మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
కవితలు

కవితా సాగర మధనం

by Y. Sujatha November 22, 2024
written by Y. Sujatha

కవిత గాఢంగా ప్రారంభించాలన్నా
గుట్టు విప్పి ముగించాలన్నా
భావాల తీవ్రత
అక్షరాల ఆర్ద్రత
సమతూకం చేయాలి !

కష్టాల కన్నీటి ఉప్పదనంలో
దుఃఖ సముద్ర లవణ శాతమెంతో‌ లెక్కించాలి !

నిట్టూర్పుల గుండె మంటల సెగలో
బాధాగ్ని శిఖ వేడి
ఎంతో గణించాలి !

ఆనందాల క్రీడా కేళిలో
గెలుపు మలుపు
గుట్టేమిటో విప్పి చెప్పాలి !

సంతోషాల వెన్నెల చినుకుల్లో
చిటపటల సందడి
ఎంతసేపో గుర్తించాలి !

భావోద్వేగాల ఆవేదన మూటలో
సమతౌల్యం ఎంతో
తూకమెయ్యాలి !

అనుభవాల క్రమ పరంపరలో
నేర్చుకున్న పాఠాల విలువ
నిగ్గు తేల్చాలి !

త్రుళ్ళిపడే
ఈర్ష్యాద్వేషాల కార్చిచ్చులో
దహించుకుపోయిన
స్వచ్ఛదనం ఎంతో
స్పష్టం చేయాలి !

ప్రతీ విషయాన్ని
సున్నితంగా స్పృశించాలి
నిశితంగా పరిశీలించాలి
సాలోచనగా వీక్షించాలి
ఆర్ద్రతగా శ్రవణించాలి !

అప్పుడే కదా
లోగుట్టు తెలిసేది
భావ సాగర మధనంలో
కవితామృతం పుట్టేది !

November 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

జనని

by Chandu Pendyala November 22, 2024
written by Chandu Pendyala

చెందు పెండ్యాల
తరానికో..
ఆడపిల్ల
తీరొక్క
రూపురేఖ.
కష్ఠానికి
ముందుంటది
సుఖానికి
ఎనుకకు పోతది.
అన్నిటిని
తట్టుకోడానికి
అలంకరించుకుని
మరీ పుడుతది.
ఇది లీలందుమా.
విధి గీతందుమా.
తన రాతందుమా.
పువ్వుకు
ప్రతిరూపమందుమా.
ఓపికకు
భూమాతందుమా.
కన్నీళ్ళ ను
కనపడనీయని
కీకారణ్యపు
పాయ అందుమా.
జన్మలకే
జనని అందుమా.

November 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

బాల్యం

by Butam Mutyalu November 22, 2024
written by Butam Mutyalu

ప॥ బాల్యం బాలల హక్కు భవితకు గురువే దిక్కు 2
ఆటలాడుతూ పాటపాడుతూ
చదువుతూ ముందుకు సాగాలి
మీరు చదువుతూ ముందుకు సాగాలి ॥ బాల్యం ॥

చిట్టి పలుకుల బుజ్జాయి
చిన్ని నడకల చెల్లాయి
జాగు చేయక రావాలి
జగతి వెలుగులే కావాలి

బడిలో టింగున బెల్లుమోగెరా మారామూ చేయక రావాలి
పలక బలపం చేతపట్టుకొని పరుగు పరుగునా రావాలి
అంక్షల చూసి బెదురేలా
కాంక్షతో బడికి రావాలి ॥ బాల్యం ॥

లేగదూడలా గంతులు వేస్తూ
లేడీ పిల్లల పరుగులు తీస్తూ సమయపాలన పాటిస్తూ
ఓనమాలు నేరుస్తూ చదువులన్ని చదవాలి
నీ భవితను నిర్మించు కోవాలి

ఆ అంటే అమ్మేరా ఆ అంటే ఆవేరా అమ్మనీకుతొలి గురువు
అమ్మ లాలి పాటలు నానబుద్ధి మాటలు మేలవించి చెప్పే టీచర్లు నీ కండ ఉండగా
శ్రద్ధతో బుద్ధిగా చదివినవో
అందవిశ్వాసాల అంతు చూడరా
దిగంతమే నీకు తలను వంచురా

November 22, 2024 0 comment
3 FacebookTwitterPinterestEmail
పుస్త‌క స‌మీక్ష‌

యాదోంకీబారాత్ జ్ఞాపకాల ఊరేగింపు-ఒక సృజనకారుడి ప్రయాణం

by Bodla Anuradha November 22, 2024
written by Bodla Anuradha

వారాల ఆనంద్  జ్ఞాపకాల ఊరేగింపు (యాదోంకీ బారాత్) మహా జోరుగా, మరెంతో ఘనంగా అలుపూ విరామం లేక ఆరు దశాబ్దాల చరితను పలకరిస్తూపాఠకులను పులకరింప చేస్తూ సాగుతుంది. కరీంనగర్ ఊపిరిగా మొదలైన ఈ బారాత్ వేములవాడ, సిరిసిల్ల, అగ్రహారం, మంథని, చొప్పదండి, హైదరాబాద్ ఇలా ఒకటీ రెండూ కాదు, తెలంగాణా ఊర్లన్నీ తిరుగుతూ, ఢిల్లీపురవీధులకి కూడ ఏగి పలు అవార్దుల, రివార్దుల హారతులందుకుంది.ప్రతి ఊరినీ అక్కడి వ్యక్తులనూ పరిచయం చేస్తూ మనల్ని తనతో పాటు తీసుకెళ్తుంది.     ఈ ఘనమైన బారాత్ ప్రయాణంలో ఇది అది అనిలేకుండా ఎన్నో విషయాలు మనకు పరిచయమవుతాయి. పలు సంస్థలకు, కార్యక్రమాలకూ జరిగిన రూపకల్పన, పలు సాహితీ ప్రక్రియల వివరణ, ఎందరోసాహితీ వేత్తల పరిచయం, దేశ విదేశ సినిమాల విశ్లేషణ,  పలు ప్రింటింగ్ విధానాలు, డాక్యుమెంటరీ సినిమాలు తీసే ప్రక్రియలు ఇలా ఎన్నింటినోవివరిస్తుంది.      ఈ జ్ఞాపకాల ఊరేగింపులో వందల కొద్దీ వ్యక్తులపేర్లు ఎదురొస్తాయి. కొన్ని తెలిసినవి, మరెన్నో తెలియనివి. ఇందులోఒక దగ్గర అనంద్ చెప్పినట్టు కొన్నిపేర్లు హాయి చెప్తే, కొన్ని హలో చెబుతాయి. ఇంతకుముందే పరిచయం ఉన్నవాళ్ళు హాయిచెబితే, కొత్తవాళ్ళు హలో చెప్పారు అని ఆయనేఒక చోట అన్నారు. అంతేకాదు కొన్నిచాఫ్టర్లలో హలొ చెప్పిన పేర్లు ఆ తరువాతిచాఫ్టర్లలో హాయి కూడా చెప్పేస్తాయి. అంటే ఆ పేర్లు మళ్ళీ మళ్ళీ ఎదురవుతూ మనకి అంతగానూ పరిచయమవుతాయి. ఇక్కడ మామూలు వ్యక్తులే కాదు, పలు సినీ నటులు, దర్శకులు, మరెందరో సాహితీవేత్తలు కూడా కలుస్తారు. అక్కడక్కడా దేశ విదేశసినిమాలూ పరిచయమవుతాయి, ఆపాత మధురాలైన అలనాటి హిందీ, తెలుగు పాటలు పలకరిస్తాయి, కూనిరాగాలుతీపిస్తాయి, మది నింపుతాయి.      ఈ పుస్తకంలో 80 వదశకం నుంచి 2014 వరకు కరీంనగర్ లో సాహితీ పరంగా, ఫిలిం సొసైటీ పరంగా జరిగిన ఎన్నో కార్యక్రమాల వివరణదొరుకుతుంది. ఎస్.ఆర్.ఆర్. కాలేజీ పరిధిలో జరిగిన కోర్సుల వివరాలు చేపట్టిన పలుఅభివృద్ది కార్యక్రమాలు, అందుకు ఎంతగానో సహకరించినఉపాధ్యాయులు, కలెక్టర్లు, మంత్రుల వివరాలు ఇలా ఎన్నో పొందుపరచబడ్డాయి.       కరీంనగర్ నేను పుట్టి పెరిగిన ఊరే. మా ఊరిలోనా చుట్టూతానే ఇంత  ప్రపంచం ఉండిందా, ఇన్ని కార్యక్రమాలు జరిగాయా, ఆప్రపంచం నాకు తెలియలేదే,  అందులో నేను లేనే అని నాకు చాలా చోట్ల అనిపించింది. ముఖ్యంగాఫిల్మ్  అప్ప్రీషియేషన్ కోర్స్ నేనూ చేసిఉండాల్సిందని, ఫిలిం సొసైటీ లోని మంచి మంచిసినిమాలు చూసి ఉండాల్సిందని అనిపించింది.    

ఈ యాదోంకీ బారాత్ ఒక సృజనకారుడి ప్రయాణం.సృజనకారుడైన వాడు తనను తాను వ్యక్తం చేసుకోవటానికి ఏదో ఒక్క రూపమే ప్రధానం కాదనినేను విశ్వసించాను అని చెప్తూ ఆనంద్ తన సృజనను,అన్నిరంగాల్లో చూపించారు. కధలు, కవితలు, విశ్లేషణలు, ఫిల్మీకరణలు, ఫిల్మ్ సొసైటీ స్థాపనలు,బోధనలు, ఉత్సాహాలు, ప్రోత్సాహాలు అన్నిటా తానైతను ఎరిగిన, తిరిగిన, ప్రపంచాన్ని మన కళ్లముందు అక్షరీకరించారు అనటం కంటేదృశ్యీకరించారు అనటం బాగుంటుంది.  అయితే ఈ సృజనకారుడిప్రయాణం పర్సనల్ కాదు. సమాజంతో, సాహిత్యంతో, సినీ ప్రపంచంతో ముడిపడి ఉన్న ఎన్నో యదార్ధ సంఘటనల చిత్రణ. ఈయదార్ధ సంఘటనలకు అక్షరరూపం ఇవ్వడం వల్ల అది భావి తరాలకు ఒక సాధికారిక చరిత్రగా మిగులుతుంది.కొన్ని దశాబ్దాల క్రితం ఉన్నసామాజిక పరిస్థితులు, మార్పుకోసం జరిగిన ప్రయత్నాలు, కార్యక్రమాలులాంటివి అర్ధమవటానికి, అలాటి వాటిని ముందుకు తీసుకెళ్లడానికి, ఈ పుస్తకం ఒక ఆలంబన అవుతుంది.   . జీవితంఎల్లవేళలా పూల పానుపు కాదు. అది నవ్విస్తుంది,ఏడిపిస్తుంది, ఎత్తున నిలబెడుతుంది,ఎత్తి  కుదేస్తుంది. ఎంతటి సృజనకారుడిని కూడా ఊహించనిమలుపులు తిప్పుతుంది. కొన్ని చిన్న చిన్న మలుపులైతే కొన్నిపెద్ద కుదుపులు. జీవితంచీకటి వెలుగుల సంగమం అంటూ పుస్తక ముఖచిత్రం చెప్పకనే చెప్తుంది.  “ ఓటమి నాకు ఊపిరి కాదుఅలవాటు కాదు దినచర్య కాదు అది చీకటిలాఎదురు వస్తుంది, చిటికెస్తేపరిగెడుతుంది…” అంటూ అలాటిఆటుపోట్లను ఎదుర్కొంటూ, సమాజంలో తనదైన స్థానాన్నినిలబెట్టుకుంటూ తన సృజనకి విరామం ఇవ్వకుండా సాగిన ఆనంద్ ప్రయాణం ‘జ్ఞాపకాల ఊరేగింపు’ ఎంతో ఇంట్రెస్టింగ్ గాసాగుతుంది. ఇందులో దాదాపు ప్రతి చాప్టర్ ఒక కవితతో మొదలవుతూ ఆ చాఫ్టర్లో ఎలాంటిజ్ఞాపకాల సందడిని మనం చూడబోతున్నామో చెప్పకనే చెప్పుతుంది, మన మూడ్ ని దానికి సిద్ధం చేస్తుంది. కొన్నిసార్లు పేజీనిండుగా టెక్స్ట్ ఉంటె ఆమ్మో ఇంత ఉందా చదవాల్సింది అనిపిస్తుంది. అలా కాకుండా మధ్యమధ్యలో ఉన్న ఈ కవితలు చూపుకి, మనసుకి కూడాఆహ్లాదాన్నిస్తాయి. అలా కవిత్వమూ, వచనమూ కలగలిసిన ఈ ప్రయాణంచదువుతుంటే ఒక మంచి పుస్తకం చదువుతున్న ఫీల్ కలుగింది. నాకయితే ఎక్కడా, ఏ పేరా కానీ, ఏ పేజీ కానీ స్కిప్చెయ్యాలి అనిపించలేదు.     యదార్ధ గాధలు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ గానేఉంటాయి. ఒక యదార్ధ గాధ, ఒక వ్యక్తి జీవిత చిత్రణఅయిన ఈ యాదోంకీ బారాత్ మొదలుపెడితే ఆగకుండా చదివిస్తుంది, చదివినవారి జ్ఞాపకాలను తడుముతుంది. ప్రత్యేకించి కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడలలో పుట్టి పెరిగినవ్యక్తులకు, ఇది ఒక నాస్టాల్జియా.     ఇక పుస్తకం రాసిన వారి గూర్చి చెప్పుకోవాలంటే, దొరికిన వృత్తి వారి ప్రవృత్తి అయిందో లేక వారి ప్రవృత్తికితగిన ఉద్యోగం దొరికిందో తెలియదుగాని వారి వృత్తి ప్రవృత్తి  రెండూ ఒకదానికొకటి పెనవేసుకుని సాగింది. వారిజీవితం. చేస్తున్న వృత్తిని ఒక సామాజిక భాద్యతగా స్వీకరించి,  నిరంతరంగా అటు సాహితీ సేవచేస్తూనే, నవతరంలో సాహితీ బీజాలు నాటటానికి, వారిలో విశ్లేషణా శక్తి,ఆసక్తికలిగించడానికి, సృజనాత్మకతను పెంపొందించటానికి, అన్ని విధాలా కృషి చేశారు. వారి బహుముఖప్రజ్ఞ, చేసే పనిలో గల నిబద్దత ఈ బారాత్వేసే ప్రతి అడుగులో కనిపిస్తుంది.    నాకు ఈ పుస్తకం చదువుతున్నంత సేపూ కొండంత  ఆశ్చర్యం కలిగించిన విషయం ఒకటుంది, అదేమిటంటేఆరు దశాబ్దాలసంఘటనలలో ఎదురైన వ్యక్తులు, చూసిన సినిమాలు, చదివిన పుస్తకాలు, జరిగిన సభలు, సభా కార్యక్రమాలు అన్నింటి గురించి పేర్లతో సహా చెప్పగలగడం. దాంతోఆనంద్ బహుముఖ ప్రజ్ఞావంతులే కాదు, వెరీ న్యాచురల్లీ ‘ఆర్టిఫిష్యల్ ఇంటెలిజెన్స్’ బ్రెయిన్  గలవారు అని. అయితే వీరి ప్రజ్ఞ పేర్లుగుర్తుంచుకోవటంలోనే కాదు, మంచి అందమైన పేర్లుపెట్టటంలో కూడా ఉంది. అవి పుస్తకాలకు అవొచ్చు,ఆర్టికల్స్కిఅవొచ్చూ, జరిపినకార్యక్రమాలకు అవొచ్చు. నాకు చాలా ముచ్చట కలిగించిన పేర్లలో కొన్ని, ‘కర్ర ముక్కలలో కమనీయ రూపాలు’, ‘కల్లోల జిల్లాలో ఎగసిన వచన కెరటాలు’, ‘మౌనం మాట్లాడింది’, ‘అజ్ఞాతవాసంలో అందాల మ్యూజియం’,  ‘వీక్షించండి-సమీక్షించండి’, ‘మేకప్ టు ప్యాకప్’. “నా గడిచిన జీవితాన్నిగుర్తుచేసుకోవటమే కాదు, ఇది ఖచ్చితంగా తిరిగిజీవించడమే” అంటూ తన అనుభవాల్ని, తన జీవితాన్ని చాలా లైవ్లీగా ప్రెజెంట్ చేశారు. అతి పెద్దజీవన్మరణ సమస్యని ఎదుర్కొని ..‘గతం’ పొరలు పొరలుగా తెరలుతెరలుగా పేర్చుకున్న జ్ఞాపకాల అర‘వర్తమానం’ క్షణ క్షణం నడక ‘భవిష్యత్తు’ రూపం దిద్దుకునే కలలమంచుపల్లకి అంటూ ఒకఆశావహ దృక్పధంతో వారాల ఆనంద్ తన జ్ఞాపకాల ఊరేగింపును ముగించగా  చదివినవారికి ఇది ఒక అందమైన జ్ఞాపకంగామిగులుతుంది.+++++++++++++++++బొడ్ల అనురాధ anubodla@gmail.com ++++++++++++ 
‘యాదొంకీ బారాత్- జ్ఞాపకాల ఊరేగింపు’ రచన: వారాల ఆనంద్ 
పేజీలు -180, వేల: రూ.250/ ప్రచురణ: ప్రాజ్ పోయెట్రీ ఫోరం, కరీంనగర్-505001
కాపీలకు: V.Indira RaniNo.302, R.V.ANUKURA,STREET No-22, MANCHIREVULA NARSINGI, HYDERABAD #9440501281ORNAVAYUGA BOOK HOUSE, HYDERABAD.TeluguBooks.in – Largest collection of Telugu books Online – TeluguBooks.in (Navodaya Book House)

November 22, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

విలక్షణ కవితా సంపుటి పల్లెపొలిమేరల్లోకి

by Narendra Sandineni November 21, 2024
written by Narendra Sandineni

ప్రముఖ కవి,సీనియర్ న్యాయవాది, గులాబీల మల్లారెడ్డి కలం నుండి జాలువారిన పల్లెపొలిమేరల్లోకి కవితా సంపుటి పై పుస్తక సమీక్ష.ఈ పుస్తకాన్ని కవి మల్లారెడ్డి తమ తండ్రి లింగారెడ్డికి అంకితం ఇవ్వడం ముదావహం.ఈ పుస్తకానికి వి.లక్మి నారాయణ చారి చక్కటి ముఖచిత్రం అందించారు.కవి మల్లా రెడ్డి ఈ పుస్తకానికి ఒక మాట – కవి బాట అంటూ తన మనసులోని భావాలను వెల్లడించారు.కవిత్వం ఇలా ఉండాలని నిర్వచించను నేను.దానికి హద్దు ఉంటుందని అనుకోను.అది వివిధ కళారూపాలలో ఉంటుందని నమ్ముతాను.కవిత్వానికి పరమార్థం ఉండాలని నమ్మే వాళ్ళలో నేను ఒకన్ని.

గులాబీల మల్లారెడ్డి

ఈ చిన్న పుస్తకములో ప్రచురించిన గేయాలు,కవితలలో ఉన్నది కవిత్వమో,కాదో సహృదయులైన పాఠక మిత్రులు,కవులు,రచయితలు,విమర్శకులే నిర్ణయించాలి.నా గుండె చేస్తున్న లయకి,మనస్సు కంపనాలకి,సమాజములో ప్రత్యక్షంగా కనిపిస్తున్న దృశ్యాలకి నాకు తెలిసిన పదాలలో రూపకల్పన చేశాను.ఇవన్నీ నా అనుభూతి గీతికలు.నా కళ్ళు చూసిన నిజాలు,మనస్సు కనే కలలు.కవిత్వానికి సామాజిక స్పృహ,మానవతా దృక్పథం ఉండాలని, సమస్త మానవజాతి కళ్యాణం కోసం,సుఖ శాంతుల కోసం మానవున్ని కార్యోన్ముఖున్ని చేయాలని ప్రగాఢంగా వాంఛిస్తాను. ఉపనిషత్తులలో మన పూర్వీకులు నుడివినట్లుగా అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ,మృత్యోర్మా అమృతం గమయ అనే నానుడి కవిత్వానికి ఊపిరి కావాలి. మానవుడు అనంతంగా దోపిడీ చేయబడుతూనే ఉన్నాడు.దోపిడీ నశించాలి.మనుషులందరు స్వతంత్రులై ఆర్థిక,రాజకీయ,సాంఘిక,సమానత పొందాలని ఎన్నో కలలతో,ఆశలతో స్వాతంత్ర్యాన్ని సంపాదించుకున్నాము.కాని జరిగింది ఏమిటి? సమానత్వం వచ్చిందా?రూల్ ఆఫ్ లా దేశములో పాటించబడుతుందా?దేశములో పోలీసులు,కోర్టులు ఆలోచనాసరళి,నడవడి ఏ విధంగా ఉంది?అని తోటి మనుష్యుల్ని ఆలోచింపజేయాలని ఈ కవితా సంపుటిని ప్రచురిస్తున్నాను.ఈ పల్లెపొలిమేరల్లోకి కవితా సంపుటిని ఆదరించగలరని సహృదయులైన పాఠక మిత్రులను కోరుకుంటాను.ఇందులో ప్రధానంగా సామ్యవాదం,చైతన్యం గూర్చి చెప్పబడిన గేయాలే అధికంగా యున్నవి. ఇందులో కనిపించే ఇజం మానవ నైజం.మానవత అదే నా అంతరాంతరాలలో అనునిత్యం పారాడే అనుభూతి.ఈ చిన్న కవితా సంపుటిని ఆదరించగలరని కోరుకుంటూ సహృదయులైన పాఠకులను సాహితీ మిత్రులను కోరుకుంటూ సెలవు తీసుకుంటాను అని కవి మల్లారెడ్డి అన్నారు. కవి మల్లారెడ్డి రచించిన విలక్షణ కవితా సంపుటి పల్లెపొలిమేరల్లోకి అంటే అతిశయోక్తి కాదు. నాగలి పట్టి దుక్కి దున్ని బక్క చిక్కిన సగటు గ్రామీణ రైతు జీవిత చిత్రం ఈ కవిత్వంలో చూడొచ్చు. దేశంలోని 70 శాతం మంది ప్రజలు వ్యవసాయం చేసి జీవనం సాగిస్తున్నారు.హాలికుడైన రైతు మట్టిని నమ్ముకుని మడి చెక్కను దున్ని సేద్యం చేస్తున్నాడు.కాలం ఉంటేనే పంటలు.వర్షాధారంతో సాగుబడి అవుతున్న భూములు.రైతు ఆరుగాలం రెక్కలు ముక్కలు చేసుకొని కష్ట పడతాడు.రైతు అహర్నిశలు పొలాలు,చేనులు,చెల్కల్లో శ్రమిస్తాడు.ఈ దేశంలో కష్టపడే వాళ్ళు ఎవరు?అంటే రైతులు అని ఠక్కున చెప్పవచ్చు.రైతు చేస్తున్న శ్రమకు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉందా?లేదు అని చెప్పవచ్చు.రెక్కలు ముక్కలు చేసుకుని శ్రమిస్తున్నది రైతు.లాభాలు దండుకుంటున్నది దళారులు.ఈ వ్యవస్థలో తరాలుగా మార్పు లేదు.నిజంగా భారత దేశంలో రైతుల దుస్థితిని కళ్ళకు కట్టినట్లు చిత్రించారు ఈ కవితలో మల్లారెడ్డి.పల్లె పొలిమేరల్లోకి కవితలో నా వాళ్లంతా/నాగళ్లకు సిలువ వేయబడి/తరతరాలుగా/నెత్తురుని/నెత్తురు కంటే అమూల్యమైన చెమటని/సమాజం కోసం ధారపోస్తున్నప్పుడు/అంటున్నారు.మనకు తెలిసిన బైబిల్ కథ ఏ నేరం చేయని మంచి కోసం పాటు పడిన ఏసుక్రీస్తు ప్రవక్తను సిలువ వేసి పొట్టన పెట్టుకున్న వైనం.భారతదేశంలో రైతులు నాగళ్ళకి సిలువ వేయబడి తరతరాలుగా నెత్తురుని నెత్తురు కంటే అమూల్యమైన చెమటని సమాజం కోసం ధారపోస్తున్నారు.ఈ కవిత 1984 సంవత్సరంలో నలభై సంవత్సరాల కింద రాయబడింది.ఇది కవితా సంపుటిలోని మొదటి కవిత.దేశంలో రైతులను నాగళ్ళకి సిలువ వేసినప్పటికీ దుక్కి దున్నడం మాన లేదు.అనాదిగా రైతు వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.రైతు పండించిన పంటతో జనానికి తిండిని పెడుతున్నాడు.రైతే రాజు,జై కిసాన్, అన్నదాత సుఖీభవ అనే నినాదాలు వెలవెలబోతున్నాయి.స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం. అయినప్పటికి రైతు జీవితంలో ఎలాంటి మార్పు రాదు అనే తీరుగా పాలకులు వ్యవహరిస్తున్నారు. మల్లారెడ్డి ఆశావాది.రైతు శ్రేయస్సు కోసం అహరహం కాంక్షించే వ్యక్తి అని కవితలోని భావాలు తెలియజేస్తున్నాయి.ఈ కవిత రైతులు ఎదుర్కొంటున్న సామాజిక,ఆర్థిక సమస్యలకు అద్దం పట్టినట్లుగా ఉంది.వర్తమాన గీతం కవితలో గాలిలా/ సూర్యరశ్మిలా/విశాల విశ్వములో/నీలాల నింగిలా/ నేలా/నీరు/అందరిది/భౌగోళిక హద్దులు లేవు/స్వంత పద్దుల ఆలోచనే లేదు/అప్పుడు మనిషంటె/సమిష్టి మానవ సంఘంలో/ఒక అంగం – అంతర్భాగం/ నేడు/మనిషంటె/కులం/మతం/వర్గం/దేశం/ఖండం అంటూ/విశ్వ మానవాత్మని/ముక్కలు ముక్కలుగా నరుకుతున్నాడు/మానవతని సమూలంగా హత్య చేస్తున్నారు/చీ!చీ!/ఏం దుర్గతి పట్టింది మానవ జాతికి/చీదరించుకుంటున్నవి/మిగతా నోరులేని విగత జీవులు/విప్పి చెప్పలేని సత్యాన్ని/విడమరిచి ముచ్చటించుకొంటున్నవి/మరి మనసున్న/ మనకెందుకు రాదు?/ఆ మంచి ఆలోచన/రండి కూర్చుందాము/తీరికగా చర్చిద్దాము/విశ్వ మానవ తత్వాన్ని/మంచి చెడుల/వెలుగునీడల/జాడల్ని వాడల్ని/గుండె మూలల్లో వెదుకుదాము/ అంటున్నారు.విశాల విశ్వంలో పంచ భూతాలు అందరివి.ఆ రోజుల్లో మనుషులందరు సమిష్టిగా కలిసి మెలిసి ఉండే వారు.నేడు మనిషి కుల మతాల పేరిట వర్గ విభేదాలను సృష్టిస్తున్నాడు. అధిపత్యం పేరిట దేశాల మధ్య యుద్ధాలు నడుస్తున్నాయి.మానవతను సమూలంగా హత్య చేస్తున్నారు.ఈనాటి మనుషులకు బుద్ధి ఎప్పుడు వస్తుంది?మనుషులు విశ్వ మానవ తత్వాన్ని ఎరిగి మసులుకోవాలి అనే భావన అద్భుతంగా ఉంది. ఎంత హాయి కవితలో ఇప్పుడు రోజు పాడుతున్నాను/అదే పాట/జైల్లొ – రైల్లొ/బస్సుల్లో/ కోర్టు హాల్లో/వందల దొరల ముందు/వేల పోలీసుల ముందు/జనం ముందు/జడ్జీల ముందు/ఎంత హాయి/అంటున్నారు.తెలంగాణలో ధనవంతులైన ఆసాములకు పోలీసులు దాసులుగా పని చేస్తున్నారు.ఈ వ్యవస్థ మారాలి.ప్రశ్నించే గొంతులను తప్పుడు కేసులతో వేధిస్తూ కొందరి ప్రాణాలను తీస్తున్నారు.రాజ్యాంగం కల్పించిన హక్కులను మనం పోరాటాలు చేసి పరిరక్షించుకోవాలి.ప్రజలు తమ హక్కుల కోసం పోరాటాలు చేయాలి.ఈ వ్యవస్థ బాగు కోసం దొర దొమ్మి ఆటలను గూర్చి పాట పాడినందుకు యువకుడు ఎన్నో శిక్షలు ఎదుర్కొన్నాడు. అయినప్పటికీ ఇప్పుడు ఆ యువకుడు పాట పాడుతున్నాడు.జనం ముందు,జడ్జీల ముందు, ఎంత హాయి అని చెప్పిన తీరు చక్కగా ఉంది.కత్తి – డాలు కవితలో కాలం ఒక్కటే నాకున్న డాలు/నిజం ఒక్కటే నాకున్న కత్తి/నీకు ఎన్నెన్ని ఆయుధాలు/ అయినప్పటికి/గెలుపు నీకు సందేహమే?/ఎందుకో తెలుసా?/నా డాలు మానవత్వపు లోహపు ముద్ద/ నా కత్తి కమ్యూనిజంలో పదును పెట్టింది/ అంటున్నారు.డాలు పోరాట సమయంలో కత్తితో పాటు ఉపయోగించే ఆయుధం.వర్తులాకారంగా ఉండి మధ్యలో వుబ్బెత్తుగా ఉండును.వెనుక పక్కన చేతితో పట్టుకొనుటకు పిడి వుండును.ఎదుటి వ్యక్తి కత్తితో దాడి చేసినప్పుడు కత్తి వేటును అడ్డు కొనుటకు డాలును అడ్డుగా ఉంచెదరు.కత్తి – డాలు జంట పదాలు.ఈ కవితలో వ్యక్తీకరించిన భావం చక్కగా ఉంది.నేనెవరో తెలుసా?కవితలో ఇంతకి నా పేరు చెప్పనేలేదు/గౌతముడు నా రూపమే/జీసస్ నా ప్రతిరూపమే/గాంధీ నా వారసుడే/పేరు మానవత/ ఊరు విశాల విశ్వం/అంటున్నారు.సర్వ మానవాళి సుఖశాంతులు కాంక్షించడం,గౌతముడు,జీసస్, గాంధీ నా వారసుడే అని పేర్కొనడం,పేరు మానవత,ఊరు విశాల విశ్వం అని వ్యక్తపరిచిన భావాలు నిజాయితీని చాటుతున్నాయి.నేనెవరో తెలుసా?అంటూ ప్రశ్నిస్తూ సమాధానం చెప్పిన తీరు చక్కగా ఉంది.నిజం కవితలో ఇవాళ్ల పోలీసులు అరెస్టు చేశారు నన్ను/ఎందుకో తెలుసా?/నేను అక్కపల్లిలో పుట్టినందుకు/అక్కపల్లిలో ఇరవై సంవత్సరాలు నుండి పెరిగినందుకు/స్వేచ్ఛగా గాడుపు పీల్చి నందుకు/దొరల మాట విననందుకు/అంటున్నారు.అమాయకుడైన యువకుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు.జైలు నుండి విడుదల అయి కన్నీళ్ళతో చెప్పిన కథను కవి మల్లారెడ్డి కవితగా మలిచారు.దొరలు పోలీసులను లంచాలతో తమ వైపు తిప్పుకుంటారు.దొరలు తమ మాట వినని అమాయకులను కేసులలో ఇరికించి జైలు పాలు చేస్తారు.ఆ యువకుడు నిజమైన విప్లవకారుడు అవునా?కాదా?అని పరిశీలించాల్సిన పోలీసులు ఒక క్షణం ఆలోచిస్తే బాగుండేది.కానీ చివరకు పోలీసులు ఏ నేరం చేయని అమాయకుడైన యువకుడిని బలి చేశారు.చట్టాన్ని పరిరక్షించాల్సిన పోలీసులు రాక్షసత్వం ప్రదర్శిస్తూ అమాయకులను పట్టుకొని జైలు పాలు చేస్తున్నారు. బ్రిటిష్ కాలం నుండి వచ్చిన పోలీస్ వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలి.నిజాయితీపరులను పోలీసులుగా ఎంపిక చేయాలి.ప్రభుత్వాలు ఆ దిశగా అడుగులు వేసి సమ సమాజంను స్థాపించాలి.ఆ యువకుడి అశ్రుధారలు కవితా బిందువులుగా మల్లారెడ్డి కలం నుండి నిజం కవితగా రూపుదిద్దుకున్నాయి.నిజం కవిత సమాజానికి స్ఫూర్తిని అందిస్తుంది.నడవడి కవితలో అయితె నేమి ఆ కామ్రేడు నడవడి/భావితరాల వాళ్ళకి రహదారి/మరి పోలీసుల నడవడి/యమదూతల ఒరవడిలో/అంటున్నారు.సమాజంలో పేదరికం, నిరుద్యోగం,అసమానతలు కొనసాగుతున్నాయి. పేదలు నిరుపేదలుగా మారుతున్నారు.నిరుద్యోగం పెచ్చు పెరిగిపోతుంది.ధనికులు కోట్లకు పడగ లెత్తుతున్నారు.అత్యాచారాలు,అరాచకాలు,దోపిడీల గురించి ప్రశ్నించినందుకు,పోరాటం చేస్తున్నందుకు కక్షతో దొరలు వారి తాబేదారులు పోలీసులకు అప్పగిస్తున్నారు.పోలీసులు పోరాట వీరులను చిత్రవధ చేసి చంపుతున్నారు.సమాజం కోసం పాటుపడుతున్న ఆ కామ్రేడు నడవడి,భావితరాలకి రహదారి,పోలీసుల నడవడి యమదూతల ఒరవడి. యమదూతలు తప్పు చేసిన వాళ్లను తీసుకుపోయి యమధర్మరాజు ముందు ప్రవేశపెడతారు.అప్పుడు యమధర్మరాజు ఇతడు చేసిన నేరం ఏమిటి?అని అడుగుతాడు.తప్పు చేసిన వాళ్లను సలసల కాగే నూనెలో వేస్తారు.కానీ మంచి కోసం,మంచి సమాజం కోసం పోరాడే వాళ్లకు స్వర్గం చూపించాలి.తప్పులు చేయని వాళ్లకు పోలీసులు నరకం చూపించడం ఎంత వరకు సబబు,ఏ శిక్షా స్మృతిలో ఉంది. పోలీసులు పరిశీలన చేసుకోవాలి.ఆత్మ శోధనలేని బతుకు అది ఏమి బతుకు?పోలీసు మిత్రులు సరియైన నడవడిలోకి మారేందుకు ఈ కవిత ఒక గుణపాఠంగా ఉంటుందని భావిస్తున్నాను.పోలీసుల నైతిక శిక్షణ పాఠ్యాంశాల్లో నడవడి కవితను కూడా చేర్చాలి.కవులు,కళాకారులు ప్రజలను సరైన నడవడి కల వ్యక్తులుగా తీర్చిదిద్దేందుకు రచనల ద్వారా కళారూపాల ద్వారా అశేషమైన కృషి చేస్తున్నారు.చేదు మాత్ర కవితలో ఏదో అన్యాయం జరిగి/వాడిలో ఆవేశం పెరిగి/ఎవడి రక్తం వాడికే చెందాలి/ఎవడి చెమటని వాడే పొందాలి/మధ్యలో దొర ఎవ్వడు?/ఆని పోకడేంది?/పటేలు ఎవ్వడు?/ ఆని పటాటోపం ఏంది?/అన్నంత మాత్రాన/నక్సలైట్ ఎలా అవుతాడు?/వాడి దగ్గర బాంబు లెందుకుంటాయి?/కేసు పెట్టిన నాడు/ఒక్క పోలీసులకే మెదడు లేదనుకున్నాను/నేడు తీరా శిక్ష పడ్డాక/జడ్జీలలో పోలీసు తమ్ముళ్లే ఉన్నారని/నన్ను నేను సముదాయించుకున్నాను/అంటున్నారు.ఈ కవితను వ్రాసిన మల్లారెడ్డి న్యాయవాది,మా పల్లె గొల్ల ఎల్లయ్యకు సంబంధించిన కేసును వాదించినాడు.గొర్లు కాచేవాళ్లు పోలీసు అధికారులకి పండుగల పేరిట జీవాలు ఇనాంగా ఇవ్వాలి. దొరలకి,పటేండ్లకి, పెండ్లిండ్లకు మరియు పేరంటాలకి జీవాలు ఇనాంగా ఇవ్వాలి.ఎల్లయ్యకు దొరలపై, పటేండ్లపై మరియు పోలీసులపై కక్ష ఎందుకు ఉంటుంది?ఎల్లయ్య జీవాలను కాస్తూ వృత్తి జీవితాన్ని గడుపుతున్నాడు.ఎల్లయ్య దగ్గర బాంబులు ఎందుకు ఉంటాయి?అమాయకుడు ఎల్లయ్య మీద కేసు బనాయించడం,దొరలు,పటేండ్ల ప్రోద్బలంతో జరిగినట్లుగా తోస్తుంది.నక్సలైట్లను ఎదుర్కోలేక అమాయకుడైన ఎల్లయ్య మీద కేసు బనాయించారు.సాక్ష్యాధారాలు పరిశీలించి జడ్జి అమాయకుడికి శిక్ష వేయడం ఎంత వరకు సబబు? అమాయకుని మీద కేసు పెట్టిన పోలీసులకే మెదడు లేదనుకున్నాను.కానీ తీరా శిక్ష పడ్డాక జడ్జీలలో కూడా పోలీసు తమ్ముళ్లే ఉన్నారని నన్ను నేను సముదాయించుకున్నాను అని వ్రాసిన కవిత చేదు మాత్రగా ఉంది.ఆనాటి వైద్యులు ధన్వంతరి వారసులు ధరణిలోని దేవతలు ఇచ్చిన చేదు మాత్ర రోగాన్ని నయం చేస్తుంది.అమాయకుడైన గొల్ల ఎల్లయ్యకు వేసిన శిక్ష చేదు మాత్ర.జడ్జీలలో పోలీసు తమ్ముళ్లే ఉన్నారు అనడం మల్లారెడ్డి సంస్కారాన్ని తెలియజేస్తుంది.చాలా మంది జడ్జీలు కింది నుండి పై దాకా అన్యాయపు తీర్పులు ఇస్తూ అమాయకుల ఉసురు పోసుకుంటున్న తీరును చేదుమాత్ర కవిత ద్వారా వెల్లడి చేశారు.ఖైది సంకల్పం కవితలో ఖైది కళ్ళలో/తిరుగుబాటు బావుటా రెపరెపలాడింది/ అంటున్నారు.జైలులో ఉన్న ఖైదీ కళ్ళలో తిరుగుబాటు జెండా ఎగురవేసినట్లు కనిపించింది. ఎందరో వీరుల త్యాగాల ఫలితంగా సాధించుకున్న స్వాతంత్ర్యంలో ప్రజలకు సుఖశాంతులు లభించడం లేదు.ఈనాటికీ దోపిడీ విధానం కొనసాగుతుంది. పాలకవర్గాలు చేస్తున్న దోపిడీని అరికట్టడం కొరకు యువకులు మార్పు కోసం పోరాడుతున్నారు.ఈ దేశంలో నివసిస్తున్న తల్లులు ప్రజల జీవితాల్లో మార్పు కోసం ప్రయత్నిస్తున్న తమ పిల్లలను జైలులో ఖైదీలుగా చూస్తున్నారు.ఈ వ్యవస్థ మారాలని కాంక్షించే వాళ్ళలో కవి మల్లారెడ్డి ఒకరు. అతడు రాసిన ఖైది సంకల్పం కవిత సమాజానికి ఒక ప్రేరణగా నిలుస్తుంది.ఖైదీ సంకల్పం కవిత దిక్సూచిగా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు. 164 Cr.P.C. STATEMENT (స్టేట్ మెంట్) కవితలో కాని/నిరాశ వాదాన్ని/కర్మ సిద్ధాంతాన్ని/ మర్మ సిద్ధాంతాన్ని/మాయ సిద్ధాంతాన్ని/నా చుట్టూర పడి వున్న/చీమలకు మాత్రం/చస్తే చెప్పలేను/ అంటున్నారు.చీమలను మాత్రం సరైన దారిలో నడిపిస్తానని ప్రతిన చేసి చెప్తున్నాడు.90 శాతం ఉన్న చీమల్లాంటి జనాలు పేదరికం,అవిద్య, నిరుద్యోగం,అసమానతలు,కుల వివక్ష ఎదుర్కొంటున్నారు.పౌరుల హక్కుల కోసం పోరాడుతున్న కలాలను,గళాలను చంపుతున్నారు.

అయినప్పటికీ 90 శాతం ఉన్న చీమల్లాంటి ప్రజలకు నిరాశా వాదాన్ని,కర్మ సిద్ధాంతాన్ని,మర్మ సిద్ధాంతాన్ని,నా చుట్టూర పడి ఉన్న వాళ్లకు చస్తే చెప్పను.చీమలను ఉదాహరణగా చెబుతూ 90% ప్రజలకు హామీ ఇస్తున్నాడు.కవి మల్లారెడ్డి మానవులంతా ఒక్కటేనని ధనిక,పేద,తేడాలు ఎందుకని సమానత్వంతో అందరూ క్షేమంగా ఉండాలని కాంక్షించే వారిలో ఒకరని కవిత చదివితే తెలుస్తుంది.కవి మల్లారెడ్డి ప్రజలకు స్ఫూర్తిని, చైతన్యాన్ని కలిగించే కవితను అందించారు. ఇదెక్కడి న్యాయం కవితలో పాలకవర్గమా!/చట్టం, నువ్వు/ఇద్దరు నా శత్రువు చుట్టాలే అని చెబుతున్నా/చట్టం చెప్పినట్టు వింటామంటావేమిటి?/ఇదెక్కడి న్యాయం?/ అంటున్నారు.సాధారణంగా అన్యాయమును ప్రశ్నించే సందర్భంలో ఇదెక్కడి న్యాయం అని ఉపయోగిస్తాం.న్యాయం అనేది సమానత్వం, సత్యం,ధర్మం మీద ఆధారపడినది.కానీ మన జీవితంలో అనేక సందర్భాల్లో అన్యాయం చోటు చేసుకుంటుంది.అది వ్యక్తిగతంగా కావచ్చు లేదా సమాజంలో ఇతరుల పట్ల జరగడం కావచ్చు.
అన్యాయం జరిగినప్పుడు మనలో ఆవేదన, ఆగ్రహం కలుగుతాయి.కోర్టు వ్యవస్థలో ఆలస్యాలు మరియు న్యాయం ఆలస్యం కావడం వలన బాధితులకు న్యాయం దక్కడం లేదు.సత్వర న్యాయం జరగకపోవడం వల్ల ప్రజల్లో ఆత్మవిశ్వాసం దెబ్బతింటుంది.సమాజంలో ధర్మంపై న్యాయంపై ఆలోచింప జేస్తుంది.చట్టం,పాలకులు,సామాన్య మనిషి మధ్య ఉన్న విరోధాన్ని ప్రతిబింబిస్తున్నాయి. కవి న్యాయ వ్యవస్థ మరియు పాలకులపై ప్రశ్నలు లేపుతున్నాడు.ఇదెక్కడి న్యాయం?అని ఒక ప్రశ్నను సంధిస్తున్నాడు.అన్యాయానికి గురి చేసిన పరిస్థితిని ప్రశ్నిస్తున్నాడు.ఈ దేశంలో నివసించే సామాన్య ప్రజలకు న్యాయం అందడం లేదు.సామాన్య ప్రజలు అన్యాయానికి గురవుతున్నారు అనే భావనను ఈ కవిత ప్రతిబింబిస్తుంది.చట్టాలు తయారుచేసి అమలు చేసే పాలకులను ఉద్దేశించి పాలకవర్గమా?అని ప్రశ్నిస్తున్నాడు.పాలకులు సామాన్యుల అవసరాలను పట్టించుకోవడం లేదు. పాలకులు స్వార్థంతో వ్యవహరిస్తున్నారనే భావం వ్యక్తం అవుతుంది.చట్టం మరియు పాలకులను శత్రువులుగా చూపించారు.చట్టం దుర్వినియోగం చేస్తున్నారు.పాలకులు స్వార్థంతో ‌ వ్యవహరిస్తున్నారు.ప్రజలకు తీవ్రమైన అన్యాయం జరుగుతుంది.ఈ దేశంలో సామాన్యులకు న్యాయం అందుబాటులో లేదు.ఇది ఎలాంటి చట్టం?చట్టం వల్ల సామాన్యులకు మేలు జరగడం లేదు.ప్రజలు చట్టాలను గౌరవించడం తప్పనిసరేనా?అని ప్రశ్నిస్తున్నారు.ప్రజలకు న్యాయస్థానాలు నిరాశను, పాలకుల తీరుపై వేదనను కలిగిస్తున్నాయి. ఇదెక్కడి న్యాయం అంటూ కవి మల్లారెడ్డి న్యాయం గురించి ఆలోచింపజేస్తున్నారు.తేడా కవితలో చెలీ!/అప్పుడు నీవు నవ వసంత యామినివి/నాడు కనిపించినవన్ని/మల్లియలు – గులాబీలు/నేడు కనిపిస్తున్నవన్ని/పల్లేరులు – జిల్లేడులు/ ఎండమావులు – బండ బతుకులు/కన్నీళ్లు కష్టాలు/ పంతాలు సాధింపులు/నేడు వినిపిస్తున్నవన్ని/పిల్లల రోగాల గానం/దైనందిన జీవిత నిశ్శబ్ద భయంకర రావాలతో/నీవు నాడు అంది అందని ప్రేయసివి/ కలల ఊర్వశివి/నేడు అందిన యిల్లాలివి/నిరాశల నీడవి/నిట్టూర్పుల జాడవి/అంటున్నారు.చెలీ నీవు కనిపించినప్పుడు జీవితం ఎంతో మధురంగా ఉంది.నాడు అంది అందని ప్రేయసివి.నేడు అందిన ఇల్లాలివి,నిరాశల నీడవి నిట్టూర్పుల జాడవి అంటూ జీవితాన్ని కాచి వడబోసినట్లు వివరించిన తీరు అద్భుతంగా ఉంది.మానవుడే మరో దేవుడై గేయంలో మానవుడే మరో దేవుడై భూతలమ్మున స్వర్గము సృష్టించే/దేవుని మించిన దేవుడై సకల చరాచర జగతిని పాలించే/ కులాల గోడలు కూల్చి – మతాల ముళ్లను కాల్చి/మానవులందరికి మానవతయే గొప్ప మతమని చాటెను/శాంతి అమృతం పంచుతూ లోకమంత స్వర్గము చేయ తలంచే మానవుడు/అంటున్నారు.మానవుడే మరో దేవుడై అనే గేయ వాక్యం ఒక గొప్ప సందేశాన్ని అందిస్తుంది.మానవుడు దేవుడితో సమానమైన వ్యక్తిగా భావించబడుతున్నాడు.భూమి మీద స్వర్గాన్ని సృష్టించగల సత్తా మానవునికి ఉన్నది. మానవుని ఆలోచనలు గొప్పవి.మానవుడు సృష్టికి శాంతిని,సంతోషాన్ని ప్రపంచానికి అందించగలరని చెప్పబడింది.మానవుడు దేవుని కంటే గొప్ప శక్తిపరుడు,సమస్త చరాచర జగతిని పాలించగలవాడిగా చూపబడ్డాడు.కులాల మధ్య ఉన్న గోడలు,మతాల మధ్య ఉన్న విభేదాలు తొలగించి మానవత్వాన్ని పెంపొందించుకోవాలని కవి ఆశిస్తున్నాడు.మానవుడు శాంతి,సామరస్యం, సహనం వంటి ఉత్తమ గుణాలను అలవర్చుకొని ఈ లోకాన్ని స్వర్గంగా మార్చాలని తలుస్తున్నాడు.ఈ గేయంలో మానవతా విలువల్ని ప్రోత్సహించి సమాజం అంతట శాంతిని వ్యాప్తి చేయాలనే భావన వ్యక్తం అవుతుంది.మానవుడిని మహోన్నతునిగా గేయంలో వ్యక్తం చేసిన తీరు చక్కగా ఉంది. మనుష్యులారా! కోయిలలై గేయంలో మనుష్యులారా కోయిలలై/యిలపై వసంత గానం చేయండి/సమ సమాజానికి ఊపిరి పోయండి/ ఓరిమి పంచి కూరిమి పెంచి/మనిషి అంటే మంచి తనమని చాటుతూ/నవ వసంత గానం చేయండి/ అంటున్నారు.మనుష్యులను కోయిలలతో పోలుస్తూ సమాజంలో వసంతాన్ని తీసుకురావాలని వసంతం కొత్త ఆశలకి సంతోషానికి చిహ్నం. మనుష్యులు కోయిలలా మారి ప్రేమతో ఐకమత్యంతో జీవించాలని కోరుతున్నారు. సమాజంలో అందరికీ న్యాయం,సమానత్వం, అందరు స్నేహంతో అన్నదమ్ముల వలె కలిసిమెలిసి ఉంటూ సమాజాన్ని మంచి దిశలో నడిపించాలని సూచిస్తున్నారు.మనుష్యుల మధ్య ప్రేమను, ఆత్మీయతను,సౌభ్రాతృత్వం భావనను, మంచితనాన్ని పెంచుకొని అందరూ కలిసిమెలిసి ఉండి సమాజాన్ని సౌభాగ్యవంతం చేయాలని కోరుతున్నారు.మనిషి అంటే మంచితనానికి మారు పేరు.మనిషి నిరంతరం కొత్త ఆలోచనలు కలిగి ఉండాలి.కొత్త మార్పులకు స్వీకారం చుట్టాలి. మంచితనాన్ని చాటాలి.నవ వసంతాన్ని గానం చేయాలి అంటూ స్ఫూర్తిని కలిగిస్తున్నారు.రెండు తరాలు కవితలో నేను నా చుట్టూరా పల్లె జనమంతా/పట్టుకూడుపు పిల్లలం/పొట్ట పోసుకోని దరిద్రులం/ఓరిమితో ఊరుకోవడం అలవాటె మాకు/ కాని మా పిల్లలు పొట్ట పోసుకోని దరిద్రులు కాదు/ పోరంటే,వెను తిరిగని పొట్టేళ్లు వాళ్ళు/గమ్యం తప్పా గతులు తెలియని సూర్యుళ్లు వాళ్ళు/అంటున్నారు. మొదటి తరం వాళ్లు బానిస బతుకులు బతికారు. రెండవ తరం వాళ్ళు వెను తిరుగకుండా పోరు బాటలో సాగే పొట్టేళ్లు వాళ్ళు.తరాల మధ్య మార్పును వ్యక్తీకరించిన తీరు చక్కగా ఉంది. ఎవరన్నారు కవితలో ఎవరన్నారు మీరు మంచి వారు కాదని?/అంటున్నారు.ఎవరన్నారు మీరు మంచివారు కాదని ప్రశ్నించడంలోనే సమాధానం దాగి ఉంది.ఈ అసమ సమాజంలో కూడా మంచివారు ఉంటారని నమ్మిన వ్యక్తి.మంచి కోసం పాటుపడుతున్న మంచి వారి గురించి మాట్లాడే దమ్ము ధైర్యం ఎందరికి ఉంటుంది?ఎవరన్నారు కవిత మనలో ఆలోచనలు రేకెత్తిస్తుంది.మనలో మరుగున పడిపోయిన మంచితనాన్ని ప్రేరేపించే భావనలు కలిగిస్తుంది.గది – హృది కవితలో ఆ గది/ఈ హృదికి ప్రతిబింబం/ఈ హృది/ఆ గదిని/ కూల్చి రేపటి సౌభాగ్యం కోసం/చెట్ల నీడల్లోకి/కొండ గుహల్లోకి/ బాధలు లేని బంజరు భూముల్లోకి/ సూర్యుడి కిరణాలపై పయనిస్తా/అమృత లోకాల కోసం బాణం సంధిస్తా/అంటున్నారు.విద్యార్థి ఉద్యమాలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్న రోజులవి.కొందరు విద్యార్థులు చదువు పూర్తి కాగానే ఒక లక్ష్యంతో సమాజాన్ని పట్టిపీడిస్తున్న అసమానతలకు చరమ గీతం పాడేందుకు కంకణం కట్టుకున్నారు.విద్యార్థులు ప్రభంజనంలా ఉద్యమాల్లో దూకారు.సమాజంలో చైతన్యం తీసుకురావాలి అనే సంకల్పంతో అడవులు కొండల బాటలు పట్టారు.కొందరు విద్యార్థులు తమ జీవితాలను ఉద్యమాలకు అంకితం చేశారు.కొందరు విద్యార్థులు భారతమాత ముద్దుబిడ్డలై ప్రజా పోరాటాల్లోకి చేరి ప్రజలను మమేకం చేసే దిశగా ఎదిగారు.ప్రజలకు రాత్రిపూట చదువు నేర్పించినారు.నిరక్షరాస్యత నిర్మూలన,కూలీల రేట్ల పెంపు,వెట్టి చాకిరి నిర్మూలనతో పాటు ప్రజలను సంఘటిత పరిచారు.ప్రజల హక్కులు ఏమిటో తెలియజేసి పోరాటం చేస్తేనే హక్కులు సాధిస్తాం. పోరాటం లేకుంటే ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉండిపోతాం.ప్రజలకు కూడా తమ సంక్షేమం గురించి పాటుపడుతున్న కార్యకర్తల పట్ల నమ్మకం పెరిగింది.ప్రజలు ఐక్యం అవ్వడం వలన ఉద్యమాలకు ఊపు వచ్చింది.ప్రజలలో వచ్చిన చైతన్యం చూసి పల్లెలో తమ అధికారం సాగదని దొరలు గ్రామాలు విడిచి పారిపోయినారు.దొరలు పట్టణాలలో నివాసం ఏర్పాటు చేసుకుని జీవించసాగారు.ఆ యువకులు సూర్యుడి కిరణాలపై పయనిస్తారని అమృత లోకాల కోసం బాణం సంధిస్తారనే కవి భావన అద్భుతంగా ఉంది.ప్రేయసీ! కవితలో నిన్ను చూశాక తెల్సింది నాకు/అజంతా అడుగులేస్తుందని/ఎల్లోరా కదలాడుతుందని/హంపీ స్వరం విప్పుతుందని/మల్లియలు మాట్లాడగలవని/ వాడని గులాబీలు ఉంటాయనీ/అంటున్నారు.కవి తన ప్రేయసిని చూసిన తర్వాత తనలో పొంగిపొరలే భావాలను అనుభూతులను కవితగా మలిచిన తీరు బాగుంది.ప్రేయసి అందాన్ని,మనసుని కవి భారతీయ సాంస్కృతిక సంపదలైన అజంతా, ఎల్లోరా,హంపీల శిల్ప సౌందర్యంతో మరియు ప్రకృతిలో భాగమైన మల్లెపూలు,గులాబీ పూలతో పోల్చడం అద్భుతంగా ఉంది.అజంతా అడుగు లేస్తుందని అంటే అజంతా గుహల నైపుణ్యాన్ని సూచిస్తుంది.ప్రేయసిని అజంతా లాంటి అపూర్వమైన శిల్ప కళారూపంతో పోలుస్తున్నాడు. ఆమె సౌందర్యం అజంతా శిల్ప సౌందర్యంలా అద్భుతంగా ఉంది.ఎల్లోరా గుహలు భారతీయ శిల్పకళలో ప్రసిద్ధి చెందినవి.ప్రేయసి నడకను, సొగసును ఎల్లోరా శిల్పాలతో పోలుస్తున్నాడు. హంపీ అపూర్వ కట్టడాలకు ప్రసిద్ధి చెందినది.
ప్రేయసి మాటలు స్వరం హంపి శిల్పాలను ప్రతిబింబిస్తుందని చెబుతున్నాడు.సువాసనలు వెదజల్లే మల్లెపూవులను ప్రేయసి మాటల మాధుర్యంతో పోలుస్తున్నాడు.ఆమె మాటలు సుగంధాలు వెదజల్లుతాయి అని సూచిస్తున్నాడు. తన ప్రేయసి అందం వాడని గులాబీ వలె ఎప్పటికీ సజీవంగా నిలిచి ఉంటుందని అంటున్నాడు.తన ప్రేయసి ఎప్పుడూ చిరునవ్వులు చిందిస్తూ గులాబీ వలె అందంతో మెరుస్తూ ఉల్లాసంగా ఉంటుందని భావిస్తున్నాడు.ప్రేయసి అందాన్ని భారతీయ సాంస్కృతిక సంపదలతో మరియు ప్రకృతిలో భాగమైన మల్లెపూలతో,గులాబీలతో పోలుస్తూ తన ప్రేమను సున్నితంగా వ్యక్తీకరించిన తీరు బాగుంది. మల్లారెడ్డి ABOUT MY BETTER HALF అని ఆంగ్లంలో రాసిన కవిత గొప్పగా ఉంది. సర్వాంతర్యామితో మనవి కవితలో ప్రజాకంటకులు/ జాతి ద్రోహులు/స్వార్థం మోసం పెంచుకున్న వాళ్లు/ అధికారాన్ని పంచుకుంటున్న వాళ్ళు/అందలాలు ఎక్కుతున్నారు/ఇదెక్కడి న్యాయం ప్రభూ!/ అంటున్నారు.బాధలో ఉన్నప్పుడు భరించలేక గిలగిలా కొట్టుకుంటాం.మన ఆత్మ తృప్తి కొరకే దేవునికి మొర పెట్టుకుంటాం.దేవుడు మన మొరలు ఆలకిస్తాడా?అనేది ప్రశ్నగానే తోస్తుంది.ప్రజలు ఎదుర్కొంటున్న ఇక్కట్లను,ఇబ్బందులను సర్వాంతర్యామితో కవిత ద్వారా మనవి చేయడం చక్కగా ఉంది.సత్యము స్వప్నము కవితలో కలల సౌధంలో – కళ్యాణమందిరం/అంటున్నారు. విద్యార్థులు కంటున్న కలలో కలలసౌధం ఉంది. అందులో కళ్యాణమందిరం ఉంది అని మనకు తెలియజేస్తున్నాడు.పెళ్లంటే నూరేళ్ల పంట అది పండాలి అని కవి రాసిన సినిమా పాటను ప్రతి పెళ్లిలో వింటాం.పెళ్లంటే ఎంత హంగామా?ఇప్పుడు లక్షల రూపాయలు కల్యాణ మందిరాలకు చెల్లిస్తున్నారు.ఆడంబరాల కోసం తల్లిదండ్రులు పెళ్లిలో అనవసరంగా వృధా ఖర్చులు చేయడం వల్ల కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి.పెళ్లిలో అంత ఖర్చు చేయడం అవసరమా?ఆడపిల్ల తల్లిదండ్రులకు ఆడంబరాల పేరిట ఎంత ఖర్చు చేసినప్పటికీ అమ్మాయిల కాపురాలు బాగున్నాయా?అంటే అది కూడా లేదు.అదనపు వరకట్నం కోసం అత్త,మామ,ఆడబిడ్డలు,భర్త, మరదలు కలిసి కొత్త కోడలును వేధించి చంపేస్తున్నారు.వరకట్నం దురాచారం ఈ దేశంలో ఆడపిల్లల పాలిట శాపంగా మారింది.కట్నం తీసుకుని కోడలును చక్కగా చూడక కాటికి పంపిస్తున్న వైనం మనం ఎరిగినదే.ఆడపిల్లల తల్లిదండ్రులను తీరని క్షోభకు గురి చేస్తున్నారు. వరకట్నం అనే సాంఘిక దురాచారం వల్ల ఎంతో మంది ఆడపిల్లలు బలి అవుతున్న సంగతికి చక్కటి పరిష్కార మార్గం అందించారు.స్వప్నంలో కూడా సత్యాన్ని ఆవిష్కరించడం చక్కగా ఉంది. సుప్రభాతం ఆగుతుందా?కవితలో ఈ తపన/ఈ తపస్సు/ఈ యజ్ఞం/ఇది మా నేరమని,కుట్రని/మా కలాలకు – చేతులకు సంకెళ్లు వేస్తే/రానున్న సుప్రభాతం ఆగుతుందా?అంటున్నారు.ప్రజా కళాకారులు ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు వాళ్ళ హక్కులను తెలియజేస్తూ గజ్జె కట్టి గళాల నెత్తి పాడుతున్నారు.ప్రదర్శనలు ఇస్తున్నారు.ప్రజా క్షేమం కాంక్షించి పాటల ద్వారా,కళారూపాల ద్వారా ప్రదర్శన చేస్తున్న కవులు,కళాకారులు,ప్రజలను కర్తవ్యం వైపుగా సాగేటట్లు చేస్తున్నారు.ప్రజల కోసం పాటుపడుతున్న కవులు,కళాకారులది కుట్రని మా కలాలకు,చేతులకు సంకెళ్లు వేస్తే రానున్న సుప్రభాతం ఆగుతుందా?సుప్రభాతం ఏనాడు ఆగదు.ఉదయించిన సూర్యుడు అస్తమించక మానడు.మళ్లీ సూర్యుడు ఉదయిస్తాడు.సుప్రభాతం కొనసాగుతుంది.వేనవేల సూర్య కిరణాలై అక్షర కళాకారులు చేస్తున్న ప్రదర్శనలు,దీక్షలు ఏనాడు ఆగవు.రానున్న సుప్రభాతం ఆగదు అని కవి మల్లారెడ్డి ఘంటాపథంగా చెబుతున్నాడు.జంపాల ప్రసాద్ కవితలో నేస్తం/క్యాంపస్ విద్యార్థివైన నీవు/ కొత్త ఆర్థిక విధానాలు చూపినందుకు/మూఢ సంస్కృతిపై నీవు పురోగమించి/శాస్త్రీయ విద్యా విధానం కావాలన్నందుకు/నిన్ను నక్సలైటని/ నిస్సహాయంగా/చెట్టుకు కట్టి/బందూకు గురి పెట్టినపుడు/కొండల గుండెలు జాలువారినవి/కన్నీటి జాలువారినవి/చెట్ల కొమ్మలు – ఆకులు/కత్తులై లేద్దామని/పిట్టలతో పిచ్చుకలతో ముచ్చట్లాడినవి/నీ గుండె చీల్చిన తుపాకి గుండు/జీవము లేని బొగ్గుగా మారింది/నీ రక్తం మోదుగు పూలై వనమంతా పూసింది/అంటున్నారు.జంపాల ప్రసాద్ ను నేస్తంగా సంబోధిస్తున్నాడు.చెలిమికి మారుపేరు స్నేహం. ఆపతి సంపతిలో ఆదుకునేవాడు స్నేహితుడు. అశేష విద్యార్థి లోకానికి ఆశాదీపం ప్రసాద్. ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ విద్యార్థిగా ఎదిగిన నిన్ను చూసి కన్న తల్లిదండ్రులే కాదు.నీవు పుట్టిన నేల కూడా పునీతమైంది.ప్రసాద్ తనతో చదువుకున్న స్నేహితులు,విద్యార్థులందరికీ మార్గదర్శిగా నిలిచాడు.ప్రసాద్ విద్యార్థులు, రైతులు,రైతు కూలీలు,సకల జనావళి ఎదుర్కొంటున్న సమస్యలకు మూలాలను కనుక్కున్నాడు.ప్రసాద్ నూతన ఆర్థిక విధానం, శాస్త్రీయ విద్యా విధానం కావాలన్నాడు.ప్రసాద్ మూఢ సంస్కృతిని ఎదిరించాడు.పురోగమించిన ప్రసాద్ ను నక్సలైట్ అని ముద్ర వేసి నిస్సహాయంగా చెట్టుకు కట్టి బందూకు గురి పెట్టినప్పుడు కొండల గుండెలు కన్నీటితో జాలువారినవి.శిఖరంగా ఎదిగిన ప్రసాద్ ను చూసి కొండల గుండెలు కరిగి దుఃఖంతో కన్నీటి జలపాతాలై ప్రవహించినవి.ప్రసాద్ వీరుని హత్య చేస్తుంటే చూసి ప్రకృతిలో భాగాలైన చెట్లు, కొమ్మలు,ఆకులు కత్తులై లేద్దామని పిట్టలతో పిచ్చుకలతో మాట్లాడినవి.నోరు లేని పక్షులు ముచ్చటించాయని చదువుతుంటే ఒళ్లంతా బాధతో వణుకుతుంది.ప్రసాద్ గుండెను చీల్చిన తుపాకీ గుండు కూడా చలించి జీవము లేని బొగ్గుగా మారింది.ప్రసాద్ రక్తంతో తడిసిన నేల మోదుగు పూలై వనమంతా పూసింది అని వ్యక్తం చేసిన భావం చక్కగా ఉంది.నిశ్శబ్ద నిరాకార ఛాయ చిత్రాలు కవితలో ఈ నిరాకార ఛాయ చిత్రాలలో/ఒక శిశువు నడవాలని/తొలి అడుగు వేయాలని తపిస్తున్నాడు/ఈ చీకటి వెలుతురు జయించి/ నూతన నవ వసంతోదయ పరంపర కోసం తొలి అడుగు/అంటున్నారు.నిజానికి మనకు కనిపించని వినిపించని ఎన్నెన్నో సంఘటనలు నిశ్శబ్దంగా నిరాకారంగా కనుల ముందు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సంఘటనలు ఎన్నింటినో తీసుకొని ప్రతి శిశువు (మనిషి) నడవాలని చీకటి జీవితాలను జయించి నూతన వసంతోదయ పరంపర కోసం తొలి అడుగు వేయాలని కవి వ్యక్తం చేసిన భావాలు అద్భుతంగా ఉన్నాయి.ఎక్కడిది చైతన్య సమీరం కవితలో ఎక్కడిదీ చైతన్యపు సమీరం?/ఎక్కడిదీ ప్రభంజనం హోరు?/ఎక్కడిదీ ఝం,ఝం తుఫాను/ దీనికి మొదలెక్కడ?తుది యెక్కడ?/ఏ దూర తీరాల నుండి వీస్తుందీ ప్రభంజనం/ఏ దెస నుండి వీస్తుంది/ ఏ కొస నుండి వీస్తుంది/ అంటున్నారు.ఇది ప్రకృతి మరియు జీవితం యొక్క అంతర్లీన శక్తి చైతన్యాన్ని ప్రశ్నిస్తూ రాయబడిన కవిత.కవి తన ప్రశ్నల ద్వారా చైతన్యపు మూలాన్ని దాని ఆరంభాన్ని,అంత్యాన్ని విశ్లేషించడాన్ని తెలుపుతుంది.చైతన్యపు సమీరం అంటే జీవన శక్తి, ప్రాణ శక్తి.ఈ జీవన శక్తికి మూలం ఎక్కడుంది?ఇది ఎక్కడినుండి ఉద్భవించింది? ప్రభంజనం హోరు అంటే గొప్ప గాలుల తుఫాను. ప్రభంజనానికి పుట్టుక ఎక్కడ ఉంది?ఝం ఝం తుఫాను అంటే ప్రకృతి యొక్క ఉగ్ర రూపాన్ని తెలియజేస్తుంది.జీవితం మరియు ప్రకృతి శక్తుల ఆరంభం,ముగింపు ఏమిటి?అని ప్రశ్నిస్తున్నారు. ప్రభంజనం ఎక్కడి నుండి మొదలైంది?అది ఏ సుదూర ప్రాంతాల నుండి ఉద్భవించింది?జీవన శక్తి ఎటు నుండి వీస్తుంది?దాని ప్రయాణం ఏమిటి? అంటూ కవి వ్యక్తికరించిన భావాలు చక్కగా ఉన్నాయి.శిల్ప సుందరి కవితలో చూడాలి నా దేవి!నీ చూపు వాడి/కనికరించి కడవ దించి కాలు కదిలించి/మెరుపుతీగవై – వెలుగు రేఖవై/పూల బాణమై – విద్యుల్లతవై/కోడె నాగిణివై – రస రాగిణివై/భువన మోహినివై – నవమోహన నాట్యంల తేలించు/లాలించు పాలించు ఓ శిల్ప సుందరీ!/ ఇదిగో!నీ పాదపద్మాల ఉండనీ/నా కవితా మంజరీ/ అంటున్నారు.శిల్ప సుందరిపై వ్యక్తీకరించిన భావాలు అద్భుతంగా ఉన్నాయి.జ్ఞాపకాలు కవితలో నీ జ్ఞాపకాల వాకిట/నీ గుండె లోగిలిలోనే/దోసిట మల్లియలతో/మజ్నునై నిలుస్తాను/అందినట్టే అంది/అందకుండా – అందే అంత దూరములోనే ఉంటూ/మల్లియలా – మౌనంగా నిలచిన/నా జీవన నెచ్చలి – కలల ఊర్వశికి/బతుకంతా నైవేద్యం/ అంటున్నారు.కవి జ్ఞాపకాలను పంచుకొని ఆమెను సజీవం చేసిన తీరు బాగుంది.సాగువాటు కవితలో నా దీన జనావళీ కన్నీళ్లను మాటి మాటికి తుడవ లేక/నేను సామ్యవాద పద్ధతిలో సాగువాటు చేద్దామనుకుంటున్నాను/తిరుగుబాటు చేసి అయినా సరే/భూముల్ని కబ్జా చేసుకుంటాను/ ప్రాణమే ఆయుధంగా బయలుదేరుతున్నాను/ కృత్తిక ఎండలు మండి/కుటిల విషం కక్కినా సరే/ రోహిణి వడలు తడలు/పెడబొబ్బలు పెడుతూ/ కబలించాలని వచ్చినా సరే/తిరుగుబాటు చేస్తాను/ సామ్య వాదం కోసం సాగువాటు చేస్తాను/నా దేశాన్ని నందన కేదారవనంగా మారుస్తాను/మరో స్వర్గం సృష్టిస్తాను/అంటున్నారు.సమాజంలో అన్యాయాలు, అక్రమాలు,అసమానతలు మనసును కలవరపెడుతున్నాయి.దీన జనావళి కన్నీళ్లను తుడవడం అనేది ప్రజల సమస్యలను పరిష్కారం కోసం ప్రయత్నించడం.సామ్యవాద పద్ధతి ద్వారా సమాజంలో ప్రతి ఒక్కరి అవకాశాలు తీరేలా వ్యవస్థను తీర్చిదిద్దాలనే సంకల్పం వ్యక్తం అవుతుంది.నందన కేదారవనం ఇది ఒక ప్రకృతి అందాల పూతోట.ఇది శాంతి,సౌందర్యం,న్యాయం, సమాజానికి చిహ్నంగా నిలుస్తుంది.సమాజాన్ని నందన కేదార వనం లాంటి పరిపూర్ణ స్థితికి తీసుకెళ్లాలనే ఆలోచన ఉంది.మరో స్వర్గం సృష్టిస్తాం అంటే ప్రపంచాన్ని మార్చేందుకు అందరి శ్రేయస్సు కలిగించే సమాజం నిర్మించేందుకు దోహదపడతానని దృఢ నిశ్చయాన్ని వ్యక్తపరుస్తున్నాడు.సామాజిక మార్పును సమానత్వం మరియు ప్రజలకు శ్రేయస్సును అందించాలనే లక్ష్యాన్ని ప్రతిబింబిస్తుంది.ఇది ప్రేరణ కలిగించేది‌.ప్రతి ఒక్కరి హృదయాలను తాకేలా ఉంటుంది.నగరంలో కన్నెలు కవితలో కన్నెలు .. కన్నెలు . నగరమంతా వన్నె వన్నెల కన్నెలు/సాయం సమయంలో నగరమంతా/ కన్నెల మేని కాంతితో ఎరుపెక్కుతుంది/ఎరుపెక్కిన సంధ్యలో రాగ రంజిత వేళలో/వెచ్చవెచ్చని చల్లగాలి సైక్లోనొకటి/ఆ గుమ్మల ఆ అమ్మల ఆ బొమ్మల/ఆ కొమ్మల పైట చెంగుల విసరులోయన/ముచ్చటగా ముద్దిడుతుంది/గిలిగింతల కవిత్వాన్ని వ్రాయమంటుంది/అంటున్నారు.నగరంలో కన్నెలను కవితామయం చేయడం అద్భుతంగా ఉంది.ఇది నా దేశం గాథ కవితలో ఇక నా దేశం నాగరికత/ఇక్కడ పార్టీకి క్యాడర్ కాని వాడు లీడరు/ఆశయాలు చంపుకున్నవాడు/ఆదర్శాలకి తిలోదకాలిచ్చిన వాడు/మానవత్వం ఎరువు తెచ్చుకున్నవాడు/ తోకవాల్చడం నేర్చుకున్నవాడు/ బట్రాజుగా మారినవాడు/వందిమాగధిగా ఎదిగిన వాడు/కాకా పట్టేవాడు/బాకాలూదేవాడు/నా దేశ ప్రజా ప్రతినిధి/నా దేశ నాయకుడు/అంటున్నారు. సమాజాన్ని కలుషితం చేస్తున్న నాయకుల దిగజారుడుతనాన్ని ఎండగట్టుతున్నాడు.నా దేశంలో ప్రజా ప్రతినిధి మరియు దేశ నాయకుడు ప్రజాసంక్షేమం కోసం పాటుపడాల్సిన వాళ్ళు స్వార్థంతో వ్యవహరిస్తున్న తీరును చూసి కవి తీవ్రమైన ఆవేదనని వ్యక్తపరుస్తున్నాడు. పల్లెపొలిమేరల్లోకి కవితా సంపుటిలోని కవితలన్ని అభ్యుదయ భావాలతో అలరారుతున్నాయి. మల్లారెడ్డి యువకుడిగా ఉన్నప్పుడు పొంగిపొరలే భావావేశం అద్భుతమైన కవితలుగా రూపు దాల్చాయి.కవితలను హాయిగా చదువుకోవచ్చు. ఇవి పాఠకుల హృదయాలను రంజింప జేస్తాయి. చక్కటి కవితలు రాసిన కవి మల్లారెడ్డిని అభినందిస్తున్నాను.మరిన్ని మంచి కవితా సుమాలు విరబూయించాలని మనసారా కోరుకుంటున్నాను.

November 21, 2024 1 comment
0 FacebookTwitterPinterestEmail
కథలు

అడవిలో చెట్లు

by Devulapalli Vijayalaxmi November 21, 2024
written by Devulapalli Vijayalaxmi

గబగబా మెట్లుదిగి వెహికల్ పార్కింగ్ దగ్గరకు అడుగులేసింది శారద. హెల్మైట్ పెట్టుకుంటూ ఆకాశంవంక చూసింది వర్షంపడే సూచనలున్నాయేమోనని. ఆతరువాత చుట్టూచూసింది అపరాజిత గురించి.ఫ్రెండ్సతో క్లాప్స్ కొట్టుకుంటూ ఆడుకుంటోంది.

“అప్పూ!”అని కేకేసింది శారద.

“ఆఁ అమ్మా!” అంటూ స్కేటింగ్చేస్తున్నట్లు వచ్చి ఆగింది హోండాఏక్టివ్ దగ్గర అప‌రాజిత.

“అప్పూ! ఎన్నిసార్లు చెప్పానమ్మా స్కూల్ బెల్ అవంగానే వెహికల్ దగ్గరకు వచ్చి నుంచోమని‌.అక్క వెయిట్ చేస్తూ ఉంటుంది.” అంది శారద.

“అమ్మా! ఇవాళ ఉన్న ఒక్క గేమ్స్ పీరిడ్ నువ్వే ఎక్స్ట్రా క్లాసు తీసుకున్నావు.అందుకే కాస్త రిలాక్సేషన్. ” కళ్ళు గుండ్రంగా తిప్పుతూ కాళ్ళతో స్టెప్సు వేస్తూ అంది అపరాజిత.

“సరే డేన్స్ ఆపి బండెక్కు.”అంటూ బండి స్టేండ్ తీసింది శారద.

అందరినీ దాటుకుంటూ స్కూల్ గేటు నించీ బయటకు రావడానికి ఐదు నిమిషాలు పట్టింది.

‘అపర్ణ కాలేజీకి వెళ్ళడానికి పది నిమిషాలు, అక్కడనించీ మ్యూజిక్ క్లాసుకి పదినిమిషాలు,క్లాసు గంట,తరవాత ఇంటి ప్రయాణం ఎంతలేదన్నా అరగంట.ఇంటికి చేరేసరికి గంటన్నర.’ అంటూ మనసులో టైము కేలిక్యులేట్ చేసుకుంది శారద.

‘సాయంత్రం ఫ్రెండ్స్ ఫేమిలీ డిన్నర్ కి వస్తారు. పనిమనిషి రాలేదు.ఇంటినించీ ఆదరా బాదరాగా స్కూలు కెళ్ళటంతో ఇల్లంతా చిందరవందరగా ఉంది. యూనిట్ రిపోర్ట్స్ తయారుచేయాలి.’అనుకుంటూ తను చేయవలసిన పనుల లిస్టు మననంచేసుకుంది శారద.

ఆలోచనల్లో కాలేజ్ కి వచ్చిన సంగతే గమనించలేదు శారద.గేటుదగ్గర అపర్ణ సిధ్ధంగా ఉంది.
పిల్లలిద్దరినీ మ్యూజిక్ క్లాసులో వదిలి దగ్గరే ఉన్న కూరగాయల షాపుకెళ్ళ కూరలు తీసుకుంది.

మ్యూజిక్ క్లాసు అవుతున్నంతసేపు పేరెంట్స్ పూలమొక్కలదగ్గర బయట కుర్చీల్లో కూర్చొని ఖబుర్లు చెప్పుకుంటారు.శారద వింటున్నట్లు తలపంకిస్తూ తోటకూర శుభ్రచేసి చిక్కళ్ళువలిచి, మెరపకాయలు తొడిమలు తీసింది.

‘హమ్మయ్య రేపటికి కూర రెడీ.’అనుకుంది మనసులో శారద.

ఈలోపు పిల్లలు మ్యూజిక్ క్లాసు అయింది.పిల్లని ఎక్కించుకున్న వెంటనే ఆలోచనలకి ఫుల్ స్టాప్ పెట్టింది.కాదు పెట్టిస్తారు పిల్లలు.క్లాస్ రూమ్ ఖబుర్లతో,గిల్లికజ్జాలతో,ఎక్కిరింతలతో,వారి చేష్టలు శారద మనస్పూర్తిగా ఆస్వాదిస్తుంది. ఇల్లు దగ్గర పడుతోందంటే వాళ్ళ అల్లరి తారాపధం చేరతుంది. శారదకి బండి బేలన్స్ చేయటమే కష్టమవుతుంది.

“అమ్మా!హాట్హాట్ బజ్జీ స్నాక్స్ ఆకలేస్తోంది.” అంది అపరాజిత.

“చాల్లే అప్పూ!జాండీస్ తగ్గి వన్మంత్ కాలేదు ఆయిలీ ఫుడ్.” అంటూ కసిరింది అపర్ణ.

“అమ్మా ! బేకరీలో దిల్పసంద్ తీసుకో మళ్ళీ ఏ ప్రిపరేషన్ వద్దు .”అంది అపర్ణ.

ఇద్దరికీ సమాధానం చెప్పకుంండా ఇంటిదగ్గరకి వచ్చి ఆపింది శారద.పోర్టికోలో బండి ఆపి తాళం తీయంగానే చిన్నారిసింధూ తోకాడిస్తూ మీదకొచ్చింది.

“అప్పూ!స్నూపిని వాకింగ్ తీసికెళ్ళు.” అంటూ కాళ్ళకడుక్కొని వంటింట్లోకి వెళ్ళి గ్లాసుల్లో ప్రొటీనెక్స్, ప్లేట్లల్లో బొప్పాస ముక్కలతో వచ్చింది శారద.

“పిల్లలూ! పప్పాయ్యాతిని పాలు తాగి ఇల్లు సర్దండి.ఇవాళ డాడీ ఫ్రెండ్స్ ఫేమిలీ డిన్నర్ కి వస్తారు.” అంటూ ఒకకప్ టీ సిప్ చేసి పాతచీర కట్టిగిన్నెలుతోమ ఉపక్రమించింది శారద.

బొప్పాసముక్కలు పాలు చూడంగానే పిల్లల మొఖాలు మాడిపోయాయి.అయినా తల్లి. హడావుడి చూసి నోరు మెదపలేదు బంగారుతల్లులు.మెదలకుండా పండుతిని పాలుతాగి వాళ్ళగదిలోకెళ్ళి చదువుకోసాగారు.

నెమ్మదిగా వంట పూర్తిచేసి తనుకూడా ఫ్రష్ అయి కూర్చొంది శారద.

‘రిపోర్ట్ వర్క్ ఉంది వాళ్ళు వచ్చి వెళ్ళాకగానీ ఆ పని చేయలేను.’అనుకుంది శారద.

‘ఛీ ! ఏమిటో ఆడదాని జీవితం.ఎంత చదువుకున్నా గిన్నెలు,బట్టలు వంట,పిల్లలని కనటం,వాళ్ళ పెంపకం అంతా ఆడదాని మొహానే రాసాడు భగవంతుడు.ఏదైనా తేడావస్తే ‘ఆతల్లి పెంపకం’ అంటూ సమాజం తల్లినే వేలెత్తి చూపుతుంది .తాతయ్య అన్నట్టు ‘బి.ఏ.’చదివినా బియ్యం కడగక తప్పదే శారదా అనేవారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తానంటే.”

ఆలోచనలలో వాకిట్లో కార్ హారన్ వినపడలేదు శారదకి.సింధూ గేటుదగ్గరకెళ్ళి ఒబీడియంటుగా తోక ఊపుతూ డాడీ ని స్వాగతిస్తోంది.శారదవెళ్ళి గేటు తీసింది.

కారుపార్కు చేసి”పిల్లలేరి శారదా?అన్నిసార్లు హారన్ కొట్టినా రాలేదు.”అన్నాడు వంశీకృష్ణ.

“చదువు కుంటున్నారు వాళ్ళగదిలో!”అంటూ అనుమానంతో గదిలోకి వెళ్ళింది శారద.

‘పుస్తకం హస్తభూషణం’ అన్నట్లు చేతిలో పుస్తకంతో కునికి పాట్లు పడుతున్నారు పిల్లలు.

శారద మాతృహృదయం తల్లడిల్లింది.’పిచ్చితల్లులు నాలుగింటికి లేచి అలసిపోయారు.స్కూలుకు పది కిలోమీటర్ల దూరంలో ఉంది ఇల్లు. స్వంతఇంటిని అనుభవించాలని ఉండటమేకాని దేనికీ దగ్గరకాదు.”అనుకుంది శారద.

వంశీ !టీ పెట్టనా!”అడిగింది.

“తప్పకుండా! ఇవాళ ఆడిటింగ్ కాదుగానీ పిచ్చెత్తిపోయింది. డిన్నరుకు వాళ్ళు ఏడున్నర ఎనిమిది ప్రాంతంలో వస్తానన్నారు.”అంటూ ఫ్రష్ అవటానికి వెళ్ళాడు.

“తల్లులూ రండి డిన్నరుకు చేసి పడుకోండి రేపెటూ సెలవేకదా చదువుకుందురుగాని.”అంటూ కేకేసింది శారద.

“డాడీ వచ్చారా?అమ్మా!”అన్నారు ముక్తకంఠంతో.

“వచ్చారు.కారు హారన్ కి మీరు లేవలేదు మీ చెల్లెలు రిసీవ్ చేసుకుంది. క్రెడిట్సన్నీ దానికే.”అంటూ నవ్వింది శారద.

“ఆయ్!”అంటూ ఇద్దరూ స్నూపి వెంట పడ్డారు.అది వంశీ కాళ్ళసందులోదూరి అరవసాగింది.

సారీ డాడీ అంటూ తండ్రికిరుపక్కలా గారంగా. చేరారు.

కంచాలదగ్గరకి ఈదురో అంటూ వచ్చిన అప్పూ అపర్ణలు” వావ్!” అంటూ ‘హైఫై’ ఇచ్చుకున్నారు.
బాదంపౌడరు స్పెషల్టచ్ సేమియాపాయసం, ఆనియన్ పకోడీ ,చోళే బటూరా,దధ్ధోజనం.

“అమ్మా!ఇవి గెస్ట్స్ కని చేసావా మాగురించా.” అంటూ తల్లిని వాటేసుకున్నారు.
★★★

వంశీకృష్ణ బ్యాంక్ లో చీఫ్ మేనేజర్.ఇవాళ చాలా చికాకుగా ఉంది.వంట్లో నలతగా ఉంది.
“ఇన్సపెక్షన్ కి సైట్ కి వెళ్ళాలి.అమ్మకి వంట్లోబాగాలేదన్నమెసేజ్ ఒకమూల కలవర పెడుతోంది.దసరా సెలవలకి శారద పిల్లలు పుట్టింటికి వెళ్ళారు.ఇంటికెళ్ళి చెయ్యకాల్చుకోవాలి.పిల్లలకి టర్మ్ ఫీజుకట్టాలి హౌసింగ్ లోను హౌస్టాక్స్, వగైరా వగైరాపోనూ ఇంటి ఖర్చుకి బొటాబొటి ఇరవై ఇరవై ఐదు మధ్యలో మిగులుతుంది ఇంటిఖర్చుకి. మధ్యలో మెడికల్ ఖర్చు లేకపోతే.

ఇదిలా ఉండగా హెడ్ఆఫీస్ నించీ టార్గెట్ రీచ్ అవలేదని షంటింగ్.”ఎవరిమీదో ఎందుకో అర్ధం కాని కోపం చికాకుగాఉంది వంశీకి.

వంశీకృష్ణకి ఛీర్ఫుల్ అండ్ అండర్స్టాండింగ్ పర్శనాలిటీ అని సబ్స్టాఫ్ నించీ హెడాఫీస్ వరకూ పేరుంది.అంతేకాదు సిన్సియర్ అండ్ హైలీ డిసిప్లైన్డ్ అని కూడా భయపడతారు.

వంశీకృష్ణ చికాకుకి అసలు కారణం ఒక ప్రాజెక్ట్ కి కోటిన్నర సాంక్షన్ చేయమని ప్రషర్.కావాలంటే కమీషను తీసుకోమని.ఒక్క కాగితమూ సరిగ్గాలేదు.ఆల్రడీ ముఫ్ఫై లక్షలు సాంక్షన్చేసి సైట్ కి వెళ్ళి చూస్తే అక్కడ ఏమీలేదు.ఆ పార్టీ దర్జాగా ఖరీదైన కారులో బ్యాంకుకు వచ్చి సొల్లు ఖబుర్లు చెప్తాడు.ఆమినిస్టరు ఈ ఏక్టరు తన బంధువులంటూ.వళ్ళుమండిపోయి ఉన్నదున్నట్లు రిపోర్టు పంపినందుకు హెడాఫీస్నించీ దొబ్బులు. ఉద్యోగం రిజైన్ చేసి పారేద్దామనిఉంది వంశీకృష్ణకి.

‘ఛ! వెధవ బ్రతుకు. ఎన్ని అవాంతరాలొచ్చినా ఉద్యోగం చేయక తప్పదు.అదే ఆడది కావాలంటే ఉద్యోగం చేయకపోయినా భర్త తెచ్చింది తిని హాయిగా ఇంటిపట్టున ఉన్నా ఎవరూ ఎద్దేవా చేయరు.అదే మగవాడైతేఎన్నెన్ని మాటలంటారు.”ఆడంగివెధవ.పెళ్ళాం సంపాదిస్తే తిని కూర్చుంటున్నాడు.ఉద్యోగం పురుషలక్షణం అని కూడా తెలియదు.”అని ఎద్దేవా హేళన చేస్తారు.జీవితంలో అన్ని కష్టాలకంటే ఆర్ధికంగా సంసారాన్ని ఏ ఒడిదుడుకులు లేకుండా గడిపేందుకు ఎంతో మానసికమైన వత్తిడికిమగవాడు గురౌతాడన్నది ఎవరికీ తెలియదు. వాడికేం మగ మహరాజు ఇంటికెళ్ళేసరికి హారతి పళ్ళెంలో వండి వార్చిపెడుతుంది పెళ్ళాం. అంటారు.ఆ వండి వార్చటానికి కావలసిన ముడిసరుకుకు మగవాడు పడే తిప్పలు ఎవరైనా ఆలోచిస్తారా? ఛీ! ఈ మగవాడిగా పుట్టడం కన్నా అడవిలో మద్దిచెట్టు మానునై పుట్టినా బాగుండేది.’అనుకున్నాడు వంశీకృష్ణ.
★★★

అర్ధరాత్రి రెండున్నర వరకూ కూర్చున్నా క్వార్టర్లీ పేపర్ కరక్షన్లు పూర్తికాలేదు.ఇంకాఒక్కరోజుంది స్కూలు రిఓపెనింగ్ కి.ఎవరి క్లాసుమార్కలిస్టు వాళ్ల కి అందచేయాలి.సెలవలకి నాలుగురోజులు ఊరెళ్ళేసరికి వర్కంతా డిలే అయింది. పిచ్చెక్కినట్లుంది శారదకి.

“శారదా!ఆ లైట్ ఆపేయి.ప్రొద్దున్నించీ గొడ్డుచాకిరి చేసి రాత్రికాస్సేపు ప్రశాంతంగా పడుకుందామంటే ఆ వెలుతురు బెడ్రూం వరకూ వస్తోంది.”ఆసహనంగా అరిచాడు వంశీ.

“ఎక్జామినేషన్ పేపర్స్ కరక్షన్ చేసుకుంటున్నా వంశీ.సారీ బెడ్రూం తలుపేసుకోండి.”ఎంతో సౌమ్యంగా జవాబిచ్చింది శారద.

“బోడి ఉద్యోగం.ఏదో పెద్ద ఉద్యోగం వెలగపెడుతున్నట్లు అర్ధరాత్రి ఏంపని?గుడ్డిగుఱ్ఱానికి దానా ఎక్కువన్నట్లు సంపాదన తక్కువకానీ ఉద్యోగం చేస్తున్నానన్న పోజెక్కువ.”అన్నాడు చిరాగ్గా వంశీ.

శారద అహం దెబ్బతింది.”అవును బోడి ఉద్యోగమే.గవర్నమెంట్ ఉద్యోగం వదులుకొని మీకు వేణ్ణీళ్ళకి చన్నీళ్ళలా ఉందామని ఈ ఉద్యోగం చేస్తున్నా.ప్రొద్దున్న నాలిగింటికి లేచి పిల్లలని చదివించాలి.పనిమనిషి రాకపోతే గిన్నెలుతోమడం,బట్టలుతకడం,ఇల్లూడవడం వండి కేరీర్లుకట్టడం ఇవన్నీ కూడా బోడిపనులే.నా ప్రాణానికి ఇద్దరూ ఆడపిల్లలువాళ్ళకి జడలువేసి మీతో పాటు వాళ్ళని పంపి.నేను ఇల్లుచక్కపెట్టుకుని డ్రైవ్ చేసుకుంటూ స్కూలుకెళ్ళేసరికి ఏరోజు ఆఖరి నిమిషం లేదా లేటు.
సాయంత్రం మ్యూజిక్ క్లాస్,కూరలు,వెచ్చాలు కొనటం కూడా బోడి పనులే.బండి నేర్చుకుని తప్పుచేసా ఆడపని మగపని చేస్తుంటే మీకేం తెలియటంలేదు.ప్రొద్దునే టిప్టాప్ గా రెడీ ఆయి కారులో ఎంచక్కా బ్యాంక్ కి వెళ్ళి సాయంత్రం వచ్చేసరికి అలసిపోతారు.ప్రొద్దున్నించీ స్కూల్లో పిల్లలతో వాగివాగి అదెంత అలసి పోతోందో అని ఎప్పుడైనా ఆలోచించారా!పైగా బోడి ఉద్యోగమట బోడి ఉద్యోగం అంటారా! ఆ బోడి టీచర్లు పాఠాలు చెపితేనే మీరింతవారయ్యారని మరవకండి. ఛీ!వెధవ ఆడజన్మ.ఆడదానిగా పుట్టడంకన్నా అడవిలో మానునైపుట్టినా బాగుండేది.”అంటూ ముక్కుచీదుకుంది శారద.
★★★

పనిమనిషి రాదని మూడుగంటలవరకూ నిద్రపోని శారద ,నాలుగు గంటలకల్లా లేచింది. చలిలో గిన్నెలు తోముతున్న శారదనిచూసివంశీకృష్ణ గుండె తరుక్కు పోయింది.బ్యాంకు గొడవలతో చికాకుగాఉండి
ఎక్కవగానే కసిరాననుకున్నాడు.

“శారదా! నాకుసారీచెప్పటం ఇష్టముండదు.నేను ఆడది హాయిగా ఉంటుంది. మగవాడే కష్టపడతాడనిపించి అలామాట్లాడాను.” అంటూ సింక్ లొ గిన్నెలు కడుగుతున్న భార్యబుజంమీద అనునయంగా చేయివేసాడువంశీ.

సరేలెండి మీటెన్షను అర్ధంచేసుకున్నా.అందరూ డబ్బుకోసం ఉద్యోగంచేస్తే మీది డబ్బతోనే ఉద్యోగమయ్యే.ఏంతేడాచ్చినా జేబులోంచి కట్టుకోవాలి. కాకపోతే నన్నూ నా ఉద్యోగాన్ని ఏమన్నా ఊరుకోను.”అంది పూర్తిగా భర్తకి లొంగకుండా.
★★★

దుప్పట్లోంచి లేవకుండా సైలంట్ గా అమ్మానాన్నల సంభాషణ విని. ‘ఓం శాంతి శాంతి శాంతిః’ అని నవ్వుకున్నారు పిల్లలు.రాత్రి తల్లిదండ్రుల హాట్ డిస్కషన్ విని వాల్కెనో ఎరప్షన్ అనుకున్న అపర్ణ అపరాజితలు.
★★★

‘ఏమైనా ఆడదానిగా పుట్టడంకన్నా అడవిలో మానై పుట్టినా బాగుండేది.’ అందిశారద కాఫీ సిప్చేస్తూ.

‘ఔనౌను!మగవాడిగా పుట్టడంకన్నా ఆడవిలో మద్దిచెట్టు మానునై పుట్టినా బాగుండేది.’అన్నాడు వంశీ క్రీగంట శారదని చూస్తూ.

“డాడ్! బోత్ ఆర్ ట్రీస్ అండ్ దె గివ్ షెల్టర్ టు అదర్స్.”అంది అప్పూ దొంగలాగ తండ్రి వెనకచేరి.

“అమ్మా!నువ్వలా మాట్లాడితే మాకు భయంగా ఉందమ్మా! మేము నీలా ఆడపిల్లలం కదమ్మా!” అంది అపర్ణ.

శారద వంశీలు తమ తప్పు తెలుసుకున్నారు.

సంసారమనే రథానికి భార్యాభర్తలిద్దరూ చక్రాల్లాంటివారు.అందులో ఏచక్రం గొప్పదని చెప్పగలం. ఏ చక్రం లేకపోయినా బండి సజావుగా నడవదు.రెండుచక్రాలమీద భారం సమానంగా ఉంటేనే సంసారరథం సాఫీగా సాగుతుందని
తెలిసినప్పటికి స్త్రీ పురుషులు తాత్కాలికమైన శారిరక,మానసిక,ఆర్ధిక వత్తిడి లో ఎవరికి వారే వారే సంసారభారాన్ని మోస్తున్నామనుకోవటం పరిపాటి కొంచెం విచక్షణతో ఆలోచిస్తే ఎవరి కష్టం వారిదన్న సత్యం స్ఫురిస్తుంది.
సర్వేజనా సుఖినో భవంతు.

November 21, 2024 0 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

వడ్డెర చండీదాస్, కాశీభట్ల వేణుగోపాల్ ల రచనల సంక్షిప్త పరిచయం

by Dr. Kasarla Rangarao November 21, 2024
written by Dr. Kasarla Rangarao

వడ్డెర చండీదాస్
1937 నవంబర్ 30న పెరిచేపల్లి గ్రామము వ్యవసాయదారుల కుటుంబాల్లో జన్మించారు ఇది పామర్రు మండలం కృష్ణాజిల్లా కిందకు వస్తుంది వీరి పేరు చెరుకూరి సుబ్రహ్మణ్యేశ్వర రావు. పేద వృత్తి శ్రామికుల వడ్డెర ప్రజల నుండి వడ్డెరను 15వ శతాబ్దపు ఓ విప్లమాత్మక శాక్తేయ బెంగాలీ పేరు చండీదాసు తీసుకొని దగ్గర చేర్చి వడ్డెర చండీదాసుగా తన కలం పేరు చేసుకున్నాడు వీరు తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర అధ్యాపకునిగా పనిచేశారు వడ్డెర చండీదాస్ గారి రచనలలో నవలలు కథలు లేఖలు తత్వశాస్త్రము ఉన్నాయి .

హిమజ్వాల అనుక్షణికం నవలలు చీకట్లోంచి చీకట్లోకి అనేది సంపుటి డిజైర్ అండ్ లిబరేషన్ తాత్వికం ప్రేమతో అనేది లేఖా సాహిత్యం . 2007లో గ్రంధ రూపం లేఖా సాహిత్యం . జనవరి 1984 నుండి 21 డిసెంబర్ 1991 వరకు చండీదాస్ గారు శ్రీ అడ్లూరి రఘురామరాజుకు రాసిన లేఖలు . వీరి రచనలన్నీ చైతన్య స్రవంతి కథని నడిచేవే మనో విశ్లేషణ చేస్తే చాలా పెద్ద థీసిస్ లే అవుతాయి. ఈయన వ్రాసిన సాహిత్యం దాదాపు 2000 పేజీలపైగా ఉంటుంది. 67 ఏళ్లు జీవించిన ఈ తాత్విక తపస్వి జనవరి 30, 2005న విజయవాడలో కన్నుమూశాడు దాదాపు 15 ఏళ్ల పాటు మౌనంగా నాలుగు గోడల మధ్య ఉండి పోయాడు ఆయన ఒకచోట తన గురించి వ్రాసుకున్న సుదీర్ఘ వ్యాఖ్యము “యాశ్వద కార్తీక కవోష్ణంలోంచి పుట్టుకొచ్చి కృష్ణ వరి పైరుల్లో సుషుప్తించి నిజామాబాద్ ప్రాంతపు పచ్చిక మైదానాల్లోంచి ఎదిగి హైదరాబాద్ వెన్నెల్లో తడిసి తిరుపతి వేడిలో కాగుతూ సంస్పందనాకాశంలో ఎగిరి, మూర్ఖత్వపు పంజరంలో పొడి, నిర్లిప్తనిరీక్షణావడిలోకి విముక్తమై అనురాగరసరాగ సౌందర్యంలో పునర్జన్మించాను కానీ అంతలోనే ఆ సౌందర్య అనురాగపు నా ఊపిరి శిలా వాల్మీకమైపోతే అందులో సమాధి అయి ఏకాంతిస్తున్నాను “వడ్డెర చండీదాస్ గారి రెండు నవలలు . హిమజ్వాల మరియు అనుక్షణికం ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో ధారావాహికలుగా వచ్చాయి . హిమజ్వాల నవలను తెలుగు తనపు కూపం లో ఇమడలేక అభాసుపాలైన కళాతపస్వి బుచ్చిబాబు గారికి అంకితం చేశాడు . హిమ జ్వాల అనుక్షణికం నవలలను సీరియలించ్చి కీర్తిని అపకీర్తిని మూటగట్టుకున్న పురాణం సుబ్రహ్మణ్య శర్మకు అంకితం చేశాడు వడ్డెర చండీదాస్ వ్రాసిన కథలన్నీ విజయ అనుబంధం చీకట్లోంచి చీకట్లోకి గా విజయ అనుబంధమాలికగా వెలువడ్డాయి. ఇది విజయం అనుబంధ 24వ నవలగా వచ్చింది. ఇది ఫిబ్రవరి 1978లో వచ్చింది దీనిని ఆమెః ఆమరణ నిర్బంధమాలిని ,మాతృభాల మలిన మందార ధార జగద్ధార మూలాధార నయన జ్వాలకు యివతలగా ,తన చీకటి కడుపున దాచిన , కాంతి నిస్వనపు సవ్వడి —-ఆమెకుఅంకిత మిచ్చారు .

ఇందులో ఏకథకు ఆ కథ గా ఉంటుంది .కానీ అన్ని కథలకు అంత సూత్రం అంటే గొలుసుకథగా ఉంటుంది. దీని గురించి ఈ విజయం అనుబంధంలోనే “సమర్పణ” పేరుతో దాదాపు 15 పేజీల సమీక్షాత్మక వివరణ విశ్లేషణ శ్రీ గుత్తికొండ నాగేశ్వరరావు వ్రాశాడు . డిసెంబర్ 1977గా అందులోనేప్రచురింపబడింది.
వీరి సాహిత్య వ్యాసంగాన్ని నిష్టతో నిష్పాక్షికంగా అధ్యయనం చేసిన వారు వైట్ హెడ్ సాత్రే జంగ్ లాంటి స్వతంత్ర ఇతివృత్తాలతో ” గమనాన్ని యానాన్ని ప్రవాహాన్ని అక్షరాలలో చిత్రించి ఉండే గొలుసు పొరలు చిరగకుండా ఒక్కొక్కటి విప్పి ఏదో శూన్య రహస్యాన్ని తెలుసుకోవాలన్న కోర్కెతో రాసిన అతని వైజ్ఞానిక చైతన్య స్రవంతులు ,రచనా పటిమకు ” అబ్బురపడ్డారు హిమజ్వాల నవల రెండు ప్రధాన పాత్రల అంతరంగ బహి ప్రయాణ చైతన్య స్రవంతి మార్గ నిర్ధారణ ఇది ఒక మనో వైజ్ఞానిక నవల. కృష్ణ చైతన్య గీతాదేవి, ఈ రెండు ప్రధాన పాత్రలతో పాటు కృష్ణ చైతన్య తండ్రి , స్నేహితుడు శశాంక్ , గీతాదేవి భర్త శివరాం , అనారోగ్యపరుడైన చిదంబరం భార్య మాధురి దేవి మరియు కృష్ణ చైతన్య బంధువులు. తెలియకుండా మనసును మనిషిని కోసేసే జ్వలన ధ్వనితమైన జ్వలన జ్వలితమైన ప్రత్యేక జీవుల ఆ రెండు పాత్రలు హిమ జ్వాల నవల. సాంద్రత గాఢ వాక్యాలు . “తడిసి ముద్దయిపోయిన ప్రకృతి ఆమె శరీరంలోంచి ఎగిసే ఆవిరికి తేరుకుంటోంది .”
“మాటాడే తీరులో, సెలయేటివేగం , స్పటత ఉన్నాయి. ” ” పర్వతపు పచ్చని నుదుటి మీద నిప్పురవ్వ ఐ పడి, పగ కొద్దీ కాల్చి , అక్కడికి కసి తీరక దోససిల్ళ్ళతో మసి ఎత్తి గాల్లోకి తెగ పోసి వెళ్లిపోయాడు సూర్యుడు.”
ఈ నవలలో అధ్యాయాల పేర్లు వెలుగు మరక , మూగబోయిన వీణ , ఉప్పొంగిపోనాది గోదారి , అనుభూతి సిగ్గెరుగదట, ప్రేమ వెర్రిబాగులదట , మరీచి కాన్వేషణ , సశేషం జీవితం . ఈ పేర్ల ద్వారా ఆయాభాగాల్లో వచ్చే కథను క్లుప్తంగా చూపించాడు రచయిత నవల చివరన అర్ధాను స్వారంలో రచయిత తన భావాలను వెల్లడించారు.
వడ్డెర చండీదాస్ గారి అనుక్షణికం నవల క్లుప్తంగా శ్రీపతి , స్వప్న రాగలీన, అనంతరెడ్డి , గాయత్రి, మోహన్ రెడ్డి, గంగి ,రవి ,సీత ,కనకదుర్గ, విజయకుమార్, నళిని ,అంకినీడు, జయంతి, వెంకటావధాని ,రంగారెడ్డి ఇవన్నీ ప్రధాన పాత్రలుగా తార, రామారావు , స్రవంతి ,విమల ,ప్రసాద్ ,రాములు చారుమతి తండ్రి , చారుమతి , రమణి ,రంగారెడ్డి సూర్యప్రకాష్ ,రామ్మూర్తి ,సుబ్రహ్మణ్యం ,వేదవతి దురదృష్టవంతురాలు సీత , నిరంజన్ రావు , ప్రత్యేక పాత్ర వందన ,వరాహ శాస్త్రి ఇంకా ఉస్మానియా కిచిడి మిక్సర్ పాత్రలు .ఒక తరం నుండి ఇంకొక తరానికి నాటి సబ్జెక్టు విషయ సామాజిక మానసిక ఆర్థిక నేపద్యాల పది సంవత్సరాల గమనాన్ని రాజకీయ ప్రాంతీయ జాతీయ అంతర్జాతీయ విశ్లేషణాలన్నీ మేళ నుంచి ఏ పాత్ర ఎదుగుదల గమనం నిష్క్రమణం దానిదే ఇంతటి సంక్లిష్ట సందిగ్ధం భీభత్స వేళా విశేష రచన ఇప్పటిదాకా తెలుగులో రాలేదు ఏదో ఒక ఇజం సంబందించిందో కాకుండా చారిత్రకతపై సామాజిక గమనంపై ఎక్కడ రచయిత అనవసర జోక్యం లేకుండా దేని వలయం విస్తరణ నిర్వాణం దానికదేగా నిర్వహించడం తెలుగు సాహిత్యంలో ఒక గొప్ప అరుదైన సందర్భం. ఇది ఒక 10 సామాజిక శాస్త్రాల అవగాహనను కలిగించగల ఏకైక నవల .ఉస్మానియా నేపథ్యంలో తెలుగు నైసర్గిక ప్రాతిపదిక విశ్లేషణలతో కూడిన వడ్డెర చండీదాస్ విశేష నవల .
వివిధ ఆంధ్రజ్యోతి సోమవారం 26 నవంబర్ 2018 నాటి తన వ్యాసంలో శ్రీ వల్లూరి రాఘవరావు గారు “అతీత వాద సాహితీ జలపాతం” శీర్షికతో వడ్డెర చండీదాస్ గారి సాహిత్య సమీక్ష చేశారు. ” ఓం వురుమూ, ఓ మెరుపూ సృష్టించి మాయమైన తాత్విక సాహితీవేత్త శ్రీ వడ్డెర చండీదాస్ “అని పేర్కొంటూ శ్రీ కొడవళ్ళ హనుమంతరావు గారు విపులమైన సాహితీ సమీక్ష చేశారు.
http://eemata.com/ em/ issues/200507/ 177.html

“తెలుగు సాహితి వినీలాకాశంలో ఓ ధ్రువతార అనుక్షణికం” డి. రామచంద్ర రాజు., సంచిక -ఏప్రిల్ ఒకటి 2018.
“విరసాన్ని బోనెక్కించిన అనుక్షణికం ” ఫేస్బుక్ పోస్ట్ 22 ఫిబ్రవరి 2022.
రచన శృంగవరపు గారి ఫేస్బుక్ పోస్ట్ నాలుగు ఆగస్టు 2023 నుండి “చండీదాసు గారు -గొప్ప రచయితే కానీ!”ఇతర సమకాలీన రచనలతో పోల్చి తన అభిప్రాయం తెలుపుతారు .
ఇక వడ్డెర చండీదాస్ గారి సాహితీ ప్రయాణం లో అత్యంత ప్రత్యేకమైనది తాత్విక రచనా వెలుగు చూడడం. డిజైర్ అండ్ లిబరేషన్ అనే వీరి సూత్రప్రాయ రచన చాలా ప్రాముఖ్యత సంతరించుకుంది. దీని విషయంలో శ్రీ వాడ్రేవు చిన వీరభద్రుడు గారు చాలా విపులమైన వివరణ తన ఫేస్బుక్ మాధ్యమం లో వివరించారు. అబ్ధుల్ రాజా హుస్సేన్ గారు కూడా చండీదాస్ గారిపై విపులమైన వివరణలు ఫేస్బుక్ మీడియా ద్వారా దృశ్యమానం చేశారు.

కాశీభట్ల వేణుగోపాల్
వేణుగోపాల్ జనవరి 2 1954లో కర్నూల్ లో జన్మించాడు. వీరికి ఇద్దరు అన్నలు. ఆరుగురు అక్కలు. 9 నెలలప్పుడే స్పష్టమైన పలుకులకు ముచ్చటపడి వీరి తల్లి వీరికి కాళిదాసు శ్లోకాలు పద్యాలు అమర కోశం నేర్పించింది. ఆ విధంగా వీరు చిన్నప్పటినుంచే జిజ్ఞాసతో అన్నలు అక్కలతో గ్రంథాలయానికి వెళ్తూ చదవడం అలవాటు చేసుకున్నాడు కాలేజీల చదువు అబద్ధం అని నమ్మి దృవపత్రాలు అన్ని చించి వేసి సాహిత్య ప్రస్థానం కొనసాగించాడు చాలా చాలా విస్తృతంగా అధ్యయనం చేశాడు శ్రోత్రియ నియమాలను మిగతా అన్ని మానవ నిర్మిత నిబంధనలన్నీ విలువల్ని ఒప్పుకోడు. మొదట మల్లాది బుజ్జిబాబు శ్రీశ్రీల ప్రభావం లో ఉన్న త్వరలోనే బయటపడి సొంత ఒరవడికై కృషి చేశాడు. గుంటూరు శేషేంద్ర శర్మకు మంచి అభిమాని. ఈయన అవివాహితుడు .మంచి పద్యం మద్యం రెండింటికి ప్రీతిపాత్రుడు. హరిప్రసాద్ చౌరాసియాలను బాగా ఇష్టపడతాడు. మూడుసార్లు దేశాటనం చేశాడు . గాఢమైన అనుభూతుల్ని ఒడిసి పట్టుకోవడంలో ఈ పర్యటన వల్ల ,అధ్యయనం వల్ల , అమ్మ చెప్పిన శ్లోకాల వల్ల వచ్చిందంటాడు . జీవితంలోని గందరగోళాన్ని అస్థిరత్వాన్ని రచనలోని ముగింపుకై పాఠకుడిలో ఏర్పడే అవగాహనను చిన్నాభిన్నం చేయడం ద్వారా అనేక ప్రశ్నల్ని గాడతల్ని బరువుల్ని పాఠకుడి పై మోపుతాడు . సమకాలీన జీవన సంఘర్షణ బీభత్సాన్ని వైరుధ్యాలని ఒకింత చిక్కగా ప్రశ్నార్ధకం చేస్తాడు ..ఒక ప్రత్యేకమైన రచనా ఒరవడిని ముంచెత్తి పాఠకుడ్ని ఆశ్చర్యల్లో ముంచెత్తి ఆలోచింప చేస్తాడు . ఈయన నాలుగు కథా సంకలనాలు మూడు కవిత్వం పుస్తకాలు ఎనిమిది నవలలు ఒక నవలిక రచించాడు. దిగంతం ,తపన, నేను చీకటి , మంచు పువ్వు , తెరవని తలుపులు , నిషకం, అసత్యానికి ఆవల , అసంగత నవలలు రంగులు అనే నవలిక . నాలుగు సినిమాలకు రచయితగా పనిచేశాడు

అసంగతం నవలపై శివా అయ్యల సోమయాజులు పుస్తకం డాట్ నెట్ లో విప్లమైన సమీక్ష వ్రాశాడు. వెంకట సిద్ధారెడ్డి సారంగ సంచిక 15 డిసెంబర్ “వేణుగోపాల్ మరియు ఒక సామాన్యుడు ” శీర్షికగా కాశీ భట్ల వేణుగోపాల్ తపన నవల తనపై ఎంత ప్రభావం చేసిందో చూపిందో విపులంగా వివరిస్తాడు . కాశీభట్ల వేణుగోపాల్ చెప్పిన కవిత యూట్యూబ్లో స్టేట్మెంట్ పేరుతో ఉంది రెండు నిమిషముల 50 సెకండ్లు ఇందులో ఆయనకు సంబంధించిన ఒక కృత్యా ద్యవస్థ వివరిస్తాడు .” కుర్చీ మై చైర్ ఓ పారాభౌతిక భావన ఒక సమ్మోహకర ప్రార్థన కేంద్రం . ముందు నన్ను రూపంగా మార్చి ఈ కుర్చి ఓ పారాభౌతిక భావన .ఎండలో మెరిసే వాన వానలో తడిసే ఎండ నన్ను చీల్చుకు వచ్చే చిగురు కోసం ఎండ వానల్లోని నన్ను మార్చే కుర్చీ సాంతం కాళ్లు చేతులు ఉన్నాయంటూ లేకున్నా ఉన్నాయంటూ మట్టిని కౌగిలించుకోవడానికి మట్టైన నేను (కుర్చీలో) ఇంకో మెరిసే వాన కోసం తడిసి ఎండ కోసం .” ఈ విధంగా చాలా సంక్లిష్టమైన భావనలను ఆలోచనలని పాఠకునిలో రేకెత్తించిమనసులోకి దించి వదిలేస్తాడు కాశీభట్ల వేణుగోపాల్ వేణుగోపాల్.

November 21, 2024 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత (15))

by Narendra Sandineni November 21, 2024
written by Narendra Sandineni

తెలుగులోకి అను సృజన : కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి).
గుల్జార్ షాయరీ కవిత పై విశ్లేషణా వ్యాసం.
ప్రఖ్యాత కవి,జ్ఞానపీఠ అవార్డు గ్రహీత,గుల్జార్ హిందీలో రచించిన షాయరీ కవిత ఇది.గుల్జార్ హిందీలో రాసిన షాయరీ కవితను కవయిత్రి గీతాంజలి (డాక్టర్ భారతి) తెలుగులోకి అను సృజన చేసింది.గుల్జార్ షాయరీ కవితలోని భావాలు
పాఠకుల హృదయాలను అలరిస్తాయి.
నన్ను ఇంతగా ఎడిపిస్తున్నావేంటి
జీవితమా …
ఒక్క సారి వెళ్ళి మా అమ్మని అడిగి రాపో …
ఎంత గారాల బిడ్డనో నేను ?
జీవితం అంటే ఉనికి యొక్క స్వాభావిక ప్రాముఖ్యత.మనం ఇక్కడ ఎందుకు ఉన్నాము?మన అస్తిత్వం యొక్క ఉద్దేశ్యం ఏమిటి?అనే ప్రశ్నలకు విభిన్న సాంస్కృతిక మరియు సైద్ధాంతిక నేపథ్యాల నుండి అనేక ప్రతిపాదిత సమాధానాలు ఉన్నాయి. జీవితాన్ని గూర్చిన అన్వేషణ చరిత్రలో తాత్విక,శాస్త్రీయ, వేదాంత మరియు మెటా ఫిజికల్ ఊహాగానాలను ఉత్పత్తి చేసింది.మనిషి యొక్క మితిమీరిన ఉనికి,సామాజిక సంబంధాలు,స్పృహ మరియు ఆనందాన్ని గూర్చిన తాత్విక, మతపరమైన ఆలోచనలు,శాస్త్రీయ విచారణల నుండి జీవితం యొక్క అర్థాన్ని పొందవచ్చు.జీవితం యొక్క అర్థం ఆనందాన్ని పెంచడం,సాధారణ జీవితాన్ని సులభతరం చేయడంగా భావించ వచ్చు. జీవితం అంటే ఒక అద్భుతమైన ప్రయాణం.మనిషి జీవితం శాశ్వతం కాదు.జీవితం క్షణికమైనది.మనిషి పుట్టినప్పటి నుంచి మరణించే వరకు జరిగే ఈ ప్రయాణంలో అనేక అనుభవాలను,భావోద్వేగాలను ఎదుర్కొంటాం.జీవితం అనగా ఒక మార్గం.ఈ మార్గంలో మనకు అనేక ఘట్టాలు ఉంటాయి. ఇవి మనకు అనుభవాన్ని అందించి మనసును బలపరుస్తాయి.జీవితం మనకు ప్రతి క్షణం కొత్త పాఠాలను నేర్పుతుంది.జీవితం అంటే కేవలం సుఖం,సంతోషాల సమాహారమే కాదు.జీవితం బాధలు,కష్టాలు,కన్నీళ్లు మరియు సవాళ్లతో కూడినదిగా ఉంటుంది.జీవితంలో చెలరేగే సంఘర్షణలు మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి.జీవితంలో విజయం పొందేందుకు మార్గం చూపిస్తాయి.కుటుంబం,ఇరుగు పొరుగు వారితో స్నేహితులతో ఉండే అనుబంధాలు, సమాజంలో మనకు ఉండే సంబంధాలు జీవితం యొక్క పరమార్ధాన్ని తెలియజేస్తాయి.జీవితం మనకు ఎన్నో అవకాశాలను అందిస్తుంది.జీవితం అందించిన సరి కొత్త అవకాశాలను గుర్తించి సద్వినియోగం చేసుకోవాలి.మనం రోజును కొత్తగా ఆరంభం చేయడానికి జీవితం అవకాశం కల్పిస్తుంది.జీవితం ఒక తెరిచిన పుస్తకం లాంటిది.ఆ పుస్తకంలోని ప్రతి పేజీ మనకు కొత్త కొత్త పాఠాలను నేర్పుతుంది.మనం ఆ పుస్తకంలోని చివరి పేజీకి చేరేలోపే వాటిని ఆస్వాదించాలి.ఈ షాయరీ కవితలోని భావాలు తీవ్రమైన వ్యధను,నిరాశను మరియు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నాయి.నన్ను ఇంతగా ఏడిపిస్తున్నావేంటి అనే వాక్యంలో జీవితం తనను ఎందుకు ఇలా మితిమీరిన కష్టాలకు,బాధలకు గురి చేస్తోంది?భరించలేని దుఃఖాన్ని,బాధలను తట్టుకోలేకపోతున్నాను అనే ఆవేదన వ్యక్తం అవుతుంది. జీవితంలో ప్రశ్నగా మిగిలిన తన స్థానం ఏమిటి?జీవితంలో తాను పొందిన తీవ్రమైన బాధలు,తాను ఎదుర్కొన్న కష్టాలు, భావోద్వేగాలు అతని కవితలో వ్యక్తమవుతున్నాయి.ఒక్కసారి వెళ్లి మా అమ్మని అడిగి రాపో…ఎంత గారాల బిడ్డనో నేను?
కాని మా అమ్మ నా గురించి ఎంతో ప్రేమగా ఆలోచించేది,నేను ఎంత విలువైన వానినో అని గుర్తు చేసుకొనేది,గారాల బిడ్డ అనే పదం తనకు తల్లికి గల ఆత్మీయతను,ప్రేమను,అనుబంధాన్ని తెలియజేస్తుంది.జీవితం మనకు కొన్ని సార్లు తీవ్రమైన కష్టాలను, సవాళ్లను ఎదుర్కొనేటట్లు చేస్తుంది.అలాంటి కష్ట సమయంలో మనకు అండగా నిలిచే ఏకైక వ్యక్తి అమ్మ.అమ్మ తన బిడ్డల మీద చూపిన ప్రేమ జీవితంలో వారు తనకు ఎంత ముఖ్యమైన వారో తెలియజేస్తుంది.తాను అపురూపంగా చూసుకునే తన తల్లి సహాయంతో శాంతిని పొందుతున్నాడు.వ్యక్తి తల్లి ప్రేమను, ఆదరణను కాంక్షిస్తున్నాడు.తల్లికి తన పట్ల అపారమైన ప్రేమ, తనను తల్లి ఇతరుల కంటే ఎంతో ప్రత్యేకంగా,ప్రేమగా, ఆదరణగా చూసేది.తల్లి తన పట్ల ఎంతో ప్రేమను కురిపించేది. తల్లి తనను ఎంతో విలువైన బిడ్డగా చూసేది.ఇప్పుడు తాను జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలు,బాధలు ఎంతో భిన్నముగా ఉన్నాయి.జీవితంలోని నిరాశ మరియు కష్టాలు తల్లి చూపించిన అపారమైన ప్రేమను గుర్తు చేస్తున్నాయి.జీవితంలో బాధలను అనుభవిస్తూ జీవన పోరాటాన్ని కొనసాగిస్తున్నాడు.ఒక్కసారి అనే పదం వ్యక్తి యొక్క ఆత్రుతను,ఆరాటాన్ని తెలియజేస్తున్నది.ఈ కవితలోని భావం చాలా తీవ్రమైన భావోద్వేగంతో కూడి సమాధానం కోసం వెతుకుతున్నట్లుగా ఉంది.మనిషి జీవితంలో ఎదుర్కొంటున్న తీవ్రమైన సంఘర్షణ ఈ కవితలో వ్యక్తం అవుతున్నది.వ్యక్తి ఆవేదనను, నిస్సహాయతను జీవితంలో ఉన్న అసమానతల పట్ల అసహనాన్ని ఈ కవిత ప్రతిబింబిస్తున్నది.కవి గుల్జార్ షాయరీ కవితలోని భావాలు పాఠకుల హృదయాలను ఆలోచింపజేస్తాయి.

November 21, 2024 1 comment
0 FacebookTwitterPinterestEmail
సంపాదకీయం

“భాష- సభ్యత “

by Kondapally Neeharini September 30, 2024
written by Kondapally Neeharini

సెప్టెంబర్ 2024 మయూఖ పత్రిక సంపాదకీయం

ఈ భూమి మీద ఆవరించి ఉన్న అనంతమైన శక్తి ని అందిపుచ్చుకున్న ఏకైక జీవి మనిషి. సర్వ ప్రాణి కోటిలో ఉత్కృష్టమైన జీవి మనిషి అని పేరు వచ్చిన కారణం ఏమిటి అని యోచిస్తే, భావవ్యక్తీకరణ కు భాషను సాధనం చేసుకున్నందుకే, బుద్ధి ని వికసింపచేసుకొని విజ్ఞానానికి మళ్ళించినందుకే, మనసు మాట విని చెప్పగలిగే యుక్తి ఉన్నందుకే అంటూ ఇలా కొన్ని విశేషాలు విశేషణాలు ఉదాహరించవచ్చు.ఈ గొప్పతనాన్ని మరింత గొప్ప చేసుకోవాలి. దీనికి మంచి చెడు అనేవి రెండు పార్శ్వాలు గా ఉంటాయి. సరళసౌమ్యంగా మాట్లాడే మనుషులు ఉంటారు.దుర్భాషలాడేవాళ్ళూ ఉంటారు. మాట కు భాష ప్రధానమైనది కాబట్టి భాష రావాలి. భాషలెన్నో ఉన్నాయి. ఎవరి మాతృభాష వాళ్ళకుంటుంది. ఎవరికి నచ్చిన భాష వాళ్ళకుంటుంది.ప్రభావితం చేసే భాష , లేదు… రుద్దబడే భాష లేదూ…మనసుపడే భాష , ఇవన్నీ భాష గొప్పతనాన్ని చూపేవే!

మనసు నిండా మాలిన్యం ఉన్న వాళ్ళ మాట ఎప్పుడూ వంకరగానే ఉంటుంది. ఈర్ష్య, వ్యతిరిక్తత, వ్యంగ్యం వంటి భావాలు వాక్యాలు వాక్యాలు గా వాళ్ళ నోటివెంట వస్తూనే ఉంటాయి.మాట రాలేని పక్షంలో నోటితో నవ్వుతూ నుదిటి తో వెక్కిరిస్తారు.
ప్రస్తుతం ఈ విషయంలో తెలుగు భాష ప్రయోగం చేసే క్రమాన్ని చర్చించుకోవడం లో ద్రావిడ కుటుంబ భాష నేనా కాదా అనే, ద్రావిడ భాష 500 సంవత్సరాల క్రితం భాషేనా కాదా అనే , అది సింధులోయ నాగరికత ప్రాంతంలో మాట్లాడిన భాష కాదా అనో ఈ చర్చ కాదు.

ఇండో యూరోపియన్ కుటుంబానికి చెందిన భాషలేవి? ఏది ముందు ఏది వెనక,? ఓల్గా నుండి గంగ వరకు నడుచుకుంటూ వచ్చిన భాషనా? గంగనుండి ఓల్గాకు నడుచుకుంటూ వెళ్లిన భాషనా అనే చర్చకాదు. కొన్ని నిరూపించబడతాయి కొన్ని నిరూపించబడవు. సిద్ధాంతాలు ఉంటాయి. సిద్ధాంతాలు ఉండవు. తాళపత్ర గ్రంథాలలో ఉన్నవే ముఖ్యమైన వనో , శిలా శాసనాల మీద ఉన్న భాషనే ముఖ్యమైన ది అని కాదు.

లేదు ….పల్లె ప్రాంతాల్లో ప్రజల నాలుక పైన మాట్యమాడే భాష ప్రధానం అనో కాదు! భాషా శాస్త్రజ్ఞులు చెప్పే లిస్ట్ ఆఫ్ లాంగ్వేజెస్ విషయ చర్చ కూడా కాదు.
ఎవరి భాష అయినా వాళ్లకు ప్రీతికరమైన భాష నే!
అయితే ఇతరులకు నచ్చేలా మన భాష ను మనం ప్రయోగిస్తున్నామా లేదా అనే విషయాన్ని చర్చించుకోవడం.
మంచి మాటలు మాట్లాడడం రాకుంటే చెడు మాట్లాడకుండా ఉంటే చాలు మేలు చేసిన వాళ్ళు అవుతారు.
పెద్దలు ఏది మాట్లాడితే పిల్లలు అదే నేర్చుకుంటారు అంటే చాలామంది ఒప్పుకోరు కానీ ఇది సత్యం. ఏ పనులు చేస్తున్న ఎక్కడ ఉన్నా పిల్లలు పెద్దవాళ్ళను అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. కాబట్టి పెద్ద వాళ్ళు ఎవరైనా కూడా చక్కని సంభాషణ చేయడం అలవర్చుకోవాలి.

బాధ్యతాయుతమైన ఉద్యోగంలో ఉన్న ఒక ఆఫీసర్లు, దేశ నాయకులు, సంఘ నాయకులు ఎలాంటి పదాలను ప్రయోగిస్తుంటే ఉచ్ఛరిస్తుంటే అవే మాటలను సబార్డినేట్స్, వాళ్ళ కింద స్థాయి వాళ్ళు అలవర్చుకుంటారు.
నలుగురికి పని చెబుతున్నాము అంటే నాలుగు ప్రపంచాలు మనని గమనిస్తున్నట్టే లెఖ్ఖ!

రాజు ఎలా ఉంటే ప్రజలు అలాగే నడుచుకుంటారు అంటూ” యధా రాజా తథా ప్రజా ” అని చెప్పిన మన పూర్వీకుల మాటను స్మరించుకుంటే, ఇంట్లో పెద్దవాళ్లు ఏది మాట్లాడితే పిల్లలు వాటినే అనుసరిస్తారు. అసలే చుట్టుపక్కల సమాజం చాలా ప్రభావితం చేస్తూ ఉంటుంది. దీనికి తోడు ఇంట్లో వాళ్ళు కూడా దుర్భాషలాడము, చెడ్డ మాటలను ఉపయోగించడం చేస్తూ ఉంటే ఆ ఇళ్లల్లో పెరిగే పిల్లలు ఏం నేర్చుకుంటారు?
రాజకీయ నాయకులు ముఖ్యంగా సభ వేదికలపై ఉపయోగించే పదజాలం అసభ్యకరంగా ఉన్నప్పుడు సభ్య సమాజం ఏమి స్పందించకుండా ఉండడం విచారకరం.వ్యక్తిగతంగా
ఏవైనా కోపాలుంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలి కానీ నలుగురి ముందు మాట్లాడే హక్కు వాళ్లకు ఉండకూడదు .ఈ నియంత్రణ అనేది పాలనలో తప్పకుండా రావాల్సి ఉంది. ఒకళ్ళు మాట్లాడారు కదా అని ఇంకొకళ్ళు మాట్లాడడం ,వాళ్ళతో పోలుస్తూ చెప్పడం వాళ్ళు చెప్పిందే మేము చెబుతున్నా అనే ఉదాహరిస్తూ చెప్పడం ఒక అలవాటుగా మారిన కాలంలో మనం ఉన్నాం .ఇది ముఖ్యంగా రాజకీయ నాయకుల ప్రసంగాలలో గమనిస్తున్నాం. ఇది ఎక్కడో ఒక దగ్గర కట్టడి చేయవలసిందే! దీనికి దేశంలోనే అత్యున్నత స్థానమైన న్యాయస్థానం ముందుకు రావాలి. అసభ్య పదాలను ఉపన్యాసాలలో ఉపయోగిస్తూ మాట్లాడితే వెంటనే చర్యలు తీసుకొని చూపించాలి. అప్పుడే తర్వాత వాళ్ళు ఎవరు మాట్లాడరు .లేకుంటే భావితరాలకు ఏ సమాజాన్ని అందించిన వాళ్ళం అవుతాం?

ఒక ఉన్నతాధికారిగా ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తన క్రింద పనిచేసే ఇతర హోదాలలో ఉన్నటువంటి ఉద్యోగస్తులతో మర్యాదపూర్వకంగా మాట్లాడతారు, మర్యాదపూర్వకమైనటువంటి భాషతో భావంతో మెలుగుతూ తాము తీసుకున్న నిర్ణయాలు అందరికీ అందజేస్తారు. నాయకులైన అంతే.ఉదాహరణకు వివిధ రకాల సంఘాలు ఉంటాయి ఆ సంఘాలకు నాయకులు ఉంటారు వాళ్ళ మనసులో ఎలాంటి కోపతాపాలున్నా కూడా సంఘానికి సంబంధించిన మీటింగ్ సభను పెట్టుకున్నప్పుడు మర్యాదపూర్వకంగా మాట్లాడతారు. పిల్లలు తల్లి తండ్రి తమకు నచ్చని అంశాలు కనిపించిన పిల్లలతో సభ్యత ఉట్టిపడే స్వరంతోనే భాషతోనే మాట్లాడుతారు. ఇది ఎందుకు అంటే వాళ్ళ మనోభావాలు దెబ్బ తినకుండా ఉండాలని తాము ఆశించినటువంటి సంస్కరణలే కాని, అభివృద్ధి పథకాలే కానీ మంచి విషయాలే కానీ చెప్పేందుకు ఒక పద్ధతి అనేది ఉంటుంది ఆ పద్ధతిలోనే మాట్లాడుతారు , వాళ్లకు చేరవేయగలుగుతారు,అప్పుడే అనుకున్నది సాధిస్తారు. కుటుంబంలో కాకుండా కార్యాలయాలలోనూ లేదా సంస్థ లాభనష్టాల విషయం చర్చించేప్పుడైనా ఒద్దికైనా మాటలతోనే తమ నిర్ణయాలను వెలిగిచ్చుతారు. అంతేకానీ కోపం వచ్చిందని ఇష్టమున్నట్టు మాట్లాడితే తమ అనుకున్నవి సాధించలేరు.

రాజకీయ నాయకుల వరకు వచ్చేసరికి ఇది క్రింద మీద అవుతుంది. ఈ మధ్యకాలంలో ప్రత్యర్థులను తిడితే కానీ దుర్భాషలాడితే కానీ ఒక హల్ చల్ వస్తుంది అనే ఒక ఉద్దేశంతో ఉంటున్నారు. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంది రాజకీయాలనేవి ఈనాటివి కావు వందల సంవత్సరాలుగా నడుస్తున్నాయి ముఖ్యంగా మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కూడా ఎంతోమంది నాయకులు దేశాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి మాట్లాడుతున్నారు మాట్లాడిస్తున్నారు. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఇది గర్హనీయం. ఈ పరిస్థితులు మారాలి.

ప్రత్యేకంగా మన తెలుగు భాషకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇతర భాషల కన్నా మిన్న అయిన భాష మనది. సరళంగా సౌమ్యంగా మాట్లాడడం చేతకాకుంటే శిక్షణ తీసుకోవాలి కోపోద్రి క్తులను చేసేలా పదజాలం
వాడితో మాట్లాడితే ఎంతో అసహ్యంగా అనిపిస్తుంది. ఉపన్యాసాలలో చెడు
ఉంటే కలిగే నష్టం ఎవరికి ? కింది వర్గాల వారికి ! మా సారు ఇలాగే మాట్లాడాడు కాబట్టి మేము ఇలాగే మాట్లాడాలి అనుకుంటున్నారు వాళ్ళు. ఇది ఎవరికి మంచిది కాదు. ఈ పద్ధతి పోగొట్టాలంటే,రాజకీయ పాఠశాలలను ఏర్పాటు చేసి శిక్షణనిచ్చి రాజకీయాల్లోకి వచ్చేలా నిబంధనలను తీసుకువస్తే గాని మార్పు వస్తుంది. భాష సభ్యత ను ఇస్తుంది. భాష భవితను ఇస్తుంది. ఇది గ్రహించి మెసలుకోవడం ఓ బాధ్యత!

September 30, 2024 2 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంట‌ర్వ్యూలు

చక్కటి భాషను ఉపయోగించండి- సృజన సమాజానుకూలంగా చేయండి – డా. సంగనభట్ల నర్సయ్య

by Aruna Dhulipala September 30, 2024
written by Aruna Dhulipala

సాహిత్యము, సంగీతము, ఆధ్యాత్మికము, పరిశోధన, కళారంగాల్లో కృషి చేస్తూ తెలుగు భారతికి విశేష సేవలందిస్తున్న డా. సంగనభట్ల నర్సయ్యగారి జీవిత ప్రస్థానాన్ని వారి మాటల్లోనే తెలుసుకుందాం.
 
నమస్కారం సార్..

1ప్ర :- మీ జననం, పుట్టిన ప్రాంతం వివరాలు చెప్పండి.
జ:-     నమస్కారం అమ్మా! మయూఖ పత్రికకు నన్ను ఇంటర్వ్యూ చేయాలనుకోవడం చాలా విశేషమని అనుకుంటున్నాను. పైగా అది అంతర్జాల పత్రిక. పాఠకుల సంఖ్య కూడా ఎక్కువే. మీరు అడిగిన విధంగా నా జీవిత విశేషాలను చెబుతాను. నేను 1954 జూలై 23వ తేదీన పాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధర్మపురి గ్రామంలో పుట్టాను. మా అమ్మ నర్సుబాయమ్మ. మా నాన్న సంగనభట్ల వెంకన్న. ఆయనను వ్యవసాయ విజ్ఞాన నిపుణుడు అని చెప్పుకోవచ్చు. మా గ్రామానికి ఒరుసుకొని గోదావరీ నది పారుతూ ఉంటుంది. మనకు అలంకార శాస్త్రంలో “గంగాయామ్ ఘోషః” అనే మాట ఒకటి ఉంది. శబ్ద శక్తులు అభిద, వ్యంజన, లక్షణ అని మూడురకాలు. అందులో లక్షణ శక్తికి ఉదాహరణగా ఈ మాట ఉంటుంది. నేను పనిచేసిన కళాశాల ప్రహరీగోడ అవతలి వైపు దూకితే గోదావరిలో పడేంత దగ్గరగా ఉంటుంది. మావూరు తీర్థ క్షేత్రం. రెండు అర్హతలు ఒక్కచోట ఉండడం అరుదు. అది ఒక విశేషమైతే రెండవది మా ఊరు 3 వేల సంవత్సరాల చరిత్ర కలిగినది. మన ఉభయరాష్ట్రాల్లో ఇంత ప్రాచీనమైన గ్రామాన్ని చూడము. దానికి సంబంధించిన రికార్డులు కూడా ఉన్నాయి. దానిమీద “ధర్మపురి క్షేత్ర చరిత్ర” పుస్తకాన్ని నేను రాశాను.
 
2 ప్ర :-  మీ విద్యాభ్యాసం, ఉద్యోగ జీవితాన్ని తెలపండి.
జ :-      మేము అగ్రహారీకులం కావడం వలన వంశాచారాన్ని అనుసరించి బాల్యంలోనే ఉపనయనం జరిగి సంస్కృతాధ్యయనం, వేదాధ్యయనం చేశాను. మా కుటుంబంలో నేను పెద్దవాడిని. 1969 లో నా హెచ్.ఎస్.సి పూర్తయింది. అది తెలంగాణ వేర్పాటు ఉద్యమ దశ. మేమంతా ఉద్యమవీరులం. ఒక పదిరోజులు జైలులో కూడా ఉన్నాను. అంతకు ముందు 4, 5 సంవత్సరాల క్రితం మా ఊళ్ళో పెట్టిన “శ్రీ లక్ష్మీ నరసింహ సంస్కృతాంధ్ర కళాశాల” (సాయం కళాశాల)
లో ఇంటర్మీడియట్, డిగ్రీ లెవెల్లో ఓరియెంటల్ లాంగ్వేజెస్ లో చేరాను. డిప్ ఓ ఎల్, బి ఓ ఎల్, ఎమ్ ఓ ఎల్ చేశాను. తర్వాత ఎమ్ ఎ. పి హెచ్ డి. అన్నీ మావూళ్ళోనే. నేను తర్కం, వ్యాకరణం, సంస్కృత కావ్యాలు, ఛందశ్శాస్త్రం సాంప్రదాయకంగా సంస్కృతం బేస్ డ్ గా చదివాను. తర్కశాస్త్రం, కావ్యాలు కొన్నింటిని కొరిడె రామారావు గారి దగ్గర, కాశీవజ్ఝల మృత్యుంజయ శర్మగారి దగ్గర సిద్ధాంత కౌముది, గుండి రఘురామ శాస్త్రిగారి దగ్గర రఘువంశం చదువుకున్నాను. వాళ్లంతా స్థానిక పండితులే కాక రాష్ట్రపతి అవార్డు గ్రహీతలు. హిందీ శ్యామ్ సుందర్ గారి వద్ద చదువుకున్నాను. ఒక విశేషం ఏమిటంటే తల్లి గర్భం నుండి బయటకు వచ్చిన 60 సంవత్సరాల వరకు మా ఊరు నుండి నేను బయటకు రాలేదు.
          చదివిన కాలేజీలోనే లెక్చరర్ గా, ప్రిన్సిపాల్ గా పని చేశాను. చదువుతున్నప్పుడే ఒక ఎయిడెడ్ పోస్టులో, పగలు నడిచే సంస్కృత పాఠశాలలో టీచరుగా పనిచేశాను. సుమారు 40 సంవత్సరాలు నా సర్వీసు. ఓరియెంటల్ కళాశాలలో 8 సంవత్సరాలు లెక్చరర్ గా పనిచేసి తర్వాత ప్రిన్సిపాల్ గా చేశాను. నేను ప్రిన్సిపాల్ గా పనిచేసిన కాలం ఒక రికార్డు. 28 సంవత్సరాలకే ప్రిన్సిపాల్ గా చేరి, 58 సంవత్సరాలు వచ్చేవరకు 30 సంవత్సరాలు ప్రిన్సిపాల్ గా అది కూడా ఒకే కాలేజీలో చేయడం విశేషం. అభివృద్ధిలో కానీ, విస్తరణలో కానీ నేను దానికి ఉద్యోగిగా కాక తల్లికి చేసినట్టు సేవలందించాను.
 
3 ప్ర :-మీ కుటుంబ నేపథ్యాన్ని వివరించండి.
జ :-      మా ఇంటి పేరు సంగనభట్ల. సంగనభట్టు అనే వ్యక్తికి సంబంధించిన కుటుంబం కాబట్టి ఆ పేరు వచ్చింది. 8 వందల సంవత్సరాల క్రితం కన్నడ బ్రాహ్మణుడు సంగనభట్టు మా ఊరికి వచ్చి అక్కడే స్థిరపడ్డాడు. అప్పటికే పశ్చిమ చాళుక్యుల పరిపాలనా కాలం ముగుస్తున్న దశ. అతని వంశీకులుగానే మేము తామరతంపరగా పెరిగాము. దాదాపు 500 బ్రాహ్మణ కుటుంబాలున్న ధర్మపురిలో 150 వరకు సంగనభట్ల వంశీయులవే ఉంటాయి. మరొక విశేషం ఏంటంటే ఇన్ని కుటుంబాలలో ఏ ఒక్క కుటుంబం కూడా ఊరు వదిలి మరోచోటికి వలస వెళ్ళింది లేదు. దానివల్ల ఉభయ రాష్ట్రాలలో మా ఇంటిపేరు గలవాళ్ళం మేము తప్ప ఎవరూ లేరు. కొన్ని ఇతర కుటుంబాల వలె మాది గ్రామ నామంతో కాక వ్యక్తి విశిష్ట నామంగా ఏర్పడింది. మా తండ్రులు, తాతలు అంతా ఆ ఊరివాళ్లే.
       మా పెదనాన్నగారు రామకృష్ణ  ఘనపాఠి గోదావరి జిల్లాల్లో వేదసభలు నిర్వహించి ‘జగజ్జేయుడు’ అనిపించుకున్నాడు. తెలంగాణ నుండి 80 సంవత్సరాల క్రితం అక్కడి ప్రాంతాలన్నీ తిరిగి ‘విజయుడు’ అని పట్టా పుచ్చుకునేవరకు కదిలేవాడు కాదు. ఆయన చరిత్ర పుట్టపర్తిలో వేద కాలేజీ ప్రిన్సిపాల్ నాకు చెప్పాడు. మా పెద నాన్నగారితో ఈయనా తిరిగేవాడట. ఇక మాతామహుల వైపు మా తాతగారు హరికథలు చెప్పేవాడు. సంగీత విద్వాంసుడు, ఆయుర్వేద వైద్యుడు కూడా. ఒక్క రామదాసు కథను 400 హరికథలు చెప్పాడు. ఆ రోజుల్లో ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతీ గ్రామం తిరిగాడు. ఆ కథలో లీనమై కథ చెబుతూ ఏడుస్తుంటే, ప్రేక్షకులు కూడా ఏడ్చేవారట. అంత ప్రసిద్ధి ఆయన కథనం. మా మేనమామ చాచం కిష్టయ్యగారు గొప్ప సంగీత విద్వాంసుడు. ఆయన దగ్గర శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను. మా అమ్మ కూడా సంగీతం పాడేది. త్యాగరాయ కృతులతో నాకు జోల పాటలు పాడేది. ఆమె విదుషి కూడా. పురాణ, ఇతిహాస కథలు చెప్పేది. ఆమె బాల్యంలో చదువుకోకపోయినా నాతో పాటు అక్షరాలు దిద్ది చదువుకున్నది. వేదం చదువుకున్నప్పటికీ జాగీర్దార్లం కావడం వలన పౌరోహిత్యం చేసేవాళ్ళం కాదు. మా మేనమామ కుటుంబం మాత్రం మా ఊళ్ళోనే పౌరోహిత్యంతో పాటు, ఆయుర్వేద వైద్యం కూడా చేసేవాళ్ళు.
         
4 ప్ర :-దేశి ఛందస్సు మీద పిహెచ్ డి చేయాలనే మీ కోరికకు కారణం ఏమిటి?
జ:-       ఓరియెంటల్ కాలేజీ కావడం వల్ల మాకు ఛందో వ్యాకరణాలు గురువులు చెప్పేవారు. మేము కూడా విశేష అధ్యయనం చేయడం జరిగింది. గ్రామీణ వాతావరణం కనుక పాటలంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది. వచనం కంటే భిన్నంగా పాటలెందుకు ఆకర్షిస్తాయి? అనే ఒక ఊహలో నుంచి పరిశోధన చేయాలనే ఆలోచన వచ్చినప్పుడు ఒక సంఘటన జరిగింది. ఆ కాలంలో ‘భారతి’ వంటి ప్రసిద్ధ పత్రికలు ఉండేవి. అప్పకవి తెలుగులో గొప్ప ఛాందసికుడు. ఆయన చెప్పిన కందభేదాలు అసమంజసమంటూ ఆ పత్రికకు ఒక వ్యాసం రాశాను. అది పెద్ద సంచలనం ఆ రోజుల్లో. బిరుదు రామరాజు గారు ఆ వ్యాసం చూసి “ఛందస్సులో మీరు పరిశోధన చేస్తే బాగుంటుంది”. అని అప్లికేషన్ పంపించారు. ఛందస్సులో పరిశోధన చేయడానికి అది ఒక కారణం. నేను అధ్యయనం చేస్తున్నప్పుడు  ‘అప్పకవీయము’ ను క్షుణ్ణంగా చదివాను. ఆయన 40 దాకా యతిభేదాలు చెప్పారు. ఇవన్నీ అవసరం లేదనేది నా భావన. ఇది రెండవ కారణం. పి హెచ్ డి సీటు ఇవ్వడానికి సినారె గారు నన్ను ఇంటర్వ్యూ చేశారు. చాలాసేపు ఛందస్సు మీద ఆయన ప్రశ్నలు అడగడం, నేను సమాధానాలు చెప్పడం జరిగింది. చివరకు ఆయన ” నేనొక వేళ సీటు ఇవ్వకపోతే మీరేం చేస్తారు?” అని అన్నారు. ” సీటు ఇచ్చినా, ఇవ్వకపోయినా నా పరిశోధన కొనసాగిస్తూనే ఉంటాను” అన్నాను. ‘బాగా చెప్పావు’ అన్నారు నవ్వుతూ. 26వ యేట సీటు పొంది 32వ ఏట పూర్తిచేశాను. పి హెచ్ డి పట్టా రావడానికి ఆలస్యమైంది.
 
5 ప్ర :- ఆ జాప్యానికి ప్రత్యేక కారణం ఏమైనా ఉందా?
జ:-        ముఖ్యంగా రెండు కారణాలు. లెక్చరర్ గా ఉన్నప్పుడు పి హెచ్ డి రిజిస్టర్ చేస్తే, ప్రిన్సిపాల్ అయ్యాక బాధ్యతలు పెరిగి ఆలస్యమవడం ఒక కారణం. రెండవది…నేను తీసుకున్న అంశం “తెలుగులో దేశి ఛందస్సు – ప్రారంభ వికాస దశలు”. దేశి ఛందస్సులన్నీ గేయ మూలాలు అనే ప్రతిపాదనతో పాటు ఏ గేయం నుండి ఏ ఛందస్సు పుట్టింది? గణవ్యవస్థ ఏమిటి? వీటన్నిటి మీద పరిశోధన చేశాను. చివరి క్షణాల్లో నాకు వచ్చిన మరొక ఆలోచన ఏమిటంటే తెలుగు భాష అభివృద్ధిలోకి రావడానికి పూర్వం మన తెలంగాణ ప్రాంతాన్ని ఏలిన భాష ప్రాకృతం. మరి ప్రాకృత భాషా ప్రభావం ఈ ఛందస్సుల మీద ఉండకూడదా? జనాల్లోనూ, సాహిత్యంలోనూ, పాటల్లోనూ ప్రాకృత భాష ఉంది. అది లేకుండా నేను చేసిన పరిశోధన అసంపూర్ణమవుతుందని భావించి ప్రాకృత ఛందస్సులు చదివాను. సీస పద్యంలో పద్యం మీద పద్యం ఉండడం మన ఛందస్సులో లేదు. అది ప్రాకృత భాషకు చెందిన ఛందస్సుగా గుర్తించాను. అట్లాగే కందం ఆర్యా ఛందస్సు మనది కాదు. అది పది రకాలుగా ఉంటుంది. దాంట్లో ‘గాహా’ అనేది ఒక ఛందస్సు. ప్రాకృతంలో ప్రసిద్ధి. హాలుడు రాసిన ‘గాథా సప్తశతి’ లో గాథ అంటే ప్రాకృతంలో ‘గాహా’. అది ఒక ఛందస్సు పేరు. మనమనుకునే కథ అనే అర్థం కాదు. ఏడు వందల కథలు కావు. ఏడువందల శ్లోకాలు.
ప్రాకృతంలో ఉన్న వీటన్నిటినీ పరిశీలించి సమగ్రంగా రాయడం వల్ల ఆలస్యమైంది.
    4, 5 ఏళ్ళలో పి హెచ్ డి పుస్తకం రావడం విశేషమైతే అచ్చు వేసిన తక్షణం బాగా ప్రాచుర్యం పొంది వివిధ విశ్వవిద్యాలయాలు పాఠ్య గ్రంథంగా
తీసుకోవడం, రెండుసార్లు అచ్చు కావడం మరీ విశేషం. ఈ విషయంలో సినారె గారు ఎంతో ప్రశంసించారు. పాటిబండ మాధవశర్మ గారి తర్వాత 25 ఏళ్లకు ఉస్మానియాలో దీనిపైన పరిశోధన చేసిన వ్యక్తిని నేనే. మాధవశర్మ గారు కేవలం మహాభారతంలో ఛందస్సు ఉపయోగించడం ద్వారా రసావిష్కరణ ఎలా జరిగిందో చూపించారు. కానీ నేను మొత్తం శాస్త్రం మీదనే పరిశోధన చేశాను. 1300 సంవత్సరాలలో ఛందస్సు పుట్టుక, పరిణామం, వికాసం వీటన్నిటి మీద పరిశోధన చేశాను. ఇలా నా అభిరుచి తప్ప మరొకటి కాదు. ఆరు పాదాల జానపద గేయం సీస పద్యంగా మారిందని, సీస పద్యానికి ఆరు పాదాలేనని చెబుతూ నేను ఒక పరిశోధన వ్యాసం రాశాను. అది చూసిన చేకూరి రామారావు గారు “ఈ ఒక్క దానికే మరొక పి హెచ్ డి ఇవ్వొచ్చు” అన్నారు. అలా నా ఇష్ట పూర్వకంగా సమగ్ర పరిశోధన చేశాను.
 

సంగనభట్ల నర్సయ్యగారితో ముఖాముఖి గ్రహీత అరుణధూళిపాళ

6 ప్ర :- సంస్కృత ఛందస్సుల నుండి మన తెలుగులోకి మారిన విధానాన్ని తెలపండి.
జ :-      సంస్కృత ఛందస్సులన్నీ మనవి కావు. అవి మార్గి. గణ వ్యవస్థ, త్య్రక్షర గణాలు, ఉత్పలాది పద్యాలు, షడ్వింశతి ఛందాలు మొత్తం సంస్కృతం నుండి వచ్చినవే. అక్కడినుండి మన తెలుగులోకి తెచ్చుకున్నాం. ఛందస్సు రెండు రకాలు. ఒకరకంగా చెప్పాలంటే గంగా యమునలు. గంగానది దేశి ఛందస్సు అనుకుంటే యమున మార్గి. బయట నుండి వచ్చిందని అర్థం. త్య్రక్షర గణ ఛందస్సులన్నీ సంస్కృతం. అయితే వాటిని మనం సొంతం చేసుకునేటప్పుడు యతి, ప్రాసలను జోడించాము. అవి సంస్కృతంలో ఉండవు. సంస్కృతంలో ప్రాస అంటే అనుప్రాసాలంకారంలో ఉంటుంది. యతి కూడా మనలాగా ఉండదు. కేవలం విశ్రాంతి. అసలు యతి అనేది మన ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలతో తయారైంది. పాదం ఒకచోట ఆపాలంటే, ఉచ్ఛ్వాస ద్వారా గాలి లోపలికి పీలుస్తాం. అక్కడ శబ్దం పుట్టదు. నిశ్శ్వాసలో ధ్వనులు పుడతాయి. మన ఊపిరి ఎంతవరకు ఆపగలుగుతామో అంతవరకు ఉచ్చరించ గలుగుతాము. తరువాత ఉచ్ఛ్వాస ద్వారా గాలి పీలుస్తాం. అక్కడే మధ్యలో యతి ఉంటుంది. అందుకే సంస్కృతంలో పాదాన్ని ఆపడమంటే ఉచ్ఛ్వాస నిశ్శ్వాసలే ప్రధానం. అందుకే అక్కడే యతి పాటించడం జరుగుతుంది. “యతిర్విచ్ఛేద సంజ్ఞితా” అని శాస్త్రం. అంటే పదం ముగిసి తరువాతి అక్షరం దగ్గర యతి విచ్ఛేదం అవుతుంది. మనకు తెలుగులో అట్లా కాదు. విచ్ఛేదం కాకున్నా సంఖ్యా నియమానుసారం యతి పాటిస్తాం. దీన్ని ‘సదృశాక్షర యతి’ అంటారు. ఇలాంటి మార్పులతో సంస్కృతం నుండి ఛందస్సు తెలుగులోకి వచ్చింది.

 7 ప్ర :- గోదావరీ తీర వాసులు కావడం వల్ల బాల్యం నుండీ పుష్కర స్నానంలో పునీతులు అయ్యారు..అలాగే మీ  “పుష్కర విశిష్టత” గ్రంథానికి మీకు కలిగిన ఆసక్తి కారణమా? లేక ఎవరి ప్రోత్సాహం అయినా ఉందా?
జ :-     ఆధ్యాత్మిక రంగం నా పరిధిని విస్తృతం చేసింది. నేను సుమారు పది పన్నెండు అంశాల మీద గ్రంథాలు రాశాను. పరిశోధన చేశాను. ధర్మపురి పుణ్యక్షేత్రంలో పుట్టడం వలన గోదావరీ నదీ తీరం కాబట్టి పుష్కరాలు నాలో ఉత్సాహాన్ని, ఆసక్తిని రేకెత్తించాయి. ముఖ్యంగా గోదావరి నది పుష్కరాలు మిగతా నదుల కంటే విశేషం. ఎందుకంటే గోదావరి నదికి మాత్రమే ఆది, అంత్య పుష్కరాలు ఉంటాయి. గురువు సింహరాశిలో ప్రవేశించగానే ఆది పుష్కరాలు వస్తాయి. గురువు కన్యా రాశిలో ప్రవేశించే 12 రోజుల ముందు అంత్య పుష్కరాలు వస్తాయి. ప్రాచీన గ్రామాలన్నీ, రాజధాని నగరాలన్నీ నదీ తీరంలోనే వెలిశాయి. ఎందుకంటే నది లేకుండా మానవ జీవనం లేదు. నది ఒడ్డున ఉండే జీవితం గొప్పది. నేను 30 సంవత్సరాలు ఏ ఒక్కరోజు తప్పకుండా నదిలో స్నానం చేశాను. నదిలో ఈత కారణంగా వ్యాయామం అవుతుంది. అందులో ధర్మపురికి చాలా విశిష్టత ఉంది. నేను ఈ విషయాల్లో రాసిన రచనల ద్వారా ప్రసిద్ధుడనైన తరువాత చాలా పత్రికల వాళ్ళు నన్ను గోదావరి పుష్కరాల పైన వ్యాసాలు రాయమని అడిగి రాయించుకున్నారు. పుష్కరాల తర్వాత వాటిని వదిలివేయకుండా ఆ వ్యాసాలన్నీ సంకలనంగా వేయాలని నాకనిపించింది. అందులో ఈ వ్యాసాలతో పాటు కొంత ఆధ్యాత్మికత జోడించి, నదిలో స్నానం చేసేటప్పుడు ఏ మంత్రాలను చెప్పాలో వాటిని కూడా జత చేయడం వల్ల ఒక కరదీపికగా ఉంటుందని అలా ఈ పుస్తకం వేసి అందరికీ పంచిపెట్టాను. ఆ విధంగా ఆ నదీమతల్లి ఋణం తీర్చుకున్నాను. గోదావరికి గంగ అనే పేరు శాసనాల్లోనే ఉంది. కుందమాంబ ఆదిలాబాద్ జిల్లాలో వేయించిన శాసనంలో ఏ భూమినైతే బ్రాహ్మణుడికి దానం చేసిందో, దాని సరిహద్దులు చెబుతూ దక్షిణం వైపు గంగ ఉన్నదని చెప్పడం జరిగింది. అంటే గోదావరి గంగ పేరుతో ప్రసిద్ధం అని అర్థం. మా ఊరికి అటు వైపు కాశి పేట, కాశి అనే ఊర్లున్నాయి. అంటే ఉత్తర భారతదేశం నుంచి వలస వచ్చిన వాళ్ళు తెలంగాణలో దక్కను పీఠభూమి మీద స్థిర నివాసం ఏర్పరచుకున్నప్పుడు నదీ తీరాల్లోనే ఉన్నారు. అందువల్లనే మాలాంటి ఊళ్ళు మూడు వేల సంవత్సరాల కిందటినుండే ఉన్నవని చరిత్ర చెబుతుంది. మిగతావి అవసరార్థం ఏర్పడినవి. తరువాతి కాలంలో పుష్కరాలకు అధిక ప్రాధాన్యం ఏర్పడింది. కానీ మాకు ఆ తేడా లేదు. నీటిలో ఉండే చేపపిల్ల, నేను సమానమే రోజూ జలక్రీడలే (నవ్వుతూ). నది వేగంగా ప్రవహిస్తున్నప్పుడు మెత్తటి ప్రాంతాల్లో ఉండే మట్టిని పైకి లేపుతుంది. అక్కడ జలాశయాలు ఏర్పడతాయి. అవి మాకు క్రీడా కేంద్రాలుగా ఉండేవి. అంత అనుబంధం గోదావరితో. అందుకే ఆ చరిత్రను రాశాను.
 
8 ప్ర :- రంగస్థలంపై మీ ప్రదర్శనలకు తొలి సోపానం ఏది? వాటి మీద మీ అభిరుచికి కారణం ఏమిటి? మీ నట ప్రస్థానం గురించి చెప్పండి.

జ :-     మా ఊరు కళలకు కాణాచి. ప్రాచీన సంప్రదాయాలన్నీ సజీవంగా నడుస్తున్న ఊరు. వేదం, వేదాంగాలు, జ్యోతిష్యం, తర్కం, మీమాంస, ఆయుర్వేదం వీటితో పాటు కళలు కూడా అక్కడే రాణించాయి. సాయంకాలం ఏదో ఒక వినోదం ఉండేది. భాగవత సప్తాహాలు, పురాణ ప్రవచనాలు, హరికథలు ఇలా దేవాలయాన్ని ఆశ్రయించి ఉన్న కళలకు సంబంధించిన కళాకారులు వచ్చేవారు. ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలు జరిగేవి. నటరాజ రామకృష్ణ గారు దేవాలయంలో జరిగే నృత్యాలు రికార్డు కూడా చేశారు. నాటకాల ప్రదర్శన కూడా జరిగేది. తెలంగాణలో నాటకం లేదంటారు. కానీ అప్పటికే ఉన్నాయి. బ్రాహ్మణులు మహారాష్ట్రకు వలస వెళ్లేవారు. బ్రిటిష్ వారు బొంబాయిని అభివృద్ధి చేసిన కాలంలో బ్రాహ్మణులకు అక్కడ ఇండ్లు ఉన్నాయి. ఇది 300 సంవత్సరాల క్రితం మాట. అంతకంటే ముందే పండితులంతా పూణేకు వెళ్లి పీష్వా ప్రభువుల వద్ద వారి పాండిత్యాన్ని ప్రదర్శించి జీవికకు కావలసిన డబ్బును, భూములను సంపాదించుకొని వచ్చారు. అక్కడే నాటక రంగానికి సంబంధించిన విషయాలు మన వాళ్లకు పరిచయం అయ్యాయి. 1936లో నాటకాలు చేయాలనే ఆలోచన రావడం, జాగీర్దార్లు కాబట్టి మహారాష్ట్ర నుండి ఆ వస్తువులను తీసుకొని వచ్చి నాటకాలు మొదలు పెట్టారు. అట్లా నాటకాలు చూస్తూ ఉండడం వల్ల నాటకాల పట్ల అభిరుచి ఏర్పడింది.

        ప్రధానంగా నేను హైస్కూలులో విద్యనభ్యసిస్తున్నప్పుడు విద్యార్థిగా నాటకం వేశాను. ప్రైమరీ, హైస్కూల్ దశలో నాటకం వేసే దిశగా ప్రేరేపిస్తే
 ఎంతస్థాయికి ఎదిగినా ఆ వ్యక్తి నాటకం వేస్తాడు. టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా నాటకాలు వేశాడు. నేను హిందీ
నాటకాలతో మొదలుపెట్టాను. ‘సోనే కీ వర్షా’ అని , రామ్ కుమార్ వర్మ రాసిన నాటకంలో దశరథుని తండ్రి అజమహారాజు పాత్ర వేశాను. 11 వ తరగతిలో ‘కన్యాశుల్కం’ లో గిరీశం ఏక పాత్రాభినయం చేశాను. మా బంధువర్గంలో చాలామంది నాటకాలు వేయడం, మా పూర్వీకులు వేస్తున్నవి చూడడం, శాస్త్రీయ సంగీతం నేర్చుకొని ఉండడం, మంచి గాత్రం ఉండడం ఇవన్నీ నాటకాలు నా జీవితంలో భాగం కావడానికి కారణాలు. పౌరాణిక పద్య నాటకాలు కూడా వేశాము. నేను నలభై రాగాల్లో పద్యాలు పాడగలను. నేను హైదరాబాద్ కు వచ్చిన తరువాత పద్యాలు పాడడం చూసి ‘SICA’ ( South Indian Cultural Association ) సంస్థ వాళ్ళు పోతన భాగవతం మీద ఉపన్యసించమని అడిగారు. ఎలాగంటే కనీసం 30 పద్యాలు పాడాలి. 20 రాగాల్లో పాడాలి. ప్రతీ పద్యం ముందు రాగం పేరు చెప్పాలని కోరారు. అంటే సాహిత్య ప్రసంగాన్ని హార్మోనియం జతగా చేశాను. హిమాయత్ నగర్ బాలాజీ భవన్ లో ఇది జరిగింది. మా ఊళ్ళో”ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ నాట్యమండలి” అనే పేరుతో నాటక సంస్థ థియేటర్లు లేని కాలంలో పెద్ద థియేటర్ లో నడుపబడేది. దాదాపు వేయి మంది ప్రేక్షకులు కూర్చుండే విధంగా సినిమా టాకీసు వలె నడిచేది. అటువంటి దానిలో నేను భాగస్వామిని అయ్యాను. రాముడు, కృష్ణుడు, అర్జునుడు, గయుడు, భీముడు, వీరభద్రుడు మొదలైన అనేక పాత్రల్లో దాదాపు 50 సంవత్సరాలు నాటకాలు వేశాను. ఇంకా వేస్తూనే ఉన్నాను. సాహిత్య రూపకాల్లో శ్రీకృష్ణదేవరాయలు, అల్లసాని పెద్దన, నందితిమ్మన మొదలగు పాత్రలు వేయడం జరిగింది.
 
9 ప్ర :-  నాటకరంగానికి మీరు అందించిన సేవలు ఎటువంటివి?
జ :-   మా ఊళ్ళో నాటకాలు చూసే వాళ్ళ సంఖ్య అధికం. బ్రహ్మోత్సవాల్లో నాటకం వేయడం ఒక నియమం. “శ్రీ లక్ష్మీ నరసింహ నాట్య మండలి” లో 88 సంవత్సరాలుగా నాటకాల ప్రదర్శన జరుగుతున్నది. నేను మూడవతరం వాడిని. నా ముందు రెండు తరాల వాళ్ళు బొంబాయి నుండి వస్తువులు తెచ్చుకునే వాళ్ళు. ఎవరి మేకప్ వాళ్లే వేసుకునేవారు. నేను కూడా చాలా కాలం అదే చేశాను. తర్వాత కాలంలో బయటి ప్రాంతాలకు వెళ్లి పోటీల్లో పాల్గొనడం, తెలుగు విశ్వవిద్యాలయ పోటీలకు, నంది పోటీలకు వెళ్లడం ప్రారంభించాము. నేను అతి బాల్యం నుండే నాటకాలు వేస్తూ వివిధ పాత్రలు ధరించాను. సాంఘికాలు, చారిత్రకాలు, పౌరాణికాలు ఇలా మూడు రకాల నాటకాలు వేశాను. వీర కాపయ, వీర పాండ్య కట్ట బ్రహ్మన, రామాంజనేయ యుద్ధం, గయోపాఖ్యానం, పాండవోద్యోగ విజయాలు వంటి నాటకాలు ప్రదర్శించేవాళ్ళం. సమయాన్ని వృధా చేసుకుంటూ, వైవిధ్యం లేకున్నా, పద్యాన్ని జిలేబీ చుట్టలాగా చుడుతూ గంట నాటకాన్ని మూడు గంటలు చేయడం వంటి వాటికి నేను వ్యతిరేకిని. నా దృష్టిలో ప్రధానమైనది పద్యం, పద్యంలోని భావం. మంచి గొంతు లేకపోయినా, రాగం తెలియకపోయినా దాన్ని తగ్గించి భావానుగుణంగా పద్యం పాడితే చాలు. లేకుంటే నాటకం రక్తి కట్టదు. రసావిష్కరణ జరుగదు. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల నుండి రాగ ప్రధానంగా వుండే నాటకాలు నాకు నచ్చేవి కావు. అదృష్టవశాత్తూ అప్పుడే సినిమాల్లో ఘంటసాల ప్రవేశం కావడం, సంక్షిప్తంగా పద్యాలు చదవడం చూసి ఆ పద్ధతిలో పద్యాలు చదవడం ప్రారంభించాము. ఆ కాలంలో నాటకం ఒక గొప్ప వార్తా మాధ్యమంగా పనిచేసేది. మా ఊళ్ళో బ్రహ్మోత్సవాలు పదిరోజులు జరిగేవి. ” శ్రీ లక్ష్మీనరసింహ నాట్య మండలి” తరఫున 2017 లో 80 ఏళ్ల నాటకోత్సవాలను రెండురోజులు జరిపించాను. మొదటి రోజు వేరే అతనిని అధ్యక్షునిగా చేసి మూడు గంటలు ‘వీరపాండ్య కట్ట బ్రహ్మన’ నాటకం వేశాను. రెండవరోజు నా అధ్యక్షతన ‘పాండవోద్యోగ విజయం’ నాటకం వేయించాను. వృద్ధ కళాకారులను సన్మానించాము. రమణాచారి లాంటి పెద్దలను పిలిచాము. ప్రభుత్వం తరఫున లక్షా డెబ్భై వేల నగదు వచ్చింది. 80 ఏళ్ల నాటకరంగ చరిత్ర అంతా రాసి, ఫొటోలతో సహా అచ్చు వేయించాను.
         నేను ఒక ప్రయోక్తగా, ఒక దర్శకుడిగా ప్రధాన పాత్రలో ఉంటూనే చిన్న పాత్రల వాళ్ళను తయారుచేసి, నాలుగు తరాల నుండి సేవ చేస్తున్నాను. నేను చారిత్రకుణ్ణి, సాహితీవేత్తను కూడా అవడం వలన తెలంగాణ ప్రభుత్వం తయారు చేస్తున్న గెజిట్ లో తెలంగాణ నాటకరంగాన్ని గురించి రాయమంటే 50 పేజీలు రాసి ఇచ్చాను. ప్రభుత్వం మారడం వల్ల అది మరుగున పడింది. బళ్ళారి రాఘవ కన్నడంలో సుప్రసిద్ధ రంగస్థల నటుడు. అక్కడ ఆయన ఆడిటోరియం కట్టారు. తెలంగాణ నుండి బళ్ళారి రాఘవ స్వాగతోపన్యాసానికి నన్ను పిలిచారు. ఇది అరుదైన విషయం. విజయనగరంలో అయిదు నాటకాల మీద
నాటకోపన్యాసాలు చేశాను. ప్రయోగ నాటకాలకు పరీక్షకుడిగా, విశ్వ విద్యాలయాల్లో జడ్జిగా వెళ్ళాను. ఈ మధ్య పౌరాణిక నాటకాలకు మిర్యాలగూడలో పోటీలు పెడితే జడ్జిగా అయిదు రోజులున్నాను. తెలంగాణలో నాటక రంగం మీద ‘ఫిలిం డెవలప్ మెంట్ కార్పొరేషన్’ లో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. దాంట్లో నేను ఒక మెంబరుగా ఉన్నాను. ఉమ్మడి రాష్ట్రంలో నాటకాలకు ‘నంది’ అవార్డులు ఇచ్చినట్లు తెలంగాణ రాష్ట్రంలో నాటక రంగంలో ‘సింహ’ అవార్డు ఇవ్వాలని ప్రతిపాదించాము. శాస్త్రీయ సంగీతం నేర్చుకొనడం వల్ల పద్యాలకు నేనే వివిధ రకాల ట్యూన్ లు కట్టి పాడతాను. శాస్త్రీయ సంగీతంలో కచేరీలు చేశాను కానీ ఎక్కువ దృష్టి దానిపై పెట్టలేదు. సంగీతమైనా, నాట్యమైనా కేవలం ప్రదర్శన కోసం అభ్యాసం చేయలేము. అరగంట ప్రదర్శనకైనా రోజులు రోజులు చేయాలి. జీవితాన్ని మొత్తం దానికి కైంకర్యం చేయాలి. అందుకని పూర్తిగా నాటకాలకే నా జీవితాన్ని  వెచ్చించాను. 55 సంవత్సరాల నాటకరంగ అనుభవం నాది. ఇప్పటికి కూడా వేస్తూనే ఉన్నాను.
 

సంగనభట్ల నర్సయ్యగారి రచనలు

10 ప్ర :-  మన ప్రాంతంలో నాటకరంగానికి ఉన్న ప్రాధాన్యత ఎటువంటిది? తిరిగి పూర్వ వైభవం తీసుకురావడం సాధ్యమవుతుందంటారా?
జ :-       నాటకం అనగానే గుంటూరు, విజయవాడ, తెనాలి, తణుకు, రాజమండ్రి ప్రాంతాలే అని ప్రజల్లో నిలిచిపోయింది. తెలంగాణాలో నాటకాలు లేవని ఒక అపప్రథ ఉంది. ఒక వాస్తవం కూడా ఉంది. ఎందుకు మనదగ్గర నాటకాలు వేయలేదని చెప్పాలంటే క్రీ.శ. 1475 కాలంలో రాచకొండ ప్రభువులు అంతమయ్యారు. స్వాతంత్య్రం వచ్చిన 1948 వరకు మన తెలంగాణ ప్రాంతాన్ని మొత్తం వివిధ రాజవంశాలకు చెందిన ముస్లింలే పరిపాలించారు. ఇస్లామిక్ కల్చర్ లో నాటకాలు ఆడడం, స్త్రీలు బాహాటంగా రావడం నిషేధం. తెలుగు భాషకు ఆదరణ లేకపోవడం ఇటువంటి కారణాల వల్ల వెనుకబడిన మాట వాస్తవం కానీ లేవని కాదు. ప్రభుత్వానికి సంబంధం లేకుండా పల్లెటూళ్ళో నాటకాలు ఆడేవారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ‘యక్షగానం’ ప్రసిద్ధి. అది తప్ప వేరే నాటకాలు లేవు. నాటకంలో యక్షగానంలో వచనం కాకుండా గేయరూపం ఉంటుంది. కందుకూరి రుద్రకవి ‘సుగ్రీవ విజయం’ నుండి తెలంగాణలో యక్షగానాలు ప్రసిద్ధి. మా ఊళ్ళో శేషప్ప కవి ‘ధర్మపురి రామాయణం’ అనే యక్షగానం రాశాడు. అది మూడు రోజులు రాత్రి పూట తెల్లవార్లు నడిచేది. ఆయన మనుమడు ‘కృష్ణ శతక’ కర్త నరసింహ కవి ‘మైరావణ చరిత్ర’ అనే యక్షగానం రాశాడు.
        తెలంగాణాలో పౌర్ణమి నాడు నాటకాలు ఆడతారని కొత్త సిద్ధాంతాన్ని నేను ప్రవేశపెట్టాను. నాటకానికి ముందు నటులందరూ బయటకు వచ్చి చంద్రుడికి పూజలు చేసి, నైవేద్యం పెడతారు. మరొకటి రాత్రిపూట కాబట్టి పురుగు పుట్రా ఉన్నా పున్నమి వెన్నెలలో ఆ ఇబ్బంది ఉండదు. ఇంగ్లీషు వాళ్ళ కారణంగా ఇంగ్లీషు నాటకాలు చూసినవారు హైదరాబాద్ లో సెటిల్ అయిన కారణంగా నిజాం అనుమతితో కొన్ని ప్రాంతాల్లో నాటకాలు ఆడేవారు. అవి పౌరాణికాలు కాబట్టి ప్రభుత్వ అభ్యంతరం ఉండేది కాదు. ప్రస్తుతం నాటకరంగం క్షీణదశలోనే ఉంది. మొదట నాటకం ప్రసిద్ధంగా ఉండేది. దాన్ని పాడు చేసింది సినిమా. సినిమాను పాడు చేసింది టి వి. టీవీని పాడు చేసింది సెల్ ఫోన్. ఎంత అద్భుత నాటక ప్రదర్శన జరిగినా, ప్రముఖులతో వేయించినా బహుశా ఒక్కసారి చూడడానికి వస్తారేమో! మా కాలంలో పాఠశాలల్లో హెడ్మాస్టర్లు ప్రోత్సహించేవారు. నేను మా కళాశాలలో ప్రతీ సంవత్సరం నాటకాలు వేయించాను. ప్రాథమిక, మాధ్యమిక, కళాశాల స్థాయిలో విద్యార్థులతో నాటకాలు వేయిస్తే నాటకం బతుకుతుంది. పూర్వ వైభవం వస్తుందని మాత్రం నేను ఆశపడడం లేదు.

11 ప్ర :- ప్రపంచ తెలుగు మహా సభల సందర్భంగా సాహిత్య రూపకంగా “ప్రతాప రుద్ర విజయాన్ని” ఎన్నుకోవడానికి కారణం ఏదైనా ఉందా?
జ :- ఉంది. చాలా చక్కటి ప్రశ్న ఇది. తెలంగాణ ఏర్పడిన తరువాత మనం సంస్కృతీరంగాన, సాహిత్య రంగాన చాలా అణచి వేయబడ్డామన్న భావన మన తెలంగాణ వాళ్లకు ఉండింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఇది కూడా ఒక బలమైన కారణం. ప్రపంచ తెలుగు మహాసభలు జరిగినప్పుడు ఒక సాహిత్య రూపకం ఏదైనా వేస్తే బాగుండునని ప్రభుత్వానికి  ఆలోచన వచ్చింది. అకాడెమీ నిర్వాహకులు సిధారెడ్డి గారు, అలాగే రమణాచారి గారు నన్ను పిలిచి అడిగారు. భువనవిజయం అనేక సార్లు ప్రదర్శించి ఉండడం, శ్రీకృష్ణదేవరాయలు తెలంగాణ చక్రవర్తి కాకపోవడం వల్ల అది కాకుండా తెలంగాణ చక్రవర్తుల మీద ఏదైనా నాటకాన్ని ప్రదర్శిస్తే సముచితంగా ఉంటుందన్నారు. సమయం కేవలం 15 రోజులు మాత్రమే ఉంది. నేను బాగా ఆలోచించి కాకతీయులు, పద్మనాయకరాజులు ఇద్దరూ తెలంగాణ ప్రాంతాన్ని పాలించినప్పటికీ నేను ప్రతాపరుద్రుని సాహిత్యసభను తీసుకోవాలనుకున్నాను. చరిత్ర, నాటకం, సాహిత్యం
 తెలిసినవాడిని కావడం వల్ల ప్రతాపరుద్రుడు, ఆయన కొలువులో ఉన్న సాహితీమూర్తుల గురించి నాటకం రాశాను. ఆ వివరాలకు సంబంధించిన చారిత్రక ఆధారాలు నాకు తెలుసు. ఆయన కొలువులో 300 మంది కవులు ఉండేవారు. ఆయన కొలువులోనే శ్రీనాథుని తాతగారు గౌరవ సత్కారాలు పొందాడు. ఈ విషయాన్ని భీమఖండంలో శ్రీనాథుడే స్వయంగా చెప్పాడు. అలాగే మల్లినాథ సూరి తాతగారు మల్లినాథుడు అక్కడ అవధానం చేసి స్వర్ణాభిషేకం పొందాడు. “శతావధాని మల్లినాథుడు వీరభద్రుని చేత సన్మానం చేయించుకున్నాడ”న్న శ్లోకం కూడా వుంది. ఆయన అవధాని కాబట్టి నేను నాటకంలో అవధాన ప్రక్రియను కూడా ప్రవేశపెట్టాను. దీన్నిబట్టి కాకతీయుల కాలం నాటికే అవధాన ప్రక్రియ ఉందని తెలుస్తుంది. ప్రతాపరుద్రుని ఆస్థానంలోని మల్లినాథుడు, విద్యానాథుడు మొదలైన కవి పండితుల పాత్రలను వేశాము. కృష్ణదేవరాయల ఆస్థానంలో తెనాలి రామలింగకవి లాగా హాస్య పాత్రకు ‘పేరిశాస్త్రి’ అనే పాత్ర ప్రవేశపెట్టి అతడు రాజుకు సహాధ్యాయి అయినట్టు కొంత స్వేచ్ఛా హాస్యం ఉండేటట్లు 40 పుటల నాటకం తయారు చేశాను. వాళ్ళ ప్రసిద్ధ పద్యాలను ఆ పాత్రలతో పలికించాను. ఉదాహరణకు విద్యానాథుని పాత్ర అయితే ఆయన ‘ప్రతాపరుద్రీయం’ నుండి శ్లోకాలు తీసుకొని ఆ పాత్ర చేత పలికించాను. కొన్ని పద్యాలను నేను రాశాను. అలాగ ఒక పద్య, చారిత్రక, సాహిత్య రూపకాన్ని వారం రోజుల్లో తయారుచేశాను. మిగిలిన వారం రోజుల్లో నాకు బాగా తెలిసిన, సాధ్యపడుతుందన్న వాళ్ళతో రిహార్సల్ చేయించాను. అలా ప్రపంచ మహాసభల్లో ‘ప్రతాపరుద్ర విజయం’ దిగ్విజయంగా వేశాము. ప్రతాపరుద్రుని కొలువులో ఇంత గొప్ప సాహితీ వేత్తలున్నారా? అని అందరూ ఆశ్చర్యపోయారు.
 
12 ప్ర :-  “సర్వజ్ఞ సింగభూపాలీయము” నాటక నేపథ్యం ఏమిటి?
జ :-     మనకు కాకతీయ రాజ్యం 1323లో పతనమై, తురుష్కాక్రాంతం అయింది. ప్రోలయ నాయకుడు, కాపయ నాయకుడు కారణంగా మళ్లీ స్వతంత్ర రాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు. అందులో మొదట ఓరుగల్లు తరువాత మిగతా రాజ్యాలు ఏర్పడ్డాయి. ప్రతాపరుద్రుని కొలువులోని సైన్యాధిపతులు చేసుకున్న రాజ్య నిర్మాణాల్లో రాచకొండ ఒకటి. అది శత్రు దుర్భేద్యమైనది. ఆ ప్రభువులు సాహిత్యంలో గానీ, పరాక్రమంలో గానీ, ఆధ్యాత్మికతలో గానీ,
ప్రజానురంజకంగా పాలించడంలో గానీ కాకతీయుల వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్నారు. ఈ రాజవంశంలో ముగ్గురు సింగభూపాలురు ఉన్నారు. మొదటి సింగ భూపాలుడు యుద్ధాల్లో ప్రసిద్ధుడు. ఆయనే రాజ్యాన్ని విస్తరించాడు. శ్రీనాథుడు దర్శించుకున్న రాజు రెండవ సింగ భూపాలుడు. ఈయన మనుమడు మూడవ సింగభూపాలుడు పోతనను ఆదరించినవాడు. పోతనకు శ్రీనాథునికి మధ్య తాత మనుమలకున్నంత ఎడం ఉంటుంది. దీన్ని నేను చరిత్ర నిర్మాణంలో ఐనవోలు శాసనంలో నిరూపించాను. ఈ సింగభూపాలుడు కూడా ప్రతాపరుద్రుడు, కృష్ణదేవరాయల వలె కవులను ఆదరించినవాడు. సంస్కృతంలో గొప్ప పండితుడు. ‘రత్న పాంచాలిక’ అనే నాటకం రాశాడు. నేను దానిని తెలుగులోకి అనువాదం చేశాను. ఆయన ‘రసార్ణవ సుధాకరం’ అనే అలంకారశాస్త్ర గ్రంథాన్ని రాశాడు.   శార్ఙ్గదేవుని సంగీత రత్నాకరానికి వ్యాఖ్యానం కూడా రాశాడు. సంగీతం బాగా తెలిసినవాడు. వ్యాఖ్యాత మల్లినాథసూరి, గౌరన లాంటి వాళ్లంతా ఆయన కొలువును సందర్శించారు. విశ్వేశ్వరుడు ‘చమత్కార చంద్రిక’ అనే అలంకార శాస్త్ర గ్రంథం రాసి సింగభూపాలునికి (రెండవ)అంకితం ఇచ్చాడు.
       నాకొక ఆలోచన వచ్చింది. ప్రతాపరుద్రుని మీద రాసినట్టు శ్రీనాథుడు, పోతన, గౌరన, విశ్వేశ్వరుడు ఇత్యాదులందరినీ తీసుకొని సింగభూపాలుని ప్రధానంగా చేసి రూపకం చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించి అలాగే సాహిత్యరూప కం రాయడం జరిగింది. తెలుగునాట భోగినీ దండకం పోతన రాశాడా? అని సందేహించే స్థితి ఉండింది. నేను పోతన భోగినీ దండకానికి ప్రతిపదార్థ వ్యాఖ్యానం రాశాను. కాబట్టి పోతన యవ్వనంలో ఉండగా సింగభూపాలుని కొలువులో ఉండేవాడని భావించి పోతన, సింగన, భోగిని వీళ్ళందరిని కలిపి నాటకం రాస్తే బాగుంటుంది కదా! అని దీనికి పక్కనే మరో అయిదు అంకాల నాటకం రాశాను. సాహిత్య రూపకానికి దీన్ని జోడించి మొత్తం ఆరు అంకాలతో ‘సర్వజ్ఞ సింగ భూపాలీయం’ రాశాను. ఇది, ‘ప్రతాపరుద్ర విజయం’ రెండూ కలిపి అచ్చువేశాను. ‘సర్వజ్ఞ సింగ భూపాలీయం’ ప్రదర్శనకు నోచుకోలేదు.
సంస్కృతంలో ఒక ప్రథ ఉంది. “నాటకాంతం హి సాహిత్యం” అంటే నాటకం రాసినప్పుడే సాహిత్యానికి పరిణతి వచ్చినట్లు లెక్క. ఒక పరిణత కవి, ఒక సాహితీ వేత్త, ఒక పండితుడు తానెన్ని రచనలు చేసినా నాటకం రాయాలి. కానీ నాటకం రాయడం ‘కత్తి మీద సాము’. దీంట్లో రచయిత ప్రత్యక్షంగా పాల్గొనడానికి వీలుండదు. వ్యక్తి యొక్క వ్యక్తిత్వం, కథ అంతా సంభాషణ రూపంలోనే నడవాలి. నాకు కూడా నాటకాలు రాయాలనే ఉబలాటం కలిగింది. అందుకే రెండు నాటకాలు రాశాను.
 
13 ప్ర :-  ‘ధర్మపురి’ క్షేత్ర చరిత్రను రాశారు కదా! దాని గురించిన విశేషాలు కొన్ని మా పాఠకుల కోసం చెప్పండి.
జ :-     నేను మౌలికంగా సాహిత్యవేత్తను. చరిత్ర నా అభిరుచి మాత్రమే. దానికి కారణం మా ఊరు ధర్మపురి ఒక గొప్ప విద్యా సాంస్కృతిక కేంద్రం. అంతులేని చరిత్ర కలిగినది. అది చెప్పాలంటే ఆధారాలు కావాలి. మా ఊళ్ళో దాదాపు 15 ప్రధాన దేవాలయాలు, 20 వరకు చిన్న ఆలయాలుంటాయి. అదొక దేవాలయాల నగరం. అంతకంటే పెద్దది మనకు చారిత్రకాధారమైన అనేక శాసనాలు ఉండడం. పశ్చిమ చాళుక్యుల నుండి బృహదాలయాలు నిర్మించబడ్డాయి. తరువాతి కాలంలో నరసింహ స్వామి దేవాలయాన్ని తురుష్కులు ధ్వంసం చేసి మసీదు కట్టుకున్నారు. సాహిత్యాధారాలు, శాసనాధారాలు, కావ్యస్థ ఆధారాలు, పండితులు ఆ నోటా ఈనోటా చెబుతున్న పారంపరిక కథనాలే కాక నేను పుట్టిన తర్వాత ఎక్కడికీ వెళ్లకుండా అక్కడే ఉండడం మూలంగా ఊరు చరిత్రను పరిశీలించడం మొదలుపెట్టాను. 37 శాసనాలు దొరికిన ఊరు. వీటితో నేను ‘ధర్మపురి చరిత్ర’ రాశాను. ఒక పక్క సాహిత్య నేపథ్యం, మరోపక్క గ్రామం అభివృద్ధి కావడానికి నదీపరంగా ఉన్న అవకాశాలేమిటి? ఇన్ని ఆలయాలు ఉండడానికి కారణం ఏమిటి? వీటిని ఎవరు కట్టించారు? ఇత్యాది ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కొని 300 పేజీల చరిత్ర రాశాను. చేకూరి రామారావు గారు “నీవు రాస్తున్నది చరిత్రనా? క్షేత్ర మాహాత్మ్యమా?” అని అడిగారు. చరిత్ర అని చెప్పాను. వెయ్యి సంవత్సరాల క్రితమే ఒక సంస్కృత మహాకవి 3 వేల శ్లోకాలతో పరమాద్భుతంగా, పురాణ పద్ధతిలో క్షేత్ర మాహాత్మ్యాన్ని రాశాడు. నేను రాసేదేముంది? అందుకే చరిత్ర రాశాను. కొంతమందికి ఉండే సందేహాలకు కూడా నేను ఇందులో ఆధారాలు చూపించాను. ధర్మపురిలో ‘ధర్మ’ అనే పదం బౌద్ధ ధర్మం నుండి వచ్చింది. 2600 సంవత్సరాల క్రితం బుద్ధుని కాలంలో ఆయన దగ్గర శిష్యరికం చేసినవాళ్ళు, బౌద్ధమతం స్వీకరించిన వాళ్ళు మా ఊరికి చుట్టుపక్కల పది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్నవాళ్లు. పాయసి, కప్పడు, బావరి వీళ్లంతా పాళీ, ప్రాకృత భాషలు ఉన్న కాలంలో బౌద్ధ వాఙ్మయములో ఉన్నవాళ్లు ఇక్కడ నివసించారు కాబట్టి బౌద్ధం బాగా ప్రచలితమైంది. పక్కనే బుద్ధాజిపల్లి అనే గ్రామం, మావూళ్ళో బుదాం మసీదు అని ఉన్నాయి. 
         వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ధర్మపురి చరిత్ర రాశాను. ఆ కాలంలో స్త్రీలు కూడా దానధర్మాలు చేయడం విశేషం. సామాన్య వ్యక్తులు చేసిన దానం నుండి రాజుల వరకు చేసిన దానాల శాసనాలు లభించాయి. మొదట 12 శాసనాలు దొరికితే నేను మరో 25 శాసనాలను వెలికితీశాను. అట్లా 37 శాసనాలు అయినాయి. విజయ నగర సామ్రాజ్య నిర్మాణ కారకుడు విద్యారణ్యస్వామి, చరిగొండ ధర్మన్న,  శేషప్ప కవి  వంటి వారు ఈ గ్రామానికి చెందినవాళ్ళు. హరిహర బుక్కరాయలు మా ఊరి పక్కన ‘మంగళ’ అనే గ్రామానికి చెందినవారు. ధర్మపురికి చెందిన పురాణం నరసింహభట్టు సదాశివరాయల చేత పల్లకీ మోయించుకున్నాడు. అల్లసాని తర్వాత ఆయనదే ఆ ఘనత. అప్పటినుండి ఆయన చతుర్వేదుల నరసింహభట్టు అయినాడు. మరో విశేషం వేములవాడ అరికేసరి చక్రవర్తి పంప మహాకవికి ధారాదత్తం చేసిన అగ్రహారం ఇదే ధర్మపురి. జినవల్లభుని కురిక్యాల శాసనంలో ఈ విషయ ప్రస్తావన ఉంది.
         ఇట్లా తవ్వినకొద్దీ అంతులేని చరిత్ర దొరికింది. అందుకే మొదటి ముద్రణలో రాసిన చరిత్రను రెండవ ముద్రణలో సంస్కరణ చేస్తూ భాషను కూడా చేర్చాను. మొత్తం ఇప్పటికి ఆ పుస్తకం 5 ముద్రణలు పొందడం గొప్ప విషయం. ఈ పుస్తకాన్ని చూసిన ఎండోమెంట్ కమిషనర్ నందివెలుగు ముక్తేశ్వరరావు గారు మహదానంద పడిపోయి వంద పుస్తకాలు కొని ఉమ్మడి రాష్ట్రంలోని ప్రసిద్ధ దేవాలయాలకు పంపి మీరందరూ ఈ విధంగా దేవాలయాల చరిత్ర రాయాలని సర్క్యులర్ వేశారు. అంత పాపులర్ అయింది.

14 ప్ర :-  అనేక రంగాల్లో విశిష్ట సేవలందించిన మీరు వెలువరించిన రచనలేవి?

జ :-     నేను చాలా రంగాల్లో కృషి చేసిన మాట వాస్తవమే. విశేషంగా ప్రాచీన సాహిత్యంలో చేశాను. ఛందశ్శాస్త్రం, అలంకార శాస్త్రం, వ్యాకరణ శాస్త్రం, నాటకరంగం, శాసనాలు, ప్రాచీన చరిత్ర, వ్యక్తుల జీవితాలకు సంబంధించిన వ్యాసాలు రాశాను. నేను ఇప్పటివరకు 550 పై చిలుకు ఉపన్యాసాలు చేశాను. వాటికే పరిమితం కాకుండా పైన చెప్పిన అన్ని రంగాల్లో దాదాపు 20 పుస్తకాలు రాశాను. ధర్మపురి చరిత్ర (అయిదు ముద్రణలు), తెలుగులో ఛందో వైవిధ్యం, పోతన కృత భోగినీ దండక వ్యాఖ్య, పింగళి సూరన కృత కృష్ణ దండక వ్యాఖ్య, తెలుగులో దేశి ఛందస్సు, పీవీ నరసింహారావు జీవితం-సాహిత్యం, శ్రీకృష్ణదేవరాయలు (అనువాదం), తెలుగులో చాటు కవిత్వం, దివ్వెనేత్రాలు (పద్యకవిత్వం), సమాంతరరేఖలు (వచన కవిత్వం), చిత్రభారతం, బసవకళ్యాణం, రంగనాథ రామాయణం  (సంపాదకత్వాలు) శ్రీలక్ష్మీ నరసింహ నాట్యమండలి చరిత్ర, ఛందోరస స్వరూపాలు, చతుశ్శతి, తెలివాహ గోదావరి, చిన్న వ్యాకరణ దీపం, ప్రతాపరుద్ర విజయం, సర్వజ్ఞ సింగ భూపాలీయం, పూత గోదావరి పుష్కర విశిష్టత, కోటిలింగాలు, భాగవత దశమ స్కంధ ఉత్తరార్థ వ్యాఖ్య (తిరుమల తిరుపతి దేవస్థానం వారి ప్రచురణ), తెలంగాణ మాండలిక భాషా వ్యాకరణం ఇవన్నీ నేను రాసిన పుస్తకాలు.


 15 ప్ర :-  చరిగొండ ధర్మన్న చిత్ర భారతాన్ని వెలికి తీసుకురావడానికి ప్రేరణ ఎవరు? దానిలోని విశేషాలను చెప్పండి.
జ :-      నేను ఛందశ్శాస్త్రంలో పరిశోధన చేస్తున్న సమయంలో తంజావూరు, మద్రాసు, తిరుపతి, విశాఖపట్నం, పూణె మొదలైన ప్రాంతాల లైబ్రరీలకు తిరిగాను. చెన్నైకి వెళ్ళినపుడు రావూరి దొరస్వామి శర్మ అని ఒక పెద్దాయన ఉండేవారు. నేను ఆయన దగ్గరకు వెళ్తుండేవాడిని. ఆయన నాకు ఆరుద్రను పరిచయం చేయించాడు. నేను చేస్తున్న పరిశోధనను చూసి అరుద్రకు నామీద అభిమానం ఏర్పడింది. ఒకరోజు మాటల్లో ఆయన “మీవూరి వాడే ఒకరు చిత్రభారతం పేరుతో రాశాడు చూశావా”? అని అడిగాడు. నాకు తెలియదన్నాను. విచిత్రం ఏమిటంటే కందుకూరి వీరేశలింగం పంతులు ఎనభై, తొంభై ఏళ్ల క్రితం ఆ పుస్తకాన్ని అచ్చువేశాడు. దాని గురించి వేట మొదలుపెట్టాను. ‘చిత్రభారతం’ దొరికాక చదివితే చిత్రంగా చరిగొండ ధర్మన్న అని మా ఊరివాడు రాసిందే అది. ఆయన ధర్మపురి వాడే అని చెప్పడానికి అందులో ఎన్నో ఆధారాలున్నాయి. ఆయన పోతనకు సమకాలికుడని, స్థలం ధర్మపురి అని తెలిసి నాకు చాలా ఆనందం కలిగింది. పరిశోధన చేసి ఏడాదిన్నరలోపు పూర్తి చేసి దానిపై ప్రసంగాలు చేసి, తెలుగు విశ్వవిద్యాలయం వాళ్ళు అడిగితే ఈ పుస్తకాన్ని పరిష్కరించి ఇవ్వగా వాళ్ళు అచ్చు వేశారు. చరిగొండ మహబూబ్ నగర్ జిల్లాలోని ఒక గ్రామం. అక్కడినుండి ఇక్కడకు వలస వచ్చాడు ఆయన. వలస వచ్చిన వాళ్ళందరికీ వారి గ్రామాల పేర్లున్నట్టే ఆయనకు చరిగొండ ఇంటిపేరు అయింది.
          ఇంకో విశేషం ఏంటంటే ఈ పుస్తకాన్ని అంకితం పుచ్చుకున్న ఎనుముల పెదనామాత్యుడు కూడా ధర్మపురి వాడే. ఇద్దరూ బాల్య స్నేహితులు. 
పెదనామాత్యుడు తన కళ్ళముందు నరసింహస్వామి దేవాలయాన్ని ధ్వంసం చేసి హింసాకాండను సృష్టించడం చూసి “ఈ దేవాలయాన్ని పాడు చేసిన వాడిని చంపి తీరుతాన”ని ప్రతిజ్ఞ చేశాడు. బ్రాహ్మణుడై నప్పటికీ యుద్ధవిద్యలు నేర్చి సైన్యాధిపతియై ఆ శపథాన్ని నెరవేర్చుకున్నాడు. ఆ విషయం చిత్రభారతంలో ఉంది. పెదనామాత్యుడు తదనంతరం ఓరుగల్లు షితాబ్ ఖాన్ రాజు దగ్గర ప్రధానమంత్రిగా పనిచేశాడు. అప్పుడే ఈ పుస్తకాన్ని అంకితం తీసుకున్నాడు. ఆ విధంగా ప్రాచీనసాహిత్యం పట్ల అభిమానం, దానికి ఆరుద్ర వంటి వారు ప్రేరణ కావడంతో ఈ పుస్తకాన్ని పరిష్కరించాను. దీన్ని నేను  ఒక ప్రాచీన మహా కావ్యాన్ని తెలంగాణ సరస్వతి మెడలో వేసిన పూలమాలగా భావిస్తాను. చరిగొండ ధర్మన్న ప్రబంధ కవులకంటే ముందు కాలం వాడు. ప్రబంధాలు ఎట్లా ఉండాలి? అనడానికి చిత్రభారతం ఒక మోడల్ గా ఉంటుంది. అల్లసాని పెద్దన, నంది తిమ్మన, కృష్ణదేవరాయలు ఎన్నో పద్యాలను దీని నుండి తీసుకొని రాసుకున్నారు. నందితిమ్మన ‘పారిజాతాపహరణం’ లో సత్యభామ కథను రాయడానికి ముందే ధర్మన్న రాశాడు. తెలంగాణ మొత్తానికి మనకు తెలిసినంతవరకు , రికార్డులో ఉన్నంతవరకు మొదటి శతావధాని ధర్మన్న. అత్యంత మనోహరమైన కవిత్వం ఆయనది. దానికి ఎవరితోనూ పోలిక లేదు. మనుచరిత్ర, పారిజాతాపహరణం కలిపిన దానికంటే చిత్రభారతం పెద్దది.1300 పై చిలుకు పద్యాలు రాశాడు. అంత గొప్పకవి చరిత్ర రాయడం వల్ల ఒక సాహితీ వేత్తగా నా జన్మ ధన్యమైనట్లు భావిస్తాను. ఆయన రచనలోని గొప్ప పద్యాలను తీసుకొని అవధాన ప్రక్రియలాగా ప్రశ్న అడుగుతుంటే చెప్పినట్లు ఆ పద్యాలను వివరిస్తూ పుస్తకం రాయాలని ఉంది.
 
16 ప్ర :-  మీ కోరిక నెరవేరాలని ఆశిస్తాం. అయితే ‘తెలుగులో చాటు కవిత్వం’ రాశారు కదా! అటువంటి ఆశు కవిత్వం ఇప్పటికీ ఆదరణ ఉందంటారా?
జ :-      ‘తెలుగులో చాటు కవిత్వం’ నా బాల్య రచన. అప్పుడెప్పుడో దేవులపల్లి రామానుజరావు గారు సాహిత్య అకాడెమీ పక్షాన ఇచ్చిన ప్రకటన మేరకు రాశాను. తర్వాత దాన్ని మళ్లీ సవరించుకొని అచ్చు వేశాను. మాకు హెడ్మాస్టర్ గా పని చేసిన వ్యక్తి వేమూరి లక్ష్మీ నరహరి శర్మ. ఆయన ఆ పుస్తకాన్ని చూసి “ఇంత మంచి పుస్తకాన్ని ఇన్నిరోజులు ఎందుకు దాచి పెట్టావ” ని అడిగారు. మనకు వేటూరి ప్రభాకరశాస్త్రి ‘చాటుపద్య మణిమంజరి’, దీపాల పిచ్చయ్య శాస్త్రి ‘చాటు పద్య రత్నాకరం’ పేరుతో చాటువులు సేకరించారు. శ్రీరంగాచార్య వంటివాళ్ళు కూడా చాటువులను సేకరించి మనకందించారు. చాటువులన్నీ కూడా ఆనాటి చరిత్రను, ఆ మహాకవుల జీవిత చరిత్రలను, వాళ్ళ పాండిత్య ప్రతిభలను చెప్తాయి. ఇవి నిజానికి పుస్తకాలలోని పద్యాలు కావు. జీవితంలో ఎప్పుడో జరిగిన సంఘటన ఆధారంగా రాసినవి. చాటుపద్యం వెనుక చారిత్రక నేపథ్యం కూడా ఉంటుంది.
వేములవాడ భీమకవి సుప్రసిద్ధ కవి అయినా ఆయన రాసిన 30 చాటు పద్యాల ద్వారా ఆయనను అంచనా కడుతున్నాం. అంతేకానీ ఆయన కావ్యాలేవీ లేవు. అట్లా మనకు వెయ్యేళ్ళ సాహిత్యం ఉంది. విశేషంగా కృష్ణ దేవరాయల అష్టదిగ్గజాల్లో సభాసంబంధమైన చర్చలు అన్నీ చాటురూపంలో ఉన్నాయి. వీటిని అధ్యయనం చేయాలి. వీటి వెనుక చమత్కారం ఉంటుంది. అనేకులకు ఈ పద్యాలు కంఠస్థంగా ఉంటాయి. కావ్యస్థం కాని ఈ చాటు పద్యం నిలుస్తుందా అంటే నిలుస్తుంది. మిగతావి నిలువవు.
 
17 ప్ర :- మీకు లభించిన అనేక పురస్కారాల్లో అమితంగా మిమ్మల్ని ఆనందింప చేసింది ఏది?
జ :- సహజంగా సాహితీవేత్తలకు పురస్కారాలు వస్తూనే  ఉంటాయి. నా స్వభావానికవి రుచించేవి కావు. పురస్కారాల కోసం పైరవీలు నడుస్తున్న రోజులు. ఏ వ్యక్తి పేరుమీద ఇస్తున్నారో, ఏ సంస్థ పేరు మీద ఇస్తున్నారో దానిమీద ఏ కృషి చేయనివాళ్లకు ఇస్తున్నారు. ఒకసారి నాకు గుంటూరు శేషేంద్రశర్మ గారి పురస్కారం ఇస్తామన్నప్పుడు ఆయన గురించి ఏమీ చేయకుండా తీసుకోనన్నాను. “ఆయన మీద ఒక రెండు గంటలు ప్రసంగం చేస్తాను తరువాత ఇవ్వండి” అని ఆ తర్వాతే తీసుకున్నాను. తెలంగాణ ప్రభుత్వం కాకతీయ మిషన్ అవార్డు ఇచ్చింది. దానికి ఒక చమత్కార విషయం ఉన్నది. గణపతిదేవ చక్రవర్తి పాలనా కాలంలో కరీంనగర్ జిల్లాలో చామనపల్లి అనే ఊళ్ళో గణపతి దేవుడు నిర్మించిన చెరువులకు సంబంధించిన కాలువల్లో ఒక కాలువ వీళ్ళ ఊరు వచ్చేవరకు, నీళ్లు ఆగిపోతున్నాయి. పైన గండి పెడుతున్నారు. బ్రాహ్మణులంతా కలిసి గణపతిదేవుని దృష్టికి తీసుకువచ్చారు. చక్రవర్తి దాని నిజానిజాలు తెలుసుకునే విధంగా ‘మాచిరాజు’ అనే పరిశీలక అధికారిని పంపించాడు. ఆయన దాదాపు పది గ్రామాల నుండి కులానికి ఇద్దరు చొప్పున వ్యక్తులను తీసుకొని కాలువ పక్కనే కూర్చుండి అది నిజమేనని నిర్ధారిస్తాడు. అంతేకాదు చక్రవర్తి పక్షాన “ఇలాంటి అన్యాయాలు ఇకముందు జరుగకూడద”ని రాగి రేకులపై సంస్కృతంలో శాసనం వేయించాడు. దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. నేను  సంస్కృత శాసనాలు పరిశీలిస్తున్నప్పుడు చూసి ఆశ్చర్య పోయాను. శాసనాలకు ఉండవలసిన లక్షణాలన్నీ దీనికి ఉన్నాయి. అంతేకాదు శాసనం మొత్తం సంస్కృతంలో ఉంటే కాలువ హద్దులు ప్రజలకు అర్థమయ్యేవిధంగా తెలుగులో ఉన్నాయి. దీన్నొక పెద్ద వ్యాసంగా రాసి, గణపతి దేవ చక్రవర్తి నాటి కాలంలో జల వనరులకు సంబంధించి ఏమేం కార్యక్రమాలు చేశారో చెప్తూ దాంట్లో చిట్టచివరగా “కాకతీయులు ఒక చెరువు తవ్విస్తే ఆ చెరువులోని చిట్ట చివరి నీటిబొట్టు కూడా చివరి పొలానికి అందేటట్లు చర్యలు తీసుకున్నారు”. అనే పేరాతో ముగించాను. ఆనాటి తెలంగాణ ప్రభుత్వంలో పెద్దలు అది చూసి మెచ్చుకొని “ఈయనకు ఫ్రీలాన్స్ జర్నలిస్టులకిచ్చే అవార్డు ఇవ్వమన్నార”ట. అట్లా మిషన్ కాకతీయ అవార్డు వచ్చింది. అది నాకు ఎంతో ఇష్టమైనది. ఈ వ్యాసం ‘తెలంగాణ’ మాస పత్రికలో వచ్చింది. అందులో నేను సీరియల్ గా కోటిలింగాల, కొండాపూర్, ధూళికట్ట, కొలనుపాక మొదలైన నగరాలను గురించి వాటి చరిత్రను ‘తెలంగాణ ప్రాచీన నగరాలు’ అనే పేరుతో రాశాను. ఛందశ్శాస్త్రంలో కృషి చేసినందుకు తెలుగు విశ్వవిద్యాలయం అబ్బూరి రామకృష్ణారావు మెమోరియల్ ‘ధర్మనిధి’ అవార్డు ఇచ్చింది. ‘గ్రామీణ కళాజ్యోతి’ పేరుతో నాటకారంగంలో పురస్కారం, శాసనాలలో కృషి చేసినందుకు బి.ఎన్ శాస్త్రి పురస్కారం ఇట్లా గ్రంథాలకు వచ్చినవి, శాస్త్రాల్లో కృషి చేసినవి ఎన్నో ఉన్నాయి.

 18 ప్ర :-  ఇటీవలే బాలవ్యాకరణ రీతిలో తెలంగాణ వ్యాకరణం రాశారు. దాని గురించి చెప్పండి.
జ :-       నేను బాల్యంలో ఓరియంటల్ కాలేజీ విద్యార్థిని కావడం వలన గురువుల నుండి వ్యాకరణం నేర్చుకున్నాను. అంతకు ముందే సంస్కృత వ్యాకరణం చదువుకున్న వాడిని. అందువలన ఆ శాస్త్రంలో పట్టు సాధించాను. పాఠాలు చెప్పడం, బాల ప్రౌఢ వ్యాకరణాల విశేషాలు తెలిసివుండడం మూలంగా ఒక భాషాప్రియుడిగా వ్యాకరణ రచన చేశాను. ఏ భాష మనకు ఉపయోగంలో  ఉన్నదో ఆ భాష లక్షణాలను, మిగతా ప్రాంత భాషలతో భిన్నత్వాన్ని, మాండలికాల భిన్నత్వాన్ని పరిశీలించే ఒక పద్ధతి ముందు నుండే ఉన్నది. మా ఊళ్ళో ఉన్నప్పుడే నాకు ఆంధ్ర వ్యాకరణ విశారద అని పేరు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ లో తెలుగు, ఉస్మానియా, కాకతీయ, అంబేద్కర్, కర్ణాటక హంపి విశ్వ విద్యాలయాలు అడిగితే పాఠాలు రాసిచ్చాను. రామోజీ ఫిల్మ్ సిటీలో డిక్షనరీ ప్రాజెక్టులో పని చేస్తున్నప్పుడు వాళ్ళు కూడా తెలుగుకు సంక్షిప్త వ్యాకరణం తయారు చేస్తే నిఘంటువులో అనుబంధంగా వేస్తామన్నారు. మధ్యలో కరోనా వచ్చి ఆగిపోయింది. ఇంగ్లీష్ – తెలుగు, తెలుగు – తెలుగు, తెలుగు – ఇంగ్లీష్ ఇలా మూడు డిక్షనరీలు తయారు చేయాలనుకున్నాం. అది రామోజీరావు గారి కల. ఇంగ్లీష్ – తెలుగు ఒక్కటే తయారైంది. నేను కన్సల్టెంట్ గా రోజూ వెళ్లి పదాలు తయారుచేసి అర్థాలు రాసేవాడిని. ఆ ప్రాజెక్టులో భాగంగా పిల్లలకు డిక్షనరీతో పాటు వ్యాకరణం రాయడం జరిగింది. దీనిని తెలంగాణ విశ్వ విద్యాలయం ముద్రించింది. తెలంగాణ ఏర్పడడానికి ముందు భాషా ప్రాతిపదికన కూడా మన దగ్గర ఉన్న వైలక్షణ్యాన్ని కవులు, పండితులు చెబుతూ వచ్చారు. మనది మాండలిక భాష అయితే అయి ఉండవచ్చు కానీ మిగతా మాండలికాల కంటే విలక్షణమైనది. కాబట్టి దీన్ని ఇతరులకు పరిచయం చేయాలంటే అందరిలో నేను ఒకణ్ణి కాకుండా ఒక వ్యాకరణ శాస్త్రమే రాయాలనిపించింది. శాస్త్రబద్ధంగా, సాంప్రదాయిక వ్యాకరణం ఎట్లా ఉండాలో అట్లానే తయారు చేయాలనుకున్నా. చిన్నయసూరి సూత్ర పద్ధతిలో తెలంగాణ పదాలను సాహిత్యంలోనూ, యావజ్జన వ్యవహారంలో ఉన్నవి తీసుకొని సంక్షిప్తత, విశ్వజనీనతలు ఉండేలాగా మూడువందల సూత్రాలతో ఈ వ్యాకరణాన్ని తయారుచేశాను. అది డిటిపి అవుతోంది. త్వరలో దాన్ని వెలుగులోకి తీసుకువస్తాను. కొంత ఆలస్యమైనా ప్రామాణికమైన తెలంగాణ భాష అందరికీ పరిచయం కావడం కోసం చేస్తున్న బృహత్ ప్రయత్నం.
 
19 ప్ర :-  ఒక శాసన పరిశోధకులుగా మీరు వెలికి తీసిన శాసనాలు ఏవి?
జ :-     చరిత్రకు సంబంధించిన ఆకరాలు అనేక రకాలుగా మనకు దొరుకుతాయి. అన్నింటిలోకి శ్రేష్ఠమైనది శాసనం. ఎందుకంటే ఒక వస్తువు దొరికితే ఆ వ్యక్తి గురించి తెలుస్తుంది.  సాహిత్యంలో దొరికిన వాటిలో కొన్ని అభూత కల్పనలు ఉండొచ్చు. పురాణాల్లో విశేషాలున్నప్పటికీ కొన్ని నమ్మలేనివి ఉంటాయి. పురా వస్తువులు దొరికితే వాటి పూర్తి వివరాలు తెలుసుకోవడం కష్టం. శాసనాలు అయితే ఆనాటి చరిత్ర మొత్తం తెలుస్తుంది. ఇంకో విశేషం లిపి కూడా ఆరోజుల్లో ఎట్లా ఉండేదో తెలుస్తుంది. నేనొక చరిత్ర పరిశోధకుడిగా, చరిత్ర పాఠకుడిగా, చరిత్ర రచయితగా ఏదైనా తవ్వకాల్లో బంగారు నాణాల బిందె దొరికిన దానికంటే ఒక శాసనం దొరికితే ఎక్కువ సంతోషిస్తాను (నవ్వుతూ). మా ఊళ్ళో అంతకుముందున్న 12 శాసనాలే కాక ఇంకా 25 వెలికితీసి మొత్తం 37 శాసనాలను వాటి అర్థాలతో సహా పుస్తకంలో రాశాను. ‘కోటిలింగాల’లో బుద్ధుని బోధనలను వివరిస్తూ రెండు వేల సంవత్సరాల కిందటి శాసనాలు పెద్ద పెద్ద బండరాళ్ల పైన ఉన్నాయి. నా ఊహ ఏంటంటే ఆ కాలంలో పెద్ద బౌద్ధ స్తూపం ఉండి ఉంటుంది. ప్రదక్షిణం చేస్తూ  వాటిని చదువుకునే విధంగా చెక్కి ఉంటారనిపించింది. తెలంగాణలో బౌద్ధం మీద ఒక వ్యాసం రాశాను. దానికి ఈ శాసనాలు ఎంతో ఉపయోగపడ్డాయి. గోనబుద్ధారెడ్డి గురించి దొరికిన మూడే మూడు శాసనాల ఆధారంగా మల్లంపల్లి సోమశేఖర శర్మ ఆయన జీవితాన్ని గురించి రాశాడు. తర్వాత నాకు ఇంకా పదకొండు శాసనాలు దొరికాయి. అందులో ఒక్కటి గోన బుద్ధారెడ్డి వాళ్ళ నాన్న గోన గన్నారెడ్డిది. అదొక్కటి విడిచిపెట్టి మిగతా వాటి ఆధారంగా సోమశేఖర శర్మ అంతకుముందు రాసిన బుద్ధారెడ్డి వంశవృక్షాన్ని సరి చేశాను. అట్లాగే రెండవ సర్వజ్ఞ సింగ భూపాలుని వద్దకు శ్రీనాథుడు వచ్చాడని, ఆయన మనుమడు మూడవ సింగభూపాలుని కొలువులో పోతన ఉన్నాడని, అందువల్ల శ్రీనాథ పోతనలకు చాలా ఎడం ఉందని నిర్ధారించి, ఐనవోలు శాసనంతో కొత్త ఆవిష్కరణ చేశాను.
        గోన గన్నారెడ్డి తమ్ముడు విఠల రెడ్డి. విఠల రెడ్డి కొడుకు బుద్ధారెడ్డి. తమ్ముని కొడుకును పెంచుకున్నాడు. ఈ కారణంగా శాసనాల్లో బుద్ధారెడ్డి తండ్రి గన్నారెడ్డి అని, పుస్తకంలో విఠల నాథుడని పేర్కొంటారు. ఇదే విధంగా ఒక శాసనంలో గణపతి దేవ చక్రవర్తి పెదనాన్న పేరు రుద్రుడు. తండ్రి మహదేవుడు. ఇక్కడ కూడా పెదనాన్న పెంచుకోవడం వల్ల ఒకచోట తండ్రి రుద్రుడంటే మరోచోట మహదేవుడు అన్నట్టు ఉంటుంది. దీని ఆధారంగా 7, 8 వందల సంవత్సరాల క్రితమే తమ్ముని కొడుకును పెంచుకోవడమనే సంప్రదాయాన్ని వెలికితీసి, నిర్ధారించడం జరిగింది. అయితే ఇవి చూడడానికి చిన్నవిగానే అనిపించినా లోతుల్లో పరిశోధన చేయవలసి వస్తుంది. బిర్లా ఫౌండేషన్ వాళ్ళు కరోనా కాలంలో హంపి విజయనగర రాజుల మీద ఉపన్యాసాలు చెప్పుమని అడిగారు. నేను 18 వారాలు రోజుకు రెండు గంటల చొప్పున ఉపన్యసించాను. ఆ సమయంలో విజయనగర కాలం నాటి శాసనాలను కూడా పరిశీలించాను. నందితిమ్మనకు ముక్కుతిమ్మన పేరు ఉందని శాసనాల ద్వారా నిరూపించాను.
 
20 ప్ర :-  మీరు చేసిన అనువాద రచనల గురించి చెప్పండి.
జ :-      అనువాదరంగం ఎలాంటిదంటే మూల గ్రంథానికి మాత్రమే ప్రసిద్ధి ఉంటుంది. ఎంత గొప్పగా లక్ష్య గ్రంథంగా అనువదించినా అనువాదకునికి పేరు రాదు. ఇంగ్లీషులో ఉన్న శ్రీకృష్ణ దేవరాయల పుస్తకాన్ని అనువదించుమని కేంద్ర సాహిత్య అకాడెమీ వాళ్ళు అడిగారు. అనువాదం చేశాక చూసుకుంటే ఇది తెలుగు భాషేనా? అనిపించింది. మూల గ్రంథం పక్కకు పెట్టి నా శైలిలో తిరిగి రాశాను. ఆముక్తమాల్యదలోని పద్యాల సౌందర్యం ఇంగ్లీషు భాషలో ఎట్లా వస్తుంది? అందుకే అందులో లేకపోయినా కృష్ణదేవరాయల కవితా సౌందర్యం తెలిసిన వాడిగా మూలంలో లేకున్నా ‘ఆముక్త’ పద్యాలను ఇందులో రాశాను. మూల గ్రంథంలో లేకుండా ఒక్క వాక్యం ఎక్కువ రాయకూడదని సాహిత్య అకాడెమీ నియమం. కానీ దీనికి వాళ్ళు అనుమతిచ్చారు. అందువల్ల మంచి పుస్తకం వచ్చింది. హిందీ నుండి కూడా కొన్ని అనువాదాలు చేశాను. తెలుగు సాహిత్యం కంటే ముందు హిందీ, ఉర్దూ సాహిత్యాలు చదువుకున్నాను. ఏడవ తరగతిలో చదువుకుంటున్నప్పుడు డాటర్స్ మర్డరర్ అనే డిటెక్టివ్ నవల రాశాను. ఎనిమిదవ తరగతి నుండే హిందీ సాహిత్యం, దానితో పాటే ఉర్దూ సాహిత్యం చదివాను. పదవతరగతిలో ఉన్నప్పుడే హిందీ పాఠశాలలో ఏదో కారణంగా హిందీ ఉపాధ్యాయుడు వెళ్లిపోవడంతో పాఠాలు కూడా చెప్పాను. పండిట్ జాకీర్ హుస్సేన్ రాసిన ‘అబ్బూఖాన్ కీ బక్రీ’ కథను తెలుగులోకి అనువదించాను. స్వాతంత్ర్యానికి సంబంధించిన ఆ కథ చాలా పాపులర్ అయింది. సర్వజ్ఞ సింగభూపాలుని “రత్నపాంచాలిక” సంస్కృత నాటకాన్ని కూడా తెలుగులో అనువాదం చేశాను. సంస్కృతంలో ఉన్న శాసనాలను, సంస్కృత కవితలను కూడా అనువాదం చేశాను. ఒకసారి బహుభాషా సమ్మేళనంలో సంస్కృత భాషలోని కవితలను తెలుగులోకి అనువదించి చదివాను. అనువాదం కూడా లక్ష్యభాషలో మాత్రమే చేశాను.
 
21 ప్ర :-  సంగీతం, సాహిత్యం, నాటకం, పరిశోధన పెనవేసుకున్న మీ జీవితంలో ఒక ఆధ్యాత్మిక వేత్తగా ఆధ్యాత్మిక రంగంలోనూ చేసిన కృషి ఏమిటి?
జ :-     నేను పవిత్ర తీర్థక్షేత్రంలో పుట్టడం, అక్కడి ఆధ్యాత్మిక వాతావరణం, చిన్నప్పటినుండీ వేదాధ్యయనం, సాంప్రదాయ కుటుంబ నేపథ్యం కారణంగా బాల్యం నుండే భక్తి ఎక్కువ. ధర్మపురిలో అనేక వైదిక సాంప్రదాయాలు, పండుగలు ఉన్నాయి. బతుకమ్మ కూడా అక్కడిదే. సత్యవతి అంటారామెను. ఆమె పేరు మీద ఒక దేవాలయం ఉంది. నేను సామాన్యుల నుండి శిష్టుల పండుగల వరకు అధ్యయనం చేసి వాటి విశేషాలను తెలుపుతూ వ్యాసాలు రాశాను. మన హిందూధర్మానికి రామాయణం, భారతం, భాగవతం మూడూ ప్రధానమైన గ్రంథాలని తెలిసిందే. వాటి మీద నేను అనేక
ఉపన్యాసాలు ఇచ్చాను. సంస్కృత భాగవత సప్తాహాలు చేశాను. దూరదర్శన్ వివిధ ఛానళ్లలో ప్రసంగించాను. తిరుమల, తిరుచానూరు, యాదగిరిగుట్ట మొదలగు దేవాలయాల్లో బ్రహ్మోత్సవాలకు వ్యాఖ్యానం చేశాను. ‘జయ జయ శంకర’ అనే ఛానల్ వాళ్ళు అడిగితే సంస్కృత నరసింహ పురాణం 60 ఎపిసోళ్లు చెప్పాను. అందులో 30 ప్రవచనాలు యూట్యూబ్ లో ఉన్నాయి. వివిధ పవిత్ర పండుగ రోజుల్లో దేవాలయాల వారు అడిగినప్పుడు పురాణాల్లో ఉన్నదానికి ఒక నవ్యత్వాన్ని జోడించి, ఆధునిక కాలానికి తగినట్లుగా వ్యాఖ్యానాలు చెప్పేవాడిని. ఆధ్యాత్మిక రంగంలో పుస్తకాలు రాసిన దానికంటే ఉపన్యాసాలు ఎక్కువగా ఉన్నాయి. ‘సనాతన ధర్మం’ అనే పేరుతో పుస్తకం రాశాను. అది అచ్చు కాలేదు. వ్యాసుని ‘నరసింహ పురాణం’ మూలం అర్థం రాసి అచ్చు వేయాలనే ఆలోచన ఉంది. ఆధ్యాత్మిక రంగంలో అనేక పుస్తకాలు వెలువడుతుండడంతో మనం చెప్పేదేముంది? అనే నిర్లిప్తత వల్ల రచనా వ్యాసంగం పెట్టుకోకుండా ఉపన్యాసాలు ఇస్తూ వస్తున్నాను.

22 ప్ర:-  నేటి సాహిత్యరంగంపై మీ అభిప్రాయం ఏమిటి?
రచనా సామర్థ్యాన్ని పెంచుకోవడానికి ఇప్పటి రచయితలకు మీ అనుభవపూర్వక సూచనలు ఇవ్వండి.
జ :-    సాహిత్య సృష్టి జరుగుతోంది. కానీ నాణ్యత లేదు. తెలుగు భాషను ప్రాథమిక దశ నుండి చదువుకున్న వాళ్లే సాహిత్య సృష్టి చేయగలరు. పరభాషా ప్రభావం వల్ల ఇంతకంటే అద్భుతంగా తెలుగు సాహిత్యం వికసిస్తుందని ఆశపడే పరిస్థితి లేదు. ఇంగ్లీషు భాషా ప్రభావం విస్తారమై మన మాటల్లో కూడా అనేక ఆంగ్ల భాషా పదాలు చొరబడి ఇది తెలుగేనా? అనే పరిస్థితిలో ఉన్నాం. అటువంటి భాష సాహిత్యానికి, కవిత్వానికి పనికొచ్చేది కాదు. కొన్ని అనివార్యమైన పదాలు వాడడం వేరు. వ్యవహారంలో మాట్లాడినట్లు రాతల్లో రాయలేము కదా! కాబట్టి భాషను శుద్ధంగా ఉంచుకోవడం తప్పనిసరి. తాము రాసిన దానిని భాష తెలిసినవారికి చూపించి వాటిని సరిదిద్దుకోవాలి. ఇది సరియైనదా, కాదా అని తనకు తాను చెప్పుకోగలిగేలా ఉండాలి. శ్రేష్ఠమైన సాహిత్యం రావాలి. దానికి పూర్వ సాహిత్యాన్ని అధ్యయనం చేయాలి. ” అనభ్యాసే విషం విద్యా” అని హితోపదేశంలో ఒక శ్లోకంలో ఉన్నది. దానికి సంస్కృతంలో పేరడీగా ‘అనధ్యయనే విషయం మిథ్య’ అన్నాను నేను. పూర్వకాలపు సాహిత్యకారుల సాహిత్యం అధ్యయనం చేయకుండా, పరిశీలించకుండా, అనుశీలించకుండా, అనుభవరాహిత్యంగా సాహిత్య సృష్టి చేయాలనుకుంటే అది వికారంగా తయారవుతుంది. అందువల్ల భావితరాన్ని నేను కోరేదేమిటంటే బాగా చదవండి. చక్కటి భాషను ఉపయోగించండి. సృజన సమాజానుకూలంగా చేయండి. ఏ ప్రక్రియలోనైనా నాణ్యత అవసరం. ఇది నా సలహా మాత్రమే.
 
        ధన్యవాదాలు సార్, అమూల్యమైన సమయాన్ని వెచ్చించి ఎంతో ఓరిమితో మీ జీవిత విశేషాలను తెలిపినం

September 30, 2024 1 comment
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us