మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

వైజ్ఞానికం వందే జగద్గురుం

by Y. Sujatha March 18, 2026
written by Y. Sujatha

అగ్గిపుల్లా,
సబ్బు బిళ్ళా
తలుపు గొళ్ళెం,
గుఱ్ఱపు కళ్ళెం
సర్వం వైజ్ఞానికమే !

దేవుని హుండీ
పూల కుండీ
చొక్కా గుండీ
చక్రం బండీ
సర్వం వైజ్ఞానికమే !

లోహ విహంగం
విద్యుత్ తరంగం
నదీ సంగమం
డ్రోన్లు వీరంగం
సర్వం వైజ్ఞానికమే !

చేతిలో సెల్లు
కరెంటు బిల్లు
రాముని విల్లు
మేఘం జల్లు
సర్వం వైజ్ఞానికమే!

గ్రహాల భ్రమణం
జీవుల చలనం
ప్రకృతి గమనం
శరీర మరణం
సర్వం వైజ్ఞానికమే !

చంద్రయానం
సముద్ర శోధనం
అణు విస్ఫోటనం
కణ విచ్ఛిన్నం
సర్వం వైజ్ఞానికమే !

దృశ్య మాధ్యమం
ప్రింట్ చోద్యం
శ్రవణ పరికరం
రవాణా పరిశ్రమం
సర్వం వైజ్ఞానికమే !

విద్యా బోధన
వైద్య శోధన
ఆహార పోషణ
అంతరిక్ష వీక్షణ
సర్వం వైజ్ఞానికమే!

ఆనకట్ట
ఆయుధ గుట్ట
లెక్కల చిట్టా
టెక్నాలజీ పట్టా
సర్వం వైజ్ఞానికమే !

సర్వం
వైజ్ఞానికం
వందే జగద్గురుం

March 18, 2026 2 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సామాన్య వర్ణ విన్యాసంతో గంభీర భావాల ప్రదర్శించగల ప్రతిభాశాలి – కొండపల్లి

by mayuukha March 18, 2026
written by mayuukha

       – డాక్టర్  దాశరథి ,(1976 అక్టోబర్ 9-‘ఆంధ్రప్రభ’ దినపత్రిక,’రాగవల్లరి’)

పరుగెత్తే నది నైనా
బంధించును చిత్రం
అంతటి ఆకాశమైనా
ఇంతవును విచిత్రం

గదిలో నది:-
     చిత్రకారుని కుంచే గంగానది నైనా కాన్వాస్ మీద బంధించగలదు. శేషగిరిరావు గారి ‘గంగ’ను చూసినవారికి ఆశ్చర్యం ఆనందం కలుగుతాయి.  అన్నీ పోతాయి, కళ ఒక్కటే మనతో ఉంటుంది అన్నారు అంటీన్ డాల్ఫిన్ .
రాజ్యాలు, సింహాసనాలు పోయాయి. అజంతా ఎల్లోరాలు మనకు మిగిలాయి. కాలం పరిగెత్తుతుంది. కళ నిలిచి ఉంటుంది.కదలాడే ప్రకృతి కళలో  ఘనీభవిస్తుంది.  అర్థం కానిదేదైనా గొప్పది అనే అభిప్రాయం కొందరిలో ఉంటుంది. అయితే కడ కూడా వెర్రి తలలు వేస్తుంది ఒక చిత్రపడా ప్రదర్శనలో ఒక కంచు బొమ్మను ప్రదర్శించారట ఆ బొమ్మని పత్రికలో పొగిడాయట విమర్శకులు మెచ్చుకున్నారట ఆ కాన్స్టయ శిల్పం కింద ఇటాలియన్ భాషలో ఏదో పేరు ఉంది ఇటాలియన్ భాష తెలిసిన వారిని అడిగితే ‘ఏనుగులద్ది’అని అర్థం చెప్పారట!
అర్థం కానిదేదైనా గొప్పది-  అనే అభిప్రాయం కొందరిలో ఉంటుంది. క్యూబిస్ట్, సర్రియలిస్ట్, డాడాయిస్ట్, నైరూప్య, అధునాతన చిత్రకళారూపాలను తెగ పొగిడే వారు ఉన్నారు. మనకు అర్థం కాని దల్లా గొప్పది అనుకోవడం ఎంత పొరపాటు అందులో ఏమీ లేదనుకోవడం అంత పొరపాటే .పాశ్చాత్య సంగీతం వినీ వినడంతోనే అందులో శ్రావ్యత లేని లేదు అనేస్తారు కొందరు మరి మన సంగీతం వారికి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవడానికి కొంత సంస్కారం కావాలి మరి.
‘ఉత్తమ కళ ఏ కాలంలోనైనా తన కాలాని కంటే ముందు పరుగెత్తుతుంది తన కాలపు సమాజాన్ని ప్రతిబింబిస్తుంది కళ పయనించే వేగాన్ని సమాజం
అందుకోలేదు. కళ నేడు అందుకున్న దాన్ని సమాజం రేపు గాని అందుకొనదు. ఇక్కడే సమాజానికి కళాపధ ప్రదర్శకురాలు అవుతుంది”. అన్నారు ప్రసిద్ధ చిత్రకారులు, విమర్శకులు సంజీవ్ దేవ్ గారు.

      ” సమాజం కళ ను సజీవ పరుస్తుంది. కళ సమాజాన్ని ఆనందపరుస్తుంది.సమాజం గుప్తపరిచే దానిని కళ వ్యక్తపరుస్తుంది. గుప్తత  వ్యక్తత రెండు కూడా జీవన సాఫల్యానికి సమానావసరాలే” అన్నారు ఆయనే! కళను గురించి ఇంతకన్నా స్పష్టంగా చెప్పడం అసాధ్యమేమో! అయితే గుప్తత, వ్యక్తత ఏ పాళ్ళలో ఉండాలన్నదే ప్రశ్న. గుప్తత ఎక్కువైపోయి,వ్యక్తత తగ్గిపోతే సుబోధకత తగ్గుతుంది. కనుక ఆయన చిత్రాలు చాలా వరకు సుబోధకం గా ఉంటాయి.వీరు స్పష్టతను కోరే కళాకారులు. అందులో అయోమయత్వం లేదు. పెన్సిల్ తో గీసినా కలంతో వ్రాసినా, కుంచెలో వాడినా,తైలవర్ణాలు ఉపయోగించినా, లలితములైన జలవర్ణాలు ప్రయోగించినా, ప్రాచీన చిత్రాలు రచించినా, పాశ్చాత్య రీతులను అనుసరించినా శేషగిరిరావు తన చిత్రంలోనే కనబడేలా చేయగల ప్రతిభాశాలి. చిత్రకళానిపుణులు, విమర్శకులు ఇది శేషగిరిరావు గారి బొమ్మ అని ఇట్టే చెప్పగలరు.

   శేషగిరిరావు శిల్పులకు ప్రోత్సాహం ఇచ్చిన వ్యక్తి. ప్రపంచంలోని సుప్రసిద్ధ కళాకారులు శిల్పులు ఆయన మిత్రులు. ఆయనది సుకుమార హృదయం. ఉదారమైన మనస్తత్వం. నవాబ్ మెహదీ నవాజ్ జంగ్ కేంద్ర లలిత కళా అకాడమీకి తొలి అధ్యక్షులు.ఊ అలాంటి వ్యక్తి అనురాగం ఆశ్రయాలు, ఉచిత విద్య శేషగిరిరావుకు లభించాయి.శాంతినికేతన్ లోని విశ్వభారతిలో చేరినప్పుడు ఆచార్య నందాలాల్ శిష్యులుగా ఎంతో అనుభవాన్ని పొందారు. ప్రముఖ చిత్రకారులు కుమారిల్ స్వామి వీరికి అక్కడ సహధ్యాయి.

     చిత్రకళా నిపుణులు విమర్శకులు అయినా వేలూరి రాధాకృష్ణ గారు, శేషగిరిరావు నందాలాల్ బోస్ గురించి చెప్పిన మాటలు ఈ సందర్భంలో గమనించవలసి ఉంది. నందాల్ లాల్ బోస్ వద్ద నేర్చుకోవడం మూలంగా నాలోని చాలా లోపాలు దిద్దుబాటు చేసుకోగలిగాను.ఆయన వద్ద నేర్చుకోవడం గురుకులంలో మునివర్యుని వద్ద నేర్చుకోవడం వంటిది.”     తమకు అదే అనుభవం కలిగినట్లు వేలూరి రాధాకృష్ణ గారు అభిప్రాయపడ్డారు. ఆయన తను చేయు ‘కర్మకు బద్ధుడైన యోగి పుంగవుడు’ అన్నారు నందా బాబును గూర్చి.

   పందొమ్మిది వందల యాభైలో హైదరాబాద్ చిత్ర కళాశాలలో శేషగిరిరావు అధ్యాపకులైనారు. బనస్థలి విద్యాపీఠంలో కుడ్య చిత్ర రచనలో తర్ఫీదు పొందిన శేషగిరిరావు ఎన్నో కుడ్య చిత్రాలు రచించారు.భారతీయ పౌరాణిక చిత్రాలు,ప్రకృతి చిత్రాలు రచించడంలో శేషగిరిరావుది అందవేసిన చెయ్యి. పల్లె ప్రజల జీవితాలను వివిధ కోణాల నుండి సున్నిక్షితంగా పరిశీలించి చిత్రాలు రచించడం శేషగిరిరావు లోని మరో విశిష్టత. రోజూ మనం వీధిలో వెళుతూ రకరకాలైన వృక్షాలను చూస్తాం. దాటిపోతాం .తన కుంచెలోని నైపుణ్యంతో శేషగిరిరావు వేసిన వృక్ష చిత్రాలు చూసి ఆగిపోతాం. దాటిపోలేం. ప్రేక్షకుణ్ణి ఆకట్టుకుని ఆగిపోయేలా చేసి, ఆశ్చర్యచకుతునిగా చేసే శక్తి శేషగిరిరావు చిత్రాలలో ఉంది. అతడు వేసిన గుల్మోహర్ చూచి తీరవలసిందే.

   ఈయన చిత్రాలల్లో మరో విశేషం ఏమిటంటే రంగులు సామాన్యమైనవిగా ఉంటూ ఎంతో కండ్ల పండువగా  గంభీర భావాలను వ్యక్తపరుస్తాయి ఈయన న్యూరల్ పెయింటింగ్స్ లో కంపోజిషన్ అద్భుతంగా ఉంటాయి ఈయన బ్రష్ వర్క్ లో వేగం శక్తి జవం స్పేసింగ్ ఉట్టిపడుతుంటాయి సంతాల్ నృత్యం, వసంతం, కాకులు అనే చిత్రాలకు 1949లో, గేదెలు ,నెమళ్లు ఈ చిత్రాలకు 1953 లోను, సంతాపం, క్షమ అనే చిత్రాలకు బంగారు పతకం, బహుమతి, స్టేట్ హుడ్ అనే చిత్రాలకు కలకత్తా అకాడమీ అవార్డు లభించాయి.

     1963 ఏప్రిల్ లో హైదరాబాదులోని ఆంధ్ర సారస్వత పరిషత్తు హాలులో ఈయన పెయింటింగ్స్ ప్రదర్శన చూశాను సాలార్జంగ్ మ్యూజియం డైరెక్టర్ వివాస్కర్ ప్రదర్శనను ప్రారంభించారు ఈ ప్రదర్శనలో ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించినవి నన్ను బుధ్ధిని చేసినవి కొన్ని చిత్రాలు ఇక్కడ ఉదాహరించడం యుక్తమని భావిస్తున్నాను.చేదిత దృమం, గుల్మోహార్, గంగ ,నూతన ప్రభాతం, అడవి కోన, విషాద ప్రకృతి  ఒక తరహాకు చెందిన ఉత్తమ చిత్రాలు అయితే, పద్మం, గర్భిణి ,చిత్రాంగద, శకుంతల, అరుంధతి బతుకమ్మ, అహల్య, గాయత్రి, రామానుజ, పార్వతి, దమయంతి మరొక రకమైన ఉత్తమ చిత్రాలు.

    శేషగిరిరావు చిత్రాలను స్వదేశంలోనూ, విదేశాలలోనూ ఎందరో కళాభిమానులు కొన్నారు. హైదరాబాదు మ్యూజియంలో, సాలార్జంగ్ మ్యూజియంలోనూ, హైదరాబాదులోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లోనూ, ఢిల్లీలోని వెస్టర్న్ కోర్టులోను, కాబూల్, కైరో , మాస్కో మ్యూజియం లండన్ ఇటలీలలోను శేషగిరిరావు చిత్రాలు ఉన్నాయి.ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడమీ భవనంలోనూ, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లోను ఈయన చిత్రాలు ఉన్నాయి.

  అలంకరణ కళ పై శేషగిరిరావు ఒక గ్రంథం వ్రాశారు. ఇది ఇంకా ప్రచురణ కావలసి ఉంది.లేపాక్షి,తాడిపత్రి, హంపి దేవాలయాలలోని శిల్పాల రేఖాచిత్రాలు శేషగిరిరావు రచించారు.వాటి సంపుటమే ‘ సురేఖ’ .ఇది ప్రచురించబడింది .శేషగిరిరావు రచించిన పోతన, తిమ్మరుసు, అల్లసాని పెద్దన,ఉభయపార్వ్శాలలో గల అశ్వారూఢుడైన  శ్రీకృష్ణదేవరాయలు, కొంగలు మరపురాని చిత్రాలు.

   ప్రముఖ విమర్శకులు వేలూరి రాధాకృష్ణ గారు అభిప్రాయ పడినట్లు అతని రేఖలలో నుంచి జీవం ఉట్టిపడుతూ ఉంటుంది అతని రంగులలో నుంచి తేజస్సు తాండవం మాడుతూ ఆయన చిత్రాలు చూపురులను ముగ్ధులను లను చేస్తవి.పట్టు వస్త్రం పై శేషగిరిరావు గారు చక్కని భారతీయ శైలిలో చిత్రించిన చిత్రాలు కూడా ఎన్నో ఉన్నవి. అన్నింటికన్నా మించినవి అతని నలుపు తెలుపు చిత్రాలు చైనా సిరాలో ‘వాష్’ శైలిలో రచించిన చిత్రాలూను, వాటిలోని వేగం గమనింపదగింది. శేషగిరి రావు గారు తైల వర్ణాలతో కూడా మిగతారీతులలో వలె సులభంగాను చిత్రించగలడు. మన దేశంలోని అనేక ముఖ్య నగరాలలో శేషగిరిరావు తన సొంత చిత్రాల ప్రదర్శనలను ఏర్పాటు చేసి పండిత పామరుల  మన్ననలను పొందారు.

   సాంఘిక ప్రయోజనం లేని కళను ఆధునికులు హర్శించరు. ఇటీవల హైదరాబాదు నగరంలో జరిగిన బ్రహ్మాండమైన హరిజన మహాసభలలో శేషగిరిరావు గారు చిత్రించి, ప్రదర్శించిన “హరిజనోద్యమం”అని ప్యానెల్ లో సాంఘిక ప్రయోజనం తో పాటు ఆయన చిత్ర విద్యాలయపుణ్యం పరాకాష్ట నందుకు ఉన్నది. అందుకే అశేష ప్రజ్ఞాధురీణుడు శేషగిరిరావు అంటాను.

March 18, 2026 4 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

సహన భారతం

by Thokala Rajesham March 18, 2026
written by Thokala Rajesham

సీ:కులము కులమటంచు కులుకుచుందురు గాని
                            కోరికవడి తెచ్చుకొనిరె కులము
   మతము మతమటంచు కతలుజెప్పుదురెల్ల
                           వారి మతములొక్క తీరు గాదె?
    ధనము నాకేయున్నదని గర్వ మేలకో?
                           పైసలనేదిని బతుకగలమె?
    అధికార బలమున్నదని తుల్లెదరు నాయ
                           కుల జేసినది ప్రజాబలము గాదె?

తే:  ప్రజల కన్నీటిలోని ఆపదలనెల్ల
   తీర్పజాలిన నాడు-విద్వేష బుద్ధు
   లింకిపోవవే? కాని నెడెందు జూడ
    నాయకులె రెచ్చగొట్టుట నడుచు చుండె

చ:మతముల పేరుజెప్పుకొని మారణహోమము రేపి చీకటుల్
    బతుకులలోన నింపుట-శవమ్ములపై పడు చిల్లరేరు దు
    ష్కృతములు సాగవెల్లపుడు-కిందిది పైనది కాకపోదు-స
    మ్మతములు తారుమారుగను మారక పోవునె?భారతావనిన్

ఆ:మతములోన గలుగు మానవత్వమ్మును
    గొంతుబిసికి చంపి గోతి లోన
    పూడ్చిపెట్టి సుద్ద పూసమాటలు నేడు
    చెప్పు చుండ్రి లేని గొప్ప కొరకు

క: పరమతములపై పడి యె
    వ్వరు’దూషింపండి’యనుచు ప్రవచించిరి నె
    త్తురులను పారింపుమనుచు
    విరచించిరె గ్రంథముల పవిత్రత నెరుపన్

ఆ:మధ్యలోన పుట్టి మధ్యలోనే పోయె
    గతమునందు కొన్ని మతములవని
    మానవత్వమనెడు మతమొక్కటే మాన
    వాళితోడ చివరి వరకు నిలుచు

తే:చెట్టుపై కిచకిచలాడు పిట్టలందు
    కులము మతములు గలిగెనే? కుట్రలేవి
    యేని పొడసూపెనే?లేని పోని లొల్లు
    లొక్క మనుషులందే కల్గియుండుటేమి?

తే:మనది ఉపఖండమని చెప్పుకొనుచు
    పక్క వారి సంస్కృతి కించపరుచ నేల?
    మాలలో తీరుతీరైన పూలు గలుగ
    చూడ ముచ్చట గొల్పదే శోభ హెచ్చి                   –

March 18, 2026 4 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

సుయజ్ఞోపాఖ్యానము

by Devaraju Revathi March 18, 2026
written by Devaraju Revathi

ఎన్నో జన్మల పుణ్యఫలంతో అదృష్టవశాత్తు లభించిన మానవ జన్మ నిరంతరం భగవన్నామ స్మరణతో సఫంలం చేసుకోవాలే తప్ప భౌతిక మోహాలకు లొంగి వ్యర్థం చేసుకోకూడదనే వేదాంత పరమార్థం తెలియ జెప్పేదే సుయజ్ఞోపాఖ్యానం.ఇహము పరము మధ్యలో కొట్టు మిట్టాడే మనిషి ఆత్మకు పరమాత్మకు అనుసంధానం పొందే విధమైన ఆత్మజ్ఞానం పొందటానికి వేదవ్యాసుడు సమవర్తి అయిన యమధర్మరాజు నోటి వెంట చెప్పించిన తత్వ విచార సారాంశంగా అర్థం చేసుకోవచ్చు.

వేదాలను విభాగం చేసి పంచమ వేదంగా మహాభారతం వ్రాసినప్పటికీ అసంతృప్తి తో వేదన చెందుతాడు బాదరాయణుడు. కారణమేమిటో విచారించిన నారద మహర్షి భగవన్నామ సంకీర్తన లేని కావ్యం అంతగా సంతృప్తి కలిగించిందని చెప్పి పురాణ రచనకు ప్రోత్సహిస్తాడు. అందులో తొలి పురాణంగా వ్యాసుడు వ్రాసింది భాగవత పురాణమే.దానిలో భక్తి,గమ్యం,వైరాగ్యం,తత్త్వం,ముక్తి ఐదు అంశాలను సమపాళ్ళలో నింపి ఇతిహాసాల స్థాయితో తీర్చిదిద్దాడు.విష్ణుమూర్తి తో మూడుజన్మల వైరం కోరుకున్న హిరణ్యాక్షుడిని యజ్ఞావరాహస్వామి అవతారంలో కేశవుడు
సంహరిస్తాడు అసందర్భంగా అంత్యక్రియలు చేయటానికి పూనుకున్న హిరణ్యాక్షుని సోదరుడు హిరణ్యకశిపుడు తన తల్లి దితికి జీవితము కర్మఫలాల గురించి వివరించిన అంశాలలో సప్తమ స్కంధములో సుయజ్ఞోపాఖ్యానం చేర్చాడు.

సుయజ్ఞుడు ఉశీ నగరానికి రాజు.తెలివిగలవాడు,యుద్ధ విద్యలలో నైపుణ్యం గలవాడు.కీర్తి ప్రతిష్టలు కలవాడు.రాజులకు యుద్ధాలు,గెలుపు ఓటములు సహజములు.ఎన్నో సంగ్రామాలలో విజయం సాధించినప్పటికీ ఒక బలహీన క్షణాన యుద్ధంలో ప్రాణాలు కోల్పోతాడు.దేహము తునాతునకలై పోతుంది.రత్నకిరీటం ముక్కలౌతుంది.ఆభరణాలు అక్కడక్కడా పడిపోతాయి.కనుగడ్లు పైకి వస్తాయి.చెవులు తెగిపోతాయి.పెదవులు రక్తసిక్తమైపోతాయి.అందమైన ముఖం అనామకమై చిన్నాభిన్నమై వికారమై భయంకరమై చూడలేకుండా పోతుంది.ఈవిషయం తెలిసి భార్యలు చెప్పలేనంతగా ఏడుస్తుంటారు.వాళ్ళ విలాపానికి బండలు కూడా కరుగుతాయా అనిపిస్తుంది.అతడు బ్రతికిన కాలంలో చేసిన మంచి పనులను వేనోళ్ళ పొగుడుతుంటారు.రాజ్యంలోని ప్రజలు దురదృష్టవంతులని మంచి మహారాజును కోల్పోయారని సానుభూతి వచనాలు వినపడుతాయి.
ఇదంతా గమనించి
యమధర్మరాజు చిన్నపిల్లవాని రూపంలో వచ్చి ఆత్మజ్ఞానం బోధించి
వైరాగ్యం వల్ల కలిగే ఆత్మ శాంతిని వివరించటమే ఈ కథలో ముఖ్యవిషయం.

కథగురించి విచారిస్తే హిరణ్యకశిపుడి ద్వార తల్లి దితికి పదహారు శ్లోకాలలో
ఆత్మజ్ఞానం బోధిస్తూ యమధర్మరాజు నోట
ఇదం శరీరం పురుషస్య మోహజం యథా పృథక్భౌతిక మీయతే గృహమ్ యథౌదకైఃపార్థివ తైజసైర్జనః కాలేనజాతో వికృతో వినశ్యతి
అంటూ ఇరవై మూడు శ్లోకాలో శరీరానికి ఆత్మకు మధ్య ఉండే సంబంధాన్ని వేదవ్యాసమహర్షి సంస్కృత మహాభాగవతం లో వివరిస్తారు.ఇదే అంశాన్ని తెలుగులో బమ్మెర పోతనామాత్యుడు

నీరాగారనివిష్టపాంథులక్రియన్ అంటూ నలభై పద్యాల్లో సుయజ్ఞోపాఖ్యానంలో ఆత్మజ్ఞానం వివరించారు.దీనిలో తొలుత హిరణ్యకశిపుడు తల్లి దితికి , తర్వాత బాలుని రూపంలో యమధర్మరాజు సుయజ్ఞుని భార్యలకు చెప్పిన పరోక్ష కథనాలద్వారా ఆత్మజ్ఞానం వివరణ కన్పిస్తుంది.

హిరణ్యకశిపుడు తల్లి దితితో
అమ్మా!బాటసారులు దారిలో స్నేహం చేసి గమ్యం చేరగానే విడిపోతారు.జీవిత గమనమంతే.కర్మానుసారంగా పుట్టుక,మరణంతో కాయం మాయమవుతుంది.కాని ఆత్మ
వాసాంసిజీర్ణాని యథావిహాయ అని గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు తనువు వీడి మరో ఉపాధి లో ప్రవేశిస్తుంది.ఆత్మకు మరణంలేదు.శరీరములో ఉన్నంత వరకే సుఖదుఃఖాలు పొందుతుంది.నీరు కదలికలో మన ప్రతిబింబం తిరిగినట్లనిపిస్తుంది.కాని తిరుగదు.అట్లే విషయ వాసనల వలన తిరిగినదని భ్రమిస్తాము అదే ఆత్మ జ్ఞానం అంటు సుయజ్ఞునికథ చెబుతాడు.
సుయజ్ఞుని భార్యలు పరివారం ఏడుస్తున్న వేళ
దండధరుడు బాలుని రూపములో వస్తాడు.
చచ్చిన వాని కేడ్చెదరు చావున కొల్లక డాగ వచ్చునే యెచ్చట బుట్టెనచ్చటికి నేగుట నైజము ప్రాణి కోటికిన్ అంటూ జననము,మరణము రాగ బంధాల నుండి విముక్తుడై మోక్షమార్గం మునకు తరలిపోయే ఆత్మ గురించి ఓపికతో వివరిస్తాడు.
సీసము పాంచ భౌతికమైన భవనంబు దేహంబు పురుషుడు దీనిలో బూర్వ కర్మ వశమున నొక వేళ వర్తించు దీపించు దఱియైన నొకవేళ దలగి పోవు జెడెనేని దేహంబు సెడుగాని పురుషుండు సెడ డాతనికినిం సేటు లేదు పురుషునికిని దేహ పుంజమునకు వేఱుగాని యేకత్వంబు గానరాదు ఆటవెలది దారువుల వెలుంగు దహనుని కైవడి గాయముల చరించు గాలి భంగి నాళలీనమైన నభము చాడ్పున వేఱు తెలియ వలయు దేహి దేహములకు ( పోతన భాగవతం సప్తమ స్కంధం 51 వ పద్యం)
అంటూ శరీరానికి ఆత్మకు దోస పండుకు తీగకు ఉన్నటువంటి బంధంగా విశ్లేషిస్తారు.తల్లిగర్భములోనున్నపుడు కాపాడింది భగవంతుడే.వాడేజీవులన్నింటినీ కాపాడుతాడు.తనలీల కొరకే సృష్టి,స్థితి,లయము చేస్తాడు‌.ఇది అతని బొమ్మలాట.కర్మ వలన జనన మరణములు కలుగును.ఆత్మకు అంటవు.దేహము,మట్టి,నీరు,తేజస్సు అనేవి పరిణామక్రమము.ఆత్మకు ఆకార వికారములు లేవు.ఆత్మ శరీరము వేరు.సుయజ్ఞుని కళేబరము మీ ముందరే ఉన్నది.అందులో ఉండాల్సిన వాడు లేడు.ఇంకా ఏడ్చు టేల?దేహము లోని ఇంద్రియా లన్నిటికి ప్రాణమే హేతువు.అది ఉంటేనే మాట్లాడుట,వినుట,కనుట.ప్రాణమే లేనిది ఇవేవీ సాధ్యము కాదు.ఆత్మ సర్వవ్యాపకము.ఆత్మశరీరమును త్యజించి పోతుంది.మాయా మోహములకు కష్ట నష్టములకు కర్మ బంధములే కారణము.అందుకే అశాశ్వతమైన శరీరము కొరకు ఏడ్చుట అజ్ఞానము. అంటూ యమ ధర్మరాజొక కథ చెబుతాడు.
ఒక అడవిలో బోయ వాడొకడు పక్షులకు యముని లాంటి వాడు.పిట్టల జంటకు ఎరపెట్టి వల పన్నుతాడు.ఆడపిట్ట వలలో చిక్కుకుంటుంది. దాన్ని విడిపించే శక్తి లేక మగపక్షి విలవిలలాడుతుంది.
పసి కూనలైన పిల్లల రక్షణ బాధ్యత తనకు గుర్తు వస్తుంది. ఈ విచారంలో జాగరుకత కోల్పోయిన మగపిట్టను బోయవాడు బాణంతో చంపుతాడు.భార్య గురించి విచారిస్తూ తన ప్రాణాల మీదికి తెచ్చుకుంటాడు.అందువల్ల సుయజ్ఞుని గురించి మీరెన్నేళ్ళు ఏడ్చినా తిరిగిరాడని బాలుడైన యముడు సముదాయించటంతో భార్యలు,పిల్లలు జ్ఞానులై సుయజ్ఞునికి కర్మకాండలు జరిపిస్తారు.గతంలో జరిగిన ఈ కథ తన కొడుకు హిరణ్యకశిపుని ద్వారా విన్న దితి,హిరణ్యాక్షుని భార్యలకు ఆత్మజ్ఞానం కలుగుతుంది.దుఃఖము నియంత్రించి అంత్యక్రియలు నిర్వహిస్తారు.అందుకోసమే జ్ఞానంతో ఉన్నప్పుడే మానవత్వంతో జీవరాశికి సేవ,హరినామ స్మరణతో మోక్ష మార్గములో పయనించాలని మహా భాగవతములోని సుయజ్ఞోపాఖ్యానం లోకానికి మార్గదర్శనం చేస్తున్నది.

ఉపయుక్తగ్రంథసూచి:
1.వేదవ్యాసమహర్షి రచించిన శ్రీ మహాభాగవతం( సంస్కృతం-తెలుగులిపీ)గీతం ప్రెస్ గోరఖ్ పూర్ వారి ప్రచురణ
2.శ్రీమదాంధ్రమహాభాగవతము( బమ్మెరపోతనామాత్యప్రణీతము)
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ
3.డాక్టర్ దాశరథి రంగాచార్య రచన
భాగవతవ్యాఖ్యానం
1977ముద్రణ

March 18, 2026 4 comments
0 FacebookTwitterPinterestEmail
కథలు

వ్రజేంద్రా నందన

by Devulapalli Vijayalaxmi March 18, 2026
written by Devulapalli Vijayalaxmi

“చూడు దేవకి…వాసు నీ ఒక్కదానికే కాదు నాకూ కొడుకే. వాడి జీవితం ఎలా ఉండాలనేది నాకు స్పష్టమైన ఆలోచన, అవగాహన ఉన్నాయి. సౌమ్య…
నీ అన్నకూతురు అనే ఒక్కఅంశం తప్ప  ఎందులో వాసుగాడికి సరిపోతుంది చెప్పు? నీ మాట కాదన్నా నని తప్పుగా అనుకోకు. నాకు వాసుభవిష్యత్తు ఎంత ముఖ్యమో, నువ్వు నీ మనోభావాలు అంటేఅంత గౌరవం. ప్రశాంతంగా కూర్చుని ఆలోచించి నీ‌మాట ఏమిటో చెప్పు. నీ నిర్ణయం ప్రకారమే అంతా జరుగుతుంది.” అన్నాడు భార్గవ. భర్త మాటలకు చిరాగ్గా తలతిప్పుకోబోయి గుమ్మందగ్గర ఏదో అలికిడి అవటంతో అటు తిరిగి చూసింది దేవకి.
ప్రొఫెసర్ రాధాదేవిని చూసి అలానే చేష్టలుడిగిపోయి సర్పద్రష్టలా నిలబడి పోయింది దేవకి.
అది గమనించిన భార్గవ, అవాక్కయి,ఆపై గుండెల్లో సన్నని మెలితిరుగుతూ నొప్పిరాగా, ” దేవకి….” అంటూ నేలకొరిగిపోయాడు.
                               ★★★
ప్రొఫెసర్ రాధాదేవి గంభీరంగా లోపలికివచ్చి “దేవకి!మంచినీళ్ళు తీసుకురా!” అంది.  
మరబొమ్మలా మంచినీళ్ళగ్లాసు తీసుకొచ్చిన దేవకి చేతిలోంచి రాధాదేవి గ్లాసుతీసుకుని వాసుని భార్గవని వడిలోకి తీసుకోమని , భార్గవ మొహాన నీళ్ళు చిలకరించింది. రాధాదేవి.
ఏమాత్రం ఊహించనిది. ఈవిధంగా మళ్ళీ రాధాదేవిని చూస్తాను,కలుస్తాను,అదీ తమఇంటిలో అని కలలో కూడా ఊహించలేదు దేవకి, భార్గవలు.
అంతా సవ్యంగా జరిగితే. వాసు పెళ్ళిచేసి సంఘంలో ఒక మంచితండ్రిగా నిలబడదామనుకున్నాడు. విధి ఆడిన వింతనాటకంలో  ఇప్పుడే తనకంటూ ఒక ప్రత్యేకస్థానాన్ని అదీ వాసువల్ల సంపాదించుకున్నాడు. ఫలితం చేతికందే సమయానికి ప్రొఫెసర్ రాధాదేవిరాక దేవకి, భార్గవలకి పచ్చి    వెలగపండు గొంతులో పడ్డట్టయింది.
                             ★★★
భార్గవ డా||వి.ఎస్.కృష్ణ కాలేజీలో  ఫిజిక్స్ లెక్చరర్ గా ఉండేవాడు. ప్రొఫెసర్ రాధాదేవి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిజిక్స్. వృత్తిపరంగా ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. అప్పుడప్పుడూ భార్గవని, దేవకిని ఇంటికి టీకి పిలిచేది రాధాదేవి. కాలేజీ పిక్నిక్స్ కి కుటుంబాలతో వెళ్ళటంతో దేవకి రాధాదేవి తో చనువు ఏర్పడింది.
ఎంతో చలాకీగాఉండే దేవకి అప్పుడప్పుడూ దిగులుగా, పరధ్యానంగా ఉండటంచూసి, “ఎందుకు దేవకి? హఠాత్తుగా ఏదో కోల్పోయిన దానిలా ఉంటావు.” అంటూ గుచ్చి గుచ్చి అడిగింది రాధాదేవి.
“ఏమీ లేదండీ! అన్నీ ఉన్నాయి కాని ఆడదానిగా నాకు భగవంతుడు తల్లినయ్యే యోగ్యత ఇవ్వలేదు. ఎన్నోపరీక్షలు చేయించుకున్నా కానీ ‘అనోవ్యులేషన్’ అంటే అండాశయం విఫలం కారణంగా నాకు పిల్లలుపుట్టే అవకాశం లేదన్నారు. దానితో నాకు విడాకులిచ్చి మళ్ళీపెళ్ళి చేసుకోమని భార్గవ వైపు వారు బలవంతం చేస్తున్నారు.” అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది దేవకి.
ఈవిధంగా తన బాధను పంచుకుని మరింత సన్నిహితురాలయింది దేవకి రాధాదేవికి.
                         ★★★
చదువుకునే రోజుల్లో మాధవ్ అంటే ఎంతో ఇష్టపడింది రాధాదేవి. రాధాదేవి శ్రోత్రీయ బ్రాహ్మణ కుటుంబంలో ఐదుగురు సంతానంలో పెద్దాడపిల్ల.
మాధవ్ ఒక్కగానొక్క కొడుకు. కులంవేరు.
రాధాదేవి తల్లిదండ్రులకి మాధవ్ కులం అభ్యంతరం అయితే, మాధవ్ తల్లిదండ్రులకి రాధాదేవి అంతస్తు అభ్యంతరమైంది.
ఇరువురు ఇరుకుటుంబాలకి నచ్చచెప్ప ప్రయత్నించారు.
“ఇంకా ఇద్దరు ఆడపిల్లలకి పెళ్ళి చేయాలి. ఇద్దరు మగపిల్లల్ని చదివించాలి. ఇంటికి  పెద్ద ఆడపిల్లవి నువ్వే తప్పటడుగు వేస్తే, నీ బాటలోనే అందరూ వెళ్తారు. చెల్లెళ్ళకు సంబంధాలు రావు. మత్స్యమాంసాదులు తినే అతనితో కాపురం సజావుగా ఉండదు. ఏ ఆలూమగలకైనా ఎంత ప్రేమ ఉన్నా భోజనం సరిగ్గా లేకపోతే ఆ మగాడు కేవలం ప్రేమని ఆస్వాదిస్తూ బ్రతుక లేడు. అలా అని నువ్వు అవి వండిపెట్టగలవా!”  అంటూ రాధాదేవికి అనునయంతో తండ్రి  ప్రభాకరశాస్త్రిగారు అభ్యంతరం తెలిపారు. అంతేకాదు ప్రేమపెళ్ళిళ్ళు సాధారణంగా విఫలమవటానికి ముఖ్యంగా ఆహారవ్యవహారాలేనని ఎన్నో ఉదాహరణలు తెలిపారు.
అటు మాధవ్ తల్లిదండ్రులు మాధవ్ ను వారికి అనుకూలంగా నయాన్న భయాన్న లొంగదీసుకున్నారు.
చదువు పూర్తికాలేదు.ఉద్యోగం వస్తుందన్న ఆశలేదు..
జీవితం సినిమా కాదని ప్రస్తుతానికి తల్లిదండ్రులమాటవిని తనకాళ్ళమీద తాను నిలబడ్డాక రాధాదేవిని వివాహం చేసుకోవాలనుకున్నాడు మాధవ్.
తండ్రి చెప్పిన మాటలు విన్న రాధాదేవి,”నాన్నా! మీరు నా చదువుకి అడ్డం చెప్పకుండా నేను చదువుకోవాలని అనుకున్నంతవరకూ చదివించండి.” అని ప్రాధేయపడింది.
దానికి ప్రభాకరశాస్త్రి రాధాదేవి తల నిమిరాడు ‘సరే’ అన్నట్లు.
ప్రభాకరశాస్త్రి కి మనస్సులో “అయ్యో ఏమీ అడగని నా చిట్టితల్లి అడిగినది కాదన్నానే!” అన్నబాధ, ఏదో తప్పుచేసానన్న భావన దహించి వేయసాగింది.
రాధాదేవి ఎమ్.ఎస్సీ ఫైనల్ ఇయర్లో ఉండగా ప్రభాకరశాస్త్రి భయపడుతూనే రాధాదేవి తో పెళ్ళి విషయం ప్రస్తావించాడు. తనకు ఇప్పుడిప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని ఖచ్చితంగా చెప్పటంతో చేసేదిలేక రాధాదేవి చెల్లెళ్ళిద్దరికీ వివాహం చేసాడు.
మగపిల్లలిద్దరికి శాస్త్రోక్తంగా వడుగులు, పెళ్ళిళ్ళు చేసాడు.
తండ్రిగా పెద్దకూతురుకి అన్యాయం చేసానన్న బాధతో అనుక్షణం ఆలోచించి మాసివ్ హార్ట్ ఎటాక్ తో కన్నుమూశాడు. భర్త చాటు భార్య అయిన సుశీలమ్మ భర్తమరణంతో అయోమయ స్థితిలోకి వెళ్ళింది. పెట్టింది తినడం శూన్యంలోకి చూస్తూ కూర్చోవడం,ఉలుకూ పలుకూ లేదు.
రాధాదేవి తమ్ముళ్ళిద్దరూ ఒకరు ఢిల్లీలో ఇంకొకరు కేరళాలో ఉద్యోగరీత్యా ఉన్నారు. తల్లిని తమతో ఉంచుకోవాలన్న ఆలోచన ఏమాత్రమూ లేదు.
పైగా పెళ్ళిపెటాకులు లేకుండా ఉన్నఅక్క చూసుకుంటుందిలే అన్న ధీమా.
జీవనస్రవంతిలో మరో మలుపు చోటుచేసుకుంది వారి కుటుంబంలో.
అందరికంటే చిన్నది అయిన చిన్న చెల్లెలు ప్రసవానికివచ్చి పండంటి మగబిడ్డను ప్రసవించింది. బిడ్డని చూడటానికి వస్తున్న వాణి భర్త, విధివంచితుడై రోడ్ ఏక్సిడెంట్ లో అసువులుబాసాడు. ఆవార్తవిన్నపురిటాలు వాణి షాక్ లో కోమాలోకి వెళ్ళింది. వాణి భర్త ఒక్కడే సంతానం వారి తల్లిదండ్రులకు. కొడుకే పోయాక తమకు వారికి ఏసంబంధం లేదని వాణి అత్తమామలు చెప్పటంతో రాధాదేవికి ఏంచేయాలో పాలు పోలేదు. పెద్దచెల్లెలుని, తమ్ముళ్ళను బ్రతిమాలింది. ఎవరూ తాత్కాలికంగా  కూడా బిడ్డ బాధ్యత తీసుకునేందుకు సిధ్ధంగా లేకపోయారు.
ఏంచేయాలో పాలుపోని పరిస్థితుల్లో దేవకి, భార్గవలు గుర్తుకొచ్చారు. దేవకి, భార్గవలను పిలిచి  విషయం వివరించి “పిల్లవాడిని పెంచుకుంటారా!” అని అడిగింది రాధాదేవి.
అడగకుండానే వరాలిచ్చినంత సంతోషపడ్డారు దేవకి,భార్గవలు.తడుముకోకుండా వెంటనే అంగీకారం తెలిపారు.
పిల్లవాడికి ఆయే ఖర్చు తానేభరిస్తానని, పిల్లవాడి జీవితంలో ముఖ్యమైన నిర్ణయాలు తనకు తెలియకుండా తీసుకోవడానికి వీలులేదని ఒప్పందం కుదుర్చుకుంది రాధాదేవి. పసివాడికి  తానే వాసుదేవ్‌ అని నామకరణం చేసింది రాధాదేవి.
                            ★★★
రాధాదేవి ఫిజిక్స్ లో గోల్డ్ మెడలిస్ట్. ఇక్కడ
కుటుంబంలో అనుకోని పరిణామాలకు మానసికంగా దెబ్బతిన్న రాధాదేవి మార్పుకోరింది. తల్లి కాలగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు తను చెల్లి వాణి.
ఒకరాయివేద్దాం ఏమవుతుందో చూద్దాం మన్నట్టు కెలిఫోర్నియా  యూనివర్సిటీకి పి.హెచ్.డి కి అప్లై చేసింది. వెంటనే పి.హెచ్.డి లో సీటు వచ్చింది. చెల్లెలు వాణిని  కేరళాలో పెద్దతమ్ముడు వద్ద కేరళా వైద్యానికి ఉంచి తాను కెలిఫోర్నియాకి బయలుదేరింది రాధాదేవి.
వెళ్ళేముందు భార్గవని కలిసి పిల్లవాడికి ఎటువంటి లోపం రాకుండా ఒక ఇరవై లక్షలు బ్యాంకులో పిల్లవాడి పేరును డిపాజిట్ చేసి వాడిని బాగా చదివించాలని, డబ్బుకి వెనుకాడవద్ధని,తనతో కాంటాక్ట్ లో ఉండమని,వాడిని హయ్యర్ స్టడీస్ కి తనతో అమెరికా తీసుకెళ్తానని, వాడితో
తల్లిదండ్రులుగా వారు రావచ్చని చెప్పి కెలిఫోర్నియాకు ప్రయాణమైంది రాధాదేవి.
                               ★★★
  వాసురాకతో మోడుబారిన దేవకి, భార్గవల జీవితం కొత్తచిగురులు తొడిగింది. వారిజీవితంలో చైతన్యం వెల్లివిరిసింది. దేవకి ఎంతో అపురూపంగా పసివాడి ఆలనా పాలనా చూడసాగింది. కానీపిల్లవాడికి   బాటిల్ పాలు పట్టినప్పుడు దేవకి మాతృహృదయం తల్లడిల్లేది. వారి జీవితం వాసు రాకతో పరిపూర్ణత్వం సంతరించుకుంది.
రాధాదేవి ప్రతీ ఆదివారం వీడియోకాల్లో వాడి ఎదుగుదల చేష్టలు చూసి మురిసిపోయేది. వాసు ఐదవ పుట్టినరోజుకి రాధాదేవి ఇండియాకి వచ్చినప్పుడు వాసు కొత్త లేకుండా రాధాదేవి దగ్గరకు వెళ్ళాడు. అమ్మక్క అంటూ ఆవిడిచ్చిన బొమ్మలు, డ్రెస్సులతో వాసుకి రాధాదేవంటే మరింత ఇష్టం ఏర్పడింది. రాధాదేవి వెళ్తుంటే వెక్కివెక్కి ఏడ్చాడు తీసుకెళ్ళమని. వాడిని సముదాయించలేక  దేవకి సతమతమయ్యింది. రాను రాను వీడియో కాల్ చేసినప్పుడల్లా అమ్మక్క అంటూ కబుర్లు చెప్పటం.దా!దా! అనిపిలవడం దేవకి మనస్సులో రాధాదేవి అంటే ఈర్ష్య, ద్వేషం, భయం ఉత్పన్నం కాసాగింది. అదేవిషయం భర్త భార్గవతో అంది. భార్గవకి గూడా బిడ్డని తాము పెంచుతున్నా రాధాదేవి సూచనలు విసుగ్గా ఉండేది.
రానురాను రాధాదేవి వీడియో కాల్ చేసినప్పుడు ఎత్తకపోవటం, లేదంటే బయట ఉన్నాం తరువాత చేస్తామనటం, పిల్లవాడు పడుకున్నాడని కుంటిసాకులతో, పదిసార్లు చేస్తే ఒక్కసారి మాట్లాడుతూ మరో రెండేళ్లు గడిచాయి.
వాసుకి ఏడేళ్ళు వచ్చాయి. అన్నీ అర్ధమయ్యే వయసు. ఈవయసులో వాడికి రాధాదేవి కానీ వాడి జన్మమూలం కాని తెలియనివ్వకూడదనుకున్నారు దేవకి, భార్గవలు. వాసు వారికి భగవంతుడిచ్చిన మహాప్రసాదం.అది జారవిడుచుకునే ఆలోచన ఏమాత్రం లేదు.
                         ★★★
ముందు ప్రణాళికగా భార్గవ కాలేజికి రిజైన్ చేసాడు. లేని తల్లికి అనారోగ్యం, ఊళ్ళో తోటలు చూసుకోవాలన్న కారణం చెప్పి  స్నేహితులని నమ్మించాడు.
తరవాత ఫోనునంబరు మార్చి కొత్తసిమ్ కొత్తఫోను  తీసుకున్నాడు.
ఆతరువాత విశాఖపట్నం నించీ హైదరాబాదుకి మకాం మార్చి ఊరిలో కొంతతోట అమ్మి గేటెడ్ కమ్యూనిటీలో ఒకవిల్లా కొన్నాడు.
భార్గవ ఎక్స్పీరియన్స్ కి చైతన్యగ్రూప్ఆఫ్ కాలేజీలో ఫిజిక్స్ లెక్చరర్ గా జాయిన్ అయ్యాడు. వాసుని ‘ఐ.జి.సి.ఎస్.ఇ’ సిలబస్ లో జాయిన్ చేసాడు.
హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు.
జన్మతః తెలివిగలవాడు అవటంతోను,భార్గవ
మార్గదర్శకత్వంతో  ఇంటర్లో స్టేట్ ఫస్ట్ వచ్చాడు.
బిట్స్ పిలాని  విద్యా విహార్  పిలాని రాజస్తాన్ లో  సీటు వచ్చింది. దానితో వాసు హాస్టల్లో ఉండాల్సి వచ్చింది.
కాలం చిన్నప్పటి అమ్మక్కని మరుగున పడేసింది.వాసుదేవ్ కి లోకమంతా తల్లి దేవకి, తండ్రి భార్గవ. బాగా చదువుకో వాలి, పేరుప్రఖ్యాతులు తెచ్చుకోవాలి అనే పట్టుదలతో చదువుకో సాగాడు.
                              ★★★
రాధాదేవి గత పన్నెండేళ్ళనించీ భార్గవ ఆచూకికోసం ప్రయత్నిస్తూనే ఉంది.ఒక సందర్భంలో పోలీసు కంప్లైంటు ఇద్దామనుకుంది. సహాయం చేసిన భార్గవగురించి తప్పుగా ఆలోచించటానికి మనస్కరించలేదు. దేవకి, భార్గవల మీద రాధాదేవికి ఎంతో నమ్మకం.పొరపాటునకూడా వారి మీద వ్యతిరేక భావన చూఛాయగా కూడా రాలేదు. ఎంతకీ భార్గవ  ఏకష్టంలో ఉన్నాడో అనిఆందోళన చెందేది. అలాఅని ఊరుకోకుండా తనకు తెలిసిన మార్గాల ద్వారా భార్గవ్ ఆచూకి తీస్తూనే ఉంది.
తమ్ముళ్ళు, పెద్దచెల్లెలు రాధాదేవిని తప్పుపట్టారు.
” పెళ్ళిపెటాకులు లేవు. తల్లిహృదయం ఏం తెలుస్తుంది? ముక్కుమొహం తెలియని వాడికి ఏదో వస్తువు అప్పచెప్పినట్లు పసిగుడ్డుని ధారాదత్తం చేసింది. ఆమాత్రం ఎవరమైనా పెంచలేక పోయేవాళ్ళమా!” అంటూంటే, ఈ మనుషులేనా ‘మా అత్తవారు ఒప్పుకోరు’ అని పెద్ద చెల్లెలు , ‘మీ మరదళ్ళ వల్లకాదు.’ అని తమ్ముళ్ళు అనటం వల్లనే కదా తాను అప్పటికప్పుడు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. వారి మాటలు శూలాల్లాతగిలి బాధపడింది రాధాదేవి.
రాధాదేవి మనస్సుకి ఎప్పటికైనా వాసు అజ్ఞాతవాసం నించీ తనకళ్ళబడతాడని బలమైన నమ్మకంతో ఉంది.
కెలిఫోర్నియా యూనివర్సిటీలో  “క్వాంటమ్ కంప్యూటింగ్”  మీద పి.హెచ్.డి లో గోల్డ్ మెడల్ సాధించింది రాధాదేవి.అదే యూనివర్సిటీలో పేరున్న ప్రొఫెసర్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంది.
ఎంతో ఉన్నతస్థాయిలో ఉన్నా నీలినీడలా వాసు కళ్ళముందు కనపడుతూ కంటికి కునుకు కరువైంది రాధాదేవికి. ‘ తనేం అనుకుంది? ఏంజరిగింది? జీవితంలో మధురిమని ఏ చెల్లెళ్ళు తమ్ముళ్ళగురించి త్యాగం చేసిందో వారే తనని దోషిగా నిలబెట్టారు.’ అని మధనపడని రోజులేదు.
                             ★★★
భగవంతుడు దయామయుడు.మనంచేసే ప్రతీపని వెనుక ఆయన హస్తం ఉంటుంది. ఆయన దృష్టిని ఎవరూ దాటిపోలేదు.
ఆరోజు కాఫీత్రాగుతూ లాప్టాప్ లో హిందూ పేపర్ చదువుతోంది రాధాదేవి. హఠాత్తుగా ఒక న్యూస్ కాలమ్ రాధాదేవిని ఆకర్షించింది.
“వాసుదేవ్ భాగవతుల ఈస్ టాప్ ఇన్ ఏస్ట్రోఫిజిక్స్ అండ్ కాస్మాలజీ ఎట్ బిట్స్ పిలాని. హి ఈస్ ప్రౌడ్ స్టూడెంట్ ఆఫ్ బిట్స్ పిలాని అండ్ ప్రౌడ్ సన్ ఆఫ్
భార్గవ్ భాగవతుల అండ్ దేవకి. మిస్టర్ భార్గవ ఫాదర్ ఆఫ్ వాసుదేవ్ భాగవతుల ఈస్ రెండరింగ్  హిస్ సర్వీసెస్ ఫర్ చైతన్యాకాలేజ్  ఏస్  ఫాకల్టీ ఇన్ ఫిజిక్స్.హార్టీ కంగ్రాట్యులేషన్స్.”
రాధాదేవి కళ్ళల్లోంచి కన్నీరు జలజలా కారింది. అది ఒక అద్వైత అనుభూతి.
తప్పిపోయిన బిడ్డ దొరికిన ఆనందం…….
పోగొట్టుకున్నానుకున్న పెన్నిధి దొరికిందనిసంతోషం..
వాసు ప్రయోజకుడయ్యాడన్న గర్వం…,
అమ్మక్క రక్తం వాడిలో ప్రవహిస్తోందన్న తృప్తి….
అంతలోనే ఆ ఆనందబాష్పాల ప్రకృతి మారిపోయి విషాదం నెలకొంది.
భార్గవ ఎందుకిలా చేసాడు?
ఎంతో నమ్మకంతో ఒక ప్రాణం లేని వస్తువుని కాదు, ఒక పెంపుడు జంతువునికాదు, తమ ఇంటి ప్రాణాన్ని తన చెల్లెలు బిడ్డని, తనకే హక్కు లేదు అయినా అనివార్య పరిస్థితిలో నమ్మి తాత్కాలికంగా పెంపకానికి ఇచ్చినందుకు ఇంత మోసం చేస్తాడా!
అంతలోనే రాధాదేవి వివేకం విచక్షణతో ఆలోచించసాగింది.
‘ఔను భార్గవకు తాను కృతజ్ఞతలు తెలుపుకోవాలి. పరాయి బిడ్డను తనదిగా చేసుకోవటమే కాక విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో ఒక మంచి వ్యక్తిగా నిలపెట్టినందుకు తాను భార్గవకి ఏమిచ్చి ఋణం తీర్చుకోగలదు. పురిటిగుడ్డుని భార్గవ చేతిలో పెట్టిన తనకే ఇంత మమకారముంటే, పెంచి పెద్దచేసిన భార్గవ,దేవకిలకి ఇంకెంత ఉంటుంది. అనుకోకుండా దొరికిన అదృష్టం. చేయి జారిపోతుందేమోనన్న  భయాందోళనతో తన ఉనికిని మరుగునపెట్టాడు.గవర్నమెంటు ఉద్యోగానికి రాజీనామా చేసి అజ్ఞాతవాసంలో పిల్లవాడిని ఈ స్థాయికి తేవడం ఒక్కొక్కసారి కన్నతల్లితండ్రులకే సాధ్యంకాదు.’
ఆలోచనలకి విరామచిహ్నంపెట్టి వెంటనే రాజస్థాన్ పిలానికు ఫ్లైట్  బుక్ చేసుకుంది రాధాదేవి.
                         ★★★
యూనివర్సిటీలో అడుగుపెట్టిన రాధాదేవి వాసుదేవ్ భాగవతుల గురించి అడిగింది. తాను వాసుదేవ్ కి పెదతల్లినని గర్వంగా చెప్పుకుంది.
“కూర్చోండి మేడమ్..” అంటూ రాధాదేవికి లాంజ్ చూపించాడు.ఇప్పుడే కబురు పెడతాను అంటూ బాయ్ ని పంపాడు.‌
గెస్ట్స్ లాంజ్ లో అడుగుపెడుతూనే, ‘ఎవరై ఉంటారు తనగురించి ఇక్కడికి వచ్చేవారు? అమ్మా నాన్నా అయితే కాదు.’ అనుకుంటూ అడుగుపెట్టిన వాసుకి జ్ఞాపకాల పొరలో అట్టడుగున నీడలాంటి ఒక ఆకారం స్ఫురించింది.
అస్పష్టంగా, ‘ అ….మ్మ …క్కా….’ అన్నాడు.
కట్టలుత్రెంచుకొచ్చిన దుఃఖాతిశయంతో నిలువెత్తు వాసుని సంకోచించకుండా కావలించుకుని వాసు గుండెలమీద సేద తీర్చుకుంది రాధాదేవి.
“ఇన్నాళ్ళు ఏమయ్యావు అమ్మక్కా? నీ గురించి  అమ్మనాన్నని అడిగితే తెలియదన్నారు.
ఇండియాలో లేవన్నారు. క్రమేపి నేనుకూడా నిన్ను జ్ఞాపకాల అడుగు పొరల్లో ఖననం చేసాను.న అమ్మక్కా!” అన్నాడు వాసు.
“వాసు నేను డైరక్ట్ గా ఎయిర్పోర్ట్ నించీ ఇక్కడికి వచ్చా ఇక్కడ దగ్గరలో హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నా! రూముకివెళ్ళిఫ్రష్ అయి బ్రేక్ఫాస్ట్ చేస్తూ మాట్లాడుకుందాం. పన్నెండేళ్ళు గా ఒంటరిగా నేననుభవిస్తున్న మానసిక క్షోభ నీకు చెప్పుకుని నా హృదయం భారాన్ని  తగ్గించుకోవాలిరా కన్నా!”          
అంటూ కళ్ళనీళ్ళు పెట్టుకుంది రాధాదేవి.
వాసుకి అంతా అయోమయంగా ఉంది. ‘ఎందుకు అమ్మక్క ఇంత ఉద్వేగంగా మాట్లాడుతోంది? ఇన్నేళ్ళ తరువాత….’
” సరే అమ్మక్కా! నేను రేపు హైదరాబాద్ వెళ్ళటానికి హాస్టల్ రూము ఖాళీ చేద్దామనుకున్నా. రూము లాక్ చేసి వస్తా.”అంటూ వెళ్ళాడు.
                             ★★★
బ్రేక్ఫాస్ట్ అయ్యాక నెమ్మదిగా, ” వాసూ నీ గురించి కొన్ని నిజాలు చెప్పాలి.నేను చెప్పే విషయాన్ని అన్ని కోణాల్నించి ఆలోచించగల వ్యక్తిత్వం నీకుందని తెలుసు. ఇందులో నాతప్పుంటే నాకు నువ్వు ఏ శిక్ష వేసినా భరించడానికి సిధ్ధంగా ఉన్నా తండ్రీ!”  అంది రాధాదేవి.
“అదేమిటి అమ్మక్కా! పెద్దదానివి నిన్ను శిక్షించటమేమిటి?”అంటూ రాధాదేవి చేయిపట్టుకున్నాడు.
రాధాదేవి పూసగుచ్చినట్లు వాసు పుట్టటం,అప్పటి పరిస్థితుల్లో తనకు మంచిదనిపించిన నిర్ణయం తీసుకోవటం,తరువాత దేవకి, భార్గవలు ఏవిధంగా తనతో సంప్రదింపులు కోల్పోయారో చెప్పింది. ఒకానొక సందర్భంలో పోలీసు కేసుపెట్టి ఎంక్వయిరీ చేయిద్దామనుకొని వారిని బాధపెట్టడం ఇష్టంలేక ఊరుకున్నట్లు చెప్పింది.
ఈ పన్నెండేళ్ళు బంధువులతో తాను పడ్డమాటలు వాసుతో  చెప్పి ఊపిరి పీల్చుకుంది రాధాదేవి.
ఒక్కక్షణం నిశ్శబ్దం తరువాత గభాల్న వాసు రాధాదేవి కాళ్ళదగ్గర కూర్చొని వళ్ళోతల పెట్టుకుని తనివి తీరా ఏడ్చాడు.
“అమ్మ ఎలావుంటుంది? అమ్మ ఇప్పుడెలా ఉంది‌. నువ్వు ఆ సాహసం చేయకపోతే నేనెలా ఉండేవాడినో!  నేనెంత అదృష్టవంతుడివి.అందరికీ ఒక అమ్మ అయితే నాకు ముగురమ్మలు.అమ్మక్కా!ముందు అమ్మని చూడాలి.తర్వాత హైదరాబాద్ వెళ్దాం అంటూ కేరళాకు టిక్కట్లు బుక్ చేసాడు వాసుదేవ్.
                              ★★★
తల్లి,తండ్రితప్ప బంధువులుఎవరూలేరని ఉదాసీనంగా గడిపిన వాసు మనసు అందరినీ కలవాలని ఉవ్వీళ్ళూరింది.
‘మొదటి సారి తనను నవమాసాలు మోసికన్న కన్నతల్లిని చూడబోతున్నాడు.తల్లిని కనిపెట్టుకుని ఉన్న మేనమామని కలువ బోతున్నాను.’ ఆ ఆలోచనే ఎంతో ఉద్వేగంగా ఉంది అనుకున్నాడు వాసు.
గుమ్మంలో అడుగుపెట్టిన వాసు విరబూసిన మల్లె కుదుళ్ళమధ్య పసిపిల్లలాంటి అమాయకమైన మల్లెపూవులాంటి స్వచ్ఛమైన కన్నతల్లిని చూసాడు.
“అమ్మా!”అంటూ కాళ్ళకి నమస్కరించాడు వాసు.
నిర్వికారంగా నిశ్చలంగా ఉన్న వాణి లో ఏదో చలనం. వాసు వంక ప్రశ్నార్ధకంగా చూసింది.
“నేనమ్మా!నీ బిడ్డని.” అంటూ వడిలో తల పెట్టుకున్నాడు వాసు.
అప్రయత్నంగా తలమీద చేయుంచింది వాణి.
అ దృశ్యం ‘శతమానం భవతి ‘ అని తల్లి వేద ఆశీర్వచనం చేస్తున్నట్లుంది.
మేనమామ కృష్ణమోహన్ కధనం ప్రకారం తన పనులు తాను చేసుకునే స్థాయికి తేగలిచారు గాని మెదడుకు తగిలిన షాక్ నించీ ఇంకా కోలుకోలేదని,ఎవరూ గుర్తులేరని తెలిపాడు.ఆమె లోకం ఆమెది. ఆకలిదప్పులు ఏమీ తెలియవని,తామేమైనా తినమని ఇస్తే తింటుంది. లేకపోతే లేదని కృష్ణమోహన్ వాసుకి రాధాదేవికి చెప్పాడు.
ప్రస్తుతం వాణి ఎమ్నీషీయాలో ఉందని డాక్టర్లు నిర్ధారించారని తెలిపాడు కృష్ణమోహన్‌.
“మావయ్యా ‘ఎమెన్షియా’, ‘డిమెన్షియా అంత ప్రమాదకరమైనది కాదు. నాకెందుకో అమ్మని కొంతవరకూ మామూలు పరిస్థితికి తేవచ్చుననిపిస్తోంది.”అన్నాడు వాసు.
“వాసు చెప్పింది నిజమే రా! నువ్వు కష్టపడి దాన్ని ఈ స్థాయికి తెచ్చావు. నేను చెల్లాయిని నాతో పాటే అమెరికా తీసికెళ్ళి  వైద్యం చేయిస్తా.అన్నట్లు వాసు ఇంతవాడవటానికి కారణమైన దేవకి భార్గవలకి మనమెంతో ఋణపడి ఉన్నాం. ముందు మనం హైదరాబాదు వెళ్దామని ముగ్గురూ కలిసి హైదరాబాదు వచ్చారు.
    .      ‌‌.               ★★★
ముందుగా ప్రొఫెసర్ రాధాదేవిని, ప్రక్కనేవాసు, కృష్ణమోహన్ లను చూసిన దేవకి సర్పద్రష్టలా నిలబడిపోయింది.
అది గమనించిన భార్గవ అవాక్కయి సన్నగా గుండె నొప్పితో నేలకొరిగాడు.
“నాన్నా!” అంటూ ఒక్కో ఉదుటున వాసు భార్గవని పొదివి పట్టుకోగా, రాధాదేవి మొహంమీద నీళ్ళు చిలకరించింది.
కళ్ళు తెరిచిన భార్గవ రాధాదెవి కళ్ళలో కళ్ళుపెట్టి చూడలేక దోషిగా తలవంచుకున్నాడు.
ఆపరిస్థితులల్లో దేవకి, భార్గవి ని చూసిన రాధాదేవి వాసుకి కనుసైగ చేసింది. వెంటనే ఒక్క ఉదుటున తల్లిని(దేవకిని) పట్టి ఊపుతూ, “అమ్మా నాకు గోల్డ్ మెడల్ వచ్చిందమ్మా.ఇదంతా మీ ఆశీర్వాదం.” అంటూ దేవకి, భార్గవ కాళ్ళకి నమస్కరించాడు. న్యూస్ పేపర్లో వారిద్దరి పేర్లు చూపించాడు.
“ఎప్పటికీ నేను మీ వాసునే నాన్నా! అందరికీ ఒకే తల్లి.నాకు ముగ్గురు తల్లులు. ఒకరు కన్నతల్లి అయితే ఇంకొకరు మమతానురాగాలు తో పెంచిన తల్లి.మరొకరు నా దశదిశ నిర్దేశించిన తల్లి. ఇంతటి అదృష్టం ఎవరికుంటుంది?” అన్నాడువాసు కంఠం భావోద్వేగంతో పూడుకుపోగా.
భార్గవ మీభయం నాకర్ధం అయ్యింది. మీరు అమితమైన ప్రేమతో చేసిన తప్పు మిమ్మల్ని దోషిని చేయదు.మీరు వాసుని ఇంతటి ప్రయోజకుడిగా చేయటానికి వెనుక మీ ఆలుమగల కృషి అభినందనీయం. మీరు వాసుని ఎంతప్రేమిస్తున్నారన్నది మీరు గవర్నమెంట్ కాలేజీకి రాజీనామా చేయటంలో తెలుస్తోంది.” అంటూ భార్గవని భయం నించీ బయటకుతేవటానికి ప్రయత్నించింది రాధాదేవి.
“కన్నతల్లి కన్నబిడ్డను గుర్తించలేని దుస్థితిలో ఉన్నప్పుడు మీరెందుకు భయపడతారు భార్గవ గారు.” అన్నాడు కృష్ణమోహన్ నిర్లిప్తంగా.
దేవకి అందరికీ కాఫీ కలుపుకొని తెచ్చింది.వాసు అందరికీ కాఫీ ఇచ్చాడు.
“రాధాదేవి గారు మీది ఎంతో విశాలహృదయం‌. ఎంతో సంస్కార వంతులు కాబట్టి నా తప్పుని నిలదీసి అడగాల్సిన సందర్భంలో సహితం నాకు మీరు కృతజ్ఞతలు తెలుపుతున్నారు. మీరు గొప్ప మనస్సుతో క్షమించినా, అది అందుకునే అర్హత నాకు లేదని నా అంతరంగం చెపుతోంది.
వాసు మీవైపు మొగ్గు తున్నాడని, మీరు వీడియోకాల్ చేసినప్పుడు వాడి కళ్ళలో ఆనందం చూసి ఈర్ష్య పడ్డాం.మీకాల్ గురించి వాడు ఎదురు చూడటం,ఆతరువాత వాడు నీగురించి పేచీ పెట్టటంతో వాడు మాకు దూరమౌతున్నాడన్న భయంతో ఈ విధంగా ఫోన్ నెంబరు మార్చటం. మా ఉనికిని గోప్యంగా ఉంచడానికి ఇలా ఇక్కడ సెటిల్ అయ్యాం. కానీ సూర్యుడిని అరచేతితో మూయలేమని ఇప్పుడే తెలుసుకున్నాం.ఇన్నాళ్ళు బిడ్డలు లేని మాకు మాతృత్వపు, పితృత్వపు మధురిమలు ఆస్వాదించడానికి అవకాశం కల్పించిన ఆ భగవంతునికి అవకాశమిచ్చిన మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను.దేవకి కి జన్మించిన కృష్ణుడు యశోదతనయుడుగా నందయశోదలకు ప్రేమ అనే అమృతాన్ని పంచాడు. కానీ శాశ్వతంగాలేడు‌అలాగే ఈ వాసుదేవ్ ఈ నందయశోదలకు తన అమృతం తుల్యమైన ప్రేమను పంచి మమ్మల్ని సమ్మోహితుల్ని చేసాడు.దానికి మాకు గర్వంగా ఉంది.ఇక ముందు ప్రయాణానికి రాధాదేవిగారికి సంతోషంగా అప్ప చెప్తున్నాం.” అంటూ వాసు చేతిని రాధాదేవి చేతిలో పెట్టిన నమస్కరించారు దేవకి,భార్గవలు.
రాధాదేవి తో కన్నతల్లి వాణిని తీసుకుని పై చదువులకి అమెరికాకి ప్రయాణమయ్యాడు వాసుదేవ్.
గుండెలనిండా ప్రేమతో మనస్పూర్తిగా ఆశీర్వదించారు వాసుని దేవకి, భార్గవలు.
                            ★★★
“దేవకీ! దేవకీ!” అంటూ హడావుడిగా వంటింట్లోకి వచ్చాడు భార్గవ.
“ఏమిటండీ ఆ గావుకేకలు!”  అని కసురుకుంది.రాధ.
“కేకలేంటి మైకు పెట్టుకుని అరుస్తా! మన వాసు భార్గవ. ఎమ్.ఎస్ పూర్తి అయింది.కెలిఫోర్నియా యూనివర్సిటీలోనే టాపర్. అమెరికన్ గవర్నమెంటు వారి స్వంత ఖర్చుతో వాడికి సర్దార్ ఎడ్యుకేషన్ కి బాధ్యతవహిస్తోంది.
మనల్ని గ్రాడ్యుయేషన్ డేకి రమ్మని  ప్రయాణానికి కావలసిన ఫ్లైట్ టికట్టుతో  కావలసిన డాక్యుమెంట్స్ పంపించాడు మన వాసు.” అంటూ దేవకిని గిరగిరాతిప్పి ఆనందభాష్బాలు రాల్చాడు భార్గవ.
వాసు మ…న… బి…డ్డే…నండీ అంటూ అస్పష్టంగా గొణిగింది దేవకి.
                         శుభం.
                                                .సమాప్తం

March 18, 2026 3 comments
0 FacebookTwitterPinterestEmail
అనువాద సాహిత్యం

వేకువ పాట

by ఎలనాగ, సురేంద్ర నాగరాజు January 31, 2026
written by ఎలనాగ, సురేంద్ర నాగరాజు

లావైన చేతిగడియారం లాగా
ప్రేమ నీ ప్రస్థానాన్ని మొదలు పెట్టింది
నర్సు నీ అరిపాదాల మీద దెబ్బ వేయగానే
నీ బోసికేక పంచభూతాల్లో చేరింది

నీ రాకను పొగడుతూ
మా గొంతుకలు ప్రతిధ్వనిస్తాయి
అదొక కొత్త ప్రతిమ.
గాలితెమ్మెరలు నిండిన మ్యూజియంలో
నీ నగ్నత్వం మా క్షేమం వెన్నంటి నడుస్తుంది
గోడల లాగా చుట్టూ ఖాళీగా నిలబడతాం మేము

గాలివాటుకు స్వీయ ప్రతిబింబం
తుడుచుకుపోయేలా చేసే
మేఘపు అద్దంకన్న గొప్ప తల్లిని కాను నేను

రాత్రంతా పెద్ద పెద్ద గులాబీల మధ్య ఉండే
కీటకపు రెక్కల లాగా
నీ శ్వాస రెపరెపలాడుతుంది
దాన్ని వినేందుకు నేను నిద్రలోంచి లేస్తాను
దూరంలోని సముద్రమొకటి
నా చెవి దగ్గరికి చేరుతుంది

స్థూలకాయంతో నైట్ గౌనులో ఉన్న నేను
నీ ఒక్క కేకకు మంచం మీంచి కింద పడతాను
నీ నోరు నిర్మలమైన పిల్లినోరులాగా తెరుచుకుంటుంది
కిటికీ చట్రం కాంతితో వెలిగి,
మసకబారిన నక్షత్రాలను మింగేస్తుంది
ఇక నువ్వు కొన్ని మాటలను
మాట్లాడేందుకు ప్రయత్నిస్తావు
స్పష్టమైన అచ్చు స్వరాలు
బెలూన్ల లాగా పైకి లేస్తాయి

ఆంగ్లమూలం: సిల్వియా ప్లాత్

January 31, 2026 1,011 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

చాణుక్యుడు ఆదిశంకరాచార్యుల ప్రభావం ఒక సింహావలోకనం

by Dr. Kasarla Rangarao January 31, 2026
written by Dr. Kasarla Rangarao

చాణక్యుడు అర్థశాస్త్ర రచయిత . అర్థశాస్త్ర విషయములే కాకుండా పాలనా రీతి ,నీతి పాలనా విషయముల కూలం కుష పరిశీలన చేశాడు .అప్పుడు పరిపాలనలో ఉన్న నందవంశ పాలన (బౌద్ధమత అనియాయి )నిర్మూలింప జేసి గాంధారదేశంలో తిష్టవేసిన విదేశీ దురాక్రమదారుల పీచ మడచడానికై చంద్రగుప్త మౌర్యునితో కలిసి బలమైన పునాది నిర్మించాడు .అది దాదాపు ఒక ఎనిమిది లేదా తొమ్మిది వందల సంవత్సరాల వరకు ప్రత్యేకంగా ఒక దురాక్రమణదారు అనేది లేకుండా చేయగలిగింది .శకులు ,యవనులు ,కుషానులు మున్నగు వారు వచ్చి చిన్నచిన్న రాజ్యాలు ఏర్పరచినా వారు స్థానిక ప్రజలతో మమేకమై దాదాపు స్థానికులుగానే మిగిలిపోయారు .వివిధ కారణాల వల్ల వివిధ పేర్లతో వచ్చిన ఇస్లాం దండ యాత్రలు మొదటి రెండు మూడు వందల సంవత్సరాలు దోచుకుని పోవడానికే వినియోగించుకున్నారు . గుప్త సామ్రాజ్యం శాతవాహన రాజుల కాలాలు హిందూ బౌద్ధ మతావలంబనలకు అనుకూలంగా రాజ్యపాలన కావించి గుంపులు గుంపులుగా వస్తున్న వారిని అటకాయించి ఆపి వారిని స్థానికీకరించారు .ఈ మధ్యలో చిట్టచివరి ఉత్తర భారత సామ్రాజ్యం హర్ష చక్రవర్తిదే . దక్షిణ భారతంలో కాకతీయ మరియు విజయనగర సామ్రాజ్యాలు కొంతకాలం తురుష్క దండయాత్రలకు తట్టుకున్న కాలక్రమంగా ఈ రెండు సామ్రాజ్యాలు తురక దండయాత్రలకు గాని పరస్పర యుద్ధాలకు గాని తట్టుకోలేక మొత్తం భారతదేశమంతా ఔరంగాజేబు పరిపాలనలో మొఘల్ సామ్రాజ్యముగా మారిపోయింది .ఈ క్రమంలో ఈశాన్య భారతదేశంలో పాల సామ్రాజ్యం కొంతవరకు బౌద్ధాన్ని నిలబెట్టగలిగింది .ఇది క్రీస్తుశకం 800 నుండి క్రీస్తుశకము 1200 వరకు మాత్రమే .
క్రీస్తు శకం 8 00 నుండి క్రీ.శ. 1200 వరకు దక్షిణ భారతదేశము నుండి ఒడియనులు తెలుగువారు మరియు తమిళులు నౌక మార్గము ద్వారా ఇండోనేషియా ,జావా సుమత్రాలలో హిందూ బౌద్ధ రాజ్యాన్ని ఏర్పరిచినారు .
తక్షశిల, నలంద ,విక్రమశిల , నాగార్జున మున్నగు విశ్వవిద్యాలయముల నేర్పరచి ఆ కాలంలోనే భారతదేశం ప్రపంచ దేశాలకు విజ్ఞాన భిక్ష పెట్టింది . ప్రపంచంలో అన్ని మూలలనుండి విద్యార్థులు భూ,జల మార్గాల ద్వారా వచ్చి చదువుకున్నారని తెలుస్తుంది. ఈ విషయం ఆ కాలంలోనే భారతదేశ వైభవం తెలుపుతుంది. ఈ విధంగా భూ జల మార్గాల ద్వారా వర్తక మరియు రవాణా జరిగాయని ఇవి వేలయేళ్ళ కొనసాగింపని తెలుస్తుంది. కాలక్రమంలో భారత దేశంలో బౌద్ధం మరియు మిగతా మతాలలో అనేక శాఖలు ఏర్పడి మతపరమైన ఘర్షణలు గందరగోళాలు ఏర్పడసాగాయి .పటిష్టమైన తర్కంతో హేతువాద భూమికతో యున్న బౌద్ధ మతము ఆరామాలు మఠములు ఆర్థిక తోడ్పాటుతో నైతికపతనం ప్రారంభమైంది . బౌద్ధంలో వజ్రయానం అనే శాఖ ద్వారా తాంత్రికం బయలుదేరి బుద్ధుడు ఏ విషయాలయితే చెడుగా చెప్పి జీవితంలో నుంచి బహిష్కరించాడో వాటికే పెద్ద పీట వేసి పతనం వైపుకు చేరుకుంది . ఈ మధ్యకాలంలో వైదిక మతము పంచ మకారాలను నిష్కర్షగా నిషేధించి సనాతన మతరూపంలో బౌద్ధ జైన శాఖలలోని అహింస హేతుబద్ధతల్ని కొంతవరకు జీవితానికి అనువయింపజేసే వీలు వసతి కల్పిస్తూ అద్వైత తత్వానికి దారులు వేసింది సరిగ్గా ఈ సమయంలోనే ఆదిశంకరుడు కాలడిలో జన్మించి చిన్నతనంలోనే ఏకసంథాగ్రహణంతో విద్యలన్నీ నేర్చుకొని నర్మదా తీరంలోని గోవిందాచార్యుల శిష్యరికంతో బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించి అద్వైత మత ప్రస్థానం మొదలు పెట్టాడు .బౌద్ధ తత్వంలోని శూన్యవాదాన్ని తన మాయావాదంతో ఎదుర్కొని అద్వైత సిద్ధాంతాన్ని భారతదేశ మంతట వేళ్ళూనుకునేటట్లు బలపడి పై చేయి సాధించేటట్లు చేయగలిగాడు .అయితే ఈ క్రమంలో బుద్ధుని భగవంతుని అవతారంలో ఒకరిగా చేర్చి బౌద్ధ సూక్తులు అన్నిటిని తీసుకున్నా డు . ఆ విధంగా అప్పటి బౌద్ధంలో వైదికల్లో ఉన్న చెడుపోకడలని నాశనం చేసి నిజమైన బౌద్ధ సనాతన ధర్మాన్ని ప్రతిష్టించాల్సిన అది శంకరుడు ఆ ప్రయత్నం చేశాడు. ఒకరకంగా హేతువాద దృష్టి తగ్గడం వల్ల భారతదేశ ఆధ్యాత్మిక ఆత్మహత్య చేసుకుంది . బలమైన వైదిక మతస్తులు మత సంస్కరణ ఇష్టం లేనివారు అంతా కలిసి ఆదిశంకరుని ప్రచ్ఛన్న బౌద్ధునిగా నిరసించి నిందించారు .ఈ విధంగా ఒక సంధి కాలంలో విదేశీ దురాక్రమణం ఎదుర్కొన్న చాణక్యుడు ,మత సంస్కరణతో అన్ని శాఖలను పరస్పరం సమన్వయం చేసి గానపత్యులు ఇంకా నరబలులు జంతుబలులు చేసే వారిని మార్చి ఎదుర్కొని ఓడించి అద్వైత మత స్థాపన చేసిన ఆదిశంకరాచార్యుడు , ఇరువురు ప్రఖ్యాత పురుషులు మరియు ప్రత్యేక స్థలంలో ఉన్నవారైనప్పటికీ లక్ష్యసాధనలో చాణిక్యుడు సఫలం అయ్యాడని చరిత్ర నిరూపించింది . చాణక్యుడు విదేశీ దాడుల్ని దండయాత్రనని అణివేసే పరిస్థితి ఏర్పరిస్తే ఆ కోణంలో ఆదిశంకరుడు విఫలమయ్యాడు .
విగ్రహారాధన లేని ఒకే నిరాకార భగవంతుని విధేయతతో ఇస్లాం మతప్రభావం భారతదేశం పై బలంగా పడింది .దాదాపు ఒక వేయి సంవత్సరాలు ఇస్లాం మతస్తుల మతపరమైన పరిపాలనలో భారతదేశం ఉండిపోయింది .వర్తక వాణిజ్యాలకై వచ్చిన బ్రిటిష్ వారు (తెల్లవారు )1857 నుంచి 1947 వరకు నిరంకుశ పాలన గావించినా ఆధునిక ఇంగ్లీష్ విద్య పరిపాలన సంస్కరణల ద్వారా చదువుకున్న యువత ప్రజాస్వామ్య స్వయంపాలనకై అనేక రకములైన పోరాటాలు చేసింది .1920 నుంచి జాతీయ పోరాట రూపంలో గాంధీ నాయకత్వంలో క్రమక్రమంగా ప్రజా ఉద్యమాలు వెల్లవలా వచ్చాయి .శాంతి , అహింస,నిరాడంబరత మొదలైన మౌలిక విషయాల ద్వారా సత్యాగ్రహ ఉద్యమ రూపంలో ప్రజలు తండోపతండాలుగా ఉద్యమించారు .
ప్రభుత్వ హింసను హింస ద్వారానే ఎదుర్కోవాలనే వాదంతో బయలుదేరిన ఉద్యమాలన్నీ కొంతవరకు సాగి చివరకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ నాయకత్వంలో ఆజాద్ హిందూ ఫౌజ్ ద్వారా జపాను తోడ్పడుతో బ్రిటిష్ ఇండియా విముక్తికై పోరాడింది. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసి అమెరికా రష్యా బ్రిటన్ కూటమి విజయం సాధించడం ద్వారా ఒక కొత్త పరిస్థితి ఏర్పడింది .రష్యా మూడవ ప్రపంచ దేశాల స్వాతంత్రానికి బలంగా నైతిక మద్దతు తెలపడం , అమెరికా కూడా ప్రపంచంలో ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు మద్దతు ప్రకటించడం వల్ల బ్రిటన్ కు మింగుడు పడని పరిస్థితి వచ్చింది. భారతదేశంలోని అన్ని కులాలను వర్గాలను మతాలను ఏకం చేసి స్వాతంత్ర్య పోరాటంలో మమేకం గావించిన కాంగ్రెస్ పార్టీకి ముస్లిం లీగ్ పక్కలో బల్లెంలా తయారయింది. విభజించి పాలించు అనే కూటనీతితో బ్రిటిష్ వారు చివరకు భారత ఉపఖండమును పాకిస్తాన్ మరియు భారతదేశం ,రెండు దేశాలుగా విభజించి వెళ్లారు .విభజన సమయంలో కనీ వినీ ఎరుగని హింస విధ్వంసం చెలరేగాయి .ఎట్టకేలకు ఆగస్టు 14 , 1947నాడు పాకిస్తాన్ ,1947 ఆగస్టు 15 నాడు భారతదేశం (హిందుస్థాన్ ) స్వతంత్ర దేశాలుగా బ్రిటిష్ పార్లమెంటు చట్టం ద్వారా ఏర్పడినాయి.

January 31, 2026 110 comments
0 FacebookTwitterPinterestEmail
సంపాదకీయం

సనాతనమంటే?

by Kondapally Neeharini January 31, 2026
written by Kondapally Neeharini

(మయూఖ 2026 జనవరి పత్రిక ఎడిటోరియల్)

 మీరు స్మార్ట్ ఫోన్ తో ఉన్నారా? మీరు స్మార్ట్ టీవీ దగ్గర ఉండి మాట్లాడుతున్నారా? అయితే ఒకింత జాగ్రత్తగా ఉండాలి. మీ ఆలోచనలనే కాదు మీ మనస్సు నూ పసిగట్టే శక్తి మిమ్మల్ని లోబరుచుకునే టెక్నాలజీ మీ చుట్టూ తిరుగుతుంది అని తెలుకోవాలి. రోజులు ఎంత మారిపోయాయి! కోవిడ్ వచ్చిపోయినప్పటినుండి అంతులేని వింతలే అన్నింటా!!

     ఈ గడ్డు కాలం లో ఆత్మవిమర్శ ఎంతో అవసరం. ఆత్మావలోకనం ఎంతో అవసరం. కొత్త సంవత్సరం 2026 లోకి అడుగుపెట్టాం. క్యాలెండర్ మన జీవితాలను శాసిస్తోంది. తప్పదు. ఈ జీవన సమరం లో తేదీలు అస్త్ర శస్త్రాలయ్యాయి. పర్వాలేదు. కానీ ప్రపంచంలో ఏ దేశ వాసులైనా వాళ్ళ వాళ్ళ సంప్రదాయాలు, ఆచారాలు, అలవాట్లు పాటిస్తున్నారు. మనలాగే! తప్పులేదు. అయితే మనమేమో తెలుగు వాళ్లం , కొత్త సంవత్సరాన్ని వసంత ఋతువు, చైత్రమాసం లో కొత్త చిగురులెత్తే ప్రకృతి లా నవ వసంతోత్సవం చేసుకుంటుంటాం. నిత్య వ్యవహారంలో ఇంగ్లీష్ తప్పదు. వాళ్ళ పద్ధతులూ తప్పవు. మంచిదే .. నడిపిద్దాం… కానీ మనదైన సనాతన ధర్మాన్ని అనుసరించి ఆచార వ్యవహారాలు మానుకోకుండా ఆచరించాలి. మరి జనవరి నెలతో నూతన సంవత్సర ప్రారంభం.  తెలుగు వాళ్ళు ముక్కోటి ఏకాదశి తో పండుగలు ఇంగ్లీష్ కొత్త ఏడాదిలో వచ్చిందనీ , తర్వాత వెనువెంటనే సంక్రాంతి పండగ వస్తుందనీ సంబరపడుతూనే మార్చ్ నెలలో వచ్చే ఉగాది పండుగ కోసం ఎదురు చూస్తుంటారు . ఇక అది మొదలు   నక్షత్రాలు, తిథులను అనుసరించి ఎన్నో పండుగలు చేసుకుంటుంటాం. వాటి సంపూర్ణ వివరణ లోకి పోకుండా కొన్ని ముఖ్యమైన విషయాలు స్పృశించుంచుకుందాం.

     ప్రతి సంవత్సరం కూడా రెండు ఆయనలుగా  విభజించి ఆ రెంటిని కలిపే జీవన స్రవంతి సంక్రాంతి . ప్రముఖంగా ఈ సంక్రాంతి ఉత్సవాన్ని జరుపుకోవడానికి  కారణమేమిటంటే, సకల జీవరాశులకి ఆధారభూతుడైన సూర్యుడు తన దిశను ఈరోజు మార్చుకోవడమే ప్రధాన

కారణం. మకర రాశిలో సూర్యుడు ప్రవేశించడం తన దిశని పూర్వముఖుడై సకల జీవనానికి సకల  జీవరాశులకు చైతన్య స్ఫూర్తిని కలిగించడమే … దక్షిణాయనంలో అంటే  దాదాపు జులై 7 నుంచి జనవరి 14 వరకు కొంతవరకు వీటికి దగ్గరగా ఉంటుంది.ఇది ఉత్తరాయణం ప్రారంభంలోనే ఉంటుంది . అది చైతన్య స్థితిని పొందుతుంది. అందుకే ఈ తేదీ లు కూడా మారకుండా  సూర్యుని పయనాన్ని అంటే రోజులుగా విభజించే పరిస్థితిని మార్చకుండా ఉంటుంది. దీనికి మన సనాతనంలో చెప్పింది ఏంటంటే ఒక పండుగ జరుపుకోవడం కన్నా ఒక చైతన్యాన్ని ముఖ్యంగా ఒక నూతనమైన ప్రణాళికతో మనిషి ముందుకు సాగాలని దీన్ని  పచ్చ పచ్చని పండుగ గా, ఒక మైలురాయిగా మార్చారు. అందుకే పంటలు రావడం .. కొత్త పంట  రావడం తర్వాత శీతాకాలం ఉండడంవల్ల రెండు ముఖ్యమైన పంటలను వేసుకోవాలి, పండించినవి మనం తీసుకోవాలని చెప్పారు.        

     ఒకటి నువ్వుల పంట. నువ్వు లు మన శరీర ఉష్ణోగ్రతకు దోహదపడేది. ఇంకొకటి బెల్లం అంటే మధురం. తీయదనం కోరుకోవడం, గళం విప్పారేందుకు సాయపడ్తుంది. మనిషి తన నూతన ఆవిష్కరణలకు ఇలా రెండు విధాలుగా ఉపయోగపడే పదార్థాలు తినాలి.  ఒకటి వాతావరణానికి అనుకూలమైనవి అవి నువ్వులు ఇంకొకటి మనం మాట్లాడే మాట మధురమైనదిగా అందరిని అలరించే విధంగా ఉండాలని సంకల్పంతో నువ్వులు బెల్లంతో కలిపిన పదార్థాలను ఈరోజు తినాలని నియమించారు. 

ఈ పండుగ పూర్తిగా సూర్యుని భ్రమణం ఆధారంగానే ఉంటుంది.అయితే ఏ మతంలోనైనా సూర్యుని తప్పనిసరిగా మన జీవనానికి ప్రకృతికి కేంద్ర బిందువుగా భావిస్తారు.  సాధనకోసం సనాతనంలో అయితే సూర్యదేవుడు సూర్యారాధన జరుపుతారు. సూర్యుడు ఆరోగ్యం ఇవ్వడం అనేది ఒక కర్మకాండ కాదు అది ఒక చేతనత్వానికి మనం ఇచ్చే గౌరవం. అందుకే ఆరోగ్యం స్నానం చేసి సూర్యారాధన చేయడం మతాలకతీతం ఎందుకంటే సూర్యుడే మనందరికీ అవసరమైన శక్తినిచ్చే కారకుడు.  నిజంగా, చెప్పాలంటే ప్రకృతి మూల దేవత అందులో సూర్యుడు ఆది దేవత అదే ఈ పండగ ప్రత్యేకత.

ఈ  పండుగ కోసం కొన్ని నియమాలను పెట్టారు.

శయనం ఆషాఢ శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు ఉన్న కాలాన్ని చాతుర్మాస దీక్ష ను చేయమన్నారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి ని శయన ఏకాదశి అంటారు. భగవంతుడు యోగ నిద్రలోఉంటాడని నమ్ముతారు. ఇలాంటివి మరిన్ని…

త్రికాల సంధ్యలలో సంధ్యవార్చుకోమని ఎందుకు పెట్టారు అంటే

ఈ పండుగని ప్రకృతితో అన్వయించడంలో మన రుతు సంక్రమణం, రుతుభేదాలు కూడా అన్వయించారని చెప్పవచ్చు. కారణం

శ్రావణమాసం తో వర్షాలు తర్వాత శరత్ కాలంలో ఉండే వాతావరణం ప్రతి మనిషి ఎక్కువగా బయట తిరిగేందుకు అనుకూలంగా ఉండవు కాబట్టి ఈ కాలంలో నాలుగు మాసాలు పూర్తిగా ఒక దీక్షతో ఉండాలని పెద్దలు చెబుతారు దాన్నే చాతుర్మాస్య దీక్షగా గుర్తించారు. అంటే ప్రతివారు చేసుకునే నిత్య కర్మలు అంటే సంధ్యావందనము అనేది సూర్యుణ్ణి కొలిచే ఒక ప్రక్రియ దానికి నియమం త్రికాల సంధ్యా అని అంటే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చేసుకోవాలన్నారు. కారణం ఉదయించే సూర్యుడిని చూడడం మధ్యాహ్నపు సూర్యుణ్ణి ఆరాధించడం అస్తమించే సూర్యుడిని ప్రార్థించడం తిరిగి ఉదయించమని అంటే మనిషి తన చేతనాస్థితిని ఈ రకంగా ప్రకృతికి అన్వయించుకోవడం ఇది పూర్తిగా దక్షిణాయంలోనే ఉంటుంది అంటే భగవంతుడు యోగనిద్రలో ఉన్నప్పుడు ఈ విధులను తప్పనిసరిగా ఒకే ప్రదేశంలో ఉండి, అంటే ఇంట్లో ఉండి లేక ఒక ప్రదేశాన్ని నియమించుకొని అక్కడ ఉండి చేసుకోవాలి. అయితే ఉత్తరాయణంలో ఈ నియమం లేదు.అంటే చెప్పబడలేదు. కారణం ఇటువంటి ప్రకృతి సంబంధమైన ఇబ్బందులు ఉత్తరాయణంలో ఉండవు. కాబట్టి అయితే చేతనాస్థితిని పొందడం ముఖ్యంగా కొత్త ఆలోచనలతో ప్రణాళికలతో మనిషి ఈరోజు ప్రారంభించేసుకోవడం అనేది సూచించబడింది దీన్నే ఇయర్ ప్లాన్ అని న్యూ ఇయర్ ప్లాన్ అని కొత్త సంవత్సరంలో కొత్త ప్రణాళికలు వేసుకోవాలని చెబుతుంటారు.

      మన పల్లెటూర్లలో దీన్ని  కొత్త లు తినడం కొత్తలు పెట్టుకోవడం అని కూడా ఒక సంప్రదాయంగా చేస్తారు.ముఖ్యంగా కొత్తగా పండిన పంట ఈరోజు తప్పనిసరిగా అంటే కొత్త బియ్యం తో  వండుకోవడం అనేది ఆచారం.

మనం అనాదిగా జరుపుకునే పండుగలు ఉగాది, సంక్రాంతి ఇవి విశ్వవ్యాప్తంగా జరుపుకునే పండుగలను చెప్పవచ్చు. కారణం ఇవి రెండూ ప్రకృతి పండుగ లు. సంక్రాంతి  సంక్రమణం ఆధారంగా అంటే మకర రాశిలో సూర్యుని ప్రవేశాన్ని  దృష్టిలో పెట్టుకొని చేశారు. అందుకే ప్రతి సంవత్సరం కూడా జనవరి 14 రోజు మాత్రమే వస్తుంది దాని ఈ పండుగని మనం ఏ నక్షత్రం ఆధారంగా చేసుకో ము అలాగే ఏ తిథి కూడా చూడాల్సిన అవసరం లేదు. ఇదేవిధంగా ఉగాది కూడా ఏ దేవతను ఆరాధించే నియమాన్ని  సనాతనంగా చెప్పలేదు. ఈ పండుగకు కేంద్ర బిందువు కాలుడు మాత్రమే. కాలుడు అంటే కలకాలం అని అర్థం. చైత్రమాసం, వసంత ఋతు ప్రాముఖ్యత . దీన్నే విశ్వవ్యాప్తంగా కూడా వాడుకలో వాళ్ళ  వాళ్ళ పద్ధతుల్లో పండగ జరుపుకుంటున్నారు.

   మనం మాసాలను తీసుకున్నా,ఋతువులను తీసుకున్నా అయనాలను తీసుకున్నా ఇదే ప్రకారమైన ఆధారమని చెప్పుకోవచ్చు.మనిషి మనుగడకు  ప్రకృతి అనుసంధానం చేసేవే పండుగ లు. వీటిని ఆచారం గా చెప్తూ alert చేయడం, జ్ఞానం కలిగించడం, పద్ధతైన బ్రతుకును అనుభవించడానికే నియమాలు ఏర్పాటు చేసారు. మంచి అలవాట్లు అలవర్చడం వంటి ఉద్దేశ్యాలున్నాయి. పూర్వీకులు నిర్ణయించిన సూర్య చంద్ర గమనాల లెక్కల్లో మార్పు లేదు. ఇప్పటివరకు తేడా రాలేదు. వీటి లక్షణాల ఆధారంగా ఆరోగ్యకరమైన జీవనశైలిని నేర్పారు.ఇదే సనాతన ధర్మం.

ఏ దేశానికి ఆ దేశ కాలమాన పరిస్థితులకు తగినట్టుగా, భౌగోళిక ప్రాధాన్యత తో ఎండా వాన చలి తీవ్రత లకు తగినట్టుగా, నేల తీరు కూ, పండే పంటలకూ అనుకూలంగా చెప్పారు. చలికాలం తెల్లవారుజామున లేచి స్నానం చేయడం మంచిది. ఆ సమయంలో బావినీళ్లు వెచ్చగా ఉంటాయి . స్నానం వల్ల బద్ధకం పోతుంది, చురుకుగా ఉంటారు. చైతన్య వంతంగా ఆలోచిస్తారు ఇదే భావి జీవితానికి చక్కని మార్గం సుగమం చేస్తుంది.బుద్ధి వికసిస్తుంది . ఇలాంటివి చాలా పండుగ ల ఉద్దేశ్యం.ఈ చలనశీలత కోసమైనా ఎవరైనా వాళ్ళ పెద్దలు చెప్పే  సనాతన సంప్రదాయం పాటించి ధర్మనిరతితో ఉంటారు. వీటివల్ల అంతా మంచే! చెడు లేదు!!

 _____****____

January 31, 2026 10 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

సమాజానికి హానికరమైనవిగా కాక ఉపయుక్తమైన రచనలు చేయాలి- డా. జి. చెన్నకేశవరెడ్డి

by Aruna Dhulipala January 30, 2026
written by Aruna Dhulipala

*ప్రముఖ కవి, రచయిత, విమర్శకులు, విశ్లేషకులు డా. జి. చెన్నకేశవరెడ్డి గారితో ‘మయూఖ’ ముఖాముఖి                                    -ధూళిపాళ అరుణ*

********************************************

     నిరంతరాన్వేషణతో అనేక పరిశోధనాత్మక వ్యాసాల ద్వారా సాహిత్యలోకానికి సుపరిచితులైన డా. జి. చెన్నకేశవరెడ్డి గారి జీవన యాత్రను, వారి అనుభవాలను వారి మాటల్లోనే తెలుసుకుందాం.

నమస్కారం సార్! మీ వ్యక్తిత్వ, సాహిత్య జీవన విశేషాలను మా పాఠకులకు తెలియజేసే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉంది…మొదటగా….

1ప్ర. అత్యంత సాహిత్యాభిలాష కలిగిన మీరు జన్మించిన

ప్రాంతం ఏది? బాల్య జీవితాన్ని ఏ విధంగా గడిపారు? ఆ విశేషాలను చెప్తారా?

జ:   నమస్కారం! నేను విద్వద్గద్వాలగా ప్రసిద్ధి చెందిన గద్వాలలో 1945 ఏప్రిల్ 7వ తేదీన జన్మించాను. మా అమ్మ రంగనాయకమ్మ, నాన్న తిమ్మారెడ్డి. చిన్నతనం నుండీ గద్వాల సాహిత్య వాతావరణంలో పెరిగాను. నేను అయిదవ తరగతి చదివేటప్పుడు డా. సి. నారాయణరెడ్డి గారు హైస్కూలుకు వచ్చారు. అప్పుడాయన తన నోట్ బుక్ లో రాసుకున్న ‘నాగార్జునసాగరం’ కవితాగానం చేశారు. అది నన్ను ఆ వయస్సులోనే ఎంతో ప్రభావితుని చేసింది. మా ఊరి లైబ్రరీలో ఉండే పుస్తకాలన్నీ చదివాను. మొదట మా అక్కయ్య కొరకు తెచ్చే డిటెక్టివ్ నవలలను నేనూ చదివేవాడిని (గట్టిగా నవ్వుతూ). మా నాన్న తరతరాల వారసత్వంలో మాలీపటేల్ గిరీ చేసేవాడు. గద్వాల ఊరే కాక చుట్టుపక్కల ఏడు ఊళ్ళల్లో కూడా మా పూర్వీకులు పటేల్ గిరీ చేశారు. మా నాన్న పంచాయతీ తీర్పులు బాగా ఇస్తాడని ప్రసిద్ధి ఉండేది. అందువల్ల బండ్లు కట్టుకొని పక్కన ఊళ్ళల్లో నుండి కూడా సమస్యల తీర్పు కోసం మా నాన్న దగ్గరికి వచ్చేవారు. ఆయన చదువుకున్నది 7వ తరగతి వరకే అయినా ఇంగ్లీషు, తెలుగు, లెక్కలు ఆయనకు బాగా వచ్చు. మేము ఏడుగురం సంతానం. అందులో అయిదవ వాడిని కావడం వలన నాకు అన్నలు, అక్క, తమ్ముడు, చెల్లెలు ఉండడం ఒక అదృష్టంగా భావిస్తాను. తదనంతర కాలంలో  సినారె గారు నామీద  అభిమానంతో ‘కర్పూర వసంత రాయలు’ కావ్యగానానికి అంగీకరించి గద్వాలకు రావడం జీవితంలో మరపురాని అనుభూతిని మిగిల్చింది.

2ప్ర. ప్రాథమిక విద్య నుండి మొదలుకొని వివిధ దశల్లో జరిగిన మీ పూర్తి విద్యార్జనను గురించి చెప్పండి.

జ:   మా ఇద్దరన్నలు హెచ్.ఎస్.సి స్కూల్ ఫైనల్ వరకు చదివారు. మా మూడో అన్న ఎఫ్.ఏ వరకు రెడ్డి హాస్టల్ లో ఉండి నిజాం కాలేజీలో చదివారు. ఆ కాలంలో ఆ చదువుకు ఉద్యోగాలు కూడా వచ్చేవి. మాకు రెండువందల ఎకరాల భూమి ఉండేది. పెద్ద వ్యవసాయ కుటుంబం. అందువల్ల ఒకరి కింద పని చేయడానికి ఒప్పుకునేవారు కారు. “ఉత్తం ఖేతి, మధ్యం బేపారే, కనిష్టం చాకిరీ” అంటారు కదా!(నవ్వుతూ) అందుకే మా అన్నయ్యలు ఇండిపెండెంట్ లైఫ్ కోరుకున్నారు. అంత చదువుకున్న మూడవ అన్నయ్య కూడా వ్యవసాయం వైపే మొగ్గు చూపాడు. దానివల్ల మా నాన్నకు నన్ను బాగా చదివించాలనే కోరిక పెరిగింది. చదువులో ముందే ఉన్నప్పటికీ గేరి(వాడ)లో పిల్లలతో ఎక్కువగా ఆటలు ఆడుతుండేవాడిని. ఓసారి మా నాన్న నేను పనికిరాకుండా పోతాననే భయంతో ‘కోదండం’ కూడా వేయించాడు. అంతేకాదు. నన్ను హైదరాబాద్ లో చదివించాలని నిర్ణయం చేసుకున్నాడు. అక్కడ గ్రామర్ హైస్కూల్లో 6వతరగతిలో చేర్పించాలనుకున్నాడు కానీ ఉపాధ్యాయుల ఉచ్చారణ నాకు అర్థం కాకపోయేది. ఆల్ సెయింట్స్ కాలేజీలో సీటు వచ్చింది. కానీ ఆ బిల్డింగ్, అక్కడి ‘నన్స్’ వేషధారణను చూసి భయపడ్డాను. అందుకే అక్కడ చదవలేదు. అకడమిక్ ఇయర్ మధ్యలో కాబట్టి గద్వాలలో చేర్చుకోలేదు. ఆరు నెలలు గద్వాల పక్కనే ఉన్న ఆత్మకూరులో మేనమామ గారింట్లో చదువుకొని తరువాత గద్వాల చేరి పియుసి వరకు అక్కడే చదివాను. రెండు సంవత్సరాలు ఇంజినీరింగ్ చదివి నేను కూడా మా నాన్న కోరికను నెరవేర్చక నిరాశ పరిచాను (విచారంగా). ఇప్పటికీ తలచుకుంటే బాధగా ఉంటుంది. తెలుగు చదవాలని, నారాయణరెడ్డి గారి దగ్గర శిష్యరికం చేయాలని , ఆయనంతటి వాడిని కావాలని నా కోరిక. యూనివర్సిటీలో నాకంటే సీనియర్ పి. నర్సింహారెడ్డి అని ఉండేవాడు. ఆయన సినారె గారి క్లాసులు ఉండే సమయాన్ని నాకు చెప్పేవాడు. నా ఇంజినీరింగ్ క్లాసులు వదిలేసి ఆ క్లాసులకు అటెండ్ అయ్యేవాడిని. ఆయనకు ప్రత్యక్ష శిష్యుడిని కావాలని బిఏ తెలుగులో చేరాను. అమ్మంగి వేణుగోపాల్, వేలూరు సాయిబాబా, వీరితో పాటు మరో ఇద్దరు నాకు స్నేహితులుగా ఉండేవారు. సినారె గారితో పాటు చలమచర్ల రంగాచార్యులు గారు, ఖండవల్లి లక్ష్మీరంజనం గారు, దివాకర్ల వెంకటావధాని గారు, పాటిబండ మాధవశర్మ గారు, బిరుదురాజు రామరాజు గారు ఇట్లా హేమాహేమీలందరూ గురువులయ్యారు. తరువాత ఎమ్ ఏ లో చేరాను. నాతో పాటు నా మిత్రులలో అమ్మంగి వేణుగోపాల్ ఒక్కడే చేరాడు. దివాకర్ల వెంకటావధాని గారి కూతుళ్లు గాయత్రి, రాజేశ్వరి కూడా మాకు క్లాస్ మేట్స్.

3ప్ర. సాహిత్యరంగంలో మీ మొదటి అడుగు పడిన చోటు ఎక్కడో వివరిస్తూ, మీలో సాహితీ కాంక్షను ప్రేరేపించిన విధానం ఏమిటో తెలపండి.

జ:    మా అమ్మ ప్రతిరోజు భగవద్గీత పారాయణం చేసేది. నా చెవిలో ఆ శ్లోకాలు వినబడుతుండేవి. వాటివల్ల దేవాలయంలో జరిగిన భగవద్గీత పోటీలో ప్రైజ్ వచ్చింది. ఇంతకుముందు నేను చెప్పినట్టు అయిదవ తరగతిలో సినారె గారి కవితాగానం నన్ను అబ్బురపరచి కవిత్వం అంటే ఇట్లా ఉండాలి అన్న భావన దృఢమైంది. 8వ తరగతిలో హిందీ కవిత ‘పథిక్’ను ‘పథికుడు’ అనే పేరుతో తెలుగులోకి అనువదించాను. హిందీ టీచర్ ఎంతో మెచ్చుకుని మిగతా టీచర్లకు కూడా చూపించి, అప్పటినుండి ‘బాలకవి’ అని పిలవడం మొదలుపెట్టాడు. తెలుగు టీచరు లక్ష్మణాచారి గారు పండితుడు. ఆయన మంచి కంఠంతో రాగయుక్తంగా వసుచరిత్ర పద్యాలు చదువుతుంటే ఎంతో ఆనందంగా ఉండేది. ఒకసారి స్కూల్లో అవధానం పెట్టించారు. అది కూడా నన్ను బాగా ప్రభావితం చేసింది. పియుసి లో ఫస్ట్ బ్యాచ్ మాది. అందులో మొదటి రూల్ నెంబర్ నాదే. అందుకే మొదటి విద్యార్థిని కూడా నేనే(నవ్వుతూ). మొదటి సంవత్సరం పరీక్షలు రాయలేదు. రెండవ సంవత్సరం మళ్లీ పరీక్షకు కట్టి ఫస్ట్ క్లాస్ లో పాసయ్యాను. ఇంజనీరింగ్ లో సీట్ వచ్చింది. చైనా యుద్ధం జరుగుతున్న సమయమది. భాషా నిలయంలో గానీ, ఎక్కడ కవిసమ్మేళనాలు జరిగినా గానీ హాజరయ్యేవాడిని. ఉత్పల సత్యనారాయణాచార్య గారు, దివాకర్ల వారు మొదలగు పండితులు వచ్చేవారు. మల్లాది సూర్యనారాయణ మూర్తిగారు హంపీ ఎక్స్ కర్షన్ తీసుకెళ్లారు. కృష్ణదేవరాయల సాహితీ వైభవంతో విలసిల్లిన ప్రాంతం కాబట్టి అది కూడా నాకు ప్రేరణ కలిగించింది..ఇట్లా నా జీవితంలోని అనేక సంఘటనలు నాలో సాహిత్య కాంక్షను పెంచుతూ వచ్చాయి. నేను బిఏ చదువుతున్నప్పుడు కేశవపంతుల నర్సింహశాస్త్రి గారితో పరిచయం ఏర్పడింది. ఆయన నాకు రేడియో ప్రోగ్రాం ఇచ్చారు ఆ స్క్రిప్ట్ మీద పాశం చెన్నకేశవరెడ్డి అని రాశాను. అది చూసి ‘మీది ఏ ఊరు?’ అని అడిగారు. నేను గద్వాల అని చెప్పాను. “మీ ఊరు వాడేనయ్యా కొత్వాల్ (రాజా బహదూర్) వెంకటరామారెడ్డి. మీ వంశం వాడు కూడా” అని చెప్పారు. ఎంతో ఆశ్చర్యపోయాను. ఈ విషయం మా ఊరికి పోయినప్పుడు మా నాన్నగారిని అడిగాను.  ఆయన మా ఇంటి ఎదుట ఉన్న ఇల్లు చూపించి ఇదే ఆయన ఇల్లు అని చెప్పారు. అంతటి గొప్పవాడు మా వంశీయుడు కావడం ఎంతో ఆనందాన్నిచ్చింది. కొత్వాల్ వెంకట రామారెడ్డి శతజయంతి సందర్బంగా ఏర్పాటు చేసిన సభలో నన్ను సత్కరిస్తూ సినారె గారు ‘పాశం ఇంటి వారి మొలక’ అని పేర్కొనడం ఎప్పటికీ మరిచిపోలేను. అదే నా మొదటి సత్కారం. బి ఏ సెకండియర్ లో ఉన్నప్పుడు తెలుగు శాఖకు సెక్రటరీగా ఎన్నో కార్యక్రమాలు నిర్వహించాను. సాహిత్య సప్తాహం పేరుతో ఏడు రోజులు కార్యక్రమాలు నిర్వహించాను. ఫైనల్ ఇయర్ లో కూడా నన్నే నియమించారు. గద్వాల కాలేజీ వాళ్ళు కూడా పిలిచేవారు. భాస్కరభట్ల కృష్ణారావు, యశోదారెడ్డి మొదలైన సాహితీవేత్తలతో సాన్నిహిత్యం ఉండేది.
         నంద్యాల అనంత రాఘవాచారి గారని జమ్మిచేడు. జమీందారు దగ్గర ఆస్థాన పండితుడు. నేను హైస్కూల్లో ఉన్నప్పుడే ఆయన దగ్గరకు వెళ్లి రఘువంశం, కుమార సంభవ కావ్యాలు, శబ్దమంజరి నేర్చుకున్నాను. అమరకోశం చదివాను కానీ నాకు రాలేదు. “అమరం నా నోటికమరలేదు”(బిగ్గరగా నవ్వుతూ). లక్ష్మణాచారి గారి వల్ల చిత్తూరు వారి సంస్కృత పరీక్షలు పరిచయ, అభిజ్ఞ, కోవిద పాసయ్యాను. ఆయన చెప్పని పేపరును కూడా బాగా రాయడంతో విద్యార్థులకు ఆ పేపరు చదివి వినిపించారు. అట్లా సంస్కృతం కూడా నేర్చుకోవడం జరిగింది.

4ప్ర. మీ వచన కవిత మొట్టమొదటగా ‘జ్యోతిర్మయి’ పత్రికలో ప్రచురించబడిందని విన్నాం. ఆ నేపథ్యాన్ని వివరిస్తూ ఆ పత్రికతో మీ అనుబంధాన్ని వివరించండి.

జ:  ఎస్వీ రామారావు గారు పి హెచ్ డి చేస్తున్నప్పుడు హాస్టల్ లో ఉండేవారు. మహబూబ్ నగర్ జిల్లాలో ‘జ్యోతిర్మయి’ అనే సాహిత్య సంస్థను స్థాపించారు. గద్వాలకు నన్ను ప్రతినిధిగా నియమించారు.  గద్వాలలోని పెద్ద పెద్ద వర్తకులంతా మా నాన్నగారి మీద ఉన్న గౌరవంతో ఆ సంస్థ నిర్వహణకు ఆర్థిక సహాయం అందించారు. ‘జ్యోతిర్మయి’ పత్రిక ద్వారా మొదటగా జిల్లా కవితా సంకలనం ప్రచురించబడింది. అందులో ‘కాంతిచక్రం’ అనే నా కవిత అచ్చయింది. ఆ సంకలనానికి సినారె గారు ముందు మాట రాశారు. ‘జ్యోతిర్మయి’ ద్వితీయ వార్షికోత్సవ సంచిక ఆవిష్కరణ మా గద్వాలలో జరగడం నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది.

5ప్ర. మాత్రా ఛందస్సు, గేయ ఛందస్సుల మీద పరిశోధన చేయడానికి ప్రోత్సాహం ఎవరినుండి లభించింది?

జ:   మొదట నేను మార్క్సిజమ్ మీద పరిశోధన చేయాలనుకున్నాను. సినారె గారు నన్ను మాత్రాఛందస్సు మీద చేయమన్నారు. నేను వారి రచనల మీద చేస్తానన్నాను. అట్లా కాదని గేయ కవిత్వం మీద చేయమని సలహా ఇచ్చారు. గేయ కవిత్వం ప్రధానంగా గతి ప్రధానమైనది. అక్షర ఛందస్సు, మాత్రాగణ ఛందస్సు, మాత్రా ఛందస్సు అని ఛందస్సు మూడువిధాలు. మాత్రా ఛందస్సులో త్రిస్ర, చతురస్ర, ఖండ, మిశ్ర గతులుగా ఉంటుంది. తొమ్మిది మాత్రలతో కూడా ఉంటుంది కానీ దాన్ని ఎవరూ రాయరు.

6. ‘ఆధునికాంధ్ర గేయకవిత్వం’పై మీరు చేసిన పరిశోధన గురించి వివరించండి.

జ:  సినారె గారు సూచించిన ప్రకారం నేను గేయ కవిత్వం మీద పరిశోధన చేయడానికి పూనుకున్నాను. గేయం గాన ప్రధానమైనది. లయబద్ధంగా భావం పూర్తవడమే గేయ ప్రధాన లక్షణం. నా పరిశోధన గ్రంథంలో  గేయలక్షణం, గేయ వికాసం, ఆధునిక యుగారంభం- గేయావతరణం, భావకవిత్వ యుగం- గేయరచనలు, అభ్యుదయ కవిత్వ యుగం- గేయ రచనల గురించి వివరించాను. గేయ కవుల గేయ ఛందస్సుల విశిష్టతలను వివరించాను. ఆధునికాంధ్ర గేయ కవిత్వాన్ని మొత్తం ఇందులో వివరణాత్మకంగా తెలిపాను. ఉస్మానియాలో ఈ ప్రక్రియ మీద పరిశోధన చేసిన తొలి పరిశోధకుడిగా గౌరవం పొందాను. ఈ మధ్యకాలంలో తెలంగాణ ఉద్యమంలో గేయం ఎంత ప్రాధాన్యత పోషించిందో దానికి సంబంధించిన విశ్లేషణ కూడా ఇందులో చేర్చడం జరిగింది. ముఖ్యంగా వస్తువు, ఛందస్సు ఈ రెండింటిని ప్రధానంగా చేసుకొని పరిశోధన చేశాను.

7ప్ర. అప్పటికీ, ఇప్పటికీ గేయ సాహిత్యంలో వచ్చిన, వస్తున్న మార్పులెటువంటివి?

జ:   నిజానికి గేయ మూలాలు ప్రాకృత గాథా సప్తశతి కాలానికి సంబంధించినవి. పరిశోధన గ్రంథంలో కూడా నేను దీన్ని ప్రతిపాదించాను. ఎందుకంటే వీటిలో తెలుగు మాటలు కనిపిస్తాయి. శాసనాల్లో కూడా గేయ ప్రస్తావనలు మనం గమనించవచ్చు. సీస పద్యం కూడా గేయ ఛందస్సు నుండి పుట్టినదే. గేయ రూపమైన మౌఖిక సాహిత్యం లిఖిత సాహిత్యం కంటే చాలా గొప్పది. మొదటి గేయకావ్యం ‘పలనాటి వీరచరిత్ర’ అయితే ఆధునిక కాలంలో గురజాడ ప్రథమ గేయకవిగా చెప్పవచ్చు. శ్రీశ్రీ లో గురజాడ ప్రభావం కనిపిస్తుంది. తరువాత కవులు దీనిని అనుసరించారు. నారాయణ రెడ్డి గారు గేయ కావ్యాలను రాశారు. అభ్యుదయ విప్లవ కవిత్వాలలో కూడా కవులు గేయ రచనలు చేశారు. తరువాత వచ్చిన వచన కవితా ప్రక్రియ, ఛందస్సును వదిలివేసే దిశగా సాగుతూ వచ్చింది. అయినా ఆధునిక కాలంలో కూడా గేయ సాహిత్యం పరిమళాలను వెదజల్లుతూనే ఉంది. సినిమా పాటలన్నీ మాత్రా ఛందస్సులే కదా! గేయం ధ్వని ప్రధానంగా సాగుతూ విషయం సూటిగా హృదయాన్ని తాకుతుంది.

8ప్ర. “జయమిత్ర” అనే పేరు తో సాహిత్య సాంస్కృతిక వేదికను స్థాపించడానికి వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? ఈ సంస్థ ద్వారా మీరు నిర్వహించిన కార్యక్రమాలు ఎటువంటివి?

జ:    అది చాలా విచిత్రంగా జరిగింది. నేను, నా స్నేహితుడు అమ్మంగి వేణుగోపాల్ మా సిద్ధాంత వ్యాస గ్రంథాలకు ఏ పబ్లికేషన్ పేరు పెట్టాలని అనుకున్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. వేణుగోపాల్ భార్య పేరు విజయలక్ష్మి, నా భార్య పేరు సుమిత్ర. వారి పేర్లలోని ముందు అక్షరం తీసేసి ‘జయమిత్ర పబ్లికేషన్’ అని పెట్టాను. నా తొలి పుస్తకావిష్కరణ (సిద్ధాంత గ్రంథం) జయమిత్ర వేదిక మీద జరిగింది. అదే సమయంలో నా మిత్రుడు వేణుగోపాల్ తన సిద్ధాంత గ్రంథాన్ని నాకు అంకితమిచ్చాడు. ఒకే వేదిక మీద పుస్తకావిష్కరణ, అంకితం తీసుకోవడం నా అదృష్టం. అదే రోజున రాత్రి జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక అనే పేరుతో సంస్థ ఏర్పాటు చేస్తే బాగుంటుందని మిత్రులు సూచించారు. స్థానికంగా ఉండేవాడిని కాబట్టి నా అధ్యక్షతన సంస్థ ఏర్పడింది. ఉపాధ్యక్షునిగా నోముల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శిగా వేణు సంకోజ్ నియమితులయ్యారు. దీని తరఫున వందలాది సాహిత్య కార్యక్రమాలు నిర్వహించాం. అనేక పుస్తకాలను, అనువాదాలను ప్రచురించాం. సాహితీ ప్రముఖులను ఆహ్వానించి సాహిత్యోపన్యాసాలు ఇప్పించాం. పద్మశ్రీ అవార్డు గ్రహీతలు బి.రామకృష్ణారెడ్డి గారు, కూరెళ్ల విఠలాచార్య గారు, శ్రీమతి ఉమా మహేశ్వరి గారు నారా కొండప్ప గారలను గౌరవ పూర్వకంగా సత్కరించాం. నా పుట్టినరోజు సందర్భంగా నా పేరు మీద ఈ సంస్థ ద్వారానే అవార్డు ఇస్తున్నాం. రాజకీయ నాయకులు లేకుండా ఉన్నతమైన కార్యక్రమాలు జరుపుతున్న సంస్థగా పేరు గడించడం మాకు గర్వకారణం. ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి. నేను నా సిద్ధాంతగ్రంథం ప్రూఫులు చూస్తున్న సమయంలో అమెరికాలో ఉన్న నా డాక్టర్ మిత్రుడు ఉత్తరం రాస్తూ ఇప్పుడేం చేస్తున్నావని అడిగారు. ప్రూఫుల విషయం చెప్పాను. వెంటనే 15 వేల రూపాయలు విలువచేసే డాలర్లు పంపించాడు. నేను ఆశించింది కాదు. నా స్థితిగతులకు కొదువలేదు. ఇదేదో నా గొప్ప తెలియజేయడం కోసం చెప్తున్నది కాదు. ప్రేమ, స్నేహం ఎట్లా ఉంటాయో చెప్తున్నా. ఈ కాలంలో అవి కొరవడ్డాయి. వేణుగోపాల్ , నేను ఇంతకాలంగా ప్రాణ స్నేహితులుగా ఉన్నాం. కారణం ఆ ఆత్మీయతే. అమ్మంగి వేణుగోపాల్ మొదటి పద్యకవి. నేనాయను వచనకవిత్వం వైపు తిప్పాను. మా స్నేహానికి గుర్తుగా తన సిద్ధాంత గ్రంథం ‘నవలా రచయిత గోపీచంద్’ గ్రంథాన్ని అంకితమిచ్చాడు. అమ్మంగి వేణుగోపాల్ తో అర్థశతాబ్ది స్నేహానికి గుర్తుగా నా విమర్శన వ్యాసాల సంపుటి ‘అక్షరన్యాసం ‘అంకిత మిచ్చాను. ఈ గ్రంథానికి తెలుగు విశ్వవిద్యాలయం వారు విమర్శనరంగంలో సాహిత్య పురస్కారం ఇచ్చారు.

9ప్ర. ఉత్పల సత్యనారాయణ గారితో మీ అనుబంధాన్ని చెప్పండి.

జ:   ఉత్పల సత్యనారాయణ కూడా నాకు సన్మిత్రుడు. ఆయన రచించిన “ఈ జంట నగరాలు హేమంత శిశిరాలు” కావ్యానికి తొలి శ్రోతనైన భాగ్యవశాన నా చేత పీఠిక రాయించుకోవడం గొప్ప విషయం. ఇద్దరు ఆస్థాన కవులు విశ్వనాథ, దాశరథి రాసినప్పటికీ నా చేత పీఠిక రాయించుకొన్నందువల్ల నేనాయన హృదయాస్దాన కవినయ్యాను. తర్వాత కూడా తన యుగళ గీతం గ్రంథానికి పీఠిక రాయించుకొన్నాడు. 2005 రసమయి సంస్థ అధ్యక్షుడు ఎన్. కె రాము గారు తలపెట్టిన నా షష్టిపూర్తి కార్యక్రమాన్ని మా గురువు నారాయణరెడ్డి గారు తాను అధ్యక్షుడిగా ఉన్న తెలంగాణా సారస్వత పరిషత్తులో ఎంతో ప్రేమతో తన ఆధ్వర్యంలో జరిపించారు. అది ఎన్నటికీ మర్చిపోలేని సంఘటన. ఈ సందర్భంలోనే సత్కవి, సహృదయుడు ఉత్పల సత్యనారాయణ చార్య  గారు తన పద్య కృతి ‘శైవలినీ రాగాలు ఉత్పలినీ పరాగాలు ‘అంకితమిచ్చాడు. అది నా అదృష్టం.

10ప్ర. తెలుగు అకాడెమీలోను, తెలుగు విశ్వ విద్యాలయంలో మీరు నిర్వహించిన పదవుల అనుభవాలు ఎటువంటివి?

జ:    ఎమ్ ఏ లో గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత ఉద్యోగాన్వేషణ ప్రారంభించాను. మహబూబ్ నగర్ ఎమ్.వి.ఎస్ కాలేజీలో ఉద్యోగం వచ్చింది. మూడు వారాలు తిరగక ముందే తెలుగు అకాడమీలో ఉద్యోగం ఇస్తున్నట్టు ఆర్డర్ వచ్చింది. కనీసం నేను అప్లై కూడా చేయలేదు. సినారె గారిని కలిసి ఈ విషయం చెప్పాను. అకాడెమీలో చేరవద్దని ఆయన నాకు మంచి సలహా ఇచ్చారు. అప్పటికి మా ఇంటి పరిస్థితుల దృష్ట్యా, మా నాన్న కోరిక దృష్ట్యా చేరిపోయాను. కానీ పని ఒత్తిడి వల్ల సృజనాత్మకతను కోల్పోయాను. జె.ఎల్ గా వెళ్ళడానికి వేరే అవకాశం వచ్చినప్పటికీ ఇక్కడ కొంతమంది ప్రోద్బలంతో వెళ్లలేకపోయాను. ప్రమోషన్లను కూడా చాలా ఆలస్యంగా అందుకున్నాను. నాకు ప్రొఫెసర్ ను కావాలని బాగా కోరిక ఉండేది. తెలుగు విశ్వవిద్యాలయంలో విజ్ఞాన సర్వస్వ కేంద్రంలో ప్రొఫెసర్ పోస్టు ఖాళీగా ఉందని తెలిసి అప్లై చేశాను. అది ‘ప్రొఫెసర్- కం- డైరెక్టర్’ పోస్టు కావడం వలన తెలుగు విశ్వవిద్యాలయంలో సంచాలకుడిని అయ్యాను. జ్యోతిష్యం శాఖలో పి జి కోర్సు పెట్టించాను. పది విజ్ఞాన సర్వస్వాలకు రూపకల్పన చేశాను. ఈ విధంగా తెలుగు అకాడెమీలో ఇరవై ఐదేళ్లు, తెలుగు విశ్వవిద్యాలయంలో పది సంవత్సరాలకు పైగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను.

11ప్ర. ‘వాణిజ్య పదకోశం’ ప్రధాన సంకలన కర్తగా మీరు చేసిన కృషి ఎటువంటిది?

జ:   తెలుగు అకాడెమీ 1985 లో వాణిజ్య పదకోశాన్ని రూపొందించడానికి నిర్ణయించినప్పుడు నేను దానికి ప్రధాన సంకలన కర్తగా వ్యవహరించాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని 28 వాణిజ్య కేంద్రాల నుండి సేకరించిన సమాచారాన్ని ఆధారం చేసుకొని దీన్ని రూపొందించాం. సామాన్య ప్రజానీకం నిత్య జీవితంలో వ్యాపార లావాదేవీలలో ఉపయోగించే  పదాలకు ప్రాధాన్యతనిచ్చాం. భాషకు సంబంధం లేని వర్తకులకు మాత్రమే అర్ధమయ్యే కోడ్ పదాలను కూడా చేర్చడం జరిగింది. అట్లాగే వ్యాపార సంబంధ సామెతలను, జాతీయాలను, అన్యదేశ్యాలను కూడా జోడించాం.

12ప్ర. విశ్వనాథ సత్యనారాయణ గారితో మీకు ఏర్పడిన పరిచయ నేపథ్యాన్ని తెలపండి.

జ: మల్లాది సూర్యనారాయణ మూర్తి గారు తాము రాసిన ‘శివభక్తుల చరిత్ర’ను శ్రీశైల మల్లికార్జుని సన్నిధిలో సమర్పించడానికి శ్రీశైలం వెళ్తూ నన్ను వెంబడి తీసుకెళ్ళారు. అప్పుడు నేను పియుసి సెకండియర్ లో ఉన్నాను. అక్కడినుండి విజయవాడకు వెళ్లాం. అక్కడ మల్లాది గారి తమ్ముడు ఇరిగేషన్ ఇంజినీర్ గా పనిచేస్తున్నాడు. ఆయన ఇంట్లో మూడు రోజులు ఉన్నాం. అప్పుడే మల్లాది గారు నన్ను విశ్వనాథ వారింటికి తీసుకు వెళ్లారు. ఆ సమయంలో ఆయన ‘పురాణ వైర గ్రంథమాల’ ను డిక్టేట్ చేస్తున్నారు. అరగంట సేపు కూర్చొని వింటూ ఆనందించాం. తర్వాత మల్లాది వారు “ఇతను నా శిష్యుడు. కవిత్వం రాస్తాడు. మీరంటే చాలా అభిమానం” అంటూ ఆయనకు నన్ను పరిచయం చేశారు. ఆ తరువాత నా మీద అభిమానంతో సాహిత్య పరిషత్తు సమావేశాలకు కూడా వచ్చారు. అంతటి సహృదయులు విశ్వనాథ వారు.

13ప్ర. మీరు రచించిన, వెలువరించిన పుస్తకాలను గురించి చెప్పండి.

జ:  నా రచనలు ఇప్పటివరకు కవితా సంకలనాలు, వ్యాససంపుటాలు, మోనోగ్రాఫులు, పి. వి నరసింహారావు గారి జీవితచరిత్ర ఇట్లా పదిహేను వరకు వచ్చాయి. సంపాదకత్వం వహించినవి మరో పదిహేను వరకు ఉంటాయి. నా వరకు నేను రాసినంతవరకు సంతృప్తికరంగానే ఉన్నాను.

14ప్ర. జోగులాంబ గద్వాల జిల్లా ఏర్పడడంలో మీరు ముఖ్య పాత్ర వహించారు కదా! అందులో మీ కృషి ఎటువంటిది?

జ:    నాకు చిన్నప్పటి నుండి నేను పుట్టిన ఊరు గద్వాల అంటే చాలా ఇష్టం. ప్రజల్లో రాజకీయ చైతన్యానికి కరపత్రాలు పంచేవాడిని. తెలంగాణ ఏర్పడిన తరువాత కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా గద్వాల, ఆలంపూర్ లను కలిపి వనపర్తి జిల్లాలో కలపాలనుకున్న ముఖ్యమంత్రి ప్రతిపాదన నాకు బాధను కలిగించింది. జోగులాంబ గద్వాల జిల్లా కోసం జరుగుతున్న ఉద్యమంలో కార్యకర్తనయ్యాను. మాజీ మంత్రి డి కె అరుణ పాదయాత్ర చేయాలని సంకల్పించినప్పుడు గద్వాల జములమ్మ గుడి నుండి ఆలంపూర్ జోగులాంబ గుడి వరకు చేస్తే బాగుంటుందని ఆమెకు సూచించి అమలు చేయించాను. సాహితీ ఘన చరిత్ర కలిగిన గద్వాలను చిన్న సంస్థానమైన వనపర్తిలో చేర్చడం ఆత్మ గౌరవానికి భంగమని, తెలంగాణాలో ఉన్న ఒకే ఒక శక్తిపీఠం కలిగిన ప్రాంతంగా దానికి ప్రాధాన్యత నివ్వాలని తెలుపుతూ ముఖ్యమంత్రికి ఉత్తరాలు రాశాను. ఆయన దృష్టికి వచ్చేలాగా కరపత్రాలు ప్రచురించి పంపాను. ఉద్యమ తీవ్రతను గుర్తించి ముఖ్యమంత్రి గారు జోగులాంబ గద్వాల జిల్లాను ప్రకటించారు. ఒకసారి రసమయి సంస్థ తరఫున నారాయణరెడ్డి గారి పేరు మీద అవార్డు అందుకొంటున్న సందర్భంలో సభకు డి కె అరుణ గారు వచ్చారు. “జోగులాంబ గద్వాల జిల్లా పేరును ప్రతిపాదించింది చెన్నకేశవ రెడ్డి అని, ఆయన సెంటిమెంటు ప్రజల్లోనూ, ముఖ్యమంత్రిలో కూడా బాగా పనిచేసిందని, జిల్లా ఏర్పాటులో చెన్నకేశవ రెడ్డి పాత్ర చాలా కీలకమైంద”ని ఆమె సభాముఖంగా ప్రశంసించారు.

15ప్ర. మీరు అమెరికాలో నిర్వహించిన కార్యక్రమాలు ఎటువంటివి?

జ:   నేను మొట్టమొదట 1998 లో ఆటా ఆహ్వానం మీద అమెరికా వెళ్లాను. ఆ వేదిక మీద వక్త గాను కవిగాను అవధాన పృచ్ఛకుడిగాను పాల్గొన్నాను. తర్వాత మా పిల్లలు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నందువల్ల రెండు సందర్భాలలో తానా సభలోను , ఆటా సభలోను వక్తగా, కవిగా పాల్గొన్నాను. కాలిఫోర్నియా రాష్ట్రం బే ఏరియాలో మా అబ్బాయి ఉండటం వల్ల ఆరు నెలలకోసారి వెళ్ళినప్పుడల్లా  అక్కడ వీక్షణం సంస్థ నెలనెలా జరుపుతున్న సాహిత్య సమావేశాలలో ప్రతినెలా వెళ్లి నా కవిత్వాన్ని వినిపించేవాణ్ణి.

16ప్ర. మీ దృష్టిలో వర్తమాన కవుల, రచయితల దృష్టి కోణం సమర్థనీయమేనా? ఎట్లా?

జ:   ఒక్కో రచయితకు ఒక్కో దృక్పథం ఉంటుంది. నేను అందరి రచనలు చదువుతాను. అన్నిటినీ అధ్యయనం చేస్తాను. అయితే ఏ రచన అయినా, ఏ ప్రక్రియ అయినా ఆ రచయిత దృక్పథంతోనే చూడాలి అని నా భావన. సమాజానికి హానికరమైనవిగా కాక ఉపయుక్తమైన రచనలు చేయాలి. ఏదో ఊహాలోకంలో విహరించినట్లు కాకుండా వాస్తవానికి దగ్గరగా, సమకాలీన అంశాలకు సంబంధించిన ఇతివృత్తాలతో రాస్తే అది సమాజ పురోభివృద్ధికి దోహదం చేస్తుంది. ప్రాంతీయ భాషలో యశోదారెడ్డి గారు రాసినట్లు రాస్తే ప్రజలకు ఇంకా చేరువవుతుంది.

17ప్ర. సాహిత్య ప్రక్రియలు వివిధరీతులుగా శాఖోపశాఖలుగా విస్తరిల్లుతున్న వర్తమాన సమాజంలో భాషాభివృద్ధి జరుగుతున్నట్లు మీరు భావిస్తున్నారా?
ఏ విధమైన రచనల ద్వారా సమాజాన్ని పరిణామ దిశగా, బలోపేతం చేయవచ్చో తగు సూచనలు ఇవ్వండి.

జ:   భాషాభివృద్ధి జరుగుతున్నదనే నేను భావిస్తాను. ఎందుకంటే వివిధ పంథాలో, వివిధ దృక్కోణంలో అనేక అంశాలతో రచనలు వస్తున్నాయి. అటువంటప్పుడు అభివృద్ధి లేదని ఎట్లా అంటాం? పోరంకి దక్షిణామూర్తి ఆయన ఎమ్ ఏ చేస్తున్నప్పుడే తెలంగాణ మాండలికంలో ‘ముత్యాల పందిరి’ రాశాడు. మా అందరికీ చదివి వినిపించేవాడు. ఇదేకాక ‘వెలుగు వెన్నెల గోదారి’ అని కోస్తా మాండలికంలో, ‘రంగవల్లి’ అనే దానిని రాయలసీమ మాండలికంలో రాశాడు. ఆ క్రెడిట్ ఆయనకే దక్కుతుంది. పోరంకి దక్షిణామూర్తి ఏర్పరచుకున్న తన సొంత గ్రంథాలయాన్ని ఆయన మరణం తర్వాత ఆయన  కుమారులు మా స్నేహాన్ని గుర్తించి ఉచితంగా ఆ పుస్తకాలన్నీ నాకు ఇచ్చారు. ప్రాంతీయ భాషల్లో రచనలు భాషను అభివృద్ధి పరుస్తాయి. అందరికీ సులువుగా అర్థమవుతాయి. ఎప్పుడైనా, ఎక్కడైనా, ఏ భాషైనా సమాజానికి స్ఫూర్తి దాయకంగా ఉండే రచనలు చేయాలి. ముందుగా రచయితలు తమను తాము ఎడ్యుకేట్ చేసుకోవాలి. దానికోసం ఎక్కువగా పుస్తకాలను చదవాలి. వారి భావనా పరిధిని విస్తృతం చేసుకోవాలి. ఏ అంశాన్ని వారు చెప్తున్నారో, దేని గురించి రాస్తున్నారో దాని పట్ల నిజాయితీ ఉండాలి. వాస్తవ జీవితాలకు దగ్గరగా ఉండడం ఉపయోగకరంగా ఉంటుంది.

నమస్కారం సార్. మీ అమూల్యమైన సమయాన్ని మాకోసం వెచ్చించి, మీ జీవన, సాహిత్య విశేష విషయాలను తెలిపినందుకు మా తరఫున, మా మయూఖ పాఠకుల తరఫున అనేకానేక కృతజ్ఞతలు సెలవు.

January 30, 2026 17 comments
1 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

సాహిత్యాకాశంలో నక్షత్రాక్షర తోరణం- అక్షరగీతం

by Aruna Dhulipala January 30, 2026
written by Aruna Dhulipala

       ఒక వ్యక్తి తాను అనుకున్న రీతిగా లక్ష్యాలను చేరుకుంటూ తన ఏడు పదుల జీవితాన్ని సంపూర్ణంగా అనుభవించడం సామాన్య విషయం కాదు. కానీ అందులో కృతకృత్యులై జీవన సాఫల్యాన్ని చవి చూసినవారు దాస్యం సేనాధిపతి గారు. అందరిలాగే జీవితంలో ఎన్నో అనుభవాలను ఎదుర్కున్నా కవిగా, రచయితగా, సమీక్షకులుగా, ఉత్తమ సభా నిర్వాహకులుగా పలువురి మన్ననలను అందుకున్నారు. ఇటీవలే సప్తతి మహోత్సవాన్ని జరుపుకొని ఆత్మీయులనేకులు అక్షరరూపంలో వ్యక్తీకరించిన ఆప్యాయతానురాగాలను ‘అక్షరగీతం’ పేరుతో అభినందన సంచికగా వెలువరించారు. ఇది కేవలం అభినందనలకు పరిమితమైన పొత్తంగా కాక అభినందన పురస్సర జీవితచరిత్రగా చెప్పవచ్చు. అక్షరదాసులైన సేనాధిపతి గారు వారి సతీమణి గీతారాణి పేరును కూడా ఈ అభినందన సంచిక పేరులో పొదువుకొని ‘అర్ధాంగి’ అనే మాటను సార్థకం చేశారు.

     ఇందులోని అంశాలను బట్టి దీనిని ఆరు భాగాలుగా విభజించుకోవచ్చు.

* మొదటి మరియు మూడవ భాగంలో వివిధరంగాల  ప్రముఖులు, సాహితీవేత్తలు, బంధుమిత్రుల సందేశాలు, వ్యాసాలు, కవితలు ఉంటాయి.

* రెండవ భాగమంతా సేనాధిపతిగారి సాహిత్య సమాలోచన చేస్తూ ప్రసిద్ధ సాహితీవేత్తల విశ్లేషణలు, ప్రత్యేక వ్యాసాలున్నాయి.

* నాల్గవ భాగంలో ఆయనవి రెండు ఇంటర్వ్యూలు… పూర్తి సాహిత్య వివరాలతో ఆయన మాటల్లోనే చెప్పిన విశేషాలతో ఒకటి, వ్యక్తిగత జీవితాన్ని గురించి ఆయన వివరించిన అంశాలతో ఒకటి ఉంటాయి.

* అయిదవ విభాగమంతా వివిధ వర్ణ చిత్రాలు, ఆయా సందర్భాలలో ఆయనకు సంబంధించి వివిధ పత్రికల్లో వెలువడిన విశేషాలుంటాయి.

* ఆరవది పూర్తిగా ఆయన జీవిత పరిచయం ఉంటుంది.

పుస్తకం ఆసాంతం ఆయనతో ఆత్మీయత గలవారి ఛాయా చిత్రాలు సందర్భానుసారంగా క్రమపద్ధతిలో కూర్చడం ఈ పుస్తకానికి ఎంతో వన్నె తెచ్చింది.

       మాన్యులు సి.హెచ్. విద్యాసాగర్ రావు గారు దీనిని ఒక కర్తవ్య గాథగా పేర్కొంటూ “వాక్చాతుర్యంతో మంత్రించగలగడం మాత్రమే కాదు. మౌనంగా నిర్దేశం చేయగల శక్తి ఆయనది” అన్న మాటలు దాస్యం వారి జీవితస్వరూప స్వభావాన్ని మొత్తంగా ప్రత్యక్షం చేయిస్తాయి.

         మనం ఎన్నో అభినందన సంచికలను చూసి ఉంటాం. వాటిల్లో ఇది విభిన్నమైనది. సందేశాలు మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా ఆయనకు కుటుంబంతో ఉన్న అనుబంధం, బంధుమిత్రులతో ఉన్న వాత్సల్యం, ఉద్యోగ ప్రస్థానంలో వారు తమ సహోద్యోగుల పట్ల చూపిన ఆదరాభిమానాలు, వారితో ఉన్న స్నేహశీలత వల్ల ప్రతీఒక్కరూ వారిని గురించి తమ ఆత్మీయతను ఇందులో వెల్లడించడం దీనికొక ప్రత్యేకతను ఆపాదించింది. ఒకవైపు కౌటుంబిక జీవితానికి ప్రాధాన్యతనిస్తూనే మరోవైపు సాహిత్యంతో మమేకమై సభలు, సమావేశాలు , సాహితీ సంస్థలతో అనుబంధాన్ని పెనవేసుకొని ముందుకు సాగుతున్నారాయన.

          “మా కురు ధన జన యవ్వన గర్వం, హరతి నిమేషాత్కాలః సర్వమ్” అన్న శంకరాచార్యుల మాటలను ఆయన తమ జీవితంలో ఆచరణాత్మకంగా నిరూపించారు. క్షణభంగురమైన జీవితంలో ప్రతీ క్షణాన్ని వినియోగించుకున్నారు. ప్రతీ అవకాశాన్ని ఒడిసి పట్టుకొని ప్రయోజనకరంగా మలచుకున్నారు.

       ఒక వృత్తిలో ఉన్నవారికి క్రమశిక్షణ, సమయపాలన, అంకితభావం ప్రధానలక్షణాలు. అందులో ఆయన ఎక్కడా రాజీ పడలేదు. దీనికి ఉదాహరణగా వారి సతీమణి గీతారాణి గారు ఈ పుస్తకంలో తమ దాంపత్య జీవితాన్ని వివరిస్తూ చెప్పుకున్న అనుభవాల్లో ఒకదానిని చూద్దాం. ఆయన శిశుమందిర్ జిల్లాల పర్యవేక్షణాధికారిగా ఉన్నప్పుడు సూర్యోదయానికి ముందే ఇంట్లోంచి వెళ్ళిపోయి ఏ రాత్రికో తిరిగి వచ్చేవారు. ఒకనాడు మూడేళ్ళ కుమారుడు సేనాధిపతిగారిని చూసి ‘ఈయనెవరు?’ అని అడిగిన మాట ఆ తల్లిదండ్రుల మనస్సులను ఎంతగా కలచివేసి ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. అంతటి కార్యదీక్షాపరులు సేనాధిపతిగారు.

“Duty is more important than beauty and personal happiness” అని అంటారు. అయితే కావచ్చు. కానీ వృత్తిలో నిబద్ధత కలిగిన వ్యక్తులు కొన్ని అపురూపమైన ఆనందాలను కూడా త్యాగం చేయడం తప్పనిసరి అవుతుంది.

      “ప్రతిభా నవనవోన్మేష శాలినీ” అన్నట్లు ఆయన ఎప్పటికప్పుడు తమ ఆలోచనాసరళిని కొత్తగా రూపు దిద్దుకుంటూ వివిధ ప్రక్రియల్లో రచనలు చేశారు. ఇప్పటివరకూ 16 పుస్తకాలను వెలువరించి తమ సమర్థతను చాటుకున్నారు. సామాజిక అంశాలపై వెయ్యికి పైగా సంపాదక లేఖలు రాయడం వారి సాహిత్యాభిరుచితో పాటు వైశిష్ట్యాన్ని, వైయక్తిక అభీష్టాన్ని వ్యక్తపరుస్తుందని శ్రీ కె. వి. రమణాచార్యులు గారు దాస్యం వారిని ప్రశంసించారు.

         “ఇప్పుడు వస్తున్న కవిత్వంలోనూ, ఇతర రచనల్లోనూ పైపైన అక్షరాలు వెల్లువెత్తినంతగా హృదయం వెల్లువెత్తడం లేదు. హృదయస్పందన లేని కవిత్వం వ్యర్థమ”ని దాస్యం సేనాధిపతిగారు చెప్పిన మాటలు రచనల పట్ల కవులు, రచయితలకు ఉండాల్సిన బాధ్యతను స్పష్టం చేస్తాయి. ఆయన సునిశిత పరిశీలనా దృక్పథాన్ని తేటతెల్లం చేస్తాయి. కాలక్షేపానికో, మేమూ రాయగలమని పదిమందికి చెప్పుకోవడానికో రాస్తున్న వారందరూ ఈ విషయాన్ని లోతుగా అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది.

       ఒక పుస్తకం ఆయన చేతిలో పడడమే ఆలస్యం. వెంటనే స్పందించడం ఆయన నిరంతర అధ్యయన శీలత్వానికి నిదర్శనం. చదివిన వెంటనే స్పందించి దానికి సమీక్ష రాయడం మరీ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వర్ధమాన కవులను కూడా ప్రోత్సహించడం ఆయన ఉదాత్త వ్యక్తిత్వ లక్షణం. ఆయన సమీక్ష మూల గ్రంథాన్ని మించిన సౌందర్యాన్ని సంతరించుకోవడం పరిపాటి. ఇప్పటివరకు 1500 కు పైగా సమీక్షలు రాసారంటే ఆయన అక్షరాన్ని ఎంత ప్రేమిస్తారో, ఎంత బాధ్యతగా భావిస్తారో అర్థం చేసుకోవచ్చు.

      “ఈనాడు సాహిత్యం వికాసదశలో కాకుండా ప్రతికూల దశలో పయనిస్తున్న సందర్భంలో సహృదయ సార్వభౌముల కొరత మీవంటి వారి వల్ల తీరుతున్నది” అని ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి గారు దాస్యం వారిని అభినందించడం సేనాధిపతి గారి సాహితీ ప్రకాశనానికి నిదర్శనం. వాణిజ్యశాస్త్ర పయోనిధి అయినప్పటికీ నిరంతర అధ్యయనం, సహృదయత, మానవీయత మొదలగు సల్లక్షణాలు కలిగిన సేనాధిపతిగారు సారస్వతార్చనలో మేటిగా, ఆధ్యాత్మ చింతనా వాహినులుగా తమ జీవితాన్ని సార్థకం చేసుకుంటున్నారు.

         ఈ అభినందన సంచిక దాస్యం సేనాధిపతి గారి జీవితాన్ని వడ్డించిన విస్తరిలా మన ముందుంచుతున్నది. కంటికింపైనది మనసుకింపైనట్లు అందమైన పుస్తకంతో పాటు ఆయన వ్యక్తిత్వ, సాహిత్య జీవితాలు హృదయంగమంగా పాఠకులను ఆకట్టుకుంటాయనడంలో సందేహం లేదు. ఇంతటి పుస్తకాన్ని వెలువరించడానికి ‘ఉదయసాహితి’ సంస్థ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ దాస్యం లక్ష్మయ్యగారితో పాటు అంకితభావం కలిగిన ఆ సంస్థ నిర్వాహక సభ్యులు చేసిన కృషి ప్రశంసించదగినది. దాస్యం సేనాధిపతి గారు పరిపూర్ణ ఆరోగ్యవంతులై శతాధిక ఆయుష్మంతులై మరింత సాహితీ కృషి చేయగలగాలని కోరుకుంటూ సప్తతి మహోత్సవ సందర్భాన వారికి అభినందనలు.

January 30, 2026 2 comments
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us