మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

లాలిత్య చిత్ర కళాప్రపూర్ణుడు – కొండపల్లి శేషగిరిరావు

by Aruna Dhulipala January 31, 2025
written by Aruna Dhulipala

         ప్రకృతిలోని చెట్టూ పుట్టా, రాయీ రప్పా ఏదైనా కావచ్చు. కానీ ఆయన ‘దృష్టి’ అందులోని సౌందర్యాన్ని దర్శిస్తుంది. మనసు అంతకంటే వేగంగా స్పందిస్తుంది. చేతులు అమాంతం కుంచెను పట్టుకుంటాయి. వేళ్ళకొనల నుండి మిశ్రమ వర్ణాలు జారుతూ వివిధ ఆకృతులుగా రూపాన్ని సంతరించుకుంటాయి. అవి హృదయాలను ముగ్ధమనోహరంగా దోచుకుంటాయి. అంతటి మహనీయుడు, మాననీయుడు మరెవరో కాదు. ఆయనే భరతజాతి గర్వించదగిన తెలుగు బిడ్డ ప్రముఖ చిత్రకారుడు కొండపల్లి శేషగిరిరావు. 

         ఆయన శత జయంత్యుత్సవ సందర్భంగా హైదరాబాదులో ఆయన చిత్రకళాప్రదర్శన ఏర్పాటు చేయాలనే సంకల్పం కుటుంబ సభ్యులకు కలగడం ముదావహం. పట్టుదలతో శ్రమించి ఆయన చిత్రాలన్నీ భద్రపరచి పదిరోజులపాటు ప్రజల సందర్శనార్థం ప్రదర్శనను ఏర్పాటు చేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. వృద్ధాప్యదశలో తల్లిదండ్రులను పట్టించుకోకుండా

వృద్దాశ్రమాల్లోనూ, రోడ్లపైనో వదిలివేస్తున్న వారసులున్న ఈ రోజుల్లో తమ ఇంట్లో విరిసిన చిత్రకళా కుసుమాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆయన వారసులుగా గర్విస్తూ, ఆ కళావిభవాన్ని నలుగురికీ పంచాలనుకున్న వారి ఆకాంక్ష ఎంతగానో ప్రశంసనీయమైనది.

            కొండపల్లి శేషగిరిరావు 1924, జనవరి 27న తెలంగాణలో వరంగల్ జిల్లా, మహబూబాబాద్ మండలంలోని పెనుగొండ గ్రామంలో జన్మించారు. బాల్యం నుండే ఆయన మదిలో చిత్రకళా బీజాలు నాటుకున్నాయి. పాఠశాలలో డ్రాయింగ్ మాష్టర్ దీన్ దయాళ్ “భవిష్యత్తులో ఈయన ఒక గొప్ప చిత్రకారుడు అవుతాడ”న్న విషయాన్ని ఆనాడే ఊహించడం చిన్ననాటనే వెలువడిన శేషగిరిరావు సృజనాత్మకతకు అద్దం పడుతుంది. మాష్టారు గారి ఊహ వమ్ము కాలేదు. శేషగిరిరావు అఖండ ప్రజ్ఞాపాటవాలతో వెలువడిన అపురూప చిత్రకళాఖండాలు అశేష జనులను ఆకర్షించాయి. ఆయనకు వెలకట్టలేని గౌరవాన్ని ఆపాదించాయి.

        వరంగల్ జిల్లాలోని రామప్ప దేవాలయం మన శిల్పకళకు కాణాచి. అటువంటి ఘన శిల్పసంపద

ఆయనను ఉత్తేజితుణ్ణి చేసింది. వాటి నుండి స్ఫూర్తి పొంది ఆ శిల్పకళను లావణ్యవంతమైన చిత్రకళగా మార్చి ప్రముఖుల చేత ఔరా! అనిపించుకున్నాడు. ఆయనకున్న భక్తి తత్పరతలు అపారం. అందుకే అనేక పర్యాయాలు భాగవతాన్ని చదివి భక్త కవిపుంగవుడైన పోతన చిత్రానికి జీవం పోశాడు. ఆనాడు ఆంధ్రపత్రిక ముఖచిత్రంగా వచ్చిన ఆ చిత్రాన్ని చూసిన తెలుగు ప్రజలకు పోతన పట్ల ఆదరాభిమానాలు ఇనుమడించి దాన్ని ఫ్రేములు కట్టించుకున్నారంటే శేషగిరిరావు చిత్రకళా సామర్థ్యం అవగతమవుతున్నది. ఆయన చిత్రాల్లో ఇతిహాస గాథలు, కావ్యాలు, చారిత్రకాలు కూడా చోటు చేసుకోవడం ఆయనకున్న విషయ పరిజ్ఞానాన్ని విదితపరుస్తున్నాయి. 1975వ సంవత్సరంలో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో ఆయన వేసిన తెలుగుతల్లి చిత్రం ఆయనకు ప్రముఖుల ప్రశంసలతో పాటు అభిమాన నీరాజనాలు అందించింది.

         శేషగిరిరావు శకుంతల కథను విశ్వామిత్ర, మేనకల నుండి మొదలుకొని క్రమపద్ధతిలో తీర్చి చిత్రకావ్యంగా మలిచారు. శ్రీమద్రామాయణంలో గుహుడు, అహల్య, పట్టాభిషేకం, శబరి, లంకానగరంలో సీత దుఃఖం మొదలైన ఘట్టాలు వర్తమానంలోజరుగుతున్న అనుభూతిని కలిగిస్తాయి. పోతనకు సరస్వతీ దేవి సాక్షాత్కరించడం, గజేంద్రమోక్షం, మహిషాసురమర్దనం, పాండవుల అరణ్యవాసం, గీతాబోధ, రాధాకృష్ణుల ప్రణయం, రుద్రమదేవి, వీరనారి ఝాన్సీలక్ష్మి మొదలైన అనేక చిత్రాలు అత్యంత సుందరంగా ఆయన కుంచె నుండి రూపుదిద్దుకున్నాయి.

జానపదుల జీవితంలోని కాయకష్టాన్ని కూడా ఆయనచేయి స్పృశించింది. కళాకారులందరూ ప్రకృతి ఆరాధకులు. శేషగిరిరావు కూడా అంతే తాదాత్మ్యంతో,  అత్యంత ప్రావీణ్యంతో పశు పక్ష్యాదులను తీర్చిన వైనం అనన్యసామాన్యం. ఎంతో జాగరూకతతో ఈ చిత్రాలను పరిశీలిస్తే పరమాణువంత చిన్న విషయాన్ని కూడా ఆయన ఎంత సునిశితంగా పరిశీలించి పరిగణనలోకి తీసుకున్నారో తేటతెల్లమవుతుంది.

         ఇది మన వారసత్వం. ప్రజలకు ఆనందాన్ని, ఆహ్లాదాన్నిచ్చేవి లలితకళలు. వీటిని కాపాడుకోవాల్సినబాధ్యత మనందరి మీదా ఉంది. అంతేకాదు. ఇంతటితో ఆగిపోకుండా ఈ మార్గదర్శకత్వంలో ఇటువంటి మరోతరం రావాలి. భారతీయ కళ నలువంకలా కీర్తిపతాకాలను ఎగురవేయాలి. శేషగిరిరావు  కుటుంబసభ్యులు ఆయన చిత్రకళా ప్రదర్శన ఏర్పాటుచేసి ఆయన గురించి అందరికీ తెలిసేలా చేస్తున్నందుకు వారికి శుభాభినందనలు.

January 31, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

మత విశ్వాసాలు – అపశృతులు

by Maji Bharathi January 31, 2025
written by Maji Bharathi

మొన్న వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో, నిన్న ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో, ఆ ముందు… బోలె బాబా ఆశ్రమంలో
(పాదధూళి కోసం)… చెప్పుకుంటూ పోతే ఎన్నో… గాలిలో కలిసిపోతున్న ప్రాణాలెన్నో? జాగ్రత్తలెన్ని తీసుకున్నా ఇలాంటి అపశ్రుతులెందుకు జరుగుతాయి?
భారతదేశంలోనే కాదు, ప్రపంచం మొత్తం మీద జరుగుతున్న తొక్కిసలాటల్లో అశువులు బాస్తున్న ప్రాణాలెన్నో! ఈ తొక్కిసలాట జరగడమనేది మతసంబంధ కార్యక్రమాలలోనే కాదు, ఫుట్ బాల్ క్రీడా ప్రాంగణాల్లోనూ, సెలబ్రిటీలు పాల్గొనే కార్యక్రమాల్లోనూ… ఒక రకంగా చెప్పాలంటే, ఎక్కడైనా జన సందోహమెక్కువగా ఉంటుందనుకున్న ప్రదేశాలలో ఈ తొక్కిసలాట జరగడమనేది సాధారణమై పోయింది. అయినా ప్రజలు, అటువంటి కార్యక్రమాలకు ఎందుకు హాజరవుతారో ఒకసారి అవలోకిద్దాం.
మత విశ్వాసాలకు సంబంధించిన కార్యక్రమాలలో పుణ్యం సంపాదించుకోవడమే ధ్యేయమైతే, మిగిలిన వాటిలో తమకిష్టమైన బాబాలనో, క్రీడాకారులనో, నటీనటులనో దగ్గర నుండి చూసామని చెప్పుకోవడం కోసం హాజరవుతారు. లింగ, వయోభేదాలు లేకుండా అన్ని సామాజిక వర్గాల నుండి వీటికి హాజరవుతారు. కొంతమంది విశ్వాసంతో వస్తే, మరి కొంతమంది, మేము కూడా ఆ కార్యక్రమానికి వెళ్లామని చెప్పుకోవడానికి… ముఖ్యంగా యువత… వస్తారు.
జనసమ్మర్దం ఎక్కువగా ఉండే కార్యక్రమాలకు ఎంతమంది వస్తారనేది ఇంచుమించుగా లెక్కలు వేసుకుని ప్రభుత్వాలు, తగిన ఏర్పాట్లను చేస్తూనే ఉంటాయి. అయినా విషాదాలు చోటు చేసుకుని, అయినవారికి కన్నీళ్లు మిగిల్చిపోతుంటాయి. వీటిని అరికట్టలేమా?
ఇప్పుడు మనం ప్రస్తావించుకునేది ప్రయాగ్ రాజ్ కుంభమేళాలో జరిగిన విషాదం గురించి. భోగి పర్వదినాన మొదలైన ఈ కుంభమేళాలో 15 కోట్ల మంది, జనవరి 28 వరకు గంగాస్నానం చేశారని లెక్కలు చెబుతున్నాయి. ఇంతమంది హాజరైనా, ఒక్క అవాంఛనీయ సంఘటన కూడా జరగలేదని అందరూ సంతోషిస్తున్న వేళలో, జరగకూడనిదే జరిగి పోయింది. 30 మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. దీనికి కారణాలు ఏమిటన్నది మనం పరిశీలిస్తే, ఒకే ఒక్క విషయం అర్థం అవుతుంది.

ఒకేరోజు, ఒకే సమయానికి, ఒకే స్థలానికి, ఎక్కువ మంది చేరుకోవడం… మహాకుంభ మేళా, పుష్య మాసపు చివరి రోజు, మౌని అమావాస్య, అమృత ఘడియల్లో దేవతలు దిగి వస్తారని, ఆ సమయంలో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం చేస్తే పాపాలన్నీ తొలగిపోతాయని, దానధర్మాలు చేస్తే సకల శుభాలు కలుగుతాయని, పిండ ప్రదానం చేస్తే పితృదేవతలకు సద్గతులు కలుగుతాయని భక్తుల విశ్వాసం. అందుకే జనవరి 29, మౌని అమావాస్య నాడు 10 కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేసిన ప్రభుత్వం దానికి తగిన ఏర్పాట్లనే చేసింది. కాని, ఉదయం రెండు గంటల సమయంలో ఒకేసారి భక్తులు పోటెత్తడంతో బారికేడ్లు విరిగి, తొక్కిసలాటకు దారి తీసింది. దానికి తోడు చీకటిగా ఉండడంతో, ఏమి జరుగుతుందో తెలియని గందరగోళ పరిస్థితి… దాంతో కొంతమంది కింద పడి ప్రాణాలు కోల్పోతే, మరి కొంతమంది గాయాల పాలయ్యారు.
12 కిలోమీటర్లు పొడవునా 44 పుష్కర ఘాట్లతో ఉన్న నదీతీరంలో స్నానం చేయకుండా, ఆ ఒక్క ప్రదేశానికే, ఆ సమయంలోనే, ఆ రోజే, వెళ్లాలని అనుకోవడమెందుకు?
మనసా, వాచా, కర్మణా పరిశుద్ధంగా ఉండడం, ఎల్లప్పుడూ సత్యాన్ని పలకడం, పరిశుద్ధమైన భావాలుంటే చాలు నన్ను పూజించినట్టేనని, ఇవేవీ లేకుండా చేసిన హోమము, దానము, తపస్సు, మరి ఏ ఇతర క్రియ అయినా ఇహపరాలలో ఫలమివ్వదని, మనం చేసిన కర్మలే మనను అనుసరిస్తాయని గీతాబోధకుడే స్వయముగా అర్జునునితో చెప్పాడని భగవద్గీతలో నేర్చుకుంటూనే ఉంటాం.
పైగా హిందూ శాస్త్రాలలో, ఏ క్రతువు గురించి చెప్పినా అందులో దానధర్మాల ప్రసక్తి ఉంటుంది. దానర్థమేమిటి? అవసరంలో ఉన్న వారిని ఆదుకోమన్న అర్థమే. వీటన్నిటినీ వదిలి, ఆ రోజే, ఆ సమయంలోనే, ఆ త్రివేణి సంగమంలోనే స్నానం చేస్తే, చేసిన పాపాలన్నీ పోతాయనుకుంటే, భగవంతుడు చెప్పిన కర్మ సిద్ధాంతానికి విలువేమిటి?
అందుకని మనం చేయాల్సిందేమిటంటే, మంచి చెప్పే మత విశ్వాసాలను, బోధనలను అనుసరిద్దాం, ఆచరిద్దాం. చేసిన పాపాలు చేసేసి, ఒక్క స్నానంతో ఆ పాపాలన్నిటినీ కడిగి వేసుకుందామనే మూఢనమ్మకాలను విడిచిపెడదాం. ఈ విషయం అందరూ పాటిస్తే, భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతమవ్వకుండా ఉంటాయి. అందుకని ప్రజలు కూడా, గుడ్డిగా ఎవరు ఏది చెప్తే అదే నిజమని భ్రమించకుండా, విచక్షణా జ్ఞానాన్ని ఉపయోగించుకుంటూ, జన సాంద్రత ఉన్న ప్రదేశాలకు వెళ్ళినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలు, వృద్దులు ఉన్నప్పుడు మరింత జాగ్రత్త అవసరం.
అలాగే న్యూస్ చానల్స్, పత్రికా యాజమాన్యాలు మూఢాచారాలను పెంచే వార్తలను ప్రోత్సహించకుండా, ప్రజలు తీసుకోవలసిన జాగ్రత్తల గురించి వారిలో అవగాహన పెంచే కార్యక్రమాలను చేస్తూ, ధర్మాధర్మ విచక్షణ తెలియజేసే కార్యక్రమాలను ప్రసారం చేస్తూ, సమాజంలో జరుగుతున్న చెడుని పదే పదే చూపించకుండా, తక్కువ ప్రాధాన్యమిచ్చి, సమాజంలో జరుగుతున్న మంచి కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యమివ్వడం ద్వారా, మంచిని ప్రోత్సహించే కార్యక్రమాలను ఒకటికి రెండుసార్లు టెలికాస్ట్ చెయ్యడం ద్వారా, సమాజమూ బాగుపడుతుంది. మన పూర్వీకులు నమ్మిన సనాతన ధర్మమూ పునరుత్తేజమవుతుంది.
అలాగే ప్రభుత్వాలు కూడా, అధిక ప్రాధాన్యం సంతరించుకున్న ఇటువంటి కార్యక్రమాలలో, వి.ఐ.పి. లు వచ్చినప్పుడు ప్రోటోకాల్ పేరుతో, సామాన్యులను కట్టడి చేసి, వారు వెళ్లగానే ఒకేసారి గేట్లు తెరవడం ద్వారా తొక్కిసలాటకు అవకాశం ఏర్పడుతుంది. అందుకని జనసమ్మర్ధం ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో విఐపి ల, రాకపోకలను నియంత్రిస్తే, చాలా ప్రమాదాలను అరికట్టవచ్చు.
అలాగే, సామాన్య ప్రజల అవసరాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ, అవసరాన్ని బట్టి అప్పటికప్పుడు ఏర్పాట్లలో తగిన మార్పులు చేర్పులు చేసుకుంటూ, జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రజలకు దిశా నిర్దేశం చేస్తూ, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని, జనసాంద్రత ఎక్కువున్న ప్రదేశాలలో, కఠిన నిబంధనలను అమలు చేస్తూ, సాంఘిక మాధ్యమాల ద్వారా ప్రజలలో ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదనే విషయాలపై ముందు నుండి అవగాహన పెంచగలిగితే, ఇటువంటి విషాదాలను అరికట్టవచ్చు. భక్తులకు మధురానుభూతులను మిగిల్చవచ్చు.

January 31, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

చరిత్ర తిరిగి రాయాలా?

by Acharya Veerareddy January 31, 2025
written by Acharya Veerareddy


మహాభారతం..  

దాయాదుల నడుమ పోరు చరితం  

ధర్మ బద్ధుల జూద క్రీడలో  

పాచికల ప్రహసనం

వ్యసన బలహీనతకు బలియైన     

పరాక్రమ సింగాల పరిహాసం

‘అన్న’ మాటకు కట్టుబడి   

అరణ్యవాసం.. అజ్ఞాతవాసం  

అంతా శకుని తలపోసిన

భారతం!

శ్రీమద్రామాయణం..   

కైకేయి వర చరితం కాదా!  

ఒకవేళ..

రాముడు మందర గురించి

ముందే ఆలోచించి ఉంటే

రావణ వధ అయ్యేదా? 

శూర్పణఖ ముక్కు చెవులు

కోసి ఉండక పోతే  

ప్రాణమున్న బంగారు జింక

ఉండదని తెలిస్తే  

సీతాపహరణం జరిగేదా?

హనుమ తోకకు నిప్పంటించకుంటే  

లంకాదహనం జరిగేదా?

మాటకు కట్టుబడితే..

జరిగే పరిణామాలు

రామాయణ మహాభారతాలే!

పురాణాలైనా, ఇతిహాసాలైనా

గుర్తుండి పోయేలా ఘోషించినవి   

యుద్ధాలేనా?

శత్రువును ఛేదించడానికి పన్నిన  

వ్యూహ ప్రతివ్యూహాలేనా? 

సబలలను అబలలుగా చిత్రించడమా?

అంతిమ ఫలితం..

దుష్ట శిక్షణ శిష్ట రక్షణా?

మరుభూమిగా మారిన పిదప

సత్యం జయిస్తే ఒరిగే లాభమేమీ?

పాలకుల కుటుంబాల నడుమ

చెలరేగిన కక్ష్యలు, కార్పణ్యాలు  

పాలితులకు శాపంగా మారాలా?

దేనికి ఏది అవసరం

ఏది ముందు ఏది వెనక?

శాసనంతో అనుశాసనమా

అనుశాసనానికి శాసనమా?  

నడిచిన దారులు

కాలం విడిచిన కుబుసాలు  

ఎవరో శాసించింది కాదు

దానికదే జరిగితే చరిత్ర. 

అలాంటప్పుడు

కాలాన్ని వెనక్కి మళ్లించాలా?

చరిత్రను తిప్పి రాయాలా?

–       ఆచార్య కడారు వీరారెడ్డి; 9392447007 

January 31, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కనుమ పండగ

by Dr. Aruna Parandhamulu January 31, 2025
written by Dr. Aruna Parandhamulu

కనుమ ను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. పంటలు చేతికి అందడంలో తమకు సహాయపడిన పశు పక్షాదులను పూజిస్తారు. సంవత్సరంలో మిగిలిన రోజులన్నీ తమతో పాటు కష్టపడి పనిచేసిన ఆవులను, ఎద్దులను, బర్రెలను పూజించి ప్రేమగా చూసుకునే రోజు ఇదే. పక్షులు కూడా రైతన్ననేస్తాలే. అందుకే వాటి కోసమే అన్నట్టు ఇంటి గుమ్మానికి ధాన్యపు కంకులు వ్రేలాడ దీస్తారు.

ఆ రోజు ఇంటి కొకరు చొప్పున తెల్లవారక ముందే ఒక కత్తి, ఒక సంచి తీసుకొని సమీపంలో ఉన్న అడవికి బయలు దేరుతారు. అక్కడ దొరికే నానా రకాల వన మూలికలు, ఔషధ మొక్కలు, సేకరిస్తారు .కొన్ని చెట్ల ఆకులు, కొన్ని చెట్ల బెరుడులు, కొన్ని, చెట్ల పూలు, వేర్లు, కాండాలు, గడ్డలు, ఇలా చాల సేకారిస్తారు. కొన్ని నిర్ధుస్టమైన చెట్ల భాగాలను మాత్రమే సెకరించాలి, అనగా, మద్ది మాను, నేరేడి మానుచెక్క, మోదుగ పూలు, నల్లేరు, మారేడు కాయ, ఇలా అనేక మూలికలను సేకరించి ఇంటికి తీసుకొచ్చి వాటిని కత్తితో చిన్న ముక్కలుగా కత్తిరించి, ఆ తర్వాత దానికి పెద్ద మొత్తంలో ఉప్పు చేర్చి రోట్లో వేసి బాగా దంచు తారు. అదంతా మెత్తటి పొడిలాగ అవుతుంది. దీన్ని ఉప్పు చెక్క అంటారు ఇది అత్యంత ఘాటైన మధుర మైన వాసనతో వుంటుంది. దీన్ని పశువులకు తిని పించాలి. ఇదొక పెద్ద ప్రహసనం. అవి దీన్ని తినవు. అంచేత ఒక్కొక్క దాన్ని పట్టుకొని దాని నోరు తెరిచి అందులో ఈ ఉప్పు చెక్కను చారెడు పోసి దాని నోరు మూస్తారు. అప్పుడు ఆపశువు దాన్ని మీంగు తుంది. ఇలా ఒక్కదానికి సుమారు రెండు మూడు దోసిళ్ల ఉప్పు చెక్కను తినిపిస్తారు. గొర్రెలు మేకలు ఐతే కొన్ని వాటంతటే తింటాయి. లేకుంటే వాటిక్కూడ తినిపిస్తారు. ఏడాది కొకసారి ఈ ఉప్పుచెక్కను తినిపిస్తే అది పశువులకు సర్వరోగ నివారణి అని వీరి నమ్మకం. అది నిజమే కావచ్చు, ఎంచేతంటే అందులో వున్నవన్ని, ఔషధాలు, వన మూలికలే గదా. ఆ తర్వాత పశువులన్నింటిని పొలాల్లోని బావుల వద్దకు గాని, చెరువుల వద్దకు గాని తోలుక పోయి, స్నానం చేయించి, లేదా ఈత కొట్టించి, ఇంటికి తోలుకొస్తారు. ఆ తర్వాత వాటి కొమ్ములను, పదునయిన కత్తితో బాగా? చెలిగి వాటికి రంగులు పూస్తారు. మంచి కోడెలున్న వారు వాటి కొమ్ములకు ఇత్తడి కుప్పెలు తొడిగి. మెడలో మువ్వల పట్టీలు, మూతికి మూజంబరాలు అలంకరిస్తారు. అన్నింటికి కొత్త పగ్గాలు వేస్తారు. ఈ సమయంలో చేలన్నీ పరిగిలి పోయి వున్నందున పశువులన్నింటిని వదిలేస్తారు.
సాయంకాలం ఊరు ముందున్న కాటమరాజును పునప్రతిస్టించి వూరులో ప్రతి ఇంటి నుండి ఆడవారు కాటమరాజు ముందు పొంగిలి పెడ్తారు. పొంగిలి అంటే కొత్త కుండలో, కొత్తా బియ్యం, కొత్త బెల్లం వేసి అన్నం వండడం. ఒక నెల ముందు నుండే కాటమరాజు ముందు ఆ దారిన వచ్చి పోయే ఊరి వారు రోజుకొక కంపో, కర్రో తెచ్చి అక్కడ కుప్పగా వేస్తారు. ఈ రోజుకు అది ఒకపెద్ద కుప్పగా తయారయ ఉంటుంది. దాన్ని “చిట్లా కుప్ప” అంటారు. చీకటి పడే సమయానికి పొంగిళ్లు తయారయి వూంటాయి. ఊరి చాకలి కాటమరాజు పూజ కార్యక్రమం ప్రారంబించి దేవుని ముందు పెద్ద తళిగ వేస్తారు. అనగా ప్రతి పొంగలి నుండి కొంత తీసి అక్కడ ఆకులో కుప్పగా పెడతారు, పూజానంతరం మొక్కున్న వారు, చాకిలి చేత కోళ్లను కోయించు కుంటారు. అప్పటికి బాగా చీకటి పడి వుంటుంది. అప్పటికి పశు కాపరు లందరూ ఊరి పశువు లన్నింటిని అక్కడికి తోలుకొని వస్తారు. పూజారి అయిన చాకలి తళిగలోని పొంగలిని తీసి ఒక పెద్దముద్దగా చేసి అందులో సగం పోలిగాని కిచ్చి (పశువుల కాపరి) తినమని చెప్పి, తర్వాత అక్కడున్న చిట్లాకుప్పకు నిప్పు పెడతారు. పెద్ద మంట పైకి లేవగా పోలిగాడు పశువులన్నింటిని బెదరగొట్టి చెదర గొట్టతాడు. అవి బెదిరి చేలెంబడి పరుగులు తీస్తాయి, ఆ సమయంలో పశువులను బెదర గొడుతున్న పోలిగాని వీపున చాకలి తనచేతిలో వున్న మిగిలిన సగం పొంగలి ముద్దను అతని వీపు మీద కొడతాడు. దానిని పిడుగు ముద్ద అంటారు. వాడు పరిగెడుతాడు .ఆ తర్వాత అందరు అక్కడ మిగిలిన తళిగలోని ప్రసాదాన్ని తిని మొక్కులు తీర్చుకొని చిట్లకుప్ప మంట వెలుగులో తమ కోళ్లను కోసుకొని పొంగళ్లను తీసుకొని తాపీగా ఇళ్ల కెళతారు. ఈ సందార్బంగా పెద్ద మొక్కున్న వారు పొట్టేళ్లను కూడా బలి ఇస్తారు. దాని రక్తాన్ని ఆన్నంలో కలిపి ఒక కుప్ప పెడతారు. దాన్ని పొలి అంటారు. ఆ “పొలి”ని తోటోడు గాని, నీరు గట్టోడు గాని తీసుకొని పోయి అందరి పొలాల్లో,చెరువుల్లో, బావుల్లో “పొలో పొలి” అని అరువ్తు చల్లుతాడు. అప్పడే కొత్త మొక్కులు కూడా మొక్కు కుంటారు. అంటే, తమ పశు మందలు అభివృద్ధి చెందితే రాబోయే పండక్కి పొట్టేలును, కోడిని ఇస్తామని కాటమ రాజుకు మొక్కు కుంటారు .అప్పటికప్పుడే ఒక పొట్టేలి పిల్లను ఎంపిక చేస్తారు. ఆ విధంగా పశువుల పండగ పరిసమాప్తి అవుతుంది.
కనుమ పండగను పశువుల పండుగగా వ్యవహరిస్తారు. సంక్రాంతి పండుగ లో మూడవరోజు కనుమ
అని పిలువబడే మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా ఉంటుంది, ప్రతి రోజు దాని స్వంత ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. కనుమ పొంగల్ (తమిళం మరియు మలయాళం) మూడవ రోజున వస్తుంది మరియు దీనిని సాధారణంగా దక్షిణ భారతదేశంలో మట్టు పొంగల్ అని పిలుస్తారు మరియు ఆంధ్రలో దీనిని ముక్కనుమ అని పిలుస్తారు.

భోగితో వేడెక్కండి, సంక్రాంతి మొదటి రోజు, దాని తర్వాత సంక్రాంతి రెండవ రోజు కొత్త దుస్తులు మరియు రుచికరమైన భోజనాలు ఉంటాయి. గేమింగ్ మరియు బెట్టింగ్ ప్రతిభను ప్రదర్శించడానికి కనుమ రోజు. సరిగ్గా పశువులతో ప్రదర్శన ప్రారంభమవుతుంది.
అత్యంత అద్భుతమైన ఎద్దులను అలంకరించి వీధుల్లో ఊరేగింపుగా తీసుకెళ్లడం కనుమలోని అత్యంత ఆకర్షణీయమైన అంశం. ఇప్పటి వరకు, ఈ ఆచారం యొక్క వ్యాయామం నిర్వహించబడుతుంది మరియు సన్నాయి సంగీతంతో వస్తున్న అత్యంత సొగసైన ఎద్దులను మీరు తరచుగా వీధుల్లో చూడవచ్చు.
పురాతన కాలంలో, ఈ సంఘటన ప్రధానంగా కోడిపందాల కోసం పరిగణించబడుతుంది, దీనిలో ప్రజలు పందెం వేసేవారు మరియు ఇది గతంలో చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది. కోడిపందాలపై పందెం కాసే ఈ అలవాటు గంభీరమైన కుటుంబాలలో శత్రుత్వానికి మరియు అసూయకు దారితీసింది మరియు గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో వరుసగా పెద్ద తగాదాలు జరిగాయి, దీనిని పల్నాటి యుద్ధం (పల్నాడు యుద్ధం) అని పిలుస్తారు. హిందూ ఇతిహాసమైన మహాభారతంతో పోల్చడం ద్వారా ఈ యుద్ధాన్ని ఆంధ్ర మహాభారతం అంటారు. ఆధునిక ప్రపంచంలో, కోడిపందాలు నిషేధించబడ్డాయి మరియు ఇది చట్టానికి విరుద్ధం.

డాక్టర్. అరుణ పరంధాములు
సాంఘిక సంక్షేమ డిగ్రీ సైనిక మహిళా శిక్షణ కళాశాల. భువనగిరి, నల్గొండ జిల్లా

January 31, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

తొందరపాటు

by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య, January 31, 2025
written by సంగనభట్ల చిన్న రామ కిష్టయ్య,

సుందరవనం అనే అడవిలో ఒకసారి పక్షుల సమావేశం జరుగుతున్నది. ఆ సమావేశంలో ఒక నెమలి చాలా అద్భుతంగా నాట్యం చేసింది . ఆ నాట్యాన్ని చూసిన పక్షులు అన్నీ దానిని అభినందిస్తూ కరతాళ ధ్వనులను చేశాయి. కానీ ఒక్క కాకి మాత్రం కరతాళ ధ్వనులను చేయలేదు . అది చూసిన దాని ప్రక్కనున్న పక్షులు ” ఓ కాకీ! నీ బుద్ధిని పోనిచ్చుకున్నావు కాదు. ఆ నెమలి అంత అద్భుతంగా నాట్యాన్ని చేస్తే నీవు కరతాళ ధ్వనులను కూడా చేయలేదు. నీకు ఇదేం బుద్ధి? నీకు కళాభిమానం కొంచెం కూడా లేదు. నీకు నాట్యం గురించి ఏం తెలుసు గనుక ? నీవు దానివలే నాట్యాన్ని చేయగలవా !”అని ప్రశ్నించాయి.
అప్పుడు ఆ కాకి” నా దృష్టిలో అది నాట్యాన్ని చక్కగా చేయలేదు. అందుకే నేను దాన్ని అభినందించలేదు . ఆ సంగతి నాకు తెలుసు. అది తను చేసే నాట్యంపై ఈరోజు ఏకాగ్రతను ఉంచలేదు. దానిలో చాలా ప్రతిభా పాటవాలు ఉన్నాయి. కానీ వాటిని ఈరోజు మీకు చూపలేదు. నేను ఎలాంటిదాన్నో దానినే మీరు అడగండి. దానికి లేని కోపం మీకెందుకు ?”అని అంది.
అది విన్న నెమలి ” ఔను. ఆ కాకి అన్నది నిజమే . మీరు తొందరపడ్డారు. దాన్ని ఏమీ అనకండి . నేనే పరధ్యానం వల్ల నాట్యం చేసేటప్పుడు కొంత తడబాటు పడ్డాను. దానిని ఇది గుర్తించింది. ఇది నా శ్రేయోభిలాషి . అదే నన్ను ఇటువంటి ఉన్నత స్థాయికి తెచ్చింది. ఈ కాకి చిన్నప్పుడు నా ఆసక్తి గమనించి నన్ను ఒక గొప్ప గురువు వద్దకు తీసుకుని వెళ్లి నాకు ఈ నాట్యాన్ని నేర్పించింది . దానికి నేను ఏమిచ్చినా దాని రుణం తీరదు. అది పైకి అలా ప్రవర్తించినా నేనంటే దానికి వల్లమాలిన అభిమానం . ఎల్లప్పుడూ అది నా బాగోగులు కోరుకుంటుంది. దానికి నాట్యం చేయరాకున్నా నాట్య రీతులన్నీ బాగా తెలుసు. అది ఎంతో మంది గొప్పవాళ్ల నాట్యాలని చూసి చాలా విషయాలను తెలుసుకుంది. నన్ను కూడా గొప్పదానిగా చేయాలన్నదే దాని ధ్యేయం “అని అంది. ఆ మాటలకు పక్షులు ఆశ్చర్యపోయి కాకిని మన్నించమన్నాయి. అందుకే పిల్లలూ! అసలు విషయం తెలుసుకోకుండా తొందరపాటు తో ఇతరులను నిందించరాదు.

January 31, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

తెలంగాణకు సమగ్ర సాంస్కృతిక విధానం రూపకల్పన జరగాలి..

by Sabbani Laxminarayana January 31, 2025
written by Sabbani Laxminarayana

MLC ఆచార్య కోదండరాం సూచన
డా. సబ్బని లక్ష్మీనారాయణ రాసిన సమగ్ర తెలంగాణ సాహిత్య గ్రంథము ఆవిష్కరణ!

హైదరాబాద్, డిసెంబర్ 24: ప్రత్యేక తెలంగాణను సాధించుకున్న మనము తెలంగాణకు సమగ్ర సాంస్కృతిక విధానాన్ని రూపొందించుకోవాలని ఇందులకు తెలంగాణ నిపుణులు, అధ్యయన వేత్తలు, ఉద్యమకారులు ముందుకు రావలసిందిగా తెలంగాణ ఉద్యమనేత తెలంగాణ, ఉద్యమంలో జేఏసీ చైర్మన్ గా క్రియా శీలక పాత్ర పోషించిన MLC ఆచార్య కోదండరాం సూచించారు. ప్రస్తుతము పర్యాటక విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వము రూపొందించినట్లు చెప్పారు. 15 ఏళ్ల తెలంగాణ మలి ఉద్యమ స్వరూపాన్ని ఈ దశాబ్ది తెలంగాణ సాధన తర్వాత పున: సమీక్షించుకోవడం ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో కనిపించని కొంతమంది నేతలు, ప్రస్తుతము తెలంగాణ పేరిట ముసుగు సమావేశాలు నిర్వహించడము ఎంతవరకు సబబని ఆయన ప్రశ్నించారు. తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటాన్ని దక్కన్ ముఖ్యమంత్రిగా పనిచేసిన బూర్గుల రామక్రిష్ణారావు గారు నిపుణులచే అధికారికంగా రికార్డు చేయించారని అన్నారు. తెలంగాణా ఉద్యమంలో పనిచేసిన వారికే పదవులు దక్కాలని, రాజకీయాలకు అతీతంగా ఈ ప్రక్రియ జరగాలని అన్నారు. తెలంగాణ ఉద్యమ సీనియర్ రచయిత, డాక్టర్ సబ్బని లక్ష్మీనారాయణ రాసిన సబ్బని సమగ్ర తెలంగాణ సాహిత్యము అనే గ్రంథాన్ని ఆచార్య కోదండరాం గారు హైదరాబాద్ బుక్ పేర్ వేదికపై డిసెంబర్ 24వ తేదీన,మంగళవారం సాయంత్రము ప్రధాన అతిథిగా హాజరై ఆవిష్కరించారు. తోపుడు బండి సాదిక్ అలి వేదికపై ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి ప్రముఖ కవి సంకేపల్లి నాగేంద్రశర్మ అధ్యక్షత వహించారు. విశిష్ట అతిథులుగా సీనియర్ సాహితీవేత్త సంగిశెట్టి శ్రీనివాస్, హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు యాకూబ్, జాతీయ స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల జాతీయ అధ్యక్షులు బోయినపల్లి హనుమంతరావు తదితరులు వేదికను అలంకరించారు.

ఆచార్య కోదండరాం మాట్లాడుతూ తెలంగాణ జేఏసీ 15 సంవత్సరాల క్రితం ఈ రోజున ఏర్పాటైన విషయాన్ని గుర్తుకు తెచ్చారు. తెలంగాణా మలి ఉద్యమం నీరు కారకుండా, అన్ని ఉద్యమ సంస్థలను ఏకతాటిపై నడిపించడానికి జె ఎ సీ ని నెలకొల్పామని అన్నారు. ఉద్యమంలో జె ఎ సి పాత్ర అద్వితీయమని, అప్పటి నుండే తెలంగాణా ఉద్యమ చైతన్యం ఎగిసిపడిందని అన్నారు. ఒక త్రాగుబోతు కార్యకర్త వరంగల్ సభ తర్వాత తనకు ఎదురై, ఉద్యమాన్ని సమన్వయం చేయాలని ఆసక్తికరంగా సూచించినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమ స్వరూపాన్ని వివిధ కోణాల్లో నిపుణులతో అధ్యయనం చేసి డజన్ పుస్తకాలు దశల వారీగా రాసి ఒక సంకలనంగా మలిచిన రచయిత డాక్టర్ సబ్బని లక్ష్మీనారాయణను ఆచార్య కోదండరాం అభినందించారు.

హైదరాబాద్ బుక్ ఫేర్ అధ్యక్షులు, ప్రముఖ కవి యాకుబ్ మాట్లాడుతూ తెలంగాణ గ్రంథ రచయిత సబ్బని లక్ష్మీనారాయణ గారు ఈ గ్రంథాన్ని సంకలనం చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమ చరిత్ర పునర్నిర్మాణములో తమ వంతు పాత్రను సమర్థతతో పోషించారని, వారు ఇతర రచయితల రచనలను అభినందించే విశాల హృదయం ఉన్నవారని, భేషజాలు లేని వారని ప్రశంసించారు

సీనియర్ సాహితీ విమర్శకులు సంగిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్రను పోషించి దశలవారీగా తెలంగాణ ఉద్యమస్వరూపాన్ని పుస్తకంగా తెచ్చిన డాక్టర్ సబ్బని లక్ష్మినారాయణను తెలంగాణ సీనియర్ ఉద్యమ అధ్యయనవేత్తగా అభినందించారు. సబ్బని వారిది నాలుగు దశాబ్దాల సాహిత్య జీవితమని, అందులో తెలంగాణా మలి ఉద్యమ కాలంలో ఉద్యమకారునిగా, రచయితగా ద్వి పాత్రాభినయనం చేసి, తెలంగాణా ఉద్యమ చైతన్యానికి ఆదర్శప్రాయులుగా నిలిచారని ప్రశంసించారు. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో తెలంగాణ సాహిత్య అకాడమీ, తెలంగాణ అధికార భాష సంఘం చైర్మన్ పదవులు ఖాళీలుగా ఉన్నాయని, వాటిని సత్వరమే పూరించాలని సంగిశెట్టి కోరారు. ఈ సంస్థల అభివృద్ధికి ఇతోధికంగా తోడ్పడాలని ఎం. కోదండరాం గారిని అభ్యర్థించారు.

విశిష్ట అతిథిగా విచ్చేసిన బోయినపల్లి హనుమంతరావు మాట్లాడుతూ తెలంగాణ మలి ఉద్యమాన్ని సబ్బని ఆవిష్కరించిన విధానాన్ని అభినందించారు. తన నాన్న బోవెరా గారు తెలంగాణా తొలి, మలి ఉద్యమంతో పాటు, జాతీయోద్యమంలో పాల్గొన్నారని గుర్తుకు తెచ్చారు. తెలంగాణా మలి ఉద్యమాన్ని తాను డిజైన్ చేసిన వారిలో తానొకరని గత ఉద్యమ రోజుల్ని గుర్తుకు తెచ్చుకొన్నారు. సభకు అధ్యక్షత వహించిన సంకేపల్లి నాగేంద్ర శర్మ మాట్లాడుతూ తెలుగు ప్రాచీన హోదా కేంద్ర శాఖని ఒకటి హైదరాబాదులో ఏర్పాటు చేయాలని కోరారు. ప్రస్తుతం నెల్లూర్ కేంద్రంగా పనిచేస్తోందని, దీనికి అనుబంధంగా హైదరాబాద్ లో ఒక శాఖని ప్రారంభించాలని సూచించారు. సమగ్ర పర్యావరణ విధానాన్ని రూపొందించాలని, గుట్టలను, నీటి వనరులను, ఇరిగేషన్ రంగాన్ని ఆయా మాఫీయా మట్తు పెట్టేస్తోందని అన్నారు. పుస్తక రచయిత రచయిత డాక్టర్ సబ్బని లక్ష్మీనారాయణ మాట్లాడుతూ తెలంగాణ మలి ఉద్యమాన్ని సూక్ష్మంగా పరిశీలించి అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు 12 పుస్తకాల ద్వారా ఈ సమగ్ర సాహిత్య గ్రంధాన్ని వెలువరిస్తున్నట్లు తెలిపారు. ఈ గ్రంథాన్ని త్వరలో ఆంగ్లంలోకి అనువదిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీవేత్తలు సుంకిరెడ్డి నారాయణరెడ్డి, డాక్టర్ కాలువ మల్లయ్య, కెవి సంతోష్ బాబు, పిఎస్ కిషన్, గాయకుడు కాసు మహేందర్ రాజు, కోయి కోటేశ్వరరావు, మానస అర్ఠ్స్ అధినేత రఘు శ్రీ తదితరులు పాల్గొన్నారు.

డా. సబ్బని లక్ష్మీనారాయణ, రచయిత, మరియు రిపోర్టింగ్ సంకేపల్లి నాగేంద్రశర్మ, కరీంనగర్, సెల్: 80748 26371.
Cell number: 89852 51271.

January 31, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

విమల

by Butam Mutyalu January 31, 2025
written by Butam Mutyalu

నా ఇంట ఆమనిలా విమల
నా కంటిపాప లా విమల
ముత్యాల పలువరస
ముసిముసి నవ్వులు
కొంటెతనం కోమలి
జతగ మూడు పదుల
ముత్తైదువు తనం
నలబై ఐదేండ్ల ప్రాయం
కాలమా ఏల ఈ హేయం .?

విమలా మనూరి ముచ్చట్లు అచ్చట్లు
అది తొంభై ఐదు సంవత్సరం
తొలినాళ్ల బెజ్జికల్లు వరినాట్లు ..
కల్పు తీతలు పంట కోతలు
చాలీచాలని జీతం నేను సతమతం
చంపాపేట హైద్రబాద్ మకాం..
ఆరునెలల కాపురం
అత్తమామల అండతో
రామోజీ ఫిల్మ్ సిటిల అడ్డ
స్టూడియో నిర్మాణం లో పార్కులు
నీసెమట గంధాలకు సొబగులద్దుకునె గదా
నీ చేతుల చలువరాయి వన్నెలద్దుకునే గదా

1997 జనవరి మాసం
అగ్గది లెక్క కొలువు తీరిన
నేను పంతులు నౌకరి ల
నువ్వు పంతులమ్మ గా
నాంపల్లి ల మన టికాన

సరికొత్త కాపురం
ఎన్ని ఆశలు పెంచుకున్నాము
ఎన్ని వుసులు పంచుకున్నాము
వోనమాలు వంట పట్టించుకోని
వి మ ల .. అని నీవు పలకపై రాసి
పరవశించిన మురిపం ఎట్లా మరిచేది..

మన ఇంటికి ఎవరు వచ్చినా
ఉరుకురికులాడి వంట వార్చిన అమ్మతనం
ఉప్పిడో సప్పిడో కలిగిన దాంట్లో వండిన కూర
కమ్మదనం మన ఇంటికి అన్నపూర్ణ నీవే కదూ..

అరమరికలు లేని దాన
అమాయక నా విమల
సుఖాలకు పొంగలే
కష్టాలకు కుంగలే
నీవో నవనీతం
నవన్మోహిత పారిజాతం

సారంతో సాగుతున్న సంసారం
ఆశలు ఊసులకు శ్వాసతో
పురుడు పోసుకున్న పిల్లలు
ఒక రేనక ఒకరు చాలనుకున్న ఇద్దరు

నలుగురు పిల్లల తల్లి నా విమల
ముగ్గురు పిల్లల ఆటలు పాటలు
అల్లరితోనే చదువులు
చండూరు మరియానికేతన్ ఒక జ్ఞాపకం

మెరుగైన చదువులకంటూ
నల్లగొండ పిల్లలు పెద్దలై గ్రాడ్యుయేట్స్
రెక్కలొచ్చిన పిట్టలయ్యారు
కాలంతుర్రుమంటూ
తీతువుపిట్టల సాగుతూనే ఉంది
జీవితం బరువుగా భారంగా
నిట్టూర్పు నెగళ్లకు సెగలుగకుతూనే ఉంది

కాని కాలం కరోనా విలయం
తట్టుకున్న దేహాలు మనవి
పిల్లల ప్రేమలకు పట్టాభిషేకాలు
దగ్గరుండి ప్రేమను గెలిపించాం

ఇప్పుడేమిటి ఇలా
నన్ను ఒంటరి చేశావు
ఎందుకిలా నాకు వినియోగం
జీవిత వైరాగ్యం

అంతా నీవు చెప్పినట్టే చేశాను కదా
నీవు చెప్పినట్టే పిల్లల జీవితాలు సరిదిద్దాను కదా
నాకెలా ఈ ఎడబాటు నా విమల

మనం మధ్యలో కలిసిన
చివరి కంట జంట తోడంటూ
అర్ధాంతరంగా ఏమిటి
నీ పాత్రకు వీడ్కోలు
నాకేలా వీడుకోలు

చివరి రోజునాడు
ఓయ్ నన్ను గురించి రాయవా
ఎవలెవలి గురించో కథలు రాస్తావ్
నా గురించి ఒకసారి రాయి అన్నావు
రాయలేక సతమతం
ఏమిటో అంతు చిక్కని నీ అభిమతం

మేడిపండు లోకముకదా
రీతులెండు కాలము కదా
కలికాలం వెతలురేపేనా
కల్లోలం చితులు రేగేనా

ఇంటిదీపం ఆరింది
కంటివెలుగు జారింది
కష్టాలు తరుముతుండెనా
కన్నీళ్ల మునుగుతున్నది
మింట తార చేరింది
గగనవీధి వాలిందా

చితిపై పెనుమంటలెంతరేగిన
గాయపడినగుండెల చింతలుతీరునా
సతిని చుట్టుముట్టిన జ్వాలలకు
ఎదపొంగె నీకన్నీళ్ల తడి ఆరునా
ఏమిటి గోరం ఎవరిది నేరం
ఎవరికి శిక్ష కాలానికేల ఈ కక్ష

January 31, 2025 0 comment
2 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం

by Narendra Sandineni January 31, 2025
written by Narendra Sandineni

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (19)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)తెలుగులోకి అను సృజన చేసింది. గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలకు ఉల్లాసాన్ని కలిగిస్తాయి.
“జాగ్రత్త దోస్త్ ! ఇక్కడ మనిషి
తీసుకునే శ్వాస కూడా నకిలీదే !
చలాకీగా తిరిగే ప్రతి మనిషి ప్రాణంతో
ఉన్నట్లు మాత్రం అనుకోకు !
నిత్య జీవితంలో మనకు ఎందరో మనుషులు తారసపడతారు.నిత్యం కనిపించే వాళ్లు అయినప్పటికీ వాళ్లు అందరు మనకు కావాల్సిన వాళ్ళు కారు,మనకు కావలసిన వాళ్లు కొందరు మాత్రమే ఉంటారు అనే వాస్తవాన్ని గుర్తుంచుకోవాలి.ఈ షాయరీ కవితలోని భావాలు సమాజంలో మనుషుల నిజ స్వరూపాన్ని ప్రతిబింబిస్తున్నాయి.బాహ్యంగా మనుషులు ఎలా కనిపిస్తున్నారో అలా ఉండరు.పైపై మెరుగులు అంటే అందం,తీయ తీయని చిలుక పలుకుల ముద్దు ముద్దు మాటలతో జనాన్ని ఆకట్టుకొని బుట్టలో వేసుకునే వారిని చూసి తక్షణమే వారిపై ఒక అభిప్రాయానికి రాకూడదు.అపరిచితుల జోలికి వెళ్లకూడదు.అపరిచితులను వెంటనే నమ్మకూడదు. అపరిచితుల మాటలకు చిక్కి బోల్తాపడకూడదు. మనకు తెలియని మనుషులు కనుక వారు ఎలాంటి వారో?అని తక్షణమే వారిపై ఒక నిర్ణయానికి రాకూడదు.వారు చెప్పేది మంచి మాటలా? బూటకపు మాటలా?వారి గురించి నిదానంగా ఆలోచించాలి.అసలు వారెవరు?వారితో గల మన సంబంధం ఏమిటి?అని దృష్టి సారించాలి అనే సూచన దాగి ఉంది.షాయరీ కవితలో మనిషి జీవితంలోని నాటకాలను,మోసాలను,వాస్తవికతను దార్శనికతతో చూపించడమైంది.షాయరీ కవితలో దాగి ఉన్న లోతైన భావం ఒక గొప్ప అర్థంతో కూడుకొని మనసుకు తాకి హాయిని గొల్పుతుంది. ‘జాగ్రత్త దోస్త్ ఇక్కడ మనిషి తీసుకునే శ్వాస కూడా నకిలీదే/’అంటే స్నేహపూర్వకమైన హెచ్చరికగా ఉపయోగిస్తారు.ఎవరైనా స్నేహితునికి ఏదైనా ముఖ్యమైన విషయం తెలియజేయడానికి జాగ్రత్తగా ఉండమని చెప్పడానికి ఇది ఉపయోగపడుతుంది. జాగ్రత్త అంటే అప్రమత్తంగా ఉండడం మరియు జాగ్రత్తతో వ్యవహరించమని తెలియజేస్తుంది.దోస్త్ ఇది హిందీ పదం సంభాషణలో స్నేహపూర్వకంగా విస్తృతంగా ఉపయోగిస్తారు.జాగ్రత్త దోస్త్ అని చెప్పడం మీకు తనపై గల అపారమైన ప్రేమను, శ్రద్ధను తెలియజేస్తుంది.నేటి సమాజంలో ఉన్న మనుషుల మనసుల్లో నెలకొని ఉన్న కృత్రిమతను, మాయ మాటలను తప్పుడు ప్రవర్తనను సూచిస్తుంది.ఇక్కడ నకిలీ శ్వాస అనే భావన మనిషిలో వాస్తవికత లేక పోవడాన్ని, మోసపూరితంగా వ్యవహరించడాన్ని తెలుపుతుంది. ఇవ్వాళ సమాజంలో వ్యక్తుల నడత దోషభూయిష్టమై,కలుషితమై కంపు కొడుతోంది. సమాజంలో ఉండే చాలా మంది తమ నిజమైన స్వభావాన్ని దాచుకొని కృత్రిమమైన రూపంలో కనిపిస్తారు. ‘చలాకీగా తిరిగే ప్రతి మనిషి/ప్రాణంతో ఉన్నట్లు మాత్రం అనుకోకు’/అని చెప్పడం ద్వారా జీవితంలో మనకు కనిపించే వాళ్లు నిజంగా,ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారు అని, భావించకూడదని హెచ్చరిస్తోంది.కవి జీవితంలోని అంతర్ముఖ పరిస్థితులపై దృష్టి చూపించారు.అనేక మంది బాహ్యంగా,శక్తివంతంగా,ఆనందంగా ఉన్నట్లు మనకు కనిపించవచ్చు.కానీ,వారి లోపల నిండి ఉన్న విషాదపు ఛాయలు,నిరాశ,నిర్లిప్తతతో పాటు, ఎదుటి వారిని బురిడీ కొట్టించే నయ వంచన, మోసం కూడా దాగి ఉండ వచ్చు.అందు వల్ల సమాజంలోని మనుషులతో వ్యవహరించే సందర్భంలో ఎటు వంటి దగా,మోసానికి గురి కాకుండా జాగ్రత్తగా ఉండమని సూచిస్తుంది.ఈ పంక్తి లోని లోతైన భావం మన హృదయాలను కదిలిస్తుంది.మనం ఎటువంటి సంకోచం లేకుండా మరొక సారి మన జీవితంపై దృష్టి పెట్టేలా ఆలోచింప జేస్తుంది.జీవితంలో మనకు ఎదురయ్యే ప్రతి వ్యక్తిని గుర్తించడంలో ఏమరుపాటు,అశ్రద్ధ తగదు.మనిషి తాను సందర్భానుసారంగా,స్వతంత్రమైన ఆలోచనతో ఇతరులతో వ్యవహరించాలి.తాను జీవితంలో సరియైన యుక్తి మరియు నేర్పుతో అప్రమత్తంగా ఉండాలన్న సందేశం ఉంది.ఈ షాయరీ కవిత ద్వారా మనం చూసే ప్రతి మనిషి ఎలా ఉన్నాడో,ఎట్లాంటి స్వభావం ఉందో అని తక్షణం అర్థం చేసుకోవడం కష్టం అని తెలుస్తోంది. మనిషి స్వభావంలోని కృత్రిమతను,అవగాహన లేక పోవడాన్ని విమర్శిస్తూ జీవితంలో అప్రమత్తంగా ఉండాలి అనే సందేశాన్ని ఇస్తుంది.ఈ కవితలోని భావం మన మనసులను తట్టి లేపుతుంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (20)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి డాక్టర్ భారతి తెలుగులోకి అను సృజన చేసింది.
“ఏదైనా మంత్రం వేసి … నన్ను చలాకైన
“వాడిగా మార్చి పడేయ రాదు ?
“ నా ఈ అమాయకత్వం నాకు చాలా
“కష్టాల్ని తెచ్చి పెడుతోంది మరి !
మంత్రం అంటే మన మనసును నియంత్రించే సాధనం.అంటే మన ఆలోచనలను కంట్రోల్ చేసే మార్గం.ఇందులో మంత్రం అంటే ఒక అద్భుతమైన మార్పు లేదా ప్రత్యేకమైన శక్తి సాధనతో తన స్వభావాన్ని మార్చుకోవడం.మంత్రాలతో లేదా మాయాజాలంతో మన జీవితాలను వెంటనే మార్చడం సాధ్యం కాదు,కానీ,తన ఆలోచనా విధానం ద్వారా తన స్వభావాన్ని మెరుగుపరుచు కోవచ్చు.చలాకైన వాడిగా ఉండాలి అంటే తాను బాగా అనుభవాల నుండి నేర్చుకున్న కార్యాచరణతో సమర్థత చూపించే వ్యక్తిగా మారాలి అని సూచిస్తుంది.కానీ,వ్యక్తి మానసికంగా ఉన్న అమాయకత్వం నుండి ఒత్తిడిని అనుభవిస్తూ బ్రతుకు ఒక సవాలుగా నిలుస్తుంది. ‘నా ఈ అమాయకత్వం నాకు చాలా/కష్టాల్ని తెచ్చి పెడుతోంది’/ మరి ఇక్కడ తాను తన అమాయకత్వంతో బాధలను అనుభవిస్తున్నాడు. అమాయకత్వం వల్ల అపరిచిత వ్యక్తుల చేతిలో సులభంగా మోసపోతున్నాడు.మరియు తాను ఏమి చేయాలో తెలియక పోవడం వల్ల తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.తనలోని అమాయకత్వం తనకు కష్టాలను,సమస్యలను తెచ్చి పెడుతుంది.అతను తన సహజమైన అమాయకత్వం విడిచిపెట్టాలని,తన స్వభావాన్ని సమర్థమైన చలాకీతనంగా మార్చుకోవాలని అనుకుంటున్నాడు.కానీ,అతనికి ఆ మార్పును ఎలా పొందాలో తెలియకపోవడం వల్ల తీవ్రమైన ఆందోళనకు గురి అవుతున్నాడు.చలాకిగా ఉండాలంటే ముందుగా తన మీద తనకు పూర్ణ విశ్వాసం ఉండడం అవసరం.తాను సాధించిన చిన్న చిన్న విజయాలను గుర్తుంచుకోవడం ద్వారా తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవచ్చు.తన మనసులోని భావాలను,స్పష్టంగా,ధైర్యంగా చెప్పాలి.తాను ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలను తెలుసు కోవడం ద్వారా తన ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలి. ముందుగా చిన్న చిన్న పనులు చేయడం ద్వారా తమను తాము పరీక్షించుకోవాలి.దాని ద్వారా అమాయకత్వం తగ్గి చలాకితనం ఉప్పొంగుతుంది. ఉత్సాహం,ఉత్తేజం పెరుగుతుంది.ఎవరైనా తమ జీవితంలో తప్పులు చేయడం సహజం.తాను ఆ తప్పుల నుండి గుణపాఠం నేర్చుకొని అమాయకత్వాన్ని విడిచి పెట్టి జీవితంలో ముందుకు సాగాలి.అప్పుడే విజయాలు సాధించడం సాధ్యం అవుతుంది అని గుల్జార్ షాయరీ కవితలోని భావాలు తెలియ జేస్తున్నాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (21)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది. గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలను రంజింప చేస్తాయి.
“నిర్దయుడా … నేను మరణించాక కనీసం
“నీకు ఆ కబురు కూడా చేరకూడదు !
“నువ్వు పిచ్చివాడిలా నా కోసం
“వెతుకుతునే ఉండు …
“నీకు నా సమాధి ఆచూకీ కూడా దొరక
“కూడదు !
ఈ కవితా పంక్తులు తన హృదయంలోని గాఢమైన బాధను మరియు ఆవేదనను,లోతైన భావోద్వేగాన్ని,అంతులేని కోపాన్ని, వ్యక్తపరుస్తోంది. నిర్ధయుడా అంటే నీలో ఏ మాత్రం దయా దాక్షిణ్యం, ప్రేమ,అభిమానం కనిపించడం లేదు.అందుకే తాను దయ లేని వాడా అని అతనిని సంబోధిస్తున్నాడు.ఈ పదం వ్యక్తి గుండెల్లో నెలకొన్న తీవ్రమైన గుబులును, మనస్సులో దాగి ఉన్న బాధను స్పష్టంగా తెలియజేస్తుంది.తాను అత్యంత ప్రియమైన వ్యక్తి అయినప్పటికీ తన పట్ల నిర్దయగా ప్రవర్తించాడని, తన లోపలి బాధను,ప్రేమను అర్థం చేసుకోలేదు అనే ఆవేదన వ్యక్తం అవుతోంది. ‌‌నిర్దయుడా నేను మరణించిన తర్వాత కూడా నీకు ఆ వార్త కూడా తెలియకూడదు అనే నిర్ణయం కనబడుతుంది. ఇది ఒకింత ప్రతీకార భావాన్ని తనలో గల ఆవేశాన్ని వ్యక్తం చేస్తుంది.నేను జీవితంలో నీకు ఎంతో ముఖ్యం అని తెలుసు. అయినప్పటికీ తనను అసలు పట్టించుకోని విధంగా వ్యవహరించడం చేత తన మరణం గురించి అతనికి తెలుసుకునే అవకాశం కూడా ఇవ్వదలుచుకోలేదు అనే విషయం ఇందులో కనబడుతుంది.
‘నువ్వు పిచ్చివాడిలా తిరుగుతూ నా కోసం వీధుల్లో వెతుకుతూనే ఉండు’/అంటే ఇక్కడ తాను అనుభవించిన బాధతో పాటు తనకు ప్రియమైన వారు తన ప్రాముఖ్యతను మరణించిన తర్వాత అయినా గుర్తించాలి అని కోరుకుంటున్నాడు.తాను చేసిన తప్పును గ్రహించాలి.అతడు పిచ్చివాడిలా తన కోసం వెతుకుతునే ఉండాలి అనే భావం వ్యక్తం అవుతుంది.నీకు నా సమాధి ఎక్కడ ఉందో అనే ఆచూకీ కూడా దొరకకూడదు.ఇది ఒక అంతిమ ఆవేదన.తాను మరణించిన తర్వాత కూడా తన కోసం గుండె నిండా గుబులతో తహతహలాడుతుండాలి అనే ఆకాంక్ష వ్యక్తం అవుతుంది.ఇది ఆ వ్యక్తి గుండెల్లో పొంగి పొర్లుతున్న‌ బాధను తెలియజేస్తుంది.ప్రియమైన వ్యక్తి మీద బాధతో,తీరని ఆవేశంతో,ఆగ్రహంతో చెప్పిన భావోద్వేగపూరితమైన భావాలు ఇందులో కనిపిస్తున్నాయి.ఇది ఒక విధంగా మనసులోని గూడు కట్టుకున్న బాధను మరియు తన జీవితంలో మిగిలిపోయిన శూన్యతను వ్యక్తం చేస్తుంది.ఈ కవితా పంక్తులు ప్రేమతో కూడిన ఆవేదన,ఎడతెగని కోపం మరియు విరహాన్ని ప్రతిబింబిస్తున్నాయి.ఇది ప్రియమైన ఆప్తుడు తన పట్ల చేసిన ఘోరమైన నిర్లక్ష్యానికి,ద్రోహానికి ప్రతిగా ఆవేదనతో కూడిన బాధను వ్యక్తం చేస్తున్నది.కవి గుల్జార్ తనలోని ప్రేమను,బాధను,ఈ షాయరీ కవితలో అద్భుతంగా పండించారు.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (22)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి ( డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“అతను నా కోసం
“వెతుకుతున్నాడు … బహుశా అతనికి
“అవసరం ఉందేమో !
“ఆ నేల కిందే నా సమాధి ఉందని అతనికి
“తెలియదు !
ఈ కవితా పంక్తులు గాఢమైన భావోద్వేగాలతో నిండి ఉన్నాయి.
అతను నా కోసం/వెతుకుతున్నాడు/అంటే అతను నన్ను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నాడు.ఈ కవితా చరణం వ్యక్తిలోని గాఢమైన ప్రేమతో చేసే అన్వేషణను సూచిస్తుంది.ఇది ఒక వ్యక్తి మరొకరి కోసం ఎంతో ఆతృతగా వెతకడం మరియు అందు కోసం చేస్తున్న ప్రయత్నాన్ని తెలియజేస్తుంది.ఇది కేవలం తాను శారీరకంగా వెతకడం మాత్రమే కాక, ఆత్మీయంగా,భావోద్వేగాలపరంగా కూడా అతనిని కనుగొనాలని చేసే ప్రయత్నం కనిపిస్తున్నది.
‘బహుశా అతనికి/అవసరం ఉందేమో/ అంటున్నారు.అంటే అతనికి నాతో ఏదో సంబంధం ఉండాలి,అయినా ఏదైనా అవసరం ఉండవచ్చు అనే సందేహాం వ్యక్తం అవుతున్నది.ఇది అతని పట్ల గల ప్రేమ లేదా జాలితో కూడిన భావన. ‘ఆ నేల కిందే నా సమాధి ఉందని/అతనికి తెలియదు/అంటే అతనెక్కడైతే నిలబడి ఉన్నాడో ఆ స్థలంలోనే నా సమాధి ఉంది అనే సంగతి అతనికి ఎలా తెలుస్తుంది?అతను నా సమాధిని కూడా చూడ లేదు.కాబట్టి అతనికి సమాధి ఎక్కడ ఉందో తెలియదు.ఈ పంక్తి అత్యంత భావోద్వేగభరితమైనది.ఇది జీవితానికి సంబంధించిన ఒక విషాదకరమైన వాస్తవాన్ని తెలియజేస్తుంది.అతను నన్ను వెతుకుతున్నప్పటికీ నా ఆత్మకి ఎలా తెలుస్తుంది?నా ఆత్మకి తెలియదు లేదా నా పరిస్థితి అతనికి తెలియదు.అతను నిలబడి ఉన్న నేల కిందే నా జీవన గమనం ముగిసింది అని తెలియని స్థితి.ఇది ఒక వ్యక్తి తన ఆత్మను లేదా తన జ్ఞాపకాలను గురించి చెప్పినట్లుగా అనిపిస్తుంది.దీన్ని ఒక భావోద్వేగపు స్వరూపంగా చూడవచ్చు.దీనిలో ఒక మౌనమైన వేదన,అర్థం కాని దురవస్థ వ్యక్తం అవుతున్నాయి. ఇది తనకు ఎదురైన జీవితం,చేదు అనుభవాలను కవితాత్మకంగా వ్యక్తీకరించినాడని చెప్పవచ్చు.ఒకరి కోసం వెతికినా ఆ వ్యక్తి ఆత్మ యొక్క నిశ్శబ్ద పిలుపును లేదా గమనం ముగిసిన దశను గుర్తించ లేని పరిస్థితిని ఇది సూచిస్తుంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (23)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)తెలుగులోకి అను సృజన చేసింది.
“ఇంత అలక దేని కోయి ….
“నీ అలక తీర్చే సులువేదైనా కాస్త చెప్పు !
“నా జీవితాన్ని తాకట్టు పెట్టేస్తా
“నీ అలక తీర్చడానికి !
ఇష్టం లేక మొహం చాటు చేయడం అలక.తాను ప్రేమించే వ్యక్తి తన పట్ల అపరాధం చేసినప్పుడు, కొంత సమయం ఉదాసీనంగా వ్యవహరించడం అలక.మనిషి అలకను అధీనంలో పెట్టుకోవడం కష్టం.అలక అంటే ఒక నిశ్చితమైన ఫలితాన్ని కోరి ఓ పథకం ప్రకారం ఆ పని సాధించేందుకు కోపం వహించడం,ఆ కోపం తెచ్చుకున్నదే అయి ఉంటుంది.ఆవేశంతో కూడిన కోపం కాదు.
ఈ కవితా పంక్తులు తాను తన ప్రియమైన వారి అలకను తీర్చే ప్రయత్నంలో వ్యక్తీకరించిన భావనలను సూచిస్తుంది.ఇది అంతా సున్నితమైన ప్రేమతో కూడిన భావనగా తోస్తోంది.తాను తన ప్రియమైన వారి అలకను తీర్చే ప్రయత్నంలో తన ప్రేమను అంకితభావాన్ని గాఢంగా వ్యక్తికరించాడు.
“ఇంత అలక దేని కోయి…/అతను తన ప్రియమైన వారిని ప్రశ్నిస్తూ అలక వెనక గల కారణాన్ని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నట్లు అర్ధమవుతోంది. అతను ఆశ్చర్యాన్ని, ఆరాటాన్ని వ్యక్తం చేస్తున్నాడు. ఇంత పెద్ద అలక ఎందుకు?దీనికి ఏమి కారణం?అనే ప్రశ్నలతో అలక గురించి తెలుసుకోవాలనే ఉత్సుకత వ్యక్తం అవుతుంది.అలక ప్రేమికుల మధ్య సంభాషణలో అనేక సార్లు వినిపించే మాధుర్యమైన ప్రశ్న.
‘నీ అలక తీర్చే సులువేదైనా కాస్త చెప్పు/’అతను ఎంతో వినయంతో ఆమె అలకను తీర్చటానికి మార్గం చెప్పమని అడుగుతున్నాడు.అతను తమను దూరంగా ఉంచిన కారణాలను తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నాడు.తనను తాను నిరూపించేందుకు అలక తీర్చడం ఎంత ముఖ్యమో తెలియజేస్తున్నాడు.ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది.దీనికి ఏదైనా సాధ్యం అయ్యే సులభమైన మార్గం చెప్పమని కోరడం ద్వారా అతను తన సరళతను,నిజాయితీని చూపిస్తున్నాడు.
‘నా జీవితాన్ని తాకట్టు పెట్టేస్తా/నీ అలక తీర్చడానికి/ అంటున్నాడు.అతనికి ఆమె మీద ఎంతో ప్రేమ ఉంది.ఇది ప్రేమ యొక్క గాఢతను,అంకితభావాన్ని, ప్రాధాన్యతను తెలియజేస్తుంది.అతను తన జీవితాన్ని త్యాగం చేయడానికి సిద్ధం అని చెప్పి ఆమె అలకను తీర్చాలనుకుంటున్నాడు.తన ప్రియమైన వారి సంతోషం కోసం అతను ఎంత దూరమైనా వెళ్లేందుకు తాను సిద్ధమని తన ప్రాణం త్యాగం చేయగల శక్తిని కలిగి ఉన్నాడని సూచిస్తుంది.ఇవన్నీ అతను తన ప్రేమను వ్యక్తపరిచే తీరును గాఢమైన ప్రేమ,భావోద్వేగాలను ప్రతిబింబిస్తాయి.తనకు అత్యంత ప్రియమైన వారిని కోల్పోయే భయంతో వారి మనసును తిరిగి పొందడానికి ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమని సూచిస్తున్నాయి.ఇది ప్రేమ,దానిలోని భావోద్వేగాలను బలంగా చూపించే ఉదాహరణగా నిలుస్తుంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (24)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“కొద్ది వెలుతురు అడిగా ఈ జీవితాన్ని !
“చూడండి … నేను ప్రేమించిన వాళ్ళు
“మొత్తానికే …. నిప్పు రాజేశారు !
ఈ కవితా పంక్తులు జీవితంలోని నమ్మకద్రోహం, ఆవేదన మరియు ఆకస్మికంగా ఎదురయ్యే మార్పులను అత్యంత గాఢంగా ప్రతిబింబిస్తాయి.
‘కొద్దిగా వెలుతురు అడిగా జీవితాన్ని’!/ఈ పంక్తి ద్వారా కవి చెప్పదలచిన భావం ఇది.జీవితంలో తాను తక్కువగానే ఆశించాను అని,కేవలం కొద్దిగా సంతోషం లేదా ఆశ కోసం మాత్రమే తపించాను అని,తన ఆశలు పెద్దవేమి కాదు అని,తను కోరుకున్నది ఒక సాధారణ వెలుగు మాత్రమే అని అంటున్నాడు.
‘చూడండి … నేను ప్రేమించిన వాళ్లు/అనే పంక్తి ద్వారా కవి తనకు అత్యంత సన్నిహితమైన వారితో,నమ్మిన వారితో గల ప్రేమతో కూడిన అనుబంధాలను సూచిస్తున్నాడు.ఇది ఒక గాఢమైన భావోద్వేగంతో కూడుకొని ఉంది.
‘ మొత్తానికే … నిప్పు రాజేశారు !/అంటే అతనికి ఎదురైన పరిస్థితులు మారాయి.ఆశ్చర్యంతో,బాధతో తాను ప్రేమించిన వారు,తనకు మద్దతుగా ఉండాలి అని భావించిన వారు, అనుకోకుండా తన జీవితాన్ని నిప్పుల బారిన పడేసినట్లుగా నడుచుకున్నారు. తాను ఎంతో ప్రేమించిన వారు,నమ్ముకున్న వాళ్ళే తీరా తన జీవితం నాశనం అవ్వడానికి కారణమయ్యారు అని,నిప్పు రాజేశారు అనే వాస్తవాన్ని తెలియజేస్తున్నది.అంటే జీవితం అంతా దహించుకుపోయినట్లు,అన్ని తారుమారు అయినట్లు తెలుస్తున్నది.ఇది నమ్మక ద్రోహం, అవిశ్వాసం మరియు ఆత్మీయ సంబంధాల్లో ఎదురయ్యే కఠిన అనుభవాలకు ప్రతిరూపం.ఇది జీవితంలో కలిగిన నమ్మక ద్రోహాన్ని,ఆకస్మిక ఆవేదనను ప్రతిఫలిస్తుంది.ఈ కవితలోని భావం ప్రతి మనిషి జీవితంలో బాధలు ఎదుర్కోవాల్సిన స్థితికి ప్రతినిధిగా నిలుస్తుంది.మనం జీవితంలో కొద్దిగా ఆనందం కోరుకుంటే అప్పుడప్పుడు నిరాశ, నమ్మకద్రోహం,భరించలేని తీవ్రమైన అనుభవాలు, కలలో కూడా ఊహించని చిక్కులు ఎదురవుతాయి. ఇది నమ్మకంతో ముడిపడిన సంబంధాల పట్ల కలిగే బాధను నిశితంగా చూపిస్తుంది.కవితలోని ఈ భావనలు తన అనుభవాలకే కాక సమాజంలో నెలకొన్న వాస్తవిక స్థితిగతులకు వర్తిస్తాయి. ఎందుకంటే మనం ఆశించే వెలుగుకు ప్రతిగా చీకటిని ఎదుర్కోవాల్సి వచ్చే సందర్భాలు అనేకం ఉంటాయి.కవి కోరుకున్న వెలుగుకు ప్రతిగా చీకటిని ఎదుర్కోవాల్సి వచ్చిన కఠోర సత్యాన్ని ఈ పంక్తులు సూచిస్తున్నాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (25)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“ఇదెలాంటి విషమో … ఏమో హృదయాల్లో
“నిండి పోయింది ?
“మనిషి మరణించాడు కానీ నీడలు బతికే
“ఉన్నాయి !
ఈ కవితలోని భావాలు చాలా లోతుగా భావోద్వేగంగా ఉన్నాయి.
“ఇదెలాంటి విషమో …ఏమో హృదయాల్లో/“నిండి పోయింది ?/ ఈ కవితా పంక్తి చాలా తీవ్రమైన భావోద్వేగాన్ని ప్రతిబింబిస్తుంది.ఇది మనసుకు చెప్పలేని బాధను,తీవ్రమైన కలతను కలిగించే ఏదో ఒక సంఘటన లేదా పరిస్థితి హృదయాలను ప్రభావితం చేస్తోంది.ఇది అనుభవంతో తాను ఎదుర్కొన్న చిన్నపాటి సమస్యను,అంతు లేని విషాదాన్ని సూచిస్తోంది.ఒక వైవిధ్యమైన అసహనాన్ని మనసులో నిలుపుతుంది.
“మనిషి మరణించాడు కానీ నీడలు బతికే/ ఉన్నాయి/’ అంటే ఈ కవితా పంక్తి ధార్మికతను మరియు ప్రగాఢమైన తాత్విక భావనను వ్యక్తపరుస్తుంది.మనిషి మరణం అనగా శరీర రూపంగా అతను లేకపోవడం,కానీ,అతను చేసిన పనులు,ఆలోచనలు,జ్ఞాపకాలు ఇంకా సజీవంగా ఉంటాయి.ఇక్కడ నీడలు అనగా మనిషి శరీరాన్ని విడిచి పోయిన తర్వాత కూడా అతని జ్ఞాపకాలు, అతని ప్రభావం లేదా అతని చేష్టలు,ఇంకా మన జీవితాల్లో కొనసాగుతాయి అని చెప్పవచ్చు.నీడలు అనేది ఆ వ్యక్తి ప్రాముఖ్యతను,ప్రభావాన్ని తెలుపుతాయి.ఇది మన మరణానంతరం కూడా మిగిలి ఉండి,జ్ఞాపకాల ప్రాధాన్యతను చూపిస్తుంది. ఇది మనిషి జీవితం మరియు మరణం మధ్య ఉండే సంబంధాన్ని మరియు మన దైనందిన జీవితాలపై అది చూపించే ప్రభావాన్ని ఆవిష్కరిస్తుంది.ఈ షాయరీ కవిత మన జీవితం,మరణం వాటి మధ్య సంబంధం మరియు తన జీవితం ముగిసినా అతని జ్ఞాపకాలు,ప్రభావాలు ఎలా కొనసాగుతాయో ఆవిష్కరించేందుకు చేసిన ఒక అద్భుతమైన ప్రయోగం.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత. (26)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)తెలుగులోకి అను సృజన చేసింది.
“అందరికీ తెలుసు … నేను కట్టుకున్న
“ఇల్లు ఇంకా పచ్చిగానే ఉందని
“అయినా … జనం వాళ్ల ప్రార్థనల్లో వర్షం
“కురవాలని కోరుకున్నారు చూడండి !
ఈ కవితా పంక్తిలో ఆంతర్యం చాలా ప్రాముఖ్యమైనదిగా ఉంది.కవి గుల్జార్ హృదయంలో చెలరేగే భావాలను ప్రతీకాత్మకంగా చెప్పిన విధానం కనిపిస్తుంది.
“అందరికీ తెలుసు … నేను కట్టుకున్న/ఇల్లు ఇంకా పచ్చిగానే ఉందని/”దీని అర్థం ఏమిటంటే నేను కొత్తగా కట్టుకున్న ఇల్లు ఇంకా పచ్చిగా,తడిగా ఉంది. ఇక్కడ ‘ఇల్లు పచ్చిగా ఉండటం’ అనేది కొత్తగా నిర్మించిన ఇల్లు పూర్తి స్థాయిలో నిర్మాణం కాలేదు అని సూచిస్తుంది.ఇది ఒక వ్యక్తి సొంత జీవితంలో కొత్తగా ప్రారంభించిన పని లేదా పరి‌సరాల గురించి చెప్పే ప్రతీకగా కూడా భావించవచ్చు. “అయినా … జనం వాళ్ల ప్రార్థనల్లో వర్షం/కురవాలని కోరుకున్నారు చూడండి/అంటున్నారు.ఇది ప్రతీకాత్మకంగా చెప్పబడింది.కానీ,వర్షం కోసం ప్రార్థనలు చేయడం అంటే జనాలు తమ అవసరాలు కోసం ప్రయత్నించడం మరియు ప్రకృతి సహకారం కోరుకోవడం సూచిస్తుంది.జనాలు వర్షం కురవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నారు.వర్షం అనేది బాహ్య పరిస్థితే అయినా,వర్షం వల్ల ఇల్లు తడిసి నష్టం కలిగించవచ్చు.ఏదైనా జరిగితే ఇల్లు తడిసిపోయే అవకాశం ఉందని కూడా అర్థం అవుతుంది.ఈ కవితా పంక్తులు వ్యక్తిగత మరియు సామాజిక స్థితి మధ్య విరుద్ధతను చూపిస్తున్నాయి.అతను పచ్చగా ఉన్న తన కొత్త ఇల్లును సంరక్షించుకోవాలనే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ,జనాలు తమ అవసరాల కోసం కోరుకునే కోరికల వల్ల తనకు సమస్యలు,వచ్చే అవకాశాన్ని తెలియజేశారు.కవి వ్యంగ్య రీతిలో వ్యక్తిగత జీవితం మరియు సామాజిక ప్రవర్తన మధ్య గల సున్నితమైన సంబంధాన్ని కవిత ద్వారా ఆవిష్కరింపజేస్తున్నారు. ఇది భిన్నమైన సందర్భాల్లో మనుషుల తీరును ప్రతిబింబించే ఒక ఉదాహరణగా నిలుస్తుంది అని చెప్పిన కవి గుల్జార్ భావాలు పాఠకులను విశేషంగా ఆకట్టుకుంటాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (27)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“చూడు ! నా మీద అలిగితే … మా “అమ్మలాగే అలుగు !
“మా అమ్మ పొద్దున్నే మాట్లాడింది
“సాయంత్రానికల్లా మరిచిపోయి నన్ను
“దగ్గర తీసేది !
ఈ పంక్తిలో కవి తన భావాన్ని చెప్పే విధానం అర్థపరంగా,ఆసక్తికరంగా ఉంటుంది.ఇందులోని భావం చాలా సున్నితంగా హృదయానికి హత్తుకునేలా ఉంది.కవితలోని ప్రధాన భావం అమ్మ ప్రేమ పై ఆధారపడి ఉంటుంది.
“నా మీద అలిగితే … మా అమ్మలాగే అలుగు”/కవి తన సహచరునితో లేదా తనకు ఎదురుగా ఉన్న వారితో చెబుతున్నారు.అంటే నువ్వు నా మీద అలిగినా,మా అమ్మలా ఆ అలక తక్కువ సేపే కలిగి ఉండాలి అనే భావాన్ని అందిస్తున్నారు.మా అమ్మకు అలక రావడం సహజం.కానీ,ఆ అలక ఎక్కువ సేపు నిలవదు.ఇక్కడ అమ్మ అనేది ప్రేమకు ప్రతిరూపం. అమ్మను అనురాగం,నిస్వార్థత,క్షమకు ప్రతీకగా ఉపయోగించారు.
“మా అమ్మ పొద్దున్నే మాట్లాడింది/సాయంత్రానికల్లా మరిచిపోయి/నన్ను దగ్గర తీసేది/అని అంటున్నారు.
ఇది ఒక ఉదాహరణగా కవి తన అమ్మను గురించి ఇలా ప్రస్తావిస్తున్నారు.తాను ఉదయం అలిగినా, సాయంత్రానికి ఆ అలక పూర్తిగా మరిచిపోయి, తనను తిరిగి ప్రేమగా దగ్గర తీసుకునేది.అంటే అమ్మ ప్రేమతో,క్షమతో తనను స్వీకరించేది.ఇక్కడ ‘మరిచిపోయి’ అనే పదం క్షమకు సూచన.ఇది అమ్మ ప్రేమలో సహజమైన లక్షణం అని చెప్పవచ్చు.ఇక్కడ అమ్మ ప్రేమను,దయను,క్షమను గుర్తు చేస్తూ తన అభిప్రాయాన్ని తెలుపుతున్నాడు.కవి ఈ పంక్తి ద్వారా ఎవరితోనైనా సంబంధాన్ని మధురంగా కొనసాగించాలనే ఉద్దేశాన్ని వ్యక్తం చేస్తున్నారు. అమ్మలా ప్రేమతో మెలగాలి.అమ్మలా అలక తక్కువ సేపు ఉండాలి,తర్వాత ప్రేమకు ప్రాధాన్యత ఇవ్వాలి అనే సందేశాన్ని తెలియ చేస్తున్నాడు.అమ్మ ప్రేమ ఎంతో గొప్పది.అమ్మలో స్వార్థం అనేది ఇసుమంత కూడా కనిపించదు.మనం కూడా అమ్మలాగే నిస్వార్థంగా ఉండాలి అని సూచిస్తున్నాడు.ఈ కవితలో వ్యక్తిత్వం,సంబంధాల కొనసాగింపుల గొప్పతనం వ్యక్తం అవుతుంది.ప్రత్యేకంగా ఏవైనా కొట్లాటలు,ఆగడాలు,అలకలు కలిగినప్పుడు కూడా ప్రేమతో మెలగాలి అని చెప్పడమే ప్రధానమైన ఉద్దేశ్యం.ఈ కవితలోని అద్భుతమైన భావాలు
పాఠకులను హృదయాలను రంజింప చేస్తాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (28)
తెలుగులోకి అను సృజన ; కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“ నిప్పు రాజేసే వాళ్లకు ఏం తెలుసు !
“గాలి దిశ మార్చుకుంటే వాళ్లు కూడా కాలి
“బూడిదవుతారని ??
ఈ కవితా పంక్తులలో లోతైన భావనతో కూడిన ఒక గొప్ప ఆలోచన దాగి ఉంది.ఇది జీవిత సత్యాన్ని తెలిపే సున్నితమైన సామెతలా కనిపించడమే కాదు,పాఠకుల హృదయాలను ఆలోచింపజేస్తుంది.
“నిప్పు రాజేసే వాళ్లకు’/అంటే ఇతరులకు సమస్యలు సృష్టించే వాళ్ళు,అకారణంగా కలహాలు రేపే వాళ్ళు, తప్పుడు పనులు చేసే వాళ్ళు,ఎదుటి వాళ్లకు హాని చేయాలనే ఉద్దేశంతో వ్యవహరించే వ్యక్తులను సూచిస్తుంది.స్వార్థపరుల తలంపులు,ఆలోచనలు, చేసే పనులు ఎల్లప్పుడు తమ స్వప్రయోజనాలు నెరవేర్చుకోవడాని కోసమే ఉంటాయి.సమాజంలో స్వార్థపరులు తమ ప్రయోజనాల కోసం ఇతరుల జీవన విధానంలో కలిగించుకుని తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తారు.
“గాలి దిశ మార్చుకుంటే/”అంటే గాలి అనే పదం ఇక్కడ పరిస్థితులను లేదా సమయాన్ని సూచిస్తుంది.జీవితంలో ఏదీ ఒక్క చోటే స్థిరంగా ఉండదు.సమయాన్ని బట్టి పరిస్థితులు అప్పటికప్పుడు మారుతాయి.కన్ను మూసి తెరిచేలోగా క్షణం మారినట్టు,కాలచక్రం గిర్రున తిరుగుతుంది.గాలి దిశ అంటే పరిస్థితుల గతి.గాలి దిశ మారిపోతే ఎవరి స్థితి ఎలా ఉంటుందో ఎవరు చెప్పగలరు?జీవితం ఏ వైపున పయనిస్తుందో ఎవరికి తెలియదు.తాము రాజేసిన మంటలు దిశ మార్చుకుని తమను కూడా కాల్చి బూడిద చేయ వచ్చు.మారిపోయే పరిస్థితిని ఊహించడం ఎవరి తరం కాదనేది స్పష్టం అవుతున్నది.
“వాళ్లు కూడా కాలి బూడిద అవుతారని “/ఎవరైనా వారు చేసే చర్యల ప్రభావం ఒక్క సారిగా తిరగబడితే అది వారి మీద కూడా దుష్ప్రభావం చూపిస్తుంది.ఇది కర్మ సిద్ధాంతాన్ని సూచిస్తుంది. దుర్మార్గంగా చేసే పనుల ప్రభావం ఎప్పుడో ఒకప్పుడు తమ పైన కూడా పడుతుందని చెప్పడం, ఎవరైనా దానవుల వలె రాక్షస ప్రవృత్తితో నడుచుకుంటే తాను తీసిన గోతిలో తానే పడడం జరుగుతుంది.దాని వల్ల కలిగే ఫలితం తనకే హాని కలిగిస్తుంది.సామాజికంగా లేదా వ్యక్తిగతంగా ఎవరికైనా హాని చేసే పని చేయడం వల్ల చివరికి అది వాళ్ళకే బెడిసికొట్టి తీరని నష్టంగా మారుతుంది అనే సందేశం తెలియజేస్తుంది.దుష్ట కార్యాలు చేయడం తాత్కాలికంగా లాభం కలిగించినప్పటికి,దీర్ఘ కాలంలో వాటి ప్రభావం తిరగబడి,ఆ దుష్కా.ర్యాలు చేసిన వారికే కష్టాలు కలుగుతాయి.అందు వల్ల ఇతరులకు మంచి చేయడం,న్యాయంగా నడుచుకోవడం,మనకు సమాజానికి మంచిది అని తెలియజేస్తుంది.ఎవరికైన హాని చేయడానికి ప్రయత్నించే ముందు ఆ కర్మల ప్రభావం తిరిగి తమ పైనే దాడి చేస్తుంది అనే నిజాన్ని గుర్తుంచుకోవాలి అనే సందేశం కవి గుల్జార్ భావాల్లో వ్యక్తం అవుతోంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (29)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“నీ జ్ఞాపకాల ఉదయాలను నాతోనే ఉండనివ్వు …
“ఎవరికి తెలుసు …ఎప్పుడు ఏ వీధి మలుపులో
“జీవితం అస్తమిస్తుందో ….?
ఈ కవితా పంక్తులు జీవితం యొక్క అస్థిరతను, దాని ఆవశ్యకతను తెలియజేస్తుంది.
“నీ జ్ఞాపకాల ఉదయాలను నాతోనే ఉండనివ్వు”
అనే చరణంలో ఒక వ్యక్తి తన మనసుకు సంబంధించిన ముఖ్యమైన జ్ఞాపకాలను ఎప్పటికీ తనతో ఉండాలని కోరుకుంటున్నాడు.ఎందుకంటే జీవితం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికి తెలియదు.’ఉదయం’ అన్నది దినచర్యలో ఒక భాగం,ఇది రోజు వారి జీవితంలో కొత్త ప్రారంభాలకు సూచనగా నిలుస్తుంది.ఆ జ్ఞాపకాలతో కొత్త జీవన అనుభవాలను స్ఫూర్తిగా తీసుకొని జీవనం గడపాలనే భావనను వ్యక్తం చేస్తుంది.
“ఎవరికి తెలుసు … ఎప్పుడు ఏ వీధి మలుపులో/జీవితం అస్తమిస్తుందో … /అనేది జీవితం యొక్క అనిశ్ఛితి,అస్థిరతను, తాత్కాలికతను సూచిస్తుంది.మరణం ఎప్పుడు సంభవిస్తుందో తెలియని పరిస్థితిని తెలుపుతుంది. మనకు ముందు ఏం జరుగుతుందో ?ఎక్కడ ఎలా మార్పులు చోటు చేసుకుంటాయో? అనే దానిని ఎవరు ఊహించ లేరు.జీవితం క్షణికం కాబట్టి అది ఎక్కడ ముగుస్తుందో? తెలియదు.జీవితాన్ని సమర్థంగా, గౌరవంగా కొనసాగించాలని,ప్రియమైన జ్ఞాపకాలను,హృదయంలో పదిలంగా నిలుపుకోవాలి అని తెలియజేస్తున్నది.జీవితం మనకు అందించే ప్రతి క్షణాన్ని,విలువైన కానుకగా భావించి, మధురమైన గత జ్ఞాపకాలను మనసులో నిలుపుకొని,వర్తమానాన్ని ప్రేమతో,ఆసక్తితో ఆస్వాదించాలనే గాఢమైన సందేశం కవి గుల్జార్ షాయరీ కవితలో వ్యక్తం అవుతుంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (30)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన ; నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“ప్రేమించు కానీ తిరిగి ఏమీ ఆశించకు
“దుఃఖం ప్రేమించడం మూలాన కలగదు …
“తిరిగి ప్రేమను ఆశిస్తావు చూడు,అప్పుడు “కలుగుతుంది.
ఈ పంక్తి ద్వారా ప్రేమకు సంబంధించిన ఒక విలువైన సందేశాన్ని అందిస్తున్నారు.
“ప్రేమించు కానీ తిరిగి ఏమీ ఆశించకు”అనేది ప్రేమ యొక్క అసలైన స్వరూపాన్ని తెలియజేస్తుంది. ప్రేమను స్వచ్ఛమైనదిగా ఎంచి,స్వార్థం లేకుండా ప్రేమించాలి అని ఇక్కడ సూచిస్తున్నారు.ప్రేమ అనేది నిర్మలమైనది,స్వచ్ఛమైనది.ప్రేమలో స్వార్థం లేకుండా ఉండాలి.ప్రేమించడం అంటే మన హృదయాన్ని ఇతరుల కోసం తెరవడం,వారి మీద మమతను చూపించడం.అయితే దీనికి ప్రతిఫలంగా వారి నుంచి ప్రేమ లేదా గుర్తింపును ఆశించడం,మన దుఃఖానికి కారణం అవుతుంది.
“దుఃఖం ప్రేమించడం మూలాన కలగదు”అని చెప్పడం,ఎవరైనా నిస్వార్ధంగా ప్రేమిస్తే దుఃఖం కలగదు.ప్రేమ సహజంగా స్వచ్ఛతతో కూడి ఉండాలి.ప్రేమించేటప్పుడు ఎలాంటి ప్రతిఫలాన్ని ఆశించ కూడదు.నిస్వార్థంగా ప్రేమిస్తే దుఃఖం కలుగదు.కానీ మీరు ప్రేమించిన వ్యక్తి నుంచి తిరిగి ప్రేమను ఆశించి అది లభించకపోతే దుఃఖం కలుగుతుంది.
“తిరిగి ప్రేమను ఆశిస్తావు చూడు,అప్పుడు కలుగుతుంది”/అని సూచించడం వల్ల మన దుఃఖానికి కారణం ఏమిటో తెలుస్తుంది. ప్రేమకు ప్రతిఫలం ఆశించడం ద్వారా ఆశలు పెరుగుతాయి. కానీ ఆ ఆశలు తీరకపోతే బాధ కలుగుతుంది. అందుకే ప్రేమ ఏ ప్రతిఫలాన్ని ఆశించనిదై ఉండాలి. ఈ భావం మనకు ఇతరులతో సంబంధాలను మరింత మంచిగా దృఢంగా నిలిపే మార్గాన్ని చూపుతుంది.మొత్తానికి ప్రేమను స్వార్థరహితంగా ప్రకటిస్తే మనం నిజమైన ఆనందాన్ని పొందగలం. అందు వల్ల ప్రేమను పంచడమే కానీ తిరిగి ప్రతిఫలాన్ని ఆశించకూడదనే భావన అని కవి గుల్జార్ కవితలో వ్యక్తం అవుతున్నది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత. (31)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“నీతో విసిగి వేసారిపోయామన్న వారిని
“వదిలివేయి
“భారంగా మిగలడం కన్నా జ్ఞాపకంగా మిగిలి
“పోవడమే మంచిది.
ఈ పంక్తులు అందంగా ఒక గొప్ప జీవిత సత్యాన్ని చెబుతోంది మరియు లోతైన భావనను కలిగి ఉంది.దీనిలో వ్యక్తిగత సంబంధాల మధ్య ఉండే సున్నితమైన సమతౌల్యతను గురించి చర్చించబడింది.
“నీతో విసిగి వేసారి పోయామన్న వారిని వదిలివేయి’/ఎవరు మనతో విసిగి వేసారి పోతారో, మనను అంగీకరించలేకపోతారో,అలాంటి వారిని వదిలి వేయడం మంచిదని సూచిస్తోంది.ఈ పంక్తిలోని భావన ఏమిటంటే,మన సమీపంలో ఉన్న వారు మనపై విసుగు చెంది,మనతో ఉండటానికి ఇష్టపడకపోతే,వారిని బలవంతంగా మనతో ఉంచడం అవసరం లేదని,ఎవరు మనకు అనుకూలంగా వ్యవహరించరో వారిని విడిచి పెట్టడమే సరైనదని అర్థం.
“భారంగా మిగలడం కన్నా జ్ఞాపకంగా మిగిలి/ పోవడమే మంచిది.”/ఎందు కంటే మనం వారికి భారంగా అనిపించడం కన్నా,మనతో గడిపిన మంచి జ్ఞాపకాలను మిగుల్చుకోవడం మంచిది.మన కుటుంబంలో,స్నేహితులలో లేదా ఇతర సంబంధాలలో మనం బలవంతంగా ఉండి వారికి మనం భారంగా మారడం మంచిది కాదు.ఒక వ్యక్తికి చెందిన గొప్ప జ్ఞాపకాలు జీవితాంతం మనతో ఉంటాయి.అందు వల్ల సంబంధాన్ని బలవంతంగా కొనసాగించకుండా గౌరవంగా ముగించడం మంచిదని చెప్పే ప్రయత్నం ఇది.ఇతరులతో మన సంబంధాలు బాగా ఉండాలి.ఇతరులతో మన సంబంధాలు భారంగా మారితే శాంతియుతంగా దూరమవడం కూడా ఒక మంచి నిర్ణయం.ఇది సంబంధాలను హాని లేకుండా,గౌరవంగా ముగించుకునే సమర్థమైన మార్గం అని కవి గుల్జార్ భావాల్లో వ్యక్తం అవుతుంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (32)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)తెలుగులోకి అను సృజన చేసింది.
“దోస్త్ …గుర్తుంచుకో ! కాలం గడిచే కొద్దీ నేనేమో
“అందరిలా మారిపోతాననుకోకు !
“నిన్నెప్పుడు కలిసినా … గతంలోలాగే ఉంటుంది
“నీతో నా వ్యవహారం.
ఈ కవితా పంక్తులు స్నేహానికి,బంధానికి గల అవినాభావ సంబంధాన్ని సూచిస్తాయి.
“కాలం గడిచిన కొద్దీ నేనేమో/అందరిలా మారిపోతాననుకోకు/ అని స్పష్టంగా చెప్పడం,కాలం ఎంత మారినా,తాను తన వ్యక్తిత్వాన్ని,తన స్వభావాన్ని మార్చుకోనని స్పష్టం చేస్తున్నాడు.ఇది అతని నిజాయితీకి,స్థిరత్వానికి నిదర్శనం.కాలం ఎంత గడిచినప్పటికీ నేను మారిపోనని నిన్ను చూసిన ప్రతి సారి,మన అనుబంధం,మన స్నేహం గతంలో ఎలా ఉందో,ఇప్పుడు అలాగే ఉంటుందని తెలియజేస్తున్నాడు.
నిన్నెప్పుడు కలిసినా .. గతంలోలాగే ఉంటుంది”/ అని అంటున్నాడు.స్నేహం ఎంత కాలం గడిచినా మారదు.స్నేహితుల మధ్య ఉండే అనుబంధం ఎప్పుడు పూర్వం ఎలా ఉందో అలాగే కొనసాగుతుంది అనేది వాస్తవంగా తోస్తుంది.
“నీతో నా వ్యవహారం”/ఈ కవితా పంక్తి సంబంధం మీద ఉన్న విశ్వాసాన్ని తెలియ జేస్తుంది.నా నడవడి నీతో ఎప్పుడు నిస్వార్థంగా,నిజాయితీతోనే ఉంటుంది.నా స్వభావం ఎప్పటికీ మారదు.నీతో నా స్నేహం ఎప్పటికీ అదే తరహాలో ఉంటుంది అని చెప్పే ఓ హామీగా చూడవచ్చు.ఈ షాయరీ కవితలోని భావన ఒక వ్యక్తి తన మిత్రుడితో గల అనుబంధాన్ని,మారని వ్యక్తిత్వాన్ని,కాలం ఎంత మారినా స్నేహం వారి మధ్య గల అనుబంధం ఎప్పటికీ మారదనే విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది. అసలుసిసలైన స్నేహం కాలంతో మారదు.అది కేవలం హృదయానికి సంబంధించినది.కవి గుల్జార్ స్నేహానికి, అనుబంధానికి గల గాఢతను షాయరీ కవితలో వ్యక్తం చేసిన తీరు అద్భుతంగా ఉంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (33)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“ నేను అమాయకుడినే కావొచ్చు కానీ,
“నేనెలాంటి
“వాడినో తెలియదు నీకు !
“నా సంతోషం కోసం వంద సార్లైనా విరిగి
“ముక్కలవగలను !
ఈ కవితా పంక్తిలోని భావం ఒక వ్యక్తి తన అంతర్ముఖ భావనలను వ్యక్తిత్వాన్ని వ్యక్తపరుస్తూ చెప్పినది.
ఇది ప్రస్తుతానికి అతని ప్రాధాన్యతల గురించిన లోతైన ఆలోచనను తెలియజేస్తుంది.
“నేను అమాయకుడినే కావొచ్చు/కానీ,వ్యక్తి తన అమాయకత్వాన్ని ఒప్పుకుంటున్నాడు.ఇది అతనిలోని నిజాయితీని సూచిస్తుంది.ఈ పంక్తిలో అతను తనను నిందించే వారికి సమాధానమిస్తున్నట్లు ఉంది.
“నేనెలాంటి వాడినో తెలియదు నీకు”/కానీ,అతను నిజానికి ఎలా ఉంటాడో,అతని గొప్పతనాన్ని, త్యాగపరత్వాన్ని ఇతరులు గుర్తించడం లేదని తపన పడుతున్నాడు.తన మనసులోని భావాలను ఇతరులు సరిగా అర్థం చేసుకోలేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు.తన వ్యక్తిత్వం గురించి,తన గొప్పతనం గురించి ప్రపంచానికి తెలియని తీరును తెలియజేస్తున్నాడు.
“నా సంతోషం కోసం వంద సార్లైనా విరిగి/ ముక్కలవగలను/అని అంటున్నాడు.ఇది తన ఆనందం కోసం ఏదైనా త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్న శక్తివంతమైన వ్యక్తిత్వాన్ని తెలియజేస్తోంది. అతడు తన ఆనందం కోసం ఎంత గొప్ప త్యాగానికైనా సిద్ధంగా ఉన్నాడు.అవసరమైతే వంద సార్లు విరిగి ముక్కలైనప్పటికీ తన ఆనందాన్ని దక్కించుకోవడంలో వెనుకాడడు.ఇది అతని త్యాగానికి,తన భావోద్వేగాలకు అద్దం పడుతుంది‌. ఈ కవితా పంక్తి తన బాధ్యతాయుతమైన ప్రేమ పూర్వక స్వభావానికి ప్రతీక.అది తన లక్ష్యాలకు ఆటంకంగా వచ్చిన ఎన్నింటినైనా ఎదిరించి,తన ఆనందాన్ని సాధించడంలో వెనుకడుగు వేయని తత్వాన్ని చూపిస్తుంది.ఈ కవితా పంక్తులలో ఒక వ్యక్తి తన అసలైన స్వరూపాన్ని తెలియజేసే ప్రయత్నం కనిపిస్తోంది.అతను అమాయకుడిగా కనిపించినప్పటికీ,అతని భావోద్వేగాలు లోతైనవి. తాను స్వార్థ రహితమైన త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.తన ఉన్నతమైన లక్ష్యాలను, ఇతరులు అర్థం చేసుకోలేకపోతున్నారని స్పష్టం చేస్తున్నాడు.కవి గుల్జార్ షాయరీ కవితలో వ్యక్తం చేసిన భావాలు బాగున్నాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(34)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“ఈ జీవితం నా మీద ఎందుకో
“అలిగినట్లుంది
“పోనీయ్ …ఇంకా వదిలేయ్ …
“ఇదేమి మొదటి సారి కాదుగా
“అలగనీ
ఈ కవితా పంక్తుల్లో జీవితాన్ని ఒక కష్ట సాధ్యమైన ప్రయాణంగా చూడటం కనిపిస్తుంది.
“ఈ జీవితం నా మీద ఎందుకో అలిగినట్లుంది”/అంటే జీవితంలో కొన్ని కష్టాలు, నిరాశలు ఎదురవుతు కలవరం కలిగిస్తున్నాయి. కానీ,ఆ కష్టాలు,సమస్యల గురించి అదే పనిగా ఎక్కువగా ఆలోచించడం,బాధ పడటం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు.నష్టమే ఎక్కువగా ఉంటుంది.ఈ కవితా పంక్తి తన మనసును పిండేస్తున్న నిరాశను,ఒత్తిడిని,జీవితం ఎందుకో ఇంత అన్యాయంగా ఉంది అనే భావనను వ్యక్తం చేస్తోంది.
“పోనీయ్ … ఇక వదిలేయ్ …”/ అని తాను మనసులో అనుకోవడం ఒక రకమైన బాధ నుంచి విముక్తి పొందటానికి చేసే ప్రయత్నం.ఇది అన్ని వదిలివేయడం కాదు,అన్ని పట్టించు కోకుండా ఉండడం కాదు.తాను జీవితాన్ని ఒక కొత్త కోణం నుండి చూసే ప్రయత్నం.తాను తన మనసులో నిండిపోయిన బాధను తేలికగా మరిచిపోయే ప్రయత్నం చేస్తున్నట్లుగా భావించవచ్చు.ఇందులో ఓ రకంగా జీవితంలోని కష్టాలను పెద్దగా పట్టించుకోకుండా వాటిని మరిచిపోయి ముందుకు సాగమనే సూచన దాగి ఉంది.
“ఇదేమి మొదటిసారి కాదుగా”/అని వ్యక్తం చేయడం వెనుక తాను ఇప్పటికే జీవితంలో ఇలాంటివి ఎన్నో సవాలక్ష సవాళ్లను సులభంగా ఎదుర్కొని ముందుకు సాగిపోయిన తీరు కనిపిస్తుంది.కాబట్టి ఇప్పుడు కూడా అదే విధంగా ధైర్యంగా ఉంటూ ఈ క్షణాలను సమర్థవంతంగా ఎదుర్కోవడం మంచిది. ఇదేమి మొదటి సారి కాదుగా అనే చరణం చాలా కీలకంగా తోస్తుంది.తనకు జీవితంలో ఇప్పటికే అనేకానేక కష్టాలు,సమస్యలు ఎన్నో ఎదురైనాయని వాటిని ఎదుర్కొని బలంగా నిలబడిన అనుభవం ఉందని తెలియజేస్తున్నాడు.తన జీవితం తాత్కాలికంగా విసిగి ఉన్నదని అంటున్నాడు.తన జీవితం అన్యాయానికి లోనైందని దానిని సరిదిద్దడానికి తాను తన ఎదలోపల ఒక పరిష్కారం కోసం చేసే తపన,ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది. ఇదేమి మొదటిసారి కాదుగా అనే మాటలు,గతంలో కష్టాలను అధిగమించిన అనుభవాలను గుర్తు చేస్తాయి.ఈ షాయరీ కవితలోని ప్రధాన ఉద్దేశం తాను కష్టాలను స్వీకరించి వాటిని అధిగమించ గల శక్తి తనకు ఉందని తెలియజేయడం.జీవితానికి అర్థం ఏమిటి?అనేది కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే తెలుస్తుంది.ఇంత వరకు తాను కష్టాలను ఎదుర్కొని బలంగా నిలబడిన అనుభవం ఉంది.మళ్లీ కూడా తాను అదే శక్తితో ముందు కెళ్లగల సాహసం ఉంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి సవాలును కూడా స్వీకరించాలి.అప్పుడే తనను తాను నిరూపించుకోవడం జరుగుతుంది.జీవితం ఎప్పుడో ఒక్కోసారి పరీక్షకు గురి చేస్తుంది.నిరాశ, నిట్టూర్పులు,అదో రకం బాధ ఏదోలా అనిపించినప్పుడు,మనసుకు శాంతి నిచ్చే పని చేయడం,ధైర్యంగా ముందుకు సాగడం అనివార్యం అని కవి గుల్జార్ షాయరీ కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత.(35)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“జీవించడానికి కొన్నే కొన్ని నా కాలపు
“క్షణాలు భద్రంగా దాచిపెట్టుకున్నాను !
“కానీ అవి ఎక్కడ … ఎప్పుడు
“ఖర్చైపోయాయో కూడా తెలీనే లేదు …
ఈ కవితా పంక్తులు జీవితం మీద లోతైన అవగాహనను ప్రతిబింబిస్తుంది.
“జీవించడానికి కొన్నే కొన్ని నా కాలపు క్షణాలు భద్రంగా దాచి పెట్టుకున్నాను/అంటున్నాడు. జీవించడానికి కొన్ని తన కాలపు క్షణాలను భద్రంగా దాచి పెట్టుకున్నా.జీవితంలోని అతి ముఖ్యమైన, విలువైన క్షణాలను జాగ్రత్తగా దాచి ఉంచుకున్నాడు అని అర్థం. “అవి ఎక్కడ … ఎప్పుడు/ఖర్చయి పోయాయో కూడా తెలీనే లేదు”/అని అంటున్నాడు.జీవితం అనేది ఎన్నో ఆకాంక్షలతో,ప్రయాణాలతో నిండిన ప్రక్రియ.మనం అప్రమత్తంగా లేకపోతే సమయాన్ని ఎలా గడిపామో కూడా తెలియదు.ఇది కాలం ఎంత వేగంగా వెళ్ళిపోతుందో,మళ్లీ తిరిగి రానిదో అనే విషయాన్ని గుర్తు చేస్తుంది.జీవితంలో కొన్ని మంచి అపురూపమైన సమయాలను భద్రంగా దాచి ఉంచాలని అనుకుంటాం.కానీ, కాలం ఎవరికి చిక్కక విలువైన క్షణాలు తెలియకుండానే ఇట్టే గడిచి పోతాయి.ఇది జీవితం ఎంత క్షణభంగురమైనదో, సమయం ఎంత విలువైనదో తెలియజేస్తుంది.మన జీవితంలో సమయానికి ఎంతో విలువ ఉంది,దానిని సద్వినియోగం చేసుకోవడం ఎంతో ముఖ్యమని ఈ కవితా పంక్తి తెలియ జేస్తుంది.కాలం అనేది నిరంతరం కదులుతూనే ఉంటుంది.మనం దాన్ని జాగ్రత్తగా ఉపయోగించాలి.మనం తెలియకుండానే అనవసర విషయాల్లో తలదూర్చితే అత్యంత విలువైన సమయాన్ని కోల్పోతాం.జీవితంలో ప్రతి క్షణాన్ని చురుకుగా ప్రయోజనకరంగా వినియోగించాలని కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ జీవితాన్ని జాగ్రత్తగా గడపాలి అనే ప్రేరణను కలిగిస్తాయి.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావాలు అద్భుతంగా ఉన్నాయి.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత. (36)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“రోజూ ఎలా ఉన్నావని అడుగుతూ నన్ను
“సిగ్గుపడేట్లు ఎందుకు చేసావు ?
“ఇంకా ఎలా ఉంటాను నువ్వే చెప్పు?
“నువ్వు నన్ను ఏ స్థితిలో వదిలేసావో .. అదిగో
“అలానే నా పరిస్థితి !
ఈ కవితా పంక్తులు లోతైన భావోద్వేగాలతో నిండినవి.తాను జీవితంలో ఎదుర్కొంటున్న బాధను,బాధ్యత లేకుండా వదిలేసిన వారి చర్యల వల్ల కలిగిన హృదయ వేదనను తెలుపుతున్నాయి
“రోజూ ఎలా ఉన్నావని అడుగుతూ నన్ను/సిగ్గు పడేట్లు ఎందుకు చేసావు?/అంటే మాట్లాడుతున్న వ్యక్తి తన జీవితంలో కలిగిన బాధను ప్రతి రోజు గుర్తు చేయడాన్ని మళ్లీ మళ్లీ వినలేకపోవడం వల్లనే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు.తాను తన పరిస్థితిని ఎల్లప్పుడు గుర్తు చేయడం వల్ల తనలో ఉన్న బాధ మరింత రెట్టింపు అవుతుంది.ఇది తనకు కలిగిన మానసిక ఆవేదనను స్పష్టం చేస్తోంది.
“ఇంకా ఎలా ఉంటాను నువ్వే చెప్పు ?/అని అంటే ఇంకా నేను ఎలా ఉంటానో నీకు తెలుసు కదా. ఇప్పుడు నీవు ఇంతకు పూర్వం నన్ను చూసిన విధంగానే బాధలను అనుభవిస్తూ ఉన్నాను.నువ్వు నన్ను ఏ స్థితిలో వదిలేసావో తిరిగి అదే స్థితిలో ఉన్నాను అనే భావనను తెలియజేస్తున్నాడు..
“నువ్వు నన్ను ఏ స్థితిలో వదిలేసావో… అదిగో అలానే నా పరిస్థితి/అంటే ఇక్కడ తన జీవితం ఎలాంటి మార్పు లేకుండా ఎటువంటి పురోగతి లేకుండా అదే స్థితిలో కొనసాగుతుందని అతను తెలుపుతున్నాడు.తనను పట్టించుకోనట్టి బాధ్యతాహీనతను స్పష్టంగా ఎత్తి చూపుతున్నాడు. ఇది తాను ఎవరో ఒకరిని నమ్మినారు,ఆ నమ్మిన వ్యక్తి వారిని మధ్యలో వదిలి వేయడం వల్ల ఎదుర్కొంటున్న ఒంటరితనాన్ని,బాధను వ్యక్తం చేస్తున్నట్లు తెలుపుతుంది.ఈ పంక్తులు ఒక వ్యక్తి వ్యక్తిగత జీవితంలోని లోతైన బాధలను ప్రతిబింబిస్తాయి.అతను వదిలిపెట్టడం వల్ల తాను అనుబంధాన్ని కోల్పోవడం,ఒంటరితనం ఎదుర్కోవడం జరిగింది.ఈ కవితలో భావోద్వేగాల తీవ్రత మరియు సంబంధం పట్ల బాధ్యత అనేది లేకపోవడం స్పష్టంగా వ్యక్తం అవుతుంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (37)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“నా కళ్ళల్లోకి రావద్దని ఆమెకి చెప్పండి
“ఎవరైనా …
“ఆమె కలలో కొచ్చిన రాత్రి మెలకువ
“వచ్చేస్తుంది ….
“హృదయం ముక్కలవుతుంది?!
ఈ కవితా పంక్తులు భావోద్వేగాలతో నిండి ఉన్నాయి.
“నా కళ్ళల్లోకి రావద్దని ఆమెకి చెప్పండి/ఎవరైనా…/ఇది ఒక ఆకాంక్షను,ఒక విజ్ఞాపనను వ్యక్తం చేస్తోంది.ఆమె అంటే ఎవరో ప్రత్యేకమైన వ్యక్తి అని,ఆమె గురించి తనకు బలమైన భావనలు ఉన్నాయని తెలియ జేస్తున్నాయి.నా కళ్ళల్లోకి రావద్దని అంటే ఎందుకో తెలియదు?ఆమె చూపులు తన మనసుని కలవరం కలిగిస్తాయి.ఆమె గుర్తుకు వచ్చి ఆమెకు చెందిన ఆలోచనలు వేధించి,వెంటాడుతాయి.తాను ఆమెను ఎంతగానో గాఢంగా ప్రేమించాడు.కాబట్టి తన ఆవేదనను ఈ కవిత పంక్తులలో వ్యక్తం చేస్తున్నాడు.
“ఆమె కలలోకొచ్చిన రాత్రి మెలకువ వచ్చేస్తుంది …/ ఎందు కంటే ఆమె కలలో వచ్చినట్లయితే తన నిద్రకు భంగం కలుగుతుంది.ఆ ఆలోచన వల్లనే తన హృదయం ముక్కలు ముక్కలుగా విడిపోతుంది. ఇది ఒక చిధ్రమైన అనుభవాన్ని చెప్పే పంక్తి.ఆమె కలలోకి వచ్చి తన నిద్రను దూరం చేస్తోంది.ఇది మనసు ప్రశాంతతను కోల్పోయిన పరిస్థితిని సూచిస్తుంది.
“హృదయం ముక్కలవుతుంది?!/అంటే ఇది ప్రేమ,వ్యథ,అసహనాన్ని వ్యక్తపరిచే పదాలుగా కనిపిస్తున్నాయి.ఇది తన మనసులోని బాధ లేదా విరహాన్ని సూచిస్తుంది.ఆమెపై తన ప్రేమ ఎంత ప్రగాఢంగా ఉందో ఆమెని గుర్తు చేసుకునే ప్రతి సారి హృదయం బాధపడుతుందని ఇది తెలియజేస్తుంది.
ఈ షాయరీ కవితా పంక్తులు ప్రేమ,విరహం,బాధల నడుమ ఉండే అంతరంగిక స్థితిని ప్రతిబింబిస్తాయి. ఇది ఒక వ్యక్తి తన మనసులోని అలజడిని, హృదయంలోని బాధను వ్యక్తపరుస్తున్నట్లు తెలుస్తోంది.కవి గుల్జార్ ఎవరో తనకు అత్యంత సన్నిహితమైన వ్యక్తిని గుర్తు చేసుకుంటూ తనలో కలిగే భావోద్వేగాలను షాయరీ కవితా రూపంలో వ్యక్తం చేస్తున్నారు.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత. (38)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“నా ఊహా ప్రపంచం ఎంత అందంగా
“ఉంటుందనుకున్నావు ?
“నీతోనే మొదలవుతుంది …
“నీవుగానే ముగుస్తుంది !
ఈ కవితా పంక్తులు మనసులో ఊహ ప్రపంచం గురించి,వ్యక్తిగత భావోద్వేగాలను,ఆత్మీయ ప్రేమను వ్యక్తపరుస్తున్నాయి.ఇందులోని ఒక్కో పదం ఒక లోతైన భావనను వ్యక్తపరిచేలా ఉండటం గమనించవచ్చు.
“నా ఊహా ప్రపంచం ఎంత అందంగా/ ఉంటుందనుకున్నావు?/ఊహ ఎంత అందంగా ఉంటుందో నీకు తెలియదు.మన ఊహా ప్రపంచం మనకి ఎంతో ప్రత్యేకమైనది.దీన్ని వేరొకరితో పంచుకోవాలనుకోవడం ఒక భావోద్వేగం.ఆ వ్యక్తి తన ఊహలకు సంబంధించిన కేంద్ర బిందువుగా ఉందని చెప్పే ప్రయత్నం ఇది.
“నీతోనే మొదలవుతుంది …/అంటే ఇది జీవితంలోని ఆరంభం,స్ఫూర్తి ఎక్కడ నుంచి వస్తుందో చూపుతుంది.తన ఊహలు,తన కలలు ఏవైతే ఉన్నాయో అవి ఆ వ్యక్తితోనే ప్రారంభం అవుతాయన్న భావన గోచరిస్తుంది.ఇక్కడ ఆ వ్యక్తి ప్రాముఖ్యత,ప్రేమను వ్యక్తం చేస్తుంది.
“నీవు గానే ముగుస్తుంది !ఇది తన జీవిత ప్రయాణం.ఆ వ్యక్తితోనే ముగుస్తుందన్న భావనను సూచిస్తుంది.నీతోనే మొదలవుతుంది..నీవుగానే ముగుస్తుంది.ఇది ప్రేమ భావనను ఆ వ్యక్తి ప్రాముఖ్యతను వ్యక్తపరుస్తుంది.ఆ వ్యక్తి లేకపోతే తన ఊహా ప్రపంచానికి,తన కలలకు,తన జీవితానికి ఎలాంటి అర్థం ఉండదని స్పష్టంగా చెప్పడం.తన ఊహల ప్రపంచం ఆ వ్యక్తితోనే ప్రారంభమై అదే వ్యక్తితో ముగిసేంతగా బలపడిందని అర్థమవుతుంది.ఈ షాయరీ కవితా పంక్తులు ఒక సునిశితమైన ప్రేమను,ఆత్మీయతను,అలాగే ఆ వ్యక్తి జీవితంలో ఉన్న ప్రాముఖ్యతను ప్రతిబింబిస్తాయి. ఇవి ఒక్క స్నేహం,ప్రేమ లేదా బంధానికి సంబంధించిన భావంగా భావించవచ్చు.ఈ భావాలు తన జీవితంలో సహజమైన సంబంధం ఎలా ఉంటుందో తెలుపుతాయి.ఈ కవితలో తాను ఎవరినైతే అంత గాఢంగా ప్రేమిస్తాడో వారికే తన జీవితం అంకితం అవుతుంది అనే భావన వ్యక్తం అవుతుంది.
గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత. (39)
తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి)
గుల్జార్ షాయరీ కవితపై విశ్లేషణా వ్యాసం.
రచన : నరేంద్ర సందినేని
ప్రఖ్యాత కవి,గుల్జార్ కలం నుండి జాలువారిన షాయరీ కవిత ఇది.దీనిని కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.
“నీ ప్రేమ కూడా చాలా ఖరీదైనదిలా
“ఉంది …
“రోజు రోజుకి పెరిగిపోయే ధరలా !
ఈ కవితా పంక్తి ఒక రూపకం (metaphor) ద్వారా వ్యక్తీకరించబడింది.
“నీ ప్రేమ కూడా చాలా ఖరీదైనదిలా/ఉంది/అని చెప్పడం ద్వారా ఆ ప్రేమ అత్యంత విలువైనదిగా లేదా అందరికీ సులభంగా అందని దానిగా అభివర్ణించబడుతోంది.
“రోజు రోజుకి పెరిగిపోయే ధరలా/అంటే మీ ప్రేమ చాలా విలువైనదిగా అనిపిస్తుంది.అది రోజు రోజుకి పెరిగే ఖరీదైన వస్తువుల ధరల మాదిరిగా ఉంది. అంటే,అది సాధారణంగా అందరికీ అందుబాటులో ఉండేలా లేదు.కానీ ఎంతో విలువైనదిగా ఉంది.ఇది ప్రేమ విలువ రోజు రోజుకు పెరుగుతోందని చెప్పడమే కాకుండా దాన్ని పొందడం కష్టతరంగా మారుతోందనే భావనను కూడా సూచిస్తుంది.ప్రేమ ఎంత ఎక్కువ ఆత్మీయతను కలిగిస్తుందో,అది అంత విలువైనదిగా భావించబడుతుంది.రోజు రోజుకు ప్రేమలో కలిగే కొత్త అనుభూతులు,మధురమైన క్షణాలు,ఆ ప్రేమ విలువను మరింత పెంచుతాయి. ప్రేమను సాధించడం లేదా దానిని పొందడం చాలా కష్టం అవుతుందనే భావన కూడా ఇందులో దాగి ఉంది.ప్రేమ రోజు రోజుకు పెరిగి అది సాధించలేనిదిగా అనిపించవచ్చు.ఈ కవితా పంక్తులు ఆ ప్రేమ విలువను, ప్రేమలో దాగి ఉన్న విశిష్టతను,ప్రేమ యొక్క ప్రత్యేకతను తెలియజేస్తుంది.అలాగే ప్రేమను పొందడం ఎంతో కష్టం అనే వాస్తవాన్ని వ్యక్తం చేస్తుంది.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావనలు అద్భుతంగా ఉన్నాయి.పాఠకుల హృదయాలను రంజింపజేస్తాయి.

January 31, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
బాల‌సాహిత్యం

సుద్దులు

by Achyutuni Rajasri January 31, 2025
written by Achyutuni Rajasri

సాధారణంగా మనం ఎంతోమంది తో మాట్లాడుతూ ఎన్నో విషయాలు తెలుసుకుంటాం కానీ కొందరు చెప్పే మాటలు మనకు ఆనందం తోపాటు ఆదర్శభావాల్ని ఆలోచనలను రేకెత్తిస్తాయి.అదే మనం తెలుసుకోవాలి” శివా మాష్టారు పాఠం చెప్పేముందు ఇలా కొన్ని మాటలు చెప్పి ఆలోచించమని పిల్లలకు చెప్తారు.అప్పుడు ఆసక్తికరంగా ఆయనపాఠంసజావుగా సాగుతుంది.బెల్లు ఐనా ఇంకా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు.” కులం అంటే ఏంటి?” ” అదే సర్! క్యాస్ట్!” పొలోమని అరిచారు.

“అసలు అర్థం నివాసం అని.వృత్తులు ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి వారు చేసేవారు.అలా సంఘంలో ఒకరిపై ఒకరు ఆధారపడి సహజీవనం గడిపేవారు.ఒకసారి శ్రీరామానుజులవారు స్నానం ముగించుకుని తిరిగి వస్తూ ధనుర్దాసు అనే శిష్యుడు భుజంపై చేయి వేసి నడిచారు.ఒక చుప్పనాతి శిష్యుడు అడిగేశాడు “వాడు తక్కువ కులంవాడుకదా? మీ మడికి భంగం కలగదా?”అని.
దానికి ఆయన ఇలా జవాబిచ్చారు” పిచ్చివాడా! చదువు డబ్బు గొప్ప వంశం కులంలో పుట్టాను అనేవి అహంకారం మదమాత్సర్యాలకి మూలం.వినయవిధేయతలున్నవాడే మానవత్వంతో సాయపడే వాడే దేవుని దృష్టిలో అసలుసిసలు భక్తుడు.శుచిశుభ్రత ముఖ్యం.” అన్నారట శ్రీ రామానుజులు . అంతెందుకు? మనమిసైల్ మాన్ అబ్దుల్ కలాం ని
బడిలో అయ్యర్ అయ్యవార్లు తమ ఇంటికి పిలిచి వంటింట్లో తమతోపాటు భోజనానికి కూచోబెట్టేవారు.మడి తో ఉన్న మాష్టారు భార్య
మామి కూడా కన్నకొడుకు లా బాల కలాం కి అన్నం కొసరి కొసరి వడ్డిస్తూ వినిపించేది.మీరు కూడా మధ్యాహ్నం లంచ్ అందుకే పక్కపక్కనే కూచుని తినాలి.మీరు తెచ్చినవి ఇతరులతో పంచపకుంటూ,వారివి మీరు పుచ్చుకోవడం లోనే ప్రేమ ఆప్యాయతలు బంధాలు పెరుగు తాయి.” అని శివా మాస్టారు చెప్పారు. అది వింటున్న బడి ఛైర్మన్ మనవడు రాము అన్నాడు” 
సార్! ఇవాల్టినుంచి నేను కూడా అందరితో కలిసి తింటాను.ఆగట్టుమీద కూచోను.మానౌకరు దగ్గర కూర్చుని తినిపిస్తాడు.మా అమ్మ మాట ప్రకారం.”
“సెభా‌ష్ రాము! మీనౌకరుకి చెప్తానులే లంచ్ బాక్స్ ఆయాకిచ్చి
వెళ్లిపొమ్మని.నీవుకూడా మీక్లాసుపిల్లలతో కల్సికూచుని తిను.అందరూ తమ ఇంట్లోంచి రకరకాల వెరైటీవంటకాలు తెస్తారు. అవి పక్కవారితో పంచుకొని తింటారు.వంకాయని రకరకాలుగా వండవచ్చు.కొందరుఅల్లంపచ్చిమిర్చి కొబ్బరివేసి గుత్తికూర చేస్తారు, కొందరు ఉల్లిగడ్డ వేసి ముద్దగా కూర చేసుకుంటారు, కొందరు వేపుడు గా చేసుకుని తింటారు. మరికొందరు వంకాయ పులుసు వండుతారు, కొందరు చట్నీ లా చేసుకుని తింటారు. వాటిలాగానే మనుషుల స్వభావాలుకూడా. చూడండి …. మన రాము ఎంత బాగా సరేనన్నాడో చూడండి.” శివాసార్ మాటల్తో పిల్లలంతా పొలోమని అరిచారు” హాయ్! రేపట్నించి రాముకూడా మనతోకల్సి చెట్టుకింద కూచునే తింటాడు.వాడి లంచ్ బాక్స్ లోని వెరైటీలు మనం కూడా రుచి చూడొచ్చు” .చప్పట్లతో రాముని పిల్లల అభినందించారు

January 31, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

రైతు సాము

by Jharki Lavanya January 31, 2025
written by Jharki Lavanya

“రైతో రక్షతిరక్షితః”
రైతును మనం రక్షిస్తే
రైతు మనలను సంరక్షిస్తాడు…
ఇది వాస్తవం…
మరి…
నేల తల్లిని నమ్ముకున్న రైతు
నాగలి పట్టి నలుగురికి అన్నం పెట్టిన రైతును…
నేల విడిచి సాము చేయమంటే ఎలా….
రెక్కాడితే కానీ, డొక్కాడని వాళ్ళు…
రెక్కల కష్టం మీద బ్రతికే వాళ్ళు…
రెక్కల కష్టం ఆపితే ఎలా….
ఎండకు ఎండుతూ,వానకు తడుస్తూ…
ఏళ్ల కొలది భూమిని నమ్ముకుంటూ…
కాలం కన్నెర్రజేసినా, కడుపు కాలినా…
కండరాళ్ళను కరిగిస్తూ….
కన్నీళ్ళనే కాలువలుగా పారిస్తూ…
క్వింటాళ్ళ కొలది పంటను పండిస్తూ…
వేయిలమందికి అన్నం పెట్టిన అన్నదాత….
చెమట చుక్కనే నీటి చుక్కగా మార్చి.‌‌..
నేల తల్లికి దాహం తీర్చే దాత..
రెక్కల సాము ఆపితే ఎలా….
ఇంటిని, పాడిపంటలను చూసుకుంటూ….
చెమట చుక్కను ధారపోసి…
బిడ్డలను కార్పోరేట్ చదువులకు పంపుతూ…
పల్లె బాటను పానంలా కాపాడుకునే రైతు…
రెక్కల కష్టం ఆపితే ఎలా…
భూస్వాముల చేతిలో రైతు
కీలు బొమ్మలుగా మారి
నమ్ముకున్న భూమిని చేజార్చుకున్న రైతు…
ఉరితాడుకు బలి అయితే ఎలా….

January 31, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • వేకువ పాట
  • చాణుక్యుడు ఆదిశంకరాచార్యుల ప్రభావం ఒక సింహావలోకనం
  • సనాతనమంటే?
  • సమాజానికి హానికరమైనవిగా కాక ఉపయుక్తమైన రచనలు చేయాలి- డా. జి. చెన్నకేశవరెడ్డి
  • సాహిత్యాకాశంలో నక్షత్రాక్షర తోరణం- అక్షరగీతం

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us