మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

మాటల చెట్టు

by Padmasri Chennojwala January 24, 2026
written by Padmasri Chennojwala

వృత్తి, వ్యక్తిగత జీవితాలను సమన్వయ పరచుకుంటూ ముందు కెళ్లిన కవయిత్రి సులోచన గారి భావాల్లోంచి మొలకెత్తిన గింజ నాలుగు పదులకు పైగా కొమ్మలతో మాటల చెట్టై ఎదిగింది. కొమ్మలన్నీ (శాఖలు) కొమ్మ(స్త్రీలు)లై కత్తులు దూస్తూ ఎద లోయల్లోని ఆవేదనలను వెలిబుచ్చిన కవితలు ఎక్కువగా కనిపించాయి. కూతురిగా, ఇల్లాలిగా, తల్లిగా, ఉపాధ్యాయురాలిగా తన సామర్ధ్యాన్ని నిరూపించుకున్నప్పటికీ, మనసు మూలల్లో ఎక్కడో దాగిన అసంతృప్తి కొన్నిచోట్ల కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. అంతే గాకుండా జన చేతనలు, భాషా ఉద్యమాలు, సైనిక వందనాలు వీరి అక్షరాల్లో కనిపిస్తాయి. వీరి సిరా చుక్కల్లో పిచ్చుకలు గూళ్ళు కట్టాయి, పిల్లనగ్రోవులు అలరించాయి. పుటలు తిరగేస్తే…..

నా లేత హృదయ కాన్వాస్ పై పంతులమ్మ చిత్రం గీసి రంగులద్దినది నీవే
ఎప్పటికీ నా హీరో వి నువ్వే (నాన్న – నేను)//
అంటూ తనను ఉపాధ్యాయురాలిగా తీర్చిదిద్దిన తన తండ్రే తాను మెచ్చిన కథానాయకుడని (ప్రతీ ఆడపిల్ల జీవితానికి మొట్టమొదటి హీరో ఆమె కన్నతండ్రే అని మానసిక విశ్లేషకులు తరచుగా చెప్పే మాట)చెబుతారు. ఒప్పుగ నను మలచిన ఒజ్జవు నీవమ్మా//
అంటూ అనురాగమూర్తి ఐన అమ్మకు వందనం సమర్పించుకుంటూనే
సంధ్య పొద్దున నేనేమి ఇవ్వగలన మ్మా నీకు నీ సేవలో తరించెద నమ్మా (ప్రేమ బంధం)//
అంటూ తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల పాల్జేసే వారిపై చర్నాకోల ఝుళిపించారు.
నా క్షేమం కోరి స్వేచ్ఛను హరిస్తారు (అందమైన పంజరం) //
ఆడపిల్లను అరటాకుగా కాపాడుకునే ప్రయత్నంలో కుటుంబ సభ్యుల ప్రవర్తన ఒక స్త్రీ మానసిక వేదనకు ఎంతగా కారణమవుతోందన్న విషయాన్ని కళ్ళక కట్టారు.

ఉదయాస్తమయాల నడుమ బొంగరంలా తిరిగే ఒక ఇల్లాలి అంతరంగాన్ని నాలుగు చేతుల దేవత నవ్వుల వెనుక నలిగిన ఆశలు,ఆశయాలను(ఆ నవ్వు వెనుక) అంటూ హృద్యంగా వర్ణించారు.

ప్రేమ మొలక(మిథునం)కు వలపుల పరిమళాల నలది దాంపత్య బంధాన్ని నిర్వచించిన తీరు అద్భుతం.

నీట కరిగే రూపం నుండి నీటిని నిలుపుకునే స్థాయిగా ….. జీవితమూ (పరిణామ పరిణతి)ఇంతే //
జీవన గమనంలో ఎదురయ్యే సమస్యలే మనిషిని పరిపూర్ణుడని చేస్తాయని చెబుతూనే,
నాగరిక ఉప్పెనలో కొట్టుకుపోయిన మట్టి గంధానికి సమస్త సుగంధ ద్రవ్యాల సారం(మట్టి- మనిషి)అంటూ పట్టం కట్టిన తీరు మహోన్నతం.

కుంచె నా చేతిలోనే ఉన్నది
నా చేయి పట్టుకున్నది ఎవరో
రంగులు నావే అద్దుతున్నది నేనే…..
ఒక్కటంటే ఒక్కటి నాకు తృప్తినివ్వలేదు (జీవన చిత్రం)

ఎన్ని విధాలుగా దూసుకెళ్లినా, ఎంత ఫలప్రదమైన జీవితాన్ని అనుభవించినా మనసు అట్టడుగు పొరల్లో ఘనీభవించి ఉన్న పరాధీనత సెగై స్త్రీ హృదయాన్ని ఎంతగా రగిలిస్తుందో ఆర్తి గా వ్యక్తీకరించారు.

కొరివితోనే మోక్షం అయితే (ప్రశ్నిస్తున్నన్నా)నే పట్టలేనా? పెట్టలేనా!
అంటూ సమాజంలో వేళ్ళు కొనిపోయిన లింగ వివక్షపై అస్త్రాన్ని సంధించారు.

నేలకేసి కొడితే నింగిదాకా ఎగురుతా//
అంటూ
శృతి మించిన అణచివేత తిరుగుబాటుకు పునాది అవుతుందని హెచ్చరించారు.
సమస్యల సుడిగుండంలో చిక్కి విలవిల్లాడే సాటి స్త్రీని (కత్తులు దూస్తున్న కొమ్మలు) అవసరమైతే సంఘటితమై ఛేదించి సాధించాలని చైతన్య పరుస్తున్నారు.

సగంలో వదిలిన రాగాలను శృతి చేసుకుంటూ, కరిగే మంచై, రగిలే నిప్పై, విలువలపై స్వారీ చేస్తూ విశ్వమంతా చుట్టే వజ్ర సంకల్పంతో సాహితీ లోకానికి మరిన్ని సంకలనాలను అందించాలని అభినందిస్తూ, ఆకాంక్షిస్తూ…..

January 24, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కొక్కరోకో !(WAKEUPCALL)

by Charu Sri January 24, 2026
written by Charu Sri

ఇక పెద్దమ్మ చెప్పిన దానిప్రకారం….ప్రతి పల్లెటూరు ప్రకృతితో మమేకమై.. పశుపక్షాదులను సైతం తమ జీవితాల్లో బాగం చేసుకొని జీవిస్తుంది. అందుకే రోగాలు నొప్పులు పల్లెదరి చేరవు. కాకులు, మేకలు, కోళ్ళు , కుక్కలు ఇత్యాదివి పల్లె ప్రజల జీవితాల్లో భాగం. వేకువ జామున కోడి కూతతో నిద్రలేచిన పల్లె సాయం సంధ్జ్యవేళ ఆవులు, గేదెలు ఇల్లుచేరడంతో ఆ రోజుకు సెలవిచ్చి.. నిద్రాదేవిని ఆశ్రయిస్తుంది. ఇక్కడ నేటి తరం గమనించాల్సింది ఏమిటంటే,..పెందలకడ పడుకొని, పెందలకడ లేవడం అన్నది మనిషి ఆరోగ్యానికి మొదటి సూత్రం అన్న మాట.

అసలువిశాయానికి వస్తే ….కొక్కరోకో ……అన్న కోడికూతతో పల్లె నిద్ర లేస్తుంది. అంటే…కోడి కూతతో పల్లె దినచర్య ప్రారంభమవుతుంది. 70 దశకంలో ఎక్కువగా సజ్జ, జొన్న ఆముద లాంటి పంటలే పండించేవారు. ]అయితే కొందరు రైతులు మాత్రం బావుల దగ్దర వరి సాగు చేసే వారు. కూరగాయలు పండించేవారు. అయితే ఇప్పటిలాగా రసాయనిక ఎరువులు వాడేవారు కాదు.సేంద్రియ ఎరువులే వాడేవారు. అంటే ఈ రోజు మనం గొప్పగా చెప్పుకుంటున్న ఆర్గానిక్ పంటలన్న మాట.

బావుల దగ్గర సాగుచేసే రైతన్నలు కొడికుతతో నిద్రలేచి ..ఎద్దులను తోలుకొని బావిదగ్గరకు బయలు దేరుతారు. ఒక పక్క ఎద్దుల మెడలో కట్టిన గంటలు,గజ్జెల సవ్వడి..మరో పక్క పల్లె అలికిడితో నిద్దుర లేచిన చెట్టు కొమ్మల్లోని పక్షుల కిలకిల రావాలు.. పల్లె తల్లికి వీనుల విందైన సుప్రభాత సంగీతం. అప్పట్లో ఇప్పటిలా ట్రాక్టర్లు ఉండేవికావు. అందుకే రైతులు పశువులపెంపకం వారి జీవనయాత్రలో ఓ భాగంగా ఉండేది. వ్యవసాయం లేని వారు సైతం పాడి కోసం గేదెలను పెంచుకునేవారు. అందుకే పల్లెల్లో పాడికి కొదువ ఉండేది కాదు.

రైతన్నలు బావులదగ్గరకు వెళ్లిన తర్వాత..ఇళ్ళల్లో ఆడవాళ్ళ హడావిడి మొదలవుతుంది. ఇంటి ముందు ఊడ్చి,పేడతో కళ్ళాపి చల్లి..ఏర్ర మన్నుతో అలికి..ముగ్గులు పెట్టడం..నిత్య కృత్యం..ఆ తర్వాత ఇల్లు ఊడ్చి వంటింట్లో పోయ్యిని శుభ్రం చేసి..అలికి ముగ్గులు వేసి..అంట్లు తోమడంతో ఇళ్లల్లో ఆడపడుచుల హడావిడి మొదలవుతుంది. పల్లెల్లో దాదాపు అన్ని ఉమ్మడి కుటుంబాలే. మనం ఎ ఇంటిలోకి తొంగి చూసినా ఉమ్మడి కుటుంబాల మమకారాల మకరందం, నాన్నమ్మ, తాతయ్యలతో మనుమడు, మనుమరాళ్ళ పరిహాసాలు.. ముసలివాళ్ళ చీవాట్లు .. అందులో కనుపించే ప్రేమ ఇట్టే అర్ధం అవుతుంది.

“లచ్చిమి ఇంకెంత సేపు పంతవే…..లే” అంటూ లక్ష్మి వాళ్ళ అమ్మ ..వంటింట్లోంచి..కేకేసింది.
తల్లీ పిలుపు వినగానే నుసులు కుంటు..దుప్పటిలో మళ్లీ ముడుచుకు పడుకుంది కూతురు లక్ష్మి..
“ఒసేయ్.. పోరీ అమ్మపిలుస్తోంది. లేవరాదే .”అంటూ కోడలికి వంత పాడింది లక్ష్మి నాన్నమ్మ.
“పెల్లీడుదకొచ్చిన పిల్ల ఇప్పటిదాకా పంతే గెట్లనే..ఇంటికి దరిద్రం”.అంటూ కంటిన్యూ చేసింది అప్పటికే లేచి ముంగిట్లో కూర్చొని..బొగ్గుతో పల్లు తోము కుంటున్న ముసలమ్మ. చికాకు పుట్టి దుప్పటిని పక్కన వేసి మంచంలో కూర్చుంది లక్ష్మి.

.”ముసల్డాన నీకెందుకు..ముఖం కడుగుతున్నావుగా..వెళ్లి అమ్మపోసే చాయ్ నీళ్ళు తాగి చావక..”అంటూ కసురుకుంటు మంచం దిగింది. లక్ష్మి. “చస్తా లే. చావకుండా నీ సూరు పట్టుకు వెలాడతాన ఎన్ది” అంటూ పెరట్లో గాబు దగ్గరకు వెళ్లి ముఖం కడుక్కుని వంటింట్లోకి వెళ్ళింది ముసలమ్మ.

“అత్తమ్మా..పొద్దున్నే దాని నోట్లో నోరు ఎందుకు పెడ్తవ్..దానికి నోరెక్కువ..” అత్తకు టీ అందిస్తూ అందీ కోడలు. “ఇది రోజు ఉందేదేగా..కొత్త కాదుగా” అంటూ టీ తాగింది అత్త..

“నానమ్మను అన్నది చాలు గానీ..నువ్వు ముఖం కడుక్కొని రా..వేడినీళ్లు గొంతులో పోసుకుంది” అంటూ కూతురును అరిచింది తల్లి.. తల్లి అరుపుతో ముఖం కడుక్కొని వచ్చి టీ తాగింది లక్ష్మి నాన్నమ్మ పక్కనే కూర్చొని.

“ఏంది నానమ్మ సంకలో దూరినవ్..మల్లేమి లొల్లి లేదుగా “అని ముసి ముసిగా నవ్వుతూ వంటింట్లో వంట పనిలో మునిగి పోయింది తల్లి.
తల్లి మాటల్లోని అంతరార్ధం తెలిసిన లక్ష్మి నాన్నమ్మను గట్టిగ వాటేసుకొని ముసల్ది చాలా మంచిది తెలుసా ? అంటూ తల్లిని ఉడికించింది. నాన్నమ్మను బిగ్గర వాటేసుకున్నట్లు నటిస్తూనే ముసలమ్మా బొడ్లో దోపుకున్న చేక్కుడు సంచిని లాగేసుకొని దూరంగా వెళ్ళింది లక్ష్మి.

“ఓస్ దొంగ ముండా సంకలో దూరి గారాలు పోయింది సంచి కోసమా?.. నీ సాద్యంగూలా” అంటూ కర్ర సాయంత్ఘో లేచి లక్ష్మిని పట్టుకునే ప్రయత్నం చే యబోయింది.

“ఓయ్ ముసల్దానా ఆ మూడుకాల్లేసుకొని నువ్వు లేసిరాకు.. నువ్వు పడి కాలో చెయ్యో పుటుక్కు అన్నదనుకో.. మా అయ్య అదే నీ కొడుకు నన్ను బతక నీయడే ” అని వ్యంగంగా దెప్పి మాట్లాడుతూ నానమ్మ దగ్గరకు వచ్చింది. చేక్కుడు సంచి నకన్నమ్మకు ఇచ్చింది. మళ్ళీ ఆమె పక్కన కూర్చోంది. ” ముసలీ ..మొన్న మీ తమ్ముని దగ్గరకు వెల్లొచ్చావుగా .. ఏమ్పెట్టిండే” అందీ.

“నీ ఏటకారం చాల్లే .. ఏదో వాడికి ఉన్నంతలో వాడు మర్యాద చేసిండు. అక్క చీర కొనుక్కోమని నాలుగు డబ్బులిచ్చుండు.” అంది నాన్నమ్మ.
” నిజమా నీ తమ్ముడు మంచోడేనే..నీకు ఈ వయసులో కూడా చీరా, సారే పెడుతుండు. అంటూ నాన్నమ్మ ఇగోను తట్టి లేపింది లక్ష్మి.

:”అత్తమ్మ అది కావాలనే రెచ్చగొడుతోంది. నువ్వు దానికి డబ్బుసంగతి చెప్పెసావు. నిన్ను ఇంకా అది బతుక నిస్తుందా ” అంది అప్పుడే వంటింట్లోంచి బయటకు వచ్చిన లక్ష్మి వాళ్ళ అమ్మ.

“ఓమ్మా ఏందీ నువ్వేమో సపోర్టు వస్తున్నావ్ .. మీ అన్న నిన్ను పుట్టింటికి తీసుకెళ్ళడు. నానమ్మ వాళ్ళ తమ్ముడు తీసుకెళ్ళి చీరకు డబ్బులిచ్చిండు. గొప్ప కదా. అది నాన్నమ్మ చెప్పుకోవద్దా ఏంటి. నీకు లేనీ పుట్టింటి ముచ్చట ముసల్దానికి ఉందని నీకు కడుపు మంట..”అంటూ నాన్నమ్మను గ పొగిడేసింది…వాళ్ళ అమ్మ తమ మధ్య వస్తే తన పాచిక పారాదని! అంటూ
లక్ష్మి వాళ్ళ నాన్నమ్మను వాటేసుకున్న సీన్ చూసిన లక్ష్మి తల్లికి ఓ వైపు నవ్వు వస్తున్నా ఆపుకొని ” వామ్మో నాన్నమ్మ, మనుమరాలి మద్ష్య నేనేన్డుకులే. మీరు మీరు ఏమయినా చేసుకోండి. అత్తమ్మా అది నీ దగ్గర ఉన్న డబ్బులకు పుటమేస్తుంది జాగ్రత్తా” అంటూ అక్కడి నుంచి లోనికి వెళ్ళింది.

తల్లి లోనికి వెళ్ళగానే ” ముస్లీ ముస్లీ ..సారీ నానమ్మా.. మా బంగారు నానమ్మా.. ఇంతకు మీ తమ్ముడు ఎన్ని డబ్బులు ఇచ్చిండే” అంటూ నానమ్మ ఒల్లో పడుకొని గోముగా అడిగింది…
” ఎహే ఆ డబ్బుల గురించి ఇప్పుడెందుకే. అయినా గారాలు పోతున్నవెంది కథ ” అంది నాన్నమ్మ.. ఏమిలేదు నాన్నమ్మ నాకు జడ రిబ్బన్లు ఒక జతే ఉన్నాయి. నువ్వు ఒక్క పదిరూపాయలు ఇస్తే ఇంకో జత కొనుక్కుంటా..” అంది లక్ష్మి ..

” దొంగ ముండా ..మీ అమ్మచెప్పింది నిజమే. నా డబ్బులమీద కన్నేసి.. నా దగ్గర ఒయ్యారాలు పోతున్నవన్న మాట. నాదగ్గర డబ్బులు లేవు ఏమి లేవు.. నా మీదు నుంచి లేవే ముందు” అంటూ మనుమరాలిని తన మీదినుంచి లేపి కూర్చోపెట్టింది. అలా నానమ్మ చేయడం, తిట్టడం మనుమరాలికి మామూలే. ఉమ్మడి కుటుంబాల్లో పెద్దవాళ్ళ తిట్లు ప్రేమగానే ఉంటాయి. వాళ్ళ కోపం పిల్లలకు ఓ సరదా..

” ముసల్దాన ప్రేమగా ఒల్లో పడుకుంటే లేపెసినావ్ కదా .. ఇక మీద నీతో మాట్లాడ. ” అంటూ అలిగినట్లు నటిస్తూ ఇట్లోకి వెళ్ళింది. అలా మనవరాలుచుసిన నాన్నమ్మ మనస్సు అదోలా అయింది. బెట్టు చేసినట్లు కాసేపు తాను నటించింది. కాని మనమరాలితో పోట్లాడకుండా.. మాట్లాడ కుండా ఉండలేదు ముసలమ్మ. ” ఒసేయ్ పోరి ఇక్కడకు రావే” మనవరాలిని పిలిచింది వాళ్ళ నాయనమ్మ. ” ఎందే ఇందాక గెంటేసి మల్లి పిలుస్తున్నావ్ ” అంటూ వచ్చింది లక్ష్మి.

లక్ష్మి రాగానే చేక్కుడు సంచిలోంచి పది రూపాయలు తీసి మనుమరాలికి ఇచ్చింది ముసలమ్మా. ఇదంతా వంటిన్తిలోంచి గమనిస్తున్న లక్ష్మి వాళ్ళ అమ్మ.. ” ఇద్దరు ఇద్దరే ” మనసులో అనుకోయి బయటకు అనేసింది. “అమ్మా నువ్వేమి కుల్లుకోవద్దు. నువ్వేమన్నా మా నాయనమ్మ బంగారం” అంటూ నాన్నమ్మకు ముద్దిచ్చి అక్కడ నుంచి తుర్రుమంది లక్ష్మి.

January 24, 2026 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

గళం, కలం… నాగసూరి సాహిత్య సాధనం

by Achyutuni Rajasri January 24, 2026
written by Achyutuni Rajasri
విజయవాడ రోజుల్లో 1998 ప్రాంతం

ఆకాశవాణిలో పత్రికల్లో గళం, కలంతో ప్రసిద్ధిగాంచినవారు డా. నాగసూరి వేణుగోపాల్ గారు. అరటిపండు ఒలిచి చేతిలో పెట్టినట్లు సైన్స్ విషయాలు ఆయన చెప్తుంటే యువతకి జోష్ వస్తుంది. వివిధ పేపర్లలో పుంఖానుపుంఖాలుగా ఆయన రాసిన వ్యాసాలు మనల్ని ఆలోచింపజేస్తాయి. సవ్యసాచిలా ఆకాశవాణిలో నిబద్ధతతో పని చేసి, రిటైరైనా కూడా ఉత్సాహపూరిత వ్యాసాలతో, ప్రసంగాలతోఎంతో మందికి స్ఫూర్తిదాతగా నిలుస్తున్నారు ఆయన. పాలు నీరులా కలిసిన దంపతులు హంసవర్ధిని వేణుగోపాల్ గార్లు ఒక్క నిముషం సమయం వృధా చేయకుండా కొత్త ప్రదేశాలు చూడటం, సభలకు హాజరుకావటం, సోషల్ వర్క్ తో కాలం గడపటం ముదావహం.

ఇక 2020లో వెలువడిన “వేణునాదం” ప్రతి ఒక్కరూ చదివితీరాల్సిన పుస్తకం. తన బాల్యం మొదలు అంచెలంచెలుగా ఎదిగిన విధానాన్ని ఆసక్తికరంగా వివరించారు. పాఠకుల్ని ఒక్క ఊపులో చదివించిన ఆ పుస్తకంతో మనం ఎన్నో విషయాలు తెల్సుకోవచ్చు. ఆయన జీవితం వడ్డించిన విస్తరికాదు. కార్యదీక్ష పట్టుదల ఏకాగ్రతతో ఆయన సాధించిన విజయాలు యువతకు మార్గదర్శకాలు.

1961లో రాయలసీమ లోని కొనతట్టుపల్లి అనే 40, 50ఇళ్లున్న పల్లెలో వ్యవసాయ కుటుంబంలో పుట్టారు. అమ్మ నాన్నలు శ్రీమతి గౌరమ్మ, శ్రీ సంజీవయ్యగార్లు.10మంది సంతానంలో 4 ఆడ, 6గురు మగపిల్లల్ని పెంచి పోషించిన వారిని గూర్చిఇలా రాశారు:

“నేను 8వవాడిని. అమ్మ చెప్పిన సుద్దుబుద్ధులు నాకు వెలుగు దివ్వెలు. ఇతరులు ఇచ్చింది తీసుకోరాదు, అలవోకగా చెప్పిన అమ్మ మాట శిలాశాసనం…. “
” మా నాన్న తన 10వ ఏట తన అన్నతో కల్సి కట్టుబట్టలతో వచ్చారు. కొప్పు ఉండేది నాన్నకి. నా 5వ ఏట దాన్ని తీసేశారు. ఆయన చనిపోయాక 2010నుంచి తెలుగు విశ్వవిద్యాలయం పాపులర్ సైన్స్ లో మా అమ్మ, నాన్నల పేర ప్రతి ఏటా కీర్తి పురస్కారం ఇస్తున్నాం”. నాగసూరి పుట్టపర్తిలో డిగ్రీ; ఎస్.వి. యూనివర్సిటిలో ఎం.ఎస్సీ. ఎం.ఫిల్ చేశారు. ఎం.ఎస్సీ ఫస్టియర్ లో ఫిజిక్స్ క్లాస్ బోర్ కొడ్తే కొండల్ని చూసేవాడినని కుండబద్దలు కొట్టినట్లు చెప్పటంలోనే ఆయన లోని నిష్కపటత్వం అవగతమౌతుంది. ఇలా మనసులోని మాటను, బాధలను మనం ఇతరులతో పంచుకోవటం వల్ల టెన్షన్ తగ్గుతుంది. ఇది నేటి యువత తెలుసుకోవాలి. విద్యార్ధిగా తన అనుభవాలు అధ్యాపకులప్రోత్సాహాన్ని ఇలా వివరించారు: “1971లో నేను 5వక్లాసు చదివేప్పుడు గోవిందరెడ్డి సార్ సోషల్ స్టడీస్ చెప్పేవారు. రోజూ రాజకీయాలు, దేశ ప్రపంచ విషయాలు చెప్పేవారు. అలా పుస్తకం చదివే అలవాటుకి బీజం పడి నేటికీ కొనసాగుతోంది.” ఇలా నేడు ప్రతి బడిలో టీచర్ల ప్రేరణ ఉండాలి.కానీ నేడది కరువైంది కదూ? 1975-76లో అన్నయ్య అంగడికొట్టులో పనిచేస్తూ చదువుకున్నారు. 1948-49 లో ప్రచురితమైన అట్టలూడిన ‘స్వర్ణ భారతి’ పుస్తకం ఆయన లో దాగిన రచయితను బైటకి లాగిందనే చెప్పొచ్చు. 1977-78లో తేటగీతిలో 17 పద్యాలు రాశారు. అదే సం. ‘ఆంధ్రపత్రిక’లో చిన్న కవిత ప్రచురింపబడటం ఓ మలుపు. ఇక 10 వ క్లాస్ లో బాగా ప్రభావితం చేసిన వారు శ్రీ కల్లూరు జానకి రామారావు గారు.

లేపాక్షి పురస్కారం అందజేసిన తర్వాత ముచ్చటిస్తున్న హిందూపురం ఎమ్మెల్యే, సినిమా నటుడు బాలకృష్ణ (ఎడమవైపున కన్నడ హీరో శివరాజ్ కుమార్ మధ్యన అంబికా కృష్ణ ఉన్నారు)- 2018

నెలకు 20 పైసలు పిల్లల దగ్గర వసూలు చేసి సోషల్ స్టడీస్ క్లబ్ నడిపి రకరకాల తెలుగు వారపత్రికలు, రీడర్స్ డైజెస్ట్, విజ్డమ్ మొదలైన పుస్తకాలు తెప్పించి పిల్లల చేత చదివించేవారు. ఇంటికి తీసుకెళ్లి చదువుకునే వారు. అలా వేణుగోపాల్ గారిలో సాహిత్య పిపాస రచనాసక్తి పొటమరించి రచయిత కావడానికి పునాది వేసింది.

2001-2010లో జర్నలిజంలో ఎం.ఏ., పి.హెచ్.డి చేయటంతో ఇక ఆయన కలం విజృంభించింది. అంతులేని అగాధ సముద్రం వంటి సాహిత్యంలో ఆయన కలం కదం తొక్కింది. ఆంధ్ర ప్రభ, ఆంధ్ర పత్రిక పఠనంతో పాటు నార్ల, విద్వాన్ విశ్వం, శ్రీపాద గార్లపై పుస్తకాలు రాశారు డా. నాగసూరి.

1968లో ఇంట్లో రేడియో మోగటంతో పొందిన ఆనందం అమూల్యం. ఇక ఆకాశవాణిలో ఉద్యోగం అదీ గోవాలో రావటం ఇంకో మైలురాయి. రొట్టె విరిగి నేతిలో పడింది అన్నట్లు ఆకాశవాణి ఉద్యోగంతో ఆయన కలలు సాకారమై రచయితగా, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ గా ఎందరో సాహితీమూర్తుల్ని కలుసుకొన్న భాగ్యం అబ్బింది. కలానికి బలం,గళానికి గుర్తింపు, శ్రోతల, పఠితల అభిమానంతో పాటు అవార్డులు, రివార్డులతో దేశమంతటికీ పరిచయమైనారు. గోవా, అనంతపురం, విజయవాడ, విశాఖపట్టణం, మద్రాసు, కడప తిరుపతి, హైద్రాబాద్ ఆకాశవాణి కేంద్రాలలో ఆయన వాణి బాణి, ఎందరో మహానుభావులతో పరిచయాలు మైలురాళ్లు. రోజుకి 8గంటలపైగా రేడియో ఉద్యోగం, 3 గంటలు రచనలతో కొన్నివేల వ్యాసాలు, 80పైగా పుస్తకాలు వేణుగారి అకుంఠిత దీక్ష ,పట్టుదల కి నిదర్శనం. “గౌరమ్మ నుంచి హంసమ్మ” దాకా సాగుతున్న ఆయన జీవిత ఆశయం ఏమంటే తెలుగు భాష పరివ్యాప్తికి సైన్స్ సామాన్యులకు చేరాలనేది. 1997 నుంచి 2010 దాకా ఆంధ్రభూమి దినపత్రికలో తెలుగులో రాసిన మీడియా టి.వి. ధారావాహికా వ్యాసాలు యూనివర్శిటీ విద్యార్థుల పరిశోధనలకు ఉపయోగపడ్డాయి.

ఈయనకు వచ్చిన ముఖ్య పురస్కారాలు :
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ తెలుగుభాషా పురస్కారం,
తాపీధర్మారావు,
నార్ల వెంకటేశ్వరరావు పురస్కారాలు,
అధికార భాషాసంఘం అవార్డ్,

పాపులర్ సైన్స్ వ్యాసప్రచురణకు
డా.పరుచూరి రాజారాం గౌరవం,
జమ్మి శకుంతల అవార్డు మొదలైనవి.

ఇక పదవీవిరమణ చేసిన తర్వాత
మల్లవరపు జాన్ సాహితీ పురస్కారం,
జానమద్ది సాహితీ సేవా పురస్కారం,
పుట్టంరాజు బుల్లెయ్య రామలక్ష్మమ్మల సాహితీ పురస్కారం,
కొంపల్లి బాలకృష్ణ స్మారక సాహితీ ప్రతిభా పురస్కారం వచ్చాయి.
2025 నవంబర్ లో
ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం నుంచి జ్ఞానజ్యోతి పురస్కారం రాగా,
డిసెంబర్ మూడోవారంలో రామానుజన్ స్మారక గణిత అవార్డు ప్రదానమయ్యింది.

‘గాంధీ తాత చెట్టు’ సినిమా దర్శకురాలు మల్లాది పద్మావతితో గాంధీజీ పరిశోధకులు డా. నాగసూరి

‘ముద్ర’ పేరుతో ఆంధ్రప్రభ ఆదివారం సంచికలో 2012-’13 కాలంలో తన బాల్యదశ విశేషాలతో జీవిత యాత్రను, స్వానుభవాలను ‘వేణునాదం’లా ఎదురుగా నిలబడి చెప్తున్నట్లు ఆయన కలం చేసిన విన్యాసం రచయిత ప్రతిభకు మచ్చుతునక. ఆయనకు భుజంతట్టినవారు శ్రీ కాళీపట్నం రామారావుగారు. అంతే విభిన్న విషయాలపై ఆయన కలం విన్యాసం పాఠకుల్ని అలరిస్తుంది. ఇప్పటిదాకా 80కి పైగా గ్రంథాలు వెలువరించారు. ఇంకా శతాధికం దాటాలని ఆశిస్తున్నాను.

పర్యావరణ కార్యక్రమాల రూపకల్పనలో ఆకాశవాణి తరుఫున ఆసియా పసిఫిక్ బ్రాడ్ కాస్టింగ్ సంస్థ మనిలా (ఫిలిప్పైన్స్)లో నిర్వహించిన సదస్సు- 2010లో పాల్గొనడం మరువలేని అనుభవం. వృత్తిలో సంతృప్తిపొందిన భాగ్యశాలి వేణుగారు. విజ్ఞాన శాస్త్రం ప్లస్ మానవతావాదం ఆయన మతం. ఈయన రాసిన వ్యాసాలను బడి పాఠ్యపుస్తకాలలో చేర్చితే సైన్స్ పై అవగాహన విద్యార్థులకు కలుగుతుంది. సరళమైన భాష, హాయైన శైలిలో సూటిగా, స్పష్టంగా రాసే, చదివించే నేర్పున్న రచయిత డా. వేణుగోపాల్ గారి కలం నిండు నూరేండ్లు సాహిత్య సేవ చేయాలని కోరుకుందాం.

January 24, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా, తెలుసుకోవాలన్న పత్రికలే ఆధారం- శ్రీరంగ స్వామి

by రంగరాజు పద్మజ January 9, 2026
written by రంగరాజు పద్మజ

విస్మృత కవి- పండిత- రచయితల శోధకులు యువకవుల ప్రోత్సాహకులు శ్రీరంగ స్వామి గారితో ముఖాముఖి

వరంగల్ లో కవులే లేరు, రచయితలే లేరు, కథలసలే లేవు, కథలున్నా ఉద్యమ సంబంధ కథలు తప్ప సమాజదర్పణ కథలులేవనే ఒక అపవాదు వచ్చేసరికి అది వినివనీ తాను స్వయంగా కవి, తండ్రి రామానుజస్వామి గారు కూడా శతకకవైన వీరికి ఆమాట రుచించక…ఆ అపవాదు తొలగించుకోవాలని ఊరూరా తిరిగి , మరుగున పడిన కవుల, రచయితలను వెలుగులోనికి తెచ్చిన సాహిత్యాభిమాని, ఆ సాహిత్య సేకరణలకోసం నిరంతరం శ్రమించిన సహృదయ సాహితీ శ్రామికులు శ్రీ తిరుకోవలూరు శ్రీరంగస్వామి గారు. అది చెప్పినంత తేలికైన విషయం కాదు! ఆ శ్రమేమిటో? దాని ఫలితమేమిటో తెలుసుకోవడానికి వారిని పలుకరించి, వారి మాటల్లోనే మరిన్ని విశేషాలు తెలుసుకుందాం!

పద్మజ:- నమస్కారమండి శ్రీరంగ స్వామి గారూ! మీ నేపథ్యం నిజం చెప్పండి!

టి. శ్రీరంగస్వామి:– నమస్కారం పద్మజ గారు!
నేను 16 -7 -1950 రోజున పర్లపల్లి, తిమ్మాపూర్ మండలం, కరీంనగర్ జిల్లాలో, తెలుగు పంచాంగం ప్రకారం విరోధి- శ్రావణ శుద్ధ పాడ్యమి, రోజున జన్మించాను. కానీ వరంగల్ లోనే పెరిగాను.
మా తల్లిదండ్రులు శ్రీ టీ. రామానుజ స్వామి- శ్రీమతి. తాయమ్మ .మాది దిగువ మధ్య తరగతి శ్రీ వైష్ణవ కుటుంబం.

పద్మజ :– మీ విద్యాభ్యాసము, మీ వృత్తి, ప్రవృత్తి గురించి వివరించండి!

శ్రీరంగ :– నేను ఒకటో తరగతి నుండి హెచ్ ఎస్ సి ; పి యు సి అన్నీ వరంగల్ లోనే చదివాను. తరువాత బీకాం, తర్వాత ఉద్యోగంలో చేరాను. ఉద్యోగం చేస్తూనే ఎంఏ ఎక్స్టర్నల్ రాశాను. ఆచార్య కోవెల సంపత్కుమారాచార్యుల వారి పర్యవేక్షణలో విశ్వనాథ వారి కృష్ణ కావ్యాలు అనే అంశంతో పిహెచ్డి కూడా ప్రైవేట్ గానే చేశాను.
1987 బెటాలియన్ పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగంలో చేరాను. అంతకు ముందు ప్రైవేట్ కంపెనీలో పని చేశాను. రిటైర్ అయ్యేవరకు అదే డిపార్ట్మెంట్లో ఉన్నాను. ఆఫీసు సూపరిండెంట్ గా రిటైర్ అయ్యాను. అంబేద్కర్ యూనివర్సిటీలోనూ, కాకతీయ యూనివర్సిటీలోనూ కౌన్సిలర్ గా అంటే లెక్చరర్ గా, ఆర్ ఓ ఆర్ లో పార్ట్ టైం లెక్చరర్ గా పనిచేశాను.

శ్రీరంగ స్వామితో పృచ్ఛకురాలు రంగరాజు పద్మజ

పద్మజ :– శ్రీలేఖ సాహితీ సంస్థ స్థాపించాలనే ఆలోచన ఎందుకు కలిగింది? ఎప్పుడు స్థాపించారు? దానికి ప్రేరణ ఏమిటి?

శ్రీరంగ :— నేను 1967 లో యువభారతి సభ్యుడిగా చేరాను. సికింద్రాబాద్ లో ఉన్న ఆ సంస్థలో సభ్యుడిగా చాలా ఉత్సాహంగా పాల్గొనే వాడిని. అందులో 79 లో ఉషోదయం అని ఒక కవితా సంకలనం తీశారు. ఆ సంకలనానికి రచనల సేకరణ కోసం రచయితలనెందరినో కలవడం, ఆ పుస్తకం రావడం నాకు ప్రేరణ నిచ్చింది. దాంతో హైదరాబాదు నుండి వరంగల్ వచ్చి ప్రభుత్వ ఉద్యోగంలో చేరగానే ఇక్కడ శ్రీలేఖ సాహితి సంస్థ ను స్థాపించాను. యువ కవులను ప్రోత్సహించాలని, వారి రచనలను ముద్రించాలని నా లక్ష్యం. ఎందుకంటే అప్పుడు వరంగల్లో ఒక్క మిత్ర మండలి సంస్థ తప్ప మరే సంస్థలు లేవు. సాహిత్యాన్ని ప్రోత్సహించేవారు లేక తెలుగు భాష సన్నగిల్లిందని ఆలోచనతో… దాని పరిధి పెంచాలని స్థాపించాను. కొన్ని బాలారిష్టాలు ఎదురైనాయి. విజయవాడ సాంస్కృతి సమాఖ్య శాఖ ఇక్కడికి రావడంతో…. కొంచెం కార్యక్రమాలు తక్కువైనాయి. కానీ అక్కడక్కడ సమావేశాలు నిర్వహిస్తూ, 84 నుండి పుస్తక ప్రచురణలు ప్రారంభించాము.
వరంగల్ చైతన్య సాహితికి నేను కార్యదర్శిగా (80) ఉన్నప్పుడు చైతన్య కవితా సంకలనం కూడా యువభారతి వారి వలెనే పరస్పర సహకారంతో వెలువరించాము. అది మా మొదటి పుస్తకం. దానికి వేరే వాళ్ళు కూడా కృషి చేశారు. పూర్తి అన్ని పనులు నేనే చూసుకున్నాను.
తర్వాత శ్రీలేఖ సాహితిలో ఏవో సమావేశాలు తప్ప ఎక్కువ సాహితీ సేవలు జరగలేదు. 1984లో మా నాన్నగారి శ్రీరామా వందనము అనే శతకం అచ్చు వేసాము. అప్పుడే సంస్కృత సమాఖ్య ద్వారా కొన్ని పనులు జరిగాయి. రాష్ట్రస్థాయి మహాసభలు రెండు రోజులు ఏర్పాటు చేశాము. ఇవి ప్రతి సంవత్సరము ఫిబ్రవరి నెలలో, తర్వాత రెండు నెలలకు ఒకసారి సాహిత్య సమావేశాలు ఏర్పాటు చేసాము. జిల్లా గ్రంధాలయ సంస్థలో సెక్రెటరీగారు మాకు అన్ని విధాల సహకరించే వారు. అలాగే మిత్రుడు కృష్ణారెడ్డి మయూరి ప్రింటింగ్ ప్రెస్ ద్వారా ఆయన ఆహ్వాన పత్రికలు ఉచితంగా అచ్చు వేయించి ఇచ్చేవారు. అలా కార్యక్రమాలు చక్కగా నడిచాయి. దాని తర్వాత విజయవాడ బ్రాంచ్ వారు కొన్ని కార్యక్రమాలు చేయడంతో కాస్త ఇబ్బంది ఏర్పడి , దాని నుండి వైదొలగి
వరంగల్లు సాహితీ సమితి స్థాపించాము. దానికి నమలికొండ బాలకిషన్ రావు గారు అధ్యక్షులు, నేను కార్యదర్శిని. దాదాపు మేమిద్దరిమే కృషి చేసాము. సంస్కృతి సమాఖ్య తో పాటు దాన్ని నిర్వహించాము. మేము ఏ కార్యక్రమం చేసినా యువ రచయితలకే ప్రాధాన్యం ఇచ్చే వాళ్ళం. వారి రచనలు వెలుగులోకి తీసుకురావడమే కాకుండా, వారితో ప్రసంగాలు చేయించే వాళ్ళం. వారి కవితలు సంకలనాలుగా తెచ్చాము. అందుకే వరంగల్లో రచయితలకు మా సంస్థ అండగా ఉంటుందని పేరు వచ్చింది. ఈ సంస్థలను నడిపించడానికి ఎన్నో ఆటంకాలు ఏర్పడ్డాయి. కానీ అన్నిటిని ఎదుర్కొన్నాము! తర్వాత సాహితీ సమితి, శ్రీలేఖ రెండింటిద్వారా కార్యక్రమాలను చేస్తూనే ఉన్నాము. దాని ద్వారా ఆరు పుస్తకాలను వెలువరించాము. శ్రీలేఖ ద్వారా కూడా ఎన్నో పుస్తకాలు వెలువరించాము. నేను ఎం.ఏలో చేరడంతో కొంతకాలం సంస్థలలో సమయం కేటాయించలేక పోయాను. సాహితీ సమితి కార్యక్రమాలు కొద్దిగా తగ్గాయి. దాంతో ఆ సంస్థ మూత పడింది. తర్వాత యువరచయితల కోసం ఏ కార్యక్రమాలనైనా శ్రీలేఖ సాహితీ సంస్థ నుండే జరుగుతున్నాయి.
ప్రభవ, విభవ, ఇలా తెలుగు సంవత్సరాల పేరుతో కవితా సంకల నాలు ప్రారంభించాము. 79లో ఉషోదయం అనే కవితా సంకలనం వేసాము.
అలా 29 సంకలనాలు వేసాము.
2002లో శ్రీలేఖ సాహితీ సమితి రజితోత్సవాల సందర్భంగా పరస్పర సహకారంతో కథా సంకలనాలు వేయడం ప్రారంభించాము. లబ్ధ ప్రతిష్టుల రచనల కన్నా యువకులకే ప్రాధాన్యత నిస్తూ ఎనిమిది సంకలనాలు వేశాము. అలా 10 వ్యాస సంకలనాలు వేశాము. అలా 150 పుస్తకాలు ఈ సంస్థ ద్వారా అచ్చు వేయించాము.
శ్రీలేఖ సాహితీ సంస్థ ద్వారా అనేక సాహితీ సదస్సులు నిర్వహించాము. పోతన భాగవతముపై ఉపన్యాసాలు నిర్వహించి, వాటిని పుస్తకం గా కూడా వెలువరించాము.
ప్రాచీన వాఙ్మయంలో ప్రవేశం ఉన్న వారి చేతనే వ్యాసాలు రాయించి, దాంతో పాటు కొంతమంది మా కార్యవర్గ సభ్యులను, యువతను కూడా ప్రోత్సహించి వారి చేత రాయించి అలా పది సంకలనాలు వేశాము.
రామాయణం మీద రెండు, భాగవత వ్యాసాలు రెండు, మధుర భక్తి అన్నమయ్య మీద రాయించాము. ప్రతి విశ్వవిద్యాలయంలో వాటికి గుర్తింపు వచ్చాయి. శ్రీలేఖ సంస్థ నుండి పరిణితి చెందిన వ్యాస సంకలనాలు వస్తాయని పేరు వచ్చింది. తరువాత ఆ వ్యాసకర్తలు దాదాపు యూనివర్సిటీలో పని చేసిన వారు, కొంతమంది పండితులే! వారికి అంశాన్ని ఇచ్చి రాయించాము.
వంశిమోహనమ్(శ్రీకృష్ణ సర్వస్వం), నేను కృష్ణుని మీద 50 కోణాల్లో రాయించాలని అనుకున్నాము. మొదలు పెట్టాము కాని 30 మాత్రమే వచ్చాయి. అప్పటికే చాలా ఆలస్యమైంది. 35 కోణాల్లో కృష్ణుని వివరించగలిగాము.
మాకు తోచిన సాహితీ కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాము. వరంగల్ జిల్లా రచయితల మీదనే ప్రధానంగా దృష్టి పెట్టి, వరంగల్ సాహిత్యం మీద ఆరు పుస్తకాలు వెలువరించాము.
1- వరంగల్ జిల్లా రచయితల వాఙ్మయ సూచిక;
2- వరంగల్ సాహితీ తరంగాలు;
3- వరంగల్ సాహితీమూర్తులు ;
4- ఏకశిలా వైతాళికులు

అడపా దడపా మనకు ముద్రించడానికి వచ్చిన పుస్తకాల్లో వరంగల్ సాహిత్యాన్ని ప్రతిబింబించే వ్యాసాలు ముద్రించాము. అంతేకాదు వారి రచనలను సాహిత్య అకాడమీకి సిఫారసు చేసాము.

మిత్రులను ప్రోత్సహించి వారి పుస్తకాలను కూడా మన సంస్థ ద్వారా వెలువరించాము. వాళ్ళ పుస్తకాలకు ముందు మాటలు రాయడమే కానీ సంస్థ తరఫున ద్రవ్య రూపకంగా సహాయం చేయలేదు. వాళ్లే ముద్రించుకున్నారు. శ్రీలేఖ సాహితి బ్యానర్ మీద ముద్రించుకున్నారు. భద్రాచలం దగ్గర సత్యనారాయణపురం నుండి ఒక తను, గుంటూరు రచయిత , ఒంగోలు రచయిత, ఇలా ఎన్నో ప్రాంతాలనుండి వాళ్ళు శ్రీలేఖ సాహితీ సంస్థ మీది అభిమానంతో వేసుకున్నారు.
కథా సంకలనం వేసినప్పుడు ఒక తండ్రి తన కొడుకు రాసిన కథను ఎలాగైనా ప్రచురించాలని సంకలనంలో వేసి వాడిని ప్రోత్సహించమని అడిగితే ఆ కథను ఎడిటింగ్ చేసి ఆ సంకలనంలో చేర్చాము. అలాగే ఖమ్మంలో మారుమూలన ఉన్న ఒక కిరాణా కొట్టు నడుపుకునే అతను నా కథను మీ సంకలనంలో వేయండి అని అడిగితే దాన్ని కూడా సవరించి వేశాను. ఇలా రచయితలను ప్రోత్సహించే దిశగానే మా కృషి సాగింది.

ప్రతి ఉగాదికి శ్రీలేఖ సాహితీ సంస్థ నుండి తప్పకుండా కవితా సంకలనం వస్తుందని అందరికీ తెలుసు! తర్వాత కార్యవర్గ సభ్యుల కోసమే ప్రత్యేక సంకలనాలు వేశాము. తర్వాత ఒక అంశమిచ్చి కవితలు రాయించి, ముద్రించాము. అలాగే కరుణ రసం మీద ఒక కథా సంకలనం తీసాము. వరంగల్ జిల్లా కథా సర్వస్వం అని 108 కథలు వేసాము. అది 800 పేజీలయ్యేసరికి 1,70,000 రూపాయలు అయింది. అమ్మవారి అనుగ్రహంతో అది కూడా వెలువడింది. ఇంకా 70 మంది కథకుల కథలు ఆ కాలంలో చేర్చాల్సి ఉండే! కానీ సమయానికి వారు పంపించకపోయేసరికి అందులో ముద్రించలేదు. దీంతో వరంగల్లో 200 మంది కథారచయితలు ఉన్నారని తేలింది. 70 మంది కథారచయితలు వారి కథలు పంపకున్నా వారి పేర్లు ఒక జాబితా తయారు చేసి, ముద్రించాముఅదే సంకలనంలో… గ్రంథాలయ వారోత్సవాలలో రెండు మూడు రోజులు మా సంస్థ తరఫున కార్యక్రమాలు చేసాము. ఇందిరా గాంధీ పుట్టిన రోజును పురస్కరించుకొని స్త్రీల కోసం ప్రత్యేక కార్యక్రమం చేసేవాళ్లం. కవయిత్రులతో కవి సమ్మేళనాలు నిర్వహించాము. ఒక సంవత్సరం ఏం చేసామంటే కాకతీయ భారతి శీర్షికన వరంగల్ ప్రాంత యువ కవులతో కవితలు రాయించి ఒక పుస్తకం వేసాము. అందులో కవితలు అందని కవయిత్రుల పేర్లు కూడా నమోదు చేశాము. ఎందుకంటే వరంగల్ కవయిత్రులను నమోదు చేయాలనే ఉద్దేశంతో… కాకతీయ భారతీ అనే పేరు అందుకే పెట్టాము.
రెండు రోజుల సభలు లేదా వార్షికోత్సవాలు చేసినప్పుడు కథల కోసం ప్రత్యేక సమావేశం నిర్వహించాము. కవితల కోసం మరొక ప్రత్యేక సమావేశం నిర్వహించాము. సాహిత్య సమావేశాలు ప్రత్యేకం…. ఇలా నాలుగు సెషన్లుగా నిర్వహించాము.
అష్టావధాన సప్తాహాలు 1996లో ఒకటి 2002లో ఒకటి నిర్వహించాము. రోజుకో అష్టావధాన సభను ఏర్పాటు చేశాము.
2006లో రాష్ట్రస్థాయి కవి సమ్మేళనం ఏర్పాటు చేసాం (శతాధిక కవి సమ్మేళనం) అందులో 130 మంది కవులు పాల్గొన్నారు. ఉదయం ఎనిమిది గంటలకు కవి సమ్మేళనం ప్రారంభిస్తే రాత్రి 9 గంటల వరకు సమావేశాలు సాగినాయి. ఈ సభల్లో ఇతర కవుల పుస్తకాల ఆవిష్కరణలు కూడా జరిగాయి. ఈ కార్యక్రమాలు చేస్తూనే ఏ సమావేశానికా సమావేశానికి వేదిక మీద వక్తలను ఆహ్వానించి చేసాముశతప్ప ప్రతీ సభకూ నేనే అధ్యక్షుడిగా ఉండాలని ఏనాడు అనుకోలేదు!
మాకు తోచినంత సాహితీ సేవ చేస్తున్నాము. 2008 తర్వాత కవితా సంకలనాలు, కథా సంకలనాలు ఆపాము. ఎందుకంటే నేను పదవి నుండి విరమణ పొందాను! ఇక ఆర్థిక భారం మోయలేనని విరమించుకున్నాను. అంతేకాదు సంకలనం కోసం ఎక్కువ శ్రమ పడాల్సి వచ్చింది. కానీ వ్యాస సంకలనాలు మాత్రం చాలానే పాఠకులకు అందించాము.
వరంగల్ కవులను ఇతర ప్రాంతాలకు ఆహ్వానిస్తే వారిని అక్కడికి తీసుకొని వెళ్లడం, వారికి అవకాశాలు కూడా ఇచ్చాము.
సంపత్ కుమార్ గారు మరణించినప్పుడు ఒక ప్రత్యేక సంచిక కనుమరుగైన చంద్ర శిఖరము అనే పేరుతో వెలువరించాము. వారి 13వ రోజు కార్యక్రమంలో కవులకు అందించాము.
తర్వాత ఆశావాద ప్రకాశరావు గారికి పద్మభూషణ అవార్డు వచ్చిన సందర్భంగా పద్మభూషణుడు ఆశావాది ప్రకాశరావు అనే చిన్న బుక్లెట్ వేసాము. ఇలా ఆయా సందర్భాలను బట్టి ప్రత్యేక పుస్తకాలు కూడా వెలువరించాము. ఇలా మా వంతు సాహితీ సేవలు చేస్తున్నాము.
నేను పీహెచ్డీ చేసినప్పుడు నాకు పద్యం రాయడం రాదు! కనుక విశ్వనాథ సత్యనారాయణ గారి సాహిత్యం మీద పరిశోధన చేస్తే పద్యం రాయడం రాదు అంటే ఎలా? అని ఆయన సాహిత్యాన్ని ఎలా అర్థం చేసుకున్నారని ప్రశ్న వస్తుంది కదా! అందుకే కొంత కృషి చేశాను .
నా దృష్టి ఎంతసేపు వరంగల్ కవుల; రచయితల సాహిత్యాన్ని వెలుగులోనికి తీసుకురావాలన్న తపనే ఎక్కువగా ఉండేది. అందుకే వరంగల్ పత్రికల మీద చాలా కృషి చేశాను. గ్రంథాలయ ఉద్యమాల మీద కృషి చేశాను. వరంగల్ లో పరిశోధన చేసి పట్టా పుచ్చుకోవాలంటే మాత్రం శ్రీలేఖ సాహితీ సంస్థ పుస్తకాలే ఆధారమవుతాయి.
ఈ కథా సంకలనాలలోని కథలను తీసుకుంటే 80 దశకంలో వరంగల్లో కవులే లేరు రచయితలే లేరు కథలే లేవు అన్న ఒక అపవాదు తొలగించుకోవాలని మూల మూలల తిరిగి వారి రచన ప్రతిభను గుర్తించి 400 మంది కవులను, రచయితలను పరిచయం చేశాను.( ప్రతాపరుద్రుని కాలం నుండి సమకాలీన రచయితల వరకు) అది పెద్ద శ్రమతో కూడిన పని! ఎడిట్ చేయడము మిగతా పనులన్నీ నేనే చేసేవాడిని. ప్రసారిక పత్రిక వెనుక నా కృషి ఎందరో గుర్తించారు ఆ పత్రికను మేము నడిపినప్పుడు అందులో వచ్చిన వ్యాసాలు పరిశోధక విద్యార్థులకు గుర్తింపును తెచ్చి పెట్టింది ఆ స్థాయికి పత్రికను నడిపాము.

పద్మజ:– మీరు రచనల వివరాలు మరియు మీ శ్రీలేఖ సాహితీ సంస్థ నుండి వెలువడిన పుస్తకాల వివరాలు తెలుపుతారా?

శ్రీరంగ :– 1-మధుర; 2- శిఖరం ; 3-మానస సంచరరే ; 4- నిరంతరం ; 5- సరేయోవా నుండి ఏకశిలకు (అనుసృజన) (బోస్నియా హెర్జగోవినా దేశంలోని సరేయోవా కవయిత్రి అజాసా జహీరోవిచ్ ఆంగ్ల కవితల అనుసృజన) 6- నీల మోహనాష్టకము; (వచన పద్యాలు) వచన ప్రక్రియలో తొలి అష్టకము, ఎనిమిది పంక్తులతో ఒకటి; ఎనిమిది పద్యాలు; ప్రస్తావన; ఉపసంహరము;( నాలుగేసి పంక్తులలో); 7-సమజ్ఞ; 8-డిసెంబర్ 11- పరిశోధన.

ఇక శ్రీలేఖ సంస్థ నుండి వచ్చిన రచనలు:–
1- వరంగల్ జిల్లా రచయితల వాఙ్మయ జీవిత సూచిక.
2- కోవెల సుప్రసన్నాచార్యుల వాఙ్మయ జీవిత సూచిక.
3- దేవులపల్లి రామానుజరావు ఒక రేఖ చిత్రం.
4- విశ్వనాథ వారి కృష్ణ కావ్యాలు.
5- వరంగల్ జిల్లా కథా సర్వస్వం.
6- మన కాంతిపుంజాలు (స్ఫూర్తి మూర్తుల జీవన రేఖలు)
వ్యాస -సంపుటాలు:-
1- విపంచి.
2- సాహితీ గవాక్షం
3- శ్రీ వ్యాసం.
4-సమూ.
5- మంచి మాట.
6- విశ్వనాథ రామకృష్ణ.
7- పొనుక.
8-విష్ణుపాద
9- పలుకు జెలి.
10- కావ్యాలోకనం (విహారి శ్రీపద చిత్ర రామాయణం.)
11- వెలుగుల గుత్తి.

కథా సంపుటాలు;—
1-సజీవ చిత్రాలు.
2- షుగర్లెస్ కాఫీ.
3- మా కిట్టమ్మ పెద్దాయి.

సుమారు 80 పుస్తకాలకు ముందుమాటలు;
సంపాదకత్వాలు-

వ్యాస సంకలనాలు:– 1-
1. నెమలికొండ బాలకిషన్ రావు కవితా దర్పణం;
2- ఏకశిలా వైతాళికులు;
3- కాలం వెంట నడిచి వస్తున్న…( న బారా
అభినందన సంచిక)
4- వరంగల్లు సాహితీ మూర్తులు;
5- తెలంగాణ సాహిత్య రూపాలు;
6- నిగమాంత సార సంగ్రహము (తాళపత్ర
గ్రంథము) పరిష్కరణ;
7- భాగవత దర్శనము ( జాతీయ సదస్సు
ప్రసంగాల సంకలనం)
8- అన్నమయ్య పద వైభవం ( జాతీయ సదస్సు (ప్రసంగాల సంకలనం.)
9- స్వయంభావకుడు ( పల్లేరు వీరాస్వామి అభినందన సంచిక )
10- రామాయణ వైభవం ;
11- సాహిత్యంలో మధురభక్తి;
12- వంశిమోహనమ్ శ్రీకృష్ణ సర్వస్వం
ఫిబ్రవరి వరకు శ్రీలేఖ సంస్థ నుండి150 పుస్తకాలు వెలువడ్డాయి.

పద్మజ :- మీ రచనల మీద ఎవరైనా పరిశోధనలు చేశారా?

శ్రీరంగ :— 2017లో మధురై యూనివర్సిటీలో మాధవి అనే విద్యార్థిని నా సాహిత్యం మీద ఎంఫిల్ చేసింది.
శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ఒక పీహెచ్డీ సిద్ధాంత గ్రంథం వచ్చింది. కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలోనే శ్రీలేఖ సాహితీ ముద్రించిన కథా సంకలనాల మీద పిహెచ్డి సిద్ధాంత గ్రంథం వెలువడింది. ఇవే కాకుండా ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థి సురేష్ నా జీవితం– సాహిత్యం మీద శ్రీ నిత్యానందరావుగారి దగ్గర పరిశోధన చేస్తున్నాడు.
శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయంలో విజయలక్ష్మి అనే అమ్మాయి కథా సంకలనాల మీద పీహెచ్డీ చేసింది. తిరుపతి యూనివర్సిటీలో, నాగార్జున యూనివర్సిటీలో కొందరు విద్యార్థులు ఉన్నారు. అంతే కాదు నేను పరిశోధన చేస్తానని ముందుకు వచ్చిన కొంతమంది విద్యార్థులకు నేను వారి అంశం కోసం ఎంతో చేయూతనిచ్చాను. కామారెడ్డి నుండి ఒక అమ్మాయి వరంగల్ సాహిత్య పత్రికల సేవ అనే అంశం మీద పరిశోధన చేయాలనుకుని నా సలహా సంప్రదింపులను కోరింది దానికి వరంగల్ జిల్లా పత్రికారంగం అని నేను రాసిన వ్యాసం ఆమెకు చాలా ఉపయోగపడింది, అప్పటి పత్రికల గురించి నేను చెప్పితే ఆమె మరికొన్ని పత్రికల గురించి తెలుసుకొని వంద పత్రికల మీద పరిశోధన గ్రంథం రాసి, డాక్టరేట్ పట్టా పుచ్చుకుంది.
శతక సాహిత్యం మీద పరిశోధనా పత్రం కోసం ఒక విద్యార్థి వస్తే 400 శతకాలను నేను ఇచ్చాను. ఆయన 100 శతకాలతో వరంగల్ శతక సాహిత్యం మీద పరిశోధన చేశాడు. పరిశోధన కొరకు ఒక విద్యార్థి వస్తే ఆయన కోసం తగిన సహకారం అందించాను.
1980లో బాలకిషన్ రావు నేను కలిసి ప్రసారిక అనే ఒక పత్రికను స్థాపించాలనుకున్నాము. నేను పోలీసు శాఖలో ఉద్యోగం చేస్తున్నాను కనుక ప్రభుత్వ ఉద్యోగులు ఎటువంటి ఇతర పనులు చేయొద్దని ఒక నిబంధన ఉండేది. అందుకే బాలకిషన్ రావును సంపాదకుడిగా నియమించి, పత్రికను ప్రారంభించాను. పని అంతా అతనే చూసుకునే వాడు. నేను గౌరవ సంపాదకుడిగా ఉండి పత్రికను ఎడిట్ చేయడం, మిగతా పనులన్నీ నేను చేసేవాడిని. అలా 40 సంవత్సరాల పాటు నడిపించాము. ప్రసారిక పత్రిక వెనుక నా కృషి ఎందరో గుర్తించారు. ఆ పత్రికలో వచ్చిన వ్యాసాలు పరిశోధక విద్యార్థులకు గుర్తింపును తెచ్చి పెట్టింది. ఆ స్థాయికి పత్రికను నడిపాము.

పద్మజ :— పత్రికల మీద మీ అభిప్రాయం ఏమిటి?

శ్రీరంగ:— పత్రికలు లేనిది రచయితలు; కవులు; ఇతర కళాకారులు ఉండరు. వారి గుర్తింపును పత్రికల ద్వారానే తెచ్చుకుంటారు. పత్రికల ద్వారా అనేక విషయాలను తెలుసుకోవచ్చును. సామాన్య పాఠకులకు కూడా ఎన్నో విషయాలు తెలుస్తాయి. అటు రచయితకు వెన్నుదన్నుగా ఉంటూనే, ఇటు పాఠకులను విజ్ఞానవంతులుగా చేస్తాయి పత్రికలు. ఒకవేళ మన రచనలు వేయకున్నా ఆ యా పత్రికలు మనకు శత్రువులు కారు!
వార్తయందు జగము వర్ధిల్లుచున్నది అని పంచమ వేదం చెప్పినట్టు పత్రికల వల్ల దేశకాల పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు, సాహిత్య పత్రికలతో ఎంతో లాభపడేవారు ఉన్నారు. ఏవైనా కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా, తెలుసుకోవాలన్న పత్రికలే మనకు ఆధారం.
శ్రీమతి కొండపల్లి నీహారిణి ఎంతో శ్రమ పడుతున్నది. పత్రికల ద్వారా ఎందరినో పరిచయం చేస్తున్నది. వారి మాటల్లో ఎన్నో విషయాలు పాఠకులకు తెలుస్తున్నాయి. ఈ విషయంలో ఆమెను ఎంత అభినందించినా తక్కువే!
పత్రిక స్థాయిని బట్టి అందులోని అంశాలను నవీకరించాలి! కొన్ని పత్రికలు కేవలం వ్యాపారాత్మకంగానే నడుస్తాయి. కొన్ని వార్తలకే ప్రాధాన్యతనిస్తాయి. కొన్ని సాహిత్యానికి ప్రాధాన్యత నిస్తాయి.
ఉదా॥ ఈనాడు పత్రిక ఒక శాతం సాహితి పాఠకుల కోసం ఎందుకు శ్రమించాలని సాహిత్య అంశాలను ప్రచురించదు. తెలుగు వెలుగు అనే ప్రత్యేకంగా సాహిత్యనికే కేటాయించారు. వేరే పత్రికలలో ప్రతి ఆదివారం ఒక ప్రత్యేక పేజీ కేటాయిస్తాయి. అది వారి వారి అభిరుచిని బట్టి నడుపుతారు. ప్రస్తుతం సాహిత్య పత్రికలకు కొరతైతే ఉంది. పత్రికలు ఉండడం వల్ల కవుల ఉనికి భద్రంగా ఉంటుంది. ఇప్పుడైతే అనేక మాధ్యమాలున్నాయి. కానీ ఒకప్పుడు కేవలం పత్రికలే ఆధారం కదా? ఐనా ఎన్ని ఎలక్ట్రానిక్ మాధ్యమాలున్నా సాహితీ పంపిణీ జరుగుతుందేమో కానీ పత్రిక పట్టుకుని చదివిన సంతృప్తి కలగదు!

పద్మజగా నాలో నేను … వరంగల్లు సాహిత్య- జీవితంలో నిలిచిన టి. శ్రీరంగ స్వామి గారు ఎన్నో ఒడిదొడుకుల నెదుర్కొని, అక్షరాన్ని బతికించుకోవలే తపనతో బహుముఖీన సాహితీసేవలందిస్తున్న సాహిత్యాభిమానుల సేవలు ఎనలేనివి.
తెలంగాణ సాహితీ ప్రక్రియలు వసివాడి పోకూడదనే సదుద్ద్యేశ్యంతో సమాజంలో మరుగున పడిన మాణిక్యాల వెలుగులు మరోసారి విరజిమ్మచేసారు. లేకపోతే తాళ పత్రగ్రంథాలన్నీ ఎక్కడో పాతాళానికి పడిపోయాయి… వాటిని పైకి తెచ్చిన ఘనత?దక్కించుకున్నారు.
ఎప్పుడైనా సాహిత్య చింతన ఉన్నవారు తనకోసం-సమాజం కోసం ఆలోచిస్తారు కదా? దానికోసం పాటుపడిన శ్రీరంగస్వామి అభినందనీయులు…
మయూఖ ద్వైమాసిక పత్రిక ద్వారా వారిని పరిచయం చేయడం నా భాగ్యంగా భావిస్తూ…
అలుపెరుగని సాహితీ కృషీవలుడు మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలనీ, మరింత మంది యువకవులను రాణింపులోనికి తెస్తూ సారస్వత పూజ చేయాలని మనసారా ఆకాంక్షిస్తూ …
పరిపృచ్ఛ చేసే అవకాశం కల్పించిన మయూఖ సంపాదకురాలైన శ్రీమతి కొండపల్లి నీహారిణి గారికి మనఃపూర్వకమైన ధన్యవాదములతో…

January 9, 2026 2 comments
0 FacebookTwitterPinterestEmail
Uncategorized

నవంబర్ మయూఖ విషయసూచిక

by mayuukha November 30, 2025
written by mayuukha

1. భూతం ముత్యాలు గారి ఇంటర్వ్యూ- by వేముల ఎల్లయ్య

2. జ్ఞానగుళిక -1 పలకల నుంచి పలుకుల వైపు    By నరేశ్ చారి

3. జ్ఞానగుళిక -2 ఏకధార                       by నరేశ్ చారి

4. అనువాద సాహిత్యం –             ఒక బంగారు చేపకథ       by ఒద్దిరాజు మురళీధర రావు

5. ఇక్కడ లేనప్పుడు కవిత                                by తండ హరీష్

6. సిద్ధార్థుని కథ….                                             by డా. అరుణ పరంధాములు

7. ఆటవెలది పద్యం –                                          by మాధవి శ్రీనివాసరావు నెల్లుట్ల

8. కార్తీక పౌర్ణమి విశిష్టత –                                   by మాధవి శ్రీనివాసరావు నెల్లుట్ల

9. The cruise – ఓ దృశ్యప్రయాణం                       by ఇంద్రాణి నెల్లుట్ల

10. అధునాతన సనాతన సింగాణం… భేరి సునీతా రామ్మోహన్ రెడ్డి గారి ఇంటర్వ్యూ by రంగరాజు పద్మజ

11. డా. లింగం నేని మహేష్ కుమార్ డాన్సర్       – అచ్యుతుని రాజ్యశ్రీ

12.  సూక్ష్మ నిర్మాణాల యువ కళాకారుడు         షేక్ హజి

13. వందేమాతర చరిత్ర                                       by రూప

14. గాయని సుశీలమ్మకు జన్మదిన శుభాకాంక్షలు           by రూప

15. కాటుక కంటినీరు                                          by విజయ కందాళ

16. రెబ్బాప్రగడ రామబ్రహ్మం గారి భక్తిపాటలు       by అచ్యుతుని రాజశ్రీ

18. ప్రమాదం అంచుల్లో సంపాదకీయం

19. జీవన మాధుర్యం – ధారావాహికం – లక్ష్మమదన్
20. కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు- నరేందర్ నందినేని
21. వ్యక్తిత్వానికి దోహదపడే వ్యాసాలు రావాలి – డాక్టర్ చిమ్మపూడి శ్రీరామమూర్తితో ముఖాముఖిలో 22. పడమటి కొండమీది రవి – ప్రగాఢ భావ కవి – రమేశ్ నల్గొండ
23. అస్తమించని ఓ ఊరిదుఃఖం ‘మెమొరీస్ ఆఫ్ మంగలిపల్లె’ – పుస్తక సమీక్ష – ఎన్. లహరి
24. గాయపడిన గుండెకు కవితా ఉపశమనం – పుస్తక సమీక్ష – ఎన్ లహరి
25. చాయి గిన్నె కష్టాలు – కథ- లక్ష్మీమదన్
26. తెలుగు జాతీయాల సొగసు – చంద్రకళ దీకొండ
27. భార్యభర్తల బంధం – కవిత – డాక్టర్ అరుణ పరంధాములు
28. నామమహిమ – తాతా కామేశ్వరి

ఇంకా మరికొన్ని

November 30, 2025 71 comments
1 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

తెలంగాణా నారీశక్తిని తెలిపే తెలంగాణా వైభవం

by Namani Sujanadevi November 30, 2025
written by Namani Sujanadevi

‘దగా పడ్డ తెలంగాణ దిగ్గున లేచిందిరో! భగ్గున మండిందిరో’ అంటూ ఉరిమే మేఘమై, ఉరికే ఉప్పెనై, ఊరూ వాడా ఏకమై సాధించుకున్న తెలంగాణలో, ‘సాహిత్యానికి’ ఉన్న పాత్ర చాలా విశిష్టమైనది. అంతకుముందు వరకు తెలంగాణ భాషను, యాసను కేవలం విలనిజానికి, ఒకరకంగా అవమానించే రకంగా మాట్లాడే పద్ధతికి మాత్రమే ఎన్నుకున్న తరుణంలో జరిగిన , ‘తెలంగాణ ఆవిర్భావం’ తెలంగాణ భాష, యాస మాధుర్యాన్ని అందరికీ చవిచూపించింది. దానితోనే తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు వచ్చింది. ముప్పయి మూడు జిల్ల్లాల్లో విస్తరించిన తెలంగాణ వైభవాన్ని, నలభై నాలుగు మంది తెలంగాణా మహిళా మణుల గళం నుండి కలం ద్వారా వెలువడి, తెలంగాణ నారీశక్తికి ప్రతీకగా నిలబడిన వ్యాస సంకలనమే తెలంగాణా ప్రాభవాన్ని తెలిపే ఈ ‘తెలంగాణ వైభవం- మహిళా చైతన్యం’ గ్రంథమని చెప్పవచ్చు. తెలంగాణ వైభవం- మహిళా చైతన్యంపై వచ్చిన తొలి గ్రంథం కూడా బహుశా ఇదే అయి ఉండవచ్చును.
ఈ గ్రంథ సంకలన సారథి, కృతి స్వీకర్త తెలంగాణ సాహితీ ప్రపంచంలో పరిచయం లేని ప్రముఖ సాహితీవేత్త, విద్యా వేత్త, రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ బండ సరోజన గారు.

‘జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీగరీయాసి’ అని జన్మభూమిని మర్చిపోకుండా తెలంగాణలోని చెట్టును, పుట్టను, గట్టును గుర్తు చేసుకుంటూ ఈ తెలంగాణ మట్టిలో పుట్టి పెరిగి, ఈ వాసనలన్నీ ఒళ్లంతా పులుముకున్న మనసున్న మహిళామణి నిరడంబరురాలైన డాక్టర్ బండ సరోజన గారు.
సరోజన గారి కృషి ఫలితంగా వారి ఆకాంక్ష మేరకు, బలమైన నారీశక్తి అయినటువంటి రాజీవ (లక్ష్మీ వాసన్ ) చంటి ప్రసన్న కేంద్ర వ్యవస్థాపకురాలు, ప్రధాన సంపాదకురాలిగా, డాక్టర్ శారద హనుమాన్లుగారు సహా సంపాదకురాలిగా, తెలంగాణా ప్రతీకలైన కాకతీయుల తోరణాన్ని, చారిత్రిక కట్టడాలను, చార్ మినార్ లను ముఖచిత్రంగా వేసుకుని అందంగా ముస్తాబై వచ్చిందే ఈ వ్యాస సంకలనం.
ఇక్కడ మనం ఎన్నో ఏళ్లుగా మహిళలకు చేయూత నిస్తున్న చంటి ప్రసన్న కేంద్రం గురించి, అరవైలో కూడా ఇరవైలా, ఆరోగ్యం సహకరించకున్నా చైతన్యంతో ‘నారీశక్తి’ ని వెలికి తీస్తున్న రాజీవ (లక్ష్మీ వాసన్) గారి గురించి నాలుగు మాటలు తెలుసుకోకపోతే ఈ వ్యాస సంకలన సమీక్షకి సంపూర్ణత చేకూరదు అంటే అతిశయోక్తి కాదు. విషయం తెలిస్తే మీరు ( పాఠకులు) కూడా తప్పక నాతొ ఏకీభవిస్తారు అనడంలో సందేహం లేదు.
చంటి ప్రసన్న కేంద్రం తెలంగాణ, మేడ్చల్(రిజిస్టర్డ్) 1993 నుండి మహిళల రక్షణ స్వయం ఉపాధి వృత్తులలో ఉచిత శిక్షణ నిచ్చి స్వయం ఉపాథి కల్పనకు తోడ్పడింది. నేర్చుకున్న వారు ఈ ఉత్పత్తులతో జాతీయ, అంతర్జాతీయ ప్రదర్శనలలో పాల్గొని పేరు తెచ్చుకున్నారు. కానీ 2022 నుండి వసతి, ఆర్ధిక సహాయం, సదుపాయం లేక ప్రస్తుతం సాహితీ జాగృతి, బాలికల విద్యకే పరిమితమైంది.

బండ సరోజన గారి కుమార్తె, కడారి అపర్ణగారి పలుకులతో ప్రారంభమైన ఈ వ్యాస సంకలనం, డాక్టర్ బండ సరోజన గారి అద్భుతమైన వాక్కులతో మొదలై, శక్తికి మించి శ్రమిస్తూ ఉత్సాహపరిస్తూ, ప్రోత్సహిస్తూ దీనికి రూపం తెచ్చిన రాజీవ, ప్రముఖ రచయిత్రి డాక్టర్ శారద హనుమాన్ల గార్ల మాటలతో ముందుకు సాగింది.

ఇది అద్భుతమైన గ్రంథంగా రూపుదిద్దుకోవడం కోసం నేపథ్యంలో కృషి చేసిన వారిలో చాలా ముఖ్యులు డాక్టర్ వంగరి త్రివేణి గారు సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్, రజనీవాసన్ గారు, కడారి అపర్ణ గారు, మేక రవీంద్ర గారు, బోడ నరేన్ గారు. ఇలా చరిత్రలో నిలిచి పోయే గ్రంథంగా రూపుదాల్చడానికి పనిచేసిన ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు.

తెలంగాణలోని ‘కుడుమంటే పండుగనే’ అమాయక మాయని మమతలను, మట్టి వాసనలను, ఆచారాల్ని ,సంప్రదాయాలని, సంస్కృతిని, మహిళలకు ఇష్టమైన పసుపు కుంకుమలుగా ఒళ్లంతా పూసుకున్నట్లు తెలంగాణ చరిత్ర అంతటినీ ఐదు ప్రధాన అంశాలుగా తెలంగాణ వైభవాన్ని, శక్తి రూపిణులైన మహిళల గళాలని, కలాలుగా మలిచి విడుదల చేసిన చంటి ప్రసన్న కేంద్రం మేడ్చల్ తెలంగాణ వారు వెలువరించిన ఈ ‘తెలంగాణ వైభవం- మహిళ చైతన్యం’ అనే వ్యాస సంపుటి నిజంగా తెలంగాణ చరిత్రకు ఒక గీటురాయిగా నిలబడుతుంది అనడం అతిశయోక్తి కాదు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ నేపథ్యంలో వచ్చిన శ్రేష్టమైన సంపుటులలో ఈ సంపుటికి అగ్ర తాంబూలమే!
సంకలనంలోని అంశాలు:
ఇందులోని విషయాలు ఐదు అంశాలుగా క్రోడీకరించారు. తెలంగాణ చరిత్ర మైలురాళ్ళు, తెలంగాణా నారీ శక్తి, తెలంగాణ సంస్కృతి- పండుగలు, తెలంగాణ కట్టడాలు -ప్రాచీన చరిత్ర, తెలంగాణ ముఖ్య వనరులు.
మొత్తం 44 మంది రచయిత్రుల అద్భుతమైన కళా సృష్టి ఈ తెలంగాణ వైభవం- మహిళా చైతన్యం.

ముఖచిత్రం:
తెలంగాణ ప్రతీకలైన కాకతీయ తోరణం, ప్రపంచ ప్రఖ్యాత రామప్ప శిలా వైభవం, గోల్కొండ కోట, చార్మినార్, తెలంగాణ సంస్కృతికి ప్రతీకలుగా నిలిచిన బతుకమ్మ, బోనాలు అన్నింటినీ కలగలుపుకున్న ముఖచిత్రాన్ని చూడగానే ఒక్కసారి ఆత్మీయంగా చేయి పెట్టి ఆ గ్రంథాన్ని తడమాలనిపిస్తుంది. అలా తడిమిన మరుక్షణం చేయి నుండి విద్యుత్ నర నరాల్లో పాకినట్టుగా ఆ పుస్తకం పైన ఏమ్బోసింగ్ చేతికి అద్భుతంగా తగిలి నిజంగానే ఆ ప్రదేశాలలో మనం ఉన్నట్లుగా ఒకలాంటి తాదాత్మ్యం నరనరాన పాకుతుంది అనడంలో సందేహం లేదు. అందుకేనేమో తెలంగాణ మహిళా సంక్షేమ శాఖ మంత్రి అయిన సీతక్క గారు కూడా తమ అభినందనలు తెలియజేశారు.

తెలంగాణపై తన అభిమానాన్ని నరనరాన నింపుకున్న నారిశక్తి అయిన రాజీవ గారు దీనిని ముందుకు నడిపించి పుస్తక రూపం రావడానికి చేసిన కృషి అనన్య సామాన్యం. తెలంగాణ చరిత్ర మైలురాళ్లు అంశంలో ‘అస్మకుల మొదలు శాతవాహనుల వరకు’ స్త్రీ సాధికారత పై ప్రముఖ విద్యావేత్త సాహిత్యంలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న డాక్టర్ శారద హనుమాన్లు గారు వ్రాసిన వ్యాసం పుస్తకానికి మా కుటాయమానమై నిలిచింది. అశ్మకులు భారతదేశంలోని మహాజనపదాల్లో ఒకటి అంటూ వారి సామాజిక జీవనం, వారి మాట, మతాచారాల గురించి, సాంస్కృతిక విశేషాల గురించి, అప్పటి భాషా సాహిత్యము, ఉత్సవాలు, ఆచారాలు, విద్య ఎలా ఉండేది అని చాలా వివరంగా తెలిపారు. అప్పట్లో కేవలము వేదమంత్రాలు బ్రాహ్మణ వంశానికి చెందిన స్త్రీలు మాత్రమే నేర్చుకునే అవకాశం ఉండేది. అప్పటి స్త్రీలు సంగీతం, నృత్యం, ఆభరణము, వస్త్రం ఇలాంటి వాటిలలో వారి ప్రతిభను చూపించే వారిగా ఉండే వారని, పరిపాలనలో కూడా భాగస్వామ్యం రాణులకు ఉండేదని, చారుమతి గురించి ఆమె అస్మకరాజకుమారిగా అభివర్ణిస్తూ, మౌర్యుల కాలంలో తెలంగాణలో మహిళల స్థానం గురించి, శాతవాహన యుగం గురించి, మలయావతి, శాతవాహన రాజు శాతకర్ణి భార్య గురించి, గౌతమపుత్ర శాతకర్ణి గురించి మొత్తం విపులంగా తన వ్యాసంలో తెలిపారు. కాకతీయులనాటి శాసనాలు అందులో స్త్రీల పాత్ర గురించి మనము చరిత్రను ఎందుకు తెలుసుకోవాలి, చరిత్ర తెలుసుకుంటే లాభమేంటి అనే విషయాలన్నింటిని చర్చిస్తూ రాసిన డాక్టర్ భిన్నూరి మనోహరి గారి వ్యాసం ఆద్యంతం మంచి విజ్ఞానదాయకంగా ఉంది. అందులో మైలమాంబ, కుందమాంభ, రుద్రమదేవి, కోట గణపాంబ, కుప్పాంబిక, నాగాంబిక, మైలాంబిక గురించి మొత్తం కాకతీయ కాలంలో స్త్రీలు అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకున్న విషయాన్ని సవివరంగా వ్యాసంలో పొందుపరిచారు.
వై సుజాత ప్రసాద్ గారు కాకతీయ రాజుల పరిపాలన, మొదటి రాజు బేతరాజు మొదలుకొని స్థాపించిన సంవత్సరము, కాకతీయను ఏలిన పాలకులు, పరిపాలించిన ఆయా కాలాల్లో జరిగిన విషయాలు సూక్ష్మంగా తెలిపారు. అప్పటి రాజకీయ చరిత్రలో ఆలయాల నిర్మాణాలు, సంస్కృతి సంప్రదాయాల వివరాలు, కళా పోషణ, అప్పటి గుట్టలపై, శిల్పాలపై నిర్మించిన అశేష శిల్ప సంపద గురించి పూర్తి వివరాలను సూక్ష్మంగా ఇప్పటికీ మనకు ప్రత్యక్ష నిదర్శనలుగా ఉన్న ఆలయాలను గురించి వివరిస్తూ సాగింది. ఇందులో ఓరుగల్లు కోటను ఏకశిలా నగరం అని ఎందుకంటారు? అక్కడి విగ్రహాలు, అక్కాచెల్లెళ్ల బావి, కుష్మహలు, హవా మహలు కాకతీయుల కాలంలో స్థాపించిన, కట్టించిన పద్మాక్షమ్మ గుడి, రుద్రేశ్వరాలయం, వేయి స్తంభాల గుడి వివరాలు చదువుతుంటే కళ్ల ముందు మనకు ఓరుగల్లు కోట సజీవంగా కథలాడుతుంది అనడంలో సందేహం లేదు.
డాక్టర్ మామిడాల శైలజ గారిది పరిచయం అవసరం లేని పేరు తెలంగాణలో సాహిత్యంలో. కుతుబ్షాహీల కాలంలో స్త్రీల యొక్క చారిత్రక విశ్లేషణ గురించి వ్రాస్తూ అప్పటి మతపరమైన నియమాలు, పరదావ్యవస్థ, ఘోష పద్ధతి, రాజ కుటుంబానికి చెందిన స్త్రీల యొక్క విద్య వివరాలు, కుతుబ్షాహీలవంశంలోని మహిళల యొక్క పాలన వ్యవహారాల్లో రాజకీయాలలో వారి పాత్ర ద్వారా వారి అలంకారీక విద్యలు, వారితో పోలిస్తే సాధారణ స్త్రీలకు ఉండే వ్యత్యాసాలు మరియు విద్యా సాహిత్య రంగాల్లో స్త్రీల యొక్క పరిస్థితులు, అప్పుడు ఉన్న భాషలు, అప్పటి కాలంలో బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన స్త్రీలకు అందించే విద్యల గురించిన వివరాలు, అప్పటి కాలంలో మహిళల యొక్క పాత్ర, సంగీతం, నాట్యం, చిత్రకళ లాంటి అనేక లలిత కళలలో స్త్రీల యొక్క పాండిత్యం గురించిన వివరాలు స్త్రీల పైన మతపరమైన పరిమితులు, వారి యొక్క మతపరమైన నియమాలు, సామాజిక పరిమితులు, ముస్లిం స్త్రీల పైన మతపరమైన నియమాలు, హిందూ స్త్రీలపై నుండి సంప్రదాయపు పరిమితులు, మతేతర ధోరణులు, ప్రముఖ కుతుబ్షాహీ మహిళల యొక్క జీవితము, వారి పాత్రలు చరిత్రలో ఎంత గుర్తింపు పొందాయో అందులో ముఖ్యమైనటువంటి వారైనా బేగ్ మల్కా బేగం, తాహిరా బేగం, సుల్తానాల పేర్లు చరిత్రపుటల్లో పేర్లు నిలిచిపోకపోయినా కళ పరిపూర్ణంగా ప్రదర్శించి కళా పోషణ చేసిన కళాభిమానులైన అనేక మంది స్త్రీల యొక్కచిత్రణ ఇందులో మనకు కనబడుతుంది.
ఇందులో రజాకార్ల ధమనకాండ స్వయంగా చూసిన డాక్టర్ బండ స్వీయ అనుభవాలు కూడా చోటుచేసుకున్నాయి. పీనుగుల పెంటగా మార్చిన ఊరి గురించి ఆమె వ్రాసిన అనుభవాలు చదువుతుంటే చెమ్మగిళ్ళని కన్ను ఉండదంటే అతిశయోక్తి కాదు. అనుభవాలన్నీ మనల్ని అప్పటి రజాకార్ల యొక్క దమనకాండలను కళ్ళ ముందు సజీవంగా కదలాడేలా చేస్తాయి.
ఇక స్వయం శక్తితో పైకి వచ్చిన ఆచార్య వంగరి త్రివేణి గారి వ్యాసాలు పరిశీలిస్తే బైరాన్ పల్లి వీరభైరాంపల్లిగా నిలిచిపోయిన చరిత్ర, దానికి ప్రత్యక్ష ప్రత్యక్ష సాక్షిగా నిలిచిన డాక్టర్ బండ సరోజన గారి వ్యాసం అత్యంతము ఒళ్ళు గగుర్ పొడిచేలా చేస్తుంది. బ్రిటిష్ కాలంలోని తెలంగాణ స్త్రీ విద్య గురించి డాక్టర్ వంగరి త్రివేణి గారు ఆమూలాగ్రహం కూలంకషంగా చర్చించారు. తెలంగాణ స్త్రీల సంస్కరణ, ఉద్యమాల గురించి కొల్లాపురం విమల గారు చెబుతూ ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణ అని, స్త్రీవాద ఉద్యమాల నేపథ్యాల గురించి తెలిపారు. డాక్టర్ అరుణ పరంథాములు గారు తెలంగాణ రావడంలో తెలంగాణ ఉద్యమంలోని మహిళ పాత్ర అందులో సాహిత్యం ద్వారా తెలంగాణను ఉత్తేజపరిచిన తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని ఉత్తేజపరిచిన మహిళా మణుల యొక్క కృషిని చక్కగా అక్షరీకరించారు. రాజీవ్ గారు స్వతంత్ర తెలంగాణ మహిళ గురించి, మరియు తిరునగరి దేవికి దేవి గారు తెలంగాణ పోరాట నవలలలో స్త్రీ చైతన్యం గురించి, జ్వలిత గారు తెలంగాణ సాహిత్యంలోని మహిళ గురించి చక్కగా తెలిపారు.

తెలంగాణ నారీ శక్తి గురించి, రాణి రుద్రమదేవి, రణచండికా అంటూ కొలిపాక శోభా రాణి గారు, తెలంగాణకి ఎంతో కీర్తి తెచ్చిన పోరాట మహిళా మణులు సమ్మక్క సారమ్మల గురించి బండి ఉష గారు మరియు వీరనారి చాకలి ఐలమ్మ చరిత్ర గురించి డాక్టర్ తాళ్లపల్లి యాకమ్మ గారు, విప్లవంలో నిప్పు కణిక లా మెరిసిన మల్లు స్వరాజ్యం గారి గురించి బండారు సునీత గారు, రాణి శంకరమ్మ గురించి రంగరాజు పద్మజ గారు, పోరాట తేజమైన ఆరుట్ల కమలాదేవి గారి గురించి ఎస్కే సలీమా గారు, సంఘసంస్కర్త అయిన ఈశ్వరీబాయి గురించి వసంత లక్ష్మణ్ గారు, వీరవనిత అయిన లక్ష్మీబాయి గురించి డాక్టర్ కే పద్మా రాణి గారు, సదాలక్ష్మి ఉద్యమ పోరాటం గురించి డాక్టర్ అన్నం దాస్ జ్యోతి గారు, డాక్టర్ కొండా శకుంతలా దేవి గారి గురించి లావణ్య గంగుల గారు, తెలంగాణ గురించి యశోద రెడ్డి గారి గురించి డాక్టర్ దాసోజు పద్మావతి గారు అలుపెరుగని అమృతమూర్తి తెలంగాణ నారిశక్తిలో పొందుపరిచారు.

తెలంగాణ సంస్కృతి పండుగలు బోనాలు, బతుకమ్మ, తెలంగాణ ఉద్యమంలో కూడా ఎంతటి పాత్ర ఇంతటి ప్రముఖ పాత్రను వహించే అందరికీ తెలుసు. అలాంటి జానపద కళారూపాలలో స్త్రీ చైతన్యం గురించి కొండపల్లి నిహారిణి గారు, డాక్టర్ ఆదివాసి దండాల యొక్క సంస్కృతి గురించి రావుల కిరణ్మయి గారు, బోసంగి మహిళా సంస్కృతి సాహిత్యాల గురించి డాక్టర్ గంధం విజయలక్ష్మి గారు, బతుకమ్మ రాష్ట్ర పండుగ విశిష్టత గురించి డాక్టర్ ఆర్ కమల గారు, రాష్ట్ర పండుగ బోనాల గురించి డాక్టర్ కందిపి రాణి ప్రసాద్ గారు, పెద్ద దేవుడైన ఇంటింటి దైవమైన దుర్గమ్మ తల్లి గురించి నామని సుజనా దేవి గారు తెలంగాణ యొక్క పంటల గురించి, సంస్కృతి సంప్రదాయాల గురించి తెలియజేశారు.

తెలంగాణ కట్టడాలు: ప్రాచీన చరిత్రలో హైదరాబాద్ అనగానే గుర్తు వచ్చే చార్మినార్ గురించి నాంపల్లి సుజాత గారు, హైదరాబాదులోని సాలార్జంగ్ మ్యూజియం గురించి సుజాత తిమ్మన గారు, కాకతీయుల వైభవాలను ఓరుగల్లు కీర్తిని తెలిపి వేయి స్తంభాల గుడి గురించి సరిగమల ఒడి అంటూ చెప్పిన చంద్రకళ దీకొండగారు, ప్రపంచమంతా ప్రఖ్యాతి చెందిన రామప్ప దేవాలయం గురించి శాంతా రెడ్డి గారు, స్వయంభూ దేవాలయాల గురించి గిరిజ పైడిమర్రి గారు, మన్యంకొండ పుణ్యక్షేత్రం సంధ్యా సూత్రావే గారు, శారదా పీఠం బాసర సరస్వతి గురించి డాక్టర్ సాయి లక్ష్మి గారు, శ్రీకరం శుభకరం శ్రీ విద్యాపురం గురించి అరుణ ధూళిపాల గారు, ఉరిమిల్ల సునంద గారు జోగులాంబ శక్తి పీఠం గురించి, వనజ గారు ప్రఖ్యాతి చెందిన భద్రకాళి ఆలయం గురించి 33 జిల్లాల ప్రత్యేకతల గురించి రజనీవాసన్ గారు మొత్తం తెలంగాణ గురించి వివరించారు.
తెలంగాణ ముఖ్య వనరులైన జల వనరుల గురించి, పర్యావరణ పచ్చదనం గురించి చేనేత పరిశ్రమ గురించి చాట్ల విద్యుల్లత గారు, డాక్టర్ విజయశ్రీ గారు, బండారి సుజాత గార్ల వ్యాసాలతో ముగించడం చాలా బాగుంది. ఈ పుస్తకంలో ఆయా కళాఖండాలకు సంబంధించిన వేయి స్తంభాల గుడి చిత్రపటాన్ని, తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలైన బతుకమ్మ, బోనాల యొక్క చిత్రపటాలను ఇందులో పొందుపరచడం వల్ల తెలంగాణ వాళ్లకు కాకుండా ఇతరప్రాంతాల వారికి కూడా ఆ చిత్రాన్ని చూసే అవకాశాన్ని కూడా కల్పించారు
‘అద్దం ఎట్లాగైతే అబద్దం చెప్పదో, ఇందులోని వ్యాసాలన్నీ కూడా అద్దంలా ఆయా ప్రత్యేకతలను చూపించాయి.
అదుగో అంటే ఆరు నెలలు అన్న సామెత ఇక్కడ కుదరదు. ఎందుకంటే శారదా హనుమాండ్లు గారు దీక్షగా ఒక యజ్ఞంలా ఈ సంకలనాన్ని పూర్తి చేయడమే కాదు. ఆవిష్కరణ రోజు డా. బండ సరోజనమ్మ గారు చీరల వితరణ, రాజీవ గారు అందమైన జూట్ బాగ్, సర్టిఫికేట్ కూడా రచయిత్రులకు ఇవ్వడం, మంచి విందు భోజనంపెట్టించడం విశేషం.
‘అన్నం పెడ్తే అరిగిపోతది . చీర బెడితే చినిగి పోతది . కాని అక్షరం అలికితే అక్షరలక్షల పంటలొస్తాయి’, అని ఈ సంకలనం నిరూపిస్తుంది.
‘అమ్మవారి మొక్కు తీరది, ఆడబిడ్డ అప్పు తీరది’ అన్నట్లు తెలంగాణా ఆడబిడ్డ ప్రతీ గడపకి ఎంత ముఖ్యమో, తెలంగాణా సొగసులను అద్దుకున్న ఈ సంపుటి ఋణం కూడా ఈ తెలంగాణాకు తీరనిదే. ఇదే సంపుటి త్వరలో
ఇంగ్లీష్ లోకి కూడా అనువదించబడి(ఇప్పటికే అనువాదం పూర్తయింది) విశ్వవ్యాప్తం కానుండడం విశేషం.

November 30, 2025 8 comments
0 FacebookTwitterPinterestEmail
సంపాదకీయం

ప్రమాదం అంచుల్లో…

by Kondapally Neeharini November 30, 2025
written by Kondapally Neeharini

( 2025 నవంబర్ మయూఖ పత్రిక సంపాదకీయం)

–  డాక్టర్ కొండపల్లి నీహారిణి, మయూఖ పత్రిక ఎడిటర్

 కొత్త బంగారులోకం, నా బంగారు కొండా, బంగారమసొంటి గుణం, ఆ ముచ్చట్లు వివరంగా చెప్తే నీ బంగారమేం పోయింది, బంగారం వంటి జీవితం తాగి తాగి నాశనం చేసుకున్నారు – ఇటువంటి మాటలు ఎందుకు వచ్చాయి? ఆ వివరాల్లోకి వెళ్తే…

బంగారం అనే లోహం అన్ని లోహాలలో చాలా చాలా విలువైన లోహం. ఒక భారమైన మూలకం.  ఎక్కువ స్థితిస్థాపక గుణం కలిగి ఉండే ఖనిజం. బంగారం కాఠిన్యత ను పరిగణలోకి తీసుకుంటారు.

 Au అనే చిహ్నంతో శాస్త్రీయంగా పిలువబడే బంగారం ఒక విలువైన లోహం. శాస్త్ర ఆవర్తన పట్టికలో 11వ సమూహానికి చెందిన మూలకం. బ్యాటింగ్ లో Aurun  అంటారు కాబట్టి Au అనే పేరుతో  రసాయనికంగా  పిలిచే ఈ లోహం మూలవర్తన లోహం. ఈ లోహం మెత్తగా ఉంటుంది ఎక్కువ సాంద్రత కలిగి ఉంటుంది.

ఆమ్లాలకు విడిపోయి ఏ చర్యకు గురికానటువంటి కరగనటువంటి బంగారం కాబట్టే ఇంత విలువ.

అయితే ఇటువంటి విలువైన  ఈ బంగారం అనే లోహం పాదరసంలో హైడ్రోక్లోరిక్ నైట్రిక్ ఆమ్లాలతో కలిపిన ఆక్వా రెజియా అనే ద్రవంలో కరుగుతుంది. బంగారం, పాదరసం కలిసిన ధాతు మిశ్రమాన్ని సిద్ధం చేస్తారు. మేలిమి బంగారం అంటే పసుపు పచ్చని వర్ణంతో ఎక్కువ సాంద్రతతో ఉండే మెత్తని లోహం. ఇది అత్యంత విలువైన లోహాల లో ఒకటి.

ఇతర ఆమ్లాల చర్యలకు రసాయనిక మార్పుచెందని లోహం కాబట్టే బంగారం అంటే ఇంత మోజు కలగడానికి కారణమేమో.  ఒక హౌస్ బంగారం నుండి దాదాపు 50 మైళ్ల పొడవైన తీగను తయారు చేయవచ్చు రేకుగా సాగదీయవచ్చు , కడ్డీల రూపంలో, బిస్కెట్ల రూపంలో నిలువ చేయవచ్చు. సాధారణంగా బంగారాన్ని karats , కారెట్స్ లలో తూకం వేస్తారు. బంగారం స్వచ్ఛత అనేది ఎలా ఉంది తెలుసుకోవాలంటే ఫైన్నెస్

fineness ఎంత ఉంది తెలుసుకోవాలని చూడడానికి ఉపయోగిస్తారు. గ్రాములు, కిలోలు  కారెట్ల కొలతల్లో చెబుతారు. చాలావరకు 24 కారెట్ ఉంది అంటే అది కల్తీ లేని బంగారమని అర్థం. కాని, దీనితో ఆభరణాలు తయారు చేయడం కష్టం. అందుకే ఎటు అంటే అటు మలిగి, గట్టిగా ఉండడానికి బంగారానికి రాగి గాని వెండి గాని ఏదైనా లోహాన్ని  ఓ 2  భాగాలు కలిపి 22 కారెట్ల కు సిద్ధం చేసి వస్తువులు తయారు చేస్తారు.               భౌతిక శాస్త్రవేత్తల అభిప్రాయాల  నేల పొరలలో తక్కువ ప్రమాణంలో నిక్షిప్తమై ఉండే బంగారు నిధులు ముఖ్యంగా ప్రధమ శ్రేణి ద్వితీయ శ్రేణి నిలువలుగా చెబుతారు. భూమి లో ఉండే ‘ మాగ్మా ‘ లో బంగారం ఉంటుందని ద్రవ రూపంలో ఉన్న బంగారం అవక్షేప శిలలలో నిలుస్తుందని , రాతి పొరలలోను చేరి ఉంటుందని చెప్పడం చూస్తాం.

ఈ మెత్తటి లోహంలో వేరే లోహాలను కలిపి దృఢంగా చేసి వస్తువులను తయారు చేయడానికి ఉపయోగిస్తారు.

పూర్వకాలం నుండి బంగారాన్ని వాడుకలో కి తెచ్చుకున్నారు ప్రజలు. శిలాజాలను తవ్వి బంగారాన్ని నిల్వ చేసుకునే వాళ్ళు. ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వస్తు మారక ద్రవ్యంగా కూడా ఉపయోగించేవాళ్ళు.  ముఖ్యంగా వ్యాపారానికే కాకుండా రాజవంశీయులు వాళ్ళ సింహాసనాలను, అలంకరణ వస్తువులను ఎంతో శ్రద్ధగా నిలువ చేసుకునేవాళ్ళు. రాజుల రాణుల సమాధులపై రాజ వంశీయుల సమాధులపై బంగారాన్ని అలంకరణగా పెట్టే అలవాటు ఉన్నవాళ్లంటే ఆశ్చర్యం కలుగుతుంది. ప్రముఖంగా ఈజిప్టులోని పురాతన దేవాలయాలలో బంగారాన్ని విరివిగా వాడే వారట.

      ఈజిప్ట్ లోని నైలునది ప్రాంతంలో, నోబియన్ ఎడారి ప్రాంతంలో, రెడ్ సి అంటే ఎర్ర సముద్రం ప్రాంతంలో గనులు బాగా ఉన్నట్టు చెబుతారు. ఏమన్, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా ప్రాంతాలలో బంగారు గనులను త్రవ్వి న చరిత్ర ఉన్నది. ఇకపోతే అమెరికా, కెనడా, రష్యా, జర్మనీ, స్విజర్లాండ్ జపాన్, ఫ్రాన్స్, ,ఆస్ట్రేలియా, చైనా, భారతదేశం, నెదర్లాండ్స్ వంటి  దేశాలలో బంగారు నిల్వలు చాలా ఉన్నాయి . అత్యధికంగా బంగారాన్ని ఉత్పత్తి చేసే దేశాలు ఇవి. ప్రపంచంలో అత్యధిక నిల్వలు ఉన్నాయనే పేరు తెచ్చుకోవడానికి పోటీలుపడి టన్నులు టన్నులుగా నిలువ చేసి పెడతారు.

   దేశాల ముఖ్య వ్యాపార లావాదేవీలు ప్రముఖ దేశాల మధ్య జరిగినప్పుడు బంగారం నిలువల ప్రస్తావన వస్తుంది.  బంగారం ధర వ్యాపారాలను శాసిస్తుంది. సెన్సెక్స్ లెక్కలు  అధికమయ్యాయా? పడిపోయాయా? అనే చర్చల ద్వారా పసిడి ధరలు పెంచాల్సిందే.

          అత్యధిక బంగారు నిల్వలు ఉన్న అమెరికా దేశస్తులు ఒంటి మీద నగలుగా ఎక్కువ ధరించరు. అక్కడ 18 క్యారెట్స్ బంగారాన్నే నగలు తయారు చేయడానికి ఉపయోగిస్తారు. కాస్త చూడటానికి తెల్ల తెల్లగా కనిపిస్తాయి నగలు.

అయితే బంగారు జీవితం అంటే బాగా బంగారు ఆభరణాలు ధరించడం కాదు. వాళ్ల జీవితం పసిడి కాంతులతో కళకళలాడుతుంది అంటే అందరూ బంగారం తో అలంకరించుకోవడం, ఇంట్లో అంతా బంగారు వస్తువులతో నింపడం కాదు.

ఆరోగ్యకరమైన , సంస్కారవంతమైన జీవితం ఉంటే బంగారు బతుకు అంటారు. బంగారం అంటే పసిడి అనీ కనకము అని కదా అర్థాలు. ” కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్ట శుభ లగ్నమునన్” మనకో పద్యం కూడా ఉన్నది కదూ..

 ” పసిడికి తావి అబ్బినట్టు ” అనేది ఓ సామెత. తావి అంటే సువాసన. అతనికి గానీ ఆమెకు గాని చక్కని అందం తో పాటు మంచి గుణాలు ఉంటే ఈ సామెత ను ఉపయోగిస్తాం. ” కల్ల పసిడికి కాంతి మెండు” అంటే, False gold is very bright అదే… All is not gold that glitters అంటారు . కల్ల పయిడికి గరుకులు మెండు False gold is very rough అని , కూడా ఓ సామెత ఉన్నది. సామెత లు ఎందుకు ఆమెతలు అంటారో ఇలాంటివి చదివితే తెలుస్తుంది. ఇవి అసలు బంగారు జీవితానికి వ్యాఖ్యానాలు. పసిడి మనసులు అంటాం. సాధారణంగా చిన్నారులను చూస్తే!!! కదా! ఏ సంఘర్షణ లు లేకుండా ఏ కుళ్ళు కుతంత్రాలు తెలియని పిల్లలు కాబట్టి.

ఇక ప్రస్తుతానికి వస్తే, ఎవరు ప్రమాదపు అంచుల్లో ఉన్నారు? ఎందుకు ? ఈ ప్రశ్న లు చాలా విలువైనవి. బంగారంలా విలువైనవి. బంగారం కన్నా విలువైనవి.

బంగారం ధర బాగా పెరగడం వల్ల దొంగతనాలు దోపిడీ లు ఎక్కువయ్యాయి. ముందు ఇంతగా దొంగిలించేవాళ్ళు కాదు. కానీ,

ఇప్పుడు ఎక్కడ చూసినా బంగారు నగల వ్యాపార ప్రకటన లకు సంబంధించిన ఫోటో లు పెట్టడం వల్ల సమాజానికి చేరువవడంతో అందరు ఆకర్షితులవుతున్నారు . అంత షో చేయడం, ప్రాపగాండా చేసుకోవడం . ఇవన్నీ అవసరమా? అసలే నేరప్రవృత్తి బాగా పెచ్చుమీరుతున్న రోజులు ఇవి. అసలే ఆధునిక శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చిన మార్పులు, ప్రపంచీకరణ ప్రభావం సగటు జీవుల బ్రతుకు లను అతలాకుతలం చేస్తున్నాయి. దారిద్ర్యం రేఖ కు మరీ దిగువనున్న సామాన్యులు ఉన్నారు. ఎటునుంచి ఎటు మారుతారో తెలియదు. ప్రమాదం అంచుల్లో ఉన్నది సమస్త మానవ జాతి. అందుకే తస్మాత్ జాగ్రత్త!!

_____*****_____

November 30, 2025 6 comments
0 FacebookTwitterPinterestEmail
Uncategorized

The Cruise ఓ దృశ్యప్రయాణం

by nellutla Indrani November 30, 2025
written by nellutla Indrani

Travelag, ధారావాహిక యాత్రాచరిత్ర

“Cruise” ఈ పదమే చాలా vibrating గా ఉంటుంది. ఇది మా సరికొత్త ప్రయాణానుభవాల పరంపర. కానీ, 2016 లో కూడా మా అన్నయ్య డాక్టర్ శ్యాంసుందర్ రావు, మా వదిన రామానుజమ్మ, మా చెల్లెలు కొండపల్లి నీహారిణి, రచయిత్రి ,తరుణి, మయూఖ ఆన్లైన్ పత్రికల ఎడిటర్, మా మరిది గారు కొండపల్లి వేణుగోపాల్ రావు గారు, మా వారు నెల్లుట్ల రఘు రామారావు గారు అందరం మూడు జంటలం Ruby Princess
అనే Cruise లో పది రోజుల ట్రిప్ కు వెళ్లి వచ్చాం. అప్పుడు చాలా enjoy చేసాం. కొత్త ప్రదేశాలు చూడడం మాకు చాలా ఆనందాన్నిచ్చింది. మేమందరం like minded people. అందుకే హాయిగా వెళ్లిరాగలిగాం. రూబీ ప్రిన్సెస్ క్రూజ్ లో అలస్కా కు వెళ్ళాం. 1. Ketchikan 2. Skagway 3.Tracy Arm 4. Sitka and Juneau and Victoria Island (BC) లు చూసి వచ్చాం .
మా చెల్లెలు నీహారిణి అప్పటినుండి ఆ టూర్ గురించి రాయమని అడుగుతూ ఉంది. నాకు బద్ధకం కొంచెం ఎక్కువ. ఇన్నాళ్లకు మళ్ళీ 2025 లో నేను మా వారు ఇద్దరం కలిసి Norwegian Joy Cruise లో unlimited Joy ను ఆస్వాదించడానికి, ఆహ్లాదించడానికి పది రోజుల విహారానికి వెళ్ళాం. మళ్లీ అదే అలస్కా టూర్ కానీ ఈసారి Icy Strait Point, Glacier Bay కూడా add అయ్యి మా ఆనందాన్ని ఇనుమడింప చేసాయి.

“బైటే బైటే క్యా కరే…” అన్నట్టు ఒకరోజు Cruise price లను చూసాం. Lucky గా cheap deal కనిపించింది. వెంటనే టిక్కెట్లు బుక్ చేశాము. అలా స్టార్ట్ అయ్యింది మా అలాస్కా క్రూజ్ ప్రయాణం! మేం ఎక్కిన క్రూజ్ చాలా పెద్ద క్రూజ్. Norwegian Joy లో 10 రోజులు వెళ్ళి వచ్చాం. 2016లో వెళ్ళినప్పుడు క్రూజ్ బుకింగ్ మా పిల్లలు చేశారు. ఈసారి మేమే ప్లేసెస్ సెలెక్ట్ చేసుకోవడం external tours అంటే వేల్ వాచింగ్ లాంటివి అన్ని మేమే స్వయంగా సెలెక్ట్ చేసుకోవడం కొంచెం థ్రిల్లింగ్ గా అనిపించింది. Balcony tickets మాకు expensive అనిపించింది. మేం Ocean view tickets తీసుకున్నాం.
టికెట్స్ కొన్న తర్వాత వెళ్లేముందు ఒక అప్లికేషన్ నింపవలసి ఉంటుంది. అప్లికేషన్లో పుట్టినరోజు, పెళ్లిరోజు అలాంటివి ఏవైనా స్పెషల్ డేస్ ఉంటే

వైభోగమే ఇక. క్రూజ్ రూములోంచి బయటకు వెళ్లి వచ్చేసరికి బెడ్ పైన love గుర్తులు ఉండే balloons , కొన్ని చాక్లెట్స్ పూలు పెట్టి ఉంటాయి ఈ దృశ్యం చూడగానే పెదాల పైన నవ్వు అనుకోకుండా వస్తుంది. బర్త్ డే కేక్ కూడా కట్ చేయిస్తారు. ప్రతిరోజు మన రూమ్ బయట డోర్ కు చిన్న నోటీస్ బాక్సులో ఆరోజు క్రూజ్ లో ఏమి ప్రోగ్రామ్స్ ఉన్నాయో వివరాలు ఉంచుతారు.

ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది.
కానీ ఈసారి ప్రతి ఫ్లోర్ లో ఒక చిన్న ఎలక్ట్రానిక్ స్క్రీన్ పెట్టారు. దాంట్లో మనం అన్ని వివరాలు చూసుకోవచ్చు ఇప్పుడు ఉన్న ప్రోగ్రామ్స్ ను ఎంజాయ్ చేయవచ్చు.
జూలై 16 నుండి జూలై 25 వరకు క్రుజ్ ప్రయాణం. మేము వాషింగ్టన్ స్టేట్ లోని సియాటిల్ లో ఉంటున్నాం. సియాటిల్ లో క్రూజ్ ప్రారంభమయ్యే పాయింట్ ఉన్నది. ఆ ప్రదేశాన్ని Pier 66 అంటారు. అలాస్కా క్రూజ్ లో వెళ్లాలంటే కెనడా వీసా కావాలి. తిరుగు ప్రయాణంలో క్రూజ్ విక్టోరియా ఐలాండ్ కు వెళుతుంది విక్టోరియా ఐలాండ్ కెనడాలో ఉన్నది. సాయంత్రం నాలుగు గంటలకు క్రూజ్ యాత్ర ప్రారంభం అవుతుంది పన్నెండు ఒంటిగంట మధ్య రిపోర్ట్ చేయాల్సిన సమయం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు మూడు గంటలు ముందు వెళ్లినట్టే సి పోర్టుకు కూడా మూడు గంటల ముందే వెళ్లాలి. మాకు ఉన్న అత్యుత్సాహంతో నాలుగు గంటల ముందే వెళ్ళాం.
నార్వేజియన్ క్రూజ్ 20 అంతస్తుల ఉన్న క్రూజ్ .2016 లో రూబీ ప్రిన్స్స్ క్రూజ్ వెళ్ళాము కదా ఆ క్రూజ 19 అంతస్తులు ఉండింది .
ఈ నార్వేజియన్ క్రూజ్ లో ఒకటి నుండి ఆరో ఫ్లోర్ వరకు ఇంజన్స్, ఇంకా దానికి సంబంధించిన మిషనరీ ఉంటుంది. ఆరవ ఫ్లోర్లో క్రూజ్ కు రెండు వైపులా లైఫ్ బోట్స్ ఉంటాయి ఒక్కొక్క లైఫ్ బోట్ లో 135 మంది

ప్రయాణికులను తీసుకువెళ్లవచ్చు. ఏడవ ఫ్లోర్ నుండి 8, 9 ఫ్లోర్లలో రెస్టారెంట్స్, డాన్స్ ఫ్లోర్, క్యాసినోస్ ఉంటాయి. ఇంకా కొన్ని ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ కూడా జరిగేవి ఉంటాయి 20వ ఫ్లోర్లో గోల్ఫ్ ఆటకు సంబంధించిన స్థలం ఉండేలా ఏర్పాట్లు ఉన్నాయి. అంతేకాదు ” Go Cart” కార్ రేస్ ఆటకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఉన్నాయి ఈ మధ్యలో ఉన్న అంతస్తులలో కొన్ని స్పెషల్ సూట్స్ , బాల్కనీ రూమ్స్ , విండో వ్యూ ఉన్న రూమ్స్ కొన్ని ఉంటాయి. కొన్నేమో స్టేట్ రూమ్స్ అంటే మధ్యలో వ్యూ లేకుండా ఉండేవి ఉంటాయి. అంటే కొన్ని ఎక్స్పెన్సివ్ , అధిక ధరలతో కొన్ని affordable అంటే మద్యస్థమైన ధరలతో ఎవరి ఇష్టానికి ఎవరి తాహతుకు సరిపోయేలాగా వాళ్ళ కు, డబ్బులు పెట్టగలిగేలాగా ఉంటాయి.
నార్వేజైన్ క్రూజ్ లో ఆహారం ప్రత్యేకంగా ఉంది ఫుడ్ స్పెషల్ గా ఉన్నది. The Taste of India , Mediterranean, Italian, Mexican, Chinese, American ఇలా చెబుతూ వెళితే ఎన్నో రకాలు ఉన్నాయి. Of course మేం భారతీయులం కాబట్టి “The Taste of India” prefer చేసాం. ప్రతిరోజు “వివాహ భోజనంబే….!”అంటే నమ్మండి!
పొద్దున్నే 6:30 నుండే టీ కాఫీలతో ఇంకా రకరకాల బ్రెడ్స్ ఇక ఇండియన్ రెస్టారెంట్లో చెప్పేదేముంది ఇడ్లీ, దోశ, ఉత్తప్పం, పొంగణాలు, ఉప్మా, అటుకుల ఉప్మా అంటే పోహ అంటారే… అదీ, పూరి, వడ! వడా విత్ టమాటా చెట్నీ, ఇంకా కొబ్బరి చెట్ని సాంబారు చెప్పొద్దు కానీ నేను కొంచెం foody నే! అసలు ఈ కొబ్బరి పచ్చడి టమాటా పచ్చడి ఎంత బాగున్నాయి అనుకున్నారు అబ్బో…! ఇక మధ్యాహ్నం భోజనమో… రోజూ స్పెషల్ లంచ్ అన్నట్టు! రెండు రకాల వెజిటేరియన్ కూరలు రెండు నాన్ వెజ్ కూరలో జీరా రైస్, వెజిటబుల్ రైస్, లెంటిల్ రైస్, పులిహోర, పెరుగు పచ్చడి, పెరుగు, కడీ పకోడి , ఇట్లాంటివి ఎన్నో..
డిన్నర్ లో ఆలూ పరోటా, గోబీ పరోటా, పన్నీర్ పరోటా ఇంకా ఏవో తక్కువైనట్టు అన్ని రకాల ఆమ్లెట్స్, రకరకాల సాలడ్స్, పాపడ్స్ రకరకాల ఐస్ క్రీమ్స్ ! ఇవేనో …ఇంకా ఏమైనా మిస్ అయ్యానో ఏమో!! “తినేవాడిదే తిన్నంత మహాదేవ ” అన్నట్టు ఉంటుంది ఫుడ్! వీటిల్లో ఇంకేమో తక్కువైనట్టు కొంతమంది వాళ్ళకి ఇష్టమైన తిండి పదార్థాలను food by order తెప్పించుకుంటారు దానికి pay చేయాల్సి వస్తుంది. మాకైతే అక్కడి

వరకు రానేలేదు chance . ఎవరు ఏమనుకున్నా సరే నేను మాత్రం ” NCL” ( Norwegian Cruise line) నే prefer చేస్తాను. ఎందుకంటే అన్నింటికంటే తిండి ముఖ్యం. మనం భారతీయులం కదా ఎంతైనా జిహ్వచాపల్యం ఎక్కువే , రుచులు ఎక్కువే..ఇది నా అభిప్రాయం మాత్రమే సుమండీ! ఎంత పిజ్జాలో బర్గర్లో తిన్న ఒకటో రెండో రోజులే… మళ్లీ మన ఫుడ్ మన తిండి పైకే మనసు మళ్ళుతుంది. Indian food కావాలి అనుకునే వాళ్లకు మాత్రం ఈ NCL perfect.
ఇక క్రుజ్ లో ప్రతి ఫ్లోర్ ( Deck) లో పిల్లల కోసం చిన్న చిన్న బొమ్మలు చేపలు బాతులు లాంటివి పెడతారు. ఎలా అనుకున్నారు? కనీ కనిపించకుండా కార్నర్స్ లలో పెడతారు. అలా మూలల్లో ఉన్న ఆ బొమ్మలు పిల్లలు చూసుకుని ” హే.. నాకు డక్ బొమ్మ దొరికింది.. ” అనో, ” హే.. నాకు చేప బొమ్మ దొరికింది.. అంటూనో సంతోషిస్తారు. ” నీకేం దొరికింది?” అంటూ మాట్లాడుకుంటారు. ఇది ఒక సరదా పిల్లలకు వాళ్లకు .
ఇంకా, పిల్లల కోసం చిన్న స్విమ్మింగ్ పూల్, రాక్ క్లైంబింగ్ కూడా ఉంటాయి. Of course, డాన్స్ ఫ్లోర్ లలో పిల్లల్ని ప్రత్యేకంగా ఎంగేజ్ చేయవలసిన అవసరమే ఉండదు. ఈ విషయానికి నేను కాస్త ఎక్కువ పాయింట్స్ వేస్తాను. ఎందుకంటే ఇది తల్లిదండ్రులకు చాలా రిలీఫ్ ను ఇస్తుంది. వాళ్లకు కూడా relaxation అవసరమే కదా పాపం . Food కోసం క్యూ లో నిలుచునే అవసరం కూడా అంతగా ఉండదు.
పెద్ద వాళ్ళకి కూడా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయి. డాన్స్ ఫ్లోర్, క్విజ్, సాంగ్స్ అండ్ మ్యూజిక్ , బింగో, డీల్ ఆర్ నో డీల్ , ఫొటోస్ దిగడానికి ఒక ప్లేస్, స్విమ్మింగ్ పూల్స్ , బార్ లు దాదాపు ఉంటాయి.
“NCL” లో ఒక పెద్ద లైబ్రరీ కూడా ఉంది. ” Ruby Princess” క్రూజ్ లో ఉందో లేదో తెలియదు అప్పుడు నేను చూడలేదు. కానీ, ఇందులో ఉన్న లైబ్రరీలో బుక్స్ తో పాటు స్క్రాబెల్, చైనీస్ చెక్కర్, బింగో, చెస్ వంటి గేమ్స్ కూడా ఉన్నాయి. వాటిని డెక్ పైకి, వాళ్ళ రూమ్స్ లోకి తీసుకువెళ్లి మళ్ళీ రిటర్న్ చేయవచ్చు .
ప్రొద్దున్నే “యోగ” చేయిస్తారు. ఇంకా కొన్ని ఎక్సర్సైజులు కూడా చేయించే వాళ్ళు ఉంటారు. చాలా పొడవు వాకింగ్ ట్రాక్ కూడా ఉంటుంది. పొద్దున్నే లేలేత కిరణాలు సముద్రం పైన పడుతున్నప్పుడు వాటిని చూస్తూ

వాకింగ్ ట్రాక్ పైన నడుస్తూ ఉంటే చాలా ప్రశాంతంగా అనిపించింది.
Deck 9 లో షాపింగ్ కూడా చేయవచ్చు. హ్యాండ్ బ్యాగ్స్, డ్రెస్సెస్ ఇంకా కొంత జ్యువలరీ కూడా అమ్ముతారు. ఫోటో గ్యాలరీ కూడా ఉంది.
ప్రముఖ చిత్రకారుల కళాఖండాలు కూడా ‘సేల్స్’ కి ఉంటాయి చాలా ఖరీదు వాటికి నిజంగా అయితే అవి అమూల్యం.
19th Deck లో Spa ladies and gents కి separate గా ఉంటుంది.
నార్వేజియన్ జాయిలో ఫుడ్ కోసం రెస్టారెంట్లకు వెళ్లేప్పుడు అక్కడ ఒక ఎంప్లాయ్ ఉన్నాడు గెస్ట్ లను రిసీవ్ చేసుకోవడానికి. అతడు మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ” కంజర్” ను వాయిస్తూ, ప్రతిరోజు ఇన్విటేషన్ లా స్వాగతం పాడేవాడు. అదెలా అనుకున్నారు? ఒకే ఒక్క వర్డ్ ను రాగయుత్తంగా పాడుతూ ఇన్వైట్ చేశాడు ” wash… washy.. washu ..” అంటూ రాగయుక్తంగా పాడేవాడు అంటే ఏంటి అనుకున్నారు చేతులు కడుక్కోమని చెప్పడం అన్నమాట! కొంతమంది ప్రయాణికులు అతనితో ఫోటోలు కూడా దిగేవాళ్ళు. ఆ ప్లేస్ కి రాగానే అందరం అనుకోకుండా అటువైపే చూసేవాళ్ళం.
ఒకరోజు ” Mickey Mouse” డ్రెస్ లో ఒక అతను ప్రత్యక్షం అతని చుట్టూ పిల్లలు అప్పుడప్పుడు పెద్ద వాళ్ళు కూడా పిక్చర్స్ దిగడం గమనించాం.
మరొక రోజున ” Sponge Bob ” dress లో ఒకతణ్ణి చూశాం. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ కొన్ని క్రియేట్ చేసి రకరకాల వేషధారణలతో అలంకరించుకొని ఉండేవాళ్ళు నిజంగా వాళ్ళ క్రియేటివ్ ఐడియాస్ ను మెచ్చుకోకుండా ఉండలేం .
Food లో కూడా creativity ని చూపించారు. రకరకాల shapes లలో బిస్కెట్లు కేకులు తయారుచేసి పెట్టే వాళ్ళు డైనింగ్ ఏరియాలో రకరకాల పూలతో చక్కని అలంకరణలు చేసేవాళ్ళు ఇవన్నీ ఉదయం 6:30 నుండి రాత్రి 9 కొన్ని సార్లు 10 గంటల వరకు కూడా ఉండేవి. నిజంగా క్రూజ్ స్టాప్ ఎప్పుడు పడుకుంటారో? ఎప్పుడు లేస్తారో? తెలియదు! మనకు మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనే చెప్పాలి!!
మామూలుగా అయితే క్రూజ్ షిప్ స్పీడ్ అనేది itinerary మీద depend అయ్యుంటుంది. Average speed 20 knots . మనకు విమానంలో వచ్చేప్పుడు కూడా turbulence feel అయినట్టే క్రూజ్ లో

కూడా ఉంటాయి కొంచెం ఎక్కువైతే తూలినట్టు అవుతామని విన్నాను కానీ రెండుసార్లు వెళ్లిన నాకైతే turbulence ఎక్కువ అనిపించలేదు. రాత్రిపూట కొంచెం స్పీడ్ ఎక్కువైనట్టు మనకు తెలుస్తుంది. ఈమధ్య అందరూ వాడుతున్న జోక్ ఇక్కడ గుర్తుకొచ్చింది నాకు. ” కౌశిక్ అంటే time , time అంటే కౌశిక్” అని ఏ సినిమాలో ఎవరన్నారో తెలియదు కానీ, క్రూజ్ లో చాలా కరెక్ట్ అనిపించింది. 4.00 pm embarking time అంటే Itinerary లో
కరెక్ట్ గా 4.00 pm కు క్రూజ్ ప్రారంభమైంది. 3,200 మంది passengers. 1,200 మంది crew వాళ్ళు. ఎంత బ్రహ్మాండమైన ratio కదండి? ప్రయాణికుల పట్ల క్రూజ్ వాళ్ళు చూపించే ఆదరణ అదరహో…
Crew లో చాలామంది భారతీయులు ఉన్నారు. అందులో నాకు అర్థమైన దాని ప్రకారం crew ఉద్యోగస్తులు కేరళ వాళ్ళు ఎక్కువ అనిపించారు. అందులో ఒకరిద్దరికి మమ్మల్ని చూడగానే పాపం వాళ్ళ తల్లిదండ్రులు గుర్తుకొచ్చారేమో చాలా అభిమానంగా పలకరించే వాళ్ళు. ఎంత jeans and t-shirt వేసుకున్న కూడా మన ‘బొట్టు’ తో తెలిసిపోతుంది కదా!
అందరినీ అందరూ బాగానే రిసీవ్ చేసుకుంటారు కానీ, ఎందుకో మా పట్ల ఎక్కువ శ్రద్ధనే చూపించారు. మాకు కూడా “పాపం” అనిపించేది. సంవత్సరంలో 9 నెలలు ఎక్కడో సముద్రంలో వాళ్ళ family కి దూరంగా ఉంటారు కదా అని అనిపించేది.
Crew లో ఒక చిన్న pharmacy కూడా ఉంటుంది. అక్కడ, Tylenol, DayQuil, nightquil వంటి మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉంటాయి. ఇంకా కొన్ని క్రూజ్ ల లో పైన helipad కూడా ఉంటుంది. NCL లో ఉందో లేదో తెలియదు.

కొందరికి ప్రయాణాలు అంటే పడవ ప్రయాణం , విమాన ప్రయాణం వంటివి పడవు అయితే వాళ్లకు వాంతులు రాకుండా ఇచ్చే మందులు కూడా ఉంటాయి.
క్రూజ్ లో wheelchair access గురించి ప్రత్యేకంగా చెప్పాలి. దాదాపు ప్రతి డెక్ లో ఇవి అందుబాటులో ఉంటాయి.
అంధులకు వీళ్ళు ఇచ్చే facilities are amazing! హిందీ సినిమాలకు సంగీతం సమకూర్చిన మ్యూజిక్ చేసిన అంటే, లిరిసిస్ట్ … రవీంద్ర జైన్

అతను కూడా అంధుడు. ఈయన వ్రాసిన “గీత్ గాతా చల్ ఓ సాథీ… గున్ గునాతా చల్…” పాటలో అతను చూసి ఆ ఆనందాన్ని అనుభవించి వ్రాసినట్టే ఉంటుంది అది ఇక్కడ ఎందుకు చెబుతున్నానంటే అందులో సముద్రపు ప్రయాణాన్ని ఆస్వాదించి enjoy చేస్తారు.
ఇక కొన్ని థీమ్స్ తోని చేసిన షో లు జరుగుతూ ఉంటాయి. ఆ వేదికకు అంటే స్టేజ్ కి ఇరువైపులా ఇద్దరు నిలబడి ” dumb and deaf వాళ్లకు ఎక్స్ప్లెయిన్ చేసే తీరు ప్రశంసాత్మకంగా ఉంటుంది. ఆ దృశ్యం నిజంగా అద్భుతం. ఎంత శ్రద్ధగా చెప్తారో! ఇంకా అలాంటి వాళ్ళకి స్టాఫ్ చేసే సహాయం సదా అభినందనీయం. ఏది ఎవ్వరూ మిస్ కావద్దు అనేదే వాళ్ళ కాన్సెప్ట్. ఇది చాలా బాగుంది.
క్రూజ్ లో పెంపుడు జంతువులు, pets ను తీసుకువెళ్లలేము. కొన్ని ప్రత్యేకమైన ట్రైనింగ్ తీసుకున్న కుక్కలు మాత్రమే ప్రవేశం కలిగి ఉంటాయి దివ్యాంగులకు సహాయపడే ట్రైనింగ్ లాగా ఉండాలి. అది కాకుండా కుక్కలంటే చాలా ఇష్టం వాటిని వదిలి ఉండలేము భావోద్వేగాల మధ్య ఉండే రిలేషన్ షిప్ లో ఉన్న కుక్కలకు ప్రవేశం లేదు.
ఏరకమైన ట్రైనింగ్ తీసుకున్న కుక్కలేనా సరే వాటి ఆహారం యజమానులే తెచ్చుకోవాల్సి ఉంటుంది అంతేకాదు వాటికి యజమానులు అంటే ఓనర్స్ రెండు వారాల క్రితమే టికెట్ బుక్ చేసుకోవాలి. బుకింగ్ అప్పుడే వ్యాక్సినేషన్ ఇప్పించినట్టు ఇంకా హెల్త్ సర్టిఫికెట్ జత చేయాల్సి ఉంటుంది వాటి ఆహారంతో పాటు వాటి మందులు, వాటికి నీళ్ళల్లో ఉపయోగించే లైఫ్ జాకెట్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది.
క్రూజ్ లో WiFi ఉండదు. WhatsApp ల బాధ ఉండదు. బాదుడూ ఉండదు. Of course కొందరికి కావాలి. అయితే, ఒక ప్లేస్ లో డబ్బులు కట్టి చేసి ఉపయోగించుకోవచ్చు .
కానీ క్రూజ్ లో ATM సౌకర్యం కూడా ఉంటుంది ఇది ” casinos” లో ‘ cash ‘ దగ్గర ఉంటుంది చార్జెస్ కొంచెం భారీగానే ఉంటాయి క్రూజ్ లో క్యాష్ తోనే కొనే సౌకర్యం లేదు.
మరో ముఖ్యమైన విషయం ….సాధారణంగా క్రూజ్ లో పొగ త్రాగడం నిషేధం. కానీ కొన్ని areas లో స్పెషల్ గా స్మోక్ చేసే ప్రదేశాలు ఉంటాయి. NLC లో కెసినో దగ్గర పొగ తాగేందుకు కాసినో, casino దగ్గర అనుమతిఉన్నది.
19 వ డెక్ లో ఒక ” జకోజీ” , రెండు స్విమ్మింగ్ పూల్స్ ఒకటి పెద్దది మరోటి చిన్నది ఉన్నాయి. వాటికి ఎదురుగా చాలా పెద్ద T.V ఏర్పాటు చేశారు. ఒకపక్క బార్ ఇంకోపక్క రెస్టారెంట్ టీ కాఫీలు ఎక్కడున్నా ఫ్రీ ఇంకా ఏవేవో హాట్ డ్రింక్స్ అలాంటి వాటికి pay చేయాల్సి వస్తుంది.
Crew కు ప్రక్కల పెద్ద పెద్ద హీటర్స్ పెట్టారు మేము కాసేపు స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉండేసరికి చల్లగా అనిపించేదే అనుకోండి వెంటనే హీటర్స్ ఉన్న ప్లేస్ లోకి వెళ్లి నిలబడే వాళ్ళం.

ఇక, elevators గురించి కూడా చెప్పుకోవాల్సిందే! ప్రతి డెక్ లో రెండు ప్రక్కల ఇటు నాలుగు అటు నాలుగు ఎలివేటర్స్ ఉంటాయి. ఎప్పుడు ఫుల్ గా ఉంటుంటాయి ప్రక్కన వాల్పపైన బోర్డులో ఏ రోజు ఏ డెక్ లో ఏమి ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఏ రెస్టారెంట్ లో ఏఏ మెనూ ఉంది అనేది చూసుకునేలా ఏర్పరిచారు.
Cruise కు లోపల బయట C.C. camera లూ ఉంటాయి .‌ రెండు పక్కల స్క్రీన్ లలో సముద్రం పైన పడవ వెళ్లే దంతా చూడవచ్చు. 9 th డెక్ లో సోలు గా చిన్న చిన్న ఆటలు పెట్టేవాళ్ళు గేమ్స్ గెలిచిన వాళ్ళ ” Ticket to Florida అలాంటివి ఉంటాయి. 300 డాలర్లు 200 డాలర్లు అలా క్యాష్ ప్రైస్ కూడా ఉంటుంది.
ఇక్కడ సాధారణంగా Casinos ను బాగా ఇష్టపడతారు. అదికూడా డెక్ లోనే దాదాపు 24 గంటలు తెరిచే ఉంటుంది. Lucky draw లు కూడా ఉంటాయి వాటిలో వస్తే ‘ earrings’ లాంటి వి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇంకా ఓపెన్ చేయగానే ” first to come first to serve” పద్ధతిలో ఒకరోజు ” జువెలరీ ( 18 క్యారెట్స్, 16 క్యారెట్స్) వంటివి వాళ్ల నుండి ఆఫర్స్ కూడా ఉంటాయి.

(ఇంకా ఉంది)

November 30, 2025 6 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కవిత్వాస్వాదన ధారావాహిక విశ్లేషణా వ్యాసాలు

by Narendra Sandineni November 30, 2025
written by Narendra Sandineni

డాక్టర్ కొండపల్లి నీహారిణి వెలుగుల దారి కవిత సమాజానికి వెలుగును పంచిన కవిత ఓ విశ్లేషణ


ప్రముఖ కవయిత్రి,జర్నలిస్ట్,కొండపల్లి నీహారిణి కలం నుండి జాలువారిన వెలుగుల దారి కవితపై విశ్లేషణా వ్యాసం.వెలుగుల దారి అనేది మనిషి జీవన యాత్రను సమగ్రంగా ప్రతిబింబించే కవిత.జీవితం అనే ప్రయాణంలో మనిషి అనుభవించే ప్రకృతి సౌందర్యం,భావోద్వేగ సంబంధాలు,కష్టాలు, సంతోషాలు మరియు చివరికి సంతోషంతో కలిగే తృప్తి,జీవితం అనే ప్రయాణంలో ఎదురయ్యేవిగా భావించవచ్చు.ఈ కవితలో రూపకాలూ,ప్రతీకలూ, ఉపమానాలూ,సమన్వయంతో జీవితం యొక్క వివిధ దశలను ప్రతిఫలింపజేస్తాయి.ఈ కవిత మొత్తం మనిషి జీవితం ఒక యాత్ర,ఒక వెలుగు దారి,ఒక ప్రస్థానం అనే దృక్కోణంలో సాగింది. బాల్యం నుండి వృద్ధాప్యం వరకు మానవ జీవన ప్రయాణం ఏ విధంగా భావోద్వేగాలు,అనుభవాలు, సందేహాలు,సంతోషాలు,వేదనలతో నిండి ఉంటుందో కవితలో గంభీరంగా ప్రతిఫలించింది.కవయిత్రి నీహారిణి వెలుగుల దారి కవితా చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారిద్దాం.కవిత్వానుభూతుల లోకంలో విహరిద్దాం.

అనేకానేక వసంతాల ప్రకృతి/అనంతాకాశ దృక్కులు/జీవితాన్ని ప్రకృతిలో ఒదిగించి చూపిన ఈ కవితా పంక్తులు అనుభవాల విస్తారతను సూచిస్తాయి.వసంతాలు అంటే ఋతువులు కాదు. మనసులో పువ్వులా వికసించిన అనుభవాలు. అనంతమైన ఆకాశంలాగా ఈ అనుభవాలకు అవధులు లేవు అని చెప్పిన తీరు గొప్పగా ఉంది. అనేకానేక వసంతాల ప్రకృతి అనేది వ్యక్తి అనుభవాల వైవిధ్యాన్ని సూచిస్తుంది.వసంతాలు ఇక్కడ సంవత్సరాలను కాకుండా మనసులో పుట్టే కొత్త అనుభూతులను సూచిస్తాయి.అలాగే అనంతాకాశ దృక్కులు అనే కవితా పంక్తి జీవితంలోని అపారమైన దృక్పథాన్ని,విశాలమైన మనసును,ప్రపంచాన్ని చూసే విస్తారమైన చూపును సూచిస్తుంది.జీవితం ఒక గమ్యం కాదు.ఒక నిరంతర ప్రయాణం అని గుర్తు చేస్తుంది.
“కష్ట సుఖానుభవ సాగర పయనం/అనే కవితా పంక్తి జీవితం ఒక సముద్రయానం వంటిది అని సూచిస్తుంది.ఈ సముద్రంలో తరంగాల్లా కష్టాలు – సుఖాలు వరుసగా వచ్చి పోతూ ఉంటాయి.మనిషి వాటిని అధిగమిస్తూ ముందుకు సాగాలి అనే గొప్ప సందేశం ఇందులో ఇందులో ఉంది.
“ఓ పాత కాలపు ఆపాత మధుర గానం/అనే ఈ కవితా పంక్తి స్మృతి ప్రపంచాన్ని మన ముందుకు తెస్తుంది.మనిషి జీవితంలోని గత స్మృతులు ఒక మృదులమైన స్వరంలా మన చెవుల్లో మళ్లీమళ్లీ మార్మోగి మనసులో నిలిచిపోతాయి.ఇందులో అనుభూతి సున్నితంగా ఉంటుంది.సంగీతానికి సంబంధించిన ప్రతీక కొనసాగుతుంది.భావం సహజంగా మరియు సాహిత్య బద్ధంగా నిలిచిపోతుంది.పాతకాలపు ఆపాత మధుర గానం అనే రూపకం గత స్మృతుల మాధుర్యాన్ని ప్రతిపాదిస్తుంది.జీవితం వైపు తిరిగి చూసినప్పుడు గుర్తొచ్చే మధురమైన అనుభూతులు,మనిషికి ఓదార్పు నిస్తాయి అని కవయిత్రి స్పష్టపరుస్తున్నారు.
“మహావృక్ష రూపు,మనుగడ రూపు/సాధారణ బ్రతుకు చిత్రానికి ప్రేరణ/అసాధారణ భావ సౌందర్యానికి ఉదాహరణ/ఈ కవితా పంక్తులలో కవయిత్రి మనిషి జీవితాన్ని మహావృక్షంతో పోల్చారు.మహావృక్షం అనేది పరిరక్షణ,ఆశ్రయం, స్థిరత్వం,విస్తరణ అనే లక్షణాలతో నిండినది.అదే విధంగా మనిషి జీవితం కూడా కాలంతో పెరిగి, అనుభవాలతో విస్తరించి,తన చుట్టూ ఉన్నవారికి ఆధారంగా నిలుస్తుంది. మనుగడ రూపు అనేది జీవితం నిరంతరంగా కొనసాగుతూ తరతరాలకు మార్గాన్ని చూపించే శక్తిని సూచిస్తుంది.ఇలా మనిషి జీవితం ప్రతి రోజు సాధారణంగా కనిపించినప్పటికీ అది లోతైన అనుభవాలు,విలువలు,పరిపక్వతతో కూడినది.
“సాధారణ బ్రతుకు చిత్రానికి ప్రేరణ/సాధారణ బ్రతుకు చిత్రానికి ప్రేరణగా నిలిచే వ్యక్తులు మహావృక్షాల్లా మనుగడ సాగిస్తూ సాధారణ మనుషుల జీవితాలకు మార్గదర్శకులై నిలుస్తారు. నిజాయితీ,శ్రమ,నిబద్ధత,ప్రేమ వంటి విలువలు సాధారణ వ్యక్తుల జీవన విధానానికి శాశ్వత ప్రేరణ కలిగిస్తాయి.
“అసాధారణ భావ సౌందర్యానికి ఉదాహరణ/అనేది జీవితం సాదాసీదాగా కనిపించినా దానిలో దాగి ఉన్న భావోద్వేగాల విశాలత,సంబంధాల లోతు అనుభవాల అందం,చాలా అసాధారణమై ఉంటుంది అని తెలుస్తుంది.జీవితమే ఒక మహా వృక్షం.ప్రతి మనిషి జీవితం చిట్టచివరికి ఇతరులకు ప్రేరణగా నిలుస్తుంది.సాధారణ జీవితంలోని అసాధారణ సౌందర్యాన్ని చూపే ప్రయత్నం ఇది. జీవితం ఒక మహా వృక్షంలా విస్తరించడాన్ని సూచిస్తుంది.మనిషి బ్రతుకు సాధారణమైనదప్పటికి అందులో దాగి ఉన్న అసాధారణ సౌందర్యం,ప్రేరణ ఒక ముఖ్యమైన అంశంగా ఉంటుంది.ఈ కవితా పంక్తుల ద్వారా కవయిత్రి చెప్పేది మనిషి జీవితం మహావృక్షంలా నిలకడగా నిలుస్తుంది అని,దాని విస్తరించిన శాఖల వలె రోజు వారి బ్రతుకులో కనిపించే విలువలు మనకు ప్రేరణగా ఉంటాయి అని,ఆ జీవన ప్రయాణంలో నిక్షిప్తమైన భావ సౌందర్యం అసాధారణ ఉదాహరణగా నిలిచి మనిషిని సార్థకమైన జీవన గమ్యం వైపు నడిపిస్తుంది అనే గొప్ప సందేశాన్ని వ్యక్తం చేస్తున్నది.
“ఎన్ని గాలి దుమారాలో/ఎన్ని వడదెబ్బలో/అనేది సంసారంలో ఉన్న సహజ సంఘర్షణలను తెలియజేస్తుంది.జీవితంలో ఎదురయ్యే కష్టాలు, సామాజిక,ఆర్థిక,భావోద్వేగాలను ఈ భావాలు సజీవంగా ప్రతిబింబిస్తాయి.ఈ కవితా పంక్తులు జీవితం అందరికీ సవాళ్లతో కూడుకొని ఉన్నది అని ప్రతీకాత్మకంగా చెబుతాయి.మనిషి జీవన ప్రయాణంలో ఎదురయ్యే కష్టాలు,సంక్షోభాలు మరియు ప్రతికూల పరిస్థితులను ఈ పంక్తులు వ్యక్త పరుస్తాయి.ఇక్కడ గాలి దుమారం అనేది అకస్మాత్తుగా వచ్చిన సమస్యలను,జీవితాన్ని కుదిపేసే సంఘటనలను,మనసును దెబ్బతీసే ప్రతికూలతలను సూచిస్తాయి.అదే విధంగా వడదెబ్బ అనేది మనిషిని అలసటకు గురి చేసే దుస్థితులను,దీర్ఘకాలిక ఒత్తిడులను,శ్రమతో కూడిన దశలను మరియు ఆర్థిక భావోద్వేగ సమస్యల రూపాన్ని తెలియజేస్తుంది.మనిషిని ఎన్నో కష్టాలు, విపత్తులు పరీక్షకు గురిచేస్తాయి.మనిషి ప్రతికూలతలను ఎదుర్కొంటూ తన ఉనికిని కాపాడుకుంటూ ముందుకు సాగాలి అనే గొప్ప సందేశాన్ని అందిస్తుంది.
“జంట పక్షితో ఎగిరినప్పుడల్లా/తెలివయిన వృద్ధ పావురము వలతో/ఎగిరించినప్పటి మిత్రలాభ,మిత్ర భేద/కథల ప్రత్యక్షానుభూతి/ఈ కవితా పంక్తుల్లో
కవయిత్రి పంచతంత్ర కథలోని పావురాల సంఘటనను ఉదాహరణగా తీసుకున్నారు. పంచతంత్రం సాంప్రదాయకంగా నీతిని బోధించే కథల సమాహారం.అందులోని పావురాల కథ చిన్నప్పటి నుంచి స్నేహం,జాగ్రత్త,అనుభవం,వివేకం వంటి విలువలను బోధిస్తుంది.అందులోని కథ ఒక వేటగాడు చెట్టు కింద వల పరిచి గింజలు చల్లుతాడు‌.ఆ గింజలను చూసి చిన్న పావురాలు అమాయకత్వంతో వాటిని తినడానికి పరుగులు పెడతాయి.అయితే ఆ పెద్ద పావురం తన అనుభవంతో ఇది వేటగాడి ఉచ్చు అని హెచ్చరిస్తుంది.పెద్ద పావురం మాటలను పట్టించుకోకుండా చిన్న పావురాలు గింజల కోసం వెళ్లి వలలో చిక్కుకొంటాయి.పెద్ద పావురం మాట వింటే చిన్న పావురాలు వలలో చిక్కేవి కావు.చిన్న పావురాలకు ఈ దుస్థితి దాపురించేది కాదు.పెద్ద పావురం సూచనతో చిన్న పావురాలు వలతో పాటు ఎగిరిపోయి ప్రాణాలను కాపాడుకోవడం వల్ల వాటి కథ సుఖాంతమైంది.వృద్ధులు గొప్ప అనుభవజ్ఞులు. అటు వంటి వృద్ధుల మాటలు వినకపోతే ప్రమాదాల్లో చిక్కుకుంటారు.అనుభవం,జ్ఞానం, విచక్షణ,ముందస్తు జాగ్రత్తలు మనకు వృద్ధులు అందజేస్తారు.జీవితంలో అనుభవజ్ఞులైన పెద్దల సూచనలను గౌరవించాలి.ఉచ్చులో ఇరికించే ఆకర్షణీయమైన వాటికి దూరంగా ఉండాలి. ప్రమాదకరమైన వాటిని జాగ్రత్తగా పరిశీలించాలి అని కవయిత్రి తెలియజేస్తున్నది.అనుభవం లేని తప్పుడు నిర్ణయాలు జీవితాన్ని సంక్షోభంలో పడేస్తాయి.జ్ఞానులైన పెద్ద వారు చేసిన సూచనలు జీవితాన్ని రక్షిస్తాయి.పెద్దవారి మాట వినకపోతే పిల్లల భవిష్యత్తు అంధకారం అవుతుంది. అవివేకంతో తీసుకున్న నిర్ణయాల వల్ల వారి భావి జీవితం ప్రమాదంలో పడుతుంది.పెద్దల మాట చద్దన్నం మూటగా భావించాలి అనే సందేశం ఇందులో ఉంది.
“ఒంటరి గమనపు సావధానతకూ/జంటల అనుసంధానాల పొందిక/కవయిత్రి మనిషి జీవన ప్రయాణాన్ని రెండు విరుద్ధ రూపాలలో చూపిస్తూ వాటి అంతర్భావాన్ని కళాత్మకంగా ప్రతిపాదించింది. ఈ కవితా పంక్తుల్లో ఒంటరి గమనం అనేది వ్యక్తి స్వయంగా ఎదుర్కొనే జీవన మార్గానికి ప్రతీక. ఒంటరిగా ప్రయాణించడం అంటే నిర్ణయాలు, సందేహాలు,జాగ్రత్తలు – All are solely one’s responsibility.అందుకే దీనిని సావధానత అనే పదంతో అర్థవంతం చేసింది.ఒంటరితనం మనిషిలో నిగూఢమైన జాగ్రత్తను,ప్రతి అడుగులో చిత్తశుద్ధితో, పరిసరాల పట్ల అప్రమత్తతను కలిగి ఉండాలి అనే భావన.దీనికి విరుద్ధంగా జంటల అనుసంధానాల పొందిక అనే కవితా పంక్తి మనిషి సంబంధాల సౌందర్యాన్ని ప్రతిబింబిస్తుంది.జంటగా లేదా సమూహంగా ఉన్నప్పుడు జీవితం సులభతరం అవుతుంది.బాధ్యతలు పంచబడతాయి.ప్రయాణం మరింత సురక్షితమవుతుంది.అనుసంధానం అనే పదం ఇక్కడ బంధాలు,సహకారం,పరస్పర నమ్మకం,జీవనంలో భాగస్వామ్యం వంటి విలువలను సూచిస్తుంది.పొందిక అనే పదం ఆ అనుసంధానాల లోతైన బంధాన్ని,అందాన్ని, సమన్వయాన్ని తెలియజేస్తుంది.ఈ కవితా పంక్తుల ద్వారా కవయిత్రి ఒక గాఢమైన జీవిత సత్యాన్ని చెబుతున్నది.మన జీవితం ఒంటరితనపు బాధ్యతలతో పాటు సంబంధాలు పరస్పరానుబంధాలతో కూడిన సమ్మేళనం. ఒంటరిగా నడిచే చోట కాస్త జాగ్రత్త అవసరం.కలిసి నడిచే చోట బలము,ధైర్యం,ఆత్మవిశ్వాసం ఉంటాయి.జీవితంలో కొన్ని దారులలో మనమే ఒంటరిగా సావధానంగా నడవాలి.ఆ సావధానతే పరిపక్వత.ఒంటరితనంలో అవసరమైన అప్రమత్తతను,సంబంధాలలో దాగిన బలం పొందికలను హృద్యంగా ప్రతిపాదిస్తూ జీవితం రెండు ధోరణుల సమతుల్యతతోనే పూర్ణం అవుతుందని కవయిత్రి తెలుపుతున్నది.
“వృద్ధాప్యమనే వరద గూడు ఒకటేదో/త్రికాల సమేత ప్రేమామృత జల్లు కురిసే/ఈ కవితా పంక్తులు వృద్ధుల హృదయంలోని అపారమైన ప్రేమను, సహకారాన్ని,ఆశీర్వాదాల్ని ప్రతీకాత్మకంగా చూపిస్తాయి.వరద గూడు అనే రూపకం ఇక్కడ చాలా గంభీరమైన అర్థాన్ని సూచిస్తుంది.వరద గూడు కనిపిస్తే వర్షం పడబోతుందనే సంకేతం. వృద్ధులైన పెద్దలు తమ కుటుంబంలో తమ పిల్లలు కష్టాల్లో ఉన్నారని తెలిస్తే చాలు వెంటనే వారు కురిసే వరుణ జల్లులా సాయం అందిస్తారు.పిల్లలపై అంతు లేని ఆదరణను చూపిస్తారు.వారి ప్రేమకు కాల పరిమితి లేదు.అది త్రికాల సమేత ప్రేమామృత జల్లులా – గతాన్ని జ్ఞాపకం చేసుకుంటూ వర్తమానాన్ని అర్థం చేసుకుంటూ,భవిష్యత్తును ఊహిస్తూ సాగుతూనే ఉంటుంది.వృద్ధులను బలహీనులుగా చూస్తారు.కానీ వృద్ధుల ప్రేమ వర్షం లాంటిది.పిల్లలు కష్టాల్లో ఉన్నప్పుడు వారు తమకు చేతనైన సహాయం చేస్తారు.వారు చేతులు ముడుచుకొని కూర్చోరు.ఆకాశంలోని మేఘాల్లా తమ ప్రేమను,సాంత్వనను,సహానుభూతిని జల్లులుగా కురిపిస్తారు.ఈ కవితా పంక్తులు వృద్ధుల ప్రేమను వర్షంతో పోల్చుతూ జీవన సత్యాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
త్రికాల సమేత ప్రేమామృత జల్లు అనే రూపకం వారి ప్రేమ గతం,వర్తమానం,భవిష్యత్తులలో నిరంతరం ప్రదర్శితం అవుతుందని సూచిస్తుంది.
“బాల్య పూచెండు పులకరింతలు/యవ్వనపు ఉలికిపాటులు/సముద్రమంత సహన సదృశ్యమయి/ఒకానొక చరమాంకపు చలన గీతాన్ని/సందేశంగా ఆలపించు/ బాల్య పూచెండు పులకరింతలు అనేది బాల్యంలోని ఆనందాన్ని,అమాయకత్వాన్ని కవయిత్రి ఇక్కడ పూచెండుతో పోల్చింది.పూలచెండు అనే రూపకంలో బాల్యంలోని అమాయకత్వం,నిర్మలత్వం,అల్లరి నవ్వులు,చిన్నచిన్న విషయాలకు ఉప్పొంగే ఆనందాలు స్పష్టమవుతాయి.బాల్యం అంటే వికసించే పుష్పం.బాల్యం కూడా అచ్చం పుష్పం లాంటిదే.బాల్యం అమాయకత్వంతో కూడిన చిన్న చిన్న సంతోషాలకు మురిసే నవ్వులతో కూడినట్టిది. పులకరింతలు అనే పదం బాల్యంలోని ఉప్పొంగే ఆనందాలను సూచిస్తుంది.ఈ కవితా పంక్తి బాల్యపు పరిమళభరితమైన,అందమైన,ఆశ్చర్యభరితమైన ప్రపంచాన్ని ప్రతిబింబిస్తుంది.

యవ్వనపు ఉలికిపాటు అనేది బాల్యాన్ని వెన్నంటి వచ్చే యవ్వన దశలోని భావోద్వేగాల కలయికను కవయిత్రి ఉలికి పాటులు అనే పదం ద్వారా తెలియ జేస్తుంది. యవ్వనం అల్లకల్లోలమైన భావోద్వేగాల ఉద్ధృతిని తెలియజేస్తుంది.యవ్వనం అంటే ఆశలు,వెర్రితనాలు,అస్థిరతలు,ఆత్రుతలు అన్నీ కలిసిన దశ.యవ్వనం అంటే వికాసపు శిఖరం, భావోద్వేగాల అల్లకల్లోలం.ఉలికిపాటు అనే పదంలో భావోద్వేగాల క్షోభ,ఆత్రుతలు,ఉద్రిక్తతలు దాగి ఉన్నాయి.యవ్వనంలో మనసు వేగంగా పరుగులు తీస్తుంది.ఆశలు ఉబికి వస్తాయి.జీవితంపై ఎనలేని తపన పెరుగుతుంది.ఈ కవితా పంక్తిలో యవ్వన దశలోని అస్థిరత,ఉత్సాహం,ఆందోళన,బలంగా ప్రతిఫలిస్తుంది.యవ్వనపు భావావేశాలను, భావోద్వేగాల జ్వాలలను,అలజడి గాలులతో ఊగే చెట్టును ఈ కవితా పంక్తి సూచిస్తుంది.
సముద్రమంత సహన సదృశ్యమయి అనేది ఇక్కడ కవయిత్రి పరిపక్వతను సముద్రంతో సారూప్యం చేస్తున్నది.సముద్రం లోతుగా,విశాలంగా,గంభీరంగా ఉంటుంది.అందులో ఎన్నో అలలు,కల్లోలాలు వచ్చినా అది తన పరిధిని కోల్పోదు.అదే విధంగా జీవితపు అనుభవాలు మనిషికి సహనం,స్థిరత్వం, లోతైన అవగాహనను అందిస్తాయి.ఇది పెద్దరికం, పరిపక్వత,సంయమనశీలతను ప్రతిబింబించే భావ చిత్రం.వృద్ధాప్య దశలో సముద్రం లాంటి గాంబీర్యం, స్థిరత్వం,పరిపక్వత ఉంటుందని కవయిత్రి తెలియజేస్తుంది.

“ఒకానొక చరమాంకపు చలన గీతాన్ని సందేశంగా ఆలపించు/ఇదే కవిత యొక్క మర్మసందేశాన్ని ఇచ్చే చివరి పంక్తి.ఇక్కడ చరమాంకపు చలన గీతం అనగా జీవితం చివరికి మనం మిగిల్చే జీవన సందేశం,అనుభవాల సారం,తర్వాత తరాలకు నేర్ప గల పాఠం.బాల్యంలో ఉన్న అమాయకత్వం, యవ్వనంలో వచ్చిన కదలికలు,పెద్దరికంతో పొందిన సహనం,ఇవన్నీ కలిపినప్పుడు జీవన గాథ ఒక గీతంలా మారుతుంది.ఈ గీతం ఇతరులకు శబ్దం కాదు.ఒక విలువైన సందేశం.జీవితాన్ని ఎలా గడపాలి?జీవితాన్ని ఎలా తట్టుకొని నిలవాలి? జీవితాన్ని ఎలా ప్రేమించాలి?అని నేర్పేది చలన గీతం.మనిషి జీవితం చివరికి ఒక బోధగా,ఒక మార్గదర్శినిగా మారుతుంది అని ఈ కవిత తెలుపుతుంది.చివరికి జీవితం ఒక సందేశమే.మన తర్వాత తరాలకు చెప్పే పాఠమే.ఈ కవితా పంక్తి మొత్తం కవితను దార్శనిక భావంతో ముగిస్తూ జీవిత యాత్ర ఒక పాటలా,ఒక ప్రవాహంలా,ఒక సందేశాత్మక అనుభవంలా ఉందని తెలియజేస్తుంది. ఈ కవితా పంక్తులు కలిపి మనిషి జీవన ప్రస్థానాన్ని అద్భుతంగా చిత్రిస్తాయి.బాల్యం పూసే పువ్వుల అమాయక సౌందర్యం,యవ్వనం గాలి అలికిడికి వచ్చే ఉద్వేగం,పెద్దరికం సముద్రం లాంటి సహనం ఈ మూడు దశల అనుభవాలను ఒక చలన గీతంగా రాబోయే తరాలకు కవయిత్రి అందించడం జరిగింది.
“సంతాన సమాదరణల చెమరింతలు/
సంతసానంద హేలల చిగురింతలు/
కావడి కుండల‌ గాథలు నడిచొచ్చు/నవతరాల నవ దిక్సూచి ‘వయసు పండిన’ వెలుగు దారి/ఈ కవితా పంక్తులు కుటుంబ జీవితంలో సంతానంతో వచ్చిన ఆనందాలు,తల్లిదండ్రుల అనుభవాల పరిపక్వత, భవిష్యత్తు తరాల మార్గదర్శకత వంటి లోతైన భావాలను అందంగా ప్రతిబింబిస్తున్నాయి.
సంతాన సమాదరణల చెమరింతలు ఈ కవితా పంక్తి తల్లిదండ్రులకు పిల్లల వలన కలిగే ఆదరణ, ప్రేమ ఇంటి నిండా కలిగే ఉత్సాహం గురించి చెబుతుంది.చెమరింతలు అనే పదం పిల్లల వల్ల కలిగే ఆనందపు జిలుగులు,ఇంటిలో వెలిగే పులకరింతల కాంతి రూపాన్ని వ్యక్తం చేస్తుంది. తల్లిదండ్రుల జీవితంలో సంతానమే వెలుగు, సంతోషాలకు నెలవు అని కవయిత్రి వ్యక్తం చేసింది.
“సంతసానంద హేలల చిగురింతలు/ఈ కవితా పంక్తి పిల్లల నవ్వులు,చిలిపితనాలు,చిన్నచిన్న అల్లర్లు, అల్లరి హేలల వల్ల ఇంట్లో చిగురించే కొత్త సంతోషాలను సూచిస్తుంది.చిగురింతలు అనే పదం కొత్తగా మొలకెత్తే ఆనందాలు అనే భావాన్ని బలంగా వ్యక్తం చేస్తున్నది.పిల్లల వల్ల ఇంటిలో ఒక పండుగ వాతావరణం నెలకొన్నది అని కవయిత్రి తెలియజేస్తుంది.
“కావడి కుండల‌ గాథలు నడిచొచ్చు/ఇది ఈ కవితలో ప్రాసంగికమైన రూపకం.భుజానికి రెండు వైపులా కావడి కుండల‌ను తగిలించి మోస్తున్నట్లుగానే జీవితంలో కూడా ఒక వైపు సుఖం, మరో వైపు దుఃఖం,ఒక వైపు విజయం,మరో వైపు ఓటమి,ఒకవైపు సుఖమైన బాధ్యతలు,మరో వైపు నిర్వహించాల్సిన కఠినమైన కర్తవ్యాలు అన్ని సమతుల్యంగా కావడికుండల్లా బాధ్యతగా మోస్తూ మనిషి ముందుకు నడవాల్సిందే.తల్లిదండ్రుల జీవితంలో కూడా సంతోషాలు,కష్టాలు రెండు కలిసి ఉంటాయి.ఇది జీవిత సమతౌల్యం,కుటుంబాన్ని భుజాలపై మోస్తూ నడిచే జీవన పరంపర కథ.
“నవతరాల నవ దిక్సూచి ‘వయసు పండిన’ వెలుగు దారి/ఈ కవితా పంక్తి మొత్తం కవితకు తాత్విక పరాకాష్టను అందిస్తుంది. వయస్సు పండిన వెలుగు దారి అంటే అనుభవం సంపాదించిన పెద్దల జ్ఞానం, తర్వాత తరాలకు దిక్సూచి మార్గదర్శిని అవుతుంది.జీవితంలో చూసిన అనుభవాలు, కష్టసుఖాలు కావడి కుండల గాథలు,తల్లిదండ్రులు కురిపించిన ప్రేమాభిమానాలు ఇవన్నీ రాబోయే తరాలకు వెలుగు చూపే బాటగా మారతాయి.పెద్దల అనుభవం పిల్లలకు మార్గదర్శకం అవుతుంది. తల్లిదండ్రుల జీవితం నవతరాలకు దిక్సూచి వలె నిలుస్తుంది. ఈ కవితా పంక్తులలో ఒక అందమైన జీవిత చిత్రం కళ్ళముందు కదలాడుతుంది.పిల్లలు తల్లిదండ్రుల జీవితాన్ని రంగుల మయం చేస్తారు. బుడిబుడి అడుగుల పిల్లలు చేసే అల్లరి,వారు చిందించే నవ్వులు,వారు చూపించే అపురూపమైన ప్రేమ,తల్లిదండ్రుల హృదయంలో సంతోషాలను నింపుతాయి.కుటుంబ జీవితం ఎప్పుడు సుఖదాయకం కాదు.కష్టసుఖాలు అనే రెండు కుండలను కావడిలా మోస్తూ నడవాలి.ఆ ప్రయాణంలో వచ్చిన అనుభవాలు చివరి తరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయి.ఇది కుటుంబంలో ప్రేమ, బాధ్యత,అనుభవం,విలువలు,తరాల అనుబంధం గురించి చెప్పే హృదయాన్ని స్పర్శించే కవిత.ఈ కవిత మన జీవన యాత్ర సుఖదుఃఖాల సంగమం. సంసారంలోని సరిగమల సౌందర్యంతో కూడిన జీవన సార స్ఫూర్తితో నిర్మించిన గొప్ప కవిత.ప్రతి దశలోని భావాలను రూపకాలుగా,ప్రతీకలుగా, అనుభవాల తీగలుగా అల్లుతూ కవి వెలుగుతో నిండిన జీవన దృశ్యాన్ని ప్రదర్శించింది.వెలుగుల దారి కవిత మనిషి జీవితాన్ని ప్రకృతి,అనుభవ సంపద,మానవ సంబంధాలు,వయస్సు,ప్రేమ, బాధ్యత మరియు కాలచక్రాలతో సమన్వయంగా చూపించిన ఒక జీవన దార్శనిక కవిత.ఇందులోని రూపకాలు,తాత్వికత,భావవిశాలత,పాఠకుడి ఆత్మ పరిశీలనకు జీవన సారాంశాన్ని గ్రహించేందుకు దోహదపడతాయి.చక్కటి కవితను అందించిన కవయిత్రి కొండపల్లి నీహారిణి గారిని అభినందిస్తున్నాను.వారు మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

November 30, 2025 6 comments
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

అచ్చంగా వినిపించే మరో స్త్రీవాద స్వరం – రేణుక అయోలా కవిత్వం

by ShailajaMitra November 30, 2025
written by ShailajaMitra

              ఆధునిక తెలుగు కవిత్వంలో రేణుక అయోలా ఒక ప్రత్యేకమైన గళం. ఆమె రచనల్లో మనసు, మనిషి, సమాజం, స్త్రీ అస్తిత్వం అనే అంశాలు సహజంగా కలిసిపోయి జీవనానుభవాలకు అక్షరరూపం ఇస్తాయి. జీవితాన్ని గమనించే కవయిత్రి చూపు లోతైనది, కానీ ఆ లోతు మృదుత్వంతో కూడినది. సున్నితమైన స్త్రీ మనసు లోతుల్లో పెరుగుతున్న బాధ, నిశ్శబ్దం, ప్రశ్నలు, ప్రతిఘటనలు ఇవన్నీ ఆమె కవిత్వంలో బలమైన శబ్ధంగా మారతాయి. రేణుక అయోల కవిత్వం స్త్రీని కేవలం బాధితురాలిగా కాదు, బలమైన వ్యక్తిత్వంతో కూడిన సజీవ ఆత్మగా చిత్రిస్తుంది.
           రేణుక అయోలా గారు గంటి కపర్ది మరియు గంటి హేమలతల దంపతుల కుమార్తె. ఆమె పుట్టిన ఊరు ఒడిశాలోని కటక్‌, ప్రస్తుతం నివాసం హైదరాబాద్‌. భర్త అరుణ కుమార్‌ అయ్యల సోమయాజుల. ఈ కుటుంబ నేపథ్యం ఆమె ఆలోచనలకు, సాహిత్యానికి ప్రేరణగా నిలిచింది. ఆమె జీవిత అనుభవం, గమనించే కళ్ళు, స్త్రీ జీవితం పట్ల ఉన్న లోతైన అవగాహన కవిత్వంలో ఒక వాస్తవికతను కలిగిస్తాయి. ఆమె కవిత్వం పఠించినపుడు మనకు ఒక మానవతా తత్త్వం, సామాజిక అవగాహన, స్త్రీ అవేదన, ఆత్మగౌరవం వంటి అనేక పొరలు కనిపిస్తాయి.

            రేణుక అయోల సాహిత్య ప్రస్థానం విస్తారమైనది. ఆమె రచించిన పుస్తకాలు పడవలో చిన్ని దీపం (2006), లోపలి స్వరం (2012), ఎర్రమట్టి గాజులు (2019), రవిక (2025) ఇవన్నీ కవితా సంపుటాలుగా విడుదలై వీరి మనోభావాలకు ప్రతిబింబంలా మిగిలాయి. అలాగే కథాసంపుటి రెండు చందమామలు (2008), దీర్ఘకావ్యాలు మూడవ మనిషి(2015), పృధ ఒక అన్వేషణ (2021) వంటి గ్రంథాలు ఆమె కవిత్వపు వైవిధ్యాన్ని, ఆలోచనల లోతును స్పష్టంగా చూపిస్తాయి. ఇటీవల కాలంలో రచించిన మరొక కవితా సంపుటి (రవిక) స్త్రీవాద కవిత్వానికి తార్కాణం గా నిలిచింది.

           రేణుక అయోలా కవిత్వం స్త్రీ జీవితం మీదే ప్రధానంగా తిరుగుతుంది. కానీ అది కేవలం ఫిర్యాదుగా, బాధగా నిలవదు. ఆమె స్త్రీని ప్రశ్నించే వ్యక్తిగా, తన ఉనికి గురించి సమాజాన్ని నిలదీసే స్వరంగా చూపుతుంది. ‘‘జీవితం గాజు పెంకు లోతుగా గుచ్చుకున్నంత బాధ’ అని వీరు రాసిన వాక్యం, జీవితం అనే పాదరసంలో స్త్రీ అనుభవించే వేదనను స్పష్టంగా చెబుతుంది. అయితే ఆ బాధలోనే బలం ఉంది. రేణుక అయోల కవిత్వంలో ఆ బలం కనిపిస్తుంది.

           సమాజంలో స్త్రీపై జరిగే అన్యాయాన్ని ఆమె కేవలం వర్ణించరు. ప్రశ్నిస్తారు. వీరి కవిత్వం నిర్భయమైనది, నిర్లజ్జమైన సమాజాన్ని ఎదుర్కోవడానికి సిద్ధమైనది. ‘‘ఈ దేహాలకి పేర్లు లేవు’’ అనే కవితలో ఆమె స్త్రీ దేహంపై పురుషుడి కామ దృష్టిని తీవ్రంగా ఖండిస్తుంది. ఈ కవిత ఆవేదనలోంచి పుట్టిన తిరుగుబాటు స్వరం. మగవారి దృష్టిలో స్త్రీ కేవలం దేహంగా కనిపిస్తే, రేణుక ఆ దేహానికే అర్థం ఇవ్వడం ద్వారా అతని అజ్ఞానాన్ని చీల్చేస్తుంది. ‘‘మా పేరు మాదే, మా ఉనికి మాదే’’ అనే పాదాలు స్త్రీ ఆత్మగౌరవానికి అక్షరరూపం.

       రేణుక అయోలా కవిత్వం స్త్రీవాదమా కాదా? స్త్రీలపై అనేకమంది కవిత్వం రచిస్తున్నారు. స్త్రీ బాధలను ఎత్తి చూపుతున్నారు. స్త్రీకి అన్యాయం జరుగుతోందని ఎలుగెత్తి తమ భావాల ద్వారా ఎలుగెత్తి చాటుతున్నారు. అలాగని అవి స్త్రీవాదాలు కావు. కాలేవు. కారణం ప్రపంచంలో వున్న అనేక సమస్యలపై కవి స్పందించినట్లే స్త్రీ అస్తిత్వం కూడా ఒక సమస్యగా తీసుకుని చర్చిస్తున్నారు. కానీ రేణుకా అయోలా అలా కాదు. నిలదీసి ప్రశ్నిస్తున్నారు. ఒక విధంగా స్త్రీ జీవితాన్ని విడమరచి చూపుతూ.. అనేక సమాధానాలు లేని ప్రశ్నల్ని లేవనెత్తుతున్నారు. కనుకనే నేను వీరి కవిత్వం స్త్రీ వాదమనే చెబుతున్నాను.  ఆమె కవిత్వంలో స్త్రీ సమస్యలను ప్రస్తావించినప్పటికీ, అవి మనిషి మనుగడకు సంబంధించినవే. స్త్రీని అణచివేసే సమాజపు ధోరణి, మనిషిని బంధించే యాంత్రిక జీవనశైలి, మానవ సంబంధాలలో పెరుగుతున్న నిశ్శబ్దం ఇవన్నీ ఆమె పదాల్లో ముడిపడి వస్తాయి. ‘‘ఆమె అతను ఒకే ఇంట్లో…మాటలు ఉండవు’’ అనే కవితలో ఆమె ఆధునిక దాంపత్య జీవితంలోని నిశ్శబ్దాన్ని ఎంత చక్కగా చిత్రించిందో గమనిస్తే మనసు కదిలిపోతుంది. కరెంటు పోయినప్పుడు వచ్చిన చీకటిలో ఇద్దరు ఒకరినొకరు చూసుకుని మాటలు మాట్లాడటం, ఆ చీకటి వారి జీవితంలో వెలుగుగా మారడం  ఇది కేవలం ఒక కవిత కాదు, ఒక ప్రతీక.

        ఆధునిక మనిషి సంబంధాల్లోని శూన్యతను, టెక్నాలజీ మధ్య చిక్కుకున్న భావనలను ఈమె ఎంతో సాధారణమైన సంఘటనతో ఆవిష్కరిస్తారు. వీరి కవిత్వంలో భాష సాధారణమే కానీ లోతైన అర్థాలను మోస్తుంది. రేణుక అయోలా పదాలను అలంకారంగా కాకుండా ఆత్మనిశ్వాసంగా వాడుతారు. ప్రతి వాక్యం వెనుక ఒక చలించిపోయిన అనుభవం ఉంటుంది. వీరి వ్యక్తీకరణలో భాష నిప్పులా మండుతుంది, కానీ అదే సమయంలో కరుణగా కూడా ఉంటుంది. ఉదాహరణకు ‘‘ఏ విలువలేని ఆడతనం కోసం ఆమె గుమ్మం దాటకుండా హక్కుల్ని అడిగింది’ అనే వాక్యం, స్త్రీ స్థితిని నిర్లక్ష్యం చేసే సమాజం మీద ఒక పదునైన బాణంలా ఉంటుంది. ఆమె కవిత్వంలో ఉన్న వేదన నిస్సహాయతను కలిగించదు. ప్రతిఘటనను పెంచుతుంది.

              రేణుక అయోల కవిత్వం ఒక రకంగా సమాజ దర్పణం. వీరి పదాల్లో మనకు మనమే కనిపిస్తాం. వీరు రాసిన అసహ్యం వంటి కవితలు, మన సమాజంలో మహిళల పట్ల ఉండే అసభ్యపు మాటలు, అనాగరిక భావనలను సూటిగా అద్దంలో చూపుతాయి. ఆ అద్దం భయపెడుతుంది, కానీ ఆ భయం మనలో మార్పుని రగిలిస్తుంది. ఈ మార్పే రేణుక కవిత్వం ఉద్దేశం. వీరి కవిత్వంలో మరో ప్రత్యేకత. నిశ్శబ్దాన్ని కూడా ఆమె పదంగా మార్చగలగడం. ‘‘మాటలు ఉండవు’అనే పదం ఆమె రచనల్లో తరచుగా వినిపిస్తుంది. కాని ఆ నిశ్శబ్దం కూడా ఒక భాష. స్త్రీ జీవితంలోని నిశ్శబ్దం, దాచుకున్న భావనలు, చెప్తే వినబడవు అన్న భయం ఇవన్నీ ఆమె కవిత్వంలో సంభాషణగా మారుతాయి. కవయిత్రి గుండె లోతుల్లో ఉన్న ఆ నిశ్శబ్ధ కేకలు పాఠకుడి మనసును తాకుతాయి.

             రేణుక అయోలా రచనల్లో ప్రకృతి, సమాజం, మనిషి ఇవి ఒకే దారిలో కదులుతాయి. వీరి కవిత్వం లోపలి స్వరం. ఆ స్వరం కొన్నిసార్లు మృదువుగా, కొన్నిసార్లు అగ్నిలా ఉంటుంది. ఆమె సాహిత్యంలో స్త్రీ సున్నితత్వం, సామాజిక సత్యం, ఆత్మపరిశీలన అనే త్రివేణి సంగమం ఉంటుంది. మూడవ మనిషి వంటి దీర్ఘకావ్యంలో హిజ్రాల వేదనను ఆమె మనసుకి చేరే భాషలో చెబుతుంది. ఇది కేవలం సాహిత్యం కాదు మానవతా ప్రకటన.

           రేణుక అయోల కవిత్వం ద్వారా సంధించే ప్రశ్నలు సమాజంపై, మనసుపై, సంబంధాలపై. ‘‘ప్రశ్న అనేది జీవితానికి బలమైన ఆయుధం’అని ఆమె చెప్పినట్లుగా, ఆమె కవిత్వంలో ప్రశ్నలే ఆయుధాలు. ఈ ప్రశ్నలు మనలో ఆత్మపరిశీలన రేపుతాయి. ఒక కవయిత్రిగా వీరి పాత్ర కేవలం రాయడం కాదు, మనసులను కదిలించడం.

            వీరు రాసిన ప్రతి పద్యం సాహిత్యంగా మాత్రమే కాదు, ఒక తాత్విక చింతనగా నిలుస్తుంది. ఆమె చూపు గృహస్థ జీవితం, సామాజిక అసమానతలు, టెక్నాలజీ ప్రభావం, మానవ సంబంధాల వైఖరి అన్నీ సమానంగా గమనిస్తుంది. రేణుక అయోల కవిత్వం చదివినపుడు మనం జీవితం గురించి ఆలోచిస్తాం. మనలోని మౌనాన్ని వినిపించుకుంటాం.రేణుక అయోల కవిత్వం యొక్క మూలం సత్యం. ఆమె తాను చూసినది, అనుభవించినది, ఆలోచించినదే రాస్తారు. ఆమె పదాలు ఉపమానాల వెనుక దాక్కోవు. అవి నేరుగా మనసును తాకుతాయి. ఆమె కవిత్వం పాఠకుడిలో దాగి ఉన్న మానవత్వాన్ని మేల్కొలుపుతాయి. తన రచనలతో రేణుక అయోలా అనేక పురస్కారాలు అందుకున్నారు.  వారణాసి వెంకట శోభ స్మారక సాహిత్య ప్రతిభా పురస్కారం, అన్నమయ్య సాహితి పురస్కారం, ఇస్మాయిల్‌ సాహితి పురస్కారం, లేఖిని మాతృదేవో పురస్కారం, జోత్స్నన కళాపీఠం పురస్కారం వంటివి ఆమె సాహిత్య ప్రాభవానికి నిదర్శనం.

          కవయిత్రి రేణుక అయోల కవిత్వం చదివితే మనం మన సమాజాన్ని కొత్త కళ్ళతో చూస్తాం. ఆమె అక్షరాలు కేవలం పాఠాలు కాదు, అనుభవాల రక్తంతో రాసిన వాక్యాలు. ఆమె పదాల్లో ఒక స్త్రీ స్వరం మాత్రమే కాదు, ఒక కాలపు మనసు ఉంది. ఆమె కవిత్వం మనలో ఆలోచన, ఆవేదన, ఆవిష్కరణ అన్నింటినీ కలిగిస్తుంది. ఈ విధంగా రేణుక అయోల సాహిత్యం ఆధునిక తెలుగు కవిత్వంలో ఒక సాక్ష్యంగా నిలుస్తుంది స్త్రీ భావోద్వేగాలకి, మనిషి బాధలకు, నిశ్శబ్దపు చీలికలకు అక్షరరూపం ఇచ్చిన ఓ జీవన ధ్వని. ఆమె కవిత్వం నేడు అవసరమైన స్వరం ప్రశ్నించే స్వరం, నిలదీసే స్వరం, ఖచ్చితమైన మార్పు కోరుకునే స్వరం. ఉదాహరణకు  ’’గాయమైన గానం’కవితలోని అద్భుతమైన దృశ్యాత్మక భాగం. ‘‘కొండ అంచుల నుండి/వాగుల అలల మీద నడుస్తూ/ప్రాణాలకి అడుగున ఉన్న/సుతారపు తీగల్ని కదిలిస్తోంది/ నిర్జన మైదానాల మీద/ వెన్నెల వెలుగుల తెరల్లా చల్లగా’’ ఈ  పంక్తులలో ఒక అంతర్మధన గమనం కనిపిస్తుంది. కవయిత్రి మనసు కొండ అంచుల మీద నిలబడి, తనలోని అంతర్భావాల వాగుల మీద నడుస్తూ జీవన నాడులను తాకుతోంది. ‘‘ప్రాణాలకి అడుగున ఉన్న సుతారపు తీగలు’ అనేది అద్భుతమైన రూపకం.  మనసులోని అత్యంత సున్నితమైన భావాల్ని సూచిస్తుంది. అవి కదిలినప్పుడు గానం పుడుతుంది, ఆ గానం కొన్నిసార్లు గాయమైనది కూడా కావచ్చు.,  ‘‘నిర్జన మైదానాల మీద వెన్నెల వెలుగుల తెరల్లా చల్లగా’ఈ వాక్యం వేదనలోని శాంతిని, చీకటిలోని వెలుగును ప్రతిబింబిస్తుంది. నిశ్శబ్దం మధ్య వెలుగుల చల్లదనం అనేది కవయిత్రి అంతరాత్మలోని సాంత్వన. ఈ కవిత భాగం మనసులోని గాయాలు మరియు గానం మధ్య ఉన్న సున్నితమైన సంబంధాన్ని తెలియజేస్తుంది. గాయమే గానంగా మారుతుంది.  వేదన సౌందర్యంగా మారుతుంది. రేణుక అయోలా గారి కవిత్వానికి ఇది ప్రత్యేక లక్షణం బాధలోనూ ఒక అందం, నిశ్శబ్దంలోనూ ఒక సంగీతం ఉంటుంది. జీవితం కొండ అంచుల్లా కఠినమైనదైనా, మనసులో ప్రవహించే వాగుల అలలు ఎప్పటికీ గమనం ఆపవు. ఆ అలల్లో కదిలే ప్రతి సుతారపు తీగ ఒక గాయమైన గానంలా మనసును తడుపుతుంది.

          రేణుక అయోలా గారి ‘‘ఎర్రమట్టి గాజులు’కవితలోని హృదయాన్ని తాకే భాగాన్ని గమనిస్తే..  అవి వీరి సాహిత్య దృష్టిలోని లోతైన స్త్రీ అనుభూతి, మాతృబంధం, కాలంతో పోరాడే ఆడపిల్ల యొక్క మౌన ప్రతిఘటనను ప్రతిబింబిస్తాయి. ఇక్కడి భావనను విశ్లేషిస్తే ‘‘కాలం గీసిన గీతాలు చూపిస్తున్నాయి. గీతాలు ఊరు చేరనివ్వని రాతలు/నాకోసం ఎదురు చూసే గాజుల చేతులు’’ ఇక్కడ ‘‘కాలం గీసిన గీతాలు’అనేది స్త్రీ జీవితంలోని విధి రేఖలను సూచిస్తుంది. ఆ గీతలు మనిషి చేత గీయబడినవి కాక, సమాజం, సంస్కారం, పరిమితులు గీసినవి. ‘‘గీతాలు ఊరు చేరనివ్వని రాతలు’ఈ పాదం స్త్రీకి విధించిన బంధాలను, ఆమె కాళ్లకు వేసిన అజ్ఞాత శృంఖలాలను ప్రతిబింబిస్తుంది. ‘‘నాకోసం ఎదురు చూసే గాజుల చేతులు’’ అనగానే, మనకు ఒక తల్లి, ఒక ఆడపిల్ల, ఒక స్త్రీ అందులో ఎవరో ఒకరు ఎదురు చూస్తున్నట్టు అనిపిస్తుంది. ఆ గాజులు స్త్రీత్వానికి, ప్రేమకు, బంధానికి ప్రతీక. ‘‘ఆడపిల్ల చదవాలి గుండెలు గట్టి పడాలి’’ ఇది కవయిత్రి సమాజానికి చేసిన గాఢమైన పిలుపు. ఆడపిల్ల కేవలం బంగారు బంగిళ్లలో నడవాల్సిన జీవి కాదు. ఆమె చదవాలి, ఆమె మనసు గట్టి పడాలి. ఇది ఒక స్త్రీ విద్యా మంత్రంలా అనిపిస్తుంది. ‘‘గుండెలు గట్టి పడాలి’’ అన్న పదబంధం సాహిత్యంలో చాలా బలమైనది స్త్రీ బలహీనతగా కాకుండా ధైర్యస్వరూపిణిగా అవతరించాలనే భావనను అది ప్రతిబింబిస్తుంది.

          ‘‘బోధించే చేతుల మీద అనుకున్న వెంటనే వాల లేని పిట్టలా’ఇది తల్లీబిడ్డల మధ్య ఉన్న ఆ లోతైన బంధాన్ని ప్రతిబింబించే వాక్యం. తల్లి భోదించే చేతులు ఆప్యాయత, శ్రద్ధ, సంరక్షణకు సంకేతం. కానీ ఆ చేతులపై వాలలేని పిట్టగా ఆడపిల్ల కనిపిస్తోంది అంటే, తల్లి భోదించినప్పటికీ, కాలం ఆమెకు విశ్రాంతి ఇవ్వలేదు. జీవితం ఆమెను ఎప్పుడూ ప్రయాణంలోనే ఉంచింది. ‘‘ఎప్పటికీ లేవలేని అమ్మ నిద్రని చూడడానికి ప్రయాణిస్తున్నాయి’ఈ పంక్తి అంతరంగాన్ని గాయపరుస్తుంది. ఇది మాతృవియోగపు వేదన. తల్లి ఇక లేవని తెలుసుకున్నా, కవయిత్రి మనసు ఇంకా ఆ నిద్రను చూడాలనుకుంటుంది. ‘‘ఎప్పటికీ లేవలేని నిద్ర’అనేది మరణానికి సున్నితమైన ప్రతీక. కానీ దానిని ‘‘చూడడానికి ప్రయాణిస్తున్నాయి’అని చెప్పడం మాతృప్రేమ యొక్క శాశ్వత బంధాన్ని తెలియజేస్తుంది. ‘‘చిట్టి ఎర్రమట్టి గాజులు చప్పుడు చేస్తూనే ఉన్నాయి’ఈ చివరి పాదం కవితకు ఒక ఆత్మ ఉంటుంది. అమ్మ లేకపోయినా, ఆమె జ్ఞాపకాలు ఇంకా చప్పుడు చేస్తున్నాయి. ఆ చిట్టి ఎర్రమట్టి గాజులు ఒక మౌన సంగీతం. కాలం మర్చిపోయినా, కవయిత్రి మనసులో మాత్రం ఇంకా మ్రోగుతూనే ఉన్నాయి.    ఈ కవితలో రేణుక అయోలా తన కవిత్వపు మూలభావాన్ని  స్త్రీ, తల్లి, సమాజం, జ్ఞాపకం ఈ నాలుగు దిశల్లో ముడిపెట్టి అద్భుతమైన భావసమగ్రతను సృష్టించడం గమనిస్తాం. ఈ కవితలోని గాజులు కేవలం అలంకారం కాదు. అవి ఒక జీవిత గాధ, ఒక తల్లిదీపం, ఒక స్త్రీ ఉనికి యొక్క శబ్దం.  రేణుక అయోల శైలిలో కనిపించే సున్నితమైన వేదన, మాటల్లో లేని తడి ఇక్కడ కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ప్రతి పాదం వెనుక ఒక కదిలిపోయిన జీవితం ఉంది. ఈ కవిత స్త్రీ మనసులోని అత్యంత గుప్తమైన మూలలోంచి పుట్టిన ఆవేదన. అదే సమయంలో, అది ప్రేమకు, గౌరవానికి, ఆత్మబలానికి ప్రతీక. ఇదొక ప్రతీకాత్మక కవిత గాజులు అనేవి స్త్రీ జీవితం మొత్తానికి ప్రతీకగా మారాయి. ఆ గాజులు విరిగిపోయినా, వాటి శబ్దం మాత్రం సమాజం అంతా వినిపిస్తుంది.

            ఇక రేణుక అయోలా గారి ‘‘మూడవ మనిషి’అనే దీర్ఘకావ్యం గురించి ప్రస్తావించదలిచితే.. ఆ కావ్యం వీరి సాహిత్య ప్రస్థానంలో అత్యంత సామాజికంగా, తాత్వికంగా, మానవతా భావంతో నిండిన కవితా సృష్టిగా నిలిచిన రచన. రేణుక  ‘‘హిజ్రా’వ్యక్తిత్వాన్ని అంటే లింగపరమైన పరిమాణాల మధ్య చిక్కుకున్న మనిషిని అద్భుతమైన కవితా భాషలో ఆవిష్కరించారు. రేణుక అయోలా ఇక్కడ ‘హిజ్రా’ అనే పదాన్ని దయనీయమైన స్థితిగా కాకుండా, ఒక ధైర్యమైన మనిషి ఉనికిగా, బతుకు ప్రతీకగా చూపింది. ఇప్పుడు ఒక్కో భావాన్ని విశ్లేషిస్తే.. ‘‘జన్యు కారణం అనుకున్నా/పుట్టుక లోపం అనుకున్నా/లోపం శరీర భాగం అయినప్పుడు’ఇక్కడ కవయిత్రి సమాజపు దృష్టిని తాకుతోంది. సామాజం ‘‘హిజ్రా’అనే మనిషిని ‘‘లోపం’గా చూస్తుంది.  పుట్టుకలో జరిగిన తప్పిదం, ప్రకృతి పొరపాటు అని. కానీ రేణుక అయోలా ఆ దృష్టిని తిరస్కరిస్తోంది. ఆమె చెబుతోంది ‘‘లోపం శరీర భాగం అయినప్పుడు’అంటే అది ప్రకృతిలోని సహజమైన రూపం. అది తప్పు కాదు. అది మనిషి వైవిధ్యానికి సూచిక. ఈ ఒక పాదంలోనే ఆమె సామాజిక న్యాయపరమైన, మానవతా దృష్టిని ప్రతిబింబించింది.‘‘ఎక్కడనుంచి మొదలవుతుందో తెలియకపోయినా ప్రయాణం ఆగలేదు’ఈ పాదాలు అంతర్భావపూరితమైనవి.                            

     మనిషి తన ఉనికి ఎక్కడ మొదలైందో, ఎందుకు తాను భిన్నంగా ఉన్నాడో తెలియకపోయినా, జీవితం ఆగదు. హిజ్రా అయినా, స్త్రీ అయినా, పురుషుడైనా  జీవితం ఒక నిరంతర ప్రయాణం. ఈ పంక్తులు ఆత్మబలం కు ప్రతీక. కవయిత్రి ఇక్కడ జీవన గమనం గురించి మాట్లాడటం మనం గ్రహించాలి.  ‘‘లోపలి స్త్రీతో బయట ప్రపంచంలో బతకాలి అనుకున్నప్పుడు’ఇది మొత్తం దీర్ఘకావ్యంలోని హృదయం. ఇక్కడ ‘‘లోపలి స్త్రీ’అనేది హిజ్రాలోని ఆత్మస్వరూపం, అంతర్మనసులోని స్త్రీ భావన. కానీ ఆ స్త్రీ బయట ప్రపంచంలో బతకడం చాలా కష్టం. సమాజం అంగీకరించదు, గౌరవించదు, అవమానిస్తుంది. అయినప్పటికీ ఆమె బతకాలి అనుకోవడం ఇది ఒక మానవీయ తిరుగుబాటు. లోపలి స్త్రీతో బతకాలి అనుకోవడం’అనేది మనిషి ఆత్మాన్వేషణకు ప్రతీక. రేణుక అయోలా ఈ భావనను బాధతో కాదు, గౌరవంతో చెబుతారు.

            ‘‘ఆ మనిషి కోసం ఆ రూపం కోసంఎన్ని మైళ్లయినా ఎలాంటి దారైనా నడవక తప్పదు అనుకుంటూ’ఇది ఒక ప్రయాణదృశ్యం మాత్రమే కాదు. అది మనిషి ఉనికి కోసం చేసే అంతర్మథనం. హిజ్రా తన స్వరూపాన్ని కనుగొనడానికి, తన ఆత్మను అర్థం చేసుకోవడానికి చేసే ప్రయాణం. సమాజం ఏ రకమైన అడ్డంకులు పెట్టినా, ఆ మార్గం వదిలిపెట్టకపోవడం ఇదే ‘మూడవ మనిషి’ కావ్యం యొక్క ప్రధాన తత్త్వం.‘‘ధైర్యపు గొడుగుతో నిలబడిన ప్రతిసారి నువ్వు ‘హిజ్రావి’ఈ పాదాలు ఈ కవితకు మానవతా శిఖరంగా నిలుస్తాయి. ‘‘ధైర్యపు గొడుగు’అనే రూపకం ఎంతో గాఢమైనది వర్షంలో తడవకుండా కాపాడేది గొడుగు, కాని ఇక్కడ అది సమాజపు అవమాన వర్షం నుంచి ఆత్మను కాపాడే ధైర్యం. ప్రతిసారి ఆ హిజ్రా నిలబడినప్పుడు, ప్రపంచం ఆమెను తక్కువ చేసింది, ఆమె మళ్లీ లేచి నిలబడి, నవ్వి చెబుతుంది ‘‘నువ్వు హిజ్రావి.’’ ఇక్కడ ‘‘హిజ్రావి’అనేది గౌరవ సూచిక పదంగా మారింది. అది దూషణ కాదు, గుర్తింపు. రేణుక అయోలా హిజ్రాల్ని మనిషిగా గౌరవించాలనే వాక్యాన్ని కవిత్వంగా, సున్నితంగా, కానీ కత్తిలా పదునుగా చెబుతారు. దీని ద్వారా రేణుక అయోలా కేవలం హిజ్రాల జీవితం గురించి రాయడం కాదు ఆమె మనిషితనం అంటే ఏమిటి అన్న ప్రశ్న వేయడం కనిపిస్తోంది. మనిషి శరీరంతో కాదు, ఆత్మతో నిర్వచించబడతాడు అంటారు.

            ‘‘మూడవ మనిషి’అనే దీర్ఘకావ్యం మొత్తం, సమాజంలో తృతీయ లింగానికి ఉన్న స్థితిని మాత్రమే కాకుండా, మనం ‘‘భిన్నతను అంగీకరించగలిగే మనుషులమా?’’ అనే ప్రశ్నను నిలబెడుతుంది.ఈ కవితలోని భాష బలమైనది, కానీ కరుణతో కూడినది. పదాలు సున్నితంగా ఉంటాయి కానీ వాటి వెనుక ఒక అగ్ని ఉంటుంది. రేణుక అయోలా ఇక్కడ కవయిత్రిగా కాకుండా, ఒక తాత్వికురాలిగా మాట్లాడుతోంది ఒక ఆత్మను సమాజం ఎలా అణచిందో, ఆ ఆత్మ మళ్లీ ఎలా లేచి నిలబడిరదో చెబుతోంది. ఈ చిన్న భాగంలోనే రేణుక అయోలా గారి సాహిత్య దృష్టి, మానవతా హృదయం, స్త్రీ సున్నితత్వం అన్నీ గోచరిస్తాయి.  కవిత్వం మనిషి హృదయాన్ని చూసే ప్రయత్నం తీర్పు ఇవ్వడం కాదు, అర్థం చేసుకోవడం.

          రేణుక అయోలా గారి మరో ప్రయోగం ‘‘పృధ’దీర్ఘకావ్యంలో ఈ పాదాలు స్త్రీ అస్తిత్వం, స్వాతంత్య్రం, శరీర స్వాధీనత వంటి మౌలిక అంశాలపై అద్భుతమైన ప్రతిఘటన స్వరాన్ని మ్రోగిస్తాయి. ‘‘శరీరంతో ఆదుకునే హక్కు ఎవరిచ్చారు’అన్న ప్రశ్నతో ప్రారంభమయ్యే ఈ ఆవేదన కేవలం ఒక స్త్రీ గళం కాదు, శతాబ్దాలుగా మౌనంగా మిగిలిన స్త్రీ సమాజం తరఫున వచ్చిన గర్జన. ఈ కవితలో కవయిత్రి స్త్రీని ఆస్తిగా, వస్తువుగా చూసే పురుషాధిక్య దృష్టిని ఛిద్రం చేస్తూ, స్త్రీ శరీరం మీద ఆధిపత్యం చూపించే సమాజపు మానసికతను నిలదీసింది. ‘‘స్త్రీ పనికి వస్తుందో లేదో, మగ సంతానం ఇస్తుందో లేదో’అని స్త్రీని కొలిచే బేరగాళ్లను, ‘‘నాగరికత లేని ద్రోహులు’ గా సంబోధిస్తూ రేణుక ప్రశ్నిస్తారు. నిజంగా స్త్రీని సుఖపెట్టే, అర్థం చేసుకునే సత్తా ఈ సమాజానికి ఉందా? ‘‘నేరేడు కళ్ల కాటుక ధారలతో దుల్హన్‌ బొమ్మ నీటి మునకని అద్దానికి చూపించి అడుగుతున్న ఆమెకి రాజ్యం అధికారం ఏ అవకాశం ఇవ్వలేదు, అడవిలో వదిలేసింది’అనే పాదాల్లో పృధ పాత్ర స్త్రీ చరిత్రలోని నిరసనకారిణి ప్రతిరూపంగా వెలుగొందుతుంది.

      ఆమె కేవలం ఒక కథా పాత్ర కాదు, స్త్రీ స్వాభిమానానికి ప్రతీక. రేణుక అయోలా ఈ కవిత ద్వారా శతాబ్దాలుగా సమాజం మూసివేసిన తలుపులపై బలమైన అక్షర తాకిడి చేసింది ఇది కేవలం వేదన కాదు, స్త్రీ చైతన్యానికి ఆహ్వానం, ప్రతిఘటనకు ప్రేరణ. ఈ సమాజానికి ఇప్పుడు కవిత్వం కావాలి. ఏ జర్నలిజం తెలపలేని వేదన, వేయలేని ప్రశ్నలు, ఎదురుచూస్తున్న సమాధానాలు వంటివన్నీ ఇప్పుడు కవిత్వమే మాట్లాడుతోంది. ముఖ్యంగా స్త్రీ స్థానం పదిలం చేయడానికి కవిత్వం కావాలి. స్త్రీ దేహాలను కాపాడుకోవడానికి, స్త్రీ అస్తిత్వాల్ని మరింత గౌరవ ప్రదంగా చూపడానికి కవిత్వం కావాలి అనిపిస్తోంది. సమాజానికి కావాల్సిన కవిత్వం ఇక్కడుంది.. ఆహ్వానిద్దాం.. మరిన్ని కవితల్ని వీరి కలం నుండి..

                                                                                                                                     

November 30, 2025 9 comments
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us