింది. ‘సమృద్ధి’గా ఉండాల్సింది ‘సిమృద్ధి’గా మారిందని అనిపించింది. అసలు ఈ పేర్లు పెట్టడం కొరకు ఇంటర్నెట్లో వెదికి, కొన్ని అక్షరాలు వాళ్ళనుకున్నవి కలుపుకొని అర్ధ వివరణ చూడకుండా పెట్టుకుంటున్నారు.ఇంగ్లీష్ ఉచ్ఛారణ వేరు.అక్షరాలు ఉంటే అవే తెలుగులో వాడుతున్నారు.సరే,ఏ పేరు అయితే ఏమిటి? పిలుస్తున్నం.పలుకుతున్నరు.ఆధార్ కార్డ్ లోను ఎక్కుతుంది అనే వాదన వేరు.కానీ,కొంచెమన్న అర్థం పర్థం ఉంటే బాగుంటుంది.కవి దేవేందర్ ఆ కాలంలో అర్థవంతమైన పేర్లు ఉండేవని,ఈ కాలంలో అక్షరాలు కలిపి కూర్చే తీరు కనబడుతున్నది అంటున్నారు.

సెల్ తో జర పదిలం మరి !! కాలమ్ లో
కాలగమనంలో కొన్ని అవసరాలు తప్పనిసరి అయితాయి.చెలామణిలో ఉన్న ప్రపంచంతో పాటు మనము నడవాలంటే కొన్నింటిని ఉపయోగిస్తుండాలి.ఏదైనా అతిగా వాడితే అంతే సంగతులు.అతిగా సెల్ ఫోన్ లో మునిగి పోతే నడుము నొప్పులు షురూ అయితయని ఆర్థోపెడిక్ వైద్యులు చెబుతున్నరు.అదే పనిగా సెల్ చూస్తుంటే కంటి రెటీనా పాడైపోతోందట.సెల్ నుంచి వచ్చే కాంతి కిరణాలు కండ్ల మీద తదేకంగా పడితే నష్టం కలుగుతుంది.సెల్ విపరీతంగా చూస్తున్న వాళ్లకు తలనొప్పి కూడా వస్తున్నదట.ఇన్ని నష్టాలు ఉన్న సెల్ ను విడిచి ఒక్క రోజు కూడా ఉండటం సాధ్యం కాకపోవచ్చు.అయితే అదే పనిగా సెల్ చూస్తే వ్యసనంగా మారిపోతే అనారోగ్యంతో పాటు రేడియేషన్ ప్రభావం కూడా పడుతుందట.అన్ని రంగాలలో ముందుకు పోయి ఆధునికంగా ఉండ వలసిందే.సెల్ కు సెలవు ఇవ్వకపోతే రోగాలతో మంచాన పడటం ఖాయం.కవి దేవేందర్ సెల్ చూడటానికి ఉదయం అర్ధ గంట,సాయంత్రం ఒక గంట లేదా కేటాయించుకుంటే మంచిదని అంటున్నారు.సెల్ ఫోన్ తో జర పదిలం అని  దాని వల్ల కలిగే అనర్థాలను చక్కగా వివరించారు.

మనిషి తనానికి ప్రతిరూపం కాలమ్ లో
పరుల కోసం పాటుపడని నరుని బ్రతుకు దేనికని? ఒక గజల్లో సినారే వేసిన ప్రశ్న.ఈ లోకం నుంచి దూరమై పోయిన సాహితీవేత్త,సామాజిక కార్యకర్త నిజాం వెంకటేశం జీవితం పరిశీలిస్తే గుర్తుకు వస్తది. ఆయన వేల కొలది పుస్తకాలను కొని చదువరులచే చదివించారు.ఆయన పుస్తకాల వితరణశీలి. కొనడం,చదవడం ఇతరులచే చదివించడం, అందులోని సారాంశాన్ని గలగల చెప్పడం ఆయనకు ఇష్టం.కవులు రచయితల పుస్తకాలు కాంప్లిమెంటరీ కాపీలుగా ఉచితంగా ఎవరి దగ్గర తీసుకోరు.ఓ పది, ఇరవై నగదు పెట్టి కొని అదే సభలో పంచుతారు. ఆయన పుస్తకాలు కొని పంచడమే కాదు.పుస్తక ప్రచురణకు కూడా ఆర్థిక సాయం చేస్తారు.కవి దేవేందర్ ఇందరి స్నేహితుల సంపదను మధ్యలోనే వదిలి వెళ్లిన నిజాం సారుకు జోహార్లు అర్పించారు. 

మనది కాని సంస్కృతి మీద ప్రేమ కాలమ్ లో          
సరే,తెలంగాణ తెచ్చుకున్నాం.మన సంస్కృతికి గౌరవం కూడా వచ్చింది.కొత్తగా ఉత్తర భారత దేశ సంస్కృతి విస్తృతమవుతోంది.గుజరాత్ వాల్ల వ్యాపారం మండలాల స్థాయికి చేరింది.రాజస్థాన్ హోటళ్ళు,స్వీట్ హౌజ్ లు కొంచెం పెద్ద ఊర్లల్ల కూడా ఉన్నాయి.ఇతర రాష్ట్రాల నుంచి వ్యవసాయ కూలీలు వస్తున్నారు.ఛత్తీస్ గఢ్ నుంచి బీహార్ నుంచి వస్తున్నారు.సంప్రదాయ బతుకమ్మ పాట మాయమైంది‌.దాని స్థానంలో ఉత్తరాది దాండియా చేరింది.పానీ పూరి,కట్లెట్ అట్లాంటివి ఎన్నో యూత్ ఆరగిస్తున్నారు.ఈ వ్యాపార సంస్కృతిలో మన ఆహార సంస్కృతి పూర్తిగా కనుమరుగైంది. ఒకప్పుడు హోటల్ అంటే పూరి,మిర్చి బజ్జీలు ఉండేది.ఇప్పుడు అవి కనిపిస్తలేవు.కొత్త వాటికి మన వాళ్లు సులువుగా ఆకర్షితులవుతున్నారు.కవి దేవేందర్ సరే,అవి నచ్చితే అవి ఆడుకొని,పాడుకొని బతుకమ్మ పాటలు పాడితే బాగుంటది కదా?స్థానిక సంస్కృతి,స్థానిక వ్యవహారాలను రక్షించుకోవాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.

శ్రమజీవులది వల్లిపోని సౌందర్యం కాలమ్ లో
నగరం నుంచి ఉద్యోగం కోసం ఉరుకులు పరుగులతో వెళ్లే మహిళలు ఫ్రెష్ గా ఉల్లాసంగా కళాత్మకంగానే కన్పిస్తారు.అందంగా తయారవడం అందుకు తగ్గట్టుగా వస్త్రధారణ ఇవన్నీ ఉంటాయి. ఇది ఉదయం ఆఫీసులకు వెళ్లే దృశ్యం.ఆఫీస్ నుండి వాళ్ళే తిరిగి వచ్చేటప్పుడు అంతా అలసిపోయినట్లు వల్లిపోయినట్లు కనిపిస్తారు.ఒక పల్లెటూరులో ఉదయం పూట నాట్లు వేసేందుకు కలుపు తీసేందుకు వెళ్లే వాళ్ళు హుషారుగా చకచకా నడుస్తూ నవ్వుతూ కనిపిస్తారు.గలగల మాట్లాడుతూ పనులకు పోతారు.తిరిగి వచ్చేటప్పుడు నాట్లేసి,కలుపు తీసి,కోత కోసి వచ్చే వాళ్ళు పోయినప్పుడు ఎట్లా ఉల్లాసంగా ఉన్నారో వచ్చేటప్పుడు అట్లాగే హుషారుగా కనిపిస్తారు. పట్టణాలలో పని చేసే వాళ్లు నాలుగు గోడల మధ్య ఫ్యాన్ కింద పని చేస్తారు.పల్లె వాళ్ళు ప్రకృతిలో పని చేస్తారు.కవి దేవేందర్ పల్లె వాళ్ళు తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు అలసిన ముఖాలు కన్పించవు అని, అందుకు భిన్నంగా నగర ఉద్యోగ వర్గ మహిళలను ఎందరిని చూసిన వల్లిపోయిన పూల వలనే కన్పిస్తారు అని అంటున్నారు.

ఈ నాయకులను సూత్తే ఒకారమొత్తంది! కాలమ్ లో
ఎన్నికల వార్తలు చూసినా,విన్నా నిజంగా ఒకార మొచ్చినంత పనైతంది.రాజకీయాలు ఎంత వ్యాపారం అయినవి.రాజకీయ పార్టీలు ఎంత బరి తెగించినవి.ప్రజాస్వామ్యం అనే మాటకు బొత్తిగా విలువ లేకుండా పోయింది.ఒక్క లీడర్లు మాత్రమేనా,ఓటర్లు కూడా అధ్వాన్నంగా తయారైండ్రు.పైసలు బహిరంగంగానే తీసుకునుడు. తాగుడు,తినుడు,ఓట్లేసుడు.పూర్తిగా ఓటరు తనకు తాను అమ్ముడుపోవుడు చూస్తే దేశం ఎటు పోతుందో?ప్రభుత్వ యంత్రాంగం ఏమన్నా తక్కువనా? నిబంధనలను పక్కన పెట్టి పై వారు ఆడించినట్టే ఆడుడు.గింత మాత్రానికి ఎలక్షన్ ఎందుకు?ఎన్ని వాహనాలు!ఎంతమంది ప్రచారం!ఎన్ని మందు సీసాలు!ఎన్ని నోట్ల కట్టలు! చెప్పనలవి కాదు.గాంధీ మహాత్ముడు బతికి ఉంటే ఎంత నెత్తి నోరు కొట్టుకొనునో?ఆ తరం రాజకీయ నాయకులు ఎవరైనా ఎంతో గొప్పగా నిజాయితీగా ఉండేవారు.ఇప్పటి రాజకీయ నాయకులకు బొత్తిగా నీతి నిజాయితీ,నిబద్ధత లేదు.కవి దేవేందర్ అయినా ఈ తరం ఇప్పుడు దినపత్రికలను చదవడం,వార్తా చానల్స్ చూడటం పూర్తిగా లేకుండా అయి పోయింది అని,ఎన్నికల వ్యవస్థను రాజకీయాలను చూస్తే జాలి కలుగుతుంది అని అంటున్నారు.

అహం అన్ని రోగాలకు మూలం కాలమ్ లో
అహాన్ని కిరీటం చేసుకుని జీవించాలనుకునే వారికి ప్రశాంతత కనిపించదు.అహం స్థానంలో ఆత్మ గౌరవం నిండి ఉండాలి.అహం నిండిన వారి కార్య క్షేత్రంలో నిరంతరం మెదిలే వారికి కొంచెం కష్టమే. వీళ్లకు ఆత్మగౌరవ సమస్య.అహంకారం ఆత్మ గౌరవాల మధ్య మమకారం నలిగిపోతది.ప్రేమ, కరుణ,అనురాగం నిండి ఉండాలి.ఒక రాజకీయ పార్టీ నాయకునికైనా,ఒక ఉన్నతాధికారికైనా,ఒక యజమానికైనా,తోటి వాళ్లతో అంతా నేనే అనే కంటే అంతా మనమే అనే భావన కొనసాగితే ఆ కార్య క్షేత్రం పరిఢవిల్లుతది.కవి దేవేందర్ అన్నింటికి మించి మనుషులందరికీ ప్రేమ,సహనం,క్షమించే గుణం, అందరి పట్ల ఉదారత్వం ఉండాల్సిన రోజులు రావాలి అని అంటున్నారు.

నడిచి వచ్చిన నిప్పుల వాగు కాలమ్ లో
తెలంగాణ ఉద్యమ పాట నిప్పుల వాగు పుస్తకం చూస్తేనే సంబురమైతది.ఇదొక మహత్తరమైన కృషి. తెలంగాణ మీద ఆలపించిన పాటలన్నీ నిప్పుల వలె ప్రవహించిన దృశ్యం.దీని సంపాదకుడు అందెశ్రీ అద్వితీయమైన కృషిని మనసారా అభినందించవలసిందే.ఇది తెలుగులో దాదాపు మొట్టమొదటి సంకలనం.ఇందులో 790 పాటలు/ కవితలు ఉన్నవి.అన్ని పాటలు తెలుగు నేల మీద హోరెత్తించినవే.ఊరూరులోను పాడినవే.తాను కొందరు స్నేహితులు,సన్నిహితుల సాయంతో ఈ నిప్పుల వాగును తెలుగు జాతికి అందించారు.కవి దేవేందర్ ఇది తెలుగు సాహిత్య చరిత్రలోనే నిలిచిపోయే మైలురాయిగా పేర్కొంటున్నారు.

వారు మేలు కథలు జానపదులు కాలమ్ లో
ఊరూరికి కథలు చెప్పే వాళ్ళు ఉంటారు.అంటే యక్షగానం,ఒగ్గు కథలు,బాగోతం ఆడేటోళ్లు,అందరికీ తెలుసు.వీళ్ళు వృత్తి కళాకారులు.ఇతర వృత్తులలో చేను – చెలక పనులలో ఉంటూ కూలీ నాలీ చేసుకుంటూ జీవనం సాగించే వాళ్ళలో కొందరు తాతల నుంచి వారసత్వంగా వచ్చిన కథలను చెబుతరు.వీటిని ‘శాత్రం’ చెప్పుడు అంటరు.ఈ విద్య అందరికీ రాదు.ఏదో ఒక కథనం అర్థం అయ్యే రీతిలో చెప్పే కళ.ఇట్లాంటి కథలను ఆచార్య పులికొండ సుబ్బాచారి గారు రెండు రాష్ట్రాల నుంచి సేకరించి ‘తెలుగింటి జానపద కథలు’ పేరిట ఒక పుస్తకంగా వెలువరించారు.ఇన్ని కథలను సేకరించడం మామూలు పని కాదు.ఆచార్య సుబ్బాచారి గారు పరిశోధకుడు,జానపద జ్ఞానం పట్ల అత్యంత ఆసక్తిగల రచయిత.సామెతలను కలుపుతూ ముచ్చట్లు పెట్టే చమత్కారులు ఉంటరు.వీళ్లందరినీ దొరకబట్టి రికార్డ్ చేసి తెలుగు సాహిత్యంలో చేర్చాల్సిన అవసరం ఉంది. కవి దేవేందర్ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారని,ఉంటరని, గుర్తించి.. పట్టుకొని,పట్టుబట్టి వాళ్లతో కథ చెప్పించి ఇలా పుస్తకం వేయడం గొప్ప విషయం అని అంటున్నారు.

కంకి ధర ఐదు.. గింజ ధర వంద !? కాలమ్ లో
చూస్తే పెద్ద పొట్లం,పొట్లం నిండా తెల్లని పువ్వులు పువ్వులుగా కనిపిస్తున్న మక్క ప్యాలాలు.వాటిని పాప్ కార్న్ అంటరు. చూడంగానే తినాలనిపిస్తది. ధర చూస్తే వంద రూపాయలకు అమ్ముడు.అసలు ఎన్ని గింజలు ఉన్నయి.ఒక చిన్న మక్క కంకి ఒలిస్తే అలాంటివి రెండు పొట్లాలు చేయచ్చు.అంటే పది రూపాయల కంకి గింజలు వంద రూపాయలకు అమ్ముడు.ఇదెంత మాయ కదా?అనుకున్న.ఇదంతా ఇటీవల మల్టీప్లెక్స్ థియేటర్లో సినిమాకు వెళ్తే తెలిసింది.ఆ పాప్ కార్న్ పొట్లంలో 30,40 గింజలున్నయి.పంటలు పండించే రైతుల దగ్గర గింత అగ్గువకు కొని సూపర్ మార్కెట్ లో సినిమా హాల్ లో ఆధునిక పద్ధతులతో మార్పిడి చేసి ఇంత ఘోరంగా సంపాదిస్తున్నారు.వీటన్నిటి వెనుక మల్టీ నేషనల్ కంపెనీలే ఉంటాయి.సమాజంలో ఏ వస్తువైనా పెట్టుబడి తక్కువ.కింది స్థాయి నుంచి తక్కువ ధరకు కొనడం,బ్రాండ్ పేర్లు చేర్చి దానినే తిరిగి అయిదింతలకు అమ్మడం.ప్రపంచం అంతా ఇట్లనే ఉన్నది.కవి దేవేందర్ మార్కెట్ మాయాజాలం నిండిపోయి ఉన్నం అని,ఈ వల నుంచి బయటపడ లేమని  అంటున్నారు.

పోలీసు సేవలన్నీ అందుకేనా !? కాలమ్ లో
పోలీసు ఉద్యోగాల ఎంపికకు యువతీ యువకులు ఎంత కష్టపడుతున్నారో వాళ్లు శిక్షణ పొందుతున్న మైదానాలు చూస్తే తెలుస్తుంది.పోలీస్ డ్రెస్ వేసుకోవడం కోసం ఈనాటి  యువతరం కల కంటున్నారు.కవి దేవేందర్ ఈ కాలం పోలీసులకు పౌరులతో సంబంధాలు ఇది వరకు కన్నా స్నేహపూర్వకంగానే ఉన్నాయని,కానీ సేవలన్నీ బందోబస్తు ప్రదర్శనకే సరిపోతున్నాయి అని అంటున్నారు.ఇది విచారించదగిన విషయంగానే తోస్తుంది.

ప్రయాణం ఒక చలన శీలత కాలమ్ లో
ప్రయాణం మనసుకు ఒక వికాసం.కొత్త ప్రదేశాలు తిరగడం, నిజంగానే ఒక జీవనోత్సాహం.యాత్రకు వెళ్లడం అంటేనే కొత్త సంస్కృతి,కొత్త మనుషులు, పట్టణాలు,రాష్ట్రాలు చూడటం అంటే పరిశీలన ఆసక్తి ఉండాలే గానీ,అది కండ్ల పండుగే.పిల్లలతో ప్రయాణం చేస్తే కూడా ఎంతో విజ్ఞానదాయకం. పిల్లలు పెద్దగా అయినంక తమ జీవితంలో అనుభూతిని గుర్తు చేసుకుంటరు.ఇలాంటి యాత్రలోనే ప్రయాణం కొన్ని గంటలు కల్సి మాట్లాడుకోవడం ఒక అనుభూతి.కవి దేవేందర్ ప్రయాణం ఒక చలనశీలత అని,ఇది మనుషుల ఏకాంతాన్ని ప్రకృతిలో మమేకం చేస్తది అని అంటున్నారు.

తెలుగుకు మరో పేరు తెలంగాణ కాలమ్ లో
తెలుగు భాషకు మరొక పేరే తెలంగాణ అని బూర్ల వెంకటేశ్వర్లు ఢంకా బజాయించి చెబుతున్నారు. తెలుగు భాషకు ఆంధ్ర భాష అనే మరో పేరు ఉన్నట్టుగానే,తెలంగాణ భాష అని పిలుచుకోవచ్చు. ఎందుకంటే లిపి అంతా ఒక్కటే అని తెలుగు తెలంగాణం అన్నారు.తెలంగాణ భాష సొగసైనదని, నాద మాధుర్యం గలదని బూర్ల వెంకటేశ్వర్లు ఇటీవలనే విడుదల చేసిన ‘ఉపకారి’ తెలంగాణ భాషానుశీలక వ్యాసాల పుస్తకంలో చాలా వరకు వివరించారు.ఈ పుస్తకంలో 23  వ్యాసాలు ఉన్నాయి.కవి దేవేందర్ తెలుగు భాషా పండితులు చదవాల్సిన పుస్తకం ఇది అంటున్నారు.

మనసు మాట వినాలి కాలమ్ లో
కాలం కరిగిపోతూనే ఉంటుంది.జీవితం జరిగిపోతది.క్యాలెండర్ పుటలు పుటలుగా మారి పన్నెండో నెల తర్వాత కొత్తది గోడకు వేలాడుతది. మాసాలు మారినట్టే ఋతువులు తిరుగుతుంటాయి.మనుషులంతా మారిపోతారు. ఆలోచనలు మారిపోతాయి.జీవితంలో కొంగ్రొత్త మార్పులు వస్తాయి.వృత్తి ఉద్యోగంలోనూ నూతనత్వం వస్తుంది.మార్పు అనివార్యం.కాలం కదలడం.భూమి తన చుట్టు తాను తిరిగినట్టే జరిగిపోతుంది.ఒక సంవత్సరం మనిషికి ఒక మైలురాయి.మనిషి ఆహారం,విహారం,ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నిట్లోనూ ఆధునికత వచ్చింది.కవి దేవేందర్ నిరంతరం మారుతున్న మార్పును ఆహ్వానించాలని,దాంతో కలిసి నడవడమే నవీన మానవుడు చేయాల్సిన చర్య అని.అప్పుడే మనసు తేలికయి గాలిలో ఊయలలు ఊగవచ్చు అని,కొత్త సంవత్సరంలో అందరి జీవితాలు నిరంతరం ఉత్సవ స్ఫూర్తితో కొనసాగాలని కోరుకుందాం అని అంటున్నారు.

సంఘ సంస్కరణల కథల శిల్పి రేగులపాటి కిషన్ రావు కాలమ్ లో
రేగులపాటి కిషన్ రావు కరీంనగర్ జిల్లాకు చెందిన సీనియర్ రచయిత,కథలు,నవలలు,కవిత్వం అభ్యుదయ దృక్పథంలో రాసిండు.దొరతనపు సామాజిక నేపథ్యంలో పుట్టినా సంఘ సంస్కరణ, దోపిడీ,పీడన,హేతువాద భావనలో కథలు రాశారు. నాలుగు నవలలు,ఆరు కథా సంపుటాలు,పద మూడు కవిత్వ సంపుటాలు,నాలుగు వ్యాసాల పుస్తకాలు వెలువరించారు.ఆయన 1946 డిసెంబర్ 1 న సిరిసిల్ల దగ్గర చింతల టానాలో పుట్టారు. ఇప్పుడు ఆ వూరు మిడ్ మానేరు ముంపుకు గురైంది.కరీంనగర్లో స్థిరపడ్డారు.1970 నుంచి 2004 వరకు 34 సంవత్సరాలు ఆదర్శ ఉపాధ్యాయునిగా పలు పాఠశాలల్లో పని చేశారు.కవి దేవేందర్ నిరంతరం సమాజంలో మార్పు కోసం ఆలోచన చేసే కిషన్ రావు 05 – 01 – 2023 రోజున కన్ను మూశారు.ఆయనకు భార్య,కూతురు,అల్లుడు, మనుమడు,మనుమరాలు ఉన్నారు అని తెలిపారు.

ఆధునికతను అందుకోకపోతే ఆగిపోవుడే కాలమ్ లో
మారుతున్న కాల పరిస్థితులకు అనుకూలంగా మనిషి ఆధునికతను అందిపుచ్చుకోకుంటే అక్కడే ఆగిపోవుడే అయితది.ఆధునిక ఆలోచన,ఆధునిక సాంకేతికత,ఆధునిక జీవనశైలి కానీయండి ఇప్పటి స్థితిలో ఉండటమే మేలు.లేకుంటే తరాల మధ్య తారతమ్యాలు వస్తాయి.కుటుంబంలో,సంస్థలో ఎక్కడైనా తరాల మధ్య అంతరాలు,మనుషుల మధ్య గ్యాప్ పెంచుతాయి.వయసు పెరిగే కొద్దీ నేను చిన్నప్పుడు ఇట్లా ఉండేది అంటూ పాత పురాణం చెపుతుంటారు.అవి ఎంత మాత్రం విన సంబరం ఇప్పటి తరంకు ఉండదు.ఎప్పటి ఆలోచనలు అప్పుడే.ప్రతిదీ నేర్చుకోవడమే జీవితం.కొత్తగా ఆలోచించడమే.కొత్తదనాన్ని ఆలోచించడమే నవ్య జీవన విధానం.కవి దేవేందర్ ఇప్పటి తరానికి అన్ని అల్కగా తెలుస్తున్నయి,వాళ్ల దగ్గర నుంచి నేర్చుకోవాలి,వాళ్లకు కూడా ఎవరు నేర్పరు,చూసి నేర్చుకుంటరు అని అంటున్నారు.                    

నిరంతర చలనంతోనే జీవన సాఫల్యత కాలమ్ లో
నిరంతరం చలనం లేకుంటే ఆగిపోయినట్టే.మనిషికి ఆక్టివిటీ ముఖ్యం.ఏ పనీ పాట లేకుంటే జీవ చైతన్యం కోల్పోవుడే.మరి పని లేనోళ్ళు ఎవలుంటారు అని కాదు గాని 60,70 ఏండ్లు దాటిన తర్వాత వృద్ధాప్యం వచ్చిందని తమకు తామే మెదడుకు సంకేతాలు ఇచ్చుకుంటరు.ఇటీవల పరిశోధనలో 80 ఏళ్లు దాటితేనే వృద్ధతరం వచ్చినట్టట.జపాన్ లాంటి దేశాల్లో నైతే 100 సంవత్సరాలు దాకా ఏదో పని చేస్తూనే ఉంటారు. రిటైర్ అయిపోయినం,పిల్లల పెండ్లిల్లు అయి పోయినయి,ఇగ ముసలితనం వచ్చిందని కొందరు ఒక భావనలో ఉంటారు.మెదడు ఎంత ఆలోచిస్తుంటే అంత చురుకుదనం వస్తుంది. ఎక్కువగా సృజనాత్మకత వైపు ఆలోచనలు ఉండాలి.చదవడం,రాయడం,మాట్లాడటం,ఇంటి పని,వంట పనిలో భాగస్వాములు కావడం, సామాజిక విషయాల్లో,చర్చల్లో,కొత్త తరంతో ఇంటరాక్ట్ అవ్వడం,ఇవన్నీ నిరంతరం మనుషులను చలనశీలత వైపు నడిపిస్తాయి.కవి దేవేందర్ మనిషి ఎప్పుడు నిరంతరం ఆలోచనలో,సృజనాత్మక చలనశీలత,సామాజిక జీవితంలో కల్సిపోతేనే అసలైన జిందగీ అని అంటున్నారు.

తినడం కాదు రుచిని ఆస్వాదిస్తున్నామా! కాలమ్ లో
ఈ మధ్య అన్నింటికీ తొందర ఎక్కువైంది.నిదానం తక్కువైంది.ఏ పని అయినా తృప్తిగా చేయడం లేదు.అందరికీ బిజీ షెడ్యూల్. ఆఫీసులకు, వ్యాపారాలకు,ఉద్యోగాలకు వెళ్లిపోవాలె అనే ధ్యాసనే కానీ,ఈ పనులన్నీ ఆనందంగా జీవించడానికే అని మరిచి పోతున్నారు.ఆరోగ్యంగా, ఆనందంగా జీవించాలంటే సరియైన వేళకు సరియైన సమతుల్యమైన భోజనం అవసరం. కానీ,ఆ భోజనాన్ని ఒక పద్ధతిగా తినడం తగ్గిపోతుంది.ఎవలను చూసినా నాలుగు బుక్కలు నోట్లో పెట్టుకొని మూతి కడుక్కొని ఉరుకుడే అవుతుంది.బిజీ లైఫ్ దాపురించి మంచి నీళ్లు తాగడం కూడా తక్కువైంది.సరియైన నీళ్లు తగిన మోతాదులో తాగడం లేదు.సరియైన వేళకు సరిగ్గా తినడం అన్ని వృత్తుల్లోని వారికి తగ్గిపోయింది. ఎందుకంటే ఒత్తిడి,పోటీ తత్వం,సంపాదన ఎక్కువైనయి.ఆఖరుకు వ్యవసాయం చేసే ఈ తరం వాళ్లు కూడా తినే దగ్గర తృప్తి లేదు.తినే అన్నం మీద మాత్రమే ధ్యాస పెడితే తిన్న తిండి పెయ్యికి పడుతది.జీవితాన్ని సరియైన మార్గంలో పెట్టాలంటే వ్యాయామం,యోగా వంటివి చేస్తుండాలి.కవి దేవేందర్ ఏ పని చేసినా ఆనందంతో ఆ పనిపై శ్రద్ధ, నైపుణ్యత,పనిని ప్రేమించడం,నిరంతరం ఆ రంగంలో మార్పులకు సాంకేతికను గమనిస్తూ చైతన్యంతో ముందుకు సాగడం ముఖ్యం అని అంటున్నారు.

చేసికోవాల్సిన సమయంలో పెళ్లి చేసికుంట లేరు కాలమ్ లో
చదువు,ఉద్యోగం,స్వతంత్ర ఆలోచనా దృక్పథం ఇటీవల యువతరంలో తరచూ కన్పిస్తున్నది. చదువుకున్న యువతరంలో ఎంత మందికి ఉద్యోగాలు వస్తున్నాయి అనే విషయం పక్కన పెట్టితే ఆ ఉద్యోగాలు పొందిన ఆడపిల్లలైనా,మగ పిల్లలైనా తమ పెళ్లి కోసం తొందరపడటం లేదు. చదువు అయిపోయింది.సాఫ్ట్ వేర్ ఉద్యోగం వచ్చింది.ఇగ పెళ్లి చేసుకోవాలె అనే ఆలోచన కూడా చేయడం లేదు.ఆడ వాళ్లు కూడా 30,35 దాటిన తర్వాత తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చిన  నిర్లిప్తంగా ఉంటున్నారు.వారిలో స్వతంత్ర ఆలోచనల భావధార కొనసాగుతుంది.పైగా పెళ్లైన కుటుంబాల ఆడ పిల్లలు మగహంకార అధిపత్యాలు గమనించి ఉంటారు.సింగిల్ లైఫ్ బెటర్ అనే ధోరణిలో ఉంటున్నారు.కవి దేవేందర్ ఏది ఏమైనా ఇదివరకు అబ్బాయిలు దొరకకపోయేదని,ఇప్పుడు అమ్మాయిలు ఉన్నా పెళ్లిళ్లు తొందరగా అయిత లేవు అని అంటున్నారు.

ఎన్నీల ముచ్చట్లు కవిత్వాన్ని జల్లెడ పట్టిన కూకట్ల కాలమ్ లో
ఎన్నీల ముచ్చట్లు అంటే కరీంనగర్ కవుల ఇంటి డాబాల మీద ప్రతి పౌర్ణమి రోజు జరుపుకునే కవి సమ్మేళనం.ఈ కవిత్వ పున్నమి కలయిక,గత పది సంవత్సరాలుగా నిర్విరామంగా నడుస్తున్నది.ఒక పున్నమికి కవులందరు చదివిన కవిత్వం మరో పున్నమి వరకు పుస్తకంగా వస్తుంది.ఇట్లా నలభై నెలల వరకు కవిత్వ సంకలనాలు వచ్చాయి.ఇట్లా వెలువడ్డ ఒకటి నుంచి ఇరవై ఐదు ఎన్నీల ముచ్చట్ల కవితా సంకలనాలను కవి, విమర్శకుడు,తెలుగు భాషోపాధ్యాయుడు కూకట్ల తిరుపతి జల్లెడ పేర విమర్శనా వ్యాసాల పుస్తకం వెలువరించారు. ఇందులో 2013 నుంచి 2015 వరకు జరిగిన కవి సమ్మేళనాల కవిత్వంకు చాలా సూక్ష్మంగా పరిశీలన చేశారు.కవి దేవేందర్ కూకట్ల తిరుపతి తెలుగు సాహిత్యంలో మైలురాయి లాంటి ఎన్నీల ముచ్చట్లను జల్లెడ పట్టి ప్రపంచానికి అందించారు అని అంటున్నారు.

పాఠకుడు మహాపాఠకుడై వివరించిన కవిత్వ సారం కాలమ్ లో
ఏ పుస్తకమైనా చదివి తీరాల్సిందేనని పట్టుదలతో ఉండే పాఠకులు ఉంటారు.ఆ పాఠకులే మహా పాఠకులైతరు.కాలం కల్సి వస్తే వాళ్లే చదివిన పుస్తకంపై వ్యాఖ్యానం చేస్తారు.అదిగో అటు వంటి గొప్ప సాహిత్య వ్యాఖ్యాత అన్నాడి గజేందర్ రెడ్డి. ఆయన తెలుగు సాహిత్యం చదువుకున్న స్నాతకోత్తర విద్యార్థి. అనంతర కాలం కళాశాలలో తెలుగు అధ్యాపకులుగా పని చేసి ప్రధానాచార్యులుగా ఉద్యోగ విరమణ పొందారు. అన్నాడి గజేందర్ రెడ్డి చదివిన ప్రతి పుస్తకాన్ని రాయడం మొదలు పెట్టాడు.అట్లా రాసిన వ్యాసాలు ‘వెలుగు’దినపత్రికలో దాదాపు వారం వారం వెలుగు చూసాయి.ఆ తర్వాత ‘వెలుగుల వెల్లువ’ అనే పుస్తకం బయటకు వచ్చింది.ఈ పుస్తకంలో తాను చదివి రాసిన పుస్తకాల్లోంచి ముప్ఫై మూడు కవిత్వ పుస్తకాల కవిత్వాన్ని పుస్తకంగా వెలువరించారు.కవి దేవేందర్ ఈ పుస్తకం చదివితే ఇందులోని వ్యాసాలు మూలాల పుస్తకం చదవాలనే ఆసక్తి పాఠకుల్లో కల్గుతుంది అని అంటున్నారు.

మానసిక ఒత్తిడితోనే ప్రశాంతత కరువు కాలమ్ లో
నిదానం నెమ్మదితనం ప్రశాంతత లేని తరం కనబడుతుంది.ఎక్కడ చూసినా ఉరుకులాట ఎక్కువైంది.వేగిరం ఎక్కువైంది.జీవితం పరుగు పందెం లెక్క తయారైంది.కొందరు తయారు చేసుకుంటున్నారు.కొన్ని వృత్తులు అట్లనే ఉంటున్నయి.ఒత్తిడి మీది కెల్లి టార్గెట్లు,తొందర పెట్టుడు,ఎక్కువ పని చేసుడు, తక్కువ పని చేసింది మీదికి రిపోర్ట్ చేసుడు ఎక్కువ.ఈ మానసిక ఒత్తిడితోనే ప్రశాంతత అందరిలో కరువైంది.కవి దేవేందర్ ఇప్పుడు అంతా స్పీడ్,మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే మానవ సంబంధాలు పరిపక్వంగా ఉంటాయి,నిదానంగా ఆలోచనలు ఉండాలి.అందుకు దృఢ దృష్టి,దృఢ సంకల్పం ఉండి తీరాలి అని అంటున్నారు.

నగరాల్లో పుస్తక మహోత్సవాలు విరివిగా.. కాలమ్ లో
పుస్తకమే జ్ఞానకవాటం.పుస్తకమే మనిషి జీవితానికి భవిష్యత్ దర్శనం.చరిత్ర వర్తమాన సామాజిక ఆర్థిక సాంస్కృతిక విషయాల పట్ల వికాసం  పెంపొందించేవి పుస్తకాలే.ఒకప్పుడు పుస్తకాలు ఇష్టంగా చదివే వాళ్ళు.ఇట్లా చదవడం వల్లనే జీవన సాఫల్యత ఉంటుంది.ప్రస్తుతం 2023 మార్చి 2 నుండి 8  వరకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని కరీంనగర్ జిల్లాలో పుస్తక మహోత్సవం నిర్వహిస్తున్నారు.కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్,అడిషనల్ కలెక్టర్ జి.వి.శ్యాం ప్రసాద్ లాల్ లకు పుస్తక వికాస ప్రేమ ఉండటం వల్ల ఇలాంటి ఉత్సవాలు నిర్వహించి ప్రజలకు అందుబాటులోకి పుస్తకాలను తెచ్చేందుకు తెలంగాణ బుక్ ట్రస్ట్ తోడ్పాటును అందిస్తున్నారు. పుస్తకాల సంస్కృతిని చదువు అలవాటును ఆధ్యయనం పట్ల ఆవశ్యకతను ప్రజల్లో కలిగించేందుకు ప్రతి రోజు ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు.కవి దేవేందర్ పుస్తక జ్ఞాన వికాసం అన్ని నగరాల్లో విస్తృతంగా జరగాల్సిన అవసరం ఉన్నది అని అంటున్నారు. 

మా బడి వజ్రోత్సవం కాలమ్ లో
కరీంనగర్ జిల్లాలో 1945 ప్రాంతంలో వేళ్ల మీద లెక్కపెట్టబడే బడులే ఉండేవి.అందులో హుస్నాబాద్ లో 1947 లో స్థాపించిన ప్రాథమిక పాఠశాల ఒకటి.ఇప్పుడది ఉన్నత పాఠశాలగా మారి ఈనెల 20 మార్చి 2023 న 75 ఏళ్లు వజ్రోత్సవ పండుగ జరుపుకుంటుంది.1947 లోనే హుస్నాబాద్ లో ప్రాథమిక పాఠశాల బి లక్ష్మీ కాంతారావు పూనికతో ఏర్పడింది.అనంతరం అది ఉన్నత పాఠశాల గా మారింది.1958లో మొదటి హెచ్.ఎస్.సి.(11 వ తరగతి)బ్యాచ్ వెలువడింది.ఒక పాఠశాల 75 వసంతాలు పూర్తి చేసుకుని ఒక పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్న సందర్భం ఇది. ఈ బడి ఎందరినో తయారు చేసింది.అందరు కలుసుకుంటున్న సందర్భం ఇది.అందరు కలిసి అరేయ్,ఒరేయ్ అనుకున్న జ్ఞాపకాలు,కొట్టుకున్న, తిట్టుకున్న మధురిమలు,పాఠశాల మైదానంలో ఆడిన పాత అడుగుజాడలు మళ్లీ మళ్లీ వెతుకుతున్న రోజు ఇది.కవి దేవేందర్ విద్యా గంధానికి దూరమైన తెలంగాణలో ఒక బడి 75 ఏళ్ల పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉంది అని అంటున్నారు. 

సామాన్యుల చేతిలో యూట్యూబ్ ప్రయోజనం కాలమ్ లో
యూట్యూబ్ సామాన్యులకు సైతం అందుబాటులోకి వచ్చిన తర్వాత పిల్లలు పెద్దలు అందరూ డ్యాన్స్ సులువుగా చేస్తున్నారు.ఒకప్పుడు పాఠశాల వార్షికోత్సవాల్లో డాన్స్ చేయాలంటే క్లాస్ కు ఇద్దరు విద్యార్థులు దొరికే వారు.ఇప్పుడు అట్లా కాదు క్లాస్ క్లాసంతా అందరు పిల్లల సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.ఇదంతా ఇంటర్నెట్,యూట్యూబ్ మహిమ.సినిమాలు,పాటలు,డాన్స్ షోలు ఎన్నో యూట్యూబ్ లో ఈ రోజుల్లో చూస్తున్నారు. చూడటమే కాదు, అనునయిస్తున్నారు. నేర్చుకుంటున్నారు.చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల దాకా డాన్స్ అన్నా,సంగీతం అన్నా,జానపద పాటలన్నా ఇష్టపడుతున్నారు.కవి దేవేందర్ సెల్ ఫోన్,ఇంటర్నెట్ అర చేతిలోకి వచ్చిన తర్వాత ప్రపంచమే మారి పోయింది.టెక్నాలజీ అందరి సొత్తు.అందరు వాడాలి.దానితో మరిన్ని కొత్త కొత్త ప్రయోగాలు చేసి సామాజిక ప్రయోజనం కోసం ఉపయోగించాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.

కుటుంబ బలగం … మృగ్యమవుతున్న కాలం కాలమ్ లో
కుటుంబ బంధాల్లో దూరమవుతున్న అనుబంధాలకు ఒక్కసారిగా ఇటీవల వచ్చిన బలగం సినిమా షాక్ ఇచ్చింది.సినిమా చూస్తున్నంత సేపు ఊరు,కుటుంబం,తల్లి,తండ్రి గుర్తుకు వచ్చి ప్రేక్షకులను పలు ఆలోచనలకు గురి చేస్తది. సినిమాలో చనిపోయిన తర్వాత పిట్టకు పెట్టుడు ఆ పద కొండు రోజుల వరకు ఉన్న సంఘటనలు ఉన్నది ఉన్నట్టు చూయించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ సంస్కృతికి,భాషకు గౌరవం పెరిగింది.బలగం సినిమాలో మాత్రం సహజత్వం ఉట్టి పడింది.కవి దేవేందర్ తెలంగాణ పల్లె సొగసు కనిపించే సినిమాలు మరిన్ని రావాలి అని కోరారు.

ఆపతికి సంపతికి సోపతి కాలమ్ లో
మనిషికి స్నేహితులు లేకపోతే మనసు విప్పి మాట్లాడుకునే ఖాళీ మనసు దొరకదు.నిజానికి అందరికీ స్నేహితులు తమ చదువుకున్న చోట్ల, తాను బాల్యంలో నివసించిన చోట్ల,తాను వృత్తి వ్యాపారం ఉద్యోగం కొనసాగిస్తున్న చోట్లల్ల ఉంటారు. స్నేహం కొందరితోనే కొనసాగుతది. స్నేహితుల్లో విశ్వసనీయత ఉండాలి.ఒకరి పట్ల ఒకరికి గౌరవం,ప్రేమ ఉండాలి.భిన్న అభిప్రాయాలు ఉన్నా సరే స్నేహం గొప్పది.స్నేహితుల మధ్య నిష్కల్మషమైన మనస్తత్వం ఉండాలి.ఏ రకమైన ఆధిపత్యం ఉండ రాదు.కవి దేవేందర్ ఒకరు చెబితే ఒకరు వినడం కాకున్నా ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉంటే అప్పుడే ఆ సోపతి జీవితానికి అసలు ఆపతి సంపతి అని అంటున్నారు.

జమిడిక జతుల ధ్వనుల కవిత్వం కాలమ్ లో
జమిడిక ఒక వాయిద్య పరికరం.బైండ్లోళ్ళు గ్రామ దేవతలను కొలిచేటప్పుడు దీన్ని వాయిస్తూ కథా గానం చేస్తారు.అదొక అద్భుతమైన కళ.జమిడిక చప్పుడు పోచమ్మల కాడ,ఎల్లమ్మ కాడ కన్పిస్తది. జమిడిక శీర్షికతో కందుకూరి అంజయ్య కవిత్వ పుస్తకం వెలువరించిండు.చెరబండరాజు కవిత్వం మీద పరిశోధన చేసిన ఆయన ఇది వరకు కట్టెపల్క అనే కవితా సంపుటి తెచ్చిండు.జమిడిక ఈ కాలానికి వెలువడిన గొప్ప పుస్తకం.ఇందులో సమకాలీన ఆరాటాలు,పోరాట స్వభావాలు, అస్తిత్వం,ఆలోచనా దృక్పథం కనిపిస్తాయి.ప్రాచీన సాహిత్యం అధ్యయనం చేసిన ఆధునిక దృక్పథం గల ఈ కవి అంజయ్య ఇంకా కవిత్వం విరివిగానే రాయాల్సి ఉంది అని కవి దేవేందర్  అంటున్నారు.

సమాజ కృతజ్ఞత తీర్చుకోవాలి! కాలమ్ లో
ఆస్తులు అంతస్తులు ఐశ్వర్యం విపరీతంగా పెరిగినంక మనిషిలో మమకారం తగ్గిపోతున్న కాలం చూస్తున్నాం.ఎదగాల్సిందే వృద్ధిలోకి రావాల్సిందే. సంపద సృష్టించాల్సిందే కావచ్చు గానీ మానవ సంబంధాలు బలహీన పడకూడదు కదా.సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతుంది.పైగా అహంకారం పెరిగిన తర్వాత స్నేహ సంబంధాలు కూడా తగ్గిపోతున్నాయి.కవి దేవేందర్ ఏదైనా సమాజంలో అసమానతలు లేకుండా సర్వ సమానంగా ఉన్నప్పుడే ఈ ఘర్షణలు,మనుషుల మధ్య వైర వాతావరణం ఉండవు.సమానత్వం కోసం అందరు కృషి చేయాల్సిన అవసరం ఉన్నది అని అంటున్నారు.

యాత్ర జీవన వికాసానికొక ఆయుర్వేద మాత్ర కాలమ్ లో
ఇటీవల మేము మిత్రులతో కల్సి ఒక ట్రావెల్ ఏజెన్సీ ద్వారా జమ్మూ కాశ్మీర్ యాత్ర చేసినం.కాశ్మీర్ ఒక బహు సుందర దృశ్యం.మంచు పర్వతాల మీద నడుస్తుంటే మనసు దేహం గాలి లోనే తిరుగుతున్న ఆనందం కల్గుతుంది.మా ప్రయాణం 60 మందికి పైగా యాత్రికులతో ఉత్సాహంగా సాగింది.మా బృందం ఆనందంగా వైష్ణోదేవి శ్రీనగర్,గుల్ మార్గ్, పహెగాం ప్రాంతాలు పర్యటించి ఊపిరితిత్తులను ఉతికి ఆరేసుకున్నాము.కవి దేవేందర్ తాను కరీంనగర్ కు తిరిగి  వచ్చినా మనసు మాత్రం  హిమాలయ పర్వతాల్లోనే తిరుగుతోంది అని అంటున్నారు.

ఆకస్మికంగా ఆగిపోతున్న హృదయాలు కాలమ్ లో
ఇటీవలి కాలంలో ఆకస్మికంగా గుండెలు ఆగిపోయి మనుషులు విలవిలా కుప్పకూలిపోతున్నారు. ఎకాఎకిన ఆగిన హృదయ కవాటాలలో ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి.అంతకు ముందు గుండె సంబంధ వ్యాధి లేకున్నా,బీపీ,షుగర్ వ్యాధులు లేకున్నా ఒక్కసారే గాలిలో ప్రాణాలు తేలి పోతున్నాయి.కరోనా ప్రభావంతో చాలా మంది మృత్యువాత పడ్డారు.అసలు మనుషుల ఆరోగ్య జీవనశైలి వ్యాయామం ఆహార శైలి నియంత్రణల దృక్పథం పట్ల ప్రజలకు చైతన్యం లేకుండా పోయింది.కవి దేవేందర్ ఏది తినకూడదో అదే తింటున్నారు.ఏది చేయకూడదో అదే చేస్తున్నారు అని అంటున్నారు.ఆ పైన  విపరీతమైన పని ఒత్తిడి తట్టుకోలేక మందు తాగడం చేత  ఆఖరుకు హృదయం బరువెక్కి తనకు తానే స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నది అని అంటున్నారు.

నిరంతర సాధన ద్వారానే ప్రావీణ్యత కాలమ్ లో
మనిషి తన కోరుకున్న ఏ రంగంలోనైనా ప్రావీణ్యత సాధించాలంటే నిరంతరం శ్రమించాల్సిందే.ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే సాధన ఎల్లవేళలా అవసరమే.క్రీడాకారుడైనా,కళాకారుడైనా,చిత్రకారుడైనా,శిల్పకారుడైనా,ఏ సృజనకారునికైనా తన పని మీద తనకు ప్రాక్టీస్ లేకపోతే ఆగిపోయినట్టే.అందుకే నిరంతరం ప్రాక్టీస్ ఉంటేనే మనిషి మెదడు అట్లనే పని చేస్తది.వృత్తినైనా ప్రవృత్తినైనా నిరంతరం అలవాటులో ఉంచుకోవాలి.కవి దేవేందర్ ఏదైనా సాధన చేయడం,సృజనాత్మకంగా ఆలోచించడం, శ్రమించడం,దాని కోసం సమయం కేటాయించడం చేస్తేనే ఆ రంగంలో శిఖర స్థాయిలో ఉండవచ్చు అని అంటున్నారు.

ఆ పోరాటం ఒక పులకరించే జ్ఞాపకం కాలమ్ లో
తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలే ఒక పులకరింపు.ఒక పలవరింతలా ఉంది.తెలంగాణ ఆవిర్భవించి తొమ్మిది ఏళ్లు దాటి పదవ సంవత్సరంలో అడుగిడుతున్న సందర్భం.తెలంగాణ రాష్ట్ర అస్తిత్వ భావజాల ప్రచారం ఎవరు ఊహించని దానికంటే ఎక్కువ జరిగింది.తెలంగాణ పాట పెద్ద స్ఫూర్తి. తెలంగాణ నేల మీద ఏ ఉద్యమానికైనా పాటనే ఆక్సిజన్.నక్సలైట్ ఉద్యమాల్లోనూ పాటలే అందరిని నిలిపేవి.అంతకు ముందు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలోను పాట ప్రభావం ఎక్కువ.కవి దేవేందర్ తెలంగాణ రాష్ట్రం పన్నెండు వందల మంది అమరవీరుల రక్త తర్పణంతో వచ్చింది అని,ఏది ఏమైనా ఈ నేల మీద విజయవంతంగా సాగిన గొప్ప శాంతియుత ప్రజా ఉద్యమం తెలంగాణ,జయహో తెలంగాణ అని అంటున్నారు.

ఆయన కవిత్వం రక్తచలన సంగీతం కాలమ్ లో
ఆయన కవిత్వం రక్తచలన సంగీతం రిక్కల సహదేవరెడ్డి నూనుగు మీసాల నూతన యవ్వనంలోనే కవిత్వం రాసి అమరుడైన కవి. ఇటీవల సహదేవరెడ్డి రాసిన కవితా సంపుటి రక్తచలన సంగీతం అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య వారు పునర్నిర్మించారు.మొదట1988లో సహదేవ్ రెడ్డి మరణానంతరం విరసం ప్రచురించింది.35 ఏళ్ల క్రితం తన 22వ ఏటనే నేలకొరిగిన సాహసి.మరణించిన 35 ఏళ్ల తర్వాత హుస్నాబాద్ కు చెందిన కవిని అతని కవిత్వం ద్వారా నవతరం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అని కవి దేవేందర్ అంటున్నారు. 

మనిషిలో క్రూరత్వం మితిమీరిపోతుంది కాలమ్ లో
మనిషిని చూస్తే మాట్లాడుతూ,నవ్వుతూ,నడుస్తూ, ఏదో పనిలో లీనమై కన్పిస్తాడు.కానీ,మనిషిలో క్రూరత్వం కూడా భయంకరంగా కనిపిస్తుంది.ఇటీవల వార్తలొస్తున్న సంఘటనలు చూస్తుంటే ఎంత క్రూరత్వం అంటే సాటి మనిషిని కలిసి ప్రయాణం చేసిన మనుషులను కసకస నరికి చంపి ముక్కలు ముక్కలు చేయడం ఇలా రాస్తుంటేనే ఎంతో ఇదనిపిస్తుంది.ఇట్లాంటిది మనుషులను నరికి కుక్కర్లో పెట్టడం,ఫ్రిజ్ లో పెట్టడం,సంచిలో పెట్టడం, చివరకు నీళ్లలో కలపడం చాలా సులువుగా చేస్తున్నారు.దేశంలో జరుగుతున్న సకల అనర్థాలకు దౌర్జన్యాలకు ప్రధానంగా సినిమాలే కారణం.సినిమా ప్రభావం సమాజం మీద ఎక్కువ.మంచితో పాటు చెడును తెలుసుకునే అంతర్జాలం ఉండటం వల్ల కూడా ఈ దుర్మార్గాలు పెరిగి పోతున్నాయి.నేర నిరూపణతో జాప్యం వల్ల న్యాయస్థానాల్లో నూ అన్యాయం జరుగుతుంది.తప్పు చేస్తున్నం, అన్యాయం చేస్తున్నం,హంతకులం అవుతున్నం, చంపడం ఎంత జుగుప్సాకరమైన అమానవీయ సంఘటన అనే సోయి పూర్తిగా కోల్పోయిన ప్రపంచం తయారవుతుంది.కవి దేవేందర్ సమాజంలో మానవ సంబంధాలు మృగ్యమైపోతున్నాయి అని అంటున్నారు.

సంస్కృతి కోల్పోతున్న పల్లెలు! కాలమ్ లో
ఒకప్పటి పల్లెల సంస్కృతి ఇప్పుడు మారి పోతున్నది.ఊర్లల్ల ఎన్ని వైరుధ్యాలు ఉన్నా అందరం ఒక్కటేననే ప్రేమ భావన ఉండేది.కుల అంతరాలు ఉన్నా రాజకీయ పార్టీల భేదాలున్నా శత్రుత్వ వైఖరి చాలా గ్రామాల్లో లేకుండా ఉండేది.నక్సలైట్ రాజకీయాల ప్రభావం వల్ల ప్రశ్నించడం,అడగడం, మర్లపడటం తెలిసింది.రాజకీయ చైతన్యం చదువుకు దూరమైన కుటుంబాలకు సైతం వచ్చింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత బహుజన కులాల్లో రాజకీయ ఆసక్తి పెరిగింది.నగరంలో దొరికే అన్ని వస్తువులు,సేవలు పల్లెలో దొరుకుతున్నయి. మద్యపానం ఒకప్పుడు పల్లెల్లో తక్కువగా ఉండేది, సారా ఉండేది.బెల్ట్ షాపుల పేర మందు మాత్రం ఊరురా చేరింది.సులువుగా డబ్బులు వస్తున్నాయి. చదువు మధ్యలో ఆపేసిన వారు డిగ్రీ,పీజీ పూర్తి కాకుండానే పల్లెలో ఉండే వాళ్లంతా ఆయా పార్టీలకు కార్యకర్తలుగా ఉంటూ ఇట్లా వ్యవహరిస్తున్నారు. భూముల పంచాయతీలు అయితే,అవి తెగేదాకా ఊరంతా పండుగే అవుతుంది అని,ఇలా పల్లెలు సంస్కృతిని పూర్తిగా కోల్పోతున్నాయి అని కవి దేవేందర్  అంటున్నారు.

జయహో .. నవ్య,షేజల్,తుల్జా,తులసీ కాలమ్ లో
స్త్రీలు తమ ఆత్మ గౌరవం కోసం న్యాయం కోసం దోషులకు శిక్ష పడటం కోసం బహిరంగంగా ముందుకు రావడం చూస్తుంటే వ్యక్తులుగా వీరు .. వ్యవస్థలను అధికారులను ఎదిరించడం అభినందించ దగ్గ అంశం.ఒక తులసీ చందుగా కాకుండా మిగతా నవ్య.షేజల్ ల పోరాటం లైంగిక వేధింపులకు వ్యతిరేకమైనది.అధికార పార్టీలోని మహిళా నాయకులు గానీ పార్టీ గానీ ఈ విషయంలో చర్య తీసుకుంటే బాగుంటుంది.ఇక తుల్జా భవానీ రెడ్డి విషయంలో అంతర్గతంగా ఆర్థిక విషయాలు ఎలా ఉన్నాయో గాని తండ్రి చర్యను నిరసిస్తూ తన పేర ఉన్న  ఆస్తిని ప్రజాపరం చేయాలనుకోవడం మూల పరిణామం.తెలంగాణ ఆవిర్భావం తర్వాత కొన్ని పోరాట సంఘాలు మౌనంగా ఉన్నట్లు కనిపిస్తున్నా,వ్యక్తులుగా ఈ మహిళలు చేసిన పోరాటాలకు కవి దేవేందర్  జయహో.. అని  అంటున్నారు.

తెలంగాణ అంటే తాగుడేనా! కాలమ్ లో
ఇటీవల వస్తున్న కొన్ని సినిమాల్లో మందు తాగడమే ప్రధానంగా కన్పిస్తుంది.పాటల్లో ఫైటింగ్లో ఎక్కడ పడితే అక్కడ తాగుడు సన్నివేశం పెట్టారు. తెలంగాణ నేటివిటీతో వచ్చే సినిమాల్లో ఎప్పుడు పడితే అప్పుడు,ఎక్కడ పడితే అక్కడ తాగడం, సందర్భం లేకున్నా మందులో మునిగిపోవడం చూస్తుంటే ఈ సినిమా వాళ్లు తెలంగాణ అంటేనే తాగుడు సంస్కృతితో పరిచయం చేస్తున్నారా? అనిపిస్తుంది.పేదరికం,మోసాలు, వలసలు, వ్యవసాయంలో నష్టపోవడం,పోరాటాలు,ప్రేమలు సమాజంలో ఎన్ని కథలు జీవితాలు ఉంటాయి? అందులో ఫ్యాక్షన్ ఒకటి కావచ్చు.తెలంగాణ సినిమాను కూడా ఒక కల్చర్ కట్టి చూపెట్టడం తగదు అని కవి దేవేందర్  అంటున్నారు.

ఆలోచనలు తారుమారు చేయడమే రాజకీయం! కాలమ్ లో
ఉన్నది ఉన్నట్టుగా కాకుండా లేనిది ఉన్నట్టుగా ఊహలను నిజమని నమ్మించడం,విషయాన్ని మ్యాన్ ప్లేషన్ చేయడంతో అధికార సోపానంలో మీది మెట్టుకు చేరుకోవచ్చు.ఎన్నడైనా ఎప్పుడైనా పాలకులు ప్రజలను నమ్మించి  నిరంతరం తమ వైపుకు తిప్పుకోవడం,ఆశలకు గురి చేయడంతోనే లింక్ కొనసాగుతది.అప్పుడే ఓట్లు పడేట్టు రూప కల్పన జరుగుతుంది.అప్పుడే పీఠం ఎక్కుతరు. పవర్ లో ఉన్న పాలకులకు అన్ని హంగులు, ఆర్భాటాలు ఉంటాయి.గనుక ఆలోచనలను తారుమారు చేయడం సులువు అవుతుంది.ఆయా పార్టీలు ఆయా ప్రాంతాలు ప్రజల నాడిని బట్టి ఎన్నికల వ్యూహ పథకాలు వేస్తుంటారు.వాగ్దానాలు అమలు కాకుండా మరిచిపోయేట్టు చేయడం, వాగ్దానాల గురించి ఎలాంటి ఆలోచన రాకుండా దాటవేయడం విజయ సూత్రంగా పరిణమించింది అని కవి దేవేందర్ అంటున్నారు.

ఎంత విద్వేషం తలకెక్కితే.. అలా ఊరేగించారు కాలమ్ లో
ఆడ వాళ్లను అలా నగ్నంగా ఊరేగించారంటే .. ఎంత పొగరు నిండిన మనుషుల గుంపు అయితే అలా హింసానందం పొందుతుంది?వాళ్ళ తలలో ఎంత విద్వేషం నిండిపోయి ఉంది?ఆ దృశ్యాలను చూస్తే అయ్యో ఎంత అన్యాయం ఎంత అమానుషం అనిపిస్తుంది.అయినా క్రూర మృగాల కంటే దారుణంగా మనిషి ఎందుకు ప్రవర్తిస్తున్నాడు?ఈ ఒక్క నగ్న ఊరేగింపే కాదు.ఎక్కడ చూసినా మనుషుల పట్ల మనుషుల్లో క్రూర స్వభావం పెరిగిపోతుంది.భూతదయ,కరుణ,జాలి అనేది పూర్తిగా తగ్గిపోతుంది.ఇంత అన్యాయం చేస్తున్నా నాకేమైనా అయితుందా?అనే భయం కూడా లేదు. ఎందుకంటే ఇదంతా వ్యూహాత్మకంగా సాగిస్తున్న దారుణం,ప్రపంచం నివ్వెరపోయేతనం అని కవి దేవేందర్ అంటున్నారు.

ఆరోగ్యానికి .. హాని కలిగించేవే కొంటున్నం!కాలమ్ లో
ప్రకృతిని,పర్యావరణాన్ని ఏర్పడకుండా ధ్వంసం చేసే సంస్కృతి దాపురించింది.ప్రపంచం అంతా ప్లాస్టిక్ నిండిపోతంది.ఇది మంచిది కాదు అని అందరికీ ఎరికే.అయినా నడుస్తూనే ఉన్నది.ఒక్క నూనెలు నీళ్లు మాత్రమే కాకుండా మన ఆరోగ్యానికి హాని కలిగించే అన్నింటిని కొనుక్కొని వాడుతున్నం.మనం తినే కూరగాయల్లో,చికెన్ లో మనం తినే పండ్లలోను క్రిమిసంహారక అవశేషాలు ఉన్నయి.అయినా కొంటున్నాం వాడుతున్నం.కవి దేవేందర్ ప్రతి వస్తువును ప్లాస్టిక్ పేపర్ ప్యాకింగ్ తో వస్తుంది అని, ఇవన్నీ పర్యావరణానికి హాని కలిగించేవే,ఆరోగ్యానికి హాని కలిగించేవే,వీటిని ప్రభుత్వాలు చూసి చూడనట్లు ఉంటున్నాయి అని అంటున్నారు.

సాంస్కృతిక యుగకర్త గద్దర్  కాలమ్ లో
గద్దర్.. ఈ పేరు పీడిత ప్రజల పొలికేక.ప్రజల పాటకు ప్రతి రూపం.జీవితాంతం ప్రజా ఉద్యమాల గీతం. ఆయన దేహం పాటలమయం.మాట్లాడితే సంగీత ప్రవాహం.పాటలో ప్రపంచాన్ని జయించే శక్తిని ప్రపంచానికి పరిచయం చేశాడు.ఇంతటి ప్రతిభావంతమైన కవి తెలుగు నేల మీద తప్ప ఇంకెక్కడైనా ఉన్నాడా అన్పిస్తది.గద్దర్ ఇప్పుడు భౌతికంగా లేకపోవచ్చు కానీ.. ఆయన పాట శాశ్వతం.ఏది ఏమైనా ఉద్యమం కోసం,పాట కోసం, సమాజం కోసం,జీవితాన్ని ధార పోసిన గద్దర్ ఈ దేశ సాంస్కృతిక యుగకర్త అని,ప్రజల భాషలో ప్రజల జీవితాలను చిత్రించిన సృజనకారుడైన,ప్రజా యుద్ధ నౌక గద్దర్ కు కవి దేవేందర్  జోహార్లు అర్పించడం బాగుంది.

ఎన్నికల పండుగలో.. కనిపించే చిత్రాలు! కాలమ్ లో
ఎన్నికల కాలం దగ్గరికి వస్తుంది అంటే అన్నీ చిత్ర విచిత్రమైన సన్నివేశాలు చూస్తం.ఐదేళ్లకు ఓసారి ఓటర్లతోని అక్కెర.ఆ తర్వాత ఇష్టా రీతిగా వ్యవహారం నడిపించుకోవచ్చు.నిజానికి ఇదొక వ్యాపారం ముందు పెట్టుబడి పెట్టుడు.గెలిచిన తర్వాత రకరకాల మార్గాల ద్వారా సంపాదించుకునుడు.కవి దేవేందర్ రానున్న రోజుల్లో ఈ చిత్రాలన్నీ మనకు కనిపిస్తాయి అని అంటున్నారు.

బహుజనులను ఆలోచనల్లో పడేసే పుస్తకం!కాలమ్ లో
ప్రఖ్యాత చరిత్ర పరిశోధకుడు,రచయిత డాక్టర్ సంగిశెట్టి శ్రీనివాస్ ఎప్పుడు కొత్త కొత్త చరిత్రాత్మకమైన పుస్తకాలు వెలువరిస్తరు.మొన్ననే రెడ్లు,వెలమలేనా!బీసీలు సీఎం కావద్దా’ అనే పుస్తకం విడుదల చేసిండు.ఈ పుస్తకాన్ని చదివితే వెనుకబడేసిన కులాల వారు ఆలోచనల్లో పడుతరు. కవి దేవేందర్ ఈ పుస్తకం అన్ని రాజకీయ పార్టీల్లోని బహుజనులు కొనుక్కొని చదవాల్సిన అవసరం ఉన్నది అని అంటున్నారు.

భయం లేని ప్రవృత్తి పెరిగిపోతోంది ! కాలమ్ లో
ఇయ్యాల రేపు హత్యలు ఎంత సులువు అయిపోయినయి.కుటుంబ సభ్యులు మరీ చెల్లె, అక్కను ఊపిరి ఆడకుండా చేసి హతమార్చడం, ఎంత ఘోరమైన పని.కోరుట్లలో సొంత చెల్లి, అక్కను తన ప్రేమికునితో కలిసి చంపడాన్ని ఎట్లా చూడాలి?దొంగతనం చేయడం చూసిందని తోడ బుట్టిన అక్కను నిర్ధాక్షిణ్యంగా గొంతు నులిమే నేర ప్రవృత్తి ఎట్లా వచ్చింది?కవి దేవేందర్ ఎన్ని నేరాలు చేసినా రాజకీయవాదులను పట్టుకొని సులువుగా బయటకు రావచ్చుననే ఆలోచన కూడా ఉండటం వల్ల సమాజంలో భయం లేని ప్రవృత్తి పెరిగి పోతుంది అని,రానున్న రోజుల్లో మరింత భయంకరం కూడా కావచ్చు అని అంటున్నారు.

ఎంత నెత్తురు ప్రవహించిందీ నేల మీద ! కాలమ్ లో
తెలంగాణ నేల పోరాటాల కార్యశాల.వేల వేల మంది అమరుల త్యాగం వల్లనే మనం ఇంత మాత్రమైనా గొప్పగా జీవిస్తున్నది. తెలంగాణ నేల మీద ఎక్కడ చూసినా కన్నీళ్లు,ఏ రక్తం అంటని మట్టి కనపడదు.ఏ ఊరు చూసినా అమరవీరుల స్థూపాలు,స్మృతులే కనిపిస్తాయి.కవి దేవేందర్ తెలంగాణ నేలనే పోరాట స్వభావాల గాలి.ఇది నిరంతరం ప్రశ్నలు వేసే కాలం. ప్రశ్నలు,పోరాడే స్వభావం అన్యాయంను ధిక్కరించే చేతులు ఎప్పుడు ఉంటాయి అని అంటున్నారు.

ఆలోచనల్లో పరిపక్వత రాకుంటే ఆగిపోవుడే !కాలమ్ లో
నిజానికి నిరంతరం నేర్చుకోవడమే జీవితం.ఎప్పుడు ఒక కొత్త పని నేర్చుకోవడం ఉంటేనే సరదా.పాత ఆలోచనలను ప్రోది చేసి పదిలపరిచి అందులో నుంచి మంచిని ఎంచి మిగతాది కొనసాగిస్తుండాలి. కవి దేవేందర్ ఆధునికతను,కొత్త సాంకేతికతను మారుతున్న మనస్తత్వాలను పట్టుకోవాలని,పది మందికి మేలు చేసేట్లు,నాలుగు మొక్కలకు నీళ్లు పోసేట్లు,నాలుగు పక్షులకు గింజలు వేసేట్లు, నలుగురితో కల్సి నవ్వుతూ జీవించడం నేటి రేపటి అవసరం అని అంటున్నారు.

జీవితంలో లాఫర్వాతనం ఎక్కువైతంది ! కాలమ్ లో
ఇప్పుడు వస్తున్న తరంలో జీవితం పట్ల ఆశావాద దృక్పథంతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే ఆకాంక్షలు ఎక్కువగానే ఉన్నాయి.కానీ పని పట్ల జీవన గమనం పట్ల లాఫర్వాతనం కూడా ఎక్కువగా కన్పిస్తుంది.కారులో ప్రయాణం చేస్తరు.డ్రైవింగ్ చేస్తరు.కానీ సీటు బెల్టు పెట్టడంలో ‘ఎహె పోనియి’ ఏమైతదనే ధోరణి ఈ తరంలో ఎక్కువ మందిలో కన్పిస్తుంది.ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు.తీవ్ర గాయాల పాలు అవుతున్నారు.కవి దేవేందర్ జీవితం పట్ల కుటుంబం పట్ల  బాధ్యతగా ఉండటం తగ్గిపోతున్నది అని, అందుకే వాస్తవికంగా, నిదానంగా,నెమ్మదిగా,తొందర లేకుండా తగు జాగ్రత్తలతో ప్రయాణాలు చేస్తే మంచిది అని అంటున్నారు.

మొదలైన ఎన్నికల రణరంగం…
ఉత్త మాటలు షురూ!కాలమ్ లో
ప్రజలకు సేవ చేయడానికి గింత పెట్టుబడి ఎట్ల పెడుతున్నవు. గిన్ని కోట్ల పైసలు ఎట్ల ఖర్చు చేస్తున్నావు.అంతకు ముందు నువ్వు ఎట్ల ఉంటివి. నీకున్న ఆదాయం ఎంత?ఇవన్నీ ఎట్ల సంపాదిస్తున్నవు?మల్ల ఇదంతా ప్రజాసేవ అంటవు. అన్ని జూటా మాటలే మాట్లాడుతవు.అన్ని అబద్ధాలు చెప్పుతవు.ఓట్ల కోసం పైసలు ఇచ్చుడు. తర్వాత పైసలు కమాయించుడు.అవినీతి,అధర్మం అనేవి ఉత్త మాటలు లెక్క అయిపోయినవి.కవి దేవేందర్ ఎన్నికల రణరంగం మోపైంది.ఎవలను చూడు గీ పార్టీ గెలుస్తదా,గా పార్టీ గెలుస్తదా అనే లెక్కలే! ప్రజాస్వామ్యం పరిఢవిల్లాల్చిన కాలం కోసం ఎదిరి చూడాలె అని అంటున్నారు.

ఓటరు ఆచితూచి ఓటు వేయాలి!కాలమ్ లో
ఎన్నికలు ప్రజాస్వామికంగా జరగాలి.ప్రజల స్వతంత్ర ఆలోచనలు సాగనివ్వాలి.ఆచితూచి ఓటరు ఆలోచించి ఓటు వెయ్యాలనే చైతన్యం పెంపొందాలి. అసలు మనుషులకున్న మతిమరుపు వీళ్ళ గెలుపుకు మూలమలుపు.కవి దేవేందర్ ఏ పార్టీ అయినా వాళ్ళ గత మేనిఫెస్టోలో పెట్టిన వాళ్ళు గత ఎన్నికల్లో మాట్లాడిన వాగ్దానాలు అమలు అయ్యాయా అంటే చాలా వరకు కావు,కొన్ని  అయితయి.అవన్నీ పౌరులకు జ్ఞాపకం ఉండవు అని అంటున్నారు.

రాజకీయమే వ్యాపారం అయితే ఎట్లా!?కాలమ్ లో
ఎల్లెడలా అవినీతి నీతి లాగే చలామణి అవుతుంది. అన్యాయం న్యాయంలాగే ఊరేగుతుంది.అధర్మం ధర్మం అయి కూచున్నది.ఇప్పుడు సమాజం మొత్తంలోనూ విలువలు మారుతున్నవి. స్వాతంత్ర్యానంతరం అవినీతి .. నీతిగా చలామణిలోకి వస్తున్న సందర్భంలో ఎన్నికల క్షేత్రంలో ఉన్నాం.ఇదంతా చూసి నాకేం తక్కువా అని ఓటరు కూడా లంచం లేనిది ఓటు వేయని పరిస్థితి వచ్చింది.డబ్బులు మాకు రాలేదని పోయిన ఎన్నికల్లో ధర్నాలకు కూడా దిగారు.కవి దేవేందర్ న్యాయం అన్యాయం తేడాలేని దుస్థితి దాపురించింది అని అంటున్నారు.

మనిషికి రాజకీయ చైతన్యం అవసరం కాలమ్ లో
నీతికి అవినీతికి తేడా లేదు.లంచాలు పైసలు దళారితనం మాట తప్పడం అనేవి ఒకప్పుడు ఇజ్జత్ అనిపించేది.ఇప్పుడు వాటికే విలువ పెరిగింది.అదే సాలు కొనసాగుతుంది.అయితే రాజ్యాంగం ప్రకారం పౌర హక్కులు,చట్టాలు అమలు కావడం లేదు.అయినా పట్టింపు లేకుండా అయ్యింది.ప్రజాస్వామిక ఆలోచనలు కూడా రాకుండా పోయినయి.ఏది ఏమైనా రాజ్యమంటే కొంత ప్రజాస్వామిక వాతావరణము ఉండాలి.కొంత స్వేచ్ఛ సమానత్వం సమభావం పరిఢవిల్లాలి. అందరిని కోతిని చేసి ఆడిచ్చుడు కాదు.కొన్ని ప్రశ్నలు ఉదయించనివ్వాలె.కొంత చైతన్యం రావాలి. అందుకు అన్ని రాజకీయ పక్షాలు కృషి చేయాలి.కవి దేవేందర్ ఏది ఏమైనా మార్పు,చైతన్యం కొత్తదనం నూతన ఆలోచనలు అవసరమని అంటున్నారు.

ఆగిపోని ప్రశ్నలతరం బర్రెలక్క అభ్యర్థిత్వం కాలమ్ లో
ఈ రోజు బర్రెలక్క ఎలియాస్ శిరీష ఒక యువతరం ప్రతినిధిగా ధైర్యంగా నిలిచింది.తన పోరాటాన్ని నిరుద్యోగ యువతరం ప్రభుత్వాలకు వేస్తున్న ప్రశ్నగా నిలిపింది.నిజానికి ఆమె చదువుకున్నది హైదరాబాదులో,గ్రూప్స్ కి ప్రిపేర్ అయ్యింది.అవి రద్దు అయినవి.లాభం లేదని ఇంటికి వచ్చి బర్లు కాస్తోంది.తెలంగాణ సమాజంలో ప్రశ్నించడం, వ్యతిరేకించడం,అడగడం,మాట్లాడటం అనేది ఆది నుంచి ఉన్నవే.ఈ గుణాత్మకత వల్లనే తెలంగాణ ఉద్యమం వచ్చింది.తెలంగాణ సాధించుకున్నం.కానీ, అప్పటి కొన్ని గొంతులు మూగ పోవడం,కొన్ని సంఘాలు సైలెంట్ కావడం వల్ల అది ఆగదు.మరో తరం ఆ ప్రశ్నను ఒక బర్రెలక్క రూపంలో తీసుకున్నది.కవి దేవేందర్ జయహో బర్రెలక్క జయహో… అని అంటున్నారు.

స్వభావమే మనిషికి ముఖ్యం కాలమ్ లో
మనిషి యొక్క ప్రవర్తన స్వభావాలు,వ్యక్తిత్వాలు మనుషులను  దగ్గర చేస్తాయి.మల్ల మార్పులు జరిగితే దూరం కొడతాయి.అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన ప్రజా జీవితంలో ఉండే నాయకుల ప్రతి చర్యను ప్రజలు గమనిస్తూ ఉంటారు.ముఖ్యంగా నాయకత్వంలో ఉన్న వారికి కన్ను మిన్ను కాననితనం ఆవహించవచ్చు.అహంకారపూరిత ప్రవర్తనలు వ్యక్తిగతంగాను ఉండవచ్చు,వ్యవస్థ పరంగాను ఉండవచ్చు, ఇవన్నీ పలు సందర్భాల్లో ప్రజల మనసుల్లో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినట్టే అవుతాయి.తర్వాత ఎక్కడ మీట నొక్కాలనో అక్కడ నొక్కుతరు.దీనికి ప్రొద్భలం కానీ అవతలి వాళ్ళ మంచితనం కానీ కొలమానం కాదు.నిన్ను దించడమే తరువాయి అయితది.ప్రజాస్వామిక స్వేచ్ఛ అవసరం,భావ ప్రకటన స్వేచ్ఛ అవసరం. ఆత్మ గౌరవం నినాదమే అసలైనది.ఇది మనుషులకు,నాయకులకు,వ్యవస్థలకు అందరికీ అవసరమైనది.ఎప్పుడు వినే చెవులను బందీ చేయరాదు అని,చూసే కనులను కలిసే కరచాలనాలను ఆహ్వానించాలె అని కవి దేవేందర్  అంటున్నారు.                           

ట్రెండ్ సెట్టర్ రైటర్ నరేందర్ కాలమ్ లో
కె.వి.నరేందర్ రాసిన బొడ్లే సంచి కవిత్వం.బొడ్లే సంచి ఈ పేరే అద్భుతమైన పురా జ్ఞాపకాన్ని తట్టి లేపుతుంది.శ్రమజీవులైన తల్లులు చీర నడుము కట్టు దగ్గర పదిలంగా చెక్కుకునే పైసల సంచే బొడ్లే సంచి.మూడు దశాబ్దాలకు పైగా కథలు,నవలలు మానవ సంబంధాలను సామాజిక అంతరాలను చిత్రిస్తున్న నరేందర్ ఇన్నేళ్ల తర్వాత కవిత్వంలోకి రావడం ఆనందంగా ఉంది.నరేందర్ కవిత్వంలో మార్మికత ఉండదు.ఉపమానాలు దృశ్యమానం చేస్తాయి.అందరికీ కనిపించే అల్ప వస్తువుల పైన అపురూపమైన కవిత్వం చెప్పడం ఈ సంపుటిలో కనపడుతుంది.కవి దేవేందర్  కె.వి. నరేందర్ రాసిన  బొడ్లే సంచి కవిత్వానికి స్వాగతం పలుకుతూ..  ఉన్నారు.

ఇప్పుడైనా మనసు కడుక్కుందాం కాలమ్ లో
రండి జర ఈ కొత్త సంవత్సరం దర్వాజా దగ్గర నిలబడి మనసులోని మలినాన్ని సబ్బుతోని కడుక్కుందాం.పాత ఆలోచనలు పనికిరాని విశ్వాసాల నుంచి మస్తిష్కాన్ని శుభ్రపరచు కోవాలి.మనం మన కోసం చట్టాలను గౌరవించుకోవాల్సి ఉంది.ధర్మాన్ని న్యాయాన్ని విధి విధానాలను గౌరవించుకోవాలి.భారత రాజ్యాంగమే ముఖ్యం దాన్ని అనుసరించి మనుషులందరు సమానంగా కల్సి జీవించాల్సి ఉంది.అణిచివేత, దోపిడీ,పీడనలేని రోజులను ఆహ్వానించాలి.కవి దేవేందర్ అందుకు ఈ కొత్త సంవత్సరం వెలుగులో ప్రతిన బూనితే బాగుంటుంది కదా.అందుకే రండి ఈ రోజే  మనల్ని మనం తేజాబుతో కడుక్కుందాం అని అంటున్నారు.

ఒక చరిత్ర నిర్మాణానికి పునాదిరాళ్లు కాలమ్ లో
ఒక చరిత్ర మరొక చరిత్రకు ఆనవాలు.మానని గాయాల నెత్తుటి చరిత్ర మన కళ్ళ ముందటి మూడు దశాబ్దాల చరిత్రను తెలియజేస్తుంది.ఈ చరిత్ర పేజీల్లోకి వెళితే నెత్తుటి ప్రవాహాల కన్నీళ్ల తడి తాకుతుంది.స్థానిక ఉద్యమాల చరిత్రను అక్షరాల్లోకి మలచాలనే ఆకాంక్ష మంగళారపు లక్ష్మణ్ కు పుష్కలంగా ఉంది.లక్ష్మణ్ కోహెడ కేంద్రంగా పాత్రికేయులుగా పని చేశారు.కవి దేవేందర్ తెలంగాణ ప్రాంతంలో ఆత్మకథలు,ప్రాంత చరిత్రలు రాసుకోవడం తక్కువ అనే లోటును తీర్చి హుస్నాబాద్ ప్రాంత చరిత్రను మంగళారపు లక్ష్మణ్ పుస్తకంగా వెలువరించడం అభినందనీయం అని అంటున్నారు.

ప్రయాణం ఒక ఆనందం కాలమ్ లో
ప్రయాణాన్ని ఆస్వాదించాలే గానీ ఇదొక ఆహ్లాదం.కొత్త ప్రాంతాలను,మనుషులను, సంస్కృతిని,ప్రకృతిని తిరిగి తిరిగి చూడటం అనేది ఏ మనిషికైనా వికాసం.ఏ పండుగ అయినా ఊరికి వెళ్లడం ఎంత ఆనందకరం.ఒక ప్రయాణమే ఒక మానసిక వికాసం.ఇప్పుడు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఒక స్వేచ్ఛా వికాసం మానసిక పరివర్తన కల్గుతది.కవి దేవేందర్ నిలువ నీరు కన్నా ప్రవహించే నది నీరు ఎంత మెరుగో..ఉన్న కాడ ఉండకుండా,మనిషి తిరిగిన్నాడే గొప్ప అనుభూతి చెందుతాడు అని అంటున్నారు.

ఈ పర్వత శ్రేణుల్లో.. సూర్యోదయం చూడాల్సిందే! కాలమ్ లో
మారేడుమిల్లి అడవుల్లోని ‘గుడిస’ ఎత్తైన కొండ గడ్డి మైదానం అంటారు.అల్లూరి సీతారామరాజు జిల్లాలోని మారేడుమిల్లి ఒక మండల కేంద్రం. ఇక్కడికి 50 కిలోమీటర్ల దూరంలో పుల్లంగి గ్రామ పరిధిలోనిది గుడిస.ఇక్కడికి ఉదయం 5 గంటలకు చేరితే అదొక ఆహ్లాదకరమైన వాతావరణంలో మనసు గాల్లో తేలిపోయి ఆనందం కల్గుతది.ఇక్కడ ఉదయం సూర్యోదయాన్ని చూడటం అనిర్వచనీయమైన ఆనందం.సూర్యోదయం కోసం ఎదురు చూస్తూ వందల మంది యాత్రికులు సెల్ ఫోన్ కెమెరాలతో నిలబడతారు.కవి దేవేందర్ పచ్చని అరణ్యంలో శీతల గాలులు..గడ్డి మైదానం నుంచి మన ముందు నుంచే తాకుతూ వెళుతున్న మేఘాలు.ఆ మబ్బుల నుంచి ఎర్రని  సూర్యుణ్ణి చూడడం గొప్ప అనుభూతి అని అంటున్నారు.

వింటే విచ్ఛిన్నమయ్యేది కాదేమో!? కాలమ్ లో
కానీ వినేందుకు చెవుల కిటికీలు మూసుకుంటే ఏం తెలువది.అంతరంగ నిఘా యంత్రం కూడా తాను కోరుకుంటునట్లుగానే అల్లిన సమాచారం ఇస్తది. బయట అల్లకల్లోలం అయితది.ఈ లోపల వ్యవస్థ పురా కరాబు అయితది.చిన్న కురుపుగా పుట్టిన వ్యతిరేకత పెద్ద గడ్డ లెక్క తయారై ఓటరు మీట నొక్కితే చీము బయటకు వస్తది.ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా వినడం అనేది ప్రధానం.చెప్పింది విని ఆలోచించాలి.తర్జన భర్జన చేయాలి.కవి దేవేందర్ నాయకులకు ప్రజాప్రతినిధులకు ముందు చూపుతో పాటు చెవుల కిటికీలు తెరిచి ఉంచితే మంచిది అని అంటున్నారు.

మార్పులు మంచివా, చెడ్డవా? కాలమ్ లో
ఇటీవల కాలంలో నగరాల్లో కొత్త వ్యాపారాలు పుంజుకుంటున్నాయి.ఆహార సంస్కృతి ఆలోచనా సరళి త్వర త్వరగా మారుతున్నది.ఆహార పదార్థాలు ఇంట్లో వండుకొని తినాలనే పద్ధతికి భిన్నంగా బయట హోటల్ భోజనాలు,టిఫిన్లకు అలవాటైపోతున్నరు.టిఫిన్లు బిర్యాని తర్వాత సాయంత్రం అయ్యిందంటే చాట్ భండార్ వద్ద పానీ పూరి,చాట్ మసాల,పావుబాజీ,కచోరి,సమోసాలు విపరీతంగా లాగిస్తున్నారు.నగరాల్లో కేక్ ల సంస్కృతి పెరిగింది.బేకరీ షాపులు వాడవాడకు అయ్యాయి.కవి దేవేందర్ పది,ఇరవై ఏండ్లకు ఒక సారి తినే ఆహారపు అలవాట్లలో పెను మార్పులు వస్తున్నయని.ఇవి మంచివా చెడ్డవా?అని ఆలోచించడం కన్నా కొత్త దనాన్ని ఆహ్వానించాల్సిందే అని,అయితే మన మూల సంస్కృతిని దేశీయ ఆహారపు దృక్పధాన్ని వీడరాదు అని అంటున్నారు.

ఆర్ట్స్ కాలేజ్ ఆకాశం మీద..కవిత్వం వెన్నెల కురిసింది కాలమ్ లో
కవిత్వానికి ఇంత ఫాలోయింగ్ ఇది వరకు చూడ లేదు.ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆర్ట్స్ కాలేజ్ ముందు బహిరంగ వేదిక మీద కవిత్వం గానం చేస్తుంటే వేలాదిమంది ఆ పంక్తులతో ఇన్ వాల్వ్ మెంట్ అయ్యారు.ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ నిర్వహించిన ఈ సదస్సులో దేశవ్యాప్తంగా ఉన్న 25 విశ్వవిద్యాలయాల తెలుగు ఆచార్యులతోపాటు తెలుగు రాష్ట్రాల్లో డిగ్రీ కళాశాల ఉపన్యాసకులు ఆసక్తి గల సాహిత్యకారులు పాల్గొన్నారు.ఆచార్య చింతకింది కాశీం కన్వీనర్.ఈ సదస్సులో అన్ని వాదాలతో పాటు ప్రకృతి వ్యవసాయం,పుర జ్ఞాపకాలు,సమకాలీన సమస్యలు,రాజ్యం, మతోన్మాదం,అణిచివేత,పోరాటాల కవిత్వం వినిపించారు.కవి దేవేందర్ ఇట్లాంటి సదస్సులు విశ్వవిద్యాలయాల్లో ఎప్పుడూ జరుగుతుంటాయి అని అంటున్నారు.

ఆడ ప్రయాణికుల్లో రాజసం కనిపించింది కాలమ్ లో
బస్సు ప్రయాణాల్లో మహిళా ప్రయాణికుల ముఖాలు రాజసంగా కన్పించినయి.మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాలు అనంతరం బస్సులో ప్రయాణిస్తే స్త్రీలు చిద్విలాసంగా కనిపిస్తున్నరు.ఈ బస్సు మాదే,మేము ఎక్కడికైనా వెళ్లి రావచ్చు ఒక్క పైసా కట్టకుండా అనే ఆనందం వారిలో కన్పించింది. కవి దేవేందర్ ఏదేమైనా బస్సుల్లో స్త్రీలు ఆనందంగా ప్రయాణిస్తున్నారు అని,ఇప్పుడు అవసరాల కోసం స్వేచ్ఛగా పావురాల్లా తిరుగుతున్నారు అని అంటున్నారు.

బొగ్గు రవ్వలు ఉద్యమాలకు దస్తావేజు కాలమ్ లో
ఇటీవల గురజాల రవీందర్ సింగరేణి ప్రాంతంలో పోరాటం నిర్వహించిన సికాసతో తన అనుబంధాన్ని తను ఎట్లా ఉద్యమంలోకి వెళ్ళింది అద్భుతంగా వెలువరించాడు.ఆ పుస్తకం పేరు బొగ్గు రవ్వలు. ఉద్యమాలను రికార్డు చేయడం అందులో పాల్గొన్న అందరికీ సాధ్యం కాకపోవచ్చు.కవి దేవేందర్ బొగ్గు రవ్వలు పుస్తకం సింగరేణి కార్మిక ఉద్యమాలకు ఒక దస్తావేజులాగా ఉన్నది అని అంటున్నారు.

అతి పెద్ద సాహిత్య ఉత్సవం కాలమ్ లో
ప్రపంచంలో అతి పెద్ద సాహిత్య ఉత్సవం 2024 మార్చి 11 నుంచి 16 మధ్య ఢిల్లీలో జరిగింది.ఈ ఉత్సవంలో పాల్గొంటే భారతదేశంలోని అన్ని భాషల అన్ని సంస్కృతుల సకల సాహిత్యాన్ని అర్థమైనా కాకున్నా వినవచ్చు.సాహిత్య అకాడమీ 70 సంవత్సరాల వార్షికోత్సవం సందర్భంగా ఈ బహుళ ఉత్సవం నిర్వహించింది.దీనిని ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ 2024 అంటారు.సాహిత్యోత్సవం – 2024 నిజంగానే ప్రపంచ స్థాయిలో గొప్పదే.అన్ని భాషల పుస్తకాల ప్రదర్శన అమ్మకం ఏర్పాట్లు జరిగాయి.కవి దేవేందర్ ఢిల్లీలోని మండేహేజ్ వద్ద గల రవీంద్ర భవన్ లో సాహిత్య అకాడమీ ఉంది అని,దాని ఆవరణ అంతా జాతీయ స్థాయిలో కవిత్వ ఉత్సవమే జరిగింది అని అంటున్నారు.

చెప్పింది చేయడానికి మీరే కావాలా?కాలమ్ లో
చట్టాలు అమలు చేసే యంత్రాంగం తంత్రాలతోనే వ్యవస్థ అంతా సర్వనాశనం అయిపోతుంది. అధికారంలో ఉన్న రాజకీయ నాయకులు వాళ్లకు అనుకూలంగా పనులు చేయమంటే ఎట్లా చేస్తారు.ఏ ఆదేశం అమలు చేయాలన్నా దానికో నిబంధన, పద్ధతి,రాజ్యాంగం చట్టం ఉత్తర్వులు ఉండే ఉంటాయి.ఈ నిబంధనలు అనుసరిస్తూ ఫోన్ ట్యాపింగ్ చేయవచ్చు.ఫోన్ ట్యాపింగ్ చేయడం కుదరదు అని చెప్పవచ్చు.ముఖ్యంగా అఖిలభారత సర్వీస్ అధికారుల వద్దనే ఈ లొంగుబాటు ఉంటుంది.ఒకే చట్టం అమలు చేసే కాలం వేరు. అమలు చేసే యంత్రాంగంలో మార్పులు.ఒకసారి నిర్వీర్యం,మరోసారి చర్యలు.కాబట్టి అధికార మార్పిడి సమాజానికి ఎంతో మంచిది అనిపిస్తుంది అని కవి దేవేందర్ అంటున్నారు.

ఇప్పటికైనా కోపం గురించి ఆలోచించాలి కాలమ్ లో
కోపం ఉండాల్సిన తరానికి కోపం ఉండటం లేదు. అవసరం లేని వారికి అనవసర కోపాలు ఎక్కువ వస్తున్నవి.ఈ సంవత్సరం పేరే క్రోధి నామ సంవత్సరం.క్రోధి అంటే కోపం అని అర్థం.అంతా కోపంతోనే నడుస్తుందని పంచాంగంలో చెప్పుతారు. పంచాంగం చెప్పినట్టు ప్రపంచం నడవదు.ఎవరి రాజ్యాంగం వారికే ఉంటది.ఆదాయం వ్యయం కూడా అందులో చెప్పినట్లు కాకుండా పేద వాళ్లకు పేదరికంగాను,ఉన్న వాళ్లకు ఉన్న రకంగానూ మారుతుంటుంది.నిజానికి కోపం రక్తపోటు ఉన్న వాళ్లకు ఎక్కువగా ఉంటుంది.వాళ్లు కాస్త ఉప్పు తక్కువ వాడాలి. పొద్దున్నే లేచి ధ్యానం చేయాలి. ఎవరికైనా ఉండాల్సింది కోపం,ధిక్కారం,మర్లపడే తత్వం ఉండాల్సిందే గానీ అవసరమైనంత వరకు  మాత్రమే ఉండాల్సి ఉంది అని కవి దేవేందర్ అంటున్నారు.

జ్ఞాపక శక్తికి ముప్పు తెస్తున్న స్థితి కాలమ్ లో
రీరంలో ఏ భాగమైనా నిరంతరం చలనం చైతన్యం ఉంటే సులువుగా దాని పని అది చేసుకుపోతది.ఏ పని లేకుండా ఉంటే అవయవాలు కూడా అంతే.ప్రతి రోజు నడక కోసమే నడవడం.కాళ్ళకు ఆ మాత్రం పని లేకపోతే ఇంట్లో నుంచి కొంచెం దూరం కూడా వెళ్లడం కష్టమే.రాను రాను పనులు సులువు అయినా శరీరం మనస్సుకు కష్టం లేకుంటా అయ్యింది.కవి దేవేందర్ పని లేకుండా ఉంటే జ్ఞాపక శక్తి కూడా తగ్గిపోతుంది అని అంటున్నారు.

నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోండి ! కాలమ్ లో
ఓట్ల పటాటోపం ప్రచారం ముగిసింది.ఎన్నిక వస్తున్నది.అరిచిన మైకులు మూగబోయినయి. బొంగురు పోయిన నాయకుల గొంతుకలకు విశ్రాంతి దొరికింది.అన్ని పార్టీల అభ్యర్థులు నాయకులు కాలికి విరామం లేకుండా తిరిగి తిరిగి జనం చెవుల్లో జివిలి వదల కొట్టిండ్రు.ప్రతి పని డబ్బులతో ముడిపడి ఉండే సంస్కృతి వచ్చేసింది.ఆఖరుకు ఓటర్లను కూడా అవినీతిపరులుగా అన్ని రాజకీయ పక్షాలు చేస్తున్నవి.ఓటుకు పైసలు ఇస్తేనే వేస్తం అన్న రీతిలో ఆలోచన వస్తుంది.వాళ్లు తింట లేరా మనం ఎందుకు ఉత్తగా వేయాలె అనే రీతిలో డిమాండ్లు రావడం ప్రజాస్వామ్యానికి విఘాతమే.కవి దేవేందర్ ఏది ఏమైనా ఎన్నికల్లో అందరు పాల్గొని నచ్చిన మెచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవాల్సిన అవసరం ఉన్నది అని అంటున్నారు.

వెలుగులోకి వస్తున్న పాత చరిత్ర కాలమ్ లో
మేర మల్లేశం (1924 – 1997) తెలంగాణ సాయుధ పోరాట యోధుడు.ఎన్నో పాటలు కట్టి పాడిన కవి, వాగ్గేయకారుడు.జీవితాంతం కష్టజీవుల పక్షాన నిలబడ్డ కమ్యూనిస్టు.ఆయన సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలోని అంతక పేట గ్రామానికి చెందిన వారు.1997 ‘మేర మల్లేశం పోరాట పాటలు’ పుస్తకం వచ్చింది.తిరిగి 27 సంవత్సరాల తర్వాత ఆ పాటలకు విపుల వ్యాఖ్యానాలతో పాటు తాను రాసుకున్న విశిష్టమైన పోరాట స్వీయ చరిత్ర కలిపి ఇప్పుడు పుస్తకం గా వెలువడింది.ఇందులో డాక్టర్ ముత్యం ‘మేర మల్లేశం జీవితం’ఒక చాప్టర్ గా వచ్చింది.ఈ పుస్తకం వెలువరించడానికి సూర్యాపేటకు చెందిన కొత్తకొండ కరుణాకర్ పూనుకున్నారు.కవి దేవేందర్ ఈ పుస్తకాన్ని తెలంగాణ రాజకీయ సమాజం అధ్యయనం చేయాల్సి ఉంది అని అంటున్నారు.

సెల్ ఫోన్ బడి పిల్లలను నాశనం చేస్తుంది కాలమ్ లో
పెద్దవాళ్లకు సెల్ ఫోన్ సరే.ఇప్పుడు బడి పిల్లలను సెల్ ఫోన్ వెంటాడుతుంది.పిల్లలు ఫోన్ చూడటం అలవాటై వదిలి ఉండటం లేదు.ఎండాకాలం సెలవుల్లో పిల్లలు సెల్ ఫోన్ తీసుకొని అందులో గేమ్స్ ఆడుతున్నారు.ఏడ చూసిన ఎవరి ఇల్లు చూసినా పిల్లలు సెల్ ఫోన్ లో తలపెట్టి పైకి తీస్త లేరు.ఇదంతా కరోనా కాలం తర్వాత ఆన్లైన్ క్లాస్ ల ద్వారా పిల్లలకు అబ్బిన జబ్బు.సెల్ ఫోన్ ఒక మత్తు లాగా అలవాటై విద్యార్థులు హోంవర్క్ ఇంట్లో ఏదైనా పని నేర్చుకోవడం కానీ చేయడం లేదు. ఎవరితోనూ మాట్లాడకుండా సెల్ ఫోన్ లోకంలోనే మునిగి పోతున్నారు.కవి దేవేందర్ పిల్లలను సెల్ ఫోన్ నుంచి రక్షించాల్సి ఉంది అని,ఈ విషయం ప్రభుత్వం కూడా పట్టించుకోవాల్సిన అవసరం ఉంది అని అంటున్నారు.

ఏ ఒక్కరు తెస్తే వచ్చింది కాదు తెలంగాణ కాలమ్ లో
ఎంత మంది ప్రాణాలు ధార పోస్తే తెలంగాణ సాకారం అయింది?ఎంత మంది మృత్యువును ముద్దాడితే తెలంగాణ ఆవిర్భవించింది?ఎన్నో వేల మంది గొంతెత్తి నిలదీస్తేనే కదా తెలంగాణ కల నెరవేరింది.ఎంత మంది తల్లుల నుదుటి కుంకుమ నేలరాలితే ఈ తెలంగాణ వచ్చిందనేది మననం చేసుకోవాల్సిన సందర్భం.అంతే గాని ఏ ఒక్కరి కృషి వల్ల మాత్రమే ఈ తెలంగాణ రాలేదు.కవి దేవేందర్ ఆ ఒక్కరి నాయకత్వం గొప్పదే కావచ్చు.కానీ చరిత్ర నిర్మాణంలో ప్రజల భాగస్వామ్యం ఉంటుంది అని భావిస్తున్నారు.

అసంకల్పిత ప్రతీకార జ్వాలలు కాలమ్ లో
ఎదుటి వ్యక్తి తన జాతిని అవమానపరిస్తే తన వాళ్లు పాల్గొన్న ఉద్యమాన్ని అవమానపరిస్తే తాత్కాలికంగా ఊరుకుంటారేమో గాని అదును కోసం చూసి ఏకాంతంగా కనిపిస్తే ఎంతటికైనా తెగిస్తారు.ఇటీవల చండీగర్ విమానాశ్రయంలో కంగనా రనౌత్ చెంప చెల్లుమనిపించిన సీ.ఐ.ఎస్.ఎఫ్.ఉద్యోగి కుల్విందర్ ప్రతీకార జ్వాలలను గమనించాం.కవి దేవేందర్ ఇప్పుడు కుల్విందర్ కౌర్ పై కేసు పెట్టవచ్చు,సస్పెండ్ చేయవచ్చు.ఎన్నైనా జరగనీ .. కానీ తన కోపం తాను చల్లార్చుకుంది అని అంటున్నారు.

ఇరాం లేని కలం కాలమ్ లో
ఆచార్య ఎన్.గోపిది తెలుగు నేల మీద వైవిధ్య జీవన వాస్తవిక కవిత్వ సంతకం.2024 జూన్ 25 కు ఆయనకు 75 ఏళ్లు.1950 జూన్ 25న భువనగిరిలో పుట్టిన ఆయన కొండంత వ్యక్తిత్వంతో ఎదిగారు. ఆయన రాసిన తొలి కవిత్వ సంపుటం తంగేడు పూలు నుంచి రేపు విడుదల అయ్యే రేపటి మైదానం దాకా 29 కవితా సంపుటాలు వెలువరించారు. తెలుగులో నానీల ప్రక్రియకు ఆచార్య ఎన్ గోపి సృష్టికర్త.కవి దేవేందర్ కాల గమనంలో ఆయన కవిత్వ ప్రయాణాన్ని కొలవడం,అధ్యయనం చేయడం,ఈ తరం కవుల కర్తవ్యం అని అంటున్నారు..

సాంస్కృతిక వారసత్వ సంపద కాలమ్ లో
తమ తండ్రుల కళలు,సాహిత్య అభిరుచులను తాము వారి స్మారకార్థం పుత్రులుగా ఇలా కొనసాగించడం ఒక విశేషంగా గౌరవంగా భావిస్తున్నామని కె ఎస్ అనంతాచార్య,జీవి శ్యాం ప్రసాద్ లాల్,మాడిశెట్టి గోపాల్,రావికంటి శ్రీనివాస్,డాక్టర్ రఘురామన్ లు సభలో ప్రకటించారు.గత నాలుగేళ్లుగా ఈ కార్యక్రమం సమైక్య సాహితి అనే వేదిక ద్వారా కొనసాగుతుంది. సంగీత నాట్య ఉపాధ్యాయ సాహిత్య పరిశోధన రంగాల్లో స్థాయిని గుర్తించి గౌరవిస్తున్నారు.కవి దేవేందర్ ఇది ఒక విశిష్ట కార్యక్రమంగా ఒక సాంస్కృతిక వారసత్వ పరంపరగా లోకమంతా తెలియాల్సి ఉంది అని  అంటున్నారు.

ఏ ప్రయోజనాలకీ ప్రచార ప్రస్థానం కాలమ్ లో
వార్తా ప్రచార దృశ్య మాధ్యమాలు యూట్యూబ్ ఛానల్లు ఇటీవల కాలంలో విస్తృతంగా నడుస్తున్నాయి.ఇటీవల ఒక వివాహ సంబంధంలో ఉన్న స్త్రీ ఎవరితో పిల్లలు కన్నది.ఆ సందర్భ సమయాల్లో ‘భర్త’ఎక్కడున్నాడు అనే విషయాలతో విస్తృతంగాను,ప్రత్యక్షంగాను మాధ్యమాల్లో ప్రసారం కావడం పాడు కాలం దాపురించింది అనుకోవచ్చు.యూట్యూబ్ ఛానల్ల లో విపరీతమైన అర్ధనగ్న శృంగార సంభాషణ దృశ్యాలు విస్తృతంగా తిరుగుతున్నాయి.ఇప్పుడు ఎవరి అరచేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ ఉంటుంది.అందులో సులువుగా ఇలాంటి దృశ్యాలు అన్ని వయసుల వాళ్ళు చూస్తున్నారు.వీటి ప్రభావం మనుషుల మీద పడకుండా ఉంటుందా..ఉండదు.కవి దేవేందర్ సామాజిక బాధ్యతగల వాళ్లంతా ఆలోచించాల్సిన అవసరం ఉంది అని  అంటున్నారు.

ఐఏఎస్ లకు క్షేత్రస్థాయి కష్టాలు ఉంటాయా? కాలమ్ లో
ఐఏఎస్ ఎంపికలో ఫిజికల్లీ ఛాలెంజెడ్ పర్సన్స్ రిజర్వేషన్స్ ఎందుకు?అనే ప్రశ్న ఒక ఐఏఎస్ నుంచి ఉత్పన్నమైంది.పుట్టుకతో ఏదో ఒక లోపం మనుషులందరిలో ఉంటుంది.ఈ సందర్భంలో ఆ ఐఏఎస్ కు తన అభిప్రాయం చెప్పే హక్కు ఉంది. కానీ కించపరిచే హక్కు లేదు.ఇందులో ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఐఏఎస్ లు కష్టమైన క్షేత్రస్థాయి పర్యటన చేస్తారు.కాబట్టి దివ్యాంగులు అది చేయ లేరనే భావనలో ఆమె ఈ వ్యాఖ్యానం చేయడం అయితే ఐఏఎస్ లకు క్షేత్రస్థాయిలో కష్టాలు ఉంటాయా?అన్నది ప్రశ్న. ఐఏఎస్ లు కూర్చుని చేసే పనికి దివ్యాంగులు ఎందుకు పనికి రారు?.కవి దేవేందర్ మనదేశంలో నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ ఉన్నట్టే,ప్రభుత్వ యంత్రాంగంలో హైరార్కి వ్యవస్థ ఉంది అని అంటున్నారు.

కరీంనగర్ సాహిత్య పరంపర … కాలమ్ లో
ఇటీవల కరీంనగర్ జిల్లాకు చెందిన ఎంపిక చేసిన ప్రాచీన ఆధునిక కవుల కవిత్వ సంకలనాన్ని ‘కరీంనగర్ కవులు నాడు నేడు’ పేర ఆచార్య అనుమాండ్ల భూమయ్య సంపాదకత్వంలో వెలువరించారు.ఇది చాలా విశిష్టమైన కవిత్వ సంకలనం.ఇందులో పదవ శతాబ్దానికి చెందిన జినవల్లభుని నుంచి నిన్న మొన్న విద్యార్థిగా కవిత్వం రాస్తున్న ఈడెపు సౌమ్య దాకా 102 కవితలు ఉన్నాయి.నేలను మరవని భూమయ్య వెలువరించిన కవితా సంకలనం అన్ని రంగాల వారు ఇలా ఏదైనా ఒకటి చేసేందుకు స్ఫూర్తిగా నిలిచింది. .

చరిత్ర జ్ఞాపకాలు తెలుసుకోవాలి…కాలమ్ లో
మేర మల్లేశం తెలంగాణ సాయుధ పోరాట యోధుడు. జీవితాంతం కష్టజీవుల పక్షాన నిలబడ్డ విప్లవ కమ్యూనిస్టు.ఈ 2024వ సంవత్సరం ఆ స్వాతంత్ర సమరయోధుని శత జయంతి జరుపుకోవాల్సిన ఉత్సవ సందర్భం.1997 తర్వాత వచ్చిన పాటల పుస్తకానికి విపుల వ్యాఖ్యానాలతో మల్లేశం జీవిత కథనాత్మక చరిత్ర పుస్తకం వెలువడ్డది.బహుజన రాజకీయవాదులకు,ఇతర రాజకీయ పక్షాలకు చెందిన వారు స్వాతంత్ర్య ఉద్యమ కారుల చరిత్రను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది అని కవి దేవేందర్ అంటున్నారు.

జీవ కళ కోల్పోతున్న జిందగీ కాలమ్ లో
ప్రకృతిలో ప్రకృతిగా జీవిస్తేనే మనసంతా ఆనందం తాండవిస్తది.ఇప్పుడు అంతా సహజానికి విరుద్ధంగా వికృతంగా జీవితాలు కొనసాగుతున్నాయి.ఏకీకృత వ్యాపార వ్యవస్థ విస్తృతమై గ్లోబలైజేషన్ గా వ్యాపించిన తర్వాత మనిషి ముఖం మీద నవ్వే కళ లేదు.చిరునవ్వుల పలకరింపులు మాయ మయ్యాయి.అంతా తరుముతున్న జీవితం.పని ఒత్తిడి,మీది వాడు కింది వాన్ని,వాని కింది వాడు మరి కింది వాన్ని,పని పని అర్జెంట్ అర్జెంట్ అని ప్రెషర్ నింపడం,ప్రభుత్వం ప్రైవేట్ అన్నిట్లో ఈ ఒత్తిడి,అణిచివేత ఉంటూనే ఉంటుంది.కవి దేవేందర్ ఒక ధ్యాన ప్రశాంతత,ఒక ఆత్మిక ఆనందం,మరొక మానవత్వ పరిమళం కనపడాల్సిన రోజులు రావాలి అని అంటున్నారు.

సముద్రం ముందు … కాలమ్ లో
సముద్రాన్ని ఎన్నిసార్లు చూసినా దాని ముందు పసిపిల్లలమై గాలిలో తేలిపోవుడే.విశాఖ బంగాళాఖాత ఆకాశం మీద తిరుగుతున్న మేఘాలను సులువుగా చేతితో నిమరవచ్చు. అప్పుడు మనసు దేహం దూదిపింజం లెక్క అల్కగా పరిగెత్తుకొస్తున్న అలల తడి స్పర్శ కాళ్లకు తగిలి దేహంలోకి సన్నని విద్యుత్ వ్యాపనం.నిలుచున్న అంచున అరి పాదాల కింద పరుచుకుంటున్న నీళ్లను కదిలి కరిగిపోతున్న ఇసుక ఒక గమ్మత్తు అనుభూతి.అలల వలలో చిక్కి తడిసిపోయి ఎగిరితేనే ఆనందం అంచుల దాకా చేరవచ్చు.అలల సవ్వడిలో కలిసి ఎగిసి కేరింతలు కొట్టినా కుతి తీరదు.సముద్రంలో సముద్రమై గంతులు వేసినా మతి నిండదు.రాత్రి పగలు వెలుగు నీడా అసలే లేదు.కడలి కడుపులో ఎల్లవేళలా కల్లోలమే.కవి దేవేందర్ అలల సవ్వడికి ఎదురెళ్లి సముద్ర స్నానం చేయడం ఒకానొక మహత్కార్యం అని అంటున్నారు.

ప్రకృతి ఎలుగెత్తిన కోపం కాలమ్ లో
ఈ నేల మీద ఎండలు,వానలు,చలి గాలులు,నీటి ప్రవాహాలు సహజాతి సహజం.ఇది స్వయంగా తనకు తాను ఏర్పరచుకున్న ప్రకృతి.దుర్మార్గంగా మనిషి మాత్రమే భూమిని,నదులను,చెరువులను, కుంటలను,మేఘాలను,ఆకాశాన్ని,గాలిని,నీటిని విధ్వంసం చేస్తాడు.సాటి మనుషులను చంపుతాడు. మోసం చేస్తాడు.అత్యాచారం చేస్తాడు.అన్ని దుర్మార్గాలకు మూలం మనిషి మాత్రమే.ప్రకృతిని చెరపట్టి సహజాతి సహజమైన ప్రవాహాలను మళ్లించి వికృతంగా చేస్తున్నాడు.కవి దేవేందర్ ప్రకృతిని,పర్యావరణాన్ని కాపాడాలంటే గుట్టలు,చెట్లు,అడవులు,నదులు,చెరువులు, కుంటలు వీటిని సహజ రీతిలోనే రక్షించాలని, లేకపోతే ప్రకృతి ప్రకోపించి విధ్వంసాన్ని సృష్టిస్తుంది అని అంటున్నారు.

కవి దేవేందర్ అంతరంగం వర్తమాన జీవన చిత్రణ కాలమ్స్ వ్యాసాలలో సమాజంలో జరుగుతున్న అన్ని విషయాలను తన అనుభవాన్ని క్రోడీకరించి అక్షర రూపం ఇచ్చారు.ఈ వ్యాసాలు వాస్తవికతతో కూడి ఉన్నాయి.ఏదో కాలక్షేపానికి చదువుతాను అంటే కుదరదు.శ్రద్ధతో ఆసక్తితో చదివితే అందులోని విషయాలు అవగాహనకు వస్తాయి.కవి దేవేందర్ కు అధ్యయనం చేసే అలవాటు మరియు సమాజం పట్ల సునిశిత పరిశీలనా శక్తి ఉంది కనుకనే కాలమ్స్ వ్యాసాలు చక్కగా రూపుదిద్దుకున్నాయి. అంతరంగం వర్తమాన జీవన చిత్రణ కాలమ్స్ వ్యాసాలను పిన్నలు,పెద్దలు అందరు చదివి ఎన్నో లోతైన విషయాలు నేర్చుకోవచ్చు.నడుస్తున్న చరిత్రకు అక్షర రూపం ఇచ్చిన కవి దేవేందర్ ను అభినందిస్తున్నాను.కవి దేవేందర్ సమాజాభివృద్ధికి దోహదం చేసే మరిన్ని రచనలు చేయాలని మనసారా కోరుకుంటున్నాను.

.

.

.

January 31, 2025 0 comment
1 FacebookTwitterPinterestEmail
కవితలు

ప్రకృతి తల్లి ఆనంద పడేలా

by D VR January 31, 2025
written by D VR

చల్లని గాలి చూడు -పచ్చని పైరు చూడు -2
వెన్నెల వెలుగు చూడు –
వెలుతురును ఇచ్చే రవిని చూడు -2-

నీడను ఇచ్చు చెట్టును చూడు
చెట్టు పైన పిట్టను చూడు-2
ఆకాశ వర్ణము చూడు -భూ లోక వర్గమును చూడు-2

అన్ని వర్గాల సరి సమానత్వం చూడు -2

రచయిత తండ్రి

సరి సమానత్వం కలిగిన – ప్రకృతి వైనాలను చూసి -2
హాయి గా జీవించు నేడు -2
చూడు చూడు చూడు చూడు
ఏమీ తెలియని జీవులు మూగ జీవులు-2

రచయిత తల్లి

వాటి జోలికి వెళ్ళటం మంచిది కాదు -2
మంచి మనస్తత్వం ఉన్న మానవ జీవులకు -2
తల తల మెరిసే తారలు చూడు
మిల మీల మెరిసే మెరుపుని చూడు -2

జల జల పారే సెలయేరును చూడు
గల గల లాడే చెట్ల ఆకులు సవ్వడి చూడు -2

అన్నీ తెలిసిన  ఓ మానవ జీవుడా -2
మధురాతి మధురమైన
మన మానవ జాతి విలువను కాపాడు -2

ఇతరులకు ఆదర్శ మూర్తిగా
నిలబడేలా జీవించు -2
చూడు చూడు చూడు చూడు
ప్రకృతి తల్లి ఆనంద పడేలా -2

రచయిత DVR
సహాయం dr. N Lahari
తోడు నీడ DCM
మొబైల్ 9963095812
January 31, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

మట్టి గణపతే మహాగణపతి

by N. Chakri January 31, 2025
written by N. Chakri

అనగనగా ఒక ఊరిలో ముగ్గురు స్నేహితులు ఉండేవారు వారు రాము, గౌతమ్,రాజేష్ ఈ ముగ్గురు మంచి మిత్రులు ఒకరోజు రాజేష్ మిగతా ఇద్దరు మిత్రుల దగ్గరకు వచ్చి వినాయక చవితి దగ్గరకు వచ్చింది. చెందాకు తిరుగుదామా అన్నాడు. వారు సరే రేపటి నుంచి తిరుగుదాం అన్నారు. మరుసటి రోజు పొద్దున్నే లేచి ముగ్గురు స్నేహితులు స్నానాలు చేసి చందా వసూలు చేయడానికి బయలుదేరారు. అలా కొన్ని రోజులు చందా వసూలు చేశారు. వినాయక చవితి ముందు రోజు ముగ్గురు స్నేహితులు పందిరి వేసి డెకరేషన్ చేశారు. గౌతమ్ వాళ్ళ నాన్న ట్రాక్టర్ ని తెచ్చాడు. ట్రాక్టర్లో మట్టి గణపతిని తీసుకొని వచ్చారు. గణపతి బప్పా మోరియా అనుకుంటూ పందిరిలోకి తెచ్చారు. గణపతికి కొబ్బరికాయ కొట్టారు. పూజారిని పిలిచి పూజ చేశారు. ప్రసాదం నైవేద్యం పెట్టారు. అందరినీ పిలిచి ప్రసాదం పెట్టారు. సాయంత్రం అయ్యింది. కాళ్లు చేతులు కడుక్కొని దేవుని పందిరిలోకి వచ్చారు. రాత్రి దేవుని పందిరిలోనే పడుకున్నారు. మరుసటి రోజు రాము వచ్చి మిగతా ఇద్దరి మిత్రులతో మనం అన్నదానం చేద్దామా అన్నాడు. మిత్రులు సరే అన్నారు. మూడు రోజుల తర్వాత రాము రాజేష్ గౌతమ్ ముగ్గురు మిత్రులు కలిసి అన్నదానం చేశారు. తొమ్మిది రాత్రులు గడిచాయి. పదవరోజు పులిహోర తయారు చేశారు. వినాయకున్ని ట్రాక్టర్లో పెట్టి ఎగురుకుంటూ చెరువు దగ్గరకు వచ్చారు. వినాయకున్ని చెరువులో నిమజ్జనం చేశారు.

అంతకుముందు ఎవరో నిమజ్జనం చేసిన వినాయకుడి విగ్రహం కరిగిపోలేదు . అలాగే కనిపిస్తున్నది . అయ్యో అనుకున్నారు . కాసేపట్లో వీళ్ళు నిమజ్జనం చేసిన వినాయకుడి విగ్రహం నీటిలో కరిగి పోతుంటే చూసి ఆనందించారు.

నీతి. చెరువులో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయక విగ్రహాలను చెరువులో వేస్తే నీళ్లు కలుషితం అవుతాయి.నీటిలో ఉండే జీవులు చనిపోతాయి. కాబట్టి మట్టి వినాయకులనే పూజిద్దాం.

యెన్. చక్రి,
6 వ తరగతి,
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల,
రేగులపల్లి,
మం.బెజ్జంకి.

January 31, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మేఘాలలో విహరింపజేసిన మేఘాలయ

by Rangaraju Shyamsundar January 31, 2025
written by Rangaraju Shyamsundar

          మా మేఘాలయ ప్రయాణం అస్సాంలోని గౌహతి నుండి ప్రారంభమైంది షిల్లాంగ్కు.  దీన్ని స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్ గా కూడా వ్యవహరిస్తారు. మేఘాలయ వెళ్లేదారిలో డివైడర్ ఎడమవైపు అంతా అస్సాం రాష్ట్రపరిధి అయితే రోడ్డుకు కుడివైపుఅంతా మేఘాలయ పరిధి. ఈ ప్రాంతంలో ఇరువైపులా ఉన్నపచ్చనిచెట్లనుండిస్వచ్ఛమైన  గాలి వీస్తుంటేరెండున్నర గంటలమా ప్రయాణం ఎంతో ఆహ్లాదకరంగా సాగింది.

                   షిల్లాంగ్కి 45 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రముఖ పర్యాటక స్థలమైనలైట్లం క్యానన్ కి వెళ్ళాం.(PHOTO 1) పచ్చని లోతైన లోయలు,నిటారుగా ఉండే కొండలు,అంతులేని ఆకాశంఈ ప్రాంతం చూస్తుంటేఅమెరికాలోనిప్రసిద్ధి చెందినప్రపంచ పర్యాటక కేంద్రమైన గ్రాండ్కెన్యాన్ గుర్తుకొస్తుంది. ప్రకృతిలో మమేకమై అందమైన ప్రాంతాల్లో జీవిస్తున్న వీళ్ళు ఎంత అదృష్టవంతులు కదా అనిపించింది. ఈ ప్రాంతం ఎప్పుడూ పొగ మంచుతో, మబ్బులతో కప్పబడి ఉండి ఆహ్లాదకరంగా ఉంటుంది.  ఎక్కువగా సినిమా చిత్రీకరణ ఈ ప్రాంతంలో జరుగుతుందని స్థానికులు చెప్పారు. ఈ ప్రాంతంలో సూర్యోదయ, సూర్యాస్తమయాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఎంతో అందంగా ఉన్న ఈ ప్రదేశాన్ని చూస్తూ అలానే ఉండి పోవాలని అనిపించేంతగా గొప్ప అనుభూతి కలిగింది.

                    ఈ ప్రాంతం నుండి షిల్లాంగ్  పట్టణం చేరుకొని డాన్ బోస్కో మ్యూజియం సందర్శించాం.ఈశాన్య భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంప్రదాయ దుస్తులు మరియు వివిధ ప్రాంతాల జీవనశైలి, వివిధ ప్రాంత ప్రజలు వాడుతున్న,  వాడిన పూర్వకాలపు పనిముట్లు వారి ఆచార వ్యవహారాలను కళ్ళకుకట్టినట్టుగా తీర్చిదిద్దిన ఐదుఅంతస్తులమ్యూజియం ఎంతో అద్భుతంగా ఉంది. వాటితోపాటు ఇరుగుపొరుగు దేశాలైన భూటాన్, మయన్మార్మరియు నేపాల్ ప్రజల జీవనశైలి ప్రతిబింభించేలా వివిధ చిత్రాలు ఎంతో అద్భుతంగా అలంకరించబడి ఉన్నాయి.

          తదుపరి గోతిక్ నిర్మాణశైలిలో 1913లోజర్మనీ రోమన్ క్యాథలిక్లచేనిర్మించబడినమేరీ కేథడ్రల్చర్చిని దర్శించుకున్నాం. ఇది 3 లక్షల మంది క్యాథలిక్ లప్రధాన ప్రార్థనా స్థలం. ఆ తదుపరి ఆ రోజుకి చివరగాఆసియాలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు అయినా ఉమియం సరస్సు చేరుకున్నాం. ఇది చుట్టూ కొండల మధ్య ఉంటుంది. 1960లో ఉమియం నదికి అడ్డుకట్ట వేసినిర్మించిన ఈ సరస్సు పరివాహక ప్రాంతం దాదాపు 225 చదరపు కిలోమీటర్లుగాఉండి,8.4 మెగావాట్ల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన జలవిద్యుత్ ప్రాజెక్టు ఇది. దీని ముఖ్య ఆకర్షణ నీటిపై తేలియాడే ఆటలు, సాహస కృత్యాలకు ప్రసిద్ధి చెందింది. సాయంత్రం ఉమియం సరస్సులో సూర్యాస్తమయ దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంది. సూర్యాస్తమయం తదుపరి ప్రముఖ వ్యాపార కూడలి అయిన పోలీస్ బజార్ కు వెళ్లి మేఘాలయ సాంప్రదాయ ఆహారం రుచి చూసి వసతి గృహానికి వెళ్ళాం.

          ఆ మరుసటి రోజు ఉదయం ఉపాహారం తీసుకుని ముందుగా షిల్లాంగ్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏనుగు ఆకారంలో ఉన్న జలపాతం చూడ్డానికి వెళ్ళాం. ముందుగా మేంషిల్లాంగ్ లోని తూర్పు ఖాశీ హిల్స్ లోని సాంప్రదాయ స్త్రీ పురుష దుస్తులు ధరించి ఫోటోలు దిగి అక్కడి నుండి 25 మెట్లు దిగి కొంచెం దూరంలో ఉన్న జలపాతంవైపు వెళ్ళాం.ఆశ్చర్యకరంగా ఒక గుట్టపై ఏనుగు ఆకారంలో అతి ఎత్తు నుండి జల దారులు పడటం, అది కూడా అచ్చం ఏనుగు ఆకారంలో ఉండటంతో దీనికి ఈ పేరు స్థిరపడింది.మరోవైపు ఉన్న రెండు జలపాతాలు కూడా చూసి ప్రయాణం కొనసాగించాం.

            తదుపరి ప్రముఖ ప్రపంచ పర్యాటక స్థలమైన చిరపుంజికి బయలుదేరాం. 65 కిలోమీటర్ల దూరంలో 5 వేలఅడుగుల ఎత్తుపైన గల ఈ ప్రాంతానికి దాదాపు రెండు గంటలు ప్రయాణించి చేరాం. ఇది తూర్పు ఖాశీ హిల్స్ జిల్లాలోని ఒక పట్టణం. ఇది భూమిమీద అతి తేమగా ఉండే ప్రాంతంగా ప్రసిద్ధి చెందింది. ప్రస్తుతం దీనికి సమీపంలో ఉండే మాసిన్రామ్ లో అత్యధికంగా 26 వేల మిల్లి మీటర్ల వర్షపాతం పడుతున్న ప్రాంతంగా ప్రసిద్ధి చెంది1985లో గిన్నిస్ ప్రపంచ రికార్డు లోకి ఎక్కింది.

            ఈ ప్రాంతంలో విహరిస్తుంటే మనం పూర్తిగా మేఘాలలో విహరించినట్టుగా ఉంటుంది. విమానంలో ప్రయాణంచేసేప్పుడు ఎలా అయితే మేఘాల మధ్య మన విమానం ప్రయాణిస్తుందో అలానే మనం ఈ ప్రాంతంలో ప్రయాణించినప్పుడు మేఘాలు మనని తాకుతూ ప్రయాణించడం చూసి గొప్ప అనుభూతిని మిగులుచుకున్నాం.

          ఇక్కడి నుండి సమీపంలోని నోహ్కలికైజలపాతం వెళ్ళాం. ఇది భారతదేశంలోనే అతి ఎత్తైన జలపాతం దాదాపు 1115 అడుగుల పై నుండి జాలు వారుతున్న ఈ జలపాతం చూస్తుంటే ఎంతో అద్భుతంగా అనిపించింది. దీన్ని చూడాలంటే వర్షాకాలం మరియు శీతాకాలంలో మాత్రమే వీలవుతుంది. వేసవి కాలంలో మాత్రం నీటి ఉధృతి చాలా తక్కువగా ఉంటుంది. ఈ ప్రాంతం నుండి సెవెన్ సిస్టర్స్ జలపాతంగా ప్రసిద్ధి చెందిననోస్నగిలింగ్ జలపాతం కి వెళ్ళాము ఇది షిల్లాంగ్ నుండి 55 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 1033 అడుగుల ఎత్తు నుండి జాలు వారుతున్న ఈ జలపాతం వీక్షించడానికి మేము చాలా సమయం నిరీక్షించాల్సి వచ్చింది.ఆ ప్రాంతమంతా పొగ మంచుతో నిండి పర్వత శిఖరాలు లోయలు పూర్తిగా అదృశ్యమై పూర్తిగా మేఘాలు ఆవరించాయి. పొగ మంచు విడిపోయాక పేరుకు తగ్గట్టే అక్కా చెల్లెళ్ల వయసు వ్యత్యాసంఎలా ఉంటుందో ఆ ఏడు జలపాతాలు కూడా పెద్దగా,మధ్యస్థంగా,చిన్నగా ఉండి ఆ జలపాతాలకు ఆ పేరు స్థిరపడినట్లుగాఉంటుంది.

           పక్షుల కిలకిలా రావాలు మరియు కీటకాల వింతవింతధ్వనులతో ఉండే దట్టమైన చెట్ల గుండాప్రయాణిస్తూ తదుపరి యాత్రా ప్రదేశమైనా మాస్మాయ్ గుహలు  వీక్షించడానికి వెళ్ళాం (PHOTO 2). 250 మీటర్ల పొడవు పది మీటర్ల ఎత్తు ఉన్న ఈ గుహల్లో కేవలం 150 మీటర్ల వరకు మాత్రమే యాత్రికులను అనుమతిస్తారు. ఇది తూర్పుఖాశీ కొండల్లో చిరపుంజి కి ఆరు కిలోమీటర్ల దూరంలో ఉన్న భారతదేశంలోనే అతి పెద్ద గుహగా పరిగణిస్తారు.

           భూగర్భంలో నీటి ప్రవాహ ఒత్తిడికి కోతకు గురై వివిధ ఆకృతుల్లో ఎంతో అద్భుతంగా ఉన్న ఈ గుహల్లోకి వెళ్లడం మాకు ఒక సాహస కృత్యం గానే అనిపించింది. చిమ్మ చీకటిలో చరవాణి కాంతి సహాయంతో అడుగులో అడుగు వేసుకుంటూ కొన్నిసార్లు పాకుతూ, కొన్నిసార్లు పూర్తిగా కింద కూర్చొని జారుతూ వెళ్లే అనుభూతి, భయం, గగుర్పాటు కలిగిస్తుంది. ఏ మాత్రం గాలి లేకుండా ఉన్న ఈ గుహల్లో మాత్రం ప్రతి భాగం నుండి నీటి చుక్కలు తుంపర్లుగా పడుతూకోతకుగురైన సున్నపురాయి వివిధ ఆకృతుల్లో చూస్తుంటే ఒక అనిర్వచనీయమైన మధురానుభూతి కలుగజేసింది.

           ఆ రోజు చివరి పర్యాటక ప్రాంతమైన గార్డెన్ ఆఫ్ కేవ్స్( PHOTO 3) కి వెళ్ళాం. దాదాపు నాలుగు కిలోమీటర్లు పరిధిలో ఉన్న ఈ ప్రాంతానికి ప్రవేశ రుసుము రూ100.  ఈ గార్డెన్ ఆఫ్ కేవ్స్ ఒక ప్యాకేజీ రూపంలో అందిస్తుంది. ఇందులో జలపాతాలు,గుహలు, వెదురు బొంగులతో నిర్మించిన వంతెనలు,స్వత:సిద్ధంగా నీటి ఒత్తిడితో తయారై వివిధ ఆకృతులతో అందంగా కనిపిస్తూచిత్రకారుడుచిత్రించినచిత్రాల్లాగా ఉన్న గుహలు.
గుట్టల పైనుండిపడుతున్ననీటిదారలు,వెదురు బొంగులతో మళ్లించిన నీటి దారలు చూడటానికి ఎంతో అద్భుతంగా ఉన్నాయి. స్వాతంత్రానికి పూర్వం ప్రభుత్వ వ్యతిరేక స్వాతంత్ర సమరయోధులుతమను తాము రక్షించుకోవడానికి ఈ ప్రాంతంలోని గుహలనుఆశ్రయించి ఇందులో ఆశ్రయం పొందే వారని స్థానికుల కథనం. దాదాపు 16 గుహలు ఇందులో ఉన్నాయి. మెట్లు ఎక్కడం దిగడం ఈ గుహల్లో విహరించడం అంటే కొంచెం శ్రమతో కూడిన పని. చేతి కర్ర సహాయంతో మాత్రమే ఈ గుహలో మనం తిరుగగలుగుతాం.

          అతిరద్దీగావుండేరోడ్లద్వారాప్రయాణించిమావసతిగృహానికిచేరుకునివిశ్రాంతితీసుకున్నాము.

రోడ్లపై విపరీతమైన రద్దీ గమనించి మరుసటి రోజు ఏడు గంటలకు ఉపాహారం ముగించుకొని ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ లోని డాకినది లోవిహారానికి బయలుదేరాం( PHOTO 4). ఇది షిల్లాంగ్ నుండి 81 కిలోమీటర్లదూరంలో ఉంటుంది. ఈ దారిలో సగభాగం పెద్ద పెద్ద గుంటలతో నిండి ఉండి ప్రయాణానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఈ దారి గుండా ప్రతిరోజు కొన్ని వందల లారీలు నిర్మాణ సామాగ్రితో బంగ్లాదేశ్ ప్రాంతానికి వెళ్లడం రావడం వల్ల రోడ్డు అంతా పాడై గతుకులతో ప్రయాణానికి తీవ్ర అసౌకర్యం కలగచేసింది. మూడు గంటల ప్రయాణం పూర్తి చేసుకొని డాకి నది చేరుకున్నాం.  దీన్నే ఉంగాట్నదిగా కూడా పిలుస్తారు. ఈ నదిలో నాటు పడవల్లో మనం విహరించవచ్చు ఇద్దరికీ రూ800 రుసుముగా ఉంటుంది. బంగ్లాదేశ్ బోర్డర్ వరకు తీసుకువెళ్లి బోర్డర్ చూపించి తీసుకువస్తారు పది నుండి 15 మీటర్ల లోతు ఉండే ఈ నదిలోని అడుగు భాగాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు ఇది ఈ నది ప్రత్యేకత.
డాకీ నది నుండి కొంత దూరంలో ఉన్న ఇండియా బంగ్లాదేశ్ బోర్డర్ (PHOTO 5) వరకు వెళ్లి బోర్డర్ పాయింట్లలో ఫోటోలు దిగి ఆ తదుపరి వీక్షించాల్సిన ప్రఖ్యాతమైనలివింగ్రూట్బ్రిడ్జిని చూడ్డానికి ప్రయాణం మొదలుపెట్టాం. స్థానికులు చిన్నచిన్న వాగులు, ఉపనదులు దాటడానికి వీటిని నిర్మించివిరివిగా ఉపయోగిస్తున్నారు.

                   రంగ్థిల్లియాంగ్లోని మావ్కిర్‌ నాట్‌అనే ప్రాంతంలోని 53 మీటర్ల పొడవు ఉన్నలివింగ్రూట్బ్రిడ్జిప్రపంచంలోనే అతి పెద్దది. వంతెన కావలసిన ఉపనదికి ఇరువైపులా రబ్బర్ వృక్షాలను పెంచుతూ వాటి వేర్లనుఒకదానితో ఒకటి జతపరుస్తూఇదే ప్రక్రియ కొనసాగిస్తారు. ఈ ప్రాంతంలో దాదాపు 500 నుండి 600సంవత్సరాలుగా ఈ విధంగా ప్రకృతి సహజంగా నిర్మించబడ్డ అనేక చిన్న, పెద్ద వంతెనలు స్థానిక అవసరాల దృష్ట్యా ప్రవాహ వేగం పరిధిని బట్టి కొన్నిచోట్ల రెండు అంచెల వంతెనలు నిర్మిస్తే చాలా ప్రాంతాల్లో చిరు వంతెనలతో నిర్మించారు. రెండు అంచెలవంతెనలు చూడటానికి పూర్తిగా ఒకరోజు వెచ్చించాలి.దాదాపు 3500 మెట్లు క్రిందకు దిగి మళ్లీ పైకి రావాల్సి ఉంటుంది. మేం మాత్రం సమయాభావం వల్ల మావిల్లాంగ్ సమీపంలోనినోవెట్‌ నదిపై నిర్మించిన సింగల్ లివింగ్ రూట్ బ్రిడ్జిచూడటానికి ఎంచుకున్నాం. ఇది కూడా 150 మెట్లు దిగి వెళ్ళాం. ప్రకృతిలోసహజీవనంమరియుసహజసిద్ధమైనజలపాతాలుచూడ్డం ధ్యేయంగా ఈ ప్రాంతాలకు యాత్రికులు విరివిగా వస్తుంటారు.మేంకూడాప్రకృతి వనరులతో సహజంగా నిర్మించబడ్డలివింగ్రూట్బ్రిడ్జి( PHOTO 6) పైన విహరించిఅనిర్వచనీయమైన అనుభూతికి లోనయ్యాం. నదీ ప్రాంతంలో కాసేపు విశ్రమించి ఆ రోజుకు చివరి యాత్రా స్థలమైన మావిల్లాంగ్ గ్రామానికి చేరుకున్నాం. ఈ గ్రామం ఆసియాలోనే శుభ్రమైన గ్రామంగా పేరుగాంచింది. ఈ గ్రామానికి దేవతల సొంత ఉద్యానవనం అనే పేరు కూడా ఉంది పూర్తిగా మహిళల చే నిర్వహించబడ్డ కూడలి సందర్శించి వారు వెదురుతో స్థానిక వనరులతో తయారుచేసిన కొన్నిసాంప్రదాయ వస్తువులను కొనుగోలు చేసి తిరుగు ప్రయాణం కొనసాగించాం. ఈ ప్రాంతం పూర్తిగా చూడాలంటే కనీసం 8 నుండి 10 రోజుల ప్రయాణం అవసరం.

January 31, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మన తెలుగు నాటకాలు : మంత్ర నగరి

by Sammeta Vijaya January 31, 2025
written by Sammeta Vijaya

మంత్ర నగరి నాటకం రచయిత శ్రీ మాఢభూషి దివాకర బాబు గారు . ప్రముఖ సినీ రచయిత యమలీల, శుభలగ్నం, మావి చిగురు , చూడాలని ఉంది , టాప్ హీరో, నెంబర్ వన్ ,ఆహ్వానం, వినోదం ,సర్దుకుపోదాం రండి ,ఇద్దరు మిత్రులు మొదలైన వంద సినిమాలకు కథ, స్క్రీన్ ప్లే సంభాషణలు అందించారు. కథలు కవితలు రేడియో నాటకాలు అనేకం రచించారు .నాటక రచయితగా ప్రతి నాటికకు నాటకానికి అనేక పరిషత్తులలో ఉత్తమ రచన తదితర బహుమతులు అందుకున్నారు. యువ వాహిని డి.వి. నరసరాజు స్మారక పురస్కారం , అక్కినేని నాటక కళా సమితి అక్కినేని జీవన సాఫల్య పురస్కారం, బాపు రమణ వారి ముళ్ళపూడి వెంకటరమణ సాహితీ పురస్కారం ,సంస్కృతి సాంస్కృతిక సంస్థ గుంటూరు వారిచే ‘ఆచార్య’ బిరుదులు అందుకున్నారు.

వీరు రచించిన ప్రతి నాటిక నాటకం పలువురి ప్రశంసలను అందుకోవడం షరా మామూలే. అంత పదునైన మంచి వస్తు వైవిధ్యంతో కూడిన నాటిక నాటకాలలో మంత్ర నగరి నాటకం ఒకటి . రసరంజని నెలనెలా నాటకం ప్రేక్షకుడికి వినోదం పేరుతో నటుడికి ఆనందం అదే మా బాట అదే మా మాట అనే సంకల్పంతో నిర్వహించే నాటక ప్రదర్శనలలో భాగంగా 28-1-20 25న రవీంద్ర భారతిలో చైతన్య కళాశాలవంతి ఉక్కునగరం విశాఖపట్నం వారి సమర్పణలో మంత్ర నగరి నాటకం ప్రదర్శన జరిగింది . ఇప్పుడు మానవాళి అంతా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ మాయలో పడి తాము మనుషులమన్న సంగతి మరిచిపోయి విం తగా బతుకుతున్నారు. ప్రేమలు పలకరింపులు ఆప్యాయతలు మరిచిపోయారు .మన సౌకర్యాల కోసం కనిపెట్టిన ఈ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సీ మనల్ని శాసించే స్థితికి ఎదిగింది! ప్రపంచమంతా ఆక్రమించి భావితరాలను బానిసలుగా చేసే ప్రమాదం ఉంది. అందుకే ఈ ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ తో పాటు హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా ఉపయోగించుకోవాలి . రెండూ అవసరమే ఈ రెండు సమపాళ్ళలో ఉంటేనే ప్రపంచం యంత్ర నగరంలా కాకుండా మంత్ర నగరాల ప్రపంచంగా మారుతుందని తెలియజేయడం ఈ నాటకంలో మూలాంశం.

నాటకానికి దర్శకత్వం వహించిన శ్రీ బాలాజీ నాయక్ ముఖ్యపాత్రధారులైన తాత పాత్రను అద్భుతంగా పోషించారు . కథానాయకుడైన నవీన్ గా శ్రీ వై అనిల్ కుమార్ తన నటనతో అందరినీ ఆకట్టుకున్నాడు. అరాచకం పాత్రతో పేరులోనే అరాచకం పాత్రకు తగిన పేరును పెట్టుకున్న పాత్రధారి శ్రీ పి. రామారావు తన పాత్రకు తగిన న్యాయం చేశారు . మేదో పాత్ర పేరుతో కృత్రిమ మనిషిగా శ్రీ కే ఉమా మహేష్ మంచి నటనను ప్రదర్శించాడు. వివేకం పేరుతో శ్రీ ఎం .వాసు తెలివైన స్నేహితుడిగా మంచి చెడు తెలిసి వివేకంతో ఎలా ఆలోచించాలి ప్రత్యక్షంగా చూపించడంలో సఫలీకృతుడైనాడు . తనఖా పాత్రతో రోబో గా ఉంటూ జర్మనీ భాషలో మాట్లాడుతూ అందర్నీ అలరించారు శ్రీ బి వెంకటరావు నాయక్ . నాటకంలో కథానాయకి ఆశాలత కుమారి రూప శ్రీ పాత్రకు తగిన విధంగా నటనను ప్రదర్శించి ప్రశంసలు పొందారు.


ఈ నాటకానికి సాంకేతిక సహకారం అందించిన వారు సంగీతం శ్రీ లీలామోహన్ ప్రతి సన్నివేశంలో ఆయా సందర్భాలలో వీరు అందించిన సంగీతం నాటకంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది . ఆహార్యం అందించిన వారు శ్రీ థామస్ రోబోనూ మేధోపాత్రను మరింత ప్రత్యేకంగా చూపించవచ్చని అనిపించింది . నాటకంలో మంత్రనగరి పేరుతో ఉన్న మాయా లోకాన్ని తన లైటింగ్ తో శ్రీ ఫణీంద్ర ,రంగాలంకరణతో శ్రీ ఎం సత్తిబాబు ,బి శ్రీనివాసులు ఎప్పటికప్పుడు ఆ దృశ్యం మన కళ్ళకు కట్టినట్లుగా చూపించే ప్రయత్నం చేయడంలో విజయం సాధించారు.
ఈ నాటకం శ్రీ బాలాజీ నాయక్ దర్శకత్వంలో కళల కాణాచి తెనాలి పరిషత్తులు ప్రదర్శించినప్పుడు 2024 నవంబర్లో ఉత్తమ ద్వితీయ పరిషత్ ప్రదర్శన ఉత్తమ క్యారెక్టర్ నటుడు ఉత్తమ విలన్ ఉత్తమ లైటింగ్ ఉత్తమ ఆహార్యం , నవీన్ పాత్రకు జ్యూరీ బహుమతులు లభించాయి. ఈ నాటకం ప్రదర్శన గురించి
కవి ,గుణ నిర్ణీత ,విశ్లేషకులు అయినా శ్రీ ఆకుల మల్లేశ్వర రావు గారు తెలుగు ప్రభలో అద్భుతమైన సమీక్షను రచించారు.
నవీన్ కృత్రిమ మేధపై ఒక ప్రాజెక్టు తయారు చేస్తుంటాడు. తెర తీసేసరికి అక్కడ దృశ్యం అంతా ఆధునికతతో టెక్నాలజీ పెరిగిపోయి జపాన్ నుంచి తెచ్చుకున్న రోబో ఇంట్లో ఉండడం ఇంటికి ఎవరు రావాలన్నా యాక్సెస్ తో రావడం వంటివి ఇంటి పనులను రోబో నిర్వహించడం ఇటువంటి దృశ్యాలను మనం గమనిస్తాం. ఇంటికి వచ్చిన తాత ఆశ్చర్యపోతాడు . మనవడిలోని యాంత్రికత మనసుని కదిలించి వేస్తుంది. ఇంతకీ ఎప్పుడు వెళ్ళిపోతావు అని మనవడు వేసిన ప్రశ్నకు ఆవేదనకు గురవుతాడు తాత. డబ్బే ప్రధానంగా జీవించే అరాచకం తన కూతుర్ని నవీన్ చేసే ప్రాజెక్టు పేటెంట్ కోసం ఉసిగొల్పుతాడు. నవీన్ తన మేధస్సును యంత్రంపై ఆధారపడినప్పటి నుంచి నవీన్ తో ఆ పాత్ర అతని వెన్నంటి ఉండి నడిపించడం ఒక ప్రత్యేక అంశం ! నాటకంలో తాతయ్యకు అనారోగ్యాన్ని పట్టించుకోని స్థితికి చేరిన మనవడికి బదులుగా స్నేహితుడైన వివేకం పరీక్షలు చేయించడం ఎప్పటికప్పుడు నవీన్ అనుసరించే విధానాన్ని హెచ్చరించడం చేస్తుంటాడు . చివరికి తన ప్రాజెక్టుకు మరింత డబ్బులు అవసరమైనప్పుడు జరిగిన పరిణామాలు కృత్రిమ మేధకు పూర్తిగా వశమై తనను తాను మర్చిపోయి మనిషిలా కాకుండా యంత్రంగా ప్రవర్తిస్తాడు నవీన్ . అది చూసి నవీన్ లోని మనిషిని వెలికి తీసే ప్రయత్నం చేస్తారు తాత ,వివేకం ,ఆశాలత . మనిషి ఆధునికత పేరుతో ఎదగడం అవసరం . కొత్త టెక్నాలజీని నేర్చుకోవడం అమలుపరచడం అవసరాలకు తగినంతవరకు ఉపయోగించుకోవడం శుభ పరిణామం. కానీ అది అదునుగా తీసుకొని పూర్తిగా దానికి బానిసగా మారవలసిన అవసరం లేదని మానవత్వం మర్చిపోకూడదు అని తెలియజేసిన నాటకం మంత్రనగరి.

రచనలు సంభాషణలలో కృత్రిమమైన మేధను మానవమేధనూ రెండింటిని ఉదాహరణలతో తాత పాత్రలో బాలాజీ నాయక్ తో చెప్పించిన విధానం నాటకానికి హైలైట్ ! పరిణితి చెందిన రచయితగా అద్భుతమైన డైలాగులతో శ్రీ మాడభూషి దివాకర్ బాబు గారు మనకు నాటకం మొదటి నుంచి చివరి వరకు కనిపిస్తారు.ఈ నాటకం ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ గురించి అందరూ ఆలోచించవలసిన కథాంశం . అభివృద్ధి పేరుతో విలువలను పట్టించుకోకపోతే మనిషి మనుగడ ప్రమాదంలో పడుతుందని హెచ్చరిక నాటకంలో మనకు కనిపిస్తుంది . ఆలోచనాత్మక నాటకం అందించిన శ్రీ మాడభూషి దివాకర్ బాబు గారు సర్వదా అభినందనీయులు.

January 31, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • వేకువ పాట
  • చాణుక్యుడు ఆదిశంకరాచార్యుల ప్రభావం ఒక సింహావలోకనం
  • సనాతనమంటే?
  • సమాజానికి హానికరమైనవిగా కాక ఉపయుక్తమైన రచనలు చేయాలి- డా. జి. చెన్నకేశవరెడ్డి
  • సాహిత్యాకాశంలో నక్షత్రాక్షర తోరణం- అక్షరగీతం

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us