మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
వ్యాసాలు

మన తెలుగు నాటకాలు

by Sammeta Vijaya November 28, 2025
written by Sammeta Vijaya

రాత – నాటిక
వెలగలేరు థియేటర్ ఆర్ట్స్ వెలగలేరు

రచన, దర్శకత్వం శ్రీనివాసరావు పోలుదాసు

వారి సమర్పణలో పలువురి ప్రశంసలు అందుకున్న నాటిక ‘రాత’ తక్కువ పాత్రలతో ఆద్యంతం ఆసక్తికరంగా అద్భుతమైన ఇతివృత్తంతో సాగిన నాటిక రాత .
దర్శకుడు శ్రీనివాసరావు పోలుదాసు. స్వయంగా నాటక రంగం , సినీ నటుడు. టీవీ ,సినీ రంగాలలో డబ్బింగ్ కళాకారుడు. నట శిక్షణ, వాయిస్ శిక్షణ ఇస్తూ, అటు సినీ రంగం ఇటు టెలివిజన్ నాటక రంగాలలో నిరంతరం కృషి చేస్తున్న నటుడు. ఏ పాత్రకైనా న్యాయం చేసే నైపుణ్యం నాటకాల పట్ల అంకితభావం కలిగిన నటుడుగా మాత్రమే కాకుండా స్వయంగా రచించి దర్శకత్వ బాధ్యతను చేపట్టిన శ్రీనివాసరావు పోలుదాసు ప్రధాన పాత్రలో ఈనాటికలో కనిపిస్తాడు. హైదరాబాదులో మూడుసార్లు రాత నాటిక ప్రదర్శించబడింది. రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా 28 ప్రదర్శనలు ఈనాటిక ప్రదర్శించబడింది. నిశి నాటిక రచన కూడా వీరిదే. భ్నీం గారు రచించిన మూల కథ ‘హరిలోరంగ హరి’ నాటకీకరణ శ్రీనివాసరావు పోలుదాసుగారు చేసి సమకాలీన పద్యనాటకంగా ప్రదర్శింపచేయగా ఈ నాటకం పలువురి మన్ననలందుకుంది.
తాను పొందాల్సినవి మంచిగా పొందుతూ తిరిగి ఇవ్వాల్సిన విషయంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న తీరుని వివరిస్తూ ఎన్టీఆర్ జిల్లా కొండూరు మండలం వెలగలేరుకు చెందిన వెలగలేరు ఆర్ట్ థియేటర్ కళాకారులు ప్రదర్శించిన ‘రాత’ నాటిక పిఠాపురంలో జనవరిలో ప్రదర్శించబడినప్పుడు పలువురి ప్రశంసలు పొందింది. ద్వితీయ ఉత్తమ ప్రదర్శనగా ఈ నాటిక నిలవడమే కాక ఉత్తమ దర్శకుడిగా శ్రీనివాసరావు పోలుదాసు ఎంపికయ్యారు. తెలుగు విశ్వవిద్యాలయం సత్కళా భారతి 29వ వార్షికోత్సవంలో కూడా ‘రాత’ నాటిక ప్రదర్శించబడింది.

రాత నాటికలో తండ్రి గోవర్ధన్. కూతురు స్వప్నిక. గోవర్ధన్ భార్య లేకుండా కూతురిని చాలా గారాబంగా పెంచుకుంటాడు. స్వప్నికను కిరణ్ మాస్టారు ఆటలలో ప్రోత్సహిస్తాడు.
అజయ్ అనే వ్యక్తి వచ్చి చక్రి ప్లాస్టిక్ ఇండస్ట్రీని ఆ ఏరియా నుండి తీసేయాలని వారించిన గోవర్ధన్ ను ఆ ఇండస్ట్రీ యజమాని చక్రవర్తి కుమారుడు అజయ్ వచ్చి బెదిరిస్తాడు . కీర్తి ఒక ఆశా వర్కర్ . చక్రి ప్లాస్టిక్ ఇండస్ట్రీస్ గురించి రిపోర్ట్ తయారుచేసింది డ్యూటీ నుంచి వస్తుండగా ఆమెకు యాక్సిడెంట్ చేయించి చంపేస్తాడు. ఆ కీర్తి గోవర్ధన్ భార్య. ఈ విషయం గుర్తు చేసిన అజయ్ తో ఆ బెదిరింపుకు బెదిరేది లేదంటాడు గోవర్ధన్. మాట వినకపోతే తన కూతురిని అలాగే చేస్తామని బెదిరించి వెళ్తాడు అజయ్.

స్వప్నిక ఆటలు ఆడుతుండగా ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంది . ఆ పరిస్థితుల్లో డాక్టరుకి చూపించుకోగా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ అని తెలుస్తుంది .ఇకపై ఆటలు ఆడకూడదని డాక్టర్ సలహా ఇస్తాడు. ఆటల పట్ల ఆసక్తి ఉన్న స్వప్నిక బాగా కృంగిపోతుంది. దేన్నైనా ఇష్టపడటమే నేను చేసే తప్పా అని సూటిగా ప్రశ్నించిన స్వప్నిక తన పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. తన ఇష్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న దానికి కారణం బ్రహ్మ రాసిన రాత అని వివరిస్తాడు గోవర్ధన్. స్వప్నిక బ్రహ్మను ప్రశ్నించగా బ్రహ్మ వచ్చి స్వప్నికతో మాట్లాడే వృత్తాంతం చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఈనాటికలో మనుషుల గురించి మనుషుల మనస్తత్వం గురించి బ్రహ్మతో చెప్పించడం నాటికలోని వైవిధ్యం. మనిషి జీవితానికి సైన్స్ కి ఆధునికతకి సాంకేతికకి మధ్య మనిషి ఏం చేస్తున్నాడో ఆలోచింపచేస్తుంది ఈ నాటిక. స్వప్నికకు ఏం జరిగింది గోవర్ధన్ స్వప్నికకు ఏం చెప్పాడు చివరకు ఏం జరుగుతుంది తెలియాలంటే రాతనాటిక చూడాల్సిందే !
రాతను రచించిన శ్రీనివాసరావు పోలుదాసు ప్రస్తుతం మనల్ని పట్టిపీడిస్తున్న సమస్యను పరిమిత పాత్రలతో ప్రేక్షకులను ఆలోచింపజేసేలాగా రచించారు. 28 ప్రదర్శనలు అనేక బహుమతులు అందుకున్న రాతనాటికకు తండ్రి గోవర్ధన్ పాత్రను రచయిత దర్శకుడు అయిన శ్రీనివాసరావు పోలుదాసు ముఖ్యపాత్రను పోషించారు. స్వప్నిక గా సురభి వాగ్దేవి ఎక్కడ తడుముకోకుండా డైలాగులను చెబుతూ పాత్రకు జీవం పోసింది . మాస్టారుగా కిరణ్ పాత్రలో సురభి రాఘవ , అజయ్ పాత్రలో పవన్ కళ్యాణ్, బ్రహ్మ పాత్రలో దిలీప్ …తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
ఏనాటిక విజయవంతంగా ప్రదర్శించబడిందని చెప్పినా విన్నా దాని వెనక సాంకేతిక నిపుణుల సహకారం ఎంతైనా ఉంటుంది. సంగీతం అందించింది సురభి నాగరాజు, ఆహార్యం సురభి రాఘవ, సెట్ మరియు లైటింగ్ సురభి ఉమాశంకర్, సహకారం బుగ్గోజు జయరాం. ఈనాటిక ప్రదర్శకులు వెలగలేరు థియేటర్ ఆర్ట్స్ , వెలగలేరు, కొండూరు మండలం, ఎన్టీఆర్ జిల్లా. సామాజిక సమస్యలపై దృష్టి సారింపజేసే ఇటువంటి నాటికల ప్రదర్శన నేడు అత్యవసరం అందుకు పూనుకున్న శ్రీనివాసరావు పోలుదాసు సర్వదా అభినందనీయుడు.

November 28, 2025 3 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

జవసత్వాలు కోరుతున్న చెరియాల్ (చేర్యాల ) చిత్రలేఖనం

by Radhika Suri November 24, 2025
written by Radhika Suri

తెలంగాణకు చెందిన జానపద కళారూపాయల్లో ఒకటి ఈ చెరియాల్ చిత్రలేఖనం.వరంగల్ జిల్లాలోని ‘చేర్యాల’ ప్రాంతంలో పురుడు పోసుకుందీకళ . దీనినే ‘నకాశి ‘కళ అని కూడా పిలుస్తారు.

పురానేతిహాసాలను కథాంశాలుగా తీసుకొని అల్లిక రూపంలో జానపద సాంప్రదాయ రీతుల్లో రూపొందిస్తారు. గతంలో ఆసియా ఖండపు సాంప్రదాయకళా రూపాలలో ఒకటిగా ప్రఖ్యాతి పొంది భారతదేశం అంతటా విస్తరించినప్పటికీ’ ఇప్పుడు చేర్యాల’ ప్రాంతంలో మాత్రమే కొంత మనుగడలో ఉంది. .

గతంలో ఫిల్మ్ లేదా కామిక్ స్ట్రిప్స్ లలా ఉండేవి .పురానేతిహాసాలు, స్థానిక అంశాలే ప్రధాన కథా వస్తువులుగా చేసుకొని కథలు అల్లుతారు. ఈ కళారూపానికి శాసనాధారాలు కూడా ఉన్నట్లు దాఖలాలు కనిపిస్తాయి. కొందరు కళాకారులు ఇప్పటికీ ఈ వృత్తినే కొనసాగిస్తున్నారు.

ఈచిత్రాలలో బ్యాక్ గ్ర్రౌండ్ గా ఎరుపు రంగును వాడుతారు . గతంలో ఈ సాంప్రదాయ చిత్రపటాల తయారీలో సహజ రంగుల కోసం తెలుపు రంగును సముద్రపు గవ్వల నుండి , దీపపు మసి నుండి నలుపును, స్వచ్ఛమైన పసుపు నుండి పసుపు రంగును సేకరించి ఇలా సహజ రంగులనే వాడేవారు. నేడు ఆ రంగుల వాడకం తగ్గించి సింథటిక్ కాన్వాస్ పై కృత్రిమ రంగుల మేళవింపులతో చిత్రిస్తున్నారు. ఈ ప్రదర్శన ముఖ్యోద్దేశం మాత్రం స్థానిక కథలు , వీర గాథలు వారివారి సాంప్రదాయాలను ఆధారంగా చేసుకుని ప్రదర్శింపబడేవే.

ఈ కళ స్థానిక కథాంశాల్ని ప్రభావితం చేసేదిగా ప్రసిద్ధిగాంచింది .ఆయా ప్రాంతాల ఆచార వ్యవహారాలు, సంస్కృతీ సాంప్రదాయాలు, భిన్నమైన శైలుల్ని ప్రతిబింబించేలా పట చిత్రాలు ప్రదర్శిస్తారు .ఆధునిక సమాజంలో ఎలక్ట్రానిక్ మీడియా, కంప్యూటర్, సినిమా రంగాలు ముందంజలో ఉండడంతో ఈ
నకాశి కళ దాదాపుగా అంతరించిపోయిందనే చెప్పాలి. భారతదేశం అంతటా విస్తరించినప్పటికీ ప్రస్తుతం మాత్రం వరంగల్ జిల్లా చేర్యాల ప్రాంతానికే పరిమితమైపోయింది దాంతో ‘చేర్యాల (స్క్రో ల్స్ ) చిత్రపటాలు ‘అనే పేరుతో మాత్రమే మనుగడలో ఉంది.
స్థానిక వృత్తుల నేపథ్యంతోనే ప్రదర్శించేవారు. ఎరుపు రంగును బ్యాక్ గ్రౌండ్ గా చేసుకుని పూలు తీగలతో చిత్రిస్తారు. ఈ కళారూపానికి 400 సంవత్సరాల చరిత్ర కలిగి ఉందని, హిందూ, జైన, బౌద్ధ గ్రంథాలలో సైతం ప్రస్తావించిన దాఖలాలు ఉన్నాయి.

ఈ నకాశి కళాకారులు సంచార జీవనం సాగిస్తూ ప్రదర్శించేవారు. ఈమధ్య కాలంలో పురాణాలలోని పొడవైన కథల్ని కుదించి చిత్రిస్తున్నారు. ( పోషకులు లేకపోవడమే ప్రధాన కారణం) చిన్నగా నిడివి తగ్గించి చిత్రించడంవల్ల వీటిని ఫ్రేములలో
భద్రపర్చుకోవడానికి అనుకూలంగా ఉంటాయి.
ఈ నకాశి కళ చిత్రీకరణకోసం ఖాదీ కాన్వాసుకు ఆకృతినిచ్చి ప్రదర్శనకు సమాయత్తం చేయాలంటే ఎంతో శ్రమించాల్సి వస్తుంది .పత్తి (దూది), బియ్యపు పిండి ,సుద్దమట్టి మిశ్రమాన్ని కలిపి, ఉడికించి చింతగింజల పేస్టు, జిగురు (బంక) కలిపిన మిశ్రమాన్ని మూడుసార్లు వరుసగా ఆరబెడుతూ అప్లై చేసిన పిదప కాన్వాస్ తయారవుతుంది. వీటికోసం వాడే బ్రష్ లకు’ ఉడుత’ల వెంట్రుకలను వాడుతారు బొమ్మలను కొబ్బరి చిప్పలు ,రంపకు చెక్క పొడి, చింతపండు పేస్టుతో తయారు చేస్తారు .కళాకారులు తమతమ నైపుణ్యాల్ని జోడించి చక్కని రూపాన్నిస్తారు. ఈ కళాకారులు రూపొందించిన పెయింటింగ్స్ లోని అంశాలు స్థానిక కథాంశాలు కాబట్టి గ్రామీణ జీవన విధానం ,పండుగలు, పంటచేలు, శ్రామిక జీవన సౌందర్యానికి నృత్య, గీతాలు జోడించి హృద్యంగా చిత్రిస్తారు. చాలా సులభంగా అర్థమౌతాయి కూడా.

మూడు అడుగుల వెడల్పు అరవై అడుగుల పొడవుతో బొమ్మలు గీస్తారు. స్ట్రోల్స్ లో నలభై నుండి యాభై ప్యానెల్స్ ఉంటాయి. ప్రతి ప్యానెల్లో ఒక కథాంశంతో కొంత భాగపు వర్ణన ఉంటుంది .ఆర్యుల రాకకు పూర్వం నుండి ఉన్న తొలి చిత్రలేఖన కళారూపాలలో ఒకటి ఈ ‘నకాశి ‘కళారూపం అంటూ స్మితా గుప్తా తన ‘ఇండియన్ ఫోక్ అండ్ ట్రైబల్ పెయింట్స్ ‘ అనే పుస్తకంలో పేర్కొన్నారు.

కీ. శే. డా. కొండపల్లి శేషగిరిరావు గారు1954 లోనే ఈ కళారూపాన్ని వెలుగులోనికి తెచ్చారు. స్థానిక కళాకారులను హైదరాబాదుకు తీసుకుని వచ్చి పరిచయం చేసారు. శ్రీ సురవరం ప్రతాపరెడ్డి ( శ్రీ పొట్టిశ్రీరాములు) తెలుగు విశ్వవిద్యాలయం లో ఈ నకాశి కళపై పత్ర సమర్పణ
కూడా చేసారు.

‘ Heart For Art’ అనే యన్. జి. ఓ. సంస్థ సహకారంతో గోవాలో చెరియాల్ చిత్రలేఖన కళపై నిర్వహించిన వర్క్ షాప్ లో , రాష్ట్ర ప్రభుత్వ అవార్డు గ్రహీతలైన డి నాగేశ్వర్ పద్మ దంపతుల కుమారుడు డి .సాయి కిరణ్ వర్మ మాట్లాడుతూ తాను తల్లిదండ్రుల వద్ద కులవిద్యను అభ్యసించానని , మేము కేవలం చిత్రకారులం మాత్రమే కానీ స్ట్రోల్ అంటే పాట చిత్రించేటప్పుడు ఇతరుల మార్గ నిర్దేశకత్వంలో పనిచేస్తామంటూ వివరించారు.

1976లో రాష్ట్ర ప్రభుత్వం ఈ చెరియాల్ పెయింటింగ్ ను హస్తకళగా గుర్తించగా, 2008లో మేధాసంపత్తి హక్కుల రక్షణ హోదా కల్పించింది.
2016లో లండన్ లోని యస్. ఓ. ఏ. యస్. విశ్వవిద్యాలయం నుండి చెరియాల్ కళపై డాక్టరేట్ చేసిన అనాయిస్ ‘డాక్టర్ ఫోన్సెకా’ మాట్లాడుతూ ఈ కళారూపం అంతరించిపోకుండా ఉండాలంటే ‘సాంస్కృతిక వారసత్వం’ అవసరమంటూ పేర్కొన్నారు.

దాదాపుగా అంతరించిపోయిన ఈ నకాశి కళారూపానికి జవసత్వాలు నింపాలనే తాపత్రయంతో ఇంకా కొన్ని నకాశి కుటుంబాలు (ముఖ్యంగా వనజ, గణేష్ దంపతులు)శ్రమిస్తున్నాయి. వివిధ వర్క్ షాప్ లలో పాల్గొంటూ ఈ కళపై అవగాహన కల్పించే పనిలో ఉన్నాయి.
ఆధునిక యుగంలో కంప్యూటర్, మీడియా కారణంగా ఆదరణ కరువైంది . అంతరించిపోతున్నఈ కళారూపాన్ని ఆదరించాల్సింది ప్రభుత్వాలే .వివిధ ప్రదర్శనలు నిర్వహించడం, కళారూపాల ఉత్పత్తులకు మార్కెటింగ్ సదుపాయం కల్పిస్తూ ప్రోత్సహిస్తే ఈ తెలంగాణ వారసత్వ కళాసంపద మరింత మెరుగై, ప్రపంచానికి చేరువై పది కాలాలపాటు మనగలుగుతుందని ఆశిద్దాం.

November 24, 2025 7 comments
0 FacebookTwitterPinterestEmail
కథలు

“మా ఊరి కథలు”

by Charu Sri November 24, 2025
written by Charu Sri

పల్లె పరిచయం

పల్లెలు దేశ ప్రగతికి పట్టుకొమ్మలు… అప్పుడైనా.. ఇప్పుడైనా .. ఎప్పుడైనా..కాకపోతే నేడు పల్లెలను కుళ్లు రాజకీయం పట్టి పీడిస్తోంది.‘మనీ‘ విషవలయంలో మానవ సంబందాలనూ చిక్కి శల్యం చేసింది.
ఒక విధంగా చెప్పాలంటే పల్లె వాతావరణం పట్టణీకరణ అయిపోయింది. అయితే 70వ దశకంలో పల్లెలు స్వచ్ఛమైన అమాయకత్వానికి, ఐకమత్యానికి అద్దం పట్టేవి. పల్లె వాతావరణం ఉమ్మడి కుటుంబాన్ని తలపించేవి. కష్టసుఖాలను , ఒకరికి ఒకరు కలిసి పంచుకునేవారు. పశు, పక్షాదులతో సహజీవనం చేసేవి పల్లెలు. పల్లెప్రజలు ప్రకృతి ఒడిలో సేదదీరేవారు. అందుకే పల్లె ప్రజలు ఆరోగ్యంగా జీవించే వారు. అనారోగ్యం వారి దరికి చేరేది కాదు. జలుబు, జ్వరం లాంటి వాటికి అమ్మలే డాక్టర్లు. వంటింటి వైద్యం చాలా రోగాలకు పరిష్కారం.

నేటి తరానికి నాటి పల్లెల మట్టి వాసనలు, మంచితనం, అమాయకత్వం, సమైక్యత , సహృదయత గురించి తెలియవు…అందుకే నేటి యువతరానికి నాటి గ్రామీణ వాతావరణాన్ని,గ్రామీణ భారతాన్ని పరిచయం చేయాలన్నదే.. “మా ఊరి కథలు”ఉద్దేశం!
( ప్రతి మయూఖ సంచికలో ఈ ” మా ఊరి కథలు ” శీర్షిక తో ఒక్కో విషయాన్ని రచిస్తారు రచయిత . చాలా ఆసక్తికరంగా సాగింది ఈ రచన . పల్లెలు ఒకప్పుడు ఎలా ఉన్నాయో, ఇప్పుడు ఎలా ఉన్నాయో ఒక అవగాహన అవసరం. మీరు తప్పక చదవాలి రచనను ప్రోత్సహించాలని ఆశిస్తున్నాను.

– మయూఖ పత్రిక సంపాదకులు.


వరంగల్ వైపు కారు దూసుకెళ్తోంది. ఒక మీటింగ్ లో పాల్గొనేందుకు మిత్రులతో కలిసి హైదరాబాద్ నుంచి వరంగల్ బయలు దేరాను. రహదారి పై మా ప్రయాణం . డ్రైవర్ కు మంచి అనుభవం ఉన్నట్లుంది. మనసే విహంగమా అన్నంత జోరుగా దూసుకెళ్తోంది కారు. హైవే సైడున ఉన్న కీలోమీటర్ రాళ్ళు వెనక్కి పరుగెడుతన్నాయి. అంటే వేగం వంద క్రాస్ అయింది.

“మల్లేషన్నా..కారు స్పీడు తగ్గించే..మీటింగ్ కు కాస్త లేటయినా ఫరక్ పడదే” అన్నా డ్రైవర్ తో..! మెల్లగ కారువేగం తగ్గించాడు డ్రైవర్. రోడ్ పక్కన ఉన్న సైన్ బోర్డులు స్పష్టంగా కనబడుతున్నాయి. కొద్దిగా ముందుకు వెళ్ళగానే జనగామ అనే సైన్ బోర్డ్ కనిపించింది.. జనగామ వెళ్ళాలంటే హై వే దిగి లోనికి వెళ్ళాలి.. ఇక్కడ జనగామ ప్రస్థావన ఎందుకంటే… ఆ సైన్ బోర్డు చూడగానే అందరి మదిలో ఒక సీనియర్ ఐఎఎస్ అధికారి మెదిలాడు. ఎందుకంటారా …
జనగామకు ఒక పది కిలోమీటర్ల దూరంలో ఆ అధికారి స్వగ్రామం. అంతే కాదండోయ్ తాను పుట్టి పెరిగిన ఊరు, జన్మ నిచ్చిన తల్లి రుణం తీర్చుకున్న ధన్యజీవి ఆ ఐఎఎస్ అధికారి. అందుకే జనగామ బోర్డు చూడగానే ఆ ఐఎఎస్ అధికారి, ఆయన స్వగ్రామంమం ఓబులకేశవ పురం మదిలో మెదిలాయి. గతంలో ఆయన గురించి, ఊరుగురించి విన్నాను కాబట్టి ఓబులకేశవ పురం గ్రామాన్ని , అధికారి కట్టించిన ప్రసన్న వెంకటేశ్వరస్వామి దేవాలయం చడాలనిపిన్చింది.. అదే మాట కార్లో ఉన్న మితృలతో చెప్పా. వాళ్లు సరే అన్నారు.. కాకపోతే తిరుగు ప్రయాణంలో వెళ్దాం అన్నారు..సాయంత్రం లేటు అయితే ఎట్లా ? .. అనే సందేహం కలిగింది… వెంటనే ..”మల్లేశన్న కారు వేగం పెంచే.. వచ్చేప్పుడు ఓబులకేశవ పురం చుసివెళ్ళాలి అన్నాను … అంతే మల్లేశన్న కారు స్పీడు పెంచిండు.. ..”గాల్లో తేలి నట్లుందే…అన్నట్లు ముందుకు దూసుకుపోయిందీ.

గంటల్లో గమ్యస్థానం చేరుకొని, పని ముగించుకొని మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో వరంగల్ నుంచి హైదరాబాద్ కు తిరుగు ప్రయనమయ్యాము. నేను కారు కిటికీల్లోంచి బయట ప్రకృతిని చూస్తూ కూర్చున్నా. రోడ్డుకు ఇరువైపులా పచ్చని చెట్లు, చేలు …వాతావరణం ఆహ్లాదంగా మారింది. . అంత వరకు తీక్షణమైన ఎండ… అంతలోనే మేఘాలు కమ్ముకున్నాయి. అంతే వాతావరణం చల్లబడింది. అంతలో కారు వేగం తగ్గి హైవే దిగి కుడివైపు టర్న్ తీసుకుంది. మేము వేరే ఆలోచనలో ఉన్నా డ్రైవర్ మర్చి పోలేదు..ఓబుల కేశవపురం వెళ్ళాలని అనుకున్న విషయం. అందుకే జనగామ బోర్డ్ కనిపించగానే టర్న్ తీసుకుండు… నేను ఆలోచిస్తుండగానే జనగామ వచ్చేసింది.. టౌన్ మధ్యలోంచి కారు ఓబుల కేశవపురం వైపు పరుగు పెడుతోంది. ఆ ఊరు చిన్నదే అయినా రోడ్డు మాత్రం బాగుంది. రోడ్డుకు ఇరువైపులా పచ్చని చేలు..మధ్య మధ్యలో గుట్టలు.. నల్లని తారు రోడ్డు..జవ్వని వాల్జడలా ఒంపులు తిరుగుతూ ఒయ్యారాలు పోతోంది. అలా కొంతదూరం వెళ్ళాక కారు లెఫ్ట్ టర్న్ తీసుకుంది,, కారు మళ్లిన దగ్గర ప్రసన్న వెంకటేశ్వర స్వామీ దేవాలయం, ఓబుల కేశవా పురం అని సైన్ బోర్డు ఉంది.. అంటే ఒక పదినిమిషాల్లో గమ్యస్థానం చేరుతమన్న మాట. అంతవరకు ఎవరి ఆలోచనల్లో వారుగా ఉన్న మిత్రులం అలర్ట్ అయ్యాము. ముందుసీట్లో కూర్చున్న ప్రియ మేడం మరింత అలర్ట్ అయింది . లోకేషన్ మ్యాప్ ఆన్ చేసింది.. రూట్ మ్యాప్ సాయంతో సాఫీగా సాగున్న కారుకు ఒక్కసారి బ్రేకులు పడ్డాయి. అప్పుడే గుడి వచ్చిందా అని చూస్తే.. ఎడమ వైపున గ్రామపంచాయతి కార్యాలయం, కుడి వైపున పెద్ద చెట్టు.. దానికింద ఆంజనేయస్వామి గుడి.

లోకేషన్ మ్యాప్ ఎడమ వైపు దారి చూపుతోంది. రోడ్ మాత్రం ఫర్లాంగ్ దూరంలో కుడివైపునకు మళ్ళింది. ఎడమవైపున పంచాయతి కార్యాలయం కంపౌండ్ వాల్ ఆనుకోని చిన్న సందు ఉంది. అతికష్టం మీద కారు వెళ్ళొచ్చు. కాని కారు దిగి చూస్తే ఎదురుగ ఒక ఇల్లు కనిపిస్తుంది. అవతలకు కారు వెళ్ళే చాన్స్ లేదు. దీంతో గుడికి వెళ్ళాలంటే ముందుకెళ్ళి కుడివైపు వేళ్ళలా? లేక పంచాయతి ఆఫీసు పక్కెంట ఎడమవైపు వెళ్ళాలా అనే మీమాంసతో డ్రైవర్ కారు ఆపిండు, కార్లో ఉన్న వాళ్ళందరం కొత్తోళ్ళమే కింకర్తవ్యం? ప్రియ మేడం గారు ఆ వూరి వ్యక్తికి కాల్ చేయక తప్పింది కాదు. ఆ కాల్ తో లోకేషన్ మ్యాప్ చెప్పిందే కరెక్ట్ అని తేలినది. మల్లేష్ కారును కంపౌండ్ వాల్ పక్కెంట ముందుకు పోనిచ్చాడు. కొద్ది ముందుకు వెళ్ళగానే ఎదురుగ ఉన్న ఇల్లు దగ్గరికి వెళ్ళక ముందే కుడివైపున ” ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవస్థానం ” అని రాసిఉన్న ఆర్చ్ దర్శనం ఇచ్చింది.

ఆర్చ్ కింది నుంచి ఆలయం వద్ద వెళ్లి ఆగింది.. అంతకు ముందే ఓక వాహనమ ఆగి ఉంది అక్కడ . అయితే అది మోడిఫై చేసిఉంది. చాన్నాళ్ళుగా అది అక్కడే ఉందన్న సంగతి ఆ జీప్ ను చూస్తే అర్ధమైంది. దాన్ని ఉత్సవాలప్పుడు ఉత్సవ విగ్రహాల ఊరేగింపు కు వినియోగిస్తారని గుడికి కాపలాగా ఉండే వ్యక్తి ద్వారా తెలుసుకున్నాము. కార్ పార్క్ చేసి గుడిలోకి వెళ్లేందుకు మున్దుకు కదిలాము.అయితే గుడి ప్రాంగణంలోకి వెళ్లేందుకు అక్కడ ఒక చెక్క గేటు ఉంది. ప్రాంగణం చుట్టూ కంచే. గేటు తీసుకొని లోపలి వెళ్తుంటే గుడి వరకు నాపరాతి బండలతో దారి ఉంది.. ఆ దారి గుడి చుట్టూ ప్రదక్షిణలు చేసేందుకు వీలుగా కుడా ఏర్పాటు చేసారు. లోనికి వెళ్తుంటే..కుడివైపున ఒక కట్టడం ఉంది. దాని పైకప్పు పిరిమిడ్ లా ఉంది. కింద నాపరాతి బండలతో ఫ్లోరింగ్ . చుట్టూ కూర్చునేందుకు వీలుగా రెండు ఫీట్లంత గోడ, మధ్యలో హోమాలు, యజ్ఞాలు చేసుకునేందుకు వీలుగా ఆ నిర్మాణం ఉంది.. అదే విషయాన్ని కాపలాదారు ధ్రువీకరించారు. గుడిలోకి ప్రవేశించకముందు కనిపించిన మోడిఫై చేసిన వాహనం, హోమాలకోసం చేసిన నిర్మాణం నిర్మించిన నిర్మాత ముందు చూపు అద్దం పడుతోంది.

ఇంకాస్త ముందుకు వెళితే యజ్ఞ మండపం వెనకాల ఒక కోనేరు. మధ్యలో చక్రతల్వార్ శిలా విగ్రహం.. అంటే ఉత్సవాల చివరిరోజు చరస్నానం కోసం దీని నిర్మించారు. కోనేరు ఏడు అడుగులు ఉంటుందనుకుంట.. ఆలయం లోకి ప్రవేశించే దారికి ఎడమ వైపున చక్కని పూదోట. తోటకు మధ్యలో మరో కోనేరు.. దాని మధ్యలో కాళీయ మర్దనం చేస్తున్న శ్రీకృష్ణుని శిల్పం చూడ ముచ్చటగా ఉంది. అందులో జీవకళ ఉట్టిపడుతోంది. రెండు కోనేర్లు దాటుకొని ముందుకు వెళ్తే ఆలయ ముఖమండపం. ఎదురుగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గర్భాలయం. స్వామి గర్భాలయానికి ఇరువైపులా శ్రీ దేవి, భూదేవిల అనుబంధ ఆలయాలు. మేము వెళ్ళే సమయానికి పూజారి లేడు . కాకపోతే ఆలయం తలుపులు తీసి ఉన్నాయి. కాని ఇనుప సువ్వలతో చేసిన జాలి వేసి ఉంది.. జాలి రంధ్రాల్లో నుంచి స్వామిని దర్శించుకున్నాము. స్వామీ నిలువెత్తు విగ్రహాన్ని చూడగానే ఏదో ఆధ్యాత్మిక భావన. శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసునికి ప్రణమిల్లి ముఖ మండపంలో కూర్చున్నాము. ఇంతలో ఆలయ కాపలాదారు వేడి వేడి కాఫీ అందించారు. అప్పటికి అదే ప్రసాదం అనుకొని ..హాయిగా సేవించాం.

చెప్పడం మరిచాను .. ఆర్చ్ నుంచి లోనికి వచ్చేప్పుడు ఎడమ వైపున ఒక గది ఉంది. అది కాపలా దారుని కోసం నిర్మించింది. కాస్త ముందుకెళితే ఒక పాక. అది నిర్మాణంలో ఉన్న గోశాల అని చాడు కాపలా దారు. ఇంకా కొద్దిగా ముందుకు వెళ్ళాక ఒక కళ్యాణ మండపోం నిర్మాణంలో ఉంది. ఇక ఆర్చి నుంచి లోనికి వచ్చేప్పుడు.. కుడివైపున ఒక పార్కు. పిల్లలు ఆడుకోడానివీలుగా… ఇక పార్క్ కు వెంక భాగంలో విశాలమిన్ స్థలం. అందులో ఒక అందమైన ఇల్లు.. గుడి లోంచే అందులోకి వెళ్లేందుకు మార్ఘం ఉంది.. అది ఐఎఎస్ అధికారి గెస్ట్ హౌస్ అని చెప్పాడు. మాకు సహాయం చేసేందుకు వచ్చిన వ్యక్తీ. మేము గుడికి వస్తున్నామని తెలిసి బుర్రా వెంకటేశం గారు అతన్ని మాకు తోడుకోసం పురమాయించారు. . సదరు అధికారి చిన్నప్పుడు ఇక్కడే పెరిగాడా అని ఆరాతీస్తే.. ఆ స్థలం సారు చిన్నప్పుడు ఆడుకున్న పొలాలు. గుడికోసం అక్కడ దాదాపు ముడు ఎకరాలు సేకరించి గుడితో పాటు గెస్ట్ హౌస్ కట్టుకున్నారన్న మాట. ఈ విషయం తెలియడంతో బుర్రా వెంకటేశం గారు పుట్టిపెరిగిన ఇల్లు చూడాలన్న ఆత్రుత. మాకు సాయం చేసేందుకు వచ్చిన వ్యక్తి ఊరిలో ఉన్న సార్ ఇంటికి తీకేళ్ళా రు.

ఇంటితో పాటు ఊరు చుదోచ్చన్న ఆలోచనతో కారును గ్రామపంచాయతి ఆఫీసు వద్దకు తీసుకు రమ్మని మల్లేష్ కు చెప్పి.. నడుచుకుంటూ బుర్రా వెంకటేశం గారు పుట్టిపెరిగిన ఇంటికి వెళ్ళాము.. మేము వెళ్ళిన దారి ఎక్కువగా చిన్న చిన్న సందులు. బుర్రా వెంకటేశం గారి ఇల్లు న్ముదర్రాలు ఉంది అయితే దాన్ని మోడిఫై చేశారు. ఇంటిముందు రేకులతో వసార.. లోనికి వెళితే ఎవరయినా వస్తే కూర్చునేందుకు హాలు.. దానికి వెనకాల వంట గది.. పక్కనే బెడ్ రూం ..బొత్ రూ కూడా కలిప[ఐ ఉంది.. బొత్ రూం ముందు డ్రెస్సింగ్ రూం.. ఇదంతా వింటుంటే ఒక భవనం లా అనిపిస్తది. కాని ముడు అర్రాల విస్తీర్ణం లోనే చాలా పొందికగా తల్లి కోసం నిర్మించారు. ఇంటి ముందు బాతుంది పైకి వెళ్లేందుకు.. ఇంటి ముందు మాత్రం చెలక ఉంది, అందులో రెండు చింత మానులు ఉన్నాయి. ఎదయినా ఫంక్షన్ జరిగోఇతే చెట్ల కింద శుబ్రం చేసి ..షామియానాలు వేస్తే ఒక వందమందికి ఒకేసారి భోజనం వద్దిన్చెంత ఖాళి స్థలం అది. బుర్రా వెంకటేశం గారి ఇల్లు చూసి బయటకు రాగానే ఇల్లు కుడివైపున ఉన్న వాళ్ళ దాయాదుల ఇల్లు చూసాము. ఇక్కడ చెప్పుకోవాల్సిన ముఖ్య విషయం ఉంది. ఎందుకంటే తస్న పెళ్ళయిన దగ్గర నుంచి, కొడుకు పెరిగి పెద్దయ్యే వరకు ఉన్న మూడు అర్రల మిద్దెను వదిలి విశాలమైన ఇంట్లోకి కొడుకుతో పాటు వెళ్లేందుకు తల్లికి ఇష్టం లేదు. అందుకే తల్లి కోసం గెస్ట్ హౌస్ కట్టించినా.. తాను పుట్టిపెరిగిన ఇంటిని తల్లి కోసం మోడిఫై చేయిన్చారు బుర్రా వెంకటేశం గారు. అంతే కాదు తాను ఐఎఎస్ అధికారి అయినప్పటికీ ఊరికి వస్తే ఆ చిన్న ఇంటిలోనే తల్లి తోపాటు భోజనం చేసేవాడట… ఢిల్లీ కి రాజయినా ఆ తల్లి కొడుకే కదా.

బుర్రా వెంకటేశం గారి ఇల్లు చూశాక ఆయన చదువుకున్న బడి చూడాలని ఆకాంక్ష. కారు దగ్గరకు వెళ్లి అందులో బడి వద్దకు వెళ్ళాము. ఆ రోజు బడికి సెలవి. బుర్రా వెంకటేశం గారు చదివినప్పుడు అది ప్రాధమికోన్నత పాత శాల. ఇప్పుడు ఉన్నత పాటశాల. ఇపుడు బిల్డింగులు బాగానే ఉన్నాయి.. అప్పట్లో మాత్రం ఒకే బిల్డింగ్.. బుర్రా వెంకటేశం గారు అక్కడ ఐదు వరకే చదివారు. ఆ తర్వాత ఆరు నుంచి సర్వేలు గురుకులంలో చదివారు.. అదే ఆయన జీవితాన్ని మార్చేసింది. మాకు సాయం చేసేందుకు వచ్చిన వ్యక్తీ చెప్పే కొన్ని విషయాలు విన్నాక పల్లెటూరి కబుర్లు తెలుసు కోవాలన్న ఉత్సుకతను నాలో పెంచాయి.. అంతే మాకు హెల్ప్ చేసేందుకు వచ్చిన వ్యక్తికీ చెప్పి అరవై ఎండ్ల వయసున్న వ్యక్తితో మాట్లాడుతాను ఎవరైనా ఉంటె పిలిపించమని అడిగాను. అతను సరే అని ఒక అరవై యేండ్ల పెద్దమ్మను బడి దగ్గరకు తీసుకోచ్చాడు .
ఆమె వచ్చే వరకు నేను తరగది ముందున్న అరుగు మీద కూర్చొన్నా.. ఆ పెద్దమనిషిని చూసి ..పెద్దమ్మా దా ..అంటూ పిలిచా. ఆమె ఎలాంటి అరమరికలు లేకుండా వచ్చి నా పక్కన కూర్చుంది. ఆమె చెప్పిన దాని ప్రకారం ఆమెది పుట్టిన ఊరు అది కాదు. పదవ ఏట పెళ్ళయి అత్తగారింటికి వచ్చింది. అంటే ఓబుల కేశవాప్పురంతో పెద్దమ్మ అనుబందం యాబై ఏళ్లు. ఆమె యాబై ఏళ్లుగా ఆ గ్రామంలో జరిగిన సంఘటనలు పూసగుచ్చి నట్లు చెబుతోంది. నేనే కాదు మా మిత్రులు కూడా ఆశ్చర్యంగా వింటున్నారు.

ఆ రోజుల్లో బాల్య వివాహాలు ఎక్కువ. అందుకు పెద్దమ్మే సాక్ష్యం. ఇక గ్రామాల్లో పెళ్ళిళ్ళు పెరంటాల్లప్పుడు తప్ప పెద్దగ కు;లం పట్టింపులు లేవు. పైగా చిన్న పెద్ద అని లేకుండా వరసలు పెట్టి పిలుచుకోవడం వళ్ళ ప్రజల మధ్య వారికే తెలియకుండా ఆత్మీయతతో కూడుకున్న అనుబంధం ఉండేది. అక్క , చెల్లి, చిన్నమ్మ, పెద్దమ్మ , మామయ్య, చిన్నాన్న, పెద్దమ్మ ,ఇలా వరుసలు పెట్టి పిలిచుకోవడం మూలంగా ఊరంతా ఉమ్మడి కుటుంబంలా అనిపిస్తుంది . అంతెందుకు నేను ఆ పెద్ద మనిషి పేరు అడగలేదు. పెద్దమ్మ అని పిలువగానే వచ్చి సాంత్కొడుకు;లా నేను అడిగిన ప్రతి ప్రశ్నకు ముందు, వెనుక ఆలోచించకుండా సమామాదానాలు చెప్పింది. అప్పట్లో జానపదులు మనస్సుల్లో కల్మషం ఉండేది కాదు. ఆ పిల్లోడయితే చిన్నప్పుడు ఎలా పలుకరించేవాడో..ఇప్పుడు కలెక్టరు అయ్యాక కూడా అంతే అప్యాయంగా పలుకరిస్తాదంటు… బుర్రా వెంకటేశం, ఐఎఎస్ గారి గురించి చెప్పిన తీరు అందుకు అద్దం పడుతోంది. యాబై ఏళ్ళ క్రితం ఊరిగురించి, ఊళ్ళల్లో జరిగే పండుగలు , శుభకార్యాలు, వ్యక్తుల గురించి పెద్దమ్మ చెబుతుంటే చెవులు రిక్కించి వినడం మా వంతయింది.
_**

November 24, 2025 3 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

84 వేల మంది మునులున్న నైమిశారణ్యం ఎక్కడుంది ? విశిష్టత ఏమిటి !?

by కావ్యసుధ (ఆర్. హరిశంకర్) November 24, 2025
written by కావ్యసుధ (ఆర్. హరిశంకర్)

మనకు శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ నైమిశారణ్యములో సూత మహర్షి శౌనకాది మునులందరికీ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత మహత్యం చెప్పినట్లుగా చెబుతారు. ఈ విషయం మనం విన్నదే ! మనకు తెలిసిందే ! ఈ నైమిశారణ్యం ఎక్కడుంది ? నైమిశారణ్యం విశిష్టత ఏమిటి ? ఈ వ్యాసంలో తెలుసుకుందాం !!

నైమిశారణ్యంలోనే మహాభారతాన్ని రచించినట్టు తెలుస్తోంది. మహా భారతం, రామాయణం, వాయుపురాణం, వరాహపురాణాల్లో నైమిశారణ్య ప్రస్తావన ఉంది. వేదవ్యాసుడు వేదాలను, అన్ని పురాణాలను తన శిష్యులకు బోధించిన పరమ పావన ప్రదేశం నైమిశారణ్యం.

నైమిశారణ్యం వైష్ణవ దివ్యదేశాలులో ఒకటి. ఇక్కడ వనరూపిగా నున్న స్వామికే ఆరాధన జరుగుతుంది. ఆళ్వార్లు కీర్తించిన సన్నిధిగాని పెరుమాళ్ళు గాని ఇక్కడ లేవు. నైమిశారణ్యం ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ జిల్లాలో లక్నోకు 94కి.మీ. దూరంలో ఉంది. గోమతి నది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం వేలాది సాధు సన్యాసులు తపమాచరించే పవిత్ర ప్రదేశం.

నైమిశారణ్యం చరిత్ర

ఆదిలోకంలో లోకహితార్ధమై బ్రహ్మమనోమయమగు నొక చక్రమును గల్పించెను. ఆ చక్రమును సత్యలోకమునుండి దొర్లించెను. (నేమి అంటే బండి చక్రపు కమ్మి అని అర్ధం) ఆ చక్రము దొర్లి దొర్లి అన్ని లోకములు దాటి భూలోకమునందు వ్రాలెను. అమిత వేగమున వచ్చి వచ్చి భూమిట్ట పల్లములలో చక్రముకమ్మి విచ్చి పోయిన ప్రదేశములో “నైమిశ” మయ్యెను . ఆ ప్రదేశములోని వనము గూడ నైమిశారణ్యమయ్యెను.

వాయు పురాణాన్ని అనుసరించి దీనికి సంబంధించిన ఒక గాథ ప్రాచుర్యంలో ఉంది. మహాభారత యుద్ధం అనంతరం కలియుగ ఆరంభం అయే సమయంలో శౌనకాది మహామునులు కలియుగ ప్రభావం లేని పవిత్ర ప్రదేశాన్ని తాము యజ్ఞం నిర్వర్తించుకునేందుకు చూపమని బ్రహ్మను ప్రార్థిస్తారు. బ్రహ్మ ఒక పెద్ద చక్రాన్ని సృష్టించి ఈ చక్రం వెంట కదిలివెళ్ళండి ఈ మనోమాయా చక్రం ఏ ప్రదేశంలో ఆగి విరిగిపోతుందో ఆ ప్రదేశం చాలా పవిత్రమైనది, యజ్ఞర్హత గలది అని చెబుతాడు. మునులంతా చక్రాన్ని అనుసరించి వెళ్ళగా ఈ నైమిశారణ్య ప్రాంతంలో ఒకచోట చక్రం ఆగి విరిగిపోతుంది. చక్రం విరిగిన ప్రదేశంలో ఉదృత రూపంలో జలం ఉద్భవించి లింగాకృతిలో పొంగిప్రవహిస్తుంది. మహాశక్తి ఆ ప్రవాహాన్ని ఆపివేస్తుంది. ఈ పవిత్ర ప్రాంతం శక్తిపీఠంగా రూపొంది లింగధారిణి శక్తి రూపం అయిన లలితా దేవి ఆలయంగా పేరుగాం చింది. చక్రం ఆగిన ప్రదేశం చక్రతీర్థం అయింది.’నిమి’ అంటే చక్రకైవారం, అరణ్యం – అడవి. చక్రం విరిగిన అరణ్యం కనుక నైమి శారణ్యంగా పేరుగాంచింది. వరాహ పురాణం ప్రకారం లిప్త కాలంలో విష్ణువు అసురు లను ఈ ప్రాంతంలో సం హరిస్తాడు. నిమి (లిప్త) అంటే సెకండులో అసురుల్ని సంహరించిన ఈ అరణ్యం నైమిశారణ్యంగా పేరొందినదని పేర్కొన బడింది. ఇక్కడే వ్యాస పీఠం, దధీచి కుండం ఉన్నాయి. శ్రీ ఆదిశంకరులు ఇక్కడి లలితాదేవిని దర్శించి ‘లలితా పంచకాన్ని’ రచించినట్టు చెబుతారు.

వేల సంవత్సరాలు ఋషులు, మునులు తపస్సు చేసిన తపోవనం ఇది. పరమ పవిత్ర దివ్య ప్రదేశం నైమిశారణ్యం. చక్రతీర్థం ఒడ్డున చక్రత్తాళ్వారు, వినాయక, శ్రీరామ లక్ష్మణ సీతా ఆలయాలు ఉన్నాయి.

గోముఖినది మార్గంలో వ్యాస ఘాట్ ఉంది. మరోవైపు శుకమహర్షి ఆలయం ఉంది. ఈ ఆలయానికి దగ్గరలో కొండపై ఆంజనేయ ఆలయం ఉంది.

నైమిశారణ్యం దివ్య దేశంలోని మూల విరాట్టు దేవరాజన్. శ్రీమన్నారాయణుడు. తూర్పుముఖంగా ఉన్న ఈ ఆలయం లోని అమ్మవారు పుండరీకవల్లిగా పూజలందుకుంటోంది. చక్రతీర్థం, గోముఖినది, సెమీతీర్థం, దివ్యవిశ్రాంత తీర్థాలలో స్నానం పవిత్రతను అందిస్తాయి.

శివపురాణంలో కూడా నైమిశారణ్య ప్రస్తావన ఉంది. అప్పటి పాంచాల, కోసల రాజ్యాల మధ్యన నైమిశారణ్యం ఉండేది. ఫాల్గుణ మాసంలో ఇక్కడ వైభవంగా ఉత్సవాలను నిర్వహి స్తారు. ఈ ఆలయం చుట్టుప్రక్కల పంచప్రయాగ, వ్యాసగడి, సూతగడి, చక్రతీర్థం, శ్రీహనుమగడి, పంచ పాండవ, శంకర మందిరాలు, వటవృక్షం, గోమతినది, దధీచి, సీతారామ ఆలయాలు ఉన్నాయి.

చక్రతీర్థం, శ్రీహనుమగడి, పంచ పాండవ,శంక మందిరాలు,వ్యాసగద్దె, సూతగద్దె, గోమతి నది, దేవరాజేశ్వరమందిరం, ఆనందమయి ఆశ్రమం, సేతుబంధరామేశ్వరం, దధీచి, సీతారామ మొదలైనవి ఉన్నాయి.రుద్రావర్తము అని ఒక ప్రదేశం ఉంది. అక్కడ నీటిలో పాలు అభిషేకిస్తే ఆ పాలు నీటిలో కలవకుండా క్రిందకువెళ్ళిపోతాయని విశ్వసిస్తున్నారు. ఆ అడుగున శివమూర్తి ఉంది.
నైమిశారణ్యం,విశేషాలు, విశిష్టతలు
నైమిశారణ్యములో వర్ణించబడిన చెట్లు, వృక్షాలు, లతలు. సరళ,తెల్ల తెగడ, కొండగోగు,ఉమ్మెత్త, దేవదారు, చండ్ర, మామిడి, నేరేడు, వెలగ, మర్రి, రావి, పారిజాత, చమ్దన, అగరు, నకుల (పొగడ),ఏడాకుల పొన్న సప్తవర్ణ , పునాగ, సురపొన్న, నాగకేసర నాగకింజల్కము నాగకేసర , శాల,తాటి, తమాలము (చీకటిమాను), మద్ది, చంపక సంపెంగ.

నైమిశారణ్యం ఆలయం ఎనిమిది స్వయంవ్యక ఆలయాలలో ఒకటి. శ్రీరంగం, శ్రీముష్ణం, సాలగ్రామం, తోతాద్రి, తిరుమల, పుష్కరం, బద్రి, నైమిశారణ్యం ఇవి స్వయంవ్యక్త ఆలయాలుగా పేరుగాంచాయి.నైమిశారణ్యం తొమ్మిది తపోవనాల్లో ఒకటి. దండకారణ్యం,సైంధవారణ్యం, జంబుకారణ్యం,
పుష్కరారణ్యం, ఉత్పలారణ్యం, బదిరికారణ్యం, జంగాలారణ్యం, అరు పుత్తరణ్యం, నైమిశారణ్యం ఇవి తొమ్మిది తపోవనాలు. గయ క్షేత్రం చరణ గయగా, బద్రిశిరోగయ, నైమిశారణ్యం నాభిగయగా పేరుగాంచాయి. ఇక్కడ ఉన్న గోమతినదీ స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు.

ఇక్కడక మిశ్రిక్ అనే ప్రాంతంలో దధీచి కుండం ఉంది. ఇంద్రుని కోరికపై వృత్రాసురుణ్ని వధించేందుకు మహర్షి దధీచి ఈ కుండంలో స్నానం చేసి తన ఎముకలను వజ్రాయుధంగా మలచి ఇంద్రునికి సమర్పించి త్యాగజీవి అయ్యడు.

శ్రీరాముడు….

శ్రీ రాముడు అశ్వమేధ యాగం చేసినదీ. లవకుశులను కలుసుకున్నది ఇక్కడే. సీతాదేవి పేరున శ్రీరాముడు బ్రాహ్మణులకు దానం చేసిన గ్రామమే నేటి ‘సీతాపురం’ అని అంటారు. శుక్రాచార్యుల వారి ద్వారా ఈ క్షేత్ర పవిత్రత గురించి తెలుసుకున్న ప్రహ్లాదుడు, ఇక్కడి తీర్థాలను దర్శించినట్టు చెబుతారు. అరణ్యములో దాదాపు 84 వేల మంది ముళ్ళతో షాపు నక్క మహర్షి సమావేశమై తొలిసారి భాగవత పారాయణం చేసింది ఇక్కడే. ఏదైనా చూడు మహాభారత కథలు మొదట తన కుమారుడు శుభ మహర్షికి ఇక్కడే చెప్పాడు శిష్యుడైన వైశంపాయనుడు ఇక్కడే ఓ మహాయాగం నిర్వహించి మహాభారత పారాయణం చేశాడు. వర్షం పాయనుడు చెప్పిన కథను చూతుడు మరోసారి శ్రవణ కాదు మురళి అందరికీ ఇక్కడే చెప్పాడు. ఇలా ఎంతో ప్రాముఖ్యత ఉన్న అరణ్యం ఇది ఇక్కడ వ్యాస మహర్షి ఆశ్రమం ఉన్నది.

అని అంటారు. శుక్రాచార్యుల వారి ద్వారా ఈ క్షేత్ర పవిత్రత గురించి తెలుసుకున్న ప్రహ్లాదుడు, ఇక్కడి తీర్థాలను దర్శించినట్టు చెబుతారు. ఇక శౌనకాది మహర్షులకు సూతమహాముని మహాభారత కథను తొలిసారిగా వినిపించినది ఇక్కడే !

ఇది ఋషులు నివసించిన ధ్యానం చేసిన మరియు వారి సాధన చేసిన అరణ్యం ఇది తపో భూమి లేదా ధ్యానం చేసిన భూమి. ఈ ప్రాంతంలో వారు కేంద్రీకరించిన సామూహిక శక్తి నైమిశారణాయను భారతీయ ప్రదేశాలలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. నైమిశారణ, నైమిష్, అని కూడా పిలుస్తారు. నాలుగు యుగాలలో నాలుగో ప్రాథమిక తీర్థాలు లేదా తీర్థయాత్రలు ఉండేవని చెబుతారు మొదటి యుగంలో అంటే సతయోగంలో నైమిశారణ్యం త్రేతా యుగములో పుష్కరం, ద్వాపరలో కురుక్షేత్రం, కలియుగంలో గంగానది ఉన్నాయి. ఆడవి ఇప్పుడు లేదు. చక్కగా చదును చేయబడిన రోడ్లు. యాత్ర స్థలంగా మార్చారు.

November 24, 2025 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

ద్వేష ఖననం

by Dr. Thanda Harish November 24, 2025
written by Dr. Thanda Harish

అసూయ ఆమడదూరంలో కూర్చుంటుంది
ద్వేషం అతడి దేహంలో బతకలేక
ఖాళీ చేసి వెళ్ళిపోతుంది
శేషాల లెక్కల్లో
శత్రువుల సంఖ్య సున్నా

కవికో కవితావాక్యాన్నిచ్చే మంచితనం
అతడిలో ప్రసరిస్తున్నందుకేమో
చంద్రుడు తలపాగా మీద వెలుగుతుంటాడు
ప్రియమైన పాటలన్నీ చెవులను ముద్దాడుతుంటాయి
మసకచీకట్లే టార్చ్ లైట్లయి ఎదురొస్తాయి
చిరు చిరు జల్లులు
పూలలా మీద కురుస్తాయి
చురకలు పెట్టిన చేతులే
లేపనాన్ని పూస్తాయి

అహం కొలతలు తగ్గించబడి
దూరాలు దగ్గరగా నిలుచున్నప్పుడే
నిజమైన ప్రేమ..గుండెలను చీల్చుతూ
బయటికొస్తుంది

సన్నని గీతలను చెరిపేసినందుకో
అంతరాలను ఖననం చేసినందుకో
పగ, ప్రతీకారాలను కనబడకుండా ఊడ్చేసినందుకో
జీవన లయాన్విత చందమామకు
గోరుముద్దలు తినిపిస్తూ
ఆ కాంతుల్లో మెరిసిపోతున్న
ఆనందకర దృశ్యాల్లోనే
అతనిప్పుడు తడిసిపోతున్నాడు

November 24, 2025 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కరీంనగర్ జిల్లాలోని ఎలగందుల కోట చరిత్ర

by కావ్యసుధ (ఆర్. హరిశంకర్) November 24, 2025
written by కావ్యసుధ (ఆర్. హరిశంకర్)

ఎలిగందుల గ్రామం పేరు వెనుక చరిత్ర

పూర్వం ఈ ఊరి పేరు బహుధాన్యానగరం. కాకతీయుల కాలం నుండి ఎలిగందులగా పిలవబడుతుంది.ఈ గ్రామం చుట్టు పక్కల పూర్వం తెల్ల కందులు ఎక్కువగా పండేవట. అలా తెల్లకందుల, ఎలగందులగా మారి పేరు స్థిరపడిందని చెబుతారు. తెల్లకందుల అన్న పేరు చింతామణి చెరువు వద్ద ఉన్న శాసనంలో స్పష్టంగా చెక్కబడి ఉంది.

గ్రామం చరిత్ర
కాకతీయుల కాలం నాటి సామంతుల పాలనలో వైభవాన్ని చాటుకుంది. నిమ్మల (నిర్మల్) పాలకుడు శ్రీనివాసరావు కాలంలో ఇది అతని అధీనంలో ఉండేది.
1754లో ఎలగందల్ కోటకు ధ్వంస అధిపతిగా ఉన్నప్పుడు నిజాం నవాబు ఆసఫ్ జా ఆజ్ఞ మేరకు శ్రీనివాసరావును బంధించి అతను పాలకుడయ్యాడు.
1905 వరకు ఎలగందల్ జిల్లాకు రాజధానిగా ఉంది.1905లో రాజధాని కరీంనగరుకు మార్చి, జిల్లా పేరును కూడా కరీంనగర్ జిల్లాగా మార్చబడింది.

ఈ గ్రామం పూర్వం కాకతీయుల పాలనలోను, తరువాత ముస్లిం రాజుల పాలనలోను ఉన్నప్పటి చరిత్రాత్మక చిహ్నాలు ఇక్కడ ఉన్నాయి. ఎలగందల్ గ్రామం ఎంతో చారిత్రిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. పూర్వం ఐదు రాజవంశీయులు పరిపాలించారు. వారు కాకతీయులు, బహమనీ సుల్తానులు, కుతుబ్ షాహీలు, మొగలులు, ఆసఫ్ జాహీలు, ఎలగందల్లోని చారిత్రక ప్రదేశాల్లో శ్రీరామాలయం, నీలకంఠస్వామి ఆలయం, ఆలంగీరు మసీదు, నిజాముద్దేలా అసఫ్ జాహీ కూతురు మెహరున్నీసా ఖానుమ్ సమాధి మందిరం, అనేక ముల్లాలు, మౌల్వీల సమాధులు ముఖ్యమైనవి.

ఎలగందల్ కోట తెలంగాణ రాష్ట్రం, కరీంనగర్ జిల్లాలోని ఎలగందల్ గ్రామంలో ఉంది. కరీంనగర్కు 10 కిలోమీటర్ల దూరంలో సిరిసిల్ల జిల్లా రోడ్డు మార్గంలో మానేరు నదీతీరంలో అడివి మధ్య సుందర ప్రకృతిక నేపథ్యంలో ఉన్న ఈ కోట ఒకప్పుడు కుతుబ్ షాహీ వంశము, మొఘల్ సామ్రాజ్యం, హైదరాబాద్ నిజాం నియంత్రణలో ఉండేది. నిజాం పాలనలో ఈ కోట కరీంనగర్ కు ప్రధాన కార్యాలయంగా ఉండేది. కరీంనగర్ జిల్లాలో చారిత్రకంగా ఈ ప్రదేశం అయిదు సామ్రాజ్యాల చేత పాలించబడింది. పురాతన జ్ఞాపక చిహ్నాలు కొండశిఖరాన ఉన్న కోట, తూర్పు ద్వారానికి వెలుపల ఉన్న బృందావన సరసు 1774 ఎ డి ఫాఫర్ -ఉద్-దౌలా చేత నిర్మించబడింది.
ముస్లిమ్ సన్యాసులైన సైయద్ షాహ్ మునావర్ క్వాద్రి సాహెబ్, దూలా షాహ్ సాహెబ్, సయద్ మరూఫ్ సాహెబ్, షాహ్ తాలిబ్ బిస్మిల్లా సాహెబ్, వాలి హైదర్ సాహెబ్ సమాధులు కదిలించినప్పుడు అక్కడ ఉన్న మినార్లు ఉఉగుతాయి. ఉన్నత పాఠశాల వద్ద మరోరెండు మీనార్లు ఉన్నాయి. ఈ మీనార్లు ఎక్కడానికి లోపలి నుండి మెట్లు ఉన్నాయి.

కరీంనగర్-వేములవాడ రహదారిలో ఎలగందల్ కోట నుండి మానకొండూరు వరకు 9 కిలోమీటర్లు మేర రహస్య సొరంగం ఉందని నమ్ముతారు.

చరిత్ర
ఎలగందల్ కోటను వెలగందుల అని కూడా పిలుస్తారు. దీనిని కాకతీయుల (1083-1323) కాలంలో నిర్మించారు. యోధులైన ముసునూరి నాయక్, రాచర్ల పద్మనాయక్ లు దీనిని దృఢంగా చేశారు. 16వ శతాబ్దంలో కుతుబ్ షాహి వంశస్థులు ఈ కోటను ఆక్రమించుకొని, క్యుయినముల్ ఉల్ ను కమాండర్ గా నియమించారు. తదనంతరం, మొఘల్ సామ్రాజ్య ఆధీనంలోకి వెళ్లింది. హైదరాబాద్ నిజాం ఉల్ ముల్క్ నిజాం అసఫ్లాహ్ (1724-1748), ముగర్రాబ్ ఖాన్ హయాంలలో, అమిన్ ఖాన్ ఎలగందల్ కు ఖిలేదార్ గా నియమించబడ్డాడు. నవాబ్ సలాబత్ జంగ్ హయాంలో మిర్జా ఇబ్రహీం దంసా ఖిలేదార్ అయ్యాడు. సికందర్ ఝా (1803-1823) హయాంలో 1754 లో దంసా ఈ కోటను పునర్నిర్మాణం చేశాడు. బహదూర్ ఖాన్, కరీముద్దీన్ లు తరువాతికాలంలో ఖిలేదార్లుగా పనిచేశారు. కరీముద్దీన్ పేరుమీద కరీంనగర్ గా మారింది. 1905 లో జిల్లాల పునర్వ్యవస్థీకరణ సందర్భంగా, ఆరవ నిజాం మహాబుబ్ అలీ ఖాన్ జిల్లా కేంద్రాన్ని ఎలగందల్ నుండి కరీంనగర్ కి మార్చారు.

శత్రువుల నుండి దాడులను నిరోధించడానికి ఎలగందల్ పాలకులు కోట చుట్టూ సుమారు 5 మీటర్లు వెడల్పు, 4 మీటర్లు లోతైన నీటి కందకాన్ని ఏర్పాటుచేసి అందులో మొసళ్లను వదిలేవారు. ఈద్ ప్రార్ధనల కొరకు ప్రత్యేక మసీదును కూడా ఈ కోటలో నిర్మించారు.
కొండమీది కోటను ఎలగందల్ కోట అంటారు ఇది ఒక చారిత్రక ప్రదేశం. దోమినార్ దోమినర్ను ముస్లిం మతం రాజులు అంటే నిజాం రాజులచే నిర్మించారు ఇది చార్మినార్ స్తంభాల ఎత్తున 2 పొడవైన స్తంభాలతో ఉంటుంది.

ఎలగందల్ కోట చరిత్ర
ఎలగందల్లో ఓ పురాతనమైన కోట అంటే కిల్లా ఉంది ఈ మధ్యనే తెలంగాణ పర్యాటక శాఖ వారు దీనిని పర్యాటక స్థలంగా గుర్తించారు ఎత్తైన కోట గోడలు అగర్తలు బలమైన చెక్క తలుపులు , వంకర దారులు రాజ దర్బారు కలిగిన మసీదులతో ఈ ఖిల్లా అలరారుతుంది టర్కీ ఫంచి ఇంజనీర్ల ప్రభావం వల్ల ఈ కోట అనేక విషయాల్లో మధ్యయుగపు ఐరోపా ఖండపు కోటలతో పోలివుంది ఈ గిరి దుర్గాన్ని తొలుత కాకతీయులు కట్టించారు 1195లో ప్రసిద్ధ యాదవ వంశపు రాజు జైతుగి ఎలగందుల కోటను పశపరచుకున్నాడు. 1345 నుండి 1439 వరకు బహుమనీ సుల్తాన్ లో పాలనలో ఉంది. మొఘల్లులో ప్రత్యక్షంగా 39 సంవత్సరాలపాటు పాలించారు. కరీంనగర్ గ్రామాన్ని స్థాపించిన సయ్యద్ కరీముద్దీన్ ఎలగందుల్ కోటకు ఖిలాదారుగా పనిచేశారు., 1905 వరకు జిల్లా యొక్క పాలన యంత్రాంగమంతా ఎలాగందలు కోట నుండి కేంద్రీకృతమై ఉండేది.
మానేరు నది తీరంలో తాటి చెట్ల మధ్య సుందర ప్రకృతిక నేపథ్యంలో ఎలగందలు కోట నిర్మించబడి. కోటకు ఒకవైపు మానేరు నది,మరొకవైపు ఎలగందల్ గ్రామం ఉన్నాయి. ఇక్కడనుండి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానకోడూరు గ్రామానికి సురంగ మార్గం ఉన్నదని ప్రతీతి. కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన ఈ గిరిదుర్గం ఆ తర్వాత బహుమనీల,కుతుబ్షాహీలు, ఇమాత్ షాలు, అసఫ్ జహీల పాలనలో జిల్లా యొక్క రాజకీయాలకు కేంద్ర బిందువు అయింది. పురాతన జ్ఞాపక చిహ్నాలు కొండ శిఖరాల ఉన్న కోట తూర్పు ద్వారానికి వెలుపల ఉన్న బృందావన్ సరస్సు 1774లో జాఫర్ ఉద్దవుల చేత నిర్మించబడింది. ముస్లిం సన్యాసులైన సయ్యద్ షా మునావర్ ఖాద్రి సాహెబ్ దూల షాహ్ సాహెబ్, సయ్యద్ మారుస్ సాహెబ్, షాహ్ తాలిబ్, వలి హైదర్ సాహెబ్ల సమాధులు కదిలించినప్పుడు అక్కడ ఉన్న మినార్లు ఊగుతాయి. ఈ మినార్లు ఎక్కడానికి లోపలికి నుండి మెట్లు ఉన్నాయి. ఈ గ్రామంలోనే ఇంకో చివర దోమినార్ అనే కట్టడం ఉంది ఇది ముస్లింలు పండుగ రోజుల్లో ప్రార్థన చేసి ఈద్గా దీనిని బహుమనీ సుల్తానులు నిర్మించారు దీని పైకి వెళ్లడానికి కూడా లోపల నుండి మెట్లు ఉన్నాయి. ఇది ఒక పర్యాటక చారిత్రక ప్రదేశం.

November 24, 2025 3 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

పండువెన్నెల పలుకు

by రూపాదేవి November 24, 2025
written by రూపాదేవి

సినీ వినీలాకాశ వీధిలో
అందాల కోకిలమ్మ
మా సుశీలమ్మ కు
పుట్టిన రోజు శుభాకాంక్షలు.

గాత్ర శుద్ధతకు, వాక్ స్పష్టతకు
మా సుశీలమ్మ నిలువెత్తు రూపం!
అమ్మ స్వరం తేనె
అమ్మ అక్షరం వెన్నె
అమ్మ ఉచ్చారణ చెక్కిన శిల్పం
బ్లర్ ఉండని high filter కంఠం
అమ్మ పాట వింటే
అలసట పోతుంది
అమ్మ పాట పాడుకుంటే
ఉత్సాహం నిండుతుంది
అందాల మోము
పసిపాప నవ్వు
పండువెన్నెల పలుకు
కనులకు చెవులకు ఇంపు

November 24, 2025 2 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

దళిత సాహిత్య కేతనం

by Vemula Ellaiah November 24, 2025
written by Vemula Ellaiah

“బేగరి కథలు, దగ్ధం కథలు, మా పల్లె కథలు, బుగాడ కథలూ వంటి కథలను, మాలచువమ్మ , ఇగురం వంటి నవలలను, కులాత్కమ్ నాటకాన్ని , మారవారి చరిత్ర నూ రచించి అస్తిత్వానికి చిహ్నమైన రచయితగా ప్రసిద్ది పొందిన కవి, రచయిత భూతం ముత్యాలు సాహిత్య ప్రస్తానాన్ని మయూఖ పత్రిక ముఖాముఖి లో తెలుసుకుందాం….

01. కవి రచయిత ఏమిచెప్పిండు అనేది వస్తువు, ఎట్లచెప్పిండు అనేది శిల్నమౌతుంది. ఎందుకు చెప్పిండుధృక్పధంఅయితది. అందరికి తెలిసిందేగదా మీ రచన మూల సూత్రం చెప్పండి ?

జ:కథా, కథన, శిల్ప, ధృక్పదం గూర్చి మీ ప్రశ్నలోనే సమాధానముందు. ఇక నా రచనలకు మూల సూత్రం అంటారా? అది ఊరిలోని దళిత వాడ జీవితం, వాడ జీవితాలను దగ్గరగా చూసి, స్వీయనుభవంతో, రచనలు చేస్తున్న నారచనలకు మూలాలు వాడ బతుకు చిత్రమే. మట్టి మనుషుల వెతలు, ఆకలి, అంటరానితనం, నిరక్షరాస్యత, మూఢనమ్మకాలు, నిరుద్యోగంతో కునారిల్లుతున్న దళితులే నా (ఇన్స్పిరేషన్ప్రేరకులు), అందునా నేను ఒక దళితుడను కావడం, నా బాల్యం నుంచి పైన చెప్పిన అంశాలు నన్ను ఏదో ఒక సందర్భంలో పీడనకు గురిచేశాయి. నా మూలాల్లోకి నేను తొంగి చూసి నిజాల్ని నిర్భయంగా నికార్సుగా చెప్పే ప్రయత్నం చేశా…., చేస్తూనే వుంటా….

02. తెలుగు సాహితీ లోకంలో దళిత సాహిత్యం ఆగిపోయింది, ఆరిపోయింది అనిబుకాయిస్తు, మనువాదులకు సవాల్ వినురుతూనల్లగొండ కేంద్రంగా దళిత సాహిత్య సదస్సు 2002న మీరు ” బర్రె ” అనే కవిత చదివిండ్రూ, ఆ ప్రవేశం మీకు ఎటువంటి అనుభూతి నిచ్చింది. చెప్పండి?

జ:మీరన్న దాంట్లో కొంత నిజముంది. నేను 2000సంవత్సరం లో తెలుగు సాహిత్యంలోకి అడిగిడే నాటికి దళిత సాహిత్యంలో కొంత స్తబ్దత ఏర్పడింది కాని పూర్తిగా ఆగిపోలే, ఆరిపోలే… దళిత సాహిత్యం ” నివురుగప్పిన నిప్పులా “.చాపకిందనీరులాప్రవహిస్తు ” నాలాంటి వారి మస్తిష్కాలలో నిక్షితమైంది. 2002లో నల్గొండలో దళిత సాహిత్య సదస్సు జరిగింది. ఆ వేదిక నాతోటివర్తమాన కవులకు దిశానిర్దేశం చేసింది. అలా నా అస్తిత్వ ములాల్లోకి వెళ్ళాను. గోవును పవిత్రంగా భావించి పూజించే సంస్కృతి అగ్రవర్ణాలది. దాని కంటే ఎక్కువ శ్రమజేసి ఎక్కువ పాలు ఇచ్చె బర్రె, తన సలుపు రంగు వర్ణం కారణంగా వివక్షకు గురైంది. అందుకే దానిని నా జాతికి చిహ్నంగా భావించి” బర్రె కవిత రాశా. వివక్ష మనుషులోనే కాదు జంతువులలో ఉంది. అనేది నిజం… ఆ కోణంలో వచ్చిందే ” బర్రె” కవిత….

03. దళిత కవిత్వ ప్రస్థానంల మీరూ “ దుగిలి దీపం వెలిగించిండ్రూ, అది ఎట్ల సాధ్యమైంది చెప్పండి? కవిత్వం తెచ్చిండ్రు సాహిత్యమనే దుగిట్ల

జ:స్థబ్దత కాలంలో దళిత సాహిత్య సదస్సు నాకు దిశానిర్దేశం చేయగా, అంతకు ముందు నేను భావవాద, అభ్యుదయవాదం, ప్రణయ కవితల ఊహాల్లోతేలియడే నాకు వేముల ఎల్లయ్య (కక్క నవలాకారుడి) సూచనలు నన్ను ప్రభావితం చేసిదళితవాదంవైపు మళ్లించాయి. ” పాయిదా” (గుడిపాటి వ్యాసాలు) కూడ నాలో నూతన జవసత్యాలు నింపాయి. నేను చేయాల్సింది, రాయాల్సింది నా మూలాల్లోకి వెళ్లి శోధన చేశా.. అందుకు ” ఏడుతరాలు ” నవల, బోయ జంగయ్య రచనలు అందుకు దోహదం చేశాయి. వాటికున్న శక్తి అటువంటిది. అలా మొదటదుగిలి ” దళిత కవిత్వం వెలువడింది.

04. నాగరికత అంటే ఆదివాసులు, దళితులది. కాని సంస్కృతి తెల్వని అగ్రవర్ణాలు సాహిత్యంలో బలవంతులెటైండ్రూ?

జ:నాగరికత చలనశీలమైంది. నిత్యం నూతన మార్పులు చోటుచేసుకుంటాయి. అది ఒకనాడు దళితుల, ఆదివాసలు, అయిన ఈ దేశ మూల వాసుల సోత్తు.అసలు ” సంస్కృతిని శ్రామికులు, కళాకారులు, శాస్త్రవేత్తలు నిర్మిస్తారని గోర్కి తన వ్యాసాలలో పేర్కొన్నారు”. అలా దళిత, ఆదివాసుల శ్రమతో నిర్మితమైన సంస్కృతి నేడు అగ్రవర్ణాల చెప్పుచేతుల్లోకి వెళ్లింది. ఒకనాడు శూద్రులు అయిన ఆధిపత్య కులాలు నేడు శాసనకర్తలైరి, సంస్కృతి పేరకల్చర్ని దళితులపై రుద్ది అదే దేశ సంస్కృతి అనిచలామనిచేస్తుండ్రు అగ్రవర్ణాలు, కాని ప్రతి జాతికి తమదైన చరిత్ర సంస్కృతి ఉందన్న విషయం మరవరాదు.

05. ప్రజా కవి రచయిత కడు బీదల వైపు ఉంటడు. మరి మీరు దళిత రచయిత ఎటువైపు ఉ ంటరు. మీ అభిప్రాయం చెప్పండి?

జ: నేను దళిత కవిని, ముందుగా దళిత పక్షం. పీడుతులు, అణచబడిన, అణగారిన, అట్టుడుగు వర్గాలు, అస్పృశ్యల జీవన సంవేదనలు. వారి ఇతిభాదలకు అక్షర రూపాలే నా రచనలు. నేను కథ రాసినా, నవల రాసినా అందులో వారే నా కథవస్తువులు, ప్రపంచంలోని ఏ కవి అయినా పీడిత జన పక్షంవైపు నిలవాలి. అలా నిలబడకుండా వారి జీవతాలను సృజించకుండా ఉండేకవి, రచయిత, రచయితగా మనలేదు. నేడు ప్రసిద్ధ కవులుగాపేరెన్నికగన్న కవులు  రచయితలు దళితుల జీవితాలను కథా వస్తువులుగా తీసుకొని దళిత స్పృహతో రచనలు చేసారుపేరుగడించారు శ్రీపాద పుల్లంరాజు కథ,లేదా ఉన్నవ లక్ష్మీనారాయణ మాలపల్లి నవల, కారా మాస్టారు యజ్ఞం కథ, పాలగుమ్మి పద్మరాజు గాలిగాన కథ ఆ కోవలోనివి.

06. మీలో ఉన్న అనుమానాన్ని నివృత్తి చేసే పని సాహిత్యమైతే నీ బతుకు ఆధారంగా రచయితగా ఎట్లఫీలైతున్నవూ నీ ఫిలాసఫిఏంది?

జ:నేను బాల్యం నుంచే పీడనకు, విపక్షకు, ఆకలి, కడుదారిద్య్రం, మూఢనమ్మకాల కు, గురైన బాధితున్ని, అందుకు ప్రధాన కారణం కులం. ఈ దేశంలో కులం ఉన్నంత వరకు వివక్ష ఉంటంది. అంబేద్కర్ఆశయమైన కుల నిర్మూలన ” జరగాలి. నేను ఎంచుకున్న పాత్రలతో రచయితగా సంతృప్తి ఉంది. కులాలు లేని -సమసమాజాన్ని కాంక్షించడమే నా ఫిలాసఫీ…

07. ఉత్పత్తి కులాల జీవితం కళాత్మకమైంది గదా! బేగరి కులం ధారువాతి దారుణమైన అవమానాన్ని ఎదురుకుంది దీనికి కారకులెవరంటురూ….?

జ: ఉత్పత్తి కులాలలో కళాత్మక సౌందర్యం ఉన్నప్పటికి అది శ్రమ నుంచి ఆవిర్భవించింది. ఇక బెగరికులాందైయనీయమైన జీవితం. మిగతా ఉత్పత్తి కులలకురోజువారి పని లభిస్తుంది. వారికి జీవనౌపాధి ఉ ంది. కుల వృత్తి ఉంది. కాని మాల బేగరికిఊరిలో ఎవరో ఒకరు చనిపోతేనే పని ఇది దుర్భరమైంది. ఇంతటి దర్భురమైన స్థితి ఏకులానికి లేదు. దీనికి ప్రధాన కారణం అగ్రవర్ణ ఆధిపత్య కుల వ్యవస్థ.

08. తొల్త మాల ఉపకులంబేగరి, మీరు బేగరి కథలు తెచ్చిండ్రు గా… నేపథ్యం చెప్పండ్రి?

జ:నామొదటి కథల సంపుటి “బేగరికథలు” (2007) ఇది తీసుకురావాడానికి 10 ఏళ్ళు పట్టింది. ఈ కథలకు ఆపేరు పెట్టడానికి నేను మాలబేగరి కావడమే. కులం కూడుపెట్టక పోవడంతో నిరక్షరాస్యులు అయినా నా తల్లిదండ్రులు హైదరాబాదుకు వలస వచ్చారు. అది 70వ దశకం, నాబాల్యంలో కొంత పట్నంలో గడిపిన. చిన్ననాటి నుండి నాకుంటుంబం పడిన కష్టాలు వర్ణణాతీతం. అవి పగవానికి కూడ రావద్దని కోరుతా. చదువులేని మూఢ నమ్మకాలు హెచ్చు. దానితో వారి కష్టం అంతా (సంపద) మంత్రతంత్రాలు చేసే భూత వైద్యుల పాలు అయ్యింది. ఆ సంఘటన తల్చుకుంటే దుఃఖం వస్తది. అ.. కులాన్ని, అ… వృత్తిని ఈసడించుకొని అందులో నుంచి బైటపడి కూలీ జీవనం సాగించడం కొంత మెరుగునిపించె అందుకే అస్తిత్వాన్ని తెల్పుతుబేగరి కథలు …

09. జీవిత అనుభవాన్ని అక్షరాలుగా వొంపిన మీరూ వర్ణనకు కారణం చెప్పండి?

జ:ఏదైనా కథ, నవల, కవిత చదివినప్పుడు అవి చదివే పాఠకున్ని, ఆకట్టుకోవాలంటే వర్ణనలు అవసరం. మన ప్రబంధకవులు, 18 రకాల వర్ణనలు పేర్కొన్నారు. ఈ రోజుల్లో ఎవరు ఏ రచన చేసినా (కథ, కవిత, నవల, నాటకం) కాసింత సింబలైజ్ చేసి చెబితే పాటకునిదరి చేరుతుంది. అందుకే చెప్పాలనుకున్నది సూటిగానే చెబుతూ దానికి అవసరం మేరకు కొంత వర్ణనాత్మకం జోడిస్తే పాఠకుల మతిలో నిల్సిపోతుంది. అందుకే నేనేకాదు అందరూ, అలా రచనలు చేస్తురు. కాని నేను వర్ణనకు పూనుకుంటే మట్టి పరిమాలలేవిరబూస్తాయి.

10. మీకు కొంత, చరిత్ర తెలుసు, స్థానిక దళిత యోధులను రాక్షసులుగా పురాణాలలో, ఇతిహసాల్లో చిత్రించిన చరిత్ర చెప్పండి?

జ:మనుషుల ప్రస్థావన రాక పూర్వం పురాణాల్లో దేవతలు రాక్షసులు, దాయాదులు(అన్నదమ్ములు), పక్షులు, జంతువులు ఈ నాలుగు సృష్టించినాక దాయాదుల పోరులో దేవత కుట్రలు కుయుక్తులతో ఆధిపత్యం దేవతల వశం అవుతుంది.తర్వాత మనిషి పుట్టక మానవకళ్యాణం లోకహితం జరగాలంటెముందుగాశివపార్వతులు కళ్యాణం జరగాలి, అటుతరువాత దేవతలు తమ కృత్యాలతోటి మోసాలు చేస్తేశపించబడిన దేవతలు భూమిపై రాక్షసులుగా పంచమలుగా పుట్టారని పురాణగాథల ద్వారా తెలుస్తుంది. ఇదంతా అదివాసులను, దళితులను ఒక్కవైపుఅణగదోక్కుతూ, పీడినకు గురి చేస్తునే శాపం నేపంతో దళితులను అక్కున చేర్చుకొనే ప్రయత్నం హిందు వర్ణ వ్యవస్థది. అందులో భాగమే దళితులు…

11. పాఠకులు వర్తమాన గమనంలో దళిత సాహిత్యాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నారు, మీరు చెప్పదలచుకున్నదిఏంది?

జ:నాడైనా, నేడైనా పాలకులు, కవులు, పాఠకులు పట్టం గట్టేది దళిత జీవితాల నేపథ్యం ఉన్న సాహిత్యానికే అని మరవరాదు. చాసో ” ఎంపు”, “కుంకుడాకు “, రావిశాస్త్రి “రత్తాలు రాంబాబు”, పాలగుమ్మి పద్మరాజు”గాలివాన. “, కాళీపట్నం రామారావు” యజ్ఞం ” కథా శ్రీశ్రీ, చలం, బుచ్చిబాబు “నన్నుగుర్చి రాయవు, చివరకుమిగిలేది “, గోపిచంద్ ” అసమర్ధని జీవయాత్ర”, త్రిపురనేణి రామస్వామి, చెరబండరాజు, వట్టికోట ” ప్రజల మనిషి “, బి.ఎస్. రాములు ” బతుకు పోరు, పాలు, సదువు”, బోయ జంగయ్య ” ఎచ్చరిక. చీమలు . గొర్రెలు, నా పేరు రాయోద్దు. కుండబద్దలుకొడతా, దొరసాని, తొడపాము, జాతర, జగడం ” వేముల ఎల్లయ్య “కక్క సిద్ధి” చిలుకూరి దేవపుత్ర” సోము, శిఖామణి, మువ్వలచేతికర్ర, ఎండ్లూరి సుధాకర్ “గోసంగి, కుసుమ ధర్మన్న” హరిజన శతకం, మాకు కొద్దునల్లదొరతం” మొదలగు దళిత, దళితేతర కవులు, రచయితల రచనలు దళిత నేపధ్యం ఉన్న సాహిత్యమే ననిగుర్తెరగాలి.

12. మీరు నవలా రచయితగా ఐదు నవలలు రాసిండ్రూ. పోలికలు, సామెతలు, జాతీయాలు, వాటి తాత్విక నేపథ్యం ఏమిటి?

జ:నేను ఇంతకు మందే చెప్పినట్టు కథాంశం ఏది అయినప్పటికి కథ సూటిగా చెబుతూనే కొంత సింబలైజ్ చేసి చెబుతాం. ఇక పోలికలు, సామెతలు, నుడికారాలు అంటారా ప్రపంచసాహిత్యంలో తెలుగుకు ఒక విశిష్టత ఉంది. అది తెలుగు భాషలో ఉన్నన్ని జాతీయాలు, సామెతలు మరెప్రపంచభాషలో లేవు. అంటే అతిశయోక్తి కాదు. ఇది నిజం మన ఊరి జనం, వాడ జనం, మన పూర్వికులు, ప్రతి సందర్భంలో ఏదో ఒక్క సంఘటనకు ఒక సామెతకాని, జాతీయ పదాని కాని, విసరడం చూస్తాం. చేసే పనులలో పోల్చుతూ, మూఢత్వాన్ని దెప్పిపొడుస్తు బుద్ధిని ఉపదేశిస్తూ, నీతిని భోదచేస్తూ వీటిని వాడారు. అలా నా నవలలో నేను సందర్భానుసారంగా పై పదాలను వాడుకొవడం జరిగింది.

13. సూర ” నవలలో సూరని పాత్ర ద్వారా మీరు అందించిన సందేశమేమిటి?

జ: “సూర ” నవల “గ్యోబాక్ టు విలేజ్” సూత్రాని అమలు చేసే ప్రయత్నం, చదువుకున్న యువత ఉ న్నఊరిని వదిలి పట్టణాలకు వలస వెళ్లితే గ్రామాలు అలాగే నిర్జీవంగా (ఎలాంటి అభివృద్ధికి నోచుకొక, అంధ విశ్వాసాలతో) ఉంటున్నాయి, మార్పు పల్లెల్లో జరగాలి, వాడలలో జరగాలి. అందుకే సూర నవలలో చదువుకున్న సూరడు తన ఊరు చేరి, ఊరిని ఉద్దరించాలని సంఘసంస్కరణకునడుంబిగాస్తాడు. అందులో భాగంగా వాడలో “ఫూలే అంబేడ్కర్ పాఠశాల పెట్టి పల్లె, వాడజనానికిఅక్షరజ్యోతిలు వెలిగించి నిరక్షరాస్యత నిర్మూలన, మూఢనమ్మకాలనను పారదోలాలనే ఆశయంతో ముందుకుసాగుతాడు.

14. భూతం ముత్యాలు అనగానేసాహితీలోకంలోబుగులు పట్టుకుంది, మీరు ఎట్లాఫీలవుతుండ్రు?

జ:నవ్వుతూ…… ఈ తెలుగునేలపై ఎందరో ప్రజాకవులు, ప్రజా వాగ్గేయకారులు ఉండ్రు. వారిని చూసి నేను గర్వపడుతా.. నావంతుగా పీడిత జాతి జనం గొంతుకనైయి సాహితీ సేద్యం చేస్తున్నా. సాహిత్యంలో కొనసాగే కవులు తన రచనలలో ” నిక్కమైన నీలమొకటి చాలు” అన్నట్టు ఒక రచన వారిని కవిగా సాహితీ క్షేత్రంలో చిరస్థాయిగా నిలుపుతాయి. నా రచనలలో అలాంటిది ఒక్కటి ఉన్న చాలు. తాలు గింజల రచన కాలంతో కొట్టుకపోతాయి. నేనన్నా. నా రచనలన్నామింగుడుపడని వారికి అది బుగులు రేపితే దానికి నేనేంచేయను. వారు స్వతహాగా తమ రచనలతో పైకి రావాలి, అంతేగాని ఒక్కరిపై ఒక్కరు ఈర్షపడితే, లేదా పొగిడితే ఒచ్చెదేంలేదు.వారి రాతలు  వారు సృజించిన సాహిత్యమే వారిని నిలబెడుతుంది. ఎవ్వరైనా ఎదుటివారి ప్రతిభ గుర్తించాలి.

15. ఒక వ్యాసకర్త, తాత్వికుడు మొదట గ్రామాలు ధ్వంసం కావాలన్నడు. గ్రామ పునాదుల మీద కవిత్వం రాశారు దీనిపై మీ అభిప్రాయం ఏమిటి చెప్పండి?

జ:నిజానికి గ్రామాలు ధ్వంసం కావాలని నేను ఆకాంక్షిస్త… ఎందుకంటే గ్రామాలలోనే మితిమీరిన అందవిశ్వాసాలు, కులకట్టడలు, ఆచారాలు, మూఢ నమ్మకాలు, అంటరానితనం, నిరక్షరాస్యత అధిక్యం, నన్నేతీసుకొండి…. నేను నిమ్నవర్గం…. నా బ్యాలం నుండి నా ఊరిని వదిలి చదువు నిమిత్తం పట్టణానికి వలస వచ్చా. ఇక్కడనే వసతి గృహాలలో చదువుకొని ఇక్కడ నుంచే ఉపాధ్యాయునిగా స్థిరపడ్డా. నా ప్రవృత్తి రచన, వ్యాసంగం. ఇపుడు ఊరి వైపు చూస్తే నాకే జాలి కలిగింది. నా తరువాత తరం నుంచి నేటికి ఒక్క  ఉద్యోగి నా వాడ నుంచి రాలేదు… అది మారని ఊరికి నిదర్శనం…. అందుకే నేను గ్రామాలు ధ్వంసం కావాలని కోరుకుంటునే, గ్రామాలను ఉద్దరించాలన్న తపనతో ” సూర” నవల రాయడం జరిగింది…

16. ఊరి దళిత కవులకు పల్లె మట్టి మీద ప్రేమ ఎందుకు? ఈ ప్రేరణకు కారణమేమిటి?

జ:ఉన్న ఊరు కన్న తల్లిలాంటిది అంటారు. అందుకే ఊరిపై మమకారంతో చాలామంది కవులు తమ కవితలలో, పాటలలో ఊరును ఊరు మట్టి వాసనలను వెదజల్లుతుఊరినికీర్తిస్తు రచనలు చేశారు. కన్న తల్లి, తండ్రి, ఒక రైతు కూలి, ఒక పాలేరుగా ఊరిజన జీవితాలు మట్టితో మమేకమైతాయ్.” అమ్మయాది “, ” నాయనమనాది ” కవితలలో (దుగిలిసంకలనంలోవి) మట్టివాసనలు పుష్కలంగా కనిపిస్తాయి. అసలు మనిషి మట్టిలో నుంచి వచ్చి చివరకు మట్టిలో కలవాల్సిందే. పల్లె మట్టివాసనల పరిమళసుగంధాలు ఆస్వాదించాలంటే పల్లె వాడ జీవితాలను తడిమి చూస్తె గాని అది భోదపడదు.

17. అగ్రవర్ణకవులు కలిసి ఉన్నట్టే ఉండి దళిత కవులను  రచయితలను విడగొట్టడమేమిటి?

 జ:మీరన్నది నిజమే…. వారిది కడుపునిండిన కవిత్వం, వారికి శ్రమైకజీవనసౌందర్యం అంటే ఎట్ల తెలుస్తుంది. ఆకలి కేకలు, అప్పుల బాధలు బాంచెను బతుకులు, బతుకుఎతలు, అస్పృశ్యత, పీడన, దళిత కవుల సొంతం. దళిత కవుల బలహీనతలైన ఆకలి, పేదరికం, నిరుద్యోగం వీటి ఆసరాతో వారు దళితుల మధ్య చీలికలు తీసుకొచ్చి తమ పబ్బం గడుపుకుంటుండ్రు. దళితులను ఉద్దరిస్తున్నమని చెప్పుకునే పాలకులు, అగ్రవర్ణకవులు వారికి అనుంగులుగా మారిన ఒకరిద్దరు దళిత కవులకు బిక్షవేసినట్టు పదవులో, పురస్కారాలో ఇచ్చి దళిత కవులు ఉద్దరిస్తునమనిఉపన్యాసాలిస్తరు. భీమన్న, జాషువా, జంగయ్య, కుసుమ ధర్మన్న, జయంతులు, వర్ధంతులు జరిపి చేతులు దులుపుకుంటున్నారు తప్ప వారి గుర్చి ఎక్కడ కూడ సరిగా గుర్తు చేయకపోవడం అందరికీ తెలిసిందే. దీనిని దళిత కవులు గమనించి అంబేద్కర్ ఆశయంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నా……

18. ఒక ప్రాంతాని మననం చేసుకొవాలంటే చారిత్రక స్పృహ ఉండాలి. ఈ ప్రాంతంలో అలజడికిలంగాణ సాయుధ పోరాటం గడ్డ నల్లగొండలోఅంబేద్కరిస్టుదృక్పధం కావడానికి కారణం చెప్పండి?

జ:స్వాతంత్రానికి పూర్వం నిజాం పాలనలో రజాకార్ల ఆకృత్యాలు, దొరలు, దేశముఖ్ లు, నాడు కులమతాలకు అతీతంగా దురాగతాలు సాగించారు. నాటి ప్రపంచ విప్లవాల ప్రభావం మనపైపడడటంతో ఇక్కడి ప్రజలు నల్లగొండ కేంద్రంగా సాయుధ పోరాటం సాగించిండ్రు. ప్రపంచ చరిత్రలో నిలిచిన ఘట్టం కాని స్వాతంత్య్రనంతర పరిస్థితుల వేరు అధికార మార్పిడి జరిగింది కాని ఈ ప్రాంత దళితుల జీవితాలు మారలే, అదే సమయంలో అంబేద్కర్ భావజాలం దేశ నలుమూలల విస్తరించింది. ఈ నేలపై మెదరిభాగ్యరెడ్డి వర్మ సంఘసంస్కరణకు పూనుకున్నాడు. అక్షరం అంటరాని వాడకు నడిచివచ్చింది. ఆ క్రమంలో అనేక మంది ” అంబేద్కరిస్టుదృక్పధంతో ముందుకు సాగిండ్రు “. ” అంబేడ్కర్ కుల నిర్మూలన సిద్ధాంతానికి ” పీడిత ప్రజలు జేజేలు పలికారు…. వాస్తవిక దృక్పధం నాటి ఆధిపత్య కవులు దళిత సానుభూతి రచనలు చేశారు. అలా ఈ ప్రాంతంలో అంబేద్కర్ భావజాలం పురుడుపోసుకుంది.

19. తెలంగాణ సాయుధ పోరాటం గడ్డ నల్లగొండలోఅంబేద్కరిస్టుదృక్పధం కావడానికి కారణం చెప్పండి?

స్వాతంత్రానికి పూర్వం నిజాం పాలనలో రజాకార్ల ఆకృత్యాలు, దొరలు, దేశముఖ్లు, నాడు కులమతాలకు అతీతంగా దురాగతాలు సాగించారు. నాటి ప్రపంచ విప్లవాల ప్రభావం మనపైపడడటంతో ఇక్కడి ప్రజలు నల్లగొండ కేంద్రంగా సాయుధ పోరాటం సాగించిండ్రు. ప్రపంచ చరిత్రలో నిలిచిన ఘట్టం కాని స్వాతంత్య్రనంతర పరిస్థితుల వేరు అధికార మార్పిడి జరిగింది కాని ఈ ప్రాంత దళితుల జీవితాలు మారలే, అదే సమయంలో అంబేద్కర్ భావజాలం దేశ నలుమూలల విస్తరించింది. ఈ నేలపై మెదరిభాగ్యరెడ్డి వర్మ సంఘసంస్కరణకు పూనుకున్నాడు. అక్షరం అంటరాని వాడకు నడిచివచ్చింది. ఆ క్రమంలో అనేక మంది ” అంబేద్కరిస్టుదృక్పధంతో ముందుకు సాగిండ్రు “. ” అంబేడ్కర్ కుల నిర్మూలన సిద్ధాంతానికి ” పీడిత ప్రజలు జేజేలు పలికారు…. వాస్తవిక దృక్పధం నాటి ఆధిపత్య కవులు దళిత సానుభూతి రచనలు చేశారు. అలా ఈ ప్రాంతంలో అంబేద్కర్ భావజాలం పురుడుపోసుకుంది.

20. తెలంగాణ ప్రాంతీయ అస్తిత్వం కథ నిర్మాణ పద్దతులు చెప్పండి?

జ: ప్రత్యేక తెలంగాణ నినాదంతో సాయుధ పోరాటం 1969లోజరిగిన తెలంగాణ ఉద్యమ ఫలితంగా తెలంగాణ ఆకాంక్షను వ్యక్తపరుస్తూ సాహిత్యంలో తమ గొంతుకను వినిపించారు. మరి ముఖ్యంగా గత రెండు దశాబ్దల నుండి ప్రాంతీయ అస్తిత్వ వాదం పుంజుకుంది. ఈ ప్రాంతపు రచయితలు బి.ఎస్. రాములు, అల్లం రాజయ్య, బోయ జంగయ్య, వేముల ఎల్లయ్య. తుమ్మెటిరఘోత్తమ రెడ్డి, ముదిగంటి సుజాత రెడ్డి, జాతశ్రీ, భూతం ముత్యాలు, పెద్దింటి అశోక్ కుమార్, దేవరాజు మహారాజు, కాలువ మల్లయ్య తదితరలు తెలంగాణ అస్తిత్వ వాదనతో కథ రచనలు చేశారు. వీరు ఈ ప్రాంత జనజీవితాలను కుంగదీసిన గ్లోబలైజేషన్, సరళీకృత ఆర్థిక విధానాలు దోపిడి, పీడన నేపథ్యంలో కథలు కొత్త పుంతలు తొక్కాయి. యదార్థ, వ్యధాభరిత దృశ్యాల్ని సంఘటనలను కథలుగా మలిచి తెలంగాణ అస్తిత్వవాదం పేరిట కథలు, కథసంకలనాలు తీసుకొని వచ్చారు. ఉద్యమకాలంలో హోరు, బద్లలా తదనంతరం అనేక కథలు వచ్చాయి.

21. సామాజిక ఉద్యమ నేపథ్యం, తెలంగాణ ఆవిర్భావ అనంతరం దళిత సాహిత్య పరిస్థితులు చెప్పండి?

జ:తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో దళిత కవులు పాలుపంచుకున్నారు. బోయ జంగయ్య, గూడ అంజయ్య, జాతశ్రీ, వేమల ఎల్లయ్య, భూతం ముత్యాలు, పసునూరి రవీందర్, గాదె వెంకట్, మన్నెఏలియా, జిలకర శ్రీనివాస్, కొమ్ము సుధాకర్, పిట్టల శ్రీనివాస్, జూపాకసుబధ్ర, జాజుల గౌరి, గోగు శ్యామల, మద్దెలశాంతయ్య, బన్నఅయిలయ్య, గౌరటి వెంకన్న, జయరాజ్, పైల్లం సంతోష్, వరకుమార్, సిద్దెంకి యాదగిరి, ఇక్కడి పరిస్థితలుకు అద్దం పట్టేలా రచనలు చేస్తునేవుండ్రు. ఐతే ఇందులో కొందరు కవులు పాలకులకు అమ్ముడుపోయినట్టు వారి తీరు వారి రచనలలో కనపడది. కాని ప్రలోభాలకు లొంగని కవులు ప్రజాపక్షంవైపు ఉండి జనహితమే… తమ హితంగా రచనలు చేస్తుడండ్రు. దళితులలో చీలికలు తీసుకవచ్చి తమ పబ్బం గడుపుకుంటున్నారు అధిపత్య కవులు. అయితే అది తాత్కలికమని మరవరాదు.

22. తెలంగాణ సాహిత్యం తరువాత మరో ఉద్యమ సాహిత్యం రాబోతుందా? అలా వొచ్చేదుందా?

జ: ఎందరో యువకుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ దొరల తెలంగాణగా అవతరించింది. తెలంగాణకై పొరాటాలు చేసి అసువులుబాసి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల కొరుకున్న తెలంగాణ ఏర్పడలేదు. తాత్కాలిక అవసరాలు తీర్చే నేతలు మాటలు నేతి మీర చందం అయినయ్. కాని యువత ఆకాంక్ష అయిన విద్య, ఉద్యోగ, ఉపాధి, కలగానే మిగిలింది. నీళ్లు, నిధులు మాటలకే పరిమితమ్యైంది. కవులు పాలకుల వైఫల్యాన్ని ఎండగుతుఆదిశగా రచనలు మరిన్ని రావాల్సివుంది. వస్తయని ఆశిస్తున్న ఏ ప్రభుత్వమైన ప్రజల ఆకాంక్ష మేరకే మనగలదు. విఫలమైతే పలాయనం తప్పదు.

23. సంస్కరణోద్యమ కర్త గురుజాడ, విప్లవకవిచెరబండ, ” మంచియన్నదిమాలయైతేమాలనేనగుదున్ “, ఉందరామాలపేట ఊరి కష్టాలున్న కాడ ” అగ్రవర్ణులు కదా! గీల్లనుఎట్లా అర్థం చేసుకుంటరు చెప్పండి?

పై వారిలో ఒక్కరు ” ముత్యాల సరాలు రాసిన కవి “గురజాడ ” కవితా పాదంలో పేరున్న వాక్యం అది, అతని సంస్కర్త హృదయాన్ని సూచిస్తుంది. అది సానుభూతి రచనగానే చూడాలి అని భావిస్తున్న. ఇక చెరబండరాజు విప్లవ కవి విప్లవంలో కులముంది. శ్రమ జీవుల పక్షం వహించి చెరబండరాజు రచనలు చేసినారు. కాని దళిత పక్షాన రచనలు చేసివుంటే మేము అతన్ని అక్కున చేర్చుకునేవాళ్లం. అలా జరగలేదు. అయినను చెరబండరాజును ప్రజాకవిగా గుర్తింస్తాం.

24. దళిత సాహిత్య ఉద్యమం, దళితోద్యమం, అస్తిత్వ పరిధిలో బంధించడానికి కారణమేమిటి చెప్పండి?

జ:అది అగ్రవర్ణ కవుల కుట్ర, ఎందుకంటే ఒక ఆధిపత్య కవి ఎలా రచన చేసినా అతను కులం, ప్రాంతం, ఎల్లలు దాటి విశ్వకవిగాచలామనిఅయితడు. “పుల్లంరాజు ” కథ రాసిన శ్రీపాద ” మాలపల్లి ” నవల రాసిన ఉన్నవ, ” ముత్యాల సరాలు రాసిన గురజాడ, చాసో “ఏంపు, కుంకుడాకు” కార మాష్టారు “యజ్ఞం ” కథ, పాలగుమ్మి పద్మరాజు ” గాలివాన ” కథలు తెలుగు సాహితీ ఎల్లలు దాటి విశ్వవిపణిలో పేర్లుగడిచాయి. అదే తెలంగాణ ప్రాంతానికి జరిగిన అన్యాయాన్ని కరువు పెడుతు రచన చేస్తే ప్రాంతీయ వాది అని ముద్ర వేస్తారు. అలాగే దళిత నేపథ్యంలో వాడ బతుకులను చిత్రించి తమ కులం, జాతి ఇతి బాధలను అక్షరబద్ధం చేసి రచనలు చేస్తే దళిత కవులని, దళిత అస్తిత్వవాదులని పేరు పెట్టి పిలవడంను పరిపాటి అయ్యింది ఆగ్రవర్ణ కవులకు. నిజానికి దళిత జీవితాలను కథలుగా మలచినవారువిశ్వకవులు అయ్యారు. తమ్మని తాము ఆర్తితో గోడు వినిపిస్తే దళిత కవులు అని ముద్రవేస్తారు. ఇది కుట్ర కాక మరి ఏమిటి?

25. కళాత్మక వ్యక్తీకరణకు మీ రచన ఎలా తోడ్పాటునందించింది?

జ:బురద నీటిలో కమలం వికసించిన తీరుగా మట్టి మనిషుల జీవితాలను వారిదైన యాస భాషలోనే కళాత్మకత దాగి ఉంది. వాడ బతుకులను రంగరించి రచనలు చేశా…. వారి బతుకు చిత్రాలు నా కథ వస్తువులు కావడం ఒక ఎత్తు అయితే  నేను అవాడ నుంచి వచ్చిన మట్టి మనిషి బిడ్డను కావడం నా అదృష్టం. కళాతృష్ణ అనేది చూసే చూపును బట్టి ఉంటుంది. చూపులో తేడా వుంటే కళా ఖండం కూడ అందవిహీనంగానే కనిపిస్తుంది. నా రచనలు అలా వాడ సోబగులతో బట్టిపురుడుసోపుకున్నాయి. అందుకే అవి సజీవాలై అందరి మన్ననలు పొందుతున్నాయి.

26. యూనివర్సిటీలోసూర, పురడు నవలలు పాఠ్యాంశాలుగా ఉన్నాయి గదా ! ఎలా అనిపిస్తుంది?

జ:నాకు చాలా సంతోషమనిస్తది. నేను సజీవంగా ఉండగానే నా రచనలు యూనివర్సిటీలలో పాఠ్యాశాంలుగా ఉండడం నా అదృష్టం. అందుకు కారణం ఆ నవలలోని పాత్రలు, పాత్రచిత్రణ, వాడజనుల, పల్లె జనుల, యాస భాష రచన నేను చేసిన ఆ గొప్పదనం దళిత వాడ జీవితానిదే. మా ఊరిలో ఇప్పటికీ మాది పురిగుడిసె. నాయన (ఇపుడు లేడు ) కూలి, ఓ రిక్షావాలా, అమ్మ కూలి నాలి, వారు కష్టపడి నన్నింతవాన్ని చేశారు. వారు పడిన కష్టాలు, వెదనలు, బతుకు సంవేదనలు నా జీవితంపై చెరగని ముద్రవేశాయి, నాలో సాహిత్యానికి మూలధారం వారే. వారే లేకుంటే నేను లేను. నా రచనలు లేవు. అది వారి చలవ…

27. దళిత రచయితలు ఎవ్వరు చెయ్యలేని దళిత వృతి పదకోశం ( మాండలికం) రాశారు. స్వీయ జీవిత చరిత్రల విశిష్టతలకు గుర్తింపు ఏమైనా వొచ్చిందా?

జ:నాకు అవార్డులు రివార్డులు అయితే రాష్ట్రస్థాయిలోపొట్టి శ్రీరాములు తెలుగు విద్యాలయం 2017 సంవత్సరానికి నేను రాసిన మొగలి దళిత నవల ఉత్తమ నవల గ్రంథంగా పురస్కారం ప్రకటించారు. అలాగే తెలంగాణ రాష్ట్ర  ఆవిర్భావ దినమైన జూన్ 02 , 2017 సంవత్సరానికి నల్లగొండ జిల్లా స్థాయి ఉత్తమ కవి పురస్కారంతో జిల్లా కలెక్టర్ మరియు అధికారులు సన్మానించారు.కాని నా రెండు నవలలు సూర దళిత నవల కాకతీయ విశ్వవిద్యాలయంలో 2013 సంవత్సరం నుండి ఎంఏ తెలుగు విద్యార్థులకు సిలబస్ గా ఉంది. అలాగే పురుడు నవల శాతవాహన విశ్వవిద్యాలయంలో 2017 సంవత్సరం నుండి 5 సంవత్సరాల పాటు ఎంఏ తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశంగా ఉంది. అదే సమయంలో బెంగళూరు విశ్వవిద్యాలయంలో సూర దళిత నవల తెలంగాణ నవలగా ఎంఏ తెలుగు విద్యార్థులకు పాఠ్యాంశంగా అంశంగా చేర్చినారు అది గొప్ప అనుభూతి ఆనందం సంతోషం.అయితే నా రెండు నవలలు (సూర, పురుడు ) యూనివర్సిటీలో పాఠ్యాంశంగా ఉండటమే నాకు లభించిన పెద్ద గుర్తింపు. నేను ఇప్పటి వరకు రాసిన కథలు , నవలలు, కవిత్వం, తెలంగాణ నిఘంటువు పాఠకుల దరి చేరాయి. విమర్శకుల మన్ననలు పొందాయి. నేను రాసిన ” మాలవారి చరిత్ర” ఒకసంవత్సరంలో అయిదు ముద్రణలు పొందింది. రెండు దశాబ్దాల సాహితీ ప్రస్థానంలో పాఠకుల ఆదరాభిమానాలు రచనలు చూరగొన్నయి. ఓపిక ఉన్నంతవరకు రచనలు కొనసాగిస్తా….. నా సాహిత్యానికి పాఠకులు ఉన్నారు. అది చాలు….. అదే పదివేలు….

November 24, 2025 4 comments
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

కార్తీక పౌర్ణమి రోజు వెలిగించే దీపం యొక్క విశిష్టత, మరియు ప్రయోజనము

by Nellutla Madhava Srinivas November 24, 2025
written by Nellutla Madhava Srinivas

కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగించే ముందు ప్రమిద మీద కాస్త పసుపు, కుంకుమ, ఒక పువ్వు వేసి దీపంలోనికి ఆ భగవంతున్ని ఆవాహన చేయాలి. ఆవాహన చేసేటప్పుడు చదవవలసిన మంత్రం త్రయంబక మావాహయామి అని గాని దామోదర మావాహయామి అని గాని చెప్పి ఆ దీపాన్ని పరమేశ్వరుడిగా గాని, దామోదరుడిగా గాని భావించి దీపం వెలిగించి నమస్కారం చేసుకోవాలి.
ఆ దీపస్వరూపమే దామోదరుడు లేదా పరమేశ్వరుడు.

ఆ *దీపమే పరబ్రహ్మము *అటువంటి దీపాన్ని వెలిగించుట వలన కలుగు ప్రయోజనములు
ఈ లోకంలో కొన్ని లక్షల, కోట్ల ప్రాణులు ఉన్నాయి కానీ …..అవి తమను తాము కానీ, ఇతరములను గాని ఉద్ధరించు శక్తి కానీ, భగవాన్నామస్మరణ చేయగల శక్తి గాని కలిగి లేవు. కానీ మానవుడు ఎంతో ఉత్కృష్టమైన మనిషి జన్మను పొంది ఉండటం వలన ఇతర ప్రాణులను ఉద్ధరించుటకు కావలసిన విభూతిని పొంది ఉన్నాడు. కనుక ఇతర ప్రాణులను ఉద్ధరించడానికి ,చెట్లు, జంతువులు, పశువులు, పక్షులు, కీటకాలు, మొదలగు ఎన్నో చరాచర జీవరాసులకు అనుగ్రహం చేయగలిగే అనువైన తిథి ఈ కార్తీక పౌర్ణమి. (మనం ఈ భూమి మీద ఎన్నో ప్రాణులను మన అవసరాలకు వాడుకుంటున్నాం అందులో మొట్టమొదట చెప్ప తగినవి చెట్లు) ఈ కార్తీక పౌర్ణమి రోజు మనం వెలిగించే దీపాన్ని మన చుట్టూ ఉన్న ప్రాణులు చూసిన కారణం చేత అవి మరల జన్మను పొందవు అని ఋషి వాక్యం.🙏🏻🙏🏻 అందుకే కార్తీక పౌర్ణమి రోజు తప్పకుండా దీపాన్ని వెలిగించాలి. కార్తీక పౌర్ణమి రోజు దీపాన్ని వెలిగించకుండా ఉండటం వలన ఇతర ప్రాణుల వలన మనం ప్రయోజనం పొంది వాటికి విముక్తి కలిగించకపోవడం వలన కృతఘ్నతా దోషం కూడా పొందుతారు మానవులు. తద్వారా మనిషి జన్మకు అర్థం కాని సార్ధకత గాని కలగవు .కనుక ఎవరైతే కార్తీక పౌర్ణమి రోజు దీపాన్ని వెలిగించి మన చుట్టూ ఉన్న జీవకోటికి విముక్తిని కలిగిస్తారో… వారు కాలాన్ని సద్వినియోగం చేసుకోగలరు . కాలాతీతులు కాగలరు . ఫలితంగా పుణ్యాన్ని సంపాదించుకోగలరు. కనుక ఈ కార్తీక పౌర్ణమి రోజు దీపాలను వెలిగించి ఈ మానవ జన్మకు సార్ధకత పొందుదాం.

లోకా సమస్త సుఖినోభవంతు

November 24, 2025 2 comments
0 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

రంగరాజు పద్మజ అందించిన జయలక్ష్మి సాహితి భక్తి భండారి

by Sammeta Vijaya November 24, 2025
written by Sammeta Vijaya

డేంకణి కోట కీర్తిశేషులు శ్రీమతి జయలక్ష్మిగారి భక్తి భండారి- సాహిత్య సంభారి అనే పుస్తక రచయిత్రి రంగరాజు పద్మజ గారు. రంగరాజు పద్మజ గారు 1953లో మహబూబాబాద్ ఇనగుర్తి లో జన్మించి ప్రస్తుతం జనగామ వాసిగా ఉన్నారు. వీరు  గృహిణి.  హరిదాసి, మనసే కోవెల ,గుండె లోతుల్లోంచి, వ్యాస వితతి ,చిత్ర కవితలు, నాటి నుంచి నేటి వరకు, ఖడ్గ తిక్కన పద్య కావ్య పరిష్కృతం , కవిత విరిమాల వంటి అనేక రచనలు చేసిన విదుషీమణి.

   వ్యాఖ్యాన సామ్రాజ్ఞి,  సహస్ర పద్య  కంఠీరవ,  ఆర్ష  ధర్మ ప్రదీపిక బిరుదులు పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి మాతృ వందనం ,  తెలంగాణ సారస్వత  పరిషత్తు నుండి వరిష్ఠ పురస్కారం,  సురవరం ప్రతాపరెడ్డి విశ్వవిద్యాలయం నుంచి కీర్తి పురస్కారం , అక్షరయాన్ అభిజ్ఞ నుంచి వెంగమాంబ పురస్కారం అందుకున్నారు. ఒద్దిరాజు సోదరులలో ఒకరైన రాఘవ రంగారావు గారి పుత్రికగా తెలంగాణ వేగుచుక్కలైన తండ్రి బాటలో నడిచి సాహిత్యాన్ని పండించారు.

   పరిశోధనాత్మకంగా చేసిన వీరి రచన డేంకణి  కోట కీర్తిశేషులు శ్రీమతి జయలక్ష్మి గారి గురించిన రచన.  భక్తి భంఢారి  సాహిత్య సంభారి శీర్షికలోనే జయలక్ష్మి గారు ఒక భక్తి   భండారమని సూచించారు . శ్రీ జిఎస్ స్వామి మంగళాశీర్వచనంతో  ఆచార్య వెలుదండ నిత్యానంద రావు గారి నిర్మల చరితం పేరుతో చక్కని సమీక్షతో ప్రారంభమైంది వీరి రచన.  ఆచార్య వెలుదండ  నిత్యానంద రావు గారు అన్నట్లు రంగరాజు పద్మజ గారు ఎంతో ప్రతిభ పూర్వకంగా ఔచిత్యం, ఆంతర్యం, సారం  ఏమాత్రం చెడకుండా సుదీర్ఘ వర్ణనలను కుదిస్తూ సరళా కృత వ్యవహారికానువర్తనం చేసి విద్వజ్జనుల ఆమోదం పొందారని చెప్పిన వాక్యాలు అక్షర సత్యాలు.

    డాక్టర్ సూరం శ్రీనివాసులు గారు ఏ యే ప్రకరణాన్ని  రంగరాజు పద్మజ గారు ఎలా పరిచయం చేశారో వివరిస్తూ పాఠకులకు వడ్డించిన విస్తరిలా రచించారని ప్రశంసించారు. చక్కని శైలి అవసరానికి మించని వ్యక్తికరణలతో జీవిత సాహిత్య గ్రంథ రచనలకు మార్గదర్శకంగా సాగిన గ్రంథమని ఆదర్శవంతమైన అనుశీలన అని  అభివర్ణించారు.

    ఆచార్య ఇ సత్యనారాయణ గారు ద్రవిడ విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు  రచించిన ముందు మాటలు డేంకణి కోట తాముండే కుప్పం దగ్గరలోని అని చెబుతూ ఈ రచన ద్వారా బడిలో పెద్దగా చదవని జయలక్ష్మి గారు చేసిన వేలాది రచనలు మనకు తెలిసేలా రంగరాజు పద్మజ గారు చేశారని ఆనాటి సామాజిక కట్టుబాట్ల మధ్య మహిళా సాధికారికత  సాధించిన మహిళ జయలక్ష్మి అన్న విషయం తెలిసిందని అన్నారు.

    అయినంపూడి శ్రీలక్ష్మి గారు అక్షరయాన్  వ్యవస్థాపక అధ్యక్షురాలు రచించిన ముందుమాటలో అసలు ఎవరు ఈ జయలక్ష్మి అంటూ ఒక పరిశోధక విద్యార్థిలా  జయలక్ష్మి గారి గురించి వివరాలు సేకరించి రచించారని ఎన్నో సంవత్సరాల క్రితం ప్రారంభమైన కథని అనేక విషయాలు తెలుసుకొని కష్టపడి రచించిన రచన అని ఆ సామర్థ్యం రంగరాజు పద్మజ గారిలో పరిపూర్ణంగా ఉండడం వల్లనే అక్షరయాన్  మాతృ వందనం పురస్కారంతో సత్కరించామని అన్నారు.

జయలక్ష్మి గారి సంతానం కూడా తల్లిని గురించిన మనోభావాలను ముందుమాటలో పంచుకుంటూ హైదరాబాద్ నుంచి హోసూర్ కు వచ్చి మా తల్లి గారి గురించి వివరాలు సేకరించి క్రోడీకరించి రాయడం పట్ల ముగ్గులై రంగరాజు పద్మరాజు గారి శైలికి ధారణా శక్తికి  ఆశ్చర్య పడుతూ పుస్తకం తీసుకురావడంలో తోడ్పడిన అయినంపూడి  శ్రీలక్ష్మి గారికి సహకారం అందించిన శ్రీ అరుణ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.  రంగరాజు పద్మజ గారు ప్రచురించిన అక్షరాలు జయ లక్ష్మమ్మకు స్వర్గ కానుకలు గా భావించారు.

డా కొండపల్లి నిహారిణి  తన ముందు మాటలో  పుస్తకం శ్రద్ధగా చదివి ఆనందిస్తూ తరిగొండ వెంగమాంబ మంజరి ద్విపద లో రాసిన ఆ లక్షణాలను వీరి రచనలో చూడవచ్చు అన్నారు  భక్తి దారుల్లో పయనించిన రంగరాజు పద్మజ గారు  భక్తి బండారి 300 పైగా పేజీలతో జీవిత చరిత్ర నా నవలనా  అని ఆసాంతం  చదివింపజేసే రచనగా రచించారని అదే రంగరాజ పద్మజ గారి గొప్పతనం అని అన్నారు.70 వ దశకం లో వీరి ఈ  రచన తప్పక చదవాలని సూచించారు

    ఆప్త వాక్యం పలుకుతూ రంగరాజు పద్మజ గారు ఇది ఒక గొప్ప ఆధ్యాత్మిక రచయిత్రి ఆత్మకథ దీనిని ఆ భగవంతుడే నా చేత రాయించాడని అన్నారు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

    పుస్తకం లోపలికి ప్రవేశిస్తే ఇది మొత్తం ఆరు ప్రకరణాలుగా రూపొందించబడింది మొదటి ప్రకరణంలో జయలక్ష్మి గారి జీవితం గృహిణి ధర్మం జీవితంలో ఒడిదుడుకులు సాహిత్య రచనపై ప్రవేశం కలిగించిన అంశాలున్నాయి రెండవ ప్రకరణంలో ద్వాదశి మణిమాలలను గురించి రాశారు అప్పటికి తెలుగు రాక తమిళ లిపిలో రాసుకున్నవి కూడా కొన్ని ఉన్నాయి. మూడవ ప్రకరణంలో జయలక్ష్మి గారు రచించిన ఖండకావ్యాలు శ్రీరామ కథామృతం శ్రీమద్ భాగవత ఆణిముత్యాలు పరిచయం ఉంది నాలుగవ ప్రకరణములు రంగరాజు పద్మజ గారు జయలక్ష్మి గారు రచించిన అనుభవాలు వారి కుమారులు చెప్పిన అనుభవాలను వివరించారు ఐదవ ప్రకరణంలో ఆ అనుభవాలు కొనసాగిస్తూ వీరి కుమారులు చెప్పిన అంశాలను ఎక్కువగా ప్రస్తావించారు ఆరవ ప్రకరణంలో శ్రీమతి జయలక్ష్మి గారి సాహిత్య జీవనం సమీక్షాత్మకంగా రచించారు.

    డేంకణి కోట  కోట జయలక్ష్మి గారు 1923 లో జన్మించారు సరిగా 102 సంవత్సరాల అయింది 27 లో స్వర్గస్తులయ్యారు 94

    సంవత్సరాల నిండు జీవితం బాల్యంలో పదేళ్ల నుంచి గో సేవ పాలు కాయడం పెరుగుచిలకడం వెన్న తీయడం పిడకలు చేయడం ఇల్లు అలకడం వాకిలి చిమ్మి ముగ్గులు వేయడం వంటివి ఆ కాలంలో అందరి స్త్రీల వలి చేశారు కానీ ఇదే నా జీవితం ఇంకా ఏదో ఉందని అనుకున్నారు అలా అనుకోవడమే ఈరోజు మనం ఆమె గురించి ముచ్చటించుకునే దశకు చేరుకుంది.

      ఆ కాలంలో ఉన్న మహిళలలో అరుదుగా కనిపించే విదుషీమణి జయలక్ష్మి గారు.  ఈ పుస్తక రచన రంగరాజు పద్మజ గారు రాయడానికి ఎందుకు పూనుకున్నారంటే  మనలో కొందరు కవిత్వం రాస్తారు కొందరు నవలలు కొందరు పద్యాలు కొందరు నాటికలు కానీ అన్ని ప్రక్రియలను సృజించిన కవయిత్రి  జయలక్ష్మి  గారు.

ఆమె జీవిత చరిత్ర ద్వారా రచయిత్రి రచనా కాలంలో సామాజిక గమనం పరిణామాలు స్త్రీలు వంటగదికే పరిమితమయ్యే కాలంలో అనేక రచనలు చేసిన మహిళా మణి గురించి రాయడం వల్ల ఈ రచన ఎందరో మహిళలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఆశాభావంతో రంగరాజు పద్మజ గారు ఈ రచన చేశారు .

     జయలక్ష్మి గారి తల్లిదండ్రులు వెంకటరమణ అయ్యగారు లక్ష్మీ గారు జయలక్ష్మి గారి కుమారులు శ్రీరామమూర్తి గారు శ్రీ శ్రీనివాసన్ గారు వీరి కుమార్తె రమామని గారు జయలక్ష్మి గారు సింగమనే గ్రామంలో తిరువన్నామలైకు దగ్గరలో ఉన్న గ్రామంలో అమ్మమ్మ గారింట జన్మించారు. జయలక్ష్మి గారు ఉన్నది తమిళనాడులో . అక్కడ గ్రామ పాఠశాలలో మూడవ తరగతి అవగానే బడి మాన్పించారు అంతకుమించి వయసుగల వారిని బడికి పంపరాదు అని నియమం.

 అప్పటి కాలంలో చిన్న వయసులోనే వివాహాలు జరిగేవి. తనలో ఒక భావన వెంకటేశ్వర స్వామి తన భర్తని దానికి తగినట్లు ఆమెకి చూసిన సంబంధం వరుడు వెంకట రామయ్య గారు వారు చదివింది ఎస్.ఎస్.ఎల్.సి చివరికి తన భర్తని వెంకటేశ్వర స్వామి అనుకున్నారు జయలక్ష్మి గారికి నలుగురు సోదరీమణులు. అక్కడ పేదరికంతో పెరిగి మెట్టినింట కూడా అదే కొనసాగి అత్తింటి ఆరళ్లతో అనారోగ్యం పాలయ్యింది. జయ లక్ష్మీ గారి భర్త ఇంట వారి దూరపు బంధువు అమ్మాళమ్మ గారు భర్త మరణించి వీరింట చేరారు.  మరో బంధువు సుందరయ్య కూడా వారింట ఉండేవారు. భర్త వెంకటరామయ్య గారి కుటుంబంలో వారి తల్లిదండ్రులు రామక్కమ్మ వెంకటసుబ్బయ్య గార్లు.. వారికి నలుగురు కొడుకులు ముగ్గురు కూతుర్లు అందులో పెద్ద కొడుకు  వెంకట రామయ్య గారు వారి భార్య జయలక్ష్మి గారు. వెంకటసుబ్బయ్య గారి పెద్ద కూతురు లక్ష్మికి ముగ్గురు కొడుకులు ఇద్దరు కూతుర్లు .ఐదవ సంతానం 15 రోజుల బిడ్డగా ఉన్నప్పుడు లక్ష్మీ గారు మరణించారు వారంతా వెంకటసుబ్బయ్య గారి ఇంట్లో చేరారు.  రెండవ కూతురు అన్నపూర్ణమ్మ ఇద్దరు కొడుకులు ,ఒక కూతురు . ఆమె కూడా కూతురు జన్మించాక మరణించారు.  ఆ పిల్లల పోషణ కూడా వీరిదే సరిగ్గా జయలక్ష్మి గారి వివాహమై కోడలుగా వచ్చాక ఆ ఇంట్లో ఐదుగురు మేనల్లుళ్లు ,ముగ్గురు మేనకోడళ్ళు ,తన వయసున్న ఆడపడుచు తనకన్నా పెద్దవారైనా ఇద్దరు మరుదులు అత్తగారు మామగారు ఇంతకు పూర్వం మనం చెప్పుకున్న అమ్మాళమ్మ, సుందరయ్య వెరసి 17 మంది. మీరు కాకుండా వచ్చే పోయే బంధువులు. అన్ని పనుల భారం తన మీద పడేది. చెప్పుడు మాటలు విని భర్త కూడా ఆమె మనసును గాయపరిచేవారు . ఎవరికోసం బతకాలి అనే ఆలోచన మారేగానపల్లెలో అనుకొని గడిపారు జీవితం.

 భర్త అక్కడ నుంచి బెంగళూరులో ఉపాధ్యాయులుగా చేరారు. భర్త అక్కడ భార్య ఇక్కడ చాకిరీ చేస్తూ వారి ఇంట్లో ఉన్న అమ్మాళమ్మ గారు జయలక్ష్మి గారిని చెంగం  గ్రామానికి వెళ్లి సాకమ్మ రామాయణం రాసుకోమన్నారు అమ్మాళమ్మ ,  సుబ్బాలమ్మ ఇద్దరి వద్ద సాకమ్మ రామాయణం నేర్చుకున్నారు జయలక్ష్మి గారు. అక్కడ భార్య శ్రమను గుర్తించి వెంకట రామయ్య గారు జయలక్ష్మి గారిని బెంగళూరుకి తీసుకొచ్చారు.  అది చిన్న ఇల్లు దేవుడి గదిలేక వంటగది గోడకి బొట్టు పెట్టి అదే దేవుడిగా భావించే ఆమె అది చూసి వారి బంధువు ఒకతను రాముల వారి పటం తెచ్చి ఇచ్చాడు. అదే ఈనాటికీ వారి కుటుంబం పూజిస్తున్నారు. ఒక స్నేహితుడు వచ్చి భర్త మనసు మార్చి జయలక్ష్మి గారిని బాధింప చేయగా తాను ఆత్మహత్యకు కూడా పూనుకొనే  ప్రయత్నం చేశారు అని తెలిపారు రంగరాజు పద్మజ గారు.

   సాకమ్మ జయలక్ష్మి గారి బంధువే ఈ కథనాలు లో సాకమ్మ  వృత్తాంతం ఉంది తనకు నిద్రలో సరస్వతి దేవి నాలుక మీద రాసిందని సాకమ్మ చెప్పగా అందరూ సాకమ్మని గొప్ప దానివవుతామని భావించారు వీరి యక్షగానంలో ద్విపదలు పాటలు కీర్తనలు, పద్యాలు, భజనలు ఉంటాయి మచ్చుకి ఒక ఘట్టం హనుమంతుడు ఉంగరం అందుకుంటున్న ఘట్టాన్ని మనం గమనించినట్లయితే..

ఉంగరమా ఉంగరమా ముద్దుటుంగరమా !
ఓ తరుణీ నిన్నెడబాయనని పలుమారు బాసచేసెనే
ఉంగరమా ముద్దుటుంగరమా!
ఏక పత్నీవ్రతుడ నేను
ఏలా వగపు నీకు అనెనే
ఉంగరమా ముద్దుటుంగరమా అంటూ గమ్మత్తుగా సాగుతుందీ యక్షగానం.

   ఈ పుస్తకంలో జయలక్ష్మి గారి అందమైన చూచి రాతతో తాను స్వయంగా రాసిన పేజీలను జోడించడం పుస్తకానికొక వన్నె తెచ్చింది . సాకమ్మ యక్షగానం రామాయణం అంకితం వివరాలను కూడా పొందు పరిచారు.

    జయలక్ష్మిగారు భరించిన కష్టాలలో కొన్ని ఇంట్లో ఉన్న అమ్మాళమ్మగారు తన కూతురు మనవరాళ్ళు మరణిస్తే జయలక్ష్మి గారి రాక వల్లే ఇలా జరిగిందని ఆడిపోసుకున్నారు. ఆమె మానసికంగా చాలా కృంగి పోయారు . తన మూడవ కూతురు జన్మించి కొన్ని నెలలకే చనిపోవడంతో ఆ బాధలు మరింత పెరిగాయి. అయినా ఇంటిల్లిపాదికీ సేవలు చేసారు. 95 ఏళ్ల వరకు చైతన్య వంతంగా గాన మాధుర్యంలో తేలిపోతూ జీవించారు తళి అనే గ్రామంలో ఈ సమీపంలో వేణుగోపాల స్వామి శ్రీరాముని గుడులు ఉండేవి అక్కడకు వెళ్లి పద్యాలు కీర్తనలు పాడితే విజయలక్ష్మి గారికి పిచ్చి పట్టిందని అనుకున్నారంతా భూతవైద్యాన్ని పిలిపించి వైద్యం చేయించారు కూడా ఆమె ఆరోగ్యం క్షీణిస్తుండగా పక్కన ఉన్న డేంకణి కోటకు బదిలీపై వచ్చారు. అక్కడ ఆమె భర్త ఇద్దరు కూతుర్లతో జీవనం గడపగా క్రమంగా ఆమె ఆరోగ్యం మెరుగైంది .1947లో స్వాతంత్ర్యం వచ్చినప్పుడే ఆమె బాధలకు విముక్తి కలిగిందని రచయిత్రి చెప్పడం ఔషధంగా అనిపించింది.

   తన దైనందిక దినచర్యను రంగరాజు పద్మజ గారు చాలా స్పష్టంగా తెలియజేశారు పనివారు లేకుండా సమస్తము చేసుకుంటూ మధ్య మధ్య యక్షగానాలు ఆలపించే వారిని అందరికీ తన పాటలతో మేలుకొలుపులు పాడేవారని సూర్యుడికి , వీరుడికి  మేలుకొలుపులు తులసికి మేలుకొలుపులు కూడా పాడేవారు.

కరిమిప్ప బృందావనం ఎవరింట్లో ఉన్నాను
లేచి మొక్కిన వారి పాపములు పోవును
తులసమ్మ మేలుకొనవే తులసమ్మ మేలుకొనవే
కృష్ణ తులసి మేలుకొనవే
రామ తులసి మేలుకొనవే
లక్ష్మీ తులసి మేలుకొనవే
మేలుకొనవమ్మా తులసమ్మ మేలుకొనవే !

   ఉదయం లేవగానే తన పక్కన ఉన్న నోట్ బుక్కులో ఆల్వారులు,  రుక్మిణమ్మ,  అయ్యంగార్లు కొందరినీ స్మరించుకునేవారు. ఆఖేట వెంకటేశ్వరుని పూజించేవారు పండుగలు పూజలు వ్రతాలు చేసేవారు పది రోజులలో పూర్తి రామాయణం పారాయణం చేసేవారు.  త్యాగయ్య పురందరదాసులు రచించిన కీర్తనల మాదిరిగా తాను ఆఖేట  వెంకటేశ్వరునిపై  కీర్తనలు రాయడానికి పూనుకున్నారు.  అలా రాసిన ఓ భాగం…

రవితేజడు నీవని రామానుజల పలుకు
ఆదినారాయణడని హనుమంతుని పలుకు
వాసు దేవుడవు నీవని వైద్యుని పలుకు
డేంకణీ  ధరుడవు  నీవని జయ విజయులు పలుకు
మేలుకో శ్రీ బేటనాథా  మేలుకో!

     ఒక ప్రవాహంలా  ఉండేది జయలక్ష్మి గారి రచనలు భర్త సహకారం జయలక్ష్మి గారికి ఉండేది ఆమె తమిళంలో రాసిన వాటిని వెంకట్రామయ్య గారు తెలుగులో చేతితో రాసేవారు తన చేత్తో ఆ బేటనాథుని సుప్రభాతాన్ని రాసి అందరికీ పంపి సమీక్షించమని వారు ఒక కుమ్మరి పిల్లవాడు కూడా తెలుగులో ఆమె రచనలు రాసేవాడు జయలక్ష్మి కుమారులు కూడా కొంత భాగాన్ని తెలుగు లిపిలో రాశారు రకరకాల ఛందస్సు ఉపయోగించి పద్యాలను రచించారు తల్లిని అనుసరించి కూతురు రమామణి గారు ప్రహేళికలు ద్విపద పద్యాలు రచించారు.  ఆమె సోదరులు తల్లి రచనలను విశ్లేషించి ఎన్నో పుస్తకాలు ముద్రించారు జయలక్ష్మి గారు రచించిన కీర్తనలను బంధువుల ఇంట్లో ఇళ్లలో మహిళలు నేర్చుకొని పాడేవారు ఇంత గొప్ప సమాచారం అంతా మొదటి ప్రకరణలో అమర్చారు. రంగరాజు పద్మ గారు ఆమె జీవితం తెలుసుకుంటే ఆ తర్వాత ఆమె కృషి మనకు మరింత సునాయాసంగా అర్థమవుతుందని వారి ఆశాభావం

రెండవ ప్రకరణంలో జయలక్ష్మి గారు రచించిన వివిధ కీర్తనలతో పాటు ఛందస్సు తెలుసుకొని 108 కి పైగా పద్యాలు రచించారు ఎక్కువ భాగం కందపద్యాలే. కందం రాయడం కష్టమైన పని అంటారు కానీ జయలక్ష్మి గారు సులువుగా రచించారు.

   పద్యాలను 108 కూర్చి 12 శతమని మాలలను ద్వాదశ శతకమని పేరుతో గ్రంథం గా తయారు చేశారు అరవిందమనే ప్రథమ శత మణి మాల కల్యాణోత్సవ ఉయ్యాల పాట గమనించినట్లయితే

  కుందనంపు కాళ్ళ చప్పరమందు
  పొందినటి నీలముల గొలుసుతోను
  అందమగు వజ్ర వేదిక మీద
  ఆఖేట నాథా నీవు ఉయ్యాలలూగు
అని  రచించారు .ఈ విధంగా ఒక్కొక్క శతమణి మాలకు ఒక్కొక్క పేరు అరవింద ,కదంబ ,నీలోత్పల ,కుండము ,చందూరము, వకుళ మాలిక,  మాలతీ మాల, మాధవి మాల, చంపకమాల సేమంతీక మాల ,పారిజాతమాల, తులసిమాల అనే ద్వాదశ శతమణి మాలలను ద్వితీయ ప్రకరణములో  పొందుపరిచారు.

    హృదయ ప్రకరణంలో ఖండకావ్యమని కొమ్మలు భాగవత ఫలాలు , అంతర్యామి అలసితి సొలసితి, సృష్టి సాకే నటరా మధురైన అంశాలను వివరించారు ఈ ప్రకరణంలో అంతర్యామి అలసితి సొలసితిలో   14 – 8 డా- 2017 న చివరి దశలో ఆమె పక్కన శ్రీనివాసన్ ,నరసింహన్ కుమారులు ఉన్నారని తెలియజేశారు.

     చతుర్ధ ప్రకరణములు అనుభవాలు జ్ఞాపకాలు పిల్ల తెమ్మెరలు

వరుసగా వివిధ సందర్భాలలో జయలక్ష్మి గారి అనుభవాలను వేంకటేశ్వరుని సాక్షాత్కారమును వెలుగు రేఖ కనిపించడం వంటి వాటితో విషాద పరిచారులలో రమామని రామమూర్తి శ్రీమతి ఉషా రామమూర్తి జానకి నరసింహ వీరంతా కుటుంబ సభ్యులు తమ అనుభవాలను పంచుకున్నారు ఏ విధంగా నడుస్తున్న చరిత్రలో వ్యాసం ప్రచురింపజేసారో వివరించారు.

    ఐదవ ప్రకరణంలో పట్టి కలలో వచ్చిన పుస్తక ఆవిష్కరణల వార్తలు జయలక్ష్మి గారిని ప్రశంసిస్తూ వచ్చిన కథనాలు పద్య పుష్పాంజలి శతజయంతి సంచిక శ్రీరామ కథామృతం జయలక్ష్మి గారి ఇంటర్వ్యూలు అన్ని పత్రికలలో వచ్చిన వాటి వివరాలను పొందుపరిచారు చేతిరాతతో రాయించి పుస్తకాలు ముద్రించి వేయ ప్రయాసలతో పుస్తకావిష్కరణలు చేయించారు ద్వాదశ శతమణి మాల సిడిలను ఆవిష్కరించారు.

    అస్వస్థులై 25 -1 – 2006న వేంకట రామయ్య గారు ఈ లోకాన్ని విడిచి వెళ్లారు తర్వాత ఈ పుస్తకంలో ఇదే ప్రకరణలో జయలక్ష్మి గారి వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా ఆవిష్కరించారు.

     షష్ఠమ ప్రకరణంలో ఆసక్తి కలిగించే అంశం ఆ కాలంలో అది తమిళనాడు తెలుగులో డిటిపి అందుబాటులో లేదు తమిళ మాధ్యమంలో చదివిన సంతానానికి రెండవ కుమార్తె రమామని పెద్ద కుమారుడు రామమూర్తిలకు మాత్రమే తెలుగు చదివారు 1988లో శ్రీ పెరంబదూర్ ఆది కేశవ పెరుమాళ్ దేవాలయ జీయర్ గారు దేనికని కోట ప్రవచనాలు చేయడానికి ఆకీట వెంకటేశ్వర స్వామి సన్నిధికి వచ్చి కొడుకు నరసింహాని చూపించిన జయలక్ష్మి గారి రాతప్రతి  చదివి పుస్తకం ప్రచురించినప్పుడు స్వయంగా ముందుమాట రచించడం ఇది గొప్ప ఆశీర్వచనం.

     నడుస్తున్న చరిత్ర పత్రికలో  తిరువళ్లిన్నేణి  మహత్మ్యం  అని వ్యాసం ప్రచురించబడింది. డేంకణి  కోట వెంకటేశ్వర స్వామి సుప్రభాతం తమిళం తెలుగు సంస్కృత భాషలలో టీకా తాత్పర్య సహితంగా ముద్రించబడింది.2007 లో ఆఖేట వేంకటేశ్వర స్వామి అష్టోత్తర శతనామావళి అది దేవాలయంలో ఆవిష్కరణ జరిగింది సుప్రభాతం సిడి సౌమ్య అనే గాయని చేత పాడించి సిడి రూపంలో విడుదల చేశారు 2018లో నిహాల్ స్వరంలో అష్టోత్తర శతనామావళి ఆడియో విడుదల  చేశారు ఆంధ్రజ్యోతిలో వీరి గురించి ముఖాముఖి వచ్చింది.

     జయలక్ష్మి గారి రచనలు మొదటి గ్రంథం ద్వాదశ శతమణి మాలలు 12 శతకమణులు  సంపుటి దీని ప్రత్యేకత ఏమిటంటే ప్రథమ తృతీయ దశమ ఏకాదశ ద్వాదశ శతమణులు కీర్తనలు . ద్వితీయ పంచమ, షష్ఠమ,  సప్తమ ,నవమ శతమణులు తెలుగు పద్యాలు శతమణి మాల పాశురము అనే తమిళ భాష రూపంలో ఉంది.

    మరొక ప్రత్యేక రచన శ్రీరామ కథామృతం 2019లో వెలువడింది మధ్య పుష్పాంజలి అనే పుస్తకం వందలాది కవీశ్వరులు జయలక్ష్మి గారి రచనలను అభినందించి వ్రాసిన పద్యాలు.

         ఈ విధంగా 39 సంవత్సరం నుండి రచనలు చేయడం ప్రారంభించిన జయలక్ష్మి గారు  12 శతకాలు ఐదు కావ్యాలు శ్రీరామ కథామృతం 30 ప్రబంధాలు కథనాలు 600 వరకు కీర్తనలు సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి , మంగళ శాసనం కరావలంబ స్తోత్రం మొదలైనవి రచించారు.  స్థల చరిత్ర సంక్షిప్తంగా పద్యాల రూపంలో సమగ్రంగా వచనంలో రచించారు.

    మరొక విశేషం తెలుగు భాషలోనే కాదు సంస్కృతం తమిళ కన్నడ భాషలలో కొన్ని కీర్తనలు పద్యాలు సెయ్యుళ్ళు  రాసారు. విశేషమైన వీరి కృషిని ఈ రకంగా దేనికని కోట కీర్తిశేషులు శ్రీమతి జయలక్ష్మి గారి గురించి భక్తి బండారి సాహిత్య సంబారి అనే శీర్షికతో ఒక పరిశోధనాత్మక గ్రంథానికి ఏ మాత్రం తీసుకోకుండా తమిళనాడు ఉన్న తెలుగు దేశాన్ని ఆమె సాహితీ సంపత్తిని మన ముందుకు తీసుకువచ్చారు రంగరాజు పద్మజ గారు .

   ఆమె శైలి సులభంగా అలతి అలతి పదాలతో అలవోకగా ఆద్యంతం చదివింపజేసింది.  తీసుకున్న ఇతివృత్తం ఎవరికి తెలియని ఒక విజ్ఞాన ఖనిని  అక్షరార్చనతో మన ముందు నిలబెట్టింది జయలక్ష్మి గారి రచనల  జాబితా లెక్కలేనంత ప్రింట్ లో ఆరు పేజీల వరకు ఉంది.

    ఆమె చేసిన సాహితీ కృషి అనన్యం అద్వితీయం అటువంటి మహత్తర మనిషి జీవితాన్ని రచనలను వెలుగులోకి తెచ్చిన రంగరాజు పద్మజ గారు అనే అనేక అనేక అభినందనలకు పాత్రులు ఈ పుస్తకం వెలికి తెచ్చిన కుమారులు పుస్తకం ఆవిష్కరణ అధ్యక్షత బాధ్యతలను చేపట్టి రంగరాజు పద్మజ గారిని గౌరవించిన అక్షర అధినేత్రి అయినంపూడి శ్రీ లక్ష్మీ గారికి మన పూర్వక అభినందనలు. వారి కుటుంబ సభ్యులకు శుభాభినందనలు. ఆశీస్సులు.

   మనం నిత్యం అనే కానేక సమస్యలతో సతమతమవుతూ ఉంటాం సమస్యలు లేనిది ఎవరికి ? కొందరికి కొంచెం. మరికొందరికి పుట్టెడు. ఎన్ని ఉన్నా మన సంకల్పంతో తాను దైవాన్ని నమ్మి 95 సంవత్సరాలు యక్షగానాలతో కీర్తనలతో పద్యాలతో సుప్రభాతాలతో,  అష్టోత్తరాలతో , రామ గానామృతంతో అనేక రూపాలుగా తన హృదయం తన అక్షరం పరిపూర్ణం చేసుకొని మనందరికీ ఆదర్శప్రాయంగా స్ఫూర్తిదాయకంగా నిలిచిన డేంకణి  కోట కీ.శే. శ్రీమతి జయలక్ష్మి గారికి  స్మృత్యంజలి  ఘటిద్దాం.

   .

November 24, 2025 3 comments
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • వేకువ పాట
  • చాణుక్యుడు ఆదిశంకరాచార్యుల ప్రభావం ఒక సింహావలోకనం
  • సనాతనమంటే?
  • సమాజానికి హానికరమైనవిగా కాక ఉపయుక్తమైన రచనలు చేయాలి- డా. జి. చెన్నకేశవరెడ్డి
  • సాహిత్యాకాశంలో నక్షత్రాక్షర తోరణం- అక్షరగీతం

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us