మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us
ఇంద్రధనుస్సు

తెలుసుకుందాం!

by Achyutuni Rajasri September 28, 2026
written by Achyutuni Rajasri

నేడు అన్ని సౌకర్యాలు,పని అలసట లేకున్న ఎవరికి వారు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు.కారణం ఉద్యోగాలు విదేశాల్లో పిల్లలు మనవలు. ఏకాకులుగా వృద్ధుల జీవితాలు కాగితాల పూలుగా మారాయి. అందుకే పెంపుడు జంతువుల ఆలనపాలనతో పాటు వాటి ఫోటోలు,గీయించిన చిత్రాలతో ఇంటిగోడల్ని నింపటం విదేశాల్లో సాధారణమైంది. అవి చనిపోయాక వాటి జ్ఞాపకాలను తల్చుకుంటూ రకరకాల పోజుల్లో వాటి చిత్రాలు గీయించి తృప్తిపడుతున్నారు.కుక్కల పిల్లుల చిత్రాలకు భలే గిరాకీ పెరిగింది.చిత్రకారులకి మంచి గిరాకీ డబ్బు లభించటంతో వారు ఖుషీగా ఉన్నారు.విక్టోరియా మహారాణి తన ఇల్లంతా వందలాది కుక్కల పేయింటింగ్స్ తో నింపింది.ఒక్కో చిత్రం గీయటానికి 16లక్షలు వసూలు చేసే చిత్రకారులున్నారంటే నమ్మబుద్ధి కాదుగదూ?!

ఉత్తరప్రదేశ్ కి చెందిన హర్షితా అరోడా 13వ ఏట కోడింగ్ లో ఆసక్తి చూపి బడి చదువుకి ఫుల్ స్టాప్ పెట్టింది. 2020లో బాలశక్తి పురస్కారం లభించింది.2019లో స్నేహితులతో కల్సి ఎటూబీ అనే స్టార్టప్ ని ప్రారంభించి అమెరికాలో ఢంకా బజాయిస్తోంది.
రాత్రి నిద్ర పోగానే కొందరికి కమ్మని కలలు,కొందరికి భయంకర కలలు! కొత్తగా రిసెర్చి ప్రకారం,ఎక్కువ స్పష్టమైన కలలు వచ్చేవారికి వారి నిద్ర క్వాలిటీ చాలా బాగుంటుంది! ఆరోగ్యంపై సకారాత్మక ప్రభావం చూపుతుంది. 44మంది ఆరోగ్యవంతులపై రిసెర్చి చేశారు.ఒక్కొక్కరిని ఒక్కో సమయంలో నిద్ర నుంచిలేపారు. కల గుర్తుండకపోయినా గాఢనిద్ర ఆపై తెల్లారాక భలే హాయిగా ఉంటుంది.సగం సగం కలలు కనేవారి నిద్ర అంత ఆరోగ్యకరమైంది కాదు.కలలవల్ల కెమికల్స్ ఉత్పత్తి కావటం మనిషితాజా గా ఉల్లాసంగా తెల్లారాక ఉషారుగా ఉంటాడుట.అందుకే పూర్వం దైవ ధ్యానం మంచి కథలతో లాలిపాటలతో పిల్లల్ని నిద్ర పుచ్చేవారు. వారు గొప్ప వారు కావడానికి దోహదం చేశారు.నేడు చెత్త చూస్తూ కళ్లు ఒళ్లు బుర్ర పాడుచేసుకుంటూ చికాకు చిటపటలతో చిందులేస్తున్నారు

September 28, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

మామ్ గిల్ట్ సిండ్రోం!…

by Achyutuni Rajasri September 28, 2026
written by Achyutuni Rajasri

నేడు ఉద్యోగంచేసే అమ్మలకి వర్కింగ్ మామ్ గిల్ట్ సిండ్రోం కొత్త గా పీడిస్తోంది.పిల్లలకి తగిన టైం కేటాయింపులేక జాబ్ మానేయలేక, ఇంటాబైట పనులతో అతలాకుతలం ఔతున్నారు. ఆఫీస్ లో టెన్షన్ ,పిల్లలు ఏంచేస్తున్నారో అనే ఆలోచనతో అపరాధ భావంతో కృంగిపోతున్నారు. పిల్లల స్కూల్ కి వెళ్లలేకపోతున్నాననే బాధ కూడా ఉంటోంది.డే కేర్ సెంటర్ లో ఉన్న పిల్లలపై ఆలోచనలు,పిల్లల కి జ్వరం వస్తే, మార్కులు తక్కువ వస్తే తన అశ్రద్ధ అనే భావం పట్టిపీడిస్తోంది. ఇంట్లో ఉండే తల్లితో తనను పోల్చుకుంటుంది. ఫంక్షన్స్ కి వెళ్లాలంటే వెనకముందులాడుతుంది. మరి ఈసిండ్రోంనుంచి బైట పడాలంటే ఏంచేయాలి?క్వాంటిటీ కాదు,క్వాలిటీ చూడాలి పిల్లలతో గడపటానికి.సూపర్ మామ్ కావాలనే దురాశవద్దు.పిల్లల చేత చిన్న చిన్న పనులు చేయిస్తూ టైం కి పని పూర్తిచేయాలి.

September 28, 2026 2 comments
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

నవరసాల్లోకెల్లా కష్టమైన రసపోషణ

by చంద్రకళ దీకొండ September 28, 2026
written by చంద్రకళ దీకొండ

కవిత్వంలో హాస్యం పలికించడం, పండించడం ఆషామాషీ కాదు-పైగా “జాషువా కవిత్వంలో” అని అబ్బురపడే తరం కూడా లేకపోలేదు. నవరసాల్లో కరుణ, హాస్య రసాల పోషణ చాల కష్టం. ఈ రెండు జీవితంలో అనుభవించినవాడే కవి,కళాకారుడవుతాడు.హాస్యం మనిషిని ఆరోగ్యవంతం చేసే పరమౌషధం.
“నవ్వడం ఒక భోగం
నవ్వించడం ఒక యోగం
నవ్వకపోవడం ఒక రోగం”
అన్నారు “జంధ్యాల”.
కడుపారా నవ్వగల కవి చక్రవర్తి జాషువా.”అనేక ఇబ్బందుల్లో కూడా నవ్వగల ధీరోదాత్తుడు నాన్న”అని ఆయన చిన్న కూతురు ‘హేమాలతా లవణం’ అన్నారు.”మీ మీసాలపై నిలబెట్టవచ్చా?” అని ఒకరంటే “గుమ్మడికాయలను నిలబెడతా-సంపెంగనూనె వుంటే” అన్నారట తన “సెన్స్ ఆఫ్ హ్యూమర్” తో!

“కనబడవేమిర జగము కల్పన
చేసిన గారడీడ?అని ఆ బ్రహ్మను నిలదీస్తాడు.
నాలుగు మోములుం తలలు నాలుగు దాలిచి వత్తువేమొ!యీ
కాలము వారు మానిసి మొగం పద్మము కన్నవంచు జం
త్వాలయమందు జేర్తురు సుమా!కమలాసనా!స్రష్టవంచునీ
నాలుగు నోళ్లు మొత్తుకొనినన్ వినరొక్కరు విశ్వసించరున్”
అంటూ ఉక్రోషం,వ్యంగ్యంతో ప్రజల అజ్ఞానంపై చురక వేసారు.
“పేదరికం పెద్ద వింత విద్యాశాల.అందులోన లజ్జ గానపడదు అంటూ కన్నీళ్లను దైన్యంగా కాక,ధైర్యంగా ఎదుర్కోవడం దళిత జీవిత అనుభవం నేర్పింది” అన్నారు.
చేతిలో చిల్లిగవ్వ లేకపోయినా, సన్మానాల్లో కొత్తబట్టలు కట్టుకుంటే,లోకులు ఆడిపోసుకునేవారు.అప్పుడు ఈ విధంగా స్పందించారు…
“కలవారిచ్చిన పట్టువస్త్రములతో గన్పట్టునన్ జూచి,శ్రీ
గల వాడీతడటంచు నల్వురన,నాకర్షించి, నా కన్న కొ
డ్కులు( జుట్టాలునూ డబ్బు లేదనిన
సంకోచింతురీనాటిక
న్యుల మాటేల?ప్రపంచమందు ఋతమున్ శుద్ధానృతాంబయ్యెడిన్!”
అని వాపోయారు.
మహిళాపక్షం వహిస్తూ-“అల్లుడు”ఖండిక లో ఈ విధంగా…
“పురుషాకారత నున్న జాలత నీలో
పుంస్త్యంబు లేకుండినన్
పెండ్లియాడిన భార్యల పిప్పిజేసి
తరుముచున్నవి పురుష భూతములు కొన్ని
స్త్రీత్వమిడి యట్టివాని శిక్షింపవోయి!”
సనాతనులు,పండితులు కోపగించుకొనేలా తన అధిక్షేప ధోరణితో ఈ విధంగా…
“నిన్ను చూపుమానుచు నేనర్చకుని వేడ
చూడమనుచు గుడిని చూపినాడు.
గుడికి బోయి చూడ గుండ్రాయివైనాడ
వెందుకిట్టిలైతి రేడ్పు వచ్చె
బ్రతికియున్న సాయిబాబెన్నడు గాడు
చావకున్న వట్టి సాయిబయ్య
తిరుమలేశుడైన తెలియడీ యుద్ధంబు
చావు బ్రతుకులోని సారమిదియ!”

కొంతకాలం ఆకాశవాణిలో కార్యక్రమ ప్రయోక్తగా పని చేసిన ఆయన,స్టేటస్ సింబల్ గా రేడియోను భావించే రోజుల్లో, ఆకాశవాణిపై ఇలా…
“నాల్గువందలిచ్చి నట్టిల్లు సగమిచ్చి
మెచ్చి చేతులార తెచ్చుకొంటు
రేడియో మెషీను చేడియా!దయచేసి
పాడకమ్మ!చలిది పాత పాట!”

కవులపై ఇలా ఘాటుగా వ్యంగాస్త్రం సంధించారు…
“నా కవిత్వంబునందు రత్నములు గలవు
వాని బెకలించి చూపెడు వాడు లేడు
కాలమిట్లున్నదని మొనగాడు వోలె
పలుకు కవిగాడ!యేటికీ స్వాతిశయము?
ఏవియా రతనంబులు!
నీవే పెకిలించి యట్లొనర్పగ
నీవలనన్ గాదా! యింక నీల్గెదవేలా?”
నేటి ఆధునిక కవులకు సైతం వర్తించే విషయమిది!

సుకవుల పక్షమూ వహిస్తూ,వారి సాధకబాధకాలను ఇలా తెలిపారు.
“కవిగాడి బ్రతుకు శ్రీరామ రామ
ఈ బిరుదముల్ ఈ గండ పెండేరముల్ దుప్పట్లక్కర
తీర్చునా?సుకవులెందున్ మందభాగ్యుల్ గదా!”
అని మధనపడ్డాడు.
ఇక పద్య కవుల కష్టాల గురించి-“కవిగా పుట్టడమే శాపం”అంటూ ఇలా వివరించారు,బాల్యంలో అవధాన సాధన చేసిన ఆయన!
“గణబాధ రవ్వంత గడచి ముందుకు సాగ
తగ్గవో!యని యతిస్థానమురుము
యతిని మచ్చిక జేసి యడుగు ముందుకు సాగ
ప్రాసంబు కుత్తుక బట్టి నిలుపు
ప్రాసవేదన దాటి పయనంబు సాగింప
భావంబు పొసగకిబ్బందివెట్టు
భావంబు పొసగించి పద్యంబు ముగియింప
రసలక్ష్మి కినిసి మారాము సేయు
ఇట్టి ప్రీతి బంధకములెల్ల గడచి
గట్టుకెక్కదనున్న వ్యాకరణ శాస్త్ర
మాదరింపదు శబ్ద మర్యాద గాన
రాక;కవిగాని బ్రదుకు శ్రీరామ రామ!”

దీపాల పిచ్చయ్య శాస్త్రి గారి పిలకతో ఆడుకున్న అపురూప స్నేహం ఆయనది.అప్పట్లో “జంటకవులు” గా ఇరువురు కవులు రాణించేవారు. ఆ సందర్భంలో తామిరువురు జంటకవులైతే ఏ పేరు పెట్టుకోవాలి అనే విషయంపై సుప్రసిద్ధమైన ఈ పద్యం ఈ విధంగా…
“నా పేరు ముందు నిల్వం
పాపంబదియేమొ జాషువా పిచ్చులగున్
నా పేరు చివర నిల్చిన
శాపంబిడినట్లు పిచ్చ జాష్వాలయ్యెన్”
అంటూ అందరినీ నవ్వించారు గుఱ్ఱం జాషువా గారు.

హాస్యప్రక్రియల్లో క్లిష్టమైనది పేరడీ ప్రక్రియ.”ఒక మాతృకకు అధిక్షేపాత్మకమైన,హేళనాత్మకమైన, హాస్యాత్మక విషయాంతరాలతో కూడిన అనుకరణ” అన్నారు తిలక్.
ఉత్తమ పేరడీ మూలానికి విధేయంగా వుంటూ, వస్తువుకు మాత్రం చోటు కలిగించాలి. మూలంలోని అపహాస్యం చేయదగ్గ అంశాన్ని వెతికి పట్టుకొని, దాన్ని ఉత్ప్రేక్షించి,పాఠకుని మూలరచనను గుర్తుచేసేట్లు వ్రాయగలగాలి.అప్పటిదాకా ఆ కోణంలో చూడని పాఠకుడి చేత “అవును.ఇది అతిశయోక్తిలా ఉంది.దీనిని వెక్కిరించవచ్చు” అనిపించేలా ఆమోదాన్ని పొందగలగాలి. కనబడ్డ ప్రతి రచనను చదువుతూ,దానిలో తనకు కావలసిన గుణం గురించి వెతుకుతూ వుండాలి. అందుకే తక్కువమంది కవులు సమకాలీన కవుల రచనలకు వేటినీ వదలకుండా, వాటికి పేరడీలు వ్రాసి,ఆ కవుల,పాఠకుల మెప్పు పొందారు.వికటకవిత్వం అనవచ్చు దీనిని.దీనికి విస్తృతార్థం వుంది. హాస్యం,వ్యంగ్యం,దూషణ,ఆభాస, చమత్కారం ప్రధానంగా గల కవిత్వమిది.
వారిలో పేరడీలకు ఆద్యుడు,
కవన్నవాడిననెవ్వడినీ కవ్వించక,నవ్వించక వదిలేవాడు కాని జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి గారు,జరుక్ శాస్త్రిగా,వికటకవిగా గుర్తింపు పొందినారు. తన ఇంటిపేరుపై సైతం హాస్యంగా “H2O ను కనిపెట్టింది మా వాళ్లే” అంటూ చమత్కరించేవారట.

కఠినంగా వుండే పదాలు,సమాసాలతో పద్యాలను ఎత్తుకునే
జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారి శైలిపై ఇలా పద్యములనల్లారు.
కించిత్తిక్త కషాయషాడబ రసక్షేఫాతిరేకాతివా
క్సంచార ప్రచయావకాశాములలో కవ్యుద్ఘ!గండాశ్మముల్
చంచల్లీల నుదాత్త వాగ్గరిమతో సాధించి వేధించుమా
పంచారించి ప్రవహ్లికాకృతి కృతిన్ పాషాణపాక ప్రభూ!

పూర్ణముగ నిన్ను అవునని ముద్దిసేయ
రాదు,కాదని పట్టి పల్లార్చరాదు
గౌరవింపగ దగ్గ శిఖండివీవు
నీదు మార్గాన నీయంత నేత లేడు.
ఒక్కరు,ఇద్దరు కాదు,ఆనాటి ఉద్ధండులందరినీ దాదాపు ఆడేసుకున్నారు.

శ్రీ.శ్రీ.గారి “వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథచక్రాలు” పై పేరడీ ఇలా…
లలాటాన కుంకుమాగ్ని,భుజం మీద మబ్బుదుబ్బు
కాళ్ళకింద కిర్రుచెప్పు,అంగోస్త్రం పొడుంకాయ
వ్యవధి లేని అవధానం వెళ్లిపోయిందెళిపోయింది
చెళ్ళపిళ్ల పద్యావళి చిలకమర్తి గయుడి కథా
వడ్డాదీ,పానుగంటి,బావినీళ్లు,బ్రహ్మసమాజ్
తాటికాయ నీటికాడ,ఫుల్లుమూను టాటాలూ
ప్రచారిణీ చింతామణి వెళిపోయాయ్యెళిపోయాయి
గిరజాలూ లాల్చీలూ, వల్లెవాటు కళ్ళజోళ్లు
టాగూరూ,పొడుగు రైక,
రిస్టువాచి,రోషనార
ఎంకిపాట,హనీడ్యూలు,కాంతం కథ,జలవైద్యం
టాల్మాడ్జీ,గృహలక్ష్మీ,లారెన్సీ,లాంగ్ ఫెలో
సాయ్ బాబా,ఫెవర్ బాబా వెళిపోయాయ్యెళిపోయాయి
చీరాలా పేరాలా, హోమ్ రూలు,మాగ్డోనాల్డు
ముద్దుకృష్ణ జ్వాలగోల అయిపోయిందయిపోయింది
మా కళ్ళ ముందు,కాళ్ళ ముందు వెళిపోయాయెళిపోయాయి
కపిలవాయి, గంధర్వా,స్థానం నటి,చలం వ్యధా
రాయప్రోలు దేశభక్తి,విశ్వనాథ విసురుళ్లూ
డాడాయిజం,ఇమేజిజం వెళిపోయా య్యెళిపోయాయి అంటూ పదాలతో కదం తొక్కేసారు.
ఉత్తమ పేరడీ మూలానికి విధేయంగా వుంటూ, వస్తువుకు మాత్రం చోటు కలిగించాలి.అందుకే పుట్టుకతోనే జరుక్ శాస్త్రికి ఉత్తమోత్తమ లక్షణం అలవడింది.

శ్రీ.శ్రీ.మహాప్రస్థానం లోని
“ఆనందం అర్ణవమైతే
అనురాగం అంబరమైతే
అనురాగపుటంచులు చూస్తాం
ఆనందపు లోతులు తీస్తాం”
దీనికి పేరడీగా..
“ఆనందం అంబరమైతే
అనురాగం బంభరమైతే
అనురాగం రెక్కలు చూస్తాం
ఆనందం ముక్కలు చేస్తాం”
అంటూ వ్రాసారు.
ఇక “నేను సైతం” కవితను ఇలా..
“నేను సైతం కిళ్లీ కొట్లో పాత బాకీలెగరగొట్టాను
నేను సైతం జనాభాలో సంఖ్యానొక్కటి వృద్ధి చేశాను”

“ఏ దేశ చరిత్ర చూసినా” కు
“ఏ కాకి చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం”

“ప్రపంచమొక సర్కస్ డేరా”(పద్మవ్యూహంకు)
“కవిత్వమొక వర్కర్ బూరా”(తీరని దాహం కు)

ప్రసిద్ధమైన “తాజ్ మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు” కు ఇలా..
“ఫిరదౌసి వ్రాసేటప్పుడు తగలేసిన బీడీలెన్ని”

“నడి నిశిలో తీతువు కూతా
పడిపోయిన బెబ్బులి వేటా
కర్రెక్కిన నల్లి నెత్తురూ
జుర్రేసిన వుల్లి కారమూ
చించేసిన కాలెండర్ షీట్
నపుంసకుడి థాట్ డెవలప్మెంట్
సామానోయ్ సరదా పాటకు!”

“తృళ్ళనిదీ కుళ్ళనిదీని
మళ్లినదీ వెళ్లినదీని
చచ్చేదీ లాభం లేనిది
ఈ జన్మకు పనికిరానిదీ
మనకెప్పుడు కలిసిరానిదీ
సామానోయ్ సరదా పాటకు!”
అంటూ “కావాలోయ్ నవ కవనానికి” కి పేరడీగా వ్రాసారు.(దీనిలో ఇంకా చాలా చరణాలున్నాయి)

“C, A, T-కేటువి నీవై
R, A, T-రేటువి నీవై
రాతగ్గ కవిత్వం నీవై
పోతగ్గ ప్రభుత్వం నేనై
తిగ్మాంశుని కిరణంలాగా
ఎగ్మూరు స్టేషన్ నీవై
మారు రంగు మణిలాగా
నోరులేను ముక్కును నేనై
కాలానికి ఆక్సిజన్ యిచ్చాం
ఎలాగో తగలబడి చచ్చాం”
అంటూ కూడా వ్రాసారు.

విశేషమేమంటే శ్రీ.శ్రీ.గారు “ఏవి తల్లీ నిరుడు కురిసిన” కు స్వయంగా ఆయనే పేరడీ వ్రాసుకున్నారు ఇలా…
“ఏవి తల్లీ నిరుడు మురిసిన
ఇనప రచయితలు?
కృష్ణశాస్త్రపు టుష్ట్రపక్షీ
దారి తప్పిన నారి బాబు
ప్రైజు ఫైటరు పాపరాజూ పలకరెంచేత?
ప్రజాస్వామ్యపు పెళ్లి కోసం
పండితారానాధ్యుడాడిన
వంద కల్లల పంది పిల్లలు
ఆంధ్రపత్రిక ఎక్కడమ్మా?” అంటూ!
కృష్ణశాస్త్రి గారి “శ్రావణం” లోని
“అసలు శ్రావణ మాస మధ్యమ్మునందు
కురిసి తీరాలి వర్షాలు కొంచెం కొంచెం
మేని రాలాలి తుంపరలేని,కానీ
ఉక్క మాత్రమేమాత్రముండరాదు” కు పేరడీగా..
“అసలు సిగరెట్లు కాల్చుట భాగ్యమై ఫ
దేడులవుతోంది ఎన్ని వూదేశినానో
నేడు సిగరెట్లు కాల్చను పాడను ఇంక
కరువు రోజులు అరువులివ్వరులె మనకు”
అని వ్రాసారు.

ఇదిలా ఉండగా…శ్రీ.శ్రీ.,ఆరుద్ర కలిసి జరుక్ శాస్త్రిపై వ్రాసిన పేరడీ చూడండి…
“గోల్డ్ వ్యామోహం చెడ్డది
మైల్డ్ వ్యాయామం శరీరమాద్యం ఖలుడ,
చైల్డ్ వ్యాపారం కూడదు
ఓల్డ్ వ్యూలను హోల్డు చేయకు డియర్ జరూ!”
“రుక్కునకు, ఆగ్రహము గల
ముక్కునకు,వినూత్న భాముఖలిత వాణీ
భాక్కునకున్,తెగ వాగెడు
డొక్కునకున్ ,సాటి లేని డుబుడుక్కునకున్!”
అంటూ సరదాగా…
“దోచేసేవాళ్లను ఏ
దో చేస్తుందని శివాశతో చూస్తుంటే
దోచేస్తుంది కదా కం
చే చేను మేసినట్టు లీ ప్రభుత జరూ!”
అంటూ సమకాలీన పరిస్థితులను తమ పేరడీలలో కూర్చారు కవులు!
ఆహా!ఆ కాలం కవుల మధ్య ఎంతటి సుహృద్భావం!ఎంతటి సహృదయత!అధిక్షేపణలను సైతం సరదాగా తీసుకుని,దీటుగా జవాబిస్తూ,హాయిగా నవ్వుకోవడం!ఈ కాలం వారికి అంత విశాల హృదయం ఉండటం లేదు.ఒకరినొకరు విమర్శించుకుంటూ, దూషించుకుంటున్నారు.

ఇక ఎన్నో పేరడీ పాటలు కట్టిన జొన్నలగడ్డ రామలింగేశ్వరరావు గారు
నేను సైతం నల్లరంగును “తెల్లజుట్టుకు రాసి దువ్వాను
నేను సైతం ఇంత చేసీ, ఇంత క్రితమే తిరుపతయ్యకు జుట్టునిచ్చాను”
అంటూ నవ్వించారు.
శ్రీ.శ్రీ. “ప్రతిజ్ఞ” పై ఇలా…
“అవాకులన్నీ చవాకులన్నీ
మహా రచనలై మహిలో నిండగ, ఎగబడి చదివే పాఠకులుండగ
విరామమెరుగక పరిశ్రమిస్తూ, అహోరాత్రులూ అవే రచిస్తూ
ప్రసిద్ధికెక్కిన కవిపుంగవులకు,వారికి జరిపే ‘సమ్’ మానాలకు, బిరుదములకు
దుశ్శాలువలకు,కర’తాళా’లకు ఖరీదు లేదోయ్” అంటూ కొంతమంది కవులపై గొప్ప సెటైర్ వేసారు.

“గజ్జెల మల్లారెడ్డి” గారి పేరడీ ఇలా సాగింది.
“ఇందిరమ్మ గుట్టు ఎరుగుట కష్టము
ధాతకైన వాడి తాతకైన
విబుధ జనుల వలన విన్నంత కన్నంత
తెలియవచ్చినంత తేటపరుతు
ఇందుగలదందులేదని
సందియము వలదవినీతి సర్వోపగతం
బెందెందు వెదకి చూచిన
నందందే కలదు ఇందిరా కాంగ్రెసునన్” అంటూ.
“పదవి వచ్చు వేళ పదవి
పోయెడి వేళ
ప్రాణమైన పదవిభంగమందు
కూడబెట్టినట్టి ‘కోట్ల’ రక్షణ యందు
బొంకవచ్చు నఘము పొందదధిప!”అంటూ ఈ విధంగా వ్యంగాస్త్రాలు సంధించారు.

జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారు కృష్ణశాస్త్రి గారి ప్రసిద్ధ కవిత అయిన “సౌరభములేల చిమ్ము(బుష్ప వ్రజంబు”ను ఇలా పేరడీ చేసి నవ్వించారు…
“జఠరరసమేల స్రవించు జఠరగ్రంథి
అడవిలో యేలనా వసించు అడవిపంది
ఏల పిచ్చికుక్క కరచు?కాకేల యరచు!”
“అరే ప్రకాశం/ఒరే గణేశం
ఆకలి లోకం పిలిచింది
పదండి ముందుకు/పదండి తిండికి
పోదాం పోదాం హోటల్ కి”

“సాహిత్యంలో,జీవితంలో విదూషక పాత్ర పోషించారు.ఒక్కో సూర్యుడు సమస్త జీవులకు తానొక్కడై తోచినట్లు, ఒక్కో కవిని ఒక్కోలాగా పేరడీ చేసారు.”ఎంత బాగా వెక్కిరించావురా!” అని
ధిషణాహంకారి విశ్వనాథ వారిచే మెచ్చుకోబడినారు.
“తనతో మాట్లాడితే నవ్వి,పొట్ట పగిలిపోవచ్చనే తెలిసి మాట్లాడుతున్నానని హామీ లిఖితపూర్వకంగా,
‘ససాక్షి’ కంగా ఇస్తే తప్ప,
మాట్లాడేవారు కాదట!
“సభా మర్యాద లేదని తెలుసు.మరొక స్వతంత్ర రచనతో అన్యోన్య మైత్రి కలది.వెర్బల్,స్టయిల్ అను రెండు రకముల పేరడీలు కలది.వికటకవిత్వం అనొచ్చు పేరడీని” అని వివరించిన
“మాచిరాజు దేవీప్రసాద్” గారు రెండో ప్రపంచ యుద్ధ సమయంలో కాగితపు కరువు ఏర్పడినప్పుడు,కాగితాలు ఎలా పొదుపు చేయాలో, అదెలా అసాధ్యమో చెప్పిన పేరడీ ఇది…
“లేవు లేవింక కాగితాల్లేవు లేవు
బిల్సుకయిన,అంటించు లేబిల్సుకైన
నోటుకైనను,ప్రాంసరీ నోటుకైన
లార్డులాంటి మా నోటీసు బోర్డుకైన
సరుకు దెచ్చిన పూర్ణాను స్వారమయ్యె
అంటే అడుగు మన గవర్నమెంటు స్టోరు
అయ్యయ్యో!లేదు చిన్న ముక్కైన
మంత్రి సెలవు రాయ, ప్రధాని రిజైను చేయ!”

“ఏ గీతం ఏ కాలంలో
సాధించినదీ పరిపూర్ణం?
ఏ ‘జలసూత్రం’ ఏ ‘కలవింకం’
చూపించింది యీ వికట కవిత్వం?
ఎగతాళుల యీ ప్రతిబింబం
ఈ భావం, ఈ కిష్కింధం
ఈ భాష్యం ఈ బాంధవ్యం” అంటూ తాను నిర్వచించిన వికటకవిత్వంపై కవిత వ్రాసారు.

“ఇంట యేర్కన్నా
సుస్తీ యొకింత జేయ
అసలు ఇంటికింజక్షనీయాలి అనును” అంటూ “తడాఖా” లో డాక్టర్ పై వ్రాసారు.

మద్రాసులో విద్యార్థిగా ఉన్నప్పుడు,తెలుగువారి కొరకు ‘ఆంధ్రామెస్’ పెడుతున్నారన్న వార్త తెలిసి,ఆశ్చర్యంతో ఇలా స్పందించారు…శ్రీ.శ్రీ.గారి అభిమాని అయిన ఈయన శ్రీ.శ్రీ.గారి
“నిజంగానే నిఖిలలోకం నిండుహర్షం వహిస్తుందా” కవితను పేరడీ చేస్తూ…

“నిజంగానే నిఖిల ఆంధ్రం
నిండు హర్షం వహిస్తుందా
భోజనానికి నిజంగానే భోగకాలం రహిస్తుందా
నిజంగానే నిజంగానే
నిఖిల ఆంధ్రం హర్షిస్తుందా
తినకముందే మొహంమొత్తే మోహన్ దాల్ నశిస్తుందా!” అని వ్రాసారు.

అలాగే “రహదార్లు” పై వ్రాసిన పేరడీ కూడా ప్రసిద్ధమైనది.

“హైరోడ్డులు అశోకుళ్ళై
చరిత్రమున ప్రసిద్ధికెక్కెను”
“లారీ రాజం,భారీబస్సు
రోడ్డురోలర్ బ్రెనగన్ కారీర్
ట్రాంకరూ ఏమైతేనేం
ఒత్తేయును టూత్పేస్టుల ట్యూబల్లే”
“ఏ రోడ్డు చరిత్ర చూసినా/ఏమున్నది గర్వకారణం?
రహదారి చరిత్ర సమస్తం
ధూళి దూసర పరిన్యస్తం
రహదారీ చరిత్ర సమస్తం
యాతాయాత జన సంయుక్తం
రహదారి చరిత్ర సమస్తం
పథిక వాహన ప్రయణసిక్తం
భూంకార గర్జిత దిగ్భాగం
చక్రాంగ జ్వలిత సమస్తాంగం
రహదారి చరిత్ర సమస్తం
పైజమ్మాలను పాడుచేయడం!”

“ఒక కారును వేరొక కారు
ఒక బస్సును వేరొక లారీ
చూచితే ఆ క్షణమందున
రూల్సన్నీ దాగును యెచట!”

“మిథునం” చలనచిత్రంతో ప్రఖ్యాతులైన శ్రీ రమణ గారి పేరడీలు నెమలిని మన జాతీయ పక్షిగా ప్రకటించినప్పుడు ఈ విధంగా..

శ్రీ. శ్రీ.గారిపై..

“నట్టడవిలోంచి
నయా దిల్లీకి
మహాప్రస్థానం
మరచిపోకు నేస్తం
నీ వాణ్ణి నేను
జాతీయ జంతువుని
మనిషిని!”

కృష్ణశాస్త్రి గారిపై..

“కరిమబ్బు మేనితో
స్వామి వచ్చే వేళ
చిగురాకు జొన్పాల
పురివిప్పి యాడేవు!”

తిలక్ గారిపై..

“నీ రెక్కల సవ్వడికి
సప్తతంత్రుల విపంచి
తూరుపు ఆకాశం నుంచి
మహాభినిష్క్రమణం చేసినప్పుడు!”

సి.నా. రె. గారిపై..
(ప్రాస కోసం భావాన్ని బలి పెట్టడానికైనా సిద్ధపడుతారు అంటూ..)

“జాతీయ విహంగం
సౌందర్య తరంగం
కాళిదాస కావ్య మరందం
పురివిప్పిన విపిన మయూరం!”

ప్రేమలేఖలు వ్రాసే శైలి ఎవరిది ఎలా ఉంటుందో;రైలు ప్రయాణం చేసినప్పుడు వారి మాటతీరు,ప్రవర్తనను బట్టి “రైలుబండిలో వైతాళికులు” అంటూ ధ్వన్యనుకరణ పద్ధతిలో వ్రాసి వ్యంగ్యాన్ని,హాస్యాన్ని పండించారు శ్రీ రమణ గారు.
“నండూరి సుబ్బారావు” గారిచే…
“సటైరులకు రెడీ రెడీ
స్వతైరులకు ఫెడి ఫెడి
శ్రీ రమణ ప్రతి పేరడీ
చిత్రోక్తుల గారడీ” అని మెప్పును పొందారు.చిత్రమేమంటే-వారి ఎంకి పాటల్లోని-“గుండె గొంతుకలోన కొట్లాడుతాది” లో గుండెను “గుండు” గా మార్చి పేరడీ చేసారు శ్రీ రమణ గారు.

ప్రజాకవి “కాళోజీ” గారు కూడా…
“ఏ దేశమేగినా ఎందు కాలిడినా
చూడరా నీ బొజ్జ పూడు మార్గంబు” అంటూ రాయప్రోలు సుబ్బారావు గారి గేయాన్ని పేరడీ చేసారు.

‘కొండేపూడి నిర్మల’ గారి “వోణీ” కవిత…
“బాల్యపు పెళ్లి యింటికీ
యవ్వనం విడిది యింటికీ
పరుగులు తీసే చిత్తకార్తె వాన వోణీ అంటే..
ఆకతాయితనం తలుపులు మూసేస్తూ అడ్డుగడియలా వుంటుంది.
గాలాడక ఉక్కపోస్తున్న కొట్టుగదిలా వుంటుంది
మడిచీరతో మగ్గిపోయే ఛాదస్తపు హెచ్చరికలా వుంటుంది
మధ్యతరగతి బూర్జువా కొంపకి పెద్దపిల్లలా వుంటుంది
పుస్తకం బోర్లించిన గ్లాసులో నిలవనీళ్ల రుచిలా వుంటుంది
రోడ్డెక్కితే చాలు అదేదో ఎలక్ట్రిక్ పోల్ ఎక్కినట్లు
ఇంటిల్లిపాదీ ఎదురుచూడ్డంలా వుంటుంది
పాపా అనాలో, మేడమ్ అనాలో తోచనివ్వని
సందేహ సరసిలా వుంటుంది
గౌను మీద బెంగలా వుంటుంది
చీర మీద మనసులా వుంటుంది
ఓణీ ఓణీలానే వుంటుంది
ఓణీకున్న లాలిత్యమెప్పుడూ
ఓణీ గొంతు విప్పనట్లు వుంటుంది
బాణీ కట్టని పాటలా వుంటుంది/రాయని పద్యంలా వుంటుంది
ఇవ్వని ముద్దులా వుంటుంది/ఒక చంచలానంద సాయంత్రం అచ్చు ఓణీలానే వుంటుంది
నాభి మీద చెయ్యి వేసి నడుము చుట్టూ గిరికీలు తిరిగి/ఎద మీద వాలిపోతూనే/మెడ మీద కితకితలు పెట్టిన నైలాన్ జార్జెట్ ఇంద్రజాలంలా ఉంటుంది/అసలు కట్టిన తీరే గమ్మత్తుగా ఉంటుంది!”

పై కవితకు “తాడి ప్రకాశ్” గారు “విప్లవోణీ” గా చేసిన పేరడీ ఇలా…
“బాల్యపు సంకెళ్ళ ఇంటికి/యవ్వనం సూర్యోదయానికి నినదిస్తూ తిరిగే ఒంటరి గొంతు ఓణీ అంటే..
పెట్టుబడి తలుపులు మూసేస్తూ అడ్డగాడిదలా వుంటుంది/గాలాడక వుక్కపోస్తున్న వ్యవస్థలా వుంటుంది/మడి చీరతో మగ్గిపోయే ఫ్యూడల్ హెచ్చరికలా వుంటుంది/మధ్యతరగతి పెటీ బూర్జువా కొంపకి/మల్టీ నేషనల్ లా వుంటుంది
నినాదం బోర్లించిన దేశంలో నీరసపు కేకలా వుంటుంది
అడివంటే అదేదో విప్లవ జెండా పైకెత్తినట్టు కుర్రకారులా ఎర్రగా చూస్తారు/ఎత్తుగడలో,వ్యూహమో తోచనివ్వని/జంగిల్ ఇండియా జాలంలా వుంటుంది
సకల ఆయుధాలూ సంధించి/వ్యవస్థ కూలిపోతుందనుకున్నప్పుడు/ముక్కు సుబ్బారెడ్డి పిక్కబలం చూపినట్టు వుంటుంది
విప్లవోణీ ఎర్రగానే వుంటుంది/జెండా కట్టని కర్రలా వుంటుంది/పేలని గ్రెనేడ్ లా వుంటుంది/చిమ్మచీకటి కురిసినట్లుగా వుంటుంది
కుర్రాళ్లను బలవంతంగా ఎన్ కౌంటర్లకు ఒప్పిస్తూ/నాయకత్వపు నోట్లో చుట్ట తిప్పుకుంటూ/పిస్టల్ కున్న రోల్డ్ గోల్డ్ ట్రిగ్గర్ని/నొక్కుతున్నట్లు నటిస్తూనే/’రామ్మా రా’ అంటూ/విప్లవాన్ని పిలుస్తున్నట్లే వుంటుంది/అసలు తుపాకీ తిప్పిపట్టుకున్న తీరే గమ్మత్తుగా వుంటుంది!”

అత్యాధునిక కవి “రావూరి నరేష్,మలికిపురం” వారి హాస్య శతకం ఇలా సాగుతుంది..

“సంస్కృతంబు నేర్చుకొనిరి సంబరముగ
భార్యాభర్తలిరువురును బాగుగాను
దెబ్బలాడెడి వేళలో జబ్బ చరిచి
దైవకార్యము తలచె నందరికి-హ హ్హ!”

సంస్కృతం నేర్చుకుని,భార్యాభర్తలిరువురూ వ్రత విషయమై పోట్లాడుచుండగా,ఇరుగుపొరుగు వారికి ఆ మాటలుమంత్రాల్లా వినిపించాయిట!

“వ్యాస సంగ్రహం:-“

కవిత్వంలో హాస్యం పలికించడం మామూలు విషయం కాదు.నవరసాల్లో కరుణ,హాస్య రసాల పోషణ చాల కష్టం.హాస్యం మనిషిని ఆరోగ్యవంతం చేసే ఔషధం.
ఆధునిక కవిత్వంలో “పేరడీ” ప్రక్రియ ద్వారా హాస్య,వ్యంగ్య ధోరణులను పండించిన వారిలో ప్రసిద్ధులు జరుక్(జలసూత్రం రుక్మిణీనాథ శాస్త్రి) శాస్త్రి,మాచిరాజు దేవీప్రసాద్ గారు,శ్రీ రమణ గారు,జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు గారు,తనికెళ్ళ భరణి,అబ్బూరి వరద రాజేశ్వరరావు గారు వంటి వేళ్ళ మీద లెక్కించదగినవారు ఉన్నారు.జాషువా గారు కూడా హాస్య,వ్యంగ్య ధోరణిలో కవితలను అల్లారు.ఎక్కువగా శ్రీ.శ్రీ.గారి కవితలను చాల మంది “పేరడీ” చేసారు. విశేషమేమంటే..తన కవితలను కూడా తనే పేరడీ చేసుకున్నారు శ్రీ.శ్రీ. గారు.అలాగే ఆరుద్ర,శ్రీ. శ్రీ. గారు కలిసి జరుక్ శాస్త్రి గారిపై “పేరడీ” వ్రాసారు.ఈ విధంగా అలనాటి కవుల మధ్య విషయాన్ని సరదాగా తీసుకునే తత్వం,కవుల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండేది.నేటి కాలంలో అటువంటి వాతావరణం కరువైందనే అనిపిస్తుంది.అత్యాధునిక కవిత్వంలో అడపాదడపా కనిపించే పేరడీలున్నాయి. కొండేపూడి నిర్మల గారి”వోణీ” కవితను “విప్లవోణీ” గా పేరడీ చేసారు తాడి ప్రకాశ్ గారు.


September 28, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
వ్యాసాలు

“కవిత్వాస్వాదన ధారావాహిక వ్యాసాలు”

by Narendra Sandineni September 28, 2026
written by Narendra Sandineni

డాక్టర్ నలిమెల భాస్కర్  “అదీ కారణం” కవితపై విశ్లేషణా వ్యాసం

ప్రముఖ కవి, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, బహు భాషావేత్త, అనువాదకులు, తెలంగాణా పదకోశ కర్త, రిటైర్డ్ తెలుగు భాషా ఉపన్యాసకులు, ఎస్.ఆర్.ఆర్.ప్రభుత్వ  డిగ్రీ కళాశాల, కరీంనగర్. డాక్టర్ నలిమెల భాస్కర్ కలం నుండి జాలువారిన “అదీ కారణం” కవితపై విశ్లేషణ.

కవి భాస్కర్ గారు తెలుగు సాహిత్యంలో తనదైన కవితా స్వరాన్ని వినిపిస్తున్న విశిష్ట కవి. ఉపాధ్యాయునిగా విద్యార్థులపై లోతైన ప్రభావాన్ని చూపారు. భాషా సౌందర్యాన్ని సూక్ష్మంగా ఆవిష్కరించిన అనువాదకుడిగా పేరు సంపాదించారు. మానవ అనుభూతులను తాత్విక లోతులతో వ్యక్తీకరించిన కవిగా విశేష గుర్తింపు పొందారు. చూడచక్కని భావాల మేళవింపు ఆయన కవిత్వంలో కనిపిస్తుంది.

“ఆశ్రు బిందువు, చెమట చుక్క, అత్తరు”  వంటి ప్రతీకల ద్వారా మానవ సమాజంలోని ప్రేమ, త్యాగం, దుఃఖం, దోపిడీ, ఆధిపత్యాలను కవి భాస్కర్ సునిశిత దృష్టితో పరిశీలించారు.     “అదీ కారణం” అనే శీర్షిక కవితలోని సామాజిక విశ్లేషణకు ఒక కారణ-కార్య సంబందాన్ని సూచిస్తుంది.    ఈ శీర్షిక సాధారణంగా కనిపించినప్పటికీ, కవితను చదివినప్పుడు దాని వెనుక ఉన్న సామాజిక అంతరార్థం స్పష్టమవుతుంది. ప్రపంచంలో కనిపించే సుఖశాంతుల వెనుక ఎవరి కన్నీళ్లు, ఎవరి చెమట, ఎవరి రక్తం ఉన్నాయో కవి అన్వేషిస్తారు. ఒకవైపు శ్రమజీవుల త్యాగం, దయ, మానవతా దృక్పథం ఉంటే, మరోవైపు వారి శ్రమను ఆస్వాదిస్తూ పెత్తనం చెలాయించే దోపిడీ వర్గం కనిపిస్తుంది. ఈ వైరుధ్యానికి మూల కారణం ఏమిటి?” అని  సూచించే శీర్షికగా ఇది నిలుస్తుంది.

చిన్నచిన్న దృశ్యాల వెనుక దాగి ఉన్న విస్తృత సామాజిక సత్యాన్ని పాఠకుల ముందుంచే శక్తి ఈ శీర్షికకు ఉంది. అభ్యుదయ కవిత్వ ధోరణిని ప్రతిబింబించే ఈ కవితా పంక్తులు సమాజంలోని రెండు పరస్పర విరుద్ధ వర్గాలను, శ్రమ దోపిడిని అత్యంత ప్రభావవంతంగా విశ్లేషిస్తాయి. మానవీయ కోణం, సామాజిక స్పృహ కలగలిసిన కవితగా “అదీ కారణం” నిలుస్తుంది.

కవితా వస్తువు:

ఈ కవితకు ప్రధాన వస్తువు శ్రమజీవుల వేదన, వారి శ్రమ దోపిడీ మరియు దోపిడీ వర్గం యొక్క క్రూరత్వం. సమాజంలో కంటికి కనిపించే కన్నీరు, చెమట వెనుక దాగి ఉన్న అసలు కారణాలను వెలికి తీయడమే “అదీ కారణం” కవిత యొక్క ముఖ్య ఉద్దేశం.

ఆశ్రు బిందువులో ఆవిష్కృతమైన విశ్వవేదన

“ఆశ్రు బిందువును విశ్లేషించాను/ లోకంలోని శోకమూర్తులందరూ గోచరించారు” – ఈ పంక్తులు కవి విశాలమైన మానవీయ దృష్టిని, సామాజిక స్పృహను, తాత్విక ఆలోచనా తీరును ప్రతిబింబిస్తాయి.  సాధారణంగా ఆశ్రు బిందువు ఒక వ్యక్తి అనుభవించే దుఃఖానికి సంకేతం. అయితే కవి దృష్టి     అక్కడితో ఆగిపోదు. ఒక ఆశ్రుబిందువును విశ్లేషించినప్పుడు, దాని వెనుక దాగి ఉన్న అనేక      జీవితాల విషాదం ఆయనకు గోచరిస్తుంది. ఈ విధంగా వ్యక్తిగత అనుభూతిని సామూహిక       వేదనగా విస్తరింపజేయడం ఈ పంక్తుల ప్రధాన విశిష్టత.

కవి మొదట ఆశ్రు బిందువును ఒక శక్తివంతమైన ప్రతీకగా స్వీకరిస్తారు. ఒక్క కన్నీటి బిందువులోనే సమస్త మానవాళి దుఃఖాన్ని దర్శిస్తారు. వ్యక్తిగత కన్నీటిని సామూహిక విషాదానికి ప్రతిరూపంగా మలచడం ద్వారా కవి మానవ వేదనకు విశ్వజనీనతను కల్పించారు.  ”శోకమూర్తులు” అనే పదప్రయోగం ఆ కన్నీటి వెనుక ఉన్న అనేక జీవితాల విషాదాన్ని స్ఫురింపజేస్తుంది. ఇవి కవితకు ప్రారంభ సూచికలు మాత్రమే కాదు ;  కవి యొక్క విశ్వజనీన సామాజిక దృక్పథానికి అద్దం పట్టే హృదయవిదారకమైన పంక్తులు.

వ్యష్టి నుంచి సమిష్టి వైపు ప్రయాణం:

ఈ పంక్తులలో కవి ఒక అద్భుతమైన తాత్విక దృష్టిని ప్రదర్శిస్తారు. ఒకరి కంటి నుంచి జారే కన్నీటి చుక్క ప్రపంచంలోని అందరి బాధలకు, శోకానికి ప్రతీక అని కవి గుర్తిస్తారు. ఒకరి కంటి నుంచి జారే కన్నీటి చుక్క కేవలం వారి వ్యక్తిగత బాధకు మాత్రమే ప్రతీక కాదు ;  అది సమాజంలోని సగటు మనిషి అనుభవించే వేదనకు కూడా అద్దం పడుతోంది.

ఇక్కడ కవి దృష్టి వ్యష్టి నుంచి సమిష్టి వైపు ప్రయాణిస్తుంది. ఒకరి కన్నీటిలో అనేకుల వేదనను, ఒకరి దుఃఖంలో సమాజపు సామూహిక దుఃఖాన్ని దర్శించడం ద్వారా కవి వ్యక్తిగత అనుభూతికి సామాజిక, విశ్వజనీనమైన పరిమాణాన్ని కల్పించారు.

ఆశ్రు బిందువు – ఒక శక్తివంతమైన ప్రతీక:

ఆశ్రు బిందువు (కన్నీటి చుక్క) వ్యక్తిగత వేదనకు గుర్తు. సాధారణంగా ఎవరైనా ఏదో బాధకు గురై ఏడుస్తారు. ఏడుస్తున్నప్పుడు ఆ వ్యక్తిని చూస్తే అతని దుఃఖం మాత్రమే కనిపిస్తుంది. కానీ కవి దానిని కేవలం కన్నీటి చుక్కగా చూడలేదు ; దానిని విశ్లేషించారు. అంటే,అతను ఎదుర్కొనే బాధ మూలాల్లోకి వెళ్లి, ఉబికి వచ్చే కన్నీటికి గల కారణాలను  అన్వేషించారు.

అలా విశ్లేషించినప్పుడు కవికి ఒక వ్యక్తి బాధ మాత్రమే కాకుండా, లోకంలోని శోకమూర్తులందరూ గోచరించారు. అంటే. ఒక చిన్న కన్నీటి చుక్క ద్వారా ప్రపంచవ్యాప్తంగా అణిచివేతకు, ఆకలికి, అన్యాయానికి గురవుతున్న సమస్త పీడిత ప్రజల సామూహిక దుఃఖాన్ని కవి దర్శించారు.

ఈ దృష్టిలో ఆశ్రు బిందువు ఒక చిన్న బిందువులోనే అపారమైన దుఃఖాన్ని ప్రతిబింబించే శక్తివంతమైన ప్రతీకగా నిలుస్తుంది. అది లోకంలోని దుఃఖ సముద్రాన్ని చూపించే ఒక చిన్న కిటికీ వంటిది.

తాత్విక మరియు సామాజిక కోణం:

ఈ పంక్తులలో కవి యొక్క ఉదాత్త హృదయం స్పష్టంగా కనిపిస్తుంది. పరపీడనకు చలించే గుణమే ఉత్తమమైన కవిత్వ లక్షణం. లోకంలోని బాధలన్నింటినీ తన బాధగా భావించే ఆర్ద్రత ఇక్కడ వ్యక్తం అవుతుంది.

సమాజంలో దారిద్ర్యం, వివక్ష, అణిచివేత, అన్యాయం ఉన్నంతకాలం శోకమూర్తులు ఉంటారనే సామాజిక సత్యాన్ని కవి ఎత్తిచూపారు.  అందువల్ల ఈ పంక్తులు కేవలం ఒక వ్యక్తి దుఃఖాన్ని వర్ణించేవి కాకుండా, ఆ దుఃఖానికి కారణమయ్యే సామాజిక పరిస్థితులను కూడా సూచించేవిగా నిలుస్తాయి.

కవితా శిల్పం మరియు ప్రతీకలు:

ఈ పంక్తులలో కవి ఉపయోగించిన ప్రతీకలు భావగర్భితమైనవి.

“ఆశ్రు బిందువు” ఒక వ్యక్తిగత వేదనకు ప్రతీక. అయితే ఆ ఆశ్రు బిందువు కవి దృష్టిలోకి వచ్చినప్పుడు అది సమస్త మానవాళి దుఃఖానికి ప్రతీకగా మారుతుంది. “శోకమూర్తులు” అనే పద ప్రయోగం కూడా అత్యంత భావతీవ్రతను కలిగి ఉంది. కవి బాధపడే మనుషులను కేవలం “బాధపడేవారు” అని అనకుండా “శోకమూర్తులు” అన్నారు. అంటే, వారి జీవితాలే దుఃఖమయంగా మారిపోయాయని, వారు శోకానికి సజీవ రూపాలుగా నిలిచారని సూచించారు. ఒకే పదంతో అనేక జీవితాల విషాదాన్ని కవి ఆవిష్కరించారు.    “గోచరించారు” అనే పదానికి కూడా ఇక్కడ ప్రత్యేకమైన ప్రాధాన్యం ఉంది. ఇది కంటికి కనిపించడం అనే సాధారణ అర్థానికే పరిమితం కాదు. అంతశ్చేతనకు తట్టడం, హృదయానికి అనుభూతి కావడం, అంతర్దృష్టితో వాస్తవాన్ని దర్శించడం అనే భావాలను కూడా సూచిస్తుంది. బాహ్య నేత్రంతో చూస్తే కన్నీరు మాత్రమే కనిపిస్తుంది ; అంతర్దృష్టితో చూస్తే ఆ కన్నీటి వెనుక ఉన్న సామాజిక విషాదం కనిపిస్తుంది.

అభ్యుదయ భావజాలం:

సాహిత్య రంగంలో అభ్యుదయ భావజాలానికి ఈ పంక్తులు ఒక విశిష్టమైన ఉదాహరణగా నిలుస్తాయి. సమాజంలో ఒకరి కన్నీటికి కారణం కేవలం వారి వ్యక్తిగత సమస్య మాత్రమే కాదని, దాని వెనుక సామాజిక పరిస్థితులు కూడా ఉండవచ్చనే విషయాన్ని కవి గంభీరంగా ప్రతిపాదించారు.

సమాజంలో అణిచివేతకు గురవుతున్నవారు, ఆకలితో అలమటిస్తున్నవారు, అన్యాయానికి గురవుతున్నవారు, కష్టజీవులు – వీరందరి సామూహిక దుఃఖాన్ని ఒక ఆశ్రు బిందువులో కవి దర్శించారు. ఈ దృష్టిలో కవి కేవలం దుఃఖాన్ని వర్ణించేవారు కాదు ; దుఃఖానికి కారణమైన సామాజిక వాస్తవాన్ని గుర్తించే సామాజిక చైతన్య శీలి.   అందువల్ల ఈ పంక్తులలో సామాజిక స్పృహ, మానవీయత, అభ్యుదయ దృష్టి సమన్వయంగా కనిపిస్తాయి.

కవి దార్శనికత:

ఒక సాధారణ మనిషి కన్నీటిని కేవలం దుఃఖానికి ప్రతీకగా మాత్రమే చూస్తాడు. కానీ దాని వెనుక ఉన్న మూల కారణాలను అన్వేషించడు. ఇక్కడ “విశ్లేషణ” అనే పదాన్ని కవి ఒక లోతైన సామాజిక,మానసిక ప్రక్రియగా ఉపయోగించారు.    కన్నీటి స్వభావాన్ని మాత్రమే కాకుండా, ఆ కన్నీటికి కారణమైన పరిస్థితులను అన్వేషించడమే కవి విశ్లేషణ. బాధ వెనుక ఉన్న మూల కారణాలను అన్వేషించే కవి అంతర్దృష్టి, దార్శనికత ఇందులో స్పష్టంగా కనిపిస్తుంది.  ఒక చిన్న ఆశ్రు బిందువులోనే సమస్త ప్రపంచపు దుఃఖాన్ని దర్శించడం ద్వారా కవి తన ఆలోచనా పరిధిని వ్యక్తి నుంచి సమాజానికి, సమాజం నుంచి విశ్వమానవత్వం వరకు తమ దృష్టిని విస్తరించారు.

ప్రతీకాత్మకత:

ఈ పంక్తులలో “ఆశ్రు బిందువు” అత్యంత శక్తివంతమైన ప్రతీకగా నిలుస్తుంది. చిన్నదైన ఒక కన్నీటి బిందువులోనే ప్రపంచంలోని మహాశోక సముద్రమంతా దాగి ఉందనే భావాన్ని కవి స్పష్టం చేశారు. హృదయం బాధకు గురైనప్పుడే దుఃఖం కలుగుతుంది. ఒకరి కన్నీటి చుక్క కేవలం వ్యక్తిగత దుఃఖానికి ప్రతీకగా నిలవకుండా,విశ్వమానవుని కన్నీటికి ప్రతీకగా విస్తరించడం ద్వారా కవి ఆ దుఃఖానికి విశ్వజనీనమైన పరిమాణాన్ని కల్పించారు.

సామాజిక స్పృహ – మానవీయ ఆర్తి:

“శోకమూర్తులు” అనే పదం ద్వారా సమాజంలోని అణిచివేతకు గురవుతున్నవారు, ఆకలితో అలమటిస్తున్నవారు, అన్యాయానికి గురవుతున్నవారు, దీనులు, కష్టజీవులు – వీరందరి వేదనను       కవి ప్రతిబింబించారు.  సమాజం పట్ల కవి గుండెల్లో ఉన్న అమితమైన కరుణ, ఆర్తి ఈ పంక్తులలో ప్రతిధ్వనిస్తుంది. ఇతరుల బాధను తన బాధగా భావించే హృదయం ఉంటేనే ఇటువంటి విశాలమైన మానవీయ దృష్టి సాధ్యమవుతుంది.

“ఆశ్రు బిందువును విశ్లేషించాను/ లోకంలోని శోకమూర్తులందరూ గోచరించారు” అనే పంక్తులు కవి యొక్క విశ్వమానవ దృష్టికి ప్రతీకలుగా నిలుస్తాయి. ఒకరి కన్నీటిలో అనేకుల కన్నీటిని, వ్యక్తిగత వేదనలో సామూహిక విషాదాన్ని, ఒక చిన్న ఆశ్రు బిందువులో అనంతమైన దుఃఖ సముద్రాన్ని కవి దర్శించారు. కన్నీటి భాషకు దేశం, ప్రాంతం, వర్గం అనే భేదాలు ఉండవు. మానవ వేదనకు విశ్వవ్యాప్తమైన ఒకే భాష ఉంది. ఎవరి కన్నీటిని విశ్లేషించినా, దాని వెనుక మానవ జీవితంలోని ఏదో ఒక వేదన కనిపిస్తుంది. ఈ విశ్వజనీన సత్యాన్ని కవి అత్యంత తక్కువ పదాలతో, అత్యంత గాఢమైన భావంతో ఆవిష్కరించారు.  అందువల్ల ఈ పంక్తులు కేవలం కవి కరుణకు ప్రతిబింబాలు మాత్రమే కాదు ; కవి యొక్క సామాజిక స్పృహకు, మానవీయ ఆర్తికి, ,తాత్విక దృష్టికి, అభ్యుదయ భావచైతన్యానికి విశ్వజనీన మానవతా దృక్పథానికి ప్రతీకలుగా నిలిచే శక్తివంతమైన కవితా పంక్తులు.

“చెమట చుక్కను పరిశీలించాను/ భువన భవనాన్ని తమ చేతులమీద మోస్తున్న/ త్యాగమూర్తులూ

శ్రమజీవులు కనిపించారు” ఇక్కడ చెమట చుక్క శ్రమకు ప్రతీకగా మారింది. ప్రపంచ నిర్మాణానికి పునాది వేసేది శ్రమజీవులేనని కవి స్పష్టం చేస్తున్నారు.

“భువన భవనాన్ని తమ చేతులమీద మోస్తున్న” అనే రూపకం శ్రమజీవుల పాత్రను అత్యంత శక్తివంతంగా ఆవిష్కరిస్తుంది. సమాజ సౌభాగ్యానికి అసలు నిర్మాతలు శ్రమజీవులే అనే భావన ఇక్కడ అంతర్లీనంగా వ్యక్తమవుతుంది.

చెమట చుక్క (స్వేద బిందువు);

ఇది కష్టజీవుల శ్రమకు గుర్తు.”భువన భవనాన్ని తమ చేతులమీద మోస్తున్న త్యాగమూర్తులూ” అంటూ సమాజ నిర్మాణానికి పునాది అయిన కార్మికులను,శ్రమజీవులను కవి ఇక్కడ అత్యున్నతంగా  గౌరవించారు.

దయా హృదయం:

లోక కళ్యాణం కోసం,మానవాళి సుఖశాంతుల కోసం తపించే నిష్కల్మషమైన ప్రేమకు ఇది ప్రతీక.

ఈ పంక్తులు కవితలోనే అత్యంత ఉదాత్తమైనవి మరియు గౌరవప్రదమైనవి.ఇవి శ్రమ సౌందర్యాన్ని, శ్రామిక వర్గపు విశ్వరూపాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తాయి.అభ్యుదయ సాహిత్య దృక్పథంలో ఈ పంక్తులు సాగుతున్నాయి.

శ్రమకు అద్దం పట్టే కన్నీటి చుక్క ద్వారా సమాజంలోని బాధను దర్శించిన కవి ఈ పంక్తులలో      “కన్నీటి చుక్క” ద్వారా ఆ బాధను అధిగమించడానికి చేసే శ్రమను విశ్లేషించారు.కవి చెమట చుక్కను కేవలం ఒక శారీరక ద్రవంగా చూడలేదు ; దానిని “పరిశీలించారు”. ఆ పరిశీలనలో కవికి సమాజ గమనాన్ని నడిపించే శ్రామిక శక్తి కనిపించింది.సంపద సృష్టికి మూలం శ్రమే అనే సత్యాన్ని కవి ఇక్కడ ప్రతిపాదించారు.

“భువన భవనం” అద్భుతమైన రూపకాలంకారం. ఇక్కడ కవి వాడిన “భువన భవనం” అనే పదం – “ప్రపంచం అనే పెద్ద భవనం” అనే భావాన్ని సూచిస్తూ – అత్యంత శక్తివంతమైన రూపకంగా నిలుస్తుంది. ఈ సమాజం,నాగరికత…. ఇలా కంటికి కనిపించే ప్రపంచ వైభవమంతా కొద్దిమంది వల్ల మాత్రమే ఏర్పడింది కాదు. దానిని తమ చేతుల మీద మోస్తున్న వారు కార్మికులు, కర్షకులు, శ్రమజీవులు.  పురాణాలలో ఆదిశేషుడు భూమిని తన చేతులమీద మోస్తాడని అంటారు. కానీ ఆధునిక అభ్యుదయ కవిత్వంలో ఈ సమాజ సంపదను, నాగరికతను తమ భుజాలపై మోస్తున్న నిజమైన దేవుళ్లు “శ్రమజీవులే” అని కవి భౌతికవాద కోణంలో నిరూపించారు.

త్యాగమూర్తులు – సామాజిక దృక్పథం:

కవి శ్రమజీవులను “త్యాగమూర్తులు” అని పిలిచారు. ఎందుకంటే వారు రాత్రింబవళ్లు కష్టపడుతూ, తమ సుఖాలను త్యాగం చేసి, ప్రపంచానికి సుఖసంతోషాలను అందిస్తున్నారు. ఇతరుల ఆకలిని తీర్చడానికి రైతు, ఇతరులకు నీడను  కల్పించడానికి భవన నిర్మాణ కార్మికుడు రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడతారు. తమ జీవితాలను సైతం ధారపోస్తారు.   అందుకే వారు కేవలం పనిచేసే కార్మికులు కాదు ; సమాజ క్షేమం కోసం నిరంతరం త్యాగం చేసే త్యాగమూర్తులు.

కవితా శిల్పం – అభ్యుదయ ధోరణి

ఉదాత్తీకరణ:     శ్రమను, చెమటను ఇంత ఉదాత్తంగా, గౌరవంగా కీర్తించడం అభ్యుదయ కవిత్వం యొక్క ప్రధాన లక్షణం. శ్రీశ్రీ  మహాప్రస్థానంలో కార్మికులకు, కర్షకులకు సముచిత గౌరవాన్ని కల్పించిన ధోరణి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది.

నడక మరియు శైలి:

భాష ఎంతో సరళంగా ఉన్నప్పటికీ,  ”భువన భవనాన్ని తమ చేతులమీద మోస్తున్న” అనే ఊహ పాఠకుని మనసులో శ్రామికుని పట్ల అపారమైన గౌరవభావాన్ని కలిగించడంతోపాటు, ఒక గొప్ప దృశ్యచిత్రాన్ని సృష్టిస్తుంది.  సాహిత్యపరంగా ఈ పంక్తులు శ్రామికవర్గ ప్రశస్తిని చాటిచెప్పే మకుటాయమానమైన పంక్తులుగా నిలుస్తాయి. జగత్తు నిర్మాణంలో శ్రమజీవుల పాత్ర ఎంత కీలకమైనదో సాటిలేని రీతిలో అభివర్ణించిన తీరు అద్భుతమైన ఘట్టంగా పేర్కొనవచ్చు.

ఈ పంక్తులు శ్రమ యొక్క విలువను, సమాజ నిర్మాణంలో కార్మికుల పాత్రను అత్యున్నత సాహిత్య గౌరవంతో ఆవిష్కరించాయి.

భావ వివరణ:

“చెమట చుక్కను పరిశీలించాను”

కవి శ్రమకు ప్రతీక అయిన ఒక చిన్న చెమట చుక్కను సాధారణంగా చూడకుండా,ఎంతో గౌరవభావంతో  లోతుగా పరిశీలించారు. ఆ పరిశీలనలో ఆయనకు   “భువన భవనాన్ని తమ చేతుల మీద మోస్తున్న త్యాగమూర్తులు, శ్రమజీవులు” కనిపించారు.   కవికి కేవలం కార్మికుల శారీరక శ్రమ మాత్రమే కనిపించలేదు. ఆ ఒక్క చెమట చుక్కలోనే  యావత్ ప్రపంచ భారాన్ని తమ భుజాలపై  మోస్తున్న  నిరుపేద కర్మజీవులైన శ్రమజీవుల త్యాగం, కష్టం,

గొప్పతనం సాక్షాత్కరించాయి. అందువల్ల ఆ చెమట చుక్క కవికి శ్రమజీవుల త్యాగానికి, వారి జీవన పోరాటానికి ప్రతీకగా కనిపించింది.   శ్రమ,సౌందర్య శాస్త్రం:   ఈ పంక్తులు అభ్యుదయ భావజాలానికి అద్దం పడతాయి.ప్రపంచంలో ఉన్న సంపద, భవనాలు, నాగరికత అంతా శ్రమజీవుల చెమట చుక్కల నుంచే ఉద్భవించాయని కవి నొక్కి చెబుతున్నారు.            కవి దృష్టిలో “చెమట చుక్క” అనేది కేవలం ఒక శారీరక ద్రవం కాదు; అది సమాజాన్ని, సృష్టిని   నడిపించే శ్రమకు ప్రతీక. శ్రమజీవుల కష్టాన్ని, త్యాగాన్ని, వారి సృజనాత్మక శక్తిని కవి ఈ ప్రతీక ద్వారా ఆవిష్కరించారు.

అద్భుతమైన రూపకం: కవి ఈ ప్రపంచాన్ని “భువన భవనం”తో పోల్చారు.ఏ భవనానికైనా          పునాదిరాళ్లు కంటికి కనిపించవు. కానీ ఆ పునాదులపైనే మొత్తం భవనం నిలబడుతుంది.           అలాగే ఈ సమాజం అనే భవనాన్ని  తమ రక్తాన్ని చెమటగా మార్చి,కంటికి కనిపించకుండా      మోస్తున్న  పునాదిరాళ్లు  శ్రమజీవులని కవి భావించారు.ఈ విధంగా శ్రమజీవులను భువన      భవనానికి పునాదిరాళ్లుగా పోల్చడం ద్వారా కవి ఇక్కడ అద్భుతమైన రూపకాన్ని సృష్టించారు.

త్యాగమూర్తులుగా శ్రమజీవులు:                                                                                     కష్టపడే వారిని కవి కేవలం కార్మికులుగా చూడలేదు. వారిని త్యాగమూర్తులుగా అభివర్ణించారు. వారు తమ సుఖాలను, సంతోషాలను త్యాగం చేసి రాత్రింబవళ్లు కష్టపడటం వల్లనే సమాజం ఇంత వైభవంగా వెలుగొందుతోంది. వారి శ్రమలోని త్యాగగుణాన్ని కవి ఈ పదం ద్వారా గౌరవించారు.

కవి సామాజిక దృక్పథం:

శ్రమను గౌరవించని సమాజం ఎప్పటికీ ముందుకు సాగదు. ఒక చిన్న చెమట చుక్క వెనుక ఉన్న సామాజిక సత్యాన్ని, ఆర్థిక అసమానతలను కవి ఇక్కడ ప్రశ్నిస్తున్నారు. ప్రపంచ నిర్మాణానికి కారణమైన శ్రమజీవుల శ్రమను గౌరవించడమే కవిత యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పంక్తులు శ్రమకు అర్పించిన అక్షర నీరాజనం. కార్మికుడే విశ్వకర్మ అనే సత్యాన్ని ఈ పంక్తులు చాటి చెబుతున్నాయి. మొదటి భాగంలో కన్నీటి వెనుక ఉన్న శ్రమను, త్యాగాన్ని కవి దర్శించారు. సమాజ హితాన్ని కోరే ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసే అత్యుత్తమ అభ్యుదయ కవితా పంక్తులు ఇవి.

“ ప్రపంచ మానవాళి సుఖశాంతుల కోసం/ప్రతి కణంలో పరితపిస్తూ/కొట్టుకుంటున్న దయా హృదయాన్ని చూశాను” ఈ పంక్తుల్లో కవి శ్రమజీవులలోని మానవతా దృక్పథాన్ని ప్రతిష్టించారు.      వారి శ్రమ కేవలం జీవనోపాధి కోసం మాత్రమే కాదు. సమస్త మానవాళి సుఖశాంతుల కోసం వారు పడే తపనగా కవి అభివర్ణించారు. శ్రమజీవుల హృదయంలో నిండిన దయ, మానవతా భావాలను ఈ పంక్తుల ద్వారా ఆవిష్కరించారు.

“ప్రతి కణంలో పరితపిస్తూ/కొట్టుకొంటున్న దయా హృదయాన్ని చూశాను” అనే అభివ్యక్తి వారి అంతరంగంలోని కరుణను,త్యాగశీలతను ప్రతిబింబిస్తుంది. సాహిత్యపరంగా ఈ పంక్తులు కవితలో కరుణ, మానవతావాదం పతాక స్థాయికి చేరిన ఘట్టాన్ని ఆవిష్కరిస్తాయి.

కవి అంతర్దృష్టి మునుపటి పంక్తుల్లోని కన్నీరు, బాధ, చెమట. శ్రమలను దాటి ఇప్పుడు వాటి వెనుక ఉన్న ప్రేమ, దయ అనే మూలతత్వాన్ని ఆవిష్కరించింది. ఈ పంక్తులు అభ్యుదయ దృక్పథంతో పాటు విశ్వజనీన మానవతాకోణం దిశగా సాగుతున్నాయి.

కవి ఇక్కడ ఒక దేశానికో, ఒక వర్గానికో పరిమితం కాలేదు. ఆయన చూపు ప్రపంచ మానవాళిపై  పడింది. సమాజంలోని పేదరికం, కష్టాలు, కన్నీళ్లను చూసి చలించిపోవడమే కాకుండా, లోకమంతా ఇప్పుడు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించే ఒక గొప్ప ఆర్ద్రత ఇక్కడ కనిపిస్తుంది.             ప్రపంచ శాంతిని, మానవ కారుణ్యాన్ని కోరుకునే గుణం అభ్యుదయ కవిత్వంలోని  అత్యున్నతమైన తాత్విక కోణాలో ఒకటి.

“ప్రతి కణంలో పరితపిస్తూ” అనే  పంక్తి భావతీవ్రతను తెలియజేస్తుంది. కవి కేవలం పైపైన దయను చూపడం లేదు. సమాజంలో పేరుకుపోయిన అశాంతిని. అన్యాయాలను చూసి కవి దేహంలోని. మనసులోని ప్రతి కణం వేదనతో రగిలిపోతూ తపిస్తోంది.  సమాజ బాధ పట్ల కవికి ఉన్న అంతరంగ స్పందన ఈ పదబందంలో స్పష్టంగా వ్యక్తమవుతుంది.                                                “కొట్టుకుంటున్న దయా హృదయం” అనే ప్రయోగంలో  హృదయం కొట్టుకోవడం కేవలం జీవక్రియకు సంబంధించినది కాదు. లోకంలోని బాధలను చూసి ఆవేదనతో, తపనతో స్పందించే ఒక సజీవ సామాజిక స్పృహకు ఇది ప్రతీక. స్వాభిమానం, కరుణ, మానవతా విలువలతో నిండిన హృదయం సమాజంలోని వైకల్యాలను చూసి మౌనంగా చేతులు ముడుచుకుని ఉండదనే సత్యాన్ని కవి ఈ అభివ్యక్తి ద్వారా స్పష్టం చేశారు.

సాహిత్య శిల్పం – అంత:సూత్రం

కవితా నిర్మాణ క్రమంలో ఈ పంక్తులు ఒక అద్భుతమైన వంతెనలా పనిచేస్తాయి. బాధితుల కన్నీటిని, శ్రామికుల చెమటను చూసిన కవిలో కలిగిన అపారమైన కరుణే ఈ “దయా హృదయం”. ఆ కరుణ కేవలం సానుభూతిగా మిగిలిపోకుండా, సామాజిక చైతన్యంగా, మార్పు పట్ల తపనగా పరిణమిస్తుంది.

దయ, కరుణ, మానవతా విలువలు లేని చోట నిజమైన సామాజిక మార్పు సాధ్యం కాదనే అంతర్లీన సత్యాన్ని కవి ఈ పంక్తుల ద్వారా స్థాపించారు. అందువల్ల “ప్రతి కణంలో పరితపిస్తూ కొట్టుకుంటున్న దయా హృదయాన్ని చూశాను” అనే అభివ్యక్తి ద్వారా కవితలో అంతర్లీనంగా ఉన్న కరుణ, మానవతావాదం, సామాజిక స్పృహలను ఏకకాలంలో ఆవిష్కరించే శక్తివంతమైన సాహిత్య శిల్పంగా ఈ పంక్తులు నిలుస్తాయి.                                                                                                          

శైలి మరియు అలంకారం

స్వభావోక్తి – భావచిత్రం:

“హృదయం పరితపించడం”, “కొట్టుకోవడం” వంటి పదబంధాలు పాఠకునిలో భావోద్వేగ స్పందనను, సానుభూతి భావాన్ని రేకెత్తిస్తాయి.                                                                                  ఆర్ద్రత కలిగిన భాష:                                                                                                 కవితలో అభ్యుదయ భావాలు ఉన్నప్పటికీ, ఈ పంక్తులలో  ఉపయోగించిన భాష ఎంతో రమ్యంగా, ఆర్ద్రంగా ఉండి, కవిలోని సున్నితమైన హృదయాన్ని ఆవిష్కరిస్తుంది.                                         ఈ పంక్తులు విశ్వశ్రేయస్సును కాంక్షించే ఉత్తమ కవితా లక్షణాలను కలిగి ఉన్నాయి.                     కేవలం వ్యవస్థను విమర్శించడమే కవిత్వం కాదు. ఆ విమర్శ వెనుక సమస్త మానవాళి సుఖశాంతులతో వర్దిల్లాలనే కాంక్ష, తపన,దయ కలిగి ఉండాలనే ఉదాత్తమైన సందేశం ఉండాలి.       ఈ పంక్తులు కవితలోని తాత్విక కోణాన్ని ఆవిష్కరిస్తాయి.

మొదటి చరణంలో కన్నీటిని, దు:ఖాన్ని, రెండవ చరణంలో చెమటను, శ్రమను విశ్లేషించిన కవి,        ఈ చరణంలో వీటన్నింటికీ మూలమైన విశ్వజనీనమైన ప్రేమను, కరుణను దర్శిస్తున్నారు.

భావ వివరణ:

“ప్రపంచ మానవాళి సుఖశాంతుల కోసం”                                                                                 – కవి ఆలోచన, ఆరాటం కేవలం తన దేశం, తన ప్రాంతం, తన వర్గానికి మాత్రమే పరిమితం కాలేదు. అది సమస్త జగత్తును, యావత్ ప్రపంచ మానవాళిని తన పరిధిలోకి తీసుకుంది.

“ప్రతి కణంలో పరితపిస్తూ” — ఆ హృదయంలోని ప్రతి అణువు, ప్రతి కణం తోటి మనుషుల బాగు కోసం తపిస్తోంది.                                                                                              “కొట్టుకుంటున్న దయా హృదయాన్ని చూశాను” — సమాజంలోని కన్నీళ్లు, కష్టాలు ఉన్నప్పటికీ, వాటన్నింటినీ తుడిచివేసి ప్రపంచాన్ని సుఖశాంతులతో నింపాలని ఆరాటపడే  అమూల్యమైన, దయతో నిండిన హృదయాన్ని కవి ఇక్కడ దర్శించారు.

సాహిత్య విశ్లేషణ:

ఈ పంక్తులలో విశ్వమానవ సౌభ్రాతృత్వం పట్ల కవికి ఉన్న విశాల దృక్పథం వ్యక్తమవుతుంది.           “వసుదైక కుటుంబం” అనే భావనలాగా, ప్రపంచంలోని మనుషులు దయ, సుఖసంతోషాలతో ప్రశాంతంగా కలిసిమెలిసి ఉండాలనే అత్యున్నత ఆశయం ఇందులో కనిపిస్తుంది. స్వార్థం నిండిన లోకంలో, పరార్థం — అంటే ఇతరుల మేలు కోసం ఆలోచించే హృదయమే నిజమైన హృదయమని కవి గాఢంగా విశ్వసిస్తున్నారు.                                                                                                         అతీతమైన ఆర్తి – అంతర్చేతన:                                                                                          “ప్రతి కణంలో పరితపిస్తూ” అనే ప్రయోగం కవి యొక్క తీవ్రమైన ఆవేదనను, ఆరాటాన్ని సూచిస్తుంది. అది పైపైన సానుభూతి చూపడం కాదు ; శరీరంలోని ప్రతి కణం తోటి మనుషుల దుఃఖాన్ని చూసి కరిగిపోవడం. సమాజ శ్రేయస్సు పట్ల కవికి ఉన్న అపారమైన బాధ్యతను, కరుణను ఈ పదప్రయోగం ఎత్తిచూపుతోంది.                                                                                                          దయ – సృష్టికి మూల స్తంభం:                                                                                       లోకంలో శోకం, బాధ ఉన్నాయి. వాటిని మార్చేందుకు శ్రమ, కష్టం అవసరం. కానీ వీటన్నింటిని నడిపించే చోదక శక్తి “దయ” మాత్రమే. ఆ దయా హృదయమే సమాజం వినాశనం వైపు వెళ్లకుండా కాపాడుతుంది.                                                                                                               కవి దర్శించిన ఆ దయ, ఏ ఒక్క వ్యక్తికో పరిమితం కాదు ; సమాజంలోని సత్పురుషులందరి అంతరంగ చైతన్యానికి ప్రతీకగా నిలుస్తుంది.                                                                                       కవితా పరిణామం:                                                                                                           ఈ కవిత ఒక క్రమ పద్ధతిలో సాగుతుంది. కన్నీటి చుక్క సమాజంలోని బాధను గుర్తించడాన్ని.     చెమట చుక్క సమాజాన్ని నిర్మించే శ్రమను గౌరవించడాన్ని. దయా హృదయం సమాజాన్ని రక్షించే ప్రేమను, శాంతిని ఆకాంక్షించడాన్ని సూచిస్తాయి.                                                                     ఈ విధంగా కవి భౌతికమైన పరిశీలనలైన  కన్నీరు, చెమట నుండి అత్యున్నతమైన ఆత్మిక మానవ విలువలైన దయ, కరుణ వైపు పాఠకులను తీసుకువెళ్లారు.                                                       ఈ పంక్తులు కవితకు ఒక సమున్నతమైన సార్థకమైన ముగింపును ఇస్తాయి. లోకంలో ఎంత కష్టం, ఎంత కన్నీరు ఉన్నప్పటికీ, మానవత్వం, దయా హృదయం ఇంకా లోకంలో కొట్టుకుంటూనే ఉన్నాయి. కాబట్టే ప్రపంచం ఇంకా ఇలా  నిలిచి ఉందనే గొప్ప ఆశాభావాన్ని కవి వ్యక్తపరిచారు.                      కవి కేవలం సమస్యలను చూపడమే కాదు ; దయ, శాంతి ద్వారానే మానవాళి మనుగడ సాధ్యమని చాటిచెప్పారు. అందువల్ల ఈ కవిత ఒక అద్భుతమైన శాంతిగీతాన్ని తలపింపజేస్తుంది.

“ఆర్ద్రమైన కన్నీటి చుక్కలను మింగి/పరిమళ సంభరితమైన/స్వేదబిందువులను వేధించుకు తిని/

చిక్కటి నెత్తుటిమీదికెక్కి/పెత్తనం చేస్తున్న/అత్తరును కూడా ఇట్టే గమనించాను” అనే పంక్తులు

సమాజంలోని తీవ్రమైన దోపిడీని, శ్రామికుల కష్టార్జితంపై పెత్తనం చెలాయించే పెట్టుబడిదారీ లేదా పెత్తందారీ వర్గాల నైజాన్ని అత్యంత ప్రభావవంతంగా,ప్రతీకాత్మకంగా నిలదీస్తున్నాయి. ఇక్కడ కవితలోని భావధోరణి ఒక్కసారిగా మరింత తీవ్రమవుతుంది. కన్నీరు, చెమట రెండూ శ్రమజీవుల జీవితానికి ప్రతీకలు. వారి దుఃఖాన్ని, శ్రమను మరొక వర్గం తమ స్వార్ధ ప్రయోజనాలకు వినియోగించుకుంటున్న సామాజిక వాస్తవాన్ని కవి వ్యంగ్యాత్మకంగా, ఆవేదనతో చిత్రించారు.

కవితా నేపథ్యం & వస్తువు:

ఈ కవితా పంక్తుల ప్రధాన వస్తువు సామాజిక అసమానత మరియు శ్రమదోపిడీ. సమాజంలో అట్టడుగున ఉండి నిరంతరం కష్టపడే శ్రామికుల, పేదల కన్నీళ్లను, చెమటను ఆసరాగా చేసుకుని, వారి రక్తాన్ని తాగి వైభోగాన్ని అనుభవించే అధికార, ధనిక వర్గాల క్రూరత్వాన్ని కవి ఇక్కడ ఎండగట్టారు.

భావవిశ్లేషణ:

ఈ పంక్తులు సమాజంలోని శ్రమ దోపిడీని, వర్గ వైరుధ్యాన్ని నిలదీస్తున్నాయి.

“ఆర్ద్రమైన కన్నీటి చుక్కలను మింగి”

అనే పదబంధం నిరుపేదల, నిస్సహాయుల ఆకలి ఆర్తనాదాలకు, వారి పట్ల సమాజానికి నెలకొన్న క్రూరత్వానికి ప్రతీకగా నిలుస్తుంది. వారి కన్నీళ్లను సైతం దిగమింగేలా చేసే దోపిడీని ఇది సూచిస్తుంది.”మింగి”, “వేధించుకు తిని” వంటి క్రియాపదాలు దోపిడీ తీవ్రతను స్పష్టంగా వ్యక్తీకరిస్తున్నాయి.

“పరిమళ సంభరితమైన స్వేద బిందువులను వేధించుకు తిని”                                                                 శ్రామికుడు చిందించే చెమట దేశ ప్రగతికి సువాసన వంటిది.అయితే, ఆ స్వేద బిందువులను “వేధించుకు తిని” అనడం ద్వారా శ్రామికుల కష్టాన్ని పీల్చి పిప్పి చేసే పరాన్న జీవుల క్రూరత్వాన్ని కవి కళ్ళకు కట్టినట్లు చూపించారు.                                                                                       “చిక్కటి నెత్తుటిమీదికెక్కి/పెత్తనం చేస్తున్న అత్తరు”                                                                  అనే భావన ఈ కవితలో అత్యంత శక్తివంతమైనది. దీని ద్వారా కవి సామాజిక వైరుధ్యాన్ని మరింత పదునుగా ఆవిష్కరించారు.”చిక్కటి నెత్తుటి” శ్రమజీవుల త్యాగానికి,వారి రక్తానికి ప్రతీకగా నిలిస్తే, దానిమీద నిలబడి “పెత్తనం చేస్తున్న అత్తరు” దోపిడీ వర్గానికి ప్రతీకగా నిలుస్తుంది.              సుగందాన్ని సూచించే “అత్తరు“అనే పదాన్ని ఇక్కడ వ్యంగ్యార్థంలో ఉపయోగించడం విశేషం.ఒకరి కన్నీరు, చెమట, రక్తం మీద మరొకరు తమ సుఖసౌఖ్యాలను, ఆధిపత్యాన్ని నిర్మించుకుంటున్న  సామాజిక అసమానతలను కవి ఎత్తిచూపారు.                                                                “అత్తరు” సుగంధ ద్రవ్యం. అయితే, ఇక్కడ అది విలాసానికి, అధికారానికి, ఆధిపత్యానికి ప్రతీకగా మారింది. అత్తరు ఎక్కడి నుంచి వచ్చింది? శ్రామికుల చిక్కటి నెత్తురుపైనుంచే పుట్టుకొచ్చింది. అంటే, సంపన్నుల విలాసవంతమైన జీవితాలు పేదల శ్రమ, త్యాగం, రక్త మాంసాల పునాదులపైనే నిర్మితమవుతున్నాయనే చేదు వాస్తవాన్ని కవి సూచించారు.

సమాజంలో అణిచివేతకు గురవుతున్న దీనులు ,పేదల కన్నీళ్లను, వారి కష్టాలను దోపిడీదారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్న తీరును ఈ పంక్తులు ప్రతిబింబిస్తున్నాయి.తీవ్రమైన సామాజిక విమర్శను ప్రతిబింబించే ఈ పంక్తుల ద్వారా.అంతకు ముందు వరకు కన్నీరు. చెమట వెనుక ఉన్న ఆర్ద్రతను చూపిన కవి, ఇక్కడ ఆ శ్రమను దోచుకుంటున్న పెట్టుబడిదారీ వర్గం నైజాన్ని అత్యంత వ్యంగ్యంగా, పదునైన శైలిలో ఎండగట్టారు.                                                                                                        వర్గ వైరుధ్యం – శ్రమదోపిడి:                                                                                                 ఈ పంక్తులు మార్క్సిస్ట్ సిద్ధాంత భావజాలంలోని ‘మిగులు విలువ సిద్ధాంతాన్ని’ కవిత్వీకరించాయి.

ఒకరు కష్టపడి శ్రమిస్తుంటే, మరొకరు ఏ పని చేయకుండా కూర్చుని సుఖసంతోషాలను అనుభవిస్తున్న వర్గ వైరుధ్యాన్ని కవి ఇక్కడ ప్రశ్నించారు.

“ఆర్ద్రమైన కన్నీటి చుక్కలను మింగి”

అనే భావం పీడిత ప్రజల కష్టాలను, వారి దీనస్థితిని దోపిడీదారులు తమ ఎదుగుదలకు పెట్టుబడిగా మార్చుకుంటున్న తీరును ఇది సూచిస్తుంది.

“స్వేద బిందువులను వేధించుకుతిని”

అనే పదబంధం కార్మికుల పవిత్రమైన చెమట చుక్కలను, వారి శ్రమను పెట్టబడిదారులు దోచుకుని, తమ సుఖసౌఖ్యాలకు ఉపయోగించుకుంటున్న తీరును తెలియజేస్తుంది.                                                                                              “పరిమళ సంభరితమైన”                                                                                                 అని కవి చెమటను సువాసన కలిగినదిగా అభివర్ణించారు. ఎందుకంటే సమాజ సృష్టికి, సంపదకు మూలం శ్రమే. అలాంటి శ్రమను పెట్టుబడిదారీ వర్గం దోపిడీ చేసి, శ్రమజీవుల హక్కులను హరిస్తుందని కవి సూచించారు.

“చిక్కటి నెత్తుటిమీదికెక్కి పెత్తనం చేస్తున్న”

అనే భావం పేదల రక్తాన్ని పిండి, వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, ఆ రక్తం పైనే తమ అధికారాన్ని, భోగాలను చెలాయిస్తున్నారనే చేదు నిజాన్ని  కళ్ళకు కడుతుంది.                                      “అత్తరు – విలాసానికి, అహంకారానికి ప్రతీక”                                                                              ఈ కవితా ఖండికలో “అత్తరు” అనేది అత్యంత శక్తివంతమైన, వైవిధ్యమైన ప్రతీకగా నిలుస్తుంది. బాహ్య ప్రపంచానికి అత్తరు సువాసనను, విలాసవంతమైన సంస్కృతిని, గొప్పతనాన్ని ప్రదర్శిస్తుంది. ధనవంతులు, పాలకులు తమ డాబుదర్పాలను చాటుకోవడానికి అత్తరును ఉపయోగిస్తుంటారు.   కానీ కవి అంతర్దృష్టిలో నిశితంగా గమనిస్తే, ఆ అత్తరు సువాసన వెనుక ఉన్నవి కేవలం సుగంధ ద్రవ్యాలు కావు. పేదల కన్నీళ్లు, కార్మికుల చెమట చుక్కలు, అమాయకుల చిక్కటి నెత్తురు. అంటే, సమాజంలో పైకి కనిపించే ధనవంతుల వైభవం, విలాసం వెనుక ఎంతోమంది శ్రమజీవుల శ్రమ, త్యాగం  దాగి ఉన్నాయనే సత్యాన్ని కవి ఎంతో గంభీరంగా ఆవిష్కరించారు.

అందువల్ల, ఈ పంక్తులు వర్గ వైరుధ్యాన్ని, శ్రమదోపిడిని, సంపన్న వర్గాల ఆధిపత్యాన్ని తీవ్రంగా ప్రశ్నిస్తూ, శ్రమజీవుల పట్ల సమాజం అనుసరిస్తున్న దోపిడీ వైఖరిని ఎండగడుతున్నాయి.

కవితా శిల్పం – అలంకారిక వైభవం:

“చిక్కటి నెత్తుటిమీదికెక్కి పెత్తనం చేస్తున్న” అనే ఊహ సమాజంలోని అన్యాయానికి వ్యతిరేకంగా

పాఠకునిలో తీవ్రమైన ఆగ్రహాన్ని,అభ్యుదయ భావాన్ని కలిగిస్తుంది.

వ్యంగ్యం:

సమాజంలో పైకి కనిపించే ఆడంబరాల వెనుక ఉన్న అసలు నగ్న సత్యాన్ని,శ్రమ దోపిడీని కవి ఎండగట్టారు. ఎంతో సున్నితమైన, సువాసనాభరితమైన “అత్తరు” అనే పదాన్ని క్రూరమైన శోషక శక్తికి ప్రతీకగా మార్చడంలో కవి వ్యంగ్య వైభవం అత్యున్నత స్థాయికి చేరింది.                                                         సాహిత్య పరంగా ఈ పంక్తులు అభ్యుదయ భావజాలానికి చెందిన కవిత్వ ధోరణికి పతాకస్థాయి నిదర్శనంగా నిలుస్తాయి. బాహ్య ప్రపంచానికి సువాసనలు వెదజల్లే “అత్తరు” వంటి వ్యవస్థల వెనుక  శ్రామికుల కన్నీరు, చెమట, రక్తం ఎంతగా దోపిడీకి గురవుతున్నాయో ఈ పంక్తులు సమాజానికి అత్యంత ఆర్ద్రంగా, అంటే తీవ్ర భావోద్వేగంతో హెచ్చరిస్తున్నాయి.                                          బాహ్య సౌకర్యాలు లేదా విలాసాల వెనుక దాగి ఉన్న సామాజిక కుళ్ళును విప్పి చెప్పిన అద్భుతమైన పంక్తులు ఇవి. ఛందోబద్డతకు ప్రాధాన్యం ఇవ్వకుండా, భావతీవ్రతకు ప్రాధాన్యమిచ్చిన ఆధునిక వచన కవితా రూపానికి ఇవి చక్కని ఉదాహరణగా నిలుస్తాయి.                                                                                         

కవితా శిల్పం – అలంకారిక శైలి

క్రియల ఎంపిక

“మింగి, వేధించుకుతిని, నెత్తుటిమీదికెక్కి పెత్తనం చేయడం” వంటి క్రియలు దోపిడీదారుల క్రూరత్వాన్ని, రాక్షసత్వాన్ని కళ్ళముందు నిలుపుతాయి. ఇక్కడ కవి ఉపయోగించిన “కన్నీటి చుక్కలు, స్వేద బిందువులు, నెత్తురు, అత్తరు” వంటి పదాలు పరస్పర విరుద్ద భావాలను కలిగిస్తూ పాఠకునిలో ఆలోచనను రేకెత్తిస్తాయి.                                                                                                    దృశ్యరూపకత:                                                                                                           “చిక్కటి నెత్తుటిమీదికెక్కి పెత్తనం చేస్తున్న” అనే పంక్తి పాఠకుని మనస్సులో ఒక బలమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది.అదే సమయంలో సామాజిక స్పృహను,దోపిడీ వ్యవస్థపై తిరుగుబాటు భావాన్ని కలిగిస్తుంది.                                                                                                             వ్యంగ్యం:                                                                                                                   ఎంతో సున్నితమైన, సువాసనాభరితమైన  “అత్తరు” అనే పదాన్ని ఒక క్రూరమైన శోషక శక్తికి ప్రతీకగా చూపించడంలో కవి వ్యంగ్య వైభవం కనిపిస్తుంది. సువాసన వెనుక దాగి ఉన్న శ్రమజీవుల కన్నీరు,

చెమట, నెత్తురును కవి తీవ్ర వ్యంగ్యంతో ఆవిష్కరించారు.                                                            సాహిత్యపరంగా ఈ పంక్తులు అభ్యుదయ కవిత్వ ధోరణికి అద్దం పడతాయి. కవి ఎంతో సున్నితంగానూ, అదే సమయంలో తీవ్రంగానూ సామాజిక వాస్తవాన్ని కవిత్వీకరించారు. శ్రమదోపిడీని ప్రశ్నిస్తూ, బాహ్య సౌందర్యం వెనుక దాగి ఉన్న అంతర్గత కుళ్ళును విప్పి చెప్పిన అద్భుతమైన పంక్తులు ఇవి.                                                                                                           పరస్పర విరుద్ధత – వ్యంగ్య  వైభవం:                                                                                      ఈ కవితలో కవి అద్భుతమైన సామాజిక విమర్శను చేశారు. ఇక్కడ రెండు శక్తుల మధ్య ఉన్న ఘర్షణను చూపించారు. ఒకవైపు ఆర్ద్రమైన కన్నీళ్లు, శ్రమతో కార్చిన చెమట చుక్కలు ఉన్నాయి. మరోవైపు శ్రమజీవుల శ్రమను “మింగి, వేధించుకుతిని, చిక్కటి నెత్తుటి మీదికెక్కి పెత్తనం చేస్తున్న “అత్తరు”ఉంది.

ఇక్కడ “అత్తరు” అనేది బోగాలాలసకు, దోపిడీదారులకు, పెట్టుబడిదారీ వర్గానికి ప్రతీకగా నిలుస్తుంది. సువాసన వెనుక పేదల రక్తం, కన్నీరు దాగి ఉన్నాయనే సత్యాన్ని కవి ఎంతో వ్యంగ్యంగా, తీవ్రంగా విమర్శించారు.                                                                                                              కవితా శైలి – శిల్పం                                                                                                     సరళత – తీవ్రత:                                                                                                          కవితలో ఉపయోగించిన  భాష చాలా సరళంగా ఉన్నప్పటికీ, అది కలిగించే భావతీవ్రత మాత్రం ఎంతో  ఎక్కువగా ఉంటుంది. సాధారణ పదాల ద్వారా అసాధారణమైన సామాజిక భావాన్ని కవి వ్యక్తీకరించారు.                                                                                                              అభ్యుదయ దృక్పథం:                                                                                                  శ్రమను గౌరవించడం,  శ్రమ దోపిడీని ప్రశ్నించడం వంటి అభ్యుదయ ధోరణికి చెందిన కవిత్వ లక్షణాలు ఇందులో స్పష్టంగా కనిపిస్తాయి.                                                                                    “భువన భవనాన్ని తమ చేతులమీద  మోస్తున్న” అనే పదబంధం శ్రామికవర్గపు విశ్వరూపాన్ని ఆవిష్కరిస్తుంది. ప్రపంచ నిర్మాణంలో శ్రామికుల పాత్ర ఎంత కీలకమైనదో ఈ పదబంధం స్పష్టం చేస్తుంది.                                                                                                                     “అదీ కారణం” అనే కవిత కన్నీటి బిందువు నుంచి చెమట చుక్క వరకు సాగుతూ శ్రమజీవుల జీవనవేదనను, త్యాగాన్ని, మానవీయతను ఆవిష్కరిస్తుంది. అదే సమయంలో వారి శ్రమపై ఆధారపడి పెత్తనం చేస్తూ దోపిడీకి పాల్పడే వర్గ స్వభావాన్ని కూడా ఎండగడుతుంది.    కవి ఉపయోగించిన “ఆశ్రువు, స్వేదం, నెత్తురు, అత్తరు” వంటి ప్రతీకలు కవితకు సామాజిక చైతన్యాన్ని, భావగాడతను, వ్యంగ్యతీవ్రతను అందించాయి.                                              అందువల్ల “అదీ కారణం” అనే శీర్షిక కవితలోని అంతరార్ధాన్ని సూచించే సార్ధకమైన, వ్యంగ్యభరితమైన శీర్షికగా నిలుస్తుంది. బాహ్య ప్రపంచంలోని వైభవాల వెనుక దాగి ఉన్న కఠోర సామాజిక వాస్తవాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది.                                                  శ్రమించేవాడు ఒకడైతే, ఆ శ్రమను దోచుకుని విలాసవంతమైన జీవితాన్ని గడిపేవారు మరొకరు అనే వర్గ సమాజ నైజాన్ని ఎండగట్టిన అద్భుతమైన సామాజిక చిత్రణగా ఈ కవిత నిలుస్తుంది.      సాహిత్యపరంగా ఈ పంక్తులు కవితలోనే అత్యంత కీలకమైనవిగా చెప్పవచ్చు. ఇవి తీవ్రమైన సామాజిక విమర్శను కలిగి ఉన్నాయి. కవి ఇక్కడ పెట్టుబడిదారీ, దోపిడీ వర్గాల క్రూరత్వాన్ని           ఎండగట్టడానికి అద్భుతమైన ప్రతీకలను, శిల్పాన్ని ఉపయోగించారు. అవి సమాజంలోని శ్రమదోపిడీని,వర్గ వైరుధ్యాలను కూడా నిలదీస్తున్నాయి.

మొత్తంగా, “అదీ కారణం” కవిత శ్రమజీవుల జీవనవేదనను, దోపిడీ వర్గాల స్వభావాన్ని, వర్గ వైరుధ్యాన్ని ప్రతీకాత్మకంగా, వ్యంగ్యాత్మకంగా ఆవిష్కరించిన అభ్యుదయ కవితగా నిలుస్తుంది.

కవి డాక్టర్ నలిమెల భాస్కర్ గారు”అదీ కారణం” అనే చక్కని  కవితను సాహిత్య లోకానికి అందించినందుకు మనసారా అభినందిస్తున్నాను. వారు ఇంకా మరెన్నో సుగంధభరితమైన కవితా సుమాలను విరబూయించాలని కోరుకుంటున్నాను.

September 28, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నీవే నా ప్రాణం

by Gaddam sulochana September 28, 2026
written by Gaddam sulochana

నీవు కుప్పకూలిన ఆ క్షణం
నా గుండె లయ తప్పింది
అంతులేని భయం
నన్ను ఆవహించింది

ఆ నిశిరాత్రి గడిచిందెలాగో
కనిపించని దేవుల్లే కరుణించారో
వాళ్ళే డాక్టర్లయ్యారో
నేను అదృష్టవంతుడిని
వెలుతురులో
నీ ఉనికే పట్టని నాకు
అసలు నా ఉనికి ఊపిరివి
నీవేనని తెలిసింది

హోదా డాబు దర్పం అంతా గత కథ
నాటకం ముగిసి వెళ్లారందరూ
తెరపై నేను ఒంటరిని
చీకటి తెరలు ముసురుకుంటున్న వేళ
తెర వెనుకే నిలిచిన
కనిపించని నీ మనసు వెలుగులను
నేనెంత ఆలస్యంగా గుర్తించాను

తోసుకొని వచ్చిన ఈ సాయంత్రంలో
నీ అనుభూతుల అనుభవాలే
నన్నంటుకునీ ఉన్న
సుగంధాలు
నీవే కమనీయ కావ్యం
రమణీయ భావం

నీ తెల్లని కురులలో
నే కుసుమాన్నవుతా
నీ అలసటను తీర్చే
విసనకర్రగా నే మారిపోతా
గడపకు రాసిన పసుపులా
నిన్నoటుకొనే ఉంటానిక..

ఈ పడమటి నీడల్లో
ఈ తీరపు ఆనందం
ఈ ప్రశాంత విశ్రాంతి
ఇక ఎంత కాలమో!అంతవరకు

September 28, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
Uncategorized

ప్రపంచంలో అద్భుతమైన ఎల్లోరా కైలాస దేవాలయ చరిత్ర – మహారాష్ట్ర

by mayuukha September 28, 2026
written by mayuukha
             కైలాస దేవాలయం భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని ఎల్లోరాలో ఉన్న గుహ దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయం ఒకే రాతితో చెక్కబడిన అతి పెద్ద పురాతన హిందూ దేవాలయాలలో ఒకటి. దీనిని కైలాసం అని కూడా అంటారు. ఒకే రాతితో ప్రత్యేకంగా చెక్కబడిన కైలాస దేవాలయం ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన గుహ దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ ఆలయం 276 అడుగుల పొడవు, 154 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇది కొండపై నుండి మొదలుకొని నిలువుగా నీడను కలిగి ఉంటుంది.

    ఈ ఏకశిలా ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 400,000 టన్నుల శిలలను వందల సంవత్సరాలుగా త్రవ్వించారని అంచనా. ఆలయ గోడలపై లభించిన ఉలి జాడల ఆధారంగా మూడు రకాల ఉలీలను ఉపయోగించారని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆలయ నిర్మాణం 46.92 మీటర్ల వెడల్పుతో పిరమిడ్ రూపంలో మూడు అంతస్తులుకలిగి ఉంది ఎల్లోరా గుహలుగా పిలువబడే 34 గుహ దేవాలయాలలో కైలాస దేవాలయం ఒకటి ఇది 16వ గుహ దీనిని ఎనిమిదవ శతాబ్దానికి చెందిన రాష్ట్ర పూట రాజు కృష్ణరాజా  సా. శ. 757-783 లో నిర్మించాడు.

కైలాస ఆలయ చరిత్ర

మరాఠీ ఇతిహాసం ప్రకారం స్థానిక రాజు తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో అతడి భార్య శివుడిని ప్రార్థించింది. రాజు పూర్తిగా ఆరోగ్యవంతంగా కోలుకుంటే ఆలయాన్ని కట్టిస్తానని, ఆలయం గోపురం చూసేవరకు తాను ఉపవాసం ఉంటానని మొక్కుకుంది. వెంటనే ఆ రాజు కోలుకున్నాడు. రాణి మొక్కు తీర్చేందుకు అప్పటి శిల్పులు కొండను తొలచి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్నకోకసా అనే శిల్పి అలా నిర్మాణం చేపడితే ఆమె ఆలయ గోపురాన్ని చూసేందుకు కొన్ని వందల ఏళ్లు పడుతుందని చెప్పాడు. దీంతో ఆలయాన్ని ముందు నుంచి కాకుండా కొండ పై భాగం నుంచి చెక్కుకుని వచ్చారు. ముందుగా ఆలయం గోపురాన్ని చెక్కి రాణిని ఉపవాస దీక్ష విరమించేలా చేశారు.

ఆలయ నిర్మాణం

      ఈ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద రెండు అంతస్తుల గోపురం ఉంది. ప్రవేశ ద్వారం వైపున శైవులు, వైష్ణవులు పూజించే దేవతల శిల్పాలు ఉన్నాయి. ప్రవేశ ద్వారం నుండి రెండు అంతర్గత ప్రాంగణాలు కనిపిస్తాయి, ప్రతి ఒక్కటి నిలువు ఆర్కేడ్తో సరిహద్దులుగా ఉన్నాయి. ఉత్తరం, దక్షిణ ప్రాంగణంలోని రాళ్ళ మీద పెద్ద ఏనుగు చెక్కబడింది. రాష్ట్రకూట రాజులు తమ ఏనుగు దళంతో అనేక యుద్ధాల్లో గెలిచి, ఏనుగులను తమకు ఇష్టమైన

జంతువులలో ఒకటిగా మార్చుకున్నారు. ఆలయంలో ఏనుగు శిల్పాలు ఉండటం రాష్ట్రకూట రాజుల బలాన్ని, శ్రేయస్సును సూచిస్తుంది. కైలాస ప్రధాన ఆలయంలో లోపల గోడపైన కమలంపై కూర్చున్న గజలక్ష్మి ప్రతిమ ఉంటుంది. ఆ ప్రతిమ వెనుక నాలుగు ఏనుగులు ఉన్నాయి. రెండు పెద్ద ఏనుగులలో ప్రతి ఒక్కటి పై వరుసలో ఒక కుండ నుండి గజలక్ష్మి మీద నీరు పోస్తున్నట్లు చిత్రీకరించబడింది, రెండు చిన్న ఏనుగులు దిగువ వరుసలో తామర చెరువు నుండి కుండలను నింపుతున్నట్లు చిత్రీకరించబడ్డాయి. శిఖరం దాని క్రింద అంతస్తునుండి 96 అడుగుల ఎత్తులో ఉంది. గర్భగుడి చుట్టూ ఒక చిన్న అంతరాల గది ఉంది, ఇది ఒక పెద్ద సభ-మండపం (స్తంభాల హాలు) తో కలిసి ఉంటుంది. దీనికి ప్రక్కల అర్ధమండపం, ముందు భాగంలో అగ్రమండపం ఉన్నాయి. నంది-మండపం, గోపురం, పూజా మందిర అగ్ర-మండపానికి మధ్య ఉంది, మూడు భాగాలను ఒకే రాయి దూలంతో కలిపారు. ప్రధాన ఆలయం పునాది పైన ఆలయ నిర్మాణ మొత్తం బరువును మోస్తున్నట్లుగా కనిపించే ఏనుగుల శిల్పాల వరుసలు ఉన్నాయి. కొండ ప్రక్కన ఉన్న ప్రదక్షిణ మార్గ ఆలయ ప్రాంగణంలో ఐదు వేరు వేరు దేవాలయాలు ఉన్నాయి, వీటిలో మూడు నదీ దేవతలకు అంకితం చేయబడ్డాయి: గంగా, యమునా, సరస్వతి.

ఆలయ నిర్మాణంలో రెండు వేర్వేరు 45 అడుగుల ఎత్తైన కీర్తి స్తంభాలు (విజయ స్తంభాలు) కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఈ స్తంభం పైన త్రిశూలం ఉండేది, కానీ 18 ఇప్పుడు లేదు. ప్రధాన ఆలయానికి ఇరువైపులా ధ్వజస్తంభం వెనుక వెలుపలి గోడపై మహాభారతం, రామాయణం నుండి కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు చిత్రీకరించారు.రామాయణం నుండి ఏడు వరుసలలో అనేక సన్నివేశాలను చిత్రీకరించారు. అవి: రాముడు అయోధ్య నుండి బయలుదేరిన దృశ్యాలు, భరతుడు తిరిగి రావడానికి ప్రయత్నించడం, శూర్పణఖ అటవీ దృశ్యాలు, రావణుడు సీతను అపహరించడం, రాముడు హనుమంతుడిని కలవడం, హనుమంతుడు సముద్రం దాటి లంకకు చేరుకోవడం, అశోకవనం, రావణుని ఆస్థానం, చివరి వరుసలో వానర సైన్యం లంకకు చేరుకోవడానికి రాళ్ల వంతెనను నిర్మించినట్లు చెక్కారు. అంతేకాకుండా మహాభారతం నుండి ఏడు వరుసలు ఉన్నాయి. అవి: కృష్ణుడి ప్రారంభ సాహసాలు దిగువ రెండు వరుసలలో చూపించబడ్డాయి. మహాభారత యుద్ధం, అర్జునుడి తపస్సు, మహాభారతంలో వివరించిన విధంగా కిరాత- అర్జునుల పోరాటం నుండి దృశ్యాలు మొదటి ఐదు వరుసలలో చిత్రీకరించబడ్డాయి. ప్రధాన ఆలయానికి దక్షిణం వైపున ఉన్న రావణమూర్తి త్రిమితీయ శిల్పం వలన ఈ ఆలయానికి “కైలాస” అని పేరు వచ్చింది. రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించడం అక్కడ శివుడు విశ్రాంతిలో కూర్చున్నట్లు, శివుని బొటనవేలు ఒత్తిడితో రావణుడి అహం తొక్కినట్లు చిత్రీకరించారు. గోపురం లేదా ప్రవేశ ద్వారం, 1 ప్రదేశానికి ప్రధాన బందువుగా పనిచేస్తుంది. ఒక మండపం నుండి మరొక మండపానికి వెళ్ళేటప్పుడు హాలు పరిమాణం, స్థలం చిన్నదిగా ఉంటుంది, కాంతి మసకబారుతుంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చాలాసార్లు ఆలయాన్ని హంసం చేయడానికి ప్రయత్నించాడు 1000 మందికి పైగా కూలీలను పంపాడు వారు మూడు సంవత్సరాలు పైగా రాత్రింబవళ్లు పనిచేశారు కానీ ఔరంగాజే ఆలయాన్ని ధ్వంసం చేయలేకపోయాడు.

ఔరంగాబాద్ జిల్లాలోని ఎల్లోరా గుహల వద్ద ఉన్న రాతితో చెక్కబడిన హిందూ దేవాలయాలలో కైలాసనాథ ఆలయం అతి పెద్దది. కొండం ముఖంపై చెక్కబడిన మొగాళిత్ దాని పరిమాణం వాస్తు శిల్పం మరియు శిల్పకళ చికిత్స కారణంగా ఇది ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన గుహ దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది.

     కైలాస ఆలయం (గుహ 16) ఎల్లోరా గుహలు అని పిలువబడే 34 హిందూ, బౌద్ధ మరియు జైన గుహ దేవాలయాలు మరియు మఠాలలో అతిపెద్దది, ఇది ఈ ప్రదేశంలో వాలుగా ఉన్న బసాల్ట్ కొండ వెంట రెండు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తరించి ఉంది . ఈ ఆలయం యొక్క తవ్వకంలో ఎక్కువ భాగం సాధారణంగా ఎనిమిదవ శతాబ్దపు రాష్ట్రకూట రాజు కృష్ణ ( 756 - 773 ) కు ఆపాదించబడింది. ఆలయ నిర్మాణం పల్లవ మరియు చాళుక్య శైలుల జాడలను చూపిస్తుంది. ఈ ఆలయం వాస్తుశిల్పానికి సమానమైన భారీ స్థాయిలో అనేక స్వేచ్ఛా శిల్పాలను కలిగి ఉంది, అయితే మొదట దానిని అలంకరించిన చిత్రాల జాడలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కైలాస ఆలయంలో అంకిత శాసనం లేదు కానీ దీనిని రాష్ట్ర కూట పాలకుడు నియమించాడనడంలో సందేహం లేదు. రెండు శిలా శాసనాల ఆధారంగా గుజరాత్ రాష్ట్ర కూట శాఖ పాలకుడు కర్కరాజా వడోదర రాగి పలక శాసనం 812-813 ప్రస్తుత గుజరాత్ లో ఒక గ్రామాన్ని దానమిచ్చినట్లు నమోదు చేసింది. ఇది కృష్ణంరాజును కైలాసనాథ పోషకుడిగా పేర్కొంది మరియు ఎల్లోరా వద్ద ఒక శివాలయాన్ని కూడా ప్రస్తావించింది రాజు దేవతలు మరియు వాస్తు శిల్పి కూడా ఆశ్చర్యపోయేంత అద్భుతంగా ఒక ఆలయాన్ని నిర్మించాడని ఇది పేర్కొంది. కైలాసాలయం అనేక విభిన్న నిర్మాణ మరియు శిల్ప శైలుల వాడకాన్ని కలిగి ఉంది, కొన్ని ఆలయ ఉపశమనాలు ఆలయానికి పక్కనే ఉన్న దశావతార గుహలో ఉపయోగించిన శైలిని కలిగి ఉన్నాయి దశావతార గుహలో శ్రీకృష్ణుడి పూర్వీకుడు మరియు మేనల్లుడు దంతి దుర్గ(735-756) యొక్క శాసనం ఉంది. దీని ఆధారంగా కైలాస ఆలయ నిర్మాణం దంతిదుర్గ పాలనలో ప్రారంభమైందని తెలుస్తోంది. ఆస్థానం ఏనుగులు మరియు విజయ స్తంభాలు రావణుడు కైలాస పర్వతాన్ని కదిలించడాన్ని చిత్రీకరించే ఆలయంలోని అతి ముఖ్యమైన శిల్పం ప్రధాన భవనం తర్వాత నిర్మించబడినట్లు తెలుస్తోంది ఈ శిల్పం భారతీయ కల యొక్క అత్యుత్తమ రచనల్లో ఒకటిగా పరిగణించబడుతుంది.

చాళుక్య-పల్లవ ప్రభావం

ఏకశిలా ఆలయంలోని ప్రధాన భాగం ఏదీ తరువాత ఆలోచించినట్లు కనిపించడం లేదని, మొత్తం ఆలయం ప్రారంభంలో ప్రణాళిక చేయబడిందని నిర్మాణ ఆధారాలు సూచిస్తున్నాయి.

ప్రధాన మందిరం పట్టడకల్లోని విరూపాక్ష ఆలయాన్ని పోలి ఉంటుంది, ఇది కాంచీలోని కైలాస ఆలయానికి ప్రతిరూపం కాంచీలో కైలాస ఆలయాన్ని నిర్మించిన పల్లవులపై విజయం సాధించిన జ్ఞాపకార్థం బాదామి చాళుక్యులు పట్టడకల్ విరూపాక్ష ఆలయాన్ని ఏర్పాటు చేశారు. విరూపాక్ష ఆలయ శాసనాల ప్రకారం, పల్లవులను ఓడించిన తర్వాత చాళుక్యులు పల్లవ కళాకారులను పట్టడకల్కు తీసుకువచ్చారు.

చాళుక్యులను ఓడించిన తర్వాత, కృష్ణుడు వారి భూభాగంలో ఉన్న విరూపాక్ష ఆలయం చూసి ఆకట్టుకుని ఉంటుందని, ఫలితంగా అతను విరూపాక్ష ఆలయ శిల్పులను మరియు వాస్తు శిలుపులను తన సొంత భూభాగానికి తీసుకువచ్చి ఎల్లారాలోని కైలాస ఆలయ నిర్మాణంలో వారిని నిమగ్నం చేశాడు. విరూపాక్ష ఆలయ వాస్తు శిల్పులు ఎల్లోరాల్లో కైలాస ఆలయాన్ని నిర్మించడంలో సహాయపడ్డారని అనుకుంటే ఒకే చక్రవర్తి పాలనలో ఒక భారీ ఆలయం నిర్మాణం అసాధ్యం అనిపించదు.

ఆలయ నిర్మాణ పద్ధతి

కైలాస ఆలయం దాని నిలువు తవ్వకాలకు ప్రసిద్ధి చెందింది శిల్పులు అసలు శిల పై భాగములో ప్రారంభించి క్రిందికి తవ్వారు. స్థానిక రాజు తీవ్రమైన వ్యాధితో బాధపడుతుంటే అతని రాణి తన భర్తను నయం చేయమని ఎలా పురంలోని గృశ్నేశ్వర్ అంటే శివదేవుని ప్రార్థించింది.
ఆమె కోరిక నెరవేరితే ఒక ఆలయాన్ని నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేసింది మరియు ఈ ఆలయం యొక్క శిఖరం పైభాగం చూసే వరకు ఉపవాసం ఉంటానని హామీ ఇచ్చింది. రాజు స్వస్థత పొందిన తర్వాత ఆమె వెంటనే ఒక ఆలయాన్ని నిర్మించమని అతనిని అభ్యర్థించింది కానీ ఒక శిఖరంతో పూర్తి చేసిన ఆలయాన్ని నిర్మించడానికి నెలలు పడుతుందని వాస్తు శిల్పులు తెలిపారు. కోకాస అనే వాస్తు శిల్పి ఒక వారం లోపు రాని ఒక ఆలయ శిఖరాన్ని చూడగలడని రాజుకు హామీ ఇచ్చాడు. అతను ఒక రాతిని చెక్కడం ద్వారా పైనుండి ఆలయాన్ని నిర్మించడం ప్రారంభించాడు. అతను ఒక వారంలోనే శిఖరాన్ని పూర్తి చేయగలగాడు దీనివలన రాణి తన ఉపవాసాన్ని విరమించుకుంది. ఆ ఆలయానికి రాణి పేరు మీద మణికేశ్వర్ అని పేరు పెట్టారు. కైలాస ఆలయ నిర్మాణం దక్కన్ ప్రాంతంలో ప్రబలంగా ఉన్న మునుపటి శైలికి భిన్నంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణ ప్రవేశ ద్వారం ఒక చిన్న గోపురం కలిగి ఉంటుంది ప్రవేశ ద్వారం యొక్క ఎడమవైపున ఉన్న చాలామంది దేవతలు శైవులు కాగా కుడివైపున ఉన్న దేవతలు వైష్ణవులు, విష్ణువుతో అనుబంధం కలిగి ఉన్నారు.

       ప్రాంగణం లోపల, శివుడికి అంకితం చేయబడిన ఒక మధ్య మందిరం మరియు అతని మౌంట్ నంది (పవిత్ర ఎద్దు) చిత్రం ఉంది. లింగం ఉన్న మధ్య మందిరంలో 16 స్తంభాల మద్దతుతో చదునైన పైకప్పు గల మండపం మరియు ఒక ద్రావిడ శిఖరం ఉన్నాయి. 111 స్తంభాలు, కిటికీలు, లోపలి మరియు బయటి గదులు, సమావేశ మందిరాలు మరియు దాని మధ్యలో ఒక అపారమైన రాతి లింగంతో పూర్తి చేయబడిన ఈ మందిరం - గూళ్లు, ప్లాస్టర్లు, కిటికీలతో పాటు దేవతల చిత్రాలు, మైథున (శృంగార పురుష మరియు స్త్రీ బొమ్మలు) మరియు ఇతర బొమ్మలతో చెక్కబడింది. శివాలయాలలో సాంప్రదాయకంగా, నంది మధ్య ఆలయం ముందు ఒక వాకిలిపై కూర్చుంటుంది. నంది మండపం మరియు ప్రధాన శివాలయం ఒక్కొక్కటి 7 మీటర్ల ఎత్తులో ఉంటాయి మరియు రెండు అంతస్తులపై నిర్మించబడ్డాయి. నంది మండపం యొక్క దిగువ అంతస్తులు రెండూ దృఢమైన నిర్మాణాలు, విస్తృతమైన దృష్టాంత శిల్పాలతో అలంకరించబడ్డాయి. ఏనుగులు నిర్మాణాన్ని పైకి పట్టుకున్నాయని సూచించడానికి ఆలయ పునాది చెక్కబడింది. ఒక రాతి వంతెన నంది మండపాన్ని ఆలయ వాకిలికి కలుపుతుంది. ఆలయ హాలు యొక్క బేస్ మహాభారతం మరియు రామాయణం నుండి దృశ్యాలను కలిగి ఉంది. ఆలయ ప్రాంగణంలో ఐదు వేరుగా ఉన్న ఆలయాలు ఉన్నాయి. వీటిలో మూడు నది దేవతలకు అంకితం చేయబడ్డాయి గంగా యమునా మరియు సరస్వతి. కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించే రావణుడి శిల్పం ఒక ముఖ్యమైన శిల్పం.

తొలినాటి గర్భగుడిలో సరళమైన మందిరం ముందు స్తంభాలు లేని చిన్న హాలు ఉంది. ప్రధాన గర్భగుడి చుట్టూ ప్రదక్షిణ మార్గాలు కూడా ఉన్నాయి. కైలాస ఆలయం చోటా కైలాస మరియు ఇంద్రసభ వంటి ఏకశిలా నిర్మాణాలు నిర్మించిన భవనాలు కనిపిస్తాయి. ఇవి పుణ్యక్షేత్రాలతో పాటు బహిరంగ వరండాలు మరియు మూసివేసిన మండపాలతో కూడిన స్వేచ్ఛ దేవాలయాలు.
ఒకే రాతితో చెక్కబడిన కైలాస ఆలయం శివుని నివాసం అయిన కైలాస పర్వతాన్ని పోలి ఉండేలా రూపొందించబడింది ప్రారంభ హిందూ గుహలలో ఎక్కువ భాగం అంకితం చేయబడ్డాయి. దేవాలయం యొక్క ఎలక్షన్ అయిన లక్షణాలను మనం గమనించవచ్చు. మండపానికి ఒక ద్రావిడ శిఖరం మరియు 16 స్తంభాలు ఆధారం ఆలయం ముందు ఒక నంది విగ్రహం ఉంది.

     ఈ ప్రాంగణంలోని బౌద్ధ గుహలలో మఠాలు మరియు పుణ్యక్షేత్రాలు ఉన్నాయి విశ్వకర్మ గృహ అత్యంత ముఖ్యమైనది ఒక ప్రత్యేక ప్రార్థన మందిరం మరియు లోపల మనం బోధనాభాగ్యములో విశ్రాంతి తీసుకుంటున్నారు 17వ అడుగుల బుద్ధ విగ్రహాన్ని చూస్తాం. ఎల్లోరాలోని జైన గుహలు హిందూ మరియు బౌద్ధ గుహల కంటే చిన్నవి ఈ గుహలు మండపం మరియు స్తంభాల వరండా వంటి నిర్మాణ లక్షణాలను కలిగి ఉంటాయి. కైలాస ఆలయం మాదిరిగానే రూపొందించబడిన చోటా కైలాస ఎల్లోరా గుహలలో అత్యధికంగా సందర్శించబడే జైనా దేవాలయం ఇంద్రసభ కూడా ప్రసిద్ధి చెందింది ఇది అన్నిటికంటే పెద్దది మరియు ఉత్తమమైనది.

ఎల్లోరా గుహల చరిత్ర

    ఎల్లోరా గుహల చరిత్ర నాలుగు శతాబ్ తలనాటిది గుహ తవ్వకాల కార్యక్రమాలు 

స్పష్టంగా లేనప్పటికీ హిందూ గుహలు మరియు బౌద్ధ గుహలలో కొంత భాగం రాష్ట్ర పూట రాజవంశం సమయంలో నిర్మించబడిందని నమ్ముతారు జై నా గుహలు యాదవ పాలనలో నిర్మించబడినట్లు భావిస్తారు. ఈ గుహలను ఆరవ శతాబ్దము నుండి పదవ శతాబ్దం వరకు 400 సంవత్సరాల కాలంలో నిర్మించారు. ఈ ప్రదేశంలో 100 కంటే ఎక్కువ గృహాలు ఉన్నాయి కానీ వాటిలో 34 మాత్రమే ప్రజలకు తెరిచి ఉంటాయి గుహలకు మతపరమైన ప్రాముఖ్యత ఉన్నప్పటికీ అవి సన్యాసులు మరియు వ్యాపారులకు వసతిగృహాలుగా కూడా పనిచేశాయి.

            బౌద్ధ గుహలు ఆరవ మరియు 8వ శతాబ్దాల మధ్య తవ్వబడ్డాయని చెబుతారు మరియు జై నా గుహలు 9వ మరియు 12వ దశాబ్దాల మధ్య తవ్వబడ్డాయని, హిందూ గుహలలో రెండు దశల్లో తవ్వాడు వీటిలో కొన్ని భావిత లేదా జైనా గుహల కంటే ముందే తవ్వబడ్డాయి ఆరవ శతాబ్దం ప్రారంభంలో తొమ్మిది గుహలు తవ్వబడ్డాయి తరువాత మరో నాలుగు ఊహలు తవ్వబడ్డాయి ఇతర హిందూ గుహలు ఏడవ మరియు పదవ శతాబ్దాల మధ్య నిర్మించబడ్డాయి.

ఎల్లోరా గుహల జాబితాలో 13 నుండి 29 గృహాలు హిందూ గుహలు వాటిలో ముఖ్యమైనవి 15వ గుహ దశావతారం,16వ గుహ కైలాస ఆలయం, 21వ గృహ (రామేశ్వరం) కైలాస ఆలయం దాని రాతి భవనానికి ప్రసిద్ధి చెందింది,దశావతార గుహ ప్రధానంగా శివుడు మరియు విష్ణువులను వివిధ రూపాల్లో వర్ణిస్తుంది మరియు రామేశ్వర గుహ దాని శిల్పకళ ప్రాతినిధ్యాలకు ప్రసిద్ధి,29వ గుహ కూడా ప్రసిద్ధి చెందింది ఇది ఎలగంగా నది నుండి జలపాతం ద్వారా సృష్టింపబడిన చిన్న కొలను అయినా సీతా -కి -నహాని పక్కన ఉంది.

  1. బౌద్ధ ఆరామాలను పరిశీలించడం

ఎల్లోరా గుహలు బౌద్ధ ఆరామాలు 1 నుండి 12 గుహల వరకు ఉన్నాయి. ఆ గుహలలో, గుహ 10 (విశ్వకర్మ), గుహ 11 (దో తాల్) మరియు గుహ 12 (తీన్ తాల్) ఆకట్టుకునేవి. విశ్వకర్మ గుహ అనేది బుద్ధుని పొడవైన స్థూపం కలిగిన మందిరం, దో తాల్ అనేది రెండు అంతస్తుల ఆరామం మరియు తీన్ తాల్ అనేది మూడు అంతస్తుల ఆరామం. అన్ని బౌద్ధ గుహలు బుద్ధుని చిత్రాలు మరియు శిల్పాలతో మరియు బౌద్ధ పురాణాల చిహ్నాలతో చెక్కబడ్డాయి.

  1. జైన మందిరాలను పరిశీలించడం

ఎల్లోరాలోని జైన గుహలు 30 నుండి 34 వరకు గుహలు. ఈ మందిరాలలో అత్యంత ముఖ్యమైనవి గుహ 30 (ఛోటా కైలాస),గుహ 32 (ఇంద్ర సభ) మరియు గుహ 33 (జగన్నాథ సభ). చోటా కైలాస హిందూ కైలాస ఆలయానికి అసంపూర్ణమైన ప్రతిరూపం లాంటిది, ఇంద్ర సభ జైన మందిరాల శ్రేణి, మరియు జగన్నాథ సభలో కొన్ని బాగా సంరక్షించబడిన శిల్పాలు ఉన్నాయి. అన్ని జైన గుహలు చక్కటి మరియు సున్నితమైన శిల్పాలతో చెక్కబడ్డాయి మరియు దిగంబర శాఖకు అంకితం చేయబడిన చిత్రాలను కలిగి ఉన్నాయి.

  1. కైలాస ఆలయాన్ని అన్వేషించడం

కైలాస ఆలయం అనేది శివుడికి అంకితం. చేయబడిన ఒక పురాతన రాతితో చెక్కబడిన ఆలయ సముదాయం. దీనిలో ఒక భారీ ఏకశిలా శివలింగం ఉంది. ఈ ఆలయంలో హిందూ ఇతిహాసాలు రామాయణం మరియు మహాభారతం నుండి సంఘటనలను వర్ణించే శిల్పాలు ఉన్నాయి. మొత్తం ఆలయ స్థావరం, గోడలు మరియు పైకప్పు సున్నితమైన మరియు విస్తృతమైన శిల్పాలతో అలంకరించబడ్డాయి, మరియు అన్ని శివాలయాల మాదిరిగానే, కేంద్ర మందిరం ముందు వాకిలిపై నంది విగ్రహం ఉంది. మొత్తం పని ఉలి మరియు సుత్తులు వంటి ప్రాథమిక సాధనాలతో జరిగింది.

  1. ఘృష్ణశ్వర ఆలయాన్ని సందర్శించడం -ఘృష్లేశ్వర ఆలయం శివుడికి అంకితం చేయబడిన హిందూ దేవాలయం. ఇది అజంతా ఎల్లోరా గుహల సమీపంలో ఉన్న ప్రసిద్ధ జ్యోతిర్లింగం. ఎల్లోరా గుహల నుండి ఒక కి.మీ దూరంలో ఉన్న వెరుల్ గ్రామంలో ఇది ఒక గౌరవనీయమైన తీర్థయాత్ర స్థలం. మహాశివరాత్రి పండుగ సమయంలో చాలా మంది యాత్రికులు ఈ ఆలయంలో గుమిగూడతారు. ఆలయం లోపల నుండి ప్రవహించే నీటిని కూడా పవిత్రంగా భావిస్తారు. కైలాస దేవాలయం భారతదేశంలోని మహారాష్ట్ర రాష్ట్రంలోని ఎల్లోరాలో ఉన్న గుహ దేవాలయాలలో ఒకటి. ఈ దేవాలయం ఒకే రాతితో చెక్కబడిన అతి పెద్ద పురాతన హిందూ దేవాలయాలలో ఒకటి. దీనిని కైలాసం అని కూడా అంటారు. [1] ఒకే రాతితో ప్రత్యేకంగా చెక్కబడిన కైలాస దేవాలయం ప్రపంచంలోని అత్యంత ఆకర్షణీయమైన గుహ దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. [2] ఈ ఆలయం 276 అడుగుల పొడవు, 154 అడుగుల వెడల్పు ఉంటుంది. ఇది కొండపై నుండి మొదలుకొని నిలువుగా నీడను కలిగి ఉంటుంది.

ఈ ఏకశిలా ఆలయాన్ని నిర్మించడానికి దాదాపు 400,000 టన్నుల శిలలను వందల సంవత్సరాలుగా త్రవ్వించారని అంచనా. ఆలయ గోడలపై లభించిన ఉలి జాడల ఆధారంగా మూడు రకాల ఉలీలను ఉపయోగించారని పురావస్తు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆలయ నిర్మాణం 46.92 మీటర్ల వెడల్పుతో పిరమిడ్ రూపంలో మూడు అంతస్తులు
కలిగి ఉంది ఎల్లోరా గుహలుగా పిలువబడే 34 గుహ దేవాలయాలలో కైలాస దేవాలయం ఒకటి ఇది 16వ గుహ దీనిని ఎనిమిదవ శతాబ్దానికి చెందిన రాష్ట్ర పూట రాజు కృష్ణరాజా సా. శ. 757-783 లో నిర్మించాడు.

కైలాస ఆలయ చరిత్ర

మరాఠీ ఇతిహాసం ప్రకారం స్థానిక రాజు తీవ్ర అనారోగ్యానికి గురవ్వడంతో అతడి భార్య శివుడిని ప్రార్థించింది. రాజు పూర్తిగా ఆరోగ్యవంతంగా కోలుకుంటే ఆలయాన్ని కట్టిస్తానని, ఆలయం గోపురం చూసేవరకు తాను ఉపవాసం ఉంటానని మొక్కుకుంది. వెంటనే ఆ రాజు కోలుకున్నాడు. రాణి మొక్కు తీర్చేందుకు అప్పటి శిల్పులు కొండను తొలచి ఆలయ నిర్మాణం చేపట్టేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్నకోకసా అనే శిల్పి అలా నిర్మాణం చేపడితే ఆమె ఆలయ గోపురాన్ని చూసేందుకు కొన్ని వందల ఏళ్లు పడుతుందని చెప్పాడు. దీంతో ఆలయాన్ని ముందు నుంచి కాకుండా కొండ పై భాగం నుంచి చెక్కుకుని వచ్చారు. ముందుగా ఆలయం గోపురాన్ని చెక్కి రాణిని ఉపవాస దీక్ష విరమించేలా చేశారు.

ఆలయ నిర్మాణం

      ఈ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద రెండు అంతస్తుల గోపురం ఉంది. ప్రవేశ ద్వారం వైపున శైవులు, వైష్ణవులు పూజించే దేవతల శిల్పాలు ఉన్నాయి. ప్రవేశ ద్వారం నుండి రెండు అంతర్గత ప్రాంగణాలు కనిపిస్తాయి, ప్రతి ఒక్కటి నిలువు ఆర్కేడ్తో సరిహద్దులుగా ఉన్నాయి. ఉత్తరం, దక్షిణ ప్రాంగణంలోని రాళ్ళ మీద పెద్ద ఏనుగు చెక్కబడింది. రాష్ట్రకూట రాజులు తమ ఏనుగు దళంతో అనేక యుద్ధాల్లో గెలిచి, ఏనుగులను తమకు ఇష్టమైన జంతువులలో ఒకటిగా మార్చుకున్నారు. ఆలయంలో ఏనుగు శిల్పాలు ఉండటం రాష్ట్రకూట రాజుల బలాన్ని, శ్రేయస్సును సూచిస్తుంది. కైలాస ప్రధాన ఆలయంలో లోపల గోడపైన కమలంపై కూర్చున్న గజలక్ష్మి ప్రతిమ ఉంటుంది. ఆ ప్రతిమ వెనుక నాలుగు ఏనుగులు ఉన్నాయి. రెండు పెద్ద ఏనుగులలో ప్రతి ఒక్కటి పై వరుసలో ఒక కుండ నుండి గజలక్ష్మి మీద నీరు పోస్తున్నట్లు చిత్రీకరించబడింది, రెండు చిన్న ఏనుగులు దిగువ వరుసలో తామర చెరువు నుండి కుండలను నింపుతున్నట్లు చిత్రీకరించబడ్డాయి. శిఖరం దాని క్రింద అంతస్తునుండి 96 అడుగుల ఎత్తులో ఉంది. గర్భగుడి చుట్టూ ఒక చిన్న అంతరాల గది ఉంది, ఇది ఒక పెద్ద సభ-మండపం (స్తంభాల హాలు) తో కలిసి ఉంటుంది. దీనికి ప్రక్కల అర్ధమండపం, ముందు భాగంలో అగ్రమండపం ఉన్నాయి. నంది-మండపం, గోపురం, పూజా మందిర అగ్ర-మండపానికి మధ్య ఉంది, మూడు భాగాలను ఒకే రాయి దూలంతో కలిపారు. ప్రధాన ఆలయం పునాది పైన ఆలయ నిర్మాణ మొత్తం బరువును మోస్తున్నట్లుగా కనిపించే ఏనుగుల శిల్పాల వరుసలు ఉన్నాయి. కొండ ప్రక్కన ఉన్న ప్రదక్షిణ మార్గ ఆలయ ప్రాంగణంలో ఐదు వేరు వేరు దేవాలయాలు ఉన్నాయి, వీటిలో మూడు నదీ దేవతలకు అంకితం చేయబడ్డాయి: గంగా, యమునా, సరస్వతి.

ఆలయ నిర్మాణంలో రెండు వేర్వేరు 45 అడుగుల ఎత్తైన కీర్తి స్తంభాలు (విజయ స్తంభాలు) కూడా ఉన్నాయి. ఒకప్పుడు ఈ స్తంభం పైన త్రిశూలం ఉండేది, కానీ 18 ఇప్పుడు లేదు. ప్రధాన ఆలయానికి ఇరువైపులా ధ్వజస్తంభం వెనుక వెలుపలి గోడపై మహాభారతం, రామాయణం నుండి కొన్ని ఆసక్తికరమైన సన్నివేశాలు చిత్రీకరించారు. రామాయణం నుండి ఏడు వరుసలలో అనేక సన్నివేశాలను చిత్రీకరించారు. అవి: రాముడు అయోధ్య నుండి బయలుదేరిన దృశ్యాలు, భరతుడు తిరిగి రావడానికి ప్రయత్నించడం, శూర్పణఖ అటవీ దృశ్యాలు, రావణుడు సీతను అపహరించడం, రాముడు హనుమంతుడిని కలవడం, హనుమంతుడు సముద్రం దాటి లంకకు చేరుకోవడం, అశోకవనం, రావణుని ఆస్థానం, చివరి వరుసలో వానర సైన్యం లంకకు చేరుకోవడానికి రాళ్ల వంతెనను నిర్మించినట్లు చెక్కారు. అంతేకాకుండా మహాభారతం నుండి ఏడు వరుసలు ఉన్నాయి. అవి: కృష్ణుడి ప్రారంభ సాహసాలు దిగువ రెండు వరుసలలో చూపించబడ్డాయి. మహాభారత యుద్ధం, అర్జునుడి తపస్సు, మహాభారతంలో వివరించిన విధంగా కిరాత- అర్జునుల పోరాటం నుండి దృశ్యాలు మొదటి ఐదు వరుసలలో చిత్రీకరించబడ్డాయి. ప్రధాన ఆలయానికి దక్షిణం వైపున ఉన్న రావణమూర్తి త్రిమితీయ శిల్పం వలన ఈ ఆలయానికి “కైలాస” అని పేరు వచ్చింది. రావణుడు కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించడం అక్కడ శివుడు విశ్రాంతిలో కూర్చున్నట్లు, శివుని బొటనవేలు ఒత్తిడితో రావణుడి అహం తొక్కినట్లు చిత్రీకరించారు. గోపురం లేదా ప్రవేశ ద్వారం, 1 ప్రదేశానికి ప్రధాన బందువుగా పనిచేస్తుంది. ఒక మండపం నుండి మరొక మండపానికి వెళ్ళేటప్పుడు హాలు పరిమాణం, స్థలం చిన్నదిగా ఉంటుంది, కాంతి మసకబారుతుంది. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు చాలాసార్లు ఆలయాన్ని హంసం చేయడానికి ప్రయత్నించాడు 1000 మందికి పైగా కూలీలను పంపాడు వారు మూడు సంవత్సరాలు పైగా రాత్రింబవళ్లు పనిచేశారు కానీ ఔరంగాజే ఆలయాన్ని ధ్వంసం చేయలేకపోయాడు.

ఔరంగాబాద్ జిల్లాలోని ఎల్లోరా గుహల వద్ద ఉన్న రాతితో చెక్కబడిన హిందూ దేవాలయాలలో కైలాసనాథ ఆలయం అతి పెద్దది. కొండం ముఖంపై చెక్కబడిన మొగాళిత్ దాని పరిమాణం వాస్తు శిల్పం మరియు శిల్పకళ చికిత్స కారణంగా ఇది ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన గుహ దేవాలయాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. కైలాస ఆలయం (గుహ 16) ఎల్లోరా గుహలు అని పిలువబడే 34 హిందూ, బౌద్ధ మరియు జైన గుహ దేవాలయాలు మరియు మఠాలలో అతిపెద్దది, ఇది ఈ ప్రదేశంలో వాలుగా ఉన్న బసాల్ట్ కొండ వెంట రెండు కిలోమీటర్ల కంటే ఎక్కువ విస్తరించి ఉంది . ఈ ఆలయం యొక్క తవ్వకంలో ఎక్కువ భాగం సాధారణంగా ఎనిమిదవ శతాబ్దపు రాష్ట్రకూట రాజు కృష్ణ ( 756 - 773 ) కు ఆపాదించబడింది. ఆలయ నిర్మాణం పల్లవ మరియు చాళుక్య శైలుల జాడలను చూపిస్తుంది. ఈ ఆలయం వాస్తుశిల్పానికి సమానమైన భారీ స్థాయిలో అనేక స్వేచ్ఛా శిల్పాలను కలిగి ఉంది, అయితే మొదట దానిని అలంకరించిన చిత్రాల జాడలు మాత్రమే మిగిలి ఉన్నాయి. కైలాస ఆలయంలో అంకిత శాసనం లేదు కానీ దీనిని రాష్ట్ర కూట పాలకుడు నియమించాడనడంలో సందేహం లేదు. రెండు శిలా శాసనాల ఆధారంగా గుజరాత్ రాష్ట్ర కూట శాఖ పాలకుడు కర్కరాజా వడోదర రాగి పలక శాసనం 812-813 ప్రస్తుత గుజరాత్ లో ఒక గ్రామాన్ని దానమిచ్చినట్లు నమోదు చేసింది. ఇది కృష్ణంరాజును కైలాసనాథ పోషకుడిగా పేర్కొంది మరియు ఎల్లోరా వద్ద ఒక శివాలయాన్ని కూడా ప్రస్తావించింది రాజు దేవతలు మరియు వాస్తు శిల్పి కూడా ఆశ్చర్యపోయేంత అద్భుతంగా ఒక ఆలయాన్ని నిర్మించాడని ఇది పేర్కొంది. కైలాసాలయం అనేక విభిన్న నిర్మాణ మరియు శిల్ప శైలుల వాడకాన్ని కలిగి ఉంది, కొన్ని ఆలయ ఉపశమనాలు ఆలయానికి పక్కనే ఉన్న దశావతార గుహలో ఉపయోగించిన శైలిని కలిగి ఉన్నాయి దశావతార గుహలో శ్రీకృష్ణుడి పూర్వీకుడు మరియు మేనల్లుడు దంతి దుర్గ(735-756) యొక్క శాసనం ఉంది. దీని ఆధారంగా కైలాస ఆలయ నిర్మాణం దంతిదుర్గ పాలనలో ప్రారంభమైందని తెలుస్తోంది.
ఆస్థానం ఏనుగులు మరియు విజయ స్తంభాలు రావణుడు కైలాస పర్వతాన్ని కదిలించడాన్ని చిత్రీకరించే ఆలయంలోని అతి ముఖ్యమైన శిల్పం ప్రధాన భవనం తర్వాత నిర్మించబడినట్లు తెలుస్తోంది ఈ శిల్పం భారతీయ కల యొక్క అత్యుత్తమ రచనల్లో ఒకటిగా పరిగణించబడుతుంది.

చాళుక్య-పల్లవ ప్రభావం

ఏకశిలా ఆలయంలోని ప్రధాన భాగం ఏదీ తరువాత ఆలోచించినట్లు కనిపించడం లేదని, మొత్తం ఆలయం ప్రారంభంలో ప్రణాళిక చేయబడిందని నిర్మాణ ఆధారాలు సూచిస్తున్నాయి.

ప్రధాన మందిరం పట్టడకల్లోని విరూపాక్ష ఆలయాన్ని పోలి ఉంటుంది, ఇది కాంచీలోని కైలాస ఆలయానికి ప్రతిరూపం కాంచీలో కైలాస ఆలయాన్ని నిర్మించిన పల్లవులపై విజయం సాధించిన జ్ఞాపకార్థం బాదామి చాళుక్యులు పట్టడకల్ విరూపాక్ష ఆలయాన్ని ఏర్పాటు చేశారు. విరూపాక్ష ఆలయ శాసనాల ప్రకారం, పల్లవులను ఓడించిన తర్వాత చాళుక్యులు పల్లవ కళాకారులను పట్టడకల్కు తీసుకువచ్చారు.

చాళుక్యులను ఓడించిన తర్వాత, కృష్ణుడు వారి భూభాగంలో ఉన్న విరూపాక్ష ఆలయం చూసి ఆకట్టుకుని ఉంటుందని, ఫలితంగా అతను విరూపాక్ష ఆలయ శిల్పులను మరియు వాస్తు శిలుపులను తన సొంత భూభాగానికి తీసుకువచ్చి ఎల్లారాలోని కైలాస ఆలయ నిర్మాణంలో వారిని నిమగ్నం చేశాడు. విరూపాక్ష ఆలయ వాస్తు శిల్పులు ఎల్లోరాల్లో కైలాస ఆలయాన్ని నిర్మించడంలో సహాయపడ్డారని అనుకుంటే ఒకే చక్రవర్తి పాలనలో ఒక భారీ ఆలయం నిర్మాణం అసాధ్యం అనిపించదు.

ఆలయ నిర్మాణ పద్ధతి

కైలాస ఆలయం దాని నిలువు తవ్వకాలకు ప్రసిద్ధి చెందింది శిల్పులు అసలు శిల పై భాగములో ప్రారంభించి క్రిందికి తవ్వారు. స్థానిక రాజు తీవ్రమైన వ్యాధితో బాధపడుతుంటే అతని రాణి తన భర్తను నయం చేయమని ఎలా పురంలోని గృశ్నేశ్వర్ అంటే శివదేవుని ప్రార్థించింది.
ఆమె కోరిక నెరవేరితే ఒక ఆలయాన్ని నిర్మిస్తానని ప్రతిజ్ఞ చేసింది మరియు ఈ ఆలయం యొక్క శిఖరం పైభాగం చూసే వరకు ఉపవాసం ఉంటానని హామీ ఇచ్చింది. రాజు స్వస్థత పొందిన తర్వాత ఆమె వెంటనే ఒక ఆలయాన్ని నిర్మించమని అతనిని అభ్యర్థించింది కానీ ఒక శిఖరంతో పూర్తి చేసిన ఆలయాన్ని నిర్మించడానికి నెలలు పడుతుందని వాస్తు శిల్పులు తెలిపారు. కోకాస అనే వాస్తు శిల్పి ఒక వారం లోపు రాని ఒక ఆలయ శిఖరాన్ని చూడగలడని రాజుకు హామీ ఇచ్చాడు. అతను ఒక రాతిని చెక్కడం ద్వారా పైనుండి ఆలయాన్ని నిర్మించడం ప్రారంభించాడు. అతను ఒక వారంలోనే శిఖరాన్ని పూర్తి చేయగలగాడు దీనివలన రాణి తన ఉపవాసాన్ని విరమించుకుంది. ఆ ఆలయానికి రాణి పేరు మీద మణికేశ్వర్ అని పేరు పెట్టారు. కైలాస ఆలయ నిర్మాణం దక్కన్ ప్రాంతంలో ప్రబలంగా ఉన్న మునుపటి శైలికి భిన్నంగా ఉంటుంది. ఆలయ ప్రాంగణ ప్రవేశ ద్వారం ఒక చిన్న గోపురం కలిగి ఉంటుంది ప్రవేశ ద్వారం యొక్క ఎడమవైపున ఉన్న చాలామంది దేవతలు శైవులు కాగా కుడివైపున ఉన్న దేవతలు వైష్ణవులు, విష్ణువుతో అనుబంధం కలిగి ఉన్నారు.

       ప్రాంగణం లోపల, శివుడికి అంకితం చేయబడిన ఒక మధ్య మందిరం మరియు అతని మౌంట్ నంది (పవిత్ర ఎద్దు) చిత్రం ఉంది. లింగం ఉన్న మధ్య మందిరంలో 16 స్తంభాల మద్దతుతో చదునైన పైకప్పు గల మండపం మరియు ఒక ద్రావిడ శిఖరం ఉన్నాయి. 111 స్తంభాలు, కిటికీలు, లోపలి మరియు బయటి గదులు, సమావేశ మందిరాలు మరియు దాని మధ్యలో ఒక అపారమైన రాతి లింగంతో పూర్తి చేయబడిన ఈ మందిరం - గూళ్లు, ప్లాస్టర్లు, కిటికీలతో పాటు దేవతల చిత్రాలు, మైథున (శృంగార పురుష మరియు స్త్రీ బొమ్మలు) మరియు ఇతర బొమ్మలతో చెక్కబడింది. శివాలయాలలో సాంప్రదాయకంగా, నంది మధ్య ఆలయం ముందు ఒక వాకిలిపై కూర్చుంటుంది. నంది మండపం మరియు ప్రధాన శివాలయం ఒక్కొక్కటి 7 మీటర్ల ఎత్తులో ఉంటాయి మరియు రెండు అంతస్తులపై నిర్మించబడ్డాయి. నంది మండపం యొక్క దిగువ అంతస్తులు రెండూ దృఢమైన నిర్మాణాలు, విస్తృతమైన దృష్టాంత శిల్పాలతో అలంకరించబడ్డాయి. ఏనుగులు నిర్మాణాన్ని పైకి పట్టుకున్నాయని సూచించడానికి ఆలయ పునాది చెక్కబడింది. ఒక రాతి వంతెన నంది మండపాన్ని ఆలయ వాకిలికి కలుపుతుంది. ఆలయ హాలు యొక్క బేస్ మహాభారతం మరియు రామాయణం నుండి దృశ్యాలను కలిగి ఉంది. ఆలయ ప్రాంగణంలో ఐదు వేరుగా ఉన్న ఆలయాలు ఉన్నాయి. వీటిలో మూడు నది దేవతలకు అంకితం చేయబడ్డాయి గంగా యమునా మరియు సరస్వతి. కైలాస పర్వతాన్ని ఎత్తడానికి ప్రయత్నించే రావణుడి శిల్పం ఒక ముఖ్యమైన శిల్పం.

ఈ ఎల్లోరా గుహలు తెరిచే సమయం సూర్యోదయం నుండి సూర్యాస్తమయం. ఎల్లోరా గ్రూపులను చూడటానికి దాదాపుగా రెండు గంటల సమయం పడుతుంది. అలాగే సమీప నగరమైన ఔరంగాబాద్ నుండి ఎల్లోరా గుహలను చేరుకోవడానికి ఒక గంట సమయం పడుతుంది.

September 28, 2026 2 comments
0 FacebookTwitterPinterestEmail
కవితలు

“మాట లక్ష లక్షణాల మూట”

by Kommidi Govardhan Reddy September 28, 2026
written by Kommidi Govardhan Reddy

“ఉండబట్టలేక ఊదిన శబ్ధంబు ఊరిజనులకెల్ల తమలపాకు కాసువక్క చేరి రంగు మారునురా సత్యమైన పలుకు గోవర్థనుడు బలుకు “

నేను గతంలో రాసుకున్న పద్యమిది.
మాట చాలా విలువైనది విశ్వవ్యాప్తమైనది. అలాంటి మాటను అనాలోచితంగా విసిరితే జరిగే పరిణామాలగూర్చి,తాంబూలంలో వాడే ఆకు వక్క సున్నం అన్ని కలిసి ఎలా అయితే ఎర్రని రంగుగా మారుతాయో” తొందరపడి మాట్లాడిన మాట విపరిత పరిణామాలకు దారీతీస్తుంది.

​సృష్టిలో మానవ జాతికి ప్రకృతి ప్రసాదించిన అత్యంత శక్తివంతమైన, అద్భుతమైన వరం ‘మాట’. పశుపక్ష్యాదులకు లేని భావప్రకటన సామర్థ్యం, గొంతులో నుండి వచ్చే శబ్దానికి అర్థాన్ని అద్దే శక్తి కేవలం మానవ జాతికి లభించిన వరం. ఈ మాట కేవలం భావాల వినిమయ సాధనమే కాదు… అది సృష్టికి, వినాశనానికి, ప్రేమకు, ద్వేషానికి, బంధాలకు, బంధకాలకు మూలం.
​అందుకే పెద్దలు “నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది” అన్నారు. మరి అలాంటప్పుడు, ఎటుపడితే అటు, ఏది పడితే అది మాట్లాడితే అది ‘మాట’ అనిపించుకోదు. విచక్షణ కోల్పోయి, హద్దు మీరి మాట్లాడే ప్రతి శబ్దం మాటకు విలువను కోల్పోయేలా చేస్తుంది. ఆధ్యాత్మిక గ్రంథాలలో చారిత్రక సంఘటనలలో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి.
​
​భారతీయ సనాతన ధర్మంలో వాక్కును సాక్షాత్తూ సరస్వతీ దేవి స్వరూపంగా భావించడం మనందరికి తెలిసిందే! ‘మాట’ వెనుక మనసు, మనసు వెనుక సంస్కారం ఉంటాయనేది సత్యం. భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు మనిషి ఆచరించవలసిన తపస్సులలో ‘వాచిక తపస్సు’ (మాట్లాడే విధానం ద్వారా చేసే తపస్సు) గురించి అత్యంత స్పష్టంగా వివరించాడు.
​
“అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్ |
స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్మయం తప ఉచ్యేతే “||
​
ఎవరికీ ఉద్వేగాన్ని (బాధను, కోపాన్ని) కలిగించనిది, సత్యమైనది, ఇతరులకు ప్రియమైనది మరియు హితకరమైనది (మంచి చేసేది) అయిన మాటను మాట్లాడటమే ‘వాచిక తపస్సు’. ఎదుటివారి మనసును గాయపరిచేలా మాట్లాడేది ఎప్పుడూ ‘మాట’ అనిపించుకోదు, అది కేవలం శబ్ద కాలుష్యమే అవుతుంది.
​ఎల్లప్పుడూ సత్యమే మాట్లాడాలి. ప్రియమైనదే మాట్లాడాలి. అలా అని ఇష్టపడని చేదు సత్యాన్ని మాట్లాడకూడదు. అలాగే ప్రియంగా ఉంటుందని అసత్యాన్ని…అబద్ధాన్ని కూడా మాట్లాడకూడదు.
​మాట యొక్క శక్తి ఎంతటిదో మన పురాణాలు మరియు చరిత్ర అనేక ఉదాహరణల ద్వారా నిరూపించాయి.భయంకరమైన వినాశనానికి,చిక్కుముడిలాంటి సమస్యల సాధనకు మాటే మూలమైన సందర్భాలు ఎన్నో…ఉన్నాయి.
​రామాయణంలో హనుమంతుని మాట చాతుర్యం
లంకలో సీతాదేవిని వెతకడానికి వెళ్ళిన సందర్భంలో మాట్లాడిన విధానం వాక్కు యొక్క గొప్పతనాన్ని లోకానికి చాటింది. హనుమంతుడు వ్యాకరణ పండితుడు. ఎక్కడ, ఎవరితో, ఏ సందర్భంలో ఎలా మాట్లాడాలో ఆయనకు తెలుసు. రాముడి దూతగా సీతాదేవిని కలిసినప్పుడు ఆమెలో భయం పోగొట్టి, ధైర్యం నూరిపోసే మాటలు, రావణుని సభలో తన వాగ్ధాటితో రాక్షసులను నివ్వెరపరిచి భయపెట్టే మాటలు లోకవిదితం. వాల్మీకి మహర్షి హనుమంతుడిని వర్ణిస్తూ “నాన్యథా రాఘవస్యాస్య” మాటలో ఏనాడు అనవసరమైన లేదా దోషపూరితమైన పదం రానీయనివాడు అని కొనియాడటం హనుమంతుని మాటవిధానానికి కొలమానం.
మహాభారత యుద్ధానికి పాండవ కౌరవుల మధ్య వైరమే ప్రధాన కారణమైనప్పటికీ, ద్రౌపది ఇంద్రప్రస్థంలో దుర్యోధనుడిని ఉద్దేశించి పలికిన ఒక వ్యాఖ్య….”అంధుని కొడుకు అంధుడే” వినాశనానికి బీజం వేసిందని… ఓ కథనం. ఎదుటివారి బలహీనతలను ఎత్తిచూపుతూ, వారిని అవమానించేలా మాట్లాడే మాటలు చివరికి మహాభారత యుద్ధంలాంటి పెను విధ్వంసానికి దారితీశాయి. ఒకే ఒక మాట ఎంతటి మహా సామ్రాజ్యాన్నైనా కూల్చగలదని దీని ద్వారా అర్థమవుతుంది.
​చరిత్రలో అదుపులేని మాటల మూల్యం యుద్ధాలు “మారణహోమాలే”…
చరిత్రలో ఎంతో మంది రాజులు, నాయకులు తమ నోటి దురుసు వల్ల, విచక్షణారహితమైన ప్రకటనల వల్ల తమ రాజ్యాలను, ప్రజల నమ్మకాన్ని కోల్పోయారు. కత్తితో చేసిన గాయం కాలక్రమేణా మానిపోతుంది, కానీ నాలుకతో (మాటతో) చేసిన గాయం గుండెలో శాశ్వతంగా నిలిచిపోతుంది. ఆలోచించకుండా మాట్లాడేవారి వల్ల కుటుంబంలో, స్నేహితుల్లో లేదా కార్యాలయంలో మాటల పేలితే ఎన్నో ఏళ్ల బంధం క్షణాల్లో తెగిపోతుంది.
​ “అతి సర్వత్ర వర్జయేత్” అన్నట్లు అనవసరమైన మాటలు మాట్లాడే వారికి సమాజంలో విశ్వసనీయత ఉండదు. ప్రజలు వారిని దూరం పెడతారు. అనవసరమైన విషయాలపై మాట్లాడటం, ఇతరులను విమర్శించడం వల్ల మనసు అశాంతికి గురవుతుంది.
​మాట అనేది మనిషి యొక్క అంతఃసౌందర్యానికి పరిపక్వతకు అద్దం పడుతుంది. మౌనం అన్నిసార్లు బంగారమే కాకపోవచ్చు, కానీ ‘మితభాషణం’ మరియు ‘మంచితనంతో కూడిన మాట’ మనిషికి సంస్కారాన్ని తెచ్చిపెడతాయి.
​ప్రతి మాటా ఆలోచించి, ఎదుటివారి హృదయాలను హత్తుకునేలా, సమాజానికి మేలు చేసేలా మాట్లాడాలి. అందుకే మన పెద్దలు “నోరు అదుపులో లేకపోతే, జీవితం అదుపుతప్పుతుంది” అని హెచ్చరించారు. వాక్కును సరస్వతీ దేవి ప్రసాదించిన పవిత్ర వరంగా భావించి, బాధ్యతాయుతంగా మాట్లాడటమే నిజమైన మానవ ధర్మం.

September 28, 2026 1 comment
0 FacebookTwitterPinterestEmail
కవితలు

నా విధి

by Tummala Ankita September 28, 2026
written by Tummala Ankita

నన్ను బీడి అంటారు.
కొంత మంది చుట్ట అంటారు.
ఇంకా కొంత మంది సిగరెట్ అంటారు.
ఎవరు ఎన్ని విధాలుగా పిలుచుకున్నా,
నా విధి మాత్రం ఒక్కటే.

ఆరోగ్యవంతుని శరీరంలోకి చేరి,
అనారోగ్యంగా మారుస్తా.

పెళ్ళాం మాట విని నన్ను వదిలేస్తే ఆదాయం వస్తుంది,
నేనే కావాలనుకుంటే అపాయం వస్తుంది.

పిల్లల ముఖం చూసి నన్ను పీల్చకుండా ఉంటావో, నన్ను చూసి నీ ముఖం మల్చుకుంటావో నీ ఇష్టం.

ధనవంతుడు ఎంత బలవంతుడో చూపించాలని నన్ను కాల్చిన,
నేను మాత్రం తనను కాలుస్తూ బలహిణుణ్ణి చేస్తా.

బీదవాడిని నేను బీడినే పట్టి పొగా ఊదుతా అంటే, నేనేం చేస్తా తన ఊపిరినే ఊదేస్థా.

నాకు అంతం ఉందనుకుంటారేమో.
ఈ మానవులు నన్ను మరుగున పడనిస్తారా?

ఆకలికి అన్నం ఎలాగో,
అన్నింటికి నేను అలాగే.

ప్రతి రోజు నేనే కావాలి,
ప్రతి పూట నేనే కావాలి,
ప్రతి చోటా నేనే కావాలి.

నన్ను ఆదిలోనే అంతం చేయకుంటే,
నేను చితిలోన తోడునవుతా.

September 28, 2026 2 comments
6 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

క్విజ్ పోటీ-

by nellutla Indrani July 31, 2026
written by nellutla Indrani

మే 2026 నుంచి మయూఖ పత్రిక లో ఇంద్రాణి నెల్లుట్ల నిర్వహిస్తున్న ఈ క్విజ్ జులై నెల మయూఖ సంచికలోనూ అంతే ఉత్సాహంగా మీ ముందుకు వచ్చింది. మే లో ఎన్ని పాయింట్స్ వచ్చాయి? ఇప్పుడు ఎన్నొస్తాయో మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి అభినందించుకోండి- కొండపల్లి నీహారిణి మయూఖ ఎడిటర్

1.Find the odd one out
A. 🔴 . B. 🔺 .C .💲. D.🔸.

2 Where is India’s largest Floating Solar power plant located ?
A. Ramagundam.B. Nirmal. C. Kothagudem. D. Bhadrachalam

3.” Man is born free and everywhere he is in chains ” who’s quote is this ?
A. Rousseau’s. B. Aristotle’s. C. Socrates’. D. Darwin’s

4 What is the name of “Sri Krishna’s Army?
A. Yadava Sena. B. Narayani Sena. C. Garuda Sena. D. Shesha Sena

5.The people of Netherlands are called?
A. Kiwis. B. Logos. C. Kangaroo. D. Dutch.

6 . Who is the recipient of Booker Prize in 2026?
A. Yang Shuang -Zi. B. Malala. C. Susan. D. Arundhathi Rai.

7 . What is the Currency of Burma ?
A. Yen. B. Dug. C. Kyat. D. Bat.

8 . Which country has the highest percentage of women in the Parliament?
A. United States. B. Australia. C. Rwanda. D. France .

9 Which country is celebrating 250 years of Independence in 2026?
A. England. B. Australia. C. United States. D. New Zealand.

10 .Which natural calamity affected Venezuela on June 24th 2026?
A. Earthquake. B. Wildfires. C. Heavy floods D. Heavy rains

11. Which country has the most time-zones?
A. United States. B. France. C. England. D. Australia.

12. Who is the author of Mricchakatikam in Telugu?
A. Bhana. B. Kalidasa. C. Bimbisara. D. Shudraka.

13. What is the largest water animal?
A.Dolphin. B. Orcas. C. Blue Whale. D. Jaws.

14. Study of heart is called?
A. Cardiology. B. Neurology. C. Nephrology. D. Urology.

15. What is the Capital of Khazakisthan?
A. Kabul. B. Dubai. C. Cairo. D. Astana.

16. Which country has Kandla port?
A. India. B. Kenya. C. U.S.A. D. Australia.

17. Vitamin ‘K’ is essential for?
A. Blood clotting. B. Mescles C. Growing Hair. D. Eye sight.

18. Which river is called “The Sarrow of China”?
A. Red River. B. Yellow river. C. Orange River. D. White River

19. Which country is called Land of White Elephants?
A. India. B. Burma. C. Thailand. D. Bangladesh.

20. What is the name of the horse of Maharana Pratap?
A. Chetak. B. Krishna. C. Indrani. D. Jawa.

——– Correct Answers ———-.
1.C .($ sign is not shape). 2.A .Ramagundam(100 MW NTPC). 3.A. Rousseau ( Swiss – born philosopher and writer). 4.B. Narayani Sena(The invincible and elite military force of Lord Krishna). 5.D.Dutch(English speakers historically used the term to describe Germanic peoples in general).
6.A .Yang Shuang -Zi(Taiwan writer). 7.C.Kyat(international code is MMK). 8.C. Rwanda(It is highly recognized globally for its inclusive representation,notably holding the highest percentage of women in parliament worldwide). 9.C.United States of America ( United States is celebrating 250th anniversary of the Declaration of Independence,marking 250 years since being 1776). 10.A.Earthquake(7.5- and 7.2-magnitude earthquakes shook Venezuela). 11.B.France(France spans 12 time Zones). 12.D.Shudraka(he is an ancient Indian king and writer). 13.C.Blue Whale(Growing up to 33 m (108 ft ) long and weighing up 200 tons). 14.A.Cardiology(A specialized branch of internal medicine diagnosing and treating disorders of the heart). 15. D.Astana(Situated on the Ishim River in the North of the country). 16.A.India(Established in 1950). 17.A.Blood clotting(It comes in two main forms: from plants like leafy greens,animal products and fermented foods). 18.B .Yellow river(China’s second -longest river and muddiest on the earth). 19.C.Thailand(The elephant is the national symbol of the country). 20.A.Chetak(Chetak is the name given in traditional literature to the horse ridden by Maharana Pratap). మీ సమాధానాలు సరైనవేనా చెక్ చేసుకోండి.

July 31, 2026 29 comments
0 FacebookTwitterPinterestEmail
ఇంద్రధనుస్సు

వంటిల్లు – వొడవని ముచ్చట (కిచెన్ కాలమ్)

by Laxmi Madan July 30, 2026
written by Laxmi Madan

పేలాలతో ఆరోగ్యం

వీటిని రకరకాలుగా పిలుస్తారు.

తెలంగాణ & మహా రాష్ట్ర లో సుశీల అని..రాయల సీమలో ఉగ్గాని అని పిలుస్తారు.

ఏ పేరుతో పిలిస్తే ఏముంది! రుచిగా శుచిగా ఉంటే చాలు కదా!

ఈ పేలాలు లేదా మరమరాలు చాలా తేలికైన ఆహారం. సులభంగా అరుగుతుంది. ఊరికే కలుపుకొని తిన్నా కూడా ఎంతో బాగుంటుంది

ఇదంతా ఎందుకు కానీ ఈరోజు నేను సుశీల చేశాను. సుశీల అంటే ఒక అమ్మాయి కాదమ్మా! పేలాల తో పోహా లాంటిది లేదా ఉప్మా అనుకోండి.

ఏముంది ఇష్టం ఉన్నన్ని పేలాలు బాగా కడిగి జాలీలో వడగట్టి పెట్టుకోవాలి.

తర్వాత బాండ్లీ పెట్టుకొని పోపు వేసుకొని పల్లీలు పచ్చిమిరపకాయలు స్వీట్ కార్న్ ఆలు, టమాటో, ఉల్లిపాయ కీర కూడా సన్నగా తరిగి వేసుకోవచ్చు కానీ నేను వేయలేదు. ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి వేసి మగ్గించి అందులో కొత్తిమీర కరివేపాకు వేసి ఆ తర్వాత ఈ తడిపిన పేలాలను అందులో వేసి ఉప్పు వేసి బాగా కలిపి మరొక ఐదు నిమిషాలు మగ్గించి నిమ్మకాయ పిండుకొని తినడమే!

రాత్రిపూట తింటే హాయిగా ఉంటుంది! డైటింగ్ పేరిట పచ్చి కూరగాయలు పిచ్చి కూరగాయలు తింటున్నారు కదా ఈమధ్య. అవే బ్రోకోలి లెట్యూస్..
ఇవన్నీ మన దేశపు పంటలు కాదు. అందులో పోషక విలువలు లేవని కాదు కానీ ట్రాన్స్పోర్ట్ లో మన దగ్గరికి వచ్చే వరకు చాలా టైం పడుతుంది అక్కడే ఫ్రెష్ గా తింటే బాగుంటుంది. నిజం చెప్పాలంటే ఏ ప్రాంతంలో పండినవి ఆ ప్రాంతం లో తింటే అది మనకు సులభంగా ఒంట పడుతుంది జీర్ణం అవుతుంది. ఏదో ఫ్యాషన్ కదా అని వాళ్ళు తింటున్నారని వీళ్ళు తింటున్నారని తింటే ఏమో లెండి! ఎందుకు వచ్చిన తిప్పలు!

నేనైతే ఇలా చేశాను. మెక్కేసాను కూడా! అంత బాగుంది మరి..

వీటికి ఇంకా వేరే పేర్లు ఏమైనా ఉన్నాయా! ఉంటే సూచించండి

July 30, 2026 9 comments
0 FacebookTwitterPinterestEmail
Newer Posts
Older Posts

Recent Posts

  • విజ్ఞానదాయకం – కె.బి.సి.
  • ఎంతగా చదివితే అంత భాషా సౌందర్యాన్ని సృష్టించుకోగలం – వి.ఆర్ విద్యార్థి
  • 12, , 14
  • క్విజ్ -3
  • ‘ఆమె’

@2021 - All Right Reserved to Mayuukha The Magazine


Back To Top
మయూఖ
  • హోమ్
  • కవితలు
  • కథలు
  • ధారావాహిక నవల
  • వ్యాసాలు
  • బాల‌సాహిత్యం
  • ఇంద్రధనుస్సు
  • ఇంట‌ర్వ్యూలు
  • పుస్త‌క స‌మీక్ష‌
  • అనువాద సాహిత్యం
  • About Us