మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
బాల‌సాహిత్యం

ఒక క్రూరమైన మారుతల్లి మరియు పన్నెండు మంది యువకులు

by ఒద్దిరాజు మురళీధరంరావు March 17, 2024
written by ఒద్దిరాజు మురళీధరంరావు

పూర్వం ఒక క్రూరమైన మారుతల్లి. ఆమె భర్తపేరు మ్యాలెట్‌. ఆమెకు ఇద్దరు కూతుర్లు. రోజీ ఆమె స్వంత కూతురు. జానీ ఆమె చనిపోయిన సవతి కూతురు. పొద్దున్నే ఆమె కూతురు రోజీకి కడుపు నిండా రుచికరమైన కోడి కూర, మాంసముతో నింపబడిన పావురము తినడానికి ఇచ్చింది. ఏదో మిగిలింది చాలీ చాలనిది జానీకి ఇస్తుండేది.

రోజీ ఏ చిన్న పని కూడా ముట్టుకోకపోయేది. మొత్తం ఇంటిపని ఉదయం నుండి సాయంత్రం వరకు జానీతో చేయించేది మారుతల్లి. అయినా మెచ్చుకోకపోయేది.

రోజీ ఎప్పుడు మంచి సిల్కు మరియు ఖరీదైన వులన్‌ దుస్తులు ధరించేది. జానీకి మాత్రం మామూలు కాటన్‌ దుస్తులు ఉండేవి.

అది జనవరి మాసం. బయట మొత్తం మంచు, విపరీతమైన చలి. చాలా మటుకు అందరు చలికి తాళలేక మంటల దగ్గర కూర్చునేది. ఒకసారి మారుతల్లి బయటికి తొంగి చూసేవరకు చలికి ముక్కు ఎర్రబడింది.

ఎంతో ప్రేమ నటిస్తూ నోట్లో పంచదార ఉన్నట్లు ఓ నా ముద్దుల జానీ అని పిలిచి నాకు మన ఇంట్లో టేబుల్‌పై గాజు వేజులో లిల్లీ పూల సువాసన ఆనందించాలని ఉంది. నీవు వెళ్ళి అడవి లోయలో పూసే లిల్లీ పూలు తీసుకరా అని అంది. అందుకు జానీ అమ్మా ఇది జనవరి మాసం, ఇప్పుడు లిల్లీలు వుండవు కదా. ఆ మాట పట్టించుకోకుండా జానీని డోర్‌ తీసి బయటికి నెట్టి వెనుక నుండి డోరు ఢబీల్న మూసేసింది. విధిలేక జానీ ఆ చలిలో అడుగుపెడితే జారే మంచుపై, అతి కష్టంగా నడుస్తూ అడవిలోకి చేరింది. ఆ అడవిలో ఆమె పన్నెండు మంది యువకులను చూసింది. వారు వేసవికాల దుస్తుల్లో వున్నారు. ఒకడు మాత్రం మేకతోలు కోటు వేసుకొని ఉన్నాడు. అతనే వారి లీడరు. వాళ్ళు ఈ అమ్మాయిని చూసి ఆశ్చర్యపడి జాలితో ఎక్కడికి వెళ్తున్నావని అడిగారు. ఆమె కథంతా వాళ్ళకు చెప్పింది. అప్పుడు వారిలో ఒకతని జేబు నుండి లిల్లీ పూలు తీసి ఇచ్చాడు. అవి పట్టుకొని ఇల్లు చేరింది. మారుతల్లికి ఈమె తిరిగి వచ్చినందుకు కోపమే కాని లిల్లీలు తెచ్చిందని లోనికి రానిచ్చింది.

మరుసటి రోజు ఎంతో ప్రేమను నటిస్తూ నా ప్రియమైన జానీ, నాకు బాస్కెటు నిండా స్ట్రాబెర్రీసు అడవి నుండి తీసుకురా అంది మారుతల్లి. దాదాపు కన్నీరు పెట్టుకుని జానీ అంది, అమ్మా అవి జనవరిలో అవి పండవు కదా. నోరు ముయ్యి అని గద్దించింది మారుతల్లి. నీవు లిల్లీసు తెచ్చినవు గదా. అదే మాదిరిగ స్ట్రాబెర్రీసు తే అని జానీని బయటికి నెట్టి తలుపు మూసేసింది. పాపం అమ్మాయి  మోకాళ్ళ మటుకు మంచులో, చలి గాలిలో మామూలు దుస్తుల్లో అడివికి చేరింది. అక్కడ ఆ పన్నెండు మంది యువకులు కలిశారు. వారితో ఆమె తన మారుతల్లి చెప్పిన విషయం చెప్పింది. ఆ యువకులకు కోపం వచ్చింది. మేకతోలు కోటు వేసుకున్నతను సరే నీకు స్ట్రాబెర్రీసు ఇస్తాను, కాని నీ మారుతల్లి జాగ్రత్త పడాలి. అతను తనవారిలో ఒకతనితో అమ్మాయి బ్యాగ్‌ నిండా రుచికరమైన స్ట్రాబెర్రీసు నింపమన్నాడు. నింపినాక వాటిపై అతను ఊదాడో, అదేంటో తెలియదు కానీ ఇది నీ మారుతల్లిని బాగు చేస్తుందన్నాడు. జానీ వారికి కృతజ్ఞతలు తెలిపి ఇల్లు చేరింది. ఆమె దారిలో వెచ్చదనం అనుభవించింది. మారుతల్లికి జానీ తిరిగి రావడం ఇష్టంలేక కోపించింది, కానీ స్ట్రాబెర్రీసు బాగా ఇష్టమైనవి. వాటిని తీసుకుని ఆమె, ఆమె కూతురు రోజీ గబగబా ఒక్క పండు మిగలకుండా తినేశారు. జానీకి పాపం ఒక్క పండు కూడా ఇవ్వలేదు. కానీ తల్లి బిడ్డ ఆ రాత్రి వానరాళ్ళు తిన్నట్లు చాలా కడుపునొప్పితో బాధపడ్డారు.

మరునాడు ఉదయం రోజీ మరియు ఆమె తల్లికి కొంత ఆరోగ్యం బాగయ్యింది. మారుతల్లి  జానీని బయటకు పంపేందుకు ఏదో ఉపాయం ఆలోచించసాగింది. ప్రేమ ఒలకపోస్తూ ఓ నా ప్రియమైన జానీ, నువ్వు గోనెసంచీ తీసుకొని అడవికి అవతలివైపు వెళ్ళి అక్కడ పండే మంచి వెరైటీ వోర్‌ సిస్టర్‌ పియర్‌ మేన్స్‌ ఆపిల్సు సంచీ నిండ తెంపుక రా. జానీ ఈసారి ఏ అడ్డూ చెప్పకుండా ఒక నిట్టూర్పు తీసి బయటికి వెళ్ళింది. మంచులో మూడుసార్లు జారిపడింది. కాళ్ళకు దెబ్బలు తగిలి గాయాలయినాయి. ఎలాగో అడవి చేరింది. అక్కడ ఆ 12 మంది యువకులు కలిశారు. ఈమె చెప్పినట్లు సంచి నిండా ఆపీల్సు పెట్టించాడు మేకతోలు కోటులో ఉన్నతడు. ఓహో ఆమె గార్కి మంచి వెరైటీ ఆపిల్సు కావలసి వచ్చిందా అన్నాడు. సంచిలో పండ్లు నింపిన తరువాత వాటి మీద మూడుసార్లు చల్లని ఆవిరి వచ్చేట్లు ఊదాడు. ఇప్పుడు మారుతల్లి వీటిని అంతగా ఆనందించకపోవచ్చు అన్నాడు అతడు. ఆ బరువైన సంచి జానీకి ఒక ఈకవలె తేలికగా ఉండి ఆమె మంచు మీద మెత్తటి దారి మీద నడిచినట్లు నడిచి ఇల్లు చేరింది. అతను మీ చెల్లెలును వీటిని తినవద్దని చెప్పమన్నారు. ఆమె ఆ విషయం చెప్పినందుకు చెల్లెలు ఆమెను నెట్టివేసి తామే తినేశారు గబగబా. వారికి కడుపులో బాగా నొప్పి లేచింది. ఈ విశ్వాసం లేని అమ్మాయి దయ్యంతో కలిసి మనమీద కుట్ర చేసిందని మారుతల్లి అంది. వారి కడుపులో పేగులకు ఏమీ తెలీదు. కానీ వారు దూదిపింజల లాగ ఇంటి పొగ గొట్టం నుండి బయటపడి ఎంతో దూరం తేలిపోయారు. ఇంటిదారి ఎప్పటికీ దొరకలేదు. ఇంటి వద్ద తండ్రి, కూతురు వివాహమై తన మంచి భర్తతో కలిసి ముగ్గురు ఎప్పటికన్నా ఎక్కువ సంతోషంగా వుండిపోయారు. మారు తల్లికి తగిన శాస్తి జరిగింది.

March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

అన్నమాచార్య సంకీర్తన

by mayuukha March 17, 2024
written by mayuukha
March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

ప్రముఖ విద్యావేత్త M.L.C. సురభి వాణీ దేవి ముఖాముఖి

by రంగరాజు పద్మజ March 17, 2024
written by రంగరాజు పద్మజ

భారత దేశ ప్రధానమంత్రి గా విశేషమైన సేవలు అందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి పి.వి. నరసింహారావు గారి కుమార్తె సురభి వాణీ దేవి గారు. వీరు తండ్రి తో పాటు వివిధ దేశాల పర్యటన చేసారు.అప్పటి వారి అనుభవాలను ఈ ఇంటర్వ్యూ లో ప్రముఖ రచయిత్రి రంగరాజు పద్మజ గారితో చెప్పిన విషయాలనూ, వారి జీవిత ప్రస్థానాన్ని వారి మాటల్లోనే వినాలంటే జస్ట్ ఈ లింక్ క్లిక్ చేయండి అంతే !

March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ఇక‌ ” మీకు” చరిత్ర పుటలే గీతి

by Dr. Lakshmanacharyulu M March 17, 2024
written by Dr. Lakshmanacharyulu M

పూరి గుడిసెల కనుకొలకుల్లో
ఉబికిన రక్తాశ్రువులు
అపార్ట్మెంట్లు,గృహాల గుండెల్లో
హోరెత్తిన మరణం మృదంగారావాలు;
ఇంతకాలం తమ రెపరెపల్లో కేవలం
వాత్సల్యం
తమ గలగలల్లో కేవలం అనురాగం
పలికించిన చిలికించిన
కొంగులు, గాజులు
ఒరుసుకుంటున్నాయ్
బిగుసుకుంటున్నాయ్
ఆవేశం తో ఆక్రోశం తో
వారి ఆవేశం ఆక్రోశాల అగ్ని పర్వతం పెఠిల్లున విస్ఫోటించి
మీ అస్తిత్వం తుడిచి పెట్టుకు ముందే
ఓ సారాసురా,! ఓ గుడంబ పిశాచమా! ఓ కల్తీ మద్యమా!
క్విట్ తెలంగాణా! క్విట్ ఆంధ్రా!
అలనాటి నెల్లూరు,దూబగుంటల
మద్యపానవ్యతిరేక మహిళోద్యమ క్రోధాగ్ని
అదిగో! ఇంకా రగుల్తూనే ఉంది
మరి..ఇక మీకు చరిత్ర పుటలే గతి!

March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

సిండ్రెల్లా పునః కధనం

by డా.కందేపి రాణీప్రసాద్ March 17, 2024
written by డా.కందేపి రాణీప్రసాద్

అనగనగా ఒక రాజ్యంలో ఒక ధనికుడు నివసించేవాడు. అతనికి ఒక కూతురు పుట్టాక భార్య మరణించింది. కూతురును అతనే పెంచి పెద్ద చేయసాగాడు. కూతురు ఎంతో అందగత్తె మరియు దయా వృదయం గలది. కొన్నాళ్ళకు మళ్ళీ పెళ్ళి చేసుకున్నాడు. కానీ ఆమె సవతి తల్లి కదా! కూతురు సిండ్రెల్లాను ఏమి బగా చూసేది. కాదు తర్వాత ఆమెకిద్దరు కుమార్తెలు పుట్టారు. సవతి తల్లి ఆమె కుమార్తె లిద్దరూ కూడా సిండ్రెల్లాను ఎప్పుడూ ఏడిపిస్తుండే వారు ఇంటి చాకిరీ అంతా చేయించేవారు. కనీసం ఆమెకు మంచి ఆహారం కూడా ఇచ్చేవారు కాదు. తండ్రి ఇదంతా చూసి చాలా బాధపడేవాడు. తాను అనవసరంగా రెండో పెళ్ళి చేసుకున్నానని చింతించేవాడు.
ఒకరోజు వ్యాపార పనుల నిమిత్తం తండ్రి పొరుగూరికి వెళ్ళాడు. తండ్రి కూడా లేక పోవడంతో సవతి తల్లి సిండ్రెల్లాను మరింత బాధ పెట్ట సాగింది. కడిగిన పాత్రల్నే మరల కడిగిస్తూ, ఇల్లంతా శుభ్రం చేశాక చెత్త పడేసి మరల శుభ్రం చేయమని చెప్తూ సిండ్రెల్లాను పని మనిషి గా మార్చేశారు. ఎంతో అందంగా ఉండే సిండ్రెల్లాను మసి బొగ్గు లా తయారు చేశారు. వంటలన్నీ వండినా పారబోసేసి మరల వండమని చెపుతూ పొయ్యి దగ్గరే ఉంచేవారు.
ఇలా ఉండగా ఒకరోజు రాజ భటుడు కరపత్రాలతో వీరింటికి వచ్చాడు. “రాజు గారి కోటలో సంబరాలు జరుగుకున్నాయనీ, వాటి కోసం రాజ్యం లోని యువతులందర్ని ఆహ్వానిస్తున్నారని” చెప్పాడు. అంతేకాక తనకు నచ్చిన యువతితో రాజకుమరుడు నృత్యం చేస్తారనీ, ఆమెనే పెళ్ళిచేసుకుంటాడనీ ఆహ్వాన పత్ర సారాంశమనీ చెప్పాడు.
సవతి తల్లి చాలా సంతోషించింది తన కుమార్తెల కోసం మంచి మంచి బట్టలు, టోపీలు, హారాలు ఎన్నో కొన్నది. రాజకుమారుడు తన కూతుళ్లిద్దరిలో ఎవరినో ఒకరిని వివాహం చేసుకోవాలని ఆశించింది. అప్పుడు సిండ్రెల్లా వచ్చి “అమ్మా నేను కూడా సంబరాలకు వస్తాను కొత్త దుస్తులు కొనవా నాకు ఈ చినిగిన గౌను తప్ప కొత్తవి లేవుకదా” అన్నది. అప్పుడు ఆమె నవ్వుతూ” పనిమనుషులు రాజభవనానికి రాకుడదు నువ్వు ఇక్కడే ఉండు” అంటూ తన కుమార్తెలతో వెళ్ళిపోయింది.
సిండ్రెల్లా మరేమి చేయలేక ఇంట్లో కూర్చుని ఏడుస్తూ ఉండిపోయింది. తోటలోని చిలుకలు ఆమెను ఊరడిస్తున్నాయి. అప్పుడు అకస్మాత్తుగా ఒక దేవమాత ప్రత్యక్షమయింది. సిండ్రెల్లా ఆశ్చర్యంగా చూస్తుండగానే “నువ్వు రాజవనానికి వెళతావా” అని అడిగింది దేవమాత “నేను వెళ్ళాలంటే నాకు సరైన దుస్తులు, వెళ్ళడానికి బండి కూడా లెవు కదా” నిరాశగా అంది సిండ్రెల్లా. వెంటనే దేవదూత తన మంత్రదండంతో సిండ్రెల్లాకు మంచి మెరుపుల బట్టలు, నగలు, గాజు చెప్పులు సృష్టించింది. వారి పెరట్లో ఉన్న ఒక గుమ్మడి కాయను రథంగా మార్చేసింది. అక్కడ తిరుగుతున్న రెండు ఎలుకలను గుర్రాలు గా మార్చింది. మరొక ఎలుకను రథ సారధి గానూ, మరొక తొండను ఆమెకు సేవకుడి గానూ మార్చింది.
“ఇప్పుడు నువ్వు రాజభవనానికి వెళ్ళు సిండ్రెల్లా ! కానీ ఒక్క విషయం గుర్తుంచుకో అర్థరాత్రి 12 గంటలలోపు నువ్వు ఇంటికి రావాలి. ఆ తర్వాత నా మాయ పని చెయ్యదు అన్ని మామూలై పోతాయి” అని చెప్పి దేవదూత అదృశ్యమైపోయింది.
సిండ్రెల్లా రాజభవనానికి చేరుకుంది. ఆమె అద్భుత సౌందర్యం చూసి అక్కడున్న అందరూ ఆమె తప్పక రాజుకుమారి అయి ఉంటుందని అనుకున్నారు. రాజకుమారుడు కూడా ఆమె అందానికి ముగ్ధుడై ‘నాతో నాట్యం చెస్తావా’ అని అడిగాడు. సిండ్రెల్లా రాజకుమారుడు నృత్యం చేస్తూ సమయం చూసుకోలేదు హటాత్తుగా సిండ్రెల్లా కు గుర్తువచ్చి ‘నేనిప్పుడే ఇంటికి వెళ్ళాలి’ అని బయటకు నడిచింది. ‘నీపేరు, చిరునామా చెప్పవా’ అంటూ రాజకుమారుడు ఆడుగు తుండగానే ఆమె రథమెక్కి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళేటప్పుడు ఆమె పాదాలకున్న గాజు చెప్పు అక్కడే పడిపోయింది.
సమయానికి ఇంటికి చేరింది సిండ్రెల్లా. సమయం 12 కాగానే అన్ని మాయమై పోయాయి. రాజ భవనంలో సిండ్రెల్లాను ఎలాగైనా గుర్తించాలని. అనుకున్నారు. ఆమె వదిలిన గాజు చెప్పు సాయంలో సిండ్రెల్లాను గుర్తించాలి అనుకున్నారు. వెంటనే అందరి వద్దకూ వెళ్ళి పరీక్షించారు. అoదులో భాగంగా సిండ్రెల్లా ఇంటికీ వచ్చారు. సవతి తల్లి కుమార్తె లిద్దరూ నాదే ఈ చెప్పు అంటూ ఇద్దరూ చెప్పారు. భటుడితో పాటు రాజకుమారుడూ వచ్చాడు అక్కడకు. చెప్పును తొడుక్కుని చూపమనగా ఒకరికి పట్టనేలేదు, మరొకరికి చాలా పెద్దదైంది. అప్పుడు మసి బట్టలతో దూరంగా నిలుచున్న సిండ్రెల్లానూ చెప్పు తొడుక్కుని చూడమనగా ఆమెకు సరిగ్గా సరిపోయింది. అప్పుడు దేవదూత ప్రత్యక్షమై సిండ్రెల్లాకు పూర్వపు దుస్తులను, రూపాన్నీ ఇచ్చింది. రాజు కుమారుడు సిండ్రెల్లాను గుర్తు పట్టాడు ఆమెను తన రథం ఎక్కించుకొని రాజ భవనానికి తీసుకు వెళ్ళాడు. తన భార్యగా చేసుకున్నాడు సిండ్రెల్లా యువరాణిగా ఎన్నో సుఖాలను పొంది ఆనందంగా జీవించింది.

March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

వీడిపోను – వాడిపోను కవిత పై విశ్లేషణా వ్యాసం

by Narendra Sandineni March 17, 2024
written by Narendra Sandineni

కవిత్వాస్వాదన ధారావాహికవిశ్లేషణా వ్యాసాలు.

ప్రముఖ కవి,రిటైర్డ్ తెలుగు భాషా రీడర్,కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల,హన్మకొండ,డాక్టర్ ముదిగొండ వీరేశలింగం కలం నుండి జాలువారిన స్పందన కవితా సంపుటిలోని వీడి పోను – వాడి పోను కవిత పై విశ్లేషణా వ్యాసం.స్పందన కవితా సంపుటిలో కవిత్రయం తమ కవితలను రాశారు.అందులో మొదటి కవి ముదిగొండ ఈశ్వర చరణ్,రెండవ కవి మాదాడి నారాయణరెడ్డి,మూడవ కవి ముదిగొండ వీరేశ లింగం.ఈ కవితా సంపుటిని 1982 లో వెలువరించారు.స్పందన కవితా సంపుటికి చక్కటి ముఖ చిత్రం కె రాజయ్య చిత్రకారుడు అందించారు. స్పందన కవితా సంపుటికి ఇరివెంటి కృష్ణమూర్తి గారి ఆశీస్సులు మీ కవిత్వోద్యమానికి నా సాధు వాదం మీ ప్రతిభా విశేషానికి ఆశీర్వాదం తెలియజేశారు. ”వేముగంటి నరసింహాచార్యులు ప్రతిస్పందన. మనసు స్పందిస్తే కవిత.మనిషి స్పందిస్తే మానవత.

ఇది ఈ సంపుటిలోని భావ సంపుటి.నిండైన జీవితానికి అను స్పందించి లోతైన లోకానికి ప్రతి స్పందించి నీతిలోనూ రీతిలోనూ విచ్చలవిడిగా పెచ్చు పెరుగుతున్న అన్యాయాన్ని అసమానతలను తొలగించి మానవతకు మణి మకుటం తొడగాలని ఈ కవిత్రయం ముదిగొండ ఈశ్వర చరణ్,మాదాడి నారాయణ రెడ్డి,ముదిగొండ వీరేశ లింగం గారలు తమ కవితల ద్వారా చేసిన ప్రయత్నం ఈ సంపుటి నిండా కనబడుతుంది.ఈ ముగ్గురు కవులు భావుకులు మనీషులు,భాషను ఉచిత రీతి ప్రకటించడంలోనూ,భావాలను ఉజ్వలంగా పలికించడంలోనూ నేర్పరులు.ఆవేశమున్నా దానిని అదుపులో ఉంచే సంయమనం కూడా కలిగి ఉండడం వీరిలోని విశేషం.ఈ కవిత్రయం ముందు ముందు ఇతోధిక భావ ప్రాభవాన్ని కవితా రచన సాగించాలని కవి మిత్రుడిగా కాంక్షిస్తున్నాను.వీడి పోను వాడి పోను కవితను ఆసక్తితో చదివాను. నాలో ఆలోచనలు రేకెత్తించింది.వీడి పోను ఏమిటి? వాడి పోను ఏమిటి? ఈ భూమి మీద పుట్టిన మనిషి ఏదో ఒక రోజు నేలను విడిచి వెళ్లి పోవాల్సిందే.అది తిరుగు లేని సత్యం.కవి వీరేశ లింగం కవితకు వీడి పోను – వాడి పోను అని శీర్షిక పెట్టాడు.వీడి పోని వాళ్లు, వాడి పోని వాళ్లు ఎవరైనా ఉంటారా? అని మనకు ఆశ్చర్యం కలుగుతుంది.మరణానంతరం మనిషి చేసిన మంచి కార్యాల ఫలితం వల్ల స్వర్గానికి పోతారు అని అంటారు.మరణానంతరం మనిషి చేసిన దుష్కార్యాల ఫలితం వల్ల నరకానికి పోతారు అని అంటారు.స్వర్గంలో మనుషులు వీడి పోకుండా కలిసి ఉంటారు.స్వర్గంలో చెట్లకు పూచిన పూలు వాడి పోకుండా ఎల్లప్పుడూ నిగనిగలాడుతూ ఉంటాయని అంటారు.వీడి పోను – వాడి పోను కవిత చరణాల్లోకి వెళ్లి దృష్టిని సారిద్దాం.అలౌకిక అనుభూతిని సొంతం చేసుకుందాం.” చెమ్మగిలిన నయనాలతో/ మందహాసానికి నోచుకోని ముఖంతో/ బరువెక్కిన హృదయంతో/ గద్గద కంఠంతో చెబుతున్నా ఈ కవిత.బాధలో ఉన్నప్పుడు మనిషి కళ్ళు చెమ్మగిల్లుతాయి.బాధలో మనిషికి దుఃఖం పొంగి పొర్లుతుంది.బాధను అనుభవించిన వారికే తెలుస్తుంది.బాధంటే ఏమిటి? బాధలో ఉన్నప్పుడు మనిషి ముఖం మీద నవ్వు మాయమై పోతుంది. బాధను అనుభవిస్తున్నప్పుడు మనిషి నవ్వును మరిచిపోతాడు.బాధలో ఉన్నప్పుడు ఎందుకో తెలియకుండానే మనిషి హృదయం బరువెక్కుతుంది.హృదయం బాధగా ఉంటే మనిషి కళ్ళ నుండి కన్నీళ్లు ధారలుగా వస్తాయి.గధ్గధ కంఠంతో బిగ్గరగా చెబుతున్నాడు.ఈ కవితను వ్రాస్తున్నా వ్రాయాలని లేకున్నా అని ఆవేదనతో చెబుతున్నాడు. ‘ఎడారిలో నీరు కనిపిస్తుంది ఎక్కడో ఒక చోట/మానవత మాత్రం అసలే కనబడదు జనమున్న చోట.”ఎటు వంటి వృక్ష సంపద లేకుండా కేవలం ఇసుకతో నిండి ఉన్న విశాలమైన భూభాగం ఎడారి.భూమిపై ⅓ వంతు వైశాల్యాన్ని ఎడారులు ఆక్రమించి ఉన్నాయి.ఎడారుల్లో అక్కడక్కడ కనిపించే ఒయాసిస్సులు మాత్రం సారవంతమై జనావాసాలకు అనుకూలంగా ఉంటాయి. ఒయాసిస్సులు ఉన్న చోట నీరు లభ్యమవడమే కాకుండా భూమి కూడా మంచి సారాన్ని కలిగి ఉంటుంది.కేవలం ఇసుకతోనే కాకుండా మంచుతో నిండి ఉన్న మంచు ఎడారులు ఉన్నాయి.ఎడారుల్లో కొన్ని నిస్సారమైన భూముల్లో ఖనిజ లవణాలు కూడా లభ్యమవుతుంటాయి.ఎడారులు జీవ కోటి మనుగడకు సహకరిస్తాయనే పేరు ఉంది.అయితే నిజానికి మనం ఎడారుల్లో కూడా చక్కటి జీవ వైవిధ్యాన్ని గమనించవచ్చు.సృష్టిలో మానవత్వాన్ని మించిన మతం లేదంటారు.మానవత్వం లేని మతం రాణించదు.మతాలన్నీ మానవత్వం కలిగి ఉండమని బోధిస్తాయి.మానవత్వం లేని వాళ్లకు స్వర్గంలో చోటు లభించదు అని అంటారు .మానవత్వం అంటే కరుణ,ప్రేమ,దయ,అహింసను పాటించడం.మానవ ప్రేమే మానవ ఆదర్శం.ఇతర విలువల కంటే మానవ విలువలే మిన్న అని చెబుతారు.వసుధైక కుటుంబ నిర్మాణం జరగాలి .ఎడారిలో నీరు కనిపిస్తుంది ఎక్కడో ఒక చోట. ఎడారిలోని ఒయాసిస్సుల్లో నీరు లభిస్తుంది అని చదివి ఉన్నాం.మనుషులు ఉన్న చోట మానవత మాత్రం అసలే కనబడదు.సమాజంలో నివసిస్తున్న ప్రజలు సాటి మనుషుల పట్ల ప్రేమ,దయ,కరుణ జాలి చూపాలి.ఇవ్వాళ మను‌షుల్లో మానవత్వం మృగ్యమై పోయింది అని కవి వీరేశ లింగం వ్యక్తీకరించిన భావం చక్కగా ఉంది. “చక్కెర రుచి మాటల్లోనే /మార్కెట్లోకెళ్తే చుక్కెదురవుతుంది.” చక్కెరను మనం బజారులో కొనుక్కొని వంటశాలలో వాడుకుంటాం.చక్కెర అనే మాటను జీవ రసాయన శాస్త్రంలో మరొక విధంగా చెప్పుకుంటారు.గ్లూకోజ్, ప్రక్టోస్,సుక్రోస్,మాల్టోస్,లాక్టోస్ మొదలైన కార్బోహైడ్రేట్లు అనే దృష్టితో చర్చ జరుపుతారు. మామూలు చక్కెరను సుక్రోస్ అంటారు.చక్కెర స్పటికాల రూపంలో స్వచ్ఛంగా ఉన్నప్పుడు తెల్లగా ఉంటుంది.చక్కెర తొందరగా శరీరానికి శక్తిని చేకూర్చేవి.కొందరు మనుషులు చక్కెర రుచిని మాటల్లోనే ఒలకబోస్తారు.చక్కెర రుచి తెలవాలంటే మనం నోట్లో వేసుకోవాలి.చక్కెర నోట్లో వేసుకుంటే నోరు తీయగా అవుతుంది.ఇవ్వాళ నడుస్తున్న సమాజం గురించి చెబుతూ మనుషులు చక్కెరకు గల రుచిని మాటల ద్వారానే తెలియజేస్తారు.తీయ తీయని తేనెల మాటలతో తీస్తారు సుమా గోతులు అని సినిమా పాట ఉంది.కొందరు వ్యక్తులు చక్కెర నోట్లో పోసినట్లుగా చక్కగా మాట్లాడుతారు.ఇవ్వాళ మార్కెట్ కు వెళ్లి చక్కెర కొందామంటే చక్కెర దొరకదు,కృత్రిమ కొరతను సృష్టించి చక్కెరను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారు.చక్కెర కొందామంటే దొరకక చుక్కెదురవుతుంది అని సమాజంలోని మనుషుల్లో పేరుకు పోయిన అవినీతిని చక్కెరను ఉదాహరిస్తూ కవి వీరేశ లింగం చెప్పిన తీరు అద్భుతంగా ఉంది.” కొంత కాలం పోతే /ఈ జనాభా పెరుగుతూ పోతే /మనం పోవాల్సింది విదేశ యాత్రకు మాత్రం కాదు / పరలోక యాత్రకు” సామాజిక శాస్త్రం లోను జీవ శాస్త్రంలోను జనాభా అనే పదాన్ని ఒక జాతికి చెందిన జీవుల సంఖ్యను చెప్పడానికి వాడతారు.జనాభా అనే పదాన్ని గణాంక శాస్త్రంలోను ఇతర విజ్ఞాన శాస్త్రాలలోను సముదాయం అనే అర్థంలో కూడా వాడుతారు. నిర్ణీత ప్రాంతాలలో నివసించే ఒకే జాతికి చెందిన జీవుల సమూహమే జనాభా.అధిక జనాభాతో వనరులు నానాటికి తగ్గిపోతున్నాయి.దేశంలో జనాభా పెరుగుదల వనరుల అభివృద్ధి మధ్య భారీ వ్యత్యాసం నెలకొంది.భవిష్యత్తులో జరిగే యుద్ధం,ధనం ఉన్న వారికి ధనం లేని వారికి మధ్య జరుగుతుంది.శరీరం విడిచిన తర్వాత మనిషి యొక్క ఆత్మ చేరే లోకాన్ని పర లోకం అంటారు. కొంత కాలం పాటు జనాభా పెరుగుతూ పోతే మన దేశంలో నివసిస్తున్న వారు పోవాల్సింది విదేశాలకు కాదు.అధిక జనాభా వల్ల మన దేశ వాసులు పర లోకానికి చేరుకుంటారు అని కవి చెప్పిన తీరు చక్కగా ఉంది. “ఎవరినడిగినా ఏమడిగినా /భగభగ మండుతారు,దావాగ్నిలా”.ఈనాటి సమాజంలో జీవిస్తున్న మనుషులను ఏదైనా విషయం గురించి ఎవరినడిగినా ఏమి అడిగినా దావాగ్నిలా భగభగ మండిపోతారు.దావానలం అంటే దావాగ్ని లేదా కార్చిచ్చు.అడవులలో సంభవించి అతి త్వరగా వ్యాపించే అగ్ని ప్రమాదాలు దావాగ్నులు.ఇవి మానవుల అలక్ష్యం వలన,మెరుపుల మూలంగా లేదా అగ్నిపర్వతాల వలన సంభవిస్తాయి.దావాగ్ని వల్ల మంటలు విస్తృతంగా వ్యాపించి అక్కడ నివసించే జంతు జాలాన్ని కూడా నాశనం చేస్తాయి.“గడబడ చేస్తారు బస్సు స్టాండులా.” విపరీతంగా పెరిగిన జనాభా వల్ల బస్సు స్టాండ్ లో రద్దీ ఎక్కువగా ఉంటుంది.ఇసుక పోస్తే రాలనంతగా జనాలు గుమి గూడి ఉంటారు.బస్సు స్టాండులో ఉన్న జనాలు తీవ్రమైన అసహనంతో గడబిడ చేస్తారు. ” అశాంతి ఈనాటి ఆత్మీయత.” మనుషులు ఏదేని చింతించాల్సిన సంఘటన కారణంగా కలిగే భయం చేత కలత చెందుట అశాంతి.అనుకోకుండా అసాంఘిక శక్తుల వల్ల బాంబు పేలుడు సంఘటన జరిగితే ప్రజలలో అశాంతి వ్యాపిస్తుంది.మనిషికి దగ్గరి బంధువుల వల్ల ఆత్మీయత నెలకొంటుంది.తల్లికి పిల్లలపై ఉండే ప్రేమ ఆత్మీయత.ఆత్మీయత అనేది ఒక వ్యక్తిగత సంపద.ఆత్మీయతను పెంపొందించుకోవడానికి మనుషులు ప్రయత్నించాలి.ఆత్మీయత మనిషికి బలం.ఈనాటి మనుషుల్లో ఆత్మీయత కొరవడింది. ఈనాటి మనుషుల్లో నైతికత లేకపోవడం వలన, విశ్వాసం లేకపోవడం వలన,ఆత్మీయతకు దూరమై కలత చెందుతారు.ఈనాటి మనిషి వ్యాకులత వలన ఏ పని పైన ధ్యాసను ఉంచలేక పోతున్నాడు.పెరిగిన జనాభా వల్ల కలవరంతో మనుషుల్లో అశాంతి పెరిగి ఆత్మీయతకు దూరమవుతున్నారు.అశాంతిని తొలగించాల్సిన అవసరం చాలా ఉంది.” ద్రోహం ఈనాటి దేశ భక్తి.” మంచికి వ్యతిరేక భావన ద్రోహం గా చెప్పవచ్చు. మనిషి ఎప్పుడైనా మంచిని గూర్చే ఆలోచించాలి.మనుషులకు ద్రోహ భావన పనికి రాదు.దేశ భక్తి అంటే ప్రజలకు వారు జన్మించిన దేశం మీద గల మక్కువ.ఇది ఒక ప్రాంతం లేదా పట్టణము లేదా గ్రామానికి పరిమితమై ఉండవచ్చు.దేశ భక్తితో వారి దేశం సాధించిన ప్రగతి,సంప్రదాయాలు మొదలైన వాటిని గొప్పవిగా భావిస్తారు.దేశ భక్తి, జాతీయత భావం ఒక్కటే.దేశ భక్తి కలిగి ఉండుట, ఇందులో వ్యక్తి కంటే దేశానికే ప్రాధాన్యత ఎక్కువ. దేశ భక్తిని కలిగిన వారు ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి వెనుకంజ వేయరు.దేశం పట్ల గల ప్రేమను విధేయతను దేశ భక్తిగా చెప్పవచ్చు.దేశ భక్తి అంటే దేశం,చరిత్ర,సంప్రదాయాల పట్ల ప్రేమ,గౌరవం ఉండడం.దేశ భక్తులు తమ దేశ అభివృద్ధికి దాని చారిత్రక వారసత్వాన్ని పరిరక్షించడానికి కృషి చేస్తారు.దేశ భక్తితో చాలామంది తమ దేశానికి సేవ చేసి ప్రాణాలను కూడా అర్పించారు.ఇప్పటికి చాలా మంది ప్రజలు భక్తి శ్రద్ధలతో తమ దేశానికి నిస్వార్ధంగా సేవ చేస్తూనే ఉన్నారు.భారత స్వాతంత్ర్య సమరంలో ఎంతో మంది ప్రజలు తమ దేశం కొరకు ప్రాణాలు కోల్పోవడం జరిగింది.దేశ భక్తి వల్ల దేశ ప్రజలు తరతమ భేదాలు లేకుండా ఐకమత్యంగా ఉంటారు.దేశ భక్తి వల్ల దేశం బలోపేతంగా తయారవుతుంది.జనాభా పెరుగుదల వల్ల ప్రజలు ద్రోహ చింతనను దేశ భక్తిగా భావించడం తీవ్రమైన ఆవేదన కలిగిస్తుంది. “అహంకారం అంతకన్నా రక్తి. ”అహంకారం,దర్పము లేదా గర్వము ఒక విధమైన ఆలోచనా పద్ధతి.రక్తి అంటే ఏమిటి? ఆహ్లాదకరమైన మనోహరమైన ఆకర్షణీయమైన అందమైన అనే అర్థంలో రక్తిని వాడుతారు. పెరిగిన జనాభా వల్ల మనుషుల్లో అహంకారం పెరిగి పోయింది.మనుషులు మితిమీరిన అహంకారంతో ప్రవర్తిస్తున్నారు. అహంకారం వల్ల సాటి మనిషిని గౌరవించ లేరు. సాటి మనిషిని హీనంగా చూస్తారు.అహంకారం వల్ల మనిషిలోని ఆత్మజ్ఞానం అడుగంటి పోతుంది. “అదేమంటే,ఉందంటారు మాకు శక్తి.అహంకారం గురించి అదేమని అడిగితే గర్వంతో ఉందంటారు మాకు శక్తి.“దీనికంతా కారణం ఏమిటి? / కల్తీ లేని శాల్తీ కనబడకపోవడం/ఏ రంగంలో చూచిన/ఏ మనిషినడిగినా,సోదా చేసినా/సాదాయైన సీదా జీవితం కనబడదు.” నిత్యావసర వస్తువులలో ఇతర పదార్థాలను కలిపి చలామణి చేయడం నేరం. వస్తువులను కల్తీ చేయడం Aduleration అంటారు. కల్తీ వలన మనిషి ప్రాణాలకు ప్రమాదం జరుగుతుంది.ఆహార కల్తీ విపణిలో ఏ వస్తువు ఎక్కువ డిమాండ్ ఉంటుందో ఏ వస్తువుకు ధర ఎక్కువగా ఉంటుందో ఆ వస్తువు కల్తీ కావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.నూనె,పాలు, నెయ్యి,కారం, పప్పు దినుసులను ఎక్కువగా కల్తీ చేస్తున్నారు.ప్రమాదకరమైన రంగులు వేసి అమ్ముతుంటారు.మనిషి మితి మీరిన అహంకారంతో వ్యవహరిస్తున్నాడు.దీనికంతా కారణమేమిటి అని ప్రశ్నించడమే కాకుండా జవాబు కూడా ఇస్తున్నాడు.ఇవ్వాళ సమాజంలో మనుషులు అందరు అవినీతి అక్రమాలకు పాల్పడుతూ నైతికంగా దిగజారిపోతున్నారు.సమాజంలో మంచి వారు ఒక్కరు కూడా కనబడడం లేదు అని కవి వీరేశ లింగం ఆవేదన చెందుతున్నాడు.సమాజంలో ఏ రంగంలో చూచినా ఏ మనిషిని అడిగినప్పటికీ సరైన సమాధానం లభించదు.సమాజంలో ఏ మనిషిని సోదా చేసినా స్వచ్ఛత కనబడడం లేదు.ఏ మనిషి జీవితం కూడా మంచితనంతో మానవత్వంతో పరిమళించడం లేదు అని కవి వీరేశ లింగం వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.
“ కౌటిల్యుడు పోయి ఎన్ని శతాబ్దాలు అయింది/ కాని,నేడు కౌటిల్యుడు లేని ప్రదేశమే లేదు. కౌటిల్యుడు మహోన్నత మానవతావాది.కౌటిల్యుడు రచించిన అర్థశాస్త్రం చాణిక్య నీతి శాస్త్రంగా పేర్కొంటారు.కౌటిల్యుడు ఈ లోకాన్ని వీడిపోయి ఎన్నో శతాబ్దాలు గడిచాయి అనేది వాస్తవం.నేటి సమాజంలో కౌటిల్యుల లాంటి వ్యక్తులు అడుగడుగునా తారసపడతారు.నేడు ఎక్కడ చూసినా కౌటిల్యుడు అన్ని ప్రదేశాల్లో ఉన్నాడు అని వెల్లడి చేయడం,కవి వీరేశ లింగం సమాజాన్ని ఔపోషణ పట్టినట్టుగా తోస్తోంది.కౌటిల్యం అంటే కుటిల రాజకీయం అని లోకంలో స్థిరపడిపోయింది. సమాజాన్ని అడుగడుగునా కలుషితం చేస్తున్న కుటిల రాజకీయ నాయకుల నుండి అప్రమత్తంగా ఉండాలని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది. “కనీసం చంద్రగోళమైనా వెళ్లి బ్రతుకుదామా అంటే, /అక్కడా ఉన్నది గందరగోళం/కనిపించేది రాళ్లు,అదో రకం బూడిద/గాలి అసలే లేదు./అనువైన వాతావరణం ఏమీ లేదు.”మానవులు అడుగు పెట్టిన మొదటి కొత్త ప్రపంచం ఏది? అంటే చంద్రమండలం అని తోస్తుంది.చంద్రుడు భూమికి సమీపంలో ఉండటం వల్ల గ్రహ శాస్త్రానికి ప్రయోగశాలగా దానిని వాడుకుంటున్నాం. అంతరిక్షంలో ఎక్కువ కాలం జీవించడం,పని చేయడం ఎలాగో తెలుసుకోవడానికి చంద్రుడు ఒక ప్రధాన ప్రదేశంగా మిగిలిపోయాడు.ఈ లోకంలో మనుషులు చేస్తున్న అక్రమాలు చూసి విసుగు చెందిన అతడు కనీసం చంద్రుని వద్దకు వెళ్లి బ్రతుకును కొనసాగిస్తానని ఆలోచించాడు.అక్కడ కూడా తన ఆలోచనలకు భిన్నంగా ఉంది.చంద్ర లోకంలో కూడా తాను ఊహించిన దానికి అతీతంగా ఉంది.ఎందుకో చంద్ర గోళం చిందర వందరగా ఉండడం,ఒక క్రమ పద్ధతిలో లేక పోవడంను చూసి అతనికి ఆందోళన కలిగింది.అక్కడ అతడు చూడగానే చంద్రుని వద్ద కనిపించేవి రాళ్లు మరియు అదో రకం బూడిద అక్కడ పేరుకు పోయి ఉంది. ఎందుకో? ఏమిటో? చంద్రుని వద్ద గాలి అసలే లేదు. చంద్రుని వద్ద నివసించడానికి అనువైన వాతావరణం కూడా అక్కడ లేదు అని కవి వీరేశ లింగం కవితలో వ్యక్తీకరించిన భావం చక్కగా ఉంది. ”మరింకే గోళంలో ఉందా వీలైన వాతావరణం ? /సైంటిస్టుల నుండి సమాధానం లేదు.” మరింకే గోళంలో ఉందా వీలైన వాతావరణం అని ప్రశ్నిస్తున్నాడు మరియు అతనే జవాబు చెబుతున్నాడు.శాస్త్రవేత్తల నుండి ఎటువంటి సమాధానం లభించడం లేదు అనే వాస్తవము ఒప్పుకుంటున్నాడు.కవి వీరేశ లింగం కవితలో చెప్పిన తీరు చక్కగా ఉంది. “అందుకే చివరికిది నా నిర్ణయం -’.నిర్ణయం తీసుకునే చర్య లేదా ప్రక్రియ. నిర్ణయం తీసుకోవడం ద్వారా ఒక ప్రశ్న లేదా సందేహం వంటి నిర్ణయం.నిర్ణయం అంటే ఏదైనా పని చేయుట కోసం తీసుకోబడే దృఢ సంకల్పం లేదా నిశ్చయం.ఏదైనా కారణం ద్వారా ఒక ఉద్దేశానికి రావటం నిర్ణయం.ఏదైనా ఒక విషయంపై నిర్ధారణ చేసుకోవటం నిర్ణయం.ఒక పని చేయాలనే ఆలోచన లేదా భావన నిర్ణయం.ఒక ఆలోచన లేక పథకం గురించి ఒక నిర్ణయం తీసుకునే ముందు ఆలోచించుకోవడం జరుగుతుంది.అందుకే అతను చిట్ట చివరిది అయిన నా నిర్ణయంలో ఎలాంటి మార్పుకు ఆస్కారం లేదు అని బహిరంగంగా వెల్లడి చేస్తున్నాడు.“ఉంటాను భూమి మీదే,/ తొలగిస్తాను ముళ్ల కంపలు.” అతను తీసుకున్న అసలైన నిర్ణయం గురించి చెబుతూ పుట్టి పెరిగిన ఈ భూమి మీదనే ఉంటాను.ఈ భూమి మీద విచ్చలవిడిగా పెరిగిన ముళ్ళ కంపలను గొడ్డలితో నరికి తొలగిస్తాను.ముళ్ళ కంపల లాంటి మనుషుల వల్లనే భూమి మీద మానవ పురోగతికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి.ఈ భూమికి అడ్డంకులు కలిగిస్తున్న ముళ్ళ కంపలను తొలగిస్తాను అని ప్రతిన చేసి చెప్పుతున్నాడు. ”మారుస్తాను జీవితాలూ – వాటి ధోరణులూ – పెను తుపానులా ముంచుకు వస్తున్న విప్లవ ధోరణులను/ దిగ మ్రింగుతాను అపర శివుడిలా.” మానవుడి సామాజిక సంబంధాలు,తాత్విక మరియు మతపరమైన ఆలోచనల ధోరణులను మారుస్తాను అంటున్నాడు.పెను తుపాను వేగంగా గాలితో వచ్చే వర్షం.దివిసీమ తుఫాను వల్ల వేలాది మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.సునామీ వచ్చి వైజాగ్ పట్టణం విలవిలలాడింది.ప్రపంచ సమాజంలో కొన్ని కొన్ని విధానాలు ప్రజాస్వామ్యము కమ్యూనిజం అనే సిద్ధాంతాలు ప్రసిద్ధిలో ఉన్నాయి.ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క విధానాన్ని ఎక్కువమంది అనుసరిస్తూ ఉంటారు.ఒక్కొక్కసారి ఒక్కొక్కరి పద్ధతిని జనాలు అనుసరిస్తూ ఉంటారు.విప్లవం అంటే ఒక దేశం యొక్క ప్రభుత్వ వ్యవస్థ,పరిపాలన వ్యవస్థ, రాజ్యాంగం లేదా సామాజిక వ్యవస్థలో అసాధారణమైన ఊహించని మార్పు అని చెప్ప వచ్చు.విప్లవం అంటే సమాజంలోని తరగతి,జాతి లేదా మతపరమైన నిర్మాణాల యొక్క వేగవంతమైన పరివర్తన.విప్లవం అనేది రాజకీయ పాలనలో మార్పునకు ప్రయత్నిస్తుంది. గణనీయమైన సామూహిక సమీకరణ,రాజ్యాంగేతర మార్గాల ద్వారా సామూహిక ప్రదర్శనం,నిరసనలు, సమ్మెలు లేదా హింస వంటి వాటి చేత సమాజాన్ని బలవంతంగా మార్చే ప్రయత్నాలను విప్లవ ధోరణి కలిగి ఉంటుంది.మానవ చరిత్రలో అనేక విప్లవాలు తల ఎత్తినాయి.ఏదైనా ఒక వ్యవస్థ మీద కలిగే అసహ్యం,విరక్తి,విరాగం,అకస్మాత్తుగా తీవ్రంగా ఏర్పడిన ఏహ్యా భావం విప్లవంగా రూపు దిద్దుకుంటుంది.సాధారణంగా రాజకీయ మార్పుని విప్లవం అంటారు.అణచివేత,అన్యాయమైన పాలన, లంచగొండితనం,అసమర్ధ రాజకీయ వ్యవస్థ, సామాజిక అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజల తిరుగుబాటు,వలస పాలన పై ప్రజల తిరుగుబాటు మొదలైనవి విప్లవాలు.ఒక భావజాలానికి అనుకూలంగా ఉద్యమం రూపంలో ఉంటాయి. ప్రజల మనస్సుల్లో,భావోద్వేగాల్లో పాత ఆలోచనలకు బదులుగా కొత్త ఆలోచనలు రేకెత్తించే ప్రయత్నం విజయవంతం అయితే అది విప్లవంగా పరిగణించబడుతుంది.సమాజంలోని ఏదైనా సామాజిక సమూహం,తరగతి లేదా వర్గానికి చెందిన వ్యక్తుల పట్ల పక్షపాతం కారణంగా కూడా విప్లవాలు సంభవించవచ్చు.ఎవరైనా మీకు నచ్చని పనిని చేయమని బలవంతం చేస్తే చేయనని ఖరాఖండిగా చెప్పడం విప్లవంగా చెప్పవచ్చు.ప్రజల జీవితాలను మారుస్తాను.ప్రజల జీవితంలో వెల్లువెత్తుతున్న తీవ్రమైన ధోరణులను కూడా మారుస్తాను. సమాజంలో మార్పు కోసం సాగుతున్న పెను తుపానులా ముంచుకు వస్తున్న విప్లవ ధోరణులను కూడా మారుస్తాను.క్షీరసాగర మథనంలో దేవతలకు రాక్షసులకు అమృతం కొరకు సాగుతున్న పోరులో దేవతలు శివుని ప్రార్థించగా శివుడు హాలాహలం మింగి దేవతలకు అమృతం దక్కేటట్లు చేశాడు. ఇవ్వాళ సమాజంలో తుఫాను వలె ముంచుకు వస్తున్న విప్లవ ధోరణులను కూడా దిగ మ్రింగుతాను అపర శివుడిలా అంటున్నాడు.అర్రులు చాచుతాను అంటూ అతను అమరత్వం కొరకు అర్రులు చాస్తాను.అమరత్వం కొరకు ఎదురు తెన్నులు చూస్తూ పోరాడుతాను అనే సంకల్పాన్ని తెలియజేస్తున్నాడు.సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కొరకు ప్రయత్నిస్తూ సమస్యల అంచుల వరకు ఆలోచిస్తాను.ఆలోచనల ఫలితాన్ని అందుకుంటాను. ఇవ్వాళ దేశం ఎదుర్కొంటున్న ఇక్కట్లకు పరిష్కారం కనుగొని నా దేశానికి పూర్ణత్వం చేకూరుస్తాను.ఇది తానూ ఎన్నుకున్న తీర్మానం,తిరుగులేని నా నిర్ణయం అంటున్నాడు.అందుకే ఈ భూమిని వీడి పోను వాడిగా అసలే పోను అని అతనిలో చెలరేగుతున్న భావాలు నిత్య నూతనత్వంతో కూడుకుని ఉన్నాయి.వాడి పోను వీడి పోను అని మనలో ఆలోచనలు రేకెత్తిస్తున్నాడు.మనలను ఏదో కొత్త లోకంలోకి తీసుకొని పోతున్నాడు.అతను వ్యక్తం చేస్తున్న భావాలకు స్వాగతం పలుకుతున్నాను.వీడి పోను వాడి పోను.నా భావాలను సజీవంగా నిలిపే ప్రయత్నం చేస్తాను అనే అతని ఊహలు ఆశ్చర్యంగా ఉన్నాయి.కవి వీరేశ లింగం కవితలో వ్యక్తం చేసిన భావాలు అద్భుతంగా ఉన్నాయి.కవి వీరేశ లింగం మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.
డాక్టర్ ముదిగొండ వీరేశ లింగం తేది 08 – 06 -1940 రోజున వరంగల్ జిల్లాలో జన్మించాడు.వీరి తల్లిదండ్రులు భవానమ్మ,శంకర శాస్త్రి.వీరి తండ్రి శంకర శాస్త్రి వరంగల్ పట్టణంలో విశ్వేశ్వర సంస్కృత కళాశాల,దుర్గేశ్వర మహిళా కళాశాలలను నడిపాడు.ఆచార్య డాక్టర్ రవ్వా శ్రీహరి గారు శంకర శాస్త్రి వద్ద సంస్కృతం నేర్చుకున్నారు.శంకర శాస్త్రి ప్రియమైన శిష్యుడు ఆచార్య డాక్టర్ రవ్వా శ్రీహరి. వీరి తండ్రి శంకర శాస్త్రి 1993 సంవత్సరంలో ఈ లోకాన్ని వీడి పోయారు.వీరి తాత వీరేశ లింగం నాయనమ్మ అన్నపూర్ణమ్మ.వీరి తాత వీరేశ లింగం,1916 సంవత్సరంలో ఈ లోకాన్ని వీడి పోయారు.వీరు 5 వ తరగతి నుండి 10 వ తరగతి వరకు ఎ.వి. హై స్కూల్ హన్మకొండలో చదివారు. వీరు 10 వ తరగతి1957 సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించారు.వీరు పి.యు.సి. నుండి బి.ఏ. డిగ్రీ 1959 – 1962 వరకు ప్రభుత్వ ఆర్ట్స్& సైన్స్ డిగ్రీ కళాశాల,వరంగల్ లో చదివారు.వీరు ఎం.ఏ. తెలుగు ఉస్మానియా యూనివర్సిటీ,హైదరాబాదులో చదివారు.వీరు ఎం.ఏ. తెలుగు 1965 సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించారు.వీరు జైమిని భారతం సంశోధనాత్మక పరిశీలన అంశంపై ప్రొఫెసర్ యం.కుల శేఖర రావు గారి పర్యవేక్షణలో ఉస్మానియా యూనివర్సిటీ,హైదరాబాద్ నుండి 1978 సంవత్సరంలో పి.హెచ్.డి.అవార్డు పొందారు. వీరు డిగ్రీ కళాశాలలో చదువుతున్నప్పటి నుండి సాహిత్య సృజన చేయడం ప్రారంభించారు.వీరు18 – 09 – 1969 రోజున ప్రభుత్వ డిగ్రీ కళాశాల, గూడూరు,నెల్లూరు జిల్లాలో లెక్చరర్ గా నియమింపబడ్డారు.వీరు వివిధ హోదాలలో పనిచేస్తూ కాకతీయ డిగ్రీ కళాశాల,హన్మకొండ నుండి రీడర్ గా 30 – 06 -1998 రోజున రిటైర్ అయ్యారు. వీరు రీడర్ గా కాకతీయ డిగ్రీ కళాశాల,హన్మకొండలో పని చేస్తున్నప్పుడు వీరి పర్యవేక్షణలో ఇద్దరు విద్యార్థులు పి.హెచ్.డీ. అవార్డు పొందారు.వీరి పర్యవేక్షణలో పిన్న శారద “మల్లంపల్లి వీరేశ్వర శర్మ గారి జీవితం సాహిత్యం” అంశంపై పరిశోధన చేసి పి.హెచ్.డి అవార్డు పొందింది.పిన్న శారద దుర్గేశ్వర మహిళా సంస్కృతాంధ్ర కళాశాల,వరంగల్ నుండి ప్రిన్సిపల్ గా పని చేసి రిటైర్ అయింది.వీరేశలింగం గారి పర్యవేక్షణలో హరి సనత్ కుమార్ విశ్వనాథ సత్యనారాయణ గారి ఖండ కావ్యాలు పరిశోధన అంశం” పై పరిశోధన చేసి పి.హెచ్.డి.అవార్డు పొందినాడు.హరి సనత్ కుమార్ ప్రొఫెసర్ హరి శివకుమార్ తమ్ముడు.హరి సనత్ కుమార్ యొక్క విశ్వనాథ సత్యనారాయణ గారి ఖండ కావ్యాలు పరిశోధన గ్రంథం ప్రచురింపబడింది.
వీరేశ లింగం గారు ఇస్కాన్ ముంబాయి సంస్థలో నవంబర్ 1998 నుండి 2011 వరకు ఉచితంగా పని చేశాడు.వీరు సంస్కృతం భగవద్గీతకు సంపాదకత్వం వహించారు.వీరు సంస్కృత భాగవతం 18 వాల్యూమ్స్ లకు సంపాదకత్వం వహించారు.వీరి సంపాదకత్వంలో ఇస్కాన్ సంస్థ నుండి 25 పుస్తకాలు వెలువడ్డాయి. శివానందమూర్తి గారు ప్రచురించిన వ్యాస గ్రంధాలలో వీరు రాసిన వ్యాసాలు యోగ శాస్త్రం,తెలంగాణలో శైవ మత వ్యాప్తి ప్రచురింపబడినవి.వీరేశ లింగం గారి వివాహం జ్ఞాన ప్రసూనాంబతో తేది 08 – 06 – 1966 రోజున పెసరమిల్లి గ్రామం కృష్ణా జిల్లాలో జరిగింది. వీరేశ లింగం,జ్ఞాన ప్రసూనాంబ దంపతులకు ముగ్గురు సంతానం :1)ప్రథమ సంతానం : కుమారి శివ కౌముదీ దేవి, కవయిత్రి,రచయిత్రి,జర్నలిస్ట్, కథలు వ్యాసాలు రాశారు.వీరు రాష్ట్రపతి ఆర్ వెంకట్రామన్ ను ఇంటర్వ్యూ చేసారు.వీరు రేడియోలో ప్రసంగాలు చేశారు.కుమారి శివ కౌముదీ దేవి అనారోగ్యంతో 02 – 06 -2016 రోజున ఈ లోకాన్ని వీడిపోయింది. సాహిత్య లోకం ఒక గొప్ప కవయిత్రిని కోల్పోయింది.
2) ద్వితీయ సంతానం : దుర్గాప్రసాద్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అమెరికాలో పని చేస్తున్నాడు.
3)తృతీయ సంతానం : భావనా శంకర్ భార్య శైలవర్తన.భావనా శంకర్ కెనడాలో బ్యాంక్ మేనేజర్ గా పని చేస్తున్నాడు.
వీరేశ లింగం గారు వెలువరించిన పుస్తకాల వివరాలు.
1) స్పందన కవితా సంపుటి – 1982.
2) జైమినీ భారతం సంశోధనాత్మక పరిశీలన గ్రంథం -1983.
వీరేశ లింగం వరంగల్ పట్టణంలో స్వగృహం నిర్మించుకున్నాడు.వీరికి 84 సంవత్సరాల వయస్సు.ప్రత్యేక తెలంగాణ 1969 గురించి అడిగితే తెలంగాణలోని రాజకీయ నాయకులకు ఎవరి స్వార్థం వారికే ఉంది.రాజకీయ నాయకులు నిజాయితీగా తెలంగాణ కోసం పని చేయ లేదు అన్నారు.2014 తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడం నాకు చాలా సంతోషంగా అనిపించింది.తల్లిదండ్రులు పిల్లలను ప్రేమగా చూసుకోవాలి.తల్లిదండ్రులను బట్టి పిల్లలు తయారవుతారు.తల్లిదండ్రులు పిల్లల పట్ల ప్రేమగా ఉండాలి.చేతనైనంత వరకు ఎవరికైనా సహాయం చేయాలి.మాటలు చెప్పడం కాదు పని చేసి చూపించాలి అని అన్నారు.వీరు 50 మందికి హోమం చేసి లింగ ధారణం,పంచాక్షర మంత్రం ఉపదేశం చేశారు.వీరు నూతన రచయితలకు కొన్ని సూచనలు చేశారు.చేతిలో కలం ఉంది కదా అని ఏది పడితే అది రాయ కూడదు.రాసే వాళ్ళు ఆలోచించి రాయాలి.నేను రాసిన దానివల్ల ఎవరికన్నా ప్రయోజనం ఉందా? లేదా? అని ఆలోచించాలి.నోరు ఉంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు.సమాజంలో రాయి రాయక పో.మనసును వాక్కును కంట్రోల్ చేయడం చాలా అవసరం.పెద్దల ఎడ గౌరవాన్ని కలిగి ఉండాలి.బుద్ధి,మనస్సు,ఆలోచనలను అదుపులో పెట్టుకోవాలి.ఎవరిని అవమానించ కూడదు. అందరికీ మంచి జరగాలని కోరుకోవాలి.తామరాకు మీద నీటి బొట్టు లాగా బతకాలి.ప్రాచీన,ఆధునిక సాహిత్యం రెండు చదవాలి.మనసులో ద్వేషం పెట్టుకుని పుస్తకాలు చదవ వద్దు.ఎవరిని గూర్చి కూడా చెడు మాట్లాడ కూడదు అని చెప్పినారు.వీరు 5 గంటలకు నిద్రలేస్తారు.కాలకృత్యాలు తీర్చుకుంటారు.రోజు శివ పూజ చేస్తారు.సమయం దొరికినప్పుడు సాహిత్య అధ్యయనం చేస్తారు.రాత్రి 10 గంటలకు నిద్ర పోతారు.

డాక్టర్ ముదిగొండ వీరేశ లింగం విప్లవానికి మలుపు కవిత పై విశ్లేషణా వ్యాసం.

ప్రముఖ కవి,రిటైర్డ్ తెలుగు భాషా రీడర్,కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల,హన్మ కొండ,డాక్టర్ ముదిగొండ వీరేశ లింగం కలం నుండి జాలువారిన స్పందన కవితా సంపుటిలోని విప్లవానికి మలుపు కవిత పై విశ్లేషణా వ్యాసం.విప్లవానికి మలుపు కవితను ఆసక్తితో చదివాను.నాకు నచ్చింది.నాలో ఆలోచనలు రేకెత్తించింది.విప్లవాలు ఒక భావజాలానికి వ్యతిరేకంగా లేదా అనుకూలంగా ఉద్యమ రూపంలో ఉంటాయి.ప్రజల మనస్సుల్లో భావోద్వేగాల్లో పాత ఆలోచనలకు బదులు కొత్త ఆలోచనలు రేకెత్తించే ప్రయత్నం విజయవంతమైతే విప్లవంగా పరిగణించబడుతుంది.చరిత్రలో ఎన్నో విప్లవాలు జరిగాయి.విప్లవానికి మలుపు ఉంటుందా? అని మనకు ఆశ్చర్యం కలిగించవచ్చు. ధనిక,పేద అసమానతలు తొలగించడానికి పేద ప్రజలు ఐక్యమై పోరుబాట సాగిస్తారు.ఆ పేద ప్రజల పోరు బాట అనేక మలుపులు తిరిగి చివరికి విప్లవం విజయవంతం అవుతుంది.
“ఈనాటి నా జాతి స్వరూపం
“రంగు రంగుల సుమాల వనం
“నానా జాతి సమితి మినీ స్వనం
“విపుల బాంధవ్య వైవిధ్యాలు లేని గుణం – నిక్వణం.
సమాజంలో జాతుల స్వరూపం అనేక తెగలతో నెలకొని ఉంది.వివిధ తెగలు గల జాతి రంగు రంగుల పూల తోటలా ఉంది.సమాజంలో అనేక తెగల మధ్య దేశాల మధ్య యుద్ధాలు ఆధిపత్యం కోసం జరుగుతూ ఉండేవి.ప్రపంచ దేశాల మధ్య అనేక తెగల మధ్య సయోధ్య చేకూర్చడానికి నానా జాతి సమితి అనే ప్రపంచ సంస్థ ఏర్పడింది.నానా జాతి సమితి లోని తెగల మధ్య ఏర్పడిన చిన్న ధ్వని ప్రభవించింది.మనం నివసించు ప్రదేశం మనకు తల్లి లాంటిది.అలాంటి ప్రదేశాలలో నివసించు ప్రజల మధ్య సంబంధాలు ఏమీ లేకపోయినప్పటికీ అనేక తెగలు కలిసిన బాంధవ్యాల మధ్య ఒక చక్కని ధ్వని వినబడింది.
“ఈ జాతికి ఎందుకో పుట్టింది విప్లవం
“ఏనాటికి మారకూడదు ప్లవంగంలా
“మారినా పరవా లేదు అది లవంగంలా
“ఎందుకైనా మంచిది : అది అలానే కావాలి.
ఈ దేశంలో పుట్టిన ఈ జాతి జనులకు ఎందుకో పుట్టింది విప్లవం? అని ప్రశ్నిస్తున్నాడు. అరాచకాలకు,అణిచివేతకు,దోపిడీకి,వివక్షకు గురి అవుతున్న ప్రజలు తమ హక్కుల సాధన కోసం ఉద్యమాల బాట పట్టి పోరాటం సాగిస్తారు.మార్పు కోరే హక్కు ప్రజలకు ఉంది.అట్టి ఆ మార్పే విప్లవంగా రూపు దిద్దుకుంటుంది.ప్రజలలో చైతన్యంతో పుట్టుకు వచ్చిన విప్లవం హక్కుల సాధన కోసం మార్పు కోసం నిరంతరం ఉద్యమాలుగా కొనసాగుతుంటాయి.ప్రజలు సాగిస్తున్న అట్టి విప్లవం సరైన పంథాలో సాగాలి.ప్రజలు సాగిస్తున్న ఆ విప్లవం ఏనాటికి మారకూడదు కోతిలా అని ప్రజలను హెచ్చరిస్తున్నాడు.విప్లవాలలో పాల్గొన్న వారి ప్రవర్తన క్షణ క్షణం మారే కోతి చేష్టల వలె ఉండకూడదు.విప్లవాలు నడిపే వాళ్ళ ప్రవర్తన కోతిలా ఉంటే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటారు అనే ఉద్దేశంతో తెలియజేస్తున్నాడు.తమ హక్కుల కోసం ప్రజలు సాగిస్తున్న విప్లవం మారినా ఫర్వాలేదు లవంగంలా అని అంటున్నాడు.లవంగం ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.విప్లవం కూడా లవంగం వలె ఆరోగ్యకరమైనదిగా కొనసాగాలి అని కోరుకుంటున్నాడు.ఎందుకైనా మంచిది విప్లవం అలానే కొనసాగాలని అంటున్నాడు.ఆరోగ్యకరమైన విప్లవం కొరకు ఆరాటపడుతున్న తపన కనబడుతుంది.మంచి కోసం పాటు పడే విప్లవాలు చోటు చేసుకోవాలి అని చెబుతూ ప్రజల్లో విశ్వాసాన్ని నింపుతూ ప్రేరణ కలిగిస్తున్నాడు.
“విప్లవ రుధిర జ్వాల కోసం
“ఎదురుచూస్తున్నారు ఈనాటి యువకులు
“కాని ఎందరున్నారు.ఈ జాతిలో రక్తం ధార పోసే వారు.”
సమాజంలో ఎందరో యువకులు విప్లవాల బాటన సాగుతున్నారు.సమాజంలో ఎందరో యువకులు విప్లవ రుధిర జ్వాల కోసం తమ రక్తాన్ని ధార పోయడానికి ఎదురు చూస్తున్నారు.ఈనాటి సమాజంలో రక్తాన్ని ధార పోసే యువకులు ఎందరు ఉన్నారు.విప్లవాల కోసం ఉద్యమాలు ఉవ్వెత్తున రగులుతున్నాయి.కాని తమ జాతి హక్కుల సాధన కోసం రక్తం ధార పోసే యువకులు ఎందరు ఉన్నారు అని ప్రశ్నించడం చక్కగా ఉంది.సమాజంలో చెలరేగుతున్న ఉద్యమాల్లో పాల్గొని యువకులు జాతి కొరకు పాటు పడాలని ప్రేరణ కలిగిస్తున్నాడు.
“రక్తమంటే ఏమో కాదు
“అర్థం చేసుకున్న వారికి
“తెలుస్తుంది దాని విలువ
“ఆరోగ్యానికి కావాలి రక్తం
“ఆయుర్దాయానికి కావాలి రక్తం.
రక్తం మానవులు ఇతర జంతువులలో కణజాలాలకు పోషకాలను,ఆక్సిజన్ ను సరఫరా చేసే ద్రవం.రక్తం జీవ క్రియలో భాగంగా ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను ఆ కణజాలాల నుండి తీసుకుపోతుంది.రక్తమును నెత్తురు అని కూడా అంటారు.జీవి మనుగడకు రక్తం అత్యవసరం.రక్తాన్ని చూడగానే వెంటనే ఆకట్టుకునేది దాని ఎర్రటి ఎరుపు రంగు.రక్తానికి ప్రాణం హిమగ్లోబిన్.దీన్నే రక్తచందురం అంటారు. కవి వీరేశ లింగం రక్తం యొక్క విలువ అర్థం చేసుకున్న వారికే తెలుస్తుంది అని అంటున్నాడు. రక్తం లేకుంటే మనిషి నీరసించి అనారోగ్యం బారిన పడి ప్రాణాలు కోల్పోతాడు.మానవుని సంపూర్ణ ఆరోగ్యానికి రక్తం కావాలి.రక్తం ఉంటేనే మనిషి ఆయుర్దాయం కలిగి సుఖంగా ఎక్కువ కాలం జీవించగలుగుతాడు అని చెప్పిన తీరు చక్కగా ఉంది.
“చైతన్యానికి కావాలి అదే
“యువతకు కావాలి అదే
“అందుకే అంటాం
“ఆపరేషన్ థియేటర్లో
“ఆరోగ్య పూరిత రక్తమే కావాలని.”
చైతన్యం లేదా స్పృహ అంటే ఆలోచనలు, జ్ఞాపకాలు,భావాలు,అనుభూతులు మరియు పరిసరాలపై వ్యక్తిగత అవగాహన కలిగి ఉండటం. చైతన్యం లేదా స్పృహ అనేది మీ గురించి మీ చుట్టూ ఉన్న ప్రపంచం గురించి మీకున్న అవగాహన అని చెప్పవచ్చు.చైతన్యం అంటే శక్తి లేదా ఉత్సాహం అని అర్థం.చైతన్యమంటే ప్రాణము లేదా జీవ శక్తి అని కూడా చెప్ప వచ్చు.కవి వీరేశ లింగం మానవుని చైతన్యానికి కావాలి రక్తం.మనిషి చైతన్యం లేకుంటే ఏ పని చేయ లేడు.చైతన్యం లేకుంటే మనిషి నీరసించి పోతాడు.మనిషి చైతన్యంతో ఉండాలి అంటే రక్తం తప్పనిసరి కావాలి అని చెప్పిన తీరు బాగుంది.యువత అనగానే తమ కుటుంబం,సమాజం,రాష్ట్రం,దేశం యొక్క అభివృద్ధిలో ఎల్లప్పుడు సానుకూల మార్పును కోరుకునే శక్తివంతమైన సమూహంగా చెప్పవచ్చు. యువత దేశానికి వెన్నెముకగా పేరు గాంచింది.దేశం అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోవాలంటే చైతన్యంతో,దృఢ సంకల్పంతో యువత ఒక ప్రణాళిక ప్రకారం కృషి చేయాలి.భారత దేశం ఇప్పటికి పేదరికం,నిరుద్యోగం,అవినీతి, ఆత్మహత్యలు మరియు వివిధ రకాల సామాజిక సమస్యలను ఎదుర్కొంటుంది.ఉత్సాహంతో పరుగులు తీస్తున్న యువతకు కూడా రక్తం కావాలి. యువత రక్తం ఉంటేనే చైతన్యంతో ఉంటారు. యువత చైతన్యంతో సమాజాభివృద్ధి కొరకు పాటు పడతారు అని చెప్పిన తీరు బాగుంది.ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ఆపరేషన్ థియేటర్లో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నప్పుడు అతనికి ఆరోగ్యపూరితమైన రక్తం ఎక్కిస్తేనే ప్రాణాపాయం నుంచి బయటపడ గలుగుతాడు.రక్తం ఎక్కించిన తర్వాత అతను ఆరోగ్యకరమైన వ్యక్తిగా జీవించగలుగుతాడు అనుటలో సందేహం లేదు.
“కాబట్టి ఈనాటి జాతికి
“పనికి వచ్చే నవయువకుల నవచైతన్యం
“ఆలోచించే అర్థవంతపు జీవితం
“అమరత్వం కొరకు అర్రులు చాచే
“మతి భ్రమణం లేని యువకుల చైతన్యం
“కావాలి అదే – చివరంటా సాగాలి అదే –
“సంకేతాలను తప్పించుకునే వారు
“సంకటాలను తప్పించు కొనాలి
“దానికే ఈనాటి యువతరం
“పడాలి మధనం పొందాలి ఆవేదన.
దేశం ఎదుర్కొంటున్న సమస్యల విష వలయం నుంచి బయటపడాలంటే చైతన్యవంతులైన నవ యువకుల వల్లనే సాధ్యమవుతుంది.అలాంటి నవ యువత మాత్రమే దేశ అభివృద్ధి,సమాజ అభివృద్ధి కొరకు కృషి చేస్తూ ప్రాణాలను పణంగా పెట్టగలరు. నవ యువత అమరత్వానికి అర్రులు చాస్తారు. అమరత్వం అనేది శాశ్వత జీవితం యొక్క భావన. అమరత్వం అనగా మరణము లేని తనం.కొండలు పిండి చేసే నవ యువకులలోని చైతన్యం మతి భ్రమణం కోల్పోయేలా ఉండకూడదు.నవ యువకుల చైతన్యం వెర్రి తలలు వేయకూడదు. ఈనాటి నవ యువత సానుకూల భావాలతో ముందుకు సాగాలి.అలాంటి సానుకూల భావాలు ఉన్న నవ యువకులు కావాలి.అలాంటి నవ యువకులు దేశ శ్రేయస్సు కొరకు జీవితాంతం వరకు ముందుకు సాగాలి అని పిలుపునిస్తున్నాడు.ఈ దేశంలో నివసించే యువత నిర్దిష్టమైన ప్రణాళికలతో చైతన్యవంతులై ఆపదల నుండి తప్పించుకునే వారుగా ఉండాలి.ఈనాటి నవ యువత తమ ఆశయాలను సాధించడానికి ఎదురయ్యే కష్టాలను తప్పించుకొని ఎదుర్కొంటూ తమ కృషిని కొనసాగించాలి.కవి వీరేశ లింగం ఈనాటి యువతరం ఉత్సాహంతో మధనపడి ఆవేదన చెంది దేశం కోసం పాటుపడాలని చైతన్యాన్ని కలిగిస్తున్నాడు.
“పది మందిలో బడ్డ పామైనా చావదు
“అదే నేటి మన సమాజపు లోటు
“దిద్దు కోవాలి ఈ లోపం
“హద్దు మీరితే పరితపించ గలం పాపం.
పది మందిలోకీ వచ్చిన పాము చావదు అని తెలుగులో సామెత ఉంది.అదే నేటి మన సమాజం యొక్క లోటు అని తెలియజేస్తున్నాడు.నేటి సమాజంలో కొందరు తెలిసి తెలియక తప్పులు చేస్తుంటారు.చేసిన తప్పు తెలుసుకొని చివరికి బాధ పడుతుంటారు.ఈ లోపాన్ని దిద్దుకోవాలని అని చైతన్యం కలగిస్తున్నాడుమనిషి చేసిన తప్పులు హద్దులు మీరితే పరితపించక తప్పదు అని చెబుతున్నాడు.
“చీకాకుల చిడిముడిపాటులో
“ఆకుల పాటులో ఆకతాయితనాన్ని
“అణగ ద్రొక్కేయి నేస్తం అణగ ద్రొక్కేయి
“నిర్లిప్తంగా పడి ఉంటే నువ్వు
“నిజంగా పడిపోతావు
“జాగ్రత్తే నీ జన్మ హక్కని
“పోరాడు శాశ్వతంగా గెలుస్తావు
“తస్మాత్ జాగ్రత్త : జాగ్రత్త : జాగ్రత్త :.
మనిషి చీకాకుగా ఉండడం వలన బాధలను ఎదుర్కొంటాడు.మనిషి చీకాకుతో ఏర్పడిన బాధల వలన కలిగిన ఫలితం అనుభవిస్తాడు.మనిషి చిన్న పిల్లల చేష్టల వంటి ఆకతాయితనాన్ని విడిచి పెట్టాలని స్నేహితుడి వలె సలహా ఇస్తున్నాడు. నిర్లిప్తంగా పడి ఉంటే ఏ పనిలోను మనసును నిమగ్నం చేయ లేక పోతాడు.నిర్లిప్తంగా ఉంటే బాధకు లోనై పడి పోతావు అని సలహా ఇస్తున్నాడు. చిన్న పిల్లల చేష్టలను మనస్సులోనే అణగ ద్రొక్కేయి నేస్తం అణగ ద్రొక్కేయి అని చెప్పడం చక్కగా ఉంది. మంచి చెడు ఆలోచించకుండా నువ్వు కళ్ళు మూసుకుని ఉంటే నిజంగా పడిపోతావు.యువత ఎక్కడ పడిపోకుండా జాగ్రత్తగా ముందుకు సాగాలి. యువత చర్యలు తీసుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలి.యువత నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటిలో జాగ్రత్తగా ఉండాలి.యువత ప్రమాదాన్ని నివారించడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.జాగ్రత్తగా ఉండడం యువత యొక్క జన్మ హక్కు. యువతా అచంచల ఆత్మ విశ్వాసంతో పోరాడు శాశ్వతంగా గెలుస్తావని జాగ్రత్త వహించమని కవి వీరేశ లింగం వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.విప్లవానికి మలుపు కవిత ద్వారా యువత సమాజం పట్ల తమ బాధ్యతను ఎలా నెరవేర్చుకోవాలి?యువత అమాయకత్వంతో దుందుడుకు చర్యలకు పాల్పడకూడదు అనే కర్తవ్య బోధ ఉంది.విప్లవానికి మలుపు కవిత ద్వారా యువతకు కవి వీరేశ లింగం గొప్ప సూచనలు ఇచ్చారు.ఈ కవిత యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుంది అని చెప్పడంలో సందేహం లేదు.కవి వీరేశ లింగం మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

ముదిగొండ వీరేశ లింగం, జ్ఞాన ప్రసూనంబ
March 17, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

నిన్నటి దాకా శిలనైనా

by PVS Krishnakumari March 15, 2024
written by PVS Krishnakumari

నీలాకాశం భూమి మీదకి ముత్యాలని వెదజల్లుతున్నదా అన్నట్లు, తెల్లని మంచు జల్లులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఆ ముత్యాల మధ్యకుండా పైపైకి ఎగురుతున్నది లోహవిహంగం.
“మేడం కెన్ యూ హేవ్ స్నాక్స్” అన్న ఎయిర్ హోస్టెస్ మాటలకి, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని, ‘ తెలంగాణ గడ్డమీద సందమామయో సందమామయా,’   పాటను కళ్ళుమూసుకుని ఆస్వాదిస్తన్న అనుపమ నుంచి ఏసమాధానం రాకపోవటంతో, తల్లి వైపు చూసింది శ్వేత.
“మమ్మీ,“ తల్లి భుజంమీద చేయి వేసింది
కళ్ళు తెరిచి చూసిన అనుపమ కళ్ళలో చిన్న కన్నీటి పొర. ఇన్ని సంవత్సరాల తర్వాత తను పుట్టిన గడ్డ మీద అడుగు పెట్టాలనే కోరికతో ఇండియా బయలు దేరిన తన తల్లిలోని ఉద్వేగాన్ని గమనించిన శ్వేత,
“కూల్ డౌన్ మమ్మీ,” అంటూ తల్లి చేయిని తన చేతిలోకి తీసుకుంది.
గతకొన్ని నెలలుగా తల్లి పడుతున్న మానసిక సంఘర్షణ, దాని నేపధ్యం అర్ధంచేసుకుంటూనే ఉంది శ్వేత.

*                 *             *

“చాలా గ్రాండ్ గా ఉంది ఫంక్షన్ హాల్. ఆడంబరంగానే చేస్తున్నాడు బావ రజనీ పెండ్లి.  పొలాలు అమ్మలేదుగా, మరి మనీ ఎలా ఎడ్జస్ట్ అయిందో?” అడిగింది అనుపమ భర్త సందీప్ ని.
“బావలిద్దరూ ఇచ్చారు.  భూమికి మంచి రేటు రాగానే అమ్మి వాళ్ళకిస్తాడంట,” సందీప్ సమాధానం.
“ఎవరో ఒకరు సాయం చేయాలిగా” ఆమె మాట ఆమెకే పేలవంగా అనిపించింది.
అన్న కూతురు, రజనీ పెళ్లి సంబురాన్ని వీడియోకాల్లో చూస్తున్నారు, అమెరికాలో ఉన్న సందీప్, అనుపమ, కూతురు శ్వేత.
“చిన్నోడా, నీవు కూడా పెండ్లికి వస్తే మంచిగుండేది. కనీసం అనుపమని, బిడ్డలిద్దర్నీ అయినా అంపకపోతివి,” వీడియోలో సందీప్ తల్లి బాధ.
“ఏంజేయాల్నే మా ఉద్యోగాలు గట్లనే ఉంటయి. బతుకమ్మల నాటికి వాళ్ళొస్తారులే,” సందీప్ హామీ తల్లికి.
ఇలాంటి హామీలు ఎన్నిసార్లు ఇచ్చాడో తెలిసిన ఆమె మాట్లాడలేదు.
“ఏం బిడ్డా,ఎట్లుండ్రు ఎప్పుడొస్తారు మనదేశం?,” అంటూ పెళ్ళికి వచ్చినవాళ్ళు ఒకరొకరే   వీడియోలో అడుగుతున్నారు.
వీడియో చూస్తూ, పెళ్లికి వచ్చిన వాళ్ళని, ‘వీళ్ళెవరు, వాళ్ళెవరూ,’ అని శ్వేత అడుగుతుంటే,అందులో కొంతమంది  బంధుత్వం గురించి ఎలా చెప్పాలో అనుపమకి అర్ధం కావటం లేదు. కారణం ఆమెకే వాళ్ళెవరో తెలియదు. ముఖ్యంగా ఈతరం పిల్లలు.
ఈసంవత్సరమే ఎం.ఏ. ఆంత్రోపాలజీలో చేరిన శ్వేత మాత్రం వీడియోలోభారతీయ వివాహ క్రతువుని, సాంప్రదాయాలని ఆసక్తిగా చూడసాగింది.

*                 *             *

అనుపమ వాళ్ళ కౌంటీ లోనే ఉండే అనూష ఇంట్లో ఫంక్షన్.  డల్లాస్ లో ఉండే అనూష ఆడబిడ్డ చికాగో వచ్చింది ఒడిబియ్యం ఫంక్షనుకి.  అనుపమని కూడా పిలిచారు. ఆమెకి ఇలాంటివి అసలు ఇష్టం ఉండదు. కానీ వాళ్ళ అమ్మాయి, శ్వేత క్లాస్ మేట్స్.
“మమ్మీ, ఆంటీ వాళ్ళు కౌంటీలో మనల్ని ఒకళ్ళనే పిలిచారు, వెళ్ళకపోతే బాగోదు,” అనటంతో వెళ్ళాల్సి వచ్చింది.
ఇండియా నుంచి అనూష అత్తమ్మ మణెమ్మ వచ్చింది. అనుపమ వెళ్ళగానే అనూష, “అత్తమ్మా, వీళ్ళ ఊరు  మనూరి  దగ్గర  కనగల్లు.   పాతికేళ్ల సందు ఈడనే ఉంటున్నారు,” పరిచయం చేసింది.
“దా బిడ్డ, కూసో,” అంటూ సోఫాలో తన పక్కనే కూర్చోబెట్టుకుంది.
“మీ మామ పేరేంటి,” అడిగింది.
“లింగమయ్య,” చెప్పింది అనుపమ.
“గరిదాసు లింగమయ్య కోడలివా, చెప్పవేం బిడ్డా. మా చిన్నమ్మమ్మ మనుమడేగా లింగమయ్య.  ఎంత మంచోడు, కొడుకుల్ని మంచిగా సదివించాలని ఏంత కష్టపడేటోడో. నీ ఆడబిడ్డలిద్దరికీ మంచి సంబంధాలే చేసాడు. నీ బావ పొలాలు చూసుకుంటున్నా, పైసా పైసా జమజేసి మీఆయన్ని పట్నం అంపి సదివించాడు. పరాయి దేశంలో నౌకరీ అని గొప్పగా చెప్పుకునే టోడు. ఏం లాభం, రెండు సార్లు ఒచ్చిండేమో మొత్తం మీద మీ ఆయన. మీ మామ  పోయినప్పుడు కూడా చివరి సూపుకి రాలేకపోయే,” మణెమ్మ వాక్ప్రహం అలా సాగుతూనే ఉంది.
అక్కడే ఉన్న మణెమ్మ కూతురు
“అమ్మా, యేందేగది, ఎప్పుడు, ఎట్ల మాట్లాడాలో తెల్వదా. గమ్మునుండు,” అని తల్లిని గదమాయించి,
“సారీ ఆండీ, ఆమె పాతకాలపు మనిషి, ఏమీ అనుకోవద్దు. రండి హాల్లో కూర్చుందాం,” అని చేయి పట్టుకుని తెచ్చి హాల్లో కుర్ఛోబెట్టింది.
ఆ క్షణంలోనే అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంది అనుపమకి. కానీ శ్వేత కోసం తమాయించుకుంది.
ఇల్లంతా సందడిసందడిగా ఉంది. ఫంక్షన్ మొదలయింది. ఒకరితో ఒకరు పరాచికాలు. ఆడపిల్లలు అందరూ సాంప్రదాయ దుస్తుల్లో భారతీయ సంస్కృతికి ప్రతీకలుగా ఉన్నారు. టాప్, లెగ్గిన్స్ లో ఉన్న శ్వేత చేత వాళ్ళ ఫ్రెండ్ బలవంతాన తను ఇండియా నుంచి తెప్పించిన చీరె కట్టించింది.
ముత్తయిదువులు అందరూ కలిసి నవ్వుతూ తుళ్ళుతూ పసుపు బియ్యం కలిపారు. పుడకలు, పళ్ళు అన్నీ తెచ్చారు.
“గదేందే, ఆపుడకలు గట్లనేనా సర్దేది,” మణెమ్మ మాటలకి, ఆమె కూతురు బిడ్డ,
“నేగిట్లనే సరుదుతా, సూడబుద్దయితే సూడు, లేదంటే గమ్మునుండు,” అమ్మమ్మతో పరాచికాలు.
ఒడిబియ్యం కార్యక్రమం పూర్తయింది. తర్వాత లంచ్, డ్రింక్స్ సర్వ్ చేసారు.
“ఏమైనా మనూళ్ళో దావత్ మల్లెయితే ఈడుండదు. ఆడయితే మంచిగ కల్లు నింపుతారు గౌవుల్లోళ్ళు. ఈడేందో ఇస్తరు,” మణెమ్మ గొణుగుడు.
కేవలం కనపడి పోదాం అనుకున్న అనుపమకి సమయం తెలియలేదు.  శ్వేత అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నది. ఫంక్షన్ ఎలా చేస్తున్నారు, ఎందుకు చేయాలి వివరంగా అడిగి తెలుసుకుంటున్నది.
లంచ్ అయిపోయాక అనుపమ అందరికీ బై చెప్పి బయలుదేరుతుంటే
“ఇండియా వెళ్ళే ప్లాన్ ఉందా,” అడిగింది అనూష.
“ఇప్పుడిప్పుడే వీలుకాదు. వెకేషన్ చూసుకోవాలి,” అంటూ మణెమ్మ కాళ్ళకి నమస్కారం చేసింది అనుపమ.
“సల్లంగుండు బిడ్డా, నీ తల్లి లాంటి దాన్ని నీవు ఏమనుకోనంటే ఓముచ్చట చెప్పనా. ఎంత ఎత్తుకు యెదిగినా మన దేశాన్ని, మనూరిని యాదుంచుకోవాల. ఊరంటే కన్నతల్లి లెక్కనే కదా బిడ్డా! చెట్టు ఆకాశం అంతా యెత్తు కెళ్ళినా, దాని వేర్లు యాడ పుట్టాయో ఆడనే ఉంటన్నయిగా! ఏర్లు తెంపుకొని చెట్టు పోతన్నదా?  రేపు నీ బిడ్డలకి పెండ్లిండ్లు అయి, పిల్లలు పుట్టినాక ఆళ్ళకి మన భాష, మన దేశం, మన పండుగలు అంటే ఏం చెపుతావు,” అంది అనుపమని రెండు చేతులతో లేవనెత్తి  దగ్గరికి తీసుకుని.
ఆమె చేతుల్లో తనకి తెలియకుండానే ఒదిగిపోయింది అనుపమ.ఆ స్పర్శ ఆమెకి కన్నతల్లి ని గుర్తు తెచ్చింది. గుండెలోతుల్లోకి దూసుకెళ్ళాయి ఆమె మాటలు.
“మమ్మీ, నాకయితే చాలా మంచిగనిపించింది.  అందరూ నావాళ్ళే అనిపించింది,” కార్లో కూర్చోగానే శ్వేత అన్న మాటలకి ‘ఔను’ అన్నట్లు తలూపింది.
“మమ్మీ, అనూష ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ లాగా మనం ఎందుకు ఉండటం లేదు?” మరో ప్రశ్న వేసింది శ్వేత. మౌనంగా డ్రైవ్ చేయసాగింది.  ప్రస్తుతం ఆమె ఆలోచనల‌ సుడిగుండంలో ఉన్నది.

*                 *             *

ఫాల్ సీజన్. చెట్లఆకులన్నీ రంగులు మారుతో, ఎరుపు, పసుపు పచ్చ, ఆకుపచ్చ, మెరూన్ రకరకాల రంగులతో వింతశోభతో బతుకమ్మలని తలపిస్తున్నాయి.
లాంగ్ వీకెండ్ రావటంతో అనూష ఫ్యామిలీ ట్రిప్ కి వెళుతూ, శ్వేతని కూడా తీసికెళ్ళారు. ఏదో ప్రాజెక్ట్ కోసం సందీప్ ఒహాయో వెళ్ళాడు. కొడుకు కార్తీ ఏడాది నుంచీ సియాటిల్ లోనే ఉంటున్నాడు.
టీ కప్పు తీసుకుని కూర్చున్న ఆమెకి  రాత్రి తల్లి అంతులేని ఆవేదనతో ఫోన్ లో మాట్లాడిన మాటలు పదేపదే గుర్తొస్తున్నాయి.
“ఎట్లుండావు బిడ్డా, ఎన్నాళ్ళు గిట్లుంటరు? నీవు, మన్మరాలు ఓతాన, అల్లుడు ఓదేశం, మనవడు ఓతాన. నాకైతే మంచిగ అనిపిస్తలేదు. అదేమంటే ఉజ్జోగం గట్లుంటది అంటావు. ఈపాలన్నా బతుకమ్మ పండక్కి ఈడకొస్తరేమో అనుకుంటి. రాకపోతిరి. ఆముచ్చట తియ్ గానీ, గీడ పొలాలన్నీ అమ్మమని మీబావకి చెప్పిండంటగ అల్లుడు. ఇక ఈ దేశం ముఖం కూడా చూడరా బిడ్డా?”

చాయ్ తాగుతూ, చెట్లనుండి రాలుతున్న  రంగురంగుల ఆకులనే చూస్తున్నది.
అనూష వాళ్ళ ఇంటినుంచి వచ్చినప్పటినుండి మనసులో ఏదో గిల్టీ ఫీలింగ్.  ఆ రోజు శ్వేత బలవంతం మీద వెళ్ళింది, కానీ ఆ తర్వాత అనూష తనని ఒక మంచి స్నేహితురాలు గా భావించి వారానికోసారి ఫోన్ చేస్తూనే ఉంది. ఆమె స్నేహం తనలో ఏదో తెలియని ప్రకంపనలు కలుగచేస్తున్నది.  ఆమెని చూసాకే తన జీవితం చాలా నిస్సారంగా ఉంది అనిపించసాగింది. ముఖ్యంగా ఆ భార్యా భర్తల అనుబంధం, తను ఏం కోల్పోయిందో తెలుపుతున్నది.
మణెమ్మ అన్న ప్రతి మాటా తనలో అలజడి రేపుతోంది.
“మా అనూష బంగారం లెక్కనే‌. కోడలు కాదు అది, బిడ్డనే. అన్ని బాధ్యతలు మీదేసుకుంటది. ఈడ ఇల్లు కొందామనుకుండ్రు. గయితే నా చిన్న కొడుకు కొడుక్కి ఎం.బీ.బీయస్ లో సీటొచ్చినాది. వాడితాన పైసలు తక్కువైతే, ఈ కొడుకే ఐదులచ్చలు ఇచ్చిండు. ఏరే ఎవరయినా అయితే ఊరుకుంటారా! మా అనూష అసుంటి మడిసి కాదు.”
అనూష మీద కోపం వస్తున్నది. ఆమె మంచితనం తనకి అశాంతిని కలుగు చేస్తున్నది.
సడెన్ గా ఒంటరితనం ఆవహించింది.  కావల్సినంత సంపాదన, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఒక్క తృప్తి తప్ప. జీవితం పరుగుపందెం అయింది. ఆనందం అనేది తన జీవితంలో నుంచి ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియనంత బిజీ. అనుపమకు మొదటిసారి తన బాల్యం, తన ఊరు, తన వాళ్ళు గుర్తురాసాగారు.
మేనత్తలు, పినతండ్రులు, పెత్తండ్రి వాళ్ళ పిల్లలతో తను గడిపిన రోజులు గుర్తురాసాగాయి. తమ్ముడితో కలిసి ఆడిన ఆటలు, స్కూలు స్నేహితులతో గడిపిన రోజులు కళ్ళముందు కదలాడసాగాయి.
తన చిన్న తనంలో, బతుకమ్మ ఎట్లాడేవాళ్ళు. అందరికంటే తమ బతుకమ్మే పెద్దగా ఉండాలని, ఆరుగంటలకే లేచి తను , అత్త కూతురు ఇద్దరూ ఊరిమీద పడి, తంగేడు, బంతి, గునుగు పూలు తెచ్చి, తాంబలంలో పేర్చేవాళ్ళు.  చుట్టుపక్కల అందరి బతుకమ్మలు కూడా తెచ్చి తమ ఇంటి ముంగిటనే పెట్టేవాళ్ళు. చుట్టూ తిరుగుతా ఏంపాడేవాళ్ళు! అత్తమ్మకి రాని పాట లేదు.
నడిరేత్రి దాకా ఆడి చెరువులో నిమజ్జనం చేసేవాళ్ళు. ఆ ఆనందం ఇప్పుడు ఏది? ఇక్కడ కూడా ఆడుతున్నారు, కానీ అది ఒక ఫార్మల్ సెలబ్రేషన్ గా వెళ్లి వస్తుంది అంతే. ఎందుకు తను ఇంత శిలలా మారింది?

*                 *             *

అనుపమది దేవరకొండ దగ్గర ఒక పల్లెటూరు. తండ్రి వ్యవసాయం చూసూకునేవాడు.  రెండెకరాల పొలంలో పాలకూర పండించేవాళ్ళు. తల్లి రెండు బర్రెలని సాకుతూ పాలమ్మి తండ్రికి చేదోడుగా ఉండేది.  కష్టమైనా సరే వాళ్ళు, అనుపమని, కొడుకు రాజేశ్ ని మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చేర్పించి చదివించారు.
అనుపమ తల్లితండ్రుల  తోబుట్టువులు మిగిలిన వారు అందరూ కాస్త కలిగిన కుటుంబాలే. అందరూ ఉద్యోగస్తులు. అనుపమ కుటుంబమే ఆర్ధికంగా వెనుకబడింది. దాంతో మిగిలిన వాళ్ళు వీళ్ళ చదువులకి, ఇతర అవసరాలకు సహాయం చేస్తుండే వాళ్లు. అదే ఊళ్ళో ఉన్న మేనత్త ఆర్ధికంగా చాల ఉన్నతంగా ఉండేది . మామూలు సహాయంతో పాటు ఆమె, అనుపమకి, ఆమె తమ్ముడికి తన పిల్లలు నెలరోజులు వాడి వద్దనుకున్న ఖరీదైన బట్టలు ఇస్తుండేది. సంవత్సరానికి ఒకసారి కొత్తబట్టలు కొని పెట్టేది.
అనుపమ బీ.టెక్. చేయటానికి కూడా ఆమె చాలా సహాయం చేసింది. ఆమె పిల్లలు కూడా వీరి పట్ల అభిమానంగా ఉండేవాళ్ళు.
అనుపమ చిన్న పిల్లగా ఉన్నప్పుడ ఇవన్నీ బాగానే ఉండేవి. కాస్త ఊహ తెలిసినప్పటి నుంచి అనుపమ, వాళ్ళు తమ మీద జాలి చూపించటం సహించలేక పోయేది. అది అవమానంగా భావించేది. దానికి తోడు ఏదైనా శుభకార్యాలు వచ్చినప్పుడు తన ఈడు పిల్లలు కొత్త బట్టలు, నగలు గురించి మాట్లాడుకుంటుంటే తను అందులో భాగస్వామి కాలేకపోయేది. ఒక ఆత్మ న్యూనతా భావం, స్వాభిమానం కలగలిసి ఉండేవి.
బీ.టెక్. కాగానే క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ రావటం ఆమె జీవితంలో ఒక ఆనందకరమైన మలుపు. ఆ తర్వాత సందీప్ తో వివాహం ఆనందకర జీవితానికి మరో మెట్టు అయింది.  వివాహానంతరం సందీప్ తో కలిసి అమెరికా ప్రయాణం.  తనకి కూడా అక్కడే జాబ్, గ్రీన్ కార్డ్ రావటం బతుకు బంగారు బాటైంది.
అయితే , ఇప్పుడే అనుపమ మనసు చిత్రంగా మారింది. ఒక్కసారి అమెరికా వెళ్ళాక, ఆమె, తనని ఆదరించిన వాళ్ళని తలచుకోవటాని కూడా ఇష్టం పడలేదు. పైగా ఒకలాంటి కసితో సంపాదనే ధ్యేయంగా పెట్టుకుంది.
ఒకటే పరిస్థితులు ఇద్దరు మనుష్యులు స్వీకరించిన విధానం వేరుగా ఉంది. అనుపమ, తన  బంధువులు తనకి చేసిన సహాయం అవమానంగా భావిస్తే, ఆమె తమ్ముడు రాజేష్ మాత్రం వాళ్ళ చేసిన సహాయం గుర్తుపెట్టుకుని, తమ ఉన్నతికి కారణమైన వాళ్ళని ఎప్పుడూ కలుస్తూ ఉంటాడు.
రెండు కానుపులకి అమ్మనే పిలిపించుకుంది.  రెండు ఇళ్లు కొన్నారు.
చూస్తూండగానే ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి. అనుపమలో చాలా  మార్పు, భాష, వేషం, తిండి అన్నింటా మార్పే. కాలంతో పాటు బుతువులు మారినంత సహజంగా, తను మారాను అని తనకే తెలియనంత సహజంగా మార్పు. మధ్యలో కేవలం ఐదారు  సార్లు ఇండియా వెళ్ళింది. ఉన్న రెండు నెలల్లో షాపింగులకే సగం సమయం గడిచిపోయేది. అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్నిరోజులు అత్తమ్మ దగ్గర కొన్ని రోజులు. అంతేమళ్ళీ అమెరికా ఫ్లైట్ ఎక్కడం.
పెద్ద పిల్ల  శ్వేత, చిన్నాడు కార్తీకి అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో అనుబంధం కేవలం ఆ కొన్ని రోజులే.   మొదట్లో వారానికి ఒకసారి ఫోన్ లో మాట్లాడేది. సెల్ ఫోన్లు వచ్చినాక ,అమెరికా నుంచి తను ఇచ్చిన సెల్ ఫోన్ లోనే వారానికొకసారి వాళ్ళు మనుమడు మనుమరాలిని చూసి మాట్లాడుతూ మురిసి పోయేవాళ్ళు.
వీక్ డేస్ వర్క్ బిజీ, వీకెండ్స్ పార్టీలతో అదీ తగ్గిపోయింది. కార్తీ అచ్చంగా అమెరికా సంస్కృతికి వారసుడయ్యాడు. తల్లితండ్రులతోనే‌ మాట్లాడలేనంత బిజీ.
శ్వేత మాత్రం తండ్రి ఆలోచన, మనస్తత్వాన్ని పుణికి పుచ్చుకుంది.  అతని ఆశయాలకి అనుగుణంగా నడచు కుంటూనే తల్లిని కూడా ప్రేమించే మెచ్యూరిటీ ఉన్న యువతి శ్వేత.  ఇప్పుడు ఆంత్రోపాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నది. కార్తీ  యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో మెడిసిన్ లో జాయిన్ అయినాడు.

*                 *             *

అనుపమ‌ మనసులో ఆలోచనలు మంచు మేఘాల్లా ముసురుకుంటున్నాయి.
ఏదో కోల్పోయిన భావన. ఏం కోల్పోయాను?  అయిన వారి ప్రేమ ఆప్యాయతలు, తన సంసృతి సంప్రదాయాలు, తన భాష, అసలు తన ఉనికినే కోల్పోయింది. మానవత్వం, సేవాభావం అనేవి ఎప్పుడో మర్చిపోయింది. ఇవన్నీ అటుంచితే భర్త ప్రేమకు కూడా దూరమైంది. తను ప్రవర్తనతో అతనికి తన మీద నిర్లిప్త ధోరణి కలిగేటట్లు ప్రవర్తించింది.  సొంత కూతురిలా చూస్తూ తనకి  మేనత్త చేసిన సాయం ఆమె వేసిన భిక్ష గా భావించిందే కానీ ఆమె ప్రేమను చూడలేక పోయింది.  సందీప్ తో తన పెళ్ళికి ఆమె చేసిన సాయం మరువలేనిది.

*.      *.      *

సందీప్, అనుపమ కొలీగ్స్. సందీప్ ఆమె కంటే రెండేళ్ళు సీనియర్. తను టీం లోకి కొత్తగా వచ్చిన అనుపమ మొదటి చూపులోనే అతనిని ఆకర్షించింది. అందం, వర్క్ పట్ల అంకితభావం సందీప్ ని ఆమెకి దగ్గర చేసాయి. ఆమె తనకి దూరపు బంధువు అని తెలియగానే, పెద్దవాళ్ల ద్వారా పెళ్లి ప్రస్తావన తెచ్చాడు.
అనుపమకు అభ్యంతరం ఏమీ లేదు. అతను ఆర్థికంగా తమకంటే బాగానే ఉన్నాడు.‌ వాళ్ళది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. అతనికి ఇద్దరు అక్కలు, అన్నయ్య. అందరికీ వివాహాలు అయినాయి. సందీప్ అన్న  ఇంటర్ తో చదువు ఆపేసి, పొలం పనులు చూసుకుంటున్నాడు. అక్కయ్యలు ఇద్దరూ స్థితిపరులే. కాబట్టి సందీప్ కి ఏ బాదరబందీ లేదు.  ఆమెకి కావాల్సింది అదే.
పైసా కట్నం లేకుండా అనుపమని  చేసుకున్నాడు సందీప్.
పెళ్ళయిన వెంటనే అమెరికా అవకాశం వచ్చింది సందీప్ కి. అనుపమకి కూడా మూడు నెలల తర్వాత అవకాశం వచ్చింది.
ఉద్యోగం లో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇద్దరూ ఉన్నత స్థితికి వచ్చారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా తెలియని దూరం ఏర్పడసాగింది.  కొన్ని సంఘటనలకి, మార్పులకి ప్రత్యేకమయిన కారణం అంటూ ఉండదు.  కొందరి విషయంలో చిన్న అభిప్రాయభేదాలు , మరికొందరు విషయంలో దారులు వేరు కావటం.
అనుపమకు  అందరూ తనని చూసి ఈర్షపడేంత ఎత్తుకు ఆర్ధికంగా ఎదగాలని కోరిక. దానికోసం ఆమె సందీప్ ని కూడా పట్టించుకోకుండా తన కెరీర్ పైనే దృష్టి పెట్టింది. మనకు ఉన్నదానితో అందరికీ సాయం చేయాలనే గుణం సందీప్ ది. దానికి పూర్తి వ్యతిరేకం అనుపమ. పంటలు సరిగా పండక ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న సందీప్ అన్నకి ఆర్ధిక సాయం చేయటం అనుపమకు ఇష్టం‌ ఉండదు.
తను సంస్కృతి సంప్రదాయాలు, తన బంధువులు గురించి పిల్లలకు చెప్పాలనే తాపత్రయం సందీప్ కి. ఆ మట్టి మనుషుల వాసనే వద్దంటుంది అనుపమ. అరకొర చదువులతో, పల్లెటూరిలో ఉండే వాళ్ళు తమ స్థాయికి తగరు అనే చిన్నచూపు.  ఆచారవ్యవహారాలు మూఢనమ్మకాలు అనే భావన.
ఉద్యోగం పేరుతో తమ ఇరవై సంవత్సరాల వైవాహిక జీవితంలో ఇద్దరూ కలిసి ఒకేచోట ఉన్నది చాలా తక్కువ.  పిల్లలు, అనుపమ ఒకచోట, సందీప్ మరోచోట. ఆ ఎడబాటు మానసికంగా కూడా చాలా దూరం చేసింది.
తండ్రి చనిపోతే తను ఒక్కతే వెళ్లి వచ్చింది. మామగారు పోతే సందీప్ ఒక్కడే వెళ్లి వచ్చాడు. కోడలిగా రావటం నీ బాధ్యత అని సందీప్ ఎంతో చెప్పాడు. కానీ అదే సమయంలో డైరెక్టర్ గా తనకి ప్రమోషన్ వచ్చింది. ఇండియా వెళ్ళలేని పరిస్థితి. చివరికి సందీప్ ఒక్కడే వెళ్ళాడు కానీ  చివరిచూపు దక్కలేదు.
అయినవాళ్ళు  ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాకూడా ఏనాడు తను సాయం చేయలేదు. బావకూతురు పెళ్ళి ఖర్చు తమకి పెద్ద సమస్య కాదు. కానీ మాటవరసకు కూడా డబ్బు కావాలా అని అడగలేదు. కానీ వారందరూ తమని ఎంతో ప్రేమిస్తున్నారు. ప్రతి ఫంక్షన్ లోను తమని కోల్పోతున్న బాధ వాళ్ళలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.
అనూషకి తనకీ ఎంతో తేడా! కోట్లు మూలుగుతున్నా ఒకళ్ళకి సాయం చేయాలనే ఆలోచనే రాదు తనకి. కానీ అనూష మరిది కొడుకు కోసం, తన సొంత ఇల్లు ఏర్పరచుకోవాలనే ఆలోచనని ఆనందంగా పక్కున పెట్టింది.
రేపు నిజంగానే తన బిడ్డలకి వారసత్వ సంపద ఏమి ఇస్తుంది తను ? ప్రేమాఆప్యాయతలు, మాతృభూమి మీద ప్రేమ లోపించిన ధనం ఇస్తున్నది.
బావ కూతురు పెళ్ళికి సందీప్ వెళ్ళాలని ఎంతో ఆశపడ్డాడు. కానీ అదే రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది. దాంతో వెళ్ళలేక పోయాడు. అది అతనిలో అశాంతిగా మారి, రోజు రోజుకూ పెరుగుతోంది.

*.      *.      *

రెండు రోజుల తర్వాత వచ్చారు అనూష వాళ్ళు ట్రిప్ నుంచి. ఆ సరికే తన మనసులోని ఆలోచనలకు ఒక రూపం ఏర్పరచుకుంది అనుపమ.
“సందీప్, నీవు,నేను, శ్వేత డిసెంబర్ లో  ఇండియా వెళ్దాం,” టూర్ నుంచి సందీప్ రాగానే చెప్పింది అనుపమ.
“ఏంటి ఇంత సడెన్ గా,”
“అమ్మని, అత్తమ్మని చూసి చాలా ఏళ్ళయింది. చూడాలని ఉంది. అలాగే,మనూర్లో పొలాలు అమ్మొద్దని బావకి చెప్పు. తనకి డబ్బు ఏదైనా అవసరమైతే మనం ఇద్దాం,” అన్న అనుపమ మాటలకి,
కలో నిజమో అర్ధం కాలేదు సందీప్ కి  అలాగే చూస్తూ నిలబడ్డాడు.
“సందీప్, ఆకాశానికి ఎదగాలంటే  భూమితో తెగతెంపులు చేసుకోకూడదు అనే సత్యం ఇన్నేళ్ళకి గ్రహించాను.  నా ప్రవర్తనతో నీవు ఎంత విసిగి పోయి ఉంటావో.  పిల్లలు ఇప్పుడు శాశ్వతంగా ఇండియా రావటానికి ఇష్టపడరు. కానీ మనకి అవకాశం ఉంది. కావల్సిన దానికంటే ఎక్కువగానే సంపాదించాం. ఇంకో ఐదేళ్ల తర్వాత మనం ఇండియాలోనే ఉందాం” అంది అనుపమ.
ఆమెని అలాగే చూస్తూ నిలబడ్డాడు. శిల నుంచి శిల్పం గా మారిన భార్యలో తాను మొదటిసారి చూసిన అనుపమ కనపడుతోంది అతనికి .
తను శిల్పంగా మారటానికి కారణం అనూష అని సందీప్ కి ఏదో ఒక రోజు తెలియ చేయాలి అనుకుంది అనుపమ.

*                 *             *

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో లాండయింది ఫ్లైట్. చిన్ననాటి జ్ఞాపకాలు చిరుజల్లులై మనసును తాకుతుండగా, ఉద్వేగంతో తన మాతృభూమి పైపాదం మోపింది అనుపమ.
క్యాబ్ లో కూర్చోగానే, అసంకల్పితంగా ఆమెకి తన  అమెరికా లోని తన ఫ్రెండ్ జెన్నీఫర్ గుర్తుకొచ్చింది. ఎప్పటినుంచో అడుగుతున్నది, ‘ఇండియన్ కల్చర్ మీద రీసెర్చ్ చేయాలనుకుంటున్నా, హెల్ప్ చేయవా’ అని.
అప్పుడు బోర్ అనిపించిన సబ్జెక్టు ఇప్పుడు అనుపమకు ఇష్టమైంది.
వెంటనే కాల్ చేసింది, “హాయ్ జెన్నీ, నీ రీసెర్చ్ కి ఇన్ఫర్మేషన్ నేను ఇండియా నుంచి వచ్చాక ఇస్తా.”
విండో కుండా బయటికి చూస్తూ మెల్లిగా హోమ్ చేసుకోసాగింది, ” నాదు జన్మభూమి కంటే నాక మెక్కడుంది,సురలోక మెక్కడుంది,

March 15, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

సింధు హృదయం

by Dr. V.V. RamaRao January 31, 2024
written by Dr. V.V. RamaRao

నా ఎద జ్వలించి
బడబానలమైనపుడు..

నా మదిలో తుఫానులు
విజృంభించినపుడు….

నా కన్నీళ్ళు  ఉప్పెనలై
ఉప్పొంగినపుడు..

నా  ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వాయుగుండాలై
చుట్టుముట్టినపుడు..

నాలో దూసుకొని వచ్చే నదీ రుధిరాలు ఉప్పగా మారివెచ్చగా తాకినపుడు..

నా గుండె సుడిగుండమై
ధ్వనించినపుడు

నా నీలిమ నల్లని దుఃఖపు దుప్పట్లు
కప్పుకొన్నపుడు..

నా కెరటాల పాదాలు విరిగి పడుతు
నడవలేనప్పుడు.

నా ఆశలు నిండు పున్నమి చంద్రునికై ఎగసి
నిరాశ శకలాలై విరిగినపుడు..

నా లోని ముత్తెపు సిరులు నత్తగుల్లలై
నవ్వినపుడు

అనుభవాల హాలాహలాలు..
బాధల బడబానలాలు
కష్టాల తిమింగలాలు
నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నపుడు
నాలో నేను మదనపడుతు..

అలల అక్షరాలతో సృజించిన
కావ్యం..
నీకు అమృతం కావాలనే తపనతో
బతుకుతున్నాను..

       *

January 31, 2024 5 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కొండకి కొండ నమస్కరించింది

by mayuukha January 31, 2024
written by mayuukha

తెలుగుజాతి గర్వించదగ్గ మహా కళాకారుడు
కొండపల్లి శేషగిరి రావు శత జయంతి
జనవరి 27 ఆయన్ని మరోసారి తలుచుకుంటూ
……………………………………………..

ఊళ్ళో పెళ్ళికి మా వాళ్ల హడావిడి. ఫోన్లు, సూడియోకి బండేసుకొస్తే కలిసిపోదామా? మీరు ఫలానా ఆర్టిస్టులతో కలిసి వస్తారా అని ఎంక్వయిరీలు. సర్లెండి డైరెక్టుగా సభ దగ్గరే కలిసి రాత్రికి అందరం కూచుందాం అంటూ ఎలాబరేట్ ఎరేంజ్మెంట్లు. ఎన్నడూ ఏ సన్మాన సభకూ చచ్చినా పోని మహానుభావులైన వీరంతా కాళ్లు తొక్కుకొనుట ఎలా? బాపూగారికి తెలుగు యూనివర్సిటీ వాళ్ళు ఎవార్డిచ్చుకుంటే వీళ్లు మధ్యాహ్నం నుంచే చంకలెగరైడమేల?
వీళ్లు సరే, ఎక్కడో కొత్తగూడెం నుంచి అజ్ఞాత కార్టూనిస్టు చిరుద్యోగానికి లాస్ ఆఫ్ పే పెట్టుకుని, బండికట్టుకొని వచ్చి స్వహస్త చమురొదిలించుకుని, అనేక వందల గజాల దూరం నుంచి మరనేక వందల మంది గుంపుల మధ్య నుంచి బాపూగార్ని చూసి కళ్లు చెమర్చి మళ్లీ మౌనంగా
కొత్తగూడెంకేసి మరలిపోవడమేంటి?
వెర్రా? సర్రియలిజమా? ఏమో.
యూనివర్సిటీ కాంపౌండ్ అంతా సాహిత్య ప్రముఖులూ, కవులూ, ఆర్టిస్టులతో సందడిగా ఉంది. ఎంట్రెన్స్లో మాత్రం పోలీస్ బందోబస్త్ జబర్దస్తీగా ఉంది. ఆడ నక్సలైట్లను కనిపెట్టడానికి రహస్య మెటల్ డిటెక్టర్. మగ నక్సలైట్ల కోసం ఓపెన్ డిటెక్టర్, అందర్నీ తడుముతున్నారు. గుచ్చి గుచ్చి చెకింగ్. అలిపిరిలో చేయని పనులన్నీ ఇక్కడ చేస్తున్నారు. ఇదంతా బాపూగారు పీపుల్స్ వార్ హిట్ లిస్టులో ఉన్నందువల్ల కాదు. ఆఫ్ట్రాల్ చిత్రకారుడి కోసం డైరెక్షనల్ మైన్లు వేస్టుచేసుకుంటారా నక్సలైట్లు?
దేవేంద్రగౌడ్ గారు చీఫ్ గెస్ట్ గనక ఈ తతంగం. ముందుస్తుగా తోసుకొచ్చిన అనేకానేక కారణాల వల్లా, కళకి బొత్తిగా టైమ్ లేనందువల్లా గౌడ్ గారు రాలేకపోయారు. బాపూగారి యందు, మా వంటి పేదల యందూ శ్రీ వేంకటేశ్వరస్వామి దయవల్లా, దీవెనెల వల్ల గూడా గౌడ్ గారు రాలేకపోయారని మా మూఢ విశ్వాసం. నిజంగా ఆయన వచ్చి “బాపూ చిత్రకళ, పత్రికల్లో కార్టూన్లు, గ్రేహౌండ్స్ తక్షణ కర్తవ్యం” అని లెక్చరిచ్చి ఉంటే మా గుంపు కకావికలై ఉండేది.సభ ప్రారంభం అనుకోని అద్భుతం, జి.వి. సుబ్రహ్మణ్యం గారు బాపూ గురించి సుతారంగా చెప్పారు. ఏకకాలంలో కవితలాగా, సంగీతంలాగా, శాస్త్రీయ విశ్లేషణలాగా, లోతైన అంచనాలా సాగిందాయన ప్రసంగం. సందర్భోచితంగా మినిమమ్ ఓవర్ యాక్షన్ కూడా లేకపోవడం సుబ్రహ్మణ్యం గారి సూపర్ స్పెషాలిటీ . తర్వాత పరుచూరి గోపాలకృష్ణ, నూతన్ ప్రసాద్ గార్ల ప్రసంగాలు పెద్ద దుర్భరంగా ఏమీ లేవు. రవీంద్రభారతి, త్యాగరాయగాన సన్మాన సభల బ్రాండ్ ఉపన్యాసాలెంత దుర్భరంగా ఉంటాయో ఖచ్చితంగా అంతే దుర్భరంగా ఉన్నాయి. అలవాటుపడ్డ ప్రాణాలంగనక పరమ వీజీగా తట్టుకున్నాము. తదనంతర అంత్యప్రాసల కామిక్ ఇంటర్లూడ్స్ మమ్మల్ని కదిలించాయి. ప్రాణవాయువు కోసమూ సిగిరెట్ల కోసమూ ఆనందంగా హాలు నుంచి బయటపడ్డాము.
అదిగో మా ఆర్టిస్టు హీరోలు చంద్ర, గోపీ కారిడార్లో ముందే ఉన్నారు. వి. రాజారామ్మోహనరావు లెక్చర్లు. అక్కడ ఇంద్రగంటి శ్రీకాంతశర్మ, జానకీబాల, ఇటు శ్రీరమణ, ఆర్టిస్టు చిత్ర, కార్టూనిస్టులు శంకర్, అన్వర్లు, బాలి రాలేదేమో అని తలుచుకుంటున్నారు. ఇంకా బోల్డన్ని పెద్ద పేర్లు పుంజీళ్లు పుంజీళ్లుగా కబుర్లు కొడుతున్నారు. అంతలో కొండపల్లి శేషగిరిరావు గారొక్కరే శాలువా సర్దుకుంటూ గుంపుల్లోంచి దారిచేసుకుంటూ వెళ్తున్నారు. వెంట ఎవరూ లేరు. ఆయన్నీ చూసి చాలా రోజులయింది. ఆనందంగా నమస్కారం పెట్టా. పక్కనే ఉన్న కొత్తగూడెం కార్టూనిస్టుని పిలిచి ఇతను వెంకటి అని పరిచయం చేశా. మా వాళ్లంతా ఆరాధనా భావంతో చుట్టూచేరారు. లోపల సభ ఇంకా నడుస్తూనే ఉంది. ఈతి బాధల వల్ల ఈ మధ్య మీ ఇంటికి రాలేదని సంజాయిషీ చెప్పి, కొత్తగా పెయింటింగ్ లు ఏం వేస్తున్నారని అడిగితే కొద్ది రోజులుగా చూపుసరిగా లేదనీ ‘బొమ్మలకు తాత్కాలికంగా సెలవిచ్చానని చెప్పినపుడు ప్రాణం కొట్టుకుంది. అయినా తెలంగాణా సాయుధ పోరాట చరిత్ర మీద సుదీర్ఘమయిన పానెల్స్ తయారు చేశానన్నారు. (వాటిలో కొన్ని స్కెచ్లు ముందే మేమందరం చూశాం) త్వరలో తప్పక వాటిని పూర్తి చేస్తానన్నారు. “ఈనాటి చిత్రకారులకు ఆనాటి చరిత్ర గురించి తెలీదు గనక ఆ పని ముగిస్తా”నన్నారు. ఈ పని ఆయన ఒక్కరే చేయగలరని అక్కడున్న మా అందరికీ తెలుసు. శేషగిరిరావుగారి గ్రాంధిక భాష, ఇంగ్లీషు విన ముచ్చటగా ఉంటాయి. అంతకు మించిన అమాయకత్వం ముడతలు పడ్డ తెల్లటి పొడుగాటి వేళ్లు తిప్పుతూ మాట్లాడుతుంటే ఆయన చైనా చెట్లు, కోడిపుంజుల రంగులూ కదలాడుతాయి. తటాకము వద్ద కణ్వమహర్షి వెంట ఉన్న శకుంతల పక్కన లేడి, ఒంపులు తిరిగిన స్టైలైజ్డ్ చెట్లూ కొండలూ కదిలొస్తాయి. భక్తిపరుడైన కొండపల్లిగారి దేవతామూర్తుల భంగిమలూ ఆ రంగులూ చూస్తే మొండి నాస్తికులు కూడా మోకాళ్లపై వంగి నమస్కారాలు చేయాల్సిందే.
తెలంగాణ కొండలు ఆయన దోసిట నీలపురాళ్ళై మెరుస్తాయి. వాటి మధ్య రావి నారాయణరెడ్డి గర్జించే ఆయిల్ పెయింటింగ్ కెంపుల పోవు. రామప్ప దేవాలయం నంది మెడ గంటల తాళ్ల ముడుల గ్రామర్నీ, నాగరిక సమస్యల నడుముల పట్టీల మడతల శాస్త్రాన్ని రచించి విశ్లేషించిన చేతులవి. తెలుగునాట ప్రాచ్య కళా సంప్రదాయ జ్యోతి ఆరిపోకుండా అడ్డంపెట్టే ఆఖరి చేతులివే.
హాల్లో సభ అయిపోయింది. మేడ మీద ఆర్ట్ ఎగ్జిబిషన్ను బాపూ ప్రారంభించాలి
(ఏంటో! అష్టకష్టాలూ పడి పగలూ రాత్రి బొమ్మలేయాలి. మళ్లీ వాటిని తానే ఇనాగురేట్ చేసుకోవాలి. పాపం ఎంత కష్టం) బాపూ చుట్టూ పాతికమంది నిర్వాహకులు రక్షణ వలయంలా కమ్ముకున్నారు. హాల్లోంచి కారిడార్ గుండా ఆయన్ని తీసుకెళ్తున్నారు. అడ్డంగా ఉన్న మా గుంపుల్ని చెదరగొడుతున్నారు. తప్పుకోండని అరిచి ఏ మాత్రం అక్కర్లేని హడావుడంతా చేస్తున్నారు. బాపూ గుంపు మమ్మల్ని తాకి ముందుకెళ్తుంది. తప్పుకున్నాం. ఎందుకో ఆయత్నకృతంగా (స్పాంటేనియస్ గా అన్నమాట) “బాపూ గారూ” అని అరిచాను.
ఆయన ఆగారు. ఆ గుంపూ ఆగింది.

‘కొండపల్లి శేషగిరిరావు గారు
బాపూ













ఆయన ముందుకొచ్చారు. ‘కొండపల్లి శేషగిరిరావు గారు” అని పరిచయం చేశాను. వాళ్ల చేతులు కలిశాయి. శేషగిరిరావు మరింత ముందుకెళ్లారు.
ఆ పొడుగాటి చేతులు రెండూ బాపూ భుజాలపై పడ్డాయి. “నాయనా బాపూ నీ రేఖ నిజంగా ఒక విలక్షణమైన… (ఆయన గ్రాంధికం తడబడుతోంది)మనిషి ఎక్సైట్ అయిపోతున్నాడు. అది నీవే గీసేగీత. యువార్ గ్రేట్. రియల్లీ గ్రేట్. నాట్ ఓన్లీ ఫర్ ఆవర్ స్టేట్. బట్ టు అవర్ నేషన్…చెప్తూనే ఉన్నాడాయన. ఎక్సైట్మెంట్ పెరిగిపోతోంది.
మాటలు మరీ ఇన్ కొహెరెంట్ గా వస్తున్నాయి. సన్నగా వణికి అరిచేతులు బాపూ భుజాల మీంచి దిగి మోచేతుల దగ్గరకొచ్చాయి. ఇంకా ఏదో చెప్తున్నాడు. చెప్పలేకనూ పోతున్నాడు.
హఠాత్తుగా ఆ చేతులు నేలకి వంగాయి. బాపూ పాదాలు రెండూ పట్టుకుని ఆయన నమస్కారం పెట్టాడు. చుట్టూ ఉన్న మేం ఈ షాక్ కి రెడీగా లేము. బాపూ గారి దుస్థితి వర్ణనాతీతం, బాగా ఎంబారాస్ అయిపోయి, సిగ్గుపడిపోయి, తల్లకిందులయ్యారు. శేషగిరిరావు గారిని రెండు చేతుల్తో లేవ దీశారు. ఈయన ఇంకా ట్రాన్స్ లోనే ఉన్నాడు. “బాబూ, నేను శాంతి నికేతన్లో చదివినా, ఇక్కడ ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్గా ఉన్నా, ఎన్ని చేసినా నీ రేఖ మాత్రం“ అంటూనే ఉన్నాడు. పెద్దవారు మీరు మాకలా చెప్పాలా.. అయ్యో’ అంటూ బాపూగారు సిగ్గు భారంతో కొంచెం వంగి అంతలోనే ఆయన కాళ్ల మీద పడి పాదాలు పట్టుకుని నమస్కారం చేసేశారు. డబుల్ షాక్… అంతా సైలెన్స్.
ఈ షార్ట్ సర్క్యూట్ కి నివ్వెరపోయిన మాలో కొందరికి కన్నీళ్లే తక్కువ.ఇంతలో నిర్వాహకులు బాపూని పైకి తీసుకుపోయారు. అందరం శేషగిరిరావు గారి వెంట బయటికొచ్చాం. ఆయనింకా బాపూ హిప్నాటిక్ స్పెల్ నుంచి తేరుకోలేదు. “ఈతని వలే ఎవరూ గీయలేదు.
అదియాతని సొంతము. వాక్చమత్కృతి లేదు. సకల చమత్కృతినీ చిత్ర చమత్కృతిగా మార్చినాడు.” ఇంకా చాలా చెప్పాడాయన.
తెలుగు చిత్రకళ చరిత్రలో ఒకే ఒక భువనగిరి కోట, ఆదిలాబాద్ పచ్చల కొండ, కరీంనగర్ అడివితల్లి వంగి తెలుగు రేఖకీ రంగుకీ నమస్కారం చేసింది.
ఈ నర్సాపురం నది సిగ్గుతో మెలికలు తిరిగి
ఆ నూనె రంగుల బృహత్పాదాలను కడిగింది.
ఇలాటి దృశ్యం ఈ దెష్ఠ బతుకులో ఇంకెప్పుడేనా చూడగలమా, కెమెరాలేవి? లైట్లేవి? ఎవరక్కడ?
కాలచక్రం గిర్రున కాకుండా టిక్కు టిక్కుమంటూ రెండ్రోజులే తిరిగింది. శ్రీరమణగారి ఫోను. “బాపూగారు మీకొక్క జపనీస్ యానిమేషన్ కేసెట్, మరో లెటర్ ఇచ్చారు”.
అమాంతంగా అరడజను ఆఘమేఘాలనూ సింగిల్ ఆటోనూ బుక్చేసి ఆంధ్రజ్యోతిలో వాలాను.
స్టూడియోకి తిరిగి రాగానే కేసెట్ను మూడు సీడీలుగా మార్చి మా సిస్టమ్ లో అందరం చూశాం. మళ్ళీ చూశాం. రెండున్నర గంటల ఎండ్వెంచర్. అంతా జపాన్ భాష ఒక్క ముక్క అర్ధం కాలేదు. సినిమా మొత్తం ముక్కస్య ముక్కహా అర్ధమయింది. ఇలాంటి కేసెట్లు ఇంకా సంపాయించాలి ఎలా? సింపుల్! బాపూగారు మద్రాసు మనిషి గదా. హైదరాబాద్ లో కొండపల్లి శేషగిరిరావు గారి లాంటి వారిని పరిచయం చేస్తే కేసెట్ పంపిస్తారని అర్థమయింది గదా.
మరైతే ఇక్కడగానీ హోల్ ఇండియాలో గానీ
మరో కొండపల్లిని పట్టుకోడం ఈ జన్మకి గానీ
మరేడు జన్మలకిగాని జరిగే పనేనా?
నాకింకో కేసెట్ దొరకదా!

ఈ వ్యాసం 2002లో ఆంధ్రజ్యోతి దిన పత్రికలో అచ్చయింది.

January 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

పోతన పద్యాలు – భావము

by Palakurti Rammurty January 31, 2024
written by Palakurti Rammurty

హరికిన్‌ పట్టపు దేవి, పున్నెముల ప్రోవర్థంబు పెన్నిక్క చం
దురు తోబుట్టువు భారతీ గిరిసుతల్ దోనాడు పూబోడి తా
మరలందుండెడి ముద్దరాలు జగముల్ మన్నించు నిల్లాలు భా
సురతన్ లేములువాపు తల్లి సిరి యిచ్చున్ నిత్యకళ్యాణముల్! (భాగవత అవతారికలోని పద్యం)

                ఒక వ్యక్తి జీవితం సంపూర్ణం కావాలి అంటే… సంస్కారంతో కూడిన చదువు, వివేకంతో, విచక్షణతో కూడిన ఆచరణ కావాలి, మూలాలను అవగాహన చేసుకోగలిగిన బుద్ధి కుశలత కావాలి. దానినే విద్య అందాము. అలాగే సకల సౌకర్యాలతో కూడిన సమగ్రమైన సంపద కావాలి దానినే అభ్యుదయము అందాము. దానికి తోడుగా సౌభాగ్యం కావాలి.. అంటే ఉన్న దానిని సంతృప్తిగా తాను అనుభవించగలిగి, ఇతరులకు పెట్ట గలిగిన శారీరక మానసిక ఆరోగ్యంతో కూడిన త్యాగ నిరతి కావాలి. దానినే సుభగత్వం అందాము. వీటి నన్నింటినీ అనుగ్రహించేది ఏది? అంటే.. ఆ లలితా పరమేశ్వరియే. ఆమె అంశలే సరస్వతీ దేవి, లక్ష్మీదేవి పార్వతీదేవి. ఆ లక్ష్మీదేవిని స్తుతిస్తున్నాడు, పోతన గారీ పద్యంలో. విద్యలకు సరస్వతిగా, సంపదలకు లక్ష్మీదేవిగా, సౌభాగ్యానికి పార్వతిగా చెప్పారు.


                హరి అంటే విష్ణుమూర్తికి పట్టపురాణి, పున్నెములకు ప్రోవు అంటే రాశి, అర్థములకు పెన్నిక్క (పెన్– గొప్పనైన, ఇక్క స్థానము) సిరిసంపదల పెన్నిధి,  చందురునికి తోబుట్టువు, భారతీ మరియు గిరిసుతయైన పార్వతి.. వారితోన్, ఆడు, పూబోడి (పూవు వంటి శరీరం కలది), తామర పూలలో నివసించే  ముద్దరాలు, జగముల్.. ముజ్జగాలు మన్నించి పూజించే శ్రీ హరి ఇల్లాలు, భాసురతన్.. ప్రకాశవంతమైన చూపులతో తన నారాధించే వారికి లేములు (దరిద్రాలు) తొలగించే తల్లి, సిరి .. లక్ష్మీదేవి నిత్య కళ్యాణములను మాకు అనుగ్రహించుగాక, అంటున్నారు పోతన గారు.
                హరి అంటే విష్ణువు.. విష్ణువు అనగా వ్యాప్తిచెందినది.. ఏది వ్యాప్తి చెందుతుంది.. ప్రవహణశీలత ఉన్నదే వ్యాప్తి చెందుతుంది. ప్రవహణ శీలత కావాలి అంటే దానికి చంచలత్వం కావాలి. ఆ సంవ్యాప్త శక్తికి చైతన్యాన్ని ఇచ్చి, కర్తవ్యాన్ని పాలించేందుకు ప్రేరణ నిచ్చి నడిపించేది.. ఆ శక్తికి పట్టపు దేవి. కన్ను ఉన్నది అంటే ఆ ఉండడమే సరిపోదు.. దానికి చూచే శక్తి ఉండాలి. విష్ణువుకు వ్యాప్తమయ్యే శక్తి ఉన్నది కాకపోతే అది క్రియాశీలం కావాలి అంటే అవసరమైన క్రియాశీలక శక్తియే లక్ష్మీదేవి. ప్రకృతిలో రెండు విధాలైన శక్తులు ఉంటాయి.. పురుష శక్తి, స్త్రీ శక్తి. ఒకటి సృజనాత్మకమైనది.. దానినే పురుష శక్తి అంటాము.. రెండవది.. దానిని అనుమోదించేది, అంగీకరించేది. దానినే స్త్రీ శక్తి అంటాము. శ్రీహరి పురుష శక్తి కాగా లక్ష్మీదేవి స్త్రీ శక్తి. రెంటి కలయికతోనే కార్యావిష్కరణ జరుగుతుంది. ప్రతిభ ఎంత గొప్పదైనా దానికి పట్టం కడితేనే దాని ఉనికి సుస్థిరం అవుతుంది. అందుకే విష్ణువు ఎంత గొప్పవాడయినా ఆయన వెంట లక్ష్మీదేవి పట్టపు రాణిగా ఉన్నాప్పుడే ఆయన గొప్పదనం సాధికారికమౌతుంది…
                పున్నెములు… భిన్నత్వంలో సామరస్యాన్ని చూడగలగడమే పున్నెము. భిన్నత్వంలో ఏకత్వం అంటారు కాని… ఏకత్వం కాదు కావలసింది సామరస్యత కావాలి. నిజానికి ఏకత్వం అనేది రాచరికానికి, అధికారానికి ప్రతీక కాగా సామరస్యత అనేది ప్రజాస్వామ్యానికి ప్రతీకగా చెప్పుకోవాలి. ఇలాంటి సమరస భావనలకు ప్రోవు.. అంటే సకల భావనల సమాఖ్యయే లేదా సమాహారమే అభ్యుదయము నిస్తుంది. ఆ అభ్యుదయానికి మరోపేరే.. లక్ష్మీదేవి. సమాజానికి ఉపకరించే కార్యాలను నిర్వహించడమే పున్నెము.

                అర్థంపు పెన్నిక్క…. మానవ జీవితంలో అర్థ కామాల ప్రాబల్యాన్ని తక్కువ చేయలేము. మానవ స్వభావంలోని గుణదోషాలకు ఈ అర్థకామాలే మూల కారణాలు. అయితే ఈ అర్థకామాలు ధర్మబద్ధాలయితేనే వ్యక్తికి శ్రేయస్సు. అర్థకామాలను ధర్మబద్ధం చేసి సరైన మార్గంలో నడిపించే మహోన్నత గుణమే సమత.. పెన్నిక్క అనడంలో అర్థాన్ని తద్వారా లభించే కామాన్ని, అధికారాన్నీ కూడా సమతా మార్గంలో నడిపించేది అని భావించాలి. దానితో సదాలోచనలు, మనోనిగ్రహం, స్థిత ప్రజ్ఞత్వం అందివస్తాయి. ఆ స్థితప్రజ్ఞతనే “దమము” అనవచ్చునేమో.. దానికి మరోపేరే లేదా దానికి ఆవాస స్థానమే లక్ష్మీదేవి.
                చందురు తోబుట్టువు.. చంద్రుడు మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగిస్తాడు. “చంద్రమా మనసోజాతా” అంటుంది శ్రుతి. చంద్రునిలో ఉన్న మరియొక లక్షణం స్వయం ప్రకాశం లేకపోయినా పరోపకార పరాయణత ఆయన లక్షణం.. సూర్యుని నుండి వేడిని గ్రహించి.. అహ్లాదకరమైన వెన్నెలలను మానవులకు అందించడం చంద్ర లక్షణం… అలాగే లక్ష్మీదేవి కూడా జీవ కోటికి ప్రశాంతమైన, ఆహ్లాదకరమైన జీవితాన్ని అనుగ్రహిస్తుంది. తోబుట్టువు అనడం వల్ల చందునిలో ఉన్న అన్ని లక్షణాలూ ఆమెలో ఉన్నాయని భావించాలి.
                భారతీ గిరిసుతల్ దోనాడు… భారతి విద్యలకు అధిదేవత… గిరిసుత.. సౌభాగ్యానికి అధినాయకి. విద్య ఒక్కటే ఉంటే ఉపయోగం ఉండదు.. దానికి సౌభాగ్యం తోడుకావాలి. ఈ రెండు ఉన్నా ప్రయోజనం పరిమితమే దానికి సంపద తోడవ్వాలి. అందుకే వినయంతో కూడిన విద్యను, సౌభాగ్యాన్నీ తోడుగా ఉంచుకొని ప్రకాశించేది లక్ష్మీదేవి. అంటే ఎవరిలో నైతే సంస్కారవంతమైన విద్య, ప్రయోజనాత్మకమైన సౌభాగ్యం ఉంటుందో వారికి లక్ష్మీదేవి ప్రసన్నమౌతుంది.. లేదా అక్కడ సంపద నిలుస్తుంది. విద్య సౌభాగ్యం ఉన్న చోట ప్రశాంతత ఉంటుంది. ఎవరినీ యాచించే ఉద్దేశ్యం ఉండదు. ఆనందమే పరమావధిగా ఉంటారు. అదే విష్ణువుకు ఆవాస స్థానం. అందుకే లక్ష్మీదేవి సదా సార్వకాలాలలో వ్యగ్రత లేని విష్ణువు పాదాలను ఆశ్రయించి ఉంటుంది. అహంకారం ఉన్నచోట విద్య భాసించదు. అలాగే సౌభాగ్యమూ నిలవదు.
                అంతేకాదు… మనం ఎవరితోనైతే అనునిత్యం కలసి ఉంటామో అలాంటి వారి ఆలోచనా పరిమితులలో బంధితులమై ఉంటాము. విద్య సౌభాగ్యం ఎక్కడైతే ప్రభావవంతంగా ప్రకాశవంతంగా ఉన్నాయో.. అక్కడ లక్ష్మీదేవి ఉంటుందనేది నిరూపితమైంది.. భారతీ గిరిసుతల్ దోనాడు పూబోడి, అనడం వల్ల.
                తామరలందుండెడి ముద్దరాలు … తామరలు అందమైన పుష్పాలే కాక.. వాటిలో ప్రత్యేక లక్షణం ఉన్నది. ఇవి మట్టి నుండి పైకి లేచినా మట్టి మరకలు పడకుండా ఉంటాయి. కాబట్టి స్వఛ్చతకు చిహ్నాలుగా నిలుస్తాయి. అంతేకాదు అవి నీటిలోనే ఉన్నా తామర ఆకుల పై భాగం నీటితో తడకపోవడం విశేషం. మరొక విశేషం.. ఇవి “మంచి”నీటి చెరువులలోనే ఎక్కువగా దర్శనం ఇస్తాయి. కాడలు సున్నితంగా ఉంటాయి. అంటే వ్యక్తికి పరుల కష్టాలకు స్పందించగలిగిన సున్నితత్వం ఉండాలి. తామరలు మనిషిలోని ఒత్తిడిని తగ్గిస్తాయని చెపుతారు. తామర లందుండెడి … ఐహిక జీవితంలో మన చుట్టూ ఎన్ని మలినాలు చేరినా వాటి ప్రభావానికి లోనుకాకుండా.. ప్రలోభాలు ఎదురైనా వాటికి చిక్కకుండా వ్యక్తి జీవితాన్ని సాగించాలి అనేదే సందేశంగా.. తామరలందుండెడి ముద్దరాలు అనడం ద్వారా పోతనగారు అందిస్తున్నారు. హృదయాన్ని కూడా కమలంతోనే పోలుస్తారు. మూలాధారం నుండి ఆరంభమయిన ప్రస్థానం.. సహస్రారం చేరడంతో ముగుస్తుంది. ఆ సహస్రారమే సహస్ర దళములతో కూడిన పద్మముగా చెపుతారు, యోగులు.
                జగముల్ మన్నించు యిల్లాలు… జగము అంటే లోకము, ప్రపంచము. ప్రపంచమే పాంచభూతాత్మకము.. దీనిని చూపేది లోకము అంటే చూపు. అనగా ప్రపంచము శాశ్వతము కాదు.. అశాశ్వతమైన దానిని పట్టించుకోకుండా శాశ్వతమైన దానిని ఆరాధించండి, ఉపాసించండి.. అంటూ ప్రబోధించే దార్శనికులైన ఋషుల చేత మన్నింప బడినది… యిల్లు గలది యిల్లాలు.. ఇల్లు అంటే ప్రపంచమే ఆమె యొక్క ఇల్లుగా గలిగినది. అంటే సకల జగత్తులోనూ వ్యాప్తిచెందినది.
                భాసురతన్ లేములు వాపు తల్లి.. లేమి అనేది సంపద లేకపోవడం కాదు.. ఎదుగుదల నుండి సంతృప్తితో కూడిన బ్రహ్మానంద విభూతి వరకు జరిగే ప్రయాణంలో నిత్యమైన, సత్యమైన, శాశ్వతమైన ఆనందాన్ని పొందలేకపోవడమే లేమి. ఎన్ని సంపదలు ఉన్నా ఒక్క క్షణాన్ని కూడా కొనలేము. లభించిన దానిని సమర్ధవంతంగా, ప్రకాశవంతంగా, ప్రభావవంతంగా ఉపయోగించుకోగలగడమే బ్రహ్మానంద స్థితి. దానికి వ్యతిరేకమైనది లేమి.. ఆ లేమిని దూరం చేసి జనన మరణ చక్ర బంధనాల నుండి తప్పించే తల్లి లక్ష్మీదేవి.
                సిరి యిచ్చున్ నిత్య కల్యాణముల్… కల్యాణము అంటే శుభము.. శోభనము.. కల్యాణము ఎప్పుడు కలుగుతుంది? పొందదగినది సంపూర్ణంగా పొందినప్పుడు కలిగేదే కల్యాణము. అది ఎప్పుడో ఒకసారి వచ్చేది కాకూడదు.. అనుక్షణం మనకు కావాలి. దానిని ఇవ్వగలిగిన లక్ష్మీదేవిని ప్రార్థిస్తున్నాడు, పోతన గారు.
 *  * *           

పుట్టం బుట్ట, శరంబునన్ మొలవ, నంభోయాన పాత్రంబునన్
నెట్టం గల్గను, గాళి గొల్వను, బురాణింపన్ దొరంకొంటి మీఁ
దెట్టే వెంట రచింతు తత్సరణి నీవీవమ్మ యో యమ్మ మేల్
పట్టున్ మానకు మమ్మ నమ్మితి జుమీ బ్రాహ్మీ దయాంభోనిధీ! (భాగవతము – పోతన)

                “మత్పురాకృత శుభాధిక్యంబు దానెట్టిదో”.. నన్నయ తిక్కనాది కవులు ఈ భాగవతాన్ని ఇప్పటి వరకు తెలుగులో వ్రాయలేదు.. “దీనిం తెనింగించి నా జననంబున్ సఫలంబు సేనెద పునర్జన్మంబు లేకుండగన్” అనే విశ్వాసాన్ని ప్రకటించాడు, పోతన గారు. మరొక జన్మ లేకుండా ఉండేందుకు ఈ భాగవతాన్ని తెలుగులో వ్రాస్తాను.. అంటూ ఆరంభించారు పోతనగారు భాగవతాన్ని ఆంధ్రీకరించడం. ఆ ప్రక్రియలో భాగంగా సరస్వతీ దేవిని ప్రార్థిస్తూ చెప్పిన పద్యమే పై “పుట్టం బుట్ట” అన్న పద్యం..
          నమ్రత, వినయ, విధేయతలను వ్యక్తీకరించే విధంగా చెప్పిన పద్యం ఇది. భాగవతాన్ని తెలిసి పలకడం తమ్మి చూలికి కాని శూలికి కాని సాధ్యం కాదని ఒకవైపు చెపుతూనే దానిని తెనిగించేందుకు సన్నద్ధమైన పోతన గారి ప్రజ్ఞాపాటవాలు ఆ సంకల్పంలోనే వ్యక్తమౌతున్నాయి.    అయినా .. “ఎట్టే వెంట రచింతు తత్సరణి నీవీవమ్మ” అంటూ భారం ఆమెపైనే పెట్టడం ఆయనలోని సర్వ సమర్పణ భావాన్ని తెలుపుతుంది.

          పుట్టలో పుట్ట లేదు.. అంటే పుట్టలో పుట్టిన వాల్మీకిని కాను.. వాల్మీకి తపస్సు చేస్తున్న సమయంలో ఆయన శరీరం అంతా పుట్టలు పెట్టిందట. దానిలో నుండి వెలికి వచ్చిన వాడు కాబట్టి అతను వాల్మీకిగా ప్రసిద్ధుడయ్యాడు. శరంబునన్ మొలవ.. రెల్లుగడ్డిలో జనించిన వాడు.. శరవణ భవుడు లేదా కుమారస్వామి. నేను కుమార స్వామిని కాదు.. అంభస్ అంటే నీరు.. నీటిపై చేసే ప్రయాణానికి అనువైన సాధనము (పాత్ర).. పడవలో సత్యవతికి పరాశరునికి జనించిన వాడు.. వ్యాసుడు.. ఆ వ్యాసుని నేను కాను.. కాళి గొల్వను.. కాళికా మాతను సేవించి ఆమె ప్రసాదంతో మహాకవి యైన వాడు.. కాళిదాసు.. నేనా కాళిదాసును కాను.. అయినా దొరంకొని (పూనుకొని) ఉంటిని.. ఉన్నాను… దేనికి? పురాణింపన్.. భాగవత పురాణాన్ని రచించేందుకు పూనుకొని ఉన్నాను. నిజానికి నాకా సామర్ధ్యం లేదు.. ఎవరికి ఉన్నది? వాల్మీకి, కుమారస్వామికి, వ్యాసునికి, కాళిదాసు లాంటి మాహాత్ములకు మాత్రమే ఉన్నది… అయినా నేనా పనిని సంకల్పించాను. ఎందుకని? నా జననము సఫలము చేసుకోవాలని.. సామర్ధ్యం లేదని తెలిసినా ఎందుకు ప్రయత్నిస్తున్నాను? అంటే నాకు అండగా నీవు ఉన్నావనే నమ్మకంతో…
          అమ్మా! నీ అండ చూచుకొని గొప్పనైన కార్యాన్ని తల కెత్తుకున్నాను. అంతేకాదు.. ముందు చెప్పిన మహాత్ములైన వారి వెంట నడుస్తాను.. అయితే ఆ సరణి మాత్రం నీవే నాకివ్వాలి. నిన్ను నమ్ముకున్నాను తల్లి.. “మేల్ పట్టున్ మానకు మమ్మ” మంచి పట్టుగా ఉండవమ్మా… ఓ దయకు సముద్రం లాంటి దానా.. బ్రహ్మీ మాతా అంటున్నాడు, పోతనగారు. దయ ఆలోచనకు పరిమితమైనది కాగా కరుణ ఆచరణకు సంబంధించినది.. ఆలోచన ఆరంభం కాగా.. ఆచరణ ముగింపు…
          “మేల్ పట్టున్ మానకు మమ్మ” … ఒక ఇరుకైన చేదబావి పూడిక తీస్తున్నారు.. అది ఒక ఉదాత్తమైన కార్యం.. ఒకడు లోపల ఉన్నాడు.. ఒకడు వెలుపల ఉన్నాడు. లోపల ఉన్నవ్యక్తి బావి లోపలి మట్టిని తీసి తట్టలో వేస్తాడు.. వెలుపల ఉన్న వ్యక్తి దానిని జాగ్రత్తగా పైకి చేది ఆ తట్టలోని మట్టిని బైట పారబోస్తాడు. పైన ఉన్న వ్యక్తి ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా లోపలి వ్యక్తి ప్రమాదానికి గురవుతాడు. మట్టి తట్ట తొణికినా… జారినా.. తాడు తెగినా.. లోని వ్యక్తికి ప్రాణాపాయ స్థితి కలుగుతుంది. అందుకే లోని వ్యక్తి అంటున్నాడు.. అరే జాగ్రత్తగా పైకి చేదుకో… అంటూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని పైన ఉండే వ్యక్తికి చెపుతున్నాడు. లోపలి వ్యక్తి ప్రాణాలు పైన ఉన్న వ్యక్తి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉన్నాయి. అదే విధంగా పోతన గారు దుష్కరమైన కార్యాన్ని తలకెత్తుకున్నాడు. తన సంకల్పం ఉదాత్తమైనది.. అత్యంత గహనమైనది. తానెంత సమర్ధుడైనా.. అమ్మవారి కరుణాదృక్కులు లేకపోతే తన ప్రయత్నం అపహాస్యం పాలవుతుంది. అందుకే మేల్ పట్టున్ మానకు మమ్మ.. అంటున్నాడు.

* * *
బలవంతుండు ధరాసుతుండు గనె శుంభద్రాజ బింబోపరి
స్థల శంపాన్వితమేఘమో యన ఖగేంద్రస్కంధపీఠంబుపై
లలనారత్నముఁ గూడి సంగరకథాలాపంబులం జేయు ను
జ్జ్వలనీలాంగుఁ గనన్నిషంగుఁ గుహనాచంగున్ రణాభంగునిన్!
(పోతన – భాగవతము – దశమ స్కంధము – ఉత్తరభాగము – 168)

                మహాబలవంతుడు, ధరా (భూదేవి) కుమారుడునైన నరకాసురుడు చూచాడు. ఎవరిని చూచాడు? ప్రకాశమానమైన చంద్రబింబం ఉపరితలంపైన మెఱపుతీగతో కూడిన మేఘమా అన్నట్లుగా గరుత్మంతుని మూపుపై, ఉత్తమ స్త్రీలలో మణివంటి సత్యభామతో గూడి యుద్ధ విశేషాలను ముచ్చటించుకుంటున్న వానిని, నీలవర్ణంతో శోభిస్తున్న వానిని, వీపుపైన అమ్ములపొదిని దాల్చిన వానిని, రణకోవిదుడైన శ్రీకృష్ణుడిని చూసాడు.
                మురాసుర సంరక్షితమైన గిరి, శస్త్ర, సలిల, దహన, పవన దుర్గమమైన దుర్గముల చేత చుట్టబడిన పట్టణంలో ఉండేవాడు నరకుడు. కృష్ణుడు ముందుగా ఆ దుర్గాలను ఛేదించి యుద్ధ సంరంభియై వచ్చిన వాడయిన కృష్ణుని చూచాడు, నరకుడు.
                ధరా సుతుడు… వరాహావతార సమయంలో విష్ణువు భూదేవిని ఉద్ధరించిన సమయంలో, ఆ ప్రకృతి పురుషుల సంగమం వలన జనించిన వాడయిన నరకాసురుడు. నరులలో అనుర లక్షణాలు కలిగినవాడు  నరకాసురుడు. ప్రతివ్యక్తిలో సుర అసుర రాక్షస లక్షణాలు ఉంటాయి. వాటిలో ఏ లక్షణాలను జాగృతం చేసుకుంటామో ఆ జీవన గతిని లేదా విధానాన్ని సంతరించుకుంటాము. నిస్వార్ధ జీవనం సుర లక్షణమని, స్వార్థం ఉన్నా హింసా ప్రవృత్తిలేనిది అసుర ప్రవృత్తి అని, స్వార్థంతో పాటుగా హింసా ప్రవృత్తిని కలిగియుండడం రాక్షస ప్రవృత్తి యని చెపుతారు.
    జీవితం పట్ల, జీవన వైఖరి పట్ల, జీవన లక్ష్యాల పట్ల, విస్పష్టమైన అవగాహన లేక జీవన ప్రయోజనాలను గుర్తించ గలిగిన వికాసం లేనట్టి జఢత్వాన్ని కలిగిన నరుడు.. నరకుడు.
ధర అనగా భూమి అనగా ప్రకృతి.. జఢత్వాన్ని కలిగింది. అంతే కాదు, భూమి పోషణ నిచ్చేది. భూమి నుండి వచ్చే ఆహారమే సమస్త జనులనూ పోషిస్తుంది.. అందుకే నరకుడు భూమి సుతుడయ్యాడు.
మొదట్లో ఇతడు “ప్రాగ్జ్యోతిష పురం” లో ఉండేవాడు.
ప్రాక్ .. సత్యము.. శాశ్వతమైనది, అనాదిగా ఉన్నది.. ఏది అనాది? అనగా ఆత్మ.. ఆత్మజ్యోతిగా ప్రకాశించేది ప్రాగ్జ్యోతిషము. సత్యము చేత ప్రకాశమానమైన పురము లేదా పట్టణము ప్రాగ్జ్యోతిషము.. అలాగే పురము అనగా శరీరము… సత్యప్రకాశమానమైన శరీరంతో వెలుగొందేవాడు.  ఆ సత్యాన్ని విస్మరించాడు. దానితో మాహిష్మతీ పట్టణానికి మారాడు. అనగా మహిష ప్రవృత్తికి మారాడు.. జ్ఞానవంతమైన, చైతన్యవంతమైన నరకుడు   పశుప్రవృత్తిని స్వీకరించి నరకాసురుడు అయ్యాడు. అక్కడ ముగ్గురు మిత్రులయ్యారు.. వారే మురాసురుడు, నిశుంభుడు, హయగ్రీవుడు… ఈ మువ్వురూ సత్వరజస్తమోగుణాలకు ప్రతీకలు కాగా వారికి మిత్రునిగా ఆ బంధంలో చిక్కుకున్నాడు, నరకుడు.
                ఎప్పుడైతే తనకు త్రిగుణ సంపత్తితో బంధం ఏర్పడిందో అప్పుడే అతనికి భయం, కోరికలు జనించాయి. జీవునికి బంధాలు ఉంటాయి.. పరమాత్మకు సంబంధాలు ఉంటాయి అంటుంది భాగవతం. అన్యోన్యమైత్రి కలిగి పతనావస్థకు దిగజార్చే భయం, కోరికల యొక్క బంధనాలలో చిక్కి మోక్షాన్ని కోరుకోవలసిన వాడు అమరత్వాన్ని (చిరకాలం జీవించడం) సాధించాలని తపించాడు.. మరణం లేని జీవితాన్ని పొందలేకపోయినా తన తల్లితో మాత్రమే మృత్యువు కావాలనే వరాన్ని పొందాడు. ఎందుకు? అంటే తనను పోషిస్తున్న తల్లినే మరచి తల్లి ఎవరో తెలియని అజ్ఞానానికి బద్ధుడయ్యాడు. కాబట్టి ఆమెతో తనకు మరణం ప్రాప్తించే అవకాశం లేదని భావించాడు.   
  నిజానికి మర్త్యుడు అంటే మృత్యువుకు సమీపానికి వెళ్ళేవాడని అర్థం. సృష్టిలో ఏ జీవికీ శాశ్వతంగా ఉండిపోయే అవకాశం లేదు. ఆకృతి ఉన్నదేదయినా కాలాంతరంలో ఆ ఆకృతిని కోల్పోవలసిందే. ఇతనూ నరుడే లేదా మర్త్యుడే శరీరాన్ని వదలవలసిన వాడే.. అయినా అసురలక్షణాలను సంతరించుకున్నవాడు.
  ఇక అతను వివాహం చేసుకున్నది చతుర్దశి అనే స్త్రీని. ఆమె “త్వష్ట” అనే ప్రజాపతి కుమార్తె. త్వష్ట అంటే తొలుచునది.. ఏది తొలుస్తుంది అంటే మాయ.. మాయయే మనిషి వివేకాన్ని తొలుస్తుంది. మాయయే ప్రకృతి.. ప్రకృతిలో ఉన్నవి పదునాలుగు భువనాలు.. ఆ పదునాలుగు భువనాలనే చతుర్దశి అన్నారు. ఆ కన్యను వివాహమాడాడు. అంటే పూర్తిగా మాయలో మ్రగ్గిపోయాడు. ఒకవైపు త్రిగుణ బద్ధులైన మిత్ర సంతతి, మరొకవైపు మాయాబద్ధమైన సహచరి.. అతనిలో అభిజాత్యానికి తోడుగా అహంకార మమకారాదులు, అధికార దర్పం లాంటివి వెలుగుచూచాయి. దానితో అదితియొక్క కుండలాలను హరించాడు. అదితి అంటే.. దితి కానిది. “దితి” అనగా ముక్కలు అయ్యేది లేదా ఖండములుగా అయ్యేది.. మరి “అదితి” అంటే ముక్కలు కానిది. ముక్కలు కానిది ఏది? అంటే ఆకాశమే.. ఆకాశమే ఖండములు గాకుండా అనంతంగా అంతటా వ్యాప్తమై ఉండేది.. కుండలాలు అంటే ఆ ఆకాశం ధరించిన సూర్య చంద్రులు. సూర్య చంద్రులు కాలానికి ప్రతీకలు. వాటిని హరించడం అంటే.. కాల స్పృహను కోల్పోవడం. కాలంయొక్క ప్రసరణ లేదా ప్రభావం తనపై లేదని భావించాడు. దుర్మార్గ ప్రవర్తన పెరిగిపోయింది. సకలమూ తనదిగా భావించాడు. “సకల” అనగా పదునారు లేదా షోడష కళలు అంటుంది లలితా సహస్రనామం. అన్ని సంపదలూ తనవిగా భావించి వాటిని నియంత్రించడమూ, బంధించడమూ ఆరంభించాడు. ఈ ప్రవృత్తిని నియంత్రించాలి.
                అందుకే కృష్ణుడు యుద్ధ సన్నద్ధుడై వచ్చాడు. సత్యభామా వస్తానన్నది.. ఆమెనూ తీసుకు వచ్చాడు. ఎందుకు అంటే నరకునికి తన తల్లితో మాత్రమే మరణం ఉన్నది.. రుక్మిణి లక్ష్మీదేవి అంశ  కాగా, సత్యభామ భూదేవి అంశ. అలా వచ్చిన సత్యభామ, కృష్ణుల నిరువురినీ చూచాడు.. బలవంతుడైన నరకాసురుడు. సత్యభామ అంటే ఎవరు? “సత్య”ము అనగా శాశ్వతమైనది.. ఏది శాశ్వతమైనదో అదే మారనిది. అదే ఈశ్వరుడు. దాని యొక్క “భా” కాంతిచే వచ్చే “మ” సంపద. శాశ్వత సత్యము యొక్క కాంతిచే పొందదగిన సంపద లేదా ఐశ్వర్యము. అది ఎవరి సొత్తు? ఈశ్వరుని సొత్తు. అందుకే సత్యభామ కృష్ణుని ప్రక్కన రాశీభూతమై  నిలిచింది. “కృష్” భూవాచకము.. ప్రయత్న సాధ్యమైనది కాగా “ణ” కారం మోక్షానికి ప్రతీక.


ఎప్పుడైతే సత్యమైన ప్రకాశాన్ని దర్శించాడో అప్పుడే నరకునిలో అజ్ఞాన తిమిరం విఛ్ఛిన్నం అయింది. అనంతమైన విష్ణు తేజస్సులో కలసిపోయాడు. మరొక విధంగా చెప్పుకుంటే.. “అ” కార “ఉ” కార “మ” కారాలు సృష్టి స్థితి లయాలకు ప్రతీకలు.. ఎప్పుడైతే సత్య దర్శనం అయిందో అప్పుడే నరకునిలో అజ్ఞానం లయమయిందని భావించవచ్చు. దానినే మనం అమావాస్యగా చెప్పుకుంటాము. “అమా” అనగా కూడి “వాస్య”.. వాసము.. అమావాస్య నాడు నరకునిలోని ఆసురీ ప్రవృత్తి భగవంతునిలో లయం అయింది. త్రిగుణాత్మకమైన ఆసురీశక్తులతో మైత్రిని కొనసాగించిన వేళ అతను ఉపాధిగతమైన జీవాత్మగా ఉన్నాడు. ఎప్పుడైతే భగవత్ దర్శనం జరిగిందో అప్పుడు ఉపాధిరహితమైన విశ్వచైతన్యంలో అనగా నారాయణునిలో లయమై “నరుడే నారాయణుని”గా మారాడు.


 నరకుని సంహారం అంటే.. ఉపాధిగతమైన నరుని ఉపాధిరహితమైన నారాయణుడు తనలో లయం చేసుకోవడమే.. లయం కావడం అంటే.. శాశ్వత సత్యంగా రూపాంతరం చెందడమే. కృష్ణుడు దుష్ట శిక్షణ చేసాడు.. అంటే దుష్టులను శిక్షించడంగా భావించకూడదు.. దుష్టత్వాన్ని శిక్షించినట్లుగానే భావించాలి. ఎప్పుడైతే సాధకునిలోని దుష్టత్వం లయమౌతుందో అప్పుడు సాధకుని ప్రయాణం “తమస్సు నుండి ప్రకాశం” వైపునకు సాగుతుంది.

January 31, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • క్విజ్ పోటీ-
  • వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)
  • తరిగొండ వెంగమాంబ
  • నడిచే విజ్ఞాన సర్వస్వం- శ్రీమాన్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథ ఆచార్య స్వామి
  • ఇప్పటికీ ఇక్కడే ఉన్నాను

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us