గురిజాల రామశేషయ్యగారు కవిపండితులు. రాశేకలం గా తెలుగు సాహిత్యలోకంలో సుప్రసిద్ధులు. తెలుగు భాషాభిమానులు. ముఖ్యం గా మాతృభాష తెలుగు లోనే కాదు సంస్కృతం, ఇంగ్లీష్, హిందీ భాషల్లో నిష్ణాతులు.తెలుగు భాషాసాహిత్యాల బోధన లో నలభై ఏళ్ల పైబడిన అనుభవం కలిగినవారు. ముఖ్యంగా భాషా విషయికంగా వాక్య భేదాలు, సంధులు , సమాసాలు , అలంకారాలు , ఛందస్సు వంటి వ్యాకరణ విశేషాలు అన్నీ ఔపోసన పట్టిన వారు. గేయ సాహిత్యం , ఆధునిక వచన కవితా వ్యూహనిర్మాణాలు తెలిసినవారు.
ఇవన్నీ ఉండగానే సరిపోదు. ఇటువంటి వారికి తమ సహాయాన్ని అడిగిన వారికి , సమాజం కోసం సాహిత్య పరంగా ఏదైనా సేవ చేయాలనే ఆలోచన తపన కూడా ఉండాలి… ఈ అంశాలు కూడా కలిగి ఉన్నవారు రామశేషయ్య గారు. కాబట్టే వీరు పాత తరం కొత్తతరం అనే భేద భావన లేకుండా అందరి రచనలూ బాగా అధ్యయనం చేస్తుంటారు .ప్రత్యేకంగా తమ ఇష్టానుసారం సమకాలీన సామాజిక కోణంలో విశ్లేషణ చేస్తూ స్పందిస్తూ ఉంటారు . ఇందులో భాగంగానే ఈ తెలంగాణ కావ్య ప్రతిభ శీర్షిక ద్వారా తెలుగు పద్యాలను , వచన కవితలను , సంస్కృత శ్లోకాలను పఠించి సంక్షిప్తంగా సమీక్ష చేస్తున్నారు . విని ఆనందించండి. సంపాదకులు మయూఖ
పవన్ కుమార్ గారు..నమస్తే…ఈరోజు మిమ్మల్ని ఇలా
కలుసుకొని మా పాఠకులకు పరిచయం చేయడం అదృష్టంగా భావిస్తున్నాను…
చెప్పండి….
1. మీరు ఎక్కడ జన్మించారు? మీ విద్యాభ్యాసం ఎక్కడ జరిగింది? మీ తల్లిదండ్రుల వివరాలు చెప్పండి..
జ: అందరికీ నమస్కారాలు. ముందుగా పాఠకులందరికీ కళాభివందనాలు. నేను పుట్టింది హైదరాబాద్ లో కానీ మా నాన్నగారి స్వస్థలం ప్రస్తుత యాదాద్రి జిల్లా రామన్నపేట గ్రామం. నేను 1వ తరగతి నుండి 3వ తరగతి వరకు అక్కడే చదివాను. తర్వాత నాట్యం నేర్చుకోవడానికి హైదరాబాద్ కి వచ్చాను.ఇక మిగిలిన విద్యాభ్యాసం అంతా ఇక్కడే కొనసాగింది.మా నాన్నగారి పేరు చేగొమ్మ రమేశ్ శర్మ. మా అమ్మగారి పేరు సుభద్ర. మా నాన్నగారు రామన్నపేట మండలంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో అర్చకులుగా పని చేసారు. సుమారు 4,5 గ్రామాల్లో పౌరోహిత్యం చేసేవారు.

2. అసలు మీరు ఈ నాట్య రంగాన్ని ఎంచుకోవడానికి మీ పూర్వీకుల సంస్కారం ఏమైనా ఉందా? నాట్యం నేర్చుకోవాలనే ఆలోచన మీకు ఎలా కలిగింది?
జ: మా ఇంట్లో ఎవరు కూడా నాట్యం నేర్చుకున్నవాళ్ళు
లేరు. పూర్వీకుల నుండి వచ్చింది కూడా కాదు. కానీ మా కుటుంబమంతా కళాభిమానులు. ముఖ్యంగా నేను ఈ నాట్యరంగానికి రావడానికి కారణం సాగర సంగమం చిత్రం అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కళాతపస్వి కె.విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చినటువంటి సాగర సంగమం చిత్రం లోని కమలహాసన్ డాన్స్ చూసి ప్రభావితుడినై నాట్యం నేర్చుకోవడం మొదలు పెట్టాను. నా మూడవ ఏటనే ఆ చిత్రంలోని ఓం నమశ్శివాయ పాటకు అనుగుణంగా అడుగులు వేస్తుంటే మా తాతగారు (మా అమ్మగారి నాన్నగారు) మధ్వాచారి శ్యామ్ సుందరశాస్త్రి గారు, ధర్మపురి వాస్తవ్యులు, ఆయన ధర్మపురి సంస్కృత కళాశాలలో అధ్యాపకులుగా పనిచేసారు. ఆయన నన్ను ఎలాగైనా కళాకారునిగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతో నన్ను హైదరాబాద్ తీసుకువచ్చారు. నాట్య శిక్షణ ఇప్పించారు.
3. మీరే కాకుండా మీ కుటుంబంలో ఇంకెవరైనా ఈ కళను నేర్చుకున్నారా?
జ: నేను కాకుండా మా ఇంట్లో మా పెదనాన్నగారి కూతురు కూడా కూచిపూడి నృత్యంలో డిప్లొమా చేసింది. కాకపోతే తనద్వారా అని చెప్పలేను. ఎవరి తోవ వారిదే. నేను నేర్చుకున్న పద్ధతికి, తన పద్ధతికి వ్యత్యాసం ఉంటుంది. ఇంక ఎవరూ లేరు.
4. ప్రముఖ నాట్యకారులు, భరత నాట్యానికే మకుటాయమానమైన నటరాజ రామకృష్ణ గారు మీ గురువులని విన్నాం…ఆ దిశగా మీ ప్రయాణం ఎలా జరిగింది?

జ : ముందు చెప్పినట్టుగా మా తాతగారు శ్యామ్ సుందర్ గారు 15, 20 రోజులు కారణ రీత్యా మా ఊరిలో ఉండవలసి వచ్చింది. అదే సమయంలో గ్రామస్తులు నా ప్రదర్శన ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని చూసిన మా తాతగారు ఏ శిక్షణ లేకుండానే నా మనవడు ఇంత బాగా
చేయగలుగుతున్నాడు. ఇక శిక్షణ ఇప్పిస్తే ఒక మంచి కళాకారుడిగా ఉన్నత స్థానాన్ని పొందుతాడని, ఎలాగైనా నాట్యకళను అభ్యసింప చేయాలనే ఉద్దేశ్యంతో తన స్నేహితులైనటువంటి ప్రముఖ నటి జమున గారిని సంప్రదించడం, ఆమె సలహా మేరకు, ఆమె సహకారంతో వారి కుతురైన స్రవంతి, నేను ఒకేసారి నటరాజ రామకృష్ణ గారి వద్ద నాట్య శిక్షణ ప్రారంభించడం జరిగింది. 1986 లో ఆ మహనీయుని వద్ద తొలిపూజ జరిపించుకొని ప్రదర్శన ఆరంభించాను.
5. మీరు ఇప్పటి వరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు? విదేశాల్లో కూడా ఏమైనా ప్రదర్శించారా?
జ: ఇప్పటి వరకు సుమారుగా దేశ విదేశాల్లో కలిపి ఆంధ్రనాట్యం, పేరిణి, అర్ధనారీశ్వర రూపాలలో 1000కి పైగా ప్రదర్శనలు ఇచ్చి ఉంటాను. విదేశాలలో అయితే అమెరికా, మలేషియా, దుబాయ్, శ్రీలంక, జపాన్ లలో అనేక ప్రదర్శనలు ఇచ్చాను. ఇక జపాన్ లో 15రోజులు కళాకృష్ణ గారి ఆధ్వర్యంలో సంగీత నాటక అకాడెమీ ద్వారా ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది.
6.మీ నాట్య కళాభిమానాన్ని మీ భార్య, కూతురు కూడా వారసత్వంగా తీసుకున్నారని తెలిసింది…ఆ ఆసక్తి వాళ్ళల్లో ఎలా కలిగింది?
జ: నా వారసత్వంగా నా కూతురు నాట్యం నేర్చుకుంది. నా శ్రీమతి కాదు. ఆమె తన చిన్నప్పటి నుంచీ అంటే మూడేళ్ళ వయసు నుండే నాట్యాన్ని నేర్చుకుంది. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు నేను డాన్సర్ ని కావడం, తను కూడా అప్పటికే ప్రముఖ నర్తకి అయి ఉండడం వల్ల జీవిత భాగస్వామి డాన్సర్ అయితే బాగుంటుందనే ఇద్దరి అభిప్రాయాలతో మాకు పెళ్లి నిశ్చయం జరిగింది. మా వారసత్వంగా మా అమ్మాయి కూడా నాట్యం నేర్చుకొని మాతో పాటు ఇప్పుడు ప్రదర్శనలు ఇస్తోంది.

7. పేరిణి శివతాండవంతో పాటు అర్ధనారీశ్వర రూపాన్ని అభినయించడం మీ ప్రత్యేకత. దీన్ని గురించి పూర్తిగా అర్థమయ్యేట్లు చెప్పండి…అది మీకు ఎలా సాధ్యమైంది?
జ: నేను ఆంధ్ర, పేరిణి ఈ రెండు నృత్యాలు నటరాజ రామకృష్ణ గారి దగ్గర నేర్చుకున్నాను. అలాగే కళాకృష్ణ గారి శిక్షణ కూడా పొందాను. ఇవే కాకుండా కొంతకాలం కథక్, కూచిపూడి నేర్చుకున్నాను. అంతగా కాదు కానీ అవగాహన కోసం కొంత కొంత నేర్చుకున్నా. అయితే కళాకృష్ణ గారు ‘సప్త తాండవాలు’ అని తన ఆధ్వర్యంలో కొత్తగా ప్రదర్శించాలి అనుకొని ఆ కాన్సెప్ట్ డిజైన్ చేశారు. అందులో ఈ అర్ధనారీశ్వరం ఒకటి. దీన్ని ప్రదర్శించడానికి నన్ను ఎంచుకోవడం జరిగింది. ఎందుకంటే చిన్నప్పటినుండీ నాట్యం – లాస్యం, పేరిణి- తాండవం రెండూ చేయడం అలవాటు నాకు. అంటే అటు నవ జనార్దన పారిజాతం, ఇటు భామా కలాపం రెండింటిలో ఆడవేషం వేసేవాన్ని. రెండూ సమానంగా ప్రదర్శిస్తూ ఉండడం, నాకు ఆయన అర్ధనారీశ్వర నృత్యం నేర్పించడానికి ముఖ్య కారణం. ఆయన నన్ను ఎంచుకున్నందుకు, ఇప్పుడు నేను దాన్ని ప్రచారం చేస్తూ ప్రదర్శిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది.
అందరికీ తెలిసిన అర్ధనారీశ్వర ప్రదర్శన అంత సులువైంది కాదు. ఒకవైపు లాస్యం, మరోవైపు తాండవం రెండింటినీ ఏక కాలంలో, క్షణాల వ్యవధిలో అభినయం మారుస్తూ, ఇటు పార్వతి, అటు శివుని అనుకరిస్తూ వారి తత్వాన్ని చూపిస్తుండాలి. మొదటి నుండీ స్త్రీలను గౌరవించడం నా లక్షణం. ముఖ్యంగా ప్రేరణ కలిగించింది ఏంటంటే శివుని తత్వం. ఎందుకంటే స్త్రీ సమానత్వాన్ని చాటుతూ తన శరీరంలోని అర్ధ భాగాన్ని భార్యకిచ్చి ఋజువు చేయడం జరిగింది. ఇది నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. అటువంటి అద్భుతమైన తత్వాన్ని ప్రదర్శించడం నాకు ఎంతో ఇష్టం. అదే దిశగా వీలైనంత ఎక్కువగా దీన్ని ప్రదర్శించ డానికే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నాను. భగవంతుని దయ వలన నా ప్రదర్శనకు ప్రేక్షకుల నుండి అంతటి స్పందన రావడం, ఆప్రదర్శనలకే ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతోంది. ప్రత్యేకంగా ఒక అర్ధనారీశ్వర కళాకారునిగా గుర్తింపు తెచ్చుకోవడం నాకు ఎంతో సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తోంది.

8. మీరు కాక ఈ నృత్యాన్ని ప్రదర్శించేవాళ్ళు ఇంకా ఎవరైనా ఉన్నారా?
జ: అర్ధనారీశ్వర నృత్యాన్ని ప్రదర్శించేవాళ్ళు వున్నారు. లేరని కాదు. కానీ వేళ్లల్లో లెక్క బెట్టగలిగేంత మంది మాత్రమే వున్నారు. అందులో నాకు బాగా తెలిసినంతవరకు అర్ధనారీశ్వరం వెంకట్ మరియు వెంపటి చినసత్యం గారి అబ్బాయి వాళ్ళిద్దరి అర్ధ నారీశ్వర నృత్యం చూడడం జరిగింది. అయితే వారిద్దరూ కూచిపూడి సాంప్రదాయంలో ప్రదర్శిస్తారు. నాది నటరాజ రామకృష్ణ గారి పద్ధతి. అలా ఎందుకంటున్నానంటే ఇందులో సాహిత్యం గానీ జతులు గానీ ఆయన రూపకల్పన చేసినటువంటిది. ఆయన రచించిన ‘ పేరిణి శివతాండవం’ లో ఈ జతులు, సాహిత్యం మనం చూడొచ్చు. ఆయన శిష్యుడిగా ఇదే నేను చేసేది. కాబట్టి ఈ పద్ధతిలో చేసే వాణ్ణి నేనొక్కడినే అని చెప్పడంలో సందేహం లేదు. ఇంకా ఉన్నారా అంటే ఉండొచ్చు. కానీ మంచి గుర్తింపు తెచ్చుకున్న వాణ్ణి మాత్రం నేనే. కళాకృష్ణ గారు 20 సంవత్సరాల క్రింద ఈ అర్ధ నారీశ్వర నృత్యాన్ని (ఇప్పుడు నేను ప్రదర్శిస్తున్న పద్ధతిలో) లండన్ టెలివిజన్ కోసం రికార్డింగ్ చేయించడం జరిగింది. దాన్నిఆయన లండన్ టెలివిజన్ కోసం ప్రదర్శించి, ఆ రికార్డింగ్ ని, ఆ కాస్ట్యూమ్స్ ని నాకు ఇవ్వడం జరిగింది.అప్పటినుండీ దాన్ని కొనసాగిస్తూ వాటిని ఆయన వారసత్వంగా ఈ నృత్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నాను.
9. నాట్య శాస్త్రాన్ని అభ్యసించేటప్పుడు మీకు కలిగిన అనుభవాలు ఎలాంటివి?
జ: నాట్యం నేర్చుకోవడంతో అనుభవమంటే అదొక ప్రత్యేకమైన మార్గం. మిగిలిన విద్యలు అంటే ఉ:- సంగీతం. దీనికి గొంతు బాగా ఉండి, రాగాలు, తాళాలు, శ్రుతుల పైన పట్టు ఉంటే అద్భుతమైన కళాకారులు అవ్వొచ్చు. కాకపోతే నాట్యానికి అవన్నీ ఉండడంతో పాటుగా ఇటు శరీరాన్ని కూడా సరియైన పద్ధతిలో కదిలిస్తూ ఉండగలగడం, ముద్రలు, అభినయాలు ప్రదర్శించడం చాలా అవసరం. చతుర్విధ అభినయాల్లో ఏ ఒక్కటీ సరిగ్గా లేకున్నా ఆ ప్రదర్శన రక్తి కట్టదు. అందువల్ల ఆ చతుర్విధ అభినయాలు నేర్చుకోవడం వల్ల నాట్యం రాణించడమే కాక మన జీవితంలో ఎన్నింటికో కూడా అది ఉపయోగపడుతుంది. సమాజంలో ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు పొందడం సాధ్యమవుతుంది. మనం వేసుకునే దుస్తులు మన వ్యక్తిత్వాన్ని నిర్దేశిస్తాయి. ముఖ్యంగా నాట్యంలో ఆహార్యానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. దీనివల్ల మనం ఎక్కడ ఎలాంటి దుస్తులు ధరించాలి, ఎక్కడ, ఎవరితో ఎలా ఉండాలి, ఎలా తయారవ్వాలి అన్నది తెలుస్తుంది. ఇంకొకటి సంస్కారం మెరుగు పడుతుంది. ఒక నాట్యమే కాదు. భారతీయ శాస్త్ర కళలు ఏవైనా అవి సంస్కారాన్ని పెంచుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు.లలితకళలే కావొచ్చు, వాయిద్య పరికరాలే కావొచ్చు..ఏదైనా భారతీయ శాస్త్ర కళలు నేర్చుకున్నవారిలో అద్భుతమైన సంస్కారం కనిపిస్తుంది. అది మన భారత శాస్త్రీయ కళల గొప్పదనం. ఇది అభ్యసించేటప్పుడు ఎన్నో ఒడిదుడుకులను నేను కూడా ఎదుర్కొన్నాను. ప్రతీ రంగంలో కూడా ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. అలాగే నేనూ శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి వచ్చింది. శరీరం ఒక్కొక్కసారి అనుకూలించకపోవడం అంటే నాట్యంలో తల నుండి పాదాలదాకా అనుకూలంగా ఉండాలి. అయితేనే మనం ఈ నాట్యాన్ని చక్కగా ప్రదర్శించగలుగుతాం. ఒక్కొక్కసారి కాళ్లు గాని, చేతులు గాని సరిగా పనిచేయకపోవటం ఇలాంటివి ఎన్నో ఇబ్బందులు. అన్నింటినీ తట్టుకోగలగాలి. మన బాధలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మర్చిపోయి వేదిక మీద ప్రదర్శించే ముందు ప్రేక్షకుల ముందు వాళ్ళని మెప్పించగలిగేలా, వాళ్లకు సంతోషం కలిగించేలాగా మనం మారి ప్రదర్శించాలని నా ఉద్దేశం. మన వ్యక్తిగత సమస్యలు వేదిక మీద చూపించకూడదు. ఒక్కసారి వేదిక మీదకు ఎక్కామంటే కళాకారునిగా మారిపోవాలి. ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయగలగాలి. అప్పుడే ప్రేక్షకులను రక్తి కట్టించగలుగుతాము. అలా చేయడం కోసం ఎన్నోసార్లు చాలా సమస్యలను ఎదుర్కొన్నాను. కాకపోతే అన్నింటిని అధిగమించి ప్రదర్శిస్తూ వస్తున్నాను. ఇంకా అధిగమించాల్సింది చాలా ఉంది ప్రస్తుతం ఈ స్థాయికి రావడం ఆ భగవంతుని అనుగ్రహంగా భావిస్తున్నాను.

10. సహజంగా ఒక వ్యక్తి పూర్తి స్థాయిలో నాట్యం నేర్చుకోవాలంటే ఎలాంటి సాధన అవసరం? పరిపూర్ణ నాట్య కళాకారులు అవడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది?
జ: పరిపూర్ణమైన నృత్యకారుడవడం అనడానికి ఎంత సమయం పడుతుందో చెప్పలేం. వాళ్ళు నేర్చుకునే నృత్యాన్ని బట్టి, వాళ్ళ గురువులను బట్టి, వారి శరీర అనుకూలతలను బట్టి అంటే అన్నింటిని ఆధారంగా చేసుకుని ఉంటుంది. కొందరు రెండేళ్లలోనే మంచి కళాకారులుగా ప్రదర్శనలు ఇస్తుంటారు. మరి కొంతమంది అయిదు, పదిహేను సంవత్సరాలు నేర్చుకున్నా కూడా ఏదో ప్రదర్శిస్తారు. కానీ వాళ్ళ ప్రదర్శన అంత రక్తి కట్టించేలాగా ఉండదు. మరి కొంతమంది నేర్చుకోకుండా అద్భుతమైన ప్రదర్శనలు ఇచ్చే వాళ్లయి ఉంటారు. అంటే ఇది ఒక సమయం అంటూ చెప్పలేము. కాకపోతే మీరు అడిగారు కాబట్టి చెబుతున్నా. ఇప్పుడు విద్యారంగంలో మన ఈ కళలు కూడా చేర్చడం వల్ల ఏదైతే మనకు మ్యూజిక్ అండ్ డ్యాన్స్ కాలేజీలలో కోర్సులు పెట్టడం జరిగిందో, ఆ కోర్సుల్లో సర్టిఫికెట్ కోర్సు చేయడానికి నాలుగు సంవత్సరాలు, డిప్లొమా కోర్సుకి మరి రెండు సంవత్సరాలు కలిపి మొత్తం ఆరు సంవత్సరాలు సర్టిఫికెట్ మరియు డిప్లొమా కోర్సులు సాధించడానికి టైం పడుతుంది. కనుక ఆ ఆరు సంవత్సరాలు శ్రద్ధగా నేర్చుకున్నట్టయితే ఒక మంచి కళాకారుడు అవడంలో ఎలాంటి ఆశ్చర్యం ఉండదు.
10. వాగ్దేవి ఆర్ట్స్ అకాడెమీ ఆలోచన ఎప్పుడు వచ్చింది? ఎలా రూపుదిద్దుకొంది?
జ: నేను సుమారుగా 10 ఏళ్లకు పైగా నాట్యం నేర్చుకున్న తర్వాత చిన్న చిన్న స్కూల్స్ లో, ఊర్లో కొంతమందికి నాట్యం నేర్పించడం ప్రారంభించాను. నాకు వచ్చినటువంటి విద్యను వాళ్లకు నేర్పించేవాడిని. ముఖ్యంగా వేసవి సెలవుల్లో ‘కళాపరిచయం’ అని అప్పట్లో ప్రభుత్వం ప్రారంభించినప్పుడు నేను ప్రతీ సంవత్సరం అందులో ఎంతో మంది విద్యార్థులకు నృత్యాన్ని పరిచయం చేయడం జరిగింది. అలా అలా స్కూల్స్ లో వార్షికోత్సవాలకు పిల్లల చేత నాట్య ప్రదర్శనలు చేయించేవాడిని. పెళ్లయిన తర్వాత ఆ భగవంతుని దయవలన నా జీవితంలో ప్రవేశించిన నా భార్య కూడా నర్తకి అవ్వడం వలన ఇద్దరము కలిసి వాగ్దేవి అకాడమీ స్థాపించాము. దీని ద్వారా మాకు తెలిసిన ఈ నృత్య కళను పదిమందికీ పంచాలని, అలా ఈ కళను తర్వాతి తరాల వారికి నిలబెట్టాలనే సదాశయంతో దీన్ని స్థాపించి సంతృప్తులమయ్యాము. వాగ్దేవి అని ఎందుకు పెట్టుకున్నాను అంటే ఆ పేరు సాక్షాత్తు అమ్మవారి స్వరూపం కావడం, విద్యా దేవత అయిన సరస్వతి పేరు పెట్టుకోవడం వలన ఆ తల్లి అనుగ్రహం మామీద పరిపూర్ణంగా ఉండాలని అకాడె మీకి ఆ పేరు పెట్టడం జరిగింది.
11. ప్రస్తుతం ఈ అకాడెమీలో ఎంతమంది నాట్యకళను అభ్యసిస్తున్నారు? తల్లిదండ్రుల ప్రోత్సాహం ఏ రకంగా ఉంది? దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు?
జ: ఈ అకాడెమీ ద్వారా సుమారుగా 200 మందికి పైగా విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగింది. కాకపోతే మనందరికీ తెలుసు కరోనా మహమ్మారి అన్ని రంగాలతో పాటు కళా రంగంలో ఉన్న వారిని కూడా చాలా దెబ్బతీసింది. ప్రదర్శనలకు సరైన అవకాశాలు రాకపోవడం, విద్యార్థులు భయపడి క్లాసులకు రాకపోవడం… ఇప్పటికీ కూడా కొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలను పంపించడానికి భయపడుతున్నారు. ఇప్పుడిప్పుడే అటువంటి పరిస్థితులు మెరుగు పడుతున్నాయి. కరోనాకి ముందు సుమారు మా దగ్గర 30 నుండి 40 మంది విద్యార్థులు నిరంతరం నేర్చుకుంటూ ఉండేవారు. కరోనా తర్వాత ఆ సంఖ్య బాగా తగ్గిపోయింది. పదుల సంఖ్యలో ఇప్పుడు విద్యార్థులు రావడం జరుగుతుంది. అది కూడా అతి కష్టం మీద. ఎందుకంటే కరోనా పరిస్థితులు మెరుగైన తర్వాత విద్యా వ్యవస్థలో కూడా చాలా మార్పులు వచ్చాయి. అకడమిక్స్ లో ఇంతకుముందు విద్యార్థులపై ఇంత ఒత్తిడి ఉండేది కాదు. రెండు సంవత్సరాల అకడమిక్స్ దెబ్బ తినడం వలన చిన్న చిన్న స్కూల్స్ నుంచి పేరుపొందిన స్కూల్స్ వరకు చదువు పైన బాగా కాన్సన్ట్రేషన్ చేయించడం, దాని కోసం పిల్లలను ఎక్కువ సమయం స్కూల్స్ లో ఉండేలా చేయడం, హోంవర్క్ ఎక్కువగా ఇవ్వడం, ఇలాంటి వాటివల్ల ఆక్టివిటీస్ కి సమయం ఎక్కువ కేటాయించలేకపోవడం వల్ల ఇలాంటి అకాడెమీలకు రావడం తగ్గింది. రాను రాను పరిస్థితులు మెరుగు పడతాయని అనుకుంటున్నాం. కాకపోతే ఇంకా మార్పు రావాలి. ఎవరికైతే వీటిపట్ల అవగాహన ఉందో వారే తమ పిల్లల్ని శిక్షణ కోసం పంపిస్తున్నారు.మేము ప్రైవేట్ గా కూడా సర్టిఫికెట్, డిప్లొమా కోర్సులను ఆంధ్రనాట్యం, పేరిణి, కూచిపూడి ఈ మూడు నృత్యాలలో చేయించడం జరుగుతోంది. నేను ప్రస్తుతం శ్రీ భక్త రామదాస ప్రభుత్వ నృత్య కళాశాలలో గత ఆరు సంవత్సరాలుగా పేరిణి అధ్యాపకునిగా పని చేస్తున్నాను. అక్కడ పేరిణి నృత్యానికి సంబంధించిన విద్యార్థులకు సర్టిఫికెట్ కోర్సుల్లో ఉత్తీర్ణులు అవ్వడానికి శిక్షణ ఇస్తున్నాను. కళాశాల విద్యార్థులే కావచ్చు అకాడెమీ విద్యార్థులే కావచ్చు. అందరూ కూడా నా ప్రతి ప్రదర్శనలో పాల్గొంటూ మా అకాడెమీ ద్వారా ఇచ్చే ప్రదర్శనలన్నింటిలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇంకొక విషయం ఏమిటంటే వాగ్దేవి ఆర్ట్స్ కేవలం నాట్యం నేర్పించడమే కాక కళా రంగంలో మన సంస్కృతి సంప్రదాయాన్ని ముందు తరాల వారికి నేర్పించే ఉద్దేశంతో స్థాపించినటువంటిది కాబట్టి మా వంతుగా మా శక్తికి మించి ఒక చిత్రాన్ని నిర్మించడం జరిగింది.2019వ సంవత్సరంలో మా సంస్థ తరఫున ‘నర్తన’ అనే చిత్రాన్ని నిర్మించాము. ఆ చిత్రంలో..ఒక నాట్యమే ఆధారంగా జీవిస్తున్న కుటుంబంలో ఉండే ఎమోషన్స్ అంటే ఒక గురువుకి ఉండాల్సిన లక్షణాలు, ఉండకూడనివి ఏమిటి? నాట్యం నేర్చుకోవాలనుకునే విద్యార్థికి ఉండాల్సిన లక్షణాలు ఏమిటి? అనే ముఖ్యమైన అంశాలే కాకుండా ఒక కుటుంబంలో ఉండే సంబంధ బాంధవ్యాలను చూపిస్తూ ఈ చిత్రాన్ని నిర్మించాం. దీనికి ఎంతో గొప్ప గుర్తింపు వచ్చింది ఎవరైతే కొంతమంది గొప్ప పేరు గడించిన నాట్య కళాకారులు ఉన్నారో వారు ఈ చిత్రాన్ని చూసి విశ్వనాథ గారి జోనల్లో చేయడం జరిగిందని మెచ్చుకున్నారు. మీరు అందరూ కూడా తప్పకుండా ఈ చిత్రాన్ని చూసి మీ యొక్క అభిమానాన్ని తెలుపుతారని అనుకుంటున్నాను. ఇది యూట్యూబ్ ఛానల్ లో అందుబాటులో ఉంది. మా శక్తికి మించి ఈ చిత్రాన్ని నిర్మించాము. ‘నర్తన ఇండిపెండెంట్’ అనే చిత్రం మీరందరూ చూడాలని కోరుకుంటున్నాను. నేను, నా భార్య, నా కూతురు నటించిన ఈ చిత్రంలో నా కూతురుకు తాతగా కళా కృష్ణ గారు నటించడం గొప్ప విషయం.

12. భవిష్యత్తులో ఈ అకాడెమీని ఇతర ప్రాంతాల్లో కూడా వ్యాప్తిలోకి తేవాలనుకుంటున్నారా?
జ: మా అకాడెమీ ఒక ప్రాంతానికి పరిమితం కాదు. అలా పరిమితం చేయాలని కూడా అనుకోవడం లేదు. ఇప్పుడు ప్రస్తుతం మేము కొత్తపేటలో నివాసం ఉంటున్నాము. ఇక్కడ, అలాగే అంబర్ పేటలో నా శ్రీమతి సంధ్య వాగ్దేవి ఆర్ట్స్ అకాడమీ బ్రాంచ్ లో క్లాసులు తీసుకుంటుంది. అలాగే నా శిష్యురాలు ఒకరు అమెరికాలో కూడా ఈ అకాడెమీ పేరు మీద నృత్య శిక్షణ ఇస్తున్నారు. ఇంకా మా శక్తిని బట్టి వీలైనంత మేరకు బ్రాంచ్ లు ఓపెన్ చేసి విస్తృత పరచాలని అనుకుంటున్నాము.
13. నాట్య కళా ప్రావీణ్యత పొందిన మీకు ఎటువంటి సత్కారాలు లభించాయి? పొందిన పురస్కారాలు ఏవి?
జ: నాకు ఇప్పటివరకు మంచి గుర్తింపు, గౌరవం నాట్యకుల ద్వారా లభించింది. ‘నాట్య కుమార’ అనే బిరుదు ‘పేరిణి నాట్య రత్నాకర’, ‘యువ కళా రత్న’ మరియు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రతిభా పురస్కారం నేను పొందడం జరిగింది. ఇంకా అనేక ఇతర సంస్థల నుండి ప్రశంసలు, సన్మానాలు పొందడం జరిగింది. అలాగే నా శ్రీమతి కూడా ‘నాట్య శిరోమణి’, ‘యువ కళారత్న’ వంటి అనేక అవార్డులను సన్మానాలను పొందడం జరిగింది. నా కూతురు శ్రీ నర్తన సి.సి.ఆర్.టి స్కాలర్ షిప్ ను పొందింది. ప్రస్తుతం తాను ఇంటర్మీడియట్ చదువుతోంది.
14.రామప్ప దేవాలయం ముందు 1985 ,86 లలో అనుకుంటా… వందమంది కళాకారులు ఒకే వేదికపై ఒక్కసారి పెద్ద నాట్య ప్రదర్శన చేసారు. అప్పుడు మీరు పాల్గొన్నారా? ఆ విశేషాలు ఈనాటి తరానికి తెలియచెప్పండి.
జ. అవును జరిగింది. అప్పుడప్పుడే నేను నటరాజ రామకృష్ణ గారి దగ్గర నృత్య శిక్షణ ప్రారంభించి ఉన్నాను. అప్పుడు కేవలం నా వయసు ఐదు సంవత్సరాలు ఉండడం వలన వారు నన్ను రామప్పలో జరిగిన ఆ కార్యక్రమానికి తీసుకెళ్లారు. ఆ ప్రదర్శన చూడడం మాత్రమే జరిగింది. అలాగని అవగాహన లేదు అనలేను. కాకపోతే లీలగా కాస్త గుర్తుంది. ఒక జాతర లాగా వేల మంది ప్రజలు అక్కడికి రావడం, ఆ వేదిక పైన 100 మంది ఒకేసారిగా అద్భుతమైన నాట్యాన్ని ప్రదర్శించడం, ఒక ముగ్గురు, నలుగురు మార్దంగీకులు మృదంగాన్ని వాయిస్తూ ఉంటే అద్భుతమైన ధ్వని రావడం.. ప్రజలందరిలో ఒక వైబ్రేషన్ కలిగించడం.. ఆ కళాకారులు ప్రదర్శిస్తూ ఉంటే ప్రకృతి అంతా పులకించి పోవడం.నిజంగా ఆ వయసులో అంతకుమించి అనుభవం కూడా ఉండదు. కానీ ఇవన్నీ లీలగా నాకు గుర్తున్న విషయాలు. అప్పటికే ప్రసిద్ధి పొందిన పేరిణి నాట్యకళాకారులు విఠల్ గారు ఆ ప్రదర్శనలో పాల్గొనడం గుర్తుంది. అప్పుడు నటరాజ రామకృష్ణ గారి వద్ద ఉన్న శిష్యుల్లో నేను చిన్నవాడిని కనుక అందరూ నన్ను ఆత్మీయంగా చూసేవారు.
15. భరత నాట్య రీతుల్లో ఏవి ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నాయి?
జ: భారత శాస్త్రీయ నృత్యాల్లో అంటే క్లాసికల్ డాన్స్ అనగానే మన భారత దేశంలో భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సి, కథాకళి, మోహినీ ఆట్టం ముందుగా గుర్తొస్తాయి. అయితే ఇవే కాకుండా ఇంకా ఎన్నో సంప్రదాయాలు ఉన్నాయి. కానీ అవన్నీ ఇంకా గుర్తింపు లోకి రావాల్సిన ఆవశ్యకత ఎంతగానో ఉంది. వాటిలో పేరిణి ఒకటి, ఆంధ్రనాట్యం కూడా ఒకటి. గుర్తింపు ఉన్నప్పటికీ సంగీత నాటక అకాడెమీ గుర్తింపు కోసం మేము మా శాయ శక్తులా కృషి చేస్తున్నాము. అలాగే పేరిణి నాట్యానికి కూడా మంచి గుర్తింపు వచ్చి సంగీత నాటక అకాడెమీల ద్వారా గుర్తింపు పొంది భావితరాల వారికి భారత శాస్త్రీయ నృత్యాల్లో ఇవి కూడా చేర్పించి మంచి స్థానాన్ని పొందే విధంగా ఉంటాయని ఆశిస్తున్నాను. ఒక శుభకరమైన విషయం ఏంటంటే ఇటీవల సంగీత నాటక అకాడమీ ఇచ్చేటువంటి యువపురస్కారాలు ఏవైతే ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పేరు మీద ఇస్తున్నారో, తొలిసారిగా పేరిణి నాట్యానికి గాను రాజ్ కుమార్ గారికి ఆ పురస్కారం రావడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. ఒకసారి ఇచ్చారంటే దానిని గుర్తించారనే కదా! అలాగే ఇంకా ఎన్నో పురస్కారాలు పేరిణి కళాకారులకు రావాలని ఆశిస్తూ అలాగే కళాకారులతో పాటుగా నాట్యానికి మంచి గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నాను.
16. మీరు ప్రదర్శించే నాట్యంలో కొత్త విధానాలను ఏమైనా ప్రవేశపెట్టాలనుకుంటున్నారా ?
జ: పేరిణి నృత్యం లో మూడు నూతన అంశాలను గురువు కళా కృష్ణ గారి నేతృత్వంలో నేను, నా శ్రీమతి కలిసి రూపకల్పన చేయడం జరిగింది. వాటిలో సప్త తాళ రాగ స్వర నర్తన ఒకటి. అలాగే హంసగతి రెండవది. మూడవది సూర్య నమస్కారాలు. ఈ మూడు అంశాలని మేము కొత్త రీతులుగా మా విద్యార్థులకు నేర్పించి, ప్రదర్శిస్తున్నాం. ఇవి ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ కి అంటే పిల్లలకు ఇతరములైన వాటి పట్ల సమయం చాలా తక్కువ అయింది. అకడమిక్స్ వైపు ఎక్కువ సమయాన్ని కేటాయించడం వల్ల వేరే శిక్షణకు సమయం లేకుండా పోయింది. కాబట్టి మానసికంగా శారీరకంగా దృఢత్వాన్ని పొందే విధంగా, యోగాభ్యాసం ముందు తరాలకు తెలిసే విధంగా, నాట్య రూపంలో మేము యోగాలో ఉపయోగించే సూర్యనమస్కారాలను నృత్య సంప్రదాయాల్లో చేయాలనుకున్నాం. సహజంగా యోగాలో సూర్య నమస్కారాలకి రాగం,తాళం,లయ ఉపయోగించరు. మేము అలా కాకుండా ఐదు గతులలో,జతులతో సహితంగా ఈ సూర్య నమస్కారాలను మిళితం చేసి ఈ అంశాన్ని రూపకల్పన చేశాము. అలాగే సంగీతంలో గాని, నాట్యంలో గాని ఒకే అంశంలో లేదా ఒక కీర్తనలో లేదా ఒక జావళిలో గాని ఏడు తాళాలను ఉపయోగించడం చాలా అరుదు. అలా మేము ఒకే అంశంలో సప్తతాళాలని ఉపయోగించి, వాటికి అనుకూలమైన ఏడు రాగాలని తీసుకొని వాటికి సంబంధించిన స్వరాలు, ఆ తాళాలకు సంబంధించిన జతులను రూపకల్పన చేసి దానిని ప్రదర్శించడం జరిగింది. ఇక మూడవ అంశం హంసగతి .దీనిలో పేరిణి పంచాంగాలుగా ప్రదర్శించడం జరుగుతుంది. ఇందులో భావాశ్రయమంటే అనుకరణ. మనుషుల లాగా కాకుండా జంతువులుగా పక్షులుగా అనుకరించడం అనేది భావాశ్రయం ప్రత్యేకత. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఒక హంస బ్రహ్మ లోకంలో సరస్వతి అమ్మవారు అద్భుతంగా వీణను వాయిస్తూ ఉంటే ఆ వచ్చే నాదాన్ని విని మైమరచి ఒక నర్తకి గా మారి ఆ వీణా నాదానికి అనుగుణంగా నృత్యం చేస్తే ఎలా ఉంటుందన్న ఒక కాన్సెప్ట్ తీసుకొని హంసగతి అన్న అంశాన్ని రూపొందించడం జరిగింది. ఈ మూడు నృత్యంశాలు కూడా మాకు మంచి గుర్తింపును తెచ్చాయి. దీనిని తిలకించిన కళాకారులందరూ ఎంతగానో మెచ్చుకోవడం జరిగింది ఇంకా దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి మేము ప్రయత్నం చేస్తాం.

17. ఆరోగ్య పరమైన విధానంలో ఈ నాట్యకళ ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఏ వయసు నుండి ఈ కళను అభ్యసిస్తే బాగుంటుందో చెప్పండి.?
జ: మంచి ప్రశ్న అడిగారు. ఈ రోజుల్లో ఎంతోమంది ఆరోగ్యం కోసమని జిమ్ అని, యోగా అని, మెడిటేషన్ అని రకరకాల వ్యాయామ శాలలకు, ధ్యాన కేంద్రాలకు వెళ్తున్నారు. అంటే మనం మన ఆరోగ్యం కోసం మనకు మనం చేసుకునే వాటిని కాకుండా ఇతరులపై ఆధారపడుతున్నాం. ఇక నాట్యం విషయానికొస్తే అది ఏదో చూసి ఆనందించే కళ కాదు. దీని ద్వారా శరీరమే కాకుండా మానసిక దృఢత్వం కలుగుతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. అన్నిరకాల వయస్సుల వారికి మానసిక ఒత్తిడులు దూరమవుతాయి. ముఖ్యంగా విద్యార్థులకు కాన్సన్ట్రేషన్ పవర్ పెరుగుతుంది. ఎలాగంటే క్షణాల్లో హావభావాలను ఒలికించడానికి, కళ్ళు, చేతులు, తిప్పడం, అనుగుణంగా అడుగులను వేయడం.. వీటివల్ల ధ్యాస అంతా అక్కడే ఉంచాల్సి ఉంటుంది. ఇది వారికి చాలా ఉపయుక్తంగా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఒక కళను నేర్చుకున్నవారికి,
లేనివారికి జీవన విధాన శైలిలో చాలా తేడా మనం గమనించవచ్చు. సభ్యత, సంస్కారం, వినయం, మాటతీరు, అణకువ ఇవన్నీ కళతోటే కళాకారునికిఅబ్బుతాయి. అది ఒక అదృష్టంగా భావించవచ్చు. ఇక వయసు అంటారా! ఐదేళ్ళ వయసు నుండి నేర్పడం మొదలు పెడితే బాగుంటుంది. ఎందుకంటే
ఆ వయసులో మనం చెప్పే విషయాన్ని వాళ్ళు అర్థం చేసుకునే వీలు ఉంటుంది.
18. ప్రస్తుత సమాజంలో లలితకళల పట్ల ఉన్న ఆదరణ ఎలాంటిది?
జ: ప్రస్తుత సమాజంలో లలిత కళల పట్ల ఆదరణ బాగానే ఉంది అని చెప్పొచ్చు. అంటే ఇది ఒక కాలచక్రం అంతే. కొంతకాలం కొన్ని నడుస్తాయి. అవి పోయి మళ్ళీ పాతవి ముందుకు వస్తాయి. తిరుగుతూనే ఉంటుంది కాలచక్రం. మొన్నటిదాకా మనం చూసాము విదేశీ సంస్కృతికి బాగా అలవాటు పడి మళ్ళీ మన శాస్త్రీయ కళల పట్ల ,మొగ్గు చూపిస్తున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే శాస్త్రీయ కళా ప్రదర్శనలు పెరుగుతూ వస్తున్నాయి. పిల్లలకి తల్లిదండ్రులు వాటిలో శిక్షణ ఇప్పించడానికి ముందుకు వస్తూనే ఉన్నారు. పిల్లలు కూడా శాస్త్రీయ నృత్యాలలో శాస్త్రీయ సంగీతాన్ని, శాస్త్రీయ కళలను నేర్చుకునే దిశగా ముందుకు వస్తున్నారు మనదేశంలోనే కాక ఇతర దేశాల్లో కూడా భారత దేశ శాస్త్రీయ నృత్య సంగీత సంప్రదాయాలకి ఆదరణ చాలా ఉంది. మనం దాని నిలబెట్టుకొని ఇంకా ముందుకు వెళ్లాలి. నేను తల్లిదండ్రులందరినీ కోరుకునేది ఒక్కటే. మీ ఇంట్లో ఉన్న ప్రతి చిన్నారికి ఏదో ఒకటి.. సంగీతమైనా, నృత్యమైనా ఏదో ఒక భారత శాస్త్రీయ కళని నేర్పించి, ముందు తరాల వారు ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసే విధంగా వారిని ప్రోత్సహిస్తారు అని ఆశిస్తున్నాను
19. ఇప్పుడున్న పరిస్థితుల్లో కళలు నేర్చుకునేవారికి భవిష్యత్తు వుందంటారా?
జ: తప్పకుండా ఉందని చెప్పగలను. ప్రభుత్వం కూడా శాస్త్రీయ కళల అభివృద్ధికి దోహదం చేస్తోంది. కాకపోతే వాళ్ళకున్న పరిధిలో వాళ్ళు చేస్తున్నారు. ఇటు స్వచ్ఛంద సంస్థలు కూడా కళాకారులను ప్రోత్సహిస్తూ ఎన్నో ప్రదర్శనలు ఇప్పించడం, అవార్డులను ఇప్పించడం, గుర్తింపు తేవడం, ఆర్థికంగా సహాయం చేయడం, తెలుగు యూనివర్సిటీ నుండి కావచ్చు, సెంట్రల్ యూనివర్సిటీ కావచ్చు, అనేక సంస్థల నుండి కావచ్చు,కళాశాలల్లో కోర్సుల రూపంలో పి. హెచ్.డి ల వరకు పరీక్షలు నిర్వహిస్తూ అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళుతున్నాయి. వీటి ద్వారా భవిష్యత్తులో మంచి ఉద్యోగ అవకాశాలు లభించడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు వీటిని నేర్చుకుంటున్న ప్రతి విద్యార్థి దానిని నమ్ముకుని ముందుకు వెళ్తే గనుక భవిష్యత్తులో మంచి స్థానానికి వెళ్తారని ఆశిస్తున్నాను. అవకాశాలు కచ్చితంగా లభిస్తాయి. ఎంతోమంది కళాకారులు అదే ఉపాధిగా మంచి స్థాయిలో జీవితాలను గడుపుతున్నారు. దానికి నేను కూడా ఒక సరియైన ఉదాహరణగా చెప్పవచ్చు. నేను నా శ్రీమతి కేవలం నాట్యాన్నే ఆధారంగా చేసుకుని జీవిస్తున్నటువంటి వాళ్ళం. నేను ఆంధ్ర నాట్యంలో డిప్లొమా పూర్తి చేయడం జరిగింది. అలాగే నా శ్రీమతి కూడా కూచిపూడిలో డిప్లొమా పూర్తి చేసింది. ఆమె ప్రస్తుతం శ్రీ సత్య సాయి విద్యా విహార్ డి.డి కాలనీలో ఉన్న స్కూల్లో గత 15 సంవత్సరాలుగా నాట్యం నేర్పిస్తూ డాన్స్ టీచరుగా ఉద్యోగం చేస్తోంది. ఇప్పుడు ఒక మంచి స్థానాన్నిచ్చి పర్మినెంట్ చేయడం జరిగింది. స్కూల్లో మంచి గుర్తింపు లభించింది. నేను కూడా ఒక నర్తకుడిగా, గురువుగా మంచి గుర్తింపు పొందాను మా కుటుంబం అంతా ఆ కళామతల్లి సేవలో ముందుకెళ్తున్నాం. ఆ తల్లి అనుగ్రహంతో ఇక ముందు కళాకారులు, కళాభిమానులు కూడా మమ్మల్ని ఇంకా బాగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.
20. మీరు ప్రదర్శనలు ఇచ్చేటప్పుడు మీ కాస్ట్యూమ్స్ మీరే తయారుచేసుకుంటారని, మేకప్ కూడా మీరే వేసుకుంటారని విన్నాం… నిజమేనా? దానికి సమయం కుదురుతుందా?
జ: (నవ్వుతూ) అవునండీ.. మీరు విన్నది నిజమే.. నేను నాట్యంలోనే కాక, ఫ్యాషన్ డిజైనింగ్ లో లకోటియా సంస్థ నుండి పి.జి.డిప్లొమా చేసాను. అందువల్ల నా ప్రదర్శనలకు మొత్తం నేనే డిజైన్ చేసి, తయారుచేసుకుంటా..ప్రస్తుతం దుస్తుల మీద వేసే అనేకరకాల డిజైన్ లను నేను వేయగలుగుతాను. సమయం అంటారా…తప్పదు..వీలు చేసుకుంటా.. మేకప్ కూడా మా టీమ్ లో నాతో సహా దాదాపుగా అందరికీ నేనే వేస్తా..ఇతరులతో చేయించడం ఎప్పుడో తప్పనిసరి అయినప్పుడు అంతే…
21. చివరగా మీరు సమాజానికి చెప్పదలచుకొన్న సందేశం ఏమిటి?
జ: సమాజానికి నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే. ప్రపంచమంతా ఎంతో గౌరవించే మన భారత శాస్త్రీయ కళలని మనం చిన్న చూపు చూడకుండా మన చిన్నారులందరికీ నేర్పిస్తూ, దాన్ని గౌరవిస్తూ మనం ఎంత గొప్ప స్థానానికి తీసుకెళ్తే ప్రపంచంలో అంత గొప్ప స్థాయిలో ఉండగలుగుతాం. దయచేసి దీనిని అందరూ గమనించి కళల యొక్క అభివృద్ధికి మీరందరూ దోహదపడతారని, కళాకారులను ఆదరిస్తారని, అభిమానిస్తారని ఆశిస్తున్నాను. ప్రభుత్వం నుండే కావచ్చు ప్రైవేట్ సంస్థల నుండి కావచ్చు. అటు అభిమానులు, కళా పోషకులు,కళారాధకులు ఇటువంటి నృత్య ప్రదర్శనలను, కళాకారులను ప్రోత్సహించడానికి ఇంకా ముందుకు రావాలని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు..
ధన్యవాదాలు పవన్ కుమార్ గారు..మీ నాట్యప్రస్థానం గురించి, మీ గురించి ఎన్నో విషయాలను ఓపికగా మాతో పంచుకున్నందుకు మా తరఫున, మా పాఠకుల తరఫున మీకు కృతజ్ఞతలు తెల్పుకుంటున్నాము…నమస్కారాలు.
Once there lived a boy named James. He was good at Football . But one day there came a new boy to their street
named John . James and his friends tried to be friends with
him but he was not good at sports so
they were teaseing him but John did not
Care about them. One day they were challengeing him about Football match
he agreed he was opposite team of James team and in the match James
kicked the ball so hard and John was the
goalkeeper he was not able to stop the ball that James kicked and John team lost the match.John’s team were teaseing
him .One day there was a singing competition in their street John sang better than all of them in tha street he won the prize
everyone was amazed by his song and everyone said sorry to him and became
his friends.

Moral of the story is don’t tease anyone that they are not good at something everyone has there own talent .
పోటుగా నిలిచిన నాటు
గీతం సంగీతం గానం
ఆట పాట నాటు నాటు
అందరి నోటా నాటు నాటు!!
చంద్రబోస్ వాణి
కీరవాణి బాణీ
RRR త్రీణీ
ఆస్కార్ బోణీ
విశ్వంలో దక్కిన ఖ్యాతి
భారతానికే భాతి
తెలుగు నాటుకు విశ్వకీర్తి
భారతదేశానికి దివ్య దీప్తి!!
రాజమౌళి రామారావు రామచరణ్
రణం రౌద్రం రుధిరం
చంద్రబోస్ కీరవాణి
రాహుల్ సిప్లిగం,కాలభైరవ గాయకులు
ప్రేమరక్షిత్ కొరియోగ్రఫీ
అదరగొట్టింది
అందరి ఎద దోచింది
ఆస్కార్ తెచ్చింది
విశ్వవిజేతగా నిలిచింది!!
భారత మాత పెదవిపై చిరునవ్వై విరబూసింది
విజయదుందుభిలు మ్రోగించింది
కీర్తిపతాక ఎగిరేసింది
ప్రపంచచిత్రరంగంలో మెరిసింది
తెలుగు భాషకు గౌరవం దక్కింది
నాటు నాటు అంటూ బెట్టుచేయక
ఓవర్ టెక్ చేసింది
ప్రపంచమాత పారాణిగా రాగరంజితమైది
పాట చూడు పాట చూడు
పాటకు పట్టాభిషేకం చూడు!!
విధి ఎవరి రాతను ఎలా లిఖిస్తుందో ఎవరూ ఊహించలేరు.బాల్యంలో సినిమా చూడటం కోసం రెండేండ్ల బండిలో ప్రయాణించిన బాలుడు పెద్దయ్యాక తెలుగు చలన చిత్ర సీమ గర్వించదగ్గ దర్శకుడవుతాడని ఎవరూహించారు.ఆ బాలుడే విధాత తలపున ప్రభవించిన విశ్వనాథుడు.అనతికాలంలోనే
కళాతపస్విగా వాసికెక్కాడు.ఆనతినిచ్చిన విధాతకు తన చిత్రమాలిక కానుకగా సమర్పించాడు. ఆయనే ఒకచోటంటారు.నేనేదీ ప్లాన్ చేసుకోలేదు.అన్నీ అలా జరిగి పోయాయని.
విచిత్రమేమిటంటే కె.విశ్వనాథ్ గారి తండ్రిగారికి జాతకాలు చూస్తారని మంచి పేరుండేది.
తన కుమారుడు ఇంత ఎత్తుకు ఎదుగుతాడని ఆ తండ్రి ఊహించారో లేదో మరి.విశ్వనాథ్ తండ్రి చాటు బిడ్డ.గుంటూరు ఏసీ కాలేజీలో డిగ్రీ పూర్తికాగానే వారి బంధువొకరు వాహిని స్టూడియోలో చేరితే బావుంటుంది, అక్కడ చాలా లేటెస్ట్ ఎక్విప్మెంట్ ఉందని చెప్పగానే తండ్రి ఆజ్ఞ మేరకు వాహినీ స్టూడియోలో సౌండ్ డిపార్ట్మెంట్ లో చేరారాయన.తండ్రి వాహిని డిస్ట్రిబ్యూషన్ లో ఉండేవారు.
ఆయనక్కడ పనిచేస్తుండగానే ఆదుర్తి సుబ్బారావు గారి దృష్టిలో పడ్డారు.ఏపని చేసినా అందులో నిమగ్నమై పనిచేయటం విశ్వనాథ్ లో ఉందని ఆయన గమనించారు.అప్రెంటిస్ గా ఆహ్వానించారు.దర్శకత్వ మెళకువలు నేర్పారు.మూగమనసులు సెకండ్ యూనిట్ దర్శకుడు విశ్వనాథే.ఇంకో పక్క వాహిని స్టూడియోలో ఎనిమిదేళ్ళు గడిచిపోయాయి.ఆదుర్తి సుబ్బారావు గారు, అక్కినేని నాగేశ్వరరావు గారు ఒక టీంలా ఉండేవారని తెలిసిందేకదా.విశ్వనాథ్ కి పనిపట్ల ఉన్న శ్రద్ద.
అక్కినేని వారిని ఆకట్టుకుంది.ఓ శుభ ముహూర్తాన తమతో కలిసి తమ కంపెనీలో (అన్నపూర్ణ ప్రొడక్షన్స్)
దర్శకత్వ శాఖలో చేరమని ఆహ్వానించారు.చేరాలా వద్దా అని విశ్వనాథ్ చాలామంది సలహా అడిగారు.వారందరి అభిప్రాయాలు మరింత సందిగ్ధంలోకి నెట్టాయి వారిని.

గురువైన ఆదుర్తి కూడా నిర్ణయం నీదే అనేశారు.
విశ్వనాథ్ గారి సందేహానికి కారణం,ఆయన త్వరలో వాహిని సౌండ్ చీఫ్ కాబోతున్నారు.అది వదులుకోవటం సబబేనా అని.అప్పుడు ఆయన వెన్నుతట్టి వెళ్ళమని చెప్పిన వారు చక్రపాణి గారు.అలా సౌండ్ రికార్డిస్ట్ విశ్వనాథ్, దర్శకుడిగా మారటానికి వారధి అయ్యారు విజయా ప్రొడక్షన్స్ సారధి చక్రపాణి.
దర్శకుడిగా ఆయనకు బ్రేక్ నిచ్చింది అన్నపూర్ణ సంస్థ.
ఆయన దర్శకత్వం వహించిన తొలి చిత్రం ఆత్మగౌరవం.1965 లో విడుదలైన ఆ చిత్రం ఉత్తమ కథకు నంది పురస్కారం పొందింది.
కె.విశ్వనాథ్ గారికి పాటల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉండేదన్న మాట జగద్విదితం.ఆయన పాటెప్పుడూ కథను ముందుకు తీసుకెళ్ళాలి గానీ, కథా గమనానికి అడ్డుపడకూడదనేవారు.పాట ప్రేక్షకుడు టీ తాగడానికో,సిగిరెట్ తాగడానికో రిలీఫ్ కాకూడదనేది వారి స్థిర అభిప్రాయం.స్క్రిప్ట్ రాసుకునే సమయంలోనే పాట అక్కడెందుకుండాలి,ఎలా ఉండాలో రాసుకునేవారుట.
చాలా పాటలకు పల్లవులు ఆయనే సమకూర్చేవారని
ఈమధ్య తెలిసిన నిజం.ఆత్మగౌరవం లోని “అందెను నేడే అందని జాబిల్లి” పాట పల్లవి ఆయనదే.చరణాలు ఆత్రేయ రాశారు.ఆత్రేయ ఆ పాట పారితోషికం లో
నీ వాటా కుడా ఉందని కొంత ముట్టజెప్పారని విశ్వనాథే స్వయంగా పేర్కొన్నారు.దాదాపు ప్రతి చిత్రంలోనూ ఆయన పల్లవులు ఉండేవి.అది తన ప్రతిభ కన్నా గీతరచయితల ఔదార్యం అని వినయంగా అంటుండేవారు కళాతపస్వి.ఒక సభలో డా.సి.నారాయణరెడ్డి తను, విశ్వనాథ్ జంటకవుల వంటివారమని ముసిముసి నవ్వుల మధ్య చెప్పారు.
జీవన జ్యోతి చిత్రం లోని “ముద్దుల మాబాబు నిద్దరోతున్నాడు,సద్దు చేశాడంటే ఉలుకులికి పడతాడు”
పాట పల్లవి విశ్వనాథ్ ఇస్తే, నారాయణ రెడ్డి గారు పూర్తి చేశారు.
తను లయలో పలుకుతానో తెలియదని, సంగీత దర్శకులు తన పల్లవికి లయ కల్పిస్తారని ఓసారన్నారు విశ్వనాథ్.
పాటల పల్లవులు గురించి ఇంకొన్ని తర్వాత.సినిమాల్లో పాట అవసరం లేదంటారు విశ్వనాథ్.కానీ వారి సినిమాల్లో పాటలూ ఎక్కువే.వాటి నిడివీ ఎక్కువే.పాట అవసరం గురించి మాట్లాడుతూ ప్రేక్షకులు పాట ఎప్పుడొస్తోందో వూహించగలుగుతున్నాడు.అలాకాకుండా పాటను ప్రేక్షకుడు ఉహించని చొప్పించటం నాకు నేను పెట్టుకున్న నియమం.దానితోపాటు పాట కథను ముందుకు తీసుకెళ్ళాలి అని బలంగా నమ్మాను అనేవారు.వారు చెప్పినట్టు వారి చిత్రాలలోని పాటలు కథలో భాగంగా కనిపిస్తాయి.
శంకరాభరణం సినిమా విశ్వనాథ్ ని శిఖరారోహణం చేయించింది.అంతకుముందు చేసిన సినిమాలొకెత్తు.ఆతర్వాత చేసిన సినిమాలొకెత్తు.అంతకుముందు చిత్రాలన్నీ కుటుంబ కథా చిత్రాలయితే, శంకరాభరణం తరువాత ఆయన చిత్రాలన్నీ సంగీత, నృత్యాల ప్రతిబింబాలయ్యాయి.ఆవిధంగా శంకరాభరణం వారినో చట్రంలో బిగించిందా అనిపిస్తుంది.విశ్వనాథ్ చిత్రాలను గుర్తు తెచ్చుకోండి. నిండు హృదయాలు,ఉండమ్మా బొట్టు పెడతా,జీవిత నౌక, నేరము-శిక్ష,శారద,కాలం మారింది,
చెల్లెలి కాపురం,జీవనజ్యోతి, సీతామాలక్ష్మి, చిన్ననాటి స్నేహితులు,అమ్మమనసు, ప్రేమబంధం, సిరిసిరిమువ్వ..ఇలా ఎన్నో చిత్రాలు.. ఇవన్నీ శంకరాభరణం ముందు కాలం నాటివి.ఆ తరువాత వచ్చినవి శుభలేఖ,సప్తపది, సాగరసంగమం, స్వాతిముత్యం,స్వయం కృషి, సిరివెన్నెల, ఆపద్బాంధవుడు,శ్రుతిలయలు,స్వాతి కిరణం,సూత్రధారులు ,శుభసంకల్పం మొదలైనవి.
ప్రతి చిత్రం కూడా ఏదో ఒక ఉద్వేగాన్ని పట్టి చూపేదే.
కథలు ఎంపిక గురించి మాట్లాడుతూ విశ్వనాథ్ ఒక మాటంటారు.తన నిర్మాత అనుకున్న కథనే తీస్తానని
చెబుతానని
చివరి ప్రత్యామ్నాయంగా మాత్రమే తన కథతో తీస్తానని అంటారు.కానీ నిర్మాత చివరికి విశ్వనాథ్ కథనే తీయటం అనేక సందర్భాల్లో జరిగింది.
విశ్వనాథ్ సినిమాలలో హాస్యం చవకబారుగా ఉండదు.
పాత్రలు నేలవిడిచి సాము చేయవు.నా పాత్రలన్నీ జనజీవనంలోంచి పుట్టినవే.ఒక బాబయ్యో,ఒక మామయ్యో అల్లు రామలింగయ్య గానో, సాక్షి రంగారావు గానో పలకరిస్తారని ఒకసారన్నారు.హీరో నేరేటివ్ అలవాటు అయిన మనకు గా విశ్వనాథ్ చిత్రాలలో పాత్రలు సినిమాను నడిపిస్తాయి.సన్నివేశ కల్పనా చాతుర్యం ఆశ్చర్యపరుస్తుంది.
శంకరాభరణం లో శంకరశాస్త్రి, స్వర్ణ కమలంలో మీనాక్షి,
సిరిసిరిమువ్వ లోని హేమ,జీవన జ్యోతి లోని శోభ,శారద లోని శారద..ఇలా ఆయన చిత్రాలలోని పాత్రలను పరిశీలిస్తే నటులు కనిపించరు.హీరోలు కూడా పాత్రల్లో ఒదిగిపోవటం చూస్తాం.అదే స్వయంకృషి చిత్రంలో మెగాస్టార్ పక్కకు వెళ్ళిపోయి నటుడు చిరంజీవి తన పాత్రతో శ్రమలోని ఔన్నత్యాన్ని చూపుతాడు.
ప్రతి సినిమా దర్శకుడు సందేశాన్నిచ్చే ప్రయత్నమే చేస్తాడు కదా.ఇందులో ప్రత్యేకత ఏముందని అన్న ప్రశ్న రావొచ్చు.
సినిమా కళగా కన్నా వ్యాపారంగానే అభివృద్ధి చెందింది. ప్రేక్షకులకు వినోదమే ప్రధానమని నిర్మాత,దర్శకులు భావించి కథను తెరకెక్కించటంలో
అసలు కథను మరిచి, కమర్షియల్ ధోరణులతో సినిమాను నిర్మించి కుటుంబమంతా కలిసి చూడాలంటే ఒక ఇబ్బందికరమైన పరిస్థితి నెలకొన్నవేళ విశ్వనాథ్ చిత్రాలు కొంత హాయిని కొంత కాంతిని పంచుతాయి విసుగుతెప్పించే విన్యాసాలు, పోరాటాలు,ద్వంద్వార్థాల సంభాషణలు,ఐటం సాంగ్స్,డ్రిల్లు లాంటి డాన్సులు ఉండేవి కావు.
అలాగే విశ్వనాథ్ చిత్రాలకు ఎవరు సంభాషణలు రాసినా వాటిలో చమత్కారం ఉంటుంది.చిలిపిదనముంటుందే తప్ప జుగుప్స ఉండదు.మాటలు రాసిన జంధ్యాల,ఆకెళ్ళ,సాయినాథ్,
ఎమ్.వి.యస్.హరినాథరావు మొదలైన వారంతా తమ పెన్నుకు వెన్ను,దన్ను దొరికాయని సంబరపడినవారే.
పాత్రల మధ్య చిక్కని అనుబంధం వారి చిత్రాల్లో మనం గమనించవచ్చు.
విశ్వనాథ్ చిత్రాలలో సామాజిక సందేశాలు ఉన్నాయి.
శుభలేఖ చిత్రం వరకట్నాన్ని ప్రశ్నిస్తుంది.శుభోదయం మనలో ఉండే సోమరిపోతుతనాన్ని బాధ్యతారాహిత్యాన్ని చూపుతుంది.శ్రుతిలయలు విజయం తలకెక్కిన మనిషి పతనాన్ని, స్వాతి కిరణం
గురువు కూడా అసూయకు అతీతుడు కాదని చెబుతుంది.ఇక సప్తపది ప్రేమెప్పుడూ కులం గోడలు ఛేదించేదే అంటుంది.సాగరసంగమం మాత్రం జీవితంలో వైఫల్యాన్ని కథగా చెబుతుంది.స్వర్ణకమలం
నాట్యకళలోని ఉదాత్తతను చూపుతుంది.
ఎనభై,తొంభై దశకాల్లో విశ్వనాథ్,బాపు,దాసరి నారాయణరావు, రాఘవేంద్రరావులు అగ్రదర్శకులు.
విశ్వనాథ్ చిత్రాలు వారితో పోటీపడావా అంటే లేదనే చెప్పాలి.ఎవరి ధోరణి వారిదే అయినా విశ్వనాథ్ కి ప్రత్యేక స్థానాన్నిచ్చారు ప్రేక్షకులు.
శంకరాభరణం చిత్రం తెలుగు సినిమాకు అంతకుమించి
భారతీయ చిత్రానికో ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది.ప్రతి ఫ్రేములోనూ
శాస్త్రీయసంగీతాన్ని నింపుకుని కొత్త నటుడిని, ప్రధాన పాత్రలో పరిచయం చేయాలంటే ఎంత దమ్ము ,ధైర్యం కావాలి.రిస్కు తీసుకునే నిర్మాత ఎక్కడ దొరకాలి.అలా
ధైర్యం చేశారు ఏడిద నాగేశ్వరరావు, ఆకాశం శ్రీరాములు.శంకరశాస్త్రి పాత్రకు కేవలం రంగస్థల అనుభవమున్న జె.వి.సోమయాజులు ని ఎంచుకున్నారు. మసకబారుతున్న శాస్త్రీయ సంగీత వెలుగులని పరిరక్షించే ప్రయత్నం విశ్వనాథ్ ది.
తనకు బ్రేక్ నిచ్చిన అక్కినేని నాగేశ్వరరావు ఆ పాత్ర పోషించాలని ఉబలాటపడ్డారని అప్పట్లో ఓ వార్త వ్యాప్తిలో ఉండేది.అదేవిధంగా బాలమురళీకృష్ణ నటించి, సంగీతాన్ని సమకూర్చాలని ఆరాటపడినట్లు మరోకధనం.ఆ స్క్రిప్ట్ కొత్త నటుడితోనే పండుతుందనుకున్న విశ్వనాథ్ అలాగే సాగారు.ఒక సంగీత కళాకారుడికి కళతోపాటు మానవత్వం ఉండాలని సూచిస్తారు.
అదే స్వాతి కిరణం లో కళాకారుడి అహం అసూయలు
ఎలా దెబ్బతీస్తాయో చెప్పే ప్రయత్నం చేశారు.శంకరాభరణాన్ని తలపై మోసిన ప్రేక్షకులే స్వాతి కిరణం చిత్రాన్ని తిరస్కరించారు.రెండింటిలోను గొప్ప పాటలున్నాయి.వేటూరి విశ్వరూపం శంకరాభరణం చూపితే, సిరివెన్నెల సౌకుమార్యం స్వాతి కిరణం చూపిస్తుంది.
మళ్ళీ శంకరాభరణం విషయానికొస్తే, అలాంటి సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారని ఊహించని పంపిణీదారులు ఆ తర్వాత లెంపలేసుకున్నారు.
సినిమాలో అన్నివర్గాల ప్రేక్షకుల్ని లీనమయేలా చేయటం అన్నిసార్లు జరగదు.మాయాబజార్ గురించో, లవకుశ గురించో ఎంత గొప్పగా చెప్పుకుంటామో
ఆతర్వాత అంతటి గౌరవాన్ని పొందింది శంకరాభరణం.
చెప్పులు బయటే ఉంచి థియేటర్ లో సినిమా చూశానని ఒక కార్పొరేట్ సిఇఒ చెప్పారని విశ్వనాథ్ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు.96 సార్లు చూశానని
ఒక టాక్సీ డ్రైవర్ చెప్పాడుట విశ్వనాథ్ గారికి.ఆయన దగ్గర డబ్బులు కూడా పుచ్చుకోలేదుట.తమిళనాట కూడా తెలుగు శంకరాభరణం నడిచింది ఆరోజుల్లో.ముప్ఫైఏళ్ళ తర్వాత కానీ అనువాదం చేయలేదు.సినిమాని అంతగా హర్షించని ప్రముఖ రచయిత్రి రంగనాయకమ్మ గారు ఈ సినిమాని చూసి రాసిన సమీక్ష మనల్ని ఆశ్చర్యపరుస్తుంది.
“శంకరశాస్త్రి పాత్రలో ప్రత్యేకత ,ఆయన సంగీత విద్వాంసుడు కావటం కాదు.సంగీతవిద్వాంసులు చాలామంది ఉంటారు.చిత్తశుద్థీ,ఆత్మగౌరవం,కష్టాలలో ఉన్న వారిని ఆదుకునే కరుణ స్వభావం ,సమాజపు సంకుచిత్వాన్ని లక్ష్య పెట్టని ధీరత్వం,నమ్మిన లక్ష్యాన్ని నుంచి చలించని పట్టుదలా,సహజ గంభీరమైన ప్రవర్తనా లక్షణాలే ఆయన ప్రత్యేకత.
ఈ చిత్రాన్ని నిజ జీవితంలా చిత్రించిన దర్శకుడు, సంభాషణల రచయిత, పాత్రధారులు కలిసి ఒక మంచి చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు ఇచ్చారు.”
బలమైన పాత్రను సృష్టించడం దర్శకుడికి ఎప్పుడూ సవాలే.ఆ సవాలును స్వీకరించి తన చిత్రాల్లో బలమైన పాత్రలు,వాటి ప్రవర్తనా తీరును నిర్దేశించగలగటం కేవలం కె.విశ్వనాధ్ కే సాధ్యం.
సినిమా మాధ్యమం తనకో దేవాలయం లాంటిదని విశ్వనాథ్ అంటుండేవారు.అందుకే తన ప్రతిచిత్రాన్ని అత్యంత శ్రద్ధతో రూపొందించేవారు.ఆయన సినిమాలన్నీ కనక వర్షం కురిపించేవి కావు.కానీ ప్రేక్షకుడికి చక్కటి విలువలను, విలువైన పాటలను
బిగువైన కధనాన్ని అందించటంలో వెనకబడుండేవి కావు.నిర్మాతకు మాట రానిచ్చేవికావు.విశ్వనాథ్ లేకపోతే వేటూరి, సిరివెన్నెలల పాటల వెన్నెల మనకు దొరికేది కాదు.చాలా పాటలకు పల్లవులు విశ్వనాధ్ సూచించేవారని ప్రారంభంలో చెప్పుకున్నాం కదా.
“రావమ్మా మహాలక్ష్మీ రావమ్మా” అని మాటసాయం చేస్తే ఉండమ్మా బొట్టు పెడతాలోని ఆ గొప్ప పాటను నారాయణ రెడ్డి గారందించారు.అలాగే సిరివెన్నెల లోని చందమామ రావే,జాబిల్లిరావే అన్ని అన్నమయ్య పల్లవిని సూచిస్తే అది పాటై ప్రకంపించింది సిరివెన్నెల సీతారామశాస్త్రి గారిలో.నా సూచనను అంగీకరించిన తన గీతరచయితలెంతో గొప్పవారని విశ్వనాథ్ అంటుండేవారు.
ఏ సన్నివేశాన్నయినా నటించి చూపడం విశ్వనాథ్ కి అలవాటు.అదే అనంతరకాలంలో వారిని నటుడిని చేసింది.లేటు వయసులో ఎంత ఘాటు నటనయో అని అనిపించేలా చేసింది.దర్శకత్వం చేసినంత సేపు వారు ఖాకీ డ్రెస్ ధరించేవారు.దానికి వారేవో కారణాలు చెప్పినా అది సాంకేతిక నిపుణులకు కర్తవ్యాన్ని, క్రమశిక్షణను, నటీనటులకు ఏకాగ్రతను బోధించింది.
అభ్యుదయవాదులు గా చెలామణీ అయ్యేవారు విశ్వనాథ్ చిత్రాలను విమర్శించే ప్రయత్నం చేశారు.వాటిని ప్రేక్షకులూ పట్టించుకోలేదు.సినీపరిశ్రమా పట్టించుకోలేదు.
2017లో విశ్వనాథ్ దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పొందిన వేళ ఆకాశవాణి తరఫున ఈ వ్యాసకర్త ఓ ప్రశ్న వేశారు.మీ జ్ఞాపకాలను అక్షరబద్ధం చేస్తే రాబోయే తరాలకు ఉపయోగం కదా అని.దానికి సమాధానంగా వారో ప్రశ్న వేశారు.ఎవరైనా నా చిత్రాలను పరిశీలించి
నా పాత్రలను విశ్లేషిస్తే అది చాలు,నా జీవిత చరిత్ర అక్కర్లేదని నవ్వుల మధ్య అన్నారు ఆరోజున.
కానీ వారారోజున అన్నమాటను నిజం చేస్తూ 2021లో “అనామకుడు” కలం పేరుతో అనేక కథలు రాసిన డా.ఏ.యస్.రామశాస్త్రి “విశ్వనాథ విశ్వరూపం” పేరుతో విశ్వనాథ్ చిత్రాలను విశ్లేషించారు.
“విశ్వనాథ్ గారి చిత్రాలు అమ్మ ఆప్యాయంగా వండి వడ్డించే భోజనాలు.కుటుంబమంతా హాయిగా కూచుని తినే ఇంటి భోజనాలు.అందుకే ఎన్నిసార్లు తిన్నా రుచిగా తృప్తిగా అనిపిస్తాయే కానీ విసుగు పుట్టదు.వెగటు కలగదు” అంటూ విశ్వనాథ్ సినిమాలను అమ్మ వంటతో పోల్చారు.
తెలుగు సినిమా
రొటీన్ రొచ్చులో కూరుకుపోయిన ప్రతిసారీ కాస్త ఊపిరిపోశారు విశ్వనాథ్.తనో కళాఖండం తీశానన్న అతిశయమెన్నడూ లేనివాడు ఆయన.తన పరిధిలో,తన అభిరుచి మేరకు భారతీయ సంగీతానికీ,నృత్యానికి వెండితెరపై వెలుగులు పంచాడు.సగటు ప్రేక్షకుడి గుండె తలుపు తట్టాడు.
అతని హృదయాన్ని గెలుచుకున్నాడు.సినిమా దేవతని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచిన అసలు సిసలు భక్తుడు.
అందుకే విశ్వనాథ్ తన చిత్రాలతో మనందరిలో శాశ్వతంగా నిలిచిపోయారు.
సి.యస్.రాంబాబు
‘ ఆస్కార్ ‘ ప్రపంచ సినీ పరిశ్రమ జగత్తులో అందరూ అందుకోవాలని కలలు కనే అవార్డ్.
ప్రపంచంలో సినిమాలను నిర్మించే అన్ని దేశాలు ఆస్కార్ అవార్డు కోసం ప్రయత్నించి ప్రయత్నించి విఫలమైన వాళ్ళు ఉన్నారు, సాధించిన వాళ్ళు ఉన్నారు. ఒక సినిమా విడుదల కావాలంటే ఏ ఏ రంగాలు పనిచేయాలో ఏ విభాగాలు పని చేయాలో ఆయా ప్రముఖమైన విభాగాలకు అవార్డును ఇస్తూ ఉంటారు. దర్శకత్వం, నిర్మాణం, కథ ఫోటోగ్రఫీ,ఎడిటింగ్, మేకప్, పాట ఇలా అన్ని విభాగాల్లో అద్భుతమైన ప్రతిభను ప్రదర్శిస్తారో వారికి ఆస్కార్ అవార్డు గత 95 ఏళ్ళు గా ప్రదానం చేస్తున్నారు. Oscar Awards- Academy ఇచ్చే ఈ అవార్డు కోసం హాలీవుడ్ మొత్తం తమ యావత్ ప్రతిభను వెచ్చించి మరీ సినిమా లను నిర్మిస్తూ ఉంటారు.
యునైటెడ్ స్టేట్స్ అఫ్ అమెరికా లోని లాస్ ఏంజిల్స్ లో ఆస్కార్ అవార్డు ప్రధాన ఉత్సవం జరుగుతుంది.
నిన్న , మార్చ్ 12 ఆదివారం నాడు 2023 సంవత్సరానికి గాను ఆస్కార్ అవార్డు వేడుకలు జరిగాయి.
ఇవన్నీ తెలియని వారు ఎవరున్నారు? అందరికీ అన్ని తెలుసు !కానీ , మన చంద్రబోస్ గారి గురించి కదా ఇక్కడ చెప్పుకోవాలి. తెలుగు పాటకు ఆస్కార్ అవార్డు రావడం సామాన్య విషయం కాదు. పాట రాసిన రచయిత చంద్రబోస్ గారు.
పాటకు వాద్య సహకారాలు అందించిన ,గాత్ర సాకారాలందిచిన ,తెరపైన నృత్య సహకారాలు అందించిన ,నృత్యం చేసిన నటీనటులు ఇవన్నీ లెక్కలోకి వచ్చేవే! వస్తాయి కూడా!ఇంతకన్నా మించి ఈ పాటను ఆర్ ఆర్ ఆర్ సినిమాలో పెట్టడం వలన గుర్తింపు లోకి వచ్చింది. అన్నింటికన్నా మించి అంత భారీ ఖర్చుతో అంత నిబద్ధతతో అంత అత్యద్భుతంగా చిత్రీకరణ చేసి దర్శకత్వం వహించిన వారి వలన ఈ సినిమాకు ఇంత పేరు వచ్చింది. కాబట్టి పాట రైటర్,సింగర్స్,మ్యూజిక్ డైరెక్షన్, ఎడిటింగ్, యాక్టింగ్, డైరెక్టర్ ఇన్ని కలిస్తే ,వీటన్నింటి కన్నా ప్రచార హోదా కల్పించడం గొప్పగా అయినందుకు ఇవాళ ప్రపంచంలో అత్యుత్తమమైనటువంటి ఆస్కార్ అవార్డు” నాటు …..నాటు……” పాట సొంతం చేసుకుంది. ప్రపంచమంతా ఆన్లైన్ మీడియాతో నడుస్తోంది అనడానికి ఒక పెద్ద ఉదాహరణ ఇటువంటి పోటీలు, ఫలితాలు . సమాచార వేగం కూడా కారణం. ఒక వంటకం కుదరాలంటే వస్తువులు, పదార్థాలు ,చేసే వ్యక్తి , చేసే తీరు, వంటవండేవారి శ్రద్ధ ఇన్ని కూడాలి! ఇన్ని సరిపడ్డాక వంటకాన్ని వడ్డించబోయే ముందే ఎవరైనా అది బాగాలేదు రుచి సరిగా లేదు అన్నారంటే గిన్నెడు పదార్థం వృధా అయిపోతుంది. ముందు తిన్న వాళ్ళు పదార్థం చాలా రుచికరంగా ఉంది అంటే ,ఇక తర్వాత తినేవాళ్ళు అదే అభిప్రాయంతో తింటారు. అందులో ఉన్న మాధుర్యాన్ని అనుభవిస్తారు. ఇక్కడ ప్రచారమే ఉపయోగపడుతుంది.ఒక మంచి నవల వచ్చింది అంటే నవల పేరు ,అంశము, రాసిన శైలి,అభూత కల్పన కాని సత్య నిరూపణము, అద్భుతమైన సందేశం. ఇవన్నీ కావాలి.వీటన్నింటిని మించి ఆ నవల ముద్రితమై అందరూ చదవడం, ఇతర భాషల్లోకి అనువాదం కావడం ప్రపంచానికి అందడం ముఖ్యం. ఇటువంటి ప్రచారం నలుగురు బాగుంది అన్నారంటే అప్పుడు కదా ఇలా సింహాసనం పైన దిష్టింప చేసేది! అయినా కానీ…..ఈ పాట విషయానికి వస్తే, పాటను ఒక్కటే విశ్లేషణ చేస్తే, పాటలోని మాటలు …మాటల్లోని భావము ….పలుకుబడులు ….ప్రజల భాష , పల్లెపదాల పరిమళం ,జానపద పదగుంఫనం ….!ఇవి ఆకట్టుకునేలా ఉండడం ఈ పాటకు ప్రాణం అయింది. అవేంటో తెలియాలంటే అట్లా దుమ్మురేగే పొలం గట్టుకోసారి పోవాల్సిందే!!పోతరాజు ఆడినట్టు ఎవరాడగలరేంది?, దుమ్ము దులుపుతుంటె చూడాల్సిందే! జాతర ..పోలేరమ్మ జాతర! ఇవన్నీ వాటి వాటి ప్రత్యేకతలను కళ్ళముందు కదలాడేలా చేసాయి కదా!పొలం గట్టు ,మిరప తొక్కుల యవ్వారం మొత్తం ఎర్ర జొన్న రొట్టె చెప్పదూ!! కుర్ర గుంపు లొల్లి లొల్లంతా మర్రి సెట్టు నీడలు తెలియజేశాయి కదా! అంతే కాదు కిర్రు సెప్పులు ఊరుకుంటాయా? ఊం..హూ…. కర్ర సాము చేసేందుకు పోవూ!!

ఇంత సహజ సిద్ధంగా మాటలు అలా అలా అలా స్వరప్రవాహమై రాలే!!
మనసు మళ్ళీ మళ్ళీ నవ్వుకోలె!!
‘నాటు’లో ఎన్ని రకాలు ఉన్నాయో అన్ని పెట్టేసాడు కవి చంద్రబోస్! అసలు’ నాటు’ అనే పదానికి అర్థం ఆస్కార్ వాళ్ళకు అర్థమైందో కాలేదో కానీ, అక్కడ వేదిక మీద చ ‘నాటు ‘కి చెప్పిన అర్థమైతే వేరే! మనకు తెలుసిన నాటు కాదు!ఇవే కదా పలుకుబళ్ళు! వ్యవహారిక భాష ,యాస, ప్రాంతీయ భాష,భావము! ఓసారి పలకరించుకొని పులకించి పోదామా?
ఒంటి లోని రగతం!
రంకెలేసి ఎగరదూ!!
ఎకా ఎకీ!
లోపలున్న పానమంతా!!
డుముకు డుముకులాడేయదూ!!
ఎక్కడి పదాలు ఇవి? మా చినపెండ్యాలలో, మా హన్మకొండ, మా వరంగల్ లలో తిరిగేసి వచ్చి ఉప్పస చెందినట్టు, ఊరట పొందినట్టు,నా చిన్నప్పుడు మా అన్నయ్య లు, తమ్ముడు, అక్కయ్య లతో ఆడుకున్నట్టున్నది, మేము మా దోస్తులందరం మాట్లాడుకున్నట్టున్నది.
ఈ ఒక్క పాటను నేనైతే ఎన్ని సార్లు చూసిన్నో!
మా పిల్లలే కాదు,మా మనవరాళ్ళు, మనవడూ ఎన్ని సార్లు డాన్సులు చేస్తారో, ఎంతగా పాడ్తారో! ఇవాళ ఈ సందర్భం వచ్చిందని చెప్పడం కాదు, చెప్పేఅవకాశం వచ్చింది కనుక చెప్పడం.
డింకిచక,
డింకనకర,
డిక్కనకర!!
ఏందిది?కవి పల్లె బుట్టలో మాటలు పోసుకొచ్చాడు. ఈ జానపద సాహిత్యాన్ని ఎన్ని దోసిళ్ళకు ఎత్తు కోవాలీ ఏందీ?
వీటి అందం తెలుసుకోగలిగితే మరింత ఆనందం! పోనీలెండి ఆస్కార్ వాళ్లకి ఎంత అర్థమైందో ఎంత అర్థం కాలేదు బేరీజు వేసుకోవాల్సిన అవసరం ఇప్పుడు లేదు కానీ, పాటలో ఉన్న ఏదో అందం వాళ్ళనాకర్షించింది! మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించింది! ఆస్కార్ వచ్చి పడింది. ఆస్కార్ తెలంగాణ యాసకు మోకరిల్లింది. ఆస్కార్ తెలుగు సినిమాకు జోహార్లు అన్నది. ఆస్కార్ తెలుగు పాట లోని వైభవాన్ని గుర్తించింది! ఇది చాలదు మనం ఇలా అనుకోవడానికి చెప్పుకోవడానికి! ఇది చాలు! ఇట్ ఈజ్ ఎ రికార్డ్! దట్సిట్!!
హాట్సాఫ్ టు చంద్రబోస్ గారు!!
మానుకోట బిడ్డడు, వరంగల్ గడ్డ ప్రతాపం చూపించి, ఆస్కార్ అవార్డు ను పడ కొట్టిండు! తెలుగు ప్రజలకు ఆస్కార్ చేరేలా చేసిన చంద్రబోస్ గారి కి శుభాకాంక్షలు!
“ఆస్కారన్న చంద్రబోసన్న ” అనే పేరు తెచ్చుకున్న చంద్రబోస్ గారి కి అభినందనలు!!
“సైన్స్”ను విశ్లేషణాత్మకంగా ప్రయోగాత్మకంగా వివరిస్తే శాస్త్ర వ్యాసాలు/ శాస్త్ర గ్రంథాలు. లోకం పోకడను, మనసు సవ్వడిని పాత్రల ముఖతః సంఘటనా శ్రయంగా వివరిస్తే కథలు, నవలలు. ఈ రెండు భిన్నమైన రంగాలు. సైన్స్ విషయాలను ఆధారభూమికగా చేసుకొని కొన్ని సామాజిక సంఘటనలకు సైన్సును అనువర్తించి పాత్రల ముఖతః సృజనాత్మకంగా వర్ణిస్తే ‘సైన్స్ ఫిక్షన్’. అంటే శాస్త్రబద్ధమైన, ఆలోచనాత్మకమైన ‘సైన్స్’కు ఊహాత్మకమైన సృజనాత్మకమైన సాహిత్యానికి పెళ్ళి చేస్తే పుట్టే బిడ్డ సైన్స్ ఫిక్షన్ అన్నమాట.
ఈ ‘సైన్స్ ఫిక్షన్’ మీద డా. ఎన్. సుధాకర్ నాయుడు చేసిన పరిశోధన గ్రంథం ఇది. ఈ రోజుల్లో మంచి పరిశోధనాంశం దొరకడం పరిశోధకులకు అదృష్టమే. సరిగ్గా చేయగలిగిన మంచి పరిశోధకుడు దొరకడం మంచి పరిశోధనాంశానికి అదృష్టమే. ఈ రెండు ఒకే చోట కలవడం పాఠకుల అదృష్టం. సుధాకర్ నాయుడు చేతిలో ఈ పరిశోధనాంశం సమాచార పౌష్కల్యంతో విషయ నిర్భరంగా రూపుదాల్చడం ఆనందాన్ని కలిగించే అంశం. ఈ విషయంలో ఇదే ఏకైక ఆకర (reference) గ్రంథం.
సుధాకర్నాయుడు తెలుగు విశ్వవిద్యాలయంలో ముగ్గురు వైస్ ఛాన్స్లర్స్ వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా ఎంతో నిబద్ధతతో పనిచేసిన వ్యక్తి. పని పట్ల నిబద్ధత, వ్యక్తుల పట్ల ఆత్మీయత సుధాకర్నాయుడు నైజగుణం.
ఈ సిద్ధాంత గ్రంథం ఒక ప్రక్రియా వికాస చరిత్ర. ప్రక్రియా వికాసం చరిత్రలన్నింటికి ప్రధానంగా కావలసింది విస్తృత సమాచార సేకరణ. ప్రాథమ్యాల, వైవిధ్యాల, ప్రయోగాల పరిశీలనం. (అవకాశం ఉంటే) అన్యభాషల్లో ఆ ప్రక్రియా వికాస స్థూల పరిచయం. ఆ తర్వాత ఆ ప్రక్రియలోని రచనల విశ్లేషణ. ఇలాగే వెనుకటి పెద్దలు తమ డాక్టరేటు గ్రంథాలలో పరిశోధించి ఒక ఒరవడి నిర్దేశించారు. సి. నారాయణరెడ్డి (ఆధునికాంధ్ర కవిత్వం బి.వి. కుటుంబరావు (ఆంధ్ర నవలా పరిణామం), పోరంకి దక్షిణామూర్తి (తెలుగుకథ), సంప్రదాయాలు, ప్రయోగాలు), మద్దూరి సుబ్బారెడ్డి (దేశభక్తి కవిత్వం), జి.వి. సుబ్రహ్మణ్యం (ప్రథమాంధ్ర పురాణం). ఎస్.వి. రామారావు (సాహిత్య విమర్శ) లాంటి సిద్ధాంత గ్రంథాల ధోరణిలో సుధాకర్ నాయుడు సిద్ధాంత గ్రంథ రచన సాగడం అభినందనీయమైన అంశం.
చారిత్రక వైజ్ఞానిక నేపథ్యం పేరిట కూర్చిన ప్రథమాధ్యాయంలో పరిశోధకులు పాలిటి గని అంతే గాక పరిశోధకుని దృష్టి కోణాన్ని శ్రమశీలాన్ని తెల్పుతుంది. ఆచంట సాంఖ్యాయన శర్మ భూతత్త్వ శాస్త్ర, ఖనిజశాస్త్ర, క్రిమికీటక శాస్త్రాలలో పాండిత్యం సంపాదించినవారు. వారు నిర్వహించిన కల్పలత పత్రికలో ‘విజ్ఞాన వల్లిక’ అనే శీర్షిక కింద ఎన్నో ఆధునిక భౌతిక శాస్త్రాంశాలు రాసే వారట. శ్రీ శర్మగారు రహస్య దర్పణం పేరుతో 1892లో రాసిన గ్రంథంలో మనుష్యేతర జీవాల జీవన రహస్యాల గురించి చర్చించారట. భూతత్త్వశాస్త్రం అని ఓ గ్రంథాన్ని రాశారు. డార్విన్ సిద్ధాంతాన్ని తెలుగులో చెప్పారు. కొమర్రాజు లక్ష్మణరావు లాంటివారు సాంఖ్యాయన శర్మను విజ్ఞాన సర్వస్వంగా ప్రశంసించారు. మరి అలాంటి ఆచంట సాంఖ్యాయన శర్మ జీవన, రచనల వివరాల మీద ఎవరైనా డాక్టరేటుకు పూనుకొంటే ఎంత బాగుంటుందోనని నాలాంటివాడికి అనిపించడంలో ఆశ్చర్యం లేదు. అట్లాగే టేకుమళ్ళ అచ్యుతరావు, టేకుమళ్ళ రాజగోపాలరావు ప్రభృతుల వైజ్ఞానిక రచనలను సుధాకర్నాయుడు ప్రస్తావించారు. వీరిని గురించి మన పరిశోధకులకు తట్టడం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే స్వాతంత్య్ర పూర్వం భారతదేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్న కాంక్ష ఉవ్వెత్తున చెలరేగింది. ఆ ప్రభావంతో సైన్స్ రచనలు కూడా ఎన్నో వచ్చాయి. ఆ తర్వాత సైన్స్ రచనలు బాల సాహిత్య విభాగంలో, లేదా
సైన్స్ ఫిక్షన్గానో, పాపులర్ మార్గంలో వచ్చాయేమోననిపిస్తుంది. ‘సీరియస్’ శాస్త్ర వాఙ్మయ రచనం – పఠనం పట్ల ఆసక్తి తగ్గడానికి నానాటికీ విస్తరిస్తున్న ఆంగ్ల భాషా ప్రభావం కావచ్చు.
స్వయంకృషితో బహుభాషలు నేర్చుకొన్న ఒద్దిరాజు సోదరులు తెలంగాణాలో మారుమూల వైజ్ఞానిక శాస్త్ర వ్యాసంగం నెరపిన వివరాలు ఈ గ్రంథంలో చోటుచేసుకోవడం గమనార్హం. ఆయుర్వేద గ్రంథాలు, చరకం, శుశ్రుతం, బాహాటం, మాధవ నిదానం, బసవరాజీయం లాంటి గ్రంథాలను క్షుణ్ణంగా అభ్యసించిన ఒద్దిరాజు సోదరులు (ఒద్దిరాజు సీతారామచంద్రరావు (2.4.1887; 28.1.1956) ఒద్దిరాజు రాఘవ రంగారావు (4.4, 1894 – 17.5.1973) మలేరియా నివారణకు ‘తిక్త’ అనే ఆయుర్వేద ఔషధాన్ని తయారుచేసి వేలాది మందిని కాపాడారట. హోమియో వైద్య గ్రంథాలు కలకత్తా నుండి తెప్పించుకొని అధ్యయనం చేసి హోమియోలో ఎం.డి. పట్టా పొందారట. ‘విజ్ఞాన ప్రచారిణి గ్రంథమాల’ను స్థాపించినవారు. ఫోటోగ్రఫీ నేర్చుకొని ‘ఛాయాగ్రహణ తంత్రం’ చేతి పనులు, బాల విజ్ఞాన మంజూష విద్యుద్విజ్ఞానం లాంటి గ్రంథాలు రాశారు. సాహిత్య సంబంధ రచనలు సరేసరి. వైజ్ఞానిక సంబంధమైన వ్యాసాలను, పుస్తకాలను, విజ్ఞాన సర్వస్వాలను ప్రచురణ సంస్థలను, సంస్థానాలను, విశ్వవిద్యాలయాలు చేసిన కృషిని పత్రికలను, పత్రికల్లోని సైన్స్ కాలమ్స్న కొండ అద్దమందు చూపినట్లుగా సుధాకర్నాయుడు ఈ ప్రథమాధ్యాయంలో ప్రదర్శించారు. దీని ఆధారంగా మరికొన్ని పరిశోధనాంశాలను దొరికించుకోవచ్చు.
సైన్స్ ఫిక్షన్కు వివిధ పండితులు, విజ్ఞాన సర్వస్వాలు, నిఘంటువులు ఇచ్చిన నిర్వచనాలను, లక్షణాలను రెండవ అధ్యాయంలో పేర్కొన్నారు. రేడియో టెలివిజన్ ఛానల్స్లోలో వచ్చిన సైన్స్ ఫిక్షన్ కార్యక్రమాల, సినిమాల వివరాలు సాధారణంగా లభించవు. వాటిని పేర్కొనడం సుధాకర్నాయుడు శ్రమశీలానికి, వెచ్చించిన సమయానికి దర్పణం పడుతోంది. వర్తమాన పరిశోధక విద్యార్థులు ప్రత్యేకించి గుర్తించాల్సిన ఆధునిక సాహిత్యంలో మొదటి సైన్స్ ఫిక్షన్ గ్రంథం మేరీ షేల్లి 1818లో రాసిన ప్రాంపెయిన్ స్టయిన్ అనే పేరున్నది మొడరన్ ప్రొమిధస్. సుధాకర్ నాయుడు దానితో మొదలుపెట్టి అడ్గర్ ఆలెన్పో, ఆల్డస్ హక్స్ లీ, జార్జి ఆర్వెల్, సి.యస్. లెవిన్లను మొదలుకొని అమెరికా, ఆస్ట్రేలియా, జర్మనీ, ఇటలీ, కెనడా, న్యూజిలాండ్ లాంటి దేశాల రచనల వివిధ భారతీయ భాషల్లోని సైన్స్ ఫిక్షన్ రచనలను ఆంగ్లాది ఇతర భాషల నుండి చేసిన ఈ అనువాదాలను సుధాకర్ నాయుడు పేర్కొనడం గమనించినపుడు నాకు పాతకాలం సిద్ధాంత గ్రంథాలు (పైన పేర్లు పేర్కొన్నాను) మదిలో మెదిలాయి.
సుధాకర్నాయుడు తొలి తెలుగు సైన్స్ కథలు తెలంగాణా నుండి వచ్చాయని నిర్ధారించడం గమనార్హం. సింగూరి జయరావు (పరమాణువులో మేజువాణి, డిసెంబర్, 1927) ఎల్. శంకరనారాయణ (చంద్రమండలపు చోద్యములు – మార్చి, ఏప్రిల్ 1928), ఒద్దిరాజు సీతారామచంద్రరావు (అదృశ్యవ్యక్తి, అక్టోబర్ 1928 గారలు రాసిన ఈ మూడు కథలు తెలంగాణా నుండి వచ్చిన సుజాత పత్రికలో వచ్చాయి. కొడవటిగంటి, కె.ఆర్.కె. మోహన్, ఎన్.ఆర్. నంది, పురాణపండ రంగనాథ్, మైనంపాటి భాస్కర్ లాంటి వారి సైన్స్ ఫిక్షన్ కథలన్నింటినీ సుధాకర్నాయుడు చర్చించారు.
టేకుమళ్ళ రాజగోపాలరావు 1934లో రాసిన ‘విహంగయానం’ తొలి తెలుగు సైన్స్ ఫిక్షన్ నవల. అప్పటికి సైన్స్ ఫిక్షన్ అనే పదబంధం వాడుకలోకి రానందున ‘ప్రకృతి శాస్త్ర సంబంధ నవల’ గా పిలిచారు. 22.1.1934 తేదీతో పీఠిక రాస్తూ రచయితనే స్వయంగా ‘విహంగ యానము తెలుగులోని ప్రకృతి శాస్త్ర సంబంధమైన నవలలో మొట్టమొదటిది. స్వతంత్రముగా రచింపబడినది. కాని ఇందలి ప్రకృతి శాస్త్ర విషయాలు జనసామాన్యమున కందుబాటులో నుండు రీతిని కూర్చబడినది. వాయు, విమాన నిర్మాణ పద్ధతులు 18,20 ప్రకరణములలో దెలుపబడినది. శాస్త్ర నవలారచనకు, మన భాషకు నాకును గూడ నిదియే ప్రధమము’ అని స్వయంగా పేర్కొన్నారు. ‘ఇది మనకు కొత్తది. మన భాషకు కొత్తది. ప్రకృతి శాస్త్ర సంబంధమగు మొట్టమొదటి నవల. స్వతంత్రంగా వ్రాయబడినది. ప్రకృతి శాస్త్ర జ్ఞానమును సామాన్య జనుల హృదయమున కెక్కించునుత్తమ నవలలు ఫ్రెంచి, జర్మను భాషలలో మాత్రమే కలవు అంటూ కపిస్థలం శ్రీరంగాచారి భారతి డిసెంబర్ 1934 సంచికలో విహంగయానాన్ని సమీక్షిస్తూ అభిప్రాయపడ్డారు. ప్రక్రియ వికాసాల మీద పరిశోధించే ప్రతి పరిశోధకుడు ముందుగా నిర్ధారించవలసింది ఏది తొలి రచన ఎప్పుడు తొలి రచన వచ్చింది. సుధాకర్ నాయుడు తొలి తెలుగు సైన్స్ ఫిక్షన్ లేదా తొలి తెలుగు సైన్స్ ఫిక్షన్ నవల అన్న విషయంలో ఆధార సమన్వితం పరిశోధన తత్పరతతో చూశారు. భవిష్యత్తులో దీనిని ఎవరైనా కాదంటే సుధాకర్నాయుడు పేర్కొన్న కాలాలకు చెందిన కథ / నవలలకన్నా ముందువి దొరికి వాటి చరిత్ర, మరికాస్త వెనక్కి వెళ్ళిందని సంతోషించవచ్చు.
సైన్స్ఫక్షన్కు కుహనా సైన్స్ ఫిక్షన్కు అంతరం ఉంటుంది. విజ్ఞాన శాస్త్రం ద్వారా సంభవమయ్యే అవకాశమున్న మేరకు రక్తి కట్టించే కల్పనను జోడించి రాయడం సైన్స్ ఫిక్షన్ అవుతుంది. అంతేగాని సైన్స్ ఏమాత్రం అంగీకరించని దాన్ని ఏదో వింత పేర్లు కల్పించి రాసేవి కుహనా సైన్స్ ఫిక్షన్ (సోషియో ఫాంటసీ) కథలు / నవలలు అవుతాయి. సుధాకర్నాయుడు ఏది సైన్స్ ఫిక్షన్? ఏది సోషియో ఫాంటసీ అని గుర్తించి పేర్కొనడం పరిశోధకునిగా ఆయన అప్రమత్తతను తెలుపుతుంది. 1934 నుంచి 1970 వరకు 37 ఏళ్ళ కాలంలో సైన్స్ ఫిక్షన్ నవలలు పదికి మించి లేవని పరిశోధకుడు అభిప్రాయపడ్డారు. (పుట. ) సోషియోఫాంటసీ, సైన్స్ ఫిక్షన్కు రెండు విభాగాలుగా చెప్పుకొన్నా ఎక్కడో ఒకచోట ఈ రెండు కొంతమేరకు కలగలిసిపోతాయేమో! కాకుంటే పాళ్ళల్లో ఎక్కువ తక్కువ లను బట్టి వర్గీకరించుకోవలసి రావచ్చు.
మొత్తమీద తెలుగులో ఇప్పటిదాకా 89 డైరెక్ట్ కథలు, 17 అనువాద కథలు 503 పైగా నవలలు సైన్స్ ఫిక్షన్కు సంబంధించి వచ్చాయని పరిశోధకుడు అంచనాకు వచ్చారు. ఒకటి రెండు జారిపోయినా నష్టం లేదు. 1987 జూన్ నుంచి 1996 సెప్టెంబర్ 67 సిద్ధాంత గ్రంథాలు ఆంగ్లంలో సైన్స్ ఫిక్షన్ మీద వచ్చాయని సుధాకర్నాయుడు ఉపసంహారంలో పేర్కొన్నారు. తెలుగులో మాత్రం ఇంతదాకా ఇదొకటే. సాహిత్యం విస్తృతంగా వస్తే పరిశోధనలు విస్తృతంగా జరుగుతాయి. సైన్స్ ఫిక్షన్ రాయడమే తక్కువ. పాఠకుల్లో విపరీతాసక్తి ఉంటే రచయితలు బాగా రాస్తారు. రచయితలు బాగా రాస్తే పరిశోధకులు ఆకర్షిస్తారు. రచయితలు బాగా రాస్తే పరిశోధకులు ఆకర్షితులు – ఇదంతా ఒకదానికి ఒకటి సంబంధించిన (Interlinked) వ్యవహారం.
తెలుగు సాహిత్యంలో ‘సైన్స్ ఫిక్షన్’పై విషయ నిర్భరమైన సమాచార పౌష్కల్యంతో కూడిన ఏకైక ఆకర (రిఫరెన్స్) గ్రంథంగా మలచిన సన్మిత్రులు డా. ఎన్. సుధాకర్ నాయుడు గారికి మనసారా అభినందనలు. నాకీ నాలుగు మాటలు రాసే అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు.
మహిమ గలది మహిళ ఈ జగతిలోన
ఆ మధుర చరిత వినిపించెద జనములోన
అంగన అంచయాన అంబుజనయన
అంబుజాక్షి అబ్జముఖి అంబుజవదన
ఏ పేరున పిలిచినా అందచందమే
ఏ తీరుగ చూసినా అనురాగబంధమే
“అమ్మ”అనే పిలుపుకై ఆరాటపడుతుంది
అందుకు ప్రాణాలే పణంగా పెడుతుంది
మగనితో జత కూడితే మగనాలి తానే
అతనిలో సగమైతే అర్థాంగియు తానే
పిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తే అత్తమ్మ తానే
ఆ పిల్లల పిల్లలకు అమ్మమ్మ నానమ్మ తానే
కూతురై పుట్టుతుంది ఒక ఇంట
కోడలై అడుగు పెట్టు ఒక ఇంట
ఇంటికి దీపం ఇల్లాలే నంట
ఇలనైన కలనైన నిజమే నంట
వింటికి నారి అనివార్యం
కంటికి నారి సౌందర్యం
మగనికి నారి మాధుర్యం
వెంటనడిస్తే ధైర్యం స్థైర్యం
తెలుగు భాషలో భావకవితా ప్రపంచానికి అదినేత బావ కవిగా పుట్టి భావగీతాలాలపించి, భావ కవిత్వాన్ని ఉధ్యమంగా స్వీకరించి విశేషప్రచారం చేసి రెండు దశాబ్దాల కాలం ఎదురు లేని తనహొ కవితా లహరిలో తెలుగు పాఠకులను ముంచి తేల్చి అచ్చమైన భావకవిగా గంధర్వలోకాల కేగిన గాన మూర్తి, పద్య కవిత్వాన్ని పండిచారు. పాటల కవిగాను, నాటకాలు, యక్షగానాలు చేశారు. ఎన్నో వ్యాసాలు రాసినప్పటికి వచనంలో కూడ సాహిత్య సౌరభాలు విరజిమ్మారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయన పాతకొత్తల మేలుకలయిక.
దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు క్రీ॥శ 1897 సంవత్సరంలో జన్మించారు. తల్లి దండ్రులు శ్రీమతి. శ్రీ సీతమ్మ వెంకటకృష్ణశాస్త్రి గార్లు కృష్ణశాస్త్రి చిన్నతనంలోనే పద్య, మరియు కవితా రచన చేసి కన్న వారి దీవెనలు పొందారు. 1918వ సంవత్సరంలో పిఠాపురం, కాకినాడల్లో విద్యాభ్యాసం పూర్తిచేశారు. పెద్దబావగారి కూతురినే వివాహం చేసుకున్నారు. 1919వ సం॥లో తల్లావజ్ఝుల శివశంకరశాస్త్రి స్థాపించిన “సాహితి సమితి” లో సభ్యులైనారు. ఓ సందర్భంలో కృష్ణశాస్త్రి బి.ఎ అనిపించుకోవడం కంటే “సాహితి సమితి సభ్యుడను” అపిపించుకోవడమే తనకిష్టమని చెప్పారు. కాకినాడ పెద్దాపురం హైస్కూల్లో ఉపాధ్యాయులుగా రెండు సంవత్సరాలు పనిచేశారు. కాలం పిలుపులోని కల్మషాన్ని కడిగి వేయడానికి రాసిన ఈయన పాటలు సంప్రదాయవాదులకు గిట్టనందుకు రాజా వారికి చెప్పి సంఘబహిష్కరణచేయించారు. పిఠాపురం రాజావారికి వ్యతిరేకంగా ‘ధర్మసాదన’ అనే పత్రికలో కొన్ని వ్యాసాలు రాయడంతో రాజావారు ఉద్యోగం నుంచి తొలగించటమే కాకుండ తండ్రులకాలం నుండి వచ్చె ‘వార్షికం’ నిలుపు చేశారు. ఇలాంటి క్లిష్టసమయంలోనే శాస్త్రిగారి భార్య మరణించారు. భార్య వియోగం తో శోకతప్త హృదయంతో ‘కన్నీరు’ అనే ఖండకావ్యం రాశారు. గాడేపల్లి సూర్యనారాయణ గారి పెద్దమ్మాయి ‘ రాజహంస’ను వివాహము చేసుకొని మామగారి ప్రోత్సాహంతో సహయం నిరాకరణోద్యమ కార్యక్రమాలలో భాగస్వామి అవడంతో స్కూలుమాష్టారి ఉద్యోగం పోగొట్టుకున్నారు అయిన అదితన అదృష్టంగానే భావించారు ఎందుకంటే దేశ సేవనే గొప్పది అనుకున్నారు.
కృష్ణశాస్త్రిగారు రచించిన ఖండకావ్యాలు చేర్చి 1925లో ‘కృష్ణపక్షము’ అనే పేరుతో సాహితి సమితి తరుపున ప్రచురించారు. తల్లావజ్ఝల శివశంకర శాస్త్రి గారి’సింహవలోకనం’ అనే పరిచయ వాక్యాలతో ఈ కావ్యం పాఠకుల ముందు కొచ్చింది. ఈ కావ్యాన్ని సూర్యరాయ బహద్దూర్ గార్కి అంకితమిచ్చారు. ఇందులో 59 శీర్షికలున్న ఈ గ్రంధం పద్యగేయంమిశ్రమం కాని కృష్ణపక్షమనే మకుటంతో ఏ శీర్షికలేదు. కాని “నాకు మరణమ్ము” అనే శీర్షిక తేటగీతి పద్యాల్లో ఒక చోట ఆపదం కనిపిస్తుంది. 14 చీకటి రాత్రులన్న కృష్ణ పక్షాన్ని తనలో సగమైన, చేయి కలిపి కష్ట సుఖాలు పంచుకున్న అర్ధాంగి తనను అందకారంలో ముంచి వెళ్లిపోయిన విషాద సన్నివేశానికి, సింబాలిక్ గా ఈ పదం వాడారని చెప్పవచ్చును.
కృష్ణశాస్ర్తీ గారు భావగీతలను కూడ రాశారు.
” ఆకులో ఆకునై పువ్వులలో పూవ్వునై / కొమ్మలో కొమ్మనై నును లేతరెమ్మనై / ఈయడవిదాగిపోనా ఎట్లైనా/ నిచటనే దాగి పోనా అంటుసాగిపోతాయి.
కృష్ణ పక్షం కావ్యంలో గొప్ప కవితా ఖండిక ‘అన్వేషణ’ తనకుతానే గోపికయై వంశీ మోహనుడైన గోపాల దేవున్ని కవి వెతకడం అన్వేషణలోని ప్రధాన ఇతి వృత్తం సెల యేటి కెరటాలలో తేలిపోతున్న విరికన్నె వలపు గాను, తొలి ప్రొద్దు తెమ్మర త్రోవలో పయనమై పరిగెత్తు కోయిల పాటగాను తెల్లని వెన్నెలలో కలసి కరిగి పోతున్న మబ్బు తునక లాగాను తీయదనమైన గోపికా హృదయాంతరాన్ని తన్మయత్వంలో ముంచి తట్టిలేపింది. అనంత సంగీత మకరంద మాధుర్యాన్ని చవి చూసిన గోపికా నాథుని వెదుకుచు ఆయన పల్లె వదిలి ప్రాణ నాథుని పట్టువొదలి యమునా సైకత భూవిలో వెరిగ్రా తిరగసాగింది ఇలా “శారద శర్వరే మధుర చంద్రిక / సూర్యమంతా స్రవంతిగా చారు వినీల వీచిక ప్రశాంత నిశా | పవనోర్మి మాలికా ” అంటు సాగింది. కృష్ణ శాస్త్రి జీవితమే అన్వేషణగా జీవించి మురళీ మోహమనే ద్యాన భజనలో మధుర భక్తిని పండించిన ఆపరజయదేవుడు. లోక నీతికి, సంప్రదాయ రీతికి భిన్నంగా శ్రీకృష్ణునికి తనకు తాను అర్పించుకున్న రాధగా జయదేవ కవి ఆలపించిన భావ సౌందర్యాన్ని పూతగా స్వీకరించ కృష్ణ శాస్త్రి అన్వేషణలో రాశారు. దేశ మాతను బంధించిన కఠిన దాస్య శృంఖలాలు చెదరి పోయినట్లు గగనతలం మారు మ్రోగెటట్లు కంఠమెత్తి స్వేచ్ఛాగానం చేశారు. ఏల ప్రేమింతును, నా ప్రేమ, ప్రాణకాంత వంటి గీతా మాలికలు రాశారు. భార్య వియోగంతో తపించిపోయిన శాస్త్రిగారు దుఃఖంలో విషాదకావ్యాలు రాశారు. ‘ఆశ్రువులను మాయం చేసె మరణం కన్నా జీవించి ఆమె కోసం దుఃఖించటమే తనకు ఆనందం అంటారు.
1929వ సం||లో జ్వాల పత్రికను నడుపుతున్న ముద్దు కృష్ణగారు ప్రవాసము ఊర్వశి అనే సంపుటిని ముద్రించారు. ‘కృష్ణపక్షము’ లోని వియోగం నుండి ప్రవాసములోని దుఃఖం ఆ దుఃఖం నుండి గమనించిన నాయిక “ఊర్వశి” అని చెప్పవచ్చు. దుఃఖాన్నే సౌఖ్యంగా అనుభవిస్తూ ప్రవాస గీతాలల్లడం, ప్రవాస గీత మాధుర్యాన్ని భావనకు అనునయించి ఆ భావనలో దివి నుండి దివ్యమూర్తి ‘ఊర్వశి’ ని భూమికి దించారు కృష్ణ శాస్త్రి గారు. ఉషస్సులు రావని తన జీవితం వలె కాలం కూడ చీకటి మయం గా కనిపిస్తుందని వాపోయారు. ఆయన బాధనుఏ గంధర్వలు అలకించారో ఏ వసంతుడు విశ్వ ప్రేయసి ఊర్వశికి తెలియచేశారో కాని ఆమె నిశీధిలో వెల్లు రేఖలా కవి హృదయకవాటాన్ని తట్టి లేపింది. ఆ విధఃగా కృష్ణ శాస్త్రి బాధ ప్రపంచానికి బాధ మాత్రమే కాదు సర్వలోకాలను కదిపి వేసిన గాధ కూడ ఆమె కోసం నిశీథిలో అన్వేషించారు. తపించారు కళ్ళలో వత్తులువేసుకొని నిరీక్షించారుఎద లోపలి ఎదలో దాచుకున్నారు. ఊర్వశిని “తొలిపొద్దున కురిసిన మంచు’ లా, విశ్వ వేదన మాల్యంగాను, విషంతో, అమృతంతో, చీకటితో, వెన్నెలతో కలసిన ప్రేయసిగా ఊహించుకున్నారు. శాస్త్రాగారి మాటల్లో చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఎవరికైనా అమ్మ సీతమ్మ, ప్రేయసి ఊర్వశి’అని అంటారు.
రఘుపతి వెంకట రత్నం నాయుడు గారి శిష్యరికంలో బ్రహ్మ సమాజంలోని విశాల మానవ దృష్టి సంకల్ప శక్తి ఆయనకునైతిక బలాన్నిచ్చాయి. వైష్ణవి గీతాల్లోని వర్ణన మాధుర్యాన్ని ఆకళింపు చేసుకున్నారు. వీరి భావనలోని అణువణువు లయతో ఉంటుంది. శాస్త్రిగారి లేఖిని నుంచి జాలువారె ప్రతి గేయంలోను శబ్ధార్ధాలు పొందికలో నాట్యం చేస్తుంది. ఇంకా భక్తి గీతాలు అమృత వీణా ‘మంగళ కాహళి అనే సంపుటాలుగా వెలువరించారు. కృష్ణ రజని కన్నీరు, మహతి, మధు మురళి, గుడి గంటలు, ఋతుభేల, విరితూపు అనేవి సప్తస్వర సమ్మిళితం అయతే నిరాశ, కరుణ, ఆర్తి, భక్తి, ప్రణయం, ప్రకృతి ఆరాధన, పుణ్యయ ప్రేమ అనేవి సప్త స్వరాఅంత నాదాలు ఉంటాయి.
ఋతుశోభను ప్రకృతి కాంతలీలా మాధుర్యాన్ని కళ్ళారా చూచి, మనసారా అనుభవించిన కృష్ణశాస్త్రి వైష్ణవ భావ పరిపక్వతతో అండాళ్ళు ‘తిరుప్పావై’ ని ఆంధ్రీకరించారు శబ్దమాధుర్యంతో పాటు రూపమాధుర్యాన్ని అంతర్నేత్రంతో దర్శించి ఆనందించగల కృష్ణశాస్త్రికి దేవుడికి ఏ పూవ్వులు కావాలో, తెలుగులో ఏ అలంకారాలు, ఏ దేవుడికిష్టమో తెలుసు. ఏ అక్షరాలలో ఏ దేవుని పూజిస్తే అతడు సంతృప్తుడౌతాడో తెలుసు. అందుకే పుష్పాక్షరాలతో పూజించిన పుణ్య మూర్తి కాబట్టి వందలాది భక్తి కీర్తనలను రచించారు. కృష్ణశాస్త్రి గారి గొంతు పోయాక రాసిన గేయ సంకలనం కృష్ణ రజని’ లో ఆర్తిగీతాలు అద్భుతంగా పలికించారు.
కృష్ణశాస్త్రి పద్యాన్ని పాటను ఎంత రమణీయ శిల్పరంజితంగా తీర్చిదిద్దారో అంతటి నైపుణ్యాన్ని వచన రచనల్లో కూడ చూపించారు మంచి గంధంతో మల్లెపూలు అత్తరులో కలిపిచినుకు చినుకు చిలకరించినట్లుంది. వారి వచన శైలి, పచ్చకర్పూరపు గుభాళింపుతో వున్న పాయస పాత్రను నోటికందించినట్టుగా వుంటుంది. శాస్త్రిగారి విషయ విన్యాసం. కృష్ణశాస్త్రి పుట్టుకతో కవిగా అవతరించిన నిరంతర కవితా ధ్యానంతో పరిణతి చెందారు. వచనంలో కూడ తనదైన ఒక శైలిని సృష్టించుకున్నారు. ఆధునిక అవసరాలను ఊటకింస్తూ రాసిన చిన్న చిన్న వ్యాసాలల్లో కవిత్వం హృదయాన్ని ఎంత రంజిప చేస్తుందో వారి వచనం కూడా అంతగానే ఆలోచనలను తట్టి లేపుతుంది. వీరి కవిత్వంలో ప్రధాన గుణం భావమైతే మరో గుణం సంగీతం అంతర్వాహినిలా సాగుతుంది. అందుకే 1960 సం||లో హైదరాబాదు ఆకాశవాణిలో పనిచేశారు అనతి కాలంలోనే చలన చిత్ర పరిశ్రమ కూడా కృష్ణశాస్త్రి గార్ని ఆహ్వానించింది. సినిమా మరుగైనా పాట నిలిచే ఉండే మంచి పాటలు రాసిన కవుల్లో దేవులపల్లి అద్వీతీయులు.
1939వ సం|| నాటికే ప్రతినాగరికుడి నోటికి కూని రాగాలయ్యాయి. ఆనాడు రాసిన గీతాల్లో “మవదూదయంలో మంచి ముహుర్తం/ మాధవి లతకు పెండ్లి/ మాదవి పెండ్లికి మల్లెమాలలు /మంధారాలు పేరంటాళ్లు” అనే పాట బహ్మండమైన ప్రచారంలో ఉండేది. ఇలాంటి పదచిత్రాలు చూసిన సినిమా రంగం 1951లో వారిచే పాటలు రాయించింది. దేవులపల్లిగారు పాటలు రాసిన మొదటి సినిమా ” మల్లీశ్వరి’ రాణి వాసపు పంజరంలో బంధీయైన మల్లీశ్వరి రాత్రిపూట రహస్యంగా ప్రియునిన కలుసుకున్నపుడు ఆమె మనస్సు మల్లెలు ఊగిపోయాయి హాయి నిండిన ఆ రేయిలో ఆమె బతుకే పండింది అంటూ ఈ పాట ‘మనసున మల్లెల మాల లూగెనే / కన్నుల వెన్నెలడోల లూగెనే ఎంత హాయి ఈ రేయి నిండెనో / ఎన్ని నాళ్లకి బ్రతుకు పండెనో అంటు సందేశాన్ని పంపినా ప్రతి పాటా ఒక మధుర కావ్యం. కాళిదాసు మేఘ సందేశాన్ని దృష్టిలో ఉంచుకొని మల్లీశ్వరిలో మంచి పాటలు రాశారు. జావళీలు రాయడంలో కూడా ఆయనకు తిరుగు లేదు. పిలిచిన బిగువటరా / పిలిచినా బిగువరా / ఔరౌర అంటు సాగే జావళీ పాట నేటికి నిత్య నూతనంగా అందరి హృదయాలను అలరిస్తూనే ఉంది. పాటలో జీవిత చిత్రాన్ని చిత్రించడంలో ‘వారికి వారె సాటి. జీవితంలో అన్ని విధాల ఓడిపోయిన మారిపోయిన ఉక్కు మనిషిలోపరివర్తనకు కారణమైంది ఒక పసిపాప. అతడు పాప కోసమే జీవిస్తాడు కారణాంతరాన చెరసాలకు వెళ్లి తిరిగి వచ్చాక పాప పెద్దదవుతుంది. అతన్ని మర్చిపోతుంది. బరువెక్కిన గుండెలతో ఒక పాప బొమ్మను లాలిస్తూ. తథిమి తకథిమిల్ బొమ్మ /దీని తమాస చూడవే కీల్ బొమ్మ / దీని తమాస చూడవే మాయ బొమ్మ అంటు పాడతాడు తలచుకుంటేనే గుండె కరిగిపోయే ఈ సన్నివేశంలో తత్త్వాన్ని చాలా గొప్పగా పలికించారు. కృష్ణశాస్త్రి గారు. మల్లెల్లో పూలల్లో కూడ సృష్టి విలాసాన్ని పొదిగి చెప్పిన పాటలు లెక్కకందవు. అందులో ఒక్కటి ” ఇది మల్లెల వేళయని / ఇది వెన్నెల మాసమని / తొందర పడి ఒక కోయిల ముందే కూసింది విందులు చేసింది అంటు మల్లెలు, వెన్నెల, కోయిలతో మహత్తరమైన జీవిత సత్యాన్ని పాడారు. అందులోనే “మరిగిపోయెకి మానవ హృదయం / కరుణ కలిగేది చల్లని దైవం వాడే లతకు ఎదురైవచ్చు, వాడని వసంత మాసం వసివాడని కుసుమ విలాసం అంటు సాగే ఈ పాటలో విషాదం వెనుక వసంతాన్ని సృష్టించి ఊపిరిపోస్తారు. సినిమాల్లో కూడ ఎన్నో భక్తి గీతలు రాశారు “సంపూర్ణ రామాయణం” లో శబరి రాముని కోసం ఎదురు చూస్తుంది రాముడు సమీపానికి వస్తున్నాడు ఈ సన్నివేశంలో శబరికి, శాస్త్రిగార్కి బేధం లేదు. ఆ సందర్భంలో ఇలా… ముందు తెలిసెనా ప్రభూ / ఈ మందిర మిటులుండేనా, మంద మతిని, నీవు వచ్చు మధుర క్షణమేదో, కాస్త ముందు తెలిసినా……. అందముగా నీ కనులకు విందులుగా వాకిటనే సుందర మందార కుందసును దళములు పరవనా…. అంటు షాగే ఈ పాట గళం మూగబోయాక రాసిన గగన తలాన్ని సృశిస్తుంది భగవంతుని పిలుస్తుంది. భాగ్య రేఖ సినిమాలో “నే వుండేదాకొండపై రాజమకుంలో ‘సడిసేయకేగాలి” భక్త శబరి చిత్రంలో “ఏమి రామ కథ” మంచి రోజులొచ్చాయి చిత్రంలో “నేలతో నీడ అన్నది నను తాకరాదని” ఆమెరికా అమ్మాయిలో పాడనా తెలుగుపాటా”, బంగారు పంజరంలో ‘గట్టుకాడ ఎవరో ” మొదలైనవి శాస్త్రి గారి పాటల్లో ఆణిముత్యాలుగా చెప్పవచ్చును. వందల సినిమాల్లో దాదాపు 500పైగా పాటలు రాశారు. సినిమా పాటకు కావ్య గౌరవాన్ని కల్పించిన ఘనత కృష్ణశాస్త్రి గార్కె దక్కింది.
కృష్ణశాస్త్రి గారు స్వాతంత్య్ర కాంక్షతో జాతీయ గీతాలు పాడారు. “జయ జయ జయ ప్రియభారతి జనయిత్రీ దివ్వ దాత్రి ” అంటూ నివాళులర్పించారు. స్వాతంత్రోద్యమంలో ప్రజలను కదిలిస్తూ రాసిన గీతం ” ప్రజారథం తరలింది / ప్రపంచ పధం పొరలింది/ కనుక పదవోయి పద” అంటూ హెచ్చరిస్తూ ఉత్తేజతుల్ని చేసింది. 1939 ప్రాంతంలో దేశంలో క్షామ దేవత తాండవిస్తున్న తరుణంలో ఆకలిగేయం రాశారు. 1941లో స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరిగిన విద్యార్థి మహ సభకు ఉద్యమానికి ప్రేరణగా అవేశం అంతర్భూతంగా ఒక స్వభోధ గీతాన్ని రచించారు. శాస్త్రిగారు అభ్యుదయ కవుల హృదయాల్లో చెలరేగిన ఉద్వేగ భావాలు గుర్తించారు. ఆశీర్వదించి వారికి పద నిర్దేశం చేసి ముందుకుసాగనించారు. తృతీయ అభ్యుదయ రచయితల మమాసభకు అధ్యక్షత వహించడం ఆయన అభ్యుదయ ప్రియత్వానికి నిదర్శనం శాస్త్రిగారు భావ కవితా ప్రతినిధే కాదు కవితా వైతాళికుడు కూడా. వారు పాడితే పక్షులు వంతపాడుతాయి. మబ్బులు శృతి కలుపుతాయి, నదులు పర్వతాలు లయలు చూపుతాయి. అందుకే ఆయన అచ్చమైన ప్రకృతికవి. ఆయన పాటల్లో ఆకుల నాడించే కొత్తగాలి, మాటల్లో విశ్వ ప్రేమ ను చూపించే కొత్త ఊపు, ఆలోచనల్లో సామాజిక హృదయ స్పందనలపై కొత్త చూపు కలంలో కరుణ, జాలు వార్చెడి కొత్త రసస్పందన కవితలలో సర్వహృదయాలను కదిలి కదిలిపోయె నూతన భాష్పీభవన పరిస్పందన. దేవులపల్లి కవిత ఆత్మీయుడైన మిత్రుడు సంస్కారాన్ని తట్టి మేలు కొల్పినట్లుంటుంది. సంప్రదాయం నుంచి చైతన్య పూరితమైన సన్నివేశాలు తెలసుకోగలరు. అవి రెండు కలిపి కవిత్వంగా ఆవిష్కరించగలరు. ఆ కవిత్వాన్ని పాడి ఎదుటి వాడి గుండెలో గూడు కట్టి కాపురం చేయగలరు. అందుకే ” కవి కృష్ణ శాస్త్రి కమ్మని కవితల కతడు మేస్త్రి అంటారు. 1942లో నవ్య సాహిత్య పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికైనారు. 1964లో శాస్త్రి గారి స్వరపేటికలో కాన్సర్ సోకింది. ఆపరేషన్ చేశారు. గళం మూగబోయింది. మధుమాస కోయిలకు గొంతు మూగ బోయదంటే ప్రకృతిలో ఎంత విచిత్ర మైన లీలలు సాగుతున్నాయో గదా !
గొంతు మూగబోయిన చివరి వరకు ఆయన మానసికంగా ఎంతో ఉత్సాహంగా జీవించారు. కవితా వ్యాసం సగం విడువలేదు ఆ సమయంలో రాసినదే “కృష్ణరజని” అని పేరు పెట్టారు. తన అభిమానులకు కొండంత సాహిత్యంతోపాటు రవంత కన్నీరు మిగిల్చి 24-02-1980 వ సంవత్సరములో గంధర్వ లోకం వెళ్ళిపోయారు.
“నన్ను గొపోవరాదా నాదా / నా హృదయం నాదా ” అంటూ భగవంతుని సన్నిధానం చేరుకున్నారు. కృష్ణ శాస్త్రి కవిత్వం రాయడానికి కొన్న హంగులు కావాలి నిరంతరం సాహితి గోష్ఠికావాలి మంచి సంగీతం వింటూ ఉండాలి. ఊసులు చెప్పుకోడానికి ఊహ తెలిసిన మిత్రులు కావాలి. ఈ హంగులుంటేకాని ఎక్కడో గున్నమావి కొమ్మల్లో ఉన్న గువ్వ కలంతో కలిసి పాడదు. కదిలి పోయే గుండె ఉండాలే కాని కృష్ణ కోయిల ప్రతి వసంతానికి తట్టి లేపుతునే ఉంటుంది.
” గూడు నిద్రపోయిన గువ్వ మేలుకుంది.
గొంతు మూగ పోయిన గుండె మేలుకుంది “
వనపర్తి పద్మావతి
ప్రముఖ కవి, రచయిత
ఉపన్యాస సిరోమణి
(అమెరికా, కెనడా)
ప్రకృతి రమణీయ దృశ్య కావ్యం నయాగరా జలపాతం. ఈ జలపాతాన్ని ఎన్ని సార్లు వీక్షించినా తనివి తీరదు. ఋతువులు మారుతుంటే వాటితోపాటు తన రూపాన్ని మార్చుకునే నయాగరా గురించి ఎంత వర్ణించినా తక్కువే. అందుకే కవులంటారు ప్రపంచంలోని జలపాతాలన్నింటిని ఒక్కచోట కుప్పపోసి చూస్తే కనిపించేదే నయాగరా అని. నయాగరాను చూస్తే ఆ కవి వర్ణన తప్పుకాదేమో అనిపిస్తుంది. అందుకే ఈ నయాగరా అందాలని వీక్షించేదుకు మూడుసార్లు వెళ్ళి వచ్చాను.
ఈ మూడు సార్లు ఎటువైపు నుండి (కెనడా, అమెరికా) చూసినా తన అందాలతో కట్టిపడేసి, తనలో తడిసిముద్దయ్యేలా చేస్తుంది. ఇన్ని సార్లు చూసేందుకు అంతలా ఎముంటుంది అనేగా మీ ప్రశ్న.. దాని గురించి తెలిస్తే దాన్ని చూడకుండా ఎవరూ ఉండలేరు. అంత అద్భుతమైనది ఆ నయాగరా..
నయాగరా గురించి…
భూతల స్వర్గమని మనం పిలుచుకునే అమెరికా, కెనడా సరిహద్దులలో ఉందీ. జలపాతం. వరల్డ్ లో అతిపెద్ద జలపాతమైన విక్టోరియా జలపాతం తర్వాత స్థానం దీనిదే. అందుకే ఏటా కోటిన్నరకు పైబడి పర్యాటకుల సందర్శనతో ఈ జలపాత ప్రాంతాలు కిటకిటలాడుతూ ఉంటాయి.
నయాగరా జలపాతం, మూడు జలపాతాల సంగమం. ఒకటి ‘హార్స్ షూ ఫాల్స్’, రెండవది ‘అమెరికన్ ఫాల్స్’, మూడవది ‘బ్రైడల్ వెయిల్ ఫాల్స్’. ఈ మూడూ ఎరీ నదిలోని నీటిని, అంటారియో లేక్ లోకి ప్రవహింప చేస్తాయి. దీని ఎత్తు 167 అడుగులే అయినా (కొన్ని చోట్ల 188 అడుగులు కూడా వుంది), నిమిషానికి ఆరు మిలియన్ల ఘనపుటడుగుల నీరు ప్రవహిస్తుంది. నయాగరా జలపాతం వెడల్పు 2,600 అడుగులు మాత్రమే!
నయాగరా అంటే, మొహాక్ ఇండియన్స్ వారు మాట్లాడే భాషలో ‘మెడ’ అని అర్ధం. 1604 ప్రాంతంలోనే దీనిని, కెనడాకి వచ్చిన ఫ్రెంచ్ వారు, అమెరికాకి వచ్చిన పూర్వీకులు కనుగొన్నారు. 18వ శతాబ్దంలోనే నయాగరా జలపాతాన్ని చూడటానికి ఎంతోమంది యాత్రీకులు వచ్చేవారుట. 1897లోనే ఈ రెండు దేశాల్నీ కలుపుతూ, ఒక బ్రిడ్జిని కట్టారు. దాని పేరు, Whirlpool Rapids Bridge ఈ స్టీల్ బ్రిడ్జ్ మీద రైళ్ళూ, కారులూ అన్నీ నడిచేవి. కార్ల కోసం కొత్త బ్రిడ్జ్ కట్టినా (దాని పేరు రైన్బో బ్రిడ్జ్), పాత బ్రిడ్జి మీద ఇంకా రైళ్ళు నడుస్తూనే వున్నాయి. జూన్, జులై, ఆగస్టుల్లో అధిక సంఖ్యలో పర్యాటకులు ఇక్కడకు విచ్చేస్తుంటారు.
కెనడా వైపు కన్నా అమెరికా వైపు జలపాతం వెడల్పు తక్కువ, లోతు ఎక్కువ ఉంటుంది. అమెరికా వైపు సుమారు 1060 అడుగుల వెడల్పుతో 175 అడుగుల లోతులో నీరు పడుతుంటే, కెనడా వైపు సుమారు 2000అడుగుల వెడల్పుతో గుర్రపు ఆకారంలో 140 అడుగుల లోతులో నీరు పడుతుంది. అంత ఎత్తు నుండి కిందకు దూకే పరవళ్లతో నయగరా జలపాతం మహా ఆద్భుతంగా ఉంటాయి. తన సోయగాలతో ప్రపంచ వింతల్లోనే ఒకటిగా చోటు సంపాదించుకున్న ఈ జలపాతాన్ని చూసేందుకు పర్యాటకులు క్యూ కడతారు.
మొదటి ప్రయాణం…
నయాగరా జలపాతాన్ని చూసేందుకు 1999లో మొదటి సారి వెళ్ళాను. అమెరికాలోని ఓహియో () నగరంలో మావారి బాల్య స్నేహితుడు సుదర్శన్ రెడ్డి, జయ దంపతులు నివసిస్తుంటే వాళ్ళను కలిసేందుకు వెళ్ళినప్పుడు మొదటి సారి
నయాగరాని చూడటం.
చిన్ననాటి స్నేహితులు కాబట్టి చాలా క్లోజ్ గా ఉండేవాళ్లం. వాళ్లు ఉద్యోగరీత్యా ఎక్కడికీ ట్రాన్స్ఫర్ అయినా అక్కడికి వెళ్ళివచ్చేవాళ్లం. వీళ్ళు కలకత్తాలో ఉంటే కలకత్తాకు, బాంబేలో ఉంటే బాంబేకి దూరంతో సంబంధం లేకుండా ఎక్కడ ఉన్నా అక్కడికి వాలిపోయేవాళ్లం. అంతంటి స్నేహం మా ఇరు కుటుంబాలది. చివరకూ అమెరికాలో ఉన్నారని తెలిసినా చూడటానికి వచ్చేశాం.
మొదటిసారి అమెరికాకు వచ్చినప్పుడు న్యూయార్క్ ఎయిర్ పోర్టులో దిగి అక్కడి నుండి గ్రే గ్రౌండ్ బస్లో ఓహియో చేరుకున్నాం. ఓహియో అనేది అమెరికా సంయుక్త రాష్ట్రాలలో ఒక ముఖ్య నగరం. ఓహియో అనే పేరు సెనెకా పదం నుండి వచ్చింది. ఓహియో అంటే ‘గొప్ప నది’ లేదా ‘మంచి నది’ అని అర్థం.
మొదటి సారి వచ్చినప్పుడు వారం రోజులు వాళ్లింటోనే మకాం. ఆసలు వారం రోజులు వాళ్లతో ఎలా గడిచిపోయిందో తెలియనే తెలిదు మాకు. వాళ్ళకు సొంత వెహికిల్ ఉంది కాబట్టి హ్యాప్పిగా అన్ని ప్రాంతాలని చుట్టి వచ్చాం. మొదటి సారి నయాగరాను చూసేందుకు వెళ్ళేసరికి రాత్రి అయింది. రాత్రి వేళలో నయాగరాను వీక్షిస్తే అద్భుతంగా ఉంటుందని ఆ టైంలో తీసుకెళ్ళారు. అక్కడే దగ్గర్లో ఉండేలా ప్లాన్ చేశారు. రాత్రి వేళల్లో ఏం కనిపిస్తుంది. ఏం చూస్తాం అనుకుంటాం కానీ నిజానికి రాత్రి వేళల్లో నయాగరా జలపాతాన్ని వీక్షించడం ఓ అద్భుతమే అనవచ్చు.
జలపాతాలని పగలు దర్శించడం వేరు. కానీ చీకట్లో చూడటమే వింత. అందుకే ఆ వేళలో చూడటం. నయాగరా జలపాతం చీకటి పడగానే మొత్తం దృశ్యం ఏదో స్వప్నలోకంలో ఉన్నట్లు మారిపోయింది. తారాజువ్వలు ఆకాశంలో నుంచి విచ్చుకొని రంగురంగుల పువ్వులను వర్షిస్తున్నట్లుగా, దాదాపు ఒక పదిహేను నిమిషాల పాటు ఫైర్ వర్కు ప్రదర్శన సాగుతుంది అక్కడ.
ఎక్కడో దూరం నుంచి ఫోకస్ చేసిన లేజర్ కిరణాలు ఈ నీటి ధారలను రంగులమయం చేసి నీటి తుంపర్ల మీద ఇంధ్రధనస్సులా పడి మంత్రముగ్ధుల్ని చేస్తుంది. అంత విశాల ప్రాంతంలో జలపాతంలో రంగులు మారుతున్నట్లు చేసిన ఏర్పాట్లకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఆ దృశ్యాన్ని చూస్తూ టూరిస్టులంతా హర్షాతిరేకంతో బిగ్గరగా అరుస్తువుంటే…అ రాత్రి అద్భుతమనే చెప్పవచ్చు.
ఆ వెండి వెన్నెల్లో తారాజువ్వల మధ్య నయాగరాను వీక్షించాక హెూటల్కు వెళ్లి పోయాం. తిరిగి ఉదయం కెనడా బార్డర్ నుండి నయాగరా జలపాతం దగ్గరకు వెళ్లాం. ఇదంతా కూడా ఓ రెయిన్ ఫారెస్టు. చినుకులతో, నీటి తుంపర్లతో ప్రదేశం మొత్తం ప్రశాంతంగా ఉంటుంది. ఇవన్నీ మా ఫ్రెండ్ వాళ్లకు ముందుగానే తెలుసు కాబట్టి నుండి చాలా ప్రదేశాలను చూపించారు. చూపించడమే కాకుండా ప్రతి ప్రదేశం గురించి చక్కగా వివరించారు. వారి అతిథ్యం మేం ఎప్పటికీ మరిచిపోలేం.
రెండోసారి (2004) స్నేహితురాలు శ్రీలతో కలిసి నయాగరా జలపాతాన్ని చూసేందుకు వెళ్ళాం. ఆమె, డాక్టర్ సుదర్శన్ గారు న్యూయర్క్ క్యాపిటల్ అయిన ఆల్బమాలో ఉంటుంది. తనతో మేం వారం రోజులు పాటు గడిపాం. వారం రోజుల్లో మేం అక్కడే ఉండే చిన్న చిన్న ప్రదేశాలకు పిక్నిక్ లాగ వెళ్ళేవాళ్లం. ఉదయం పూట మమ్మల్ని కార్లో తానే డ్రైవ్ చేస్తూ తీసుకెళ్ళేది. మాబాబు మాతోపాటు వచ్చాడు కాబట్టి తనకు చూపిద్దామని అందరం కలిసి వెళ్ళాం. రాత్రికి దగ్గర్లో ఉన్న హెూటల్లో రూమ్ తీసుకొని మర్నాడు ఉదయం కూడా నయాగరా చూడటానికి వెళ్ళాం. మా బాబుకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా ఉండాలని దగ్గరుండి నయాగరా అందాలను దగ్గరుండి మరీ చూపించాపించాలని జలపాతం దగ్గర ఉన్న టేబుల్ రాక్ కాంప్లెక్స్కు వెళ్ళాం. అదో వ్యూ పాయింట్. లిఫ్టులో 125 అడుగుల కిందకి తీసుకెళ్ళి ఒక గ్లాసు డోరులోంచి జలపాతాన్ని చూడవచ్చు. నీటి మట్టానికి 25 అడుగుల ఎగువన ఒక బాల్కనీ కట్టారు. మూడువైపులా రైయిలింగ్స్ ఉంటాయి. నిమిషానికి సుమారు 20కోట్ల లీటర్ల నీరు 175 అడుగుల లోతుకు పడి, వందల అడుగుల ఎత్తుకు లేచిన చల్లటి నీటి తుంపర్లు ముఖాన్ని తడుపుతుంటే…. ఆ మనోహర దృశ్యాలను వివరించడానికి మాటలు చాలవనుకోండి.
మైడ్ ఆఫ్ ది మిస్ట్….
వెళ్ళిన వెంటనే అందరం కలిసి నయాగరా జలపాతాన్ని చూశాక ఆ జలపాత పరవల్లను మరింత దగ్గర నుండి చూడాలని టికెట్లు కొనుక్కొని ‘మైడ్ ఆఫ్ ది మిస్ట్’ దగ్గరికి వెళ్ళాం. సుమారు 100 మంది పట్టే డబుల్ డెక్ మోటార్ బోటు ఇది. అక్కడికి వెళ్ళగానే లిఫ్ట్ ఎక్కి, అంత ఎత్తు నించీ క్రిందకి దిగి, అక్కడ ఒక బోటు ఎక్కాం. బోటు ఎక్కే ముందు, అందరికీ పాంచోలు (రైన్ కోటు లాంటివి) వాళ్ళు ఇస్తే అందరం వాటిని వేసుకుని, తల అంతా పాంచోలో వున్న టోపీతో కప్పుకుని, బోటులో అందరం రైలింగ్ పట్టుకుని నుంచున్నాం. అది రెండస్తుల బోటు. అది నెమ్మదిగా, ఈ మూడు జలపాతాలు పక్క నించీ వెడుతుంటే, ఆ శబ్దం, గాలి, తల మీద పడే నీటి తుంపరలే కాక, అక్కడక్కడా కుండపోత వర్షంలా పడే నీరూ | అదొక అందమైన అనుభవం.
ఒక రకంగా జలపాతం క్రింద దాకా వెడతామన్నమాట. ఇక్కడ గాలి విపరీతంగా వుంటుంది. జలపాతం హెూరు చెవుల్ని చిల్లులు పడేట్టు చేస్తుంది. మన మీద పడే నీళ్ళు కూడా గట్టిగా తాకుతుంది. నదిపై బోటులో వెళుతుంటే… ఒక వైపు భయంగా ఉన్నా… మరో వైపు సాహసం చేస్తున్న థ్రిల్ కలుగుతుంది. అంత ఎత్తు నుండి నీటి ఉధృతి, తుంపర్లతో తడిసి ముద్దయిపోవలసిందే…!
ఆ అద్భుత దృశ్యాలను చాలా మంది తమ కెమెరాల్లో, సెల్ఫోన్లలో బంధిస్తుంటే మేము కూడా ఫొటోలు తీసుకున్నాం. ఇక్కడ పిల్లా, పెద్ద అనే తేడా లేకుండా హాయిగా ఎంజాయ్ చేయవచ్చు. అందరం కలిసి బాగా ఎంజాయ్ చేశాం అక్కడ.
డాక్టర్ సుదర్శన్ గారు లీవ్ పెట్టి మరీ మాతో వచ్చిన ఆ ప్రయాణాన్ని ఎప్పటికీ మరిచిపోలేం. ఆ దంపుతులిద్దరు సాయంత్రం పూట బర్బిక్ తో తయారు చేసిన చికెన్, మటన్, మొక్కజొన్న కంకులతో వేడి వేడిగా స్నాక్స్ తినిపించేవాళ్లు. చాలా రుచిగా అనిపించేవి. మమ్మల్ని ఫై స్టార్ హెూటల్కు తీసుకెళ్లారు. ఆ ప్రయాణంలో ఒక్క పైస కూడా మమ్మల్ని ఖర్చు పెట్టనివ్వలేదు. వారి అతిథ్యాన్ని మేం ఎప్పటికీ మరిచిపోలేం.
2014లో ఇంకోసారి….
2014లో మేం కెనడా వెళ్లాం. ఈ ప్రయాణంలో మరిచిపోలేని అనుభూతి వయా ట్రైన్. వాస్తవానికి మేము అక్కడికి వెళ్ళే వరకూ కూడా దాని గురించి తెలియదు. ఒక హెూటల్లో రూమ్ తీసుకొని ఓ రాత్రి ఉన్నప్పుడు అక్కడున్న ఓ అమ్మాయి అడిగింది. “మీరు ఎక్కడికెళ్తున్నారని”. మేం ఇక్కడ దగ్గర్లో ఉన్న ప్రదేశాలను చూడటానికి అని చెప్పాం. అవి ఎప్పుడైనా చూడోచ్చు కానీ. ముందు మీరు కెనడా వచ్చేరంటే కచ్చితంగా మీరు వయా ట్రెయిన్ ఎక్కాలి. ఇది కెనడా వాళ్ల జీవిత కాలపు స్వప్నం. మీరు ఇంత దూరం వచ్చారు కాబట్టి ఈ ట్రైన్ ఎక్కడం మీస్ కాకుండా చూసుకొండని” అమ్మాయి చెప్పింది. ఆమె ఇచ్చిన ఓ సలహాకు వెంటనే ఆమెనే టికెట్లు బుక్ చేయమని అడిగాం. “మీరు ఒక టూ నైట్స్కు తీసుకొండి. చాలా తక్కువలో వస్తుంది. అంటే లాస్ట్ మినిట్ సేల్ ఉంటాయి. అది నేను బుక్ చేస్తానని” చెప్పింది. అలా చాలా తక్కువ ధరలో మాకు ట్రెయిన్ బుక్ చేశారు. నిజంగా ఎంత ఆనందించానో.. మనం వెళ్లాలని ఆశ, కోరిక ఉంటే చాలా మనకు అలాంటివారే తటస్థ పడతారు. మనల్ని ప్రోత్సాహించేవాళ్లు, దారి చూపించేవాళు మన చుట్టు ఉంటే ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. పొద్దున్నే లేచి రెడీ అయి వయా ట్రెయిన్ ఎక్కాం. ఆ అమ్మాయే మాకు కెనడాలో ఏయే ప్రదేశాలు చూస్తే బాగుంటుందో చక్కగా చెప్పారు.
వయా ట్రైన్ కొందరి స్వప్నం….
కెనడాలో ఇది అతి ముఖ్యమైన జర్నీగా చెప్పుకొవచ్చు. ఎందుకంటే ఈ ట్రెయిన్ ఎక్కడం అక్కడి ప్రజలు జీవిత కలగా భావిస్తారు. వయా ట్రైన్ అనేది కెనడాలో చాలా ముఖ్యమైనది. ఇక్కడ ఒక విషయం చెప్పాలి.
మేం పొద్దున్నే స్టేషన్కు వెళ్లి ట్రెయిన్ బుక్ చేసుకున్నాం. ఆ ట్రెయిన్ ఉదయం ఐదింటికి ఉంది. కానీ మేం నాలుగింటికే ప్లాట్ పామ్ దగ్గరకు వెళ్లాం. మేం వెళ్లేసరికే మాకన్నా ముందే ఒక ముసలావిడ ట్రెయిన్ కోసం ఎదురు చూస్తోంది. ఆమె వయసు 84 ఏండ్లు. ఆమె దగ్గరకు వెళ్ళి నేను కాసేపు మాట్లాడాను. ట్రెయిన్ కోసం తాను మూడింటి నుండి వెయిట్ చేస్తున్న అని చెప్పింది. అమె అలా చెబుతుంటే కాస్త వింతగా అనిపించింది. ఇంత ఎర్లీగా ఎందుకు వచ్చిందో అని. అదే అడిగాను. మూడింటికే ఎందుకు వచ్చారు మీరు. ఐదింటికి రావొచ్చు కదా? అని. దానికి ఆమె ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా “నాకు ఈ ట్రెయిన్ ఎక్కలన్నది నా కల, ఈ కోరిక కొన్ని ఏండ్లది. అందుకే ఈ సమయానికి ఇక్కడికి వచ్చి ట్రెయిన్ కోసం ఎదురు చూస్తున్నాను. ఆ ఉత్సహంలో నాకు రాత్రాంత నిద్ర కూడా పట్టలేదు. అందుకనీ రెండింటికే నిద్రలేచి రెడీ అయి మూడింటికల్లా స్టేషన్ దగ్గర కొచ్చి ట్రెయిన్ కోసం ఎదురిచుస్తున్నాను” అని అంది. ఆమె అలా చెబుతుంటే ఆశ్చర్యంగా అనిపించింది నాకు. తానోక టీచరట. తాను సంపాందించిన సంపాదనలో కొంత భాగం ఈ ప్రయాణం కోసం దాచిపెట్టుకుందని చెప్పింది. అలా ఆమె జీవిత కాలపు కలను నేరవేర్చుకుంటోన్నది. మేం కూడా ఆ చలిలో తనతో పాటు కూర్చున్నా.
ఆమెను చూసిన తర్వాత ఈ వయసులో కూడా ఎంత సాహసం, ఎంత ఉత్సహాం కదా అనుకున్నాం. నిజానికి ప్రయాణికులకు కావాల్సింది ప్రోత్సాహాం కాదు, ఇలాంటి వాళ్ల అనుభవం ఉంటే చాలు ఎంత దూరమైన సరే వయసుతో సంబంధం లేకుండా తిరిగేయొచ్చు. ఇలా వాళ్ల జీవితమే కదా మాలాంటి వాళ్ళకు ప్రోత్సహం. ఆమెను చూసి మేం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం. అలా ఆ రోజంతా మేం ట్రెయిన్లో గడిపాం. సహజంగా ట్రెయిన్ జర్నీ అనగానే ఎవరికైనా ఆనందమే కదా!. అలాంటిది మేం వెళ్లే ట్రెయిన్ అన్నీ ట్రెయిన్స్ కన్నా భిన్నమైనది, ప్రత్యేకమైనదిగా చెప్పొచ్చు.
వయా ట్రైయిన్….
జనరల్గా ఏ ట్రెయిన్ అయినా ఐరన్ ఉంటాయి. మహా అయితే కాస్త లక్జరిగా ఉంటాయి. హంగూ ఆర్భాటాలత మూస్తాబు చేసి ఉంటాయి. కానీ ఈ ట్రెయిన్ అలాంటి ఇలాంటి ట్రెయిన్ కాదు. అందుకే కదా ఆ ముసలావిడ ఆ వయసులో కూడా తను కూడా దీన్ని ఎక్కాలని తహతహలాదింది.
కెనడా ప్రభుత్వం ప్రకృతి అందాలను వీకించేందుకు ప్రత్యేకంగా గ్లాస్తో నిర్మాణం చేయించింది ఈ ట్రెయిన్ను. ఈ ట్రైయిన్లో ప్రయాణం చేస్తూ ఎంచక్కా జర్నీ పొడవునా బయటి ప్రదేశాలను, ప్రకృతి దృశ్యాలను వీక్షించవచ్చు. బోగిలు అంతా గ్లాస్తోనే ఉంటాయి. కింది వైపు, పక్కవైపు, పైని వైపు ఎటూ చూసిన గ్లాస్గోనే ఉంటాయి. అందుకే బయట కనిపించే వాటిని స్పష్టంగా చూడవచ్చు. చూస్తూనే మన కంటికి కనిపించే దృశ్యాలను ఎంచక్కా ఫోటోలు కూడా తీసుకోవచ్చు. అయితే ఈ ట్రెయిన్ కాస్త కాస్లీ అని చెప్పవచ్చు. సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే కొన్ని లక్షల రూపాయలు కూడా ఖర్చు అవుతుంది ఈ ట్రెయిన్ జర్నీకి. మా తర్వాత వెళ్ళి, ఆ ట్రెయిన్ ఎక్కిన మా స్నేహితులు లక్ష రూపాయాలు ఖర్చు పెట్టామని చెప్పారు. అంత ఎందుకైంది. మేం వెయ్యి రూపాయాల్లో చూసొచ్చామని చెప్పాను. అయితే వాళ్లు బుక్ చేసుకున్నది పూర్తిగా అక్కడే ఉండి చూడటానికి. మేం నార్మల్ ట్రెయిన్ మాదిరి బుక్ చేసుకొని అక్కడి ప్రదేశాలను చూడటం జరిగింది.
ఆ ట్రెయిన్లో జర్నీతో ప్రయాణికులకు కావాల్సిన భోజనం, టీ, కాఫీ, బ్రెడ్ ఇంకా చాలా పదార్థాలను సప్లయ్ చేస్తారు. మేం మాత్రం ఎక్కువగా వేటిని ఆర్డర్ చేయకుండా కేవలం ఒక కాఫీ ఆర్డర్ ఇచ్చి తాగి అలా అందులోనే కూర్చుండిపోయి నాలుగు గంటలు ప్రయాణం చేసి తర్వాత మళ్లీ తిరిగొచ్చి భోజనం ఆర్డర్ చేసుకొనే వాళ్లం. అలా రోజంతా ట్రెయిన్లోనే గడిపేవాళ్లం. అందుకని మాకు కాస్త తక్కువనే ఖర్చు అయింది. ప్రకృతిని ఆస్వాదిస్తూ ప్రయాణం చేయాలనుకునే వాళ్ళకు ఈ ట్రెయిన్ జర్నీ అద్భుతమనే చెప్పాలి.
మేయి ఈ ట్రెయిన్ జర్నీలో మొదటగా అలస్కా కు చేరుకున్నాం. అక్కడి నుండి విక్టోరియా, తర్వాత విజిలర్స్, తర్వాత క్యూబెక్ ఇలా రెండు రోజుల పాటు ఆ ట్రెయిన్లో ప్రయాణం చేయడం ఎప్పుడు మరిచిపోలేని అనుభూతిని మిగిల్చిందనే చెప్పవచ్చు.
ఆ ట్రెయిన్ జర్నీ తర్వాత క్యూబెక్ నుండి టొరంటోకు బస్సులో వెళ్ళిపోయాం. బస్సులో వెళ్లేందుకు అమెరికాలో ఉన్న కుమార్ అనే అబ్బాయి బస్ బుక్ చేసి మాకు హెల్ప్ చేశాడు. మళ్ళీ ఓసారి కెనడా వైపు నుండి నయాగరా చూడాలని బయలు దేరాం.
ఈ సారి ప్రయాణంలో మాకు నయాగరా వద్ద ఇండియా నుండి వచ్చిన డాక్టర్ రమా, ప్రసాద్ దంపతులు కలిసారు. మేము నలుగురం కలిసి అక్కడే డబుల్ బెడ్ రూం తీసుకొని అక్కడే ఉండి ఆ ప్రాంతాలనన్నీంటిని చూడాలని ప్లాన్ చేసుకున్నాం.
ముచ్చటగా మూడోసారి…
ఎలాగూ రూం తీసుకున్నాం కాబట్టి స్వయంగా వండుకొని ప్రశాంతంగా ఆ ప్రాంతాలనన్నీంటినీ చూడాలని బయలు దేరాం. ఈ సారి మా ప్రయాణంలో కేవలం నయాగరా జలపాతాన్ని చూడటమే కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంతాలని కూడా కవర్ చేయాలని అనుకున్నాం. అందుకే నయాగరా చూశాక చుట్టుపక్కల వంతెనలు ఉన్నాయంటే వాటిని చూద్దామని వెళ్ళాం.
జలపాత మార్గంలో ఉన్న ఆరు అపురూపమైన బ్రిడ్జిలూ భలే ఆకట్టుకుంటుంటాయి. ఈ వంతెనలన్నీ కెనడా, అమెరికా అంతర్జాతీయ సరిహద్దుల వెంబడే నయగరా నదిపై నిర్మితమయ్యాయి. నాలుగు చక్రాల వాహనదారులు,పాదచారులు కూడా ఈ వంతెనలపై ప్రయాణిస్తుంటారు. వీటిలోనే ఇంటర్నేషనల్ రైల్వే బ్రిడ్జ్ మొదలైనవి. వీటిని చూసేందుకు 20,30 డాలర్ల ఫీజు ఉంటుంది. అక్కడ ఓ బ్రిడ్జ్ మీదకు ఎక్కి నయాగరా అందాలను తిలకించాం.
అలాగ మేం దగ్గర్లో ఉండే ప్రదేశాలకు నడిచి వెళుతూ అన్నీ చూస్తు తిరిగాం. చాలా సంతోషం అనిపించింది. నయాగరా పరిసరాల్లో, ఆ ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తే ఎగిరి గంతులేయలనిపించింది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మేము స్టే చేసింది కూడా నయాగరా జలపాతం దగ్గర్లోనే కాబట్టి ప్రతిరోజూ రాత్రి ఆ రంగు రంగుల నయాగరా జలపాతాన్ని వీక్షించడం సంతోషకరమైన అనుభవం.
టొరంటోలోనే మా అల్లుడి గారి మేనత్త జయ వాళ్లు ఉంటే వాళ్ళింటికెళ్లాం. జయ మమ్మల్ని టొరంటో నుండే పికప్ చేసుకొని వాళ్ళింటికి తీసుకెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళగానే చక్కటి సంగీతం పెట్టి వేడి వేడి కాఫీతో మాకు స్వాగతం పలికింది. ఒకవైపు జయ వాళ్ల ఆయన క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉంటూ భాదపడుతూ ఉన్నా మాకు ఇచ్చిన ఆతిథ్యం ఎన్నటికీ మరిచిపోలేను. వాళ్ల ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నాడు కాబట్టి మాకు ఇబ్బంది కలగకూడదని ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసింది. మా కోసం గదిలో బ్రష్ లు, దువ్వెన, టవల్స్ ఇలా అన్ని అన్నీ కొత్తవి ఉంచింది.
జయకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. రోజూ రాత్రి పన్నెండు గంటల వరకు చక్కగా కబర్లు చెప్పుకుంటూ, పాటలు పడుకుంటూ గడిపేవాళ్లం. మావారు, జయవాళ్లయన ఇద్దరు డ్రింక్ చేసుకుంటూ సంగీతాన్ని వినేవారు. షాపింగ్ తీసుకెళ్ళి చాలా తక్కువ ధరకు లభించే వస్తువులను చూపించింది. తక్కువ ధరకు స్టోర్ట్స్ షూట్ ఇప్పిచ్చింది. ఈ యాత్రలో జయ వాళ్ళ ఇంట్లో గడిపిన క్షణాలు మాత్రం ఎప్పటికి గుర్తుండిపోతాయి. అదే చివరిసారి జయ వాళ్ళ ఆయనను చూడటం. రెండు రైలు వంతెనలు కూడా ఉన్నాయి. అవి.. పీస్ బ్రిడ్జ్, రెయిన్బో బ్రిడ్జ్, వర్ల్ుల్ బ్రిడ్జ్,లూయిస్టన్-క్వీన్స్ట్రన్ బ్రిడ్జ్, మిచిగన్ సెంట్రల్ రైల్వే బ్రిడ్జ్, ఇంటర్నేషనల్ రైల్వే బ్రిడ్జ్ మొదలైనవి. వీటిని చూసేందుకు 20,30 డాలర్ల ఫీజు ఉంటుంది. అక్కడ ఓ బ్రిడ్జ్ మీదకు ఎక్కి నయాగరా అందాలను తిలకించాం.
అలాగ మేం దగ్గర్లో ఉండే ప్రదేశాలకు నడిచి వెళుతూ అన్నీ చూస్తు తిరిగాం. చాలా సంతోషం అనిపించింది. నయాగరా పరిసరాల్లో, ఆ ఆహ్లాదకరమైన వాతావరణం చూస్తే ఎగిరి గంతులేయలనిపించింది. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి. మేము స్టే చేసింది కూడా నయాగరా జలపాతం దగ్గర్లోనే కాబట్టి ప్రతిరోజూ రాత్రి ఆ రంగు రంగుల నయాగరా జలపాతాన్ని వీక్షించడం సంతోషకరమైన అనుభవం.
టొరంటోలోనే మా అల్లుడి గారి మేనత్త జయ వాళ్లు ఉంటే వాళ్ళింటికెళ్లాం. జయ మమ్మల్ని టొరంటో నుండే పికప్ చేసుకొని వాళ్ళింటికి తీసుకెళ్ళారు. ఇంట్లోకి వెళ్ళగానే చక్కటి సంగీతం పెట్టి వేడి వేడి కాఫీతో మాకు స్వాగతం పలికింది. ఒకవైపు జయ వాళ్ల ఆయన క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉంటూ భాదపడుతూ ఉన్నా మాకు ఇచ్చిన ఆతిథ్యం ఎన్నటికీ మరిచిపోలేను. వాళ్ల ఆయన క్యాన్సర్ తో బాధపడుతున్నాడు కాబట్టి మాకు ఇబ్బంది కలగకూడదని ఒక ప్రత్యేకమైన గదిని ఏర్పాటు చేసింది. మా కోసం గదిలో బ్రష్ లు, దువ్వెన, టవల్స్ ఇలా అన్ని అన్నీ
కొత్తవి ఉంచింది.
జయకు పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. రోజూ రాత్రి పన్నెండు గంటల వరకు చక్కగా కబర్లు చెప్పుకుంటూ, పాటలు పడుకుంటూ గడిపేవాళ్లం. మావారు, జయవాళ్లయన ఇద్దరు డ్రింక్ చేసుకుంటూ సంగీతాన్ని వినేవారు. షాపింగ్ తీసుకెళ్ళి చాలా తక్కువ ధరకు లభించే వస్తువులను చూపించింది. తక్కువ ధరకు స్టోర్ట్స్ షూట్ ఇప్పిచ్చింది. ఈ యాత్రలో జయ వాళ్ళ ఇంట్లో గడిపిన క్షణాలు మాత్రం ఎప్పటికి గుర్తుండిపోతాయి. అదే చివరిసారి జయ వాళ్ళ ఆయనను చూడటం.
